In 2018, the world's largest health insurance scheme 'Ayushman Bharat' was launched, every village of the country got electricity: PM Modi #MannKiBaat
Our festivals represent 'Unity in Diversity' and 'Ek Bharat, Shreshtha Bharat': PM Modi during #MannKiBaat
The global importance that Kumbh holds is very well exemplified from the fact that UNESCO has described it as ‘Intangible Cultural Heritage of Humanity': PM during #MannKiBaat
Kumbh in itself is grand in nature. It is divine as well as beautiful: PM Modi during #MannKiBaat
This time, every devotee will be able to offer prayers at Akshay Vat after the holy bath in the Sangam: Prime Minister Modi during #MannKiBaat
Pujya Bapu’s connect with South Africa is unbreakable. It was in South Africa, where Mohan became the 'Mahatma': Prime Minister Modi #MannKiBaat
Mahatma Gandhi had started his first Satyagraha in South Africa and he stood against the discrimination based on the colour of one's skin: PM #MannKiBaat
Sardar Patel dedicated his entire life towards uniting India. He devoted every moment of his life to protect the nation's integrity: PM Modi during #MannKiBaat
Guru Gobind Singh Ji was born in Patna, His karmabhoomi was North India and He sacrificed His life in Maharashtra’s Nanded: PM during #MannKiBaat
Guru Gobind Singh Ji calm but whenever, an attempt was made to suppress the voice of the poor and the weak, then Guru Gobind Singh Ji raised his voice and stood firmly with the poor: PM #MannKiBaat
Guru Gobind Singh Ji always used to say that strength cannot be demonstrated by fighting weak sections: PM Modi #MannKiBaat

నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! ఈ 2018 సంవత్సరం చివరికి వచ్చేసింది. 2019వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇలాంటి సమయంలో గడచిన ఏడాది తాలూకూ కబుర్లను తలచుకోవడంతో పాటుగా నూతన సంవత్సర తీర్మానాల గురించి కూడా చర్చించుకోవడం సర్వసాధారణం. వ్యక్తిగతంగానూ , సామాజికపరంగానూ, దేశపరంగా కూడా ప్రతి ఒక్కరూ ఒక్కసారి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుచూపుతో భవిష్యత్తు వైపుకి కూడా చూడగలిగినంత దూరం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చూసుకున్నప్పుడే గతంలోని అనుభవాలూ ఉపయోగపడతాయి, కొత్త పనులు చేయడానికి ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. ఇంకా, మన జీవితంలో మార్పుని తీసుకురావడానికి మనం ఏం చెయ్యగలము? దేశం కోసం, సమాజం ముందుకు నడవడానికి మన వంతు సహాయం ఏం చెయ్యగలము? అన్న ఆలోచన కూడా కలుగుతుంది. మీ అందరికీ 2019వ సంవత్సరానికి గానూ అనేకానేక శుభాకాంక్షలు. 2018వ సంవత్సరాన్ని ఎలా గుర్తుంచుకోవాలా అని మీరందరూ ఆలోచిస్తూ ఉండిఉంటారు. 2018వ సంవత్సరాన్ని భారతదేశం ఒక గర్వించదగ్గ దేశంగా, తన 130కోట్ల ప్రజల బలాన్ని ఎలా గుర్తుంచుకుంటుందనేది కూడా ముఖ్యమైన విషయమే. ఇది మనందరికీ ఎంతో గౌరవప్రదమైన సంగతి.

2018లో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరోగ్య భీమా పథకం "ఆయుష్మాన్ భారత" ప్రారంభమైంది. దేశంలోని ప్రతి గ్రామానికీ విద్యుత్తు లభించింది. దేశంలోని పేదరికాన్ని భారతదేశం రికార్డ్ స్థాయిలో నిర్మూలిస్తోందని ప్రపంచంలోని రేటింగ్ – విశిష్ట సంస్థలన్నీ ఒప్పుకున్నాయి. అభ్యంతరహితమైన దేశప్రజల సంకల్పం వల్ల పరిశుభ్రతా కార్యక్రమాలు కూడా తొంభై ఇదు శాతానికి మించి జరుగుతున్నాయి.

