1960 మే 1వ తేదీన గుజరాత్ ఆవిర్భావం రోజున పెల్లుబికిన ఆనందం, ఆశావాదం దశాబ్దం అంతానికి పూర్తిగా సద్దుమణిగిపోయింది. తొందరగా వచ్చిన సంస్కరణలు, అభివృద్ధి కలలు గుజరాత్ లోని సామాన్య ప్రజల మధ్య భ్రమగానే మిగిలిపోయాయి.శ్రీ ఇందూలాల్ యాజ్ఞ‌ిక్, శ్రీ జీవ్ రాజ్ మెహతా, శ్రీ బల్ వంత్ రాయ్ మెహతా ల వంటి రాజకీయ అగ్రనేతల పోరాటాలు, త్యాగాలు, ధనం పైన ఉండే దురాశ, రాజకీయాల్లోని అధికారంతో రద్దయిపోయాయి. 1960 దశకం చివరి నుండి 1970 దశకం మొదలు వరకు గుజరాత్ లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో అవినీతి, అక్రమపాలన కొత్త పుంతలు తొక్కింది. 1971 లో భారతదేశం, పాకిస్తాన్ ను యుద్ధంలో ఓడించింది. పేదలను ఉద్ధరిస్తామనే హామీతో కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఎన్నికయ్యింది. అయితే ఆ వాగ్దానం నెరవేర్చక పోగా " గరీబీ హటావో" నినాదం క్రమంగా "గరీబ్ హటావో" గా మారింది.పేదవారి జీవితం అధ్వానంగా మారింది. గుజరాత్ లో ఈ కష్టాలకు తీవ్ర కరవు తోడైంది. ధరలు విపరీతంగా పెరిగాయి. రాష్ట్రంలో ఎక్కడ చూసినా నిత్యావసర వస్తువుల కోసం అంతులేని బారులు నిత్యకృత్యం అయ్యాయి.సామాన్య మానవునికి ఎక్కడా ఉపశమనం లేదు.

నివారణ చర్యలు తీసుకోవడానికి బదులు కాంగ్రెస్ నాయకత్వం గుజరాత్ లో ముఠా కక్షలతో తలమునకలవుతూ, పరిస్థితి పట్ల పూర్తిగా ఉదాసీనతను ప్రదర్శించేది. ఫలితంగా శ్రీ ఘన్ శ్యామ్ ఓజా ప్రభుత్వం త్వరలోనే విఫలమవడంతో అధికార వ్యవహారంలో భాగంగా అధిష్టానం శ్రీ చిమన్ భాయ్ పటేల్ ను ఆ స్థానంలో భర్తీ చేసింది. అయితే ఈ ప్రభుత్వం కూడా సమానమైన అసమర్ధ ప్రభుత్వంగా రుజువుకావడంతో గుజరాత్ ప్రజల్లో రాష్ట్రానికి వ్యతిరేకంగా అసంతృప్తి పెరిగింది.ప్రజల్లోని అసంతృప్తి ప్రజా ఆగ్రహం గా మారింది. 1973 డిసెంబర్ లో మోర్బీ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థుల ఆహార ధరలను అన్యాయంగా పెంచడాన్ని వ్యతిరేకిస్తూ కొంతమంది విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నిరసనలకు విస్తృతంగా మద్దతు లభించడంతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇది ఒక భారీ ఉద్యమంగా రాష్ట్రవ్యాప్తంగా రాజుకొంది.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల్లో అసంతృప్తిని అరికట్టడంలో విఫలం అయ్యాయి. పరిస్థితి అధ్వానంగా మారింది. అవినీతి, ధరల పెరుగుదల లకు వ్యతిరేకంగా ఈ భారీ ఉద్యమం జరుగుతూ ఉంటే ఈ ఉద్యమానికి జన్ సంఘ్ కారణమని అప్పటి విద్యాశాఖ మంత్రి ఆరోపించారు. 1973 నాటికి శ్రీ నరేంద్ర మోదీ సామాజిక క్రియాశీల కార్యక్రమాల పట్ల ఆశక్తిని ప్రదర్శించారు. ఆయన అప్పటికీ ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణంతో పాటు సామాన్య ప్రజలపై ప్రభావం చూపే ఇతర సమస్యలకు వ్యతిరేకంగా పలు ఉద్యమాలలో పాల్గొన్నారు.

