“భార‌తీయ జ‌న‌తా పార్టీ ప‌య‌నం భార‌త దేశ ప్ర‌జ‌ల‌కు ఆశాకిర‌ణంగా భాసిల్లుతోంది. భార‌తీయ జన‌తా పార్టీ ఈ రోజు ఏ ప్రాంతంలోనైనా ఈ స్థాయికి చేరిందంటే, అది ఏ ఒక్క వ్యక్తి వ‌ల్లో సాధ్య‌మైంది కాదు; అది కొన్ని త‌రాల కార్య‌క‌ర్త‌ల త్యాగం, వారి స్వేదం, వారి క‌ఠోర శ్ర‌మ వ‌ల్ల మాత్ర‌మే సాధ్య‌మైంది. మ‌న‌కు పార్టీ క‌న్నదేశం ఎంతో గొప్ప‌ది. భార‌తీయ జ‌న‌తా పార్టీ ఇండియా ఫ‌స్ట్ నినాదంతో ముందుకు వెళుతుంది.”
శ్రీ న‌రేంద్ర మోదీ 2013 ఏప్రిల్ 6 వ తేదీన అహమ్మదాబాద్‌లో కార్య‌క‌ర్త‌ల మ‌హా స‌మ్మేళ‌నంలో ప్ర‌సంగిస్తూ అన్న మాట‌లివి

Organiser par excellence: Man with the Midas Touch

Narendra Modi addressing BJP Karyakarta Mahasammelan on Party’s 33rd Sthapana Divas

శ్రీ న‌రేంద్ర మోదీ పార్టీ కార్య‌కర్త‌గా త‌న జీవితాన్ని ప్రారంభించి ప్ర‌ధాన‌ మంత్రి ప‌ద‌వికి చేరుకోవ‌డం వెనుక ఆయ‌న చేసిన ప‌రిశ్ర‌మ, పార్టీ ప‌రంగా ఆయ‌న అందించిన సేవలు, త‌న‌కు అప్ప‌గించిన ఏ ప‌నినైనా స‌మ‌ర్ధంగా నిర్వ‌హించ‌గ‌ల శ‌క్తి వంటివి ఉన్నాయని చెప్పుకోవ‌చ్చు. పార్టీ కార్య‌క‌ర్త‌గా ఉన్న‌ప్పుడు కూడా పార్టీ ప‌రంగా ఏ బాధ్య‌త‌ను, ఏ ప‌నిని అప్ప‌గించినా దానిని ఆయన చిత్త‌శుద్ధితో చేసే వారు. పార్టీ అభివృద్ధికి కీల‌క‌మ‌ని భావించిన ప్రాంతాల‌లో స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి పార్టీ సీనియ‌ర్ లు ఆయ‌న‌ను పంపే వారు. పార్టీకి సంబంధించి ర్యాలీ ఏర్పాటు చేసే బాధ్య‌త గాని, లేదా పార్టీకి క్లిష్టంగా ఉన్న ప్రాంతంలో ఎన్నిక‌ల ప్ర‌చారానికి పంపిన‌ప్పుడు గాని పార్టీ అంచ‌నాల‌ను మించిన ఫ‌లితాల‌ను శ్రీ మోదీ చూపెట్టారు.

అన్నిస్థాయిల‌లోని కార్య‌క‌ర్త‌లు సంస్థాగ‌త వ్య‌వ‌హారాల‌పైన దృష్టిని పెట్టాల్సిన ప్రాధాన్య‌ం గురించి శ్రీ మోదీ ప‌దే ప‌దే చెబుతుంటారు.
శ్రీ న‌రేంద్ర మోదీ అహమ్మదాబాద్‌లో ఒక‌సారి భార‌తీయ జ‌న‌తా యువ మోర్చా కార్య‌క‌ర్తల స‌మావేశంలో ప్ర‌సంగించారు. బిజెవైఎమ్ భార‌తీయ జ‌న‌తాపార్టీ యువ‌జ‌న విభాగం. ఈ స‌మావేశంలో ఆయన చేసిన ప్ర‌సంగ పాఠం ముఖ్యాంశం, పోలింగ్ కేంద్రం నిర్వహణను గురించి. ‘పోలింగ్ కేంద్రం నిర్వహణ ఎన్నిక‌ల స‌మ‌యంలో చాలా ముఖ్య‌మైన అంశం. కోట‌ను గెలుచుకోకుండా మీరు యుద్ధాన్ని గెల‌వ‌లేరు. పోలింగ్ కేంద్రంలో విజ‌యం సాధించ‌కుండా ఎన్నిక‌ల‌ను గెల‌వ‌లేం. ఎన్నిక‌ల‌కు నిజ‌మైన ప‌రీక్ష పోలింగ్ బూత్‌లోనే ఉంటుంద‌’ని శ్రీ న‌రేంద్ర మోదీ ఆ స‌మావేశంలో అన్నారు.

namo-organiser-in2

Narendra Modi addressing BJYM

అదే ప్ర‌సంగంలో, పార్టీ కార్య‌క‌ర్త‌లు ప్ర‌జ‌ల‌తో వారి క‌ష్ట సుఖాల‌లో పాలుపంచుకొంటూ భుజం భుజం క‌లిపి అడుగు ముందుకు వేయాల‌ని, వారితో వ్య‌క్తిగ‌త ప‌రిచ‌యాల‌ను పెంపొందించుకోవాల‌ని శ్రీ మోదీ చెప్పారు.

