#MannKiBaat దేశానికి మరియు సమాజానికి అద్దం లాంటిది. మన దేశ ప్రజలకు అంతర్గత బలం మరియు ప్రతిభకు కొరత లేదని ఇది హైలైట్ చేస్తుంది: ప్రధాని
#MannKiBaat కోసం, నాకు చాలా లేఖలు మరియు టెలిఫోన్ కాల్స్ వచ్చాయి, కాని ఫిర్యాదు చేసే అంశాలు ఏవీ లేవు: ప్రధాని మోదీ
అత్యవసర సమయంలో, ప్రజాస్వామ్య హక్కులు కొల్లగొట్టబడ్డాయి: ప్రధాని #MannKiBaat
ఈ దేశ ప్రజలకు దగ్గరగా ఉన్న చట్టాలకు మించి ఏదైనా ఉంటే, అది మన ప్రజాస్వామ్య సంస్కృతి: #MannKiBaat సమయంలో ప్రధాని
2019 లోక్‌సభ ఎన్నికలలో ఓటు వేసిన ఓటర్ల సంఖ్య అమెరికా జనాభాలో దాదాపు రెట్టింపు మరియు మొత్తం యూరప్ జనాభా కంటే ఎక్కువ: ప్రధాని #MannKiBaat
2019 లోక్‌సభ ఎన్నికలు ప్రపంచంలోనే అతిపెద్ద కార్యక్రమం: ప్రధాని మోదీ #మన్‌కిబాత్
సామూహిక ప్రయత్నం ద్వారా పెద్ద మరియు సానుకూల మార్పులు సాధించవచ్చు: #MannKiBaat సందర్భంగా ప్రధాని మోదీ
మేము కలిసి వచ్చి కష్టపడి పనిచేసినప్పుడు, చాలా కష్టమైన పనులను విజయవంతంగా సాధించవచ్చు. జాన్ జాన్ జుడేగా, జల్ బచెగా: ప్రధాని మోదీ #మన్‌కిబాట్
స్వచ్ఛతా మాదిరిగానే, నీటి సంరక్షణను జన అండోలాన్ చేద్దాం: ప్రధాని మోదీ #మన్‌కిబాట్
# మన్‌కిబాత్ : వినూత్న ప్రచారాల ద్వారా నీటి సంరక్షణపై అవగాహన కల్పించాలని సినీ పరిశ్రమ, క్రీడాకారులు, మీడియా, సామాజిక, సాంస్కృతిక సంస్థలను ప్రధాని మోదీ కోరారు.
జూన్ 21 న, యోగా దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా గుర్తించారు: #MannKiBaat సందర్భంగా ప్రధాని మోదీ
ఆరోగ్యకరమైన వ్యక్తులు ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడంలో సహాయపడతారు మరియు యోగా అదే నిర్ధారిస్తుంది: #MannKiBaat సందర్భంగా ప్రధాని మోదీ

నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారము. ఒక దీర్ఘ విరామము తర్వాత, మళ్ళీ ఒకసారి , మీ అందరితో, ‘ మన్ కీ బాత్’ , మనసులో మాట, జనులలోని మాట, జనుల మనసులోని మాట ఐన ఈ పరంపర మొదలుపెడుతున్నాము. ఎన్నికల హడావిడిలో పనుల వత్తిడి ఎక్కువగా ఉండింది కానీ ‘మన్ కీ బాత్’ లోని మజా మాత్రం అందులో లేదు. ఒక లోటు కనిపిస్తూనే ఉండింది. మనవాళ్ళ మధ్య కూర్చొని, తేలికైన వాతావరణంలో, 130 కోట్ల దేశవాసుల కుటుంబంలోని వ్యక్తిగా, ఎన్నో మాటలు వినేవాళ్ళము, మళ్ళీ చెప్పుకునేవాళ్ళము. అప్పుడప్పుడూ మనమాటలే మనవాళ్ళకు ప్రేరణ కలిగించేవి. ఈ మధ్యలో నాకు కాలం ఎలా గడిచి ఉంటుందో మీరంతా ఊహించగలరు. ఆదివారం, చివరి ఆదివారం 11 గంటలకు నాకు ఏదో కోల్పోయినట్టుగా అనిపించింది-మీకూ అనిపించి ఉంటుంది కదా! ఖచ్చితంగా అనిపించి ఉంటుంది. బహుశా ఇది నిస్సారమైన కార్యక్రమం కానే కాదు. ఈ కార్యక్రమంలో జీవం ఉండేది, సొంతం అనిపించేది, మనసు లగ్నమయ్యేది, హృదయం లగ్నమయ్యేది, అందువల్లే ఈ మధ్య ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ కొద్ది విరామం నాకు చాలా కఠినంగా అనిపించింది. నేను అనుక్షణమూ ఏదో పోగొట్టుకున్నట్టు భావించేవాడిని. ‘మన్ కీ బాత్’ చెప్పేటపుడు మాట్లాడింది నేనైనా, ఆ పదాలు నావైనా, గొంతు నాదైనా, కథ మీది, ప్రయోజనం మీది, గొప్పతనం మీది. నా పదాలు, నా స్వరం మాత్రమే నేను ఉపయోగించేవాడిని. కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని కాదు మిమ్మల్నే miss అయ్యాను.  వెలితిగా అనిపించేది. ఎన్నికలు అయిపోగానే మీ మధ్యకు రావాలని కూడా ఒకసారి అనిపించింది. కానీ మళ్ళీ అనుకున్నాను, ఇలా కాదు, ఆ Sunday క్రమమే అలా కొనసాగాలి అని. కానీ ఈ Sunday చాలా ఎదురుచూసేలా చేసింది. ఎలాగైతేనేం, చివరికి ఈ సండే రానేవచ్చింది. ఒక కుటుంబవాతావరణంలో ఒక చిన్న ‘మన్ కీ బాత్’  ఎలాగైతే సమాజం, జీవనములలో మార్పుకు కారణం అవుతుందో, అలాగే ఈ ‘మన్ కీ బాత్’ పరంపర ఒక కొత్త spirit కి కారణమౌతూ, ఒక రకంగా New India  యొక్క spirit కు బలమిచ్చేలా కొనసాగనిద్దాం.

