ప్రధాని నరేంద్ర మోదీపై రెండు పుస్తకాల ఆవిష్కరణ సందర్భంగా ఉప రాష్ట్రపతి శ్రీ హమీద్ అన్సారీ మాట్లాడుతూ, మన్ కి బాత్ అనేది ప్రధాని మోదీ సృష్టించిన అద్భుతమైన మరియు ప్రభావవంతమైన భావవ్యక్తీకరణ వేదిక అని అన్నారు. “ఇది రేడియో మొదలుకుని టెలివిజన్ నుండి ఇంటర్నెట్ వరకూ, సోషల్ మీడియా నుండి మొబైల్ టెలిఫోన్ల వరకూ వున్న అన్ని సమాచార సాంకేతిక పరిజ్ఞానాల యొక్క మొత్తం స్పెక్ట్రంలను ఏకం చేస్తుంది.” అని కూడా అన్నారు.
"ప్రజలతో ప్రధాని నేరుగా సంభాషించే వ్యూహంలో ట్విట్టర్, వంటి సామాజిక మాద్యమం మొదలుకుని ప్రభుత్వ యొక్క పౌరులతో సంభాషించే ప్లాట్‌ఫారమ్, మైగౌవ్.ఇన్ మరియు అతని వ్యక్తిగత యాప్ ల తో పాటుగా, మన్ కి బాత్ ప్రధానాంశంగా మారింది.