ఈ రోజు శ్రీ న‌రేంద్ర మోదీ త‌న స్వ‌రాష్ట్రం గుజ‌రాత్‌లో పరివర్తనను తీసుకువ‌చ్చిన చురుకైన అభివృద్ధి ప్రధాన నేత‌గా ప్ర‌పంచానికి తెలుసు. అయితే ఒక గొప్ప కార్య‌ద‌క్షుడిగా ఆయ‌న పేరు తెచ్చుకోవ‌డానికి ముందే ఆయ‌న చేప‌ట్టిన ప్ర‌తి ప‌ని బిజెపి కి విజ‌య‌ గాథ‌నే అందించింది

namo-organiser-in3

Narendra Modi - Man with the Midas Touch

ఇవాళ శ్రీ న‌రేంద్ర‌ మోదీ విశాల‌మైన బంగ‌ళాలో దేశ విదేశాల‌కు చెందిన ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో ఉండ‌గా మీరూ చూస్తూ ఉండ‌వ‌చ్చు. అయితే మీకు ఆశ్చ‌ర్యం క‌లిగించే విష‌యం ఏమంటే, శ్రీ న‌రేంద్ర మోదీకి ఆర్‌ఎస్‌ఎస్‌ లో ముందుగా అప్ప‌గించిన ప‌ని అహమ్మదాబాద్‌లోని ఆర్ఎస్ఎస్ కార్యాల‌యంలో నేల‌ను శుభ్రం చేయ‌డం. అంతే కాదు, ఆయ‌న విధుల‌లో మ‌రికొన్ని ఏవేవంటే.. ఉద‌యాన్నే పాలు తీసుకురావ‌డం, కార్యాల‌యాన్నిశుభ్రంగా ఉంచ‌డం. అంతేకాదు, గౌర‌వ‌భావంతో ఆయ‌న సీనియ‌ర్ ప్ర‌చార‌క్‌ల దుస్తులను కూడా ఉతికిపెట్టే వారు.

ఎన్నిక‌ల రాజ‌కీయాల ప‌ట్ల శ్రీ న‌రేంద్ర మోదీ కి ఆస‌క్తి లేక‌పోయిన‌ప్ప‌టికీ, సంఘ్ నాయ‌క‌త్వం ఆయ‌న‌ను 1987లో బిజెపి ప్రధాన కార్యదర్శిగా చేరాలని కోరింది. ఇక అప్ప‌టి నుండి ఆయ‌న వెనుదిరిగి చూడ‌లేదు. ప్ర‌తి ఎన్నిక‌ల‌లోనూ ఆయ‌న తాను గెలుస్తూ రావ‌డ‌మే కాదు, ఇత‌రులు కూడా గెలిచేందుకు స‌హ‌క‌రిస్తూ వచ్చారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌లు: చిన్న ఎన్నిక‌లు- పెద్ద విజ‌యం

శ్రీ న‌రేంద్ర‌ మోదీ 1987లో బిజెపి లో చేరిన సంవ‌త్స‌ర‌మే ఆయ‌న‌కు ప‌రీక్ష ఎదురైంది. అదే సంవత్సరం అహమ్మదాబాద్ మున్సిప‌ల్ ఎన్నిక‌లు జ‌రిగాయి. 1980 ల‌లో బిజెపి రాజ్‌కోట్‌, జునాగ‌ఢ్ కార్పొరేష‌న్ లను కైవ‌సం చేసుకున్న‌ప్ప‌టికీ, శాస‌న‌ స‌భ‌లో కొన్ని స్థానాలు ద‌క్కించుకున్న‌ప్ప‌టికీ రాష్ట్రంలో అధికారం ద‌క్కించుకోవాలంటే అహమ్మదాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల‌లో బిజెపి పాగా వెయ్యాల‌న్న ఆకాంక్ష ఉండేది. పార్ల‌మెంట్ లో , విధాన‌ స‌భ‌లో, గుజ‌రాత్‌లోని పంచాయతీలు, ప‌లు కార్పొరేష‌న్ లలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నా ఆ పార్టీకి మంచి పేరు లేదు. అయితే ఆ పార్టీ అనుస‌రించే బెదిరింపు రాజ‌కీయాల‌ కారణంగా ఆ పార్టీని ఢీకొన‌డం క‌ష్టంగా ఉండేది.

ఈ స‌వాలును స‌మ‌ర్ధంగానే స్వీక‌రించిన శ్రీ నరేంద్ర మోదీ అహ‌మ్మ‌దాబాద్ అంతటా విస్తృతంగా ప‌ర్య‌టించారు. బిజెపి విజ‌యం కోసం అలుపెరుగ‌క శ్ర‌మించారు. చివ‌ర‌కు ఫ‌లితాలు భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆశించిన రీతిలో వ‌చ్చాయి. అహమ్మదాబాద్ మున్సిప‌ల్ కౌన్సిల్‌లో బిజెపి అధికార ప‌క్షంగా అవ‌త‌రించింది. ఆ త‌రువాతి కాలాల్లో పార్టీ రాష్ట్రంలో విస్త‌రించేందుకు, ప్ర‌జ‌ల‌కు మ‌రింత సేవ‌ చేయ‌డానికి ఇది ఉప‌క‌రించింది.

2000 సంవ‌త్స‌రం వ‌ర‌కు బిజెపి అహమ్మదాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌లో ప్ర‌ధాన శ‌క్తిగా ఉంటూ వ‌చ్చింది. దుర‌దృష్టం ఏమిటంటే, 1987 త‌రువాత శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్‌లో లేకుండా మ‌రో ప్రాంతంలో దృష్టి కేంద్రీక‌రిస్తున్న‌ప్పుడు జ‌రిగిన తొలి ఎన్నిక‌లు ఇవి.

