We will send you 4 digit OTP to confirm your number
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా జీవితంలో మరపురాని క్షణాలేవని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ప్రత్యేకమైన మరపురాని ఒక క్షణం ఉంది- అది గత సంవత్సరం నవంబర్ 15 వ తేదీన జరిగింది. ఆరోజు నేను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్ళాను. ఈ యాత్ర నాపై చాలా ప్రభావం చూపింది. ఈ పుణ్యభూమి మట్టిని తలతో తాకే భాగ్యం పొందిన దేశ తొలి ప్రధానమంత్రిని నేనే. ఆ క్షణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న శక్తి తెలిసిరావడమే కాకుండా ఈ భూ శక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా వచ్చింది. ఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో నేను గ్రహించాను.
మిత్రులారా! భారతదేశం ప్రతి యుగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ప్రతి యుగంలో ఈ సవాళ్లను ఎదుర్కొనే అసాధారణ భారతీయులు జన్మించారు. నేటి 'మన్ కీ బాత్'లో ధైర్యం, దూరదృష్టి ఉన్న ఇద్దరు మహానాయకుల గురించి చర్చిస్తాను. వారి 150వ జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని దేశం నిర్ణయించింది. అక్టోబర్ 31వ తేదీన సర్దార్ పటేల్ 150వ జయంతి సంవత్సరం ప్రారంభమవుతుంది. దీని తరువాత భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సంవత్సరం నవంబర్ 15వ తేదీన మొదలవుతుంది. ఈ మహానుభావులు ఇద్దరూ వేర్వేరు సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే ఇద్దరి దృక్కోణం దేశ సమైక్యతే.
మిత్రులారా! గడిచిన సంవత్సరాల్లో దేశం మహానాయకుల జయంతిని కొత్త శక్తితో జరుపుకోవడం ద్వారా కొత్త తరానికి కొత్త స్ఫూర్తిని ఇచ్చింది. మనం మహాత్మా గాంధీ 150వ జయంతిని ఎంత ప్రత్యేకంగా జరుపుకున్నామో మీకు గుర్తుండే ఉంటుంది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ నుండి ఆఫ్రికాలోని చిన్న గ్రామాల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశ సత్యం, అహింసల సందేశాన్ని అర్థం చేసుకున్నారు. తిరిగి తెలుసుకున్నారు. అలాగే జీవించారు. యువకుల నుండి వృద్ధుల వరకు, భారతీయుల నుండి విదేశీయుల వరకు ప్రతి ఒక్కరూ గాంధీజీ బోధనలను కొత్త సందర్భంలో అర్థం చేసుకున్నారు. కొత్త ప్రపంచ పరిస్థితుల్లో వాటిని తెలుసుకున్నారు. మనం స్వామి వివేకానంద 150వ జయంతిని జరుపుకున్నప్పుడు దేశ యువత భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక శక్తిని కొత్త పరిభాషలో అర్థం చేసుకుంది. మన గొప్ప వ్యక్తులు మరణించినంత మాత్రాన వారి ప్రభావం కోల్పోలేదని, వారి జీవితాలు మన వర్తమానాన్ని భవిష్యత్తుకు మార్గాన్ని చూపుతుందన్న భరోసా వీటివల్ల ఏర్పడుతుంది.
మిత్రులారా! ఈ మహనీయుల 150వ జయంతి ఉత్సవాలను జాతీయ స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ భాగస్వామ్యం మాత్రమే ఈ ప్రచారానికి జీవం పోస్తుంది. ఈ ఉత్సవాలకు జీవం అందిస్తుంది. ఈ ప్రచారంలో మీరందరూ భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉక్కు మనిషి సర్దార్ పటేల్‌కి సంబంధించిన మీ ఆలోచనలను, కార్యక్రమాలను # సర్దార్150 తో పంచుకోండి. #బిర్సాముండా150తో బిర్సా ముండా స్ఫూర్తిని ప్రపంచానికి అందించండి. మనం కలసికట్టుగా ఈ ఉత్సవాలను భిన్నత్వంలో భారతదేశ ఏకత్వాన్ని చాటేవిధంగా, గొప్ప వారసత్వాన్ని వికాస ఉత్సవంగా జరుగపుకుందాం.
నా ప్రియమైన దేశవాసులారా! ‘ఛోటా భీమ్’ టీవీలో కనిపించడం ప్రారంభించిన ఆ రోజులను మీరు తప్పక గుర్తుంచుకోవాలి. ‘ఛోటా భీమ్’ అంటే ఎంత ఉత్కంఠ ఉండేదో పిల్లలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ రోజు ఢోలక్ పూర్ డోలు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల పిల్లలను కూడా ఆకర్షిస్తుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. అలాగే మన ఇతర యానిమేషన్ సీరియళ్లు ‘కృష్ణ’, ‘హనుమాన్’, ‘మోటు-పత్లు’లకు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారతీయ యానిమేషన్ పాత్రలు, ఇక్కడి యానిమేషన్ సినిమాలు వాటి కంటెంట్, సృజనాత్మకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల మక్కువను చూరగొంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ నుండి సినిమా స్క్రీన్ వరకు, గేమింగ్ కన్సోల్ నుండి వర్చువల్ రియాలిటీ వరకు యానిమేషన్ ప్రతిచోటా ఉంటుందని మీరు తప్పక చూసి ఉంటారు. యానిమేషన్ ప్రపంచంలో భారత్ సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేస్తోంది. భారతదేశ గేమింగ్ స్పేస్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ రోజుల్లో భారతీయ ఆటలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కొన్ని నెలల క్రితం నేను భారతదేశంలోని ప్రముఖ గేమర్లను కలిశాను. అప్పుడు భారతీయ గేమ్‌ల అద్భుతమైన సృజనాత్మకత, నాణ్యతను తెలుసుకునే, అర్థం చేసుకునే అవకాశం నాకు లభించింది. నిజానికి దేశంలో సృజనాత్మక శక్తి తరంగం నడుస్తోంది. యానిమేషన్ ప్రపంచంలో ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ బై ఇండియన్స్’ ప్రబలంగా ఉన్నాయి. నేడు భారతీయ ప్రతిభ కూడా విదేశీ నిర్మాణాలలో కూడా ముఖ్యమైన భాగంగా మారుతున్నదని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ప్రస్తుత స్పైడర్ మ్యాన్ అయినా, ట్రాన్స్ఫార్మర్స్ అయినా ఈ రెండు సినిమాల్లో హరినారాయణ్ రాజీవ్ అందించిన సహకారానికి ప్రజల ప్రశంసలు లభించాయి. భారతదేశ యానిమేషన్ స్టూడియోలు డిస్నీ, వార్నర్ బ్రదర్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థలతో కలిసి పని చేస్తున్నాయి.
మిత్రులారా! నేడు మన యువత అసలైన భారతీయ కంటెంట్‌ను సిద్ధం చేస్తోంది. మన సంస్కృతికి ప్రతిబింబమైన ఇవి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇతర పరిశ్రమలకు బలాన్ని ఇచ్చే స్థాయిలో యానిమేషన్ రంగం నేడు పరిశ్రమ రూపాన్ని సంతరించుకుంది. ఈ రోజుల్లో వీఆర్ టూరిజం చాలా ప్రసిద్ధి చెందుతోంది. మీరు వర్చువల్ యాత్ర ద్వారా అజంతా గుహలను చూడవచ్చు. కోణార్క్ మందిర ఆవరణలో షికారు చేయవచ్చు. లేదా వారణాసి ఘాట్లను ఆస్వాదించవచ్చు. ఈ వీఆర్ యానిమేషన్లన్నీ భారతీయులు సృష్టించినవే. వీఆర్ ద్వారా ఈ స్థలాలను చూసిన తర్వాత చాలా మంది ఈ పర్యాటక ప్రదేశాలను వాస్తవంగా సందర్శించాలని కోరుకుంటారు. అంటే పర్యాటక గమ్యస్థానాల వర్చువల్ టూర్ ప్రజల మనస్సుల్లో ఉత్సుకతను సృష్టించడానికి ఒక మాధ్యమంగా మారింది. నేడు ఈ రంగంలో యానిమేటర్లతో పాటు స్టోరీ టెల్లర్లు, రచయితలు, వాయిస్ ఓవర్ నిపుణులు, సంగీతకారులు, గేమ్ డెవలపర్లు, వర్చువల్ రియాలిటీ- ఆగ్మెంటెడ్ రియాలిటీ నిపుణులకు కూడా డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. కాబట్టి సృజనాత్మకతను పెంచుకోవాలని నేను భారతదేశ యువతకు చెప్తాను. ఎవరికి తెలుసు- ప్రపంచంలోని తర్వాతి సూపర్ హిట్ యానిమేషన్ మీ కంప్యూటర్ నుండే రావచ్చేమో! తర్వాతి వైరల్ గేమ్ మీ సృష్టే కావచ్చు! విద్యాపరమైన యానిమేషన్లలో మీ ఆవిష్కరణ గొప్ప విజయాన్ని సాధించగలదు. ‘వరల్డ్ యానిమేషన్ డే’ కూడా ఈ అక్టోబర్ 28 వ తేదీన అంటే రేపు జరుపుకుంటున్నాం. రండి.... భారతదేశాన్ని ప్రపంచ యానిమేషన్ పవర్ హౌస్‌గా మార్చాలని సంకల్పిద్దాం.
నా ప్రియమైన దేశప్రజలారా! స్వామి వివేకానంద ఒకప్పుడు విజయ మంత్రాన్ని అందించారు. 'ఒక ఆలోచన తీసుకోండి. ఆ ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి. దాని గురించి ఆలోచించండి. దాని గురించి కలలుగనండి. జీవించడం ప్రారంభించండి.’ అనే ఆ విజయ మంత్రం ఆధారంగా ఆత్మ నిర్భర్ భారత్ విజయం కూడా కొనసాగుతోంది. ఈ ప్రచారం మన సామూహిక చైతన్యంలో భాగమైంది. అడుగడుగునా నిరంతరం మనకు స్ఫూర్తిగా నిలిచింది. స్వావలంబన మన విధానం మాత్రమే కాదు- అది మన అభిరుచిగా మారింది. చాలా సంవత్సరాలు కాలేదు- భారతదేశంలో సంక్లిష్టమైన సాంకేతికత అభివృద్ధి చెందుతుందని పదేళ్ల కిందట ఎవరైనా చెప్తే చాలా మంది నమ్మేవారు కాదు. చాలా మంది అపహాస్యం చేసేవారు. కానీ ఈ రోజు దేశ విజయాలను చూసి వారే ఆశ్చర్యపోతున్నారు. స్వయం సమృద్ధి పొందిన తర్వాత భారతదేశం ప్రతి రంగంలో అద్భుతాలు చేస్తోంది. ఒక్కసారి ఊహించుకోండి- ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారుగా ఉన్న భారతదేశం నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద తయారీదారుగా మారింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ పరికరాల కొనుగోలుదారుగా ఉన్న భారతదేశం ఇప్పుడు 85 దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. అంతరిక్ష సాంకేతికతలో ఈ రోజు భారతదేశం చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశంగా మారింది. నాకు చాలా నచ్చిన విషయం ఏమిటంటే ఈ స్వావలంబన ప్రచారం ఇకపై కేవలం ప్రభుత్వ ప్రచారం కాదు- ఇప్పుడు స్వయం ఆధారిత భారతదేశ ప్రచారం ప్రజల ప్రచార ఉద్యమంగా మారుతోంది. ప్రతి రంగంలో దేశం విజయాలు సాధిస్తోంది. ఉదాహరణకు ఈ నెలలో లద్దాక్ లోని హాన్లేలో ఆసియాలోనే అతిపెద్ద ఇమేజింగ్ టెలిస్కోప్ MACEను కూడా ప్రారంభించాం. ఇది 4300 మీటర్ల ఎత్తులో ఉంది. అందులో విశేషమేంటో తెలుసుకుందాం! ఇది భారతదేశ తయారీ- ‘మేడ్ ఇన్ ఇండియా’. మైనస్ 30 డిగ్రీల చల్లటి వాతావరణం ఉన్న ప్రదేశంలో- ఆక్సిజన్ కొరత కూడా ఉన్న ప్రదేశంలో- మన శాస్త్రవేత్తలతో పాటు స్థానిక పరిశ్రమలు ఆసియాలో మరే దేశం చేయని పనిని చేశాయి. హాన్లే టెలిస్కోప్ సుదూర ప్రపంచాన్ని చూస్తూ ఉండవచ్చు. అది మనకు మరొక విషయాన్ని కూడా చూపుతోంది – అది స్వయం సమృద్ధ భారతదేశ సామర్థ్యం.
మిత్రులారా! మీరు కూడా ఒక పని చేయాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశం స్వయం సమృద్ధంగా మారడానికి దోహదపడే ప్రయత్నాలకు వీలైనన్ని ఎక్కువ ఉదాహరణలను పంచుకోండి. మీ పరిసరాల్లో మీరు చూసిన కొత్త ఆవిష్కరణ, మీ ప్రాంతంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న స్థానిక స్టార్ట్-అప్- ఇలాంటి విశేషాలను #AatmanirbharInnovationతో సోషల్ మీడియాలో రాయండి. స్వావలంబన భారతదేశ ఉత్సవాలు నిర్వహించండి. ఈ పండుగ సీజన్ లో మనమందరం స్వావలంబన భారతదేశ ప్రచారాన్ని మరింత బలోపేతం చేద్దాం. వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రంతో మనం మన షాపింగ్ చేద్దాం. ఇది అసాధ్యం కేవలం సవాలుగా ఉన్న నవీన భారతదేశం. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు మేక్ ఫర్ ది వరల్డ్‌గా మారింది. ఇక్కడ ప్రతి పౌరుడు ఒక ఆవిష్కర్త. ఇక్కడ ప్రతి సవాలు ఒక అవకాశం. మనం భారతదేశాన్ని స్వయం సమృద్ధంగా మార్చడమే కాకుండా మన దేశాన్ని ప్రపంచవ్యాప్త ఆవిష్కరణల శక్తి కేంద్రంగా బలోపేతం చేయాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! మీ కోసం ఒక ఆడియోను వినిపిస్తాను.
(ఆడియో)
ఫ్రాడ్ కాలర్ 1: హలో
బాధితుడు: సార్… నమస్కారం సార్.
ఫ్రాడ్ కాలర్ 1: నమస్తే
బాధితుడు: సార్... చెప్పండి సార్
ఫ్రాడ్ కాలర్ 1: మీరు నాకు పంపిన ఈ FIR నంబర్‌ను చూడండి.. ఈ నంబర్‌పై మాకు 17 ఫిర్యాదులు ఉన్నాయి. మీరు ఈ నంబర్ ను వాడుతున్నారా?
బాధితుడు: నేను దీన్ని వాడను సార్.
ఫ్రాడ్ కాలర్ 1: మీరు ఇప్పుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
బాధితుడు: సార్.. కర్ణాటక సార్.. నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను సార్.
ఫ్రాడ్ కాలర్ 1: సరే. మన స్టేట్మెంట్ను రికార్డ్ చేద్దాం. మీరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా ఈ నంబర్ ను బ్లాక్ చేయవచ్చు.
బాధితుడు: సరే సార్...
ఫ్రాడ్ కాలర్ 1: నేను ఇప్పుడు మిమ్మల్ని మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో కనెక్ట్ చేస్తున్నాను. ఈ నంబర్ ను బ్లాక్ చేసేందుకు మీ స్టేట్మెంట్ను రికార్డ్ చేయండి.
బాధితుడు: సరే సార్...
ఫ్రాడ్ కాలర్ 1: అవును.. చెప్పండి... మీరు ఎవరు? మీ ఆధార్ కార్డును నాకు చూపించండి.. వెరిఫై చేయడానికి నాకు తెలియజేయండి.
బాధితుడు: సార్… నా దగ్గర ఇప్పుడు ఆధార్ కార్డు లేదు.. ప్లీజ్ సార్.
ఫ్రాడ్ కాలర్ 1: ఫోన్లో.. అది మీ ఫోన్లో ఉందా?
బాధితుడు: లేదు సార్
ఫ్రాడ్ కాలర్ 1: మీ ఫోన్లో ఆధార్ కార్డ్ ఫోటో లేదా?
బాధితుడు: లేదు సార్
ఫ్రాడ్ కాలర్ 1: మీకు నెంబర్ గుర్తుందా?
బాధితుడు: సార్.. లేదు సార్.. నంబర్ కూడా గుర్తు లేదు సార్.
ఫ్రాడ్ కాలర్ 1: మేం కేవలం వెరిఫై చేయాలి. వెరిఫై చేసేందుకు కావాలి.
బాధితుడు: లేదు సార్
ఫ్రాడ్ కాలర్ 1: భయపడొద్దు... భయపడొద్దు... మీరు ఏమీ చేయకపోతే భయపడొద్దు.
బాధితుడు: సరే సార్, సరే సార్
ఫ్రాడ్ కాలర్ 1: మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటే, వెరిఫై చేయడానికి నాకు చూపించండి.
బాధితుడు: లేదు సార్, లేదు సార్. నేను ఊరికి వచ్చాను సార్. ఆధార్ కార్డు ఇంట్లో ఉంది సార్..
ఫ్రాడ్ కాలర్ 1: ఓకే..
రెండో గొంతు: మే ఐ కమ్ ఇన్ సార్
ఫ్రాడ్ కాలర్ 1: కమ్ ఇన్
ఫ్రాడ్ కాలర్ 2: జై హింద్
ఫ్రాడ్ కాలర్ 1: జై హింద్
ఫ్రాడ్ కాలర్ 1: ప్రోటోకాల్ ప్రకారం ఇతని వన్ సైడెడ్ వీడియో కాల్ రికార్డ్ చేయండి. ఓకే?
ఈ ఆడియో కేవలం సమాచారం కోసం మాత్రమే కాదు. ఇది వినోదం కలిగించే ఆడియో కాదు. ఈ ఆడియో తీవ్రమైన ఆందోళనతో వచ్చింది. మీరు ఇప్పుడే విన్న సంభాషణ డిజిటల్ అరెస్ట్ మోసంపై ఉంది. ఈ సంభాషణ బాధితుడికి, మోసగాడికి మధ్య జరిగింది. డిజిటల్ అరెస్ట్ మోసంలో కాలర్లు కొన్నిసార్లు పోలీసులుగా, కొన్నిసార్లు సీబీఐ అధికారులుగా, కొన్నిసార్లు నార్కోటిక్స్ అధికారులుగా, కొన్నిసార్లు రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా వేర్వేరు హోదాలను పెట్టుకుని, మాట్లాడతారు. చాలా నమ్మకంతో చేస్తారు. చాలా మంది ‘మన్ కీ బాత్’ శ్రోతలు ఈ విషయాన్ని ఖచ్చితంగా చర్చించాలని నాతో అన్నారు. ఈ మోసం ముఠా ఎలా పని చేస్తుందో, ఈ ప్రమాదకరమైన ఆట ఏమిటో నేను మీకు చెప్తాను. మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇతరులకు అర్థం చేయించడం కూడా అంతే ముఖ్యం. మొదటి ఉపాయం - మీ వ్యక్తిగత సమాచారం అంతటినీ వారు సేకరిస్తారు. “మీరు గత నెలలో గోవా వెళ్లారు. కదా? మీ అమ్మాయి ఢిల్లీలో చదువుతుంది కదా?” ఇలా వారు మీ గురించి చాలా సమాచారాన్ని సేకరిస్తారు. మీరు ఆశ్చర్యపోయేలా సమాచారాన్ని సేకరిస్తారు. రెండవ ఉపాయం – భయానక వాతావరణాన్ని సృష్టించడం. యూనిఫాం, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, చట్టపరమైన విభాగాలు, అవి మిమ్మల్ని ఎంతగా భయపెడతాయంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించలేరు. ఆపై వారి మూడవ ఉపాయం ప్రారంభమవుతుంది. మూడవ ఉపాయం - సమయం ఒత్తిడి. 'మీరు ఇప్పుడు నిర్ణయించుకోవాలి. లేకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవలసి ఉంటుంది' -ఇలా ఈ వ్యక్తులు బాధితులు భయపడేంతగా చాలా మానసిక ఒత్తిడిని కలిగిస్తారు. డిజిటల్ అరెస్ట్ బాధితుల్లో ప్రతి వర్గం, ప్రతి వయో బృందంలోనివారు ఉన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించిన లక్షల రూపాయలను భయంతో నష్టపోయారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి కాల్ వస్తే భయపడాల్సిన పనిలేదు. ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలాంటి విచారణలు చేయదని మీరు తెలుసుకోవాలి. డిజిటల్ భద్రత లోని మూడు దశలను నేను మీకు చెప్తాను. ఈ మూడు దశలు – ‘వేచి ఉండండి- ఆలోచించండి- చర్య తీసుకోండి’ కాల్ వస్తే 'వేచి ఉండండి'. భయాందోళనలకు గురికాకండి. ప్రశాంతంగా ఉండండి. తొందరపాటుతో ఎటువంటి పనులూ చేయకండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని రికార్డింగ్ చేయండి. దీని తరువాత రెండవ దశ. మొదటి దశ వేచి చూడడం. రెండో దశ ఆలోచించడం. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్లో ఇలాంటి బెదిరింపులు చేయదు. వీడియో కాల్ల ద్వారా విచారణ చేయదు. ఇలా డబ్బులు డిమాండ్ చేయదు. మీకు భయం అనిపిస్తే ఏదో పొరపాటు జరిగిందని అర్థం చేసుకోండి. మొదటి దశ, రెండవ దశ తర్వాత ఇప్పుడు నేను మూడవ దశ గురించి చెప్తాను. మొదటి దశలో నేను చెప్పాను ‘వేచి చూడండి’ అని. రెండవ దశలో ‘ఆలోచించండి’. మూడవ దశలో – ‘చర్య తీసుకోండి’. జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కి డయల్ చేయండి. cybercrime.gov.inలో రిపోర్ట్ చేయండి. మీ కుటుంబానికి, పోలీసులకు తెలియజేయండి. సాక్ష్యాలను భద్రపరచండి. 'వేచి ఉండండి', 'ఆలోచించండి', ఆపై 'చర్య తీసుకోండి’. ఈ మూడు దశలు మీ డిజిటల్ భద్రతకు రక్షణగా మారతాయి.
మిత్రులారా! చట్టంలో డిజిటల్ అరెస్ట్ లాంటి వ్యవస్థ లేదని మరోసారి చెప్తున్నాను. ఇది కేవలం మోసం, వంచన, అబద్ధం. ఇది దుష్టుల ముఠా చేసే పని. ఇలా చేస్తున్న వారు సమాజానికి శత్రువులని మళ్ళీ చెప్తున్నాను. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో దర్యాప్తు సంస్థలన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఈ ఏజెన్సీల మధ్య సమన్వయం కోసం నేషనల్ సైబర్ కో-ఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు జరిగింది. ఇలాంటి మోసాలకు పాల్పడిన వేలాది వీడియో కాలింగ్ ఐడీలను దర్యాప్తు సంస్థలు బ్లాక్ చేశాయి. లక్షలాది సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు కూడా బ్లాక్ అయ్యాయి. ఏజెన్సీలు తమ పనిని చేస్తున్నాయి. కానీ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలను నివారించడానికి చాలా ముఖ్యమైంది - ప్రతి ఒక్కరికీ అవగాహన, ప్రతి పౌరునికీ అవగాహన. ఈ రకమైన సైబర్ మోసాలకు గురైన వ్యక్తులు దాని గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలి. అవగాహన కోసం మీరు #SafeDigitalIndia ను ఉపయోగించవచ్చు. సైబర్ స్కామ్‌కు వ్యతిరేకంగా ప్రచారంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయవలసిందిగా పాఠశాలలు, కళాశాలలను కూడా నేను కోరుతున్నాను. సమాజంలోని ప్రతి ఒక్కరి కృషితోనే మనం ఈ సవాలును ఎదుర్కోగలం.
నా ప్రియమైన దేశప్రజలారా! మన పాఠశాల పిల్లల్లో చాలా మంది కాలిగ్రఫీపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. దీని ద్వారా మన చేతిరాత శుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. నేడు జమ్మూ-కాశ్మీర్లో స్థానిక సంస్కృతిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. అక్కడి అనంతనాగ్‌కు చెందిన ఫిర్దౌసా బషీర్ గారికి కాలిగ్రఫీలో నైపుణ్యం ఉంది. దీని ద్వారా స్థానిక సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలను ముందుకు తీసుకువస్తున్నారు. ఫిర్దౌసా గారి కాలిగ్రఫీ స్థానిక ప్రజలను, ముఖ్యంగా యువతను ఆకర్షిస్తోంది. ఉదంపూర్‌కు చెందిన గోరీనాథ్ గారు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఒక శతాబ్దానికి పైగా పురాతనమైన సారంగి ద్వారా డోగ్రా సంస్కృతి, వారసత్వ వివిధ రూపాలను సంరక్షించడంలో ఆయన నిమగ్నమై ఉన్నారు. సారంగి రాగాలతో పాటు తమ సంస్కృతికి సంబంధించిన పురాతన కథలు, చారిత్రక సంఘటనలను ఆసక్తికరంగా చెప్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చిన ఇలాంటి అసాధారణ వ్యక్తులు చాలా మందిని మీరు కలుస్తారు. డి.వైకుంఠం దాదాపు 50 సంవత్సరాలుగా చేర్యాల్ జానపద కళను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన ఈ కళను ముందుకు తీసుకెళ్ళడంలో ఆయన కృషి అద్భుతం. చేర్యాల్ పెయింటింగ్స్ సిద్ధం చేసే విధానం చాలా ప్రత్యేకమైంది. ఇది స్క్రోల్ రూపంలో కథలను ముందుకు తెస్తుంది. ఇందులో మన చరిత్ర, పురాణాల పూర్తి సంగ్రహావలోకనం లభిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌కు చెందిన బుట్లూరామ్ మాత్రాజీ అబూజ్ మాడియా తెగకు చెందిన జానపద కళలను సంరక్షించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆయన గత నాలుగు దశాబ్దాలుగా ఈ పనిలో ఉన్నారు. 'బేటీ బచావో-బేటీ పడావో', 'స్వచ్చ భారత్' వంటి ప్రచారాలతో ప్రజలను అనుసంధానించడంలో కూడా ఆయన కళ చాలా ప్రభావవంతంగా ఉంది.
మిత్రులారా! కాశ్మీర్‌లోని లోయల నుండి ఛత్తీస్‌గఢ్ అడవుల వరకు మన కళలు, సంస్కృతి ఎలా కొత్త రూపంలో విస్తరిస్తున్నాయో ఇప్పుడే మాట్లాడుకున్నాం. అయితే ఈ విషయం ఇక్కడితో ముగియదు. మన ఈ కళల పరిమళం అంతటా వ్యాపిస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు భారతీయ కళలు, సంస్కృతిని చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ఉధంపూర్‌లో ప్రతిధ్వనించే సారంగి గురించి చెబుతున్నప్పుడు వేల మైళ్ల దూరంలో ఉన్న రష్యాలోని యాకూత్స్క్ నగరంలో భారతీయ కళల మధురమైన రాగం ప్రతిధ్వనించడం నాకు గుర్తుకు వచ్చింది. ఊహించుకోండి… చలికాలం ఒకటిన్నర రోజులు, మైనస్ 65 డిగ్రీల ఉష్ణోగ్రత, చుట్టూ తెల్లటి మంచు దుప్పటి, అక్కడి థియేటర్లో కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శీతల నగరమైన యాకూత్స్క్ లో భారతీయ సాహిత్యం వెచ్చదనాన్ని మీరు ఊహించగలరా? ఇది ఊహ కాదు కానీ నిజం. మనందరినీ గర్వం, ఆనందంతో నింపే సత్యం.
మిత్రులారా! కొన్ని వారాల క్రితం నేను లావోస్ కు వెళ్ళాను. అది నవరాత్రి సమయం. అక్కడ నేను ఒక అద్భుతాన్ని చూశాను. స్థానిక కళాకారులు "ఫలక్ ఫలం" అనే 'లావోస్ రామాయణం' ప్రదర్శించారు. రామాయణం పట్ల మనకున్న అంకితభావమే వారి కళ్లలో శక్తిగా, వారి స్వరంలో సమర్పణా భావంగా కనబడింది. అదేవిధంగా కువైట్‌లో అబ్దుల్లా అల్-బారూన్ గారు రామాయణ మహాభారతాలను అరబిక్ భాషలోకి అనువదించారు. ఈ రచన కేవలం అనువాదం మాత్రమే కాదు- రెండు గొప్ప సంస్కృతుల మధ్య వారధి. ఆయన ప్రయత్నాలు అరబ్ ప్రపంచంలో భారతీయ సాహిత్యంపై కొత్త అవగాహనను పెంచుతున్నాయి. మరొక స్ఫూర్తిదాయక ఉదాహరణ పెరూకు చెందిన ఎర్లిందా గార్సియా అక్కడి యువతకు భరతనాట్యం నేర్పుతున్నారు. మరియా వాల్దెజ్ ఒడిస్సీ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ కళల ప్రభావంతో 'భారతీయ శాస్త్రీయ నృత్యం' దక్షిణ అమెరికాలోని అనేక దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది.
మిత్రులారా! విదేశీ గడ్డపై భారతదేశానికి చెందిన ఈ ఉదాహరణలు భారతీయ సంస్కృతి శక్తి ఎంత అద్భుతమైందో చూపిస్తాయి. ఈ శక్తి నిరంతరం ప్రపంచాన్ని తనవైపు ఆకర్షిస్తూనే ఉంటుంది.
"ఎక్కడెక్కడ కళ ఉంటుందో అక్కడక్కడ భారతదేశం ఉంటుంది."
"సంస్కృతి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ భారతదేశం ఉంటుంది"
నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. భారతదేశ ప్రజలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి మీ అందరికి ఒక విన్నపం... మీ చుట్టూ ఉన్న ఇలాంటి సాంస్కృతిక అంశాలను #CulturalBridges తో పంచుకోండి. అలాంటి ఉదాహరణలను మనం ‘మన్ కీ బాత్’లో మరింత చర్చిస్తాం.
నా ప్రియమైన దేశప్రజలారా! దేశంలోని చాలా ప్రాంతాల్లో చలికాలం మొదలైంది. అయితే ఫిట్నెస్ పై అభిరుచి, ఫిట్ ఇండియా స్ఫూర్తి విషయంలో ఏ వాతావరణానికీ తేడా లేదు. ఫిట్‌గా ఉండే అలవాటు ఉన్నవారు చలి, వేడి, వర్షం గురించి పట్టించుకోరు. భారతదేశంలోని ప్రజలు ఇప్పుడు ఫిట్నెస్ గురించి మరింత అవగాహన పెంచుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీ చుట్టుపక్కల ఉన్న పార్కుల్లో ప్రజల సంఖ్య పెరుగుతుండటం కూడా మీరు గమనిస్తూ ఉండాలి. పార్కులో షికారు చేసే వృద్ధులు, యువకులు, యోగా చేసే కుటుంబ సభ్యులను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకు గుర్తుంది- నేను యోగా దినోత్సవం రోజున శ్రీనగర్‌లో ఉన్నప్పుడు వర్షం ఉన్నప్పటికీ చాలా మంది 'యోగా' కోసం ఒక్కచోటికి చేరారు. కొద్దిరోజుల క్రితం శ్రీనగర్‌లో జరిగిన మారథాన్‌లో కూడా ఫిట్‌గా ఉండేందుకు ఇదే ఉత్సాహం కనిపించింది. ఈ ఫిట్ ఇండియా భావన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారుతోంది.
మిత్రులారా! మన పాఠశాలలు ఇప్పుడు పిల్లల ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ చూపడం చూసి నేను కూడా సంతోషిస్తున్నాను. ఫిట్ ఇండియా స్కూల్ అవర్స్ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం. వివిధ ఫిట్నెస్ కార్యకలాపాల కోసం పాఠశాలలు తమ మొదటి పీరియడ్‌ని ఉపయోగిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో కొన్ని రోజులు పిల్లలతో యోగా చేయిస్తారు. కొన్ని రోజులు ఏరోబిక్స్ సెషన్లు ఉంటాయి. కొన్ని రోజులు క్రీడా నైపుణ్యాలను పెంచే పని చేస్తారు. కొన్ని రోజులు ఖో-ఖో, కబడ్డీ వంటి సాంప్రదాయిక ఆటలను ఆడుతున్నారు. దాని ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. హాజరు మెరుగుపడుతుంది. పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లలు కూడా సరదాగా ఉంటారు.
మిత్రులారా! నేను ఈ వెల్నెస్ శక్తిని ప్రతిచోటా చూస్తున్నాను. చాలా మంది ‘మన్ కీ బాత్’ శ్రోతలు తమ అనుభవాలను కూడా నాకు పంపారు. కొంతమంది చాలా ఆసక్తికరమైన ప్రయోగాలు చేస్తున్నారు. వీటిలో ఒక ఉదాహరణ ఫ్యామిలీ ఫిట్నెస్ అవర్. అంటే కుటుంబ ఫిట్నెస్ యాక్టివిటీ కోసం ప్రతి వారాంతంలో కుటుంబాలు ఒక గంట కేటాయిస్తున్నాయి. మరో ఉదాహరణ స్వదేశీ ఆటల పునరుద్ధరణ. అంటే కొన్ని కుటుంబాలు తమ పిల్లలకు సాంప్రదాయిక ఆటలను నేర్పిస్తున్నాయి. మీరు మీ ఫిట్నెస్ రొటీన్ అనుభవాన్ని తప్పనిసరిగా #fitIndia పేరుతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. నేను దేశ ప్రజలకు ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందించాలనుకుంటున్నాను. ఈసారి దీపావళి పండుగ సర్దార్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 న వస్తోంది. మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న "జాతీయ ఐక్యతా దినోత్సవం" రోజున 'రన్ ఫర్ యూనిటీ'ని నిర్వహిస్తాం. ఈసారి దీపావళి కారణంగా అక్టోబర్ 29వ తేదీన అంటే మంగళవారంనాడు ‘రన్ ఫర్ యూనిటీ’ జరుగుతుంది. ఇందులో అత్యధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. జాతీయ ఐక్యత మంత్రంతో పాటు ఫిట్నెస్ మంత్రాన్ని ప్రతిచోటా వ్యాప్తి చేయండి.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్'లో ఈ సారి ఇంతే! మీరు మీ అభిప్రాయాలను పంపుతూ ఉండండి. ఇది పండుగల కాలం. ధన్ తేరస్, దీపావళి, ఛత్ పూజ, గురునానక్ జయంతి - అన్ని పండుగల సందర్భంగా ‘మన్ కీ బాత్’ శ్రోతలకు శుభాకాంక్షలు. మీరందరూ పండుగలను పూర్తి ఉత్సాహంతో జరుపుకోవాలి. వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని గుర్తుంచుకోండి. పండుగల సమయంలో స్థానిక దుకాణదారుల నుండి కొనుగోలు చేసిన వస్తువులు మీ ఇంటికి వచ్చేలా చూసుకోండి. రాబోయే పండుగల సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. నా జీవితంలో మరపురాని క్షణాలేవని మీరు నన్ను అడిగితే చాలా సంఘటనలు గుర్తుకు వస్తాయి. కానీ చాలా ప్రత్యేకమైన మరపురాని ఒక క్షణం ఉంది- అది గత సంవత్సరం నవంబర్ 15 వ తేదీన జరిగింది. ఆరోజు నేను భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్‌లోని ఆయన జన్మస్థలమైన ఉలిహాతు గ్రామానికి వెళ్ళాను. ఈ యాత్ర నాపై చాలా ప్రభావం చూపింది. ఈ పుణ్యభూమి మట్టిని తలతో తాకే భాగ్యం పొందిన దేశ తొలి ప్రధానమంత్రిని నేనే. ఆ క్షణంలో స్వాతంత్య్ర పోరాటంలో ఉన్న శక్తి తెలిసిరావడమే కాకుండా ఈ భూ శక్తితో అనుసంధానమయ్యే అవకాశం కూడా వచ్చింది. ఒక సంకల్పాన్ని నెరవేర్చేందుకు చేసే సాహసం దేశంలోని కోట్లాది ప్రజల భవిష్యత్తును ఎలా మార్చగలదో నేను గ్రహించాను.
మిత్రులారా! భారతదేశం ప్రతి యుగంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంది. ప్రతి యుగంలో ఈ సవాళ్లను ఎదుర్కొనే అసాధారణ భారతీయులు జన్మించారు. నేటి 'మన్ కీ బాత్'లో ధైర్యం, దూరదృష్టి ఉన్న ఇద్దరు మహానాయకుల గురించి చర్చిస్తాను. వారి 150వ జయంతి ఉత్సవాలను జరుపుకోవాలని దేశం నిర్ణయించింది. అక్టోబర్ 31వ తేదీన సర్దార్ పటేల్ 150వ జయంతి సంవత్సరం ప్రారంభమవుతుంది. దీని తరువాత భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి సంవత్సరం నవంబర్ 15వ తేదీన మొదలవుతుంది. ఈ మహానుభావులు ఇద్దరూ వేర్వేరు సవాళ్లను ఎదుర్కొన్నారు. అయితే ఇద్దరి దృక్కోణం దేశ సమైక్యతే.
మిత్రులారా! గడిచిన సంవత్సరాల్లో దేశం మహానాయకుల జయంతిని కొత్త శక్తితో జరుపుకోవడం ద్వారా కొత్త తరానికి కొత్త స్ఫూర్తిని ఇచ్చింది. మనం మహాత్మా గాంధీ 150వ జయంతిని ఎంత ప్రత్యేకంగా జరుపుకున్నామో మీకు గుర్తుండే ఉంటుంది. న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ నుండి ఆఫ్రికాలోని చిన్న గ్రామాల వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశ సత్యం, అహింసల సందేశాన్ని అర్థం చేసుకున్నారు. తిరిగి తెలుసుకున్నారు. అలాగే జీవించారు. యువకుల నుండి వృద్ధుల వరకు, భారతీయుల నుండి విదేశీయుల వరకు ప్రతి ఒక్కరూ గాంధీజీ బోధనలను కొత్త సందర్భంలో అర్థం చేసుకున్నారు. కొత్త ప్రపంచ పరిస్థితుల్లో వాటిని తెలుసుకున్నారు. మనం స్వామి వివేకానంద 150వ జయంతిని జరుపుకున్నప్పుడు దేశ యువత భారతదేశ ఆధ్యాత్మిక, సాంస్కృతిక శక్తిని కొత్త పరిభాషలో అర్థం చేసుకుంది. మన గొప్ప వ్యక్తులు మరణించినంత మాత్రాన వారి ప్రభావం కోల్పోలేదని, వారి జీవితాలు మన వర్తమానాన్ని భవిష్యత్తుకు మార్గాన్ని చూపుతుందన్న భరోసా వీటివల్ల ఏర్పడుతుంది.
మిత్రులారా! ఈ మహనీయుల 150వ జయంతి ఉత్సవాలను జాతీయ స్థాయిలో నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మీ భాగస్వామ్యం మాత్రమే ఈ ప్రచారానికి జీవం పోస్తుంది. ఈ ఉత్సవాలకు జీవం అందిస్తుంది. ఈ ప్రచారంలో మీరందరూ భాగస్వాములు కావాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఉక్కు మనిషి సర్దార్ పటేల్‌కి సంబంధించిన మీ ఆలోచనలను, కార్యక్రమాలను # సర్దార్150 తో పంచుకోండి. #బిర్సాముండా150తో బిర్సా ముండా స్ఫూర్తిని ప్రపంచానికి అందించండి. మనం కలసికట్టుగా ఈ ఉత్సవాలను భిన్నత్వంలో భారతదేశ ఏకత్వాన్ని చాటేవిధంగా, గొప్ప వారసత్వాన్ని వికాస ఉత్సవంగా జరుగపుకుందాం.
నా ప్రియమైన దేశవాసులారా! ‘ఛోటా భీమ్’ టీవీలో కనిపించడం ప్రారంభించిన ఆ రోజులను మీరు తప్పక గుర్తుంచుకోవాలి. ‘ఛోటా భీమ్’ అంటే ఎంత ఉత్కంఠ ఉండేదో పిల్లలు ఎప్పటికీ మర్చిపోలేరు. ఈ రోజు ఢోలక్ పూర్ డోలు భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల పిల్లలను కూడా ఆకర్షిస్తుంది అంటే మీరు ఆశ్చర్యపోతారు. అలాగే మన ఇతర యానిమేషన్ సీరియళ్లు ‘కృష్ణ’, ‘హనుమాన్’, ‘మోటు-పత్లు’లకు కూడా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. భారతీయ యానిమేషన్ పాత్రలు, ఇక్కడి యానిమేషన్ సినిమాలు వాటి కంటెంట్, సృజనాత్మకత కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజల మక్కువను చూరగొంటున్నాయి. స్మార్ట్‌ఫోన్ నుండి సినిమా స్క్రీన్ వరకు, గేమింగ్ కన్సోల్ నుండి వర్చువల్ రియాలిటీ వరకు యానిమేషన్ ప్రతిచోటా ఉంటుందని మీరు తప్పక చూసి ఉంటారు. యానిమేషన్ ప్రపంచంలో భారత్ సరికొత్త విప్లవం దిశగా అడుగులు వేస్తోంది. భారతదేశ గేమింగ్ స్పేస్ కూడా వేగంగా విస్తరిస్తోంది. ఈ రోజుల్లో భారతీయ ఆటలు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. కొన్ని నెలల క్రితం నేను భారతదేశంలోని ప్రముఖ గేమర్లను కలిశాను. అప్పుడు భారతీయ గేమ్‌ల అద్భుతమైన సృజనాత్మకత, నాణ్యతను తెలుసుకునే, అర్థం చేసుకునే అవకాశం నాకు లభించింది. నిజానికి దేశంలో సృజనాత్మక శక్తి తరంగం నడుస్తోంది. యానిమేషన్ ప్రపంచంలో ‘మేడ్ ఇన్ ఇండియా’, ‘మేడ్ బై ఇండియన్స్’ ప్రబలంగా ఉన్నాయి. నేడు భారతీయ ప్రతిభ కూడా విదేశీ నిర్మాణాలలో కూడా ముఖ్యమైన భాగంగా మారుతున్నదని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ప్రస్తుత స్పైడర్ మ్యాన్ అయినా, ట్రాన్స్ఫార్మర్స్ అయినా ఈ రెండు సినిమాల్లో హరినారాయణ్ రాజీవ్ అందించిన సహకారానికి ప్రజల ప్రశంసలు లభించాయి. భారతదేశ యానిమేషన్ స్టూడియోలు డిస్నీ, వార్నర్ బ్రదర్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాత నిర్మాణ సంస్థలతో కలిసి పని చేస్తున్నాయి.
మిత్రులారా! నేడు మన యువత అసలైన భారతీయ కంటెంట్‌ను సిద్ధం చేస్తోంది. మన సంస్కృతికి ప్రతిబింబమైన ఇవి ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తున్నాయి. ఇతర పరిశ్రమలకు బలాన్ని ఇచ్చే స్థాయిలో యానిమేషన్ రంగం నేడు పరిశ్రమ రూపాన్ని సంతరించుకుంది. ఈ రోజుల్లో వీఆర్ టూరిజం చాలా ప్రసిద్ధి చెందుతోంది. మీరు వర్చువల్ యాత్ర ద్వారా అజంతా గుహలను చూడవచ్చు. కోణార్క్ మందిర ఆవరణలో షికారు చేయవచ్చు. లేదా వారణాసి ఘాట్లను ఆస్వాదించవచ్చు. ఈ వీఆర్ యానిమేషన్లన్నీ భారతీయులు సృష్టించినవే. వీఆర్ ద్వారా ఈ స్థలాలను చూసిన తర్వాత చాలా మంది ఈ పర్యాటక ప్రదేశాలను వాస్తవంగా సందర్శించాలని కోరుకుంటారు. అంటే పర్యాటక గమ్యస్థానాల వర్చువల్ టూర్ ప్రజల మనస్సుల్లో ఉత్సుకతను సృష్టించడానికి ఒక మాధ్యమంగా మారింది. నేడు ఈ రంగంలో యానిమేటర్లతో పాటు స్టోరీ టెల్లర్లు, రచయితలు, వాయిస్ ఓవర్ నిపుణులు, సంగీతకారులు, గేమ్ డెవలపర్లు, వర్చువల్ రియాలిటీ- ఆగ్మెంటెడ్ రియాలిటీ నిపుణులకు కూడా డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. కాబట్టి సృజనాత్మకతను పెంచుకోవాలని నేను భారతదేశ యువతకు చెప్తాను. ఎవరికి తెలుసు- ప్రపంచంలోని తర్వాతి సూపర్ హిట్ యానిమేషన్ మీ కంప్యూటర్ నుండే రావచ్చేమో! తర్వాతి వైరల్ గేమ్ మీ సృష్టే కావచ్చు! విద్యాపరమైన యానిమేషన్లలో మీ ఆవిష్కరణ గొప్ప విజయాన్ని సాధించగలదు. ‘వరల్డ్ యానిమేషన్ డే’ కూడా ఈ అక్టోబర్ 28 వ తేదీన అంటే రేపు జరుపుకుంటున్నాం. రండి.... భారతదేశాన్ని ప్రపంచ యానిమేషన్ పవర్ హౌస్‌గా మార్చాలని సంకల్పిద్దాం.
నా ప్రియమైన దేశప్రజలారా! స్వామి వివేకానంద ఒకప్పుడు విజయ మంత్రాన్ని అందించారు. 'ఒక ఆలోచన తీసుకోండి. ఆ ఆలోచనను మీ జీవితంగా చేసుకోండి. దాని గురించి ఆలోచించండి. దాని గురించి కలలుగనండి. జీవించడం ప్రారంభించండి.’ అనే ఆ విజయ మంత్రం ఆధారంగా ఆత్మ నిర్భర్ భారత్ విజయం కూడా కొనసాగుతోంది. ఈ ప్రచారం మన సామూహిక చైతన్యంలో భాగమైంది. అడుగడుగునా నిరంతరం మనకు స్ఫూర్తిగా నిలిచింది. స్వావలంబన మన విధానం మాత్రమే కాదు- అది మన అభిరుచిగా మారింది. చాలా సంవత్సరాలు కాలేదు- భారతదేశంలో సంక్లిష్టమైన సాంకేతికత అభివృద్ధి చెందుతుందని పదేళ్ల కిందట ఎవరైనా చెప్తే చాలా మంది నమ్మేవారు కాదు. చాలా మంది అపహాస్యం చేసేవారు. కానీ ఈ రోజు దేశ విజయాలను చూసి వారే ఆశ్చర్యపోతున్నారు. స్వయం సమృద్ధి పొందిన తర్వాత భారతదేశం ప్రతి రంగంలో అద్భుతాలు చేస్తోంది. ఒక్కసారి ఊహించుకోండి- ఒకప్పుడు మొబైల్ ఫోన్ల దిగుమతిదారుగా ఉన్న భారతదేశం నేడు ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద తయారీదారుగా మారింది. ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యధికంగా రక్షణ పరికరాల కొనుగోలుదారుగా ఉన్న భారతదేశం ఇప్పుడు 85 దేశాలకు కూడా ఎగుమతి చేస్తోంది. అంతరిక్ష సాంకేతికతలో ఈ రోజు భారతదేశం చంద్రుని దక్షిణ ధృవాన్ని చేరుకున్న మొదటి దేశంగా మారింది. నాకు చాలా నచ్చిన విషయం ఏమిటంటే ఈ స్వావలంబన ప్రచారం ఇకపై కేవలం ప్రభుత్వ ప్రచారం కాదు- ఇప్పుడు స్వయం ఆధారిత భారతదేశ ప్రచారం ప్రజల ప్రచార ఉద్యమంగా మారుతోంది. ప్రతి రంగంలో దేశం విజయాలు సాధిస్తోంది. ఉదాహరణకు ఈ నెలలో లద్దాక్ లోని హాన్లేలో ఆసియాలోనే అతిపెద్ద ఇమేజింగ్ టెలిస్కోప్ MACEను కూడా ప్రారంభించాం. ఇది 4300 మీటర్ల ఎత్తులో ఉంది. అందులో విశేషమేంటో తెలుసుకుందాం! ఇది భారతదేశ తయారీ- ‘మేడ్ ఇన్ ఇండియా’. మైనస్ 30 డిగ్రీల చల్లటి వాతావరణం ఉన్న ప్రదేశంలో- ఆక్సిజన్ కొరత కూడా ఉన్న ప్రదేశంలో- మన శాస్త్రవేత్తలతో పాటు స్థానిక పరిశ్రమలు ఆసియాలో మరే దేశం చేయని పనిని చేశాయి. హాన్లే టెలిస్కోప్ సుదూర ప్రపంచాన్ని చూస్తూ ఉండవచ్చు. అది మనకు మరొక విషయాన్ని కూడా చూపుతోంది – అది స్వయం సమృద్ధ భారతదేశ సామర్థ్యం.
మిత్రులారా! మీరు కూడా ఒక పని చేయాలని నేను కోరుకుంటున్నాను. భారతదేశం స్వయం సమృద్ధంగా మారడానికి దోహదపడే ప్రయత్నాలకు వీలైనన్ని ఎక్కువ ఉదాహరణలను పంచుకోండి. మీ పరిసరాల్లో మీరు చూసిన కొత్త ఆవిష్కరణ, మీ ప్రాంతంలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న స్థానిక స్టార్ట్-అప్- ఇలాంటి విశేషాలను #AatmanirbharInnovationతో సోషల్ మీడియాలో రాయండి. స్వావలంబన భారతదేశ ఉత్సవాలు నిర్వహించండి. ఈ పండుగ సీజన్ లో మనమందరం స్వావలంబన భారతదేశ ప్రచారాన్ని మరింత బలోపేతం చేద్దాం. వోకల్ ఫర్ లోకల్ అనే మంత్రంతో మనం మన షాపింగ్ చేద్దాం. ఇది అసాధ్యం కేవలం సవాలుగా ఉన్న నవీన భారతదేశం. ఇక్కడ మేక్ ఇన్ ఇండియా ఇప్పుడు మేక్ ఫర్ ది వరల్డ్‌గా మారింది. ఇక్కడ ప్రతి పౌరుడు ఒక ఆవిష్కర్త. ఇక్కడ ప్రతి సవాలు ఒక అవకాశం. మనం భారతదేశాన్ని స్వయం సమృద్ధంగా మార్చడమే కాకుండా మన దేశాన్ని ప్రపంచవ్యాప్త ఆవిష్కరణల శక్తి కేంద్రంగా బలోపేతం చేయాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! మీ కోసం ఒక ఆడియోను వినిపిస్తాను.
(ఆడియో)
ఫ్రాడ్ కాలర్ 1: హలో
బాధితుడు: సార్… నమస్కారం సార్.
ఫ్రాడ్ కాలర్ 1: నమస్తే
బాధితుడు: సార్... చెప్పండి సార్
ఫ్రాడ్ కాలర్ 1: మీరు నాకు పంపిన ఈ FIR నంబర్‌ను చూడండి.. ఈ నంబర్‌పై మాకు 17 ఫిర్యాదులు ఉన్నాయి. మీరు ఈ నంబర్ ను వాడుతున్నారా?
బాధితుడు: నేను దీన్ని వాడను సార్.
ఫ్రాడ్ కాలర్ 1: మీరు ఇప్పుడు ఎక్కడి నుండి మాట్లాడుతున్నారు?
బాధితుడు: సార్.. కర్ణాటక సార్.. నేను ఇప్పుడు ఇంట్లో ఉన్నాను సార్.
ఫ్రాడ్ కాలర్ 1: సరే. మన స్టేట్మెంట్ను రికార్డ్ చేద్దాం. మీరు భవిష్యత్తులో ఎటువంటి సమస్యలను ఎదుర్కోకుండా ఈ నంబర్ ను బ్లాక్ చేయవచ్చు.
బాధితుడు: సరే సార్...
ఫ్రాడ్ కాలర్ 1: నేను ఇప్పుడు మిమ్మల్ని మీ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ తో కనెక్ట్ చేస్తున్నాను. ఈ నంబర్ ను బ్లాక్ చేసేందుకు మీ స్టేట్మెంట్ను రికార్డ్ చేయండి.
బాధితుడు: సరే సార్...
ఫ్రాడ్ కాలర్ 1: అవును.. చెప్పండి... మీరు ఎవరు? మీ ఆధార్ కార్డును నాకు చూపించండి.. వెరిఫై చేయడానికి నాకు తెలియజేయండి.
బాధితుడు: సార్… నా దగ్గర ఇప్పుడు ఆధార్ కార్డు లేదు.. ప్లీజ్ సార్.
ఫ్రాడ్ కాలర్ 1: ఫోన్లో.. అది మీ ఫోన్లో ఉందా?
బాధితుడు: లేదు సార్
ఫ్రాడ్ కాలర్ 1: మీ ఫోన్లో ఆధార్ కార్డ్ ఫోటో లేదా?
బాధితుడు: లేదు సార్
ఫ్రాడ్ కాలర్ 1: మీకు నెంబర్ గుర్తుందా?
బాధితుడు: సార్.. లేదు సార్.. నంబర్ కూడా గుర్తు లేదు సార్.
ఫ్రాడ్ కాలర్ 1: మేం కేవలం వెరిఫై చేయాలి. వెరిఫై చేసేందుకు కావాలి.
బాధితుడు: లేదు సార్
ఫ్రాడ్ కాలర్ 1: భయపడొద్దు... భయపడొద్దు... మీరు ఏమీ చేయకపోతే భయపడొద్దు.
బాధితుడు: సరే సార్, సరే సార్
ఫ్రాడ్ కాలర్ 1: మీ దగ్గర ఆధార్ కార్డ్ ఉంటే, వెరిఫై చేయడానికి నాకు చూపించండి.
బాధితుడు: లేదు సార్, లేదు సార్. నేను ఊరికి వచ్చాను సార్. ఆధార్ కార్డు ఇంట్లో ఉంది సార్..
ఫ్రాడ్ కాలర్ 1: ఓకే..
రెండో గొంతు: మే ఐ కమ్ ఇన్ సార్
ఫ్రాడ్ కాలర్ 1: కమ్ ఇన్
ఫ్రాడ్ కాలర్ 2: జై హింద్
ఫ్రాడ్ కాలర్ 1: జై హింద్
ఫ్రాడ్ కాలర్ 1: ప్రోటోకాల్ ప్రకారం ఇతని వన్ సైడెడ్ వీడియో కాల్ రికార్డ్ చేయండి. ఓకే?
ఈ ఆడియో కేవలం సమాచారం కోసం మాత్రమే కాదు. ఇది వినోదం కలిగించే ఆడియో కాదు. ఈ ఆడియో తీవ్రమైన ఆందోళనతో వచ్చింది. మీరు ఇప్పుడే విన్న సంభాషణ డిజిటల్ అరెస్ట్ మోసంపై ఉంది. ఈ సంభాషణ బాధితుడికి, మోసగాడికి మధ్య జరిగింది. డిజిటల్ అరెస్ట్ మోసంలో కాలర్లు కొన్నిసార్లు పోలీసులుగా, కొన్నిసార్లు సీబీఐ అధికారులుగా, కొన్నిసార్లు నార్కోటిక్స్ అధికారులుగా, కొన్నిసార్లు రిజర్వ్ బ్యాంక్ అధికారులుగా వేర్వేరు హోదాలను పెట్టుకుని, మాట్లాడతారు. చాలా నమ్మకంతో చేస్తారు. చాలా మంది ‘మన్ కీ బాత్’ శ్రోతలు ఈ విషయాన్ని ఖచ్చితంగా చర్చించాలని నాతో అన్నారు. ఈ మోసం ముఠా ఎలా పని చేస్తుందో, ఈ ప్రమాదకరమైన ఆట ఏమిటో నేను మీకు చెప్తాను. మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇతరులకు అర్థం చేయించడం కూడా అంతే ముఖ్యం. మొదటి ఉపాయం - మీ వ్యక్తిగత సమాచారం అంతటినీ వారు సేకరిస్తారు. “మీరు గత నెలలో గోవా వెళ్లారు. కదా? మీ అమ్మాయి ఢిల్లీలో చదువుతుంది కదా?” ఇలా వారు మీ గురించి చాలా సమాచారాన్ని సేకరిస్తారు. మీరు ఆశ్చర్యపోయేలా సమాచారాన్ని సేకరిస్తారు. రెండవ ఉపాయం – భయానక వాతావరణాన్ని సృష్టించడం. యూనిఫాం, ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు, చట్టపరమైన విభాగాలు, అవి మిమ్మల్ని ఎంతగా భయపెడతాయంటే ఫోన్లో మాట్లాడేటప్పుడు మీరు ఆలోచించలేరు. ఆపై వారి మూడవ ఉపాయం ప్రారంభమవుతుంది. మూడవ ఉపాయం - సమయం ఒత్తిడి. 'మీరు ఇప్పుడు నిర్ణయించుకోవాలి. లేకపోతే మిమ్మల్ని అరెస్టు చేయవలసి ఉంటుంది' -ఇలా ఈ వ్యక్తులు బాధితులు భయపడేంతగా చాలా మానసిక ఒత్తిడిని కలిగిస్తారు. డిజిటల్ అరెస్ట్ బాధితుల్లో ప్రతి వర్గం, ప్రతి వయో బృందంలోనివారు ఉన్నారు. ప్రజలు కష్టపడి సంపాదించిన లక్షల రూపాయలను భయంతో నష్టపోయారు. మీకు ఎప్పుడైనా ఇలాంటి కాల్ వస్తే భయపడాల్సిన పనిలేదు. ఫోన్ కాల్ లేదా వీడియో కాల్ ద్వారా ఏ దర్యాప్తు సంస్థ కూడా ఇలాంటి విచారణలు చేయదని మీరు తెలుసుకోవాలి. డిజిటల్ భద్రత లోని మూడు దశలను నేను మీకు చెప్తాను. ఈ మూడు దశలు – ‘వేచి ఉండండి- ఆలోచించండి- చర్య తీసుకోండి’ కాల్ వస్తే 'వేచి ఉండండి'. భయాందోళనలకు గురికాకండి. ప్రశాంతంగా ఉండండి. తొందరపాటుతో ఎటువంటి పనులూ చేయకండి. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఎవరికీ ఇవ్వకండి. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకొని రికార్డింగ్ చేయండి. దీని తరువాత రెండవ దశ. మొదటి దశ వేచి చూడడం. రెండో దశ ఆలోచించడం. ఏ ప్రభుత్వ సంస్థ కూడా ఫోన్లో ఇలాంటి బెదిరింపులు చేయదు. వీడియో కాల్ల ద్వారా విచారణ చేయదు. ఇలా డబ్బులు డిమాండ్ చేయదు. మీకు భయం అనిపిస్తే ఏదో పొరపాటు జరిగిందని అర్థం చేసుకోండి. మొదటి దశ, రెండవ దశ తర్వాత ఇప్పుడు నేను మూడవ దశ గురించి చెప్తాను. మొదటి దశలో నేను చెప్పాను ‘వేచి చూడండి’ అని. రెండవ దశలో ‘ఆలోచించండి’. మూడవ దశలో – ‘చర్య తీసుకోండి’. జాతీయ సైబర్ హెల్ప్‌లైన్ 1930కి డయల్ చేయండి. cybercrime.gov.inలో రిపోర్ట్ చేయండి. మీ కుటుంబానికి, పోలీసులకు తెలియజేయండి. సాక్ష్యాలను భద్రపరచండి. 'వేచి ఉండండి', 'ఆలోచించండి', ఆపై 'చర్య తీసుకోండి’. ఈ మూడు దశలు మీ డిజిటల్ భద్రతకు రక్షణగా మారతాయి.
మిత్రులారా! చట్టంలో డిజిటల్ అరెస్ట్ లాంటి వ్యవస్థ లేదని మరోసారి చెప్తున్నాను. ఇది కేవలం మోసం, వంచన, అబద్ధం. ఇది దుష్టుల ముఠా చేసే పని. ఇలా చేస్తున్న వారు సమాజానికి శత్రువులని మళ్ళీ చెప్తున్నాను. డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాన్ని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వాలతో దర్యాప్తు సంస్థలన్నీ కలిసి పనిచేస్తున్నాయి. ఈ ఏజెన్సీల మధ్య సమన్వయం కోసం నేషనల్ సైబర్ కో-ఆర్డినేషన్ సెంటర్‌ను ఏర్పాటు జరిగింది. ఇలాంటి మోసాలకు పాల్పడిన వేలాది వీడియో కాలింగ్ ఐడీలను దర్యాప్తు సంస్థలు బ్లాక్ చేశాయి. లక్షలాది సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లు, బ్యాంకు ఖాతాలు కూడా బ్లాక్ అయ్యాయి. ఏజెన్సీలు తమ పనిని చేస్తున్నాయి. కానీ డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలను నివారించడానికి చాలా ముఖ్యమైంది - ప్రతి ఒక్కరికీ అవగాహన, ప్రతి పౌరునికీ అవగాహన. ఈ రకమైన సైబర్ మోసాలకు గురైన వ్యక్తులు దాని గురించి వీలైనంత ఎక్కువ మందికి తెలియజేయాలి. అవగాహన కోసం మీరు #SafeDigitalIndia ను ఉపయోగించవచ్చు. సైబర్ స్కామ్‌కు వ్యతిరేకంగా ప్రచారంలో విద్యార్థులను భాగస్వామ్యం చేయవలసిందిగా పాఠశాలలు, కళాశాలలను కూడా నేను కోరుతున్నాను. సమాజంలోని ప్రతి ఒక్కరి కృషితోనే మనం ఈ సవాలును ఎదుర్కోగలం.
నా ప్రియమైన దేశప్రజలారా! మన పాఠశాల పిల్లల్లో చాలా మంది కాలిగ్రఫీపై చాలా ఆసక్తిని కలిగి ఉంటారు. దీని ద్వారా మన చేతిరాత శుభ్రంగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటుంది. నేడు జమ్మూ-కాశ్మీర్లో స్థానిక సంస్కృతిని ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు దీన్ని ఉపయోగిస్తున్నారు. అక్కడి అనంతనాగ్‌కు చెందిన ఫిర్దౌసా బషీర్ గారికి కాలిగ్రఫీలో నైపుణ్యం ఉంది. దీని ద్వారా స్థానిక సంస్కృతికి సంబంధించిన అనేక అంశాలను ముందుకు తీసుకువస్తున్నారు. ఫిర్దౌసా గారి కాలిగ్రఫీ స్థానిక ప్రజలను, ముఖ్యంగా యువతను ఆకర్షిస్తోంది. ఉదంపూర్‌కు చెందిన గోరీనాథ్ గారు కూడా ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నారు. ఒక శతాబ్దానికి పైగా పురాతనమైన సారంగి ద్వారా డోగ్రా సంస్కృతి, వారసత్వ వివిధ రూపాలను సంరక్షించడంలో ఆయన నిమగ్నమై ఉన్నారు. సారంగి రాగాలతో పాటు తమ సంస్కృతికి సంబంధించిన పురాతన కథలు, చారిత్రక సంఘటనలను ఆసక్తికరంగా చెప్తారు. దేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చిన ఇలాంటి అసాధారణ వ్యక్తులు చాలా మందిని మీరు కలుస్తారు. డి.వైకుంఠం దాదాపు 50 సంవత్సరాలుగా చేర్యాల్ జానపద కళను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నారు. తెలంగాణకు సంబంధించిన ఈ కళను ముందుకు తీసుకెళ్ళడంలో ఆయన కృషి అద్భుతం. చేర్యాల్ పెయింటింగ్స్ సిద్ధం చేసే విధానం చాలా ప్రత్యేకమైంది. ఇది స్క్రోల్ రూపంలో కథలను ముందుకు తెస్తుంది. ఇందులో మన చరిత్ర, పురాణాల పూర్తి సంగ్రహావలోకనం లభిస్తుంది. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌కు చెందిన బుట్లూరామ్ మాత్రాజీ అబూజ్ మాడియా తెగకు చెందిన జానపద కళలను సంరక్షించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఆయన గత నాలుగు దశాబ్దాలుగా ఈ పనిలో ఉన్నారు. 'బేటీ బచావో-బేటీ పడావో', 'స్వచ్చ భారత్' వంటి ప్రచారాలతో ప్రజలను అనుసంధానించడంలో కూడా ఆయన కళ చాలా ప్రభావవంతంగా ఉంది.
మిత్రులారా! కాశ్మీర్‌లోని లోయల నుండి ఛత్తీస్‌గఢ్ అడవుల వరకు మన కళలు, సంస్కృతి ఎలా కొత్త రూపంలో విస్తరిస్తున్నాయో ఇప్పుడే మాట్లాడుకున్నాం. అయితే ఈ విషయం ఇక్కడితో ముగియదు. మన ఈ కళల పరిమళం అంతటా వ్యాపిస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాల ప్రజలు భారతీయ కళలు, సంస్కృతిని చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ఉధంపూర్‌లో ప్రతిధ్వనించే సారంగి గురించి చెబుతున్నప్పుడు వేల మైళ్ల దూరంలో ఉన్న రష్యాలోని యాకూత్స్క్ నగరంలో భారతీయ కళల మధురమైన రాగం ప్రతిధ్వనించడం నాకు గుర్తుకు వచ్చింది. ఊహించుకోండి… చలికాలం ఒకటిన్నర రోజులు, మైనస్ 65 డిగ్రీల ఉష్ణోగ్రత, చుట్టూ తెల్లటి మంచు దుప్పటి, అక్కడి థియేటర్లో కాళిదాసు అభిజ్ఞాన శాకుంతలాన్ని ప్రేక్షకులు మంత్రముగ్ధులై చూస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత శీతల నగరమైన యాకూత్స్క్ లో భారతీయ సాహిత్యం వెచ్చదనాన్ని మీరు ఊహించగలరా? ఇది ఊహ కాదు కానీ నిజం. మనందరినీ గర్వం, ఆనందంతో నింపే సత్యం.
మిత్రులారా! కొన్ని వారాల క్రితం నేను లావోస్ కు వెళ్ళాను. అది నవరాత్రి సమయం. అక్కడ నేను ఒక అద్భుతాన్ని చూశాను. స్థానిక కళాకారులు "ఫలక్ ఫలం" అనే 'లావోస్ రామాయణం' ప్రదర్శించారు. రామాయణం పట్ల మనకున్న అంకితభావమే వారి కళ్లలో శక్తిగా, వారి స్వరంలో సమర్పణా భావంగా కనబడింది. అదేవిధంగా కువైట్‌లో అబ్దుల్లా అల్-బారూన్ గారు రామాయణ మహాభారతాలను అరబిక్ భాషలోకి అనువదించారు. ఈ రచన కేవలం అనువాదం మాత్రమే కాదు- రెండు గొప్ప సంస్కృతుల మధ్య వారధి. ఆయన ప్రయత్నాలు అరబ్ ప్రపంచంలో భారతీయ సాహిత్యంపై కొత్త అవగాహనను పెంచుతున్నాయి. మరొక స్ఫూర్తిదాయక ఉదాహరణ పెరూకు చెందిన ఎర్లిందా గార్సియా అక్కడి యువతకు భరతనాట్యం నేర్పుతున్నారు. మరియా వాల్దెజ్ ఒడిస్సీ నృత్యంలో శిక్షణ ఇస్తున్నారు. ఈ కళల ప్రభావంతో 'భారతీయ శాస్త్రీయ నృత్యం' దక్షిణ అమెరికాలోని అనేక దేశాల్లో ప్రాచుర్యం పొందుతోంది.
మిత్రులారా! విదేశీ గడ్డపై భారతదేశానికి చెందిన ఈ ఉదాహరణలు భారతీయ సంస్కృతి శక్తి ఎంత అద్భుతమైందో చూపిస్తాయి. ఈ శక్తి నిరంతరం ప్రపంచాన్ని తనవైపు ఆకర్షిస్తూనే ఉంటుంది.
"ఎక్కడెక్కడ కళ ఉంటుందో అక్కడక్కడ భారతదేశం ఉంటుంది."
"సంస్కృతి ఎక్కడెక్కడ ఉంటుందో అక్కడక్కడ భారతదేశం ఉంటుంది"
నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు భారతదేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. భారతదేశ ప్రజలను గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. కాబట్టి మీ అందరికి ఒక విన్నపం... మీ చుట్టూ ఉన్న ఇలాంటి సాంస్కృతిక అంశాలను #CulturalBridges తో పంచుకోండి. అలాంటి ఉదాహరణలను మనం ‘మన్ కీ బాత్’లో మరింత చర్చిస్తాం.
నా ప్రియమైన దేశప్రజలారా! దేశంలోని చాలా ప్రాంతాల్లో చలికాలం మొదలైంది. అయితే ఫిట్నెస్ పై అభిరుచి, ఫిట్ ఇండియా స్ఫూర్తి విషయంలో ఏ వాతావరణానికీ తేడా లేదు. ఫిట్‌గా ఉండే అలవాటు ఉన్నవారు చలి, వేడి, వర్షం గురించి పట్టించుకోరు. భారతదేశంలోని ప్రజలు ఇప్పుడు ఫిట్నెస్ గురించి మరింత అవగాహన పెంచుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. మీ చుట్టుపక్కల ఉన్న పార్కుల్లో ప్రజల సంఖ్య పెరుగుతుండటం కూడా మీరు గమనిస్తూ ఉండాలి. పార్కులో షికారు చేసే వృద్ధులు, యువకులు, యోగా చేసే కుటుంబ సభ్యులను చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. నాకు గుర్తుంది- నేను యోగా దినోత్సవం రోజున శ్రీనగర్‌లో ఉన్నప్పుడు వర్షం ఉన్నప్పటికీ చాలా మంది 'యోగా' కోసం ఒక్కచోటికి చేరారు. కొద్దిరోజుల క్రితం శ్రీనగర్‌లో జరిగిన మారథాన్‌లో కూడా ఫిట్‌గా ఉండేందుకు ఇదే ఉత్సాహం కనిపించింది. ఈ ఫిట్ ఇండియా భావన ఇప్పుడు ప్రజా ఉద్యమంగా మారుతోంది.
మిత్రులారా! మన పాఠశాలలు ఇప్పుడు పిల్లల ఫిట్‌నెస్‌పై ఎక్కువ శ్రద్ధ చూపడం చూసి నేను కూడా సంతోషిస్తున్నాను. ఫిట్ ఇండియా స్కూల్ అవర్స్ కూడా ఒక ప్రత్యేక కార్యక్రమం. వివిధ ఫిట్నెస్ కార్యకలాపాల కోసం పాఠశాలలు తమ మొదటి పీరియడ్‌ని ఉపయోగిస్తున్నాయి. చాలా పాఠశాలల్లో కొన్ని రోజులు పిల్లలతో యోగా చేయిస్తారు. కొన్ని రోజులు ఏరోబిక్స్ సెషన్లు ఉంటాయి. కొన్ని రోజులు క్రీడా నైపుణ్యాలను పెంచే పని చేస్తారు. కొన్ని రోజులు ఖో-ఖో, కబడ్డీ వంటి సాంప్రదాయిక ఆటలను ఆడుతున్నారు. దాని ప్రభావం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. హాజరు మెరుగుపడుతుంది. పిల్లల ఏకాగ్రత పెరుగుతుంది. పిల్లలు కూడా సరదాగా ఉంటారు.
మిత్రులారా! నేను ఈ వెల్నెస్ శక్తిని ప్రతిచోటా చూస్తున్నాను. చాలా మంది ‘మన్ కీ బాత్’ శ్రోతలు తమ అనుభవాలను కూడా నాకు పంపారు. కొంతమంది చాలా ఆసక్తికరమైన ప్రయోగాలు చేస్తున్నారు. వీటిలో ఒక ఉదాహరణ ఫ్యామిలీ ఫిట్నెస్ అవర్. అంటే కుటుంబ ఫిట్నెస్ యాక్టివిటీ కోసం ప్రతి వారాంతంలో కుటుంబాలు ఒక గంట కేటాయిస్తున్నాయి. మరో ఉదాహరణ స్వదేశీ ఆటల పునరుద్ధరణ. అంటే కొన్ని కుటుంబాలు తమ పిల్లలకు సాంప్రదాయిక ఆటలను నేర్పిస్తున్నాయి. మీరు మీ ఫిట్నెస్ రొటీన్ అనుభవాన్ని తప్పనిసరిగా #fitIndia పేరుతో సామాజిక మాధ్యమంలో పంచుకోండి. నేను దేశ ప్రజలకు ముఖ్యమైన సమాచారాన్ని కూడా అందించాలనుకుంటున్నాను. ఈసారి దీపావళి పండుగ సర్దార్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31 న వస్తోంది. మనం ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న "జాతీయ ఐక్యతా దినోత్సవం" రోజున 'రన్ ఫర్ యూనిటీ'ని నిర్వహిస్తాం. ఈసారి దీపావళి కారణంగా అక్టోబర్ 29వ తేదీన అంటే మంగళవారంనాడు ‘రన్ ఫర్ యూనిటీ’ జరుగుతుంది. ఇందులో అత్యధిక సంఖ్యలో పాల్గొనవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. జాతీయ ఐక్యత మంత్రంతో పాటు ఫిట్నెస్ మంత్రాన్ని ప్రతిచోటా వ్యాప్తి చేయండి.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్'లో ఈ సారి ఇంతే! మీరు మీ అభిప్రాయాలను పంపుతూ ఉండండి. ఇది పండుగల కాలం. ధన్ తేరస్, దీపావళి, ఛత్ పూజ, గురునానక్ జయంతి - అన్ని పండుగల సందర్భంగా ‘మన్ కీ బాత్’ శ్రోతలకు శుభాకాంక్షలు. మీరందరూ పండుగలను పూర్తి ఉత్సాహంతో జరుపుకోవాలి. వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని గుర్తుంచుకోండి. పండుగల సమయంలో స్థానిక దుకాణదారుల నుండి కొనుగోలు చేసిన వస్తువులు మీ ఇంటికి వచ్చేలా చూసుకోండి. రాబోయే పండుగల సందర్భంగా మీ అందరికీ మరోసారి శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంతో మిమ్మల్ని కలిసే అవకాశం వచ్చింది. ఈరోజు ఎపిసోడ్ నన్ను భావోద్వేగానికి గురిచేస్తోంది. ఇది చాలా పాత జ్ఞాపకాలతో నన్ను చుట్టుముట్టింది. కారణం మన 'మన్ కీ బాత్' ప్రయాణం పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. పదేళ్ల కిందట విజయదశమి పర్వదినమైన అక్టోబర్ 3వ తేదీన 'మన్ కీ బాత్' ప్రారంభమైంది. ఈ ఏడాది అక్టోబర్ 3వ తేదీన ‘మన్ కీ బాత్’ పదేళ్ల ప్రయాణం పూర్తి చేసుకుంటుంది. యాదృచ్ఛికంగా అది నవరాత్రుల మొదటి రోజు కావడం విశేషం.
'మన్ కీ బాత్' ఈ సుదీర్ఘ ప్రయాణంలో నేను ఎప్పటికీ మరచిపోలేని అనేక మైలురాళ్లు ఉన్నాయి. 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని వినే కోట్లాది శ్రోతలు ఈ కార్యక్రమానికి భాగస్వాములుగా ఉన్నారు. వారు నిరంతరం తమ సహకారాన్ని అందిస్తూనే ఉన్నారు. దేశంలోని ప్రతి మూల నుండి వారు సమాచారాన్ని అందిస్తూనే ఉన్నారు. ఈ ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి అసలైన సూత్రధారులు శ్రోతలే.
సాధారణంగా ఉబుసుపోక ముచ్చట్లు, నెగిటివ్ విషయాలు ఉంటే తప్ప ప్రజల దృష్టిని ఆకర్షించలేమన్న అభిప్రాయం ఉంది. కానీ 'మన్ కీ బాత్' దేశంలోని ప్రజలు సానుకూల సమాచారం కోసం ఎంతగా ఎదురుచూస్తున్నారో నిరూపించింది. సానుకూల అంశాలు, స్పూర్తిదాయకమైన ఉదంతాలు, ప్రోత్సహించే గాథలను ప్రజలు ఇష్టపడతారు. చకోర పక్షి కేవలం వర్షపు చినుకులు మాత్రమే తాగుతుందంటారు. అలాగే శ్రోతలు కూడా. చకోర పక్షి లాగే మన్ కీ బాత్ శ్రోతలు కూడా దేశ ప్రయోజనాల అంశాలను, ఉమ్మడి ప్రయోజనాల విషయాలను ఎంతో గర్వంతో వింటారు. ప్రతి ఎపిసోడ్‌తో కొత్త గాథలు, కొత్త రికార్డులు, కొత్త వ్యక్తులను జోడించేవిధంగా ఒక ధారావాహికను 'మన్ కీ బాత్' సృష్టించింది. మన సమాజం లోని వ్యక్తులు సామూహిక స్ఫూర్తితో ఏ పని చేసినా వారికి 'మన్ కీ బాత్' ద్వారా గౌరవం లభిస్తుంది. 'మన్ కీ బాత్' కోసం వచ్చిన లేఖలు చదివితే నా హృదయం గర్వంతో నిండిపోతుంది. మన దేశంలో దేశసేవ, సమాజసేవ పట్ల గొప్ప అభిరుచి ఉండే చాలా మంది ప్రతిభావంతులు ఉన్నారు. తమ జీవితాన్ని నిస్వార్థంగా దేశానికి, సమాజానికి సేవ చేయడానికి వారు అంకితం చేస్తారు. వారి గురించి తెలుసుకున్నప్పుడు నేను కొత్త శక్తితో నిండిపోతాను. 'మన్ కీ బాత్'లోని ఈ మొత్తం ప్రక్రియ నాకు గుడికి వెళ్లి భగవంతుని దర్శనం చేసుకున్నట్లుగా ఉంటుంది. ‘మన్ కీ బాత్’ లోని ప్రతి విషయం, ప్రతి సంఘటన, ప్రతి లేఖ గుర్తుకు వచ్చినప్పుడు ప్రజల రూపంలోని భగవంతుడిని చూస్తున్నట్లుగా అనిపిస్తుంది. భగవంతుడి రూపంగానే వారిని భావిస్తాను. ఆ భగవంతుని రూపాన్ని నేను దర్శిస్తున్నాను.
మిత్రులారా! దూరదర్శన్, ప్రసార భారతి, ఆకాశవాణిలతో అనుబంధంగా ఉన్న అందరినీ ఈ రోజు నేను అభినందిస్తున్నాను. వారి అవిశ్రాంత ప్రయత్నాల కారణంగా 'మన్ కీ బాత్' ఈ ముఖ్యమైన మైలురాయిని చేరుకుంది. 'మన్ కీ బాత్' కార్యక్రమాన్ని ప్రసారం చేసిన టీవీ ఛానెళ్లకు, ప్రాంతీయ టీవీ ఛానెళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 'మన్ కీ బాత్' ద్వారా లేవనెత్తిన అంశాలపై కొన్ని మీడియా సంస్థలు ప్రచారాన్ని కూడా నిర్వహించాయి. వారికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రింట్ మీడియాకు, 'మన్ కీ బాత్'పై అనేక కార్యక్రమాలు చేసిన యూట్యూబర్లకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం దేశంలోని 22 భాషలతో పాటు 12 విదేశీ భాషల్లో కూడా వినవచ్చు. ‘మన్ కీ బాత్’ కార్యక్రమాన్ని తమ ప్రాంతీయ భాషలో విన్నామని శ్రోతలు చెప్తుంటే నాకు ఆనందంగా ఉంటుంది. 'మన్ కీ బాత్' కార్యక్రమం ఆధారంగా క్విజ్ పోటీ కూడా జరుగుతోందని మీలో చాలా మందికి తెలుసు. ఇందులోఎవరైనా పాల్గొనవచ్చు. Mygov.in వెబ్ సైట్ ను సందర్శించడం ద్వారా మీరు కూడా పాల్గొనవచ్చు. బహుమతులు గెలుచుకోవచ్చు. ఈ గొప్ప సందర్భంలో నేను మీ అందరి నుండి మరోసారి ఆశీర్వాదాలు కోరుతున్నాను. స్వచ్ఛమైన మనసుతో, పూర్తి అంకితభావంతో- నేను ఇదేవిధంగా- భారతదేశ ప్రజల గొప్పతనాన్ని కీర్తిస్తూనే ఉంటాను. మనమందరం ఇదే విధంగా దేశ సామూహిక శక్తిని ఉత్సవంగా జరుపుకుందాం. ఇదే భగవంతుడితో నా ప్రార్థన. నరరూపంలో ఉన్న నారాయణులతో కూడా నా ప్రార్థన ఇదే!
నా ప్రియమైన దేశప్రజలారా! గత కొన్ని వారాలుగా దేశంలోని వివిధ ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. జల సంరక్షణ ప్రాధాన్యతను వర్షాకాలం గుర్తు చేస్తుంది. వర్షపు రోజుల్లో పొదుపు చేసుకున్న నీళ్లు నీటి సంక్షోభం సమయంలో ఎంతగానో ఉపయోగపడతాయి. 'క్యాచ్ ది రెయిన్' వంటి ప్రచారాల వెనుక ఉన్న భావన ఇదే. నీటి సంరక్షణ కోసం చాలా మంది కొత్త కార్యక్రమాలు చేపడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అలాంటి ఒక ప్రయత్నం ఉత్తరప్రదేశ్‌లో కనిపించింది. నీటి కొరతకు గుర్తింపు పొందిన 'ఝాన్సీ' బుందేల్‌ఖండ్‌లో ఉందని మీకు తెలుసు. ఝాన్సీలో స్వయం సహాయక బృందంతో అనుబంధం ఉన్న మహిళలు ఘురారి నదికి కొత్త జీవితం ఇచ్చారు. 'జల్ సహేలీ'గా మారి, ఈ ఉద్యమానికి ఆ మహిళలు నాయకత్వం వహించారు. దాదాపు మృత స్థితిలో ఉన్న ఘురారి నదిని వారు రక్షించిన తీరు ఊహకు కూడా అందనిది. ఈ జల్ సహేలీలు ఇసుకను బస్తాలలో నింపి ఒక చెక్ డ్యామ్‌ను సిద్ధం చేశారు. వర్షం నీరు వృధా కాకుండా కాపాడారు. నదిని నీటితో నింపారు. వందలాది రిజర్వాయర్ల నిర్మాణం, పునరుజ్జీవనంలో ఈ మహిళలు చురుగ్గా దోహదపడ్డారు. ఈ ప్రాంత ప్రజల నీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా వారి ముఖాల్లో సంతోషం వెల్లివిరిసేలా చూశారు.
మిత్రులారా! కొన్ని చోట్ల జలశక్తిని నారీశక్తి పెంచుతుంది. మరికొన్ని చోట్ల నారీశక్తిని జలశక్తి బలోపేతం చేస్తుంది. మధ్యప్రదేశ్ లోని రెండు స్ఫూర్తిదాయక ప్రయత్నాల గురించి నాకు తెలిసింది. ఇక్కడ డిండౌరీ లోని రాయపురా గ్రామంలో పెద్ద చెరువు కట్టడం వల్ల భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీనివల్ల అక్కడి మహిళలకు లబ్ధి కలిగింది. అక్కడి 'శారదా జీవనోపాధి స్వయం సహాయక బృందం'లోని మహిళలు చేపల పెంపకం వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టారు. ఫిష్ పార్లర్ ను కూడా ప్రారంభించారు. అక్కడ వారి ఆదాయం కూడా చేపల విక్రయం ద్వారా పెరుగుతోంది. మధ్యప్రదేశ్‌లోని ఛతర్పూర్ మహిళల ప్రయత్నాలు కూడా ప్రశంసనీయం. అక్కడి ఖోప్ గ్రామంలో పెద్దచెరువు ఎండిపోవడంతో అక్కడి మహిళలు దాని పునరుజ్జీవనానికి కృషి చేశారు. 'హరి బగియా స్వయం సహాయక బృందా'నికి చెందిన ఈ మహిళలు చెరువులోని పూడిక మట్టిని పెద్ద మొత్తంలో తీశారు. చెరువులోంచి వచ్చిన పూడికమట్టితో బంజరు భూమిలో ఫల వనాన్ని సిద్ధం చేశారు. ఈ మహిళల కృషి వల్ల చెరువు పుష్కలంగా నిండడమే కాకుండా పంట దిగుబడి కూడా గణనీయంగా పెరిగింది. దేశంలోని ప్రతి మూలలో జరుగుతున్న ఇటువంటి నీటి సంరక్షణ ప్రయత్నాలు నీటి సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో చాలా సహాయకారిగా ఉంటాయి. మీ చుట్టూ జరుగుతున్న అలాంటి ప్రయత్నాలలో మీరు కూడా తప్పకుండా పాల్గొంటారని నాకు నమ్మకం ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా! ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో ‘ఝాలా’ అనే సరిహద్దు గ్రామం ఉంది. అక్కడి యువకులు తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. వారు తమ గ్రామంలో ‘ధన్యవాదాలు ప్రకృతి- థాంక్యూ నేచర్’ అనే ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులోభాగంగా ప్రతిరోజు రెండు గంటల పాటు గ్రామాన్ని శుభ్రం చేస్తున్నారు. గ్రామంలోని వీధుల్లో ఉన్న చెత్తను సేకరించి గ్రామం వెలుపల నిర్దేశించిన స్థలంలో వేస్తారు. దీంతో ‘ఝాలా’ గ్రామం కూడా పరిశుభ్రంగా మారుతోంది. ప్రజల్లోనూ అవగాహన కల్పిస్తున్నారు. ప్రతి గ్రామం, ప్రతి వీధి, ప్రతి ప్రాంతం ఇలాంటి థాంక్యూ ప్రచారం ప్రారంభిస్తే ఎంత పరివర్తన వస్తుందో ఒక్కసారి ఆలోచించండి!
మిత్రులారా! పుదుచ్చేరి సముద్ర తీరంలో పరిశుభ్రతపై అధ్బుతమైన ప్రచారం జరుగుతోంది. అక్కడ రమ్య అనే మహిళ మాహే మున్సిపాలిటీతో పాటు ఆ పరిసర ప్రాంతాల యువ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు. తమ కృషితో మాహే ప్రాంతాన్ని, ముఖ్యంగా అక్కడి బీచ్‌లను పూర్తిగా పరిశుభ్రంగా తీర్చిదిద్దుతున్నారు ఈ బృందంలోని వ్యక్తులు.
మిత్రులారా! నేను ఇక్కడ రెండు ప్రయత్నాల గురించి మాత్రమే చర్చించాను. కానీ మనం మన చుట్టూ చూస్తే దేశంలోని ప్రతి ప్రాంతంలో పరిశుభ్రతకు సంబంధించి ఏదో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం ఖచ్చితంగా జరుగుతుందని తెలుస్తుంది. మరికొద్ది రోజుల్లో అంటే అక్టోబర్ 2వ తేదీన 'స్వచ్ఛ భారత్ మిషన్' పదేళ్లు పూర్తి చేసుకుంటోంది. భారతదేశ చరిత్రలో ఇంత పెద్ద ప్రజా ఉద్యమం చేసిన వారిని అభినందించడానికి ఇది ఒక సందర్భం. జీవితాంతం ఈ లక్ష్యం కోసమే అంకితభావంతో నిలిచిన మహాత్మా గాంధీజీకి ఇదే నిజమైన నివాళి.
మిత్రులారా! ఈరోజు 'స్వచ్ఛ భారత్ మిషన్' విజయంతో 'వ్యర్థాల నుండి సంపద' అనే మంత్రం ప్రజల్లో ప్రాచుర్యం పొందుతోంది. ప్రజలు 'రెడ్యూస్, రీ-యూజ్, రీసైకిల్' గురించి మాట్లాడటం ప్రారంభించారు. వాటికి ఉదాహరణలు ఇవ్వడం మొదలుపెట్టారు. కేరళలోని కోజికోడ్‌లో ఒక అద్భుతమైన ప్రయత్నం గురించి నేను తెలుసుకున్నాను. అక్కడ డెబ్బై నాలుగు సంవత్సరాల వయసున్న సుబ్రహ్మణ్యన్ గారు 23 వేలకు పైగా కుర్చీలకు మరమ్మతులు చేసి, వాటిని మళ్లీ ఉపయోగించుకునేలా చేశారు. ప్రజలు ఆయనను 'రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్- అంటే RRR (ట్రిపుల్ ఆర్) ఛాంపియన్’ అని కూడా పిలుస్తారు కోజికోడ్ సివిల్ స్టేషన్, పిడబ్ల్యుడి, ఎల్ఐసి కార్యాలయాలలో ఆయన చేసిన ఈ అపూర్వ ప్రయత్నాలను చూడవచ్చు.
మిత్రులారా! పరిశుభ్రతకు సంబంధించి జరుగుతున్న ప్రచారంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాములను చేయాలి. ఈ ప్రచారం ఒక రోజు లేదా ఒక సంవత్సరం జరిగే ప్రచారం కాదు. ఇది యుగయుగాల వరకు జరగవలసిన నిరంతర కృషి. ‘స్వచ్ఛత’ మన స్వభావం అయ్యే వరకు చేయవలసిన పని ఇది. మీ కుటుంబసభ్యులు, స్నేహితులు, పొరుగువారు లేదా సహోద్యోగులతో కలిసి పరిశుభ్రత ప్రచారంలో పాల్గొనాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ‘స్వచ్ఛ భారత్ మిషన్’ విజయవంతం అయిన సందర్భంగా మీ అందరికీ మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! మనమందరం మన వారసత్వం గురించి చాలా గర్వపడుతున్నాం. నేను ఎప్పుడూ చెప్తాను- వికాసంతో పాటు వారసత్వం కూడా ముఖ్యమని. ఈ కారణం వల్లే నా ఇటీవలి అమెరికా పర్యటనలో ఒక నిర్దిష్ట అంశం గురించి నాకు చాలా సందేశాలు వస్తున్నాయి. మన ప్రాచీన కళాఖండాలు తిరిగి రావడంపై మరోసారి చర్చ జరుగుతోంది. దీనికి సంబంధించి మీ అందరి భావాలను నేను అర్థం చేసుకోగలను. 'మన్ కీ బాత్' శ్రోతలకు కూడా దీని గురించి చెప్పాలనుకుంటున్నాను.
మిత్రులారా! నా అమెరికా పర్యటన సందర్భంగా అమెరికా ప్రభుత్వం దాదాపు 300 పురాతన కళాఖండాలను భారతదేశానికి తిరిగి ఇచ్చింది. అమెరికా అధ్యక్షులు బైడెన్ పూర్తి ఆప్యాయతను ప్రదర్శిస్తూ, డెలావేర్‌లోని తన వ్యక్తిగత నివాసంలో ఈ కళాఖండాలలో కొన్నింటిని నాకు చూపించారు. తిరిగి వచ్చిన కళాఖండాలు టెర్రకోట, రాయి, ఏనుగు దంతాలు, కలప, రాగి, కాంస్యం వంటి పదార్థాలతో తయారయ్యాయి. వీటిలో చాలా వస్తువులు నాలుగు వేల సంవత్సరాల కిందటివి. నాలుగు వేల సంవత్సరాల కిందటి నుండి 19వ శతాబ్దం వరకు ఉన్న కళాఖండాలను అమెరికా తిరిగి అందించింది. వీటిలో పూల కుండీలు, దేవతల టెర్రకోట ఫలకాలు, జైన తీర్థంకరుల విగ్రహాలు, బుద్ధుడి ప్రతిమలు, శ్రీ కృష్ణుడి విగ్రహాలు ఉన్నాయి. తిరిగి వచ్చిన వస్తువులలో చాలా జంతువుల బొమ్మలు కూడా ఉన్నాయి. పురుషులు, స్త్రీల బొమ్మలతో జమ్మూ కాశ్మీర్‌లోని టెర్రకోట టైల్స్ చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. వీటిలో దక్షిణ భారతదేశానికి చెందిన కంచుతో చేసిన గణేశుని విగ్రహాలు కూడా ఉన్నాయి. తిరిగి వచ్చిన వస్తువులలో పెద్ద సంఖ్యలో విష్ణువు చిత్రాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రధానంగా ఉత్తర, దక్షిణ భారతదేశ ప్రాంతాలకు సంబంధించినవి. ఈ కళాఖండాలను చూస్తే మన పూర్వికులు సూక్ష్మ నైపుణ్యాలపై ఎంత శ్రద్ధ చూపారో స్పష్టమవుతుంది. కళ పట్ల వారికి ఎంతో అద్భుతమైన అవగాహన ఉండేది. ఈ కళాఖండాలను చాలా వరకు అక్రమ రవాణా, ఇతర చట్టవిరుద్ధ మార్గాల ద్వారా దేశం నుండి బయటకు తీసుకువెళ్ళారు. ఇది తీవ్రమైన నేరం. ఒక విధంగా ఇది మన వారసత్వాన్ని నాశనం చేయడం లాంటిది. అయితే గత దశాబ్దంలో ఇటువంటి అనేక కళాఖండాలు, మన పురాతన వస్తువులు చాలా వరకు తిరిగివచ్చాయని తెలియజేసేందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ దిశలో నేడు భారతదేశం కూడా అనేక దేశాలతో కలిసి పనిచేస్తోంది. మన వారసత్వం గురించి మనం గర్వపడుతున్నప్పుడు ప్రపంచం కూడా దాన్ని గౌరవిస్తుందని నేను నమ్ముతున్నాను. దాని ఫలితమే నేడు ప్రపంచంలోని అనేక దేశాలు మన దేశం నుండి తరలిపోయిన అటువంటి కళాఖండాలను తిరిగి ఇస్తున్నాయి.
నా ప్రియమైన మిత్రులారా! ఏ పిల్లవాడైనా ఏ భాషను సులభంగా, త్వరగా నేర్చుకుంటాడు అని నేను అడిగితే - మీ సమాధానం 'మాతృభాష' అనే వస్తుంది. మన దేశంలో దాదాపు ఇరవై వేల భాషలు, మాండలికాలు ఉన్నాయి. అవన్నీ ఎవరో ఒకరికి మాతృభాషలే. వ్యవహర్తల సంఖ్య చాలా తక్కువగా ఉన్న కొన్ని భాషలు ఉన్నాయి. కానీ నేడు ఆ భాషలను సంరక్షించడానికి ప్రత్యేకమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. అలాంటి భాషల్లో ఒకటి మన 'సంథాలీ' భాష. డిజిటల్ ఇన్నోవేషన్ సాయంతో ‘సంథాలీ’కి కొత్త గుర్తింపు తెచ్చేలా ఉద్యమం మొదలైంది. మన దేశంలోని అనేక రాష్ట్రాల్లో నివసిస్తున్న సంథాల్ ఆదివాసీ సమాజానికి చెందిన ప్రజలు 'సంథాలీ'ని మాట్లాడతారు. భారతదేశంతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్లలో కూడా సంథాలీ మాట్లాడే ఆదివాసీ సమాజాలు ఉన్నాయి. ఒడిషాలోని మయూర్‌భంజ్‌లో నివసిస్తున్న రామ్‌జిత్ టుడు గారు సంథాలీ భాష ఆన్లైన్ గుర్తింపు పొందేందుకు ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. రామ్‌జిత్ గారు డిజిటల్ వేదికను సృష్టించారు. ఇక్కడ సంథాలీ భాషకు సంబంధించిన సాహిత్యాన్ని సంథాలీ భాషలో చదవవచ్చు. రాయవచ్చు. కొన్ని సంవత్సరాల క్రితం రామ్‌జిత్ గారు మొబైల్ ఫోన్ ఉపయోగించడం ప్రారంభించినప్పుడు తన మాతృభాషలో సందేశాలు పంపలేనందుకు ఆయన బాధపడ్డారు. ఆ తర్వాత 'సంథాలీ భాష' లిపి 'ఓల్ చికీ'ని టైప్ చేసే అవకాశాలను అన్వేషించడం ప్రారంభించారు. తన సహోద్యోగుల సహాయంతో 'ఓల్ చికీ'లో టైపింగ్ చేసే సాంకేతికతను అభివృద్ధి చేశారు. నేడు ఆయన కృషి వల్ల సంథాలీ భాషలో రాసిన వ్యాసాలు లక్షలాది మందికి చేరుతున్నాయి.
మిత్రులారా! మన దృఢ సంకల్పంతో సామూహిక భాగస్వామ్యం జోడీ కలిస్తే, యావత్ సమాజానికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి. దీనికి తాజా ఉదాహరణ 'ఏక్ పేడ్ మా కే నామ్'. ఈ ప్రచారం అద్భుతంగా నిలిచింది. ప్రజల భాగస్వామ్యానికి ఇటువంటి ఉదాహరణ నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రారంభించిన ఈ ప్రచారంలో దేశంలోని నలుమూలల ప్రజలు అద్భుతాలు చేశారు. ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ రాష్ట్రాలు లక్ష్యానికి మించి మొక్కలు నాటి సరికొత్త రికార్డు సృష్టించాయి. ఈ ప్రచారం కింద ఉత్తరప్రదేశ్‌లో 26 కోట్లకు పైగా మొక్కలు నాటారు. గుజరాత్ ప్రజలు 15 కోట్లకు పైగా మొక్కలు నాటారు. ఒక్క ఆగస్టు నెలలోనే రాజస్థాన్‌లో 6 కోట్లకు పైగా మొక్కలను నాటారు. దేశంలోని వేలాది పాఠశాలలు కూడా ఈ ప్రచారంలో చురుకుగా పాల్గొంటున్నాయి.
మిత్రులారా! చెట్ల పెంపకానికి సంబంధించిన అనేక ఉదాహరణలు మన దేశంలో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అలాంటి ఒక ఉదాహరణ తెలంగాణకు చెందిన కె.ఎన్.రాజశేఖర్ గారిది. మొక్కలు నాటడం పట్ల ఆయనకున్న నిబద్ధత మనందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నాలుగేళ్ల క్రితం మొక్కలు నాటే కార్యక్రమాన్నిఆయన ప్రారంభించారు. రోజూ ఓ మొక్క తప్పకుండా నాటాలని నిర్ణయించుకున్నారు. ఆయన ఈ ఉద్యమాన్ని కఠినమైన వ్రతంలా నిర్వహించారు. ఆయన 1500కు పైగా మొక్కలు నాటారు. ఈ ఏడాది ప్రమాదానికి గురైన తర్వాత కూడా ఆయన తన దృఢ సంకల్పాన్ని వదలకపోవడం అత్యంత గొప్ప విషయం. అలాంటి ప్రయత్నాలన్నింటినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఈ పవిత్ర ఉద్యమం 'ఏక్ పేడ్ మా కే నామ్'లో చేరాలని నేను మిమ్మల్ని కూడా అభ్యర్థిస్తున్నాను.
నా ప్రియమైన మిత్రులారా! విపత్తులోనూ ధైర్యం కోల్పోకుండా, దాని నుండి నేర్చుకునే కొంతమంది మన చుట్టూ ఉన్నారని మీరు గమనించాలి. అటువంటి మహిళ సుభాశ్రీ. ఆమె తన ప్రయత్నాలతో అరుదైన, చాలా ఉపయోగకరమైన మూలికలతో కూడిన అద్భుతమైన తోటను సృష్టించారు. ఆమె తమిళనాడులోని మధురై నివాసి. ఆమె వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలైనా ఆమెకు ఔషధ మొక్కలు, వైద్య మూలికల పట్ల మక్కువ అధికంగా ఉంది. 80వ దశకంలో ఆమె తండ్రి విషపూరితమైన పాము కాటుకు గురైనప్పుడు వీటిపై ఆమెకు ఆసక్తి ప్రారంభమైంది. అప్పుడు సాంప్రదాయిక మూలికలు ఆమె తండ్రి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా సహాయపడ్డాయి. ఈ సంఘటన తర్వాత ఆమె సాంప్రదాయిక ఔషధాలు, మూలికల కోసం అన్వేషణ ప్రారంభించారు. నేడు మధురైలోని వెరిచియూర్ గ్రామంలో ఒక ప్రత్యేకమైన హెర్బల్ గార్డెన్‌ను ఆమె రూపకల్పన చేశారు. ఇందులో 500 కంటే ఎక్కువ అరుదైన ఔషధ మొక్కలు ఉన్నాయి. ఈ తోటను సిద్ధం చేయడానికి ఆమె చాలా కష్టపడ్డారు. ప్రతి మొక్కను కనుగొనడానికి చాలా దూరం ప్రయాణించి, సమాచారాన్ని సేకరించారు. చాలాసార్లు ఇతర వ్యక్తుల నుండి సహాయం కోరారు. కోవిడ్ సమయంలో ప్రజలకు రోగనిరోధక శక్తిని పెంచే మూలికలను ఆమె పంపిణీ చేశారు. నేడు ఆమె రూపకల్పన చేసిన హెర్బల్ గార్డెన్‌ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు వస్తుంటారు. మూలికల మొక్కలు, వాటి ఉపయోగాల గురించిన సమాచారాన్ని ఆమె అందరికీ వివరిస్తారు. వందల ఏళ్లుగా మన సంస్కృతిలో భాగమైన మన సంప్రదాయ వారసత్వాన్ని సుభాశ్రీ ముందుకు తీసుకువెళుతున్నారు. ఆమె హెర్బల్ గార్డెన్ మన గతాన్ని భవిష్యత్తుతో అనుసంధానిస్తుంది. ఆమెకు మన శుభాకాంక్షలు.
మిత్రులారా! పరివర్తన చెందుతున్న ఈ కాలంలో ఉద్యోగాల స్వభావాలు మారుతున్నాయి. కొత్త రంగాలు పుట్టుకొస్తున్నాయి. గేమింగ్, యానిమేషన్, రీల్ మేకింగ్, ఫిల్మ్ మేకింగ్ లేదా పోస్టర్ మేకింగ్ వంటివి వస్తున్నాయి. మీరు ఈ నైపుణ్యాలు దేంట్లోనైనా బాగా చేయగలిగితే మీ ప్రతిభకు భారీ వేదిక లభిస్తుంది. మీరు బ్యాండ్‌తో అనుసంధానమై ఉంటే లేదా కమ్యూనిటీ రేడియో కోసం పని చేస్తే, మీకు కూడా మంచి అవకాశాలు లభిస్తాయి. మీ ప్రతిభను, సృజనాత్మకతను ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ 'క్రియేట్ ఇన్ ఇండియా' అనే థీమ్‌తో 25 సవాళ్లను ప్రారంభించింది. మీకు ఖచ్చితంగా ఈ సవాళ్లు ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని సవాళ్లు సంగీతం, విద్య, యాంటీ పైరసీపై కూడా దృష్టి సారించాయి. అనేక వృత్తిపరమైన సంస్థలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. ఇవి ఈ సవాళ్లకు తమ పూర్తి సహకారం అందిస్తున్నాయి. వీటిలో చేరడానికి మీరు wavesindia.org వెబ్ సైట్ లో లాగిన్ చేయవచ్చు. ఇందులో పాల్గొని సృజనాత్మకతను ప్రదర్శించవలసిందిగా దేశవ్యాప్తంగా ఉన్న క్రియేటర్లకు నా ప్రత్యేక కోరిక.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ నెలలో మరో ముఖ్యమైన ప్రచారానికి 10 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ ప్రచారం విజయవంతం కావడంలో దేశంలోని పెద్ద పరిశ్రమల నుండి చిన్న దుకాణదారుల వరకు ప్రతి ఒక్కరి సహకారం ఉంది. నేను ‘మేక్ ఇన్ ఇండియా’ గురించి మాట్లాడుతున్నాను. ఈ రోజు పేద, మధ్యతరగతి ప్రజలతో పాటు MSME లు ఈ ప్రచారం నుండి చాలా ప్రయోజనాలను పొందడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ప్రచారం ద్వారా ప్రతి వర్గానికి చెందిన ప్రజలకు తమ ప్రతిభను ప్రదర్శించేందుకు అవకాశం లభించింది. నేడు భారతదేశం తయారీ రంగంలో పవర్‌హౌస్‌గా మారింది. దేశ యువ శక్తి కారణంగా యావత్ ప్రపంచం దృష్టి మనపై ఉంది. ఆటోమొబైల్స్, టెక్స్టైల్స్, ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్ లేదా డిఫెన్స్ ఇలా అన్ని రంగాలలో దేశ ఎగుమతులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో నిరంతరంగా పెరుగుతున్న ఎఫ్‌డిఐలు కూడా మన 'మేక్ ఇన్ ఇండియా' విజయగాథను చెప్తున్నాయి. ఇప్పుడు మనం ప్రధానంగా రెండు విషయాలపై దృష్టి పెడుతున్నాం. అందులో మొదటిది 'క్వాలిటీ'. అంటే మన దేశంలో తయారయ్యే వస్తువులు ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఉండాలి. రెండోది 'వోకల్ ఫర్ లోకల్'. అంటే స్థానిక విషయాలను వీలైనంతగా ప్రచారం చేయాలి. 'మన్ కీ బాత్'లో #MyProductMyPride గురించి కూడా చర్చించాం. స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం వల్ల దేశ ప్రజలు ఎలా ప్రయోజనం పొందుతారో ఒక ఉదాహరణతో అర్థం చేసుకోవచ్చు.
మహారాష్ట్రలోని భండారా జిల్లాలో టెక్స్ టైల్స్ లో పాత వారసత్వం ఉంది. దాని పేరు 'భండారా టసర్ సిల్క్ హ్యాండ్లూమ్'. టసర్ సిల్క్ దాని డిజైన్, రంగు, దృఢత్వానికి ప్రసిద్ధి చెందింది. భండారాలోని కొన్ని ప్రాంతాల్లో 50కి పైగా స్వయం సహాయక బృందాలు దీనిని పరిరక్షించే పనిలో నిమగ్నమై ఉన్నాయి. వీటిలో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉంది. ఈ సిల్క్ బాగా ప్రాచుర్యం పొందుతోంది. స్థానిక సమాజాలకు సాధికారత కల్పిస్తోంది. ఇది 'మేక్ ఇన్ ఇండియా' స్ఫూర్తి.
మిత్రులారా! ఈ పండుగ సీజన్లో మీరు మీ పాత తీర్మానాన్ని పునరావృతం చేయాలి. మీరు ఏది కొనుగోలు చేసినా అది 'మేడ్ ఇన్ ఇండియా' అయి ఉండాలి. మీరు ఏది బహుమతిగా ఇచ్చినా అది కూడా 'మేడ్ ఇన్ ఇండియా' అయి ఉండాలి. కేవలం మట్టి దీపాలు కొనడం ‘వోకల్ ఫర్ లోకల్’ కాదు. మీరు మీ ప్రాంతంలో తయారైన స్థానిక ఉత్పత్తులను వీలైనంత ఎక్కువగా ప్రచారం చేయాలి. భారతదేశ మట్టితో, భారతీయ శిల్పి చెమటతో తయారు చేసిన ఏదైనా ఉత్పత్తి మనకు గర్వకారణం. మనం ఎల్లప్పుడూ ఈ గర్వాన్ని జోడించాలి.
మిత్రులారా! ఈ ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్లో మీతో అనుసంధానం అవడం నాకు సంతోషంగా ఉంది. దయచేసి ఈ కార్యక్రమానికి సంబంధించిన మీ ఆలోచనలు, సూచనలను మాకు పంపండి. మీ ఉత్తరాలు, సందేశాల కోసం నేను ఎదురు చూస్తున్నాను. మరికొద్ది రోజుల్లో పండుగల సీజన్ ప్రారంభం అవుతుంది. ఇది నవరాత్రుల నుండి ప్రారంభమవుతుంది. తరువాతి రెండు నెలల వరకు ఈ పూజలు, వ్రతాలు, పండుగలు, ఉత్సాహం, ఆనందాల వాతావరణం మన చుట్టూ ప్రవహిస్తుంది. రాబోయే పండుగలకు మీ అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరందరూ మీ కుటుంబంతో, ప్రియమైన వారితో పండుగను ఆనందించండి. మీ ఆనందంలో ఇతరులను చేర్చుకోండి. వచ్చే నెల 'మన్ కీ బాత్'లో మరికొన్ని కొత్త అంశాలతో మీతో అనుసంధానమవుతుంది. మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి నా కుటుంబ సభ్యులైన మీ అందరికీ మరోసారి స్వాగతం. ఈ రోజు మనం మరోసారి దేశం సాధించిన విజయాలు, దేశ ప్రజల సామూహిక కృషి గురించి మాట్లాడుకుంటాం. 21వ శతాబ్దపు భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వికసిత భారతదేశ పునాదిని బలోపేతం చేస్తున్నాయి. ఉదాహరణకు ఈ ఆగస్టు 23వ తేదీన మనమందరం మొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని జరుపుకున్నాం. మీరందరూ ఈ రోజును తప్పకుండా జరుపుకున్నారని, చంద్రయాన్-3 విజయాన్ని మరోసారి జరుపుకున్నారని నాకు విశ్వాసం ఉంది. గత సంవత్సరం ఇదే రోజున చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ భాగంలోని శివ-శక్తి స్థలంలో విజయవంతంగా ల్యాండ్ అయింది. ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్ నిలిచింది.
మిత్రులారా! అంతరిక్ష రంగ సంస్కరణల వల్ల దేశంలోని యువతకు కూడా చాలా ప్రయోజనం లభించింది. కాబట్టి ఈ రోజు 'మన్ కీ బాత్'లో అంతరిక్ష రంగానికి సంబంధించిన కొంతమంది యువ సహోద్యోగులతో సంభాషించాలని నేను అనుకున్నాను. నాతో మాట్లాడేందుకు స్పేస్ టెక్ స్టార్ట్ అప్ GalaxEye బృందం సిద్ధంగా ఉంది. ఈ స్టార్టప్‌ను ఐఐటీ-మద్రాస్ పూర్వ విద్యార్థులు ప్రారంభించారు. ఈ యువకులు – సూయశ్, డేనిల్, రక్షిత్, కిషన్, ప్రణీత్- ఈరోజు ఫోన్ లైన్లో మనతో ఉన్నారు. రండి, ఈ యువత అనుభవాలను తెలుసుకుందాం.
ప్రధానమంత్రి: హల్లో!
యువకులందరూ: హల్లో సార్!
ప్రధానమంత్రి: అందరికీ నమస్కారం!
యువకులందరూ (కలిసి): నమస్కారం సార్!
ప్రధానమంత్రి: మిత్రులారా! మద్రాసు ఐఐటి లో ఏర్పడిన మీ స్నేహం నేటికీ బలంగా ఉండడాన్ని చూసి నేను సంతోషిస్తున్నాను. అందుకే మీరు GalaxEyeని ప్రారంభించాలని కలిసి నిర్ణయించుకున్నారు. ఈ రోజు నేను దాని గురించి కొంచెం తెలుసుకోవాలనుకుంటున్నాను. దాని గురించి చెప్పండి. దాంతో పాటు మీ సాంకేతికత వల్ల దేశానికి ఎంత మేలు జరుగుతుందో కూడా చెప్పండి.
సూయశ్: సార్.. నా పేరు సూయశ్. మేం మీరు చెప్పినట్టే ఐఐటీ-మద్రాస్‌లో కలుసుకున్నాం. మేమంతా వేర్వేరు సంవత్సరాల్లో అక్కడ చదువుకున్నాం. అక్కడ ఇంజనీరింగ్ చేశాం. హైపర్‌లూప్ అనే ప్రాజెక్ట్ చేయాలని అప్పట్లో అనుకున్నాం. మేం అనుకున్నది కలిసి చేయాలనుకున్నాం. ఆ సమయంలో మేం ఒక బృందాన్ని ప్రారంభించాం. దాని పేరు 'ఆవిష్కార్ హైపర్‌లూప్'. ఆ బృందంతో మేం అమెరికా కూడా వెళ్ళాం. ఆ సంవత్సరం ఆసియా నుండి అక్కడికి వెళ్లి దేశ జెండాను ప్రదర్శించిన ఏకైక బృందం మాది మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పదిహేను వందల బృందాల్లో అత్యుత్తమమైన 20 జట్లలో మేం ఉన్నాం.
ప్రధానమంత్రి: ఇంకా విందాం. ఇంకా వినడానికి ముందు ఈ విషయంలో నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను.
సూయశ్: మీకు చాలా ధన్యవాదాలు సార్. అదే సమయంలో మా స్నేహం ఈ విధంగా దృఢమైంది. కష్టతరమైన ప్రాజెక్ట్‌లు చేయగలమనే విశ్వాసాన్ని కూడా పొందాం. అదే సమయంలో SpaceX చూశాం. మీరు అంతరిక్ష రంగంలో ప్రారంభించిన ప్రైవేటీకరణ 2020లో ఒక మైలురాయిగా చెప్పగలిగే నిర్ణయం సార్. ఆ విషయంలో మేం చాలా సంతోషించాం. మరి మేం చేసిన పనుల గురించి మాట్లాడేందుకు, ఆ కృషి వల్ల జరిగిన ప్రయోజనం చెప్పేందుకు రక్షిత్‌ని ఆహ్వానించాలనుకుంటున్నాను.
రక్షిత్: సార్. నా పేరు రక్షిత్. ఈ సాంకేతికతతో మనకు ఏ ప్రయోజనం కలిగిందో నేను చెప్తాను సార్.
ప్రధానమంత్రి: రక్షిత్.. ఉత్తరాఖండ్‌లో మీ స్వగ్రామం ఎక్కడ?
రక్షిత్: సార్… మాది అల్మోరా.
ప్రధానమంత్రి: అంటే మీరు బాల్ మిఠాయి వారా?
రక్షిత్: అవును సార్. అవును సార్. బాల్ మిఠాయి మాకు చాలా ఇష్టం.
ప్రధానమంత్రి: మన లక్ష్యా సేన్ నాకు ఎప్పుడూ బాల్ మిఠాయి తినిపిస్తూ ఉంటాడు. రక్షిత్.. చెప్పండి.
రక్షిత్: మా ఈ సాంకేతికత అంతరిక్షం నుండి మేఘాలకు అవతల కూడా చూడగలదు. రాత్రిపూట కూడా చూడగలదు. కాబట్టి మనం ప్రతిరోజూ దేశంలోని ఏ మూలనైనా స్పష్టమైన చిత్రాన్ని తీయవచ్చు. మేం ఈ డేటాను రెండు రంగాలలో అభివృద్ధి కోసం ఉపయోగిస్తాం. మొదటిది భారతదేశాన్ని అత్యంత సురక్షిత ప్రదేశంగా రూపొందించడం. మేం ప్రతిరోజూ మన సరిహద్దులు, మహాసముద్రాలు, సముద్రాలను పర్యవేక్షిస్తాం. శత్రువు కార్యకలాపాలను పరిశీలిస్తుంటాం. మన సాయుధ దళాలకు ఈ సాంకేతికత ద్వారా ఇంటెలిజెన్స్ సమాచారం అందుతుంది. ఇక రెండవది భారతదేశంలోని రైతులకు సాధికారత కల్పించడం. మేం ఇప్పటికే భారతదేశంలోని రొయ్యల రైతుల కోసం ఒక ఉత్పత్తిని సృష్టించాం. ఇది ప్రస్తుత ధరలో 1/10వ వంతుతో అంతరిక్షం నుండి వారి చెరువుల నీటి నాణ్యతను కొలుస్తుంది. మేం మరింత ముందుకు సాగి, అత్యుత్తమ నాణ్యత ఉండే ఉపగ్రహ చిత్రాలను ప్రపంచానికి అందించాలనుకుంటున్నాం. గ్లోబల్ వార్మింగ్ వంటి అంతర్జాతీయ సమస్యలతో పోరాడేందుకు ప్రపంచానికి అత్యుత్తమ నాణ్యత ఉండే ఉపగ్రహ డేటాను అందించాలనేది మా లక్ష్యం సార్.
ప్రధానమంత్రి: అంటే మీ బృందం కూడా జై జవాన్, జై కిసాన్ అని చెప్తుంది.
రక్షిత్: అవును సార్, ఖచ్చితంగా.
ప్రధానమంత్రి: మిత్రులారా! మీరు ఇంత మంచి పని చేస్తున్నారు. మీ సాంకేతిక పరిజ్ఞానం ఖచ్చితత్వం ఎంతో కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
రక్షిత్: సార్.. మనం 50 సెంటీమీటర్ల కంటే తక్కువ రిజల్యూషన్ పొందగలం. మేం ఒకే సమయంలో సుమారు 300 చదరపు కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రాంతాన్ని చిత్రించగలం.
ప్రధానమంత్రి: సరే... ఇది విని దేశప్రజలు చాలా గర్వపడతారని నేను అనుకుంటున్నాను. నేను మరొక ప్రశ్న అడగాలనుకుంటున్నాను.
రక్షిత్: సార్.
ప్రధాన మంత్రి: అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ చాలా శక్తిమంతంగా మారుతోంది. మీ బృందం ఇప్పుడు ఎలాంటి మార్పులను చూస్తోంది?
కిషన్: సార్.. నా పేరు కిషన్. మేం GalaxEye ప్రారంభించినప్పటి నుండి IN-SPAce రావడాన్ని చూశాం. 'జియో-స్పేషియల్ డేటా పాలసీ', భారత అంతరిక్ష విధానం మొదలైన అనేక విధానాలు రావడాన్ని మేం చూశాం. గత 3 సంవత్సరాలలో చాలా మార్పులు రావడం చూశాం. చాలా ప్రక్రియలు, చాలా మౌలిక సదుపాయాలు, చాలా సౌకర్యాలు ఇస్రో ద్వారా అందుబాటులోకి వచ్చాయి. ఇవన్నీ చాలా మంచి మార్గంలో ఉన్నాయి. ఇప్పుడు మనం ఇస్రోకి వెళ్లి మన హార్డ్‌వేర్‌ని చాలా సులభంగా పరీక్షించవచ్చు. మూడేళ్ల కిందట ఆ ప్రక్రియలు అంతగా లేవు. ఇది మాకు, అనేక ఇతర స్టార్ట్-అప్‌లకు కూడా చాలా సహాయకారిగా ఉంది. ఇటీవలి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాల కారణంగా, సౌకర్యాల లభ్యత కారణంగా స్టార్ట్-అప్లు రావడానికి చాలా ప్రోత్సాహకాలు ఉన్నాయి. ఈ విధంగా స్టార్ట్-అప్లు అభివృద్ధి చెందడం చాలా కష్టంగా, ఖర్చుతో కూడుకుని సమయం తీసుకునే రంగాలలో కూడా చాలా సులభంగా, చాలా బాగా అభివృద్ధి చెందుతాయి. కానీ ప్రస్తుత విధానాలు, ఇన్-స్పేస్ వచ్చిన తర్వాత స్టార్ట్-అప్‌లకు చాలా విషయాలు సులభంగా మారాయి. నా స్నేహితుడు డేనిల్ చావ్రా కూడా దీని గురించి చెప్తాడు.
ప్రధానమంత్రి: డేనిల్.. చెప్పండి...
డేనిల్: సార్... ఇంకో విషయం గమనించాం. ఇంజినీరింగ్ విద్యార్థుల ఆలోచనలో మార్పు కనిపించింది. ఇంతకు ముందు వారు బయటకు వెళ్లి ఉన్నత చదువులు చదవాలనుకునేవారు. అక్కడ అంతరిక్ష రంగంలో పని చేయాలనుకునేవారు. కానీ ఇప్పుడు భారతదేశంలో అంతరిక్ష పర్యావరణ వ్యవస్థ చాలా బాగా ఉన్నందువల్ల వారు భారతదేశానికి తిరిగి వచ్చి ఈ వ్యవస్థలో పనిచేయడం ప్రారంభించారు. కాబట్టి మాకు చాలా మంచి ఫీడ్‌బ్యాక్ వచ్చింది. కొంతమంది ఈ కారణం వల్ల విదేశాల నుండి తిరిగి వచ్చి, మా కంపెనీలో పని చేస్తున్నారు.
ప్రధానమంత్రి: కిషన్, డేనిల్ ఇద్దరూ ప్రస్తావించిన అంశాల గురించి ఎక్కువ మంది ఆలోచించరని నేను భావిస్తున్నాను. ఒక రంగంలో సంస్కరణలు జరిగినప్పుడు ఆ సంస్కరణలు ఎన్ని బహుళ ప్రభావాలను కలిగిస్తాయనే వాస్తవాన్ని, ఎంత మంది వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారనే విషయాన్ని చాలా మంది పట్టించుకోలేదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. మీరు ఆ రంగంలో ఉన్నందు వల్ల ఇది మీ దృష్టికి వస్తుంది. దేశంలోని యువత ఇప్పుడు ఈ రంగంలో తమ భవిష్యత్తును ఉపయోగించాలనుకుంటున్నారని, తమ ప్రతిభను ప్రదర్శించాలనుకుంటున్నారని మీరు గమనించారు. మీ పరిశీలన చాలా బాగుంది. మరో ప్రశ్న అడగాలనుకుంటున్నాను. స్టార్టప్‌లు, అంతరిక్ష రంగంలో విజయం సాధించాలనుకునే యువతకు మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను.
ప్రణీత్: సార్..నేను ప్రణీత్ ను మాట్లాడుతున్నాను. మీ ప్రశ్నకు నేను సమాధానం ఇస్తాను.
ప్రధానమంత్రి: సరే.. ప్రణీత్, చెప్పండి.
ప్రణీత్: సార్… కొన్ని సంవత్సరాల నా అనుభవం నుండి రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను. అన్నింటిలో మొదటిది మీరు స్టార్ట్-అప్ ప్రారంభించాలనుకుంటే ఇదే మంచి అవకాశం. ఎందుకంటే మొత్తం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా భారతదేశం ఉంది. దీని అర్థం మీకు చాలా అవకాశాలు ఉన్నాయి. వచ్చే ఏడాది మేం ఉపగ్రహాన్ని ప్రయోగించబోతున్నామని ఇలా 24 ఏళ్ల వయసులో చెప్పడాన్ని నేను గర్వంగా భావిస్తున్నాను. దాని ఆధారంగా మన ప్రభుత్వం కొన్ని ప్రధాన నిర్ణయాలు తీసుకుంటుంది. దానిలో మాకు చిన్న భాగస్వామ్యం ఉంటుంది. అటువంటి కొన్ని జాతీయ ప్రభావ ప్రాజెక్ట్‌లలో పని చేయండి. ఇది అలాంటి సరైన పరిశ్రమ. ఇది అలాంటి సరైన సమయం. ఇది జాతీయ ప్రభావం కోసం మాత్రమే కాకుండా వారి స్వంత ఆర్థిక వృద్ధికి, ప్రపంచ సమస్యను పరిష్కరించడానికి ఇది ఒక అవకాశమని నా యువ స్నేహితులకు చెప్పాలనుకుంటున్నాను. పెద్దయ్యాక నటులం అవుతాం, క్రీడాకారులం అవుతాం అని చిన్నప్పుడు చెప్పుకునేవాళ్ళం. కాబట్టి ఇక్కడ అలాంటివి జరిగేవి. కానీ పెద్దయ్యాక పారిశ్రామికవేత్త కావాలని, అంతరిక్ష పరిశ్రమలో పనిచేయాలని కోరుకుంటున్నానని ఈ రోజు మనం వింటున్నాం. ఈ మొత్తం పరివర్తనలో చిన్న పాత్ర పోషిస్తున్నందుకు ఇది మాకు చాలా గర్వకారణం.
ప్రధానమంత్రి: మిత్రులారా! ప్రణీత్, కిషన్, డానిల్, రక్షిత్, సూయశ్.. ఒక విధంగా చెప్పాలంటే.. మీ స్నేహం లాగే మీ స్టార్టప్ కూడా దృఢంగా ఉంది. అందుకే మీరు ఇంత అద్భుతమైన పని చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం మద్రాస్ ఐఐటి ని సందర్శించే అవకాశం నాకు లభించింది. ఆ సంస్థ గొప్పతనాన్ని ప్రత్యక్షంగా అనుభవించాను. ఏమైనప్పటికీ ఐఐటిల పట్ల ప్రపంచం మొత్తం మీద గౌరవం ఉంది. అక్కడి నుండి బయటకు వచ్చే మన ప్రజలు భారతదేశం కోసం పని చేసినప్పుడు ఖచ్చితంగా ఏదైనా మంచిని అందిస్తారు. మీ అందరికీ- అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న ఇతర స్టార్ట్-అప్‌లందరికీ నేను చాలా చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మీ ఐదుగురు స్నేహితులతో మాట్లాడటం నాకు ఆనందాన్ని కలిగించింది. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా!
సూయశ్: చాలా ధన్యవాదాలు సార్!
నా ప్రియమైన దేశవాసులారా! రాజకీయ నేపథ్యం లేని లక్ష మంది యువతను రాజకీయ వ్యవస్థతో అనుసంధానించాలని ఈ సంవత్సరం నేను ఎర్రకోట నుండి పిలుపునిచ్చాను. దీనికి నాకు అద్భుతమైన స్పందన వచ్చింది. దీన్నిబట్టి మన యువత ఎంత పెద్ద సంఖ్యలో రాజకీయాల్లోకి రావడానికి సిద్ధంగా ఉన్నారో అర్థమవుతుంది. వారు సరైన అవకాశం, సరైన మార్గదర్శకత్వం కోసం చూస్తున్నారు. దేశవ్యాప్తంగా యువత నుంచి ఈ అంశంపై నాకు లేఖలు కూడా వచ్చాయి. సామాజిక మాధ్యమాల్లో కూడా విశేష స్పందన వస్తోంది. ప్రజలు కూడా నాకు చాలా రకాల సలహాలు పంపారు. ఇది నిజంగా తమకు ఊహకందని విషయమని కొందరు యువకులు లేఖలో రాశారు. తాతగారికి గానీ తల్లిదండ్రులకు గానీ రాజకీయ వారసత్వం లేకపోవడంతో రాజకీయాల్లోకి రావాలనుకున్నా వారు రాలేకపోయారు. రాలేకపోయింది తమకు అట్టడుగు స్థాయిలో పనిచేసిన అనుభవం ఉందని, ప్రజల సమస్యల పరిష్కారానికి తమ అనుభవం ఉపయోగపడుతుందని కొంతమంది యువకులు రాశారు. కుటుంబ రాజకీయాలు కొత్త ప్రతిభను అణిచివేస్తాయని కూడా కొందరు రాశారు. ఇలాంటి ప్రయత్నాలు మన ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తాయని కొందరు యువకులు అభిప్రాయపడ్డారు. ఈ అంశంపై సూచనలను పంపినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని యువత కూడా ఇప్పుడు మన సామూహిక కృషితో రాజకీయాల్లో ముందుకు రావాలని కోరుకుంటున్నాను. వారి అనుభవం, ఉత్సాహం దేశానికి ఉపయోగపడతాయని ఆశిస్తున్నాను.
మిత్రులారా! సమాజంలోని వివిధ వర్గాలకు చెంది, రాజకీయ నేపథ్యం లేని అనేక మంది స్వాతంత్య్ర పోరాట సమయంలో కూడా ముందుకు వచ్చారు. భారతదేశానికి స్వాతంత్ర్యం కోసం తమను తాము త్యాగం చేసుకున్నారు. వికసిత భారతదేశ లక్ష్యాన్ని సాధించడానికి ఈ రోజు మనకు మరోసారి అదే స్ఫూర్తి అవసరం. తప్పకుండా ఈ ప్రచారంలో పాల్గొనమని నా యువ స్నేహితులందరికీ చెప్తాను. మీ ఈ అడుగు మీ భవిష్యత్తును, దేశ భవిష్యత్తును మారుస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! ‘హర్ ఘర్ తిరంగా, పూరా దేశ్ తిరంగా’ ప్రచారం ఈసారి పూర్తి స్థాయిలో ఉంది. దేశంలోని నలుమూలల నుండి ఈ ప్రచారానికి సంబంధించిన అద్భుతమైన చిత్రాలు వచ్చాయి. ఇళ్లపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించడం చూశాం. స్కూళ్లు, కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని చూశాం. ప్రజలు తమ దుకాణాలు, కార్యాలయాల్లో పతాకాన్ని ఎగురవేశారు. తమ డెస్క్‌టాప్‌లు, మొబైళ్లు, వాహనాలపై కూడా త్రివర్ణ పతాకాన్ని ఉంచారు. ప్రజలు ఒకచోట చేరి తమ భావాలను వ్యక్తం చేసినప్పుడు ప్రతి ప్రచారానికి ఊతం లభిస్తుంది. మీరు ప్రస్తుతం మీ టీవీ స్క్రీన్‌పై చూస్తున్న చిత్రాలు జమ్మూ కాశ్మీర్‌లోని రియాసికి చెందినవి. అక్కడ 750 మీటర్ల పొడవైన జెండాతో త్రివర్ణ పతాక ర్యాలీని నిర్వహించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన చినాబ్ రైల్వే బ్రిడ్జిపై ఈ ర్యాలీ జరిపారు. ఈ చిత్రాలను చూసిన వారందరికీ ఆనందం కలిగింది. శ్రీనగర్‌లోని దాల్ లేక్‌లో త్రివర్ణ పతాక యాత్రకు సంబంధించిన అందమైన చిత్రాలను అందరం చూశాం. అరుణాచల్ ప్రదేశ్‌లోని ఈస్ట్ కామెంగ్ జిల్లాలో 600 అడుగుల పొడవైన త్రివర్ణ పతాకంతో యాత్ర నిర్వహించారు. అదేవిధంగా దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ అన్ని వయసుల వారు ఇలాంటి త్రివర్ణ పతాక ఊరేగింపుల్లో పాల్గొన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం ఇప్పుడు సామాజిక పర్వదినంగా మారుతోంది. మీరు కూడా దీన్ని అనుభూతి చెంది ఉండవచ్చు. ప్రజలు తమ ఇళ్లను త్రివర్ణ మాలలతో అలంకరిస్తారు. స్వయం సహాయక సంఘాలతో సంబంధం ఉన్న మహిళలు లక్షల జెండాలను తయారు చేస్తారు. ఇ-కామర్స్ వేదికలో త్రివర్ణ రంగులో ఉన్న వస్తువుల విక్రయం పెరుగుతుంది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని నలుమూలల, నేల- నీరు-ఆకాశంలో ఎక్కడ చూసినా మన జెండా మూడు రంగులే కనిపించాయి. హర్ ఘర్ తిరంగా వెబ్సైట్లో కూడా ఐదు కోట్లకు పైగా సెల్ఫీలు పోస్ట్ అయ్యాయి. ఈ ప్రచారం మొత్తం దేశాన్ని ఒక చోట చేర్చింది. ఇదే 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్'.
నా ప్రియమైన దేశవాసులారా! మనుషులు, జంతువుల ప్రేమపై మీరు చాలా సినిమాలు చూసి ఉంటారు. అయితే ఈ రోజుల్లో అస్సాంలో ఓ రియల్ స్టోరీ తయారవుతోంది. అస్సాంలోని తిన్ సుకియా జిల్లాలోని చిన్న గ్రామం బారేకురీలో, మోరాన్ ఆదివాసీ తెగకు చెందిన ప్రజలు నివసిస్తున్నారు. ఇదే గ్రామంలో 'హూలాక్ గిబన్లు' కూడా నివసిస్తున్నాయి. వాటిని అక్కడ 'హోలో కోతులు' అని పిలుస్తారు. హూలాక్ గిబ్బన్లు ఈ గ్రామంలోనే తమ నివాసం ఏర్పాటు చేసుకున్నాయి. తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు- ఈ గ్రామ ప్రజలకు హూలాక్ గిబ్బన్లతో చాలా లోతైన అనుబంధం ఉంది. ఇప్పటికీ గ్రామ ప్రజలు తమ సంప్రదాయ విలువలను పాటిస్తున్నారు. అందువల్ల గిబ్బన్లతో తమ సంబంధాన్ని మరింత బలోపేతం చేసే అన్ని పనులను చేశారు. గిబ్బన్లు అరటిపండ్లను ఇష్టపడతాయని తెలుసుకున్న వారు అరటి సాగును కూడా ప్రారంభించారు. అంతే కాకుండా గిబ్బన్ల జనన మరణాలకు సంబంధించిన ఆచారాలను మనుషులకు చేసే విధంగానే నెరవేర్చాలని నిర్ణయించుకున్నారు. వారు గిబ్బన్లకు పేర్లు కూడా పెట్టారు. ఇటీవల సమీపంలోని విద్యుత్ తీగల వల్ల గిబ్బన్లు ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. అటువంటి పరిస్థితిలో, ఈ గ్రామ ప్రజలు ఈ విషయాన్ని ప్రభుత్వం ముందు ఉంచారు. త్వరలోనే దాని పరిష్కారం లభించింది. ఇప్పుడు ఈ గిబ్బన్లు ఫోటోలకు కూడా పోజులిస్తాయని నాకు తెలిసింది.
స్నేహితులారా! అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన మన యువ స్నేహితులు కూడా జంతువులపై ప్రేమలో వెనుకాడరు. అరుణాచల్‌లోని మన యువ స్నేహితులు కొందరు 3-డి ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించడం ప్రారంభించారు. ఎందుకో తెలుసా? ఎందుకంటే కొమ్ములు, దంతాల కోసం అడవి జంతువులను వేటాడకుండా కాపాడాలని వారు కోరుకుంటారు. నాబమ్ బాపు, లిఖా నానా నేతృత్వంలో ఈ బృందం జంతువులలోని వివిధ భాగాలను 3-డి ప్రింటింగ్ చేస్తుంది. జంతువుల కొమ్ములు కావచ్చు. దంతాలు కావచ్చు. వీటన్నింటినీ 3-డి ప్రింటింగ్ ద్వారా రూపొందిస్తారు. వీటి నుండి దుస్తులు, టోపీలు వంటి వాటిని తయారు చేస్తారు. బయో-డిగ్రేడబుల్ సామగ్రిని ఉపయోగించే అద్భుతమైన ప్రత్యామ్నాయం ఇది. ఇలాంటి అద్భుతమైన ప్రయత్నాలను ఎంత ప్రశంసించినా తక్కువే. మన జంతువుల రక్షణ కోసం, సంప్రదాయ పరిరక్షణ కోసం ఈ రంగంలో మరిన్ని స్టార్టప్‌లు రావాలని నేను చెప్తాను.
నా ప్రియమైన దేశప్రజలారా! మధ్యప్రదేశ్‌లోని ఝాబువాలో ఒక అద్భుతం జరుగుతోంది. దాని గురించి మీరు తప్పక తెలుసుకోవాలి. మన పారిశుద్ధ్య కార్మిక సోదర సోదరీమణులు అక్కడ అద్భుతాలు చేశారు. ఈ సోదర సోదరీమణులు ' వ్యర్థం నుండి సంపద' అనే సందేశాన్ని వాస్తవంగా మార్చి, మనకు చూపించారు. ఈ బృందం ఝాబువాలోని ఒక పార్కులో చెత్త నుండి అద్భుతమైన కళాకృతులను రూపొందించింది. ఇందుకోసం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలు, సీసాలు, టైర్లు, పైపులను సేకరించారు. ఈ కళాఖండాలలో హెలికాప్టర్లు, కార్లు, ఫిరంగులు కూడా ఉన్నాయి. అందమైన వేలాడే పూల కుండీలను కూడా తయారు చేశారు. వాడిన టైర్లను ఇక్కడ సౌకర్యవంతమైన బెంచీల తయారీకి ఉపయోగించారు. ఈ పారిశుద్ధ్య కార్మికుల బృందం రెడ్యూస్, రీ యూజ్, రీసైకిల్ అనే మంత్రాన్ని స్వీకరించింది. వారి కృషి వల్ల పార్క్ చాలా అందంగా కనిపించడం ప్రారంభించింది. దీన్ని చూసేందుకు స్థానికులే కాకుండా చుట్టుపక్కల జిల్లాల్లో నివసించే వారు కూడా అక్కడికి చేరుకుంటున్నారు.
మిత్రులారా! ఈ రోజు మన దేశంలో అనేక స్టార్టప్ టీమ్‌లు కూడా పర్యావరణాన్ని ప్రోత్సహించే ఇటువంటి ప్రయత్నాలలో పాలుపంచుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇ-కాన్షస్ పేరుతో ఉన్న ఒక బృందం పర్యావరణ అనుకూల ఉత్పత్తులను తయారు చేయడానికి ప్లాస్టిక్ వ్యర్థాలను ఉపయోగిస్తోంది. మన పర్యాటక ప్రదేశాలలో- ముఖ్యంగా కొండ ప్రాంతాలలో- పేరుకుపోయిన చెత్తను చూసిన తర్వాత వారికి ఈ ఆలోచన వచ్చింది. అలాంటి వారితో కూడిన మరో బృందం ఎకోకారీ అనే స్టార్టప్‌ను ప్రారంభించింది. ఆ బృందం ప్లాస్టిక్ వ్యర్థాల నుండి వివిధ అందమైన వస్తువులను తయారు చేస్తుంది.
మిత్రులారా! టాయ్ రీసైక్లింగ్ అనేది మనం కలిసి పని చేసే మరొక రంగం. చాలా మంది పిల్లలు బొమ్మలతో ఎంత త్వరగా విసుగు చెందుతారో కూడా మీకు తెలుసు. అదే సమయంలో ఆ బొమ్మలను ఆరాధిస్తూ కలలు కనే పిల్లలు కూడా ఉన్నారు. మీ పిల్లలు ఇకపై ఆడని బొమ్మలను వాటిని ఉపయోగించే ప్రదేశాలకు విరాళంగా ఇవ్వవచ్చు. పర్యావరణ పరిరక్షణకు ఇది కూడా మంచి మార్గం. మనందరం కలిసికట్టుగా కృషి చేస్తేనే పర్యావరణం పటిష్టంగా మారి దేశం కూడా పురోగమిస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! కొద్ది రోజుల క్రితం ఆగస్టు 19వ తేదీన రక్షాబంధన్ పండుగను జరుపుకున్నాం. అదే రోజున ప్రపంచ వ్యాప్తంగా ‘ప్రపంచ సంస్కృత దినోత్సవం’ కూడా జరుపుకున్నారు. నేటికీ భారతదేశంతో పాటు విదేశాలలో కూడా సంస్కృతంతో ప్రజలకు ప్రత్యేక అనుబంధం ఉంది. ప్రపంచంలోని అనేక దేశాల్లో సంస్కృత భాషపై వివిధ రకాల పరిశోధనలు, ప్రయోగాలు జరుగుతున్నాయి. మనం తర్వాతి సంభాషణ కొనసాగించే ముందు మీ కోసం చిన్న ఆడియో క్లిప్ వినిపిస్తున్నాను.
## ఆడియో క్లిప్####
మిత్రులారా! ఈ ఆడియో యూరప్‌లోని లిథువేనియా దేశానికి సంబంధించింది. అక్కడి ప్రొఫెసర్ వైటిస్ విదునాస్ అద్వితీయమైన ప్రయత్నం చేసి దానికి ‘నదులపై సంస్కృతం’ అని పేరు పెట్టారు. అక్కడి నెరిస్ నది ఒడ్డున ఒక సమూహం గుమిగూడి వేదాలు, గీతా పఠించారు. అక్కడ గత కొన్నేళ్లుగా అలాంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మీరు కూడా సంస్కృతాన్ని ముందుకు తీసుకెళ్లే ఇలాంటి ప్రయత్నాలను ముందుకు తీసుకువస్తూ ఉండండి.
నా ప్రియమైన దేశప్రజలారా! మనందరి జీవితాల్లో ఫిట్‌నెస్‌కు చాలా ప్రాముఖ్యత ఉంది. ఫిట్‌గా ఉండాలంటే మన ఆహారపు అలవాట్లు, జీవనశైలిపై శ్రద్ధ పెట్టాలి. ఫిట్నెస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు ‘ఫిట్ ఇండియా క్యాంపెయిన్’ ప్రారంభమైంది. వయస్సు, వర్గాలతో సంబంధం లేకుండా ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటానికి యోగాను అవలంబిస్తున్నారు. ప్రజలు ఇప్పుడు తమ భోజనంలో సూపర్‌ఫుడ్ మిల్లెట్లకు- అంటే శ్రీ అన్నకి- స్థానం ఇవ్వడం ప్రారంభించారు. ప్రతి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలన్నదే ఈ ప్రయత్నాల లక్ష్యం.
మిత్రులారా! మన కుటుంబం, మన సమాజం, మన దేశం- వారందరి భవిష్యత్తు మన పిల్లల ఆరోగ్యంపై ఆధారపడి ఉంటుంది. పిల్లల మంచి ఆరోగ్యం కోసం వారు సరైన పోషకాహారాన్ని కొనసాగించడం చాలా ముఖ్యం. పిల్లల పౌష్టికాహారం దేశం ప్రాధాన్యత. మనం ఏడాది పొడవునా వారి పోషణపై శ్రద్ధ చూపినప్పటికీ ఒక నెల పాటు దేశం దానిపై ప్రత్యేక దృష్టి పెడుతుంది. దీని కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబరు 1వ తేదీ నుండి సెప్టెంబరు 30వ తేదీ మధ్య పోషకాహార మాసాన్ని జరుపుకుంటారు. పౌష్టికాహారంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పోషకాహార మేళా, రక్తహీనత శిబిరం, నవజాత శిశువుల ఇంటి సందర్శన, సెమినార్, వెబ్‌నార్ వంటి అనేక పద్ధతులను అవలంబిస్తున్నారు. అనేక చోట్ల అంగన్వాడీల నిర్వహణలో మాతా శిశు కమిటీలను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ పోషకాహార లోపం ఉన్న పిల్లలు, గర్భిణీ స్త్రీలు, నవజాత శిశువుల తల్లుల ఆరోగ్యంపై శ్రద్ద పెడుతుంది. వారిని నిరంతరం పర్యవేక్షిస్తుంది. వారి పోషకాహారానికి ఏర్పాట్లు చేస్తుంది. గతేడాది నూతన విద్యా విధానానికి పౌష్టికాహార ప్రచారాన్ని అనుసంధానం చేశారు. ‘పోషణ్ భీ పఢాయీ భీ’ ప్రచారం పిల్లల సమతుల అభివృద్ధిపై దృష్టి సారించింది. మీ ప్రాంతంలో పోషకాహార అవగాహన ప్రచారంలో మీరు కూడా చేరాలి. పోషకాహార లోపానికి వ్యతిరేకంగా జరిగే ఈ పోరాటంలో మీ చిన్న ప్రయత్నం ఎంతో దోహదపడుతుంది.
నా ప్రియమైన దేశవాసులారా! ఈసారి 'మన్ కీ బాత్'లో ఇంతే. 'మన్ కీ బాత్'లో మీతో మాట్లాడటం నాకు ఎప్పుడూ గొప్పగా అనిపిస్తుంది. నేను నా కుటుంబ సభ్యులతో కూర్చుని తేలికపాటి వాతావరణంలో నా మనసులోని మాటలను పంచుకున్నట్టు అనిపిస్తుంది. మీ మనసులతో అనుసంధానమవుతున్నాను. మీ అభిప్రాయాలు, సూచనలు నాకు చాలా విలువైనవి. మరికొద్ది రోజుల్లో ఎన్నో పండుగలు వస్తున్నాయి. ఆ పండుగల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జన్మాష్టమి పండుగ కూడా ఉంది. వచ్చే నెల ప్రారంభంలో వినాయక చవితి పండుగ కూడా ఉంది. ఓనం పండుగ కూడా దగ్గరలోనే ఉంది. మిలాద్-ఉన్-నబీ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.
మిత్రులారా! ఈ నెల 29వ తేదీన 'తెలుగు భాషా దినోత్సవం' కూడా ఉంది. ఇది నిజంగా చాలా అద్భుతమైన భాష. ప్రపంచవ్యాప్తంగా తెలుగు మాట్లాడేవారందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు.
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న
తెలుగు వారికి
తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
మిత్రులారా! ఈ వర్షాకాలంలో మీరందరూ జాగ్రత్తగా ఉండవలసిందిగా కోరుతున్నాను. 'క్యాచ్ ద రెయిన్ మూవ్మెంట్'లో కూడా భాగస్వాములు కావాలని నా అభ్యర్థనను తెలియజేస్తున్నాను. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ ప్రచారాన్ని మీ అందరికీ గుర్తు చేయాలనుకుంటున్నాను. వీలైనన్ని ఎక్కువ చెట్లను నాటండి. ఇతరులను కూడా అలాగే చేయమని ప్రోత్సహించండి. మరికొద్ది రోజుల్లో పారిస్‌లో పారాలింపిక్స్ ప్రారంభమవుతాయి. మన దివ్యాంగ సోదర సోదరీమణులు అక్కడికి చేరుకున్నారు. 140 కోట్ల భారతీయులు మన అథ్లెట్లను, క్రీడాకారులను ఉత్సాహపరుస్తున్నారు. మీరు #cheer4bharatతో మన క్రీడాకారులను ప్రోత్సహించండి. వచ్చే నెలలో మరోసారి అనుసంధానమై అనేక అంశాలపై చర్చిద్దాం. అప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీకు స్వాగతం. అభినందనలు. ప్రస్తుతం పారిస్ ఒలింపిక్స్ ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఒలింపిక్స్ మన క్రీడాకారులకు ప్రపంచ వేదికపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసే అవకాశం అందిస్తుంది. దేశం కోసం ఏదైనా చేసే అవకాశాన్ని కల్పిస్తుంది. మీరు కూడా మన క్రీడాకారులను ప్రోత్సహించండి. ఛీర్ ఫర్ భారత్.!!
మిత్రులారా! క్రీడా ప్రపంచంలో ఈ ఒలింపిక్స్‌తో పాటు, కొద్ది రోజుల క్రితం గణిత ప్రపంచంలో కూడా ఒలింపిక్స్ జరిగాయి. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ జరిగింది. ఈ ఒలింపియాడ్‌లో భారతీయ విద్యార్థులు అద్భుత ప్రదర్శన చూపింది. ఇందులో మన జట్టు అత్యుత్తమ ప్రదర్శన చూపి నాలుగు బంగారు పతకాలు, ఒక రజత పతకం సాధించింది. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో 100 కంటే ఎక్కువ దేశాలకు చెందిన యువత పాల్గొంటోంది. మన బృందం మొదటి ఐదు స్థానాల్లోకి రావడంలో విజయం సాధించింది. దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ఈ విద్యార్థులు - పూణే నివాసి ఆదిత్య వెంకట్ గణేష్, పూణే నుండే సిద్ధార్థ్ చోప్రా, ఢిల్లీ నుండి అర్జున్ గుప్తా, గ్రేటర్ నోయిడా నుండి కనవ్ తల్వార్, ముంబాయి నుండి రుశీల్ మాథుర్, గౌహతికి చెందిన ఆనందో భాదురి.
మిత్రులారా! ఈ రోజు ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి నేను ఈ యువ విజేతలను ప్రత్యేకంగా ఆహ్వానించాను. వాళ్లంతా ఈ సమయంలో మనతో ఫోన్లో ఉన్నారు.
ప్రధానమంత్రి:- నమస్కారం మిత్రులారా! ‘మన్ కీ బాత్’ కు స్నేహితులందరికీ స్వాగతం. మీరందరూ ఎలా ఉన్నారు?
విద్యార్థులు:- బాగున్నాం సార్.
ప్రధానమంత్రి:- మిత్రులారా! 'మన్ కీ బాత్' ద్వారా మీ అందరి అనుభవాలను తెలుసుకోవాలని దేశప్రజలు చాలా ఆసక్తితో ఉన్నారు. నేను ఆదిత్య, సిద్ధార్థ్ లతో ప్రారంభిస్తాను. మీరు పూణేలో ఉన్నారు. ముందుగా నేను మీతో ప్రారంభిస్తాను. ఒలింపియాడ్ సమయంలో మీ అనుభవాలను మా అందరితో పంచుకోండి.
ఆదిత్య :- నాకు గణితంలో కొద్దిగా ఆసక్తి ఉండేది సార్. నాకు 6వ తరగతిలో గణితం నేర్పిన ఓంప్రకాశ్ సార్ మా టీచర్. ఆయన నాకు గణితంపై ఆసక్తిని పెంచారు. నేను నేర్చుకోగలిగాను. నాకు అవకాశం వచ్చింది సార్.
ప్రధానమంత్రి: మీ మిత్రుడు ఏమంటారు?
సిద్ధార్థ్:- సార్! నేను సిద్ధార్థ్. మాది పూణే. నేను ఈ మధ్యే 12వ తరగతి పాసయ్యాను. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్ లో పాల్గొనడం నాకు రెండవ సారి. నాకు కూడా గణితంపై చాలా ఆసక్తి ఉంది. నేను ఆరో తరగతిలో ఉన్నప్పుడు ఓం ప్రకాశ్ సార్ మా ఇద్దరికీ శిక్షణనిచ్చారు. మాకు చాలా సహాయం చేశారు. నేను ప్రస్తుతం సీఎంఐ కాలేజీ లో చదువుతున్నాను. అక్కడ గణితం, కంప్యూటర్ సైన్స్ నేర్చుకుంటున్నాను.
ప్రధానమంత్రి: సరే! అర్జున్ ప్రస్తుతం గాంధీనగర్‌లో ఉన్నారని, కనవ్ గ్రేటర్ నోయిడాకు చెందినవారని నాకు తెలిసింది. అర్జున్, కనవ్ మనం ఒలింపియాడ్ గురించి చర్చించుకున్నాం. అయితే మీరిద్దరూ మీ సన్నద్ధతకు సంబంధించిన ఏదైనా అంశాన్ని, ఏదైనా ప్రత్యేక అనుభవాన్ని చెప్తే మన శ్రోతలు ఇష్టపడతారు.
అర్జున్:- నమస్కారం సార్. జై హింద్! నేను అర్జున్ ని మాట్లాడుతున్నాను సార్.
ప్రధాన మంత్రి :- జై హింద్ అర్జున్.
అర్జున్ :- నేను ఢిల్లీలో ఉంటున్నాను. మా అమ్మ శ్రీమతి ఆశా గుప్తా ఢిల్లీ యూనివర్సిటీలో ఫిజిక్స్ ప్రొఫెసర్. మా నాన్న శ్రీ అమిత్ గుప్తా ఛార్టర్డ్ అకౌంటెంట్. దేశ ప్రధాన మంత్రితో మాట్లాడడాన్ని నేను చాలా గర్వంగా భావిస్తున్నాను సార్. ముందుగా నా విజయానికి సంబంధించిన క్రెడిట్‌ను మా తల్లిదండ్రులకు అందించాలనుకుంటున్నాను. ఒక కుటుంబంలోని సభ్యుడు అలాంటి పోటీకి సిద్ధమవుతున్నప్పుడు అది ఆ సభ్యుని పోరాటం మాత్రమే కాదు- యావత్ కుటుంబ పోరాటం అని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా ఈ పేపర్లో మూడు సమస్యలు పరిష్కరించేందుకు నాలుగున్నర గంటల సమయం ఉంటుంది. అంటే ఒక సమస్యకు గంటన్నర. సమస్యను పరిష్కరించేందుకు ఎంత సమయం ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి, మనం ఇంట్లో చాలా కష్టపడాలి. ఇలాంటి సమస్యలకు గంటలు వెచ్చించాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఒక రోజు పడుతుంది. కొన్నిసార్లు ప్రతి సమస్యతో 3 రోజులు గడపవలసి ఉంటుంది. కాబట్టి దీని కోసం మనం ఆన్లైన్లో సమస్యలను వెతకాల్సి ఉంటుంది. మనం కిందటి ఏడాది సమస్యను ప్రయత్నిస్తాం. క్రమంగా కష్టపడి పని చేస్తున్నప్పుడు మన అనుభవం పెరుగుతుంది. అత్యంత ముఖ్యమైన విషయం- మన సమస్యా పరిష్కార సామర్థ్యం పెరుగుతుంది. ఇది గణితంలో మాత్రమే కాదు- జీవితంలోని ప్రతి రంగంలో మనకు ఉపయోగపడుతుంది.
ప్రధానమంత్రి: సరే! కనవ్… ఈ సన్నాహాల్లో ఏదైనా ప్రత్యేకమైన అనుభవం ఉంటే మీరు నాకు చెప్పగలరా! ఈ తయారీలో ఏమైనా ప్రత్యేకత ఉంటే మన యువ స్నేహితులు తెలుసుకుని చాలా సంతోషిస్తారు.
కనవ్ తల్వార్: నా పేరు కనవ్ తల్వార్. నేను ఉత్తరప్రదేశ్‌లోని గ్రేటర్ నోయిడాలో నివసిస్తున్నాను. నేను 11వ తరగతి విద్యార్థిని. గణితం నాకు ఇష్టమైన సబ్జెక్ట్. నాకు చిన్నప్పటి నుంచి గణితం అంటే చాలా ఇష్టం. నా చిన్నప్పుడు మా నాన్న నాతో పజిల్స్ చేయించేవారు. దానివల్ల నా ఆసక్తి పెరిగింది. 7వ తరగతి నుంచే ఒలింపియాడ్‌కు ప్రిపరేషన్ ప్రారంభించాను. ఇందులో నా సోదరి సహకారం చాలా ఉంది. మా తల్లిదండ్రులు కూడా ఎల్లప్పుడూ నాకు సహకరించారు. ఈ ఒలింపియాడ్ ను హోమీ బాబా సెంటర్ ఫర్ సైన్స్ ఎడ్యుకేషన్ సంస్థ నిర్వహిస్తుంది. ఇది 5 దశల ప్రక్రియ. గత ఏడాది నేను టీంలో లేను. చాలా దగ్గరలో ఉండి టీంలో లేనందుకు చాలా బాధపడ్డాను. అప్పుడు మా తల్లిదండ్రులు నాకు నేర్పించారు- మనం గెలుస్తాం లేదా నేర్చుకుంటాం అని. ప్రయాణం ముఖ్యం తప్ప విజయం కాదని చెప్పారు. కాబట్టి నేను చెప్పదలుచుకున్నది ఇదే - ‘మీరు చేసే పనిని ఇష్టపడండి. మీరు ఇష్టపడే పనిని చేయండి’. ప్రధానమైనది ప్రయాణం. విజయం ముఖ్యం కాదు. మనం చేసే పనిని ఇష్టపడితే విజయాన్ని అందుకుంటూనే ఉంటాం. ప్రయాణాన్ని ఆనందిద్దాం.
ప్రధానమంత్రి: కనవ్... మీకు గణితంపై ఆసక్తి ఉంది. సాహిత్యంపై కూడా ఆసక్తి ఉన్నట్టుగా మాట్లాడుతున్నారు.!
కనవ్ తల్వార్: అవును సార్! నేను నా చిన్నప్పుడు చర్చలు, ఉపన్యాసాల్లో కూడా పాల్గొనేవాడిని.
ప్రధానమంత్రి: సరే... ఇప్పుడు ఆనందోతో మాట్లాడుదాం. ఆనందో.. మీరు ప్రస్తుతం గౌహతిలో ఉన్నారు. మీ మిత్రుడు రుషిల్ ముంబాయిలో ఉన్నారు. మీ ఇద్దరికీ నాదో ప్రశ్న. చూడండి.. నేను పరీక్ష గురించి చర్చిస్తూనే ఉంటాను. పరీక్ష గురించి చర్చించడమే కాకుండా ఇతర కార్యక్రమాలలో కూడా విద్యార్థులతో మాట్లాడుతూ ఉంటాను. చాలా మంది విద్యార్థులు గణితం అంటే చాలా భయపడతారు. దాని పేరు వినగానే వారు కంగారుపడతారు. గణితంతో స్నేహం చేయడం ఎలాగో చెప్పగలరా?
రుశీల్ మాథుర్: సార్! నేను రుశీల్ మాథుర్‌ని మాట్లాడుతున్నాను. మన చిన్నప్పుడు కూడికలు నేర్చుకున్నప్పుడు క్యారీ ఫార్వర్డ్ నేర్పిస్తారు. కానీ క్యారీ ఫార్వర్డ్ అంటే ఏమిటో ఎప్పుడూ వివరించరు. చక్రవడ్డీని చదువుకున్నప్పుడు చక్రవడ్డీ సూత్రం ఎక్కడ నుండి వస్తుంది అనే ప్రశ్న మనం ఎప్పుడూ అడగం. గణితం నిజానికి ఆలోచనాత్మక, సమస్యా పరిష్కార కళ అని నేను నమ్ముతున్నాను. కాబట్టి మనమందరం గణితానికి కొత్త ప్రశ్నను జోడించాలనిపిస్తుంది. మనం దీన్ని ఎందుకు చేస్తున్నాం, ఇది ఎందుకు ఇలా జరుగుతుంది అనే ప్రశ్న వేసుకోవాలి. అప్పుడు ఇది గణితంపై ప్రజల ఆసక్తిని చాలా పెంచుతుందని నేను భావిస్తున్నాను! ఎందుకంటే మనం ఏదైనా అర్థం చేసుకోలేనప్పుడు మనకు భయం కలుగుతుంది. గణితం చాలా లాజికల్ సబ్జెక్ట్ అని అందరూ అనుకుంటున్నారని నేను కూడా భావిస్తున్నాను. అయితే అంతే కాకుండా గణితంలో సృజనాత్మకత కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే సృజనాత్మకత ద్వారా మాత్రమే మనం ఒలింపియాడ్‌లో చాలా ఉపయోగకరంగా ఉండే పరిష్కారాల నుండి ఆలోచించగలుగుతాం. అందువల్ల గణితంపై ఆసక్తిని పెంచడానికి మ్యాథ్స్ ఒలింపియాడ్‌కు చాలా ముఖ్యమైన ఔచిత్యం ఉంది.
ప్రధానమంత్రి: ఆనందో ఏదైనా చెప్పాలనుకుంటున్నారా!
ఆనందో భాదురి: నమస్కారం ప్రధానమంత్రి గారూ..! నేను గౌహతికి చెందిన ఆనందో భాదురిని. నేను ఈ మధ్యే 12వ తరగతి పాసయ్యాను. నేను 6,7 తరగతుల్లో ఇక్కడి లోకల్ ఒలింపియాడ్ లో పాల్గొనేవాడిని. అప్పటి నుండి ఆసక్తి కలిగింది. ఇది నా రెండవ అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్. రెండు ఒలింపియాడ్లూ బాగా జరిగాయి. రుశీల్ చెప్పిన దానితో నేను ఏకీభవిస్తున్నాను. ఇక లెక్కలంటే భయపడే వారికి ఓపిక చాలా అవసరమని కూడా చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే మనం గణిత శాస్త్రాన్ని అలా బోధిస్తారు. ఒక సూత్రాన్ని ఇస్తారు. దాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ సూత్రాన్ని ఉపయోగించి వంద ప్రశ్నలను అధ్యయనం చేయడం జరుగుతుంది. కానీ మీరు ఆ సూత్రాన్ని అర్థం చేసుకున్నారో లేదో చూడరు. ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. చేస్తూ ఉండాలి. చేస్తూ ఉండాలి. సూత్రం కూడా బట్టీ పట్టేస్తాం. మరి పరీక్షలో సూత్రం మర్చిపోతే ఏం చేస్తాం? అందుకే రుశీల్ చెప్పినట్టు సూత్రాన్ని అర్థం చేసుకోండి. ఓపికగా చూడండి! మీరు సూత్రాన్ని సరిగ్గా అర్థం చేసుకుంటే వంద ప్రశ్నలు అడగాల్సిన అవసరం లేదు. కేవలం ఒకటి లేదా రెండు ప్రశ్నలలోనే పూర్తవుతుంది. గణితానికి భయపడాల్సిన అవసరం లేదు.
ప్రధానమంత్రి: ఆదిత్య, సిద్ధార్థ్! మీరు మొదట్లో మాట్లాడుతున్నప్పుడు సరిగ్గా మాట్లాడలేకపోయారు. ఇప్పుడు ఈ స్నేహితులందరి మాటలు విన్న తర్వాత మీకు కూడా ఏదో చెప్పాలనిపిస్తుంది కదా. మీరు మీ అనుభవాన్ని పంచుకోగలరా?
సిద్ధార్థ్ :- అనేక ఇతర దేశాల వారితో మాట్లాడాం. అనేక సంస్కృతులు ఉన్నాయి. ఇతర విద్యార్థులతో సంభాషించడం, కనెక్ట్ అవ్వడం చాలా బాగుంది. చాలా మంది ప్రసిద్ధ గణిత శాస్త్రజ్ఞులు ఉన్నారు.
ప్రధానమంత్రి :- అవును... ఆదిత్యా!
ఆదిత్య:- ఇది చాలా మంచి అనుభవం. వారు మాకు బాత్ సిటీ మొత్తం తిప్పి చూపించారు. చాలా చక్కటి దృశ్యాలు చూశాం. మమ్మల్ని పార్కులకు తీసుకెళ్లారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి కూడా తీసుకెళ్లారు. అది చాలా గొప్ప అనుభవం.
ప్రధాన మంత్రి: మిత్రులారా! నేను మీతో మాట్లాడటం నాకు నిజంగా ఆనందంగా ఉంది. నేను మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే ఈ రకమైన ఒలింపియాడ్ క్రీడకు చాలా ప్రత్యేక దృష్టి అవసరమని నాకు తెలుసు. మీరు మీ మెదడును ఉపయోగించాలి. కుటుంబ సభ్యులు కూడా కొన్నిసార్లు విసుగు చెందుతారు. ఎప్పుడూ ఈ లెక్కలేమిటి అనుకుంటారు. మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు. మీరు దేశ గౌరవం, పేరు పెంచారు. మిత్రులారా! మీకు ధన్యవాదాలు.
విద్యార్థులు:- ధన్యవాదాలు, ధన్యవాదాలు సార్.
ప్రధానమంత్రి:- ధన్యవాదాలు.
విద్యార్థులు:- ధన్యవాదాలు సార్, జై హింద్.
ప్రధాన మంత్రి :- జై హింద్! జై హింద్!
విద్యార్థులతో మాట్లాడడం చాలా ఆనందంగా ఉంది. 'మన్ కీ బాత్'తో అనుసంధానమైనందుకు మీ అందరికీ చాలా ధన్యవాదాలు. ఈ యువ గణిత నిపుణుల మాటలు విన్న తర్వాత యువతరానికి గణితాన్ని ఆస్వాదించడానికి ప్రేరేపణ లభిస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్'లో ఇప్పుడు నేను ప్రతి భారతీయుడు గర్వించే అంశాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. కానీ దాని గురించి చెప్పే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. చరాయిదేవ్ మైదామ్ అనే పేరు విన్నారా? మీరు గతంలో వినకపోతే ఇప్పుడు మీరు ఈ పేరు పదేపదే వింటారు. ఇతరులకు చాలా ఉత్సాహంగా చెప్తారు. అస్సాంలోని చరాయిదేవ్ మైదామ్ ను యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో చేర్చారు. ఈ జాబితాలో ఇది భారతదేశంలోని 43వ ప్రదేశం. ఈశాన్య ప్రాంతంలో ఈ జాబితాలో మొట్టమొదటిది.
స్నేహితులారా! చరాయిదేవ్ మైదామ్ అంటే ఏమిటి, ఇంత ప్రత్యేకమెందుకు అనే ప్రశ్న మీ మనసులో తప్పక వస్తుంది. చరాయిదేవ్ అంటే కొండలపై ఉన్న ప్రకాశవంతమైన నగరం. ఇది అహోం రాజవంశ మొదటి రాజధాని. అహోం రాజవంశానికి చెందినవారు తమ పూర్వికుల మృతదేహాలను, వారి విలువైన వస్తువులను మైదామ్‌లో సంప్రదాయ బద్ధంగా ఉంచేవారు. మైదామ్ ఒక మట్టిదిబ్బ లాంటి నిర్మాణం. ఇది పైన మట్టితో కప్పి ఉంటుంది. కింద ఒకటి లేదా అంతకంటే ఎక్కువ గదులు ఉంటాయి. ఈ మైదాం అహోం రాజ్యానికి చెందిన దివంగత రాజులు, ప్రముఖుల పట్ల గౌరవానికి చిహ్నం. మన పూర్వికుల పట్ల గౌరవం చూపించే ఈ విధానం చాలా ప్రత్యేకమైంది. ఈ ప్రదేశంలో సామూహిక ఆరాధనలు కూడా జరిగేవి.
మిత్రులారా! అహోం సామ్రాజ్యం గురించిన ఇతర సమాచారం మిమ్మల్ని మరింత ఆశ్చర్యపరుస్తుంది. 13వ శతాబ్దంలో ప్రారంభమైన ఈ సామ్రాజ్యం 19వ శతాబ్దం ప్రారంభం వరకు కొనసాగింది. ఒక సామ్రాజ్యం ఇంత కాలం మనుగడ సాగించడం గొప్ప విషయం. బహుశా అహోం సామ్రాజ్య సిద్ధాంతాలు, నమ్మకాలు చాలా బలమైనవి కాబట్టి అది చాలా కాలం పాటు ఈ రాజవంశాన్ని కొనసాగించింది. ఎడతెగని సాహసం, శౌర్యపరాక్రమాలకు ప్రతీక అయిన గొప్ప అహోం యోధుడు లసిత్ బోర్ఫుకాన్ ఎత్తైన విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం ఈ సంవత్సరం మార్చి 9వ తేదీన నాకు లభించిందని గుర్తుంది. ఈ కార్యక్రమంలో అహోం సమాజ ఆధ్యాత్మిక సంప్రదాయాన్ని అనుసరిస్తున్నప్పుడు నాకు భిన్నమైన అనుభవం ఎదురైంది. లసిత్ మైదామ్ లో అహోం సమాజ పూర్వికులకు నివాళులు అర్పించడం నాకు చాలా గొప్ప విషయం. ఇప్పుడు చరాయిదేవ్ మైదామ్ ప్రపంచ వారసత్వ ప్రదేశంగా మారడం అంటే ఎక్కువ మంది పర్యాటకులు ఇక్కడికి వస్తారు. మీరు మీ భవిష్యత్ ప్రయాణ ప్రణాళికల్లో ఖచ్చితంగా ఈ ప్రదేశాన్ని కూడా చేర్చుకుంటారు.
మిత్రులారా! ఒక దేశం దాని సంస్కృతిని గౌరవించడం ద్వారా మాత్రమే అభివృద్ధి చెందుతుంది. భారతదేశంలో కూడా ఇలాంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. అలాంటి ఒక ప్రయత్నమే – ప్రాజెక్ట్ పరీ. ఇప్పుడు మీరు పరీ అనే పేరు విని అయోమయానికి గురికాకండి. ఈ అద్భుతం స్వర్గపు ఊహకు అనుసంధానం కాలేదు. కానీ భూమిని స్వర్గంగా మారుస్తోంది. పరీ అంటే పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియా. ప్రజా కళను ప్రాచుర్యంలోకి తెచ్చేందుకు, వర్ధమాన కళాకారులను ఒకే వేదికపైకి తీసుకురావడానికి ప్రాజెక్ట్ పరీ ఒక ప్రధాన మాధ్యమంగా మారుతోంది. మీరు తప్పక చూస్తూ ఉంటారు.. రోడ్ల పక్కన, గోడలపై, అండర్‌పాస్‌లపై చాలా అందమైన పెయింటింగ్స్ కనిపిస్తాయి. ఈ పెయింటింగులు, ఈ కళాఖండాలు పరీతో అనుసంధానమైన కళాకారులు రూపొందించినవి. ఇది మన బహిరంగ ప్రదేశాల అందాన్ని మెరుగుపరుస్తుంది. మన సంస్కృతిని మరింత ప్రాచుర్యం పెంచడంలో కూడా ఇది సహాయపడుతుంది. ఉదాహరణకు ఢిల్లీలోని భారత్ మండపాన్ని తీసుకోండి. ఇక్కడ మీరు దేశం నలుమూలల నుండి అద్భుతమైన కళాఖండాలను చూడవచ్చు. ఢిల్లీలోని కొన్ని అండర్‌పాస్‌లు, ఫ్లైఓవర్లపై కూడా మీరు అలాంటి అందమైన ప్రజాకళను చూడవచ్చు. కళ, సంస్కృతి ప్రేమికులు పబ్లిక్ ఆర్ట్‌పై మరింత కృషి చేయాలని నేను కోరుతున్నాను. ఇది మన మూలాల గురించి గర్వించే ఆహ్లాదకరమైన అనుభూతిని ఇస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్'లో ఇప్పుడు 'రంగుల' గురించి మాట్లాడుకుందాం. హర్యానాలోని రోహ్తక్ జిల్లాకు చెందిన 250 మందికి పైగా మహిళల జీవితాలను సమృద్ధితో వర్ణమయం చేసిన రంగులు. చేనేత పరిశ్రమతో అనుబంధం ఉన్న ఈ మహిళలు ఇంతకు ముందు చిన్న చిన్న దుకాణాలు నిర్వహిస్తూ, కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే ప్రతి ఒక్కరిలో ముందుకు వెళ్లాలనే కోరిక ఉంటుంది. కాబట్టి వాళ్ళు ‘ఉన్నతి’ స్వయం సహాయ సమూహంలో చేరాలని నిర్ణయించుకున్నారు. ఈ సమూహంలో చేరడం ద్వారా బ్లాక్ ప్రింటింగ్, డైయింగ్‌లో శిక్షణ పొందారు. బట్టలపై రంగుల మాయాజాలాన్ని కూర్చడం నేర్చుకున్న ఈ మహిళలు నేడు లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. వాళ్ళు తయారు చేసే బెడ్ కవర్లు, చీరలు, దుపట్టాలకు మార్కెట్ లో విపరీతమైన డిమాండ్ ఉంది.
మిత్రులారా! రోహ్తక్కు చెందిన ఈ మహిళల మాదిరిగానే దేశంలోని వివిధ ప్రాంతాల్లోని కళాకారులు చేనేతకు ప్రాచుర్యం కల్పించడంలో బిజీగా ఉన్నారు. ఒడిశాకు చెందిన 'సంబల్పురి చీర' అయినా, మధ్యప్రదేశ్ కు చెందిన 'మహేశ్వరి చీర' అయినా, మహారాష్ట్రకు చెందిన 'పైథానీ' అయినా, విదర్భకు చెందిన 'హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్' అయినా, హిమాచల్‌కు చెందిన 'భూట్టికో' శాలువాలు, ఉన్ని బట్టలు అయినా లేదా జమ్మూ కశ్మీర్ కనీ శాలువాలు అయినా దేశంలోని నలుమూలలా చేనేత కళాకారుల కృషి కనిపిస్తుంది. మరి కొన్ని రోజుల తర్వాత ఆగస్టు 7వ తేదీన 'జాతీయ చేనేత దినోత్సవం' జరుపుకుంటామని మీకు తెలిసి ఉండవచ్చు. ఈ రోజుల్లో చేనేత ఉత్పత్తులు ప్రజల హృదయాలలో తమ స్థానాన్ని సంపాదించుకున్న విధానం చాలా విజయవంతమైనది, అద్భుతమైనది. ఇప్పుడు చాలా ప్రైవేటు కంపెనీలు కూడా కృత్రిమ మేధ ద్వారా చేనేత ఉత్పత్తులను, ఫ్యాషన్ ఉత్పత్తులను రూపొందిస్తున్నాయి. కోషా ఏఐ, హ్యాండ్ లూం ఇండియా, డి- జంక్, నోవా టాక్స్, బ్రహ్మపుత్ర ఫెబుల్స్ లాంటి అనేక స్టార్టప్‌లు కూడా చేనేత ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడంలో కృషి చేస్తున్నాయి. ఇలాంటి స్థానిక ఉత్పత్తులను ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి చాలా మంది ప్రయత్నిస్తున్నారని తెలిసి నేను కూడా సంతోషిస్తున్నాను. మీరు మీ స్థానిక ఉత్పత్తులను సోషల్ మీడియాలో ‘హ్యాష్‌ట్యాగ్ మై ప్రోడక్ట్ మై ప్రైడ్’ పేరుతో కూడా అప్లోడ్ చేయవచ్చు. మీ ఈ చిన్న ప్రయత్నం చాలా మంది జీవితాలను మారుస్తుంది.
మిత్రులారా! చేనేతతో పాటు నేను ఖాదీ గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఇంతకు ముందు ఖాదీ ఉత్పత్తులను ఉపయోగించని వారు మీలో చాలా మంది ఉండవచ్చు. కానీ నేడు ఖాదీని చాలా గర్వంగా ధరిస్తున్నారు. ఖాదీ గ్రామోద్యోగ్ టర్నోవర్ మొదటిసారిగా లక్షన్నర కోట్ల రూపాయలు దాటిందని మీకు చెప్పడానికి కూడా సంతోషిస్తున్నాను. ఊహించుకోండి... ఒకటిన్నర లక్షల కోట్ల రూపాయలు!! మరి ఖాదీ అమ్మకాలు ఎంత పెరిగాయో తెలుసా? 400 శాతం. ఈ పెరుగుతున్న ఖాదీ, చేనేత విక్రయాలు పెద్ద సంఖ్యలో కొత్త ఉపాధి అవకాశాలను కూడా సృష్టిస్తున్నాయి. చాలా మంది మహిళలకు ఈ పరిశ్రమతో అనుబంధం ఉంది. వారు ఎక్కువ ప్రయోజనం పొందుతున్నారు. నేను మళ్ళీ మిమ్మల్ని ఒక విషయం కోరుతున్నాను. మీ దగ్గర తప్పనిసరిగా వివిధ రకాల బట్టలు ఉండవచ్చు. మీరు ఇప్పటి వరకు ఖాదీ బట్టలు కొనకపోతే ఈ సంవత్సరం నుండి ప్రారంభించండి. ఆగస్ట్ నెల వచ్చేసింది. ఇది స్వాతంత్ర్యం వచ్చిన నెల. ఇది విప్లవ మాసం. ఖాదీని కొనడానికి ఇంతకంటే మంచి అవకాశం ఏముంటుంది!
నా ప్రియమైన దేశవాసులారా! డ్రగ్స్ సవాలు గురించి నేను మీతో 'మన్ కీ బాత్'లో తరచుగా చర్చించాను. తమ బిడ్డ డ్రగ్స్ బారిన పడే ప్రమాదం ఉందని ప్రతి కుటుంబం ఆందోళన చెందుతోంది. ఇప్పుడు అలాంటి వారికి సహాయం చేసేందుకు ప్రభుత్వం ‘మానస్’ పేరుతో ప్రత్యేక కేంద్రాన్ని ప్రారంభించింది. డ్రగ్స్‌పై పోరాటంలో ఇదొక పెద్ద ముందడుగు. ‘మానస్’ హెల్ప్‌లైన్, పోర్టల్ కొద్ది రోజుల కిందటే ప్రారంభమయ్యాయి. ప్రభుత్వం ‘1933’ అనే టోల్ ఫ్రీ నంబర్‌ను కూడా ప్రారంభించింది. దీనికి కాల్ చేయడం ద్వారా, ఎవరైనా అవసరమైన సలహాలను పొందవచ్చు లేదా సహాయ పునరావాసాలకు సంబంధించిన సమాచారాన్ని పొందవచ్చు. ఎవరి దగ్గరైనా డ్రగ్స్‌కు సంబంధించిన ఇతర సమాచారం ఉంటే వారు ఈ నంబర్‌కు కాల్ చేయడం ద్వారా దాన్ని మాదక ద్రవ్యాల నిరోధక సంస్థ- నారోటిక్స్ కంట్రోల్ బ్యూరోతో పంచుకోవచ్చు. 'మానస్'తో పంచుకునే ప్రతి సమాచారాన్ని రహస్యంగా ఉంచుతారు. మానస్ హెల్ప్‌లైన్‌ను పూర్తిగా ఉపయోగించుకోవాలని భారతదేశాన్ని 'డ్రగ్స్ ఫ్రీ'గా మార్చడంలో కృషి చేస్తున్న అందరు వ్యక్తులను, అన్ని కుటుంబాలను, అన్ని సంస్థలను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! పులుల దినోత్సవాన్ని రేపు ప్రపంచమంతటా జరుపుకుంటున్నారు. పులులు మన సంస్కృతిలో అంతర్భాగంగా ఉన్నాయి. మనమందరం పులులకు సంబంధించిన కథలను వింటూ పెరిగాం. అడవి చుట్టూ ఉన్న గ్రామాలలో ప్రతి ఒక్కరికీ పులితో సామరస్యంగా ఎలా జీవించాలో తెలుసు. మనుషులు, పులుల మధ్య ఎప్పుడూ ఘర్షణలు జరగని చోట్లు కూడా దేశంలో ఉన్నాయి. అలాంటి చోట్ల కూడా పులుల సంరక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. అలాంటి ప్రజా భాగస్వామ్య ప్రయత్నాలలో ఒకటి "కుల్హాడి బంద్ పంచాయితీ". రాజస్థాన్‌లోని రణతంబోర్ లో ప్రారంభమైన కుల్హాడి బంద్ పంచాయితీ ఒక ఆసక్తికరమైన ఉద్యమం. గొడ్డలితో అడవిలోకి వెళ్లబోమని, చెట్లను నరకబోమని అక్కడి స్థానిక సంఘాలు స్వచ్ఛందంగా ప్రమాణం చేశాయి. ఈ ఒక్క నిర్ణయంతో ఇక్కడి అడవులు మరోసారి పచ్చగా మారడంతోపాటు పులులకు చక్కటి వాతావరణం ఏర్పడుతోంది.
మిత్రులారా! మహారాష్ట్రలోని తడోబా-అంధారి టైగర్ రిజర్వ్ పులుల ప్రధాన నివాసాలలో ఒకటి. ఇక్కడి స్థానిక సమాజాలు- ముఖ్యంగా గోండు, మానా ఆదివాసీ తెగలకు చెందిన మన సోదర సోదరీమణులు ఎకో-టూరిజం వైపు వేగంగా అడుగులు వేశారు. ఇక్కడ పులులు పెరిగేలా చేసేందుకు తాము అడవిపై ఆధారపడడాన్ని తగ్గించుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల కొండలపై నివసించే 'చెంచు' తెగ కృషి చూసి మీరు కూడా ఆశ్చర్యపోతారు. వారు టైగర్ ట్రాకర్లుగా, అడవిలో వన్యప్రాణుల సంచారం గురించి ప్రతి సమాచారాన్ని సేకరించారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లో జరుగుతున్న అక్రమాలపై నిఘా పెట్టారు. అదేవిధంగా ఉత్తరప్రదేశ్‌లోని పీలీభీత్‌లో జరుగుతున్న 'బాగ్ మిత్ర కార్యక్రమం' కూడా చాలా చర్చనీయాంశమైంది. దీని కింద స్థానిక ప్రజలకు 'బాగ్ మిత్ర'- అంటే పులి మిత్రులు గా పని చేసేందుకు శిక్షణ ఇస్తారు. పులులకు, మనుషులకు మధ్య ఎలాంటి ఘర్షణ జరగకుండా పూర్తి జాగ్రత్తలు తీసుకుంటారు ఈ 'పులి మిత్రులు’. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఇలాంటి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేను ఇక్కడ కొన్ని ప్రయత్నాలను మాత్రమే చర్చించాను. అయితే పులుల సంరక్షణలో ప్రజల భాగస్వామ్యం చాలా సహాయపడుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఇలాంటి ప్రయత్నాల వల్ల భారతదేశంలో పులుల సంఖ్య ఏటా పెరుగుతోంది. ప్రపంచంలోని 70 శాతం పులులు మన దేశంలోనే ఉన్నాయని తెలిస్తే మీరు సంతోషంగా, గర్వంగా అనుభూతి చెందుతారు. ఆలోచించండి! 70 శాతం పులులు!! - అందుకే మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక పులుల అభయారణ్యాలు ఉన్నాయి.
మిత్రులారా! మన దేశంలో పులుల పెరుగుదలతో పాటు అటవీ ప్రాంతం కూడా వేగంగా పెరుగుతోంది. ఇందులో కూడా సమాజం చేస్తోన్న కృషి వల్లనే గొప్ప విజయం లభిస్తోంది. గత ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమం గురించి మీతో చర్చించాను. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో ప్రజలు ఈ ఉద్యమంలో చేరడం నాకు సంతోషంగా ఉంది. పరిశుభ్రతకు ప్రసిద్ధి చెందిన ఇండోర్‌లో కొద్ది రోజుల క్రితం ఓ అద్భుతమైన కార్యక్రమం జరిగింది. ఇక్కడ ‘ఏక్ పేడ్ మా కే నామ్’ కార్యక్రమంలో ఒకే రోజు 2 లక్షలకు పైగా మొక్కలు నాటారు. మీరు కూడా మీ అమ్మ పేరు మీద మొక్కలు నాటే ఈ ఉద్యమంలో పాల్గొని సెల్ఫీ తీసుకుని సామాజిక మాధ్యమంలో పోస్టు చేయాలి. ఈ ఉద్యమంలో చేరడం ద్వారా, మీరు మీ అమ్మ కోసం, మాతృభూమి కోసం ప్రత్యేకంగా ఏదైనా చేయాలని భావిస్తారు.
నా ప్రియమైన దేశప్రజలారా! ఆగస్టు 15వ తేదీ ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు ఆగస్టు 15వ తేదీకి 'హర్ ఘర్ తిరంగా అభియాన్' అనే మరో ఉద్యమం అనుసంధానమైంది. గత కొన్నేళ్లుగా దేశవ్యాప్తంగా 'హర్ ఘర్ తిరంగా అభియాన్'పై అందరి ఉత్సాహం ఎక్కువగా ఉంది. పేదవారైనా, ధనవంతులైనా, చిన్న ఇల్లు అయినా, పెద్ద ఇల్లు అయినా అందరూ త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించి గర్వాన్ని అనుభూతి చెందుతారు. త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు దిగి సామాజిక మాధ్యమంలో పోస్టు చేయడంలో కూడా క్రేజ్ ఉంది. కాలనీ లేదా సొసైటీలోని ప్రతి ఇంటిపై త్రివర్ణ పతాకం రెపరెపలాడినప్పుడు ఇతర ఇళ్లపై కూడా త్రివర్ణ పతాకం కనిపించడం ప్రారంభించడాన్ని మీరు గమనించి ఉండాలి. అంటే ‘హర్ ఘర్ తిరంగా అభియాన్’ త్రివర్ణ పతాక చరిత్రలో ఒక అపూర్వమైన పర్వదినంగా మారింది. ఇప్పుడు దీనికి సంబంధించి వివిధ రకాల ఆవిష్కరణలు జరగడం ప్రారంభించాయి. ఆగస్టు 15వ తేదీ సమీపిస్తున్న కొద్దీ, త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించే వివిధ రకాల ఉత్పత్తులు ఇళ్లు, కార్యాలయాలు, కార్లలో కనిపించడం ప్రారంభిస్తాయి. కొందరు వ్యక్తులు తమ స్నేహితులకు, పొరుగువారికి త్రివర్ణ పతాకాన్ని కూడా పంపిణీ చేస్తారు. త్రివర్ణ పతాకం పట్ల ఉన్న ఈ ఆనందం, ఈ ఉత్సాహం మనల్ని ఒకరికొకరిని కలుపుతాయి.
మిత్రులారా! గతంలో లాగే ఈ ఏడాది కూడా త్రివర్ణ పతాకంతో కూడిన మీ సెల్ఫీని 'హర్ ఘర్ తిరంగా డాట్ కామ్’ లో అప్లోడ్ చేయాలి. నేను మీకు మరో విషయాన్ని గుర్తు చేయాలనుకుంటున్నాను. ప్రతి సంవత్సరం ఆగస్టు 15వ తేదీకి ముందు మీరు నాకు చాలా సలహాలు పంపుతారు. మీరు ఈ సంవత్సరం కూడా మీ సలహాలను నాకు పంపాలి. మీరు మై గవ్ లేదా నమో యాప్‌లో కూడా మీ సూచనలను పంపవచ్చు. నేను ఆగస్టు 15వ తేదీన నా ప్రసంగంలో వీలైనన్ని ఎక్కువ సూచనలను పొందుపర్చడానికి ప్రయత్నిస్తాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్లో మీతో అనుసంధానం కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశం సాధించే కొత్త విజయాలు, ప్రజల భాగస్వామ్యం కోసం కొత్త ప్రయత్నాలతో మనం వచ్చేసారి కలుస్తాం. ‘మన్ కీ బాత్’ కోసం మీరు మీ సూచనలు పంపిస్తూ ఉండండి. రాబోయే కాలంలో అనేక పండుగలు కూడా వస్తున్నాయి. మీకు అన్ని పండుగల శుభాకాంక్షలు. మీరు కుటుంబ సమేతంగా పండుగలను ఆనందించండి. దేశం కోసం ఏదైనా కొత్త పని చేసే శక్తిని నిరంతరం కొనసాగించండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఫిబ్రవరి నుండి మనం అందరం ఎదురుచూస్తున్న రోజు ఇప్పుడు వచ్చింది. ‘మన్ కీ బాత్’ ద్వారా మీ మధ్యకు- నా కుటుంబ సభ్యుల మధ్యకు- మరోసారి వచ్చాను. చాలా మనోహరమైన లోకోక్తి ఒకటి ఉంది - 'ఇతి విదా పునర్మిలనాయ్'. దాని అర్థం కూడా అంతే మనోహరంగా ఉంది. “మళ్ళీ కలవడానికి నేను సెలవు తీసుకుంటాను” అని ఆ లోకోక్తి అర్థం. ఈ స్ఫూర్తితోనే ఫిబ్రవరిలో ఎన్నికల ఫలితాల తర్వాత మళ్లీ కలుస్తానని చెప్పాను. ఈరోజు ‘మన్‌కీ బాత్’తో మళ్ళీ మీ మధ్యకు వచ్చాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని, మీ ఇంట్లో అందరూ ఆరోగ్యంగా ఉన్నారని విశ్వసిస్తున్నాను. ఇప్పుడు రుతుపవనాలు కూడా వచ్చాయి. రుతుపవనాలు వస్తే మనసు కూడా ఆనందంగా ఉంటుంది. తమ పని ద్వారా సమాజంలో, దేశంలో మార్పు తీసుకువస్తున్న దేశప్రజల గురించి ఈ రోజు నుండి మరోసారి 'మన్ కీ బాత్' లో మనం చర్చిస్తాం. మన సుసంపన్న సంస్కృతి గురించి, మహిమాన్విత చరిత్ర గురించి మాట్లాడుకుంటాం. వికసిత భారతదేశం కోసం ప్రయత్నాలను చర్చిస్తాం.
మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.
మిత్రులారా! మన రాజ్యాంగంపై, దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలపై తమ అచంచలమైన విశ్వాసాన్ని మరోసారి ప్రకటించినందుకు ఈ రోజు నేను దేశప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ ఏడాది 2024లో జరిగిన ఎన్నికలు ప్రపంచంలోనే అతి పెద్ద ఎన్నికలు. ఇంత భారీ స్థాయి ఎన్నికలు ప్రపంచంలో ఏ దేశంలో జరగలేదు. ఈ ఎన్నికల్లో 65 కోట్ల మంది ప్రజలు ఓట్లు వేశారు. ఇందుకోసం ఎన్నికల సంఘాన్ని, ఓటింగు ప్రక్రియతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈరోజు జూన్ 30వ తేదీ చాలా ముఖ్యమైన రోజు. మన ఆదివాసీ సోదర సోదరీమణులు ఈ రోజును 'హూల్ దినోత్సవం'గా జరుపుకుంటారు. ఈ రోజు పరాయి పాలకుల దౌర్జన్యాలను తీవ్రంగా వ్యతిరేకించిన పరాక్రమశాలులు సిద్ధో-కాన్హుల తిరుగులేని ధైర్యంతో ముడిపడి ఉంది. ధైర్యవంతులైన సిద్ధో- కాన్హు వేలాది మంది సంథాలీ సహచరులను ఏకం చేసి, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఇది ఎప్పుడు జరిగిందో మీకు తెలుసా? ఇది 1855లో జరిగింది. అంటే 1857లో జరిగిన భారతదేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి రెండేళ్ల ముందన్నమాట. జార్ఖండ్‌లోని సంథాల్ పరగణాలో మన ఆదివాసీ సోదర సోదరీమణులు విదేశీ పాలకులకు వ్యతిరేకంగా అప్పుడు ఆయుధాలు చేపట్టారు. ఆ కాలంలో బ్రిటిష్ వారు మన సంథాలీ సోదర సోదరీమణులపై అనేక అఘాయిత్యాలకు పాల్పడ్డారు. వారిపై అనేక ఆంక్షలు కూడా విధించారు. ఈ పోరాటంలో అద్భుతమైన ధైర్యసాహసాలు ప్రదర్శించిన వీరులు సిద్ధో, కన్హూ వీరమరణం పొందారు. జార్ఖండ్ నేలలోని ఈ అమర పుత్రుల త్యాగం ఇప్పటికీ దేశప్రజలకు స్ఫూర్తినిస్తుంది. వారికి అంకితం చేసిన సంథాలీ భాషలోని పాట నుండి కొద్ది భాగం విందాం .
-ఆడియో క్లిప్-
నా ప్రియమైన మిత్రులారా! ప్రపంచంలో అత్యంత విలువైన సంబంధం ఏది అని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఖచ్చితంగా ‘అమ్మ’ అని చెప్తారు. మనందరి జీవితాల్లో ‘అమ్మ’కు అత్యున్నత స్థానం ఉంది. దుఃఖాన్ని భరించి కూడా తల్లి తన బిడ్డను పోషిస్తుంది. ప్రతి తల్లి తన బిడ్డపై ప్రేమను చూపిస్తుంది. జన్మనిచ్చిన తల్లి ప్రేమ రుణం లాంటిది. దీన్ని ఎవరూ తీర్చుకోలేరు. అమ్మకి మనం ఏమీ ఇవ్వలేం. కానీ ఇంకేమైనా చేయగలమా అని ఆలోచించాను. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సంవత్సరం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రత్యేక ఉద్యమం ప్రారంభమైంది. ఈ ఉద్యమం పేరు - 'ఏక్ పేడ్ మా కే నామ్'- ‘అమ్మ పేరుపై ఒక చెట్టు’. మా అమ్మ పేరు మీద నేను కూడా ఒక చెట్టు నాటాను. దేశప్రజలందరికీ- ప్రపంచంలోని అన్ని దేశాల ప్రజలందరికీ నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వారి తల్లితో కలిసి లేదా ఆమె పేరు మీద ఒక చెట్టు నాటాలనేది ఆ విజ్ఞప్తి. తల్లి జ్ఞాపకార్థం లేదా ఆమె గౌరవార్థం మొక్కలు నాటాలనే ప్రచారం వేగంగా జరగడం చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. ప్రజలు తమ తల్లితో కలిసి లేదా ఆమె ఫోటోతో చెట్లను నాటుతున్న చిత్రాలను సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి కోసం మొక్కలు నాటుతున్నారు. వారు ధనికులు కావచ్చు. పేదవారు కావచ్చు. ఉద్యోగం చేసే మహిళ కావచ్చు. లేదా గృహిణి కావచ్చు. ఈ ఉద్యమం ప్రతి ఒక్కరికీ తమ తల్లి పట్ల ఉన్న ప్రేమను వ్యక్తీకరించడానికి సమాన అవకాశాన్ని కల్పించింది. #Plant4Mother, #एक_पेड़_मां_के_नाम అనే హ్యాష్ ట్యాగులతో తమ ఫోటోలను పంచుకుంటూ ఇతరులకు స్ఫూర్తినిస్తున్నారు.
మిత్రులారా! ఈ ఉద్యమం వల్ల మరో ప్రయోజనం కూడా ఉంటుంది. భూమి కూడా మనల్ని తల్లిలా చూసుకుంటుంది. భూమాత మనందరి జీవితాలకు ఆధారం. కాబట్టి మాతృభూమిని కూడా చూసుకోవడం మన కర్తవ్యం. తల్లి పేరుతో మొక్కలు నాటే కార్యక్రమం మన తల్లిని గౌరవించడమే కాకుండా భూమిని కాపాడుతుంది. గత దశాబ్దంలో అందరి కృషి కారణంగా భారతదేశంలో అటవీ విస్తీర్ణం అపూర్వ రీతిలో పెరిగింది. అమృత మహోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 60 వేలకు పైగా అమృత సరోవరాలను కూడా నిర్మించారు. ఇకపై కూడా అమ్మ పేరుతో మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలి.
నా ప్రియమైన దేశవాసులారా! దేశంలోని వివిధ ప్రాంతాలకు రుతుపవనాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ వర్షాకాలంలో అందరూ తమ ఇంట్లో వెతుకులాట ప్రారంభించిన వస్తువు ‘గొడుగు’. ఈరోజు ‘మన్ కీ బాత్’లో నేను మీకు ప్రత్యేకమైన గొడుగుల గురించి చెప్పాలనుకుంటున్నాను. ఈ గొడుగులు మన కేరళలో తయారుచేస్తారు. నిజానికి కేరళ సంస్కృతిలో గొడుగులకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అక్కడి అనేక సంప్రదాయాలు, ఆచారాలలో గొడుగులు ఒక ముఖ్యమైన భాగం. నేను చెప్తున్న గొడుగులు ‘కార్థుంబీ గొడుగులు’. అవి కేరళలోని అట్టాపడిలో తయారవుతాయి. ఈ రంగురంగుల గొడుగులు చాలా అద్భుతంగా ఉంటాయి. ప్రత్యేకత ఏమిటంటే ఈ గొడుగులను మన కేరళ ఆదివాసీ సోదరీమణులు తయారు చేస్తారు. దేశవ్యాప్తంగా ఈ గొడుగులకు డిమాండ్ పెరుగుతోంది. ఆన్లైన్లో కూడా విక్రయిస్తున్నారు. ఈ గొడుగులను 'వట్టాలక్కీ సహకార వ్యవసాయ సొసైటీ' పర్యవేక్షణలో తయారు చేస్తారు. ఈ సొసైటీ నాయకత్వం మహిళా శక్తిదే. అట్టాపడి ఆదివాసీ సమాజం మహిళల నాయకత్వంలో వ్యవస్థాపకతకు అద్భుతమైన ఉదాహరణగా నిలిచింది. ఈ సొసైటీ వెదురు-హస్తకళ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ వ్యక్తులు రిటైల్ విక్రయకేంద్రాన్ని, సంప్రదాయ కేఫ్‌ను తెరవడానికి సిద్ధమవుతున్నారు. వారి లక్ష్యం తమ గొడుగులు, ఇతర ఉత్పత్తులను విక్రయించడం మాత్రమే కాదు- వారు తమ సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు. కేరళలోని ఒక చిన్న గ్రామం నుండి బహుళజాతి కంపెనీల వరకు కార్థుంబీ గొడుగులు తమ ప్రయాణాన్ని పూర్తి చేస్తున్నాయి. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం కల్పించడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏముంటుంది?
నా ప్రియమైన దేశప్రజలారా! వచ్చే నెలలో ఈ సమయానికి ప్యారిస్ ఒలింపిక్స్ ప్రారంభమవుతాయి. ఒలింపిక్ క్రీడల్లో భారత ఆటగాళ్లను ప్రోత్సహించేందుకు మీరందరూ కూడా ఎదురు చూస్తారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను. ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటున్న భారత జట్టుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. టోక్యో ఒలింపిక్స్ జ్ఞాపకాలు ఇప్పటికీ మనందరి మదిలో మెదులుతూనే ఉన్నాయి. టోక్యోలో మన ఆటగాళ్ల ప్రదర్శన ప్రతి భారతీయుడి హృదయాన్ని గెలుచుకుంది. టోక్యో ఒలింపిక్స్ తర్వాత నుంచి మన క్రీడాకారులు ప్యారిస్ ఒలింపిక్స్‌కు సిద్ధమవుతున్నారు. ఆటగాళ్లందరినీ కలుపుకుంటే- వారంతా దాదాపు తొమ్మిది వందల అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నారు. ఇది చాలా పెద్ద సంఖ్య.
మిత్రులారా! మీరు ప్యారిస్ ఒలింపిక్స్‌లో మొదటిసారిగా కొన్ని విషయాలను చూస్తారు. షూటింగ్లో మన క్రీడాకారుల ప్రతిభ వెలుగులోకి వస్తోంది. టేబుల్ టెన్నిస్‌లో పురుషులు, మహిళల రెండు జట్లు అర్హత సాధించాయి. భారత షాట్‌గన్ టీమ్‌లో మన షూటర్ అమ్మాయిలు కూడా ఉన్నారు. రెజ్లింగ్, గుర్రపు స్వారీలలో మన జట్టులోని క్రీడాకారులు గతంలో ఎన్నడూ పాల్గొనని విభాగాల్లో కూడా ఇప్పుడు పోటీపడుతున్నారు. దీన్ని బట్టి ఈసారి క్రీడల్లో మరో స్థాయి ఉత్కంఠను అనుభూతి చెందవచ్చని మీరు ఊహించవచ్చు. మీకు గుర్తుండవచ్చు. కొన్ని నెలల కిందట ప్రపంచ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మన క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శన చూపారు. చెస్, బ్యాడ్మింటన్‌లలో కూడా మన క్రీడాకారులు జెండా ఎగురవేశారు. ఇప్పుడు ఒలింపిక్స్‌లో కూడా మన క్రీడాకారులు రాణిస్తారని దేశమంతా ఎదురుచూస్తోంది. ఈ క్రీడల్లో పతకాలు సాధిస్తాం. దేశప్రజల హృదయాలను కూడా గెలుచుకుంటాం. రాబోయే రోజుల్లో నేను కూడా భారత జట్టును కలిసే అవకాశం రాబోతోంది. మీ తరఫున వారిని ప్రోత్సహిస్తాను. అవును మరి.. ఈసారి మన హ్యాష్‌ట్యాగ్ #Cheer4Bharat. ఈ హ్యాష్‌ట్యాగ్ ద్వారా మన ఆటగాళ్లను ఉత్సాహపరుస్తూ, వారిని ప్రోత్సహిస్తూనే ఉండాలి. ఈ ఊపును కొనసాగించండి. మీ ఈ ప్రోత్సాహం భారతదేశ మాయాజాలాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంలో సహాయపడుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! నేను మీ అందరి కోసం ఒక చిన్న ఆడియో క్లిప్ వినిపిస్తున్నాను.
-ఆడియో క్లిప్-
ఈ రేడియో కార్యక్రమం విని మీరు కూడా ఆశ్చర్యపోయారు కదా!? రండి... దీని వెనుక ఉన్న మొత్తం కథను మీకు చెప్తాను. నిజానికి ఇది కువైట్ రేడియో ప్రసారానికి సంబంధించిన క్లిప్. ఇప్పుడు మనం కువైట్ గురించి మాట్లాడుకుంటున్నామని మీరు అనుకుంటారు. అక్కడికి హిందీ ఎలా వచ్చింది? వాస్తవానికి కువైట్ ప్రభుత్వం తన జాతీయ రేడియోలో ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించింది. అది కూడా హిందీలో. 'కువైట్ రేడియో'లో ప్రతి ఆదివారం అరగంట పాటు ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న అంశాలు ఉన్నాయి. కళా ప్రపంచానికి సంబంధించిన మన సినిమాలు, చర్చలు అక్కడి భారతీయ సమాజంలో బాగా ప్రాచుర్యం పొందాయి. కువైట్ స్థానిక ప్రజలు కూడా దీనిపై చాలా ఆసక్తి చూపుతున్నారని నాకు తెలిసింది. ఈ అద్భుతమైన చొరవ ప్రదర్శించినందుకు కువైట్ ప్రభుత్వానికి, ప్రజలకు నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా! నేడు ప్రపంచ వ్యాప్తంగా మన సంస్కృతిని కీర్తిస్తున్న తీరు పట్ల ఏ భారతీయుడు సంతోషించకుండా ఉండగలడు? ఉదాహరణకు తుర్క్మెనిస్తాన్లో ఈ సంవత్సరం మేలో అక్కడి జాతీయ కవి 300వ జయంతి వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా ప్రపంచంలోని 24 మంది ప్రముఖ కవుల విగ్రహాలను తుర్క్ మెని స్తాన్ అధ్యక్షుడు ఆవిష్కరించారు. ఈ విగ్రహాలలో ఒకటి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ది కావడం విశేషం. ఇది గురుదేవుడికి గౌరవం. భారతదేశానికి గౌరవం. అదేవిధంగా జూన్ నెలలో రెండు కరేబియన్ దేశాలు సూరినామ్, సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్ తమ భారతీయ వారసత్వాన్ని పూర్తి ఉత్సాహంతో, ఉల్లాసంతో జరుపుకున్నాయి. సూరినామ్‌లోని భారతీయ సమాజం ప్రతి సంవత్సరం జూన్ 5వ తేదీని ఇండియన్ అరైవల్ డేగా, ప్రవాస భారతీయుల దినోత్సవంగా జరుపుకుంటుంది. అక్కడ హిందీతో పాటు భోజ్‌పురి కూడా ఎక్కువగా మాట్లాడతారు. సెయింట్ విన్సెంట్ అండ్ గ్రెనడిన్స్‌లో నివసిస్తున్న భారతీయ సంతతికి చెందిన మన సోదర సోదరీమణులు దాదాపు ఆరు వేల మంది ఉంటారు. వారందరూ తమ వారసత్వం గురించి చాలా గర్వపడుతున్నారు. జూన్ 1వ తేదీన వారందరూ ఇండియన్ అరైవల్ డేని ఘనంగా జరుపుకున్న విధానంలో ఈ భావన స్పష్టంగా ప్రతిబింబిస్తుంది. భారతీయ వారసత్వం, సంస్కృతులకు సంబంధించిన అటువంటి విస్తరణ ప్రపంచవ్యాప్తంగా కనిపించినప్పుడు ప్రతి భారతీయుడూ గర్వపడుతున్నాడు.
మిత్రులారా! ఈ నెల యావత్ ప్రపంచం 10వ యోగా దినోత్సవాన్ని ఎంతో ఆనందోత్సాహాలతో జరుపుకుంది. జమ్ముకశ్మీర్‌లోని శ్రీనగర్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. కశ్మీర్లో యువతతో పాటు సోదరీమణులు, అమ్మాయిలు కూడా యోగా దినోత్సవంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. యోగా దినోత్సవ వేడుకలు కొనసాగుతున్న కొద్దీ కొత్త రికార్డులు నమోదవుతున్నాయి. యోగా దినోత్సవం ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో అద్భుతమైన విజయాలు సాధించింది. సౌదీ అరేబియాలో మొదటిసారిగా ఒక మహిళ అల్ హనౌఫ్ సాద్ గారు ఉమ్మడి యోగా సాధన కార్యక్రమానికి నాయకత్వం వహించారు. ఒక సౌదీ మహిళ ప్రధాన యోగా సెషన్‌ను నిర్వహించడం ఇదే మొదటిసారి. ఈసారి యోగా దినోత్సవం సందర్భంగా ఈజిప్టులో ఫొటోల పోటీ నిర్వహించారు. నైలు నది తీరం వెంబడి, ఎర్ర సముద్రం బీచ్‌లలో, పిరమిడ్ల ముందు లక్షలాది మంది యోగా సాధన చేస్తున్న చిత్రాలు బాగా ప్రాచుర్యం పొందాయి. చలవరాతి బుద్ధ విగ్రహానికి ప్రసిద్ధి చెందిన మయన్మార్‌లోని మారావిజయ పగోడా కాంప్లెక్స్ ప్రపంచంలోనే పేరు పొందింది. అక్కడ కూడా జూన్ 21వ తేదీన అద్భుతమైన యోగా కార్యక్రమం జరిగింది. బహ్రెయిన్‌లో దివ్యాంగ బాలల కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శ్రీలంకలోని యునెస్కో వారసత్వ ప్రదేశంగా ప్రసిద్ధి చెందిన గాల్ ఫోర్ట్‌లో ఒక అద్భుతమైన యోగా కార్యక్రమం కూడా జరిగింది. అమెరికాలోని న్యూయార్క్‌లోని అబ్జర్వేషన్ డెక్‌పై కూడా ప్రజలు యోగా చేశారు. మార్షల్ ఐలాండ్స్‌లో తొలిసారిగా భారీ ఎత్తున నిర్వహించిన యోగా దినోత్సవ కార్యక్రమంలో అక్కడి దేశ అధ్యక్షురాలు కూడా పాల్గొన్నారు. భూటాన్‌లోని థింఫులో కూడా ఒక భారీ స్థాయి యోగా దినోత్సవ కార్యక్రమం జరిగింది. ఇందులో నా స్నేహితుడు ప్రధానమంత్రి టోబ్గే గారు కూడా పాల్గొన్నారు. అంటే మనమందరం ప్రపంచంలోని ప్రతి మూలమూలనా యోగా చేసే వ్యక్తుల విహంగ వీక్షణం చేశాం. యోగా దినోత్సవంలో పాల్గొన్న మిత్రులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గతం నుండి నేను మిమ్మల్ని కోరుకుంటున్న విషయం ఒకటుంది. మనం యోగాను ఒక్కరోజు మాత్రమే సాధన చేసి ఆపేయకూడదు. క్రమం తప్పకుండా యోగా చేయాలి. ఫలితంగా మీరు ఖచ్చితంగా మీ జీవితంలో సానుకూల మార్పులను అనుభవిస్తారు.
మిత్రులారా! భారతదేశానికి చెందిన అనేక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా చాలా డిమాండ్ ఉంది. భారతదేశ స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం కావడం చూసినప్పుడు గర్వంతో నిండిపోవడం సహజం. అటువంటి ఒక ఉత్పత్తి అరకు కాఫీ. ఆంధ్రప్రదేశ్‌లోని అల్లూరి సీతా రామరాజు జిల్లాలో అరకు కాఫీ భారీ స్థాయిలో ఉత్పత్తి అవుతుంది. ఇది గొప్ప రుచికి, సువాసనకు ప్రసిద్ధి చెందింది. అరకు కాఫీ సాగులో దాదాపు ఒకటిన్నర లక్షల ఆదివాసీ కుటుంబాలు నిమగ్నమై ఉన్నాయి. అరకు కాఫీ ఖ్యాతి కొత్త శిఖరాలకు చేరడంలో గిరిజన సహకార సంఘం ప్రధాన పాత్ర పోషించింది. అక్కడి రైతు సోదర సోదరీమణులను ఏకతాటిపైకి తీసుకొచ్చి, అరకు కాఫీ సాగు చేసేలా ప్రోత్సహించింది. దీంతో ఈ రైతుల ఆదాయం కూడా బాగా పెరిగింది. కొండ దొర ఆదివాసీ సమాజం కూడా దీని వల్ల ఎంతో లబ్ధి పొందింది. సంపాదనతో పాటు గౌరవప్రదమైన జీవితాన్ని కూడా వారు పొందుతున్నారు. ఒకసారి విశాఖపట్నంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో పాటు ఈ కాఫీని రుచి చూసే అవకాశం నాకు లభించిందని గుర్తుంది. దాని రుచి గురించి అడగవలసిన అవసరమే లేదు! ఈ కాఫీ అద్భుతమైంది! అరకు కాఫీకి అనేక అంతర్జాతీయ పురస్కారాలు లభించాయి. ఢిల్లీలో జరిగిన జి-20 శిఖరాగ్ర సమ్మేళనంలోనూ కాఫీ మాధుర్యాన్ని అతిథులు రుచి చూశారు. మీకు అవకాశం దొరికినప్పుడల్లా అరకు కాఫీని కూడా ఆస్వాదించండి.
మిత్రులారా! మన జమ్మూ కశ్మీర్ ప్రజలు కూడా స్థానిక ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తం చేయడంలో వెనుకబడి లేరు. జమ్మూ కశ్మీర్లో గత నెలలో చేసిన పనులు దేశవ్యాప్తంగా ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయి. అక్కడి పుల్వామా నుంచి లండన్‌కు మంచు బఠానీల మొదటి సరుకును పంపారు. కాశ్మీర్లో పండే విలక్షణమైన కూరగాయలను ప్రపంచ పటంలోకి ఎందుకు తీసుకురాకూడదనే ఆలోచన కొంతమందికి వచ్చింది. అప్పుడు చకూరా గ్రామానికి చెందిన అబ్దుల్ రషీద్ మీర్ గారు ఇందుకు ముందుగా ముందుకు వచ్చారు. గ్రామంలోని ఇతర రైతుల భూమితో సమష్టిగా మంచు బఠానీలను పండించే పనిని ప్రారంభించారు. త్వరలో కశ్మీర్ నుండి మంచు బఠానీలు లండన్ కు పంపడం మొదలుపెట్టారు. ఈ విజయం జమ్మూ కాశ్మీర్ ప్రజల సమృద్ధికి కొత్త ద్వారాలు తెరిచింది. మన దేశంలో ఇలాంటి ప్రత్యేకమైన ఉత్పత్తులకు కొదవలేదు. మీరు తప్పనిసరిగా అటువంటి ఉత్పత్తులను #myproductsmypride అనే హ్యాష్ ట్యాగుతో పంచుకోవాలి. వచ్చే ‘మన్ కీ బాత్’లో కూడా ఈ అంశంపై చర్చిస్తాను.
మమ ప్రియాః దేశవాసినః
అద్య అహం కించిత్ చర్చా సంస్కృత భాషాయాం ఆరభే!
నేను హఠాత్తుగా 'మన్ కీ బాత్'లో సంస్కృతంలో ఎందుకు మాట్లాడుతున్నాను అని మీరు ఆశ్చర్యపోవచ్చు. దీనికి కారణం ఈరోజు సంస్కృతానికి సంబంధించిన ప్రత్యేక సందర్భం! ఈరోజు జూన్ 30వ తేదీన ఆకాశవాణి సంస్కృత బులెటిన్ ప్రసారం ప్రారంభమై 50 సంవత్సరాలు పూర్తవుతోంది. ఈ బులెటిన్ చాలా మందిని 50 సంవత్సరాలుగా సంస్కృతంతో నిరంతరం అనుసంధానించింది. నేను ఆకాశవాణి కుటుంబాన్ని అభినందిస్తున్నాను.
మిత్రులారా! ప్రాచీన భారతీయ విజ్ఞానంలో, వైజ్ఞానిక పురోగతిలో సంస్కృతం ముఖ్య పాత్ర పోషించింది. మనం సంస్కృతానికి గౌరవం ఇవ్వడం, సంస్కృతాన్ని మన దైనందిన జీవితంతో అనుసంధానించడం నేటి కాలానికి అవసరం. ప్రస్తుతం బెంగళూరులో చాలా మంది ఇలాంటి ప్రయత్నం చేస్తున్నారు. బెంగళూరులో ‘కబ్బన్ పార్క్’ అనే పేరుతో ఒక పార్కు ఉంది. అక్కడి ప్రజలు ఆ పార్కులో కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అక్కడ వారానికి ఒకసారి- ప్రతి ఆదివారం- పిల్లలు, యువకులు, పెద్దలు పరస్పరం సంస్కృతంలో మాట్లాడుకుంటారు. అంతే కాదు- అక్కడ అనేక చర్చా సమావేశాలను సంస్కృతంలో మాత్రమే నిర్వహిస్తారు. వారి ఈ చొరవకు పెట్టుకున్న పేరు - సంస్కృత వారాంతం! దీన్ని సమష్టి గుబ్బీ గారు వెబ్సైట్ ద్వారా ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ప్రారంభమైన ఈ ప్రయత్నం బెంగుళూరు ప్రజలలో చాలా త్వరగా ప్రాచుర్యం పొందింది. మనమందరం అలాంటి ప్రయత్నంలో పాలుపంచుకుంటే ప్రపంచంలోని ఈ పురాతన, శాస్త్రీయ భాష నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవచ్చు.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ ‘మన్ కీ బాత్’ ఎపిసోడ్లో మీతో అనుసంధానం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు ఈ క్రమం మునుపటిలాగానే కొనసాగుతుంది. వారం రోజుల తర్వాత పవిత్ర రథయాత్ర ప్రారంభమవుతుంది. మహాప్రభు జగన్నాథుని ఆశీస్సులు దేశప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. అమర్నాథ్ యాత్ర కూడా ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో పండరిపూర్ యాత్ర కూడా ప్రారంభమవుతుంది. ఈ యాత్రల్లో పాల్గొనే భక్తులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కచ్ ప్రాంత నూతన సంవత్సర వేడుకల ఆషాఢీ బీజ్ పండుగ కూడా వస్తోంది. ఈ పండుగలన్నింటికి మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. సానుకూలతకు సంబంధించిన ప్రజా భాగస్వామ్య ప్రయత్నాలను మీరు ఖచ్చితంగా నాతో పంచుకుంటూ ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వచ్చే నెలలో మీతో అనుసంధానం అయ్యేందుకు నేను ఎదురుచూస్తున్నాను. అప్పటి వరకు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!
ప్రియమైన నా దేశ ప్రజలారా, నమస్కారం. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం 110 వ ఎపిసోడ్ కు స్వాగతం. ఎప్పటిలాగే ఈసారి కూడా మీ వద్ద నుండి పెద్ద సంఖ్య లో వచ్చిన సూచనల ను, స్పందనల ను, వ్యాఖ్యల ను స్వీకరించాం. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎపిసోడ్ లో ఏ అంశాల ను చేర్చాలి అనేదే సవాలు గా ఉంది. సానుకూల వైఖరి తో కూడిన అనేక స్పందనల ను నేను అందుకున్నాను. వాటిలో ఇతరుల కు ఆశాకిరణం గా మారడం ద్వారా వారి జీవితాల ను మెరుగు పరచడానికి కృషి చేస్తున్న చాలా మంది దేశవాసుల ప్రస్తావన లు ఉన్నాయి.
సహచరులారా, కొన్ని రోజుల తరువాత మార్చి 8 వ తేదీ న ‘మహిళల దినం’ ను జరుపుకొంటున్నాం. దేశ అభివృద్ధి ప్రయాణం లో నారీ శక్తి యొక్క సహకారాని కి వందనాల ను సమర్పించేందుకు ఒక అవకాశమే ప్రత్యేకమైనటువంటి ఈ రోజు మహిళల కు సమాన అవకాశాలు లభించినప్పుడే ప్రపంచం అభివృద్ధి చెందుతుంది అని మహాకవి భారతియార్ అన్నారు. నేడు భారతదేశం మహిళల శక్తి ప్రతి రంగం లో ప్రగతి పథం లో దూసుకు పోతున్నది. మన దేశం లో గ్రామాల లో నివసించే మహిళ లు కూడా డ్రోన్ లను ఎగురవేస్తారు అని కొన్నేళ్ల క్రితం వరకు ఎవరైనా ఊహించారా ? కానీ నేడు ఇది సాధ్యపడుతోంది. ఈ రోజు న ప్రతి ఊరి లో డ్రోన్ దీదీ ని గురించే చాలా చర్చ జరుగుతోంది. “నమో డ్రోన్ దీదీ, నమో డ్రోన్ దీదీ” అనే పదాలు అందరి నోళ్ల లో నానుతున్నాయి. అందరూ ఈ విషయాన్ని గురించే మాట్లాడుకొంటున్నారు. విపరీతమైన ఆసక్తి ఏర్పడింది. అందుకే ఈ సారి ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో నమో డ్రోన్ దీదీ తో ఎందుకు మాట్లాడకూడదు అని నేను కూడా అనుకున్నాను. ఉత్తర్ ప్రదేశ్ లోని సీతాపూర్ కు చెందిన నమో డ్రోన్ దీదీ సునీత గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఆమె తో మాట్లాడుదాం.
మోదీ గారు: సునీతా దేవి గారు.. మీకు నమస్కారం.
సునీతా దేవి: నమస్తే సర్.
మోదీ గారు: సునీత గారూ... ముందుగా నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ కుటుంబాన్ని గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి.
సునీతా దేవి: సర్. మా కుటుంబం లో మా ఇద్దరు పిల్లలు, నేను భర్త మరియు మా అమ్మ ఉన్నాం.
మోదీ గారు: సునీత గారూ.. మీరు ఏం చదువుకున్నారు ?
సునీతా దేవి: సర్. నేను బి. ఏ. (ఫైనల్) అండి.
మోదీ గారు: మరి ఇంటి కార్యకలాపాలు వగైరా గురించి చెబుతారా ?
సునీతా దేవి: వ్యవసాయానికి సంబంధించినటువంటి పనుల ను చేస్తుంటాం సర్.
మోదీ గారు: సరే సునీత గారూ.. ఈ డ్రోన్ దీదీ గా మారే మీ ప్రయాణం ఎలా మొదలైంది ? మీరు శిక్షణ ను ఎక్కడ తీసుకొన్నారు ?, ఏయే మార్పు లు చోటు చేసుకొన్నాయి ?, ఏమేమిటి జరిగాయి ? , నేను మొదటి నుండి తెలుసుకోవాలని అనుకుంటున్నాను.
సునీతా దేవి: సర్. అలహాబాద్ లోని ఫూల్ పుర్ ఇఫ్ కో (IFFCO) కంపెనీ లో మాకు శిక్షణ ను ఇవ్వడం జరిగింది. మేం అక్కడి నుండి శిక్షణ పొందాం సర్.
మోదీ గారు: అప్పటి లోపు డ్రోన్ లను గురించి ఎప్పుడైనా మీరు విని ఉన్నారా ?
సునీతా దేవి: సర్. గతం లో ఎప్పుడూ వినలేదు. ఒక్కసారి అలా చూశాం సీతాపుర్ లోని కృషి విజ్ఞాన కేంద్రం లో. మేం మొదటి సారి డ్రోన్ ను అక్కడ చూశాం.
మోదీ గారు: సునీత గారూ.. మీరు మొదటి రోజు న వెళ్ళినప్పటి అనుభూతి ని నేను అర్థం చేసుకోవాలి అని అనుకుంటున్నాను.
సునీతా దేవి: సర్..
మోదీ గారు: మొదటి రోజు న మీకు డ్రోన్ ను చూపించి ఉంటారు. అప్పుడు బోర్డు మీద ఏదో నేర్పించి ఉంటారు. కాగితం పైనా నేర్పించి ఉంటారు. ఆపై మైదానానికి తీసుకెళ్ళి అభ్యాసం చేయించి ఉంటారు. ఇలా అన్ని విషయాల ను మీరు నాకు పూర్తి గా చెప్పగలరా !
సునీతా దేవి: అవును సర్. మేం అక్కడకు వెళ్ళిన రెండో రోజు నుండి మా శిక్షణ మొదలైంది. ముందుగా థియరి ని బోధించి ఆ తరువాత రెండు రోజుల పాటు క్లాస్ నిర్వహించారు. క్లాస్ లో డ్రోన్ లోని భాగాలు, మేం చేయవలసింది ఏమిటి ?, ఎలా చేయాలి ?- ఇలాగ అన్నీ థియరి లో బోధించారు. మూడో రోజు న మాకు పేపర్ పై పరీక్ష పెట్టారు. ఆ తరువాత కంప్యూటర్ ద్వారా కూడా పరీక్ష పెట్టారు. అంటే ముందుగా క్లాసు ను నిర్వహించి తరువాత పరీక్ష పెట్టారు. ఆ తరువాత ప్రాక్టికల్ ను జరిపించారు. డ్రోన్ ను ఎలా ఎగరేయాలి ?, ఎలాగ కంట్రోల్ చేయాలి.. ఇలా ప్రతిదీ ఆచరణాత్మకం గా నేర్పించారు.
మోదీ గారు: డ్రోన్ పనితీరు ను ఎలా నేర్పించారు ?
సునీతా దేవి: సర్.. వ్యవసాయం లో కూడా డ్రోన్ పని చేస్తుంది. వానాకాలం లేక ఇతర కాలాల్లో అయినా వానలు కురవడం వల్ల పంటలు కోసేందుకు పొలాల్లోకి వెళ్లలేకపోతున్నాం. అప్పుడు కూలీ లు పొలాల కు ఎలా వెళ్తారు ? అప్పుడు డ్రోన్ ఉపయోగం వల్ల రైతుల కు ఎంతో మేలు జరుగుతుంది. పొలాల్లోకి కూడా ప్రవేశించవలసిన అవసరం లేదు. కూలీల ను పెట్టుకుని పనులు చేసుకున్నట్టు గట్టు మీద నిలబడి డ్రోన్ తో పనులు చేసుకోవచ్చు. పొలం లోపల పురుగుల నుండి కూడా రక్షణ లభిస్తుంది. ఇబ్బందులు ఉండవు. రైతుల కు కూడా చాలా మంచిది. ఇప్పటి వరకు 35 ఎకరాల లో పిచికారీ చేశాం సర్.
మోదీ గారు: అంటే దీనివల్ల లాభాలు ఉన్నాయనే సంగతి రైతు ల కు తెలుసంటారా ?
సునీతా దేవి: అవును సర్. రైతు లు చాలా సంతృప్తి గా ఉన్నారు. చాలా బాగుంది అని వారు చెబుతున్నారు. సమయం కూడా ఆదా అవుతుంది. అన్ని సౌకర్యాలూ అదే చూసుకుంటుంది. నీళ్ళు, మందులు- అన్నీ అదే కలుపుకొంటుంది. రైతు లు వారి పొలం ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉందో చెబితే చాలు. అరగంట లో మొత్తం పని ని డ్రోన్ యే చక్కబెడుతుంది.
మోదీ గారు: మరి అయితే ఈ డ్రోన్ ని చూడడానికి వేరే వాళ్ళు కూడా వస్తూ ఉండి ఉండవచ్చేమో ?
సునీతా దేవి: సర్.. చాలా మంది గుమిగూడతారు. డ్రోన్ ను చూడడానికి చాలా మంది వస్తారు. పెద్ద పెద్ద రైతు లు ఉన్నారు, వారు నంబరు కూడా అడిగి తీసుకుంటుంటారు ఎప్పుడైనా మేం కూడా మిమ్మల్ని పిచికారీ కోసం పిలుస్తాం అంటూ.
మోదీ గారు: సరే. లఖ్ పతి దీదీ (లక్షాధికారి సోదరీమణి) ని తయారు చేయాలి అనే లక్ష్యం నాకు ఉంది. కాబట్టి, డ్రోన్ దీదీ నాతో మొదటి సారి గా మాట్లాడుతున్న విషయాల ను ఈ రోజు న దేశవ్యాప్తంగా ఉన్న సోదరీమణులు వింటూ ఉంటే, మీరు వారికి ఏమి చెప్పాలని అనుకుంటున్నారు ?
సునీతా దేవి: ఈ రోజు నేనొక్కదాన్నే డ్రోన్ దీదీ ని. అటువంటి వేలాది సోదరీమణులు నాలా డ్రోన్ దీదీలు గా మారడానికి ముందుకు వచ్చారా అంటే, నేను చాలా సంతోషిస్తాను. నేను ఒంటరి గా ఉన్నప్పుడు వేల మంది నాతో పాటు నిలబడితే ఆనందం గా ఉంటుంది. ఒంటరి గా లేము అని, చాలా మంది డ్రోన్ దీదీ అనే గుర్తింపు తో మాతో ఉన్నారని సంతోషం గా ఉంటుంది.
మోదీ గారు: సునీత గారూ.. మీకు నా తరఫు నుండి అనేకానేక అభినందన లు. ఈ నమో డ్రోన్ దీదీ, ఈ దేశం లో వ్యవసాయాన్ని ఆధునికీకరించడానికి గొప్ప మాధ్యం గా మారుతోంది. నా పక్షాన అనేకానేక శుభాకాంక్షలు.
సునీతా దేవి: మీకు ధన్యవాదాలు, థేంక్ యు సర్.
మోదీ గారు: మీకు ధన్యవాదాలు!
సహచరులారా, ప్రస్తుతం మహిళా శక్తి వెనుకబడిపోయినటువంటి రంగం అంటూ దేశం లో ఏ రంగమూ లేదు. మహిళ లు వారి నాయకత్వ సామర్థ్యాలను మెరుగైన రీతి లో చాటిన మరొక రంగం ఏది అంటే అది ప్రాకృతిక వ్యవసాయ రంగం. జల సంరక్షణ ఇంకా పారిశుద్ధ్యం. రసాయనాల వల్ల మన భూమాత కు కలుగుతున్న కష్టాలు, బాధ లు, వేదన నుండి మన ధరణి మాత ను కాపాడడం లో దేశం లోని మాతృ శక్తి పెద్ద పాత్ర ను పోషిస్తున్నది. దేశం లో ప్రతి మూల న ఇప్పుడు మహిళ లు ప్రాకృతిక వ్యవసాయాన్ని విస్తరిస్తున్నారు. ఇవాళ దేశం లో ‘జల్ జీవన్ మిశన్’ లో భాగం గా ఇంత పని జరుగుతుంటే అందులో దీనికి వెనుక నీటి సంఘాల ది చాలా పెద్ద పాత్రే ఉంది. ఈ నీటి సంఘాల నాయకత్వం మహిళల దగ్గరే ఉంది. దీనికి అదనం గా నీటి సంరక్షణ కోసం మహిళ లు అన్ని విధాలు గాను కృషి చేస్తున్నారు. అటువంటి ఒక మహిళ యే కళ్యాణి ప్రఫుల్ల పాటిల్ గారు. ఆమె నాతో ఫోన్ లైన్ లో ఉన్నారు. ఆవిడ మహారాష్ట్ర నివాసి. రండి, కళ్యాణి ప్రఫుల్ల పాటిల్ గారి తో మాట్లాడి, ఆమె ఏం చెబుతారో తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి గారు: కళ్యాణి గారూ.. నమస్తే.
కళ్యాణి గారు: నమస్తే సర్ జీ, నమస్తే.
ప్రధాన మంత్రి గారు: కళ్యాణి గారూ.. ముందుగా మీరు మీ గురించి, మీ కుటుంబాన్ని గురించి, మీ పనిపాటుల ను గురించి కాస్త వివరాలను తెలియజేయండి.
కళ్యాణి గారు: సర్.. నేను ఎమ్మెస్సీ మైక్రోబయాలజీ చదివాను. మా ఇంట్లో నా భర్త, మా అత్త గారు, ఇంకా నా ఇద్దరు పిల్లలు ఉంటాం. మూడేళ్ల నుండి నేను మా గ్రామ పంచాయతీ లో పని చేస్తున్నాను.
ప్రధాన మంత్రి గారు: అయితే ఊళ్ళో వ్యవసాయ పనుల లో నిమగ్నం అయ్యారా ? ఎందుకంటే మీ దగ్గర ప్రాథమిక జ్ఞానం కూడా ఉంది. మీ చదువు కూడాను ఈ రంగం లోనే పూర్తి అయింది. ఇక మీరు వ్యవసాయం లో చేరారు. మరి మీరు ఏయే క్రొత్త ప్రయోగాల ను చేశారంటారు ?
కళ్యాణి గారు: సర్... మేం ఏవైతే పది రకాల వనస్పతులు ఉన్నాయో వాటిని అన్నింటిని కలిపి వేసి మేం ఆర్గానిక్ స్ప్రే ను తయారు చేశాం. మనం పురుగు మందుల ను పిచికారీ చేస్తే మనకు మంచి చేసే స్నేహపూర్వక కీటకాలు కూడా నాశనం అవుతాయి. నీళ్ల లో రసాయనాల ను కలిపినందువల్ల నేల కలుషితం అవుతూ, ఈ కారణం గా మన శరీరం మీద సైతం హానికారక ప్రభావాలు ప్రసరిస్తూ ఉంటాయి. ఈ లెక్క న మేం కనీస స్థాయి లో పురుగుమందుల ను ఉపయోగించాం.
ప్రధాన మంత్రి గారు: అంటే ఒక రకం గా మీరు పూర్తి గా ప్రాకృతిక వ్యవసాయం వైపు మళ్లుతున్నారన్న మాట.
కళ్యాణి గారు: అవునండి, మా సాంప్రదాయిక వ్యవసాయం ఏదైతే ఉందో క్రిందటి ఏడాది మేం అలాగే చేశాం.
ప్రధాన మంత్రి గారు: ప్రాకృతిక వ్యవసాయం లో మీకు ఎటువంటి అనుభవం లభించింది ?
కళ్యాణి గారు: సర్. మా ఆడవాళ్ళకి అయ్యే ఖర్చులు తక్కువయ్యాయి. ఆ పరిష్కారం లభించాక ఆ ఉత్పత్తుల ను పురుగుమందులు లేకుండా తయారు చేశాం. ఎందుకంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాల తో పాటు గ్రామీణ ప్రాంతాల లో కూడాను కేన్సర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి దానికి తగ్గట్టుగా భావి కుటుంబాన్ని కాపాడుకోవాలి అంటే ఈ మార్గాన్ని అవలంబించవలసిందే. అందుకు అనుగుణం గా ఆయా మహిళ లు కూడా ఇందులో చురుకు గా పాలుపంచుకొంటున్నారు.
ప్రధాన మంత్రి గారు: సరే కళ్యాణి గారు.. నీటి సంరక్షణ లోనూ మీరు ఏదైనా కృషి ని చేశారా ? అందులో మీరు చేసింది ఏమిటి ?
కళ్యాణి గారు: సర్.. మన ప్రభుత్వ భవనాలైన ప్రాథమిక పాఠశాల, ఆంగన్ బాడీ, మా గ్రామ పంచాయతీ భవనం- వీటి దగ్గర ఉన్న వర్షపు నీటినంతటినీ ఒకే చోటు లోకి సేకరించాం సర్. రీచార్జ్ శాఫ్ట్, అంటే వాన నీరు- భూమి లోపల కు చొచ్చుకు పోవాలి. కాబట్టి మేం మా గ్రామం లో 20 రీచార్జ్ శాఫ్ట్ లను తయారు చేశాం. మరో 50 రీచార్జ్ శాఫ్ట్ లు మంజూరు అయ్యాయి. ఇప్పుడు ఆ పని కూడా త్వరలో ప్రారంభం అవుతుంది.
ప్రధాన మంత్రి గారు: కళ్యాణి గారు.. మీతో మాట్లాడినందుకు చాలా ఆనందం గా ఉంది. మీకు చాలా చాలా శుభాకాంక్ష లు.
కళ్యాణి గారు: ధన్యవాదాలు సర్, ధన్యవాదాలు సర్. మీతో మాట్లాడినందుకు నాకు కూడా చాలా సంతోషం గా ఉంది. నా జీవితం సంపూర్ణం గా సార్థకమయింది, నాకు ఇలాగ అనిపిస్తున్నది.
ప్రధాన మంత్రి గారు: మంచిది, సేవ చేస్తూ ఉండండి.
ప్రధానమంత్రి గారు: మీ పేరే కళ్యాణి మరి మీరు కళ్యాణ పూర్వకమైనటువంటి కార్యాలనే చేస్తూ ఉంటారన్నమాట. ధన్యవాదాలండీ. నమస్కారం.
కళ్యాణి గారు: ధన్యవాదాలు సర్. ధన్యవాదాలు.
సహచరులారా, సునీత గారు అయినా, కళ్యాణి గారు అయినా, వివిధ రంగాల లో స్త్రీ శక్తి సాధించినటువంటి సాఫల్యం చాలా ప్రేరణ ను అందిస్తున్నది. నేను మరో సారి మన మహిళా శక్తి అందిస్తున్నటువంటి ఈ స్ఫూర్తి ని మనస్పూర్తి గా ప్రశంసిస్తున్నాను.
ప్రియమైన నా దేశ ప్రజలారా, ప్రస్తుతం మన అందరి జీవనం లో సాంకేతిక విజ్ఞానం ప్రాముఖ్యం చాలా పెరిగిపోయింది. మొబైల్ ఫోన్ లు, డిజిటల్ పరికరాలు ప్రతి ఒక్కరి జీవనం లో ఒక ముఖ్యమైన భాగం గా మారిపోయాయి. కానీ ఇప్పుడు అడవి జంతువుల తో సమన్వయం లో డిజిటల్ పరికరాలు మనకు సహాయపడతాయి అని మీరు ఊహించ గలరా ! కొన్ని రోజుల తరువాత మార్చి 3 వ తేదీ న ‘ప్రపంచ వన్యప్రాణి దినం’ రాబోతోంది. వన్యప్రాణుల సంరక్షణ పై అవగాహన ను కల్పించే లక్ష్యం తో ఈ దినోత్సవాన్ని జరుపుకొంటాం. ఈ సంవత్సరం ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఇతివృత్తం లో డిజిటల్ ఇనొవేశన్ కు ప్రాధాన్యాన్ని ఇవ్వడమైంది. మన దేశం లో వివిధ ప్రాంతాల లో వన్యప్రాణుల సంరక్షణ కోసం సాంకేతికత ను విరివి గా ఉపయోగిస్తున్నారన్న విషయం తెలిస్తే మీరు సంతోషిస్తారు. గత కొన్ని సంవత్సరాలు గా ప్రభుత్వ ప్రయాసల వల్ల దేశం లో పులుల సంఖ్య పెరిగింది. మహారాష్ట్ర లోని చంద్రపుర్ పులుల అభయారణ్యం లో పులుల సంఖ్య 250 కి పైగా పెరిగింది. చంద్రపుర్ జిల్లా లో మనుషులు, పులుల మధ్య ఘర్షణ ను తగ్గించడానికి కృత్రిమ మేధ సహాయాన్ని తీసుకొన్నారు. ఇక్కడ గ్రామ, అటవీ సరిహద్దుల లో కెమెరా లు ఏర్పాటు చేశారు. పులి గ్రామ సమీపం లోకి వచ్చినప్పుడల్లా కృత్రిమ మేధ సహాయం తో స్థానిక ప్రజలు వారి మొబైల్ లో హెచ్చరిక ను అందుకొంటారు. నేడు ఈ వ్యవస్థ ఈ టైగర్ రిజర్వ్ చుట్టూ ఉన్న 13 గ్రామాల ప్రజలకు చాలా సౌకర్యాన్ని అందించింది. పులుల కు కూడా రక్షణ లభించింది.
సహచరులారా, నేడు యువ నవ పారిశ్రమికవేత్త లు వన్యప్రాణుల సంరక్షణ, ఇకో టూరిజమ్ కోసం నూతన ఆవిష్కరణల ను కూడా తీసుకు వస్తున్నారు. ఉత్తరాఖండ్ లోని రూడ్ కీ లో రోటర్ ప్రిసిఝన్ గ్రూప్స్ సంస్థ కెన్ నది లో మొసళ్ల పైన నిఘా ను ఉంచడం లో సహాయ పడే రకం డ్రోన్ ను ను వైల్డ్ లైఫ్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఇండియా సహకారం తో తయారు చేసింది. ఇదే విధం గా బెంగళూరు లోని ఓ కంపెనీ ‘బఘీరా’ మరియు ‘గరుడ్’ పేరుల తో ఏప్‌ల ను సిద్ధం చేసింది. బఘీరా ఏప్ తో అడవి లో సఫారీ సమయం లో వాహనం వేగాన్ని, ఇతర కార్యకలాపాల ను పర్యవేక్షించవచ్చు. దేశం లోని అనేక పులుల అభయారణ్యాల లో దీనిని ఉపయోగిస్తున్నారు. కృత్రిమ మేధ (ఏల్టర్నేటివ్ ఇంటెలిజెన్స్- ఎఐ) పైన, ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి) పైన ఆధారపడే గరుడ ఏప్ ను ఏదైనా సిసిటివి కి కలపడం ద్వారా వాస్తవ కాలిక హెచ్చరికలు అందడం మొదలవుతుంది. వన్య ప్రాణుల పరిరక్షణ కోసం చేసే ఇటువంటి ప్రతి ప్రయాస తోనూ మన దేశం లో జీవ వైవిధ్యం మరింత సమృద్ధం అవుతోంది.
సహచరులారా, భారతదేశం లో ప్రకృతి తో సమన్వయం అనేది మన సంస్కృతి లో అంతర్భాగం గా ఉంది. వేల సంవత్సరాలు గా ప్రకృతి తోను, వన్య ప్రాణులతోను సహజీవనం చేస్తూ జీవిస్తున్నాం. మీరు ఎప్పుడైనా మహారాష్ట్ర లోని మేల్ఘాట్ పులుల అభయారణ్యానికి వెళ్తే మీరు దాన్ని స్వయంగా అనుభూతి చెందవచ్చు. ఈ టైగర్ రిజర్వ్ సమీపం లోని ఖట్ కలి గ్రామం లో నివసిస్తున్న ఆదివాసి కుటుంబాలు ప్రభుత్వ సహాయంతో వారి ఇళ్లను హోమ్ స్టేలు గా మార్చుకున్నాయి. ఇది వారికి భారీ ఆదాయ వనరు గా మారుతోంది. అదే గ్రామం లో నివాసం ఉంటున్న కోర్ కు తెగ కు చెందిన ప్రకాశ్ జామ్‌కార్ గారు తన రెండు హెక్టార్ల భూమి లో ఏడు గదుల హోమ్ స్టే ను సిద్ధం చేశారు. ఆయన కుటుంబం ఆ స్థలం లో బస చేసే పర్యటకుల కు ఆహారం, పానీయాల ఏర్పాటుల ను చేస్తుంది. ఆయన తన ఇంటి చుట్టూ ఔషధ మొక్కల తో పాటు మామిడి, కాఫీ చెట్ల ను కూడా నాటారు. ఇది పర్యటకుల ను ఆకర్షించడమే కాకుండా ఇతర వ్యక్తుల కు కొత్త ఉపాధి అవకాశాల ను కూడా అందించింది.
ప్రియమైన నా దేశ ప్రజలారా, మనం పశు పోషణ ను గురించి మాట్లాడేటప్పుడు, మనం తరచు గా ఆవులు, గేదెల వద్ద మాత్రమే ఆగిపోతాం. కానీ మేక కూడా ఒక ముఖ్యమైన పశువు. దీనిపై ఎక్కువ గా చర్చ జరగ లేదు. దేశం లోని వివిధ ప్రాంతాల లో చాలా మంది ప్రజలు మేకల పెంపకం తో సంబంధం కలిగి ఉన్నారు. ఒడిశా లోని కాలాహండి లో మేక ల పెంపకం గ్రామ ప్రజల జీవనోపాధి తో పాటు వారి జీవన ప్రమాణాల ను మెరుగు పరచడానికి ప్రధాన సాధనం గా మారుతోంది. ఈ ప్రయత్నం వెనుక జయంతి మహాపాత్ర గారు, ఆమె భర్త బీరెన్ సాహు గారి పెద్ద స్థాయి నిర్ణయం ఉంది. వారిద్దరూ బెంగళూరు లో మేనేజ్మెంట్ నిపుణులు. అయితే వారు కొంత విరామాన్ని తీసుకొని కాలాహండి లోని సాలెభాటా గ్రామాని కి రావాలి అని నిర్ణయించుకున్నారు. ఇక్కడి గ్రామీణుల సమస్యల ను పరిష్కరించడంతో పాటుగా వారికి సాధికారత ను కల్పించే విధంగా ఏదైనా మంచి చేయాలి అని వారు భావించారు. సేవ భావం తోను, అంకితభావం తోను కూడిన ఈ ఆలోచన తో మాణికాస్తు ఎగ్రో ను స్థాపించి రైతుల తో కలసి పనిచేయడం ప్రారంభించారు. జయంతి గారు, బీరేన్ గారు లు ఇక్కడ ఆసక్తికరమైన మాణికాస్తు గోట్ బ్యాంకు ను కూడా ప్రారంభించారు. వారు సామాజిక స్థాయి లో మేక ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. వారి మేక ల ఫారం లో డజన్ల కొద్ది మేక లు ఉన్నాయి. రైతుల కోసం పూర్తి వ్యవస్థ ను మాణికాస్తు మేక ల బ్యాంకు సిద్ధం చేసింది. దీని ద్వారా రైతులకు 24 నెలల కాలాని కి రెండు మేకల ను అందజేస్తారు. మేక లు 2 సంవత్సరాల లో 9 నుండి 10 పిల్లల కు జన్మనిస్తాయి. వాటిలో 6 పిల్లల ను బ్యాంకు లో ఉంచుతారు. మిగిలిన వాటి ని మేకల ను పెంచే కుటుంబాని కి ఇస్తారు. అంతే కాదు మేక ల సంరక్షణ కు అవసరమైన సేవల ను సైతం వారు అందిస్తున్నారు. ప్రస్తుతం లో 50 గ్రామాల కు చెందిన 1000 మందికి పైగా రైతులు ఈ జంట తో అనుబంధాన్ని కలిగివున్నారు. వారి సహకారం తో గ్రామ ప్రజలు పశు పోషణ రంగం లో స్వావలంబన దిశ గా పయనిస్తున్నారు. విభిన్న రంగాల లో విజయవంతమైన నిపుణులు చిన్న రైతులు సాధికారిత ను, స్వయం సమృద్ధి ని పొందేందుకు కొత్త పద్ధతుల ను అవలంబించడం చూసి నేను చాలా సంతోషం గా ఉన్నాను. వారి కృషి అందరి కి స్ఫూర్తి ని ఇస్తుంది.
ప్రియమైన నా దేశ ప్రజలారా, మన సంస్కృతి నేర్పింది ఏమిటి అంటే అది ‘పరమార్థ్ పరమో ధర్మః’ అనేదే. ఈ మాటలకు అర్థం, ఇతరులకు సహాయం చేయడమే అతి పెద్ద కర్తవ్యం అని. ఈ భావన ను అనుసరించి మన దేశం లో లెక్క లేనంత మంది ప్రజలు నిస్వార్థం గా ఇతరుల కు సేవ చేయడానికి వారి యొక్క జీవనాన్ని అంకితం చేసివేస్తున్నారు. అటువంటి వారి లో ఒకరు - బిహార్ లోని భోజ్ పుర్ కు చెందిన భీమ్ సింహ్ భవేశ్ గారు. ఆయన పని గురించి ఆయన ప్రాంతం లోని ముస్ హర్ సామాజిక వర్గం వారి లో చాలా చర్చ జరుగుతోంది. అందుకే ఈ రోజు న ఈ విషయాన్ని మీతో ఎందుకు మాట్లాడ కూడదు అని అనుకున్నాను. బిహార్ లో అత్యంత నిరాదరణ కు గురైన సముదాయమూ, చాలా పేద సముదాయమూ ముస్ హర్ అనే సముదాయం. భీమ్ సింహ్ భవేశ్ గారు ఈ సముదాయం లోని పిల్లల భవిష్యత్తు ఉజ్వలం గా ఉండేందుకు వారి లో విద్య వ్యాప్తి పై దృష్టి పెట్టారు. ముస్ హర్ సామాజిక వర్గాని కి చెందిన దాదాపు 8 వేల మంది బాలల ను పాఠశాల లో చేర్పించారు. ఆయన ఒక పెద్ద గ్రంథాలయాన్ని కూడా కట్టించారు. దాని వల్ల పిల్లల కు చదువు కోవడం లో మెరుగైన సౌకర్యాలు లభిస్తున్నాయి. భీమ్ సింహ్ గారు తన సామాజిక వర్గ సభ్యుల కు అవసరమైన పత్రాల ను తయారు చేయడం లో, వారి కి దరఖాస్తుల ను పూరించడం లో కూడాను సహాయం చేస్తారు. ఇది గ్రామ ప్రజల కు అవసరమైన వనరుల ను మరింత మెరుగు పరచింది. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పరచడానికి ఆయన 100 కు పైగా వైద్య శిబిరాల ను నిర్వహించారు. కరోనా సంక్షోభం పెద్దదవుతున్నప్పుడు భీమ్ సింహ్ గారు తాను ఉన్న ప్రాంతం లోని ప్రజల ను టీకామందు ను తీసుకోవలసింది గా ప్రోత్సహించారు. దేశం లోని వివిధ ప్రాంతాల లో భీమ్ సింహ్ భవేశ్ గారు ల వంటి అనేక మంది ఉన్నారు. వారు సమాజం లో ఈ తరహా అనేక ఉదాత్తమైన పనుల్లో నిమగ్నమై ఉన్నారు. బాధ్యతాయుతమైన పౌరులు గా మనం మన విధుల ను నిర్వర్తిస్తే, అది బలమైన దేశాన్ని నిర్మించడం లో చాలా సహాయకారి గా ఉంటుంది.
