ఓమాన్ ఇండియా జాయింట్ బిజినెస్ కౌన్సిల్ లో భాగంగా ఉన్నటువంటి సుమారు 30 మంది యువ వ్యాపార వేత్తల బృందం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఈ రోజు సమావేశమైంది .
ఈ సందర్భంగా వారు ఉభయ దేశాల ఉమ్మడి చరిత్ర మరియు సముద్ర మార్గాల తాలూకు తమ తమ దృష్టికోణాలను వెల్లడించారు.
ముఖాముఖి లో ప్రధాన మంత్రి ఇరు దేశాల మధ్య శక్తి భద్రత మరియు ఆహార భద్రత లలో సహకారానికి ఉన్న అవకాశాలను గురించి ప్రముఖంగా వివరించారు. పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఆరంభం అవుతున్న సందర్భంగా ఓమాన్ సుల్తాన్ కు తన శుభాకాంక్షలను కూడా ఆయన తెలియజేశారు.