విధాన‌ స‌భ‌లో విజ‌యం.. గాంధీన‌గ‌ర్‌లో క‌మ‌ల వికాసం

గుజ‌రాత్‌లో 1980 లో జ‌రిగిన శాస‌న‌ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్ పార్టీ శ్రీ మాధ‌వ్ సింహ్ సోలంకీ , ఆయ‌న కూట‌మి కెహెచ్ఎఎమ్ నాయ‌క‌త్వంలో 141 స్థానాలు గెలుచుకొని 51.04 శాతం వోట్ల శాతాన్ని పొందింది. భారతీయ జ‌న‌తా పార్టీ 9 స్థానాలను మాత్ర‌మే గెలుచుకుంది. ఆ తరువాత శ్రీమతి ఇందిరాగాంధీ హ‌త్యానంత‌రం సానుభూతి, కొత్త సామాజిక కూట‌మి ఆధ్వర్యంలో శ్రీ సోలంకి నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ మ‌రో సారి 149 స్థానాలు గెలుచుకొని 55.55 శాతం ఓట్లు పొందింది. ఈ సారి కూడా బిజెపి కి మళ్లీ నిరుత్సాహ‌మే మిగిలింది. బిజెపి 11 స్థానాల‌తో 14.96 శాతం వోట్ల‌తో స‌రిపెట్టుకోవ‌ల‌సి వ‌చ్చింది.
అయితే, కాంగ్రెస్‌ పార్టీకి స్ప‌ష్ట‌మైన విధాన ల‌క్ష్యాలు ఏవీ లేవు. వారు రిజ‌ర్వేష‌న్ ల చుట్టూ రాజకీయాలు చేయ‌డం, సామాజిక సంకీర్ణాల ఏర్పాటు, ధ్వంసం వంటి చ‌ర్య‌ల‌తో కాలం గ‌డుపుతూ వ‌చ్చారు. 1985- 1988 మ‌ధ్య తీవ్ర అనావృష్టి ప‌రిస్థితులు ఎదురయ్యాయి. గుజ‌రాత్‌లో ప‌లు చోట్ల బాంబు పేలుళ్ళు జ‌రిగి సామాజిక జీవ‌నం అస్త వ్య‌స్త‌మైంది.

namo-organiser-in4

Narendra Modi welcomed to Gujarat in 1990s

1990 శాస‌న‌స‌భ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌ప‌డ‌గానే ప్ర‌జ‌లు కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా ఉన్న‌ప్ప‌టికీ కాంగ్రెస్‌ పార్టీ బ‌ల‌మైన అణచివేత రాజ‌కీయాల‌ను అనుస‌రిస్తూ వ‌చ్చింది. ఈ ద‌శ‌లో ప్ర‌జ‌ల తీర్పు త‌మ‌కు అనుకూలంగా మ‌ల‌చ‌డానికి పార్టీ రాజ‌కీయ నాయక‌త్వానికి బ‌ల‌మైన‌ సంస్థాగ‌త నిర్మాణం అండ‌గా ఉండేలా చూసే బాధ్య‌తను పార్టీ శ్రీ న‌రేంద్ర మోదీపై ఉంచింది.

1990 ఫిబ్ర‌వ‌రి 27న ద‌శాబ్ద‌పు కాంగ్రెస్ పాల‌న అనంత‌రం గుజ‌రాత్ కొత్త విధాన‌ స‌భను ఎన్నుకొంది. శ్రీ చిమ‌న్‌భాయ్ ప‌టేల్ నాయ‌క‌త్వంలోని జ‌న‌తా ద‌ళ్ 70 స్థానాలు గెల్చుకొని 26.69 శాతం వోట్లు సాధించింది. బిజెపి 67 స్థానాలు గెలుచుకుని రెండో స్థానంలో నిలచి 26.69 శాతం వోట్లు రాబట్టుకొంది. అతి త‌క్కువ స్థానాలు ఉంటూ వ‌చ్చిన బిజెపి బ‌ల‌మైన శ‌క్తిగా విధాన‌ స‌భ‌లో గ‌ణ‌నీయ‌మైన స్థానాలను గెల్చుకొంది.

namo-organiser-in5

Narendra Modi, Keshubhai Patel and other leaders listening to the speech of L. K. Advani in 1990s

ఇక రెండో గ‌ట్టి ప‌రీక్ష 1995 శాస‌న‌ స‌భ ఎన్నిక‌లు. ఈ ఎన్నిక‌ల స‌మ‌యంలో శ్రీ న‌రేంద్ర మోదీ నిర్వాహకుడుగా పార్టీ రాష్ట్ర విభాగంలో చురుకుగా ఉన్నారు. గుజ‌రాత్ విధాన స‌భ‌లోని అన్ని అంటే 182 స్థానాల‌లో బిజెపి తొలి సారిగా పోటీ చేసింది. కాంగ్రెస్‌ పార్టీ కంటే ఎక్కువ స్థానాలను బిజెపి పోటీ చేయ‌డం కూడా ఇదే మొద‌టి సారి. ఈ ఎన్నిక‌ల‌లో గుజ‌రాత్ ప్ర‌జ‌లు బిజెపి కి ఘ‌న విజ‌యాన్ని క‌ట్ట‌బెట్టారు. 182 స్థానాల‌కు గాను 121 స్థానాల‌లో బిజెపి విజ‌యం సాధించింది. బిజెపి కి పోలైన వోట్ల వాటా 42.51 శాతానికి చేరింది. కాంగ్రెస్ పార్టీ 45 సీట్ల‌తోనే స‌రిపెట్టుకోవ‌ల‌సి వ‌చ్చింది. శ్రీ న‌రేంద్ర‌ మోదీ బిజెపి ని సంస్థాగ‌తంగా ప‌టిష్టపరచడ‌మే కాక‌, కాంగ్రెస్‌ పార్టీలోని లుక‌లుక‌ల‌ను జ‌నం ముందు ఉంచగ‌లిగారు.