            గడచిన కొన్ని నెలలలో చాలా సందేశాలు వచ్చాయి. ప్రజలు కూడా ‘మన్ కీ బాత్’ miss అవుతున్నట్టుగా చెప్పారు. వీటిని నేను చదివినప్పుడు, విన్నప్పుడు నాకు చాలా బాగుంటుంది. ఒక ఆత్మీయభావన కలుగుతుంది. ఇది నా ‘ స్వ’ నుంచి ‘సమిష్టి’ వరకూ సాగే యాత్రగా ఇది అప్పుడప్పుడూ నాకనిపిస్తూ ఉంటుంది. ఇది నా ‘అహమ్ నుంచి వయమ్’ వరకూ సాగే యాత్ర. మీతో చేసే ఈ మౌనభాషణము ఒక రకంగా నాకు నా spiritual యాత్రానుభూతి లోని అంశం. నేను ఎన్నికల హడావిడిలో కేదారనాథ్ ప్రయాణం ఎందుకు చేశాను అనే ప్రశ్న చాలా మంది వేశారు. అలా ప్రశ్నించడం మీ హక్కు. మీ కుతూహలాన్ని నేనర్థం చేసుకోగలను. నాకు కూడా ఆ భావాలను మీతో పంచుకోవాలని అనిపిస్తుంది. కానీ అవి మాట్లాడితే ‘మన్ కీ బాత్’ రూపం మారిపోతుంది. ఎన్నికల హడావిడిలో, జయాపజయాల సందిగ్ధతలో, ఇంకా పోలింగ్ కూడా ముగియకముందే నేను బయల్దేరాను. చాలామంది దీనిలో రాజకీయ అర్థాలు వెదికారు. నా వరకూ ఇది , నేను నాతో గడిపే అవకాశం. చెప్పాలంటే నన్ను నేను కలుసుకోవడానికే వెళ్ళాను. అన్నీ ఇప్పుడు చెప్పను గానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ‘మన్ కీ బాత్’ వరుసలో వచ్చిన చిన్న విరామం వల్ల నా మనసులో ఏర్పడిన వెలితిని కేదార్ లోయల్లో , ఆ ఏకాంత గుహలో నింపుకొనే అవకాశం ఏర్పడింది. ఇక మీ కుతూహలాన్ని కూడా ఒకరోజు తీర్చే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు చేస్తాను అని చెప్పలేను కానీ తప్పక చేస్తాను. ఎందుకంటే నామీద మీకు ఆ హక్కు ఉంది. కేదార్ విషయంలో ప్రజలు ఎలా కుతూహలం కనబరిచారో అదే కుతూహలంతో కొన్ని సకారాత్మకమైన విషయాలపట్ల మీరు చూపే శ్రద్ధను , మీ మాటల్లో చాలా సార్లు గమనించాను. ‘మన్ కీ బాత్’ కు వచ్చే ఉత్తరాలు, input అంతా routine ప్రభుత్వ కార్యక్రమాలకు భిన్నంగా ఉంటుంది. ఒక రకంగా మీ ఉత్తరాలు నాకు ఒక్కోసారి ప్రేరణనిస్తే, ఒక్కోసారి శక్తి నిస్తుంటాయి. అప్పుడప్పుడూ నా ఆలోచనలకు పదునుపెట్టే పని కూడా మీ మాటలు చేస్తుంటాయి. ప్రజలకు, దేశానికి, సమాజానికి ఎదురయ్యే సమస్యలను, సవాళ్ళను నా దృష్టిలోకి తీసుకొని రావడంతో పాటే వాటికి పరిష్కారాలు కూడా చెప్తూ ఉంటాయి. నేను  గమనించాను- ప్రజలు సమస్యలను ఏకరువుపెట్టడమే కాక వాటికి సమాధానాలను, సూచనలను, కొన్ని ఆలోచనలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకటిస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా స్వచ్ఛత గురించి వ్రాస్తూ ఉంటే, కాలుష్యం పట్ల తమ ఆగ్రహాన్ని ప్రకటిస్తూనే స్వచ్ఛత కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తూ ఉంటారు కూడా. ఒక్కొక్కరు పర్యావరణం గురించి మాట్లాడేటప్పుడు  వారి బాధ వ్యక్తమౌతూ ఉంటుంది, దాంతోపాటే తాము స్వయంగా చేసిన ప్రయోగాలు, చూసిన ప్రయోగాలు, మనసులోని ఆలోచనలు అన్నిటి గురించీ చెప్తారు. అంటే ఒక రకంగా సమస్యల పరిష్కారాలు ఎలా సమాజవ్యాప్తం కావాలో  ఆ నమూనా మీ మాటల్లో కనిపిస్తుంది. ‘మన్ కీ బాత్’ దేశము, సమాజము కోసము ఒక అద్దము లాంటిది. దేశవాసుల్లో ఉన్న అంతర్గత శక్తి, బలము, talent కి లోటు లేదనే విషయము దీనిద్వారా తెలుస్తుంది. ఆ బలాలను, talent ను సమన్వయపరిచి ఒక అవకాశం ఇచ్చి, కార్యాన్వితం చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ ‘మన్ కీ బాత్’ ద్వారా తెలిసే ఇంకొక విషయమేమిటంటే దేశం యొక్క అభివృద్ధిలో 130 కోట్ల ప్రజలందరూ సక్రియంగా, సమర్థతతో పాలు పంచుకోవాలనుకుంటున్నారు. అంతేకాదు, నేను ఒక మాట తప్పకుండా చెప్తాను, ‘మన్ కీ బాత్’ కోసం నాకు ఎన్ని ఉత్తరాలు, టెలిఫోన్ calls వస్తాయో, ఎన్ని సందేశాలు వస్తాయో వాటన్నిటిలో ఫిర్యాదు చేసే స్వభావం చాలా తక్కువ ఉంటుంది. ఎవరైనా ఏదైనా తమ కోసం అడిగినట్టుగా ఒక్కసారి కూడా , గడచిన ఐదేళ్ళలో నా దృష్టికి రాలేదు. దేశ ప్రధానమంత్రికి ఉత్తరం వ్రాస్తూ, తమ స్వంత ప్రయోజనం కోసం ఏమీ అడగకుండా వ్రాస్తున్నారంటే ఈ దేశంలో కోట్ల ప్రజల భావాలు ఎంత ఉన్నతమైనవి అని మీరే ఊహించండి. నేను ఇటువంటి విషయాలను analysis చేసినప్పుడు, నా మనసుకెంత ఆనందం కలుగుతుందో నాకెంత శక్తి లభిస్తుందో మీరు ఊహించగలరు. మీరు ఎంతగా నన్ను నడిపిస్తారని, నన్ను పరుగెత్తిస్తారని, క్షణక్షణం ప్రాణం పోస్తారని మీరు ఊహించనేలేరు, ఇదే, ఈ బంధాన్నే నేను miss అయ్యాను. ఈరోజు నా మనసు సంతోషంతో నిండిపోయింది. నేను చివరిసారి మాట్లాడినప్పుడు మూడు-నాలుగు నెలల తర్వాత కలుసుకుందాం అని చెప్తే, కొందరు అందులో రాజకీయ అర్థాలు వెదికారు. అరె! మోదీజీ కి ఎంత confidence, ఎంత నమ్మకం అన్నారు. Confidence మోదీది కాదు – ఈ నమ్మకం, మీ నమ్మకం అనే foundation ది. ఆ మీ నమ్మకం రూపు గట్టగా నేను చాలా సహజంగా ‘ మళ్ళీ కొన్ని నెలల తర్వాత మీ వద్దకు వస్తాను ‘ అని చెప్పగలిగాను. Actually నేను రాలేదు, మీరు నన్ను తెచ్చారు, కూర్చోబెట్టారు. మీరే నాకు మళ్ళీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ భావనతోటే ‘మన్ కీ బాత్’ పరంపరను ముందుకు తీసుకెళ్దాం.