స్వాతంత్రం వచ్చిన తరువాత, ఎర్రకోటపై నుండి మొట్టమొదటిసారిగా స్వాతంత్ర భారత ప్రభుత్వపు 75వ వార్షికోత్సవ  త్రివర్ణపతాకం ఎగురవేయబడింది. దేశాన్ని ఏకత్రాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గౌరవార్థం ప్రపంచంలోకెల్ల పెద్ద ప్రతిమ "Statue of Unity" దేశానికి లభించింది. మన దేశం పేరు ప్రపంచంలో మారుమ్రోగింది. ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారమైన "Champions of the earth" award ను మన దేశానికి బహుకరించింది. సౌర శక్తి, వాతావరణ మార్పులలో భారతదేశ ప్రయత్నాలకు ప్రపంచంలో స్థానం లభించింది. భారతదేశంలో అంతర్జాతీయ సోలార్ కూటమి తాలూకూ మొదటి మహాసభ " International Solar Alliance" ప్రారంభోత్సవం జరిగింది. మనందరి సామూహిక సహకారాల కారణంగానే మన దేశంలో ease of doing business rankingలో అపూర్వమైన మెరుగుదల కనబడింది. దేశ ఆత్మరక్షణకు కొత్త బలం లభించింది. ఈ సంవత్సరంలోనే మన దేశం Nuclear Triad  (అణు త్రయం) ను సఫలవంతంగా పూర్తి చేసింది. అంటే నీరు, భూమి, ఆకాశం – ఈ మూడు అంచెల్లోనూ అణుప్రయోగ సామర్థ్యం ఉన్న దేశంగా ఇప్పుడు మన దేశం మారింది. మన దేశపు ఆడపడుచులు తమ నావికా సాగర్ ప్రదక్షిణ ద్వారా యావత్ దేశాన్నీ చుట్టి వచ్చి దేశం గర్వపడేలా చేశారు. వారణాసి లో భారతదేశ మొదటి జలమార్గం ప్రారంభమైంది. దీనితో జాతీయ జలమార్గ రంగంలో కొత్త విప్లవానికి అంకురార్పణ జరిగింది. భారదేశంలోనే అతిపెద్ద రోడ్డూ,రైల్ వంతెన బోగీబీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరిగింది. దేశంలో వందవది, సిక్కింలో మొదటిది అయిన పాక్యాంగ్ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగింది. Under-19 ప్రపంచ క్రికెట్ కప్ , అంధుల ప్రపంచ కప్ – రెండిటినీ భారతదేశం గెలుచుకుంది. ఈసారి ఆసియా క్రీడల్లో భారతదేశం పెద్ద సంఖ్యలో పతకాలను సాధించింది. పారా ఆసియా క్రీడల్లో కూడా భారతదేశం ఎంతో చక్కని ప్రతిభను కనబరిచింది. ఇలా ప్రతి భారతీయుడి ప్రయత్నం గురించీ , మనందరి ప్రయత్నాల గురించీ నేను మన మన్ కీ బాత్ లో  మాట్లాడుతూంటే 2019 వచ్చేస్తుందేమో ! ఇదంతా 130కోట్ల దేశప్రజల నిర్విరామ కృషి వల్లనే సాధ్యమైంది. భారతదేశ ప్రగతి, అభివృధ్ధిల ప్రయాణం 2019  లో కూడా ఇలానే సాగుతుందని, మన దేశం మరింత బలంగా తయారై ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని నాకు నమ్మకం ఉంది. 

నా ప్రియమైన దేశప్రజలారా, ఈ డిసెంబరు లో మనం కొందరు అసాధారణ వ్యక్తులను కోల్పోయాం. డిసెంబర్ 19న చెన్నై లో డాక్టర్ జయచంద్రన్ మరణించారు. ఆయనను ప్రజలు ప్రేమతో "మక్కల్ మరుతవర్(ప్రజల వైద్యుడు)" అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన ప్రజల మనసుల్లో నివసించేవారు. డాక్టర్ జయచంద్రన్ పేదవారికి అతిచవకగా వైద్యసదుపాయాలను అందించినవారిగా పేరుపొందారు. రోగులకు వైద్యాన్ని అందించడానికి ఆయన ఎప్పుడూ సిధ్ధంగా ఉండేవారని ప్రజలు చెప్తారు. తన వద్దకు వచ్చే వృధ్ధ రోగులకు రానూ పోనూ ఖర్చులను కూడా ఆయనే ఇచ్చేవారు. సమాజానికి ప్రేరణ ను అందించేలాంటి ఆయన గురించిన ఇలాంటి ఎన్నో విషయలను  నేను thebetterindia.com websiteలో చదివాను. 