భార‌తీయ జ‌న‌తాపార్టీ ప్ర‌భుత్వాన్నిఏర్పాటు చేసింది కానీ, స‌మ‌స్య‌లు మాత్రం తొల‌గ‌లేదు. గుజ‌రాత్ బిజెపి లోని తీవ్ర ముఠా క‌ల‌హాల కార‌ణంగా 1996లో బిజెపి అధికారాన్ని కోల్పోయింది. అప్ప‌టికే శ్రీ న‌రేంద్ర‌ మోదీ న్యూ ఢిల్లీలో ఉంటూ బిజెపి జాతీయ కార్య‌ద‌ర్శిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 1996లో స్వంత పార్టీ నాయ‌కులే పార్టీని మోసం చేయ‌డం, చిన్న చిన్న ముఠాలుగా ఏర్ప‌డి కాంగ్రెస్‌తో చేతులు క‌లప‌డం.. వీట‌న్నింటి నుండి తేరుకుని 1998 లో బిజెపి తిరిగి అధికారాన్ని చేప‌ట్టింది. అయితే 2001 నాటికి మరోసారి నిరాశాపూరిత వాతావ‌ర‌ణం ఏర్ప‌డింది. వ‌ర‌ద‌లు, తుపానులు, క‌రువు, క‌చ్‌లో తీవ్ర భూకంపం, భూకంప బాధితుల‌కు స‌హాయం స‌రిగా అంద‌క‌పోవ‌డం వంటివి బిజెపి ని ప్ర‌జ‌ల‌కు దూరం చేశాయి. స‌హ‌కార రంగంలో అవినీతి ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఇటువంటి క్లిష్ట ప‌రిస్థితుల‌లో ప‌రిస్థితుల‌ను చ‌క్క‌దిద్ద‌డానికి 2001 అక్టోబ‌ర్ 7 వ తేదీన శ్రీ న‌రేంద్ర మోదీజీని గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించాల్సిందిగా పార్టీ కోరింది. అధికారం గురించి ఏనాడూ క‌ల‌ల క‌న‌ని శ్రీ న‌రేంద్ర మోదీకి గుజ‌రాత్‌లో పార్టీ ప్ర‌తిష్ఠ‌ను పెంచేందుకు ఈ బాధ్య‌త‌లు అప్ప‌గించారు. 2003 మార్చిలో ఎన్నిక‌లు ఉండ‌డంతో శ్రీ న‌రేంద్ర మోదీ ముందు గ‌ట్టి స‌వాలే ఉంచిన‌ట్లయింది.

గోద్రాలో జ‌రిగిన దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న‌లు, మిగిలిన గుజ‌రాత్‌లో జ‌రిగిన ప‌రిణామాలు గ‌మ‌నించిన త‌రువాత గుజ‌రాత్ గాయాల‌ను మాన్పి, అభివృద్ధి ప‌థంలో తీసుకుపోయేందుకు కొత్త ప్ర‌భుత్వం అవ‌స‌ర‌మ‌ని. ఇందుకు బిజెపియే స‌రైన పార్టీ అని శ్రీ న‌రేంద్ర మోదీ భావించారు. ఫ‌లితంగా శాస‌న‌ స‌భను నిర్ణీత కాలానికి ముందే ర‌ద్దు చేశారు. 2002 డిసెంబ‌ర్ లో ఎన్నికలు ప్ర‌క‌టించారు.

ఎన్నిక‌ల ప్ర‌చార స‌మ‌యంలో శ్రీ న‌రేంద్ర‌ మోదీకి వ్య‌తిరేకంగా పెద్ద ఎత్తున వ్య‌తిరేక ప్ర‌చారం జ‌రిగింది. ఎన్నిక‌ల పండితులు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈ ఎన్నిక‌లు ఉన్న‌ట్టు ప్ర‌క‌టించారు. ఇవేవీ లెక్క‌చేయ‌కుండా శ్రీ న‌రేంద్ర‌ మోదీ క‌ష్ట‌ప‌డి ఎన్నిక‌ల ప్ర‌చారం సాగించారు. గ‌తంలోలా కాకుండా ఈ ఎన్నిక‌ల‌లో ప్ర‌ధాన ప్ర‌చార క‌ర్త శ్రీ న‌రేంద్ర మోదీ. లోక్‌ స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో అనుస‌రించిన వ్యూహాన్ని ఆయ‌న అనుస‌రించారు. రాష్ట్రం అంతా విస్తృతంగా ప్ర‌చారం చేశారు. ప్ర‌జ‌ల‌లో ఆశావ‌హ సందేశాన్ని వ్యాప్తి చేశారు.
ఈ ఎన్నిక‌ల‌లో ప్రజలు బిజెపి కి బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టాయి. 127 స్థానాల‌ను బిజెపి గెలుచుకుని 49.85 శాతం వోట్ల‌ను సంపాదించింది. కాంగ్రెస్‌ పార్టీ 51 స్థానాల‌తో స‌రిపెట్టుకోవ‌ల‌సి వ‌చ్చింది.

2002 నుండి 2007 వ‌ర‌కు శ్రీ న‌రేంద్ర‌ మోదీ గుజ‌రాత్‌లో స్వ‌చ్ఛ‌మైన‌, ప్రగతిశీలమైన పాల‌న‌ను అందించారు. దీనితో రాష్ట్రం ఎల్ల‌లెరుగ‌ని అభివృద్ధిని సాధించింది. గుజ‌రాత్‌లో అభివృద్ధి జ‌రుగుతున్న కొద్దీ ప్ర‌తిప‌క్షాల‌లో అస‌హనం పెరిగిపోవ‌డం ప్రారంభించింది. 2007 వ సంవ‌త్స‌రంలో శాస‌న‌ స‌భ ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌కొద్దీ ఆయ‌న‌పై ప్ర‌తిప‌క్షాలు వ్య‌క్తిగ‌త విమర్శ‌లు ఎక్కుపెట్టాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆయ‌న‌ను మృత్యు వ్యాపారిగా అభివ‌ర్ణించారు. అయినా శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఇవేవీ ప‌ట్టించుకోలేదు. విద్వేష పూరిత రాజ‌కీయాల‌కు దూరంగా త‌న అభివృద్ధి కార్యాచరణ మీదే దృష్టి నిలిపి, ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు వెళ్లారు. చివ‌ర‌కు బిజెపి 117 స్ధానాలు గెలుచుకోవ‌డంతో పాటు 49.12 శాతం వోటు వాటాను నిలుపుకోగ‌లిగింది. కాంగ్రెస్ పార్టీ 59 స్థానాల‌కు ప‌రిమితమైంది.

