• పారిపోయిన ఆర్థిక అపరాధుల సమస్య ను సమగ్రం గాను, దీటు గాను పరిష్కరించడం కోసం జి-20 దేశాల మధ్య బలవత్తరమైనటువంటి మరియు క్రియాశీలమైనటువంటి సహకారాన్ని అందించుకోవాలి.
• అపరాధం ద్వారా కూడబెట్టుకొన్న సంపద ను ప్రభావవంతంగా జప్తు చేయాలి; పరదేశీ అపరాధులను వీలైనంత త్వరగా వారి స్వదేశానికి అప్పగించాలి, అంతేకాక అపరాధం తాలూకు సొమ్ము ను సాధ్యమైనంత శీఘ్రం గా మాతృ దేశానికి తిరిగి పంపించడం వంటి న్యాయపరమైన ప్రక్రియల లోనూ సహకరించుకోవాలి; సంబంధిత ప్రక్రియ ను సువ్యవస్థితం చేయాలి.
• పరారైన ఆర్థిక అపరాధులందరికీ వేరే దేశాల లో ప్రవేశాన్ని కల్పించడాన్ని మరియు వారి కి సురక్షితమైనటువంటి ఆశ్రయం కల్పించడాన్ని అడ్డుకోవడం కోసం జి-20 దేశాల ద్వారా ఒక కార్య ప్రణాళిక ను రూపొందించడానికి సమష్టి గా కృషి చేయాలి.
• అవినీతి కి వ్యతిరేకంగా ఐక్య రాజ్య సమితి యొక్క సిద్ధాంతాలు (యుఎన్‌సిఎసి), అంతర్జాతీయ సంఘటిత అపరాధాని కి వ్యతిరేకంగా ఐక్య రాజ్య సమితి యొక్క సిద్ధాంతాలు (యుఎన్ఒటిసి).. ఈ రెండు అంశాల లో దేశాలు అన్నింటి మధ్య సహకారాన్ని పూర్తి గాను, ప్రభావశీలం గాను అమలు లోనికి తీసుకు రావాలి.
• అంతర్జాతీయ సహకారానికి ఊతాన్ని అందించడం కోసం ఒక ఫైనాన్శియల్ ఏక్శన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఎటిఎఫ్)ను ఏర్పాటు చేయాలి; ఇది సమర్ధమైనటువంటి కార్యక్రమాలు మరియు ఫైనాన్శియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఎఫ్ఐయు)ల మధ్య వెల్లడులకు కావలసిన సమయాన్ని తీసుకొంటూ సమగ్ర సమాచారం యొక్క ఆదాన ప్రదానానికి వీలు కల్పించాలి. తద్వారా దర్యాప్తు పక్కా గా జరగాలి.
• పారిపోయిన ఆర్థిక అపరాధుల తాలూకు ఒక ప్రమాణ పూర్వక నిర్వచనాన్ని సిద్ధం చేసే పని ని ఎఫ్ఎటిఎఫ్ కు అప్పగించాలి.
• ఎఫ్ఎటిఎఫ్ పారిపోయిన ఆర్థిక అపరాధుల పై తీసుకోవలసిన న్యాయపరమైన చర్యలను, వారి ని వారి స్వదేశాని కి పంపించడాని కి సంబంధించిన ప్రమాణ పూర్వక ప్రక్రియ లను రూపొందించాలి. వీటి కి ఉమ్మడి అంగీకారాన్ని తీసుకోవాలి. అలా జి-20 దేశాలు వాటి దేశీయ చట్టాల కు అనుగుణం గా నడచుకోవడం లో తగిన మార్గదర్శకత్వాన్ని మరియు సహాయాన్ని సైతం అందించగలగాలి.
• పరదేశీ అపరాధుల అప్పగింత కు సంబంధించిన విజయవంతమైన వ్యవహారాలను, పరదేశీ అపరాధుల అప్పగింత కు సంబంధించిన ఈసరికే అమలులో ఉన్న ప్రణాళిక లలో భేదాలు మరియు న్యాయపరమైన సహాయం లతో పాటు ఇతర అనుభవాల ను, సర్వోత్తమ పద్ధతుల ను పంచుకోవడం కోసం ఒక ఉమ్మడి వేదిక ను ఏర్పాటు చేయాలి.
• ఇటువంటి ఆర్థిక అపరాధుల నివాసం ఏ దేశంలో అయితే ఉందో ఆ దేశం లో వారు భారీ మొత్తం లో పన్ను లను తీర్చవలసి ఉంటే గనక వాటి ని వసూలు చేసేందుకు ఆ అపరాధుల సంపత్తి వివరాలను ఆరా తీసే పని ని జి-20 ఫోరమ్ చేపట్టాలి.