       దేశంలో ఎమర్జెన్సీ విధించినపుడు దానికి వ్యతిరేకత కేవలం రాజకీయపరిధికి మాత్రం పరిమితం కాలేదు, రాజకీయనాయకులకు మాత్రం పరిమితం కాలేదు, జైలు ఊచలకు మాత్రం ఆ ఉద్యమం పరిమితం కాలేదు. ప్రజలందరి మనసులో ఒక ఆక్రోశం ఉండింది. పోగొట్టుకున్న ప్రజాస్వామ్యం గురించి తపన ఉండింది. పగలూ రాత్రి చక్కగా భోజనం లభిస్తున్నప్పుడు ఆకలి ఏమిటన్నది తెలీనట్లే, సాధారణ జీవనంలో ప్రజాస్వామిక హక్కుల యొక్క మజా ఏమిటన్నది తెలీదు. వాటినెవరన్నా లాక్కున్నప్పుడు తెలుస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో ప్రతి పౌరుడికీ తమ వస్తువేదో ఎవరో లాక్కుపోయినట్లు తెలిసింది. తన జీవితమంతా ఉపయోగించనివైనా సరే వాటినెవరో లాక్కుపోయినప్పుడు ఆ బాధ ఏమిటో అది మనసులో ఉండింది. ప్రజాస్వామ్యం ఏర్పడిందీ, కొన్ని ఏర్పాట్లు భారతరాజ్యాంగం చేసిందీ ఇందుకు కాదు అని మనసులో ఉండింది. సమాజవ్యవస్థను నడిపించడానికి రాజ్యాంగం, నియమనిబంధనలు, చట్టాలు వీటి ఆవశ్యకత ఉంటుంది, హక్కులు, కర్తవ్యాలు కూడా ఉంటాయి కానీ చట్టాలు, నియమాలకు అతీతమైన ప్రజాస్వామ్యం మన సంస్కారమని, ప్రజాస్వామ్య విధానం మన సంస్కృతిలోనే ఉందని భారత్ గర్వంగా చెప్పుకోగలదు. ప్రజాస్వామ్యము మనకు లభించిన వారసత్వము. ప్రజాస్వామ్యానికి వారసులమైన మనము అది లేని లోటును ఇట్టే తెలుసుకోగలము. ఎమర్జెన్సీ సమయంలో అలా తెలుసుకున్నాము. కాబట్టి దేశము తనకోసం కాకుండా , తన స్వప్రయోజనం కోసం కాకుండా ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్నికలకు ఆహ్వానం ఇచ్చింది. బహుశా ప్రపంచంలోని ఏ దేశంలోనైనా అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యం కోసం, తమ మిగిలిన హక్కులు, అధికారాలను, అవసరాలను పట్టించుకోకుండా కేవలం ప్రజాస్వామ్యము కోసం ఓటు వేశారో లేదో గానీ ఈ దేశం అటువంటి ఒక ఎన్నికలను 77 (డెబ్భై ఏడు) లో చూసింది. ప్రజాస్వామ్యపు నేటి ఎన్నికలపండుగ, అతి పెద్ద ఎన్నికల ఉద్యమం మన దేశం లో ప్రస్తుతం జరిగింది. ధనికులనుంచి మొదలుకొని బీదల వరకు అందరూ ఈ పండుగలో సంతోషంతో పాల్గొని మన దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి తత్పరులై పాల్గొన్నారు.

            ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు మనము దాన్ని underestimate చేస్తాము, దాని amazing facts ని కూడా నిర్లక్ష్యం చేస్తాము. మనకు దొరికిన అమూల్యమైన ప్రజాస్వామ్యాన్ని కూడా మనము చాలా సులువుగా granted గా తీసుకుంటాము. కానీ, ఈ ప్రజాస్వామ్యము ఎంతగొప్పదో, శతాబ్దాల సాధనతో, తరతరాల సంస్కారాలతో, ఒక విశాలమైన మానసిక స్థితితో ఈ ప్రజాస్వామ్యము మన నవనాడుల్లో నెలకొన్నది అని మనము  గుర్తుచేసుకుంటూ ఉండాలి. భారతదేశములో 2019 లోక్ సభ ఎన్నికలలో 61 కోట్లకు పైగా ప్రజలు వోటు వేశారు, sixty one crore. ఈ సంఖ్య మనకు ఏదో సామాన్యంగా అనిపించవచ్చు. కానీ ప్రపంచంలో చూడబోతే ఒక చైనా ను వదిలేస్తే, మిగతా ప్రపంచంలోని ఏ దేశం యొక్క నికర జనాభా కన్నా ఎక్కువ మంది ప్రస్తుతం వోటు వేశారు అని చెప్పగలను. ఎంతమంది ఐతే 2019 లోక్ సభ ఎన్నికలలో వోటు వేశారో , ఆ సంఖ్య అమెరికా మొత్తం జనాభా కన్నా ఎక్కువ, దాదాపు రెండింతలు. భారతదేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య మొత్తం యూరప్ జనాభాకన్నా ఎక్కువ. ఇది మన  ప్రజాస్వామ్యం యొక్క వైశాల్యాన్ని పరిచయం చేస్తుంది. 2019 లోక్ సభ ఎన్నికలు ఇప్పటివరకూ చరిత్రలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నికలు. ఈ విధంగా ఎన్నికలు జరిపించడానికి ఎంత పెద్ద స్థాయిలో మానవశక్తి, ఏర్పాట్ల అవసరం ఉంటుందో మీరు ఊహించవచ్చు. లక్షల మంది ఉపాధ్యాయులు, అధికారులు, ఉద్యోగులు పగలూ రాత్రి శ్రమిస్తేనే ఇది సంభవమైంది. ప్రజాస్వామ్యం యొక్క ఈ మహ యజ్ఞాన్ని సుసంపన్నం చేయడానికి సుమారు మూడు లక్షల పారామిలిటరీ దళాల రక్షణాధికారులు తమ బాధ్యతలను నిర్వహించారు, వివిధ రాష్ట్రాల 20 లక్షల పోలీసు ఉద్యోగులు కూడా గరిష్ఠ స్థాయిలో శ్రమించారు.  వీరి కఠిన పరిశ్రమ ఫలితంగా ఈసారి క్రితంసారి కన్నా ఎక్కువగా ఓటింగ్ జరిగింది. దేశం మొత్తం మీద 10 లక్షల పోలింగ్ స్టేషన్ లు, సుమారు 40 లక్షలకు పైగా ఈవిఎమ్ (EVM) మెషిన్లు, 17 లక్షలకు పైగా వివిప్యాట్ (VVPAT)మెషిన్లు, ఎంత పెద్ద ఏర్పాట్లో మీరు ఊహించవచ్చు. ఏ ఒక్క ఓటరు కూడా తన ఓటుహక్కు వినియోగించలేని పరిస్థితి రాకూడదని ఇదంతా చేయడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక సుదూర ప్రాంతంలో కేవలం ఒక్క మహిళా ఓటరు కోసం ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి చేరడానికి ఎన్నికల కమిషన్ అధికారులకు రెండు రోజులు ప్రయాణించవలసి వచ్చిందని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇదే ప్రజాస్వామ్యానికి అసలైన గౌరవం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్థానంలోని పోలింగ్ కేంద్రం భారతదేశంలో ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ –స్పీతి ప్రాంతంలో 15000 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాదు, ఈ ఎన్నికలలో గర్వపడదగ్గ ఇంకో అంశం కూడా ఉంది. బహుశా చరిత్రలో మొదటిసారిగా మహిళలు కూడా పురుషుల తో సమానంగా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ ఎన్నికలలో మహిళల, పురుషుల పోలింగ్ శాతం దాదాపు సమానంగా ఉంది. అదేవిధంగా ఉత్సాహం కలిగించే వాస్తవం ఏమిటంటే నేడు పార్లమెంటులో 78 (seventy eight) మహిళా ఎంపీలున్నారు. నేను ఎన్నికల కమిషన్ ను, ఎన్నికల ప్రక్రియకు చెందిన ప్రతి వ్యక్తినీ అభినందిస్తున్నాను. భారతదేశంలో జాగృతి పొందిన ఓటర్లకు ప్రణామం చేస్తున్నాను.