namo-organiser-in6

https://www.narendramodi.in/360/build.html

న‌రేంద్ర మోదీ గుజ‌రాత్‌ తాజా ఎన్నిక‌ల విజ‌యం 2012 డిసెంబ‌ర్‌లో సాధించారు. ఈ ఎన్నిక‌ల‌లో పార్టీ 115 స్థానాలు గెల్చుకొంది. ప్ర‌జ‌లు ఈ ఎన్నిక‌ల‌లో బిజెపి కి ఘ‌న విజ‌యాన్ని అందించారు.

2001 వ సంవత్స‌రం నుండి దేశ ప్ర‌ధాన మంత్రిగా వెళ్లే వ‌ర‌కు శ్రీ న‌రేంద్ర మోదీయే గుజ‌రాత్ రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఉంటూ వ‌చ్చారు. ఆ రాష్ట్రంలో బిజెపి పంచాయ‌తీలు, కార్పొరేష‌న్ లు.. ఇలా అన్ని ఎన్నిక‌ల‌లో విజ‌యం సాధిస్తూ వ‌చ్చింది.

1990- 2012 మ‌ధ్య చాలా మార్పులు వ‌చ్చాయి. అయినా శ్రీ న‌రేంద్ర మోదీ ప‌ట్టుద‌ల‌, అంకిత‌భావం, క‌ష్టించి ప‌నిచేసే త‌త్వంలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. ప్ర‌తి ఎన్నిక‌ల ప్ర‌చారంలో ఆయ‌న వినూత్న పంథాను అనుస‌రించారు. బిజెపి కి అనుకూలంగా విజయానికి కృషి చేశారు.

లోక్‌ స‌భ ఎన్నిక‌లు.. గుజ‌రాత్ నుండి ఎంతో మంది క‌మ‌లం ఎంపీలు

త‌దుప‌రి లోక్‌ స‌భ ఎన్నిక‌ల‌లో గుజ‌రాత్ నుండి గ‌రిష్ఠ సంఖ్య‌లో బిజెపి ఎంపీలు దక్కారంటే అందుకు కార్య‌ద‌క్షుడు శ్రీ న‌రేంద్ర మోదీ సామ‌ర్ధ్య‌మే కార‌ణం.1984లో గుజ‌రాత్ నుండి బిజెపి ఒకే ఒక స్థానాన్ని గెల్చుకొంది. ఆ త‌ర్వాత అయిదు సంవ‌త్స‌రాల‌కు, 1989 ఎన్నిక‌ల‌లో, పార్టీ  ఎమ్ పి ల బ‌లం  12 కు పెరిగింది. 1991లో ఇది 20 కి ఎదిగింది.

1996, 1998, 1999 సంవ‌త్స‌రాల‌లో గుజ‌రాత్ నుండి బిజెపి ఎమ్ పి ల బ‌లం 20 కంటే ఎక్కువ‌గా ఉంటూ వ‌చ్చింది. ఈ సంవ‌త్స‌రాల‌లో శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా లేక‌పోయిన‌ప్ప‌టికీ  ఆయన వేసిన గ‌ట్టి పునాదులే ఈ విజ‌యానికి కార‌ణ‌మ‌య్యాయి. శ్రీ న‌రేంద్ర మోదీ గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు 2004, 2009 సంవ‌త్స‌రాల‌లో బిజెపి అధిక స్థానాల‌ను గుజ‌రాత్ నుండి గెల్చుకొంది.

యాత్ర‌లు.. వ్య‌క్తి క‌న్న దేశం మిన్న‌

గుజ‌రాత్‌లో పార్టీ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శిగా శ్రీ న‌రేంద్ర మోదీ 1987లో న్యాయ‌ యాత్ర‌, 1989లో లోక్ శ‌క్తి యాత్ర‌ల వెనుక బ‌ల‌మైన శ‌క్తిగా నిలచారు. కాంగ్రెస్ పార్టీ అనుస‌రిస్తున్న అణచివేత‌, అవినీతిక‌ర పాల‌న‌లో గుజ‌రాత్‌ ప్ర‌జ‌ల‌కు న్యాయం జ‌రిగేలా చేసేందుకు చేప‌ట్టిన యాత్ర‌లివి.

namo-organiser-in7

Narendra Modi and Murli Manohar Joshi holding Ekta Yatra in 1991

జాతీయ స్థాయిలో శ్రీ లాల్ కృష్ణ ఆడ్ వాణీ నేతృత్వంలో నిర్వ‌హించిన సోమ‌నాథ్ నుండి అయోధ్య ర‌థ‌ యాత్ర‌కు, శ్రీ ముర‌ళీ మ‌నోహ‌ర్ జోషి నిర్వ‌హించిన ఏక‌తా యాత్ర నిర్వ‌హ‌ణ‌కు కీల‌క వ్య‌క్తి శ్రీ న‌రేంద్ర మోదీ.  కశ్మీర్‌లో ఉగ్ర‌వాదులు సృష్టించిన ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో ఏక‌తా యాత్ర జ‌రిగింది.  శ్రీ‌న‌గ‌ర్‌లో త్రివ‌ర్ణ ప‌తాకాన్ని ఎగుర‌వేయ‌డాన్ని ఉగ్ర‌వాదులు అడ్డుకొంటున్న స‌మ‌యంలో ఈ యాత్ర జ‌రిగింది.  యాత్ర‌కు ముందే అన్ని ప్రాంతాల‌ను శ్రీ న‌రేంద్ర మోదీ ప‌రిశీలించి వ‌చ్చారు.

