దేశ సైనికావసరాలకు సంబంధించి వ్యూహాత్మకంగా కీలకమైన 928 లైన్ రీప్లేస్‌మెంట్ యూనిట్లు/సబ్-సిస్టమ్స్/స్పేర్స్-కాంపోనెంట్లతో కూడిన 4వ దేశీయకరణ అనుకూల జాబితాకు రక్షణశాఖ ఆమోదం తెలిపింది. ఈ జాబితాలో అత్యాధునిక రక్షణ సామగ్రి, విడిభాగాలు కూడా ఉన్నాయని, ఈ దిగుమతి ప్రత్యామ్నాయ ఉత్పత్తుల విలువ రూ.715 కోట్లు ఉంటుంది. ఈ మేరకు రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఒక ట్వీట్ ద్వారా తెలిపారు.
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దీనిపై స్పందిస్తూ ఒక ట్వీట్ ద్వారా పంపిన సందేశంలో:
“రక్షణ రంగంలో ఇదొక సానుకూల పరిణామం. స్వయం సమృద్ధ భారతంపై మా సంకల్పాన్ని ఇది మరింత బలోపేతం చేస్తుంది. అంతేకాకుండా దేశీయ పారిశ్రామిక నైపుణ్యానికి ప్రతీకగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.
A positive development for the defence sector. This will add strength to our resolve towards an Aatmanirbhar Bharat and encourage local entrepreneurial talent. https://t.co/J7rVWXvdvy
— Narendra Modi (@narendramodi) May 16, 2023