ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని యునైటెడ్ స్టేట్స్ రక్షణ మంత్రి శ్రీ ఎశ్టన్ కార్టర్ ఈ రోజు కలుసుకొన్నారు.
భారతదేశానికి, యునైటెడ్ స్టేట్స్ కు మధ్య రక్షణ రంగ సహకారాన్ని పటిష్టపరచడంలో మంత్రి శ్రీ కార్టర్ చేసిన కృషిని ప్రధాన మంత్రి ప్రశంసించారు.
ఈ సంవత్సరం జూన్ లో ప్రధాన మంత్రి తాను యునైటెడ్ స్టేట్స్ లో జరిపిన పర్యటన విజయవంతమైన సంగతిని గుర్తుకు తెచ్చుకొన్నారు. యుఎస్ తో బలిష్ఠమైన మరియు దృఢమైన ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని భారతదేశం కొనసాగిస్తుందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు.
ఈ సంవత్సరం జూన్ లో తీసుకున్న నిర్ణయాలను, కుదిరిన అవగాహనను ముందుకు తీసుకువెళ్లడంలో చోటుచేసుకొంటున్న పురోగతిని ప్రధాన మంత్రికి మంత్రి శ్రీ కార్టర్ వివరించారు.
వారు ఉభయులు ప్రాంతీయ అంశాలపైన మరియు ఆసియా పసిఫిక్ ప్రాంతంలో పరిణామాలపైన అభిప్రాయాలను పరస్పరం తెలియజేసుకొన్నారు.