namo-organiser-in8

Narendra Modi joins L. K. Advani’s Janadesh Yatra

namo-organiser-in9

L. K. Advani’s Somnath to Ayodhya Yatra

యాత్ర నిర్వ‌హించ‌డం ఎల్ల‌వేళ‌లా సుల‌భ‌మైన విష‌యం కాదు. యాత్ర వెళ్లే మార్గాన్ని ఖ‌రారు చేయ‌డం, ప్ర‌తి ప్రాంతంలో ఏర్పాట్ల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం, యాత్ర స‌జావుగా ముందుకు సాగేటట్టు చూడ‌డం నిర్వాహ‌కుడి బాధ్య‌త‌. యాత్ర జ‌రిగిన సంవ‌త్స‌రాల‌లో శ్రీ న‌రేంద్ర మోదీ ఎంతో ప‌క‌డ్బందీ  ఏర్పాట్లు చేసి యాత్ర‌లు విజ‌య‌వంత‌ం అయ్యేలా చేశారు. ముఖ్యమంత్రిగా కూడా శ్రీ న‌రేంద్ర మోదీ ప‌లు యాత్ర‌లు చేప‌ట్టారు. తాజాగా ఆయన నిర్వ‌హించిన యాత్ర  వివేకానంద యువ వికాస యాత్ర 2012. దీనిని  గుజ‌రాత్ అంత‌టా నిర్వ‌హించి,  వివేకానందుడి సందేశాన్ని ప్ర‌జ‌ల‌కు చేర‌వేశారు.

namo-organiser-in10

Narendra Modi initiates Vivekananda Yuva Vikas Yatra

గుజ‌రాత్‌కు ఆవ‌ల‌....ఉత్త‌ర భార‌త దేశంలో విజ‌యాలు

1995లో శ్రీ న‌రేంద్ర మోదీ ని బిజెపి జాతీయ కార్య‌ద‌ర్శిగా న్యూ ఢిల్లీకి పంపారు. ఆయనకు జ‌మ్ము కశ్మీర్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్‌, హ‌రియాణా, కేంద్ర పాలిత ప్రాంత‌మైన చండీగ‌ఢ్ బాధ్య‌త‌ల‌ను అప్ప‌గించారు. ఈ అన్ని ప్రాంతాల‌లో బిజెపి బ‌ల‌హీనంగా ఉండింది. జ‌మ్ము & కశ్మీర్‌, పంజాబ్‌ లు 15 సంవ‌త్స‌రాల సంక్షుభిత కాలంలో గ‌డిచాయి. 1987లో జ‌మ్ము & కశ్మీర్‌లో ఎన్నిక‌లు వ్య‌త్యాసం పై పోరాడితే, 1992 లో పంజాబ్ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిప‌క్షాలు బ‌హిష్క‌రించాయి. హ‌రియాణానా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో ఉంది. హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో 1993లో బిజెపి ఓటమిని చ‌వి చూసింది.

namo-organiser-in11

Narendra Modi hoisting Indian Flag in Srinagar in 1992

ఈ స‌మ‌యంలో కూడా శ్రీ న‌రేంద్ర మోదీ సంస్థాగ‌త నైపుణ్యాలు పార్టీకి చాలా  ఉపయోగ‌ప‌డ్డాయి.  హ‌రియాణాలో 1996 మ‌ధ్య‌లో ఎన్నిక‌లు జ‌రిగిన‌పుడు బిజెపి, శ్రీ బ‌న్సీలాల్ కు చెందిన హ‌ర్యానా వికాస్ పార్టీతో పొత్తు కుదుర్చుకొని 44 స్థానాల‌తో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. శ్రీ బ‌న్సీలాల్ ముఖ్య‌మంత్రి అయ్యారు.  బిజెపి 25 స్థానాల‌లో పోటీ చేసి, 11 స్థానాల‌ను గెల్చుకొంది. 1991లో 90 స్థానాల‌కు 89 స్థానాల‌లో పోటీచేయ‌గా కేవ‌లం రెండు స్థానాలే గెలిచింది. దీనితో పోల్చి చూసిన‌పుడు పార్టీ ప‌రిస్థితి మెరుగుప‌డింది. ఒక ద‌శాబ్దం క్రితం వ‌ర‌కు బిజెపి శ్రీ బ‌న్సీ లాల్‌, శ్రీ దేవి లాల్ వంటి వారితో పొత్తు పెట్టుకోవ‌డ‌మ‌నే విష‌యాన్ని ఏమాత్రం ఊహించ‌గ‌ల విష‌యం కాదు. అయితే బిజెపి సైద్ధాంతిక విధానాల నుండి ఏమాత్రం వైదొల‌గ‌కుండా  పొత్తులు వాస్త‌వ రూపం దాల్చాయి.