ఇలానే డిసెంబర్ 25న కర్ణాటక కు చెందిన సులగిట్టి నరసమ్మ గారి మరణవార్త తెలిసింది. గర్భం ధరించిన తల్లులు, సోదరీమణులకు ప్రసవ సమయంలో సహాయం చేసే సహాయకురాలిగా సులగిట్టి నరసమ్మ పనిచేసేది. ముఖ్యంగా కర్ణాటకలోని  దుర్లభమైన ప్రాంతాల్లో వేల సంఖ్యలో తల్లులకు, సోదరీమణులకూ తన సేవలను అందించారు ఆవిడ. ఈ సంవత్సరం మొదట్లో పద్మశ్రీ పురస్కారంతో సన్మానించబడ్డారు ఆవిడ. ప్రేరణాత్మకమైన వ్యక్తిత్వం ఉన్న డాక్టర్ జయ చంద్రన్, సులగిట్టి నరసమ్మ లాంటి ఎందరో వ్యక్తులు సమాజంలో అందరి శ్రేయస్సు కోసం తమ జీవితాలను అంకితం చేసారు. హెల్త్ కేర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఉత్తర్ ప్రదేశ్ లోని బిజ్- నౌర్ లోని డాక్టర్ల సామాజిక ప్రయత్నాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పట్నంలోని కొందరు డాక్టర్లు శిబిరాలను ఏర్పాటుచేసి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తున్నారని  కొద్ది రోజుల క్రితం మా పార్టీ కార్యకర్తలు కొందరు నాతో చెప్పారు. అక్కడి హార్ట్, లంగ్స్ క్రిటికల్ సెంటర్ తరఫున ప్రతి నెలా ఇలాంటి వైద్య శిబిరాల ఏర్పాటు చేసి, ఎన్నోరకాల రోగాలకు ఉచితంగా పరీక్షలు జరపడమే కాకుండా వారికి ఆ శిబిరాల్లో ఉచితంగా వైద్యం చేసే ఏర్పాటు కూడా జరుగుతుంది. ప్రతి నెలా వందల కొద్దీ పేద రోగులు ఈ శిబిరాల వల్ల లాభ్ధి పొందుతున్నారు. నిస్వార్థ భావంతో సేవ చేయడానికి నడుంకట్టిన ఈ డాక్టర్ మిత్రుల ఉత్సాహం నిజంగా ప్రసంశనీయం. సామూహిక ప్రయత్నాల ద్వారానే పరిశుభ్రతా ఉద్యమం విజయవంతమైందని ఇవాళ  నేను గర్వంగా చెప్తున్నాను. కొద్ది రోజుల క్రితం మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఒకేసారి మూడు లక్షల పైగా ప్రజలు పరిశుభ్రతా ఉద్యమంలో పాల్గొన్నారని నాకు కొందరు చెప్పారు. పరిశుభ్రత అనే ఈ మహాయజ్ఞంలో నగరపాలికలు, స్వయం సేవా సంస్థలు, స్కూలు,కాలేజీ విద్యార్థులు, జబల్ పూర్ లోని ప్రజలు, అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. డాక్టర్ జయచంద్రన్ గురించి నేను చదివిన thebetterindia.com గురించి ఇందాకే నేను ప్రస్తావించాను. సమయం దొరికినప్పుడల్లా నేను తప్పక ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మకమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఈమధ్య ఇలాంటి ఎన్నో వెబ్సైట్లు ప్రేరణాత్మకమైన ఇటువంటి విలక్షణమైన వ్యక్తుల జీవితాల నుండి స్ఫూర్తిని అందించేలాంటి ఎన్నో కథలను మనకి పరిచయం చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. thepositiveindia.com అనే వెబ్సైట్ సమాజంలో సానుకూలతను, సున్నితత్వాన్నీ పెంచడానికి పనిచేస్తోంది. ఇలానే yourstory.comలో young innovator ల, ఇంకా ఉద్యమకారుల తాలూకూ విజయగాథలు చాలా చక్కగా ప్రచురిస్తారు. ఇలానే samskritabharati.in ద్వారా ఇంటి వద్ద నుండే సంస్కృత భాషను సులభంగా నేర్చుకోవచ్చు. ఇలాంటి వెబ్సైట్ల గురించి మనం ఒకరితో ఒకరం షేర్ చేసుకుందాం. సానుకూలతను మనందరం కలిసి వైరల్(ప్రచారం) చేద్దాం. ఇలా షేర్ చేయడం వల్ల సమాజంలో మార్పుని తేగలిగే ఇలాంటి నాయకుల గురించి చాలా ఎక్కువ మందికి తెలుస్తుంది. ప్రతికూల భావాలను ప్రచారం చేయడం సులభమే. కానీ మన సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అనేక మంచి పనులు 130కోట్ల దేశప్రజల సాముహిక ప్రయాసల వల్లనే జరుగుతున్నాయి.

