ప్రస్తుతం భారతదేశంలో వ్యాపార సంబంధ కార్యక్రమాలలో పాలుపంచుకోవడానికి వచ్చిన టెక్సాస్ గవర్నరు శ్రీ గ్రెగ్ అబాట్ బుధవారం నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమయ్యారు.
భారతదేశం మరియు యుఎస్ ల మధ్య నెలకొన్న వ్యూహాత్మక భాగస్వామ్యంలో చక్కటి వృద్ధి ఉందని ప్రధాన మంత్రి ఈ సందర్భంగా ప్రస్తావించారు; అలాగే వ్యాపారం, వాణిజ్యం, శక్తి, పరిశ్రమ, విద్య ఇంకా ప్రజలకు ప్రజలకు మధ్య సంబంధాల వంటి రంగాలలో టెక్సాస్ తో అనుబంధాన్ని పెంపొందించుకోవడానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి కూడా ఆయన వివరించారు. ఈ బంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నేతలు ఇరువురూ అంగీకరించారు.
టెక్సాస్ లో నివాసం ఉంటున్న భారతీయ మూలాలు కలిగిన వ్యక్తులు టెక్సాస్ తో పాటు యునైటెడ్ స్టేట్స్ కు మద్దతును అందిస్తుండటం పట్ల గవర్నర్ శ్రీ అబాట్ ప్రశంసలు కురిపించారు.
Texas Governor Mr. @GregAbbott_TX met PM @narendramodi in Delhi today. @GovAbbott pic.twitter.com/Yf0czvjdaa
— PMO India (@PMOIndia) March 28, 2018