రైసీనా డైలాగ్ నేపథ్యం లో 12 దేశాల కు చెందిన మంత్రుల స్థాయి ప్రతినిధి వర్గం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆయన నివాసం లో ఈ రోజు న భేటీ అయింది.
ప్రధాన మంత్రి తో సమావేశమైన ప్రతినిధుల లో లాత్ వియా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ ఎడ్ గర్ రింక్ విక్స్, ఉజ్ బెకిస్తాన్ కు చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ అబ్దుల్ అజీజ్ కామిలోవ్, హంగరీ కి చెందిన విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీ పీటర్ సుజీజార్టో, అఫ్గానిస్తాన్ జాతీయ భద్రత సలహాదారు డాక్టర్ హందుల్లా మోహిబ్, చెక్ రిపబ్లిక్ విదేశాంగ మంత్రి శ్రీ టామస్ ఫెట్రీ సెక్, మాల్దీవ్స్ విదేశాంగ మంత్రి శ్రీ అబ్దుల్లా శాహిద్, బాంగ్లాదేశ్ సమాచార శాఖ మంత్రి శ్రీ హసన్ మహముద్, ఎస్టోనియా విదేశాంగ మంత్రి శ్రీ ఉర్ మాస్ రెన్ సలూ, దక్షిణ ఆఫ్రికా అంతర్జాతీయ సంబంధాలు మరియు సహకారం శాఖ మంత్రి డాక్టర్ పండోర్, డెన్మార్క్ విదేశాంగ మంత్రి శ్రీ జెపీ ఎస్ కొఫోడ్, కామన్ వెల్త్ సెక్రటరీ జనరల్ శ్రీ పెట్రీసియా స్కాట్ లాండ్, శంఘాయి కోఆపరేశన్ ఆర్గనైజేశన్ సెక్రటరీ జనరల్ శ్రీ వ్లాదిమీర్ నొరోవ్ లు ఉన్నారు.
ఈ నాయకులు అందరినీ ప్రధాన మంత్రి భారతదేశాని కి ఆహ్వానిస్తూ, రైసీనా డైలాగ్ 2020లో పాల్గొనడం కోసం తరలివచ్చినందుకు వారి ని అభినందించారు. శీఘ్ర గతి న మరియు సమ్మిళిత రీతి న సామాజిక, ఆర్థిక అభివృద్ధి సాధన కు గాను ప్రభుత్వం చేపడుతున్న కృషి ని గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భం గా వివరించారు. అంతేకాకుండా, ప్రధానమైన ప్రపంచ అభివృద్ధి పరమైన సవాళ్ళ ను తగ్గించడం కోసం మరియు సుస్థిర అభివృద్ధి లక్ష్యాల ను సాధించడం కోసం ఈ కార్యక్రమాల ప్రాముఖ్యం ఏమిటన్నది కూడా ఆయన ఈ సందర్భం గా తెలియజేశారు.