జి-7 శిఖర సమ్మేళనం సందర్భం లో 2022 జూన్ 26వ తేదీ న అర్జెంటీనా అధ్యక్షుడు శ్రీ అల్ బర్టో ఫర్నాండీజ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు.
నేతల మధ్య జరిగిన ఒకటో ద్వైపాక్షిక సమావేశం ఇది. ఇరువురు పాలనాధినేత లు 2019 లో ఏర్పాటు చేసుకొన్న ద్వైపాక్షిక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని అమలుపరచడం లో పురోగతి ని సమీక్షించారు. వ్యాపారం మరియు పెట్టుబడి, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సహకారం (సౌత్ – సౌత్ కోఆపరేశన్) మరీ ముఖ్యం గా ఔషధనిర్మాణ రంగం లో సహకారం, జలవాయు సంబంధి కార్యాచరణ, నవీకరణయోగ్య శక్తి, న్యూక్లియర్ మెడిసిన్, బ్యాటరీతో నడిచే వాహనాలు, రక్షణ రంగం లో సహకారం, వ్యవసాయం మరియు ఆహార భద్రత, సాంప్రదాయిక ఔషధాలు, సాంస్కృతిక రంగ సహకారంలతో పాటు అంతర్జాతీయ సంస్థల లో సమన్వయం సహా వివిధ అంశాలపై చర్చ లు జరిగాయి. ఈ రంగాలన్నిటి లో పరస్పర సంబంధాలను పెంపొందింపచేసుకోవాలి అని ఇరు పక్షాలు సమ్మతి ని వ్యక్తం చేశాయి.
Reviewed the full range of the India-Argentina friendship during the very productive meeting with President @alferdez in Munich. Stronger cooperation between our nations will greatly benefit our people. pic.twitter.com/bBe32Wg850
— Narendra Modi (@narendramodi) June 26, 2022