ఒక యువ ప్రచారకర్తగా, అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఎబివిపి) సహచరునిగా శ్రీ నరేంద్ర మోదీ నవ నిర్మాణ్ ఉద్యమంలో చేరి, తనకు కేటాయించిన పనులను శ్రద్ధగా గా నిర్వహించే వారు.

నవ నిర్మాణ్ ఉద్యమం అనేది ఒక భారీ ఉద్యమం. ఇందులో సమాజంలోని అన్ని వర్గాల నుండీ సామాన్య పౌరులు ముక్త కంఠంతో నిలబడ్డారు.

గౌరవనీయులైన ప్రముఖ వ్యక్తి, అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న యోధునిగా పేరు గాంచిన శ్రీ జయప్రకాశ్ నారాయణ్ మద్దతు లభించడంతో ఈ ఉద్యమం మరింత బలోపేతమైంది. అహ్మదాబాద్ లో శ్రీ జయప్రకాశ్ నారాయణ్ వంటి ఆకర్షణీయమైన నాయకునితో సన్నిహితంగా మాట్లాడే అరుదైన అవకాశం శ్రీ నరేంద్ర మోదీకి లభించింది.

అనంతరం ఆ ప్రముఖ నాయకునితో అనేక సార్లు జరిపిన చర్చలు యువకుడైన శ్రీ నరేంద్ర పై బలమైన ముద్ర వేశాయి. నవ నిర్మాణ్ ఉద్యమం భారీగా విజయవంతమైంది. కేవలం ఆరు నెలల పదవీకాలం అనంతరం శ్రీ చిమన్ భాయ్ పటేల్ రాజీనామా చేయవలసివచ్చింది. తాజాగా ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే అధికారం కోల్పోయింది.

గుజరాత్ ఎన్నికల ఫలితాలు 1975 జూన్ నెల 12వ తేదీన వెలువడగా - ఎన్నికల అవినీతి కేసులో ప్రధాన మంత్రి శ్రీమతి ఇందిరాగాంధీని దోషిగా పేర్కొంటూ అదే రోజున అలహాబాద్ తీర్పు వెలువరిస్తూ - భవిష్యత్ ప్రధాన మంత్రిగా ఆమె కొనసాగడంపై అనుమానం వ్యక్తం చేసింది.

వారం రోజుల తరువాత గుజరాత్ లో శ్రీ బాబూభాయ్ జశ్ భాయ్ పటేల్ నాయకత్వంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. సామాజిక సమస్యలపై శ్రీ నరేంద్ర తన మొదటి భారీ నిరసన ప్రదర్శనను నవ నిర్మాణ్ ఉద్యమం ద్వారా నిర్వహించి, ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. 1975 లో గుజరాత్ లో లోక్ సంఘర్ష్ సమితి ప్రధాన కార్యదర్శిగా శ్రీ నరేంద్ర తన మొట్ట మొదటి రాజకీయ పదవి పొందడానికి ఇది దోహదపడింది. ఈ ఉద్యమ సమయంలో ముఖ్యంగా సన్నిహితుల ద్వారా విద్యార్థుల సమస్యలను అర్ధం చేసుకోడానికి అవకాశం లభించింది. అదే ఆయన ముఖ్యమంత్రి అయ్యాక ఒక పెద్ద వరంగా రుజువైంది.

విద్యాపరమైన సంస్కరణల పైనా, అలాగే గుజరాత్ లోని యువతకు ప్రపంచ స్థాయి విద్యను అందుబాటులోకి తేవడంపైన ఆయన 2001 నుంచీ గణనీయమైన దృష్టిని కేంద్రీకరించారు.

