ముఖేష్ ను తన వ్యాపార కార్యకలాపాలను యుపిఐ, డిజిటల్ పేమెంట్స్ ద్వారా చేయాల్సిందిగా ప్రధానమంత్రి సూచించారు. దీని వల్ల బ్యాంకులనుంచి మరింత పెట్టుబడి పొందవచ్చని తెలిపారు. ప్రస్తుత 50 శాతం డిజిటల్, యుపిఐ చెల్లింపుల విధానం నుంచి మొత్తం డిజిటల్, యుపిఐ చెల్లింపుల విధానానికి మారాల్సిందిగా ప్రధానమంత్రి , లబ్ధిదారు ముఖేష్ కు సూచించారు.
ఉద్యోగం కోరుకునే స్థాయి నుంచి ముఖేష్ ఉద్యోగం కల్పించే స్థాయికి ఎదగడం పట్ల ప్రధానమంత్రి సంతోషం వ్యక్తం చేశారు. దేశ యువతకు అండగా నిలవడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి అన్నారు.