ప్రియమైన నా దేశ ప్రజలారా, భారతదేశం యొక్క సుందరత్వం ఇక్కడి వివిధత్వం మరియు మన సంస్కృతి యొక్క విభిన్న మైనటువంటి వర్ణాల లో సైతం ఇమిడిపోయి ఉంది. భారతీయ సంస్కృతి ని పరిరక్షించడానికి, అందంగా తీర్చిదిద్దడాని కి ఎంత మంది నిస్వార్థం గా కృషి చేస్తున్నారో చూస్తే నాకు చాలా సంతోషం గా ఉంటుంది. భారతదేశం లోని ప్రతి ప్రాంతం లో ఇటువంటి వ్యక్తులు కనిపిస్తారు. వీరిలో భాష రంగం లో పనిచేస్తున్న వారు కూడా అధిక సంఖ్య లో ఉన్నారు. జమ్ము - కశ్మీర్ లోని గాందర్ బల్ కు చెందిన మొహమ్మద్ మాన్ శాహ్ గారు గత మూడు దశాబ్దాలు గా గోజ్ రీ భాష ను పరిరక్షించే ప్రయత్నాల లో నిమగ్నం అయి ఉన్నారు. ఆయన ఆదివాసీ సముదాయం అయిన గుజ్జర్ బకర్ వాల్ సముదాయాని కి చెందిన వారు. బాల్యం లో చదువు కోసం కష్టపడే వారు. రోజూ 20 కిలోమీటర్ల దూరం కాలినడక న వెళ్లే వారు. అటువంటి సవాళ్ల మధ్య ఆయన మాస్టర్స్ డిగ్రీ ని పొందారు. తన భాష ను కాపాడుకోవాలి అనే ఆయన సంకల్పం దాంతో మరింత బలపడింది.
సాహిత్యరంగం లో మాన్ శాహ్ గారి కార్యాల పరిధి ఎంత పెద్దది అంటే ఈ కృషి ని దాదాపు 50 సంపుటాల లో భద్రపరచారు. వీటిలో కవిత లు, జానపద గేయాలు కూడా కలిసి ఉన్నాయి. ఆయన అనేక పుస్తకాల ను గోజ్ రీ భాష లోకి అనువదించారు.
సహచరులారా, అరుణాచల్ ప్రదేశ్ లోని తిరప్ కు చెందిన బన్ వంగ్ లోసు గారు ఒక ఉపాధ్యాయుడు. వాంచో భాష వ్యాప్తి లో అత్యంత విలువైన కృషి ని ఆయన చేశారు. అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, అసమ్ లోని కొన్ని ప్రాంతాల లో ఈ భాష లో మాట్లాడుతారు. భాషా పాఠశాల నిర్మాణానికి ఆయన కృషి చేశారు. వాంచో భాష కు సంబంధించిన లిపి కూడా సిద్ధమైంది. రాబోయే తరాల కు వాంచో భాష ను నేర్పిస్తున్నారు. తద్వారా ఆ భాష అంతరించి పోకుండా కాపాడుతున్నారు.
సహచరులారా, పాటల ద్వారాను, నృత్యాల ద్వారాను సంస్కృతి ని, భాష ను కాపాడుకోవడం లో తలమునకలు గా ఉన్న వారు మన దేశం లో చాలా మంది ఉన్నారు. కర్నాటక కు చెందిన శ్రీ వెంకప్ప అంబాజీ సుగేత్కర్ జీవనం కూడా ఈ విషయం లో చాలా స్ఫూర్తిదాయకం. ఇక్కడి బాగల్కోట్ నివాసి సుగేత్ కర్ గారు జానపద గాయకులు. ఆయన 1000 కంటే ఎక్కువ గోంధ్ లీ పాటల ను పాడారు. ఈ భాష లో కథల ను కూడా ప్రచారం చేశారు. వందల కొద్దీ విద్యార్థుల కు ఫీజు లేకుండా శిక్షణ ను కూడా ఇచ్చారు. భారతదేశం లో నిరంతరం మన సంస్కృతి ని సుసంపన్నం చేస్తున్నటువంటి, ప్రగాఢ ఆసక్తి మరియు ఉత్సాహం నిండిన అటువంటి వ్యక్తుల కు కొరత లేదు. మీరు కూడా వారి నుండి స్ఫూర్తి పొందండి. మీ స్వంతం గా ఏదైనా చేయడానికి ప్రయత్నించండి. మీరు చాలా సంతృప్తి ని అనుభవిస్తారు.
ప్రియమైన నా దేశ ప్రజలారా, రెండు రోజుల క్రితం నేను వారాణసీ లో ఉన్నాను. అక్కడ చాలా అద్భుతమైన ఫోటో ఎగ్జిబిశను ను చూశాను. కాశీ, పరిసర ప్రాంతాల యువత కెమెరా లో బంధించిన క్షణాలు అద్భుతం గా ఉన్నాయి. అందులో మొబైల్ కెమెరా తో తీసిన ఫోటో లు చాలా ఉన్నాయి. నిజాని కి నేడు మొబైల్ ఉన్న వారు కంటెంట్ సృష్టికర్తలు గా మారారు. సామాజిక మాధ్యాలు కూడా ప్రజల కు వారి నైపుణ్యాల ను, ప్రతిభ ను చూపడం లో చాలా సహాయ పడ్డాయి. భారతదేశం లోని మన యువ స్నేహితులు కంటెంట్ సృష్టి రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. ఇది ఏ సామాజిక మాధ్యం వేదిక అయినా కానివ్వండి. కచ్చితం గా మన యువ స్నేహితులు వేరువేరు విషయాల పై విభిన్న అంశాల ను శేర్ చేసుకొంటారు. అది పర్యటన రంగం కావచ్చు. సామాజిక మార్పు కారకాలు కావచ్చు. ప్రజా భాగస్వామ్యం కావచ్చు. లేదా స్పూర్తిదాయకమైన జీవిత ప్రయాణం కావచ్చు. వీటికి సంబంధించిన వివిధ రకాల కంటెంట్ సామాజిక మాధ్యాల లో అందుబాటు లో ఉంది. కంటెంట్ ను సృజిస్తున్న దేశ యువత గళం నేడు చాలా ప్రభావవంతం గా మారింది. వారి ప్రతిభ ను గౌరవించేందుకు, దేశం లో నేశనల్ క్రియేటర్స్ అవార్డు మొదలైంది. దీని లో వివిధ కేటగిరీల లో సామాజిక మార్పు విషయం లో ప్రభావశీలమైన వాణి గా మారేందుకు సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగిస్తున్న వారిని సత్కరించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ పోటీ ని మైగవ్ (MyGov) లో నిర్వహించడం జరుగుతున్నది. కంటెంట్ సృష్టికర్త లు ఇందులో చేరవలసింది గా నేను కోరుతున్నాను. మీకు అటువంటి ఆసక్తికరమైన కంటెంట్ క్రియేటర్ లను గురించి తెలిస్తే, కచ్చితం గా వారి ని నేశనల్ క్రియేటర్స్ అవార్డు కు నామినేట్ చేయండి.
ప్రియమైన నా దేశ ప్రజలారా, కొద్ది రోజుల క్రితం ఎన్నికల సంఘం ‘మేరా పెహ్లా ఓట్ – దేశ్ కే లియే’ అనే పేరు తో మరో ప్రచారాన్ని ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను. దీని ద్వారా మొదటి సారి వోటర్ లు అత్యధిక సంఖ్య లో వోటు వేయాలి అని ప్రత్యేకంగా అభ్యర్థించారు. ఉత్సాహం, శక్తితో నిండిన యువ శక్తి పట్ల భారతదేశం గర్విస్తోంది. ఎన్నికల ప్రక్రియ లో యువత అధిక సంఖ్య లో పాల్గొంటే దాని ఫలితాలు దేశాని కి అంతే ఎక్కువ ప్రయోజనకరం గా ఉంటాయి. మొదటి సారి వోటరు లు కూడా రికార్డు సంఖ్యలో వోటు వేయాలి అని నేను కోరుతున్నాను. 18 ఏళ్లు నిండిన తరువాత 18 వ లోక్ సభ కు సభ్యుడి ని ఎన్నుకొనే అవకాశం మీకు లభిస్తుంది. అంటే ఈ 18 వ లోక్ సభ కూడా యువత ఆకాంక్ష కు ప్రతీక అవుతుంది. అందుకే మీ వోటు కు ప్రాధాన్యం మరింత గా పెరిగింది. సార్వత్రిక ఎన్నికల హడావుడి మధ్య యువత, కేవలం రాజకీయ కార్యకలాపాల్లో భాగం కావడమే కాకుండా ఈ కాలం లో జరిగే చర్చలు, వాదనల ను గురించి కూడా తెలుసుకోవాలి. గుర్తు పెట్టుకోండి- ‘మేరా పహ్ లా వోట్ – దేశ్ కే లియే’ (అంటే ‘నా మొదటి ఓటు - దేశం కోసం’ అని భావం). క్రీడా ప్రపంచం, చలనచిత్ర పరిశ్రమ, సాహిత్య ప్రపంచం, ఇతర నిపుణులు, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ల తో సహా దేశం లోని ప్రభావశీలురు ఈ ప్రచారం లో పాల్గొనాలి. ఏ రంగాని కి చెందిన ప్రభావశీలురు అయినా ఈ ప్రచారం లో చురుకు గా పాల్గొని, వోటు ను మొదటిసారి గా వేస్తున్న వోటర్ లను ప్రోత్సహించడానికి మద్దతు ను ఇవ్వాలని నేను కోరుతున్నాను.
సహచరులారా, ఈ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం ఎపిసోడ్ లో ఇంతే. దేశం లో లోక్ సభ ఎన్నికల సంబంధి వాతావరణం నెలకొనడం తో కిందటి సారి మాదిరి గానే మార్చి నెల లో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు లోకి వచ్చేందుకు ఆస్కారం ఉంది. గడచిన 110 ఎపిసోడ్ల లో ప్రభుత్వ నీడ కు దూరం గా ఉంచడం ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం భారీ విజయం. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో దేశం యొక్క సామూహిక శక్తి గురించి, దేశం సాధించిన విజయాల ను గురించి న చర్చ జరుగుతుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది ప్రజల కు చెందిన, ప్రజల కోసం, ప్రజలే సిద్ధం చేసిన కార్యక్రమం. అయినప్పటికీ రాజకీయ సంప్రదాయాల ను అనుసరించి, లోక్ సభ ఎన్నికల ఈ రోజుల లో ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం వచ్చే మూడు నెలల పాటు ప్రసారం కాదు. తరువాతి సారి మనం ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో కలుసుకున్నప్పుడు అది 111 వ ఎపిసోడ్ అవుతుంది. తరువాతి సారి ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం శుభ సంఖ్య 111 తో మొదలవుతుంది. ఇంతకంటే మంచిది ఏముంటుంది! అయితే, సహచరులారా, మీరు నా కోసం ఒక పని ని చేస్తూనే ఉండాలి. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం మూడు నెలలు ఆగిపోవచ్చు. కానీ, దేశ విజయాలు కొంతకాలం ఆగవు. కాబట్టి సమాజం, దేశం సాధించిన విజయాల ను ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం హ్యాశ్ ట్యాగ్ (#) తో సామాజిక మాధ్యాల లో పోస్ట్ చేస్తూ ఉండండి. | కొంతకాలం కిందట ఓ యువకుడు నాకు మంచి సలహా ను ఇచ్చారు. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్ల లో చిన్న చిన్న వీడియోల ను యూట్యూబ్ శార్ట్ ల రూపం లో శేర్ చేయాలి అనేదే ఆ సూచన. అందువల్ల, అటువంటి లఘు చిత్రాల ను విస్తృతం గా శేర్ చేయండి అంటూ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం శ్రోతల కు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.
సహచరులారా, మీతో మరో మారు మాట్లాడేటప్పటికల్లా కొత్త శక్తి తో, కొత్త సమాచారం తో మిమ్ములను కలుసుకొంటాను. మీరు మీ పట్ల శ్రద్ధ తీసుకోండి, అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం.
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. 2024 సంవత్సరంలో ఇది మొదటి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం. అమృతకాలంలో కొత్త ఉత్సాహం, కొత్త కెరటం. రెండు రోజుల క్రితం మనమందరం 75వ గణతంత్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నాం. ఈ ఏడాదితో మన రాజ్యాంగం 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. సుప్రీంకోర్టు కూడా 75 ఏళ్లు పూర్తి చేసుకుంటోంది. మన ప్రజాస్వామ్యానికి సంబంధించిన ఈ పండుగలు ప్రజాస్వామ్యానికి తల్లిగా ఉన్న భారతదేశాన్ని మరింత బలోపేతం చేస్తాయి. భారతదేశ రాజ్యాంగాన్ని చాలా తీవ్రమైన మేధామథనం తర్వాత రూపొందించారు. అందుకే భారత రాజ్యాంగాన్ని ‘సజీవ పత్రం’ అని పిలుస్తారు. ఈ రాజ్యాంగం మూల ప్రతిలోని మూడవ అధ్యాయం భారతదేశ పౌరుల ప్రాథమిక హక్కుల గురించి వివరిస్తుంది. మన రాజ్యాంగ నిర్మాతలు మూడవ అధ్యాయం ప్రారంభంలో భగవాన్ శ్రీరామచంద్రుడు, సీతామాత, లక్ష్మణ్ జీల చిత్రాలకు స్థానం కల్పించడం చాలా ఆసక్తికరంగా ఉంది.. రాముడి పాలన మన రాజ్యాంగ నిర్మాతలకు కూడా స్ఫూర్తిదాయకం. అందుకే జనవరి 22వ తేదీన అయోధ్యలో 'దైవం నుండి దేశం వరకు’ అనే విషయంపై మాట్లాడాను. 'రాముడి నుండి దేశం వరకు’ అనే అంశంపై మాట్లాడాను.
మిత్రులారా! అయోధ్యలో ప్రాణ ప్రతిష్ఠ జరిగిన సందర్భం కోట్లాది మంది దేశ ప్రజలను కట్టిపడేసిందనిపిస్తుంది. అందరి భావాలు ఒక్కటే. అందరి భక్తి ఒక్కటే. అందరి మాటల్లో రాముడు. అందరి హృదయాల్లో రాముడు. ఈ సమయంలో దేశంలోని చాలా మంది ప్రజలు రామభజనలను పాడి, శ్రీరాముని చరణాలకు సమర్పించుకున్నారు. జనవరి 22 సాయంత్రం యావద్దేశం రామజ్యోతులను వెలిగించి, దీపావళిని జరుపుకుంది. ఈ సమయంలో దేశం సామూహిక శక్తిని దర్శించింది. ఇది అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన తీర్మానాలకు ప్రధాన ఆధారం. మకర సంక్రాంతి నుండి జనవరి 22వ తేదీ వరకు స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని నేను దేశ ప్రజలను కోరాను. లక్షలాది మంది ప్రజలు భక్తితో తమ ప్రాంతాల్లోని ధార్మిక స్థలాలను శుభ్రం చేయడం నాకు సంతోషాన్ని కలిగించింది. దీనికి సంబంధించిన చిత్రాలు, వీడియోలను నాకు ఎంతో మంది పంపారు. ఈ భావన ఆగకూడదు. ఈ ప్రచారం ఆగకూడదు. ఈ సామూహిక శక్తి మన దేశాన్ని కొత్త విజయ శిఖరాలకు తీసుకెళ్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈసారి జనవరి 26న జరిగిన కవాతు చాలా అద్భుతంగా సాగింది. అయితే కవాతులో మహిళా శక్తిని చూడడం ఎక్కువగా చర్చనీయాంశమైంది. కేంద్ర భద్రతా బలగాలకు, ఢిల్లీ పోలీసు యంత్రాంగానికి చెందిన మహిళా బృందాలు కర్తవ్య పథ్ లో కవాతు చేయడం ప్రారంభించినప్పుడు అందరూ గర్వంతో ఉప్పొంగిపోయారు. మహిళా బ్యాండ్ బృందం కవాతును చూసి, వారి అద్బుతమైన సమన్వయాన్ని చూసి దేశ విదేశాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈసారి కవాతులో పాల్గొన్న 20 బృందాలలో 11 బృందాలు మహిళలవే. ఇందులో పాల్గొన్న శకటాల్లో భాగస్వాములైన వారు కూడా మహిళా కళాకారులే. ఈ సందర్భంగా జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో సుమారు ఒకటిన్నర వేల మంది అమ్మాయిలు పాల్గొన్నారు. చాలా మంది మహిళా కళాకారులు శంఖం, నాదస్వరం, నాగద వంటి భారతీయ సంగీత వాయిద్యాలను ఉపయోగించారు. డి.ఆర్.డి.ఓ. ప్రదర్శించిన శకటం కూడా అందరి దృష్టిని ఆకర్షించింది. నీరు, భూమి, ఆకాశం, సమాచార సాంకేతికత, అంతరిక్షం - ఇలా ప్రతి రంగంలోనూ మహిళా శక్తి దేశాన్ని ఎలా రక్షిస్తుందో ఇందులో చూపించారు. 21వ శతాబ్దపు భారతదేశం మహిళల నేతృత్వంలో అభివృద్ధి మంత్రంతో ముందుకు సాగుతోంది.
మిత్రులారా! మీరు కొన్ని రోజుల క్రితం అర్జున పురస్కారాల వేడుకను తప్పక చూసి ఉంటారు. ఈ కార్యక్రమంలో దేశానికి చెందిన పలువురు క్రీడాకారులను, అథ్లెట్లను రాష్ట్రపతి భవన్లో సన్మానించారు. ఇక్కడ కూడా అందరి దృష్టిని ఆకర్షించింది అర్జున పురస్కారాలు స్వీకరించిన అమ్మాయిలు, వారి జీవిత ప్రయాణాలు. ఈసారి 13 మంది మహిళా అథ్లెట్లను అర్జున పురస్కారంతో సత్కరించారు. ఈ మహిళా అథ్లెట్లు ఎన్నో పెద్ద టోర్నమెంట్లలో పాల్గొని భారతదేశ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సాహసోపేతమైన, ప్రతిభావంతులైన ఆటగాళ్ల ముందు శారీరక సవాళ్లు, ఆర్థిక సవాళ్లు నిలబడలేకపోయాయి. పరివర్తన చెందుతున్న భారతదేశంలో మన అమ్మాయిలు, మహిళలు ప్రతి రంగంలో అద్భుతాలు చేస్తున్నారు. మహిళలు తమదైన ముద్ర వేసిన మరో రంగం స్వయం సహాయక సంఘాలు. ఇప్పుడు దేశంలో మహిళా స్వయం సహాయక సంఘాల సంఖ్య కూడా పెరిగింది. వాటి పని పరిధి కూడా చాలా విస్తరించింది. ప్రతి గ్రామంలోని పొలాల్లో డ్రోన్ల ద్వారా వ్యవసాయం చేయడంలో సహాయం చేసే నమో డ్రోన్ సోదరీమణులను చూసే రోజు ఎంతో దూరంలో లేదు. ఉత్తరప్రదేశ్ లోని బహ్రాయిచ్‌లో స్థానిక వస్తువులను ఉపయోగించి మహిళలు జీవ-ఎరువులు, జీవ-పురుగుమందులను తయారు చేయడం గురించి నాకు తెలిసింది. నిబియా బేగంపూర్ గ్రామంలో స్వయం సహాయక సంఘాలతో అనుబంధం ఉన్న మహిళలు ఆవు పేడ, వేప ఆకులు, అనేక రకాల ఔషధ మొక్కలను కలపడం ద్వారా జీవ ఎరువులను తయారు చేస్తారు. అదేవిధంగా ఈ మహిళలు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, మిరపకాయలను పేస్ట్ చేసి, సేంద్రియ పురుగుమందును కూడా తయారు చేస్తారు. ఈ మహిళలంతా సంఘటితమై ‘ఉన్నతి బయోలాజికల్ యూనిట్’ పేరుతో ఒక సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. బయో ఉత్పత్తులను తయారు చేయడంలో ఈ సంస్థ మహిళలకు సహాయం చేస్తుంది. వారు తయారు చేసిన జీవ ఎరువులు, జీవ పురుగుమందుల డిమాండ్ కూడా నిరంతరం పెరుగుతోంది. అక్కడికి సమీప గ్రామాలకు చెందిన ఆరు వేల మందికి పైగా రైతులు వారి నుంచి బయో ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. దీని వల్ల స్వయం సహాయక సంఘాలతో అనుబంధం ఉన్న ఈ మహిళల ఆదాయం పెరిగింది. వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడింది.
నా ప్రియమైన దేశప్రజలారా! సమాజాన్ని, దేశాన్ని బలోపేతం చేయడానికి నిస్వార్థంగా పనిచేస్తున్న దేశవాసుల ప్రయత్నాలకు 'మన్ కీ బాత్'లో మనం ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మూడు రోజుల క్రితం దేశం పద్మ అవార్డులను ప్రకటించినప్పుడు 'మన్ కీ బాత్'లో ఇలాంటి వారిపై చర్చ జరగడం సహజం. ఈసారి కూడా అట్టడుగు వర్గాలతో మమేకమై సమాజంలో పెనుమార్పులు తీసుకురావడానికి కృషి చేసిన ఎంతోమంది దేశవాసులకు పద్మ పురస్కారాలు లభించాయి. ఈ స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల జీవిత ప్రయాణం గురించి తెలుసుకోవడానికి దేశవ్యాప్తంగా చాలా ఆసక్తి ఏర్పడింది. మీడియా పతాక శీర్షికలకు దూరంగా, వార్తాపత్రికల మొదటి పేజీలకు దూరంగా, ఎటువంటి ప్రాముఖ్యత లేకుండా ఈ వ్యక్తులు సామాజిక సేవలో నిమగ్నమై ఉన్నారు. ఇంతకు ముందు ఇలాంటి వ్యక్తుల గురించి మనం చూడలేదు, వినలేదు. కానీ ఇప్పుడు పద్మ పురస్కారాల ప్రకటన తర్వాత ఇలాంటి వారి గురించి ప్రతి చోటా చర్చ జరగడం, వారి గురించి మరింత ఎక్కువగా తెలుసుకోవాలని ప్రజలు ప్రయత్నం చేస్తున్నందుకు సంతోషం. ఈ పద్మ పురస్కార గ్రహీతల్లో చాలా మంది తమ తమ రంగాల్లో చాలా ప్రత్యేకమైన కృషి చేస్తున్నారు. ఉదాహరణకు ఒకరు అంబులెన్స్ సేవను అందిస్తున్నారు. ఒకరు నిరుపేదలకు పైకప్పును ఏర్పాటు చేస్తున్నారు. కొందరు కొన్ని వేల చెట్లను నాటుతూ ప్రకృతి పరిరక్షణలో నిమగ్నమై ఉన్నారు. 650 కంటే ఎక్కువ రకాల వరిపంట పరిరక్షణకు కృషి చేసిన వారు కూడా ఉన్నారు. మాదకద్రవ్యాలు, మద్యపాన వ్యసనాల నివారణకు సమాజంలో అవగాహన కల్పిస్తున్న వారు కూడా ఉన్నారు. చాలా మంది వ్యక్తులు స్వయం సహాయక బృందాలతో, ముఖ్యంగా నారీ శక్తి ప్రచారంతో ప్రజలను అనుసంధానించడంలో నిమగ్నమై ఉన్నారు. ఈ సన్మానం పొందిన వారిలో 30 మంది మహిళలు ఉండటం పట్ల కూడా దేశప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ మహిళలు అట్టడుగు స్థాయిలో తమ కృషి ద్వారా సమాజాన్ని, దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు.
మిత్రులారా! పద్మ పురస్కార గ్రహీతల్లో ప్రతి ఒక్కరి అంకితభావం దేశప్రజలకు స్ఫూర్తిదాయకం. శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, జానపద నృత్యం, రంగస్థలం, భజన ప్రపంచంలో దేశానికి కీర్తిప్రతిష్టలు తీసుకొస్తున్న వారు ఈసారి పెద్ద సంఖ్యలో ఈ గౌరవం పొందుతున్నారు. ప్రాకృతం, మాళవీ, లంబాడీ భాషల్లో అద్భుతమైన కృషి చేసిన వారికి కూడా ఈ గౌరవం దక్కింది. భారతీయ సంస్కృతిని, వారసత్వాన్ని కొత్త శిఖరాలకు చేర్చిన పలువురు విదేశీ వాసులు కూడా పద్మ పురస్కారం పొందారు. వీరిలో ఫ్రాన్స్, తైవాన్, మెక్సికో, బంగ్లాదేశ్ పౌరులు కూడా ఉన్నారు.
మిత్రులారా! గత దశాబ్ద కాలంలో పద్మ పురస్కారాల విధానం పూర్తిగా మారిపోయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు అది పీపుల్స్ పద్మగా మారింది.పద్మ పురస్కారాలు బహూకరించే విధానంలో కూడా చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు ప్రజలు తమను తాము నామినేట్ చేసుకునే అవకాశం ఉంది. 2014తో పోలిస్తే ఈసారి 28 రెట్లు ఎక్కువ నామినేషన్లు రావడానికి ఇదే కారణం. పద్మ పురస్కారాల ప్రతిష్ఠ, విశ్వసనీయత, గౌరవం ప్రతి సంవత్సరం పెరుగుతున్నాయని ఇది తెలియజేస్తుంది. పద్మ పురస్కారాలు పొందిన వారందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ప్రతి జీవితానికి ఒక లక్ష్యం ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి జన్మించారు. ఇందుకోసం ప్రజలు తమ విధులను పూర్తి భక్తితో నిర్వహిస్తారు. కొంత మంది సామాజిక సేవ ద్వారా, మరికొందరు సైన్యంలో చేరి, మరికొందరు తరువాతి తరానికి బోధిస్తూ తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడం మనం చూశాం. కానీ, మిత్రులారా! జీవితం ముగిసిన తర్వాత కూడా సామాజిక జీవితం పట్ల తమ బాధ్యతలను నిర్వర్తించే వారు మన మధ్య ఉన్నారు. దీనికి వారి మాధ్యమం అవయవ దానం. ఇటీవలి సంవత్సరాల్లో మరణానంతరం అవయవాలను దానం చేసిన వారు దేశంలో వెయ్యి మందికి పైగా ఉన్నారు. ఈ నిర్ణయం అంత సులభం కాదు. కానీ ఈ నిర్ణయం చాలా మంది ప్రాణాలను కాపాడుతుంది. తమ ప్రియమైనవారి చివరి కోరికలను గౌరవించిన కుటుంబాలను కూడా నేను అభినందిస్తాను. దేశంలోని అనేక సంస్థలు కూడా ఈ దిశగా చాలా స్ఫూర్తిదాయకమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని సంస్థలు అవయవ దానం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాయి. కొన్ని సంస్థలు అవయవాలు దానం చేయడానికి ఇష్టపడే వ్యక్తుల వివరాలను నమోదు చేయడంలో సహాయం చేస్తున్నాయి. ఇలాంటి ప్రయత్నాల వల్ల దేశంలో అవయవదానం పట్ల సానుకూల వాతావరణం ఏర్పడుతోంది. ప్రజల ప్రాణాలను ఈ అవయవదానం కాపాడుతోంది.
నా ప్రియమైన దేశప్రజలారా! రోగుల జీవితాన్ని సులభతరం చేసి, వారి సమస్యలను తగ్గించే విషయంలో భారతదేశం సాధించిన విజయాన్ని ఇప్పుడు నేను మీతో పంచుకుంటున్నాను. చికిత్స కోసం ఆయుర్వేదం, సిద్ధ లేదా యునాని వైద్య విధానాల నుండి సహాయం పొందే అనేక మంది వ్యక్తులు మీలో ఉంటారు. కానీ ఇలాంటి రోగులు అదే వైద్య విధానాన్ని అవలంబించే మరో వైద్యుడి వద్దకు వెళ్లినప్పుడు సమస్యలను ఎదుర్కొంటారు. ఈ వైద్య విధానాల్లో వ్యాధులు, చికిత్సలు, మందుల పేర్లకు ఒకే భాష ఉపయోగించరు. ప్రతి వైద్యుడు తనదైన మార్గంలో వ్యాధి పేరు, చికిత్స పద్ధతులను రాస్తారు. ఇది కొన్నిసార్లు ఇతర వైద్యులు అర్థం చేసుకోవడం చాలా కష్టమవుతుంది. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సమస్యకు ఇప్పుడు పరిష్కారం దొరికింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ సహాయంతో ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆయుర్వేదం, సిద్ధ, యునాని వైద్య విధానాలకు సంబంధించిన డేటాను, పదజాలాన్ని వర్గీకరించిందని మీతో పంచుకోవడానికి నేను సంతోషిస్తున్నాను. ఇద్దరి కృషి వల్ల ఆయుర్వేదం, యునాని, సిద్ధ వైద్య విధానాల్లో వ్యాధి, చికిత్సకు సంబంధించిన పదజాలాన్ని కోడింగ్ చేశారు. ఈ కోడింగ్ సహాయంతో ఇప్పుడు వైద్యులందరూ తమ ప్రిస్క్రిప్షన్లు లేదా స్లిప్పులపై ఒకే భాషను రాస్తారు. ఇందులో ఒక ప్రయోజనం ఏమిటంటే మీరు ఆ స్లిప్‌తో మరొక వైద్యుడి వద్దకు వెళితే, ఆ స్లిప్ నుండే వైద్యుడికి దాని గురించి పూర్తి సమాచారం లభిస్తుంది. ఆ స్లిప్ మీ అనారోగ్యం, చికిత్స, మీరు ఏ మందులు తీసుకుంటున్నారు, చికిత్స ఎంతకాలంగా కొనసాగుతోంది, మీకు ఏ పదార్థాల అలెర్జీ ఉంది – మొదలైన విషయాలు తెలుసుకోవడానికి సహాయం చేస్తుంది. దీనివల్ల పరిశోధకులకు కూడా మరో ప్రయోజనం కలుగుతుంది. ఇతర దేశాల శాస్త్రవేత్తలు కూడా వ్యాధి, మందులు , వాటి ప్రభావాల గురించి పూర్తి సమాచారాన్ని పొందుతారు. పరిశోధనలు పెరిగి అనేక మంది శాస్త్రవేత్తలు ఒకచోట చేరితే, ఈ వైద్య విధానాలు మెరుగైన ఫలితాలను ఇస్తాయి. వాటి పట్ల ప్రజల మొగ్గు పెరుగుతుంది. ఈ ఆయుష్ విధానాలతో అనుబంధం ఉన్న మన వైద్యులు వీలైనంత త్వరగా ఈ కోడింగ్‌ని స్వీకరిస్తారని నేను విశ్వసిస్తున్నాను.
నా స్నేహితులారా! నేను ఆయుష్ వైద్య విధానం గురించి మాట్లాడుతున్నప్పుడు యానుంగ్ జామోహ్ లెగో చిత్రం నా కళ్ల ముందు కదలాడుతోంది. శ్రీమతి యానుంగ్ అరుణాచల్ ప్రదేశ్ నివాసి. మూలికా ఔషధ నిపుణురాలు. ఆదివాసుల సంప్రదాయ వైద్య విధానాన్ని పునరుద్ధరించేందుకు ఆమె ఎంతో కృషి చేశారు. ఈ కృషికి గాను ఈసారి ఆమెకు పద్మ అవార్డు కూడా లభించింది. అదేవిధంగా ఈసారి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన హేమ్‌చంద్ మాంఝీ కూడా పద్మ పురస్కారాన్ని పొందారు. వైద్యరాజ్ హేమ్‌చంద్ మాంఝీ ఆయుష్ వైద్య విధానం సహాయంతో ప్రజలకు చికిత్స చేస్తారు. ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్‌లో 5 దశాబ్దాలకు పైగా పేద రోగులకు సేవలందిస్తున్నారు. మన దేశంలో నిక్షిప్తమైన ఆయుర్వేదం, మూలికా ఔషధాల నిధిని కాపాడడంలో శ్రీమతి యానుంగ్, హేమ్‌చంద్ జీ వంటి వారి పాత్ర చాలా ఉంది.
నా ప్రియమైన దేశప్రజలారా! ‘మన్ కీ బాత్’ ద్వారా మన మధ్య ఉన్న సంబంధానికి దశాబ్ద కాలం పూర్తయింది. సామాజిక మాధ్యమాలు, ఇంటర్నెట్ యుగంలో కూడా మొత్తం దేశాన్నిఅనుసంధానించేందుకు శక్తివంతమైన మాధ్యమం రేడియో. రేడియో శక్తి ఎంత పరివర్తన తీసుకువస్తుందో చెప్పడానికి ఛత్తీస్‌గఢ్‌లో ఒక ప్రత్యేక ఉదాహరణ కనిపిస్తుంది. జనాదరణ పొందిన ఒక కార్యక్రమం గత 7 సంవత్సరాలుగా ఇక్కడ రేడియోలో ప్రసారమవుతోంది. దాని పేరు 'హమర్ హాథీ - హమర్ గోఠ్'. ఈ పేరు వినగానే రేడియోకి, ఏనుగుకి మధ్య సంబంధం ఏంటని మీరు ఆశ్చర్యపోవచ్చు. కానీ ఇది రేడియో ప్రత్యేకత. ఈ కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం ఛత్తీస్‌గఢ్‌లోని నాలుగు ఆకాశవాణి కేంద్రాలు- అంబికాపూర్, రాయ్‌పూర్, బిలాస్పూర్, రాయ్‌గఢ్ ల నుండి ప్రసారమవుతుంది. ఛత్తీస్‌గఢ్, దాని చుట్టుపక్కల అడవుల్లో నివసించే ప్రజలు ఈ కార్యక్రమాన్ని చాలా ఆసక్తిగా వింటారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఏనుగుల గుంపు అడవిలోని ఏ ప్రాంతం గుండా వెళుతుందో ‘హమర్ హాథీ - హమర్ గోఠ్’ కార్యక్రమంలో చెప్తారు. ఈ సమాచారం ఇక్కడి ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఏనుగుల గుంపు వచ్చినట్లు రేడియో ద్వారా సమాచారం అందిన వెంటనే ప్రజలు అప్రమత్తమవుతారు. ఏనుగులు సంచరించే మార్గంలోకి వెళ్లే ప్రమాదం ఇలా తప్పుతోంది. ఒక వైపు ఇది ఏనుగుల గుంపుల వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది. మరోవైపు ఇది ఏనుగుల గురించి డేటాను సేకరించడంలో సహాయపడుతుంది. ఈ డేటా వినియోగం భవిష్యత్తులో ఏనుగుల సంరక్షణకు కూడా సహాయపడుతుంది. ఇక్కడ ఏనుగులకు సంబంధించిన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రజలకు చేరవేస్తున్నారు. దీంతో అటవీ పరిసరాల్లో నివసించే ప్రజలకు ఏనుగుల బెడదను తట్టుకోవడం సులువుగా మారింది. దేశంలోని ఇతర అటవీ ప్రాంతాల్లో నివసించే ప్రజలు కూడా ఛత్తీస్‌గఢ్ ప్రదర్శించిన ఈ ప్రత్యేక చొరవను, ఆ అనుభవాలను సద్వినియోగం చేసుకోవచ్చు.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ జనవరి 25వ తేదీన మనమందరం జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని జరుపుకున్నాం. మన ఉజ్వల ప్రజాస్వామ్య సంప్రదాయాలకు ఇది ముఖ్యమైన రోజు. ప్రస్తుతం దేశంలో దాదాపు 96 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ సంఖ్య ఎంత పెద్దదో తెలుసా? ఇది అమెరికా మొత్తం జనాభాకు దాదాపు మూడు రెట్లు ఎక్కువ. ఇది మొత్తం ఐరోపా జనాభా కంటే ఒకటిన్నర రెట్లు ఎక్కువ. ప్రస్తుతం దేశంలో పోలింగ్ కేంద్రాల సంఖ్య దాదాపు పదిన్నర లక్షలకు చేరింది. భారతదేశంలోని ప్రతి పౌరుడు ప్రజాస్వామిక హక్కును వినియోగించుకునేలా చేయడానికి, మన ఎన్నికల సంఘం కేవలం ఒకే ఓటరు ఉన్న ప్రదేశాల్లో కూడా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. దేశంలో ప్రజాస్వామ్య విలువల బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న ఎన్నికల సంఘాన్ని నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా! ప్రస్తుతం ప్రపంచంలోని అనేక దేశాల్లో ఓటింగ్ శాతం తగ్గుతుండగా, భారతదేశంలో ఓటింగ్ శాతం పెరగడం దేశానికి ఉత్సాహాన్ని కలిగించే విషయం. 1951-52లో దేశంలో తొలిసారిగా ఎన్నికలు జరిగినప్పుడు కేవలం 45 శాతం మంది ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇప్పుడు ఈ సంఖ్య గణనీయంగా పెరిగింది. దేశంలో ఓటర్ల సంఖ్య పెరగడమే కాకుండా ఓటింగ్ శాతం కూడా పెరిగింది. మన యువ ఓటర్ల నమోదుకు మరిన్ని అవకాశాలు లభించేలా ప్రభుత్వం చట్టంలో కూడా మార్పులు చేసింది. ఓటర్లలో అవగాహన పెంచడానికి సమాజ స్థాయిలో అనేక ప్రయత్నాలు జరుగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. కొన్నిచోట్ల ఇంటింటికీ తిరుగుతూ ఓటు వేయాలని ఓటర్లకు చెప్తున్నారు. కొన్నిచోట్ల పెయింటింగ్స్ వేస్తూ, మరికొన్ని చోట్ల వీధినాటకాల ద్వారా యువతను ఆకర్షిస్తున్నారు. ఇలాంటి ప్రతి ప్రయత్నమూ మన ప్రజాస్వామ్య వేడుకలకు రకరకాల వర్ణాలను అందిస్తోంది. మొదటి సారి ఓటర్లుగా నమోదయ్యే అర్హత పొందిన యువత ఓటరు జాబితాలో తమ పేర్లను తప్పకుండా చేర్చుకోవాలని ‘మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా సూచిస్తున్నాను. నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ద్వారా, ఓటర్ హెల్ప్‌లైన్ యాప్ ద్వారా ఆన్లైన్లో ఈ ప్రక్రియను సులభంగా పూర్తి చేయవచ్చు. మీ ఒక్క ఓటు దేశ సౌభాగ్యాన్ని మార్చగలదని, దేశ భవితవ్యాన్ని రూపొందించగలదని మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ రోజు జనవరి 28వ తేదీ వివిధ కాలాల్లో దేశభక్తికి ఉదాహరణగా నిలిచిన భారతదేశానికి చెందిన ఇద్దరు గొప్ప వ్యక్తుల జయంతి కూడా. పంజాబ్ కేసరి లాలా లజపతిరాయ్ జీకి నేడు దేశం నివాళులు అర్పిస్తోంది. లాలా జీ స్వాతంత్ర్య పోరాట యోధులు. పరాయి పాలన నుండి మనల్ని విముక్తి చేయడానికి తన జీవితాన్ని త్యాగం చేశారు. లాలాజీ వ్యక్తిత్వం కేవలం స్వాతంత్ర్య పోరాటానికే పరిమితం కాదు. ఆయన చాలా దూరదృష్టి గలవారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్, అనేక ఇతర సంస్థల ఏర్పాటులో ఆయన ముఖ్యమైన పాత్ర పోషించారు. విదేశీయులను దేశం నుండి బహిష్కరించడం మాత్రమే ఆయన లక్ష్యం కాదు. దేశానికి ఆర్థిక దృఢత్వాన్ని అందించాలనే దృక్కోణం కూడా ఆయన ఆలోచనల్లో ముఖ్యమైన భాగం. ఆయన ఆలోచనలు, త్యాగం భగత్ సింగ్‌ను బాగా ప్రభావితం చేశాయి. ఈరోజు ఫీల్డ్ మార్షల్ కె.ఎం. కరియప్ప గారికి భక్తితో శ్రద్దాంజలి సమర్పించే రోజు కూడా. చరిత్రలో ముఖ్యమైన కాలంలో మన సైన్యాన్ని నడిపించడం ద్వారా ధైర్య సాహసాలకు ఆయన ఉదాహరణగా నిలిచారు. మన సైన్యాన్ని పటిష్టం చేయడంలో కీలక పాత్ర పోషించారు.
నా ప్రియమైన దేశప్రజలారా! నేడు భారతదేశం క్రీడా ప్రపంచంలో ప్రతిరోజు కొత్త శిఖరాలను అందుకుంటోంది. క్రీడా ప్రపంచంలో పురోగమించేందుకు ఆటగాళ్లు వీలైనన్ని ఎక్కువ అవకాశాలను పొందడం, దేశంలో ఉత్తమస్థాయి క్రీడా పోటీల నిర్వహణ చాలా ముఖ్యం. ఈ ఆలోచనతో నేడు భారతదేశంలో కొత్త టోర్నమెంట్లు నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం చెన్నైలో ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాలు ప్రారంభమయ్యాయి. దేశంలోని 5 వేల మందికి పైగా క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారు. ఈ రోజు భారతదేశంలో ఇటువంటి కొత్త వేదికలు నిరంతరం ఏర్పాటవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. వీటిలో క్రీడాకారులు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించే అవకాశాన్ని పొందుతున్నారు. అటువంటి ఒక వేదికే బీచ్ గేమ్స్ కు సంబంధించింది. వీటిని డయ్యూలో నిర్వహించారు. సోమనాథ్ కు సమీపంలో ఉండే 'డయ్యూ' కేంద్రపాలిత ప్రాంతమని మీకు తెలుసు. రోడ్డు సమీపంలో ఉంది. ఈ ఏడాది ప్రారంభంలోనే డయ్యూలో ఈ బీచ్ గేమ్స్ నిర్వహించారు. ఇవి భారతదేశంలో మొట్టమొదటి మల్టీ-స్పోర్ట్స్ బీచ్ క్రీడలు. వీటిలో టగ్ ఆఫ్ వార్, సీ స్విమ్మింగ్, పెన్కాక్సిలత్, మల్ల ఖంబ్, బీచ్ వాలీబాల్, బీచ్ కబడ్డీ, బీచ్ సాకర్ , బీచ్ బాక్సింగ్ వంటి పోటీలు ఉన్నాయి. ఇందులో ప్రతి క్రీడాకారుడు తమ ప్రతిభను ప్రదర్శించడానికి పుష్కలంగా అవకాశం పొందారు. ఈ టోర్నమెంటులో చాలా మంది క్రీడాకారులు సముద్రంతో సంబంధం లేని రాష్ట్రాల నుండి వచ్చారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ టోర్నమెంటులో సముద్ర తీరం లేని మధ్యప్రదేశ్ అత్యధిక పతకాలు సాధించింది. క్రీడల పట్ల ఉన్న ఈ ఉత్సాహమే ఏ దేశాన్నైనా క్రీడా ప్రపంచంలో రారాజుగా నిలుపుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈసారి 'మన్ కీ బాత్' విశేషాలింతే. ఫిబ్రవరిలో మళ్ళీ మీతో మాట్లాడతాను. దేశంలోని ప్రజల సామూహిక, వ్యక్తిగత ప్రయత్నాల ద్వారా దేశం ఎలా పురోగమిస్తుందనే దానిపై దృష్టి ఉంటుంది. మిత్రులారా! రేపు 29వ తేదీ ఉదయం 11 గంటలకు 'పరీక్షా పే చర్చా' కూడా ఉంటుంది. ఇది ‘పరీక్ష పే చర్చా’ 7వ ఎడిషన్. నేను ఎప్పుడూ ఎదురుచూసే కార్యక్రమమిది. ఇది విద్యార్థులతో సంభాషించే అవకాశాన్ని కల్పిస్తుంది. వారిలో పరీక్షల సంబంధిత ఒత్తిడిని తగ్గించడానికి కూడా ప్రయత్నిస్తాను. గత 7 సంవత్సరాలుగా 'పరీక్ష పే చర్చా' చదువు, పరీక్షలకు సంబంధించిన వివిధ సమస్యలపై సంభాషించడానికి ఒక వేదికగా మారింది. ఈసారి 2. కోట్ల 25 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ కార్యక్రమం కోసం నమోదు చేసుకోవడంతో పాటు తమ ఇన్పుట్లను కూడా అందించడం సంతోషంగా ఉంది. మొదట 2018లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినప్పుడు ఈ సంఖ్య 22,000 మాత్రమే. విద్యార్థులను ప్రేరేపించడానికి, పరీక్ష ఒత్తిడి గురించి అవగాహన కల్పించడానికి అనేక వినూత్న ప్రయత్నాలు కూడా జరిగాయి. మీ అందరూ, ముఖ్యంగా యువత, విద్యార్థులు రేపు రికార్డు సంఖ్యలో కార్యక్రమంలో భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను. మీతో మాట్లాడడం నాకు కూడా సంతోషాన్ని కలిగిస్తుంది. ఈ మాటలతో నేను ‘మన్ కీ బాత్’ ఈ భాగంలో మీ నుండి సెలవు తీసుకుంటున్నాను. త్వరలో మళ్లీ కలుద్దాం. ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. మిమ్మల్ని కలిసేందుకు ఒక శుభ అవకాశం ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం. మీ తో, మీ కుటుంబ సభ్యుల తో ఈ కార్యక్రమం లో భేటీ అయినప్పుడు చాలా ఆహ్లాదకరం గాను, సంతృప్తికరం గాను ఉంటుంది. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ద్వారా మిమ్మల్ని కలుస్తుంటే నా అనుభూతి ఇలాగే ఉంటుంది. ఈ రోజు న మనం కలసి చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రయాణం లో ఇది 108 వ భాగం. 108 సంఖ్య కు గల ప్రాముఖ్యం, పవిత్రత లు అనేవి ఇక్కడ గాఢమైనటువంటి అధ్యయన అంశం. జపమాల లో 108 పూస లు, 108 సారుల జపం, 108 దివ్య క్షేత్రాలు, ఆలయాల లో 108 మెట్లు, 108 గంట లు.. ఈ 108 సంఖ్య అపారమైన విశ్వాసం తో ముడిపడి ఉంది. అందుకే ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం 108 వ భాగం నాకు మరింత ప్రత్యేకం గా మారింది. ఈ 108 భాగాల లో ప్రజల భాగస్వామ్యాని కి సంబంధించినటువంటి ఉదాహరణల ను మనం అనేకం గా చూశాం. వారి నుండి ప్రేరణ ను పొందాం. ఇప్పుడు ఈ మైలురాయి ని చేరుకొన్న తరువాత కొత్త శక్తి తో, కొత్త ఉత్సాహం తో, వేగం గా ముందుకు వెళ్లాలని మనం నిర్ణయించుకోవాలి. సంతోషకరమైన యాదృచ్ఛిక విషయం ఏమిటంటే రేపటి సూర్యోదయం 2024 వ సంవత్సరం లో మొదటి సూర్యోదయం కావడం. రేపటి రోజు న మనం 2024 వ సంవత్సరం లోకి అడుగుపెడుతున్నాం. 2024 వ నూతన సంవత్సర సందర్భం లో మీ అందరి కి ఇవే శుభాకాంక్ష లు.
మిత్రులారా, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమాన్ని వినేటటువంటి వారు అనేకులు నాకు లేఖల ను వ్రాసి వారి యొక్క స్మరణీయమైనటువంటి క్షణాల ను గురించి నాకు తెలియజేశారు. ఈ సంవత్సరం లో, మన దేశం అనేక ప్రత్యేకమైనటువంటి సాఫల్యాల ను సాధించడం 140 కోట్ల మంది భారతీయుల బలం అని చెప్పాలి. ఏళ్ల తరబడి ఎదురుచూసిన ‘నారీ శక్తి వందన్ చట్టం’ ఆమోదం పొందింది ఈ సంవత్సరం లోనే. భారతదేశం 5 వ అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలచినందుకు హర్షాన్ని వ్యక్తం చేస్తూ పలువురు ఉత్తరాల ను వ్రాశారు. జి- 20 శిఖర సమ్మేళనం సఫలం అయిన విషయాన్ని చాలా మంది గుర్తు చేశారు. సహచరులారా, ఈ రోజు న భారతదేశం మూలమూలన ఆత్మవిశ్వాసం తో నిండిపోయి ఉన్నది. అభివృద్ధి చెందినటువంటి భారతదేశం యొక్క స్ఫూర్తి తో, స్వావలంబన భావన తో నిండి ఉంది. అదే స్ఫూర్తి ని, ఊపును 2024 లో కూడాను మనం కొనసాగించాలి. దీపావళి రోజు న రికార్డు స్థాయి లో జరిగినటువంటి వ్యాపార లావాదేవీ లు భారతదేశం లో ప్రతి ఒక్కరు ‘వోకల్ ఫార్ లోకల్’ (స్థానికం గా తయారైన ఉత్పాదనల నే ఆదరించాలి) అనే మంత్రాని కి ప్రాముఖ్యాన్ని ఇస్తున్నారు అని నిరూపించాయి.
మిత్రులారా, నేటికీ చాలా మంది చంద్రయాన్-3 సాఫల్యానికి సంబంధించిన సందేశాల ను నాకు పంపుతూ ఉన్నారు. నాలాగే మీరు కూడా మన శాస్త్రవేత్త ల విషయం లో, ముఖ్యంగా మహిళా శాస్త్రవేత్త ల విషయం లో గర్వపడుతున్నారు అని నేను నమ్ముతున్నాను.
మిత్రులారా, ‘నాటు-నాటు’ పాట కు ఆస్కర్ పురస్కారం లభించినప్పుడు యావత్తు దేశం సంతోషం తో ఉప్పొంగిపోయింది. ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’కు దక్కిన సమ్మానాన్ని గురించి విన్నప్పుడు సంతోషించనిది ఎవరు? వీటి ద్వారా భారతదేశం యొక్క సృజనాత్మకత ను ప్రపంచం గమనించింది. పర్యావరణం తో మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని అర్థం చేసుకుంది. ఈ సంవత్సరం లో క్రీడల లో కూడా మన క్రీడాకారిణులు, క్రీడాకారులు అద్భుతం గా రాణించారు. మన క్రీడాకారులు ఆసియా క్రీడల లో 107 పతకాల ను, ఆసియా పేరా గేమ్స్ లో 111 పతకాల ను గెలిచారు. క్రికెట్ ప్రపంచ కప్ లో భారతదేశం క్రీడాకారులు వారి ఆటతీరు తో అందరి హృదయాల ను గెలుచుకొన్నారు. అండర్-19 టి-20 ప్రపంచ కప్ లో మన మహిళా క్రికెట్ జట్టు యొక్క గెలుపు చాలా ప్రేరణ ను అందించేదే. అనేక క్రీడల లో భారతీయులు సాధించినటువంటి విజయాలు దేశాని కి పేరు ప్రతిష్టల ను పెంచివేశాయి. ఇప్పుడు 2024 లో పేరిస్ ఒలింపిక్స్ ను నిర్వహించడం జరుగుతుంది. దీని కోసం యావత్తు దేశం మన ఆటగాళ్ల లో ను ప్రోత్సహిస్తోంది.
మిత్రులారా, మనమంతా కలసికట్టుగా ప్రయత్నాల ను చేసినప్పుడల్లా అది మన దేశ అభివృద్ధి ప్రయాణం పైన చాలా సానుకూల ప్రభావాన్ని ప్రసరించింది. ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’, ‘మేరీ మాటీ మేరా దేశ్’ ల వంటి విజయవంతమైన ప్రచారాలు మన అనుభవం లోకి వచ్చాయి. ఇందులో కోట్ల కొద్దీ ప్రజల భాగస్వామ్యాని కి మనమంతా సాక్షులం. డెబ్భయ్ వేల అమృత సరోవరాల నిర్మాణం కూడా మన సామూహిక కార్యసాధన యే.
మిత్రులారా, ఆవిష్కరణల కు ప్రాముఖ్యాన్ని ఇవ్వనటువంటి దేశం యొక్క అభివృద్ధి ఆగిపోతుంది అని నేను నమ్ముతాను. భారతదేశం ఇనొవేశన్ హబ్ గా మారడం మన ప్రగతి ప్రయాణం ఆగేది కాదు అనే విషయాని కి సంకేతం. గ్లోబల్ ఇనొవేశన్ ఇండెక్స్ లో 2015వ సంవత్సరం లో మనం 81 వ స్థానం లో ఉన్నాం. ప్రస్తుతం ఈ సూచిక లో మనది 40వ స్థానంగా ఉంది.
ఈ సంవత్సరం భారతదేశం లో దాఖలు చేసిన పేటెంట్ ల సంఖ్య ఎక్కువ గా ఉంది. వీటిలో దాదాపు అరవై శాతం దేశీయ నిధుల కు సంబంధించినవే. ఈసారి క్యూఎస్ ఏశియా యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో అత్యధిక సంఖ్య లో భారతీయ విశ్వవిద్యాలయాలు చోటు ను దక్కించుకున్నాయి. మీరు ఈ కార్యసాధన ల జాబితా ను రూపొందించడం మొదలుపెట్టారా అంటే అది ఎప్పటికీ పూర్తి కాదు. భారతదేశం సామర్థ్య ప్రభావాని కి ఇది ఒక సంగ్రహావలోకనం మాత్రమే. మన దేశం సాధించిన ఈ సాఫల్యాల నుండి, దేశ ప్రజల ఈ సాఫల్యాల నుండి మనం ప్రేరణ ను పొందాలి. వారి విషయం లో గర్వపడాలి. కొత్త సంకల్పాల ను చెప్పుకోవాలి. 2024వ సంవత్సరానికి గాను మరో సారి మీ అందరికీ శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా, భారతదేశం విషయం లో ప్రతి చోటా ఉన్న ఆశ ను గురించి, ఉత్సాహాన్ని గురించి మనం చర్చించాం. ఈ ఆశ, ఈ నమ్మకం చాలా బాగున్నాయి. భారతదేశం అభివృద్ధి చెందితే యువతీయువకుల కు ఎక్కువ ప్రయోజనం చేకూరుతుంది. కానీ యువత దృఢం గా ఉన్నప్పుడే దాని వల్ల ఎక్కువ ప్రయోజనం లభిస్తుంది.
ఈ రోజుల్లో జీవన విధానాల కు సంబంధించిన వ్యాధుల ను గురించి ఎంత చర్చ జరుగుతుందో మనం చూస్తున్నాం. ఇది మనందరికీ- ముఖ్యంగా యువతకు చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కోసం ఫిట్ ఇండియా కు సంబంధించిన అంశాల ను పంపవలసింది గా మీ అందరినీ కోరాను. మీ స్పందన నాలో ఉత్సాహాన్ని నింపింది. పెద్ద సంఖ్య లో స్టార్ట్- అప్స్ కూడా నమో యాప్ (NaMo App) పై తమ సూచనల ను నాకు పంపించాయి. స్టార్ట్- అప్స్ వాటి యొక్క అనేక ప్రత్యేక ప్రయాసల ను గురించి చర్చించాయి.
మిత్రులారా, భారతదేశం చేసిన ప్రయత్నాల కారణం గా 2023 వ సంవత్సరాన్ని ‘అంతర్జాతీయ చిరుధాన్యాల (శ్రీ అన్న) సంవత్సరం’ గా జరుపుకొన్నాం. ఇది ఈ రంగం లో పని చేస్తున్న స్టార్ట్- అప్ స్ కు చాలా అవకాశాల ను అందించింది. వీటి లో లఖ్ నవూ లో ప్రారంభం అయినటువంటి ‘కీరోజ్ ఫూడ్స్’, ప్రయాగ్‌రాజ్ కు చెందిన ‘గ్రాండ్-మా మిలిట్స్’, ‘న్యూట్రస్యూటికల్ రిచ్ ఆర్గానిక్ ఇండియా’ ల వంటి అనేక స్టార్ట్- అప్స్ ఉన్నాయి. ఆల్పినో హెల్త్ ఫూడ్స్, అర్బోరియల్ , కీరోజ్ ఫూడ్స్ తో ముడిపడ్డ యువతీ యువకులు ఆరోగ్యకరమైన ఆహార ఎంపికల కు సంబంధించినటువంటి క్రొత్త ఆవిష్కరణల ను చేస్తున్నారు. బెంగళూరు లోని అన్‌బాక్స్ హెల్థ్ తో జతపడ్డ యువతీ యువకులు వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని ఎంచుకోవడం లో ప్రజల కు ఎలా యపడుతున్నదీ తెలిపారు. శారీరిక స్వస్థత పై ఆసక్తి పెరుగుతూ ఉండడం తో ఆ రంగాని కి సంబంధించిన కోచ్ ల డిమాండు కూడా పెరుగుతున్నది. ‘జోగో టెక్నాలజీస్’ వంటి స్టార్ట్- అప్ స్ ఈ డిమాండు ను తీర్చడం లో సహాయ పడుతున్నాయి.
మిత్రులారా, ఈ రోజు శారీరిక ఆరోగ్యాన్ని గురించిన, శ్రేయం ను గురించిన చర్చలు అనేకం జరుగుతున్నాయి. అయితే దానితో సంబంధం ఉన్న మరో ముఖ్యమైన అంశం మానసిక ఆరోగ్యం. మానసిక స్వస్థత అనేది శ్రేయాన్ని మెరుగుపరచడానికి ముంబయి కి చెందిన ‘ఇన్ఫీ-హీల్’, ‘యువర్‌దోస్త్’ ల వంటి స్టార్ట్- అప్ స్ పనిచేస్తున్నాయని తెలిసి నేను చాలా సంతోషిస్తున్నాను. అంతే కాదు. నేడు కృత్రిమ మేధ (ఎఐ) వంటి సాంకేతికత ను కూడా దీని కోసం ఉపయోగిస్తున్నారు. మిత్రులారా, స్టార్ట్- అప్ స్ జాబితా చాలా పెద్దది. అందువల్ల నేను ఇక్కడ కొన్ని స్టార్ట్- అప్ స్ పేరుల ను మాత్రమే చెప్పగలను. ఫిట్ ఇండియా కల ను సాకారం చేసే దిశగా వినూత్నమైన ఆరోగ్య సంరక్షణ సంబంధి స్టార్ట్- అప్ స్ ను గురించి నాకు వ్రాస్తూ ఉండండి అంటూ మీ అందరి ని నేను కోరుతున్నాను. శారీరిక స్వస్థత ను గురించి, మానసిక ఆరోగ్యాన్ని గురించి మాట్లాడే ప్రసిద్ధ వ్యక్తుల అనుభవాల ను కూడా మీకు తెలియజేయాలనుకొంటున్నాను.
ఈ క్రింది మొదటి సందేశాన్ని సద్గురు జగ్గీ వాసుదేవ్ గారి నుండి వినండి. దృఢత్వం- ముఖ్యం గా మానసిక దృఢత్వం- అంటే మానసిక ఆరోగ్యాన్ని గురించి వారు వారి యొక్క అభిప్రాయాల ను వెల్లడిస్తారు..
***ఆడియో***
‘‘మానసిక ఆరోగ్యాన్ని గురించి ఈ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కార్యక్రమం లో మాట్లాడటం నా అదృష్టం. మానసిక అనారోగ్యాలు, మన నాడీ వ్యవస్థ ను మనం చూసుకొనే విధానం నేరు గా సంబంధం కలిగి ఉంటాయి. నాడీ వ్యవస్థ ను మనం ఎంత అప్రమత్తం గా, చంచల రహితం గా, అలజడులనేవి లేకుండా ఉంచుతాం అనే విషయంపై మనలో మనం ఎంత ఆహ్లాదకరం గా ఉంటాం అనే అంశం ఆధార పడుతుంది. మనం శాంతి, ప్రేమ, ఆనందం, ప్రసన్నత, వేదన, నిస్పృహ, పారవశ్యం అని పిలిచే వాటికి రసాయన, నాడీ సంబంధి మూలాలు ఉంటాయి. తప్పనిసరి గా బయటి నుండి రసాయనాల ను జోడించడం ద్వారా శరీరం లోని రసాయన అసమతుల్యత ను పరిష్కరించడానికి ఫార్మకాలజీ ప్రయత్నిస్తుంది. మానసిక అనారోగ్యాల ను ఈ విధం గా నియంత్రించ గలుగుతున్నాం. అయితే తీవ్రమైన పరిస్థితి లో ఉన్నప్పుడు బయటి నుండి రసాయనాల ను మందుల రూపం లో తీసుకోవడం అవసరం అని మనం గ్రహించాలి. అంతర్గత మానసిక ఆరోగ్య స్థితి కోసం పనిచేయడం లేదా మనలో ఒక సమతుల్య రసాయన స్థితి కోసం పనిచేయడం; శాంతి, ఆనందం, సంతోషాల కోసం రసాయనాల ను ప్రతి వ్యక్తి జీవితం లోకి తీసుకు రావాలి. సమాజ సాంస్కృతిక జీవితం లోకి, ప్రపంచవ్యాప్తం గా ఉన్న దేశాల లోకి, మొత్తం మానవాళి కి తీసుకు రావాలి. మన మానసిక ఆరోగ్యాన్ని మనం అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మన చిత్తశుద్ధి అనేది సున్నితమైన ప్రత్యేకత. మనం దానిని రక్షించాలి. దానిని పెంపొందించుకోవాలి. దీని కోసం యోగ వ్యవస్థ లో అనేక స్థాయి ల అభ్యాసాలు ఉన్నాయి. ఇవి సాధారణ అభ్యాసాలు గా పూర్తి గా అంతర్గతీకరించ గలిగేవి. వీటితో ప్రజలు వారిలో వారు రసాయనిక సమతాస్థితి ని పొందవచ్చు. వారి యొక్క నాడీ వ్యవస్థ కు కొంత ప్రశాంతత ను తీసుకు రావచ్చును. అంతర్గత శ్రేయస్సు ను కల్పించే సాంకేతికతల ను మనం యోగిక్ సైన్సెస్ అని పిలుస్తాం. అది జరిగేలా చూద్దాం.’’
సద్గురు జీ ఆయన యొక్క అభిప్రాయాల ను ఇంత సులభ గ్రాహ్య శైలి లో, అద్భుతమైన విధానం లో అందించడం లో ప్రసిద్ధి చెందారు.
రండి… ఇప్పుడు మనం ప్రముఖ క్రికెట్ క్రీడాకారిణి హర్ మన్‌ప్రీత్ కౌర్ గారి యొక్క మాటల ను విందాం.
***ఆడియో***
హర్ మన్ ప్రీత్ గారు వంటి ప్రతిభావంతురాలైన క్రీడాకారిణి ఆడిన మాట లు మీ అందరికీ తప్పక స్ఫూర్తి ని ఇవ్వగలవు.
రండి... గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ గారి మాటల ను వినండి. ఆయన ఆడే ‘చదరంగం’ ఆట కు మానసిక దృఢత్వం ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు.
***ఆడియో***
‘‘నమస్తే. నేను విశ్వనాథన్ ఆనంద్ ని. నేను చదరంగం ఆడడాన్ని మీరు చూశారు. నా ఫిట్నెస్ కారణం ఏమిటి అని చాలా తరచు గా నన్ను అడుగుతూ ఉంటారు. చదరంగం ఆడేందుకు చాలా శ్రద్ధ మరియు సహనం అవసరం. కాబట్టి నేను ఇప్పుడు చెప్పే వాటిని చేస్తాను. అవి నన్ను ఫిట్ గాను, చురుగ్గాను ఉంచుతాయి. నేను వారాని కి రెండు సార్లు యోగ చేస్తాను. వారాని కి రెండు సార్లు కార్డియో వ్యాయామాలు చేస్తాను. ఫ్లెక్సిబిలిటీ, స్ట్రెచింగ్, వెయిట్ ట్రైనింగ్‌లపై వారానికి రెండు సార్లు దృష్టి పెడతాను. వారాని కి ఒక రోజు సెలవు తీసుకుంటాను. చదరంగాని కి ఇవి అన్నీ చాలా ముఖ్యమైనవి. మీరు 6గంటలు లేదా 7 గంటల పాటు తీవ్రమైన మానసిక శ్రమ ను కొనసాగించే శక్తి ని కలిగి ఉండాలి. మీరు హాయి గా, సౌకర్యవంతం గా కూర్చో గలగాలి. మీరు చదరంగం లాంటి ఆట లో ఏదైనా సమస్య పైన దృష్టి ని సారించాలనుకొన్నప్పుడు ప్రశాంతం గా ఉండడానికి మీ శ్వాస నియంత్రణ సామర్థ్యం అనేది సహాయపడుతుంది. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోతలు అందరి కి నా ఫిట్నెస్ చిట్కా ఏమిటంటే ప్రశాంతం గా ఉండి లక్ష్యంపై దృష్టి పెట్టాలి. నా విషయం లో మంచి ఫిట్నెస్ చిట్కా- ఖచ్చితంగా అత్యంత ముఖ్యమైన ఫిట్నెస్ చిట్కా- సుఖవంతమైన రాత్రి నిద్ర. రాత్రి కి కేవలం నాలుగైదు గంటలు మాత్రమే నిద్ర పోవడం అనేది సరి కాదు. కనీసం ఏడు లేదా ఎనిమిది గంటలు ఉత్తమం అని నేను అనుకొంటున్నాను. కాబట్టి మనం రాత్రి పూట మంచి నిద్ర ను పొందడానికి వీలు అయినంతగా ప్రయత్నించాలి. అలా నిద్ర పోతేనే మరుసటి రోజు లో పగటిపూట ను మీరు ప్రశాంతం గా గడప గలుగుతారు. అలా నిద్ర పోయారంటే మీరు అనాలోచిత నిర్ణయాల ను తీసుకోరు. మీ భావోద్వేగాల ను అదుపులో పెట్టుకో గలుగుతారు. నా దృష్టి లో నిద్ర అత్యంత ముఖ్యమైన ఫిట్నెస్ చిట్కా.’’
రండి... ఇప్పుడు మనం అక్షయ్ కుమార్ గారి మాటల ను విందాం.
***ఆడియో***
‘‘నమస్కారం. నేను అక్షయ్ కుమార్ ని. ముందుగా మన ఆదరణీయ ప్రధాన మంత్రి గారి కి నేను చాలా కృతజ్ఞతల ను తెలియజేస్తున్నాను. ఆయన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మీకు నా మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) ను చెప్పే చిన్న అవకాశం లభించింది. ఫిట్ నెస్ పై ఎంత ఆసక్తి నాలో ఉందో అంతకంటే ఎక్కువ గా సహజం గా ఫిట్ గా ఉండేందుకు ఆసక్తి ని కనబరుస్తానని మీకు తెలుసిందే. ఫ్యాన్సీ జిమ్ కంటే ఎక్కువ గా నాకు నచ్చేది బయట స్విమ్మింగ్ చేయడం, బాడ్ మింటన్ ఆడడం, మెట్లు ఎక్కడం, ముగ్దర్ తో కసరత్తు లు చేయడం, మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం. స్వచ్ఛమైన నేతి ని సరి అయిన పరిమాణం లో తీసుకోవడం వల్ల మేలు జరుగుతుంది అని కూడా నేను నమ్ముతాను. కానీ చాలా మంది అబ్బాయి లు, చాలా మంది అమ్మాయి లు లావు అవుతాం అని భయపడి నెయ్యి తినకుండా ఉండడం నేను చూస్తున్నాను. మన ఫిట్నెస్ కు ఏది మంచిదో, ఏది చెడ్డదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సినీ నటుల శరీరాన్ని చూసి కాకుండా వైద్యుల సలహా మేరకు జీవనశైలి ని మార్చుకోవాలి. నటీనటులు తరచు గా తెరపై కనిపించేలా ఉండరు. అనేక రకాల ఫిల్టర్ లను, స్పెశల్ ఎఫెక్ట్ లను ఉపయోగించడం జరుగుతుంది. వాటిని చూసిన తరువాత మన శరీరాన్ని మార్చుకోవడానికి అడ్డదారుల ను ఉపయోగించడం ప్రారంభిస్తాం. ఈ రోజుల్లో చాలా మంది స్టెరాయిడ్స్ తీసుకుంటున్నారు. సిక్స్ ప్యాక్ కు గాని లేదా యైట్ ప్యాక్ కు గాని ప్రాధాన్యాన్ని ఇస్తున్నారు. మిత్రులారా, అటువంటి అడ్డదారుల తో శరీరం బయటి నుండి చూడడానికి ఉబ్బుతుంది. కానీ లోపల డొల్ల గా ఉంటుంది. సత్వర మార్గం మీ జీవిత కాలాన్ని చిన్నది గా మారుస్తుంది అని మీరు గుర్తు పెట్టుకోవాలి. మీకు అడ్డదారులు వద్దు. దీర్ఘకాలం ఉండే ఫిట్నెస్ కావాలి. మిత్రులారా, ఫిట్నెస్ ఒక రకమైన తపస్సు. ఇన్ స్టాంట్ కాఫీ నో, రెండు నిమిషాల లో తయారు అయ్యే నూడుల్సో కాదు. రసాయనాల ను ఉపయోగించబోమని, సత్వర మార్గాల వ్యాయామం చేయబోమని; యోగ, మంచి ఆహారం, సమయానికి నిద్ర పోవడం, కొంత ధ్యానం చేయడంలతో పాటు ముఖ్యం గా మీరు కనిపించే తీరు ను సంతోషం గా అంగీకరించడం వంటివి చేస్తామని ఈ కొత్త సంవత్సరం లో వాగ్దానం చేసుకోండి. ఇప్పటి నుండి ఫిల్టర్ జీవితాన్ని గడపకండి. ఫిట్టర్ జీవితాన్ని గడపండి. సురక్షితం గా ఉండండి. జయ్ మహాకాల్.’’
ఈ రంగం లో అనేక ఇతర స్టార్ట్- అప్ స్ ఉన్నాయి. కాబట్టి ఈ రంగం లో అద్భుతమైన పని చేస్తున్న యువ స్టార్ట్- అప్ వ్యవస్థాపకుడి తో చర్చించాలని అనుకున్నాను.
***ఆడియో***
‘‘నమస్కారం. నా పేరు రుషభ్ మల్హోత్రా. నేను బెంగళూరు లో ఉంటాను. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ఫిట్నెస్ ను గురించి చర్చ జరుగుతోంది అని తెలిసి చాలా సంతోషం గా ఉంది. నేనే ఫిట్నెస్ ప్రపంచాని కి చెందిన వాడి ని. బెంగళూరు లో మాకు ‘తగ్ డా రహో’ పేరు తో స్టార్ట్-అప్ ఉంది. భారతదేశం సాంప్రదాయిక వ్యాయామాని కి ప్రాధాన్యాన్ని కల్పించేందుకు మా స్టార్ట్-అప్ ను ప్రారంభించాం. భారతదేశం సాంప్రదాయిక వ్యాయామం అయినటువంటి ‘గదా వ్యాయామం’ లో చాలా అద్భుతమైన వ్యాయామం ఉంది. మా దృష్టి మొత్తం గద, ముగ్దర్ ల వ్యాయామం పైన మాత్రమే ఉంది. గద తో శిక్షణ ఎలా చేస్తారో తెలుసుకొని ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. గద వ్యాయామం వేల సంవత్సరాల నాటిది అని, భారతదేశం లో వేల సంవత్సరాలు గా ఇది ఆచరణ లో ఉందని నేను మీకు చెప్పాలని అనుకొంటున్నాను. మీరు దీనిని వివిధ స్థాయిల లో ఉన్న వ్యాయామశాలల్లో తప్పక చూసి ఉంటారు. మా స్టార్ట్-అప్ ద్వారా దానిని ఆధునిక రూపం లో తిరిగి తీసుకు వచ్చాం. దేశవ్యాప్తం గా మాకు చాలా ఆప్యాయత, చక్కటి స్పందన లు లభించాయి. ఇది మాత్రమే కాకుండా భారతదేశం లో అనేక పురాతన వ్యాయామాలు; ఆరోగ్యానికి, ఫిట్‌నెస్‌కు సంబంధించిన పద్ధతులు ఉన్నాయని ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ద్వారా నేను చెప్పాలని అనుకొంటున్నాను. వీటి ని మనం స్వీకరించి, ప్రపంచాని కి నేర్పించాలి. నేను ఫిట్నెస్ ప్రపంచాని కి చెందిన వాడి ని. కాబట్టి నేను మీకు వ్యక్తిగత చిట్కా ను ఇవ్వాలని అనుకొంటున్నాను. గద వ్యాయామం తో మీరు మీ బలాన్ని, భంగిమ ను, శ్వాస ను కూడా మెరుగు పరచుకోవచ్చును. కాబట్టి గద వ్యాయామాన్ని అనుసరించండి. దానిని ముందుకు తీసుకుపొండి. జయ్ హింద్. ’’
మిత్రులారా, ప్రతి ఒక్కరు వారి అభిప్రాయాలను వ్యక్తం చేయడం . అయితే అందరి ది ఒకే మంత్రం- ‘ఆరోగ్యం గా ఉండండి, ఫిట్ గా ఉండండి’ అనేదే. క్రొత్త సంవత్సరం 2024 ను ప్రారంభించడానికి మీ ఫిట్నెస్ కంటే పెద్ద సంకల్పం మరొకటి ఏమిటి ఉంటుంది ?
నా కుటుంబ సభ్యులారా, కొన్ని రోజుల క్రితం కాశీ లో ఒక ప్రయోగం జరిగింది. దాని ని గురించి నేను ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోతల కు చెప్పాలని అనుకొంటున్నాను. కాశీ- తమిళ సంగమం లో పాల్గొనేందుకు తమిళ నాడు నుండి వేలకొద్దీ ప్రజలు కాశీ కి చేరుకొన్నారు అని మీకు తెలుసు. అక్కడ నేను వారి తో సంభాషించేందుకు కృత్రిమ మేధ కు చెందిన ఎ ఐ టూల్ ‘భాషిణి’ని మొదటిసారి గా ఉపయోగించాను. నేను వేదిక మీద ఉండి హిందీ లో ప్రసంగించాను. కానీ ఎ ఐ సాధనం భాషిణి కారణం గా అక్కడ ఉన్న తమిళ నాడు ప్రజలు నా ప్రసంగాన్ని తమిళ భాష లో విన్నారు. కాశీ-తమిళ సంగమానికి వచ్చిన ప్రజలు ఈ ప్రయోగం పట్ల చాలా ఉత్సాహం గా కనిపించారు. ఒక భాష లో మాట్లాడి, అదే ప్రసంగాన్ని ప్రజలు వారి మాతృ భాష లో ఏక కాలం లో వినే రోజు ఎంతో దూరం లో లేదు. సినిమా ల విషయం లో కూడా అదే జరుగుతుంది. సినిమా హాల్ లో కృత్రిమ మేధ సహాయం తో ఏక కాలం లో అనువాదాన్ని ప్రజలు వినగలుగుతారు. ఈ సాంకేతికత ను మన పాఠశాల లు, ఆసుపత్రులు, న్యాయస్థానాల లో విస్తృతం గా ఉపయోగించడం ప్రారంభించినప్పుడు ఎంత పెద్ద మార్పు జరుగుతుందో మీరు ఊహించవచ్చు. ఏక కాల అనువాదాల కు సంబంధించిన కృత్రిమ మేధ సాధనాల ను మరింత గా అన్వేషించాలని, వాటిని వంద శాతం సామర్థ్యం తో తీర్చిదిద్దాలి అని నేటి యువతరాన్ని నేను కోరుతున్నాను.
మిత్రులారా, మారుతున్న కాలం లో మనం మన భాషల ను కాపాడుకోవడంతో పాటు గా వాటి ని ప్రచారం కూడా చేసుకోవాలి. ఇప్పుడు నేను మీకు ఝార్ ఖండ్ లోని ఒక ఆదివాసీ గ్రామాన్ని గురించి చెప్పాలి అని అనుకొంటున్నాను. ఈ గ్రామం అక్కడి పిల్లల కు వారి మాతృభాష లో విద్య ను అందించడానికి ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొన్నది. గఢ్ వా జిల్లా మంగళో గ్రామం లో బాలల కు విద్య ను కుడుఖ్ భాష లో అందిస్తున్నారు. ఈ పాఠశాల పేరు ‘కార్తిక్ ఉరాఁవ్ ఆదివాసీ కుడుఖ్ స్కూల్’. ఈ పాఠశాల లో 300 మంది ఆదివాసీ పిల్లలు చదువుతున్నారు. ఉరాఁవ్ ఆదివాసీల మాతృభాష కుడుఖ్. ఈ భాష కు లిపి కూడా ఉంది. దీని ని ‘తోలంగ్ సికీ’ అని పిలుస్తారు. ఈ భాష క్రమం గా అంతరించిపోతోంది. దాని ని కాపాడడానికి ఈ సమాజం వారి పిల్లల కు విద్య ను సొంత భాష లో అందించాలి అని నిర్ణయించుకొది. ఆదివాసీ బాలల కు ఇంగ్లీషు భాష కష్టమని, అందుకే ఆ ఊరి పిల్లల కు మాతృభాష లో పాఠాల ను చెప్పడం మొదలుపెట్టామని ఈ పాఠశాల ను ప్రారంభించిన శ్రీ అరవింద్ ఉరాఁవ్ అంటారు. ఆయన ప్రయాస లు మెరుగైన ఫలితాల ను ఇవ్వడం మొదలైనప్పుడు గ్రామస్థులు కూడా ఆయన తో చేరారు. వారి సొంత భాష లో చదువుకోవడం వల్ల పిల్లల అభ్యసన వేగం కూడా పెరిగింది. మన దేశం లో చాలా మంది పిల్లలు భాషా సమస్య తో చదువు ను మధ్యలోనే వదలివేసే వారు. నూతన జాతీయ విద్య విధానం అటువంటి సమస్యల ను తొలగించడం లో కూడా సహాయపడుతుంది. ఏ పిల్లల చదువు కు, ప్రగతి కి భాష ఆటంకం కాకూడదు అనేది మన ప్రయత్నం.
మిత్రులారా, దేశం లోని అద్భుతమైన స్త్రీమూర్తుల ద్వారా మన భారతదేశం ప్రతి కాలం లో గర్వం తో నిండిపోయింది. సావిత్రీ బాయి ఫులే జీ, రాణి వేలు నాచియార్ జీ దేశాని కి చెందిన ఇద్దరు మహిళామణులు. వారి వ్యక్తిత్వం దీప స్తంభం లాంటిది. ఇది ప్రతి యుగం లో మహిళా శక్తి ని ముందుకు తీసుకు పోయే మార్గాన్ని చూపుతూనే ఉంటుంది. నేటి నుండి కొన్ని రోజుల తరువాత- అంటే జనవరి మూడో తేదీ న మనం ఈ ఇద్దరి జయంతి వేడుకల ను జరుపుకొంటాం. సావిత్రీబాయి ఫులే జీ అనే పేరు మన మనసు లోకి రాగానే మనకు గుర్తుకు వచ్చేది విద్య, సామాజిక సంస్కరణల రంగం లో ఆమె చేసిన కృషి. మహిళ లు, అణగారిన వర్గాల విద్య కోసం ఆమె ఎప్పుడూ తన గొంతు ను బలం గా వినిపించారు. ఆమె తన కాలం కంటే చాలా ముందున్నారు. తప్పుడు పద్ధతుల ను వ్యతిరేకించడం లో ఎప్పుడూ గొంతు విప్పే వారు. విద్య ద్వారా సమాజ సశక్తీకరణ పై ఆమె కు చాలా విశ్వాసం ఉండింది. బాలికల కోసం అనేక పాఠశాలల ను మహాత్మ ఫులే జీ తో కలసి ఆమె ప్రారంభించారు. ఆమె కవిత లు ప్రజల లో చైతన్యాన్ని పెంచి, ఆత్మవిశ్వాసాన్ని నింపేవి. అవసరమైనప్పుడు ఒకరికొకరు సహాయం చేసుకోవాలని, ప్రకృతి తో సమరస భావన కలిగి జీవనాన్ని సాగించాలని ఆమె ఎల్లప్పుడూ ప్రజల ను కోరే వారు. ఆమె ఎంత దయ గలవారో మాటల్లో చెప్పలేం. మహారాష్ట్ర లో కరువు ఏర్పడినప్పుడు పేదల కు సహాయం చేయడానికి సావిత్రీబాయి, మహాత్మ ఫులే లు వారి ఇంటి తలుపుల ను తెరచి ఉంచారు. సామాజిక న్యాయం విషయం లో అటువంటి ఉదాహరణ చాలా అరుదు గా కనిపిస్తుంది. అక్కడ ప్లేగు భయం ఏర్పడినప్పుడు ఆమె ప్రజలకు సేవ చేయడం లో తలమునుకలు అయ్యారు. ఆ కాలం లో ఆమె స్వయం గా ఈ వ్యాధి బారి న పడ్డారు. మానవత కు అంకితం అయిన ఆమె జీవనం ఇప్పటికీ మనందరికీ స్ఫూర్తిదాయకం.
మిత్రులారా, పరాయి పాలన కు వ్యతిరేకం గా పోరాడిన దేశం లోని ఎందరో మహనీయ వ్యక్తుల లో రాణి వేలు నాచియార్ గారు ఒకరు. తమిళ నాడు లోని నా సోదర సోదరీమణులు ఇప్పటికీ ఆమెను ‘వీర మంగయి’ అంటే వీరనారి అనే పేరు తో గుర్తు పెట్టుకొన్నారు. బ్రిటిష్ వారి కి వ్యతిరేకం గా రాణి వేలు నాచియార్ గారు చాటిన ధైర్యం, సాహసాలు, ఆమె పరాక్రమం చాలా స్ఫూర్తిదాయకం. అక్కడ రాజు గా ఉన్న ఆమె భర్త శివగంగై రాజ్యం మీద బ్రిటిష్ వారు చేసిన దాడి లో మరణించారు. రాణి వేలు నాచియార్ గారు, ఆమె కుమార్తె శత్రువుల నుండి ఎలాగోలా తప్పించుకున్నారు. ఆమె మరుదు బ్రదర్స్ అంటే తన కమాండర్ లతో కలసి సేన ను ఏర్పాటు చేయడం లో, సైన్యాన్ని సిద్ధం చేయడం లో చాలా సంవత్సరాలు నిమగ్నమై ఉన్నారు. పూర్తి సన్నద్ధత తో బ్రిటీష్ వారిపై యుద్ధాన్ని మొదలుపెట్టారు. చాలా ధైర్యం తో, సాహసం తో, దృఢ సంకల్పం తో పోరాటం జరిపారు. సైన్యం లో పూర్తి గా మహిళల తో తొలిసారి గా సమూహాన్ని ఏర్పాటు చేసిన వారి లో రాణి వేలు నాచియార్ గారి పేరు ఉంటుంది. ఈ ఇద్దరు వీర మహిళల కు నా శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా, గుజరాత్ లో డాయరా సంప్రదాయం ఉంది. రాత్రంతా వేల కొద్దీ ప్రజలు డాయరా లో చేరి వినోదం తో పాటు విజ్ఞానాన్ని కూడా పొందుతున్నారు. ఈ డాయరా లో జానపద సంగీతం, జానపద సాహిత్యం, హాస్యం ల యొక్క త్రివేణీ సంగమం అందరి మది లో ఆనందాన్ని నింపుతున్నది. సోదరుడు జగదీశ్ త్రివేదీ గారు ఈ డాయరా కు చెందిన ప్రముఖ కళాకారులు. హాస్యనటుడి గా సోదరుడు జగదీశ్ త్రివేదీ గారు ముప్ఫయ్ సంవత్సరాల కు పైగా తన ప్రభావాన్ని కొనసాగించారు. ఇటీవల నాకు ఆయన నుండి ఒక లేఖ వచ్చింది. దాంతో పాటు ఆయన తన గ్రంథమొకటి పంపారు. ఆ గ్రంథం పేరు ‘సోశల్ ఆడిట్ ఆఫ్ సోశల్ సర్వీస్’. ఆ గ్రంథం చాలా విశిష్టమైంది. అందులో అకౌంటింగ్ బుక్ ఉంది. అది ఒక రకమైన బాలెన్స్ శీట్. సోదరుడు జగదీశ్ త్రివేదీ గారు గత ఆరు సంవత్సరాల లో వివిధ కార్యక్రమాల నుండి పొందిన ఆదాయం, ఖర్చు లకు సంబంధించిన పూర్తి వివరాలు గ్రంథం లో ఇచ్చారు. ఈ బాలెన్స్ శీట్ ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆయన తన మొత్తం ఆదాయాన్ని, ప్రతి ఒక్క రూపాయి ని సమాజం కోసం ఖర్చు పెట్టారు. పాఠశాల, ఆసుపత్రి, గ్రంథాలయం, వికలాంగుల కు సంబంధించిన సంస్థ లు మొదలైన వాటి కోసం సమాజ సేవ లో పూర్తి ఆరు సంవత్సరాల ఆదాయాన్ని ఖర్చు పెట్టారు. గ్రంథం లో ఒక చోట రాసినట్లు గా 2022వ సంవత్సరం లో ఆయన తన కార్యక్రమాల ద్వారా రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు సంపాదించారు. పాఠశాల, ఆసుపత్రి, గ్రంథాలయం కోసం రెండు కోట్ల ముప్పై ఐదు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఆరు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఖర్చు చేశారు. తన దగ్గర ఒక్క రూపాయి కూడా ఉంచుకోలేదు. నిజాని కి దీని వెనుక ఒక ఆసక్తికరమైన సంఘటన కూడా ఉంది. తన కు 2017వ సంవత్సరం లో 50 ఏళ్లు నిండినప్పుడు తన కార్యక్రమాల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఇంటి కి తీసుకుపోకుండా సమాజాని కి ఖర్చు చేస్తాను అని సోదరుడు జగదీశ్ త్రివేది గారు ఒక సందర్భం లో ప్రకటించారు. వివిధ సామాజిక కార్యక్రమాల కోసం 2017 నుండి ఆయన సుమారు ఎనిమిది కోట్ల డెబ్భయ్ అయిదు లక్షల రూపాయలను ఖర్చు చేశారు. ఒక హాస్యనటుడు తన మాటల తో అందరినీ నవ్వించేలా చేస్తాడు. అయితే లోలోపల ఎంత సున్నితత్వం ఉంటుందో సోదరుడు జగదీశ్ త్రివేదీ గారి జీవనం లో చూడవచ్చు. ఆయనకు మూడు పీహెచ్డీ డిగ్రీ లు కూడా ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన 75 గ్రంథాలను వ్రాశారు. వాటిలో చాలా గ్రంథాల కు పురస్కారాలు కూడా వచ్చాయి. సామాజిక సేవ కు కూడా ఎన్నో పురస్కారాలు స్వీకరించారు. సోదరుడు జగదీశ్ త్రివేదీ గారి కి ఆయన యొక్క సామాజిక సేవ కు గాను నేను శుభాకాంక్షల ను తెలియజేస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా, అయోధ్య లో రామ మందిరం విషయం లో దేశవ్యాప్తం గా ఆసక్తి, ఉత్సాహం ఉన్నాయి. ప్రజలు వారి భావాల ను విధ విధాలు గా వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని రోజులు గా శ్రీరాముడు, అయోధ్య కు సంబంధించి అనేక కొత్త పాట లు, కొత్త భజన లు స్వరపరచడం మీరు తప్పక చూసి ఉంటారు. చాలా మంది కొత్త కవిత లు కూడా రాస్తున్నారు. ఇందులో చాలా మంది అనుభవజ్ఞులైన కళాకారులు ఉన్నారు. క్రొత్త, వర్ధమాన యువ కళాకారులు కూడా మనసు కు హత్తుకొనే భజనల ను స్వర పరిచారు. నేను నా సామాజిక మాధ్యం లో కొన్ని పాటల ను, భజనల ను కూడా వెల్లడించాను. ఈ చారిత్రక ఘట్టం లో కళారంగం తనదైన ప్రత్యేక శైలి లో భాగస్వామి అవుతోంది అని తెలుస్తున్నది. అటువంటి మొత్తం రచనల ను మనమందరం ఉమ్మడి హ్యాష్‌ట్యాగ్ తో పంచుకోవాలని నేను భావిస్తున్నాను. #shriRamBhajan అనే హ్యాష్‌ట్యాగ్ తో సామాజిక మాధ్యం లో మీ రచనల ను పంచుకోవలసిందిగా మీకు నేను వి జ్ఞ ప్తి చేస్తున్నాను. భావోద్వేగాల తో, భక్తి తో కూడిన ఈ సమాహారం సర్వం రామ మయం అయ్యేలా ఒక ప్రవాహం గా మారుతుంది.
ప్రియమైన నా దేశవాసులారా, ఈ రోజు న ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఇంతే! 2024 వ సంవత్సరం ముగింపునకు ఇంకా కొన్ని గంటల సమయం ఉంది. భారతదేశం సాధించినటువంటి విజయాలు భారతదేశం లో ప్రతి ఒక్క వ్యక్తి సాధించినటువంటి విజయాలు అని చెప్పాలి. పంచ్ ప్రణ్ సూత్రాల ను దృష్టి లో పెట్టుకొని భారతదేశం యొక్క అభివృద్ధి కి నిరంతరం కృషి చేయాలి. మనం ఏ పని ని చేసినా, ఏ నిర్ణయాన్ని తీసుకున్నా, దాని వల్ల దేశాని కి లభించే ప్రయోజనమే మన మొదటి ప్రమాణం కావాలి. దేశాని కే మొదటి ప్రాధాన్యం. నేశన్ ఫస్ట్ - ఇంతకంటే గొప్ప మంత్రం లేదు. ఈ మంత్రాన్ని అనుసరించి, భారతీయులం అయినటువంటి మనం మన దేశాన్ని అభివృద్ధి తో, స్వావలంబన తో తీర్చి దిద్దుదాం. మీరందరూ 2024వ సంవత్సరం లో విజయాల నూతన శిఖరాల ను చేరుకోవాలి అని నేను ఆకాంక్షిస్తున్నాను. మీరంతా ఆరోగ్యం గా ఉండాలని, ఫిట్ గా ఉండాలని, పూర్తి సంతోషం గా ఉండాలని కోరుకొంటున్నాను. ఇదే నా ప్రార్థన. దేశ ప్రజల నవీన విజయాల ను గురించి 2024వ సంవత్సరం లో మరో సారి చర్చించుదాం. చాలా చాలా ధన్యవాదాలు.
My dear countrymen, Namaskar, Welcome to Mann Ki Baat. But, we can never forget this day, the 26th of November. It was on this very day that the country had come under the most dastardly terror attack. Terrorists had made Mumbai shudder… along with the entire country. But it is India’s fortitude that made us surmount the ordeal; we are now quelling terror with full ardor. I pay homage to all of them who lost their lives in the Mumbai attack. Today, the country is in remembrance of those brave hearts who made the supreme sacrifice during the attack.
My family members, this day, the 26th of November is extremely significant on one more account. It was on this very day in 1949 that the Constituent Assembly had passed and adopted the Constitution of India. I remember… in the year 2015, when we were celebrating the 125th birth anniversary of Babasaheb Ambedkar, a thought had struck the mind to observe the 26th of November as Constitution Day. And since then, every year, we have been celebrating this day as Constitution Day. I extend my best wishes to all countrymen on the occasion of Constitution Day. And together we shall certainly attain the resolve of a developed India, according priority to citizens’ duties.
Friends, all of us know that the Constitution took 2 years 11 months and 18 days for coming into being. The oldest member in the Constituent Assembly was Shri Sachidananda Sinha Ji. The Draft of our Constitution came up after close study of the Constitution of over 60 countries; after long deliberations. After readying the Draft, before the final structure shaped up, over 2000 Amendments were re incorporated in it. Even after the Constitution came into force in 1950, till this day, a total of 106 Amendments have been carried out in the Constitution. In consonance with the times, circumstances and requirements of the country, various Governments carried out Amendments at different times. But this too has been a misfortune that the Constitution’s first Amendment pertained to curtailing the Freedom of Speech and Freedom of Expression. Whereas, through the 44th Amendment, the wrongs committed during the Emergency had been duly rectified.
Friends, it’s again inspiring that out of the same members of the Constituent Assembly who were nominated, 15 were Women. One such Member was Hansa Mehta Ji, who raised her voice for the sake of rights and justice to women. During that period, India was one of the countries whose Constitution enabled Voting Rights to women. In the process of nation building, collective development is possible only with support from everyone. It’s a matter of inner satisfaction for me that in adherence to the farsightedness of the framers of the Constitution, the Parliament of India has now passed the NARI SHAKTI VANDAN Act. The Nari Shakti Vandan Adhiniyam is an example of the Sankalp Shakti, the strength of the resolve of the Democracy. This will provide a fillip to the pace of accomplishing our resolve of a developed India.
My family members, when the people at large take charge of nation building, no power in the world can stop that country from moving forward. Today, it is clearly visible in India that many transformations are being led by the 140 crore people of the country. We have seen a direct example of this during this festive season. Last month in ‘Mann Ki Baat’ I had laid emphasis on ‘Vocal for Local’ i.e. buying local products. Within the last few days, business worth more than Rs. 4 lakh crore has been done in the country on Diwali, Bhaiya Dooj and Chhath. And during this period, tremendous enthusiasm was seen among the people in buying products Made in India. Now even our children, while buying something at the shop, have started checking whether Made in India is mentioned on them or not. Not only that, nowadays, people do not forget to check the Country of Origin while purchasing goods online.
Friends, just as the very success of 'Swachh Bharat Abhiyan' is becoming its inspiration; the success of ‘Vocal For Local’ is opening the doors to a ‘Developed India - Prosperous India’. This campaign of ‘Vocal For Local’ strengthens the economy of the entire country. The Vocal For Local campaign is a guarantee of employment. This is a guarantee of development; this is the guarantee of balanced development of the country. This provides equal opportunities to both urban and rural people. This also paves the way for Value Addition in local products, and if ever, there are ups and downs in the global economy, the mantra of Vocal For Local also protects our economy.
Friends, this sentiment towards Indian products should not be limited to festivals only. The wedding season as well has commenced now. Some trade organizations estimate that there could be a business of around Rs 5 lakh crore during this wedding season. While shopping for weddings, all of you should give importance to products made in India only. And yes, since the topic of marriage has come up, one thing has been troubling me off and on for a long time… and if I don't open up my heart's pain to my family members, who else do I do it with? Just ponder… these days a new milieu is being created by some families to go abroad and conduct weddings. Is this at all necessary? If we celebrate the festivities of marriages on Indian soil, amid the people of India, the country's money will remain in the country. The people of the country will get an opportunity to render some service or the other at your wedding… even poor people will tell their children about that occasion. Can you extrapolate on this mission of ‘Vocal for Local’? Why don't we hold such wedding ceremonies in our own country? It is possible that the kind of system you want may not be there today, but if we organize such events, systems will also develop. This is a topic related to very big families. I hope this pain of mine will definitely reach those big families.
My family members, another big trend has been seen during this festive season. This is the second consecutive year when the trend of buying some goods through cash payments on the occasion of Deepawali is gradually on the decline. That means, people are making more and more digital payments now. This is also very encouraging. You can do one more thing. Decide for yourself that for one month you will make payments only through UPI or any digital medium and not through cash. The success of the digital revolution in India has made this absolutely possible. And when one month is over, please share your experiences and your photos with me. I wish you all the best in advance from now itself.
My family members, our young friends have given another significant good news to the country, which is going to swell all of us with pride. ‘Intelligence, Idea and Innovation’ is the hallmark of Indian youth today. A continuous rise in their intellectual properties through the combination of technology - this in itself is an important facet of progress in enhancing the capability of the country. You will be pleased to know that there has been an increase of more than 31 percent in patent applications by Indians in 2022. The World Intellectual Property Organization has released a very interesting report. This report shows that this has never happened earlier even in the top 10 countries that are at the forefront in filing patents. I congratulate my young colleagues for this wonderful achievement. I want to assure my young friends that the country is with you at every step. After the administrative and legal reforms made by the government, today our youth are engaged in innovation on a large scale with renewed energy. If compared with the figures of 10 years ago… today, our patents are getting 10 times more approvals. We all know that patents not only increase the Intellectual Property of the country; they also open doors to newer opportunities. Not only that, it also enhances the strength and potential of our start-ups. Today the spirit of innovation is being promoted among our school children as well. Atal Tinkering Lab, Atal Innovation Mission, Incubation Centres in colleges, Start-Up India campaign… the results of such relentless efforts are in front of the countrymen. This too, is a direct example of India's youth power; India's innovative power. Moving ahead with this fervour, we shall achieve the vision of a developed India and that is why I say again and again, 'Jai Jawan-Jai Kisan', 'Jai Vigyan-Jai Anusandhan'.
My dear countrymen, you might remember that some time ago in 'Mann Ki Baat' I had discussed about the large number of fairs being organized in India. Then the idea of a competition also came to mind in which people would share photos related to fairs. The Ministry of Culture had organized a Mela Moments Contest in connection with the same. You would be pleased to know that thousands of people participated in it and many people also won prizes. Rajesh Dhar ji, resident of Kolkata, won the award for his amazing photo of a balloon and toy seller at Charak Mela. This fair is very popular in rural Bengal. Anupam Singh ji received the Mela Portraits Award for showcasing Holi at Varanasi. Arun Kumar Nalimela ji was awarded for showing an attractive aspect related to 'Kulasai Dussehra'. Similarly, a photo showing the devotion of Pandharpur was included in the most liked photo, which was sent by a gentleman from Maharashtra, Shriman Rahul ji. In this competition, there were many pictures of local dishes visible during the fairs. In this, the picture by Alok Avinash ji, resident of Purulia, won an award. He had showcased the food of rural areas of Bengal during a fair. A picture by Pranab Basaak ji, in which women are enjoying Qulfi during the Bhagoriya festival, was also awarded. Rumela ji had sent a photo of women tasting Bhajiya in a village fair in Jagdalpur, Chhattisgarh - that was also awarded.
Friends, through ‘Mann Ki Baat’, today I request every village, every school, every panchayat to organize such competitions regularly. Nowadays, the power of social media is immense… technology and the mobile have reached every home. Be it your local festivals or products, you can make them global through them as well.
Friends, just like the fairs held in every village, various dances here also possess their own heritage. There is a very famous dance in the tribal areas of Jharkhand, Odisha and Bengal which is called 'Chhau'. 'Chhau' festival was organized in Srinagar from 15 to 17 November with the spirit of ‘Ek Bharat Shreshtha Bharat’. Everyone enjoyed the 'Chhau' dance in this program. A workshop was also organized to impart training in 'Chhau' dance to the youth of Srinagar. Similarly, 'Basohli Utsav' was organized in Kathua district a few weeks ago. This place is a 150 kilometers away from Jammu. Local art, folk dance and traditional Ramlila were organized in this festival.
Friends, the beauty of Indian culture was felt in Saudi Arabia also. This month, an event named 'Sanskrit Utsav' was held in Saudi Arabia. This was unique in itself, since the entire program was in Sanskrit. Dialogues, music, dance, everything in Sanskrit, in which the participation of the local people was also seen.
My family members, 'Swachh Bharat' has now become a favorite topic of the entire country. It of course is my favorite topic as well and as soon as I receive any news related to it, my mind veers towards it… and it is natural for it to certainly find a mention in 'Mann Ki Baat'. The Swachh Bharat Abhiyan has changed people's mindset regarding cleanliness and public hygiene. Today this initiative has become a symbol of the national spirit, which has improved the lives of crores of countrymen. This campaign has also inspired people from different walks of life, especially the youth, for collective participation. One such commendable effort has been observed in Surat. A team of youth has started ‘Project Surat’ there. Its aim is to make Surat a model city which becomes an excellent example of cleanliness and sustainable development. Under this effort, which commenced as 'Safai Sunday', the youth of Surat earlier used to clean public places and the Dumas Beach. Later, these people also got involved wholeheartedly in cleaning the banks of the Tapi river. And you will be happy to know that within no time the number of people associated with this has risen to more than 50 thousand. The confidence of the team increased with the support received from the people, after which they also embarked upon the task of collecting garbage. You will be surprised to know that this team has cleared lakhs of kilos of garbage. Such efforts made at the grassroots level can bring huge changes.
Friends, another piece of information has come in from Gujarat itself. A few weeks ago, 'Bhadaravi Poonam Fair' was organized at Ambaji. More than 50 lakh people came to this fair. This fair takes place every year. The most significant aspect about it was that the people who came to the fair conducted a cleanliness campaign across a large part of Gabbar Hill. This campaign to keep the entire area around the temples clean is very inspiring.
Friends, I always say that cleanliness is not a campaign for a day or a week but it is an endeavor to be implemented for life. We also see people around us who have devoted their entire lives to issues related to cleanliness. Loganathan ji, who lives in Coimbatore, Tamil Nadu, is incomparable. During his childhood, he often used to get perturbed on seeing the torn clothes of poor children. After that, he took a vow to help such children and started donating a part of his earnings to them. When there was shortage of money, Loganathan ji even cleaned toilets so that the needy children could be helped. He has been engaged in this task with complete dedication for the last 25 years and till now has helped more than 1500 children. I once again commend such efforts. Many such efforts taking place across the country not only inspire us but also ignite the will to do something new.
My family members, one of the biggest challenges of the 21st century is 'Water Security'. Conserving water is no less than saving life. When we perform any work with this spirit of collectivity, we also achieve success. An example of this is the 'AmritSarovar' being built in every district of the country. The more than 65 thousand ‘Amrit Sarovars’ that India has developed during the ‘Amrit Mahotsav’ will benefit forthcoming generations. Now it is also our responsibility to ensure that wherever 'Amrit Sarovar' have been built, they should be regularly looked after so that they remain the main source of water conservation.
Friends, amidst such discussions on water conservation; I also came to know about the 'Jal Utsav' held in Amreli, Gujarat. There is also a lack of perennially flowing rivers in Gujarat, hence people have to depend mostly on rain water. During the last 20-25 years, after the efforts of the government and social organizations, the situation there has definitely changed. And hence ‘Jal Utsav’ has a big role there. During the ‘Jal Utsav’ held in Amreli, there were efforts to enhance awareness among the people on ‘water conservation’ and conservation of lakes. In that, water sports were also promoted and brainstorming was also done with experts on water security. The people participating in the program liked the tricolor water fountain very much. This water festival was organized by the foundation of Savjibhai Dholakia, who made a name for himself in the diamond business of Surat. I congratulate everyone involved in this and wish them all the best for doing similar work for water conservation.
My family members, nowadays the importance of skill development is finding acceptance all over the world. When we teach someone a skill, we not only give the person that skill; we also provide a source of income. And when I came to know that an organization has been engaged in skill development work for the last four decades, I felt even better. This institution is in Srikakulam, Andhra Pradesh and its name is ‘Beljipuram Youth Club’. Focusing on skill development, ‘Beljipuram Youth Club’ has empowered around 7000 women. Most of these women today are doing some work or the other on their own. This organization has also helped the children trapped in child labor to get out of that vicious cycle by teaching them some skill or the other. The team of ‘Beljipuram Youth Club’ also taught new skills to the farmers associated with Farmer Producer Organizations i.e. FPOs, which has empowered a large number of farmers. This youth club is also spreading awareness in every village regarding cleanliness. It has also helped in the construction of many toilets. I congratulate and appreciate all the people associated with this organization for skill development. Today, such collective efforts are needed for skill development in every village of the country.
Friends, when there is a collective effort towards a goal, the level of success also rises higher. I want to share with all of you an inspiring example of Ladakh. You certainly must have heard about the Pashmina Shawl. Ladakhi Pashmina is also being discussed a lot for some time now. Ladakhi Pashmina is reaching the markets around the world under the name of ‘Looms of Ladakh’. You will be surprised to know that more than 450 women from 15 villages are involved in weaving them. Earlier they used to sell their products only to the tourists coming there. But now in this era of Digital India, the products made by them have started reaching different markets in the country and the world. That means our local is now becoming global and on account of that, the earnings of these women have also increased.
Friends, such successes of women power are present in every corner of the country. There is a need to bring such examples to the fore as much as possible. And what could be better than ‘Mann Ki Baat’ to convey this? So you too share such examples with me as much as possible. I will also try my best to bring them to you.
My family members, in 'Mann Ki Baat' we have been discussing such collective efforts which have brought about major changes in the society. Another achievement of ‘Mann Ki Baat’ is that it has made radio more popular in every household. On MyGov, I have received a letter from Ram Singh Baudh Ji of Amroha in Uttar Pradesh. Ram Singh ji has been engaged in the work of collecting radio sets for the last several decades. He says that after 'Mann Ki Baat', people's curiosity about his Radio Museum has increased further. Similarly, inspired by ‘Mann Ki Baat’, Teerthdham Prerna Teerth near Ahmadabad has organized an interesting exhibition. More than a 100 antique radios from India and abroad are displayed here. Here, all the episodes of ‘Mann Ki Baat’ done till now can be heard. There are many more examples, which show how people got inspired by ‘Mann Ki Baat’ and started their own enterprise. One such example is that of Varsha ji of Chamarajanagar, Karnataka, who was inspired by 'Mann Ki Baat' to stand on her own feet. Motivated by an episode of this program, she started the work of making organic fertilizer from bananas. This initiative of Varsha ji, who is very fond of nature, has also brought employment opportunities for other people.
My family members, tomorrow the 27th of November, is the festival of Kartik Purnima. ‘Dev Deepawali’ is also celebrated on this day. And I always feel like witnessing 'Dev Deepawali' of Kashi. This time I’ll not be able to go to Kashi but I am definitely sending my best wishes to the people of Banaras through ‘Mann Ki Baat’. This time too, lakhs of lamps will be lit on the Ghats of Kashi; there will be a grand Aarti; there will be a laser show… lakhs of people from India and abroad will enjoy 'Dev Deepawali'.
Friends, tomorrow, on the day of the full moon, is also the Prakash Parv of Guru Nanak Dev Ji. Guru Nanak Ji's precious messages are inspiring and relevant even today, not only for India but for the whole world. They inspire us to be simple, harmonious and dedicated towards others. Our Sikh brothers and sisters all over the world are seen following the teachings of Guru Nanak Dev Ji about the spirit of service and acts of service. I convey my very best wishes to all the listeners of Mann Ki Baat, on the Prakash Parv of Guru Nanak Dev Ji.
My family members, that’s all this time with me in 'Mann Ki Baat'. By and by, 2023 is moving towards its end. And like every time, you and I are also thinking that look...this year has passed so quickly. But it is also true that this year has been a year of immense achievements for India, and India's achievements are the achievements of every Indian. I am glad that ‘Mann Ki Baat’ has become a powerful medium to highlight such achievements of Indians. Next time we will talk to you again about the many successes of our countrymen. Till then, I take leave of you. Thank you very much. Namaskar.
నా ప్రియమైన కుటుంబసభ్యులారా! నమస్కారం. ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి మరోసారి మీకు స్వాగతం. దేశవ్యాప్తంగా పండుగల ఉత్సాహం నెలకొని ఉన్న తరుణంలో ఈ ఎపిసోడ్ జరుగుతోంది. రాబోయే అన్ని పండుగలకు మీ అందరికీ చాలా చాలా శుభాకాంక్షలు.
మిత్రులారా! ఈ పండుగల ఉత్సాహం మధ్య ఢిల్లీ నుండి వచ్చిన ఒక వార్తతో ఈసారి మన్ కీ బాత్ ను ప్రారంభించాలనుకుంటున్నాను. ఈ నెల మొదట్లో గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీలో రికార్డు స్థాయిలో ఖాదీ అమ్మకాలు జరిగాయి. ఇక్కడి కన్నాట్‌ప్లేస్‌లో ఒకే ఒక్క ఖాదీ స్టోర్‌లో కేవలం ఒక్కరోజులోనే ఒకటిన్నర కోట్ల రూపాయలకు పైగా అమ్మకాలు జరిగాయి. ఈ నెలలో జరుగుతున్న ఖాదీ మహోత్సవ్ పాత అమ్మకాల రికార్డులన్నింటినీ మరోసారి బద్దలు కొట్టింది. మీరు ఇంకో విషయం తెలుసుకుంటే ఇంకా సంతోషిస్తారు. పదేళ్ల కిందట దేశంలో ఖాదీ ఉత్పత్తుల విక్రయం దాదాపు 30 వేల కోట్ల రూపాయల కంటే తక్కువగా ఉండేది. ఇప్పుడు దాదాపు ఒక లక్ష ఇరవై ఐదు కోట్లకు చేరుతోంది. ఖాదీ అమ్మకాలు పెరగడం అంటే దాని ప్రయోజనాలు నగరం నుండి గ్రామం వరకు సమాజంలోని వివిధ వర్గాలకు చేరుతున్నట్టు అర్థం. మన చేనేత కార్మికులు, హస్తకళా కళాకారులు, మన రైతులు, ఆయుర్వేద మొక్కలు నాటుతున్న కుటీర పరిశ్రమల వారు- ఇలా ప్రతి ఒక్కరూ ఈ అమ్మకాల ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇది 'వోకల్ ఫర్ లోకల్' ఉద్యమ బలం. మన దేశవాసులైన మీ అందరి మద్దతు క్రమంగా పెరుగుతోంది.
మిత్రులారా! ఈ రోజు నేను మీకు మరో అభ్యర్థనను పునరావృతం చేయాలనుకుంటున్నాను. నేను దాన్ని చాలా పట్టుదలతో పునరావృతం చేయాలనుకుంటున్నాను. మీరు ఎప్పుడైనా ఎక్కడైనా పర్యటనకు వెళితే, తీర్థయాత్రలకు వెళితే, అక్కడి స్థానిక కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులనే తప్పకుండా కొనండి. మీరు మీ ప్రయాణంలోని మొత్తం బడ్జెట్లో ముఖ్యమైన ప్రాధాన్యతగా స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయడం కొనసాగించండి. అది 10 శాతం అయినా, 20 శాతం అయినా- మీ బడ్జెట్ అనుమతించినంత వరకు మీరు దానిని స్థానిక ఉత్పత్తుల కోసమే ఖర్చు చేయాలి. అక్కడ మాత్రమే ఖర్చు చేయాలి.
మిత్రులారా! ఎప్పటిలాగానే ఈసారి కూడా మన పండుగలలో మన 'వోకల్ ఫర్ లోకల్' ఉద్యమానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం కలిసి ఆ కలను నెరవేర్చుకుందాం. మన కల ‘స్వయం సమృద్ధ భారతదేశం'. ఈ సారి నా దేశవాసుల్లో ఒకరి స్వేద సుగంధం, నా దేశ యువకుడి ప్రతిభ మిళితమై దాని తయారీలో నా దేశవాసులకు ఉపాధి కల్పించిన ఉత్పత్తితో మాత్రమే ఇంటిని వెలిగిద్దాం. రోజువారీ జీవితంలో అవసరమైనప్పుడల్లా మనం స్థానిక ఉత్పత్తులనే కొనాలి. అయితే మీరు మరొక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఈ 'వోకల్ ఫర్ లోకల్' భావన కేవలం పండుగ షాపింగ్‌కి మాత్రమే పరిమితం కాదు. కొందరు దీపావళికి దీపాలు కొని సోషల్ మీడియాలో 'వోకల్ ఫర్ లోకల్' అని పోస్ట్ చేయడం నేను చూశాను. అది కేవలం ప్రారంభం మాత్రమే. మనం చాలా ముందుకు సాగాలి. జీవితంలో అవసరపడే అన్ని వస్తువులు ఇప్పుడు మన దేశంలో అందుబాటులో ఉన్నాయి. ఈ దృక్కోణం కేవలం చిన్న దుకాణదారులు, వీధి వ్యాపారుల నుండి వస్తువులను కొనుగోలు చేయడానికి మాత్రమే పరిమితం కాదు. ఇప్పుడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ కేంద్రంగా అవతరిస్తోంది. చాలా పెద్ద బ్రాండ్లు తమ ఉత్పత్తులను ఇక్కడ తయారు చేస్తున్నాయి. మనం ఆ ఉత్పత్తులను మనవిగా చేసుకుంటే మేక్ ఇన్ ఇండియాకు ప్రోత్సాహం దొరుకుతుంది. అలాగే, మనం 'లోకల్ కోసం వోకల్'గా ఉండాలి. అవును.. అటువంటి ఉత్పత్తులను కొనుగోలు చేసేటప్పుడు మన దేశానికి గర్వకారణమైన యూపీఐ డిజిటల్ చెల్లింపు వ్యవస్థ ద్వారా చెల్లింపులు చేయాలి. దీన్ని జీవితంలో అలవాటు చేసుకోండి. ఆ ఉత్పత్తితో లేదా ఆ కళాకారుడితో సెల్ఫీ దిగి నమో యాప్ లో నాతో పంచుకోండి - అది కూడా మేడ్ ఇన్ ఇండియా స్మార్ట్ ఫోన్ నుండి సెల్ఫీని షేర్ చేయండి. ఇతర వ్యక్తులు కూడా 'వోకల్ ఫర్ లోకల్'కు ప్రేరణ పొందేలా నేను ఆ పోస్టుల్లో కొన్నింటిని సామాజిక మాధ్యమాల్లో పంచుకుంటాను.
మిత్రులారా! భారతదేశంలో తయారు చేసిన, భారతీయులు తయారు చేసిన ఉత్పత్తులతో దీపావళి కాంతులు తెచ్చుకుంటే; మీ కుటుంబ ప్రతి చిన్న అవసరాన్ని స్థానిక ఉత్పత్తులతో తీర్చుకున్నప్పుడు దీపావళి వెలుగులు మరింత పెరుగుతాయి. ఆ కళాకారుల జీవితాల్లో ఒక కొత్త దీపావళి వస్తుంది. కొత్త జీవితం ఉదయిస్తుంది. వారి జీవితం అద్భుతంగా మారుతుంది. భారతదేశాన్ని స్వావలంబనగా మార్చండి. 'మేక్ ఇన్ ఇండియా' ఎంపికను కొనసాగించండి, అలా చేస్తే మీతో పాటు కోట్లాది మంది దేశప్రజల దీపావళి అద్భుతంగా, ఉల్లాసంగా, ప్రకాశవంతంగా, ఆసక్తికరంగా మారుతుంది.
నా ప్రియమైన దేశవాసులారా! అక్టోబర్ 31 మనందరికీ చాలా ప్రత్యేకమైన రోజు. ఆ రోజు మనం మన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జరుపుకుంటాం. భారతీయులమైన మనం అనేక కారణాల వల్ల ఆయనను స్మరించుకుంటాం. నివాళులర్పిస్తాం. అతిపెద్ద కారణం- దేశంలోని 580 కంటే అధిక సంఖ్యలో రాచరిక రాష్ట్రాలను, సంస్థానాలను అనుసంధానించడంలో ఆయన పాత్ర సాటిలేనిది. ప్రతి ఏడాది అక్టోబర్ 31వ తేదీన గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వద్ద ఐక్యతా దినోత్సవానికి సంబంధించిన ప్రధాన కార్యక్రమం జరుగుతుందని మనకు తెలుసు. దీంతోపాటు ఈసారి ఢిల్లీలోని కర్తవ్య పథ్ దగ్గర అత్యంత ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. దేశంలోని ప్రతి గ్రామం నుండి, ప్రతి ఇంటి నుండి మట్టిని సేకరించాలని నేను ఈమధ్య కోరిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. ప్రతి ఇంటి నుంచి మట్టిని సేకరించి, కలశంలో ఉంచి, అనంతరం అమృత కలశ యాత్రలు నిర్వహించారు. దేశంలోని నలుమూలల నుంచి సేకరించిన ఈ మట్టితో వేలాది అమృత కలశ యాత్రలు ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంటున్నాయి. ఇక్కడ ఢిల్లీలో ఆ మట్టిని విశాల భారత కలశంలో వేసి, ఈ పవిత్ర మట్టితో ఢిల్లీలో ‘అమృత వాటిక’ నిర్మిస్తారు. ఇది దేశ రాజధాని నడిబొడ్డున అమృత్ మహోత్సవ భవ్య వారసత్వంగా నిలిచిపోతుంది. దేశవ్యాప్తంగా గత రెండున్నరేళ్లుగా జరుగుతున్న స్వాతంత్య్ర అమృత మహోత్సవం అక్టోబర్ 31న ముగుస్తుంది. మీరందరూ కలిసి దీన్ని ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘమైన పండుగలలో ఒకటిగా మార్చారు. సైనికులను సన్మానించడమైనా, ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడం అయినా స్వాతంత్ర్య అమృత మహోత్సవంలో ప్రజలు తమ స్థానిక చరిత్రకు కొత్త గుర్తింపును ఇచ్చారు. ఈ కాలంలో సమాజ సేవకు అద్భుతమైన ఉదాహరణలు కూడా కనిపించాయి.
మిత్రులారా! ఈ రోజు నేను మీకు మరో శుభవార్త చెప్తున్నాను. ముఖ్యంగా దేశం కోసం ఏదైనా చేయాలనే అభిరుచి, కలలు, సంకల్పం ఉన్న నా యువతీ యువకులకు ఈ శుభవార్త చెప్తున్నాను. ఈ శుభవార్త భారతదేశ ప్రజల కోసం. కానీ నా యువ మిత్రులారా! ఇది మీకు ప్రత్యేకమైంది. కేవలం రెండు రోజుల తర్వాత- అక్టోబర్ 31వ తేదీన చాలా పెద్ద దేశవ్యాప్త సంస్థకు పునాది పడుతోంది. అది కూడా సర్దార్ సాహెబ్ జయంతి రోజున. ఈ సంస్థ పేరు – మేరా యువ భారత్... అంటే MYBharat. MYBharat సంస్థ భారతదేశంలోని యువతకు వివిధ దేశ నిర్మాణ కార్యక్రమాలలో చురుకైన పాత్ర పోషించే అవకాశాన్ని కల్పిస్తుంది. అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడంలో భారతదేశ యువశక్తిని ఏకం చేయడానికి ఇది ఒక ప్రత్యేకమైన మార్గం. మేరా యువ భారత్ వెబ్సైట్ MYBharat కూడా ప్రారంభం అవుతుంది. నేను యువతను కోరుతున్నాను. పదే పదే కోరుతున్నాను. నా దేశ నవ యువతీ యువకులారా! MYBharat.Gov.inలో నమోదు చేసుకోండి. వివిధ కార్యక్రమాల కోసం సైన్ అప్ చేయండి. అక్టోబర్ 31వ తేదీన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీ గారి పుణ్య తిథి కూడా. ఇందిరాగాంధీ గారికి హృదయపూర్వక నివాళులర్పిస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా! మన సాహిత్యం ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్ భావనను మరింతగా పెంచే ఉత్తమ మాధ్యమాలలో ఒకటి. తమిళనాడుకు చెందిన అద్భుతమైన వారసత్వానికి సంబంధించి రెండు ఉత్తేజకరమైన ప్రయత్నాలను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ప్రముఖ తమిళ రచయిత్రి- సోదరి శివశంకరి గారి గురించి తెలుసుకునే అవకాశం నాకు లభించింది. ఆమె ‘నిట్ ఇండియా- త్రూ లిటరేచర్’ అనే ఒక ప్రాజెక్ట్ చేశారు. దాని అర్థం సాహిత్యం ద్వారా దేశాన్ని అల్లడం, అనుసంధానించడం. ఆమె గత 16 సంవత్సరాలుగా ఈ ప్రాజెక్ట్‌పై పనిచేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆమె 18 భారతీయ భాషలలో రాసిన సాహిత్యాన్ని అనువదించారు. వివిధ రాష్ట్రాల రచయితలు, కవులను ఇంటర్వ్యూ చేసేందుకు వీలయ్యేలా కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు, ఇంఫాల్ నుండి జైసల్మేర్ వరకు దేశవ్యాప్తంగా అనేక సార్లు పర్యటించారు. శివశంకరీ గారు వివిధ ప్రాంతాలకు వెళ్లి వాటిని ట్రావెల్ కామెంటరీ- ప్రయాణ వ్యాఖ్యానంతో పాటు ప్రచురించారు. ఇది తమిళ, ఆంగ్ల భాషల్లో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో నాలుగు పెద్ద సంపుటాలు ఉన్నాయి. ప్రతి సంపుటిని భారతదేశంలోని వేర్వేరు ప్రాంతాలకు అంకితమిచ్చారు. ఆమె సంకల్ప శక్తికి నేను గర్వపడుతున్నాను.
మిత్రులారా! కన్యాకుమారికి చెందిన తిరు ఎ. పెరుమాళ్ గారి పని కూడా చాలా స్ఫూర్తిదాయకం. తమిళనాడు కథాకథన సంప్రదాయాన్ని పరిరక్షించడంలో ఆయన ప్రశంసనీయమైన పని చేశారు. ఆయన గత 40 సంవత్సరాలుగా ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇందుకోసం తమిళనాడులోని వివిధ ప్రాంతాలకు వెళతారు. అక్కడి జానపద కళారూపాలను అన్వేషిస్తారు. వాటిని తన పుస్తకంలో భాగం చేసుకుంటారు. ఇప్పటి వరకు ఆయన దాదాపు 100 పుస్తకాలు రాశారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది కాకుండా పెరుమాళ్ గారికి మరో అభిరుచి కూడా ఉంది. తమిళనాడులోని ఆలయ సంస్కృతిపై పరిశోధన చేయడం ఆయనకు ఇష్టం. అక్కడి స్థానిక జానపద కళాకారులకు ప్రయోజనం కలిగిస్తున్న తోలుబొమ్మలపై కూడా ఆయన ఎన్నో పరిశోధనలు చేశారు. శివశంకర్ గారు, ఎ.కె. పెరుమాళ్ గారు చేస్తున్న కృషి అందరికీ ఆదర్శం. భారతదేశం తన సంస్కృతిని కాపాడుకోవడానికి జరిగే ఇటువంటి ప్రతి ప్రయత్నం పట్ల గర్విస్తుంది, ఇది మన జాతీయ ఐక్యతను బలోపేతం చేయడమే కాకుండా దేశం పేరును, దేశ గౌరవాన్ని పెంచుతుంది.
నా కుటుంబ సభ్యులారా! దేశం యావత్తూ నవంబర్ 15వ తేదీన ఆదివాసీ గౌరవ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. ఈ దినోత్సవం భగవాన్ బిర్సా ముండా జన్మదినాన్ని సూచిస్తుంది. భగవాన్ బిర్సా ముండా మన అందరి హృదయాలలో ఉన్నారు. అసలైన ధైర్యం అంటే ఏమిటో, సంకల్ప శక్తి విషయంలో స్థిరంగా ఉండటం అంటే ఏమిటో మనం ఆయన జీవితం నుండి నేర్చుకోవచ్చు. ఆయన ఎప్పుడూ పరాయి పాలనను అంగీకరించలేదు. అన్యాయానికి ఆస్కారం లేని సమాజాన్ని ఆయన కోరుకున్నారు. ప్రతి వ్యక్తి గౌరవం, సమానత్వంతో కూడిన జీవితాన్ని పొందాలన్నారు. భగవాన్ బిర్సా ముండా ఎల్లప్పుడూ ప్రకృతితో సామరస్యంగా జీవించడాన్ని నొక్కి చెప్పారు. నేటికీ మన ఆదివాసీ సోదరులు, సోదరీమణులు ప్రకృతి పట్ల బాధ్యతగా ప్రకృతి పరిరక్షణకు అన్ని విధాలుగా అంకితభావంతో ఉన్నారని మనం చూడవచ్చు. ఆదివాసీ సోదర సోదరీమణుల ఈ పని మనందరికీ ఎంతో స్ఫూర్తిదాయకం.
మిత్రులారా! రేపు అంటే అక్టోబర్ 30వ తేదీ గోవింద్ గురు గారి పుణ్యతిథి కూడా. గుజరాత్, రాజస్థాన్‌లోని ఆదివాసీలు, అణగారిన వర్గాల జీవితాల్లో గోవింద్ గురు జీకి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. గోవింద్ గురు జీకి కూడా నా నివాళులర్పిస్తున్నాను. నవంబర్ నెలలో మేము మాన్ గఢ్ ఊచకోత వార్షికోత్సవాన్ని కూడా జరుపుకుంటాం. ఆ ఊచకోతలో అమరులైన భారతమాత బిడ్డలందరికీ నేను వందనం సమర్పిస్తున్నాను.
మిత్రులారా! భారతదేశ ఆదివాసీ యోధులది గొప్ప చరిత్ర. అన్యాయానికి వ్యతిరేకంగా తిల్కా మాంఝీ శంఖారావం చేసింది ఈ భారత భూమిపైనే. ఈ భూమి నుండే సిద్ధో-కణ్హు సమానత్వ వాణిని వినిపించారు. ప్రజా యోధుడు టంట్యా భిల్ మన గడ్డపై పుట్టినందుకు గర్విస్తున్నాం. అమరవీరుడు వీర్ నారాయణ్ సింగ్‌ను భక్తితో స్మరించుకుంటాం. వారు క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు అండగా నిలిచారు. వీర్ రామ్‌జీ గోండ్, వీర్ గుండాధూర్, భీమా నాయక్ -- వీరి ధైర్యం ఇప్పటికీ మనకు స్ఫూర్తినిస్తుంది. గిరిజన సోదర సోదరీమణుల్లో అల్లూరి సీతారామరాజు నింపిన స్ఫూర్తిని దేశం ఇప్పటికీ గుర్తుంచుకుంటుంది. ఈశాన్య ప్రాంతాలకు చెందిన కియాంగ్ నోబాంగ్, రాణి గైడిన్ ల్యూ వంటి స్వాతంత్ర్య సమరయోధుల నుండి కూడా మనకు చాలా ప్రేరణ లభిస్తుంది. రాజమోహినీ దేవి, రాణి కమలపాటి లాంటి వీరాంగనలు దేశానికి లభించింది ఆదివాసీ సమాజం నుంచే. ఆదివాసీ సమాజానికి స్ఫూర్తినిచ్చిన రాణి దుర్గావతి గారి 500వ జయంతిని దేశం ప్రస్తుతం జరుపుకుంటోంది. దేశంలోని మరింత మంది యువత తమ ప్రాంతంలోని గిరిజన వీరుల గురించి తెలుసుకుని వారిని స్ఫూర్తిగా తీసుకుంటారని ఆశిస్తున్నాను. దేశం ఆత్మగౌరవాన్ని, ప్రగతిని ఎల్లప్పుడూ ప్రధానమైనదిగా భావించిన ఆదివాసీ సమాజం పట్ల దేశం కృతజ్ఞతతో ఉంది.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ పండుగల సమయంలో దేశంలో క్రీడా పతాకం కూడా రెపరెపలాడుతోంది. ఇటీవల ఆసియా క్రీడల తర్వాత పారా ఆసియా క్రీడల్లో కూడా భారత క్రీడాకారులు అద్భుతమైన విజయాలు సాధించారు. ఈ క్రీడల్లో భారత దేశం 111 పతకాలు సాధించి సరికొత్త చరిత్ర సృష్టించింది. పారా ఏషియన్ క్రీడల్లో పాల్గొంటున్న క్రీడాకారులందరినీ నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా! నేను మీ దృష్టిని స్పెషల్ ఒలింపిక్స్ వరల్డ్ సమ్మర్ గేమ్స్ వైపు
తీసుకెళ్లాలనుకుంటున్నాను. ఈ క్రీడలు బెర్లిన్‌లో జరిగాయి. ఇంటలెక్చువల్ డిసెబిలిటీ ఉన్న మన క్రీడాకారుల్లోని సామర్థ్యాన్ని బయటికి తెచ్చేందుకు ఈ పోటీ ఒక అద్భుతమైన అవకాశం. ఈ పోటీలో భారత జట్టు 75 బంగారు పతకాలతో సహా 200 పతకాలు సాధించింది. రోలర్ స్కేటింగ్, బీచ్ వాలీబాల్, ఫుట్‌బాల్, లాన్ టెన్నిస్ క్రీడల్లో భారత క్రీడాకారులు పతకాలు సాధించారు. ఈ పతక విజేతల జీవిత ప్రయాణం చాలా స్ఫూర్తిదాయకంగా ఉంది. గోల్ఫ్‌లో హర్యానాకు చెందిన రణవీర్ సైనీ స్వర్ణ పతకం సాధించారు. చిన్నప్పటి నుంచి ఆటిజంతో బాధపడుతున్న రణ్‌వీర్‌కి గోల్ఫ్‌పై ఉన్న మక్కువను ఏ సవాలు కూడా తగ్గించలేకపోయింది. వారి కుటుంబంలో ఈ రోజు అందరూ గోల్ఫ్ క్రీడాకారులుగా మారారని ఆయన తల్లి కూడా చెప్పింది. పుదుచ్చేరికి చెందిన 16 ఏళ్ల టి-విశాల్ నాలుగు పతకాలు సాధించారు. గోవాకు చెందిన సియా సరోదే పవర్‌లిఫ్టింగ్‌లో 2 బంగారు పతకాలతో సహా నాలుగు పతకాలు సాధించారు. 9 ఏళ్ల వయసులో తల్లిని కోల్పోయిన తర్వాత కూడా ఆమె అధైర్యపడలేదు. చత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు చెందిన అనురాగ్ ప్రసాద్ పవర్‌లిఫ్టింగ్‌లో మూడు బంగారు, ఒక రజత పతకాన్ని సాధించారు. సైక్లింగ్‌లో రెండు పతకాలు సాధించిన జార్ఖండ్‌కు చెందిన ఇందు ప్రకాష్‌ది కూడా స్ఫూర్తిదాయకమైన జీవితం. చాలా సాధారణ కుటుంబం నుండి వచ్చినప్పటికీ ఇందు తన విజయానికి పేదరికాన్ని అడ్డు గోడ కానివ్వలేదు. ఈ క్రీడల్లో భారతీయ క్రీడాకారులు సాధించిన విజయం ఇంటలెక్చువల్ డిసెబిలిటీ సమస్యను ఎదుర్కొంటున్న ఇతర పిల్లలు, కుటుంబాలకు కూడా స్ఫూర్తినిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ క్రీడల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన మీ గ్రామంలోని, మీ ఊరి పొరుగు ప్రాంతాలలో ఉన్న పిల్లల వద్దకు మీ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లవలసిందిగా మీ అందరినీ కోరుతున్నాను. వారిని అభినందించండి. ఆ పిల్లలతో కొన్ని క్షణాలు గడపండి. మీకు కొత్త అనుభవం కలుగుతుంది. మీరు కూడా వారిని చూసే అవకాశం పొందేంత శక్తిని దేవుడు వారిలో నింపాడు. తప్పకుండా వెళ్ళండి.
నా కుటుంబ సభ్యులారా! మీరందరూ గుజరాత్‌లోని పుణ్యక్షేత్రమైన అంబాజీ ఆలయాన్ని గురించి తప్పక విని ఉంటారు. ఇది ఒక మహిమగల శక్తిపీఠం. మా అంబే దర్శనం చేసుకోవడానికి దేశ విదేశాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వెళ్తారు. ఇక్కడి గబ్బర్ పర్వతానికి వెళ్లే మార్గంలో మీరు వివిధ రకాల యోగా భంగిమలు, ఆసనాల ప్రతిమలు కనిపిస్తాయి. ఈ విగ్రహాల ప్రత్యేకత ఏంటో తెలుసా? నిజానికి వీటిని చెత్తతో తయారు చేస్తారు. చెత్తతో చేసిన ఈ శిల్పాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. అంటే ఈ విగ్రహాలను చెత్తలో పడేసిన పాత వస్తువులతో తయారయ్యాయి. అంబాజీ శక్తి పీఠంలో అమ్మవారి దర్శనంతో పాటు ఈ విగ్రహాలు కూడా భక్తులకు ఆకర్షణ కేంద్రాలుగా మారాయి. ఈ ప్రయత్నం విజయం పొందడం చూసి నా మనసులో ఒక ఆలోచన కూడా వస్తోంది. వ్యర్థపదార్థాలతో ఇలాంటి కళాఖండాలను తయారు చేసేవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. కాబట్టి గుజరాత్ ప్రభుత్వం ఒక పోటీని ప్రారంభించి, అలాంటి వారిని ఆహ్వానించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను. ఈ ప్రయత్నం గబ్బర్ పర్వతం ఆకర్షణను పెంచడంతో పాటు దేశవ్యాప్తంగా 'వేస్ట్ టు వెల్త్' ప్రచారానికి ప్రజలను ప్రేరేపిస్తుంది.
మిత్రులారా! స్వచ్ఛ భారత్, 'వేస్ట్ టు వెల్త్' విషయాలకు వస్తే దేశంలోని ప్రతి మూల నుండి మనకు లెక్కలేనన్ని ఉదాహరణలు కనిపిస్తాయి. అస్సాంలోని కామరూప్ మెట్రోపాలిటన్ జిల్లాలో అక్షర్ ఫోరమ్ అనే పాఠశాల పిల్లలలో స్థిరమైన అభివృద్ధి భావనలను పెంపొందించే పనిని నిరంతరం చేస్తోంది. ఇక్కడ చదువుతున్న విద్యార్థులు ప్రతి వారం ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరిస్తారు, ఇటుకలు, కీ చైన్ల వంటి పర్యావరణ అనుకూల వస్తువులను తయారు చేయడానికి వాటిని ఉపయోగిస్తారు. ఇక్కడ విద్యార్థులకు రీసైక్లింగ్, ప్లాస్టిక్ వ్యర్థాల నుండి ఉత్పత్తులను తయారు చేయడం కూడా నేర్పిస్తారు. చిన్న వయస్సులోనే పర్యావరణం పట్ల ఈ అవగాహన ఈ పిల్లలను దేశం పట్ల కర్తవ్యనిష్ట ఉన్న పౌరులుగా మార్చడంలో చాలా దోహదపడుతుంది.
నా కుటుంబ సభ్యులారా! ఈ రోజు మనం మహిళా శక్తిని చూడలేని ప్రాంతం లేదు. వారు సాధించిన విజయాలకు సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్న ఈ కాలంలో- చరిత్రలోని బంగారు పుటల్లో నిలిచిపోయిన -భక్తి శక్తిని చాటిన ఓ మహిళా సాధువును కూడా మనం స్మరించుకోవాలి. ఈ సంవత్సరం దేశం సంత్ మీరాబాయి 525వ జయంతి వేడుకలను జరుపుకుంటోంది. ఆమె అనేక కారణాల వల్ల దేశవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తిదాయక శక్తిగా ఉంది. ఎవరికైనా సంగీతం పట్ల ఆసక్తి ఉంటే సంగీతం పట్ల అంకితభావానికి ఆమె గొప్ప ఉదాహరణ. ఎవరైనా కవితా ప్రియులైతే, భక్తిరసంలో ముంచే మీరాబాయి భజనలు అలౌకిక ఆనందాన్ని ఇస్తాయి. ఎవరైనా దైవిక శక్తిని విశ్వసిస్తే అప్పుడు మీరాబాయి- శ్రీ కృష్ణునిలో లీనం కావడం వారికి గొప్ప ప్రేరణగా మారుతుంది. మీరాబాయి సంత్ రవిదాస్‌ని తన గురువుగా భావించింది. ఆమె కూడా చెప్పేది- ‘గురు మిలియా రైదాస్, దీన్హీ జ్ఞాన్ కీ గుట్కీ’ అని. మీరాబాయి ఇప్పటికీ దేశంలోని తల్లులు, సోదరీమణులు, కుమార్తెలకు స్ఫూర్తిదాయకంగా ఉంది. ఆ కాలంలో కూడా ఆమె తన అంతర్గత స్వరాన్ని విని, మూస పద్ధతులకు వ్యతిరేకంగా నిలబడింది. సాధువుగా కూడా ఆమె మనందరికీ స్ఫూర్తినిస్తుంది. దేశం అనేక రకాల దాడులను ఎదుర్కొంటున్నప్పుడు ఆమె భారతీయ సమాజాన్ని, సంస్కృతిని బలోపేతం చేయడానికి ముందుకు వచ్చింది. సరళత, సాధారణ జీవన విధానంలో ఎంత శక్తి ఉందో మీరాబాయి జీవితకాలం నుండి మనకు తెలుసు. నేను సంత్ మీరాబాయికి నమస్కారాలు సమర్పిస్తున్నాను.
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! ఈసారి 'మన్ కీ బాత్'లో ఇంతే! మీ అందరితో చేసే ఈ సంభాషణ నాలో కొత్త శక్తిని నింపుతుంది. మీ సందేశాలలో ఆశాభావం, సానుకూలతకు సంబంధించిన వందలాది కథనాలు నాకు చేరుతున్నాయి. స్వావలంబన భారతదేశ ప్రచారాన్ని నొక్కి చెప్పవలసిందిగా నేను మిమ్మల్ని మళ్లీ అభ్యర్థిస్తున్నాను. స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయండి. స్థానిక ఉత్పత్తులపై మాట్లాడండి. మీరు మీ ఇళ్లను శుభ్రంగా ఉంచుకున్నట్టే మీ ప్రాంతాన్ని, నగరాన్ని శుభ్రంగా ఉంచండి. మీకు తెలుసా- అక్టోబర్ 31వ తేదీన సర్దార్ సాహెబ్ జయంతిని దేశం ఏకతా దివస్ గా జరుపుకుంటుంది, దేశంలోని అనేక ప్రదేశాలలో ఐక్యత కోసం పరుగు జరుగుతుంది. మీరు కూడా అక్టోబర్ 31వ తేదీన రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని నిర్వహించండి. మీరు కూడా పెద్ద సంఖ్యలో సంఘటితంగా ఉండి ఐక్యతా సంకల్పాన్ని బలోపేతం చేయాలి. మరోసారి రాబోయే పండుగలకు చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీరందరూ మీ కుటుంబంతో ఆనందంగా పండుగలు జరుపుకోవాలని, ఆరోగ్యంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇదే నా కోరిక. దీపావళి సమయంలో అగ్నిప్రమాదాలు సంభవించేవిధంగా ఎలాంటి పొరపాట్లూ జరగకూడదు. ఒకరి ప్రాణం ప్రమాదంలో ఉంటే మీరు తప్పకుండా కాపాడే ప్రయత్నం చేయండి. మిమ్మల్ని కూడా మీరు జాగ్రత్తగా చూసుకోవాలి. మొత్తం ప్రాంతాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి. ఎన్నెన్నో శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు.
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! నమస్కారం! 'మన్ కీ బాత్' మరొక భాగంలో దేశం సాధించిన విజయాలను, దేశప్రజల విజయాలను, వారి స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని మీతో పంచుకునే అవకాశం నాకు లభించింది. ఈ రోజుల్లో నాకు వచ్చిన ఉత్తరాలు, సందేశాలు చాలా వరకు రెండు విషయాలపై ఉన్నాయి. మొదటి అంశం చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ కావడం, రెండవ అంశం ఢిల్లీలో జి-20 శిఖరాగ్ర సదస్సును విజయవంతంగా నిర్వహించడం. దేశంలోని ప్రతి ప్రాంతం నుండి, సమాజంలోని ప్రతి వర్గం నుండి, అన్ని వయసుల వారి నుండి నాకు లెక్కపెట్టలేనన్ని లేఖలు వచ్చాయి. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రునిపై దిగే సంఘటనలో ప్రతి క్షణాన్ని కోట్లాది మంది ప్రజలు వివిధ మాధ్యమాల ద్వారా ఏకకాలంలో చూశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో యూట్యూబ్ లైవ్ ఛానెల్లో 80 లక్షల మందికి పైగా ప్రజలు ఈ సంఘటనను వీక్షించారు. అందులోనే ఇదొక రికార్డు. చంద్రయాన్-3తో కోట్లాది మంది భారతీయుల అనుబంధం ఎంత గాఢంగా ఉందో దీన్నిబట్టి అర్థమవుతోంది. చంద్రయాన్ సాధించిన ఈ విజయంపై దేశంలో చాలా అద్భుతమైన క్విజ్ పోటీ జరుగుతోంది. ఈ ప్రశ్నల పోటీకి 'చంద్రయాన్-3 మహాక్విజ్' అని పేరు పెట్టారు. మై గవ్ పోర్టల్ ద్వారా జరుగుతున్న ఈ పోటీలో ఇప్పటివరకు 15 లక్షల మందికి పైగా పాల్గొన్నారు. మై గవ్ పోర్టల్ ను ప్రారంభించిన తర్వాత రూపొందించిన క్విజ్‌లలో పాల్గొన్నవారి సంఖ్యాపరంగా ఇదే అతిపెద్దది. మీరు ఇంకా ఇందులో పాల్గొనకపోతే ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇంకా కేవలం ఆరు రోజుల గడువే మిగిలి ఉంది. ఈ క్విజ్‌లో తప్పకుండా పాల్గొనండి.
నా కుటుంబ సభ్యులారా! చంద్రయాన్-3 విజయం తర్వాత గొప్ప శిఖరాగ్ర సదస్సు జి-20 ప్రతి భారతీయుడి ఆనందాన్ని రెట్టింపు చేసింది. భారత వేదిక -మండపం- స్వయంగా సెలబ్రిటీలా మారిపోయింది. ప్రజలు సెల్ఫీలు దిగుతూ గర్వంగా పోస్ట్ చేస్తున్నారు. ఈ శిఖరాగ్ర సదస్సులో ఆఫ్రికన్ యూనియన్ను జి-20లో పూర్తి సభ్యదేశంగా చేయడం ద్వారా భారతదేశం తన నాయకత్వాన్ని నిరూపించుకుంది. భారతదేశం సుసంపన్నంగా ఉన్న కాలంలో మన దేశంలోనూ ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లోనూ సిల్క్ రూట్ గురించి చాలా చర్చలు జరిగేవి. ఈ సిల్క్ రూట్ వాణిజ్యానికి ప్రధాన మాధ్యమంగా ఉండేది. ఇప్పుడు ఆధునిక కాలంలో భారతదేశం జి-20లో మరొక ఆర్థిక కారిడార్‌ను సూచించింది. ఇది ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఆర్థిక కారిడార్. ఈ కారిడార్ రాబోయే వందల సంవత్సరాలకు ప్రపంచ వాణిజ్యానికి ఆధారం అవుతుంది. ఈ కారిడార్ భారతదేశ గడ్డపై ప్రారంభమైందని చరిత్ర ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.
మిత్రులారా! జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా భారతదేశ యువశక్తి ఈ కార్యక్రమంలో పాల్గొన్న తీరు గురించి, అనుసంధానమైన విధానం గురించి నేడు ప్రత్యేక చర్చ అవసరం. ఏడాది పొడవునా దేశంలోని అనేక విశ్వవిద్యాలయాలలో జి-20కి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఈ వరుసలో ఇప్పుడు ఢిల్లీలో ‘జి20 యూనివర్సిటీ కనెక్ట్ ప్రోగ్రామ్’ అనే మరో ఉత్కంఠభరితమైన కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తంగా లక్షలాది మంది యూనివర్సిటీ విద్యార్థులు పరస్పరం అనుసంధానమవుతారు. ఐఐటీలు, ఐఐఎంలు, ఎన్ఐటీలు, వైద్య కళాశాలల వంటి పలు ప్రతిష్టాత్మక సంస్థలు కూడా ఇందులో పాల్గొంటాయి. మీరు కాలేజీ విద్యార్థి అయితే సెప్టెంబర్ 26వ తేదీన జరిగే ఈ కార్యక్రమాన్ని తప్పక చూడాలని, అందులో భాగస్వామి కావాలని కోరుకుంటున్నాను. భావి భారతదేశంలో యువత భవిష్యత్తుపై అనేక ఆసక్తికరమైన విషయాలను ఇందులో చర్చిస్తారు. ఈ కార్యక్రమంలో నేను కూడా స్వయంగా పాల్గొంటాను. నేను కూడా మన కళాశాలల విద్యార్థులతో సంభాషించేందుకు ఎదురు చూస్తున్నాను.
నా కుటుంబ సభ్యులారా! నేటి నుండి రెండు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 27వ తేదీన 'ప్రపంచ పర్యాటక దినోత్సవం' జరుగుతోంది. కొంతమంది వ్యక్తులు పర్యాటకాన్ని విహారయాత్రా సాధనంగా మాత్రమే చూస్తారు. అయితే పర్యాటకంలో చాలా పెద్ద అంశం 'ఉపాధి'కి సంబంధించింది. కనీస పెట్టుబడితో అత్యధిక ఉపాధి కల్పించే రంగం ఏదన్నా ఉందంటే అది పర్యాటక రంగమే. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంలో దేశం పట్ల సద్భావన, ఆకర్షణ చాలా ముఖ్యం. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంపై ఆకర్షణ చాలా పెరిగింది. జి-20 సమ్మేళనం నిర్వహణ విజయవంతమైన తర్వాత భారతదేశంపై ప్రపంచ ప్రజల ఆసక్తి మరింత పెరిగింది.
మిత్రులారా! జి-20 సమ్మేళనం జరుగుతున్న సమయంలో లక్షమందికి పైగా ప్రతినిధులు భారతదేశానికి వచ్చారు. ఇక్కడి వైవిధ్యం, విభిన్న సంప్రదాయాలు, వివిధ రకాల ఆహార పానీయాలు, మన వారసత్వ సంపద గురించి వారు తెలుసుకున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతినిధులు తమ వెంట తీసుకెళ్లిన అద్భుతమైన అనుభవాలు పర్యాటకాన్ని మరింత విస్తరింపజేస్తాయి.
భారతదేశంలో ఒక దానికి మించి మరొకటిగా ఉండే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయని, వాటి సంఖ్య నిరంతరం పెరుగుతోందని మీ అందరికీ తెలుసు. కొద్ది రోజుల క్రితం శాంతినికేతన్ ను, కర్ణాటకలోని పవిత్ర హొయసాల దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా ప్రకటించారు. ఈ అద్భుతమైన విజయానికి దేశప్రజలందరినీ నేను అభినందిస్తున్నాను. శాంతి నికేతన్ ను 2018లో సందర్శించే అవకాశం నాకు లభించింది. శాంతి నికేతన్‌తో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ కు అనుబంధం ఉంది. గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ పురాతన సంస్కృత శ్లోకం నుండి శాంతినికేతన్ పేరును తీసుకున్నారు. ఆ శ్లోకం -
“యత్ర విశ్వం భవత్యేక నీడమ్”
అంటే యావత్ ప్రపంచమే ఒక చిన్న గూడు అయ్యే చోటు అని. యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో చేర్చిన కర్నాటకలోని హొయసాల దేవాలయాలు 13వ శతాబ్దానికి చెందిన అద్భుతమైన వాస్తుశిల్పానికి ప్రసిద్ధి చెందాయి. ఈ దేవాలయాలు యునెస్కో నుండి గుర్తింపు పొందడం భారతీయ ఆలయ నిర్మాణ సంప్రదాయానికి కూడా గౌరవం. భారతదేశంలోని ప్రపంచ వారసత్వ సంపద మొత్తం సంఖ్య ఇప్పుడు 42 కు చేరుకుంది. మన చారిత్రక, సాంస్కృతిక ప్రదేశాలను వీలైనంత అధిక సంఖ్యలో ప్రపంచ వారసత్వ ప్రదేశాలుగా గుర్తింపు పొందేందుకు భారతదేశం ప్రయత్నిస్తోంది. మీరు ఎక్కడికైనా వెళ్లాలని అనుకున్నప్పుడల్లా భారతదేశ వైవిధ్యాన్ని చూడాలని మీ అందరినీ కోరుతున్నాను. మీరు వివిధ రాష్ట్రాల సంస్కృతిని అర్థం చేసుకోవాలి. అందుకోసం ప్రపంచ వారసత్వ ప్రదేశాలను సందర్శించండి. దీనితో మీరు మన దేశ అద్భుతమైన చరిత్ర గురించి తెలుసుకోవడమే కాకుండా స్థానిక ప్రజల ఆదాయాన్ని పెంచడానికి ఒక ముఖ్యమైన మాధ్యమంగా కూడా మారతారు.
నా కుటుంబ సభ్యులారా! భారతీయ సంస్కృతి, భారతీయ సంగీతం ఇప్పుడు విశ్వవ్యాపితమయ్యాయి. వాటితో ప్రపంచవ్యాప్తంగా ప్రజల అనుబంధం రోజురోజుకూ పెరుగుతోంది. ఒక అమ్మాయి సమర్పించిన చిన్న ఆడియో రికార్డును వినండి.
### (MKB EP 105 AUDIO Byte 1)###
ఇది విని మీరు కూడా ఆశ్చర్యపోయారు కదా! ఆమెది ఎంత మధురమైన స్వరం! ప్రతి పదంలో ప్రతిబింబించే భావోద్వేగాల ద్వారా భగవంతునిపై ఆమె ప్రేమను మనం అనుభూతి చెందగలం. ఈ మధురమైన స్వరం జర్మనీకి చెందిన ఒక అమ్మాయిది అని నేను మీకు చెబితే, బహుశా మీరు మరింత ఆశ్చర్యపోతారు. ఈ అమ్మాయి పేరు కైసమీ. 21 ఏళ్ల కైసమీ ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌లో బాగా ప్రసిద్ధి చెందారు. జర్మనీ నివాసి అయిన కైసమీ భారతదేశానికి ఎప్పుడూ రాలేదు. కానీ ఆమె భారతీయ సంగీతానికి అభిమాని. భారతదేశాన్ని కూడా చూడని ఆమెకు భారతీయ సంగీతంపై ఉన్న ఆసక్తి చాలా స్ఫూర్తిదాయకం. కైసమీ జన్మతః అంధురాలు. కానీ ఈ కష్టమైన సవాలు ఆమెను అసాధారణ విజయాల నుండి ఆపలేదు. సంగీతం, సృజనాత్మకతపై ఉన్న మక్కువతో ఆమె చిన్నతనం నుండి పాడటం ప్రారంభించారు. కేవలం 3 సంవత్సరాల వయస్సులో ఆఫ్రికన్ డ్రమ్మింగ్ ప్రారంభించారు. భారతీయ సంగీతంతో 5-6 సంవత్సరాల క్రితమే ఆమెకు పరిచయం ఏర్పడింది. భారతదేశ సంగీతం ఆమెను ఎంతగానో ఆకట్టుకుంది. ఆమె దానిలో పూర్తిగా మునిగిపోయింది. తబలా వాయించడం కూడా నేర్చుకున్నారు. చాలా స్ఫూర్తిదాయకమైన విషయం ఏమిటంటే ఆమె అనేక భారతీయ భాషలలో పాడటంలో ప్రావీణ్యం సంపాదించారు. సంస్కృతం, హిందీ, మలయాళం, తమిళం, కన్నడ, అస్సామీ, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ... ఈ అన్ని భాషల్లోనూ పాడారు. తెలియని భాషలో రెండు మూడు వాక్యాలు మాట్లాడాలంటే ఎంత కష్టమో ఊహించుకోవచ్చు కానీ కైసమీకి మాత్రం ఇదొక సులువైన ఆట. మీ అందరి కోసం కన్నడలో ఆమె పాడిన ఒక పాటను ఇక్కడ పంచుకుంటున్నాను.
###(MKB EP 105 AUDIO Byte 2)###
భారతీయ సంస్కృతిపై, సంగీతంపై జర్మనీకి చెందిన కైసమీకి ఉన్న మక్కువను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆమె ప్రయత్నాలు ప్రతి భారతీయుడిని ఉప్పొంగిపోయేలా చేస్తాయి.
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! మన దేశంలో విద్యను ఎల్లప్పుడూ సేవగా చూస్తారు. అదే స్ఫూర్తితో పిల్లల చదువు కోసం కృషి చేస్తున్న ఉత్తరాఖండ్‌లోని యువత గురించి నాకు తెలిసింది. నైనిటాల్ జిల్లాలో కొంతమంది యువకులు పిల్లల కోసం ఒక ప్రత్యేక సంచార గ్రంథాలయాన్ని ప్రారంభించారు. ఈ గ్రంథాలయం ప్రత్యేకత ఏమిటంటే దీని ద్వారా అత్యంత మారుమూల ప్రాంతాలలో కూడా పిల్లలకు పుస్తకాలు చేరుతున్నాయి. అంతేకాదు- ఈ సేవ పూర్తిగా ఉచితం. ఇప్పటి వరకు నైనిటాల్‌లోని 12 గ్రామాలకు ఈ గ్రంథాలయం ద్వారా సేవలందించారు. పిల్లల చదువుకు సంబంధించిన ఈ ఉదాత్తమైన పనిలో స్థానిక ప్రజలు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. ఈ సంచార గ్రంథాలయం ద్వారా మారుమూల పల్లెల్లో నివసించే పిల్లలకు పాఠశాల పుస్తకాలే కాకుండా పద్యాలు, కథలు, నైతిక విద్యకు సంబంధించిన పుస్తకాలు చదివేందుకు పూర్తి అవకాశం కల్పించే ప్రయత్నం జరుగుతోంది. ఈ ప్రత్యేకమైన లైబ్రరీని పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు.
మిత్రులారా! గ్రంథాలయానికి సంబంధించి హైదరాబాదులో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం గురించి నాకు తెలిసింది. ఇక్కడ ఏడో తరగతి చదువుతున్న అమ్మాయి ‘ఆకర్షణా సతీష్’ అద్భుతం చేసింది. కేవలం 11 ఏళ్ల వయస్సులో ఆమె పిల్లల కోసం ఒకటి, రెండు కాదు- ఏడు లైబ్రరీలను నిర్వహిస్తోందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. రెండేళ్ల క్రితం తల్లిదండ్రులతో కలిసి క్యాన్సర్ ఆస్పత్రికి వెళ్లిన సందర్భంలో ఈ దిశగా ఆకర్షణకు ప్రేరణ లభించింది. ఆమె తండ్రి పేదవారికి సహాయం చేయడానికి అక్కడికి వెళ్ళారు. అక్కడి పిల్లలు వారిని 'కలరింగ్ బుక్స్' అడిగారు. ఈ విషయం ఆమె మనస్సును తాకింది. దాంతో వివిధ రకాల పుస్తకాలను సేకరించాలని ఆమె నిర్ణయించుకుంది. తన ఇరుగుపొరుగు ఇళ్ళు, బంధువులు, స్నేహితుల నుండి పుస్తకాలు సేకరించడం ప్రారంభించింది. అదే క్యాన్సర్ ఆసుపత్రిలో పిల్లల కోసం మొదటి లైబ్రరీ ప్రారంభించారని తెలిస్తే మీరు సంతోషిస్తారు. ఈ బాలిక నిరుపేద పిల్లల కోసం వివిధ ప్రదేశాలలో ఇప్పటివరకు ప్రారంభించిన ఏడు లైబ్రరీలలో ఇప్పుడు సుమారు 6 వేల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఈ చిన్న 'ఆకర్షణ' విశేషంగా కృషి చేస్తున్న తీరు అందరిలోనూ స్ఫూర్తి నింపుతోంది. మిత్రులారా! నేటి యుగం డిజిటల్ టెక్నాలజీ, ఇ-బుక్స్‌తో కూడుకున్నదనడంలో వాస్తవముంది. అయితే ఇప్పటికీ పుస్తకాలు ఎల్లప్పుడూ మన జీవితంలో మంచి స్నేహితుని పాత్ర పోషిస్తాయి. అందుకే పిల్లలను పుస్తకాలు చదివేలా ప్రేరేపించాలి.
నా కుటుంబ సభ్యులారా! మన గ్రంథాలలో ఇలా చెప్పారు-
జీవేషు కరుణా చాపి, మైత్రీ తేషు విధీయతామ్!
అంటే ప్రాణులపై కరుణ చూపి వాటిని మిత్రులుగా చేసుకొమ్మని అర్థం. మన దేవతల వాహనాలు చాలా వరకు జంతువులు, పక్షులు. చాలా మంది గుడికి వెళ్తారు. భగవంతుడి దర్శనం చేసుకుంటారు. కానీ భగవంతుడి వాహనాలుగా ఉండే జీవాలను పెద్దగా పట్టించుకోరు. ఈ జీవాలు మన విశ్వాసాలకు కేంద్రాలుగా ఉంటాయి. మనం వాటిని అన్ని విధాలుగా రక్షించుకోవాలి. గత కొన్ని సంవత్సరాలుగా, దేశంలో సింహాలు, పులులు, చిరుతలు, ఏనుగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ భూమిపై నివసించే ఇతర జంతువులను రక్షించడానికి అనేక ఇతర ప్రయత్నాలు కూడా నిరంతరం జరుగుతున్నాయి. రాజస్థాన్‌లోని పుష్కర్‌లో కూడా ఇలాంటి ప్రత్యేక ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ అడవి జంతువులను రక్షించడానికి సుఖ్‌దేవ్ భట్ జీ తో పాటు ఆయన బృందం కలిసికట్టుగా పని చేస్తోంది. వారి బృందం పేరు ఏమిటో మీకు తెలుసా? ఆఅ బృందం పేరు కోబ్రా. ఈ ప్రమాదకరమైన పేరు ఎందుకంటే ఆయన బృందం కూడా ఈ ప్రాంతంలో ప్రమాదకరమైన పాములను రక్షించడానికి పని చేస్తుంది. ఈ బృందంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొంటున్నారు. వారు కేవలం ఒక్క పిలుపుతో స్థలానికి చేరుకుని తమ పనిలో పాల్గొంటారు. సుఖ్‌దేవ్ జీ బృందం ఇప్పటి వరకు 30 వేలకు పైగా విష సర్పాల ప్రాణాలను కాపాడింది. ఈ ప్రయత్నం ద్వారా ప్రజలకు ప్రమాదం తొలగి పోవడంతో పాటు ప్రకృతి పరిరక్షణ కూడా జరుగుతోంది. ఈ బృందం ఇతర జబ్బుపడిన జంతువులకు సేవ చేసే పనిలో కూడా పాల్గొంటుంది.
మిత్రులారా! తమిళనాడులోని చెన్నైలో ఉండే ఆటో డ్రైవర్ ఎం. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ప్రత్యేకమైన పని చేస్తున్నారు. ఆయన గత 25-30 సంవత్సరాలుగా పావురాలకు సేవ చేయడంలో నిమగ్నమై ఉన్నారు. ఆయన ఇంట్లో 200కు పైగా పావురాలున్నాయి. పక్షులకు ఆహారం, నీరు, ఆరోగ్యం మొదలైన ప్రతి అవసరాన్ని వారు పూర్తిగా చూసుకుంటారు. దీని కోసం చాలా డబ్బు ఖర్చు చేస్తారు. కానీ ఖర్చుకు వెనుకకు పోకుండా తన పనిలో అంకితభావంతో ఉంటారు. మిత్రులారా! మంచి ఉద్దేశ్యంతో ఇలాంటి పని చేస్తున్న వారిని చూడటం నిజంగా చాలా ప్రశాంతతను, చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీరు కూడా అలాంటి కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాల గురించి సమాచారాన్ని పొందితే తప్పకుండా వాటిని పంచుకోండి.
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! ఈ స్వాతంత్య్ర అమృత కాలం దేశం కోసం ప్రతి పౌరుని కర్తవ్య కాలం కూడా. మన విధులను నిర్వర్తించడం ద్వారా మాత్రమే మనం మన లక్ష్యాలను సాధించగలం. మన గమ్యాన్ని చేరుకోగలం. కర్తవ్య భావన మనందరినీ కలుపుతుంది. ఉత్తరప్రదేశ్ లోని సంభల్‌లో దేశం అటువంటి కర్తవ్య భావానికి ఉదాహరణను చూసింది. నేను మీతో కూడా ఆ విషయాన్ని పంచుకోవాలనుకుంటున్నాను. ఒక్కసారి ఊహించుకోండి. అక్కడ 70కి పైగా గ్రామాలు ఉన్నాయి. వేలాది జనాభా ఉంది. అయినా ప్రజలందరూ కలిసి ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఏకమయ్యారు. ఇది చాలా అరుదుగా జరుగుతుంది. కానీ సంభల్ ప్రజలు దీన్ని చేసి చూపారు. ఈ వ్యక్తులు సంఘటితమై ప్రజల భాగస్వామ్యం, సమష్టితత్వానికి అద్భుతమైన ఉదాహరణగా నిలిచారు. దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో 'సోత్' అనే నది ఉండేది. అమ్రోహా నుండి మొదలై సంభల్ గుండా బదాయూ వరకు ప్రవహించే ఈ నదికి ఒకప్పుడు ఈ ప్రాంతంలో ప్రాణదాతగా పేరుండేది. ఇక్కడి రైతులకు వ్యవసాయానికి ప్రధాన ఆధారమైన ఈ నదిలో నీరు నిరంతరం ప్రవహించేది. కాలక్రమేణా నది ప్రవాహం తగ్గింది. నది ప్రవహించే మార్గాలు ఆక్రమణకు గురయ్యాయి. ఈ నది అంతరించిపోయింది. నదిని తల్లిగా భావించే మన దేశంలో సంభల్ ప్రజలు ఈ సోత్ నదిని కూడా పునరుద్ధరించాలని సంకల్పించారు. గతేడాది డిసెంబరులో 70కి పైగా గ్రామ పంచాయతీలు కలిసి సోత్ నది పునరుద్ధరణ పనులను ప్రారంభించాయి. గ్రామ పంచాయతీల ప్రజలు తమతో పాటు ప్రభుత్వ శాఖలను కూడా భాగస్వాములుగా చేశారు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లోనే ఈ ప్రజలు నదిలో 100 కిలోమీటర్ల కంటే అధిక ప్రాంతాన్ని పునరుద్ధరించారు. ఎక్కువ పునరావాసం కల్పించారని తెలిస్తే మీరు సంతోషిస్తారు. వర్షాకాలం ప్రారంభం కాగానే ఇక్కడి ప్రజల శ్రమ ఫలించి సోత్ నది నిండుకుండలా నీటితో నిండిపోయింది. ఇది ఇక్కడి రైతులకు సంతోషం కలిగించే పెద్ద సందర్భం. ప్రజలు నది ఒడ్డు పూర్తిగా సురక్షితంగా ఉండేందుకు ఒడ్డుపై 10 వేలకు పైగా మొక్కలను కూడా నాటారు. దోమలు వృద్ధి చెందకుండా ముప్పై వేలకు పైగా గంబూసియా చేపలను కూడా నది నీటిలో వదిలారు. మిత్రులారా! మనం దృఢ సంకల్పంతో ఉంటే అతిపెద్ద సవాళ్లను అధిగమించి పెద్ద మార్పు తీసుకురాగలమని సోత్ నది ఉదాహరణ చెబుతోంది. కర్తవ్య మార్గంలో నడవడం ద్వారా మీరు కూడా మీ చుట్టూ ఉన్న అనేక మార్పులకు వాహకంగా మారవచ్చు.
నా కుటుంబ సభ్యులారా! ఉద్దేశాలు దృఢంగా ఉండి ఏదైనా నేర్చుకోవాలనే తపన ఉంటే ఏ పనీ కష్టంగా ఉండదు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన శ్రీమతి శకుంతలా సర్దార్ ఇది ఖచ్చితంగా సరైనదని నిరూపించారు. ఈరోజు ఆమె ఎందరో మహిళలకు స్ఫూర్తిగా నిలిచారు. శకుంతల గారు జంగల్ మహల్‌లోని శాతనాల గ్రామ నివాసి. చాలా కాలంగా ఆమె కుటుంబం ప్రతిరోజు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఆమె కుటుంబం బతకడం కూడా కష్టమైంది. ఆ తర్వాత కొత్త బాటలో నడవాలని నిర్ణయించుకుని విజయం సాధించి, అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె ఈ విజయాన్ని ఎలా సాధించారో మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలనుకుంటున్నారు! సమాధానం- ఒక కుట్టు యంత్రం. కుట్టుమిషన్ ఉపయోగించి 'సాల్' ఆకులపై అందమైన డిజైన్లు చేయడం ప్రారంభించారు. ఆమె నైపుణ్యం మొత్తం కుటుంబ జీవితాన్నే మార్చేసింది. ఆమె తయారు చేసిన ఈ అద్భుతమైన క్రాఫ్ట్‌కు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. శకుంతల గారి ఈ నైపుణ్యం ఆమె జీవితాన్నే కాకుండా 'సాల్' ఆకులను సేకరించే చాలా మంది జీవితాలను కూడా మార్చింది. ఇప్పుడు ఆమె చాలా మంది మహిళలకు శిక్షణ ఇచ్చే పనిలో ఉన్నారు. మీరు ఊహించవచ్చు- ఒకప్పుడు వేతనాలపై ఆధారపడిన కుటుంబం ఇప్పుడు ఇతరులకు ఉపాధి లభించేలా ప్రేరేపిస్తోంది. దినసరి కూలీపైనే ఆధారపడి బతుకుతున్న తమ కుటుంబాన్ని తమ కాళ్లపై నిలబెట్టింది. దీంతో ఆమె కుటుంబానికి ఇతర విషయాలపై కూడా దృష్టి పెట్టే అవకాశం వచ్చింది. ఇంకో విషయం శకుంతల గారి పరిస్థితి మెరుగుపడిన వెంటనే ఆమె పొదుపు చేయడం కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఆమె జీవిత బీమా పథకాలలో పెట్టుబడి పెట్టడం ప్రారంభించారు. తద్వారా తన పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలంగా ఉంటుంది. శకుంతల గారి అభిరుచిని ఎంత ప్రశంసించినా తక్కువే. భారతదేశ ప్రజలు అలాంటి ప్రతిభతో నిండి ఉన్నారు. మీరు వారికి అవకాశం ఇవ్వండి. వారు ఎలాంటి అద్భుతాలు చేస్తారో చూడండి.
నా కుటుంబ సభ్యులారా! ఢిల్లీలో జరిగిన జి-20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా పలువురు ప్రపంచ నేతలు కలిసి, రాజ్‌ఘాట్‌కు చేరుకుని బాపూజీకి నివాళులు అర్పించిన ఆ దృశ్యాన్ని ఎవరు మాత్రం మరిచిపోగలరు! బాపూజీ ఆలోచనలు ప్రపంచవ్యాప్తంగా నేటికీ ఎంత సందర్భోచితంగా ఉన్నాయనడానికి ఇదే పెద్ద నిదర్శనం. గాంధీ జయంతి మొదలుకుని దేశవ్యాప్తంగా పరిశుభ్రతకు సంబంధించిన అనేక కార్యక్రమాలు ప్రారంభం కావడం పట్ల కూడా నేను సంతోషిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలన్నింటిలో ‘స్వచ్ఛతా హీ సేవా అభియాన్’ అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. ఇండియన్ స్వచ్ఛతా లీగ్‌లో కూడా చాలా మంచి భాగస్వామ్యం కనిపిస్తోంది. ఈ రోజు నేను ‘మన్ కీ బాత్’ ద్వారా దేశప్రజలందరికీ ఒక అభ్యర్థన చేయాలనుకుంటున్నాను. అక్టోబర్ 1వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు పరిశుభ్రతపై పెద్ద కార్యక్రమం నిర్వహించబోతున్నాను. మీరు కూడా మీ సమయాన్ని వెచ్చించి పరిశుభ్రతకు సంబంధించిన ఈ ప్రచారంలో సహకరించండి. మీరు మీ వీధి, పరిసరాలు, పార్కులు, నది, సరస్సు లేదా ఏదైనా ఇతర బహిరంగ ప్రదేశంలో ఈ స్వచ్ఛత ప్రచారంలో చేరవచ్చు. అమృత్ సరోవర్ నిర్మితమైన ప్రదేశాలలో పరిశుభ్రత పాటించాలి. ఈ పరిశుభ్రత చర్య గాంధీజీకి నిజమైన నివాళి అవుతుంది. గాంధీ జయంతి సందర్భంగా తప్పనిసరిగా ఏదైనా ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నేను మీకు మళ్లీ గుర్తు చేయాలనుకుంటున్నాను.
నా కుటుంబ సభ్యులారా! మన దేశంలో పండుగల సీజన్ కూడా ప్రారంభమైంది. మీరందరూ కూడా ఇంట్లో ఏదైనా కొత్త వస్తువు కొనాలని ఆలోచిస్తూ ఉండవచ్చు. నవరాత్రులలో ఏవైనా శుభకార్యాలు ప్రారంభించాలని ఎదురుచూస్తూ ఉండవచ్చు. ఉల్లాసం, ఉత్సాహంతో కూడిన ఈ వాతావరణంలో మీరు వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని కూడా గుర్తుంచుకోవాలి. వీలైనంత వరకు, మీరు భారతదేశంలో తయారైన వస్తువులను కొనుగోలు చేయాలి. భారతీయ ఉత్పత్తులను ఉపయోగించాలి. భారతదేశంలో తయారు చేసిన వస్తువులను మాత్రమే బహుమతిగా ఇవ్వాలి. మీ చిన్న ఆనందం వేరొకరి కుటుంబంలో గొప్ప ఆనందానికి కారణం అవుతుంది. మీరు కొనుగోలు చేసే భారతీయ వస్తువులు నేరుగా మన శ్రామికులు, కార్మికులు, శిల్పకారులు, ఇతర విశ్వకర్మ సోదరులు, సోదరీమణులకు ప్రయోజనం చేకూరుస్తాయి. ప్రస్తుతం చాలా స్టార్టప్‌లు కూడా స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇస్తున్నాయి. మీరు స్థానిక వస్తువులను కొనుగోలు చేస్తే ఈ స్టార్టప్‌ల యువత కూడా ప్రయోజనం పొందుతుంది.
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! ఈ రోజు 'మన్ కీ బాత్'లో ఇప్పటికి ఇంతే! వచ్చేసారి నేను మిమ్మల్ని 'మన్ కీ బాత్'లో కలిసేటప్పటికి నవరాత్రులు, దసరా గడిచిపోతాయి. ఈ పండగ సీజన్లో మీరు కూడా ప్రతి పండుగను ఉత్సాహంగా జరుపుకోవాలని, మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరియాలని కోరుకుంటున్నాను. ఇదే నా కోరిక. ఈ పండుగల సందర్భంగా మీకు చాలా శుభాకాంక్షలు. మరిన్ని కొత్త అంశాలతో, దేశప్రజల కొత్త విజయాలతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీరు మీ సందేశాలను నాకు పంపుతూనే ఉండండి. మీ అనుభవాలను పంచుకోవడం మర్చిపోవద్దు. నేను ఎదురుచూస్తూ ఉంటా. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! నమస్కారం. మన్ కీ బాత్ ఆగస్టు ఎపిసోడ్‌లోకి మరోసారి మీకు హృదయపూర్వక స్వాగతం. శ్రావణ మాసంలో రెండేసి సార్లు గతంలో 'మన్ కీ బాత్' కార్యక్రమం జరిగినట్టు నాకు గుర్తు లేదు. కానీ, ఈసారి అదే జరుగుతోంది. శ్రావణమంటే మహాశివుడి మాసం. వేడుకలు , ఆనందాల నెల. చంద్రయాన్ విజయం ఈ వేడుకల వాతావరణాన్ని అనేక రెట్లు పెంచింది. చందమామ పైకి చంద్రయాన్ చేరుకుని మూడు రోజులకు పైగా కాలం గడిచింది. ఈ విజయంపై ఎంత చర్చ చేసినా ఆ చర్చతో పోలిస్తే ఈ విజయం చాలా పెద్దది. ఈరోజు మీతో మాట్లాడుతున్నప్పుడు నా పాత కవితలోని కొన్ని పంక్తులు గుర్తుకు వస్తున్నాయి.
ఆకాశంలో తల ఎత్తి
మేఘాలను చీల్చుకుంటూ
వెలుగు కోసం ప్రతిజ్ఞ చేయండి
సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు
దృఢ సంకల్పంతో అడుగేయండి
అన్ని సవాళ్లను అధిగమించండి
పెను చీకట్లను తరిమేందుకు
సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు.
ఆకాశంలో తల ఎత్తి
మేఘాలను చీల్చుకుంటూ
సూర్యుడు ఇప్పుడే ఉదయించాడు
నా కుటుంబ సభ్యులారా! సంకల్ప సూర్యులు చంద్రుడిపై కూడా ఉదయిస్తారని ఆగష్టు 23వ తేదీన భారతదేశం, భారతదేశ చంద్రయాన్ ప్రయోగం నిరూపించాయి. ఏ పరిస్థితిలోనైనా గెలవాలనుకునే, విజయ సాధనపై అవగాహన ఉండే నవ భారత స్ఫూర్తికి మిషన్ చంద్రయాన్ చిహ్నంగా మారింది.
మిత్రులారా! ఈ మిషన్‌లో ఒక అంశం గురించి నేను ఈరోజు ప్రత్యేకంగా మీ అందరితో చర్చించాలనుకుంటున్నాను. మహిళా నాయకత్వ అభివృద్ధిని జాతీయ చరిత్ర రూపంలో పటిష్టం చేయాలని ఈసారి ఎర్రకోట నుండి నేను చెప్పిన విషయం ఈసారి మీకు గుర్తుండే ఉంటుంది. మహిళా శక్తి అనుసంధానమయ్యే చోట అసాధ్యమైన వాటిని కూడా సుసాధ్యం చేయవచ్చు. భారతదేశ మిషన్ చంద్రయాన్ కూడా మహిళా శక్తికి ప్రత్యక్ష ఉదాహరణ. చాలా మంది మహిళా శాస్త్రవేత్తలు, ఇంజనీర్లు ఈ మొత్తం మిషన్‌లో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వేర్వేరు విభాగాల్లో వారు ప్రాజెక్ట్ డైరెక్టర్, ప్రాజెక్ట్ మేనేజర్ మొదలైన అనేక ముఖ్యమైన బాధ్యతలను నిర్వహించారు. భారతదేశ అమ్మాయిలు ఇప్పుడు అనంతంగా భావించే అంతరిక్షాన్ని కూడా సవాలు చేస్తున్నారు. ఒక దేశ అమ్మాయిలు ఇలా ఆకాంక్షలు వ్యక్తం చేస్తూ ఉంటే ఆ దేశం అభివృద్ధి చెందకుండా ఎవరు ఆపగలరు!
మిత్రులారా! ఈ రోజు మన కలలు పెద్దవి. మన ప్రయత్నాలు కూడా పెద్దవే. అందువల్లే మనం ఇంత ఉన్నత స్థాయిని చేరుకోగలిగాం. చంద్రయాన్-3 విజయంలో మన శాస్త్రవేత్తలతో పాటు ఇతర రంగాల వారు కూడా కీలక పాత్ర పోషించారు. అందరూ సహకరిస్తే విజయం సాధ్యం. ఇదే చంద్రయాన్-3 కి అన్నింటికంటే గొప్ప బలం. చాలా మంది దేశస్థులు అన్ని భాగాలు , సాంకేతిక అవసరాలను తీర్చడంలో సహకరించారు. అందరి కృషితో విజయం కూడా సాధించింది. భవిష్యత్తులో కూడా మన అంతరిక్ష రంగం అందరి కృషితో ఇలాంటి అసంఖ్యాక విజయాలు సాధించాలని కోరుకుంటున్నాను.
నా కుటుంబ సభ్యులారా! సెప్టెంబరు నెల భారతదేశ సామర్థ్యానికి సాక్ష్యంగా నిలవబోతోంది. వచ్చే నెలలో జరిగే జి-20 నాయకుల శిఖరాగ్ర సదస్సుకు భారతదేశం పూర్తిగా సిద్ధమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు 40 దేశాల అధినేతలతో పాటు పలు అంతర్జాతీయ సంస్థలు రాజధాని ఢిల్లీకి వస్తున్నాయి. అత్యధికమంది పాల్గొనడం G-20 శిఖరాగ్ర సదస్సుల చరిత్రలోనే తొలిసారి. భారతదేశం అధ్యక్షత వహిస్తున్న ఈ తరుణంలో G-20ని మరింత సమగ్ర వేదికగా మార్చింది. భారతదేశం ఆహ్వానంపై ఆఫ్రికన్ యూనియన్ కూడా G-20లో చేరింది. ఆఫ్రికా ప్రజల గొంతు ప్రపంచంలోని ఈ ముఖ్యమైన వేదికపైకి చేరుకుంది. మిత్రులారా! గత ఏడాది బాలిలో భారతదేశం G-20 అధ్యక్ష పదవిని చేపట్టినప్పటి నుండి మనలో గర్వాన్ని నింపే అనేక సంఘటనలు జరిగాయి. ఢిల్లీలో భారీ స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించే సంప్రదాయానికి భిన్నంగా ఈసారి దేశంలోని వివిధ నగరాలకు ఈ కార్యక్రమాలను తీసుకెళ్లాం. దీనికి సంబంధించి దేశంలోని 60 నగరాల్లో దాదాపు 200 సమావేశాలు జరిగాయి. జి-20 ప్రతినిధులు ఎక్కడికి వెళ్లినా ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ ప్రతినిధులు మన దేశ వైవిధ్యాన్ని, మన శక్తిమంతమైన ప్రజాస్వామ్యాన్ని చూసి ఎంతో ముగ్ధులయ్యారు. భారతదేశంలో చాలా అవకాశాలు ఉన్నాయని కూడా వారు గ్రహించారు.
మిత్రులారా! మన జి-20 అధ్యక్ష స్థానం ప్రజల అధ్యక్ష స్థానమే. ఇందులో ప్రజల భాగస్వామ్య స్ఫూర్తి అన్నింటికంటే ముఖ్యమైంది. జి-20కి చెందిన పదకొండు ఎంగేజ్మెంట్ గ్రూపులలో విద్యావేత్తలు, పౌర సమాజానికి చెందినవారు, యువత, మహిళలు, చట్ట సభల సభ్యులు, పారిశ్రామికవేత్తలు, పట్టణ పరిపాలనకు సంబంధించినవారు ముఖ్యమైన పాత్ర పోషించారు. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో ఏదో ఒక రూపంలో ఒకటిన్నర కోట్ల మంది ప్రజలు భాగస్వాములయ్యారు. ప్రజల భాగస్వామ్యం కోసం మనం చేస్తున్న ఈ ప్రయత్నంలో ఒకటి మాత్రమే కాదు, రెండు ప్రపంచ రికార్డులు సృష్టించగలిగాం. వారణాసిలో జరిగిన జి-20 క్విజ్‌లో 800 పాఠశాలలకు చెందిన 1.25 లక్షల మంది విద్యార్థులు పాల్గొనడం ప్రపంచ రికార్డుగా నిలిచింది. అదే సమయంలో లంబానీ కళాకారులు కూడా అద్భుతాలు చేశారు. 450 మంది కళాకారులు దాదాపు 1800 ప్రత్యేక ప్యాచ్‌ల అద్భుతమైన సేకరణను రూపొందించడం ద్వారా తమ హస్తకళా నైపుణ్యాన్ని ప్రదర్శించారు. జి-20కి వచ్చిన ప్రతి ప్రతినిధి మన దేశ కళాత్మక వైవిధ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అలాంటి అద్భుతమైన కార్యక్రమం సూరత్‌లో జరిగింది. అక్కడ జరిగిన ‘చీరల వాకథాన్'లో 15 రాష్ట్రాల నుంచి 15,000 మంది మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం సూరత్‌లోని టెక్స్టైల్ పరిశ్రమకు ఊతమిచ్చింది. వోకల్ ఫర్ లోకల్- స్థానిక ఉత్పత్తులకు ప్రాచుర్యం లభించింది. లోకల్ అంటే స్థానిక ఉత్పత్తులు గ్లోబల్ స్థాయికి చేరేందుకు మార్గం సుగమమైంది. శ్రీనగర్‌లో జరిగిన జి-20 సమావేశం తర్వాత కశ్మీర్ పర్యాటకుల సంఖ్య భారీగా పెరిగింది. జి-20 సదస్సును విజయవంతం చేసి, దేశ ప్రతిష్టను పెంచుదామని దేశప్రజలందరికీ చెప్పాలనుకుంటున్నాను.
నా కుటుంబ సభ్యులారా! 'మన్ కీ బాత్' ఎపిసోడ్లలో మనం తరచుగా మన యువతరం సామర్థ్యాన్ని చర్చిస్తాం. క్రీడారంగం మన యువత నిరంతరం కొత్త విజయాలను సాధిస్తున్నక్షేత్రం. ఇటీవల మన క్రీడాకారులు దేశ వైభవాన్ని ఉన్నతస్థాయిలో నిలబెట్టిన టోర్నమెంట్ల గురించి ఈ రోజు 'మన్ కీ బాత్'లో మాట్లాడుతాను. కొద్ది రోజుల క్రితం చైనాలో ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడోత్సవాలు జరిగాయి. ఈసారి ఈ గేమ్‌లలో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శన చూపింది. మన ఆటగాళ్లు మొత్తం 26 పతకాలు సాధించగా, అందులో 11 బంగారు పతకాలు ఉన్నాయి. 1959 నుండి జరిగిన అన్ని ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలలో మేము సాధించిన పతకాలన్నింటినీ కలిపినా, ఈ సంఖ్య 18కి మాత్రమే చేరుకుంటుంది. ఇన్ని దశాబ్దాలలో కేవలం 18 మాత్రమే పొందారు. కానీ ఈసారి మన క్రీడాకారులు 26 పతకాలు సాధించారు. అందుకే ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడోత్సవాల్లో పతకాలు సాధించిన కొందరు యువ క్రీడాకారులు, విద్యార్థులు ప్రస్తుతం నాతో ఫోన్లైన్లో ఉన్నారు. ముందుగా వారి గురించి చెబుతాను. యూపీకి చెందిన ప్రగతి ఆర్చరీలో పతకం సాధించారు. అస్సాం నివాసి అమ్లాన్ అథ్లెటిక్స్‌లో పతకం సాధించారు. యూపీకి చెందిన ప్రియాంక రేస్ వాక్‌లో పతకం సాధించారు. మహారాష్ట్రకు చెందిన అభిదన్య షూటింగ్లో పతకం సాధించారు.
మోదీ గారు: నా ప్రియమైన యువ క్రీడాకారులారా! నమస్కారం.
యువ ఆటగాళ్లు: నమస్కారం సార్
మోదీ గారు: మీతో మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. భారతదేశంలోని యూనివర్శిటీల నుండి ఎంపికైన జట్టుల్లో ఉన్న మీరు భారతదేశానికి కీర్తిని తెచ్చారు. ఈ సందర్భంగా మీ అందరికీ అభినందనలు. మీరు ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడోత్సవాల్లో మీ ప్రదర్శన ద్వారా ప్రతి దేశవాసీ గర్వపడేలా చేశారు. కాబట్టి ముందుగా నేను మిమ్మల్ని చాలా చాలా అభినందిస్తున్నాను. ప్రగతీ.. నేను మీతో ఈ సంభాషణను ప్రారంభిస్తున్నాను. రెండు పతకాలు సాధించి ఇక్కడ నుండి బయలుదేరినప్పుడు మీరేం అనుకున్నారో ముందుగా చెప్పండి. ఇంత పెద్ద విజయాన్ని సాధించిన అనుభూతి ఎలా ఉంది?
ప్రగతి: సార్.. నాకు చాలా గర్వంగా అనిపించింది. నేను నా దేశ జెండాను ఇంత ఉన్నత స్థాయిలో నిలిపినందుకు గర్వపడ్డాను. ఒకసారి బంగారు పతకం కోసం పోటీలో ఓడిపోయి, పశ్చాత్తాపపడ్డాను. కానీ రెండోసారి నా మనసులో అనిపించింది.. ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని. ఎట్టి పరిస్థితిలో ఉన్నత స్థాయిలో ఉండాలని. చివరిగా పోటీలో గెలిచినప్పుడు అదే పోడియంలో చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆ క్షణం చాలా బాగుంది. ఆ విజయగర్వాన్ని లెక్కించలేనంత ఆనందంగా ఉన్నాను.
మోదీ గారు: ప్రగతీ.. మీరు శారీరకంగా పెద్ద సమస్యను ఎదుర్కొన్నారు. దాని నుండి బయటపడ్డారు. దేశంలోని యువతకు ఇదో గొప్ప స్ఫూర్తి. మీకు ఏం జరిగింది?
ప్రగతి : సార్.. 2020 మే 5వ తేదీన నాకు మెదడులో రక్తస్రావం జరిగింది. నేను వెంటిలేటర్‌పై ఉన్నాను. బతుకుతానా లేదా అనే విషయంలో సందిగ్ధత ఉంది. నేను ఏం చేస్తే బతకగలనో కూడా తెలియదు. కానీ లోపలి నుండి నాకు ధైర్యం వచ్చింది. అది ఎంతగా అంటే ఆర్చరీలో బాణం వేసేలా నేను గ్రౌండ్ పై తిరిగి నిలబడాలి అని. నా ప్రాణం దక్కిందంటే ప్రధాన కారణం దేవుని కృప. తరువాత డాక్టర్, ఆపై విలువిద్య.
మోదీ గారు: అమ్లాన్ కూడా మనతో ఉన్నారు. అమ్లాన్, మీరు అథ్లెటిక్స్‌పై ఇంత ఆసక్తిని ఎలా పెంచుకున్నారో చెప్పండి!
అమ్లాన్ :- నమస్కారం సార్.
మోదీ గారు: నమస్కారం.. నమస్కారం..
అమ్లాన్: సార్.. ఇంతకు ముందు అథ్లెటిక్స్ అంటే పెద్దగా ఆసక్తి ఉండేది కాదు. మేం ఎక్కువగా ఫుట్‌బాల్ ఆడేవాళ్ళం. నా సోదరుడికి ఒక స్నేహితుడున్నాడు. “అమ్లాన్... నువ్వు అథ్లెటిక్స్ పోటీలకు వెళ్లాలి” అని అతను చెప్పాడు. అంగీకరించాను. మొదటిసారి స్టేట్ మీట్ లో ఆడినప్పుడు ఓడిపోయాను. ఓటమి నాకు నచ్చలేదు. అలా చేస్తూచేస్తూ అథ్లెటిక్స్‌లో అడుగుపెట్టాను. ఆ తర్వాత మెల్లగా ఇలా... ఇప్పుడు సరదా మొదలైంది. అలా నాలో ఆసక్తి పెరిగింది.
మోదీ గారు: అమ్లాన్... మీరు ఎక్కడ ఎక్కువగా ప్రాక్టీస్ చేశారో చెప్పండి!
అమ్లాన్ : నేను ఎక్కువగా హైదరాబాద్‌లో సాయిరెడ్డి సార్ దగ్గర ప్రాక్టీస్ చేశాను. ఆ తర్వాత భువనేశ్వర్ కి మారాను. అక్కడి నుంచి ప్రొఫెషనల్‌గా స్టార్ట్ చేశాను సార్.
మోదీ గారు: సరే... ప్రియాంక కూడా మనతోనే ఉన్నారు. ప్రియాంకా! మీరు 20 కిలోమీటర్ల రేస్ వాక్ టీమ్‌లో ఉన్నారు. ఈ రోజు దేశం మొత్తం మీ మాట వింటోంది. వారు ఈ క్రీడ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. దీనికి ఎలాంటి నైపుణ్యాలు కావాలో మీరే చెప్పండి. మరి మీ కెరీర్ ఎక్కడి నుంచి ఎక్కడికి చేరుకుంది?
ప్రియాంక: నేను పాల్గొన్న లాంటి ఈవెంట్ చాలా కష్టం. ఎందుకంటే ఐదుగురు జడ్జీలు నిలబడి ఉంటారు. మనం పరుగెత్తినా మనల్ని తొలగిస్తారు. లేదా మనం రోడ్డు మీద నుంచి కొంచెం దిగినా, ఎగిరినా తొలగిస్తారు. మనం మోకాళ్లు వంచినా వారు బహిష్కరిస్తారు. నాకు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ తర్వాత నా స్పీడ్‌ని ఎంతగానో నియంత్రించుకున్నాను. కనీసం ఇక్కడ జట్టు పతకమైనా సాధించాలనుకున్నా. ఎందుకంటే మేం దేశం కోసం అక్కడికి వెళ్ళాం. ఖాళీ చేతులతో తిరిగిరావడం ఇష్టం లేదు.
మోదీ గారు: నాన్న, అన్న... అందరూ బాగున్నారా?
ప్రియాంక : అవును సార్… అందరూ బాగానే ఉన్నారు. మీరు మమ్మల్ని చాలా ప్రోత్సహిస్తున్నారని నేను అందరికీ చెబుతున్నాను. నిజంగా సార్.. నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇండియాలో వరల్డ్ యూనివర్శిటీ వంటి ఆటలకు పెద్దగా డిమాండ్ కూడా లేదు. కానీ ఇప్పుడు ఈ క్రీడల్లో మనకు చాలా సపోర్ట్ వస్తోంది. మేం ఇన్ని పతకాలు సాధించామని అందరూ ట్వీట్లు చేయడం కూడా చూస్తున్నాం. ఒలింపిక్స్ లాగా ఇది కూడా ప్రాచుర్యం పొందడం చాలా బాగుంది సార్.
మోదీ గారు: సరే ప్రియాంక.. నా వైపు నుండి అభినందనలు. మీరు పెద్ద పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అభిదన్యతో మాట్లాడుకుందాం.
అభిదన్య : నమస్కారం సార్.
మోదీ గారు: మీ గురించి చెప్పండి.
అభిదన్య : సార్! మా స్వస్థలం మహారాష్ట్రలోని కొల్హాపూర్. నేను షూటింగ్లో 25 మీటర్ల స్పోర్ట్స్ పిస్టల్, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లు రెండింటినీ చేస్తాను. మా తల్లిదండ్రులిద్దరూ హైస్కూల్ టీచర్లు. నేను 2015లో షూటింగ్ ప్రారంభించాను. నేను షూటింగ్ ప్రారంభించినప్పుడు కొల్హాపూర్‌లో అంతగా సౌకర్యాలు లేవు. వడ్గావ్ నుంచి కొల్హాపూర్‌కి బస్‌లో వెళ్లడానికి గంటన్నర పట్టేది. తిరిగి రావడానికి గంటన్నర, నాలుగు గంటల శిక్షణ... ఇలా ఆరేడు గంటలు వెళ్ళి వచ్చేందుకు, ట్రెయినింగుకు పట్టేది. అలా నేనూ స్కూల్ మిస్ అయ్యేదాన్ని. దాంతో శని, ఆదివారాల్లో షూటింగ్ రేంజికి తీసుకెళ్తామని అమ్మానాన్న చెప్పారు. మిగతారోజుల్లో మిగతా గేమ్స్ అడుకొమ్మన్నారు. దాంతో చిన్నప్పుడు చాలా ఆటలు ఆడాను. ఎందుకంటే మా అమ్మానాన్నలిద్దరికీ క్రీడలంటే చాలా ఆసక్తి. కానీ వారు ఏమీ చేయలేకపోయారు. ఆర్థిక సహాయం అంతగా లేదు. అవగాహన అంతగా లేదు. నేను దేశానికి ప్రాతినిధ్యం వహించి, దేశం కోసం పతకం సాధించాలని అమ్మకు ఒక పెద్ద కల. ఆమె కలను నెరవేర్చడానికి నేను చిన్నప్పటి నుండి ఆటలంటే చాలా ఆసక్తిని కలిగి ఉండేదాన్ని. ఆపై నేను తైక్వాండోలో కూడా పాల్గొన్నాను. అందులో కూడా నాకు బ్లాక్ బెల్ట్ ఉంది. బాక్సింగ్, జూడో , ఫెన్సింగ్, డిస్కస్ త్రో వంటి అనేక ఆటలు ఆడాను. 2015 లో నేను షూటింగ్ కి వచ్చాను. అప్పుడు నేను 2-3 సంవత్సరాలు చాలా కష్టపడ్డాను. నేను మొదటిసారి లో విశ్వవిద్యాలయ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొనేందుకు కు మలేషియా సెలక్షన్ లో ఎంపికయ్యాను. అందులో నాకు కాంస్య పతకం వచ్చింది. నాకు అప్పటి నుండి ప్రోత్సాహం లభించింది. అప్పుడు మా స్కూల్ నా కోసం షూటింగ్ రేంజ్ తయారుచేసింది. నేను అక్కడ శిక్షణ పొందాను. ఆపై వారు నన్ను శిక్షణ కోసం పూణేకు పంపారు. ఇక్కడ గగన్ నారంగ్ స్పోర్ట్స్ ఫౌండేషన్ ఉంది. ఆఅ ఫౌండేషన్ లో నేను శిక్షణ పొందుతున్నాను. ఇప్పుడు గగన్ సార్ నన్ను చాలా ప్రోత్సహించారు. నాకు చాలా సపోర్ట్ చేశారు.
మోదీ గారు: సరే.. మీ నలుగురూ నాతో ఏదైనా చెప్పాలనుకుంటే నేను వినాలనుకుంటున్నాను. ప్రగతి కానీ, అమ్లాన్ కానీ, ప్రియాంక కానీ, అభిదాన్య కానీ. మీ అందరికీ నాతో అనుబంధం ఉంది. కాబట్టి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే తప్పకుండా వింటాను.
అమ్లాన్ : సార్.. నాదో ప్రశ్న ఉంది సార్.
మోదీ గారు: చెప్పండి.
ఆమ్లాన్ :- మీకు ఏ ఆట బాగా ఇష్టం సార్?
మోదీ గారు: భారతదేశం క్రీడా ప్రపంచంలో చాలా అభివృద్ధి చెందాలి. అందుకే నేను వీటిని ఎక్కువగా ప్రోత్సహిస్తున్నాను. కానీ హాకీ, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖో-ఖో.. ఇవి మన భూమికి సంబంధించిన ఆటలు. వీటిలో మనం వెనుకబడి ఉండకూడదు. మనవాళ్లు విలువిద్యలో బాగా రాణిస్తున్నారని నేను చూస్తున్నాను. వారు షూటింగ్లో బాగా రాణిస్తున్నారు. రెండవది.. మన యువతలో, మన కుటుంబాలలో కూడా క్రీడల పట్ల ఇంతకుముందు ఉన్న భావన లేకపోవడాన్ని నేను చూస్తున్నాను. ఇంతకుముందు పిల్లలు ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు వారు ఆపేవారు. ఇప్పుడు కాలం మారింది. మీరు సాధిస్తున్న విజయాలు అన్ని కుటుంబాలను ఉత్సాహపరుస్తాయి. ప్రతి ఆటలో- మన పిల్లలు ఎక్కడికి వెళ్లినా- దేశం కోసం ఏదో ఒకటి చేసిన తర్వాత తిరిగి వస్తారు. ఈ వార్తలను నేడు దేశంలో ప్రముఖంగా చూపిస్తున్నారు. చెప్పుకుంటున్నారు. పాఠశాలల్లో, కళాశాలల్లో కూడా చర్చించుకుంటున్నారు. ఈ విషయాలన్నీ నాకు బాగా నచ్చాయి. మీ అందరికి నా వైపు నుండి చాలా చాలా అభినందనలు. చాలా శుభాకాంక్షలు.
యువ ఆటగాళ్లు : చాలా చాలా ధన్యవాదాలు! థాంక్యూ సార్. ధన్యవాదాలు.
మోదీ గారు: ధన్యవాదాలు! నమస్కారం..
నా కుటుంబ సభ్యులారా! ఈసారి ఆగస్టు 15న దేశం 'సబ్ కా ప్రయాస్' సామర్థ్యాన్ని చూసింది. దేశప్రజలందరి కృషి వల్లే 'హర్ ఘర్ తిరంగా అభియాన్' నిజానికి 'హర్ మన్ తిరంగా అభియాన్' అయింది. ఈ ప్రచారంలో అనేక రికార్డులు కూడా నమోదయ్యాయి. దేశప్రజలు కోట్లలో త్రివర్ణ పతాకాలను కొన్నారు. ఒకటిన్నర లక్షల పోస్టాఫీసుల ద్వారా దాదాపు ఒకటిన్నర కోట్ల త్రివర్ణ పతాకాల విక్రయం జరిగింది. దీని వల్ల మన కార్మికులు, చేనేత కార్మికులు.. ముఖ్యంగా మహిళలు కూడా వందల కోట్ల రూపాయల ఆదాయం పొందారు. ఈసారి త్రివర్ణ పతాకంతో సెల్ఫీ దిగి దేశప్రజలు సరికొత్త రికార్డు సృష్టించారు. గత ఏడాది ఆగస్టు 15వ తేదీ వరకు దాదాపు 5 కోట్ల మంది దేశస్థులు త్రివర్ణ పతాకంతో సెల్ఫీ పోస్ట్‌లు పెట్టారు. ఈ ఏడాది ఈ సంఖ్య కూడా 10 కోట్లు దాటింది.
మిత్రులారా! ప్రస్తుతం దేశభక్తి స్ఫూర్తిని చాటిచెప్పే 'మేరీ మాటీ, మేరా దేశ్' అనే కార్యక్రమం దేశంలో జోరుగా సాగుతోంది. సెప్టెంబరు నెలలో దేశంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుండి మట్టిని సేకరించే కార్యక్రమం జరుగుతుంది. దేశ పవిత్ర మట్టి వేల అమృత కలశాల్లో నిక్షిప్తమవుతుంది. అక్టోబర్ నెలాఖరులో అమృత కలశ యాత్రతో దేశ రాజధాని ఢిల్లీకి వేలాది మంది చేరుకుంటారు. ఈ మట్టితోనే ఢిల్లీలో అమృత వాటికను నిర్మిస్తారు. ప్రతి దేశస్థుని కృషి ఈ ప్రచారాన్ని విజయవంతం చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
నా కుటుంబ సభ్యులారా! ఈసారి నాకు సంస్కృత భాషలో చాలా ఉత్తరాలు వచ్చాయి. దీనికి కారణం శ్రావణ మాస పౌర్ణమి. ఈ తిథిన ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారు.
సర్వేభ్య: విశ్వ సంస్కృత దివసస్య హార్దయః శుభకామనా:
ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. సంస్కృతం ప్రపంచంలోని పురాతన భాషలలో ఒకటి అని మనందరికీ తెలుసు. దీన్ని అనేక ఆధునిక భాషలకు తల్లిగా పేర్కొంటారు. ప్రాచీనతతో పాటు వైజ్ఞానికతకు, వ్యాకరణానికి కూడా సంస్కృతం ప్రసిద్ది చెందింది. భారతదేశానికి సంబంధించిన ప్రాచీన జ్ఞానాన్ని వేల సంవత్సరాలుగా సంస్కృత భాషలో భద్రపర్చారు. యోగా, ఆయుర్వేదం, తత్వశాస్త్రం వంటి విషయాలపై పరిశోధనలు చేస్తున్న వ్యక్తులు ఇప్పుడు మరింత ఎక్కువగా సంస్కృతం నేర్చుకుంటున్నారు. అనేక సంస్థలు కూడా ఈ దిశగా చాలా కృషి చేస్తున్నాయి. ఉదాహరణకు యోగా కోసం సంస్కృతం, ఆయుర్వేదం కోసం సంస్కృతం, బౌద్ధమతం కోసం సంస్కృతం వంటి అనేక కోర్సులను సంస్కృత ప్రమోషన్ ఫౌండేషన్ నిర్వహిస్తోంది. ప్రజలకు సంస్కృతం నేర్పేందుకు 'సంస్కృత భారతి' ప్రచారం నిర్వహిస్తోంది. ఇందులో 10 రోజుల 'సంస్కృత సంభాషణ శిబిరం'లో మీరు పాల్గొనవచ్చు. నేడు ప్రజలలో సంస్కృతంపై అవగాహన, గర్వ భావన పెరిగినందుకు సంతోషిస్తున్నాను. దీని వెనుక గత సంవత్సరాల్లో దేశం చేసిన ప్రత్యేక కృషి కూడా ఉంది. ఉదాహరణకు 2020లో మూడు సంస్కృత డీమ్డ్ యూనివర్సిటీలను కేంద్రీయ విశ్వవిద్యాలయాలుగా మార్చారు. వివిధ నగరాల్లో సంస్కృత విశ్వవిద్యాలయాలకు చెందిన అనేక కళాశాలలు, సంస్థలు కూడా నడుస్తున్నాయి. ఐఐటీలు, ఐఐఎంల వంటి సంస్థల్లో సంస్కృత కేంద్రాలు బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి.
మిత్రులారా! మీరు తరచుగా ఒక విషయాన్ని అనుభవించి ఉండాలి. మూలాలతో అనుసంధానమయ్యేందుకు, మన సంస్కృతితో అనుసంధానమయ్యేందుకు మన సంప్రదాయంలోని చాలా శక్తివంతమైన మాధ్యమం మన మాతృభాష. మన మాతృభాషతో అనుసంధానం అయినప్పుడు సహజంగానే మన సంస్కృతితో ముడిపడి ఉంటాం.
మనం మన సంస్కారాలతో ముడిపడి ఉంటాం. మన సంప్రదాయంతో ముడిపడి ఉంటాం. మన ప్రాచీన వైభవంతో అనుసంధానం అవుతాం. అదేవిధంగా భారతదేశానికి మరో మాతృభాష - ప్రకాశవంతమైన తెలుగు భాష ఉంది. ఆగస్టు 29 వ తేదీని తెలుగు దినోత్సవంగా జరుపుకుంటారు.
అందరికీ తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు..
మీ అందరికీ తెలుగు దినోత్సవ శుభాకాంక్షలు. తెలుగు భాషా సాహిత్యంలో, వారసత్వ సంపదలో భారతీయ సంస్కృతికి సంబంధించిన ఎన్నో వెలకట్టలేని రత్నాలు దాగి ఉన్నాయి. ఈ తెలుగు వారసత్వాన్ని దేశం మొత్తం పొందేలా అనేక ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి.
నా కుటుంబ సభ్యులారా! మనం 'మన్ కీ బాత్' అనేక ఎపిసోడ్లలో పర్యాటక రంగం గురించి మాట్లాడుకున్నాం. వస్తువులను లేదా ప్రదేశాలను ప్రత్యక్షంగా చూడడం, వాటిని అర్థం చేసుకోవడం, వాటితో కొన్ని క్షణాలు గడపడం భిన్నమైన అనుభవాన్ని ఇస్తుంది. ఎవరైనా సముద్రాన్ని ఎంత వర్ణించినా సముద్రాన్ని చూడకుండా దాని విశాలతను మనం అనుభవించలేం. హిమాలయాల గురించి ఎంత మాట్లాడినా హిమాలయాలను చూడకుండా వాటి అందాలను అంచనా వేయలేం. అందుకే అవకాశం దొరికినప్పుడల్లా మన దేశ సౌందర్యాన్ని, వైవిధ్యాన్ని చూసేందుకు తప్పకుండా వెళ్లాలని మీ అందరినీ నేను తరచుగా కోరుతూ ఉంటాను. మనం తరచుగా మరొక విషయాన్ని కూడా గమనిస్తాం. ప్రపంచంలోని ప్రతి మూలను శోధించినా మన సొంత నగరం లేదా రాష్ట్రంలోని అనేక ఉత్తమ స్థలాలు, వస్తువుల గురించి మనకు తెలియదు. ప్రజలు తమ సొంత నగరంలోని చారిత్రక ప్రదేశాల గురించి పెద్దగా తెలుసుకోకపోవడం చాలా సార్లు జరుగుతుంది. ధన్ పాల్ గారి విషయంలో కూడా అలాంటిదే జరిగింది. ధనపాల్ గారు బెంగళూరులోని ట్రాన్స్పోర్ట్ కార్యాలయంలో డ్రైవర్‌గా పనిచేసేవారు. సుమారు 17 సంవత్సరాల కిందట ఆయన క్షేత్ర సందర్శన విభాగంలో బాధ్యత స్వీకరించారు. ఇప్పుడు బెంగుళూరు దర్శిని అనే పేరుతో ఆ విభాగం ప్రజలకు తెలుసు. ధన్ పాల్ గారు పర్యాటకులను నగరంలోని వివిధ పర్యాటక ప్రదేశాలకు తీసుకెళ్లేవారు. అలాంటి ఒక పర్యటనలో ఒక పర్యాటకుడు బెంగుళూరులోని ట్యాంక్‌ను సెంకి ట్యాంక్ అని ఎందుకు పిలుస్తారని అడిగారు. సమాధానం తనకు తెలియకపోవడం ఆయనకు రుచించలేదు. చాలా బాధపడ్డారు. అటువంటి పరిస్థితిలో ఆయన తన పరిజ్ఞానాన్ని పెంచుకోవడంపై దృష్టి పెట్టారు. తన వారసత్వాన్ని తెలుసుకోవాలనే మక్కువతో ఆయన అనేక శిలలు, శాసనాలు కనుగొన్నారు. ధన్ పాల్ గారి మనస్సు ఈ పనిలో మునిగిపోయింది. ఎంతలా అంటే ఆయన శాసనాలకు సంబంధించిన ఎపిగ్రఫీ అంశంలో డిప్లొమా కూడా చేశారు. ఇప్పుడు పదవీ విరమణ చేసినప్పటికీ బెంగళూరు చరిత్రను అన్వేషించాలనే ఆయన అభిరుచి ఇప్పటికీ సజీవంగా ఉంది.
మిత్రులారా! బ్రాయన్ డి. ఖార్ ప్రన్ గురించి చెప్పడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన మేఘాలయ నివాసి. ఆయనకు స్పెలియాలజీలో చాలా ఆసక్తి ఉంది. సాధారణ భాషలో దీని అర్థం గుహల అధ్యయనం. కొన్నాళ్ల కిందట చాలా కథల పుస్తకాలు చదివినప్పుడు ఆయనలో ఈ ఆసక్తి ఏర్పడింది. 1964 లో ఆయన పాఠశాల విద్యార్థిగా తన మొదటి అన్వేషణ చేశారు. 1990 లో తన స్నేహితుడితో కలిసి ఒక సంస్థను స్థాపించారు. దీని ద్వారా ఆయన మేఘాలయలోని తెలియని గుహల గురించి తెలుసుకోవడం ప్రారంభించారు. కొద్ది కాలంలోనే చూస్తూ ఉండగానే తన బృందంతో కలిసి మేఘాలయలో 1700 కంటే ఎక్కువ గుహలను కనుగొన్నారు. అలా మేఘాలయ రాష్ట్రాన్ని ప్రపంచ గుహ పటంలోకి తేగలిగారు. భారతదేశంలోని కొన్ని పొడవైన, లోతైన గుహలు మేఘాలయలో ఉన్నాయి. బ్రాయన్ గారు, ఆయన బృందం కేవ్ ఫౌనా అంటే గుహ జంతుజాలంపై డాక్యుమెంటేషన్ చేశారు. ఇవి ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. ఈ మొత్తం బృందం చేసిన కృషిని, ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను. అలాగే మేఘాలయ గుహలను సందర్శించడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను.
నా కుటుంబ సభ్యులారా! మన దేశంలోని అత్యంత ముఖ్యమైన రంగాలలో డెయిరీ రంగం ఒకటని మీకందరికీ తెలుసు. మన తల్లులు, సోదరీమణుల జీవితాల్లో పెద్ద మార్పు తీసుకురావడంలో ఇది చాలా ముఖ్యమైన పాత్ర పోషించింది. కొద్ది రోజుల కిందట గుజరాత్‌కు చెందిన బనాస్ డెయిరీ చేసిన ఆసక్తికరమైన చొరవ గురించి నాకు తెలిసింది. బనాస్ డెయిరీని ఆసియాలోనే అతిపెద్ద డెయిరీగా పరిగణిస్తారు. ఇక్కడ రోజుకు సగటున 75 లక్షల లీటర్ల పాలను ప్రాసెస్ చేస్తారు. తర్వాత ఇతర రాష్ట్రాలకు కూడా పంపుతారు. ఇతర రాష్ట్రాల్లో సకాలంలో పాల పంపిణీ కోసం ఇప్పటివరకు ట్యాంకర్లు లేదా పాల రైళ్ల సహకారం పొందారు. అయితే ఇందులో కూడా సవాళ్లు తక్కువేమీ కావు. మొదట లోడింగ్, అన్లోడింగ్ చేయడానికి చాలా సమయం పట్టేది. కొన్నిసార్లు పాలు కూడా చెడిపోయేవి. ఈ సమస్యను అధిగమించేందుకు భారతీయ రైల్వే సరికొత్త ప్రయోగం చేసింది. రైల్వే శాఖ పాలన్పూర్ నుండి న్యూ రేవాడి వరకు ట్రక్-ఆన్-ట్రాక్ సౌకర్యాన్ని ప్రారంభించింది. ఇందులో పాల ట్రక్కులను నేరుగా రైలులోకి ఎక్కిస్తారు. అంటే రవాణాకు సంబంధించిన ప్రధాన సమస్య దీని ద్వారా తొలగిపోయింది. ట్రక్-ఆన్-ట్రాక్ సదుపాయం ఫలితాలు చాలా సంతోషానిస్తున్నాయి. గతంలో రవాణాకు 30 గంటల సమయం పట్టే పాలు ఇప్పుడు సగం కంటే తక్కువ సమయంలో చేరుతున్నాయి. దీని వల్ల ఇంధనం వల్ల కలిగే కాలుష్యం పోయింది. ఇంధన ఖర్చు కూడా ఆదా అవుతోంది. ట్రక్కుల డ్రైవర్లు కూడా దీని నుండి చాలా ప్రయోజనం పొందారు. వారి పని సులువైంది.
మిత్రులారా! సమష్టి కృషి వల్ల నేడు మన డెయిరీలు కూడా ఆధునిక ఆలోచనతో ముందుకు సాగుతున్నాయి. బనాస్ డెయిరీ పర్యావరణ పరిరక్షణ దిశగా ముందడుగు వేసిందనే విషయం సీడ్‌బాల్ ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం తెలియజేస్తుంది. మన పాడి రైతుల ఆదాయాన్ని పెంచడానికి వారణాసి మిల్క్ యూనియన్ ఎరువుల నిర్వహణపై కృషి చేస్తోంది. కేరళకు చెందిన మలబార్ మిల్క్ యూనియన్ డెయిరీ కృషి కూడా చాలా ప్రత్యేకమైంది. ఇది జంతువుల వ్యాధుల చికిత్స కోసం ఆయుర్వేద ఔషధాలను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉంది.
మిత్రులారా! ఈరోజు చాలా మంది పాడిపరిశ్రమ లో కృషి చేస్తూ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తున్నారు. రాజస్థాన్‌లోని కోటాలో డైరీ ఫామ్‌ను నడుపుతున్న అమన్‌ప్రీత్ సింగ్ గురించి కూడా మీరు తప్పక తెలుసుకోవాలి. ఆయన డెయిరీతో పాటు బయోగ్యాస్ పై కూడా దృష్టి పెట్టి రెండు బయోగ్యాస్ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. దీని వల్ల విద్యుత్‌పై ఖర్చు దాదాపు 70 శాతం తగ్గింది. ఆయన చేసిన ఈ ప్రయత్నం దేశవ్యాప్తంగా పాడి రైతులకు స్ఫూర్తినిస్తుంది. నేడు అనేక పెద్ద డెయిరీలు బయోగ్యాస్‌పై దృష్టి సారిస్తున్నాయి. ఈ రకమైన కమ్యూనిటీ ఆధారిత విలువ జోడింపు చాలా ఉత్తేజకరమైనది. ఇలాంటి ధోరణులు దేశవ్యాప్తంగా కొనసాగుతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
నా కుటుంబ సభ్యులారా! ఈ రోజు మన్ కీ బాత్‌లో ఇంతే. ఇప్పుడు పండుగల సీజన్ కూడా వచ్చేసింది. ముందుగా మీ అందరికీ రక్షా బంధన్ శుభాకాంక్షలు. వేడుకల సమయంలో మనం వోకల్ ఫర్ లోకల్- స్థానిక ఉత్పత్తులకు ప్రచారం మంత్రాన్ని కూడా గుర్తుంచుకోవాలి. ఈ 'స్వయం సమృద్ధ భారతదేశ' ప్రచారం ప్రతి దేశస్థుని స్వంత ప్రచారం. పండుగ వాతావరణం ఉన్నప్పుడు మనం మన విశ్వాస స్థలాలను, వాటి చుట్టుపక్కల ప్రాంతాలను ఎప్పటికీ శుభ్రంగా ఉంచుకోవాలి. వచ్చేసారి 'మన్ కీ బాత్' కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. కొన్ని కొత్త అంశాలతో కలుద్దాం. దేశప్రజల కొత్త ప్రయత్నాలు, వాటి విజయాలపై మనం చర్చిద్దాం. అప్పటి వరకు నాకు సెలవివ్వండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ సాదర స్వాగతం. జులై నెల అంటే వర్షాకాలం, వర్షాల నెల. ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత కొన్ని రోజులుగా బాధాకరమైన, ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. యమునాతో పాటు వివిధ నదుల్లో వరదలు పోటెత్తడంతో పలు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కొండ ప్రాంతాలలో కొండచరియలు కూడా విరిగిపడ్డ సంఘటనలు జరిగాయి. మరోవైపు కొంతకాలం క్రితం దేశంలోని పశ్చిమ ప్రాంతంలో-గుజరాత్ లోని వివిధ ప్రదేశాలలో బిపార్జాయ్ తుఫాను వచ్చింది. మిత్రులారా!ఈ విపత్తుల మధ్య, మనమందరం దేశవాసులం మరోసారి సామూహిక కృషి శక్తిని చూపించాం. స్థానిక ప్రజలు, ఎన్. డి. ఆర్. ఎఫ్. జవాన్లతో పాటు స్థానిక అధికార యంత్రాంగం విపత్తులను ఎదుర్కోవడానికి రాత్రింబగళ్లు శ్రమించింది. ఏ విపత్తునైనా ఎదుర్కోవడంలో మన సామర్థ్యం, వనరుల పాత్ర ప్రధానమైంది. కానీ దాంతోపాటే మన స్పందన, పరస్పరం సహకరించుకునే స్ఫూర్తి కూడా అంతే ముఖ్యం. ప్రజలందరూ బాగుండాలన్న సర్వజన హితాయ భావన భారతదేశానికి గుర్తింపు, భారతదేశ బలం.
మిత్రులారా! వర్షాలొచ్చే ఈ సమయమే 'చెట్ల పెంపకం', 'నీటి సంరక్షణ'లకు కూడా ప్రధానమైంది. స్వాతంత్ర్య అమృత మహోత్సవాలసందర్భంగా ఏర్పాటు చేసిన 60 వేలకు పైగా అమృత సరోవరాలు కూడా వెలుగులు వెదజల్లుతున్నాయి. ప్రస్తుతం మరో 50 వేలకు పైగా అమృత్ సరోవరాలను ఏర్పాటు చేసే పనులు కొనసాగుతున్నాయి. మన దేశప్రజలు పూర్తి చైతన్యంతో, బాధ్యతతో 'జల సంరక్షణ' కోసం కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. మీకు గుర్తుండే ఉంటుంది-కొద్దికాలం కిందట నేను, మధ్యప్రదేశ్ లోని షాహడోల్‌కి వెళ్ళాను. అక్కడ నేను పకరియా గ్రామంలోని గిరిజన సోదరసోదరీమణులను కలిశాను. ప్రకృతిని, నీటిని కాపాడాలని వారితో చర్చలు జరిపాను. పకరియా గ్రామంలోని గిరిజన సోదరులు, సోదరీమణులు ఈ పనిని మొదలుపెట్టినట్టు ఇప్పుడు నాకు తెలిసింది. అధికారుల సహాయంతో అక్కడి ప్రజలు సుమారు వంద బావులను నీటి రీఛార్జ్ వ్యవస్థలుగా మార్చారు. వర్షపు నీరు ఇప్పుడు ఈ బావులలోకి వెళ్తుంది. అక్కడి నుండి భూమి లోపలికి వెళ్తుంది. దీంతో క్రమంగా ఆ ప్రాంతంలో భూగర్భ జలాలు మెరుగవుతాయి. ఇప్పుడు గ్రామస్తులందరూ నీటి రీఛార్జ్ కోసం ఆ ప్రాంతంలోని సుమారు 800 బావులను ఉపయోగం లోకి తేవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అటువంటి ప్రోత్సాహకరమైన వార్త ఒకటి ఉత్తరప్రదేశ్ నుండి వచ్చింది. కొద్ది రోజుల క్రితం ఒక్కరోజులో 30 కోట్ల మొక్కలు నాటిన రికార్డును ఉత్తరప్రదేశ్ సృష్టించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ ప్రచారాన్ని అక్కడి ప్రజలు పూర్తి చేశారు. ఇటువంటి ప్రయత్నాలు ప్రజల భాగస్వామ్యంతో పాటు ప్రజల చైతన్యానికి గొప్ప ఉదాహరణలుగా నిలుస్తాయి. మొక్కలు నాటడం, నీటిని పొదుపు చేయడం వంటి కార్యక్రమాల్లో మనమందరం భాగస్వాములు కావాలని నేను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!ప్రస్తుతం పవిత్ర శ్రావణ మాసం కొనసాగుతోంది. శ్రావణ మాసం సదాశివ మహాదేవుడిని ఆరాధించడంతో పాటుపచ్చదనం, ఆనందాలతో ముడిపడి ఉంటుంది. అందుకేఆధ్యాత్మిక, సాంస్కృతిక దృక్కోణం నుండి శ్రావణ మాసం చాలా ముఖ్యమైంది. శ్రావణ ఊయలలు, శ్రావణ గోరింటాకు, శ్రావణ ఉత్సవం- శ్రావణ మాసమంటేనే ఆనందం, ఉల్లాసం.
మిత్రులారా!ఈ విశ్వాసానికి, మన సంప్రదాయాలకు మరో కోణం కూడా ఉంది. ఈ పండుగలు, సంప్రదాయాలు మనల్ని చైతన్యవంతం చేస్తాయి. చాలా మంది భక్తులు శ్రావణ మాసం శివుడిని ఆరాధించేందుకు కావడ్ యాత్రకు వెళ్తారు. చాలా మంది భక్తులు ఈ శ్రావణ మాసంలో 12 జ్యోతిర్లింగాలను దర్శించుకుంటున్నారు. బనారస్ ను సందర్శించే వారి సంఖ్య కూడా రికార్డు స్థాయిలో ఉందని తెలుసుకోవడం మీకు ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు ఏటా 10 కోట్ల మంది పర్యాటకులు కాశీని సందర్శిస్తున్నారు. అయోధ్య, మధుర, ఉజ్జయిని వంటి పుణ్యక్షేత్రాలను సందర్శించే భక్తుల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. దీంతో లక్షలాది మంది పేదలు ఉపాధి పొందుతూ జీవితం గడుపుతున్నారు. ఇదంతా మన సాంస్కృతిక జనజాగరణ ఫలితం. దీని దర్శనం కోసం ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు తీర్థయాత్రలకు వస్తున్నారు. అమర్నాథ్ యాత్ర చేయడానికి కాలిఫోర్నియా నుండి ఇక్కడికి వచ్చిన ఇద్దరు అమెరికన్ మిత్రుల గురించి నాకు తెలుసు. ఈ విదేశీ అతిథులు అమర్నాథ్ యాత్రకు సంబంధించి స్వామి వివేకానంద అనుభవాల గురించి ఎక్కడో విన్నారు. ఆ స్ఫూర్తితో వాళ్ళు అమర్నాథ్ యాత్రకు వచ్చారు. దీన్ని భగవాన్ భోలేనాథ్ ఆశీర్వాదంగా వారు భావిస్తారు. ప్రతి ఒక్కరినీ తనవారిగా చేసుకోవడం, ప్రతి ఒక్కరికీ ఏదో ఒకటి ఇవ్వడం - ఇదే భారతదేశం ప్రత్యేకత. అలాంటి ఒక ఫ్రెంచ్ షార్లెట్ షోపా. గతంలో నేను ఫ్రాన్స్ వెళ్లినప్పుడు ఆమెను కలిశాను. షార్లెట్ షోపా యోగా ప్రాక్టీషనర్, యోగా గురువు. ఆమె వయస్సు 100 సంవత్సరాల కంటే ఎక్కువ. ఆమె సెంచరీ దాటింది. గత 40 ఏళ్లుగా యోగా సాధన చేస్తోంది. ఆమె తన ఆరోగ్యానికి, ఈ వంద సంవత్సరాల వయస్సుకు కారణం యోగా మాత్రమేనని ఆమె చెప్తుంది. భారతదేశ యోగా విజ్ఞాన శాస్త్రానికి, యోగా శక్తికి ఆమె ప్రపంచానికి చాటిచెప్పే ప్రముఖురాలిగా మారింది. ప్రతి ఒక్కరూ ఆమె నుండి నేర్చుకోవాలి. మన వారసత్వాన్ని స్వీకరించడమే కాకుండాప్రపంచానికి బాధ్యతాయుతంగా అందజేద్దాం. ఈ రోజుల్లో ఉజ్జయినిలో అలాంటి ప్రయత్నం జరగడం నాకు సంతోషంగా ఉంది. ఇక్కడ దేశవ్యాప్తంగా ఉన్న 18 మంది చిత్రకారులు పురాణాల ఆధారంగా ఆకర్షణీయమైన చిత్రాలు రూపొందిస్తున్నారు. ఈ చిత్రాలు బూందీ శైలి, నాథద్వార శైలి, పహాడీ శైలి, అపభ్రంశ శైలి వంటి అనేక విలక్షణమైన రీతుల్లో తయారు అవుతున్నాయి. వీటిని ఉజ్జయినిలోని త్రివేణి మ్యూజియంలో ప్రదర్శిస్తారు. అంటే కొంత కాలం తరువాతమీరు ఉజ్జయినికి వెళ్ళినప్పుడుమీరు మహాకాల్ మహాలోక్‌తో పాటు మరొక దివ్యమైన స్థలాన్ని చూడగలుగుతారు.
మిత్రులారా!ఉజ్జయినిలో వేసిన ఈ పెయింటింగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు మరో ప్రత్యేకమైన పెయింటింగ్ గుర్తుకు వచ్చింది. ఈ పెయింటింగ్‌ను రాజ్‌కోట్‌కు చెందిన ప్రభాత్ సింగ్ మోడ్ భాయ్ బర్హాట్ అనే కళాకారుడు రూపొందించారు. ఈ పెయింటింగ్ ను ఛత్రపతి వీర్ శివాజీ మహారాజ్ జీవితంలోని ఒక సంఘటన ఆధారంగా చిత్రించారు. పట్టాభిషేకం తర్వాత ఛత్రపతి శివాజీ మహారాజ్ తన కులదైవం 'తుల్జా మాత'ని దర్శించుకోబోతున్నట్టు, ఆ సమయంలో వాతావరణం ఎలా ఉందో చిత్రకారుడు ప్రభాత్ భాయ్ చిత్రించారు. మన సంప్రదాయాలను, మన వారసత్వాన్ని సజీవంగా ఉంచాలంటేవాటిని కాపాడాలి. సజీవంగా ఉంచాలి. తరువాతి తరానికి నేర్పించాలి. ఈ దిశగా అనేక ప్రయత్నాలు జరుగుతున్నందుకు సంతోషిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా!పర్యావరణం, వృక్షజాలం, జంతుజాలం, జీవ వైవిధ్యం వంటి పదాలు విన్నప్పుడుకొంతమంది ఇవి ప్రత్యేకమైన విషయాలని, నిపుణులకు సంబంధించిన అంశాలని అనుకుంటారు. కానీ అది వాస్తవం కాదు. మనం నిజంగా ప్రకృతిని ప్రేమిస్తేమన చిన్న ప్రయత్నాలతో కూడా చాలా చేయవచ్చు. సురేష్ రాఘవన్ గారు తమిళనాడులోని వాడవల్లికి చెందిన మిత్రుడు. ఆయనకు పెయింటింగ్ అంటే చాలా ఇష్టం. మీకు తెలుసా!పెయింటింగ్ అనేది కళ. కాన్వాస్‌కు సంబంధించిన పని. కానీ రాఘవన్ గారు తన పెయింటింగుల ద్వారా మొక్కలు, జంతువులకు సంబంధించిన సమాచారాన్ని భద్రపరచాలని నిర్ణయించుకున్నారు. వివిధ వృక్షజాలం, జంతుజాలం చిత్రాలను రూపొందించడం ద్వారా వాటికి సంబంధించిన సమాచారాన్ని ఆయన డాక్యుమెంటేషన్ చేస్తారు. అంతరించిపోయే దశలో ఉన్న డజన్ల కొద్దీ పక్షులు, జంతువులు, ఆర్కిడ్ పుష్పాల చిత్రాలను ఇప్పటి వరకు ఆయన గీశారు. కళ ద్వారా ప్రకృతికి సేవ చేసే ఈ ఉదాహరణ నిజంగా అద్భుతమైంది.
నా ప్రియమైన దేశప్రజలారా!ఈరోజు నేను మీకు మరో ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియాలో అద్భుతమైన క్రేజ్ కనిపించింది. అమెరికా మనకు వందకు పైగా అరుదైన, పురాతన కళాఖండాలను తిరిగి ఇచ్చింది. ఈ వార్త తెరపైకి రావడంతో, ఈ కళాఖండాల గురించి సామాజిక మాధ్యమాల్లో చాలా చర్చ జరిగింది. యువత తమ వారసత్వంపై గర్వాన్ని చాటుకున్నారు. భారతదేశానికి తిరిగి వచ్చిన ఈ కళాఖండాలు 2500 నుండి 250 సంవత్సరాల నాటి కిందటివి. ఈ అరుదైన కళాఖండాలు దేశంలోని వివిధ ప్రాంతాలకు సంబంధించినవని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. వీటిని టెర్రకోటను,రాతిని, లోహాలను, చెక్కలను ఉపయోగించి తయారు చేశారు. వీటిలో కొన్ని మీలో ఆశ్చర్యాన్ని నింపే విధంగా ఉంటాయి. వాటిని చూస్తే- అలాగే చూస్తూ ఉండిపోతారు. మీరు వీటిలో 11వ శతాబ్దానికి చెందిన అందమైన ఇసుకరాతి శిల్పాన్ని కూడా చూడవచ్చు. ఇది నృత్యం చేసే అప్సరకళాకృతి. ఇది మధ్యప్రదేశ్‌కు చెందింది. చోళుల కాలం నాటి అనేక విగ్రహాలు కూడా వీటిలో ఉన్నాయి. దేవత, భగవాన్ మురుగన్ విగ్రహాలు 12వ శతాబ్దానికి చెందినవి. తమిళనాడు సంస్కృతికి సంబంధించినవి. దాదాపు వెయ్యి సంవత్సరాల నాటి గణేశుడి కాంస్య విగ్రహం కూడా భారతదేశానికి తిరిగి వచ్చింది. లలితాసనంలో కూర్చున్న ఉమా-మహేశ్వర విగ్రహం 11వ శతాబ్దానికి చెందినదని చెబుతారు. అందులో ఉమామహేశ్వరులిద్దరూ నందిపై కూర్చున్నారు. జైన తీర్థంకరుల రెండు రాతి విగ్రహాలు కూడా భారతదేశానికి తిరిగి వచ్చాయి. సూర్య భగవానుడి రెండు విగ్రహాలు కూడా మిమ్మల్ని ఆకర్షిస్తాయి. వీటిలో ఒకటి ఇసుకరాతితో తయారైంది. తిరిగి వచ్చిన వస్తువులలో కలపతో చేసిన ప్యానెల్ ఉంది. ఇది సాగరమథనం కథను మనకు గుర్తుకు తెస్తుంది. 16వ-17వ శతాబ్దానికి చెందిన ఈ ప్యానెల్ దక్షిణ భారతదేశానికి సంబంధించింది.
మిత్రులారా!నేను ఇక్కడ చాలా కొన్నింటినే చెప్పాను. అయితేఈ జాబితా చాలా పొడవుగా ఉంది. మన విలువైన ఈ వారసత్వ సంపదను తిరిగి అందించిన అమెరికా ప్రభుత్వానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను 2016లోనూ 2021లోనూ అమెరికాను సందర్శించినప్పుడు కూడా చాలా కళాఖండాలు భారతదేశానికి తిరిగి వచ్చాయి. ఇలాంటి ప్రయత్నాలతో మన సాంస్కృతిక వారసత్వ సంపద దొంగతనాన్ని అరికట్టడానికి దేశవ్యాప్తంగా చైతన్యం పెరుగుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మన సుసంపన్నమైన వారసత్వంతో దేశప్రజల అనుబంధాన్ని ఇది మరింతగా పెంచుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!దేవభూమి ఉత్తరాఖండ్‌లోని కొంతమంది తల్లులు, సోదరీమణులు నాకు రాసిన లేఖలు హృదయాన్ని కదిలించాయి. వారు తమ కుమారునికి, తమ సోదరునికి అనేక దీవెనలు ఇచ్చారు. మన సాంస్కృతిక వారసత్వమైన 'భోజపత్రం' తమ జీవనోపాధిగా మారుతుందని తాము ఎప్పుడూ ఊహించలేదని వారు రాశారు. మొత్తం విషయం ఇంతేనా అని మీరనుకుంటూ ఉండవచ్చు.
మిత్రులారా!ఈ ఉత్తరాన్ని చమోలి జిల్లా నీతీ -మాణా లోయలోని మహిళలు నాకు రాశారు. గత సంవత్సరం అక్టోబర్‌లో భోజపత్రంలో నాకు ఒక ప్రత్యేకమైన కళాఖండాన్ని అందించిన మహిళలు వీరే. ఈ బహుమతి అందుకున్న తర్వాత నేను చాలా పొంగిపోయాను. అన్నింటికంటే ముఖ్యంగా పురాతన కాలం నుండిమన గ్రంథాలు, పుస్తకాలను ఈ భోజపత్రాలపై భద్రపర్చారు. మహాభారతం కూడా ఈ భోజపత్రాలపై రాశారు. నేడుదేవభూమికి చెందిన ఈ మహిళలు ఈ భోజ పత్రం నుండి చాలా అందమైన కళాఖండాలను, స్మృతి చిహ్నాలను తయారు చేస్తున్నారు. నేను మాణా గ్రామాన్ని సందర్శించినప్పుడువారి ప్రత్యేక ప్రయత్నాన్ని మెచ్చుకున్నాను. దేవభూమిని సందర్శించే పర్యాటకులు తమ సందర్శన సమయంలో వీలైనన్ని ఎక్కువ స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలని నేను విజ్ఞప్తి చేశాను. అది అక్కడ చాలా ప్రభావం చూపింది. నేడుభోజపత్ర ఉత్పత్తులను ఇక్కడికి వచ్చే యాత్రికులు చాలా ఇష్టపడుతున్నారు. మంచి ధరలకు కొనుగోలు చేస్తున్నారు. పురాతన భోజపత్ర వారసత్వం ఉత్తరాఖండ్‌లోని మహిళల జీవితాల్లో కొత్త ఆనందాన్ని నింపుతోంది. భోజపత్రాల నుండి కొత్త ఉత్పత్తులను తయారు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు శిక్షణ కూడా ఇస్తోందని తెలిసి నేను సంతోషిస్తున్నాను.
రాష్ట్ర ప్రభుత్వం కూడా అరుదైన భోజపత్ర జాతిని సంరక్షించేందుకు ప్రయత్నాలను ప్రారంభించింది. ఒకప్పుడు దేశానికి చిట్టచివరి ప్రాంతాలుగా భావించేpradeశాలను ఇప్పుడు దేశంలోనే తొలి గ్రామాలుగా పరిగణిస్తూ అభివృద్ధి చేస్తున్నారు. మన సంప్రదాయం, సంస్కృతిని కాపాడుకోవడంతో పాటు ఆర్థిక ప్రగతికి ఈ ప్రయత్నం సాధనంగా మారుతోంది.
నా ప్రియమైన దేశవాసులారా!ఈసారి 'మన్ కీ బాత్'లో మనసుకు ఎంతో సంతోషాన్నిచ్చే ఉత్తరాలు పెద్ద సంఖ్యలో వచ్చాయి. ఇటీవల హజ్ యాత్రకు వెళ్ళివచ్చిన ముస్లిం మహిళలు ఈ లేఖలు రాశారు. వారి ఈ ప్రయాణం చాలా రకాలుగా చాలా ప్రత్యేకమైంది. మగ సహచరుడు-మెహ్రం- లేకుండా హజ్ యాత్ర పూర్తి చేసిన మహిళలు వీరు. వీరి సంఖ్య వందో, యాభయ్యో కాదు- నాలుగు వేల కంటే ఎక్కువ - ఇది భారీ మార్పు. ముస్లిం మహిళలు మెహ్రం లేకుండా 'హజ్' యాత్ర చేయడానికి ఇంతకుముందు అనుమతి లేదు. 'మన్ కీ బాత్' మాధ్యమం ద్వారా సౌదీ అరేబియా ప్రభుత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మెహ్రం లేకుండా 'హజ్'కు వెళ్లే మహిళల కోసం ప్రత్యేకంగా మహిళా సమన్వయకర్తలను నియమించారు.
మిత్రులారా!గత కొన్నేళ్లుగా హజ్ విధానంలో చేసిన మార్పులకు ఎన్నో ప్రశంసలు వస్తున్నాయి. మన ముస్లిం తల్లులు, సోదరీమణులు దీని గురించి నాకు చాలా రాశారు. ఇప్పుడు ఎక్కువ మంది 'హజ్'కి వెళ్లే అవకాశం లభిస్తోంది. హజ్ యాత్ర నుండి తిరిగి వచ్చిన ప్రజలు-ముఖ్యంగా మన తల్లులు, సోదరీమణులు ఉత్తరాల ద్వారా అందజేసిన ఆశీర్వాదాలు చాలా స్ఫూర్తినిస్తాయి.
నా ప్రియమైన దేశప్రజలారా!జమ్మూ కాశ్మీర్లో మ్యూజికల్ నైట్లు అయినా, ఎత్తైన ప్రదేశాలలో బైక్ ర్యాలీలు అయినా, చండీగఢ్‌లో స్థానిక క్లబ్‌లు అయినా, పంజాబ్‌లో క్రీడా సమూహాలు అయినా ఇవన్నీ వింటే మనం వినోదం, సాహసం గురించి మాట్లాడుకుంటున్నట్లు అనిపిస్తుంది. కానీ విషయం వేరు. ఈ కార్యక్రమం ఉమ్మడి ప్రయోజనానికి సంబంధించింది.ఆ ఉమ్మడి కారణం - డ్రగ్స్‌పై అవగాహన ప్రచారం. జమ్మూ కాశ్మీర్ యువతను డ్రగ్స్ నుండి రక్షించడానికి అనేక వినూత్న ప్రయత్నాలు జరిగాయి. మ్యూజికల్ నైట్, బైక్ ర్యాలీల వంటి కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి. చండీగఢ్‌లో ఈ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి స్థానిక క్లబ్‌లను దీనికి అనుసంధానించారు. వారు వీటిని ‘వాదా (VADA)క్లబ్బులు’ అంటారు. VADA అంటే విక్టరీ అగైన్స్ట్ డ్రగ్స్ అబ్యూజ్. మాదక ద్రవ్యాల దుర్వినియోగానికి వ్యతిరేకంగా విజయం. పంజాబ్‌లో అనేక స్పోర్ట్స్ గ్రూపులు ఏర్పడ్డాయి. ఇవి ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టడానికి, మాదకద్రవ్యాల వ్యసనం నుండి బయటపడటానికి అవగాహన ప్రచారాలను నిర్వహిస్తున్నాయి. మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో యువత ఎక్కువగా పాల్గొనడం చాలా ప్రోత్సాహకరంగా ఉంది. ఈ ప్రయత్నాలు భారతదేశంలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా ప్రచారానికి చాలా బలాన్ని ఇస్తున్నాయి. దేశంలోని భవిష్యత్తు తరాలను కాపాడాలంటే డ్రగ్స్‌కు దూరంగా ఉంచాలి. ఈ ఆలోచనతో 'నషా ముక్త్ భారత్ అభియాన్' 2020 ఆగస్టు 15వ తేదీన ప్రారంభమైంది. ఈ ప్రచారంతో 11 కోట్ల మందికి పైగా అనుసంధానమయ్యారు. రెండు వారాల కిందట మాదక ద్రవ్యాలపై భారత్ పెద్ద ఎత్తున చర్య తీసుకుంది. సుమారు 1.5 లక్షల కిలోల డ్రగ్స్‌ను స్వాధీనం చేసుకుని, ధ్వంసం చేశారు. 10 లక్షల కిలోల మాదక ద్రవ్యాలను ధ్వంసం చేసిన అద్వితీయ రికార్డును కూడా భారత్ సృష్టించింది. ఈ మాదక ద్రవ్యాల ధర 12 వేల కోట్లరూపాయలకు పైగానే ఉంది. మాదక ద్రవ్యాల నుండి విముక్తి కలిగించే ఈ గొప్ప ఉద్యమం సహకరిస్తున్న వారందరినీ నేను అభినందిస్తున్నాను. మాదకద్రవ్య వ్యసనం కుటుంబానికే కాదు-మొత్తం సమాజానికి పెద్ద సమస్యగా మారుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రమాదం శాశ్వతంగా అంతం కావాలంటే మనమందరం ఏకమై ఈ దిశగా ముందుకు సాగడం అవసరం.
నా ప్రియమైన దేశప్రజలారా! మాదకద్రవ్యాల గురించి, యువ తరం గురించి మాట్లాడుతున్నప్పుడుమధ్యప్రదేశ్ నుండి ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణం గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఇది మినీ బ్రెజిల్ స్ఫూర్తిదాయక ప్రయాణం. మధ్యప్రదేశ్‌లోకి మినీ బ్రెజిల్ ఎక్కడి నుంచి వచ్చిందని మీరు అనుకుంటూ ఉంటారు. ఇదే ట్విస్ట్. మధ్యప్రదేశ్ లోని శహడోల్ లో ఒక ఊరు బిచార్పూర్. బిచార్పూర్ ను మినీ బ్రెజిల్ అంటారు. మినీ బ్రెజిల్ ఎందుకంటే ఈ రోజు ఈ గ్రామం ఫుట్‌బాల్ లో వర్ధమాన తారలకు కంచుకోటగా మారింది. కొన్ని వారాల క్రితం శహడోల్ కి వెళ్ళినప్పుడునేను చాలా మంది ఫుట్‌బాల్ ఆటగాళ్లను కలిశాను. మన దేశప్రజలు-ముఖ్యంగా మన యువ మిత్రులు దీని గురించి తెలుసుకోవాలని నాకనిపించింది.
మిత్రులారా!బిచార్పూర్ గ్రామం మినీ బ్రెజిల్‌గా మారడం రెండు- రెండున్నర దశాబ్దాల క్రితం ప్రారంభమైంది. ఆ సమయంలోబిచార్‌పూర్ గ్రామం అక్రమ మద్యానికి పేరు పొందింది-మత్తులో ఉంది. దానివల్ల అక్కడి యువకులకు ఎక్కువగా నష్టం జరిగేది. మాజీ జాతీయ క్రీడాకారుడు, కోచ్ రయీస్ అహ్మద్ ఈ యువకుల ప్రతిభను గుర్తించారు. రయీస్ గారి దగ్గర పెద్దగా వనరులు లేవు. కానీ ఆయన పూర్తి అంకితభావంతో యువతకు ఫుట్‌బాల్ నేర్పడం ప్రారంభించాడు. కొన్ని సంవత్సరాలలో ఫుట్‌బాల్ ఎంతగా ప్రాచుర్యం పొందిందంటే బిచార్పూర్ గ్రామం కూడా ఫుట్‌బాల్‌తో గుర్తింపు పొందింది. ఇప్పుడు ఇక్కడ ఫుట్‌బాల్ క్రాంతి అనే కార్యక్రమం కూడా జరుగుతోంది. ఈ కార్యక్రమం కింద యువతను ఈ గేమ్‌తో అనుసంధానం చేసి, వారికి శిక్షణ ఇస్తారు. ఈ కార్యక్రమం ఎంత విజయవంతమైందంటే బిచార్పూర్ నుండి 40 మందికి పైగా జాతీయ, రాష్ట్ర స్థాయి క్రీడాకారులు తయారయ్యారు. ఈ ఫుట్‌బాల్ విప్లవం ఇప్పుడు మెల్లమెల్లగా ఆ ప్రాంతం అంతటా విస్తరిస్తోంది. శహడోల్, దాని పరిసర ప్రాంతాల్లో 1200 కంటే ఎక్కువ ఫుట్‌బాల్ క్లబ్బులు ఏర్పడ్డాయి. జాతీయ స్థాయిలో ఆడుతున్న క్రీడాకారులు ఇక్కడి నుంచి పెద్ద సంఖ్యలో పుట్టుకొస్తున్నారు. చాలా మంది ఉన్నత స్థాయి మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారులు, శిక్షకులు ఇక్కడ యువతకు శిక్షణ ఇస్తున్నారు. మీరు ఆలోచించండి. అక్రమ మద్యానికి పేరుపొంది, మాదకద్రవ్యాల వ్యసనానికి పేరుగాంచిన ఆదివాసీ ప్రాంతం ఇప్పుడు దేశానికి ఫుట్‌బాల్ నర్సరీగా మారింది. అందుకే మనసుంటే మార్గముంటుందంటారు. మన దేశంలో ప్రతిభావంతులకు కొదవలేదు. అవసరమైతేవారిని కనుగొనండి. మరింత సానబెట్టి, తీర్చి దిద్దండి. దీని తరువాతఈ యువత దేశం పేరును ప్రకాశవంతం చేస్తుంది. దేశ అభివృద్ధికి దిశానిర్దేశం చేస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగామనమందరం అమృత మహోత్సవాలను పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటున్నాము. అమృత మహోత్సవాలసందర్భంగా దేశంలో దాదాపు రెండు లక్షల కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలు ఒక దానికి మించి ఒకటి జరిగాయి. విభిన్నంగా జరిగాయి. ఈ కార్యక్రమాలకు వన్నె తెచ్చిన విషయం ఏమిటంటే వాటిలో రికార్డు స్థాయిలో యువత పాల్గొనడం. ఈ సమయంలోమన యువత దేశంలోని గొప్ప వ్యక్తుల గురించి చాలా తెలుసుకున్నారు. మొదటి కొన్ని నెలల గురించి మాత్రమే మాట్లాడుకుంటే ప్రజల భాగస్వామ్యానికి సంబంధించిన అనేక ఆసక్తికరమైన కార్యక్రమాలను చూడగలిగాం. అలాంటి ఒక కార్యక్రమం దివ్యాంగ రచయితల కోసం 'రైటర్స్ మీట్' నిర్వహణ. రికార్డు స్థాయిలో ప్రజలు ఇందులో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుపతిలో 'జాతీయ సంస్కృత సదస్సు' జరిగింది. మన చరిత్రలో కోటల ప్రాముఖ్యత మనందరికీ తెలుసు. దీన్ని ప్రదర్శించే కార్యక్రమం 'కోటలు-కథలు'. కోటలకు సంబంధించిన కథలు కూడా ప్రజలకు నచ్చాయి.