         నా ప్రియ దేశవాసులారా, ‘ బొకే కాదు బుక్’ అని నేను చెప్పడం మీరు చాలా సార్లు వినే ఉంటారు. స్వాగత-సత్కారాల్లో మనము పూల బదులు పుస్తకాలు ఇవ్వమని నా ప్రార్థన. అప్పట్నించీ చాలా చోట్ల ఇలా పుస్తకాలు ఇవ్వడం జరుగుతోంది. ఈమధ్య నాకెవరో ‘ప్రేమ్ చంద్ కీ లోక్ ప్రియ కహానియా’ అనే పుస్తకం ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. ఎక్కువ సమయం దొరకకపోయినా, ప్రవాసంలో ఉన్నప్పుడు నాకు వారికొన్ని కథలు మళ్ళీ చదివే అవకాశం దొరికింది. ప్రేమ్ చంద్ తన కథల్లో సమాజం యొక యథార్థ చిత్రణ చేయడం వల్ల చదివేటప్పుడు వాటి యథార్థచిత్రం మనసులో ఏర్పడుతుంది. వారు వ్రాసిన ఒక్కొక్క మాట సజీవమై నిలుస్తుంది. సహజమైన, సరళమైన భాషలో మానవీయ అనుభూతులను వ్యక్తం చేసే వారి కథలు నా మనసును ఆకట్టుకున్నాయి. వారి కథల్లో మొత్తం భారతదేశం యొక్క మనోభావాలు ప్రతిఫలిస్తాయి. వారు రచించిన ‘నశా’ అనే కథ చదువుతున్నప్పుడు సమాజంలోని ఆర్థిక అసమానతలవైపు నా దృష్టి మళ్ళింది. నేను యువకునిగా ఉన్నప్పుడు ఈ విషయంమీద చర్చలలో రాత్రులెన్ని గడచిపోయేవో గుర్తు వచ్చింది. జమీందారు కొడుకు ఈశ్వరీ , పేదకుటుంబంలోని వీర్ ల ఈ కథ ద్వారా, జాగ్రత్తగా లేకపోతే చెడు సాంగత్యం యొక్క ప్రభావం ఎప్పుడు పడుతుందో తెలీదు అన్న విషయం తెలుసుకుంటాము. నా మనసును ఆకట్టుకున్న రెండోకథ ‘ఈద్ గాహ్’, ఒక పిల్లవాడి హృదయకోమలత, తన నాన్నమ్మ పట్ల అతడి నిర్మలమైన ప్రేమ, అంత చిన్న వయసులో అతని పరిపక్వత. 4-5 ఏళ్ళ హామిద్ సంత నుంచి పట్టకారు తీసుకొని నాన్నమ్మ వద్దకు వెళ్ళడం, నిజంగా మానవహృదయకోమలత్వానికి గరిమ అని చెప్పవచ్చు. ఈ కథలోని చివరి పంక్తులు ఎంతో భావుకుల్ని చేయకమానవు, “ చిన్న హామిద్ వృద్ధ హామిద్ పార్ట్ ఆడుతున్నాడు – వృద్ధ అమీనా , అమీనా చిన్న పాప అయిపోయింది.”

           అదేవిధంగా ‘పూస్ కీ రాత్’ ఒక మార్మిక కథ.  ఈ కథలో ఒక పేదరైతు కష్టజీవితపు వ్యంగ్యచిత్రణ కనిపిస్తుంది. తన పంట అంతా నష్టమై పోయినాక హల్దూ రైతు ఇక తనకు వణికించే చలిలో పొలానికి కాపలాగా రాత్రిళ్ళు పడుకోవాల్సిన అవసరం లేదని సంతోషిస్తాడు. వాస్తవానికి ఈ కథలు ఒక శతాబ్దకాలం పాతవే అయినా, నేటి సందర్భానికీ తగినవే అనిపిస్తుంది. వీటిని చదివిన తర్వాత నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతికి లోనయ్యాను.

          చదవడం మాటకొస్తే, ఏదో ఒక మీడియాలో నేను కేరళ లోని అక్షరా లైబ్రరీ గురించి చదివాను. ఈ లైబ్రరీ ఇడుక్కి (Idukki) దట్టమైన అడవుల్లోని ఒక గ్రామంలో ఉందని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగక మానదు. అక్కడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పి.కె.మురళీధరన్, చిన్న టీ కొట్టు నడిపే పి.వి.చిన్నతంబి వీళ్ళిద్దరూ ఈ లైబ్రరీ కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఒక్కొక్కసారి పుస్తకాల కట్టలు భుజం మీద మోసుకొని కూడా తీసుకురావాల్సి వచ్చింది. నేడు ఈ లైబ్రరీ ఆదివాసీ పిల్లలతో పాటు ప్రతి ఒక్కరికీ దారిచూపుతున్నది.

      గుజరాత్ లో వాంచె గుజరాత్ (చదువు గుజరాత్) ఉద్యమం ఒక సఫల ప్రయోగం. లక్షల సంఖ్యలో అన్ని వయస్సులవాళ్ళు పుస్తకపఠనం అనే ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. నేటి digital ప్రపంచంలో, Google గురు కాలంలో మీ daily routine లోంచి కొంత సమయం చదవడానికి తప్పకుండా వినియోగించండి అని మీకు నా విన్నపం. మీరు నిజంగా చాలా enjoy చేస్తారు. ఏ పుస్తకం చదివినా దాని గురించి NarendraModi App లో ఖచ్చితంగా వ్రాయండి. తద్వారా ‘మన్ కీ బాత్’ లో శ్రోతలందరూ దానిగురించి తెలుసుకోగలుగుతారు.

       నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలోని ప్రజలు వర్తమానానికే కాకుండా భవిష్యత్తు కూ సవాలు గా నిలిచే విషయాల గురించి ఆలోచిస్తారని నాకు చాలా సంతోషంగా ఉంది. నేను NarendraModi App,  Mygov లలో మీ వ్యాఖ్యలు చదివేటప్పుడు గమనించాను. నీటి సమస్య గురించి చాలామంది చాలా వ్రాస్తున్నారు. బెళగావి(Belagavi) లో పవన్ గౌరాయి, భువనేశ్వర్ లో సితాంశూ మోహన్ పరీదా, ఇంకా యశ్ శర్మా, శాహాబ్ అల్తాఫ్ ఇంకా చాలా మంది నాకు నీటికి సంబంధించిన సమస్యల గురించి వ్రాశారు. మన సంస్కృతిలో నీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఋగ్వేదంలో ఆపఃసూక్తము నీటి గురించి ఇలా చెప్పబడింది:

