ఉపాధ్యాయుల దినం కంటే ముందు రోజు సాయంత్రం పూట, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 వ సంవత్సరాని కి గాను ‘జాతీయ గురువుల పురస్కారం’ గెలుచుకొన్న వ్యక్తుల తో 7, లోక్ కళ్యాణ్ మార్గ్ లో సమావేశమయ్యారు. ఈ సంభాషణ కార్యక్రమం లో 75 మంది పురస్కార విజేత లు పాలుపంచుకొన్నారు.
దేశం లో యువజనుల మేధ ను వికసింపజేయడం లో గురువు ల ప్రయాసల ను ప్రధాన మంత్రి ప్రశంసించారు. మంచి ఉపాధ్యాయుల కు ఉండే ప్రాముఖ్యాన్ని గురించి మరియు దేశ భావి గతి కి రూపు రేఖల ను ఇవ్వడం లో వారు పోషించే పాత్ర ను గురించి ఆయన వివరించారు. క్షేత్రస్థాయి లో కార్యసాధకులు సాధించిన సాఫల్యాన్ని గురించి బాలల కు తెలియ జేసి, బాలల్లో ప్రేరణ ను నింపవలసిన అంశాని కి ప్రాధాన్యం ఉందని ఆయన స్పష్టం చేశారు.
మన స్థానిక వారసత్వాన్ని మరియు చరిత్ర ను చూసుకొని గర్వపడాలని ప్రధాన మంత్రి వివరించారు. విద్యార్థినీ విద్యార్థులు వారి ప్రాంతం యొక్క చరిత్ర ను మరియు సంస్కృతి ని గురించి తెలుసుకొనేటట్లు గా ప్రేరణ ను అందించాలని గురువుల కు ఆయన విజ్ఞప్తి చేశారు. దేశం లో వివిధత్వం యొక్క బలాన్ని గురించి ప్రధాన మంత్రి నొక్కి చెప్తూ, దేశం లోని వేరు వేరు ప్రాంతాల సంస్కృతి ని గురించి మరియు భిన్నత్వాన్ని గురించి పాఠశాలల్లో ఒక వేడుక మాదిరి గా ఘనం గా జరపాల్సింది గా ఉపాధ్యాయుల ను కోరారు.
చంద్రయాన్-3 సాఫల్యాన్ని గురించి ప్రధాన మంత్రి చర్చిస్తూ, 21 వ శతాబ్దం అనేది సాంకేతిక విజ్ఞానం ఆధారం గా దూసుకు పోతున్నటువంటి శతాబ్దం గా ఉన్నందువల్ల, విజ్ఞానశాస్త్రం గురించి మరియు సాంకేతిక విజ్ఞానం గురించి విద్యార్థినీ విద్యార్థుల లో ఆసక్తి ని ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. యువజనుల ను నైపుణ్యం గలవారి గా తయారు చేసి, మరి వారిని రాబోయే కాలం కోసం తయారు గా ఉండేటట్టు తీర్చిదిద్దడానికి పెద్దపీట ను వేయాలి అని కూడ ఆయన చెప్పారు.
మిశన్ లైఫ్ (ఎల్ఐఎఫ్ఇ) ని గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ఏదైనా ఒక వస్తువును వాడి పారవేసే ధోరణి కి భిన్నం గా ఒకసారి ఉపయోగించిన వస్తువుల ను తిరిగి ఉపయోగించుకొనేందుకు మార్గాలు ఉన్నాయేమో పరిశీలించి ఆ దారిన ప్రయాణించడానికి ప్రాముఖ్యాన్ని ఇవ్వడాన్ని గురించి చర్చించారు. ఈ సందర్భం లో అనేక మంది ఉపాధ్యాయులు వారి వారి పాఠశాలల్లో జరుగుతున్న స్వచ్ఛత కార్యక్రమాల ను గురించి ప్రధాన మంత్రి కి తెలియజేశారు. దీనికి అదనం గా, గురువులు వారి యావత్తు వృత్తి జీవనం లో నిరంతరం నేర్చుకొంటూ ఉండే తత్త్వాన్ని కలిగి ఉండాలని మరియు వారి ప్రావీణ్యాన్ని పెంచుకోవాలని సలహా ను ఇచ్చారు.
జాతీయ ఉపాధ్యాయుల పురస్కారం యొక్క ఉద్దేశ్యం దేశం లో కొందరు అతి ఉత్తములైన ఉపాధ్యాయుల విశిష్ట తోడ్పాటుల ను ఒక ఉత్సవం మాదిరి గా జరుపుకోవడం తో పాటు గురువులు వారి అంకిత భావం తో విద్య పరమైన నాణ్యత ను పెంచడం ఒక్కటే కాకుండా వారి విద్యార్థుల జీవనాన్ని కూడ సమృద్ధం చేస్తూ ఉన్నందుకు వారి ని గౌరవించడం కూడాను. ఈ సంవత్సరం లో, పురస్కారం యొక్క పరిధి ని విస్తరించడం జరిగింది. ఇది వరకు పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం ఎంపిక చేసిన ఉపాధ్యాయుల ను దీని పరిధి లో చేర్చడం జరిగింది. ఇప్పుడు దీనిలో ఉన్నత విద్య విభాగం మరియు నైపుణ్యాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ లు ఎంపిక చేసిన ఉపాధ్యాయుల ను కూడా లెక్క కు తీసుకోవడం జరుగుతున్నది.