ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో కెంటకీ గవర్నర్ శ్రీ మేట్ బెవిన్ గాంధీనగర్ లో నేడు భేటీ అయ్యారు.
వ్యాపారం మరియు పెట్టుబడి రంగాలు సహా భారతదేశాని కి, అమెరికా కు మధ్య సమన్వయం పెరుగుతూ ఉండటాన్ని, అలాగే ఈ రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం పటిష్టం అవుతూ ఉండటాన్ని ప్రధాన మంత్రి ఈ సందర్భం గా ప్రస్తావించారు. భారతదేశం లో తయారీ రంగం లో యుఎస్ పెట్టుబడులు పెరగటాన్ని ఆయన స్వాగతించారు. ‘మేక్ ఇన్ ఇండియా’లో అవకాశాల ను అన్వేషించవలసిందిగా యుఎస్ కంపెనీల ను ఆయన ఆహ్వానించారు.
గవర్నర్ కెంటకీ కి, భారతదేశాని కి మధ్య వ్యాపారం, పెట్టుబడులు పెరుగుతున్న సంగతి ని ప్రధాన మంత్రి దృష్టి కి తీసుకు వచ్చారు. కెంటకీ రాష్ట్రం సహా యుఎస్ కు భారతీయ వృత్తి నిపుణులు అందిస్తున్నటువంటి తోడ్పాటు ను ఆయన స్వాగతించారు.