ప్రతి సమాజంలోనూ ఆటపాటల కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఆటలను చూస్తున్నపుడు, చూసేవారి మనసు కూడా శక్తితో నిండిపోతుంది. క్రీడాకారులకు లభించే పేరు ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు లాంటి ఎన్నో విషయాలను మనం చూస్తూంటాం. కానీ ఒకోసారి వీటి వెనుక ఉన్న ఎన్నో విషయాలను క్రీడాప్రపంచం పరిధి ని దాటి ఉంటాయి. అంతుపట్టనివిగా ఉంటాయి. కాశ్మీర్ కు చెందిన ఒక ఆడబిడ్డ హనాయా నిసార్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కొరియాలో జరిగిన కరాటే ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకాన్ని గెలిచింది. 12 సంవత్సరాల హనాయా  కాశ్మీర్ లోని అనంత్ నాగ్ ప్రాంతానికి చెందింది. హనాయా ఎంతో కష్టపడి, ఏకాగ్రతతో కరాటే నేర్చుకుంది.ఆ ఆట మెలుకువలన్నీ తెలుసుకుని తనని తాను నిరూపించుకుంది. నేను కూడా దేశప్రజల తరఫున ఆమెకు ఉజ్వలమైన భవిష్యత్తు లభించాలని కోరుకుంటున్నాను. హనాయాకు అనేకానేక శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు.
అలానే పదహారేళ్ల ఆడబిడ్డ రజని గురించి మీడియాలో ఎంతో చర్చ జరిగింది. మీరు కూడా చదివే ఉంటారు. రజని జూనియర్ మహిళా బాక్సింగ్ పోటీల్లో స్వర్ణ పరకాన్ని గెలుచుకుంది. రజని పతకాన్ని గెలుచుకోగానే ఆమె దగ్గరలో ఉన్న ఒక స్టాల్ కి వెళ్ళి ఒక గ్లాసు పాలు తాగింది. ఆ తర్వాత ఆమె తన పతకాన్ని ఒక గుడ్డలో చుట్టి బ్యాగ్ లో పెట్టుకుంది. రజని ఒక గ్లాస్ పాలు ఎందుకు తాగింది అని మీరు ఆలోచిస్తూ ఉండచ్చు. ఆమె తన తండ్రి జస్మేర్ సింహ్ గారి గౌరవార్థం అలా చేసింది. ఎందుకంటే ఆయన పానీపట్ లో ఒక స్టాల్ లో లస్సీ అమ్ముతారు. తన తండ్రి తనను అంతవరకూ చేర్చడానికి ఎంతో త్యాగం చేశారనీ, ఎంతో కష్టపడ్డారని, రజని చెప్పింది. జస్మేర్ సింహ్ ప్రతి ఉదయం రజని , ఆమె తమ్ముళ్ళు లేవడానికి ఎంతో ముందుగానే పనిలోకి వెళ్ళిపోయేవారు. రజని తన తండ్రికి బాక్సింగ్ నేర్చుకుంటానన్న కోరికని తెలుపగానే, ఆయన తనకు వీలయినన్ని ప్రయత్నాల ద్వారా ఆమెకు ధైర్యాన్ని ఇచ్చారు. రజనికి  తన బాక్సింగ్ సాధన పాత గ్లౌజులతో మొదలుపెట్టాల్సివచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండేది. ఇన్ని ఇబ్బందుల తర్వాత కూడా రజని నిరుత్సాహపడకుండా బాక్సింగ్  నేర్చుకుంటూనే ఉంది. సెర్బియా లో కూడా ఆమె ఒక పతకాన్ని సాధించింది. నేను రజనికి శుభాకాంక్షలు , ఆశీర్వాదాలు తెలుపుతున్నాను. రజనికి తోడ్పాటుని ఇచ్చి, ఆమెను ఉత్సాహపరచినందుకు ఆమె తల్లిదండ్రులు జస్మేర్ గారికి, ఉషారాణి గారికి కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఇదేనెలలో పూనా కి చెందిన ఆడపడుచు ఇరవై ఏళ్ళ వేదాంగీ కులకర్ణీ సైకిల్ పై అత్యంత వేగంగా ప్రపంచయాత్ర చేసిన ఆసియా మహిళగా నిలిచింది. 159 రోజులవరకూ రోజూ మూడొందల కిలోమీటర్లు సైకిల్ తొక్కేవారు. ప్రతిరోజూ మూడొందల కిలోమీటర్లు సైకిల్ తొక్కడం మీరు ఊహించగలరా? సైకిల్ నడపడమంటే ఆమెకి ఉన్న అత్యంత ఆసక్తి మెచ్చుకోదగ్గది. ఇలాంటి విజయాలను గురించి విన్నప్పుడు మనకూ స్ఫూర్తి రాదూ?!  నా యువస్నేహితులారా, ముఖ్యంగా ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడు మనం కూడా కష్టాల మధ్యనుండి ఏదో సాధించాలనే ప్రేరణని పొందుతాం. సంకల్పం గట్టిదైతే, స్థిరమైన ధైర్యం ఉంటే, అడ్డంకులు వాటంతట అవే అగిపోతాయి. కష్టాలు ఎప్పుడూ అడ్డంకులు కావు. ఇటువంటి అనేక ఉదాహరణలు వింటూంటే మనకి కూడా మన జీవితంలో ప్రతి క్షణం ఒకకొత్త ప్రేరణ లభిస్తూనే ఉంటుంది.