మిత్రులారా!దేశం నలు దిశలా అమృత మహోత్సవప్రతిధ్వనులు వినిపిస్తున్న వేళ- ఆగస్ట్ 15 సమీపిస్తోన్న ప్రస్తుత సందర్భంలో దేశంలో మరో పెద్ద ఉద్యమం ప్రారంభమవుతోంది. అమరులైన వీరులను, వీరాంగనలను సన్మానించేందుకు 'మేరీ మాటీ - మేరా దేశ్' ఉద్యమం మొదలవుతోంది. దీని కింద మన అమరవీరుల జ్ఞాపకార్థం దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు జరుగుతాయి. వారి గుర్తుగా దేశంలోని లక్షలాది గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక శిలా శాసనాలు కూడా ఏర్పాటవుతాయి. ఈ ప్రచారం కింద దేశవ్యాప్తంగా 'అమృత కలశ యాత్ర' కూడా జరుగుతుంది. ఈ 'అమృత కలశ యాత్ర' దేశంలోని నలుమూలల్లోని గ్రామ గ్రామాన 7500 కలశాల్లో మట్టిని మోసుకుని దేశ రాజధాని ఢిల్లీకి చేరుకుంటుంది. ఈ యాత్ర దేశంలోని వివిధ ప్రాంతాల నుండి మొక్కలను కూడా తీసుకువస్తుంది. 7500 కలశాల్లో వచ్చిన మట్టిని, మొక్కలను కలిపి జాతీయ యుద్ధ స్మారక ప్రాంత సమీపంలో 'అమృత వాటిక' నిర్మిస్తారు. ఈ అమృత వాటిక 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ 'కు కూడా గొప్ప ప్రతీక అవుతుంది. నేను గత ఏడాది ఎర్రకోట నుండి వచ్చే 25 సంవత్సరాల అమృతకాలంలో 'పంచ ప్రాణ' గురించి మాట్లాడాను. 'మేరీ మాటీ - మేరా దేశ్' ప్రచారంలో పాల్గొనడం ద్వారాఈ పంచ ప్రాణకర్తవ్యాలను నెరవేర్చడానికి మనం ప్రమాణం కూడా చేస్తాం. దేశంలోని పవిత్రమైన మట్టిని చేతిలోకి తీసుకుని ప్రమాణం చేస్తున్నప్పుడు మీరందరూ మీ సెల్ఫీని యువ డాట్ గవ్ డాట్ ఇన్ లో అప్లోడ్ చేయాలి. గతేడాది స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'హర్‌ఘర్ తిరంగా అభియాన్' కోసం దేశం మొత్తం ఒక్కతాటిపైకి వచ్చినట్టే ఈసారి కూడా ప్రతి ఇంటిలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఆ సంప్రదాయాన్ని కొనసాగించాలి. ఈ ప్రయత్నాలతో మనం మన కర్తవ్యాలను గుర్తిస్తాం. దేశ స్వాతంత్ర్యం కోసం చేసిన అసంఖ్యాక త్యాగాలను మనం గ్రహిస్తాం. స్వేచ్ఛ విలువను తెలుసుకుంటాం. కాబట్టి ప్రతి దేశవాసీ ఈ ప్రయత్నాలలో తప్పకుండా పాలుపంచుకోవాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!ఈ రోజు 'మన్ కీ బాత్'లో ఇంతే. మరికొద్ది రోజుల్లో ఆగస్టు 15వ తేదీన జరిగే గొప్ప స్వాతంత్య్ర పండుగలో మనం భాగమవుతున్నాం. దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు కోల్పోయినవారిని నిత్యం స్మరించుకోవాలి. వారి కలలను సాకారం చేయడానికి మనం రాత్రింబగళ్లు కష్టపడాలి. దేశప్రజల ఈ కృషిని, సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువచ్చే మాధ్యమమే 'మన్ కీ బాత్'. వచ్చేసారి మరికొన్ని కొత్త అంశాలతో కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
ప్రియమైన నా దేశ ప్రజలారా, నమస్కారం. మరోసారి మీ అందరిని ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమాని కి ఆహ్వానిస్తున్నాను. ప్రతి నెల చివరి ఆదివారం ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం ఉంటుంది. అయితే, ఈసారి మాత్రం ఒక వారం ముందుగానే జరుగుతోంది. మీకు తెలుసు - నేను వచ్చే వారం అమెరికా లో ఉంటాను. అక్కడ చాలా కార్యక్రమాల్లో పాల్గొనవలసి ఉంది. కాబట్టి నేను అక్కడకు వెళ్ళే ముందే మీతో మాట్లాడాలని అనుకున్నాను. ఇంతకంటే ఉత్తమ మార్గం ఏముంటుంది? జనతా జనార్దన్ ల ఆశీస్సు లు, మీరు ఇచ్చే ప్రేరణ లతో నాలో శక్తి కూడా పెరుగుతూనే ఉంటుంది.
మిత్రులారా, ప్రధాన మంత్రి గా నేను ఈ మంచి పని ని చేశాను, ఇంత గొప్ప పని ని చేశాను అని చాలా మంది అంటారు. చాలా మంది ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం శ్రోత లు వారి ఉత్తరాల లో ఎంతో ప్రశంసిస్తూ ఉంటారు. నేను ఇలా చేశాను, అలా చేశాను అని చాలా మంది వ్రాస్తూ ఉంటారు. కొన్ని మంచి పనులు, కొన్ని గొప్ప పనులు చేశానని అంటూ ఉంటారు. కానీ, భారతదేశం లోని సామాన్యుల ప్రయత్నాలు, వారి కృషి, వారి సంకల్ప బలం చూసినప్పుడు పొంగిపోతాను. అతి పెద్దదైనటువంటి లక్ష్యం కావచ్చు, కఠినాతికఠినమైనటువంటి సవాలు కావచ్చు- భారతదేశం ప్రజల సామూహిక బలం, సమష్టి శక్తి ప్రతి సవాలు ను పరిష్కరిస్తాయి. రెండు- మూడు రోజుల క్రితం దేశ పశ్చిమ ప్రాంతం లో ఎంత పెద్ద చక్రవాతం వచ్చిందో మనం చూశాం. బలమైన గాలులు, భారీ వర్షం. బిపర్ జాయ్ చక్రవాతం కచ్ఛ్ లో పెను విధ్వంసాన్ని సృష్టించింది. కచ్ఛ్ ప్రజలు ఇంత ప్రమాదకరమైనటువంటి గాలివాన ను ఎంతో ధైర్యం తో, సన్నద్ధత తో ఎదుర్కొన్న తీరు ఎంతో అపూర్వమైంది. రెండు రోజుల తరువాత కచ్ఛ్ ప్రజలు వారి కొత్త సంవత్సరం ఆషాఢీ బీజ్ ను జరుపుకోబోతున్నారు. కచ్ఛ్ లో వర్షాల ప్రారంభాని కి ప్రతీక గా ఆషాఢీ బీజ్ ను జరుపుకొంటారు. నేను చాలా సంవత్సరాలు గా కచ్ఛ్ కు వెళ్తూ వస్తూ ఉన్నాను. అక్కడి ప్రజల కు సేవ చేసే అదృష్టం కూడా నాకు కలిగింది. అందువల్ల కచ్ఛ్ ప్రజల తెగువ, వారి జీవనోపాధి ల గురించి నాకు బాగా తెలుసు. రెండు దశాబ్దాల క్రితం విధ్వంసకర భూకంపం అనంతరం ఎన్నటికీ కోలుకోలేదు అని భావించినటువంటి కచ్ఛ్ ప్రస్తుతం దేశం లోనే అత్యంత వేగం గా అభివృద్ధి చెందుతున్న జిల్లాల లో ఒకటి గా ఉంది. బిపర్ జాయ్ చక్రవాతం కలిగించిన విధ్వంసం నుండి కూడా కచ్ఛ్ ప్రజలు వేగం గా బయటపడతారు అన్న నమ్మకం నాలో ఉంది.
మిత్రులారా, ప్రకృతి వైపరీత్యాల ను గురించి ఎవరూ పెద్ద గా పట్టించుకోరు. కానీ, భారతదేశం గత కొన్ని సంవత్సరాలు గా అభివృద్ధి చేసిన విపత్తు నిర్వహణ తాలూకు బలం నేడు ఒక ఉదాహరణ గా మారుతున్నది. ప్రకృతి వైపరీత్యాల ను ఎదుర్కోవడానికి ఒక గొప్ప మార్గం ఉంది. అదే ప్రకృతి పరిరక్షణ. వర్షాకాలం లో ఈ దిశ లో మన బాధ్యత మరింత పెరుగుతుంది. అందుకే ప్రస్తుతం దేశం 'క్యాచ్ ద రెయిన్' వంటి ప్రచారాల ద్వారా సామూహిక ప్రయత్నాల ను చేస్తోంది. గత నెల ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం లో నీటి సంరక్షణ కు సంబంధించిన స్టార్ట్ అప్ స్ ను గురించి చర్చించాం. ప్రతి నీటి చుక్క ను పొదుపు చేసేందుకు వారి శక్తి మేరకు కృషి చేస్తున్న ఎందరో వ్యక్తుల గురించి కొందరు లేఖల లో తెలియ జేశారు. అటువంటి ఒక సహచరుడే ఉత్తర్ ప్రదేశ్ లోని బాందా జిల్లా కు చెందిన తులసీరామ్ యాదవ్ గారు. తులసీరామ్ యాదవ్ గారు లుక్ తరా గ్రామ పంచాయతీ కి సర్పంచ్ గా ఉన్నారు. బాందా మరియు బుందేల్‌ఖండ్ ప్రాంతం లో జలం కోసం ఇబ్బందులు ఎదురవుతున్న సంగతి మీకు తెలుసు. ఈ సవాలు ను అతిగమించేందుకు తులసీరామ్ గారు గ్రామ ప్రజల సహకారం తో ఆ ప్రాంతం లో 40 కి పైగా చెరువుల ను నిర్మించారు. ‘చేను నీరు చేను లో- ఊరి నీరు ఊళ్లో’ అనే నినాదాన్ని తులసీరామ్ గారు తన ప్రచార ఉద్యమాని కి ప్రాతిపదిక గా చేసుకున్నారు. ఆయన కృషి ఫలితంగానే ఆ గ్రామం లో భూగర్భ జలాల మట్టం మెరుగవుతోంది. అంతరించి పోయిన నది ని ఉత్తర్ ప్రదేశ్ లోని హాపుడ్ జిల్లా ప్రజలు సమష్టి కృషి తో పునరుద్ధరించారు. చాలా కాలం క్రితం అక్కడ ‘నీమ్’ అనే నది ఉండేది. ఆ నది కాలక్రమం లో కనుమరుగైంది. కానీ స్థానిక ప్రజల జ్ఞాపకాల్లో, జానపద కథల్లో ఎప్పుడూ దాన్ని ప్రస్తావించే వారు. చివరకు ప్రజలు వారి ఈ సహజ వారసత్వాన్ని పునరుద్ధరించాలి అని నిర్ణయించుకొన్నారు. ప్రజల సమష్టి కృషి వల్ల ఇప్పుడు ‘నీమ్’ నది మళ్లీ జీవం పోసుకోవడం ప్రారంభించింది. నది పుట్టిన స్థలాన్ని అమృత్ సరోవర్ లాగా కూడా అభివృద్ధి పరచడం జరుగుతోంది.
మిత్రులారా, ఈ నదులు, కాలువ లు, సరస్సు లు కేవలం నీటి వనరులు కాదు. జీవితం లోని వర్ణాలు, భావోద్వేగాలు కూడా వాటితో ముడిపడి ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం మహారాష్ట్ర లో ఇటువంటి దృశ్యమే కనిపించింది. ఈ ప్రాంతం ఎక్కువ గా కరువు కోరల లో చిక్కుకొంది. ఐదు దశాబ్దాల నిరీక్షణ అనంతరం ఇక్కడ నిల్ వండే ఆనకట్ట తాలూకు కాలవ పనులు పూర్తి అవుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పరీక్షించేందుకు కాలవలో నీటి ని విడుదల చేశారు. ఈ సమయం లో వచ్చిన చిత్రాలు భావోద్వేగభరితం గా ఉన్నాయి. హోలీ-దీపావళి పండుగ ల సందర్భాల లో చేసినట్టు ఊరి జనం నృత్యాలు చేశారు.
మిత్రులారా, పరిపాలన విషయాని కి వస్తే ఈ రోజు న నేను ఛత్రపతి శివాజీ మహారాజ్ ను కూడా గుర్తు కు తెచ్చుకొంటాను. ఛత్రపతి శివాజీ మహారాజ్ వీరత్వం తో పాటు ఆయన పరిపాలన, నిర్వహణ నైపుణ్యాల నుండి నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి. ముఖ్యం గా నీటి నిర్వహణ, నౌకాదళం విషయాల లో ఛత్రపతి శివాజీ మహారాజ్ చేసిన కార్యాలు ఇప్పటికీ భారతదేశం చరిత్ర యొక్క గౌరవాన్ని పెంచుతాయి. ఆయన కట్టిన జల దుర్గాలు ఇన్ని శతాబ్దాల తరువాత కూడాను సముద్రం మధ్య లో సగర్వం గా కొలువై ఉన్నాయి. ఈ నెల మొదట్లోనే, ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక ఘట్టాని కి 350 సంవత్సరాలు పూర్తి అయ్యాయి. ఈ సందర్భాన్ని పెద్ద పండుగ లా జరుపుకొంటున్నారు. ఈ సందర్భం లో మహారాష్ట్ర లోని రాయ్‌గఢ్ కోట లో దీనికి సంబంధించిన భారీ కార్యక్రమాల ను నిర్వహించారు. నాకు గుర్తుంది- చాలా సంవత్సరాల క్రితం 2014 లో ఆ పుణ్యభూమి కి నమస్కరించడానికి రాయగఢ్ కు వెళ్లే అవకాశం నాకు లభించింది. ఈ సందర్భంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ నిర్వహణ నైపుణ్యాలను తెలుసుకోవడం, వాటి నుండి ఎన్నో విషయాలను గ్రహించడం మనందరి కర్తవ్యం. ఇది మన వారసత్వం పట్ల మన లో గర్వాన్ని నింపుతుంది. భవిష్యత్తు కోసం మన కర్తవ్యాల ను నిర్వర్తించడానికి కూడా మనలను ప్రేరేపిస్తుంది.
ప్రియమైన నా దేశ వాసులారా, రామాయణంలో రామసేతు నిర్మాణం లో సహాయం చేయడానికి ముందుకు వచ్చిన చిన్న ఉడుత ను గురించి మీరు తప్పక విని ఉంటారు. ఉద్దేశ్యం సుస్పష్టం గా ఉండి, ప్రయత్నాలలో నిజాయతీ ఉన్నప్పుడు ఏ లక్ష్యం కష్టం గా ఉండదు అని ఉడుత సహాయం చాటి చెప్తుంది. భారతదేశం కూడా ఈ ఉదాత్తమైన ఉద్దేశ్యం తో నేడు భారీ సవాలు ను ఎదుర్కొంటోంది. ఈ సవాలు టి.బి. దీన్నే ‘క్షయవ్యాధి అని కూడా అంటారు. 2025 వ సంవత్సరాని కల్లా టీబీ కి తావు ఉండని అటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించాలి అనే లక్ష్యం ఖచ్చితం గా చాలా పెద్దదే. ఒకప్పుడు టీబీ ని గురించి తెలిసిన తరువాత కుటుంబ సభ్యులు కూడా దూరం అయ్యే వారు. కానీ ఇప్పుడు టీబీ రోగుల ను తమ కుటుంబం లో సభ్యుని గా చూస్తూ సహకరిస్తున్నారు. ఈ క్షయ వ్యాధి ని మూలాల నుండి తొలగించడానికి నిక్షయ మిత్రులు ముందుకు వచ్చారు. దేశం లో పెద్ద సంఖ్య లో వివిధ సామాజిక సంస్థ లు నిక్షయ మిత్రగా మారాయి. వేలాది మంది ముందుకు వచ్చి టి.బి. రోగుల ను దత్తత తీసుకున్నారు. టిబి రోగుల కు సహాయం చేయడానికి చాలా మంది పిల్లలు ముందుకు వచ్చారు. ఈ ప్రజా భాగస్వామ్యమే ఈ ప్రచారాని కి అతి పెద్ద బలం. ఈ భాగస్వామ్యం కారణం గా ప్రస్తుతం దేశం లో 10 లక్షల మంది కి పైగా టీబీ రోగుల ను దత్తత తీసుకొన్నారు. సుమారు 85 వేల మంది నిక్షయ మిత్రులు ఈ స్వచ్ఛంద సేవ కు నడుం కట్టారు. దేశం లోని ఎందరో సర్పంచులు, గ్రామపెద్దలు వారి గ్రామం లో టీబీ వ్యాధి అంతరించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినందుకు నాకు సంతోషం గా ఉంది.
నైనీతాల్ లోని ఒక గ్రామాని కి చెందిన నిక్షయ మిత్ర శ్రీమాన్ దీకర్ సింహ్ మేవారీ గారు ఆరుగురు టీబీ రోగుల ను దత్తత తీసుకొన్నారు. ఇదే విధం గా కిన్నౌర్ గ్రామ పంచాయితీ అధినేత, నిక్షయ మిత్ర శ్రీమాన్ జ్ఞాన్ సింహ్ గారు వారి బ్లాకు లో టీబీ రోగుల కు అవసరమైన ప్రతి సహాయాన్ని అందించడం లో నిమగ్నమై ఉన్నారు. భారతదేశాన్ని టీబీ రహితం గా చేసే ప్రచారం లో పిల్లలు, యువ స్నేహితులు కూడా వెనుకబడి లేరు. హిమాచల్ ప్రదేశ్ లోని ఊనా కు చెందిన ఏడేళ్ల చిన్నారి నళిని సింహ్ చేసిన అద్భుతమైన పని ని చూడండి. చిన్నారి నళిని తన పాకెట్ మనీ నుండి టి.బి. రోగుల కు సహాయం చేస్తోంది. డబ్బు ను పొదుపు చేసుకోవడం లో ఉపయోగించే పిగ్గీ బ్యాంకుల ను పిల్లలు ఎంతగా ఇష్టపడతారో మీకు తెలుసు. మధ్య ప్రదేశ్ లోని కట్ నీ జిల్లా కు చెందిన పదమూడేళ్ల వయసు ఉన్న మీనాక్షి, పశ్చిమ బంగాల్ లోని డాయమండ్ హార్బర్ కు చెందిన పదకొండేళ్ల వయసున్న బష్వర్ ముఖర్జీ .. వీరు ఇద్దరూ ఈ విషయం లో మిగతా వారి కన్న భిన్నం గా ఉండే చిన్నారులు. ఈ బాలలు వారి పిగ్గీ బ్యాంకు డబ్బు ను టీబీముక్త్ భారత్ ప్రచారాని కి అందజేశారు. ఈ ఉదాహరణలు భావోద్వేగాలతో నిండి ఉండడమే కాకుండా, చాలా స్ఫూర్తిదాయకం గా కూడా ఉన్నాయి. చిన్న వయసు లో పెద్ద గా ఆలోచిస్తున్న ఈ పిల్లలందరిని హృదయపూర్వకం గా అభినందిస్తున్నాను.
ప్రియమైన నా దేశప్రజలారా, కొత్త ఆలోచనల ను స్వాగతించడానికి ఎల్లప్పుడూ సిద్ధం గా ఉండడం భారతీయులమైన మన స్వభావం. మనం మన వస్తువుల ను ప్రేమిస్తాం. కొత్త విషయాల ను కూడా స్వీకరిస్తాం. కలుపుకొంటాం. దీనికి ఉదాహరణ జాపాన్ టెక్నిక్ మియావాకీ. ఎక్కడైనా మట్టి సారవంతం గా లేకపోతే ఆ ప్రాంతాన్నిమళ్ళీ సస్యశ్యామలం చేయడానికి మియావాకీ టెక్నిక్ చాలా మంచి మార్గం. మియావాకీ సాంకేతికత ను ఉపయోగించే అడవులు వేగం గా విస్తరించి, రెండు మూడు దశాబ్దాల లో జీవ వైవిధ్యానికి కేంద్రం గా మారుతాయి. ఇప్పుడు భారతదేశం లోని వివిధ ప్రాంతాల లో ఇది చాలా వేగం గా విస్తరిస్తోంది. కేరళ కు చెందిన శ్రీమాన్ రాఫీ రాంనాథ్ అనే ఉపాధ్యాయుడు ఈ టెక్నిక్ తో ఒక ప్రాంత రూపురేఖల ను మార్చివేశారు. నిజానికి రాంనాథ్ గారు ఆయన యొక్క విద్యార్థుల కు ప్రకృతి, పర్యావరణం గురించి లోతు గా వివరించాలి అనుకొన్నారు. అందుకోసం ఒక మూలిక ల తోట ను సిద్ధం చేశారు. ఆయన తోట ఇప్పుడు బయోడైవర్సిటీ జోన్ గా మారిపోయింది. ఈ విజయం ఆయన లో మరింత స్ఫూర్తి ని నింపింది. దీని తరువాత రాఫీ గారు మియావాకీ టెక్నిక్ తో చిన్నపాటి అడవి నే తయారు చేశారు. దానికి ‘విద్యావనం’ అనే పేరు ను పెట్టారు. ఇంత అందమైన ‘విద్యావనం’ అనే పేరు ను కేవలం ఒక ఉపాధ్యాయుడే పెట్టగలరు. 115 రకాల కు చెందిన 450 కి పైగా మొక్కల ను రాంనాథ్ గారి కి చెందిన ఈ ‘విద్యావనం’ లో తక్కువ స్థలం లో నాటారు. వాటి నిర్వహణ లో రాంనాథ్ యొక్క విద్యార్థులు కూడాను ఆయన కు సహాయం చేస్తారు. సమీపం లోని పాఠశాలల విద్యార్థులు, సాధారణ పౌరులు ఈ అందమైన ప్రదేశాన్ని చూసేందుకు పెద్ద సంఖ్య లో వెళ్తున్నారు. మియావాకీ అడవుల ను నగరాల తో సహా ఎక్కడైనా సులభం గా పెంచవచ్చును. కొంతకాలం క్రితం నేను గుజరాత్ లోని కేవడియా లో గల ఏక్ తా నగర్ లో మియావాకీ అడవుల ను ప్రారంభించాను. కచ్ఛ్ లో కూడా 2001 భూకంపం వల్ల మరణించిన వారి జ్ఞాపకార్థం మియావాకీ శైలి లో స్మృతి వనాన్ని నిర్మించారు. కచ్ఛ్ వంటి ప్రదేశం లో దీని విజయం అత్యంత కఠినమైన సహజ వాతావరణం లో కూడా ఈ సాంకేతికత ఎంత ప్రభావవంతం గా ఉందో చూపిస్తుంది. అదేవిధం గా అంబాజీ, పావాగఢ్ లలో కూడా మియావాకీ పద్ధతి లో మొక్కల ను నాటారు. లఖ్ నవూ లోని అలీగంజ్ లో కూడాను మియావాకీ ఉద్యానాన్ని తయారు చేస్తున్నట్టు నాకు తెలిసింది. గత నాలుగు సంవత్సరాల లో ముంబయి లో, ఆ నగర పరిసర ప్రాంతాల లో ఇటువంటి 60 కంటే ఎక్కువ అడవుల పై కృషి జరిగింది. ఇప్పుడు ఈ సాంకేతికత ను ప్రపంచవ్యాప్తం గా ఇష్టపడుతున్నారు. సింగపూర్, పేరిస్, ఆస్ట్రేలియా, మలేషియా వంటి అనేక చోట్ల దీనిని విరివిగా వాడుతున్నారు. మియావాకీ విధానాన్ని గురించి తెలుసుకొనే ప్రయత్నం చేయండి అంటూ దేశ ప్రజల కు-ముఖ్యంగా నగరాల లో నివసించే వారికి నేన విజ్ఞప్తి చేస్తున్నాను. దీని ద్వారా మీరు మన భూమి ని, ప్రకృతి ని పచ్చగాను, పరిశుభ్రంగాను మార్చడంలో అమూల్యమైన సహకారాన్ని అందించవచ్చు.
ప్రియమైన నా దేశ వాసులారా, ఈ రోజుల లో మన దేశం లో జమ్ము- కశ్మీర్ గురించి చాలా చర్చ లు జరుగుతున్నాయి. కొన్నిసారులు పెరుగుతున్న పర్యటకం కారణంగా, కొన్నిసారులు జి-20 లో భాగం గా జరుగుతున్న అద్భుతమైన సదస్సు ల కారణం గా. కశ్మీర్ లోని ‘నాదరూ’ ను దేశం వెలుపల కూడా ఎలా ఇష్టపడుతున్నారో కొంతకాలం క్రితం ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం లో మీకు నేను వివరించాను. ఇప్పుడు జమ్ము- కశ్మీర్ లోని బారామూలా జిల్లా ప్రజలు అద్భుతమైన కార్యాన్ని చేసి చూపించారు. బారామూలా లో చాలా కాలం గా వ్యవసాయం చేస్తున్నారు. అయితే ఇక్కడ పాల కొరత ఉండేది. బారామూలా వాసులు ఈ సవాలు ను అవకాశం గా తీసుకున్నారు. పెద్ద సంఖ్య లో ప్రజలు ఇక్కడ డెయరీ పనుల ను ప్రారంభించారు. ఇక్కడి మహిళ లు ఈ పని లో ముందంజ లో ఉన్నారు. ఉదాహరణ కు ఇశ్ రత్ నబీ అనే ఒక సోదరి ని గురించి ప్రస్తావించుకొందాం. పట్టభద్రురాలు అయిన ఇశ్ రత్ ‘మీర్ సిస్టర్స్ డెయరీ ఫార్మ్’ ను ప్రారంభించారు. ఆమె డెయరీ ఫార్మ్ నుండి ప్రతి రోజూ దాదాపు 150 లీటర్ల పాలు అమ్ముడవుతున్నాయి. సోపోర్ లో అటువంటి మరో సహచరుడు శ్రీ వసీం అనాయత్ ఉన్నారు. వసీమ్ కు రెండు డజన్ లకు పైగా పశువులు ఉన్నాయి. ఆయన ప్రతి రోజూ రెండు వందల లీటర్లకు పైగా పాల ను విక్రయిస్తాడు. మరో యువకుడు శ్రీ ఆబిద్ హుసైన్ కూడా డెయిరీ పనుల ను చేస్తున్నారు. ఆయన పని కూడా చాలా ముందుకు సాగుతోంది. అటువంటి వారి కృషి వల్ల బారామూలా లో రోజు కు ఐదున్నర లక్షల లీటర్ల పాలు ఉత్పత్తి అవుతున్నాయి. ఇప్పుడు యావత్ బారామూలా కొత్త శ్వేత విప్లవానికి చిహ్నం గా మారుతోంది. గత రెండున్నర- మూడు సంవత్సరాల లో ఐదు వందల కు పైగా డెయరీ యూనిట్ లు ఇక్కడ కు వచ్చాయి. మన దేశం లోని ప్రతి ప్రాంతం అవకాశాల తో నిండి ఉందనడానికి బారామూలా లోని పాడి పరిశ్రమ యే ఒక నిదర్శన గా ఉంది. ఒక ప్రాంతం ప్రజల యొక్క సమష్టి సంకల్పం ఏ లక్ష్యాన్ని అయినా సాధించి చూపిస్తుంది.
ప్రియమైన నా దేశప్రజలారా, ఈ నెల లో భారతదేశానికి క్రీడా ప్రపంచం నుండి చాలా గొప్ప వార్త లు వచ్చాయి. మహిళ ల జూనియర్ ఏశియా కప్ ను తొలిసారి గా గెలిచి భారతదేశం యొక్క త్రివర్ణ పతాకం వైభవాన్ని పెంచింది. ఈ నెల లో మన పురుషుల హాకీ జట్టు జూనియర్ ఏశియా కప్ ను కూడా గెలుచుకొంది. దీంతో ఈ టౌర్నమంట్ చరిత్ర లో అత్యధిక విజయాల ను సాధించిన జట్టు గా కూడా నిలచాం. జూనియర్ శూటింగ్ ప్రపంచ కప్ లో కూడా మన జూనియర్ జట్టు అద్భుతాలు చేసింది. ఈ టోర్నీ లో భారత జట్టు మొదటి స్థానాన్ని సాధించింది. ఈ టోర్నీ లో మొత్తం బంగారు పతకాల లో 20 శాతం ఒక్క భారతదేశం ఖాతా లోనే చేరాయి. ఈ జూన్ లో ఏశియా అండర్ ట్వంటీ అథ్లెటిక్స్ ఛాంపియన్ శిప్ కూడా జరిగింది. ఇందులో 45 దేశాల లో భారతదేశం పతకాల పట్టిక లో మొదటి మూడు స్థానాల లో నిలచింది.
మిత్రులారా, గతం లో మనం అంతర్జాతీయ పోటీల ను గురించి తెలుసుకొనే వాళ్ళం. వాటి లో భారతదేశం భాగస్వామ్యం ఉండేది కాదు. కానీ ఈ రోజున నేను గత కొన్ని వారాల విజయాల ను మాత్రమే ప్రస్తావిస్తున్నాను. అయినా కూడా జాబితా చాలా పొడవు గా ఉంటుంది. ఇదే మన యువత అసలైన బలం. భారతదేశం మొదటి సారి గా తన ఉనికి ని చాటుతున్న ఇటువంటి అనేక క్రీడ లు, పోటీ లు ఉన్నాయి. ఉదాహరణ కు లాంగ్ జంప్ లో శ్రీశంకర్ మురళి పేరిస్ డాయమండ్ లీగ్ వంటి ప్రతిష్ఠాత్మక ఈవెంట్ లో దేశం కోసం కాంస్యం సాధించారు. ఈ పోటీల లో భారతదేశానికి ఇదే తొలి పతకం. కిర్గిస్తాన్ లో మన అండర్ 17 విమెన్ రెస్ లింగ్ టీమ్ కూడా అటువంటి విజయాన్ని నమోదు చేసింది. దేశం లోని ఈ క్రీడాకారులు, వారి తల్లితండ్రులు, కోచ్ ల యొక్క కృషి కి నేను అభినందనల ను వ్యక్తం చేస్తున్నాను.
మిత్రులారా, అంతర్జాతీయ ఈవెంట్ లలో దేశం సాధించిన ఈ విజయం వెనుక జాతీయ స్థాయి లో మన క్రీడాకారుల కృషి ఉంది. నేడు దేశం లోని వివిధ రాష్ట్రాల లో కొత్త ఉత్సాహం తో క్రీడల ను నిర్వహిస్తున్నారు. ఆడేందుకు, గెలిచేందుకు, ఓటమి నుండి నేర్చుకొనేందుకు ఈ క్రీడల లో ఆటగాళ్ల కు అవకాశం లభిస్తుంది. ఉదాహరణ కు ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడలు ఇప్పుడే ఉత్తర్ ప్రదేశ్ లో జరిగాయి. యువత లో ఎంతో ఉత్సాహం, అభిరుచి కనిపించాయి. ఈ క్రీడల లో మన యువత పదకొండు రికార్డుల ను బద్దలు కొట్టింది. పంజాబ్ యూనివర్సిటీ, అమృత్సర్ లోని గురు నానక్ దేవ్ యూనివర్సిటీ, కర్నాటక లోని జైన్ యూనివర్సిటీ పతకాల పట్టిక లో మొదటి మూడు స్థానాల్లో నిలచాయి.
మిత్రులారా, ఇటువంటి టూర్నామెంట్ ల లో ఒక ప్రధాన అంశం ఏమిటంటే, యువ ఆటగాళ్లకు సంబంధించిన అనేక స్ఫూర్తిదాయకమైన కథలు తెరపైకి వస్తాయి. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ క్రీడల్లో రోయింగ్ ఈవెంట్ లో అసమ్ లోని కాటన్ యూనివర్సిటీ కి చెందిన రాజ్ కుమార్ ఇందులో పాల్గొన్న మొదటి దివ్యాంగ క్రీడాకారుని గా నిలచారు. బర్కతుల్లా యూనివర్సిటీ కి చెందిన నిధి పవైయ్య గారు మోకాలి గాయం తో బాధపడుతూ ఉన్నప్పటికీ కూడాను షాట్‌పుట్ లో బంగారు పతకాన్ని సాధించారు. చీలమండ గాయం కారణం గా గత ఏడాది బెంగళూరు లో నిరాశ కు గురైన సావిత్రి బాయి పులే పూణే యూనివర్సిటీ కి చెందిన శుభం భండారే ఈసారి స్టీపుల్‌చేజ్ లో బంగారు పతకం విజేత గా నిలిచారు. బుర్ద్వాన్ యూనివర్సిటీ కి చెందిన సరస్వతి కుండూ గారు కబడ్డీ జట్టు కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్నారు. ఎన్నో కష్టాల ను దాటుకొని ఆమె ఈ దశ కు చేరుకొన్నారు. అత్యుత్తమ ప్రదర్శన ను కనబరిచిన చాలా మంది క్రీడాకారులు కూడా టిఒపిఎస్ స్కీము నుండి చాలా సహాయాన్ని పొందుతున్నారు. మన ఆటగాళ్లు ఎంత ఎక్కువ గా ఆడితే అంత గా వికసిస్తారు.
ప్రియమైన నా దేశవాసులారా, జూన్ 21 కూడా వచ్చింది. ఈసారి కూడా అంతర్జాతీయ యోగ దినోత్సవం కోసం ప్రపంచం లోని నలుమూల ల ప్రజలు ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. ఈ సంవత్సరం యోగ దినోత్సవం యొక్క ఇతి వృత్తం ‘వసుధైవ కుటుంబానికి యోగ’. అంటే 'ఒకే ప్రపంచం-ఒకే కుటుంబం' రూపం లో అందరి సంక్షేమం కోసం యోగ. అందరి ని ఏకం చేసి, ముందుకు తీసుకు పోవడం అనే యోగ స్ఫూర్తి ని ఇది వ్యక్తపరుస్తుంది. ప్రతిసారి మాదిరే ఈసారి కూడా దేశం లోని నలుమూల ల యోగ కు సంబంధించిన కార్యక్రమాల ను నిర్వహించడం జరుగుతుంది.
మిత్రులారా, ఈసారి న్యూయార్క్ లోని ఐక్య రాజ్య సమితి ప్రధాన కేంద్రం లో జరిగే యోగ దినోత్సవ కార్యక్రమం లో పాల్గొనే అవకాశం నాకు లభించింది. సామాజిక మాధ్యాల లో కూడా యోగ దినోత్సవం పై అద్భుతమైన ఉత్సాహం కనిపించడం నేను చూస్తున్నాను.
మిత్రులారా, యోగ ను మీ జీవనం లో తప్పనిసరి గా పాటించాలి, దానిని మీ దినచర్య లో భాగం చేసుకోవాలి అంటూ మీ అందరిని నేను కోరుతున్నాను. మీరు ఇప్పటికీ యోగ తో అనుసంధానం కాకపోతే జూన్ 21 వ తేదీ ఈ సంకల్పాని కి ఒక గొప్ప అవకాశం. యోగ లో పెద్ద గా శ్రమ అవసరం లేదు. మీరు యోగ తో ముడిపడ్డారు అంటే మీ జీవనం లో ఎంతో పెద్ద మార్పు వస్తుందో గమనించండి.
ప్రియమైన నా దేశ ప్రజలారా, ఎల్లుండి అంటే జూన్ 20 వ తేదీ చరిత్రాత్మకమైనటువంటి రథ యాత్ర జరిగే రోజు. ప్రపంచం అంతటా రథ యాత్ర కు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంది. భగవాన్ జగన్నాథుని రథ యాత్ర దేశం లో వివిధ రాష్ట్రాల లో అట్టహాసం గా జరుగుతుంది. ఒడిశా లోని పురీ లో జరిగే రథ యాత్ర అద్భుతం. నేను గుజరాత్ లో ఉన్నప్పుడు అహమదాబాద్ లో జరిగే భారీ రథ యాత్ర కు హాజరు అయ్యే అవకాశం వచ్చేది. ఈ రథయాత్రల లో దేశం నలుమూలల నుండి ప్రతి సమాజం, ప్రతి వర్గాని కి చెందిన ప్రజలు తరలివస్తున్న తీరు ఆదర్శప్రాయం. ఈ విశ్వాసం తో పాటు ఇది 'ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’ కు ప్రతిబింబం కూడా. ఈ పునీతమైనటువంటి సందర్భం లో మీ అందరికి చాలా చాలా శుభాకాంక్షలు. భగవాన్ జగన్నాథుడు దేశ ప్రజలందరికి మంచి ఆరోగ్యాన్ని, సుఖం, సమృద్ధుల ఆశీస్సుల ను అందించాలి అని నేను కోరుకొంటున్నాను.
మిత్రులారా, భారతీయ సంప్రదాయం, సంస్కృతిలకు సంబంధించిన పండుగ లను గురించి చర్చిస్తున్నప్పుడు దేశం లోని రాజ్ భవన్ల లో జరిగే ఆసక్తికరమైన కార్యక్రమాల ను కూడా నేను ప్రస్తావించాలి. ఇప్పుడు దేశం లోని రాజ్‌భవన్ లు సామాజిక, అభివృద్ధి కార్యక్రమాల తో గుర్తింపు ను పొందుతున్నాయి. ఈరోజు న మన రాజ్ భవన్ లు టి.బి. ముక్త్ భారత్ ప్రచారానికి, ప్రాకృతిక వ్యవసాయాని కి సంబంధించిన ప్రచారాని కి మార్గదర్శనం చేస్తున్నాయి. గతం లో గుజరాత్, గోవా, తెలంగాణ, మహారాష్ట్ర, సిక్కిమ్ మొదలైన వివిధ రాజ్‌భవన్ లు తమ స్థాపన దినోత్సవాల ను జరుపుకొన్న ఉత్సాహమే ఇందుకు ఉదాహరణ. 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' స్ఫూర్తి ని సశక్తం చేసే గొప్ప కార్యక్రమం ఇది.
మిత్రులారా, భారతదేశం ప్రజాస్వామ్యాని కి జనని గా ఉంది. మనం ప్రజాస్వామ్య ఆదర్శాల ను ప్రధానమైనవి గా పరిగణిస్తాం. మన రాజ్యాంగాన్ని ప్రధానమైంది గా పరిగణిస్తాం. కాబట్టి, జూన్ 25 వ తేదీ ని మనం ఎప్పటికీ మరచిపోలేం. మన దేశం లో అత్యవసర పరిస్థితి ని విధించిన రోజు అది. భారతదేశం చరిత్ర లో అది ఒక చీకటి కాలం. ఎమర్జెన్సీ ని లక్షల కొద్దీ ప్రజలు గట్టిగా వ్యతిరేకించారు. ఆ సమయం లో ప్రజాస్వామ్య మద్దతుదారుల ను ఎంతగా హింసించారో, ఎన్ని వేదనల కు గురిచేశారో తలుచుకొంటే ఈనాటికీ నా మనసు కంపిస్తుంది. ఈ అఘాయిత్యాల పై; పోలీసులు, పరిపాలకులు విధించిన శిక్షల పై ఎన్నో పుస్తకాల లో రచయితలు వ్రాశారు. అప్పట్లో ‘సంఘర్ష్ మే గుజరాత్’ అనే పుస్తకాన్ని వ్రాసే అవకాశం కూడా నాకు లభించింది. ఎమర్జెన్సీ పై రాసిన ‘టార్చర్ ఆఫ్ పొలిటికల్ ప్రిజనర్స్ ఇన్ ఇండియా’ అనే మరో పుస్తకం కొద్ది రోజుల కిందట నా ముందుకు వచ్చింది. అప్పటి ప్రభుత్వం ప్రజాస్వామ్య పరిరక్షకుల పట్ల అత్యంత క్రూరం గా ఎలా వ్యవహరించిందో ఎమర్జెన్సీ కాలం లో ప్రచురితమైన ఈ పుస్తకం వివరిస్తుంది. ఈ పుస్తకం లో చాలా కేస్ స్టడీస్ ఉన్నాయి. చాలా చిత్రాలు ఉన్నాయి. ఈ రోజు మనం స్వాతంత్ర్య అమృత మహోత్సవాల ను జరుపుకొంటున్నప్పుడు దేశ స్వేచ్ఛ ను ప్రమాదం లో పడేసిన ఇటువంటి అపరాధాలను కూడా తప్పకుండా గమనించాలి అని నేను కోరుకొంటున్నాను. దీని వల్ల ప్రజాస్వామ్యం యొక్క అర్థాన్ని, ప్రాముఖ్యాన్ని అవగాహన చేసుకోవడం నేటి యువతరాని కి సులభతరం అవుతుంది.
ప్రియమైన నా దేశవాసులారా, ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం రంగురంగు ల ముత్యాల తో అలంకరించినటువంటి ఒక అందమైన దండ. ప్రతి ముత్యం దానికి అదే ప్రత్యేకమైంది. అమూల్యమైంది. ఈ కార్యక్రమం లోని ప్రతి భాగం చాలా వైవిధ్యం గా ఉంటుంది. సామూహిక భావన తో పాటు సమాజం పట్ల కర్తవ్యాన్ని, సేవాభావాన్ని మనలో నింపుతుంది. మనం సాధారణం గా చదవడం, వినడం తక్కువ గా ఉండే విషయాలపై ఇక్కడ బహిరంగం గా చర్చ జరుగుతుంది. ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం లో ఒక అంశాన్ని ప్రస్తావించిన తరువాత ఎంత మంది దేశస్థులు కొత్త స్ఫూర్తి ని పొందారో మనం తరచు గా చూస్తూనే ఉంటాం. ఇటీవలే నాకు దేశం లోని ప్రముఖ భారతీయ శాస్త్రీయ నృత్యకారిణి ఆనందా శంకర్ జయంత్ గారి నుండి ఒక ఉత్తరం వచ్చింది. ఆ లేఖ లో మనం కథల ను చెప్పడం గురించి చర్చించిన ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం ఎపిసోడ్ ను గురించి వ్రాశారు. ఆ రంగాని కి సంబంధించిన వ్యక్తుల ప్రతిభ ను మనం ఆ కార్యక్రమం లో పేర్కొన్నాం. ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం నుండి ప్రేరణ ను పొంది ఆనందా శంకర్ జయంత్ గారు ‘కుట్టి కహానీ’ ని రూపొందించారు. ఇది వివిధ భాషల లో బాలల కోసం గొప్ప కథల సేకరణ. మన పిల్లల కు వారి సంస్కృతి పట్ల ఉన్న అనుబంధాన్ని మరింత గా పెంచే ఈ ప్రయత్నం చాలా బాగుంది. ఈ కథల కు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వీడియోల ను కూడా ఆమె తన యూట్యూబ్ చానల్ లో అప్లోడ్ చేశారు. దేశ ప్రజల మంచి పనులు ఇతరుల కు కూడా ఎలా స్ఫూర్తి ని ఇస్తున్నాయో చూసి నేను చాలా సంతోషిస్తున్నాను. అందుకే ఆనందా శంకర్ జయంత్ గారు చేసిన ఈ ప్రయత్నాన్ని నేను ప్రత్యేకం గా ప్రస్తావించాను. ఎందుకంటే దీని నుండి నేర్చుకొని తమ నైపుణ్యాలతో దేశానికి, సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఇతరులు కూడా ప్రయత్నిస్తారు. ఇది భారతదేశ ప్రజల సమష్టి శక్తి. ఇది దేశ పురోగతి లో కొత్త శక్తి ని నింపుతోంది.
ప్రియమైన నా దేశ ప్రజలారా, ఈసారి నాతో ‘మన్ కీ బాత్’ (మనుసు లో మాట) కార్యక్రమం ఇంతే. వచ్చే సారి కొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం. ఇది వర్ష కాలం. కాబట్టి ఆరోగ్యాన్ని జాగ్రత గా చూసుకోండి. సంతులిత ఆహారం తీసుకోండి. ఆరోగ్యం గా ఉండండి. అవును, యోగ ను తప్పక అభ్యసించండి. ఇప్పుడు చాలా పాఠశాలల్లో వేసవి సెలవు లు కూడా ముగుస్తున్నాయి. చివరి రోజు వరకు హోం వర్క్ పెండింగు లో ఉంచవద్దని పిల్లల కు కూడా చెప్తాను. పని ని పూర్తి చేయండి. నిశ్చింత గా ఉండండి. చాలా చాలా ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్'లోకి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈసారి 'మన్ కీ బాత్' ఎపిసోడ్ 2వ సెంచరీ ప్రారంభం. గత నెలలో మనమందరం ప్రత్యేక సెంచరీ కార్యక్రమాన్ని జరుపుకున్నాం. మీ భాగస్వామ్యమే ఈ కార్యక్రమానికి అతిపెద్ద బలం. 100వ ఎపిసోడ్ ప్రసారమయ్యే సమయానికిఒక విధంగా దేశం మొత్తం ఒక సూత్రంతో అనుసంధానమై ఉంది. పరిశుభ్రతా కార్మికులైన సోదర సోదరీమణులు కావచ్చు. లేదా వివిధ రంగాలకు చెందిన అనుభవజ్ఞులు కావచ్చు. 'మన్ కీ బాత్' అందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి కృషి చేసింది. 'మన్ కీ బాత్'పై మీరందరూ ప్రదర్శించిన ఆత్మీయత, స్నేహభావం అపూర్వమైనవి. అవి భావోద్వేగానికి గురి చేస్తాయి. 'మన్ కీ బాత్' ప్రసారమైనప్పుడుఆ సమయంలో ప్రపంచంలోని వివిధ దేశాల్లో, వివిధ టైమ్ జోన్లలో ఒకచోట సాయంత్రం, మరోచోట అర్థరాత్రి అయినప్పటికీ 100వ ఎపిసోడ్‌ను పెద్ద సంఖ్యలో ప్రజలు వీక్షించారు. వినేందుకు సమయం కేటాయించారు. వేల మైళ్ల దూరంలో ఉన్న న్యూజిలాండ్ నుండి వచ్చిన ఒక వీడియోను కూడా నేను చూశాను. అందులో వందేళ్ల ఒక అమ్మ తన ఆశీస్సులు ఇస్తోంది. భారతదేశంతో పాటు ఇతర నుండి కూడా ప్రజలు 'మన్ కీ బాత్'పై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. చాలా మంది నిర్మాణాత్మక విశ్లేషణ కూడా చేశారు. 'మన్ కీ బాత్'లో దేశం, దేశప్రజలు సాధించిన విజయాల గురించి మాత్రమే చర్చించడాన్ని ప్రజలు ప్రశంసించారు. ఈ ఆశీర్వాదానికి నేను మీ అందరికీ గౌరవంగా మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! గతంలో మనం 'మన్ కీ బాత్'లో కాశీ-తమిళ సంగమం గురించి, సౌరాష్ట్ర-తమిళ సంగమం గురించి మాట్లాడుకున్నాం. కాశీ-తెలుగు సంగమం కూడా ఎప్పుడో వారణాసిలో జరిగింది. ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్ స్ఫూర్తికి బలం చేకూర్చేందుకు ఒక అపూర్వ ప్రయత్నం దేశంలో జరిగింది. ఇది యువసంగమం కృషి. ఈ విశిష్ట ప్రయత్నంలో భాగస్వాములైన వ్యక్తుల నుండి దీని గురించి ఎందుకు వివరంగా అడగకూడదని నేను అనుకున్నాను. అందుకే ప్రస్తుతం ఇద్దరు యువకులు నాతో ఫోన్లో కనెక్ట్ అయ్యారు. ఒకరు అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన గ్యామర్ న్యోకుమ్ గారు, మరొకరు బీహార్‌కి చెందిన అమ్మాయి విశాఖ సింగ్ గారు. మనం ముందు గ్యామర్ న్యోకుమ్ గారితో మాట్లాడదాం.
ప్రధానమంత్రి గారు: గ్యామర్ గారూ.. నమస్కారం.
గ్యామర్ గారు: నమస్కారం మోదీ గారూ!
ప్రధానమంత్రి గారు: గ్యామర్ గారూ.. మీ గురించి తెలుసుకోవాలని ముందుగా నేను కోరుకుంటున్నాను.
గ్యామర్ గారు – మోదీ గారూ... చాలా విలువైన సమయాన్ని వెచ్చించి నాతో మాట్లాడేందుకు అవకాశం కల్పించినందుకు ముందుగా నేను మీకు, ప్రభుత్వానికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నేను అరుణాచల్ ప్రదేశ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాను.
ప్రధానమంత్రి గారు: మీ నాన్న గారు, ఇంకా మీ కుటుంబంలోని వారు ఏం చేస్తారు?
గ్యామర్ గారు: మా నాన్న చిన్న వ్యాపారం చేస్తారు. మా కుటుంబసభ్యులందరూ వ్యవసాయం చేస్తారు.
ప్రధానమంత్రి గారు: యువ సంగమం గురించి మీకు ఎలా తెలుసు? యువ
సంగమానికి ఎక్కడికి వెళ్ళారు? ఎలా వెళ్ళారు, ఏమైంది?
గ్యామర్ గారు: మోదీ గారూ.. నాకు యువ సంగమం అంటే ఇష్టం.
యువ సంగమంలో పాల్గొనవచ్చని మా విద్యాసంస్థ ఎన్ఐటీలో చెప్పారు. నేను మళ్ళీ ఇంటర్నెట్లో వెతికాను. ఇది చాలా మంచి కార్యక్రమమని నేను తెలుసుకున్నాను. ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్‌లో ఈ కార్యక్రమం చాలా దోహదపడుతుంది. నాకు కొత్త విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. కాబట్టి వెంటనేనేనువెబ్‌సైట్‌కి వెళ్ళి అందులో నమోదు చేసుకున్నాను. నా అనుభవం చాలా సరదాగా ఉంది. చాలా బాగుంది.
ప్రధానమంత్రి గారు: మీరు ఏదైనా ఎంపిక చేసుకోవాల్సివచ్చిందా?
గ్యామర్ గారు: మోదీ గారూ.. వెబ్సైట్ లో అరుణాచల్ ప్రజల కోసం రెండు ఎంపికలు ఉన్నాయి. మొదటిది ఐఐటి తిరుపతి ఉన్న ఆంధ్రప్రదేశ్. రెండవది సెంట్రల్ యూనివర్శిటీ, రాజస్థాన్. నేను నా మొదటి ప్రాధాన్యత రాజస్థాన్‌కు ఇచ్చాను. రెండవ ప్రాధాన్యత ఐఐటి తిరుపతికి ఇచ్చాను. అలా రాజస్థాన్‌కు ఎంపికయ్యాను. అందుకే రాజస్థాన్ వెళ్లాను.
ప్రధానమంత్రి గారు: మీ రాజస్థాన్ పర్యటన ఎలా ఉంది? మీరు మొదటిసారి
రాజస్థాన్ వెళ్లారా?
గ్యామర్ గారు: అవును సార్. నేను మొదటిసారి అరుణాచల్ నుండి బయటికి వెళ్ళాను. నేను ఈ రాజస్థాన్ లోని కోటలూ ఇవన్నీ సినిమాల్లో, ఫోన్లో మాత్రమే చూశాను. కాబట్టినేను మొదటిసారి వెళ్ళినప్పుడునా అనుభవం చాలా బాగుంది. అక్కడి ప్రజలు చాలా మంచివారు. మాతో వారు వ్యవహరించిన తీరు కూడా చాలా బాగుంది. అక్కడ మనం నేర్చుకునేందుకు కొత్త కొత్త విషయాలున్నాయి. రాజస్థాన్‌లోని పెద్ద సరస్సుల గురించి, అక్కడి ప్రజల గురించి తెలుసుకున్నాను. నాకు అసలే తెలియని వర్షపు నీటి సంరక్షణ వంటి అనేక కొత్త విషయాలు నేర్చుకున్నాను. కాబట్టి ఈ కార్యక్రమం- రాజస్థాన్ సందర్శన- నాకు చాలా బాగుంది.
ప్రధానమంత్రి గారు: చూడండి. మీకు లభించిన అతిపెద్ద ప్రయోజనం ఏమిటంటే-
అరుణాచల్ హీరోల నేల. రాజస్థాన్ కూడా హీరోల నేల. సైన్యంలో రాజస్థాన్ నుండి చాలా మంది ఉన్నారు. అరుణాచల్‌లోని సరిహద్దులో ఉన్న సైనికుల మధ్య మీరు రాజస్థాన్ సైనికులను కలిసినప్పుడు మీరు ఖచ్చితంగా వారితో మాట్లాడతారు. మీరు రాజస్థాన్ వెళ్ళినట్టుగా, రాజస్థాన్ లో కొన్ని అనుభవాలు కలిగినట్టుగా వారికి చెప్తే మీ సాన్నిహిత్యం వెంటనే పెరుగుతుంది. సరే.. మీరు అక్కడ కూడా అరుణాచల్‌లో ఉండేలాంటి కొన్ని సారూప్యతలను గమనించి ఉంటారు.
గ్యామర్ గారు: మోదీ గారూ...నాకు కనిపించిన ఒకే ఒక్క సారూప్యత దేశంపై ప్రేమ, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ దృక్పథం, అనుభూతి. ఎందుకంటే అరుణాచల్‌లో కూడా ప్రజలు తాము భారతీయులమని చాలా గర్వంగా భావిస్తారు. రాజస్థాన్‌లోని ప్రజలు కూడా తమ మాతృభూమిని ప్రేమిస్తారు. ఇదే అక్కడ- ముఖ్యంగా యువ తరంలో కనబడింది. ఎందుకంటే నేను అక్కడ చాలా మంది యువకులతో సంభాషించాను. వారి మధ్య చాలా సారూప్యతను నేను చూశాను. వారు భారతదేశం కోసం ఏం చేయాలనుకుంటున్నారు, దేశంపై ప్రేమ- ఈ రెండు విషయాల్లో నాకు చాలా పోలికలు కనబడ్డాయి.
ప్రధానమంత్రి గారు: అక్కడ పరిచయమైన స్నేహితులతో పరిచయం పెంచుకున్నారా? లేదా వచ్చిన తర్వాత మరిచిపోయారా?
గ్యామర్ గారు: లేదు సార్. మేం పరిచయాన్ని పెంచుకున్నాం.
ప్రధాని గారు: అవునా...! మీరు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారా?
గ్యామర్ గారు: అవును మోదీ గారూ... నేను సోషల్ మీడియాలో చురుకుగా ఉన్నాను.
ప్రధానమంత్రి గారు: అలాంటప్పుడు మీరు బ్లాగ్ లో రాయాలి. యువ సంగమం అనుభవాన్ని, అందులో మీరెలా నమోదు చేసుకున్నారు, రాజస్థాన్‌లో మీ అనుభవం ఎలా ఉంది అనే విషయాలను రాయాలి. దేశంలోని యువతకు ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ గొప్పతనం, ఈ పథకం వివరాలు తెలిసేలా రాయాలి. యువత దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలో మీ అనుభవాలతో బ్లాగ్ రాయాలి. అప్పుడు చాలా మందికి ఉపయోగపడుతుంది.
గ్యామర్ గారు: సరే సార్. నేను ఖచ్చితంగా రాస్తాను.
ప్రధానమంత్రి గారు: గ్యామర్ గారూ... మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది. ఈ 25 సంవత్సరాలు మీ జీవితానికి, అలాగే దేశ భవిష్యత్తుకు చాలా ముఖ్యమైనవి. అందుకే యువత దేశం కోసం, దేశ ఉజ్వల భవిష్యత్తు కోసం కృషి చేయాలి. నేను మీకు చాలా చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మీకు ధన్యవాదాలు.
గ్యామర్ గారు: మోదీ గారూ... మీకు కూడా ధన్యవాదాలు.
ప్రధానమంత్రి గారు: నమస్కారం సోదరా!
మిత్రులారా!అరుణాచల్ ప్రజలు చాలా ఆత్మీయంగా ఉంటారు. వారితో మాట్లాడుతుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది. యువ సంగమంలో గ్యామర్ గారి అనుభవం అద్భుతం. రండి… ఇప్పుడు బీహార్ అమ్మాయి విశాఖ సింగ్ గారితో మాట్లాడదాం.
ప్రధాన మంత్రి గారు: విశాఖ గారూ... నమస్కారం.
విశాఖ గారు: ముందుగా, గౌరవనీయులైన భారత ప్రధాన మంత్రి గారికి నా నమస్కారాలు. నాతో పాటు ప్రతినిధులందరి తరపున మీకు ప్రణామాలు.
ప్రధానమంత్రి గారు: సరే విశాఖ గారూ.. . ముందుగా మీ గురించి చెప్పండి. యువ సంగమం గురించి కూడా తెలుసుకోవాలని ఉంది.
విశాఖ గారు: నేను బీహార్‌లోని సాసారాం పట్టణ నివాసిని. మా కాలేజీ వాట్సాప్ గ్రూప్ సందేశం ద్వారా యువ సంగమం గురించి మొదట తెలుసుకున్నాను. ఆ తర్వాత నేను దాని గురించి మరిన్ని వివరాలను తెలుసుకున్నాను. ప్రధానమంత్రి పథకం ‘ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్’లో భాగమే యువ సంగమం అని తెలుసుకున్నాను. అలా ఆ తర్వాత అందులో జాయిన్ అవ్వాలని ఉత్సాహంతో దరఖాస్తు చేశాను. అక్కడి నుంచి తమిళనాడు ప్రయాణం చేసి తిరిగి వచ్చాను. అలా నేను పొందిన ఎక్స్ పోజర్ తర్వాత ఈ కార్యక్రమంలో భాగమైనందుకు చాలా గర్వపడుతున్నాను. నేను ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. భారతదేశంలోని వివిధ ప్రాంతాల సంస్కృతికి అనుగుణంగా మాలాంటి యువత కోసం ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించినందుకు హృదయపూర్వకంగా మీకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను..
ప్రధానమంత్రి గారు: విశాఖ గారూ.. మీరేం చదువుతున్నారు?
విశాఖ గారు: నేను కంప్యూటర్ సైన్స్ ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాను సార్ .
ప్రధానమంత్రి గారు: సరే విశాఖ గారూ..మీరు ఏ రాష్ట్రానికి వెళ్లాలి, ఎక్కడ చేరాలి? అనే నిర్ణయాన్ని ఎలా తీసుకున్నారు?
విశాఖ గారు: నేను ఈ యువ సంగమం గురించి గూగుల్‌లో వెతకడం ప్రారంభించినప్పుడుబీహార్‌కు చెందిన ప్రతినిధులు తమిళనాడు నుండి వచ్చిన ప్రతినిధులతో పరస్పర మార్పిడి చేసుకుంటున్నారని నాకు తెలిసింది. తమిళనాడు మన దేశంలో చాలా గొప్ప సాంస్కృతిక రాష్ట్రం. కాబట్టి బీహార్ నుండి తమిళనాడుకు ప్రతినిధులను పంపడం చూసినప్పుడు ఫామ్ నింపాలా వద్దా, అక్కడికి వెళ్ళాలా వద్దా అనే విషయాల్లో నిర్ణయం తీసుకోవడానికి ఇది నాకు చాలా సహాయపడింది. నేను అందులో పాల్గొన్నందుకు ఈరోజు చాలా గర్వపడుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది.
ప్రధానమంత్రి గారు: ఇదే మీ మొదటి తమిళనాడు పర్యటనా?
విశాఖ గారు: అవును సార్. నేను మొదటిసారి వెళ్ళాను.
ప్రధానమంత్రి గారు: సరే, మీరు ప్రత్యేకంగా గుర్తుంచుకోదగింది ఏదైనా చెప్పాలనుకుంటే, మీరు ఏం చెప్తారు? దేశ యువత మీ మాట వింటోంది.
విశాఖ గారు: సార్. మొత్తం ప్రయాణాన్ని పరిశీలిస్తేఅది నాకు చాలా అద్భుతంగా ఉంది. ఒక్కో దశలో చాలా మంచి విషయాలు నేర్చుకున్నాం. తమిళనాడు వెళ్ళి అక్కడ మంచి స్నేహితులను పొందాను. అక్కడి సంస్కృతిని అలవర్చుకున్నాను. అక్కడి ప్రజలను కలిశాను. కానీ అక్కడ నేను అనుభవించిన గొప్ప విషయం ఏమిటంటే ఇస్రోకి వెళ్లే అవకాశం ఎవరికీ ఉండదు. మేం ప్రతినిధులం కాబట్టి ఇస్రోకి వెళ్లే అవకాశం మాకు లభించింది. రెండవది మేం రాజ్‌భవన్‌కు వెళ్లినప్పుడు తమిళనాడు గవర్నర్‌ను కలిశాం. కాబట్టి ఆ రెండు క్షణాలు నాకు చాలా గొప్పవి. యువతగా మాకు లభించని అవకాశాలు యువ సంగమం ద్వారా దొరికాయి. కాబట్టి ఇది నాకు పరిపూర్ణమైన, మరపురాని క్షణం.
ప్రధానమంత్రి గారు: బీహార్‌లో తినే విధానం వేరు, తమిళనాడులో తినే విధానం వేరు.
విశాఖ గారు: అవును సార్.
ప్రధానమంత్రి గారు: అంటే పూర్తిగా అన్ని విధాలుగా సెట్ చేశారా?
విశాఖ గారు: మేము అక్కడికి వెళ్లినప్పుడు, తమిళనాడులో దక్షిణ భారత వంటకాలు ఉన్నాయి. అందుకే అక్కడికి వెళ్లగానే దోశ, ఇడ్లీ, సాంబార్, ఊతప్పం, వడ, ఉప్మా వడ్డించారు. మేం మొదట ప్రయత్నించినప్పుడుఅది చాలా బాగుంది! అక్కడి ఆహారం చాలా ఆరోగ్యకరమైంది. చాలా రుచిగా ఉంటుంది. ఉత్తరాది ఆహారానికి చాలా భిన్నంగా ఉంటుంది.కాబట్టి నాకు అక్కడి ఆహారం నచ్చింది. అక్కడి ప్రజలు కూడా చాలా మంచివారు.
ప్రధానమంత్రి గారు: అంటే ఇప్పుడు మీకు తమిళనాడులో కూడా కొత్తగా స్నేహితులయ్యారు కదా?
విశాఖ గారు: సార్! అవును, మేం అక్కడ NIT తిరుచ్చిలో ఉన్నాం. ఆ తర్వాత IIT మద్రాస్‌లో ఉన్నాం. ఆ రెండు ప్రాంతాల విద్యార్థులతో నేను స్నేహం చేశాను. దానికి తోడు మధ్యలో CII స్వాగతోత్సవం ఉండడంతో దగ్గర్లోని కాలేజీల నుంచి కూడా చాలా మంది విద్యార్థులు అక్కడికి వచ్చారు. అక్కడ మేం ఆ విద్యార్థులతో కూడా సంభాషించాం. వారిని కలవడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. వారిలో చాలా మంది నా స్నేహితులు కూడా. తమిళనాడు నుండి బీహార్ వస్తున్న కొంతమంది ప్రతినిధులను కూడా కలిశాం. కాబట్టి మేం వారితో కూడా మాట్లాడాం. మేం ఇప్పటికీ ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నాం.. కాబట్టి నేను చాలా సంతోషంగా ఉన్నాను.
ప్రధానమంత్రి గారు: అయితే విశాఖ గారూ.... మీరు ఈ అనుభవాన్ని బ్లాగ్ లో రాయండి. సోషల్ మీడియాలో పంచుకోండి. ముందుగా ఈ యువ సంగమం గురించి, ఆ తర్వాత 'ఏక్ భారత్-శ్రేష్ట్ భారత్' గురించి రాయండి. ఆపై తమిళనాడులో మీకు లభించిన పరిచయం, స్వాగతం, పొందిన ఆతిథ్యం, తమిళ ప్రజల ప్రేమ- ఈ విషయాలన్నీ దేశానికి చెప్పండి. అయితే రాస్తారు మీరు.
విశాఖ గారు: అవును, తప్పకుండా!
ప్రధానమంత్రి గారు: నేను మీకు చాలా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. చాలా చాలా ధన్యవాదాలు.
విశాఖ గారు: థాంక్యూ సోమచ్ సార్. నమస్కారం.
గ్యామర్ గారు, విశాఖ గారు- మీకు చాలా చాలా శుభాకాంక్షలు. యువ సంగమంలో మీరు నేర్చుకున్నది జీవితాంతం మీతో ఉండనివ్వండి. మీ అందరికీ ఇవే నా శుభాకాంక్షలు.
మిత్రులారా!భారతదేశం బలం వైవిధ్యంలో ఉంది. మన దేశంలో చూడవలసినవి చాలా ఉన్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని విద్యా మంత్రిత్వ శాఖ 'యువసంగమం' పేరుతో అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ప్రజల మధ్య అనుసంధానాన్ని పెంచడంతోపాటు దేశంలోని యువత ఒకరితో ఒకరు కలిసిపోయే అవకాశాన్ని కల్పించడం ఈ చొరవ లక్ష్యం. వివిధ రాష్ట్రాల ఉన్నత విద్యాసంస్థలను దీనికి అనుసంధానించారు. 'యువసంగమం'లో యువత ఇతర రాష్ట్రాల నగరాలు, గ్రామాలను సందర్శిస్తుంది. వివిధ రకాల వ్యక్తులను కలుసుకునే అవకాశం వారికి లభిస్తుంది. యువసంగమం తొలి దశలో దేశంలోని 22 రాష్ట్రాల్లో సుమారు 1200 మంది యువకులు పర్యటించారు. అందులో భాగమైన యువకులంతా జీవితాంతం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ఇలాంటి జ్ఞాపకాలతో తిరిగి వస్తున్నారు. చాలా పెద్ద కంపెనీల సీఈవోలు, బిజినెస్ లీడర్లు భారతదేశంలో యాత్రికులుగా గడిపినట్టు మనం చూశాం. నేను ఇతర దేశాల నాయకులను కలిసినప్పుడు వారు తమ యవ్వనంలో భారతదేశాన్ని సందర్శించడానికి వచ్చినట్టు చాలాసార్లు చెప్పారు. చూసిన ప్రతిసారీ మన ఉత్సాహం పెంచేలా మన భారతదేశంలో తెలుసుకోవలసినవి, చూడవలసినవి చాలా ఉన్నాయి. ఈ ఉత్తేజకరమైన అనుభవాలను తెలుసుకున్న తర్వాతమీరు కూడా దేశంలోని వివిధ ప్రాంతాలకు వెళ్లడానికి ఖచ్చితంగా స్ఫూర్తిని పొందుతారని నాకు నమ్మకం ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా!కొద్ది రోజుల క్రితం నేను జపాన్‌లోని హిరోషిమాకు వెళ్ళాను. అక్కడ నాకు హిరోషిమా పీస్ మెమోరియల్ మ్యూజియాన్ని సందర్శించే అవకాశం వచ్చింది. అది ఒక భావోద్వేగ అనుభవం. మనం చరిత్ర జ్ఞాపకాలను స్మరించుకుంటే అది రాబోయే తరాలకు ఎంతగానో ఉపకరిస్తుంది. కొన్నిసార్లు మనం మ్యూజియంలో కొత్త పాఠాలు నేర్చుకుంటాం. కొన్నిసార్లు మనం నేర్చుకోవడానికి చాలా విషయాలుంటాయి. కొద్ది రోజుల కిందట భారతదేశంలో ఇంటర్నేషనల్ మ్యూజియం ఎక్స్పో జరిగింది. ఇది ప్రపంచంలోని 1200 కంటే ఎక్కువ మ్యూజియాల ప్రత్యేకతలను ప్రదర్శించింది. భారతదేశంలో మనకు అనేక రకాలైన ప్రదర్శనశాలలు ఉన్నాయి. అవి మన గతానికి సంబంధించిన అనేక అంశాలను ప్రదర్శిస్తాయి. గురుగ్రామ్‌లో మ్యూజియో కెమెరా అనే ఒక ప్రత్యేకమైన మ్యూజియం ఉంది. 1860 వ సంవత్సరం తర్వాత వచ్చిన 8 వేల కంటే ఎక్కువ కెమెరాల సేకరణ ఈ మ్యూజియంలో ఉంది. తమిళనాడులో మ్యూజియం ఆఫ్ పాసిబిలిటీస్ ను దివ్యాంగులను దృష్టిలో ఉంచుకుని రూపొందించారు. ముంబాయిలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ వస్తు సంగ్రహాలయంలో 70 వేలకు పైగా వస్తువులను భద్రపర్చారు. 2010వ సంవత్సరంలో స్థాపించిన ఇండియన్ మెమరీ ప్రాజెక్ట్ ఒక రకమైన ఆన్లైన్ మ్యూజియం. ప్రపంచం నలుమూలల నుండి పంపిన చిత్రాలు, కథల ద్వారా భారతదేశ అద్భుతమైన చరిత్ర లింక్‌లను అనుసంధానించడంలో ఇది నిమగ్నమై ఉంది. విభజన భయాందోళనలతో ముడిపడి ఉన్న జ్ఞాపకాలను ముందుకు తెచ్చే ప్రయత్నం కూడా జరిగింది. గత సంవత్సరాల్లో కూడాభారతదేశంలో కొత్త రకాల మ్యూజియాలు, స్మారక చిహ్నాలు నిర్మించడం మనం చూశాం. స్వాతంత్య్ర పోరాటంలో గిరిజన సోదరులు, సోదరీమణుల కృషికి అంకితమిచ్చిన పది కొత్త మ్యూజియాలు ఏర్పాటవుతున్నాయి. కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్ లోని బిప్లోబీ భారత్ గ్యాలరీ అయినా జలియన్‌వాలాబాగ్ మెమోరియల్ పునరుద్ధరణ అయినాదేశంలోని మాజీ ప్రధానులందరికీ అంకితం చేసిన పీఏం మ్యూజియం కూడా ఈ రోజు ఢిల్లీ కీర్తిని పెంచుతున్నాయి. ఢిల్లీలోని నేషనల్ వార్ మెమోరియల్, పోలీస్ మెమోరియల్ వద్ద అమరవీరులకు నివాళులర్పించేందుకు ప్రతిరోజూ చాలా మంది వస్తుంటారు. చరిత్రాత్మక దండి మార్చ్ కు అంకితమిచ్చిన దండి స్మారక చిహ్నం కావచ్చు. లేదా స్టాట్యూ ఆఫ్ యూనిటీ మ్యూజియం కావచ్చు. సరే. నేను ఇక్కడితో ఆగాలి. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఉన్న మ్యూజియాల జాబితా చాలా పెద్దది. దేశంలోని అన్ని మ్యూజియాల గురించి అవసరమైన సమాచారం కూడా సంకలనం చేశారు. మ్యూజియం ఏ థీమ్ ఆధారంగా ఉంది, అక్కడ ఎలాంటి వస్తువులున్నాయి, అక్కడి వారిని సంప్రదించేందుకు వివరాలు - ఇవన్నీ ఆన్లైన్ డైరెక్టరీలో ఉంటాయి. మీకు అవకాశం దొరికినప్పుడల్లాదేశంలోని ఈ మ్యూజియాలను తప్పక సందర్శించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. అక్కడ ఉన్న ఆకర్షణీయమైన చిత్రాలను #(హ్యాష్‌ట్యాగ్) మ్యూజియం మెమోరీస్‌లో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇది మన అద్భుతమైన సంస్కృతితో భారతీయుల అనుబంధాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! మనమందరం ఒక లోకోక్తిని చాలాసార్లు విని ఉంటాం. పదే పదే విని ఉంటాం. నీళ్లు లేకుంటే జీవం లేదని. నీళ్లు లేకుంటే జీవితంలో ఎప్పుడూ సంక్షోభం ఉంటుంది. వ్యక్తి వికాసం, దేశాభివృద్ధి కూడా నిలిచిపోతాయి. ఈ భవిష్యత్ సవాలును దృష్టిలో ఉంచుకునినేడు దేశంలోని ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలను నిర్మిస్తున్నారు. మన అమృత సరోవరాలు ప్రత్యేకమైనవి. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన అమృత కాలంలో నిర్మితమవుతున్నాయి కాబట్టి. ఇందులో ప్రజల అమృతం కృషి కూడా ఉంది కాబట్టి. ఇప్పటి వరకు 50 వేలకు పైగా అమృత సరోవరాలను నిర్మించారని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. నీటి సంరక్షణ దిశగా ఇదొక పెద్ద ముందడుగు.
మిత్రులారా!ప్రతి వేసవిలో నీటికి సంబంధించిన సవాళ్ల గురించి మనం ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటాం. ఈసారి కూడా మనం ఈ అంశాన్ని తీసుకుంటాం. అయితే ఈసారి మనం నీటి సంరక్షణకు సంబంధించిన స్టార్టప్‌ల గురించి చర్చిస్తాం. ఫ్లక్స్‌జెన్ అనే స్టార్ట్-అప్ IOT ఎనేబుల్డ్ టెక్నాలజీ ద్వారా నీటి నిర్వహణ కోసం ఎంపికలను అందిస్తుంది. ఈ సాంకేతికత నీటి వినియోగం నమూనాలను తెలియజేస్తుంది. నీటిని సమర్థవంతంగా ఉపయోగించడంలో సహాయపడుతుంది. మరో స్టార్టప్ LivNSense. ఇది కృత్రిమ మేధ, మెషిన్ లెర్నింగ్ ఆధారంగా రూపొందించిన వేదిక. దాని సహాయంతోనీటి పంపిణీని సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చు. దీన్ని బట్టి ఎక్కడెక్కడ ఎంత నీరు వృథా అవుతుందో కూడా తెలిసిపోతుంది. మరో స్టార్టప్ 'కుంభీ కాగజ్'. ఈ కుంభీ కాగజ్ మీకు కూడా చాలా నచ్చుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కుంభీ కాగజ్ స్టార్ట్-అప్ ఒక ప్రత్యేక పనిని ప్రారంభించింది. ఒకప్పుడు నీటి వనరులకు ఇబ్బందిగా భావించిన గుర్రం డెక్కతో కాగితాన్ని తయారు చేసే పని చేస్తోంది.
మిత్రులారా!చాలా మంది యువకులు నవకల్పన, సాంకేతికతల ద్వారా పని చేస్తుంటే, ఛత్తీస్‌గఢ్‌లోని బాలోద్ జిల్లా యువతలా సమాజానికి అవగాహన కల్పించే లక్ష్యంలో నిమగ్నమై ఉన్న యువకులు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడి యువకులు నీటిని పొదుపు చేసేందుకు ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికీ వెళ్లి నీటి సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఎక్కడైనా పెళ్లి లాంటి కార్యక్రమం జరిగితే అక్కడికి వెళ్లి నీటి దుర్వినియోగాన్ని ఎలా అరికట్టవచ్చో తెలియజేస్తున్నారు. జార్ఖండ్‌లోని ఖూంటి జిల్లాలో నీటి సమర్ధవంతమైన వినియోగానికి సంబంధించిన స్ఫూర్తిదాయకమైన ప్రయత్నం జరుగుతోంది. నీటి సంక్షోభం నుండి బయటపడేందుకు ఖూంటిలోని ప్రజలు బోరి డ్యామ్ సహకారం కనుగొన్నారు. బోరి డ్యామ్ నుండి నీరు చేరడం వల్ల ఇక్కడ ఆకుకూరలు , కూరగాయలు కూడా పెరగడం ప్రారంభించాయి. దీని వల్ల ప్రజల ఆదాయం కూడా పెరుగుతోంది, ఈ ప్రాంత అవసరాలు కూడా నెరవేరుతున్నాయి. ఏ ప్రజా భాగస్వామ్య ప్రయత్నమైనా దానితో పాటు అనేక మార్పులను ఎలా తీసుకువస్తుందనేందుకు ఖూంటి ఒక ఆకర్షణీయమైన ఉదాహరణగా మారింది. ఈ కృషికి ఇక్కడి ప్రజలను అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! 1965 యుద్ధ సమయంలో మన మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి గారు జై జవాన్- జై కిసాన్ అనే నినాదాన్ని ఇచ్చారు. తర్వాత అటల్ జీ జై విజ్ఞాన్ని జోడించారు. కొన్నేళ్ల క్రితం దేశంలోని శాస్త్రవేత్తలతో మాట్లాడుతున్నప్పుడు జై అనుసంధాన్ గురించి మాట్లాడాను. జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్ ఈ నాలుగింటికి అద్దం పట్టే 'మన్ కీ బాత్'లో ఈరోజు చర్చ అలాంటి వ్యక్తి గురించే, అలాంటి సంస్థ గురించే. ఆ సత్పురుషులు మహారాష్ట్రకు చెందిన శివాజీ శ్యాంరావ్ డోలే గారు. శివాజీ డోలే నాసిక్ జిల్లాలోని ఒక చిన్న గ్రామానికి చెందినవారు. ఆయన పేద ఆదివాసీ రైతు కుటుంబం నుండి వచ్చారు. మాజీ సైనికుడు కూడా. సైన్యంలో ఉంటూ దేశం కోసం కృషి చేశారు. ఉద్యోగ విరమణ తర్వాత కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని నిర్ణయించుకుని అగ్రికల్చర్ డిప్లొమా చేశారు. అంటే జై జవాన్ నుండి జై కిసాన్ వైపు మళ్లారు. ఇప్పుడు ప్రతి క్షణం ఆయన ప్రయత్నం వ్యవసాయ రంగంలో గరిష్టంగా ఎలా కృషి చేయాలనేదే. ఈ చొరవలో శివాజీ డోలే గారు 20 మందితో ఒక చిన్న బృందాన్ని ఏర్పాటు చేశారు. అందులో కొంతమంది మాజీ సైనికులను చేర్చుకున్నారు. ఆ తర్వాత ఆయన బృందం వెంకటేశ్వర కో-ఆపరేటివ్ పవర్ &ఆగ్రో ప్రాసెసింగ్ లిమిటెడ్ అనే సహకార సంఘ నిర్వహణను చేపట్టింది. ఈ సహకార సంస్థ గతంలో నిష్క్రియంగా ఉండేది. ఆయన దాన్ని పునరుద్ధరించేందుకు చొరవ తీసుకున్నారు. ఇప్పుడు వెంకటేశ్వర కో-ఆపరేటివ్ కొద్దికాలంలోనే అనేక జిల్లాలకు విస్తరించింది. ప్రస్తుతం ఈ బృందం మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పని చేస్తోంది. దాదాపు 18 వేల మంది దీనితో అనుసంధానమై ఉన్నారు. ఇందులో పెద్ద సంఖ్యలో మాజీ సైనికులు కూడా ఉన్నారు. ఈ బృందంలోని సభ్యులు నాసిక్‌లోని మాలేగావ్‌లో 500 ఎకరాలకు పైగా భూమిలో ఆగ్రో ఫార్మింగ్ చేస్తున్నారు. ఈ బృందం నీటి సంరక్షణ కోసం అనేక చెరువులను నిర్మించడంలో నిమగ్నమై ఉంది. విశేషమేమిటంటే వారు ఆర్గానిక్ ఫార్మింగ్ ను, డైరీని కూడా ప్రారంభించారు. ఇప్పుడు వారు పండించిన ద్రాక్షను యూరప్‌కు కూడా ఎగుమతి చేస్తున్నారు. నా దృష్టిని ఆకర్షించిన ఈ టీమ్‌లోని రెండు గొప్ప లక్షణాలు జై విజ్ఞాన్, జై అనుసంధాన్. దీని సభ్యులు సాంకేతికతను, ఆధునిక వ్యవసాయ పద్ధతులను గరిష్టంగా ఉపయోగిస్తున్నారు. ఎగుమతులకు అవసరమైన వివిధ ధ్రువీకరణ పత్రాలపై కూడా దృష్టి పెట్టడం రెండో విశేషం. 'సహకారంతో సమృద్ధి’ అనే స్ఫూర్తితో పని చేస్తున్న ఈ బృందాన్ని నేను అభినందిస్తున్నాను. ఈ ప్రయత్నం పెద్ద సంఖ్యలో ప్రజలను శక్తిమంతం చేయడమే కాకుండాఅనేక జీవనోపాధి మార్గాలను కూడా సృష్టించింది. ఈ ప్రయత్నం 'మన్ కీ బాత్' వింటున్న ప్రతి శ్రోతకి స్ఫూర్తినిస్తుందని ఆశిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఈరోజు మే 28న గొప్ప స్వాతంత్ర్య సమరయోధుడు వీర సావర్కర్ జయంతి. ఆయన త్యాగం, ధైర్యం, సంకల్ప శక్తికి సంబంధించిన కథలు నేటికీ మనందరికీ స్ఫూర్తినిస్తాయి. అండమాన్‌లో వీర సావర్కర్ కాలాపానీ శిక్ష అనుభవించిన గదికి వెళ్లిన రోజును నేను మర్చిపోలేను. వీర సావర్కర్ వ్యక్తిత్వం దృఢత్వం, గొప్పతనాలతో తో కూడి ఉంది. ఆయన నిర్భయ, ఆత్మగౌరవ స్వభావానికి బానిస మనస్తత్వం పూర్తిగా నచ్చలేదు. స్వాతంత్య్రోద్యమం కోసం మాత్రమే కాదు- సామాజిక సమానత్వం, సామాజిక న్యాయం కోసం వీర్ సావర్కర్ చేసిన కృషి ఆయనను ఇప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తుంది.
మిత్రులారా!కొన్ని రోజుల తర్వాత జూన్ 4వ తేదీన సంత్ కబీర్దాస్ జీ జయంతి. కబీర్దాస్ జీ చూపిన మార్గం నేటికీ ప్రాసంగికత కలిగి ఉంది.
“కబీరా కువా ఏక్ హై – పానీ భరే అనేక్
బర్తన్ మే హీ భేద్ హై, పానీ సబ్ మే ఏక్”
అని కబీర్దాస్ చెప్పేవారు. అంటేబావి దగ్గరకు రకరకాల వ్యక్తులు నీళ్లు తోడుకోవడానికి వచ్చినాఆ బావి ఎవరికీ తేడా లేకుండాఅన్ని పాత్రల్లోనూ నీరు ఒకేలా ఉంటుంది. సమాజాన్ని విభజించేందుకు యత్నించే ప్రతి చెడు ఆచారాన్ని సంత్ కబీర్ వ్యతిరేకించారు. సమాజాన్ని మేల్కొల్పడానికి కృషి చేశారు. ప్రస్తుతం దేశం అభివృద్ధి చెందాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నప్పుడు సంత్ కబీర్‌ను స్ఫూర్తిగా తీసుకొని సమాజాన్ని శక్తిమంతం చేయడానికి మన ప్రయత్నాలను పెంచాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!రాజకీయాలలో, చలనచిత్ర పరిశ్రమలో తన అద్భుతమైన ప్రతిభతో చెరగని ముద్ర వేసిన గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు నేను మీతో చర్చించబోతున్నాను. ఆ మహనీయుని పేరు ఎన్.టి. రామారావు. ఆయన మనందరికీ ఎన్టీఆర్ అనే పేరుతో కూడా తెలుసు. ఈరోజు ఎన్టీఆర్ 100వ జయంతి. ఆయన తన బహుముఖ ప్రజ్ఞతో తెలుగు చిత్రసీమలో సూపర్‌స్టార్‌గా నిలవడమే కాకుండా కోట్లాది ప్రజల హృదయాలను కూడా గెలుచుకున్నారు. ఆయన 300కి పైగా సినిమాల్లో నటించిన సంగతి మీకు తెలుసా? ఆయన తన నటన ఆధారంగా అనేక చారిత్రక పాత్రలకు జీవం పోశారు. భగవాన్ శ్రీకృష్ణుడు, శ్రీరాముడు లాంటి అనేక పాత్రలలో ఎన్టీఆర్ నటనని ప్రజలు ఎంతగానో ఇష్టపడ్డారు. ప్రజలు ఇప్పటికీ ఆయనను గుర్తుంచుకుంటారు. ఎన్టీఆర్ సినీరంగంతో పాటు రాజకీయాల్లోనూ తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక్కడ కూడా ఆయన ప్రజల నుండి చాలా ప్రేమ, ఆశీర్వాదాలు పొందారు. దేశంలోనూ, ప్రపంచవ్యాప్తంగానూ లక్షలాది ప్రజల హృదయాలను ఏలిన ఎన్. టి. రామారావు గారికి నా వినమ్రపూర్వకమైన నివాళులర్పిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఈసారి 'మన్ కీ బాత్'లో ఇంతే. వచ్చేసారి మరికొన్ని కొత్త అంశాలతో మీ మధ్యకి వస్తాను. అప్పటి వరకు కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మరింత పెరగవచ్చు. కొన్ని చోట్ల వర్షాలు కూడా ప్రారంభమవుతాయి. ప్రతి వాతావరణ పరిస్థితుల్లోనూ మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. జూన్ 21న 'ప్రపంచ యోగా దినోత్సవం' కూడా జరుపుకుంటాం. దేశ విదేశాల్లో అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సన్నాహాల గురించి కూడా మీరు మీ 'మన్ కీ బాత్'ని నాకు రాస్తూ ఉండండి. మీ దగ్గర మరేదైనా అంశంపై మరింత సమాచారం ఉంటే, అది కూడా నాకు చెప్పండి. 'మన్ కీ బాత్'లో అత్యధికంగా సూచనలు తీసుకునేందుకే నేను ప్రయత్నిస్తున్నాను. మీ అందరికీ మరోసారి చాలా చాలా ధన్యవాదాలు. వచ్చే నెల మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పండి. నమస్కారం!
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈరోజు 'మన్ కీ బాత్' వందో ఎపిసోడ్. నాకు మీ అందరి నుండి వేల ఉత్తరాలొచ్చాయి. లక్షల సందేశాలొచ్చాయి. వీలైనన్ని ఎక్కువ ఉత్తరాలు చదవడానికి, చూడడానికి ప్రయత్నించాను. సందేశాలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. మీ ఉత్తరాలు చదువుతున్నప్పుడు చాలా సార్లు ఉద్వేగానికి గురయ్యాను. భావోద్వేగాలతో నిండిపోయాను. భావోద్వేగాల్లో మునిగిపోయాను. నన్ను నేను సంబాళించుకున్నాను. 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్ సందర్భంగా మీరు నన్ను అభినందించారు. కానీ నేను హృదయపూర్వకంగా చెప్తున్నాను. వాస్తవానికి అభినందనలకు అర్హులు మీరు- మన్ కీ బాత్ శ్రోతలు- మన దేశ వాసులు. 'మన్ కీ బాత్' కోట్లాది భారతీయుల 'మన్ కీ బాత్'. వారందరి భావాల వ్యక్తీకరణ.
మిత్రులారా! 2014 అక్టోబర్ 3న విజయ దశమి పండుగ. మనం అందరం కలిసి ఆ విజయ దశమి రోజున 'మన్ కీ బాత్' యాత్రను ప్రారంభించాం. విజయ దశమి అంటే చెడుపై మంచి- విజయం సాధించిన పండుగ. 'మన్ కీ బాత్' కూడా దేశప్రజల ఉత్తమ కార్యాలు, సకారాత్మకతల ప్రత్యేకమైన పండుగగా మారింది. ప్రతి నెలా వచ్చే పండుగ. దాని కోసం అందరం ఎదురుచూస్తాం. మనం ఇందులో సకారాత్మకతను, ప్రజల భాగస్వామ్యాన్ని ఉత్సవంగా జరుపుకుంటాం. 'మన్ కీ బాత్' ఇన్ని నెలలు, ఇన్ని సంవత్సరాలు పూర్తి చేసుకుందంటే కొన్నిసార్లు నమ్మడం కష్టం. ప్రతి ఎపిసోడ్ ఒక ప్రత్యేకమైందిగా మారింది. ప్రతిసారీ కొత్త ఉదాహరణల నూతనత్వం. ప్రతిసారీ దేశవాసుల కొత్త విజయాల విస్తరణ. 'మన్ కీ బాత్'లో దేశంలోని నలుమూలల ప్రజలు, అన్ని వయసుల వారు చేరారు. బేటీ బచావో- బేటీ బచావో అంశం కానివ్వండి. స్వచ్ఛ భారత్ ఉద్యమం కానివ్వండి. ఖాదీపై ప్రేమ లేదా ప్రకృతిపై ప్రేమ కానివ్వండి. స్వాతంత్ర్య అమృత మహోత్సవం లేదా అమృత సరోవర్ కానివ్వండి. 'మన్ కీ బాత్'లో ప్రస్తావించిన ఏ అంశమైనా, ప్రజా ఉద్యమంగా మారింది. మీరు అలా చేశారు. నేను అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా విషయాన్ని 'మన్ కీ బాత్'లో పంచుకున్నప్పుడు అది ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
మిత్రులారా! 'మన్ కీ బాత్' నాకు ఇతరుల ఉత్తమ గుణాలను ఆరాధించడం లాంటిది. నాకు ఒక మార్గదర్శకులుండేవారు. ఆయన శ్రీ లక్ష్మణరావు జీ ఇనామ్దార్. మేం ఆయన్నివకీల్ సాహెబ్ అని పిలిచేవాళ్ళం. ఎదుటివారి గుణాలను పూజించాలని ఆయన ఎప్పుడూ చెప్తుండేవారు. ఎదుటి వారెవరైనా సరే- మీ మిత్రులైనా సరే, మీ ప్రత్యర్థులైనా సరే. వారి మంచి గుణాలను తెలుసుకుని వారి నుంచి నేర్చుకునే ప్రయత్నం చేయాలి. ఆయన చెప్పిన ఈ విషయం నాకు ఎప్పుడూ స్ఫూర్తినిస్తుంది. ఇతరుల గుణాల నుంచి నేర్చుకునేందుకు 'మన్ కీ బాత్' గొప్ప మాధ్యమంగా మారింది.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ కార్యక్రమం నన్ను మీ నుండి ఎప్పుడూ దూరం కానివ్వలేదు. నాకు గుర్తుంది- నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి సామాన్య ప్రజలను కలవడం, వారితో మమేకం కావడం సహజంగా జరిగేది. ముఖ్యమంత్రి పని తీరు, పదవీకాలం ఇలాగే ఉండే అవకాశాలున్నాయి. కానీ 2014లో ఢిల్లీకి వచ్చిన తర్వాత ఇక్కడి జీవితం చాలా భిన్నంగా ఉంటుందని తెలుసుకున్నాను. పని స్వభావం వేరు. బాధ్యత వేరు. పరిస్థితుల బంధనాలు. భద్రతా కవచాలు. కాలపరిమితులు. తొలి రోజుల్లో ఏదో భిన్నంగా అనిపించింది. వెలితిగా అనిపించింది. ఏదో ఒకరోజు నా స్వదేశంలోని ప్రజలతో మైత్రి దొరకడం కష్టం అవుతుంది కాబట్టి యాభయ్యేళ్ల కిందట నేను నా ఇంటిని వదిలి వెళ్ళలేదు. నా సర్వస్వం అయిన దేశప్రజల నుండి వేరుగా జీవించలేను. 'మన్ కీ బాత్' ఈ సవాలుకు ఒక పరిష్కారాన్ని అందించింది. సామాన్యులతో అనుసంధానమయ్యే మార్గం చూపింది. కార్యాలయ భారాలు, ప్రోటోకాల్ వ్యవస్థకే పరిమితమయ్యాయి. ప్రజల ఉద్వేగాలు, కోట్లాది మందితో పాటు నా మనోభావాలు ప్రపంచంలో విడదీయరాని భాగాలయ్యాయి. ప్రతి నెలా నేను దేశ ప్రజల నుండి వేలకొద్దీ సందేశాలను చదువుతాను. ప్రతి నెలా నేను దేశవాసుల ఒక అద్భుతమైన స్వరూపాన్ని చూస్తాను. దేశప్రజల తపస్సు, త్యాగాల్లోని పతాకస్థాయిని నేను చూస్తున్నాను. అనుభూతి చెందుతున్నాను. నేను మీకు కొద్దిగా కూడా దూరంగా ఉన్నాననే భావన నాలో ఏమాత్రం లేదు. నా దృష్టిలో 'మన్ కీ బాత్' కేవలం ఒక కార్యక్రమం కాదు. నాకు ఇది విశ్వాసం, ఆరాధన, వ్రతం. దైవ పూజకు వెళ్లినప్పుడు ప్రజలు ప్రసాదం పళ్లెం తెస్తారు. అలాగే నా దృష్టిలో 'మన్ కీ బాత్' ప్రజా దేవుళ్ల చరణ ప్రసాదం లాంటిది. 'మన్ కీ బాత్' నా మనసులోని ఆధ్యాత్మిక యాత్రగా మారింది.
'మన్ కీ బాత్' వ్యక్తి నుండి సమష్టి దశకు ప్రయాణం.
'మన్ కీ బాత్' అహం నుండి సామూహిక చేతనకు ప్రయాణం.
ఇదే ‘నేను కాదు-మీరు’ అనే సంస్కార సాధన.
మీరు ఊహించండి. నా దేశవాసులు కొందరు 40-40 సంవత్సరాలుగా జనావాసం లేని కొండలపై, బంజరు భూముల్లో చెట్లను నాటుతున్నారు. చాలా మంది ప్రజలు 30-30 సంవత్సరాలుగా నీటి సంరక్షణ కోసం మెట్ల బావులను, చెరువులను తవ్విస్తున్నారు, వాటిని శుభ్రం చేస్తున్నారు. కొందరు 25-30 ఏళ్లుగా పేద పిల్లలకు పాఠాలు చెప్తున్నారు. మరికొందరు పేదల చికిత్సలో సహాయం చేస్తున్నారు. 'మన్ కీ బాత్'లో చాలాసార్లు ఈ విషయాలను ప్రస్తావిస్తూ భావోద్వేగానికి గురయ్యాను. ఆకాశవాణి సహచరులు దీన్ని చాలాసార్లు మళ్ళీ మళ్ళీ రికార్డ్ చేయాల్సి వచ్చింది. ఈరోజు గతం కళ్ల ముందు కనిపిస్తోంది. దేశప్రజల ఈ ప్రయత్నాలు నన్ను నిరంతరం శ్రమించేలా ప్రేరేపించాయి.
మిత్రులారా! 'మన్ కీ బాత్'లో మనం ప్రస్తావించే వ్యక్తులందరూ ఈ కార్యక్రమాన్ని సజీవంగా మార్చిన మన హీరోలు. ఈ రోజు మనం వందవ ఎపిసోడ్ మైలురాయిని చేరుకున్న సందర్భంలో ఈ హీరోల ప్రయాణం గురించి తెలుసుకోవడానికి మనం మరోసారి వారి దగ్గరికి వెళ్లాలని నేను కోరుకుంటున్నాను. ఈ రోజు మనం కొంతమంది మిత్రులతో మాట్లాడేందుకు కూడా ప్రయత్నిద్దాం. హర్యానాకు చెందిన సోదరుడు సునీల్ జగ్లాన్ గారు ఈరోజు మనతో ఉన్నారు. హర్యానాలో లింగ నిష్పత్తిపై చాలా చర్చ జరిగింది. నేను కూడా 'బేటీ బచావో-బేటీ పఢావో' ప్రచారాన్ని హర్యానా నుండే ప్రారంభించాను. అందువల్లే సునీల్ జగ్లాన్ గారు నా మనస్సుపై ఎంతో ప్రభావం చూపారు. సునీల్ గారి 'సెల్ఫీ విత్ డాటర్' ప్రచారాన్ని చూసినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను. నేను కూడా ఆయన దగ్గర నేర్చుకుని 'మన్ కీ బాత్'లో చేర్చాను. కూతురితో సెల్ఫీ ప్రపంచ ప్రచారంగా మారింది. ఇందులో ముఖ్య విషయం సెల్ఫీ కాదు, సాంకేతికత కాదు. ఈ ప్రచారంలో కూతురికి ప్రాధాన్యత ఇచ్చారు. జీవితంలో కూతురి ప్రాముఖ్యత కూడా ఈ ప్రచారం ద్వారా వెల్లడైంది. ఇటువంటి అనేక ప్రయత్నాల ఫలితంగా నేడు హర్యానాలో లింగ నిష్పత్తి మెరుగుపడింది. ఈరోజు సునీల్ గారితో మాట్లాడదాం.
ప్రధానమంత్రి గారు: నమస్కారం సునీల్ గారూ...
సునీల్ గారు: నమస్కారం సార్. మీ మాట విన్న తర్వాత నా ఆనందం చాలా పెరిగింది సార్.
ప్రధానమంత్రి గారు: సునీల్ గారూ... 'సెల్ఫీ విత్ డాటర్' అందరికీ గుర్తుంది. ఇప్పుడు మళ్లీ దాని గురించి చర్చిస్తున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తోంది?
సునీల్ గారు: ప్రధానమంత్రి గారూ... నిజానికి అమ్మాయిల ముఖాల్లో చిరునవ్వులు నింపేందుకు మా రాష్ట్రం హర్యానా నుండి ప్రారంభించి, దేశం అంతటికీ విస్తరించిన నాలుగో పానిపట్టు యుద్ధం నాతోపాటు ప్రతి ఒక్క ఆడపిల్లల తండ్రికీ చాలా ముఖ్యమైంది. కూతుళ్లను ప్రేమించే తండ్రులకు ఇది పెద్ద విషయం.
ప్రధానమంత్రి గారు: సునీల్ గారూ.. మీ కూతురు ఇప్పుడు ఎలా ఉంది? ఈ రోజుల్లో ఏం చేస్తోంది?
సునీల్ గారు: సార్. నా కూతుళ్లు నందిని, యాచిక. ఒకరు 7వ తరగతి, ఒకరు 4వ తరగతి చదువుతున్నారు. మీకు వీరాభిమానులు సార్. ‘థాంక్యూ ప్రైమ్ మినిస్టర్’ అంటూ తమ క్లాస్ మేట్స్ తో మీకు లేఖలు కూడా వాళ్ళు రాయించారు సార్.
ప్రధానమంత్రి గారు: వహ్వా! మీ అమ్మాయిలకు మా తరఫున, మన్ కీ బాత్ శ్రోతల తరఫున చాలా ఆశీర్వాదాలు అందించండి.
సునీల్ గారు: చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ వల్ల దేశంలోని ఆడపిల్లల ముఖాల్లో చిరునవ్వులు నిరంతరం పెరుగుతూనే ఉన్నాయి.
ప్రధానమంత్రి గారు: చాలా ధన్యవాదాలు సునీల్ గారూ...
సునీల్ గారు: ధన్యవాదాలు సార్.
మిత్రులారా! 'మన్ కీ బాత్'లో దేశంలోని మహిళా శక్తికి సంబంధించిన వందలాది స్పూర్తిదాయకమైన కథనాలను ప్రస్తావించినందుకు నేను చాలా సంతృప్తి చెందాను. మనం ఛత్తీస్‌గఢ్‌లోని దేవుర్ గ్రామ మహిళల గురించి చర్చించినట్టుగానే మన సైన్యమైనా, క్రీడా ప్రపంచమైనా -నేను మహిళల విజయాల గురించి మాట్లాడినప్పుడల్లా అనేక ప్రశంసలు వచ్చాయి. ఈ దేవుర్ గ్రామ మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా గ్రామ కూడళ్లు, రోడ్లు, దేవాలయాలను శుభ్రం చేయడానికి ప్రచారాన్ని నిర్వహిస్తారు. అదేవిధంగా వేలాది పర్యావరణ హిత టెర్రకోట కప్పులను ఎగుమతి చేసిన తమిళనాడు గిరిజన మహిళల నుండి దేశం చాలా స్ఫూర్తిని పొందింది. తమిళనాడులోనే 20 వేల మంది మహిళలు ఏకమై వేలూరులోని నాగా నదిని పునరుజ్జీవింపజేశారు. ఇలాంటి అనేక ప్రచారాలకు మన మహిళా శక్తి నాయకత్వం వహించింది. వారి ప్రయత్నాలను తెరపైకి తీసుకురావడానికి 'మన్ కీ బాత్' వేదికగా మారింది.
మిత్రులారా! ఇప్పుడు మనకు ఫోన్ లైన్లో మరో ఉత్తములు ఉన్నారు. ఆయన పేరు మంజూర్ అహ్మద్. 'మన్ కీ బాత్'లో జమ్మూ కాశ్మీర్ పెన్సిల్ స్లేట్స్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మంజూర్ అహ్మద్ గారి ప్రస్తావన వచ్చింది.
ప్రధాన మంత్రి గారు: మంజూర్ గారూ... ఎలా ఉన్నారు?
మంజూర్ గారు: థాంక్యూ సార్... చాలా బాగున్నాం సార్.
ప్రధాన మంత్రి గారు: ఈ మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్లో మీతో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది.
మంజూర్ గారు: థాంక్యూ సార్.
ప్రధాన మంత్రి గారు: పెన్సిల్-స్లేట్ల పని ఎలా జరుగుతోంది?
మంజూర్ గారు: ఇది చాలా బాగా జరుగుతోంది సార్. మీరు మన 'మన్ కీ బాత్' ప్రసంగంలో చెప్పినప్పటి నుండి పని చాలా పెరిగింది సార్. ఈ పనిలో ఇతరులకు ఉపాధి కూడా చాలా పెరిగింది.
ప్రధాన మంత్రి గారు: ఇప్పుడు ఎంత మందికి ఉపాధి లభిస్తుంది?
మంజూర్ గారు: ఇప్పుడు నా దగ్గర రెండు వందల మందికి పైగా ఉన్నారు సార్.
ప్రధాన మంత్రి గారు: ఓహో! నాకు చాలా సంతోషంగా ఉంది.
మంజూర్ గారు: అవును సార్..అవును సార్...ఇప్పుడు నేను దీన్ని రెండు నెలల్లో విస్తరిస్తున్నాను. మరో 200 మందికి ఉపాధి పెరుగుతుంది సార్.
ప్రధాన మంత్రి గారు: వావ్! మంజూర్ గారూ... చూడండి...
మంజూర్ గారు: సార్..
ప్రధానమంత్రి గారు: దీనివల్ల మీ పనికిగానీ మీకు గానీ ఎలాంటి గుర్తింపూ లేదని మీరు చెప్పడం నాకు బాగా గుర్తుంది. మీరు చాలా బాధలు, ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు గుర్తింపు కూడా వచ్చింది. రెండు వందల మందికి పైగా ఉపాధి దొరుకుతోంది.
మంజూర్ గారు: అవును సార్... అవును సార్.
ప్రధాన మంత్రి గారు: మీరు కొత్త విస్తరణలతో, 200 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఎంతో గొప్ప సంతోషకరమైన వార్తను అందించారు మీరు.
మంజూర్ గారు: ఇక్కడ ఉన్న రైతులకు కూడా అప్పటి నుండి చాలా ప్రయోజనం కలిగింది సార్. ఒకప్పుడు 2000 రూపాయలు విలువ చేసే చెట్టు విలువ ఇప్పుడు 5000 రూపాయలకి చేరింది సార్. అప్పటి నుండి ఇందులో చాలా డిమాండ్ పెరిగింది. ఇది దాని స్వంత గుర్తింపుగా కూడా మారింది సార్. ఇప్పుడు నాకు చాలా ఆర్డర్లు ఉన్నాయి సార్. ఇప్పుడు నేను ఒకటి, రెండు నెలల్లో మరింత విస్తరిస్తున్నాను. ఇక్కడి రెండు నుండి నాలుగు ఊళ్ళలో రెండొందల నుండి రెండున్నర వందల మంది యువతీ యువకులకు జీవనోపాధి కూడా కల్పించవచ్చు సార్.
ప్రధాన మంత్రి గారు: మంజూర్ గారూ... చూడండి.. వోకల్ ఫర్ లోకల్ ప్రచారంలోని శక్తి ఎంత అద్భుతమైందో మీరు నిరూపించారు.
మంజూర్ గారు: సార్.
ప్రధాన మంత్రి గారు: మీకు, గ్రామంలోని రైతులందరికీ, మీతో పని చేస్తున్న మిత్రులందరికీ అనేక అభినందనలు. ధన్యవాదాలు సోదరా!
మంజూర్ గారు: ధన్యవాదాలు సార్.
మిత్రులారా! మన దేశంలో ఎంతో మంది ప్రతిభావంతులు తమ శ్రమ శక్తితో విజయ శిఖరాలకు చేరుకున్నారు. నాకు గుర్తుంది- విశాఖపట్నం నుండి వెంకట్ మురళీ ప్రసాద్ గారు ఆత్మ నిర్భర భారత్ చార్ట్‌ను పంచుకున్నారు. ఆయన భారతీయ ఉత్పత్తులను మాత్రమే ఎలా గరిష్టంగా ఉపయోగిస్తారో చెప్పారు. బేతియాకు చెందిన ప్రమోద్ గారు ఎల్ఈడీ బల్బుల తయారీకి చిన్న యూనిట్‌ను ఏర్పాటు చేసినప్పుడు, గఢ్ ముక్తేశ్వర్‌కు చెందిన సంతోష్ గారు చాపలను తయారు చేయడం ప్రారంభించినప్పుడు వారి ఉత్పత్తులను అందరి ముందుకు తీసుకురావడానికి 'మన్ కీ బాత్' మాధ్యమంగా మారింది. మేక్ ఇన్ ఇండియా నుండి స్పేస్ స్టార్టప్‌ల వరకు చాలా ఉదాహరణలను 'మన్ కీ బాత్'లో చర్చించాం.
మిత్రులారా! మణిపూర్ సోదరి విజయశాంతి దేవి గారి గురించి కూడా నేను కొన్ని ఎపిసోడ్ల కిందట ప్రస్తావించడం మీకు గుర్తుండే ఉంటుంది. విజయశాంతి గారు తామర పీచులతో బట్టలు తయారు చేస్తారు. ఈ ప్రత్యేకమైన పర్యావరణ అనుకూల ఆలోచనను 'మన్ కీ బాత్'లో చర్చించాం. దాంతో వారి పని మరింత ప్రజాదరణ పొందింది. ఈరోజు విజయశాంతి గారు ఫోన్లో మనతో ఉన్నారు.
ప్రధానమంత్రి గారు: నమస్తే విజయశాంతి గారూ...! మీరు ఎలా ఉన్నారు?
విజయశాంతి గారు: సార్.. నేను బాగున్నాను.
ప్రధానమంత్రి గారు: మీ పని ఎలా జరుగుతోంది?
విజయశాంతి గారు: సార్… ఇప్పటికీ 30 మంది మహిళలతో కలిసి పనిచేస్తున్నాను.
ప్రధానమంత్రి గారు: ఇంత తక్కువ సమయంలో మీరు 30 మంది వ్యక్తుల బృంద స్థాయికి చేరుకున్నారు.
విజయశాంతి గారు: అవును సార్. ఈ సంవత్సరం కూడా మా ప్రాంతంలో 100 మంది మహిళలతో మరింత విస్తరిస్తున్నాను.
ప్రధానమంత్రి గారు: కాబట్టి మీ లక్ష్యం 100 మంది మహిళలన్నమాట
విజయశాంతి గారు: అవును సార్! 100 మంది మహిళలు
ప్రధానమంత్రి గారు: ఇప్పుడు ప్రజలకు ఈ తామర కాండం ఫైబర్ గురించి బాగా తెలుసు
విజయశాంతి గారు: అవును సార్. భారతదేశం అంతటా 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా అందరికీ తెలుసు.
ప్రధానమంత్రి గారు: ఇప్పుడు ఇది బాగా ప్రాచుర్యం పొందింది
విజయశాంతి గారు: అవును సార్.. ప్రధాన మంత్రి 'మన్ కీ బాత్' కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి లోటస్ ఫైబర్ గురించి తెలుసు
ప్రధానమంత్రి గారు: ఇప్పుడు మీకు మార్కెట్ కూడా ఏర్పడిందా?
విజయశాంతి గారు: అవును సార్. నాకు యు. ఎస్. ఏ. నుండి మార్కెట్ వచ్చింది. వారు పెద్దమొత్తంలో, చాలా పరిమాణంలో కొనుగోలు చేయాలనుకుంటున్నారు. అమెరికాకు కూడా పంపడానికి నేను ఈ సంవత్సరం నుండి ఇవ్వాలనుకుంటున్నాను.
ప్రధానమంత్రి గారు: కాబట్టి ఇప్పుడు మీరు ఎగుమతిదారులన్నమాట?
విజయశాంతి గారు: అవును సార్. ఈ సంవత్సరం నుండి నేను భారతదేశంలో తయారు చేసిన లోటస్ ఫైబర్ ఉత్పత్తిని ఎగుమతి చేస్తాను.
ప్రధానమంత్రి గారు: కాబట్టి నేను వోకల్ ఫర్ లోకల్ అన్నప్పుడు ఇప్పుడు లోకల్ ఫర్ గ్లోబల్ అన్నట్టు
విజయశాంతి గారు: అవును సార్. నేను నా ఉత్పత్తితో ప్రపంచమంతటా చేరుకోవాలనుకుంటున్నాను.
ప్రధానమంత్రి గారు: అభినందనలు. విష్ యూ బెస్టాఫ్ లక్.
విజయశాంతి గారు: ధన్యవాదాలు సార్
ప్రధానమంత్రి గారు: ధన్యవాదాలు, ధన్యవాదాలు విజయశాంతి గారూ..
విజయశాంతి గారు: థాంక్యూ సార్
మిత్రులారా! 'మన్ కీ బాత్'కి మరో ప్రత్యేకత ఉంది. 'మన్ కీ బాత్' ద్వారా అనేక ప్రజా ఉద్యమాలు పుట్టుకొచ్చాయి, ఊపందుకున్నాయి. ఉదాహరణకు మన బొమ్మల పరిశ్రమను తిరిగి ఉన్నత స్థాయిలో స్థాపించే లక్ష్యం 'మన్ కీ బాత్'తో మాత్రమే ప్రారంభమైంది. భారతీయ జాతి శునకాలు, మన దేశీయ కుక్కల గురించి అవగాహన కల్పించడం కూడా 'మన్ కీ బాత్'తో ప్రారంభమైంది. నిరుపేద చిన్న దుకాణదారులతో బేరాలాడమని, గొడవలు పెట్టుకోమని మరో ప్రచారం మొదలుపెట్టాం. 'హర్ ఘర్ తిరంగా' ప్రచారం ప్రారంభమైనప్పుడు కూడా ఈ నినాదంతో దేశప్రజలను అనుసంధానించడంలో 'మన్ కీ బాత్' పెద్ద పాత్ర పోషించింది. ఇలాంటి ప్రతి ఉదాహరణ సమాజంలో మార్పుకు కారణమైంది. ఇలాగే సమాజాన్ని చైతన్యవంతం చేసే పనిని ప్రదీప్ సాంగ్వాన్ గారు కూడా చేపట్టారు. 'మన్ కీ బాత్'లో ప్రదీప్ సాంగ్వాన్ గారి 'హీలింగ్ హిమాలయాస్' ప్రచారం గురించి చర్చించాం. ఆయన ఇప్పుడు ఫోన్ లైన్లో మనతో ఉన్నారు.
మోదీ గారు: ప్రదీప్ గారూ... నమస్కారం!
ప్రదీప్ గారు: సార్ జై హింద్ |
మోదీ గారు: జై హింద్, జై హింద్, సోదరా! మీరు ఎలా ఉన్నారు ?
ప్రదీప్ గారు: చాలా బాగున్నాను సార్. మీ మాటలు విని, ఇంకా బాగున్నా సార్. మోదీ గారు: మీరు హిమాలయాలను బాగు చేయాలని భావించారు.
ప్రదీప్ గారు: అవును సార్.
మోదీ గారు: ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. ఈ రోజుల్లో మీ ఉద్యమం ఎలా సాగుతోంది?
ప్రదీప్ గారు: సార్... చాలా బాగా జరుగుతోంది. మనం గతంలో ఐదేళ్లలో చేసే పని 2020 నుండి ఒక సంవత్సరంలో పూర్తవుతోంది సార్.
మోదీ గారు: వాహ్!
ప్రదీప్ గారు: అవును... అవును సార్. మొదట్లో నేను చాలా కంగారు పడ్డాను. జీవితాంతం ఇలా చేయగలనా లేదా అని చాలా భయపడ్డాను. కానీ కొంత సహకారం లభించింది. 2020 వరకు చాలా కష్టపడ్డాం. ప్రజలు చాలా తక్కువగా చేరారు. సహకరించని వారు చాలా మంది ఉన్నారు. వారు కూడా మా ప్రచారంపై పెద్దగా శ్రద్ధ చూపలేదు. కానీ 2020లో 'మన్ కీ బాత్'లో ప్రస్తావించిన తర్వాత చాలా మార్పు వచ్చింది. ఇంతకుముందు ఏడాదికి 6-7 క్లీనింగ్ డ్రైవ్‌లు చేసేవాళ్లం. 10 క్లీనింగ్ డ్రైవ్‌లు చేసేవాళ్లం. ఇప్పుడు మేం ప్రతిరోజూ వేర్వేరు ప్రదేశాల నుండి ఐదు టన్నుల చెత్తను సేకరిస్తున్నాం.
మోదీ గారు: వాహ్!
ప్రదీప్ గారు: సార్.. నేను ఒకానొక సమయంలో దాదాపు ఈ పనిని వదులుకునే దశలో ఉన్నానంటే నమ్మండి సార్. 'మన్ కీ బాత్'లో ప్రస్తావించిన తర్వాత నా జీవితంలో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. ఊహించనంత వేగంగా మార్పులు జరిగాయి. మీరు మాలాంటి వ్యక్తులను ఎలా కనుగొంటారో తెలియదు. నేను నిజంగా కృతజ్ఞుడిని. ఇంత మారుమూల ప్రాంతంలో ఎవరు పనిచేస్తారు? మేం హిమాలయ ప్రాంతంలో పనిచేస్తున్నాం. ఇంత ఎత్తైన ప్రాంతంలో పని చేస్తున్నాం. అయినా మీరు మమ్మల్ని అక్కడ కనుగొన్నారు. మన పనిని ప్రపంచం ముందుంచారు. మన దేశ ప్రథమ సేవకులతో మాట్లాడగలగడం ఆరోజు, ఈరోజు కూడా ఉద్వేగభరిత క్షణాలే. ఇంతకు మించిన అదృష్టం నాకు మరొకటి ఉండదు.
మోదీ గారు: ప్రదీప్ గారూ...! మీరు వాస్తవమైన అర్థంలో హిమాలయాల శిఖరాలపై సాధన చేస్తున్నారు. ఇప్పుడు మీ పేరు వినగానే పర్వతాల పరిశుభ్రత ప్రచారంలో మీరు ఎలా పాల్గొంటున్నారో ప్రజలు గుర్తుంచుకుంటారని నాకు ఖచ్చితంగా తెలుసు.
ప్రదీప్ గారు: అవును సార్.
మోదీ గారు: మీరు చెప్పినట్లుగా ఇప్పుడు ఒక పెద్ద బృందం ఏర్పడుతోంది. మీరు ప్రతిరోజూ ఇంత భారీ స్థాయిలో పని చేస్తున్నారు.
ప్రదీప్ గారు: అవును సార్.
మోదీ గారు: మీ ప్రయత్నాలు, వాటిపై చర్చల కారణంగా ఇప్పుడు చాలా మంది పర్వతారోహకులు పరిశుభ్రతకు సంబంధించిన ఫోటోలను పోస్టు చేయడం ప్రారంభించారని నాకు పూర్తి నమ్మకం ఉంది.
ప్రదీప్ గారు: అవును సార్! చాలా...
మోదీ గారు: మీలాంటి మిత్రుల కృషి వల్ల వ్యర్థాలు కూడా ఉపయోగకరమేనన్న సందేశం ఇప్పుడు ప్రజల మనస్సుల్లో నాటుకు పోవడం మంచి విషయం. పర్యావరణ పరిరక్షణ కూడా జరుగుతోంది. మనం గర్వించే హిమాలయాలు కూడా ఇప్పుడు రక్షణ పొందుతున్నాయి. ఇందులో సామాన్యులు కూడా అనుసంధానమవుతున్నారు. ప్రదీప్ గారూ.. ఇది నాకు చాలా బాగా నచ్చింది. చాలా చాలా ధన్యవాదాలు సోదరా!
ప్రదీప్ గారు: ధన్యవాదాలు సార్. థాంక్యూ సోమచ్. జై హింద్!
మిత్రులారా! దేశంలో పర్యాటకం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. మన సహజ వనరులు కావచ్చు, నదులు కావచ్చు, పర్వతాలు కావచ్చు, చెరువులు కావచ్చు లేదా మన పుణ్యక్షేత్రాలు కావచ్చు. వాటిని పరిశుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. ఇది పర్యాటక రంగానికి ఎంతగానో దోహదపడుతుంది. టూరిజంలో పరిశుభ్రతతో పాటు ఇన్క్రెడిబుల్ ఇండియా ఉద్యమం గురించి కూడా చాలాసార్లు చర్చించుకున్నాం. ఈ ఉద్యమం కారణంగా ప్రజలు తమ చుట్టూ ఉన్న ఎన్నో ప్రదేశాల గురించి మొదటిసారిగా తెలుసుకున్నారు. విదేశాల్లో పర్యటనకు వెళ్లేముందు మన దేశంలోని కనీసం 15 పర్యాటక ప్రాంతాలను తప్పక సందర్శించాలని నేను ఎప్పుడూ చెప్తుంటాను. ఈ ప్రాంతాలు మీరు నివసించే రాష్ట్రంలోవి కాకూడదు. మీ రాష్ట్రం వెలుపల ఏ ఇతర ప్రాంతంలో అయినా ఉండాలి. అదేవిధంగా స్వచ్చ సియాచిన్, సింగిల్ యూజ్ ప్లాస్టిక్, ఇ-వేస్ట్ వంటి ముఖ్యమైన అంశాల గురించి మనం నిరంతరం మాట్లాడుకున్నాం. ప్రస్తుతం ప్రపంచం యావత్తూ ఆందోళన చెందుతున్న పర్యావరణ సమస్యను పరిష్కరించడంలో 'మన్ కీ బాత్' చేసిన ఈ ప్రయత్నం చాలా ముఖ్యమైంది.
మిత్రులారా! ఈసారి యునెస్కో డైరెక్టర్ జనరల్ ఆడ్రీ అజూలే గారి నుండి 'మన్ కీ బాత్'పై నాకు మరో ప్రత్యేక సందేశం వచ్చింది. వంద ఎపిసోడ్ల ఈ అద్భుతమైన ప్రయాణంపై దేశప్రజలందరికీ ఆమె శుభాకాంక్షలు తెలిపారు. అలాగే కొన్ని ప్రశ్నలు కూడా అడిగారు. ముందుగా యునెస్కో డైరెక్టర్ జనరల్ గారి మనసులోని మాటను విందాం.
#ఆడియో (యునెస్కో డైరెక్టర్ జనరల్)#
డైరెక్టర్ జనరల్, యునెస్కో: నమస్తే ఎక్స్ లెన్సీ.. ప్రియమైన ప్రధాన మంత్రిగారూ..! ‘మన్ కీ బాత్’ రేడియో ప్రసారం వందవ ఎపిసోడ్లో భాగంపొందే అవకాశం కల్పించినందుకు యునెస్కో తరపున నేను మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యునెస్కోకు, భారతదేశానికి సుదీర్ఘమైన ఉమ్మడి చరిత్ర ఉంది. విద్య, విజ్ఞాన శాస్త్రం, సంస్కృతి, సమాచార రంగాల్లో యునెస్కోకు, భారతదేశానికి బలమైన భాగస్వామ్యం ఉంది. విద్య ప్రాముఖ్యత గురించి మాట్లాడటానికి నేను ఈ రోజు ఈ అవకాశాన్ని ఉపయోగించాలనుకుంటున్నాను. 2030 నాటికి ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ నాణ్యమైన విద్య అందుబాటులో ఉండేలా యునెస్కో తన సభ్య దేశాలతో కలిసి పనిచేస్తోంది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్నందువల్ల ఈ లక్ష్యాన్ని సాధించడానికి భారత దేశం అనుసరిస్తున్న మార్గాన్ని దయచేసి వివరించగలరా? సంస్కృతిలో సహకారానికి, వారసత్వ పరిరక్షణకు కూడా యునెస్కో పని చేస్తుంది. ఈ సంవత్సరం జి-20కి భారతదేశం అధ్యక్షత వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రపంచ నేతలు ఢిల్లీకి వచ్చే అవకాశం ఉంది. ఎక్స్ లెన్సీ! అంతర్జాతీయ ఎజెండాలో సంస్కృతిని, విద్యను భారతదేశం ఎలా అగ్రస్థానంలో ఉంచాలని కోరుకుంటోంది? ఈ అవకాశానికి నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారతదేశ ప్రజలకు మీ ద్వారా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. త్వరలో కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు.
ప్రధానమంత్రి మోదీ: ధన్యవాదాలు ఎక్స్‌లెన్సీ. 100వ ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో మీతో సంభాషించడం నాకు సంతోషంగా ఉంది. మీరు విద్యకు, సంస్కృతికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను ప్రస్తావించినందుకు నేను కూడా సంతోషిస్తున్నాను.
మిత్రులారా! యునెస్కో డైరెక్టర్ జనరల్ గారు విద్య, సాంస్కృతిక పరిరక్షణకు సంబంధించి భారతదేశ కృషి గురించి తెలుసుకోవాలనుకున్నారు. ఈ రెండు అంశాలు 'మన్ కీ బాత్'లో ఇష్టమైన అంశాలు.
విషయం విద్యకు సంబంధించినది కావచ్చు. లేదా సంస్కృతికి సంబంధించిన విషయం కావచ్చు. పరిరక్షణ కావచ్చు. లేదా ఉన్నతీకరించడం కావచ్చు. ఇది భారతదేశ పురాతన సంప్రదాయం. నేడు దేశం ఈ దిశగా చేస్తున్న కృషి నిజంగా అభినందనీయం. జాతీయ విద్యా విధానం కావచ్చు. లేదా ప్రాంతీయ భాషలో చదివే ఎంపిక కావచ్చు. విద్యలో సాంకేతికత అనుసంధానం కావచ్చు. మీరు ఇలాంటి అనేక ప్రయత్నాలను చూస్తారు. కొన్ని సంవత్సరాల కిందట గుజరాత్ లో 'గుణోత్సవ్’, ‘శాలా ప్రవేశోత్సవ్' వంటి కార్యక్రమాలు మెరుగైన విద్యను అందించడంలో, డ్రాపౌట్ రేట్లను తగ్గించడంలో ప్రజల భాగస్వామ్యానికి అద్భుతమైన ఉదాహరణలుగా మారాయి. విద్య కోసం నిస్వార్థంగా పనిచేస్తున్న చాలా మంది వ్యక్తుల ప్రయత్నాలకు 'మన్ కీ బాత్'లో మనం ప్రాధాన్యత ఇచ్చాం. ఒడిషాలో బండిపై టీ అమ్మే దివంగత డి. ప్రకాశరావు గురించి మనం ఒకసారి చర్చించుకోవడం మీకు గుర్తుండే ఉంటుంది. పేద పిల్లలకు చదువు చెప్పడంలో ఆయన కృషి ప్రత్యేకంగా ప్రస్తావించదగింది.
జార్ఖండ్‌లోని గ్రామాల్లో డిజిటల్ లైబ్రరీలను నిర్వహిస్తున్న సంజయ్ కశ్యప్ కావచ్చు, కోవిడ్ సమయంలో చాలా మంది పిల్లలకు ఇ-లర్నింగ్ ద్వారా సహాయం చేసిన హేమలత ఎన్‌కె కావచ్చు, ఇలాంటి చాలా మంది ఉపాధ్యాయుల ఉదాహరణలను మనం 'మన్ కీ బాత్'లో తీసుకున్నాం. సాంస్కృతిక పరిరక్షణ ప్రయత్నాలకు కూడా 'మన్ కీ బాత్'లో ప్రాముఖ్యత ఇచ్చాం. లక్షద్వీప్ కు చెందిన కుమ్మెల్ బ్రదర్స్ ఛాలెంజర్స్ క్లబ్ కావచ్చు, లేదా కర్ణాటక కు చెందిన 'క్వెమ్‌శ్రీ' గారి 'కళా చేతన' వంటి వేదిక కావచ్చు. దేశంలోని ప్రతి మూల నుండి ప్రజలు లేఖల్లో నాకు అలాంటి ఉదాహరణలను పంపారు. దేశభక్తిపై 'గీత్', 'లోరీ' , 'రంగోలి'కి సంబంధించిన మూడు పోటీల గురించి కూడా మనం మాట్లాడుకున్నాం. మీకు గుర్తుండవచ్చు. ఒకసారి మనం భారతీయ విద్యా విధానంలో కథాకథన మాధ్యమ వినియోగంపై దేశవ్యాప్తంగా ఉన్న కథకులతో చర్చించాం. సమష్టి కృషితో అతిపెద్ద మార్పు తీసుకురాగలమని నాకు అచంచలమైన నమ్మకం ఉంది. స్వాతంత్ర్య స్వర్ణయుగంలో ముందుకు సాగుతున్న ఈ సంవత్సరం మనం జి-20కి కూడా అధ్యక్షత వహిస్తున్నాం. విద్యతో పాటు విభిన్న ప్రపంచ సంస్కృతులను సుసంపన్నం చేయాలనే మన సంకల్పం మరింత దృఢంగా మారడానికి ఇది కూడా ఒక కారణం.
నా ప్రియమైన దేశవాసులారా! మన ఉపనిషత్తుల నుండి ఒక మంత్రం శతాబ్దాలుగా మన మనస్సులకు ప్రేరణ అందిస్తోంది.
చరైవేతి చరైవేతి చరైవేతి
కొనసాగించు - కొనసాగించు – కొనసాగించు
ఈ రోజు మనం చరైవేతి చరైవేతి స్ఫూర్తితో 'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్‌ని పూర్తి చేస్తున్నాం. ప్రతి పూసను ఒకదానితో ఒకటి అంటిపెట్టుకునే పూల దారం లాగే భారతదేశ సామాజిక నిర్మాణాన్ని బలోపేతం చేయడంలో 'మన్ కీ బాత్' ప్రతి మనస్సును అనుసంధానిస్తోంది. ప్రతి ఎపిసోడ్లో దేశవాసుల సేవ, సామర్థ్యం ఇతరులకు స్ఫూర్తినిచ్చాయి. ఈ కార్యక్రమంలో ప్రతి దేశస్థుడు ఇతర దేశస్థులకు స్ఫూర్తిగా నిలుస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే మన్ కీ బాత్‌లోని ప్రతి ఎపిసోడ్ తర్వాతి ఎపిసోడ్‌కు రంగం సిద్ధం చేస్తుంది. 'మన్ కీ బాత్' ఎల్లప్పుడూ సద్భావన, సేవాభావం, కర్తవ్య భావనతో ముందుకు సాగింది. ఈ సానుకూలత స్వాతంత్ర్య అమృతకాలంలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది. 'మన్ కీ బాత్'తో ప్రారంభమైన ఈ కృషి నేడు దేశంలో ఒక కొత్త సంప్రదాయంగా మారుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ప్రతి ఒక్కరి ప్రయత్నాల స్ఫూర్తిని మనం చూసే సంప్రదాయమిది.
మిత్రులారా! ఈ మొత్తం కార్యక్రమాన్ని ఎంతో ఓపికతో రికార్డ్ చేసే ఆకాశవాణి సహచరులకు కూడా ఈరోజు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 'మన్ కీ బాత్'ని చాలా తక్కువ సమయంలో చాలా వేగంతో వివిధ ప్రాంతీయ భాషల్లోకి అనువదించే అనువాదకులకు కూడా నేను కృతజ్ఞుడిని. దూరదర్శన్, మై గవ్ సహచరులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కమర్షియల్ బ్రేక్స్ లేకుండా 'మన్ కీ బాత్' చూపించే దేశవ్యాప్తంగా ఉన్న అన్ని టీవీ ఛానళ్లు, ఎలక్ట్రానిక్ మీడియా వారికి నేను నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చివరగా 'మన్ కీ బాత్'పై ఆసక్తి చూపిన దేశప్రజలకు, భారతదేశంపై విశ్వాసం ఉన్న ప్రజలకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీ స్ఫూర్తి, శక్తి వల్లే ఇదంతా సాధ్యమైంది.
మిత్రులారా! ఈ రోజు నేను చాలా చెప్పవలసి ఉంది. కానీ సమయం తక్కువుంది. మాటలు తక్కువ పడుతున్నాయి. మీరందరూ నా భావాలను అర్థం చేసుకుంటారని, నా భావనలను అర్థం చేసుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మీ కుటుంబ సభ్యుడిగా, 'మన్ కీ బాత్' సహాయంతో నేను మీ మధ్యలో ఉన్నాను, మీ మధ్యలో ఉంటాను. వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. కొత్త విషయాలతో, కొత్త సమాచారంతో దేశప్రజల విజయాలను మళ్లీ ఉత్సవంగా జరుపుకుందాం. అప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పండి. మిమ్మల్ని, మీ ప్రియమైన వారిని బాగా చూసుకోండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
నా ప్రియమైన దేశప్రజలారా!మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ హృదయపూర్వక స్వాగతం. ఈరోజు ఈ చర్చ మొదలుపెడుతుంటే మనసులో చాలా ఆలోచనలు మెదులుతున్నాయి. మా, మీ 'మన్ కీ బాత్' అనుబంధం తొంభై తొమ్మిదవ మైలురాయికి చేరుకుంది. సాధారణంగా తొంభైతొమ్మిదవ మలుపు చాలా కష్టం అని వింటుంటాం. క్రికెట్లో 'నెర్వస్ నైంటీస్'ను చాలా క్లిష్టమైన దశగా భావిస్తారు. కానీ, భారతదేశంలోని ప్రజల 'మన్ కీ బాత్' ఉండే చోట ప్రేరణ కూడా భిన్నంగా ఉంటుంది. 'మన్ కీ బాత్' వందవ ఎపిసోడ్ గురించి దేశ ప్రజలలో చాలా ఆసక్తి ఉన్నందుకు నేను కూడా సంతోషిస్తున్నాను. నాకు చాలా సందేశాలు, ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మనం స్వేచ్ఛా స్వర్ణయుగాన్ని జరుపుకుంటున్న ఈ సందర్భంలో, కొత్త తీర్మానాలతో ముందుకు సాగుతున్న దశలోవందవ'మన్ కీ బాత్' గురించి మీ సలహాలు , ఆలోచనలను తెలుసుకోవాలని నేను కూడా చాలా ఆసక్తితో ఉన్నాను.మీ సూచనల కోసం నేను ఆసక్తితో ఎదురు చూస్తున్నాను. నిజానికినిరీక్షణ ఎప్పుడూ ఉంటుంది. కానీ ఈసారి మరింత ఎక్కువగా ఎదురుచూస్తున్నాను. మీ సూచనలు, ఆలోచనలు ఏప్రిల్ 30వ తేదీన నిర్వహించుకునే వందవ 'మన్ కీ బాత్'ను మరింత గుర్తుండేలా చేస్తాయి.
నా ప్రియమైన దేశప్రజలారా!ఇతరులకు సేవ చేసేందుకు తమ జీవితాలను అంకితం చేస్తున్న వేలాది మంది గురించి మనం 'మన్ కీ బాత్'లో మాట్లాడుకున్నాం. తమ పింఛన్ మొత్తాన్ని కూతుళ్ల చదువుల కోసం వెచ్చించే వారు చాలా మంది ఉన్నారు. కొందరు తమ జీవితాంతం సంపాదనను పర్యావరణం కోసం, జీవరాశుల సేవ కోసం వెచ్చిస్తారు.మన దేశంలోదాతృత్వం చాలా ఎక్కువగా ఉంది. ప్రజలు ఇతరుల సంతోషం కోసం తమ సర్వస్వాన్ని దానం చేయడానికి వెనుకాడరు. అందుకే మనకు చిన్నప్పటి నుంచి శిబి, దధీచి లాంటి అవయవదాతలు, దేహదాతల కథలు చెబుతుంటారు.
మిత్రులారా!ఈ ఆధునిక వైద్య విజ్ఞాన యుగంలోఅవయవ దానం ఒకరికి ప్రాణం పోయడానికి చాలా ముఖ్యమైన సాధనంగా మారింది. ఒక వ్యక్తి మరణానంతరం తన శరీరాన్ని దానం చేస్తే, దాని ద్వారా8 నుండి 9 మందికి కొత్త జీవితాన్ని పొందే అవకాశం ఏర్పడుతుందని చెబుతారు. దేశంలో కూడా అవయవ దానంపై అవగాహన పెరుగుతుండడం సంతోషించదగ్గ విషయం. 2013లో మన దేశంలో అవయవదానం కేసులు 5 వేల లోపే నమోదయ్యేవి. 2022 నాటికి ఈ సంఖ్య 15 వేలకు పైగా పెరిగింది. అవయవదానం చేసిన వ్యక్తులు గానీవారి కుటుంబాలుగానీ చేసింది చాలా పుణ్యం వచ్చే పని.
మిత్రులారా!ఇలాంటి ఉదాత్తమైన పని చేసే వ్యక్తుల ‘మనసులో మాట’ తెలుసుకోవాలని, దేశప్రజలతో కూడా పంచుకోవాలని నాకు చాలా కాలంగా కోరిక. కాబట్టి ఈ రోజు 'మన్ కీ బాత్' లో ఒక అందమైన పాప, ఆమె తల్లిదండ్రులు మనతో కలవబోతున్నారు. తండ్రి పేరు సుఖ్బీర్ సింగ్ సంధు, తల్లి పేరు సుప్రీత్ కౌర్. ఈ కుటుంబం పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో నివసిస్తుంది.అనేక మొక్కుల తర్వాతఆమెకు చాలా అందమైన పాప పుట్టింది. ఆమెకు ప్రేమగా ‘అబాబత్ కౌర్’ అని పేరు పెట్టారు. ‘అబాబత్’ అర్థం ఇతరుల సేవకు సంబంధించింది, ఇతరుల బాధలను తొలగించడానికి సంబంధించింది. ఆ పసిగుడ్డు కేవలం ముప్పై తొమ్మిది రోజుల వయస్సులోనే ఈ లోకాన్ని విడిచిపెట్టింది.కానీ సుఖ్బీర్ సింగ్ సంధు గారు, అతని భార్య సుప్రీత్ కౌర్ గారు, వారి కుటుంబం చాలా స్ఫూర్తిదాయకమైన నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం –ముప్పై తొమ్మిది రోజుల వయస్సున్న పసిగుడ్డు అవయవ దానం. ఇప్పుడు సుఖ్బీర్ సింగ్ గారు, ఆయన శ్రీమతి ఫోన్ లైన్లో మనతో ఉన్నారు. రండి…వాళ్ళతో మాట్లాడదాం.
ప్రధానమంత్రి గారు: సుఖ్బీర్ గారూ! నమస్తే.
సుఖ్బీర్ గారు :నమస్కారం గౌరవనీయ ప్రధాన మంత్రి గారూ... సత్ శ్రీ అకాల్
ప్రధానమంత్రి గారు : సత్ శ్రీ అకాల్ జీ, సత్ శ్రీ అకాల్ జీ. సుఖ్బీర్ గారూ...నేను ఈ రోజు 'మన్ కీ బాత్' గురించి ఆలోచిస్తుంటే ఎంతో ప్రేరణ కలిగించే అబాబత్ విషయాన్ని మీ నోటి నుండి వినాలని భావించాను. ఎందుకంటే ఇంట్లో బిడ్డ పుట్టుక ఎన్నో కలలను, సంతోషాలను తీసుకొస్తుంది. కానీ ఆ బిడ్డ ఇంత త్వరగా వెళ్లిపోతే ఆ బాధ తీవ్రతను నేను ఊహించగలను. మీరు నిర్ణయం తీసుకున్న విధానాన్ని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.
సుఖ్బీర్ గారు : సార్ దేవుడు మాకు చాలా మంచి బిడ్డను ఇచ్చాడు. చాలా అందమైన బొమ్మ మా ఇంటికి వచ్చింది. పుట్టిన వెంటనే తెలిసింది- బిడ్డ మెదడులో నరాల గుచ్ఛం ఉందని, దాని కారణంగా బిడ్డ గుండె పరిమాణం పెద్దదిగా అవుతుందని. బిడ్డ దృఢంగా, అందంగా ఉన్నా ఇలాంటి పెద్ద సమస్యతో జన్మించడమేంటని మేం ఆందోళన చెందాం. మొదటి 24 రోజులు బిడ్డ పూర్తిగా సాధారణంగా ఉన్నా అకస్మాత్తుగా బిడ్డ గుండె పనిచేయడం పూర్తిగామానేసింది. మేం వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యులు బిడ్డకు ప్రాణం పోశారు. కానీ ఇంత చిన్న వయస్సులో బిడ్డకు వచ్చిన ఇంత పెద్ద సమస్య- గుండెపోటును అర్థం చేసుకోవడానికి సమయం పట్టింది. చికిత్స కోసం బిడ్డను చండీగఢ్‌లోని పీజీఐకి తీసుకెళ్లాం. అక్కడ చికిత్స చేసేప్పుడు చిన్నారి ధైర్యంగా పోరాడింది. కానీ వ్యాధి ఎలాంటిదంటే చిన్న వయస్సులో చికిత్స సాధ్యం కాదు. బిడ్డను బతికించడానికి డాక్టర్లు చాలా ప్రయత్నించారు. ఒకవేళ ఆ బిడ్డ దాదాపు ఆరు నెలల దాకా ఉంటే ఆపరేషన్ చేయాలనే ఆలోచన ఉండవచ్చు. కానీ దేవుడు మరొకటి తలిచాడు. బిడ్డకు 39 రోజుల వయస్సు ఉన్నప్పుడు మళ్ళీ గుండెపోటు వచ్చిందని డాక్టర్ చెప్పారు. అప్పుడు నమ్మకం తగ్గిపోయింది. బిడ్డ పదేపదే ధైర్యంగా పోరాడడం చూశాం. బిడ్డ ఇక్కడికి రావడంలో ఏదో ప్రయోజనం ఉందని భార్యాభర్తలం ఏడుస్తూనే ఆ నిర్ణయానికి వచ్చాం. సరిగ్గా సమాధానమిచ్చాం. ఈ బిడ్డ అవయవాన్ని ఎందుకు దానం చేయకూడదని మేం అనుకున్నాం. దానివల్ల వేరొకరి జీవితంలోకి వెలుగు వస్తుందనుకున్నాం. పీజీఐ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ వారిని సంప్రదించాం. అంతచిన్న బిడ్డది కేవలం కిడ్నీ మాత్రమే తీసుకోవచ్చని వారు మార్గనిర్దేశం చేశారు. భగవంతుడు మాకు ధైర్యాన్ని ఇచ్చాడు. గురునానక్ సాహెబ్ తత్వం మా వెంట ఉంది. మేం ఈ నిర్ణయం తీసుకున్నాం.
ప్రధానమంత్రి గారు: మీరు గురువులు చెప్పిన బోధనలను ఆచరించి చూపించారు. నువ్వు సుప్రీత్ గారున్నారా? ఆమెతో మాట్లాడవచ్చా?
సుఖ్బీర్ గారు : సరే సార్.
సుప్రీత్ గారు: నమస్తే సార్
ప్రధానమంత్రి గారు : సుప్రీత్ గారూ... మీకు నేనునమస్కరిస్తున్నాను.
సుప్రీత్ గారు: నమస్కారం సార్. నమస్కారం సార్.. మీరు మాతో మాట్లాడటం మాకు చాలా గర్వకారణం సార్.
ప్రధానమంత్రి గారు : మీరు ఎంతో గొప్ప పని చేశారు. దేశం ఈ విషయాలన్నీ వింటే, ఇతరుల ప్రాణాలను రక్షించడానికి చాలా మంది ముందుకు వస్తారని నేను నమ్ముతున్నాను. ఇది అబాబత్ త్యాగం. ఇది చాలా గొప్పది.
సుప్రీత్ గారు: సార్…ఇది కూడా బహుశా గురునానక్ బాద్షా గారి నుండి వచ్చిన ఆశీర్వాదం కావచ్చు. అలాంటి నిర్ణయం తీసుకోవడానికి తగిన ధైర్యాన్ని గురునానక్ జీ ఇచ్చాడు.
ప్రధానమంత్రి గారు : గురువుల కృప లేకుండా ఏదీ జరగదు.
సుప్రీత్ గారు: ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా.
ప్రధానమంత్రి గారు : సుఖ్బీర్ గారూ.. మీరు ఆసుపత్రిలో ఉన్నప్పుడు... డాక్టర్ మీకు ఈ షాకింగ్ న్యూస్ చెప్పినప్పుడుమీరు, మీ భార్య ఆరోగ్యకరమైన మనస్సుతో ఇంత పెద్ద నిర్ణయం తీసుకోవడం గురువుల బోధనల ఫలితం. మీ మనస్సులో గొప్ప ఉదారమైన ఆలోచన. నిజానికి సాధారణ భాషలో అబాబత్ కి అర్థం సహకారం. ఈ పని పూర్తయిన క్షణం గురించి నేను వినాలనుకుంటున్నాను.
సుఖ్బీర్ గారు : సార్.. నిజానికి మా కుటుంబ స్నేహితురాలు ప్రియా గారు తన అవయవాలను దానం చేశారు. మేం ఆమె నుండి కూడా ప్రేరణ పొందాం. పార్థివ దేహంపంచభూతాలలో కలిసిపోతుందని ఆ సమయంలో మేం భావించాం. ఎవరైనా ఈ లోకం నుండి వెళ్ళిపోయినప్పుడు వారి శరీరాన్ని కాల్చివేయడమో పాతిపెట్టడమో చేస్తారు. కానీ ఆ అవయవాలు ఎవరికైనా ఉపయోగపడితేఅది మంచి పని. భారతదేశంలో విజయవంతంగా మార్పిడి చేసిన అవయవాలను దానం చేసిన అతి పిన్న వయస్కురాలు మీ కూతురేనని డాక్టర్లు మాకు చెప్పినప్పుడు మరింత గర్వపడ్డాం. ఇంత వయసొచ్చినా ఇప్పటివరకూ మా తల్లిదండ్రులకు మంచి పేరు తేలేకపోయాం. కానీ మా బిడ్డ కొన్ని రోజుల్లోనే మాకు పేరు తెచ్చింది. ఈరోజు మీతో మాట్లాడడం అంతకంటే గొప్ప విషయం. మాకు చాలా గర్వంగా ఉంది.
ప్రధానమంత్రి గారు : సుఖ్బీర్ గారూ.. ఈ రోజు మీ కుమార్తె శరీరంలోని ఒక భాగం మాత్రమే జీవించి ఉన్నట్టు కాదు.. మీ కుమార్తె మానవత్వ అమర గాథలో అమర యాత్రికురాలిగా మారింది. తన శరీరంలోని ఒక భాగం ద్వారా ఆ పాప నేటికీ జీవించి ఉంది. ఈ గొప్ప పనికినేను మిమ్మల్ని, మీ భార్యను, మీ కుటుంబాన్ని అభినందిస్తున్నాను.
సుఖ్బీర్ గారు : ధన్యవాదాలు సార్.
స్నేహితులారా!అవయవ దానంలో ఉన్న అతి పెద్ద భావన ఏమిటంటేఈ లోకం నుండి వెళ్లిపోతున్నప్పుడు కూడా ఒకరి ప్రాణాన్ని కాపాడాలి. అవయవ దానం కోసం ఎదురుచూసేవారికి ప్రతి క్షణం నిరీక్షణ ఎంత కష్టమో తెలుసు. అటువంటి పరిస్థితిలోఒక అవయవ దాతనో శరీర దాతనో లభించినప్పుడు వారిలో భగవంతుని రూపం మాత్రమే కనిపిస్తుంది.జార్ఖండ్ నివాసి స్నేహలతా చౌధరి గారు కూడా దేవుడిగా మారి ఇతరులకు జీవితాన్ని ఇచ్చారు. 63 ఏళ్ల స్నేహలతా చౌధరి తన గుండెను, కిడ్నీని, కాలేయాన్ని దానం చేశారు. ఈ రోజు 'మన్ కీ బాత్'లో ఆమె కుమారుడు అభిజిత్ చౌధరి గారు మాతో ఉన్నారు. వారి మాటలు విందాం.
ప్రధాన మంత్రి గారు: అభిజిత్ గారూ... నమస్కారం.
అభిజిత్ గారు: నమస్కారాలు సార్.
ప్రధాన మంత్రి గారు: అభిజిత్ గారూ... మీకు జన్మనిచ్చి, మీకు జీవితాన్ని అందించిన తల్లిచాలా మందికి జీవితాన్ని ఇచ్చి మరణించారు. ఒక కుమారుడిగా మీరు గర్వపడుతుండవచ్చు కదా..
అభిజిత్ గారు: అవును సార్.
ప్రధానమంత్రి గారు: మీ అమ్మ గురించి కొంచెం చెప్పండి. ఏ పరిస్థితుల్లో అవయవదానం నిర్ణయం తీసుకున్నారు?
అభిజిత్ గారు: జార్ఖండ్‌లో సరాయికెలా అనే ఒక చిన్న ఊరుంది. అక్కడ మా అమ్మానాన్నలు ఉండేవారు. గత ఇరవై ఐదేళ్లుగా నిరంతరాయంగా మార్నింగ్ వాక్ చేసే అలవాటు ప్రకారం మా అమ్మ ఉదయం 4 గంటలకు మార్నింగ్ వాక్ కు బయలుదేరారు. ఆ సమయంలో ఓ ద్విచక్రవాహనం ఆమెను వెనుక నుంచి ఢీకొనడంతో ఆమె ఒక్కసారిగా కిందపడిపోయింది. తలకు బలమైన గాయమైంది. వెంటనే ఆమెను సరాయికెలాలోని పెద్దాసుపత్రికి తీసుకెళ్లాం. అక్కడ వైద్యుడు ఆమెకు కట్టు కట్టాడు. కాని ఆమెకు తీవ్ర రక్తస్రావం జరిగింది. స్పృహలో లేదు. వెంటనే టాటా మెయిన్ హాస్పిటల్ కి తీసుకెళ్లాం. అక్కడ సర్జరీ చేశారు. 48 గంటల అబ్జర్వేషన్ తర్వాత ఆమె బతికే అవకాశాలు చాలా తక్కువని డాక్టర్ చెప్పారు. తర్వాత ఆమెను విమానంలో ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకొచ్చాం. దాదాపు 7-8 రోజుల పాటు ఇక్కడ చికిత్స పొందారు.ఆ తర్వాత పరిస్థితి బాగానే ఉండేది. కానీ ఒక్కసారిగా రక్తపోటు బాగా పడిపోయింది. బ్రెయిన్ డెత్ అయిందని ఆ తర్వాత తెలిసింది. అప్పుడు డాక్టర్ మళ్ళీ అవయవ దానం గురించి, నియమ నిబంధనల గురించి మాకు చెప్పారు. అవయవ దానం లాంటివి ఉన్నాయని మా నాన్నగారికి చెప్పలేక పోవచ్చని అనుకున్నాం. ఈ విషయాన్ని ఆయన జీర్ణించుకోలేరని మాకనిపించింది. కాబట్టి ఇలాంటిది ఒకటి ఉంటుందన్న విషయాన్ని ఆయన మనసులోంచి తీసేద్దామనుకున్నాం. అవయవ దానం గురించి చర్చ జరుగుతుందని మేం చెప్పగానే ఆయన “ఇది అమ్మకు కూడా ఇష్టం. మనం దీన్ని చేయాలి” అని చెప్పాడు. అమ్మ బతకదని తెలిసి అప్పటివరకు చాలా నిరాశలో ఉన్నాం. కానీ ఈ అవయవ దానం చర్చ మొదలు కాగానే ఆ నిరాశ పాజిటివ్ దిశకు మళ్ళింది. అలా చాలా మంచి పాజిటివ్ వాతావరణంలోకి వచ్చాం. అలా ఉండగానే రాత్రి 8 గంటలకు కౌన్సెలింగ్ జరిగింది. రెండో రోజు అవయవదానం చేశాం.ఇంతకుముందు నేత్ర దానం మొదలైన సామాజిక కార్యక్రమాలలో ఆమె చాలా చురుకుగా ఉండేదన్న మా అమ్మ ఆలోచనలు గుర్తొచ్చాయి. బహుశా మేం ఈ ఆలోచనతోనే ఇంత పెద్ద పని చేయగలిగాం. ఈ విషయంలో మా నాన్న నిర్ణయం తీసుకోవడం వల్ల ఇది సాధ్యమైంది.
ప్రధానమంత్రి గారు: ఎంత మందికి ఆమె అవయవాలు ఉపయోగపడ్డాయి?
అభిజిత్ గారు: ఆమె గుండె, రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కళ్ళు దానం చేశాం. నలుగురు వ్యక్తుల ప్రాణాలు దక్కాయి. ఇద్దరికి కళ్ళు లభించాయి.
ప్రధానమంత్రి గారు: అభిజిత్ గారూ... మీ అమ్మానాన్న ఇద్దరూ గౌరవించటానికి అర్హులు. నేను వారికి నమస్కరిస్తున్నాను. ఇంత పెద్ద నిర్ణయంవైపు మీ నాన్న మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యులను నడిపించారు. ఇది నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. తల్లంటే తల్లే అని నేను నమ్ముతున్నాను. తల్లి స్వయం ప్రేరణ పొందుతుంది. తల్లి నేర్పిన సంప్రదాయాలు తరతరాలుగా గొప్ప శక్తిగా మారతాయి. అవయవదానానికి మీ అమ్మ ప్రేరణ ఈరోజు దేశమంతటికీ చేరుతోంది. పవిత్రమైన ఈ గొప్ప పని విషయంలో నేను మీ మొత్తం కుటుంబాన్ని అభినందిస్తున్నాను. ధన్యవాదాలు అభిజిత్ గారూ.. మీ నాన్నకి మా నమస్కారాలు తెలియజేయండి.
అభిజిత్ గారు: తప్పకుండా సార్. ధన్యవాదాలు.
స్నేహితులారా! 39 రోజుల అబాబత్ కౌర్ కానీయండి. 63 ఏళ్ల స్నేహలతా చౌధరి కానీయండి. వారిలాంటి దాతలు మనకు జీవితం ప్రాముఖ్యతను తెలియజెప్పుతారు. మన దేశంలోఆరోగ్యవంతమైన జీవితాన్ని ఆశించి, అవయవ దాత కోసం ఎదురుచూసేవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు.అవయవ దానాన్ని సులభతరం చేయడానికి, ప్రోత్సహించడానికి ఒక విధాన రూపకల్పన జరుగుతుండడం నాకు ఆనందాన్నిస్తోంది. ఈ దిశలో అవయవ స్వీకర్త ఆయా రాష్ట్రాలలోనే నివాసం ఉండాలన్న నిబంధనను తొలగించాలని కూడా నిర్ణయించారు. అంటే.. ఇప్పుడు రోగి దేశంలోని ఏ రాష్ట్రానికైనా వెళ్లి అవయవాన్ని స్వీకరించడానికి నమోదు చేసుకోగలుగుతారు.అవయవదానానికి 65 ఏళ్లలోపు వయోపరిమితిని రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ ప్రయత్నాల మధ్యఅవయవ దాతలు గరిష్ట సంఖ్యలో ముందుకు రావాలని నేను దేశప్రజలను కోరుతున్నాను. మీ ఒక్క నిర్ణయం ఎంతో మంది ప్రాణాలను కాపాడుతుంది. జీవితాన్ని నిలబెట్టగలదు.
నా ప్రియమైన దేశప్రజలారా!ఇది నవరాత్రుల సమయం. శక్తిని ఆరాధించే సమయం. నేడుభారతదేశ సామర్థ్యం కొత్త పుంతలు తొక్కుతోంది. అందులో మన మహిళా శక్తి పాత్ర కీలకం. ఇటీవల ఇలాంటి ఉదాహరణలు చాలానే మన ముందుకు వచ్చాయి. ఆసియాలోనే తొలి మహిళా లోకో పైలట్ సురేఖా యాదవ్ గారిని మీరు సోషల్ మీడియాలో చూసి ఉంటారు.వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు తొలి మహిళా లోకో పైలట్‌గా కూడా సురేఖ గారు మరో రికార్డు సృష్టించారు. ఈ నెలలోనే నిర్మాత గునీత్ మోంగా గారు, దర్శకుడు కార్తికీ గొంజాల్విస్ గారు తమ డాక్యుమెంటరీ 'ఎలిఫెంట్ విస్పరర్స్' కు ఆస్కార్ అవార్డును గెలుచుకుని దేశానికి పేరు తెచ్చారు. భాభా అణు పరిశోధనాకేంద్ర శాస్త్రవేత్త, సోదరి జ్యోతిర్మయి మొహంతి గారు కూడా దేశానికి మరో ఘనతను సాధించారు.జ్యోతిర్మయి గారు కెమిస్ట్రీ, కెమికల్ ఇంజనీరింగ్ విభాగంలో ఐ.యు.పి.ఏ.సి. (IUPAC)నుండి ప్రత్యేక పురస్కారం పొందారు. ఈ ఏడాది ప్రారంభంలో భారత అండర్-19 మహిళా క్రికెట్ జట్టు టీ-20 ప్రపంచకప్ గెలిచి కొత్త చరిత్ర సృష్టించింది.రాజకీయాలను పరిశీలిస్తే నాగాలాండ్‌లో కొత్త విశేషం చోటుచేసుకుంది. నాగాలాండ్‌లో 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలు గెలిచి అసెంబ్లీకి చేరుకున్నారు. వారిలో ఒకరికి నాగాలాండ్ ప్రభుత్వంలో మంత్రి పదవి కూడా లభించింది. అంటే ఆ రాష్ట్ర ప్రజలకు తొలిసారిగా మహిళా మంత్రి సేవలను పొందే అవకాశం లభించింది.
మిత్రులారా!కొద్దిరోజుల క్రితంటర్కీలో విధ్వంసకర భూకంపం తర్వాత ప్రజలకు సహాయం చేయడానికి వెళ్లిన ఆ ధైర్యవంతులైన కుమార్తెలను నేను కూడా కలిశాను. వీరందరినీ ఎన్డీఆర్ఎఫ్ స్క్వాడ్‌లో చేర్చారు. వారి ధైర్యకౌశల్యాలకు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఐక్యరాజ్యసమితి మిషన్ కింద శాంతిసేనలో మహిళలు మాత్రమే ఉండే ప్లాటూన్‌ను కూడా భారత్ ఏర్పాటు చేసింది.
ఈరోజు మన త్రివిధ సైనిక దళాల్లో దేశ ఆడపడుచులు తమ శౌర్య పతాకాన్ని ఎగురవేస్తున్నారు. గ్రూప్ కెప్టెన్ శాలిజా ధామి యుద్ధ విభాగంలో కమాండ్ అపాయింట్మెంట్ పొందిన మొదటి మహిళా ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్‌గా నిలిచారు. ఆమెకు దాదాపు మూడు వేల గంటల విమానయాన అనుభవం ఉంది. అదేవిధంగా సియాచిన్‌లో నియమితులైన తొలి మహిళా అధికారిగా భారత ఆర్మీ కెప్టెన్ శివ చౌహాన్ నిలిచారు.ఉష్ణోగ్రత మైనస్ అరవై (-60) డిగ్రీలకు పడిపోతున్న సియాచిన్‌లో శివ మూడు నెలల పాటు ఉంటారు.
మిత్రులారా!ఈ జాబితా చాలా పొడవుగా ఉంది. అందరి గురించీ ఇక్కడ చర్చించడం కష్టం. అటువంటి మహిళలు, మన కుమార్తెలునేడు భారతదేశానికి, భారతదేశస్వప్నాలకు శక్తిని ఇస్తున్నారు. ఈ నారీశక్తి వికసిత భారతావనికి ప్రాణవాయువు.
నా ప్రియమైన దేశప్రజలారా!ఈ రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా పరిశుభ్రమైన శక్తి వనరులు, పునరుత్పాదక ఇంధనం గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. నేను ప్రపంచంలోని ఇతర ప్రాంతాల ప్రజలను కలిసినప్పుడువారు ఖచ్చితంగా ఈ రంగంలో భారతదేశం సాధించిన అద్భుత విజయం గురించి మాట్లాడతారు.ముఖ్యంగా సౌరశక్తి రంగంలో భారత్ వేగంగా ముందుకు సాగడం ఒక పెద్ద విజయం. భారతదేశ ప్రజలకు శతాబ్దాలుగా సూర్యునితో ప్రత్యేక సంబంధం ఉంది. సూర్యుని శక్తి గురించి మనకున్న శాస్త్రీయ అవగాహన, సూర్యుడిని పూజించే సంప్రదాయాలు ఇతర ప్రాంతాలలో చాలా అరుదుగా కనిపిస్తాయి. ఈ రోజు ప్రతి దేశవాసీ సౌరశక్తి ప్రాముఖ్యతను అర్థం చేసుకుంటున్నందుకు నేను సంతోషిస్తున్నాను. పరిశుభ్రమైన శక్తి వనరులకు కూడా సహకరించాలని భావిస్తున్నారు. 'సబ్ కా ప్రయాస్' లోని ఈ స్ఫూర్తి నేడు భారతదేశ సోలార్ మిషన్‌ను ముందుకు నడిపిస్తోంది. మహారాష్ట్రలోని పూణేలోఅటువంటి అద్భుతమైన ప్రయత్నం నా దృష్టిని ఆకర్షించింది. ఇక్కడి ఎం ఎస్ ఆర్- ఆలివ్ హౌసింగ్ సొసైటీ ప్రజలు ఇప్పుడు సొసైటీలో తాగునీరు, లిఫ్ట్, లైట్లు వంటి సాధారణ అవసరాలకు సౌరశక్తిని మాత్రమే ఉపయోగించాలని నిర్ణయించుకున్నారు.దీని తర్వాత అందరూ కలిసి ఈ సొసైటీలో సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ సోలార్ ప్యానెళ్ల నుంచి ఏటా దాదాపు 90వేల కిలోవాట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. దీంతో ప్రతి నెలా దాదాపు 40 వేల రూపాయల డబ్బు ఆదా అవుతోంది. సొసైటీలోని ప్రజలందరూ ఈ పొదుపు ప్రయోజనం పొందుతున్నారు.
మిత్రులారా!డామన్ డయ్యూ లోని డయ్యూప్రత్యేక జిల్లా ప్రజలు కూడా పూణే లాగా అద్భుతమైన పని చేశారు. డయ్యూ సోమనాథ్ సమీపంలో ఉందని మీకు తెలిసి ఉండవచ్చు. పగటి వేళల్లో వంద శాతం క్లీన్ ఎనర్జీని అన్ని అవసరాలకు ఉపయోగిస్తున్న భారతదేశంలోని మొదటి జిల్లాగా డయ్యూ నిలిచింది. డయ్యూ సాధించిన ఈ విజయానికి మంత్రం కూడా అందరి కృషి.ఒకప్పుడు విద్యుదుత్పత్తికి వనరుల కొరత ఉండేది. ఈ సమస్యను పరిష్కరించడానికి ప్రజలు సౌరశక్తిని ఎంచుకున్నారు. ఇక్కడ బంజరు భూమితో పాటు అనేక భవనాలపై సౌర ఫలకాలను ఏర్పాటు చేశారు. ఈ ప్యానెళ్ల నుంచి డయ్యూలో పగటిపూట అవసరమైన దానికంటే ఎక్కువ విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఈ సోలార్ ప్రాజెక్టు కారణంగా విద్యుత్ కొనుగోలుతో అయ్యే దాదాపు 52 కోట్ల రూపాయల ఖర్చు మిగిలింది. దీని వల్ల పర్యావరణం కూడా ఎంతో ఆదా అయింది.
మిత్రులారా!వారు పూణే, డయ్యూలో చేసి చూపించినటువంటి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా చాలా చోట్ల జరుగుతున్నాయి. పర్యావరణం, ప్రకృతి పట్ల భారతీయులమైన మనం ఎంత సున్నితంగా ఉంటామో, మన దేశం భవిష్యత్ తరాల పట్ల ఎంత స్పృహతో ఉందో ఇది తెలియజేస్తుంది. అలాంటి ప్రయత్నాలన్నింటినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! మన దేశంలోకాలక్రమేణాపరిస్థితులకు అనుగుణంగాఅనేక సంప్రదాయాలు అభివృద్ధి చెందుతాయి. ఈ సంప్రదాయాలు మన సంస్కృతికి బలాన్ని పెంపొందిస్తాయి. ప్రతిరోజూ కొత్త శక్తిని కూడా ఇస్తాయి. కొన్ని నెలల క్రితం కాశీలో అలాంటి సంప్రదాయం ఒకటి మొదలైంది. కాశీ-తమిళ సంగమం సమయంలోకాశీ-తమిళ ప్రాంతాల మధ్య శతాబ్దాల నాటి చారిత్రక, సాంస్కృతిక సంబంధాలను ఉత్సవంగా జరుపుకున్నారు.'ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్' స్ఫూర్తి మన దేశానికి బలాన్నిస్తుంది. మనం ఒకరి గురించి ఒకరం తెలుసుకున్నప్పుడు, ఒకరి నుండి ఒకరం నేర్చుకున్నప్పుడు ఈ ఏకత్వ భావన మరింత బలపడుతుంది. ఈ ఐక్యతా స్ఫూర్తితో వచ్చే నెలలో గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో 'సౌరాష్ట్ర-తమిళ సంగమం' జరుగుతుంది. 'సౌరాష్ట్ర-తమిళ సంగమం' ఏప్రిల్ 17వ తేదీ నుండి30వ తేదీ వరకు కొనసాగుతుంది.గుజరాత్‌లోని సౌరాష్ట్రకు తమిళనాడుతో సంబంధం ఏమిటని'మన్ కీ బాత్' శ్రోతలు కొందరు ఆలోచిస్తుండవచ్చు. నిజానికిశతాబ్దాల క్రితమే సౌరాష్ట్రకు చెందిన చాలా మంది తమిళనాడులోని వివిధ ప్రాంతాల్లో స్థిరపడ్డారు.వీరికి ఇప్పటికీ 'సౌరాష్ట్రీ తమిళులు'గానే గుర్తింపు ఉంది.నేటికీ వారిలో సౌరాష్ట్రఆహారపు అలవాట్లు, జీవనశైలి, సామాజిక ఆచారాలు చూడవచ్చు. ఈ వేడుకకు సంబంధించి తమిళనాడుకు చెందిన చాలామంది నన్ను అభినందిస్తూ లేఖలు రాశారు.మధురైలో నివసించే జయచంద్రన్ గారు చాలా భావోద్వేగంతో కూడిన విషయాన్ని రాశారు. "వెయ్యి సంవత్సరాల తర్వాత, ఈ సౌరాష్ట్ర-తమిళ సంబంధాల గురించి ఎవరైనా ఆలోచించారా అని సౌరాష్ట్ర నుండి వచ్చి తమిళనాడులో స్థిరపడిన ప్రజలను అడిగాన"ని ఆయన రాశారు. జయచంద్రన్ గారి మాటలు వేలాది తమిళ సోదర సోదరీమణుల భావాల వ్యక్తీకరణ.
మిత్రులారా!అస్సాంకి సంబంధించిన ఒక వార్త గురించి 'మన్ కీ బాత్' శ్రోతలకు తెలియజేయాలనుకుంటున్నాను. ఇది 'ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్' స్ఫూర్తిని కూడా బలపరుస్తుంది. వీర్ లాసిత్ బోర్ఫుకన్ గారి400వ జయంతి వేడుకలు జరుపుకుంటున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ధైర్యవంతుడైన లాసిత్ బోర్ఫుకన్ నిరంకుశ మొఘల్ సుల్తానుల చేతుల నుండి గౌహతిని విముక్తి చేశాడు. ఈ మహాయోధుని అలుపెరగని ధైర్యసాహసాలు నేడు దేశానికి పరిచయం అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం లాసిత్ బోర్ఫుకన్ జీవితంపై వ్యాస రచన కోసం ప్రచారం మొదలైంది. ఇందులో దాదాపు 45 లక్షల మంది వ్యాసాలు పంపారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు అది గిన్నిస్ రికార్డ్‌గా నిలిచిందని కూడా తెలిస్తే మీరు సంతోషిస్తారు.వీర్ లాసిత్ బోర్ఫుకన్ పై రాసిన ఈ వ్యాసాలలో దాదాపు 23 విభిన్న భాషల్లో రాసిన వ్యాసాలుండడం చాలా సంతోషకరమైన విషయం. ఇందులోఅస్సామీ భాష కాకుండాప్రజలు హిందీ, ఇంగ్లీష్, బంగ్లా, బోడో, నేపాలీ, సంస్కృతం, సంతాలి వంటి భాషలలో వ్యాసాలు పంపారు.ఈ ప్రయత్నంలో భాగమైన ప్రతి ఒక్కరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! కాశ్మీర్ లేదా శ్రీనగర్ విషయానికి వస్తే, మనకు ముందుగా గుర్తుకు వచ్చేది అక్కడి మైదానాలు, దాల్ సరస్సు. మనలో ప్రతి ఒక్కరూ దాల్ సరస్సు వీక్షణను ఆస్వాదించాలని కోరుకుంటారు. అయితే దాల్ సరస్సులో మరో ప్రత్యేకత ఉంది. దాల్ సరస్సు రుచికరమైన తామరకాడలకు కూడా ప్రసిద్ధి చెందింది. దేశంలోని వివిధ ప్రాంతాలలో తామర కాడలను వివిధ పేర్లతో గుర్తిస్తారు. కాశ్మీర్లో వాటిని నాదరూ అంటారు. కాశ్మీర్ నాదరూకు డిమాండ్ నిరంతరం పెరుగుతోంది. ఈ డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని దాల్ సరస్సులో నాదరూ సాగు చేస్తున్న రైతులు ఎఫ్పీఓగా ఏర్పడ్డారు. దాదాపు 250 మంది రైతులు ఈ FPOలో చేరారు. నేడు ఈ రైతులు తమ నాదరూని విదేశాలకు పంపడం ప్రారంభించారు. కొంతకాలం కిందట ఈ రైతులు రెండులోడుల నాదరూని యుఎఇకి పంపారు. ఈ విజయం కాశ్మీర్‌కు పేరు తీసుకురావడమే కాకుండా వందలాది మంది రైతుల ఆదాయాన్ని కూడా పెంచింది.
మిత్రులారా!కాశ్మీర్ ప్రజల వ్యవసాయానికి సంబంధించిన అలాంటి ఒక ప్రయత్నం ఈ రోజుల్లో దాని విజయ పరిమళాన్ని వెదజల్లుతోంది. విజయ పరిమళమని నేనెందుకు అంటున్నానని మీరు ఆలోచిస్తుండవచ్చు. ఈ విషయం పరిమళానికి సంబంధించింది. సుగంధానికి సంబంధించిన విషయమే! నిజానికిజమ్మూ కాశ్మీర్‌లోని దోడా జిల్లాలో 'భదర్వాహ్' అనే పట్టణం ఉంది. ఇక్కడి రైతులు దశాబ్దాలుగా సంప్రదాయ మొక్కజొన్న సాగు చేస్తుండగాకొంత మంది రైతులు అందుకు భిన్నంగా ఏదైనా చేయాలని భావించారు. వారు ఫ్లోరీ కల్చర్ అంటే పూల సాగు వైపు మొగ్గు చూపారు. నేడుదాదాపు రెండున్నర వేల మంది రైతులు ఇక్కడ లావెండర్ ను సాగు చేస్తున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వ సుగంధ మిషన్ నుండి కూడా సహకారం లభించింది. ఈ కొత్త సాగు రైతుల ఆదాయాన్ని బాగా పెంచింది. నేడు లావెండర్‌తో పాటు వారి విజయ పరిమళం కూడా సుదూరప్రాంతాలకు వ్యాపిస్తోంది.
మిత్రులారా!కాశ్మీర్ గురించి మాట్లాడేటప్పుడు, కమలం గురించి మాట్లాడేటప్పుడు, పువ్వుల గురించి మాట్లాడేటప్పుడు, సుగంధ పరిమళం గురించి మాట్లాడేటప్పుడు- తామర పువ్వుపై కూర్చున్న శారదామాత గుర్తుకు రావడం చాలా సహజం. కొన్ని రోజుల క్రితమేకుప్వారాలో శారదామాత భవ్య ఆలయాన్ని ప్రారంభించారు. గతంలో శారదా పీఠాన్ని సందర్శించేందుకు వెళ్లే మార్గంలోనే ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయ నిర్మాణానికి స్థానికులు ఎంతో సహకరించారు. ఈ శుభ కార్యానికి జమ్మూ కాశ్మీర్ ప్రజలకు నేను చాలా చాలా అభినందనలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!ఈసారి 'మన్ కీ బాత్'లో ఇంతే. తర్వాతిసారి 'మన్ కీ బాత్' వందవ ఎపిసోడ్లో కలుద్దాం. మీరందరూ మీ సూచనలను తప్పనిసరిగా పంపండి. ఈ మార్చి నెలలో మనం హోలీ నుండి నవరాత్రి వరకు అనేక పర్వాలు, పండుగలసందడితో ఉన్నాం. పవిత్ర రంజాన్ మాసం కూడా ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో శ్రీరామ నవమి మహాపర్వదినం కూడా వస్తోంది. తర్వాతమహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ కూడా వస్తాయి.ఏప్రిల్ నెలలో మనం భారతదేశంలోని ఇద్దరు గొప్ప వ్యక్తుల జయంతిని కూడా జరుపుకుంటాం. ఆ ఇద్దరు మహాపురుషులు మహాత్మా జ్యోతిబా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్. సమాజంలోని వివక్షను తొలగించేందుకు ఈ మహానుభావులిద్దరూ అపూర్వమైన కృషి చేశారు.స్వాతంత్య్ర అమృతకాలంలో ఉన్న ఈ రోజు మనం అలాంటి మహనీయుల నుండి నేర్చుకోవాలి. వారి నుండి నిరంతరం స్ఫూర్తిని పొందాలి.మన కర్తవ్యానికి అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. మిత్రులారా!ఈ సమయంలో కరోనా కూడా కొన్ని చోట్ల పెరుగుతోంది. అందుకే మీరందరూ జాగ్రత్తలు తీసుకోవాలి. పరిశుభ్రతపై కూడా శ్రద్ధ వహించండి. వచ్చే నెలమన్ కీ బాత్ 100వ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పండి. ధన్యవాదాలు. నమస్కారం.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. 'మన్ కీ బాత్' 98వ ఎపిసోడ్లో మీ అందరితో మాట్లాడడం నాకు చాలా సంతోషంగా ఉంది. వందో భాగం దిశగా సాగుతున్న ఈ ప్రయాణంలో ప్రజల భాగస్వామ్యాన్ని వ్యక్తపరిచేందుకు అద్భుతమైన వేదికగా'మన్ కీ బాత్'నుమీరందరూమార్చుకున్నారు. ప్రతి నెలాలక్షల్లో వచ్చే సందేశాల్లో చాలా మంది మనసులో మాట- మన్ కీ బాత్- నాకు చేరుతుంది. మీ మనస్సు శక్తి మీకు తెలుసు. అదేవిధంగాసమాజ శక్తితో దేశం శక్తి ఎలా పెరుగుతుందో మనం'మన్ కీ బాత్' కార్యక్రమంలోని వివిధ భాగాలలో చూశాం. అర్థం చేసుకున్నాం. ఇది నేను అనుభవించాను. స్వీకరించాను. 'మన్ కీ బాత్'లో భారతీయసంప్రదాయ క్రీడలను ప్రోత్సహించే విషయం మాట్లాడిన రోజు నాకు గుర్తుంది. ఆ సమయంలో- వెంటనే-భారతీయ క్రీడలతో అనుసంధానమయ్యేందుకు, వాటిని ఆస్వాదించేందుకు, నేర్చుకునేందుకు దేశంలో ఒక చైతన్యం పెల్లుబికింది. 'మన్ కీ బాత్'లో భారతీయ బొమ్మల గురించి మాట్లాడినప్పుడుదేశ ప్రజలు దాన్ని కూడా ప్రోత్సహించారు. ఇప్పుడు భారతీయ బొమ్మల విషయంలో విదేశాల్లో కూడా పెరుగుతున్న డిమాండ్ వాటిపై పెరుగుతోన్న వ్యామోహాన్ని తెలియజేస్తుంది. మనం'మన్ కీ బాత్'లో భారతీయ కథా శైలి గురించి మాట్లాడినప్పుడువాటి కీర్తి కూడా చాలా దూరం వెళ్ళింది. భారతీయ కథా కథనాల వైపు ప్రజలు మరింతగా ఆకర్షితులవుతున్నారు.
మిత్రులారా!సర్దార్ పటేల్ జయంతి – అంటే 'ఐక్యతా దినోత్సవం' సందర్భంగా మనం'మన్ కీ బాత్'లో మూడు పోటీల గురించి మాట్లాడుకోవడం మీకు గుర్తుండే ఉంటుంది. దేశభక్తి గీతాలు, లాలి పాటలు, ముగ్గులకు సంబంధించిన పోటీలవి. దేశవ్యాప్తంగా 700లకు పైగా జిల్లాల నుంచి 5 లక్షల మందికి పైగా ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పిల్లలు, పెద్దలు, వృద్ధులు- అందరూ ఇందులో ఉత్సాహంగా పాల్గొని 20కి పైగా భాషల్లో తమ ఎంట్రీలను పంపారు.ఈ పోటీల్లో పాల్గొన్న వారందరికీ నా అభినందనలు. మీలో ప్రతి ఒక్కరూ ఒక ఛాంపియన్, కళా సాధకులు. మన దేశంలోని వైవిధ్యం, సంస్కృతి పట్ల ప్రేమను మీరందరూ నిరూపించారు.
మిత్రులారా!ఈ సందర్భంగా నాకు లతా మంగేష్కర్ గారు- లతా దీదీ గుర్తుకు రావడం చాలా సహజం. ఎందుకంటే ఈ పోటీ ప్రారంభమైన రోజులతా దీదీ ట్వీట్ చేసి, ఖచ్చితంగా ఈ పోటీల్లో పాల్గొనాలని దేశ ప్రజలను కోరారు.
మిత్రులారా!లాలిపాటల రచన పోటీలో ప్రథమ బహుమతిని కర్ణాటకలోని చామరాజనగర్ జిల్లాకు చెందిన బి.ఎం. మంజునాథ్ పొందారు. కన్నడలో రాసిన ‘మలగు కంద’ అనే లాలిపాటకు ఆయనకు ఈ పురస్కారం లభించింది. తన తల్లి,నానమ్మ పాడిన లాలి పాటల నుండి ఆయన దీన్ని రాసేందుకు ప్రేరణ పొందారు. ఇది విని మీరు కూడా ఆనందిస్తారు.
(కన్నడసౌండ్ క్లిప్ – 35 సెకన్లు- తెలుగు అనువాదం)
"నిదురపో.. నిదురపో.. నా చిట్టి పాపా!
నా తెలివైన ప్రియతమా… నిదురపో
రోజు గడిచిపోయింది
చీకటై పోయింది
నిద్రాదేవి వస్తుంది-
నక్షత్రాల తోట నుండి,
కలలను కోసుకొస్తుంది
నిదురపో.. నిదురపో..
జోజో...జో..జో..
జోజో...జో..జో.."
అస్సాంలోని కామరూప్ జిల్లాకు చెందిన దినేష్ గోవాలా ఈ పోటీలో ద్వితీయ బహుమతిని గెలుచుకున్నారు. ఆయన రాసిన లాలిపాటలో స్థానిక మట్టి, లోహ పాత్రలను తయారు చేసే కళాకారుల ప్రసిద్ధ చేతిపనుల ముద్ర ఉంది.
(అస్సామీస్ సౌండ్ క్లిప్ – 35 సెకన్లు- తెలుగు అనువాదం)
సంచి తెచ్చాడుకుమార్ దాదా
సంచిలో ఏముంది?
కుమ్మరి సంచి తెరిచి చూస్తే
సంచిలో ఉంది అందమైన గిన్నె!
మా బొమ్మ కుమ్మరిని అడిగింది
ఈ చిన్న గిన్నె ఎలా ఉందని!
గీతాలు, లాలిపాటల్లా ముగ్గుల పోటీ కూడా బాగా ప్రాచుర్యం పొందింది. ఇందులో పాల్గొన్నవారు ఒకరికి మించి మరొకరు అందమైన ముగ్గులను పంపారు. ఇందులో పంజాబ్‌కు చెందిన కమల్ కుమార్ గారు విజేతగా నిలిచారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్, అమర వీరుడు భగత్ సింగ్ ల చాలా అందమైన రంగోలీని కమల్ కుమార్ గారు తయారు చేశారు.మహారాష్ట్రలోని సాంగ్లీకి చెందిన సచిన్ నరేంద్ర అవ్సారి గారు జలియన్ వాలా బాగ్- దాని ఊచకోత, షహీద్ ఉధమ్ సింగ్ ధైర్యాన్ని తన రంగోలీలో ప్రదర్శించారు. గోవా నివాసి గురుదత్ వాంటెకర్ గారు- గాంధీజీ రంగోలీని తయారుచేశారు. పుదుచ్చేరికి చెందిన మాలతీసెల్వం గారు కూడా ఎందరో గొప్ప స్వాతంత్ర్య సమరయోధులపై దృష్టి సారించారు.
దేశభక్తి గీతాల పోటీ విజేత టి. విజయ దుర్గ గారు ఆంధ్ర ప్రదేశ్ కు చెందినవారు. ఆమె తెలుగులో తన ఎంట్రీని పంపారు. ఆమె తన ప్రాంతంలోని ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు నరసింహారెడ్డి గారి నుండి ఎంతో ప్రేరణ పొందారు. విజయ దుర్గ గారి ఎంట్రీలోని ఈ భాగాన్ని కూడా మీరు వినండి.
(Telugu Sound Clip (27 seconds) HINDI అనువాదానికి తెలుగు రూపం)(ఇది బహుశా అవసరం ఉండదు)
రేనాడు ప్రాంత వీరా!
ఓ వీర నరసింహా!
భారత స్వాతంత్ర్య పోరాటానికి అంకురానివి!
అంకుశానివి!
ఆంగ్లేయుల అన్యాయమైన
నిరంకుశ దమన కాండను చూసి
మీ రక్తం మండింది
మంటలు లేచాయి!
రేనాడు ప్రాంత వీరా!
ఓ వీర నరసింహా!
తెలుగు తర్వాత ఇప్పుడు మైథిలిలో ఓ క్లిప్ వినిపిస్తాను. దీన్ని దీపక్ వత్స్ గారు పంపారు. ఆయన కూడా ఈ పోటీలో బహుమతి కూడా గెలుచుకున్నారు.
(మైథిలి సౌండ్ క్లిప్ – 30 సెకన్లు- తెలుగు అనువాదం)
సోదరా!
ప్రపంచానికే గర్వకారణం భారతదేశం
మన దేశం మహోన్నతం
మూడు వైపులా సముద్రం
ఉత్తరాన బలంగా కైలాసం
గంగా, యమున, కృష్ణ, కావేరి,
జ్ఞానం, సంపత్తి రూపాలు
సోదరా!
మన దేశం గొప్పది
త్రివర్ణ పతాకంలో జీవం ఉంది
మిత్రులారా! ఇదిమీకు నచ్చిందని ఆశిస్తున్నాను. పోటీలో వచ్చిన ఎంట్రీల జాబితా చాలా పెద్దది. మీరు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌కి వెళ్లి, మీ కుటుంబంతో కలిసి వాటిని చూడండి- వినండి. మీరు చాలా స్ఫూర్తిని పొందుతారు.
నా ప్రియమైన దేశప్రజలారా!బనారస్ గురించి అయినా, షెహనాయ్ గురించి అయినా, ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ జీ గురించి అయినా, నా దృష్టి అటువైపు వెళ్ళడం సహజం. కొద్ది రోజుల క్రితం 'ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ యువ పురస్కారాలు’ ఇచ్చారు. సంగీతం, ప్రదర్శన కళల రంగంలో వర్ధమాన, ప్రతిభావంతులైన కళాకారులకు ఈ పురస్కారాలు ఇస్తారు. ఈ కళాకారులు కళ, సంగీత ప్రపంచానికి ఆదరణ పెంచడంతో పాటు, వారు దాని అభ్యున్నతికి కూడా కృషి చేస్తున్నారు. కాలక్రమేణా జనాదరణ తగ్గుతున్న వాయిద్యాలకు కొత్త వైభవాన్ని ఇచ్చిన కళాకారులు కూడా వీరిలో ఉన్నారు. ఇప్పుడు మీరందరూ ఈ ట్యూన్ ని శ్రద్ధగా వినండి...
(సౌండ్ క్లిప్ (21 సెకన్లు) వాయిద్యం- 'సుర్ సింగార్', కళాకారుడు -జాయ్దీప్ ముఖర్జీ)
ఇది ఏ వాయిద్యమో మీకు తెలుసా? మీకు తెలియకపోవచ్చుకూడా! ఈ వాయిద్య మంత్రం పేరు 'సుర్ సింగార్'. ఈ ట్యూన్‌ను జాయ్దీప్ ముఖర్జీ గారు స్వరపరిచారు. ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ పురస్కారంతో సన్మానితులైన యువకుల్లో జాయ్దీప్ గారు కూడా ఉన్నారు. 50వ,60వ దశాబ్దాల నుండి ఈ వాయిద్యం ట్యూన్లను వినడం చాలా అరుదుగా మారింది. అయితే 'సుర్ సింగార్'ను మళ్లీ పాపులర్ చేయడానికి జాయ్దీప్ తన శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు.
అదేవిధంగాకర్నాటక వాద్య సంగీత విభాగంలోని మాండలిన్లో ఈ అవార్డును పొందిన సోదరి ఉప్పలపు నాగమణి గారి కృషి కూడా చాలా స్ఫూర్తిదాయకం. ఇందులోసంగ్రామ్ సింగ్ సుహాస్ భండారే గారు వార్కారీ కీర్తనకు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ జాబితాలో సంగీత కళాకారులు మాత్రమే కాదు – వి. దుర్గా దేవి గారు 'కరకట్టం' అనే ప్రాచీన నృత్య రూపానికి ఈ అవార్డును గెలుచుకున్నారు. ఈ పురస్కారాన్ని పొందిన మరో విజేత రాజ్ కుమార్ నాయక్ గారు తెలంగాణలోని 31 జిల్లాల్లో 101 రోజుల పాటు పేరిణి ఒడిస్సీని నిర్వహించారు.పేరిణి రాజ్‌కుమార్ అనే పేరుతో ప్రజలకు సుపరిచితులయ్యారు. కాకతీయ రాజుల కాలంలో శివునికి అంకితమిచ్చిన పేరిణి నాట్యం బాగా ప్రాచుర్యం పొందింది. ఈ రాజవంశ మూలాలు నేటి తెలంగాణకు సంబంధించినవి. మరో పురస్కార విజేత సాయిఖౌమ్ సురచంద్రాసింగ్ గారు. మైతేయీ పుంగ్ వాద్యాన్ని తయారు చేయడంలో సుప్రసిద్ధులు. ఈ పరికరం మణిపూర్‌కు చెందింది.పూరన్ సింగ్ ఒక దివ్యాంగ కళాకారుడు. రాజూలా-మలుషాహి, న్యౌలీ, హుడ్కా బోల్,జాగర్ వంటి వివిధ సంగీత రూపాలకు ప్రాచుర్యం కల్పించేందుకు ఆయన కృషి చేస్తున్నారు. వాటికి సంబంధించిన పలు ఆడియో రికార్డింగ్‌లను కూడా సిద్ధం చేశారు. పూరన్ సింగ్ గారు ఉత్తరాఖండ్ జానపద సంగీతంలో తన ప్రతిభను కనబరిచి అనేక అవార్డులను కూడా గెలుచుకున్నారు.సమయ పరిమితి కారణంగాఅవార్డు గ్రహీతలందరి గురించి నేను ఇక్కడ మాట్లాడలేకపోవచ్చు. కానీ మీరు ఖచ్చితంగా వారి గురించి చదువుతారని నాకు విశ్వాసం ఉంది. ప్రదర్శన కళలకు మరింత ప్రాచుర్యం కల్పించేందుకు ఈ కళాకారులందరూ క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరినీ ప్రోత్సహిస్తారని నేను ఆశిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! వేగంగా పురోగమిస్తున్న మన దేశంలోడిజిటల్ ఇండియా శక్తి ప్రతి మూలలోనూ కనిపిస్తుంది. డిజిటల్ ఇండియా శక్తిని ప్రతి ఇంటికి తీసుకెళ్లడంలో వివిధ యాప్‌లు పెద్ద పాత్ర పోషిస్తున్నాయి. అలాంటి ఒక యాప్ ఇ-సంజీవని. ఈ యాప్ నుండి టెలి-కన్సల్టేషన్ చేయవచ్చు. అంటే దూరంగా కూర్చొనివీడియో కాన్ఫరెన్స్ ద్వారామీరు మీ అనారోగ్యం గురించి వైద్యుడిని సంప్రదించవచ్చు. ఇప్పటి వరకుఈ యాప్‌ను ఉపయోగిస్తున్న టెలి-కన్సల్టెంట్ల సంఖ్య 10 కోట్లుదాటింది. మీరు ఊహించవచ్చు- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 10 కోట్ల సంప్రదింపులంటే ఎంత పెద్ద గెలుపో! రోగికి- వైద్యుడికి మధ్య అద్భుతమైన సంబంధం - ఇది ఒక పెద్ద విజయం. ఈ విజయానికి గాను వైద్యులను, ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నరోగులందరినీ నేను అభినందిస్తున్నాను. భారతదేశంలోని ప్రజలు సాంకేతికతను తమ జీవితంలో ఎలా భాగం చేసుకున్నారో చెప్పేందుకు ఇది ఒక ప్రత్యక్ష ఉదాహరణ.
కరోనా సమయంలోఇ-సంజీవని యాప్ ద్వారా టెలి-కన్సల్టేషన్ ప్రజలకు గొప్ప వరమని నిరూపితమైంది. దీని గురించి 'మన్ కీ బాత్'లో డాక్టర్ తో, రోగితోమాట్లాడి, చర్చించి, విషయాన్ని మీకు తెలియజేయాలని నేను కూడా ఆలోచించాను. టెలి-కన్సల్టేషన్ ప్రజలకు ఎంత ప్రభావవంతంగా ఉందో తెలుసుకునేందుకు మనంప్రయత్నిద్దాం. సిక్కింకు చెందిన డాక్టర్ మదన్ మణి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. డా. మదన్ మణి సిక్కింకు చెందినవారైనా ధన్బాద్లో ఎంబీబీఎస్ చేశారు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో ఎండీ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లోని వందలాది మందికి టెలి-కన్సల్టేషన్ ఇచ్చారు.
ప్రధానమంత్రి: నమస్కారం...నమస్కారం మదన్ మణి గారూ..
డాక్టర్ మదన్ మణి: నమస్కారం సార్.
ప్రధాని: నేను నరేంద్ర మోదీని మాట్లాడుతున్నాను.
డాక్టర్ మదన్ మణి: సార్... సార్
ప్రధాని: మీరు బనారస్‌లో చదువుకున్నారు కదా.
డాక్టర్ మదన్ మణి:అవును సార్..నేను బనారస్‌లో చదువుకున్నాను సార్.
ప్రధాని: మీ వైద్య విద్యాభ్యాసం అక్కడే జరిగింది.
డాక్టర్ మదన్ మణి: అవును సార్.. అవును.
ప్రధానమంత్రి: కాబట్టి మీరు బనారస్‌లో ఉన్నప్పటి బనారస్ ను, ఇప్పుడు మారిన బనారస్ తో పోల్చి చూసేందుకు ఎప్పుడైనా వెళ్లారా?
డాక్టర్ మదన్ మణి: ప్రధానమంత్రి సార్.. సిక్కింకు తిరిగి వచ్చినప్పటి నుండి నేను వెళ్లలేకపోయాను. కానీ చాలా మార్పు వచ్చిందని నేను విన్నాను.
ప్రధానమంత్రి: మీరు బనారస్ వదిలిపెట్టి ఎన్ని సంవత్సరాలైంది?
డా. మదన్ మణి: నేను 2006లో బనారస్ వదిలి వెళ్ళాను సార్.
ప్రధాని: ఓహ్... ఐతే మీరు తప్పకుండా వెళ్లాలి.
డాక్టర్ మదన్ మణి: అవును సార్... అవును.
ప్రధాన మంత్రి: సరే, మీరు సుదూర పర్వతాలలో నివసిస్తూ సిక్కిం ప్రజలకు టెలి-సంప్రదింపుల గొప్ప సేవలను అందిస్తున్నందుకు నేను మీకు ఫోన్ చేశాను.
డాక్టర్ మదన్ మణి: సార్..
ప్రధానమంత్రి: నేను మీ అనుభవాన్ని 'మన్ కీ బాత్' శ్రోతలకు పంచుకోవాలనుకుంటున్నాను.
డాక్టర్ మదన్ మణి: సార్.
ప్రధానమంత్రి: కొంచెం నాకు చెప్పండి.. మీ అనుభవం ఎలా ఉంది?
డాక్టర్ మదన్ మణి: అనుభవం.. చాలా గొప్ప అనుభవం ప్రధానమంత్రి గారూ. సిక్కింలోని సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లడానికి కూడా ప్రజలు వాహనం ఎక్కి కనీసం ఒకటి నుండి రెండు వందల రూపాయల వరకు ఖర్చు పెట్టేందుకు తీసుకెళ్లాలి. అక్కడ డాక్టర్ ఉండవచ్చు.. ఉండకపోవచ్చు. ఇది కూడా ఒక సమస్య. టెలి కన్సల్టేషన్ ద్వారా ప్రజలు నేరుగా మాతో- సుదూర ప్రాంతాలకు చెందిన వ్యక్తులతో కనెక్ట్ అవుతారు. ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల సి. హెచ్. ఓ. లు వారిని మాతో కనెక్ట్ చేస్తారు. వారు వారి పాత వ్యాధుల రిపోర్ట్స్, ప్రస్తుత పరిస్థితి- ఇలా ప్రతిదీ మాకు చెప్తారు.
ప్రధానమంత్రి: అంటే డాక్యుమెంట్స్ ని పంపిస్తారన్నమాట.
డాక్టర్ మదన్ మణి: అవును సార్.. అవును. వారు డాక్యుమెంట్స్ పంపుతారు. పంపలేకపోతే చదివి మాకు చెబుతారు.
ప్రధాని: అక్కడి వెల్నెస్ సెంటర్ డాక్టర్ చెప్తారా.
డాక్టర్ మదన్ మణి: అవును సార్. వెల్నెస్ సెంటర్లో ఉండే సి. హెచ్. ఓ. -కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మాకు చెప్తారు.
ప్రధాని: పేషెంట్స్ వారి సమస్యలను మీకు నేరుగా చెప్తారు కదా.
డాక్టర్ మదన్ మణి: అవును... పేషెంట్ తన సమస్యల గురించి కూడా చెప్తాడు. ఆ తర్వాత పాత రికార్డులు చూసిన తర్వాత ఏదైనా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే- ఉదాహరణకుకాళ్ల వాపు ఉందో లేదో చూడటానికి అతని ఛాతీని ఆస్కల్టేట్ చేయాలి. సి.హెచ్.ఓ గారు అప్పటివరకు చూడకపోతే వాపు ఉందో లేదో చూడమని, కళ్లను చూడమని, రక్తహీనత ఉందో లేదో చూడమని చెప్తాం. దగ్గు ఉంటే ఛాతీని ఆస్కల్టేట్ చేయమని చెప్తాం. అక్కడ ధ్వనులు వినిపిస్తాయో లేదో చూడమంటాం.
ప్రధానమంత్రి: మీరు వాయిస్ కాల్ ద్వారా మాట్లాడతారా లేదా వీడియో కాల్ని కూడా ఉపయోగిస్తున్నారా?
డాక్టర్ మదన్ మణి: అవును సార్.. మేం వీడియో కాల్ ఉపయోగిస్తాం.
ప్రధానమంత్రి: కాబట్టి మీరు కూడా రోగిని చూస్తారు.
డాక్టర్ మదన్ మణి: రోగిని కూడా చూడగలం సార్.
ప్రధానమంత్రి: రోగికి ఎలాంటి అనుభూతి కలుగుతుంది?
డాక్టర్ మదన్ మణి: రోగి డాక్టర్ని దగ్గరగా చూడగలడు కాబట్టి రోగికి అది నచ్చుతుంది. సిక్కింలో చాలా మంది రోగులు మధుమేహం, రక్తపోటుతో ఉన్నవారుంటారు. మందు పరిమాణం తగ్గించాలా, పెంచాలా అనే విషయంలో వారు సందిగ్ధంలో ఉంటారు. మధుమేహం, రక్తపోటుకు మందు మార్చడానికి డాక్టర్ ని సంప్రదించేందుకు ఎంతోదూరం వెళ్లాల్సి వస్తుంది. కానీ టెలి కన్సల్టేషన్ ద్వారా అక్కడే వైద్యుడి సలహా సంప్రదింపులు లభిస్తాయి. ఆరోగ్య, సంక్షేమ కేంద్రాల్లో ఉచిత మందుల పథకం ద్వారా ఔషధం కూడా అందుబాటులో ఉంటుంది. అందుకని అక్కడి నుండే మందు తీసుకుంటారు.
ప్రధానమంత్రి: సరే మదన్ మణి గారూ.. మీకు తెలుసు... డాక్టర్ వచ్చేంతవరకు, డాక్టర్ తనను చూసేంతవరకు పేషెంట్ సంతృప్తి చెందడు. రోగిని చూడవలసి ఉంటుందని డాక్టర్ కూడా భావిస్తాడు. ఇప్పుడు అక్కడ అన్ని సంప్రదింపులు ఆన్ లైన్లో జరుగుతాయికాబట్టి వైద్యుడికి ఏమనిపిస్తుంది, రోగికి ఏమనిపిస్తుంది?
డాక్టర్ మదన్ మణి: అవును సార్. రోగికి డాక్టర్ని చూడాలని అనిపిస్తే రోగిని చూడాలని మాకు కూడా అనిపిస్తుంది. మేం చూడాలనుకున్నవి ఏవైనా సి. హెచ్. ఓ. గారికి చెప్పడం ద్వారావీడియోలో చూస్తాం. మరి కొన్ని సార్లు వీడియోలోనే పేషెంట్ మాకు దగ్గరగా వచ్చి చూపిస్తారు. ఉదాహరణకు ఎవరికైనా చర్మ సంబంధిత సమస్యలు ఉంటే మాకు వీడియో ద్వారానే చూపిస్తారు. కాబట్టి వారు సంతృప్తిగా ఉంటారు.
ప్రధాన మంత్రి: వారికి చికిత్స చేసిన తర్వాతవారు సంతృప్తి చెందుతారా? వారు ఎలాంటి అనుభూతి పొందుతారు? పేషెంట్స్ కు బాగవుతుందా?
డాక్టర్ మదన్ మణి: అవును సార్.. చాలా సంతోషం కలుగుతుంది. మాకు కూడా ఆనందంగా ఉంటుంది సార్. నేను ప్రస్తుతం ఆరోగ్యశాఖలో ఉన్నాను. ఏకకాలంలో టెలి-కన్సల్టేషన్ చేస్తూఫైల్తో పాటు రోగిని చూడటం నాకు చాలా మంచి, ఆహ్లాదకరమైన అనుభవం.
ప్రధానమంత్రి: సగటునమీకు టెలి కన్సల్టేషన్ కేసులు ఎన్ని వస్తాయి?
డాక్టర్ మదన్ మణి: నేను ఇప్పటివరకు 536 మంది రోగులను చూశాను.
ప్రధానమంత్రి: ఓ... అంటే మీరు చాలా పట్టు సాధించారు.
డాక్టర్ మదన్ మణి: అవును సార్. పేషెంట్లను చూడడం బాగుంటుంది.
ప్రధానమంత్రి: సరే.. మీకు శుభాకాంక్షలు. ఈ సాంకేతికతను ఉపయోగించడం ద్వారామీరు సిక్కింలోని మారుమూల అడవుల్లో, పర్వతాల్లో నివసించే ప్రజలకు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. మన దేశంలోని సుదూర ప్రాంతాల్లో కూడా సాంకేతికతను ఇంత చక్కగా వినియోగించుకోవడం సంతోషించదగ్గ విషయం. మీకు చాలా చాలా అభినందనలు.
డా. మదన్ మణి: ధన్యవాదాలు సార్!
మిత్రులారా! ఇ-సంజీవని యాప్ ఎలా సహకరిస్తుందో డాక్టర్ మదన్ మణి గారి మాటలను బట్టి అర్థమవుతుంది. డాక్టర్ మదన్ గారి తర్వాతఇప్పుడు మనం మరో మదన్ గారితో కలుద్దాం. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లా నివాసి మదన్ మోహన్ లాల్ గారు. చందౌలీ కూడా బనారస్ పక్కనే ఉండడం కూడా కాకతాళీయమే. ఇ-సంజీవని గురించి రోగిగా ఆయన అనుభవం ఏమిటో మదన్ మోహన్ గారి నుండి తెలుసుకుందాం.
ప్రధానమంత్రి గారు: మదన్ మోహన్ గారూ.. నమస్కారం..
మదన్ మోహన్ గారు: నమస్కారం.. నమస్కారం సార్.
ప్రధానమంత్రి గారు: నమస్కారం!మీరు డయాబెటిక్ పేషెంట్ అని నాకు చెప్పారు.
మదన్ మోహన్ గారు: అవును సార్ .
ప్రధానమంత్రి గారు: మీరు సాంకేతికతను ఉపయోగించి టెలి-కన్సల్టేషన్ ద్వారా మీ అనారోగ్యానికి సంబంధించి సహాయం తీసుకుంటున్నారు.
మదన్ మోహన్ జీ: అవును సార్.
ప్రధాన మంత్రి: ఒక రోగిగామీ అనుభవాలను వినాలనుకుంటున్నాను. తద్వారా మన గ్రామాల్లో నివసించే ప్రజలు నేటి సాంకేతికతను ఎలా ఉపయోగించవచ్చోదేశప్రజలకు తెలియజేయాలనుకుంటున్నాను. మీరు చెప్పండి..
మదన్ మోహన్ జీ: చాలా ఇబ్బందిగా ఉండేది సార్.. ఆసుపత్రులు చాలా దూరంగా ఉన్నాయి. డయాబెటిస్ వచ్చినప్పుడుచికిత్స చేయించుకోవడానికి ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్ళాల్సివచ్చేది. అక్కడ చూపించుకోవాల్సివచ్చేది. మీరు ఏర్పాటు చేసిన కొత్త పద్ధతిలో మమ్మల్ని బయటి డాక్టర్లతో మాట్లాడిస్తారు. మందులు కూడా ఇస్తారు. దీని వల్ల మాకు ఎంతో మేలు జరుగుతుంది. అందరూ దీని వల్ల ప్రయోజనం పొందుతారు.
ప్రధానమంత్రి: మిమ్మల్నిప్రతిసారీ ఒకే డాక్టర్ చూస్తారా లేదా డాక్టర్లు మారుతూ ఉంటారా?
మదన్ మోహన్ గారు: వారికి తెలియకపోతే మరో డాక్టర్ కి చూపిస్తారు. వాళ్ళే మాట్లాడి, మరొక వైద్యుడితో మాట్లాడేలా చేస్తారు.
ప్రధాన మంత్రి: అయితే వైద్యులు మీకు అందించే మార్గదర్శకత్వం నుండి మీరు పూర్తి ప్రయోజనం పొందుతారన్నమాట.
మదన్ మోహన్ జీ: మాకు లాభం కలుగుతుంది సార్. దాని వల్ల మాకు ఎంతో ప్రయోజనం ఉంది. గ్రామ ప్రజలు కూడా దీని నుండి ప్రయోజనం పొందుతారు. అక్కడ అందరూ అడుగుతారు-మాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, టెస్ట్ చేయండి,చెక్ చేయండి, మందు చెప్పండి- అని. మరి ఇంతకుముందు ఐదారు కిలోమీటర్ల దూరం వెళ్లేవారు. పొడవాటి లైన్లు, పాథాలజీలో కూడా లైన్లు ఉండేవి. రోజు మొత్తం సమయం వృథా అవుతూ ఉండేది.
ప్రధానమంత్రి: అంటే మీ సమయం కూడా ఆదా అవుతుంది.
మదన్ మోహన్ జీ: అప్పుడు డబ్బు కూడా ఖర్చయ్యేది. ఇక్కడ అన్ని సేవలను ఉచితంగా చేస్తున్నారు.
ప్రధాని: సరే... ముందు డాక్టర్ని చూడగానే ఒక నమ్మకం ఏర్పడుతుంది. “డాక్టర్ నా నాడిని పరీక్షించాడు.. నా కళ్ళు, నా నాలుక కూడా చెక్ చేశాడు” అనే అనుభూతి వస్తుంది. ఇప్పుడు వాళ్ళు టెలి కన్సల్టేషన్ చేసినా మీకు అంతే సంతృప్తి వస్తుందా?
మదన్ మోహన్ జీ: అవును సార్. సంతోషంగా ఉంటుంది. వాళ్ళు మన నాడి పట్టుకుంటున్నట్టు, సముచితమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. మాకుచక్కటి ఆరోగ్యం కలుగుతుంది. ఇంత మంచి ఏర్పాటు మీరు చేసినందుకుచాలా సంతోషంగా ఉంటున్నాం. కష్టపడి వెళ్ళవలసి వచ్చేది. వాహనం ఛార్జీలు ఇవ్వాల్సి వచ్చేది. అక్కడ లైన్లో నిలబడాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని అన్ని సౌకర్యాలు పొందుతున్నాం.
ప్రధానమంత్రి: సరే.. మదన్ మోహన్ గారూ.. నేను మీకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ వయస్సులో కూడామీరు సాంకేతికతను నేర్చుకున్నారు. సాంకేతికతను ఉపయోగించుకుంటున్నారు. ఇతరులకు కూడా చెప్పండి. దానిద్వారా ప్రజల సమయం ఆదా అవుతుంది. డబ్బు కూడా ఆదా అవుతుంది. వారికి మార్గదర్శకత్వం లభించడంతో మందులు కూడా సరియన విధంగా ఉపయోగించుకోవచ్చు.
మదన్ మోహన్ జీ: అవును సార్ మరి
ప్రధానమంత్రి: సరే.. మదన్ మోహన్ గారూ... మీకు చాలా చాలా శుభాకాంక్షలు.
మదన్ మోహన్ జీ: సార్.. మీరు బనారస్ ను కాశీ విశ్వనాథ్ స్టేషన్ గా మార్చారు. దాన్ని అభివృద్ధి చేశారు. మీకు మా అభినందనలు.
ప్రధానమంత్రి: మీకు ధన్యవాదాలు. మనం ఏం చేశాం.. బనారస్ ప్రజలు బనారస్ ను అభివృద్ధి చేశారు. లేకుంటే గంగామాతకి సేవ చేయమని గంగామాత పిలిచింది. అంతేతప్ప మరేమీ కాదు. సరే .. మీకు చాలా చాలా శుభాకాంక్షలు. నమస్కారం!
మదన్ మోహన్ జీ: నమస్కారం సార్!
ప్రధానమంత్రి: నమస్కారం!
మిత్రులారా!దేశంలోని సామాన్యులకు, మధ్యతరగతి వారికి, కొండ ప్రాంతాలలో నివసించే వారికి ప్రాణాలను రక్షించే యాప్గాఇ-సంజీవని మారుతోంది. భారతదేశ డిజిటల్ విప్లవ శక్తి ఇది. మనం ప్రతి రంగంలో దాని ప్రభావాన్ని చూస్తున్నాం. భారతదేశ యూపీఐ శక్తి కూడామీకు తెలుసు. ప్రపంచంలోని అనేక దేశాలు దీని వైపు ఆకర్షితులవుతున్నాయి.
కొన్ని రోజుల కిందటభారతదేశం, సింగపూర్ మధ్య యూపీఐ- పే నౌ లింకు ప్రారంభమైంది. ఇప్పుడుసింగపూర్, భారతదేశంలోని ప్రజలు తమ మధ్య తమ దేశాలలో చేసే విధంగానే తమ మొబైల్ ఫోన్ల నుండి డబ్బును బదిలీ చేస్తున్నారు. ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించినందుకు నేను సంతోషిస్తున్నాను. భారతదేశం ఇ-సంజీవని యాప్ అయినా యూపీఐ అయినాజీవన సౌలభ్యాన్ని పెంచడంలో చాలా సహాయకారిగా నిరూపితమయ్యాయి.
నా ప్రియమైన దేశప్రజలారా!ఒక దేశంలో అంతరించిపోతున్న ఒక జాతి పక్షిని గానీజంతువును గానీ రక్షించినప్పుడుఅది ప్రపంచమంతటా చర్చనీయాంశమౌతుంది. మనదేశంలో కనుమరుగైపోయిప్రజల మనసుల్లోంచి, హృదయాల్లోంచి దూరమైన గొప్ప సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ప్రజా భాగస్వామ్య శక్తితో వాటిని పునరుద్ధరించేందుకు జరుగుతున్న ప్రయత్నాలను చర్చించేందుకు 'మన్ కీ బాత్'కి మించిన వేదిక ఏముంటుంది?
ఇప్పుడు నేను మీకు ఏమి చెప్పబోతున్నానో తెలుసుకుంటేమీరు నిజంగా సంతోషిస్తారు. మీ వారసత్వ సంపద గురించి గర్వపడతారు. అమెరికాలో నివసిస్తున్న కంచన్ బెనర్జీ గారువారసత్వ పరిరక్షణకు సంబంధించిన అటువంటి ప్రచారం ద్వారా నా దృష్టిని ఆకర్షించారు. నేను ఆయనను అభినందిస్తున్నాను. మిత్రులారా!ఈ నెలలో పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీ జిల్లా బాన్స్‌బేరియాలో 'త్రిబేని కుంభో మోహోత్సవ్' నిర్వహించారు.ఎనిమిది లక్షల మందికి పైగా భక్తులు ఇందులో పాల్గొన్నారు. ఇంత విశిష్టత ఎందుకో తెలుసా? ముఖ్యంగాఈ ఆచారాన్ని 700 సంవత్సరాల తర్వాత పునరుద్ధరించారు. ఈ సంప్రదాయం వేల సంవత్సరాల నాటిది అయినప్పటికీ, దురదృష్టవశాత్తు బెంగాల్‌లోని త్రిబేనిలో జరిగే ఈ పండుగను700 సంవత్సరాల క్రితం నిలిపివేశారు. స్వాతంత్య్రానంతరం ప్రారంభించాల్సింది. కానీ అది కూడా కుదరలేదు. రెండేళ్ల కిందట ఈ పండుగస్థానిక ప్రజల ద్వారా,'త్రిబేని కుంభో పారిచాలోనాశామితి' ద్వారా మళ్లీ ప్రారంభమైంది. దీనితో అనుబంధం ఉన్న వ్యక్తులందరినీ నేను అభినందిస్తున్నాను. మీరు సంప్రదాయాన్ని సజీవంగా ఉంచడమే కాదు- భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని కూడా కాపాడుతున్నారు.
మిత్రులారా!పశ్చిమ బెంగాల్‌లోని త్రిబేని శతాబ్దాలుగా పవిత్ర ప్రదేశంగా ప్రసిద్ధి చెందింది. వివిధ మంగళకావ్యాల్లోనూవైష్ణవ సాహిత్యంలోనూశాక్త సాహిత్యంలోనూ ఇతర బెంగాలీ సాహిత్య రచనల్లోనూ దీని ప్రస్తావన ఉంది. ఈ ప్రాంతం ఒకప్పుడు సంస్కృతం, విద్య , భారతీయ సంస్కృతికి కేంద్రంగా ఉండేదని వివిధ చారిత్రక పత్రాల ద్వారా తెలుస్తోంది. మాఘ సంక్రాంతిలో కుంభస్నానానికి పవిత్ర స్థలంగాదీన్నిచాలా మంది సాధువులు భావిస్తారు.త్రిబేనిలోఅనేక గంగా ఘాట్లను, శివాలయాలను, టెర్రకోట వాస్తు కళతో అలంకృతమైన పురాతన భవనాలను చూడవచ్చు. త్రిబేని వారసత్వ పునఃస్థాపనకు, కుంభ సంప్రదాయ వైభవ పునరుద్ధరణకు గత ఏడాది ఇక్కడ కుంభమేళా నిర్వహించారు. ఏడు శతాబ్దాల తరువాతమూడు రోజుల కుంభ మహాస్నానాలు, జాతర ఈ ప్రాంతంలో కొత్త శక్తిని నింపాయి. మూడు రోజుల పాటు ప్రతిరోజూ జరిగే గంగా హారతి, రుద్రాభిషేకం, యజ్ఞంలో పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. వివిధ ఆశ్రమాలు, మఠాలు, అఖాడాలు కూడా ఈసారి ఉత్సవంలోపాల్గొన్నాయి.బెంగాలీ సంప్రదాయాలకు సంబంధించినకీర్తన, బౌల్, గోడియో నృత్యాలు, శ్రీ-ఖోల్ జానపద వాద్య సంగీతం, పోటర్ గీతాలు, ఛౌ నాట్యాల వంటి వివిధ కళా ప్రక్రియలు సాయంత్రం కార్యక్రమాల్లో ఆకర్షణగా నిలిచాయి.దేశంలోని బంగారు గతంతో మన యువతను అనుసంధానం చేయడానికి ఇది చాలా అభినందనీయమైన ప్రయత్నం. భారతదేశంలో ఇలాంటి అనేక ఇతర పద్ధతులు ఉన్నాయి. వీటిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది. వాటి గురించిన చర్చ ఖచ్చితంగా ఈ దిశగా ప్రజలను ప్రేరేపించగలదని నేను ఆశిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! మన దేశంలో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో ప్రజల భాగస్వామ్యం అనే అర్థమే మారిపోయింది. దేశంలో ఎక్కడైనా పరిశుభ్రతకు సంబంధించిన అంశం ఏదైనా ఉంటేప్రజలు దాని గురించి ఖచ్చితంగా నాకు తెలియజేస్తారు. ఇలాగేహర్యానా యువత స్వచ్ఛత ప్రచారంపై నా దృష్టిని ఆకర్షించింది. హర్యానాలో దుల్హేడి అనే ఒక గ్రామం ఉంది. పరిశుభ్రత విషయంలో భివానీ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దాలని ఇక్కడి యువకులు నిర్ణయించారు. ‘యువ స్వచ్ఛత ఏవం జన్ సేవా సమితి’ అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. ఈ కమిటీతో సంబంధం ఉన్న యువకులు తెల్లవారుజామున 4 గంటలకు భివానీకి చేరుకుంటారు. వీరంతా కలిసి పట్టణంలోని వివిధ ప్రాంతాల్లో క్లీన్ డ్రైవ్‌లు నిర్వహిస్తున్నారు. వీళ్ళంతా ఇప్పటివరకు పట్టణంలోని వివిధ ప్రాంతాల నుండి టన్నుల కొద్దీ చెత్తను తొలగించారు.
మిత్రులారా! స్వచ్ఛ భారత్ అభియాన్‌లో వేస్ట్ టు వెల్త్ కూడా ఒక ముఖ్యమైన అంశం. ఒడిశాలోని కేంద్రపారా జిల్లాలో కమలా మోహరానా అనే సోదరి స్వయం సహాయక సంఘాన్ని నిర్వహిస్తోంది. ఈ సమూహంలోని మహిళలు పాల సంచులు, ఇతర ప్లాస్టిక్ ప్యాకింగ్లతో బుట్టలు, మొబైల్ స్టాండ్ల వంటి అనేక వస్తువులను తయారు చేస్తారు. పరిశుభ్రతతో పాటు వారికి మంచి ఆదాయ వనరుగా కూడా ఇది మారుతోంది. మనం దృఢ సంకల్పంతో ఉంటే స్వచ్ఛ భారత్‌కు పెద్దపీట వేయగలం. కనీసం ప్లాస్టిక్ బ్యాగుల స్థానంలో బట్టతో చేసిన బ్యాగులు ఉపయోగిస్తామని ప్రతిజ్ఞ చేయాలి. మీ ఈ తీర్మానం మీకు ఎంత సంతృప్తిని ఇస్తుందో, ఇతర వ్యక్తులకు ఎంత స్ఫూర్తినిస్తుందో మీరు తప్పకుండా చూస్తారు.
నా ప్రియమైన దేశప్రజలారా!ఈ రోజు మీరు, నేను కలిసి అనేక ప్రేరణాత్మకమైన అంశాలపై మరోసారి మాట్లాడుకున్నాం. మీరు కుటుంబంతో కూర్చొని విన్నారు. ఇప్పుడు రోజంతా ఈ ధ్యానంలోనే ఉంటారు. దేశం కృషి గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత శక్తి వస్తుంది. ఈ శక్తి ప్రవాహంతో కదులుతూ కదులుతూఈ రోజు మనం 'మన్ కీ బాత్' 98వ భాగం దశకు చేరుకున్నాము. హోలీ పండుగ ఇప్పటి నుండి కొన్ని రోజులే ఉంది. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు. వోకల్ ఫర్ లోకల్ అనే తీర్మానంతో మన పండుగలు జరుపుకోవాలి. మీ అనుభవాలను కూడా నాతో పంచుకోవడం మర్చిపోవద్దు. అప్పటి వరకు నాకు వీడ్కోలు చెప్పండి. వచ్చేసారి కొత్త అంశాలతో మళ్ళీ కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 2023సంవత్సరంలో మొదటి 'మన్ కీ బాత్'. ఈ కార్యక్రమ పరంపరలో ఇది తొంభై ఏడవ ఎపిసోడ్ కూడా. మీ అందరితో మరోసారి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం జనవరి నెల చాలా సంఘటనలతో కూడి ఉంటుంది. ఈ నెల-జనవరి 14కు అటూ ఇటూగా ఉత్తరం నుండి దక్షిణం వరకు, తూర్పు నుండి పడమర వరకు దేశవ్యాప్తంగా పండుగలు పుష్కలంగా ఉంటాయి. వీటి తర్వాత దేశం గణతంత్ర పండుగను కూడా జరుపుకుంటుంది.ఈసారి కూడా గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పలు అంశాలు ప్రశంసలు అందుకుంటున్నాయి. జనవరి 26న కవాతు సందర్భంగా కర్తవ్య్ పథ్ ను నిర్మించిన కార్మికులను చూసి చాలా సంతోషమైందని జైసల్మేర్ నుండి పుల్కిత్ నాకురాశారు. పెరేడ్లో చేర్చిన అంశాలలో భారతీయ సంస్కృతికి సంబంధించిన విభిన్న కోణాలను చూడటం తనకు నచ్చిందని కాన్పూర్‌కు చెందిన జయరాశారు. తొలిసారిగా ఈ పెరేడ్ లో పాల్గొన్న ఒంటెలను అధిరోహించిన మహిళా రైడర్లతో పాటు సీఆర్పీఎఫ్లోని మహిళా దళానికి కూడా ప్రశంసలందుతున్నాయి.
మిత్రులారా!ప్రతి ఏడాది జనవరి 25వ తేదీ కోసం వేచి చూస్తానని డెహ్రాడూన్‌కు చెందిన వత్సల్ గారు రాశారు. ఆ రోజు పద్మ అవార్డుల ప్రకటన రావడంతో పాటు 25వ తేదీ సాయంత్రమే జనవరి 26వ తేదీ ఉత్సవాల కోసం తన ఉత్సాహాన్ని పెంచుతుందని వత్సల్ తన అభిప్రాయం తెలిపారు. అట్టడుగు స్థాయిలో తమ అంకితభావం, సేవాభావంతో విజయం సాధించిన వారికి పీపుల్స్ పద్మ అవార్డుల ప్రదానంపై పలువురు తమ భావాలను పంచుకున్నారు. ఆదివాసీ సమాజంతోనూ ఆదివాసీ జీవితాల తోనూ ముడిపడి ఉన్న వ్యక్తులకు ఈసారి పద్మ అవార్డుల్లో మంచి ప్రాతినిధ్యం లభించింది. ఆదివాసీల జీవితం నగరాల సందడికి విభిన్నంగా ఉంటుంది. వారి సవాళ్లు కూడా వేరు. అయినప్పటికీ ఆదివాసీ సమాజాలు తమ సంప్రదాయాలను కాపాడుకోవడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయిఆదివాసీ సముదాయాలకు సంబంధించిన విషయాలను పరిరక్షించడానికి, పరిశోధనలు నిర్వహించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.అదేవిధంగాటోటో, హో, కుయి, కువి, మాండ మొదలైన ఆదివాసీ భాషలపై కృషి చేసిన ఎందరో మహానుభావులు పద్మ అవార్డులు అందుకున్నారు. ఇది మనందరికీ గర్వకారణం. ధనిరామ్ టోటోగారు, జనుమ్ సింగ్ సోయ్గారు, బి. రామకృష్ణారెడ్డిగారు- ఈ పేర్లు ఇప్పుడు దేశం మొత్తం సుపరిచితమయ్యాయి. సిద్ధి, జారవా, ఒంగే వంటి ఆదివాసీ సమాజాలతో కలిసి పనిచేస్తున్న వారిని కూడా ఈసారి సత్కరించారు. వారిలో హీరాబాయి లోబీ గారు, రతన్ చంద్ర కార్ గారు, ఈశ్వర్ చంద్ర వర్మగారు ఉన్నారు. గిరిజన సమాజాలు మన భూమి, మన వారసత్వంలో అంతర్భాగంగా ఉన్నాయి. దేశాభివృద్ధి, సమాజ అభివృద్ధిలో వారి సహకారం చాలా ముఖ్యమైంది. తమ కోసం పనిచేసిన వ్యక్తులను సన్మానించడం కొత్త తరానికి కూడా స్ఫూర్తినిస్తుంది.నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఈ ఏడాది పద్మ అవార్డుల ప్రతిధ్వనులు వినిపిస్తున్నాయి. నక్సలైట్ ప్రభావిత ప్రాంతాల్లో దారితప్పిన యువకులకు సరైన మార్గాన్ని చూపిన వారి కృషికి కూడా పద్మ అవార్డులు లభించాయి. ఇందుకు గాను కంకేర్‌లో శిల్పాలను చెక్కిన అజయ్ కుమార్ మాండవి గారు, గడ్చిరోలిలోని ప్రసిద్ధ ఝడిపట్టి రంగభూమికి సంబంధించిన పరశురామ్ కోమాజీ ఖుణే కూడా ఈ గౌరవాన్ని అందుకున్నారు. అదేవిధంగా, ఈశాన్య ప్రాంతంలో తమ సంస్కృతి పరిరక్షణలో పాలుపంచుకుంటున్న రామ్‌కుయి వాంగ్‌బే నియుమే, బిక్రమ్ బహదూర్ జమాతియా, కర్మ వాంగ్చులను కూడా సత్కరించారు.
మిత్రులారా!ఈసారి పద్మ అవార్డులతో సత్కరించిన వారిలో సంగీత ప్రపంచాన్ని సుసంపన్నం చేసిన వారు ఎందరో ఉన్నారు. సంగీతం అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు! సంగీతంలో ప్రతి ఒక్కరి ఇష్టాలు భిన్నంగా ఉండవచ్చు. కానీ ప్రతి ఒక్కరి జీవితంలో సంగీతం ఒక భాగం. ఈసారి పద్మ అవార్డు గ్రహీతలలో మన సంప్రదాయ సంగీత వాయిద్యాలైన సంతూర్, బంహుం, ద్వితారా వంటి వాటి మాధుర్యాన్ని వ్యాప్తి చేయడంలో నైపుణ్యం ఉన్నవారు ఉన్నారు.గులామ్ మహ్మద్ జాజ్, మోవా సు-పోంగ్, రి-సింగ్‌బోర్ కుర్కా-లాంగ్, ముని-వెంకటప్ప, మంగళ్ కాంతి రాయ్ వంటి వారి పేర్లు నలుదిశలా చర్చనీయాంశాలయ్యాయి.
మిత్రులారా!చాలా మంది పద్మ అవార్డు గ్రహీతలు మన మధ్య ఉన్న స్నేహితులు. వారు ఎల్లప్పుడూ దేశాన్ని సర్వోత్తమంగా ఉంచారు. దేశానికి ప్రాధాన్యత ఇస్తూ తమ జీవితాలను అంకితం చేశారు. వారుసేవాభావంతో తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. ప్రతిఫలం ఆశించలేదు. తమ పనికి లక్ష్యంగా ఉన్నవారి ముఖాల్లో సంతృప్తి వారికి అతిపెద్ద అవార్డు.అటువంటి అంకితభావం ఉన్న వ్యక్తులను సత్కరించడం ద్వారా మన దేశ ప్రజల గౌరవం పెరిగింది. నేను ఇక్కడ పద్మ అవార్డు గ్రహీతలందరి పేర్లను చెప్పలేకపోవచ్చు. అయితే ఈ పద్మ అవార్డు గ్రహీతల స్ఫూర్తిదాయకమైన జీవిత విశేషాల గురించి వివరంగా తెలుసుకోవాలని, ఇతరులకు కూడా తెలియజేయాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
మిత్రులారా!ఈ రోజు మనం స్వాతంత్ర్య అమృత మహోత్సవం సందర్భంగా గణతంత్ర దినోత్సవం గురించి చర్చిస్తున్నప్పుడునేను ఇక్కడ ఒక ఆసక్తికరమైన పుస్తకాన్ని కూడా ప్రస్తావిస్తాను. కొన్ని వారాల క్రితం నాకు లభించిన ఈ పుస్తకంలో చాలా ఆసక్తికరమైన విషయాన్ని చర్చించారు. ఈ పుస్తకం పేరు ‘ఇండియా- ద మదర్ ఆఫ్ డెమొక్రసీ’. ఇందులో చాలా అద్భుతమైన వ్యాసాలు ఉన్నాయి. భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మన దేశాన్ని‘ప్రజాస్వామ్యానికి తల్లి’గా భావించడం భారతీయులమైన మనం గర్వించే విషయం. ప్రజాస్వామ్యం మన నరనరాల్లో ఉంది. మన సంస్కృతిలో ఉంది. శతాబ్దాలుగా మన కార్యకలాపాల్లో అంతర్భాగంగా ఉంది. స్వభావరీత్యా మనది ప్రజాస్వామిక సమాజం. డాక్టర్ అంబేద్కర్ బౌద్ధ భిక్షువుల సంఘాన్ని భారత పార్లమెంటుతో పోల్చారు. ప్రతిపాదనలు, నిర్ణయాలు, సమావేశ నిర్వహణకు అవసరమయ్యే సభ్యుల సంఖ్య, ఓటింగ్, ఓట్ల లెక్కింపు కోసం అనేక నియమాలు ఉన్న సంస్థగా ఆయన పేర్కొన్నారు. బుద్ధుడు ఆనాటి రాజకీయ వ్యవస్థల నుండి ప్రేరణ పొందాడని బాబాసాహెబ్ అభిప్రాయం.
చిన్నదైనా ప్రసిద్ధి చెందిన ఉతిర్మేరూర్ అనే ఒక ఊరు తమిళనాడులోఉంది. అక్కడ 1100-1200 సంవత్సరాల క్రితం నాటి శాసనం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఈ శాసనం మినీ రాజ్యాంగం లాంటిది. గ్రామసభను ఎలా నిర్వహించాలి, సభ్యుల ఎంపిక ప్రక్రియ ఎలా ఉండాలో ఇందులో వివరంగా పేర్కొన్నారు. మన దేశ చరిత్రలో ప్రజాస్వామ్య విలువలకు మరో ఉదాహరణ 12వ శతాబ్దపు బసవేశ్వర స్వామి అనుభవ మండపం. ఇక్కడ స్వేచ్చాయుత వాదోపవాదాలను, చర్చలను ప్రోత్సహించారు. ఇది మాగ్నా కార్టా కంటే పూర్వమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వరంగల్‌లోని కాకతీయ వంశ రాజుల గణతంత్ర సంప్రదాయాలు కూడా చాలా ప్రసిద్ధి చెందాయి. భక్తి ఉద్యమం పశ్చిమ భారతదేశంలో ప్రజాస్వామ్య సంస్కృతిని పెంచింది.సిక్కు మతంలో ప్రజాస్వామ్య స్ఫూర్తిపై ఒక వ్యాసాన్ని కూడా ఈ పుస్తకంలో చేర్చారు. గురునానక్ దేవ్ జీ ఏకాభిప్రాయంతో తీసుకున్న నిర్ణయాలను ఈ వ్యాసం తెలియజేస్తుంది. మధ్య భారతదేశంలోని ఒరాన్, ముండా తెగలలో సమాజ నిర్వహణపై, ఏకాభిప్రాయంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడంపై ఈ పుస్తకంలో చక్కటి సమాచారం ఉంది.శతాబ్దాలుగా దేశంలోని ప్రతి ప్రాంతంలో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఎలా ప్రవహిస్తోందో ఈ గ్రంథాన్ని చదివిన తర్వాత మీకు తెలుస్తుంది. ప్రజాస్వామ్యానికి తల్లిగా పేర్కొనే భారతదేశ వాసులుగా మనం నిరంతరం ఈ అంశంపై లోతుగా ఆలోచించాలి. చర్చించాలి. ప్రపంచానికి తెలియజేయాలి. ఇది దేశంలో ప్రజాస్వామిక స్ఫూర్తిని మరింత బలోపేతం చేస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!యోగా దినోత్సవానికి, వివిధ రకాల చిరు ముతక ధాన్యాలకు మధ్య పోలిక ఏమిటని నేను మిమ్మల్ని అడిగితే, ఈ పోలిక ఏమిటి అని మీరు ఆలోచిస్తారు? ఈ రెండింటికీ చాలా పోలికలు ఉన్నాయని నేను చెబితే మీరు ఆశ్చర్యపోతారు. వాస్తవానికి... భారతదేశ ప్రతిపాదన తర్వాత అంతర్జాతీయ యోగా దినోత్సవం, అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం రెండింటినీఐక్యరాజ్యసమితి నిర్ణయించింది.రెండవది- యోగా ఆరోగ్యానికి సంబంధించింది. చిరుధాన్యాలు కూడా ఆరోగ్యంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఇక మూడో విషయం ఏమిటంటే - రెండు ప్రచారాలలో ప్రజల భాగస్వామ్యం కారణంగా విప్లవాత్మక మార్పు వస్తోంది. ప్రజలు పెద్ద ఎత్తున చురుగ్గా పాల్గొనడం ద్వారా యోగా, ఫిట్నెస్లను తమ జీవితంలో ఒక భాగంగా చేసుకున్నట్టే పెద్ద ఎత్తున చిరుధాన్యాలను కూడా దైనందిన జీవితంలో చేర్చుకుంటున్నారు.ప్రజలు ఇప్పుడు చిరుధాన్యాలను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. ఈ మార్పు ప్రభావం పెద్ద ఎత్తున కనిపిస్తోంది. ఒకవైపు సంప్రదాయబద్ధంగా చిరుధాన్యాలనుపండించే చిన్నకారు రైతులు ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచం ఇప్పుడు చిరుధాన్యాల ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం ప్రారంభించినందుకు వారు చాలా సంతోషంగా ఉన్నారు. మరోవైపు రైతు ఉత్పత్తి సంఘాలతో పాటు పారిశ్రామికవేత్తలు చిరుధాన్యాలను మార్కెట్ చేయడానికి, వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచడానికి ప్రయత్నాలు ప్రారంభించారు.ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాకు చెందిన కె.వి. రామ సుబ్బారెడ్డి గారు చిరుధాన్యాల విషయంలో కృషి చేసేందుకు మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలేశారు. అమ్మ చేతితో చేసిన చిరుధాన్యాల రుచి చూసి ఆయన తన గ్రామంలో మిల్లెట్ ప్రాసెసింగ్ యూనిట్‌ను ప్రారంభించారు. సుబ్బారెడ్డి గారు చిరుధాన్యాల ప్రయోజనాలను ప్రజలకు వివరించడంతో పాటు వాటిని సులభంగా అందుబాటులో ఉంచుతారు. మహారాష్ట్రలోని అలీబాగ్ సమీపంలోని కెనాడ్ గ్రామానికి చెందిన షర్మిలా ఓస్వాల్ గత 20 ఏళ్లుగా చిరుధాన్యాల ఉత్పత్తిలో తనదైన శైలిలో సేవలందిస్తున్నారు. ఆమె రైతులకు నేర్పుగా వ్యవసాయం చేయడంలో శిక్షణ ఇస్తున్నారు. ఆమె కృషి వల్ల చిరుధాన్యాల దిగుబడి పెరగడమే కాకుండా రైతుల ఆదాయం కూడా పెరిగింది.
ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్‌ని సందర్శించే అవకాశం మీకు లభిస్తేమీరు అక్కడి మిల్లెట్స్ కేఫ్‌ను తప్పక సందర్శించాలి. కొన్ని నెలల క్రితం ప్రారంభమైన ఈ మిల్లెట్స్ కేఫ్‌లో చీలా, దోశ, మోమోస్, పిజ్జా, మంచూరియా వంటివి బాగా ప్రసిద్ధి చెందుతున్నాయి.
నేను మిమ్మల్ని ఇంకో విషయం అడగవచ్చా? మీరు ఎంటర్ ప్రెన్యూర్ అనే పదాన్ని విని ఉంటారు, కానీ మీరు Milletpreneursఅనే పదం విన్నారా? ఈ రోజుల్లో ఒడిశాకు చెందిన మిల్లెట్‌ప్రెన్యూర్లు వెలుగులోకి వస్తున్నారు. ఆదివాసీ జిల్లా సుందర్‌గఢ్ కు చెందిన సుమారు 1500 మంది మహిళల స్వయం సహాయక బృందానికి ఒడిశా మిల్లెట్స్ మిషన్‌తో అనుబంధం ఉంది.ఇక్కడ మహిళలు చిరుధాన్యాల నుండి కుకీలు, రసగుల్లా, గులాబ్ జామూన్, కేక్‌ల వరకు ప్రతిదీ తయారు చేస్తున్నారు. మార్కెట్లో వీరికి ఉన్న విపరీతమైన డిమాండ్ కారణంగా మహిళల ఆదాయం కూడా పెరుగుతోంది.
కర్నాటకలోని కలబుర్గిలో భారత చిరుధాన్యాల పరిశోధనా సంస్థ పర్యవేక్షణలో అలంద్ భూతాయి మిల్లెట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ గత సంవత్సరం పని ప్రారంభించింది. ఇక్కడి ఖాక్రా, బిస్కెట్లు, లడ్డూలను ప్రజలు ఇష్టపడుతున్నారు. కర్నాటకలోని బీదర్ జిల్లాలో హుల్సూర్ మిల్లెట్ ప్రొడ్యూసర్ కంపెనీకి చెందిన మహిళలు చిరుధాన్యాలను పండించడంతోపాటు వాటి పిండిని కూడా తయారు చేసుకుంటున్నారు.దీంతో వారి సంపాదన కూడా బాగా పెరిగింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన సందీప్ శర్మ గారికి ప్రాకృతిక వ్యవసాయంతో అనుబంధం ఉంది. ఆయనకు చెందిన రైతు ఉత్పత్తి సంస్థలో 12 రాష్ట్రాలకు చెందిన రైతులు చేరారు. బిలాస్‌పూర్‌కి చెందిన ఈ ఎఫ్పిఓ 8 రకాల చిరుధాన్యాల పిండిని, వాటితో వంటలను తయారు చేస్తోంది.
మిత్రులారా! ఈ రోజు జి-20 శిఖరాగ్ర సమావేశాలు భారతదేశంలోని ప్రతి మూలలో నిరంతరం జరుగుతున్నాయి. దేశంలోని ప్రతి మూలలో జి-20శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగినా చిరుధాన్యాలతో చేసిన పుష్టికరమైన, రుచికరమైన వంటకాలు చేరుస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను.మార్కెట్లో తయారు చేసిన ఖిచ్డీ, పోహా, ఖీర్, రోటీ, రాగులతో చేసిన పాయసం, పూరీ , దోస వంటి వంటకాలు కూడా ఈ సమావేశాలు జరిగేచోట లభిస్తున్నాయి. ఆరోగ్య పానీయాలు, తృణధాన్యాలు,చిరుధాన్యాలతో తయారు చేసిన నూడుల్స్ అన్ని జి20 వేదికలలోని చిరుధాన్యాల ఎగ్జిబిషన్లలో ప్రదర్శించడం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ మిషన్లు కూడా వీటి ప్రజాదరణను పెంచడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాయి.దేశం చేస్తున్న ప్రయత్నాలు, ప్రపంచంలో చిరుధాన్యాలకు పెరుగుతున్న డిమాండ్ మన చిన్న రైతులకు బలం చేకూర్చబోతున్నాయని మీరు ఊహించవచ్చు. ఈ రోజు చిరుధాన్యాలతో తయారు చేయడం ప్రారంభించిన వివిధ రకాల కొత్త తినుబండారాలను యువతరం ఇష్టపడటం కూడా నాకు ఆనందంగా ఉంది.అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరాన్ని ఇంత అద్భుతంగా ప్రారంభించినందుకు, దాన్ని నిరంతరం ముందుకు తీసుకెళ్తున్నందుకు 'మన్ కీ బాత్' శ్రోతలను కూడా నేను అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!ఎవరైనా టూరిస్ట్ హబ్ గోవా గురించి మాట్లాడితే మీ మనసులో ఏం గుర్తొస్తుంది? గోవా పేరు వినగానే ముందుగా అందమైన తీరప్రాంతం, బీచులు, ఇష్టమైన ఆహార పదార్థాలు గుర్తుకు రావడం సహజం. అయితే ఈ నెలలో గోవాలో ఒక ముఖ్యమైన కార్యక్రమం జరిగింది. ఈరోజు 'మన్ కీ బాత్'లో నేను ఈ విషయాన్ని మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను.గోవాలో జరిగిన ఈ కార్యక్రమం పర్పుల్ ఫెస్ట్. ఈ ఫెస్ట్ జనవరి 6వ తేదీ నుండి 8వ తేదీ వరకు పనాజీలో జరిగింది. దివ్యాంగుల సంక్షేమం విషయంలో ఇదొక ప్రత్యేక ప్రయత్నం. పర్పుల్ ఫెస్ట్ ఎంత గొప్ప సందర్భమనే విషయాన్ని అందులో 50 వేల మందికి పైగా సోదర సోదరీమణులు పాల్గొన్నారనే వాస్తవాన్ని బట్టి మీరందరూ ఊహించవచ్చు.ఇక్కడికి వచ్చిన ప్రజలు ఇప్పుడు 'మీరామార్ బీచ్'లో తిరగడాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలిగినందుకు పులకించిపోయారు. నిజానికి 'మీరామార్ బీచ్' దివ్యాంగ సోదరులు, సోదరీమణులకు గోవాలో అందుబాటులో ఉండే బీచ్‌లలో ఒకటిగా మారింది. క్రికెట్ టోర్నమెంట్, టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్, మారథాన్ పోటీలతో పాటుబధిర-అంధుల సమ్మేళనం కూడా ఇక్కడ జరిగింది. ప్రత్యేకమైన బర్డ్ వాచింగ్ ప్రోగ్రామ్‌తో పాటుఇక్కడ ఒక చిత్రాన్ని కూడా ప్రదర్శించారు. దివ్యాంగ సోదర సోదరీమణులు, పిల్లలు పూర్తిస్థాయిలో ఆనందించేలా దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. దేశంలోని ప్రైవేట్ రంగం భాగస్వామ్యం కూడా ఉండడం పర్పుల్ ఫెస్ట్ లోని ఒక ప్రత్యేక విషయం. దివ్యాంగులు ఉపయోగించేందుకు వీలుగా ఉండే ఉత్పత్తులను ప్రదర్శించారు. దివ్యాంగుల సంక్షేమంపై అవగాహన కల్పించేందుకు ఈ ఫెస్ట్‌లో ఎన్నో ప్రయత్నాలు జరిగాయి.పర్పుల్ ఫెస్ట్‌ని విజయవంతం చేసినందుకుఅందులో పాల్గొన్నవారందరికీ నా అభినందనలు. దీన్ని నిర్వహిచేందుకు పగలూ రాత్రీ ఏకం చేసిన వాలంటీర్లను కూడా నేను అభినందిస్తున్నాను. యాక్సెసబుల్ ఇండియా దృక్కోణాన్ని సాకారం చేయడంలో ఇటువంటి ప్రచారాలు చాలా ప్రభావవంతంగా ఉంటాయని నాకు పూర్తి నమ్మకం ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా!మీకు ఆనందం, గర్వం కలిగించడంతో పాటు మనసుకు సంతోషం కలిగించే విషయంపై ఇప్పుడు 'మన్ కీ బాత్'లోనేను మాట్లాడతాను. దాంతో మీ హృదయం ఆనందభరితం అవుతుంది. దేశంలోని పురాతన వైజ్ఞానిక సంస్థల్లో ఒకటైన బెంగుళూరు లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-IISc-అద్భుతమైన ఉదాహరణను అందిస్తోంది.ఈ సంస్థ స్థాపన వెనుకఇద్దరు గొప్ప వ్యక్తులు- జంషెడ్జీ టాటా, స్వామి వివేకానందల ప్రేరణను 'మన్ కీ బాత్'లోనేను ఇంతకుముందు చర్చించాను. గత ఏడాది 2022లో ఈ సంస్థ పేరు మీద మొత్తం 145 పేటెంట్లు ఉండడం మీకు, నాకు ఆనందం, గర్వం కలిగించే విషయం. అంటే దీని అర్థం - ప్రతి ఐదు రోజులకు రెండు పేటెంట్లు. ఈ రికార్డు అద్భుతమైంది.ఈ విజయం సాధించిన IISc బృందాన్ని నేను అభినందించాలనుకుంటున్నాను. మిత్రులారా!ఈరోజు భారతదేశం ర్యాంకింగ్ పేటెంట్ ఫైలింగ్‌లో 7వ స్థానంలో, ట్రేడ్‌మార్క్‌లలో 5వ స్థానంలో ఉంది. పేటెంట్ల గురించి మాత్రమే మాట్లాడితేగత ఐదేళ్లలో సుమారు 50 శాతం పెరుగుదల ఉంది.గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో కూడాభారతదేశం ర్యాంకింగ్ అద్భుతంగా మెరుగుపడింది. ఇప్పుడు అది 40వ స్థానానికి చేరుకుంది. 2015 లోగ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్‌లో భారతదేశం 80వ స్థానంలో ఉంది. నేను మీకు మరో ఆసక్తికరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను.భారతదేశంలో గత 11 సంవత్సరాలలో మొదటిసారిగాదేశీయ పేటెంట్ ఫైలింగ్ సంఖ్య విదేశీ ఫైలింగ్ కంటే ఎక్కువగా కనిపించింది. ఇది భారతదేశంలో పెరుగుతున్న శాస్త్రీయ సామర్థ్యాన్ని కూడా చూపుతుంది.
మిత్రులారా! 21వ శతాబ్దపు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో విజ్ఞానం అత్యంత ప్రధానమైందని మనందరికీ తెలుసు. మన ఆవిష్కర్తలు, వారి పేటెంట్ల బలంతో భారతదేశం టెకేడ్ కల ఖచ్చితంగా నెరవేరుతుందని నేను నమ్ముతున్నాను. దీంతోమనందరం ప్రపంచ స్థాయి సాంకేతికతను, మన దేశంలో తయారైన ఉత్పత్తుల నుండి పూర్తిగా లాభం పొందగలం.
నా ప్రియమైన దేశప్రజలారా! తెలంగాణకు చెందిన ఇంజనీరు విజయ్ గారి పోస్టునునేను నమో యాప్ లో చూశాను. ఇందులో విజయ్ గారు ఈ-వేస్ట్ గురించి రాశారు. దీని గురించి 'మన్ కీ బాత్'లో చర్చించమని విజయ్ గారు అభ్యర్థించారు. ఇంతకుముందు కూడా ఈ కార్యక్రమంలో 'వేస్ట్ టు వెల్త్' అంటే 'చెత్త నుండి బంగారం’ గురించి మాట్లాడుకున్నాం. రండి- ఈ రోజుదీనికి సంబంధించిన ఈ-వేస్ట్ గురించి చర్చిద్దాం.
మిత్రులారా!ఈరోజుల్లో ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్, ల్యాప్‌టాప్, టాబ్లెట్ వంటి పరికరాలు సర్వసాధారణమైపోయాయి. దేశవ్యాప్తంగా వారి సంఖ్య బిలియన్లలో ఉంటుంది. నేటి ఆధునిక ఉపకరణాలు కూడా భవిష్యత్తులో ఇ-వేస్ట్‌గా మారుతాయి. ఎవరైనా కొత్త పరికరాన్ని కొనుగోలు చేసినప్పుడు లేదా పాత పరికరాన్ని మార్పిడి చేసుకున్నప్పుడు దాన్ని సరైన రీతిలో విసర్జించామా లేదా అనేది గుర్తుంచుకోవడం అవసరం. ఇ-వ్యర్థాలను సరిగ్గా పారవేయకపోతేఅది మన పర్యావరణానికి కూడా హాని కలిగిస్తుంది.కానీజాగ్రత్తగా చేస్తే పునరుపయోగం- రీసైకిల్, రీయూజ్ -వర్తుల ఆర్థిక వ్యవస్థలో గొప్ప శక్తిగా మారుతుంది. ఏటా 50 మిలియన్ టన్నుల ఈ-వ్యర్థాలను పారేస్తున్నామని ఐక్యరాజ్యసమితి నివేదికలో పేర్కొంది. ఈ వ్యర్థాల పరిమాణం ఎంత ఉంటుందో ఊహించగలరా? మానవజాతి చరిత్రలో నిర్మించిన అన్ని వాణిజ్య విమానాల బరువును కలిపినా, విడుదలవుతున్న ఈ-వ్యర్థాల పరిమాణానికి సమానం కాదు. ప్రతి సెకనుకు 800 ల్యాప్‌టాప్‌లను వదిలివేయడం జరుగుతోంది. ఈ-వ్యర్థాల నుండి వివిధ ప్రక్రియల ద్వారా సుమారు 17 రకాల విలువైన లోహాలు వెలికితీయవచ్చని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇందులో బంగారం, వెండి, రాగి, నికెల్ ఉన్నాయి. కాబట్టి ఈ-వ్యర్థాలను ఉపయోగించడం చెత్త నుండి బంగారం' కంటే తక్కువేమీ కాదు.నేడు ఈ దిశగా వినూత్నమైన పనులు చేస్తున్న స్టార్టప్‌లకు కొదవలేదు. దాదాపు 500 ఈ-వేస్ట్ రీసైక్లర్లు ఈ రంగానికి అనుబంధంగా ఉన్నారు. అనేక మంది కొత్త వ్యవస్థాపకులు కూడా దీనితో అనుసంధానమయ్యారు. ఈ రంగం వేల మందికి ప్రత్యక్ష ఉపాధిని కూడా కల్పించింది. బెంగుళూరుకు చెందిన ఈ-పరిసర అటువంటి ప్రయత్నంలో నిమగ్నమై ఉంది.ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డుల నుండి విలువైన లోహాలను వేరు చేయడానికి ఇది స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేసింది. అదేవిధంగాముంబాయిలో పనిచేస్తున్న ఇకోరీకో- మొబైల్ యాప్ ద్వారా ఈ-వ్యర్థాలను సేకరించే వ్యవస్థను అభివృద్ధి చేసింది. ఉత్తరాఖండ్‌లోని రూర్కీకి చెందిన అటెరో రీసైక్లింగ్ ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో అనేక పేటెంట్లను పొందింది. ఇది తన సొంత ఇ-వేస్ట్ రీసైక్లింగ్ టెక్నాలజీని సిద్ధం చేయడం ద్వారా చాలా పేరు సంపాదించింది.భోపాల్‌లో మొబైల్ యాప్, వెబ్సైట్ 'కబాడీవాలా' ద్వారా టన్నుల కొద్దీ ఈ-వ్యర్థాలను సేకరిస్తున్నారు. ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ఇవన్నీ భారతదేశాన్ని గ్లోబల్ రీసైక్లింగ్ హబ్‌గా మార్చడానికి సహాయపడుతున్నాయి. అయితేఅటువంటి కార్యక్రమాలు విజయవంతం అయ్యేందుకు అవసరమైన షరతు కూడా ఉంది. అది E-వేస్ట్‌ను పారవేసే సురక్షితమైన ఉపయోగకరమైన పద్ధతుల గురించి ప్రజలు తెలుసుకోవడం. ప్రస్తుతం ఏటా 15-17 శాతం ఈ-వ్యర్థాలు మాత్రమే రీసైకిల్ అవుతున్నాయని ఈ-వేస్ట్ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులు చెబుతున్నారు.