ఆపో హిష్ఠా మయో భువః, స్థా న ఊర్జే దధాతన, మహేరణాయ చక్షసే,

యో వః శివతమో రసః, తస్య భాజయతేహ నః, ఉషతీరివ మాతరః ।

     అర్థమేమంటే జలమే జీవనదాయిని శక్తి, శక్తిమూలం. మాతృవత్ అంటే తల్లిలాగా ఆశీర్వదించు. మీ కృప మామీద వర్షించుగాక. అని. ప్రతియేడూ దేశంలోని అనేక ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తుతూనే ఉంది. సంవత్సరం పాటు పడిన వర్షపాతంలోని నీటిలో మనం కేవలం 8% నీటిని మాత్రమే మనం దాచుకోగలుగుతున్నామంటే మీరు ఆశ్చర్యపోకమానరు. కేవలం 8% మాత్రమే. ఈ సమస్యకు పరిష్కారం వెదకాల్సిన సమయం వచ్చింది. మిగిలిన అన్ని సమస్యలలాగే ప్రజల భాగస్వామ్యంతో , ప్రజాశక్తితో, నూటముప్ఫై కోట్ల దేశవాసుల సామర్థ్యంతో, సహకారంతో, సంకల్పంతో ఈ సమస్యను కూడా పరిష్కరిద్దాం. నీటి యొక్క ప్రాధాన్యతను అన్నిటికన్నా ముఖ్యంగా భావించి దేశంలో కొత్త జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిద్వారా నీటికి సంబంధించిన అన్ని విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోగలము. కొన్నాళ్ళ క్రితం నేను ఒక కొత్త పని చేశాను. దేశంలోని సర్పంచ్ లందరికీ గ్రామప్రధానికి ఉత్తరాలు వ్రాశాను. గ్రామప్రధానులకు నీటిని పొదుపుచేయాలని, నీటి సేకరణ చేయడానికి వర్షపునీటియొక్క ప్రతి బిందువునూ సేకరించడానికి వారిని  గ్రామసభలో ఒక సమావేశం ఏర్పాటు చేసి, గ్రామీణులతో చర్చించమని వ్రాశాను. ఈ పనిలో వారంతా పూర్తిగా ఉత్సాహంతో పాల్గొని ఈ నెల 22 వ తేదీన వేల పంచాయతీలలో కోట్ల ప్రజలు శ్రమదానం చేశారు. గ్రామాల్లో ప్రజలు నీటి యొక్క ప్రతి బిందువునూ సేకరించే సంకల్పం చేశారు.

       ఈరోజు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో నేను మీకు ఒక సర్పంచ్ మాటలు వినిపిస్తాను. ఝార్ఖండ్ లోని హజారీబాగ్ జిల్లాకు చెందిన కటకమ్ సాండీ బ్లాక్ లోని లుపుంగ్ పంచాయతీ సర్పంచ్ మనందరికీ ఒక సందేశం ఇస్తున్నాడు.

      “నా పేరు దిలీప్ కుమార్ రవిదాస్. నీటిని పొదుపు చేయాలంటూ ప్రధానమంత్రి నుంచి ఉత్తరం వచ్చినప్పుడు ప్రధానమంత్రి మనకు ఉత్తరం వ్రాశాడంటే మా చెవులను మేమే నమ్మలేకపోయాము. మేము 22 వ తేదీ గ్రామంలోని ప్రజలను సమావేశపరచి, ప్రధానమంత్రి ఉత్తరాన్ని చదివి వినిపించాక, గ్రామంలోని ప్రజలు చాలా ఉత్సాహభరితులైనారు. నీటి సేకరణకు చెరువును శుభ్రం చేసి, కొత్త చెరువు నిర్మించడానికి శ్రమదానం చేసి తమ పాత్ర నిర్వహించడానికి సిద్ధమైనారు. వర్షాలు రావడానికి ముందే ఈ పని చేయడం వల్ల మనకు రాబోయే సమయంలో నీటి కరువు ఉండదు. సరైన సమయంలో మన ప్రధానమంత్రి మనలను హెచ్చరించారు.”

            బిర్సా ముండా పుట్టిన ఆ నేల ప్రకృతితో సహజీవనం చేయడమే అక్కడి సంస్కృతి. అక్కడి ప్రజలు మళ్ళీ ఒకసారి జలసంరక్షణ కొరకు తమ వంతు పాత్ర నిర్వహించడానికి సిద్ధమైనారు. అందరు గ్రామ ప్రధానులకు, అందరు సర్పంచులకు వారి క్రియాశీలతకు అనేక శుభాకాంక్షలు. దేశమంతటా ఇలా జలసంరక్షణ చేపట్టిన అనేక సర్పంచులున్నారు. గ్రామమంతటికీ కూడా ఇది జలసంరక్షణ చేయవలసిన సందర్భము. గ్రామంలోని ప్రజలు, తమ ఊళ్ళో జలమందిరం కట్టడానికి పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. నేను ముందే అన్నట్టుగా, సామూహిక ప్రయత్నంతో హెచ్చు సకారాత్మక పరిణామాలు కనిపిస్తాయి. దేశమంతటికీ నీటి సమస్య పరిష్కారం కోసం ఒకే ఫార్ములా ఉండదు. కాబట్టి దేశంలోని వివిధ ప్రాంతాలలో , వివిధ పద్ధతులలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అన్నిటి లక్ష్యము ఒక్కటే. అదే నీటి వనరును కాపాడుకోవడం. జలసంరక్షణ.

            పంజాబ్ లో drainage lines ను సరిచేస్తున్నారు. దీనివల్ల water logging సమస్య నివారింపబడుతుంది. తెలంగాణాలో timmaipalli (తిమ్మైపల్లి) లో టాంక్ నిర్మాణం గ్రామజనుల జీవితాన్నే మార్చివేసింది. రాజస్థాన్ లోని కబీర్ ధామ్ లో పొలాలలో ఏర్పాటుచేయబడిన చిన్న చిన్న చెరువుల వలన ఒక పెద్ద మార్పు వచ్చింది. తమిళనాడు లోని వెల్లూరు (Vellore) లో నాగ నది (Naag nadi) ని పునరుజ్జీవింపజేయడానికి 20 వేల మంది మహిళలు కలిసి సామూహికంగా ప్రయత్నం చేశారని చదివాను. గఢ్ వాల్ లో కూడా స్త్రీలందరూ కలసి rain water harvesting మీద చాలా పని చేస్తున్నారని కూడా నేను చదివాను. ఇటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. మనమంతా కలిసి బలంగా ప్రయత్నిస్తే అసంభవాన్ని కూడా సంభవం చేస్తామని నాకు నమ్మకం కలుగుతోంది. జనం జనం కలిస్తే జలం ప్రాప్తిస్తుంది. నేడు ‘మన్ కీ బాత్’ ద్వారా నేను దేశవాసులకు 3 విన్నపాలు చేస్తున్నాను.

