యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్‌టెండెడ్ రియాలిటీ (ఏవీజీసీ-ఎక్స్ఆర్) కోసం నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (ఎన్ సీఓఈ) ఆవిర్భవిస్తోంది. కంపెనీల చట్టం 2013 ప్రకారం సెక్షన్ 8 కంపెనీగా దీనిని రూపొందిస్తున్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశం ఈ ప్రతిపాదనను ఆమోదించింది. ఇండియన్ చాంబర్స్ అఫ్ కామర్స్ సమాఖ్య, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీలో ఉన్న పరిశ్రమల భాగస్వామ్యంతో ఈ సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ముంబయిలో ఎన్ సిఓఈ సంస్థను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలో ఏవీజీసీ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు కోసం కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి 2022-23 బడ్జెట్ ప్రకటనకు అనుగుణంగా ఇది ప్రారంభం అవుతోంది.
ఫిల్మ్ మేకింగ్, ఓవర్ ది టాప్ (ఓటీటీ), గేమింగ్, వాణిజ్య ప్రకటనలు, ఆరోగ్యం, విద్య, ఇతర సామాజిక రంగాలతో సహా మొత్తం మీడియా, వినోద రంగంలో ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగం నేడు ఒక అనివార్యమైన పాత్రను పోషిస్తుంది. దేశం అభివృద్ధి గమనంలో వెళుతున్నది. వేగంగా అభివృద్ధి చెందుతున్న సాంకేతికత, దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఇంటర్నెట్, చౌక డేటా రేట్లతో పోటీ పడుతూ, ప్రపంచవ్యాప్తంగా ఏవీజీసీ-ఎక్స్ఆర్ వినియోగం విపరీతమైన వేగంతో పెరగడానికి సిద్ధంగా ఉంది.
ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగం వృద్ధి దిశగా పయనం
చురుకుగా సాగుతున్న ఈ వేగాన్ని కొనసాగించడానికి, దేశంలో ఏవీజీసీ-ఎక్స్ఆర్ విస్తరణ వ్యవస్థను ప్రోత్సహించడానికి, ఒక అత్యున్నత సంస్థగా నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపిస్తున్నారు. అత్యాధునిక ఏవీజీసీ-ఎక్స్ఆర్ టెక్నాలజీల్లో సరికొత్త నైపుణ్యాలతో ఔత్సాహికులు, నిపుణులను సన్నద్ధం చేయడానికి ప్రత్యేక శిక్షణ, బోధనా కార్యక్రమాలను అందిస్తుంది. పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. కంప్యూటర్ సైన్స్ వంటి వివిధ రంగాలకు చెందిన నిపుణులను ఒకచోట చేరుస్తుంది. ఇంజినీరింగ్, డిజైన్, ఆర్ట్... ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగంలో ప్రధాన పురోగతికి మార్గం వేస్తుంది. దేశవిదేశాల మార్కెట్ల కోసం భారతదేశం ఐపీని రూపొందించడంపై నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్- విస్తృతంగా దృష్టి సారిస్తుంది. మొత్తంగా ఇది భారతదేశ గొప్ప చారిత్రక, సాంస్కృతిక వారసత్వం ఆధారంగా కంటెంట్‌ను రూపొందించడానికి దారితీస్తుంది. ఇంకా, ఏవీజీసీ-ఎక్స్ఆర్ రంగంలో అంకుర సంస్థలు, ప్రారంభ-దశ కంపెనీలకు వనరులను అందించడం ద్వారా ఎన్ సీఓఈ ఒక ఇంక్యుబేషన్ సెంటర్‌గా పని చేస్తుంది. అలాగే, ఎన్ సీఓఈ విద్యారంగంతోపాటు, పరిశ్రమ రంగ అవసరాల కోసం కూడా పని చేస్తుంది.
ఈ ఎన్ సీఓఈ ని ఏవీజీసీ-ఎక్స్ఆర్ పరిశ్రమ వృద్ధికి చోదక శక్తిగా పని చేయడం ద్వారా దేశంలోని అన్ని ప్రాంతాల యువతకు ఇది అతిపెద్ద ఉపాధి వనరులలో ఒకటిగా ఉపయోగపడుతుంది. ఇది సృజనాత్మక కళలు, డిజైన్ రంగానికి అపారమైన ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలను మరింతగా పెంచే ఏవీజీసీ-ఎక్స్ఆర్ కార్యకలాపాలకు భారతదేశాన్ని కేంద్రంగా మారుస్తుంది.
ఏవీజీసీ-ఎక్స్ఆర్ కోసం ఎన్ సీఓఈ అత్యాధునిక కంటెంట్‌ను అందించడానికి భారతదేశాన్ని కంటెంట్ హబ్‌గా ఉంచుతుంది. తద్వారా ప్రపంచవ్యాప్తంగా కళ పరంగా భారతదేశపు ప్రాభవాన్ని పెంచుతుంది. మీడియా, ఎంటర్‌టైన్‌మెంట్ రంగంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షిస్తుంది.
The Cabinet approval to establish the National Centre of Excellence for Animation, Visual Effects, Gaming, Comics and Extended Reality is great news for the world of media and entertainment. The eco-system of creators will get a big boost and many more job opportunities will be…
— Narendra Modi (@narendramodi) September 18, 2024