నా ప్రియమైన దేశప్రజలారా, జనవరిలో ఆనందోత్సాహాలతో నిండిన ఎన్నో పండుగలు రాబోతున్నాయి. లోరీ, పొంగల్, మకర సంక్రాంతి, ఉత్తరాయణ్, మాఘ్  బిహూ, మాఘీ, ఇలాంటి పండుగల సందర్భంలో యావత్ భారతదేశంలో ఎన్నో సంప్రదాయక నృత్యాల చిత్రాలు కనబడతాయి. కొన్ని చోట్ల పంటలు కోతకివచ్చిన ఆనందంలో భోగిమంటలు వేసుకుంటారు. కొన్ని చోట్ల ఆకాశంలో రంగు రంగుల గాలిపటాలు ఎగురుతూ కనిపిస్తాయి. కొన్ని చోట్ల తిరనాళ్ల తాలూకూ రంగులు వెల్లివిరిస్తే, కొన్ని చోట్ల ఆటల పోటీలు జరుగుతాయి. కొన్నిచోట్ల నువ్వులు-బెల్లం కలిపి తినిపిస్తారు. ఒకరితో ఒకరు "తిల్ గుడ్ గ్యా,ఆణి గోడ్ గోడ్ బోలా" అని చెప్పుకుంటారు. ఈ పండుగల పేర్లన్నీ వేరు వేరుగా ఉన్నా అన్నింటినీ జరుపుకునే అంతర్గత భావం ఒకటే.  ఈ ఉత్సవాలు ఎక్కడోఅక్కడ పంటపొలాలతో ముడిపడి ఉంటుంది. రైతుతో, గ్రామాలతో, పంటలు, ధాన్య రాశులతో ముడిపడి ఉంటుంది. ఈ సమయంలోనే సూర్యుడు ఉత్తరాయణంలో మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ తర్వాతే పగటి పొద్దు ఎక్కువగా మారుతుంది. చలికాలపు పంటల కోతలు మొదలైపోతాయి. మన అన్నదాతలైన రైతు సోదరసోదరీమణులకు అనేకానేక శుభాకాంక్షలు. భిన్నత్వంలో ఏకత్వం, ఒకే భారతదేశం శ్రేష్ఠ భారతదేశం -అనే భావన తాలూకూ పరిమళాన్ని మన పండుగలన్నీ తమలో కలుపుకుని ఉన్నాయి. మన పండుగలు ప్రకృతితో ఎంత దగ్గరగా ముడిపడి ఉన్నాయో మనం గమనించవచ్చు. భారతీయ సంస్కృతిలో  సమాజాన్నీ ప్రకృతినీ వేరువేరుగా చూడము. ఇక్కడ వ్యక్తి, సమాజం రెండూ ఒకటే. పండుగల ఆధారంతో తయారైన కేలెండరు ప్రకృతితో మనకి ఉన్న దగ్గర సంబంధానికి ఒక చక్కని ఉదాహరణ. ఇందులో సంవత్సరం పొడుగునా వచ్చే పండుగలతో పాటూ, గ్రహ నక్షత్రాల లెఖ్ఖింపు కూడా ఉంటుంది. ప్రాకృతిక, భౌగోళిక ఘటనలతో మనకి ఎంతో పురాతన సంబంధం ఉందన్న సంగతి ఈ సాంప్రదాయక కేలెండర్ వల్ల మనకి తెలుస్తుంది. సూర్య చంద్రుల గమనముతో ఆధారంగా, సూర్య చంద్రుల కేలెండర్ ల ఆధారంగా పండుగల, పర్వదినాల తిధులు నిర్ధారితమై ఉంటాయి. ఎవరు ఏ కేలండర్ ని అనుసరిస్తారో ఆ కేలెండర్ ఆధారంగా పండుగలను వారు జరుపుకుంటారు. చాలా ప్రాంతాల్లో గ్రహ నక్షత్రాల స్థితులకు అనుసారంగా పండుగలు, పర్వదినాలు జరుపుకుంటారు. గుడీపడ్వా, చేటీచండ్, ఉగాది ఇలాంటి పండుగలన్నీ చంద్రమాన కేలెండర్ ఆధారంగా జరుపుకుంటారు. తమిళ పుథాండు, విషు, వైశాఖ్, పోయిలా వైశాఖ్,బిహు – ఈ పండుగలన్నీ సౌరమానం ప్రకారం జరుపుకుంటారు. మనం జరుపుకునే కొన్ని పండుగల్లో నదులను, నీటిని రక్షించుకునే భావం ప్రత్యేకంగా నిక్షిప్తమై ఉంది. ఛట్ పండుగ  నదులు, చెరువులలో సూర్యోపాసనతో ముడిపడి ఉంది. 

మకర సంక్రాంతి రోజున కూడా లక్షల, కోట్ల ప్రజలు ప్రవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. మన పండుగలు, పర్వదినాలు మనకి సామాజిక విలువలను గురించి కూడా తెలుపుతాయి. ఒక వైపు పౌరాణిక ప్రాముఖ్యతను చాటిచెప్తూనే, ఒకరితో ఒకరు కలిసిమెలిసి సోదరభావంతో మెలగాలనే ప్రేరణాత్మక జీవిత పాఠాలను ఎంతో సహజంగా ఈ పండుగలు నేర్పుతాయి. మీ అందరికీ 2019వ సంవత్సరానికి గానూ అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాబోయే పండుగలను కూడా మీరు సంపూర్ణ ఆనందంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. భారతదేశంలోని భిన్నత్వం, భారతీయ సంస్కృతి తాలూకూ అందాన్నీ అందరూ చూసేలా ఈ పండుగలలో తీసుకున్న ఫోటోలను అందరితో షేర్ చేసుకోండి.