జ‌మ్ము & క‌శ్మీర్‌లో ప‌రిస్థితి సంక్లిష్టమైంది. అక్కడ 1987 ఎన్నిక‌లు వివాదాస్ప‌ద ప‌రిస్థితుల నేప‌థ్యంలో జ‌రిగాయి. 1990 నుండి కశ్మీర్ రాష్ట్ర‌ప‌తి పాల‌నలో ఉంది.1996లో రాష్ట్రం ఎన్నిక‌ల‌కు వెళ్లిన‌పుడు ప్ర‌జ‌లు నేష‌న‌ల్ కాన్ఫ‌రెన్సుకు చెందిన శ్రీ ఫ‌రూక్ అబ్దుల్లా యొక్క పార్టీకి 87 స్థానాల‌కు గాను 57 స్థానాలు క‌ట్ట‌బెట్టారు. రెండో స్థానం బిజెపి కి ద‌క్కింది. బిజెపి కి 8 స్థానాలు వ‌చ్చిన‌ప్ప‌టికీ, నిజంగా ఇది విజ‌య‌మే. ఎందుకంటే, మిగిలిన పార్టీలైన కాంగ్రెస్‌, , జ‌న‌తా ద‌ళ్‌ల‌ కంటే బిజెపి కి ఎక్కువ స్థానాలు వ‌చ్చాయి.

ఇక శ్రీ న‌రేంద్ర మోదీ బాధ్యుడుగా ఉన్న రాష్ట్రం హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌. ఇక్క‌డ రాజ‌కీయ ప‌రిస్థితులు వేరు. 1990లో బిజెపి 68 స్థానాల‌కు గాను 46స్థానాలు సాధించి, ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. 1992లో బాబ్రీ కూల్చివేత అనంత‌రం అక్క‌డ అధికారం కోల్పోయింది. తిరిగి 1993లో ఎన్నిక‌లు జ‌రిగిన‌పుడు బిజెపి కేవ‌లం 8 స్థానాలే గెల్చుకొంది. 1998లో బిజెపి, కాంగ్రెస్ పార్టీలు రెండూ 31 స్థానాలు గెలుచుకోగా, టెలికం మాజీ మంత్రి శ్రీ సుఖ్‌రామ్ కు చెందిన హ‌ర్యానా వికాస్ మంచ్‌కు 5 స్థానాలు ద‌క్కాయి.  ఇలాంటి ప‌రిస్థితుల‌లో శ్రీ సుఖ్‌రామ్ మ‌ద్ద‌తును కూడ‌గ‌ట్ట‌డంలో శ్రీ న‌రేంద్ర మోదీ కీల‌క పాత్ర ను పోషించారు. అక్క‌డ శ్రీ ప్రేమ్ కుమార్ ధుమాల్ నేతృత్వంలో ప్ర‌భుత్వం ఏర్పాటు చేశారు. శ్రీ ధుమాల్ 2007లో కూడా ముఖ్య‌మంత్రి అయ్యారు. ఈ సారి ఆయ‌న పూర్తి మెజారిటీతో ముఖ్య‌మంత్రి కాగ‌లిగారు.

ఇక పంజాబ్ విష‌యానికి వ‌స్తే,  1997 విధాన స‌భ ఎన్నిక‌ల‌లో అకాలీ- బిజెపి కూట‌మి 117 స్థానాల‌కు 93 స్థానాలు గెల్చుకొని అధికారాన్ని కైవ‌సం చేసుకొంది.  బిజెపి 22 స్థానాల‌కు పోటీ చేసి 18 స్థానాలు గెలిచి, 48.22 శాతం వోట్ల శాతాన్ని పొందింది. అంత‌కు సంవ‌త్స‌రం ముందు, 1996లో శ్రీ న‌రేంద్ర మోదీ చండీగ‌ఢ్ మున్సిప‌ల్ ఎన్నిక‌ల ప్ర‌చారానికి నాయ‌క‌త్వం వ‌హించి ఆ ఎన్నిక‌ల‌లో నాలిగింట మూడు వంతుల మెజారిటీని బిజెపికి సాధించిపెట్టారు. చండీగ‌ఢ్ కార్పొరేష‌న్ ఎన్నిక‌లు చాలా ముఖ్య‌మైన‌వి. ఎందుకంటే, చండీగ‌ఢ్ కార్పొరేష‌న్ లో దామాషా ప్ర‌కారం లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్ స‌భ్యుల‌ను నామినేట్ చేస్తారు. శ్రీ న‌రేంద్ర మోదీ ఎంతో జాగ్ర‌త్త‌గా వివ‌రాలు సేక‌రించి, 1998లో చండీగ‌ఢ్ లోక్‌ స‌భ స్థానానికి శ్రీ స‌త్య‌పాల్‌ జైన్ ను ఎంపిక చేశారు. ఆయ‌న శ్రీ ప‌వ‌న్‌ కుమార్ బ‌న్ సల్‌ను ఓడించారు..

namo-organiser-in12

Narendra Modi and Parkash Singh Badal

పార్ల‌మెంట‌రీ ఎన్నిక‌ల‌లో పార్టీ కార్య‌ద‌క్షుడిగా శ్రీ న‌రేంద్ర మోదీ ప‌నితీరు చెప్పుకోద‌గింది. శ్రీ మోదీ గుజ‌రాత్‌కు వెలుప‌ల బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తూ వ‌చ్చిన ఆరు సంవ‌త్స‌రాల‌లో మూడు లోక్ స‌భ ఎన్నిక‌లను ఎదుర్కోవ‌ల‌సి వ‌చ్చింది. ఈ రాష్ట్రాల ఇన్ చార్జిగా తొలి ఎన్నిక‌ల‌లో జ‌మ్ము & కశ్మీర్‌లో బిజెపి ఒక స్థానం, హ‌రియాణాలో నాలుగు స్థానాలు గెలుచుకోగా పంజాబ్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌ల‌లో ఒక్క స్థానం కూడా ద‌క్క‌లేదు. అయితే 1999 ఎన్నిక‌లు వ‌చ్చే స‌రికి జ‌మ్ము & క‌శ్మీర్‌లో రెండు స్థానాలు, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లో మూడు స్థానాలు, పంజాబ్‌లో ఒక స్థానం, హ‌ర్యానాలో ఐదు స్థానాలు బిజెపి గెల్చుకొంది.