గుజరాత్ లోని నవ నిర్మాణ్ ఉద్యమానికి చెందిన ఎంతో ఆశావాదమైన పదవి ఎంతో కాలం నిలవలేదు. 1975 జూన్ 25వ తేదీ అర్ధరాత్రి ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ భారతదేశంలో అత్యవసర పరిస్థితి (ఎమర్జెన్సీ) ని విధించారు. భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అడ్డుకుంటూ అన్ని పౌర సంఘాలనూ రద్దు చేశారు. శ్రీ నరేంద్ర మోదీ జీవితంలో అత్యంత ముఖ్యమైన దశల్లో ఒకటి ఇప్పుడు ప్రారంభమైంది.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore

Media Coverage

PM Modi govt created 17.19 crore jobs in 10 years compared to UPA's 2.9 crore
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
ప్రధాని మోదీ హృదయాన్ని హత్తుకునే లేఖ
December 03, 2024

దివ్యాంగ్ కళాకారిణి దియా గోసాయికి, సృజనాత్మకత యొక్క ఒక క్షణం జీవితాన్ని మార్చే అనుభవంగా మారింది. అక్టోబరు 29న ప్రధాని మోదీ వడోదర రోడ్‌షో సందర్భంగా, ఆమె తన స్కెచ్‌లను ప్రదర్శించింది మరియు హెచ్.ఇ. Mr. పెడ్రో సాంచెజ్, స్పెయిన్ ప్రభుత్వ అధ్యక్షుడు. ఇద్దరు నాయకులు ఆమె హృదయపూర్వక బహుమతిని వ్యక్తిగతంగా స్వీకరించడానికి బయలుదేరారు, ఆమె ఆనందాన్ని మిగిల్చింది.

వారాల తర్వాత, నవంబర్ 6వ తేదీన, దియా తన కళాకృతిని మెచ్చుకుంటూ మరియు హెచ్.ఇ. Mr. సాంచెజ్ దానిని మెచ్చుకున్నారు. "వికసిత భారత్" నిర్మాణంలో యువత పాత్రపై విశ్వాసం వ్యక్తం చేస్తూ అంకితభావంతో లలిత కళలను అభ్యసించమని ప్రధాని మోదీ ఆమెను ప్రోత్సహించారు. అతను తన వ్యక్తిగత స్పర్శను ప్రదర్శిస్తూ ఆమె కుటుంబ సభ్యులకు దీపావళి మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.

ఆనందంతో ఉబ్బితబ్బిబ్బవుతున్న దియా తన కుటుంబానికి ఇంతటి అపారమైన గౌరవాన్ని తెచ్చిపెట్టినందుకు ఉప్పొంగిన తన తల్లిదండ్రులకు లేఖను చదివింది. "మన దేశంలో ఒక చిన్న భాగమైనందుకు నేను గర్వపడుతున్నాను. నాకు మీ ప్రేమ మరియు ఆశీర్వాదాలు అందించినందుకు ధన్యవాదాలు, మోదీ జీ," అని దియా అన్నారు, ప్రధానమంత్రి నుండి లేఖ అందుకున్నందుకు జీవితంలో సాహసోపేతమైన చర్యలు తీసుకోవడానికి మరియు శక్తివంతం కావడానికి తనను తీవ్రంగా ప్రేరేపించిందని దియా అన్నారు. ఇతరులు కూడా అదే చేయడానికి.

దివ్యాంగుల సాధికారత మరియు వారి సహకారాన్ని గుర్తించడంలో ఆయన నిబద్ధతను ప్రధాని మోదీ సంజ్ఞ ప్రతిబింబిస్తుంది. సుగమ్య భారత్ అభియాన్ వంటి అనేక కార్యక్రమాల నుండి దియా వంటి వ్యక్తిగత సంబంధాల వరకు, అతను ఉజ్వల భవిష్యత్తును రూపొందించడంలో ప్రతి ప్రయత్నం ముఖ్యమని రుజువు చేస్తూ, స్ఫూర్తిని మరియు ఉద్ధరణను కొనసాగిస్తున్నారు.