నా ప్రియమైన దేశప్రజలారా, యావత్ ప్రపంచానికీ గర్వంగా చూపెట్టడానికి మన సంస్కృతిలో మనం గర్వించదగ్గ విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి కుంభ మేళా. కుంభ మేళా గురించి మీరు ఎంతో విని ఉంటారు. చలనచిత్రాల్లో కూడా దాని గొప్పదనం గురించి, వైభవం గురించి చాలా చూసే ఉంటారు. అది నిజమే. కుంభ మేళా స్వరూపం విస్తృతమైనది. ఎంత దివ్యమైనదో, అంత భవ్యమైనది. దేశ, విదేశాలనుండీ ప్రజలు వచ్చి ఇందులో పాల్గొంటారు.కుంభ మేళా లో నమ్మకం, శ్రధ్ధల తో కూడిన జనసాగరం నిండి ఉంటుంది. ఒకే చోట ఒకేసారి దేశవిదేశాల నుండి లక్షల, కోట్ల మంది ప్రజలు కలుస్తారు. కుంభ్ వారసత్వం మన దేశపు గొప్ప సాంస్కృతిక సంప్రదాయం  నుండి వికసించి, విరాజిల్లింది. ఈసారి జనవరి పదిహేను నుండీ ప్రయాగ లో ఏర్పాటవుతున్న ప్రపంచ ప్రసిధ్ధ కుంభ మేళా కోసం మీరందరూ కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తూ ఉండి ఉంటారు. ఇప్పటి నుండే మహాత్ములు, సాధువులు అప్పుడే కుంభ మేళా కు చేరుకోవడం మొదలుపెట్టేసారు. క్రితం ఏడాది యునెస్కో వారు కుంభ మేళా ను "Intangible cultural heritage of humanity " జాబితాలో గుర్తింపునిచ్చి చేర్చడమే దీని ప్రాపంచిక ప్రాముఖ్యతకు నిదర్శనం. కొద్ది రోజుల క్రితం ఎన్నో దేశాల దౌత్యాధికారులు కుంభ మేళా కు జరుగుతున్న ఏర్పాట్లను చూశారు. అక్కడ ఒకేచోట ఎన్నో దేశాల జాతీయ జండాలను ఎగురవేశారు. ప్రయాగలో ప్రారంభమౌతున్న ఈ కుంభ మేళాలో నూట ఏభై కంటే ఎక్కువ దేశాల నుండి ప్రజలు రావచ్చని అంచనా. కుంభ మేళా దివ్యత్వం నుండే యావత్ ప్రపంచానికీ భారతదేశం తన వైభవాన్ని చాటిచెప్తుంది. సెల్ఫ్ డిస్కవరీకి ఒక పెద్ద మాధ్యమం కుంభ మేళా. ఇక్కడకు వచ్చే ప్రతి వ్యక్తికీ వేరు వేరు అనుభవాలు ఎదురౌతాయి. సంసారిక విషయాలను ఆధ్యాత్మిక దృష్టితో చూసి, అర్థంచేసుకుంటారు. యువతకు ఇది ఒక పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గా నిలుస్తుంది. కొద్ది రోజుల క్రితం నేను స్వయంగా ప్రయాగ వెళ్ళాను. కుంభ మేళాకి ఏర్పాట్లు జోరుగా సాగుతుండడం చూశాను. ఈ సందర్భంగా ప్రయాగలో ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అక్కడ నేను integrated command and control centre  ప్రారంభోత్సవం చేశాను. భక్తులకు దీనివల్ల ఎంతోసహాయం లభిస్తుంది. ఈసారి కుంభ మేళాలో, పరిశుభ్రత పట్ల కూడా ఎంతో దృష్టి పెడుతున్నారు. ఏర్పాట్లలో భక్తి తో పాటుగా, శుభ్రత కూడా ఉంటే, దూరదూరాల వరకూ దీని గురించి మంచి మాట అందుతుంది. ఈసారి ప్రతి యాత్రికుడికీ  పవిత్ర సంగమస్నానం తర్వాత అక్షయ వృక్షం పుణ్య దర్శనం కూడా లభిస్తుంది. ప్రజల నమ్మకానికి ప్రతీకైన ఈ అక్షయ వృక్షం వందల ఏళ్ల నుండీ కోటలోపలే ఉండిపోయింది. అందువల్ల భక్తులు కావాలన్నా దీనిని దర్శించుకోలేకపోయేవారు. ఇప్పుడు అక్షయ వృక్షం ద్వారం అందరి కోసం తెరవబడింది. మీరు కుంభ మేళాకి వచ్చినప్పుడు , అక్కడి వేరు వేరు సందర్భాల్లో ఫోటోలు తీసుకుని, సామాజిక మాధ్యమాల్లో అందరితో షేర్ చేయండి. అందువల్ల ఎక్కువ మంది ప్రజలకు కుంభ్ మేళాకు వెళ్ళడానికి ప్రేరణ లభిస్తుంది. 

అధ్యాత్మికత నిండిన ఈ కుంభ్, భారతీయ దర్శనానికి ఒక గొప్ప కుంభ్ అవ్వాలి. 
నమ్మకానికి నిలయమైన ఈ కుంభ్ , దేశభక్తి ని నింపే గొప్ప కుంభ్ అవ్వాలి. 
జాతీయ సమైక్యతను పెంచే గొప్ప కుంభ్ అవ్వాలి.
భక్తులకు చెందిన ఈ కుంభ్ ప్రపంచ పర్యాటికుల పాలిట గొప్ప కుంభ్ అవ్వాలి. 
కళాత్మికత నిండిన ఈ కుంభ్ సృజనశక్తులకు ఒక గొప్ప కుంభ్ అవ్వాలి. 

