ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దక్షిణ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సిరిల్ రామఫోసా తో జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో సమావేశమయ్యారు.
నేతలు ఇద్దరూ రెండు దేశాల మధ్య సంబంధాల లో మరీ ముఖ్యం గా ద్వైపాక్షిక సంబంధాల లో 2019వ సంవత్సరం లో సహకారానికి సంబంధించిన వ్యూహాత్మక కార్యక్రమం పై సంతకాలు అయిన తరువాతి కాలం లో నమోదైన పురోగతి ని గురించి సమీక్షించారు. వారు రక్షణ, విద్య మరియు వ్యవసాయం రంగాల లో ప్రగతి పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. వ్యాపారం, పెట్టుబడి, ఆహార భద్రత, రక్షణ, ఔషధ నిర్మాణం, డిజిటల్ ఫినాన్శల్ ఇన్ క్లూజన్, నైపుణ్యాభివృద్ధి, బీమా, ఆరోగ్యం లతో పాటు ప్రజల పరస్పర సంబంధాలు వంటి రంగాల లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత గాఢం చేసుకోవలసిన అవసరాన్ని గురించి పునరుద్ఘాటించారు
ఇదే సంవత్సరం జూన్ లో ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటిఒ) ఒప్పందం రూపుదాల్చడాన్ని నేతలు ఇరువురు స్వాగతించారు; ఈ ఒప్పందం అభివృద్ధి చెందుతూ ఉన్న దేశాల లో కోవిడ్-19 నివారక టీకా మందుల తయారీ ని సమర్థిస్తున్నది. కోవిడ్-19 నివారణ, కట్టడి లేదా చికిత్స లకు సంబంధించి టిఆర్ఐపిఎస్ అగ్రిమెంటు లోని కొన్ని నిబంధనల అమలు అనే అంశం లో డబ్ల్యుటిఒ సభ్యత్వ దేశాల కు ఒక మినహాయింపు ను వర్తింప చేయాలి అనే సూచనతో కూడిన ఒక ప్రతిపాదన ను తీసుకు వచ్చింది భారతదేశం మరియు దక్షిణ ఆఫ్రికా కావడం గమనార్హం.
బహుపక్షీయ సంస్థల లో నిరంతర సమన్వయం మరియు వాటి లో సంస్కరణ లు విశేషించి ఐక్య రాజ్య సమితి భద్రత మండలి లో సంస్కరణ ల ఆవశ్యకత పైన కూడా చర్చ లు జరిగాయి.
Glad to have met President @CyrilRamaphosa in Germany. Our talks covered diverse sectors including economic cooperation, improving connectivity and deepening ties in food processing and FinTech. 🇮🇳 🇿🇦 pic.twitter.com/dNVQSG5oQq
— Narendra Modi (@narendramodi) June 27, 2022