నా ప్రియమైన దేశప్రజలారా!నేడు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు , జీవవైవిధ్య పరిరక్షణ గురించి చాలా చర్చలు జరుగుతున్నాయి. ఈ దిశలో భారతదేశం చేస్తున్న నిర్దిష్ట ప్రయత్నాల గురించి మనం నిరంతరం మాట్లాడుతున్నాం. భారతదేశం చిత్తడి నేలల కోసం చేసిన కృషిని తెలుసుకుంటే మీరు కూడా చాలా సంతోషిస్తారు. చిత్తడి నేలలు అంటే ఏమిటని కొంతమంది శ్రోతలు ఆలోచిస్తుండవచ్చు. చిత్తడి నేలలు భూమిలో ఏడాది పొడవునా నీరు పేరుకుపోయే ప్రదేశాలు. కొన్ని రోజుల తర్వాత ఫిబ్రవరి 2వ తేదీన ప్రపంచ చిత్తడి నేలల దినోత్సవం. మన భూమి ఉనికికి చిత్తడి నేలలు చాలా ముఖ్యమైనవి. ఎందుకంటే అనేక పక్షులు, జంతువులు వాటిపై ఆధారపడి ఉంటాయి.జీవవైవిధ్యాన్ని సుసంపన్నం చేయడంతో పాటు ఈ నేలలు వరద నియంత్రణకు, భూగర్భ జలాల రీఛార్జ్‌కు కూడా ఉపయోగపడతాయి. రామ్సర్ సైట్స్ అంటే అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగిన చిత్తడి నేలల ప్రాంతమని మీలో చాలా మందికి తెలిసి ఉండాలి. చిత్తడి నేలలు ఏ దేశంలో ఉన్నా అవి అనేక ప్రమాణాలను నెరవేర్చినప్పుడు మాత్రమే వాటిని రామ్సర్ సైట్లుగా ప్రకటిస్తారు.రామ్సర్ సైట్లలో 20,000 లేదా అంతకంటే ఎక్కువ నీటి పక్షులు ఉండాలి. స్థానిక చేప జాతులు పెద్ద సంఖ్యలో ఉండటం ముఖ్యం. 75 సంవత్సరాల స్వాతంత్ర్యవేడుకల అమృత మహోత్సవాల సందర్భంగా రామ్సర్ సైట్లకు సంబంధించిన సమాచారాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మన దేశంలో మొత్తం రామ్సర్ సైట్ల సంఖ్య 75కి పెరిగింది. 2014 కి ముందు దేశంలో 26 రామ్సర్ సైట్లు మాత్రమే ఉండేవి. ఇందుకుగానుఈ జీవవైవిధ్యాన్ని కాపాడిన స్థానిక సమాజం అభినందనలకు పాత్రమైంది.ఇది మన ప్రాచీన సంస్కృతికి, ప్రకృతికి అనుగుణంగా జీవించే సంప్రదాయానికి కూడా గౌరవమే. భారతదేశంలోని ఈ చిత్తడి నేలలు మన సహజ సామర్థ్యానికి ఉదాహరణ. ఒడిశాలోని చిల్కా సరస్సు 40 కంటే ఎక్కువ నీటి పక్షుల జాతులకు ఆశ్రయం కల్పిస్తుంది. కైబుల్-లమ్జా, లోక్టాక్ చిత్తడి జింకలకు ఒకవిధంగా సహజ నివాసంగా పరిగణిస్తారు.తమిళనాడులోని వేడంథాంగల్‌ను 2022లో రామ్‌సర్‌గా ప్రకటించారు. ఇక్కడ పక్షి జనాభాను సంరక్షించిన ఘనత మొత్తం సమీపంలోని రైతులకే చెందుతుంది. కాశ్మీర్‌లోని పంజాథ నాగ్ సమాజం వార్షిక ఫల వికాస ఉత్సవం సందర్భంగా ఒక రోజు ప్రత్యేకంగా గ్రామంలోని నీటి వనరులను శుభ్రపరుస్తుంది. ప్రపంచంలోని చాలా రామ్సర్ సైట్లకు ప్రత్యేక సాంస్కృతిక వారసత్వం ఉంది.మణిపూర్ కు చెందిన లోక్టాక్, పవిత్ర సరస్సు రేణుకతో అక్కడి సంస్కృతికి గాఢమైన సంబంధం ఉంది. అదేవిధంగాసాంభార్ కూడా దుర్గామాత అవతారమైన శాకంభరి దేవికి సంబంధించింది. భారతదేశంలోని ఈ చిత్తడి నేలల విస్తరణ రామ్సర్ సైట్ల చుట్టూ నివసించే ప్రజల వల్ల సాధ్యమైంది. అలాంటి వారందరినీ నేను ఎంతో అభినందిస్తున్నాను. 'మన్ కీ బాత్' శ్రోతల తరపునవారికి శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశప్రజలారా!ఈసారి మన దేశంలో- ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో - తీవ్రమైన చలికాలం ఉంది. ఈ చలికాలంలోపర్వతాల మీద మంచు కురుస్తుంది. అలాంటి కొన్ని చిత్రాలు జమ్మూ కాశ్మీర్ నుండి వచ్చాయి. అవి యావత్ దేశ హృదయాలను దోచుకున్నాయి. ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు ఈ చిత్రాలను సోషల్ మీడియాలో ఇష్టపడుతున్నారు.హిమపాతం కారణంగామన కాశ్మీర్ లోయ ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా చాలా అందంగా మారింది. బనిహాల్ నుండి బడ్గామ్ వరకు రైలు వెళ్తున్న వీడియోను కూడా ప్రజలు ప్రత్యేకంగా ఇష్టపడుతున్నారు. అందమైన హిమపాతం. నలువైపులా తెల్లటి దుప్పటి లాంటి మంచు. ఈ దృశ్యం అద్భుత కథలా ఉందని అంటున్నారు జనం. ఇవి ఏదో ఒక విదేశానికి చెందిన చిత్రాలు కావని, మన దేశంలోనే కాశ్మీర్‌కు సంబంధించినవని చాలామంది అంటున్నారు.
'స్వర్గం ఇంతకంటే అందంగా ఉంటుందా?'అని సామాజిక మాధ్యమంలో ఒకరు రాశారు. ఇది ఖచ్చితంగా సరైంది. అందుకే కాశ్మీర్‌ను భూతల స్వర్గమని పిలుస్తారు. ఈ చిత్రాలను చూస్తుంటే మీకు కూడా కాశ్మీర్ పర్యటనకు వెళ్లాలని అనిపిస్తుంది. మీరు స్వయంగా వెళ్ళాలని, మీ సహచరులను కూడా తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను.కాశ్మీర్లో మంచుతో కప్పబడిన పర్వతాలు, ప్రకృతి అందాలతో పాటుచూడవలసినవి, తెలుసుకోవలసినవి ఎన్నో ఉన్నాయి.ఉదాహరణకుకశ్మీర్‌లోని సయ్యదాబాద్‌లో శీతాకాల క్రీడోత్సవాలు జరిగాయి. ఈ ఉత్సవాల అంశం మంచు క్రికెట్! స్నో క్రికెట్ మరింత ఉత్తేజకరమైన క్రీడ అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. మీ భావన పూర్తిగా వాస్తవం. కాశ్మీరీ యువత మంచు మధ్య క్రికెట్‌ను మరింత అద్భుతంగా ఆడుతుంది. భారత క్రికెట్ బృందంలో ఆడే యువ క్రీడాకారుల కోసం కాశ్మీర్లో అన్వేషణ కూడా జరుగుతోంది. ఇది కూడా ఒక విధంగా ఖేలో ఇండియా ఉద్యమానికి పొడిగింపు. కాశ్మీర్లో క్రీడల పట్ల యువతలో ఉత్సాహం పెరుగుతోంది. రాబోయే కాలంలో ఇలాంటి యువకులు ఎందరో దేశానికి పతకాలు సాధించి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు.మీరు వచ్చేసారి కాశ్మీర్ పర్యటనకు ప్లాన్ చేసినప్పుడుఇలాంటి ఉత్సవాలను సందర్శించడానికి సమయం కేటాయించాలని నేను సూచిస్తున్నాను. ఈ అనుభవాలు మీ యాత్రను మరింత గుర్తుండిపోయేలా చేస్తాయి.
నా ప్రియమైన దేశవాసులారా! గణతంత్రాన్ని బలోపేతం చేసేందుకు మన ప్రయత్నాలు నిరంతరం కొనసాగాలి. ప్రజల భాగస్వామ్యంతో, ప్రతి ఒక్కరి కృషితో, దేశం పట్ల కర్తవ్యాన్ని నిర్వర్తించడం ద్వారాగణతంత్రం పటిష్టంగా తయారవుతుంది. అలాంటి కర్తవ్య నిష్ఠా సేనానుల గంభీర స్వరమే మన 'మన్ కీ బాత్' కావడం నాకు సంతోషాన్నిస్తోంది. అలాంటి కర్తవ్య నిష్ఠా పరాయణత్వం ఉన్న వ్యక్తుల ఆసక్తికరమైన, స్ఫూర్తిదాయకమైన గాథలతో వచ్చేసారి మళ్ళీ కలుస్తాను. చాలా చాలా ధన్యవాదాలు...
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈ రోజు మనం 'మన్ కీ బాత్' తొంభై ఆరవఎపిసోడ్ లో కలుస్తున్నాం. 'మన్ కీ బాత్' తర్వాతి ఎపిసోడ్ 2023 సంవత్సరంలో మొదటి ఎపిసోడ్ అవుతుంది. మీరు పంపిన సందేశాలను పరిశీలిస్తున్నప్పుడు 2022పై మాట్లాడాలన్న మీ కోరిక తెలిసింది. గతం పరిశీలన ఎల్లప్పుడూ వర్తమాన, భవిష్యత్తు సన్నాహాలకు ప్రేరణనిస్తుంది. 2022లోదేశ ప్రజల సామర్థ్యం, సహకారం, సంకల్పం, విజయాలు ఎంత ఎక్కువగా ఉన్నాయంటే వాటన్నిటినీ 'మన్ కీ బాత్'లో చేర్చడం కష్టం.2022 నిజానికి చాలా స్ఫూర్తిదాయకంగా, అనేక విధాలుగా అద్భుతంగా ఉంది. ఈ సంవత్సరానికి భారతదేశం స్వాతంత్ర్యం పొంది 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సంవత్సరంలోనే అమృతోత్సవ కాలం ప్రారంభమైంది. ఈ సంవత్సరం దేశం కొత్త ఊపందుకుంది. దేశప్రజలందరూ ఒకరికి మించి మరొకరు మంచి పనులు చేశారు. 2022లో సాధించిన విజయాలుప్రపంచవ్యాప్తంగా భారతదేశానికి ప్రత్యేక స్థానాన్నికల్పించాయి. 2022 అంటే భారతదేశం ప్రపంచంలోని ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ హోదాను పొందడం.2022 అంటే ఎవరూ నమ్మలేని విధంగా దేశం 220 కోట్ల వాక్సిన్ల మైలు రాయిని అధిగమించి రికార్డు సాధించడం. 2022 అంటే భారతదేశం ఎగుమతుల్లో 400 బిలియన్ డాలర్ల మేజిక్ ఫిగర్‌ను దాటడం,2022 అంటే ప్రజలుఆత్మ నిర్భర్ భారత్ తీర్మానాన్ని స్వీకరించడం-జీవించి చూపించడం. 2022 అంటే భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక INS విక్రాంత్‌ను స్వాగతించడం. 2022 అంటే అంతరిక్షం, డ్రోన్, రక్షణ రంగాలలో భారతదేశ కీర్తి. 2022 అంటే ప్రతి రంగంలో భారతదేశ విజయం. కామన్వెల్త్ క్రీడలైనా మన మహిళా హాకీ జట్టు విజయమైనా క్రీడా రంగంలో కూడా మన యువత అద్భుతమైన సామర్థ్యాన్ని కనబరిచింది.
మిత్రులారా!వీటన్నిటితో పాటు 2022 సంవత్సరాన్ని గుర్తుంచుకోవడానికి మరో కారణం కూడా ఉంది. ఇది 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' భావన విస్తరణ. దేశ ప్రజలు ఐక్యతను, సంఘీభావాన్ని చాటిచెప్పేందుకుఅనేక అద్భుతమైన కార్యక్రమాలను కూడా నిర్వహించారు.రుక్మిణీ కళ్యాణంతో పాటుశ్రీకృష్ణునికి ఈశాన్య ప్రాంతాలతో ఉన్న సంబంధాన్ని వెల్లడించే గుజరాత్‌లోని మాధవపూర్ మేళా; కాశీ-తమిళ సంగమం మొదలైన ఉత్సవాల్లో ఏకీభావ ప్రదర్శన వర్ణమయంగా కనిపించింది. 2022లో దేశప్రజలు మరో అజరామర చరిత్రను లిఖించారు.ఆగస్టు నెలలో నిర్వహించిన 'హర్ ఘర్ తిరంగా' ప్రచారాన్ని ఎవరు మర్చిపోగలరు! ప్రతి దేశస్థుది రోమాలు నిక్కబొడుచుకునే క్షణాలవి. స్వతంత్రభారత 75 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా దేశం యావత్తూ త్రివర్ణమయమైంది. 6 కోట్ల మందికి పైగా ప్రజలు త్రివర్ణ పతాకంతో సెల్ఫీలు కూడా పంపారు.ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవం వచ్చే ఏడాది కూడా ఇదే విధంగా కొనసాగుతుంది. ఇది అమృతోత్సవ కాల పునాదిని మరింత బలోపేతం చేస్తుంది.
మిత్రులారా!జి-20 గ్రూప్‌కు అధ్యక్షత వహించే బాధ్యత కూడా ఈ ఏడాది భారతదేశానికి వచ్చింది. ఇంతకుముందు కూడా దీని గురించి వివరంగా చర్చించాను. 2023 సంవత్సరంలోమనం జి-20 ఉత్సాహాన్ని కొత్తశిఖరాలకు తీసుకెళ్ళాలి. ఈ కార్యక్రమాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!ఈరోజు క్రిస్మస్ పండుగను ప్రపంచమంతటా ఘనంగా జరుపుకుంటున్నారు. ఇది యేసుక్రీస్తు జీవితం, బోధనలను గుర్తుంచుకునే సందర్భం. మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలుతెలియజేస్తున్నాను.
మిత్రులారా!ఈరోజు గౌరవనీయ అటల్ బిహారీ వాజ్‌పేయి గారి పుట్టినరోజు కూడా. దేశానికి అసాధారణ నాయకత్వాన్ని అందించిన గొప్ప రాజనీతిజ్ఞుడు ఆయన. ప్రతి భారతీయుడి హృదయంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. కోల్‌కతాకు చెందిన ఆస్థా గారి నుండి నాకు ఉత్తరం వచ్చింది.ఈ లేఖలో ఆమె తన ఢిల్లీ పర్యటన గురించి ప్రస్తావించారు. ఆ సమయంలో తాను పీఎంమ్యూజియాన్ని సందర్శించానని ఆమె రాశారు. ఈ మ్యూజియంలోని అటల్ జీ గ్యాలరీ ఆమెకు బాగా నచ్చింది. అక్కడ అటల్ జీ చిత్రంతో తీసుకున్న ఫోటో ఆమెకుఎప్పుడూ గుర్తుండే జ్ఞాపకంగా మారింది.అటల్ జీ గ్యాలరీలోదేశానికి ఆయన చేసిన అమూల్యమైన కృషిని మనం చూడవచ్చు. మౌలిక సదుపాయాల రంగంలో గానీ విద్యారంగంలోగానీ విదేశాంగ విధానంలో గానీ - ప్రతి రంగంలో భారతదేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ఆయన కృషి చేశారు. నేను మరోసారి అటల్ జీకి హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను.
మిత్రులారా!రేపు డిసెంబర్ 26న 'వీర్ బాల్ దివస్' జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా అమరవీరులు సాహిబ్ జాదా జోరావర్ సింగ్ జీ, సాహిబ్ జాదా ఫతే సింగ్ జీ స్మృతిలో ఢిల్లీలో నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొనే అదృష్టం నాకు కలిగింది. సాహిబ్ జాదే, మాతా గుజ్రీల త్యాగాన్ని దేశం ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది.
నా ప్రియమైన దేశవాసులారా!
“సత్యమ్ కిమ్ ప్రమాణం, ప్రత్యక్షమ్ కిమ్ ప్రమాణమ్” అంటారు.
అంటే సత్యానికి రుజువులు అవసరం లేదు. ప్రత్యక్షం గా కనబడేదానికి కూడా రుజువు అవసరం లేదు. కానీ ఆధునిక వైద్య శాస్త్రం విషయానికి వస్తే రుజువు చాలా ముఖ్యమైన విషయం. శతాబ్దాలుగా భారతీయుల జీవితంలో భాగమైన యోగా, ఆయుర్వేదం వంటి మన శాస్త్రాల్లో సాక్ష్యాధార ఆధారిత పరిశోధన లేకపోవడం ఎప్పుడూ సవాలుగా ఉంది. ఫలితాలు కనిపిస్తాయి. కానీ రుజువులు కాదు.కానీ సాక్ష్యాధారిత వైద్య యుగంలోయోగా, ఆయుర్వేదం ఇప్పుడు ఆధునిక యుగపరీక్షల్లో విశ్వసనీయమైనవిగా నిలుస్తున్నందుకు నేను సంతోషిస్తున్నాను. ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్ గురించి మీరందరూ వినే ఉంటారు. పరిశోధన, పరికల్పన, క్యాన్సర్ కేర్లోఈ సంస్థ చాలా పేరు సంపాదించింది. బ్రెస్ట్ క్యాన్సర్ పేషెంట్లకు యోగా చాలా ప్రభావవంతంగా ఉంటుందని ఈ కేంద్రం చేసిన లోతైన పరిశోధనలో వెల్లడైంది. అమెరికాలో జరిగిన అత్యంత ప్రతిష్టాత్మక బ్రెస్ట్ క్యాన్సర్ సదస్సులో టాటా మెమోరియల్ సెంటర్ తన పరిశోధన ఫలితాలను అందించింది.ఈ ఫలితాలు ప్రపంచంలోని పెద్ద - పెద్ద నిపుణుల దృష్టిని ఆకర్షించాయి. ఎందుకంటేయోగా ఫలితంగా రోగులు ఎలా ప్రయోజనం పొందారో టాటా మెమోరియల్ సెంటర్ సాక్ష్యాధారాలతో సహా తెలియజేసింది. ఈ కేంద్ర పరిశోధన ప్రకారంక్రమం తప్పకుండా యోగా సాధన చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ పునరావృతమయ్యే అవకాశాలు, మరణాల ప్రమాదం 15 శాతం తగ్గాయి.పాశ్చాత్య పద్ధతుల కఠినమైన ప్రమాణాలతో భారతీయ సంప్రదాయ వైద్య ఫలితాల నిగ్గు తేల్చడం విషయంలో ఇది మొదటి ఉదాహరణ.అలాగేరొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళల్లో జీవన నాణ్యతను మెరుగుపరచడంలో యోగా ఫలితాలను కనుగొన్న మొదటి అధ్యయనం ఇది. దీని దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా తెరపైకి వచ్చాయి. ప్యారిస్‌లో జరిగిన యూరోపియన్ సొసైటీ ఆఫ్ మెడికల్ ఆంకాలజీ సదస్సులో టాటా మెమోరియల్ సెంటర్ తన అధ్యయన ఫలితాలను సమర్పించింది.
మిత్రులారా!నేటి యుగంలోభారతీయ వైద్య విధానాల్లోసాక్ష్యాధారాలు ఎక్కువైనకొద్దీ ప్రపంచం మొత్తంలో వాటికి అంతగా ఆదరణ పెరుగుతుంది. ఈ ఆలోచనతో ఢిల్లీలోని అఖిలభారత వైద్య విజ్ఞాన సంస్థలో కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఇక్కడమన సంప్రదాయ వైద్య విధానాలను ధృవీకరించడానికి సెంటర్ ఫర్ ఇంటిగ్రేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్ ను ఆరేళ్ల కిందట స్థాపించారు. ఇందులో ఆధునిక పరిజ్ఞానాన్ని, పరిశోధనాపద్ధతులను ఉపయోగించారు. ప్రఖ్యాత అంతర్జాతీయ జర్నల్స్‌లో ఈ కేంద్రం ఇప్పటికే 20పత్రాలను ప్రచురించింది.అమెరికన్ కాలేజ్ ఆఫ్ కార్డియాలజీ జర్నల్‌లో ప్రచురితమైన ఒక పత్రం మూర్ఛతో బాధపడుతున్న రోగులకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తుంది. ఇదేవిధంగాన్యూరాలజీ జర్నల్ లో ప్రచురితమైన పత్రంలో మైగ్రేన్ బాధితులకు యోగా వల్ల కలిగే ప్రయోజనాలను వివరించారు. ఇవే కాకుండా అనేక ఇతర వ్యాధుల బాధితులకు కూడా యోగా వల్ల కలిగే ప్రయోజనాలకు సంబంధించి అధ్యయనాలు జరుగుతున్నాయి. గుండె జబ్బులు, డిప్రెషన్, స్లీప్ డిజార్డర్, గర్భధారణ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలు మొదలైనవాటిపై ఈ అధ్యయనాలు నిర్వహిస్తున్నారు.
మిత్రులారా!కొన్ని రోజుల క్రితం నేను ప్రపంచ ఆయుర్వేద కాంగ్రెస్ లో పాల్గొనేందుకు గోవా వెళ్ళాను. ఇందులో 40కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొని 550కి పైగా శాస్త్రీయ పత్రాలను సమర్పించారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న దాదాపు 215 కంపెనీలు ఇక్కడ ప్రదర్శనలో తమ ఉత్పత్తులను ప్రదర్శించాయి. నాలుగు రోజుల పాటు జరిగిన ఈ ఎక్స్‌పోలో లక్ష మందికి పైగా ప్రజలు ఆయుర్వేదానికి సంబంధించిన అనుభవాన్ని ఆస్వాదించారు.ఆయుర్వేద కాంగ్రెస్‌లో కూడాప్రపంచం నలుమూలల నుండి హాజరైన ఆయుర్వేద నిపుణులను సాక్ష్యాధారిత పరిశోధనలు నిర్వహించాల్సిందిగా కోరాను. కరోనా మహమ్మారి కాలంలో యోగా, ఆయుర్వేద శక్తిని మనమందరం చూస్తున్నాం. వీటికి సంబంధించిన సాక్ష్యాధారిత పరిశోధనలు చాలా ముఖ్యమైనవిగా నిరూపితమవుతాయి.యోగా, ఆయుర్వేదం, మన సంప్రదాయ వైద్య పద్ధతులకు సంబంధించిన అటువంటి ప్రయత్నాల గురించి మీకు ఏవైనా సమాచారం ఉంటేవాటిని సోషల్ మీడియాలో పంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!గత కొన్ని సంవత్సరాలుగా ఆరోగ్య రంగానికి సంబంధించిన అనేక ప్రధాన సవాళ్లను మనం అధిగమించాం. మన వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలు, దేశప్రజల సంకల్పశక్తి వల్లే ఇది సాధ్యమైంది. మనం భారతదేశం నుండి మశూచి, పోలియో, 'గినియా వార్మ్' వంటి వ్యాధులను నిర్మూలించాం.
ఈ రోజునేను 'మన్ కీ బాత్' శ్రోతలకు మరో సవాలు గురించి చెప్పాలనుకుంటున్నాను. అది ఇప్పుడు ముగియబోతోంది. ఈ సవాలు-ఈ వ్యాధి - 'కాలాజార్'. ఈ వ్యాధి పరాన్నజీవి శాండ్ ఫ్లైఈగ కాటు ద్వారా వ్యాపిస్తుంది. 'కాలాజార్' వచ్చినప్పుడు నెలల తరబడి జ్వరం ఉంటుంది. రక్తహీనత కలుగుతుంది. శరీరం బలహీనపడటంతోపాటు బరువు కూడా తగ్గుతుంది.ఈ వ్యాధి పిల్లల నుండి పెద్దల వరకు ఎవరికైనా రావచ్చు. కానీ అందరి కృషితో 'కాలాజార్' వ్యాధి నిర్మూలన ఇప్పుడు వేగంగా జరుగుతోంది. నిర్మూలించబడుతోంది. కొద్దికాలం క్రితం వరకు'కాలాజార్' వ్యాప్తి 4 రాష్ట్రాల్లోని 50 కంటే ఎక్కువ జిల్లాల్లో ఉండేది. కానీ ఇప్పుడు ఈ వ్యాధి బీహార్, జార్ఖండ్‌లోని 4 జిల్లాలకు మాత్రమే పరిమితమైంది. బీహార్-జార్ఖండ్ ప్రజల సమర్థత, అవగాహన ఈ నాలుగు జిల్లాల నుండి కూడా 'కాలాజార్'ని నిర్మూలించడానికి ప్రభుత్వ ప్రయత్నాలకు దోహదపడతాయన్న విశ్వాసం నాకుంది. 'కాలాజార్' ప్రభావిత ప్రాంతాల ప్రజలు రెండు విషయాలను గుర్తుంచుకోవాలని నేను కోరుతున్నాను. ఒకటి - శాండ్ ఫ్లై లేదా ఇసుక ఈగ నియంత్రణ. రెండవది, వీలైనంత త్వరగా ఈ వ్యాధిని గుర్తించి పూర్తి చికిత్స అందించడం. 'కాలాజార్'చికిత్స సులభం. దీనికి ఉపయోగించే మందులు కూడా చాలా ప్రభావవంతంగా ఉంటాయి.మీరు అప్రమత్తంగా ఉంటే చాలు. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయవద్దు. ఇసుక ఈగను చంపే మందులను పిచికారీ చేస్తూ ఉండండి. మన దేశం 'కాలాజార్'నుండి విముక్తి పొందినపుడు మనకు ఎంత సంతోషం కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. సమష్టి కృషి- సబ్ కా ప్రయాస్- భావనతో భారతదేశం 2025 నాటికి టి. బి. నుండి కూడా విముక్తి పొందేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో టీబీ విముక్త భారత ప్రచారాన్ని ప్రారంభించినప్పుడువేలాది మంది ప్రజలుటి.బి. రోగులను ఆదుకునేందుకు ముందుకు రావడాన్ని మీరు చూసి ఉంటారు. ఈ వ్యక్తులుక్షయరహిత ప్రచార మిత్రులు కావడంతో టీబీ రోగులను ఆదుకుంటున్నారు. వారికి ఆర్థిక సహాయం చేస్తున్నారు. ప్రజల సేవ, భాగస్వామ్యం ఉన్న ఈ శక్తి ప్రతి కష్టమైన లక్ష్యాన్ని సాధించడం ద్వారా మాత్రమే ప్రదర్శితమవుతుంది.
నా ప్రియమైన దేశవాసులారా! మన సంస్కృతీ సంప్రదాయాలకు గంగామాతతో అవినాభావ సంబంధం ఉంది. గంగాజలం మన జీవన విధానంలో అంతర్భాగంగా ఉంది.
నమామి గంగే తవ్ పాద పంకజం,
సుర అసురై: వందిత దివ్య రూపం|
భుక్తిం చ ముక్తిం చ దదాసి నిత్యం,
భావ అనుసరేణ్ సదా నరాణాం ||
అని మన గ్రంథాలలో పేర్కొన్నారు.
అంటే-“ఓ గంగామాతా! భక్తులకు వారి ఇష్టానుసారం ప్రాపంచిక సుఖాన్ని, ఆనందాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నావు. అందరూ నీ పవిత్ర పాదాలను పూజిస్తారు. నేను కూడా నీ పవిత్ర పాదాలకు నమస్కరిస్తున్నాను.” అని అర్థం. ఇలాంటి పరిస్థితుల్లో శతాబ్దాల పాటు ప్రవహిస్తున్న గంగమ్మను పరిశుభ్రంగా ఉంచుకోవడం మనందరి ముందున్న పెద్ద బాధ్యత. ఈ లక్ష్యంతో ఎనిమిదేళ్ల క్రితం 'నమామి గంగే అభియాన్' ప్రారంభించాం. ఈ చొరవ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు అందుకోవడం మనందరికీ గర్వకారణం.పర్యావరణ వ్యవస్థను పునరుద్ధరించడం విషయంలో ప్రపంచంలోని మొదటి పది కార్యక్రమాలలో 'నమామి గంగే' మిషన్‌ను ఐక్యరాజ్యసమితి చేర్చింది. ప్రపంచం నలుమూలల నుండి వచ్చిన 160 కార్యక్రమాలలో 'నమామి గంగే'కి ఈ గౌరవం లభించడం మరింత సంతోషకరమైన విషయం.
మిత్రులారా! 'నమామి గంగే' ప్రచారంలో అతిపెద్ద శక్తి ప్రజల నిరంతర భాగస్వామ్యం. 'నమామి గంగే' ప్రచారంలో గంగా ప్రహరీలకు, గంగా దూతలకు ప్రాముఖ్యత కల్పించారు. మొక్కలు నాటడం, ఘాట్లను శుభ్రపరచడం, గంగా హారతి, వీధి నాటకాలు, పెయింటింగ్‌లు వేయడం, కవితల ద్వారా అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాల్లో వారు నిమగ్నమై ఉన్నారు. ఈ ప్రచారం వల్ల జీవవైవిధ్యంలో కూడా చాలా అభివృద్ధి కనిపిస్తోంది.వివిధ జాతుల హిల్సా చేపలు, గంగా డాల్ఫిన్ , తాబేళ్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. గంగ పర్యావరణ వ్యవస్థ పరిశుభ్రంగా ఉండటంతోఇతర జీవనోపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయి. ఇక్కడ జీవవైవిధ్యాన్ని దృష్టిలో ఉంచుకుని తయారు చేసిన 'జల జీవనోపాధి నమూనా' గురించి చర్చించాలనుకుంటున్నాను.ఈ పర్యాటక ఆధారిత బోట్ సఫారీలను26 ప్రదేశాలలో ప్రారంభించారు. సహజంగానే 'నమామి గంగే' మిషన్ పరిధి, దాని విస్తృతినదిని శుభ్రపరచడం కంటే అధికంగా పెరిగింది. ఇది మన సంకల్ప శక్తికి , అవిశ్రాంత ప్రయత్నాలకు ప్రత్యక్ష నిదర్శనం. మరోవైపు పర్యావరణ పరిరక్షణ దిశగా ప్రపంచానికి కొత్త మార్గాన్ని కూడా చూపబోతోంది.
నా ప్రియమైన దేశప్రజలారా!మన సంకల్ప శక్తి బలంగా ఉన్నప్పుడుఅతి పెద్ద సవాలు కూడా సులభం అవుతుంది. సిక్కింలోని థేగు గ్రామానికి చెందిన సంగే షెర్పా గారు దీనికి ఉదాహరణగా నిలిచారు. గత 14 సంవత్సరాలుగా 12,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో పర్యావరణ పరిరక్షణ పనిలో ఆయనఅ నిమగ్నమై ఉన్నారు. సంగే గారు సాంస్కృతిక, పౌరాణిక ప్రాముఖ్యత ఉన్న సోమ్గో సరస్సును శుభ్రంగా ఉంచే పనిని చేపట్టారు.తన అలుపెరగని కృషితోఆయన ఈ హిమానీనద సరస్సు రంగురూపులను మార్చారు. ఈ పరిశుభ్రత ప్రచారాన్ని 2008లో సంగే షెర్పా గారు ప్రారంభించినప్పుడు అనేక ఇబ్బందులను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే అనతికాలంలోనే ఈ మహత్తర కార్యానికి యువకులు, గ్రామస్థులతో పాటు పంచాయతీ నుండి కూడా పూర్తి మద్దతు లభించడం ప్రారంభమైంది. ఈరోజుమీరు సోమ్గోసరస్సును చూడటానికి వెళితేఅక్కడ చుట్టూ పెద్ద పెద్ద చెత్త డబ్బాలు కనిపిస్తాయి. ఇప్పుడు ఇక్కడ సేకరించిన చెత్తను రీసైక్లింగ్ కోసం పంపుతున్నారు. ఇక్కడికి వచ్చే పర్యాటకులు చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా వారికి గుడ్డతో చేసిన చెత్త సంచులను కూడా అందజేస్తున్నారు.ఇప్పుడు ఈ పరిశుభ్రమైన సరస్సును చూడటానికి ప్రతి ఏటా సుమారు 5 లక్షల మంది పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటున్నారు. సోమ్గో సరస్సును పరిరక్షించడానికి చేసిన ఈ ప్రత్యేకమైన కృషికి సంగే షెర్పాను అనేక సంస్థలు గౌరవించాయి. ఇటువంటి ప్రయత్నాల కారణంగాసిక్కిం భారతదేశంలోని పరిశుభ్రమైన రాష్ట్రాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. సంగే షెర్పా గారు, ఆయన సహచరులతో పాటుదేశవ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన గొప్ప ప్రయత్నాల్లో నిమగ్నమైన ప్రజలను కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
మిత్రులారా! 'స్వచ్ఛ భారత్ మిషన్' నేడు ప్రతి భారతీయుని మనస్సులో స్థిరపడినందుకునేను సంతోషిస్తున్నాను. 2014వ సంవత్సరంలో ఈ ప్రజాఉద్యమం ప్రారంభమైనప్పటి నుండిదీన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్లడానికి ప్రజల నుండి అనేక విశిష్ట ప్రయత్నాలు జరిగాయి. ఈ ప్రయత్నాలు సమాజంలోనే కాకుండా ప్రభుత్వంలో కూడా జరుగుతున్నాయి.ఈ నిరంతర ప్రయత్నాల ఫలితాలు చాలా ఉన్నాయి. చెత్తను తొలగించడం వల్ల, అనవసరమైన వస్తువులను తొలగించడం వల్ల కార్యాలయాలలో చాలా స్థలంఖాళీ అవుతుంది. కొత్త స్థలం అందుబాటులోకి వస్తుంది. ఇంతకు ముందు స్థలాభావం వల్ల దూరప్రాంతాల్లో కార్యాలయాలు అద్దెకు తీసుకోవాల్సి వచ్చేది. ఈ రోజుల్లోఈ శుభ్రత కారణంగాచాలా స్థలం అందుబాటులోకి వచ్చి ఇప్పుడు, అన్ని కార్యాలయాలు ఒకే చోటికి వచ్చే అవకాశం ఏర్పడింది. గతంలోసమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కూడా ముంబై, అహ్మదాబాద్, కోల్‌కతా, షిల్లాంగ్ లతో పాటు అనేక ఇతర నగరాల్లోని తన కార్యాలయాలలో చాలా కృషి చేసింది. ఆ కారణంగానే నేడు పూర్తిగా కొత్తగా వినియోగించుకునే రెండు- మూడు అంతస్తులు వారికి అందుబాటులోకి వచ్చాయి. ఈ పరిశుభ్రత కారణంగావనరులను ఉత్తమంగా వినియోగించుకోవడంలో ఉత్తమ అనుభవాన్ని పొందుతున్నాం. ఈ ప్రచారం సమాజంతో పాటు గ్రామాలు, నగరాలు, కార్యాలయాల్లో కూడా అన్ని విధాలుగా దేశానికి ఉపయోగపడుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!మన దేశంలో మన కళలు, సంస్కృతి పై కొత్త అవగాహన వస్తోంది. కొత్త చైతన్యం జాగృతమవుతోంది. 'మన్ కీ బాత్'లో ఇలాంటి ఉదాహరణలను తరచుగా చర్చిస్తాం. కళ, సాహిత్యం, సంస్కృతి సమాజానికి సమష్టి మూలధనం అయినట్లే, వాటిని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత కూడా మొత్తం సమాజంపై ఉంది.అలాంటి విజయవంతమైన ప్రయత్నం లక్షద్వీప్‌లో జరుగుతోంది. కల్పేని ద్వీపంలో ఒక క్లబ్ ఉంది –కూమేల్ బ్రదర్స్ ఛాలెంజర్స్ క్లబ్. ఈ క్లబ్ స్థానిక సంస్కృతి, సంప్రదాయ కళలను కాపాడుకోవడానికి యువతకు స్ఫూర్తినిస్తుంది. ఇక్కడ యువత స్థానిక కళలైన కోల్కలి, పరీచాక్లి, కిలిప్పాట్ట్, సంప్రదాయ గీతాల్లో శిక్షణ పొందుతున్నారు.అంటే పాత వారసత్వాన్ని కొత్త తరం చేతుల్లో భద్రపరుచుకుంటూ ముందుకు సాగుతున్నారు. మిత్రులారా! దేశంలోనే కాదు-విదేశాల్లోనూ ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నందుకు సంతోషంగా ఉంది. ఇటీవల దుబాయ్ నుంచి అక్కడి కలరి క్లబ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసిందని వార్తలు వచ్చాయి. దుబాయ్ క్లబ్ రికార్డ్ సృష్టించిందని, దీనికి భారతదేశంతో సంబంధం ఏమిటని ఎవరైనా అనుకోవచ్చు. వాస్తవానికిఈ రికార్డు భారతదేశంలోని పురాతన యుద్ధ కళ కలరిపయట్టుకు సంబంధించింది. ఏకకాలంలో ఎక్కువ మంది వ్యక్తులు కలరిని ప్రదర్శించినందుకు ఈ రికార్డు నమోదైంది. దుబాయ్ లోని కలరి క్లబ్, దుబాయ్ పోలీసులతో కలిసి దీనికి ప్రణాళిక రూపొందించి, అరబ్ ఎమిరేట్స్ జాతీయ దినోత్సవం సందర్భంగా ప్రదర్శించింది. ఈ కార్యక్రమంలో నాలుగేళ్ల పిల్లల నుంచి అరవయ్యేళ్ల వృద్ధుల వరకు కలరిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. వివిధ తరాలు ప్రాచీన సంప్రదాయాన్నిపూర్తి అంకితభావంతోఎలా ముందుకు తీసుకెళ్తున్నాయో తెలియజేసేందుకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ.
మిత్రులారా!కర్ణాటకలోని గడక్ జిల్లాలో నివసించే 'క్వేమశ్రీ' గారి గురించి కూడా'మన్ కీ బాత్' శ్రోతలకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. దక్షిణాదిలో కర్ణాటక కళ-సంస్కృతిని పునరుద్ధరించే లక్ష్యంలో 'క్వేమశ్రీ'గత 25 సంవత్సరాలుగా నిరంతరం నిమగ్నమై ఉన్నారు. వారి తపస్సు ఎంత గొప్పదో మీరు ఊహించుకోవచ్చు.అంతకుముందు క్వేమశ్రీ గారికి హోటల్ మేనేజ్మెంట్ వృత్తితో సంబంధం కలిగి ఉంది. కానీ సంస్కృతీ సంప్రదాయాలతో లోతైన అనుబంధం ఉండడంతో దాన్ని తన లక్ష్యంగా చేసుకున్నారు. ‘కళా చేతన’ పేరుతో ఓ వేదికను రూపొందించారు.ఈ వేదికకర్ణాటకతో పాటు దేశ విదేశాల కళాకారులతో అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇందులోస్థానిక కళను, సంస్కృతిని ప్రోత్సహించడానికి అనేక వినూత్న కార్యక్రమాలను కూడా నిర్వహిస్తారు. మిత్రులారా!తమ కళ, సంస్కృతి పట్ల దేశప్రజల ఈ ఉత్సాహం 'మన వారసత్వం పట్ల గర్వం' అనే భావానికి నిదర్శనం. మన దేశంలోప్రతి మూలలో చెల్లాచెదురుగా అలాంటి వర్ణమయమైన ప్రయత్నాలు చాలా ఉన్నాయి. వాటిని అలంకరించడానికి, భద్రపరచడానికి మనం నిరంతరం కృషి చేయాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!దేశంలోని అనేక ప్రాంతాల్లో వెదురుతో చాలా అందమైన, ఉపయోగకరమైన వస్తువులు తయారు చేస్తారు. ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో నైపుణ్యం ఉన్న వెదురుపనివారు, కళాకారులుఉన్నారు. వెదురుకు సంబంధించిన బ్రిటిష్ కాలంనాటి చట్టాలను మార్చినప్పటి నుండిదానికి భారీ మార్కెట్ అభివృద్ధి చెందింది. మహారాష్ట్రలోని పాల్ఘర్ వంటి ప్రాంతాల్లో కూడా ఆదివాసీలు వెదురుతో ఎన్నో అందమైన ఉత్పత్తులను తయారు చేస్తున్నారు.వెదురుతో చేసిన పెట్టెలు, కుర్చీలు, టీపాట్‌లు, బుట్టలు, ట్రేలు మొదలైనవి బాగా ప్రాచుర్యం పొందుతున్నాయి. అంతే కాదు- ఈ వ్యక్తులు వెదురు గడ్డితో అందమైన బట్టలు, అలంకరణ వస్తువులు కూడా చేస్తారు. దీనివల్ల ఆదివాసీ మహిళలు కూడా ఉపాధి పొందుతున్నారు. వారి నైపుణ్యానికి కూడా గుర్తింపు లభిస్తోంది.
మిత్రులారా!కర్నాటకకు చెందిన ఓ జంట తమలపాకుతో తయారు చేసిన అనేక ప్రత్యేకమైన ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు పంపుతోంది. కర్ణాటకలోని శివమొగ్గకు చెందిన ఆ దంపతులు - శ్రీ సురేష్ గారు, ఆయన భార్య శ్రీమతి మైథిలి గారు. వారు తమలపాకు పీచుతో ట్రేలు, ప్లేట్లు, హ్యాండ్‌బ్యాగ్‌ల నుంచి మొదలుకొని అనేక అలంకరణ వస్తువులను తయారు చేస్తున్నారు.ఈ పీచుతో చేసిన చెప్పులను కూడా చాలామంది ఇష్టపడుతున్నారు. వారి ఉత్పత్తులను లండన్, ఐరోపాలోని ఇతర మార్కెట్లలో విక్రయిస్తున్నారు. ఇది అందరూ ఇష్టపడుతున్నమన సహజ వనరులు, సంప్రదాయ నైపుణ్యాల నాణ్యత. ఈ సంప్రదాయ జ్ఞానంలోప్రపంచం స్థిరమైన భవిష్యత్తు వైపు చూస్తోంది. మనం కూడా ఈ దిశగా మరింత అవగాహన కలిగి ఉండాల్సిన అవసరం ఉంది.మనమే అలాంటి స్వదేశీ, స్థానిక ఉత్పత్తులను ఉపయోగించాలి. ఇతరులకు కూడా బహుమతిగా ఇవ్వాలి. ఇది మన గుర్తింపును దృఢపరుస్తుంది. స్థానిక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. పెద్ద సంఖ్యలో ప్రజల భవిష్యత్తును ప్రకాశవంతం చేస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!ఇప్పుడు మనం 'మన్ కీ బాత్'లో అపూర్వమైన మైలురాయి వందవ ఎపిసోడ్ వైపు నెమ్మదిగా కదులుతున్నాం. నాకు చాలా మంది దేశప్రజల నుండి లేఖలు వచ్చాయి. అందులో వారు వందవ ఎపిసోడ్ గురించి చాలా ఉత్సుకతను వ్యక్తం చేశారు. వందవ ఎపిసోడ్లో మనం ఏం మాట్లాడాలి, దాన్ని ఎలా ప్రత్యేకంగా రూపొందించాలనే దానిపై మీరు మీ సూచనలను పంపితే నేను సంతోషపడతాను. తర్వాతిసారి మనం 2023 సంవత్సరంలో కలుద్దాం. 2023 సంవత్సరానికి మీకు శుభాకాంక్షలు.ఈ సంవత్సరం కూడా దేశానికి ప్రత్యేకం కావాలని, దేశం కొత్త శిఖరాలను తాకాలని కోరుకుందాం. అందరం కలిసి ఒక తీర్మానం చేయాలి. అలాగే దాన్ని సాకారం చేయాలి. ఈ సమయంలో చాలా మంది సెలవుల మూడ్‌లో ఉన్నారు.మీరు ఈ పండుగలను చాలా ఆనందించండి. అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి. ప్రపంచంలోని చాలా దేశాల్లో కరోనా పెరుగుతోందని మీరు కూడా చూస్తున్నారు. కాబట్టి మనం మాస్కులు ధరించడం, చేతులు కడుక్కోవడం వంటి జాగ్రత్తలపై మరింత దృష్టి పెట్టాలి. మనం జాగ్రత్తగా ఉంటేసురక్షితంగా కూడా ఉంటాం. మన ఆనందానికి ఎటువంటి ఆటంకం ఉండదు. దీంతో మరోసారి మీ అందరికీ శుభాకాంక్షలు.చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం... మీ అందరికీ మరోసారి 'మన్ కీ బాత్'లోకి స్వాగతం. ఈ కార్యక్రమం 95వ ఎపిసోడ్. 'మన్ కీ బాత్' వందో సంచిక వైపు మనం వేగంగా దూసుకుపోతున్నాం. 130 కోట్ల మంది దేశప్రజలతో అనుసంధానమయ్యేందుకు ఈ కార్యక్రమం నాకు మరో మాధ్యమం. ప్రతి ఎపిసోడ్‌కు ముందుగ్రామాలు, నగరాల నుండి వచ్చే చాలా ఉత్తరాలను చదవడం, పిల్లల నుండి పెద్దల వరకు మీరు పంపిన ఆడియో సందేశాలు వినడం నాకు ఆధ్యాత్మిక అనుభవం లాంటిది.
మిత్రులారా! నేటి కార్యక్రమాన్ని ఒక ప్రత్యేకమైన బహుమతి గురించిన చర్చతో ప్రారంభించాలనుకుంటున్నాను. తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక నేత సోదరుడు ఉన్నారు. ఆయన పేరు యెల్ది హరిప్రసాద్ గారు. ఆయన తన స్వహస్తాలతో నేసిన ఈ జి-20 లోగోను నాకు పంపారు. ఈ అద్భుతమైన బహుమతిని చూసి నేను ఆశ్చర్యపోయాను. హరిప్రసాద్ గారు తన కళతో అందరి దృష్టిని ఆకర్షించే స్థాయిలో నైపుణ్యం ఉంది.చేతితో నేసిన G-20 లోగోతో పాటు హరిప్రసాద్ గారు నాకు ఒక లేఖ కూడా పంపారు. వచ్చే ఏడాది జి-20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వడం గర్వించదగ్గ విషయమని ఇందులో రాశారు.దేశం సాధించిన ఈ విజయం నుండి పొందిన ఆనందంతో ఆయన తన స్వహస్తాలతో జి-20 లోగోను సిద్ధం చేశారు. తన తండ్రి నుండి ఈ అద్భుతమైన నేత ప్రతిభను వారసత్వంగా పొందిన ఆయన ఈ రోజు పూర్తి ఇష్టంతో అందులో నిమగ్నమై ఉన్నారు.
మిత్రులారా!కొన్ని రోజుల క్రితం నేను జి-20 లోగోను, ప్రెసిడెన్సీ ఆఫ్ ఇండియా వెబ్‌సైట్‌ను ఆవిష్కరించే అవకాశాన్ని పొందాను. ఈ లోగోను పోటీ ద్వారా ఎంపిక చేశారు. హరిప్రసాద్ గారు పంపిన ఈ బహుమతి అందుకోగానే నా మనసులో మరో ఆలోచన వచ్చింది. తెలంగాణలోని ఒక జిల్లాలో కూర్చున్న వ్యక్తి కూడా జి-20 వంటి శిఖరాగ్ర సదస్సుతో ఎంతగా అనుసంధానమయ్యాడో చూసి నేను చాలా సంతోషించాను. ఇంత పెద్ద సమ్మిట్‌ని దేశం నిర్వహించడం వల్ల హృదయం ఉప్పొంగిపోయిందని హరిప్రసాద్ గారి లాంటి చాలా మంది నాకు లేఖలు పంపారు.పూణే నుండి సుబ్బారావు చిల్లరా గారు, కోల్‌కతా నుండి తుషార్ జగ్మోహన్ గారు పంపిన సందేశాలను కూడా నేను ప్రస్తావిస్తాను. జి-20 మొదలుకుని భారతదేశం చేపట్టిన అనేక క్రియాశీలక ప్రయత్నాలను వారు ఎంతో ప్రశంసించారు.
మిత్రులారా!జి-20 దేశాలకు ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు, ప్రపంచ వాణిజ్యంలో నాలుగింట మూడు వంతులు, ప్రపంచ జిడిపిలో 85%భాగస్వామ్యం ఉంది. మీరు ఊహించవచ్చు- 3 రోజుల తర్వాత అంటే డిసెంబర్ 1వ తేదీ నుండి భారతదేశం ఇంత పెద్ద సమూహానికి, ఇంత శక్తిమంత మైన సమూహానికిఅధ్యక్షత వహించబోతోంది. భారతదేశానికి, ప్రతి భారతీయుడికి ఎంత గొప్ప అవకాశం వచ్చింది! స్వతంత్ర భారత అమృతోత్సవ కాలంలో భారతదేశానికి ఈ బాధ్యత లభించినందువల్ల ఇది మరింత ప్రత్యేకమైంది. మిత్రులారా!జి-20 అధ్యక్ష పదవి మనకు గొప్ప అవకాశంగా వచ్చింది. మనం ఈ అవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలి. విశ్వ కళ్యాణంపై-ప్రపంచ సంక్షేమంపై దృష్టి పెట్టాలి. శాంతి కావచ్చు. ఐక్యత కావచ్చు. పర్యావరణం నుండి మొదలుకుని సున్నితమైన విషయాలు కావచ్చు. సుస్థిర అభివృద్ధి కావచ్చు. ఏ విషయమైనా సరే.. వీటికి సంబంధించిన సవాళ్లకు భారతదేశం దగ్గర పరిష్కారాలున్నాయి. ఒకే భూమి-ఒకే కుటుంబం-ఒకే భవిష్యత్తు అనే అంశంతో వసుధైక కుటుంబ భావన మన నిబద్ధతను తెలియజేస్తుంది.
ఓం సర్వేషాం స్వస్తిర్భవతు
సర్వేషాం శాంతిర్భవతు
సర్వేషాం పూర్ణంభవతు
సర్వేషాం మంగళం భవతు
ఓం శాంతిః శాంతిః శాంతిః ॥
- అని మనం ఎప్పుడూ చెప్తాం.
అంటే “అందరూ క్షేమంగా ఉండాలి. అందరికీ శాంతి లభించాలి. అందరికీ పూర్ణత్వం సిద్ధించాలి. అందరికీ శుభం కలగాలి” అని. రానున్న రోజుల్లో జి-20కి సంబంధించిన అనేక కార్యక్రమాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతాయి. ఈ సమయంలోప్రపంచంలోని వివిధ ప్రాంతాల ప్రజలకు మీ రాష్ట్రాలను సందర్శించే అవకాశం లభిస్తుంది. మీరు ఇక్కడి సంస్కృతిలోని విభిన్నమైన, విలక్షణమైన రంగులను ప్రపంచానికి అందిస్తారన్న నమ్మకం నాకుంది. జి-20 సమావేశాలకు వచ్చేవారు ఇప్పుడు ప్రతినిధులుగా వచ్చినప్పటికీ వారు భవిష్యత్తులో పర్యాటకులనే విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. హరిప్రసాద్ గారిలాగా అందరూ ఏదో ఒకరకంగా జి-20తో అనుసంధానం కావాలని మీ అందరినీ- ముఖ్యంగా నా యువ మిత్రులను కోరుతున్నాను. జి-20 భారతీయ లోగోను చాలా ఆకర్షణీయంగా, కొత్త సొగసుతో తయారు చేసి బట్టలపై ముద్రించవచ్చు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తమ తమ ప్రదేశాల్లో జి-20కి సంబంధించిన చర్చలకు, పోటీలకు అవకాశాలను కల్పించాలని కూడా నేను కోరుతున్నాను. మీరు జి20 డాట్ ఇన్ వెబ్సైట్ చూస్తే మీ ఆసక్తికి అనుగుణంగా చాలా విషయాలు కనిపిస్తాయి.
నా ప్రియమైన దేశప్రజలారా!నవంబర్ 18న అంతరిక్ష రంగంలో కొత్త చరిత్ర సృష్టించడాన్ని యావద్దేశం చూసింది. ఆ రోజునభారతదేశంలోని ప్రైవేట్ రంగం రూపొందించి, సిద్ధం చేసిన తొలి రాకెట్‌ను అంతరిక్షంలోకి పంపింది. ఈ రాకెట్ పేరు 'విక్రమ్-ఎస్'. స్వదేశీ స్పేస్ స్టార్ట్-అప్ తో రూపొందించిన ఈ మొదటి రాకెట్ శ్రీహరికోట నుండి అంతరిక్షంలోకి ఎగిరినవెంటనే ప్రతి భారతీయుడు గర్వంతో తలెత్తుకున్నాడు.మిత్రులారా! 'విక్రమ్-ఎస్' రాకెట్ ను అనేక ఫీచర్లతో అమర్చారు. ఇది ఇతర రాకెట్ల కంటే తేలికైంది. చవకైంది. దీని అభివృద్ధి వ్యయం అంతరిక్ష యాత్రలో పాల్గొన్న ఇతర దేశాల ఖర్చు కంటే చాలా తక్కువ. తక్కువ ఖర్చుతోప్రపంచ స్థాయి నాణ్యత. అంతరిక్ష సాంకేతికతలో ఇప్పుడు ఇది భారతదేశానికి గుర్తింపుగా మారింది.ఈ రాకెట్ తయారీలో మరో ఆధునిక సాంకేతికతను ఉపయోగించారు. ఈ రాకెట్‌లోని కొన్ని ముఖ్యమైన భాగాలను త్రీడీ ప్రింటింగ్ ద్వారా తయారు చేశారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. నిజానికి 'విక్రమ్-ఎస్' లాంచ్ మిషన్కి పెట్టిన పేరు 'ప్రారంభ్' సరిగ్గా సరిపోతుంది. ఇది భారతదేశ ప్రైవేట్ అంతరిక్ష రంగంలో కొత్త శకానికి ప్రారంభం.దేశంలో విశ్వాసంతో నిండిన కొత్త శకానికి ఇది నాంది. చేతితోకాగితపు విమానాలను నడిపే పిల్లలు ఇప్పుడు భారతదేశంలోనే విమానాలను తయారుచేసి, ఎగురవేయగలరని మీరు ఊహించవచ్చు.ఒకప్పుడు చంద్రుడు, నక్షత్రాలను చూస్తూ ఆకాశంలో ఆకారాలు గీసే పిల్లలు ఇప్పుడు భారతదేశంలోనే రాకెట్లు తయారు చేసే అవకాశం పొందుతున్నారని మీరు ఊహించవచ్చు.అంతరిక్షరంగంలో ప్రైవేటు సంస్థలకు అవకాశాలు కల్పించిన తర్వాత యువత కలలు కూడా సాకారమవుతున్నాయి. రాకెట్లను తయారు చేస్తున్నఈ యువత ఆకాశం కూడా హద్దు కాదంటోంది.
మిత్రులారా!భారతదేశం అంతరిక్ష రంగంలో తన విజయాన్ని తన పొరుగు దేశాలతో కూడా పంచుకుంటుంది. భారతదేశం, భూటాన్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహాన్ని నిన్ననే భారతదేశం ప్రయోగించింది. భూటాన్ సహజ వనరుల నిర్వహణలో సహాయపడే విధంగా ఈ ఉపగ్రహం చాలా చక్కటి స్పష్టత ఉన్న చిత్రాలను పంపుతుంది. ఈ ఉపగ్రహ ప్రయోగం భారత్-భూటాన్ దేశాల మధ్య దృఢ సంబంధాలకు అద్దం పడుతోంది.
మిత్రులారా!గత కొన్ని 'మన్ కీ బాత్' ఎపిసోడ్లలో మనం అంతరిక్షం, సాంకేతికత, ఆవిష్కరణల గురించి ఎక్కువగా మాట్లాడుకోవడం మీరు గమనించి ఉంటారు. దీనికి రెండు ప్రత్యేక కారణాలు ఉన్నాయి. ఒకటి మన యువత ఈ రంగంలో అద్భుతంగా పనిచేస్తోంది. యువకులు భారీస్థాయిలో ఆలోచిస్తున్నారు. భారీస్థాయిలో సాధిస్తున్నారు. ఇప్పుడు చిన్న చిన్న విజయాలతో వారు సంతృప్తి చెందడం లేదు. రెండవది-ఆవిష్కరణ, విలువ సృజనల ఈ ఉత్తేజకరమైన ప్రయాణంలో యువకులు ఇతర యువ సహచరులను, స్టార్ట్-అప్‌లను కూడా ప్రోత్సహిస్తున్నారు.
మిత్రులారా!టెక్నాలజీకి సంబంధించిన ఆవిష్కరణల గురించి మాట్లాడుతున్నప్పుడుమనం డ్రోన్లను ఎలా మరచిపోగలం? డ్రోన్ల రంగంలో భారత్ కూడా వేగంగా దూసుకుపోతోంది. కొన్ని రోజుల క్రితం హిమాచల్ ప్రదేశ్‌లోని కిన్నౌర్‌లో డ్రోన్ల ద్వారా ఆపిల్లను ఎలా రవాణా చేశారో చూశాం. కిన్నౌర్ హిమాచల్‌లోని మారుమూల జిల్లా. ఈ సీజన్లో అక్కడ విపరీతమైన మంచు కురుస్తుంది.ఇంత ఎక్కువ హిమపాతంతోకిన్నౌర్ కు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో వారాల తరబడి అనుసంధానం చాలా కష్టమవుతుంది. అటువంటి పరిస్థితిలోఅక్కడి నుండి యాపిల్స్ రవాణా కూడా అంతే కష్టం. ఇప్పుడు డ్రోన్ టెక్నాలజీ సహాయంతోహిమాచల్‌లోని రుచికరమైన కిన్నౌరి యాపిల్స్ ప్రజలకు మరింత త్వరగా చేరువకానున్నాయి. దీని వల్ల మన రైతు సోదర సోదరీమణుల ఖర్చు తగ్గుతుంది. యాపిల్స్ సమయానికి మార్కెట్‌కు చేరుతాయి. యాపిల్స్ వృధా తగ్గుతుంది.
మిత్రులారా! గతంలో ఊహకు కూడా వీలు కాని విషయాలను ఈ రోజు మన దేశవాసులు తమ ఆవిష్కరణలతో సాధ్యం చేస్తున్నారు. ఇది చూస్తే ఎవరు మాత్రం సంతోషించకుండా ఉంటారు? ఇటీవలి సంవత్సరాల్లోమన దేశం చాలా విజయాలు సాధించింది. భారతీయులు- ముఖ్యంగా మన యువతరం- ఇంతటితో ఆగబోదని నాకు పూర్తి నమ్మకం ఉంది.
ప్రియమైన దేశప్రజలారా! నేను మీ కోసం ఒక చిన్న క్లిప్ వినిపించబోతున్నాను.
##(పాట)##
మీరందరూ ఈ పాటను ఎప్పుడో ఒకసారి విని ఉంటారు. ఇది బాపుకి ఇష్టమైన పాట. ఈ పాట పాడిన గాయకులు గ్రీస్ దేశస్థులని నేను చెబితే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు! ఈ విషయం కూడా మీరు గర్వించేలా చేస్తుంది. ఈ పాటను గ్రీస్ గాయకుడు ‘కాన్ స్టాంటినోస్ కలైట్జిస్’ పాడారు. గాంధీజీ 150వ జయంతి వేడుకల సందర్భంగా ఆయన దీన్ని పాడారు. కానీ ఈ రోజు నేను వేరే కారణాల వల్ల ఈ విషయాన్ని చర్చిస్తున్నాను. ఆయనకు భారతదేశంపై,భారతీయ సంగీతంపై గొప్ప అభిరుచి ఉంది. ఆయనకు భారతదేశంపై ఎంతో ప్రేమ. గత 42 సంవత్సరాలలో ఆయన దాదాపు ప్రతి ఏటా భారతదేశానికి వచ్చారు. భారతీయ సంగీత మూలాలు, వివిధ భారతీయ సంగీత వ్యవస్థలు, వివిధ రకాల రాగాలు, తాళాలు, రసాలతో పాటు వివిధ ఘరానాల గురించి ఆయనఅధ్యయనం చేశారు. భారతీయ సంగీతానికి చెందిన అనేక మంది గొప్ప వ్యక్తుల సేవలను అధ్యయనం చేశారు. భారతదేశంలోని శాస్త్రీయ నృత్యాలకు సంబంధించిన విభిన్న అంశాలను కూడా నిశితంగా అర్థం చేసుకున్నారు. ఇప్పుడు భారతదేశానికి సంబంధించిన ఈ అనుభవాలన్నింటినీ ఒక పుస్తకంలో చాలా అందంగా పొందుపరిచారు. ఇండియన్ మ్యూజిక్ పేరుతో ఆయన రాసిన పుస్తకంలో దాదాపు 760 చిత్రాలు ఉన్నాయి.ఈ ఛాయాచిత్రాల్లో చాలా వరకు ఆయనే తీశారు. ఇతర దేశాల్లో భారతీయ సంస్కృతిపై ఇటువంటి ఉత్సాహం,ఆకర్షణ నిజంగా సంతోషాన్నిస్తుంది.
మిత్రులారా!కొన్ని వారాల క్రితం మనం గర్వించదగ్గ మరో వార్త కూడా వచ్చింది. గత 8 సంవత్సరాల్లో భారతదేశం నుండి సంగీత వాయిద్యాల ఎగుమతి మూడున్నర రెట్లు పెరిగిందని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ఎలక్ట్రికల్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఎగుమతి 60 రెట్లు పెరిగింది.భారతీయ సంస్కృతికి, సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్ పెరుగుతోందని దీన్నిబట్టి తెలుస్తోంది. అమెరికా సంయుక్తరాష్ట్రాలు, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, యూకే మొదలైన అభివృద్ధి చెందిన దేశాలు భారతీయ సంగీత వాయిద్యాలను ఎక్కువగా కొనుగోలు చేస్తున్నాయి. సంగీతం, నృత్యం, కళల విషయంలో గొప్ప వారసత్వ సంపదను మన దేశం కలిగి ఉండటం మనందరి అదృష్టం.
మిత్రులారా! 'నీతి శతకం' కారణంగా ఆ శతక కర్త, గొప్ప కవి భర్తృహరి మనందరికీ తెలుసు. కళ, సంగీతం, సాహిత్యం పట్ల మనకున్న అనుబంధమే మానవత్వానికి నిజమైన గుర్తింపు అని ఆయన ఒక శ్లోకంలో చెప్పారు. నిజానికిమన సంస్కృతి దాన్ని మానవత్వానికి మించి దైవత్వానికి తీసుకువెళుతుంది. వేదాలలోసామవేదాన్ని మన విభిన్న సంగీతాలకు మూలంగా పేర్కొంటారు. సరస్వతీ మాత వీణ అయినా, భగవాన్ శ్రీకృష్ణుడి వేణువు అయినా, భోలేనాథుడి ఢమరు అయినామన దేవతలు కూడా సంగీతానికి భిన్నంగా ఉండరు. భారతీయులమైన మనం ప్రతిదానిలో సంగీతాన్ని అన్వేషిస్తాం. నది గలగలలైనా, వాన చినుకుల టపటప చప్పుడు అయినా, పక్షుల కిలకిలారావాలైనా, గాలి ప్రతిధ్వనులైనా మన నాగరికతలో సంగీతం ప్రతిచోటా ఉంటుంది.ఈ సంగీతం శరీరాన్ని సేద తీర్చడమే కాకుండా మనసును కూడా ఆహ్లాదపరుస్తుంది. సంగీతం మన సమాజాన్ని కూడా అనుసంధానిస్తుంది. భాంగ్రా, లావణి లలో ఉత్సాహం, ఆనందం ఉంటేరవీంద్ర సంగీతం మన ఆత్మను ఉల్లాసపరుస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న గిరిజనులకు విభిన్నసంగీత సంప్రదాయాలున్నాయి. ఒకరితో కలిసి ఉండేందుకు, ప్రకృతితో సామరస్యంగా జీవించడానికి ఇవి మనకు స్ఫూర్తినిస్తాయి.మిత్రులారా!మన సంగీత రూపాలు మన సంస్కృతిని సుసంపన్నం చేయడమే కాకుండా ప్రపంచ సంగీతంపై చెరగని ముద్ర వేశాయి. భారతీయ సంగీత ఖ్యాతి ప్రపంచంలోని నలుమూలలకు వ్యాపించింది. మీకు మరో ఆడియో క్లిప్ వినిపిస్తాను.
##(పాట)##
ఇంటికి సమీపంలోని ఏదో గుడిలో భజన కీర్తనలు జరుగుతున్నాయని మీరు అనుకుంటూ ఉంటారు. అయితే ఈ స్వరం భారతదేశానికి వేల మైళ్ల దూరంలో ఉన్న దక్షిణ అమెరికా దేశమైన గయానా నుండి మీకు చేరింది. 19వ,20వ శతాబ్దాలలో ఇక్కడి నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు గయానాకు వెళ్ళారు.ఇక్కడి నుంచి భారత దేశంలోని అనేక సంప్రదాయాలను కూడా తీసుకెళ్లారు. ఉదాహరణకు-మనం భారతదేశంలో హోలీని జరుపుకుంటున్నప్పుడుగయానాలో కూడా హోలీ రంగులు పలకరిస్తాయి. హోలీ రంగులు ఉన్నచోట ఫగ్వా సంగీతం కూడా ఉంటుంది. గయానాలోని ఫగ్వాలో రాముడితో, శ్రీకృష్ణుడితో సంబంధం ఉన్న పెళ్ళి పాటలు పాడే ప్రత్యేక సంప్రదాయం ఉంది.ఈ పాటలను చౌతాల్ అంటారు. ఇక్కడ ప్రాచుర్యంలో ఉన్న అదే రకమైన రాగంలోనే తారాస్థాయిలో వాటిని పాడతారు. ఇది మాత్రమే కాదు-చౌతాల్ పోటీ కూడా గయానాలో జరుగుతుంది. అదేవిధంగాచాలా మంది భారతీయులు-ముఖ్యంగా తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్ ప్రాంతాల నుండిప్రజలు ఫిజీకి కూడావెళ్లారు. వారు సంప్రదాయ భజనలు, కీర్తనలు పాడేవారు. వాటిలో ప్రధానంగా రామచరితమానస్ పద్య పాదాలు ఉండేవి.వారు ఫిజీలో భజనలు, కీర్తనలకు సంబంధించిన అనేక సమ్మేళనాలను కూడా ఏర్పాటు చేశారు. నేటికీ రామాయణ మండలి పేరుతో ఫిజీలో రెండు వేలకు పైగా భజన-కీర్తన మండళ్లు ఉన్నాయి. నేడు ప్రతి గ్రామంలో, ప్రతి ప్రాంతంలో వాటిని చూడవచ్చు. నేను ఇక్కడ కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇచ్చాను. మీరు ప్రపంచం మొత్తం మీద చూస్తేభారతీయ సంగీత ప్రియుల జాబితా చాలా పెద్దది.
నా ప్రియమైన దేశప్రజలారా!మన దేశం ప్రపంచంలోని పురాతన సంప్రదాయాలలో ఒకటైనందుకు మనమందరం ఎప్పుడూ గర్విస్తాం. అందువల్ల, మన సంప్రదాయాలను,సంప్రదాయ విజ్ఞానాన్ని కాపాడుకోవడం; వాటిని ప్రోత్సహించడం, సాధ్యమైనంతవరకు ముందుకు తీసుకెళ్లడం కూడా మన బాధ్యత.మన ఈశాన్య రాష్ట్రమైన నాగాలాండ్‌కు చెందిన కొందరు మిత్రులు అలాంటి ప్రశంసనీయమైన ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నం నాకు బాగా నచ్చింది. అందుకే 'మన్ కీ బాత్' శ్రోతలతో పంచుకోవాలని అనుకున్నాను.
మిత్రులారా!నాగాలాండ్‌లోని నాగా సమాజ జీవనశైలి, వారి కళ, సంస్కృతి, సంగీతంఅందరినీ ఆకర్షిస్తాయి. ఇవి మన దేశ అద్భుతమైన వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగం. నాగాలాండ్ ప్రజల జీవితం, వారి నైపుణ్యాలు కూడా సుస్థిర జీవన శైలికి చాలా ముఖ్యమైనవి.ఈ సంప్రదాయాలను, నైపుణ్యాలను కాపాడడంతో పాటు వాటిని తర్వాతి తరానికి అందించేందుకు అక్కడి ప్రజలు 'లిడి-క్రో-యు' పేరుతో ఓ సంస్థను ఏర్పాటు చేసుకున్నారు. మెల్లమెల్లగా అదృశ్యమవుతున్న నాగా సంస్కృతిలోని విశేషాలను పునరుద్ధరించేందుకు 'లిడి-క్రో-యు' సంస్థ కృషి చేస్తోంది. ఉదాహరణకునాగా జానపద సంగీతం సుసంపన్నమైంది.ఈ సంస్థ నాగా మ్యూజిక్ ఆల్బమ్స్ ఆవిష్కరించే పనిని ప్రారంభించింది. ఇప్పటి వరకు అలాంటి మూడు ఆల్బమ్‌లు విడుదలయ్యాయి. వారు జానపద సంగీతం, జానపద నృత్యానికి సంబంధించిన కార్యశాలలను కూడా నిర్వహిస్తారు. వీటికి సంబంధించి యువతకు శిక్షణ కూడా ఇస్తున్నారు. అంతేకాదు-సంప్రదాయ నాగాలాండ్ శైలిలో దుస్తుల తయారీ, టైలరింగ్, నేయడంలో కూడా యువతశిక్షణ పొందుతోంది. ఈశాన్యరాష్ట్రాల్లో వెదురుతో అనేక రకాల ఉత్పత్తులను తయారు చేస్తారు.కొత్త తరానికి చెందిన యువతకు కూడా వెదురు ఉత్పత్తులను తయారు చేయడం నేర్పుతున్నారు. దీంతో ఈ యువత వారి సంస్కృతితో ముడిపడి ఉండటమే కాకుండావారికి కొత్త ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. నాగా జానపదసంస్కృతి గురించి మరింత ఎక్కువ మందికి తెలియజేసేందుకులిడి-క్రో-యుసంస్థ కృషి చేస్తోంది.
మిత్రులారా!మీ ప్రాంతంలో కూడా అలాంటి సాంస్కృతిక శైలులు, సంప్రదాయాలు ఉంటాయి. మీరు కూడా మీ ప్రాంతాల్లో అలాంటి కృషి చేయవచ్చు. ఎక్కడైనా ఇలాంటి అద్వితీయ ప్రయత్నాల గురించి మీకు తెలిస్తేఆ సమాచారాన్ని నాతో కూడా పంచుకోవాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!
‘విద్యాధనం సర్వధనప్రధానమ్’ అని లోకోక్తి.
అంటే ఎవరైనా విద్యను దానం చేస్తుంటేఅతను సమాజ హితం కోసం అతిపెద్ద పని చేస్తున్నట్టు. విద్యారంగంలో వెలిగించే చిన్న దీపం కూడా మొత్తం సమాజానికి వెలుగునిస్తుంది. ఈరోజు దేశవ్యాప్తంగా ఇలాంటి ఎన్నో ప్రయత్నాలు జరగడం నాకు చాలా సంతోషాన్నిస్తుంది. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోకు 70-80 కిలోమీటర్ల దూరంలోని హర్దోయ్ ప్రాంతంలో బన్సా ఒక గ్రామం. విద్యలో వెలుగులు నింపే పనిలో నిమగ్నమైన ఈ గ్రామానికి చెందిన జతిన్ లలిత్ సింగ్ గురించి నాకు సమాచారం వచ్చింది. జతిన్ గారు రెండేళ్లకిందట ఇక్కడ సామాజిక గ్రంథాలయాన్ని, వనరుల కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ కేంద్రంలో హిందీ, ఆంగ్ల సాహిత్యం, కంప్యూటర్, లా అంశాలతో పాటు ప్రభుత్వ పోటీ పరీక్షలసన్నద్ధతకు సంబంధించిన 3000 కంటే ఎక్కువ పుస్తకాలు ఉన్నాయి. ఈ లైబ్రరీలోపిల్లల ఇష్టాయిష్టాలకు కూడా పూర్తి ప్రాధాన్యత ఇచ్చారు. ఇక్కడ ఉన్న కామిక్స్ పుస్తకాలను, విద్యాసంబంధమైన బొమ్మలను పిల్లలు చాలా ఇష్టపడతారు. చిన్న పిల్లలు ఆటలతో కొత్త విషయాలు నేర్చుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. చదువులు ఆఫ్‌లైన్ అయినా ఆన్లైన్ అయినాదాదాపు 40 మంది వాలంటీర్లు ఈ కేంద్రంలో విద్యార్థులకు మార్గనిర్దేశం చేయడంలో తీరికలేకుండా ఉన్నారు.ఈ గ్రంథాలయానికి ప్రతిరోజు 80 మంది విద్యార్థులు చదువుకునేందుకు వస్తుంటారు.
మిత్రులారా!జార్ఖండ్‌కు చెందిన సంజయ్ కశ్యప్ గారు కూడా పేద పిల్లల కలలకు కొత్త రెక్కలు ఇస్తున్నారు. తన విద్యార్థి జీవితంలోసంజయ్ గారు మంచి పుస్తకాల కొరతను ఎదుర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పుస్తకాలు లేకపోవడం కారణంగాతమ ప్రాంత పిల్లల భవిష్యత్తు అంధకారం కాకూడదని నిర్ణయించుకున్నారు. ఈ మిషన్ కారణంగాఈ రోజు ఆయన జార్ఖండ్‌లోని అనేక జిల్లాల్లో పిల్లలకు 'లైబ్రరీ మ్యాన్' అయ్యాడు.సంజయ్ గారు తన ఉద్యోగ ప్రారంభంలో తన స్వస్థలంలో మొదటి లైబ్రరీని ఏర్పాటు చేశారు. ఉద్యోగం చేస్తున్న సమయంలో ఎక్కడికి బదిలీ అయినా పేదలు, గిరిజనుల పిల్లల చదువుల కోసం లైబ్రరీని ప్రారంభించే లక్ష్యంతో పనిచేశారు. ఇలా చేస్తూనే జార్ఖండ్‌లోని అనేక జిల్లాల్లో పిల్లల కోసం లైబ్రరీలను ప్రారంభించారు. గ్రంథాలయాన్ని ప్రారంభించాలన్న ఆయన లక్ష్యం నేడు సామాజిక ఉద్యమంగా రూపుదిద్దుకుంటోంది. సంజయ్ గారు అయినా జతిన్ గారు అయినా...వారి ఇలాంటి అనేక ప్రయత్నాలకు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా!పరిశోధన, ఆవిష్కరణలతో పాటు అత్యాధునిక సాంకేతికత, పరికరాల సహాయంతో వైద్య విజ్ఞాన ప్రపంచం చాలా పురోగతి సాధించింది. అయితే కొన్ని వ్యాధులు నేటికీ మనకు పెద్ద సవాలుగా ఉన్నాయి. అటువంటి వ్యాధుల్లో ఒకటి కండరాల క్షీణత!ఇది ఏ వయస్సులోనైనా సంభవించే జన్యుపరమైన వ్యాధి. ఇందులో కండరాలు బలహీనపడటం ప్రారంభమవుతుంది. రోగి తన దైనందిన జీవితంలో చిన్న చిన్న పనులు కూడా చేయడం కష్టంగా మారుతుంది. అటువంటి రోగుల చికిత్స, సంరక్షణకు గొప్ప సేవాభావం అవసరం.హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో మనకు అలాంటి కేంద్రం ఉంది. ఇది కండరాల బలహీనత రోగులకు కొత్త ఆశాకిరణంగా మారింది. ఈ కేంద్రం పేరు 'మానవ్ మందిర్'. దీన్ని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మస్కులర్ డిస్ట్రోఫీ నిర్వహిస్తోంది. ‘మానవ్ మందిర్’ దాని పేరుకు తగ్గట్టుగానే మానవ సేవకు అద్భుతమైన ఉదాహరణ. మూడు-నాలుగేళ్ల క్రితమే ఇక్కడ రోగులకు ఓపీడీ, అడ్మిషన్ సేవలు ప్రారంభమయ్యాయి. మానవ్ మందిర్‌లో దాదాపు 50 మంది రోగులకు పడకల సౌకర్యం కూడా ఉంది. ఫిజియోథెరపీ, ఎలక్ట్రోథెరపీ, హైడ్రోథెరపీలతో పాటు యోగా-ప్రాణాయామం సహాయంతో కూడా వ్యాధులకు చికిత్స చేస్తారు.మిత్రులారా!అన్ని రకాల అత్యాధునిక సౌకర్యాల ద్వారాఈ కేంద్రం రోగుల జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావడానికి కూడా ప్రయత్నిస్తోంది. మస్కులర్ డిస్ట్రోఫీకి సంబంధించిన సవాళ్లలో ఒకటి దాని గురించి అవగాహన లేకపోవడం. అందుకేఈ కేంద్రం హిమాచల్ ప్రదేశ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా రోగులకు అవగాహన శిబిరాలను నిర్వహిస్తోంది. అత్యంత స్ఫూర్తినిచ్చే విషయం ఏమిటంటే ఈ వ్యాధితో బాధపడేవారే ఈ సంస్థ నిర్వహణలో ప్రధానంగా భాగస్వాములు కావడం. సామాజిక కార్యకర్త ఊర్మిళ బల్దీ గారు, ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ మస్క్యులర్ డిస్ట్రోఫీ అధ్యక్షురాలు సోదరి సంజనా గోయల్ గారు, ఈ సంస్థ నిర్మాణంలో ముఖ్యపాత్ర పోషించిన విపుల్ గోయల్ గారు ఈ సంస్థ నిర్వహణలో చాలా ప్రధాన భూమిక నిర్వహిస్తున్నారు. మానవ్ మందిర్‌ను ఆసుపత్రిగా, పరిశోధనా కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో రోగులకు ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుంది. ఈ దిశలో ప్రయత్నిస్తున్న అందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. కండర క్షీణతతో బాధపడుతున్నవారందరికీమంచి జరగాలని కోరుకుంటున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!నేటి 'మన్ కీ బాత్'లో మనం చర్చించుకున్న దేశవాసుల సృజనాత్మక, సామాజిక కార్యక్రమాలు దేశ సమర్థతకు, ఉత్సాహానికి ఉదాహరణలు. ఈ రోజు ప్రతి దేశవాసీ దేశం కోసం ఏదో ఒక రంగంలోప్రతి స్థాయిలో విభిన్నంగా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. జి-20 లాంటి అంతర్జాతీయ అంశంలో మన నేత సహచరుడు ఒకరు తన బాధ్యతను అర్థం చేసుకుని దానిని నెరవేర్చేందుకు ముందుకు రావడాన్ని ఈరోజు జరిగిన చర్చలోనే చూశాం.అదేవిధంగా కొందరు పర్యావరణం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. కొందరు నీటి కోసం పనిచేస్తున్నారు. చాలా మంది విద్య, వైద్యం, సైన్స్ టెక్నాలజీ నుండి సంస్కృతి-సంప్రదాయాల వరకు అసాధారణమైన కృషి చేస్తున్నారు.ఎందుకంటేఈ రోజు మనలోని ప్రతి పౌరుడు తన కర్తవ్యాన్ని అర్థం చేసుకుంటున్నాడు.దేశ పౌరులలో అటువంటి కర్తవ్య భావన వచ్చినప్పుడుదేశ బంగారు భవిష్యత్తు దానంతట అదే నిర్ణయమవుతుంది. దేశ బంగారు భవిష్యత్తులో మనకు కూడా బంగారు భవిష్యత్తు ఉంటుంది.
దేశప్రజల కృషికి నేను మరోసారి నమస్కరిస్తున్నాను. మనం వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాల గురించి ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మీరు మీ సూచనలను, ఆలోచనలను తప్పకుండా పంపుతూ ఉండండి. మీ అందరికీ చాలా ధన్యవాదాలు!
నా ప్రియమైన దేశప్రజలారా!
నమస్కారం!
దేశంలోని అనేక ప్రాంతాల్లో సూర్యారాధన పండుగ 'ఛత్' ను జరుపుకుంటారు. 'ఛత్' పండుగలో భాగంగా లక్షలాది మంది భక్తులు తమ గ్రామాలకు, వారి ఇళ్లకు, వారి కుటుంబాల దగ్గరికి చేరుకున్నారు. ఛత్ మాత ప్రతి ఒక్కరికీ సమృద్ధిని,సంక్షేమాన్ని అనుగ్రహించాలని నేను ప్రార్థిస్తున్నాను.
మిత్రులారా!
మన సంస్కృతికి, మన విశ్వాసానికి, ప్రకృతికి ఎంత లోతైన సంబంధం ఉందో చెప్పేందుకు సూర్యారాధన సంప్రదాయమే నిదర్శనం. ఈ పూజ మన జీవితంలో సూర్యకాంతి ప్రాముఖ్యతను వివరిస్తుంది. దీంతో పాటు ఎత్తుపల్లాలు జీవితంలో అంతర్భాగమని సందేశం కూడా ఇస్తుంది. కాబట్టిప్రతి సందర్భంలోనూ మనం ఒకే వైఖరిని కలిగి ఉండాలి. ఛత్ మాత పూజలో వివిధ పండ్లు,తేకువా మిఠాయిలను సమర్పిస్తారు. ఈ వ్రతం ఏ కష్టమైన సాధన కంటే తక్కువేమీ కాదు. ఛత్ పూజలో మరో ప్రత్యేకత ఏమిటంటే పూజకు ఉపయోగించే వస్తువులను సమాజంలోని వివిధ వ్యక్తులు కలిసి తయారుచేస్తారు. ఇందులో వెదురుతో చేసిన బుట్ట లేదా సుప్లిని ఉపయోగిస్తారు. మట్టి దీపాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. దీని ద్వారాశనగలను పండించే రైతులు, పిండిని తయారు చేసే చిన్న పారిశ్రామికవేత్తలకు సమాజంలో ప్రాముఖ్యత ఏర్పడింది. వారి సహకారం లేకుండా ఛత్ పూజలు పూర్తికావు. ఛత్ పండుగ మన జీవితంలో పరిశుభ్రత ప్రాముఖ్యతను కూడా నొక్కి చెబుతుంది. ఈ పండుగ సందర్భంగా రోడ్లు, నదులు, ఘాట్లు, వివిధ నీటి వనరులను సమాజ స్థాయిలో శుభ్రం చేస్తారు. ఛత్ పండుగ కూడా 'ఏక్ భారత్- శ్రేష్ఠ్ భారత్'కి ఉదాహరణ. ఈరోజు బీహార్, పూర్వాంచల్ ప్రజలు దేశంలో ఏ మూలన ఉన్నా ఛత్‌ను ఘనంగా జరుపుకుంటున్నారు. ఢిల్లీలో, ముంబాయితో సహా మహారాష్ట్రలోని వివిధ జిల్లాల్లో, గుజరాత్‌లోని వివిధ ప్రాంతాల్లో ఛత్‌ను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. గుజరాత్లో ఇంతకు ముందు ఛత్ పూజ పెద్దగా జరిగేది కాదని నాకు గుర్తుంది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ దాదాపు గుజరాత్ మొత్తంలో ఛత్ పూజ రంగులు కనిపించడం మొదలైంది. ఇది చూసి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. ఈ రోజుల్లో విదేశాల నుంచి కూడా ఛత్ పూజకు సంబంధించిన ఎన్ని అందమైన చిత్రాలు వస్తున్నాయో మనం చూస్తున్నాం. అంటేభారతదేశ గొప్ప వారసత్వం, మన విశ్వాసం, ప్రపంచంలోని ప్రతి మూలలో మన గుర్తింపును పెంచుతున్నాయి. ఈ గొప్ప పండుగలో పాల్గొనే ప్రతి విశ్వాసికి నా శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశప్రజలారా!
ఇప్పుడు మనం పవిత్రమైన ఛత్ పూజ, సూర్య భగవానుడి ఆరాధన గురించి మాట్లాడుకున్నాం. కాబట్టి ఈరోజు సూర్యుని ఆరాధించడంతో పాటు ఆయన వరం గురించి కూడా చర్చించుకోవాలి. సూర్య భగవానుడి వరం 'సౌరశక్తి'. సోలార్ ఎనర్జీ ఈరోజుల్లో ఎంత ముఖ్యమైన అంశమంటే ఈరోజు ప్రపంచం మొత్తం తన భవిష్యత్తును సౌరశక్తిలో చూస్తోంది. సూర్య భగవానుడిని భారతీయులకు శతాబ్దాలుగా ఆరాధిస్తున్నారు. అంతే కాకుండా భారతీయ జీవన విధానానికి కేంద్రం సూర్యుడే. భారతదేశం నేడు తన సాంప్రదాయిక అనుభవాలను ఆధునిక విజ్ఞాన శాస్త్రంతో జోడిస్తోంది. అందుకేనేడుసౌరశక్తి నుండి విద్యుత్తును ఉత్పత్తి చేసే అతిపెద్ద దేశాలలో చేరాం. మన దేశంలోని పేద,మధ్యతరగతి ప్రజల జీవితాల్లో సౌరశక్తి తెచ్చిన మార్పులు కూడా అధ్యయనం చేసే అంశం.
తమిళనాడులోని కాంచీపురంలో ఎఝిలన్ అనే రైతు ఉన్నారు. ఆయన 'పిఎం కుసుమ్ యోజన'ని సద్వినియోగం చేసుకున్నారు. తన పొలంలో పది అశ్వ సామర్థ్యాల సోలార్ పంప్‌సెట్‌ను అమర్చారు. ఇప్పుడు తమ పొలానికి కరెంటు కోసం డబ్బులు ఖర్చు చేయాల్సిన పనిలేదు. పొలంలో సాగునీటి కోసం ప్రభుత్వం ఇచ్చే విద్యుత్ సరఫరాపై కూడా ఆధారపడడం లేదు. అలాగే రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో కమల్జీ మీనా 'పి.ఎం. కుసుమ్ యోజన' నుండి లబ్ధి పొందారు. కమల్ గారు పొలంలో సోలార్ పంప్‌ను అమర్చారు. దాని కారణంగా ఆయన ఖర్చు తగ్గింది. ఖర్చు తగ్గితే ఆదాయం కూడా పెరుగుతుంది. కమల్ జీ సౌరశక్తి కారణంగా అనేక ఇతర చిన్న పరిశ్రమలకు కూడా విద్యుత్తు లభిస్తోంది. వారి ప్రాంతంలో చెక్క పని ఉంది. ఆవు పేడతో కూడా ఉత్పత్తులు తయారవుతున్నాయి. సోలార్ విద్యుత్తును వాటిలో కూడా వినియోగిస్తున్నారు. వారు 10-12 మందికి ఉపాధి కూడా కల్పిస్తున్నారు. అంటే కమల్ జీ ప్రారంభించిన కుసుమ్ యోజన పరిమళం ఎంతో మందికి చేరడం ప్రారంభమైంది.
మిత్రులారా!
మీరు ఒక నెలంతా కరెంటు వాడిన తర్వాత మీకు కరెంటు బిల్లు రావడం కాకుండామీకు అదనంగా ఆదాయం వస్తుందని మీరు ఊహించగలరా? సౌరశక్తి ఈ పని కూడా చేసింది. కొన్ని రోజుల క్రితంమీరు దేశంలోని మొట్టమొదటి సౌరశక్తి గ్రామం - గుజరాత్‌లోని మోధేరా గురించి చాలా విన్నారు. మోధేరా సౌరగ్రామంలోని చాలా ఇళ్లలో సౌర శక్తి తో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభమైంది.ఇప్పుడు అక్కడ చాలా ఇళ్లలో నెలాఖరులోగా కరెంటు బిల్లు రావడం లేదు. దానికి బదులుగా కరెంటుతో సంపాదన చెక్కు వస్తోంది. ఇలా జరగడం చూసి ఇప్పుడు దేశంలోని అనేక గ్రామాల ప్రజలు తమ గ్రామాన్ని కూడా సౌరగ్రామంగా మార్చాలని నాకు లేఖలు రాస్తున్నారు. అంటే భారతదేశంలో సౌర గ్రామాల నిర్మాణం పెద్ద ప్రజా ఉద్యమంగా మారే రోజు ఎంతో దూరంలో లేదు. దీని ప్రారంభాన్ని మోధేరా గ్రామ ప్రజలు ఇప్పటికే చేసి చూపించారు.
రండి.. 'మన్ కీ బాత్' శ్రోతలకు కూడా మోధేరా ప్రజలను పరిచయం చేద్దాం. శ్రీమాన్ విపిన్‌భాయ్ పటేల్ గారు ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో ఉన్నారు.
ప్రధానమంత్రి గారు :- విపిన్ భాయ్ నమస్తే! చూడండి.. ఇప్పుడు దేశం మొత్తానికి మోధేరా ఆదర్శంగా నిలిచి చర్చలోకి వచ్చింది. మీ బంధువులు, పరిచయస్తులను మిమ్మల్ని వివరాలు అడిగినప్పుడు మీరు వారికి ఏం చెప్తారు? ఏం లాభం కలిగింది?
విపిన్ గారు :- సార్ మమ్మల్ని ఎవరైనా అడిగితే ఇప్పుడు కరెంటు బిల్లు జీరోగా వస్తోందని చెప్తాం. ఒక్కోసారి ఇది 70 రూపాయలు వస్తోంది. మొత్తం మీద మా ఊరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతోంది.
ప్రధానమంత్రి గారు :- అంటే ఒకరకంగా చెప్పాలంటే ఇంతకు ముందులాగా కరెంటు బిల్లు గురించిన ఆలోచన ఇప్పుడు లేదన్నమాట.
విపిన్ గారు :- అవును సార్. అది వాస్తవం సార్. ప్రస్తుతం గ్రామంలో ఎలాంటి టెన్షన్ లేదు. సార్ చేసిన పని బాగుందని అందరూ అనుకుంటున్నారు. వారంతా ఆనందంగా ఉన్నారు సార్. అందరూ సంతోషిస్తున్నారు.
ప్రధానమంత్రి గారు:- ఇప్పుడు మీరే స్వయంగా మీ ఇంట్లోనే కరెంటు ఫ్యాక్టరీకి యజమాని అయ్యారు. మీ స్వంత ఇంటి పైకప్పు మీద విద్యుత్ ఉత్పత్తి అవుతోంది.
విపిన్ జీ :- అవును సార్. నిజమే సార్.
ప్రధానమంత్రి గారు :- ఈ మార్పు గ్రామ ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది?
విపిన్ గారు:- సార్.. ఊరి మొత్తం ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. మాకున్న కరెంటు కష్టాలు తీరిపోయాయి. కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదు సార్.
ప్రధానమంత్రి గారు:- అంటే కరెంటు బిల్లు కూడా పోయింది. సౌకర్యం పెరిగింది.
విపిన్ గారు:- మీరు ఇంతకుముందు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా గందరగోళంగా ఉంది సార్. ఇక్కడ మొదలైన 3-డిషో తర్వాత మోధేరా గ్రామంలో నాలుగు చందమామలు వచ్చినట్టయింది సార్. అప్పుడు వచ్చిన సెక్రటరీ సార్...
ప్రధాని గారు :- అవును...
విపిన్ గారు :- అలా ఊరు ఫేమస్ అయింది సార్.
ప్రధానమంత్రి గారు :- అవును. ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్. ఆయన కోరిక అది. ఇంత గొప్ప పనిని అక్కడికి వెళ్లి స్వయంగా చూడాలని ఉందని ఆయన నన్ను కోరారు. విపిన్ సోదరా!మీకు, మీ గ్రామ ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ప్రపంచం యావత్తూ మిమ్మల్ని స్పూర్తిగా తీసుకోవాలని, ఈ సౌరశక్తి ప్రచారం ఇంటింటా జరగాలని కోరుకుంటున్నాను.
విపిన్ గారు :- సరే సార్. ‘సౌరశక్తి ఉపయోగించుకోండి-మీ డబ్బు ఆదా చేసుకోండి’ అని అందరికీ చెప్తాం సార్. దీనివల్ల చాలా ప్రయోజనం కలుగుతుంది సార్.
ప్రధానమంత్రి గారు :- అవును. దయచేసి ప్రజలకు వివరించండి. మీకు శుభాకాంక్షలు. ధన్యవాదాలు సోదరా!
విపిన్ గారు :- ధన్యవాదాలు సార్. థాంక్యూ సార్. మీతో మాట్లాడటం వల్ల నా జీవితం ధన్యమైంది.
ప్రధాన మంత్రి గారు :- విపిన్ భాయ్ గారికి చాలా ధన్యవాదాలు. ఇప్పుడు మోధేరా గ్రామంలో వర్ష సోదరితో కూడా మాట్లాడదాం.
వర్షాబెన్ :- నమస్తే సార్!
ప్రధాన మంత్రి గారు :- నమస్తే-నమస్తే వర్షాబెన్. మీరు ఎలా ఉన్నారు?
వర్షాబెన్ :- మేం చాలా బాగున్నాం సార్. మీరు ఎలా ఉన్నారు ?
ప్రధాని గారు:- నేను చాలా బాగున్నాను.
వర్షాబెన్ :- మీతో మాట్లాడినందుకు మేం ధన్యులమయ్యాం సార్.
ప్రధాన మంత్రి గారు :- వర్షాబెన్..
వర్షాబెన్ :- అవును సార్
ప్రధానమంత్రి గారు:- మీరు మోధేరాలో ఉన్నారు. మీరు సైనిక కుటుంబానికి చెందినవారు కదా.
వర్షాబెన్ :- అవును సార్. మాది సైనిక కుటుంబం సార్. మాజీ సైనికుడి భార్యను మాట్లాడుతున్నాను సార్.
ప్రధానమంత్రి గారు:- మీకు భారతదేశంలో ఎక్కడెక్కడికి వెళ్లే అవకాశం వచ్చింది?
వర్షాబెన్ :- నేను రాజస్థాన్‌కు వెళ్ళాను. గాంధీ నగర్‌కు వెళ్ళాను. జమ్మూలో కలిసి ఉండే అవకాశం వచ్చింది. అక్కడ చాలా సౌకర్యాలు ఉన్నాయి సార్.
ప్రధానమంత్రి గారు:- అవును. మీవారు సైన్యంలో ఉండడం వల్ల మీరు హిందీ కూడా బాగా మాట్లాడుతున్నారు.
వర్షాబెన్ :- అవును సార్. అవును. నేను నేర్చుకున్నాను.
ప్రధానమంత్రి గారు :- మోధేరాలో వచ్చిన పెద్ద మార్పును చెప్పండి. మీరు ఈ సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్‌ను పెట్టారు. ప్రజలు మొదట్లో ఏమి చెప్తుండేవారో అప్పుడు మీకు గుర్తుకు వచ్చి ఉంటుంది. దీని అర్థం ఏమిటి? మీరు ఏం చేస్తున్నారు ? ఏం జరుగుతుంది ? ఇలా విద్యుత్తు వస్తుందా? ఇవన్నీ మీ మనసులో మెదిలి ఉంటాయి. ఇప్పుడు మీ అనుభవం ఏంటి? దీని వల్ల ఏం లాభం కలిగింది?
వర్షాబెన్:- చాలా లాభం ఉంది. చాలా లాభమే వచ్చింది సార్. మీ వల్లే మా ఊళ్లో ప్రతిరోజు దీపావళి జరుపుకుంటారు. 24 గంటలు కరెంటు వస్తోంది. బిల్లు అస్సలే రావడం లేదు. మా ఇంట్లోకి అన్ని ఎలక్ట్రిక్ వస్తువులు తెచ్చుకున్నాం సార్. మీ వల్లే అన్నీ వాడుతున్నాం సార్. బిల్లు అసలే రాకపోతే డబ్బు ఖర్చు ధ్యాసే లేకుండా వాడుకోవచ్చు కదా!
ప్రధానమంత్రి గారు :- ఇది నిజమే. మీరు కూడా కరెంటును ఎక్కువగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు.
వర్షాబెన్ :- నిర్ణయించాం సార్. నిర్ణయించాం. ప్రస్తుతం మాకు ఎలాంటి సమస్య లేదు. ఇవన్నీ మనం ఫ్రీ మైండ్‌తో ఉపయోగించుకోవచ్చు. అన్నీ ఉన్నాయి.. వాషింగ్ మెషీన్, ఏసీ.. అన్నీ ఉపయోగించుకుంటున్నాం సార్.
ప్రధానమంత్రి గారు:- మరి ఊళ్లోని మిగతా ప్రజలు కూడా దీనివల్ల సంతోషంగా ఉన్నారా?
వర్షాబెన్ :- చాలా చాలా సంతోషంగా ఉన్నారు సార్.
ప్రధానమంత్రి గారు:- అక్కడ సూర్య దేవాలయంలో పని చేసేది మీ భర్తేనా? అక్కడ జరిగిన లైట్ షో ఎంతో పెద్ద ఈవెంట్ కావడంతో ఇప్పుడు ప్రపంచం నలుమూలల నుంచి అతిథులు వస్తున్నారు.
వర్షా బెన్ :- ప్రపంచం నలుమూలల నుండి విదేశీయులు రావచ్చు కానీ మీరు మా ఊరుప్రపంచ ప్రసిద్ధి చెందేలా చేశారు సార్.
ప్రధానమంత్రి గారు:- అయితే గుడిని చూసేందుకు చాలా మంది అతిథులు వస్తుండడంతో మీ భర్తకు ఇప్పుడు పని పెరిగి ఉండవచ్చు..
వర్షా బెన్ :- పని ఎంత పెరిగినా ఫర్వాలేదు సార్. మా వారికి ఎలాంటి ఇబ్బంది లేదు. మీరు మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటూ వెళ్లండి.
ప్రధానమంత్రి గారు:- ఇప్పుడు మనమందరం కలిసి గ్రామాభివృద్ధి చేయాలి.
వర్షా బెన్ :- అవును. అవును సార్. మేం మీతో ఉన్నాం.
ప్రధానమంత్రి గారు:- నేను మోధేరా ప్రజలను అభినందిస్తున్నాను. ఎందుకంటే గ్రామం ఈ పథకాన్ని అంగీకరించింది. మన ఇంట్లో విద్యుత్తును తయారు చేయగలమని వారు విశ్వసించారు.
వర్షా బెన్ -: 24 గంటలు సార్! మా ఇంట్లో కరెంటు ఉంది. చాలా సంతోషంగా ఉంది.
ప్రధానమంత్రి గారు :- రండి! నేను మీకు చాలా మంచిని కోరుకుంటున్నాను. కరెంటు బిల్లు ఆదావల్ల మిగిలిన డబ్బును పిల్లల అభ్యున్నతికి వినియోగించండి. మీ జీవితానికి ప్రయోజనం చేకూర్చేలా ఆ డబ్బును బాగా ఉపయోగించండి. నేను మీకు చాలా మంచిని కోరుకుంటున్నాను. మోధేరా ప్రజలందరికీ నా నమస్కారాలు!
మిత్రులారా!
వర్షాబెన్, బిపిన్ భాయ్ చెప్పిన విషయాలు దేశం మొత్తానికి, గ్రామాలకు, నగరాలకు ప్రేరణ. మోధేరా అనుభవం దేశవ్యాప్తంగా పునరావృతమవుతుంది. సౌర శక్తి ఇప్పుడు డబ్బును ఆదా చేస్తుంది. ఆదాయాన్ని పెంచుతుంది. జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌కు చెందిన మిత్రులు మంజూర్ అహ్మద్ లఢ్వాల్. కాశ్మీర్లో చలి ఎక్కువ కావడంతో కరెంటు ఖర్చు కూడా ఎక్కువే. ఈ కారణంగా మంజూర్ గారి కరెంటు బిల్లు కూడా 4 వేల రూపాయలకు పైగా వచ్చేది. కానీమంజూర్ గారి ఇంట్లో సోలార్ రూఫ్‌టాప్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడంతో ఆయన ఖర్చు సగానికి పైగా తగ్గింది. అదే విధంగా ఒడిషాకు చెందిన కున్ని దేవురి అనే అమ్మాయి తనతో పాటు ఇతర మహిళలకు కూడా సౌరశక్తిని ఉపాధి మాధ్యమంగా మారుస్తోంది. ఒడిషాలోని కేందుఝర్ జిల్లా కర్దాపాల్ గ్రామంలో కున్ని నివసిస్తున్నారు. సౌరశక్తితో నడిచే రీలింగ్ యంత్రంతో పట్టు వడకడంపై ఆదివాసీ మహిళలకు ఆమె శిక్షణ ఇస్తున్నారు. సోలార్ మెషీన్ ఫలితంగా ఈ ఆదివాసీ మహిళలకు కరెంటు బిల్లుల భారం లేకపోగా, ఆదాయాన్ని కూడాపొందుతున్నారు. ఇది సూర్య భగవానుడి సౌరశక్తి వరం. వరం, ప్రసాదం ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది. అందుచేతమీరు ఇందులో చేరండి. ఇతరులను కూడా చేర్చండి.
నా ప్రియమైన దేశప్రజలారా!
ఇప్పటివరకు నేను మీతో సూర్యుని గురించి మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా దృష్టి అంతరిక్షం వైపు మతోంది. అందుకు కారణం మన దేశం సోలార్ రంగంతో పాటు అంతరిక్ష రంగంలోనూ అద్భుతాలు సృష్టిస్తోంది. భారతదేశం సాధించిన విజయాలను చూసి ప్రపంచం మొత్తం నేడు ఆశ్చర్యపోతోంది. అందుకే 'మన్ కీ బాత్' శ్రోతలకు ఈ విషయం చెప్పి వారిని కూడా సంతోషపెట్టాలని అనుకున్నాను.
మిత్రులారా!కొద్దిరోజుల క్రితం భారతదేశం ఒకేసారి 36 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి ప్రవేశపెట్టడాన్ని మీరు చూసిఉంటారు. దీపావళికి సరిగ్గా ఒక్కరోజు ముందు సాధించిన ఈ విజయం ఒక విధంగా మన యువత నుండి దేశానికి ప్రత్యేకమైన దీపావళి కానుక. ఈ ప్రయోగంతో దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కచ్ నుంచి కోహిమా వరకు డిజిటల్ కనెక్టివిటీ మరింత బలోపేతం అవుతుంది. దీని సహాయంతోమారుమూల ప్రాంతాలు కూడా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో మరింత సులభంగా అనుసంధానమవుతాయి. దేశం స్వావలంబన సాధించినప్పుడు కొత్త విజయ శిఖరాలకు చేరుకుంటుందని చెప్పేందుకు ఇది కూడా ఒక ఉదాహరణ. మీతో ఈ విషయం మాట్లాడుతున్నప్పుడుభారతదేశానికి క్రయోజెనిక్ రాకెట్ సాంకేతికతను ఇవ్వడాన్ని నిరాకరించిన పాత కాలాన్ని కూడా గుర్తు చేసుకుంటున్నాను.కానీ, భారతీయ శాస్త్రవేత్తలు స్వదేశీ సాంకేతికతను అభివృద్ధి చేయడమే కాకుండా ఇప్పుడు దాని సహాయంతో ఏకకాలంలో పదుల సంఖ్యలో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపుతున్నారు. ఈ ప్రయోగంతో ఇప్పుడు ప్రపంచ వాణిజ్య విపణిలో భారతదేశం సుదృఢ స్థానం పొందింది. మనకు కొత్త అవకాశాల ద్వారాలు కూడా తెరుచుకున్నాయి.
మిత్రులారా!
‘అభివృద్ధి చెందిన భారతదేశం’ అనే సంకల్పంతో నడుస్తున్న మన దేశం ప్రతి ఒక్కరి కృషితోనే తన లక్ష్యాలను చేరుకోగలదు.భారతదేశంలో అంతకుముందు అంతరిక్ష రంగం ప్రభుత్వ వ్యవస్థల పరిధిలోనే ఉండేది. యువత కోసం, ప్రైవేట్ రంగానికి అవకాశం ఇవ్వడంతో ఇందులో విప్లవాత్మక మార్పులు రావడం ప్రారంభించాయి.భారతీయ పరిశ్రమలు,స్టార్టప్‌లు ఈ రంగంలో కొత్త ఆవిష్కరణలను,కొత్త సాంకేతికతలను తీసుకురావడంలో నిమగ్నమై ఉన్నాయి. విశేషించి ఇన్-స్పేస్ సహకారం ఈ రంగంలో పెద్ద మార్పును తీసుకురాబోతోంది. ప్రభుత్వేతర సంస్థలు కూడా తమ పేలోడ్లు, ఉపగ్రహాలను IN-SPAce ద్వారా ప్రయోగించే సౌకర్యాన్ని పొందుతున్నాయి. అంతరిక్ష రంగంలో భారతదేశంలోని ఈ భారీ అవకాశాలను పూర్తిగా ఉపయోగించుకోవాలని నేను స్టార్టప్‌లను, ఆవిష్కర్తలను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా!
విద్యార్థులు, యువశక్తి, నాయకత్వ శక్తి విషయాలకు వస్తే మనలో పాతుకుపోయిన ఎన్నో మూస భావనలు, పాత విషయాలు గుర్తుకువస్తాయి. విద్యార్థి శక్తి విషయానికి వస్తే దాని పరిధిని విద్యార్థి సంఘం ఎన్నికలతో జోడించడం చాలా సార్లు చూస్తుంటాం. కానీ విద్యార్థి శక్తి పరిధి చాలా పెద్దది. చాలా విస్తృతమైంది. భారతదేశాన్ని శక్తిమంతం చేయడానికి విద్యార్థి శక్తి ఆధారం. నేటి యువత భారతదేశాన్ని 2047 వరకు తీసుకువెళ్తుంది. భారతదేశం శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్నప్పుడుఈ యువత శక్తి, వారి శ్రమ, వారి చెమట, వారి ప్రతిభ, భారతదేశాన్ని ఈ రోజు సంకల్పిస్తున్న ఉన్నత స్థాయికి తీసుకెళ్తాయి. నేటి మన యువత దేశం కోసం పని చేస్తున్న తీరును, వారు దేశ నిర్మాణంలో చేరిన తీరును చూసి నేను చాలా నమ్మకంతో ఉన్నాను. మన యువత హ్యాకథాన్లలో సమస్యలను పరిష్కరించే విధానం, రాత్రంతా మేల్కొని గంటల తరబడి శ్రమించే తీరు ఎంతో స్ఫూర్తిదాయకం. దేశంలోని లక్షలాది మంది యువతగత సంవత్సరాల్లో నిర్వహించిన హ్యాకథాన్ లలో అనేక సవాళ్లను పరిష్కరించింది. దేశానికి కొత్త పరిష్కారాలను అందించింది.
మిత్రులారా!
మీకు గుర్తుండే ఉంటుంది- నేను ఎర్రకోట నుండి 'జై అనుసంధాన్' అని ఆహ్వానించాను. ఈ దశాబ్దాన్ని ‘టెకేడ్’ గా మార్చడం గురించి కూడా నేను మాట్లాడాను. దీన్ని చూడటం నాకు చాలా ఇష్టం. మన ఐ.ఐ.టి.ల విద్యార్థులు కూడా దీని స్ఫూర్తి ని తీసుకున్నారు.ఈ నెల-అక్టోబరు- 14-15 తేదీల్లో మొత్తం 23 ఐ.ఐ.టి.లు తమ ఆవిష్కరణలు,పరిశోధన ప్రాజెక్టులను ప్రదర్శించడానికి మొదటిసారి ఒకే వేదికపైకి వచ్చాయి. దేశం నలుమూలల నుంచి వచ్చిన విద్యార్థులు, పరిశోధకులు 75కు పైగా అత్యుత్తమ ప్రాజెక్టులను ఈ మేళాలో ప్రదర్శించారు.ఆరోగ్య పరిరక్షణ, వ్యవసాయం, రోబోటిక్స్, సెమీకండక్టర్స్, ఫైవ్- జికమ్యూనికేషన్స్ ఇలా ఎన్నో ఇతివృత్తాలపై ఈ ప్రాజెక్ట్‌లను రూపొందించారు. ఈ ప్రాజెక్టులన్నీ ఒకదాన్ని మించినవి మరొకటి అయినప్పటికీకొన్ని ప్రాజెక్టుల గురించి మీ దృష్టిని ఆకర్షించాలనుకుంటున్నాను. ఉదాహరణకు ఐఐటి భువనేశ్వర్‌కు చెందిన ఒక బృందం నవజాత శిశువుల కోసం పోర్టబుల్ వెంటిలేటర్‌ను అభివృద్ధి చేసింది. ఇది బ్యాటరీతో నడుస్తుంది. మారుమూల ప్రాంతాల్లో కూడా సులభంగా ఉపయోగించవచ్చు. ఇది నెలలు నిండకుండా జన్మించిన శిశువుల జీవితాలను రక్షించడంలో చాలా సహాయకారిగా ఉంటుంది. ఎలక్ట్రిక్ మొబిలిటీ, డ్రోన్ సాంకేతికత, ఫైవ్-జి - ఏదైనా కావచ్చు, మన విద్యార్థులు చాలా మంది వాటికి సంబంధించిన కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయడంలో నిమగ్నమై ఉన్నారు. స్థానిక భాషలను నేర్చుకునే విధానాన్ని సులభతరం చేసే బహుభాషా ప్రాజెక్టులో వివిధ ఐఐటిలు కలిసి పనిచేస్తున్నాయి. ఈ ప్రాజెక్టు కొత్త జాతీయ విద్యా విధాన లక్ష్యాలను సాధించడంలో చాలా సహాయపడుతుంది. భారతదేశ స్వదేశీ ఫైవ్-జి టెస్ట్ బెడ్‌ను అభివృద్ధి చేయడంలో ఐఐటి మద్రాస్, ఐఐటి కాన్పూర్ ప్రముఖ పాత్ర పోషించాయని తెలుసుకుని మీరు సంతోషిస్తారు. ఇది ఖచ్చితంగా ఒక గొప్ప ప్రారంభం. రాబోయే కాలంలో ఇలాంటి ప్రయత్నాలు మరెన్నో జరగాలని నేను ఆశిస్తున్నాను. ఐఐటిలు, ఇతర సంస్థలు కూడా తమ పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలను మరింత వేగవంతం చేయాలని ఆశిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!
పర్యావరణం పట్ల సున్నితత్వం మన సమాజంలోని అణువణువులో ఇమిడి ఉంది. మన చుట్టూ మనం దాన్ని అనుభవించగలం. పర్యావరణ పరిరక్షణ కోసం తమ జీవితాలను వెచ్చించే వారికి దేశంలో కొరత లేదు.
కర్ణాటకలోని బెంగుళూరులో నివసిస్తున్న సురేష్ కుమార్ గారి నుండి కూడా మనం చాలా నేర్చుకోవచ్చు. ఆయనకు ప్రకృతి, పర్యావరణ పరిరక్షణలో గొప్ప అభిరుచి ఉంది. ఆయన ఇరవై ఏళ్ల క్రితం నగరంలోని సహకారనగర్‌లో ఒక అడవిని సస్యశ్యామలం చేసేందుకు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు వాటి అందాలు అందరి మనసులను దోచుకుంటున్నాయి. ఇది అక్కడ నివసించే ప్రజలకు కూడా గర్వకారణం. సురేష్ కుమార్ గారు అద్భుతమైన పని చేశారు. కన్నడ భాష , సంస్కృతులను పెంపొందించేందుకు సహకరనగర్లో బస్ షెల్టర్‌ను కూడా నిర్మించారు. కన్నడలో రాసిన ఇత్తడి పలకలను వందలాది మందికి బహూకరించారు. పర్యావరణం – సంస్కృతి రెండూ కలిసి వృద్ధి చెంది, వికసించాలంటే... ఇది ఎంత పెద్ద కార్యమో ఆలోచించండి.
మిత్రులారా!
ఈ రోజు ప్రజల్లో పర్యావరణ అనుకూల జీవన విధానం, పర్యావరణ అనుకూల ఉత్పత్తుల గురించి గతంలో కంటే ఎక్కువ అవగాహన కనిపిస్తోంది. తమిళనాడు నుండి అలాంటి ఒక ఆసక్తికరమైన ప్రయత్నం గురించి తెలుసుకునే అవకాశం కూడా నాకు లభించింది. కోయంబత్తూరులోని అనైకట్టిలో ఆదివాసి మహిళల బృందం చేసిన అద్భుతమైన ప్రయత్నం ఇది. ఈ మహిళలు ఎగుమతుల కోసం పది వేల పర్యావరణ అనుకూలమైన టెర్రకోట టీ కప్పులను తయారు చేశారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. టెర్రకోట టీ కప్పుల తయారీ బాధ్యతను ఈ మహిళలే స్వయంగా తీసుకున్నారు. క్లే మిక్సింగ్ నుంచి ఫైనల్ ప్యాకేజింగ్ వరకు స్వయంగా చేశారు. ఇందుకోసం శిక్షణ కూడా తీసుకున్నారు. ఈ అద్భుతమైన ప్రయత్నానికి ఎలాంటి ప్రశంసలు దక్కినా తక్కువే.
మిత్రులారా!
త్రిపురలోని కొన్ని గ్రామాలు కూడా చాలా మంచి పాఠాలు చెప్పాయి. మీరు బయో-విలేజ్ గురించి వినే ఉంటారు. కానీ త్రిపురలోని కొన్ని గ్రామాలు బయో-విలేజ్-2నిచ్చెనను అధిరోహించాయి. బయో-విలేజ్ 2 ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాన్ని ఎలా తగ్గించాలో నొక్కి చెబుతుంది. ఇందులోవివిధ ఆలోచనల ద్వారా ప్రజల జీవన నాణ్యతను మెరుగుపరచడానికి పూర్తి శ్రద్ధ పెడతారు. సౌరశక్తి, బయోగ్యాస్, తేనెటీగల పెంపకం,బయో ఫెర్టిలైజర్లపై పూర్తి దృష్టి పెడతారు. మొత్తమ్మీద చూస్తే వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారానికి బయో-విలేజ్ 2మరింత బలం చేకూరుస్తుంది.
దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణ పట్ల పెరుగుతున్న ఉత్సాహాన్ని చూసి నేను చాలా సంతోషంగా ఉన్నాను. కొద్ది రోజుల కిందట భారతదేశంలోపర్యావరణాన్ని పరిరక్షించడానికి అంకితమైన మిషన్ లైఫ్ కూడా ప్రారంభమైంది. మిషన్ లైఫ్ సాధారణ సూత్రం పర్యావరణానికి హాని కలిగించని జీవనశైలినిప్రోత్సహించడం. మిషన్ లైఫ్ గురించి తెలుసుకుని, దాన్ని స్వీకరించడానికి ప్రయత్నించవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.
మిత్రులారా!
రేపు- అక్టోబర్ 31- జాతీయ ఐక్యతా దినోత్సవం. సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి శుభ సందర్భం. ఈ రోజున దేశంలోని ప్రతి మూలలో రన్ ఫర్ యూనిటీ నిర్వహిస్తారు. ఈ పరుగు దేశంలో ఐక్యతా సూత్రాన్ని బలపరుస్తుంది. మన యువతకు స్ఫూర్తినిస్తుంది. కొద్ది రోజుల క్రితం మన జాతీయ క్రీడల సందర్భంగా కూడా అదే భావన కనిపించింది. 'జుడేగా ఇండియా తో జీతేగా ఇండియా' – అంటే ‘దేశం అనుసంధానమైతే విజయం సాధిస్తుంది’ అనే థీమ్తోజాతీయ క్రీడలు బలమైన ఐక్యతా సందేశాన్ని అందించాయి. భారతదేశ క్రీడా సంస్కృతిని కూడా ప్రోత్సహించాయి. భారతదేశంలో ఇప్పటివరకు నిర్వహించిన వాటిలో ఇవే అతిపెద్ద జాతీయ క్రీడలని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ఇందులో 36 క్రీడలను చేర్చారు. వాటిలో 7 కొత్త పోటీలతో పాటు రెండు దేశీయ పోటీలు- యోగాసనాలు,మల్లాఖంబ్ కూడా చేర్చారు. స్వర్ణ పతకం గెలుచుకోవడంలో ముందంజలో ఉన్న మూడు జట్లు – సర్వీసెస్ టీమ్, మహారాష్ట్ర ,హర్యానా టీమ్. ఈ గేమ్‌లలో ఆరు జాతీయ రికార్డులను నెలకొల్పారు. సుమారు 60 జాతీయ క్రీడల రికార్డులను కూడా సృష్టించారు. ఈ క్రీడా పోటీల్లో పాల్గొన్న, పతకాలు సాధించిన, కొత్త రికార్డులు సాధించిన క్రీడాకారులందరికీ అభినందనలు. ఈ ఆటగాళ్లకు ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.
మిత్రులారా!
గుజరాత్లో జరిగిన జాతీయ క్రీడలను విజయవంతంగా నిర్వహించడంలో సహకరించిన వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. గుజరాత్లో నవరాత్రుల సందర్భంగా జాతీయ క్రీడలు నిర్వహించడం మీరు చూశారు. ఈ సమయంలో గుజరాత్ మొత్తం నవరాత్రుల ఉత్సవాల్లో ఉండడం వల్ల ప్రజలు ఈ ఆటలను ఎలా ఆస్వాదించగలరని ఈ క్రీడల ప్రారంభానికి ముందు ఒకసారి నా మనస్సుకు అనిపించింది. ఇంత పెద్ద క్రీడోత్సవాల వ్యవస్థ- మరోవైపు నవరాత్రుల సందర్భంగా గర్బా మొదలైన వాటికి ఏర్పాట్లు. గుజరాత్ ఏకకాలంలో ఇవన్నీ ఎలా చేస్తుందని అనుకున్నాను. కానీ గుజరాత్ ప్రజలు తమ ఆతిథ్యంతో అతిథులందరినీ సంతోషపెట్టారు. అహ్మదాబాద్‌లో జరిగిన జాతీయ క్రీడల సందర్భంగా కళ, క్రీడలు,సంస్కృతుల సంగమం జరిగిన తీరు ఆనందాన్ని నింపింది. క్రీడాకారులు కూడా పగటిపూట ఆటలో పాల్గొని, సాయంత్రం గర్బా, దాండియా రంగుల్లో మునిగితేలారు. గుజరాతీ ఆహారంతో పాటు నవరాత్రులకు సంబంధించిన చాలా చిత్రాలను కూడా వారు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇవన్నీ చూడటం మా అందరికీ ఆనందదాయకం. ఇలాంటి ఆటలు భారతదేశంలోని విభిన్న సంస్కృతుల గురించి కూడా వెల్లడిస్తాయి. అవి 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని కూడా బలోపేతం చేస్తాయి.
నా ప్రియమైన దేశప్రజలారా!
నవంబర్ నెలలో 15వ తేదీన మన దేశం ఆదివాసిల గౌరవ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. మీకు గుర్తుండే ఉంటుంది-భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగా ఆదివాసివారసత్వ, గౌరవ దినోత్సవాన్ని జరుపుకోవడాన్ని దేశం గత సంవత్సరం ప్రారంభించింది.భగవాన్ బిర్సా ముండా తన స్వల్ప జీవితకాలంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా లక్షలాది మందిని ఏకం చేశారు. భారతదేశ స్వాతంత్ర్యం కోసం, ఆదివాసి సంస్కృతిపరి రక్షణ కోసం ఆయన తన జీవితాన్ని త్యాగం చేశారు. ఆయన నుండి మనం నేర్చుకోవలసినవి చాలా ఉన్నాయి.
మిత్రులారా!
భగవాన్ బిర్సా ముండా విషయానికి వస్తే.. ఆయన చిన్న జీవిత కాలం చూద్దాం. ఈ రోజు కూడా మనం ఆయన నుండి చాలా నేర్చుకోవచ్చు. “ఈ భూమి మనది. మనమే దాని రక్షకులం” అని ఆయన చెప్పేవారు. ఈ వాక్యాల్లో మాతృభూమి పట్ల కర్తవ్యం కూడా ఉంది. పర్యావరణం పట్ల కర్తవ్య భావన కూడా ఉంది. మన ఆదివాసిసంస్కృతిని మరచిపోకూడదని, దానికి దూరంగా వెళ్లకూడదని ఆయన ఎప్పుడూ చెప్పేవారు. నేటికీదేశంలోని ఆదివాసి సమాజాల నుండి మనం ప్రకృతి, పర్యావరణం మొదలుకుని చాలా విషయాల గురించి నేర్చుకోవచ్చు.
మిత్రులారా!
గత ఏడాది భగవాన్ బిర్సా ముండా జయంతి సందర్భంగారాంచీలో భగవాన్ బిర్సా ముండా మ్యూజియాన్ని ప్రారంభించే అవకాశం నాకు లభించింది. సమయం దొరికినప్పుడు తప్పకుండా ఈ మ్యూజియాన్ని సందర్శించాలని యువతను నేను కోరుతున్నాను. నవంబర్ 1వ తేదీ అంటే ఎల్లుండి గుజరాత్-రాజస్థాన్ సరిహద్దుల్లోని మాన్‌గఢ్ లో ఉంటానని కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో, మన సుసంపన్నమైన ఆదివాసి వారసత్వంలో మాన్‌గఢ్ కు చాలా విశిష్ట స్థానం ఉంది. 1913నవంబర్ లో ఇక్కడ ఒక భయంకరమైన ఊచకోత జరిగింది. బ్రిటిష్ వారు స్థానిక ఆదివాసిలను దారుణంగా హత్య చేశారు. ఈ మారణకాండలో వెయ్యి మందికి పైగా ఆదివాసి ప్రాణాలు కోల్పోయారని చెప్తారు. ఈ గిరిజన ఉద్యమానికి గోవింద్ గురు జీ నాయకత్వం వహించారు. ఆయన జీవితం ప్రతి ఒక్కరికీ స్ఫూర్తిదాయకం. ఈ రోజు గోవింద్ గురు జీ తో సహా ఆ ఆదివాసి అమరవీరులందరూ ప్రదర్శించిన అసమానమైన ధైర్యానికి, పరాక్రమానికి నేను నమస్కరిస్తున్నాను. భగవాన్ బిర్సా ముండా, గోవింద్ గురు, ఇతర స్వాతంత్ర్య సమరయోధుల ఆదర్శాలను ఈ అమృత కాలంలో మనం ఎంత నిష్ఠతో పాటిస్తామోమన దేశం అంతే ఉన్నతంగా ఉంటుంది. ఉన్నత శిఖరాలను చేరుకుంటుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!
నవంబర్ 8వ తేదీన గురుపురబ్ ఉంది. మన విశ్వాసానికి గురునానక్ జీ ప్రకాశ్ పర్వ్ ఎంతో ముఖ్యమైంది. దాన్నుండి మనం ఎంతో నేర్చుకోవచ్చు. గురునానక్ దేవ్ జీ తన జీవితాంతంమానవాళికి వెలుగునిచ్చారు. గత కొన్నేళ్లుగా గురువుల వెలుగులు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దేశం ఎన్నో ప్రయత్నాలు చేసింది. గురునానక్ దేవ్ జీ 550వ ప్రకాశ్ పర్వ్‌ను దేశ విదేశాల్లో పెద్ద ఎత్తున జరుపుకునే అవకాశం మనకు లభించింది. దశాబ్దాల నిరీక్షణ తర్వాత కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ నిర్మాణం కూడా జరగడం అంతే ఆనందంగా ఉంది. కొద్దిరోజుల క్రితం హేమకుండ్ సాహిబ్ కోసం రోప్‌వేకి పునాది రాయి వేసే అవకాశం కూడా నాకు లభించింది. మనం మన గురువుల ఆలోచనల నుండి నిరంతరం నేర్చుకోవాలి. వారి పట్ల అంకితభావంతో ఉండాలి. ఈ రోజు కార్తీక పౌర్ణమి కూడా. ఈ రోజు మనం పుణ్యక్షేత్రాల్లో, నదుల్లో స్నానం చేస్తాం. సేవ,దానధర్మాలు చేస్తాం. ఈ పండుగల సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లోచాలా రాష్ట్రాలు తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటుంది. కేరళలో పిరవి జరుపుకుంటారు. కర్ణాటకలో రాజ్యోత్సవాలు జరుపుకుంటారు. ఇదేవిధంగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హర్యానా కూడా తమ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాయి. ఈ అన్ని రాష్ట్రాల ప్రజలకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రాష్ట్రాలన్నింటిలో ఒకరి నుండి ఒకరు నేర్చుకోవడం, సహకరించుకోవడం, కలిసి పనిచేయడం అనే స్ఫూర్తి ఎంత బలంగా ఉంటే దేశం అంత ముందుకు సాగుతుంది. ఈ స్ఫూర్తితో ముందుకు సాగుతామన్న నమ్మకం నాకు ఉంది. మీరందరూ మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. ఆరోగ్యంగా ఉండండి. 'మన్ కీ బాత్'లో మళ్ళీ కలిసే వరకు మీ నుండి సెలవు తీసుకునేందుకు నన్ను అనుమతించండి. నమస్కారం, ధన్యవాదాలు.
ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. గడచిన కొద్ది రోజులుగా మన ధ్యాసను ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే చీతా. చీతాలగురించి మాట్లాడమని చాలా సందేశాలొచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆరూప్ కుమార్ గుప్తాగారు కావొచ్చు లేదంటే తెలంగాణ నుంచి ఎన్. రామచంద్ర రఘురామ్ గారు కావొచ్చు, గుజరాత్ నుంచి రాజన్ గారు కావొచ్చు లేదంటే ఢిల్లీనుంచి సుబ్రత్ గారు కావొచ్చు. దేశంలో నలుమూలలా చీతాలు తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. 130 కోట్లమంది భారత వాసులు సంతోషంగా ఉన్నారు. చాలా గర్విస్తున్నారు. దీనికి కారణం భారతీయులకు ప్రకృతిమీద ఉన్న ప్రేమ. దీని గురించి అందరూ అడుగుతున్న కామన్ ప్రశ్న ఏంటంటే మోడీగారు మాకు చీతాలను చూసే అవకాశం ఎప్పుడు కలుగుతుంది? అని.
మిత్రులారా, ఓ టాస్క్ ఫోర్స్ ని ఏర్పాటు చేశాం. ఈ టాస్క్ ఫోర్క్ చీతాలను మానిటర్ చేస్తుంది. ఇక్కడ పరిస్థితులతో అవి ఎంతగా కలిసిపోతాయో చూస్తుంది. దాన్ని ఆధారం చేసుకుని కొన్ని నెలల తర్వాత ఓ నిర్ణయం తీసుకుంటాం. మరి అప్పటిదాకా చీతాలను మనం చూడగలుగుతాం. కానీ అప్పటిదాకా నేను మీకందరికీ కొన్ని పనులు అప్పజెబుతున్నాను. దానికోసం మై గవర్నమెంట్ వేదికమీద ఓ కాంపిటీషన్ ను ఏర్పాటు చేస్తున్నాం. దాంట్లో నేను అందరితో కొన్ని విషయాలు పంచుకోవాలని అభ్యర్థిస్తున్నాను. చీతాలకోసం మనం ఓ పథకాన్ని నడుపుతున్నాం. మరి ఆ పథకానికి ఏ పేరు పెడితే బాగుంటుంది. మనం వాటికి పేరు పెట్టడం గురించి ఆలోచించగలుగుతామా, అసలు వాటిలో ప్రతి ఒక్కదాన్నీ ఏ పేరుతో పిలవాలని. నిజానికి ఆ నామకరణం సంప్రదాయబద్ధంగా ఉంటే చాలా బాగుంటుంది కదా. ఎందుకంటే మన సమాజం, మన సంస్కృతి, సంప్రదాయం, వారసత్వాలతో ముడిపడి ఉన్నది ఏదైనా సరే మనల్ని సహజంగానే దానివైపుకి ఆకర్షిస్తుందికదా. అది మాత్రమే కాదు మీరింకో విషయం కూడా చెప్పాలి. అసలు మనుషులు జంతువులతో ఎలా ప్రవర్తించాలి అనే విషయాన్ని. మన ప్రాథమిక విధుల్లోకూడా రెస్పెక్ట్ ఫర్ యానిమల్స్ అనే విషయం మీద కూడా శ్రద్ధ చూపించారు. నేను మీకందరికీ ఏం అప్పీల్ చేస్తున్నానంటే మీరందరూ ఈ కాంపిటీషన్ లో తప్పక భాగస్వాములు కావాలి. ఎవరికి తెలుసు బహుమానంగా చీతాని చూసే మొదటి అవకాశం మీకే రావొచ్చుకదా.
ప్రియమైన దేశవాసులారా, ఈ సెప్టెంబర్ 25కి దేశంలోని ప్రముఖ మానవతావాదులు, ఆలోచనాపరులు, భరతమాత ముద్దుబిడ్డ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి జన్మదిన వేడుకల్ని జరుపుకుంటాం. ఏ దేశంలో అయినా సరే యువకులు వాళ్లకు లభించే గుర్తింపును, గౌరవాన్నీ చూసి గర్విస్తారో, వాళ్లని ప్రాథమికమైన ఆలోచనలు, ముందుచూపు అంతే స్థాయిలో ఆకర్షిస్తాయి. దీన్ దయాళ్ గారి ఆలోచనల్లో ఉన్న గొప్పదనం ఏంటంటే ఆయన తన జీవితంలో ఎన్నో పెద్ద పెద్ద ఉత్థాన పతనాల్ని చూశారు. అలాంటి ఆలోచనలకు, సంఘర్షణలకు ఆయన సాక్షిగా నిలిచారు.
అందుకే ఆయన సమసమాజ స్థాపన, అలాగే అంత్యోదయ లాంటి చక్కటి ఆలోచనల్ని దేశం ముందు ఉంచారు. అవి పూర్తిగా భారతీయ భావనలు. దీన్ దయాళ్ గారు చెప్పిన సమసమాజ స్థాపన అసలు ఎలాంటి ఆలోచనంటే అది ఆలోచనా ధార అనే పేరుతో ద్వంద్వానికి, దురాగ్రహానికి తావు లేకుండా చేసేది. ఆయన మనుషులందర్నీ సమానంగా చూసే భారతీయ దర్శనాన్ని మళ్లీ ప్రపంచం ముందుంచారు. మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే, ఆత్మవత్ సర్వభూతేషు అన్నాయి. అంటే దానర్థం మనం జీవులన్నింటినీ మనతో సమానంగా చూడాలని. వాటిలో కూడా మనందరిలాగే వ్యవహరించాలని. ఆధునిక, సామాజిక అలాగే రాజనైతిక దృష్టికోణంలోకూడా భారతీయ దర్శనం ప్రపంచానికి ఎలా మార్గదర్శనం కాగలదో, దీన్ దయాళ్ గారు మనకి నేర్పించారు. ఓ విధంగా స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఎలాంటి హీనమైన భావన ఉండేదంటే, దాని నుంచి విముక్తి కల్పించి ఆయన మన అంతః చైతన్యాన్ని జాగృతం చేశారు. ఆయనేమనేవారంటే మనకి వచ్చిన ఈ స్వాతంత్ర్యం ఎప్పటికి సార్థకమవుతుందంటే అది మన సంస్కృతికి, గుర్తింపుకు మారుపేరుగా ఉన్నప్పుడే. ఈ ఆలోచనల ఆధారంగా ఆయన దేశం అభివృద్ధి చెందడానికి ఓ విజన్ ని రూపొందించగలిగారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ ఏమనేవారంటే దేశ ప్రగతికి చిహ్నం, చిట్ట చివరి మెట్టుమీదున్న వ్యక్తే అవుతాడనేవారు.
స్వాతంత్ర్య అమృతోత్సవ కాలంలో మనం దీన్ దయాళ్ గారి గురించి ఎంతగా తెలుసుకోగలిగితే, ఆయన్ని చూసి ఎంత నేర్చుకోగలిగితే ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మనందరికీ అంతగా ప్రేరణ లభిస్తుంది.
ప్రియమైన దేశవాసులారా, ఇవ్వాళ్టినుంచి మూడు రోజుల తర్వాత అంటే సెప్టెంబర్ 28వ తేదీన అమృత మహాత్సవాలకు సంబంధించి ఓ ప్రత్యేకమైన రోజొస్తోంది. ఆ రోజున మనం భరతమాత వీర పుత్రుడు భగత్ సింగ్ జయంతిని జరుపుకుంటాం.
భగత్ సింగ్ జయంతిని జరుపుకోవడానికి ముందుగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఓ గొప్ప నిర్ణయం తీసుకున్నాం. చండీఘడ్ ఎయిర్ పోర్ట్ కు అమర వీరుడైన భగత్ సింగ్ పేరును పెడుతున్నాం. దానికోసం చాలాకాలం నుంచి ఎదురుచూస్తున్నాం. నేను చండీఘడ్, పంజాబ్, హర్యానా అలాగే ఈ దేశవాసులందరికీ ఓ నిర్ణయం గురించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
మిత్రులారా, మనం మన స్వాతంత్ర్యం సేనానులనుంచి ప్రేరణ పొందాలి, వాళ్ల ఆదర్శాలను పాటిస్తూ వాళ్లు కలలుగన్న భారత దేశాన్ని నిర్మించాలి. అదే మనం వాళ్లకు అర్పించే నిజమైన శ్రద్ధాంజలి. అమర వీరుల్ని స్మరించుకోవడం, వాళ్ల పేరును కొన్ని ప్రదేశాలకు, కొన్ని కట్టడాలకు పెట్టడం మనకి ప్రేరణనిస్తుంది. కొద్ది రోజుల క్రితమే ఈ దేశం ఆ కర్తవ్య పథంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని నెలకొల్పేందుకు ఇలాంటి ప్రయత్నమే చేసింది. ఇప్పుడు చండీఘడ్ ఎయిర్ పోర్ట్ కు భగత్ సింగ్ పేరు పెట్టడం ఆ దిశగా మరో అడుగు ముందుకు వెయ్యడమే.
నాక్కావాల్సిందేంటంటే, అమృత మహోత్సవాల్లో మనం మన స్వాతంత్ర్య సేనానులకు సంబంధించి విశేషమైన సందర్భాలను ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నామో అదే విధంగా సెప్టెంబర్ 28వ తేదీనాడుకూడా ప్రతి ఒక్క యువకుడూ ఓ సరికొత్త ప్రయత్నాన్ని తప్పకుండా మొదలుపెట్టాలి.
అలాగే నా ప్రియమైన దేశవాసులారా, మీకందరికీ సెప్టెంబర్ 28వ తేదీని సెలబ్రేట్ చేసుకోవడానికి ఇంకో కారణం కూడా ఉంది. అదేంటో మీకు తెలుసా? నేను కేవలం రెండు ముక్కలు మాత్రం చెబుతాను. కానీ నాకు తెలుసు మీ ఉత్సాహం నాలుగు రెట్లు ఎక్కువగా పెరిగిపోతుంది.
ఆ రెండు పదాలేంటంటే సర్జికల్ స్ట్రైక్! ఉత్సాహం పెరిగిందికదా! మన దేశంలో ఇప్పుడు నడుస్తున్న అమృత మహాత్సవాల సంరంభం దాన్ని మనం మనస్ఫూర్తిగా సెలబ్రేట్ చేసుకోవాలి. మన సంతోషాన్ని అందరితో పంచుకోవాలి.
నా ప్రియమైన దేశవాసులారా! జీవితంలో అనేక సంఘర్షణలను ఎదుర్కున్న వ్యక్తి ముందు ఎలాంటి బాధా నిలబడలేదంటారు. మన నిత్య జీవితంలో మనం కొందరు ఎలాంటి వాళ్లను చూస్తామంటే, వాళ్లు ఏదో ఒక శారీరకమైన లోపంతో బాధపడుతూ ఉంటారు. చాలామంది వినలేనివాళ్లుంటారు, లేదంటే మాట్లాడి మనసులోని మాటలు చెప్పలేనివాళ్లుంటారు.అలాంటి మిత్రలకు చాలా పెద్ద ఆధారం సైన్ లాంగ్వేజ్. కానీ భారత దేశంలో చాలా కాలంగా చాలా పెద్ద ఇబ్బంది ఏంటంటే ఆ సంజ్ఞల భాషకు చాలా కాలం వరకూ స్పష్టమైన హావభావాలుండేవికావు. స్టాండర్డ్స్ ఉండేవి కావు. ఆ ఇబ్బందుల్ని తొలగించడం కోసమే 2015లో ఇండియెన్ సైన్ లాంగ్వేజ్ రీసెర్చ్ సెంటర్ ని స్థాపించడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే ఆ సంస్థ ఇప్పటికే వెయ్యి పదాలు, భావాలతో కూడిన డిక్ష్నరీని తయారు చేసింది. రెండు రోజుల క్రితం అంటే సెప్టెంబర్ 23వ తేదీన సైన్ లాంగ్వేజ్ డే రోజున ఎన్నో స్కూళ్ల పాఠ్యాంశాలను కూడా సైన్ లాంగ్వేజ్ లో లాంచ్ చేశాం. సైన్ లాంగ్వేజ్ నిర్ణయించిన స్టాండర్డ్ ని ముందుకు తీసుకెళ్లేందుకు దేశీయ విద్యా విధానంలోకూడా చాలా గట్టి ప్రయత్నాలే చేశాం. ఇప్పుడు తయారు చేసిన సైన్ లాంగ్వేజ్ డిక్ష్నరీని వీడియో తీసి నిరంతరాయంగా ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు కూడా జరిగాయి. యూట్యూబ్ లో చాలామంది, చాలా సంస్థలు, భారతీయ భాషల్లో సైన్ లాంగ్వేజ్ లో ఛానళ్లుకూడా ప్రారంభించారు. అంటే ఏడెనిమిదేళ్లక్రితం సైన్ లాంగ్వేజ్ ని అభివృద్ధి చెయ్యడానికి ప్రారంభించిన పథకంవల్ల ఇప్పుడు లక్షలాదిమంది దివ్యాంగులైన సోదరసోదరీమణులకు లాభం కలుగుతోంది.
హర్యానా వాసియైన పూజగారు ఇండియెన్ సైన్ లాంగ్వేజ్ ని చూసి చాలా సంతోషపడుతున్నారు. ముందసలు ఆవిడకి తన బిడ్డతో సంబంధం ఉండేది కాదు. కానీ 2018లో సైన్ లాంగ్వేజ్ లో ట్రైనింగ్ తీసుకున్నాక తల్లీ బిడ్డా ఇద్దరి జీవితం సుఖంగా సాగిపోతోంది. పూజగారి పిల్లవాడు కూడా సైన్ లాంగ్వేజ్ నేర్చుకున్నాడు. పైగా తను వాళ్ల స్కూల్లో స్టోరీ టెల్లింగ్ లో ప్రైజ్ గెలిచి చూపించాడుకూడా. ఈ విధంగామో టింకా గారికి ఓ పదేళ్ల కూతురుంది. తను పాపం వినలేదు. టింకా గారు తన కూతురితో సైన్ లాంగ్వేజ్ కోర్స్ చేయించారు. కానీ ఆవిడకు మాత్రం ఆ సైన్ లాంగ్వేజ్ రాదు. ఆ కారణం వల్ల తను తన బిడ్డతో కమ్యూనికేట్ చేయలేకపోయేవారు. కానీ ఇప్పుడు టింకాగారుకూడా సైన్ లాంగ్వేజ్ లో శిక్షణ పొందిన తర్వాత వాళ్లిద్దరూ హాయిగా చక్కగా మాట్లాడుకోగలుగుతున్నారు.
ఈ ప్రయత్నాలవల్ల కేరళవాసియైన మంజుగారికి కూడా చాలా లాభం కలిగింది. మంజుగారు పుట్టినప్పట్నుంచీ బధిరురాలే. అదిమాత్రమే కాక తన తల్లిదండ్రులకు కూడా ఇలాంటి స్థితే ఉండేది. ఆ పరిస్థితుల్లో సైన్ లాంగ్వేజ్ మొత్తం కుటుంబానికి మాట్లాడుకోవడానికి మాధ్యమం అయ్యింది. ఇప్పుడసలు మంజుగారు స్వయంగా తనే సైన్ లాంగ్వేజ్ టీచర్ కావాలని నిర్ణయించుకున్నారు.
మిత్రులారా నేను దీని గురించి మనసులో మాటలో ఎందుకు చెబుతున్నానంటే ఇండియెన్ సైన్ లాంగ్వేజ్ గురించి అందరికీ అవగాహన కలగాలని. దీని ద్వారా వికలాంగులైన సోదర సోదరీమణులకు మనం వీలైనంత ఎక్కువగా సాయం చెయ్యగలుగుతాం.
సోదర సోదరీమణులారా, కొన్ని రోజుల క్రితం నాకు బ్రెయిలీ లిపిలో రాసిన హేమకోశం ఓ కాపీ దొరికింది. హేమకోశం అస్సామీ భాషలోని అత్యంత పురాతనమైన డిక్ష్నరీలలో ఒకటి. దాన్ని 19వ శతాబ్దంలో తయారు చేశారు. దానికి ప్రముఖ భాషావేత్త హేమచంద్రబారువా సంపాదకత్వం వహించారు.
ఆ హేమకోశం ఎడిషన్ దాదాపుగా 10వేల పేజీలకు పైనే ఉంది. దాన్ని 15 వాల్యూములుగా ప్రచురించడం జరుగుతోంది. దాంట్లో ఉన్న లక్షకంటే ఎక్కువ పదాలను అనువదించాలి. నేను అత్యంత ప్రయోజనకరమైన ఈ ప్రయత్నాన్ని అభినందిస్తున్నాను. ఈ విధంగా ప్రతి ఒక్క ప్రయత్నం దివ్యాంగులైన సోదరసోదరీమణుల కౌశలాన్ని, సామర్ధ్యాన్ని పెంచడానికి చాలా సాయపడుతుంది. ఇవ్వాళ్ల భారతదేశం పారా స్పోర్ట్స్ లోకూడా విజయకేతనాన్ని ఎగరేస్తోంది. మనం అలాంటి ఎన్నో టోర్నమెంట్లలో పాలుపంచుకోవడం జరిగింది. ఇవ్వాళ్ల చాలామంది ఎలా ఉన్నారంటే వికలాంగుల్లో ఫిట్ నెస్ కల్చర్ ని పెంచేందుకు క్షేత్ర స్థాయిలో చెయ్యాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తున్నారు. దానివల్ల దివ్యాంగుల ఆత్మ విశ్వాసానికి చాలా బలం చేకూరుతోంది.
ప్రియమైన దేశవాసులారా, నేను కొన్ని రోజుల క్రితం సూతర్ కి చెందిన ఓ పిల్ల అన్వీని కలిశాను. అన్వీతోపాటు అన్వీ యోగా కూడా నాకు ఎంత బాగా గుర్తుండిపోయిందంటే దాని గురించి నేను మనసులో మాట శ్రోతలందరికీ చెప్పదలచుకున్నాను.
మిత్రలారా, అన్వీ పుట్టినప్పటినుంచే డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతోంది. తను చిన్నప్పట్నుంచీ అత్యంత క్లిష్టతరమైన హృద్రోగంతో బాధపడుతోంది. తను మూడు నెలల పిల్లగా ఉన్నప్పుడు, అప్పుడే తను ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సొచ్చింది. ఇన్ని కష్టాలున్నప్పటికీ కూడా, అన్వీగానీ, తన తల్లిదండ్రులుగానీ ఎప్పుడూ నిరుత్సాహ పడలేదు. అన్వీ తల్లిదండ్రులు డౌన్ సిండ్రోమ్ గురించి మొత్త సమాచారాన్ని సేకరించారు. తర్వాత అన్వీ ఇతరుల మీద ఆధారపడకుండా ఉండాలంటే ఏం చెయ్యాలా అని ఆలోచించారు. వాళ్లు అన్వీకి మంచినీళ్ల గ్లాస్ ఎలా పట్టుకోవాలి, బుట్లకు లేసులు ఎలా కట్టుకోవాలి, బట్టలకు గుండీలు ఎలా పెట్టుకోవాలి, ఇలాంటి చిన్న చిన్న చిన్న విషయాలను నేర్పించడం మొదలుపెట్టారు. ఏ వస్తువును ఎక్కడుంచాలి, మంచి అలవాట్లంటే ఏంటి లాంటి విషయాలన్నింటినీ చాలా ధైర్యంగా వాళ్లు అన్వీకి నేర్పించే ప్రయత్నం చేశారు. అసలు అన్వీ వాటన్నింటినీ ఎంత ఇష్టంగా నేర్చుకుందంటే, ఎంత ప్రతిభను చూపించిందంటే, దాన్ని చూసి దాన్ని చూసి వాళ్లమ్మానాన్నలకు కూడా కాస్త నమ్మకం కలిగింది. వాళ్లు అన్వీని యోగా నేర్చుకోమని ప్రోత్సహించారు. అసలప్పుడు ఎంత కష్టంగా ఉండేదంటే అన్వీ కనీసం తన కాళ్లమీద నిలబడగలిగేది కాదు. అలాంటి పరిస్థితిలో అన్వీ తల్లిదండ్రులు తనని యోగా నేర్చుకోమని ప్రోత్సహించారు. మొట్టమొదటిసారి తను యోగ గురువు దగ్గరికి వెళ్లినప్పుడు ఆయనకూడా అసలీ పిల్ల యోగా చెయ్యగలుగుతుందా అన్న సందిగ్థంలో ఉన్నారు. కానీ అసలా కోచ్ కి కూడా అసలు అన్వీకి ఈ విషయంలో ఎంత పట్టుదల ఉంది అన్న విషయం గురించి ఎలాంటి అంచనా లేదేమో. తను తన తల్లితోపాటు యోగాను అభ్యసించడం మొదలుపెట్టింది. పైగా ఇప్పుడు తను యోగాలో ఎక్స్ పర్ట్ అయిపోయింది. ఇవ్వాళ్ల అన్వీ కాంపిటీషన్లలో పాల్గొంటోంది, మెడల్స్ సాధిస్తోంది. యోగా అన్వీకి ఓ కొత్త జీవితాన్ని ప్రసాదించింది. అన్వీ పట్టుదలగా శ్రద్ధగా యోగాని నేర్చుకుని తన జీవితాన్ని సాఫల్యం చేసుకుంది. వాళ్లమ్మానాన్నలు నాకేం చెప్పారంటే యోగావల్ల అన్వీ జీవితం చాలా అద్భుతంగా మారిపోయిందన్నారు. ఇప్పుడు తనకి ఆత్మ విశ్వాసం బాగా పెరిగింది. యోగావల్ల అన్వీకి ఫిజికల్ హెల్త్ కూడా బాగుపడింది. అలాగే మందుల అవసరం కూడా రోజురోజుకీ తగ్గిపోతోంది. నా ఉద్దేశం ఏంటంటే దేశ విదేశాల్లో ఉన్న మనసులో మాటల శ్రోతలు అన్వీకి యోగా వల్ల కలిగిన లాభాన్ని గురించి శాస్త్రీయంగా అధ్యయనం చెయ్యాలి. నాకు తెలిసినంతవరకూ యోగా శక్తి సామర్ధ్యాలను పరీక్షించడానికి, నిరూపించడానికి అన్వీ చాలా గొప్ప కేస్ స్టడీ అవుతుంది. విద్యావేత్తలైన శాస్త్రజ్ఞులు ముందుకొచ్చి అన్వీ గురించి ఆధ్యయనం చేసి యోగా సామర్ధ్యాన్ని ప్రపంచానికి పరిచయం చెయ్యాల్సిన అవసరం ఉంది.
అలా పరిశోధనలు చెయ్యడంవల్ల ప్రపంచంలో డౌన్ సిండ్రోమ్ తో బాధపడుతున్న అనేకమంది పిల్లలకు చాలా మేలు కలుగుతుంది. శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగా ఎంతగా దోహదపడుతుందో ప్రపంచం మొత్తానికీ ఇప్పుడు చాలా బాగా తెలిసిపోయింది. ప్రత్యేకించి డయాబెటీస్, బ్లడ్ ప్రెజర్ లాంటి లోపాలకు సంబంధించిన కష్టానష్టాలనుంచి బైటపడేందుకు యోగవల్ల చాలా మేలు కలుగుతుంది. యోగాకి ఉన్న ఇంతటి శక్తిని గుర్తించి జూన్ 21వ తేదీని ప్రపంచ యోగా దినోత్సవంగా జరుపుకోవాలని ఐక్యరాజ్య సమితి నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి భారత దేశానికి సంబంధించిన మరో ప్రయత్నాన్నికూడా ఇప్పుడు గుర్తించింది. దాన్ని గౌరవించింది. ఆ ప్రయత్నం ఏంటంటే 2017లో ప్రారంభించిన ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనీషియేటివ్. దానివల్ల బ్లడ్ ప్రెజర్ తో బాధపడుతున్న లక్షలాదిమందికి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో వైద్యం చేస్తున్నారు. ఈ ప్రయత్నం అంతర్జాతీయ సంస్థల దృష్టిని మనవైపుకు ఎంతగా ఆకర్షించిందంటే నిజంగా చాలా అద్భుతం అది. అసలు మనందరికీ అత్యంత ఆశాజనకమైన విషయం ఏంటంటే ఎంతమందికైతే చికిత్స చేశారో వాళ్లలో సగంమందికి బ్లడ్ ప్రెజర్ కంట్రోల్లో ఉంది. నేను ఈ ఇనిషియేటివ్ కోసం పనిచేస్తున్నవాళ్లందరికీ ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. వాళ్లంతా ఎంతో శ్రమపడి దీనిలో సఫలతను సాధించారు.
మిత్రులారా, మానవ జీవన అభివృద్ధి యాత్రం, నిరంతరాయంగా నీళ్లతో ముడిపడి ఉంది. అయితే అది సముద్రం కావొచ్చు, లేదంటే నదికావొచ్చు, చెరువు కావొచ్చు.
భారత దేశపు సౌభాగ్యం ఏంటంటే దాదాపుగా 7వేల 5 వందల కిలోమీటర్ల పొడవైన కోస్ట్ లైన్ ఉన్నందువల్ల మనకి సముద్రంతో విడదీయలేని అనుబంధం ఏర్పడింది. ఈ తీర ప్రాంతం ఎన్నో రాష్ట్రాలను, ద్వీపాలను తాకుతూ పోతుంది.
భారత దేశంలో ఉన్న వేర్వేరు సముదాయాలు, అలాగే వైవిధ్యంతో కూడిన సంస్కృతి ఇక్కడ పరిఢవిల్లడాన్ని మనం స్వయంగా చూడొచ్చు. అది మాత్రమే కాక ఈ తీరప్రాంతాల్లో ఉన్నవాళ్ల ఆహార వ్యవహారాలు అందర్నీ చాలా ఆకట్టుకుంటాయి. మనకున్న ఈ తీర ప్రాంతం పర్యావరణానికి సంబంధించిన అనేక సమస్యల్ని ఎదుర్కుంటోంది. ఓ వైపున క్లైమేట్ ఛేంజ్ మెరైన్ ఎకో సిస్టమ్స్ కి చాలా పెద్ద ప్రమాదంగా పరిణమిస్తోంది. మరో వైపున మన బీచ్ లలో పెరిగిపోతున్న మురికి అనేక సమస్యల్ని సృష్టిస్తోంది. మనందరి బాధ్యత ఏంటంటే మనం ఆ సమస్యల గురించి చాలా పట్టుదలగా, నిరంతరాయంగా శ్రమించాలి. నేను దేశంలోని తీర ప్రాంతాల్లో ఉన్న కోస్టల్ క్లీనింగ్ కోసం స్వచ్ఛమైన సాగరం, సురక్షితమైన సాగరం అనే పేరుతో ఒక ప్రయత్నం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. జూలై 5వ తేదీన ప్రారంభమైన ఈ పథకానికి సంబంధించిన ప్రయత్నాలుగడచిన సెప్టెంబర్ 17వ తేదీన విశ్వకర్మ జయంతి రోజున సఫలమయ్యాయి. ఆ రోజు కోస్టల్ క్లీనింగ్ అప్ డే కూడా. స్వాతంత్ర్య అమృతోత్సవాల్లో మొదలైన ఈ యుద్ధం 75 రోజుల పాట నడిచింది. దీంట్లో జన భాగ్యస్వామ్యం పెద్ద ఎత్తున ఉంటోంది. ఈ ప్రయోగం వల్ల దాదాపుగా నెలన్నర ముంచీ పరిశుభ్రతకు సంబంధించిన అనేక కార్యక్రమాల్ని చూడడం జరిగింది. గోవాలో ఓ పెద్ద మానవ హారాన్ని రూపొందించారు. కాకినాడలో గణపతి నిమజ్జనోత్సవం సందర్భంగా జనానికి ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు.
NSSకి చెందిన దాదాపు 5000 మంది సోదర సోదరీమణులు 30 టన్నులకంటే ఎక్కువ ప్లాస్టిక్ ని సేకరించారు. ఒడిషాలో మూడు రోజుల్లోనే 20 వేలమంది కంటే ఎక్కువ మంది విద్యార్థినీ విద్యార్థులు స్వచ్ఛమైన సాగరం – సురక్షితమైన సాగరం కోసం వాళ్లు వాళ్లతోపాటుగా వాళ్ల కుటుంబాల్ని, చుట్టుపక్కల వాళ్లనందర్నీ ప్రేరేపిస్తామని ప్రతిజ్ఞ చేశారు.
Elected Officials, ప్రభుత్వంలోని నగరాల్లోని మేయర్లు, గ్రామాల్లోని సర్పంచులతో నేను మాట్లాడినప్పుడు నేను వాళ్లకి ఓ మాట తప్పక చెబుతాను. స్వచ్ఛతకోసం చేస్తున్న ఈ యజ్ఞంలో స్థానిక సంస్థల ప్రతినిధులను, స్థానికుల్ని కూడా భాగస్వాముల్ని చెయ్యాలని ఇన్నోవేటివ్ తరహాలో పనులు చెయ్యమని చెబుతుంటాను.
బెంగళూరులో ఓ టీమ్ ఉంది - Youth For Parivarthan– యూత్ ఫర్ పరివర్తన్. గడచిన ఎనిమిది సంవత్సరాలుగా ఈ టీమ్ స్వచ్ఛతకోసం అదే విధంగా ఇతర సామాజిక అంశాలకోసం చాలా పరిశ్రమ చేస్తోంది. వాళ్ల మోటో చాలా స్పష్టంగా ఉంది. 'Stop Complaining, Start Acting'. ఈ టీమ్ నగరంలోని దాదాపు 370 ప్రాంతాల్లో సుందరంగా తీర్చిదిద్దింది. ప్రతి ప్రాంతంలోనూ ఈ Youth For Parivarthanఅనే సంస్థలో వంద నుంచి నూట యాభైమంది సభ్యులు చేరారు. ప్రతి ఆదివారం వీళ్లీ పని మొదలుపెడతారు. మధ్యాహ్నం వరకూ చేస్తారు. ఈ పనిలో చెత్తను ఎలాగూ ఏరి పారేస్తారు. దాంతోపాటుగా పెయింటింగ్ అలాగే Artistic Sketches వేసే పని కూడా జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో వీళ్లు సుప్రసిద్ధులైన వ్యక్తుల మాటల్ని, వాళ్ల ఇన్స్పిరేషనల్ కొటేషన్లని కూడా మీరు చూడొచ్చు. బెంగుళూరులో Youth For Parivarthanచేసిన ప్రయత్నాల తర్వాత మీకు నేను మీరట్ కి చెందిన కబాడ్ సే జుగాడ్ ('कबाड़सेजुगाड़') పథకం గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ పథకం పర్యావరణ పరిరక్షణతోపాటుగా నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దే పని కూడా చేస్తోంది. ఈ యుద్ధంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీంట్లో లోహ వ్యర్థాలు, ప్లాస్టిక్ వేస్ట్, పాత టైర్లు, అలాగే డ్రమ్ములు లాంటి పాడైపోయిన వస్తువుల్ని ఉపయోగిస్తున్నారు.
తక్కువ ఖర్చుతో సామాజిక స్థలాలను సుందరంగా తీర్చిదిద్దడం ఎలాగో చూపించేందుకు ఈ ప్రయత్నాన్నికూడా మనం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. ఈ ప్రయత్నాలు చేపట్టిన వారందరికీ నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలుపుతున్నాను.
ప్రియమైన దేశవాసులారా, ఇప్పుడు దేశంలో అన్నిచోట్లా ఉత్సవాల వెలుగులు కనిపిస్తున్నాయి. రేపు నవరాత్రుల్లో మొదటి రోజు. ఈ రోజున మనం అమ్మవారి మొదటి స్వరూపమైన శైలపుత్రిని ఆరాధిస్తాం. ఇక్కడ్నుంచి తొమ్మిది రోజులపాటు నియమబద్ధులమై, ఉపవాసం ఉంటూ, తర్వాత విజయ దశమి పండుగను జరుపుకుంటాం. అంటే ఓ విధంగా మన రక్తంలో భక్తి మరియు ఆధ్యాత్మికతలతోకూడన ఎంతటి నిగూఢమైన సందేశం దాగి ఉందో అర్థం చేసుకోవచ్చు. నియమబద్ధమైన ప్రణాళికతో సిద్ధిని పొందడానికి ఆ తర్వాత విజయదశమి పండుగ జరుపుకోవడం, ఈ రెండూ జీవితంలో ఎలాంటి లక్ష్యాన్నైనా సాధించుకునే మార్గాలు అవుతాయి. దసరా తర్వాత ధన త్రయోదశి, దీపావళి పండుగలు కూడా వస్తాయి.
మిత్రులారా, కొద్ది సంవత్సరాలుగా మన పండుగలకు ఓ సరికొత్త సంకల్పాన్నికూడా జోడించుకున్నాం. మీకందరికీ తెలిసిన విషయమే, ఆ సంకల్పం ఏంటంటే - 'Vocal for Local' అనే సంకల్పం. ఇప్పడు మనం పండుగల సంతోషంలో మన local పౌరుల్ని, శిల్పకారుల్ని, వ్యాపారుల్ని కూడా కలుపుకుంటున్నాం. రాబోయే అక్టోబర్ 2వ తేదీన బాపూజీ జయంతి సందర్భంగా ఈ పథకాన్ని మరింత సమర్థవంతంగా అమలు చెయ్యాలని మనం సంకల్పించుకోవాలి. ఒకవేళ handloom, handicraft లాంటి ప్రాడక్ట్ లన్నింటినీ కలుపుకునే మీరు సామాన్లు కొనుక్కోండి. అసలు ఈ పండుగకు నిజమైన ఆనందం ఎప్పుడంటే ప్రతి ఒక్కరూ ఈ పండుగలో భాగం అయినప్పుడే, అందుకే స్థానిక ప్రాడక్టులకు సంబంధించిన వాళ్లందరికీ మనం మద్దతివ్వాలి.
చాలా మంచి పని ఏంటంటే, పండుగల్లో మనం ఏ గిఫ్ట్ లు ఇచ్చినా సరే, వాటిలో ఇలాంటి ప్రాడక్ట్ లను కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పథకానికి ఇంతటి ప్రాముఖ్యత ఎందుకు వచ్చిందంటే స్వాతంత్ర్య అమృత కాలంలోకి అడుగుపెట్టేటప్పటికల్లా మనం స్వయం సమృద్ధ భారతాన్ని సాధించాలని కలలుగంటున్నాం కాబట్టి. ఓ విధంగా చూస్తే మనకి ఈ స్వాతంత్ర్యాన్ని తెచ్చిపెట్టిన వాళ్లకు ఇదే నిజమైన శ్రద్ధాంజలి అవుతుంది. అందుకోసం నేను మీకు ఏం చెప్పదలచుకున్నానంటే, ఈసారి ఖాదీ, handloom లేదంటే handicraft లాంటి ప్రాడక్టుల్ని కొనడంలో మీరు అన్ని రికార్డుల్నీ అధిగమించాలి. మనం చూస్తున్నాం పండుగల్లో packingకి అలాగే packaging కోసం polythene bagsని విరివిగా ఉపయోగిస్తున్నారు. స్వచ్ఛతకోసం తపిస్తున్న ఈ సందర్భంలో polythene వల్ల నష్టం కలిగించే చెత్త మన పండుగ వాతావరణాన్ని పాడు చేస్తుంది. అందుకోసం మనం స్థానికంగా తయారైన non-plastic బ్యాగుల్ని మాత్రమే ఉపయోగించాలి. మన దగ్గర జూట్ వి, నారవి, అరటి నారతో చేసినవి ఇలాంటి సంప్రదాయికమైన వస్తువులతో చేసిన బ్యాగుల ఉపయోగం చాలా బాగా పెరుగుతోంది. పండుగల్లో వీటిని విరివిగా వాడి వీటి తయారీని ప్రోత్సహించడం మనందరి బాధ్యత. అలాగే స్వచ్ఛత అంటే మన ఆరోగ్యంతోపాటుగా పర్యావహరణ హితాన్ని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి.
ప్రియమైన దేశవాసులారా, మన శాస్త్రాలు ఏం చెబుతున్నాయంటే – పరహిత్ సరిస్ ధర్మ నహీ భాయీ అని చెబుతున్నాయి. అంటే ఇతరులకు మేలు చెయ్యడం కంటే మించిన ధర్మం, ఇతరులకు సేవ చేయడం కంటే మించిన ధర్మం, సాయం చెయ్యడాన్ని మించిన ధర్మం మరొకటి లేదని. గడచిన రోజుల్లో దేశంలో సమాజ సేవకు సంబంధించి ఓ ఉదాహరణను మనం చూడగలిగాం. మీరుకూడా చూసే ఉంటారు. జనం ముందుకొచ్చి టీబీతో బాధపడుతున్న రోగుల్ని దత్తత తీసుకుంటున్నారు. వాళ్లకి పౌష్టిక ఆహారం అందించే బాధ్యతను స్వీకరిస్తున్నారు. నిజానికి ఇదికూడా టీబీ విముక్త భారత దేశం అనే పథకంలో ఒక భాగమే. దీంట్లో జనం భాగస్వాములవుతున్నారు. తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నారు. సరైన పోషణ లభిస్తేనే సరైన సమయంలో వేసుకున్న మందులు టీబీని తగ్గించగలుగుతాయి. నాకు పూర్తి విశ్వాసం ఉంది, భక్తితో కూడిన ఈ జన భాగస్వామ్యం వల్ల 2025వ సంవత్సరానికల్లా భారత దేశం టీబీనుంచి పూర్తిగా విముక్తి పొందుతుంది.
మిత్రలారా, కేంద్ర పాలిత ప్రాంతాలైన దాద్రా నగర్ హవేలీ అలాగే డామన్ ద్వీపంలో కూడా నాకు అలాంటి ఒక ఉదాహరణ గురించి తెలుసుకునే అవకాశం కలిగింది. అక్కడున్న ఆదీవాసీ ప్రాంతాల్లో నివశించే జినూ రావతీయ్ గారు నాకేమని లేఖ రాశారంటే అక్కడ గ్రామాలను దత్తత చేసుకునే కార్యక్రమం నడుస్తోందట, దానిద్వారా Medical college students 50 గ్రామాలను దత్తత చేసుకున్నారట. వాటిలో జిన్ గారి గ్రామం కూడా ఉందట. ఆ మెడికల్ విద్యార్థులు రోగాల బారిన పడకుండా ఆయా గ్రామాల ప్రజలకు జాగ్రత్తలు చెబుతున్నారట. జబ్బు చేసిన వాళ్లకు సాయం కూడా చేస్తున్నారట. అలాగే ప్రభుత్వ పథకాల గురించి కూడా వివరిస్తున్నారట. పరోపకారమనే ఈ భావన గ్రామాల్లో నివశిస్తున్నవారి జీవితాల్లో తప్పక సంతోషాన్ని నింపుతుంది. నేను దీనికి medical college విద్యార్థులందరికీ అభినందనలు తెలుపుతున్నాను.
మిత్రలారా, మనసులో మాటలో మనం కొత్త కొత్త విషయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఎన్నో సందర్భాల్లో మనకి ఈ సందర్భంగా పాత విషయాల గురించి చాలా లోతుగా ఆలోచించే అవకాశం కూడా కలుగుతోంది. కిందటి నెల మనసులో మాటలో నేను తృణ ధాన్యాల గురించి అలాగే 2023ని'International Millet Year' గా మనం జరుపుకోవాలని చెప్పాను. ఈ విషయం మీద జనం చాలా ఆసక్తి చూపించారు. నాకు దాని గురించి ఎన్నో లేఖలొచ్చాయి. వాటిలో జనం ఏం చెబుతున్నారంటే, వాళ్లు ఏ విధంగా మిల్లెట్స్ ని దైనందిన ఆహారంలో భాగంగా స్వీకరిస్తున్నారో చెబుతున్నారు. కొందరైతే మిల్లెట్స్ తో తయారు చేసే సంప్రదాయబద్ధమైన ఆహార పదార్ధాల గురించి కూడా చెప్పారు. ఇది ఒక చాలా పెద్ద మార్పుకు సంకేతం. జనానికి ఉన్న ఈ ఉత్సాహాన్ని చూసి నాకేమనిపిస్తోందంటే మనందరం కలిసి దీనిమీద ఓ ఈ బుక్ ని తయారు చేస్తే బాగుంటుంది. దాంట్లో మనం మిల్లెట్లతో తయారు చేసుకునే dishes గురించి అలాగే మనందరి అనుభవాల గురించి వివరించడం బాగుంటుంది. దానివల్ల International Millet Year ప్రారంభం కావడానికి ముందే మన దగ్గర millets కి సంబంధించిన ఒక public encyclopaediaకూడా తయారవుతుంది. మనం దాన్ని MyGov portalలో కూడా పబ్లిష్ చెయ్యొచ్చు.
మిత్రులారా, మనసులో మాటలో ఈసారి ఈ విషయాలు చాలు, కానీ సెలవు తీసుకోవడానికి ముందు నేను మీకు మన National Games గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. సెప్టెంబర్ 29వ తేదీనుంచి గుజరాత్ లో National Games కోసం ఏర్పాటు జరుగుతున్నాయి. ఇది మనకి మహత్తరమైన అవకాశం. ఎందుకంటే మనం చాలా ఏళ్ల తర్వాత National Gamesని ఏర్పాటు చేసుకుంటున్నాం. కోవిడ్ మహమ్మారి వల్ల కిందటి సారి ఈ ఆటల పోటీలను రద్దు చెయ్యాల్సొచ్చింది. ఈ ఆటల పోటీల్లో పాల్గొనబోతున్న ఆటగాళ్లందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఆటగాళ్లలో ఉత్సాహాన్ని నింపేందుకు నేనివ్వాళ్ల వాళ్లందరి మధ్యే ఉంటాను. మీరందరూ కూడా National Games ని తప్పకుండా follow అవ్వండి. అలాగే మన ఆటగాళ్లకి ఆత్మ స్థైర్యాన్ని పెంచండి. ఇంక నేను ఇవ్వాళ్టికి సెలవు తీసుకుంటున్నాను. వచ్చేనెల మనసులో మాటలో కొత్త విషయాలతో మళ్లీ మిమ్మల్ని కలుసుకుంటాను. ధన్యవాదాలు. నమస్కారం.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం! ఈ ఆగస్టు నెలలోమీ ఉత్తరాలు, సందేశాలు, కార్డులు అన్నీ నా కార్యాలయాన్ని త్రివర్ణమయం చేశాయి. త్రివర్ణ పతాకం లేని లేదా త్రివర్ణ పతాకం, స్వేచ్ఛ గురించిన్ విషయాలు లేని ఏ లేఖను నేను బహుశా చూడలేదు. పిల్లలు, యువ స్నేహితులు అమృత మహోత్సవం సందర్భంగా అందమైన చిత్రాలను, కళాకృతులను పంపారు. స్వాతంత్య్రం వచ్చిన ఈ మాసంలో మన దేశంలో, ప్రతి నగరంలో, ప్రతి గ్రామంలో అమృత మహోత్సవఅమృతధార ప్రవహిస్తోంది. అమృత మహోత్సవంతో పాటు స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న ఈ ప్రత్యేక సందర్భంలో దేశ సామూహిక శక్తిని మనం చూశాం. చైతన్య అనుభూతిని పొందాం. ఇంత పెద్ద దేశంలో ఎన్నో వైవిధ్యాలు. కానీ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేటప్పుడు అందరూ ఒకే భావనతో వ్యవహరించినట్టు అనిపించింది. త్రివర్ణ పతాక గౌరవాన్ని కాపాడడంలో ప్రథమ రక్షకులుగా ప్రజలు స్వయంగా ముందుకు వచ్చారు. స్వచ్చతా అభియాన్ లోనూ టీకా ప్రచారంలోనూ దేశ స్ఫూర్తిని కూడా మనం చూశాం. అమృత మహోత్సవంలో మళ్లీ అదే దేశభక్తి స్ఫూర్తిని చూడబోతున్నాం.ఎత్తైన పర్వతాల శిఖరాలపైనా, దేశ సరిహద్దుల్లోనూ, సముద్రం మధ్యలోనూ కూడా మన సైనికులు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. త్రివర్ణ పతాక ప్రచారానికి ప్రజలు కూడా విభిన్నమైన వినూత్న ఆలోచనలతో ముందుకు వచ్చారు. అలా వచ్చిన యువ సహచరుడు కృష్నీల్ అనిల్ గారు. అనిల్ గారు ఒక పజిల్ కళాకారుడు. రికార్డు సమయంలో మొజాయిక్ కళతో అందమైన త్రివర్ణ పతాకాన్ని సృష్టించారు.కర్ణాటకలోని కోలార్‌లో 630 అడుగుల పొడవు, 205 అడుగుల వెడల్పుతో త్రివర్ణ పతాకాన్ని పట్టుకుని అపురూప దృశ్యాన్ని ప్రదర్శించారు. అస్సాంలోని ప్రభుత్వ ఉద్యోగులు దిఘాలిపుఖురి యుద్ధ స్మారకం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసేందుకు తమ స్వహస్తాలతో 20 అడుగుల త్రివర్ణ పతాకాన్ని తయారు చేశారు. అదేవిధంగాఇండోర్‌లోని ప్రజలు మానవహారం ద్వారా భారతదేశ పటాన్ని రూపొందించారు.చండీగఢ్‌లో యువకులు భారీ మానవ త్రివర్ణ పతాకాన్ని తయారు చేశారు. ఈ రెండు ప్రయత్నాలూ గిన్నిస్ రికార్డులో కూడా నమోదయ్యాయి. వీటన్నింటి మధ్యలోహిమాచల్ ప్రదేశ్‌లోని గంగోట్ పంచాయితీ నుండి ఒక గొప్ప స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ కూడా కనిపించింది.ఇక్కడ పంచాయతీలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో వలస కూలీల పిల్లలను ముఖ్య అతిథులుగా భాగస్వాములను చేశారు.
మిత్రులారా!అమృత మహోత్సవంలోని ఈ వర్ణాలు భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని ఇతర దేశాలలో కూడా కనిపించాయి. బోట్స్ వానాలో నివసిస్తున్న స్థానిక గాయకులు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా 75 దేశభక్తి గీతాలను ఆలపించారు. ఇందులో విశేషమేమిటంటేఈ 75 పాటలు హిందీ, పంజాబీ, గుజరాతీ, బెంగాలీ, అస్సామీ, తమిళం, తెలుగు, కన్నడ , సంస్కృతం వంటి భాషల్లో పాడారు. అదేవిధంగా నమీబియాలో ఇండో-నమీబియా సాంస్కృతిక-సాంప్రదాయిక సంబంధాలపై ప్రత్యేక స్టాంపును విడుదల చేశారు.
మిత్రులారా!నేను మరో సంతోషకరమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితంభారత ప్రభుత్వ సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యక్రమానికి హాజరయ్యే అవకాశం నాకు లభించింది. అక్కడ 'స్వరాజ్' దూరదర్శన్ సీరియల్ ను ప్రదర్శించారు. ఆ సీరియల్ ప్రీమియర్‌కి వెళ్లే అవకాశం నాకు లభించింది.స్వాతంత్య్ర ఉద్యమంలో పాలుపంచుకుని, గుర్తింపు పొందని వీరులు, వీరవనితల కృషిని దేశంలోని యువ తరానికి పరిచయం చేసేందుకు ఇదో గొప్ప కార్యక్రమం. ఇది ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు దూరదర్శన్‌లో ప్రసారమవుతుంది.ఈ సీరియల్ 75 వారాల పాటు కొనసాగుతుందని నాకు చెప్పారు. మీరు సమయాన్ని వెచ్చించి మీరు చూడడంతో పాటు మీ ఇంట్లోని పిల్లలకు కూడా చూపించాలని నేను కోరుతున్నాను. పాఠశాలలు, కాలేజీల వారు ఈ కార్యక్రమాన్ని రికార్డ్ చేసి; సోమవారం పాఠశాలలు, కాలేజీలు తెరిచినప్పుడు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించి అందరికీ చూపించాలని నేను కోరుతున్నాను. తద్వారా స్వాతంత్ర్య సముపార్జన కోసం శ్రమించిన ఈ గొప్ప వీరుల పట్ల మన దేశంలో అవగాహన కలుగుతుంది. స్వతంత్ర భారత అమృత మహోత్సవాలు వచ్చే ఏడాది వరకు – అంటే 2023 ఆగస్టు వరకు జరుగుతాయి. దేశం కోసం, స్వాతంత్ర్య సమరయోధుల కోసంమనం చేస్తున్న రచనలను, కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్లాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!నేటికీ మన పూర్వికుల జ్ఞానం, మన పూర్వికుల దూరదృష్టి, మన పూర్వికుల అంతర్దర్శనంఈరోజుకీ ఎంతో ప్రభావశీలత కలిగిఉన్నాయి. ఈ విషయాలపై లోతుల్లోకి తరచి చూస్తే మనకు ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది.
ఓమాన్-మాపో మానుషీ:అమృక్తమం ధాత్ తోకాయ్ తనయాయ్ శం యోః|
యూయం హిష్ఠా భిషజో మాతృతమా విశ్వస్య స్థాతు: జగతో జనిత్రీ: ||
అని వేల సంవత్సరాల నాటిమన ఋగ్వేదంలో చెప్పారు.
“ఓ జలమా! నువ్వేమానవాళికి మంచి స్నేహితుడివి. జీవాన్ని ఇచ్చేది కూడా నువ్వే. నీ నుండి ఆహారం ఉత్పత్తి అవుతుంది. నీవే మా పిల్లలకు ప్రయోజనకారి. నువ్వే మాకు రక్షణ కల్పించేది. మమ్మల్ని అన్ని చెడుల నుండి దూరంగా ఉంచేది కూడా నువ్వే. నువ్వే అత్యుత్తమ ఔషధం. ఈ బ్రహ్మాండాన్ని పెంచి పోషించేది నువ్వే.” అని దీని అర్థం.
ఆలోచించండి… నీటి గురించి, నీటి సంరక్షణ ప్రాముఖ్యత గురించి వేల సంవత్సరాల క్రితమే మన సంస్కృతిలో పేర్కొన్నారు. నేటి సందర్భంలో ఈ జ్ఞానాన్ని చూసినప్పుడుమనం పులకించిపోతాం. దేశం ఈ జ్ఞానాన్ని తన శక్తిగా స్వీకరించినప్పుడు దేశ సామర్థ్యం అనేక రెట్లు పెరుగుతుంది. మీకు గుర్తుండే ఉంటుంది…నాలుగు నెలల క్రితం 'మన్ కీ బాత్'లో నేను అమృత్ సరోవర్ గురించి మాట్లాడాను. ఆ తర్వాత వివిధ జిల్లాల్లో స్థానిక పరిపాలన జత గూడింది. స్వచ్చంద సంస్థలు తోడయ్యాయి. స్థానిక ప్రజలు భాగస్వాములయ్యారు. చూస్తూ ఉండగానే అమృత్ సరోవర్ నిర్మాణం ప్రజా ఉద్యమంగా మారింది. దేశం కోసం ఏదైనా చేయాలనే భావన ఉన్నప్పుడు, తన కర్తవ్యాన్ని గుర్తించినప్పుడు, రాబోయే తరాల పట్ల ఆలోచన ఉన్నప్పుడు సామర్థ్యం కూడా తోడవుతుంది. సంకల్పం ఉదాత్తమవుతుంది.తెలంగాణలోని వరంగల్ నుండి ఒక గొప్ప ప్రయత్నం గురించి తెలుసుకున్నాను. ఇక్కడ కొత్త గ్రామ పంచాయితీ ఏర్పడింది. ఆ పంచాయతీ పేరు 'మంగ్త్యా-వాల్యా తాండా'. ఈ గ్రామం అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. వర్షాకాలంలో చాలా నీరు నిల్వ ఉండే ప్రాంతం సమీపంలో ఈ పంచాయతీ ఉంది.గ్రామస్థుల చొరవతోఇప్పుడు ఈ స్థలాన్ని అమృత్ సరోవర్ అభియాన్ కింద అభివృద్ధి చేస్తున్నారు. ఈసారి వర్షాకాలంలో కురిసిన వర్షాల కారణంగా ఈ చెరువు నీటితో నిండిపోయింది.
మధ్యప్రదేశ్‌లోని మాండ్లాలో ఉన్న మోచా గ్రామ పంచాయతీలో నిర్మించిన అమృత్ సరోవర్ గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ అమృత్ సరోవర్ కన్హా నేషనల్ పార్క్ సమీపంలో నిర్మితమైంది. దీనివల్ల ఈ ప్రాంతం అందం మరింత పెరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని లలిత్‌పూర్‌లో కొత్తగా నిర్మించిన షహీద్ భగత్ సింగ్ అమృత్ సరోవర్ కూడా ప్రజలను ఆకర్షిస్తోంది.నివారి గ్రామ పంచాయతీలో నిర్మించిన ఈ సరస్సు 4 ఎకరాల్లో విస్తరించి ఉంది. సరస్సు ఒడ్డున ఉన్న తోటలు దాని అందాన్ని పెంచుతున్నాయి. సరస్సు సమీపంలోని35 అడుగుల ఎత్తున్న త్రివర్ణ పతాకాన్ని చూసేందుకు సుదూర ప్రాంతాల నుంచి కూడా ప్రజలు వస్తున్నారు. కర్ణాటకలోనూ అమృత్ సరోవర్ ఉద్యమం జోరుగా సాగుతోంది.ఇక్కడ బాగల్కోట్ జిల్లాలోని 'బిల్కెరూర్' గ్రామంలో ప్రజలు చాలా అందమైన అమృత సరోవరాన్ని నిర్మించారు. వాస్తవానికిఈ ప్రాంతంలోకొండ నుండి నీరు రావడంతో ప్రజలు చాలా నష్టపోయేవారు. రైతులకు నష్టం కలిగేది. వారి పంటలు కూడా దెబ్బతినేవి. అమృత సరోవరం చేసేందుకు గ్రామ ప్రజలు మొత్తం నీటిని కాలువలుగా చేశారు. దీంతో ఆ ప్రాంతంలో వరద సమస్య కూడా తీరింది.అమృత్ సరోవర్ అభియాన్ నేటి మన అనేక సమస్యలను పరిష్కరించడంతో పాటు రాబోయే తరాలకు కూడా అంతే ఆవశ్యకంగా ఉంది. ఈ ప్రచారంలోచాలా చోట్లపాత నీటి వనరులను కూడా పునరుద్ధరించారు. జంతువుల దాహం తీర్చడంతో పాటు వ్యవసాయానికి కూడాఅమృత సరోవర్‌ను వినియోగిస్తున్నారు.ఈ చెరువుల వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరిగాయి. అదే సమయంలో వాటి చుట్టూ పచ్చదనం కూడా పెరుగుతోంది. ఇదొక్కటే కాదు-అమృత్ సరోవర్‌లో చేపల పెంపకం కోసం చాలా చోట్ల ప్రజలు సన్నాహాల్లో నిమగ్నమై ఉన్నారు. అమృత్ సరోవర్ ఉద్యమంలో చురుగ్గా పాల్గొనాలని; ఈ నీటి నిల్వ, నీటి సంరక్షణ ప్రయత్నాలకు పూర్తి శక్తిని అందించి, వాటిని ముందుకు తీసుకెళ్లాలని మిమ్మలని అందరినీ -ముఖ్యంగా నా యువ మిత్రులను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! అస్సాంలోని బొంగై గ్రామంలో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ అమలు జరుగుతోంది. ఆ ప్రాజెక్టు పేరు ప్రాజెక్ట్ సంపూర్ణ. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం పోషకాహార లోపానికి వ్యతిరేకంగా పోరాడటం. ఈ పోరాటం చేసే పద్ధతి కూడా చాలా ప్రత్యేకమైంది. ఇందులోభాగంగా అంగన్వాడీ కేంద్రంలోని ఆరోగ్యవంతమైన బిడ్డ తల్లి ప్రతివారం పోషకాహార లోపం ఉన్న పిల్లల తల్లిని కలుసుకుని పౌష్టికాహారానికి సంబంధించిన సమస్త సమాచారాన్ని చర్చిస్తుంది. అంటేఒక తల్లి మరొక తల్లికి స్నేహితురాలు అవుతుంది. ఆమెకు సహాయం చేస్తుంది. ఆమెకు నేర్పిస్తుంది. ఈ ప్రాజెక్ట్ సహాయంతోఈ ప్రాంతంలోఒక సంవత్సరంలో90 శాతానికి పైగా పిల్లల పోషకాహార లోపాన్ని నిర్మూలించగలిగారు. మీరు ఊహించగలారా! పోషకాహార లోపాన్ని తొలగించడానికి పాటలను, సంగీతాన్ని, భజనలను కూడా ఉపయోగించవచ్చా?మధ్యప్రదేశ్‌లోని దతియా జిల్లాలో జరుగుతున్న "మేరా బచ్చా అభియాన్"లో వీటిని విజయవంతంగా ఉపయోగించారు. దీని కిందజిల్లాలో భజనలను, కీర్తనలను నిర్వహించారు. ఇందులో ‘పోషణ్ గురు’ అని పిలిచే శిక్షకులకు భాగస్వామ్యం కల్పించారు. అంగన్వాడీ కేంద్రానికి మహిళలు పిడికెడు ధాన్యాన్ని తీసుకొచ్చి, ఆ ధాన్యంతో శనివారాల్లో 'బాలభోజ్' నిర్వహించే మట్కా కార్యక్రమం కూడా జరిగింది.దీంతో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల హాజరు పెరగడంతోపాటు పోషకాహార లోపం కూడా తగ్గుముఖం పట్టింది. పోషకాహార లోపంపై అవగాహన పెంచేందుకు జార్ఖండ్‌లో ప్రత్యేక ఉద్యమం కూడా జరుగుతోంది. జార్ఖండ్‌లోని గిరిడీహ్‌లో పాము-నిచ్చెన ఆటను సిద్ధం చేశారు. ఆటల ద్వారా పిల్లలు మంచి, చెడు అలవాట్లను తెలుసుకుంటారు.
మిత్రులారా!పోషకాహార లోపానికి సంబంధించిన అనేక వినూత్న ప్రయోగాల గురించి నేను మీకు చెప్తున్నాను. ఎందుకంటే రాబోయే నెలలో మనమందరం ఈ ప్రచారంలో చేరాలి. సెప్టెంబరు నెల పండుగలతో పాటు పోషకాహారానికి సంబంధించిన అతి పెద్ద ప్రచారానికి కూడా అంకితమైంది. మనం ప్రతి ఏడాది సెప్టెంబర్ 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు పోషణమాసోత్సవాలను జరుపుకుంటాం.
పోషకాహార లోపానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక సృజనాత్మక, విభిన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. సాంకేతికతను మెరుగ్గా ఉపయోగించడంతో పాటు ప్రజల భాగస్వామ్యం కూడా పోషకాహార ప్రచారంలో ముఖ్యమైన భాగంగా మారింది. దేశంలోని లక్షలాది మంది అంగన్వాడీ కార్యకర్తలకు మొబైల్ పరికరాలను అందించడం నుండి అంగన్వాడీ సేవలను అందజేయడం, పర్యవేక్షణలకోసం పోషన్ ట్రాకర్ కూడాప్రారంభమైంది.
అన్ని ఆకాంక్షాత్మక జిల్లాలు -యాస్పిరేషన్ జిల్లాలతో పాటు ఈశాన్య రాష్ట్రాలలో14 నుండి 18 సంవత్సరాల వయస్సున్న ఆడపిల్లలను పోషణ్ అభియాన్ పరిధిలోకి తీసుకువచ్చారు. పోషకాహార లోపం సమస్యకు పరిష్కారం ఈ దశలకే పరిమితం కాదు - ఈ పోరాటంలోఅనేక ఇతర కార్యక్రమాలు కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఉదాహరణకుజల్ జీవన్ మిషన్‌ను తీసుకోండి. భారతదేశాన్ని పోషకాహార లోప రహితంగా మార్చడంలో ఈ మిషన్ కూడా భారీ ప్రభావాన్ని చూపుతుంది.పోషకాహార లోపం సవాళ్లను ఎదుర్కోవడంలో సామాజిక అవగాహన ప్రయత్నాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. రాబోయే పోషణ మాసంలో పోషకాహార లోపాన్ని తొలగించే ప్రయత్నాల్లో పాలుపంచుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! చెన్నైకి చెందిన శ్రీదేవి వరదరాజన్ గారు నాకు ఒక విషయాన్ని గుర్తు చేశారు. “కొత్త సంవత్సరం రావడానికి 5 నెలల కన్నా తక్కువ సమయం ఉంది. రాబోయే నూతన సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంటామని మనందరికీ తెలుసు” అని ఆమె మై గవ్ లో రాశారు. దేశ చిరుధాన్యాల భౌగోళిక చిత్ర పటాన్ని కూడా ఆమె నాకు పంపారు. 'మన్ కీ బాత్'లో రాబోయే ఎపిసోడ్లో మీరు దీని గురించి చర్చించగలరా అని కూడా ఆమె అడిగారు. నా దేశ ప్రజలలో ఇలాంటి స్ఫూర్తిని చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఐక్యరాజ్యసమితి 2023 సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటిస్తూ తీర్మానాన్ని ఆమోదించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది.భారతదేశం చేసిన ఈ ప్రతిపాదనకు 70కి పైగా దేశాల మద్దతు లభించిందని తెలిసి మీరు కూడా చాలా సంతోషిస్తారు. నేడుప్రపంచవ్యాప్తంగాఈ చిరుధాన్యాలపై మోజు పెరుగుతోంది. మిత్రులారా!నేను చిరు ధాన్యాల గురించి మాట్లాడేటప్పుడునా ప్రయత్నాలలో ఒకదాన్ని మీతో ఈ రోజు పంచుకోవాలనుకుంటున్నాను.కొంతకాలంగా విదేశీ అతిథులు భారత్‌కు వచ్చినప్పుడు, వివిధ దేశాల అధినేతలు భారతదేశానికి వచ్చినప్పుడుభారతదేశంలోని చిరుధాన్యాలతో చేసిన వంటలను తయారుచేయించడం నా ప్రయత్నం. ఆ పెద్దలకు ఈ వంటకాలు చాలా ఇష్టమయ్యాయని అనుభవంలోకి వచ్చింది. మన చిరుధాన్యాల గురించి చాలా సమాచారాన్ని సేకరించడానికి కూడా వారు ప్రయత్నిస్తారు.చిరుధాన్యాలు, ముతక ధాన్యాలు ప్రాచీన కాలం నుండి మన వ్యవసాయం, సంస్కృతి, నాగరికతలో ఒక భాగం. మన వేదాలలో చిరుధాన్యాల ప్రస్తావన ఉంది. అదే విధంగాపురాణాల్లో, తొల్కాప్పియంలో కూడా వీటి ప్రస్తావన ఉంది. దేశంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అక్కడి ప్రజల ఆహారంలో వివిధ రకాల చిరుధాన్యాలు ఉంటాయి. మన సంస్కృతిలాగే చిరుధాన్యాలు కూడా చాలా వైవిధ్యాన్ని కలిగి ఉంటాయి. జొన్నలు, సజ్జలు, రాగులు, ఊదలు, కొర్రలు, ఒరిగలు, అరికెలు, సామలు, ఉలవలు - ఇవన్నీ చిరుధాన్యాలే. ప్రపంచంలోనే అత్యధికంగా చిరుధాన్యాలను ఉత్పత్తి చేసే దేశం భారతదేశం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత కూడా భారతీయులమైన మన భుజాలపైనే ఉంది. మనమందరం కలిసి దీన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చాలి. దేశ ప్రజల్లో చిరుధాన్యాలపై అవగాహన పెంచాలి.మిత్రులారా!మీకు బాగా తెలుసు…చిరుధాన్యాలు రైతులకు- ముఖ్యంగా చిన్న రైతులకు కూడా ప్రయోజనకరం. వాస్తవానికిపంట చాలా తక్కువ సమయంలో సిద్ధంగా ఉంటుంది. దీనికి ఎక్కువ నీరు అవసరం లేదు. ముఖ్యంగా మన చిన్న రైతులకు చిరుధాన్యాలు మేలు చేస్తాయి. చిరుధాన్యాల గడ్డిని కూడా ఉత్తమ మేతగా పరిగణిస్తారు. ఈ రోజుల్లోయువతరం ఆరోగ్యకరమైన జీవనం, ఆహారంపై చాలా దృష్టి పెడుతుంది.ఈ విధంగా చూసినా చిరుధాన్యాల్లో ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. చాలా మంది దీన్ని సూపర్ ఫుడ్ అని కూడా అంటారు. చిరుధాన్యాల్లో ఒకటి కాదు-అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఊబకాయాన్ని తగ్గించడంతో పాటు మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని కూడా ఇవి తగ్గిస్తాయి.ఉదర, కాలేయ వ్యాధుల నుండి రక్షించడంలో కూడా ఇవి సహాయపడతాయి.కొంతకాలం క్రితమేమనం పోషకాహార లోపం గురించి మాట్లాడుకున్నాం. పోషకాహార లోపంతో పోరాడడంలో చిరుధాన్యాలు కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే అవి శక్తితో పాటు ప్రోటీన్‌తో నిండి ఉంటాయి. నేడు దేశంలో చిరుధాన్యాలను ప్రోత్సహించేందుకు ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన పరిశోధన, ఆవిష్కరణలపై దృష్టి సారించడంతో పాటుఉత్పత్తిని పెంచేందుకు రైతు ఉత్పత్తి సంఘాలను ప్రోత్సహిస్తున్నారు. నా రైతు సోదరులు, సోదరీమణులు చిరుధాన్యాలను- అంటే ముతక ధాన్యాలను తమవిగా భావించి, లాభాలు పొందాలని నా కోరిక. చిరుధాన్యాలపై పనిచేస్తున్న అనేక స్టార్టప్‌లు నేడు పుట్టుకొస్తుండటం నాకు చాలా సంతోషకరం. వీరిలో కొందరు మిల్లెట్ కుకీలను తయారు చేస్తుంటే, మరికొందరు మిల్లెట్ పాన్ కేక్స్, దోశలను కూడా తయారు చేస్తున్నారు. మిల్లెట్ ఎనర్జీ బార్లు, మిల్లెట్ అల్పాహారాలను తయారు చేస్తున్న వారు కొందరు ఉన్నారు.ఈ రంగంలో పనిచేస్తున్న వారందరికీ శుభాకాంక్షలు. ఈ పండగ సీజన్లో మనం చాలా వంటలలో చిరుధాన్యాలను కూడా ఉపయోగిస్తాం. మీరు మీ ఇళ్లలో తయారు చేసిన అటువంటి వంటకాల చిత్రాలను తప్పనిసరిగా సోషల్ మీడియాలో షేర్ చేయండి. మిల్లెట్స్ గురించి ప్రజల్లో అవగాహన పెంచడంలో ఇది సహాయపడుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!కొద్ది రోజుల క్రితం, అరుణాచల్ ప్రదేశ్‌లోని సియాంగ్ జిల్లాలోని జోర్సింగ్ గ్రామం నుండి నేను ఒక వార్త చూశాను. ఈ వార్త ఈ గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న మార్పు గురించి. వాస్తవానికి ఈ నెలలో జోర్సింగ్ గ్రామంలో స్వాతంత్య్ర దినోత్సవం రోజు నుంచే 4జీ ఇంటర్నెట్ సేవలు ప్రారంభమయ్యాయి. ఇంతకు ముందు పల్లెల్లో కరెంటు వచ్చినప్పుడు ప్రజలు సంతోషించేవారు. ఇప్పుడు నవ భారతదేశంలో 4జీ వస్తే అదే ఆనందం పొందుతున్నాం. అరుణాచల్, ఈశాన్య మారుమూల ప్రాంతాలలో 4G రూపంలో కొత్త సూర్యోదయమైంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ కొత్త ఉదయాన్ని తెచ్చింది. ఒకప్పుడు పెద్ద నగరాల్లో మాత్రమే ఉన్న సౌకర్యాలను డిజిటల్ ఇండియా గ్రామ గ్రామానికీ తీసుకువచ్చింది. దీని వల్ల దేశంలో కొత్త డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్స్ ఆవిర్భవిస్తున్నారు. రాజస్థాన్‌లోని అజ్మీర్ జిల్లాకు చెందిన సేఠా సింగ్ రావత్ గారు'దర్జీ ఆన్లైన్' అనే 'ఈ-స్టోర్'ని నిర్వహిస్తున్నారు. ఈ 'దర్జీ ఆన్లైన్' అంటే ఏమిటని మీరు ఆలోచిస్తారు. నిజానికి- సేఠా సింగ్ రావత్ గారు కోవిడ్‌కు ముందు టైలరింగ్ పని చేసేవారు.కోవిడ్ వచ్చినప్పుడురావత్ గారు ఈ సవాలును కష్టంగా తీసుకోలేదు. ఒక అవకాశంగా తీసుకున్నారు. ఆయన 'కామన్ సర్వీస్ సెంటర్' అంటే CSC E-స్టోర్‌లో చేరారు. ఆన్లైన్లో పని చేయడం ప్రారంభించారు. కస్టమర్లు పెద్ద సంఖ్యలో మాస్కుల కోసం ఆర్డర్లు ఇవ్వడాన్ని ఆయన చూశారు. ఆయన కొంతమంది మహిళలను పనిలోకి తీసుకుని మాస్కులు తయారు చేయడం ప్రారంభించారు. దీని తర్వాత ఆయన 'దర్జీ ఆన్లైన్' పేరుతో తన ఆన్లైన్ స్టోర్‌ను ప్రారంభించారు. అందులోఅనేక ఇతర బట్టలు కూడా అమ్మడం ప్రారంభించారు.నేడుడిజిటల్ ఇండియా శక్తితోసేఠా సింగ్ గారి పని ఎంతగా పెరిగిందంటే ఇప్పుడు ఆయనకు దేశం నలుమూలల నుండి ఆర్డర్లు వస్తున్నాయి. వందలాది మహిళలకు ఆయన ఉపాధి కల్పించారు.ఉత్తరప్రదేశ్ లోని ఉన్నావ్‌లో నివసిస్తున్న ఓం ప్రకాష్ సింగ్ గారిని కూడా డిజిటల్ ఇండియా డిజిటల్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మార్చింది. ఆయన తన గ్రామంలో వెయ్యికి పైగా బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్లను ఏర్పాటు చేశారు. ఓం ప్రకాష్ గారు తన కామన్ సర్వీస్ సెంటర్ చుట్టూ ఉచిత వైఫై జోన్‌ను కూడా సృష్టించారు. ఇది అవసరమైన వారికి చాలా సహాయం చేస్తోంది. ఓం ప్రకాష్ గారి పని ఎంతగా పెరిగిపోయిందంటే ఆయన 20 మందికి పైగా తన దగ్గర పనిలో పెట్టుకున్నారు. ఆయా గ్రామాల్లోని పాఠశాలలు, ఆసుపత్రులు, తహసీల్ కార్యాలయాలు, అంగన్వాడీ కేంద్రాలకు బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అందించి ఉపాధి కూడా పొందుతున్నారు. కామన్ సర్వీస్ సెంటర్ లాగా, ప్రభుత్వ ఈ-మార్కెట్ ప్లేస్ అంటే GEM పోర్టల్‌లో ఇలాంటి విజయగాథలు ఎన్ని కనిపిస్తున్నాయి.
మిత్రులారా! నాకు గ్రామాల నుండి ఇలాంటి సందేశాలు చాలా వస్తుంటాయి. ఇంటర్నెట్ ద్వారా వచ్చిన మార్పులను ఆ సందేశాలు నాతో పంచుకుంటాయి. ఇంటర్నెట్ మన యువ స్నేహితులు చదువుకునే, నేర్చుకునే విధానాన్ని మార్చింది. ఉదాహరణకు, ఉత్తరప్రదేశ్ కు చెందిన గుడియా సింగ్ ఉన్నావ్‌లోని అమోయియా గ్రామంలో ఉన్న తన అత్తమామల ఇంటికి వచ్చినప్పుడు ఆమె తన చదువు గురించి ఆందోళన చెందారు. అయితేభారత్ నెట్ ఆమె ఆందోళనను పరిష్కరించింది. గుడియా ఇంటర్నెట్ ద్వారా తన చదువును కొనసాగించారు. గ్రాడ్యుయేషన్ కూడా పూర్తి చేశారు. డిజిటల్ ఇండియా ప్రచారం ద్వారా గ్రామగ్రామానా ఇలాంటి జీవితాలెన్నో కొత్త శక్తిని పొందుతున్నాయి. మీరు గ్రామాల్లోని డిజిటల్ వ్యాపారవేత్తల గురించి మీకు వీలైనంత ఎక్కువగా రాయండి. వారి విజయగాథలను సోషల్ మీడియాలో కూడా పంచుకోండి.
నా ప్రియమైన దేశప్రజలారా!కొంతకాలం క్రితంహిమాచల్ ప్రదేశ్ కు చెందిన 'మన్ కీ బాత్' శ్రోత రమేశ్ గారి నుండి నాకు ఒక లేఖ వచ్చింది. రమేశ్ గారు తన లేఖలో పర్వతాల గొప్పతనాన్ని ప్రస్తావించారు. “పర్వతాల మీద నివాసాలు చాలా దూరం ఉండవచ్చు. కానీ ప్రజల హృదయాలు ఒకదానికొకటి చాలా దగ్గరగా ఉన్నాయ”ని ఆయన రాశారు. నిజమే!పర్వతాలపై నివసించే ప్రజల జీవితాల నుండి మనం చాలా నేర్చుకోవచ్చు.పర్వత ప్రాంతాల్లో ఉండేవారి జీవనశైలి, సంస్కృతి నుండి మనకు లభించే మొదటి పాఠం ఏమిటంటేమనం పరిస్థితుల ఒత్తిడికి లోనుకాకపోతే వాటిని సులభంగా అధిగమించవచ్చు. రెండవది-స్థానిక వనరులతో మనం ఎలా స్వయం సమృద్ధి చెందగలమో కూడా తెలుసుకోవచ్చు. నేను ప్రస్తావించిన మొదటి పాఠం, దాని అందమైన చిత్రం ఈ రోజుల్లో స్పీతీ ప్రాంతంలో కనిపిస్తుంది.స్పీతీ గిరిజన ప్రాంతం. ఇక్కడఈ రోజుల్లోబఠానీలు తీయడం జరుగుతుంది. కొండప్రాంత పొలాల్లో ఇది శ్రమతో కూడుకున్న పని. అయితే ఇక్కడ మాత్రం గ్రామంలోని మహిళలు ఉమ్మడిగా ఒకరికొకరు సహకరిస్తూ అందరి పొలాలలోంచి బఠానీలు కోస్తారు. ఈ పనితో పాటుమహిళలు 'ఛప్రా మాఝీ ఛప్రా' అనే స్థానిక పాటను కూడా పాడతారు.ఇక్కడ పరస్పర సహకారం కూడా జానపద సంప్రదాయంలో భాగమే. స్థానిక వనరుల వినియోగానికి కూడా ఉత్తమ ఉదాహరణ స్పీతీలో ఉంది. స్పీతీలో ఆవులను పెంచే రైతులు వాటి పేడను ఎండబెట్టి బస్తాల్లో నింపుతారు. శీతాకాలం వచ్చినప్పుడుఈ బస్తాలను ఆవు ఉండే ప్రదేశంలో వేస్తారు. ఈ ప్రదేశాన్ని ఇక్కడ ఖూడ్ అని పిలుస్తారు.హిమపాతం మధ్యఈ బస్తాలు చలి నుండి ఆవులకు రక్షణ కల్పిస్తాయి. చలికాలం తర్వాత ఈ ఆవు పేడను పొలాల్లో ఎరువుగా ఉపయోగిస్తారు. అంటేజంతువుల వ్యర్థాల నుండే వాటికి రక్షణ కల్పిస్తారు. వాటి నుండే పొలాలకు ఎరువు కూడా లభిస్తుంది. సాగు ఖర్చు కూడా తక్కువ. పొలంలో దిగుబడి కూడా ఎక్కువ. అందుకే ఈ రోజుల్లో ఈ ప్రాంతం సహజ వ్యవసాయానికి కూడా స్ఫూర్తిగా నిలుస్తోంది.
మిత్రులారా!మనమరొక కొండరాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో కూడా ఇటువంటి మెచ్చుకోదగిన అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్‌లో అనేక రకాల ఔషధాలు, వృక్షజాలం కనిపిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వాటిలో ఒక పండు బేడు. దీన్నే హిమాలయన్ ఫిగ్లేదా హిమాలయన్ అంజీర్అని కూడా అంటారు.ఈ పండులో ఖనిజాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. ప్రజలు దీన్ని పండ్ల రూపంలోనే కాకుండాఅనేక వ్యాధుల చికిత్సలో కూడా ఉపయోగిస్తారు. ఈ పండులోని ఈ గుణాలను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు బేడు రసం, జామ్‌లు, చట్నీలు, ఊరగాయలు, ఎండబెట్టి తయారు చేసిన డ్రై ఫ్రూట్స్‌ను మార్కెట్లోకి విడుదల చేశారు.పితోర్‌ఘర్ పాలకవర్గం చొరవ, స్థానిక ప్రజల సహకారం కారణంగా బేడును వివిధ రూపాల్లో మార్కెట్లోకి తీసుకురావడంలో విజయం సాధించగలిగారు. బేడును పర్వత ప్రాంత అంజీర్ లేదా పహాడీ అంజీర్ గా బ్రాండ్ చేయడం ద్వారా ఆన్లైన్ మార్కెట్ కూడా మొదలైంది.దీని కారణంగారైతులకు కొత్త ఆదాయ వనరులు లభించడమే కాకుండాబేడుఔషధ గుణాల ప్రయోజనాలు సుదూరప్రాంతాలకు చేరుకోవడం ప్రారంభించాయి.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్' ప్రారంభంలో మనం స్వతంత్ర భారత అమృత మహోత్సవం గురించి మాట్లాడుకున్నాం. స్వాతంత్ర్య దినోత్సవం అనే గొప్ప పండుగతో పాటు రానున్న రోజుల్లో మరెన్నో పండుగలు రానున్నాయి. కొద్ది రోజుల తర్వాతగణేశుడిని పూజించే పండుగ గణేశ్ చతుర్థి వస్తోంది. గణేశ్ చతుర్థిఅంటే గణపతి బప్పా ఆశీస్సుల పండుగ.గణేశ్ చతుర్థికి ముందే ఓనం పండుగ కూడా ప్రారంభమవుతుంది. ఓనం ముఖ్యంగా కేరళలో శాంతి, సమృద్ధి అనే భావనలతో జరుపుకుంటారు. హర్తాళికా తీజ్ కూడా ఆగస్టు 30న వస్తోంది. సెప్టెంబర్ 1వ తేదీన ఒడిశాలో నువాఖాయి పండుగను కూడా జరుపుకుంటారు. నువాఖాయి అంటే కొత్త ఆహారం. అంటే ఇది కూడా అనేక ఇతర పండుగల మాదిరిగానే మన వ్యవసాయ సంప్రదాయానికి సంబంధించిన పండుగ. వీటి మధ్య జైన సమాజం వారి సంవత్సరాది పండుగ కూడా ఉంటుంది. మన ఈ పండుగలన్నీ మన సాంస్కృతిక సమృద్ధికి, చైతన్యానికి మారుపేర్లు.ఈ పండుగలు, ప్రత్యేక విశేషాల సందర్భంగా మీకు శుభాకాంక్షలు. ఈ పండుగలతో పాటు రేపు- ఆగస్టు 29వ తేదీన మేజర్ ధ్యాన్‌చంద్ గారి జయంతి సందర్భంగా జాతీయ క్రీడా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటారు. ప్రపంచ వేదికలపై మన యువ ఆటగాళ్లు మన త్రివర్ణ పతాకం వైభవాన్ని కొనసాగించాలని కోరుకుందాం. ఇదే ధ్యాన్ చంద్ గారికి మన నివాళి. మనమందరం కలిసి దేశం కోసం ఇలాగే పని చేద్దాం. దేశ గౌరవాన్ని పెంచుదాం. ఈ కోరికతో నా ప్రసంగాన్ని ముగిస్తాను. వచ్చే నెలలోమరోసారి 'మన్ కీ బాత్' ఉంటుంది. మీకు చాలా చాలా కృతజ్ఞతలు..
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఇది 'మన్ కీ బాత్' 91వ ఎపిసోడ్. మనం ఇంతకుముందు చాలా విషయాలు మాట్లాడుకున్నాం. వివిధ అంశాలపై మన అభిప్రాయాన్ని పంచుకున్నాం. కానీ, ఈసారి 'మన్ కీ బాత్' చాలా ప్రత్యేకమైంది. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తి చేసుకోనున్నసందర్భంలో నిర్వహించుకుంటోన్న స్వాతంత్ర్య దినోత్సవమే ఇందుకు కారణం. మనమందరం చాలా అద్భుతమైన, చారిత్రాత్మక క్షణానికి సాక్షులుగా ఉండబోతున్నాం. ఈశ్వరుడు మనకు ఇంతటి అదృష్టాన్ని ప్రసాదించాడు. మీరు కూడా ఆలోచించండి. మనం బానిసత్వ యుగంలో జన్మించి ఉంటే ఈ రోజు ఊహ ఎలా ఉండేది? బానిసత్వం నుండి విముక్తి పొందాలనే ఆ తపన, పరాధీనతా సంకెళ్ళ నుండి స్వేచ్ఛ పొందాలనే ఆకాంక్ష - ఎంత గాఢంగా ఉండి ఉండాలి. ఆ రోజుల్లో ప్రతిరోజూ లక్షలాది మంది దేశప్రజలు స్వాతంత్ర్యం కోసం పోరాడడం, త్యాగాలు చేయడం చూసి ఉండేవాళ్లం. మన భారతదేశం ఎప్పుడు స్వాతంత్ర్యం పొందుతుందో అనే ఆలోచనతో ఉండేవాళ్లం. వందేమాతరం, భారత్ మా కీ జై అంటూ నినాదాలు చేస్తూ మన జీవితాలను రాబోయే తరాలకు అంకితం చేయాలని యవ్వనాన్ని కోల్పోయినా సరేనని భావించేవాళ్ళం. స్వాతంత్ర్యం పొందే రోజు మన జీవితంలోకి వస్తుందనే కలతో మనం ప్రతి రోజూ ఉదయాన్నే నిద్రలేచేవాళ్ళం.
మిత్రులారా! జులై 31న అంటే ఈ రోజున దేశవాసులం అందరం అమరవీరుడు షహీద్ ఉధమ్ సింగ్ జీకి వందనం చేస్తున్నాం. దేశం కోసం ప్రాణాలర్పించిన అలాంటి గొప్ప విప్లవకారులందరికీ నా వినయపూర్వకమైన నివాళులు అర్పిస్తున్నాను.
మిత్రులారా! స్వతంత్ర భారత అమృతోత్సవం ప్రజాఉద్యమ రూపం దాల్చడం చూసి చాలా సంతోషంగా ఉంది. అన్ని వర్గాల ప్రజలు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు దీనికి సంబంధించిన వివిధ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అలాంటి కార్యక్రమమే ఈ నెల ప్రారంభంలో మేఘాలయలో జరిగింది. మేఘాలయ వీర యోధులు యు. టిరోత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ప్రజలు ఆయనను స్మరించుకున్నారు. ఖాసీ కొండలను నియంత్రించడానికి, అక్కడి సంస్కృతిపై దాడి చేయడానికి బ్రిటిష్ వారు చేసిన కుట్రను టిరోత్ సింగ్ జీ తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ కార్యక్రమంలో పలువురు కళాకారులు చక్కని ప్రదర్శనలు ఇచ్చారు. చరిత్రను సజీవంగా చూపారు. ఇందులో భాగంగా మేఘాలయ మహోన్నత సంస్కృతిని చాలా అందంగా చిత్రీకరించిన ఉత్సవాన్ని కూడా నిర్వహించారు.
కొన్ని వారాల కిందట కర్ణాటకలో అమృత భారతి కన్నడార్థి అనే పేరుతో ఒక ప్రత్యేకమైన ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు. ఇందులో రాష్ట్రంలోని 75 చోట్ల స్వతంత్ర భారత అమృతోత్సవాలకు సంబంధించిన భారీ కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో కర్ణాటకలోని గొప్ప స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకోవడంతో పాటు స్థానిక సాహిత్య విజయాలను కూడా తెరపైకి తెచ్చేందుకు కృషి చేశారు.
మిత్రులారా! ఈ జూలైలో చాలా ఆసక్తికరమైన ప్రయత్నం జరిగింది. దీనికి స్వాతంత్ర్య రైలు, రైల్వే స్టేషన్ అని పేరు పెట్టారు. స్వాతంత్య్ర పోరాటంలో భారతీయ రైల్వే పాత్ర గురించి ప్రజలకు తెలియడమే ఈ ప్రయత్నం లక్ష్యం. స్వాతంత్ర్య ఉద్యమ చరిత్రతో ముడిపడి ఉన్న ఇలాంటి రైల్వే స్టేషన్లు దేశంలో చాలా ఉన్నాయి. ఈ రైల్వే స్టేషన్ల గురించి తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. జార్ఖండ్‌లోని గోమో జంక్షన్‌ను ఇప్పుడు అధికారికంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జంక్షన్ గోమో అని పిలుస్తారు. ఎందుకో తెలుసా? ఈ స్టేషన్లో నేతాజీ సుభాష్ కాల్కా మెయిల్ ఎక్కి, బ్రిటిష్ అధికారుల నుండి తప్పించుకోవడంలో విజయం సాధించారు. లక్నో సమీపంలోని కాకోరి రైల్వే స్టేషన్ పేరు మీరందరూ విని ఉంటారు. రామ్ ప్రసాద్ బిస్మిల్ , అష్ఫాక్ ఉల్లా ఖాన్ వంటి ధైర్యవంతుల పేర్లు ఈ స్టేషన్‌తో ముడిపడి ఉన్నాయి. రైల్లో వెళ్లే బ్రిటిష్ వారి ఖజానాను ఇక్కడ దోచుకోవడం ద్వారా వీర విప్లవకారులు తమ శక్తిని బ్రిటిష్ వారికి తెలియజెప్పారు. తమిళనాడు ప్రజలతో ఎప్పుడైనా మాట్లాడితే తూత్తుకుడి జిల్లాలోని వాంచీ మణియాచ్చీ జంక్షన్ గురించి తెలుసుకుంటారు. ఈ స్టేషన్‌కు తమిళ స్వాతంత్ర్య సమరయోధుడు వాంచినాథన్ పేరు పెట్టారు. బ్రిటిష్ కలెక్టర్‌ను ఆయన చర్యల ఫలితంగా 25 ఏళ్ల యువకుడు వాంచి శిక్షించిన ప్రదేశం ఇదే.
మిత్రులారా! ఈ జాబితా చాలా పెద్దది. దేశవ్యాప్తంగా 24 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న 75 రైల్వే స్టేషన్లను గుర్తించడం జరిగింది. ఈ 75 స్టేషన్లను చాలా అందంగా అలంకరించారు. వీటిలో అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. మీకు సమీపంలోని అటువంటి చారిత్రక స్టేషన్‌ని సందర్శించడానికి మీరు సమయాన్ని వెచ్చించాలి. మీకు తెలియని స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర గురించి అక్కడ మీరు వివరంగా తెలుసుకుంటారు. నేను ఈ స్టేషన్లకు సమీపంలోని పాఠశాల విద్యార్థులను కోరుతున్నాను. ఆ పాఠశాలలలోని చిన్న పిల్లలను ఆ స్టేషన్‌కు తీసుకెళ్లి, ఆ పిల్లలకు జరిగిన మొత్తం సంఘటనల క్రమాన్ని వివరించమని ఉపాధ్యాయులను కూడా కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! స్వాతంత్ర్య అమృత మహోత్సవం లో భాగంగా ఆగస్టు 13వ తేదీ నుండి 15 వరకు 'హర్ ఘర్ తిరంగా- హర్ ఘర్ తిరంగా' అనే ప్రత్యేక ఉద్యమం జరుగుతోంది. ఈ ఉద్యమంలో భాగంగా ఆగస్టు 13వ తేదీ నుండి 15వ తేదీ వరకు మీరు తప్పనిసరిగా మీ ఇంటి దగ్గర త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయాలి. లేదా మీ ఇంటి దగ్గర పెట్టుకోవాలి. త్రివర్ణ పతాకం మనల్ని కలుపుతుంది. దేశం కోసం ఏదైనా చేయాలనే స్ఫూర్తినిస్తుంది. ఆగస్టు 2వ తేదీ నుండి ఆగస్టు 15వ తేదీ వరకు మనమందరం మన సోషల్ మీడియా ప్రొఫైల్ చిత్రాలలో త్రివర్ణ పతాకాన్ని పెట్టుకోవాలని నేను సూచిస్తున్నాను. మీకు తెలుసా! ఆగస్టు 2వ తేదీకి మన త్రివర్ణ పతాకంతో కూడా ప్రత్యేక సంబంధం ఉంది. ఆ రోజు మన జాతీయ జెండాను రూపొందించిన పింగళి వెంకయ్య గారి జయంతి. వారికి నా గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నాను. మన జాతీయ జెండా గురించి మాట్లాడుతూ నేను గొప్ప విప్లవకారురాలు మేడమ్ కామాను కూడా గుర్తుంచుకుంటాను. త్రివర్ణ పతాకాన్ని తీర్చిదిద్దడంలో ఆమె పాత్ర చాలా కీలకం.
మిత్రులారా!స్వాతంత్ర్య అమృతోత్సవంలో నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమాలన్నింటిలో అతిపెద్ద సందేశం ఏమిటంటే దేశవాసులుగా మనమందరందరం మన కర్తవ్యాన్ని పూర్తి నిష్ఠతో నిర్వహించాలి. అప్పుడే అసంఖ్యాక స్వాతంత్య్ర సమరయోధుల కల నెరవేరుతుంది. వారి కలల భారతదేశాన్ని నిర్మించగలుగుతాం. అందుకే రాబోయే 25 సంవత్సరాల ఈ అమృత కాలం ప్రతి దేశవాసికి కర్తవ్యకాలం లాంటిది. దేశాన్ని పూర్తిగా విముక్తి చేయడానికి మన వీర యోధులు ఈ బాధ్యతను మనకు ఇచ్చారు. దాన్ని మనం పూర్తిగా నెరవేర్చాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! కరోనాపై మన దేశవాసుల పోరాటం ఇంకా కొనసాగుతోంది. ప్రపంచం మొత్తం నేటికీ పోరాడుతోంది. సమగ్ర ఆరోగ్య పరిరక్షణపై ప్రజల్లో పెరుగుతున్న ఆసక్తి ప్రతి ఒక్కరికీ ఇందులో చాలా సహాయపడింది. ఇందులో భారతీయ సంప్రదాయ పద్ధతులు ఎంతగా ఉపయోగపడతాయో మనందరికీ తెలిసిందే. కరోనాపై పోరాటంలో ప్రపంచ స్థాయిలో ఆయుష్ ముఖ్యమైన పాత్ర పోషించింది. ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేదంపై, భారతీయ వైద్యంపై ఆసక్తి పెరుగుతోంది. ఆయుష్ ఎగుమతులు రికార్డు వృద్ధిని సాధించడానికి ఇది ఒక ప్రధాన కారణం. ఈ రంగంలో అనేక కొత్త స్టార్టప్‌లు కూడా ఆవిర్భవించడం చాలా ఆనందంగా ఉంది. ఇటీవల గ్లోబల్ ఆయుష్ ఇన్వెస్ట్మెంట్, ఇన్నోవేషన్ సమ్మిట్ జరిగింది. ఇందులో దాదాపు పదివేల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలు వచ్చాయని తెలిస్తే ఆశ్చర్యపోతారు. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కరోనా కాలంలో ఔషధ మొక్కలపై పరిశోధనలు చాలా పెరిగాయి. దీని గురించి అనేక పరిశోధన అధ్యయనాల ప్రచురణలు జరుగుతున్నాయి. ఇది ఖచ్చితంగా మంచి ప్రారంభం.
మిత్రులారా! వివిధ రకాల ఔషధ మొక్కలు, మూలికలకు సంబంధించి దేశంలో మరో గొప్ప ప్రయత్నం జరిగింది. ఇండియన్ వర్చువల్ హెర్బేరియం ప్రారంభం జులై నెలలో జరిగింది. మన మూలాలతో అనుసంధానం అయ్యేందుకు డిజిటల్ ప్రపంచాన్ని ఎలా ఉపయోగించవచ్చో కూడా ఇది ఒక ఉదాహరణ. ఇండియన్ వర్చువల్ హెర్బేరియం సంరక్షిత మొక్కలు లేదా మొక్కల భాగాల డిజిటల్ చిత్రాల ఆసక్తికరమైన సేకరణ. ఇది అంతర్జాలంలో ఉచితంగా లభిస్తుంది. ఈ వర్చువల్ హెర్బేరియంలో లక్షకు పైగా నమూనాలు, వాటికి సంబంధించిన శాస్త్రీయ సమాచారం అందుబాటులో ఉన్నాయి. వర్చువల్ హెర్బేరియంలో భారతదేశంలోని వృక్ష సంబంధ వైవిధ్యం కూడా కనిపిస్తుంది. భారతీయ వృక్షజాలంపై పరిశోధనలో ఇండియన్ వర్చువల్ హెర్బేరియం ఒక ముఖ్యమైన వనరుగా మారుతుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! ప్రతిసారీ 'మన్ కీ బాత్'లో మన ముఖాల్లో మధురమైన చిరునవ్వు తెప్పించే దేశప్రజల విజయాల గురించి చర్చిస్తాం. ఒక విజయగాథ మధురమైన చిరునవ్వులను పంచడంతో పాటు తీపి రుచిని కూడా పంచితే మీరు దాన్ని ఖచ్చితంగా బంగారానికి తావి అబ్బినట్టుందని అంటారు. ఈ రోజుల్లో మన రైతులు తేనె ఉత్పత్తిలో ఇలాంటి అద్భుతాలు చేస్తున్నారు. తేనెలోని తీపి మన రైతుల జీవితాలను కూడా మారుస్తోంది. వారి ఆదాయాన్ని కూడా పెంచుతోంది. హర్యానాలోని యమునానగర్‌లో సుభాష్ కాంబోజ్ జీ అనే తేనెటీగల పెంపకందారు నివసిస్తున్నారు. సుభాష్ గారు తేనెటీగల పెంపకంలో శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ తీసుకున్నారు. దీని తరువాత ఆయన కేవలం ఆరు పెట్టెలతో తన పనిని ప్రారంభించారు. ఈరోజు సుమారు రెండు వేల పెట్టెల్లో తేనెటీగల పెంపకం చేస్తున్నారు. వాటి తేనె అనేక రాష్ట్రాలకు సరఫరా అవుతుంది. వినోద్ కుమార్ గారు కూడా జమ్మూలోని పల్లీ గావ్ లో ఒకటిన్నర వేలకు పైగా యూనిట్లలో తేనెటీగల పెంపకం చేస్తున్నారు. గత ఏడాది రాణి తేనెటీగ పెంపకంలో శిక్షణ తీసుకున్నారు. ఈ పనితో ఏటా 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు సంపాదిస్తున్నారు.
కర్ణాటకకు చెందిన మరో రైతు మధుకేశ్వర్ హెగ్డే గారు. 50 తేనెటీగల యూనిట్లకు భారత ప్రభుత్వం నుంచి సబ్సిడీ తీసుకున్నట్టు మధుకేశ్వర్ గారు తెలిపారు. నేడు ఆయన 800 యూనిట్లను నిర్వహిస్తున్నారు. టన్నులకొద్ది తేనెను విక్రయిస్తున్నారు. ఆయన తన పనిలో కొత్తదనం చూపుతున్నారు. జామున్ తేనె, తులసి తేనె, ఉసిరి తేనె వంటి రకరకాల వృక్షాల తేనెను కూడా తయారు చేస్తున్నారు. మధుకేశ్వర్ గారూ.. తేనె ఉత్పత్తిలో మీ వైవిధ్య భరితమైన కార్యాచరణ, విజయం మీ పేరును సార్థకం చేస్తున్నాయి.
మిత్రులారా! మన సాంప్రదాయిక ఆరోగ్య శాస్త్రంలో తేనెకు ఎంత ప్రాధాన్యత ఉందో మీకందరికీ తెలుసు. ఆయుర్వేద గ్రంథాలలో తేనెను అమృతంగా వర్ణించారు. తేనె మనకు రుచిని మాత్రమే కాదు, ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది. ఈరోజుల్లో తేనె ఉత్పత్తిలో అనేక అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరమైన విద్యను అభ్యసిస్తున్న యువత కూడా దాన్ని తమ స్వయం ఉపాధిగా చేసుకుంటోంది.
అలాంటి ఒక యువకుడు – ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ కు చెందిన నిమిత్ సింగ్. నిమిత్ గారు బీటెక్ చేశారు. ఆయన తండ్రి కూడా వైద్యులే. కానీ తన చదువు తర్వాత నిమిత్ గారు ఉద్యోగం కాకుండా స్వయం ఉపాధిని నిర్ణయించుకున్నారు. తేనె తయారీ పనులను ప్రారంభించారు. నాణ్యత తనిఖీ కోసం లక్నోలో తన సొంత ల్యాబ్‌ను కూడా నిర్మించారు. నిమిత్ గారు ఇప్పుడు తేనె, బీ వ్యాక్స్ ద్వారా బాగా సంపాదిస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు వెళ్లి రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నారు. అలాంటి యువకుల కృషి వల్లనే నేడు దేశం ఇంత పెద్ద తేనె ఉత్పత్తిదారుగా మారుతోంది. దేశం నుండి తేనె ఎగుమతి కూడా పెరిగిందని తెలిస్తే మీరు సంతోషిస్తారు. దేశం జాతీయ తేనెటీగల పెంపక ప్రచారాన్ని ప్రారంభించింది. రైతులు కష్టపడి పనిచేశారు. మన తేనె మాధుర్యం ప్రపంచానికి చేరడం ప్రారంభించింది. ఈ రంగంలో ఇంకా భారీ అవకాశాలు ఉన్నాయి. మన యువత ఈ అవకాశాలతో అనుసంధాన కావాలని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని, కొత్త అవకాశాలను స్వీకరించాలని నేను కోరుకుంటున్నాను.
నా ప్రియమైన దేశ వాసులారా! హిమాచల్ ప్రదేశ్‌కు చెందిన 'మన్ కీ బాత్' శ్రోత ఆశిష్ బహల్ గారి నుండి నాకు ఒక లేఖ వచ్చింది. ఆయన తన లేఖలో చంబాకు చెందిన 'మింజర్ మేళా' గురించి ప్రస్తావించారు. మొక్కజొన్న పూలను మింజర్ అంటారు. మొక్కజొన్నలో పూలు వచ్చినప్పుడు మింజర్ మేళా కూడా జరుపుకుంటారు. ఈ మేళాలో పాల్గొనడానికి దేశం నలుమూలల నుండి పర్యాటకులు సుదూర ప్రాంతాల నుండి వస్తారు. యాదృచ్ఛికంగా మింజర్ మేళా కూడా ఈ సమయంలోనే జరుగుతోంది. మీరు హిమాచల్ వెళ్లి ఉంటే ఈ మేళాను చూడటానికి చంబాకు వెళ్లవచ్చు.
చంబా ఎంత అందమైందంటే ఇక్కడి జానపద గేయాల్లో ఇలా పేర్కొన్నారు..
“చంబే ఏక్ దిన్ ఓణా-కనే మహీనా రౌణా”అని.
అంటే.. చంబాకి ఒకరోజు వచ్చేవాళ్లు.. దాని అందాలను చూస్తూ నెలల తరబడి ఇక్కడే ఉండిపోతారు.
మిత్రులారా! మన దేశంలో జాతరలు గొప్ప సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి. జాతరలు ప్రజలను, మనస్సులను కలుపుతాయి. హిమాచల్‌లో వర్షాలు కురిసిన తరువాత- ఖరీఫ్ పంటలు పండినప్పుడు- సెప్టెంబర్‌లో సిమ్లా, మండి, కులు, సోలన్ లకు విహారయాత్ర జరుపుకుంటారు. జాగ్ర జాతర కూడా సెప్టెంబర్ లోనే రాబోతోంది. జాగ్ర జాతరలలో మహాసూ దేవతను ఆహ్వానిస్తూ బీసు పాటలు పాడతారు. మహాసు దేవత మేల్కొలుపు హిమాచల్‌లోని సిమ్లా, కిన్నౌర్, సిర్మౌర్‌లతో పాటు ఉత్తరాఖండ్‌లో కూడా జరుగుతుంది.
మిత్రులారా! మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆదివాసీ సమాజానికి సంబంధించిన అనేక సాంప్రదాయిక జాతరలు ఉన్నాయి. ఈ జాతరలలో కొన్ని ఆదివాసీ సంస్కృతికి సంబంధించినవి. కొన్ని జాతరలు ఆదివాసీల చరిత్ర, వారసత్వానికి సంబంధించినవి. ఉదాహరణకు మీకు అవకాశం దొరికితే తెలంగాణలోని మేడారంలో నాలుగు రోజులపాటు జరిగే సమ్మక్క-సారలమ్మ జాతరను తప్పక సందర్శించండి. ఈ జాతరను తెలంగాణ మహాకుంభమేళాగా పిలుస్తారు. సారలమ్మ జాతరను ఇద్దరు ఆదివాసీ మహిళా నాయకురాళ్లు సమ్మక్క, సారలమ్మల గౌరవార్థం జరుపుకుంటారు. ఇది కేవలం తెలంగాణకు మాత్రమే కాకుండా ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల కోయ ఆదివాసీ సమాజానికి కూడా అతి పెద్ద విశ్వాస కేంద్రం. ఆంధ్ర ప్రదేశ్‌లోని మరిడమ్మ జాతర కూడా ఆదివాసీ సమాజ విశ్వాసాలకు సంబంధించిన పెద్ద జాతర. మరిడమ్మ జాతర జ్యేష్ట అమావాస్య నుండి ఆషాఢ అమావాస్య వరకు జరుగుతుంది. ఇక్కడి ఆదివాసీ సమాజం దీన్ని శక్తి ఆరాధనతో అనుసంధానిస్తుంది. ఇక్కడే తూర్పుగోదావరిలోని పెద్దాపురంలో మరిడమ్మ గుడి కూడా ఉంది. ఇదేవిధంగా రాజస్థాన్‌లోని గరాసియా తెగ ప్రజలు వైశాఖ శుక్ల చతుర్దశి నాడు 'సియావా కా మేళా' లేదా 'మన్ ఖాన్ రో మేళా' నిర్వహిస్తారు.
ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌లో ఉన్న నారాయణపూర్‌లోని 'మావలీ మేళా' కూడా చాలా ప్రత్యేకమైంది. అక్కడికి సమీపంలోనే మధ్యప్రదేశ్‌లోని భగోరియా మేళా కూడా చాలా ప్రసిద్ధి చెందింది. భోజరాజు కాలంలో భగోరియా జాతర ప్రారంభమైందంటారు. అప్పుడు భిల్లు రాజులు కాసూమరా, బాలూన్ వారి రాజధానుల్లో మొదటిసారి నిర్వహించారు. నాటి నుంచి నేటి వరకు ఈ జాతరలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.
అదేవిధంగా తరణేతర్, మాధోపూర్ వంటి అనేక జాతరలు గుజరాత్లో చాలా ప్రసిద్ధి చెందాయి. జాతరలు మన సమాజానికి, జీవితానికి గొప్ప శక్తి వనరులు. మీ చుట్టూ కూడా ఇలాంటి జాతరలు ఎన్నో జరుగుతూ ఉండవచ్చు. ఆధునిక కాలంలో 'ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలోపేతం చేయడానికి సమాజంలోని ఈ పురాతన బంధాలు చాలా ముఖ్యమైనవి.
మన యువత తప్పనిసరిగా వాటితో అనుసంధానం కావాలి. మీరు ఇలాంటి జాతరలకు వెళ్ళినప్పుడల్లా అక్కడి చిత్రాలను సోషల్ మీడియాలో కూడా పంచుకోండి. మీకు కావాలంటే ప్రత్యేకమైన హ్యాష్‌ట్యాగ్‌ని కూడా ఉపయోగించవచ్చు. దీంతో ఆ జాతరల గురించి ఇతరులకు కూడా తెలిసిపోతుంది. మీరు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వెబ్సైట్లో కూడా ఫోటోలను అప్లోడ్ చేయవచ్చు. రాబోయే కొద్ది రోజుల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కూడా ఒక పోటీని ప్రారంభించబోతోంది. జాతరాల ఉత్తమ చిత్రాలను పంపిన వారికి బహుమతులను కూడా అందిస్తుంది. కాబట్టి ఆలస్యం చేయొద్దు. జాతరలను సందర్శించండి. వాటి చిత్రాలను పంచుకోండి. బహుశా మీరు బహుమతి కూడా పొందవచ్చు.
నా ప్రియమైన దేశప్రజలారా! మీరు తప్పక గమనించి ఉంటారు- బొమ్మల ఎగుమతిలో పవర్‌హౌస్‌గా మారడానికి భారతదేశానికి పూర్తి సామర్థ్యం ఉందని 'మన్ కీ బాత్'లోని ఒక ఎపిసోడ్లో నేను చెప్పాను. క్రీడలు, ఆటలలో భారతదేశం గొప్ప వారసత్వం గురించి నేను ప్రత్యేకంగా చర్చించాను. భారతదేశంలోని స్థానిక బొమ్మలు సంప్రదాయం, ప్రకృతి రెండింటికీ అనుగుణంగా ఉంటాయి. పర్యావరణ అనుకూలమైనవి. ఈ రోజు నేను భారతీయ బొమ్మల విజయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మన యువకులు, స్టార్టప్‌లు, పారిశ్రామికవేత్తల కారణంగా, మన బొమ్మల పరిశ్రమ చేసిన పనులను, సాధించిన విజయాలను ఎవరూ కనీసం ఊహించలేరు. భారతీయ బొమ్మల విషయానికి వస్తే వోకల్ ఫర్ లోకల్ అనే స్వరం ప్రతిచోటా వినిపిస్తోంది. ఇప్పుడు భారతదేశానికి విదేశాల నుండి వచ్చే బొమ్మల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. ఈ విషయం మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. గతంలో 3 వేల కోట్ల రూపాయలకు పైగా విలువైన బొమ్మలు విదేశాల నుంచి వచ్చేవి. ఇప్పుడు వాటి దిగుమతులు 70 శాతం వరకు తగ్గాయి. ఈ కాలంలో భారతదేశం రెండు వేల ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన బొమ్మలను ఇతర దేశాలకు ఎగుమతి చేయడం సంతోషించదగ్గ విషయం. గతంలో భారతదేశం నుండి 300-400 కోట్ల రూపాయల విలువైన బొమ్మలు మాత్రమే విదేశాలకు వెళ్ళేవి. ఇదంతా కరోనా కాలంలో జరిగిందని మీకు ఇప్పటికే తెలుసు. భారతదేశపు బొమ్మల రంగం రూపాంతరం చెందడం ద్వారా తనను తాను నిరూపించుకుంది. భారతీయ తయారీదారులు ఇప్పుడు భారతీయ ఇతిహాసాలు, చరిత్ర , సంస్కృతి ఆధారంగా బొమ్మలను తయారు చేస్తున్నారు. దేశంలో ప్రతిచోటా బొమ్మల ఉత్పత్తిదారుల సమూహాలు ఉన్నాయి. బొమ్మలు తయారు చేసే చిన్న పారిశ్రామికవేత్తలు వాటి నుండి చాలా ప్రయోజనం పొందుతున్నారు. ఈ చిన్న వ్యాపారవేత్తలు తయారు చేసిన బొమ్మలు ఇప్పుడు ప్రపంచాన్ని చుట్టేస్తున్నాయి. భారతదేశానికి చెందిన బొమ్మల తయారీదారులు ప్రపంచంలోని ప్రముఖ గ్లోబల్ టాయ్ బ్రాండ్లతో కలిసి పనిచేస్తున్నారు. మన స్టార్టప్ రంగం కూడా బొమ్మల ప్రపంచంపై పూర్తి శ్రద్ధ చూపడం నాకు చాలా నచ్చింది. వారు ఈ ప్రాంతంలో చాలా సరదా వస్తువులు కూడా తయారు చేస్తున్నారు. బెంగుళూరులో శూమీ టాయ్స్ అనే స్టార్టప్ పర్యావరణ అనుకూల బొమ్మలపై దృష్టి సారిస్తోంది. గుజరాత్లో ఆర్కిడ్జూ కంపెనీ భౌతిక వాస్తవిక ప్రపంచాన్ని కళ్లకు కట్టినట్టు చూపించే సాంకేతికత ఆధారిత ఫ్లాష్ కార్డులను, కథాపుస్తకాలను తయారు చేస్తోంది.
పూణేకి చెందిన ఫన్‌వెన్షన్ అనే సంస్థ అభ్యసన, బొమ్మలు, కృత్యాల ప్రహేళికల ద్వారా పిల్లల్లో విజ్ఞాన సాంకేతిక శాస్త్రాలపై, గణితశాస్త్రంపై ఆసక్తిని పెంచడంలో నిమగ్నమై ఉంది. బొమ్మల ప్రపంచంలో గొప్ప కృషి చేస్తున్న తయారీదారులను, స్టార్ట్-అప్‌లందరినీ నేను అభినందిస్తున్నాను. మనమందరం కలిసి భారతీయ బొమ్మలను ప్రపంచవ్యాప్తంగా మరింత ప్రాచుర్యం పొందేలా చేద్దాం. దీంతో పాటు మరింత ఎక్కువగా భారతీయ బొమ్మలు, పజిల్స్, ఆటల సామగ్రిని కొనుగోలు చేయాలని తల్లిదండ్రులను కోరుతున్నాను.
మిత్రులారా! తరగతి గది అయినా, ఆట స్థలం అయినా నేడు మన యువత ప్రతి రంగంలోనూ దేశం గర్వించేలా చేస్తున్నారు. ఈ నెలలో పివి సింధు సింగపూర్ ఓపెన్ టైటిల్‌ను గెలుచుకున్నారు. నీరజ్ చోప్రా తన అత్యుత్తమ ప్రదర్శనను కొనసాగిస్తూ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో దేశానికి రజత పతకాన్ని సాధించారు. ఐర్లాండ్ పారా బ్యాడ్మింటన్ ఇంటర్నేషనల్‌లో కూడా మన క్రీడాకారులు 11 పతకాలు సాధించి దేశ గౌరవాన్ని పెంచారు. రోమ్‌లో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో కూడా భారత ఆటగాళ్లు ఉత్తమ ప్రదర్శన చూపారు. గ్రీకో-రోమన్ ఈవెంట్లో మన అథ్లెట్ సూరజ్ అద్భుతం చేశారు. 32 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ ఈవెంట్లో రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం సాధించారు. ఆటగాళ్ల విషయంలో ఈ నెల మొత్తం ఉత్తమ ప్రదర్శనలతో నిండిపోయింది. చెన్నైలో 44వ చెస్ ఒలింపియాడ్‌కు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు గొప్ప గౌరవం. ఈ టోర్నమెంటు జులై 28వ తేదీన ప్రారంభమైంది. టోర్నమెంటు ప్రారంభ వేడుకలకు హాజరయ్యే అవకాశం నాకు లభించింది. అదే రోజున యు. కె. లో కామన్వెల్త్ క్రీడోత్సవాలు కూడా ప్రారంభమయ్యాయి. యువ ఉత్సాహంతో నిండిన భారత జట్టు అక్కడ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోంది. దేశప్రజల తరపున క్రీడాకారులందరికీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే అంతర్జాతీయ ఫుట్ బాల్ క్రీడా సమాఖ్య- ఫిఫా ఆధ్వర్యంలో జరిగే పదిహేడేళ్ల లోపు బాలికల ప్రపంచకప్‌కు కూడా భారత్ ఆతిథ్యం ఇవ్వబోతుండడం సంతోషంగా ఉంది. ఈ టోర్నమెంటు అక్టోబర్ కు కాస్త అటూ ఇటూగా జరుగుతుంది. ఇది దేశ యువతుల్లో క్రీడల పట్ల ఉత్సాహాన్ని పెంచుతుంది.
మిత్రులారా! కొద్ది రోజుల కిందట దేశవ్యాప్తంగా 10వ తరగతి, 12వ తరగతి ఫలితాలను ప్రకటించారు. కృషి, అంకితభావంతో విజయం సాధించిన విద్యార్థులందరినీ నేను అభినందిస్తున్నాను. మహమ్మారి కారణంగా గత రెండు సంవత్సరాలు చాలా సవాళ్లను ఎదుర్కొన్నాం. ఈ పరిస్థితుల్లో మన యువత చూపిన ధైర్యం, సంయమనం ఎంతో అభినందనీయం. అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మనం 75 సంవత్సరాల స్వాతంత్ర్యంపై చర్చను దేశ పర్యటనతో ప్రారంభించాం. వచ్చేసారి మనం కలిసినప్పుడు మన తర్వాతి 25 సంవత్సరాల ప్రయాణం కూడా ప్రారంభమవుతుంది. మన ప్రియమైన త్రివర్ణ పతాకాన్ని మన ఇళ్ల వద్ద, మన ప్రియమైనవారి ఇళ్లలో ఎగురవేయడానికి మనం అందరం సంఘటితం కావాలి. ఈసారి స్వాతంత్ర్య దినోత్సవం ఎలా జరుపుకున్నారు, ఏమైనా ప్రత్యేకంగా చేశారా అనే వివరాలను నాతో పంచుకోండి. మన ఈ అమృతోత్సవంలోని వివిధ రంగుల గురించి వచ్చేసారి మాట్లాడుకుందాం. అప్పటి వరకు వీడ్కోలు చెప్పేందుకు నన్ను అనుమతించండి. మీకు చాలా చాలా కృతజ్ఞతలు
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. 'మన్ కీ బాత్' కోసం మీ అందరి నుండి నాకు చాలా లేఖలు వచ్చాయి.సామాజిక మాధ్యమాల నుండి,నమో యాప్ ద్వారా కూడా నాకు చాలా సందేశాలు వచ్చాయి. మీ స్పందనకు నేను మీకు చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఈ కార్యక్రమంలోపరస్పర స్ఫూర్తిదాయక ప్రయత్నాలను చర్చించడం, ప్రజా చైతన్యం ద్వారా వచ్చిన మార్పు గాథలను దేశం మొత్తానికి తెలియజేయడం మా ప్రయత్నం.దేశంలోని ప్రతి పౌరుడి జీవితంలో గొప్ప ప్రాముఖ్యత ఉన్న ప్రజా చైతన్య ఉద్యమం గురించి నేను ఈ రోజు మీతో చర్చించాలనుకుంటున్నాను. కానీ, అంతకు ముందు నేను నేటి తరం యువతను- 24-25 సంవత్సరాల యువతను- ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. ప్రశ్న చాలా గంభీరమైంది. నా ప్రశ్నకు సమాధానం ఖచ్చితంగా ఆలోచించండి. మీ వయస్సులో ఉన్నప్పుడు మీ తల్లిదండ్రులకు జీవించే హక్కు కూడా ఒకప్పుడు లేదని మీకు తెలుసా! ఇది ఎలా సాధ్యమని మీరు ఆలోచిస్తూ ఉండాలి. ఇది అసాధ్యం. కానీ నా యువ మిత్రులారా! ఇది మన దేశంలో ఒకసారి జరిగింది. ఎన్నో ఏళ్ల కిందట 1975 నాటి సంగతి ఇది. జూన్‌లో ఇదే సమయంలో అత్యవసర పరిస్థితి -ఎమర్జెన్సీ- విధించారు. అప్పుడు దేశ ప్రజలు అన్ని హక్కులూ కోల్పోయారు. రాజ్యాంగంలోని 21వ అధికరణం ప్రకారం భారతీయులందరికీ లభించిన జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ కూడా ఆ హక్కులలో ఉన్నాయి. ఆ సమయంలో భారత ప్రజాస్వామ్యాన్ని అణచివేసే ప్రయత్నాలు జరిగాయి. దేశంలోని న్యాయస్థానాలు, ప్రతి రాజ్యాంగ సంస్థ, పత్రికా రంగాలు అన్నీ నియంత్రణకు గురయ్యాయి. ఆమోదం లేకుండా ఏదీ ముద్రించకూడదని సెన్సార్షిప్ షరతు. నాకు గుర్తుంది- అప్పటి ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్ ప్రభుత్వాన్ని ప్రశంసించేందుకు నిరాకరించడంతో ఆయనపై నిషేధం విధించారు. రేడియోలోకి ఆయన ప్రవేశ అవకాశాన్ని తొలగించారు. అయితే ఎన్నో ప్రయత్నాలు, వేల సంఖ్యలో అరెస్టులు, లక్షలాది మందిపై దౌర్జన్యాలు జరిగినా ప్రజాస్వామ్యంపై భారత ప్రజల విశ్వాసం ఏమాత్రం సడలలేదు. భారతదేశ ప్రజల్లో శతాబ్దాలుగా కొనసాగుతున్న ప్రజాస్వామ్య విలువలు, మన హృదయాల్లో ఉన్న ప్రజాస్వామ్య స్ఫూర్తిచివరకు విజయం సాధించాయి. భారతదేశ ప్రజలు ఎమర్జెన్సీని తొలగించి ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజాస్వామ్యాన్ని స్థాపించారు. నియంతృత్వ మనస్తత్వాన్ని, నియంతృత్వ ధోరణిని ప్రజాస్వామ్య పద్ధతిలో ఓడించడం విషయంలో ప్రపంచం మొత్తంలో ఇలాంటి ఉదాహరణ దొరకడం కష్టం. ఎమర్జెన్సీ సమయంలోదేశప్రజల పోరాటానికి సాక్షిగా, భాగస్వామిగా ఉండే అదృష్టం - ప్రజాస్వామ్య సైనికుడిగా నాకు లభించింది. నేడు-దేశం స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా-అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఆ భయంకరమైన ఎమర్జెన్సీ కాలాన్ని మనం ఎన్నటికీ మరచిపోకూడదు.రాబోయే తరాలు కూడా మరిచిపోకూడదు. అమృత మహోత్సవం వందల సంవత్సరాల బానిసత్వం నుండి విముక్తి విజయ గాథను మాత్రమే కాకుండా, స్వాతంత్ర్యం తర్వాత 75 సంవత్సరాల ప్రయాణాన్ని కూడా ఇముడ్చుకుంటుంది. చరిత్రలోని ప్రతి ముఖ్యమైన దశ నుంచి నేర్చుకుంటూ ముందుకు సాగుతున్నాం.