నా ప్రియమైన దేశప్రజలారా, జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను గురించి దేశప్రజల మనసుల్లో ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఆ రోజున మనం మన రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తులను తలచుకుంటాం. ఈ సంవత్సరం మనం మన పూజ్యులైన బాపూ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దక్షిణాఫ్రికా ప్రసిడెంట్ శ్రీ సిరిల్ రామపోసా గారు ఈసారి మన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా భారతదేశం రావడం ఎంతో అదృష్టం. పూజ్యులైన బాపూకీ, దక్షిణాఫ్రికాకి ఎంతో విడదీయలేని బంధం ఉంది. ”మోహన్’ మహాత్ముడిగా మారింది దక్షిణాఫ్రికాలోనే. దక్షిణాఫ్రికాలోనే మహాత్మా గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని మొదలుపెట్టారు. అక్కడే వర్ణవిభేదానికి వ్యతిరేకంగా ఎదురునిలిచారు ఆయన.  ఫీనిక్స్, టాల్స్టాయ్ ఫార్మ్ లను అక్కడే స్థాపించారు. అక్కడి నుండే న్యాయం, శాంతి ల ప్రతిధ్వని ప్రపంచానికి వినబడింది. 2018ని -నెల్సన్ మండేలా శతజయంతి ఏడాదిగా కూడా జరుపుకుంటున్నాము. ఆయనను మఢీబా అనే పేరుతో కూడా ప్రసిధ్ధులు. వర్ణవివక్ష కి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నెల్సన్ మండేలా యావత్ ప్రపంచానికీ ఒక ఉదాహరణ. ఆయనకు స్ఫూర్తిదాయకం ఎవరో తెలుసా? అన్ని ఏళ్ల పాటు ఆయన జైలులో గడపడానికి సహన శక్తి, ప్రేరణ ఆయనకు మన పూజ్యులైన బాపూ నుండే వచ్చాయి. బాపు గురించి మండేలా ఏమన్నారంటే " మన చరిత్రలో ఒక విడదీయలేని భాగం మహాత్ములు. ఎందుకంటే ఆయన సత్యంతో తన మొదటి ప్రయోగం ఇక్కడే చేశారు. ఇక్కడే ఆయన న్యాయం కోసం తన విలక్షణతను ప్రదర్శించారు. ఇక్కడే ఆయన తన సత్యాగ్రహాన్ని ప్రారంభించి, పోరాటాన్ని జరిపే విధానాలని తెలియజేసారు" ఆయన బాపూజీని తన రోల్ మోడల్ గా స్వీకరించారు. బాపూ, మండేలా ఇద్దరూ కూడా యావత్ ప్రపంచానికీ కేవలం స్ఫూర్తికి ఆధారాలు మాత్రమే కాదు, వారి ఆదర్శాలు మనకు ప్రేమ, కరుణ తో నిండిన సమాజ నిర్మాణానికి ఎల్లప్పూడూ ప్రోత్సాహాన్ని అందిస్తాయి."

నా ప్రియమైన దేశప్రజలారా, కొద్ది రోజుల క్రితం గుజరాత్ లోని నర్మదాతీరంలోని కేవడియాలో DGP conference జరిగింది.  ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన విగ్రహం "statue of unity" ఉన్నచోట, మన దేశంలోని ఉన్నత పోలీసుఅధుకారులతో ఒక సమర్థవంతమైన చర్చ జరిగింది. భారత దేశ, దేశప్రజల రక్షణను మరింత భద్రతను పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయంపై విస్తారంగా చర్చ జరిగింది. ఆ సందర్భంగా నేను జాతీయ సమైక్యత కోసం "సర్దార్ పటేల్ పురస్కారాలను" మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించాను. జాతీయ సమైక్యతకు తమ వంతు కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. సర్దార్ పటేల్ గారు తన యావత్ జీవితాన్నీ దేశ సమైక్యత కోసం అంకితం చేశారు. భారతదేశ అఖండత చెక్కుచెదరకుండా ఉండేందుకు పాటుపడ్డారు. భారతదేశ శక్తి ఇక్కడి భిన్నత్వంలోనే దాగి ఉందని సర్దార్ గారి నమ్మకం. సర్దార్ పటేల్ గారి ఈ భావనను గౌరవిస్తూ ఈ సమైక్యతా పురస్కారం ద్వారా వారికి శ్రధ్ధాంజలిని అర్పిద్దాం.

నా ప్రియమైన దేశప్రజలారా, జనవరి పదమూడున గురుగోవింద్ సింగ్ గారి పవిత్ర జయంతి . గురు గోవిండ్ సింగ్ గారి జననం పాట్నా లో జరిగింది. ఆయన తన జీవితంలో ఎక్కువ సమయాన్ని ఆయన ఉత్తర భారతంలోనే గడిపారు. మహారాష్ట్ర లోని నాందేడ్ లో ఆయన తన ప్రాణాలను త్యజించారు. ఆయన జన్మభూమి పట్నా, కర్మ భూమి ఉత్తర భారతం , అంతిమ క్షణాలు నాందేడ్.  ఒకరకంగా చెప్పాలంటే, యావత్ భారత దేశానికీ ఆయన ఆశీర్వాదం లభించింది. ఆయన జీవితకాలాన్ని గనుక పరిశీలిస్తే, అందులో యావత్ భారతదేశమూ కనబడుతుంది. తన తండ్రి శ్రీ గురు తేగ్ బహదూర్ (tegh bahadur) మరణించిన తరువాత గురు గోవింద్ సింగ్ గారు తొమ్మిదేళ్ల చిన్న వయసులోనే గురువు స్థానంలో కూర్చున్నారు. న్యాయం కోసం పోరాటం జరపడానికి కావలసిన ధైర్యం గురు గోవింద్ సింగ్ గారికి సిక్కు గురువుల నుండి వారసత్వంగా లభించింది. ఆయన శాంతమైన, సరళమైన వ్యక్తిత్వం కలవారు. కానీ ఎప్పుడెప్పుడైతే పేదల, బలహీనులను అణచడానికి ప్రయత్నాలు జరిగాయో, వారికి అన్యాయాలు జరిగాయో, అప్పుడప్పుడు మాత్రం గురు గోవింద్ సింగ్ తన మాటని ఎంతో గట్టిగా వినిపించారు. అందుకనే ఏమన్నారంటే 

