ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మ్యూనిఖ్ నుంచి తిరుగు ప్రయాణమై మార్గమధ్యం లో అబూ ధాబీ లో కొద్ది సేపు ఆగారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) అధ్యక్షుడు మరియు అబూ ధాబీ పాలకుడు అయిన శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ తో ప్రధాన మంత్రి సమావేశమయ్యారు. ప్రధాన మంత్రి 2019వ సంవత్సరం ఆగస్టు లో అబూ ధాబీ ని సందర్శించిన తరువాత నేత లు ఇరువురు ముఖాముఖి సమావేశం కావడం ఇదే తొలి సారి.
శ్రీ శేఖ్ ఖలీఫా బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కిందటి నెల లో కన్నుమూసిన నేపథ్యం లో ప్రధాన మంత్రి తన వ్యక్తిగత సంతాపాన్ని వ్యక్తం చేయడం అనేది ఈ సందర్శన తాలూకు ప్రధాన ఉద్దేశ్యం గా ఉండింది. శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ తో పాటు కుటుంబ సభ్యులు అందరికీ ప్రధాన మంత్రి తన హృదయపూర్వక సంతాపాన్ని వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యుల లో జాతీయ భద్రత సలహాదారు శ్రీ శేఖ్ తహన్నౌ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్, ఉప ప్రధాని శ్రీ శేఖ్ మంసూర్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్, అబూ ధాబీ ఇన్వెస్ట్ మెంట్ అథారిటీ ఎమ్ డి శ్రీ శేఖ్ హమీద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్, విదేశీ వ్యవహారాలు మరియు అంతర్జాతీయ సహకారం శాఖ మంత్రి శ్రీ శేఖ్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ తదితరులు ఉన్నారు.
యుఎఇ కి మూడో అధ్యక్షుడు గా శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ ఎన్నిక కావడం తో పాటు గా అబూ ధాబీ కి పాలకుడు అయినందుకు ఆయన కు ప్రధాన మంత్రి అభినందనల ను తెలియజేశారు.
భారతదేశం- యుఎఇ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం లో వివిధ అంశాల పై నేత లు ఇద్దరు సమీక్ష జరిపారు. ఫిబ్రవరి 18వ తేదీ నాడు వీరు ఒక వర్చువల్ సమిట్ లో పాల్గొన్నప్పుడు ఈ రెండు దేశాలు సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందాన్ని (సిఇపిఎ) కుదుర్చుకొన్నాయి. మే నెల 1వ తేదీ నాడు సిఇపిఎ అమలు లోకి వచ్చింది. ఉభయ దేశాల మధ్య వ్యాపారాన్ని, పెట్టుబడి ని ఈ సిఇపిఎ మరింత గా ప్రోత్సహిస్తుందన్న అంచనా ఉంది. ద్వైపాక్షిక వ్యాపారం 2021-22 ఆర్థిక సంవత్సరం లో సుమారు 72 బిలియన్ యుఎస్ డాలర్ గా ఉండింది. భారతదేశాని కి మూడో అతి పెద్ద వ్యాపార భాగస్వామి గా, రెండో అతి పెద్ద ఎగుమతి గమ్యస్థానం గా ప్రస్తుతం యుఎఇ ఉంది. గత కొన్ని సంవత్సరాలు గా భారతదేశం లో యుఎఇ విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి (ఎఫ్ డిఐ) నిరంతరం గా వృద్ధి చెంది, ప్రస్తుతం 12 బిలియన్ యుఎస్ డాలర్ కు పైబడింది.
వర్చువల్ సమిట్ సాగిన క్రమం లో, ఇద్దరు నేత లు ఒక విజన్ స్టేట్ మెంట్ ను కూడా విడుదల చేశారు. అందులో రాబోయే సంవత్సరాల లో వ్యాపారం, పెట్టుబడి, శక్తి, నవీకరణ యోగ్య శక్తి, ఆహార భద్రత, ఆరోగ్యం, రక్షణ, నైపుణ్యాల కల్పన, విద్య, సంస్కృతి మరియు ప్రజా సంబంధాలు సహా విభిన్న రంగాల లో ద్వైపాక్షిక సహకారాని కి ఒక మార్గసూచీ ని పొందుపరచడం జరిగింది. నేతలు ఇరువురు భారతదేశం మరియు యుఎఇ వాటి సుసంపన్నమైనటువంటి మరియు మైత్రిపూర్వకమైనటువంటి సంబంధాలతో పాటు ప్రజల మధ్య చారిత్రిక అనుబంధాన్ని కూడా ఇంకాస్త అధికం గా పటిష్టపరచుకోవడాన్ని కొనసాగిస్తున్నాయి. శక్తి రంగం లో భారతదేశాని కి, యుఎఇ కి మధ్య పటిష్టమైన భాగస్వామ్యం కొనసాగుతూ ఉండగా, ఆ మాధ్యమం ద్వారా ఇక నవీకరణ యోగ్య శక్తి రంగం లో సైతం సరికొత్త గా శ్రద్ధ ను వహించడం జరుగుతున్నది.
యుఎఇ లో 3.5 మిలియన్ ప్రవాసీ భారతీయ సముదాయం శ్రేయం విషక్ష్ లో మంచి శ్రద్ధ ను తీసుకొంటున్నందుకు, విశేషించి కోవిడ్-19 మహమ్మారి కాలం లో వారి బాగోగులు పట్టించుకొన్నందుకు గాను యుఎఇ అధ్యక్షుడు మరియు అబూ ధాబీ పాలకుడు శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ కు ప్రధాన మంత్రి ధన్యవాదాలు తెలిపారు. వీలు ను చూసుకొని త్వరలోనే భారతదేశాన్ని సందర్శించడానికి రావలసిందంటూ శ్రీ శేఖ్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నాహ్ యాన్ ను ప్రధాన మంత్రి ఆహ్వానించారు.