ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వికసిత్ భారత్ సంకల్ప్ యాత్ర (వి.బి.ఎస్.వై.) లబ్ధిదారులతో సంభాషించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు నిర్దేశిత లబ్ధిదారులందరికీ సమయానుకూలంగా చేరేలా చూడడం ద్వారా ప్రభుత్వ ప్రధాన పథకాల సంతృప్తిని పొందేందుకు దేశ వ్యాప్తంగా విక్షిత్ భారత్ సంకల్ప్ యాత్ర చేపట్టబడుతోంది. జమ్మూ & కాశ్మీర్‌లోని షేక్ పురా నుండి పాల విక్రేత మరియు వి.బి.ఎస్.వై. లబ్ధిదారుని శ్రీమతి నజియా నజీర్‌తో సంభాషిస్తూ ప్రధాన మంత్రి ఆమె కుటుంబ సభ్యుల వివరాలను గురించి అడిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తన భర్త ఆటోడ్రైవర్ అని, తన ఇద్దరు పిల్లలు యూటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్నారని ఆమె బదులిచ్చారు. గత సంవత్సరాలతో పోలిస్తే తన గ్రామంలో స్పష్టమైన మార్పుల గురించి ప్రధాన మంత్రి అడిగినప్పుడు, శ్రీమతి నజియా నజీర్ సమాధానమిస్తూజజ జల్ జీవన్ మిషన్ స్వచ్ఛమైన మరియు సురక్షితమైన నీటి సరఫరాతో ఒక గేమ్ ఛేంజర్‌గా నిరూపించబడిందని అన్నారు. ఒకప్పుడు నీటి సమస్య ఎదుర్కొన్న వాళ్ల ఇండ్లకు ఇప్పడు నీళ్లు చేరుకుంటున్నాయని తెలిపారు. ఉజ్వల యోజన కింద గ్యాస్ కనెక్షన్ల ప్రయోజనాలు, ప్రభుత్వ పాఠశాలల్లో విద్య మరియు పీఎంజీకేఏవైను మరో 5 సంవత్సరాలు పొడిగించినందుకు ఆమె ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ మోదీ గ్రామంలో వి.బి.ఎస్.వై. వ్యాన్ యొక్క అనుభవం మరియు ప్రభావం గురించి కూడా అడిగి తెలుసుకున్నారు. కాశ్మీరీ సంస్కృతి ప్రకారం పవిత్రమైన సందర్భాలలో నిర్వహించే ఆచారాల ద్వారా ప్రజలు దీనిని స్వాగతిస్తున్నారని ఆమె బదులిచ్చారు. శ్రీమతి నజియా నజీర్‌తో సంభాషించడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ప్రయోజనాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా తమ పిల్లలను చదివించి, దేశాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగుతున్న కాశ్మీర్‌లోని మహిళా శక్తిపై విశ్వాసం వ్యక్తం చేశారు. "జమ్మూ & కాశ్మీర్‌లో వి.బి.ఎస్.వై. పట్ల ఉన్న ఉత్సాహం దేశంలోని ఇతర ప్రాంతాలకు సానుకూల సందేశాన్ని పంపుతుందని పేర్కొంటూ, మీ ఉత్సాహం నాకు మరింత శక్తినిచ్చేందుకు మూలం" అని అన్నారు. కొత్త తరాల ఉజ్వల భవిష్యత్తుకు ఇది హామీ అని ఆయన అన్నారు. దేశం నలుమూలల నుండి ప్రజలు అభివృద్ధి బాటలో చేరడం పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. జమ్మూ & కాశ్మీర్ ప్రజల సహకారాన్ని కొనియాడారు.