ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో నెదర్లాండ్స్ యొక్క ప్రధాని శ్రీ మార్క్ రుటే ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.
ఎన్నికల లో విజయం సాధించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి అభినందనల ను ప్రధాని శ్రీ మార్క్ రుటే తెలపడం తో పాటు గా చరిత్రాత్మకమైనటువంటి మూడో పదవీకాలానికి గాను శుభాకాంక్షల ను కూడ వ్యక్తం చేశారు.
ప్రధాని శ్రీ మార్క్ రుటే అందించిన హార్దిక శుభాకాంక్షల కు ప్రధాన మంత్రి ధన్యవాదాలను పలకడంతో పాటు గా ఇరు దేశాల మధ్య సన్నిహిత సంబంధాల ను పెంపొందింపచేయడం లో వ్యక్తిగతంగా చొరవ ను తీసుకొంటున్నందుకు గాను ఆయన ను ప్రశంసించారు.
భారతదేశానికి మరియు నెదర్లాండ్స్ కు మధ్య గల విశిష్టమైన మరియు విలువైన సంబంధాల ను గురించి నేతలు నొక్కిపలికారు.
ఇరు దేశాల ప్రజల హితం కోసం ద్వైపాక్షిక సంబంధాల ను మరింత గా బలపరచుకోవడానికి నిరంతరం కృషి చేస్తూ ఉండాలని ప్రధాన మంత్రి తన నిబద్ధత ను పునరుద్ఘాటించారు.
Spoke to PM Mark Rutte @MinPres. Thank him for his warm felicitations. Netherlands is a valued and trusted partner. Looking forward to further advancing our ties to new heights.
— Narendra Modi (@narendramodi) June 5, 2024