" సవా లాఖ్ సే ఎక్ లడావూ, 
చిడియోం సే మై బాజ్ తుడావూ,
తబే గోవింద్ సింగ్ నామ్ సునావూ"
బలహీనవర్గాలతో పోరాడి బలాన్ని ప్రదర్శించకూడదు అని అనేవారు ఆయన. మానవ దు:ఖాన్ని నివారించడమే అన్నింటికంటే పెద్ద సేవ అని శ్రీ గోవింద్ సింగ్ నమ్మేవారు. వీరత్వం, శౌర్యం, త్యాగం, ధర్మపరాయణత తో నిండిన దివ్య పురుషులు ఆయన. శస్త్రం, శాస్త్రం  రెండింటి గురించిన గొప్ప జ్ఞానం ఆయనకు ఉండేది. ఆయన ఒక గొప్ప విలుకాడు మాత్రమే కాక గురుముఖి, బ్రజ్ భాష, సంస్కృతం, ఫార్సీ, హిందీ, ఉర్దూ మొదలైన అనేక భాషలు తెలిసిన వారు. నేను మరొక సారి గురుగోవింద్ సింగ్ గారికి నమస్కరిస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా,  దేశంలో ఎన్నో మంచి ఉదంతాలు జరుగుతూ ఉంటాయి కానీ వాటిని గురించి విస్తృతమైన చర్చలు జరగవు. ఇలాంటి ఒక ప్రత్యేకమైన ప్రయత్నం FSSAI అంటే food safety and standard authority of India వారి ద్వారా జరిగుతోంది. మహాత్మా గాంధీ గారి 150వ జయంతి సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరంపరలో సేఫ్ & హెల్తీ డైట్ హేబిట్స్ – మంచి ఆహారపు అలవాట్లను పెంపొందించడం కోసం పనిచేస్తోంది. Eat right India ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య భారతదేశ పర్యటనలు జరుగుతున్నాయి. ఈ ప్రచారం జనవరి 27 వరకూ జరిగుతుంది. అప్పుడప్పుడు ప్రభుత్వసంస్థలు నియంత్రణ విభాగాలుగా కనబడతాయి. కానీ ఈ FSSAI దానిని దాటుకుని ప్రజలను జాగృతం చేసి, వారిని శిక్షితులను చేసే పని చేయడం మెచ్చుకోదగ్గది. భారతదేశం పరిశుభ్రంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంపన్నంగా తయారవుతుంది. మంచి ఆరోగ్యానికి పౌష్టిక భోజనం అవసరం. ఈ సందర్భం లో ఈ చొరవతీసుకున్నందుకు గానూ FSSAI ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీరంతా ఈ ప్రయత్నంతో ముడిపడాలని  నా విన్నపం. మీరందరూ ఇందులో పాలుపంచుకోవాలని, ముఖ్యంగా పిల్లలకు తప్పకుండా ఈ విషయాలను చూపెట్టాలని నేను కోరుతున్నాను. భోజనం తాలుకూ ప్రాముఖ్యతను చిన్నప్పటి నుండే పిల్లలకు తెలపాల్సిన ఆవస్యకత ఉంది. 

నా ప్రియమైన దేశ ప్రజలారా, 2018లో ఇది చివరి కార్యక్రమం. 2019లో మనం తిరిగి కలుద్దాం. తిరిగి మన్ కీ బాత్ లో కబుర్లు చెప్పుకుందాం. వ్యక్తిగత జీవనమైనా, దేశ జీవనమైనా, సమాజ జీవనమైనా , ప్రగతికి స్ఫూర్తి ఆధారం. రండి, కొత్త ప్రేరణతో, కొత్త ఉత్సాహంతో, కొత్త సంకల్పాలతో, కొత్త విజయాలతో, కొత్త శిఖరాలను చేరుకుందాం. ముందుకు నడుద్దాం. ఎదుగుతూ నడుద్దాం. మనం మారదాం. దేశాన్ని మారుద్దాం. అనేకానేక ధన్యవాదాలు.

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait

Media Coverage

Snacks, Laughter And More, PM Modi's Candid Moments With Indian Workers In Kuwait
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister Narendra Modi to attend Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India
December 22, 2024
PM to interact with prominent leaders from the Christian community including Cardinals and Bishops
First such instance that a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India

Prime Minister Shri Narendra Modi will attend the Christmas Celebrations hosted by the Catholic Bishops' Conference of India (CBCI) at the CBCI Centre premises, New Delhi at 6:30 PM on 23rd December.

Prime Minister will interact with key leaders from the Christian community, including Cardinals, Bishops and prominent lay leaders of the Church.

This is the first time a Prime Minister will attend such a programme at the Headquarters of the Catholic Church in India.

Catholic Bishops' Conference of India (CBCI) was established in 1944 and is the body which works closest with all the Catholics across India.