ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యూరోపియన్ కమిశన్ అధ్యక్షురాలు ఉర్సు లా వాన్ డేర్ లేయెన్ గారి తో జి-7 శిఖర సమ్మేళనం సందర్బం లో 2022 జూన్ 27 న జర్మనీ లోని శ్లాస్ ఎల్మౌ లో సమావేశమయ్యారు.
సమావేశం సాగిన క్రమం లో, ప్రధాన మంత్రి రాయ్ సీనా డైలాగ్ కాలం లో 2022వ సంవత్సరం ఏప్రిల్ మాసం లో అధ్యక్షురాలు వాన్ డేర్ లేయెన్ గారు దిల్లీ కి జరిపిన పర్యటన ఫలప్రదం కావడాన్ని గుర్తు కు తీసుకు వచ్చారు. నేతలు ఇరువురు భారతదేశాని కి మరియు యూరోపియన్ యూనియన్ (ఇయు) కు మధ్య వ్యాపారం, పెట్టుబడి మరియు జిఐ ఒప్పందాల పై సంప్రదింపులు మళ్ళీ మొదలవడం పట్ల ప్రసన్నత ను వ్యక్తం చేశారు. డిజిటల్ సహకారం, జలవాయు సంబంధిత కార్యాచరణ, సాంకేతిక విజ్ఞానం, నూతన ఆవిష్కరణ లు సహా వివిధ రంగాల లో భారతదేశం-ఇయు సంబంధాల ను కూడా వారు సమీక్షించారు.
సమకాలీన ప్రపంచ మరియు ప్రాంతీయ ఘటన క్రమాల పై నేత లు ఇరువురు వారి వారి ఆలోచనల ను ఒకరి దృష్టి కి మరొకరు తీసుకు వచ్చారు.
President @EU_Commission @vonderleyen and I had an outstanding meeting earlier today. We discussed ways to deepen investment linkages, efforts to combat climate change, boosting digital cooperation and other important issues. pic.twitter.com/dDpbMBlWHw
— Narendra Modi (@narendramodi) June 27, 2022