           నా మొదటి విన్నపం – దేశవాసులంతా స్వచ్ఛతను ఎలా ప్రజాఉద్యమం చేశారో, అలాగే, జలసంరక్షణ కొరకు కూడా ఒక ప్రజా ఉద్యమం ప్రారంభిద్దాం. మనమంతా కలిసి నీటి యొక్క ప్రతి బిందువును సేకరించేందుకు సంకల్పిద్దాం. నాకు నమ్మకం ఉంది, నీళ్ళు పరమేశ్వరుని ప్రసాదం. జలం పరుసవేది. ఈ పరుసవేదితో , నీటి స్పర్శతో నవజీవన నిర్మాణం జరుగుతుంది. నీటియొక్క ఒక్కొక్క బిందువును కాపాడడానికి ఒక అవగాహనా ఉద్యమం చేద్దాం. దీనిలో భాగంగా నీటికి చెందిన సమస్యల గురించి మాట్లాడాలి, జలసంరక్షణా పద్ధతుల గురించి మాట్లాడాలి. ముఖ్యంగా వివిధ క్షేత్రాలకు చెందిన ముఖ్యులకు, జలసంరక్షణ కొరకు innovative campaigns కు నాయకత్వం వహించాల్సిందిగా నా విజ్ఞప్తి. సినిమా రంగం కానివ్వండి, క్రీడారంగం కానివ్వండి, మీడియాలోని మన మిత్రులు కానివ్వండి, సామాజిక సంస్థలకు చెందిన వ్యక్తులు కానివ్వండి, సాంస్కృతిక సంస్థలకు చెందిన వ్యక్తులు కానివ్వండి, ప్రవచనకారులు కానివ్వండి, ప్రతిఒక్కరూ తమ తమ పద్ధతులలో ఈ ఉద్యమానికి నేతృత్వం వహించండి. సమాజాన్ని మేల్కొల్పండి, సమాజాన్ని ఒకటి చేయండి, సమాజంతో కలిసి పనిచేయండి. చూడండి, మన కళ్ళముందు మనం మార్పును తప్పక చూస్తాము.

           దేశవాసులతో నా రెండవ విన్నపం. మన దేశంలో జలసంరక్షణ కొరకు అనేక సాంప్రదాయిక పద్ధతులు శతాబ్దాలనుంచి వినియోగంలో ఉన్నాయి. జలసంరక్షణ కు చెందిన ఆ సాంప్రదాయిక పద్ధతులను share చేసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విన్నవిస్తున్నాను. మీలో ఎవరైనా పోర్ బందర్, పూజ్య బాపూ జన్మస్థలం దర్శించే అవకాశం కలిగి ఉంటే, పూజ్య బాపూ ఇంటి వెనుక ఒక ఇల్లు ఉంది. అక్కడ 200 ఏళ్ళ నీటి టాంక్ (Water Storage Tank) ఉంది. ఈనాటికీ అందులో నీళ్ళు ఉంటాయి. వర్షాకాలంలో నీటిని పట్టికాపాడే వ్యవస్థ ఉంది. అందుకే నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. ఎవరైనా కీర్తి మందిర్ వెళ్తే ఆ నీటి టాంక్ ను తప్పక చూడండి అని. ప్రతిచోటా ఇటువంటి అనేక ప్రయోగాలు ఉంటాయి.

            మీ అందరితో నా మూడవ విన్నపం. జలసంరక్షణ దిశలో ముఖ్య పాత్ర నిర్వహించే వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, ఈ రంగంలో పని చేసే ప్రతి ఒక్కరూ ఈ విషయానికి సంబంధించి వారికి తెలిసింది share చేయండి. అలా చేయడం వల్ల ఒక సమృద్ధమైన, నీటికి సంబంధించిన క్రియాశీల సంస్థల, వ్యక్తుల database తయారౌతుంది. రండి, మనం జలసంరక్షణకు సంబంధించిన అత్యధిక పద్ధతుల సూచి తయారుచేసి ప్రజలకు జల సంరక్షణ పట్ల ప్రేరణ కలిగిద్దాం. మీరంతా #JanShakti4JalShakti హాష్ టాగ్ ని ఉపయోగించి మీ content share చేసుకోవచ్చు.

             నా ప్రియదేశవాసులారా, ఇంకొక విషయంలో కూడా నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రపంచంలోని వ్యక్తులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 21, జూన్ నాడు మళ్ళీ ఒకసారి ఉత్సాహోల్లాసాలతో ఒక కుటుంబానికి చెందిన మూడు-మూడు, నాలుగు-నాలుగు తరాలవాళ్ళు కలిసి యోగాడే ను జరుపుకున్నారు. Holistic Health Care కోసం అవగాహన పెరిగింది, అందులో యోగా డే ప్రాముఖ్యత పెరిగింది. ప్రపంచంలో అన్ని మూలల్లో సూర్యోదయ సమయంలో యోగాభ్యాసి స్వాగతం చెప్తే, సూర్యాస్తమయం వరకూ జరుగుతుంది. ఎక్కడెక్కడ మనుషులున్నారో అక్కడంతా యోగా ఆచరించారు. బహుశా అలా కాని ప్రదేశం లేదేమో అనిపించేంతగా యోగా బృహద్రూపం దాల్చింది. భారతదేశంలో హిమాలయాల నుంచి హిందూ మహాసాగరం వరకూ, సియాచిన్ నుంచీ సబ్ మెరైన్ వరకూ, air-fore నుంచీ air-craft carriers వరకూ, AC gyms నుంచి వేడిగాలుల ఎడారి వరకూ, గ్రామాలనుంచీ పట్టణాలవరకూ- ఎక్కడ అవకాశం ఉందో అక్కడంతా యోగా చేయడమే కాదు, సామూహికంగా ఉత్సవంగా చేసుకున్నారు.