నా ప్రియమైన దేశప్రజలారా! జీవితంలో ఆకాశానికి సంబంధించిన ఊహలు లేని వారు మనలో ఎవ్వరూ ఉండరు. చిన్నతనంలో ఆకాశంలోని చంద్రుడు, నక్షత్రాల కథలు అందరినీ ఆకర్షిస్తాయి. యువతకుఆకాశాన్ని తాకడం కలలను నిజం చేయడానికి పర్యాయపదంగా ఉంటుంది. నేడు-మన భారతదేశం అనేక రంగాలలో విజయాల ఆకాశాన్ని తాకుతున్నప్పుడుఆకాశం లేదా అంతరిక్షం దాని నుండి దూరంగా ఎలా ఉండగలదు! గత కొన్నేళ్లుగా మన దేశంలో అంతరిక్ష రంగానికి సంబంధించి ఎన్నో పెద్ద పనులు జరిగాయి. దేశం సాధించిన ఈ విజయాలలో ఒకటి ఇన్-స్పేస్ అనే ఏజెన్సీ ఏర్పాటు. భారతదేశఅంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి కొత్త అవకాశాలను ప్రోత్సహిస్తున్న ఏజెన్సీ ఇది. ఈ ప్రారంభం మన దేశ యువతను విశేషంగా ఆకర్షించింది.నాకు చాలా మంది యువకుల నుంచి దీనికి సంబంధించిన సందేశాలు కూడా వచ్చాయి. కొన్ని రోజుల క్రితం నేను ఇన్-స్పేస్ ప్రధాన కార్యాలయాన్ని ప్రారంభించేందుకు వెళ్ళినప్పుడుచాలా మంది యువ స్టార్టప్ వ్యవస్థాపకుల ఆలోచనలను, ఉత్సాహాన్ని చూశాను. నేను వారితో చాలా సేపు మాట్లాడాను. మీరువారి గురించి తెలుసుకున్నప్పుడు ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఉదాహరణకు, స్పేస్ స్టార్ట్-అప్ల సంఖ్యను, వేగాన్ని మాత్రమే తీసుకోండి. కొన్నేళ్ల క్రితం వరకు మన దేశంలో అంతరిక్ష రంగంలో స్టార్టప్‌ల గురించి ఎవరూ ఆలోచించలేదు. నేడు వాటి సంఖ్య వందకు పైగా ఉంది. ఈ స్టార్టప్‌లన్నీ ఇంతకుముందు ఆలోచించని, ప్రైవేట్ రంగానికి అసాధ్యమని భావించిన ఆలోచనలపై పనిచేస్తున్నాయి.ఉదాహరణకుచెన్నై, హైదరాబాద్‌లలోఅగ్నికుల్ , స్కైరూట్ అనే రెండు స్టార్టప్‌లు ఉన్నాయి. ఈ స్టార్టప్‌లు తక్కువ భారాన్ని అంతరిక్షంలోకి తీసుకెళ్లే ప్రయోగ వాహనాలను అభివృద్ధి చేస్తున్నాయి. దీని కారణంగా స్పేస్ లాంచింగ్ ఖర్చు చాలా తక్కువఅవుతుందని అంచనా వేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన ధృవ స్పేస్ అనే మరో స్టార్టప్ కృత్రిమ ఉపగ్రహాల వినియోగం విషయంలో అత్యధిక సాంకేతికత ఉన్న సౌర ఫలకలతో పని చేస్తోంది. అంతరిక్ష వ్యర్థాలను కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్న మరో స్పేస్ స్టార్టప్ దిగంతరాకు చెందిన తన్వీర్ అహ్మద్‌ని కూడా కలిశాను.అంతరిక్ష వ్యర్థాలను నిర్మూలించే సాంకేతికతపై పని చేయాలనినేను వారికి ఒక సవాలు కూడా ఇచ్చాను. దిగంతరా, ధృవ స్పేస్ రెండూ జూన్ 30వ తేదీన ఇస్రో వాహక నౌక నుండి తమ మొదటి ప్రయోగాన్ని చేస్తున్నాయి. అదేవిధంగా బెంగుళూరుకు చెందిన స్పేస్ స్టార్టప్ ల సంస్థ ఆస్ట్రోమ్ వ్యవస్థాపకురాలు నేహా కూడా ఒక అద్భుతమైన ఆలోచనతో పని చేస్తున్నారు.చిన్నవిగా ఉండి, తక్కువ ఖర్చు ఉండే ఫ్లాట్ యాంటినా లను ఈ స్టార్టప్‌లు తయారు చేస్తున్నాయి. ఈ టెక్నాలజీకి ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉంటుంది.
మిత్రులారా!ఇన్-స్పేస్ కార్యక్రమంలోనేను మెహసాణా పాఠశాల విద్యార్థిని తన్వీ పటేల్‌ను కూడా కలిశాను. ఆమె చాలా చిన్న కృత్రిమ ఉపగ్రహం కోసం పని చేస్తోంది. దీన్ని రాబోయే కొద్ది నెలల్లో అంతరిక్షంలోకి పంపుతున్నారు. తన్వి తన పని గురించి గుజరాతీలో చాలా సరళంగా చెప్పింది.తన్విలాగేదేశంలోని దాదాపు ఏడున్నర వందల మంది పాఠశాల విద్యార్థులు అమృత మహోత్సవంలో ఇటువంటి 75 ఉపగ్రహాలపై పని చేస్తున్నారు. ఈ విద్యార్థులలో ఎక్కువ మంది దేశంలోని చిన్న పట్టణాలకు చెందినవారు కావడం కూడా సంతోషకరమైన విషయం.
మిత్రులారా!ఇదే యువతమదిలో కొన్ని సంవత్సరాల క్రితం అంతరిక్ష రంగం చిత్రం రహస్య మిషన్ లాగా ఉండేది. కానీదేశం అంతరిక్ష రంగంలో సంస్కరణలు చేపట్టింది. అదే యువత ఇప్పుడు వారి ఉపగ్రహాన్ని ప్రయోగిస్తున్నారు.దేశంలోని యువత ఆకాశాన్ని తాకడానికి సిద్ధంగా ఉన్నప్పుడుమన దేశం ఎలా వెనుకబడి ఉంటుంది!
నా ప్రియమైన దేశప్రజలారా! 'మన్ కీ బాత్'లోఇప్పుడు మీ మనస్సును ఆహ్లాదపరిచే, మీకు స్ఫూర్తినిచ్చే అంశం గురించి మాట్లాడుదాం.మన ఒలింపిక్ బంగారు పతక విజేత నీరజ్ చోప్రా ఇటీవలమళ్ళీ ముఖ్యాంశాలలో నిలిచారు. ఒలింపిక్స్ తర్వాత కూడా ఒకదాని తర్వాత ఒకటిగా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు.ఫిన్లాండ్లో జరిగిన పావో నుర్మీ గేమ్స్‌లో నీరజ్ రజత పతకం సాధించారు. ఇది మాత్రమే కాదు- ఆయన తన సొంత జావెలిన్ త్రో రికార్డును కూడా బద్దలు కొట్టారు. కుర్టానే గేమ్స్‌లో స్వర్ణం సాధించి దేశం గర్వించేలా చేశారు నీరజ్. అక్కడ వాతావరణం కూడా చాలా ప్రతికూలంగా ఉన్న పరిస్థితుల్లో ఆయన ఈ స్వర్ణం సాధించారు. ఈ ధైర్యమే నేటి యువతరానికి గుర్తింపు.స్టార్టప్‌ల నుంచి క్రీడా ప్రపంచం వరకు భారత యువత కొత్త రికార్డులు సృష్టిస్తోంది.ఇటీవల జరిగిన ఖేలో ఇండియా యువజన క్రీడోత్సవాల్లో కూడా మన క్రీడాకారులు ఎన్నో రికార్డులు సృష్టించారు. ఈ గేమ్‌లలో మొత్తం 12 రికార్డులు బద్దలయ్యాయని తెలుసుకోవడం మీకు సంతోషంగా ఉంటుంది. అంతేకాదు- 11 రికార్డులను మహిళా క్రీడాకారులు నమోదు చేశారు. మణిపూర్ కు చెందిన ఎం. మార్టినా దేవి వెయిట్ లిఫ్టింగ్ లో ఎనిమిది రికార్డులు సృష్టించారు.
అలాగే సంజన, సోనాక్షి, భావన కూడా విభిన్న రికార్డులు సృష్టించారు. రానున్న కాలంలో అంతర్జాతీయ క్రీడల్లో భారత ఖ్యాతి ఎంతగా పెరుగుతుందో ఈ ఆటగాళ్లు తమ కఠోర శ్రమతో నిరూపించారు. నేను ఈ క్రీడాకారులందరినీ అభినందిస్తున్నాను. భవిష్యత్తు బాగుండాలని వారికి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాను.
స్నేహితులారా!ఖేలో ఇండియా యువజన క్రీడల్లో మరో ప్రత్యేకత ఉంది.ఈసారి కూడా ఇలాంటి ప్రతిభావంతులు చాలా మంది బయటి ప్రపంచానికి తెలిశారు. వారు చాలా సాధారణ కుటుంబాల నుండి వచ్చారు. ఈ క్రీడాకారులు తమ జీవితంలో చాలా కష్టపడి విజయాల స్థాయికి చేరుకున్నారు. వారి విజయంలో వారి కుటుంబం, తల్లిదండ్రుల పాత్ర కూడా పెద్దది.
సైక్లింగ్70 కి.మీ విభాగంలో స్వర్ణం సాధించిన శ్రీనగర్‌కు చెందిన ఆదిల్ అల్తాఫ్ తండ్రి టైలరింగ్ పని చేస్తున్నారు. కానీ, తన కొడుకు కలలను నెరవేర్చడానికి ఆయన ఏ అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. ఇప్పుడు ఆదిల్ తన తండ్రితో పాటు సమస్త జమ్మూ-కాశ్మీర్ గర్వంతో తలెత్తుకునేలా చేశారు. వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణం పొందిన చెన్నై కి చెందిన ఎల్.ధనుష్ తండ్రి కూడా సాధారణ కార్పెంటర్. సాంగ్లీకి చెందిన అమ్మాయి కాజోల్ సర్గర్ తండ్రి టీ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు. కాజోల్ తన తండ్రి పనిలో సాయం చేయడంతో పాటు వెయిట్ లిఫ్టింగ్ లోనూ కృషి చేసింది. ఆమె, ఆమె కుటుంబం కృషి ఫలించింది. కాజోల్ వెయిట్ లిఫ్టింగ్‌లో చాలా ప్రశంసలు అందుకున్నారు. రోహ్తక్కి చెందిన తనూ కూడా ఇదే విధమైన కృషి చేసింది.తనూ తండ్రి రాజ్బీర్ సింగ్ రోహ్తక్లో స్కూల్ బస్ డ్రైవర్ గా పనిచేస్తున్నారు. తనూ రెజ్లింగ్‌లో బంగారు పతకం సాధించి, తన కలను, తన కుటుంబం కలను, తన తండ్రి కలను నిజం చేశారు.
మిత్రులారా!క్రీడా ప్రపంచంలో ఇప్పుడు భారతీయ క్రీడాకారుల ప్రాబల్యం పెరుగుతోంది. అదే సమయంలో భారతీయ క్రీడలకు కొత్త గుర్తింపు కూడా ఏర్పడుతోంది.ఈసారి ఖేలో ఇండియా యువజన క్రీడల్లో ఒలింపిక్స్ లో ఉండే క్రీడలతో పాటుదేశీయ క్రీడలను కూడా చేర్చారు.ఈ ఐదు క్రీడలు – గత్కా, థాంగ్ తా, యోగాసనాలు, కలరిపయట్టు, మల్లఖంబ్.
మిత్రులారా! అంతర్జాతీయ టోర్నమెంటు జరిగే ఆ భారతీయ క్రీడ శతాబ్దాల క్రితం మనదేశంలో పుట్టింది. ఇది జులై 28 నుంచి ప్రారంభమయ్యే చెస్ ఒలింపియాడ్ ఈవెంట్. ఈసారి 180కి పైగా దేశాలు చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొంటున్నాయి. మన నేటి క్రీడలు, ఫిట్‌నెస్‌ల చర్చ ఒక పేరు లేకుండా పూర్తి కాదు. ఆ పేరు – తెలంగాణకు చెందిన పర్వతారోహకురాలు పూర్ణ మాలావత్ గారిది. ఏడు శిఖరాగ్రాల ఛాలెంజ్‌ని పూర్తి చేయడం ద్వారా ఆమె మరో ఘనత సాధించారు. ఏడు శిఖరాగ్రాల సవాలు అంటే ప్రపంచంలో అత్యంత కఠినమైన, ఎత్తైన పర్వతాల ఆరోహణ సవాలు. పూర్ణఉన్నతమైన స్ఫూర్తితోఉత్తర అమెరికాలోని ఎత్తైన శిఖరం మౌంట్ దెనాలి శిఖరారోహణ పూర్తి చేయడం ద్వారా దేశం గర్వించేలా చేశారు.ఆమే -కేవలం 13 ఏళ్ల వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని జయించి అద్భుతమైన సాహసకృత్యం చేసిన భారతదేశ అమ్మాయి పూర్ణ.
స్నేహితులారా!క్రీడల విషయానికి వస్తే, ఈ రోజు నేను భారతదేశంలోని అత్యంత ప్రతిభావంతులైన క్రికెటర్లలో ఒకరైన మిథాలీ రాజ్ గురించి కూడా చర్చించాలనుకుంటున్నాను.ఈ నెలలో ఆమె క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించారు. ఇది చాలా మంది క్రీడాభిమానులను భావోద్వేగానికి గురి చేసింది.మిథాలీ అసాధారణ క్రీడాకారిణి మాత్రమే కాదు-చాలా మంది ఆటగాళ్లకు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. మిథాలీ భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటూ ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! మన్ కీ బాత్‌లో వ్యర్థాల నుండి సంపద సృష్టికి సంబంధించిన విజయవంతమైన ప్రయత్నాలను మనం చర్చిస్తున్నాం. అలాంటి ఒక ఉదాహరణ మిజోరాం రాజధాని ఐజ్వాల్ ది. ఐజ్వాల్‌లో 'చిటే లూయి' అనే అందమైన నది ఉంది. ఇది సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురి కావడం వల్ల మురికిగా, చెత్త కుప్పగా మారింది. ఈ నదిని కాపాడేందుకు గత కొన్నేళ్లుగా ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, స్థానిక ప్రజలు కలిసి సేవ్ చిటే లూయి కార్యాచరణ ప్రణాళికను కూడా అమలు చేస్తున్నారు. నదిని శుభ్రపరిచే ఈ ప్రచారం వ్యర్థాల నుండి సంపద సృష్టికి కూడా అవకాశం కల్పించింది.
వాస్తవానికిఈ నది, దాని ఒడ్డు ప్లాస్టిక్, పాలిథిన్ వ్యర్థాలతో నిండి ఉంది. నదిని కాపాడేందుకు కృషి చేస్తున్న సంస్థ ఈ పాలిథిన్‌తో రోడ్డు వేయాలని నిర్ణయించింది.అంటే నది నుంచి వెలువడే వ్యర్థాలతో మిజోరాంలోని ఓ గ్రామంలో రాష్ట్రంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ రోడ్డు నిర్మించింది. అంటే స్వచ్ఛతతో పాటు వికాసం కూడా.
మిత్రులారా!పుదుచ్చేరి యువకులు కూడా తమ స్వచ్ఛంద సంస్థల ద్వారా అలాంటి ప్రయత్నాన్ని ప్రారంభించారు. పుదుచ్చేరి సముద్రం ఒడ్డున ఉంది. అక్కడి బీచ్‌లు, సముద్ర అందాలను చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. కానీ, పుదుచ్చేరి సముద్ర తీరంలో కూడా ప్లాస్టిక్ వల్ల కాలుష్యం పెరుగుతోంది. అందుకే ఇక్కడి సముద్రాన్ని, బీచ్‌లను, జీవావరణాన్ని కాపాడేందుకు ఇక్కడి ప్రజలు 'రీసైక్లింగ్ ఫర్ లైఫ్' అనే ప్రచారాన్ని ప్రారంభించారు. పుదుచ్చేరిలోని కరైకల్‌లో ఇప్పుడు ప్రతిరోజూ వేల కిలోల చెత్తను సేకరించి వేరు చేస్తున్నారు. అందులోని సేంద్రియ వ్యర్థాలను ఎరువుగా చేసి, మిగిలిన వాటిని వేరు చేసి రీసైకిల్ చేస్తారు. ఇటువంటి ప్రయత్నాలు స్ఫూర్తిదాయకమే కాకుండాసింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా భారతదేశం చేస్తున్న ప్రచారానికి ఊపునిస్తాయి.
మిత్రులారా!నేను మీతో మాట్లాడుతున్న ఈ సమయంలోహిమాచల్ ప్రదేశ్‌లో ఒక ప్రత్యేకమైన సైక్లింగ్ ర్యాలీ కూడా జరుగుతోంది. దీని గురించి కూడా నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సిమ్లా నుండి మండి వరకు సైక్లిస్టుల బృందం పరిశుభ్రత సందేశాన్ని తీసుకువెళ్ళడం ప్రారంభించింది. పర్వత రహదారులపై దాదాపు 175 కిలోమీటర్ల దూరాన్నివారు సైక్లింగ్ ద్వారా మాత్రమే పూర్తి చేస్తారు. ఈ బృందంలో పిల్లలతో పాటు వృద్ధులు కూడా ఉన్నారు.మన పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే-మన పర్వతాలు, నదులు, మన సముద్రాలు శుభ్రంగా ఉంటే-మన ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అలాంటి ప్రయత్నాల గురించి మీరు నాకు రాస్తూ ఉండాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!మన దేశంలో రుతుపవనాలు నిరంతరం విస్తరిస్తున్నాయి. పలు రాష్ట్రాల్లో వర్షాలు పెరుగుతున్నాయి. 'నీరు','జల సంరక్షణ' దిశలో విశేష కృషి చేయాల్సిన సమయం కూడా ఇదే. మన దేశంలోశతాబ్దాలుగాఈ బాధ్యతను సమాజం తీసుకుంటోంది. మీకు గుర్తుండే ఉంటుంది- 'మన్ కీ బాత్'లో మనం ఒకసారి దిగుడు బావుల వారసత్వ సంపద గురించి చర్చించాం.మెట్ల బావులు లేదా దిగుడు బావుల్లో మెట్లు దిగడం ద్వారా నీటిని చేరుకుంటారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో వందల సంవత్సరాల నాటి ఇలాంటి బావి ఉంది. దాన్ని 'సుల్తాన్ మెట్ల బావి' అంటారు. దీన్ని రావు సుల్తాన్ సింగ్ నిర్మించారు. కానీ నిర్లక్ష్యం కారణంగాఈ ప్రదేశం క్రమంగా నిర్జనమై చెత్త కుప్పగా మారింది. ఒకరోజు అక్కడ తిరుగుతున్న కొందరు యువకులు ఈ మెట్లబావి వద్దకు వచ్చి దాని పరిస్థితిని చూసి చాలా బాధపడ్డారు.ఈ యువకులు సుల్తాన్ మెట్ల బావి రూపురేఖలను, అదృష్టాన్ని మార్చాలనిఆ క్షణంలోనే సంకల్పించారు. వారు తమ మిషన్‌కు 'సుల్తాన్ సే సుర్-తాన్' లేదా ‘సుల్తాన్ నుండి స్వర తాళాల వరకు’ అని పేరు పెట్టారు. ఈ సుర్-తాన్ లేదా స్వర తాళాలు ఏమిటి అని మీరు ఆలోచిస్తుండవచ్చు. వాస్తవానికిఈ యువకులు తమ ప్రయత్నాలతో మెట్ల బావిని పునరుద్ధరించడమే కాకుండాసంగీత స్వరతాళాలతో దీన్ని అనుసంధానించారు. సుల్తాన్ మెట్ల బావిని శుభ్రం చేసిన తరువాత, దానిని అలంకరించిన తరువాత, అక్కడ సంగీత కార్యక్రమం ఉంటుంది. ఈ మార్పు గురించి ఎంతగా చర్చలు జరుగుతున్నాయంటే దీన్ని చూడటానికి విదేశాల నుండి కూడా చాలా మంది రావడం ప్రారంభించారు.ఈ విజయవంతమైన ప్రయత్నంలో ముఖ్యమైన విషయం ఏమిటంటేప్రచారాన్ని ప్రారంభించిన యువత చార్టర్డ్ అకౌంటెంట్లు. యాదృచ్ఛికంగాకొన్ని రోజుల తర్వాత జూలై 1న చార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవం. దేశంలోని సీఏలందరినీ ఈ సందర్భంగా ముందుగా అభినందిస్తున్నాను. నీటి వనరులను సంగీతం, ఇతర సామాజిక కార్యక్రమాలతో అనుసంధానించడం ద్వారా మనం వాటి గురించి ఇలాంటి చైతన్యాన్ని కలిగించవచ్చు. నీటి సంరక్షణ నిజంగా జీవన సంరక్షణ. ఈ రోజుల్లో ఎన్ని 'నదీ మహోత్సవాలు' జరగడం ప్రారంభించాయో మీరు తప్పక చూసి ఉంటారు. మీ పట్టణాలలో అలాంటి నీటి వనరులు ఏవైనా ఉంటేమీరు తప్పనిసరిగా ఏదో ఒకకార్యక్రమం నిర్వహించాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!మన ఉపనిషత్తుల జీవన మంత్రం ఉంది - 'చరైవేతి-చరైవేతి-చరైవేతి'. మీరు కూడా ఈ మంత్రాన్ని విని ఉంటారు. దీని అర్థం - కొనసాగించు, కొనసాగించు. గతిశీలంగా ఉండడం మన స్వభావంలో భాగమే కాబట్టి ఈ మంత్రం మన దేశంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఒక దేశంగావేల సంవత్సరాల పాటు సాగిన అభివృద్ధి ప్రయాణం ద్వారా మనం ఇంత దూరం వచ్చాం.ఒక సమాజంగా మనం ఎప్పుడూ కొత్త ఆలోచనలు, కొత్త మార్పులను స్వీకరిస్తూ ముందుకు సాగుతాం. మన సాంస్కృతిక చలనశీలత,యాత్రలు దీనికి చాలా దోహదపడ్డాయి. అందుకే మన రుషులు, మునులు తీర్థయాత్ర వంటి ధార్మిక బాధ్యతలను మనకు అప్పగించారు. మనమందరం వేర్వేరు తీర్థయాత్రలకు వెళ్తాం. ఈసారి చార్ధామ్ యాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం మీరు చూశారు. మన దేశంలోఎప్పటికప్పుడువివిధ దైవిక యాత్రలు కూడా జరుగుతాయి. దైవిక యాత్రలు అంటే భక్తులే కాదు- మన దేవుళ్లు కూడా ప్రయాణం చేస్తారు.మరికొద్ది రోజుల్లో జూలై 1వ తేదీ నుంచి ప్రఖ్యాతిగాంచిన జగన్నాథ యాత్ర ప్రారంభం అవుతోంది. ఒరిస్సాలో జరిగే పూరీ యాత్ర ప్రతి దేశవాసికీ సుపరిచితం. ఈ సందర్భంగా పూరీకి వెళ్లే భాగ్యం కలగాలన్నది ప్రజల ఆకాంక్ష. ఇతర రాష్ట్రాల్లో కూడా జగన్నాథ యాత్రను ఘనంగా నిర్వహిస్తారు.జగన్నాథ యాత్ర ఆషాఢ మాసం రెండవ రోజు ప్రారంభమవుతుంది. మన గ్రంథాలలో 'ఆషాఢస్య ద్వితీయ దివసే... రథయాత్ర' అన్నారు. సంస్కృత శ్లోకాలలో ఈ వర్ణన కనిపిస్తుంది. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో కూడా ఆషాఢ ద్వితీయ నుంచి ప్రతి సంవత్సరం రథయాత్ర సాగుతుంది. నేను గుజరాత్లో ఉన్నానుకాబట్టి ప్రతి సంవత్సరం ఈ యాత్రలో సేవ చేసే అవకాశం కూడా నాకు లభించింది.ఆషాఢ ద్వితీయనుఆషాఢీ బిజ్ అని కూడా పిలుస్తారు. ఆ రోజు నుండి కచ్ కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. నా కచ్ సోదర సోదరీమణులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నాకు ఈ రోజు చాలా ప్రత్యేకమైంది. నాకు గుర్తుంది-ఆషాఢ ద్వితీయకు ఒక రోజు ముందు-అంటే ఆషాఢమాసం మొదటిరోజున గుజరాత్లో సంస్కృత భాషలో పాటలు, సంగీత,సాంస్కృతిక కార్యక్రమాలతో సంస్కృత పండుగను జరపడం ప్రారంభించాం.ఈ కార్యక్రమం పేరు - 'ఆషాఢస్య ప్రథమ దివసే'. ఈ పండుగకు ఈ ప్రత్యేక పేరు పెట్టడం వెనుక కూడా ఓ కారణం ఉంది. ఆషాఢ మాసం నుండి వర్ష ఆగమనంపై సుప్రసిద్ధ సంస్కృత కవి కాళిదాసు మేఘదూతం రచించాడు. మేఘదూతంలో ఒక శ్లోకం ఉంది – ఆషాఢస్య ప్రథమ దివసే మేఘమ్ ఆశ్లిష్ట సానుమ్- అంటే ఆషాఢ మాసంలో తొలిరోజు పర్వత శిఖరాలతో కప్పబడిన మేఘాలు. ఈ శ్లోకం ఈ కార్యక్రమానికి ఆధారమైంది.
మిత్రులారా!అహ్మదాబాద్ కావచ్చు. లేదా పూరీ కావచ్చు. జగన్నాథ భగవానుడు ఈ యాత్ర ద్వారా మనకు చాలా లోతైన మానవీయ సందేశాలను అందిస్తాడు. జగన్నాథుడు జగత్తుకు ప్రభువు. అయితే ఆయన యాత్రలో పేదలకు, అణగారిన వర్గాల వారికి ప్రత్యేక భాగస్వామ్యం ఉంటుంది. దేవుడు కూడా సమాజంలోని ప్రతి వర్గంతోనూ, ప్రతి వ్యక్తితోనూ కలిసి నడుస్తాడు. అలాగే మనదేశంలో జరిగే అన్ని యాత్రల్లోనూ పేద-ధనిక అనే భేదభావం ఉండదు.అన్ని వివక్షలకు అతీతంగా యాత్రే ప్రధానమైంది. మహారాష్ట్రలోని పండరిపూర్ యాత్ర గురించి మీరు తప్పక విని ఉంటారు. పండరిపూర్ యాత్రలో ఒకరు పెద్ద, మరొకరు చిన్న అన్న భేదం ఉండదు. అందరూ భగవాన్ విఠలుడి సేవకులు. నాలుగు రోజుల తర్వాత అమర్నాథ్ యాత్ర కూడా జూన్ 30వ తేదీన ప్రారంభం అవుతోంది. అమర్నాథ్ యాత్ర కోసం దేశం నలుమూలల నుంచి భక్తులు జమ్మూ కాశ్మీర్‌కు చేరుకుంటారు. జమ్మూ కాశ్మీర్‌లోని స్థానిక ప్రజలు ఈ యాత్ర బాధ్యతను తీసుకోవడంతో పాటు యాత్రికులకు సహకరిస్తారు.
మిత్రులారా!దక్షిణాదిలోశబరిమల యాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. ఈ మార్గం పూర్తిగా అడవులతో ఉన్న కాలం నుండి శబరిమల కొండలపై ఉన్న అయ్యప్ప దర్శనం కోసం ఈ యాత్ర కొనసాగుతోంది. నేటికీప్రజలు ఈ యాత్రలకు వెళ్లినప్పుడుధార్మిక ఆచారాల నిర్వహణ నుండి, బస ఏర్పాట్ల వరకు పేదలకుఎన్నో అవకాశాలు లభిస్తున్నాయి. అంటేఈ యాత్రలు మనకు నేరుగా పేదలకు సేవ చేసే అవకాశాన్ని కల్పిస్తాయి.అందుకే ఇప్పుడు భక్తులకు ఆధ్యాత్మిక యాత్రలో సౌకర్యాలు పెంచేందుకు దేశం కూడా ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. మీరు కూడా అలాంటి యాత్రలో వెళితే, ఆధ్యాత్మికతతో పాటు ఏక్ భారత్-శ్రేష్ట భారత్ దర్శనం కూడా కలుగుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!ఎప్పటిలాగే ఈసారి కూడా 'మన్ కీ బాత్' ద్వారా మీ అందరితో అనుసంధానం కావడం చాలా ఆహ్లాదకరమైన అనుభవం. మనం దేశప్రజల సాఫల్యాలు, విజయాల గురించి చర్చించాం. వీటన్నింటి మధ్యమనం కరోనా విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి.అయితేనేడు దేశంలో వ్యాక్సిన్‌కు సంబంధించిన సమగ్ర రక్షణ కవచం ఉండటం సంతృప్తిని కలిగించే విషయం. మనం దాదాపు 200 కోట్ల వ్యాక్సిన్ డోసుల స్థాయికి చేరుకున్నాం. దేశంలో ప్రి కాషన్ డోసులను ఇవ్వడం కూడా వేగవంతం చేస్తున్నారు. మీ రెండవ డోసు తర్వాత ప్రి కాషన్ డోసు తీసుకునే సమయం వస్తే మీరు ఈ మూడవ డోసుతప్పక తీసుకోవాలి. మీ కుటుంబ సభ్యులకు-ముఖ్యంగా వృద్ధులకు- ప్రి కాషన్ డోసు వేయించండి. చేతుల పరిశుభ్రత, మాస్కుల వంటి అవసరమైన జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. వర్షాకాలంలో మన చుట్టూ ఉండే మురికి వల్ల వచ్చే వ్యాధుల విషయంలో కూడా జాగ్రత్త గా ఉండాలి. మీరందరూ అప్రమత్తంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. అలాంటి శక్తితో ముందుకు సాగండి. వచ్చే నెలలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు.. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈరోజు మరోసారి 'మన్ కీ బాత్' ద్వారా నా కుటుంబ సభ్యులందరినీ కలిసే అవకాశం వచ్చింది. 'మన్ కీ బాత్' కార్యక్రమానికి స్వాగతం. కొన్ని రోజుల క్రితం మనందరికీ స్ఫూర్తినిచ్చే విజయాన్ని దేశం సాధించింది. ఈ విజయం భారతదేశ సామర్థ్యంపై కొత్త విశ్వాసాన్ని నింపుతుంది. క్రికెట్ మైదానంలో టీమ్ ఇండియా బ్యాట్స్‌మెన్ ఎవరైనా సెంచరీ చేశారని వింటే మీరు సంతోషిస్తుండవచ్చు. కానీ, భారత్ మరో రంగంలో సెంచరీ చేసింది. అది చాలా విశేషమైంది. ఈ నెల 5వ తేదీకి దేశంలో యూనికార్న్ స్టార్టప్ ల సంఖ్య 100కి చేరుకుంది. యూనికార్న్ స్టార్టప్ అంటే కనీసం ఏడున్నర వేల కోట్ల రూపాయల స్టార్టప్ అని మీకు తెలుసు. ఈ యూనికార్న్‌ల మొత్తం విలువ 330 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ. అంటే 25 లక్షల కోట్ల రూపాయల కంటే ఎక్కువ. ఖచ్చితంగా ఇది ప్రతి భారతీయుడికి గర్వకారణం. మన మొత్తం యూనికార్న్‌లలో 44 స్టార్టప్ లు గత ఏడాదే మొదలయ్యాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది మాత్రమే కాదు- ఈ సంవత్సరం 3-4 నెలల్లో 14 కొత్త యూనికార్న్‌లు ఏర్పడ్డాయి. అంటే ఈ ప్రపంచ మహమ్మారి యుగంలో కూడా మన స్టార్టప్‌లు సంపదను, విలువను సృష్టిస్తున్నాయి. భారతీయ యూనికార్న్‌ల సగటు వార్షిక వృద్ధి రేటు USA, UKలతో సహా అనేక ఇతర దేశాల కంటే ఎక్కువ. రాబోయే సంవత్సరాల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. శుభవార్త ఏమిటంటే మన యూనికార్న్ స్టార్టప్ లు వైవిధ్యభరితంగా ఉంటాయి. ఈ-కామర్స్, ఫిన్-టెక్, ఎడ్-టెక్, బయోటెక్ వంటి అనేక రంగాల్లో అవి పనిచేస్తున్నాయి. నేను మరింత ముఖ్యమైందిగా భావించే మరో విషయం ఏమిటంటే స్టార్టప్‌ల ప్రపంచం నవీన భారతదేశ స్ఫూర్తిని ప్రతిబింబిస్తోంది. భారతదేశ స్టార్ట్-అప్ పర్యావరణ వ్యవస్థ కేవలం పెద్ద నగరాలకే పరిమితం కాదు- చిన్న పట్టణాలు , నగరాల నుండి కూడా వ్యవస్థాపకులు ముందుకు వస్తున్నారు. భారతదేశంలో వినూత్న ఆలోచన ఉన్న వ్యక్తి సంపదను సృష్టించగలడని ఇది నిరూపిస్తుంది.
మిత్రులారా! దేశం సాధించిన ఈ విజయం వెనుక దేశంలోని యువశక్తి, ప్రతిభ, ప్రభుత్వం ఉన్నాయి. అందరూ కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. అందరి సహకారం ఉంది. కానీ ఇందులో ఇంకో విషయం ఉత్తమ మార్గదర్శి స్టార్టప్‌ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లగలడు. సరైన నిర్ణయం విషయంలో వ్యవస్థాపకులకు అన్ని విధాలుగా మార్గనిర్దేశం చేయగలడు. వృద్ధి చెందుతున్న స్టార్టప్‌లకు తమను తాము అంకితం చేసుకున్న అనేక మంది మార్గదర్శకులు భారతదేశంలో ఉన్నందుకు నేను గర్విస్తున్నాను.
శ్రీధర్ వెంబు గారు ఇటీవలే పద్మ అవార్డును పారిశ్రామికవేత్త. ఆయన ఇప్పుడు మరో పారిశ్రామికవేత్తని తీర్చిదిద్దే పనిలో పడ్డారు. శ్రీధర్ గారు గ్రామీణ ప్రాంతం నుండి తన పనిని ప్రారంభించారు. గ్రామంలోనే ఉంటూ గ్రామీణ యువతను ఈ ప్రాంతంలో ఏదో ఒక మంచి పని చేయాలని ప్రోత్సహిస్తున్నారు. గ్రామీణ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి 2014లో వన్-బ్రిడ్జ్ అనే ప్లాట్‌ఫారమ్‌ను రూపొందించిన మదన్ పడకి వంటి వ్యక్తులు కూడా మనకు ఉన్నారు. దక్షిణ, తూర్పు భారతదేశంలోని 75 కంటే ఎక్కువ జిల్లాల్లో వన్-బ్రిడ్జ్ అందుబాటులో ఉంది. దీనితో అనుబంధించబడిన 9000 మందికి పైగా గ్రామీణ పారిశ్రామికవేత్తలు గ్రామీణ వినియోగదారులకు తమ సేవలను అందిస్తున్నారు. మీరా షెనాయ్ గారు కూడా అలాంటి ఒక ఉదాహరణ. మార్కెట్ తో అనుసంధానమైన నైపుణ్యాల శిక్షణను గ్రామీణ, గిరిజన, వికలాంగ యువతకు అందించేందుకు ఆమె విశేషమైన కృషి చేస్తున్నారు. నేను ఇక్కడ కొన్ని పేర్లను మాత్రమే తీసుకున్నాను. కానీ ఈ రోజు మన మధ్య మార్గదర్శకుల కొరత లేదు. ఈ రోజు దేశంలో స్టార్టప్‌ల కోసం పూర్తి మద్దతు వ్యవస్థను సిద్ధం చేయడం మనకు చాలా సంతోషకరమైన విషయం. రాబోయే కాలంలో భారతదేశంలోని స్టార్టప్ ప్రపంచంలో మనం కొత్త పురోగతిని చూడగలమన్న నమ్మకం నాకు ఉంది.
మిత్రులారా! దేశ ప్రజల సృజన, కళాత్మక ప్రతిభ మిళితమై ఉన్న ఒక ఆసక్తికరమైన, ఆకర్షణీయమైన అంశాన్ని కొన్ని రోజుల క్రితం చూశాను. ఇది తమిళనాడులోని తంజావూరు నుండి స్వయం సహాయక బృందం నాకు పంపిన బహుమతి. ఈ బహుమతిలో భారతీయత పరిమళం, మాతృ శక్తి ఆశీర్వాదాలు ఉన్నాయి. నా పట్ల వారికి ఉన్న స్నేహభావనకు ఇది నిదర్శనం. ఇది ప్రత్యేకమైన తంజావూరు బొమ్మ. దీనికి GI ట్యాగ్ కూడా ఉంది. స్థానిక సంస్కృతిలో భాగంగా రూపొందించిన ఈ బహుమతిని నాకు పంపినందుకు తంజావూరు స్వయం సహాయక బృందానికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా! ఈ తంజావూరు బొమ్మ ఎంత అందంగా ఉందో అంతే అందంగా మహిళా సాధికారతకు సంబంధించిన కొత్త గాథలను కూడా లిఖిస్తోంది. తంజావూరులో మహిళా స్వయం సహాయక సంఘాల దుకాణాలు, కియోస్క్‌లు కూడా ప్రారంభమవుతున్నాయి. దీంతో ఎన్నో పేద కుటుంబాల జీవితాలు మారిపోయాయి. అటువంటి కియోస్క్‌లు, దుకాణాల సహాయంతో మహిళలు ఇప్పుడు తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు విక్రయించగలుగుతున్నారు. ఈ కార్యక్రమానికి 'థారగైగల్ కైవినై పోరుత్తకల్ వీరప్పనై అంగడి' అని పేరు పెట్టారు. విశేషమేమిటంటే 22 స్వయం సహాయక బృందాలు ఈ చొరవతో అనుసంధానమయ్యాయి. ఈ మహిళా స్వయం సహాయక సంఘాల దుకాణాలు తంజావూరులో చాలా ప్రధానమైన ప్రదేశంలో ఉన్నాయి. వాటి బాధ్యతను కూడా మహిళలు పూర్తిగా తీసుకుంటున్నారు.
ఈ మహిళా స్వయం సహాయక బృందం తంజావూరు బొమ్మలు, కాంస్య దీపాలు మొదలైన జిఐ ఉత్పత్తులే కాకుండా అల్లికలు, కృత్రిమ ఆభరణాలు కూడా తయారు చేస్తారు. ఇటువంటి దుకాణాల కారణంగా GI ఉత్పత్తులతో పాటు హస్తకళా ఉత్పత్తుల అమ్మకాలు బాగా పెరిగాయి. ఈ ప్రచారం వల్ల చేతివృత్తిదారులకు ప్రోత్సాహం లభించడమే కాకుండా మహిళలు కూడా తమ ఆదాయాన్ని పెంచుకుంటూ సాధికారత సాధిస్తున్నారు. 'మన్ కీ బాత్' శ్రోతలకు కూడా నాకో విన్నపం. మీ ప్రాంతంలో ఏ మహిళా స్వయం సహాయక బృందాలు పనిచేస్తున్నాయో తెలుసుకోండి. మీరు వారి ఉత్పత్తుల గురించి సమాచారాన్ని కూడా సేకరించాలి. వీలైనంత ఎక్కువగా ఈ ఉత్పత్తులను ఉపయోగించాలి. ఇలా చేయడం ద్వారా మీరు స్వయం సహాయక బృందానికి ఆదాయాన్ని పెంచడంలో సహాయపడటమే కాకుండా ‘ఆత్మ నిర్భర్ భారత్’ ప్రచారానికి ఊపునిస్తారు.
మిత్రులారా! మన దేశంలో అనేక భాషలు, లిపులు, మాండలికాల గొప్ప సంపద ఉంది. వివిధ ప్రాంతాలలో భిన్నమైన దుస్తులు, ఆహారం, సంస్కృతి మన గుర్తింపు. ఈ వైవిధ్యం ఒక దేశంగా మనల్ని శక్తివంతం చేస్తుంది. మనల్ని ఐక్యంగా ఉంచుతుంది. దీనికి సంబంధించిన చాలా స్పూర్తిదాయకమైన ఉదాహరణ కల్పన గారు. ఈ విషయాన్ని నేను మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఆమె పేరు కల్పన. కానీ ఆమె ప్రయత్నం 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' నిజమైన స్ఫూర్తితో నిండి ఉంది. వాస్తవానికి కల్పన గారు ఇటీవలే కర్ణాటకలో 10వ తరగతి పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. అయితే ఆమె విజయంలో ప్రత్యేకత ఏమిటంటే కల్పనకు కొంతకాలం క్రితం వరకు కన్నడ భాష తెలియదు. మూడు నెలల్లో కన్నడ భాష నేర్చుకోవడమే కాకుండా 92 మార్కులు తెచ్చుకుని చూపించారు. ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. ఆమె గురించి మీకు ఆశ్చర్యం కలిగించే, మీకు స్ఫూర్తినిచ్చే అనేక ఇతర విషయాలు ఉన్నాయి. కల్పన స్వస్థలం ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్. ఆమె ఇంతకుముందు టిబితో బాధపడ్డారు. ఆమె మూడవ తరగతిలో ఉన్నప్పుడు కంటి చూపును కూడా కోల్పోయారు. కానీ, 'సంకల్పం ఉన్నచోట, ఒక మార్గం ఉంటుంది'అన్న సూక్తి ఉంది కదా. కల్పనకు తరువాత మైసూరు నివాసి ప్రొఫెసర్ తారామూర్తి గారితో పరిచయం ఏర్పడింది. ఆమె కల్పనను ప్రోత్సహించడమే కాకుండా అన్ని విధాలుగా సహాయం చేశారు. ఈరోజు ఆమె తన కృషితో మనందరికీ ఆదర్శంగా నిలిచింది. కల్పన ధైర్యానికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇదేవిధంగా దేశంలోని భాషా వైవిధ్యాన్ని పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నవారు మన దేశంలో చాలా మంది ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు పశ్చిమ బెంగాల్‌లోని పురూలియాకు చెందిన శ్రీపతి టూడూ గారు. ఆయన పురూలియాలోని సిద్ధో-కానో-బిర్సా విశ్వవిద్యాలయంలో సంతాలీ భాష ప్రొఫెసర్. ఆయన సంతాలీ సమాజం కోసం వారి 'ఓల్ చికి' లిపిలో భారతదేశ రాజ్యాంగాన్ని సిద్ధం చేశారు. మన రాజ్యాంగం మన దేశంలోని ప్రతి పౌరుడికి వారి హక్కులు, కర్తవ్యాలపై అవగాహన కల్పిస్తుందని శ్రీపతి టూడూ గారు అంటారు. అందువల్ల ప్రతి పౌరుడు దాని గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం సంతాలీ సమాజానికి వారి సొంత లిపిలో రాజ్యాంగ ప్రతిని సిద్ధం చేసి బహుమతిగా ఇచ్చాడు. శ్రీపతి గారి ఈ ఆలోచనను, ఆయన ప్రయత్నాలను నేను అభినందిస్తున్నాను. 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తికి ఇది సజీవ ఉదాహరణ. ఈ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లే ఇలాంటి అనేక ప్రయత్నాల గురించి మీరు 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' వెబ్సైట్లో కూడా చూడవచ్చు. అక్కడ మీరు ఆహారం, కళ, సంస్కృతి, పర్యాటకం వంటి అనేక అంశాలకు సంబంధించిన కార్యకలాపాల గురించి తెలుసుకుంటారు. మీరు ఈ కార్యకలాపాలలో కూడా పాల్గొనవచ్చు. ఇది మీకు మన దేశం గురించి సమాచారాన్ని అందిస్తుంది. మీరు దేశం వైవిధ్యాన్ని కూడా అనుభూతి చెందుతారు.
నా ప్రియమైన దేశప్రజలారా! ప్రస్తుతం మన దేశంలో ఉత్తరాఖండ్‌లోని 'చార్-ధామ్' పవిత్ర యాత్ర కొనసాగుతోంది. 'చార్-ధామ్'కు, ముఖ్యంగా కేదార్నాథ్ కు ప్రతిరోజూ వేలాది మంది భక్తులు చేరుకుంటున్నారు. ప్రజలు తమ 'చార్-ధామ్ యాత్ర' సంతోషకరమైన అనుభవాలను పంచుకుంటున్నారు. కానీ కేదార్‌నాథ్‌లో కొంతమంది యాత్రికులు అపరిశుభ్రంగా వ్యాపింపజేయడం వల్ల భక్తులు చాలా బాధపడటం నేను చూశాను. సోషల్ మీడియాలో కూడా చాలా మంది తమ అభిప్రాయాలను వెల్లడించారు. పవిత్ర తీర్థయాత్రకు వెళ్ళి, అక్కడ అపరిశుభ్రతను వ్యాపించేలా చేయడం సరైంది కాదు. కానీ మిత్రులారా! ఈ ఫిర్యాదుల మధ్య చాలా మంచి దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. విశ్వాసం ఉన్నచోట సృజన, సకారాత్మకత కూడా ఉన్నాయి. బాబా కేదార్ ధామ్‌లో పూజలు చేయడంతో పాటు స్వచ్చతా సాధన కూడా చేసే భక్తులు చాలా మంది ఉన్నారు. ఒకరు తాము బస చేసిన ప్రదేశానికి సమీపంలో శుభ్రం చేస్తున్నారు. మరొకరు ప్రయాణ మార్గం నుండి చెత్తను శుభ్రం చేస్తున్నారు. స్వచ్ఛ భారత్ ప్రచార బృందంతో పాటు పలు సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు కూడా అక్కడ పనిచేస్తున్నాయి. మిత్రులారా! తీర్థయాత్రకు ప్రాముఖ్యత ఉన్నట్టే తీర్థ సేవ ప్రాముఖ్యత కూడా ఇక్కడ కనబడుతోంది. తీర్థ సేవ లేకుండా తీర్థయాత్ర కూడా అసంపూర్ణమే అని నేను చెప్తాను. దేవభూమి ఉత్తరాఖండ్‌లో పరిశుభ్రతా కార్యక్రమాల్లో, సేవలో నిమగ్నమై ఉన్నవారు చాలా మంది ఉన్నారు. రుద్ర ప్రయాగకు చెందిన మనోజ్ బైంజ్ వాల్ గారి నుండి కూడా మీకు చాలా ప్రేరణ లభిస్తుంది. గత పాతికేళ్లుగా పర్యావరణ సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. పరిశుభ్రత ప్రచారాన్ని నిర్వహించడమే కాకుండా పవిత్ర స్థలాలను ప్లాస్టిక్ రహితంగా మార్చడంలో నిమగ్నమై ఉన్నారు. గుప్తకాశీలో నివసించే సురేంద్ర బగ్వాడీ గారు స్వచ్చతను తన జీవిత మంత్రంగా మార్చుకున్నారు. ఆయన గుప్తకాశీలో క్రమం తప్పకుండా పరిశుభ్రత కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన ఈ ప్రచారానికి 'మన్ కీ బాత్' అని పేరు పెట్టారని నాకు తెలిసింది. ఇదే విధంగా దేవర్ గావ్ కు చెందిన చంపాదేవి గత మూడేళ్లుగా గ్రామంలోని మహిళలకు వ్యర్థ పదార్థాల నిర్వహణను నేర్పిస్తున్నారు. చంపా గారు వందలాది చెట్లను నాటారు. తన శ్రమతో పచ్చని వనాన్ని రూపొందించారు. మిత్రులారా! అలాంటి వారి కృషి వల్ల ఆ దేవ భూమి, తీర్థయాత్రల దివ్యమైన అనుభూతి అక్కడ కలుగుతోంది. మనం అక్కడ అనుభవించే ఈ దైవత్వాన్ని, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కాపాడుకోవడం మన బాధ్యత. ప్రస్తుతం మన దేశంలో 'చార్ ధామ్ యాత్ర'తో పాటు రాబోయే కాలంలో 'అమర్నాథ్ యాత్ర', 'పండర్పూర్ యాత్ర', 'జగన్నాథ యాత్ర' వంటి అనేక యాత్రలు ఉంటాయి. శ్రావణ మాసంలో బహుశా ప్రతి గ్రామంలో ఏదో ఒక జాతర జరుగుతుంది. మిత్రులారా! మనం ఎక్కడికి వెళ్లినా ఈ యాత్రా స్థలాల గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. పరిశుభ్రత, పవిత్ర వాతావరణం మనం ఎప్పటికీ మరచిపోకూడదు. వాటిని మనం కాపాడుకోవాలి. అందుకే పరిశుభ్రతా తీర్మానాన్ని గుర్తుంచుకోవడం ముఖ్యం. కొన్ని రోజుల తర్వాత జూన్ 5వ తేదీన 'ప్రపంచ పర్యావరణ దినోత్సవం' జరుపుకుంటున్నాం. పర్యావరణానికి సంబంధించి మన చుట్టూ సానుకూల ప్రచారాలను నిర్వహించాలి. ఇది నిరంతరం జరగవలసిన పని. మీరు ఈసారి అందరూ కలిసి పరిశుభ్రత కోసం, చెట్ల పెంపకం కోసం కొంత ప్రయత్నం చేయండి. మీరే ఒక చెట్టును నాటండి. ఇతరులకు కూడా స్ఫూర్తినివ్వండి.
నా ప్రియమైన దేశప్రజలారా! వచ్చే నెల జూన్ 21వ తేదీన మనం 8వ 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' జరుపుకోబోతున్నాం. ఈసారి యోగా దినోత్సవ అంశం మానవత్వం కోసం యోగా. 'యోగా డే'ని ఎంతో ఉత్సాహంగా జరుపుకోవాలని నేను మీ అందరినీ కోరుతున్నాను. అవును! అలాగే కరోనాకు సంబంధించిన జాగ్రత్తలు తీసుకోండి. ఇప్పుడు యావత్ ప్రపంచంలో మునుపటి కంటే మెరుగైన పరిస్థితి ఉంది. ఎక్కువ టీకా కవరేజ్ కారణంగా ఇప్పుడు ప్రజలు గతంలో కంటే ఎక్కువగా బయటకు వెళ్తున్నారు. అందువల్ల యోగా దినోత్సవం తో సహా అనేక విషయాల్లో చాలా సన్నాహాలు కూడా జరుగుతున్నాయి. మన జీవితంలో ఆరోగ్యానికి ఉండే ప్రాధాన్యతను కరోనా తెలియజేసింది. ఆరోగ్య పరిరక్షణలో యోగా ప్రాధాన్యత చాలా ఉంది. అవును. యోగా ద్వారా శారీరక, ఆధ్యాత్మిక, మేధో శ్రేయస్సు ఎంతగా వృద్ధి చెందుతుందో ప్రజలు గ్రహిస్తున్నారు. ప్రపంచంలోని అగ్రశ్రేణి వ్యాపారవేత్త నుండి సినీ, క్రీడా ప్రముఖుల వరకు, విద్యార్థుల నుండి సామాన్య మానవుల వరకు, ప్రతి ఒక్కరూ యోగాను తమ జీవితంలో అంతర్భాగంగా చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగాకు పెరుగుతున్న ప్రజాదరణను చూడడానికి మీరందరూ ఇష్టపడతారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మిత్రులారా! ఈ సారి దేశ విదేశాల్లో యోగా దినోత్సవం సందర్భంగా చాలా వినూత్నమైన కార్యక్రమాల నిర్వహణ గురించి తెలిసింది. వీటిలో ఒకటి గార్డియన్ రింగ్. ఇది చాలా ప్రత్యేకమైన కార్యక్రమం. ఇందులో సూర్యుని కదలికను ఉత్సవంగా జరుపుకుంటారు. అంటే సూర్యుడు ప్రయాణించేటప్పుడు భూమిపై ఉన్న వివిధ ప్రాంతాల నుండి మనం యోగా ద్వారా దాన్ని స్వాగతిస్తాం. వివిధ దేశాల్లోని భారతీయ దౌత్య కార్యాలయాలు అక్కడి స్థానిక కాలమానం ప్రకారం సూర్యోదయం సమయంలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తాయి. ఈ కార్యక్రమం ఒక దేశం తర్వాత మరొక దేశం నుండి ప్రారంభమవుతుంది. తూర్పు నుండి పడమరకు ప్రయాణం నిరంతరం జరుగుతుంది. అలాగే ముందుకు సాగుతుంది. ఈ కార్యక్రమాల ధార ఒకదాని తర్వాత ఒకటిగా అనుసంధానమవుతుంది. అంటే ఇది ఒక రకమైన రిలే యోగా స్ట్రీమింగ్ ఈవెంట్. మీరు కూడా తప్పకుండా చూడండి.
మిత్రులారా! ఈసారి మన దేశంలో 'అమృత్ మహోత్సవ్'ను దృష్టిలో ఉంచుకుని 'అంతర్జాతీయ యోగా దినోత్సవం' దేశంలోని 75 ప్రధాన ప్రదేశాలలో జరుగుతుంది. ఈ సందర్భంగా పలు సంస్థలు, దేశప్రజలు తమ తమ ప్రాంతాల్లో తమ స్థాయిలో వినూత్నంగా ఏదైనా చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈసారి యోగా దినోత్సవాన్ని జరుపుకోవాలని, మీ నగరం, పట్టణం లేదా గ్రామంలో అత్యంత ప్రత్యేకమైన ప్రదేశాన్ని ఎంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ప్రదేశం పురాతన దేవాలయం, పర్యాటక కేంద్రం కావచ్చు. లేదా ప్రసిద్ధ నది, సరస్సు లేదా చెరువు ఒడ్డు కూడా కావచ్చు. దీంతో యోగాతో పాటు మీ ప్రాంతానికి గుర్తింపు పెరగడంతో పాటు టూరిజం కూడా పుంజుకుంటుంది. ప్రస్తుతం 'యోగా డే'కి సంబంధించి వంద రోజుల కౌంట్‌డౌన్ కూడా జరుగుతోంది. వ్యక్తిగత, సామాజిక ప్రయత్నాలకు సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే మూడు నెలల క్రితం ప్రారంభమయ్యాయి. ఢిల్లీలో 100వ రోజు, 75వ రోజు కౌంట్ డౌన్ కార్యక్రమాలు జరిగాయి. అదే సమయంలో అస్సాంలోని శివసాగర్‌లో 50వ కౌంట్‌డౌన్ ఈవెంట్లు, హైదరాబాద్‌లో 25వ కౌంట్‌డౌన్ ఈవెంట్లు నిర్వహించారు. 'యోగా డే' కోసం మీరు ఇప్పుడే సన్నాహాలు ప్రారంభించాలని నేను కోరుకుంటున్నాను. మరింత మంది వ్యక్తులను కలవండి. ప్రతి ఒక్కరూ 'యోగా డే' కార్యక్రమంలో చేరేవిధంగా స్ఫూర్తినివ్వండి. మీరందరూ 'యోగా డే'లో ఉత్సాహంగా పాల్గొంటారని, మీ రోజువారీ జీవితంలో యోగాను అలవర్చుకుంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
మిత్రులారా! కొన్ని రోజుల క్రితం నేను జపాన్ వెళ్ళాను. అనేక కార్యక్రమాల మధ్య కొందరు అద్భుతమైన వ్యక్తులను కలిసే అవకాశం నాకు లభించింది. నేను వారి గురించి 'మన్ కీ బాత్'లో మీతో చర్చించాలనుకుంటున్నాను. వారు జపాన్ ప్రజలు. కానీ వారికి భారతదేశంతో అద్భుతమైన అనుబంధం, ప్రేమ ఉన్నాయి. వీరిలో ఒకరు ప్రముఖ కళా దర్శకులు హిరోషి కోయికే గారు. ఆయన మహాభారత్ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం వహించారని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఈ ప్రాజెక్ట్ కంబోడియాలో ప్రారంభమైంది. గత 9 సంవత్సరాలుగా కొనసాగుతోంది. హిరోషి కోయికే గారు ప్రతిదీ చాలా భిన్నమైన రీతిలో నిర్వహిస్తారు. ఆయన ప్రతి సంవత్సరం, ఆసియాలోని ఒక దేశానికి వెళ్తారు. అక్కడ స్థానిక కళాకారులు, సంగీతకారులతో మహాభారతంలోని భాగాలను రూపొందిస్తారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఆయన భారతదేశంతో పాటు కంబోడియా, ఇండోనేషియాతో సహా తొమ్మిది దేశాలలో రంగస్థల ప్రదర్శనను అందించారు. శాస్త్రీయ, సాంప్రదాయిక ఆసియా ప్రదర్శన కళల నేపథ్యం ఉన్న కళాకారులను హిరోషి కోయికేగారు ఒకచోట చేరుస్తారు. దీని కారణంగా, ఆయన పనిలో వైవిధ్యం కనిపిస్తుంది. ఇండోనేషియా, థాయిలాండ్, మలేషియా, జపాన్ దేశాల ప్రదర్శనకారులు జావా నృత్యం, బాలినీస్ నృత్యం, థాయ్ నృత్యం ద్వారా మరింత ఆకర్షణీయంగా చేస్తారు. విశేషమేమిటంటే, ఇందులో ప్రతి ప్రదర్శకుడు తన స్వంత మాతృభాషలో మాట్లాడతారు. కొరియోగ్రఫీ ఈ వైవిధ్యాన్ని చాలా అందంగా ప్రదర్శిస్తుంది. సంగీత వైవిధ్యం దీన్ని మరింత సజీవంగా చేస్తుంది. మన సమాజంలోని వైవిధ్యాన్ని, సహజీవనం ప్రాముఖ్యతను తెలియజేయడంతో పాటు నిజమైన శాంతి ఎలా ఉండాలో చెప్పడం వారి లక్ష్యం. వీరితో పాటు నేను జపాన్‌లో కలిసిన మరో ఇద్దరు వ్యక్తులు అత్సుషి మాత్సువో గారు, కెంజీ యోషీ గారు. వారిద్దరూ TEM ప్రొడక్షన్ కంపెనీకి అనుసంధానమై ఉన్నారు. ఈ సంస్థ 1993లో విడుదలైన జపనీస్ యానిమేషన్ చిత్రం రామాయణానికి సంబంధించినది. ఈ ప్రాజెక్ట్ జపాన్ కు చెందిన సుప్రసిద్ధ చిత్ర దర్శకుడు యుగో సాకో గారితో అనుబంధం కలిగి ఉంది. దాదాపు 40 ఏళ్ల క్రితం 1983లో ఆయనకు రామాయణం గురించి తొలిసారిగా తెలిసింది. 'రామాయణం' ఆయన హృదయాన్ని తాకింది. ఆ తర్వాత దానిపై లోతుగా పరిశోధన చేయడం ప్రారంభించారు. అంతే కాదు- జపనీస్ భాషలో రామాయణానికి సంబంధించిన 10 వెర్షన్లు చదివారు. ఇంతటితో ఆగకుండా యానిమేషన్లో కూడా రూపొందించాలనుకున్నారు. ఇందులో భారతీయ యానిమేటర్లు కూడా ఆయనకు చాలా సహాయపడ్డారు. చిత్రంలో చూపిన భారతీయ ఆచారాలు, సంప్రదాయాల గురించి ఆయనకు మార్గనిర్దేశం చేశారు. భారతదేశంలోని ప్రజలు ధోతీని ఎలా ధరిస్తారు, చీర ఎలా ధరించాలి, జుట్టును ఎలా దువ్వుకుంటారో వారికి వివరించారు. కుటుంబం లోపల పిల్లలు ఒకరినొకరు ఎలా గౌరవిస్తారు, ఆశీర్వాదాల సంప్రదాయం ఏమిటి, ఉదయాన్నే లేవడం, ఇంట్లోని పెద్దలకు పాదాభివందనం చేయడం, వారి ఆశీస్సులు తీసుకోవడం- ఇలా అన్నీ- 30 ఏళ్ల తర్వాత ఈ యానిమేషన్ చిత్రం నాలుగింతల రెజల్యూషన్ ఉండే చిత్రంగా మళ్ళీ రూపొందుతోంది. ఈ ప్రాజెక్ట్ త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. మన భాష తెలియని, మన సంప్రదాయాల గురించి తెలియని మనకు వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న జపాన్ వాసులైన వారికి మన సంస్కృతి పట్ల ఉన్న అంకితభావం, గౌరవం ప్రశంసనీయమైనవి. ఏ భారతీయుడికి ఇది గర్వంగా అనిపించదు?
నా ప్రియమైన దేశవాసులారా! వ్యక్తిగత ప్రయోజనాలకు పై స్థాయిలో సమాజానికి సేవ చేయాలనే మంత్రం, సమాజం కోసం నేను అనే మంత్రం మన విలువలలో ఒక భాగం. మన దేశంలో లెక్కలేనంతమంది ఈ మంత్రాన్ని తమ జీవిత లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని మార్కాపురంలో నివాసముంటున్న రామ్‌భూపాల్‌రెడ్డి గారి గురించి నాకు తెలిసింది. రాంభూపాల్ రెడ్డి గారు ఉద్యోగ విరమణ తర్వాత తన సంపాదనంతా ఆడపిల్లల చదువుల కోసం విరాళంగా ఇచ్చారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆయన 'సుకన్య సమృద్ధి యోజన' కింద దాదాపు 100 మంది ఆడపిల్లల కోసం ఖాతాలు తెరిచి అందులో 25 లక్షల రూపాయలకు పైగా డబ్బును డిపాజిట్ చేశారు. అటువంటి సేవకు మరొక ఉదాహరణ ఉత్తరప్రదేశ్ ఆగ్రాలోని కచౌరా గ్రామంలో ఉంది. చాలా ఏళ్లుగా ఈ గ్రామంలో మంచినీటి కొరత ఉండేది. ఇంతలో గ్రామానికి 6-7 కిలోమీటర్ల దూరంలో ఉన్న కున్వర్ సింగ్ అనే ఆ గ్రామానికి చెందిన రైతు పొలంలో మంచినీరు వచ్చింది. ఇది వారికి ఎంతో సంతోషాన్ని కలిగించే విషయం. ఈ నీళ్లతో మిగతా గ్రామస్తులందరికీ ఎందుకు సేవ చేయకూడదని ఆయన అనుకున్నారు. కానీ, పొలం నుంచి గ్రామానికి నీరు తీసుకెళ్లేందుకు 30-32 లక్షల రూపాయలు కావాలి. కొంతకాలం తర్వాత కున్వర్ సింగ్ గారి తమ్ముడు శ్యామ్ సింగ్ గారు సైన్యం నుండి ఉద్యోగ విరమణ చేసిన తర్వాత గ్రామానికి వచ్చారు. అప్పుడు ఆయనకు ఈ విషయం తెలిసింది. రిటైర్మెంట్ ద్వారా వచ్చిన డబ్బునంతా ఈ పనికి అప్పగించి పొలం నుంచి గ్రామానికి పైప్‌లైన్ వేసి గ్రామస్తులకు మంచినీళ్లు సరఫరా చేశారు. ససహృదయత, కర్తవ్యంపై అంకితభావం ఉంటే ఒక్క వ్యక్తి కూడా మొత్తం సమాజ భవిష్యత్తును ఎలా మార్చగలడనే విషయం తెలిపేందుకు ఈ ప్రయత్నం ప్రేరణగా నిలుస్తుంది. కర్తవ్య మార్గంలో నడవడం ద్వారానే సమాజాన్ని శక్తివంతం చేయగలం. దేశాన్ని శక్తివంతం చేయగలం. ఈ స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో ఇది మన సంకల్పం. ఇది మన సాధన కూడా కావాలి. దానికి ఒకే మార్గం - కర్తవ్యం, కర్తవ్యం , కర్తవ్యం.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈ రోజు మనం 'మన్ కీ బాత్'లో సమాజానికి సంబంధించిన అనేక ముఖ్యమైన అంశాలను చర్చించాం. మీరందరూ నాకు వివిధ అంశాలకు సంబంధించిన ముఖ్యమైన సూచనలను పంపండి. వాటి ఆధారంగా మన చర్చ ముందుకు సాగుతుంది. అలాగే 'మన్ కీ బాత్' తర్వాతి సంచిక కోసం మీ సూచనలను పంపడం మర్చిపోవద్దు. ప్రస్తుతం స్వాతంత్య్ర అమృత మహోత్సవానికి సంబంధించిన కార్యక్రమాలు జరుగుతున్నాయి. మీరు పాల్గొంటున్న కార్యక్రమాల గురించి కూడా తప్పక చెప్పండి. నమో యాప్, మై గవ్ లపై మీ సూచనల కోసం నేను ఎదురు చూస్తున్నాను. తర్వాతిసారి మనం మరోమారు కలుద్దాం. దేశప్రజలకు సంబంధించిన ఇలాంటి అంశాలపై మరోసారి మాట్లాడుకుందాం. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ చుట్టూ ఉన్న అన్ని జంతువులను కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఈ వేసవి కాలంలో జంతువులు, పక్షులకు ఆహారం, నీరు అందించే మానవీయ బాధ్యతను మీరు కొనసాగించాలి. ఇది గుర్తుంచుకోండి. అప్పటి వరకు చాలా చాలా ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.
కొత్త అంశాలతో, కొత్త స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలతో, కొత్త కొత్త సందేశాలతోమీకు నా ‘మనసులో మాట’ చెప్పేందుకు మరోసారి వచ్చాను. ఈసారి నాకు ఎక్కువ ఉత్తరాలు, సందేశాలు వచ్చిన అంశం గురించి మీకు తెలుసా? ఈ విషయం చరిత్ర, వర్తమానం, భవిష్యత్తు- ఈ మూడింటికి సంబంధించింది. కొత్త ప్రధానమంత్రి మ్యూజియం గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి మ్యూజియం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఈ ఏప్రిల్ 14వ తేదీన ప్రారంభమైంది. దీన్ని దేశప్రజల సందర్శనార్థం తెరిచారు. సార్థక్ గారు ఒక శ్రోత. ఆయన గురుగ్రామ్‌లో నివసిస్తున్నారు. ఆయన తొలిసారి అవకాశం లభించిన వెంటనే ప్రధాన మంత్రి మ్యూజియం చూడటానికి వచ్చారు. నమో యాప్‌లో సార్థక్ గారు నాకు రాసిన సందేశం చాలా ఆసక్తికరంగా ఉంది. తాను చాలా ఏళ్లుగా న్యూస్ ఛానల్స్ చూస్తున్నానని, వార్తాపత్రికలు చదువుతున్నానని, సోషల్ మీడియాతో కొన్నాళ్లుగా కనెక్ట్ అయ్యానని, కాబట్టి తనకు జనరల్ నాలెడ్జ్ చాలా బాగుందని ఆయన అనుకున్నారు.కానీప్రధానమంత్రి మ్యూజియాన్ని సందర్శించినప్పుడు ఆయన చాలా ఆశ్చర్యపోయారు. తన దేశం గురించి, దేశానికి నాయకత్వం వహించిన వారి గురించి తనకు పెద్దగా తెలియదని గ్రహించారు. ప్రధాన మంత్రి మ్యూజియంలో తనకు ఆసక్తికరంగా కనిపించిన విషయాలను ఆయన రాశారు. లాల్ బహదూర్ శాస్త్రికి ఆయన అత్తమామలు బహుమతిగా ఇచ్చిన చరఖాను చూసి సార్థక్ గారు చాలా సంతోషించారు. శాస్త్రి జీ పాస్‌బుక్‌ను కూడా సార్థక్ గారుచూశారు. శాస్త్రి గారి వద్ద ఎంత తక్కువ డబ్బు ఉందో కూడా చూశారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనడానికి ముందు మొరార్జీ భాయ్ దేశాయ్ గుజరాత్లో డిప్యూటీ కలెక్టర్‌గా ఉన్నారని కూడా తనకు తెలియదని సార్థక్ గారు రాశారు.మొరార్జీ దేశాయ్ పరిపాలనారంగంలో సుదీర్ఘకాలం సేవలందించారు. చౌదరి చరణ్ సింగ్ గారి గురించి కూడా సార్థక్ గారు రాశారు. జమీందారీ నిర్మూలన కోసం చౌదరి చరణ్ సింగ్ జీ గొప్ప కృషి చేశారని ఆయనకు తెలియదు. ఇది మాత్రమే కాదు- నేను శ్రీ పి.వి. నరసింహారావు గారు భూ సంస్కరణల విషయంలో చాలా ఆసక్తిని కనబరిచిన సంగతి కూడా ఈ మ్యూజియంలో తనకు తెలిసిందని సార్థక్ గారు తెలిపారు. చంద్రశేఖర్ గారు4 వేల కిలోమీటర్లకు పైగా నడిచి చరిత్రాత్మక భారతదేశ యాత్ర చేశారని ఈ మ్యూజియానికి వచ్చిన తర్వాతే సార్థక్ గారికి కూడా తెలిసింది. అటల్ జీ ఉపయోగించిన వస్తువులను మ్యూజియంలో చూసినప్పుడు, ఆయన ప్రసంగాలు వింటుంటే సార్థక్ గర్వంతో ఉప్పొంగిపోయారు. ఈ మ్యూజియంలో మహాత్మా గాంధీ, సర్దార్ పటేల్, డాక్టర్ అంబేద్కర్, జయ ప్రకాష్ నారాయణ్, మన ప్రధాన మంత్రి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గురించి కూడా చాలా ఆసక్తికరమైన సమాచారం ఉందని సార్థక్ గారు తెలిపారు.
మిత్రులారా! దేశ ప్రధానమంత్రుల సేవలను గుర్తుంచుకోవడానికి స్వతంత్ర భారత అమృత మహోత్సవంకంటే మంచి సందర్భం ఏముంటుంది! స్వాతంత్య్ర అమృత మహోత్సవం ప్రజాఉద్యమ రూపం దాల్చడం దేశానికి గర్వకారణం. ప్రజలలో చరిత్ర పట్ల ఆసక్తి చాలా పెరుగుతోంది. ఇటువంటి పరిస్థితిలోదేశంలోని అమూల్యమైన వారసత్వ సంపదతో యువతను అనుసంధానిస్తూ ఈ మ్యూజియం యువతకు కూడా కేంద్రంగా మారుతోంది.
మిత్రులారా! మ్యూజియం గురించి మీతో ఈ విషయాలు మాట్లాడుతున్నప్పుడునేను కూడా మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడగాలని అనిపించింది. మీ జనరల్ నాలెడ్జి ఏం చెప్తుందో చూద్దాం. మీకు ఎంత అవగాహన ఉందో చూద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? నా యువ సహచరులుకాగితం, పెన్ను చేతుల్లోకి తీసుకున్నారా? నేను ప్రస్తుతం మిమ్మల్ని అడిగే ప్రశ్నల సమాధానాలను నమో యాప్ లేదా సోషల్ మీడియాలో #MuseumQuizతో పంచుకోవచ్చు. దయచేసి ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇవ్వవలసిందిగా నేను మిమ్మల్నికోరుతున్నాను. దీంతో దేశ వ్యాప్తంగా ప్రజల్లో మ్యూజియంపై ఆసక్తి పెరుగుతుంది. దేశంలోని ఏ నగరంలో ప్రసిద్ధ రైలు మ్యూజియం ఉందో మీకు తెలుసా? అక్కడ గత 45 ఏళ్లుగా భారతీయ రైల్వే వారసత్వాన్ని చూసే అవకాశం ప్రజలకు లభిస్తోంది. నేను మీకు మరొక క్లూ ఇస్తాను. మీరు ఇక్కడ ఫెయిరీ క్వీన్, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ సెలూన్ నుండి మొదలుకొని ఫైర్‌లెస్ స్టీమ్ లోకోమోటివ్ వరకు కూడా చూడవచ్చు. ముంబైలోని ఏ మ్యూజియం కరెన్సీ పరిణామాన్ని ఆసక్తికరంగా వివరిస్తుందో మీకు తెలుసా? ఇక్కడ క్రీస్తుపూర్వం ఆరవ శతాబ్దానికి చెందిన నాణేలు ఉన్నాయి. మరోవైపు ఈ-మనీ కూడా ఉంది. మూడవ ప్రశ్న 'విరాసత్-ఎ-ఖల్సా' ఏ మ్యూజియానికి సంబంధించింది? పంజాబ్‌లోని ఏ నగరంలో ఈ మ్యూజియం ఉందో తెలుసా? మీరందరూ గాలిపటం ఎగురవేయడంలో చాలా ఆనందించి ఉంటారు. తర్వాతి ప్రశ్న దీనికి సంబంధించింది. దేశంలోని ఏకైక గాలిపటాల మ్యూజియం ఎక్కడ ఉంది? నేను మీకు ఒక క్లూ ఇస్తాను. ఇక్కడ ఉన్న అతిపెద్ద గాలిపటం పొడవు వెడల్పులు 22అడుగులు, 16 అడుగులు. ఒక విషయం గుర్తొచ్చింది. ఇక్కడే ఇంకో విషయం చెప్తాను. ఈ మ్యూజియం ఉన్న ఊరికి బాపుకు ప్రత్యేక అనుబంధం ఉంది. చిన్నతనంలో టపాసులు సేకరించే హాబీ ఎవరికి మాత్రం ఉండదు! అయితేభారతదేశంలో పోస్టల్ స్టాంపులకు సంబంధించిన జాతీయ మ్యూజియం ఎక్కడ ఉందో తెలుసా? నేను మిమ్మల్ని ఇంకొక ప్రశ్న అడుగుతున్నాను. గుల్షన్ మహల్ అనే భవనంలో ఏ మ్యూజియం ఉంది? మీ కోసం క్లూ ఏమిటంటేఈ మ్యూజియంలో మీరు సినిమా డైరెక్టర్‌గా కూడా మారవచ్చు. మీరు కెమెరా, ఎడిటింగ్ నైపుణ్యాలను కూడా అక్కడ చూడవచ్చు. సరే! భారతదేశ వస్త్ర వారసత్వాన్ని తెలియజేసే మ్యూజియం ఏదైనా మీకు తెలుసా? ఈ మ్యూజియంలో సూక్ష్మ వర్ణ చిత్రాలు, జైన లిఖిత ప్రతులు, శిల్పాలు - మరెన్నో ఉన్నాయి. ఇది ప్రత్యేక తరహా ప్రదర్శనకు కూడా ప్రసిద్ధి చెందింది.
మిత్రులారా!ఈ టెక్నాలజీ యుగంలోమీరు వాటికి సమాధానాలు కనుగొనడం చాలా సులభం. మన కొత్త తరంలో ఆసక్తి పెరగాలని, వాటి గురించి మరింత ఎక్కువగా చదవాలని, చూడ్డానికి వెళ్లాలని నేను ఈ ప్రశ్నలు అడిగాను. ఇప్పుడు మ్యూజియాలకు ఉన్న ప్రాధాన్యత కారణంగా చాలా మంది స్వయంగా ముందుకు వచ్చి వాటికి విరాళాలు ఇస్తున్నారు. చాలా మంది తమ పాత సేకరణలతో పాటు చారిత్రక విశేషాలను మ్యూజియంలకు అందజేస్తున్నారు. మీరు ఇలా చేసినప్పుడుఒక విధంగామీరు మొత్తం సమాజంతో సాంస్కృతిక అంశాలను పంచుకుంటారు. భారతదేశంలో కూడా ఇప్పుడు ప్రజలు దీని కోసం ముందుకు వస్తున్నారు. అలాంటి వ్యక్తిగత ప్రయత్నాలన్నింటినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈరోజుల్లో మారుతున్న కాలంలోకోవిడ్ నిబంధనల కారణంగామ్యూజియాలలో కొత్త పద్ధతులను అవలంబించడంపై దృష్టి సారిస్తున్నారు.
మ్యూజియాలలో డిజిటలైజేషన్‌పై కూడా దృష్టి పెరిగింది. మే 18న అంతర్జాతీయ మ్యూజియం దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకోనున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. నా యువ సహచరుల కోసం నా దగ్గర ఒక ఆలోచన ఉంది. రాబోయే సెలవుల్లో మీ స్నేహితుల బృందంతో స్థానిక మ్యూజియాన్ని ఎందుకు సందర్శించకూడదు! #MuseumMemoriesతో మీ అనుభవాన్ని పంచుకోండి. ఇలా చేయడం ద్వారా మీరు ఇతరుల మనస్సులలో కూడా మ్యూజియాలపై ఆసక్తిని పెంచుతారు.
నా ప్రియమైన దేశప్రజలారా!మీరు మీ జీవితంలో చాలా తీర్మానాలు చేసి ఉండాలి. వాటిని నెరవేర్చడానికి మీరు కష్టపడి ఉండాలి. మిత్రులారా!కానీ ఇటీవలనేను ఒక భిన్నమైన, ప్రత్యేకమైన తీర్మానం గురించి తెలుసుకున్నాను. అందుకే 'మన్ కీ బాత్' శ్రోతలతో తప్పక పంచుకోవాలని అనుకున్నాను.
మిత్రులారా!రోజంతా ఊరంతా తిరుగుతూనగదు రూపంలో ఎలాంటి డబ్బు లావాదేవీలు చేయనుఅనే సంకల్పంతో ఎవరైనా తమ ఇంటి నుండి బయటకు రాగలరని మీరు ఊహించగలరా! ఇది ఆసక్తికరమైన తీర్మానం కదా! ఢిల్లీకి చెందిన ఇద్దరు అమ్మాయిలు సాగరిక, ప్రేక్ష ఇలాంటి ఒక క్యాష్‌లెస్ డే అవుట్ ప్రయోగం చేశారు. ఢిల్లీలో సాగరిక, ప్రేక్ష ఎక్కడికి వెళ్లినా డిజిటల్ పేమెంట్ సౌకర్యం లభించింది. UPI QR కోడ్ కారణంగావారు నగదు విత్‌డ్రా చేయాల్సిన అవసరం రాలేదు. స్ట్రీట్ ఫుడ్ దుకాణాల్లోనూ వీధి వ్యాపారుల దగ్గర కూడావారు ఆన్లైన్ లావాదేవీల సౌకర్యాన్ని పొందారు.
మిత్రులారా!ఢిల్లీ మెట్రో నగరం కాబట్టి అక్కడ ఇవన్నీ ఉండటం చాలా సులభమణి ఎవరైనా అనుకోవచ్చు. కానీ ఇప్పుడు UPI వ్యాప్తి కేవలం ఢిల్లీ వంటి పెద్ద నగరాలకు మాత్రమే పరిమితం కాదు. ఘజియాబాద్ కు చెందిన ఆనందితా త్రిపాఠి గారి నుండి నాకు సందేశం వచ్చింది. ఆనందిత గత వారం తన భర్తతో కలిసి ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లారు. అస్సాం నుంచి మొదలుకుని మేఘాలయ, అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ వరకు తమ ప్రయాణ అనుభవాన్ని చెప్పారు. చాలా రోజుల ఈ ప్రయాణంలో వారు మారుమూల ప్రాంతాల్లో కూడా నగదు ఉపయోగించవలసిన అవసరం రాలేదని తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు. కొన్నేళ్ల క్రితం వరకు మంచి ఇంటర్నెట్ సదుపాయం కూడా లేని చోట ఇప్పుడు యూపీఐ ద్వారా చెల్లింపులు చేసే సౌకర్యం కూడా అందుబాటులోకి వచ్చింది. సాగరిక, ప్రేక్ష, ఆనందిత అనుభవాలను పరిశీలిస్తూ క్యాష్‌లెస్ డే అవుట్ ప్రయోగాన్ని ప్రయత్నించమని నేను మిమ్మల్ని కూడా కోరుతున్నాను. తప్పకుండా చేయండి. మిత్రులారా!గత కొన్ని సంవత్సరాలుగా BHIM UPI మన ఆర్థిక వ్యవస్థ, అలవాట్లలో ఒక భాగంగా మారింది. ఇప్పుడు చిన్న చిన్న పట్టణాల్లో, చాలా గ్రామాల్లో ప్రజలు UPI ద్వారానే లావాదేవీలు జరుపుతున్నారు. డిజిటల్ ఎకానమీ వల్ల దేశంలో ఒక సంస్కృతి కూడా ఏర్పడుతోంది. డిజిటల్ చెల్లింపుల కారణంగా వీధుల్లోని చిన్నచిన్న దుకాణాలు కూడా ఎక్కువ మంది వినియోగదారులకు సేవలను అందించడాన్ని సులభతరం చేశాయి. ఇప్పుడు వారికి నగదు సమస్య కూడా లేదు. మీరు రోజువారీ జీవితంలో UPI సౌలభ్యాన్ని కూడా అనుభవిస్తూ ఉంటారు. ఎక్కడికెళ్లినా నగదు తీసుకెళ్లడం, బ్యాంకుకు వెళ్ళడం, ఏటీఎం వెతకడం మొదలైన సమస్యలు దూరమయ్యాయి. అన్ని చెల్లింపులు మొబైల్ నుండే జరుగుతాయి. కానీమీ ఈ చిన్న ఆన్లైన్ చెల్లింపుల వల్ల దేశంలో ఎంత పెద్ద డిజిటల్ ఆర్థిక వ్యవస్థ ఏర్పడిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా! ప్రస్తుతం మన దేశంలో ప్రతిరోజూ దాదాపు 20 వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి. గత మార్చి నెలలో యూపీఐ లావాదేవీలు దాదాపు రూ.10 లక్షల కోట్లకు చేరుకున్నాయి. దీనివల్ల దేశంలో సౌలభ్యం కూడా పెరిగి నిజాయితీ వాతావరణం కూడా ఏర్పడుతోంది. ఇప్పుడు ఫిన్-టెక్కి సంబంధించిన అనేక కొత్త స్టార్టప్‌లు కూడా దేశంలో ముందుకు సాగుతున్నాయి. ఈ డిజిటల్ చెల్లింపు శక్తి, స్టార్ట్-అప్ వ్యవస్థకు సంబంధించి మీకు ఏవైనా అనుభవాలు ఉంటే పంచుకోవాలని నేను కోరుతున్నాను. మీ అనుభవాలు ఇతరులకు స్ఫూర్తిగా మారవచ్చు.
నా ప్రియమైన దేశవాసులారా ! సాంకేతికతలోని శక్తి సామాన్య ప్రజల జీవితాలను ఎలా మారుస్తుందోమన చుట్టూ మనం నిరంతరం చూస్తూనే ఉంటాం. టెక్నాలజీ మరో గొప్ప పని చేసింది. దివ్యాంగ సహచరుల అసాధారణ సామర్థ్యాల ప్రయోజనాన్ని దేశానికి, ప్రపంచానికి చూపించడమే ఈ పని. మన దివ్యాంగ సోదర సోదరీమణులు ఏం చేయగలరో టోక్యో పారాలింపిక్స్‌లో మనం చూశాం. క్రీడలతోపాటు కళలు, విద్యారంగం మొదలైన అనేక ఇతర క్షేత్రాల్లో దివ్యాంగసహచరులు అద్భుతాలు చేస్తున్నారు. కానీ ఈ సహచరులకు సాంకేతికత లోని శక్తి లభించినప్పుడు వారు మరింత ఉన్నత గమ్యాలను చేరుకుంటారు. అందుకేఈ రోజుల్లో దేశం దివ్యాంగులకు వనరులను, మౌలిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తోంది. దేశంలో అనేక స్టార్టప్‌లు, సంస్థలు ఈ దిశలో స్ఫూర్తిదాయకమైన పని చేస్తున్నాయి. అటువంటి సంస్థల్లో ఒకటి – వాయిస్ ఆఫ్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్. ఈ సంస్థ సహాయక సాంకేతిక రంగంలో కొత్త అవకాశాలను ప్రోత్సహిస్తోంది. దివ్యాంగ కళాకారుల కృషిని అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లేందుకు వినూత్నమైన ప్రారంభం కూడా జరిగింది. వాయిస్ ఆఫ్ స్పెషల్లీ ఏబుల్డ్ పీపుల్ సంస్థకు చెందిన కళాకారుల చిత్రాల డిజిటల్ ఆర్ట్ గ్యాలరీని సంస్థ సిద్ధం చేసింది. దివ్యాంగులైన సహచరులు ఎంత అసాధారణమైన ప్రతిభతో సుసంపన్నమవుతారో, వారు ఎలాంటి అసాధారణ సామర్థ్యాలను కలిగి ఉంటారో తెలిపేందుకు ఈ ఆర్ట్ గ్యాలరీ ఉదాహరణగా నిలుస్తుంది. దివ్యాంగ సహచరుల జీవితంలో ఉండే సవాళ్లు, వాటిని అధిగమిస్తే వారు ఎంత దూరం చేరుకోగలరు మొదలైన విషయాలు ఈ పెయింటింగ్స్ చూస్తే తెలుస్తాయి. మీకు కూడా దివ్యాంగ సహచరులు తెలిస్తే, వారి ప్రతిభను తెలుసుకుంటే, డిజిటల్ టెక్నాలజీ సహాయంతోమీరు వారిని ప్రపంచం ముందుకు తీసుకురావచ్చు. దివ్యాంగ సహచరులు కూడా అలాంటి ప్రయత్నాలలో పాలుపంచుకోవాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా వేగంగా పెరుగుతున్నాయి. పెరుగుతున్నఈ వేడి- నీటిని ఆదా చేసే విషయంలో మన బాధ్యతను పెంచుతుంది. మీరు ఇప్పుడు ఉన్న చోట పుష్కలంగా నీరు అందుబాటులో ఉండవచ్చు. కానీనీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో నివసించే కోట్లాది ప్రజలను కూడా మీరు ఎల్లప్పుడూ గుర్తుంచుకోవాలి. వారికి ప్రతి నీటి బొట్టు అమృతం లాంటిది.
మిత్రులారా!స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతున్నసందర్భంగా అమృతోత్సవం జరుపుకుంటున్న ఈ తరుణంలో దేశం ముఖ్యమైనవిగా భావిస్తున్న సంకల్పాలలో నీటి సంరక్షణ కూడా ఒకటి. అమృత మహోత్సవం సందర్భంగా దేశంలోని ప్రతి జిల్లాలో 75 అమృత సరోవరాలను నిర్మిస్తారు. ఎంత పెద్ద ఉద్యమం జరుగుతుందో మీరు ఊహించుకోవచ్చు. మీ పట్టణానికి 75 అమృత సరోవరాలు వచ్చే రోజు ఎంతో దూరంలో లేదు. మీరందరూ-ముఖ్యంగా యువత ఈ ప్రచారం గురించి తెలుసుకోవాలని,ఈ బాధ్యత తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీ ప్రాంతంలో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఏదైనా చరిత్ర ఉన్నా,ఒక పోరాట యోధుని జ్ఞాపకాలు ఉన్నా మీరు వాటిని అమృత సరోవరాలతో కూడా అనుసంధానించవచ్చు. అమృత్ సరోవర్ సంకల్పం తీసుకున్న తర్వాతదాని కోసం చాలా చోట్ల శరవేగంగా పనులు ప్రారంభమయ్యాయని తెలిసి నాకు చాలా సంతోషమైంది. యూపీలోని రాంపూర్ లో పట్వాయి గ్రామ పంచాయతీ గురించి నాకు సమాచారం వచ్చింది. అక్కడ గ్రామసభ జరిగే స్థలంలో ఒక చెరువు ఉంది. కానీ అది మురికితో, చెత్తతో నిండి ఉంది. ఎంతో కష్టంతో స్థానికుల సహకారంతో, స్థానిక పాఠశాల విద్యార్థుల సహకారంతో ఆ మురికి చెరువు గత కొన్ని వారాల్లో రూపాంతరం చెందింది.ఇప్పుడు ఆ సరస్సు ఒడ్డున రిటైనింగ్ వాల్, ప్రహరీ గోడ, ఫుడ్ కోర్ట్, ఫౌంటెన్లు, లైటింగ్ లాంటి ఏర్పాట్లు చేశారు. ఈ కృషికి రాంపూర్‌లోని పట్వాయి గ్రామపంచాయతీని, గ్రామ ప్రజలను,అక్కడి చిన్నారులను అభినందిస్తున్నాను.
మిత్రులారా!నీటి లభ్యత, నీటి కొరతదేశ ప్రగతిని, అభివృద్ధి వేగాన్ని నిర్ణయిస్తాయి. 'మన్ కీ బాత్'లో పరిశుభ్రత వంటి అంశాలతో పాటు నీటి సంరక్షణ గురించి నేను మళ్ళీ మళ్ళీ మాట్లాడటం మీరు గమనించి ఉంటారు.
“పానీయం పరమం లోకే, జీవానాం జీవనం స్మృతమ్” అని మన గ్రంథాలలో స్పష్టంగా ఉంది.
అంటే ప్రపంచంలో ప్రతి జీవికి నీరే ఆధారం. నీరే అతి పెద్ద వనరు కూడా. అందుకే మన పూర్వీకులు నీటి సంరక్షణకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. వేదాల నుండి పురాణాల వరకుప్రతిచోటా- నీటి పొదుపు;చెరువులు, సరస్సులు మొదలైన వాటి నిర్మాణం మనిషి సామాజిక, ఆధ్యాత్మిక కర్తవ్యంగా పేర్కొన్నారు. వాల్మీకి రామాయణంలో నీటి సంరక్షణ, నీటి వనరుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. అదేవిధంగాసింధు-సరస్వతి , హరప్పా నాగరికతలలో కూడా నీటికి సంబంధించి భారతదేశంలో ఇంజనీరింగ్ ఎంత అభివృద్ధి చెందిందో చరిత్ర విద్యార్థులకు తెలిసి ఉండవచ్చు. పురాతన కాలంలో, అనేక నగరాల్లో నీటి వనరులు ఒకదానితో ఒకటి అనుసంధానమైన వ్యవస్థ ఉండేది. ఆ సమయంలో జనాభా అంతగా లేదు. సహజ వనరుల కొరత లేదు. ఒక రకమైన సమృద్ధి ఉంది. అయినప్పటికీనీటి సంరక్షణ గురించిఅప్పుడుఅవగాహన చాలా ఎక్కువగా ఉండేది. కానీఈరోజులలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మీ ప్రాంతంలోని ఇటువంటి పాత చెరువులు, బావులు, సరస్సుల గురించి తెలుసుకోవాలని మీ అందరినీ కోరుతున్నాను. అమృత్ సరోవర్ అభియాన్ కారణంగానీటి సంరక్షణతో పాటుమీ ప్రాంతానికి గుర్తింపు కూడా లభిస్తుంది. దీంతో నగరాలతో పాటు వివిధ ప్రాంతాలలో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి కూడా జరుగుతుంది. ప్రజల విహారయాత్రలకు కూడా స్థలం లభిస్తుంది.
*****
మిత్రులారా నీటికి సంబంధించిన ప్రతి ప్రయత్నమూ మన భవిష్యత్తుతో ముండిపడిందే. అది మన సామాజిక బాధ్యతకదా. దీనికోసం శతాబ్దాలుగా విభిన్న సమాజాలు భిన్నమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. కచ్ కి చెందిన మాల్ ధారీ అనే ఓ తెగ జల సంరక్షణకోసం వృదాస్ అనే ఓ ప్రత్యేకమైన ప్రక్రియని అనుసరిస్తుంది. దాంట్లో చిన్న చిన్న బావుల్ని ఏర్పాటు చేసుకుని వాటి సంరక్షణకోసం చుట్టుపక్కలంతా మొక్కల్ని నాటి చెట్లు పెంచుతారు. అదే విధంగా మధ్యప్రదేశ్ కి చెందిన బీల్ అనే తెగ హల్మా అనే ఓ సంప్రదాయ విధానాన్ని అనుసరించింది. ఈ విధానంలో జల సంరక్షణకు సంబంధించిన విషయాల గురించి చర్చించుకునేందుకు అందరూ కలసి ఓ చోట సమావేశమవుతారు. హల్మా విధానంలో కనుగొన్న పరిష్కారాల వల్ల ఈ ప్రదేశంలో నీటి ఎద్దడి తగ్గిపోయింది. అలాగే భూగర్భజలాలు పెరుగుతున్నాయి.
మిత్రులారా అసలు ఇది మన కర్తవ్యం అన్న భావన అందరి మనసుల్లో కలిగితే నీటి ఎద్దడికి సంబంధించిన అతి పెద్ద సమస్యలకు కూడా సులభ పరిష్కారాలు లభిస్తాయి. అందుకే మనం స్వాతంత్ర్య అమృతోత్సవాల వేళ జల సంరక్షణ, జీవన సంరక్షణ అనే సంకల్పాలు చేద్దాం. మనం ప్రతి నీటి బొట్టునూ, అలాగే మన జీవితాలను కాపాడుకుందాం.
ప్రియతమ దేశవాసులారా మీరంతా చసే ఉంటారు నేను కొన్ని రోజుల క్రితం నా యువనేస్తాలతో, విద్యార్ధులతో పరీక్షలపై చర్చ జరిపాను. దాంట్లో చాలా మంది విద్యార్థులు ఏమన్నారంటే వాళ్లకి పరీక్షల్లో లెక్కల పరీక్షంటే చాలా భయమేస్తోందట. ఇదే విషయాన్ని ఎంతో మంది విద్యార్ధులు నాకు సందేశాల ద్వారాకూడా పంపించారు. ఈసారి మనసులో మాటలో లెక్కల గురించి చర్చించాలని నేను ఆ క్షణంలోనే నిర్ణయించుకున్నాను. మిత్రులారా అసలు లెక్కల గురించైతే మన భారతీయులెవరూ అస్సలు భయపడాల్సిన పనేలేదు. ఎందుకంటే లెక్కలకి సంబంధించి భారతీయులే ఎక్కువగా వీలైనన్ని పరిశోధనలు, ఆవిష్కారాలు చేశారుకదా. సున్నా విలువ అలాగే దాని ప్రాధాన్యత గురించి మన యువతరం వినే ఉంటుందికదా. నిజానికి మీకింకో విషయం కూడా తెలిసే ఉంటుంది అసలు సున్నాని కనిపెట్టకపోయుంటే అసలు ప్రపంచం ఇంత వైజ్ఞానిక ప్రగతి సాధించడం కూడా మనం చూసుండే వాళ్లం కాదేమో. క్యాలిక్యులస్ నుంచి కంప్యూటర్ల వరకూ అన్ని వైజ్ఞానికి ఆవిష్కరణలూ సున్నామీదే ఆధారపడి ఉంటాయికదా. అసలు మన భారతీయ గణి శాస్త్రవేత్తలు, విద్వాంసులు ఏం రాశారంటే
యత్ కించిత్ వస్తు తత్ సర్వః గణితేన వినా నహి
దానర్థం ఏంటంటే అసలీ మొత్తం బ్రహ్మాండంలో ఏముందో మొత్తం అదంతా గణితం మీదే ఆధారపడి ఉందని. మీరు విజ్ఞాన శాస్త్రం గురించి గుర్తు చేసుకుంటే అప్పుడు మీకు దీని గురించి అర్థమైపోతుంది. విజ్ఞానానికి సంబంధించిన ప్రతి ఒక్క సూత్రాన్నీ మేథమెటికల్ ఫార్ములాగానే వ్యక్తం చెయ్యడం జరిగిందికదా. న్యూటన్ లా కావొచ్చు, ప్రసిద్ధి చెందిన ఐన్ స్టీన్ ఈక్వేషన్ కావొచ్చు, అసలీ బ్రహ్మాండానికి సంబంధించిన మొత్తం విజ్ఞానమంతా గణితమే కదా. ఇప్పుడు శాస్త్రవేత్తలు థియరీ ఆఫ్ ఎవ్రీ థింగ్ గురించి మాట్లాడుతున్నారు. అంటే మొత్తం బ్రహ్మాండం గురించి చెప్పడానికి ఒకే ఒక సూత్రమన్న మాట. అసలు గణితానికి సంబంధించి మన మహర్షులు ఎంతో విస్తృత స్థాయిలో ఆలోచించారు, పరిశోధనలు చేశారు. మనం కేవలం సున్నానిమాత్రం ఆవిష్కరించడమే కాక అనంతం అంటే ఇన్ఫినిటీనికూడా కనిపెట్టాం. సాధారణమైన మాటల్లో మనం సంఖ్యల గురించి మాట్లాడుకున్నప్పుడు మిలియెన్, బిలియెన్, ట్రిలియెన్ వరకూ చెబుతాం, ఆలోచిస్తాం. కానీ వేదాల్లో అలాగే భారతీయ గణితంలో ఈ గణన ఇంకా చాలా ముందుకెళ్లింది. మనకి ఓ పురాతనమైన శ్లోకం కూడా ప్రచారంలో ఉంది.
ఏకం దశం శతంచైవ సహస్రం అయుతం తథా
లక్షంచ నియుతంచైవ కోటిః అర్బుదమ్ ఏవచ
వృదం ఖర్వే నిఖర్వ చ శంఖః పదమః చ సాగరః
అంత్యం మధ్యం పరార్ధః చ దశ వృదధ్వా యధా క్రమమ్
ఈ శ్లోకంలో సంఖ్యల ఆర్డర్ ని చెప్పారు. ఎలాగంటే ఒకటి, పది, వంద, వెయ్యి, అయుతం, లక్ష, నియుత, అలాగే కోటి. సంఖ్యలు ఈ విధంగా వెళ్తుంటాయి సంఖ్య, పదం అలాగే సాగరం వరకూ. ఓ సాగరం అంటే ఎంతంటే పదికి టూదీ పవర్ ఆఫ్ 57. అది మాత్రమే కాక ఇంకా ఆ తర్వాత ఓధ్ అలాగే మహోధ్ లాంటి సంఖ్యలు కూడా ఉన్నాయి. ఓ మహోధ్ అంటే ఎంతంటే 10కి టూది పవర్ ఆఫ్ 62కి సమానం. అంటే ఒకటి తర్వాత 62 సున్నాలు 62 జీరోస్. మనం అసలు అంత పెద్ద సంఖ్యల గురించి సలు తలచుకున్నా సరే కష్టంగా అనిపిస్తుంది. కానీ భారతీయ గణితంలో వీటి ప్రయోగం వేలాది సంవత్సరాలుగా జరుగుతోంది. నాకు కొన్ని రోజుల క్రితం ఇంటెల్ కంపెనీ సీఈఓ కలిశారు. అసలు ఇంటెల్ పేరు వింటేనే మీ మనసులో కంప్యూటర్ అన్న ఆలోచన వచ్చేస్తుందికదా. మీరు కంప్యూటర్ గురించి మన బైనరీ సిస్టమ్ గురించి కూడా వినుంటారుకదా. కానీ మీకోటి తెలుసా అసలు మన దేశంలో ఆచార్య పింగళుడు ఎన్నో ఏళ్ల క్రితమే ఈ బైనరీ సిస్టమ్ గురించి ఆలోచించాడు. ఈ విధంగా ఆర్యభట్టనుంచి రామానుజం లాంటి గణిత శాస్త్ర వేత్తల వరకూ అందరూ గణితానికి సంబంధించిన న్నో సూత్రాలను సిద్ధాంతీకరించారు.
మిత్రులారా అసలు మన భారతీయులకెప్పుడూ గణితం అస్సలు కష్టంగా అనిపించలేదు. దానికి మన వైదిక గణితం కూడా ఓ కారణం. ఆధునిక కాలంలో వైదిక గణితానికి సంబంధించిన కీర్తెవరికి దక్కుతుందంటే శ్రీ భారతీ కృష్ణ తీర్థ మహరాజ్ కే. ఆయన క్యాలిక్యులేషన్ కి సంబంధించిన ప్రాచీన విధానాలను ఆధునికీకరించారు. అలాగే దానికి వైదిక గణితం అనే పేరు పెట్టారు. అసలు వైదిక గణితం విశిష్టత ఏంటంటే మీరు దాంతో అత్యంత కఠిమైన లెక్కల్ని కూడా రెప్పపాటు కాలంలో చేసెయ్యొచ్చు. అసలీ మధ్య కాలంలో సోషల్ మీడియాలో అలా వైదిక గణితాన్ని నేర్చుకునేవాళ్లు నేర్పించేవాళ్ల వీడియాలు అనేకం చూడొచ్చు.
మిత్రులారా ఇవ్వాళ్టి మనసులో మాటలో అలా వైదిక గణితం నేర్పించే ఓ మిత్రుడు మనతో కలవబోతున్నారు. ఆయనెవరంటే కోలకతాకి చందిన సౌరవ్ టేక్రీవాల్ గారు. ఆయన గడచిన రెండు రెండున్నర దశాబ్దాలనుంచి వైదిక్ మ్యాధమెటిక్స్ అనే ఈ మూవ్ మెంట్ ని చాలా అంకిత భావంతో ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మనం ఆయనతో కొన్ని విషయాలు మాట్లాడదాం.
నరేంద్ర మోడీ గౌరవ్ గారూ నమస్కారం
గౌరవ్ నమస్కారం సర్
నరేంద్ర మోడీ మేమేం విన్నామంటే మీకు వైదిక్ మ్యాథ్స్ అంటే చాలా ఇష్టమట కదా, చాలా పరిశ్రమ చేశారట కదా
ముందు నేను మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను
తర్వాత అసలు మీకు దానిమీద ఎందుకు ఇష్టత కలిగిందో చెప్పండి
గౌరవ్ సార్ నేను ఇరవై ఏళ్లక్రితం బిజినెస్ స్కూల్ కి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు, దానికో కాంపిటీటివ్ ఎగ్జామ్ జరిగేది.
దాని పేరు క్యాట్.
అందులో గణితానికి సంబంధించి చాలా ప్రశ్నలొచ్చేవి.
వాటిని చాలా తక్కువ సమయంలో పూర్తి చెయ్యాలి.
అప్పుడు మా అమ్మ నాకో పుస్తకం తెచ్చిచ్చింది, దాని పేరేంటంటే వైదిక గణితం.
స్వామి శ్రీ భారతీ కృష్ణ తీర్థ మహారాజు ఆ పుస్తకం రాశారు.
ఆవిడా పుస్తకంలో పదహారు సూత్రాల్ని ఇచ్చారు.
వాటివల్ల గణితం చాలా సులభంగా, చాలా తొందరగా పూర్తైపోయేది.
నేనా పుస్తకాన్ని చదివినప్పుడు నాకు చాలా ప్రేరణ కలిగింది.
తర్వాత నాకు మ్యాథమెటిక్స్ మీద ఇష్టత ఏర్పడింది.
అసలు మనకున్న ఆ విజ్ఞానాన్ని, ఆ బలాన్ని ప్రపంచం నలుమూలలా విస్తృత స్థాయిలో ప్రచారం చెయ్యొచ్చనిపించింది.
అందుకే నేను అప్పట్నుంచీ వైదిక గణితాన్ని ప్రపంచంలో మూలమూలలా ప్రచారం చెయ్యడం అనే ఓ మిషన్ కి చేపట్టి అందుకోసం ప్రయత్నిస్తున్నాను.
ఎందుకంటే ప్రతొక్కరూ లెక్కలంటే భయపడతారు కాబట్టి.
పైగా అసలు వైదిక గణితం కంటే తేలికైంది ఇంకేదైనా ఉంటుందా.
నరేంద్రమోడీ గౌరవ్ గారు మీరు ఎన్నేళ్లుగా దీనికోసం పనిచేస్తున్నారు.
గౌరవ్ దాదాపుగా ఇవ్వాళ్టికి ఇరవై ఏళ్లయ్యింది సార్. నేను పూర్తిగా ఇందులోనే ఉన్నాను.
నరేంద్రమోడీ మరి అవేర్ నెస్ కోసం ఏం చేస్తారు? ఏమేం ప్రయోగాలు చేస్తారు?
గౌరవ్ మేం స్కూళ్లకెళ్తాం. మేం ఆన్ లైన్ లో శిక్షణ ఇస్తాం.
మా సంస్థ పేరేంటంటే వైదిక్ మ్యాథ్స్ ఫోరమ్ ఇండియా.
ఆ సంస్థ ద్వారా మేము ఇంటర్ నెట్ మాధ్యమంలో ఇరవై నాలుగ్గంటలూ చదువు చెబుతాం సర్.
నరేంద్రమోడీ గౌరవ్ గారూ నాకసలెప్పుడూ పిల్లలతో మాట్లాడ్డం చాలా ఇష్టమని, పైగా నేను దానికోసం అవకాశాలు వెతుక్కుంటానని మీకు తెలుసుకదా. పైగా అసలు ఎగ్జామ్ వారియెర్ తో నేను పూర్తిగా ఓ విధంగా దాన్ని ఇనిస్టిట్యూషనలైజ్ చేసేశాను.
పైగా అసలు విషయం ఏంటంటే మనం పిల్లలతో మాట్లాడేటప్పుడు లెక్కల గురించి మాట్లాడితే చాలు చాలామంది పిల్లలు వెంటనే పారిపోతారు. అందుకే నేనేం చేస్తానంటే అలాంటి అనవసరపు భయాల్ని దూరం చేసేందుకు ప్రయత్నిస్తాను. అసలా భయాన్ని పోగొట్టాలి. అలాగే వాళ్లకి మనకి వారసత్వంగా లభించిన చిన్న చిన్న టెక్నిక్స్ ని చెప్పాలి. ఎందుకంటే భారతీయులకి లెక్కలంటే కొత్త విషయమేం కాదుగా. బహుశా ప్రపంచంలో ఉన్న అత్యంత పురాతనమైన రీతుల్లో భారత దేశానికి చెందిన గణిత శాస్త్ర రీతులుకూడా భాగమేనేమో. మకి ఎగ్జామ్ వారియెర్స్ మనసుల్లో ఉన్న భయాన్ని పోగొట్టడానికి మీరు వాళ్లకేం చెబుతారు?
గౌరవ్ సర్ ఇది పిల్లలకి అన్నింటికంటే ఎక్కువ ఉపయోగపడే విషయం. ఎందుకంటే అసలు పరీక్షలంటేనే చాలా భయపడిపోతారు పిల్లలు, వాళ్లకి చాలా అపోహలుంటాయా విషయంలో ప్రతి ఇంట్లోనూ. పరీక్షలకోసం పిల్లలు ట్యూషన్లకెళ్తారు. తల్లిదండ్రులు ఇబ్బందిపడుతుంటారు. అసలు మామూలు గణితంతో పోలిస్తే వేద గణితం పదిహేను వందల శాతం ఎక్కువ వేగవంతమైంది. అలాగే దానివల్ల పిల్లలకు చాలా కాన్ఫిడెన్స్ కలుగుతుంది. అలాగే మైండ్ కూడా చాలా బాగా పనిచేస్తుంది. అసలు మేం వైదిక గణితంతోపాటుగా యోగానికడా ఇంట్రడ్యూస్ చేశాం. దానివల్ల ఒకవేళ పిల్లలు కావాలనుకుంటే కళ్లుమూసుకుని కూడా కాలిక్యులేషన్ చేసేయొచ్చు వైదిక గణిత పద్ధతుల్లో.
నరేంద్రమోడీ నిజానికి అదెలాంటి ధ్యాన రీతి అంటే దాంట్లో ఆ విధంగా గణించడం కూడా ధ్యానంలో ఓ ప్రైమరీ కోర్సు కదా
గౌరవ్ అవును సర్
నరేంద్ర మోడీ సరే గౌరవ్ గారూ, మీరు దీన్ని మిషన్ మోడలో తీసుకోవడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అలాగే మీ అమ్మగారు మిమ్మల్ని ఓ గురువు రూపంలో ఈ దారిలోకి తీసుకొచ్చారు. అలాగే ఇవ్వాళ్ల మీరుకూడా లక్షలాది మంది పిల్లల్ని ఈ మార్గంలోకి తీసుకొస్తున్నారు. నా తరఫున మీకు హార్ధిక శుభాభినందనలు.
గౌరవ్ ధన్యవాదాలు సర్. మీరు వైదిక గణితానికి ఈ విధంగా ఇప్పుడు గుర్తింపుని తీసుకొచ్చేందుకు, దానికోసం నన్ను ఎంపిక చేసినందుకు నేను మీకు కృతజ్ఞతలు చెబుతున్నాను సర్. మేం మీకు ఋణపడి ఉన్నాం.
నరేంద్రమోడీ మీకు హార్థిక శుభాకాంక్షలు. నమస్కారం.
గౌరవ్ నమస్తే సర్.
మిత్రులారా గౌరవ్ గారు అసలు వైదిక గణితం సాధారణ గణితాన్ని ఏ విధంగా కష్టాన్ని ఇష్టంగా మారుస్తుందో చాలా చక్కగా చెప్పారు. అది మాత్రమే కాక వైదిక గణితం ద్వారా మీరు అతి పెద్ద ప్రాబ్లమ్స్ ని కూడా అత్యంత సులభంగా సాల్వ్ చెయ్యొచ్చు. అందుకే ప్రతొక్క తల్లీ తండ్రీ వైదిక గణితాన్ని తమ పిల్లలకి
నేర్పించాలని నేను కోరుకుంటున్నాను. దానివల్ల వాళ్లకి కాన్ఫిడెన్స్ పెరగడం మాత్రమే కాక వాళ్ల అనలెటికల్ పవర్ కూడా పెరుగుతుంది. పైగా ఏంటంటే లెక్కలనే పేరు చెప్పగానే కొందరు పిల్లల్లో ఉన్న కాస్తో కూస్తో భయం కూడా పూర్తిగా దూరమైపోతుంది.
ప్రియమైన మిత్రులారా ఇవ్వాళ్ల మనం మనసులో మాటలో మ్యూజియం నుంచి మ్యాథ్స్ వరకూ అనేక విధాలైన జ్ఞానాన్ని పెంపొందించే విషయాల గురించి చర్చించుకున్నాం. అసలీ విషయాలన్నీ మీ సూచనలవల్లే మనసులో మాటలో చోటు చేసుకుంటున్నాయి. నాకు మీరు ఇదే విధంగా ఇకపై కూడా మీ సలహాలు, సూచనలను నమో యాప్ మరియు మై గౌవ్ ల ద్వారా పంపిస్తూనే ఉండండి. రాబోయే రోజుల్లో దేశంలో ఈద్ పండగకూడా రాబోతోంది. మే మూడో తేదీన అక్షయ తృతీయ, అలాగే పరశురామ భగవానుడి జయంతిని కూడా జరుపుకుంటాం. కొన్ని రోజుల తర్వాత వైశాఖ శుద్ధ పౌర్ణమి పర్వదినంకూడా వస్తుంది. ఈ పండుగలన్నీ శాంతి, పవిత్రత, దానం అలాగే సహృదయతలను
పెంపొందించే పర్వాలే. మీకందరికీ ఈ పర్వాలకు సంబంధించి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ పండుగల్ని చాలా సంతోషంగా చాలా మంచి మనసుతో జరుపుకోండి. వాటితోపాటుగా మీరు కరోనా విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. మాస్క్ పెట్టుకోండి. నియమిత కాల వ్యవధుల్లో చేతులు సబ్బుతో కడుక్కుంటూ ఉండండి. దానినుంచి తప్పించుకోవడానికి ఉన్న ఉపాయాలన్నింటినీ మీరు
తప్పకుండా పాటించండి. మళ్లీ వచ్చేసారి మనసులో మాటలో మళ్లీ కలుసుకుందాం. అలాగే మీరు పంపించిన ఇంకొన్ని కొత్త విషయాల గురించి కూడా చర్చించుకుందాం. అప్పటిదాకా సెలవు తీసుకుంటాను. హృదయపూర్వక
ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. గత వారం మనందరిలో గర్వాన్ని నింపే ఒక ఘనతను సాధించాము. గత వారం భారతదేశం 400 బిలియన్ డాలర్ల అంటే 30 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని మీరు వినే ఉంటారు. మొదటి సారి వింటే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని అనిపిస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఇది భారతదేశ సామర్థ్యానికి, భారతదేశ శక్తికి సంబంధించిన విషయం. ఒకప్పుడు భారతదేశం నుండి ఎగుమతుల విలువ 100 బిలియన్లు. కొన్నిసార్లు 150 బిలియన్లు, కొన్నిసార్లు 200 బిలియన్లు, ఇప్పుడు భారతదేశం 400 బిలియన్ డాలర్ల విలువ ఉండే ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని దీని అర్థం. భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకు బలపడుతుందని కూడా దీని అర్థం. ఇందులో చాలా పెద్ద సందేశం కూడా ఉంది. కలల కంటే సంకల్పాలు పెద్దవి అయినప్పుడు దేశం గొప్ప అడుగులు వేస్తుంది. సంకల్పాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ సంకల్పాలు కూడా సాకారమవుతాయి. చూడండి.. వ్యక్తుల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. కలలకంటే సంకల్పాలు, ప్రయత్నాలు పెద్దవిగా మారినప్పుడు విజయం దానంతటదే వస్తుంది.
మిత్రులారా! దేశంలోని నలుమూలల నుండి కొత్త ఉత్పత్తులు విదేశాలకు వెళ్తున్నాయి . అస్సాంలోని హైలకండి నుండి లెదర్ ఉత్పత్తులు కావచ్చు లేదా ఉస్మానాబాద్ నుండి చేనేత ఉత్పత్తులు కావచ్చు, బీజాపూర్ నుండి పండ్లు , కూరగాయలు కావచ్చు లేదా చందౌలీ నుండి నల్ల బియ్యం కావచ్చు… వాటి ఎగుమతులు పెరుగుతున్నాయి. ఇప్పుడు లదదాఖ డఖ్‌లోని ప్రపంచ ప్రసిద్ధ యాప్రికాట్ దుబాయ్‌లో కూడా దొరుకుతుంది. తమిళనాడు నుండి పంపిన అరటిపండ్లు సౌదీ అరేబియాలో కూడా లభిస్తాయి. ఇప్పుడు కొత్త కొత్త ఉత్పత్తులను కొత్త కొత్త దేశాలకు పంపడం గొప్ప విషయం. ఉదాహరణకు ఉత్తరాఖండ్‌లోని హిమాచల్‌లో పండిన చిరుధాన్యాలు తొలి విడతగా డెన్మార్క్‌కు ఎగుమతయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, చిత్తూరు జిల్లాల నుంచి బంగనపల్లి, సువర్ణరేఖ మామిడి పండ్లను దక్షిణ కొరియాకు ఎగుమతి చేశారు. త్రిపుర నుండి తాజా పనసపండ్లను విమానంలో లండన్‌కు ఎగుమతి చేశారు. నాగాలాండ్‌కు చెందిన రాజా మిర్చ్‌ను మొదటిసారిగా లండన్‌కు పంపారు. అదేవిధంగా మొదటి దశలో భాలియా గోధుమలు గుజరాత్ నుండి కెన్యాకు, శ్రీలంకకు ఎగుమతి అయ్యాయి. అంటే ఇప్పుడు ఇతర దేశాలకు వెళితే మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు గతంలో కంటే ఎన్నో రెట్లు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
మిత్రులారా! ఈ జాబితా చాలా పొడవుగా ఉంది. ఈ జాబితా లాగే మేక్ ఇన్ ఇండియా శక్తి కూడా చాలా గొప్పది. భారతదేశం శక్తి కూడా అంత గొప్పది. దాని సామర్థ్యానికి ఆధారం మన రైతులు, మన చేతివృత్తులు, మన నేత కార్మికులు, మన ఇంజనీర్లు, మన చిన్న వ్యాపారవేత్తలు, మన MSME రంగం, అనేక విభిన్న వృత్తులకు చెందిన వ్యక్తులు. ఈ రంగాలు, ఈ వృత్తులు, ఈ రంగాల్లోని వ్యక్తులు దేశానికి నిజమైన బలం. వారి కృషి కారణంగా 400 బిలియన్ డాలర్ల ఎగుమతి లక్ష్య సాధన సాధ్యమైంది. భారతదేశ ప్రజల ఈ శక్తి ఇప్పుడు ప్రపంచంలోని ప్రతిమూలలో కొత్త మార్కెట్లను చేరుకోవడం నాకు సంతోషంగా ఉంది. ప్రతి భారతీయుడు స్థానిక ఉత్పత్తుల కోసం నినదిస్తే మన స్థానిక ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం కావడానికి ఎక్కువ సమయం పట్టదు. రండి.. స్థానికతను ప్రపంచవ్యాప్తం చేద్దాం. మన ఉత్పత్తుల ప్రతిష్ఠను మరింత పెంచుకుందాం.
మిత్రులారా! స్థానిక స్థాయిలో మన చిన్న వ్యాపారవేత్తల విజయం మనలో గర్వాన్ని నింపబోతోందని తెలుసుకుని 'మన్ కీ బాత్' శ్రోతలు సంతోషిస్తారు. ఈ రోజు మన చిన్న వ్యాపారవేత్తలు ప్రభుత్వ ఇ-మార్కెట్ ద్వారా ప్రభుత్వ సేకరణలో పెద్ద పాత్ర పోషిస్తున్నారు. టెక్నాలజీ ద్వారా చాలా పారదర్శకమైన వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రభుత్వ ఇ-మార్కెట్ పోర్టల్ – GeM- ద్వారా గత ఏడాది కాలంలో ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలకు పైగా విలువైన వస్తువులను కొనుగోలు చేసింది. దేశంలోని నలుమూలల నుంచి దాదాపు 1.25 లక్షల మంది చిన్నవ్యాపారులు, చిన్న దుకాణదారులు తమ వస్తువులను నేరుగా ప్రభుత్వానికి విక్రయించారు. ఒకప్పుడు పెద్ద కంపెనీలు మాత్రమే ప్రభుత్వానికి వస్తువులను విక్రయించేవి. కానీ ఇప్పుడు దేశం మారుతోంది- పాత వ్యవస్థలు కూడా మారుతున్నాయి. ఇప్పుడు చిన్న దుకాణదారు కూడా GeM పోర్టల్‌లో తన వస్తువులను ప్రభుత్వానికి విక్రయించవచ్చు - ఇది కొత్త భారతదేశం. పెద్దగా కలలు కనడమే కాదు- ఇంతకు ముందు ఎవరూ చేరుకోని లక్ష్యాన్ని చేరుకునే ధైర్యాన్ని కూడా చూపిస్తాడు. ఈ ధైర్యసాహసాల బలంతో భారతీయులమైన మనమందరం కలిసి స్వావలంబన భారతదేశ కలను కూడా ఖచ్చితంగా నెరవేరుస్తాం.
నా ప్రియమైన దేశప్రజలారా! మీరు ఇటీవల జరిగిన పద్మపురస్కారాల ప్రదాన వేడుకలో బాబా శివానంద్ జీని తప్పక చూసి ఉంటారు. 126 ఏళ్ల వృద్ధుడి చురుకుదనాన్నిచూసి, నాలాగే ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయి ఉంటారు. రెప్పపాటులో ఆయన నంది ముద్రలో నమస్కరించడం ప్రారంభించారు. నేను బాబా శివానంద్ జీకి పదే పదే వంగి నమస్కరించాను. బాబా శివానంద్ 126 ఏళ్ల వయస్సు, ఆయన ఫిట్నెస్- రెండూ ఇప్పుడు దేశంలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. బాబా శివానంద్ తన వయసు కంటే నాలుగు రెట్లు ఎక్కువ ఫిట్ గా ఉన్నారని సామాజిక మాధ్యమాల్లో చాలా మంది కామెంట్స్ చూశాను. నిజానికి బాబా శివానంద్ జీవితం మనందరికీ స్ఫూర్తిదాయకం. ఆయన దీర్ఘాయుష్షు పొందాలని కోరుకుంటున్నాను. ఆయనకు యోగా అంటే అభిరుచి ఎక్కువ. ఆయన చాలా ఆరోగ్యకరమైన జీవనశైలిని గడుపుతున్నారు.
జీవేం శరదః శతం|
మన సంస్కృతిలో ప్రతి ఒక్కరూ నిండు నూరేళ్లు ఆరోగ్యంగా జీవించాలని ఆకాంక్షిస్తారు. ఏప్రిల్ 7న 'ప్రపంచ ఆరోగ్య దినోత్సవం' జరుపుకుంటాం. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యం గురించి యోగ, ఆయుర్వేదం మొదలైన భారతీయ చింతన పెరుగుతోంది. గత వారం ఖతర్‌లో యోగా కార్యక్రమం నిర్వహించడం మీరు చూసి ఉంటారు. ఇందులో 114 దేశాల పౌరులు పాల్గొని సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. అదేవిధంగా ఆయుష్ పరిశ్రమ మార్కెట్ కూడా నిరంతరం పెరుగుతోంది. 6 సంవత్సరాల క్రితం ఆయుర్వేదానికి సంబంధించిన మందుల మార్కెట్ దాదాపు 22 వేల కోట్ల రూపాయలు. నేడు ఆయుష్ తయారీ పరిశ్రమ దాదాపు లక్షా నలభై వేల కోట్ల రూపాయలకు చేరుకుంటోంది. అంటే, ఈ రంగంలో అవకాశాలు నిరంతరం పెరుగుతున్నాయి. స్టార్టప్ ప్రపంచంలో కూడా ఆయుష్ ఆకర్షణీయంగా మారుతోంది.
మిత్రులారా! ఆరోగ్య రంగంలోని ఇతర స్టార్టప్‌ల గురించి నేను ఇంతకు ముందు చాలాసార్లు మాట్లాడాను. కానీ ఈసారి ప్రత్యేకంగా ఆయుష్ స్టార్ట్-అప్ల గురించి మీతో మాట్లాడతాను. ఇందులో ఒక స్టార్టప్ ‘కపివా’. దాని అర్థం దాని పేరులోనే ఇమిడిఉంది. ఇందులో క అంటే కఫ, పి అంటే పిత్త, వా అంటే వాత. ఈ స్టార్టప్ మన సంప్రదాయాల ప్రకారం ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటుంది. ఆయుర్వేద హెల్త్‌కేర్ ఎకోసిస్టమ్‌లో ఒక ప్రత్యేకమైన భావన అయిన నిరోగ్-స్ట్రీట్ అనే మరో స్టార్టప్ కూడా ఉంది. దీని సాంకేతికత ఆధారిత వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయుర్వేద వైద్యులను నేరుగా ప్రజలతో అనుసంధానిస్తుంది. 50 వేల మందికి పైగా అభ్యాసకులు ఈ స్టార్టప్ తో అనుసంధానమయ్యారు. అదేవిధంగా సంపూర్ణ ఆరోగ్య రంగంలో ఆత్రేయ ఇన్నోవేషన్స్ అనే మరో హెల్త్‌కేర్ టెక్నాలజీ స్టార్టప్ కూడా పనిచేస్తోంది. ఇగ్జొరియల్ (Ixoreal) అశ్వగంధ వాడకం గురించి అవగాహన కల్పించడమే కాకుండా అత్యున్నత నాణ్యత ఉన్న ఉత్పత్తుల తయారీ ప్రక్రియపై భారీ మొత్తాన్ని పెట్టుబడి పెట్టింది. ఆధునిక మూలికా పరిశోధన, సంప్రదాయ పరిజ్ఞానాన్ని మిళితం చేయడం ద్వారా క్యూర్ వేద సంపూర్ణ జీవితానికి ఆహార పదార్ధాలను రూపొందించింది.
మిత్రులారా! నేను ఇప్పటివరకు కొన్ని పేర్లను మాత్రమే పేర్కొన్నాను. ఈ జాబితా చాలా పెద్దది. ఇది భారతదేశంలోని యువ పారిశ్రామికవేత్తలకు, భారతదేశంలో ఏర్పడుతున్న కొత్త అవకాశాలకు చిహ్నం. ఆరోగ్య రంగంలోని స్టార్ట్-అప్లు, ముఖ్యంగా ఆయుష్ స్టార్ట్-అప్‌లను ఒక విషయం కోరుతున్నాను. మీరు ఆన్లైన్లో ఏ పోర్టల్‌ని తయారుచేసినా, ఏ కంటెంట్‌ను సృష్టించినా ఐక్యరాజ్యసమితి గుర్తించిన అన్ని భాషల్లో దాన్ని రూపొందించడానికి ప్రయత్నించండి. ఇంగ్లీషు అంతగా మాట్లాడని, అర్థం కాని దేశాలు ప్రపంచంలో చాలా ఉన్నాయి. అటువంటి దేశాలను కూడా దృష్టిలో ఉంచుకుని మీ సమాచారాన్ని ప్రచారం చేయండి. భారతదేశం నుండి మెరుగైన నాణ్యమైన ఉత్పత్తులతో ఆయుష్ స్టార్ట్-అప్లు త్వరలో ప్రపంచవ్యాప్తమవుతాయని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
మిత్రులారా! ఆరోగ్యం నేరుగా పరిశుభ్రతకు సంబంధించిన విషయం. 'మన్ కీ బాత్'లో పరిశుభ్రత కోసం కృషిచేసేవారి ప్రయత్నాలను మేం ఎప్పుడూ ప్రస్తావిస్తాం. అలాంటి స్వచ్ఛాగ్రహి చంద్రకిషోర్ పాటిల్ గారు. ఆయన మహారాష్ట్రలోని నాసిక్‌లో నివసిస్తున్నారు. పరిశుభ్రత విషయంలో చంద్రకిషోర్ జీ సంకల్పం చాలా లోతైనది. గోదావరి నది పక్కనే ఉంటూ నదిలో చెత్త వేయకుండా ప్రజలను ఆయన నిరంతరం ప్రోత్సహిస్తున్నారు. ఎవరైనా నదిలో చెత్త వేస్తుంటే వెంటనే ఆపుతారు. చంద్రకిషోర్ జీ ఈ పనిలో ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తారు. నదిలో విసిరేందుకు ప్రజలు తెచ్చిన అటువంటి వస్తువులన్నీ సాయంత్రానికి ఆయన దగ్గర చేరతాయి. చంద్రకిషోర్ జీ చేసిన ఈ ప్రయత్నం అవగాహనను కూడా పెంచుతుంది. స్ఫూర్తిని కూడా ఇస్తుంది. అదేవిధంగా, మరొక స్వచ్ఛాగ్రహి - ఒరిస్సాలోని పూరీకి చెందిన రాహుల్ మహారాణా. రాహుల్ ప్రతి ఆదివారం తెల్లవారుజామున పూరీలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లి అక్కడ ప్లాస్టిక్ చెత్తను శుభ్రం చేస్తుంటారు. ఇప్పటి వరకు వందల కిలోల ప్లాస్టిక్ చెత్తను, మురికిని శుభ్రం చేశారు. పూరీ రాహుల్ అయినా, నాసిక్కి చెందిన చంద్రకిషోర్ అయినా మనకు చాలా నేర్పుతారు. పరిశుభ్రత, పోషకాహారం లేదా టీకాకరణ – ఇలా సందర్భం ఏదైనా పౌరులుగా మనం మన విధులను నిర్వహించాలి. ఈ ప్రయత్నాలన్నీ ఆరోగ్యంగా ఉండటానికి మనకు సహాయపడతాయి.
నా ప్రియమైన దేశప్రజలారా! కేరళకు చెందిన ముపట్టం శ్రీ నారాయణన్ గారి గురించి మాట్లాడుకుందాం. 'జీవించేందుకు అవసరమయ్యే నీటి కోసం కుండలు' అనే ప్రాజెక్టును ఆయన ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ గురించి మీకు తెలిస్తే ఇది ఎంత అద్భుతమైన పని అని మీరు అనుకుంటారు.
మిత్రులారా! వేసవిలో జంతువులకు, పక్షులకు నీటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు ముపట్టం శ్రీ నారాయణన్ గారు మట్టి కుండలను పంపిణీ చేసేందుకు ప్రచారం నిర్వహిస్తున్నారు. వేసవిలో జంతువులు, పక్షుల సమస్యను చూసి ఆయన కలత చెందారు. అలాంటప్పుడు ఆ కుండల్లో నీళ్లు నింపే పని మాత్రమే ఇతరులకు ఉండేలా స్వయంగా మట్టి కుండల పంపిణీ ఎందుకు ప్రారంభించకూడదని అనుకున్నారు. నారాయణన్ గారు పంపిణీ చేసిన పాత్రల సంఖ్య లక్ష దాటబోతుందంటే మీరు ఆశ్చర్యపోతారు. తన ప్రచారంలో, గాంధీజీ స్థాపించిన సబర్మతి ఆశ్రమానికి లక్షవ పాత్రను విరాళంగా ఇవ్వనున్నారు. ఈరోజు వేసవి కాలం వచ్చిందంటే, నారాయణన్ గారు చేస్తున్న ఈ పని ఖచ్చితంగా మనందరికీ స్ఫూర్తినిస్తుంది. ఈ వేసవిలో మన జంతు, పక్షి స్నేహితులకు కూడా నీటిని ఏర్పాటు చేస్తాం.
మిత్రులారా! మన సంకల్పాలను తిరిగి గుర్తు తెచ్చుకోవలసిందిగా 'మన్ కీ బాత్' శ్రోతలను నేను కోరుతున్నాను. ప్రతి నీటి చుక్కను పొదుపు చేసేందుకు మనం చేయగలిగే పని చేయాలి. ఇది కాకుండా నీటి రీసైక్లింగ్ కు మనం సమాన ప్రాధాన్యతనిస్తూనే ఉండాలి. ఇంట్లో వినియోగించిన నీటిని కుండీల్లో వాడుకోవచ్చు. తోటపనిలో వాడుకోవచ్చు. ఆ నీటిని మళ్లీ వాడాలి. కొంచెం ప్రయత్నం చేస్తే మీరు మీ ఇంట్లో అలాంటి ఏర్పాట్లు చేయవచ్చు. రహీమ్‌దాస్ జీ శతాబ్దాల క్రితం 'రహిమన్ పానీ రాఖియే, బిన్ పానీ సబ్ సూన్' అని చెప్పారు. ఈ నీటి పొదుపు పనిలో నేను పిల్లలపై చాలా ఆశలు పెట్టుకున్నాను. మన పిల్లలు పరిశుభ్రతను ఒక ఉద్యమంలా చేసినట్టే వారు 'వాటర్ వారియర్'గా మారడం ద్వారా నీటి ఆదాలో సహకరించవచ్చు.
మిత్రులారా! మన దేశంలో నీటి సంరక్షణ, నీటి వనరుల పరిరక్షణ, శతాబ్దాలుగా సమాజ స్వభావంలో భాగం. దేశంలో చాలా మంది ప్రజలు నీటి సంరక్షణను జీవిత లక్ష్యంగా మార్చుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను. అరుణ్ కృష్ణమూర్తి చెన్నైకి చెందిన మిత్రుడు. అరుణ్ గారు తన ప్రాంతంలోని చెరువులు, సరస్సులను శుభ్రం చేసే ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు. 150కి పైగా చెరువులు, సరస్సులను శుద్ధి చేసే బాధ్యతను తీసుకుని విజయవంతంగా పూర్తి చేశారు. అదేవిధంగా మహారాష్ట్రకు చెందిన రోహన్ కాలే గారు కూడా కృషి చేస్తున్నారు. రోహన్ గారు వృత్తిరీత్యా హెచ్ఆర్ ప్రొఫెషనల్. మహారాష్ట్రలోని వందలాది దిగుడు బావులను పరిరక్షించేందుకు ఆయన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ బావులు చాలా వందల సంవత్సరాల నాటివి. అవి మన వారసత్వంలో భాగమయ్యాయి. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్ పేటలో ఉన్న బాగి కూడా అలాంటి దిగుడుబావుల్లో ఒకటి. ఏళ్ల తరబడి పట్టించుకోకపోవడంతో ఈ మెట్ల బావి మట్టితోనూ చెత్తతోనూ నిండిపోయింది. అయితే ఇప్పుడు ఈ దిగుడుబావిని పునరుద్ధరించాలనే ఉద్యమం ప్రజల భాగస్వామ్యంతో ప్రారంభమైంది.
మిత్రులారా! ఎప్పుడూ నీటి కొరత ఉండే రాష్ట్రం నుండి నేను వచ్చాను. గుజరాత్లో ఈ దిగుడు బావుల ను వావ్ అంటారు. గుజరాత్ లాంటి రాష్ట్రంలో వావ్ ప్రధాన భూమిక నిర్వహించాయి. ఈ దిగుడు బావులు లేదా మెట్ల బావుల రక్షణలో 'జల్ మందిర్ పథకం' ప్రముఖ పాత్ర పోషించింది. గుజరాత్ అంతటా అనేక మెట్ల బావులను పునరుద్ధరించారు. ఈ ప్రాంతాల్లో నీటి మట్టం పెరగడానికి ఇది చాలా దోహదపడింది.
మీరు స్థానికంగా కూడా ఇలాంటి ఉద్యమాలను నిర్వహించవచ్చు. చెక్ డ్యామ్‌లు కానివ్వండి, వాననీటి సంరక్షణ కానివ్వండి.. వీటిలో వ్యక్తిగత ప్రయత్నాలు కూడా ముఖ్యమైనవి. సామూహిక కృషి కూడా అవసరం. స్వతంత్ర్య భారత అమృతోత్సవాల్లో మన దేశంలోని ప్రతి జిల్లాలో కనీసం 75 అమృత్ సరోవరాలను తయారు చేయవచ్చు. కొన్ని పాత సరస్సులను బాగు చేయవచ్చు. కొన్ని కొత్త వాటిని నిర్మించవచ్చు. మీరు ఈ దిశలో తప్పకుండా కొంత ప్రయత్నం చేస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్' విశిష్టత, సౌందర్యం ఏమిటంటే మీ సందేశాలు అనేక భాషలలో, అనేక మాండలికాలలో నాకు అందుతాయి. చాలా మంది మై గవ్ లో ఆడియో సందేశాలను కూడా పంపుతారు. భారతదేశ సంస్కృతి, మన భాషలు, మాండలికాలు, మన జీవన విధానం, మన ఆహార పానీయాల విస్తరణ- ఈ వైవిధ్యాలన్నీ మనకు గొప్ప బలం. తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఈ వైవిధ్యం భారతదేశాన్ని ఒకదానితో ఒకటి అనుసంధానిస్తుంది. ‘ఏక్ భారత్ -శ్రేష్ట్ భారత్’ గా మారుస్తుంది. ఇందులో కూడా మన చారిత్రక ప్రదేశాలు, పురాణాలు - చాలా దోహదపడతాయి. నేను ఇప్పుడే మీతో ఈ విషయం ఎందుకు చెబుతున్నానని మీరు ఆలోచిస్తూ ఉంటారు. దీనికి కారణం ‘మాధవ్‌పూర్ మేళా’. మాధవపూర్ మేళా ఎక్కడ జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, భారతదేశ వైవిధ్యంతో ఆ మేళాకు ఎలా సంబంధం ఉందో తెలుసుకోవడం మన్ కీ బాత్ శ్రోతలకు చాలా ఆసక్తికరంగా ఉంటుంది.
మిత్రులారా! ‘మాధవ్‌పూర్ జాతర’ గుజరాత్‌లోని పోర్బందర్లో సముద్రానికి సమీపంలోని మాధవపూర్ గ్రామంలో జరుగుతుంది. కానీ ఇది భారతదేశం తూర్పు చివరతో కూడా కలుపుతుంది. ఇది ఎలా సాధ్యం అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. దీనికి సమాధానం కూడా ఒక పౌరాణిక కథ నుండి తెలుస్తుంది. వేల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు ఈశాన్యప్రాంత రాజకుమారి రుక్మిణిని వివాహం చేసుకున్నాడని చెప్తారు. ఈ వివాహం పోరుబందర్‌లోని మాధవపూర్‌లో జరిగింది. ఆ పెళ్ళికి గుర్తుగా ఈ రోజు కూడా మాధవపూర్ జాతర అక్కడ జరుగుతుంది. తూర్పు, పడమరల మధ్య ఉన్న ఈ లోతైన సంబంధం మన వారసత్వం. కాలంతో పాటు ఇప్పుడు ప్రజల కృషితో మాధవపూర్ జాతరకు కొత్తదనం కూడా తోడవుతోంది. వధువు వైపు వారిని ఘరాతీ అని పిలుస్తారు. ఇప్పుడు ఈశాన్య ప్రాంతాల నుండి చాలా మంది ఘరాతీలు ఈ జాతరకు రావడం ప్రారంభించారు. వారం రోజుల పాటు జరిగే మాధవపూర్ జాతరకు ఈశాన్య రాష్ట్రాల నుండి కళాకారులు చేరుకుంటారు. హస్తకళకు సంబంధించిన కళాకారులు వస్తారు. నలుగురు చంద్రుల వెన్నెలలాగా ఈ జాతర అందాలు పొందుతుంది. ఒక వారం పాటు భారతదేశ తూర్పు, పశ్చిమ సంస్కృతుల సమ్మేళనమైన ఈ మాధవపూర్ జాతర ఏక్ భారత్ - శ్రేష్ఠ భారత్‌కు చాలా అందమైన ఉదాహరణను సృష్టిస్తోంది. మీరు ఈ జాతర గురించి చదివి తెలుసుకోవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా! దేశంలో స్వాతంత్ర్య అమృతోత్సవం ఇప్పుడు ప్రజల భాగస్వామ్యానికి కొత్త ఉదాహరణగా మారుతోంది. కొద్ది రోజుల క్రితం అంటే మార్చి 23న అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశంలోని వివిధ ప్రాంతాల్లో అనేక వేడుకలు జరిగాయి. దేశం స్వాతంత్ర్యం సాధించిన వీరులను, వీరవనితలను భక్తిశ్రద్ధలతో స్మరించుకుంది. అదే రోజు కోల్‌కతాలోని విక్టోరియా మెమోరియల్‌లో విప్లవీ భారత్ గ్యాలరీని ప్రారంభించే అవకాశం కూడా నాకు లభించింది. భారతదేశంలోని వీర విప్లవకారులకు నివాళులర్పించేందుకు ఇది చాలా ప్రత్యేకమైన గ్యాలరీ. అవకాశం దొరికితే చూడడానికి తప్పకుండా వెళ్ళండి.
మిత్రులారా, ఏప్రిల్ నెలలో మనం ఇద్దరు మహానుభావుల జయంతిని కూడా జరుపుకుంటాం. వీరిద్దరూ భారతీయ సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపారు. ఈ మహనీయులు మహాత్మా ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్. ఏప్రిల్ 11న మహాత్మా ఫూలే జయంతిని, ఏప్రిల్ 14న బాబాసాహెబ్ జయంతిని జరుపుకుంటాం. ఈ మహానుభావులు ఇద్దరూ వివక్షకు, అసమానతలకు వ్యతిరేకంగా గొప్ప పోరాటం చేశారు. మహాత్మా ఫూలే ఆ కాలంలో ఆడపిల్లల కోసం పాఠశాలలు తెరిచారు. ఆడ శిశు హత్యలకు వ్యతిరేకంగా గళం విప్పారు. నీటి ఎద్దడి నుంచి బయటపడేందుకు పెద్దఎత్తున ఉద్యమాలు కూడా చేశారు.
మిత్రులారా! మహాత్మా ఫూలే గురించిన ఈ చర్చలో సావిత్రీబాయి ఫూలే గారి ప్రస్తావన కూడా అంతే ముఖ్యమైనది. అనేక సామాజిక సంస్థల ఏర్పాటులో సావిత్రీబాయి ఫూలే ప్రముఖ పాత్ర పోషించారు. ఉపాధ్యాయురాలిగా, సంఘ సంస్కర్తగా సమాజానికి అవగాహన కల్పించి ప్రోత్సహించారు. వారిద్దరూ కలిసి సత్యశోధక్ సమాజాన్ని స్థాపించారు. ప్రజల సాధికారత కోసం కృషి చేశారు. బాబాసాహెబ్ అంబేద్కర్ రచనలలో మహాత్మా ఫూలే ప్రభావాన్ని మనం స్పష్టంగా చూడవచ్చు. సమాజ అభివృద్ధిని ఆ సమాజంలో మహిళల స్థితిగతులను బట్టి అంచనా వేయవచ్చని కూడా ఆయన చెప్పేవారు. మహాత్మా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్ జీవితాలను స్ఫూర్తిగా తీసుకుని తల్లిదండ్రులు, సంరక్షకులందరూ తమ కుమార్తెలను చదివించాలని కోరుతున్నాను. ఆడపిల్లలను బడిలో చేర్పించడం కోసం కొద్దిరోజుల క్రితమే కన్యాశిక్ష ప్రవేశ ఉత్సవ్ కూడా ప్రారంభమైంది. కొన్ని కారణాల వల్ల చదువుకు దూరమైన ఆడపిల్లలను మళ్లీ పాఠశాలకు తీసుకురావడంపై శ్రద్ధ పెట్టడం జరుగుతోంది.
మిత్రులారా! బాబాసాహెబ్‌తో అనుబంధం ఉన్న పంచ తీర్థం కోసం పని చేసే అవకాశం కూడా లభించడం మనందరి అదృష్టం. మహూలోని ఆయన జన్మస్థలమైనా, ముంబైలోని చైత్యభూమి అయినా, లండన్‌లోని ఆయన నివాసమైనా, నాగ్‌పూర్ దీక్షా భూమి అయినా, ఢిల్లీలోని బాబాసాహెబ్ మహాపరినిర్వాణస్థలమైనా- అన్ని ప్రదేశాలను, అన్ని తీర్థాలను సందర్శించే భాగ్యం నాకు లభించింది. మహాత్మా ఫూలే, సావిత్రీబాయి ఫూలే, బాబాసాహెబ్ అంబేద్కర్‌లకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించాలని నేను 'మన్ కీ బాత్' శ్రోతలను కోరుతున్నాను. అక్కడ మీరు చాలా విషయాలు నేర్చుకోవచ్చు.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈసారి కూడా 'మన్ కీ బాత్'లో మనం అనేక అంశాలపై మాట్లాడుకున్నాం. వచ్చే నెలలో చాలా పండుగలు వస్తున్నాయి. కొన్ని రోజుల తర్వాత నవరాత్రులు వస్తున్నాయి. నవరాత్రులలో మనం ఉపవాసాలు చేస్తాం. శక్తి సాధన చేస్తాం. శక్తిని ఆరాధిస్తాం. అంటే మన సంప్రదాయాలు మనకు ఆనందాన్ని ఇవ్వడంతో పాటు నిగ్రహాన్ని నేర్పుతాయి. సంయమనం, పట్టుదల కూడా మనకు పర్వాలే. కాబట్టి నవరాత్రులు ఎప్పుడూ మనందరికీ చాలా ప్రత్యేకమైనవి. నవరాత్రుల మొదటి రోజున గుడి పడ్వా పండుగ కూడా ఉంది. ఈస్టర్ కూడా ఏప్రిల్‌లో వస్తుంది. రంజాన్ పవిత్ర రోజులు కూడా ప్రారంభమవుతాయి. అందరినీ ఏకతాటిపైకి తీసుకుని మన పండుగలను జరుపుకుందాం. భారతదేశ వైవిధ్యాన్ని బలోపేతం చేద్దాం. ఇదే అందరి కోరిక. ఈసారి 'మన్ కీ బాత్'లో ఇవే విషయాలు. కొత్త అంశాలతో వచ్చే నెలలో మళ్లీ కలుద్దాం. చాలా చాలా ధన్యవాదాలు !
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. మరోసారి 'మన్ కీ బాత్' కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మనం భారతదేశ విజయ ప్రస్తావనతో 'మన్ కీ బాత్' ప్రారంభిద్దాం. ఈ నెల మొదట్లో ఇటలీ నుండి తన విలువైన వారసత్వ సంపదను తిరిగి తీసుకురావడంలో భారతదేశం విజయవంతమైంది. ఇది ఒక వారసత్వ సంపద. వెయ్యి సంవత్సరాల కంటే పురాతనమైన అవలోకితేశ్వర పద్మపాణి విగ్రహం. ఈ విగ్రహం కొన్నేళ్ల క్రితం బీహార్‌లోని గయా జీ దేవస్థానం కుండల్పూర్ ఆలయం నుంచి చోరీ అయింది. అయితే ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇప్పుడు భారతదేశం ఈ విగ్రహాన్ని తిరిగి పొందింది. అదే విధంగా కొన్నేళ్ల క్రితం తమిళనాడులోని వేలూరులో హనుమంతుడి విగ్రహం చోరీకి గురైంది. ఈ హనుమాన్ విగ్రహం కూడా 600-700 సంవత్సరాల నాటిది. ఈ నెల ప్రారంభంలో దీన్ని ఆస్ట్రేలియాలో స్వీకరించాం. మన విశేష ప్రయత్నాల కారణంగా ఇది సాధ్యమైంది.
మిత్రులారా! వేలాది సంవత్సరాల మన చరిత్రలో దేశంలోని నలుమూలల్లో ఎప్పుడూ ఒకదాని తర్వాత ఒకటి విగ్రహాలు తయారవుతూ వచ్చాయి. ఇందులో శ్రద్ధ, సామర్థ్యం, నైపుణ్యం, వైవిధ్యం మిళితమై ఉన్నాయి. మన ప్రతి విగ్రహంలో ఆ కాలం నాటి చరిత్ర ప్రభావం కూడా కనిపిస్తుంది. అవి భారతీయ శిల్పకళకు అద్వితీయమైన ఉదాహరణలు మాత్రమే కాదు- మన విశ్వాసం కూడా అందులో మిళితమైంది. గతంలో చాలా విగ్రహాలు చోరీకి గురై భారత్ నుంచి వెళ్లిపోయాయి. కొన్నిసార్లు వివిధ దేశాల్లో ఆ విగ్రహాలను విక్రయించారు. వారికి అవి కళాఖండాలు మాత్రమే. వారికి దాని చరిత్రతో గానీ విశ్వాసాలతో గానీ ఎలాంటి సంబంధమూ లేదు. ఈ విగ్రహాలను తిరిగి తీసుకురావడం భారతమాత పట్ల మన బాధ్యత. ఈ విగ్రహాలలో భారతదేశ ఆత్మ ఉంది. విశ్వాసం ఉంది. వాటికి సాంస్కృతిక, చారిత్రక ప్రాముఖ్యత కూడా ఉంది. ఈ బాధ్యతను గ్రహించిన భారత్ తన ప్రయత్నాలను పెంచింది. దొంగతనం చేసే ప్రవృత్తిలో భయం కూడా దీనికి కారణం. ఈ విగ్రహాలను దొంగిలించి తీసుకెళ్లిన దేశాల వారు ఇప్పుడు భారత్‌తో సంబంధాలలో సున్నితత్వం విషయంలో దౌత్య మార్గంలో కూడా దీనికి గొప్ప ప్రాముఖ్యత ఉంటుందని భావించడం ప్రారంభించారు. దీనికి కారణం భారతదేశ భావాలు దానితో ముడిపడి ఉన్నాయి. భారతదేశ గౌరవం కూడా దానితో ముడిపడి ఉంది. ఒక విధంగా ఇది ప్రజల మధ్య సంబంధాలలో కూడా చాలా ప్రభావాన్ని కలిగిస్తుంది. కాశీలో చోరీకి గురైన అన్నపూర్ణాదేవి విగ్రహాన్ని కూడా తిరిగి తీసుకురావడం కొద్దిరోజుల క్రితమే మీరు చూసి ఉంటారు. భారతదేశం పట్ల ప్రపంచ దృక్పథం మారుతున్నదనడానికి ఇదొక ఉదాహరణ. 2013 సంవత్సరం వరకు దాదాపు 13 విగ్రహాలు భారతదేశానికి వచ్చాయి. అయితే గత ఏడేళ్లలో భారతదేశం విజయవంతంగా 200 కంటే ఎక్కువ విలువైన విగ్రహాలను తిరిగి తీసుకువచ్చింది. అమెరికా, బ్రిటన్, హాలండ్, ఫ్రాన్స్, కెనడా, జర్మనీ, సింగపూర్- ఇలా ఎన్నో దేశాలు భారత్ స్ఫూర్తిని అర్థం చేసుకుని విగ్రహాలను తిరిగి తీసుకురావడానికి సహకరించాయి. గతేడాది సెప్టెంబర్‌లో నేను అమెరికా వెళ్లినప్పుడు అక్కడ చాలా పురాతనమైన విగ్రహాలు, సాంస్కృతిక ప్రాధాన్యత కలిగిన ఎన్నో వస్తువులు లభ్యమయ్యాయి. దేశంలోని ఏదైనా విలువైన వారసత్వ సంపద తిరిగి వచ్చినప్పుడు చరిత్రపై గౌరవం ఉన్నవారు, పురావస్తు శాస్త్రంపై ఆసక్తి ఉన్నవారు; విశ్వాసం , సంస్కృతితో ముడిపడి ఉన్న వ్యక్తులు; భారతీయులుగా మనందరమూ సంతోషపడడం చాలా సహజం.
మిత్రులారా! భారతీయ సంస్కృతి, మన వారసత్వం గురించి మాట్లాడుతూ ఈ రోజు 'మన్ కీ బాత్'లో మీకు ఇద్దరిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఈ రోజుల్లో Facebook, Twitter, Instagramలలో వార్తల్లో ఉన్న ఆ ఇద్దరు టాంజానియన్ తోబుట్టువులు కిలీ పాల్, ఆయన సోదరి నీమా. మీరు కూడా వారి గురించి తప్పకుండా విని ఉంటారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వారికి భారతీయ సంగీతంపై అభిరుచి, మమకారం ఉన్నాయి. ఈ కారణంగా వారు చాలా ప్రజాదరణ పొందారు. పెదవులు కదిలించే విధానం చూస్తే వారు ఎంత కష్టపడుతున్నారో తెలుస్తుంది. ఈమధ్య రిపబ్లిక్ డే సందర్భంగా మన జాతీయ గీతం 'జన గణ మన'ను వారు ఆలపించిన వీడియో వైరల్‌గా మారింది. కొద్ది రోజుల క్రితం కూడా లతా దీదీకి ఓ పాట పాడి వారు ఆత్మీయ నివాళులర్పించారు. ఈ అద్భుతమైన సృజనాత్మకతకు ఈ ఇద్దరు తోబుట్టువులు కిలి, నీమాలను నేను చాలా అభినందిస్తున్నాను. కొద్ది రోజుల క్రితం టాంజానియాలోని భారత రాయబార కార్యాలయంలో కూడా వారిని సన్మానించారు. భారతీయ సంగీతంలోని మాయాజాలం అందరినీ ఆకట్టుకుంటుంది. నాకు గుర్తుంది- కొన్ని సంవత్సరాల కిందట ప్రపంచంలోని నూట యాభైకి పైగా దేశాల నుండి గాయకులు, సంగీతకారులు వారి వారి దేశాలలో, వారి వారి సాంప్రదాయిక ఆహార్యంతో పూజ్య బాపుకు ప్రియమైన- మహాత్మా గాంధీకి ఇష్టమైన కీర్తన 'వైష్ణవ జనతో' పాడడం ద్వారా ఒక విజయవంతమైన ప్రయోగం చేశారు.
నేడు భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల ముఖ్యమైన పండుగను జరుపుకుంటున్నప్పుడు దేశభక్తి గీతాలకు సంబంధించి ఇలాంటి ప్రయోగాలు చేయవచ్చు. విదేశీ పౌరులను, అక్కడి నుండి ప్రసిద్ధ గాయకులను భారతీయ దేశభక్తి గీతాలు పాడటానికి ఆహ్వానిద్దాం. ఇది మాత్రమే కాదు- మన దేశంలో అనేక భాషలలో చాలా రకాల పాటలు ఉన్నాయి. టాంజానియాలోని కిలీ, నీమా భారతదేశంలోని పాటలకు ఈ విధంగా పెదవులను కదపగలిగినట్టే ఎవరైనా గుజరాతీ పిల్లలు తమిళంలో చేయవచ్చు. కేరళ పిల్లలు అస్సామీ పాటలు చేయాలి. మరికొందరు కన్నడ పిల్లలు జమ్మూ కాశ్మీర్ పాటలు చేయాలి. మనం 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' అనుభూతి చెందగలిగే వాతావరణాన్ని సృష్టించుకోవచ్చు. ఇది మాత్రమే కాదు- మనం ఖచ్చితంగా స్వాతంత్ర్య అమృత మహోత్సవాలను కొత్త పద్ధతిలో జరుపుకోవచ్చు. నేను దేశంలోని యువతకు విజ్ఞప్తి చేస్తున్నాను. భారతీయ భాషలలోని ప్రసిద్ధ పాటలను మీకు తోచిన విధానంలో వీడియో తీయండి. మీరు బాగా పాపులర్ అవుతారు. దేశంలోని వైవిధ్యం కొత్త తరానికి పరిచయం అవుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! కొద్దిరోజుల క్రితం మనం మాతృభాషా దినోత్సవాన్ని జరుపుకున్నాం. మాతృభాష అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది, దాని వ్యుత్పత్తి ఏంటి అనే విషయాలపై విద్యా సంబంధమైన అంశాలను పండితులు చెప్పగలరు. మాతృభాషకు సంబంధించి నేను ఒకటే చెప్తాను- మన తల్లి మన జీవితాన్ని తీర్చిదిద్దే విధంగా మాతృభాష కూడా మన జీవితాన్ని తీర్చిదిద్దుతుంది. అమ్మ, మాతృభాష రెండూ జీవితపు పునాదిని పటిష్టం చేస్తాయి. చిరంజీవిని చేస్తాయి. మనం తల్లిని విడిచిపెట్టలేం. అలాగే మాతృభాషను కూడా వదలలేం. కొన్నాళ్ల కిందటి ఒక విషయం నాకు గుర్తుంది. నేను అమెరికా వెళ్ళినప్పుడు వివిధ కుటుంబాలను పరామర్శించే అవకాశం కలిగేది. ఒకసారి నేను తెలుగు కుటుంబాన్ని కలిసినప్పుడు అక్కడ చాలా సంతోషకరమైన దృశ్యాన్ని చూశాను. కుటుంబంలో ప్రతి ఒక్కరు ఎంత పనిఉన్నా ఊరి బయట లేకుంటే కుటుంబ సభ్యులంతా కలిసి రాత్రి భోజనం చేయాలని, భోజన సమయంలో తెలుగు భాషలో మాత్రమే మాట్లాడాలని నియమంగా పెట్టుకున్నట్టు వారు చెప్పారు. అక్కడ పుట్టిన పిల్లలకు కూడా ఇదే నియమం. మాతృభాషపై ఉన్న ఈ ప్రేమ కారణంగా ఈ కుటుంబం నన్ను ఎంతగానో ప్రభావితుడిని చేసింది.
మిత్రులారా! స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు గడిచినా కొందరు వ్యక్తులు తమ భాష, వేషధారణ, తిండి, పానీయాల పట్ల సంకోచంతో మానసిక సంఘర్షణలో బతుకుతున్నారు. అయితే ప్రపంచంలో మరెక్కడా ఇలా ఉండదు. మన మాతృభాషను మనం గర్వంగా మాట్లాడాలి. మన భారతదేశం భాషల పరంగా చాలా సమృద్ధమైంది. దాన్ని ఇతర దేశాలతో పోల్చలేం. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, కచ్ నుండి కోహిమా వరకు- వందలాది భాషలు, వేలాది మాండలికాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి. కానీ ఒకదానికొకటి కలిసిపోయాయి. భాషలు అనేకం. కానీ భావం ఒక్కటే. శతాబ్దాలుగా మన భాషలు తమను తాము మెరుగుపరుచుకుంటున్నాయి. ఒకదాని నుండి మరొకటి నేర్చుకుంటూ అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన భాష తమిళం భారతదేశంలోనే ఉంది. ప్రపంచంలోనే ఇంత గొప్ప వారసత్వ సంపద మనకు ఉన్నందుకు ప్రతి భారతీయుడు గర్వపడాలి. అదే విధంగా అనేక ప్రాచీన ధర్మ శాస్త్ర గ్రంథాల్లోని అభివ్యక్తి మన సంస్కృత భాషలో కూడా ఉంది. భారతదేశంలోని ప్రజలు సుమారుగా 121 అంటే 121 రకాల మాతృభాషలతో అనుబంధం కలిగి ఉండడం మనకు గర్వ కారణం. వీటిలో దైనందిన జీవితంలో 14 భాషలలో ఒక కోటి మందికి పైగా ప్రజలు సంభాషిస్తారు. అంటే అనేక యూరోపియన్ దేశాల మొత్తం జనాభా కంటే ఎక్కువ మంది ప్రజలు మన దేశంలో 14 వేర్వేరు భాషలతో అనుబంధం కలిగి ఉన్నారు. 2019 సంవత్సరంలో ప్రపంచంలో అత్యధికంగా మాట్లాడే భాషలలో హిందీ మూడవ స్థానంలో నిలిచింది. ప్రతి భారతీయుడు ఈ విషయంలో గర్వపడాలి. భాష అనేది భావ వ్యక్తీకరణ మాధ్యమం మాత్రమే కాదు. సమాజ సంస్కృతిని, వారసత్వాన్ని కాపాడేందుకు కూడా భాష ఉపయోగపడుతుంది. సుర్జన్ పరోహి గారు తన భాషా వారసత్వాన్ని కాపాడుకోవడానికి సూరినామ్‌లో ఇలాంటి పని చేస్తున్నారు. ఈ నెల 2వ తేదీన ఆయన 84వ ఏట అడుగుపెట్టారు. ఆయన పూర్వీకులు జీవనోపాధి కోసం వేలాది మంది కార్మికులతో పాటు చాలా ఏళ్ల కిందట సూరినామ్‌కు వెళ్లారు. సుర్జన్ పరోహి గారు హిందీలో చాలా మంచి కవిత్వం రాస్తారు. ఆయనకు అక్కడ జాతీయ కవులలో ఒకరిగా గుర్తింపు వచ్చింది. అంటే నేటికీ ఆయన గుండెల్లో హిందుస్థాన్ ధ్వని వినబడుతుంది. ఆయన రచనల్లో హిందుస్థానీ మట్టి సుగంధం ఉంది. సూరినామ్ ప్రజలు సుర్జన్ పరోహి పేరు మీద మ్యూజియం కూడా నిర్మించారు. 2015లో ఆయనను సన్మానించే అవకాశం రావడం నాకు చాలా ఆనందంగా ఉంది.
మిత్రులారా! ఈరోజు- అంటే ఫిబ్రవరి 27న మరాఠీ భాషాదినోత్సవం కూడా.
"సర్వ్ మరాఠీ బంధు భగినినా మరాఠీ భాషా దినాచ్యా హార్దిక్ శుభేచ్ఛా! "
ఈ రోజు మరాఠీ కవిరాజు విష్ణు బామన్ షిర్వాడ్కర్ జీ, శ్రీ కుసుమాగ్రజ్ జీకి అంకితం. ఈరోజు కుసుమాగ్రజ్ గారి జన్మదినం కూడా. కుసుమాగ్రజ్ గారు మరాఠీలో కవిత్వం రాశారు. అనేక నాటకాలు రాశారు. మరాఠీ సాహిత్యానికి ఔన్నత్యం కల్పించారు.
మిత్రులారా! భాషకు స్వీయ లక్షణాలు ఉన్నాయి. మాతృభాషకు దాని స్వీయ విజ్ఞానం ఉంది. ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకుని జాతీయ విద్యా విధానంలో స్థానిక భాషలో విద్యకు ప్రాధాన్యత ఇవ్వబడింది. మన వృత్తిపరమైన కోర్సులను కూడా స్థానిక భాషలోనే బోధించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. స్వాతంత్య్ర అమృత కాలంలో మనమందరం కలిసి ఈ ప్రయత్నానికి ఊపు ఇవ్వాలి. ఇది మన స్వాభిమాన కార్యం. మీరు ఏ మాతృభాష మాట్లాడినా దాని యోగ్యత గురించి తెలుసుకుని ఆ విషయంపై రాయాలి.
మిత్రులారా! కొన్ని రోజుల క్రితం నేను నా స్నేహితుడు, కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడింగా గారితో సమావేశమయ్యాను. ఈ సమావేశం ఆసక్తికరంగా, చాలా ఉద్వేగభరితంగా సాగింది. మనం చాలా మంచి స్నేహితులమైతే స్వేచ్ఛగా మాట్లాడతాం. మేమిద్దరం మాట్లాడుకుంటున్నప్పుడు ఒడింగా గారు తన కుమార్తె గురించి చెప్పాడు. ఆయన కుమార్తె రోజ్ మేరీకి బ్రెయిన్ ట్యూమర్ ఉంది. దాని కారణంగా ఆయన తన కుమార్తెకు శస్త్రచికిత్స చేయించవలసి వచ్చింది. అయితే దీని వల్ల ఒక దుష్ఫలితం ఏమిటంటే రోజ్ మేరీ కంటి చూపు దాదాపుగా పోయింది. ఆయన కుమార్తె పరిస్థితి ఎలా ఉందో మీరు ఊహించవచ్చు. మనం ఆ తండ్రి పరిస్థితిని కూడా ఊహించవచ్చు. ఆయన భావాలను అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆసుపత్రులలో తన కుమార్తె చికిత్స కోసం ఆయన తన వంతు ప్రయత్నం చేయని పెద్ద దేశం ప్రపంచంలోనే లేదు.
ప్రపంచంలోని పెద్ద పెద్ద దేశాల్లో వెతికినా ఫలితం లేకపోవడంతో ఓ విధంగా ఆశలన్నీ వదులుకున్నారు. దాంతో ఇల్లంతా నిస్పృహ వాతావరణం నెలకొంది. ఆయుర్వేద చికిత్స కోసం ఇండియాకు వెళ్లాలని ఎవరో సూచించారు. ఆయన చాలా చేశారు. అలసిపోయారు. “ఒకసారి ప్రయత్నిద్దాం. ఏమవుతుంది?” అనుకుని భారతదేశానికి వచ్చారు. కేరళలోని ఆయుర్వేద ఆసుపత్రిలో తన కుమార్తెకు చికిత్స చేయించడం ప్రారంభించారు. ఆయన కూతురు చాలా కాలం ఇక్కడే ఉండిపోయింది. ఆయుర్వేద చికిత్స ప్రభావం వల్ల రోజ్ మేరీ కంటి చూపు చాలా వరకు తిరిగి వచ్చింది. రోజ్ మేరీకి కొత్త జీవితం లభించినట్టు, ఆమె జీవితానికి కొత్త వెలుగు వచ్చినట్టు మీరు ఊహించవచ్చు. కానీ మొత్తం కుటుంబానికి ఒక కొత్త వెలుగు వచ్చింది. ఈ విషయం నాకు చెబుతున్నప్పుడు ఒడింగా గారు చాలా ఉద్వేగానికి లోనయ్యారు. భారతీయ ఆయుర్వేద పరిజ్ఞానాన్ని కెన్యాకు తీసుకెళ్లాలని ఆయన కోరుకుంటున్నారు. ఆయుర్వేదంలో వినియోగించే మొక్కలను పెంచి, మరింత మందికి ప్రయోజనం కలిగేలా కృషి చేస్తామన్నారు.
మన భూమి నుండి, సంప్రదాయం నుండి ఒకరి జీవితంలోని ఇంత గొప్ప బాధ తొలగిపోవడం నాకు చాలా సంతోషకరమైన విషయం. ఇది విని మీరు కూడా సంతోషిస్తారు. దాని గురించి గర్వించని భారతీయుడు ఎవరు ఉంటారు? ఒడింగా గారు మాత్రమే కాదు- ప్రపంచంలోని లక్షలాది ప్రజలు ఆయుర్వేదం నుండి ఇలాంటి ప్రయోజనాలను పొందుతున్నారని మనందరికీ తెలుసు.
బ్రిటన్ యువరాజు చార్లెస్ కూడా ఆయుర్వేదం అభిమానులలో ఒకరు. నేను ఆయనను కలిసినప్పుడల్లా ఆయన ఖచ్చితంగా ఆయుర్వేదం గురించి ప్రస్తావిస్తారు. ఆయనకు భారతదేశంలోని అనేక ఆయుర్వేద సంస్థల గురించి కూడా తెలుసు.
మిత్రులారా! గత ఏడేళ్లలో దేశంలో ఆయుర్వేద ప్రచారంపై చాలా శ్రద్ధ పెట్టారు. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఏర్పాటు మన సంప్రదాయ వైద్యాన్ని, ఆరోగ్య పద్ధతులను ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే మన సంకల్పాన్ని మరింత బలోపేతం చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఆయుర్వేద రంగంలో అనేక కొత్త స్టార్టప్‌లు పుట్టుకొచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఆయుష్ స్టార్టప్ ఛాలెంజ్ ఈ నెల మొదట్లో ప్రారంభమైంది. ఈ రంగంలో పనిచేస్తున్న స్టార్టప్‌లను గుర్తించడం, వాటికి సహకారం ఇవ్వడం ఈ ఛాలెంజ్ లక్ష్యం. ఈ రంగంలో పనిచేస్తున్న యువత తప్పనిసరిగా ఈ ఛాలెంజ్‌లో పాల్గొనవలసిందిగా కోరుతున్నాను.
మిత్రులారా! ప్రజలు కలిసి ఏదైనా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, వారు అద్భుతమైన పనులు చేస్తారు. సమాజంలో ఇలాంటి పెద్ద మార్పులు ఎన్నో వచ్చాయి. అందులో ప్రజల భాగస్వామ్యం, సమిష్టి కృషి పెద్ద పాత్ర పోషించాయి. కశ్మీర్‌లోని శ్రీనగర్‌లో ‘మిషన్ జల్ థల్’ పేరుతో అలాంటి ప్రజా ఉద్యమం జరుగుతోంది. శ్రీనగర్‌లోని సరస్సులను, చెరువులను శుభ్రపరిచి వాటి పాత వైభవాన్ని పునరుద్ధరించడానికి ఇది ఒక ప్రత్యేకమైన ప్రయత్నం. ‘మిషన్ జల్ థల్’ దృష్టి కుశల్ సార్, గిల్ సార్ లపై ఉంది. ఇందులో ప్రజల భాగస్వామ్యంతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఎక్కడెక్కడ ఆక్రమణలు జరిగాయో, ఎక్కడెక్కడ అక్రమ నిర్మాణాలు జరిగాయో తెలుసుకునేందుకు ఈ ప్రాంతంలో సర్వే చేయించారు. దీనితో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించడం, వ్యర్థాలను శుభ్రం చేయడం వంటి ప్రచారాన్ని కూడా ప్రారంభించారు. మిషన్ రెండవ దశలో పాత నీటి కాలువలు, సరస్సులను నింపే 19 జలపాతాలను పునరుద్ధరించడానికి కూడా చాలా ప్రయత్నాలు జరిగాయి. ఈ పునరుద్ధరణ ప్రాజెక్ట్ ప్రాముఖ్యత గురించి మరింత అవగాహన కల్పించడానికి స్థానిక ప్రజలను, యువతను నీటి రాయబారులుగా మార్చారు. ఇప్పుడు ఇక్కడి స్థానిక ప్రజలు కూడా గిల్ సార్ సరస్సులో వలస పక్షులు, చేపల సంఖ్యను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు ఇది చూసి సంతోషిస్తున్నారు. ఈ అద్భుతమైన ప్రయత్నానికి శ్రీనగర్ ప్రజలను నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా! ఎనిమిదేళ్ల కిందట దేశం ప్రారంభించిన ‘స్వచ్చ భారత్ మిషన్' విస్తరణ కాలంతో పాటు పెరిగింది. కొత్త ఆవిష్కరణలు కూడా అనుసంధానమయ్యాయి. మీరు భారతదేశంలో ఎక్కడికి వెళ్లినా, ప్రతిచోటా పరిశుభ్రత కోసం కొంత ప్రయత్నం జరుగుతుందని మీకు తెలుస్తుంది. అస్సాంలోని కోక్రాఝర్‌లో అలాంటి ఒక ప్రయత్నం గురించి నాకు తెలిసింది. ఇక్కడ మార్నింగ్ వాకర్స్ బృందం ఒకటి 'క్లీన్ అండ్ గ్రీన్ కోక్రాఝర్' మిషన్ కింద చాలా ప్రశంసనీయమైన చొరవ తీసుకుంది. వీరంతా కొత్త ఫ్లైఓవర్ ప్రాంతంలోని మూడు కిలోమీటర్ల పొడవునా రోడ్డును శుభ్రం చేసి స్వచ్ఛత స్ఫూర్తి సందేశాన్ని అందించారు. అదేవిధంగా విశాఖపట్నంలో ‘స్వచ్ఛ భారత్ అభియాన్’ కింద పాలిథిన్‌కు బదులు గుడ్డ సంచులు వినియోగించాలని ప్రచారం చేస్తున్నారు. ఇక్కడి ప్రజలు పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులకు వ్యతిరేకంగా కూడా ప్రచారం చేస్తున్నారు. దీంతో పాటు వ్యర్థాలను ఇంటి వద్దే వేరుచేయాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ముంబాయిలోని సోమయ్య కాలేజీ విద్యార్థులు తమ పరిశుభ్రత ప్రచారంలో సౌందర్యాన్ని కూడా చేర్చారు. కళ్యాణ్ రైల్వే స్టేషన్ గోడలను అందమైన పెయింటింగ్స్‌తో అలంకరించారు. రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్ స్ఫూర్తిదాయకమైన ఉదాహరణ కూడా నాకు తెలిసింది. ఇక్కడి యువత రణథంబోర్‌లో 'మిషన్ బీట్ ప్లాస్టిక్' పేరుతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఇందులో రణథంబోర్ అడవుల్లో ప్లాస్టిక్, పాలిథిన్ లను తొలగించారు. ప్రతి ఒక్కరి కృషిలోని ఈ స్ఫూర్తి దేశంలో ప్రజల భాగస్వామ్యాన్ని బలపరుస్తుంది. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు అతిపెద్ద లక్ష్యాలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి.
నా ప్రియమైన దేశవాసులారా! నేటి నుండి కొద్ది రోజులకే మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్నారు. 'మన్ కీ బాత్'లో మనం మహిళల సాహసాలు, నైపుణ్యం, ప్రతిభకు సంబంధించిన అనేక ఉదాహరణలను పంచుకుంటున్నాము. నేడు స్కిల్ ఇండియా అయినా, స్వయం సహాయక బృందాలయినా, చిన్న, పెద్ద పరిశ్రమలైనా అన్ని చోట్లా మహిళలు ముందున్నారు. ఎక్కడ చూసినా మహిళలు పాత అపోహలను ఛేదిస్తున్నారు. నేడు మన దేశంలో మహిళలు పార్లమెంట్ నుంచి పంచాయతీల వరకు వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలు పొందుతున్నారు. సైన్యంలో కూడా అమ్మాయిలు ఇప్పుడు ఉన్నత స్థానాలలో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దేశాన్ని కాపాడుతున్నారు. గత నెల గణతంత్ర దినోత్సవం రోజున అమ్మాయిలు కూడా ఆధునిక యుద్ధ విమానాలను ఎగురవేయడం చూశాం. సైనిక్ పాఠశాలల్లో అమ్మాయిల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని దేశం తొలగించింది. దేశవ్యాప్తంగా ఉన్న సైనిక్ పాఠశాలల్లో ఇప్పుడు అమ్మాయిలు ప్రవేశం పొందుతున్నారు. అదేవిధంగా మన స్టార్ట్-అప్ ప్రపంచాన్ని చూడండి. గత సంవత్సరాలలో దేశంలో వేలాది కొత్త స్టార్టప్‌లు ప్రారంభమయ్యాయి. ఈ స్టార్టప్‌లలో దాదాపు సగం మహిళలే నిర్వహిస్తున్నవి ఉన్నాయి. ఈ మధ్య కాలంలో మహిళలకు ప్రసూతి సెలవుల పెంపు వంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అబ్బాయిలు, అమ్మాయిలకు సమాన హక్కులు కల్పిస్తూ పెళ్లి వయసును సమానం చేసేందుకు దేశం ప్రయత్నిస్తోంది. దీంతో ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం పెరుగుతోంది. దేశంలో జరుగుతున్న మరో పెద్ద మార్పును మీరు తప్పక చూస్తారు. ఈ మార్పు మన సామాజిక ప్రచారాల విజయం. 'బేటీ బచావో, బేటీ పడావో' విజయాన్ని తీసుకోండి.. దీని ద్వారా నేడు దేశంలో లింగ నిష్పత్తి మెరుగుపడింది. పాఠశాలలకు వెళ్లే బాలికల సంఖ్య కూడా మెరుగుపడింది. మన అమ్మాయిలు మధ్యలోనే చదువు మానేయకుండా చూడాల్సిన బాధ్యత కూడా మనపై ఉంది. అదేవిధంగా 'స్వచ్ఛ్ భారత్ అభియాన్' కింద దేశంలోని మహిళలు బహిరంగ మలవిసర్జన నుండి విముక్తి పొందారు. ముమ్మారు తలాక్ లాంటి సామాజిక దురాచారం కూడా అంతం కాబోతోంది. ట్రిపుల్ తలాక్‌కు వ్యతిరేకంగా చట్టం వచ్చినప్పటి నుంచి దేశంలో ఈ కేసులు 80 శాతం తగ్గాయి. ఇంత తక్కువ సమయంలో ఈ మార్పులన్నీ ఎలా జరుగుతున్నాయి? మన దేశంలో మార్పుకు, ప్రగతిశీల ప్రయత్నాలకు ఇప్పుడు మహిళలే నాయకత్వం వహిస్తున్నారు కాబట్టి ఈ మార్పు వస్తోంది.
నా ప్రియమైన దేశ వాసులారా! రేపు ఫిబ్రవరి 28న 'నేషనల్ సైన్స్ డే'. ఈ రోజు రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణకు కూడా ప్రసిద్ధి చెందింది. నేను సివి రామన్ గారితో పాటు మన వైజ్ఞానిక యాత్రను సుసంపన్నం చేయడంలో ప్రధానపాత్ర పోషించిన శాస్త్రవేత్తలందరికీ నేను గౌరవపూర్వక నివాళులర్పిస్తున్నాను. మిత్రులారా! సాంకేతికత మన జీవితంలో సులభంగా, సరళంగా ఎక్కువ పాత్ర సంపాదించింది. ఏ సాంకేతికత మంచిది, ఏ సాంకేతికత ఉత్తమ వినియోగం ఏమిటి, -ఈ విషయాలన్నీ మనకు బాగా తెలుసు. కానీ, మన కుటుంబంలోని పిల్లలకు ఆ సాంకేతికతకు ఆధారం ఏమిటి, దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటి అనే విషయాలను వివరించడం పైకి మన దృష్టి వెళ్లడం లేదన్నది కూడా నిజం. ఈ సైన్స్ దినోత్సవం సందర్భంగా కుటుంబాలన్నీ తమ పిల్లలలో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడాన్ని చిన్న చిన్న ప్రయత్నాలతో తప్పకుండా ప్రారంభించాలని నేను కోరుతున్నాను.
ఉదాహరణకి ఇప్పుడు సరిగ్గా కనబడడం లేదు కానీ కళ్లద్దాలు పెట్టుకున్నాక కనిపిస్తోంది.. దీని వెనుక ఉన్న శాస్త్రం ఏమిటో పిల్లలకు సులభంగా వివరించవచ్చు. కేవలం ‘అద్దాలు చూడండి- ఆనందించండి’ అనడం మాత్రమే కాదు. మీరు ఒక చిన్న కాగితంపై వారికి చెప్పవచ్చు. ఇప్పుడు వారు మొబైల్ ఫోన్ ఉపయోగిస్తున్నారు. కాలిక్యులేటర్ ఎలా పని చేస్తుంది, రిమోట్ కంట్రోల్ ఎలా పని చేస్తుంది, సెన్సార్లు ఏమిటి? ఇలాంటి సైంటిఫిక్ విషయాలు ఇంట్లో చర్చిస్తారా? ఇంటి దైనందిన జీవితం వెనుక ఉన్న ఈ విషయాలను మనం సులభంగా వివరించవచ్చు. అది ఏమి చేస్తుందో దాని వెనుక ఉన్న సైన్స్ ఏమిటో చెప్పవచ్చు. అదే విధంగా మనం ఎప్పుడైనా పిల్లలతో కలిసి ఆకాశాన్ని పరిశీలించామా? రాత్రిపూట నక్షత్రాల గురించి మాట్లాడాలి. వివిధ రకాల నక్షత్రరాశులు కనిపిస్తాయి. వాటి గురించి చెప్పండి. ఇలా చేయడం ద్వారా మీరు పిల్లలలో భౌతిక శాస్త్రం, ఖగోళ శాస్త్రం పట్ల ఆసక్తిని కలిగించవచ్చు. ఈ రోజుల్లో, చాలా యాప్‌లు కూడా ఉన్నాయి. వాటి నుండి మీరు నక్షత్రాలను, గ్రహాలను గుర్తించవచ్చు లేదా ఆకాశంలో కనిపించే నక్షత్రాన్ని మీరు గుర్తించవచ్చు. దాని గురించి కూడా మీరు తెలుసుకోవచ్చు. దేశ నిర్మాణానికి సంబంధించిన పనిలో మీ నైపుణ్యాలు , శాస్త్రీయ స్వభావాన్ని ఉపయోగించాలని మన స్టార్టప్ ఆవిష్కర్తలకు నేను చెప్తాను. దేశం పట్ల మన సమష్టి శాస్త్రీయ బాధ్యత కూడా ఇదే. ఈ రోజుల్లో మన స్టార్టప్‌లు వర్చువల్ రియాలిటీ ప్రపంచంలో చాలా మంచి పని చేస్తున్నాయని నేను చూస్తున్నాను. వర్చువల్ తరగతుల ఈ యుగంలో పిల్లలను దృష్టిలో ఉంచుకుని అటువంటి వర్చువల్ ల్యాబ్‌ను తయారు చేయవచ్చు. మనం వర్చువల్ రియాలిటీ ద్వారా పిల్లలను ఇంట్లో కూర్చొని కెమిస్ట్రీ ల్యాబ్‌ను అనుభవించేలా చేయవచ్చు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు నా అభ్యర్థన ఏమిటంటే విద్యార్థులు , పిల్లలందరినీ ప్రశ్నలు అడగడానికి ప్రోత్సహించండి. వారితో కలిసి ప్రశ్నలకు సరైన సమాధానాలు కనుగొనండి. కరోనాపై పోరాటంలో భారతీయ శాస్త్రవేత్తల పాత్రను కూడా ఈ రోజు నేను అభినందించాలనుకుంటున్నాను. వారి కృషి కారణంగానే మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్‌ను తయారు చేయడం సాధ్యమైంది. ఇది ప్రపంచం మొత్తానికి ఎంతగానో ఉపయోగపడింది. ఇది మానవాళికి సైన్స్ అందించిన బహుమతి.
నా ప్రియమైన దేశవాసులారా! ఈసారి కూడా మనం అనేక అంశాలపై చర్చించాం. మార్చి నెలలో అనేక పండుగలు వస్తున్యి. శివరాత్రి వస్తోంది. ఆ తర్వాత కొన్ని రోజులకు మీరందరూ హోలీ కోసం సిద్ధం కావడం ప్రారంభిస్తారు. హోలీ మనల్ని కలిపే పండుగ. ఇందులో మనవాడు -పరాయివాడు, చిన్న- పెద్ద అనే తేడాలన్నీ తుడిచిపెట్టుకుపోతాయి. ద్వేషాలు-విద్వేషాలు దూరమవుతాయి. అందుకే హోలీకి ఉన్న ప్రేమ, సామరస్యాలు హోలీ రంగుల కంటే గాఢమైనవని అంటారు. హోలీలో తీయనైన కజ్జికాయలతో పాటు, సంబంధాలలో కూడా ప్రత్యేకమైన మాధుర్యం ఉంటుంది. మనం ఈ సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలి. మన కుటుంబంలోని వ్యక్తులతో మాత్రమే కాకుండా మీ విస్తృత కుటుంబంలో భాగమైన వారితో కూడా సంబంధాలు బలోపేతం చేసుకోవాలి. దీన్ని చేయడానికి అత్యంత ముఖ్యమైన మార్గం కూడా మీరు గుర్తుంచుకోవాలి. 'వోకల్ ఫర్ లోకల్'తో పండుగ జరుపుకోవడమే ఈ మార్గం. పండుగల సందర్భంగా మీరు స్థానిక ఉత్పత్తులను కొనుగోలు చేయాలి. తద్వారా మీ చుట్టూ నివసించే ప్రజల జీవితాలను కూడా వర్ణమయం చేయవచ్చు. ఉత్సాహం నింపవచ్చు. మన దేశం కరోపై విజయంసాధిస్తూ ముందుకు సాగడంతో, పండుగలలో ఉత్సాహం కూడా చాలా రెట్లు పెరిగింది. ఈ ఉత్సాహంతో మనం పండుగలు జరుపుకోవాలి. అదే సమయంలో మనం జాగ్రత్తగా కూడా ఉండాలి. రానున్న పండుగల సందర్భంగా నేను మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్ను. నేను ఎప్పుడూ మీ మాటలు, మీ ఉత్తరాలు, మీ సందేశాల కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మీకు చాలా చాలా ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మనం 'మన్ కీ బాత్' మరో ఎపిసోడ్లో కలుసుకుంటున్నాం. 2022లో ఇది మొదటి 'మన్ కీ బాత్'. ఈ రోజు మనం మన దేశం, దేశప్రజల సానుకూల ప్రేరణలు, సమిష్టి ప్రయత్నాలకు సంబంధించిన చర్చలను మళ్లీ ముందుకు తీసుకెళదాం. ఈరోజు మన పూజ్య బాపు మహాత్మా గాంధీ గారి వర్ధంతి కూడా. ఈ జనవరి 30వ తేదీ మనకు బాపు బోధనలను గుర్తు చేస్తుంది. కొద్ది రోజుల క్రితమే రిపబ్లిక్ డే జరుపుకున్నాం. ఢిల్లీలోని రాజ్‌పథ్‌లో మనం చూసిన దేశ శౌర్య సామర్థ్యాలు ప్రతి ఒక్కరిలో గర్వం, ఉత్సాహాన్ని నింపాయి. మీరు తప్పక చూడవలసిన మార్పులుఇప్పుడు గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జనవరి 23వ తేదీ నుండి ప్రారంభమయ్యాయి. అంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంత్యుత్సవం నాడు ప్రారంభమై జనవరి 30 వరకు అంటే గాంధీజీ వర్ధంతి వరకు కొనసాగుతాయి. ఇండియా గేట్ వద్ద నేతాజీ డిజిటల్ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. దీన్ని దేశం స్వాగతించిన తీరును, దేశంలోని నలుమూలల నుంచి వెల్లువెత్తిన ఆనందోత్సాహాలను, ప్రతి దేశస్థుడు వ్యక్తం చేసిన భావాలను మనం ఎప్పటికీ మరచిపోలేం.
మిత్రులారా! ఈ ప్రయత్నాల ద్వారా దేశం తన జాతీయ చిహ్నాలను స్వాతంత్ర్య అమృత మహోత్సవాల్లో పున: ప్రతిష్టించుకుంటుంది. ఇండియా గేట్ దగ్గర ఉన్న 'అమర్ జవాన్ జ్యోతి'ని, సమీపంలోని 'నేషనల్ వార్ మెమోరియల్' వద్ద వెలిగించిన జ్యోతినిఏకం చేశాం. ఈ ఉద్వేగభరితమైన సంఘటన సందర్భంగా పలువురు దేశప్రజలు, అమరవీరుల కుటుంబాల కళ్లలో నీళ్లు తిరిగాయి.'నేషనల్ వార్ మెమోరియల్'లోస్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండిఅమరులైన దేశంలోని వీరులందరి పేర్లను చెక్కారు. ‘అమర జవాన్ల స్మృతి చిహ్నం ముందు వెలిగించే ‘అమర్ జవాన్ జ్యోతి’ అమరవీరుల అమరత్వానికి ప్రతీక’ అని కొందరు మాజీ సైనికులు నాకు లేఖ రాశారు. నిజంగా 'అమర్ జవాన్ జ్యోతి' లాగా మన అమరవీరులు, వారి స్ఫూర్తి, వారి త్యాగం కూడా అజరామరం.మీకు అవకాశం దొరికినప్పుడల్లా 'నేషనల్ వార్ మెమోరియల్'ని తప్పక సందర్శించండని నేను మీ అందరినీ కోరుతున్నాను. మీ కుటుంబాన్ని, పిల్లలను కూడా తీసుకెళ్లండి. ఇక్కడ మీరు భిన్నమైన శక్తిని, స్ఫూర్తిని అనుభవిస్తారు.
మిత్రులారా!ఈ అమృత్ మహోత్సవ్ వేడుకల మధ్య దేశంలో చాలా ముఖ్యమైన జాతీయ అవార్డుల ప్రదానం కూడా జరిగింది. వీటిలో ఒకటి ప్రధానమంత్రి జాతీయ బాలల పురస్కారం. చిన్నవయసులో సాహసోపేతమైన, స్ఫూర్తిదాయకమైన పనులు చేసిన పిల్లలకు ఈ అవార్డులను అందజేస్తారు. ఈ పిల్లల గురించి మనమందరం మన ఇళ్లలో చెప్పాలి. ఇవి మన పిల్లలకు కూడా స్ఫూర్తినిస్తాయి. దేశానికి పేరు తేవాలనే ఉత్సాహాన్ని వారిలో నింపుతాయి. దేశంలో పద్మ అవార్డులను కూడా ప్రకటించారు. పద్మ అవార్డుల గ్రహీతలలోచాలా తక్కువ మందికి తెలిసిన వారు కూడా ఉన్నారు. ఇప్పటివరకు వెలుగులోకి రాని ఈ వీరులు సాధారణ పరిస్థితులలో అసాధారణమైన పనులు చేశారు. ఉదాహరణకుఉత్తరాఖండ్‌కు చెందిన బసంతీ దేవి గారికి పద్మశ్రీ ప్రకటించారు. బసంతీ దేవి గారు తన జీవితమంతా పోరాటాల మధ్యనే గడిపారు. చిన్నతనంలోనే భర్త చనిపోవడంతో ఆశ్రమంలో నివసించారు.అక్కడే ఉంటూ నదిని కాపాడేందుకు పోరాడి పర్యావరణానికి విశేష కృషి చేశారు. మహిళా సాధికారత కోసం కూడా ఆమె చాలా కృషి చేశారు. అదేవిధంగామణిపూర్‌కు చెందిన 77 ఏళ్ల లౌ రెంబమ్ బీనో దేవిగారు దశాబ్దాలుగా మణిపూర్‌లోని లిబా వస్త్ర కళను సంరక్షిస్తున్నారు. ఆమెకుకూడాపద్మశ్రీ అవార్డు లభించింది.బైగా గిరిజన నృత్య కళకు ప్రాచుర్యం కల్పించినందుకు మధ్యప్రదేశ్‌కు చెందిన అర్జున్ సింగ్ గారు పద్మ అవార్డును పొందారు. పద్మ పురస్కారం పొందిన మరొకరు అమాయ్ మహాలింగ నాయక్గారు.ఆయన కర్నాటకకు చెందిన రైతు. కొంతమంది ఆయనను టన్నెల్ మ్యాన్ అని కూడా పిలుస్తారు. అందరూ ఆశ్చర్యపోయేవిధంగా వ్యవసాయంలో ఆయన ఆవిష్కరణలు చేశారు. ఆయన యత్నాల వల్లచిన్న రైతులు పెద్ద ఎత్తున లబ్ది పొందుతున్నారు. ఇలా బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని వీరులు ఇంకా ఎందరో ఉన్నారు. వారు చేసిన కృషిని దేశం గౌరవించింది. మీరు వారి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి. వారి నుండి మనం జీవితంలో చాలా నేర్చుకోవచ్చు.
నా ప్రియమైన దేశప్రజలారా! అమృత్ మహోత్సవ్‌లో మీరందరూ నాకు చాలా ఉత్తరాలు, సందేశాలు పంపుతున్నారు. చాలా సలహాలు కూడా ఇస్తున్నారు. ఈ సిరీస్‌లో ఎన్నో మరిచిపోలేని విషయాలు జరిగాయి. కోటి మందికి పైగా పిల్లలు తమ 'మన్ కీ బాత్'ను పోస్ట్ కార్డ్‌ల ద్వారా నాకు రాసి పంపారు. ఈ కోటి పోస్ట్ కార్డులు దేశంలోని వివిధ ప్రాంతాలతో పాటు విదేశాల నుండి కూడా వచ్చాయి. నేను ఈ పోస్ట్‌కార్డులలో చాలా వరకు చదవడానికి సమయాన్ని వెచ్చించడానికి ప్రయత్నించాను.ఈ పోస్ట్‌కార్డులు దేశ భవిష్యత్తు పట్ల మన కొత్త తరం దృష్టి ఎంత విశాలంగా ఉందో చూపిస్తాయి. 'మన్ కీ బాత్' శ్రోతల కోసంనేను మీతో పంచుకోవాలనుకుంటున్న కొన్ని పోస్ట్‌కార్డ్‌ల జాబితా రూపొందించాను. వీటిలో ఒకటి అస్సాంలోని గౌహతికి చెందిన రిద్ధిమా స్వర్గియారి రాసిన పోస్ట్‌కార్డు. రిద్ధిమా 7వ తరగతి చదువుతున్న విద్యార్థిని. స్వాతంత్ర్యం వచ్చిన 100వ సంవత్సరంలో ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన దేశంగా, ఉగ్రవాదం నుండి పూర్తిగా విముక్తి పొందిన దేశంగా, 100 శాతం అక్షరాస్యత కలిగిన దేశంగా, ప్రమాదాలు అసలే లేని దేశంగా, స్థిరమైన సాంకేతికతతో పూర్తి ఆహార భద్రతాసామర్థ్యం ఉన్నదేశంగా భారతదేశాన్ని చూడాలన్న కోరిక ఉందని ఆమె రాసింది.రిద్ధిమాతో పాటు మన బిడ్డలు ఏమనుకుంటున్నారో అవి నెరవేరతాయి.అందరి ప్రయత్నాలు ఏకమైనప్పుడుదేశం కోసం వారి కలలు నిజమవుతాయి.మీ యువ తరం ఈ లక్ష్యం కోసం పని చేసినప్పుడు మీరు ఖచ్చితంగా భారతదేశాన్ని మీరు కోరుకున్న విధంగా తయారు చేస్తారు.ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన నవ్య వర్మ పోస్ట్ కార్డ్ కూడా నా దగ్గర ఉంది. 2047లో ప్రతి ఒక్కరూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలని, రైతులు సుసంపన్నంగా ఉండే, అవినీతికి తావులేని భారతదేశం తన కల అని నవ్య రాశారు. నవ్యా! దేశం కోసం మీ కల చాలా అభినందనీయం. దేశం కూడా ఈ దిశగా శరవేగంగా ముందుకు సాగుతోంది.అవినీతి రహిత భారత్ గురించి మీరు మాట్లాడారు. అవినీతి దేశాన్ని చెదపురుగులాగా గుల్లగా చేస్తుంది. దాన్ని వదిలించుకోవడానికి 2047 వరకు ఎందుకు వేచి ఉండాలి? మనమందరం దేశవాసులం, నేటి యువత కలిసి ఈ పనిని వీలైనంత త్వరగా చేయాలి. దీని కోసం మనం మన విధులకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా ముఖ్యం. కర్తవ్యం ప్రధానంగా ఉండే చోట అవినీతి జరగదు.
మిత్రులారా! నా ముందు చెన్నైకి చెందిన మహమ్మద్ ఇబ్రహీం రాసిన మరొక పోస్ట్‌కార్డ్ ఉంది. 2047లో రక్షణ రంగంలో భారత్‌ను ప్రధాన శక్తిగా చూడాలని ఇబ్రహీం కోరుకుంటున్నారు. చంద్రునిపై భారతదేశం తన స్వంత పరిశోధనా స్థావరాన్ని కలిగి ఉండాలని , అంగారక గ్రహంపైమానవ జనాభాను స్థిరపరిచే పనిని భారతదేశం ప్రారంభించాలని వారు కోరుతున్నారు. అలాగే, భూమిని కాలుష్య రహితంగా చేయడంలో భారతదేశం పోషించే ప్రధాన పాత్రను ఇబ్రాహీం చూస్తారు. ఇబ్రహీం! మీలాంటి యువత ఉన్న దేశానికి అసాధ్యమైంది ఏదీ లేదు.
మిత్రులారా! మన ముందు మరో ఉత్తరం ఉంది. మధ్యప్రదేశ్‌లోని రైసెన్‌లోని సరస్వతి విద్యా మందిర్‌లో 10వ తరగతి చదువుతున్న భావన రాసిన ఉత్తరమిది. ముందుగామీరు మీ పోస్టు కార్డును త్రివర్ణ పతాకంతో అలంకరించిన విధానం నాకు బాగా నచ్చిందని నేను భావనతో చెబుతాను. విప్లవకారుడు శిరీష్ కుమార్ గురించి భావన రాశారు.
మిత్రులారా! నేను గోవా నుండి లారెన్సియో పరేరా పోస్టు కార్డును కూడా అందుకున్నాను. పరేరా12వ తరగతి చదువుతున్న విద్యార్థి. ఆ లేఖలోని అంశం కూడా బయటి ప్రపంచానికి తెలియని వీరులు. దాని హిందీ అర్థాన్ని నేను మీకు చెబుతున్నాను. భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న ధైర్యవంతులైన మహిళల్లో ప్రముఖులైన భికాజీ కామా గురించి పరేరా రాశారు. బాలికలకు సాధికారత కల్పించేందుకుభికాజీ కామా దేశ విదేశాల్లో ఎన్నో ప్రచారాలు చేశారు.అనేక ప్రదర్శనలు నిర్వహించారు. ఖచ్చితంగా భికాజీ కామా స్వాతంత్ర్య ఉద్యమంలో అత్యంత సాహసోపేతమైన మహిళల్లో ఒకరు. 1907లో జర్మనీలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. ఈ త్రివర్ణ పతాకాన్ని రూపొందించడంలో ఆమెకు సహకరించిన వ్యక్తి శ్రీ శ్యామ్‌జీ కృష్ణ వర్మ. శ్రీ శ్యామ్‌జీ కృష్ణవర్మ గారు 1930లో జెనీవాలో మరణించారు. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాతతన చితాభస్మాన్ని భారతదేశానికి తీసుకురావాలని ఆయన చివరి కోరిక.1947లో స్వాతంత్య్రం వచ్చిన రెండో రోజునే ఆయన చితాభస్మాన్ని తిరిగి భారతదేశానికి తీసుకురావాల్సి ఉన్నప్పటికీ ఆ పని జరగలేదు. బహుశా భగవంతుడు నన్ను ఈ పని చేయమని కోరుకున్నాడేమో-నాకు ఈ పని చేసే అదృష్టం వచ్చింది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2003లో ఆయన చితాభస్మాన్ని భారతదేశానికి తీసుకొచ్చారు. శ్యామ్‌జీ కృష్ణ వర్మ గారి జ్ఞాపకార్థం కచ్‌లోని మాండ్విలో ఆయన జన్మస్థలం వద్ద ఒక స్మారక చిహ్న నిర్మాణం కూడా జరిగింది.
మిత్రులారా!భారత దేశ స్వాతంత్ర్య అమృతోత్సవ ఉత్సాహం మన దేశంలోనే కాదు. భారతదేశ స్నేహపూర్వక దేశమైన క్రొయేషియా నుండి కూడా నాకు 75 పోస్ట్‌కార్డ్‌లు వచ్చాయి. క్రొయేషియాలోని జాగ్రెబ్‌లో ఉన్న స్కూల్ ఆఫ్ అప్లైడ్ ఆర్ట్స్ అండ్ డిజైన్ విద్యార్థులు ఈ 75 కార్డులను భారతదేశ ప్రజలకు పంపారు. అమృతోత్సవసందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. మన దేశవాసులందరి తరపుననేను క్రొయేషియాకు, ఆ దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా!భారతదేశం విద్య, విజ్ఞాన తపో భూమి. మనం విద్యను పుస్తక విజ్ఞానానికి పరిమితం చేయలేదు. కానీ దాన్ని జీవిత సంపూర్ణ అనుభవంగా చూశాం. మన దేశంలోని గొప్ప వ్యక్తులు కూడా విద్యారంగంతో లోతైన సంబంధం కలిగి ఉన్నారు. పండిట్ మదన్ మోహన్ మాలవ్య బనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించారు. గుజరాత్ విద్యాపీఠం నిర్మాణంలో మహాత్మా గాంధీ ముఖ్యమైన పాత్ర పోషించారు.గుజరాత్‌లోని ఆనంద్‌లో వల్లభ్ విద్యానగర్ అనే చాలా సుందరమైన ప్రదేశం ఉంది. సర్దార్ పటేల్ అభ్యర్థనతో ఆయన సహచరులు భాయ్ కాకా, భిఖా భాయ్ అక్కడ యువత కోసం విద్యా కేంద్రాలను స్థాపించారు. అదేవిధంగాపశ్చిమ బెంగాల్లో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ శాంతినికేతన్‌ను స్థాపించారు.మహారాజా గైక్వాడ్ కూడా విద్యారంగాన్ని ప్రోత్సహించే వారిలో ఒకరు. ఆయన అనేక విద్యా సంస్థలను నిర్మించారు. డాక్టర్ అంబేద్కర్, శ్రీ అరబిందోతో సహా అనేక మంది వ్యక్తులను ఉన్నత విద్యారంగంలో ప్రేరేపించారు. అలాంటి మహానుభావుల జాబితాలో రాజ మహేంద్ర ప్రతాప్ సింగ్ పేరు కూడా ఉంది.రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ గారు తన ఇంటిని సాంకేతిక పాఠశాల స్థాపన కోసం అప్పగించారు. అలీగఢ్, మధురలో విద్యా కేంద్రాల నిర్మాణానికి ఆయన చాలా ఆర్థిక సహాయం చేశారు. కొంతకాలం క్రితం అలీగఢ్‌లో ఆయన పేరు మీద యూనివర్సిటీకి శంకుస్థాపన చేసే అవకాశం కూడా నాకు లభించింది. విద్యను ప్రజల్లోకి తీసుకెళ్లాలనే చైతన్యవంతమైన స్ఫూర్తి నేటికీ భారతదేశంలో కొనసాగుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.ఈ భావనలోని అత్యంత అందమైన విషయం ఏమిటో మీకు తెలుసా? అంటేవిద్య పట్ల ఈ అవగాహన సమాజంలో ప్రతి స్థాయిలో కనిపిస్తుంది. తమిళనాడులోని త్రిప్పూర్ జిల్లా ఉదుమల్పేట్ బ్లాక్‌లో నివసిస్తున్న తాయమ్మళ్ గారి ఉదాహరణ చాలా స్ఫూర్తిదాయకం.తాయమ్మళ్ గారికి సొంతంగా భూమి లేదు. కొన్నేళ్లుగా వారి కుటుంబం కొబ్బరినీళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది. ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినా తాయమ్మళ్ గారు తన కొడుకును, కుమార్తెను చదివించడానికి ఎటువంటి అవకాశాన్నీ వదిలిపెట్టలేదు. వారి పిల్లలు చిన్నవీరంపట్టి పంచాయతీ మాధ్యమిక పాఠశాలలో చదివారు.ఒకరోజు పాఠశాలలో తల్లిదండ్రులతో జరిగిన సమావేశంలో తరగతి గదులు, పాఠశాలల పరిస్థితి మెరుగుపర్చాలని, పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఆ సమావేశంలో తాయమ్మళ్ గారు కూడా ఉన్నారు. తాయమ్మళ్ గారు అంతా విన్నారు. ఇదే సమావేశంలో ఈ పనులకు డబ్బుల కొరతపై మళ్లీ చర్చ వచ్చింది.దీని తర్వాత తాయమ్మళ్ గారు ఏం చేశారో ఎవరూ ఊహించలేరు. కొబ్బరి నీళ్లు అమ్మి కొంత మూలధనాన్ని కూడబెట్టిన తాయమ్మళ్ గారు పాఠశాల కోసం లక్ష రూపాయలను విరాళంగా అందించారు. నిజానికి ఇలా చేయడానికి విశాల హృదయం, సేవా భావం కావాలి.
ప్రస్తుతం పాఠశాలలో 8వ తరగతి వరకు చదువుకోవచ్చని తాయమ్మళ్ గారుచెప్పారు. ఇప్పుడు పాఠశాలలో మౌలిక సదుపాయాలు మెరుగుపడినప్పుడు అక్కడ ఉన్నత మాధ్యమిక విద్య ప్రారంభమవుతుంది. మన దేశంలో విద్య గురించి నేను మాట్లాడిన భావన ఇదే. IIT BHU పూర్వ విద్యార్థి చేసిన ఇలాంటి విరాళం గురించి కూడా నేను తెలుసుకున్నాను.BHU పూర్వ విద్యార్థి జయ్ చౌదరి IIT BHU ఫౌండేషన్‌కి ఒక మిలియన్ డాలర్లు అంటే సుమారు ఏడున్నర కోట్ల రూపాయలు విరాళంగా ఇచ్చారు.
మిత్రులారా!మన దేశంలో చాలా మంది వివిధ రంగాలకు చెందిన వారుఇతరులకు సహాయం చేస్తూ సమాజం పట్ల తమ బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. ఉన్నత విద్యారంగంలో ముఖ్యంగా మన వివిధ IITలలో ఇటువంటి ప్రయత్నాలు నిరంతరంగా కనిపిస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. కేంద్రీయ విశ్వవిద్యాలయాలలోనూ ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలకు కొదవలేదు.ఇలాంటి ప్రయత్నాలను మరింత పెంచేందుకు గతేడాది సెప్టెంబర్ నుంచి దేశంలో విద్యాంజలి అభియాన్ కూడా ప్రారంభమైంది. వివిధ సంస్థలు, CSR, ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా పాఠశాలల్లో విద్య నాణ్యతను మెరుగుపరచడం దీని లక్ష్యం. విద్యాంజలి సామాజిక భాగస్వామ్యాన్ని,విద్యాసంస్థ తమదే అన్న స్ఫూర్తిని ప్రోత్సహిస్తోంది. మీ పాఠశాల, కళాశాలతో నిరంతరం అనుసంధానం అయ్యేందుకు వీలవుతుంది. మీ సామర్థ్యానికి అనుగుణంగా ఏదైనా అందించడంలో ఉన్న సంతృప్తిని, ఆనందాన్ని స్వీయ అనుభవం ద్వారా మాత్రమే పొందగలం.
నా ప్రియమైన దేశప్రజలారా!ప్రకృతిపై ప్రేమ, ప్రతి జీవిపై కరుణ- ఇది మన సంస్కృతి. మన సహజ స్వభావం. ఇటీవల మధ్యప్రదేశ్‌లోని పెంచ్ టైగర్ రిజర్వ్‌లో ఒక పులి మరణించినపుడు మన ఈ ఆచారాల సంగ్రహావలోకనం కనిపించింది. ప్రజలు ఈ పులిని కాలర్ టైగ్రెస్ అని పిలిచేవారు. అటవీ శాఖ దీనికి టీ-15 అని పేరు పెట్టింది. ఈ పులి మరణంతో ప్రజలు తమ సంబంధీకులు ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయినట్టు భావోద్వేగానికి గురయ్యారు.ప్రజలు ఆ పులికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. పూర్తి గౌరవం, ఆప్యాయతతో వీడ్కోలు పలికారు. సోషల్ మీడియాలో మీరు కూడా ఈ చిత్రాలను చూసి ఉంటారు. ప్రకృతిపై, జంతువులపై భారతీయులమైన మనకున్న ఈ ప్రేమ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రశంసలు పొందింది. కాలర్ పులి తన జీవితకాలంలో 29 పిల్లలకు జన్మనిచ్చింది. 25 పిల్లలను పెంచి, పెద్ద చేసింది. మనం ఈ T-15 జీవితాన్ని కూడా ఉత్సవంగా జరుపుకున్నాం. ప్రపంచాన్ని విడిచిపెట్టినప్పుడు మనం ఆ పులికి భావోద్వేగ వీడ్కోలు కూడా ఇచ్చాం. ఇది భారతదేశ ప్రజల ప్రత్యేకత. ప్రతి జీవితో మనం ప్రేమ సంబంధాన్ని ఏర్పరుచుకుంటాం. ఈసారి రిపబ్లిక్ డే పరేడ్‌లో కూడా అలాంటి దృశ్యమే కనిపించింది. ఈ కవాతులోరాష్ట్రపతి అంగరక్షక బృందంలోని ఛార్జర్ గుర్రంవిరాట్ తన చివరి పరేడ్‌లో పాల్గొంది. ఈ గుర్రం విరాట్ 2003లో రాష్ట్రపతి భవన్‌కు వచ్చింది. కమాండెంట్ ఛార్జర్‌గా ప్రతిసారీ రిపబ్లిక్ డే పరేడ్‌కు నాయకత్వం వహించేది. రాష్ట్రపతి భవన్లో విదేశీ దేశాధినేతలెవరికైనా స్వాగతం పలికినప్పుడు కూడా ఆ గుర్రం ఈ పాత్రను పోషించేది. ఈ ఏడాది ఆర్మీ డే రోజున గుర్రం విరాట్‌కు సైనిక దళాల ప్రధానాధిపతి COAS కమెండేషన్ కార్డ్ కూడా ఇచ్చారు. విరాట్ అపారమైన సేవలను దృష్టిలో ఉంచుకుని ఆ గుర్రం పదవీ విరమణ తర్వాతఘనంగా వీడ్కోలు జరిగింది.
నా ప్రియమైన దేశప్రజలారా!చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు, ఉన్నతమైన లక్ష్యంతో పని చేసినప్పుడుదాని ఫలితాలు కూడా కనిపిస్తాయి. దీనికి ఒక గొప్ప ఉదాహరణ అస్సాం నుండి వచ్చింది. అస్సాం పేరు చెప్పగానే తేయాకు తోటలు, అనేక జాతీయ పార్కులు గుర్తొస్తాయి. వీటితో పాటుఒంటి కొమ్ము ఖడ్గమృగం అంటే one horn Rhino చిత్రం కూడా మన మనస్సులోకి వస్తుంది. ఒక కొమ్ము ఉన్న ఖడ్గమృగం అస్సామీ సంస్కృతిలో భాగమని మీ అందరికీ తెలుసు. భారతరత్న భూపేన్ హజారికా పాట ప్రతి చెవిలో ప్రతిధ్వనిస్తుంది.
##పాట (ఒక ప్రత్యేక ఆడియో ఫైల్ WhatsAppలో షేర్ చేస్తారు)
మిత్రులారా! ఈ పాట అర్థం చాలా సందర్భోచితంగా ఉంది. ఏనుగులు, పులులకు నిలయమైన కాజిరంగా పచ్చటి పరిసరాల్లో ఒంటి కొమ్మున్న ఖడ్గమృగాన్ని భూమి చూస్తుందని, పక్షుల కిలకిలరావాలు వినిపిస్తాయని ఈ పాట పేర్కొంటోంది. అస్సాంలోని ప్రపంచ ప్రసిద్ధ చేనేత వస్త్రాలపై నేసిన పగడపు అలంకరణలో కూడా ఖడ్గమృగం కనిపిస్తుంది. అస్సాం సంస్కృతిలో ఇంత గొప్ప వైభవం ఉన్న ఖడ్గమృగం కూడా కష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చింది.2013లో 37, 2014లో 32 ఖడ్గమృగాలను స్మగ్లర్లు చంపేశారు. ఈ సవాలును పరిష్కరించడానికిఅస్సాం ప్రభుత్వం ప్రత్యేక ప్రయత్నాలతో గత ఏడేళ్లలో ఖడ్గమృగంపై భారీ ప్రచారాన్ని నిర్వహించింది. సెప్టెంబర్ 22న ప్రపంచ ఖడ్గమృగాల దినోత్సవం సందర్భంగా స్మగ్లర్ల నుంచి స్వాధీనం చేసుకున్న 2400కు పైగా కొమ్ములను దహనం చేశారు.స్మగ్లర్లకు ఇది గట్టి హెచ్చరిక. అలాంటి ప్రయత్నాల ఫలితంగానే ఇప్పుడు అస్సాంలో ఖడ్గమృగాల వేట క్రమంగా తగ్గుతోంది. 2013లో 37 ఖడ్గమృగాలను చంపేయగా 2020లో 2, 2021లో 1 మాత్రమే వేటలో మరణించినట్టుగా నమోదైంది. ఖడ్గమృగాలను రక్షించాలన్న అస్సాం ప్రజల సంకల్పాన్ని నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా!భారతీయ సంస్కృతిలోని వైవిధ్యం, ఆధ్యాత్మిక శక్తి ఎల్లప్పుడూ ప్రపంచం నలుమూలల నుండి ప్రజలను ఆకర్షిస్తాయి. అమెరికా, కెనడా, దుబాయ్, సింగపూర్, పశ్చిమ యూరప్, జపాన్లలో భారతీయ సంస్కృతి బాగా ప్రాచుర్యం పొందిందని నేను మీతో చెప్తే మీరు ఈ విషయాన్ని చాలా సాధారణమైందిగా భావిస్తారు. ఆశ్చర్యపోరు. కానీలాటిన్ అమెరికా, దక్షిణ అమెరికాలలో కూడా భారతీయ సంస్కృతి అంటే ఆకర్షణ బాగా ఉందని నేను చెప్తే మీరు ఖచ్చితంగా ఒకసారి ఆలోచనలో పడతారు. మెక్సికోలో ఖాదీని ప్రమోట్ చేయాలనే విషయమైనా లేదా బ్రెజిల్లో భారతీయ సంప్రదాయాలను ప్రాచుర్యంలోకి తెచ్చే ప్రయత్నమైనా ఈ విషయాలపై ఇంతకుముందు 'మన్ కీ బాత్'లో చర్చించాం. అర్జెంటీనాలో రెపరెపలాడుతున్న భారతీయ సంస్కృతి గురించి ఈరోజు నేను మీకు చెప్తాను. అర్జెంటీనాలో మన సంస్కృతి అంటే చాలా ఇష్టం.2018లోనేను అర్జెంటీనా పర్యటన సందర్భంగా 'శాంతి కోసం యోగా' అనే యోగా కార్యక్రమంలో పాల్గొన్నాను. అర్జెంటీనాలో హస్తినాపూర్ ఫౌండేషన్ అనే ఒక సంస్థ ఉంది. ఎక్కడి అర్జెంటీనా! - అక్కడ కూడా హస్తినాపూర్ ఫౌండేషన్ అని వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఈ ఫౌండేషన్ అర్జెంటీనాలో భారతీయ వైదిక సంప్రదాయాల వ్యాప్తిలో పాలుపంచుకుంది.దీన్ని 40 సంవత్సరాల క్రితం ప్రొఫెసర్ ఏడా ఎల్ బ్రెక్ట్ అనే మహిళా ప్రొఫెసర్ స్థాపించారు. ప్రొఫెసర్ ఏడా ఎల్ బ్రెక్ట్ ఈరోజు 90వ ఏట అడుగుపెట్టబోతున్నారు. భారత్‌తో ఆమె అనుబంధం కూడా చాలా ఆసక్తికరం.. ఆమె 18 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడుభారతీయ సంస్కృతి శక్తి తొలిసారిగా ఆమెకు పరిచయమైంది. ఆమె భారతదేశంలో కూడా చాలా కాలం గడిపారు. భగవద్గీత, ఉపనిషత్తుల గురించి లోతుగా తెలుసుకున్నారు. హస్తినాపూర్ ఫౌండేషన్ లో 40,000 మందికి పైగా సభ్యులున్నారు. అర్జెంటీనా, ఇతర లాటిన్ అమెరికా దేశాలలో ఈ సంస్థకు దాదాపు 30 శాఖలున్నాయి. హస్తినాపూర్ ఫౌండేషన్ స్పానిష్ భాషలో 100 కంటే ఎక్కువ వైదిక, తాత్త్విక గ్రంథాలను ప్రచురించింది. వారి ఆశ్రమం కూడా చాలా మనోహరంగా ఉంటుంది. ఆశ్రమంలో పన్నెండు ఆలయాలను నిర్మించారు. వాటిలో అనేక దేవుళ్ళ , దేవతల విగ్రహాలు ఉన్నాయి. వీటన్నింటి మధ్యలో అద్వైతవాద ధ్యానం కోసం నిర్మించిన ఆలయం కూడా ఉంది.
మిత్రులారా!మన సంస్కృతి మనకే కాదు-ప్రపంచం మొత్తానికి అమూల్యమైన వారసత్వ సంపద. ఇలాంటి వందలాది ఉదాహరణలు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు ఈ సంస్కృతిని తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని, దీని ప్రకారం జీవించాలని కోరుకుంటారు. మనం కూడా పూర్తి బాధ్యతతో మన సాంస్కృతిక వారసత్వాన్ని మన జీవితంలో ఒక భాగం చేసుకునేందుకు ప్రయత్నించడంతో పాటు ప్రజలందరికీ చేరవేయాలి.
నా ప్రియమైన దేశప్రజలారా!ఇప్పుడు నేను మిమ్మలని- ముఖ్యంగా మన యువతను- ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. మీరు ఒకేసారి ఎన్ని పుష్-అప్లు చేయగలరో ఊహించండి. నేను మీకు చెప్పబోయేది తప్పకుండా మీలో ఆశ్చర్యాన్ని నింపుతుంది. మణిపూర్‌లో 24 ఏళ్ల థౌనా ఓజం నిరంజాయ్ సింగ్ ఒక్క నిమిషంలో 109 పుష్-అప్లు చేసి రికార్డు సృష్టించారు.నిరంజాయ్ సింగ్‌కు రికార్డును బద్దలు కొట్టడం కొత్త కాదు-అంతకు ముందు కూడాఒక నిమిషంలో ఒక పిడికిలితో అత్యధిక పుష్-అప్లు చేసిన రికార్డు సాధించారు. మీరు నిరంజాయ్ సింగ్ నుండి ప్రేరణ పొంది, శారీరక దృఢత్వాన్ని మీ జీవితంలో భాగం చేసుకుంటారని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను.
మిత్రులారా!మీరు గర్వంగా భావించే ఒక అంశాన్ని ఈ రోజు నేను లడఖ్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. లడఖ్ లో త్వరలో ఆకర్షణీయమైన ఓపెన్ సింథటిక్ ట్రాక్, ఆస్ట్రో టర్ఫ్ ఫుట్‌బాల్ స్టేడియం ప్రారంభం కానున్నాయి. 10,000 అడుగులకు పైగా ఎత్తులో నిర్మిస్తున్న ఈ స్టేడియం నిర్మాణం త్వరలో పూర్తి అవుతుంది. లడఖ్‌లో 30,000 మంది ప్రేక్షకులు కూర్చునే అతిపెద్ద ఓపెన్ స్టేడియం ఇదే. లడఖ్‌లోని ఈ ఆధునిక ఫుట్‌బాల్ స్టేడియంలో 8 లేన్లతో కూడిన సింథటిక్ ట్రాక్ కూడా ఉంటుంది. దీంతోపాటు వెయ్యి పడకలతో హాస్టల్ సౌకర్యం కూడా ఉంటుంది.ఈ స్టేడియం ఫుట్‌బాల్‌లో అతిపెద్ద సంస్థ అయిన FIFA కూడా ధృవీకరించింది. ఇంత పెద్ద స్థాయిలో క్రీడల మౌలిక సదుపాయాలు దేశంలోని యువతకు గొప్ప అవకాశాలను తెస్తాయి. అదే సమయంలోఈ ఏర్పాటు జరిగే చోటికి దేశం నలుమూలల నుండి ప్రజలు వస్తారు, వెళతారు. పర్యాటక రంగానికి ప్రోత్సాహం లభిస్తుంది. అనేక ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. ఈ స్టేడియం లడఖ్‌లోని మన యువతలో చాలా మందికి ప్రయోజనం కల్పిస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈసారి 'మన్ కీ బాత్'లో కూడా మనం అనేక అంశాలపై మాట్లాడుకున్నాం. ఈ సమయంలో అందరి మదిలో మెదులుతున్న మరో అంశం కరోనా. కొత్త కరోనా వేవ్ తో భారతదేశం గొప్ప విజయం సాధిస్తూ పోరాడుతోంది. ఇప్పటివరకు దాదాపు నాలుగున్నర కోట్ల మంది పిల్లలు కరోనా వ్యాక్సిన్‌ను తీసుకోవడం గర్వించదగ్గ విషయం.అంటే 15 నుండి 18 సంవత్సరాల వయస్సు గల యువతలో దాదాపు 60% మంది మూడు నుండి నాలుగు వారాల్లోనే టీకాలు వేయించుకున్నారు. ఇది మన యువతను రక్షించడమే కాకుండా వారి చదువును కొనసాగించడానికి కూడా సహాయపడుతుంది.మరో విశేషం ఏమిటంటే 20 రోజుల్లోనే కోటి మంది ముందుజాగ్రత్త డోసు కూడా తీసుకున్నారు.మన దేశ వ్యాక్సిన్‌పై మన దేశప్రజలకున్న ఈ నమ్మకమే మనకు గొప్ప బలం. ఇప్పుడు కరోనా ఇన్ఫెక్షన్ కేసులు కూడా తగ్గడం ప్రారంభించాయి. ఇది చాలా సానుకూల సంకేతం. ప్రజలు సురక్షితంగా ఉండాలి. దేశ ఆర్థిక కార్యకలాపాల వేగం కొనసాగాలి. ఇది ప్రతి దేశవాసి కోరిక.
మీకు తెలుసు- 'మన్ కీ బాత్'లోకొన్ని విషయాలునేను చెప్పకుండా ఉండలేను. 'స్వచ్ఛతా అభియాన్' మనం మరచిపోనవసరం లేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని వేగవంతం చేయాలి. ఇది ముఖ్యమైంది. స్థానిక ఉత్పత్తులకు ప్రచారం అనే మంత్రం మన బాధ్యత. స్వావలంబన భారతదేశ ప్రచారం కోసం మనం హృదయపూర్వకంగా పని చేయాలి. మనందరి కృషితో దేశం అభివృద్ధిలో కొత్త శిఖరాలకు చేరుకుంటుంది. ఈ కోరికతోనేను మీకు వీడ్కోలు చెప్తున్నాను. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం! ఈ సమయంలో మీరు 2021కి వీడ్కోలు చెప్తూ 2022కి స్వాగతం పలకడానికి సిద్ధమవుతూ ఉంటారు. ప్రతి వ్యక్తి, ప్రతి సంస్థ వచ్చే ఏడాదిలో రాబోయే సంవత్సరంలో మరింత మెరుగ్గా మారాలని, ఏదైనా మంచి చేయాలని సంకల్పం తీసుకోవడం జరుగుతుంది. గత ఏడు సంవత్సరాలుగా మన 'మన్ కీ బాత్' కూడా వ్యక్తి, సమాజం, దేశం మంచితనాన్ని ఎత్తిచూపుతోంది. మంచి చేయడానికి , మంచిగా మారడానికి స్ఫూర్తినిస్తోంది. ఈ ఏడేళ్లలో 'మన్ కీ బాత్' చేస్తున్నప్పుడు ప్రభుత్వం సాధించిన విజయాల గురించి కూడా చర్చించగలిగాను. మీరు దీన్ని ఇష్టపడ్డారు. మెచ్చుకున్నారు. కానీ మీడియాకు దూరంగా, వార్తాపత్రికల ఆకర్షణలకు దూరంగా చాలా మంది మంచి చేస్తున్నారనేది దశాబ్దాల అనుభవం. దేశ భవిష్యత్తు కోసం తమ నేటి కాలాన్ని వెచ్చిస్తున్నారు. వారు దేశంలోని రాబోయే తరాల కోసం తమ ప్రయత్నాలతో తీరిక లేకుండా ఉన్నారు. అలాంటి వ్యక్తుల చర్చ చాలా ఓదార్పునిస్తుంది. లోతైన స్ఫూర్తిని ఇస్తుంది. నా విషయంలో 'మన్ కీ బాత్' ఎప్పుడూ అలాంటి వారి కృషితో నిండిన అందమైన ఉద్యానవనం. 'మన్ కీ బాత్'లో ప్రతి నెలా నా ప్రయత్నం ఈ విషయంపైనే. ఆ తోటలోని ఏ పుష్పాదళాన్ని మీకోసం తీసుకురావాలా అని నేను ఆలోచిస్తాను. బహురత్న వసుంధరగా పేర్కొనే భారతదేశ పుణ్యకార్యాల ఎడతెగని ప్రవాహం నిరంతరం ప్రవహిస్తూనే ఉన్నందుకు సంతోషిస్తున్నాను. దేశం అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ఈ మానవశక్తి, ప్రజల శక్తి, ఆ శక్తి ప్రస్తావన, ప్రజల కృషి, భారతదేశ ప్రజలతో పాటు సమస్త మానవాళి ఉజ్వల భవిష్యత్తు కోసం హామీ ఇస్తుంది.
మిత్రులారా! ఇది జనశక్తిలోని బలం. భారతదేశం వందేళ్లలో వచ్చిన అతిపెద్ద అంటువ్యాధితో పోరాడగలగడం అందరి కృషి ఫలితం. ప్రతి కష్ట సమయంలో ఒక కుటుంబంలా ఒకరికొకరం అండగా నిలిచాం. మీ ప్రాంతంలో లేదా నగరంలో ఎవరికైనా సహాయం చేయడానికి సాధ్యమయ్యేదానికంటే ఎక్కువ చేయడానికి ప్రయత్నించారు. ఈ రోజు ప్రపంచంలో వ్యాక్సినేషన్‌కు సంబంధించిన గణాంకాలను భారతదేశంతో పోల్చి చూస్తే దేశం అపూర్వమైన పని చేసినట్లు అనిపిస్తుంది. ఇంత పెద్ద లక్ష్యాన్ని సాధించిందా అనిపిస్తుంది. 140 కోట్ల డోసుల వ్యాక్సిన్ల మైలురాయిని దాటడం ప్రతి భారతీయుడి ఘనత. ఇది వ్యవస్థపై ప్రజల నమ్మకానికి నిదర్శనంగా ఉంటుంది. సైన్స్‌పై నమ్మకాన్ని చూపుతుంది. శాస్త్రవేత్తలపై నమ్మకాన్ని చూపుతుంది. సమాజం పట్ల మన బాధ్యతలను నెరవేర్చడంలో భారతీయులమైన మన సంకల్ప శక్తికి నిదర్శనం. అయితే మిత్రులారా! ఈ మహమ్మారిని ఓడించడానికి పౌరులుగా మన స్వంత ప్రయత్నం చాలా ముఖ్యమని గత రెండేళ్లుగా మన అనుభవం చెప్తోంది. మన శాస్త్రవేత్తలు ఈ కొత్త ఒమిక్రాన్ వేరియంట్‌ను నిరంతరం అధ్యయనం చేస్తున్నారు. వారికి ప్రతిరోజూ కొత్త విషయాలను సేకరిస్తున్నారు. ఆ సూచనలపై పని చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితిలో కరోనా ఈ వైవిధ్యానికి వ్యతిరేకంగా అప్రమత్తత, స్వీయ క్రమశిక్షణ దేశానికి గొప్ప శక్తి. మన సంఘటిత శక్తి కరోనాను ఓడిస్తుంది. ఈ బాధ్యతతో మనం 2022లోకి ప్రవేశించాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! మహాభారత యుద్ధ సమయంలో 'నభః స్పృశం దీప్తం' అని అర్జునుడికి శ్రీకృష్ణుడు చెప్పాడు. అంటే గర్వంతో ఆకాశాన్ని తాకడం. భారతీయ వాయుసేన ఆదర్శ వాక్యం కూడా ఇదే. తల్లి భారతి సేవలో నిమగ్నమైన అనేక మంది జీవితాలు ప్రతిరోజూ గర్వంగా ఈ ఆకాశపు ఎత్తులను తాకుతున్నాయి. అవి మనకు చాలా నేర్పుతాయి. గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ జీవితం అలాంటిదే. తమిళనాడులో ఈ నెల ప్రమాదానికి గురైన హెలికాప్టర్లో వరుణ్ సింగ్ ప్రయాణిస్తున్నాడు. ఆ ప్రమాదంలో దేశ మొదటి సి.డి.ఎస్. జనరల్ బిపిన్ రావత్, ఆయన భార్యతో సహా అనేక మంది ధైర్యవంతులను కోల్పోయాము. వరుణ్ సింగ్ కూడా మృత్యువుతో చాలా రోజులు ధైర్యంగా పోరాడారు. కానీ ఆయన కూడా మనల్ని వదిలి వెళ్లిపోయారు. వరుణ్ హాస్పిటల్లో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో నా మనసుకు హత్తుకునే విషయం చూశాను. ఈ ఏడాది ఆగస్టులో ఆయనకు శౌర్యచక్ర ప్రదానం చేశారు. ఈ సన్మానం తరువాత ఆయన తాను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపాల్‌కు ఒక లేఖ రాశారు. ఈ ఉత్తరం చదివాక నా మదిలో మెదిలిన మొదటి ఆలోచన ఏమిటంటే విజయ శిఖరాలను అధిరోహించినా ఆయన తన మూలాలను మరిచిపోలేదు. రెండవది – ఆయన తన విజయోత్సవాలను జరుపుకోవడానికి సమయం ఉన్నప్పుడు రాబోయే తరాల కోసం ఆలోచించారు. తాను చదివిన పాఠశాల విద్యార్థుల జీవితం కూడా వేడుకగా మారాలన్నారు. తన లేఖలో వరుణ్ సింగ్ తన పరాక్రమాన్ని వివరించలేదు కానీ తన వైఫల్యాల గురించి చెప్పారు. తన లోపాలను ఎలా సామర్థ్యాలుగా మార్చుకున్నారో చెప్పారు. ఈ లేఖలో ఒక చోట ఆయన ఇలా రాశారు- “సాధారణ మనిషిగా ఉండటం మంచిది. ప్రతి ఒక్కరూ పాఠశాలలో రాణించలేరు. ప్రతి ఒక్కరూ 90లు సాధించలేరు. మీరు సాధిస్తే అది అద్భుతమైన విజయం. తప్పక మెచ్చుకోవాలి. అయితే మీరు అలా సాధించకపోతే మీరు సాధారణ స్థాయిలో ఉన్నారని అనుకోకండి. మీరు పాఠశాలలో సాధారణంగా ఉండవచ్చు కానీ జీవితంలో రాబోయే విషయాలకు ఇది కొలమానం కాదు. మీకు ఆసక్తి ఉన్న రంగాన్ని కనుగొనండి. అది కళ, సంగీతం, గ్రాఫిక్ డిజైన్, సాహిత్యం మొదలైనవి కావచ్చు. మీరు ఏ పనిచేసినా, అంకితభావంతో చేయండి. మీ వంతు కృషి చేయండి. మరింతగా కృషి చేయవలసిందని ఆలోచిస్తూ ఎప్పుడూ పడుకోవద్దు.”
మిత్రులారా! సాధారణ స్థాయి నుండి అసాధారణంగా మారడానికి ఆయన ఇచ్చిన మంత్రం కూడా అంతే ముఖ్యమైనది. ఈ లేఖలో వరుణ్ సింగ్ ఇలా రాశారు. "నమ్మకాన్ని కోల్పోవద్దు. మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో దానిలో మీరు మంచిగా ఉండలేరని ఎప్పుడూ అనుకోకండి. ఇది సులభంగా రాదు. ఇది సమయం తీసుకుంటుంది. సౌకర్యాలను త్యాగం చేస్తుంది. నేను సామాన్యుడిని. ఈ రోజు నా కెరీర్లో కష్ట సాధ్యమైన మైలురాళ్లను చేరుకున్నాను. 12వ తరగతి మార్కులు మీరు జీవిత లక్ష్యాలను నిర్ణయిస్తాయని అనుకోకండి. మిమ్మల్ని మీరు నమ్మండి. దాని కోసం పని చేయండి."
వరుణ్ తాను ఒక్క విద్యార్థిని ప్రేరేపించగలిగినా అది చాలా ఎక్కువ అని రాశారు. కానీ ఈ రోజు నేను చెప్పాలనుకుంటున్నాను – ఆయన యావద్దేశానికి స్ఫూర్తినిచ్చారు. తన లేఖ ద్వారా కేవలం విద్యార్థులతో మాత్రమే మాట్లాడినప్పటికీ ఆయన మన మొత్తం సమాజానికి సందేశం ఇచ్చారు.
మిత్రులారా! ప్రతి సంవత్సరం నేను పరీక్షలపై విద్యార్థులతో ఇలాంటి అంశాలపై చర్చిస్తాను. ఈ సంవత్సరం కూడా పరీక్షలకు ముందు విద్యార్థులతో చర్చించాలని ప్రనాలీక రూపొందిస్తున్నాను. ఈ ప్రోగ్రామ్ కోసం రిజిస్ట్రేషన్ కూడా రెండు రోజుల తర్వాత డిసెంబర్ 28వ తేదీ నుండి మై గవ్ డాట్ ఇన్ లో ప్రారంభం అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్ డిసెంబర్ 28 నుండి జనవరి 20 వరకు కొనసాగుతుంది. ఇందుకోసం 9 నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులకు ఆన్లైన్ పోటీలను కూడా నిర్వహిస్తారు. మీరందరూ ఇందులో భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని కలిసే అవకాశం లభిస్తుంది. మనం కలిసి పరీక్ష, కెరీర్, విజయం, విద్యార్థి జీవితానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చిద్దాం.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్'లో ఇప్పుడు నేను మీకు చాలా దూరం నుండి, సరిహద్దులు దాటి వచ్చిన విషయాన్ని చెప్పబోతున్నాను. ఇది మిమ్మల్ని ఆనందపరుస్తుంది. ఆశ్చర్యపరుస్తుంది కూడా:
గాత్రం #(వందే మాతరం)
వందేమాతరం.. వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్య శ్యామలాం మాతరం.. వందేమాతరం
శుభ్ర జ్యోత్స్నపులకితయామినీం
ఫుల్ల కుసుమిత ద్రుమదల శోభినీం
సుహాసినీం సుమధుర భాషిణీం
సుఖదాం వరదాం మాతరం.
వందేమాతరం... వందేమాతరం.
మీరు దీన్ని విని ఆనందించారని, గర్వంగా భావించారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వందేమాతరంలో ఉన్న స్ఫూర్తి మనలో గర్వాన్ని, ఉత్సాహాన్ని నింపుతుంది.
మిత్రులారా! ఈ అందమైన వీడియో ఎక్కడిది, ఏ దేశం నుండి వచ్చింది అని మీరు ఆలోచిస్తూ ఉంటారు. సమాధానం మీ ఆశ్చర్యాన్ని మరింత పెంచుతుంది. వందేమాతరం అందించిన ఈ విద్యార్థులు గ్రీస్‌కు చెందినవారు. అక్కడ వారు ఇలియా లోని ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. వారు ఎంతో అందంగా, భావోద్వేగంతో 'వందేమాతరం' పాడిన తీరు అద్భుతం, ప్రశంసనీయం. ఇటువంటి ప్రయత్నాలు రెండు దేశాల ప్రజలను మరింత సన్నిహితం చేస్తాయి. నేను ఈ గ్రీస్ విద్యార్థులను, వారి ఉపాధ్యాయులను అభినందిస్తున్నాను. స్వాతంత్ర్య అమృత మహోత్సవం సందర్భంగా వారు చేసిన ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను.
మిత్రులారా! నేను లక్నో నివాసి నీలేష్ గారి పోస్ట్ గురించి కూడా చర్చించాలనుకుంటున్నాను. నీలేష్ గారు లక్నోలో ఒక ప్రత్యేకమైన డ్రోన్ ప్రదర్శనను ప్రశంసించారు. ఈ డ్రోన్ షోను లక్నోలోని రెసిడెన్సీ ప్రాంతంలో నిర్వహించారు. 1857 నాటి మొదటి స్వాతంత్ర్య పోరాట సాక్ష్యం ఇప్పటికీ రెసిడెన్సీ గోడలపై కనిపిస్తుంది. రెసిడెన్సీలో జరిగిన డ్రోన్ షోలో భారత స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన వేర్వేరు అంశాలకు జీవం పోశారు. చౌరీ చౌరా ఆందోళన కావచ్చు. కాకోరి రైలు సంఘటన కావచ్చు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ అసమానమైన ధైర్యం, పరాక్రమం కావచ్చు. వీటన్నిటినీ ప్రదర్శించిన ఈ డ్రోన్ షో అందరి హృదయాలను గెలుచుకుంది. అదేవిధంగా మీరు మీ నగరాలు, గ్రామాలలో స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన ప్రత్యేక అంశాలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లవచ్చు. ఇందులో సాంకేతికత సహాయం కూడా పొందవచ్చు. స్వాతంత్ర్య అమృతోత్సవ పండుగ స్వాతంత్ర్య పోరాట జ్ఞాపకాలను గుర్తుతెచ్చుకునే అవకాశాన్ని ఇస్తుంది. దాన్ని అనుభవించే అవకాశాన్ని ఇస్తుంది. దేశం కోసం కొత్త తీర్మానాలు చేయడానికి, ఏదైనా చేయాలనే సంకల్పాన్ని ప్రదర్శించడానికి ఇది ప్రేరణాత్మక ఉత్సవం, ప్రేరణాత్మక సందర్భం. స్వాతంత్య్ర సమరంలోని మహనీయుల స్ఫూర్తిని పొందుతూ దేశం కోసం మన ప్రయత్నాలను బలోపేతం చేస్తూనే ఉంటాం.
నా ప్రియమైన దేశప్రజలారా! మన భారతదేశం చాలా అసాధారణమైన ప్రతిభలతో సుసంపన్నమైంది. ఆ ప్రతిభా మూర్తుల సృజనాత్మకత ఇతరులను ఏదైనా చేయడానికి ప్రేరేపిస్తుంది. అలాంటి వారిలో తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య గారు ఒకరు. ఆయన వయస్సు 84 సంవత్సరాలు. మీ కలలను నెరవేర్చుకోవడానికి వయస్సుతో సంబంధం లేదనేందుకు విఠలాచార్య గారు ఒక ఉదాహరణ. మిత్రులారా! పెద్ద గ్రంథాలయాన్ని తెరవాలనే కోరిక విఠలాచార్య గారికి చిన్నప్పటి నుండి ఉండేది. దేశానికి అప్పటికి ఇంకా స్వాతంత్ర్యం రాలేదు. కొన్ని పరిస్థితుల వల్ల చిన్ననాటి కల కలగానే మిగిలిపోయింది. కాలక్రమేణా విఠలాచార్య గారు అధ్యాపకుడయ్యారు. తెలుగు భాషను లోతుగా అధ్యయనం చేశారు. అందులో అనేక సృజనాత్మక రచనలు చేశారు. 6-7 సంవత్సరాల క్రితం ఆయన తన కలను నెరవేర్చుకోవడం మొదలుపెట్టారు. తన సొంత పుస్తకాలతో లైబ్రరీని ప్రారంభించారు. తన జీవితకాల సంపాదనను ఇందులో పెట్టారు. క్రమంగా ప్రజలు అందులో చేరడం, సహకరించడం ప్రారంభించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని ఈ గ్రంథాలయంలో దాదాపు 2 లక్షల పుస్తకాలు ఉన్నాయి. చదువుతో మొదలుకొని అనేక విషయాల్లో తాను పడిన ఇబ్బందులు మరెవరికీ రాకూడదని విఠలాచార్య గారు అంటారు. ఈరోజు అధిక సంఖ్యలో విద్యార్థులు దాని ప్రయోజనాలను పొందడం చూసి ఆయన చాలా సంతోషంగా ఉన్నారు. ఆయన కృషితో స్ఫూర్తి పొంది అనేక ఇతర గ్రామాల ప్రజలు కూడా గ్రంథాలయాలను రూపొందించే పనిలో నిమగ్నమై ఉన్నారు.
మిత్రులారా! పుస్తకాలు జ్ఞానాన్ని అందించడమే కాకుండా వ్యక్తిత్వాన్ని రూపుదిద్దుతాయి. జీవితాన్ని తీర్చిదిద్దుతాయి. పుస్తక పఠన అభిరుచి అద్భుతమైన సంతోషాన్ని ఇస్తుంది. ఈ సంవత్సరం చాలా పుస్తకాలు చదివానని గర్వంగా చెప్పుకునే వారిని ఈ రోజుల్లో చూస్తున్నాను. ఇప్పుడు నేను ఈ పుస్తకాలను మరిన్ని చదవాలనుకుంటున్నాను. ఇది మంచి ధోరణి. దీన్ని మరింత పెంచాలి. ఈ సంవత్సరం మీకు ఇష్టమైన ఐదు పుస్తకాల గురించి చెప్పమని 'మన్ కీ బాత్' శ్రోతలను కూడా నేను అడుగుతున్నాను. ఈ విధంగా, మీరు 2022లో మంచి పుస్తకాలను ఎంచుకోవడానికి ఇతర పాఠకులకు కూడా సహాయం చేయగలుగుతారు. మన స్క్రీన్ టైమ్ పెరుగుతున్న తరుణంలో పుస్తక పఠనం మరింత ప్రాచుర్యం పొందేందుకు మనం కలిసి కృషి చేయాలి.
నా ప్రియమైన దేశప్రజలారా! ఇటీవల నా దృష్టి ఒక ఆసక్తికరమైన ప్రయత్నంపైకి మళ్లింది. మన ప్రాచీన గ్రంథాలకు, సాంస్కృతిక విలువలకు భారతదేశంలోనే కాకుండా ప్రపంచమంతటా ప్రాచుర్యం పొందేందుకు ఈ ప్రయత్నం. పూణేలో భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పేరుతో ఒక కేంద్రం ఉంది. మహాభారత ప్రాముఖ్యతను ఇతర దేశాల ప్రజలకు పరిచయం చేయడానికి ఈ సంస్థ ఆన్లైన్ కోర్సును ప్రారంభించింది. ఈ కోర్సు ఇప్పుడే ప్రారంభించినప్పటికీ ఇందులో బోధించే అంశాల రూపకల్పన 100 సంవత్సరాల క్రితం ప్రారంభించినట్టు తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఈ కోర్సును ఇన్స్టిట్యూట్ ప్రారంభించినప్పుడు అద్భుతమైన స్పందన వచ్చింది. మన సంప్రదాయంలోని వివిధ అంశాలను ఆధునిక పద్ధతిలో ఎలా ప్రదర్శిస్తున్నారో ప్రజలకు తెలియజేసేందుకు నేను ఈ అద్భుతమైన చొరవ గురించి చర్చిస్తున్నాను. సప్తసముద్రాల అవతల ఉన్న ప్రజలకు దీని ప్రయోజనాలను అందజేసేందుకు కూడా వినూత్న పద్ధతులను అవలంబిస్తున్నారు.
మిత్రులారా! నేడు భారతీయ సంస్కృతి గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ప్రపంచంలో పెరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన వారు మన సంస్కృతిని తెలుసుకోవాలనే కుతూహలంతో ఉండటమే కాకుండా దానిని పెంచేందుకు సహకరిస్తున్నారు. అలాంటి వారిలో సెర్బియాకు చెందిన విద్యావేత్త డాక్టర్ మోమిర్ నికిచ్ ఒకరు. అతను సంస్కృత-సెర్బియన్ ద్విభాషా నిఘంటువును రూపొందించారు. ఈ నిఘంటువులో చేర్చిన 70 వేలకు పైగా సంస్కృత పదాలను సెర్బియన్ భాషలోకి అనువదించారు. డాక్టర్ నికిచ్ 70 ఏళ్ల వయసులో సంస్కృత భాష నేర్చుకున్నారని తెలుసుకోవడం మీకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. మహాత్మాగాంధీ వ్యాసాలను చదివి తాను స్ఫూర్తి పొందానని ఆయన చెప్తారు. ఇదే విధమైన ఉదాహరణ మంగోలియాకు చెందిన 93 సంవత్సరాల ప్రొఫెసర్ జె. గొందె ధరమ్ గారిది. గత 4 దశాబ్దాలలో ఆయన భారతదేశంలోని 40 పురాతన గ్రంథాలు, ఇతిహాసాలు, రచనలను మంగోలియన్ భాషలోకి అనువదించారు. మన దేశంలో కూడా చాలా మంది ఇలాంటి అభిరుచితో పనిచేస్తున్నారు. గోవాకు చెందిన సాగర్ ములే గారి కృషి గురించి కూడా నేను తెలుసుకున్నాను. శతాబ్దాల క్రితం నాటి 'కావి' చిత్రకళ అంతరించిపోకుండా కాపాడడంలో ఆయన నిమగ్నమయ్యారు. 'కావి' చిత్రకళ భారతదేశపు ప్రాచీన చరిత్రను స్వయంగా వివరిస్తుంది. 'కావ్' అంటే ఎర్ర మట్టి. ప్రాచీన కాలంలో ఈ కళలో ఎర్ర మట్టిని ఉపయోగించేవారు. గోవా పోర్చుగీసు పాలనలో ఉన్న సమయంలో అక్కడి నుంచి వలస వచ్చిన వారు ఇతర రాష్ట్రాల ప్రజలకు ఈ అద్భుతమైన చిత్రకళను పరిచయం చేశారు. కాలక్రమేణా ఈ చిత్రకళ అంతరించిపోయే పరిస్థితి వచ్చింది. కానీ సాగర్ ములే గారు ఈ కళకు కొత్త జీవం పోశారు. ఆయన ప్రయత్నాలకు ప్రశంసలు కూడా లభిస్తున్నాయి. మిత్రులారా! ఒక చిన్న ప్రయత్నం, ఒక చిన్న అడుగు కూడా మన గొప్ప కళల పరిరక్షణలో చాలా సహకారం అందిస్తాయి.
మన దేశ ప్రజలు దృఢ సంకల్పంతో ఉంటే దేశవ్యాప్తంగా ఉన్న మన ప్రాచీన కళలను అందంగా తీర్చిదిద్ది, కాపాడుకోవాలనే తపన ఒక ప్రజా ఉద్యమ రూపం పొందవచ్చు. నేను ఇక్కడ కొన్ని ప్రయత్నాల గురించి మాత్రమే మాట్లాడాను. దేశవ్యాప్తంగా ఇలాంటి ప్రయత్నాలు ఎన్నో జరుగుతున్నాయి. నమో యాప్ ద్వారా మీరు వాటి సమాచారాన్ని తప్పనిసరిగా నాకు తెలియజేయాలి.
నా ప్రియమైన దేశ ప్రజలారా! అరుణాచల్ ప్రదేశ్ ప్రజలు ఒక సంవత్సరం నుండి ఒక ప్రత్యేకమైన ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. దానికి ‘అరుణాచల్ ప్రదేశ్ ఎయిర్‌గన్ సరెండర్ అభియాన్’ అని పేరు పెట్టారు. ఈ ప్రచారంలో ప్రజలు స్వచ్ఛందంగా తమ ఎయిర్గన్లను అప్పగిస్తున్నారు. ఎందుకో తెలుసా? తద్వారా అరుణాచల్ ప్రదేశ్‌లో విచక్షణారహితంగా జరిగే పక్షుల వేటను అరికట్టవచ్చు. మిత్రులారా! అరుణాచల్ ప్రదేశ్ 500 కంటే ఎక్కువ జాతుల పక్షులకు నిలయం. వీటిలో కొన్ని దేశీయ జాతులు ఉన్నాయి. ఇవి ప్రపంచంలో మరెక్కడా కనిపించవు. కానీ క్రమంగా ఇప్పుడు అడవుల్లో పక్షుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు దీన్ని సరిదిద్దేందుకే ఈ ఎయిర్‌గన్ సరెండర్ ప్రచారం జరుగుతోంది. గత కొన్ని నెలలుగా పర్వతం నుండి మైదానాల వరకు, ఒక సమాజం నుండి మరొక సమాజం వరకు, రాష్ట్రంలోని ప్రతిచోటా ప్రజలు హృదయపూర్వకంగా దీనిని స్వీకరించారు.అరుణాచల్ ప్రజలు తమ ఇష్టపూర్వకంగా 1600 కంటే ఎక్కువ ఎయిర్గన్లను అప్పగించారు. ఇందుకు అరుణాచల్ ప్రజలను ప్రశంసిస్తున్నాను. వారిని అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! మీ అందరి నుండి 2022కు సంబంధించి చాలా సందేశాలు, సూచనలు వచ్చాయి. ప్రతిసారిలాగే చాలా మంది వ్యక్తుల సందేశాలలో ఒక అంశం ఉంది. ఇది పరిశుభ్రత, స్వచ్ఛ భారత్ కు సంబంధించింది. ఈ పరిశుభ్రత సంకల్పం క్రమశిక్షణ, జాగరూకత, అంకితభావంతో మాత్రమే నెరవేరుతుంది. ఎన్. సి. సి. క్యాడెట్లు ప్రారంభించిన పునీత్ సాగర్ అభియాన్‌లో కూడా మనం దీని సంగ్రహావలోకనం చూడవచ్చు. ఈ ప్రచారంలో 30 వేల మందికి పైగా ఎన్సిసి క్యాడెట్లు పాల్గొన్నారు. ఈ ఎన్సీసీ క్యాడెట్లు బీచ్‌లను శుభ్రం చేశారు. అక్కడి నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి రీసైక్లింగ్ కోసం సేకరించారు. పరిశుభ్రత ఉన్నప్పుడే మన బీచ్‌లు, మన పర్వతాలు సందర్శించడానికి అనువుగా ఉంటాయి. జీవితాంతం ఏదో ఒక ప్రదేశానికి వెళ్లాలని చాలా మంది కలలు కంటుంటారు. కానీ అక్కడికి వెళ్ళి తెలిసో తెలియకో చెత్త కూడా వ్యాపింపజేస్తారు. మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చే ప్రదేశాలను అపరిశుభ్రంగా మార్చకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి దేశవాసిపై ఉంది.
