ఎన్నికల రాజకీయ ప్రపంచంలోకి రాకముందు శ్రీ నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ సంస్థలో అనేక ఏళ్ళు గడిపి, తన సంస్థాగత నైపుణ్యాలకు గుర్తింపు పొంది, సంస్థ మూలాలను కాపాడే విధానాలు అతనిని ఆ పార్టీ కార్యకర్తలకు అత్యంత ప్రియమైనవాడైయ్యేలా చేశాయని మీకు తెలుసా?
1987లో, శ్రీ నరేంద్ర మోదీ బిజెపిలో చేరగా, 1987 అహ్మదాబాద్ పౌర ఎన్నికల ప్రచారం ఆయనకు మొదటిబాధ్యత అయ్యింది. ఆ ఉత్సాహకర ప్రచారం, బిజెపిని ఆ ఎన్నికల్లో గెలిపు వైపుకు నడిపించింది.
1990లో, ఆయన గుజరాత్ విధానసభ ఎన్నికలకు వ్యూహాలు రచించే కీలక జట్టులో సభ్యులుగా ఉన్నారు. ఆ ఎన్నికల ఫలితాలు, దశాబ్దాల కాంగ్రెస్ పాలనకు ముగింపు పలికాయి. వరుసగా 1980లో 141 సీట్లు మరియు 1985లో 149 సీట్ల సాధించిన కాంగ్రెస్, ఆ ఎనికల్లో 33 సీట్లకు పడిపోగా, బిజెపి 67 స్థానాలను గెలుపొంది శ్రీ చిమన్భాయ్ పటేల్ యొక్క సంకీర్ణ ప్రభుత్వంలో చేరింది. అయితే, ఆ కూటమి కొంతకాలమే నిలిచినప్పటికీ, గుజరాత్ లో బిజెపి ఒక బలమైన శక్తిగా ఎదిగింది.
1995లో, శ్రీ నరేంద్ర మోదీ మరొకసారి అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో చురుకుగా పాల్గొన్నారు. అప్పుడు బిజెపి మొదటిసారిగా మొత్తం 182 సీట్లలో పోటీ చేసేందుకు నిర్ణయించుకుంది. ఒక చారిత్రాత్మక ఫలితంతో, ఆ పార్టీ 121 సీట్లు గెలుచుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
1996లో, శ్రీ మోదీ, బిజెపి జాతీయ కార్యదర్శిగా ఢిల్లీ వెళ్ళగా, పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ వంటి కీలక ఉత్తర భారతదేశ రాష్ట్రాల బాధ్యతలు అప్పగింపబడ్డాయి. ఆ తరువాత, 1998లో బిజెపి, హిమాచల్ ప్రదేశ్ లో సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మరియు హర్యానా (1996), పంజాబ్ (1997), జమ్ము కాశ్మీర్ లలో సంకీర్ణాలు ఏర్పాటుచేసింది. ఢిల్లీలో అతనికివ్వబడిన బాధ్యతల వల్ల శ్రీ మోదీకి శ్రీ సర్దార్ ప్రకాశ్ సింగ్ బాదల్, శ్రీ బాన్సీ లాల్ మరియు శ్రీ ఫరూఖ్ అబ్దుల్లా వంటి అగ్రనాయకులతో కలిసి పనిచేసే అవకాశం దక్కింది.
అంతకుముందు, శ్రీ సుందర్ సింగ్ భండారి మరియు శ్రీ కుషభాహు థాకరే వంటి సమర్థులు నిర్వహించిన ప్రాముఖ్యమైన జాతీయ కార్యదర్శి (సంస్థ) పదవి శ్రీ మోడీకి అప్పగింపబడింది. జాతీయ కార్యదర్శి (సంస్థ) గా 1998 మరియు 1999 లోక్ సభ ఎన్నికల ప్రచారంలో ఆయన పాత్ర కీలకపాత్ర పోషించారు. ఆ రెండు ఎన్నికల్లో కూడా బిజెపి ఏకైక పెద్ద పార్టీగా నిలిచింది మరియు శ్రీ అటల్ బీహార్ వాజ్ పేయి నాయకత్వంలో ప్రభుత్వాన్నికూడా ఏర్పాటు చేసింది.
శ్రీ మోడీ, సంస్థ వ్యవహారాల్లో నూతన నాయకత్వంను ఉత్తేజపరిచి, యువ కార్యకర్తలను ప్రోత్సహించడంతో పాటు ప్రచారం కోసం సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై కూడా దృష్టిసారించారు. ఇవన్నీ కూడా ఆ పార్టీ కేంద్రంలో ఇద్దరు ఎంపీల స్థాయి నుండి 1998 నుండి 2004 వరకు పూర్తికాలం అధికారంలో ఉండేందుకు దోహదపడ్డాయి.