               ప్రపంచంలో అనేక దేశాల రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ప్రసిద్ధ వ్యక్తులు, సామాన్య పౌరులు వారి వారి దేశాల్లో ఎలా యోగా ఆచరించారో నాకు twitter లో చూపించారు. ఆరోజు ప్రపంచమంతా ఒక సుఖమయకుటుంబం లాగా కనిపించింది.

ఒక ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కొరకు ఒక ఆరోగ్యకరమైన, సహానుభూతి కల వ్యక్తుల అవసరం ఉంటుందని మనందరికీ తెలుసు. యోగా వల్ల ఇది సాధ్యమౌతుంది. కాబట్టి యోగా ప్రచారము-ప్రసారము ఒక గొప్ప సమాజసేవ . ఈ సేవకు గుర్తింపు నిచ్చి సన్మానించుకోవద్దా? 2019 లో యోగా promotion and development లో విశిష్టపాత్ర పోషించినవారికి Prime Minister’s Awards  ప్రకటన, నాకు చాలా సంతోషాన్నిచ్చిన విషయం. ప్రపంచమంతటా ఉన్న అనేక సంస్థలకు ఈ పురస్కారం ఇవ్వబడింది. వారంతా ఎంత గొప్పగా యోగా ను ప్రచారము-ప్రసారము చేయడంలో ఎంత ముఖ్య పాత్ర పోషించారో మీరు ఊహించలేరు. ఉదాహరణకు ‘జపాన్ యోగ్ నికేతన్’ తీసుకుంటే, ఇది జపాన్ అంతటా యోగాను జనప్రియం చేసింది. ‘జపాన్ యోగ్ నికేతన్’ అక్కడ ఎన్నో institutes, training courses నడుపుతుంది. తర్వాత ఇటలీకి చెందిన Ms. Antonietta Rozzi అనే వ్యక్తి సర్వయోగ్ ఇంటర్నేషనల్ ను ఆరంభించి యూరప్ అంతటా యోగా ప్రచారం-ప్రసారం చేశారు. ఇవి అన్నీ స్ఫూర్తిదాయకమైనవి. యోగాకు సంబంధించిన విషయంలో భారతీయులు వెనుకబడే ప్రసక్తే లేదు కదా? బీహార్ యోగ్ విద్యాలయ్, ముంగేర్ కూడా ఈ పురస్కారం పొందింది. గడచిన కొన్ని దశాబ్దాలుగా ఇది యోగా కు అంకితమై ఉంది. అదే విధంగా స్వామీ రాజర్షి ముని కూడా పురస్కారం అందుకున్నారు. వారు life mission and Lakulish Yoga University ని స్థాపించారు.  యోగా యొక్క విస్తృత celebration మరియు యోగా సందేశాన్ని ఇంటింటికీ చేర్చేవారికి పురస్కారం ఈ రెండూ ఈ యోగా డే ను మరింత ప్రాముఖ్యత గలదిగా చేశాయి.

          నా ప్రియ దేశవాసులారా, మన యాత్ర ఈరోజు ప్రారంభమవుతున్నది. కొత్త భావాలు, కొత్త అనుభూతులు, కొత్త సంకల్పాలు, కొత్త సామర్థ్యాలు. అయినా నేను మీ సలహాల కొరకు వేచి ఉంటాను. మీ ఆలోచనలతో కలిసి నడవడం నాకు ఒక ముఖ్యమైన యాత్ర. ‘మన్ కీ బాత్’ కేవలము నిమిత్తమాత్రము. రండి మనం కలుస్తూ ఉందాం, మాట్లాడుతూ ఉందాం. మీ భావాలను వింటూ, సేకరించుకుంటూ, అర్థం చేసుకుంటూ ఉండనివ్వండి. ఆ భావాలకనుగుణంగా జీవించే ప్రయత్నమూ అప్పుడప్పుడూ చేయనివ్వండి. మీ ఆశీస్సులు నా మీద ఎప్పుడూ ఉండుగాక. మీరే నాకు ప్రేరణ, మీరే నాకు శక్తి. రండి, అందరం కలిసి కూర్చొని ‘మన్ కీ బాత్’ ని ఆస్వాదిస్తూ జీవితంలోని కర్తవ్యాలను నిర్వహించుకుంటూ సాగుదాం. మళ్ళీ ఒకసారి వచ్చే నెల ‘మన్ కీ బాత్’ లో కలుద్దాం. మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు.

నమస్కారం.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry

Media Coverage

Annual malaria cases at 2 mn in 2023, down 97% since 1947: Health ministry
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister condoles passing away of former Prime Minister Dr. Manmohan Singh
December 26, 2024
India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji: PM
He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic policy over the years: PM
As our Prime Minister, he made extensive efforts to improve people’s lives: PM

The Prime Minister, Shri Narendra Modi has condoled the passing away of former Prime Minister, Dr. Manmohan Singh. "India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji," Shri Modi stated. Prime Minister, Shri Narendra Modi remarked that Dr. Manmohan Singh rose from humble origins to become a respected economist. As our Prime Minister, Dr. Manmohan Singh made extensive efforts to improve people’s lives.

The Prime Minister posted on X:

India mourns the loss of one of its most distinguished leaders, Dr. Manmohan Singh Ji. Rising from humble origins, he rose to become a respected economist. He served in various government positions as well, including as Finance Minister, leaving a strong imprint on our economic policy over the years. His interventions in Parliament were also insightful. As our Prime Minister, he made extensive efforts to improve people’s lives.

“Dr. Manmohan Singh Ji and I interacted regularly when he was PM and I was the CM of Gujarat. We would have extensive deliberations on various subjects relating to governance. His wisdom and humility were always visible.

In this hour of grief, my thoughts are with the family of Dr. Manmohan Singh Ji, his friends and countless admirers. Om Shanti."