మిత్రులారా! కొంతమంది యువకులు ప్రారంభించిన ‘సాఫ్ వాటర్’ అనే స్టార్టప్ గురించి నాకు తెలిసింది. కృత్రిమ మేధ, ఇంటర్నెట్ సహాయంతో ఇది ప్రజలకు వారి ప్రాంతంలోని నీటి స్వచ్ఛత, నాణ్యతకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తుంది. ఇది పరిశుభ్రత తదుపరి దశ. ప్రజల స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన భవిష్యత్తు కోసం ఈ స్టార్టప్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకుని, దీనికి గ్లోబల్ అవార్డు కూడా లభించింది.
మిత్రులారా! ఈ ప్రయత్నంలో 'పరిశుభ్రత వైపు ఒక అడుగు' ప్రచారంలో ప్రతి ఒక్కరి పాత్రా ప్రధానమైంది. సంస్థలు కావచ్చు లేదా ప్రభుత్వం కావచ్చు.. ప్రతి ఒక్కరి పాత్రా ముఖ్యమైందే. గతంలో ప్రభుత్వ కార్యాలయాల్లో పాత ఫైళ్లు, కాగితాలు ఎక్కువగా ఉండేవన్న సంగతి మీ అందరికీ తెలిసిందే. ప్రభుత్వం పాత పద్ధతులను మార్చడం ప్రారంభించినప్పటి నుండి ఈ ఫైళ్లు, కాగితాలు డిజిటలైజ్ అయి, కంప్యూటర్ ఫోల్డర్లో నిల్వ ఉంటున్నాయి. పాత, పెండింగ్‌లో ఉన్న మెటీరియల్‌ను తొలగించడానికి మంత్రిత్వ శాఖలు, విభాగాలలో ప్రత్యేక ప్రచారాలు కూడా నిర్వహిస్తున్నారు. ఈ ప్రచారాల్లో కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. పోస్టల్ డిపార్ట్మెంట్లో ఈ పరిశుభ్రతా డ్రైవ్ ప్రారంభించినప్పుడు అక్కడ ఉన్న జంక్‌యార్డ్ పూర్తిగా ఖాళీ అయింది. ఇప్పుడు ఈ జంక్‌యార్డ్ ను ప్రాంగణంగా, ఫలహారశాలగా మార్చారు. మరో జంక్‌యార్డ్‌ను ద్విచక్ర వాహనాలు నిలిపేందుకు పార్కింగ్ ప్రాంతంగా మార్చారు. అదేవిధంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ దాని ఖాళీగా ఉన్న జంక్‌యార్డ్‌ను వెల్నెస్ సెంటర్‌గా మార్చింది. పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ క్లీన్ ఏటీఎంను కూడా ఏర్పాటు చేసింది. దీని ఉద్దేశ్యం ఏమిటంటే ప్రజలు చెత్తను ఇవ్వడం, బదులుగా నగదు తీసుకోవడం. పౌర విమానయాన మంత్రిత్వ శాఖలోని విభాగాలు ఎండు ఆకులు, చెట్ల నుండి పడే సేంద్రీయ వ్యర్థాల నుండి సేంద్రీయ కంపోస్ట్‌ను తయారు చేయడం ప్రారంభించాయి. ఈ విభాగం వేస్ట్ పేపర్‌తో స్టేషనరీని తయారు చేసేందుకు కూడా కృషి చేస్తోంది. మన ప్రభుత్వ శాఖలు కూడా పరిశుభ్రత వంటి అంశంపై చాలా వినూత్నంగా ఆలోచిస్తాయి. కొన్నాళ్ల క్రితం వరకు ఎవరూ నమ్మలేదు కానీ నేడు అది వ్యవస్థలో భాగమైపోతోంది. దేశప్రజలందరూ కలసి నడిపిస్తున్న దేశపు కొత్త ఆలోచన ఇది.
నా ప్రియమైన దేశప్రజలారా! ఈసారి 'మన్ కీ బాత్'లో కూడా మనం అనేక అంశాలపై మాట్లాడుకున్నాం. ప్రతిసారిలాగే ఇప్పుడు కూడా ఒక నెల తర్వాత కలుద్దాం. మనం మళ్ళీ కలుద్దాం- కానీ, 2022లో. ప్రతి కొత్త ప్రారంభం మన సామర్థ్యాన్ని గుర్తించే అవకాశాన్ని తెస్తుంది. ఆ లక్ష్యాలు ఇంతకు ముందు మనం ఊహించనివి కూడా కావచ్చు. నేడు దేశం వాటి కోసం ప్రయత్నాలు చేస్తోంది.
క్షణశః కణశశ్చైవ, విద్యామ్ అర్థం చ సాధయేత్
క్షణో నష్టే కుతో విద్యా, కణే నష్టే కుతో ధనమ్
అంటే మనం జ్ఞానాన్ని సంపాదించాలనుకున్నప్పుడు, ఏదైనా కొత్తది నేర్చుకోవాలనుకున్నప్పుడు, చేయాలనుకున్నప్పుడు ప్రతి ఒక్క క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం డబ్బు సంపాదించవలసి వచ్చినప్పుడు, అంటే పురోగతి చెందవలసివచ్చినప్పుడు ప్రతి కణాన్ని- అంటే ప్రతి వనరును సముచితంగా ఉపయోగించాలి. ఎందుకంటే క్షణం నష్టపోతే జ్ఞానం, విద్య పోతాయి. వనరుల నష్టంతో సంపదకు, పురోగమనానికి దారులు మూసుకుపోతాయి. ఈ విషయం మన దేశవాసులందరికీ స్ఫూర్తిదాయకం. మనం చాలా నేర్చుకోవాలి. కొత్త ఆవిష్కరణలు చేయాలి. కొత్త లక్ష్యాలను సాధించాలి. అందుకే క్షణం కూడా వృధా చేయకుండా ఉండాలి. మనం దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలి. కాబట్టి మన ప్రతి వనరును పూర్తిగా ఉపయోగించుకోవాలి. ఒకరకంగా ఇది స్వావలంబన భారతదేశ మంత్రం కూడా. ఎందుకంటే మనం మన వనరులను సక్రమంగా ఉపయోగించినప్పుడు వాటిని వృధా చేయనివ్వం. అప్పుడే స్థానిక శక్తిని గుర్తిస్తాం. అప్పుడే దేశం స్వయం సమృద్ధి సాధిస్తుంది. కాబట్టి ఉన్నతంగా ఆలోచించాలని, ఉన్నతంగా కలలు కనాలని, వాటిని సాకారం చేసేందుకు కృషి చేయాలని మన సంకల్పాన్ని మళ్ళీ చెప్పుకుందాం. మన కలలు మనకు మాత్రమే పరిమితం కావు. మన కలలు మన సమాజం, దేశ అభివృద్ధికి సంబంధించినవిగా ఉంటాయి. మన పురోగతి దేశ పురోగతికి మార్గాన్ని తెరుస్తుంది. దీని కోసం ఈ రోజు నుండి మనం ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా, ఒక్క కణాన్ని కూడా కోల్పోకుండా పని చేయాలి. ఈ సంకల్పంతో రాబోయే సంవత్సరంలో దేశం ముందుకు సాగుతుందని, 2022 నవ భారత నిర్మాణానికి బంగారు పుట అవుతుందని నేను విశ్వసిస్తున్నాను. ఈ నమ్మకంతో మీ అందరికీ 2022 శుభాకాంక్షలు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం! ఈ రోజు మనం 'మన్ కీ బాత్' కోసం మరోసారి కలిశాం. రెండు రోజుల తర్వాత డిసెంబరు నెల కూడా మొదలవుతోంది. డిసెంబరు రాగానే సంవత్సరం గడిచిపోయినట్టే అనిపిస్తుంది. ఏడాదికి చివరి నెల కావడంతో కొత్త ఏడాదికి పునాదులు వేసుకుంటాం. దేశం అదే నెలలో నౌకా దళ దినోత్సవాన్ని,సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని కూడా జరుపుకుంటుంది. డిసెంబర్ 16వ తేదీన దేశం 1971 యుద్ధ స్వర్ణోత్సవాన్ని కూడా జరుపుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. ఈ సందర్భాలలోనేను దేశంలోని భద్రతా దళాలను గుర్తుకు తెచ్చుకుంటాను. మన వీరులను స్మరించుకుంటాను. అలాంటి వీరులకు జన్మనిచ్చిన ధైర్యవంతులైన తల్లులను గుర్తుకు తెచ్చుకుంటాను. ఎప్పటిలాగేఈసారి కూడా నమో యాప్ ద్వారానూ మీ గవ్ ద్వారానూ మీ అందరి నుండి నాకు చాలా సూచనలు వచ్చాయి.మీరు నన్ను మీ కుటుంబంలో ఒక భాగంగా భావించి మీ జీవితంలోని సంతోషాలను, బాధలను పంచుకున్నారు. ఇందులో చాలా మంది యువకులు ఉన్నారు. విద్యార్థులు ఉన్నారు. మన'మన్ కీ బాత్' కుటుంబం నిరంతరం అభివృద్ధి చెందుతుండడం నాకు సంతోషంగా ఉంటోంది. ఈ కార్యక్రమం మనస్సులతో అనుసంధానమవుతోంది. లక్ష్యాలతో అనుసంధానమవుతోంది. మన మధ్య లోతైన సంబంధంతో మనలో సానుకూల దృక్పథం నిరంతరం ప్రవహిస్తోంది.
నా ప్రియమైన దేశప్రజలారా! అమృత మహోత్సవానికి సంబంధించిన చర్చలు తనకు బాగా నచ్చాయని సీతాపూర్ నుండి ఓజస్వీ నాకు రాశారు. ఆయన తన స్నేహితులతో కలిసి 'మన్ కీ బాత్' వింటారు. స్వాతంత్ర్య పోరాటం గురించి చాలా తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి నిరంతరం ప్రయత్నిస్తారు. మిత్రులారా!అమృత మహోత్సవంనేర్చుకోవడంతో పాటు, దేశం కోసం ఏదైనా చేయాలనే స్ఫూర్తినిస్తుంది. ఇప్పుడు దేశవ్యాప్తంగా సామాన్య ప్రజలు అయినా ప్రభుత్వాలు అయినా, పంచాయితీ నుండి పార్లమెంట్ వరకు అమృత మహోత్సవ ప్రతిధ్వని వినిపిస్తోంది. ఈ మహోత్సవానితో అనుసంధానమైన కార్యక్రమాల పరంపర కొనసాగుతోంది. ఈ మధ్య ఢిల్లీలో అలాంటి ఆసక్తికరమైన కార్యక్రమం ఒకటి జరిగింది. ‘స్వాతంత్ర్య పోరాట కథలు-పిల్లల ప్రసంగాలు’ అనే కార్యక్రమంలోపిల్లలు పూర్తి ఉత్సాహంతో స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన కథలను ప్రస్తావించారు. విశేషమేమిటంటే భారత్‌తో పాటు నేపాల్, మారిషస్, టాంజానియా, న్యూజిలాండ్, ఫిజీ దేశాలకు చెందిన విద్యార్థులు కూడా ఇందులో పాల్గొన్నారు. మన దేశానికి చెందిన మహారత్న సంస్థ ఓ.ఎన్.జి.సి. కూడా అమృత మహోత్సవాన్ని విభిన్నంగా జరుపుకుంటోంది.ఈ మహోత్సవ రోజుల్లోవిద్యార్థుల కోసం చమురు క్షేత్రాలలో అధ్యయన యాత్రలను ఓ.ఎన్.జి.సి. నిర్వహిస్తోంది. ఈ అధ్యయనాలలోఓ.ఎన్.జి.సి. ఆయిల్ ఫీల్డ్ కార్యకలాపాల గురించి యువతకు తెలియజేస్తున్నారు. మన వర్ధమాన ఇంజనీర్లు దేశ నిర్మాణ ప్రయత్నాలలో పూర్తి ఉత్సాహంతో,అభిరుచితో చేతులు కలపాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
మిత్రులారా! స్వాతంత్య్ర సాధనలో గిరిజన సమాజం అందించిన సహకారాన్ని దృష్టిలో ఉంచుకునిదేశం కూడా గిరిజనులు గర్వించదగిన వారోత్సవాలను జరుపుకుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరిగాయి. అండమాన్ నికోబార్ దీవులలోజారవా,ఒంగే వంటి గిరిజన వర్గాల ప్రజలు తమ సంస్కృతిని సజీవంగా ప్రదర్శించారు.హిమాచల్ ప్రదేశ్‌లోని ఉనాకు చెందిన సూక్ష్మ లేఖకులు రామ్ కుమార్ జోషి అద్భుతమైన పని చేశారు. ఆయన చాలా చిన్నవైన పోస్టల్ స్టాంపులపైనే నేతాజీ సుభాష్ చంద్రబోస్, మాజీ ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రిల ప్రత్యేకమైన చిత్రాలను రూపొందించారు. ఆయన హిందీలో రాసిన 'రామ్' అనే పదంపై చిత్రాలను రూపొందించారు. అందులో ఇద్దరు మహానీయుల జీవిత చరిత్రను కూడా క్లుప్తంగా చెక్కారు.మధ్యప్రదేశ్‌లోని కట్నీకి చెందిన కొంతమంది మిత్రులు కూడా ఒక చిరస్మరణీయమైన దాస్తాంగోయ్ కార్యక్రమం గురించి సమాచారాన్ని అందించారు. ఇందులో రాణి దుర్గావతి ఎనలేని ధైర్యసాహసాలు, త్యాగాల జ్ఞాపకాలను గుర్తుకు తెచ్చారు. అలాంటి ఒక కార్యక్రమం కాశీలో జరిగింది. గోస్వామి తులసీదాస్, సంత్ కబీర్, సంత్ రవి దాస్, భారతేందు హరిశ్చంద్ర, మున్షీ ప్రేమ్‌చంద్, జయశంకర్ ప్రసాద్ వంటి మహానుభావుల గౌరవార్థం మూడు రోజుల పండుగను నిర్వహించారు.వివిధ కాలాలలోవీరంతా దేశ ప్రజల చైతన్యంలో పెద్ద పాత్ర పోషించారు. మీకు గుర్తు ఉండవచ్చు. 'మన్ కీ బాత్' ఇంతకుముందు భాగాలలో నేను మూడు పోటీలను ప్రస్తావించాను. దేశభక్తి గీతాలు రాయడం; దేశభక్తికి, స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన సంఘటనలకు చెందిన రంగవల్లికలను రూపుదిద్దడం;పిల్లల మనస్సులలో భవ్య భారతదేశ స్వప్నావిష్కరణ చేసేందుకుచిట్టిపాట లను రాయడం. ఈ పోటీల కోసం మీరు తప్పనిసరిగా ఎంట్రీని పంపారని నేను భావిస్తున్నాను. మీరు మీ మిత్రులతో కూడా ప్రణాళిక వేసుకుని, చర్చించి ఉండాలి. మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని భారతదేశంలోని ప్రతి మూలలో ఎంతో ఉత్సాహంతో ముందుకు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా!ఈ చర్చ నుండి నేను ఇప్పుడు మిమ్మల్ని నేరుగా బృందావనానికి తీసుకెళ్తాను. భగవంతుని ప్రేమకు ప్రత్యక్ష స్వరూపంగా బృందావనాన్ని చెప్తారు. మన యోగులు కూడా ఇలా చెప్పారు -
చిత్తంలో ఉందీ ఆశ -చిత్తంలో ఉందీ ఆశ
ఈ వైభవాన్ని వివరిస్తాను-
బృందావన వైభోగం, బృందావన వైభోగం
ఏవరికీ అంతుచిక్కలేదు-
దీని అర్థం ఏమిటంటే బృందావన మహిమనుమనందరం మన శక్తికి తగ్గట్టుగా చెప్పుకుంటాం. కానీ బృందావన ఆనందం, ఈ ప్రదేశం అందించే అనుభూతి, దాని తాదాత్మ్యత ఎవరూ కనుగొనలేరు. ఇది అపరిమితంగా ఉంటుంది. అందుకే బృందావనం ప్రపంచం నలుమూలల ప్రజలను ఆకర్షిస్తోంది.మీరు ప్రపంచంలోని ప్రతి మూలలో దాని ముద్రను కనుగొంటారు.
పెర్త్ పశ్చిమ ఆస్ట్రేలియాలోని ఒక నగరం. క్రికెట్ ప్రేమికులు ఈ ప్రపంచంతో బాగా పరిచయం కలిగి ఉంటారు. ఎందుకంటే పెర్త్‌లో క్రికెట్ మ్యాచ్‌లు తరచుగా జరుగుతాయి. పెర్త్‌లో 'సాక్రెడ్ ఇండియా గ్యాలరీ' పేరుతో కళా ప్రదర్శన శాలకూడా ఉంది. ఈ గ్యాలరీని స్వాన్ వ్యాలీలోని ఒక అందమైన ప్రాంతంలో ఏర్పాటు చేశారు. ఆస్ట్రేలియా నివాసి జగత్ తారిణి దాసి గారి కృషి ఫలితంగాఇది ఏర్పాటైంది. జగత్ తారిణి గారు ఆస్ట్రేలియాకు చెందినవారు. ఆమె అక్కడే పుట్టారు. అక్కడే పెరిగారు. అయితే ఆమె బృందావనం వచ్చిన తర్వాత 13 సంవత్సరాలకు పైగా కాలాన్ని ఇక్కడే గడిపారు. తాను ఆస్ట్రేలియాకు తిరిగి వెళ్ళినా, తిరిగి తన దేశానికి వెళ్ళినాబృందావనాన్నిమరచిపోలేనని చెప్పారు. అందువల్లబృందావనంతో, దాని ఆధ్యాత్మిక స్ఫూర్తితో అనుసంధానమయ్యేందుకు ఆమె ఆస్ట్రేలియాలోనే బృందావనాన్ని ఏర్పాటు చేశారు. తన కళను మాధ్యమంగా చేసుకుని అద్భుతమైన బృందావనాన్ని తీర్చిదిద్దారు. ఇక్కడికి వచ్చే ప్రజలకు అనేక రకాల కళాఖండాలను చూసే అవకాశం లభిస్తుంది. వారు భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ తీర్థయాత్ర కేంద్రాలు – బృందావనం, నవద్వీప్, జగన్నాథపూరీల సంప్రదాయం,సంస్కృతిల సంగ్రహావలోకనం పొందుతారు.శ్రీకృష్ణుని జీవితానికి సంబంధించిన అనేక కళాఖండాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తారు. గోవర్ధన పర్వతాన్ని కృష్ణుడు తన చిటికెన వేలితో ఎత్తిన ఒక కళాఖండం కూడా ఉంది. దాని కింద బృందావన ప్రజలు ఆశ్రయం పొందారు. జగత్ తారిణి గారి ఈ అద్భుతమైన ప్రయత్నంకృష్ణభక్తి లోని శక్తిని చూపిస్తుంది. ఈ ప్రయత్నానికి వారందరికీ శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశవాసులారా! నేను ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో ఉన్న బృందావనం గురించి మాట్లాడుతున్నాను. మన బుందేల్‌ఖండ్‌కు చెందిన ఝాన్సీతో ఆస్ట్రేలియాకు కూడా సంబంధం ఉందనేది ఆసక్తికరమైన చరిత్ర. నిజానికిఝాన్సీకి చెందిన రాణి లక్ష్మీబాయి ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా న్యాయ పోరాటం చేస్తున్నప్పుడుఆమె న్యాయవాది జాన్ లాంగ్.జాన్ లాంగ్ నిజానికి ఆస్ట్రేలియా వాసి. భారతదేశంలో ఉండి ఆయన రాణి లక్ష్మీబాయి విషయంలో పోరాడాడు. మన స్వాతంత్ర్య పోరాటంలో ఝాన్సీ, బుందేల్‌ఖండ్‌ల భాగస్వామ్యం మనందరికీ తెలుసు.రాణి లక్ష్మీబాయి,ఝల్కారీ బాయి వంటి వీరనారీమణులు ఇక్కడివారే. మేజర్ ధ్యాన్ చంద్ వంటి ఖేల్ రత్నను కూడా ఈ ప్రాంతమే దేశానికి అందించింది.
మిత్రులారా!శౌర్యాన్ని యుద్ధరంగంలో మాత్రమే ప్రదర్శించాల్సిన అవసరం లేదు. శౌర్యం వ్రతంగా మారినప్పుడు అది విస్తరిస్తుంది. అప్పుడు ప్రతి రంగంలోనూ అనేక కార్యాల సాధన ప్రారంభమవుతుంది. అలాంటి పరాక్రమం గురించి శ్రీమతి జ్యోత్స్నగారు నాకు లేఖ రాశారు. జాలౌన్‌లో ఒక నది ఉండేది - నూన్ నది. ఇక్కడి రైతులకు ఇది ప్రధాన నీటి వనరుగా ఉండేది. కానీక్రమంగా నూన్ నది అంతరించిపోయే దశకు చేరుకుంది. ఈ నదికి మిగిలి ఉన్న కొద్దిపాటి అస్తిత్వంగా ఇది కాలువగా మారింది. దీని కారణంగా రైతులకు సాగునీటికి కూడా ఇక్కట్లు ఏర్పడే పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితిని మార్చేందుకు జాలౌన్ ప్రజలు చొరవ తీసుకున్నారు. ఇందుకోసం ఈ ఏడాది మార్చిలో కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఉద్యమంలో వేలాది మంది గ్రామస్తులు, స్థానికులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు.ఇక్కడి పంచాయతీలు గ్రామస్తుల సహకారంతో పనులు ప్రారంభించాయి. నేడు అతి తక్కువ సమయంలో, అతి తక్కువ ఖర్చుతో నదికి జీవం పోశాయి. దీని వల్ల ఎంతో మంది రైతులకులబ్ది కలుగుతోంది. యుద్ధభూమిలో కాకుండా ఇతర క్షేత్రాలలో ధైర్యసాహసాలకు ఇది ఒక ఉదాహరణ. ఇది మన దేశవాసుల సంకల్ప శక్తిని చూపుతుంది. మనం దృఢ సంకల్పంతో ఉంటేఅసాధ్యమైనదిఏదీ ఉండదని ఈ ఉదాహరణ చెప్తోంది. సామూహిక కృషి ఉండాలని ఇది చెబుతుంది.
నా ప్రియమైన దేశవాసులారా!మనం ప్రకృతిని సంరక్షించినప్పుడు, ప్రకృతి కూడా మనకు రక్షణను, భద్రతను ఇస్తుంది. మనం వ్యక్తిగత జీవితంలో కూడా దీన్ని అనుభవిస్తాం.అలాంటి ఒక ఉదాహరణను తమిళనాడు ప్రజలు అందించారు. ఈ ఉదాహరణ తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు సంబంధించింది. తీర ప్రాంతాలలో కొన్నిసార్లు భూమి మునిగిపోయే ప్రమాదం ఉందని మనకు తెలుసు. తూత్తుకుడిలో కూడా చాలా చిన్నచిన్న ద్వీపాలుఉన్నాయి. అవి సముద్రంలో మునిగిపోయే ప్రమాదం పెరుగుతోంది.ఇక్కడి ప్రజలు,నిపుణులు ప్రకృతి ద్వారానే ఈ ప్రకృతి వైపరీత్యాన్ని రక్షించగలిగారు. ఈ ప్రజలు ఇప్పుడు ఈ దీవుల్లో తాటి చెట్లను నాటుతున్నారు. ఈ చెట్లు తుఫాన్లలో కూడా భూమికి రక్షణ ఇస్తాయి. ఇప్పుడు ఈ ప్రాంతాన్ని కాపాడుకోవడంలో కొత్త విశ్వాసం ఏర్పడింది.
మిత్రులారా!మనం ప్రకృతి సమతుల్యతను భంగపరిచినప్పుడు లేదా దాని స్వచ్ఛతను నాశనం చేసినప్పుడు మాత్రమే ప్రకృతి మనకు ముప్పు కలిగిస్తుంది. ప్రకృతి కూడా మనల్ని తల్లిలా ఆదరిస్తుంది. మన ప్రపంచాన్ని కొత్త రంగులతో నింపుతుంది.
ప్రస్తుతం నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను- మేఘాలయలో ఎగురుతున్న పడవ ఫోటో చాలా వైరల్ అవుతోంది. ఈ చిత్రం తొలిచూపులోనే మనల్ని ఆకర్షిస్తుంది. మీలో చాలామంది దీన్ని ఆన్లైన్లో చూసి ఉంటారు. గాలిలో తేలుతున్న ఈ పడవను నిశితంగా పరిశీలిస్తే అది నది నీటిలో కదులుతున్నట్లు తెలుస్తుంది. నది నీరు ఎంత శుభ్రంగా ఉందంటే నది కింది ప్రాంతం పారదర్శకంగా కనిపిస్తుంది. పడవ గాలిలో తేలుతున్నట్టు కనిపిస్తుంది. మన దేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ప్రజలు తమ సహజ వారసత్వాన్ని సంరక్షించిన అనేక ప్రాంతాలు ఉన్నాయి.ప్రకృతితో మమేకమై కాలం గడిపే జీవనశైలిని ఈ ప్రజలు నేటికీ సజీవంగా ఉంచారు. ఇది మనందరికీ కూడా స్ఫూర్తిగా నిలుస్తుంది. మన చుట్టూ ఉన్న సహజ వనరులను కాపాడి, వాటి అసలు రూపానికి తీసుకురావాలి. ఇందులోనే మనందరి క్షేమం ఉంది. ప్రజా ప్రయోజనం ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా!ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించినప్పుడు, బడ్జెట్‌ను ఖర్చు చేసినప్పుడు, ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసినప్పుడుఅది పని చేస్తుందని ప్రజలు భావిస్తారు. కానీ ప్రభుత్వం రూపొందించే అనేక అభివృద్ధి పథకాలలోమానవీయ సంవేదనలకు సంబంధించిన విషయాలు ఎల్లప్పుడూ భిన్నమైన ఆనందాన్ని ఇస్తాయి. ప్రభుత్వ కృషితో, ప్రభుత్వ పథకాలతో ఏ జీవితం ఎలా మారిపోయిందో, ఆ మారిన జీవితాల అనుభవాలేమిటో విన్నప్పుడు మనలో కూడా సంవేదనలు కలుగుతాయి.మనసుకు సంతృప్తిని ఇవ్వడంతోపాటు ఆ పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు స్ఫూర్తిని కూడా ఇస్తాయి. ఒక రకంగా చెప్పాలంటేఇది కేవలం స్వీయ ఆనందం మాత్రమే. అందుకే ఈ రోజు ‘మన్ కీ బాత్’ లో తమ మానసిక శక్తితో కొత్త జీవితాన్ని గెలిచిన అలాంటి ఇద్దరు మిత్రులు మనతో కలుస్తున్నారు. వారు ఆయుష్మాన్ భారత్ పథకం సహాయంతో తమ చికిత్సను పూర్తి చేసి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. వీరిలో మొదటి మిత్రుడు రాజేష్ కుమార్ ప్రజాపతి. ఆయనకు గుండె సంబంధిత సమస్యలు ఉండేవి.
రండి.. రాజేష్ గారితో మాట్లాడదాం -
ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. నమస్తే.
రాజేష్ ప్రజాపతి: నమస్తేసార్.. నమస్తే
ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. మీకు వచ్చిన వ్యాధి ఏమిటి? అప్పుడు
ఎవరో డాక్టర్ దగ్గరకు వెళ్లి ఉండాలి. నాకు చెప్పండి. స్థానిక వైద్యుడు తప్పనిసరిగా చెప్పిన తర్వాత మీరు వేరే వైద్యుడి వద్దకు వెళ్లి ఉండాలి. అప్పుడు మీరు నిర్ణయం తీసుకున్నారా? లేదా? ఏం జరిగింది?
రాజేష్ ప్రజాపతి: నా గుండెలో ఒక సమస్య వచ్చింది సార్. నా
ఛాతీలో మంటగా అనిపించింది సార్. అప్పుడు డాక్టర్‌కి చూపించాను. అసిడిటీ ఉండవచ్చని డాక్టర్ చెప్పారు సార్. అందుకే చాలా రోజులు అసిడిటీ కి మందులు వాడాను. లాభం లేకపోవడంతో అప్పుడు నేను డాక్టర్ కపూర్ గారికి చూపించాను. “నీకు ఉన్న లక్షణాలు యాంజియోగ్రఫీ ద్వారా తెలుస్తాయి” అని డాక్టర్ గారుచెప్పారు. అప్పుడు ఆయన నన్ను శ్రీరామ్ మూర్తి గారికి రిఫర్ చేశారు. అప్పుడు మేం అమ్రేష్ అగర్వాల్ గారిని కలిశాం. ఆయన నా యాంజియోగ్రఫీ చేశారు. అప్పుడు ఆయన చెప్పారు. “ఇది మీ సిర బ్లాక్ కావడం వల్ల జరిగింది” అని. ఎంత ఖర్చవుతుందని మేం అడిగాం. దాంతో ఆయుష్మాన్ కార్డు ఉంటుందని, దాన్ని ప్రధానమంత్రి గారు తయారు చేశారని ఆయన చెప్పారు. ఆ కార్డు మా దగ్గర ఉందని మేం చెప్పాం. దాంతో ఆయన నా కార్డు తీసుకున్నారు. నా చికిత్స మొత్తం ఆ కార్డుతోనే జరిగింది సార్. మీరు ఈ కార్డ్‌ని చాలా మంచి పద్ధతిలో తయారు చేశారు. ఇది పేద ప్రజలకు చాలా సౌకర్యంగా ఉంది. నేను మీకు ఎలా కృతజ్ఞతలు చెప్పగలను!
ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. మీరేం చేస్తారు?
రాజేష్ ప్రజాపతి: సార్.. ఇప్పుడు నేను ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నాను సార్
ప్రధానమంత్రి: మీ వయసెంత ?
రాజేష్ ప్రజాపతి: నా వయసు నలభై తొమ్మిదేళ్లు సార్
ప్రధానమంత్రి: మీకు ఇంత చిన్న వయసులోనే గుండె జబ్బు వచ్చింది.
రాజేష్ ప్రజాపతి - అవును సార్...
ప్రధానమంత్రి: మీ కుటుంబంలో ఇంతకు ముందు మీ కుటుంబంలో మీ అమ్మకు గానీ నాన్నకు గానీ ఇంకా ఎవరికైనా ఇలా ఉందా? మీకే వచ్చిందా?
రాజేష్ ప్రజాపతి: లేదు సార్, ఎవరూ లేరు సార్. ఇది నాకే వచ్చింది.
ప్రధాన మంత్రి: ఈ ఆయుష్మాన్ కార్డును భారత ప్రభుత్వం ఇస్తుంది. ఈ కార్డు పేదల కోసం ఒక పెద్ద పథకం. దీని గురించి మీకెలా తెలిసింది?
రాజేష్ ప్రజాపతి: సార్!ఇది చాలా పెద్ద పథకం. దీని ద్వారా పేద ప్రజలు చాలా ప్రయోజనం పొందుతున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు సార్. ఈ కార్డు ద్వారా ప్రజలు ఎంత ప్రయోజనం పొందారో ఆసుపత్రిలో చూశాం సార్. ఈ కార్డు మాదగ్గర ఉందని చెప్పినప్పుడు“సరే ఆ కార్డు తీసుకురండి.. అదే కార్డుతో మీకు వైద్యం చేస్తాన”ని డాక్టర్ చెప్పారు.
ప్రధానమంత్రి: మీ దగ్గర కార్డు లేకపోతేఎంత ఖర్చవుతుందో డాక్టర్ గారు చెప్పారా?
రాజేష్ ప్రజాపతి: కార్డు లేకపోతే చాలా ఖర్చవుతుందని డాక్టర్ చెప్పారు సార్. “సార్ నా దగ్గర కార్డ్ ఉంది” అని చెప్పాను. ఆ కార్డు వెంటనే చూపించమన్నారు డాక్టర్. ఆ కార్డు చూపిస్తే అదే కార్డ్ తో మొత్తం చికిత్స అంతా జరిగింది. ఒక్క పైసా కూడా ఖర్చు పెట్టలేదు, మందులు కూడా ఆ కార్డు ద్వారానే వచ్చాయి.
ప్రధానమంత్రి: కాబట్టి రాజేష్ గారూ.. మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారు. మీ ఆరోగ్యం బాగుంది.
రాజేష్ ప్రజాపతి: సార్! చాలా కృతజ్ఞతలు సార్!మీ ఆయుష్షు దీర్ఘకాలం ఉండాలి సార్. మీరు ఎల్లప్పుడూ అధికారంలో ఉండాలి. మా కుటుంబ సభ్యులు కూడా మీ కారణంగా చాలా సంతోషంగా ఉన్నారు.
ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. నేను అధికారంలో ఉండాలని కోరుకోకండి. నేను ఈ రోజు కూడా అధికారంలో లేను. భవిష్యత్తులో కూడా అధికారంలోకి వెళ్లాలనుకోను. నేను సేవలో మాత్రమే ఉండాలనుకుంటున్నాను. నాకు ఈ పదవి-ఈ ప్రధానమంత్రి పదవి.. ఇవన్నీ అధికారం కోసం కాదు సోదరా, సేవ కోసమే.
రాజేష్ ప్రజాపతి: మాకు కావలసింది సేవే సార్.. ఇంకేం కావాలి!
ప్రధానమంత్రి: ఈ ఆయుష్మాన్ భారత్ పథకం పేదల కోసం.
రాజేష్ ప్రజాపతి: సార్ .. చాలా గొప్ప విషయం
ప్రధానమంత్రి: అయితే చూడండి రాజేష్ గారూ.. మీరు మా కోసం ఒక పని చేయండి. చేస్తారా?
రాజేష్ ప్రజాపతి: అవును.. ఖచ్చితంగా చేస్తాసార్
ప్రధానమంత్రి: ప్రజలకు దీని గురించి తెలియడం లేదు. మీరు బాధ్యత వహించాలి. మీకు దీని వల్ల కలిగిన ఉపయోగాన్ని మీకు ఎలా ప్రయోజనం కలిగిందో మీ చుట్టూ ఉన్న పేద కుటుంబాలకు చెప్పాలి.
రాజేష్ ప్రజాపతి: తప్పకుండాచెప్తాను సార్
ప్రధానమంత్రి: ఎప్పుడు కష్టాలు వస్తాయో తెలియదని, అందుకే ఇలాంటి కార్డును వారు కూడా తయారు చేసుకోవాలని వారికి చెప్పండి. డబ్బు లేకపోవడం వల్ల వారు మందు తీసుకోరు. వ్యాధికి మందు తీసుకోరు. అది కూడా చాలా ఆందోళన కలిగించే విషయం. ఈ గుండె సమస్య ఉంటే పేదలకు ఏం జరుగుతుంది? అప్పుడు మీరు ఎన్ని నెలలు పని చేయకుండా ఉండాల్సి వస్తుంది?
రాజేష్ ప్రజాపతి: నేను పది అడుగులు కూడా నడవలేకపోయేవాడిని. మెట్లు ఎక్కలేకపోయే వాడిని సార్
ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. మీరు నాకు మంచి మిత్రునిగా మారడం ద్వారా, ఈ ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మీకు వీలైనంత మంది పేదలకు వివరించడం ద్వారా మీరు అనారోగ్యంతో ఉన్నవారికి సహాయం చేయవచ్చు. మీరు కూడా సంతోషపడుతారు. రాజేష్ గారి ఆరోగ్యం బాగుపడడంతో పాటు రాజేష్ గారు వందలాది మందికి ఆరోగ్యం చేకూర్చారని నేను కూడా సంతోషిస్తాను. ఈ ఆయుష్మాన్ భారత్ పథకంపేదల కోసం. మధ్యతరగతి వారి కోసం. ఇది సాధారణ కుటుంబాల కోసం, కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఇంటికి మీరు చేర్చాలి.
రాజేష్ ప్రజాపతి: ఖచ్చితంగా చేరుస్తాను సార్. మూడు రోజులు ఆసుపత్రిలోనే ఉన్నాం సార్. ఆసుపత్రికి వచ్చిన చాలా మంది పేదలకు కార్డు ఉంటే కలిగే ప్రయోజనాలు చెప్పాం సార్. కార్డు ఉంటే ఉచితంగా చేస్తారని చెప్పాం సార్.
ప్రధానమంత్రి: రాజేష్ గారూ.. మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి. మీ శరీరాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి. పిల్లలను జాగ్రత్తగా చూసుకోండి. చాలా అభివృద్ధి చెందండి. నేను మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా! మనం రాజేష్ గారి మాటలు విన్నాం. ఇప్పుడు సుఖ్ దేవి గారు మనతో చేరుతున్నారు. మోకాళ్ల సమస్య ఆమెని చాలా బాధపెట్టింది. సుఖ్‌దేవి గారి బాధను విందాం. ఆమెకు ఆనందం ఎలా వచ్చిందో అర్థం చేసుకుందాం.
మోదీ గారు: సుఖదేవి గారూ.. నమస్తే! మీరు ఎక్కడ నుండి మాట్లాడుతున్నారు?
సుఖ దేవి గారు:దాన్ దపరా నుండి సార్.
మోదీ గారు: ఇది ఎక్కడ ఉంది?
సుఖ దేవి గారు: మధురలో.
మోదీ గారు: మధురలోనా! సుఖదేవి గారూ.. అయితేమీరు నమస్తే చెప్పడంతో పాటు రాధే-రాధే అని కూడా చెప్పాలి.
సుఖదేవి గారు: అవును సార్. రాధే-రాధే.
మోదీ గారు: మీరు ఇబ్బందుల్లో ఉన్నారని మేము విన్నాము. మీకు ఏదైనా ఆపరేషన్ జరిగిందా? విషయమేమిటో చెప్పగలరా?
సుఖ దేవి గారు: అవును. నా మోకాలు దెబ్బతింది. కాబట్టి నాకు ఆపరేషన్ జరిగింది. ప్రయాగ్ హాస్పిటల్ లో.
మోదీ గారు: సుఖదేవి గారూ.. మీ వయస్సు ఎంత?
సుఖ దేవి గారు: వయస్సు 40 సంవత్సరాలు సార్ .
మోదీ గారు: సుఖదేవి అనే పేరు. 40 సంవత్సరాలు. సుఖదేవి అనారోగ్యం పాలయ్యారు.
సుఖ దేవి గారు: 15-16 సంవత్సరాల వయస్సు నుండేనేను అనారోగ్యంతో ఉన్నాను.
మోదీ గారు: ఇంత చిన్న వయస్సులో మీ మోకాలు
చెడిపోయిందా!
సుఖ దేవి గారు: కీళ్లనొప్పుల వల్ల మోకాలు చెడిపోయింది సార్.
మోదీ గారు: 16 సంవత్సరాల నుండి 40 సంవత్సరాల వరకు మీరు చికిత్స కూడా చేయించలేదా?
సుఖ దేవి గారు: లేదు. .. చేయించాను. పెయిన్ మెడిసిన్ తీసుకుంటూనే ఉన్న చిన్నా చితకా డాక్టర్లకు చూపించాను. స్థానికంగా దొరికే మందులు వాడాను. దాంతో మోకాలు మరింత పాడైపోయింది.
మోదీ గారు: సుఖదేవి గారూ.. ఆపరేషన్ ఆలోచన ఎలా వచ్చింది? దానికోసం డబ్బుఎలా ఏర్పాటు చేసుకున్నారు? ఇదంతా ఎలా జరిగింది?
సుఖ దేవి గారు: నేను ఆయుష్మాన్ కార్డ్‌తో ఆ చికిత్సను పూర్తి చేశాను.
మోదీ గారు: మీకు ఆయుష్మాన్ కార్డు వచ్చిందా?
సుఖ దేవి గారు: అవును.
మోదీ గారు: ఆయుష్మాన్ కార్డుతో పేదలకు ఉచిత చికిత్సజరుగుతుంది. ఇది మీకు తెలుసా?
సుఖ దేవి గారు: స్కూల్లో ఒక మీటింగ్ ద్వారా మా భర్తకు తెలిసింది. నా పేరు మీద కార్డు చేయించారు.
మోదీ గారు: ఓహ్..
సుఖ దేవి గారు: అప్పుడు కార్డు ద్వారా ట్రీట్మెంట్ చేయించాను. నేను డబ్బు పెట్టుబడి పెట్టలేదు. నేను కార్డు ద్వారానే చికిత్స పొందాను. మంచి చికిత్స జరిగింది.
మోదీ గారు: కార్డు లేకపోతే ఎంత ఖర్చవుతుందని డాక్టర్ చెప్పేవారు?
సుఖ దేవి గారు: రెండున్నర లక్షల రూపాయలు, మూడు లక్షల రూపాయలు. ఆరేడేళ్ల నుంచి మంచంలో ఉన్నాను. “దేవుడా! నన్ను తీసుకెళ్లు. నాకు బతకాలని లేదు” అని అనుకునేదాన్ని.
మోదీ గారు: 6-7 సంవత్సరాలు మంచం మీద ఉన్నారు. అమ్మో!
సుఖ దేవి గారు: అవును.
మోదీ గారు: ఓ!
సుఖ దేవి గారు: అస్సలు లేవడం, కూచోవడం ఉండేది కాదు.
మోదీ గారు: ఇప్పుడు మీ మోకాలి మునుపటి కంటే మెరుగ్గా ఉందా?
సుఖ దేవి గారు: నేను చాలా ప్రయాణం చేస్తాను. నేను తిరుగుతున్నాను వంటగది పనిచేస్తాను. ఇంటి పనులు చేస్తాను. నేనే వండి పిల్లలకు భోజనం పెడతాను.
మోదీ గారు: కాబట్టి ఆయుష్మాన్ భారత్ కార్డు నిజంగా మిమ్మల్ని ఆయుష్మంతులుగా మార్చింది.
సుఖ దేవి గారు: ఈ పథకానికి చాలా ధన్యవాదాలు. కోలుకున్నాను. నా కాళ్ళపై నేను నిలబడగలుగుతున్నాను.
మోదీ గారు: కాబట్టి ఇప్పుడు పిల్లలు కూడా ఆనందిస్తున్నారు.
సుఖ దేవి గారు: అవును. పిల్లలు చాలా ఇబ్బందులు పడేవారు. తల్లి బాధపడితే బిడ్డలు కూడా బాధపడేవారు.
మోదీ గారు: చూడండి.. మన ఆరోగ్యం మన జీవితంలో అతిపెద్ద ఆనందం. ఇది ఆయుష్మాన్ భారత్ భావన. ప్రతి ఒక్కరూ ఈ సంతోషకరమైన జీవితాన్ని పొందాలి. సుఖదేవి గారూ.. మీకు మరోసారి శుభాకాంక్షలు. రాధే-రాధే.
సుఖ దేవి గారు: రాధే – రాధే.. నమస్తే!
నా ప్రియమైన దేశప్రజలారా! యువత అధికంగా ఉన్న ప్రతి దేశంలో మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. ఇప్పుడు అవే కొన్నిసార్లు యువత నిజమైన గుర్తింపుగా మారతాయి. మొదటి విషయం - ఆలోచనలు,ఆవిష్కరణ. రెండవది రిస్క్ తీసుకునేందుకు సిద్ధంగా ఉండే మనస్తత్వం. మూడవది ఏదైనా చేయగలననే ఆత్మ విశ్వాసం-అంటే పరిస్థితులు ఎంత ప్రతికూలంగా ఉన్నా ఏ పనినైనా సాధించాలనే సంకల్పం. ఈ మూడు అంశాలు కలిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి.అద్భుతాలు జరుగుతాయి. ఈ రోజుల్లో మనం స్టార్ట్-అప్, స్టార్ట్-అప్, స్టార్ట్-అప్ అని అన్ని వైపులా వింటున్నాం. నిజమే.. ఇది స్టార్టప్ యుగం, అలాగే స్టార్ట్-అప్ ప్రపంచంలోఈ రోజు భారతదేశం ప్రపంచానికే ఒకరకంగా మార్గదర్శిగా నేతృత్వం వహిస్తుందన్నది కూడా నిజం. స్టార్టప్‌లు ఏడాదికేడాది రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెడుతున్నాయి. ఈ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.దేశంలోని చిన్న పట్టణాల్లో కూడా స్టార్టప్‌ల పరిధి పెరిగింది. ఈ రోజుల్లో 'యూనికార్న్' అనే పదం చాలా చర్చలో ఉంది. మీరందరూ తప్పక విని ఉంటారు. 'యూనికార్న్' అటువంటి స్టార్టప్. దీని విలువ కనీసం 1 బిలియన్ డాలర్లు అంటే దాదాపు ఏడు వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ.
మిత్రులారా! 2015 సంవత్సరం వరకు దేశంలో దాదాపు తొమ్మిది లేదా పది యూనికార్న్‌లు మాత్రమే ఉండేవి. ఇప్పుడు భారతదేశం యునికార్న్స్ ప్రపంచంలో కూడా వేగంగా పురోగమిస్తుందని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఒక నివేదిక ప్రకారంఈ సంవత్సరం పెద్ద మార్పు వచ్చింది. కేవలం 10 నెలల్లోప్రతి 10 రోజులకు ఒక యూనికార్న్ భారతదేశంలో తయారవుతోంది. కరోనా మహమ్మారి మధ్య మన యువత ఈ విజయాన్ని సాధించడం కూడా పెద్ద విషయం. ప్రస్తుతం భారతదేశంలో 70 కంటే ఎక్కువ యూనికార్న్‌లు ఉన్నాయి. అంటే 1 బిలియన్ కంటే ఎక్కువ విలువను దాటిన 70 కంటే ఎక్కువ స్టార్టప్‌లు ఉన్నాయి. మిత్రులారా!స్టార్ట్-అప్ విజయం కారణంగాప్రతి ఒక్కరి దృష్టి దీనిపై పడింది. దేశం నలుమూలల నుండి, విదేశాల నుండి పెట్టుబడిదారుల సహకారం లభిస్తున్న విధానాన్ని అందరూ గమనిస్తున్నారు. బహుశా కొన్ని సంవత్సరాల కిందట ఇది ఎవరూ ఊహించలేదు.
మిత్రులారా!భారతీయ యువత స్టార్టప్‌ల ద్వారా ప్రపంచ సమస్యల పరిష్కారంలోకూడా సహకరిస్తోంది. ఈ రోజు మనం ఒక యువకుడు మయూర్ పాటిల్‌తో మాట్లాడదాం. ఆయన తన స్నేహితులతో కలిసి కాలుష్య సమస్యకు పరిష్కారం ఇవ్వడానికి ప్రయత్నించారు.
మోదీ గారు: మయూర్ గారూ.. నమస్తే.
మయూర్ పాటిల్ గారు: నమస్కారం సార్.
మోదీ గారు: మయూర్ గారూ.. మీరెలా ఉన్నారు?
మయూర్ పాటిల్ గారు: చాలా బాగున్నాను సార్. మీరెలా ఉన్నారు ?
మోదీ గారు: నేను చాలా సంతోషంగా ఉన్నాను. సరే చెప్పండి. ప్రస్తుతం మీరేదో స్టార్టప్ ప్రపంచంలో ఉన్నారు.
మయూర్ పాటిల్ గారు: అవును సార్!
మోదీ గారు: వ్యర్థాలను ఉత్తమంగా పరివర్తన చేస్తున్నారు.
మయూర్ పాటిల్ గారు: అవును సార్!
మోదీ గారు: పర్యావరణ రంగంలో కూడా మీరు పని చేస్తున్నారు. మీ గురించి చెప్పండి. మీ పని గురించి మాకు చెప్పండి. ఈ పనికి మీకు ఎలా ఆలోచన వచ్చింది?
మయూర్ పాటిల్ గారు: సార్!నేను కాలేజీలో ఉన్నప్పుడు నాకు మోటార్ సైకిల్ ఉండేది. దాని మైలేజ్ చాలా తక్కువగా ఉండేది. ఎమిషన్ చాలా ఎక్కువగా ఉండేది. అది టూ స్ట్రోక్ మోటార్ సైకిల్. కాబట్టి ఉద్గారాలను తగ్గించి, దాని మైలేజీని కొద్దిగా పెంచడానికినేను ప్రయత్నించడం ప్రారంభించాను.ఎప్పుడో 2011-12లో నేను మైలేజీని లీటరుకు 62 కిలోమీటర్ల మేరకు పెంచాను. కాబట్టి అక్కడి నుండి నేను ప్రజల కోసం పెద్ద ఎత్తున తయారు చేయాలనే ప్రేరణ పొందాను. అప్పుడు చాలా మంది దాని నుండి ప్రయోజనం పొందుతారుకాబట్టి. 2017-18లో మేం దాని సాంకేతికతను అభివృద్ధి చేశాం. ప్రాంతీయ రవాణా సంస్థలో 10 బస్సులలో ఉపయోగించాం. దాని ఫలితాన్ని తనిఖీ చేయడానికి దాదాపు మేం ఉద్గారాలను నలభై శాతం తగ్గించాం- బస్సులలో ..
మోదీ గారు: ఓహ్! మీరు కనుగొన్న ఈ సాంకేతికతకు పేటెంట్ మొదలైనవి పొందారా?
మయూర్ పాటిల్ గారు: అవును సార్! పేటెంట్ పూర్తయింది. ఈ సంవత్సరంలో మాకు పేటెంట్ వచ్చింది.
మోదీ గారు: మరి దీన్ని మరింత పెంచే ప్రణాళిక ఏమిటి? ఎలా చేస్తున్నారు? బస్సు ఫలితం వచ్చేసింది. ఆ విషయాలన్నీ కూడా బయటకు వచ్చే ఉంటాయి. కాబట్టి మీరు తర్వాత ఏం చేయాలని ఆలోచిస్తున్నారు?
మయూర్ పాటిల్ గారు: సార్!స్టార్ట్-అప్ ఇండియాలో NITI ఆయోగ్ నుండి అటల్ న్యూ ఇండియా ఛాలెంజ్ నుండి మాకు గ్రాంట్ వచ్చింది. ఆ గ్రాంట్ ఆధారంగామేం ఎయిర్ ఫిల్టర్లను తయారు చేసే ఫ్యాక్టరీని ప్రారంభించాం.
మోదీ గారు: మీరు భారత ప్రభుత్వం నుండి ఎంత గ్రాంట్ పొందారు?
మయూర్ పాటిల్ గారు: 90 లక్షలు
మోదీ గారు: 90 లక్షలా!
మయూర్ పాటిల్ గారు: అవును సార్!
మోదీ గారు: మీ పని దానితో పూర్తయిందా !
మయూర్ పాటిల్ గారు: అవును.. ఇప్పుడే మొదలైంది. ఇంకా ప్రాసెస్ లో ఉన్నాం.
మోదీ గారు: మీరు ఎంత మంది స్నేహితులు కలిసి చేస్తున్నారు ఇదంతా?
మయూర్ పాటిల్ గారు: మేం నలుగురం సార్.
మోదీ గారు: నలుగురూ ఇంతకుముందు కలిసి చదువుకునేవారు. దాని నుండి మీకు ముందుకు వెళ్లాలనే ఆలోచన వచ్చింది.
మయూర్ పాటిల్ గారు: అవును సార్! అవును! మేము ఇంకా కాలేజీలోనే ఉన్నాం అప్పుడు. కాలేజీలో మేం ఇదంతా ఆలోచించాం. కనీసం నా మోటార్‌సైకిల్ కాలుష్యాన్ని తగ్గించి మైలేజీని పెంచాలని నా ఆలోచన.
మోదీ గారు: కాలుష్యాన్ని తగ్గించారు.. మైలేజీని పెంచారు.. అప్పుడు సగటు ఖర్చు ఎంత ఆదా అవుతుంది?
మయూర్ పాటిల్ గారు: సార్!మోటార్ సైకిల్ మైలేజీని పరీక్షించాం. లీటరుకు 25 కిలోమీటర్లు ఇచ్చే దాన్ని లీటర్‌కు 39 కిలోమీటర్లకు పెంచాం. అప్పుడు దాదాపు 14 కిలోమీటర్ల ప్రయోజనం. అందులో 40 శాతం కార్బన్ ఉద్గారాలు తగ్గాయి. ప్రాంతీయ రవాణా సంస్థ బస్సులను ప్రారంభించినప్పుడుఇంధన సామర్థ్యం 10 శాతం పెరిగింది. దానిలో ఉద్గారాలు 35-40 శాతం తగ్గాయి.
మోదీ గారు: మయూర్ గారూ.. మీతో మాట్లాడటం నాకు ఆనందంగా ఉంది. మీకు మిత్రులను కూడా అభినందిస్తున్నాను. కళాశాల జీవితంలో మీరు ఎదుర్కొన్న సమస్యకు మీరు ఒక పరిష్కారం కనుగొనడంతో పాటు ఆ పరిష్కారం ఎంచుకున్న మార్గం పర్యావరణ సమస్యను పరిష్కరించింది. మీరు చొరవ తీసుకున్నారు. మన దేశ యువతఏదైనా పెద్ద సవాలును స్వీకరించి, మార్గాలను అన్వేషిస్తుంది. అదే మన యువత శక్తి. మీకు అంతా మంచే జరగాలని ఆశిస్తున్నాను. నా తరఫున మీకు చాలా చాలా ధన్యవాదాలు
మయూర్ పాటిల్ గారు: ధన్యవాదాలు సార్! ధన్యవాదాలు!
మిత్రులారా! కొన్నేళ్ల క్రితం ఎవరైనా వ్యాపారం చేయాలనుకుంటున్నానని, కొత్త కంపెనీ పెట్టాలనుకుంటున్నానని చెబితే“నీకు ఉద్యోగం ఎందుకు వద్దు? ఉద్యోగంలో భద్రత ఉంటుంది. జీతం వస్తుంది. ఇబ్బంది కూడా తక్కువే.” అని కుటుంబ పెద్దలు సమాధానమిచ్చేవారు. కానీ, ఎవరైనా ఈరోజు తన స్వంత కంపెనీని ప్రారంభించాలనుకుంటేచుట్టూ ఉన్న వారందరూ చాలా ఉత్సాహపరుస్తారు. అతనికి పూర్తిగా మద్దతు ఇస్తారు. మిత్రులారా!ఇది భారతదేశ వృద్ధి కథ మలుపు. ఇక్కడ ఇప్పుడు ప్రజలు ఉద్యోగార్థులుగా కాకుండా ఉద్యోగ సృష్టికర్తలుగా మారాలని కలలు కంటున్నారు. ఇది ప్రపంచ వేదికపై భారత్ స్థానాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా!ఈరోజు మనం 'మన్ కీ బాత్'లో అమృత మహోత్సవం గురించి మాట్లాడుకున్నాం. అమృత కాలంలో మన దేశప్రజలు కొత్త సంకల్పాలను ఎలా నెరవేరుస్తున్నారో చర్చించాం. డిసెంబర్ నెలలో సైన్యం ధైర్యసాహసాలకు సంబంధించిన అంశాలను కూడా ప్రస్తావించాం. డిసెంబరు నెలలోమనం స్ఫూర్తి పొందే మరో పెద్ద రోజు మన ముందుకు వస్తుంది. అది డిసెంబర్ 6వ తేదీన వచ్చే బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి. బాబా సాహెబ్ తన జీవితమంతా దేశం కోసం,సమాజం కోసం తన విధులను నిర్వర్తించడానికి అంకితం చేశారు. మనమందరం మన కర్తవ్యాన్ని నిర్వర్తించాలనిమన రాజ్యాంగం ఆశిస్తున్నదని, అదే మన రాజ్యాంగంలోని ప్రాథమిక భావన అని దేశప్రజలమైన మనం ఎప్పటికీ మరచిపోకూడదు. కాబట్టి మన కర్తవ్యాలను పూర్తి నిజాయితీతో నిర్వహిస్తామనిఅమృత మహోత్సవంలో ప్రతిజ్ఞ చేద్దాం. ఇదే బాబా సాహెబ్‌కి మనం ఇచ్చే నిజమైన నివాళి.
మిత్రులారా! ఇప్పుడు మనం డిసెంబర్ నెలలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 2021లో తర్వాతి 'మన్ కీ బాత్' ఈ సంవత్సరంలో చివరి 'మన్ కీ బాత్' కావడం సహజం. 2022లో మళ్లీ ప్రయాణాన్ని ప్రారంభిద్దాం. అవును.. నేను మీ నుండి చాలా సూచనలను ఆశిస్తూనే ఉన్నాను. దాన్ని కొనసాగిస్తాను. మీరు ఈ సంవత్సరానికి ఎలా వీడ్కోలు పలుకుతున్నారు, కొత్త సంవత్సరంలో మీరు ఏమి చేయబోతున్నారు- దయచేసి ఈ విషయాలు కూడా చెప్పండి. కరోనా ఇంకా పోలేదని మర్చిపోకండి. జాగ్రత్తలు తీసుకోవడం మనందరి బాధ్యత.
చాలా చాలా ధన్యవాదాలు!
ప్రియమైన సహచరులారా, మీకందరికీ నమస్కారం | శతకోటి ప్రణామాలు | నేను మీకు శతకోటి ప్రణామాలు ఎందుకు చెబుతున్నానంటే వంద కోట్ల వాక్సీన్ డోసులు తీసుకున్న తర్వాత ఇవ్వాళ్ల దేశం కొత్త ఉత్సహంతో, కొత్త వేగంతో ముందుకు దూసుకెళ్తోంది. మన వాక్సినేషన్ కార్యక్రమం సఫలత భారతదేశపు సామర్ధ్యాన్ని చాటుతోంది, అది మన సామర్ధ్యానికి ప్రతీకగా నిలిచింది.
మిత్రులారా వంద కోట్ల వాక్సీన్ డోసుల్ని వేయడం చాలా పెద్ద విషయం, కానీ దానికి సంబంధించిన లక్షలాది చిన్న చిన్న ప్రేరణలు, అలాగే గర్వంతో కూడుకున్న అనేక అనుభవాలు, అనేక ఉదాహరణలు దానికి ముడిపడి ఉన్నాయి | వాక్సినేషన్ మొదలుపెట్టిన రోజునే ఇంత పెద్ద కార్యక్రమం పూర్తిగా సఫలమవుతుందన్న విశ్వాసం నాకెలా కలిగిందని చాలామంది నాకు లేఖలు రాస్తున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు | నాకు అంతటి నమ్మకం ఎందుకు కలిగిందంటే, నాకు నా దేశంయొక్క, నా దేశ ప్రజలయొక్క శక్తి సామర్ధ్యాల గురించి చాలా బాగా తెలుసు కనుక | మన హెల్త్ వర్కర్లు దేశవాసులందరికీ టీకాలు వేసే ప్రయత్నంలో ఎలాంటి లోపం చెయ్యరన్న పూర్తి నమ్మకం నాకుంది. మన హెల్త్ వర్కర్లు పూర్తి స్థాయి అంకిత భావంతో, ఓ సత్సంకల్పంతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించారు. వాళ్లందరూ ఓ వినూత్నమైన సంకల్పంతో, అంకితభావంతో తమ శక్తికి మంచి చాలా కష్టపడ్డారు | ధృఢ నిశ్చయంతో మానవతా భావనతో సేవా దృక్పథంతో ముందుకు సాగి ఓ సరికొత్త అధ్యాయాన్ని సృష్టించారు | దానికి సంబంధించి ఎన్నో ఉదాహరణలున్నాయి | అనేక రకాలైన ఇబ్బందుల్ని సవాళ్లని అధిగమించి వాళ్లు ఏ విధంగా దేశ ప్రజలందరికీ ఓ సురక్షా కవచాన్ని ఏర్పాటు చేశారో కథలు కథలుగా చెబుతున్నారు | ఈ సఫలత సాధించడానికి వాళ్లు ఎంతగా కష్టపడ్డారో, ఎన్ని శ్రమలకోర్చారో మనం అనేక పత్రికల్లో వచ్చిన కథనాలు చూశాం, అనేక రకాల కథనాల్నికూడా విన్నాం | ఒకరిని మించి ఒకరుగా అనేక రకాలైన ప్రేరణలు మనకి కనిపించాయి | నేనివ్వాళ్టి మన్ కీ బాత్ లో ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ ప్రాంతానికి చెందిన ఓ హెల్త్ వర్కర్ పూనమ్ నౌటియాలా ని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను | మిత్రులారా ఆ బాగేశ్వర్ దేశంలోకెల్లా నూటికి నూరుశాతం వాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేసిన ఉత్తరాఖండ్ ఖండ్ కి చెందినవారు కావడం విశేషం | ఉత్తరాఖండ్ ప్రభుత్వాన్నికూడా మనం ఈ సందర్భంగా అభినందించి తీరాలి. ఎందుకంటే అది అత్యంత దుర్గమమైన, కఠినమైన ప్రదేశం కాబట్టి | అదే విధంగా అనేక విధాలైన అవాంతరాల్ని అధిగమించి హిమాచల్ ప్రదేశ్ కూడా నూటికి నూరుశాతం వాక్సినేషన్ ప్రక్రియలో సఫలత సాధించింది | నాకు తెలిసిన సమాచారం ప్రకారం పూనమ్ గారు తానున్న ప్రదేశంలో అందరికీ వాక్సీన్ ని అందించడానికి రాత్రింబవళ్లూ తీవ్రస్థాయిలో శ్రమించారు |
ప్రధాన మంత్రి :- పూనమ్ గారు నమస్తే |
పూనమ్ నౌటియాలా :- నమస్కారం సర్ |
ప్రధాన మంత్రి :- పూనమ్ గారూ దేశ వాసులందరికీ కాస్త మీ
గురించి చెబుతారా
పూనమ్ నౌటియాలా :- సార్ నా పేరు పూనమ్ నౌటియాలా | సార్
నేను ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ జిల్లాలోని చానీ కోరాలీ సెక్టర్ లో పనిచేసే ఆరోగ్య కార్యకర్తని సర్. నేనో ANMని సర్.
ప్రధాన మంత్రి :- పూనమ్ గారూ నాకు బాగేశ్వర్ కి వచ్చే
అవకాశం కలగడం నిజంగా నా అదృష్టం. అది ఓ పుణ్య క్షేత్రం కావడం విశేషం. అక్కడ బాగేశ్వర్ మందిరం ఉంది, దాన్ని దర్శించుకుని నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎన్నో శతాబ్దాల క్రితం ఆ మందిరాన్ని అసలు ఎలా నిర్మించారోకదా అని.
పూనమ్ నౌటియాల్ :- అవును సార్.
ప్రధాన మంత్రి :- పూనమ్ గారూ మీరు మీ ప్రాంతంలో
ఉన్నవారందరికీ వాక్సినేషన్ పూర్తి చేశారా?
పూనమ్ నౌటియాల్ :- అవును సర్, మొత్తం అందరికీ పూర్తైపోయింది.
ప్రధానమంత్రి :- ఆ ప్రక్రియలో మీరేమైనా ఇబ్బందుల్ని
ఎదుర్కోవాల్సొచ్చిందా?
పూనమ్ నౌటియాలా :- అవును సర్ | ఇక్కడ మాకు ఎక్కడైతే వర్షం
పడుతుందో అక్కడ రోడ్డు పూర్తిగా బ్లాకైపోతుంది | సార్ మేం నదిని దాటుకుని వెళ్లాల్సొచ్చింది |
మేం ప్రతి ఒక్క ఇంటికీ వెళ్లాం సర్ |NHCVC కార్యక్రమంలో భాగంగా మేం ప్రతి ఇంటికీ వెళ్లాం | చాలామంది ఆరోగ్య కేంద్రానికి రాలేకపోయారండీ, ఎలాంటివాళ్లంటే వృద్ధులు, వికలాంగులులాంటి వాళ్లు, గర్భవతులైన మహిళలు, గృహిణులు చాలామంది |
ప్రధానమంత్రి :- పైగా అక్కడ కొండలమీద ఇళ్లు చాలా
దూరంగా ఉంటాయికదా.
పూనమ్ నౌటియాలా :- అవును |
ప్రధాన మంత్రి :- మరైతే మీరు ఒక్క రోజులో ఎంతదూరం
ప్రయాణించాల్సొచ్చేది.
పూనమ్ నౌటియాలా :- సార్ కిలోమీటర్ల ప్రకారం చూస్తే రోజుకి దాదాపు పది
కిలోమీటర్లు, ఎనిమిది కిలోమీటర్లు.
ప్రధాన మంత్రి :- నిజానికి పట్టణాల్లో నివశించేవాళ్లకి 8-10 కిలోమీటర్లు
కొండలెక్కి ప్రయాణించడమంటే ఏంటో తెలియదు. నాకు తెలిసి 8-10 కిలోమీటర్లు కొండలెక్కడమంటే మొత్తం రోజంతా పడుతుంది.
పూనమ్ నౌటియాలా :- అవును సర్..
ప్రధాన మంత్రి :- కానీ ఒక్కరోజులో ఇంతంటే, పైగా ఇది చాలా
ముఖ్యమైన వాక్సినేషన్ కార్యక్రమం కాబట్టి మొత్తం సామానంతా కూడా మోసుకెళ్లాల్సొస్తుంది. మీతోపాటుగా ఎవరైనా సహాయకులు కూడా వచ్చేవారా లేదా ?
పూనమ్ నౌటియాలా :- అవును సర్.. మేం ఐదుగురం టీమ్ మెంబర్లం
ఉంటాం సర్.
పూనమ్ నౌటియాలా :- ఆ..
పూనమ్ నౌటియాలా :- ఆ బృందంలో ఓ డాక్టర్, ఓ ANM, ఇంకా ఓ
ఫార్మసిస్ట్, ఆశా అలాగే డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా ఉన్నారు సర్.
ప్రధానమంత్రి :- అవునా.. అయితే ఆ డేటా ఎంట్రీకోసం అక్కడ
కనెక్టివిటీ దొరికేదా లేకపోతే బాగేశ్వర్ కి తిరిగొచ్చాక చేసేవాళ్లా?
పూనమ్ నౌటియాలా :- సర్.. అక్కడక్కడా నెట్వర్క్ ఉండేది, మిగతావన్నీ
బాగేశ్వర్ కి తిరిగొచ్చాక ఎంట్రీ చేసేవాళ్లం మేము.
ప్రధాన మంత్రి :- అవును. నాకు తెలిసిన సమాచారం ఏంటంటే
పూనమ్ గారు ఔటాఫ్ ది వే వెళ్లి జనానికి టీకాలు వేసేవాళ్లట. అసలు మీకా ఆలోచన ఎలా వచ్చింది, మీరప్పుడేమనుకున్నారు, మీరు ఎలా ముందుకెళ్లారు?
పూనమ్ నౌటియాలా :- మేమంతా, మొత్తం టీమ్ కలిసి మావల్ల ఒక్క డోస్
వాక్సీన్ కూడా మిస్ కాకూడదని బలంగా
సంకల్పించుకున్నాం. మన దేశం నుంచి కరోనా మహమ్మారిని దూరంగా తరిమి వెయ్యాలనుకున్నాం. నేను ఆశ కలిసి గ్రామాల వారీగా ఓ డ్యూ లిస్ట్ ని తయారు చేసుకున్నాం. ఆ జాబితా ప్రకారం చూసుకుని సెంటర్ కి వచ్చినవాళ్లకి అక్కడే టీకాలు వేసేశాం. తర్వాత మేం ఇంటింటికీ వెళ్లాం. సార్ ఆ తర్వాత మిగిలిపోయినవాళ్లు, సెంటర్ కి రాలేని వాళ్లని గుర్తించాం.
ప్రధాన మంత్రి :- మీరు అందరికీ నచ్చజెప్పాల్సొచ్చేదా?
పూనమ్ నౌటియాలా :- అవును సర్.. నచ్చజెప్పాం.. అవును..
ప్రధాన మంత్రి :- ఇప్పుడు కూడా అందరూ వాక్సీన్ తీసుకోవడానికి
ఉత్సాహం చూపిస్తున్నారా?
పూనమ్ నౌటియాలా :- అవును సర్.. అవును.. ఇప్పుడు అందరికీ
అర్థమైపోయింది. మొదట్లో మాకు చాలా కష్టంగా అనిపించింది. ఈ వాక్సీన్ సురక్షితమైనదని, మేం కూడా వేసుకున్నామని, మేం బాగానే ఉన్నాంకదా అని జనానికి నచ్చజెప్పాల్సొచ్చేది. మా స్టాఫ్ అంతా వేసుకున్నామని మేం బాగున్నామని చెప్పాల్సొచ్చేది.
ప్రధాన మంత్రి :- ఎక్కడైనా వాక్సీన్ వేసిన తర్వాత ఏమైనా
ఇబ్బందులొచ్చాయా తర్వాత.. పూనమ్ నౌటియాలా :- లేదు లేదు సర్.. అలాంటిదేం లేదు..
పూనమ్ నౌటియాలా :- ఏం కాలేదా..
పూనమ్ నౌటియాలా :- అవును..
ప్రధాన మంత్రి :- అందరూ సంతోషంగానే ఉన్నారా
పూనమ్ నౌటియాలా :- అవును సర్..
ప్రధానమంత్రి :- అంతా బాగానే ఉందికదా..
పూనమ్ నౌటియాలా :- అవును సర్..
ప్రధాన మంత్రి :- అవును.. మీరు చాలా కష్టపడి పనిచేశారు.. ఆ
ప్రాంతం ఎలా ఉంటుందో, అక్కడ కొండలెక్కడం ఎంత కఠినంగా ఉంటుందో నాకు తెలుసు. ఓ కొండ ఎక్కడం మళ్లీ కిందికి దిగడం, మళ్లీ ఇంకో కొండెక్కడం, ఇళ్లుకూడా చాలా దూరంగా ఉంటాయి, మీరు చాలా చాలా కష్టపడి పనిచేశారు.
పూనమ్ నైటియాల్ :- ధన్యవాదాలు సర్, మీతో మాట్లాడ్డం నిజంగా నా
అదృష్టం.
ప్రధానమంత్రి :- మీలాంటి లక్షలాది మంది హెల్త్ వర్కర్లు
కఠినమైన పరిశ్రమతో భారత దేశంలో కోట్లాది వాక్సీన్ డోసుల లక్ష్యాన్ని పూర్తి చేశారు. ఇవ్వాళ్ల దానికి నేను కేవలం మీకు మాత్రమే కాక ఉచిత టీకాకరణ ప్రక్రియని ఇంత పెద్ద ఎత్తున పూర్తి చేయడానికి సహకరించిన ప్రతి ఒక్క భారతీయుడికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరివల్లే మన దేశంలో వాక్సినేషన్ ప్రక్రియ ఇంతగా సఫలమయ్యింది. మీకు మీ కుటుంబాలకు నేను అభినందనలు తెలుపుతున్నాను.
ప్రియమైన దేశవాసులారా, మీకు తెలిసిందేకదా వచ్చే ఆదివారం, అక్టోబర్ 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పండుగ. మనసులో మాట శ్రోతలందరి తరఫునా, నా తరఫునా, నేనా ఉక్కుమనిషికి నమస్కరిస్తున్నాను.
మిత్రులారా, అక్టోబర్ 31వ తేదీని మనం రాష్ట్రీయ సమైక్య దినంగా జరుపుకుంటున్నాం. ఏకత్వానికి సంబంధించిన ఏ విధానం లేదా ప్రక్రియతో అయినా సరే మనందరం అనుబంధాన్ని పెంచుకోవడం మన ధర్మం. మీరు చూసే ఉంటారు గుజరాత్ పోలీసులు కచ్ లోని లఖ్ పత్ కోటనుండి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకూ బైక్ ర్యాలీని నిర్వహించారు. త్రిపుర పోలీసులు ఏకతా దివస్ ని జరుపుకునే సందర్భంలో త్రిపుర నుంచి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వరకూ బైక్ ర్యాలీని నిర్వహిస్తున్నారు. అంటే తూర్పు నుంచి పశ్చిమ దిశ వరకూ దేశాన్ని ఏకం చేస్తున్నారు. జమ్మూకాశ్మీర్ పోలీసులుకూడా ఉరీనుంచి పఠాన్ కోట్ వరకూ అలాంటి బైక్ ర్యాలీని నిర్వహించి దేశంలో ఏకత్వ సందేశాన్ని ప్రచారం చేస్తున్నారు. నేనా జవానులందరికీ సెల్యూట్ చేస్తున్నాను. జమ్మూకాశ్మీర్ లోని కుప్వారా జిల్లాలోని అనేక మంది ఆడపడుచుల గురించి కూడా నాకు తెలిసింది. ఆ ఆడపడుచులందరూ కాశ్మీర్ లోని సైన్యానికి సంబంధించిన కార్యాలయాలకోసం, ప్రభుత్వ కార్యాలయాలకోసం మువ్వన్నెల జెండాలను కుడుతున్నారు. పరిపూర్ణమైన దేశ భక్తితో చేస్తున్న పని అది. నేను ఆ ఆడపడుచులు పడుతున్న శ్రమని అభినందిస్తున్నాను. మీరుకూడా భారతదేశంలో ఏకత్వం కోసం, భారత దేశ ఔన్నత్యం కోసం, ఏదో ఒకటి చెయ్యాలి. అప్పుడు మీ మనసుకు ఎంతటి సంతోషం కలుగుతుందో మీరే చూడండి.
మిత్రులారా, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమనేవారంటే – మనందరం కలిసికట్టుగా ఉన్నప్పుడు మాత్రమే దేశాన్ని ప్రగతి పథంలోకి తీసుకెళ్లగలం. మనలో గనక ఏకత్వం లేకపోతే మనంతట మనమే కొత్త కొత్త ఆపదల్లో చిక్కుకుపోతాం. అంటే దేశం ఒక్కటిగా ఉంటే మనం ఉన్నతంగా ఉంటాం. మనం సర్దార్ పటేల్ జీవితంనుంచి ఆయన ఆశయాలనుంచి చాలా చాలా నేర్చుకోవచ్చు. మన ప్రసార మంత్రిత్వ శాఖ కూడా సర్దార్ పటేల్ జీవితంపై ఓ పిక్టోరియెల్ బయోగ్రఫీని ప్రచురించింది. మన దేశంలోని యువకులందరూ దాన్ని చదవాలని నేను కోరుకుంటున్నాను. దానిద్వారా మీకు ఆకర్షణీయమైన రీతిలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జీవితం గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుంది.
ప్రియమైన సహచరులారా, జీవితం నిరంతరాయంగా ప్రగతిని కోరుకుంటుంది, అభివృద్ధిని కోరుకుంటుంది, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటుంది. విజ్ఞానం ఎంతగా అభివృద్ధి చెందినా సరే, ప్రగతి పథం ఎంత వేగంగా ఉన్నాసరే, భవనాలు ఎంత అందంగా నిర్మితమైనా సరే, జీవితంలో మాత్రం ఏదో ఒక లోటు కనిపిస్తూనే ఉంటుంది. కానీ దానికి చక్కటి సంగీతాన్ని, కళల్ని, నాట్యాన్ని, సాహిత్యాన్ని జోడిస్తే అప్పుడు లభించే సంతృప్తి కోటానుకోట్ల రెట్లు పెరుగుతుంది. నిజానికి జీవితాన్ని సార్థకం చేసుకోవాలంటే ఇవన్నీ మనకు చాలా అవసరం. అందుకే ఇవన్నీ మన జీవితంలో ఓ కెటలిస్ట్ లా పనిచేస్తాయని చెబుతారుకదా. ఇవి మన శక్తిని పెంచేందుకు దోహదపడతాయి. మానవుడి మనస్సుని అంతర్గతంగా వికసింపజేసేందుకు, మన మనోయాత్రకు చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసేందుకు చక్కటి సంగీతం, ఇంకా వివిధ రకాలైన కళలు ముఖ్యమైన భూమికను పోషిస్తాయి. వాటికి ఉన్న శక్తి ఎలాంటిదంటే అవి కాలానికి, ప్రాంతానికి, మత తత్వానికీ కట్టుబడేవికావు, అమృత మహోత్సవంలోకూడా మన కళలు, సంస్కృతి, గీతాలు, సంగీతానికి సంబంధించిన రంగుల్ని నింపడం చాలా అవసరం.
నాక్కూడా అనేకమందినుంచి అమృత మహోత్సవానికి, అలాగే సంగీత సాహిత్యాలకు ఉన్న శక్తికి సంబంధించిన అనేక సూచనలు అందుతున్నాయి. ఆ సూచనలు నాకు అత్యంత విలువైనవి. నేను వాటిని సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు అధ్యయనంకోసం పంపించాను. సంతోషకరమైన విషయం ఏంటంటే సాంస్కృతిక మంత్రిత్వ శాక వాటిని అతి తక్కువ కాలంలోనే అధ్యయనం చేసింది. దానికి సంబంధించిన పనికూడా మొదలయ్యింది. అలాంటి ఓ చక్కటి ఆలోచనే దేశ భక్తి గీతాల పోటీ. స్వాతంత్ర్య సంగ్రామంలో వేర్వేరు భాషలు, యాసల్లో దేశ భక్తి గీతాలు, భజనలు దేశాన్ని ఒక్కతాటిమీద నడిపించాయి. ఇప్పుడు అమృతకాలంలో మన యువత అలాంటి దేశ భక్తి గీతాల్ని రాసి, ఈ కార్యక్రమానికి మరింతగా శోభను పెంచొచ్చు. ఆ దేశ భక్తి గీతాలు మాతృభాషలో కూడా ఉండొచ్చు లేదా జాతీయ భాషలోనూ ఉండొచ్చు అలాగే ఇంగ్లిష్ భాషలో కూడా రాయొచ్చు. కానీ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ రచనలు నవ భారతానికి సంబంధించిన కొత్త ఆలోచనలతో కూడినవయ్యుండాలి. వర్తమానానికి సంబంధించి ప్రేరణను స్వీకరించి దేశ భవిష్యత్తుని సమున్నతమైన పథంలో నడిపించగలిగేవి అయ్యుండాలి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జిల్లా స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకూ ఈ పోటీల్ని నిర్వహించాలి.
మిత్రులారా, మనసులో మాట శ్రోత ఒకరు ఏం సలహా ఇచ్చారంటే అమృత మహాత్సవంలో ముగ్గుల పోటీలుకూడా పెట్టాలన్నారు. మన దేశంలో పండుగ రోజుల్లో రంగు రంగుల ముగ్గులెయ్యడం శతాబ్దాలుగా ఆనవాయితీ. రంగుల ముగ్గుల్లో దేశం వైవిధ్యంగా కనిపిస్తుంది. వివిధ రాష్ట్రాల్లో వివధ పేర్లతో, వివిధ రకాలైన థీమ్ లతో రంగుల ముగ్గులు వేస్తారు. అందుకే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి కూడా ఓ క్యాంపెయిన్ నిర్వహించబోతోంది. మీరే ఆలోచించండి, స్వాతంత్ర్య సమరానికి సంబంధించిన ముగ్గులు వేస్తే, జనం వాళ్లవాళ్ల ఇళ్లముందు, గోడల మీద స్వాతంత్ర్యోద్యమ కారుల బొమ్మల్ని చిత్రీకరిస్తే, స్వాతంత్ర్యోద్యమానికి సంబంధించిన ఏ సంఘటననైనా రంగులతో చిత్రీకరిస్తే, అమృత మహోత్సవం శోభ ఎన్నో రెట్లు పెరుగుతుంది.
మిత్రులారా మనకి లాలి పాటలు పాడే ఇంకో కళకూడా ఉంది. మన దేశంలో లాలి పాటల ద్వారా చిన్న పిల్లలకు సంస్కారాన్ని నేర్పుతారు. వాటిద్వారా మన సంస్కృతిని వాళ్లకి పరిచయం చేస్తారు. లాలిపాటలకు కూడా ఓ వైవిధ్యం ఉంది. మరప్పుడు మనం అమృత కాలంలో ఈ కళనుకూడా తిరిగి బతికించుకోకూడదు, దేశ భక్తికి సంబంధించిన లాలి పాటల్ని ఎందుకు రాయకూడదు, కవితలు, గీతాలు ఏదో ఒకటి రాయగలిగితే, చాలా తేలికగా ప్రతి ఇంట్లోనూ తల్లులు తమ చిన్నారి బాలలకు వాటిని వినిపించొచ్చుకదా. ఆ లాలిపాటల్లో ఆధునిక భారతం కనిపించాలి. 21వ శతాబ్దపు భారతీయ కలలు వాటిలో ప్రతిఫలించాలి. మీరు చేసిన ఈ సూచనల ఆధారంగా సాంస్కృతిక మంత్రిత్వ శాఖ వాటికి సంబంధించిన పోటీల్ని నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
మిత్రులారా, ఈ మూడు పోటీలూ అక్టోబర్ 31వ తేదీన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజున ప్రారంభం కాబోతున్నాయి. రాబోయే రోజుల్లో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ దానికి సంబంధించిన వివరాల్ని మీకు అందజేస్తుంది. ఆ వివరాల్ని మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లో, సోషల్ మీడియాలోకూడా అందజేస్తారు. మీరందరూ ఈ పోటీల్లో పాల్గొనాలని నేను కోరుకుంటున్నాను. మన యువతరం తప్పనిసరిగా తమలోని కళను, తమ ప్రతిభను ప్రదర్శించాలి. దానివల్ల మీ ప్రాంతానికి సంబంధించిన కళ, సంస్కృతి దేశంలో మూల మూలలకూ విస్తరిస్తాయి. మీ కథల్ని దేశం మొత్తం వింటుంది.
ప్రియమైన మిత్రులారా, ఇప్పుడు మనం అమృతోత్సవ సమయంలో వీరులైన, అమరులైన భరతమాత ముద్దు బిడ్డల్ని గుర్తు చేసుకుంటున్నాం. వచ్చే నెల నవంబర్ 15వ తేదీన అలాంటి మహా పురుషులు, వీర యోధులైన, భగవాన్ బిరసా ముండ్ గారి జయంతి రాబోతోంది. భగవాన్ బిరసా ముండ్ ను భరత మాతకు తండ్రిగా కీర్తిస్తారు. అంటే ఆయన ఈ భూమికే తండ్రి అని అర్థం. భగవాన్ బిరసా ముండ్ తమ నేలను, అడవుల్ని, భూమిని రక్షించుకోవడంకోసం తీవ్రమైన పోరాటం చేశారు. భూమికి తండ్రియైనవారే అంతటి పోరాటం చెయ్యగలరు. ఆయన మనకు మన సంస్కృతిని, దాని మూలాల్నీ చూసి గర్వించడం నేర్పించారు. విదేశీ పాలకులు ఆయన్ని ఎంతగా బెదిరించినా సరే, ఎంతగా ఒత్తిడి చేసినా సరే, ఆయన మాత్రం ఆదివాసీల సంస్కృతిని మాత్రం విడిచిపెట్టలేదు. ప్రకృతిని, పర్యావరణాన్ని మనం ప్రేమించడం నేర్చుకోవాలంటే, కచ్చితంగా దానికి భగవాన్ బిరసా ముండ్ మనకు ప్రేరణగా నిలుస్తారు. ఆయన, పర్యావరణానికి హాని కలిగించే విదేశీ పాలనకు సంబంధించిన ఏ నిర్ణయాన్నైనా సరే తీవ్రంగా వ్యతిరేకించారు. బీదసాదల్ని, కష్టాల్లో ఉన్నవాళ్లని ఆదుకోవడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవారు. అనేక రకాలైన సామాజిక దురాచారాల్ని నిర్మూలించడానికి ఆయన చాలా కృషి చేశారు. ఉల్ గులాన్ ఉద్యమాన్ని ఆయన తప్ప ఇంకెవరు ముందుకు నడిపించగలిగుండేవారు. ఆ ఉద్యమం ఆంగ్లేయులకు మనశ్శాంతి లేకుండా చేసింది. దాని తర్వాతే ఆంగ్లేయులు భగవాన్ బిరసా ముండ్ ని పట్టించిన వారికి చాలా పెద్ద నగదు బహుమతిని ప్రకటించారు. బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ని జైల్లోపెట్టింది. ఆయన్ని ఎంతగా వేధించారంటే పాతికేళ్లకంటే తక్కువ వయసులోనే ఆయన మనల్ని విడిచి వెళ్లిపోయారు. ఆయన మనల్ని కేవలం భౌతికంగా మాత్రమే విడిచి వెళ్లిపోయారు. జనం మనసుల్లో మాత్రం ఆయన శాశ్వతమైన, సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. జనానికి ఆయన జీవితం ఓ ప్రేరణాత్మక శక్తిగా మిగిలిపోయింది. ఇవ్వాళ్టికీ ఆయన జీవిత గాథకు సంబంధించిన జానపద గీతాలు, కథలు మధ్య భారతంలో విస్తృతంగా ప్రచారంలో ఉన్నాయి. ఈ ధరిత్రికే తండ్రి అయిన భగవాన్ బిరసా ముండ్ కి నేను నమస్కరిస్తున్నాను. ఆయన గురించి విస్తృత స్థాయిలో తెలుసుకోవాలని నేను యువతరానికి సూచిస్తున్నాను. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో మన ఆదివాసీ జాతుల పోరాట పటిమను గురించి మీరు ఎంతగా తెలుసుకుంటే అంతగా మీకు గౌరవప్రదమైన అనుభూతులు కలుగుతాయి.
ప్రియమైన సహచరులారా, ఇవ్వాళ్ల అక్టోబర్ 24వ తేదీ UN Day అంటే ఐక్యరాజ్య సమితి ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటాం. ఈ రోజునే ఐక్య రాజ్య సమితి ఆవిర్భవించింది. ఐక్యరాజ్య సమితిని స్థాపించిన రోజునుంచీ భారత్ కి దానిలో అనుబంధం ఉంది. భారత దేశం 1945లో స్వాతంత్ర్యం సాధించడానికి పూర్వమే ఐక్యరాజ్య సమితి చార్టర్ లో సంతకం చేసిందన్న విషయం మీకు తెలుసా. ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఓ ముఖ్యమైన విషయం ఏంటంటే ఐక్యరాజ్య సమితి ప్రభావనాన్ని ఇంకా దాని శక్తిని పెంచడానికి భారతీయ నారీశక్తి చాలా ముఖ్యమైన భూమికను నిర్వహించింది. 1947-48లో UN Human Rights Universal Declarationని రూపొందించేటప్పుడు అందులో “All Men are Created Equal” అని రాశారు. కానీ భారతీ దేశానికి చెందిన ఓ Delegate దానికి అభ్యంతరం తెలిపారు. తర్వాత Universal Declarationలో - “All Human Beings are Created Equal” అని రాశారు. Gender Equality అనే ఈ అంశం భారత దేశంలో శతాబ్దాల క్రితమే అమల్లో ఉంది. శ్రీమతి హంసా మెహతా ఆ Delegate అన్న విషయం మీకు తెలుసా. ఆవిడవల్లే ఆ మార్పు జరిగింది. అప్పుడే మరో Delegate శ్రీమతి లక్ష్మీ మీనన్ Gender Equalityఅంశంపై బలంగా తన అభిప్రాయాన్ని తెలిపారు. అది మాత్రమే కాక, 1953లో శ్రీమతి విజయలక్ష్మీ పండిట్, UN General Assemblyకి తొలి మహిళా President అయ్యారు.
మిత్రులారా, మనం ఎలాంటి పవిత్రమైన నేలకు చెందినవాళ్లమంటే, దేన్ని విశ్వసిస్తామంటే, ఏమని ప్రార్థన చేస్తామంటే :
ఓం ద్యోశాన్తిరన్తరిక్ష శాన్తిః,
పృధ్వీ శాన్తిరాపః శాంతిరోషధయః శాన్తిః ।
వనస్పతయః శాన్తిర్విశ్వేదేవాః శాన్తిర్బ్రహ్మమ్ శాన్తిః,
సర్వే శాన్తిః, శాన్తిరేవ శాన్తిః, సామా శాన్తిరేధి
ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ।।
భారత దేశం ఎప్పుడూ విశ్వశాంతికోసం పాటుపడింది. మనం గర్వించదగ్గ విషయం ఏంటంటే భారతదేశం 1950వ దశాబ్దంలో నిరంతరాయంగా ఐక్యరాజ్య సమితి శాంతి మిషన్ లో భాగంగా ఉంది. దారిద్ర్య నిర్మూలన, Climate Change ఇంకా శ్రామికులకు సంబంధించి సమస్యలు విషయంలో సమాధానాలకు సంబంధించి భారతదేశం అగ్రపథంలోనే పయనిస్తోంది. అది మాత్రమే కాక యోగాని ఇంకా ఆయుష్ ని అందరికీ చేరువ చేసేందుకు భారత దేశం WHOఅంటే World Health Organisation తో కలిసి పనిచేస్తోంది. 2021 మార్చ్ లో WHO భారతదేశంలో సంప్రదాయ చికిత్సను అందించేందుకు ఓ Global Centreని స్థాపిస్తామని ప్రకటించింది.
మిత్రులారా, ఐక్యరాజ్య సమితి గురించి మాట్లాడుతుంటే నాకివ్వాళ్ల అటల్ బిహారీ వాజ్ పేజ్ గారి మాటలు గుర్తొస్తున్నాయి. 1977లో ఆయన ఐక్యరాజ్య సమితిలో హిందీ భాషలో ప్రసంగించి ఓ కొత్త చరిత్రను సృష్టించారు. ఇవ్వాళ్ల నేను మనసులో మాట శ్రోతలకు, నాడు అటల్ బిహారీ వాజ్ పేయ్ గారి ప్రసంగంలోని ఓ భాగాన్ని వినిపించాలనుకుంటున్నాను.
“ఇక్కడ నేను దేశాల గురించి వాటి గొప్పదనం గురించి ఆలోచించడం లేదు. సామాన్యుల అభివృద్ధి, గౌరవాలు నాకు అత్యంత ప్రధానమైన అంశాలు. చివరికి మన విజయాలు, పరాజయాలను కేవలం ఒకే అంశం ఆధారంగా లెక్కించాలి అదేంటంటే నిజంగా మనం మొత్తం మానవ సమాజాన్ని, అంటే ప్రతి ఒక్క పురుషుడు, స్త్రీ, పిల్లవాడు లేదా పిల్లకి సంపూర్ణమైన న్యాయం చెయ్యడానికి, వాళ్ల జీవితాల్లోంచి బీదరికాన్ని పారద్రోలడానికి పూర్తి ప్రయత్నం చెయ్యగలుగుతున్నామా అన్నదే ఆ అంశం.’’ |
మిత్రులారా, వాజ్ పేయిగారు చెప్పిన ఆ మాటలు ఇవ్వాళ్టికీ మనకు దిశా నిర్దేశం చేస్తాయి. ఈ భూమిని ఓ చక్కటి, సురక్షితమైన Planetగా చెయ్యడంలో భారతదేశం యొక్క పాత్ర, విశ్వవ్యాప్తంగా చాలా గొప్ప ప్రేరణ.
ప్రియమైన మిత్రులారా, కొన్ని రోజుల క్రితం అక్టోబర్ 21వ తేదీన, పోలీస్ సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకున్నాం. ఏ పోలీసు సోదరులైతే దేశ రక్షణకరోసం తమ ప్రాణాలను త్యాగం చేశారో, ఆ రోజున మనం వారందర్నీ మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటాం.
నేనివ్వాళ్ల ఆ పోలీస్ ఉద్యోగులతోపాటుగా వాళ్ల కుటుంబాల్నికూడా గుర్తు చేసుకోవాలనుకుంటున్నాను. కుటుంబంనుంచి సహకారం, త్యాగం లేకపోతే పోలీస్ ఉద్యోగం లాంటి సర్వీస్ చెయ్యడం చాలా కష్టం. పోలీస్ సేవకు సంబంధించిన ఇంకో విషయాన్ని నేను మనసులో మాట శ్రోతలకు చెప్పాలనుకుంటున్నాను. మొదట్లో అందరూ పోలీస్, సైన్యం లాంటి సర్వీసులు కేవలం మగవాళ్లకి మాత్రమే అని అనుకునేవాళ్లు. కానీ ఇవ్వాళ్ల పరిస్థితి అలా లేదు. Bureau of Police Research and Development లెక్కల ప్రకారం గడచిన కొద్ది సంవత్సరాల్లో మహిళా పోలీసు ఉద్యోగుల సంఖ్య రెట్టింపు అయ్యింది. 2014లో వారి సంఖ్య ఒక లక్షా ఐదు వేల వరకూ ఉండేది. అదే 2020కల్లా అది రెట్టింపుకన్నా ఎక్కువై రెండు లక్షల 15 వేల వరకూ వచ్చింది. అంతేకాకుండా Central Armed Police Forces లో కూడా గడచిన ఏడేళ్లలో మహిళా ఉద్యోగుల సంఖ్య దాదాపుగా రెట్టింపయ్యింది. నేను కేవలం సంఖ్య గురించి మాత్రమే మాట్లాడ్డం లేదు. ఇప్పుడు మన దేశంలో అడబిడ్డలు అత్యంత కఠినమైన Dutyలనుకూడా పూర్తి స్థాయి శక్తి సామర్థ్యాలు, విశ్వాసంతో చేస్తున్నారు. ఉదాహరణకు చాలామంది ఆడబిడ్డలు అత్యంత కఠినంగా చెప్పుకునే Trainingsలో ఒకటైన Specialized Jungle Warfare Commandos Training తీసుకుంటున్నారు. వాళ్లు మన Cobra Battalion భాగస్వాములవుతారు.
మిత్రులారా, ఇప్పుడు మనం Airports వెళ్తున్నాం, Metro Stations కి వెళ్తున్నాం, లేదంటే ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్తాం. CISF కి చెందిన సమర్ధులైన మహిళలు చాలా ముఖ్యమైన అనేక ప్రాంతాల్లో గస్తీ కాస్తూ కనిపిస్తారు. దీనికి సంబంధించి సకారాత్మక ఫలితాలు కేవలం పోలీసు బలగాలతోపాటుగా సమాజం మనోబలాన్నికూడా పెంచుతున్నాయి. మహిళా రక్షక దళాల్ని చూసి జనంలో, ప్రత్యేకంగా మహిళల్లో సహజంగానే ఓ నమ్మకం ఏర్పడుతుంది. వాళ్లు అత్యంత సహజంగా తాము పరిపూర్ణమైన రక్షణ వలయంలో వారికి దగ్గరగా ఉన్న భావనకు లోనవుతారు. మహిళలకు ఉండే సహజలక్షణాలైన ఓర్పు, సహనాలవల్లకూడా జనం వారిని ఎక్కువగా నమ్ముతారు. మన మహిళా పోలీసు ఉద్యోగులు దేశంలో లక్షలాదిమందికి, ఆడ బిడ్డలకు Role Modelగా నిలుస్తున్నారు. స్కూళ్లు తెరిచిన తర్వాత మీమీ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్లని విజిట్ చెయ్యమని, అక్కడ పిల్లలతో మాట్లాడమని నేను మహిళా పోలీసు ఉద్యోగుల్ని కోరుతున్నాను. అలా మాట్లాడ్డంవల్ల మన పిల్లలకు ఓ కొత్త స్ఫూర్తి లభిస్తుందని నేను విశ్వసిస్తున్నాను. అది మాత్రమే కాక పోలీసులమీద జనానికి నమ్మకంకూడా పెరుగుతుంది. ఇకపై కూడా మహిళలు ఎక్కువ సంఖ్యలో పోలీసు ఉద్యోగాల్లో చేరతారని, మన దేశంలో New Age Policingని లీడ్ చేస్తారని ఆశిస్తున్నాను.
ప్రియమైన దేశ వాసులారా, గడచిన కొన్ని ఏళ్లుగా మన దేశంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం ఎంత వేగంగా పెరుగుతోందంటే, దానిమీద మనసులో మాట శ్రోతలు నాకు తరచూ రాస్తుంటారు. ఇవ్వాళ్ల నేను మీతో అలాంటి ఓ విషయం గురించి చర్చించాలనుకుంటున్నాను. అది మన దేశంలో, ప్రత్యేకించి యువతలో చిన్న చిన్న పిల్లల్లో పాకిపోయింది. అదేంటంటే డ్రోన్, మరియు డ్రోన్ టెక్నాలజీ గురించి. కొన్నేళ్ల క్రితం డ్రోన్ అనే పదం వినిపించగానే జనం మనసుల్లో ఉత్పన్నమయ్యే మొదటి భావనేంటి? సైన్యం, ఆయుధాలు, యుద్ధం. కానీ ఇప్పుడు మన దగ్గర ఎక్కడ పెళ్లి ఫంక్షన్లు జరిగినా మనం డ్రోన్ ని ఫోటోలు, వీడియోలు తీసుకోవడానికి ఉపయోగిస్తుంటే చూస్తున్నాం. డ్రోన్ వినియోగం, దాని శక్తి అంత మాత్రమే కాదు. గ్రామాల్లో భూమి వివరాల్ని సేకరించడానికి డ్రోన్ ని వినియోగిస్తున్న దేశాల్లో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. భారతదేశం డ్రోన్ వినియోగాన్ని Transportation కోసం చాలా విస్తృత స్థాయిలో చేసేందుకు ప్రయత్నిస్తోంది. అది గ్రామాల్లో వ్యవసాయానికి సంబంధించైనా కావొచ్చు లేదా ఇంటి సామాను డెలివరీకైనా కావొచ్చు. ఆపత్కాలంతో సహాయం అందించడానికి కావొచ్చు లేదా చట్టపరమైన వ్యవస్థకు సంబంధించి నిఘా పెట్టడానికి కావొచ్చు. చాలా కొద్ది సమయంలోనే డ్రోన్లు మనకి ఈ అవసరాలన్నింటికీ ఉపయోగపడే రోజు వస్తుంది. వాటిలో చాలావాటికి ఇప్పటికే డ్రోన్ల వినియోగం ప్రారంభమయ్యింది. ఎలాగంటే కొద్ది రోజుల క్రితం గుజరాత్ లోని భావ నగర్ లో డ్రోన్ ద్వారా పొలాల్లో నానో యూరియాని చల్లారు. Covid Vaccine పథకంలోకూడా డ్రోన్లు తమ వంతు పాత్రని పోషిస్తున్నాయి. దానికి సంబంధించిన ఓ చిత్రం మనకు మణిపూర్ లో కనిపిస్తుంది. అక్కడ ఓ ద్వీపంలో డ్రోన్ ద్వారా వాక్సీన్ ని అందజేశారు. తెలంగాణలోకూడా డ్రోన్ ద్వారా వాక్సీన్ డెలివరీకి ట్రయల్స్ వేశారు. అది మాత్రమే కాక ఇప్పుడు ఇన్ ఫ్రా స్ట్రక్టర్ కి సంబంధించిన ఎన్నో పెద్ద ప్రాజెక్టుల్లో నిఘాకోసం కూడా డ్రోన్లని ఉపయోగిస్తున్నారు. నేను అలాంటి ఓ యంగ్ స్టూడెంట్ గురించి కూడా చదివాను, తను డ్రోన్ ని దోమలపై ప్రయోగించాడని. A
మిత్రులారా, ముందు ఈ సెక్టర్ లో ఎన్ని నియమాలు, చట్టాలు, ఇంకా ప్రతిబంధకాలు ఉండేవంటే డ్రోన్ యొక్క అసలు శక్తిని వినియోగించుకోవడానికి కూడా సాధ్యమయ్యేది కాదు. ఆ టెక్నాలజీని ఉపయోగించుకోవడం మంచిదో దాన్ని సందేహాస్పదంగా చూడాల్సిన పరిస్థితి ఉండేది. ఒకవేళ మీరు దేనికోసమైనా సరే డ్రోన్ ని వాడాల్సొస్తే లైసెన్సులు, అనుమతులు ఎంత క్లిష్టంగా ఉండేవంటే జనం డ్రోన్ అనే పేరునికూడా గుర్తు చేసుకోలేనంతగా. నేను ఈ మైండ్ సెట్ ని మార్చాలని, కొత్త ట్రెండ్స్ ని తీసుకురావాలని నిర్ణయించుకున్నాను. అందుకే ఈ సంవత్సరం ఆగస్ట్ 25న దేశంలో ఓA కొత్త డ్రోన్ విధానాన్ని ప్రవేశపెట్టాం. ఈ విధానం డ్రోన్ కి సంబంధించి వర్తమాన, భవిష్యత్తు లెక్కలకు సంబంధించి రూపొందించినది. అందులో ఇప్పుడు బోల్డన్ని ఫామ్స్ నింపాల్సిన బాధ లేదు, అలాగే ముందులా ఎక్కువ ఫీజు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. కొత్త డ్రోన్ పాలసీ వచ్చిన తర్వాత చాలా డ్రోన్స్ స్టార్టప్స్ లో బోల్డన్ని దేశీ, విదేశీ పెట్టుబడులు పెరిగాయి. చాలా కంపెనీలు Manufacturing Units కూడా పెట్టాయి. Army, NavyమరియుAir Force లు భారతీయ Droneకంపెనీలకు 500 కోట్ల రూపాయలకంటే ఎక్కువ Orderలు కూడా ఇచ్చాయి. కేవలం ఇది ప్రారంభం మాత్రమే. మనం ఇక్కడితో ఆగిపోకూడదు. మనం Drone Technologyలో అగ్ర దేశంగా నిలవాలి. దానికోసం ప్రభుత్వం కావాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తోంది. నేను దేశంలోని యువతకు ఏం చెబుతున్నానంటే మీరు Drone Policyతర్వాత వచ్చిన అవకాశాల్ని వినియోగించుకోవడం గురించి తప్పక ఆలోచించండి. ముందుకు రండి.
ప్రియమైన దేశ వాసులారా, యూపీలోని మీరట్ నుంచి ఓ మనసులో మాట శ్రోత శ్రీమతి ప్రభా శుక్లా స్వచ్ఛతకు సంబంధించిన ఓ లేఖను పంపారు. ఆవిడేం రాశారంటే “భారత దేశంలో అన్ని పండగలకూ మనం స్వచ్ఛతను సెలబ్రేట్ చేసుకుంటాం. అలాగే మనం స్వచ్ఛతని ప్రతిరోజూ మన జీవితాల్లో భాగంగా చేసుకుంటే, మొత్తం దేశమంతా స్వచ్ఛంగా ఉంటుంది.” అని. నాకు ప్రభగారి మాటలు చాలా బాగా నచ్చాయి. నిజంగానే ఎక్కడ పరిశుభ్రత ఉంటుందో అక్కడ ఆరోగ్యం ఉంటుంది, ఎక్కడ ఆరోగ్యం ఉంటుందో అక్కడ సామర్ధ్యం ఉంటుంది అలాగే ఎక్కడ సామర్ధ్యం ఉంటుందో అక్కడ సమృద్ధి ఉంటుంది. అందుకే దేశంలో స్వచ్ఛ భారత కార్యక్రమంమీద అంతగా శ్రద్ధ పెడుతున్నాం.
(साथियो, मुझेराँचीसेसटेएकगाँवसपारोमनयासराय, वहाँकेबारेमेंजानकरबहुतअच्छालगा |)
మిత్రులారా, నాకు రాంచీలోని सपारोमनयासराय ఓ కుగ్రామంలో పరిశుభ్రత గురించి తెలిసి చాలా సంతోషం కలిగింది. ఈ గ్రామంలోఓ చెరువు ఉండేది. కానీ గ్రామస్తులు ఆ చెరువు ఉన్న ప్రాంతాన్ని బహిరంగ మల విసర్జనకు ఉపయోగించడం మొదలుపెట్టారు. స్వచ్ఛ భారత్ పథకం ద్వారా అందరి ఇళ్లలోనూ మరుగుదొడ్లు నిర్మించుకున్నారో అప్పుడే ఊరివాళ్లందరూ కలిసి ఏమని ఆలోచించారంటే మనం ఊరిని పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటుగా దాన్ని అందంగా తీర్చిదిద్దాలనుకున్నారు. తర్వాతేమయ్యిందంటే అందరూ కలిసి ఆ చెరువు ఉన్న ప్రాంతంలో ఓ పార్కుని నిర్మించుకున్నారు. ఇవ్వాళ్ల ఆ ప్రదేశం జనానికి, పిల్లలకి చక్కగా సేదతీరే స్థానమయ్యింది. దానివల్ల మొత్తం గ్రామస్తులందరి జీవితాల్లో చాలా మార్పొచ్చింది. నేను మీకు చత్తీస్ ఘడ్ లోని దేవుర్ గ్రామానికి చెందిన మహిళల గురించి కూడా చెప్పాలనుకుంటున్నాను. అక్కడి మహిళలు ఓ స్వయం సహకార సంఘాన్ని నడుపుకుంటున్నారు. వాళ్లందరూ కలిసి గ్రామంలోని కూడళ్లు, ముఖ్య ప్రదేశాలు, రోడ్లు, మందిరాల్ని శుభ్రం చేస్తున్నారు.
మిత్రులారా, యూపీలోని గజియాబాద్ లో ఉన్న రామ్ వీర్ తంవర్ ని జనం ‘Pond Man’ అని పిలుచుకుంటారు. రామ్ వీర్ గారు మెకానికల్ ఇంజినీరింగ్ చదివిన తర్వాత ఉద్యోగం చేశారు. కానీ ఆయన మనసులో స్వచ్ఛతకు సంబంధించిన ఎలాంటి ఆలోచన వచ్చిందంటే ఆయనా ఉద్యోగాన్ని వదిలిపెట్టేసి చెరువుల్ని శుభ్రం చేసే పని మొదలుపెట్టారు. రామ్ వీర్ గారు ఇప్పటివరకూ ఎన్నో చెరువుల్ని శుభ్రం చేసి వాటికి పునరుజ్జీవనాన్ని ప్రసాదించారు.
మిత్రులారా, స్వచ్ఛతకోసం చేసే ప్రయత్నాలు ఎప్పుడు సఫలమవుతాయంటే దేశంలోని ప్రతి పౌరుడూ స్వచ్ఛతకు సంబంధించి తన బాధ్యతను నిర్వర్తించినప్పుడే. ఇప్పుడు దీపావళి పండక్కి మనందరం మన ఇళ్లను శుభ్రం చేసుకుంటాంకదా. ఇప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే మన ఇంటితోపాటుగా మన చుట్టుపక్కల, పరిసరాల్నికూడా శుభ్రంగా ఉంచుకోవాలి. మనం మన ఇంటిని మాత్రం శుభ్రం చేసుకుని, మన ఇంటిలో ఉన్న చెత్తని బైట రోడ్లమీద పడెయ్యకూడదు. ఇంకో విషయం నేను స్వచ్ఛత గురించి మాట్లాడేటప్పుడు ఆ సందర్భంలో మనం Single Use Plastic నుంచి విముక్తిని పొందే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు. రండి మనం సంకల్పం తీసుకుందాం.. స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఉత్సాహాన్ని మనం తక్కువ కానివ్వకూడదు. మనందరం కలిసి మన దేశాన్ని పూర్తి స్థాయిలో స్వచ్ఛంగా మార్చుకుందాం. శుభ్రంగా ఉంచుకుందాం.
ప్రియమైన దేశవాసులారా, అక్టోబర్ నెల మొత్తం పండుగల రంగులతో నిండిపోయింది. లాగే ఇంకొన్ని రోజుల్లో దీపావళి పండుగ కూడా వస్తోంది. దీపావళి, దాని తర్వాత గోవర్థన పూజ ఆ తర్వాత భగినీ హస్త భోజనం ఈ మూడు పండుగల్ని ఎలాగూ జరుపుకుంటాం. ఆ తర్వాత छठपूजा మరో పూజ. నవంబర్ లో గురునానక్ జయంతికూడా ఉంది. ఇన్ని పండుగలు ఒకేసారి వచ్చినప్పుడు వాటికోసం ఏర్పాట్లుకూడా ముందునుంచే మొదలవుతాయి. మీరందరూ ఇప్పటినుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. కానీ మీకు గుర్తుంది కదా కొనడం అంటే అర్థం ‘VOCAL FOR LOCAL’ | మీరు స్థానిక వస్తువుల్నే కొంటే మీ పండగ కూడా అత్యంత మనోహరంగా జరుగుతుంది. నిరుపేదలైన అక్క చెల్లెళ్లు, అన్నదమ్ముల, కార్మికుల, ఆకలితో ఉన్నవాళ్ల ఇళ్లలో కూడా వెలుగులు ప్రసరిస్తాయి. మనందరం కలిసి ఈ విధానాన్ని ప్రారంభించుకున్నాం. ఈసారి పండుగలకు మీరు దాన్ని మరింత బలంగాకొనసాగిస్తారని నాకు పూర్తి విశ్వాసం ఉంది. మీరు మీకు స్థానికంగా దొరికే వస్తువుల్నే కొనండి, సోషల్ మీడియాలో షేర్ చెయ్యండి. మీతోపాటు మిగతావాళ్లకి కూడా ఈ విషయాన్ని చెప్పండి. వచ్చే నెల మనం మళ్లీ కలుసుకుందాం. అప్పుడుకూడా ఇలాగే బోల్డన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం.
మీకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. నమస్కారం.
నా ప్రియమైన దేశ వాసులారా! నమస్కారం.. ఒక ముఖ్యమైన కార్యక్రమం కోసం నేను అమెరికా వెళ్లాల్సి ఉందని మీకు తెలుసు. కాబట్టి అమెరికా వెళ్లే ముందు 'మన్ కీ బాత్' రికార్డ్ చేయడం మంచిదని అనుకున్నాను. సెప్టెంబర్‌లో 'మన్ కీ బాత్' ప్రసారం అయ్యే తేదీన మరో ముఖ్యమైన రోజు ఉంది. మనం చాలా రోజులను గుర్తుంచుకుంటాం. వివిధ దినోత్సవాలను జరుపుకుంటాం. మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే, మీరు వారిని అడిగితే, సంవత్సరం మొత్తంలో ఏ రోజు ప్రాధాన్యత ఏమిటో మీకు పూర్తి జాబితాను చెప్తారు. కానీ మనమందరం గుర్తుంచుకోవలసిన మరో రోజు ఉంది. ఈ రోజు భారతదేశ సంప్రదాయాలకు అనుగుణమైంది. ఇది శతాబ్దాలుగా మన సంప్రదాయాలకు అనుబంధంగా ఉన్న అంశంతో అనుసంధానమైంది. ఇది 'వరల్డ్ రివర్ డే'. అంటే ప్రపంచ నదుల దినోత్సవం.
మనకు ఒక లోకోక్తి ఉంది.
“పిబంతి నద్యః స్వయమేవ నాంభః” అని.
అంటే- నదులు తమ స్వంత నీటిని తాగవు. కానీ పరోపకారం కోసం ఇస్తాయి. మనకు నదులు భౌతికమైన వస్తువులు కావు. మనకు నది ఒక జీవి. అందుకే మనం నదులను తల్లిగా పిలుస్తాం. మనకు ఎన్ని పండుగలు, పబ్బాలు, వేడుకలు, ఉల్లాసాలు ఉన్నా ఇవన్నీ మన అమ్మల ఒడిలోనే జరుగుతాయి. మాఘ మాసం వచ్చినప్పుడు మన దేశంలో చాలా మంది ప్రజలు గంగా మాత ఒడ్డున లేదా ఇతర నదుల ఒడ్డున ఒక నెల మొత్తం గడుపుతారని మీకు తెలుసు. ఇప్పుడు లేదు కానీ పూర్వకాలంలో మనం ఇంట్లో స్నానం చేసేటప్పుడు కూడా నదులను గుర్తు చేసుకునే సంప్రదాయం ఉండేది. ఈరోజుల్లో ఈ సంప్రదాయం కనుమరుగై ఉండవచ్చు లేదా చాలా తక్కువ పరిమాణంలో ఉండి ఉండవచ్చు. కానీ ఈ సంప్రదాయం చాలా గొప్పది. ఉదయమే- స్నానం చేసే సమయంలోనే- విశాలమైన భారతదేశ యాత్ర చేసే సంప్రదాయమిది. ఇది ఒక మానసిక యాత్ర! ఇది దేశంలోని ప్రతి మారుమూల ప్రాంతంతో అనుసంధానం అయ్యేందుకు ప్రేరణగా మారింది. అది భారతదేశంలో స్నానం చేసేటప్పుడు ఒక శ్లోకం చెప్పే సంప్రదాయం.
గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి |
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిమ్ కురు ||
ఇంతకు ముందు మన ఇళ్లలో పిల్లల కోసం కుటుంబ పెద్దలు ఈ శ్లోకాలను గుర్తుంచుకునేవారు. ఇది మన దేశంలో నదులపై విశ్వాసాన్ని నింపేది. విశాలమైన భారతదేశ పటం మనస్సులో ముద్రించబడి ఉండేది. నదులకు అనుసంధానంగా ఉండేది. మనకు తల్లిగా తెలిసిన నది- చూస్తుంది, జీవిస్తుంది. ఆ నదిపై విశ్వాస భావన జన్మించింది. ఇది ఒక ధార్మిక సంస్కార ప్రక్రియ. మిత్రులారా! మన దేశంలో నదుల మహిమ గురించి మాట్లాడుతున్నప్పుడు సహజంగా ప్రతి ఒక్కరూ ఒక ప్రశ్నను లేవనెత్తడం సహజం. ప్రశ్నను లేవనెత్తే హక్కు కూడా ఉంది. దానికి సమాధానం చెప్పడం మన బాధ్యత కూడా. ఎవరైనా ప్రశ్న అడుగుతారు- “సోదరా! మీరు నదిపై చాలా పాటలు పాడుతున్నారు. నదిని తల్లి అని పిలుస్తున్నారు. మరి ఈ నది ఎందుకు కలుషితం అవుతుంది?” అని. నదులలో కొద్దిగా కలుషితం చేయడం కూడా తప్పు అని మన శాస్త్రాలు చెప్తున్నాయి. మన సంప్రదాయాలు కూడా ఇలాగే ఉన్నాయి. మన భారతదేశంలోని పశ్చిమ భాగం- ముఖ్యంగా గుజరాత్ , రాజస్థాన్ లలో - నీటి కొరత చాలా ఉందని మీకు తెలుసు. చాలా సార్లు కరువు పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు అందుకే అక్కడ సమాజ జీవితంలో కొత్త సంప్రదాయం అభివృద్ధి చెందింది. గుజరాత్లో వర్షాలు మొదలైనప్పుడు జల్-జీలనీ ఏకాదశిని జరుపుకుంటారు. డఅని అర్థం ఈ కాలంలో మనం జరుపుకునే 'క్యాచ్ ది రెయిన్'- వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడమే. వర్షంలోని ప్రతి నీటి బిందువును సేకరించి, పరిరక్షించడం. అదే విధంగా వర్షాల తర్వాత ఛట్ పండుగను బీహార్ లోనూ తూర్పు ప్రాంతాల్లోనూ జరుపుకుంటారు. ఛట్ పూజలను దృష్టిలో ఉంచుకుని నదుల వెంబడి ఘాట్లను శుభ్రపరచడం, మరమ్మతు చేయడానికి సన్నాహాలు ప్రారంభమయ్యాయని నేను ఆశిస్తున్నాను. నదులను శుభ్రం చేసి కాలుష్యం లేకుండా చేసే పనిని అందరి ప్రయత్నం, అందరి సహకారంతో మనం చేయవచ్చు. 'నమామి గంగే మిషన్' కూడా అమల్లో ఉంది. ప్రజలందరి ప్రయత్నాలు, ప్రజా అవగాహన, ప్రజా చైతన్యం- మొదలైన వాటికి ఇందులో ప్రముఖ పాత్ర ఉంది.
మిత్రులారా! మనం నది గురించి మాట్లాడుతున్నప్పుడు- గంగామాత గురించి మాట్లాడుతున్నప్పుడు- నేను మీ దృష్టిని మరో విషయం వైపు ఆకర్షించాలనుకుంటున్నాను. మనం 'నమామి గంగే' గురించి మాట్లాడుతున్నప్పుడు, మీరు తప్పనిసరిగా ఒక విషయం గమనించి ఉండాలి. మన యువత ఖచ్చితంగా గమనించి ఉంటారు. ఈ రోజుల్లో ప్రత్యేక ఈ-వేలం జరుగుతోంది. ప్రజలు నాకు ఎప్పటికప్పుడు ఇచ్చిన బహుమతుల కోసం ఈ ఎలక్ట్రానిక్ వేలం నిర్వహిస్తున్నారు. ఈ వేలం ద్వారా వచ్చే డబ్బు 'నమామి గంగే' ప్రచారానికి అంకితం చేశాం. మీరు నాకు ఎంతో ఆత్మీయ భావన తో ఇచ్చిన బహుమతులోని ఆత్మీయతను ఈ ప్రచారం మరింత దృఢంగా చేస్తుంది.
మిత్రులారా! దేశవ్యాప్తంగా నదులను పునరుద్ధరించడానికి, నీటి పరిశుభ్రత కోసం ప్రభుత్వం, సామాజిక సంస్థలు నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేస్తూ ఉంటాయి. ఈ రోజు నుండి కాదు- ఇది దశాబ్దాలుగా కొనసాగుతోంది. కొంతమంది అలాంటి పనులకు తమను తాము అంకితం చేసుకున్నారు. ఈ సంప్రదాయం, ఈ ప్రయత్నం, ఈ విశ్వాసం మన నదులను కాపాడుతున్నాయి. భారతదేశంలోని ఏ ప్రాంతం నుండి అయినా అలాంటి వార్తలు నా చెవికి చేరినప్పుడు అలాంటి పని చేసే వారి పట్ల గొప్ప గౌరవభావం నా మనస్సులో కలుగుతుంది. ఆ విషయాలు మీకు చెప్పాలని కూడా అనిపిస్తుంది. చూడండి! నేను తమిళనాడులోని వెల్లూరు, తిరువణ్ణామలై జిల్లాల ఉదాహరణ ఇవ్వాలనుకుంటున్నాను. ఇక్కడ నాగా నది అనే ఒక నది ప్రవహిస్తుంది. ఈ నాగా నది కొన్ని సంవత్సరాల కిందట ఎండిపోయింది. ఈ కారణంగా అక్కడ నీటి మట్టం కూడా చాలా తక్కువ స్థాయికి పడిపోయింది. కానీ అక్కడి మహిళలు తమ నదిని పునరుద్ధరించడానికి చొరవ తీసుకున్నారు. వారు ప్రజలను అనుసంధానించారు. ప్రజల భాగస్వామ్యంతో కాలువలు తవ్వారు. చెక్ డ్యామ్‌లు నిర్మించారు. రీఛార్జ్ బావులు నిర్మించారు. మిత్రులారా! ఈ రోజు ఆ నది నీటితో నిండిపోయిందని తెలుసుకొని మీరు కూడా సంతోషిస్తారు. నీటితో నది నిండినప్పుడు మనస్సు పొందే హాయిని నేను ప్రత్యక్షంగా అనుభవించాను.
మహాత్మాగాంధీ సబర్మతి నది ఒడ్డున సబర్మతి ఆశ్రమాన్ని నిర్మించారు. ఆ సబర్మతి నది కొన్ని దశాబ్దాల కిందట ఎండిపోయిందని మీలో చాలా మందికి తెలుసు. సంవత్సరంలో 6-8 నెలల పాటు నీరు కనిపించేది కాదు. నర్మదా నదితో సబర్మతి నదిని అనుసంధానించారు. మీరు ఇప్పుడు అహ్మదాబాద్ వెళ్తే సబర్మతి నది నీరు మనస్సును ఉల్లాసపరుస్తుంది. అదేవిధంగా తమిళనాడుకు చెందిన మన సోదరీమణులు చేసిన పనుల వంటి అనేక కార్యక్రమాలు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయి. నాకు తెలుసు- మన ధార్మిక సంప్రదాయంతో సంబంధం ఉన్న అనేక మంది సాధువులు, గురువులు తమ ఆధ్యాత్మిక ప్రయాణంతో పాటు నీటి కోసం, నదుల కోసం చాలా కృషి చేస్తున్నారు. చాలామంది నదుల ఒడ్డున చెట్లు నాటడానికి ప్రచారం చేస్తున్నారు. కాబట్టి నదులలో ప్రవహించే మురికి నీరు నిలిచిపోతుంది.
మిత్రులారా! మనం ఈరోజు 'ప్రపంచ నదీ దినోత్సవం' జరుపుకుంటున్న సందర్భంగా ఈ పనికి అంకితమైన ప్రతి ఒక్కరినీ నేను అభినందిస్తున్నాను. కానీ భారతదేశంలోని ప్రతి మూలలో సంవత్సరానికి ఒకసారి నదీ ఉత్సవాన్ని జరుపుకోవాలని నేను ప్రతి నది దగ్గర నివసిస్తున్న ప్రజలను, దేశ వాసులను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఒక చిన్న విషయాన్ని చిన్నగా పరిగణించే తప్పు ఎవరూ చేయకూడదు. చిన్న ప్రయత్నాలు కొన్నిసార్లు పెద్ద మార్పులను తెస్తాయి. మహాత్మాగాంధీ జీవితాన్ని పరిశీలిస్తే ఆయన జీవితంలో చిన్న విషయాలు కూడా ఎంతో ముఖ్యమైనవని మనకు అనిపిస్తుంది. ఆ చిన్న చిన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని ఆయన పెద్ద సంకల్పాలను ఎలా సాకారం చేశారో తెలుస్తుంది. స్వాతంత్య్రోద్యమానికి పరిశుభ్రత ప్రచారం నిరంతర శక్తిని ఎలా అందించిందో మన నేటి యువత తెలుసుకోవాలి. మహాత్మా గాంధీ పరిశుభ్రతను ఒక ప్రజా ఉద్యమంగా మార్చారు. పరిశుభ్రతను స్వతంత్రతా స్వప్నంతో ఆయన అనుసంధానించారు. నేడు- అనేక దశాబ్దాల తర్వాత పరిశుభ్రతా ఉద్యమం మరోసారి దేశాన్ని నవీన భారతదేశ కలలతో అనుసంధానించింది. ఇది కూడా మన అలవాట్లను మార్చుకునే ప్రచారంగా మారుతోంది. పరిశుభ్రత అనేది కేవలం ఒక కార్యక్రమం అని మనం మర్చిపోకూడదు. పరిశుభ్రత అనేది ఒక తరం నుండి మరో తరానికి సంస్కారాన్ని బదలాయించే బాధ్యత. పరిశుభ్రత ప్రచారం ఒక తరం నుండి మరో తరానికి జరుగుతుంది. అప్పుడు మొత్తం సమాజ జీవితంలో పరిశుభ్రత ఒక స్వభావంగా మారుతుంది. కాబట్టి పరిశుభ్రత ఒకట్రెండేళ్ళు నిర్వహించే అంశం కాదు. ఒక ప్రభుత్వం-మరొక ప్రభుత్వం మొదలైన వాటికి సంబంధించిన అంశం కూడా కాదు. ఒక తరం నుండి మరో తరానికి మనం పరిశుభ్రత గురించి అవగాహనతో, అలుపు లేకుండా, గొప్ప శ్రద్ధతో పరిశుభ్రత ప్రచారం కొనసాగించాలి. మహనీయులైన పూజ్య బాపుకు పరిశుభ్రత గొప్ప నివాళి అని నేను ఇంతకు ముందు కూడా చెప్పాను. మనం ప్రతిసారీ ఈ నివాళిని అర్పించాలి. నిరంతరం అర్పిస్తూనే ఉండాలి.
మిత్రులారా! పరిశుభ్రత గురించి మాట్లాడే అవకాశాన్ని నేను ఎన్నడూ వదులుకోలేదని ప్రజలకు తెలుసు. అందుకే “ఈ స్వతంత్ర భారత అమృత మహోత్సవంలో బాపూజీ నుండి నేర్చుకుంటూ ఆర్థిక స్వచ్ఛత కోసం కూడా ప్రతిజ్ఞ చేయాల”ని మన 'మన్ కీ బాత్' శ్రోతల్లో ఒకరైన రమేష్ పటేల్ గారు రాశారు. మరుగుదొడ్ల నిర్మాణం పేదవారి గౌరవాన్ని పెంచినట్టే ఆర్థిక స్వచ్ఛత పేదలకు అధికారాన్ని సునిశ్చితం చేస్తుంది. వారి జీవితాలను సులభతరం చేస్తుంది. జన్ ధన్ ఖాతాలకు సంబంధించి దేశం ప్రారంభించిన ప్రచారం ఇప్పుడు మీకు తెలుసు. ఈ కారణంగా నేడు పేదల డబ్బు నేరుగా వారి ఖాతాలకు బదిలీ అవుతోంది. దీని వల్ల అవినీతి వంటి అడ్డంకులు భారీగా తగ్గాయి. ఆర్థిక స్వచ్ఛతలో సాంకేతికత ఎంతగానో సహాయపడుతుందనేది నిజం. ఈ రోజు పల్లెటూళ్లలో కూడా సాధారణ ప్రజలు ఫిన్-టెక్ UPI ద్వారా డిజిటల్ లావాదేవీలు చేసే స్థాయికి చేరడం మాకు సంతోషకరమైన విషయం. దాని వినియోగం పెరుగుతోంది. మీరు గర్వపడే ఒక సంఖ్యను నేను మీకు చెప్తాను- ఆగస్టు నెలలో 355 కోట్ల లావాదేవీలు UPI ద్వారా ఒక నెలలో జరిగాయి. అంటే 350 కోట్ల కంటే ఎక్కువ పర్యాయాలు డిజిటల్ లావాదేవీల కోసం UPIని ఉపయోగించారు. సగటున 6 లక్షల కోట్ల రూపాయలకు కు పైగా లావాదేవీలు డిజిటల్ పద్ధతిలో UPI ద్వారా జరుగుతున్నాయి. ఈ స్వచ్ఛత కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థలో పారదర్శకత వస్తోంది. ఫిన్-టెక్ ప్రాముఖ్యత చాలా పెరుగుతోందని ఇప్పుడు మనకు తెలుసు.
మిత్రులారా! బాపూజీ స్వచ్ఛతను స్వేచ్ఛతో ముడిపెట్టినట్టే ఖాదీని కూడా స్వాతంత్ర్యానికి గుర్తుగా మార్చారు. నేడు- స్వాతంత్య్రం వచ్చిన 75 వ సంవత్సరంలో, స్వాతంత్ర్య అమృత మహోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు, ఖాదీకి స్వాతంత్ర్యోద్యమంలో ఉన్న గౌరవాన్నే నేటి మన యువ తరం అందిస్తోందని సంతృప్తిగా చెప్పగలం. నేడు ఖాదీ, చేనేత ఉత్పత్తి అనేక రెట్లు పెరిగింది. డిమాండ్ కూడా పెరిగింది. ఢిల్లీలోని ఖాదీ షోరూమ్ ఒక రోజులో కోటి రూపాయలకు పైగా వ్యాపారం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని మీకు కూడా తెలుసు. పూజ్య బాపు జన్మదినమైన అక్టోబర్ 2 న మనమందరం మరోసారి కొత్త రికార్డు సృష్టించాలని నేను మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. మీరు మీ పట్టణంలో ఎక్కడైనా ఖాదీ, చేనేత, హస్తకళల ఉత్పత్తులను కొనండి. దీపావళి పండుగ ముందుంది. ఆ పండుగ కోసం చేసే ఖాదీ, చేనేత, కుటీర పరిశ్రమకు సంబంధించిన ప్రతి కొనుగోలు స్థానిక ఉత్పత్తుల ప్రచారం -ఓకల్ ఫర్ లోకల్ కు బలం చేకూరుస్తుంది. ఈ విషయంలో పాత రికార్డులను అధిగమించాలి.
మిత్రులారా! అమృత మహోత్సవం జరుగుతున్న ఈ కాలంలో- దేశంలో స్వాతంత్ర్య చరిత్రలో చెప్పలేని కథలను ప్రజలకు తెలియజేయడానికి ఒక ప్రచారం కూడా జరుగుతోంది. దీని కోసం వర్ధమాన రచయితలకు, దేశంలోని , ప్రపంచంలోని యువతకు పిలుపునివ్వడం జరిగింది. ఈ ప్రచారం కోసం ఇప్పటివరకు 13 వేలకు పైగా ప్రజలు నమోదు చేసుకున్నారు. అది కూడా 14 వివిధ భాషలలో. 20 కంటే ఎక్కువ దేశాలలోని అనేక మంది ప్రవాస భారతీయులు కూడా ఈ ప్రచారంలో చేరడానికి తమ కోరికను వ్యక్తం చేయడం నాకు సంతోషకరమైన విషయం. మరో చాలా ఆసక్తికరమైన సమాచారం ఉంది- 5000 కంటే ఎక్కువ మంది వర్ధమాన రచయితలు స్వాతంత్ర్య సమరం లోని ఘట్టాల కోసం, గాథల కోసం వెతుకుతున్నారు. బయటి ప్రపంచానికి పెద్దగా తెలియని అన్సంగ్ హీరోల గురించి, అనామకులుగా మిగిలిపోయిన వారి గురించి, చరిత్ర పేజిలలో పేర్లు కనిపించని ప్రజా నాయకుల వారి జీవితాలపై, ఆ సంఘటనలపై రాసేందుకు యువత ఆసక్తి చూపిస్తున్నారు. గత 75 ఏళ్లలో చర్చించని స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను దేశం ముందుకు తీసుకురావాలని యువత నిర్ణయించింది. శ్రోతలందరికీ నా అభ్యర్థన. విద్యా ప్రపంచంతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరికీ నా అభ్యర్థన. యువతకు మీరంతా ప్రేరణగా నిలవండి. మీరు కూడా ముందుకు రండి. స్వాతంత్ర్య భారత అమృతమహోత్సవంలో చరిత్ర రచన చేసే వారు కూడా చరిత్ర సృష్టించబోతున్నారని నేను గట్టిగా నమ్ముతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! సియాచిన్ గ్లేషియర్ గురించి మనందరికీ తెలుసు. అక్కడ చలి చాలా భయానకంగా ఉంటుంది. అక్కడ నివసించడం సామాన్యులకు సాధ్యం కాదు. సుదూరం వరకు మంచు-మంచు- ఎక్కద చూసినా మంచే కనబడే ఆ ప్రాంతంలో చెట్లు, మొక్కల ఉనికి కూడా ఉండదు. అక్కడ ఉష్ణోగ్రత కూడా మైనస్ 60 డిగ్రీల వరకు కూడా చేరుతుంది. కొద్ది రోజుల క్రితం సియాచిన్ లోని ఈ దుర్గమ ప్రాంతంలో 8 మంది దివ్యాంగుల బృందం అద్భుతాలు చేసింది. ఇది ప్రతి పౌరుడికి గర్వకారణం. ఈ బృందం సియాచిన్ గ్లేసియర్ లో 15 వేల అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న 'కుమార్ పోస్ట్' పై జెండాను ఎగురవేసి ప్రపంచ రికార్డు సృష్టించింది. శారీరక అవరోధాలు, సవాళ్లు ఉన్నప్పటికీ, ఈ దివ్యాంగులు చేసిన విన్యాసాలు మొత్తం దేశానికి స్ఫూర్తి. ఈ బృందంలోని సభ్యుల గురించి మీకు తెలిసినప్పుడు, మీరు కూడా నాలాగే ధైర్యం, ఉత్సాహం పొందుతారు. ఈ ధైర్యవంతులైన దివ్యాంగులు - మహేశ్ నెహ్రా గారు,ఉత్తరాఖండ్‌కు చెందిన అక్షత్ రావత్ గారు, మహారాష్ట్రకు చెందిన పుష్పక్ గవాండే గారు, హర్యానాకు చెందిన అజయ్ కుమార్ గారు,లడఖ్ కు చెందిన లోబ్సాంగ్ చోస్పెల్ గారు, తమిళనాడుకు చెందిన మేజర్ ద్వారకేష్ గారు, జమ్మూ కాశ్మీర్‌కు చెందిన ఇర్ఫాన్ అహ్మద్ మీర్ గారు, హిమాచల్ ప్రదేశ్ కు చెందిన చొంజిన్ ఎంగ్మో గారు. సియాచిన్ హిమానీనదాన్ని జయించే ఈ ఆపరేషన్ భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాల అనుభవజ్ఞుల కారణంగా విజయవంతమైంది. ఈ చరిత్రాత్మక, అపూర్వమైన విజయానికి నేను ఈ బృందాన్ని అభినందిస్తున్నాను. "నేను చేయగలనన్నసంస్కృతి”, "నేను చేయగలనన్నసంకల్పం", "నేను చేయగలనన్న వైఖరి"తో ప్రతి సవాలును ఎదుర్కొనే భావనతో ఉన్న మన దేశ ప్రజల స్ఫూర్తిని కూడా ఇది ప్రకటిస్తుంది.
మిత్రులారా! ఈ రోజు దేశంలో దివ్యాంగుల సంక్షేమం కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ‘ఒక టీచర్-ఒక కాల్’ అనే పేరుతో ఉత్తరప్రదేశ్‌లో చేస్తున్న అలాంటి ఒక ప్రయత్నం గురించి తెలుసుకునే అవకాశం నాకు లభించింది. బరేలీలో ఈ ప్రత్యేక ప్రయత్నం వికలాంగ పిల్లలకు కొత్త మార్గాన్ని చూపుతోంది. ఈ ఉద్యమానికి డభౌర గంగాపూర్‌లోని ఒక పాఠశాల ప్రిన్సిపాల్ దీప మాలా పాండేయ గారు నాయకత్వం వహిస్తున్నారు. కరోనా కాలంలో ఈ ప్రచారం కారణంగా పెద్ద సంఖ్యలో పిల్లల ప్రవేశం సాధ్యపడటమే కాకుండా 350 మందికి పైగా ఉపాధ్యాయులు సేవా స్ఫూర్తితో చేరారు. ఈ ఉపాధ్యాయులు వికలాంగులైన పిల్లలను పిలుస్తూ, గ్రామ గ్రామానికి వెళ్లి శోధిస్తారు. ఏదో ఒక పాఠశాలలో వారి ప్రవేశాన్ని నిర్ధారించుకుంటారు. వికలాంగుల కోసం దీప మాల గారు, వారి తోటి ఉపాధ్యాయులు చేస్తున్న ఈ గొప్ప ప్రయత్నాన్ని నేను అభినందిస్తున్నాను. విద్యా రంగంలో అలాంటి ప్రతి ప్రయత్నం మన దేశ భవిష్యత్తును తీర్చిదిద్దబోతోంది.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మన జీవితాల పరిస్థితి ఏమిటంటే రోజులో వందల సార్లు కరోనా అనే పదం మన చెవుల్లో ప్రతిధ్వనిస్తుంది. వంద సంవత్సరాలలో అతిపెద్ద ప్రపంచ మహమ్మారి అయిన కోవిడ్-19 ప్రతి దేశ పౌరుడికి చాలా విషయాలు నేర్పింది. ఈరోజు ఆరోగ్య పరిరక్షణ, స్వస్థతపై ఆసక్తి, అవగాహన పెరిగాయి. ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉండే సాంప్రదాయిక, సహజ ఉత్పత్తులు మన దేశంలో సమృద్ధిగా లభిస్తాయి. ఒడిషాలోని కలహండి ప్రాంతంలోని నాందోల్ లో నివసించే పతాయత్ సాహు గారు ఎన్నో సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో ఒక ప్రత్యేకమైన పని చేస్తున్నారు. వారు ఒకటిన్నర ఎకరాల భూమిలో ఔషధ మొక్కలను నాటారు. ఇది మాత్రమే కాదు- సాహు గారు ఈ ఔషధ మొక్కల డాక్యుమెంటేషన్ కూడా చేశారు. రాంచీకి చెందిన సతీష్ గారు ఇలాంటి ఒక సమాచారాన్ని నాకు ఒక లేఖ ద్వారా పంచుకున్నారు. సతీష్ గారు జార్ఖండ్‌లోని ఒక కలబంద సాగు గ్రామం వైపు నా దృష్టిని ఆకర్షించారు. రాంచీ సమీపంలోని దేవరి గ్రామంలోని మహిళలు మంజు కచ్ఛప్ గారి నాయకత్వంలో బిర్సా వ్యవసాయ విద్యాలయంలో కలబంద సాగులో శిక్షణ పొందారు. తరువాత కలబంద సాగును ప్రారంభించారు. ఈ సాగు కారణంగా ఆరోగ్య రంగంలో ప్రయోజనం కలగడమే కాకుండా ఈ మహిళల ఆదాయం కూడా పెరిగింది. కోవిడ్ మహమ్మారి సమయంలో కూడా వారికి మంచి ఆదాయం వచ్చింది. దీనికి ఒక ప్రధాన కారణం ఏమిటంటే శానిటైజర్ తయారుచేసే కంపెనీలు వారి నుండి నేరుగా కలబందను కొనుగోలు చేయడం. ఈ రోజు దాదాపు నలభై మంది మహిళల బృందం ఈ పనిలో పాలుపంచుకుంటోంది. కలబంద అనేక ఎకరాలలో సాగు అవుతోంది. ఒడిషాకు చెందిన పతాయత్ సాహు గారి కృషి లేదా దేవరీ లోని ఈ మహిళల బృందం కృషి వ్యవసాయ క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంతో ముడిపెట్టడానికి ఉదాహరణగా చెప్పవచ్చు.
మిత్రులారా! అక్టోబర్ 2 వ తేదీ లాల్ బహదూర్ శాస్త్రి జయంతి కూడా. వారి జ్ఞాపకార్థం ఈ రోజు వ్యవసాయ రంగంలో కొత్త ప్రయోగాల గురించి కూడా తెలుసుకోవాలి. ఔషధ మొక్కల రంగంలో స్టార్టప్‌లను ప్రోత్సహించడానికి గుజరాత్‌లోని ఆనంద్‌లో మెడి-హబ్ TBI పేరుతో ఇంక్యుబేటర్ పనిచేస్తోంది. ఔషధ, సుగంధ మొక్కలతో అనుసంధానించిన ఈ ఇంక్యుబేటర్ 15 మంది పారిశ్రామికవేత్తల వ్యాపార ఆలోచనలకు చాలా తక్కువ సమయంలో సహకారం అందించింది. ఈ ఇంక్యుబేటర్ సహాయం పొందిన తర్వాతనే సుధా చేబ్రోలు తన స్టార్టప్‌ను ప్రారంభించారు. ఆమె కంపెనీలో మహిళలకు ప్రాధాన్యత ఇస్తారు. వినూత్న మూలికల ఫార్ములా తయారీకి కూడా వారు బాధ్యత వహిస్తారు. ఈ ఔషధ, సుగంధ మొక్కల ఇంక్యుబేటర్ నుండి సహాయం పొందిన మరొక వ్యవస్థాపకులు సుభాశ్రీ గారు. సుభాశ్రీ గారి కంపెనీ- గదులు, కార్ల ఫ్రెష్ నర్ల తయారీ రంగంలో పనిచేస్తోంది. వారు 400 కంటే ఎక్కువ ఔషధ మూలికలున్న మూలికల మిద్దె తోటను కూడా సృష్టించారు.
మిత్రులారా! పిల్లల్లో ఔషధ, మూలికా మొక్కల గురించి అవగాహన పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆసక్తికరమైన చొరవ తీసుకుంది. మన ప్రొఫెసర్ ఆయుష్మాన్ గారు ఈ విషయంలో ముందడుగు వేశారు. ప్రొఫెసర్ ఆయుష్మాన్ ఎవరు అని మీరు అనుకోవచ్చు. వాస్తవానికి ప్రొఫెసర్ ఆయుష్మాన్ ఒక హాస్య పుస్తకం పేరు. ఇందులో విభిన్న కార్టూన్ పాత్రల ద్వారా చిన్న కథలను సిద్ధం చేశారు. వీటితో పాటు కలబంద, తులసి, ఉసిరి, తిప్పతీగ, వేప, అశ్వగంధ, బ్రాహ్మి వంటి ఆరోగ్యకరమైన ఔషధ మొక్కల ఉపయోగం గురించి ఈ పుస్తకంలో పేర్కొన్నారు.
మిత్రులారా! నేటి పరిస్థితిలో ఔషధ మొక్కలు, మూలికల ఉత్పత్తులకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా ప్రజల అవగాహన పెరిగినందువల్ల భారతదేశానికి అపారమైన అవకాశాలున్నాయి. గత కొద్దికాలంగా ఆయుర్వేద, మూలికా ఉత్పత్తుల ఎగుమతిలో గణనీయమైన పెరుగుదల ఉంది.
శాస్త్రవేత్తలు, పరిశోధకులు, స్టార్ట్-అప్ ప్రపంచంతో సంబంధం ఉన్న వ్యక్తులు అటువంటి ఉత్పత్తులపై దృష్టి పెట్టాలని నేను కోరుతున్నాను. ఇది ప్రజల ఆరోగ్యాన్ని, రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా మన రైతులు, యువత ఆదాయాన్ని పెంచడంలో కూడా సహాయపడుతుంది.
మిత్రులారా! సాంప్రదాయిక వ్యవసాయ దశను దాటి వ్యవసాయం రంగంలో కొత్త ప్రయోగాలు జరుగుతున్నాయి. కొత్త పరికల్పనలు నిరంతరం కొత్త స్వయం ఉపాధి మార్గాలను సృష్టిస్తున్నాయి. పుల్వామాకు చెందిన ఇద్దరు సోదరుల కథ కూడా దీనికి ఉదాహరణ. జమ్మూ కాశ్మీర్‌లోని పుల్వామాలో బిలాల్ అహ్మద్ షేక్ గారు, మునీర్ అహ్మద్ షేక్ గారు తమ కోసం కొత్త మార్గాలను కనుగొన్న విధానం నవీన భారతదేశానికి ఒక ఉదాహరణ. 39 ఏళ్ల బిలాల్ అహ్మద్ గారు అత్యంత అధిక అర్హతలు కలిగినవారు. ఆయన అనేక డిగ్రీలు సాధించారు. నేడు వ్యవసాయంలో సొంతగా స్టార్ట్-అప్ ప్రారంభించి ఉన్నత విద్యకు సంబంధించిన తన అనుభవాన్ని ఉపయోగిస్తున్నారు. బిలాల్ గారు తన ఇంట్లో వర్మీ కంపోస్టింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేశారు. ఈ యూనిట్ నుంచి తయారు చేసిన జీవ ఎరువులు వ్యవసాయంలో ఎంతో ప్రయోజనం అందించడమే కాకుండా ప్రజలకు ఉపాధి అవకాశాలను కూడా అందించాయి. ప్రతి సంవత్సరం ఈ సోదరుల యూనిట్ల నుండి రైతులు సుమారు మూడు వేల క్వింటాళ్ల వర్మీ కంపోస్ట్ పొందుతున్నారు. వారి వర్మి కంపోస్టింగ్ యూనిట్లో 15 మంది పని చేస్తున్నారు.
ఈ యూనిట్‌ను చూడటానికి పెద్ద సంఖ్యలో ప్రజలు వెళ్తున్నారు. వారిలో ఎక్కువ మంది వ్యవసాయ రంగంలో ఏదైనా చేయాలనుకునే యువకులు. పుల్వామాకు చెందిన షేక్ సోదరులు ఉద్యోగార్ధులుగా ఉండే బదులుగా ఉద్యోగాల సృష్టికర్తలమవుతామని ప్రతిజ్ఞ చేశారు. నేడు వారు జమ్మూ కాశ్మీర్‌కు మాత్రమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలకు కొత్త మార్గాన్ని చూపుతున్నారు.
నా ప్రియమైన దేశ ప్రజలారా! సెప్టెంబర్ 25 న దేశమాత గొప్ప బిడ్డ పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి. దీన్ దయాళ్ గారు గత శతాబ్దపు గొప్ప ఆలోచనాపరులలో ఒకరు. ఆయన ఆర్థిక విధానాలు, సమాజాన్ని శక్తిమంతం చేయడానికి ఆయన చూపిన దారులు, ఆయన చూపిన అంత్యోదయ మార్గం ఈనాటికీ ప్రాసంగికత కలిగి ఉన్నాయి. అవి అంతే స్ఫూర్తిదాయకం కూడా. మూడేళ్ల కిందట సెప్టెంబర్ 25 న ఆయన జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య భరోసా పథకం - ఆయుష్మాన్ భారత్ పథకం ప్రారంభమైంది. నేడు దేశంలో రెండు- రెండున్నర కోట్ల మందికి పైగా పేదలు ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఆసుపత్రుల్లో 5 లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్స పొందారు. పేదల కోసం ప్రారంభించిన ఇంత పెద్ద పథకం దీన్ దయాళ్ గారి అంత్యోదయ తత్వానికి అంకితమైంది. ఈనాటి యువత తమ విలువలు, ఆదర్శాలను తమ జీవితాల్లోకి తీసుకువస్తే అది వారికి గొప్ప సహాయకారిగా ఉంటుంది. “ఎన్ని మంచి విషయాలు, మంచి లక్షణాలు ఉన్నాయి - ఇవన్నీ సమాజం నుండే మనకు లభిస్తాయి. మనం సమాజం రుణం తీర్చుకోవాలి, మనం ఇలా ఆలోచించాలి.” అని ఒకసారి లక్నోలో దీన్ దయాళ్ గారు అన్నారు. అంటే దీన్ దయాళ్ గారు మనం సమాజం నుండి, దేశం నుండి చాలా తీసుకుంటున్నామని బోధించారు. మన స్థానం దేశం వల్ల మాత్రమేనని, కాబట్టి దేశం పట్ల మన రుణం ఎలా తీర్చుకోవాలో మనం ఆలోచించాలని ఆయన అన్నారు. నేటి యువతకు ఇది గొప్ప సందేశం.
మిత్రులారా! మనం ఎన్నటికీ ఓటమిని అంగీకరించకూడదనే పాఠాన్ని కూడా దీన్ దయాళ్ గారి జీవితం నుండి నేర్చుకుంటాం. ప్రతికూల రాజకీయ, సైద్ధాంతిక పరిస్థితులు ఉన్నప్పటికీ ఆయన భారతదేశ అభివృద్ధి కోసం స్వదేశీ నమూనా సృష్టికి దూరంగా ఉండలేదు. నేడు చాలా మంది యువకులు సిద్ధంగా ఉన్న మార్గాల నుండి బయటపడటం ద్వారా ముందుకు సాగాలని కోరుకుంటున్నారు. వారు తమదైన రీతిలో పనులు చేయాలనుకుంటున్నారు. దీన్ దయాళ్ గారి జీవితం వారికి చాలా సహాయపడుతుంది. అందుకే యువత తప్పనిసరిగా వారి గురించి తెలుసుకోవాలని నేను కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! మనం ఈరోజు అనేక అంశాలపై చర్చించాం. మనం మాట్లాడుకున్నట్టు రాబోయే సమయం పండుగల కాలం. అసత్యంపై ధర్మ విజయంగా పురుషోత్తముడైన శ్రీరాముని విజయోత్సవాన్ని దేశం మొత్తం జరుపుకోబోతోంది. కానీ ఈ పండుగలో మనం మరో పోరాటం గురించి గుర్తుంచుకోవాలి - అది కరోనాపై దేశం చేసిన పోరాటం. ఈ పోరాటంలో టీం ఇండియా ప్రతిరోజూ కొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా చర్చల్లో ఉన్న అనేక రికార్డులను వాక్సినేషన్ రంగంలో దేశం నెలకొల్పింది. ఈ పోరాటంలో ప్రతి భారతీయుడిది కీలక పాత్ర. మన వంతు వచ్చినప్పుడు మనం టీకాను తప్పనిసరిగా తీసుకోవాలి. ఈ భద్రతా వలయం నుండి ఎవరూ బయటపడకుండా మనం జాగ్రత్త వహించాలి. చుట్టుపక్కల వ్యాక్సిన్ తీసుకోని వారిని కూడా టీకా కేంద్రానికి తీసుకెళ్లాలి. టీకా తీసుకున్న తర్వాత కూడా అవసరమైన నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. ఈ పోరాటంలో మరోసారి టీం ఇండియా తన జెండాను ఎగురవేస్తుందని నేను ఆశిస్తున్నాను. వచ్చేసారి మరికొన్ని ఇతర అంశాలపై 'మన్ కీ బాత్'- మనసులో మాట చెప్పుకుందాం. మీ అందరికీ- ప్రతి దేశ పౌరుడికీ- చాలా సంతోషకరమైన పండుగ శుభాకాంక్షలు.
ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. ఈరోజు మేజర్ ధ్యాన్ చంద్ గారి జయంతి అని మనందరికీ తెలుసు. ఆయన జ్ఞాపకార్థం మన దేశం దీన్ని జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ సమయంలో మేజర్ ధ్యాన్ చంద్ గారి ఆత్మ ఎక్కడ ఉన్నా చాలా సంతోషంగా ఉండవచ్చని నేను ఆలోచిస్తున్నాను. ఎందుకంటే హాకీ ప్రపంచంలో భారత హాకీకి పేరు తెచ్చింది ధ్యాన్ చంద్ గారే. నాలుగు దశాబ్దాల తరువాత- దాదాపు 41 సంవత్సరాల తరువాత- భారతదేశంలోని యువత- మరోసారి హాకీలో మన దేశం పేరు మారుమోగేలా చేశారు. ఎన్ని పతకాలు గెలిచినప్పటికీ హాకీలో పతకం వచ్చే వరకు భారతదేశ పౌరులు విజయాన్ని ఆస్వాదించలేరు. ఈసారి నాలుగు దశాబ్దాల తర్వాత ఒలింపిక్స్ లో హాకీ పతకం అందుకున్నారు. మేజర్ ధ్యాన్ చంద్ గారి ఆత్మ ఎక్కడ ఉన్నా ఆయన హృదయంలో ఎంత ఆనందం ఉంటుందో మీరు ఊహించవచ్చు. ధ్యాన్ చంద్ గారు తమ జీవితమంతా క్రీడలకే అంకితం చేశారు. ఈ రోజు యువత దృష్టి క్రీడలవైపు మళ్ళుతోంది. మన కుమారులు, కుమార్తెలు ఆట వైపు ఆకర్షితులవుతున్నారు. పిల్లలు ఆటలో ముందుకు వెళుతుంటే తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉన్నారు. ఈ ఉత్సాహమే మేజర్ ధ్యాన్‌చంద్ గారికి పెద్ద నివాళి.
మిత్రులారా! క్రీడల విషయానికి వస్తే, మొత్తం యువ తరం మన ముందు కనిపించడం సహజం. మనం యువ తరాన్ని దగ్గరగా చూసినప్పుడు ఎంత పెద్ద మార్పు కనిపిస్తుంది? యువత మనసు మారింది. నేటి యువకుల మనస్సు పాత పద్ధతుల నుండి వైవిధ్యంగా కొత్తగా ఏదైనా చేయాలనుకుంటుంది. విభిన్నంగా చేయాలని కోరుకుంటుంది. నేటి యువత మనస్సు ఏర్పరిచిన మార్గాల్లో నడవడానికి ఇష్టపడదు. వారు కొత్త మార్గాలు వేయాలనుకుంటున్నారు.తెలియని ప్రదేశంలోకి అడుగు పెట్టాలనుకుంటున్నారు. గమ్యం కొత్తది. లక్ష్యం కూడా కొత్తది. మార్గం కూడా కొత్తది. కోరిక కూడా కొత్తది. పగలు, రాత్రి కష్టపడి పనిచేస్తున్నారు. కొంతకాలం కిందట భారతదేశం అంతరిక్ష రంగానికి ద్వారాలు తెరిచింది. చూస్తూ ఉండగానే యువతరం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సిద్ధమైంది. ఆ అవకాశాన్ని దాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యార్థులతో పాటు ప్రైవేట్ రంగంలో పనిచేసే యువకులు చాలా ఉత్సాహంతో ముందుకు వచ్చారు. రాబోయే రోజుల్లో మన యువత, మన విద్యార్థులు, మన కళాశాలలు, మన విశ్వవిద్యాలయాలు, ప్రయోగశాలల్లో పనిచేసే విద్యార్థులు రూపొందించే కృత్రిమ ఉపగ్రహాలు పెద్ద సంఖ్యలో ఉంటాయని నాకు ఖచ్చితంగా విశ్వాసం ఉంది.
అదేవిధంగా ఈ రోజు మీరు ఎక్కడ చూసినా, ఏ కుటుంబాన్ని చూసినా - ఎంత ఆస్తి ఉన్న కుటుంబమైనా, ఎంత చదువుకున్న కుటుంబమైనా- మీరు ఆ కుటుంబంలోని యువకుడితో మాట్లాడితే, సంప్రదాయాలకు అతీతంగానే తాను స్టార్ట్-అప్ మొదలు పెడతానని చెప్తారు. స్టార్ట్-అప్ల వైపు వెళ్తానని చెప్తారు. అంటే రిస్క్ తీసుకోవడానికి వారి మనస్సు ఉవ్విళ్లూరుతోంది. నేడు చిన్న పట్టణాలలో కూడా స్టార్ట్-అప్ సంస్కృతి విస్తరిస్తోంది. నేను అందులో ఉజ్వల భవిష్యత్తు సంకేతాలను చూస్తున్నాను. కొద్ది రోజుల క్రితం మన దేశంలో బొమ్మల గురించి చర్చలు జరిగాయి. ఇది చూసి, ఈ అంశం మన యువత దృష్టికి వచ్చినప్పుడు, వారు కూడా భారతదేశంలోని బొమ్మలకు ప్రపంచంలో ఎలా గుర్తింపు ఉందో తెలుసుకున్నారు. అందులో కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. ప్రపంచంలో బొమ్మల రంగానికి భారీ మార్కెట్ ఉంది. 6-7 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ ఉంది. అందులో ఈరోజు భారతదేశ వాటా చాలా తక్కువ. కానీ పిల్లల మనస్తత్వశాస్త్రం ప్రకారం బొమ్మలు ఎలా తయారు చేయాలి, వివిధ రకాల బొమ్మలలో వైవిధ్యం ఎలా ఉంటుంది, బొమ్మలలో సాంకేతికత ఏమిటి మొదలైన విషయాలపై ఈ రోజు మన దేశంలోని యువత దృష్టి పెట్టింది. ఈ రంగంలో ఏదైనా సహకారం అందించాలనుకుంటోంది. మిత్రులారా! మరో విషయం- ఇది మనస్సులో ఆనందాన్ని నింపుతుంది. విశ్వాసాన్ని మరింత పెంచుతుంది. అది ఏమిటి? మీరు ఎప్పుడైనా గుర్తించారా? మన దేశంలోని యువత మనస్సు ఇప్పుడు ఉత్తమమైన వాటి వైపు దృష్టి పెడుతోంది. ఉత్తమంగా కృషి చేయాలనుకుంటున్నారు. అత్యుత్తమ మార్గంలో చేయాలనుకుంటున్నారు. ఇది కూడా దేశాన్ని గొప్ప శక్తిగా అవతరించేలా చేస్తుంది.
మిత్రులారా! ఈసారి ఒలింపిక్స్ భారీ ప్రభావాన్ని సృష్టించాయి. ఒలింపిక్ క్రీడలు ముగిశాయి. ఇప్పుడు పారాలింపిక్స్ జరుగుతున్నాయి. క్రీడా ప్రపంచంలో భారతదేశం పొందినవి ప్రపంచంతో పోలిస్తే తక్కువే కావచ్చు. కానీ ఇవి ఆత్మవిశ్వాసాన్ని నింపాయి. యువత కేవలం క్రీడల వైపు మాత్రమే దృష్టి పెట్టడంలేదు. దానికి సంబంధించిన అవకాశాలను కూడా చూస్తోంది. దాని మొత్తం పర్యావరణ వ్యవస్థను చాలా దగ్గరగా చూస్తోంది. దాని సామర్థ్యాన్ని అర్థం చేసుకుంటోంది. ఏదో ఒక విధంగా తనను తాను జోడించాలనుకుంటోంది. ఇప్పుడు యువత సంప్రదాయ విషయాలకు అతీతంగా కొత్త విభాగాలను తనదిగా చేసుకుంటోంది. నా దేశవాసులారా! ఎఏ రంగంలో ఎంత వేగం వచ్చిందంటే ప్రతి కుటుంబంలో క్రీడల గురించి చర్చ మొదలైంది. మీరు చెప్పండి- ఈ వేగాన్ని ఇప్పుడు ఆపాలా? నిలిపివేయాలా? లేదు! మీరూ నాలాగే ఆలోచిస్తూ ఉండాలి. ఇప్పుడు దేశంలో క్రీడలు, ఆటలు, క్రీడాకారుల స్ఫూర్తి ఇప్పుడు ఆగకూడదు. ఈ వేగాన్ని కుటుంబ జీవితంలో, సామాజిక జీవితంలో, జాతీయ జీవితంలో శాశ్వతంగా ఒక స్థాయిలో ఉండేలా చేయాలి. శక్తితో నింపాలి. నిరంతరం కొత్త శక్తితో నింపాలి. ఇల్లు, బయటి ప్రదేశం, గ్రామం, నగరం- ఎక్కడైనా మన ఆట స్థలాలు నిండి ఉండాలి. అందరూ ఆడుకోవాలి. అందరూ వికసించాలి. మీకు గుర్తుందా - నేను ఎర్రకోట నుండి చెప్పాను- సబ్ కా ప్రయాస్- "అందరి కృషి" - అవును, అందరి కృషి . అందరి కృషితో, క్రీడలలో భారతదేశం ఉన్నత స్థాయికి ఎదుగుతుంది. మేజర్ ధ్యాన్‌చంద్ గారి లాంటి వ్యక్తులు చూపిన మార్గంలో ముందుకు సాగడం మన బాధ్యత. ఎన్నో సంవత్సరాల తరువాత దేశంలో తిరిగి అలాంటి సమయం వచ్చింది. కుటుంబం, సమాజం, రాష్ట్రం, దేశం యావత్తూ ప్రజలందరూ ఒకే మనస్సుతో క్రీడలతో అనుసంధానమవుతున్నారు.
నా ప్రియమైన యువకులారా! మనం ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని వివిధ రకాల క్రీడలలో ప్రావీణ్యం పొందాలి. గ్రామ గ్రామాన క్రీడా పోటీలు నిరంతరం కొనసాగాలి. పోటీ నుండి ఆట విస్తరిస్తుంది. ఆట అభివృద్ధి చెందుతుంది. పోటీ నుండే క్రీడాకారులు తయారవుతారు. రండి.. దేశప్రజలందరం ఈ వేగాన్ని కొనసాగించేందుకు మన వంతు సహకారం అందిద్దాం. 'సబ్కా ప్రయాస్'.. అందరి కృషి .. అనే మంత్రంతో దీన్ని సాకారం చేసుకుందాం.
నా ప్రియమైన దేశవాసులారా! రేపు జరిగే జన్మాష్టమి గొప్ప పండుగ. ఈ జన్మాష్టమి పండుగ .. శ్రీకృష్ణుని జన్మదినోత్సవం. కొంటె కన్నయ్య నుండి విరాట్ స్వరూపాన్ని సంతరించుకునే కృష్ణుడి వరకు, శాస్త్ర సామర్థ్యం ఉన్న కృష్ణుడి నుండి శస్త్ర సామర్థ్యం ఉన్న కృష్ణుడి వరకు- భగవంతుని అన్ని రూపాలతో మనకు పరిచయం ఉంది. కళ అయినా, అందం అయినా, మాధుర్యమైనా – ఎక్కడైనా శ్రీకృష్ణుడు ఉన్నాడు. జన్మాష్టమికి కొన్ని రోజుల ముందు నేను అలాంటి ఆసక్తికరమైన అనుభవాన్ని పొందాను. కాబట్టి మీకు ఈ మాటలు చెప్పాలని నా మనసు కొరుకుంటోంది. ఈ నెల 20 వ తేదీన సోమనాథ దేవాలయానికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభించినట్లు మీకు గుర్తుండే ఉంటుంది. భాల్కా తీర్థం సోమనాథ దేవాలయం నుండి కేవలం 3-4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భాల్కా తీర్థం శ్రీకృష్ణుడు ఆ అవతారంలో భూమిపై తన చివరి క్షణాలు గడిపిన ప్రదేశం. ఒక విధంగా చెప్పాలంటే ఈ ప్రపంచంలో ఆయన లీలలు అక్కడ ముగిశాయి. సోమనాథ్ ట్రస్ట్ ద్వారా ఆ ప్రాంతంలో చాలా అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. నేను భాల్కా తీర్థం గురించి, అక్కడ జరిగే కార్యక్రమాల గురించి ఆలోచిస్తున్నాను. అంతలో నా దృష్టి ఒక అందమైన ఆర్ట్ బుక్ పై పడింది. ఆ పుస్తకాన్ని నా నివాసం బయట ఎవరో నాకోసం వదిలివెళ్లారు. అందులో శ్రీకృష్ణుని అనేక రూపాలు, అనేక గొప్ప చిత్రాలు ఉన్నాయి. గొప్ప చిత్రాలు, చాలా అర్థవంతమైన చిత్రాలు ఉన్నాయి. నేను పుస్తకం పేజీలు తిప్పడం మొదలుపెట్టినప్పుడు, నా ఉత్సుకత మరింత పెరిగింది. నేను ఆ పుస్తకాన్ని, ఆ చిత్రాలన్నింటినీ చూసినప్పుడు, అందులో నా కోసం రాసిన ఒక సందేశాన్ని చదివినప్పుడు ఆ పుస్తకాన్ని నా ఇంటి బయట వదిలిపెట్టిన వారిని నేను కలవాలనుకున్నాను. మా ఆఫీసు వాళ్ళు వారిని సంప్రదించారు. ఆ తర్వాతి రోజే వారిని కలవడానికి ఆహ్వానించాను. ఆర్ట్-బుక్ లో శ్రీ కృష్ణుని వివిధ రూపాలను చూసి నా ఉత్సుకత అంతగా పెరిగింది. ఆ ఉత్సుకతతో నేను జదురాణి దాసి గారిని కలిశాను. ఆమె అమెరికన్. అమెరికాలో జన్మించారు. అమెరికాలో పెరిగారు. జదురాణి దాసి గారు ఇస్కాన్ సంస్థతో అనుసంధానమై ఉన్నారు. హరే కృష్ణ ఉద్యమంతో వారి జీవితం ముడిపడి ఉంది. ఆమె గొప్ప ప్రత్యేకత ఆమె భక్తి కళలలో నైపుణ్యం. కేవలం రెండు రోజుల తరువాత సెప్టెంబర్ 1 న ఇస్కాన్ వ్యవస్థాపకుడు శ్రీల ప్రభుపాద స్వామి గారి 125 వ జయంతి అని మీకు తెలుసు. జదురాణి దాసి గారు అందుకోసమే భారతదేశానికి వచ్చారు. నా ముందు ఉన్న పెద్ద ప్రశ్న ఏమిటంటే.. ఆమె అమెరికాలో జన్మించారు. భారతీయ భావాలకు దూరంగా ఉన్నారు. అలాంటి ఆమె శ్రీకృష్ణుడి అందమైన చిత్రాలను ఎలా తయారు చేయగలిగిందనే నా ప్రశ్న. నేను ఆమెతో సుదీర్ఘంగా మాట్లాడాను. కానీ అందులో కొంత భాగాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నాను.
ప్రధానమంత్రి గారు: జదురాణి గారూ.. హరే కృష్ణ!
నేను భక్తి కళ గురించి కొంచెం చదివాను. దాని గురించి మా శ్రోతలకు మరింత చెప్పండి. దాని పై మీ అభిరుచి, ఆసక్తి చాలా బాగున్నాయి.
జదురాణి గారు: భక్తి కళలో ఒక కథనం ఉంది. ఇది ఈ కళ మనస్సు లేదా ఊహ నుండి ఎలా రాలేదో వివరిస్తుంది. ఇది బ్రహ్మ సంహిత వంటి ప్రాచీన వేద గ్రంథాల నుండి వచ్చింది. ఓంకారాయ పతితం స్కిలతం సికంద్, బృందావన గోస్వామినుండి, స్వయంగా బ్రహ్మ దేవుడి నుండి ఈ కళ వచ్చింది. ఈశ్వరః పరమః కృష్ణః సచ్చిదానంద విగ్రహః కృష్ణుడు వేణువును ఎలా ధరించాడో, ఆయన ఇంద్రియాలన్నీ ఏ ఇతర భావాల కోసం ఎలా పని చేయగలవో చెప్తుంది. శ్రీమద్భాగవతం (TCR 9.09) బర్హా పీండ నటవరవపుః కర్ణయో: కర్ణికారం. ఆయన చెవిపై కర్ణిక పుష్పం ధరించాడు. ఆయన బృందావనం అంతటా తన కమల పాదాల ముద్రను వేస్తారు. ఆవు మందలు ఆయన మహిమలను వినిపిస్తాయి. ఆయన వేణువు అదృష్టవంతుల హృదయాలను, మనస్సులను ఆకర్షిస్తుంది. కాబట్టి ప్రతిదీ ప్రాచీన వేద గ్రంథాల నుండి వచ్చిందే. ఈ గ్రంథాల శక్తి అతీంద్రియ వ్యక్తుల నుండి, స్వచ్ఛమైన భక్తుల నుండి వచ్చింది. కళకు వారి శక్తి ఉంది. అందుకే దాని పరివర్తన తప్ప అది నా శక్తి కాదు.
ప్రధానమంత్రిగారు: జదురాణి గారూ... 1966 నుండి.. ఒక విధంగా 1976 నుండి మీరు భౌతికంగా భారతదేశంతో సుదీర్ఘకాలం సంబంధం కలిగి ఉన్నారు. మీ దృష్టిలో భారతదేశం అంటే ఏమిటో నాకు చెప్తారా?
జదురాణి గారు: ప్రధాన మంత్రి గారూ.. భారతదేశం అంటే నాకు సర్వస్వం. నేను కొన్ని రోజుల క్రితం గౌరవ రాష్ట్రపతి గారిని ఉద్దేశించి ప్రస్తావించాను అనుకుంటా- భారతదేశం సాంకేతిక అభివృద్ధిలో చాలా ముందుకు వచ్చిందని. ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఐఫోన్లు, పెద్ద భవనాలు, చాలా సదుపాయాలతో పాశ్చాత్య దేశాలను బాగా అనుసరిస్తోందని. కానీ అది భారతదేశపు నిజమైన కీర్తి కాదని నాకు తెలుసు. భారతదేశాన్ని గొప్పగా చేసేది ఏమిటంటే, కృష్ణుడు ఆ అవతారంలో ఇక్కడ కనిపించాడు. అవతారాలన్నీ ఇక్కడ కనిపించాయి- శివుడు ఇక్కడ కనిపించాడు, రాముడు ఇక్కడ కనిపించాడు. పవిత్ర నదులన్నీ ఇక్కడ ఉన్నాయి. వైష్ణవ సంస్కృతికి సంబంధించిన అన్ని పవిత్ర స్థలాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి భారతదేశం- ముఖ్యంగా బృందావనం- విశ్వంలో అత్యంత ముఖ్యమైన ప్రదేశం. బృందావనం అన్ని వైకుంఠ గ్రహాలకు మూలం. ద్వారకకు మూలం, మొత్తం భౌతిక సృష్టికి మూలం. కాబట్టి నేను భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను.
ప్రధానమంత్రి గారు: ధన్యవాదాలు జదురాణి గారూ.. హరే కృష్ణ!
మిత్రులారా! ప్రపంచ ప్రజలు ఈనాడు భారతీయ ఆధ్యాత్మికత, తత్వశాస్త్రం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు.ఈ సందర్భంలో ఈ గొప్ప సంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మనపై ఉంది. కాలంతో పాటు మారే విషయాలను వదిలివేసి, కాలాతీతమైన దాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మన పండుగలను జరుపుకుందాం. వాటి శాస్త్రీయతను అర్థం చేసుకుందాం. వాటి వెనుక ఉన్న అర్థాన్ని అర్థం చేసుకుందాం. ఇది మాత్రమే కాదు- ప్రతి పండుగలో ఏదో ఒక సందేశం ఉంటుంది. ఏదో ఒక ఆచారం ఉంటుంది. మనం వాటిని తెలుసుకుని జీవించాలి. రాబోయే తరాలకు వారసత్వంగా అందించాలి. దేశ ప్రజలందరికీ మరోసారి జన్మాష్టమి శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ కరోనా కాలంలో నేను పరిశుభ్రత గురించి మాట్లాడాల్సిన అంశాలలో కొంత కొరత ఉన్నట్లు అనిపిస్తుంది. పరిశుభ్రత ప్రచారాన్ని కొద్దిగానైనా దూరం చేయకూడదని నేను భావిస్తున్నాను. జాతి నిర్మాణం కోసం ప్రతిఒక్కరి ప్రయత్నాలు దేశాన్ని ఎలా అభివృద్ధి చేస్తాయో చెప్పే ఉదాహరణలు మనకు స్ఫూర్తినిస్తాయి. ఏదైనా చేయడానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. కొత్త విశ్వాసాన్ని అందిస్తాయి. మన సంకల్పానికి ప్రాణం పోస్తాయి. స్వచ్ఛ భారత్ అభియాన్ విషయం వచ్చినప్పుడు ఇండోర్ పేరు ప్రస్తావనకు వస్తుంది. ఎందుకంటే ఇండోర్ పరిశుభ్రతకు సంబంధించి ప్రత్యేక గుర్తింపును కలిగి ఉంది. ఇండోర్ పౌరులు కూడా అభినందనలకు అర్హులు. మన ఇండోర్ చాలా సంవత్సరాలుగా 'స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్'లో నంబర్ వన్ స్థానంలో ఉంది. ఇప్పుడు ఇండోర్ ప్రజలు స్వచ్ఛ భారత్ ర్యాంకింగ్‌తో సంతృప్తి చెందడానికి ఇష్టపడరు. వారు మరింత ముందుకు వెళ్లాలనుకుంటున్నారు. కొత్తగా ఏదైనా చేయాలనుకుంటున్నారు. వారి మనసులో నిర్ణయించుకున్న విషయం 'వాటర్ ప్లస్ సిటీ' గా ఆ నగరాన్ని రూపుదిద్దడం. ఇప్పుడు వారు ఇండోర్ ను 'వాటర్ ప్లస్ సిటీ'గా మార్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. 'వాటర్ ప్లస్ సిటీ' అంటే మురుగునీటిని శుద్ధి చేయకుండా ఏ కాలువలోకీ వదలరు. ఇక్కడి ప్రజలు స్వయంగా ముందుకు వచ్చి తమ కాలువలను మురుగునీటి కాలువలతో అనుసంధానించారు. పరిశుభ్రత ఉద్యమాన్ని కూడా ప్రారంభించారు.ఈ కారణంగా సరస్వతి, కాన్ నదులలో మురికి నీటిని వదలడం కూడా గణనీయంగా తగ్గిపోయింది. పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తోంది. ఈ రోజు మన దేశం స్వాతంత్ర్య భారత అమృతమహోత్సవాలను జరుపుకుంటున్నప్పుడు స్వచ్ఛ భారత్ అభియాన్ తీర్మానాన్ని మందగించనివ్వకూడదని గుర్తుంచుకోవాలి. మన దేశంలో 'వాటర్ ప్లస్ సిటీ' నగరాలు ఎంత ఎక్కువ సంఖ్యలో ఉంటే అంత పరిశుభ్రత పెరుగుతుంది. మన నదులు కూడా శుభ్రంగా ఉంటాయి. నీటిని ఆదా చేసే మానవ బాధ్యతను నెరవేర్చే సంస్కారం కూడా ఉంటుంది.
మిత్రులారా! బీహార్‌లోని మధుబని నుండి ఒక ఉదాహరణ వచ్చింది. మధుబనిలోని డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ వ్యవసాయ విశ్వవిద్యాలయం, స్థానిక కృషి విజ్ఞాన కేంద్రం కలిసి మంచి ప్రయత్నం చేశాయి. రైతులు దీని ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఇది స్వచ్ఛ భారత్ అభియాన్‌కు కొత్త బలాన్ని ఇస్తోంది. విశ్వవిద్యాలయం ప్రారంభించిన ఈ చొరవ పేరు ‘సుఖేత్ మోడల్’. గ్రామాల్లో కాలుష్యాన్ని తగ్గించడమే సుఖేత్ మోడల్ ఉద్దేశ్యం. ఈ పతాకంలో భాగంగా ఆవు పేడ, ఇతర గృహ వ్యర్థాలను గ్రామంలోని రైతుల నుండి సేకరిస్తారు. బదులుగా గ్రామస్తులకు వంట గ్యాస్ సిలిండర్ల కోసం డబ్బు ఇస్తారు. గ్రామం నుండి సేకరించిన చెత్తను పారవేయడం కోసం వర్మీ కంపోస్ట్ తయారు చేసే పని కూడా జరుగుతోంది. అంటే సుఖేత్ మోడల్ లో నాలుగు ప్రయోజనాలు నేరుగా కనిపిస్తాయి. మొదటిది గ్రామానికి కాలుష్యం నుండి విముక్తి. రెండవది - గ్రామానికి మురికి నుండి విముక్తి. మూడవది గ్రామస్తులకు LPG సిలిండర్ కోసం డబ్బు లభించడం. నాల్గవది గ్రామంలోని రైతులకు సేంద్రియ ఎరువులు లభించడం. అలాంటి ప్రయత్నాలు మన గ్రామాల శక్తిని ఎంతగా పెంచుతాయో మీరు ఊహించండి. ఇది స్వావలంబనకు సంబంధించిన విషయం. దేశంలోని ప్రతి పంచాయితీ ఇలాంటి వాటిని చేయాలని నేను చెప్తున్నాను. మిత్రులారా! మనం ఒక లక్ష్యంతో బయలుదేరినప్పుడు ఫలితాలు లభిస్తాయని ఖచ్చితంగా చెప్పలేం. ఇప్పుడు తమిళనాడులోని శివగంగ జిల్లాలో ఉన్న కాంజీ రంగాల్ పంచాయితీని చూడండి. ఈ చిన్న పంచాయితీ ఏమి చేసిందో చూడండి. చెత్త నుండి సంపద సృష్టించే మరో నమూనాను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ గ్రామ పంచాయితీ స్థానిక ప్రజలతో కలిసి తమ గ్రామంలో వ్యర్థాల నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే స్థానిక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. మొత్తం గ్రామం నుండి చెత్తను సేకరిస్తారు. దాని నుండి విద్యుత్ ఉత్పత్తి చేస్తారు. మిగిలిన ఉత్పత్తులను కూడా పురుగుమందులుగా అమ్ముతారు. గ్రామంలో ఈ పవర్ ప్లాంట్ సామర్థ్యం రోజుకు రెండు టన్నుల వ్యర్థాలను పారవేయడం. దీని ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు వీధిలైట్లు, గ్రామంలోని ఇతర అవసరాలకు ఉపయోగపడుతోంది. ఈ కారణంగా పంచాయతీ డబ్బు ఆదా అవుతోంది. ఆ డబ్బు ఇతర అభివృద్ధి పనులకు ఉపయోగపడుతోంది. ఇప్పుడు చెప్పండి- తమిళనాడులోని శివగంగ జిల్లాలోని ఒక చిన్న పంచాయితీ మనందరికీ ప్రేరణ ఇస్తుంది. వారు అద్భుతాలు చేశారు. కదా!
నా ప్రియమైన దేశవాసులారా!
'మన్ కీ బాత్' ఇప్పుడు భారతదేశ సరిహద్దులకే పరిమితం కాదు. ప్రపంచంలోని వివిధ మూలల్లో కూడా 'మన్ కీ బాత్' గురించి చర్చ జరుగుతోంది. విదేశాలలో నివసిస్తున్న మన భారతీయ సమాజానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. వారు కూడా నాతో కొత్త కొత్త విషయాలను పంచుకుంటూనే ఉన్నారు. అలాగే 'మన్ కీ బాత్' లో విదేశాలలో జరుగుతున్న ప్రత్యేకమైన కార్యక్రమాలను కొన్నిసార్లు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ రోజు కూడా అలాంటి కొంతమందిని నేను మీకు పరిచయం చేస్తాను. కానీ అంతకు ముందు నేను మీకు ఆడియో వినిపించాలనుకుంటున్నాను. శ్రద్ధగా వినండి.
##
[రేడియో యూనిటీ నైంటీ ఎఫ్. ఎం.-2]
నమోనమః సర్వేభ్యః మమ నామ గంగా భవంతః శృణ్వంతు రేడియో-యూనిటీ -నవతి-F.M-'ఏక్ భారతం శ్రేష్ఠ భారతం' | అహం ఏకతా మూర్తే: మార్గ్ దర్శికా ఏవం రేడియో యూనిటీ మాధ్యమే ఆర్. జె. అస్మి | అద్య సంస్కృత దినం అస్తి | సర్వేభ్య: బహవ్య: శుభ కామ్ నాః సంతి | సర్దార్-వల్లభాయ్-పటేల్ మహోదయ: 'లోహ పురుషః' ఇత్యుచ్యతే. 2013-తమే వర్షే లోహసంగ్రహస్య అభియానం ప్రారబ్ధం | 134-టన్-పరిమితస్య లోహస్య గలనం కృతమ్ | జార్ఖండస్య ఏక: వ్యవసాయవేత్త: ముద్రరస్య దానం కృత్వాన్ | భవంతః శృణ్వంతు రేడియో-యూనిటీ-నవతి-ఎఫ్. ఎం. -'ఏక భారతం శ్రేష్ఠ-భారతం' |
[రేడియో యూనిటీ నైంటీ ఎఫ్. ఎం.-2]
##
మిత్రులారా! భాషను మీరు అర్థం చేసుకుని ఉంటారు. ఈ రేడియోలో సంస్కృతంలో మాట్లాడుతున్నవారు ఆర్జే గంగ. గుజరాత్ రేడియో జాకీల సమూహంలో ఆర్జే గంగ సభ్యురాలు. ఆమెతో పాటు ఆర్.జె. నీలం, ఆర్.జె. గురు, ఆర్.జె. హేతల్ వంటి ఇతర సహచరులు కూడా ఉన్నారు. గుజరాత్లో, కేవడియాలో వీరంతా కలిసి ప్రస్తుతం సంస్కృత భాష విలువను పెంచడంలో నిమగ్నమై ఉన్నారు. మీకు తెలుసు కదా! ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం, మన దేశానికే గర్వకారణమైన స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఉన్న కెవాడియా ఇదేనని. నేను అదే కెవాడియా గురించి మాట్లాడుతున్నా అని మీకు తెలుసు కదా! వీరంతా ఒకేసారి అనేక పాత్రలను పోషించే రేడియో జాకీలు. వారు గైడ్లుగా కూడా పనిచేస్తారు. అలాగే సామాజిక రేడియో అయిన రేడియో యూనిటీ 90 ఎఫ్. ఎం. ని నిర్వహిస్తారు. ఈ ఆర్. జె.లు తమ శ్రోతలతో సంస్కృత భాషలో మాట్లాడతారు. వారికి సంస్కృతంలో సమాచారాన్ని అందిస్తారు.
మిత్రులారా! సంస్కృతం గురించి ఇలా చెప్తారు. -
అమృతం సంస్కృత మిత్ర, సరసం సరళం వచః |
ఏకతా మూలకం రాష్ట్రే, జ్ఞాన విజ్ఞాన పోషకమ్|
అంటే మన సంస్కృత భాష సరసమైనది. సరళమైనది కూడా.
సంస్కృతం ఆ భాష ఆలోచనలు, సాహిత్యం ద్వారా జ్ఞానాన్ని అందిస్తుంది. దేశ ఐక్యతను పెంపొందిస్తుంది. బలపరుస్తుంది. సంస్కృత సాహిత్యంలో ఎవరినైనా ఆకర్షించగల మానవత్వం, జ్ఞానాల దైవిక తత్వం ఉంది. ఇటీవల విదేశాలలో సంస్కృతం బోధించే స్ఫూర్తిదాయకమైన పని చేస్తున్న చాలా మంది గురించి నాకు తెలిసింది. అలాంటి వారిలో ఒకరు రట్గర్ కోర్టెన్‌హార్స్ట్ గారు. ఆయన ఐర్లాండ్‌లో ప్రసిద్ధ సంస్కృత పండితుడు, ఉపాధ్యాయుడు. ఆయన అక్కడి పిల్లలకు సంస్కృతం నేర్పిస్తున్నారు. ఇక్కడ తూర్పున భారతదేశం, థాయ్‌లాండ్ ల మధ్య సాంస్కృతిక సంబంధాలను బలోపేతం చేయడంలో సంస్కృత భాష కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. డాక్టర్ చిరాపత్ ప్రపండవిద్య గారు, డాక్టర్ కుసుమ రక్షామణి గారు - ఇద్దరూ థాయ్‌లాండ్‌లో సంస్కృత భాష ప్రచారంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. వారు థాయ్, సంస్కృత భాషలలో తులనాత్మక సాహిత్యాన్ని కూడా రచించారు. రష్యాలోని మాస్కో స్టేట్ యూనివర్సిటీలో సంస్కృతం బోధించే బోరిస్ జాఖరిన్ గారు అటువంటి ప్రొఫెసర్. ఆయన అనేక పరిశోధనా పత్రాలను, పుస్తకాలను ప్రచురించారు. సంస్కృతం నుండి రష్యన్ భాషలోకి అనేక పుస్తకాలను అనువదించారు. అదేవిధంగా ఆస్ట్రేలియాలో విద్యార్థులకు సంస్కృత భాష బోధించే ప్రముఖ సంస్థలలో సిడ్నీ సంస్కృత పాఠశాల ఒకటి. ఈ పాఠశాల పిల్లల కోసం సంస్కృత వ్యాకరణ శిబిరం, సంస్కృత నాటకం, సంస్కృత దినోత్సవం వంటి కార్యక్రమాలను కూడా నిర్వహిస్తుంది.
మిత్రులారా! ఇటీవలి కాలంలో చేసిన ప్రయత్నాలు సంస్కృతం విషయంలో కొత్త అవగాహన తెచ్చాయి. ఈ దిశగా మన ప్రయత్నాలను పెంచాల్సిన సమయం వచ్చింది. మన వారసత్వాన్ని సంరక్షించడం, నిర్వహించడం, కొత్త తరానికి అందించడం, భవిష్యత్తు తరాల వారికి అందించడం మన బాధ్యత. వీటిపై భావి తరాలకు కూడా హక్కు ఉంటుంది. ఇప్పుడు ఈ పనుల కోసం కూడా అందరి ప్రయత్నాలను పెంచాల్సిన సమయం వచ్చింది. మిత్రులారా! ఈ రకమైన ప్రయత్నంలో నిమగ్నమైన వ్యక్తి మీకు తెలిసినట్లయితే, మీకు అలాంటి సమాచారం ఏదైనా ఉంటే, దయచేసి వారికి సంబంధించిన సమాచారాన్ని సోషల్ మీడియాలో #CelebratingSanskrit అన్న ట్యాగ్ తో పంచుకోండి.
నా ప్రియమైన దేశవాసులారా! 'విశ్వకర్మ జయంతి' కూడా రాబోయే కొద్ది రోజుల్లో రాబోతోంది. ప్రపంచ సృష్టి శక్తికి చిహ్నంగా విశ్వకర్మ దేవుడిని పరిగణిస్తారు. కుట్టు-ఎంబ్రాయిడరీ అయినా, సాఫ్ట్వేర్ అయినా, ఉపగ్రహమైనా, ఎవరైనా తన నైపుణ్యంతో ఒక వస్తువును సృష్టించినా- ఇదంతా విశ్వకర్మ స్వరూపం. ఈ రోజు ప్రపంచంలో నైపుణ్యాన్ని కొత్త మార్గంలో గుర్తిస్తున్నప్పటికీ మన రుషులు వేల సంవత్సరాల నుండి నైపుణ్యం, కొలతల ప్రకారం తీర్చిదిద్దడంపై దృష్టి పెట్టారు. వారు నైపుణ్యాన్ని, కౌశలాన్ని, విశ్వాసాన్ని మన జీవిత తత్వశాస్త్రంలో ఒక భాగంగా చేశారు. మన వేదాలు కూడా విశ్వకర్మ దైవానికి అనేక శ్లోకాలను అంకితం చేశాయి. విశ్వంలోని గొప్ప సృష్టి ప్రణాళికలు, కొత్త, పెద్ద పనులు మొదలయిన వాటి ఘనత మన గ్రంథాలలో భగవాన్ విశ్వకర్మకే ఇచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ప్రపంచంలో ఏ అభివృద్ధి, ఆవిష్కరణ జరిగినా అది నైపుణ్యాల ద్వారా మాత్రమే జరుగుతుందనేదానికి ఇది చిహ్నం. విశ్వకర్మ భగవంతుని జయంతి, ఆయన ఆరాధన వెనుక ఉన్న స్ఫూర్తి ఇది. మన గ్రంథాలలో ఇలా పేర్కొన్నారు. -
విశ్వస్య కృతే యస్య కర్మవ్యాపారః సః విశ్వకర్మ |
అంటే సృష్టికి, నిర్మాణానికి సంబంధించిన అన్ని చర్యలను చేసేవాడు విశ్వకర్మ. మన గ్రంథాల దృష్టిలో, మన చుట్టూ ఉన్న నిర్మాణాల్లో, సృజనలో నిమగ్నమైన నైపుణ్యం ఉన్న వ్యక్తులందరూ విశ్వకర్మ భగవానుడి వారసులు. వారు లేని జీవితాన్ని మనం ఊహించలేము. ఆలోచించండి. చూడండి- మీ ఇంట్లో విద్యుత్ సమస్య ఉంటే, మీకు ఎలక్ట్రీషియన్ దొరకకపోతే ఏం జరుగుతుంది? మీరు ఎంత పెద్ద సమస్యను ఎదుర్కొంటారు! ఇలాంటి నైపుణ్యం కలిగిన వ్యక్తుల కారణంగా మన జీవితం కొనసాగుతుంది. లోహాలతో పని చేసేవారు, కుండల తయారీదారు, చెక్క పనివారు, ఎలక్ట్రీషియన్, హౌస్ పెయింటర్, స్వీపర్ లేదా మొబైల్-ల్యాప్‌టాప్ రిపేర్ చేసేవారు - ఎవరైనా కానివ్వండి. వారంతా మీ చుట్టూ ఆధునిక రూపంలో ఉన్న విశ్వకర్మలే. కానీ మిత్రులారా! దానిలో మరో కోణం ఉంది. ఇది కొన్నిసార్లు ఆందోళనను కలిగిస్తుంది. దేశంలో సంస్కృతి, సంప్రదాయం, ఆలోచన, నైపుణ్యం ఉన్న మానవశక్తిని విశ్వకర్మగా భావించే రోజులుండేవి. అలాంటి పరిస్థితులు ఎలా మారిపోయాయి? ఒకప్పుడు మన కుటుంబ జీవితం, సామాజిక జీవితం, జాతీయ జీవితంపై కౌశల్య ప్రభావం భారీగా ఉండేది. కానీ బానిసత్వపు సుదీర్ఘ కాలంలో నైపుణ్యానికి అలాంటి గౌరవం ఇచ్చిన భావన క్రమంగా పోయింది. నైపుణ్యం ఆధారిత పనులు చిన్నవిగా భావించే విధంగా ఆలోచన మారింది. ఇప్పుడు ఈ రోజు చూడండి- ప్రపంచం మొత్తం నైపుణ్యం మీద ఎక్కువగా దృష్టి పెడుతోంది. విశ్వకర్మ భగవంతుని ఆరాధన కూడా లాంఛనాలతో మాత్రమే పూర్తి కాలేదు. మనం ప్రతిభను గౌరవించాలి. నైపుణ్యం సాధించడానికి మనం కష్టపడాలి. నైపుణ్యం ఉన్నందుకు గర్వపడాలి. మనం కొత్తగా ఏదైనా చేసినప్పుడు, కొత్త అంశాన్ని ఆవిష్కరించినప్పుడు, సమాజానికి ఉపయోగపడేదాన్ని సృష్టించినప్పుడు, ప్రజల జీవితాన్ని సులభతరం చేసినప్పుడు, మన విశ్వకర్మ పూజ అర్థవంతంగా ఉంటుంది. ఈరోజు ప్రపంచంలో నైపుణ్యం ఉన్న వ్యక్తులకు అవకాశాల కొరత లేదు. నేడు నైపుణ్యాలతో ఎన్నో ప్రగతి మార్గాలు సిద్ధమవుతున్నాయి. కాబట్టి రండి.. ఈసారి విశ్వకర్మ దేవుడిని ఆరాధించడంలో విశ్వాసంతో పాటు ఆయన సందేశాన్ని స్వీకరించాలని నిర్ణయించుకుందాం. నైపుణ్యం ప్రాముఖ్యతను మనం అర్థం చేసుకునే విధంగా మన ఆరాధన లోని భావం ఉండాలి. అలాగే నైపుణ్యం ఉన్న వ్యక్తులు ఏ పని చేసినా వారికి పూర్తి గౌరవం ఇవ్వాలి.
నా ప్రియమైన దేశ వాసులారా! ఇది స్వాతంత్ర్యానికి 75 వ సంవత్సరం. ఈ సంవత్సరం మనం ప్రతిరోజూ కొత్త తీర్మానాలు చేసుకోవాలి. కొత్తగా ఆలోచించాలి. కొత్త విషయాలను సాధించేందుకు ప్రేరణ పొందాలి. భారతదేశం స్వాతంత్య్రం సాధించి వంద సంవత్సరాలు పూర్తయినప్పుడు, మన ఈ తీర్మానాలు మాత్రమే విజయానికి పునాదిగా కనిపిస్తాయి. కాబట్టి మనం ఈ అవకాశాన్ని వదులుకోకూడదు. ఇందులో మన వంతు సహకారం అందించాలి. ఈ ప్రయత్నాల మధ్య మనం గుర్తుంచుకోవలసిన మరో విషయం ఉంది. ఔషధం కూడా- కఠిన నియమాలు కూడా. దేశంలో 62 కోట్లకు పైగా వ్యాక్సిన్ డోస్‌లు అందజేశాం. అయినా మనం ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. అవును- ఎప్పటిలాగే మీరు ఏదైనా కొత్త పని చేసినప్పుడు కొత్తగా ఆలోచించండి. అప్పుడు ఖచ్చితంగా నన్నుకూడా అందులో భాగస్వామిని చేయండి. నేను మీ ఉత్తరాలు, సందేశాల కోసం వేచి ఉంటాను. ఈ శుభాకాంక్షలతో, రాబోయే పండుగలకు మీ అందరికీ మరోసారి అభినందనలు. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం!
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం..
రెండు రోజుల కిందటి కొన్ని అద్భుతమైన చిత్రాలు, కొన్ని ఎప్పటికీ గుర్తుండే క్షణాలు ఇప్పటికీ నా కళ్ల ముందు ఉన్నాయి. కాబట్టి ఈసారి ఆ క్షణాలతో 'మన్ కి బాత్' ప్రారంభిద్దాం. టోక్యో ఒలింపిక్స్‌లో భారత ఆటగాల్లచేతిలో త్రివర్ణ పతాకం రెపెరెపెలాడటం చూసి చూసి నేను మాత్రమే కాదు- దేశం యావత్తూ రోమాంచితమైంది. దేశం మొత్తం ఐక్యంగా ఈ యోధులతో విజయీభవ.. విజయీభవ అని చెప్పినట్టుగా అనిపించింది.
ఈ క్రీడాకారులు భారతదేశం నుండి వెళ్ళినప్పుడు వారితో మాట్లాడే అవకాశం లభించింది. వారి గురించి తెలుసుకుని, దేశానికి చెప్పే అవకాశం నాకు దొరికింది. ఈ ఆటగాళ్ళు జీవితంలోని అనేక సవాళ్లను అధిగమించి ఇక్కడికి చేరుకున్నారు. ఈ రోజు వారికి మీ ప్రేమ, సహకారాల శక్తి లభించింది. కాబట్టి అందరం కలిసి మన ఆటగాళ్లందరికీ శుభాకాంక్షలు తెలియజేద్దాం. సోషల్ మీడియాలో ఒలింపిక్ ఆటగాళ్లకు మద్దతు తెలిపే మన విక్టరీ పంచ్ ప్రచారం ఇప్పుడు ప్రారంభమైంది. మీరు కూడా విక్టరీ పంచ్‌ను మీ బృందంతో కలిసి పంచుకోండి. భారతదేశానికి ఉత్సాహాన్ని అందించండి.
మిత్రులారా! దేశం కోసం త్రివర్ణ పతాకాన్ని పట్టుకునే వారి గౌరవార్థం భావోద్వేగాలతో ఉండడం సహజం. ఈ దేశభక్తి భావన మనందరినీ ఏకం చేస్తుంది.
రేపు- అంటే జూలై 26వ తేదీన 'కార్గిల్ విజయ్ దివస్' కూడా ఉంది. కార్గిల్ యుద్ధం భారతదేశ ధైర్యానికి, సంయమనానికి ప్రతీక. దీన్ని ప్రపంచం మొత్తం చూసింది. ఈసారి ఈ అద్భుతమైన రోజును 'అమృత్ మహోత్సవ్' మధ్యలో జరుపుకుంటున్నాం. కాబట్టి ఇది మరింత ప్రత్యేకమైంది. కార్గిల్ రోమాంచితం చేసె కార్గిల్ గాథను మీరు చదవాలని నేను కోరుకుంటున్నాను. కార్గిల్ హీరోలకు మనమందరం వందనం సమర్పిద్దాం.
మిత్రులారా! ఈసారి ఆగస్టు 15 న దేశం స్వాతంత్య్రం వచ్చి 75 వ సంవత్సరంలోకి ప్రవేశిస్తోంది. శతాబ్దాలుగా దేశం ఎదురుచూసిన స్వాతంత్ర్యానికి 75 సంవత్సరాలు వచ్చిన ఈ సమయంలో ఈ ఉత్సవాలకు మనం సాక్షులుగా ఉండడం మన గొప్ప అదృష్టం. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను 'అమృత్ మహోత్సవ్' పేరుతో మార్చి 12 న బాపుకు చెందిన సబర్మతి ఆశ్రమం నుండి ప్రారంభించిన విషయం మీకు గుర్తుండే వుంటుంది . అదే రోజున బాపు దండి యాత్రను కూడా పునరుద్ధరించడం జరిగింది. అప్పటి నుండి జమ్మూ కాశ్మీర్ మొదలుకొని పుదుచ్చేరి వరకు, గుజరాత్ మొదలుకొని ఈశాన్య భారతదేశం వరకు 'అమృత్ మహోత్సవ్' కు సంబంధించిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. ఇలాంటి అనేక సంఘటనల గురించి, ఎంతో గొప్ప త్యాగం చేసిన స్వాతంత్ర్య సమరయోధుల గురించి గతంలో పెద్దగా చర్చ జరగలేదు. ఈ రోజు ప్రజలు వారి గురించి కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఉదాహరణకు మొయిరాంగ్ డే నే తీసుకోండి! మణిపూర్ లోని మొయిరాంగ్ అనే చిన్న పట్టణం ఒకప్పుడు నేతాజీ సుభాస్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ (ఐఎన్ఎ) కి ప్రధాన స్థావరం. అక్కడ స్వాతంత్ర్యానికి ముందే ఐఎన్ఎకు చెందిన కల్నల్ షౌకత్ మాలిక్ జెండాను ఎగురవేశారు. 'అమృత్ మహోత్సవ్' సందర్భంగా ఏప్రిల్ 14 వ తేదీన అదే మొయిరాంగ్‌లో త్రివర్ణ పతాకాన్ని మరోసారి ఎగురవేశారు. చాలా మంది గొప్ప స్వాతంత్ర్య సమరయోధులు, మహోన్నత వ్యక్తులు ఉన్నారు. వీరిని దేశం 'అమృత్ మహోత్సవ్'లో గుర్తుంచుకుంటుంది. దీనికి సంబంధించిన కార్యక్రమాలను ప్రభుత్వం, సామాజిక సంస్థలు నిరంతరం నిర్వహిస్తున్నాయి. అలాంటి ఒక కార్యక్రమం ఈసారి ఆగస్టు 15 వ తేదీన జరగబోతోంది. ఇది ఒక ప్రయత్నం. జాతీయ గీతంతో అనుసంధానించిన ప్రయత్నం. ఆ రోజున భారతదేశంలో ఎక్కువ మంది ప్రజలు ఒకేసారి కలిసి జాతీయగీతం పాడేందుకు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కృషి చేస్తోంది. దీని కోసం ఒక వెబ్సైట్ కూడా రూపొందించారు. ఆ వెబ్ సైట్ రాష్ట్ర్ గాన్ డాట్ ఇన్. ఈ వెబ్సైట్ సహాయంతో మీరు జాతీయ గీతాన్ని పాడి రికార్డ్ చేయగలుగుతారు, ఈ ఉద్యమంలో చేరగలుగుతారు. ఈ ప్రత్యేకమైన కృషిలో మీరు ఖచ్చితంగా చేరతారని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరెన్నో ప్రచారాలు, మరెన్నో ప్రయత్నాలను రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. 'అమృత్ మహోత్సవ్' ఏ ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఏ రాజకీయ పార్టీ కార్యక్రమం కాదు. ఇది కోట్లాది భారత ప్రజల కార్యక్రమం. స్వేచ్ఛాయుతమైన, కృతజ్ఞతాభావం కలిగిన ప్రతి భారతీయుడు స్వాతంత్ర్య సమరయోధులకు వందనం సమర్పిస్తాడు. ఈ పండుగ ప్రాథమిక భావన చాలా విస్తృతమైంది. ఈ భావన మన స్వాతంత్య్ర సమరయోధుల బాటను అనుసరించడానికి, వారి కలల దేశాన్ని నిర్మించడానికి మార్గం. దేశ స్వాతంత్య్ర సమరయోధులు స్వేచ్ఛ కోసం ఏకమయ్యారు. అదేవిధంగా దేశ అభివృద్ధి కోసం మనం ఏకం కావాలి.
మనం దేశం కోసం జీవించాలి. దేశం కోసం పని చేయాలి. ఇందులో చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద ఫలితాలను తెస్తాయి. రోజువారీ పని చేస్తూ కూడా మనం దేశ నిర్మాణం చేయగలం. ఉదాహరణకు వోకల్ ఫర్ లోకల్ ఉద్యమం. మన దేశంలోని స్థానిక పారిశ్రామికవేత్తలు, కళాకారులు, హస్తకళాకారులు, చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడం మన సహజ స్వభావంలో భాగంగా ఉండాలి. ఆగస్టు 7 న వస్తున్న జాతీయ చేనేత దినోత్సవం ఈ పనిని మనం ప్రయత్నించేందుకు ఒక సందర్భం. జాతీయ చేనేత దినోత్సవానికి సంబంధించిన చారిత్రక నేపథ్యం చాలా ఉంది. 1905 లో ఇదేరోజు స్వదేశీ ఉద్యమం ప్రారంభమైంది.
మిత్రులారా! మన దేశంలోని గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో చేనేత పెద్ద ఆదాయ వనరు. లక్షలాది మంది మహిళలు, లక్షలాది మంది నేత కార్మికులు, లక్షలాది మంది హస్తకళాకారులతో సంబంధం ఉన్న రంగమిది. మీ చిన్న ప్రయత్నాలు నేత కార్మికులకు కొత్త ఆశను ఇస్తాయి. మీరు ఏదో ఒకటి కొనండి. మీ అభిప్రాయాన్ని ఇతరులతో పంచుకోండి. మనం 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలను జరుపుకుంటున్నప్పుడు అలా చేయటం మన బాధ్యత సోదరులారా! మీరు తప్పక గమనించి ఉంటారు- 2014 సంవత్సరం నుండి మనం తరచుగా 'మన్ కి బాత్' లో ఖాదీ గురించి మాట్లాడుకుంటున్నాం. మీ కృషి వల్ల ఈ రోజు ఖాదీ అమ్మకం దేశంలో అనేక రెట్లు పెరిగింది. ఒక ఖాదీ దుకాణం రోజుకు 1 కోట్ల రూపాయలకు పైగా అమ్మగలదని ఎవరైనా ఊహించగలరా! కానీ మీరు దీన్ని కూడా సాధ్యం చేశారు. మీరు ఖాదీ బట్టలు కొన్నప్పుడు మన పేద చేనేత సోదరులకు ప్రయోజనం చేకూరుస్తుంది. కాబట్టి, ఖాదీ కొనడం ఒక విధంగా ప్రజా సేవ. ఇది దేశానికి చేసే సేవ కూడా. గ్రామీణ ప్రాంతాల్లో తయారైన చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి, వాటిని #MyHandloomMyPride అనే హాష్ ట్యాగ్ తో పంచుకోవాలని నా ప్రియ సోదరులైన మీ అందరినీ కోరుతున్నాను.
మిత్రులారా! స్వాతంత్య్ర ఉద్యమం, ఖాదీ విషయానికి వస్తే పూజ్య బాపును గుర్తుంచుకోవడం సహజం. బాపు నాయకత్వంలో ‘భారత్ చోడో’ అనే 'క్విట్ ఇండియా ఉద్యమం' ప్రారంభించినట్టే ఈ రోజు ప్రతి దేశస్థుడు ‘భారత్ జోడో’ అనే భారత్ తో సంధాన ఉద్యమానికి నాయకత్వం వహించాలి. భారతదేశాన్ని వైవిధ్యంతో అనుసంధానించడంలో సహాయపడే విధంగా కృషి చేయడం మన కర్తవ్యం. కాబట్టి 'అమృత్ మహోత్సవ్' సందర్భంగా ఈ అమృత సంకల్పంతో ముందుకు సాగుదాం. దేశమే మన అతిపెద్ద విశ్వాసమని, మన అతిపెద్ద ప్రాధాన్యత అని తీర్మానం చేసుకుందాం. "నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్" అనే మంత్రంతో మనం ముందుకు సాగాలి.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు, 'మన్ కీ బాత్' వింటున్న నా యువ సహచరులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. కొద్ది రోజుల క్రితం 'మన్ కి బాత్' శ్రోతలకు సంబంధించి మైగవ్ వేదిక పక్షాన ఒక అధ్యయనం చేశారు. 'మన్ కీ బాత్' కోసం సందేశాలు , సలహాలను పంపే ప్రధాన వ్యక్తులు ఎవరు అనే విషయం ఈ అధ్యయనంలో తెలిసింది. సందేశాలు, సలహాలను పంపే వారిలో 75 శాతం మంది 35 ఏళ్లలోపువారని తేలింది. అంటే భారత యువ శక్తి సూచనలు 'మన్ కీ బాత్'కు దిశానిర్దేశం చేస్తున్నాయని ఈ అధ్యయనం దృష్టికి వచ్చింది. నేను దీన్ని చాలా మంచి సంకేతంగా చూస్తున్నాను. 'మన్ కి బాత్' సానుకూలత, సున్నితత్వం ఉన్న మాధ్యమం. 'మన్ కి బాత్' లో మనం పాజిటివ్ అంశాలను మాట్లాడుతాం. ఈ కార్యక్రమానికి సమిష్టి స్వభావం ఉంటుంది. ఈ విధంగా సానుకూల ఆలోచనలు, సలహాల విషయంలో భారతీయ యువత క్రియాశీలత నాకు సంతోషాన్ని ఇస్తుంది. 'మన్ కి బాత్' ద్వారా యువత మనసును కూడా తెలుసుకునే అవకాశం లభించడం నాకు సంతోషంగా ఉంది.
మిత్రులారా! మీ నుండి వచ్చే సూచనలే 'మన్ కి బాత్'కి నిజమైన శక్తి. మీ సూచనలు 'మన్ కీ బాత్' ద్వారా భారతదేశ వైవిధ్యాన్ని వెల్లడిస్తాయి. భారతదేశ ప్రజల సేవ, త్యాగాల పరిమళాన్ని నాలుగు దిక్కుల్లో వ్యాప్తి చేస్తాయి. మన శ్రామిక యువత ఆవిష్కరణలు ప్రతి ఒక్కరికీ ప్రేరణనిస్తాయి. 'మన్ కి బాత్' కోసం మీరు అనేక రకాల ఆలోచనలను పంపుతారు. మేం వాటన్నింటినీ చర్చించలేం. కానీ నేను వాటిలో చాలా ఆలోచనలను సంబంధిత విభాగాలకు పంపుతాను. తద్వారా వాటిపై మరింత కృషి చేయవచ్చు.
మిత్రులారా! సాయి ప్రణీత్ గారి ప్రయత్నాల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. సాయి ప్రణీత్ గారు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్. వాతావరణ దుష్ప్రభావం కారణంగా రైతులు చాలా నష్టపోవలసి వచ్చిన విషయాన్ని గత సంవత్సరం ఆయన చూశారు. వాతావరణ శాస్త్రంలో చాలా సంవత్సరాలుగా ఆయన ఆసక్తి కలిగి ఉన్నారు. తన ఆసక్తిని, తన ప్రతిభను రైతుల శ్రేయస్సు కోసం ఉపయోగించాలని ఆయన నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆయన వేర్వేరు వనరుల నుండి వాతావరణ సమాచారాన్ని కొనుగోలు చేస్తారు. వాటిని విశ్లేషించి, అవసరమైన సమాచారాన్ని స్థానిక భాషలో వివిధ మాధ్యమాల ద్వారా రైతులకు పంపుతారు. వాతావరణ వివరాలను ఎప్పటికప్పుడు అందజేయడంతో పాటు ప్రణీత్ గారు వివిధ వాతావరణ పరిస్థితుల్లో ప్రజలు ఏం చేయాలో మార్గదర్శనం చేస్తారు. ముఖ్యంగా వరదలను నివారించడానికి ఏం చేయాలో చెప్పడంతో పాటు తుఫాను, పిడుగుపాటులాంటి సందర్భాలలో ఎలా రక్షణ పొందాలనే విషయాల గురించి ప్రజలకు చెబుతారు.
మిత్రులారా! ఒకవైపు ఇలాంటి మరో యువ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రయత్నం హృదయ స్పందన కలిగిస్తుంది. మరోవైపు మన మిత్రుల్లో ఒకరు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం కూడా మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది. ఈ మిత్రుడు ఒడిషాలోని సంబల్పూర్ జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తున్న ఇసాక్ ముండా గారు. గతంలో రోజువారీ కూలీ కార్మికుడిగా పనిచేసే ఇసాక్ గారు ఇప్పుడు ఇంటర్నెట్ సంచలనంగా మారిపోయారు. ఆయన తన యూట్యూబ్ ఛానల్ నుండి చాలా డబ్బు సంపాదిస్తున్నారు. స్థానిక వంటకాలు, సాంప్రదాయిక వంట పద్ధతులు, వారి గ్రామం, వారి జీవనశైలి, కుటుంబం, ఆహార అలవాట్లను వారి వీడియోలలో ప్రముఖంగా చూపిస్తారు. యూట్యూబర్‌గా ఆయన ప్రయాణం 2020 మార్చిలో ప్రారంభమైంది. ఒడిషాకు చెందిన ప్రసిద్ధ స్థానిక వంటకాలైన పఖాల్ కు సంబంధించిన వీడియోను అప్పుడు పోస్ట్ చేశారు. అప్పటి నుండి ఆయన వందలాది వీడియోలను పోస్ట్ చేశాడు. ఆయన కృషి అనేక కారణాల వల్ల భిన్నంగా ఉంది. ముఖ్యంగా ఇది నగరాల్లో నివసించే ప్రజలకు పెద్దగా తెలియని జీవనశైలిని చూసే అవకాశాన్ని ఇస్తుంది. ఇసాక్ ముండా గారు సంస్కృతిని, వంటకాలను అనుసంధానిస్తున్నారు. మనందరికీ స్ఫూర్తినిస్తున్నారు.
మిత్రులారా! మనం సాంకేతిక పరిజ్ఞానం గురించి చర్చిస్తున్నప్పుడు నేను మరొక ఆసక్తికరమైన అంశాన్ని చర్చించాలనుకుంటున్నాను. ఐఐటి మద్రాస్ పూర్వ విద్యార్థులు స్థాపించిన స్టార్ట్-అప్ సంస్థ 3 డి ప్రింటెడ్ హౌస్‌ను సృష్టించిందని మీరు ఇటీవల చదివి ఉండాలి. 3 డి ప్రింటింగ్ ద్వారా ఇల్లు కట్టుకోవడం ఎలా జరిగింది? వాస్తవానికి ఈ స్టార్ట్-అప్ సంస్థ మొదట ఒక 3D ప్రింటర్‌కు మూడు కొలతలుండే డిజైన్ ను అందించింది. తరువాత ఒక ప్రత్యేకమైన కాంక్రీటు ద్వారా పొరలు పొరలుగా 3 డి నిర్మాణాన్ని రూపొందించింది. ఇలాంటి అనేక ప్రయోగాలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయని తెలుసుకోవడం మీకు సంతోషంగా ఉంటుంది. గతంలో చిన్న నిర్మాణ పనులకు కూడా సంవత్సరాలు పట్టేది. కానీ ఈరోజుల్లో భారతదేశంలో సాంకేతిక పరిజ్ఞానం కారణంగా పరిస్థితి మారుతోంది. ప్రపంచం నలుమూలల నుండి ఇటువంటి వినూత్న సంస్థలను ఆహ్వానించడానికి కొంతకాలం క్రితం గ్లోబల్ హౌజింగ్ టెక్నాలజీ ఛాలెంజ్‌ను ప్రారంభించాం. ఇది దేశంలో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం. కాబట్టి వాటికి లైట్ హౌస్ ప్రాజెక్ట్స్ అని పేరు పెట్టాం. ప్రస్తుతం దేశంలోని 6 వేర్వేరు ప్రదేశాలలో లైట్ హౌస్ ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ లైట్ హౌస్ ప్రాజెక్టుల్లో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, వినూత్న పద్ధతులను ఉపయోగిస్తారు. ఇది నిర్మాణాల సమయాన్ని తగ్గిస్తుంది. నిర్మించిన ఇళ్ళు మరింత మన్నికైనవిగా, చవకగా, సౌకర్యవంతంగా ఉంటాయి. నేను ఇటీవల ఈ ప్రాజెక్టులను డ్రోన్ల ద్వారా సమీక్షించాను. పని పురోగతిని ప్రత్యక్షంగా చూశాను.
ఇండోర్ ప్రాజెక్టులో ఇటుక, మోర్టార్ గోడలకు బదులుగా ప్రీ-ఫ్యాబ్రికేటెడ్ శాండ్విచ్ ప్యానెల్ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు. రాజ్‌కోట్‌లో లైట్ హౌస్‌లను ఫ్రెంచ్ సాంకేతికతతో నిర్మిస్తున్నారు. ఇందులో సొరంగం ద్వారా మోనోలిథిక్ కాంక్రీట్ నిర్మాణ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. ఈ సాంకేతిక పరిజ్ఞానంతో తయారైన గృహాలు విపత్తులను ఎదుర్కొనే సామర్థ్యాన్ని అధికంగా కలిగి ఉంటాయి. చెన్నైలో అమెరికా, ఫిన్లాండ్ సాంకేతికతలను ఉపయోగిస్తున్నారు. ప్రీ-కాస్ట్ కాంక్రీట్ వ్యవస్థను వాడుతున్నారు. దీంతో ఇళ్ళ నిర్మాణం వేగంగా పూర్తవుతుంది. ఖర్చు కూడా తగ్గుతుంది. జర్మనీ 3 డి నిర్మాణ వ్యవస్థను ఉపయోగించి రాంచీలో ఇళ్ళని నిర్మిస్తున్నారు. ఇందులో ప్రతి గదిని విడిగా తయారు చేస్తారు. బ్లాక్ బొమ్మలను జోడించబడిన విధంగా మొత్తం నిర్మాణాన్ని అనుసంధానిస్తారు. అగర్తలలో న్యూజిలాండ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఉక్కు చట్రంతో ఇళ్ళు నిర్మిస్తున్నారు. ఇవి పెద్ద భూకంపాలను కూడా తట్టుకోగలవు. లక్నోలో కెనడియన్ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. ప్లాస్టర్, పెయింట్ అవసరం ఉండదు. ఇంటిని వేగంగా నిర్మించడానికి ఇప్పటికే తయారుచేసిన గోడలను ఉపయోగిస్తారు.
మిత్రులారా! ఈ ప్రాజెక్టులను ఇంక్యుబేషన్ సెంటర్ల మాదిరిగా పని చేయించడానికి నేడు దేశంలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీంతో మన ప్లానర్లు, ఆర్కిటెక్టులు, ఇంజనీర్లు, విద్యార్థులు కొత్త టెక్నాలజీని తెలుసుకోగలుగుతారు. దానితో కూడా ప్రయోగాలు చేయగలరు. మన యువతను దేశ ప్రయోజనాల కోసం సాంకేతిక పరిజ్ఞానపు కొత్త రంగాల వైపు ప్రోత్సహించేందుకు నేను ఈ విషయాలను ముఖ్యంగా మన యువత కోసం పంచుకుంటున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! మీరు ‘టు లర్న్ ఈజ్ టు గ్రో’ అనే ఆంగ్ల సామెతను విని ఉంటారు. ‘నేర్చుకోవడం అంటే ఎదగడమే’ అని దాని అర్థం. మనం కొత్త విషయాన్ని నేర్చుకున్నప్పుడు పురోగతికి కొత్త మార్గాలు వాటంతట అవే తెరుచుకుంటాయి. మూస ధోరణులకు భిన్నంగా కొత్తగా ఏదైనా చేసే ప్రయత్నం జరిగినప్పుడల్లా మానవత్వం కోసం కొత్త తలుపులు తెరుచుకున్నాయి. కొత్త శకం ప్రారంభమయింది. ఎక్కడో కొత్త ప్రయత్నం జరిగినప్పుడు దాని ఫలితం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. యాపిల్ తో అనుసంధానం అయ్యే రాష్ట్రాలు ఏవి అని నేను మిమ్మల్ని అడిగితే మీ మనస్సులో మొదట హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ , ఉత్తరాఖండ్ పేర్లు గుర్తొస్తాయని స్పష్టంగా తెలుస్తుంది. ఈ జాబితాలో మణిపూర్‌ను కూడా చేర్చాలని నేను చెబితే బహుశా మీకు ఆశ్చర్యం వేస్తుంది. కొత్తగా ఏదైనా చేయాలనే అభిరుచి ఉన్న యువత మణిపూర్‌లో ఈ ఘనత సాధించారు. ఈ రోజుల్లో మణిపూర్ లోని ఉక్రుల్ జిల్లాలో యాపిల్ సాగు జోరందుకుంది. ఇక్కడి రైతులు తమ తోటలలో ఆపిల్ పండిస్తున్నారు. యాపిల్ సాగు కోసం ఈ ప్రజలు హిమాచల్ వెళ్ళి శిక్షణ కూడా తీసుకున్నారు. వారిలో ఒకరు టి.ఎస్.రింగ్ ఫామి యొంగ్ గారు. ఆయన వృత్తిరీత్యా ఏరోనాటికల్ ఇంజనీర్. ఆయన తన భార్య శ్రీమతి టి.ఎస్. ఏంజెల్ గారితో కలిసి యాపిల్ సాగు చేశారు. అదేవిధంగా అవుంగ్షీ షిమ్రే అగస్టినా గారు కూడా తన తోటలలో యాపిల్ ను సాగు చేశారు. అవుంగ్షీ గారు ఢిల్లీలో ఉద్యోగం చేసేవారు. దాన్ని వదిలి ఆమె తన గ్రామానికి తిరిగి వచ్చి యాపిల్ సాగు ప్రారంభించారు. ఈ రోజు మణిపూర్‌లో ఇలా యాపిల్ పండించేవారు చాలా మంది ఉన్నారు. వారు భిన్నమైన దాన్ని, కొత్త విషయాన్ని చేసి చూపించారు.
మిత్రులారా! మన ఆదివాసీ సమాజంలో బెర్రీ చాలా ప్రాచుర్యం పొందింది. గిరిజన వర్గాల ప్రజలు దీన్ని ఎప్పుడూ సాగు చేస్తున్నారు. కోవిడ్-19 మహమ్మారి తరువాత దాని సాగు పెరుగుతోంది. త్రిపురలోని ఉనకోటికి చెందిన 32 సంవత్సరాల నా యువ స్నేహితుడు బిక్రమ్ జీత్ చక్మా గారు బెర్రీ సాగు ప్రారంభించడం ద్వారా చాలా లాభాలను ఆర్జించారు. ఇప్పుడు ఆయన బెర్రీ సాగు చేయడానికి ప్రజలను కూడా ప్రేరేపిస్తున్నారు. అలాంటి వారికి సహాయం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా ముందుకు వచ్చింది. దీని కోసం ప్రభుత్వం అనేక ప్రత్యేక నర్సరీలను తయారు చేసింది. తద్వారా ఈ పంటతో సంబంధం ఉన్న ప్రజల డిమాండ్ తీరుతుంది. వ్యవసాయంలో పరివర్తన జరుగుతోంది. కాబట్టి వ్యవసాయ ఉప ఉత్పత్తులలో కూడా సృజనాత్మకత కనిపిస్తోంది.
మిత్రులారా! ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖీరిలో చేసిన ప్రయత్నం గురించి కూడా నాకు తెలిసింది. కోవిడ్ కాలం లోనే లఖింపూర్ ఖీరిలో ఒక ప్రత్యేకమైన కృషి జరిగింది. అక్కడ పనికిరాని అరటి కాండం నుండి ఫైబర్ తయారు చేయడానికి మహిళలకు శిక్షణ ఇచ్చే పని ప్రారంభమైంది. వ్యర్థాల నుండి ఉత్తమమైనవి చేయడానికి ఇది ఒక మార్గం. అరటి కాండాన్ని ఒక యంత్రం సహాయంతో కత్తిరించడం ద్వారా అరటి ఫైబర్ ను తయారు చేస్తారు. ఇది జనపనార వంటిది. చేతి సంచులు, చాపలు, కార్పెట్లు మొదలైన ఎన్నో వస్తువులను ఈ ఫైబర్ నుండి తయారు చేస్తారు. ఈ కారణంగా పంట వ్యర్థాల వాడకం ప్రారంభమైంది. మరోవైపు గ్రామంలో నివసిస్తున్న మన సోదరీమణులకు, బాలికలకు మరో ఆదాయ వనరు వచ్చింది. అరటి ఫైబర్ పని తో ఒక స్థానిక మహిళ రోజుకు నాలుగు వందల నుండి ఆరు వందల రూపాయలు సంపాదిస్తుంది. లఖింపూర్ ఖీరిలో వందల ఎకరాల భూమిలో అరటి సాగు చేస్తారు. అరటి పంట కోసిన తరువాత రైతులు సాధారణంగా కాండం విసిరేందుకు అదనపు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు వారి డబ్బు కూడా ఆదా అయింది. ‘ఆమ్ కే ఆమ్.. గుఠ్ లియోం కే దామ్’ అన్ హిందీ సామెత ఇక్కడ ఖచ్చితంగా సరిపోతుంది.
మిత్రులారా! ఒక వైపు అరటి ఫైబర్ నుంచి ఉత్పత్తులు తయారవుతుండగా మరోవైపు అరటి పిండి నుంచి దోస, గులాబ్ జామున్ వంటి రుచికరమైన వంటకాలను కూడా తయారు చేస్తున్నారు. కర్ణాటకలోని ఉత్తర కన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లోని మహిళలు ఈ ప్రత్యేకమైన పనిని చేస్తున్నారు. కరోనా కాలంలోనే ఇది ప్రారంభమైంది. ఈ మహిళలు అరటి పిండి నుండి దోస, గులాబ్ జామున్ వంటి వాటిని తయారు చేయడమే కాకుండా ఆ చిత్రాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అరటి పిండి గురించి ఎక్కువ మందికి తెలియగానే దాని డిమాండ్ కూడా పెరిగింది. ఈ మహిళల ఆదాయం కూడా పెరిగింది. లఖింపూర్ ఖీరి మాదిరిగానే అక్కడ కూడా మహిళలే ఈ వినూత్న ఆలోచనకు నాయకత్వం వహిస్తున్నారు.
మిత్రులారా! ఇలాంటి ఉదాహరణలు జీవితంలో కొత్తగా ఏదైనా చేయటానికి ప్రేరణగా మారతాయి. మీ చుట్టూ కూడా ఇలాంటి వారు చాలా మంది ఉంటారు. మీ కుటుంబంలో మీ మనసులోని విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు మే ముచ్చటలలో మీరు వాటిని కూడా భాగం చేసుకోవాలి. కొంత సమయం కేటాయించి, పిల్లలతో ఇటువంటి ప్రయత్నాలను చూడటానికి వెళ్ళండి. మీకు అవకాశం వస్తే మీరే ఇలా ఏదైనా చేసి చూపించండి. అవును.. మీరు నమోయాప్ లేదా మైగవ్‌లో ఇవన్నీ నాతో పంచుకుంటే నాకు సంతోషంగా ఉంటుంది.
నా ప్రియమైన దేశవాసులారా! మన సంస్కృత గ్రంథాలలో ఒక శ్లోకం ఉంది -
ఆత్మార్థం జీవ లోకే అస్మిన్, కో న జీవతి మానవః
పరమ పరోపకారార్థం, యో జీవతి స జీవతి.
అంటే “ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తనకోసం జీవిస్తారు. కానీ ఏ వ్యక్తి పరోపకారం కోసం జీవిస్తాడో ఆ వ్యక్తీ ఎప్పటికి జీవిస్తాడు .” భారత మాత కుమారులు, కుమార్తెల దాతృత్వ కృషిని గురించిన మాటలే 'మన్ కీ బాత్'. ఈ రోజు కూడా మనం అలాంటి మరికొందరు సహచరుల గురించి మాట్లాడుతాం. ఇలాంటి ఒక మిత్రుడు చండీగఢ్ నగరానికి చెందినవారు. చండీగఢ్ లో నేను కూడా కొన్ని సంవత్సరాలు నివసించాను. ఇది చాలా ఆనందాల అందమైన నగరం. ఇక్కడ నివసించే ప్రజలు కూడా దయామయులు. అవున.. మీరు భోజన ప్రియులు అయితే మీరు మరింత ఎక్కువగా ఆనందిస్తారు. చండీగఢ్ సెక్టార్ 29 లో సంజయ్ రాణా గారు ఒక ఫుడ్ స్టాల్ నడుపుతారు. తన సైకిల్ పై చోలే-భతురేను అమ్ముతారు. ఒక రోజు అతని కుమార్తె రిద్దిమా, మేనకోడలు రియా ఒక ఆలోచనతో ఆయన దగ్గరికి వచ్చారు. కోవిడ్ వ్యాక్సిన్ పొందిన వారికి చోలే-భతురే ను ఉచితంగా ఇవ్వమని వారిద్దరూ ఆయనను కోరారు. ఆయన సంతోషంగా దానికి అంగీకరించారు. వెంటనే ఈ మంచి, గొప్ప ప్రయత్నాన్ని ప్రారంభించారు. సంజయ్ రాణా గారి దగ్గర చోలే-భతురేను ఉచితంగా తినడానికి అదే రోజున మీకు వ్యాక్సిన్ తీసుకున్నట్టు చూపించాల్సి ఉంటుంది. టీకా సందేశాన్ని చూపించిన వెంటనే వారు మీకు రుచికరమైన చోలే-భతురేను ఇస్తారు. సమాజ శ్రేయస్సు కోసం డబ్బు కంటే అధికంగా సేవాభావం, కర్తవ్య నిర్వహణా భావం అవసరమని చెబుతారు. మన సంజయ్ భాయ్ ఈ మాట నిజమని నిరూపిస్తున్నారు.
మిత్రులారా! అలాంటి మరొక పని గురించి ఈ రోజు చర్చించాలనుకుంటున్నాను. ఈ పని తమిళనాడులోని నీలగిరిలో జరుగుతోంది. అక్కడ రాధికా శాస్త్రి గారు అంబురెక్స్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ ఉద్దేశ్యం కొండ ప్రాంతాలలో రోగుల చికిత్స కోసం సులభంగా రవాణా సౌకర్యాలు అందించడం. రాధిక గారు కూనూర్‌లో కేఫ్ నడుపుతున్నారు. ఆమె తన కేఫ్ సహచరుల నుండి అంబురెక్స్ కోసం నిధులు సేకరించారు. ఈ రోజు 6 అంబురెక్స్ వాహనాలు నీలగిరి కొండలపై సేవలు అందిస్తున్నాయి. మారుమూల ప్రాంతాల్లో అత్యవసర సమయంలో రోగుల వద్దకు వస్తున్నాయి. స్ట్రెచర్, ఆక్సిజన్ సిలిండర్, ప్రథమ చికిత్స పెట్టె వంటి అత్యవసర సామగ్రి ని అంబురెక్స్ లో ఏర్పాటు చేశారు.
మిత్రులారా! సంజయ్ గారైనా, రాధిక గారైనా మన పని, మన వ్యాపారం, మన ఉద్యోగం చేసుకుంటూనే సేవ చేయవచ్చని నిరూపిస్తున్నారు.
మిత్రులారా! కొద్ది రోజుల క్రితం చాలా ఆసక్తికరమైన, చాలా భావోద్వేగాన్ని కలిగించే సంఘటన జరిగింది. ఇది భారతదేశం-జార్జియా స్నేహానికి కొత్త బలాన్ని ఇచ్చింది. ఈ వేడుకలో సెయింట్ క్వీన్ కేటేవాన్ పవిత్ర స్మృతి చిహ్నాన్ని జార్జియా ప్రభుత్వానికి, అక్కడి ప్రజలకు భారతదేశం అందజేసింది. దీని కోసం మన విదేశాంగ మంత్రి స్వయంగా అక్కడికి వెళ్లారు. చాలా భావోద్వేగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో జార్జియా అధ్యక్షుడు, ప్రధానమంత్రి, అనేక మంది మత పెద్దలు , పెద్ద సంఖ్యలో జార్జియన్లు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భారతదేశాన్ని ప్రశంసిస్తూ చెప్పిన మాటలు గుర్తుండిపోయేవి. ఈ ఒక్క వేడుక ఇరు దేశాలతో పాటు గోవా- జార్జియా మధ్య సంబంధాలను మరింత బలపరిచింది. సెయింట్ క్వీన్ కేటేవాన్ పవిత్ర అవశేషాలు 2005 లో గోవాలోని సెయింట్ అగస్టిన్ చర్చి దగ్గర లభ్యమయ్యాయి.
మిత్రులారా! ఇవన్నీ ఏమిటి? ఎప్పుడు? ఎలా జరిగింది అనే ప్రశ్న మీ మనస్సులో ఉంటుంది. వాస్తవానికి ఇది నాలుగైదు వందల సంవత్సరాల క్రితం జరిగిన విషయం. కేటేవాన్ రాణి జార్జియా రాజకుటుంబ కుమార్తె. పదేళ్ల జైలు శిక్ష తర్వాత 1624 లో ఆమె అమరులయ్యారు. పురాతన పోర్చుగీస్ పత్రం ప్రకారం, సెయింట్ క్వీన్ కేటేవాన్ అస్థికల భస్మాన్ని పాత గోవాలోని సెయింట్ అగస్టిన్ కాన్వెంట్లో ఉంచారు. కానీ ఖననం చేసిన ఆమె అవశేషాలు 1930 లో గోవాలో వచ్చిన భూకంపం కారణంగా కనుమరుగయ్యాయని చాలా కాలంగా భావించారు.
భారత ప్రభుత్వం, జార్జియన్ చరిత్రకారులు, పరిశోధకులు, పురావస్తు శాస్త్రవేత్తలు, జార్జియన్ చర్చి దశాబ్దాల పాటు జరిపిన అవిశ్రాంత ప్రయత్నాల తరువాత ఆమె అవశేషాలు 2005 లో లభించాయి. ఈ విషయం జార్జియా ప్రజలకు చాలా భావోద్వేగంగా మారింది. అందుకే వారి చారిత్రక, మత, ఆధ్యాత్మిక మనోభావాలను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం ఈ అవశేషాలలో కొంత భాగాన్ని జార్జియా ప్రజలకు బహుమతిగా ఇవ్వాలని నిర్ణయించింది. భారతదేశం- జార్జియా భాగస్వామ్య చరిత్రలో ఈ ప్రత్యేకమైన భాగాన్ని కాపాడినందుకు గోవా ప్రజలకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. గోవా గొప్ప ఆధ్యాత్మిక వారసత్వ ప్రదేశంగా ఉంది. సెయింట్ అగస్టిన్ చర్చి, యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం, గోవా చర్చిలు , కాన్వెంట్లు- ఇవన్నీ నెలవైన ప్రదేశం గోవా.
నా ప్రియమైన దేశవాసులారా! జార్జియా నుండి ఇప్పుడు మిమ్మల్ని నేరుగా సింగపూర్‌కు తీసుకెళ్తాను. అక్కడ ఈ నెల ప్రారంభంలో మరో అద్భుతమైన సంఘటన జరిగింది. ఇటీవల పునరుద్ధరించిన సిలాట్ రోడ్ గురుద్వారాను సింగపూర్ ప్రధాని, నా స్నేహితుడు లీ సెన్ లూంగ్ ప్రారంభించారు. సాంప్రదాయిక సిక్కు తలపాగా కూడా ధరించారు. ఈ గురుద్వారాను సుమారు వంద సంవత్సరాల క్రితం నిర్మించారు. భాయ్ మహారాజ్ సింగ్ కు అంకితం చేసీన స్మారక చిహ్నం కూడా అక్కడ ఉంది. భాయ్ మహారాజ్ సింగ్ గారు భారత స్వాతంత్ర్యం కోసం పోరాడారు. మనం 75 సంవత్సరాల స్వాతంత్ర్యాన్ని జరుపుకుంటున్న సందర్భంలో ఈ క్షణం మరింత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. రెండు దేశాల ప్రజల మధ్య సంబంధం ఇలాంటి ప్రయత్నాల వల్లే పెరుగుతుంది. సామరస్యపూర్వక వాతావరణంలో జీవించడం, ఒకరి సంస్కృతిని మరొకరు అర్థం చేసుకోవడంలో ఎంత గొప్పదనం ఉంటుందో కూడా వారు నిరూపిస్తారు.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు 'మన్ కీ బాత్'లో మనం చాలా విషయాలు చర్చించాం. నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న మరొక విషయం ఉంది. ఇదే నీటి సంరక్షణ అంశం. నా బాల్యం గడిచిన చోట నీటి కొరత ఎప్పుడూ ఉండేది. మేం వర్షం కోసం ఆరాటపడే వాళ్ళం. అందువల్ల ప్రతి చుక్క నీటిని ఆదా చేయడం మా ఆచారాలలో ఒక భాగం. ఇప్పుడు ‘ప్రజల భాగస్వామ్యం తో నీటి సంరక్షణ’ అనే మంత్రం అక్కడి చిత్రాన్ని మార్చింది. ప్రతి చుక్క నీటిని ఆదా చేయడం, నీరు వృధా కాకుండా నిరోధించడం మన జీవనశైలిలో సహజమైన భాగంగా మారాలి. అలాంటి సంప్రదాయం మన కుటుంబాలలో ఉండాలి. ఇది ప్రతి ఒక్కరినీ గర్వించేలా చేస్తుంది.
మిత్రులారా! ప్రకృతి, పర్యావరణ పరిరక్షణ భారతదేశ సాంస్కృతిక జీవితంలో, మన దైనందిన జీవితంలో భాగం. వర్షం, రుతుపవనాలు ఎల్లప్పుడూ మన ఆలోచనలను, మన తత్వాన్ని, మన నాగరికతను తీర్చిదిద్దుతాయి. ఋతు సంహారం, మేఘదూతం కావ్యాలలో మహా కవి కాళిదాసు వర్షం గురించి చాలా అందమైన వర్ణన చేశారు. ఈ కావ్యాలు సాహిత్య ప్రియులలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఋగ్వేదంలోని పర్జన్య సూక్తంలో కూడా వర్షాన్ని అందంగా వర్ణించారు. అదేవిధంగా భూమి, సూర్యుడు, వర్షం మధ్య ఉన్న సంబంధాన్ని శ్రీమద్ భాగవతంలో కవితాత్మకంగా వివరించారు.
అష్టౌ మాసాన్ నిపీతం యద్, భూమ్యా చ, ఓద్-మయం వసు|
స్వగోభిః మోక్తుమ్ ఆరేభే, పర్జన్యః కాల్ ఆగతే ||
అంటే సూర్యుడు భూమి సంపదను ఎనిమిది నెలలుగా నీటి రూపంలో దోపిడీ చేశాడు. ఇప్పుడు వర్షాకాలంలో సూర్యుడు ఈ పేరుకుపోయిన సంపదను భూమికి తిరిగి ఇస్తున్నాడు. నిజమే.. రుతుపవనాలు, వర్షాకాలం అందమైనవి, ఆహ్లాదకరమైనవి మాత్రమే కాదు- అవి పోషకాయలను అందించేవి.. జీవితాన్ని ఇస్తాయి. మనకు లభిస్తున్న వర్షపు నీరు మన భవిష్యత్ తరాల కోసం. దాన్ని మనం ఎప్పటికీ మర్చిపోకూడదు.
ఈ ఆసక్తికరమైన సూచనలతోనే నా ప్రసంగాన్ని ఎందుకు ముగించకూడదని ఈ రోజు ఒక ఆలోచన వచ్చింది. మీ అందరికీ రాబోయే పర్వదినాల శుభాకాంక్షలు. పండుగలు, పర్వదినాల సమయంలో కరోనా ఇంకా మన మధ్య నుండి వెళ్లలేదని గుర్తుంచుకోవాలి. కరోనాకు సంబంధించిన నియమాలను మీరు మరచిపోవలసిన అవసరం లేదు. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండండి.
చాలా చాలా ధన్యవాదాలు!
నా ప్రియమైన దేశ వాసులారా! నమస్కారం. తరచుగా 'మన్ కి బాత్' మీరు కురిపించే ప్రశ్నలతో నిండిపోతుంది. ఈసారి మరో రకంగా 'మన్ కి బాత్' నిర్వహించాలని నేను అనుకుంటున్నాను. ఈసారి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. నా ప్రశ్నలను శ్రద్ధగా వినండి.
.... ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు?
.... ఏ ఒలింపిక్ క్రీడలో భారతదేశం ఇప్పటివరకు అత్యధిక పతకాలు సాధించింది?
... ఒలింపిక్స్‌లో అత్యధిక పతకాలు సాధించిన క్రీడాకారుడు ఎవరు?
మిత్రులారా! నాకు సమాధానాలు పంపినా పంపకపోయినా, మైగవ్‌లో ఒలింపిక్స్‌పై క్విజ్‌లోని ప్రశ్నలకు మీరు సమాధానం ఇస్తే, మీరు చాలా బహుమతులు గెలుచుకుంటారు. మైగవ్‌లోని 'రోడ్ టు టోక్యో క్విజ్'లో ఇలాంటి ప్రశ్నలు చాలా ఉన్నాయి. మీరు 'రోడ్ టు టోక్యో క్విజ్' లో పాల్గొనండి. ఇంతకు ముందు భారతదేశం ఎలాంటి సమర్థత చూపించింది? టోక్యో ఒలింపిక్స్ కోసం ఇప్పుడు మన సన్నాహాలు ఏమిటి? - ఇవన్నీ మీరే తెలుసుకోండి. ఇతరులకు కూడా చెప్పండి. ఈ క్విజ్ పోటీలో మీరు తప్పక పాల్గొనాలని మీ అందరినీ కోరుతున్నాను.
మిత్రులారా! టోక్యో ఒలింపిక్స్ విషయంపై మాట్లాడేటప్పుడు మిల్కా సింగ్ గారి లాంటి ప్రసిద్ధ అథ్లెట్‌ను ఎవరు మరచిపోగలరు! కొద్ది రోజుల క్రితమే కరోనా ఆయనను మన నుండి లాక్కుంది. ఆయన ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆయనతో మాట్లాడే అవకాశం నాకు లభించింది.
1964 టోక్యో ఒలింపిక్స్‌లో భారతదేశానికి ఆయన ప్రాతినిధ్యం వహించిన విషయం ఆయనకు నేను గుర్తుచేశాను. ఈసారి మన క్రీడాకారులు ఒలింపిక్స్ కోసం టోక్యోకు వెళుతున్నప్పుడు మన అథ్లెట్ల ధైర్యాన్ని పెంచాలని, సందేశం అందించి వారిని ప్రేరేపించమని ఆయనతో మాట్లాడేటప్పుడు నేను కోరాను. ఆయనకు ఆటలపై చాలా అంకితభావం,మక్కువ ఉన్నాయి. అనారోగ్యంలో కూడా ఆయన వెంటనే దానికి అంగీకరించాడు. కానీ దురదృష్టవశాత్తు విధి మరో రకంగా తలచింది. ఆయన 2014 లో సూరత్ కు వచ్చారని నాకు ఇప్పటికీ గుర్తుంది. మేము నైట్ మారథాన్‌ను ప్రారంభించాం. ఆ సమయంలో జరిగిన పిచ్చాపాటీ కబుర్లలో క్రీడల గురించి మాట్లాడటం వల్ల నేను కూడా చాలా ప్రేరణ పొందాను. భారతదేశానికి గర్వకారణంగా మిల్కా సింగ్ గారి కుటుంబం మొత్తం క్రీడలకు అంకితం అయిందని మనందరికీ తెలుసు.
మిత్రులారా! ప్రతిభ, అంకితభావం, సంకల్ప బలం, క్రీడా స్ఫూర్తి – ఇవన్నీ ఉన్నవారు ఛాంపియన్ అవుతారు. మన దేశంలో చాలా మంది ఆటగాళ్ళు చిన్న చిన్న నగరాలు, పట్టణాలు, గ్రామాల నుండి వచ్చారు. టోక్యో క్రీడలకు వెళ్ళే చాలామంది క్రీడాకారుల జీవితం చాలా స్ఫూర్తినిస్తుంది. మీరు మన ప్రవీణ్ జాదవ్ గారి గురించి వింటే ఆయన చాలా కఠినమైన సంఘర్షణల ద్వారా ఇక్కడిదాకా చేరుకున్నారని కూడా మీరు తెలుసుకుంటారు. ప్రవీణ్ జాదవ్ గారు మహారాష్ట్రలోని సతారా జిల్లాలోని ఒక గ్రామంలో నివసిస్తున్నారు. అతను ఆర్చరీలో ఉత్తమ క్రీడాకారుడు. ఆయన తల్లిదండ్రులు కుటుంబాన్ని పోషించడానికి కార్మికులుగా పనిచేస్తారు. ఇప్పుడు వారి కుమారుడు మొదటిసారి ఒలింపిక్స్ క్రీడలలో పాల్గొనేందుకు టోక్యోకు వెళ్తున్నాడు. ఇది అతని తల్లిదండ్రులు మాత్రమే కాదు. మనందరం గర్వించదగ్గ విషయం. అదేవిధంగా నేహా గోయల్ అనే మరో క్రీడాకారిణి కూడా ఉన్నారు. టోక్యోకు వెళ్లే మహిళల హాకీ జట్టులో నేహా సభ్యురాలు. ఆమె తల్లి, సోదరీమణులు కుటుంబాన్ని పోషించడానికి సైకిల్ ఫ్యాక్టరీలో పనిచేస్తారు. నేహా మాదిరిగానే దీపికా కుమారి జీవితం కూడా ఒడిదుడుకులతో నిండి ఉంది. దీపిక తండ్రి ఆటో రిక్షా నడుపుతారు. ఆమె తల్లి ఒక నర్సు. ఇప్పుడు చూడండి- టోక్యో ఒలింపిక్స్‌లో మహిళల ఆర్చరీ క్రీడలో భారతదేశం నుండి పాల్గొనే ఏకైక క్రీడాకారిణి దీపిక. ప్రపంచ నంబర్ వన్ ఆర్చర్ అయిన దీపికకు మనందరి శుభాకాంక్షలు.
మిత్రులారా! మనం జీవితంలో ఏ దశకు చేరుకున్నా, మనం ఎంత ఎత్తుకు చేరుకున్నా, భూమితో ఈ సంబంధం ఎల్లప్పుడూ మన మూలాలతో ముడిపడి ఉంటుంది. పోరాటం తర్వాత సాధించిన విజయంలోని ఆనందం ఎంతో ఉంటుంది. టోక్యోకు వెళ్ళే బృంద సభ్యులు బాల్యంలో అభ్యాసం చేయడంలో ఎన్నో అడ్డంకులు ఎదురైనా ఆటను వదులుకోలేదు. ఆటతో అనుసంధానం అయ్యే ఉన్నారు. ఉత్తర ప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌కు చెందిన ప్రియాంక గోస్వామి గారి జీవితం కూడా చాలా నేర్పిస్తుంది. ప్రియాంక తండ్రి బస్సు కండక్టర్. పతక విజేతలు పొందే బ్యాగ్‌ను చిన్నతనంలో ప్రియాంక ఇష్టపడింది. ఈ ఆకర్షణలో ఆమె మొదటిసారి రేస్-వాకింగ్ పోటీలో పాల్గొన్నారు. ఇప్పుడు- ఈ రోజు ఆమె అందులో పెద్ద ఛాంపియన్.
జావెలిన్ త్రోలో పాల్గొంటున్న శివపాల్ సింగ్ గారు బనారస్ కు చెందినవారు. శివపాల్ గారి కుటుంబం మొత్తం ఈ ఆటతో ముడిపడి ఉంది. ఆయన తండ్రి, బాబాయి, సోదరుడు అందరూ జావెలిన్ త్రో లో నిపుణులు. కుటుంబ వారసత్వం టోక్యో ఒలింపిక్స్‌లో పని చేయబోతోంది. టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్ళే చిరాగ్ శెట్టి, అతని భాగస్వామి సాత్విక్ సాయిరాజ్ ల ధైర్యం కూడా స్ఫూర్తిదాయకం. ఇటీవల చిరాగ్ తాతయ్య కరోనాతో మరణించారు. సాత్విక్ కూడా గత సంవత్సరం కరోనా పాజిటివ్ అయ్యారు. కానీ ఈ ఇబ్బందులు ఉన్నప్పటికీ వారిద్దరూ పురుషుల డబుల్ షటిల్ పోటీలో తమ ఉత్తమమైన ప్రతిభను ప్రదర్శించేందుకు సన్నద్ధమవుతున్నారు.