namo-organiser-in13

Swearing-in ceremony of Shri Atal Bihari Vajpayee in 1998

1998లో శ్రీ న‌రేంద్ర‌ మోదీని బిజెపి జాతీయ ప్ర‌ధాన‌ కార్య‌ద‌ర్శి (సంస్థాగ‌త)గా నియ‌మించారు. పార్టీ వ్య‌వ‌స్థాగ‌త నిర్మాణంలో ఆర్గనైజేషన్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ప‌ద‌వి ఎంతో కీల‌క‌మైంది.  దేశ‌వ్యాప్తంగా పార్టీ కార్య‌క‌లాపాల‌ను స‌మ‌న్వ‌యం చేయ‌డం వీరి బాధ్య‌త‌.  గ‌తంలో ఈ బాధ్యత‌ల‌ను శ్రీ సుంద‌ర్ సింగ్ భండారీ, శ్రీ కుశ‌భావ్ ఠాక్రే లు నిర్వ‌హించారు. 1999లో వీరు ఆర్గ‌నైజేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ గా ఉన్న‌ప్పుడు, బిజెపి గ‌రిష్ఠ‌ స్థాయిలో 182 లోక్‌ స‌భ స్థానాల‌ను గెలిచింది.

2014 లోక్‌ స‌భ ఎన్నిక‌ల‌కు, ఎన్‌ డి ఎ  ప్ర‌ధాన మంత్రి అభ్య‌ర్థిగా శ్రీ న‌రేంద్ర మోదీ పేరును 2013 సెప్టెంబ‌ర్ 13న ప్ర‌క‌టించారు. .

namo-organiser-in14

Narendra Modi declared as NDA’s Prime Ministerial candidate

సంఘ్ కార్యాల‌య ప్రాంగ‌ణాన్ని శుభ్ర‌ం చేసే ప‌నితో ప్రారంభించి ఆ త‌రువాతి కాలంలో పంచాయ‌తీ ఎన్నిక‌ల మొద‌లు పార్ల‌మెంట్ ఎన్నిక‌ల వ‌ర‌కు  ఎన్నిక‌ల ప్ర‌చార ప్ర‌క్రియ‌ల‌లో పాలుపంచుకొంటూ శ్రీ న‌రేంద్ర మోదీ పార్టీ సంస్థాగ‌త వ్య‌వ‌హారాల అన్ని పార్శ్వాల‌నూ చూశారు. అన్నింటా ఆయ‌న విజ‌యం సాధించారు. బిజెపి కి ఆయ‌న ప‌ట్టింద‌ల్లా బంగారం లాంటి వ్య‌క్తి అన‌డంలో అతిశ‌యోక్తి లేదు.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait

Media Coverage

When PM Modi Fulfilled A Special Request From 101-Year-Old IFS Officer’s Kin In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ప్రధాని మోదీ హృదయాన్ని హత్తుకునే లేఖ
December 03, 2024

దివ్యాంగ్ కళాకారిణి దియా గోసాయికి, సృజనాత్మకత యొక్క ఒక క్షణం జీవితాన్ని మార్చే అనుభవంగా మారింది. అక్టోబరు 29న ప్రధాని మోదీ వడోదర రోడ్‌షో సందర్భంగా, ఆమె తన స్కెచ్‌లను ప్రదర్శించింది మరియు హెచ్.ఇ. Mr. పెడ్రో సాంచెజ్, స్పెయిన్ ప్రభుత్వ అధ్యక్షుడు. ఇద్దరు నాయకులు ఆమె హృదయపూర్వక బహుమతిని వ్యక్తిగతంగా స్వీకరించడానికి బయలుదేరారు, ఆమె ఆనందాన్ని మిగిల్చింది.

వారాల తర్వాత, నవంబర్ 6వ తేదీన, దియా తన కళాకృతిని మెచ్చుకుంటూ మరియు హెచ్.ఇ. Mr. సాంచెజ్ దానిని మెచ్చుకున్నారు. "వికసిత భారత్" నిర్మాణంలో యువత పాత్రపై విశ్వాసం వ్యక్తం చేస్తూ అంకితభావంతో లలిత కళలను అభ్యసించమని ప్రధాని మోదీ ఆమెను ప్రోత్సహించారు. అతను తన వ్యక్తిగత స్పర్శను ప్రదర్శిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు దీపావళి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న దియా తన కుటుంబానికి ఇంతటి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టినందుకు ఉప్పొంగిన తన తల్లిదండ్రులకు లేఖను చదివింది. "మన దేశంలో ఒక చిన్న భాగమైనందుకు నేను గర్వపడుతున్నాను. నాకు మీ ప్రేమ మరియు ఆశీర్వాదాలు అందించినందుకు ధన్యవాదాలు, మోదీ జీ," అని దియా అన్నారు, ప్రధానమంత్రి నుండి లేఖ అందుకున్నందుకు జీవితంలో సాహసోపేతమైన చర్యలు తీసుకోవడానికి మరియు శక్తివంతం కావడానికి తనను తీవ్రంగా ప్రేరేపించిందని దియా అన్నారు. ఇతరులు కూడా అదే చేయడానికి.

దివ్యాంగుల సాధికారత మరియు వారి సహకారాన్ని గుర్తించడంలో ఆయన నిబద్ధతను ప్రధాని మోదీ సంజ్ఞ ప్రతిబింబిస్తుంది. సుగమ్య భారత్ అభియాన్ వంటి అనేక కార్యక్రమాల నుండి దియా వంటి వ్యక్తిగత సంబంధాల వరకు, అతను ఉజ్వల భవిష్యత్తును రూపొందించడంలో ప్రతి ప్రయత్నం ముఖ్యమని రుజువు చేస్తూ, స్ఫూర్తిని మరియు ఉద్ధరణను కొనసాగిస్తున్నారు.