జి-20 కి భారతదేశం అధ్యక్ష బాధ్యతలు నిర్వహించడం అనేది అన్ని వర్గాల ను కలుపుకొనిముందుకు పోయేటటువంటి, మహత్వాకాంక్ష కలిగినటువంటి, నిర్ణయాత్మకమైనటువంటి మరియు చేత లు ప్రధానం గా ఉన్నటువంటిది గా ఉన్నది
వరుస లోని చివరి వ్యక్తి కి సహా, ఆదరణ కు నోచుకోకుండామిగిలి పోయినటువంటి వర్గాల కు సేవ చేయాలన్న గాంధీ గారి ఆశయాన్ని నెరవేర్చడం ప్రధానం

న్యూ ఢిల్లీ లో జరిగే జి-20 శిఖర సమ్మేళనం మనుష్య ప్రధానమైన మరియు సమ్మిళితమైన అభివృద్ధి లో ఒక క్రొత్త బాట ను పరచగలదన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు. జి-20 కి భారతదేశం అధ్యక్షత వహించడం అనేది సమాజం లో అన్ని వర్గాల ను కలుపుకొని వెళ్ళేటటువంటి, మహత్వాకాంక్ష కలిగినటువంటి, నిర్ణయాత్మకమైనటువంటి మరియు చేత లు ప్రధానంగా ఉండేటటువంటిది గా ఉందని, గ్లోబల్ సౌథ్ దేశాల అభివృద్ధి సంబంధి ఆందోళనల ను ఎలుగెత్తి చాటడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు.

 

సమాజం లో ఆదరణ కు నోచుకోకుండా దూరం గా అట్టిపెట్టినటువంటి వర్గాల వారి కి సేవల ను అందించాలన్న గాంధీ గారి ఆశయాన్ని అనుసరించడానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, భారతదేశం ప్రగతి ని ముందుకు తీసుకు పోవడం కోసం మనుష్య ప్రధానమైన మార్గాన్ని అవలంబించడాని కి పెద్ద పీట ను వేస్తోందన్నారు.

 

‘ఒక భూమి’, ‘ఒక కుటుంబం’, మరియు ‘ఒక భవిష్యత్తు’ సంబంధి సదస్సుల కు తాను అధ్యక్షత వహించనున్నట్లు ప్రధాన మంత్రి తెలియ జేశారు. మరింత బలమైనటువంటి, స్థిరమైనటువంటి, అన్ని వర్గాల కు స్థానం ఉండేటటువంటి మరియు సమతుల్యమైనటువంటి వృద్ధి ని ముందుకు తీసుకు పోవడం సహా ప్రపంచ సముదాయం ఎదుర్కొంటున్న అనేక ఆందోళనకర అంశాలు ఈ సదస్సుల లో ప్రస్తావన కు వస్తాయి. మైత్రి మరియు సహకార బందాలను గాఢతరం గా మలచడం కోసం అనేక మంది నాయకుల తోను, ప్రతినిధి వర్గం యొక్క ప్రముఖఉల తోను ద్వైపాక్షిక సమావేశాల ను కూడా జరపనున్న సంగతి ని ఆయన ప్రస్తావించారు.

 

మాన్య రాష్ట్రపతి 2023 సెప్టెంబర్ 9 వ తేదీ నాడు నేతల కు రాత్రి భోజనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నారని కూడా ప్రధాన మంత్రి తెలియజేశారు. నేత లు 2023 సెప్టెంబర్ 10వ తేదీన రాజ్ ఘాట్ కు వెళ్ళి గాంధీ మహాత్ముని కి శ్రద్ధాంజలి ని సమర్పించనున్నారు. అదే రోజు న ముగింపు కార్యక్రమం లో, జి-20 నేత లు ఆరోగ్యకరమైన ‘ఒక భూమి’ , ‘ఒక కుటుంబం’, ఒక స్థిరమైనటువంటి మరియు న్యాయబద్ధమైనటువంటి ‘ఒకే భవిష్యత్తు’ కోసం వంటి తమ తమ సామూహిక దృష్టికోణాన్ని వెల్లడిస్తారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం ద్వారా కొన్ని ట్వీట్ లలో -

‘‘భారతదేశం 2023 సెప్టెంబరు తొమ్మిదో, పదో తేదీల లో న్యూ ఢిల్లీ లోని ప్రతిష్టాత్మకమైన భారత్ మండపమ్ లో జి-20 తాలూకు పద్దెనిమిదో శిఖర సమ్మేళనాని కి ఆతిథేయి గా వ్యవహరించడాని కి సంతోష పడుతున్నది. ఇది భారతదేశం నిర్వహిస్తున్నటువంటి మొట్టమొదటి జి-20 శిఖర సమ్మేళనం. రాబోయే రెండు రోజుల లో ప్రపంచ నేతల తో సార్థక చర్చలు జరపడానికి నేను ఉత్సుకత తో ఉన్నాను.

 

న్యూ ఢిల్లీ లో జరిగే జి-20 శిఖర సమ్మేళనం మనుష్య ప్రధానమైనటువంటి మరియు సమ్మిళితమైనటువంటి అభివృద్ధి లో ఒక క్రొత్త బాట ను పరుస్తుందని నేను గట్టి గా నమ్ముతున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore

Media Coverage

PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister greets on the occasion of Urs of Khwaja Moinuddin Chishti
January 02, 2025

The Prime Minister, Shri Narendra Modi today greeted on the occasion of Urs of Khwaja Moinuddin Chishti.

Responding to a post by Shri Kiren Rijiju on X, Shri Modi wrote:

“Greetings on the Urs of Khwaja Moinuddin Chishti. May this occasion bring happiness and peace into everyone’s lives.