నేను మీకు మరొక క్రీడాకారుడిని పరిచయం చేయాలనుకుంటున్నాను. ఆయన హర్యానాలోని భివానీకి చెందిన మనీష్ కౌశిక్ గారు. మనీష్ గారు ఒక వ్యవసాయ కుటుంబం నుండి వచ్చారు. చిన్నతనంలో పొలాలలో పనిచేస్తున్నప్పుడు మనీష్‌కు బాక్సింగ్ అంటే ఇష్టం ఏర్పడింది. ఈ రోజు ఆ అభిరుచి ఆయనను టోక్యోకు తీసుకువెళుతోంది. మరొక క్రీడాకారిణి సి.ఎ. భవానీ దేవి. ఆమె పేరు భవాని.. ఆమె కత్తి పోరాటంలో నిపుణురాలు. చెన్నైకి చెందిన భవాని ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి భారతీయ ఫెన్సర్. భవాని గారు శిక్షణ కొనసాగించేందుకు ఆమె తల్లి తన ఆభరణాలను కూడా తనఖా పెట్టిందని నేను ఎక్కడో చదివాను.
మిత్రులారా! అసంఖ్యాక పేర్లు ఉన్నాయి. కానీ మన్ కి బాత్ లో ఈ రోజు నేను కొన్ని పేర్లను మాత్రమే ప్రస్తావించగలిగాను. టోక్యోకు వెళ్లే ప్రతి క్రీడాకారుడి జీవితంలో దాని కోసం స్వంత పోరాటం ఉంది. ఇది చాలా సంవత్సరాల కృషి. వారు తమ కోసం మాత్రమే కాకుండా దేశం కోసం వెళుతున్నారు. ఈ ఆటగాళ్ళు భారతదేశ గౌరవాన్ని పెంచాలి. ప్రజల హృదయాలను కూడా గెలుచుకోవాలి. అందుకే నా దేశవాసులకు కూడా నేను సలహా ఇవ్వాలనుకుంటున్నాను. మనం ఈ ఆటగాళ్ళపై తెలిసిగానీ తెలియకుండా గానీ ఒత్తిడి చేయకూడదు. మంచి మనసుతో వారికి మద్దతు ఇవ్వండి. ప్రతి క్రీడాకారుడి ఉత్సాహాన్ని పెంచండి.
సోషల్ మీడియాలో హాష్ చీర్ 4 ఇండియాతో మీరు ఈ ఆటగాళ్లకు మీరు శుభాకాంశాలు తెలియజేయవచ్చు. మీరు మరింత వినూత్నమైన పని చేయాలనుకుంటే ఖచ్చితంగా అది కూడా చేయండి. మన ఆటగాళ్ల కోసం దేశం అంతా కలిసి ఏదైనా చేయాలనే ఆలోచన మీకు వస్తే మీరు ఖచ్చితంగా దాన్ని నాకు పంపండి. టోక్యోకు వెళ్లే మన ఆటగాళ్లకు మనందరం కలిసి మద్దతు తెలియజేద్దాం. చీర్ 4 ఇండియా !!! చీర్ 4 ఇండియా !!! చీర్ 4 ఇండియా !!!
నా ప్రియమైన దేశవాసులారా! కరోనాకు వ్యతిరేకంగా మన దేశవాసుల పోరాటం కొనసాగుతోంది. ఈ పోరాటంలో మనం చాలా అసాధారణమైన మైలురాళ్లను కూడా సాధిస్తున్నాం. కొద్ది రోజుల క్రితం మన దేశం అపూర్వమైన పని చేసింది. టీకా కార్యక్రమంలోని తరువాతి దశ జూన్ 21 న ప్రారంభమైంది. అదే రోజున దేశం 86 లక్షల మందికి ఉచిత వ్యాక్సిన్ అందించిన రికార్డును సాధించింది. అది కూడా కేవలం ఒక్క రోజులో. భారత ప్రభుత్వం ద్వారా ఇంత పెద్ద సంఖ్యలో ఉచిత టీకాలు- అది కూడా కేవలం ఒక్క రోజులో! సహజంగానే ఇది చర్చనీయాంశమైంది.
మిత్రులారా! ఒక సంవత్సరం క్రితం అందరి ముందు టీకా ఎప్పుడు వస్తుందన్న ప్రశ్న ఉండేది. ఈ రోజు మనం ఒక్క రోజులో లక్షలాది మందికి ఉచితంగా 'మేడ్ ఇన్ ఇండియా' వ్యాక్సిన్ ఇస్తున్నాం. ఇది నవీన భారతదేశబలం.
మిత్రులారా! దేశంలోని ప్రతి పౌరుడు వ్యాక్సిన్ భద్రతను పొందాలి. ఈ విషయంలో మనం నిరంతర ప్రయత్నాలు చేయవలసి ఉంది. వాక్సిన్ వేసుకోవడం లో ఉన్న సంకోచాన్ని దూరం చేసేందుకు అనేక సంస్థలు ముందుకొచ్చాయి. సమాజంలోని ప్రజలు కూడా ఈ విషయంలో ముందుకు వచ్చారు. అందరూ కలిసి చాలా మంచి పని చేస్తున్నారు. రండి.. ఈ రోజు కూడా ఒక గ్రామానికి వెళ్లి, టీకా గురించి అక్కడి వ్యక్తులతో మాట్లాడుదాం. మధ్యప్రదేశ్ లోని బైతూల్ జిల్లాలో ఉన్న డులారియా గ్రామానికి వెళ్దాం.
ప్రధానమంత్రి: హలో!
రాజేశ్: నమస్కారం సార్!
ప్రధాని: నమస్కారమండీ.
రాజేశ్: నా పేరు రాజేశ్ హిరావే. మాది భీంపూర్ బ్లాక్ లోని డులారియా గ్రామ పంచాయతీ సార్.
ప్రధానమంత్రి: రాజేశ్ గారూ.. మీ గ్రామంలో కరోనా పరిస్థితి ఏమిటో తెలుసుకోవాలని నేను మిమ్మల్ని పిలిచాను.
రాజేశ్: సార్. ఇక్కడ కరోనా పెద్దగా ఏమీ లేదు సార్.
ప్రధానమంత్రి: ప్రస్తుతం ప్రజలు అనారోగ్యంతో లేరా?
రాజేశ్: అవును సార్.
ప్రధానమంత్రి: గ్రామ జనాభా ఎంత? గ్రామంలో ఎంత మంది ఉన్నారు?
రాజేశ్: గ్రామంలో 462 మంది పురుషులు, 332 మంది మహిళలు ఉన్నారు సార్.
ప్రధానమంత్రి: సరే! రాజేశ్ గారూ.. మీరు టీకా తీసుకున్నారా?
రాజేశ్: లేదు సార్. ఇంకా తీసుకోలేదు.
ప్రధానమంత్రి: ఓహ్! ఎందుకు తీసుకోలేదు?
రాజేశ్: సార్... ఇక్కడ కొంతమంది వాట్సాప్‌లో కొంత గందరగోళం కలిగించారు సార్. దాంతో ప్రజలు అయోమయంలో పడ్డారు సార్.
ప్రధానమంత్రి: కాబట్టి మీ మనసులో కూడా భయం ఉందా?
రాజేశ్: అవును సార్. ఇలాంటి పుకార్లు గ్రామమంతా వ్యాపించాయి సార్.
ప్రధానమంత్రి: అయ్యో.. టీకా విషయంలో గందరగోళం గురించా మీరు మాట్లాడేది! రాజేశ్ గారూ.. చూడండి ...
రాజేశ్: సార్.
ప్రధానమంత్రి: భయాన్ని తొలగించుకొమ్మని మీకు, మీ ఊరిలోని సోదర సోదరీమణులకు నేను చెప్తున్నాను.
రాజేశ్: సార్.
ప్రధానమంత్రి: మన దేశంలో 31 కోట్లకు పైగా ప్రజలు టీకా తీసుకున్నారు.
రాజేశ్: సార్
ప్రధానమంత్రి: మీకు తెలుసా! నేను కూడా రెండు డోసులు టీకా తీసుకున్నాను.
రాజేశ్: అవును సార్.
ప్రధానమంత్రి: మా అమ్మకు దాదాపు 100 సంవత్సరాలు. ఆమె కూడా రెండు డోసులు తీసుకుంది. కొన్నిసార్లు ఎవరికైనా జ్వరం లాంటివి వస్తాయి. కానీ అవి చాలా మామూలు. కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి. టీకా తీసుకోకపోవడం చాలా ప్రమాదకరం.
రాజేశ్: అవును సార్.
ప్రధానమంత్రి: దీని ద్వారా మీకు మీరుగా ప్రమాదంలో పడటమే కాదు- మీ కుటుంబాన్ని, గ్రామాన్ని కూడా ప్రమాదంలో పడేయవచ్చు.
రాజేశ్: సార్.
ప్రధానమంత్రి: రాజేశ్ గారూ.. కాబట్టి వీలైనంత త్వరగా వ్యాక్సిన్ తీసుకోండి. గ్రామంలోని ప్రతి ఒక్కరికీ భారత ప్రభుత్వం ఉచిత వ్యాక్సిన్ ఇస్తోందని, 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారందరికీ ఉచిత టీకా అని చెప్పండి.
రాజేశ్: సార్ .. సరే సార్.
ప్రధానమంత్రి: కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రామంలోని ప్రజలకు కూడా చెప్పాలి. గ్రామంలో ఈ భయ వాతావరణానికి కారణమే లేదు.
రాజేశ్: తప్పుడు పుకారును వ్యాప్తి చేయడం వల్ల ప్రజలు చాలా భయపడ్డారు సార్. టీకా వల్ల జ్వరం వస్తుందని, దాంతో వ్యాధి పెరిగి మరణానికి కూడా దారి తీస్తుందని పుకార్లు వచ్చాయి సార్.
ప్రధానమంత్రి: ఓహ్ ... ఈ రోజులలో రేడియో ఉంది, టీవీ ఉంది. వీటితో చాలా వార్తలు వస్తాయి. కాబట్టి ప్రజలకు వివరించడం చాలా సులభం అవుతుంది. చూడండి.. గ్రామంలోని అందరూ టీకాలు తీసుకున్న గ్రామాలు కూడా భారతదేశంలో చాలా ఉన్నాయి. అంటే గ్రామానికి చెందిన 100% మంది టీకాలు తీసుకున్న గ్రామాలు. నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తాను ...
రాజేశ్: సార్.
ప్రధానమంత్రి: కాశ్మీర్లో బాందీపుర జిల్లా ఉంది. ఈ జిల్లాలో వ్యవన్ అనే గ్రామ ప్రజలు 100% వ్యాక్సిన్‌ను లక్ష్యంగా చేసుకుని దాన్ని సాధించారు. ఈ కాశ్మీర్ గ్రామంలో ఉన్న 18 ఏళ్లు పైబడిన ప్రజలందరికీ టీకాలు వేశారు. నాగాలాండ్‌లోని మూడు గ్రామాలలో కూడా వంద శాతం టీకాలు వేసుకున్నారని నాకు తెలిసింది.
రాజేశ్: సార్ ...
ప్రధానమంత్రి: రాజేశ్ గారూ.. మీరు దీన్ని మీ గ్రామానికి, మీ చుట్టుపక్కల గ్రామాలకు కూడా తెలియజేయాలి. మీరు చెప్పిన విషయం కేవలం ఒక భ్రమ. అవి పుకార్లు మాత్రమే.
రాజేశ్: అవును ...
ప్రధానమంత్రి: కాబట్టి గందరగోళానికి సమాధానం ఏమిటంటే మీరే స్వయంగా టీకాలు వేసుకుని అందరినీ ఒప్పించాలి. చేస్తారు కదా..!
రాజేశ్: సరే సార్.
ప్రధానమంత్రి: తప్పకుండా చేస్తారు కదా!
రాజేశ్: అవును సార్. అవును సార్. మీతో మాట్లాడటం వల్ల టీకా వేసుకుని, దాని గురించి ప్రజలకు తెలియజేయాలని అనుకుంటున్నాను సార్.
ప్రధానమంత్రి: సరే. నాతో మాట్లాడేందుకు మీ గ్రామం నుండి ఇంకా ఎవరైనా ఉన్నారా?
రాజేశ్: అవును సార్.
ప్రధాని: ఎవరు మాట్లాడతారు?
కిశోరీలాల్: హలో సార్ ...నమస్కారం
ప్రధానమంత్రి: నమస్కారమండీ.. మీరు ఎవరు మాట్లాడుతున్నారు?
కిశోరీలాల్: సార్.. నా పేరు కిశోరీలాల్ దూర్వే.
ప్రధానమంత్రి: కిశోరీలాల్ గారూ.. నేను ఇప్పటివరకూ రాజేశ్ గారి తో మాట్లాడుతున్నాను.
కిశోరీలాల్: అవును సార్.
ప్రధానమంత్రి: ప్రజలు టీకాపై మరో రకంగా మాట్లాడుతున్నారని ఆయన చాలా బాధతో చెప్పారు.
కిశోరీలాల్: అవును సార్
ప్రధానమంత్రి: మీరు కూడా ఇలాంటివి విన్నారా?
కిశోరీలాల్: అవును సార్ ... నేను విన్నాను సార్ ...
ప్రధానమంత్రి: మీరేం విన్నారు?
కిశోరీలాల్: సమీపంలోని మహారాష్ట్రలో బంధువులున్న కొందరు- అక్కడి ప్రజలు వ్యాక్సిన్ వేయడం ద్వారా చనిపోతున్నారని పుకార్లు వ్యాపింపజేశారు సార్. కొందరు చనిపోతున్నారని, కొందరు అనారోగ్యానికి గురవుతున్నారని పుకార్లు లేపారు సార్. ప్రజలలో ఎక్కువ గందరగోళం ఉంది కాబట్టి తీసుకోవడం లేదు సార్.
ప్రధానమంత్రి: లేదు .. అసలు వాళ్ళేమంటారు? ఇప్పుడు కరోనా పోయిందని అంటున్నారా?
కిశోరీలాల్: అవును సార్.
ప్రధానమంత్రి: కరోనాతో ఏమీ కాదని చెప్తున్నారా?
కిశోరీలాల్: లేదు సార్. కరోనా పోయిందని చెప్పడం లేదు. కరోనా ఉంది కానీ టీకా తీసుకోవడం వల్ల జబ్బు పడుతున్నారని, అందరూ చనిపోతున్నారని చెప్తున్నారు సార్.
ప్రధానమంత్రి: అయితే టీకా కారణంగా చనిపోతున్నారని చెప్తున్నారా?
కిశోరీలాల్: మాది ఆదివాసీ ప్రాంతం సార్. వాళ్లు చాలా త్వరగా భయపడతారు. .. పుకార్లు వ్యాప్తి చెందుతున్నందువల్ల ప్రజలు వ్యాక్సిన్ తీసుకోవడం లేదు సార్.
ప్రధానమంత్రి: కిశోరీలాల్ గారూ.. చూడండి ...
కిశోరీలాల్: సార్ ...
ప్రధాని: ఈ పుకార్లను వ్యాప్తి చేసే వాళ్ళు పుకార్లు కల్పిస్తూనే ఉంటారు.
కిశోరీలాల్: అవును సార్.
ప్రధానమంత్రి: మనం ప్రాణాలను కాపాడుకోవాలి. మన గ్రామస్తులను కాపాడాలి. మన దేశవాసులను కాపాడాలి. కరోనా పోయిందని ఎవరైనా చెబితే ఆ భ్రమలో ఉండకండి.
కిశోరీలాల్: సార్.
ప్రధానమంత్రి: ఈ వ్యాధి రూపం మార్చుకుంటూ ఉంటుంది.
కిశోరీలాల్: అవును సార్.
ప్రధానమంత్రి: ఇది రూపం మారుతుంది. కొత్త రూపాలు తీసుకున్న తర్వాత అది ప్రజలను చేరుకుంటుంది.
కిశోరీలాల్: అవును సార్.
ప్రధానమంత్రి: దాని నుండి తప్పించుకోవడానికి మనకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కరోనా కోసం తయారుచేసిన ప్రోటోకాల్- మాస్క్ ధరించడం, సబ్బుతో తరచుగా చేతులు కడుక్కోవడం, దూరాన్ని పాటించడం. మరొక మార్గం దాంతో పాటు టీకాలు వేయడం. అది కూడా మంచి రక్షణ కవచం. దాని గురించి ఆలోచించండి.
కిశోరీలాల్: సార్
ప్రధానమంత్రి: సరే.. కిశోరీలాల్ గారూ.. ఈ విషయం చెప్పండి.
కిశోరీలాల్: సార్
ప్రధానమంత్రి: ప్రజలు మీతో మాట్లాడేటప్పుడు మీరు ప్రజలకు ఈ విషయాన్ని ఎలా వివరిస్తారు? లేదా మీరు కూడా పుకార్ల మాయలో పడిపోతారా?
కిశోరీలాల్: వివరించడం కాదు సార్.. ఆ వ్యక్తులు ఎక్కువైతే, మనం కూడా భయపడిపోతాం కదా సార్.
ప్రధానమంత్రి: చూడండి.. కిశోరీలాల్ గారూ.. నేను ఈ రోజు మీతో మాట్లాడాను. మీరు నా స్నేహితులు.
కిశోరీలాల్: సార్
ప్రధానమంత్రి: మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ప్రజల భయాన్ని తొలగించాలి. మీరు దాన్ని తొలగిస్తారా?
కిశోరీలాల్: అవును సార్. సార్.. మేం ప్రజల భయాన్ని తొలగిస్తాం సార్. నేనే స్వయంగా ఆ పని చేస్తాను.
ప్రధానమంత్రి: చూడండి.. పుకార్లను పట్టించుకోవద్దు.
కిశోరీలాల్: సార్
ప్రధానమంత్రి: మీకు తెలుసా.. ఈ టీకా తయారీ కోసం మన శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు.
కిశోరీలాల్: అవును సార్.
ప్రధానమంత్రి: సంవత్సరమంతా రాత్రి , పగలు చాలా మంది గొప్ప శాస్త్రవేత్తలు పనిచేశారు. అందుకే మనం సైన్స్ ను విశ్వసించాలి. శాస్త్రవేత్తలను నమ్మాలి. ఈ అబద్ధాలను వ్యాప్తి చేసే వ్యక్తులకు మళ్లీ మళ్లీ వివరించాలి. ఇంత మంది టీకా తీసుకున్నారు.. ఏమీ జరగదని వారికి చెప్పాలి.
కిశోరీలాల్: సరే సార్
ప్రధానమంత్రి: పుకార్ల నుండి సురక్షితంగా ఉండాలి. గ్రామాన్ని కూడా రక్షించాలి.
కిశోరీలాల్: అవును సార్
ప్రధానమంత్రి: రాజేశ్ గారు, కిశోరీ లాల్ గారు.. మీలాంటి నా మిత్రులు కేవలం మీ స్వంత గ్రామంలో మాత్రమే కాకుండా ఇతర గ్రామాల్లో కూడా ఈ పుకార్లను ఆపడానికి, నేను మాట్లాడిన విషయాన్ని ప్రజలకు చెప్పడానికి పని చేయాలి.
కిశోరీలాల్: సరే సార్.
ప్రధానమంత్రి: చెప్పండి.. నా పేరు చెప్పండి.
కిశోరీలాల్: చెప్తాం సార్. ప్రజలకు అర్థం చేయిస్తాం సార్. నేను కూడా టీకా తీసుకుంటాను సార్.
ప్రధానమంత్రి: చూడండ.. మీ గ్రామానికి నా శుభాకాంక్షలు.
కిశోరీలాల్: సార్.
ప్రధానమంత్రి: తప్పకుండా టీకా తీసుకొమ్మని అందరికీ చెప్పండి ...
కిశోరీలాల్: సార్ ...
ప్రధానమంత్రి: ఖచ్చితంగా టీకా తీసుకోండి.
కిశోరీలాల్: సరే సార్.
ప్రధానమంత్రి: గ్రామంలోని మహిళలను, మన తల్లులను, సోదరీమణులను ఈ పనిలో అనుసంధానింపజేయండి.
కిశోరీలాల్: సార్
ప్రధానమంత్రి: వారిని మీతో పాటు చురుకుగా ఉంచండి.
కిశోరీలాల్: సరే సార్
ప్రధానమంత్రి: కొన్నిసార్లు తల్లులు, సోదరీమణులు చెప్పే విషయాలను ప్రజలు త్వరగా అంగీకరిస్తారు.
కిశోరీలాల్: అవును సార్
ప్రధానమంత్రి: మీ గ్రామంలో టీకాలు వేయడం పూర్తయినప్పుడు మీరు నాకు చెప్తారా?
కిశోరీలాల్: అవును సార్. చెప్తాం సార్.
ప్రధాని: తప్పకుండా చెప్తారా?
కిశోరీలాల్: అవును సార్
ప్రధానమంత్రి: చూడండి.. నేను మీ లేఖ కోసం వేచి ఉంటాను.
కిశోరీలాల్: సరే సార్
ప్రధానమంత్రి: రాజేశ్ గారు, కిశోర్ గారు.. చాలా ధన్యవాదాలు. మీతో మాట్లాడే అవకాశం వచ్చింది
కిశోరీలాల్: ధన్యవాదాలు సార్. మీరు మాతో మాట్లాడారు. మీకు కూడా చాలా ధన్యవాదాలు సార్.
మిత్రులారా! భారత దేశంలోని వివిధ గ్రామాల ప్రజలు- మన ఆదివాసీ గిరిజన సోదర సోదరీమణులు ఈ కరోనా కాలంలో తమ శక్తిని, అవగాహనను ఎలా చూపించారనే విషయం ప్రపంచానికి ఒక అధ్యయనాంశం అవుతుంది. గ్రామాల ప్రజలు క్వారంటైన్ కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నారు. స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని కోవిడ్ ప్రోటోకాల్‌ను తయారు చేశారు. గ్రామ ప్రజలు - ఎవరినీ ఆకలితో నిద్రపోనివ్వలేదు. వ్యవసాయ పనులను కూడా ఆపలేదు. సమీప నగరాలకు పాలు, కూరగాయలు- ఇవన్నీ రోజూ చేరుకుంటూనే ఉన్నాయి. ఈ విధంగా గ్రామాలు తమను తాము చూసుకోవడంతో పాటు ఇతరులను కూడా చూసుకున్నాయి. అదేవిధంగా టీకా ప్రచారంలో కూడా మనం అదే చేస్తూనే ఉండాలి. మనకు అవగాహన ఉండాలి. ఇతరులకు అవగాహన కల్పించాలి. గ్రామాల్లోని ప్రతి వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోవాలి. అది ప్రతి గ్రామ లక్ష్యం. గుర్తుంచుకోండి- నేను ప్రత్యేకంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. మీరు మీ మనస్సులో మీకు మీరే ఒక ప్రశ్న వేసుకోండి. ప్రతి ఒక్కరూ విజయవంతం కావాలని కోరుకుంటారు. కానీ నిర్ణయాత్మక విజయ మంత్రం ఏమిటి? నిర్ణయాత్మక విజయ మంత్రం – నిరంతరత. అందువల్ల, మనం మందగించకూడదు. ఏ భ్రమల్లోనూ జీవించవద్దు. మనం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి. కరోనాపై గెలవాలి.
నా ప్రియమైన దేశవాసులారా! ఇప్పుడు రుతుపవనాలు కూడా మన దేశానికి వచ్చాయి. మేఘాలు వర్షం కురిపించినప్పుడు అవి కేవలం మనకోసం మాత్రమే వర్షం కురిపించవు. రాబోయే తరాల కోసం కూడా మేఘాలు వర్షిస్తాయి. వర్షపు నీరు భూమిలోకి ఇంకడంతో పాటు భూమిపై ఉండే నీటి స్థాయిని కూడా మెరుగుపరుస్తుంది. అందుకే నీటి సంరక్షణను దేశానికి చేసే సేవగా నేను భావిస్తున్నాను. మీరు కూడా చూసి ఉంటారు- మనలో చాలా మంది ఈ పనిని బాధ్యతగా తీసుకుంటున్నారు. అలాంటివారిలో ఒకరు ఉత్తరాఖండ్‌లోని పౌడి గఢ్వాల్ కు చెందిన సచ్చిదానంద్ భారతి గారు. ఆయన ఒక ఉపాధ్యాయుడు. ఆయన తన రచనల ద్వారా ప్రజలకు చాలా మంచి విద్యను అందించారు. ఈ రోజు ఆయన కృషి కారణంగా పౌడి గఢ్వాల్ లోని ఉఫ్రెయిన్ ఖాల్ ప్రాంతంలో పెద్ద నీటి సంక్షోభం ముగిసింది. ఒకప్పుడు ప్రజలు నీటి కోసం ఆరాటపడిన చోట నేడు ఏడాది పొడవునా నీటి సరఫరా ఉంది.
మిత్రులారా! పర్వతాలలో నీటి సంరక్షణకు ఒక సాంప్రదాయిక పద్ధతి ఉంది, దీనిని చాల్ ఖాల్’ అని అంటారు అంటే నీటిని నిల్వ చేయడానికి ఒక పెద్ద గొయ్యిని తవ్వదన్నమాట. భారతి గారు కొన్ని కొత్త పద్ధతులను కూడా జోడించారు. ఆయన కొన్ని పెద్ద, చిన్న చెరువులను నిర్మించారు. వీటి వల్ల ఉఫ్రయింఖాల్ కొండలు పచ్చగా మారడమే కాకుండా ప్రజల తాగునీటి సమస్య కూడా పోయింది. భారతి గారు ఇలాంటి 30 వేలకు పైగా నీటి వనరులను నిర్మించారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 30 వేలు! ఆయన భగీరథ ప్రయత్నం నేటికీ కొనసాగుతూనే ఉంది. అది చాలా మందికి స్ఫూర్తినిస్తోంది.
మిత్రులారా! అదేవిధంగా యూపీలోని బాందా జిల్లాలో ఉన్న అంధావ్ గ్రామ ప్రజలు కూడా భిన్నమైన ప్రయత్నం చేశారు. వారు తమ ఉద్యమానికి చాలా ఆసక్తికరమైన పేరు పెట్టారు. ఆ పేరు 'ఖేత్ కా పానీ ఖేత్ మే, గావ్ కా పానీ గావ్ మే'. అంటే ‘పొలం నీళ్ళు పొలం లోనే, ఊరి నీళ్ళు ఊరిలోనే’ అని. ఈ ఉద్యమం కింద గ్రామంలోని అనేక వందల ఎకరాల విస్తీర్ణంలోని పొలాలలో ఎత్తైన కట్టలను నిర్మించారు. ఈ కారణంగా వర్షపు నీరు పొలంలో సేకరణ ప్రారంభమై భూమిలోకి వెళ్ళడం మొదలైంది. ఇప్పుడు ఈ ప్రజలందరూ పొలాల కట్టలపై చెట్లను నాటాలని ఆలోచిస్తున్నారు. అంటే ఇప్పుడు రైతులకు నీరు, చెట్లు, డబ్బు- మూడూ లభిస్తాయి. వారి మంచి పనుల ద్వారా ఆ గ్రామానికి సుదూర ప్రాంతాల్లో కూడా గుర్తింపు లభించింది.
మిత్రులారా! వీటన్నిటి నుండి ప్రేరణ పొంది మన చుట్టూ ఉన్న నీటిని ఏ విధంగానైనా ఆదా చేసుకోగలగాలి. నీటిని మనం కాపాడుకోవాలి. ఈ ముఖ్యమైన రుతుపవన సమయాన్ని మనం కోల్పోవలసిన అవసరం లేదు.
నా ప్రియమైన దేశ వాసులారా! మన గ్రంథాలలో ఇలా చెప్పారు.
"నాస్తి మూలం అనౌషధం" ||
అంటే ఔషధ గుణాలు లేని మొక్క భూమిపై లేదని అర్థం! మన చుట్టూ ఇలాంటి చెట్లు, మొక్కలు చాలా ఉన్నాయి. వీటిలో అద్భుతమైన లక్షణాలు ఉన్నాయి. కానీ చాలా సార్లు వాటి గురించి కూడా మనకు తెలియదు! నైనిటాల్‌కు చెందిన పరితోష్ అనే మిత్రుడు ఇదే విషయంపై నాకు లేఖ పంపారు. కరోనా వచ్చిన తరువాత మాత్రమే గిలోయ్, అనేక ఇతర మొక్కల అద్భుతమైన వైద్య లక్షణాల గురించి తాను తెలుసుకున్నట్టు ఆయన రాశారు. 'మన్ కీ బాత్' శ్రోతలందరూ మీ చుట్టూ ఉన్న వృక్షసంపద గురించి తెలుసుకోవాలని పరితోష్ సూచించారు. వారంతా ఇతరులకు కూడా చెప్పవలసిందిగా ఆయన కోరారు. నిజానికి ఇది మన పురాతన వారసత్వం, మనం దీన్ని ఎంతో ఆదరించాలి. ఈ దిశలో మధ్యప్రదేశ్‌కు చెందిన సత్నాకు చెందిన రామ్లోటన్ కుష్వాహా గారు చాలా ప్రశంసనీయమైన పని చేశారు. రామ్లోటన్ గారు తన పొలంలో దేశీయ ప్రదర్శనశాలను నిర్మించారు. ఈ మ్యూజియంలో ఆయన వందలాది ఔషధ మొక్కలను, విత్తనాలను సేకరించి, భద్రపర్చారు. వాటిని చాలా దూరం నుండి ఇక్కడికి తీసుకువచ్చారు. ఇవి కాకుండా వారు ప్రతి సంవత్సరం అనేక రకాల కూరగాయలను కూడా పండిస్తారు. ఈ దేశీయ మ్యూజియమైన రామ్లోటన్ గారి తోటను సందర్శించేందుకు ప్రజలు వస్తారు. దాని నుండి చాలా నేర్చుకుంటారు. నిజమే! ఇది చాలా మంచి ప్రయోగం. ఇది దేశంలోని వివిధ ప్రాంతాలలో ప్రతిబింబిస్తుంది. మీలో అలాంటి ప్రయత్నం చేయగల వారిని నేను కోరుకుంటున్నాను. దీన్ని చేయండి. ఇది మీ కోసం కొత్త ఆదాయ వనరులను కూడా తెరుస్తుంది. స్థానిక వృక్షజాలం ద్వారా మీ ప్రాంత గుర్తింపు కూడా పెరుగుతుంది.
నా ప్రియమైన దేశవాసులారా! ఇప్పటి నుండి కొన్ని రోజుల తర్వాత జూలై 1వ తేదీన మనం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. దేశంలోని గొప్ప వైద్యుడు, రాజనీతిజ్ఞుడు డాక్టర్ బిసి రాయ్ జయంతి సందర్భంగా ఈ దినోత్సవం జరుగుతుంది. కరోనా కాలంలో వైద్యులు చేసిన కృషికి మనమందరం కృతజ్ఞులం. వైద్యులు వారి జీవితాలను పట్టించుకోకుండా మనకు సేవ చేశారు. కాబట్టి ఈసారి జాతీయ వైద్యుల దినోత్సవం మరింత ప్రత్యేకమైంది.
మిత్రులారా! ఔషధ ప్రపంచంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తులలో ఒకరైన హిప్పోక్రేట్స్ ఇలా అన్నారు:
"వైద్య కళను ప్రేమించే చోట మానవత్వాన్ని కూడా ప్రేమిస్తారు” అని.
ఈ ప్రేమ శక్తితో మాత్రమే వైద్యులు మనకు సేవ చేయగలుగుతారు. అందువల్ల వారికి సమాన ప్రేమతో కృతజ్ఞతలు చెప్పడం, ప్రోత్సహించడం మన కర్తవ్యం. మరింత ముందుకు వెళ్ళి వైద్యులకు సహాయం చేసేవారు కూడా మన దేశంలో చాలా మంది ఉన్నారు. శ్రీనగర్ నుండి అలాంటి ఒక ప్రయత్నం గురించి నాకు తెలిసింది. అక్కడి దాల్ సరస్సులో బోట్ అంబులెన్స్ సేవను ప్రారంభించారు. ఈ సేవను హౌస్‌బోట్ యజమాని అయిన శ్రీనగర్‌కు చెందిన తారిక్ అహ్మద్ పట్లూ గారు ప్రారంభించారు. ఆయన కూడా స్వయంగా కోవిడ్-19 తో యుద్ధం చేశారు. ఇది అంబులెన్స్ సేవను ప్రారంభించడానికి ఆయనకు ప్రేరణనిచ్చింది. ఈ అంబులెన్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఒక ప్రచారం కూడా జరుగుతోంది. వారు కూడా అంబులెన్స్ నుండి నిరంతరం ప్రకటనలు చేస్తున్నారు. మాస్క్ ధరించడంతో పాటు ఇతర విషయాలలో అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.
మిత్రులారా! డాక్టర్ల దినోత్సవంతో పాటు చార్టర్డ్ అకౌంటెంట్స్ దినోత్సవాన్ని కూడా జూలై 1 న జరుపుకుంటారు. కొన్ని సంవత్సరాల క్రితం నేను ప్రపంచ స్థాయి భారతీయ ఆడిట్ సంస్థల నుండి బహుమతుల కోసం దేశంలోని చార్టర్డ్ అకౌంటెంట్లను ప్రతిపాదనలు అడిగాను. ఈ రోజు నేను ఈ విషయాన్ని వారికి గుర్తు చేయాలనుకుంటున్నాను. చార్టర్డ్ అకౌంటెంట్లు ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతను తీసుకురావడంలో చాలా మంచి, సానుకూల పాత్ర పోషిస్తారు. చార్టర్డ్ అకౌంటెంట్స్ కు, వారి కుటుంబ సభ్యులందరికీ నా శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశ వాసులారా! కరోనాపై భారతదేశం చేసిన పోరాటంలో గొప్ప లక్షణం ఉంది. ఈ పోరాటంలో దేశంలోని ప్రతి వ్యక్తి తన వంతు పాత్ర పోషించారు. నేను దీనిని "మన్ కి బాత్" లో తరచుగా ప్రస్తావించాను. కానీ కొంతమంది తమ గురించి ఎక్కువగా మాట్లాడలేదని ఫిర్యాదు చేస్తారు. చాలా మంది ఈ పోరాటం చేసిన వారిజాబితాలో ఉన్నారు. బ్యాంక్ సిబ్బంది, ఉపాధ్యాయులు, చిన్న వ్యాపారులు, దుకాణదారులు, దుకాణాలలో పనిచేసే వ్యక్తులు, వీధి వ్యాపారులు, సెక్యూరిటీ వాచ్మెన్లు ,పోస్ట్‌మెన్, పోస్ట్ ఆఫీస్ ఉద్యోగులు - వాస్తవానికి ఈ జాబితా చాలా పెద్దది. చాలా కాలం ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్ర పోషించారు. పరిపాలనలో కూడా వివిధ స్థాయిలలో ఎంతో మంది పాల్గొన్నారు.
మిత్రులారా! భారత ప్రభుత్వంలో కార్యదర్శిగా ఉన్న గురు ప్రసాద్ మహా పాత్ర గారి పేరు మీరు బహుశా విని ఉంటారు. ఈ రోజు ‘మన్ కి బాత్’ లో నేను ఆయన విషయం కూడా ప్రస్తావించాలనుకుంటున్నాను. గురుప్రసాద్ గారికి కరోనా వచ్చింది. ఆయన ఆసుపత్రిలో చేరారు. తన విధులను కూడా నిర్వహించారు. దేశంలో ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడానికి, సుదూర ప్రాంతాలకు ఆక్సిజన్ చేరుకోవడానికి ఆయన పగలు, రాత్రి పనిచేశారు. ఒక వైపు కోర్టు వ్యవహారాలు, మీడియా ఒత్తిడి – ఇలా ఆయన ఒకేసారి అనేక రంగాల్లో పోరాడుతూనే ఉన్నారు. అనారోగ్య సమయంలో కూడా ఆయన పనిచేయడం ఆపలేదు. వద్దని చెప్పిన తర్వాత కూడా ఆయన మొండిగా ఆక్సిజన్‌పై జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనేవారు. దేశవసూలు కూడా ఆయన గురించి చాలా ఆందోళన చెందారు. ఆసుపత్రి మంచం మీద తన గురించి ఆలోచించకుండా దేశ ప్రజలకు ఆక్సిజన్ సరఫరా చేసే ఏర్పాట్లు చేస్తూనే ఉన్నారు. దేశం ఈ కర్మ యోగిని కోల్పోవడం మనందరికీ విచారకరం. కరోనా ఆయనను మన నుండి లాక్కుంది. చర్చలోకి కూడా రాని అనేకమంది ఉన్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను పూర్తిగా అనుసరించడం, వ్యాక్సిన్‌ను ఖచ్చితంగా తీసుకోవడమే అలాంటి ప్రతి వ్యక్తికి మనమిచ్చే నివాళి.
నా ప్రియమైన దేశవాసులారా! 'మన్ కీ బాత్' గొప్పదనం ఏమిటంటే, మీరందరూ ఇందులో నాకన్నా ఎక్కువ సహకారం అందించడం. ఇప్పుడే నేను మైగవ్‌లో ఒక పోస్ట్ చూశాను. చెన్నైకి చెందిన ఆర్.గురుప్రసాద్ గారు రాసిన విషయం తెలుసుకోవడం మీకూ సంతోషంగా ఉంటుంది. తాను ‘మన్ కి బాత్’ కార్యక్రమాన్ని రెగ్యులర్ శ్రోతను అని ఆయన రాశారు. ఇప్పుడు నేను గురుప్రసాద్ గారి పోస్ట్ నుండి కొన్ని పంక్తులను ఉటంకిస్తున్నాను.
“మీరు తమిళనాడు గురించి మాట్లాడినప్పుడల్లా నా ఆసక్తి మరింత పెరుగుతుంది. తమిళ భాష , తమిళ సంస్కృతి గొప్పతనం, తమిళ పండుగలు, తమిళనాడులోని ప్రధాన ప్రదేశాల గురించి మీరు చర్చించారు.” అని ఆయన రాశారు.
గురు ప్రసాద్ గారు ఇంకా ఇలా రాశారు. “మన్ కి బాత్” లో తమిళనాడు ప్రజల విజయాల గురించి కూడా చాలాసార్లు చెప్పారు. తిరుక్కురళ్ పై మీకున్న ప్రేమ గురించి, తిరువళ్లువార్ గారి పట్ల మీకున్న గౌరవం గురించి ఏమి చెప్పాలి! అందుకే మీరు తమిళనాడు గురించి మాట్లాడినవన్నీ 'మన్ కి బాత్' లో సంకలనం చేసి ఈ-బుక్ సిద్ధం చేశాను. మీరు ఈ ఇ-బుక్ గురించి ఏదైనా చెప్పి, దానిని నామోఆప్లో కూడా విడుదల చేస్తారా? ధన్యవాదాలు” .
గురుప్రసాద్ గారి ఈ లేఖను మీ ముందు చదువుతున్నాను.
గురుప్రసాద్ గారూ.. మీ ఈ పోస్ట్ చదివినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మీ ఇ-బుక్కు మరో పేజీని జోడించండి.
.. 'నాన్ తమిళకలా చారాక్తిన్ పెరియే అభిమాని!
నాన్ ఉల్గాత్ లయే పాల్ మాయా తమిళ మొలియన్ పెరియే అభిమాని!!'
ఖచ్చితంగా ఉచ్చారణ దోషాలు ఉంటాయి. కానీ నా ప్రయత్నం, నా ప్రేమ ఎప్పటికీ తగ్గవు. నేను తమిళం మాట్లాడని వారికి చెప్పాలనుకుంటున్నాను, నేను గురుప్రసాద్ గారికి చెప్పాను – “నేను తమిళ సంస్కృతికి పెద్ద అభిమానిని. నేను ప్రపంచంలోని అన్నింటికంటే ప్రాచీన భాష అయిన తమిళానికి పెద్ద అభిమానిని.” అని.
మిత్రులారా! ప్రపంచంలోని అత్యంత ప్రాచీన భాష మన దేశానికి చెందినది అయినందుకు ప్రతి భారతీయుడు గర్వించాలి. దాన్ని ప్రశంసించాలి. నేను కూడా తమిళం విషయంలో చాలా గర్వపడుతున్నాను. గురు ప్రసాద్ గారూ.. మీ ఈ ప్రయత్నం నాకు కొత్త దృష్టిని ఇవ్వబోతోంది. ఎందుకంటే నేను 'మన్ కి బాత్' చేసేటప్పుడు విషయాలను సహజంగా, సరళంగా ఉండేలా చూస్తాను. ఇది కూడా ఒక లక్షణం అని నాకు తెలియదు. మీరు పాత విషయాలన్నీ సేకరించినప్పుడు నేను కూడా ఒకసారి కాదు రెండుసార్లు చదివాను. గురుప్రసాద్ గారూ.. నేను ఖచ్చితంగా మీ ఈ పుస్తకాన్ని నమోయాప్‌లో అప్లోడ్ చేస్తాను. భవిష్యత్ ప్రయత్నాలకు మీకు శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మనం కరోనా ఇబ్బందులు , జాగ్రత్తల గురించి మాట్లాడాం. దేశం, దేశస్థుల అనేక విజయాల గురించి కూడా చర్చించాం. ఇప్పుడు మరో ముఖ్యమైన సందర్భం కూడా మన ముందు ఉంది. ఆగస్టు 15 కూడా వస్తోంది. 75 సంవత్సరాల అమృత మహోత్సవం- ఈ పండుగ మనకు పెద్ద ప్రేరణ. దేశం కోసం జీవించడం నేర్చుకుందాం. స్వాతంత్ర్య సమరం దేశం కోసం మరణించిన వారి కథ. ఈ స్వాతంత్య్రానంతర సమయాన్ని మనం దేశం కోసం జీవించే వారి కథగా చేసుకోవాలి. మన మంత్రం ‘ఇండియా ఫస్ట్’ అని ఉండాలి. మన ప్రతి నిర్ణయానికి ఒక ఆధారం ఉండాలి అదే- ఇండియా ఫస్ట్.
మిత్రులారా! అమృత మహోత్సవంలో దేశం కూడా అనేక సామూహిక లక్ష్యాలను నిర్దేశించింది. అలాగే మన స్వాతంత్య్ర సమరయోధులను గుర్తుంచుకోవాలి. వారితో సంబంధం ఉన్న చరిత్రను పునరుద్ధరించాలి. స్వాతంత్య్ర సమర చరిత్ర రాయాలని, పరిశోధన చేయాలని 'మన్ కి బాత్' లో నేను యువతను కోరిన విషయం మీకు గుర్తు ఉండి ఉంటుంది. యువ ప్రతిభ ముందుకు రావాలి. యువత-ఆలోచన, యువత-అభిప్రాయాలు ముందుకు రావాలి. యువత కొత్త శక్తితో రాయాలి. చాలా తక్కువ సమయంలో ఈ పని చేయడానికి రెండున్నర వేలకు పైగా యువత ముందుకు వచ్చారు. మిత్రులారా! ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 19 వ - 20 వ శతాబ్దాల యుద్ధం గురించి సాధారణంగా మాట్లాడుతారు. కాని 21 వ శతాబ్దంలో జన్మించిన యువ మిత్రులు 19, 20 వ శతాబ్దపు స్వాతంత్ర్య పోరాటాన్ని ప్రజల ముందు ఉంచడానికి ముందుకు వచ్చారు. మైగవ్‌లో తమ పూర్తి వివరాలను పంపారు. వారు హిందీ, ఇంగ్లీష్, తమిళం, కన్నడ, బంగ్లా, తెలుగు, మరాఠీ, మలయాళం, గుజరాతీ మొదలైన దేశంలోని వివిధ భాషలలో స్వాతంత్య్ర సంగ్రామం గురించి రాస్తారు. స్వాతంత్ర్య పోరాటంతో సంబంధం కలిగి ఉండే తమ సమీప ప్రదేశాల గురించి సమాచారాన్ని కొందరు సేకరిస్తారు. కొందరు గిరిజన స్వాతంత్ర్య సమరయోధులపై పుస్తకం రాస్తున్నారు. మంచి ప్రారంభం. మీరందరూ మీకు వీలైనంతవరకు అమృత్ మహోత్సవ్‌లో చేరాలని నేను కోరుతున్నాను. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలకు మనం సాక్షులమవ్వడం మన అదృష్టం.
కాబట్టి తర్వాతిసారి మనం 'మన్ కి బాత్'లో కలుసుకున్నప్పుడు అమృత్-మహోత్సవ్ గురించి, ఆ కార్యక్రమ సన్నాహాల గురించి మాట్లాడుకుందాం. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి. కరోనాకు సంబంధించిన నియమాలను పాటిస్తూ ముందుకు సాగండి. మీ కొత్త ప్రయత్నాలతో దేశాన్ని కూడా ప్రగతిశీలంగా ఉంచండి. ఈ శుభాకాంక్షలతో చాలా చాలా ధన్యవాదాలు.
ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. COVID-19 కు వ్యతిరేకంగా దేశం పూర్తి శక్తితో ఎలా పోరాడుతుందో మనం చూస్తున్నాం. గత వంద సంవత్సరాలలో ఇది అతి పెద్ద మహమ్మారి. ఈ మహమ్మారి కాలంలోనే భారతదేశం అనేక ప్రకృతి వైపరీత్యాలతో పోరాడింది. ఈ సమయంలో అంఫాన్ తుపాను వచ్చింది. నిసర్గ్ తుపాను వచ్చింది. అనేక రాష్ట్రాల్లో వరదలు సంభవించాయి. అనేక చిన్న, పెద్ద భూకంపాలు వచ్చాయి. కొండచరియలు విరిగిపడ్డాయి. గత 10 రోజుల్లో దేశం మళ్లీ రెండు పెద్ద తుఫానులను ఎదుర్కొంది. పశ్చిమ తీరంలో 'తౌ -తె' తుఫాను, తూర్పు తీరంలో 'యాస్' తుఫాను. ఈ రెండు తుఫానులు అనేక రాష్ట్రాలను ప్రభావితం చేశాయి. దేశం, దేశ ప్రజలు వాటితో తీవ్రంగా పోరాడారు. కనీసం ప్రాణనష్టం జరగకుండా చూసుకున్నారు. గత సంవత్సరాలతో పోలిస్తే, ఎక్కువ మంది ప్రజలు ప్రాణాలు కాపాడుకోగలుగుతున్నారని మన అనుభవంలోకి వచ్చింది. ఈ కష్టమైన, అసాధారణమైన పరిస్థితుల్లో తుఫాను ప్రభావిత రాష్ట్రాల ప్రజలు విపత్తును ఎదుర్కోవడంలో ధైర్యాన్ని ప్రదర్శించారు. ఈ సంక్షోభం సమయంలో పునరావాసం, రక్షణ పనులలో అధికార యంత్రాంగం తో కలిసి ప్రజలు చాలా ఓపికతో, క్రమశిక్షణతో పనిచేశారు. ఆ ప్రజాలందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. వారి కృషికి ఈ ప్రశంసలు, అభినందనలు చాలా చిన్నవి. వారందరికీ నమస్కరిస్తున్నాను. ఈ విపత్తును ఎదుర్కోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక పరిపాలన యంత్రాంగం కలిసి పనిచేస్తున్నాయి. ఈ విపత్తుల్లో సన్నిహితులను కోల్పోయిన వారందరికీ నా సానుభూతిని తెలియజేస్తున్నాను. ఈ కష్ట సమయంలో వారితో మనమందరం గట్టిగా కలిసి నిలబడతాం.
నా ప్రియమైన దేశవాసులారా! ఎంత పెద్ద సవాలు అయినా గెలవాలనే భారతదేశ సంకల్పం ఎప్పుడూ గొప్పది. దేశ సామూహిక శక్తి, మన సేవాభావం ప్రతి తుఫాను నుండి దేశాన్ని కాపాడింది. ఇటీవలి కాలంలో మన వైద్యులు, నర్సులు, ఫ్రంట్ లైన్ యోధులు తమ గురించి ఆలోచించకుండా పగలు, రాత్రి పనిచేశారు. ఈ రోజు కూడా అలాగే పని చేస్తున్నారు. రెండవ దశలో కరోనాతో పోరాటంలో ప్రముఖ పాత్ర పోషించిన వారు చాలా మంది ఉన్నారు. 'మన్ కి బాత్' శ్రోతలు చాలా మంది ఈ యోధులను గురించి చర్చించమని నమోయాప్ ద్వారా, లేఖల ద్వారా నన్ను కోరారు.
మిత్రులారా! సెకండ్ వేవ్ వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆక్సిజన్ డిమాండ్ అనేక రెట్లు పెరిగింది. ఇది చాలా పెద్ద సవాలు. దేశంలోని సుదూర ప్రాంతాలకు మెడికల్ ఆక్సిజన్ పంపిణీ చాలా పెద్ద సవాలు. ఆక్సిజన్ ట్యాంకర్ వేగంగా వెళ్ళవలసి వస్తుంది. ఒక చిన్న పొరపాటు చేసినా, చాలా పెద్ద పేలుడు ప్రమాదం జరిగే అవకాశం ఉంది. దేశంలోని తూర్పు భాగాలలో పారిశ్రామిక ఆక్సిజన్ ఉత్పత్తి చేసే అనేక ప్లాంట్స్ ఉన్నాయి. అక్కడి నుండి ఇతర రాష్ట్రాలకు ఆక్సిజన్ రవాణా చేయడానికి చాలా రోజులు పడుతుంది. దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలులో దేశానికి సహాయపడింది- క్రయోజెనిక్ ట్యాంకర్ నడుపుతున్న డ్రైవర్లు, ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్, వైమానిక దళ పైలట్లు. ఇలాంటి వారు చాలా మంది పనిచేసి వేలాది, లక్షలాది మంది ప్రజల ప్రాణాలను రక్షించారు. ఈ రోజు మన్ కి బాత్‌లో, అలాంటి ఒక మిత్రుడు మనతో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ లోని జౌన్‌పూర్‌కు చెందిన దినేష్ ఉపాధ్యాయ గారు.
మోదీ గారు: దినేష్ గారూ.. నమస్కారం!
దినేష్ ఉపాధ్యాయ గారు: సార్.. నమస్కారం..
మోదీ గారు: మొదట మీ గురించి మాకు చెప్పాలని నేను కోరుకుంటున్నాను.
దినేష్ ఉపాధ్యాయ గారు: సార్.. నా పేరు దినేష్ బాబూల్ నాథ్ ఉపాధ్యాయ. నేను జాన్ పూర్ జిల్లాలోని జామువా పోస్టాఫీస్ పరిధిలో ఉన్నహసన్పూర్ గ్రామంలో ఉంటాను సార్.
మోదీ గారు: మీది ఉత్తర ప్రదేశా?
దినేష్ ఉపాధ్యాయ గారు: అవును! అవును! సార్.
మోదీ గారు: ఓహ్
దినేష్: సార్. మాకు ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు సార్. నా భార్యతో పాటు మా తల్లిదండ్రులు ఉన్నారు సార్
మోదీ గారు: మీరు ఏం చేస్తారు?
దినేష్: సార్, నేను ఆక్సిజన్ ట్యాంకర్ నడుపుతున్నాను సార్ .. లిక్విడ్ ఆక్సిజన్ ట్యాంకర్.
మోదీ గారు: - పిల్లల చదువు సరిగా జరుగుతుందా?
దినేష్ - అవును సార్! పిల్లలు చదువుతున్నారు. ఆడపిల్లలు ఇద్దరూ చదువుతున్నారు. నా అబ్బాయి కూడా చదువుతున్నాడు సార్.
మోదీ గారు: ఈ ఆన్లైన్ చదువులు కూడా సరిగ్గా నడుస్తున్నాయా?
దినేష్ - అవును సార్. ప్రస్తుతం మా అమ్మాయిలు చదువుతున్నారు. ఆన్లైన్లోనే చదువుతున్నారు సార్. ఆక్సిజన్ ట్యాంకర్ ను 15 - 17 సంవత్సరాల నుండి నడుపుతున్నాను సార్.
మోదీ గారు: బాగుంది! ఈ 15-17 సంవత్సరాలు మీరు ఆక్సిజన్ ను తీసుకువెళ్తున్నారంటే మీరు ట్రక్ డ్రైవర్ మాత్రమే కాదు! మీరు ఒక విధంగా లక్షల మంది ప్రాణాలను రక్షించడంలో నిమగ్నమై ఉన్నారు.
దినేష్: సార్. ఇది మా పని సార్.. మా కంపెనీ ఐనాక్స్ కంపెనీ సార్. మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. మేం ఎక్కడికైనా వెళ్లి ఆక్సిజన్‌ను అందిస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది సార్.
మోదీ గారు: అయితే ఇప్పుడు కరోనా కాలంలో మీ బాధ్యత చాలా పెరిగింది?
దినేష్: అవును సార్. మా బాధ్యత చాలా పెరిగింది.
మోదీ గారు: మీరు మీ ట్రక్ డ్రైవింగ్ సీటులో కూర్చున్నప్పుడు మీ మనసులో ఉండే ఆలోచన ఏంటి? ఇంతకుముందు కంటే వేరుగా ఉండే అనుభవం ఏమిటి? చాలా ఒత్తిడి కూడా ఉంటుందా? మానసిక ఒత్తిడి ఉంటుందా? కుటుంబ ఆందోళనలు, కరోనా వాతావరణం, ప్రజల నుండి ఒత్తిడి, డిమాండ్... ఏదైనా ఉంటుందా?
దినేష్: సార్, మాకు ఏ ఆలోచన లేదు. మా కర్తవ్యం మేం చేస్తున్నామని మాత్రమే ఉంటుంది. మేం సమయానికి తీసుకువెళ్ళి, ఈ ఆక్సిజన్ తో ఎవరి ప్రాణమైనా నిలబడితే అది మాకు ఎంతో గర్వకారణం.
మోదీ గారు: మీరు మీ భావాలను చాలా మంచి రీతిలో వ్యక్తం చేస్తున్నారు. ఈ రోజు ప్రజలు ఈ మహమ్మారి సమయంలో మీ పని ప్రాముఖ్యతను చూస్తున్నారు. ఇది ఇంతకు ముందు అర్థం కాకపోవచ్చు. ఇప్పుడు వారు అర్థం చేసుకుంటున్నారు. మీపై వారి వైఖరిలో ఏమైనా మార్పు వచ్చిందా?
దినేష్: అవును సార్! ఇంతకుముందు ఎక్కడో ఒక దగ్గర ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయేవాళ్ళం. కానీ ఈరోజుల్లో అధికార యంత్రాంగం మాకు చాలా సహాయపడుతోంది. త్వరగా వెళ్ళి ప్రజల ప్రాణాలను రక్షించాలన్న ఉత్సుకత మాకు ఏర్పడుతోంది. మాకు తినేందుకు ఏదైనా దొరికిందా లేదా అని కానీ ఎలాంటి సమస్యలున్నా ఆలోచించకుండా ట్యాంకర్ ను వెంటనే తీసుకువెళ్తాం. మేం ట్యాంకర్ తీసుకువెళ్ళినప్పుడు ఆసుపత్రికి చేరుకోగానే అక్కడ అడ్మిట్ అయి ఉన్న వారి కుటుంబసభ్యులు V అనే సైగ చేస్తారు.
మోదీ గారు: విజయం గుర్తుగా V అనే సైగ చేస్తారా?
దినేష్: అవును సార్! V అని సైగ చేస్తారు. ఒక్కోసారి బొటనవేలును చూపిస్తారు. మేము చాలా ఓదార్పునిస్తున్నాం. జీవితంలో ఖచ్చితంగా కొన్ని మంచి పనులను చేసినందుకే ఇలాంటి సేవ చేసే అవకాశం దొరికిందని సంతోషంగా ఉంటుంది సార్.
మోదీ గారు: అప్పుడు అలసట అంతా పోతుందా?
దినేష్: అవును సార్! అవును సార్!
మోదీ గారు: మీరు ఇంటికి వెళ్ళి పిల్లలతో ఈ విషయాలన్నీ మాట్లాడతారా?
దినేష్: లేదు సార్. పిల్లలు మా గ్రామంలో నివసిస్తున్నారు. మేము ఇక్కడ INOX ఎయిర్ ప్రొడక్ట్ వద్ద ఉన్నాము. నేను డ్రైవర్‌గా పని చేస్తాను. 8-9 నెలల తరువాత నేను ఇంటికి వెళ్తాను.
మోదీ గారు: మీరు ఎప్పుడైనా పిల్లలతో ఫోన్లో మాట్లాడుతారా?
దినేష్: అవును సార్! తప్పకుండా మాట్లాడతా.
మోదీ గారు: కాబట్టి ఇలాంటి సమయంలో మీరు జాగ్రత్తగా ఉండాలని వారి మనసులో ఉంటుంది కదా
దినేష్: అవును సార్. మా పిల్లలు చెప్తారు “నాన్నా.. పని చేసేప్పుడు జాగ్రత్తగా ఉండ”మని. మేం చాలా భద్రతతో పని చేస్తాం సార్. మాంగావ్ ప్లాంట్ కూడా ఉంది. INOX మాకు చాలా సహాయపడుతుంది.
మోదీ గారు: దినేష్ గారూ.. మీతో మాట్లాడడం నాకు చాలా నచ్చింది. మీ మాటలు విన్న తర్వాత ఈ కరోనా పోరాటంలో మీలాంటి వారు ఎలా పని చేస్తున్నారో కూడా దేశం అనుభూతి చెందుతుంది. మీరు 9–9 నెలలు మీ పిల్లలను కలవడం లేదు. కుటుంబాన్ని కలవకుండా ప్రజల ప్రాణాలను రక్షించడం మాత్రమే ముఖ్యమైన పనిగా భావిస్తున్నారు. దినేష్ ఉపాధ్యాయ వంటి లక్షలాది మంది మనస్ఫూర్తిగా పనిచేస్తున్నందు వల్ల మనం యుద్ధంలో విజయం సాధిస్తామని దేశం గర్విస్తుంది.
దినేష్: సార్! కరోనాను ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం ఓడిస్తాం సార్.
మోదీ గారు: దినేష్ గారూ.. మీ ఈ భావనే దేశానికి బలం. చాలా ధన్యవాదాలు దినేష్ గారూ. మీ పిల్లలకు నా ఆశీర్వాదాలు తెలియజేయండి.
దినేష్: సరే సార్. నమస్కారం.
మోదీ గారు: ధన్యవాదాలు
దినేష్: నమస్కారం సార్
మోదీ గారు: ధన్యవాదాలు.
మిత్రులారా! దినేష్ గారు చెబుతున్నట్లుగా, ఒక ట్యాంకర్ డ్రైవర్ ఆక్సిజన్‌తో ఆసుపత్రికి చేరుకున్నప్పుడు, దేవుడు పంపిన దూతలాగా మాత్రమే కనిపిస్తారు. ఈ పనికి ఎంత బాధ్యత ఉందో, దానిలో ఎంత మానసిక ఒత్తిడి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు.
మిత్రులారా! ఈ సవాలు సమయంలో భారత రైల్వే కూడా ఆక్సిజన్ రవాణాను సులభతరం చేయడానికి ముందుకు వచ్చింది. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్, ఆక్సిజన్ రైలు రోడ్లపై వెళ్ళే ఆక్సిజన్ ట్యాంకర్ కంటే చాలా వేగంగా ఎక్కువ పరిమాణంలో దేశంలోని ప్రతి మూలకు ఆక్సిజన్‌ను తీసుకువెళ్ళింది. ఒక ఆక్సిజన్ ఎక్స్ ప్రెస్ ను పూర్తిగా మహిళలే నడిపిస్తారన్న విషయం తెలిస్తే దేశంలోని ప్రతి మహిళ దీని గురించి గర్వపడుతుంది. అంతేకాదు.. ప్రతి భారతీయుడు గర్వపడతాడు. ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్ లోకో-పైలట్ శిరీషా గజని గారిని 'మన్ కీ బాత్' కు ఆహ్వానించాను.
మోదీ గారు: శిరీష గారూ.. నమస్తే!
శిరీష: నమస్తే సార్. ఎలా ఉన్నారు సార్?
మోదీ గారు: నేను చాలా బాగున్నాను. శిరీష గారూ.. మీరు రైల్వే పైలట్‌గా పనిచేస్తున్నారని విన్నాను. మీ మొత్తం మహిళా బృందం ఈ ఆక్సిజన్ ఎక్స్‌ప్రెస్‌ను నడుపుతోందని నాకు తెలిసింది. శిరీష గారూ.. మీరు గొప్ప పని చేస్తున్నారు. కరోనా కాలంలో మీలాగే చాలా మంది మహిళలు ముందుకు వచ్చి కరోనాకు వ్యతిరేకంగా పోరాడటానికి దేశానికి శక్తి ఇచ్చారు. మీరు కూడా మహిళా శక్తికి గొప్ప ఉదాహరణ. కానీ దేశం తెలుసుకోవాలనుకుంటుంది, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను.- ఈ ప్రేరణ మీకు ఎక్కడ నుండి వస్తుంది అని.
శిరీష: సార్.. నాకు ప్రేరణ మా అమ్మా నాన్న నుండి వచ్చింది సార్. మా నాన్న ప్రభుత్వ ఉద్యోగి సార్. నాకు ఇద్దరు అక్కలు ఉన్నారు సార్. మేం ముగ్గురమూ ఆడపిల్లలమే. అయినా మేము పని చేయడానికి మా నాన్న చాలా ప్రోత్సహిస్తున్నారు. మా పెద్ద అక్క బ్యాంకులో ప్రభుత్వ ఉద్యోగం చేస్తుంది. నేను రైల్వేలో స్థిరపడ్డాను. మా తల్లిదండ్రులు నన్ను ప్రోత్సహిస్తారు.
మోదీ గారు: శిరీష గారూ.. సాధారణ రోజుల్లో కూడా మీరు మీ సేవలను రైల్వేలకు అందించారు. ఒక వైపు ఆక్సిజన్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్నప్పుడు, మీరు ఆక్సిజన్‌ను తీసుకువెళుతున్నప్పుడు అది కొంచెం ఎక్కువ బాధ్యతతో కూడింది కదా.. సాధారణ వస్తువులను తీసుకెళ్లడం వేరు, ఆక్సిజన్ చాలా సున్నితమైంది. కాబట్టి ఆక్సిజన్ ను తీసుకువెళ్లడం వేరు. ఈ విషయంలో మీ అనుభవం ఎలా ఉంది?
శిరీష: ఈ పని చేయడం నాకు సంతోషంగా ఉంది. ఆక్సిజన్ స్పెషల్ ఇచ్చే సమయంలో భద్రత విషయంలో, ఏర్పాట్ల విషయంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా చూశారు. లీకేజీలు లేకుండా చూశారు. భారత రైల్వే కూడా చాలా సహకరిస్తోంది సార్. ఆక్సిజన్ రైలు నడపడానికి అవకాశం ఇచ్చింది. గంటన్నరలో 125 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు చేరుకుంది. రైల్వే శాఖ కూడా బాధ్యత తీసుకుంది. నేను కూడా బాధ్యత తీసుకున్నాను సార్.
మోదీ గారు: వావ్! ...మీకు అభినందనలు తెలియజేస్తున్నాను. ముగ్గురు ఆడపిల్లలకు ప్రేరణనిచ్చిన మీ అమ్మా నాన్నలకు నమస్కారాలు. ఈ విధంగా దేశానికి సేవ చేసిన, అభిరుచిని చూపించిన మీ సోదరీమణులందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా ధన్యవాదాలు శిరీష గారూ..
శిరీష: ధన్యవాదాలు సార్. మీ ఆశీస్సులు నాకు కావాలి సార్.
మోదీ గారు: దేవుని ఆశీర్వాదాలు ఉండాలి. మీ తల్లిదండ్రుల ఆశీర్వాదాలు మీకు ఉండాలి. ధన్యవాదాలు !
శిరీష: ధన్యవాదాలు సార్.
మిత్రులారా! మనం ఇప్పుడే శిరీష గారి మాటలు విన్నాం. వారి అనుభవాలు కూడా స్ఫూర్తినిస్తాయి. అవి కూడా ప్రేరేపిస్తాయి. వాస్తవానికి, ఈ యుద్ధం ఎంత పెద్దదంటే రైల్వేల మాదిరిగా మన దేశం జల, భూ, ఆకాశ మార్గాల ద్వారా- మూడు మార్గాల ద్వారా- పనిచేస్తోంది. ఒక వైపు ఖాళీ అయిన ట్యాంకర్లను ఎయిర్ ఫోర్స్ విమానాల ద్వారా ఆక్సిజన్ ప్లాంట్లకు రవాణా చేసే పనులు జరుగుతున్నాయి. మరోవైపు కొత్త ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణ పనులు కూడా పూర్తవుతున్నాయి. అలాగే విదేశాల నుండి ఆక్సిజన్ ను, ఆక్సిజన్ కాన్సంట్రేటర్లను, క్రయోజెనిక్ ట్యాంకర్లను కూడా దేశంలోకి తీసుకురావడం జరుగుతోంది. అందువల్ల ఈ పనుల్లో నౌకాదళం, వైమానిక దళం, సైనిక దళం, డిఆర్డిఓ లాంటి మన సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. మన శాస్త్రవేత్తలు, పరిశ్రమ నిపుణులు , సాంకేతిక నిపుణులు కూడా యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నారు. వీరు చేసే పని గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి దేశ ప్రజలందరి మనస్సుల్లో ఉంది. అందువల్ల మన వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు.
మోదీ గారు: పట్నాయక్ గారూ.. జై హింద్.
Grp. Cpt. – సార్. జై హింద్ సార్. నేను గ్రూప్ కెప్టెన్ ఎ.కె. పట్నాయక్ ని సార్. నేను ఎయిర్ ఫోర్స్ స్టేషన్ హిండన్ నుండి మాట్లాడుతున్నాను.
మోదీ గారు: పట్నాయక్ గారూ.. కరోనాతో యుద్ధ సమయంలో మీరు చాలా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ట్యాంకర్లను, రవాణా ట్యాంకర్లను ఇక్కడకు తీసుకురావడానికి ప్రపంచవ్యాప్తంగా వెళుతున్నారు. మీరు సైనికుడిగా వేరే రకమైన పని చేశారు. చనిపోవడం కోసం, చంపడం కోసం సైనికులు పరుగెత్తడం ఉంటుంది. ఈ రోజు మీరు ప్రాణాలను కాపాడటానికి పరుగెత్తుతున్నారు. ఇది ఎలా అనిపిస్తుంది?
Grp. Cpt.- సార్.. ఈ సంక్షోభ సమయంలో మన దేశస్థులకు సహాయం చేయగలగడం మాకు చాలా అదృష్టం సార్. మాకు ఏ బాధ్యతలు చెప్పినా వాటిని సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం సార్. మాకు శిక్షణ, సహాయ సేవలు ఉన్నాయి. అవి మాకు పూర్తిగా సహకారం అందిస్తున్నాయి. ఇందులో మాకు లభించే ఉద్యోగ సంతృప్తి చాలా ఎక్కువ స్థాయిలో ఉంది సార్. అదే అతి పెద్ద విషయం సార్. అందుకే మేం నిరంతరం ఇలాంటి పనులు చేయగలుగుతున్నాం.
మోదీ గారు: కెప్టెన్.. మీరు ఈ రోజుల్లో ఏ ప్రయత్నాలు చేసినా, అది కూడా అతి తక్కువ సమయంలోనే చేయాల్సి వచ్చింది. ఈ రోజుల్లో మీ పనులు ఎలా జరిగాయి?
Grp. Cpt.: సార్. గత నెల రోజుల నుండి మేము ఆక్సిజన్ ట్యాంకర్లు, లిక్విడ్ ఆక్సిజన్ కంటైనర్లను దేశీయ, అంతర్జాతీయ ప్రాంతాల నుండి తీసుకువస్తున్నాం సార్. నేను 1600 కి పైగా విమానాలలో వైమానిక దళం ఈ సరఫరా చేసింది. మేము 3000 గంటలకు పైగా ప్రయాణించాము. 160 అంతర్జాతీయస్థాయి సరఫరాలను చేశాం. అంతకుముందు దేశీయంగా సరఫరాకు 2 నుండి 3 రోజులు తీసుకుంటే మేం 2 నుండి 3 గంటల్లో ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి పంపించగలం సార్. అంతర్జాతీయస్థాయి సరఫరా కూడా 24 గంటలలోపు చేయవచ్చు. నిరంతరాయంగా పనిచేయడంలో మొత్తం వైమానిక దళం నిమగ్నమై ఉంది సార్. వీలైనంత త్వరగా మేము వీలైనన్ని ట్యాంకర్లను తీసుకువచ్చి దేశానికి సహాయపడతాం సార్.
మోదీ గారు: కెప్టెన్.. మీరు అంతర్జాతీయంగా ఎక్కడెక్కడికి వెళ్లాల్సి వచ్చింది?
Grp. Cpt: సార్. ఏర్పాట్లు చేసుకునేందుకు ఎక్కువ కాలం లేకుండానే భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్ -76, సి -17, సి -130 మొదలైన విమానాలన్నీ సింగపూర్, దుబాయ్, బెల్జియం, జర్మనీ, యుకె లకు వెళ్ళాయి. తక్కువ కాలంలోనే ఈ పనులను ప్రణాళికాబద్దంగా చేయగలిగాం సార్. మా శిక్షణ, ఉత్సాహం కారణంగా మేము ఈ పనులను సకాలంలో పూర్తి చేయగలిగాం.
మోదీ గారు: నౌకాదళం, వైమానికదళం, సైనిక దళం.. ఏ దళమైనా మన సైనికులందరూ కరోనాపై పోరాటంలో నిమగ్నమై ఉన్నారు. ఇది దేశానికి గర్వకారణం. కెప్టెన్.. మీరు కూడా చాలా బాధ్యతగా పని చేశారు. నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను.
Grp. Cpt.- సార్.. చాలా ధన్యవాదాలు సార్. మేం మా ఉత్తమ ప్రయత్నాలలో నిమగ్నమై ఉన్నాం. నా కుమార్తె అదితి కూడా నాతో ఉంది సార్.
మోదీ గారు: ఓహ్.. వావ్!
అదితి: నమస్తే మోదీ గారూ..
మోదీ గారు: నమస్తే అదితి. నీ వయసెంత?
అదితి : నాకు 12 సంవత్సరాలు సార్. నేను 8 వ తరగతి చదువుతున్నాను.
మోదీ గారు: మీ నాన్న గారు బయటకు వెళ్లినప్పుడు యూనిఫాంలో ఉంటాడు కదా.
అదితి : అవును సార్! మా నాన్నని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. ఆయన ముఖ్యమైన పనులను చేయడం చాలా గర్వంగా భావిస్తున్నాను. కరోనాతో బాధపడుతున్న ప్రజలకు చాలా సహాయం చేస్తున్నారు. చాలా దేశాల నుండి ఆక్సిజన్ ట్యాంకర్లు, కంటైనర్లను తీసుకువస్తున్నారు.
మోదీ గారు: కాని కుమార్తె తన తండ్రిని చాలా మిస్ అయ్యింది కదా!
అదితి : అవును.. నేను చాలా మిస్ అయ్యాను. ఈ రోజుల్లో నాన్న ఇంట్లో ఎక్కువగా ఉండలేరు. ఎందుకంటే చాలా అంతర్జాతీయ విమానాలు వెళ్తున్నాయి. కంటైనర్లు, ట్యాంకర్లను ఉత్పత్తి కర్మాగారాలకు రవాణా చేస్తున్నాయి. తద్వారా కరోనా బాధితులు సకాలంలో ఆక్సిజన్ పొందగలుగుతున్నారు. అలా వారి ప్రాణాలను కాపాడగలుగుతున్నారు.
మోదీ గారు: ఆక్సిజన్ వల్ల ప్రజల ప్రాణాలను కాపాడిన పని ఇది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ప్రజలు ఈ విషయం తెలుసుకున్నారు.
అదితి - అవును.
మోదీ గారు: మీ నాన్న ఆక్సిజన్ సేవలో నిమగ్నమై ఉన్నారని మీ తోటి విద్యార్థులకు తెలిస్తే, అప్పుడు వారు కూడా మిమ్మల్ని చాలా గౌరవంగా చూస్తారు కదా!
అదితి: అవును.. నా స్నేహితులందరూ కూడా మీ నాన్న ఇంత ముఖ్యమైన పని చేయడం మీకు గర్వ కారణమని అంటే నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. నా కుటుంబం, మా నాన్నమ్మ, తాతయ్య, అమ్మమ్మ – అందరికీ చాలా గర్వంగా ఉంటుంది. మా అమ్మతో పాటు వాళ్ళంతా డాక్టర్లు. వారు కూడా పగలు, రాత్రి పనిచేస్తున్నారు. అన్ని సాయుధ దళాలు, మా నాన్నతో పాటు స్క్వాడ్రన్ అంకుల్స్, మొత్తం సైన్యం చాలా పని చేస్తోంది. ప్రతి ఒక్కరి ప్రయత్నంతో కరోనాతో ఈ యుద్ధంలో మనం ఖచ్చితంగా విజయం సాధిస్తామని నాకు నమ్మకం సార్.
మోదీ గారు: కుమార్తె మాట్లాడేటప్పుడు సరస్వతి ఆమె మాటలలో ఉంటుందని ఒక లోకోక్తి. మనం ఖచ్చితంగా గెలుస్తామని అదితి చెబుతున్నప్పుడు అది దైవ స్వరమే అవుతుంది. అదితీ.. ఇప్పుడు ఆన్ లైన్ లో చదువుకుంటున్నారా?
అదితి – అవును సార్. ఇప్పుడు మా ఆన్లైన్ క్లాసులు అన్నీ జరుగుతున్నాయి. ప్రస్తుతం మేము ఇంట్లో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. బయటకు వెళ్లాలనుకుంటే డబుల్ మాస్క్ వేసుకుంటున్నాం. అన్ని ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తున్నాం. ప్రతిదీ జాగ్రత్తగా చూసుకుంటున్నాం.
మోదీ గారు: మీ హాబీలు ఏమిటి? మీకు ఏమిష్టం?
అదితి - నా అభిరుచులు ఈత కొట్టడం, బాస్కెట్‌బాల్ ఆడడం సార్. కానీ ఇప్పుడు అవి కొంచెం ఆగిపోయాయి. నాకు బేకింగ్, వంట చేయడం చాలా ఇష్టం. ఈ లాక్డౌన్, కరోనా వైరస్ కాలంలో నాన్న బయటికి వెళ్ళి చాలా పనులు చేసి వచ్చినప్పుడు నేను ఆయన కోసం కుకీస్, కేక్ తయారు చేసి పెడుతున్నాను.
మోదీ గారు: వావ్, వావ్, వావ్! చాలా కాలం తరువాత మీకు మీ నాన్నతో సమయం గడపడానికి అవకాశం వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది. కెప్టెన్.. నేను మిమ్మల్ని చాలా అభినందిస్తున్నాను. నేను కెప్టెన్‌ను అభినందించినప్పుడు మీ ఒక్కరినే కాదు- మన దళాలు- నీరు, భూమి, ఆకాశాలతో అనుసంధానించబడ్డ అందరికీ - నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు సోదరా!
Grp. Cpt. - ధన్యవాదాలు సార్
మిత్రులారా! ఈ యోధులు చేసిన పనికి దేశం వారికి నమస్కరిస్తుంది. అదేవిధంగా లక్షలాది మంది ప్రజలు పగలు, రాత్రి కరోనా సంబంధిత పనుల్లో ఉన్నారు. వారు చేస్తున్న పని వారి దినచర్యలో భాగం కాదు. వంద సంవత్సరాల తరువాత ప్రపంచం ఇంతటి విపత్తును ఎదుర్కొంటోంది. ఒక శతాబ్దం తరువాత ఇంత పెద్ద సంక్షోభం! అందువల్ల ఈ రకమైన పని గురించి ఎవరికీ అనుభవం లేదు. వారి కృషి వెనుక దేశ సేవ చేయాలన్న అభిరుచి, సంకల్ప శక్తి ఉన్నాయి. ఇంతకు ముందెన్నడూ చేయని పని దేశం చేసింది. మీరు ఊహించవచ్చు- సాధారణ రోజుల్లో మనం ఒక రోజులో 900 మెట్రిక్ టన్నుల ద్రవ వైద్య ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేస్తాం. ఇప్పుడు ఇది 10 రెట్ల కన్నా ఎక్కువ పెరిగి, రోజుకు 9500 మెట్రిక్ టన్నులను ఉత్పత్తి జరుగుతోంది. మన యోధులు ఈ ఆక్సిజన్‌ను దేశంలోని సుదూర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.
నా ప్రియమైన దేశవాసులారా! దేశంలో ఆక్సిజన్ అందించడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. చాలా మంది ప్రజలు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు. పౌరుడిగా ఈ పనులన్నీ స్ఫూర్తినిస్తాయి. అందరూ ఒక జట్టుగా ఏర్పడి తమ కర్తవ్యాన్ని నిర్వర్తించారు. తన భర్త ల్యాబ్ టెక్నీషియన్ అని బెంగళూరుకు చెందిన ఊర్మిళ గారు నాకు చెప్పారు. చాలా సవాళ్ళ మధ్య నిరంతరం కరోనా పరీక్షలు ఎలా చేస్తున్నారో కూడా చెప్పారు.
మిత్రులారా! కరోనా ప్రారంభంలో దేశంలో ఒకే ఒక పరీక్షా ప్రయోగశాల ఉండేది. కాని ఇప్పుడు రెండున్నర వేలకు పైగా ప్రయోగశాలలు పనిచేస్తున్నాయి. ప్రారంభంలో, ఒక రోజులో కొన్ని వందల పరీక్షలు మాత్రమే నిర్వహించగలిగేవాళ్ళం. ఇప్పుడు ఒక రోజులో 20 లక్షలకు పైగా పరీక్షలు జరుగుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో 33 కోట్లకు పైగా నమూనాలను పరీక్షించారు. ఈ యోధుల వల్ల మాత్రమే ఈ భారీ పని సాధ్యమవుతుంది. నమూనా సేకరణ పనిలో ఎంతోమంది ఫ్రంట్‌లైన్ కార్మికులు నిమగ్నమై ఉన్నారు. వైరస్ సోకిన రోగుల మధ్యకు వెళ్లడం, వారి నమూనాను తీసుకోవడం- ఇది ఎంత గొప్ప సేవ. తమను తాము రక్షించుకోవడానికి, ఈ సహచరులు ఇంత వేడిలో కూడా నిరంతరం పిపిఇ కిట్ ధరించాలి. ఆ తరువాత ఆ నమూనా ప్రయోగశాలకు చేరుకుంటుంది. అందువల్ల నేను మీ సలహాలను, ప్రశ్నలను చదువుతున్నప్పుడు మన ఈ స్నేహితుల గురించి కూడా చర్చ జరగాలని నిర్ణయించుకున్నాను. వారి అనుభవాల నుండి మనం కూడా చాలా తెలుసుకుంటాం. ఢిల్లీలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్న ప్రకాష్ కాండ్పాల్ గారితో మాట్లాడదాం.
మోదీ గారు: - ప్రకాశ్ గారూ.. నమస్కారం..
ప్రకాశ్ గారు: నమస్కారాలు గౌరవనీయ ప్రధానమంత్రి గారూ..
మోదీ గారు: ప్రకాశ్ గారూ.. మొదట 'మన్ కీ బాత్' శ్రోతలందరికీ మీ గురించి చెప్పండి. మీరు ఈ పనిని ఎంతకాలం నుండి చేస్తున్నారు? కరోనా కాలంలో మీరు ఎలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు? ఎందుకంటే దేశ ప్రజలు దీన్ని టీవీలో గానీ వార్తాపత్రికలలో గానీ చూడరు. అయినా ఒక రుషి లాగా ప్రయోగశాలలో పనిచేస్తున్నారు. కాబట్టి మీరు చెప్పినప్పుడు దేశంలో పని ఎలా జరుగుతుందనే దాని గురించి ప్రజలకు కూడా తెలుస్తుంది.
ప్రకాశ్ గారు: ఢిల్లీ ప్రభుత్వ స్వయంప్రతిపత్తి సంస్థ ఇనిస్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బైలియరీ సైన్సెస్ అనే ఆసుపత్రిలో నేను గత 10 సంవత్సరాలుగా ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాను. నాకు ఈ రంగంలో 22 సంవత్సరాల అనుభవం ఉంది. ఐఎల్‌బిఎస్‌కు ముందే అపోలో హాస్పిటల్, రాజీవ్ గాంధీ క్యాన్సర్ హాస్పిటల్, ఢిల్లీ లోని రోటరీ బ్లడ్ బ్యాంక్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలలో పనిచేశాను. సార్.. నేను ప్రతిచోటా బ్లడ్ బాంక్ విభాగంలో పనిచేసినప్పటికీ గత ఏడాది 2020 ఏప్రిల్ 1 va తేదీ నుండి నేను ILBS వైరాలజీ విభాగం పరిధిలోని కోవిడ్ పరీక్షా ప్రయోగశాలలో పనిచేస్తున్నాను. నిస్సందేహంగా కోవిడ్ మహమ్మారి కారణంగా వైద్య రంగంతో పాటు సంబంధిత అన్ని విభాగాలపై చాలా ఒత్తిడి ఉంది. దేశం, ప్రజలు, సమాజం మా నుండి ఎక్కువ బాధ్యతాయుత తత్వాన్ని, సహకారాన్ని, అధిక సామర్థ్యాన్ని ఆశించడం ఒక అవకాశంగా భావిస్తున్నాను. సార్.. దేశం, ప్రజలు, సమాజం ఆశించే సహకారానికి అనుగుణంగా పనిచేయడం గర్వాన్ని కలిగిస్తుంది. కొన్నిసార్లు మా కుటుంబ సభ్యులు కూడా భయపడినప్పుడు నేను వారికి చెప్తాను- దేశం కోసం అసాధారణ పరిస్థితుల్లో సరిహద్దుల్లో పనిచేసే వారితో పోలిస్తే మేం చేసేది చాలా తక్కువ అని. వారు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఒక విధంగా వారు నాతో కూడా సహకరిస్తారు. తమ సహకారాన్ని కూడా అందిస్తారు.
మోదీ గారు: ప్రకాశ్ గారూ.. ఒక వైపు ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ దూరం ఉంచమని చెబుతోంది. దూరం ఉంచండి. కరోనాలో ఒకరికొకరు దూరంగా ఉండండి. మీరు కరోనా వైరస్ మధ్యలో నివసించాలి. కాబట్టి ఇది ఒక ప్రాణాంతక వ్యవహారం. అప్పుడు కుటుంబం ఆందోళన చెందడం చాలా సహజం. కానీ ఇప్పటికీ ఈ ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం సర్వసాధారణం. మహమ్మారి పరిస్థితులలో పని గంటలు చాలా పెరిగి ఉంటాయి. రాత్రిపూట ల్యాబ్‌లలో గడపాల్సి ఉంటుంది. ఎందుకంటే చాలా కోట్ల మంది ప్రజల నమూనాలను పరీక్షిస్తున్నారు. అప్పుడు భారం కూడా పెరుగుతుంది. కానీ మీ భద్రత కోసం జాగ్రత్తలు తీసుకుంటారా లేదా?
ప్రకాశ్ గారు: తప్పకుండా జాగ్రత్తలు తీసుకుంటాం సార్. మా ILBS ప్రయోగశాల WHO గుర్తింపు పొందింది. కాబట్టి అన్ని ప్రోటోకాల్‌లు అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఉంటాయి. మేం ల్యాబ్‌కు దుస్తుల్లో వెళ్తాం. అలాగే మూడు అంచెలలో పనిచేస్తాం. విసర్జించేందుకు, లేబులింగ్ చేయడానికి, పరీక్షించడానికి పూర్తి ప్రోటోకాల్ ఉంది. అప్పుడు అవి ఆ ప్రోటోకాల్ కింద పనిచేస్తాయి. సార్.. ఇంకా నా కుటుంబం, నా పరిచయస్తులలో చాలామంది ఈ సంక్రమణ నుండి దూరంగా ఉన్నారంటే దైవ కృప కారణం.. జాగ్రత్తగా, సంయమనంతో ఉంటే, దాన్ని నివారించవచ్చు.
మోదీ గారు: : ప్రకాశ్ గారూ.. మీలాంటి వేలాది మంది గత ఒక సంవత్సరం నుండి ల్యాబ్‌లో కూర్చుని చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మందిని రక్షించడానికి కృషి చేస్తున్నారు. ఈ రోజు దేశం ఈ విషయాలన్నీ తెలుసుకుంటుంది. ప్రకాశ్ గారూ.. మీ ద్వారా మీ సహోద్యోగులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. దేశవాసుల తరపున ధన్యవాదాలు. మీరు ఆరోగ్యంగా ఉండండి. మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉండనివ్వండి. మీకు చాలా శుభాకాంక్షలు..
ప్రకాశ్ గారు: ధన్యవాదాలు ప్రధానమంత్రి గారూ.. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు చాలా కృతజ్ఞతలు.
మోదీ గారు: - ధన్యవాదాలు సోదరా..
మిత్రులారా! నేను సోదరుడు ప్రకాశ్ గారితో మాట్లాడాను. కానీ అతని మాటల్లో వేలాది ల్యాబ్ టెక్నీషియన్ల సేవలోని గొప్పదనం మనకు చేరువవుతోంది. ఈ మాటల్లో వేలాది, లక్షలాది ప్రజల సేవాభావం మనకు కనిపిస్తుంది. మనమందరం మన బాధ్యతను కూడా గ్రహించాం. సోదరుడు ప్రకాశ్ గారి లాంటి మన సహోద్యోగులు ఎంతో కష్టపడి, అంకితభావంతో పనిచేస్తున్నారు. అదే అంకితభావంతో వారి సహకారం కరోనాను ఓడించడంలో సహాయపడుతుంది.
నా ప్రియమైన దేశవాసులారా! మనం మన కరోనా యోధుల గురించి మాట్లాడుతున్నాం. గత ఒకటిన్నర సంవత్సరాల్లో వారి అంకితభావాన్ని, కృషిని చూశాం. ఈ పోరాటంలో దేశంలోని అనేక ప్రాంతాల నుండి చాలా మంది యోధులు కూడా పెద్ద పాత్ర పోషిస్తున్నారు. మీరు ఆలోచించండి.. మన దేశంలో ఇంత పెద్ద సంక్షోభం ఏర్పడింది. ఇది దేశంలోని ప్రతి వ్యవస్థను ప్రభావితం చేసింది. ఈ దాడి నుండి వ్యవసాయ వ్యవస్థ చాలా వరకు తనను తాను రక్షించుకుంది. సురక్షితంగా ఉండడమే కాకుండా పురోగతి సాధించింది- మరింత పురోగతి సాధించింది! ఈ మహమ్మారి కాలంలో కూడా మన రైతులు రికార్డు స్థాయిలో వ్యవసాయ ఉత్పత్తులను పెంచారని మీకు తెలుసా? రైతులు రికార్డు స్థాయిలో ఉత్పత్తి చేశారు. కాబట్టి ఈసారి దేశం రికార్డు స్థాయిలో పంటలను కూడా కొనుగోలు చేసింది. ఈ సారి రైతులకు చాలా చోట్ల ఆవాల పంటకు కనీస మద్దతు ధర కంటే ఎక్కువ లభించింది. రికార్డు చేసిన ఆహార ధాన్యాల ఉత్పత్తి వల్ల మన దేశం ప్రతి దేశస్థుడికి సహాయాన్ని అందించగలదు. ఈ సంక్షోభ కాలంలో 80 కోట్ల మంది పేద ప్రజలకు ఉచిత రేషన్ లభిస్తుంది. పెద ప్రజల ఇళ్ళలో పొయ్యి వెలగని రోజు ఉండకూడనే లక్ష్యంతో ఉచిత రేషన్ ను అందిస్తున్నాం.
మిత్రులారా! ఈ రోజు మన దేశంలోని రైతులు అనేక ప్రాంతాలలో కొత్త ఏర్పాట్లను సద్వినియోగం చేసుకొని అద్భుతాలు చేస్తున్నారు. ఉదాహరణకు అగర్తల రైతులను తీసుకోండి! ఈ రైతులు చాలా మంచి పనస పండ్లను ఉత్పత్తి చేస్తారు. వాటి డిమాండ్ దేశ విదేశాలలో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఈసారి అగర్తలరైతులు పనస పండ్లను రైలు ద్వారా గౌహతికి తీసుకువచ్చారు. ఈ జాక్‌ఫ్రూట్‌లను ఇప్పుడు గౌహతి నుండి లండన్‌కు పంపుతున్నారు. అదేవిధంగా మీరు బీహార్‌కు చెందిన 'షాహి లీచీ' పేరును విని ఉంటారు. 2018 లో ప్రభుత్వం ఈ 'షాహి లీచీ'కి జిఐ ట్యాగ్‌ను ఇచ్చింది. తద్వారా దానికి గుర్తింపు లభిస్తుంది. రైతులకు మరింత ప్రయోజనం ఉంటుంది. ఈసారి బీహార్‌కు చెందిన ఓ 'షాహి లీచీ'ని కూడా విమానంలో లండన్‌కు పంపారు. మన దేశం తూర్పు నుండి పడమర వరకు, ఉత్తరం నుండి దక్షిణం వరకు ఇటువంటి ప్రత్యేకమైన రుచులు, ఉత్పత్తులతో నిండి ఉంది. దక్షిణ భారతదేశంలో, విజయనగరంలోని మామిడి పండ్ల గురించి మీరు తప్పక విని ఉంటారు. ఇప్పుడు ఈ మామిడి పండ్లు తినడానికి ఇష్టపడని వారు ఎవరుంటారు? కాబట్టి ఇప్పుడు కిసాన్ రైలు వందల టన్నుల విజయనగరం మామిడిని ఢిల్లీ కి చేరుస్తోంది. దీనివల్ల ఢిల్లీ, ఉత్తర భారతదేశ ప్రజలకు విజయనగరం మామిడిపండ్లు తినడానికి దొరుకుతాయి. విజయనగరం రైతులకు మంచి ఆదాయం లభిస్తుంది. కిసాన్ రైలు ఇప్పటివరకు దాదాపు 2 లక్షల టన్నుల ఉత్పత్తులను రవాణా చేసింది. ఇప్పుడు రైతులు పండ్లు, కూరగాయలు, ధాన్యాలను దేశంలోని ఇతర మారుమూల ప్రాంతాలకు చాలా తక్కువ ఖర్చుతో పంపించగలుగుతున్నారు.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మనం మే 30 న 'మన్ కి బాత్' కార్యక్రమంలో మాట్లాడుకుంటున్నాం. యాదృచ్చికంగా ఇది ఈ ప్రభుత్వానికి 7 సంవత్సరాల కాలం పూర్తి అయ్యే సమయం. కొన్నేళ్లుగా దేశం 'సబ్కా-సాథ్, సబ్కా-వికాస్, సబ్కా-విశ్వాస్' అనే మంత్రాన్ని అనుసరించింది. మనమందరం దేశ సేవలో ప్రతి క్షణం అంకితభావంతో పనిచేశాం. చాలా మంది నాకు లేఖలు పంపారు. 'మన్ కీ బాత్'లో 7 సంవత్సరాల మన ప్రయాణం గురించి కూడా చర్చించాలని చెప్పారు. మిత్రులారా! ఈ 7 సంవత్సరాలలో ఏమైనా సాధించినా అది దేశానికి చెందింది, దేశవాసులది. ఈ సంవత్సరాల్లో మనం జాతీయ గౌరవానికి సంబంధించిన అనేక క్షణాలను కలిసి అనుభవించాం. ఇప్పుడు భారతదేశం ఇతర దేశాల ఒత్తిడికి లోనుకాకుండా, స్వీయ సంకల్పంతో నడుస్తుందని చూస్తే, మనమందరం గర్వపడుతున్నాం. మనకు వ్యతిరేకంగా కుట్ర చేసేవారికి ఇప్పుడు భారతదేశం తగిన సమాధానం ఇస్తుందని చూసినప్పుడు, మన విశ్వాసం పెరుగుతుంది. జాతీయ భద్రత సమస్యలపై భారతదేశం రాజీపడనప్పుడు, మన దళాల బలం పెరిగినప్పుడు మనం సరైన మార్గంలో ఉన్నామని భావిస్తాం.
మిత్రులారా! నేను దేశంలోని ప్రతి మూల నుండి చాలా మంది దేశవాసుల సందేశాలను, వారి లేఖలను అందుకుంటున్నాను. 70 సంవత్సరాల తరువాత విద్యుత్తు మొదటిసారిగా తమ గ్రామానికి చేరుకున్నందుకు, వారి పిల్లలు విద్యుత్తు వెలుగులో ఫ్యాన్ కింద కూర్చుని చదువుకుంటున్నారని చాలా మంది కృతజ్ఞతలు తెలిపారు. తమ గ్రామం కూడా ఇప్పుడు పట్టణానికి రోడ్డు ద్వారా అనుసంధానమైందని ఎంతో మంది అంటున్నారు. రహదారి నిర్మాణం తరువాత మొదటిసారిగా తాము కూడా ప్రపంచంలోని ఇతర ప్రాంతాలతో కలిసిపోయినట్టుగా వారు భావించారని ఒక గిరిజన ప్రాంతానికి చెందిన కొంతమంది సహచరులు నాకు సందేశం పంపారని గుర్తు. అదే విధంగా కొందరు బ్యాంకు ఖాతా తెరిచిన ఆనందాన్ని పంచుకుంటున్నారు. కొందరు వివిధ పథకాల సహాయంతో కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించినప్పుడు ఆ ఆనందంలో నన్ను కూడా భాగస్వామి అయ్యేందుకు ఆహ్వానిస్తాడు. 'ప్రధాన మంత్రి ఆవాస్ యోజన' కింద ఇల్లు పొందిన తరువాత గృహ ప్రవేశానికి ఎందరి నుండో నిరంతరం నాకు చాలా ఆహ్వానాలు వస్తున్నాయి. ఈ 7 సంవత్సరాలలో ఇలాంటి లక్షలాది ఆనందాలలో నేను పాలుపంచుకున్నాను. కొద్ది రోజుల క్రితం గ్రామానికి చెందిన ఒక కుటుంబం 'జల్ జీవన్ మిషన్' కింద ఇంట్లో ఏర్పాటు చేసిన నీటి నల్లా ఫోటోను నాకు పంపింది. అతను ఆ ఫోటోకి 'నా గ్రామానికి చెందిన జీవన్ ధార' అనే శీర్షిక రాశాడు. ఇలాంటి చాలా కుటుంబాలు ఉన్నాయి. స్వాతంత్య్రం వచ్చిన 7 దశాబ్దాలలో మన దేశంలో 3.5 కోట్ల గ్రామీణ కుటుంబాలకు మాత్రమే నీటి కనెక్షన్ ఉంది. కానీ గత 21 నెలల్లో నాలుగున్నర కోట్ల ఇళ్లకు స్వచ్ఛమైన నీటి కనెక్షన్లు లభించాయి. వీటిలో15 నెలలు కరోనా కాలానికి చెందినవి.
'ఆయుష్మాన్ యోజన' ద్వారా ఇలాంటి నమ్మకం దేశంలో వచ్చింది. ఉచిత చికిత్సతో ఎవరైనా పేదవాడు ఆరోగ్యంగా ఇంటికి వచ్చినప్పుడు అతను కొత్త జీవితాన్ని పొండినట్టే భావిస్తాడు. దేశం తనతో ఉందని భరోసా ఏర్పడుతుంది. ఇలాంటి చాలా కుటుంబాల ఆశీర్వచనాలతో, కోట్ల మంది తల్లుల ఆశీర్వాదంతో, మన దేశం దృఢంగా అభివృద్ధి వైపు పయనిస్తోంది.
మిత్రులారా! ఈ 7 సంవత్సరాలలో, 'డిజిటల్ లావాదేవీలలో' ప్రపంచానికి కొత్త దిశను చూపించే పనిని భారతదేశం చేసింది. ఈ రోజు మీరు ఏ ప్రదేశంలోనైనా డిజిటల్ చెల్లింపు తేలికగా చేయగలుగుతున్నారు. ఈ కరోనా సమయంలో కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంది. ఈరోజుల్లో పరిశుభ్రత పై దేశవాసుల ఆసక్తి అప్రమత్తత పెరుగుతోంది. మనం రికార్డ్ ఉపగ్రహాలను కూడా రూపొందిస్తున్నాం. , రికార్డ్ రోడ్లను కూడా తయారు చేస్తున్నాం.
ఈ 7 సంవత్సరాలలో దేశంలోని అనేక పాత వివాదాలు కూడా పూర్తి శాంతి, సామరస్యంతో పరిష్కృతమయ్యాయి. శాంతి, అభివృద్ధిపై కొత్త విశ్వాసం ఈశాన్య ప్రాంతాల నుండి కాశ్మీర్ వరకు పుట్టుకొచ్చింది. మిత్రులారా! దశాబ్దాలుగా చేయలేని ఈ పనులన్నీ ఈ 7 సంవత్సరాలలో ఎలా జరిగాయి? ఇవన్నీ ఎందుకు సాధ్యమయ్యాయంటే ఈ 7 సంవత్సరాలలో మనం ప్రభుత్వం- ప్రజలు అనే భావనకంటే ఎక్కువగా ‘ఒకే దేశం’ అనే భావనతో కలిసి పనిచేశాం. ఒక జట్టుగా పనిచేశాం. 'టీం ఇండియా'గా పనిచేశాం. ప్రతి పౌరుడు దేశాన్ని అభివృద్ధి చేయడంలో కొన్ని అడుగులు వేయడానికి ప్రయత్నించాడు. అవును! విజయాలు ఉన్నచోట పరీక్షలు కూడా ఉంటాయి. ఈ 7 సంవత్సరాలలో మనం కలిసి చాలా కష్టమైన పరీక్షలను ఎదుర్కొన్నాం. ప్రతిసారీ మనమందరం విజయం సాధించాం. దృఢంగా బయటపడ్డాం. కరోనా మహమ్మారి రూపంలో ఇంత పెద్ద పరీక్ష నిరంతరం జరుగుతోంది. ఇది ప్రపంచం మొత్తాన్ని కలవరపెట్టిన సంక్షోభం. ఎంతో మంది తమ ప్రియమైన వారిని కోల్పోయారు. పెద్ద దేశాలు కూడా దాని విధ్వంసం నుండి రక్షణ పొందలేకపోయాయి. ఈ మహమ్మారి కాలంలో 'సేవ, సహకారం' అనే సంకల్పంతో భారత్ ముందుకు సాగుతోంది. కరోనా మొదటి వేవ్‌లో కూడా మనం శక్తిమంతంగా పోరాడాం. ఈసారి కూడా వైరస్ కు వ్యతిరేకంగా పోరాటంలో భారత్ విజయం సాధిస్తుంది.
రెండు గజాల దూరం, మాస్కులకు సంబంధించిన నియమాలను గానీ వ్యాక్సిన్‌కు సంబంధించిన నియమాలను గానీ మనం సడలించాల్సిన అవసరం లేదు. ఇదే మన విజయ మార్గం. తర్వాతిసారి 'మన్ కీ బాత్'లో కలిసినప్పుడు దేశవాసుల మరెన్నో స్ఫూర్తిదాయకమైన ఉదాహరణల గురించి మాట్లాడుకుందాం. కొత్త విషయాల గురించి చర్చిద్దాం. మీ సలహాలను ఇలాగే నాకు పంపుతూ ఉండండి. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి. దేశాన్ని ఇదే విధంగా అభివృద్ధి చేస్తూ ఉండండి. చాలా చాలా ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశవాసులారా. నమస్కారం. మనందరి ధైర్యాన్ని, దుఃఖాన్ని, సహనాన్ని కరోనా పరీక్షిస్తున్న ఈ సమయంలో నేను ఈ ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) ద్వారా మీతో మాట్లాడుతున్నాను. చాలా మంది మనవాళ్లు మనలను అకాలం లో వదలిపెట్టి వెళ్లిపోయారు. కరోనా తాలూకు ఒకటో వేవ్ ను సఫలతపూర్వకంగా ఎదుర్కొన్న తరువాత దేశం ఆత్మవిశ్వాసం తో తొణికిసలాడింది; కానీ ఈ తుపాను దేశాన్ని విచలితం చేసివేసింది.
మిత్రులారా, గతంలో ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి, వివిధ రంగాలకు చెందిన నిపుణులతో నేను సుదీర్ఘంగా చర్చించాను. ఔషధ పరిశ్రమ కు చెందిన వారు, టీకా మందు తయారీదారులు, ఆక్సీజన్ ఉత్పత్తి లో పాల్గొన్న వ్యక్తులు, వైద్య రంగ పరిజ్ఞానం ఉన్న వారు వారి వారి ముఖ్యమైన సలహాల ను ప్రభుత్వానికి అందజేశారు. ఈ సమయం లో- ఈ యుద్ధం లో విజయాన్ని సాధించడానికి నిపుణులు, శాస్త్రవేత్తల సలహాల కు ప్రాధాన్యాన్ని ఇవ్వవలసివుంది. రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నాలను ముందుకు తీసుకుపోవడం లో భారత ప్రభుత్వం పూర్తి శక్తి ని కూడదీసుకొంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటి బాధ్యతలను నెరవేర్చడానికి సకల ప్రయత్నాలు చేస్తున్నాయి.
మిత్రులారా, కరోనా కు వ్యతిరేకం గా ఈ సమయం లో దేశం లోని వైద్యులు , ఆరోగ్య కార్యకర్త లు అతి పెద్ద పోరాటాన్ని చేస్తున్నారు. గత సంవత్సర కాలం లో ఈ వ్యాధి కి సంబంధించి వారికి అన్ని రకాల అనుభవాలు కలిగాయి. మనతో, ఈ వేళ, ముంబయి కి చెందిన ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్ శశాంక్ జోశీ గారు కలిశారు.
డాక్టర్ శశాంక్ గారికి కరోనా చికిత్స, కరోనా తో ముడిపడ్డ పరిశోధన లో చాలా అనుభవం ఉంది. ఆయన, ఇండియన్ కాలేజి ఆఫ్ ఫిజిశియన్స్ డీన్ గా కూడా పనిచేశారు. రండి, డాక్టర్ శశాంక్ తో మాట్లాడుదాం : -
మోదీ గారు: నమస్కారం డాక్టర్ శశాంక్ గారూ.
డాక్టర్ శశాంక్: నమస్కారం సర్.
మోదీ గారు : కొద్ది రోజుల క్రితం మీతో మాట్లాడే అవకాశం నాకు దక్కింది. మీ ఆలోచనలలోని స్పష్టత ను నేను ఇష్టపడ్డాను. దేశం లోని ప్రజలంతా మీ అభిప్రాయాలను తెలుసుకోవాలని నేను భావించాను. మనం వింటున్న విషయాలను నేను మీకు ప్రశ్న గా అందిస్తున్నాను. డాక్టర్ శశాంక్ గారు.. ప్రాణాలను రక్షించే పనిలో మీరు రాత్రింబగళ్లు నిమగ్నమై ఉన్నారు. మొదట మీరు కరోనా రెండో వేవ్ ను గురించి ప్రజల కు చెప్పాలనుకుంటున్నాను. వైద్యం పరంగా ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? ఏయే జాగ్రత్త లు అవసరం?
డాక్టర్ శశాంక్ : ధన్యవాదాలు సర్. ఇది రెండో వేవ్. ఇది వేగం గా వచ్చింది. కాబట్టి ఈ వైరస్ ఒకటో వేవ్ కంటే వేగం గా నడుస్తోంది. అయితే మంచి విషయం ఏమిటంటే, ఈ దశ లో వేగం గా కోలుకుంటున్నారు. మరణాల రేటు చాలా తక్కువ గా ఉంది. ఇందులో రెండు- మూడు తేడా లు ఉన్నాయి. ఇది యువత లో, పిల్లల లో కూడా కొద్ది గా ప్రభావాన్ని కలిగిస్తోంది. గతం లో కరోనా లక్షణాలైన శ్వాస తీసుకోలేకపోవడం, పొడి దగ్గు, జ్వరం- ఇవన్నీ ఉన్నాయి. వాటితో పాటు కొంచెం వాసన తెలియకపోవడం, రుచి తెలియకపోవడం కూడా ఉన్నాయి. ప్రజలు కొద్దిగా భయపడుతున్నారు. భయపడాల్సిన అవసరం లేదు. 80-90 శాతం మందికి ఇందులో ఎలాంటి లక్షణాలు కనిపించవు. ఈ ఉత్పరివర్తనాలు భయాందోళన కు గురి చేసేవి కాదు. మనం బట్టలు మార్చినట్టుగానే వైరస్ కూడా దాని రంగు ను మార్చుకొంటుంది. అందువల్ల భయపడడానికి ఏమీ లేదు. మనం ఈ దశ ను దాటుతాం. వేవ్ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈ వైరస్ వస్తూ పోతూ ఉంటుంది. ఇవి విభిన్నమైన లక్షణాలు. వైద్యం పరంగా మనం జాగ్రత్త గా ఉండాలి. ఇది 14 రోజుల నుంచి 21 రోజుల పాటు పట్టేటటువంటి కోవిడ్ టైమ్ టేబుల్. ఇందులో వైద్యుల సలహా ను తీసుకోవాలి.
మోదీ గారు: డాక్టర్ శశాంక్ గారూ, మీరు చెప్పిన విశ్లేషణ చాలా ఆసక్తికరం గా ఉంది. నాకు చాలా లేఖ లు వచ్చాయి. వాటి ప్రకారం ప్రజల కు చికిత్స ను గురించిన సందేహాలు చాలా ఉన్నాయి. కొన్ని ఔషధాల అవసరం చాలా ఉంది. కాబట్టి కోవిడ్ కు చికిత్స ను గురించి చెప్పండి.
డాక్టర్ శశాంక్: అవును సర్. క్లినికల్ ట్రీట్ మెంట్ ను ప్రజలు చాలా ఆలస్యం గా మొదలుపెడతారు. ఈ వ్యాధి తనంత తాను అణగిపోతుంది అనే భరోసా తో ఉంటారు. మొబైల్ లో వస్తున్న విషయాలను నమ్ముతారు. ఒకవేళ ప్రభుత్వం ఇచ్చిన సమాచారాన్ని అనుసరించారా అంటే ఈ ఇబ్బంది ఎదురు కాదు. కోవిడ్ లో క్లినికల్ ట్రీట్ మెంట్ ప్రోటోకాల్ లో మూడు రకాల తీవ్రత లు ఉన్నాయి. వాటిలో ఒకటోది తేలికపాటి కోవిడ్. రెండోది మధ్యస్థంగా ఉండే కోవిడ్. మూడోది తీవ్రమైన కోవిడ్.
తేలికపాటి కోవిడ్ విషయం లో ఆక్సీజన్ ను, పల్స్ ను, జ్వరాన్ని పరిశీలిస్తూ ఉంటాం. జ్వరం పెరుగుతున్నప్పుడు కొన్ని సార్లు పారాసెటమాల్ వంటి మందులను వాడతాం. కోవిడ్ మధ్యస్థంగా గాని, లేదా తీవ్రంగగా గాని ఉంటే వైద్యుడి ని సంప్రదించడం తప్పనిసరి. సరైన, చౌకైన మందులు అందుబాటు లో ఉన్నాయి. ఈ ఔషధాల్లో ఉండే స్టిరాయిడ్లులు ఇన్ హేలర్ ల లాగా ప్రాణాలను కాపాడతాయి. మందులతో పాటు ఆక్సీజన్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. దీనికి చిన్న చిన్న చికిత్సలు ఉన్నాయి. రెమ్‌డెసివిర్ అని ఒక కొత్త ప్రయోగాత్మక ఔషధం ఉంది. ఈ ఔషధం తో ఉపయోగం ఏమిటంటే దీనివల్ల ఆసుపత్రి లో రెండు, మూడు రోజులు తక్కువ కాలం ఉండవచ్చు. క్లినికల్ రికవరీ లో ఈ ఔషధం కొద్దిగా ఉపయోగపడుతుంది. మొదటి 9-10 రోజులలో ఇచ్చినప్పుడు ఈ ఔషధం పనిచేస్తుంది. దీనిని ఐదు రోజులు మాత్రమే ఇవ్వవలసి ఉంటుంది. రెమ్‌డెసివిర్ వెనుక పరుగెత్తడం ఉండకూడదు. ఈ ఔషధం ఆక్సీజన్ అవసరమైన పరిస్థితుల్లో మాత్రమే- అది కూడా ఆసుపత్రి లో చేరిన తరువాత డాక్టర్ చెప్పినప్పుడే తీసుకోవాలి. ప్రజలందరినీ అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మనం ప్రాణాయామం చేస్తాం. మన ఊపిరితిత్తులను కొద్దిగా విస్తరిస్తాం. రక్తాన్ని పల్చగా చేసే హెపారిన్ అనే ఇంజెక్షన్ మొదలైన చిన్న చిన్న మందులు ఇస్తే 98 శాతం మంది ప్రజల్లో తగ్గిపోతుంది. ఆశావహ దృక్పథాన్ని కలిగి ఉండటం చాలా ముఖ్యం. వైద్యుడి సలహా తో చికిత్స ను పొందడం మరీ ముఖ్యం. ఖరీదైన ఔషధాల వెంట పడవలసిన అవసరం లేదు సర్. మన దగ్గర మంచి చికిత్స ఉంది. ప్రాణవాయువు ఉంది. వెంటిలేటర్ సౌకర్యం కూడా ఉంది. ప్రతిదీ ఉంది. ఈ ఔ షధాలను నిజం గా అవసరమైన వారికి మాత్రమే ఇవ్వాలి. ప్రపంచంలోనే ఉత్తమమైన చికిత్స మనకు అందుబాటులో ఉందని నేను స్పష్టం చేయాలనుకుంటున్నాను సర్. భారతదేశం లో రికవరీ రేటు కూడా ఎక్కువ గా ఉంది. యూరోప్ తో, అమెరికా తో పోలిస్తే మన చికిత్స పద్ధతులు బాగున్నాయి సర్.
మోదీ గారు: చాలా ధన్యవాదాలు డాక్టర్ శశాంక్ గారు. మనకు డాక్టర్ శశాంక్ గారు ఇచ్చిన సమాచారం చాలా ముఖ్యమైంది. మనందరికీ ఉపయోగపడుతుంది.
మిత్రులారా, మీకు ఏదైనా సమాచారం కావాలి అంటే, మీకు ఏవైనా సందేహాలు ఉంటే, అధీకృత సమాచారాన్ని పొందండి. సమీపం లోని వైద్యులను గాని, మీ కుటుంబ వైద్యుడి ని గాని సంప్రదించండి. ఫోన్ ద్వారా వారిని సంప్రదించి, సలహా తీసుకోండి. మన వైద్యులు చాలా మంది ఈ బాధ్యత ను స్వయం గా తీసుకుంటున్న విషయం నేను గమనిస్తున్నాను. చాలా మంది వైద్యులు సోశల్ మీడియా ద్వారా ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్నారు. ఫోన్ ద్వారాను, వాట్సాప్ ద్వారా కూడాను కౌన్సెలింగ్ చేస్తున్నారు. చాలా ఆసుపత్రుల వెబ్సైట్ లలో సైతం సమాచారం అందుబాటు లో ఉంది. ఆ వెబ్ సైట్ ల ద్వారా మీరు వైద్యుల ను సంప్రదించవచ్చు. ఇది చాలా ప్రశంసనీయమైనటువంటి విషయం.
శ్రీనగర్ కు చెందిన వైద్యులు డాక్టర్ నావీద్ నజీర్ శాహ్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. డాక్టర్ నావీద్ శ్రీనగర్ లోని ప్రభుత్వ వైద్య కళాశాల లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయన తన పర్యవేక్షణ లో చాలా మంది కరోనా రోగులకు వ్యాధి ని నయం చేశారు. డాక్టర్ నావీద్ ఈ పవిత్ర రంజాన్ మాసం లో కూడా తన పని ని చేస్తున్నారు. ఆయన మనతో మాట్లాడటానికి కూడా వీలు చేసుకున్నారు. వారితో మాట్లాడుదాం.
మోదీ గారు: నావీద్ గారూ, నమస్కారం.
డాక్టర్ నావీద్ – నమస్కారం సర్.
మోదీ గారు: డాక్టర్ నావీద్ గారూ. ‘మన్ కీ బాత్ ’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) శ్రోత లు ఈ క్లిష్ట సమయం లో పానిక్ మేనేజ్ మెంట్ ప్రశ్నను లేవనెత్తారు. ఆందోళన ను, భయాన్ని దూరం చేసుకునే విషయం లో మీరు మీ అనుభవాన్నుంచి వారికి ఏమని జవాబిస్తారు?
డాక్టర్ నావీద్: కరోనా ప్రారంభమైనప్పుడు మా సిటీ హాస్పిటల్ ‘కోవిడ్ హాస్పిటల్’ గా ప్రత్యేక హోదా ను పొందింది. ఈ వైద్యశాల మెడికల్ కాలేజీ కి అనుబంధం గా ఉంది. ఆ సమయం లో భయానక వాతావరణం నెలకొంది. ఎవరికైనా కోవిడ్ సంక్రమిస్తే దాన్ని మరణశిక్ష గా భావించే వారు. అటువంటి స్థితి లో మా ఆసుపత్రి లో వైద్యులు, పారా-మెడికల్ స్టాఫ్ లో కూడా ఒక భయంకర వాతావరణం ఉండింది. ఈ రోగుల కు ఎలా చికిత్స చేయగలం? మాకు ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదమైతే లేదు కదా? వంటి ప్రశ్న లు వచ్చాయి. అయితే సరైన రక్షణ పద్ధతులను పాటించామా అంటే గనక మనకు సంక్రమణ సోకే ప్రమాదం లేదు. కానీ సరైన రక్షణ పద్ధతులను పాటిస్తే మేము, మాతో పాటు మిగతా సిబ్బంది కూడా సురక్షితంగా ఉండవచ్చని కాలం గడుస్తున్న కొద్దీ మేము చూశాం. చాలా మంది రోగుల లో వ్యాధి లక్షణాలు కూడా లేవు. 90- 95 శాతం కంటే ఎక్కువ మంది రోగుల లో చికిత్స లేకుండానే వ్యాధి నయం అవుతోంది. కాలం గడిచే కొద్దీ కరోనా అంటే భయం తగ్గింది.
ఈ సమయం లో వచ్చిన ఈ రెండో వేవ్ కరోనా విషయంలో కూడా మనం భయపడవలసిన అవసరం లేదు. మాస్క్ ధరించడం, హ్యాండ్ శానిటైజర్ ను ఉపయోగించడం, ఒక మనిషి కి మరొక మనిషికి మధ్య సురక్షిత దూరాన్ని పాటించడం, గుంపులు గా చేరకుండా ఉండడం మొదలైన రక్షణ చర్యల ను పాటిస్తే మనం రోజువారీ పనుల ను చక్కగా చేసుకోవచ్చు. వ్యాధి నుంచి రక్షణ ను పొందవచ్చు.
మోదీ గారు: డాక్టర్ నావీద్ గారు, టీకా మందు తో సహా చాలా విషయాల్లో ప్రజలకు చాలా సందేహాలు ఉన్నాయి. టీకా నుంచి ఎంతమేరకు రక్షణ లభిస్తుంది? టీకా తరువాత ఎంత భరోసా గా ఉండవచ్చు? దీనిని గురించి మీరు చెప్తే శ్రోత ల కు చాలా లాభం కలుగుతుంది.
డాక్టర్ నావీద్: కరోనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు మనకు కోవిడ్ 19 కి ఎటువంటి సమర్థవంతమైన చికిత్స అందుబాటు లో లేదు. అప్పుడు మనం వ్యాధి తో కేవలం రెండు విధాలు గా పోరాడవచ్చును. వాటిలో ఒకటి- రక్షణ ను పొందడం. ఏదైనా సమర్థవంతమైన వ్యాక్సీన్ ఉంటే, వ్యాధి నుంచి బయటపడవచ్చని మనం మొదటి నుంచి అనుకుంటున్నాం. ఈ సమయంలో రెండు టీకా మందు లు మన దేశంలో అందుబాటు లో ఉన్నాయి. కోవాక్సిన్, కోవిశీల్డ్ – రెండూ ఇక్కడే తయారయ్యాయి. కంపెనీ లు నిర్వహించిన ట్రయల్స్ లో వాటి సామర్థ్యం 60 శాతం కంటే ఎక్కువ గా ఉందని తెలిసింది. జమ్ము కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం లో ఇప్పటి వరకు 15 నుండి 16 లక్షల మంది టీకా తీసుకున్నారు. అవును.. సోశల్ మీడియా లో చాలా అపోహలు ఉన్నాయి. దుష్ప్రభావాలు ఉన్నాయన్న భ్రమ లు ఉన్నాయి. కానీ ఇక్కడ టీకా లు వేసిన వారి లో ఎటువంటి దుష్ప్రభావాలు లేవు. జ్వరం, మొత్తం శరీరం లో నొప్పి లేదా ఇంజెక్షన్ ఉన్న చోట మాత్రమే నొప్పి మొదలైనవి ఇతర టీకాల మాదిరిగానే ఈ టీకా తీసుకున్న వారిలో కూడా కనబడుతున్నాయి. ఈ లక్షణాలన్నీ ప్రతి వ్యాక్సీన్ తో సాధారణ సంబంధం కలిగి ఉంటాయి. అంతే తప్ప టీకా వేసుకున్న ఎవరిలోనూ ఎటువంటి ప్రతికూల ప్రభావాన్ని చూడలేదు. అవును.. టీకా లు వేసిన తరువాత కొంత మంది పాజిటివ్ అయ్యారని ప్రజలలో ఒక భయం కూడా ఉంది. ఈ విషయం లో కంపెనీ ల నుండి మార్గదర్శకాలు ఉన్నాయి. ఆ తరువాత ఇన్ఫెక్షన్ ఉండవచ్చు. వారు పాజిటివ్ కావచ్చు. కానీ వ్యాధి తీవ్రత ఎక్కువ గా ఉండదు. అంటే కోవిడ్ పాజిటివ్ ఉన్నా ప్రాణాంతకం అయ్యేటంత ప్రమాదకరం గా నిరూపణ కాజాలదు. ఈ కారణం గా, ఈ వ్యాక్సీన్ ను గురించి అపోహ లు ఏవైనా ఉంటే వాటిని మన మెదడు లో నుంచి తొలగించాలి. మరి మే 1వ తేదీ నుంచి మన యావత్తు దేశం లో 18 సంవత్సరాల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి టీకా మందు ను వేయించే కార్యక్రమం మొదలవుతుందో, అప్పుడు మనం ప్రజలకు విజ్ఞప్తి చేస్తాం. అందరూ వారి వారి వంతు వచ్చిన ప్రకారం టీకా మందు ను తీసుకోవాలి. దాని ద్వారా ఎవరిని వారు రక్షించుకోవడంతో పాటు మొత్తం సమాజాన్ని రక్షించుకోవచ్చు. అందరూ టీకా తీసుకుంటే కోవిడ్ 19 సంక్రమణ నుండి సమాజానికి రక్షణ లభిస్తుంది.
మోదీ గారు: డాక్టర్ నావీద్ గారు మీకు చాలా చాలా ధన్యవాదాలు. మీకు పవిత్ర రంజాన్ నెల తాలూకు అనేకానేక శుభాకాంక్షలు.
డాక్టర్ నావీద్ - బహుత్ బహుత్ శుక్రియా.
మోదీ గారు: మిత్రులారా, ఈ కరోనా సంక్షోభ కాలం లో టీకా ప్రాముఖ్యం అందరికీ తెలుసు. అందువల్ల టీకా ను గురించి ఎటువంటి వదంతులను నమ్మకండి అంటూ మిమ్మల్ని నేను కోరుతున్నాను. ఉచిత వ్యాక్సీన్ ను భారత ప్రభుత్వం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించింది. 45 ఏళ్లు పైబడిన వారు దీనిని సద్వినియోగం చేసుకోవచ్చు. దేశంలో 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ వ్యాక్సీన్ మే 1 నుంచి అందుబాటు లో ఉంటుంది. ఇప్పుడు దేశం లోని కార్పొరేట్ రంగం, కంపెనీ లు తమ ఉద్యోగులకు వ్యాక్సీన్ వేసే ఉద్యమంలో పాల్గొంటాయి. భారత ప్రభుత్వం నుండి ఉచిత వ్యాక్సీన్ అందజేసే కార్యక్రమం ఇకపై కూడా కొనసాగుతుంది. భారత ప్రభుత్వ ఈ ఉచిత వ్యాక్సీన్ ప్రయోజనాలను వీలైనంత ఎక్కువ మందికి విస్తరించాలని రాష్ట్రాల ను నేను కోరుతున్నాను.
మిత్రులారా, అనారోగ్యంలో ఉన్న మనల్ని, మన కుటుంబాలను చూసుకోవడం ఎంత కష్టమో మనందరికీ తెలుసు. మన ఆసుపత్రు ల నర్సింగ్ సిబ్బంది ఒకే సారి చాలా మంది రోగులకు సేవ చేస్తారు. ఈ సేవ మన సమాజానికి గొప్ప బలం. నర్సింగ్ సిబ్బంది కృషి ని గురించి చెప్పగలిగే వారు నర్సులు. అందుకే రాయ్ పుర్ లోని డాక్టర్ బి.ఆర్. అమ్బే డ్ కర్ మెడికల్ కాలేజి హాస్పిటల్ లో తన సేవలను అందిస్తున్న సిస్టర్ భావనా ధ్రువ్ గారి ని ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమానికి) ఆహ్వానించాం. ఆమె చాలా మంది కరోనా రోగుల పట్ల శ్రద్ధ వహిస్తున్నారు. రండి, ఆమెతో మాట్లాడుదాం.
మోదీ గారు: నమస్కారం భావన గారు.
భావన: గౌరవనీయ ప్రధానమంత్రి గారూ, నమస్కారమండి.
మోదీ గారు: భావన గారు.
భావన: యస్ సర్.
మోదీ గారు: ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) వినే వారికి మీరు తప్పక చెప్పాలి. మీ కుటుంబం లో మీకు చాలా బాధ్యత లు ఉన్నాయని; ఎన్నో పనులు ఉన్నాయని. అయినప్పటికీ మీరు కరోనా రోగుల కోసం సేవలను అందిస్తున్నారు. కరోనా రోగుల తో మీ అనుభవాలను గురించి తెలుసుకోవాలి అని దేశవాసులు ఖచ్చితం గా కోరుకుంటారు. ఎందుకంటే రోగి కి దగ్గరగా, ఎక్కువ కాలం ఉండే వారు సిస్టర్లు, నర్సులే. అందువల్ల వారు ప్రతి విషయాన్నీ చాలా సూక్ష్మం గా అర్థం చేసుకోగలరు.
భావన: సర్.. కోవిడ్ లో నా మొత్తం అనుభవం 2 నెలలు సర్. మేము 14 రోజుల డ్యూటీ చేస్తాం. 14 రోజుల తరువాత మాకు విశ్రాంతి లభిస్తుంది. 2 నెలల తరువాత మా కోవిడ్ విధులు రిపీట్ అవుతాయి సర్. నేను మొదటి సారి కోవిడ్ డ్యూటీ చేసినప్పుడు ఈ విషయాన్ని నా కుటుంబ సభ్యులకు చెప్పాను. ఇది మే నెల లో జరిగిన విషయం. నేను ఈ విషయాన్ని పంచుకున్నానో లేదో ఒక్కసారి గా వారంతా భయపడ్డారు. నేనంటే గాభరా కలిగింది. అమ్మా, సరిగ్గా పని చేయి తల్లీ అని నాతో అన్నారు. అది ఒక భావోద్వేగ పరిస్థితి సర్. కోవిడ్ డ్యూటీ చేసే సందర్భం లో నా కుమార్తె నన్ను అడిగింది “అమ్మా! కోవిడ్ డ్యూటీ కి వెళుతున్నావా” అని. అది నాకు చాలా భావోద్వేగ క్షణం. కానీ నేను కోవిడ్ రోగి వద్దకు వెళ్ళినప్పుడు నేను ఇంటి బాధ్యతలను విడచిపెట్టాను. నేను కోవిడ్ రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు అతను మరింత భయపడ్డాడు. రోగులందరూ కోవిడ్ అంటే చాలా భయపడ్డారు సర్. వారికి ఏం జరుగుతుందో, తరువాత మనం ఏం చేస్తామో వారికి అర్థం కాలేదు. వారి భయాన్ని అధిగమించడానికి వారికి చాలా ఆరోగ్యకరమైన వాతావరణాన్ని ఇచ్చాం సర్. ఈ కోవిడ్ డ్యూటీ చేయమని అడిగినప్పుడు ముందుగా పిపిఇ కిట్ వేసుకొమ్మని చెప్పారు. ఇది చాలా కష్టం సార్. పిపిఇ కిట్ వేసుకుని డ్యూటీ చేయడం చాలా కష్టం. ఇది మాకు చాలా కఠినమైన పని. నేను 2 నెలల పాటు పద్నాలుగు, పద్నాలుగేసి రోజులు డ్యూటీ వార్డు లో, ఐసియు లో, ఐసలేశన్ లో ఉన్నాను సర్.
మోదీ గారు: అంటే, మీరు మొత్తం కలుపుకొంటే ఒక సంవత్సరం నుంచి ఈ పని ని చేస్తున్నారన్న మాట.
భావన: అవును సర్. అక్కడికి వెళ్ళే ముందు నా సహోద్యోగులు ఎవరో నాకు తెలియదు. మేము ఒక జట్టు సభ్యుల మాదిరిగా వ్యవహరించాం సర్. వారికి ఉన్న సమస్యల ను గురించి వారికి వివరించాం. వారి గురించి తెలుసుకొని వారి అపవాదు ను దూరం చేశాం సర్.. కోవిడ్ అంటేనే భయపడే చాలా మంది ఉన్నారు. మేం వారి నుండి క్లినికల్ హిస్టరీ ని తీసుకునేటప్పుడు ఆ లక్షణాలన్నీ వాటిలో వస్తాయి. కానీ భయం కారణం గా వారు ఆ పరీక్షల ను చేయించుకోవడానికి సిద్ధంగా లేరు. మేము వారికి వివరించే వాళ్ళం సర్. తీవ్రత పెరిగినప్పుడు అప్పటికే వారి ఊపిరితిత్తుల లోకి ఇన్ఫెక్షన్ వచ్చేది. అప్పుడు వారికి ఐసియు అవసరం ఏర్పడేది. అప్పుడు అతను వచ్చే వాడు. అతని కుటుంబ సభ్యులందరితో కలసి వస్తాడు. మేము అలాంటి 1-2 కేసుల ను చూశాం సర్. మేము ప్రతి వయస్సు వారి తో కలసి పనిచేశాం సర్. వారిలో చిన్న పిల్లలు, మహిళలు, పురుషులు, వృద్ధులు ఉన్నారు. అన్ని రకాల రోగులు ఉన్నారు. మేము వారందరితో మాట్లాడినప్పుడు, భయం వల్ల రాలేదు అని చెప్పే వారు. అందరి నుంచి ఇదే సమాధానం వచ్చింది సర్. అప్పుడు మేము వారికి సర్దిచెప్పాము, ఏమని అంటే, భయపడటానికి ఏమీ లేదు, మీరు మాకు సహకరించండి, మేము మీకు తోడు గా ఉంటాం. మీరు ఏవయితే ప్రోటోకాల్స్ ఉన్నాయో వాటిని అనుసరించండి, అంతే మేము వాళ్లతో ఈ మాత్రం చెప్పగలిగాము సర్.
మోదీ గారు: భావన గారు, మీతో మాట్లాడి నాకు చాలా బాగా అనిపించింది. మీరు ఎంతో మంచి సమాచారాన్ని ఇచ్చారు. మీరు మీ స్వీయ అనుభవం నుంచి ఇచ్చిన సమాచారం. మరి ఇది తప్పక దేశవాసులకు ఓ సానుకూల సందేశాన్ని ఇవ్వగలుగుతుంది. మీకు చాలా చాలా ధన్యవాదాలు భావన గారూ.
భావన గారు: థాంక్యూ సో మచ్ సర్.. థాంక్యూ సో మచ్... జయ్ హింద్ సర్.
మోదీ గారు: జయ్ హింద్.
భావన గారి లాంటి నర్సింగ్ స్టాఫ్ లక్షల కొద్దీ సోదరీమణులు, సోదరులు వారి విధులను చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. ఇది మనందరికీ పెద్ద ప్రేరణగా ఉంది. మీరు ఆరోగ్యం పైన కూడా చాలా శ్రద్ధ తీసుకోండి. మీ కుటుంబాన్ని కూడా జాగ్రత్త గా చూసుకోండి.
మిత్రులారా, బెంగళూరు నుంచి ఈ సమయం లో మనతో సిస్టర్ సురేఖ గారు కూడా జతయ్యారు. సురేఖ గారు కె.సి. జనరల్ హాస్పిటల్ లో సీనియర్ నర్సింగ్ ఆఫీసర్ గా ఉన్నారు. రండి! ఆమె అనుభవాలను కూడా తెలుసుకుందాం.
మోదీ గారు: నమస్తే సురేఖ గారూ.
సురేఖ గారు: మన దేశ ప్రధాన మంత్రి గారితో మాట్లాడడం అంటే అది నాకు నిజం గా గర్వంగాను, గౌరవంగాను ఉంది సర్.
మోదీ గారు: సురేఖ గారు.. మీతో పాటు తోటి నర్సులు, హాస్పిటల్ సిబ్బంది అంతా శ్రేష్ఠమైన పని ని చేస్తున్నారు. మీ అందరికీ భారతదేశం ధన్యవాదాలు పలుకుతోంది. కోవిడ్-19 కి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ యుద్ధం లో మీరు పౌరులకు ఇచ్చే సందేశం ఏమిటి?
సురేఖ: అవును సర్. బాధ్యతాయుతమైన పౌరురాలు గా కొన్ని విషయాలను చెప్పాలనుకుంటున్నాను. దయచేసి మీ పొరుగువారితో వినయంగా ఉండండి. ముందస్తు పరీక్ష లు, సరైన ట్రాకింగ్ మరణాల రేటు ను తగ్గించడానికి మనకు సహాయపడతాయి. అంతేకాకుండా ఏవైనా లక్షణాలు కనిపిస్తే మీ అంతట మీరు గా ఐసలేశన్ లో ఉండండి. సమీపం లోని వైద్యులను సంప్రదించి, వీలైనంత త్వరగా చికిత్స ను పొందండి. మరి, సమాజం ఈ వ్యాధి ని గురించి తెలుసుకోవాలి. సానుకూలంగా ఉండాలి. భయాందోళనలకు గురి కావద్దు, తెగేవరకు కొనితెచ్చుకోకండి. అది రోగి స్థితి ని దిగజార్చుతుంది. మనం మన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. టీకా మందు కూడా వచ్చినందుకు గర్వంగా ఉంది. ఇప్పటికే నేను టీకా తీసుకున్నాను. నా స్వీయ అనుభవం తో భారత పౌరులకు నేను చెప్పాలనుకుంటున్నాను- ఏ వ్యాక్సీన్ కూడా తక్షణం 100 శాతం రక్షణ ను అందించదు. వ్యాధి నిరోధక శక్తి ని పెంపొందించాలి అంటే అందుకు సమయం పడుతుంది. టీకా తీసుకోవడానికి భయపడకండి. దయచేసి టీకా ను వేయించుకోండి. దుష్ప్రభావాలు చాలా తక్కువ గా ఉన్నాయి. ఇంట్లో ఉండండి. ఆరోగ్యం గా ఉండండి. అనారోగ్యం గా ఉన్న వ్యక్తులకు దూరం గా ఉండండి. అనవసరం గా ముక్కు ను, కళ్ళ ను, నోటి ని తాకకుండా ఉండండి. దయచేసి భౌతిక దూరాన్ని పాటించండి. మాస్క్ ను సరిగ్గా తొడుక్కోండి. మీ చేతులను క్రమం తప్పకుండా కడుక్కుంటూ ఉండండి. మీరు ఇంట్లో పాటించే చిట్కాల ను పాటించండి. దయచేసి ఆయుర్వేద కషాయాలను తాగండి. ప్రతి రోజూ ఆవిరి పీల్చడం, పుక్కిలించడం చేయండి. శ్వాస పీల్చే వ్యాయామాన్ని కూడాను మీరు చేయవచ్చు. ఇంకొక విషయం- ఫ్రంట్ లైన్ వర్కర్ లు, వృత్తినిపుణుల పట్ల సానుభూతి తో ఉండండి. మాకు మీ సహకారం అవసరం. మనందరం కలసి పోరాడుదాం. కరోనా మహమ్మారి నుంచి తప్పక బయటపడతాం. ప్రజలకు నా సందేశం ఇదే సర్.
మోదీ గారు: ధన్యవాదాలు సురేఖ గారూ.
సురేఖ: ధన్యవాదాలు సర్.
మోదీ గారు: సురేఖ గారూ.. నిజానికి, మీరు చాలా కష్టమైన కాలం లో ఉద్యమాన్ని సంబాళిస్తున్నారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబానికి కూడా నా తరఫు న అనేకానేక శుభాకాంక్షలు. భావన గారు, సురేఖ గారు వారి అనుభవాల నుంచి చెప్పినట్లు నేను దేశ ప్రజలను కూడా కోరుతున్నాను. కరోనా తో పోరాడడానికి పాజిటివ్ స్పిరిట్ చాలా ముఖ్యం. దేశవాసులు ఈ వైఖరి తో ఉండాలి.
మిత్రులారా, వైద్యులు, నర్సింగ్ సిబ్బంది తో పాటు ల్యాబ్-టెక్నీషియన్ లు , ఏమ్ బ్యులన్స్ డ్రైవర్లు వంటి ఫ్రంట్ లైన్ వర్కర్ లు కూడా దేవుని లాగే పనిచేస్తున్నారు. ఏమ్ బ్యులన్స్ ఏ రోగి వద్దకు అయినా చేరుకున్నప్పుడు వారు రోగి ని డ్రైవర్ ను దేవదూత లా భావిస్తారు. ఈ సేవల ను గురించి, వారి అనుభవాన్ని గురించి దేశం తెలుసుకోవాలి. ప్రస్తుతం మనతో పాటు అలాంటి ఒక మంచి వ్యక్తి ఉన్నారు. ఆయనే శ్రీమాన్ ప్రేమ్ వర్మ గారు. ఆయన ఒక ఏమ్ బ్యులన్స్ డ్రైవర్. ఆయన పేరు సూచించినట్లు ఆయన చాలా మంచివారు. ప్రేమ్ వర్మ గారు తన పని ని, కర్తవ్యాన్ని పూర్తి ప్రేమ తో, అంకితభావం తో చేస్తారు. రండి ఆయన తో మాట్లాడుదాం..
మోదీ గారు: నమస్తే ప్రేమ్ గారూ.
ప్రేమ్ గారు: నమస్తే సర్ జీ.
మోదీ గారు: సోదరా, ప్రేమ్.
ప్రేమ్ గారు: అవునండి సర్.
మోదీ గారు: మీరు పని ని గురించి చెప్పండి.
ప్రేమ్ గారు: అలాగేనండి.
మోదీ గారు: కాస్త వివరంగా తెలియజేయండి. మీ అనుభవాలు ఏవయితే ఉన్నాయో, వాటిని గురించి కూడా చెప్పండి.
ప్రేమ్ గారు: నేను క్యాట్స్ ఏమ్ బ్యులన్స్ లో డ్రైవర్ గా పనిచేస్తున్నాను. కంట్రోల్ నుంచి మాకు టాబ్ లో కాల్ వస్తుంది. 102 నుండి కాల్ వచ్చిన వెంటనే మేం రోగి దగ్గరకు వెళ్తాం. రెండు సంవత్సరాలు గా మేము ఈ పని ని చేస్తున్నాం. మా కిట్ వేసుకుని, చేతి తొడుగులను, మాస్కులను ధరించి, వారు ఎక్కడ డ్రాప్ చేయమని అడిగినా, ఏ ఆసుపత్రిలో అయినా, మేము వీలైనంత త్వరగా వారిని అక్కడికి చేరుస్తాం.
మోదీ గారు: మీకు ఇప్పటికే రెండు వ్యాక్సీన్ డోసులు అంది ఉండాలి కదా.
ప్రేమ్ గారు: ఖచ్చితంగా సర్.
మోదీ గారు: ఇప్పుడు ఇతరులకు టీకా మందు ఇప్పించండి. ఈ విషయం లో మీ సందేశం ఏమిటంటారు?
ప్రేమ్ గారు: సర్. తప్పక చెప్తాను. ప్రతి ఒక్కరికి ఈ టీకా డోసు ను ఇప్పించాలి మరి ఇది కుటుంబానికి కూడాను మంచిదే. మా అమ్మ గారు నాతో అంటారు, ఈ ఉద్యోగం మానివేయమని. నేనన్నాను, అమ్మా, ఒకవేళ నేను కూడా నౌకరీ ని వదలివేసి కూర్చుండిపోతే, అప్పుడు మిగతా రోగులందరినీ ఎవరు తీసుకువెళ్తారు అని. ఎందుకంటే అందరూ ఈ కరోనా కాలం లో పరారవుతున్నారు. అంతా ఉద్యోగాలు వదలివేసి పోతున్నారు. మా అమ్మ కూడా నాతో అంటోంది, ఏమని అంటే అబ్బాయీ, కొలువు ను వదలిపెట్టేసెయ్ అని. నేను అన్నాను ఉహు, అమ్మా నేను ఉద్యోగాన్ని వదలిపెట్టను అని.
మోదీ గారు: ప్రేమ్ గారు, అమ్మ కు దు:ఖం కలిగేటట్టు నడుచుకోవద్దు. అమ్మ కు అర్థమయ్యేటట్టు చెప్పండి.
ప్రేమ్ గారు: సరేనండి.
మోదీ గారు: కానీ మీరు మీ అమ్మ గురించి చెప్పిన విషయం.
ప్రేమ్ గారు: సర్.
మోదీ గారు: అయితే మీరు మీ అమ్మ గారి విషయం చెప్పారు చూడండి.
ప్రేమ్ గారు: అవునండి.
మోదీ గారు: ఆ సంగతి మనస్సు కు ఎంతో హత్తుకుంటున్నది.
ప్రేమ్ గారు: మరేనండి.
మోదీ గారు: నా ప్రణామాలు చెప్పండి.
ప్రేమ్ గారు: తప్పకుండానండి.
మోదీ గారు: ఆఁ.
ప్రేమ్ గారు: అలాగేనండి.
మోదీ గారు: మరి ప్రేమ్ గారూ నేను మీ ద్వారా..
ప్రేమ్ గారు: అవునండి.
మోదీ గారు: ఈ ఏమ్ బ్యులన్స్ లను నడుపుతున్న మన డ్రైవర్ లు కూడా.
ప్రేమ్ గారు: అవునండి.
మోదీ గారు: ఎంత పెద్ద రిస్క్ తీసుకొని, ఈ పని ని చేస్తున్నారో కదా.
ప్రేమ్ గారు: అవును సర్
మోదీ గారు: వీరిలో ప్రతి ఒక్కరి అమ్మ గారు ఏం ఆలోచిస్తుంటారు?
ప్రేమ్ గారు: నిజమే సర్.
మోదీ గారు: ఈ విషయం శ్రోత ల వరకు చేరితేనో.
ప్రేమ్ గారు: మరేనండి.
మోదీ గారు: నేను తప్పక అనుకుంటాను ఏమని అంటే ఈ విషయం శ్రోత ల
మనస్సు కు కూడా హత్తుకుంటుంది అని.
ప్రేమ్ గారు: అవును సర్.
మోదీ గారు: ప్రేమ్ గారు చాలా చాలా ధన్యవాదాలు. మీరు ఒక విధం గా ప్రేమ తాలూకు గంగ ను ప్రవహింప జేస్తున్నారు.
ప్రేమ్ గారు: ధన్యవాదాలు సర్ గారు.
మోదీ గారు: ధన్యవాదాలు సోదరా.
ప్రేమ్ గారు: ధన్యవాదాలు.
మిత్రులారా, ప్రేమ్ వర్మ గారి లాంటి వేల కొద్దీ మంది ఈ రోజు న వారి జీవితాలను పణం గా పెట్టి మరీ ప్రజలకు సేవ చేస్తున్నారు. కరోనా కు వ్యతిరేకం గా ఈ పోరాటం లో ఎన్నో జీవితాల రక్షణ లో ఏమ్ బ్యులన్స్ డ్రైవర్ లు కూడా చాలా సహకరించారు. ప్రేమ్గారూ.. మీకు, దేశవ్యాప్తంగా మీ సహోద్యోగులందరికీ చాలా చాలా కృతజ్ఞతలు. మీరు సమయాన్ని చేరుకుంటూ ఉండండి. జీవితాలను కాపాడుతూ ఉండండి.
ప్రియమైన నా దేశవాసులారా, చాలా మంది కరోనా బారి న పడుతున్నారన్నది నిజం. అయితే, కరోనా నుంచి నయమవుతున్న వారి సంఖ్య కూడా అంతే ఎక్కువ గా ఉంది. గురుగ్రామ్ కు చెందిన ప్రీతి చతుర్వేది గారు కూడా ఇటీవల కరోనా ను ఓడించారు. ప్రీతి గారు ఈరోజు ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో మన తో మాట్లాడడానికి జత కలిశారు. వారి అనుభవాలు మనందరికీ చాలా ఉపయోగపడుతాయి.
మోదీ గారు: ప్రీతి గారు, నమస్కారం.
ప్రీతి గారు: నమస్తే సర్. ఎలా ఉన్నారు మీరు?
మోదీ గారు: నేను బాగున్నానండి. అన్నిటికంటే ముందు గా నేను మీ కోవిడ్ -19 తో
ప్రీతి గారు: మరేనండి.
మోదీ గారు: పోరాడడం లో సఫలం అయినందుకు గాను
ప్రీతి గారు: సర్.
మోదీ గారు: కొనియాడాలనుకొంటున్నాను.
ప్రీతి గారు: చాలా ధన్యవాదాలు సర్.
మోదీ గారు: మీరు మరింత త్వరగా పూర్తి ఆరోగ్యం పొందాలని కోరుకుంటున్నాను.
ప్రీతి గారు: థేంక్ యు సో మచ్ సర్.
మోదీ గారు: నేను కోరుకొనేది ఏమిటి అంటే, మీ ఆరోగ్యం మరింత త్వరగా మెరుగుపడాలి అని.
ప్రీతి గారు: ధన్యవాదాలు సర్.
మోదీ గారు: ప్రీతి గారు
ప్రీతి గారు: సర్.
మోదీ గారు: ఈ వేవ్ లో కేవలం మీకు ఒక్కరికే కరోనా వచ్చిందా, లేక కుటుంబం లోని ఇతర సభ్యులు కూడా ఇందులో చిక్కుకున్నారా?
ప్రీతి గారు: లేదు.. లేదు సర్. నేను ఒక్కదానినే దీని బారిన పడ్డాను.
మోదీ గారు: సరే లెండి. భగవంతుడి కృప. సరే, నేను అనుకోవడం.
ప్రీతి గారు: సర్ చెప్పండి.
మోదీ గారు: ఏమిటంటే, మీరు ఈ వేదనాభరిత స్థితి తాలూకు కొన్ని అనుభవాలను ఒకవేళ వెల్లడించారా అంటే అప్పుడు వినే శ్రోతలకు కూడాను ఇలాంటి వేళ లో ఎలా వారిని వారు సంబాళించుకోవాలో అనే విషయంలో మార్గదర్శకత్వం లభిస్తుంది.
ప్రీతి గారు: సర్.. తప్పకుండా. ప్రారంభిక దశ లో నాకు చాలా బద్ధకం వచ్చింది. అంటే చాలా నీరసం గా ఉన్నాను. మరి ఆ తరువాత నా గొంతు లో కొంచెం నొప్పి గా అనిపించింది. కాబట్టి ఆ తరువాత ఈ లక్షణాలున్నాయి కాబట్టి పరీక్ష చేయించుకున్నా. రెండో రోజు రిపోర్ట్ వచ్చిన వెంటనే నాకు ఎప్పుడయితే పాజిటివ్ అని తెలిసిందో, నన్ను నేను క్వారంటైన్ చేసేసుకున్నాను. ఒక గది లో ఏకాంతం గా ఉంటూ, వైద్యులను సంప్రదించాను. వారు ఇచ్చిన మందులను వేసుకోవడం మొదలుపెట్టేశాను.
మోదీ గారు: అంటే మీ కుటుంబ సభ్యులు బయటపడ్డారన్న మాట మీరు సత్వర చర్య తీసుకున్నందువల్ల.
ప్రీతి గారు: సర్. మా కుటుంబం లో మిగతా వారికి కూడా తరువాత పరీక్ష చేయించడం జరిగింది. మిగతా అందరికీ నెగెటివ్ వచ్చింది. నాకొక్కరికే పాజిటివ్ వచ్చింది. అంతకు ముందు నా అంతట నేను ఒక గది లోపల ఐసలేశన్ లో ఉండిపోయాను. నాకు అవసరమైన అన్ని వస్తువులను అట్టిపెట్టుకొని తరువాత నా అంతట నేను గది లో ఉండిపోయాను. మరి నేను డాక్టర్ సలహా తో మందులు తీసుకోవడం ప్రారంభించాను. సర్.. మందులతో పాటు నేను యోగ, ఆయుర్వేదిక ఔషధాలు అవీ తీసుకోవడం మొదలుపెట్టాను. నేను కషాయాన్ని సేవించడం కూడా చేశాను. వ్యాధి నిరోధక శక్తి ని పెంచడానికి పగటి పూట భోజనం లో మాంసకృత్తులు పుష్కలంగా ఉండే ఆహార పదార్థాలు, వాటిని తీసుకున్నాను. నేను ద్రవాలను చాలా ఎక్కువ గా తాగాను. నీటి ఆవిరి ని తీసుకున్నాను. వేడి నీటి ని తీసుకుని పుక్కిలించాను. నేను రోజంతా ఇవే చేస్తూ వచ్చాను. సర్.. అన్నింటి కంటే నేను చెప్పదలుస్తున్న అతి ప్రధానమైన విషయం ఏమిటి అంటే అస్సలు గాభరాపడలేదు. మానసికం గా చాలా దృఢం గా ఉండాలి. దీని కోసం నేను చాలాసేపు యోగా ను, శ్వాసను పీల్చే కసరత్తు ను చేసేదాన్ని. అలా చేయడం వల్ల బాగా అనిపించేది.
మోదీ గారు: అవును. సరే, ప్రీతి గారు, ఇక మీ ప్రక్రియ ముగిసిపోయిది; మీరు గండం నుంచి బయటపడిపోయారు.
ప్రీతి గారు: అవునండి.
మోదీ గారు: ఇప్పుడు మీ టెస్ట్ లో కూడాను నెగిటివ్ అని వచ్చింది.
ప్రీతి గారు: అవును సర్.
మోదీ గారు: మరి మీరు మీ ఆరోగ్యం గురించి, దీని సంరక్షణ గురించి ఇప్పుడు ఏమి చేస్తున్నారు?
ప్రీతి గారు: సర్.. ఒకటి, నేను యోగ ను ఆపివేయనేలేదు.
మోదీ గారు: అవునా..
ప్రీతి గారు: అవును సర్. నేను ఇప్పటికీ కషాయాన్ని తీసుకుంటున్నాను. నా వ్యాధి నిరోధక శక్తి ని పెంచుకోవడానికి నేను ఇప్పుడు మంచి ఆరోగ్య కరమైన ఆహారాన్ని తీసుకుంటున్నాను.
మోదీ గారు: ఓ, అలాగా.
ప్రీతి గారు: నేను చాలా నిర్లక్ష్యం గా ఉండేదానిని. ఆ విషయం లో నేను చాలా శ్రద్ధ తీసుకొంటున్నాను.
మోదీ గారు: ధన్యవాదాలు ప్రీతి గారు.
ప్రీతి గారు: థేంక్ యు సోమచ్ సర్.
మోదీ గారు: మీరు అందజేసిన సమాచారం నాకనిపిస్తోంది, ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అని. మీరు ఆరోగ్యం గా ఉండాలి. మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యం గా ఉండాలి. మీకు నా తరఫున చాలా చాలా శుభాకాంక్షలు.
ప్రియమైన నా దేశవాసులారా, ఈ రోజు మన వైద్య రంగం లోని వారు, ఫ్రంట్ లైన్ వర్కర్ లు రాత్రనక పగలనక సేవా కార్యాల లో తలమునకలు అయి ఉన్నారు. అదే విధం గా, సమాజం లోని ఇతర వ్యక్తులు కూడా ఈ సమయం లో వెనుకబడి లేరు. దేశం మరో సారి ఒక్కటై కరోనా కు వ్యతిరేకం గా పోరాడుతోంది. ఈ రోజుల్లో నేను గమనిస్తున్నాను, కొందరు క్వారంటైన్ లో ఉన్న కుటుంబాలకు మందులను చేరవేస్తున్నారు, మరి కొందరేమో కాయగూరలు, పాలు, పండ్లు మొదలైనవి అందిస్తున్నారు. కొంత మంది రోగుల కు ఉచితం గా ఏమ్ బ్యులన్స్ సేవల ను సమకూర్చుతున్నారు. దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈ సవాలు నిండిన సమయం లోనూ స్వయం సేవ సంస్థ లు ముందుకు వచ్చి ఇతరులకు సహాయం గా అవి ఏమి చేయగలవో ఆ పనులన్నీ చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈసారి గ్రామాలలో కూడా కొత్త అవగాహన కనిపిస్తోంది. కోవిడ్ నియమాలను ఖచ్చితంగా పాటించడం ద్వారా ప్రజలు తమ గ్రామాన్ని కరోనా నుంచి రక్షించుకొంటున్నారు. బయటి నుండి వస్తున్న వారికి సరైన ఏర్పాటులను కూడా చేస్తున్నారు. తమ ప్రాంతం లో కరోనా కేసులు పెరగకుండా ఉండడానికి నగరాలలో కూడా స్థానిక ప్రజలతో కలసి పనిచేయడానికి చాలా మంది యువకులు ముందుకు వచ్చారు. అంటే ఒకవైపు దేశం రాత్రింబగళ్లు ఆసుపత్రులు, వెంటిలేటర్ లు, మందుల కోసం పని చేస్తుంటే మరో వైపు దేశవాసులు కూడా మనస్పూర్తి గా కరోనా ను ఎదుర్కొంటున్నారు. ఈ భావన మనకు ఎంతటి బలాన్ని, ఎంతటి విశ్వాసాన్ని ఇస్తుందో కదా. ఈ ప్రయాసలు ఏవయితే జరుగుతున్నాయో, ఇవన్నీ సమాజానికి గొప్ప సేవ ను చేయడమే అవుతాయి. ఇవి సమాజం తాలూకు శక్తి ని పెంచుతాయి.
ప్రియమైన నా దేశవాసులారా, ఈ రోజు మనం ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) మొత్తం చర్చ ను కరోనా మహమ్మారి పై చేశాం. ఎందుకంటే ఈ రోజు ఈ వ్యాధి ని ఓడించడమే మన పెద్ద ప్రాధాన్యం. ఈ రోజు భగవాన్ మహావీర్ జయంతి. ఈ సందర్భం లో దేశవాసులందరినీ అభినందిస్తున్నాను. మహావీరుని సందేశం మనకు స్వీయ నిగ్రహం విషయం లో స్ఫూర్తిని ఇస్తుంది. ప్రస్తుతం పవిత్ర రంజాన్ మాసం కూడా జరుగుతోంది. ఇకపై బుద్ధ పూర్ణిమ రానుంది. గురు తేగ్ బహాదుర్ జీ 400 వ ప్రకాశ్ పర్వ్ కూడా ఉంది. ఒక ముఖ్యమైన పోచిశే బోయిశాఖ్ -టాగోర్ జయంతి అది. ఇవి అన్నీ మన కర్తవ్యాలను నిర్వర్తించడానికి మనకు ప్రేరణ ను అందిస్తాయి. ఒక పౌరుని గా మనం మన జీవనం లో ఎంతటి కుశలత తో మన విధులను నిర్వర్తిస్తామో. సంక్షోభం నుంచి బయటపడి భవిష్యత్తు మార్గం లో అంతే వేగం గా ముందంజ వేయగలం. ఈ ఆకాంక్ష తో నేను మీ అందరికీ మరొక్క మారు చేసే విజ్ఞప్తి ఏమిటి అంటే అది- మనందరమూ వ్యాక్సీన్ ను వేయించుకోవాలి, దాంతో పాటు పూర్తి జాగ్రత తో ఉండాలి- అనేదే. ‘దవాయీ భీ కడాయీ భీ’ (మందుల తో పాటు కఠిన నియమాల పాలన కూడాను). ఈ మంత్రాన్ని ఎప్పటికీ మర్చిపోవద్దు. మనం త్వరలోనే కలిసికట్టు గా ఈ ఆపద నుంచి బయటపడతాం. ఈ విశ్వాసం తో, మీకు అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం!! ఈసారి నేను 'మన్ కీ బాత్' కోసం వచ్చిన ఉత్తరాలు, వ్యాఖ్యలు, ఇన్ పుట్స్ పై నా దృష్టిని పరుగులు పెట్టించినప్పుడు చాలా మంది అత్యంత ముఖ్యమైన విషయాన్ని గుర్తుకు తెచ్చారని గమనించాను. మైగవ్‌లో ఆర్యన్ శ్రీ గారు, బెంగళూరు నుండి అనూప్ రావు గారు, నోయిడా నుండి దేవేష్ గారు, థానే నుండి సుజిత్ గారు – వీళ్ళందరూ చెప్పారు – “మోదీ గారు.. ఈసారి 'మన్ కి బాత్' 75 వ ఎపిసోడ్. ఈ సందర్భంగా మీకు అభినందనలు” అని. ఇంత సునిశిత దృష్టితో మీరు 'మన్ కీ బాత్' ను అనుసరించినందుకు, కనెక్ట్ అయినందుకు నేను చాలా చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇది నాకు చాలా గర్వకారణం. ఆనందకరమైన విషయం. నా వైపు నుండి మీకు ధన్యవాదాలు. 'మన్ కీ బాత్' శ్రోతలందరికీ కృతజ్ఞతలు. ఎందుకంటే మీరు లేకుండా ఈ ప్రయాణం సాధ్యపడేది కాదు. మనమందరం కలిసి ఈ సైద్ధాంతిక ప్రయాణాన్ని నిన్ననే ప్రారంభించామనిపిస్తుంది. ఆరోజు 2014 అక్టోబరు 3వ తేదీ విజయదశమి- ఒక పవిత్ర పర్వదినం. యాదృచ్చికంగా చూడండి- ఈ రోజు కామ దహనం జరుపుకుంటున్నాం. ఒక్క దీపంతో కాలిపోయి, మరోవైపు దేశం ప్రకాశించాలి. ఈ భావనతో ప్రయాణిస్తూ మనం ఈ మార్గాన్ని నిర్ధారించాం.
దేశంలోని ప్రతి మూలలోని ప్రజలతో మేం సంభాషించాం. వారి అసాధారణమైన పనుల గురించి తెలుసుకున్నాం. మన దేశంలోని మారుమూల ప్రాంతాల్లో కూడా ఎలాంటి అపూర్వమైన సామర్థ్యం ఉందో కూడా మీరు అనుభవించి ఉండాలి. భారతమాత ఒడిలో ఎంత అద్భుతమైన రత్నాలు పెరుగుతున్నాయి! ఒక సమాజాన్ని చూడడం, సమాజాన్ని తెలుసుకోవడం, సమాజ సామర్థ్యాన్ని గుర్తించడం నాకు ఒక అద్భుతమైన అనుభవం. ఈ 75 ఎపిసోడ్ల ద్వారా ఎన్ని అంశాలను చర్చించుకున్నాం! కొన్నిసార్లు నదుల గురించి, కొన్నిసార్లు హిమాలయాల శిఖరాల గురించి, కొన్నిసార్లు ఎడారుల విషయం, కొన్నిసార్లు ప్రకృతి విపత్తు విషయం, కొన్నిసార్లు మానవ సేవకు సంబంధించిన అసంఖ్యాక కథల అనుభూతి, కొన్నిసార్లు సాంకేతిక పరిజ్ఞానం ఆవిష్కరణ, కొన్నిసార్లు మనకు తెలియని మారుమూల ప్రాంతంలో ఏదో ఒక విషయాన్ని చేసి చూపించే అంశం.. ఇలా ఎన్నో విషయాలను చర్చించాం. పరిశుభ్రతకు సంబంధించిన విషయం, మన వారసత్వ పరిరక్షణ- ఇవి మాత్రమే కాదు, బొమ్మలు తయారుచేసే విషయం కూడా. చర్చించని విషయం ఏముంది? మనం లెక్కలేనన్ని అంశాలను చర్చించాం. భారతదేశ నిర్మాణంలో భాగస్వాములైన గొప్ప వ్యక్తులకు సందర్భానుసారం నివాళి అర్పించాం. వారి గురించి తెలుసుకున్నాం. అనేక అంతర్జాతీయ అంశాలపై కూడా చర్చించాం. వారి నుండి ప్రేరణ పొందటానికి ప్రయత్నించాం. మీరు నాకు చాలా విషయాలు చెప్పారు. చాలా ఆలోచనలు ఇచ్చారు. ఒక విధంగా ఈ ఆలోచన ప్రయాణంలో మీరు కలిసి నడిచారు. అనుసంధానమయ్యారు. కొత్త విషయాలను జోడించారు. 'మన్ కీ బాత్' ను విజయవంతం చేసినందుకు, సుసంపన్నం చేసినందుకు, ఈ కార్యక్రమంతో కనెక్ట్ అయినందుకు ఈ రోజు- ఈ 75 వ ఎపిసోడ్ సమయంలో- ప్రతి శ్రోతకు నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు నాకు ఎంత ఆనందంగా ఉందో చూడండి. ఒకవైపు 75 వ 'మన్ కీ బాత్'లో మాట్లాడే అవకాశం. మరోవైపు 75 సంవత్సరాల స్వాతంత్ర్య ఉత్సవాలు 'అమృత్ మహోత్సవ్' ఈ నెలలోనే ప్రారంభం కావడం. అమృత్ మహోత్సవ్ దండి యాత్ర రోజు నుండి ప్రారంభమైంది. 2023 ఆగస్టు 15 వరకు కొనసాగుతుంది. 'అమృత్ మహోత్సవ్'కు సంబంధించిన కార్యక్రమాలు దేశవ్యాప్తంగా నిరంతరం జరుగుతున్నాయి. ప్రజలు వివిధ ప్రాంతాల నుండి ఈ కార్యక్రమాల చిత్రాలను, సమాచారాన్ని పంచుకుంటున్నారు. జార్ఖండ్‌కు చెందిన నవీన్ గారు ఇలాంటి కొన్ని చిత్రాలతో పాటు నాకు ఒక సందేశాన్ని నమోఆప్‌లో పంపారు. తాను 'అమృత్ మహోత్సవ్' కార్యక్రమాలను చూశానని, తాను కూడా స్వాతంత్య్ర సంగ్రామంతో సంబంధం ఉన్న కనీసం 10 ప్రదేశాలను సందర్శించాలని నిర్ణయించుకున్నానని ఆయన రాశారు. ఆయన జాబితాలో మొదటి పేరు భగవాన్ బిర్సా ముండా జన్మస్థలం. జార్ఖండ్‌కు చెందిన గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల కథలను దేశంలోని ఇతర ప్రాంతాలకు తీసుకెళ్తామని నవీన్ రాశారు. మీ ఆలోచనకు నేను మిమ్మల్ని అభినందిస్తున్నాను నవీన్ గారూ.
మిత్రులారా! ఎవరైనా స్వాతంత్ర్య సమరయోధుడి గాథ కావచ్చు. ఒక ప్రదేశం చరిత్ర కావచ్చు. దేశ సాంస్కృతిక కథ కావచ్చు. 'అమృత్ మహోత్సవ్' సందర్భంగా మీరు దానిని ప్రస్తావనకు తీసుకురావచ్చు. అది దేశ ప్రజలను అనుసంధానించే మాధ్యమంగా మారవచ్చు. చూస్తూ ఉండగానే 'అమృత్ మహోత్సవ్' చాలా ఉత్తేజకరమైన అమృత బిందువులతో నిండి పోతుంది. ఆపై అలాంటి అమృత ధార ప్రవహిస్తుంది. ఇది భారతదేశ స్వాతంత్య్రం వచ్చిన వంద సంవత్సరాల వరకు మనకు స్ఫూర్తినిస్తుంది. దేశాన్ని కొత్త ఎత్తులకు తీసుకువెళుతుంది. ఏదైనా చేయాలనే అభిరుచిని ఏర్పరుస్తుంది. దేశం కోసం త్యాగం చేయడాన్ని, బలిదానాలను తమ కర్తవ్యంగా మన స్వాతంత్ర్య సమర యోధులు భావించారు. అందుకే ఎన్నో కష్టాలను ఓర్చుకున్నారు. వారి త్యాగం, బలిదానాల కథలు మనలను కర్తవ్య పథం వైపు ప్రేరేపిస్తాయి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో చెప్పినట్లుగా –
నియతం కురు కర్మ త్వం కర్మ జ్యాయో హయకర్మణ:
అదే మనోభావంతో మనమందరం మన విధులను పూర్తి నిష్ఠతో నిర్వహించాలి. మనం కొత్త నిర్ణయాలు తీసుకోవడమే 'అమృత్ మహోత్సవ్' లక్ష్యం. ఆ నిర్ణయాల నుండి ఫలితం పొందేందుకు మనస్ఫూర్తిగా పాల్గొనండి. ఆ సంకల్పం సమాజానికి మంచి చేసేది కావాలి. ఆ సంకల్పం దేశం బాగు కోసం, భారతదేశం ఉజ్వల భవిష్యత్తు కోసం ఉండాలి. ఆ తీర్మానంలో మన విధులు కూడా ఉండాలి. మన బాధ్యతలు ఉండాలి. భగవద్గీతను అనుసరించడానికి ఇది సువర్ణావకాశమని నేను నమ్ముతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! గత సంవత్సరంలో ఇదే మార్చినెలలో దేశం జనతా కర్ఫ్యూ అనే పదాన్ని తొలిసారిగా విన్నది. కానీ ఈ గొప్ప దేశం లోని గొప్ప విషయాల గొప్ప శక్తి అనుభవాన్ని చూడండి. జనతా కర్ఫ్యూ మొత్తం ప్రపంచానికి ఆశ్చర్యం కలిగించింది. ఇది క్రమశిక్షణకు అపూర్వమైన ఉదాహరణ. రాబోయే తరాలు ఖచ్చితంగా ఈ విషయం గురించి తప్పకుండా గర్వపడతాయి. అదే విధంగా కరోనా యోధులకు గౌరవం, వారిని ఆదరించడం, ప్లేట్లను(పళ్లాలను) కొట్టడం, చప్పట్లు కొట్టడం, దీపం వెలిగించడం.. ఇవన్నీ కరోనా యోధుల హృదయాన్ని ఎంతగా తాకాయో మీరు ఊహించలేరు. ఏడాది పొడవునా వారు అలసట లేకుండా నిరంతరాయంగా పనిచేయడానికి కారణం అదే. దేశంలోని ప్రతి పౌరుడి ప్రాణాలను కాపాడడానికి వారు తమ ప్రాణాలకు తెగించి కష్టపడ్డారు. గత సంవత్సరం ఈ సమయంలో కరోనా వ్యాక్సిన్ ఎప్పటివరకు వస్తుందనేది ప్రశ్నగా ఉండేది. మిత్రులారా! ఈ రోజు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద టీకా కార్యక్రమాన్ని నిర్వహిస్తుండటం మనందరికీ గర్వకారణం. టీకా కార్యక్రమం ఛాయాచిత్రాల గురించి భువనేశ్వర్‌కు చెందిన పుష్ప శుక్లా గారు నాకు రాశారు. టీకా తీసుకోవడంపై వృద్ధులు చూపిన ఉత్సాహం గురించి 'మన్ కి బాత్' లో నేను చర్చించాలని వారు అన్నారు. మిత్రులారా! నిజమే. దేశంలోని ప్రతి మూల నుండి మనం అలాంటి వార్తలను వింటున్నాం. మన హృదయాలను తాకే అలాంటి చిత్రాలను చూస్తున్నాం. యూపీలోని జౌన్‌పూర్‌లో 109 ఏళ్ల వృద్ధురాలు రామ్ దులైయా గారు టీకా తీసుకున్నారు. ఢిల్లీ లో కూడా 107 ఏళ్ల కేవల్ కృష్ణ గారు టీకా తీసుకున్నారు. హైదరాబాద్‌లో 100 సంవత్సరాల వయసున్న జై చౌదరి టీకా తీసుకోవాడమే కాకుండా అందరూ టీకా తప్పనిసరిగా తీసుకోవాలని అందరికీ విజ్ఞప్తి కూడా చేశారు. టీకాలు వేసిన తర్వాత ప్రజలు తమ పెద్దల ఫోటోలను ఎలా అప్లోడ్ చేస్తున్నారో నేను ట్విట్టర్ లో, ఫేస్బుక్లో చూస్తున్నాను. కేరళకు చెందిన ఆనందన్ నాయర్ అనే యువకుడు దీనికి 'వాక్సిన్ సేవ' అనే కొత్త పదాన్ని ఇచ్చారు. ఇలాంటి సందేశాలను ఢిల్లీ కి చెందిన శివానీ, హిమాచల్ నుండి హిమాన్షు , ఇంకా చాలా మంది ఇతర యువకులు పంపారు. మీ శ్రోతలందరి అభిప్రాయాలను నేను అభినందిస్తున్నాను. వీటన్నిటి మధ్యలో కరోనాతో పోరాట మంత్రాన్ని గుర్తుంచుకోండి- ‘మందులు కూడా- కఠినమైన ముందు జాగ్రత్తలు కూడా’ – 'దవాయీ భీ – కడాయి భీ'. మనం జీవించాలి. మాట్లాడాలి. చెప్పాలి. మందులతో పాటు కఠిన నియమాలను కూడా పాటించాలని. దీనికి మనం కట్టుబడి ఉండాలి.
నా ప్రియమైన దేశవాసులారా! ఇండోర్‌లో నివసిస్తున్న సౌమ్య గారికి ఈ రోజు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఒక విషయం లో ఆమె నా దృష్టిని ఆకర్షించారు. దాన్ని మన్ కి బాత్ లో ప్రస్తావించమని కోరారు. ఈ అంశం క్రికెటర్ మిథాలీ రాజ్ గారి కొత్త రికార్డు. అంతర్జాతీయ క్రికెట్లో 10,000 పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్‌గా మిథాలీ గారు ఇటీవల రికార్డు సాధించారు. ఇందుకు మిథాలీ రాజ్ గారికి చాలా చాలా అభినందనలు. వన్డే ఇంటర్నేషనల్స్‌లో ఏడు వేల పరుగులు చేసిన ఏకైక అంతర్జాతీయ మహిళా క్రీడాకారిణి ఆమె. మహిళల క్రికెట్ రంగంలో ఆమె అందించిన సేవలు చాలా గొప్పవి. రెండు దశాబ్దాలకు పైగా కెరీర్లో మిథాలీ రాజ్ లక్షలాది మందికి స్ఫూర్తినిచ్చారు. ఆమె కఠోర శ్రమ, విజయ గాథ మహిళా క్రికెటర్లకు మాత్రమే కాదు- పురుష క్రికెటర్లకు కూడా ప్రేరణగా నిలుస్తుంది.
మిత్రులారా! ఇది ఆసక్తికరంగా ఉంది ఇదే మార్చి నెలలో మనం మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు చాలా మంది మహిళా క్రీడాకారులు పతకాలు, రికార్డులు సాధించారు. ఢిల్లీ లో జరిగిన ISSF ప్రపంచ కప్ షూటింగ్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. బంగారు పతకాల సంఖ్య పరంగా కూడా భారత్ ముందుంది. భారత దేశానికి చెందిన మహిళా షూటర్లు, పురుష షూటర్ల గొప్ప ప్రదర్శన కారణంగా మాత్రమే ఇది సాధ్యమైంది. బిడబ్ల్యుఎఫ్ స్విస్ ఓపెన్ సూపర్ 300 టోర్నమెంట్లో పివి సింధు రజత పతకం సాధించారు. చదువు నుండి సంస్థల వ్యవస్థాపకత వరకు, సాయుధ దళాల నుండి సైన్స్ & టెక్నాలజీ వరకు, దేశంలోని ఆడపిల్లలు తమదైన గుర్తింపును పొందుతున్నారు. యువతులు క్రీడలను తమ గమ్యస్థానంగా చేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రొఫెషనల్ ఛాయిస్‌గా క్రీడలు అభివృద్ధి చెందుతున్నాయి.
నా ప్రియమైన దేశవాసులారా! కొంతకాలం క్రితం జరిగిన మారిటైమ్ ఇండియా సమ్మిట్ మీకు గుర్తుందా? ఈ శిఖరాగ్ర సమావేశంలో నేను చెప్పిన విషయం మీకు గుర్తుందా? సహజమే.. చాలా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. చాలా విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇన్నింటి మధ్యలో ప్రతి విషయం ఎలా గుర్తుంటుంది? ప్రతి విషయమూ ఎలా గుర్తుకు వస్తుంది? ఎక్కువ శ్రద్ధ ఎలా ఉంటుంది? ఇది సహజం. కానీ నా అభ్యర్ధనలలో ఒకదాన్ని గురు ప్రసాద్ గారు ఎంతో ఆసక్తితో ముందుకు తీసుకెళ్లడం నాకు నచ్చింది. దేశంలోని లైట్ హౌస్ కాంప్లెక్స్‌ల చుట్టూ పర్యాటక సౌకర్యాలను అభివృద్ధి చేయడం గురించి ఈ శిఖరాగ్ర సమావేశంలో మాట్లాడాను. తమిళనాడులోని రెండు లైట్ హౌస్ లు – చెన్నై లైట్ హౌస్, మహాబలిపురం లైట్ హౌస్ లకు 2019లో తాను జరిపిన పర్యటన గురించి గురు ప్రసాద్ గారు తన అనుభవాలను పంచుకున్నారు. ‘మన్ కీ బాత్’ శ్రోతలను కూడా ఆశ్చర్యపరిచే చాలా ఆసక్తికరమైన విషయాలను ఆయన పంచుకున్నారు. ఉదాహరణకు ఎలివేటర్ ఉన్న ప్రపంచంలోని కొన్ని లైట్ హౌస్‌లలో చెన్నై లైట్ హౌస్ ఒకటి. ఇది మాత్రమే కాదు.. భారతదేశంలో నగర పరిధిలో ఉన్న ఏకైక లైట్ హౌస్ ఇది. ఇందులో విద్యుత్ కోసం సోలార్ ప్యానెళ్లు కూడా ఉన్నాయి. మెరైన్ నావిగేషన్ చరిత్రను తెలిపే లైట్ హౌస్ హెరిటేజ్ మ్యూజియం గురించి కూడా గురు ప్రసాద్ గారు తెలిపారు. మ్యూజియంలో నూనెతో వెలిగే దీపాలను, కిరోసిన్ లైట్లను, పెట్రోలియం ఆవిరి దీపాలను, పాతకాలపు విద్యుత్ దీపాలను ప్రదర్శిస్తారు. భారతదేశపు పురాతన లైట్ హౌస్ – మహాబలిపురం లైట్ హౌస్ గురించి గురు ప్రసాద్ గారు వివరంగా రాశారు. ఈ లైట్ హౌస్ పక్కన పల్లవ రాజు మొదటి మహేంద్ర వర్మ వందల సంవత్సరాల క్రితం నిర్మించిన 'ఉల్కనేశ్వర' ఆలయం ఉందని ఆయన అంటున్నారు.
మిత్రులారా! 'మన్ కి బాత్' సందర్భంగా పర్యాటక రంగం గురించి నేను చాలాసార్లు మాట్లాడాను. కాని, ఈ లైట్ హౌస్‌లు పర్యాటక పరంగా ప్రత్యేకమైనవి. అద్భుతమైన నిర్మాణాల కారణంగా లైట్ హౌసెస్ ప్రజలను ఎల్లప్పుడూ ఆకర్షించే కేంద్రాలుగా ఉన్నాయి. పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి భారతదేశంలో 71 లైట్ హౌజులను ఎంపిక చేశాం. మ్యూజియం, యాంఫి-థియేటర్, ఓపెన్ ఎయిర్ థియేటర్, ఫలహారశాల, పిల్లల పార్కు, ఎకో ఫ్రెండ్లీ కాటేజీలు, ల్యాండ్ స్కేపింగ్ ఈ అన్ని లైట్ హౌజులలో ఏర్పాటవుతాయి. లైట్ హౌజుల గురించి చర్చిస్తున్నాం కాబట్టి ఒక ప్రత్యేకమైన లైట్ హౌస్ గురించి కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ లైట్ హౌస్ గుజరాత్ లోని సురేంద్ర నగర్ జిల్లాలో జింఝు వాడా అనే ప్రదేశంలో ఉంది. ఈ లైట్ హౌస్ ఎందుకు ప్రత్యేకమైనదో మీకు తెలుసా? సముద్ర తీరం ఈ లైట్ హౌస్ ఉన్న ప్రదేశానికి వంద కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉంది. ఇక్కడ ఏదో ఒక సమయంలో ఒక ఓడరేవు ఉందనేందుకు సాక్ష్యంగా ఈ గ్రామంలో మీకు అలాంటి రాళ్ళు కూడా కనిపిస్తాయి. అంటే అంతకుముందు తీరప్రాంతం జింఝు వాడా వరకు ఉండేది. సముద్రం అలలు పైకి లేవడం, వెనుకకు పోవడం, ఇంత దూరం వెళ్ళడం కూడా దాని రూపాల్లో ఒకటి. ఈ నెలలో జపాన్‌లో సంభవించిన భారీ సునామీకి 10 సంవత్సరాలు. ఈ సునామీలో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. అలాంటి ఒక సునామీ 2004 లో భారతదేశంలో సంభవించింది. అండమాన్ నికోబార్లలో, తమిళనాడులో లైట్ హౌజుల్లో పనిచేస్తున్న 14 మంది ఉద్యోగులను సునామీ సమయంలో కోల్పోయాం. కష్టపడి పనిచేసే ఈ లైట్ కీపర్లకు నేను సగౌరవంగా నివాళి అర్పిస్తున్నాను. లైట్ కీపర్ల పనిని నేను ప్రశంసిస్తున్నాను.
ప్రియమైన దేశవాసులారా! కొత్తదనం, ఆధునికత జీవితంలోని ప్రతి రంగంలోనూ అవసరం. లేకపోతే అది కొన్నిసార్లు మనకు భారంగా మారుతుంది. భారతదేశ వ్యవసాయ ప్రపంచంలో ఆధునికత- ఇది నేటి కాలపు డిమాండ్. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. మనం చాలా సమయాన్ని నష్టపోయాం. వ్యవసాయ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించడానికి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి సాంప్రదాయ వ్యవసాయంతో పాటు కొత్త ఎంపికలు, కొత్త ఆవిష్కరణలను అవలంబించడం కూడా అంతే అవసరం. శ్వేత విప్లవం సందర్భంగా దేశం దీనిని అనుభవించింది. ఇప్పుడు తేనెటీగల పెంపకం అటువంటి ఎంపికగా ఉంది. తేనెటీగల పెంపకం దేశంలో తేనె విప్లవం లేదా తీపి విప్లవానికి ఆధారం. పెద్ద సంఖ్యలో రైతులు అందులో చేరారు. పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో గుర్ దుం అనే గ్రామం ఉంది. ఇక్కడి పర్వతాలు ఎత్తయినవి. భౌగోళిక సమస్యలు కూడా ఉన్నాయి. కానీ ఇక్కడి ప్రజలు తేనెటీగల పెంపకం పనిని ప్రారంభించారు. ఈ ప్రదేశంలో తయారుచేసిన తేనెకు ఇప్పుడు మంచి డిమాండ్ ఉంది. తేనె వల్ల రైతుల ఆదాయం కూడా పెరుగుతోంది. పశ్చిమ బెంగాల్ లోని సుందర్బన్ ప్రాంతాల సహజ సేంద్రీయ తేనెను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇష్టపడతారు. నాకు గుజరాత్ నుండి అలాంటి ఒక వ్యక్తిగత అనుభవం కూడా ఉంది. గుజరాత్‌లోని బనాస్ కాంఠ లో 2016 లో ఒక కార్యక్రమం నిర్వహించారు. ఇక్కడ చాలా అవకాశాలు ఉన్నాయని ఆ కార్యక్రమంలో నేను ప్రజలకు చెప్పాను. “బనాస్ కాంఠ రైతులు తీపి విప్లవంలో కొత్త అధ్యాయాన్ని ఎందుకు రాయకూడదు?” అని అడిగాను. మీకు ఈ విషయం తెలుసుకోవడం ఆనందంగా ఉంటుంది. చాలా తక్కువ సమయంలో బనాస్ కాంఠ తేనె ఉత్పత్తికి ప్రధాన కేంద్రంగా మారింది. బనాస్ కాంఠ రైతులు తేనె నుండి ఏటా లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అలాంటి ఒక ఉదాహరణ హర్యానాలోని యమునా నగర్లో కూడా ఉంది. యమునా నగర్ లో రైతులు తేనెటీగ పెంపకం ద్వారా సంవత్సరానికి అనేక వందల టన్నుల తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. వారి ఆదాయాన్ని పెంచుకుంటున్నారు. రైతుల ఈ కృషి ఫలితంగా దేశంలో తేనె ఉత్పత్తి నిరంతరం పెరుగుతోంది. ఏటా దాదాపు లక్ష ఇరవై ఐదువేల టన్నులకు చేరుకుంది. అందులో అధిక మొత్తంలో తేనె విదేశాలకు కూడా ఎగుమతి అవుతోంది.
మిత్రులారా! తేనెటీగ పెంపకంలో ఆదాయం కేవలం తేనె నుండి మాత్రమే కాదు. తేనెటీగ మైనం -బీ వాక్స్ – కూడా చాలా పెద్ద ఆదాయ వనరు. మందుల పరిశ్రమ, ఆహార పరిశ్రమ, వస్త్ర, సౌందర్య ఉపకరణాల పరిశ్రమలలో ప్రతిచోటా దీనికి డిమాండ్ ఉంది. మన దేశం ప్రస్తుతం తేనెటీగ మైనాన్ని దిగుమతి చేస్తుంది. ఇప్పుడు ఈ పరిస్థితి వేగంగా మారుతోంది. అంటే ఒక విధంగా మనం ఆత్మ నిర్భర భారత ప్రచారానికి సహకరిస్తున్నాం. ప్రపంచం మొత్తం ఆయుర్వేదం, సహజ ఆరోగ్య ఉత్పత్తుల వైపు చూస్తోంది. అటువంటి పరిస్థితిలో తేనె కోసం డిమాండ్ మరింత వేగంగా పెరుగుతోంది. అటువంటి పరిస్థితిలో, తేనె కోసం డిమాండ్ మరింత వేగంగా పెరుగుతోంది. దేశంలోని ఎక్కువ మంది రైతులు తమ వ్యవసాయంతో పాటు తేనెటీగ పెంపకం కూడా చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది రైతుల ఆదాయాన్ని కూడా పెంచుతుంది. వారి జీవితాలకు తీపిని కూడా ఇస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! కొద్ది రోజుల క్రితం ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుకున్నాం. మన ఇళ్ల గోడలపై, చుట్టుపక్కల చెట్లపై పక్షులు ఉండేవి. కానీ కొన్ని సంవత్సరాల క్రితం పిట్టలను చూశామని చెప్పడం ద్వారా ఇప్పుడు ప్రజలు పక్షులను గుర్తు తెచ్చుకుంటారు. ఈ రోజు మనం వాటిని కాపాడటానికి ప్రయత్నాలు చేయాలి. నా బెనారస్ సహచరుడు ఇంద్రపాల్ సింగ్ బత్రా గారు అలాంటి పని చేశారు. ఈ విషయాన్ని నేను మన్ కి బాత్ శ్రోతలకు చెప్పాలనుకుంటున్నాను. బత్రా తన ఇంటిని పక్షుల నివాసంగా చేసుకున్నారు. అతను తన ఇంట్లో పక్షులు సులభంగా ఉండేందుకు వీలయ్యే చెక్క గూళ్ళను నిర్మించారు. బెనారస్ లో అనేక ఇళ్ళు ఈ ప్రచారంలో చేరాయి. ఇది ఇళ్లలో అద్భుతమైన సహజ వాతావరణాన్ని కూడా సృష్టించింది. ప్రకృతి, పర్యావరణం, జంతువులు, పక్షుల కోసం మనం కూడా ప్రయత్నాలు చేయాలి. అలాంటి మరో సహచరుడు బిజయ్ కుమార్ కాబీ గారు. బిజయ్ గారు ఒడిషాలోని కేంద్రపారాకు చెందినవారు. కేంద్రపారా సముద్ర ఒడ్డున ఉంది. అందువల్ల ఈ జిల్లాలో సముద్ర అలల తాకిడికి, తుఫానుకు గురయ్యే గ్రామాలు చాలా ఉన్నాయి. ఇది కొన్ని సమయాల్లో చాలా నష్టాన్ని కలిగిస్తుంది. ఈ ప్రకృతి విపత్తును ప్రకృతి మాత్రమే ఆపగలదని బిజయ్ గారు అభిప్రాయపడ్డారు. అప్పుడు బిజయ్ గారు తన ఉద్యమాన్ని బడాకోట్ గ్రామం నుండి ప్రారంభించారు. పన్నెండు సంవత్సరాలు- మిత్రులారా! పన్నెండు సంవత్సరాలు- కష్టపడి కష్టపడి పనిచేసి గ్రామం నుండి సముద్రం వైపు 25 ఎకరాల మడ అడవులను తయారు చేశారు. ఈ రోజు ఆ అడవి ఆ గ్రామాన్ని కాపాడుతోంది. ఒడిషాలోని పారదీప్ జిల్లాలో అమ్రేష్ సామంత్ అనే ఇంజనీరు ఇలాంటి పని చేశారు. అమ్రేష్ గారు చిన్న అడవులను నాటారు. దాని నుండి ఈరోజు అనేక గ్రామాలకు రక్షణ లభిస్తోంది.
మిత్రులారా! ఈ రకమైన కృషిలో మనం కూడా భాగస్వాములమైతే పెద్ద ఎత్తున మంచి ఫలితాలు వస్తాయి. ఉదాహరణకు తమిళనాడులోని కోయంబత్తూర్‌లో బస్సు కండక్టర్ గా పనిచేసే మరిముత్తు యోగనాథన్‌గారి కృషి గురించి చెప్పుకుందాం. యోగనాథన్ తన బస్సులోని ప్రయాణికులకు టిక్కెట్లు ఇస్తారు. వాటితో పాటు ఒక మొక్కను కూడా ఉచితంగా ఇస్తారు. ఈ విధంగా, యోగనాథన్ గారు ఎన్ని చెట్లు నాటారో తెలియదు. ఈ పనిలో యోగనాథన్ తన జీతంలో చాలా భాగాన్ని ఖర్చు చేస్తున్నారు. ఇప్పుడు ఇది విన్న తరువాత మరిముత్తు యోగనాథన్ కృషిని మెచ్చుకోని పౌరుడు ఎవరైనా ఉంటారా? ఆయన చేస్తున్న ఉత్తేజకరమైన పనికి, ఆయన ప్రయత్నాలకు హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! మనమందరం వ్యర్థాల నుండి బంగారం లేదా కచరా నుండి కాంచనాన్ని తయారు చేయడం గురించి చూశాం.. విన్నాం. మనం కూడా ఇతరులకు చెబుతూనే ఉన్నాం. అదే విధంగా వ్యర్థాలను విలువగా మార్చే పని కూడా జరుగుతోంది. అలాంటి ఒక ఉదాహరణ కేరళలోని కొచ్చిలో ఉన్న సెయింట్ తెరెసా కళాశాల. నాకు గుర్తు- 2017 లో నేను ఈ కళాశాల ప్రాంగణంలో ఒక పుస్తక పఠన కార్యక్రమానికి హాజరయ్యాను. ఈ కళాశాల విద్యార్థులు పునర్వినియోగ బొమ్మలను తయారు చేస్తున్నారు- అది కూడా చాలా సృజనాత్మకంగా. ఈ విద్యార్థులు బొమ్మలు తయారు చేయడానికి పాత బట్టలు, పడేసిన చెక్క ముక్కలు, సంచులు , పెట్టెలను ఉపయోగిస్తున్నారు. ఒక విద్యార్థి ఒక పజిల్ ను తయారు చేస్తే మరి కొందరు కారు, రైలును తయారు చేస్తున్నారు. బొమ్మలు సురక్షితంగా ఉండటంతో పాటు పిల్లలకు స్నేహపూర్వకంగా ఉండడంపై ఇక్కడ ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఈ మొత్తం కృషిలో మంచి విషయం ఏమిటంటే ఈ బొమ్మలను అంగన్వాడీ పిల్లలకు ఆడడానికి ఇస్తారు. బొమ్మల తయారీలో దేశం ప్రగతి సాధించడంలో వ్యర్థాల నుండి విలువ రాబట్టే ఈ ఉద్యమాలు, ఈ వినూత్న ప్రయోగాలు చాలా ముఖ్యమైనవి.
ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడలో ప్రొఫెసర్ శ్రీనివాస్ పదకాండ్ల గారు చాలా ఆసక్తికరమైన పని చేస్తున్నారు. ఆయన వాహనాల తుక్కు నుండి శిల్పాలను సృష్టించారు. ఆయన రూపొందించిన ఈ భారీ శిల్పాలను పబ్లిక్ పార్కులలో ఏర్పాటు చేశారు. ప్రజలు వాటిని ఎంతో ఉత్సాహంగా చూస్తున్నారు. ఎలక్ట్రానిక్ , ఆటోమొబైల్ రంగాల్లోని వ్యర్థాలను రీసైక్లింగ్ చేయడంలో ఇది ఒక వినూత్న ప్రయోగం. కొచ్చి, విజయవాడలలో జరుగుతున్న ఈ ప్రయత్నాలను నేను మరోసారి అభినందిస్తున్నాను. ఇలాంటి కృషిలో పాల్గొనేందుకు ఎక్కువ మంది ముందుకు వస్తారని ఆశిస్తున్నాను.
నా ప్రియమైన దేశ వాసులారా! భారతదేశ ప్రజలు ప్రపంచంలోని ఏ మూలకు వెళ్ళినా తాము భారతీయులమని గర్వంగా చెప్తారు. మన యోగా, ఆయుర్వేదం, తత్వశాస్త్రం – ఇలా మన దగ్గర లేనిది ఏముంది? ఈ విషయాలలో మనకు చాలా గర్వంగా ఉంటుంది. అలాగే మన స్థానిక భాష, మాండలికం, గుర్తింపు, శైలి, అన్నపానీయాల గురించి కూడా గర్వపడుతున్నాం. మనం కొత్తవి స్వీకరించాలి. అదే జీవితం. కానీ అదే సమయంలో ప్రాచీనతను, సాంప్రదాయాలను కోల్పోకూడదు. మన చుట్టూ ఉన్న అపారమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రోత్సహించడానికి, కొత్త తరానికి అందించడానికి మనం కృషి చేయాలి. అస్సాంలో నివసించే సికారి టిస్సౌ చాలా అంకితభావంతో దీన్ని చేస్తున్నారు. కర్బీ ఆంగ్లాంగ్ జిల్లాకు చెందిన సికారి టిస్సౌ గారు గత 20 సంవత్సరాలుగా కార్బీ భాషను డాక్యుమెంట్ చేస్తున్నారు. ఒకప్పుడు ఈ కార్బీ భాష గిరిజన తోబుట్టువుల భాష. కార్బీ నేడు ప్రధాన స్రవంతి నుండి కనుమరుగవుతోంది. సికారి టిస్సౌ గారు తమ గుర్తింపును కాపాడుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆయన చేసిన ప్రయత్నాల వల్ల కార్బీ భాష డాక్యుమెంటేషన్ చాలావరకు పూర్తయింది. ఆయన చేసిన కృషికి ప్రశంసలు అందుకున్నారు. అవార్డులు కూడా పొందారు. సికారి టిస్సౌ గారిని 'మన్ కి బాత్' ద్వారా నేను అభినందిస్తున్నాను. దేశంలోని అనేక మారుమూల ప్రాంతాల్లో ఇలాంటి అనేక మంది అన్వేషకులు ఏదో ఒక రంగంలో కృషి చేస్తూనే ఉన్నారు. నేను వారందరినీ అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఏదైనా కొత్త ప్రారంభం ఎప్పుడూ చాలా ప్రత్యేకమైంది. కొత్త ప్రారంభం అంటే కొత్త అవకాశాలు – కొత్త ప్రయత్నాలు. కొత్త ప్రయత్నాలు అంటే కొత్త శక్తి, కొత్త ఉత్సాహం. అందువల్లనే వివిధ రాష్ట్రాలు, ప్రాంతాలలో వైవిధ్యంతో నిండిన మన సంస్కృతిలో ఏదైనా ప్రారంభాన్ని వేడుకగా జరుపుకోవడం సంప్రదాయం. ఈ సమయం కొత్త ఆరంభాలు, కొత్త పండుగలకు నాంది. వసంతాన్ని పండుగగా జరుపుకోవడం హోలీ సంప్రదాయం. మనం హోలీని రంగులతో జరుపుకునే సమయంలో- అదే సమయంలో- వసంతకాలం కూడా. కొత్త రంగులు మన చుట్టూ ఉన్నాయి. ఈ సమయంలో పూలు వికసించడం ప్రారంభిస్తాయి. ప్రకృతి సజీవమౌతుంది. త్వరలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో కొత్త సంవత్సర వేడుకలు కూడా జరుగుతాయి. ఉగాది లేదా పుథండు, గుడి పడ్వా లేదా బిహు, నవ్రేహ్ లేదా పోయిలా, బోయిషాక్ లేదా బైసాఖి – పండుగ ఏదైనా దేశం మొత్తం అధిక ఉత్సాహం, కొత్త ఆశల రంగులో తడిసిపోతుంది. అదే సమయంలో కేరళ విషు అనే చక్కటి పండుగను కూడా జరుపుకుంటుంది. దీని తరువాత త్వరలో చైత్ర నవరాత్రి పవిత్ర సందర్భం కూడా వస్తుంది. చైత్ర మాసం తొమ్మిదవ రోజు మనకు శ్రీరామ నవమి పండుగ ఉంటుంది. ఇది భగవాన్ శ్రీరాముడి జన్మదినం. న్యాయం, పరాక్రమాల కొత్త శకానికి నాంది. ఈ సమయంలో చుట్టూ ఉత్సాహకరమైన, భక్తితో నిండిన వాతావరణం ఉంటుంది. ఇది ప్రజలను దగ్గరికి కలుపుతుంది. వారిని కుటుంబంతో, సమాజంతో సాన్నిహిత్యం చేస్తుంది. పరస్పర సంబంధాలను బలపరుస్తుంది. ఈ ఉత్సవాల సందర్భంగా దేశవాసులందరినీ అభినందిస్తున్నాను.
మిత్రులారా! ఈ సమయంలో ఏప్రిల్ 4 వ తేదీన దేశం ఈస్టర్ పండుగను కూడా జరుపుకుంటుంది. ఈస్టర్ పండుగ సందర్భంగా యేసుక్రీస్తు పునరుత్థానం వేడుకగా జరుపుకుంటారు. ప్రతీకాత్మకంగా ఈస్టర్ పండుగ జీవితపు కొత్త ప్రారంభంతో ముడిపడి ఉంది. ఈస్టర్ ఆశయాల పునరుత్థానానికి ప్రతీక. ఈ పవిత్రమైన పర్వదిన సందర్భంగా కేవలం భారతదేశంలోని క్రైస్తవులను మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు 'మన్ కీ బాత్'లో 'అమృత్ మహోత్సవ్ 'గురించి, దేశం కోసం మన కర్తవ్యాల గురించి మాట్లాడుకున్నాం. ఇతర పండుగలు, పర్వదినాల గురించి కూడా చర్చించాం. త్వరలో మన రాజ్యాంగ హక్కులు, విధులను గుర్తుచేసే మరో పండుగ రాబోతోంది. అది ఏప్రిల్ 14 – డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినం. ఈసారి 'అమృత్ మహోత్సవ్'లో ఈ సందర్భం మరింత ప్రత్యేకమైంది. బాబా సాహెబ్ గారి ఈ పుట్టినరోజును మనం చిరస్మరణీయంగా జరుపుకుంటామని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. మన కర్తవ్యాలను పాటిస్తామని సంకల్పం చేసుకుని, బాబాసాహెబ్ కు నివాళి అర్పించాలి. ఈ నమ్మకంతో మీకు మరోసారి పర్వదినాల శుభాకాంక్షలు.
మీరందరూ సంతోషంగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. ఉల్లాసంగా ఉండండి. ఈ కోరికతో ‘మందులు కూడా- కఠినమైన ముందు జాగ్రత్తలు కూడా’ అనే నినాదాన్ని మరోసారి గుర్తు చేస్తున్నాను. అందరికీ చాలా చాలా ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. నిన్న మాఘ పూర్ణిమ పండుగ. మాఘ మాసం నదులు, చెరువులు, నీటి వనరులతో ముడిపడి ఉంది.
"మాఘే నిమగ్నా: సలీలే సుశీతే, విముక్త పాపా: త్రిదివం ప్రయాన్తి ||"
అని మన గ్రంథాలలో చెప్పారు..
అంటే మాఘ మాసంలో ఏదైనా పవిత్ర జలాశయంలో స్నానం చేయడాన్ని పవిత్రమైందిగా పరిగణిస్తారు. ప్రపంచంలోని ప్రతి సమాజంలో, నదికి సంబంధించిన సంప్రదాయం ఉంది. నదుల ఒడ్డున అనేక నాగరికతలు అభివృద్ధి చెందాయి. మన సంస్కృతి వేల సంవత్సరాల నాటిది కాబట్టి, నదుల నాగరికత ఇక్కడ ఎక్కువగా ఉంటుంది. దేశంలో ఏదో ఒక మూలలో నీటి సంబంధిత పర్వదినం లేని రోజు ఉండదు. మాఘ మాసంలో ప్రజలు తమ ఇళ్లను, కుటుంబాలను వదిలిపెట్టి నెల మొత్తం నదుల ఒడ్డుకు వెళతారు. ఈసారి హరిద్వార్‌లో కుంభ మేళాకూడా జరుగుతోంది. నీరు మనకు జీవితం. నీరే విశ్వాసం. నీరే ప్రగతి ధార కూడా. నీరు చాలా ముఖ్యమైంది. నీటి స్పర్శతో ఇనుము బంగారంగా మారుతుందని ఒక తత్వవేత్త అంటారు. అదేవిధంగా జీవితానికి నీటి స్పర్శ అవసరం. అభివృద్ధికి కూడా ఇది చాలా అవసరం.
మిత్రులారా! మాఘ మాసాన్ని నీటితో అనుసంధానించడానికి మరొక కారణం ఉండవచ్చు. ఈ మాసం నుండి శీతాకాలం ముగుస్తుంది. వేసవి ప్రారంభమవుతుంది. నీటిని పరిరక్షించడానికి ఇప్పటినుండే ప్రయత్నాలను ప్రారంభించాలి. కొన్ని రోజుల తరువాత మార్చి 22 వ తేదీ నాడు ప్రపంచ జల దినోత్సవం కూడా ఉంది.
ప్రపంచంలోని కోట్లాది ప్రజలు నీటి కొరతను తీర్చడానికి మాత్రమే తమ జీవితంలో ఎక్కువ భాగం కష్టపడుతున్నారని ఉత్తరప్రదేశ్ నుండి ఆరాధ్య గారు రాశారు. ‘నీరు లేకుంటే అంతా శూన్యం' అని కూడా చెప్పలేదు.నీటి సంక్షోభాన్ని పరిష్కరించడానికి పశ్చిమ బెంగాల్‌లోని ఉత్తర దీనాజ్పూర్కు చెందిన సుజిత్ గారు నాకు చాలా మంచి సందేశం పంపారు. ప్రకృతి మనకు నీటి రూపంలో ఉమ్మడి బహుమతిని ఇచ్చిందని, కాబట్టి దాన్ని ఆదా చేయడం కూడా ఉమ్మడి బాధ్యత అని సుజిత్ గారు రాశారు. సామూహిక బహుమతి ఉన్నట్లే, సామూహిక బాధ్యత కూడా ఉంటుంది. . సుజిత్ గారి మాట ఖచ్చితంగా నిజమైంది. నది, చెరువు, సరస్సు, వర్షం, భూగర్భ జలాలు అందరికోసం.
మిత్రులారా! గ్రామంలోని బావులు, సరస్సులను ఊరంతా కలిసి చూసుకునే ఒక కాలం గతంలో ఉండేది. ఇప్పుడు అలాంటి ఒక ప్రయత్నం తమిళనాడులోని తిరువన్నామలైలో జరుగుతోంది. అక్కడ స్థానిక ప్రజలు తమ బావులను కాపాడుకోవాలని ప్రచారం చేశారు. ఈ ప్రజలు తమ ప్రాంతంలో కొన్నేళ్లుగా పూడుకుపోయిన ఉమ్మడి బావులను పునరుద్ధరిస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని అగరోథ గ్రామానికి చెందిన బబితా రాజ్‌పుత్ గారి ప్రయత్నం అందరికీ స్ఫూర్తినిస్తుంది. బబిత గారి గ్రామం బుందేల్‌ఖండ్‌లో ఉంది. ఒకప్పుడు ఆ గ్రామానికి సమీపంలో చాలా పెద్ద సరస్సు ఎండిపోయింది. అప్పుడు బబిత గారు గ్రామంలోని ఇతర మహిళలను వెంట తీసుకెళ్ళి సరస్సు వరకు నీరు వెళ్లేందుకు ఒక కాలువ నిర్మించారు. ఆ కాలువ నుండి వర్షపు నీరు నేరుగా సరస్సులోకి వెళ్ళడం ప్రారంభించింది. ఇప్పుడు ఆ సరస్సు నీటితో నిండి ఉంది.
మిత్రులారా! ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ లో నివసిస్తున్న జగదీష్ కునియాల్ గారి కృషి కూడా చాలా బోధిస్తుంది. జగదీష్ గారి గ్రామంతో పాటు ఆ పరిసర ప్రాంతం నీటి అవసరాలకు సహజ వనరులపై ఆధారపడింది. కానీ చాలా సంవత్సరాల కిందట ఆ నీటి వనరు ఎండిపోయింది. ఈ కారణంగా ఆ ప్రాంతంలో నీటి సంక్షోభం తీవ్రమైంది. జగదీష్ గారు చెట్లను నాటడం ద్వారా ఈ సంక్షోభాన్ని పరిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఆయన గ్రామ ప్రజలతో కలిసి ఆ ప్రాంతమంతా వేలాది చెట్లను నాటారు. దాంతో ఎండిపోయిన జలాశయంలో నీటి నిల్వలు మళ్లీ పెరిగాయి.
మిత్రులారా! నీటి నుండి మొదలుకొని మన సామూహిక బాధ్యతలను అర్థం చేసుకోవాలి. భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో మే-జూన్ నెలల్లో వర్షం మొదలవుతుంది. మన చుట్టూ ఉన్న నీటి వనరులను శుభ్రపరచడానికి, వర్షపునీటిని సేకరించడానికి 100 రోజుల ప్రచారాన్ని ఇప్పటి నుండే ప్రారంభించగలమా? ఈ ఆలోచనతో కొన్ని రోజుల తర్వాత జలశక్తి మంత్రిత్వ శాఖ 'క్యాచ్ ది రెయిన్' అనే పేరుతో జల్ శక్తి అభియాన్ ను ప్రారంభిస్తోంది. ‘వర్షం ఎక్కడ పడ్డా, ఎప్పుడు పడ్డా వెంటనే ఒడిసిపట్టుకోవాలి’ అనేది ఈ ప్రచారం ప్రాథమిక సూత్రం. మనం మొదటి నుండి చేస్తున్న వాన నీటి సంరక్షణను మనం ఇప్పటి నుండి మళ్ళీ మొదలుపెట్టాలి. వర్షపు నీటి సేకరణ విధానం ఇప్పటినుండే అమల్లోకి తేవాలి. గ్రామాల్లో చెరువులు, జలాశయాల మార్గాలలో నీటి ప్రవాహానికి అడ్డుగా ఉన్న చెత్తను తొలగించాలి. నీటి మార్గానికి ఉన్న అడ్డంకులను తొలగించడం ద్వారా మరింత ఎక్కువ వర్షపునీటిని నిల్వ చేయగలుగుతాం.
నా ప్రియమైన దేశవాసులారా! మాఘ మాసం గురించి, ఈ మాస ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి చర్చ జరిగినప్పుడల్లా, ఈ చర్చ సంత్ రవిదాస్ గారి పేరు లేకుండా పూర్తి కాదు. మాఘ పూర్ణిమ రోజే సంత్ రవిదాస్ గారి జయంతి. సంత్ రవిదాస్ గారి మాటలు, ఆలోచనా ధోరణి, ఆయన జ్ఞానం మనకు ఈ రోజు కూడా మార్గ నిర్దేశం చేస్తాయి.
మనమంతా ఒకే తల్లి ముద్దుబిడ్డలం
అందరి సృష్టికర్త ఒకరే
అన్నీ ఒకే మట్టి మృణ్మయ పాత్రలే||
అని సంత్ రవిదాస్ చెప్పేవారు.
అంటే మనమంతా ఒకే మట్టి పాత్రలమని అర్థం. మనందరినీ ఒక్కరే తయారు చేశారని ఆయన భావం. సమాజంలో ప్రబలంగా ఉన్న వక్రీకరణల గురించి సంత్ రవిదాస్ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడేవారు. ఆయన ఈ వక్రీకరణలను సమాజం ముందు ఉంచారు. వాటిని సరిచేయడానికి మార్గం చూపించారు. అందుకే ‘రవి దాస్ రూపంలో గురువు దొరికారు.. ఇదే జ్ఞాన మార్గం’ అని మీరా బాయి గారు అన్నారు. సంత్ రవిదాస్ గారి జన్మస్థలమైన వారణాసితో అనుసంధానం కావడం నా అదృష్టం. సంత్ రవిదాస్ గారి ఆధ్యాత్మిక సమున్నత స్థాయిని, ఆ తీర్థక్షేత్రంలో ఆయన శక్తిని నేను అనుభవించాను.
మిత్రులారా!
‘కర్మ బంధనాలకు కట్టుబడి ఉండండి
ఫలాల ఆశ వద్దు.
కర్మ మనుష్య ధర్మం
నిజాయితీ రవిదాస్ మతం ||’ అని సంత్ రవిదాస్ చెప్పేవారు.
అంటే మన పనిని నిరంతరం చేస్తూనే ఉండాలి. అప్పుడు మనకు ఖచ్చితంగా ఫలం వస్తుంది. అంటే కర్మ నుండి సిద్ధి ఎలాగూ ఉంటుంది. దాని గురించిన ఆలోచన వద్దు అని. మన యువత సంత్ రవిదాస్ గారి నుండి ఇంకొక విషయం నేర్చుకోవాలి. యువకులు ఏదైనా పని చేయడానికి పాత మార్గాలకు, విధానాలకు తమను తాము బంధించుకోకూడదు. మీ జీవితాన్ని మీరే నిర్ణయించుకోండి. మీ స్వంత మార్గాలను కూడా తయారు చేసుకోండి. మీ లక్ష్యాలను మీరు స్వంతంగా నిర్ధారించుకోండి. మీ వివేకం, మీ విశ్వాసం బలంగా ఉంటే, మీరు ప్రపంచంలో దేనికీ భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇలా ఎందుకు చెప్తున్నానంటే మన యువత చాలా సార్లు పని చేయాలనుకుంటున్నా కొనసాగుతున్న ఆలోచనల ఒత్తిడిలో పని చేయలేకపోతుంది. అందువల్ల మీరు ఎప్పుడూ ఆలోచించడానికి, ఆవిష్కరించడానికి వెనుకాడకూడదు. సంత్ రవిదాస్ గారు మరో ముఖ్యమైన సందేశాన్ని ఇచ్చారు. 'ఎవరి కాళ్ల మీద వారు నిలబడాలి’ అనేది ఆ సందేశం. మన కలల కోసం మనం వేరొకరిపై ఆధారపడడం సరైనది కాదు. రవిదాస్ గారు ఎప్పుడూ ఆ ఆలోచనకు సానుకూలంగా లేరు. ఈ రోజు దేశ యువత కూడా ఆ ఆలోచనా ధోరణికి అనుకూలంగా లేరని మనం చూస్తున్నాం. ఈ రోజు దేశంలోని యువతలో వినూత్న స్ఫూర్తిని చూసినప్పుడు సంత్ రవిదాస్ గారు కూడా గర్వపడతారని నేను భావిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు 'నేషనల్ సైన్స్ డే' జరుపుకుంటున్నాం. భారతదేశ గొప్ప శాస్త్రవేత్త డాక్టర్ సి.వి. రామన్ గారు చేసిన రామన్ ఎఫెక్ట్ పరిశోధనకు గుర్తుగా ఈ రోజు 'నేషనల్ సైన్స్ డే' జరుగుతోంది. రామన్ ఎఫెక్ట్ ఆవిష్కరణ మొత్తం సైన్స్ దిశను మార్చిందని కేరళకు చెందిన యోగేశ్వరన్ గారు నమోఆప్‌లో రాశారు. దీనికి సంబంధించిన చాలా మంచి సందేశాన్ని నాసిక్ కు చెందిన స్నేహిల్ గారు కూడా నాకు పంపారు. మన దేశంలో లెక్కలేనంతమంది శాస్త్రవేత్తలు ఉన్నారని, శాస్త్రవేత్తల కృషి లేకుండా సైన్స్ ఇంత పురోగతి సాధించలేదని స్నెహిల్ గారు రాశారు. ప్రపంచంలోని ఇతర శాస్త్రవేత్తల గురించి మనకు తెలిసినట్టే భారతదేశ శాస్త్రవేత్తల గురించి కూడా మనం తెలుసుకోవాలి. ‘మన్ కి బాత్’ శ్రోతల అభిప్రాయాలతో నేను కూడా ఏకీభవిస్తున్నాను. భారతదేశ శాస్త్రీయ చరిత్రను గురించి, మన శాస్త్రవేత్తల గురించి మన యువత తెలుసుకోవాలని, అర్థం చేసుకోవాలని, అధ్యయనం చేయాలని నేను ఖచ్చితంగా కోరుకుంటున్నాను.
మిత్రులారా! మనం సైన్స్ గురించి మాట్లాడేటప్పుడు చాలాసార్లు ప్రజలు దీనిని భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం లేదా ప్రయోగశాలలకు పరిమితం చేస్తారు. కాని, సైన్స్ దీని కంటే చాలా ఉన్నతమైంది. 'స్వయం సమృద్ధి భారత ప్రచారంలో' సైన్స్ శక్తి చాలా దోహద పడుతుంది. ‘ల్యాబ్ టు ల్యాండ్’ అనే మంత్రంతో మనం ముందుకు వెళ్ళాలి.
ఉదాహరణకు హైదరాబాద్ లో చింతల వెంకట రెడ్డి గారు ఉన్నారు. రెడ్డిగారి డాక్టర్ స్నేహితుడు ఒకసారి ఆయనకు విటమిన్-డి లోపం వల్ల కలిగే వ్యాధులు, వాటి అనర్థాల గురించి చెప్పారు. రెడ్డి గారు ఒక రైతు. ఈ సమస్యను పరిష్కరించడానికి ఏం చేయాలా అని ఆయన ఆలోచించారు. దీని తరువాత ఆయన చాలా కష్టపడ్డారు. విటమిన్-డి అధికంగా ఉండే గోధుమ, వరి పంటలను అభివృద్ధి చేశారు. అదే నెలలో ఆయన జెనీవాలోని ప్రపంచ మేధో సంపత్తి సంస్థ నుండి పేటెంట్ కూడా పొందారు. గతేడాది వెంకట్ రెడ్డి గారిని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించడం మన ప్రభుత్వ సౌభాగ్యం.
లద్దాఖ్‌కు చెందిన ఉర్ గెన్ ఫుత్ సౌగ్ గారు కూడా చాలా వినూత్న పద్ధతిలో పనిచేస్తున్నారు. ఉర్ గెన్ గారు ఇంత ఎత్తులో సేంద్రీయ విధానంలో సుమారు 20 పంటలను పండిస్తున్నారు. చక్రీయ పద్ధతిలో సాగు చేస్తున్నారు. ఒక పంట వ్యర్థాలను ఇతర పంటలలో ఎరువుగా ఉపయోగిస్తారు. ఇది అద్భుతమైన విషయం కదా!
అదేవిధంగా గుజరాత్‌లోని పాటన్ జిల్లాలో కామరాజ్ భాయ్ చౌదరి గారి ఇంట్లో మంచి మునగ కాయ విత్తనాలను అభివృద్ధి చేశారు. మంచి విత్తనాల సహాయంతో ఉత్పత్తి అయ్యే మునగ కాయ నాణ్యత కూడా మంచిది. ఆయన ఇప్పుడు తన ఉత్పత్తులను తమిళనాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు పంపించడం ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటున్నారు.
మిత్రులారా! ఈ రోజుల్లో మీరు చియా విత్తనాల పేరు తప్పక వింటూ ఉండవచ్చు. ఆరోగ్య అవగాహన ఉన్న వ్యక్తులు దీనికి చాలా ప్రాముఖ్యతనిస్తారు. ప్రపంచంలో దీనికి చాలా డిమాండ్ ఉంది. భారతదేశంలో ఇది ఎక్కువగా విదేశాల నుండి వస్తోంది. కానీ ఇప్పుడు ప్రజలు చియా విత్తనాల విషయంలో స్వయం సమృద్ధి దిశలో ముందడుగు వేస్తున్నారు. ఈ విధంగా యూపీలోని బారాబంకిలో హరిశ్చంద్ర గారు చియా విత్తనాల సాగు ప్రారంభించారు. ఈ విత్తనాల సాగు వారి ఆదాయాన్ని కూడా పెంచుతోంది. స్వావలంబన భారత ప్రచారానికి సహాయపడుతుంది.
మిత్రులారా! వ్యవసాయ వ్యర్థాల నుండి సంపదను సృష్టించడానికి అనేక ప్రయోగాలు కూడా దేశవ్యాప్తంగా విజయవంతంగా జరుగుతున్నాయి. ఉదాహరణకు, మదురైకి చెందిన మురుగేషన్ గారు అరటి వ్యర్థాల నుండి తాడు తయారు చేసే యంత్రాన్ని రూపొందించారు. మురుగేషన్ గారి ఈ ఆవిష్కరణ పర్యావరణ సమస్యలను, వ్యర్థ పదార్థాల నిర్మూలన సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. అదనపు ఆదాయానికి రైతులకు ఒక మార్గాన్ని కూడా అందిస్తుంది.
మిత్రులారా! మన్ కీ బాత్ శ్రోతలకు ఇలా చాలా మంది గురించి చెప్పడం వెనుక నా ఉద్దేశ్యం మనమందరం వారి నుండి ప్రేరణ పొందుతాం. దేశంలోని ప్రతి పౌరుడు తన జీవితంలోనూ ప్రతి రంగంలోనూ విజ్ఞాన శాస్త్రాన్ని విస్తరిస్తే పురోగతికి మార్గాలు కూడా తెరుచుకుంటాయి. దేశం కూడా స్వయం సమృద్ధిగా మారుతుంది. ఈ దేశంలోని ప్రతి పౌరుడు దీన్ని చేయగలడన్న నమ్మకం నాకుంది.
నా ప్రియమైన మిత్రులారా! కోల్‌కతాకు చెందిన రంజన్ గారు తన లేఖలో చాలా ఆసక్తికరమైన, ప్రాథమిక ప్రశ్నలను అడిగారు. అదే సమయంలో వాటికి ఉత్తమ సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నించారు. మనం స్వావలంబన గురించి మాట్లాడేటప్పుడు దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? "స్వావలంబన భారత ప్రచారం కేవలం ప్రభుత్వ విధానం మాత్రమే కాదు, జాతీయ స్ఫూర్తి” అని ఈ ప్రశ్నకు సమాధానంగా ఆయన స్వయంగా రాశారు. స్వయం సమృద్ధిగా ఉండడం అంటే తమ స్వంత విధిని నిర్ణయించడమని ఆయన అభిప్రాయం. అంటే తమ భవిష్యత్తును తామే నిర్ణయించుకోవడమని ఆయన నమ్ముతారు. రంజన్ బాబు గారి అభిప్రాయం వంద శాతం సరైంది. ఆయన చెప్పిన విషయాన్ని మరింత వివరిస్తే- మన దేశ విషయాల గురించి గర్వపడడం, మన దేశ ప్రజలు చేసిన పనుల గురించి గర్వపడడం స్వయం సమృద్ధిలో మొదటి అంశం. ప్రతి దేశ వాసీ గర్వపడుతున్నప్పుడు, ఈ ప్రక్రియలో అందరూ దేశవాసులూ పాలుపంచుకున్నప్పుడు స్వావలంబన భారతదేశం కేవలం ఆర్థిక ప్రచారం కాకుండా జాతీయ స్ఫూర్తిగా మారుతుంది. మన దేశంలో తయారైన తేజస్ యుద్ధ విమానాల విన్యాసాలను ఆకాశంలో చూసినప్పుడు; భారతదేశంలో తయారైన యుద్ధ ట్యాంకులు, క్షిపణులు మన గౌరవాన్ని పెంచినప్పుడు; ధనిక దేశాలలోని మెట్రో రైళ్లలో మేడ్ ఇన్ ఇండియా కోచ్ లను చూసినప్పుడు; మేడ్ ఇన్ ఇండియా కరోనా వ్యాక్సిన్ విదేశాలకు చేరుకున్న విషయం చూసినప్పుడు, మన నుదురు మరింత ఉన్నతమవుతుంది. పెద్ద విషయాలు మాత్రమే భారతదేశాన్ని స్వయం సమృద్ధిగా మారుస్తాయని కాదు. భారతదేశంలో తయారైన దుస్తులు, భారతదేశంలోని ప్రతిభావంతులైన హస్తకళాకారులు తయారుచేసిన వస్తువులు, భారతదేశ ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, దేశ మొబైల్ రంగం.. ఇలా ప్రతి రంగంలోనూ మనం ఈ ప్రతిష్ఠను పెంచుకోవాలి. ఈ ఆలోచనతో మనం ముందుకు సాగినప్పుడు మాత్రమే మనం నిజంగా స్వావలంబన సాధించగలుగుతాం. ఈ స్వావలంబన భారతదేశ మంత్రం దేశంలోని ప్రతి గ్రామానికి చేరుకోవడం నాకు సంతోషంగా ఉంది. బీహార్‌లోని బేతియాలో ఇదే జరిగింది. దీని గురించి నేను మీడియాలో చదివాను.
బేతియాలో నివసించే ప్రమోద్ గారు ఢిల్లీ లో ఎల్ఈడీ బల్బ్ తయారీ కర్మాగారంలో టెక్నీషియన్‌గా పనిచేసేవారు. ఆ కర్మాగారంలో పనిచేసేటప్పుడు మొత్తం ప్రక్రియను చాలా దగ్గరగా అర్థం చేసుకున్నాడు. కానీ కరోనా సమయంలో ప్రమోద్ గారు తన ఇంటికి తిరిగి రావలసి వచ్చింది. తిరిగి వచ్చిన తర్వాత ప్రమోద్ గారు ఏం చేశారో తెలుసా? ఎల్ఈడీ బల్బుల తయారీకి స్వయంగా ఒక చిన్న యూనిట్‌ను ప్రారంభించారు. ఆయన తన ప్రాంతం నుండి కొంతమంది యువకులను తీసుకొని ఫ్యాక్టరీ కార్మికుడి నుండి ఫ్యాక్టరీ యజమానిగా తన ప్రయాణాన్ని కొన్ని నెలల్లో పూర్తి చేశారు. అది కూడా తన తన సొంత ఇంట్లోనే నివసిస్తూ..
మరో ఉదాహరణ ఉత్తరప్రదేశ్ లోని గఢ్ ముక్తేశ్వర్ కు సంబంధించింది. కరోనా కాలంలో విపత్తును అవకాశంగా తాను ఎలా మార్చుకున్నారో గఢ్ ముక్తేశ్వర్ నుండి సంతోష్ గారు రాశారు. సంతోష్ గారి పూర్వికులు అద్భుతమైన హస్తకళాకారులు. చాపలు తయారు చేసేవారు. కరోనా సమయంలో ఇతర పనులు ఆగిపోయినప్పుడు వారు గొప్ప శక్తితో, ఉత్సాహంతో చాపలను తయారు చేయడం ప్రారంభించారు. త్వరలో ఉత్తరప్రదేశ్ లోని వివిధ ప్రాంతాల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా చాపల కోసం ఆర్డర్లు పొందారు. దీనివల్ల ఈ ప్రాంతానికి చెందిన శతాబ్దాల పూర్వపు పురాతన అందమైన కళకు కొత్త బలం లభించిందని సంతోష్ గారు చెప్పారు.
మిత్రులారా! దేశవ్యాప్తంగా అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు స్వావలంబన భారత ప్రచారానికి సహకరిస్తున్నారు. ఈ రోజు అది ఒక భావోద్వేగ అంశంగా మారింది. ఈ భావోద్వేగం సాధారణ ప్రజల హృదయాల్లో ప్రవహిస్తోంది.
నా ప్రియమైన దేశవాసులారా! గుర్గావ్లో నివసిస్తున్న మయూర్ గారి ఆసక్తికరమైన పోస్ట్ ను నమోఆప్‌లో చూశాను. ఆయన పక్షుల వీక్షకుడు. ప్రకృతి ప్రేమికుడు. తాను హర్యానాలో నివసిస్తున్నానని మయూర్ గారు రాశారు. కానీ అస్సాం ప్రజలపై– ముఖ్యంగా కాజీరంగ ప్రజలపై చర్చించాలని తాను కోరుకుంటున్నానని ఆయన రాశారు. అస్సాంకు గర్వకారణమైన ఖడ్గమృగం గురించి మయూర్ గారు మాట్లాడతారని నేను అనుకున్నాను. కానీ కాజీరంగాలో వాటర్ ఫౌల్స్ సంఖ్య పెరిగినందుకు అస్సాం ప్రజలను మయూర్ గారు అభినందించారు. ఈ వాటర్ ఫౌల్స్ ను సులువైన భాషలో ఎలా చెప్పవచ్చో నేను అన్వేషిస్తున్నాను. ఒక పదం కనుగొన్నాను. – ఆ పదం ‘జలపక్షి’. చెట్ల మీద కాకుండా నీటి పై గూడు ఉండే పక్షి. బాతులు మొదలైనవి. కాజీరంగ నేషనల్ పార్క్, టైగర్ రిజర్వ్ అథారిటీ కొంతకాలంగా వార్షిక వాటర్ ఫాల్స్ సెన్సస్ చేస్తున్నాయి. ఈ జనాభా లెక్కల ప్రకారం నీటి పక్షుల సంఖ్య తెలుస్తుంది. వాటికి ఇష్టమైన ఆవాసాలేమిటో తెలుస్తుంది. రెండు-మూడు వారాల కిందట మళ్ళీ సర్వే జరిగింది. ఈసారి నీటి పక్షుల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే సుమారు 175 శాతం పెరిగిందని తెలుసుకోవడం మీకు కూడా సంతోషంగా ఉంటుంది.
ఈ జనాభా లెక్కల ప్రకారం కాజీరంగ జాతీయ ఉద్యానవనంలో మొత్తం 112 జాతుల పక్షులు కనిపించాయి. వీటిలో 58 జాతుల పక్షులు యూరప్, మధ్య ఆసియా, తూర్పు ఆసియాతో సహా ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుండి శీతాకాలంలో వలస వస్తాయి. మెరుగైన నీటి సంరక్షణతో పాటు ఇక్కడ చాలా తక్కువ మానవ ప్రమేయం ఉండడం కూడా దీనికి ముఖ్య కారణం. కొన్ని సందర్భాల్లో సానుకూల మానవ జోక్యం కూడా చాలా ముఖ్యమైంది.
అస్సాంకు చెందిన జాదవ్ పాయెంగ్ ను చూడండి. మీలో కొందరికి ఆయన గురించి తెలిసి ఉండవచ్చు. ఆయన చేసిన కృషికి పద్మ అవార్డు అందుకున్నారు. అస్సాంలోని మజులి ద్వీపంలో సుమారు 300 హెక్టార్ల తోటల పెంపకంలో తన చురుకైన సహకారాన్ని ఆయన అందించారు. ఆయన అటవీ సంరక్షణ కోసం కృషి చేస్తున్నారు. తోటల పెంపకంలో, జీవవైవిధ్య పరిరక్షణ కోసం ప్రజలను ప్రేరేపించడంలో కూడా పాల్గొన్నారు.
మిత్రులారా! అస్సాంలోని మన దేవాలయాలు కూడా ప్రకృతి పరిరక్షణలో తమదైన పాత్ర పోషిస్తున్నాయి. మీరు దేవాలయాలను పరిశీలిస్తే ప్రతి ఆలయానికి ఒక చెరువు ఉందని మీకు తెలుస్తుంది. హజోలోని హయగ్రీవ మధేబ్ ఆలయం, సోనిత్‌పూర్‌లోని నాగశంకర్ ఆలయం, గువహతిలోని ఉగ్రతార ఆలయం మొదలైన ఆలయాల సమీపంలో ఇలాంటి చెరువులు చాలా ఉన్నాయి. అంతరించిపోయిన జాతుల తాబేళ్లను కాపాడటానికి వీటిని ఉపయోగిస్తున్నారు. అస్సాంలో అత్యధిక జాతుల తాబేళ్లు ఉన్నాయి. దేవాలయాల సమీపంలోని ఈ చెరువులు తాబేళ్ల సంరక్షణ, పెంపకంతో పాటు తాబేళ్ల పెంపకంలో శిక్షణ కోసం ఒక అద్భుతమైన ప్రదేశంగా మారతాయి.
నా ప్రియమైన దేశవాసులారా! ఆవిష్కరణ చేయడానికి శాస్త్రవేత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కొంతమంది భావిస్తారు. ఇతరులకు ఏదైనా నేర్పడానికి ఉపాధ్యాయుడిగా ఉండాల్సిన అవసరం ఉందని మరికొందరు భావిస్తారు. ఈ ఆలోచనను సవాలు చేసే వారికి ఎల్లప్పుడూ ప్రశంసలు లభిస్తాయి. ఎవరైనా సైనికుడిగా మారడానికి శిక్షణ పొందితే అతను సైనికుడిగా ఉండాల్సిన అవసరం ఉందా? అవును.. అది అవసరం అని మీరు ఆలోచిస్తూ ఉండాలి. కానీ ఇక్కడే చిన్న మెలిక ఉంది.
మైగవ్‌లో కమలకాంత్ గారు ఒక మీడియా నివేదికను పంచుకున్నారు. ఇది భిన్నమైన విషయం. ఒడిశాలోని అరాకుడలో ఒక మంచి వ్యక్తి ఉన్నారు. ఆయన పేరు నాయక్ సర్. ఆయన పేరు సిలూ నాయక్ అయినప్పటికీ అందరూ ఆయన్ని నాయక్ సర్ అని పిలుస్తారు. నిజానికి ఆయన మ్యాన్ ఆన్ ఎ మిషన్. సైన్యంలో చేరాలని కోరుకునే యువకులకు ఆయన ఉచితంగా శిక్షణ ఇస్తారు. ఆయన సంస్థ పేరు మహాగురు బెటాలియన్. శారీరక దృఢత్వం నుండి ఇంటర్వ్యూల వరకు, రాయడం నుండి శిక్షణ వరకు అన్ని అంశాలను అక్కడ నేర్పిస్తారు. ఆ సంస్థలో శిక్షణ పొందిన వ్యక్తులు ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్ వంటి సైనిక దళాలలో స్థానం పొందారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఒడిశా పోలీసులలో నియామకం కోసం ప్రయత్నించిన సిలూ నాయక్ విజయం సాధించలేకపోయారని తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. అయినప్పటికీ తన శిక్షణ ఆధారంగా ఆయన చాలా మంది యువకులను జాతీయ సేవకు అర్హుడుగా చేశారు. రండి.. మన దేశానికి మరింతమంది నాయకులను సిద్ధం చేయాలని నాయక్ సర్ కు శుభాకాంక్షలు తెలియజేద్దాం.
మిత్రులారా! కొన్నిసార్లు చాలా చిన్న, సాధారణమైన ప్రశ్న కూడా మనస్సును కదిలిస్తుంది. ఈ ప్రశ్నలు చాలా పెద్దవి కావు.. అవి చాలా సరళమైనవి. అయినప్పటికీ అవి మనల్ని ఆలోచింపజేస్తాయి. కొద్ది రోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన అపర్ణరెడ్డి గారు అలాంటి ఒక ప్రశ్న నన్ను అడిగారు. “మీరు చాలా సంవత్సరాలు ప్రధానమంత్రి గా ఉన్నారు. చాలా సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఏదో ఇంకా తక్కువ ఉందని మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా?” అని అపర్ణ గారు అడిగారు. అపర్ణ గారి ప్రశ్న చాలా సులభం. కాని జవాబు కష్టమైంది కూడా. నేను ఈ ప్రశ్న గురించి చాలా ఆలోచించాను. నా లోపాలలో ఒకటి, ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళాన్ని నేర్చుకోవడానికి నేను పెద్దగా ప్రయత్నం చేయకపోవడమని, నేను తమిళం నేర్చుకోలేకపోయానని నాలో నేను అనుకున్నాను. తమిళం చాలా సుందర భాష. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. తమిళ సాహిత్యంలోని నాణ్యత, ఆ భాషలో రాసిన కవితల లోతు గురించి చాలా మంది నాకు చాలా చెప్పారు. మన సంస్కృతికి, గౌరవానికి ప్రతీక అయిన అనేక భాషల ప్రదేశం భారతదేశం. భాష గురించి మాట్లాడుతూ, మీతో ఒక చిన్న ఆసక్తికరమైన క్లిప్‌ను పంచుకోవాలనుకుంటున్నాను.
సౌండ్ క్లిప్- స్టాచ్యూ ఆఫ్ యూనిటీ – బైట్‌ను లిప్యంతరీకరించాల్సిన అవసరం లేదు)
## (sound clip Statue of Unity-no need to transcribe the byte)
ప్రపంచంలో అత్యంత ఎత్తైన సర్దార్ పటేల్ ఐక్యతా విగ్రహంపై ఒక గైడ్ ప్రజలకు సంస్కృతంలో చెప్పే విషయాన్ని మీరు ఇప్పుడు విన్నారు. కేవాడియాలో 15 మంది కి పైగా గైడ్లు సంస్కృతంలో ప్రజలకు మార్గానిర్దేశం చేస్తారని తెలుసుకోవడం మీకు సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నేను మీకు మరో గొంతు వినిపిస్తాను. –
## (sound clip Cricket commentary- no need to transcribe the byte)
## (సౌండ్ క్లిప్ క్రికెట్ వ్యాఖ్యానం- బైట్‌ను లిప్యంతరీకరించాల్సిన అవసరం లేదు)
ఇది కూడా మీరు విని ఆశ్చర్యపోయి ఉంటారు. వాస్తవానికి, ఇది సంస్కృతంలో జరుగుతున్న క్రికెట్ వ్యాఖ్యానం. వారణాసిలో సంస్కృత మహావిద్యాలయాల మధ్య క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఈ కళాశాలలు – శాస్త్రార్థ్ కళాశాల, స్వామి వేదాంతి వేద విద్యాపీఠం, శ్రీ బ్రహ్మ వేద విద్యాలయ , అంతర్జాతీయ చంద్రమౌళి ఛారిటబుల్ ట్రస్ట్. ఈ టోర్నమెంట్ మ్యాచ్‌ల సందర్భంగా సంస్కృతంలో కూడా కామెంటరీ ఉంటుంది. ఇప్పుడు ఆ వ్యాఖ్యానంలో చాలా చిన్న భాగం మీకు వినిపించాను. ఇది మాత్రమే కాదు.. ఈ టోర్నమెంట్ లో ఆటగాళ్ళు, వ్యాఖ్యాతలు సాంప్రదాయ దుస్తులలో కనిపిస్తారు. మీకు శక్తి, ఉత్సాహం, సస్పెన్స్ ఒకేసారి కావాలంటే మీరు ఆటల వ్యాఖ్యానాన్ని వినాలి.
టీవీ. రాకముందు క్రికెట్, హాకీ వంటి క్రీడల వ్యాఖ్యానం దేశ ప్రజలను రోమాంచితం చేసే మాధ్యమం. టెన్నిస్, ఫుట్‌బాల్ మ్యాచ్‌ల వ్యాఖ్యానం కూడా చాలా బాగా జరుగుతుంది. వ్యాఖ్యానం గొప్పగా ఉండే ఆటలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతాయని మనం చూశాం. మనకు ఇక్కడ చాలా భారతీయ క్రీడలు ఉన్నాయి. కాని వాటిలో వ్యాఖ్యాన సంస్కృతి రాలేదు. ఈ కారణంగా అవి అంతరించిపోయే స్థితిలో ఉన్నాయి. నా మనసులో ఒక ఆలోచన ఉంది. విభిన్న క్రీడలలో- ముఖ్యంగా భారతీయ క్రీడలలో ఎక్కువ భాషలలో మంచి వ్యాఖ్యానం ఎందుకు లేదని. వ్యాఖ్యానాన్ని క్రీడలలో ప్రోత్సహించడం గురించి మనం ఆలోచించాలి. దీని గురించి ఆలోచించాలని క్రీడా మంత్రిత్వ శాఖ, ప్రైవేటు సంస్థల సహచరులను నేను కోరుతున్నాను.
నా ప్రియమైన యువ మిత్రులారా! రాబోయే నెలలు మీ అందరి జీవితంలో ప్రత్యేక ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. చాలా మంది యువ మిత్రులకు పరీక్షలున్నాయి. మీరు వారియర్స్ గా మారాలి గానీ వర్రీయర్స్ గా మారకూడదని మీకు గుర్తుంది కదా. మీరు యోధులుగా మారాలి. ఆందోళన చెందకూడదు. మీరు నవ్వుతూ పరీక్షకు వెళ్ళాలి. నవ్వుతూ తిరిగి రావాలి. ఇతరులతో పోటీ కాదు. మీతో మీరు పోటీ పడాలి. తగినంత సమయం నిద్ర పోవాలి. సమయ నిర్వహణ కూడా ఉండాలి. ఆడడం కూడా ఆపవద్దు. ఎందుకంటే ఆడేవారు వికసిస్తారు. పునర్విమర్శలో , జ్ఞాపకశక్తి లో ఆధునిక పద్ధతులను అవలంబించాలి. మొత్తంమీద ఈ పరీక్షలలో మీరు మీలోని ఉత్తమమైన సామర్థ్యాన్ని వెలికి తీయాలి. ఇవన్నీ ఎలా జరుగుతాయో మీరు ఆలోచిస్తూ ఉండవచ్చు. మనందరం కలిసి ఈ కృషి చేయబోతున్నాం. ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సారి కూడా 'పరీక్షా పే చర్చ' నిర్వహిస్తాం. మార్చిలో 'పరీక్షా పే చర్చ' జరగడానికి ముందు మీ అనుభవాలను, మీ చిట్కాలను పంచుకోవాలని పరీక్ష యోధులను, తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను నేను కోరుతున్నాను. ఈ విషయాలను మీరు MyGov లో పంచుకోవచ్చు. నరేంద్రమోడి యాప్‌లో షేర్ చేయవచ్చు. ఈసారి యువతతో పాటు తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను కూడా 'పరీక్షా పే చర్చ' కు ఆహ్వానిస్తారు. ఎలా పాల్గొనాలి, బహుమతిని ఎలా గెలుచుకోవాలి, నాతో చర్చించే అవకాశాన్ని ఎలా పొందాలో మీకు సమస్త సమాచారం మైగవ్‌లో లభిస్తుంది. ఇప్పటివరకు లక్ష మందికి పైగా విద్యార్థులు, సుమారు 40 వేల మంది తల్లిదండ్రులు, సుమారు 10 వేల మంది ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మీరు కూడా పాల్గొనండి. ఎగ్జాం వారియర్ పుస్తకంలో నేను కొత్త అంశాలను జోడించేందుకు ఈ కరోనా కాలంలో నేను కొంత సమయం తీసుకున్నాను. పరీక్ష యోధుల పుస్తకంలో చాలా కొత్త విషయాలను జోడించాను. ఇప్పుడు తల్లిదండ్రులకు కూడా కొన్ని అంశాలను అందజేయడం జరిగింది. ఈ అంశాలకు సంబంధించిన చాలా ఆసక్తికరమైన కార్యకలాపాలు నరేంద్రమోడి యాప్‌లో ఉన్నాయి. ఇవి మీలోని పరీక్ష యోధుడిని ప్రజ్వలింపజేసి, విజయం పొందేందుకు దోహదపడుతుంది. మీరు వాటిని తప్పక ప్రయత్నించాలి. రాబోయే పరీక్షల సందర్భంగా యువ మిత్రులందరికీ చాలా అభినందనలు.
నా ప్రియమైన దేశవాసులారా! మార్చి నెల ఆర్థిక సంవత్సరంలో చివరి నెల. కాబట్టి మీలో చాలా మంది తీరిక లేకుండా ఉండవచ్చు. ఇప్పుడు దేశంలో ఆర్థిక కార్యకలాపాలు అధికమవుతుండడం వల్ల వ్యాపారులు, వ్యవస్థాపక సహోద్యోగుల పని కూడా పెరుగుతోంది. ఈ పనులన్నిటి మధ్య కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండడాన్ని తగ్గించకూడదు. మీరందరూ ఆరోగ్యంగా ఉంటారు. సంతోషంగా ఉంటారు. మీ విధులలో ఉంటారు. అప్పుడు దేశం వేగంగా ముందుకు సాగుతుంది.
మీకు రాబోయే పండుగల శుభాకాంక్షలు. అలాగే కరోనాకు సంబంధించిన నిబంధనల విషయంలో ఏమాత్రం అలసత్వం ఉండకూడదు. మీకు చాలా చాలా కృతజ్ఞతలు.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. 'మన్ కీ బాత్' ద్వారా మీతో సంభాషిస్తున్నప్పుడు మీ కుటుంబ సభ్యునిగా నేను మీ మధ్య ఉన్నట్లు అనిపిస్తుంది. మన చిన్న చిన్న విషయాలు ఏవైనా అంశాలను నేర్పిస్తే.., జీవితంలోని వివిధ అనుభవాలు మొత్తం జీవితాన్ని గడపడానికి ప్రేరణగా మారితే.. – అదే 'మన్ కి బాత్'. ఈ రోజు 2021 జనవరిలో చివరి రోజు. కొద్ది రోజుల క్రితమే 2021 ప్రారంభమైందని మీరు కూడా నాలాగే ఆలోచిస్తున్నారా? జనవరి నెల మొత్తం గడిచిపోయిందని అనిపించదు – దీన్నే కాల గమనం అంటారు. కొన్ని రోజుల కిందటే మనం ఒకరికొకరు పండుగ శుభాకాంక్షలు తెలుపుకున్నామనిపిస్తోంది. మనం లోహ్రీని జరుపుకున్నాం.. మకర సంక్రాంతి జరుపుకున్నాం. పొంగల్, బిహు జరుపుకున్నాం. దేశంలోని వివిధ ప్రాంతాల్లో పండుగలు జరుపుకున్నారు. జనవరి 23న నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజును 'పరాక్రామ్ దివస్' గా జరుపుకున్నాం. జనవరి 26 నాడు 'రిపబ్లిక్ డే' సందర్భంగా అద్భుతమైన కవాతును కూడా చూశాం. పార్లమెంటు సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ప్రసంగించిన తరువాత బడ్జెట్ సమావేశాలు కూడా ప్రారంభమయ్యాయి. వీటన్నిటి మధ్య మరో పని కూడా జరిగింది. మనమందరం చాలా ఎదురుచూసిన ఆ కార్యక్రమం పద్మ అవార్డుల ప్రకటన. అసాధారణమైన కృషి చేస్తున్న వారిని – వారి విజయాలు, వారి సేవకు గుర్తింపుగా దేశం సత్కరించింది. ఈ సంవత్సరం కూడా వివిధ రంగాల్లో అద్భుతమైన కృషి చేసినవారు, వారి కృషితో ప్రజల జీవితాలను మార్చినవారు అవార్డు పొందిన వారిలో ఉన్నారు. వారు దేశాన్ని ముందుకు తీసుకెళ్లారు. అట్టడుగు స్థాయిలో పనిచేస్తూ గుర్తింపు పొందని నిజ జీవిత హీరోలకు పద్మ అవార్డులు ఇచ్చే సంప్రదాయాన్ని కొన్నేళ్ల క్రితం దేశం ప్రారంభించింది. అదే సంప్రదాయం ఈసారి కూడా కొనసాగింది. ఈ వ్యక్తుల గురించి, వారి సేవల గురించి తెలుసుకోవాలని మీ అందరిని నేను కోరుతున్నాను. వారి గురించి మీ కుటుంబంలో చర్చ జరపాలి. దీని నుండి ప్రతి ఒక్కరూ ఎంత ప్రేరణ పొందుతారో చూడండి.
ఈ నెల క్రికెట్ పిచ్ నుండి కూడా చాలా మంచి వార్తలను అందుకున్నాం. మన క్రికెట్ జట్టు ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొని, తర్వాత అద్భుతంగా ఆడి ఆస్ట్రేలియాలో సిరీస్‌ను గెలుచుకుంది. మన క్రీడాకారుల కష్టపడే స్వభావం, టీం వర్క్ ప్రేరణ ఇస్తుంది. వీటన్నింటి మధ్య ఢిల్లీలో జనవరి 26న త్రివర్ణ పతాకానికి జరిగిన అవమానాన్ని చూసిన దేశం చాలా విచారంగా ఉంది. మనం భవిష్యత్తును కొత్త ఆశతో, కొత్తదనంతో నింపాలి. మనం గత సంవత్సరం అసాధారణమైన సంయమనాన్ని, ధైర్యాన్ని చూపించాం. ఈ సంవత్సరం కూడా మనం కష్టపడి పనిచేయాలి. మన సంకల్పాన్ని నిరూపించుకోవాలి. మన దేశాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్లాలి.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ సంవత్సరం ప్రారంభంతో కరోనాపై మన పోరాటం కూడా దాదాపు ఒక సంవత్సరం పూర్తయింది. కరోనాకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటం ఒక ఉదాహరణగా మారినవిధంగానే ఇప్పుడు మన టీకా కార్యక్రమం కూడా ప్రపంచంలో ఒక ఉదాహరణగా మారుతోంది. నేడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద కోవిడ్ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అంతకన్నా గర్వం ఏముంటుంది? అతిపెద్ద వ్యాక్సిన్ ప్రోగ్రామ్‌తో పాటు ప్రపంచంలోనే అత్యంత వేగంతో మన పౌరులకు టీకాలు వేస్తున్నాం. కేవలం 15 రోజుల్లో భారతదేశం 30 లక్షలకు పైగా ఉన్న మన కరోనా యోధులకు టీకాలు వేసింది. ఈ కార్యక్రమానికి అమెరికా వంటి ధనిక దేశానికి 18 రోజులు, బ్రిటన్‌కు 36 రోజులు పట్టింది.
మిత్రులారా! 'మేడ్-ఇన్-ఇండియా వ్యాక్సిన్' నేడు కేవలం భారతదేశ స్వావలంబనకు మాత్రమే కాకుండా దేశ ఆత్మగౌరవానికి కూడా ప్రతీక. 'మేడ్-ఇన్-ఇండియా వ్యాక్సిన్' మనస్సులో కొత్త ఆత్మ విశ్వాసాన్ని కల్పించిందని నమో యాప్‌లో ఉత్తరప్రదేశ్ నుండి సోదరుడు హిమాన్షు యాదవ్ రాశారు. తన విదేశీ స్నేహితులు చాలా మంది తనకు సందేశాల మీద సందేశాలు పంపుతూ భారతదేశానికి కృతజ్ఞతలు తెలుపుతున్నారని మదురై నుండి కీర్తి గారు రాశారు. కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో భారతదేశం ప్రపంచానికి సహాయం చేసిన విధానం వల్ల భారతదేశం పట్ల వారికి ఉన్న గౌరవం వారి మనస్సుల్లో మరింతగా పెరిగిందని కీర్తి గారి స్నేహితులు ఆమెకు రాశారు. కీర్తి గారూ.. దేశం పొందిన ఈ గౌరవాన్ని వింటూ 'మన్ కి బాత్' శ్రోతలు కూడా గర్వపడుతున్నారు. ఈ మధ్య నేను వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రుల నుండి కూడా ఇలాంటి సందేశాలను పొందుతున్నాను. ట్వీట్ చేయడం ద్వారా బ్రెజిల్ అధ్యక్షుడు భారతదేశానికి ఎలా కృతజ్ఞతలు చెప్పారో, ప్రతి భారతీయుడికి ఇది ఎంత గర్వం కలిగించే విషయమో మీరు కూడా చూసి ఉంటారు. వేలాది కిలోమీటర్ల దూరంలో- ప్రపంచంలోని సుదూర ప్రాంతాల్లో, మూల మూలల్లో నివసిస్తున్నవారికి రామాయణం పై ఉన్న లోతైన అవగాహన వారి మనస్సులపై ఎంతో ప్రభావాన్ని కలిగిస్తోంది. ఇది మన సంస్కృతి ప్రత్యేకత.
మిత్రులారా! ఈ టీకా కార్యక్రమంలో మీరు ఇంకొక విషయం గమనించి ఉంటారు. భారతదేశానికి మందులు, వ్యాక్సిన్ల విషయంలో ఎంతో సామర్థ్యం ఉంది. ఈ రంగంలో దేశం స్వయం సమృద్ధి సాధించింది. అందుకే సంక్షోభ సమయాల్లో భారతదేశం ప్రపంచానికి సేవ చేయగలిగింది. ఇదే ఆలోచన భారత స్వావలంబన ప్రచారంలో కూడా ఉంది. భారతదేశం సమర్థత పెరుగుతున్న కొద్దీ మానవాళికి ఎక్కువ సేవ లభిస్తుంది. దాని ద్వారా ప్రపంచానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది.
నా ప్రియమైన దేశవాసులారా! ప్రతిసారీ మీ నుండి ఉత్తరాలు వచ్చినప్పుడు; నమో యాప్, మైగవ్‌లోని మీ సందేశాలు, ఫోన్ కాల్స్ ద్వారా మీ అభిప్రాయాలను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. అలాంటి ఒక సందేశం నా దృష్టిని ఆకర్షించింది. – ఇది సోదరి ప్రియాంక పాండే గారి సందేశం. హిందీ సాహిత్య విద్యార్థి అయిన 23 ఏళ్ల ప్రియాంక బీహార్‌లోని సీవాన్ లో నివసిస్తున్నారు. దేశంలోని 15 దేశీయ పర్యాటక గమ్యస్థానాలను సందర్శించాలన్న నా సూచనతో తాను చాలా ప్రేరణ పొందినట్టు ఆమె నమో యాప్ లో రాశారు. ఆ ప్రేరణతో జనవరి 1న ఆమె చాలా ప్రత్యేకమైన ప్రదేశానికి బయలుదేరినట్టు తెలిపారు. ఆ స్థలం ఆమె ఇంటి నుండి 15 కిలోమీటర్ల దూరంలోని దేశ ప్రథమ రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ పూర్వికుల నివాసం. తన దేశనికి చెందిన గొప్ప వ్యక్తిత్వాలను తెలుసుకోవటానికి ఇది తన మొదటి అడుగు అని ప్రియాంక గారు ఒక చక్కటి విషయం రాశారు. ప్రియాంక గారికి అక్కడ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు రాసిన పుస్తకాలు లభించాయి. అనేక చారిత్రక ఛాయాచిత్రాలను పొందారు. ప్రియాంక గారూ.. మీ ఈ అనుభవం ఇతరులకు కూడా స్ఫూర్తినిస్తుంది.
