ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో శ్రీ లంక అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన కొద్ది సేపటి క్రితం టెలిఫోన్ లో సంభాషించారు. జమ్మూ – కశ్మీర్ లోని ఉరీలో జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటన పట్ల శ్రీ మైత్రిపాల సిరిసేన సంతాపాన్ని వ్యక్తం చేశారు.
సీమాంతర ఉగ్రవాద దాడిని అధ్యక్షుడు శ్రీ మైత్రిపాల సిరిసేన తీవ్రంగా ఖండించారు. అమరుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేశారు.
ఈ ప్రాంతంలో ఉగ్రవాద ఉపద్రవాన్ని అంతం చేసేందుకు ఈ ప్రాంత దేశాలన్నీ పరస్పరం స్థిర ప్రాతిపదికన సహకరించుకోవలసిన అవసరాన్ని గురించి ఇరువురు నేతలు మాట్లాడుకొన్నారు.
President @MaithripalaS called PM @narendramodi to condole the terror attack in Uri, Jammu & Kashmir.
— PMO India (@PMOIndia) September 20, 2016
President @MaithripalaS strongly condemned the cross-border terrorist attack and offered condolences to the families of the victims.
— PMO India (@PMOIndia) September 20, 2016
The leaders spoke of the need for sustained cooperation among countries of the region to end the scourge of terrorism in the region.
— PMO India (@PMOIndia) September 20, 2016