మిత్రులారా! ఈ ఏడాది నుండి భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను ‘అమృత్ మహోత్సవ్’ గా ప్రారంభించబోతోంది. మన స్వాతంత్ర్య వీరులతో సంబంధాలున్న స్థానిక ప్రదేశాలను అన్వేషించడానికి ఇది సరైన సమయం. వారి కృషి కారణంగానే మనకు స్వేచ్ఛ లభించింది.
మిత్రులారా! మనం స్వాతంత్ర్య ఉద్యమం గురించి, బీహార్ గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి నమో యాప్‌లోనే చేసిన మరో వ్యాఖ్యను కూడా చర్చించాలనుకుంటున్నాను. ముంగేర్‌కు చెందిన జైరామ్ విప్లవ్ గారు తారాపూర్ అమరవీరుల దినోత్సవం గురించి నాకు రాశారు. దేశభక్తుల బృందానికి చెందిన అనేక మంది వీర నవ యువకులను 1932 ఫిబ్రవరి 15 వ తేదీన బ్రిటిష్ వారు దారుణంగా హత్య చేశారు. వారి ఏకైక నేరం ఏమిటంటే వారు 'వందే మాతరం', 'భారత్ మా కి జై' అంటూ నినాదాలు చేయడమే. నేను ఆ అమరవీరులకు నమస్కరిస్తున్నాను. వారి ధైర్యానికి నివాళి అర్పిస్తున్నాను. నేను జైరామ్ విప్లవ్ గారికి కృతజ్ఞతలు చెప్పాలనుకుంటున్నాను. ఇంతకు ముందు పెద్దగా చర్చ జరగని ఒక సంఘటనను ఆయన దేశం దృష్టికి తీసుకువచ్చారు.
నా ప్రియమైన దేశవాసులారా! భారతదేశంలోని ప్రతి భాగంలో- ప్రతి నగరంలో, ప్రతి పట్టణం, ప్రతి గ్రామంలో స్వాతంత్య్ర సంగ్రామం పూర్తి శక్తితో జరిగింది. దేశం కోసం తమ జీవితాలను త్యాగం చేసిన వీర కుమారులు భారతదేశంలోని ప్రతి మూలలో జన్మించారు. మన కోసం వారు చేసిన పోరాటాలు, వారికి సంబంధించిన జ్ఞాపకాలను జాగ్రత్తపర్చుకోవడం చాలా ముఖ్యం. వారి గురించి రాయడం ద్వారా, మనం మన భవిష్యత్ తరాల కోసం వారి జ్ఞాపకాలను సజీవంగా ఉంచగలం. దేశ స్వాతంత్య్ర సమరయోధుల గురించి, స్వాతంత్ర్యానికి సంబంధించిన సంఘటనల గురించి రాయాలని నేను దేశవాసులకు- ముఖ్యంగా నా యువ సహచరులకు పిలుపునిస్తున్నాను. మీ ప్రాంతంలో స్వాతంత్య్ర సంగ్రామ యుగం నాటి వీరోచిత గాథల గురించి పుస్తకాలు రాయండి. ఇప్పుడు- భారతదేశం 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలను జరుపుకుంటున్న సందర్భంలో మీ రచన ఆ స్వాతంత్ర్య వీరులకు గొప్ప నివాళి అవుతుంది. యువ రచయితల కోసం ఇండియా సెవెన్టీ ఫైవ్ ద్వారా ఒక కార్యక్రమం ప్రారంభమవుతోంది. ఇది అన్ని రాష్ట్రాలు, భాషల యువ రచయితలను ప్రోత్సహిస్తుంది. భారతీయ వారసత్వం, సంస్కృతిపై లోతైన అధ్యయనం చేసి, ఇటువంటి విషయాలను రాసే రచయితలు దేశంలో పెద్ద సంఖ్యలో సిద్ధంగా ఉంటారు. అటువంటి ప్రతిభకు మనం పూర్తిగా సహాయం చేయాలి. ఇది భవిష్యత్ దిశను నిర్ణయించే ఆలోచన ఉన్న నాయకుల విభాగాన్ని కూడా సృష్టిస్తుంది. ఈ ప్రయత్నంలో భాగం కావాలని, సాహిత్య నైపుణ్యాలను గరిష్టంగా ఉపయోగించుకోవాలని నా యువ స్నేహితులను ఆహ్వానిస్తున్నాను. దీనికి సంబంధించిన సమాచారాన్ని విద్యా మంత్రిత్వ శాఖ వెబ్సైట్ నుంచి పొందవచ్చు.
నా ప్రియమైన దేశవాసులారా! మన్ కీ బాత్‌లో శ్రోతలు ఇష్టపడేది మీకు బాగా తెలుసు. 'మన్ కీ బాత్'లో నాకు బాగా నచ్చింది ఏమిటంటే ఇందులో తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి, అధ్యయనం చేయడానికి చాలా విషయాలు లభిస్తాయి. ఒక విధంగా- పరోక్షంగా మీ అందరితో అనుసంధానమయ్యే అవకాశం లభిస్తుంది. కొందరి ప్రయత్నాలు, కొందరి అభిరుచులు, దేశానికి ఏదో చేయాలని కొందరిలో ఉన్న తపన – ఇవన్నీ నాకు చాలా స్ఫూర్తినిస్తాయి. నన్ను శక్తితో నింపుతాయి.
హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని స్థానిక కూరగాయల మార్కెట్ తన బాధ్యతలను నెరవేర్చే విధానాన్ని చదవడం కూడా నాకు చాలా సంతృప్తి ఇచ్చింది. కూరగాయల మార్కెట్లలో చాలా కారణాల వల్ల చాలా కూరగాయలు చెడిపోతాయని మనం అందరం చూశాం. ఈ కుళ్లిపోయిన కూరగాయలు ఇతర ప్రాంతాలకు కూడా వ్యాపిస్తాయి. వీటి ద్వారా అపరిశుభ్రత కూడా వ్యాపిస్తుంది. కాని బోయిన్ పల్లి కూరగాయల మార్కెట్ ఇలా రోజువారీ కూరగాయలను విసిరివేయకూడదని నిర్ణయించుకుంది. కూరగాయల మార్కెట్‌తో సంబంధం ఉన్న ప్రజలు వీటితో విద్యుత్తును సృష్టించాలని నిర్ణయించుకున్నారు. వ్యర్థ కూరగాయల నుండి విద్యుత్తును తయారు చేయడం గురించి మీరు ఎప్పుడైనా విని ఉంటారు. ఇది నవ కల్పన శక్తి. గతంలో బోయినపల్లి మార్కెట్లో ఉన్న వ్యర్థాల నుండి నేడు సంపద సృష్టి జరుగుతోంది. ఇది వ్యర్థాల నుండి బంగారం తయారుచేసే దిశగా ప్రయాణం. అక్కడ ప్రతి రోజు 10 టన్నుల వ్యర్థ పదార్థాలు తయారవుతున్నాయి. ఎఏ వ్యర్థాలను ఒక ప్లాంట్ లో సేకరిస్తారు. ప్లాంట్ లోపల ఈ వ్యర్థాల నుండి ప్రతిరోజూ 500 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతుంది. సుమారు 30 కిలోల జీవ ఇంధనం కూడా ఉత్పత్తి అవుతుంది. ఈ కాంతే కూరగాయల మార్కెట్‌కిఊ వెలుగు ఇస్తుంది. అక్కడ ఉత్పత్తి అయిన జీవ ఇంధనం నుండి ఆ మార్కెట్లోని క్యాంటీన్లో ఆహారాన్ని తయారు చేస్తారు. ఇది అద్భుతమైన ప్రయత్నం కదూ !
హర్యానాలో పంచకుల ప్రాంతంలోని బడౌత్ గ్రామ పంచాయతీ కూడా ఇదే విధమైన ఘనతను చూపించింది. ఈ పంచాయతీ ప్రాంతంలో నీటి పారుదల సమస్య ఉంది. ఈ మురికి నీరు వ్యాప్తి చెందుతూ, వ్యాధులకు కారణమవుతోంది. అయితే ఈ నీటి వ్యర్థాల నుండి కూడా సంపదను సృష్టించాలని బడౌత్ ప్రజలు నిర్ణయించుకున్నారు. గ్రామ పంచాయతీ మొత్తం గ్రామం నుండి వస్తున్న మురికి నీటిని ఒకే చోట ఫిల్టర్ చేయడం ప్రారంభించింది. ఈ ఫిల్టర్ చేసిన నీటిని ఇప్పుడు గ్రామ రైతులు తమ పొలాలలో నీటిపారుదల కొరకు వినియోగిస్తున్నారు. ఆ విధంగా కాలుష్యం, మలినాలు, వ్యాధులను వదిలించుకోవడంతో పాటు తమ పొలాలకు కూడా నీరందించగలిగారు.
మిత్రులారా! పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా ఆదాయ మార్గం ఎలా కల్పించుకోవచ్చనేదానికి ఉదాహరణ అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ లో కూడా కనిపిస్తుంది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఈ పర్వత ప్రాంతంలో 'మోన్ శుగు' అనే కాగితం శతాబ్దాలుగా తయారవుతోంది. ఈ కాగితాలు శుగు శెంగ్ అనే స్థానిక మొక్క బెరడు నుండి తయారవుతాయి. అందువల్ల ఈ కాగితాన్ని తయారు చేయడానికి చెట్లను నరికివేయవలసిన అవసరం లేదు. దీన్ని తయారు చేయడానికి ఏ రసాయనాన్నీ ఉపయోగించరు. అంటే ఈ కాగితం పర్యావరణానికి , ఆరోగ్యానికి కూడా సురక్షితం. ఈ కాగితాన్ని గతంలో ఎగుమతి కూడా చేసేవారు. కానీ, ఆధునిక సాంకేతికత వల్ల పెద్ద మొత్తంలో కాగితాలను ఉత్పత్తి చేయడం ప్రారంభమయ్యాక ఈ స్థానిక కాగితాల ఉత్పత్తి మూసివేత అంచుకు చేరుకుంది. ఇప్పుడు స్థానిక సామాజిక కార్యకర్త గొంబు దీన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నించారు. ఇది ఆదివాసి సోదర సోదరీమణులకు కూడా ఉపాధి కల్పిస్తోంది.
నేను కేరళ నుండి మరొక వార్తను చూశాను. ఇది మన బాధ్యతలను మనం గ్రహించేలా చేస్తుంది. కేరళలోని కొట్టాయంలో దివ్యాంగ వృద్ధుడు ఉన్నారు. ఆయన ఎన్.ఎస్.రాజప్పన్ గారు. పక్షవాతం కారణంగా రాజప్పన్ గారు నడవలేకపోతున్నారు. కానీ ఇది పరిశుభ్రత పట్ల ఆయనకున్న అంకితభావాన్ని తగ్గించలేదు. ఆయన గత కొన్నేళ్లుగా పడవలో వెంబనాడ్ సరస్సు వద్దకు వెళ్లి సరస్సులో విసిరిన ప్లాస్టిక్ బాటిళ్లను బయటకు తెస్తారు. ఆలోచించండి.. రాజప్పన్ గారి ఆలోచన ఎంత ఉన్నతమైంది! మనం కూడా రాజప్పన్ గారి నుండి ప్రేరణ పొంది, వీలైన చోట పరిశుభ్రతకు దోహదపడాలి.
నా ప్రియమైన దేశవాసులారా! మీరు కొన్ని రోజుల క్రితం తప్పక చూసి ఉంటారు. భారతదేశం నుండి నలుగురు భారతీయ మహిళా పైలట్లు శాన్ ఫ్రాన్సిస్కో నుండి బెంగళూరుకు నాన్ స్టాప్ ఫ్లైట్ ను తీసుకువచ్చారు. పదివేల కిలోమీటర్లకు పైగా ప్రయాణించిన తరువాత ఈ విమానం రెండు వందల ఇరవై ఐదు మందికి పైగా ప్రయాణికులను భారతదేశానికి తీసుకువచ్చింది. భారత వైమానిక దళానికి చెందిన ఇద్దరు మహిళా అధికారులు కొత్త చరిత్రను సృష్టించిన విషయాన్ని ఈసారి జనవరి 26 న జరిగిన కవాతులో మీరు గమనించి ఉంటారు.
ఏ రంగంలో అయినా దేశ మహిళల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూనే ఉంది. కానీ దేశంలోని గ్రామాల్లో ఇలాంటి మార్పుల గురించి పెద్దగా చర్చ జరగడం లేదు. కాబట్టి, నాకు మధ్యప్రదేశ్ లోని జబల్పూర్ నుండి వచ్చిన ఒక వార్తను 'మన్ కీ బాత్' లో ప్రస్తావించాలని భావించాను. ఈ వార్త చాలా ప్రేరణ ఇస్తుంది. . జబల్పూర్లోని చిచ్‌గావ్‌లో కొందరు ఆదివాసీ మహిళలు రోజూ బియ్యం మిల్లులో పనిచేసేవారు. కరోనా మహమ్మారి ప్రపంచంలో చాలా మందిని ప్రభావితం చేసినట్లే ఈ మహిళలపై కూడా ప్రభావం చూపించింది. ఆ రైస్ మిల్లులో పని ఆగిపోయింది. సహజంగానే ఇది ఆర్థిక సమస్యలను కలిగించడం ప్రారంభించింది. కానీ వారు నిరాశపడలేదు. తామందరం కలిసి తమ సొంత రైస్ మిల్లును ప్రారంభించాలని వారు నిర్ణయించుకున్నారు. వారు పనిచేసిన మిల్లువారు తమ యంత్రాన్ని కూడా అమ్మాలనుకున్నారు. వీరిలో మీనా రాహండాలే గారు మహిళలందరినీ అనుసంధానించి, 'స్వయం సహాయక బృందాన్ని' ఏర్పాటు చేశారు. అందరూ తాము ఆదా చేసిన మూలధనం నుండి డబ్బును సేకరించారు. కొంత డబ్బు తక్కువైతే 'ఆజీవికా మిషన్' కింద బ్యాంకు నుండి రుణం తీసుకున్నారు. ఇప్పుడు చూడండి…. ఈ గిరిజన సోదరీమణులు ఒకప్పుడు తాము పనిచేసిన బియ్యం మిల్లునే కొన్నారు. ఈ రోజు వారు తమ సొంత రైస్ మిల్లు నడుపుతున్నారు. కొద్ది కాలంలోనే ఈ మిల్లు దాదాపు మూడు లక్షల రూపాయల లాభాలను ఆర్జించింది. ఈ లాభంతో మీనా గారు, ఆమె సహచరులు మొదట బ్యాంకు రుణాన్ని తిరిగి చెల్లించడానికి, తరువాత తమ వ్యాపారాన్ని విస్తరించడానికి సన్నద్ధమవుతున్నారు. కరోనా సృష్టించిన పరిస్థితులను ఎదుర్కోవడానికి దేశంలోని ప్రతి మూలమూలనా ఇలాంటి అద్భుతమైన పనులు జరిగాయి.
నా ప్రియమైన దేశవాసులారా! నేను మీతో బుందేల్ ఖండ్ గురించి మాట్లాడితే మీ మనసులో గుర్తొచ్చే విషయాలు ఏమిటి? చరిత్రపై ఆసక్తి ఉన్నవారు ఈ ప్రాంతాన్ని ఝాన్సీ కి చెందిన రాణి లక్ష్మీబాయితో అనుసంధానిస్తారు. అదే సమయంలో, కొంతమంది సుందరమైన, ప్రశాంతమైన 'ఓర్చా' గురించి ఆలోచిస్తారు. కొంతమంది ఈ ప్రాంతంలోని విపరీతమైన వేడిని కూడా గుర్తు తెచ్చుకుంటారు. కానీ ఈ రోజుల్లో ఇక్కడ భిన్నమైన ప్రదర్శన జరుగుతోంది. చాలా ప్రోత్సాహకరంగా ఉండే దీని గురించి మనం తెలుసుకోవాలి. కొద్దిరోజుల కిందట ఝాన్సీలో ఒక నెల రోజులపాటు జరిగే 'స్ట్రాబెర్రీ ఫెస్టివల్' ప్రారంభమైంది. అందరూ ఆశ్చర్యపోతుండవచ్చు. బుందేల్‌ఖండ్ లో స్ట్రాబెర్రీ ఏంటా అని! కానీ, ఇది నిజం. ఇప్పుడు బుందేల్‌ఖండ్‌లో స్ట్రాబెర్రీ సాగు పై ఆసక్తి పెరుగుతోంది. ఇందులో ఝాన్సీ కి చెందిన గుర్లీన్ చావ్లా గారు అతి ముఖ్యమైన పాత్ర పోషించారు. న్యాయ శాస్త్ర విద్యార్థిని అయిన గుర్లీన్ గారు తన ఇంట్లో, తరువాత తన పొలంలో విజయవంతంగా స్ట్రాబెర్రీని సాగు చేశారు. ఝాన్సీ లో కూడా ఇది జరగవచ్చని ఆమె నిరూపించారు. ఝాన్సీలో జరుగుతున్న 'స్ట్రాబెర్రీ ఫెస్టివల్' స్టే ఎట్ హోమ్ భావనను నొక్కి చెబుతుంది. ఈ పండుగ ద్వారా రైతులను, యువతను స్ట్రాబెర్రీని వారి ఇంటి వెనుక ఖాళీ స్థలంలో లేదా టెర్రస్ మీద తోటలను పెంచమని ప్రోత్సహిస్తున్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో దేశంలోని ఇతర ప్రాంతాలలో కూడా ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు పర్వతాలలో పెరుగుతుందన్న గుర్తింపు వచ్చిన స్ట్రాబెర్రీ ఇప్పుడు కచ్ ఇసుక భూమిలో కూడా పండుతోంది. దీనిద్వారా రైతుల ఆదాయం పెరుగుతోంది.
మిత్రులారా! స్ట్రాబెర్రీ ఫెస్టివల్ వంటి ప్రయోగాలు నవ కల్పనను ప్రదర్శించడమే కాకుండా మన దేశంలోని వ్యవసాయ రంగం కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా అవలంబిస్తుందో చూపిస్తాయి.
మిత్రులారా! వ్యవసాయాన్ని ఆధునీకరించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఇందుకు అనేక చర్యలు కూడా తీసుకుంటోంది. ప్రభుత్వ ప్రయత్నాలు మరింత కొనసాగుతాయి.
నా ప్రియమైన దేశవాసులారా! నేను కొన్ని రోజుల క్రితం ఒక వీడియో చూశాను. పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ ప్రాంతంలో ఉన్న 'నయా పింగ్లా' గ్రామానికి చెందిన చిత్రకారుడు సర్ముద్దీన్ వీడియో అది. రామాయణంపై తన పెయింటింగ్ రెండు లక్షల రూపాయలకు అమ్ముడైందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఇది ఆయన గ్రామస్తులకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ వీడియో చూసిన తరువాత దాని గురించి మరింత తెలుసుకోవాలనే ఆసక్తి నాకు ఏర్పడింది. ఈ క్రమంలో పశ్చిమ బెంగాల్‌కు సంబంధించిన చాలా మంచి ప్రయత్నం గురించి నేను తెలుసుకున్నాను. ఈ విషయం ఖచ్చితంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. పర్యాటక మంత్రిత్వ శాఖ ప్రాంతీయ కార్యాలయం ఈ నెల ప్రారంభంలో బెంగాల్ లోని గ్రామాల్లో 'ఇన్ క్రెడిబుల్ ఇండియా వీకెండ్ గేట్ వే' ను ప్రారంభించింది. ఇందులో పశ్చిమ మిడ్నాపూర్, బాంకురా, బీర్ భూం, పురులియా, తూర్పు బర్ధమాన్ ప్రాంతాల నుండి హస్తకళా కారులు సందర్శకుల కోసం హస్తకళ కార్య శాల నిర్వహించారు. 'ఇన్ క్రెడిబుల్ ఇండియా వీకెండ్ గేట్ వే' కార్యక్రమాల సమయంలో హస్తకళ ఉత్పత్తుల అమ్మకాలు హస్తకళాకారులకు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయని నాకు చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రజలు మన కళలకు కొత్త మార్గాల్లో ప్రాచుర్యం పొందుతున్నారు. ఒడిశాలోని రూర్కెలాకు చెందిన భాగ్యశ్రీ సాహు గారిని చూడండి. ఆమె ఇంజనీరింగ్ విద్యార్థి అయినప్పటికీ, గత కొన్ని నెలలుగా ఆమె చిత్రకళను నేర్చుకోవడం ప్రారంభించింది. అందులో నైపుణ్యం పొందారు. కానీ ఆమె ఎక్కడ పెయింట్ చేశారో మీకు తెలుసా? ఆమె సాఫ్ట్ స్టోన్స్ పై పెయింట్ చేశారు. కాలేజీకి వెళ్ళేటప్పుడు భాగ్యశ్రీ గారికి ఈ సాఫ్ట్ స్టోన్స్ దొరికాయి. వాటిని సేకరించి శుభ్రం చేశారు. తరువాత ఆమె ఈ రాళ్లపై పట్టచిత్ర శైలిలో ప్రతిరోజూ రెండు గంటలు చిత్రించారు. ఆమె ఈ రాళ్లపై చిత్రించి తన స్నేహితులకు బహుమతిగా ఇవ్వడం మొదలుపెట్టారు. లాక్డౌన్ సమయంలో ఆమె సీసాలపై కూడా పెయింటింగ్ ప్రారంభించారు. ఇప్పుడు ఆమె ఈ కళపై వర్క్‌షాపులు కూడా నిర్వహిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం సుభాష్ చంద్ర బోసు జన్మదినం సందర్భంగా భాగ్యశ్రీ రాతిపై ఆయనను చిత్రించి, ఆయనకు ప్రత్యేక నివాళి అర్పించారు. ఆమె భవిష్యత్ ప్రయత్నాలకు శుభాకాంక్షలు. చిత్రాలు, రంగుల ద్వారా చాలా కొత్త విషయాలు నేర్చుకోవచ్చు, చేయవచ్చు. జార్ఖండ్‌లోని దుమ్కాలో చేసిన ఒక ప్రత్యేకమైన ప్రయత్నం గురించి నాకు చెప్పారు. అక్కడ మాధ్యమిక పాఠశాల ప్రిన్సిపాల్ పిల్లలకు నేర్పడానికి గ్రామంలోని గోడలను ఇంగ్లీషు, హిందీ అక్షరాలతో చిత్రించారు. అలాగే అందులో వేర్వేరు చిత్రాలను కూడా రూపొందించారు. తద్వారా గ్రామంలోని పిల్లలకు అభ్యసనంలో సహకారం లభిస్తోంది. ఇలాంటి ప్రయత్నాలలో నిమగ్నమైన వారందరినీ అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! భారతదేశం నుండి వేల కిలోమీటర్ల దూరంలో అనేక మహాసముద్రాలు, ద్వీపాలు దాటిన తర్వాత చిలీ అనే ఒక దేశం ఉంది. భారతదేశం నుండి చిలీ చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. కానీ భారతీయ సంస్కృతిలోని పరిమళం చాలా కాలం క్రితమే అక్కడికి వ్యాపించింది. మరో ప్రత్యేక విషయం ఏమిటంటే యోగా అక్కడ బాగా ప్రాచుర్యం పొందింది. చిలీ రాజధాని శాంటియాగోలో 30 కి పైగా యోగా పాఠశాలలు ఉన్నాయి. చిలీలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. యోగా దినోత్సవం సందర్భంగా హౌస్ ఆఫ్ డిప్యూటీస్ లో పెద్ద ఎత్తున ఉత్సవం జరుగుతుందని నాకు తెలిసింది. ఈ కరోనా సమయంలో రోగనిరోధక శక్తికి ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచడంలో యోగా బలాన్ని వారు చవిచూస్తున్నారు. ఇప్పుడు వారు గతంలో కంటే యోగాకు ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. చిలీ దేశంలోని పార్లమెంటు ఒక తీర్మానాన్ని ఆమోదించింది. అక్కడ నవంబర్ 4 ను జాతీయ యోగా దినంగా ప్రకటించారు. నవంబర్ 4 కు ఏ ప్రాముఖ్యత ఉందని మీరు ఇప్పుడు ఆలోచించవచ్చు. ఆ దేశంలోని తొలి యోగా సంస్థ ను 1962 నవంబర్ 4వ తేదీన రాఫెల్ ఎస్ట్రాడా స్థాపించారు. ఆ తేదీని జాతీయ యోగా దినంగా ప్రకటించడం ద్వారా ఎస్ట్రాడా గారికి కూడా నివాళి అర్పించారు. ఇది చిలీ పార్లమెంట్ ఇచ్చిన ప్రత్యేక గౌరవం. ఇది ప్రతి భారతీయుడు గర్వించే విషయం. చిలీ పార్లమెంటుకు సంబంధించిన మరో విషయం మీకు ఆసక్తి కలిగిస్తుంది. చిలీ సెనేట్ ఉపాధ్యక్షుడి పేరు రవీంద్రనాథ్ క్వింటెరాస్. ఆయన పేరును విశ్వ కవి గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రేరణతో పెట్టారు.
నా ప్రియమైన దేశవాసులారా! మహారాష్ట్ర లోని జాల్నాకు చెందిన డాక్టర్ స్వప్నిల్ మంత్రి, కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన ప్రహ్లాద్ రాజగోపాలన్ 'మన్ కీ బాత్'లో రహదారి భద్రతపై కూడా మాట్లాడాలని మైగవ్ ద్వారా కోరారు. జనవరి 18వ తేదీ నుండి ఫిబ్రవరి 17 వ తేదీ వరకు మన దేశం రహదారి భద్రతా మాసోత్సవాన్ని జరుపుకుంటుంది. రోడ్డు ప్రమాదాలు మన దేశంలోనే కాదు- ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. భారతదేశంలో ప్రభుత్వంతో పాటు వ్యక్తిగత, సమష్టి స్థాయిలో రహదారి భద్రత కోసం అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రాణాలను కాపాడటానికి జరిగే ఈ ప్రయత్నాలలో మనమందరం చురుకుగా పాల్గొనాలి.
మిత్రులారా! బోర్డర్ రోడ్ ఆర్గనైజేషన్ వేసిన రహదారుల గుండా వెళుతూ మీరు గమనించి ఉండాలి. ఆ రహదారులపై మీరు చాలా వినూత్న నినాదాలను చూడవచ్చు. ‘ఇది హైవే- రన్‌వే కాదు’ లేదా ‘లేట్ మిస్టర్ కావడం కంటే మిస్టర్ లేట్ గా ఉండడం ఉత్తమం’ మొదలైనవి. ఈ నినాదాలు రహదారి జాగ్రత్తల గురించి తెలుసుకోవడంలో చాలా ప్రభావవంతంగా ఉంటాయి. ఇప్పుడు మీరు ఇలాంటి వినూత్న నినాదాలను లేదా పదబంధాలను మైగవ్‌కు పంపవచ్చు. మీరు పంపే ఉత్తమ నినాదాలను కూడా ఈ ప్రచారంలో ఉపయోగిస్తారు.
మిత్రులారా! రోడ్డు భద్రత గురించి మాట్లాడుతుంటే కోల్‌కతాకు చెందిన అపర్ణ దాస్ గారు నమో యాప్‌లో రాసిన పోస్ట్ గురించి చర్చించాలనుకుంటున్నాను. 'ఫాస్టాగ్' కార్యక్రమం గురించి మాట్లాడమని అపర్ణ గారు నాకు సలహా ఇచ్చారు. 'ఫాస్ట్ ట్యాగ్'తో ప్రయాణ అనుభవం మారిందని ఆమె అంటున్నారు. ఇది సమయాన్ని ఆదా చేస్తుంది. టోల్ ప్లాజా దగ్గర ఆపడం, నగదు చెల్లింపు గురించి ఆలోచించడం వంటి సమస్యలు కూడా ముగిశాయి. అపర్ణ గారి మాట కూడా సరైందే. ఇంతకుముందు టోల్ ప్లాజా దగ్గర ఒక్కో వాహనానికి సగటున 7 నుండి 8 నిమిషాలు పట్టేది. కానీ 'ఫాస్ట్ ట్యాగ్' వచ్చిన తరువాత సగటున కేవలం ఒకటిన్నర- రెండు నిమిషాలు పడుతోంది. టోల్ ప్లాజా వద్ద వేచి ఉండే సమయం తగ్గడం వల్ల వాహనంలో ఇంధనం ఆదా కూడా పెరుగుతోంది. దీనివల్ల దేశ ప్రజలు సుమారు 21 వేల కోట్ల రూపాయలు ఆదా చేస్తారని అంచనా. అంటే సమయం ఆదా తో పాటు డబ్బు కూడా ఆదా అవుతోంది. అన్ని మార్గదర్శకాలను పాటిస్తూ మీ గురించి మీరు జాగ్రత్త పడడంతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా కాపాడాలని నేను మీ అందరిని కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! "జలబిందు నిపాతేన క్రమశః పూర్యతే ఘటః" అని ఆర్యోక్తి. అంటే బిందువు, బిందువు కలిసి కుండను నింపుతాయి. మన ఒక్కో ప్రయత్నం మన సంకల్పాన్ని పూర్తి చేస్తాయి. అందువల్ల మనం 2021 లో ప్రారంభించిన లక్ష్యాలను మనమందరం కలిసి నెరవేర్చాలి. కాబట్టి ఈ సంవత్సరాన్ని సార్థకం చేయడానికి మనమందరం కలిసి అడుగులేద్దాం. మీ సందేశాన్ని, మీ ఆలోచనలను మీరు ఖచ్చితంగా పంపుతూ ఉండండి. వచ్చే నెలలో మరోసారి కలుద్దాం.
మరో మన్ కీ బాత్ లో కలిసేందుకు ఇప్పుడు వీడ్కోలు చెప్తున్నాను. నమస్కారం..
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. ఈ రోజు డిసెంబర్ 27. నాలుగు రోజుల తర్వాత 2021 ప్రారంభం అవుతుంది. నేటి 'మన్ కి బాత్' 2020 సంవత్సరంలో చివరి 'మన్ కీ బాత్'. తదుపరి 'మన్s కీ బాత్' 2021 లో ప్రారంభమవుతుంది. మిత్రులారా! మీరు రాసిన లేఖలు నా ముందు చాలా ఉన్నాయి. మీరు మైగవ్‌లో పంపిన సూచనలు కూడా నా ముందు ఉన్నాయి. ఎంతో మంది ఫోన్ చేసి కూడా తమ విషయాలు చెప్పారు. చాలా సందేశాలలో ఈ ఏడాది అనుభవాలు, 2021 తో అనుసంధానించిన తీర్మానాలు ఉన్నాయి. కొల్హాపూర్ నుండి అంజలి గారు రాశారు.. “ప్రతిసారికొత్త సంవత్సరంలో ఇతరులను అభినందిస్తున్నాం, శుభాకాంక్షలు ఒకరికొకరం చెప్పుకుంటున్నాం కదా. ఈసారి మేము కొత్త పని చేస్తాం. మన దేశాన్ని మనం ఎందుకు అభినందించకూడదు? దేశానికి ఎందుకు శుభాకాంక్షలు చెప్పకూడదు?” అని. అంజలి గారు.. చాలా గొప్ప ఆలోచన. మన దేశం 2021 లో కొత్త విజయ శిఖరాలను తాకాలని, ప్రపంచంలో భారతదేశం మరింత గుర్తింపు పొందాలని, దేశం మరింత శక్తిమంతం కావాలని కోరుకోవడం కంటే గొప్ప కోరిక ఏముంటుంది?
మిత్రులారా! ముంబాయికి చెందిన అభిషేక్ గారు నమోయాప్‌లో ఒక సందేశాన్ని పోస్ట్ చేశారు. 2020 లో తాను చూసింది, నేర్చింది.. తాను ఎప్పుడూ కనీసం ఆలోచించలేదని రాశారు. కరోనాకు సంబంధించిన అన్ని విషయాలను ఆయన రాశారు. ఈ లేఖలలో, ఈ సందేశాలన్నింటిలో ఉన్న ఉమ్మడి అంశాలను ఈరోజు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలా లేఖలలో దేశ సామర్థ్యాన్ని, దేశవాసుల సామూహిక శక్తిని ప్రజలు ప్రశంసించారు. జనతా కర్ఫ్యూ వంటి వినూత్న ప్రయోగం మొత్తం ప్రపంచానికి ప్రేరణగా మారడాన్ని చాలామంది గుర్తు చేశారు. చప్పట్లు కొట్టడం ద్వారా మన కరోనా వారియర్స్ ను గౌరవించడాన్ని, సంఘీభావం చూపించడాన్ని కూడా చాలా మంది జ్ఞాపకం చేసుకున్నారు.
మిత్రులారా! దేశంలోని సామాన్యులు ఈ మార్పును అనుభవించారు. నేను దేశంలో అద్భుతమైన ఆశల ప్రవాహాన్ని కూడా చూశాను. చాలా సవాళ్లు ఉన్నాయి. చాలా సమస్యలు కూడా వచ్చాయి. కరోనా కారణంగా సప్లై చైన్ తో పాటు అనేక విషయాల్లో ప్రపంచంలో చాలా అడ్డంకులు ఏర్పడ్డాయి. కాని మనం ప్రతి సంక్షోభం నుండి కొత్త పాఠాలు నేర్చుకున్నాం. దేశంలో కొత్త సామర్ధ్యం కూడా ఏర్పడింది. మాటల్లో చెప్పాలనుకుంటే ఈ సామర్ధ్యం పేరు 'స్వావలంబన'.
మిత్రులారా! ఢిల్లీ లో నివసించే అభినవ్ బెనర్జీ గారు తమ అనుభవాన్ని నాకు రాసి పంపారు. ఇది కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. తన బంధువుల పిల్లలకు బహుమతులు ఇవ్వడానికి అభినవ్ గారు కొన్ని బొమ్మలు కొనవలసి వచ్చింది. అందువల్ల ఆయన ఢిల్లీలోని ఝండేవాలాన్ మార్కెట్‌కు వెళ్ళారు. మీలో చాలామందికి తెలిసి ఉండవచ్చు- ఈ మార్కెట్ ఢిల్లీలో సైకిళ్లకు, బొమ్మలకు ప్రసిద్ది చెందింది. అంతకుముందు అక్కడికి ఖరీదైన బొమ్మలు దిగుమతి అయ్యేవి. చౌకైన బొమ్మలు కూడా బయటి దేశాల నుండి వచ్చేవి. కానీ అభినవ్ గారు తమ లేఖలో రాశారు. ఇప్పుడు అక్కడ చాలా మంది దుకాణదారులు కస్టమర్లకు బొమ్మలు చూపించి “ఇది మంచి బొమ్మ. ఎందుకంటే ఇది భారతదేశంలో తయారైన – 'మేడ్ ఇన్ ఇండియా' బొమ్మ కాబట్టి” అని చెప్తున్నారని. భారతదేశం తయారు చేసిన బొమ్మలను మాత్రమే వినియోగదారులు అడుగుతున్నారు. ఆలోచనలో పెద్ద మార్పు వచ్చిందనడానికి ఇది సజీవ రుజువు. దేశవాసుల మనస్తత్వంలో ఎంత పెద్ద మార్పు వస్తోంది- అది కూడా ఒక సంవత్సరంలోనే. ఈ మార్పును అంచనా వేయడం అంత సులభం కాదు. ఆర్థికవేత్తలు కూడా తమ ప్రమాణాలపై ఆధారపడి ఈ మార్పును కొలవలేరు.
మిత్రులారా! విశాఖపట్నం నుండి వెంకట మురళీ ప్రసాద్ గారు రాసిన ఆలోచన విభిన్నంగా ఉంది. “2021 కోసం నా ఎబిసిని మీకు అటాచ్ చేస్తున్నాను” అని వెంకట్ గారు రాశారు. ఏబీసీ అంటే అర్థం ఏమిటో నాకు తెలియలేదు. అప్పుడు వెంకట్ గారు తమ లేఖ పాటు ఒక చార్టు ను కూడా జత చేసినట్టు నేను చూశాను. ఆ చార్ట్ వైపు చూశాన. ఆపై ఏబీసీ అంటే అర్థం ఏమిటో తెలుసుకున్నాను. స్వయం సమృద్ధిగల భారత చార్ట్ ABC. ఇది చాలా ఆసక్తికరంగా ఉంది. వెంకట్ గారు ప్రతిరోజూ ఉపయోగించే అన్ని వస్తువుల పూర్తి జాబితాను తయారు చేశారు. ఇందులో ఎలక్ట్రానిక్స్, స్టేషనరీ, స్వీయ సంరక్షణ సామగ్రితో పాటు మరికొన్నివస్తువులు ఉన్నాయి. మనకు తెలిసీ తెలియకుండానే, భారతదేశంలో సులభంగా లభించే విదేశీ ఉత్పత్తులను ఉపయోగిస్తున్నామని వెంకట్ గారు చెప్పారు. మన దేశవాసుల శ్రమ, చెమట ఉన్న ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తానని ఆయన ప్రతిజ్ఞ చేశారు.
మిత్రులారా! చాలా ఆసక్తికరంగా ఉన్న మరొక విషయాన్ని కూడా ఆయన చెప్పారు. స్వావలంబన భారతదేశానికి తాము మద్దతు ఇస్తున్నామని ఆయన రాశారు. మన దేశీయ తయారీదారులు కూడా ఉత్పత్తుల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టమైన సందేశం ఉండాలని ఆయన రాశారు. ఈ విషయం వాస్తవం. శూన్య ప్రభావం, శూన్య లోపం అనే ఆలోచనతో పనిచేయడానికి ఇది సరైన సమయం. దేశ తయారీదారులు, పరిశ్రమల నాయకులను నేను కోరుతున్నాను: దేశ ప్రజలు స్వావలంబన భారతదేశం దిశగా బలమైన అడుగులు వేస్తున్నారు. వారు బలమైన చర్యలు తీసుకున్నారు. స్థానిక వస్తువుల కోసం స్వరం- వోకల్ ఫర్ లోకల్- ఈ రోజు ఇంటింటా ప్రతిధ్వనిస్తోంది. ఇటువంటి పరిస్థితుల్లో మన ఉత్పత్తులు ప్రపంచ స్థాయిలో ఉండేలా చూడాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రపంచంలో ఉత్తమమైనది ఏమైనప్పటికీ మనం దాన్ని భారతదేశంలో తయారు చేయవచ్చు. దీని కోసం మన సహచరులు ముందుకు రావాలి. స్టార్ట్-అప్లు కూడా ముందుకు రావాలి. వెంకట్ గారి ఉత్తమ ప్రయత్నాలను మరోసారి అభినందిస్తున్నాను.
మిత్రులారా! మనం ఈ భావనను కలిగిఉండాలి. ఈ భావనను మనలో ఉంచుకోవాలి, పెంచుకోవాలి. నేను ఇంతకు ముందే చెప్పాను. ఆపై దేశవాసులను కూడా కోరుతున్నాను. మీరు కూడా ఒక జాబితాను తయారు చేయండి. రోజంతా మనం ఉపయోగించే అన్ని వస్తువుల గురించి చర్చించండి. తెలిసీ తెలియకుండా విదేశాలలో తయారైన వస్తువులు ఏవైనా మన జీవితంలోకి ప్రవేశించాయేమో చూడండి. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు మనల్ని బందీలుగా చేశారు. విదేశీ వస్తువుల స్థానంలో ఉపయోగించగలిగే భారతదేశ ఉత్పత్తులను కనుగొనండి. ఇకపై భారతదేశంలో ప్రజలు చెమటోడ్చి కష్టపడి తయారుచేసిన ఉత్పత్తులను ఉపయోగించాలని నిర్ణయించుకోండి. మీరు ప్రతి సంవత్సరం కొత్త సంవత్సర తీర్మానాలను చేస్తారు. ఈసారి దేశం కోసం తీర్మానం కూడా చేసుకోవాలి.
నా ప్రియమైన దేశవాసులారా! దేశంలోని వేల సంవత్సరాల సంస్కృతిని, నాగరికతను, మన ఆచారాలను కాపాడడానికి; ఉగ్రవాదుల నుండి, అణచివేతదారుల నుండి దేశాన్ని రక్షించడానికి మన దేశంలో ఎన్ని త్యాగాలు చేశారో.. ఈ రోజు ఆ బలిదానాలను గుర్తుంచుకునే రోజు. ఈ రోజు గురు గోవింద్ కుమారులు సాహిబ్ జాదే జొరావర్ సింగ్, ఫతే సింగ్ లను గోడలో సజీవంగా బలి చేసినరోజు. సాహిబ్ జాదే తన విశ్వాసాన్ని వదులుకోవాలని, గొప్ప గురు సంప్రదాయాన్ని విడిచిపెట్టాలని నిరంకుశులు కోరుకున్నారు. కానీ, మన సాహిబ్జాదాలు చిన్న వయసులో కూడా గొప్ప ధైర్యం, సంకల్ప శక్తిని ప్రదర్శించారు. గోడలో సజీవ సమాధి సమయంలో రాళ్ళు పెరుగుతూనే ఉన్నాయి.. గోడ పెరుగుతూనే ఉంది.. మరణం వారి ముందు కొట్టుమిట్టాడుతోంది.. అయినా వారు బెదరలేదు. గురు గోవింద్ సింగ్ జీ తల్లి – మాతా గుజ్రీ కూడా ఇదే రోజు ప్రాణాలర్పించారు. . సుమారు వారం కిందట శ్రీ గురు తేగ్ బహదూర్ జి బలిదానం చేసిన రోజు. ఢిల్లీ లోని గురుద్వారా రకాబ్ గంజ్ కు వెళ్ళి గురు తేగ్ బహదూర్ జికి నివాళి తెలిపే అవకాశం, నమస్కరించే అవకాశం నాకు లభించింది. శ్రీ గురు గోవింద్ సింగ్ జి స్ఫూర్తితో చాలా మంది ఈ నెల నేలమీద నిద్రపోతారు.
శ్రీ గురు గోవింద్ సింగ్ జీ కుటుంబ బలిదానాలను ప్రజలు చాలా భావోద్వేగ స్థితిలో గుర్తుంచుకుంటారు. ఈ బలిదానం మొత్తం మానవాళికి, దేశానికి కొత్త పాఠం నేర్పింది. ఈ అమరవీరులు మన సంస్కృతిని సురక్షితంగా ఉంచడంలో గొప్ప పని చేశారు. ఈ అమరవీరులకు మనమందరం రుణపడి ఉన్నాం. శ్రీ గురు తేగ్ బహదూర్ జీ , మాతా గుజ్రీ జీ, గురు గోవింద్ సింగ్ జీలతో పాటు నలుగురు సాహిబ్జాదాల అమరవీరులకు మరోసారి నమస్కరిస్తున్నాను. అదేవిధంగా చాలామంది అమరవీరులు భారతదేశ ప్రస్తుత రూపాన్ని సంరక్షించారు, కొనసాగించారు.
నా ప్రియమైన దేశవాసులారా! ఇప్పుడు నేను మీకు చెప్పే విషయం మీకు సంతోషంగా, గర్వంగా ఉంటుంది. 2014-2018 మధ్య భారతదేశంలో చిరుతపులుల సంఖ్య 60 శాతానికి పైగా పెరిగింది. 2014 లో దేశంలో చిరుతపులుల సంఖ్య 7,900 ఉండగా, 2019 లో వారి సంఖ్య 12,852 కు పెరిగింది. " ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరించే చిరుతపులులను చూడని వారు దాని అందాన్ని ఊహించలేరు. చిరుతపులి రంగుల అందం, దాని నడకలోని సౌందర్యాన్ని ఊహించలేరు." అని జిమ్ కార్బెట్ చెప్పిన చిరుతపులి అదే. దేశంలోని చాలా రాష్ట్రాల్లో- ముఖ్యంగా మధ్య భారతదేశంలో చిరుతపులుల సంఖ్య పెరిగింది. చిరుతపులుల జనాభా అధికంగా ఉన్న రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర అగ్రస్థానంలో ఉన్నాయి. ఇది పెద్ద విజయం. చిరుతపులులు సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా అపాయాలను ఎదుర్కొంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా వాటి ఆవాసాలకు నష్టం జరుగుతోంది. అటువంటి సమయంలో చిరుతపులుల జనాభాను నిరంతరం పెంచడం ద్వారా భారతదేశం మొత్తం ప్రపంచానికి ఒక మార్గాన్ని చూపించింది. గత కొన్నేళ్లుగా భారతదేశంలో సింహాల జనాభా పెరిగింది. పులుల సంఖ్య కూడా పెరిగింది. అలాగే భారత అటవీ ప్రాంతం కూడా పెరిగింది. దీనికి కారణం మన చెట్లు, వన్యప్రాణుల రక్షణలో ప్రభుత్వం మాత్రమే కాదు- చాలా మంది ప్రజలు, పౌర సమాజం, అనేక సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. వారందరూ అభినందనలకు అర్హులు.
మిత్రులారా! తమిళనాడులోని కోయంబత్తూర్‌లో జరిగిన హృదయాన్ని స్పర్శించే ఒక కృషి గురించి చదివాను. సోషల్ మీడియాలో మీరు కూడా ఆ కృషికి సంబంధించిన విజువల్స్ చూశారు. మనమందరం మనుషుల వీల్‌చైర్‌ను చూశాం. కానీ కోయంబత్తూరుకు చెందిన గాయత్రి అనే అమ్మాయి తన తండ్రితో కలిసి బాధిత కుక్క కోసం వీల్‌చైర్ తయారు చేసింది. ఈ సంఘటన ఉత్తేజకరమైంది. ప్రేరణ కలిగించేది . మనుషులు ప్రతి జీవి పట్ల దయ, కరుణ చూపినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది.
దేశ రాజధాని ఢిల్లీలో, దేశంలోని ఇతర నగరాల్లో చలి ఎక్కువగా ఉన్న సమయంలో జంతువులను జాగ్రత్తగా చూసుకోవడానికి చాలా మంది చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. వారు ఆ జంతువులకు తినడానికి, తాగడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. వాటి కోసం స్వెట్టర్లు, పరుపులను కూడా ఏర్పాటు చేస్తారు. కొంతమంది ప్రతిరోజూ వందలాది జంతువులకు ఆహారం అందిస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలను ప్రశంసించాలి. ఉత్తర ప్రదేశ్‌లోని కౌశాంబిలో కూడా ఇలాంటి గొప్ప ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆవులను చలి నుండి రక్షించడానికి అక్కడి జైలు ఖైదీలు ప్రత్యేకంగా పాత, చిరిగిన కంబళ్లను కుడుతున్నారు. కౌశాంబితో సహా ఇతర జిల్లాల జైళ్ల నుండి వాటిని సేకరించి, ఆ తర్వాత వాటిని కుట్టి గోశాలలకు పంపుతారు. కౌశాంబి జైలు ఖైదీలు పాత, చిరిగిన దుప్పట్లతో ఆవులను కప్పేందుకు ప్రతివారం ఇలాంటి కవర్లు తయారు చేస్తున్నారు. రండి, ఇతరులను చూసుకోవటానికి సేవా భావంతో నిండిన ఇటువంటి ప్రయత్నాలను ప్రోత్సహించండి. ఇవి నిజంగా సమాజంలోని సానుభూతులను బలపరిచే మంచి పనులు.
నా ప్రియమైన దేశవాసులారా! ఇప్పుడు నా ముందు ఉన్న లేఖలో రెండు పెద్ద ఫోటోలు ఉన్నాయి. ఈ ఫోటోలు ఒక ఆలయానివి. గతంలో, ఇప్పుడు ఆ దేవాలయ ఫోటోలు అవి. ఈ ఫోటోలతో ఉన్న లేఖ తమను తాము యువ బ్రిగేడ్ అని పిలిచే యువకుల బృందం గురించి చెప్తుంది. వాస్తవానికి ఈ యువ బ్రిగేడ్ కర్ణాటకలోని శ్రీరంగపట్నం సమీపంలోని ఉన్న పురాతన వీరభద్రస్వామి శివాలయానికి పునరుజ్జీవనం కల్పించింది. ఈ ఆలయం ప్రతి వైపు కలుపు మొక్కలు, పొదలతో నిండి ఉండేది. ఎంతగా అంటే అక్కడ శివాలయం ఉందనే విషయం బాటసారులు కూడా చెప్పలేనంతగా. ఒక రోజు కొంతమంది పర్యాటకులు ఈ పురాతన ఆలయం వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో చూసిన యువ బ్రిగేడ్ ఆగలేకపోయారు. తరువాత ఈ బృందం కలిసి దానిని పునరుద్ధరించాలని నిర్ణయించుకుంది. ఆలయ ప్రాంగణంలో పెరిగిన ముళ్ల పొదలు, గడ్డి, మొక్కలను ఈ బృందం తొలగించింది. అవసరమయ్యే చోట మరమ్మత్తు, నిర్మాణం చేశారు. వారి మంచి పనిని చూసి స్థానిక ప్రజలు కూడా తమ సహాయాన్ని అందించారు. కొంతమంది సిమెంటు ఇచ్చారు. కొంతమంది పెయింట్, మరెన్నో వస్తువులతో తమవంతు సహకారం అందించారు. ఈ యువకుల్లో అనేక రకాలైన వృత్తుల వారు ఉన్నారు. ఈ విధంగా వారు వారాంతాల్లో సమయం తీసుకున్నారు, ఆలయం కోసం పనిచేశారు. ఆలయంలో తలుపులను ఏర్పాటు చేయడంతో పాటు, విద్యుత్ కనెక్షన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఆ విధంగా ఆలయ పాత వైభవాన్ని తిరిగి నెలకొల్పడానికి కృషి చేశారు. అభిరుచి, సంకల్పం ఉంటే ఏ లక్ష్యాన్నయినా సాధించవచ్చు. భారతదేశ యువతను చూసినప్పుడు నాకు సంతోషంగా ఉంటుంది. నమ్మకం కలుగుతుంది. ఎందుకంటే నా దేశంలోని యువతకు ‘నేను చేయగలను’ అనే దృక్కోణం, ‘నేను చేస్తాను’ అనే ఆత్మవిశ్వాసం ఉన్నాయి. వారికి ఏ సవాలూ పెద్దది కాదు. ఏదీ వారికి అందనంత దూరంలో లేదు. నేను తమిళనాడుకు చెందిన ఒక టీచర్ గురించి చదివాను. ఆమె పేరు ఎన్.కె. హేమలత. విడుపురంలోని ఒక పాఠశాలలో ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళాన్ని ఆమె నేర్పిస్తారు. కోవిడ్ 19 మహమ్మారి కూడా ఆమె బోధనామార్గానికి అడ్డు రాలేదు. అవును! ఆమె ముందు సవాళ్లు ఉన్నాయి. కానీ, ఆమె ఒక వినూత్న మార్గాన్ని కనుగొన్నారు. కోర్సు మొత్తం 53 అధ్యాయాలను రికార్డ్ చేశారు. యానిమేటెడ్ వీడియోలను తయారు చేశారు. వాటిని పెన్ డ్రైవ్‌లో తన విద్యార్థులకు పంపిణీ చేశారు. ఇది ఆమె విద్యార్థులకు చాలా సహాయపడింది. తద్వారా అధ్యాయాలను విద్యార్థులు దృశ్యరూపంలో అర్థం చేసుకోగలిగారు. దీంతో పాటు ఆమె తన విద్యార్థులతో టెలిఫోన్లో మాట్లాడటం కొనసాగించింది. ఇది విద్యార్థులకు చదువును మరింత ఆసక్తికరంగా చేసింది. దేశవ్యాప్తంగా కరోనా ఉన్న ఈ సమయంలో ఉపాధ్యాయులు అనుసరించిన వినూత్న పద్ధతులు, సృజనాత్మకంగా తయారుచేసిన కోర్సు సామగ్రి ఆన్లైన్ అధ్యయనాల ఈ దశలో అమూల్యమైనవి. ఈ కోర్సు సామగ్రిని విద్యా మంత్రిత్వ శాఖకు ఇవ్వాలని ఉపాధ్యాయులందరినీ కోరుతున్నాను. దయచేసి ‘దీక్ష’ పోర్టల్‌లో అప్లోడ్ చేయండి. ఇది దేశంలోని సుదూర ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది.
మిత్రులారా! జార్ఖండ్‌కు చెందిన కొర్వా తెగకు చెందిన హీరామన్ గారి గురించి మాట్లాడుకుందాం. హీరామన్ గారు గర్వా జిల్లాలోని సింజో గ్రామంలో నివసిస్తున్నారు. కొర్వా తెగ జనాభా కేవలం 6,000 మాత్రమే అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. వారు నగరాలకు దూరంగా ఉన్న పర్వతాలు, అడవులలో నివసిస్తున్నారు. తన సమాజ సంస్కృతి , గుర్తింపును కాపాడడానికి హీరామన్ గారు ముందడుగు వేశారు. 12 సంవత్సరాల నిరంతర శ్రమ తరువాత అతను అంతరించిపోయిన కొర్వ భాష నిఘంటువును సిద్ధం చేశారు. ఇంట్లో ఉపయోగించే పదాల నుండి మొదలుకొని రోజువారీ జీవితంలో ఉపయోగపడే అనేక పదాలను అర్థాలతో సహా ఆయన ఈ నిఘంటువులో చేర్చారు. కొర్వా సమాజం కోసం హెరామన్ చేసిన పని దేశానికి ఆదర్శంగా నిలుస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! అక్బర్ ఆస్థానంలో ఒక ప్రముఖుడు ఉన్నారని చెబుతారు. ఆయన అబుల్ ఫజల్. కాశ్మీర్లో ఒక దృశ్యాన్ని చూసి చిరాకు, కోపంతో ఉండేవారు కూడా ఆనందం వ్యక్తం చేస్తారని కాశ్మీర్ సందర్శన తర్వాత ఆయన పేర్కొన్నారు. కాశ్మీర్‌లోని కుంకుమ పొలాల గురించి ఆయన ఆ మాట అన్నారు. కుంకుమ పువ్వు శతాబ్దాలుగా కాశ్మీర్‌తో సంబంధం కలిగి ఉంది. కాశ్మీరీ కుంకుమ పువ్వు ప్రధానంగా పుల్వామా, బడ్ గాం, కిష్త్ వార్ వంటి ప్రదేశాలలో పండిస్తారు. ఈ సంవత్సరం మేలో కాశ్మీరీ కుంకుమపువ్వుకు భౌగోళిక సూచిక ట్యాగ్ అంటే జీ ఐ ట్యాగ్ ఇచ్చారు. దీని ద్వారా కాశ్మీరీ కుంకుమ పువ్వును ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన బ్రాండ్‌గా మార్చాలనుకుంటున్నాం. కాశ్మీరీ కుంకుమ పువ్వు అనేక ఔషధ లక్షణాలను కలిగి ఉన్న మసాలా దినుసుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. ఇది చాలా సువాసనతో , ముదురు రంగులో ఉంటుంది. దాని దారాలు పొడవుగా, మందంగా ఉంటాయి. ఇది దాని ఔషధ విలువను పెంచుతుంది. ఇది జమ్మూ కాశ్మీర్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని సూచిస్తుంది. నాణ్యత గురించి చెప్పాలంటే కాశ్మీరీ కుంకుమ పువ్వు చాలా ప్రత్యేకమైంది. ఇతర దేశాల కుంకుమపువ్వు తో పోలిస్తే పూర్తిగా భిన్నమైంది. కాశ్మీరీ కుంకుమపువ్వుకు జిఐ ట్యాగ్ గుర్తింపుతో ప్రత్యేకఠ వచ్చింది. జిఐ ట్యాగ్ సర్టిఫికేట్ పొందిన తరువాత కాశ్మీరీ కుంకుమ పువ్వును దుబాయ్ లోని సూపర్ మార్కెట్లో ప్రారంభించినట్లు తెలిస్తే మీరు సంతోషిస్తారు.. ఇప్పుడు దాని ఎగుమతులు పెరగడం ప్రారంభమవుతుంది. ఇది స్వావలంబన భారతదేశాన్ని నిర్మించడానికి మన ప్రయత్నాలను మరింత బలోపేతం చేస్తుంది. కుంకుమ పువ్వు రైతులకు దీనివల్ల ప్రయోజనం ఉంటుంది. పుల్వామాలోని త్రాల్ లో ఉన్న షార్ ప్రాంతంలో నివసించే అబ్దుల్ మజీద్ వానీ ని చూడండి. ఆయన జి.ఐ టాగ్ పొందిన కుంకుమపువ్వును పాంపోర్‌లోని ట్రేడింగ్ సెంటర్లో నేషనల్ సాఫ్రాన్ మిషన్ సహాయంతో ఇ-ట్రేడింగ్ ద్వారా విక్రయిస్తున్నారు. ఇలా చాలా మంది కాశ్మీర్లో ఈ పని చేస్తున్నారు. ఈసారి మీరు కుంకుమపువ్వు కొనాలని నిర్ణయించుకున్నప్పుడు కాశ్మీర్ నుండి కుంకుమపువ్వు కొనాలని ఆలోచించండి. కాశ్మీరీ ప్రజల గొప్పదనం ఏమిటంటే అక్కడి కుంకుమ పువ్వు రుచి భిన్నంగా ఉంటుంది.
నా ప్రియమైన దేశ వాసులారా! కేవలం రెండు రోజుల కిందట గీతా జయంతి జరుపుకున్నాం. గీత మన జీవితంలోని ప్రతి సందర్భంలోనూ మనకు స్ఫూర్తినిస్తుంది. గీత ఇంత అద్భుతమైన గ్రంథం ఎందుకైందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఎందుకంటే అది స్వయంగా భగవాన్ శ్రీకృష్ణుడి వాణి. కానీ గీత ప్రత్యేకత ఏమిటంటే అది తెలుసుకోవాలనే ఉత్సుకతతో మొదలవుతుంది. ప్రశ్నతో మొదలవుతుంది. అర్జునుడు దేవుణ్ణి ప్రశ్నించాడు. ఉత్సుకత చూపాడు. అప్పుడే ప్రపంచానికి గీతా జ్ఞానం వచ్చింది. గీత మాదిరిగా మన సంస్కృతిలో ఉన్న జ్ఞానం అంతా ఉత్సుకతతో మొదలవుతుంది. వేదాంతం మొదటి మంత్రం “అథాతో బ్రహ్మ జిజ్ఞాసా’ అంటే మనం బ్రహ్మను విచారిద్దాం. అందుకే బ్రహ్మను అన్వేషించే చర్చ కూడా ఉంది. ఉత్సుకత లోని శక్తి అలాంటిది. ఉత్సుకత నిరంతరం కొత్త అంశాల కోసం మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. బాల్యంలో మనలో ఉత్సుకత ఉన్నందు వల్ల మనం నేర్చుకుంటాం. అంటే ఉత్సుకత ఉన్నంతవరకు జీవితం ఉంటుంది. ఉత్సుకత ఉన్నంతవరకు కొత్త అభ్యాస క్రమం కొనసాగుతుంది. ఇందులో వయస్సు, పరిస్థితులతో సంబంధం లేదు. అటువంటి ఉత్సుకత శక్తికి, జిజ్ఞాసకు ఒక ఉదాహరణ నాకు తెలిసింది. ఆ ఉదాహరణ తమిళనాడుకు చెందిన పెద్దవారు టి. శ్రీనివాసాచార్య స్వామి జీ గురించి! టి. శ్రీనివాసాచార్య స్వామి గారి వయస్సు 92 సంవత్సరాలు. ఈ వయస్సులో కూడా ఆయన తన పుస్తకాన్ని కంప్యూటర్లో రాస్తున్నారు. అది కూడా స్వయంగా టైప్ చేయడం ద్వారా. పుస్తకం రాయడం సరైందేనని మీరు ఆలోచిస్తూ ఉండాలి. కాని పూర్వ కాలంలో కంప్యూటర్ అసలే లేదు. అప్పుడు ఆయన కంప్యూటర్ ఎప్పుడు నేర్చుకున్నారు? ఆయన కళాశాలలో చదువుతున్న సమయంలో కంప్యూటర్ లేదనేది నిజం. కానీ, ఆయన యవ్వనంలో ఉన్నప్పుడు ఉన్న ఉత్సుకత, జిజ్ఞాస ఇప్పుడూ ఉన్నాయి. శ్రీనివాసాచార్య స్వామీజీ సంస్కృత , తమిళ పండితుడు. ఆయన ఇప్పటివరకు 16 ఆధ్యాత్మిక గ్రంథాలను రాశారు. కంప్యూటర్ వచ్చిన తరువాత పుస్తకం రాయడం, ముద్రించే విధానం మారిందని భావించినప్పుడు, తన 86 సంవత్సరాల వయస్సులో కంప్యూటర్ నేర్చుకున్నారు. తనకు అవసరమైన సాఫ్ట్వేర్ నేర్చుకున్నారు. ఇప్పుడు ఆయన తన పుస్తకాన్ని పూర్తి చేస్తున్నారు.
మిత్రులారా! జీవితంలో జిజ్ఞాస చనిపోయేంత వరకు నేర్చుకోవాలనే కోరిక చనిపోదు. అందుకు ప్రత్యక్ష ఉదాహరణ టి. శ్రీనివాసాచార్య స్వామీజీ జీవితం. అందువల్ల వెనుకబడిపోయామని, ఆగిపోయామని ఎప్పుడూ అనుకోకూడదు. నేర్చుకుంటామని ఆశాజనకంగా ఉండాలి. మనం నేర్చుకోలేమని, ముందుకు సాగలేమని కూడా అనుకోకూడదు.
నా ప్రియమైన దేశవాసులారా! ప్రస్తుతం మనం ఉత్సుకతతో కొత్త విషయాన్ని నేర్చుకోవడం గురించి మాట్లాడుకుంటున్నాం. కొత్త సంవత్సరంలో కొత్త తీర్మానాల గురించి కూడా మాట్లాడుకున్నాం. కొంతమంది నిరంతరం కొత్త పనులు చేస్తూ, కొత్త సంకల్పాలను నెరవేరుస్తూ ఉంటారు. మీరు కూడా మీ జీవితంలో అనుభూతి చెంది ఉంటారు. మనం సమాజం కోసం ఏదైనా చేసినప్పుడు సమాజం మనకు చాలా చేయగల శక్తిని ఇస్తుంది. సామాన్యంగా కనబడే ప్రేరణలతో చాలా పెద్ద పనులు చేయవచ్చు. ప్రదీప్ సంగ్వాన్ అలాంటి ఒక యువకుడు! గురుగ్రామ్‌కు చెందిన ప్రదీప్ సంగ్వాన్ 2016 నుండి హీలింగ్ హిమాలయాస్ అనే పేరుతో ఉద్యమం చేస్తున్నారు. ఆయన తన బృందం, వాలంటీర్లతో కలిసి హిమాలయాలలోని వివిధ ప్రాంతాలకు వెళ్లి, అక్కడ టూరిస్టులు వదిలేసిన ప్లాస్టిక్ వ్యర్థ పదార్థాలను శుభ్రపరుస్తారు. ప్రదీప్ గారు ఇప్పటివరకు హిమాలయాలలోని వివిధ పర్యాటక ప్రాంతాల నుండి టన్నుల కొద్ది ప్లాస్టిక్‌ను శుభ్రపరిచారు. ఇదేవిధంగా కర్ణాటకకు చెందిన అనుదీప్, మినుషా అనే ఒక యువ జంట ఉన్నారు. అనుదీప్, మినుషా గత నెల నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. వివాహం తరువాత చాలా మంది వివిధ ప్రాంతాలు తిరిగేందుకు వెళతారు. కానీ ఈ ఇద్దరూ భిన్నమైన పని చేశారు. ప్రజలు తమ ఇంటి నుండి బయటికి తిరగడానికి వెళ్లడాన్ని వారిద్దరూ ఎప్పుడూ గమనించేవారు. కానీ ఎక్కడికి వెళ్ళినా ప్రజలు చాలా చెత్తను వదిలివేస్తారన్న విషయాన్ని వారు గమనించారు. కర్ణాటకలోని సోమేశ్వర్ బీచ్‌లో పరిస్థితి కూడా అలాంటిదే. సోమేశ్వర్ బీచ్‌లో ప్రజలు వదిలిపెట్టిన చెత్తను శుభ్రం చేయాలని అనుదీప్, మినుషా నిర్ణయించుకున్నారు. భార్యాభర్తలిద్దరూ వివాహం తర్వాత మొదటి ప్రతిజ్ఞ తీసుకున్నారు. వీరిద్దరూ కలిసి సముద్ర తీరంలో చాలా చెత్తను శుభ్రపరిచారు. అనుదీప్ తన సంకల్పాన్ని సోషల్ మీడియాలో కూడా పంచుకున్నారు. తర్వాత ఏమైంది? వారిద్దరి అద్భుతమైన ఆలోచనతో ప్రభావితం అయిన చాలా మంది యువత వచ్చి వారితో చేరారు. మీకు తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ వ్యక్తులందరూ కలిసి సోమేశ్వర్ బీచ్ నుండి 800 కిలోల కంటే ఎక్కువ వ్యర్థాలను శుభ్రపరిచారు.
మిత్రులారా! ఈ ప్రయత్నాల మధ్య- ఈ చెత్త ఈ బీచ్ లకు, ఈ పర్వతాలకు ఎలా చేరుకుంటుందో కూడా మనం ఆలోచించాలి. మనలోనే కొందరు ఈ చెత్తను అక్కడ వదిలివేస్తారు. ప్రదీప్, అనుదీప్-మినుషా లాగా శుభ్రతా ఉద్యమాన్ని మనం నడపాలి. కానీ దీనికి ముందు మనం చెత్తను అస్సలు వ్యాప్తి చేయబోమని ప్రతిజ్ఞ కూడా తీసుకోవాలి. స్వచ్ఛభారత అభియాన్ మొదటి తీర్మానం ఇదే. అవును.. నేను మీకు మరో విషయం గుర్తు చేయాలనుకుంటున్నాను. కరోనా కారణంగా ఈ సంవత్సరం పెద్దగా చర్చించలేదు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుండి దేశానికి విముక్తి కల్పించాలి. 2021 తీర్మానాల్లో ఇది కూడా ఒకటి. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆరోగ్యంగా ఉండండి, మీ కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచండి. వచ్చే ఏడాది జనవరిలో కొత్త అంశాలపై 'మన్ కీ బాత్' ఉంటుంది.
మీకు చాలా చాలా కృతజ్ఞతలు.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం.. ఈ రోజు 'మన్ కీ బాత్' ప్రారంభంలో మీతో ఒక శుభవార్త పంచుకోవాలనుకుంటున్నాను. అతి పురాతనమైన అన్నపూర్ణ దేవత విగ్రహం కెనడా నుండి భారతదేశానికి తిరిగి వస్తోంది. ఈ విషయం తెలుసుకోవడం ప్రతి భారతీయుడికి గర్వంగా ఉంటుంది. ఈ విగ్రహాన్ని సుమారు వంద సంవత్సరాల కిందట 1913లో వారణాసిలోని ఒక ఆలయం నుండి దొంగిలించి దేశం నుండి బయటికి తరలించారు. కెనడా ప్రభుత్వానికి, ఈ మంచి పనిని సాధ్యం చేసిన వారందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అన్నపూర్ణ మాతకు కాశీతో చాలా ప్రత్యేకమైన సంబంధం ఉంది. ఇప్పుడు ఆ మాత విగ్రహం తిరిగి రావడం మనందరికీ సంతోషకరంగా ఉంది.
అన్నపూర్ణ మాత విగ్రహం లాగే మన వారసత్వ సంపద- అత్యంత విలువైన వారసత్వ సంపద – అంతర్జాతీయ ముఠాల బారినపడింది. ఈ ముఠాలు అంతర్జాతీయ మార్కెట్లో వాటిని చాలా ఎక్కువ ధరలకు అమ్ముతాయి. ఇలాంటి వాటిపై ఇకపై కఠినంగా ఉంటాం. ఆ సంపద తిరిగి రావడానికి భారతదేశం తన ప్రయత్నాలను పెంచింది. ఇటువంటి ప్రయత్నాల కారణంగా గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశం అనేక విగ్రహాలను, కళాఖండాలను తిరిగి తీసుకురావడంలో విజయవంతమైంది. మాతా అన్నపూర్ణ విగ్రహం తిరిగి రావడంతో పాటు కొన్ని రోజుల క్రితం ప్రపంచ వారసత్వ వారోత్సవం కూడా జరుపుకోవడం యాదృచ్చికం.
ప్రపంచ వారసత్వ వారోత్సవం సంస్కృతి ప్రేమికులకు పాత కాలానికి తిరిగి వెళ్లడానికి, చరిత్రపై వారి ఉత్సాహాన్ని పెంచుకోవడానికి గొప్ప అవకాశాన్ని అందిస్తుంది. కరోనా కాలం ఉన్నప్పటికీ ఈసారి ప్రజలు ఈ వారసత్వ వారోత్సవాన్ని వినూత్నంగా జరుపుకోవడం చూశాం. సంక్షోభంలో సంస్కృతి చాలా ఉపయోగపడుతుంది. సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో సంస్కృతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సంస్కృతి కూడా టెక్నాలజీ ద్వారా భావోద్వేగాలను పెంచడంలో ఉపయోగపడుతుంది. దేశంలోని అనేక మ్యూజియాలు, గ్రంథాలయాలు వాటి సేకరణను పూర్తిగా డిజిటల్ రూపంలోకి తేవడానికి కృషి చేస్తున్నాయి. ఢిల్లీలోని మన జాతీయ మ్యూజియం ఈ విషయంలో కొన్ని ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసింది. నేషనల్ మ్యూజియం ద్వారా పది వర్చువల్ గ్యాలరీలను ప్రవేశపెట్టే పని జరుగుతోంది. ఈ విషయం ఆసక్తికరంగా ఉంది కదా.. ఇప్పుడు మీరు మీ ఇంటి నుండి ఢిల్లీలోని నేషనల్ మ్యూజియం గ్యాలరీలలో పర్యటించవచ్చు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎక్కువ మందికి సాంస్కృతిక వారసత్వాన్ని అందించడం చాలా ముఖ్యం. ఈ వారసత్వ ప్రదేశాల రక్షణకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం కూడా ముఖ్యం.
నేను ఈ మధ్య ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ గురించి చదివాను. నార్వేకు ఉత్తర దిక్కులో స్వాల్బార్డ్ అనే ద్వీపం ఉంది. ఈ ద్వీపంలో ఆర్కిటిక్ ప్రపంచ ఆర్కైవ్ అనే ప్రాజెక్ట్ ను నిర్మించారు. ఈ ఆర్కైవ్‌లో విలువైన హెరిటేజ్ డేటాను ఎలాంటి ప్రకృతి లేదా మానవ నిర్మిత విపత్తుల బారిన పడకుండా సురక్షితంగా ఉంచారు. ఈ ప్రాజెక్టులో అజంతా గుహల వారసత్వాన్ని కూడా డిజిటలైజ్ చేసి అలంకరిస్తున్నట్లు ఇటీవల తెలిసింది. ఇందులో మీరు అజంతా గుహల పూర్తి అవగాహన పొందుతారు. ఇందులో పునరుద్ధరించబడిన డిజిటలైజ్డ్ పెయింటింగ్‌తో పాటు సంబంధిత పత్రాలు, సూక్తులు ఉంటాయి. మిత్రులారా! అంటువ్యాధి ఒకవైపు మన పని తీరును మార్చింది. మరోవైపు ప్రకృతిని కొత్త మార్గంలో అనుభవించే అవకాశాన్ని కూడా ఇచ్చింది. ప్రకృతిని చూడడంలో మన దృక్పథం కూడా మారిపోయింది. ఇప్పుడు మనం చలికాలంలోకి ప్రవేశిస్తున్నాం. ప్రకృతిలోని వివిధ రంగులను మనం చూస్తాం. గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్ అంతా చెర్రీ బ్లాసమ్స్ వైరల్ చిత్రాలతో నిండిపోయింది. నేను చెర్రీ బ్లాసమ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు జపాన్ లోని ఈ ప్రత్యేకత గురించి మాట్లాడుతున్నానని మీరు తప్పకుండా ఆలోచిస్తూ ఉండాలి. కానీ అది నిజం కాదు.. అవి జపాన్ ఫోటోలు కాదు. షిల్లాంగ్ లో ఉన్న మేఘాలయలోని చిత్రాలివి. మేఘాలయ అందాలను ఈ చెర్రీ బ్లాసమ్స్ మరింతగా పెంచాయి.
మిత్రులారా! ఈ నెల- నవంబరు 12 వ తేదీనాడు డాక్టర్ సలీం అలీ గారి 125 వ జయంతి వేడుకలు ప్రారంభమయ్యాయి. పక్షుల ప్రపంచంలో డాక్టర్ సలీం పక్షుల వీక్షణతో పాటు అనేక చెప్పుకోదగ్గ పనులు చేశారు. ప్రపంచంలోని వివిధ ప్రాంతాల పక్షి వీక్షకులు కూడా భారతదేశం వైపు ఆకర్షితులయ్యారు. నేను ఎప్పుడూ పక్షిని చూసే వీక్షకుల అభిమానిని. చాలా ఓపికతో గంటల తరబడివారు పక్షులను చూస్తారు. ఉదయం నుండి సాయంత్రం వరకు ప్రకృతి ప్రత్యేకమైన దృశ్యాలను ఆస్వాదిస్తారు. వారి జ్ఞానాన్ని ప్రజలకు అందజేస్తారు. భారతదేశంలో కూడా బర్డ్ వాచింగ్ సొసైటీలు చురుకుగా పని చేస్తున్నాయి. మీరు కూడా తప్పకుండా బర్డ్ వాచింగ్ తో అనుసంధానం కావాలి. నా ఉరుకులు పరుగుల జీవితంలో కూడా గతంలో పక్షులతో గడిపే అవకాశం కెవాడియాలో వచ్చింది. ఇది చాలా గుర్తుండిపోయే అవకాశం. పక్షులతో గడిపే సమయం మిమ్మల్ని ప్రకృతితో అనుసంధానిస్తుంది. పర్యావరణానికి కూడా ప్రేరణ ఇస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! భారతదేశం సంస్కృతి, శాస్త్రాలు ఎప్పుడూ ప్రపంచం మొత్తాన్ని ఆకర్షించే కేంద్రాలుగా ఉన్నాయి. వీటి అన్వేషణలో చాలా మంది భారతదేశానికి వచ్చారు. ఎప్పటికీ ఇక్కడే ఉండిపోయారు. చాలా మంది తమ దేశానికి తిరిగి వెళ్లి ఈ సంస్కృతిని వ్యాప్తి చేశారు. 'విశ్వనాథ్' అని కూడా పిలిచే జానస్ మాసెట్టి గారి గురించి నాకు తెలిసింది. జానస్ బ్రెజిల్ ప్రజలకు వేదాంతాన్ని, భగవద్గీతను బోధిస్తారు. రియో డి జనీరో నుండి గంటల తరబడి ప్రయాణ దూరంలో ఉండే పెట్రో పోలిస్ పర్వతాలలో విశ్వవిద్య అనే సంస్థను ఆయన నిర్వహిస్తున్నారు. మెకానికల్ ఇంజనీరింగ్ చదివి, తన కంపెనీలో స్టాక్ మార్కెట్లో పని చేశారు. తరువాత భారతీయ సంస్కృతి- ప్రత్యేకించి వేదాంతం వైపు ఆకర్షితులయ్యారు. స్టాక్ నుండి ఆధ్యాత్మికత వరకు- అది నిజానికి సుదీర్ఘ ప్రయాణం. జానస్ భారతదేశంలో వేదాంత తత్వాన్ని అభ్యసించారు. నాలుగు సంవత్సరాలు కోయంబత్తూర్ లోని అర్ష విద్యా గురుకులంలో నివసించారు. జానస్ కు మరో ప్రత్యేకత ఉంది. ఆయన తన సందేశాన్ని ఫార్వార్డ్ చేయడానికి సాంకేతికతను ఉపయోగిస్తున్నారు. ఆయన క్రమం తప్పకుండా ఆన్లైన్ కార్యక్రమాలు చేస్తారు. ప్రతిరోజూ ఆడియో ఫైళ్లను డౌన్ లోడ్ చేసేందుకు వీలుగా పాడ్ కాస్ట్ చేస్తారు. గత 7 సంవత్సరాల్లో జానస్ ఉచిత ఓపెన్ కోర్సుల ద్వారా ఒకటిన్నర లక్షకు పైగా విద్యార్థులకు వేదాంతాన్ని బోధించారు. జాన్స్ కేవలం ఇంత పెద్ద పని చేయడమే కాదు, చాలా మందికి అర్థమయ్యే భాషలో ఈ కోర్సులను నిర్వహించడం మరో విశేషం. కరోనా, క్వారంటైన్ల ఈ కాలంలో వేదాంతం ఎలా సహాయపడుతుందనే దానిపై ప్రజలకు చాలా ఆసక్తి ఉంది. జాన్స్ చేసిన కృషికి, ఆయన భవిష్యత్ ప్రయత్నాలకు 'మన్ కీ బాత్' ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మిత్రులారా! అదే విధంగా మీరు ఒక వార్తను గమనించి ఉండాలి. న్యూజిలాండ్‌లో కొత్తగా ఎన్నికైన ఎం.పి. డాక్టర్ గౌరవ్ శర్మ ప్రపంచంలోని ప్రాచీన భాషలలో ఒకటైన సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేశారు. భారతీయులుగా భారతీయ సంస్కృతి వ్యాప్తి మనందరికీ గర్వం కలిగిస్తుంది. 'మన్ కీ బాత్' ద్వారా గౌరవ్ శర్మ గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. న్యూజిలాండ్ ప్రజల సేవలో ఆయన కొత్త విజయాలు సాధించాలని మనమందరం కోరుకుంటున్నాం.
నా ప్రియమైన దేశవాసులారా! రేపు- నవంబర్ 30వ తేదీనాడు శ్రీ గురు నానక్ దేవ్ జీ 551 వ జయంతి సందర్భంగా ప్రకాశ్ పర్వ్ జరుపుకుంటున్నాం. గురు నానక్ దేవ్ జీ ప్రభావం ప్రపంచం మొత్తం స్పష్టంగా కనిపిస్తుంది. వాంకోవర్ నుండి వెల్లింగ్టన్ వరకు, సింగపూర్ నుండి దక్షిణాఫ్రికా వరకు గురు నానక్ సందేశాలు ప్రతిచోటా వినబడతాయి. ‘సేవక్ కో సేవా బన్ ఆయీ’ అని గురు గ్రంథ్ సాహిబ్ పేర్కొంటోంది. అంటే సేవకుడి పని సేవ చేయడమేనని అర్థం. గత కొన్ని సంవత్సరాల్లో చాలా ముఖ్యమైన సంఘటనలు జరిగాయి. సేవకుడిగా చాలా సేవ చేసే అవకాశం లభించింది. గురు సాహిబ్ మా నుండి సేవ పొందారు. గురు నానక్ దేవ్ జీ 550 వ జయంతి ఉత్సవం, శ్రీ గురు గోవింద్ సింగ్ జీ 350 వ జయంతి ఉత్సవంతో పాటు వచ్చే ఏడాది శ్రీ గురు తేజ్ బహదూర్ జీ 400 వ జయంతి ఉత్సవం కూడా ఉంది. గురు సాహిబ్ జీ కి నాపై ప్రత్యేక దయ ఉందని నేను భావిస్తున్నాను. ఆయన తన పనుల్లో నన్ను ఎప్పుడూ చాలా దగ్గరగా అనుసంధానించాడు.
మిత్రులారా! కచ్లోలఖ్ పత్ గురుద్వారా సాహిబ్ అనే పేరుతో గురుద్వారా ఉందని మీకు తెలుసా? శ్రీ గురు నానక్ తన విచార సమయంలో లఖ్‌పత్ గురుద్వారా సాహిబ్‌లో బస చేశారు. ఈ గురుద్వారా 2001 లో సంభవించిన భూకంపం వల్ల కూడా దెబ్బతింది. గురు సాహిబ్ కృప వల్ల దాని పునరుద్ధరణను నేను పూర్తి చేయగలిగాను. గురుద్వారా మరమ్మతులు చేయడమే కాదు- దాని గౌరవాన్ని, గొప్పతనాన్ని కూడా పునరుద్ధరించాం. మనందరికీ గురు సాహిబ్ నుండి ఆశీర్వాదాలు వచ్చాయి. లఖ్‌పత్ గురుద్వారా పరిరక్షణ ప్రయత్నాలకు 2004 లో యునెస్కో ఆసియా పసిఫిక్ వారసత్వ పురస్కారాలలో ప్రత్యేక అవార్డు లభించింది. మరమ్మతు సమయంలో శిల్పాలతో సంబంధం ఉన్న ప్రత్యేకతలు దెబ్బతినకుండా జాగ్రత్తగా చూసుకున్నట్టు అవార్డు అందజేసే జ్యూరీ పేర్కొన్నారు. గురుద్వారా పునర్నిర్మాణ పనులలో సిక్కు సమాజం చురుకుగా పాల్గొనడమే కాకుండా వారి మార్గదర్శకత్వంలోనే పునర్నిర్మాణం జరిగినట్టు కూడా జ్యూరీ గుర్తించారు. నేను ముఖ్యమంత్రిగా లేనప్పుడు కూడా లఖ్‌పత్ గురుద్వారాను సందర్శించే భాగ్యం నాకు లభించింది. నేను అపరిమిత శక్తిని పొందేవాడిని. ఈ గురుద్వారా సందర్శన వల్ల ధన్యులమైనట్టు అందరూ భావిస్తారు. గురు సాహిబ్ నా నుండి నిరంతర సేవలను తీసుకున్నందుకు చాలా ధన్యుడినయ్యాను. గత ఏడాది నవంబర్‌లో కర్తార్‌పూర్ సాహిబ్ కారిడార్ ప్రారంభించడం చాలా చారిత్రాత్మకమైనది. ఈ విషయం జీవితాంతం నా హృదయంలో ఉండిపోతుంది. శ్రీ దర్బార్ సాహిబ్‌కు సేవ చేయడానికి మరో అవకాశం లభించడం మనందరికీ ఒక విశేషం. విదేశాలలో నివసిస్తున్న సిక్కు సోదరులు, సోదరీమణులు దర్బార్ సాహిబ్ సేవ కోసం నిధులు పంపడం చాలా సులభం. ఈ అడుగు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల వారిని కూడా దర్బార్ సాహిబ్‌కు సన్నిహితం చేసింది.
మిత్రులారా! అన్నదానం అనే లంగర్ సంప్రదాయాన్ని గురు నానక్ దేవ్ జీ ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిక్కు సమాజం కరోనా సమయంలో ప్రజలకు ఆహారం ఇచ్చే సంప్రదాయాన్ని ఎలా కొనసాగిస్తుందో మనం చూశాం. సేవ, మానవత్వాల ఈ సంప్రదాయం మనందరికీ నిరంతర ప్రేరణగా ఉపయోగపడుతుంది. మనమందరం సేవకులుగా పనిచేయడం కొనసాగించాలని కోరుకుంటున్నాను. గురు సాహిబ్ ఈ విధంగా నా నుండి, దేశవాసుల నుండి సేవలను పొందడం కొనసాగించాలని కోరుకుంటున్నాను. మరోసారి గురునానక్ జయంతి సందర్భంగా నా శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశవాసులారా! ఇటీవల దేశవ్యాప్తంగా అనేక విశ్వవిద్యాలయాల విద్యార్థులతో సంభాషించడానికి, వారి విద్యా ప్రయాణంలో ముఖ్యమైన కార్యక్రమాల్లో పాల్గొనడానికి నాకు అవకాశం లభించింది. ఐఐటి-గువహతి, ఐఐటి- ఢిల్లీ, గాంధీనగర్ లోని దీన్‌దయాళ్ పెట్రోలియం విశ్వవిద్యాలయం, ఢిల్లీ లోని జెఎన్‌యు, మైసూర్ విశ్వవిద్యాలయం, లక్నో విశ్వవిద్యాలయం విద్యార్థులతో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా కనెక్ట్ అవ్వగలిగాను. దేశంలోని యువతతో గడపడం తాజాగా ఉంచుతుంది. ఎంతో శక్తిని అందిస్తుంది. విశ్వవిద్యాలయ ప్రాంగణాలు ఒక విధంగా మినీ ఇండియా లాంటివి. ఒక వైపు ఈ క్యాంపస్‌లలో భారతదేశం లోని వైవిధ్యం కనబడుతుంది. మరోవైపు నవ భారతానికి అవసరమయ్యే పెద్ద మార్పుల పట్ల మక్కువ కూడా కనబడుతుంది. కరోనాకు ముందు రోజులలో నేను ఏదైనా ఒక సంస్థ కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు సమీప పాఠశాలల నుండి పేద పిల్లలను కూడా ఆ కార్యక్రమానికి ఆహ్వానించాలని కోరేవాడిని. ఆ పిల్లలు నా ప్రత్యేక అతిథిగా ఆ వేడుకకు వచ్చేవారు. ఆ గొప్ప వేడుకలో ఒక యువకుడు డాక్టర్, ఇంజనీర్, సైంటిస్ట్ అవ్వడాన్ని ఒక చిన్న పిల్లవాడు చూస్తాడు. ఎవరైనా పతకం తీసుకోవడాన్ని చూస్తాడు. అప్పుడు అతనిలో కొత్త కలలు తలెత్తుతాయి. ‘నేను కూడా చేయగలను’ అనే ఆత్మవిశ్వాసాన్ని అతనిలో ఆ కార్యక్రమం కలిగిస్తుంది. సంకల్పం దిశగా వెళ్లేందుకు ప్రేరణ లభిస్తుంది.
మిత్రులారా! ఇది కాకుండా ఆ సంస్థ పూర్వ విద్యార్థులు ఎవరు, ఆ సంస్థ పూర్వ విద్యార్థులతో క్రమం తప్పకుండా సంబంధాలు కొనసాగించేందుకు చేసే ఏర్పాట్లు ఏమిటి అనే విషయాలు తెలుసుకోవటానికి నేను ఎప్పుడూ ఆసక్తి కలిగి చూపిస్తాను. ఆ సంస్థ పూర్వ విద్యార్థుల నెట్వర్క్ ఎంత శక్తిమంతమైనదో తెలుసుకోవాలని నాకు ఉంటుంది.
నా యువ మిత్రులారా! విద్యార్థిగా మీరు అక్కడ చదువుతున్నంత కాలం మాత్రమే ఉంటారు. కానీ, పూర్వ విద్యార్థులుగా మీరు జీవితాంతం కొనసాగుతారు. పాఠశాల, కళాశాల నుండి బయటికి వచ్చాక రెండు విషయాలు ఎప్పటికీ ముగియవు. ఒకటి మీ అభ్యసన ప్రభావం. రెండవది మీ పాఠశాల, కళాశాలతో మీ అనుబంధం. పూర్వ విద్యార్థులు తమలో తాము మాట్లాడినప్పుడు పుస్తకాలు, చదువుల కంటే ఎక్కువగా క్యాంపస్‌లో స్నేహితులతో గడిపిన క్షణాలే ఎక్కువగా మాట్లాడతారు. ఈ జ్ఞాపకాల నుండే ఆ విద్యాసంస్థకు ఏదైనా చేయాలనే ఒక భావన ప్రారంభమవుతుంది. మీ వ్యక్తిత్వం అభివృద్ధి చెందిన ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి మించిన ఆనందం ఏముంటుంది? పూర్వ విద్యార్థులు తమ పాత సంస్థలను అభివృద్ధి చేసిన అలాంటి కొన్ని ప్రయత్నాల గురించి నేను చదివాను. ఈ రోజుల్లో పూర్వ విద్యార్థులు తమ విద్యాసంస్థ అభివృద్ధిలో క్రియాశీలంగా ఉన్నారు. ఐఐటియన్లు తమ సంస్థలను కాన్ఫరెన్స్ సెంటర్లు, మేనేజ్మెంట్ సెంటర్లు, ఇంక్యుబేషన్ సెంటర్లు వంటి అనేక విభిన్న రూపాలుగా అభివృద్ధి చేశారు. ఈ ప్రయత్నాలన్నీ ప్రస్తుత విద్యార్థుల అభ్యసన అనుభవాలను మెరుగు పరుస్తాయి. ఐఐటి ఢిల్లీ ఎండోమెంట్ ఫండ్‌ను ప్రారంభించింది. ఇది అద్భుతమైన ఆలోచన. ప్రపంచంలోని ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో ఇటువంటి నిధుల సేకరణ సంస్కృతి ఉంది. ఇది విద్యార్థులకు సహాయ పడుతుంది. భారతదేశ విశ్వవిద్యాలయాలు కూడా ఈ సంస్కృతిని సంస్థాగతం చేయగలవని నా అభిప్రాయం.
ఏదైనా తిరిగి ఇవ్వాలనుకున్నప్పుడు పెద్దది, చిన్నది అన్న భేదం ఏమీ లేదు. ప్రతి చిన్న సహాయం ముఖ్యమైందే. ప్రతి ప్రయత్నం కూడా ముఖ్యమైందే. తరచుగా పూర్వ విద్యార్థులు తమ సంస్థల సాంకేతిక పరిజ్ఞానంలో; భవన నిర్మాణంలో; అవార్డులు, స్కాలర్షిప్లను ప్రారంభించడంలో; నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. కొన్ని పాఠశాలల పూర్వ విద్యార్థి సంఘాలు మార్గదర్శక కార్యక్రమాలను కూడా ప్రారంభించాయి. ఇందులో వారు వివిధ బ్యాచ్‌ల విద్యార్థులకు మార్గనిర్దేశం చేస్తారు. విద్యా అవకాశాల గురించి కూడా చర్చిస్తారు. అనేక పాఠశాలల్లో- ముఖ్యంగా రెసిడెన్షియల్ పాఠశాలల్లో పూర్వ విద్యార్థుల సంఘాలు చాలా బలంగా ఉన్నాయి. క్రీడా పోటీలు, సమాజ సేవ వంటి కార్యకలాపాలను కూడా అవి నిర్వహిస్తున్నాయి. వారు చదివిన సంస్థతో అనుబంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని పూర్వ విద్యార్థులను నేను కోరుతున్నాను. అది పాఠశాల అయినా, కళాశాల అయినా, విశ్వవిద్యాలయమైనా ఆ సంస్థతో పూర్వ విద్యార్థులు అనుబంధం పెరగాలి. పూర్వ విద్యార్థుల భాగస్వామ్యంతో నవీన, వినూత్న మార్గాలలో పని చేయాలని నేను విద్యా సంస్థలను కోరుతున్నాను. పూర్వ విద్యార్థులు చురుకుగా పాల్గొనడానికి సృజనాత్మక వేదికలను అభివృద్ధి చేయండి. పెద్ద కళాశాలలు, విశ్వవిద్యాలయాలు మాత్రమే కాదు- మన గ్రామాల పాఠశాలలు కూడా బలమైన, చురుకైన పూర్వ విద్యార్థుల నెట్వర్క్ కలిగి ఉండాలి.
నా ప్రియమైన దేశవాసులారా! డిసెంబర్ 5వ తేదీ శ్రీ అరబిందో వర్ధంతి. శ్రీ అరబిందోను మనం ఎంత ఎక్కువ చదువుతామో అంత లోతైన పరిజ్ఞానం మనకు లభిస్తుంది. నా యువ స్నేహితులు శ్రీ అరబిందో గురించి ఎంత ఎక్కువ తెలుసుకుంటే అంత ఎక్కువ మీ గురించి మీరే తెలుసుకుంటారు. మీరు ఉన్న జీవన స్థితి, మీ సంకల్పాలను నెరవేర్చడానికి పడుతున్న శ్రమ- వీటి మధ్య మీరు ఎల్లప్పుడూ శ్రీ అరబిందోకు కొత్త మార్గాన్ని చూపిస్తూ, నూతన మార్గం పొందుతారు. ప్రేరణ ఇస్తూ ప్రేరణ పొందుతారు. 'వోకల్ ఫర్ లోకల్' ప్రచారంతో మనం ముందుకు వెళుతున్నప్పుడు శ్రీ అరబిందో స్వదేశీ తత్వశాస్త్రం మనకు కనిపిస్తుంది. బంగ్లాలో అత్యంత ప్రభావవంతమైన కవిత ప్రచారంలో ఉంది.
‘ఛుయీ శుతో పాయ్- మాన్ తో ఆశే తుంగ హోతే|
దియ-శలాయి కాఠి, తౌ ఆసే పోతే ||
ప్రో-దీప్తి జాలితే ఖేతే, శుతే, జేతే|
కిఛుతే లోక్ నాయ్శాధీన్||
అంటే- ఇక్కడ సూది నుండి అగ్గి పెట్టె వరకు ప్రతి ఒక్కటీ విలాసవంతమైన ఓడలో దిగుమతి అవుతాయి. తినడంలో, తాగడంలో, నిద్రపోవడంలో – ఏ విషయంలోనూ ప్రజలకు స్వేచ్ఛ లేదు.
స్వదేశీ అంటే మన భారతీయ కార్మికులు, చేతివృత్తులవారు తయారుచేసే వస్తువులకు ప్రాధాన్యత ఇవ్వడమని ఆయన చెప్పేవారు. విదేశాల నుండి ఏదైనా నేర్చుకోవడాన్ని శ్రీ అరబిందో ఎప్పుడూ వ్యతిరేకించలేదు. కొత్త అంశం నుండి నేర్చుకోవాలని, మన దేశానికి ఉపయోగపడేదానికి సహకారం, ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన అభిప్రాయం. ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ లో ‘వోకల్ ఫర్ లోకల్’ మంత్ర భావన ఇదే. ముఖ్యంగా స్వదేశీని మనదిగా చేసుకోవడంతో పాటు వివిధ విషయాల్లో ఆయన చెప్పిన అభిప్రాయాలు ఈ రోజు ప్రతి పౌరుడు చదవాలి. మిత్రులారా! విద్యపై అరబిందో అభిప్రాయాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. పుస్తక పరిజ్ఞానికి; డిగ్రీలు, ఉద్యోగాలకు పొందడానికి మాత్రమే విద్య పరిమితమని ఆయన భావించలేదు. మన జాతీయ విద్య మన యువతరం హృదయాలకు, మనసులకు శిక్షణగా ఉండాలని శ్రీ అరబిందో చెప్పేవారు. అంటే శాస్త్రీయ వికాసం పొందిన మస్తిష్కం, భారతీయ భావోద్వేగాల హృదయం ఉండే యువకుడు మాత్రమే దేశానికి మంచి పౌరుడిగా మారగలడని అరబిందో అభిప్రాయం. ఆ రోజుల్లో జాతీయ విద్యపై అరబిందో చెప్పినదాన్నే కొత్త జాతీయ విద్యా విధానం ద్వారా దేశం పూర్తి చేస్తోంది.
నా ప్రియమైన దేశవాసులారా! భారతదేశంలో వ్యవసాయం, అనుబంధ రంగాలకు కొత్త కోణాల అనుసంధానం జరుగుతోంది. గతంలోని వ్యవసాయ సంస్కరణలు రైతులకు కొత్త అవకాశాలకు తలుపులు తెరిచాయి. కొన్నేళ్లుగా ఉన్న రైతుల ఆకాంక్షలు, వాటిని తీరుస్తామన్న రాజకీయ పక్షాల వాగ్దానాలు నెరవేరాయి. చాలా చర్చల తరువాత భారత పార్లమెంట్ వ్యవసాయ సంస్కరణలకు చట్టపరమైన రూపాన్ని ఇచ్చింది. ఈ సంస్కరణలు రైతుల అనేక బంధనాలను అంతం చేయడమే కాకుండా వారికి కొత్త హక్కులు, కొత్త అవకాశాలను కూడా కల్పించాయి.
మిత్రులారా! అవగాహన సజీవంగా ఉంచుతుంది. తన అవగాహనతో వేలాది మంది ప్రజల జీవితాలను ప్రభావితం చేసిన వ్యవసాయ పారిశ్రామికవేత్త వీరేంద్ర యాదవ్ గారు. వీరేంద్ర యాదవ్ గారు ఒకప్పుడు ఆస్ట్రేలియాలో నివసించారు. రెండేళ్ల క్రితం భారతదేశానికి వచ్చిన ఆయన ఇప్పుడు హర్యానాలోని కైతాల్‌లో నివసిస్తున్నారు. ఇతర వ్యక్తుల మాదిరిగానే వ్యవసాయంలో గడ్డి ఆయన ముందు పెద్ద సమస్యగా నిలిచింది. దీని పరిష్కారం కోసం చాలా విస్తృత స్థాయిలో పని జరుగుతోంది. కానీ, ఈ రోజు 'మన్ కీ బాత్'లో నేను ప్రత్యేకంగా వీరేంద్ర గారి గురించి ప్రస్తావిస్తున్నాను. ఎందుకంటే ఆయన ప్రయత్నాలు భిన్నంగా ఉంటాయి. కొత్త దిశను చూపుతాయి. గడ్డి సమస్యను పరిష్కరించడానికి వీరేంద్ర గారు గడ్డి ముద్దలను తయారు చేయడానికి ఒక యంత్రాన్ని కొన్నారు. ఇందుకోసం వ్యవసాయ శాఖ నుంచి ఆర్థిక సహాయం కూడా పొందారు. ఈ యంత్రంతో గడ్డి మోపులను చేసి, అగ్రో ఎనర్జీ ప్లాంట్, పేపర్ మిల్లులకు విక్రయించారు. వీరేంద్ర గారు కేవలం రెండేళ్లలో గడ్డితో ఒకటిన్నర కోట్లకు పైగా వ్యాపారం చేశారని, అందులో కూడా ఆయన సుమారు 50 లక్షల రూపాయల లాభం పొందారని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది రైతులకు కూడా ప్రయోజనం చేకూరుస్తోంది. వీరి పొలాల నుండి కూడా వీరేంద్ర గారు గడ్డి సేకరిస్తారు. చెత్త నుండి బంగారం పొందడం గురించి మనం చాలా విన్నాం. కాని, గడ్డి ద్వారా డబ్బు, పుణ్యం సంపాదించడానికి ఇది ఒక ప్రత్యేకమైన ఉదాహరణ. యువత- ముఖ్యంగా వ్యవసాయాన్ని అభ్యసిస్తున్న లక్షలాది మంది విద్యార్థులు- తమ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి రైతులకు ఆధునిక వ్యవసాయం, ఇటీవలి వ్యవసాయ సంస్కరణల గురించి అవగాహన కల్పించాలని నేను కోరుతున్నాను. ఇలా చేయడం ద్వారా దేశంలో జరుగుతున్న పెద్ద మార్పుల్లో మీరు భాగస్వామి అవుతారు.
నా ప్రియమైన దేశవాసులారా!
'మన్ కీ బాత్'లో మనం చాలా భిన్నమైన విభిన్న అంశాలపై మాట్లాడుకుంటాం. కానీ, ఒక విషయానికి కూడా ఏడాది గడుస్తోంది. దీన్ని మనం ఆనందంతో గుర్తుంచుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడం. కరోనా మొదటి కేసు గురించి ప్రపంచానికి తెలిసి దాదాపు ఒక సంవత్సరం అయ్యింది. అప్పటి నుండి ప్రపంచం మొత్తం చాలా ఉత్థాన పతనాలను చూసింది. లాక్ డౌన్ కాలం నుండి బయటపడిన తర్వాత ఇప్పుడు వ్యాక్సిన్ పై చర్చ ప్రారంభమైంది. కానీ, కరోనాకు సంబంధించిన ఎలాంటి నిర్లక్ష్యమైనా ఇప్పటికీ చాలా ప్రమాదకరమైంది. కరోనాపై మన పోరాటాన్ని దృఢంగా కొనసాగించాలి.
మిత్రులారా! కొద్ది రోజుల తరువాత డిసెంబర్ 6న బాబా సాహెబ్ అంబేద్కర్ వర్ధంతి. బాబా సాహెబ్‌కు నివాళులర్పించడంతో పాటు, పౌరుడిగా మన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి ఆయన మనకు బోధించిన పాఠాలను గుర్తుకు తెచ్చుకోవాలి. దేశంలోని అధిక ప్రాంతాల్లో శీతాకాలం కూడా ఊపందుకుంది. చాలా చోట్ల మంచు కురుస్తోంది. ఈ సీజన్ లో మనం కుటుంబంలోని పిల్లలు, వృద్ధులు, జబ్బుపడిన వ్యక్తుల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మనం కూడా జాగ్రత్త తీసుకోవాలి. ప్రజలు తమ చుట్టూ ఉన్న పేదవారి గురించి కూడా ఆలోచించడం చూసినప్పుడు నాకు సంతోషంగా ఉంది. కొందరు వెచ్చని బట్టలు ఇవ్వడం ద్వారా వారికి సహాయం చేస్తున్నారు. జంతువులకు కూడా శీతాకాలం చాలా కష్టం. వాటికి సహాయం చేయడానికి కూడా చాలా మంది ముందుకు వస్తారు.
మన యువ తరం ఇలాంటి కార్యకలాపాల్లో చాలా చురుకుగా ఉంటుంది. మిత్రులారా! మన్ కీ బాత్ తర్వాతి సంచికలో మనం కలిసినప్పుడు ఈ సంవత్సరం 2020 చివరిలో ఉంటుంది. కొత్త అంచనాలతో, కొత్త నమ్మకాలతో మనం ముందుకు వెళదాం. ఏమైనా సూచనలు, ఆలోచనలు ఉంటే వాటిని నాతో పంచుకుంటూ ఉండండి. మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. మీరందరూ ఆరోగ్యంగా ఉండండి. దేశం కోసం క్రియాశీలకంగా, చురుకుగా ఉండండి.
మీకు అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశ వాసులారా! విజయదశమి పండుగ అంటే దసరా పర్వదినాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. ఈ శుభ సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు. అసత్యంపై సత్యం గెలుపుకు సూచన దసరా పండుగ. కష్టాలపై ధైర్యం విజయానికి కూడా ఒక సూచిక ఇది. ఈ రోజు మీరందరూ ఎంతో సంయమనంతో జీవిస్తున్నారు. పండుగలను హుందాగా జరుపుకుంటున్నారు. అందువల్ల ఈ యుద్ధంలో మన విజయం ఖాయం. ఇంతకుముందు దుర్గాదేవి మంటపాల్లో తల్లి దర్శనం కోసం భారీగా జనం వచ్చేవారు. అక్కడ జాతర లాంటి వాతావరణం ఉండేది. కానీ ఈసారి అలాంటి వాతావరణం లేదు. ఇంతకుముందు దసరా సందర్భంగా పెద్ద ఉత్సవాలు కూడా జరిగేవి. కానీ ఈసారి ఈ పండుగ భిన్నంగా ఉంటుంది. రామ్‌లీలా పండుగ కూడా పెద్ద ఆకర్షణ. కానీ ఈసారి అందులో కూడా కొన్ని ఆంక్షలు ఉన్నాయి. ఇంతకుముందు నవరాత్రులలో గుజరాత్ గార్బా సందడి ప్రతిచోటా ఉండేది. ఈసారి పెద్ద ఉత్సవాలెవీ జరగడం లేదు. ఇంకా మరెన్నో పండుగలు రాబోతున్నాయి. ఇప్పుడు ఈద్, శరద్ పూర్ణిమ, వాల్మీకి జయంతి పండుగలున్నాయి. తర్వాత ధంతేరస్, దీపావళి, భాయి-దూజ్, ఆరవ మాత ఆరాధన, గురు నానక్ దేవ్ జీ జన్మదినం ఇవన్నీ ఉన్నాయి. ఈ కరోనా సంక్షోభంలో మనం సంయమనంతో ఉండాలి. గౌరవంగా ఉండాలి.
మిత్రులారా! మనం పండుగ గురించి మాట్లాడేటప్పుడు, పండుగకు సన్నాహాలు చేసేటప్పుడు ఒక విషయం గుర్తుకు వస్తుంది. మార్కెట్‌కు ఎప్పుడు వెళ్ళాలి? ఏమేం కొనాలి అనే విషయం గుర్తుకొస్తుంది. ముఖ్యంగా పిల్లలకు షాపింగ్ అంటే ప్రత్యేక ఉత్సాహం ఉంటుంది. ఈసారి పండుగ సందర్భంగా కొత్త వస్తువులేం దొరుకుతాయి మార్కెట్లో? ఈ పండుగ ఉత్సవాలు, మార్కెట్ చైతన్యం ఒకదానితో మరొక దానికి సంబంధం ఉన్న అంశాలు. ఈ సమయంలో మీరు షాపింగ్‌కు వెళ్ళినప్పుడు 'వోకల్ ఫర్ లోకల్' అన్న మన సంకల్పం గుర్తుంచుకోండి. మార్కెట్ లో వస్తువులను కొనుగోలు చేసేటప్పుడు మనం స్థానిక ఉత్పత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి.
మిత్రులారా! ఈ పండుగ వేడుకల మధ్యలో లాక్డౌన్ సమయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. లాక్డౌన్లో సమాజానికి సన్నిహితులైనవారిని మరింత దగ్గరగా చూశాం. వారు లేకుండా మన జీవితం చాలా కష్టంగా ఉంటుంది. స్వీపర్లు, ఇంట్లో పనిచేసే సోదర సోదరీమణులు, స్థానికంగా కూరగాయలు అమ్మేవారు, పాలమ్మే వాళ్లు, సెక్యూరిటీ గార్డులు మొదలైనవారి పాత్ర మన జీవితంలో ఎంతగా ఉందో ఇప్పుడు బాగా తెలుసుకున్నాం. కష్ట సమయాల్లో వీరంతా మనతో ఉన్నారు. మనందరితో ఉన్నారు. ఇప్పుడు మన పండుగలనూ మన ఆనందాలను కూడా వారితో పంచుకోవాలి. వీలైనప్పుడల్లా వాటిని మీ ఆనందంలో చేర్చమని నేను మిమ్మల్ని కోరుతున్నాను. వారిని మన కుటుంబ సభ్యుడిలా భావించండి. అప్పుడు మీ ఆనందం ఎంత పెరుగుతుందో మీరు చూస్తారు.
మిత్రులారా! ఈ పండుగలలో కూడా సరిహద్దుల్లో నిలబడి ఉన్న మన ధైర్యవంతులైన సైనికులను మనం గుర్తుంచుకోవాలి. వారంతా భారతమాటకు సేవ చేస్తూ రక్షిస్తున్నారు. వారందరినీ గుర్తు చేసుకుంటూ మనం మన పండుగలను జరుపుకోవాలి. భారతమాత ధైర్యవంతులైన కుమారులు, కుమార్తెలను గౌరవించడానికి మనం ఇంట్లో ప్రత్యేకంగా ఒక దీపం వెలిగించాలి. మీరు సరిహద్దులో ఉన్నప్పటికీ దేశం మొత్తం మీతోనే ఉందని, మీ క్షేమాన్ని ఆకాంక్షిస్తోందని నా ధైర్యవంతులైన సైనికులకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు సరిహద్దుల్లో విధులు నిర్వహిస్తున్న కుమారులు, కుమార్తెలు ఉన్న ఆ కుటుంబాల త్యాగానికి నేను వందనం చేస్తున్నాను. దేశానికి సంబంధించిన కొంత బాధ్యత కారణంగా ఇంటికి, కుటుంబానికి దూరంగా ఉన్నప్రతి ఒక్కరికీ నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు మనం స్థానిక వస్తువులను ప్రచారం చేస్తున్న సందర్భంలో ప్రపంచం కూడా మన స్థానిక ఉత్పత్తులపై అభిమానం ప్రదర్శిస్తోంది. మన స్థానిక ఉత్పత్తులలో అధిక శాతం వస్తువులకు ప్రపంచవ్యాప్తమయ్యేందుకు తగినంత భారీ శక్తి ఉంది. దీనికి ఒక ఉదాహరణ ఖాదీ. ఖాదీ చాలా కాలంగా సాధారణ జీవితానికి ప్రతీక. కానీ, ఈ రోజుల్లో మన ఖాదీ పర్యావరణ అనుకూల వస్త్రంగా పేరుపొందింది. ఆరోగ్య పరంగా ఇది శరీరానికి అనుకూలంగా ఉండే ఫాబ్రిక్. అన్ని కాలాల్లో ఉపయోగపడే వస్త్రం ఇది. ఈరోజుల్లో ఖాదీ ఫ్యాషన్ కు గుర్తుగా మారింది. ఖాదీకి ఆదరణ పెరుగుతోంది. అదే సమయంలో ఖాదీ ప్రపంచంలో చాలా చోట్ల తయారవుతోంది. మెక్సికోలో 'ఓహాకా' అనే స్థలం ఉంది. అక్కడ చాలా గ్రామాల్లో స్థానికులు ఖాదీ నేస్తున్నారు. ఇప్పుడు అక్కడి ఖాదీ 'ఓహాకా ఖాదీ' గా ప్రసిద్ది చెందింది. ఖాదీ ఓహాకాకు ఎలా చేరుకుండానే విషయం కూడా చాలా ఆసక్తి కలిగిస్తుంది. వాస్తవానికి మెక్సికోకు చెందిన మార్క్ బ్రౌన్ అనే యువకుడు ఒకసారి మహాత్మా గాంధీపై తయారైన చిత్రం చూశాడు. ఆ సినిమా చూసిన తర్వాత బ్రౌన్ ను బాపు ఎంతగానో ఆకట్టుకున్నాడు. బాపు జీవితంతో ఆయన ప్రభావితుడయ్యాడు. భారతదేశంలోని బాపు ఆశ్రమానికి వచ్చాడు. బాపు గురించి మరింత లోతుగా అర్థం చేసుకున్నాడు. ఖాదీ ఒక వస్త్రం మాత్రమే కాదని అది ఒక జీవన విధానం అని బ్రౌన్ గ్రహించాడు. దానితో గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, స్వావలంబన అనుసంధానమైన విధానం బ్రౌన్ ను ప్రభావితం చేసింది. ఇక్కడి నుండి మెక్సికో వెళ్లిన తర్వాత ఖాదీ పనిని ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు. మెక్సికోలోని ఓహాకాలోని గ్రామస్తులకు ఖాదీ పనిని నేర్పించాడు. వారికి శిక్షణ ఇచ్చాడు. 'ఓహాకా ఖాదీ' ఇప్పుడు ఒక బ్రాండ్‌గా మారింది. ఈ ప్రాజెక్ట్ వెబ్సైట్ లో 'చలనంలో ఉన్న ధర్మ చిహ్నం' అని ఉంటుంది. ఈ వెబ్సైట్లో ఉన్న మార్క్ బ్రౌన్ ఇంటర్వ్యూ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మొదట్లో ప్రజలు ఖాదీపై సందేహాలు కలిగి ఉండేవారని, అయితే, ప్రజలకు దానిపై ఆసక్తి పెరిగిందని, ఆ విధంగా ఖాదీ మార్కెట్ లోకి వచ్చిందని ఆయన అంటారు. ఇవి రామ రాజ్యానికి సంబంధించిన విషయాలని, ప్రజల అవసరాలను తీర్చినప్పుడు, ప్రజలు కూడా మీతో వస్తారని బ్రౌన్ చెప్తారు.
మిత్రులారా! ఈసారి గాంధీ జయంతి నాడు ఢిల్లీ కన్నాట్ ప్లేస్ లోని ఖాదీ దుకాణంలో ఒకే రోజులో కోటి రూపాయలకు పైగా కొనుగోళ్లు జరిగాయి. అదేవిధంగా కరోనా కాలంలో ఖాదీ మాస్కులు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. స్వయం సహాయక బృందాలు, ఇతర సంస్థలు దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఖాదీ మాస్కులు తయారు చేస్తున్నాయి. ఉత్తర ప్రదేశ్ లోని బారాబంకిలో సుమన్ దేవి గారు స్వయం సహాయక బృందంలోని తన తోటి మహిళలతో కలిసి ఖాదీ మాస్కులు తయారు చేయడం ప్రారంభించారు. క్రమంగా ఇతర మహిళలు కూడా వారితో చేరారు. ఇప్పుడు వారంతా వేలాది ఖాదీ మాస్కులు తయారు చేస్తున్నారు. మన స్థానిక ఉత్పత్తుల ప్రత్యేకత ఏమిటంటే తరచుగా వాటితో తత్త్వశాస్త్రం అనుసంధానమై ఉంటుంది.
నా ప్రియమైన దేశవాసులారా! మన వస్తువులు మనకు గర్వం కలిగించేవిగా ఉన్నప్పుడు ప్రపంచంలోని ఇతర ప్రాంతాల్లో కూడా వాటిపై ఆసక్తి పెరుగుతుంది. మన ఆధ్యాత్మికత, యోగా, ఆయుర్వేదం మొత్తం ప్రపంచాన్ని ఆకర్షించాయి. మన క్రీడలు కూడా ప్రపంచాన్ని ఆకర్షిస్తున్నాయి. మల్ ఖంబ్ గా పేర్కొనే మన దేశీయ క్రీడ మల్ల స్తంభం ఈ రోజుల్లో చాలా ఇతర దేశాలలో కూడా ప్రాచుర్యంలో ఉంది. చిన్మయ పతంకర్, ప్రజ్ఞా పతంకర్ అమెరికాలోని తమ ఇంటి నుండి మల్ ఖంబ్ నేర్పడం ప్రారంభించినప్పుడు, అది ఇంత విజయవంతం అవుతుందని వారికి తెలియదు. ఈ రోజు అమెరికాలో మల్ ఖంబ్ శిక్షణా కేంద్రాలు చాలా చోట్ల నడుస్తున్నాయి. మల్ ఖంబ్ నేర్చుకోవడం కోసం పెద్ద సంఖ్యలో అమెరికన్ యువకులు వాటిలో చేరుతున్నారు. జర్మనీ, పోలాండ్, మలేషియా మొదలైన సుమారు 20 ఇతర దేశాలలో మల్ ఖంబ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఇప్పుడు ఈ క్రీడలో ప్రపంచ ఛాంపియన్షిప్ కూడా ప్రారంమైంది. ఇందులో అనేక దేశాల నుండి క్రీడాకారులు పాల్గొంటారు. భారతదేశంలో పురాతన కాలం నుండి ఇలాంటి ఆటలు చాలా ఉన్నాయి. ఇవి మనలో అసాధారణమైన వికాసం కలుగుతుంది. మన మనస్సుకు, శరీరానికి సమతుల్యత కలిగిస్తాయి. కానీ బహుశా మన యువ తరం కొత్త సహచరులకు మల్ ఖంబ్ తో అంతగా పరిచయం లేకపోవచ్చు. మీరు దీన్ని ఇంటర్నెట్లో శోధించి చూడాలి. మిత్రులారా! మన దేశంలో చాలా మార్షల్ ఆర్ట్స్ ఉన్నాయి. మన యువ స్నేహితులు వాటి గురించి తెలుసుకోవాలని, వాటిని నేర్చుకోవాలని, సమయానికి అనుగుణంగా కొత్తదనం పొందాలని నేను కోరుకుంటున్నాను. జీవితంలో పెద్దగా సవాళ్లు లేనప్పుడు ఉత్తమమైన వ్యక్తిత్వం కూడా బయటకు రాదు. కాబట్టి ఎప్పుడూ మిమ్మల్ని మీరు సవాలు చేసుకోండి.
నా ప్రియమైన దేశవాసులారా! అభ్యసనం వికాసానికి దారి తీస్తుంది. ఈ రోజు 'మన్ కి బాత్' లో ప్రత్యేకమైన అభిరుచి ఉన్న వ్యక్తిని మీకు పరిచయం చేస్తాను. చదవడం, నేర్చుకోవడంలోని ఆనందాలను ఇతరులతో పంచుకోవాలనే అభిరుచి ఇది. పొన్ మరియప్పన్ గారు తమిళనాడులోని తుత్తుకుడిలో ఉంటారు. తుత్తుకుడిని పెర్ల్ సిటీ అని కూడా అంటారు. అంటే ముత్యాల నగరం అన్నమాట. ఇది ఒకప్పుడు పాండ్య సామ్రాజ్యానికి ఒక ముఖ్యమైన కేంద్రం. ఇక్కడ నివసించే నా స్నేహితుడు పొన్ మరియప్పన్ గారు జుట్టు కత్తిరించే వృత్తిని నిర్వహిస్తున్నారు. సెలూన్ నడుపుతున్నారు. చాలా చిన్న సెలూన్ అది. ఆయన ఒక ప్రత్యేకమైన, ఉత్తేజకరమైన పని చేశారు. తన సెలూన్లో కొంత భాగాన్ని లైబ్రరీగా మార్చారు. సెలూన్లో తన వంతు కోసం ఎదురు చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి ఏదో ఒక పుస్తకాన్ని చదివి, తాను చదివిన దాని గురించి కొంచెం రాస్తే పొన్ మరియప్పన్ గారు ఆ కస్టమర్ కి డిస్కౌంట్ ఇస్తారు. ఇది సరదాగా ఉంది కదా!
రండి.. తుత్తుకుడికి వెళ్దాం. పొన్ మరియప్పన్ గారితో మాట్లాడదాం.
ప్రధానమంత్రి: పొన్ మరియప్పన్ గారూ! వణక్కం … నల్లా ఇర్ కింగ్డా?
(ప్రధానమంత్రి: పొన్ మరియప్పన్ గారూ! నమస్కారం.. మీరు ఎలా ఉన్నారు?)
పొన్ మరియప్పన్: గౌరవనీయ ప్రధానమంత్రి గారూ! వణక్కం (తమిళంలో సమాధానం)
ప్రధానమంత్రి: వణక్కం, వణక్కం .. ఉంగలక్కే ఇంద లైబ్రరీ ఐడియా యప్పాడి వందదా
(ప్రధానమంత్రి: వణక్కం, వణక్కం. మీకు లైబ్రరీ ఆలోచన ఎలా వచ్చింది? )
పొన్ మరియప్పన్: నేను ఎనిమిదో తరగతి వరకు చదువుకున్నాను. నా కుటుంబ పరిస్థితుల కారణంగా నేను నా చదువును కొనసాగించలేకపోయాను. చదువుకున్నవారిని చూస్తుంటే నాలో ఏదో లోటు ఉన్నట్టు ఆనిపించేది. అందుకే మనం లైబ్రరీని ఎందుకు ఏర్పాటు చేయకూడదని నాకు ఆలోచన వచ్చింది. లైబ్రరీ చాలా మందికి ప్రయోజనం చేకూరుస్తుందని నాకు అనిపించింది. ఇది నాకు ప్రేరణగా మారింది. (తమిళంలో సమాధానం)
ప్రధానమంత్రి: ఉంగ్లక్కే యెంద పుత్తహం పిడిక్కుం?
(ప్రధానమంత్రి: మీకు ఏ పుస్తకం ఎక్కువ ఇష్టం?)
పొన్ మరియప్పన్: నాకు 'తిరుక్కురళ్' అంటే చాలా ఇష్టం. (తమిళంలో సమాధానం)
ప్రధానమంత్రి: ఉంగ కిట్ట పెసియదిల యెనక్క. రొంబ మగిలచి. నల వాడ తుక్కల్
(ప్రధానమంత్రి: మీతో మాట్లాడటం చాలా సంతోషంగా ఉంది. మీకు శుభాకాంక్షలు )
పొన్ మరియప్పన్: గౌరవనీయ ప్రధానమంత్రి గారితో మాట్లాడుతున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. (తమిళంలో సమాధానం)
ప్రధానమంత్రి: నల వాడ తుక్కల్
(ప్రధానమంత్రి: మీకు అనేక శుభాకాంక్షలు)
పొన్ మరియప్పన్: ధన్యవాదాలు, ప్రధానమంత్రి గారూ.. (తమిళంలో సమాధానం)
ప్రధానమంత్రి: ధన్యవాదాలు.
మనం ఇప్పుడు పొన్ మరియప్పన్‌తో మాట్లాడాం. చూడండి.. వారు ప్రజల జుట్టును ఎలా అలంకరిస్తారో, తమ జీవితాలను అలంకరించడానికి కూడా అంతే ప్రాధాన్యత ఇస్తారు. తిరుక్కురళ్ ప్రజాదరణ గురించి వినడానికి చాలా బాగుంది. తిరుక్కురళ్ ప్రజాదరణ గురించి మీరు కూడా విన్నారు. ఈ రోజు భారతదేశంలోని అన్ని భాషల్లో తిరుక్కురళ్ లభిస్తుంది. మీకు అవకాశం వస్తే తప్పకుండా చదవాలి. జీవితానికి ఆ గ్రంథం మార్గదర్శిగా ఉంటుంది.
మిత్రులారా! జ్ఞానాన్ని వ్యాప్తి చేయడం ద్వారా అపారమైన ఆనందాన్ని పొందేవారు భారతదేశం అంతటా చాలా మంది ఉన్నారని తెలుసుకోవడం మీకు సంతోషంగా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ చదువుకోవడానికి ప్రేరణ లభించేలా చూడడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్న వ్యక్తులు వీరు. మధ్యప్రదేశ్‌లోని సింగ్రౌలి ఉపాధ్యాయురాలు ఉషా దుబే గారు స్కూటీని మొబైల్ లైబ్రరీగా మార్చారు. ప్రతిరోజూ ఆమె తన కదిలే లైబ్రరీతో ఏదైనా వేరే గ్రామానికి చేరుకుని అక్కడి పిల్లలకు బోధిస్తారు. పిల్లలు ప్రేమతో ఆమెను పుస్తకాల అక్కయ్య అని పిలుస్తారు.
ఈ ఏడాది ఆగస్టులో అరుణాచల్ ప్రదేశ్‌లోని నిర్జులిలో రేయో గ్రామంలో స్వయం సహాయక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలో లైబ్రరీ లేదని మీనా గురుంగ్ గారు, దివాంగ్ హోసాయ్ గారు తెలుసుకున్నప్పుడు నిధుల సమీకరణకు సిద్ధమయ్యారు. ఈ లైబ్రరీకి సభ్యత్వం అవసరం లేదని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఎవరైనా రెండు వారాల పాటు పుస్తకం తీసుకోవచ్చు. చదివిన తరువాత తిరిగి ఇవ్వాలి. ఈ లైబ్రరీ రోజులో 24 గంటలు, వారంలో ఏడు రోజులు తెరిచి ఉంటుంది. చుట్టుపక్కల తల్లిదండ్రులు తమ పిల్లలు పుస్తకం చదవడంలో బిజీగా ఉండటం చూసి చాలా సంతోషంగా ఉన్నారు. ముఖ్యంగా పాఠశాలలు ఆన్లైన్ తరగతులను కూడా ప్రారంభించిన సమయంలో వారు తమ పిల్లలు చదువుతుండడం చూసి సంతోషించారు. అదే సమయంలో, చండీగఢ్ లో ఎన్జీఓ నడుపుతున్న సందీప్ కుమార్ గారు ఒక మినీ వ్యాన్‌లో మొబైల్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. దీని ద్వారా పేద పిల్లలకు ఉచిత పఠనం కోసం పుస్తకాలు ఇస్తారు.
గుజరాత్‌లోని భావ్‌నగర్ లో ఉన్న ఇలాంటి రెండు సంస్థల గురించి కూడా నాకు తెలుసు. వాటిలో ఒకటి 'వికాస్ వర్తుల్ ట్రస్ట్'. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఈ సంస్థ చాలా సహాయపడుతుంది. ఈ ట్రస్ట్ 1975 నుండి పని చేస్తోంది. ఈ ట్రస్ట్ 5,000 పుస్తకాలతో పాటు 140 కి పైగా పత్రికలను అందిస్తుంది. అలాంటి మరో సంస్థ 'పుస్తక్ పరబ్’ . సాహిత్య గ్రంథాలతో పాటు ఇతర పుస్తకాలను కూడా ఉచితంగా అందించే వినూత్న ప్రాజెక్ట్ ఇది. ఈ లైబ్రరీలో ఆధ్యాత్మికత, ఆయుర్వేద వైద్యం మొదలైన అనేక అంశాలకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయి. ఇలాంటి ఇతర ప్రయత్నాల గురించి మీకు ఏమైనా తెలిస్తే వాటిని సోషల్ మీడియాలో పంచుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ ఉదాహరణలు పుస్తకాన్ని చదవడానికి లేదా లైబ్రరీని తెరవడానికి మాత్రమే పరిమితం కాదు. ప్రతి రంగానికి, ప్రతి విభాగానికి చెందిన ప్రజలు సమాజ అభివృద్ధికి వినూత్న మార్గాలను సొంతం చేసుకుంటున్న నవీన భారతదేశ స్ఫూర్తిని సూచిస్తాయి.
గీత పేర్కొంది –
నహి జ్ఞానేన సద్దశం పవిత్ర్ మిహ్ విద్యతే
అంటే జ్ఞానంలా ప్రపంచంలో ఏదీ స్వచ్ఛమైనది కాదు. జ్ఞానాన్ని వ్యాప్తి చేసే గొప్ప ప్రయత్నాలు చేసిన మహానుభావులందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశ వాసులారా! కొద్దిరోజుల తర్వాత అక్టోబర్ 31 న మనమందరం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని 'జాతీయ ఐక్యత దినోత్సవం'గా జరుపుకుంటాం. 'మన్ కి బాత్' లో ఇంతకుముందు మనం సర్దార్ పటేల్ గురించి వివరంగా మాట్లాడుకున్నాం. ఆయన గొప్ప వ్యక్తిత్వం లోని అనేక కోణాలను మనం చర్చించుకున్నాం. సైద్ధాంతిక లోతు, నైతిక స్థైర్యం, రాజకీయ విలక్షణత, వ్యవసాయ రంగంపై లోతైన జ్ఞానం, జాతీయ ఐక్యత పట్ల అంకితభావం – ఇవన్నీ ఒకే సమయంలో ఒకే వ్యక్తిలో ఉండడం చాలా అరుదు. సర్దార్ పటేల్ లో హాస్య ధోరణి గురించి ఒక విషయం మీకు తెలుసా? ఒకవైపు రాచరికం ఉన్నస్వతంత్ర రాజ్యాలతో చర్చలు, పూజ్య బాపు సామూహిక ఉద్యమ నిర్వహణ ఏర్పాట్లు; మరోవైపు బ్రిటిష్ వారితో పోరాటం – వీటన్నిటి మధ్యలో ఉన్న ఉక్కు మనిషి చిత్రాన్ని ఊహించుకోండి. ఆయన హాస్యం వర్ణ భరితంగా ఉండేది. సర్దార్ పటేల్ హాస్య ధోరణి తనను బాగా నవ్వించేదని బాపు చెప్పేవారు. నవ్వీ నవ్వీ ఒక్కోసారి పొట్ట చెక్కలయ్యేదని బాపు అనేవారు. ఇది రోజుకు ఒకసారి కాకుండా చాలా సార్లు జరిగేదని ఆయన చెప్పేవారు. ఇందులో మనకు కూడా ఒక పాఠం ఉంది. పరిస్థితులు ఎంత విషమంగా ఉన్నా మనలో హాస్య భావనను సజీవంగా ఉంచాలి. అది మనను సహజంగా ఉంచటమే కాకుండా మన సమస్యను కూడా పరిష్కరించేలా చేస్తుంది. సర్దార్ సాహెబ్ చేసిన పని ఇదే!
నా ప్రియమైన దేశవాసులారా! సర్దార్ పటేల్ దేశాన్ని సంఘటితం చేసేందుకే తన జీవితాన్ని అంకితం చేశారు. ఆయన స్వాతంత్ర్య ఉద్యమంతో భారత ప్రజలను అనుసంధానించారు. రైతుల సమస్యలను స్వాతంత్ర్యంతో అనుసంధానించడానికి కృషి చేశారు. స్వతంత్ర రాజ్యాలను మన దేశంలో కలిపేందుకు కృషి చేశారు. ‘భిన్నత్వంలో ఏకత్వ’ మంత్రాన్ని ప్రతి భారతీయుడి మనస్సులో ఉండేలా చేశారు. మిత్రులారా! ఈ రోజు మన ప్రసంగం, మన కార్యక్రమాలు, మన చర్యలు, ప్రతి క్షణం మనల్ని సంఘటితం చేసే అన్ని విషయాలను ముందుకు తీసుకెళ్లాలి. దేశంలోని ఒక మూలలో నివసిస్తున్న పౌరుడు తన వాడేనన్న భావన మరో భాగంలో నివసిస్తున్న పౌరుడి మనస్సులో కలిగేలా చేయాలి. మన పూర్వికులు శతాబ్దాలుగా ఈ ప్రయత్నాలను నిరంతరం చేస్తున్నారు. కేరళలో జన్మించిన పూజ్య ఆది శంకరాచార్యులు భారతదేశంలోని నాలుగు దిక్కుల్లో నాలుగు ముఖ్యమైన మఠాలను స్థాపించారు. ఉత్తరాన బద్రికాశ్రమం, తూర్పున పూరీ, దక్షిణాన శృంగేరి , పశ్చిమాన ద్వారక- ఇలా నాలుగు దిక్కుల్లో నాలుగు మఠాలను నెలకొల్పారు. శంకరాచార్య శ్రీనగర్ కూడా వెళ్ళారు. అందుకే అక్కడ 'శంకరాచార్య కొండ' ఉంది. తీర్థయాత్ర భారతదేశాన్నిఏక సూత్రంతో అనుసంధానిస్తుంది. జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాల శ్రేణి భారతదేశాన్ని ఒకే సూత్రంతో బంధిస్తుంది. త్రిపుర నుండి గుజరాత్ వరకు, జమ్మూ కాశ్మీర్ నుండి తమిళనాడు వరకు స్థాపించిన మన 'విశ్వాస కేంద్రాలు' మనల్ని ఏకం చేస్తాయి. భక్తి ఉద్యమం భారతదేశమంతటా ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారింది. ఇది భక్తి ద్వారా మనలను ఏకం చేసింది. ఐక్యత శక్తిని కలిగి ఉన్న ఈ విషయాలు మన దైనందిన జీవితంలో ఎలా జీర్ణమైపోయాయి! ప్రతి ధార్మిక క్రియలో అనుష్ఠానానికి ముందు వేర్వేరు నదులను ఆహ్వానించడం ఉంటుంది. ఇందులో ఉత్తరాన ఉన్న సింధూ నది నుండి దక్షిణ భారతదేశ జీవనాధారమైన కావేరి నది వరకు ప్రతి నదీ ఉన్నాయి. స్నానం చేసేటప్పుడు ఐక్యత మంత్రాన్ని పవిత్ర భావంతో పఠిస్తామని తరచుగా ఇక్కడి ప్రజలు చెప్తారు.
గంగే చ యమునై చేవ గోదావరి సరస్వతీ I
నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు II
అదేవిధంగా సిక్కుల పవిత్ర స్థలాలలో 'నాందేడ్ సాహిబ్' , 'పాట్నా సాహిబ్' గురుద్వారాలు ఉన్నాయి. మన సిక్కు గురువులు కూడా తమ జీవితాల ద్వారా, మంచి పనుల ద్వారా ఐక్యత స్ఫూర్తిని పెంచారు. గత శతాబ్దంలో, మన దేశంలో, రాజ్యాంగం ద్వారా మనందరినీ ఏకం చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తులు ఉన్నారు.
మిత్రులారా!
ఐక్యతే శక్తి, ఐక్యతే బలం,
ఐక్యతే పురోగతి, ఐక్యతే సాధికారత,
ఐక్యంగా ఉంటే ఉన్నత శిఖరాలను చేరగలుగుతాం
మన మనస్సులో సందేహాల బీజాలను నాటేందుకు, దేశాన్ని విభజించడానికి నిరంతరం ప్రయత్నించే శక్తులు కూడా ఉన్నాయి. ఈ దుర్మార్గపు ఉద్దేశ్యాలకు దేశం ప్రతిసారీ సమర్థవంతమైన సమాధానం ఇచ్చింది. మన సృజనాత్మకతతో, ప్రేమతో, మన అతి చిన్న పనుల్లో కూడా ప్రతి నిమిషం ప్రయత్నంతో 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్'లోని వర్ణమయ కోణాన్ని ప్రదర్శించాలి. ఐక్యతా భావనలోని సౌందర్యాన్ని నిరంతరం ముందుకు తీసుకురావాలి. ప్రతి పౌరుడిలో ఏకత్వ భావన నింపాలి. ఒక వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఈ సందర్భంగా మీ అందరినీ నేను కోరుతున్నాను. ఆ వెబ్ సైట్ ekbharat.gov.in (ఏక్ భారత్ డాట్ గవ్ డాట్ ఇన్). జాతీయ సమైక్యత ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి అనేక ప్రయత్నాలు ఇందులో కనిపిస్తాయి. ఈ వెబ్ సైట్ లో ఒక ఆసక్తికరమైన అంశం ఉంది. అదే నేటి వాక్యం- ఆజ్ కా వాక్య్. వివిధ భాషలలో ఒక వాక్యాన్ని ఎలా మాట్లాడాలో ఈ విభాగంలో ప్రతిరోజూ నేర్చుకోవచ్చు. ఈ వెబ్సైట్ కోసం మీరు కూడా వాక్యాలను పంపవచ్చు. ప్రతి రాష్ట్రం, సంస్కృతి ప్రకారం భిన్నమైన ఆహారపానీయాది అంశాలుంటాయి. ఈ వంటకాలను స్థానిక ప్రత్యేక పదార్థాలు- అంటే ధాన్యాలు, సుగంధ ద్రవ్యాలతో తయారు చేస్తారు. 'ఏక్ భారత్-శ్రేష్ఠ భారత్' వెబ్సైట్లో ఈ స్థానిక ఆహార తయారీ స్థానిక పదార్ధాల పేర్లతో పంచుకోవచ్చా? ఐక్యతను, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఇంతకంటే మంచి మార్గం ఏముంటుంది!
మిత్రులారా! ఈ నెల 31 న కేవాడియాలోని చారిత్రక ఐక్యతా విగ్రహం దగ్గర జరిగే అనేక కార్యక్రమాలకు హాజరయ్యే అవకాశం నాకు లభిస్తుంది. మీరు కూడా తప్పకుండా మాతో చేరండి.
నా ప్రియమైన దేశవాసులారా! అక్టోబర్ 31 న మనం 'వాల్మీకి జయంతి' కూడా జరుపుకుంటాం. నేను మహర్షి వాల్మీకికి నమస్కరిస్తున్నాను. ఈ ప్రత్యేక సందర్భంగా దేశవాసులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మహర్షి వాల్మీకి గొప్ప ఆలోచనలు కోట్లాది మందికి స్ఫూర్తినిస్తాయి. బలాన్ని ఇస్తాయి. లక్షలాది, కోట్లాది పేదలు, దళితులకు వారు గొప్ప ఆశా భావాన్ని కలిగిస్తారు. “మనిషిలో సంకల్పం దృఢంగా ఉంటే అతను ఏ పని అయినా చాలా తేలికగా చేయగలడు” అనేది మహర్షి వాల్మీకి సందేశం. ఈ సంకల్ప శక్తి యువతకు అసాధారణమైన పనులు చేయడానికి బలాన్ని ఇస్తుంది. మహర్షి వాల్మీకి సానుకూల ఆలోచనా ధోరణికి బలాన్నిచ్చారు. సేవ, హుందాతనం వాల్మీకి దృష్టి లో అత్యంత ముఖ్యమైనవి. మహర్షి వాల్మీకి ఆచరణ, ఆలోచనలు, ఆదర్శాలు ఈ రోజు మన నవీన భారతదేశ సంకల్పానికి ప్రేరణగా, దిక్సూచిగా నిలుస్తాయి. రాబోయే తరాలకు మార్గనిర్దేశం చేసేందుకు రామాయణం లాంటి ఇతిహాసాన్ని రూపొందించినందుకు మహర్షి వాల్మీకికి మనం ఎల్లప్పుడూ కృతజ్ఞులం.
అక్టోబర్ 31 న భారత మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరా గాంధీగారిని కోల్పోయాం. నేను సగౌరవంగా దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారికి శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! కాశ్మీర్ లోని పుల్వామా ఈ రోజు దేశం మొత్తాన్ని చదివించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. దేశవ్యాప్తంగా పిల్లలు తమ హోం వర్క్ చేస్తారు. నోట్స్ తయారు చేస్తారు. పుల్వామా ప్రజల కృషి దాని వెనుక ఉంది. మొత్తం దేశంలోని పెన్సిల్ స్లేట్‌లో 90% అవసరాలను కాశ్మీర్ తీరుస్తోంది. అందులో ఎక్కువ భాగం పుల్వామా నుండి వచ్చిందే. గతంలో మనం పెన్సిల్ కోసం కలపను విదేశాల నుండి దిగుమతి చేసుకునేవాళ్ళం. కాని ఇప్పుడు మన పుల్వామా దేశాన్ని స్వయం సమృద్ధిగా మారుస్తోంది. వాస్తవానికి పుల్వామా నుండి వచ్చే ఈ పెన్సిల్ స్లేట్లు రాష్ట్రాల మధ్య అంతరాలను తగ్గిస్తున్నాయి. లోయలో ఉండే చినార్ వృక్షం నుండి వచ్చే కలపలో అధిక తేమ శాతం, మృదుత్వం ఉంటాయి. ఇది పెన్సిల్స్ తయారీకి చాలా అనుకూలంగా ఉంటుంది. పుల్వామాలోని ఉక్ఖును ‘పెన్సిల్ విలేజ్’ అని పిలుస్తారు. ఇక్కడ పెన్సిల్ స్లేట్ ఉత్పాదక యూనిట్లు చాలా ఉన్నాయి. ఇవి ఉపాధిని అందిస్తాయి. వాటిలో పెద్ద సంఖ్యలో మహిళలు పనిచేస్తున్నారు.
మిత్రులారా!ఇక్కడి ప్రజలు ఏదైనా కొత్తగా చేయాలని నిర్ణయించుకుని, పని విషయంలో శ్రమ తీసుకున్నప్పుడు, దానికి తమను తాము అంకితం చేసుకున్నప్పుడు పుల్వామాకు ఈ గుర్తింపు వచ్చింది. అటువంటి కష్టపడి పనిచేసే వారిలో మంజూర్ అహ్మద్ అలాయ్ గారు ఒకరు. మొదట్లో ఆయన చెక్కను నరికే ఒక సాధారణ కట్టర్ గా పనిచేసేవారు. తమ భవిష్యత్ తరాలు పేదరికంలో జీవించకుండా కొత్తగా ఏదైనా చేయాలనుకున్నారు. ఆయన తన పూర్వికుల నుండి వచ్చిన భూమిని అమ్మి, ఆపిల్ వుడెన్ బాక్స్ – అంటే యాపిళ్లను ఉంచే చెక్క పెట్టెల తయారీ యూనిట్ ను ప్రారంభించారు. అతను తన చిన్న వ్యాపారంలో నిమగ్నమైనప్పుడు పెన్సిళ్ల తయారీలో పోప్లర్ కలప- అంటే చినార్ వృక్షం నుండి వచ్చే కలప-ను వాడడాన్ని ప్రారంభించారని తెల్సింది. ఈ సమాచారం వచ్చిన తరువాత మంజూర్ గారు కొన్ని ప్రసిద్ధ పెన్సిల్ తయారీ యూనిట్లకు పోప్లర్ వుడెన్ బాక్స్‌ను సరఫరా చేయడం ప్రారంభించారు. ఇది చాలా ప్రయోజనకరంగా ఉందని మంజూర్ భావించారు. ఆయన ఆదాయం కూడా గణనీయంగా పెరగడం ప్రారంభించింది. కాలక్రమేణా ఆయన పెన్సిల్ స్లేట్ తయారీ యంత్రాలను తీసుకున్నారు. ఆ తరువాత దేశంలోని పెద్ద కంపెనీలకు పెన్సిల్ స్లేట్ సరఫరా చేయడం ప్రారంభించారు. నేడు, మంజూర్ భాయ్ గారి వ్యాపారం టర్నోవర్ కోట్లలో ఉంది. ఆయన సుమారు రెండు వందల మందికి జీవనోపాధి మార్గాన్ని కూడా అందజేస్తున్నారు. మంజూర్ భాయ్ తో సహా పుల్వామాలో పని చేసే సోదర సోదరీమణులను, వారి కుటుంబ సభ్యులను దేశ ప్రజలందరి తరపున ఈ రోజు 'మన్ కి బాత్' ద్వారా ప్రశంసిస్తున్నాను. దేశంలోని యువతకు శిక్షణ ఇచ్చేందుకు విలువైన సహకారాన్నిఇస్తున్నపుల్వామా సోదర సోదరీమణులను నేను అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! లాక్ డౌన్ సమయంలో సాంకేతిక ఆధారిత సేవల విషయంలో అనేక ప్రయోగాలు మన దేశంలో జరిగాయి. పెద్ద టెక్నాలజీ, లాజిస్టిక్స్ కంపెనీలు మాత్రమే ఈ సేవలను అందించగలవనే విషయం తప్పని ఇప్పుడు నిరూపితమైంది. జార్ఖండ్‌లో ఈ పనిని మహిళల స్వయం సహాయక బృందం చేసింది. ఈ మహిళలు రైతుల పొలాల నుండి కూరగాయలు, పండ్లను తీసుకొని నేరుగా ఇళ్లకు అందజేశారు. ఈ మహిళలు 'ఆజీవికా ఫామ్ ఫ్రెష్' అనే యాప్‌ను రూపొందించారు. దీని ద్వారా ప్రజలు కూరగాయలను సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ మొత్తం ప్రయత్నం ద్వారా రైతులు తమ కూరగాయలు, పండ్లకు మంచి ధరలను పొందారు. ప్రజలు తాజా కూరగాయలను కూడా పొందారు. అక్కడ 'ఆజీవికా ఫామ్ ఫ్రెష్' తాజా అనువర్తన ఆలోచన బాగా ప్రాచుర్యం పొందింది. లాక్ డౌన్లో 50 లక్షల రూపాయల కంటే అధిక విలువ కలిగిన పండ్లు, కూరగాయలను దీనిద్వారా ప్రజల దగ్గరికి చేర్చారు. మిత్రులారా! వ్యవసాయ రంగంలో కొత్త అవకాశాలను చూసి, మన యువత కూడా పెద్ద సంఖ్యలో చేరుతున్నారు. మధ్యప్రదేశ్‌లోని బడ్వానీలో అతుల్ పాటిదార్ గారు తన ప్రాంతంలోని 4 వేల మంది రైతులను డిజిటల్‌గా అనుసంధానించారు. ఈ రైతులు అతుల్ పాటిదార్ గారి ఇ-ప్లాట్ ఫామ్ కార్డు ద్వారా ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, శిలీంధ్ర సంహారిణులు మొదలైన వ్యవసాయ సంబంధిత వస్తువులను హోం డెలివరీ ద్వారా పొందగలుతున్నారు. అంటే రైతులు తమ అవసరాలకు పనికి వచ్చే వస్తువులను ఇంటివద్దే పొందగలుగుతున్నారు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్లో ఆధునిక వ్యవసాయ పరికరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. లాక్ డౌన్ సమయంలో కూడా ఈ డిజిటల్ ప్లాట్‌ఫాం ద్వారా రైతులకు వేలాది వస్తువుల సరఫరా జరిగింది. వాటిలో పత్తి, కూరగాయల విత్తనాలు కూడా ఉన్నాయి. అతుల్ గారు, ఆయన బృంద సభ్యులు రైతులకు సాంకేతికంగా అవగాహన కల్పిస్తున్నారు. ఆన్లైన్ చెల్లింపు, షాపింగ్ విషయాలను నేర్పిస్తున్నారు.
మిత్రులారా! ఈ రోజుల్లో మహారాష్ట్రలో జరిగిన ఒక సంఘటన నా దృష్టిని ఆకర్షించింది. అక్కడ ఒక రైతు ఉత్పత్తి సంస్థ మొక్కజొన్న రైతుల నుండి మొక్కజొన్నను కొనుగోలు చేసింది. కంపెనీ ఈసారి రైతులకు ధరతో పాటు బోనస్ కూడా ఇచ్చింది. రైతులు ఆనందపడడంతో పాటు ఆశ్చర్యపోయారు. ఆ సంస్థ ప్రతినిధులను ఇదే విషయం అడిగారు. భారత ప్రభుత్వం తయారుచేసిన కొత్త వ్యవసాయ చట్టం ప్రకారం ఇప్పుడు రైతులు భారతదేశంలో ఎక్కడైనా పంటలను అమ్మగలుగుతున్నారని, వారికి మంచి ధరలు లభిస్తున్నాయని, కాబట్టి ఈ అదనపు లాభాలను రైతులతో కూడా పంచుకోవాలని వారు భావించారని రైతులకు తెలిసింది. దానిపై వారికి కూడా హక్కు ఉంది కాబట్టి రైతులకు బోనస్ ఇచ్చారు. మిత్రులారా! బోనస్ మొత్తం చిన్నదే కావచ్చు. కానీ ఇది చాలా గొప్ప ప్రారంభం. కొత్త వ్యవసాయ చట్టంతో అట్టడుగు స్థాయిలో రైతులకు అనుకూలంగా ఉండే అవకాశాలతో ఎలాంటి మార్పులు ఏర్పడుతున్నాయో ఇది మనకు నిరూపిస్తుంది.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ రోజు 'మన్ కీ బాత్'లో దేశవాసుల అసాధారణ విజయాల గురించి, మన దేశంలోని వివిధ అంశాలపై, మన సంస్కృతిపై మీతో మాట్లాడే అవకాశం లభించింది. మన దేశం ప్రతిభావంతులైన వ్యక్తులతో నిండి ఉంది. మీకు కూడా అలాంటి వ్యక్తులు కూడా తెలిస్తే వారి గురించి మాట్లాడండి. రాయండి. వారి విజయాలను పంచుకోండి. రాబోయే పండుగల సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు అనేక శుభాకాంక్షలు. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి. మరీ ముఖ్యంగా పండుగ సందర్భాల్లో గుర్తుంచుకోండి. మాస్క్ ధరించండి. సబ్బుతో చేతులు కడుక్కోండి. రెండు గజాల దూరం పాటించండి.
మిత్రులారా! వచ్చే నెలలో 'మన్ కీ బాత్'లో మళ్ళీ కలుద్దాం. అందరికీ అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశవాసులారా! నమస్కారం. కరోనా విజృంభిస్తున్న ఈ ప్రస్తుత పరిస్థితులలో ప్రపంచమంతా అనేక మార్పులకు లోనవుతోంది. ఈరోజుల్లో రెండు గజాల దూరం తప్పనిసరి అయింది. అయితే ఈ కాలమే కుటుంబ సభ్యులందరిని ఒకటిగా కలిపే, దగ్గరకు చేర్చే పని కూడా చేసింది. కానీ ఇంత ఎక్కువ కాలం ఎలా కలిసి ఉండడం, సమయం ఎలా వెచ్చించాలి? ప్రతి నిమిషం సంతోషంగా ఎలా ఉండాలి ? ఐతే, చాలా కుటుంబాలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. దానికి కారణం ఏమిటంటే మన సంస్కృతి, సాంప్రదాయాలు కొన్ని కుటుంబాల్లో లోపించడమే. మన సంస్కృతీ సాంప్రదాయాలలో గొప్ప విషయం ఏముంది? ప్రతి కుటుంబంలో ఎవరో ఒకరు పెద్దవారు కథలు చెప్పేవారు. ఇంట్లో కొత్త ప్రేరణ, కొత్త ఆశలు నింపేవారు. మనకు తప్పకుండ అనుభవంలోకి వచ్చి ఉంటుంది. మన పూర్వీకులు ఏర్పాటు చేసిన పద్ధతులు నేడు కూడా ఎంత గొప్పగా ఉన్నాయనే విషయం మనకు అవగాహన అయి ఉంటుంది. ఇలాంటిదే ఒక విధానం కథలు చెప్పడం. మిత్రులారా! కథల చరిత్ర మానవ నాగరికత అంత పురాతనమైంది.
జీవం ఉన్నచోట కథ తప్పకుండా ఉంటుంది.
కథలు ప్రజల సృజనాత్మక, సంవేదనశీలతను ప్రకటిస్తాయి. కథ శక్తిని తెలుసుకోవాలంటే తల్లి తన చిన్న పిల్లవాడి ని నిద్ర పుచ్చడానికో లేదా అన్నం తినిపించడానికో చెప్పే కథ చూడండి. నేను నా జీవితంలో చాలా కాలం దేశమంతటా సంచరించాను. దేశాటనయే నా జీవితంగా గడిపాను. ప్రతి రోజు ఒక కొత్త ఊరు, కొత్త ప్రజలు, కొత్త కుటుంబాలు. కానీ నేను కుటుంబాల దగ్గరికి వెళ్ళినప్పుడు పిల్లలతో తప్పకుండ మాట్లాడేవాడిని. అపుడపుడు పిల్లలతో అనేవాడిని.. పిల్లలూ… నాకు ఏదైనా కథ చెప్పండి అని. నేను ఆశర్యపోయేవాడిని. పిల్లలు నాతో అనేవారు మేం జోకులు చెప్తాం. మీరు కూడా జోకులే చెప్పండి అని. , అంకుల్.. మీరు మాకు జోకులు చెప్పండి అనేవారు. అంటే వారికి కథలతో అసలు పరిచయమే లేదు. చాలావరకు వారి జీవితం జోకులతో గడిచిపోయింది.
మిత్రులారా! భారతదేశంలో కథలది, కథల వృత్తాంతాలది ఒక పెద్ద పరంపర. హితోపదేశం, పంచతంత్రల పరంపర ఉన్న దేశం మనదైనందుకు మనకు గర్వంగా ఉండాలి. ఇక్కడి కథల్లో పశు పక్షుల, దేవకన్యల కాల్పనిక ప్రపంచం ఉంది. వివేకం, బుద్ధిమంతుల మాటలు అలవోకగా అర్థం అయ్యేందుకు వీలుగా ఈ కథలున్నాయి. మన దగ్గర కథల పరంపర ఉంది. ధార్మిక కథలు చెప్పే ప్రాచీన పద్ధతి ఉంది.
ఇందులో కథా కాలక్షేపం కూడా ఉంది. మన దగ్గర వివిధ రకాల కథలు ప్రచారం లో ఉన్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో కథలు చెప్పే చాలా విశేషమైన పద్ధతి ఉంది. దీన్ని 'విల్లు పాటు ' అని అంటారు. ఇందులో కథ, సంగీతం చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. భారత దేశములో తోలు బొమ్మలాట కూడా ఉంది. ఈ రోజులలో Science, science fiction లతో కలగలిపిన కథలు, కథా కథన పద్ధతి ఆకర్షణీయంగా ఉంటాయి. నేను చూశాను.. చాలా మంది ప్రజలు వృతాంతముల కథను ముందుకు తీసుకురావడానికి ప్రశంసనీయ ప్రయత్నం చేస్తున్నారు. నాకు gaathastory.in లాంటి website గురించి తెలిసింది. దీన్ని అమర్ వ్యాస్ మిగతావారితో కలిసి నిర్వహిస్తున్నారు. అమర్ వ్యాస్ IIM, అహ్మదాబాద్ నుండి MBA పట్టభద్రులైన తరువాత విదేశాలకు వెళ్లారు. తిరిగి వచ్చారు. ప్రస్తుతం బెంగళూరులో నివాసముంటున్నారు. సమయం కల్పించుకుని కథలతో ఈ విధమైన అద్భుతమైన పనులు చేస్తున్నారు. అక్కడక్కడా ఇలాంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. గ్రామీణ భారత కథలను కూడా చాలా బాగా ప్రచారం చేస్తున్నారు. వైశాలి వ్యవహరి దేశ్ పాండే లాంటి చాలా మంది దీన్ని మరాఠీ భాషలో కూడా ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నారు.
చెన్నైకి చెందిన శ్రీ విద్యా వీర్ రాఘవన్ కూడా మన సంస్కృతితో కూడుకొన్న కథలను ప్రచారము, ప్రసారము చేయుటలో నిమగ్నమయ్యారు. అక్కడే కథాలయం, The Indian story telling network అనే పేర్లతో రెండు websiteలు కూడా ఈ రంగంలో గొప్ప పని చేస్తున్నాయి. గీత రామానుజంగారు Kathalaya.orgనందు కథలను ఉంచారు. అందులో sThe Indian story telling network ద్వారా పట్టణాలలో Story tellers network తయారు చేయబడుచున్నది. బెంగుళూరులో శ్రీధర్ అనే ఆయన బాపూగారి కథలతో ఉత్సాహంగా ఉన్నారు. ఇంకా చాలా మంది ఈ రంగంలో కృషి చేస్తున్నారు. మీరు తప్పకుండా వారి గూర్చి social media ద్వారా తెలియచేయండి. .
నేడు మనతో బెంగళూరు Story telling society కి సంబంధించిన Aparna Athreya, ఇతర సభ్యులు ఉన్నారు. రండి. వారితో మాట్లాడుదాం. వారి అనుభవాలు తెలుసుకుందాం.
ప్రధాన మంత్రి . హలో
Aparna : నమస్కారం పూజ్య ప్రధాన మంత్రిగారూ..
ప్రధాన మంత్రి: నేను బాగున్నాను. మీరెలా ఉన్నారు అపర్ణ గారూ
Aparna: చాలా బాగున్నాను సార్ అన్నిటి కన్నా ముందు నేను Bengaluru story telling societyతరపున ధన్యవాదములు తెలపాలనుకుంటున్నాను. మీరు మా లాంటి కళాకారులను ఈ స్టేజి పైకి పిలిచి, మాట్లాడుతున్నారు.
ప్రధాన మంత్రి: ఈరోజు మీ టీం మొత్తం మీతో కూర్చున్నారు
Aparna: అవును సర్ .
ప్రధాన మంత్రి: అయితే మీ టీం సభ్యులను పరిచయం చేస్తే బావుంటుంది. 'మన్ కి బాత్ 'శ్రోతలకు వారి పరిచయం జరగాలి. వారికీ తెలియాలి మీరు ఎలాంటి ప్రచారం చేస్తున్నారో.
Aparna: సార్.. నా పేరు అపర్ణ ఆత్రేయ. నేను ఇద్దరు పిల్లల తల్లిని. ఓక భారతీయ వాయుసేన ఆఫీసర్ భార్యను. ఒక Passionate story teller ని సార్. story telling ను 15 సంవత్సరాలకు పూర్వం ప్రారంభించాను. అప్పుడు నేను Software industry లో పనిచేస్తున్నారు. అపుడు నేను CSR Projects లో Voluntary గ పని చేసేందుకు వెళ్ళాను. అపుడు వేల మంది పిల్లలకు కథల మాధ్యమం ద్వారా శిక్షణ ఇచ్చే అవకాశం లభించించి. నేను చెప్తున్న ఈ కథ మా నాయనమ్మ దగ్గర విన్నాను. కానీ కథ చెప్పేటప్పుడు ఆ పిల్లలలో చూసిన ఆనందాన్ని నేను మీకెలా చెప్పాలి. ఎంతటి చిరునవ్వు ఉందో, ఎంత ఆనందం ఉందో.. అపుడే నేను నిర్ణయించుకొన్నాను. Story telling నా జీవిత లక్ష్యం అని.
ప్రధాన మంత్రి: మీ టీంలోఇంకా ఎవరున్నారు అక్కడ
Aparna: నాతో పాటు శైలజా సంపత్ ఉన్నారు
శైలజ: నమస్కారం సార్
ప్రధాన మంత్రి: నమస్తే జీ..
శైలజ: నేను శైలజ సంపత్ ను మాట్లాడుతున్నాను. నేను మొదట ఉపాధ్యాయురాలిగా పని చేశాను. ఆ తరువాత నా పిల్లలు పెద్దవారయ్యాక నేను theatre లో పని ఆరంభించాను. చివరగా కథలను వినిపించడంలో చాల సంతృప్తి కలిగింది.
ప్రధాన మంత్రి: ధన్యవాదాలు
శైలజ: నాతో పాటు సౌమ్య ఉన్నారు సార్.
సౌమ్య: నమస్కారం సర్
ప్రధాన మంత్రి : నమస్తే జి
సౌమ్య : నా పేరు సౌమ్య శ్రీనివాసన్. నేను ఒక psychologist ని. నేను పని చేసేప్పుడు పిల్లలు, పెద్దలతో కథల ద్వారా ఆసక్తి కలిగించే ప్రయత్నం చేస్తున్నాను. ఆ తరువాత చర్చిస్తాను కూడా. నా లక్ష్యం Healing and transformative story telling sir.
Aparna: నమస్తే సార్
ప్రధాన మంత్రి: నమస్తే జి
Aparna: నా పేరు అపర్ణ జయశంకర్. ఇది నా అదృష్టం సార్. నేను మా నాయనమ్మ, తాతగారితో కలిసి ఈ దేశములోని వేర్వేరు ప్రాంతాలలో పెరిగాయను సార్. అందువల్ల రామాయణం, పురాణాలు , గీత.. ఆ కథలు నాకు వారసత్వం గా ప్రతి రోజు రాత్రి లభించేవి. Bengaluru story telling society లాంటి సంస్థ ఉంది. అయితే నాకు Story teller కావాలని ఉంది. నాతో పాటు నా సహోద్యోగి లావణ్య ప్రసాద్ ఉన్నారు.
ప్రధాన మంత్రి: లావణ్య జీ.. నమస్తే
లావణ్య: నమస్తే సార్. నేను ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ని. స్టోరీ టెల్లర్ ని కూడా సార్. నేను మా తాతగారి దగ్గర కథలు వింటూ పెరిగాను. సీనియర్ సిటిజన్స్ తో కలిసి పని చేశాను. రూట్స్ అనే నా ప్రత్యేక ప్రాజెక్టులో నేను వారి జీవిత కథలను వారి కుటుంబాల కోసం డాక్యుమెంట్ చేసేదానిని.
ప్రధాన మంత్రి: లావణ్య గారు మీకు హృదయపూర్వక శుభాకాంక్షలు. మీరు అన్నట్టే నేను కూడా ఒకసారిమన్ కి బాత్ లో అందరితో చెప్పాను. మీరు కుటుంబములో మీ నాయనమ్మ, తాతయ్యలు, అమ్మమ్మ, తాతయ్యలు ఉంటే గనక వారితో వారి చిన్ననాటి కథలు అడగండి వాటిని టేపులో రికార్డు చేసుకోండి. చాలా పనికి వస్తాయని నేను అన్నాను. నాకు బాగా అనిపించింది. మీ పరిచేయంలో మీ Communiation skills చాలా తక్కువ మాటల్లో చాలా చక్కగా మీ మీ పరిచయాలు చేశారు. అందుకొరకు కూడా నేను మీకు శుభాకాంక్షలు చెప్తున్నాను.
లావణ్య: ధన్యవాదములు సర్, ధన్యవాదములు
ఇపుడు మన శ్రోతలు ‘మన్ కి బాత్' ద్వారా వారి మనసులో కూడా కథలు వినాలని తహతహలాడుచున్నారేమో.నాది ఒక చిన్న అభ్యర్థన, ఏమిటంటే ఒకటి రెండు కథలు వినిపించండి మీరు.
సమూహ స్వరం: అలాగే సర్, ఇది మాకు దక్కిన అదృష్టం.
పదండి పదండి ఒక రాజుగారి కథ విందాం. రాజు గారి పేరు కృష్ణ దేవరాయలు. రాజ్యముపేరు విజయ నగరం. మన రాజు చాలా గుణవంతుడు. అతని బలహీనత చెప్పాలంటే అది కేవలం అధిక ప్రేమ కలిగి ఉండడం.. తెనాలి రామకృష్ణునితో రెండవది భోజనంపై . రాజుగారు ప్రతి రోజు మధ్యాహ్న భోజనం కొరకు ఎంతో ఆశగా ఎదురు చూసేవారు. ఈరోజు ఏదైనా మంచి వంటకం చేసి ఉంటారు. ప్రతి రోజు ఆయన వంటవాడు ఆయనకు రుచీ పచీ లేని కూరగాయలు తినిపించేవాడు. బీరకాయ, సొరకాయ. ఇలాగే ఒక రోజు రాజుగారు తింటూ తింటూ కోపముతో పళ్లెం విసిరివేసాడు. తన వంటవాడితో రేపు మంచి రుచికరమైన కూరగాయ చేయండి. లేదంటే నేను రేపు నిన్ను ఉరి పై వేలాడదీస్తాను అన్నాడు. వంటవాడు పాపం భయపడిపోయాడు. ఇపుడు కొత్త కూరగాయల కొరకు తాను ఎక్కడికి వెళ్ళాలి. వంటవాడు పరిగెత్తుకొంటూ తెనాలి రామ లింగడి వద్దకు వెళ్ళాడు. జరుగిందంతా చెప్పాడు. తెనాలి రామలింగడు వంటవాడికి ఒక ఉపాయం చెప్పాడు. మరుసటి రోజు రాజుగారు భోజనానికి వచ్చారు. వంటవాడిని పిలిచాడు. ఈరోజు ఏదైనా రుచికరమైనది వండావా, లేదంటే నేను ఉరి తయారు చేయాలా అన్నాడు. భయపడిన వంటవాడు పళ్లెం పెట్టాడు. వేడి వేడి వంటకాలు వడ్డించాడు. పళ్లెంలో కొత్త కూరగాయ ఉంది. రాజుగారు సంతోషించారు. కొద్దిగా కూరగాయ రుచి చూసారు .ఆహ ఎంత బావుంది. ఏమి కూర. బీరకాయ లాగా చేదుగా లేదు, సొరకాయలా తీయగా లేదు. వంటవాడు ఏ ఏ మసాలా వేశాడో, అంతా కూడా మంచిగా కలిసినది. అందుకొరకు రుచి చూడగానే రాజుగారు అడిగారు. ఇది ఏమి కూర? దీని పేరు ఏమిటి? ఎలాగైతే నేర్చుకున్నాడో అలాగే వంటవాడు సమాధానమిచ్చాడు. మహా రాజా ఇది కిరీటమున్న వంకాయ కూర. ప్రభు అచ్చు మీ వలెనె ఇది కూడా కూరగాయలకు రాజు. అందుచేత మిగిలిన కూరగాయల్ని వంకాయకు కిరీటం తొడిగారు అని చెప్పాడు. రాజుగారు సంతోషించారు. తాను నాటి నుండి ఈ కిరీటమున్న వంకాయని తింటానని ప్రకటించారు. నేనే కాదు , మన రాజ్యములో కూడా, వంకాయ మాత్రమే వండుతారు. వేరే కూరగాయలు వండరు అన్నారు. ప్రజలు ఆనందంగా ఉన్నారు. ప్రారంభములో అందరు ఆనందంగా ఉన్నారు… ఎందుకంటే వారికీ కొత్త కూరగాయ లభించినది. కానీ రోజులు గడుస్తూన్న కొద్దీ రుచి కాస్త తగ్గినది. ఒకరింట్లో వంకాయ బిరియాని వండితే, వంకాయ కూర. ఒకరి దగ్గర వంకాయ సాంబారు ఉంటె ఇంకొకరి వద్ద వంకాయ బాత్. ఒకటే వంకాయ.. పాపం ఎన్ని రూపాలు ధరించాలి . మెల్లి మెల్లిగా రాజుగారు కూడా విసిగిపోయారు. ప్రతి రోజు అదే వంకాయ. రాజుగారు వంటవాడిని పిలిచారు. బాగా చీవాట్లు పెట్టారు. . నీతో ఎవరు చెప్పారు వంకాయ తల పైన కిరీటం ఉందని అన్నారు. ఈ రాజ్యములో ఇప్పటినుండి ఎవరు వంకాయ తినరు.. రేపటి నుండి వేరే ఏవైనా కూరగాయలు వండు. వంకాయ మాత్రం వద్దు అన్నారు. . మీ ఆజ్ఞ ప్రభు అని వంటవాడు నేరుగా తెనాలి రామలింగడి వద్దకు వెళ్ళాడు. తెనాలి రామ లింగడి కళ్ళు మొక్కుతూ అన్నాడు ‘మంత్రి గారు ధన్యవాదాలు .. . మీరు నా ప్రాణం కాపాడారు. మీ ఉపాయం కారణంగా ఇపుడు ఏ కూరనైనా రాజుగారికి తినిపించగలం’ అని . తెనాలి రామ లింగడు నవ్వుతూ అన్నాడు- ఎవరైనా రాజుగారిని ఎందుకు సంతోషపెట్టలేదో. ఇదే విధముగా రాజా కృష్ణదేవరాయలు మంత్రి తెనాలి రామ లింగడి కథలు తయారవుతూ వచ్చాయి. ప్రజలు వింటూ వెళ్లారు.
ప్రధాన మంత్రి: మీ మాటలలో ఇంత ఖచ్చితత్వం ఉంది. ఇంత చిన్న చిన్న విషయాలు మీరు పట్టుకుంటారు. నేననుకంటాను పిల్లలు, పెద్దలు మీ మాటలు వింటే చాలా విషయాలు గుర్తుంచుకొంటారు. దేశంలో పోషణ మాసము నడుస్తోంది. మీ కథ భోజనంతో కూడి ఉంది.
ప్రధాన మంత్రి : Story tellers గా మీలాగే ఇంకా చాలా మంది ప్రజలు ఉన్నారు. మన దేశ మహాపురుషుల , మహా మాతృ దేవతలు, సోదరీమణుల కథలు, కథల ద్వారా వారితో ఎలా మమేకమయ్యారు.. మనం కథాశాస్త్రాన్ని ఇంకా గొప్పగా ఎలా ప్రచారం చేయాలి. ప్రజలలోకి ఎలా పంపించాలి ఆలోచించాలి. ప్రతి ఇంటిలో మంచికథలు చెప్పాలి, మంచి కథలు వినిపించాలి. ఇవి జన జీవనానికి చాల పెద్ద పేరు తేవాలి. ఈ వాతావరణము ఎలా తయారు చేయాలి. ఈ దిశలో మనమందరం కలిసి పని చేయాలి. మీతో సంభాషణ నాకు చాలా సంతోషంగా ఉంది.. నేను మీ అందరికి చాలా చాలా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.. . .
సమూహ స్వరం: ధన్యవాదాలు సార్ ..
కథ ల ద్వారా ఎక్కువగా సంస్కారాన్ని కలిగించే ఈ కథలను మనం విన్నాం. నేను ఇప్పుడు వారితో ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు చాలా పెద్ద సంభాషణ అయింది. నాకు అనిపించింది.. 'మన్ కి బాత్' లో వారితో జరిపిన ఈ సంభాషణ ను నా NarendraModi.App ద్వారా అప్లోడ్ చేయాలని. పూర్తి కథలు వినిపించాలని. తప్పకుండా యాప్ లో పూర్తి కథలు వినండి. ఇపుడు 'మన్ కి బాత్' లో అందులోని చాలా చిన్న అంశాన్ని మీ ముందు ఉంచాను. నేను మిమ్మల్ని తప్పకుండా కోరతాను. కుటుంబంలో ప్రతి వారం మీరు కథల కోసం కొంత కాలం తీసిపెట్టండి. కుటుంబములోని ప్రతి సభ్యుడికి ప్రతి వారం ఒక కొత్త విషయం ఇవ్వండి. ఉదాహరణకు కరుణ, స్పందన, పరాక్రమం, త్యాగం, శౌర్యం.. .. ఇలా ఏదో ఒక అంశం. కుటుంబం లోని సభ్యులందరూ ఆ వారం ఒకే విషయంపై కుటుంబమంతా కథలు వెతుకుతారు. కుటుంబం లోని సభ్యులందరూ ఒక్కొక్క కథ చెబుతారు.
మీరు చూడండి, కుటుంబంలో ఎంత పెద్ద కథల సంపద ఏర్పడుతుందో.. పరిశోధనకు ఎంత పెద్ద పని ఉంటుందో! ప్రతి ఒక్కరికి ఎంత ఆనందమౌతుంది! కుటుంబానికి ఒక కొత్త చైతన్యం వస్తుంది. కొత్త ఆశలు చిగురిస్తాయి. ఆ విధంగానే మనం మరో పని కూడా చేయవచ్చు. నేను కథలు వినిపించే అందరిని కోరుతు న్నాను. మనం స్వాతంత్యం వచ్చిన 75 వ సంవత్సరం జరుపుకోబోతున్నాం. మన కథల్లో ఎన్ని ప్రేరణ కలిగించే సంఘటనలు ఉన్నాయో వాటన్నిటిని కథల ద్వారా ప్రచారమా చేయలేమా? 1857 నుండి 1947 వరకు ప్రతి చిన్న చిన్న సంఘటన ను ఇపుడు మన కొత్త తరాలకు కథల ద్వారా పరిచయం చేయించవచ్చు. నాకు నమ్మకముంది. మీరు ఈ పనిని తప్పకుండా చేస్తారు. కథలు చెప్పే ఈ కళ దేశంలో ఇంకా బలోపేతం కావాలి. ఎక్కువ ప్రచారం కావాలి. రండి, మనమంతా దీనికోసం ప్రయత్నం చేద్దాం.
నా ప్రియమైన దేశవాసులారా! రండి, ఇప్పుడు మనం కథల ప్రపంచం నుండి సప్త సముద్రాలు దాటి వెళ్దాం. ఈ గొంతు వినండి!
“నమస్తే, సోదర సోదరీమణులారా! నా పేరు సేదు దెంబేలే. మాది పశ్చిమ ఆఫ్రికాలోని మాలి అనే దేశం. భారతదేశంలో అతిపెద్ద ధార్మిక ఉత్సవమైన కుంభమేళాకు ఫిబ్రవరిలో హాజరయ్యే అవకాశం నాకు లభించింది. ఇది నాకు చాలా గర్వకారణం. కుంభమేళా నాకు చాలా నచ్చింది. భారతదేశ సంస్కృతిని చూడటం ద్వారా చాలా నేర్చుకున్నాను. మాకు మరోసారి భారతదేశాన్ని సందర్శించే అవకాశం కల్పించాలని నేను కోరుతున్నాను. అ అవకాశం వస్తే భారతదేశం గురించి మరింత తెలుసుకోవచ్చు. నమస్తే.. "
ప్రధానమంత్రి: బాగుంది కదా! సేదు దెంబేలే మాలి దేశానికి చెందినవారు. మాలి భారతదేశానికి దూరంగా పశ్చిమ ఆఫ్రికాలో ఒక దేశం. మాలిలోని కిటాలో ఉన్న ఒక ప్రభుత్వ పాఠశాలలో ! సేదు దెంబేలే ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఇంగ్లీష్, సంగీతం, పెయింటింగ్, చిత్రకళ లను ఆయన పిల్లలకు నేర్పిస్తారు. అతనికి మరొక గుర్తింపు కూడా ఉంది. ప్రజలు అతన్ని మాలిలో ‘హిందూస్తాన్ కా బాబు’ అని పిలుస్తారు అల పిలిపించుకోవడం అతనికి చాలా గర్వంగా అనిపిస్తుంది. ప్రతి ఆదివారం మధ్యాహ్నం, ఆయన మాలిలో ఒక గంటపాటు రేడియో కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమం పేరు ‘ ఇండియన్ ఫ్రెక్వెన్సీపై బాలీవుడ్ పాటలు’. గత 23 సంవత్సరాలుగా ఆయన దీన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఆయన ఫ్రెంచ్ భాషతో పాటు మాలి భాషలో తన వ్యాఖ్యానంతో నిర్వహిస్తారు. నాటకీయంగా వ్యాఖ్యానిస్తారు. ఆయనకు భారతదేశంపై గాఢమైన ప్రేమ ఉంది. భారతదేశంతో ఆయన లోతైన అనుబంధానికి మరొక కారణం ఏమిటంటే ఆయన ఆగస్టు 15 వ తేదీ నాడు జన్మించారు. సేదు గారు ప్రతి ఆదివారం రాత్రి 9 గంటలకు రెండు గంటల పాటు నిర్వహించే మరో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇందులో ఒక బాలీవుడ్ చిత్రం కథను ఫ్రెంచ్, బంబారా భాషలలో చెప్తారు. బారా కథను చెబుతుంది. కొన్నిసార్లు ఏదైనా భావోద్వేగ సన్నివేశం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన ఏడుస్తారు. ఆయనతో పాటు శ్రోతలు కూడా ఏడుస్తారు. సేదు గారి తండ్రి కూడా ఆయనను భారతీయ సంస్కృతితో గుర్తించారు. ఆయన తండ్రి సినిమా, థియేటర్ రంగాలలో పనిచేశారు. సేదు కు భారతీయ సినిమాలను ఆయన చూపించేవారు. ఈ ఆగస్టు 15 నాడు ఒక వీడియో ద్వారా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత ప్రజలను హిందీలో శుభాకాంక్షలు తెలిపారు. ఆయన పిల్లలు భారతదేశ జాతీయ గీతాన్ని సులభంగా పాడతారు. మీరు ఈ రెండు వీడియోలను తప్పక చూడాలి. వారికి భారతదేశంపై ఉన్న ప్రేమను అనుభూతి చెందాలి. సేదు గారు కుంభ మేళా ను సందర్శించినప్పుడు నేను కలిసిన ప్రతినిధి బృందంలో ఆయన కూడా ఉన్నారు. భారతదేశం పట్ల ఆయనకున్న అభిరుచి, ఆప్యాయత, ప్రేమ నిజంగా మనందరికీ గర్వకారణం.
నా ప్రియమైన దేశవాసులారా! భూమికి అనుసంధానించబడినవారు అతిపెద్ద తుఫానులలో కూడా దృఢంగా ఉంటారని ఒక లోకోక్తి. మన వ్యవసాయ రంగంలో ఈ కరోనా క్లిష్ట సమయంలో కూడా పనిచేసే మన రైతు దీనికి సజీవ ఉదాహరణ. సంక్షోభం ఉన్న ఈ కాలంలో కూడా మన దేశ వ్యవసాయ రంగం మళ్లీ తన శక్తిని చూపించింది. మిత్రులారా! దేశంలోని వ్యవసాయ రంగం, మన రైతులు, మన గ్రామాలు స్వావలంబన భారతదేశానికి ఆధారం. వారు బలంగా ఉంటే స్వయం సమృద్ధిగల భారతదేశం పునాది బలంగా ఉంటుంది. ఈ మధ్యకాలంలో దేశంలోని అనేక ప్రాంతాలు అనేక పరిమితుల నుండి స్వీయ విముక్తి పొందాయి. అనేక అపోహలను విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నించాయి. అలాంటి చాలా మంది రైతుల నుండి నాకు లేఖలు వస్తాయి. నేను రైతు సంఘాలతో కూడా మాట్లాడుతున్నాను. కొత్త కోణాల్లో వ్యవసాయం ఎలా జరుగుతోందో, వ్యవసాయం ఎలా మారుతుందో వారితో సంభాషణ ద్వారా తెలుస్తుంది. నేను వారి నుండి, ఇతరుల నుండి విన్న విషయాలను ఈ రోజు మన్ కి బాత్ లో మీతో తప్పకుండా పంచుకోవాలని ఉంది. ఆ రైతుల గురించి నేను మీకు కొన్ని విషయాలు తప్పక చెప్పాలి. మన రైతు సోదరులలో ఒకరు హర్యానాలోని సోనిపట్ జిల్లాలో ఉండే కన్వర్ చౌహాన్ గారు. ఆయన తన పండ్లు, కూరగాయలను మార్కెట్ వెలుపల విక్రయించడంలో ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి చెప్పారు. వారు తమ పండ్లు, కూరగాయలను మార్కెట్ వెలుపల విక్రయిస్తుంటే వారి పండ్లు, కూరగాయలు, బండ్లను చాలాసార్లు జప్తు చేసేవారు. కానీ 2014 లో పండ్లు, కూరగాయలను ఎపిఎంసి చట్టం నుండి మినహాయించారు. ఇది వారితో పాటు అనేకమంది తోటి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూర్చింది. నాలుగేళ్ల క్రితం ఆయన గ్రామంలోని తోటి రైతులతో కలిసి రైతు ఉత్పత్తి బృందాన్ని ఏర్పాటు చేశారు. నేడు, గ్రామ రైతులు స్వీట్ కార్న్ , బేబీ కార్న్ సాగు చేస్తున్నారు. వారి ఉత్పత్తులను నేరుగా ఢిల్లీలోని ఆజాద్‌పూర్ మార్కెట్, బిగ్ రిటైల్ చైన్ , ఫైవ్ స్టార్ హోటళ్లకు సరఫరా చేస్తున్నారు. నేడు గ్రామంలోని రైతులు స్వీట్ కార్న్, బేబీ కార్న్ లను పండించడం ద్వారా ఎకరానికి సంవత్సరానికి రెండున్నర నుండి మూడు లక్షలు సంపాదిస్తున్నారు. ఇది మాత్రమే కాదు- ఈ గ్రామానికి చెందిన 60 మందికి పైగా రైతులు, నెట్ హౌస్ తయారు చేయడం ద్వారా, పాలీ హౌస్ తయారు చేయడం ద్వారా టమోటా, దోసకాయ, క్యాప్సికమ్, వాటి విభిన్న రకాలను ఉత్పత్తి చేయడం ద్వారా ప్రతి సంవత్సరం ఎకరానికి 10 నుండి 12 లక్షల వరకు సంపాదిస్తున్నారు. ఈ రైతుల ప్రత్యేకత ఏమిటో తెలుసా? తమ పండ్లు, కూరగాయలను ఎక్కడైనా, ఎవరికైనా అమ్మే శక్తి వారికి ఉంది. ఈ శక్తి వారి పురోగతికి ఆధారం. ఇప్పుడు ఈ శక్తి దేశంలోని ఇతర రైతులకు కూడా కలిగింది. పండ్లు, కూరగాయలు మాత్రమే కాదు- పొలంలో వారు పండించే వరి, గోధుమలు, ఆవాలు, చెరకు, ఇతర పంటలను వారి కోరిక ప్రకారం, వాటిని ఎక్కువ ధర ఉండే చోట అమ్ముకోవడానికి వారికి స్వేచ్ఛ లభించింది.
మిత్రులారా! మూడు, నాలుగు సంవత్సరాల క్రితం మహారాష్ట్రలో పండ్లు , కూరగాయలను ఎపిఎంసి పరిధి నుండి మినహాయించారు. ఈ మార్పు మహారాష్ట్రలో పండ్లు , కూరగాయలు పండించే రైతుల పరిస్థితిని ఎలా మార్చిందో చెప్పేందుకు ఒక ఉదాహరణ శ్రీ స్వామి సమర్థ్ ఫార్మ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్. ఇది రైతుల సమూహం. పూణే, ముంబైలోని రైతుల ప్రతి వారం మార్కెట్లను స్వయంగా నడుపుతున్నారు. ఈ మార్కెట్లలో సుమారు 70 గ్రామాలకు చెందిన సుమారు నాలుగున్నర వేల మంది రైతులు తమ ఉత్పత్తులను నేరుగా అమ్ముకుంటారు. మధ్యవర్తులెవరూ లేరు. గ్రామీణ యువకులు వ్యవసాయం , అమ్మకం ప్రక్రియలో నేరుగా మార్కెట్లో పాలుపంచుకుంటారు. ఇది రైతులకు నేరుగా ప్రయోజనం చేకూరుస్తుంది. గ్రామంలోని యువతకు ఉపాధి లభిస్తుంది.
మరొక ఉదాహరణ తమిళనాడులోని తేని జిల్లాకు సంబంధించింది. ఇక్కడ తమిళనాడు అరటి ఉత్పత్తి సంస్థ ఉంది. దీని పేరులో కంపెనీ అని ఉన్నా నిజానికి ఇది రైతుల సమూహం. చాలా సరళమైన వ్యవస్థ ఇది. అది కూడా ఐదారు ఏళ్ల కిందట ఏర్పాటైంది. ఈ రైతు బృందం లాక్డౌన్ సమయంలో చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాది మెట్రిక్ టన్నుల కూరగాయలు, పండ్లు , అరటిపండ్లను కొనుగోలు చేసింది. చెన్నై నగరానికి కూరగాయల కాంబో కిట్ ఇచ్చింది. మీరు ఆలోచించండి.. వారు ఎంత మంది యువతకు ఉపాధి కల్పించారు! ఇందులో విశేషం ఏమిటంటే, మధ్యవర్తులు లేనందువల్ల రైతులు ప్రయోజనం పొందారు. వినియోగదారులు కూడా ప్రయోజనం పొందారు. అలాంటిదే లక్నోకు చెందిన మరో రైతుల బృందం. వారు ఆ బృందానికి 'ఇరాదా ఫార్మర్ ప్రొడ్యూసర్' అని పేరు పెట్టారు. వారు లాక్డౌన్ సమయంలో రైతుల పొలాల నుండి నేరుగా పండ్లు, కూరగాయలను తీసుకున్నారు. నేరుగా లక్నో మార్కెట్ లో అమ్మారు. నేరుగా వెళ్ళడం ద్వారా లక్నో మార్కెట్లలో మధ్యవర్తుల నుండి విముక్తి పొందారు. తాము కోరుకున్నధరకు వారు అమ్ముకోగలిగారు. మిత్రులారా! ఇస్మాయిల్ భాయ్ గుజరాత్ లోని బనాస్కాంఠా రాంపురా గ్రామంలో రైతు. ఆయన కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంది. ఇస్మాయిల్ భాయ్ వ్యవసాయం చేయాలనుకున్నారు. ఆయన వ్యవసాయం చేయాలనుకుంటే కుటుంబ సభ్యులు విచిత్రంగా చూసేవారు. ఇస్మాయిల్ భాయ్ తండ్రి వ్యవసాయం చేసేవాడు. కాని అతనికి తరచూ నష్టాలు వచ్చేవి. కాబట్టి తండ్రి నిరాకరించారు. కుటుంబం నిరాకరించినప్పటికీ ఇస్మాయిల్ భాయ్ వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యవసాయం నష్టాలతో కూడినదని ఇస్మాయిల్ భాయ్ భావించాడు. అయితే ఈ ఆలోచనను, పరిస్థితిని రెండింటినీ మార్చాలనుకున్నారు. వినూత్న మార్గాల్లో వ్యవసాయం ప్రారంభించారు. బంగాళాదుంపలను పండించడం ప్రారంభించారు. డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో సేద్యం చేశారు. ఈరోజు ఆయన పండించిన బంగాళాదుంపలు ప్రత్యేక గుర్తింపు పొందాయి. ఆయన పండించే బంగాళాదుంపలు ఎక్కువ నాణ్యత కలిగినవి. ఇస్మాయిల్ భాయ్ ఈ బంగాళాదుంపలను నేరుగా పెద్ద కంపెనీలకు విక్రయిస్తారు. మధ్యవర్తుల అవసరం లేకుండానే ఈ విక్రయం జరుగుతుంది. ఆయన ఇప్పుడు మంచి లాభాలను ఆర్జిస్తున్నారు. తన తండ్రి అప్పును కూడా ఇస్మాయిల్ భాయ్ తీర్చగలిగారు. మరో గొప్ప విషయం ఏమిటంటే ఇస్మాయిల్ భాయ్ ప్రస్తుతం తన ప్రాంతంలోని వందలాది రైతులకు కూడా సహాయం చేస్తున్నారు. వారి జీవితాలు కూడా మారుతున్నాయి.
మిత్రులారా! ఈరోజుల్లో ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కొత్త పద్ధతులు వస్తాయి. కొత్త ఆవిష్కరణలు తోడవుతాయి. మణిపూర్‌లో నివసించే విజయశాంతి కొత్త ఆవిష్కరణ కారణంగా వార్తల్లో నిలిచారు. తామర అండాశయం నుండి దారాన్ని తయారు చేయడం ప్రారంభించారు. నేడు ఆ ఆవిష్కరణ కారణంగా తామర సాగుతో వస్త్ర తయారీకి కొత్త మార్గం ఏర్పడింది.
నా ప్రియమైన దేశవాసులారా! నేను మిమ్మల్ని గత కాలానికి తీసుకెళ్లాలనుకుంటున్నాను. వందేళ్ల కిందటి విషయం. 1919 సంవత్సరం. జలియన్ వాలా బాగ్‌లో బ్రిటిష్ ప్రభుత్వం అమాయక ప్రజలను ఊచకోత కోసింది. ఈ ఊ చకోత తరువాత పన్నెండు సంవత్సరాల బాలుడు ఆ ప్రదేశానికి వెళ్ళాడు. అతను సంతోషకరమైన, ఉల్లాసభరితమైన పిల్లవాడు. కానీ అతను జలియన్ వాలా బాగ్‌లో చూసింది అతని ఆలోచనకు మించినది. ఎవరైనా ఇంత క్రూరంగా, నిర్దయగా ఎలా ఉండగలరని అతను ఆశ్చర్యపోయాడు. అతను ఆలోచించడం ప్రారంభించాడు ఆంగ్లేయుల దుశ్చర్య ఆగ్రహం కలిగించింది. అదే జలియన్ వాలా బాగ్‌లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడతామని శపథం చేశాడు. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నానో మీకు తెలుసా? అవును! నేను అమరవీరుడు భగత్ సింగ్ గురించి మాట్లాడుతున్నాను. రేపు- సెప్టెంబర్ 28 న అమరవీరుడు భగత్ సింగ్ జయంతిని జరుపుకుంటున్నాం. నేను దేశవాసులతో కలిసి ధైర్యశౌర్యాలకు చిహ్నమైన షహీద్ వీర్ భగత్ సింగ్ కు నమస్కరిస్తున్నాను. మీరు ఊహించగలరా! ప్రపంచంలోని ఇంత పెద్ద భాగాన్ని పరిపాలించి, సూర్యుడు తన పాలనలో ఎన్నడూ అస్తమించలేదని చెప్పేంత శక్తివంతమైన ప్రభుత్వం 23 ఏళ్ల వ్యక్తికి భయపడింది. షహీద్ భగత్ సింగ్ శక్తిమంతుడు కావడంతో పాటు పండితుడు, ఆలోచనాపరుడు కూడా. తమ జీవితాల గురించి ఆలోచించకుండా భగత్ సింగ్, ఆయన సహచర క్రాంతివీరులు ధైర్యసాహసాలను ప్రదర్శించారు. వారు చేసిన పనులు దేశ స్వాతంత్ర్యానికి ఎంతో దోహదపడ్డాయి. షహీద్ వీర్ భగత్ సింగ్ జీవితంలో మరో గొప్ప అంశం ఏమిటంటే జట్టు పని ప్రాముఖ్యతను ఆయన బాగా అర్థం చేసుకున్నాడు. లాలా లాజ్‌పత్ రాయ్ పట్ల ఆయనకున్న అంకితభావం; చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్‌దేవ్, రాజ్‌గురు వంటి విప్లవకారులతో ఆయనకున్న అనుబంధం చాలా గొప్పది. అతను జీవించినంత కాలం ఒక లక్ష్యం కోసం మాత్రమే జీవించాడు. దాని కోసం అతను ఆత్మ త్యాగం చేశాడు. ఆ లక్ష్యం భారతదేశాన్ని అన్యాయమైన ఆంగ్ల పాలన నుండి విముక్తి చేయడం. నమోఆప్‌లో హైదరాబాద్‌కు చెందిన ఎస్. అజయ్ గారి వ్యాఖ్య చదివాను. నేటి యువత భగత్ సింగ్ లాగా ఎలా మారగలరని అజయ్ జీ ప్రశ్నించారు. చూడండి! మనం భగత్ సింగ్ అవ్వలేకపోవచ్చు. కానీ భగత్ సింగ్ కు ఉన్న దేశ భక్తి, దేశం కోసం ఏదైనా చేయాలనే అభిలాష వాస్తవానికి మన అందరి హృదయాల్లో ఉన్నాయి. షహీద్ భగత్ సింగ్ కు ఇది మన గొప్ప నివాళి. నాలుగు సంవత్సరాల క్రితం ఈ సమయంలోనే సర్జికల్ స్ట్రైక్ సమయంలో ప్రపంచం మన సైనికుల శౌర్య సాహసాలను, ధైర్యాన్ని చూసింది. మన ధైర్యవంతులైన సైనికుల లక్ష్యం ఒకటే. ఏది ఏమైనా భరతమాత గౌరవాన్ని కాపాడదామనే ఒకే లక్ష్యం ఉంది. వారు తమ జీవితాలను పెద్దగా పట్టించుకోలేదు. తమ కర్తవ్య మార్గంలో కొనసాగారు. వారు ఎలా విజయం సాధించారో మనమందరం చూశాం. భారతమాత గౌరవం దీనివల్ల పెరిగింది.
నా ప్రియమైన దేశవాసులారా! రాబోయే రోజుల్లో భారతదేశ నిర్మాణంలో ఎంతో కృషి చేసిన చాలా మంది గొప్ప వ్యక్తులను మనం గుర్తు తెచ్చుకుంటాం. అక్టోబర్ 2 మనందరికీ పవిత్రమైన, ఉత్తేజకరమైన రోజు. ఆ రోజు భారతమాత ఇద్దరు కుమారులు మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిలను జ్ఞాపకం చేసుకునే రోజు.
పూజ్య బాపూజీ ఆలోచనలు, ఆదర్శాలు గతంలో కంటే ఈ రోజుల్లో చాలా సందర్భోచితమైనవి. మహాత్మా గాంధీ ఆర్ధిక ఆలోచనను అర్థం చేసుకుని, ఆ మార్గంలో వెళ్ళి ఉంటే ఈ రోజు స్వావలంబన భారత ప్రచారం అవసరం ఉండేది కాదు. గాంధీ ఆర్ధిక ఆలోచనలో భారతదేశ నాడిపై, భారతదేశ గొప్పదనంపై అవగాహన ఉంది. పేదవారిలోకెల్లా పేదవారిపై ప్రతిపనిలోనూ దృష్టి పెట్టాలని పూజ్య బాపుజీ జీవితం మనకు సందేశం ఇస్తుంది.
అదే సమయంలో శాస్త్రీజీ జీవితం మనకు వినయం, సింప్లిసిటీ లను సందేశంగా ఇస్తుంది. అక్టోబర్ 11 రోజు కూడా మనకు చాలా ప్రత్యేకమైనది. ఆ రోజు భారత రత్న లోక్ నాయక్ జయ ప్రకాశ్ గారిని ఆయన జన్మదినం సందర్భంగా గుర్తు చేసుకుంటాం. మన ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించడంలో జెపి ప్రముఖ పాత్ర పోషించారు. భారత రత్న నానాజీ దేశ్ ముఖ్ కూడా మనం స్మరించుకుంటాం. ఆయన జయంతి కూడా 11 వ తేదీనే ఉంది. నానాజీ దేశ్ ముఖ్ గారు – జయ ప్రకాశ్ నారాయణ్ గారి కి చాలా సన్నిహితుడు. జెపి అవినీతికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నప్పుడు పాట్నాలో అతనిపై దాడి చేశారు. అప్పుడు నానాజీ దేశ్ ముఖ్ జేపీ ని కాపాడే బాధ్యత తీసుకున్నాడు. ఆ దాడిలో నానాజీ తీవ్రంగా గాయపడ్డాడు. కానీ జెపి ప్రాణాలను రక్షించడంలో విజయం పొందాడు. ఈ అక్టోబర్ 12 రాజ మాత విజయరాజే సింధియా జన్మదినం. ఆమె తన జీవితమంతా ప్రజల సేవ కోసం అంకితం చేసింది. ఆమె ఒక రాజ కుటుంబానికి చెందినవారు. ఆస్తి, అధికారం, ఇతర వనరులకు కొరత లేదు. కానీ ఆమె మాతృత్వ భావనతో, ఒక తల్లిలాగా ఎంతో వాత్సల్యం ప్రదర్శిస్తూ ప్రజా ప్రయోజనాల కోసం తన జీవితం గడిపారు. ఆమె హృదయం చాలా ఉదారమైంది. ఈ అక్టోబర్ 12న ఆమె శత జయంతి ఉత్సవాల ముగింపు రోజు. ఈ రోజు నేను రాజ్‌మాత గారి గురించి మాట్లాడుతున్నప్పుడు నాకు కూడా చాలా భావోద్వేగ సంఘటన ఒకటి గుర్తుకు వచ్చింది.
చాలా సంవత్సరాలు రాజమాతతో కలిసి పనిచేయడానికి నాకు అవకాశం వచ్చింది. చాలా సంఘటనలు ఉన్నాయి. కానీ ఈ రోజు నేను ఒక సంఘటనను తప్పక ప్రస్తావించాలని ఉంది. కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు ఏక్తా యాత్రకు బయలుదేరాం. డాక్టర్ మురళి మనోహర్ జోషి గారి నాయకత్వంలో ఆ ప్రయాణం జరుగుతోంది. డిసెంబర్, జనవరి నెలల్లో వణికించే చల్లని రోజులు. రాత్రి పన్నెండు- ఒంటి గంటలకు మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ సమీపంలో ఉన్న శివపురికి చేరుకున్నాం. నివాసానికి వెళ్ళాం. రోజంతా అలసిపోయాం. స్నానం చేసి, నిద్రపోవాలనుకున్నాం. ఉదయం కోసం సిద్ధమవుతున్నాం. సుమారు 2 గంటలైంది. నేను స్నానం చేసి, నిద్రపోవడానికి సిద్ధమవుతున్నాను. అప్పుడు ఎవరో తలుపు తట్టారు. నేను తలుపు తెరిచినప్పుడు రాజమాతా సాహెబ్ ముందు నిలబడి ఉన్నారు. చలికాలపు రాత్రి. ఆ సమయంలో రాజ్‌మాతా సాహెబ్‌ను చూసి నేను ఆశ్చర్యపోయాను. నేను ఆ తల్లికి నమస్కరించాను. “ఇంత రాత్రివేళలో వచ్చారా అమ్మా?” అన్నాను. “బిడ్డా! ఈ పాలు తాగండి. మోడీ జీ! వేడి పాలు తాగిన తరువాత నిద్రించండి” అన్నారు. పసుపు వేసిన పాలు స్వయంగా తెచ్చారు. అవును. కానీ తర్వాతి రోజు నేను గమనించాను. కేవలం నాకొక్కడికే కాదు.. యాత్రలో ఉన్న అందరూ ఉన్న చోటికి వెళ్ళి స్వయంగా పాలు అందజేశారని తెలిసింది. మా యాత్రలో 30-40 మంది ఉన్నారు. వారిలో డ్రైవర్లు ఉన్నారు. ఎక్కువ మంది కార్య కర్తలు ఉన్నారు. తల్లి ప్రేమను, వాత్సల్యాన్ని నేను ఆ సంఘటనలో చవిచూశాను. ఆ సంఘటనను నేను ఎప్పటికీ మరచిపోలేను. అలాంటి మహనీయులు తమ త్యాగం, తపస్సుతో మన దేశసేవ చేయడం మన అదృష్టం. రండి.. మనమందరం కలిసి ఈ గొప్ప వ్యక్తులు గర్వంగా భావించే భారతదేశాన్ని నిర్మిద్దాం. వారి కలలను వాస్తవరూపంలోకి తెచ్చేందుకు సంకల్పం చేసుకుందాం.
నా ప్రియమైన దేశవాసులారా! ఈ కరోనా కాలంలో నేను మీకు మరోసారి గుర్తు చేస్తున్నాను. మాస్క్ ధరించండి. ముఖానికి ముసుగు లేకుండా బయటకు వెళ్లవద్దు. రెండు గజాల నియమం మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కూడా కాపాడుతుంది. ఇవి కొన్ని నియమాలు.. ఈ కరోనాకు వ్యతిరేకంగా యుద్ధ ఆయుధాలు. ప్రతి పౌరుడి ప్రాణాలను రక్షించే బలమైన మార్గాలు. మర్చిపోవద్దు. మందు వచ్చేవరకు తొందరవద్దు. మీరు ఆరోగ్యంగా ఉండండి. మీ కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచండి. శుభాకాంక్షలతో చాలా చాలా ధన్యవాదాలు.
నమస్కారం
నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. సాధారణంగా ఈ సమయంలో వేర్వేరు ప్రదేశాల్లో వేడుకలు జరుగుతాయి. మతపరమైన ధార్మిక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ కరోనా సంక్షోభ కాలంలో ఈ ఉత్సవాలను నిర్వహించుకోవాలన్న ఉత్సాహం మనలో ఉన్నప్పటికీ ఇలాంటి సంక్షోభ సమయంలో మనం ఎలా ఉండాలనే నియమాలతో కూడిన క్రమశిక్షణ కూడా ఉంది. పౌరులలో బాధ్యత కూడా ఉంది. ప్రజలు తమను తాము చూసుకుంటూ ఇతరులను కూడా పట్టించుకుంటున్నారు. తమ రోజువారీ పనిని కూడా చేస్తున్నారు. దేశంలో ఈ సమయంలో జరుగుతున్న ప్రతి సంఘటనలో సంయమనం, సారళ్యత అపూర్వమైనవి. గణేశ్ ఉత్సవాలను కొన్ని చోట్ల ఆన్ లైన్ లో కూడా జరుపుకుంటున్నారు; చాలా చోట్ల పర్యావరణ మిత్రపూర్వకమైన గణేశ విగ్రహాలను ఏర్పాటు చేశారు. మిత్రులారా, మనం చాలా సమీపం నుండి పరిశీలిస్తే ఒక విషయం ఖచ్చితంగా మన దృష్టికి వస్తుంది. మన పండుగ, పర్యావరణం- ఈ రెండిటి మధ్య చాలా లోతైన బంధం ఉంది. ఒక వైపు న పర్యావరణం తో, ప్రకృతి తో సహవాసం చేయాలనే సందేశం మన మన పండుగలలో దాగి ఉంది; మరో వైపు న, సరిగ్గా ప్రకృతిని కాపాడే లక్ష్యంతో అనేక పండుగలను జరుపుకుంటారు. ఉదాహరణకు తీసుకొంటే, బిహార్ లోని పశ్చిమ చంపారణ్ లో, థారూ ఆదివాసీ సమాజం లోని ప్రజలు శతాబ్దాలుగా 60 గంటల లాక్ డౌన్ ను పాటిస్తున్నారు. వారు దీనిని ‘60-గంటల బర్ నా’ అంటారు. ప్రకృతి ని కాపాడటానికి థారూ జాతి కి చెందిన గిరిజనులు వారి సంప్రదాయం ప్రకారం బర్ నా ను శతాబ్దాల కాలం నుండి అనుసరిస్తున్నారు. ఈ సమయంలో ఎవరూ వారి గ్రామానికి వెళ్లలేరు. వారి ఇళ్ళ నుండి ఎవ్వరూ బయటకు రారు. వారు బయటికి రావడమో, ఎవరైనా బయటి నుండి రావడమో జరిగితే వారి కదలికల వల్ల, వారి రోజువారీ కార్యకలాపాల వల్ల కొత్త మొక్కలకు హాని కలగవచ్చని భావిస్తారు. బర్ నా ప్రారంభం లో మన ఆదివాసీ సోదరులు, సోదరీమణులు పెద్ద ఎత్తున పూజలను నిర్వహిస్తారు. ఆ ఉత్సవాల చివర్లో గిరిజన సంప్రదాయం ప్రకారం పాటలు, సంగీతం, నృత్య కార్యక్రమాలు ఏర్పాటు చేసుకుంటారు.
మిత్రులారా, ఈ రోజుల్లో ఓణమ్ పండుగను కూడా ఎంతో ఉత్సాహంగా జరుపుకొంటున్నారు. ఈ పండుగ చిన్ గమ్ నెల లో వస్తుంది. ఈ సమయంలో ప్రజలు కొత్త వస్తువులను కొంటారు. తమ ఇళ్లను అలంకరిస్తారు. పూక్కలం అనే ముగ్గులతో తమ ఇంటి ప్రాంగణాలను తీర్చిదిద్దుతారు. ఓణమ్ రోజుల్లో సద్య అనే ఆహారపదార్థాలను ఆస్వాదిస్తారు. వివిధ రకాల ఆటల పోటీలు కూడా జరుగుతాయి. ఓణమ్ దేశ విదేశాల్లో ప్రాచుర్యం పొందింది. అమెరికా, యూరోప్, గల్ఫ్ మొదలైన ప్రాంతాలలోని అనేక దేశాలలో కూడా ఓణమ్ ఆనందం కనిపిస్తోంది. ఓణమ్ ఒక అంతర్జాతీయ ఉత్సవంలా మారుతోంది.
మిత్రులారా, ఓణమ్ వ్యవసాయానికి సంబంధించిన పండుగ. మన గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఇది కొత్త ఆరంభం. రైతుల శక్తి ఫలితంగానే మన జీవితం గడుస్తుంది. మన సమాజం నడుస్తుంది. రైతుల శ్రమ వల్ల మన పండుగలు వర్ణమయమవుతాయి. మన అన్నదాతకు, రైతుల శక్తికి వేదాలలో కూడా గౌరవనీయమైన స్థానం లభించింది.
రుగ్వేదంలో ఒక మంత్రం ఉంది ..
అన్నానామ్ పతయే నమః ,
క్షేత్రానామ్ పతయే నమః.. అని.
దీనికి అర్థం, అన్నదాతకు నమస్కారం.. రైతుకు వందనం అని. కరోనా క్లిష్ట పరిస్థితులలో కూడా మన రైతులు వారి శక్తిని నిరూపించుకున్నారు. మన దేశంలో ఈసారి ఖరీఫ్ పంట నాట్లు అంతకుముందు సంవత్సరం తో పోలిస్తే 7 శాతం పెరిగాయి.
వరి ని 10 శాతం, పప్పుధాన్యాలను 5 శాతం, ముతక తృణధాన్యాలను 3 శాతం, నూనె గింజలను 13 శాతం, పత్తిని ఇంచుమించు 3 శాతం అధికంగా నాటారు. దీనికి గాను దేశంలోని రైతులను నేను అభినందిస్తున్నాను. వారి కృషికి నేను నమస్కరిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా, ఈ కరోనా కాలంలో దేశం అనేక రంగాల్లో ఐక్యంగా పోరాడుతోంది. కానీ దీర్ఘ కాలం ఇళ్ళలో ఉండడం వల్ల నా బాల మిత్రుల సమయం ఎలా గడిచిపోతుందన్న ఆలోచన వస్తుంది. ప్రపంచంలో భిన్నమైన ప్రయోగమైన గాంధీనగర్ చిల్డ్రన్ యూనివర్శిటీ; మహిళా శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ; విద్యా మంత్రిత్వ శాఖ; సూక్ష్మ, లఘు, మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ.. వీటన్నిటితో కలసి పిల్లల కోసం మనం ఏం చేయగలమనే విషయాన్ని ఆలోచించాము. ఈ చర్చలు నాకు చాలా ఆహ్లాదం కలిగించాయి. ఈ చర్చలు ప్రయోజనకరంగా ఉన్నాయి. ఒక విధంగా కొత్త అంశాన్ని నేర్చుకోవటానికి నాకు ఇది ఒక అవకాశంగా మారింది.
మిత్రులారా, మా చర్చల అంశం – బొమ్మలు – మరీ ముఖ్యంగా భారతీయ బొమ్మలు. భారతదేశం లె బాలల కు కొత్త కొత్త ఆటబొమ్మలు ఎలా దొరకాలి, భారతదేశం బొమ్మల ఉత్పత్తికి చాలా పెద్ద కేంద్రంగా ఎలా మారాలి అనే అంశాలపై మా చర్చలు జరిగాయి. ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) ను వింటున్న పిల్లల తల్లిదండ్రులకు నేను క్షమాపణలు చెబుతున్నాను. ఎందుకంటే ఈ ‘మన్ కీ బాత్’ ను విన్న తరువాత బొమ్మల కోసం కొత్త డిమాండ్ లు ముందుకు రావచ్చు.
మిత్రులారా, బొమ్మలు కార్యాచరణను పెంచడంతో పాటు మన ఆకాంక్షలకు రెక్కలను ఇస్తాయి. బొమ్మలు మనస్సును అలరించడమే కాదు, ప్రయోజనాలను కూడా అందజేస్తాయి. అసంపూర్ణంగా ఉన్న బొమ్మ ఉత్తమమైందన్న గురుదేవులు రవీంద్రనాథ్ టాగోర్ అభిప్రాయాన్ని నేను ఎక్కడో చదివాను. అటువంటి బొమ్మను ఆటలో భాగంగా పిల్లలు పూర్తి చేస్తారు. బాల్యంలో తన స్నేహితులతో- తన కల్పనా శక్తితో ఇంట్లో ఉన్న వస్తువుల నుండి బొమ్మలను, ఆటలను తయారు చేసేవాడినని టాగోర్ అన్నారు. అలా ఒక రోజు సరదాగా ఆడుకునే సమయంలో ఆయన సహచరులలో ఒకరు అందమైన పెద్ద విదేశీ బొమ్మను తీసుకు వచ్చాడు. దాంతో ఆయన మిత్రుల దృష్టి అంతా ఆట కంటే బొమ్మపైనే ఎక్కువగా నిమగ్నమైంది. ఆటలు కాకుండా ఆ బొమ్మే ఆకర్షణ కేంద్రంగా మారింది. అంతకు ముందు అందరితో ఆడుకుంటూ, అందరితో కలిసి ఉంటూ, క్రీడలలో మునిగిపోయే ఆయన దూరంగా ఉండడం ప్రారంభించాడు. ఒక విధంగా చెప్పాలంటే మిగతా పిల్లల కంటే తాను భిన్నమైనవాడిననే భావన ఆయన మనస్సు లో ఏర్పడింది. ఖరీదైన బొమ్మలలో తయారు చేయడానికి ఏమీ లేదు- నేర్చుకోవడానికి ఏమీ లేదు. అంటే, ఆకర్షణీయమైన బొమ్మ ఒక అద్భుతమైన పిల్లవాడిని అణిచివేసింది. అతని ప్రతిభను కప్పేసింది. ఈ బొమ్మ అతని సంపదను ప్రదర్శించింది. కాని పిల్లల సృజనాత్మక వికాసాన్ని నిరోధించింది. బొమ్మ వచ్చింది. కానీ ఆట ముగిసింది. వికాసం ఆగిపోయింది. అందువల్ల పిల్లల బాల్యాన్ని బయటకు తెచ్చే విధంగా, సృజనాత్మకతను వెలికితీసే విధంగా బొమ్మలు ఉండాలని గురుదేవులు చెప్పే వారు. పిల్లల జీవితంలోని వివిధ అంశాలపై బొమ్మల ప్రభావాన్ని జాతీయ విద్యా విధానం కూడా పరిగణనలోకి తీసుకుంది. బొమ్మల తయారీని నేర్చుకోవడం, బొమ్మల తయారీ పరిశ్రమల సందర్శన- ఇవన్నింటిని బోధన ప్రణాళిక లో భాగంగా చేశారు.
మిత్రులారా, మన దేశంలో స్థానిక బొమ్మల తయారీ విషయంలో గొప్ప సంప్రదాయం ఉంది. మంచి బొమ్మలు తయారు చేయడంలో నైపుణ్యం కలిగిన ప్రతిభావంతులైన వారున్నారు. నైపుణ్యం కలిగిన చేతివృత్తులవారు చాలా మంది ఉన్నారు. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు బొమ్మల కేంద్రాలుగా కూడా అభివృద్ధి చెందుతున్నాయి. ఉదాహరణకు కర్నాటకలోని రామనగరంలో చన్నాపట్నం, ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలో కొండపల్లి, తమిళ నాడు లో తంజావూరు, అసమ్ లోని ధుబరీ, ఉత్తర ప్రదేశ్‌లోని వారాణసీ – ఇలాంటి చాలా ప్రదేశాలు ఉన్నాయి. ప్రపంచ బొమ్మల పరిశ్రమ విలువ 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా ఉందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. 7 లక్షల కోట్ల రూపాయల పెద్ద వ్యాపారం. కానీ ఇందులో భారతదేశం వాటా చాలా తక్కువ. గొప్ప వారసత్వం, సంప్రదాయం, వైవిధ్యం, అధిక సంఖ్యలో యువత ఉన్న దేశం వాటా బొమ్మల పరిశ్రమలో చాలా తక్కువగా ఉండడం మీకు సబబుగా అనిపిస్తోందా? లేదు.. ఇది మీకు నచ్చదు. మిత్రులారా, బొమ్మల పరిశ్రమ చాలా విస్తృతమైంది. గృహ పరిశ్రమలు, చిన్న తరహా పరిశ్రమలు, ఎంఎస్ఎంఇల తో పాటు పెద్ద పరిశ్రమలు, ప్రైవేట్ పారిశ్రామిక సంస్థలు కూడా దాని పరిధిలోకి వస్తాయి. దీనిని ముందుకు తీసుకుపోవడానికి దేశం ఉమ్మడిగా కృషి చేయవలసి ఉంటుంది.
ఆంధ్ర ప్రదేశ్ లోని విశాఖపట్నానికి చెందిన శ్రీమాన్ సి.వి. రాజు ను చూడండి. ఆయన గ్రామానికి చెందిన ఏటి కొప్పాక బొమ్మలు గతంలో బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ బొమ్మలు చెక్కతో తయారు కావడం విశేషం. ఈ బొమ్మలలో ఎక్కడా వంపు కోణం కనబడదు. ఈ బొమ్మలు అన్ని వైపుల నుండి గుండ్రంగా ఉంటాయి. మొనతేలి ఉండవు. అందువల్ల పిల్లలకు గాయాలయ్యే అవకాశం లేదు. సివి రాజు తన గ్రామంలోని చేతివృత్తి పనివారి సహకారంతో ఏటి కొప్పాక బొమ్మల కోసం కొత్త ఉద్యమాన్ని ప్రారంభించాడు. ఏటి కొప్పాక బొమ్మలను ఉత్తమ నాణ్యత తో తయారు చేయడం ద్వారా స్థానిక బొమ్మలు కోల్పోయిన ప్రాభవాన్ని రాజు తిరిగి నిలబెట్టారు. బొమ్మల తో మనం చేయగలిగే విషయాలు రెండు ఉన్నాయి. మన జీవితం లోని అద్భుతమైన గతాన్ని పునరుద్ధరించవచ్చు. స్వర్ణమయ భవిష్యత్తును కూడా రూపొందించవచ్చు. మన స్టార్ట్ అప్ స్నేహితులకు, మన నవ పారిశ్రామిక వేత్తలకు కలసి బొమ్మలు తయారు చేద్దామని పిలుపు ఇస్తున్నాను. ప్రతి ఒక్కరు స్థానిక బొమ్మలపై ప్రచారం చేసే సమయం ఇక ఆసన్నమైంది. రండి.. మన బాలల కోసం కొత్త రకాల నాణ్యమైన బొమ్మల ను తయారు చేద్దాము. బాల్యాన్ని వికసింపజేసేవే బొమ్మలు. ఇటువంటి బొమ్మలను, పర్యావరణానికి అనుకూలమైన బొమ్మలను తయారు చేద్దాము.
మిత్రులారా, కంప్యూటర్ లు, స్మార్ట్ ఫోన్ లు ఉన్న ఈ యుగంలో కంప్యూటర్ గేమ్స్ కూడా చాలా ప్రాచుర్యంలో ఉన్నాయి. పిల్లలు కూడా ఈ ఆటలను ఆడతారు. పెద్దవారు కూడా ఆడతారు. వీటిల్లో చాలా ఆటలు ఉన్నాయి. వాటి ఇతివృత్తాలు కూడా అధికంగా విదేశాలకు సంబంధించినవే ఉన్నాయి. మన దేశంలో చాలా ఆలోచనలు ఉన్నాయి. చాలా భావనలు ఉన్నాయి. మనకు చాలా గొప్ప చరిత్ర ఉంది. మనం వాటిపై ఆటలు రూపొందించగలమా? నేను దేశంలోని యువ ప్రతిభావంతులకు పిలుపు ఇస్తున్నాను. మీరు భారతదేశంలో కూడా ఆటలు రూపొందించండి. భారతదేశానికి సంబంధించిన ఆటలు రూపొందించండి. ఎక్కడికి వెళ్ళినా ఆటలు ప్రారంభిద్దాం! రండి.. ఆట ను మొదలుపెడదాము!
మిత్రులారా, కాల్పనిక క్రీడలయినా, బొమ్మల రంగం అయినా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ లో చాలా ముఖ్యమైన పాత్ర పోషించవలసి ఉంటుంది. వందేళ్ల కిందట సహాయ నిరాకరణ ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఆ ఉద్యమం భారతీయుల ఆత్మగౌరవాన్ని పెంచి, మన శక్తిని వెల్లడించేందుకు ఒక మార్గమని గాంధీ జీ పేర్కొన్నారు.
ప్రస్తుతం, దేశాన్ని స్వయంసమృద్దం చేయడానికి ప్రయత్నిస్తున్న తరుణం లో మనం పూర్తి విశ్వాసంతో ముందుకు సాగాలి. ప్రతి రంగంలో దేశాన్ని స్వయంసమృద్ధియుతంగా చేసుకోవాలి. సహాయ నిరాకరణ రూపం లో నాటిన విత్తనాన్ని ఇప్పుడు స్వయంసమృద్ధి గల భారతదేశ వట వృక్షం గా మార్చడం మనందరి బాధ్యత.
నా ప్రియమైన దేశవాసులారా, భారతీయుల ఆవిష్కరణ సామర్థ్యాన్ని, సమస్యా పరిష్కార నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. అంకితభావం ఉన్నప్పుడు ఈ శక్తి అపరిమితంగా మారుతుంది. ఈ నెల మొదట్లో యాప్ ఇన్నోవేశన్ చాలింజ్ ను దేశ యువత ముందు ఉంచారు. ఈ స్వావలంబన భారతదేశ యాప్ ఆవిష్కరణ పోటీ లో మన యువతీయువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. దాదాపు 7 వేల ఎంట్రీలు వచ్చాయి. అందులో కూడా మూడింట రెండు వంతుల అనువర్తనాలను మెట్రో నగరాలు కానటువంటి రెండో అంచె నగరాలు, మూడో అంచె నగరాల యువతయే సృష్టించింది. . ఇది స్వావలంబనయుత భారతదేశానికి, దేశ భవిష్యత్తుకు ఎంతో శుభ సంకేతం. ఈ ఆవిష్కరణ సవాలు ఫలితాలు మిమ్మల్ని ఖచ్చితంగా ఆకట్టుకుంటాయి. ఈ పోటీ యొక్క ఎంట్రీలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత, వివిధ కేటగిరీలలో సుమారు రెండు డజన్ ల యాప్స్ కు పురస్కారాలు కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఈ అప్లికేశన్ లను గురించి తెలుసుకోవాలి. వాటివల్ల ఇలాంటివి సృష్టించడానికి మీరు కూడా ప్రేరణ పొందవచ్చు. వాటిలో ఒక అనువర్తనం ఉంది. అది కుటుకి పిల్లల అభ్యసన యాప్. చిన్నపిల్లల కోసం రూపొందించిన ఇంటరాక్టివ్ యాప్ ఇది. దీని ద్వారా పాటలు కథల ద్వారా గణితం, సామాన్య శాస్త్రాల లో చాలా విషయాలను పిల్లలు నేర్చుకోవచ్చు. దీంట్లో యాక్టివిటీస్ ఉన్నాయి. ఆటలూ ఉన్నాయి. అదేవిధంగా మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫార్మ్ కోసం ఒక యాప్ ఉంది. దీని పేరు కూ – K OO కూ. ఇందులో, మన మాతృభాష లో టెక్స్ట్ ను ఉంచడం ద్వారా, వీడియో లు ఇంకా ఆడియో ల ద్వారా సంభాషించవచ్చు. అదేవిధంగా, చింగారీ యాప్ కూడా యువతలో బాగా ప్రాచుర్యం పొందింది. ‘ఆస్క్ సర్కార్’ అనేది కూడా ఒక యాప్. ఇందులో మీరు చాట్ బోట్ ద్వారా ఇంటరాక్ట్ అవ్వవచ్చు. ఏదైనా ప్రభుత్వ పథకం గురించి సరైన సమాచారాన్ని పొందవచ్చు. అది కూడా టెక్స్ట్, ఆడియో, వీడియో ల ద్వారా- మూడు విధాలుగా. ఇది మీకు చాలా సహాయపడుతుంది. మరొక అనువర్తనం ఉంది- అది ‘స్టెప్ సెట్ గో’. ఇది ఫిట్నెస్ అనువర్తనం. మీరోజు వారీ కార్యకలాపాల్లో ఎన్ని కేలరీల శక్తిని మీరు ఖర్చు చేస్తారో ఈ అనువర్తనం ట్రాక్ చేస్తుంది. ఫిట్‌గా ఉండటానికి మిమ్మల్ని ప్రేరేపిస్తుంది. నేను కొన్ని ఉదాహరణలు ఇచ్చాను. ఇంకా చాలా అనువర్తనాలు పురస్కారాలను గెలుచుకున్నాయి. ‘ఈజ్ ఈక్వల్ టు’, బుక్స్ అండ్ ఎక్స్పెన్స్, జోహో వర్క్‌ప్లేస్, ఎఫ్‌టిసి టాలెంట్ వంటి అనేక బిజినెస్ యాప్స్, ఆటల అనువర్తనాలు వాటిలో ఉన్నాయి. వాటి గురించి నెట్ లో శోధిస్తే మీకు చాలా సమాచారం దొరుకుతుంది. మీరు కూడా ముందుకు రండి. ఆవిష్కరించండి. అమలు చేయండి. మీ ప్రయత్నాలు, మీ చిన్న చిన్న స్టార్ట్ అప్ లు రేపు పెద్ద కంపెనీలుగా మారుతాయి. భారతదేశానికి ప్రపంచంలో గుర్తింపు లభిస్తుంది. ఈ రోజు ప్రపంచంలో కనిపించే పెద్ద కంపెనీలు కూడా ఒకప్పుడు చిన్న స్థాయిలో ప్రారంభమైనవే అనే విషయం మీరు మరచిపోకూడదు.
ప్రియమైన దేశ వాసులారా, మన పిల్లలు, మన విద్యార్థులు వారి పూర్తి సామర్థ్యాన్ని చూపించడంలో, వారి బలాన్ని చూపించగలగడంలో పోషకాహారానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ ను పోషకాహార మాసం గా జరుపుకుంటారు. దేశం, పోషకాహారం చాలా దగ్గరి సంబంధం కలిగి ఉన్నాయి. “యథా అన్నం తథా మన్నం” అనే ఒక లోకోక్తి కూడా ఉంది.
అంటే మన ఆహారం వల్లే మానసిక, శారీరక వికాసాలు జరుగుతాయని అర్థం. గర్భంలోనూ, బాల్యంలోనూ ఎంత మంచి పోషకాహారం లభిస్తే మానసిక వికాసం, ఆరోగ్యం అంతబాగా ఉంటాయని నిపుణులు చెప్తారు. పిల్లల పోషణలో తల్లికి పూర్తి పోషకాహారం లభించడం కూడా ముఖ్యమైంది. పోషణ అంటే ఏం తింటున్నారు, ఎంత పరిమాణంలో తింటున్నారు, ఎంత తరచుగా తింటున్నారు అని కాదు. అన్ని పోషక పదార్థాలు శరీరానికి అందడం ముఖ్యం. మీ శరీరానికి ఎన్ని ముఖ్యమైన పోషకాలు అందుతున్నాయి? మీరు ఐరన్, కాల్షియం పొందుతున్నారా, లేదా? సోడియం పొందడం లేదా? విటమిన్లు పొందడం లేదా? ఇవన్నీ పోషకాహారం లో చాలా ముఖ్యమైన అంశాలు. ఈ పోషకాహార ఉద్యమం లో ప్రజల భాగస్వామ్యం కూడా చాలా ముఖ్యం. ప్రజల భాగస్వామ్యం వల్లే ఈ కార్యక్రమం విజయవంతం అవుతుంది. గత కొన్నేళ్లుగా దేశంలో ఈ దిశ లో చాలా ప్రయత్నాలు జరిగాయి. ముఖ్యంగా మన గ్రామాలలో ప్రజల భాగస్వామ్యంతో దీనిని పెద్ద ఎత్తున ఉద్యమంగా నిర్వహిస్తున్నారు. పోషకాహార వారోత్సవాలైనా, పోషకాహార మాసమైనా- వాటి ద్వారా మరింత అవగాహన ఏర్పడుతోంది. ఈ ఉద్యమంలో పాఠశాలలను కూడా అనుసంధానించడమైంది. పిల్లల కోసం పోటీల నిర్వహణ, వారిలో అవగాహన పెంచడం- వీటికోసం నిరంతరం ప్రయత్నాలు జరుగుతున్నాయి. తరగతిలో క్లాస్ మానిటర్ ఉన్న విధంగానే న్యుట్రిశన్ మానిటర్ కూడా ఉండాలి. రిపోర్ట్ కార్డ్ లాగా న్యూట్రిశన్ కార్డ్ కూడా తయారు చేయాలి. అటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. పోషకాహార మాసోత్సవాల్లో MyGov portal లో ఆహారం, పోషణ క్విజ్ జరుగుతుంది. అలాగే ఇతర పోటీలు కూడా ఉంటాయి. మీరు పాల్గొనండి. ఇతరులను కూడా వీటిలో పాల్గొనేలా ప్రేరేపించండి.
మిత్రులారా, కోవిడ్ తరువాత గుజరాత్ లో సర్ దార్ వల్లభ్ భాయి పటేల్ విగ్రహ సందర్శనకు అనుమతించిన తరువాత సందర్శించే అవకాశం మీకు లభిస్తే అక్కడ నిర్మించిన ప్రత్యేకమైన న్యూట్రిశన్ పార్కు ను కూడా చూడండి. ఆట పాటలతో పోషకాహార పరిజ్ఞానాన్ని పొందవచ్చు.
మిత్రులారా, భారతదేశం చాలా విశాలమైంది. ఆహార అలవాట్లలో చాలా వైవిధ్యం ఉంది. మన దేశంలో ఆరు వేర్వేరు రుతువులలో వివిధ ప్రాంతాలలో అక్కడి వాతావరణం ప్రకారం వేర్వేరు వస్తువులు ఉత్పత్తి అవుతాయి. అందువల్ల ప్రతి ప్రాంతంలో సీజన్ ప్రకారం ఉత్పత్తి అయ్యే ఆహార పదార్థాలు, పండ్లు, కూరగాయలను బట్టి పోషకాహార ప్రణాళికను రూపొందించడం చాలా ముఖ్యం. ఉదాహరణ కు రాగులు, జొన్నలు మొదలైన చిరు ధాన్యాలు చాలా ఉపయోగకరమైన పోషకాహారం. ప్రతి జిల్లాలో పండే పంటలు, వాటి పోషక విలువ ను గురించి పూర్తి సమాచారంతో ‘అగ్రికల్చరల్ ఫండ్ ఆఫ్ ఇండియా’ తయారవుతోంది. ఇది మీ అందరికీ చాలా ఉపయోగపడుతుంది. రండి, పోషకాహార మాసంలో పోషక పదార్థాలు తినడానికి, ఆరోగ్యంగా ఉండటానికి అందరినీ ప్రోత్సహించండి.
ప్రియమైన దేశవాసులారా, గతంలో మనం స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నప్పుడు ఒక ఆసక్తికరమైన వార్త నా దృష్టిని ఆకర్షించింది. ఇది మన భద్రత దళాలకు సంబంధించిన రెండు సాహస గాథల వార్త. ఈ రెండు గాథలు ‘సోఫీ’, ‘విదా’ అనే రెండు శునకాలకు సంబంధించినవి. ఇవి రెండూ భారత సైన్యానికి చెందిన కుక్కలు. ఈ కుక్కలు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ‘కమెండేషన్ కార్డులు’ పొందాయి. సోఫీ, ఇంకా విదా దేశాన్ని పరిరక్షిస్తూ తమ విధులను చక్కగా నిర్వర్తించినందు వల్ల ఈ గౌరవాన్ని పొందాయి. మన భద్రత దళాలలో దేశం కోసం పని చేసే ఎన్నో కుక్కలు ఉన్నాయి. ఆ శునకాలు దేశం కోసం బలిదానం కూడా చేస్తాయి. ఎన్నో బాంబు పేలుళ్లను, ఉగ్రవాద కుట్రలను నిరోధించడంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషించాయి. దేశ భద్రత లో కుక్కల పాత్ర గురించి కొంతకాలం క్రితం నేను చాలా వివరంగా తెలుసుకున్నాను. ఇలాంటి చాలా సంఘటనలు కూడా వినండి. అమరనాథ్ యాత్రకు వెళ్లే దారిలో బలరామ్ అనే కుక్క 2006 లో మందుగుండు సామగ్రిని కనుగొంది. 2002 లో పేలుడు పదార్థాలను భావన అనే కుక్క కనుగొన్నది. ఈ పదార్థాల వెలికితీత సమయంలో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలను పేల్చడంతో ఆ కుక్క చనిపోయింది. రెండు, మూడు సంవత్సరాల క్రితం ఛత్తీస్‌గఢ్ లోని బీజాపుర్ లో జరిగిన మందుగుండు పదార్థాల పేలుడు సంఘటన లో సిఆర్ పిఎఫ్ కు చెందిన స్నిఫర్ డాగ్ ‘క్రాకర్’ కూడా అమరత్వం పొందింది. కొన్ని రోజుల క్రితం మీరు టీవీలో చాలా భావోద్వేగ దృశ్యాన్ని చూసి ఉంటారు. బీడ్ పోలీసులు తమ శునకం ‘రాకీ’కి అన్ని విధాలా గౌరవప్రదంగా తుది వీడ్కోలు పలికిన ఘట్టాన్ని మీరు చూడొచ్చు. 300 కి పైగా కేసులను పరిష్కరించడంలో రాకీ పోలీసులకు సహాయం చేసింది.
విపత్తు నిర్వహణ, రక్షణ కార్యక్రమాల్లో కుక్కల పాత్ర కూడా ముఖ్యమైంది. భారతదేశంలో నేశనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ – ఎన్ డిఆర్ఎఫ్ అటువంటి డజన్ ల కొద్దీ కుక్కలకు ప్రత్యేకంగా శిక్షణ ను ఇచ్చింది. భూకంపం సంభవించినప్పుడు, భవనాలు కూలిపోయినప్పుడు శిధిలాల లో సజీవంగా ఉన్న వారిని కాపాడడంలో ఉండటం లో ఈ కుక్కలు నైపుణ్యం కలిగిఉన్నాయి.
మిత్రులారా, భారతీయ జాతికి చెందిన కుక్కలు చాలా మంచివని, చాలా సామర్థ్యం కలిగి ఉన్నాయని నిపుణులు నాకు చెప్పారు. భారతీయ జాతుల లో ముధోల్ హౌండ్, హిమాచలీ హౌండ్ ఉన్నాయి. అవి చాలా మంచి జాతులు. రాజాపలాయమ్, కన్నీ, చిప్పీపరాయి, కొంబాయి లు కూడా గొప్ప భారతీయ జాతులు. వాటిని పెంచడానికి అయ్యే ఖర్చు కూడా చాలా తక్కువ. అవి భారత వాతావరణానికి మేలైనవి. ఇప్పుడు మన భద్రతా సంస్థలు ఈ భారతీయ జాతి కుక్కలను కూడా తమ భద్రత బృందాలలో చేరుస్తున్నాయి. ఈ మధ్యకాలం లో సైన్యం, సిఐఎస్ఎఫ్, ఎన్ఎస్జి సంస్థలు ముధోల్ హౌండ్ కుక్కలకు శిక్షణ ఇచ్చి డాగ్ స్క్వాడ్ లో చేర్చాయి. సిఆర్ పిఎఫ్ లో కొంబాయి జాతి కుక్కలు ఉన్నాయి. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసిఎఆర్) కూడా భారతీయ జాతి కుక్కలపై పరిశోధనలు చేస్తోంది. భారతీయ జాతులను మెరుగ్గా, ఉపయోగకరంగా మార్చడమే ఈ పరిశోధనల లక్ష్యం. మీరు కుక్కల జాతుల పేర్లను ఇంటర్ నెట్ లో శోధించి, వాటిని గురించి తెలుసుకోండి. వాటి అందం, లక్షణాలు తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. మీరు కుక్కను పెంచాలని అనుకున్నప్పుడల్లా తప్పకుండా ఈ భారతీయ జాతి కుక్కలలో ఒకదాన్ని ఇంటికి తీసుకురావాలి. స్వావలంబనయుత భారతదేశం ప్రజల మనస్సు లోని మంత్రంగా మారుతోంది. ఇలాంటప్పుడు ఏ రంగంలో అయినా ఎలా వెనుకబడి ఉంటాము?
నా ప్రియమైన దేశ వాసులారా, కొన్ని రోజుల తరువాత- సెప్టెంబర్ 5 వ తేదీ నాడు- మనం ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటాం. మన జీవిత ప్రయాణం లో విజయాలను చవి చూసినప్పుడు మన ఉపాధ్యాయుల లో ఎవరో ఒకరిని మనం ఖచ్చితంగా గుర్తుకు తెచ్చుకుంటాము. వేగంగా మారుతున్న కాలం లో, కరోనా సంక్షోభం లో మన ఉపాధ్యాయులు కూడా కాలంతో పాటు మారవలసిన సవాలును ఎదుర్కొంటారు. మన ఉపాధ్యాయులు ఈ సవాలు ను అంగీకరించడమే కాకుండా దానిని ఒక అవకాశంగా స్వీకరించినందుకు నాకు సంతోషం గా ఉంది. అభ్యసనలో సాంకేతికత ను ఎలా ఉపయోగించాలో, కొత్త పద్ధతులను ఎలా అనుసరించాలో, విద్యార్థులకు ఎలా సహాయం చేయాలో మన ఉపాధ్యాయులు ఇప్పటికే తెలుసుకున్నారు. విద్యార్థులకు కూడా నేర్పించారు. దేశంలో ఈరోజులలో ప్రతిచోటా నూతన ఆవిష్కరణలు జరుగుతున్నాయి. ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి కొత్తవి రూపొందిస్తున్నారు. జాతీయ విద్యా విధానం ద్వారా దేశం లో పెద్ద మార్పు జరుగబోతోంది. దీని ప్రయోజనాలను విద్యార్థులకు అందజేయడంలో ఉపాధ్యాయులు ముఖ్యమైన పాత్ర ను పోషిస్తారని నాకు నమ్మకం ఉంది.
మిత్రులారా, ముఖ్యంగా నా ఉపాధ్యాయ మిత్రులారా, మన దేశం 2022 వ సంవత్సరంలో 75 సంవత్సరాల స్వాతంత్ర్య సంబరాలను జరుపుకోనుంది. స్వాతంత్య్రానికి ముందు సుదీర్ఘకాలం మన దేశంలో స్వాతంత్ర్య సమరం జరిగింది. ఈ సమయంలో స్వాతంత్య్ర సమరయోధులు వారి ప్రాణాలను త్యాగం చేయని, తమ సర్వస్వాన్ని తృణప్రాయంగా భావించని ప్రాంతం అంటూ దేశం లోని ఏ మూలలోనూ లేదు. మన దేశ స్వాతంత్ర్య వీరుల గురించి ఈ తరానికి, మన విద్యార్థులకు తెలియవలసిన ఆవశ్యకత ఉంది. తమ జిల్లా లో, తమ ప్రాంతం లో స్వాతంత్య్ర ఉద్యమ సమయం లో ఏం జరిగింది?, ఎలా జరిగింది?, ఎవరు అమరవీరుడు?, ఎంతకాలం దేశం కోసం జైలు లో ఉన్నారు? అనే విషయాలు విద్యార్థులకు తెలియాలి. మన విద్యార్థులకు ఈ విషయాలు తెలిస్తే వారి వ్యక్తిత్వం లో కూడా ఈ ప్రభావం కనిపిస్తుంది. దీని కోసం చాలా పనులు చేయవచ్చు. ఇందులో మన ఉపాధ్యాయుల బాధ్యత ప్రధానమైంది. ఉదాహరణ కు శతాబ్దాలుగా సాగిన స్వాతంత్ర్య యుద్ధం లో మీ జిల్లాలో ఏవైనా సంఘటనలు జరిగాయా? ఈ అంశాన్ని తీసుకొని విద్యార్థుల తో పరిశోధనలు నిర్వహించవచ్చు. లిఖితరూపం లో దీనిని పాఠశాల తయారుచేయవచ్చు. మీ పట్టణం లో స్వాతంత్ర్య ఉద్యమం తో సంబంధం గల స్థలం ఉంటే విద్యార్థులను అక్కడికి తీసుకుపోవచ్చు. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల ఉత్సవాల సందర్భం లో తమ ప్రాంతంలోని 75 మంది స్వాతంత్ర్య సమర వీరులపై కవితలు, నాటకాలు రాయాలని ఒక పాఠశాల విద్యార్థులు నిర్ణయించుకోవచ్చు. మీ ప్రయత్నాలు దేశంలోని వేలాది మంది విస్మృత వీరుల సమాచారాన్ని వెలికి తీయవచ్చు. దేశం కోసం జీవించి, దేశం కోసం మరణించినప్పటికీ మరచిపోయిన వారి పేరులను మీ ప్రయత్నాలు ముందుకు తెస్తాయి. స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల ఉత్సవాల్లో గొప్ప వ్యక్తులను మనం గుర్తుకు తెచ్చుకుంటే అదే వారికి నిజమైన నివాళి అవుతుంది. సెప్టెంబర్ 5 వ తేదీ న ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకొనే సందర్భం లో దీని కోసం పెద్ద ఎత్తున ఉద్యమాన్ని చేపట్టాలని నా ఉపాధ్యాయ మిత్రుల ను కోరుతున్నాను. ఈ ఉద్యమం లో అంతా ఉమ్మడి గా కృషిచేయాలని కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా! దేశం సాగించే ప్రగతి ప్రయాణం ప్రతి పౌరుడి భాగస్వామ్యం వల్లే విజయవంతం అవుతుంది. ఈ ప్రయాణం లో అందరూ కలసివస్తేనే ఈ వికాస యాత్ర ఫలవంతం అవుతుంది. అందువల్ల దేశంలోని ప్రతి ఒక్కరూ ఆరోగ్యం గా ఉండాలి, సంతోషం గా ఉండాలి. అందరమూ కలసి కరోనా ను పూర్తిగా ఓడించాలి. మీరు సురక్షితం గా ఉన్నప్పుడు మాత్రమే కరోనా ను ఓడించవచ్చు. ‘‘రెండు గజాల దూరం, మాస్క్ అవసరం’’ అనే సంకల్పాన్ని మీరు పూర్తిగా పాటించినప్పుడు మాత్రమే కరోనా ఓడిపోతుంది. మీరందరూ ఆరోగ్యం గా ఉండండి. సంతోషం గా ఉండండి. ఈ శుభాకాంక్షల తో తరువాతి ‘మన్ కీ బాత్’ (‘‘మనసు లో మాట’’ కార్యక్రమం) లో కలుసుకొందాము.
అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం.
నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. ఈ రోజు, జూలై 26 వ తేదీ, ఇది ఒక చాలా ప్రత్యేకమైనటువంటి దినం. ‘కర్ గిల్ విజయ్ దివస్’ ఈనాడే. 21 సంవత్సరాల క్రితం ఇదే రోజు న, మన సైన్యం కర్ గిల్ యుద్ధం లో విజయ పతాక ను ఎగురవేసింది. మిత్రులారా, ఎటువంటి పరిస్థితుల లో కర్ గిల్ యుద్ధం చోటుచేసుకొందో భారతదేశం ఎన్నటికీ మరచిపోజాలదు. భారతదేశ భూ భాగాన్ని దురాక్రమణ చేయాలనే భ్రమల ను పాకిస్తాన్ మనస్సు లో ఉంచుకొని, అక్కడి అంతర్గత కలహాల నుండి ప్రజల దృష్టి ని మళ్ళించడానికి ఈ యొక్క దుస్సాహసాన్ని ఆరంభించింది. అప్పట్లో భారతదేశం పాకిస్తాన్‌తో సత్సంబంధాల ను పెంచుకొనే ప్రక్రియ లో నిమగ్నమైంది. అయితే
‘‘బయరూ అకారన్ సబ్ కాహూ సోం
జో కర్ హిత్ అనహిత్ తాహూ సోం’’
అని అన్నారు కదా.
ఈ మాటల కు – దుర్మార్గుల కు ప్రతి ఒక్కరి తో అకారణం గానే శత్రుత్వం ఏర్పరచుకోవడం స్వాభావికం గానే అబ్బుతుంది – అని భావం.
అటువంటి స్వభావం గల వ్యక్తులు వారి హితవు కోరే వారికి కూడా నష్టం కలిగించేందుకు ఆలోచిస్తారు. అందుకే భారత స్నేహాని కి ప్రతిస్పందన గా పాకిస్తాన్ దెబ్బ తీసేందుకు ప్రయత్నించింది. కానీ, ఆ తరువాత భారతదేశ పరాక్రమాన్ని సైన్యం రుచి చూపించింది. మన సైన్య పరాక్రమాన్ని ప్రపంచం కూడా చూసింది. మీరు అనుకోవచ్చు – ఎత్తైన పర్వతాలపై కూర్చున్న శత్రువుల కు క్రింద నుండి పోరాడిన మన సైన్యాలు ఎలా జవాబు చెప్పగలిగాయి అని. అయితే విజయం పర్వత ఎత్తుల లో లేదు.. భారత సైనిక దళాల ధైర్యం, వాస్తవమైన శౌర్యం లో ఉంది. మిత్రులారా, ఆ సమయం లో నేను కర్ గిల్ కు వెళ్లి, మన సైనికుల శౌర్యాన్ని చూసే అదృష్టాన్ని కూడా పొందాను. ఆ రోజు నా జీవితం లో అత్యంత విలువైన క్షణాల్లో ఒకటి. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు కర్ గిల్ విజయాన్ని గుర్తుకు తెచ్చుకొంటున్నారు. సోశల్ మీడియా లో #courageinkargil అనే హ్యాష్‌ట్యాగ్ తో ప్రజలు వారి యొక్క కథానాయకుల కు నమస్కరిస్తూ, మరణించిన వారికి నివాళి అర్పిస్తున్నారు. నేను ఈ రోజు దేశం లోని ప్రజలందరి తరపున మన ఈ వీర సైనికులతో పాటు, భారత మాత నిజమైన కుమారులకు జన్మనిచ్చిన వీరనారీమణులైన వారి తల్లులకు కూడా నమస్కరిస్తున్నాను.
కర్ గిల్ విజయం తో సంబంధం ఉన్న మన వీర సైనికుల కథల తో పాటు వారి తల్లుల త్యాగాన్ని గురించి యువతీయువకులు ఒకరితో మరొకరు పంచుకోవాలని నేను కోరుతున్నాను. మిత్రులారా, ఈ రోజు న నేను మిమ్ములను ఒకటి అభ్యర్థిస్తున్నాను. www.gallantryawards.gov.in అనే వెబ్సైట్ ఉంది. మీరు ఆ వెబ్ సైట్ ను తప్పక సందర్శించాలి. మన ధైర్యవంతులైన మరియు శక్తివంతమైన యోధుల ను గురించి, వారి శక్తి ని గురించి అక్కడ మీకు చాలా సమాచారం లభిస్తుంది. ఆ సమాచారాన్ని మీరు మీ సహచరుల తో చర్చించినప్పుడు అది వారికి కూడాను ప్రేరణ లభించేందుకు ఒక కారణం అవుతుంది. మీరు ఈ వెబ్సైట్ ను తప్పక సందర్శించాలి. మళ్ళీ మళ్ళీ ఆ వెబ్ సైట్ ను దర్శించండి.
మిత్రులారా, కర్ గిల్ యుద్ధం కాలం లో అటల్ గారు ఎర్ర కోట నుండి ఇచ్చిన ప్రసంగాన్ని గుర్తు చేసుకోవడం ఈ రోజు న చాలా సందర్భోచితం. అటల్ జీ అప్పుడు గాంధీ గారు పేర్కొన్న సూత్రాలలో ఒక సూత్రాన్ని దేశాని కి గుర్తు చేశారు. మహాత్మ గాంధీ సూత్రం ఏమిటంటే ఎవరికైనా ఏదైనా పని చేయాలా వద్దా అనే విషయం లో ఎప్పుడైనా గందరగోళం ఉంటే అతను భారతదేశపు అత్యంత నిరు పేద నిస్సహాయ వ్యక్తి ని గురించి ఆలోచించాలి అనేదే. అతను చేయబోయే కార్యం ఆ వ్యక్తి కి మంచిది కాదా అని అతను అనుకోవాలి. గాంధీ జీ యొక్క ఈ ఆలోచన ను మించి కర్ గిల్ యుద్ధం మనకు రెండో సూత్రాన్ని కూడా చెప్తోందని అటల్ గారు అన్నారు. ఈ సూత్రం ఏమిటంటే ఏదైనా ముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకొనే ముందు అటువంటి నిర్ణయం ఆ యొక్క దుర్గమమైన కొండల లో తన జీవితాన్ని త్యాగం చేసిన సైనికుడి గౌరవానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి అనేది అటల్ గారి అభిప్రాయం. అటల్ గారు పేర్కొన్న ఈ స్ఫూర్తి ని ఆయన స్వరం లోనే విందాం.
అటల్ జీ యొక్క సౌండ్ బైట్ –
‘‘గాంధీజీ ఒక సూత్రం పేర్కొన్నారని మనందరికీ గుర్తుంది. మహాత్మ గాంధీ సూత్రం ఏమిటంటే ఎవరికైనా ఏదైనా పని చేయాలా వద్దా అనే విషయం లో ఎప్పుడైనా గందరగోళం ఉంటే అతను భారతదేశపు అత్యంత నిరు పేద నిస్సహాయ వ్యక్తి ని గురించి ఆలోచించాలి. అతను చేయబోయే కార్యం ఆ వ్యక్తి కి మంచిది కాదా అని అతను అనుకోవాలి. కర్ గిల్ యుద్ధం మనకు రెండో సూత్రాన్ని కూడా చెప్తోంది. ఈ సూత్రం ఏమిటంటే ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు ఆ నిర్ణయం దుర్గమమైన కొండలలో తన జీవితాన్ని త్యాగం చేసిన సైనికుడి గౌరవానికి అనుగుణంగా ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి..’’
మిత్రులారా, యుద్ధం జరిగినప్పుడు మనం చెప్పే విషయాలు, మన చర్యలు సరిహద్దు లోని సైనికుడి ధైర్యం పై, అతని కుటుంబ మనో బలం పై చాలా బలమైనటువంటి ప్రభావాన్ని చూపుతాయి. దీనిని మనం ఎప్పటికీ మరచిపోకూడదు. అందుకే మన ఆచారాలు, మన వ్యవహారాలు, మన ప్రసంగాలు, మన ప్రకటనలు, మన గౌరవం, మన లక్ష్యాలు.. అన్నీ.. సైనికుల మనోధైర్యాన్ని పెంచేవిగా ఉండాలి. వారి గౌరవాన్ని పెంచాలి. అత్యున్నతమైన ఏకత బంధం లో కట్టుబడి ఉన్న దేశవాసులు మన సైనికుల బలాన్ని అనేక వేల రెట్లు పెంచుతారు. ఈ కాలం లో సంఘ శక్తే బలమన్న లోకోక్తి ఉంది కదా.
కొన్నిసర్లు మన దేశానికి చాలా హాని కలిగించే ఇటువంటి విషయాలను అర్థం చేసుకోకుండా సోశల్ మీడియా లో కొన్ని విషయాల ను ప్రోత్సహిస్తాం. కొన్నిసర్లు ఇటువంటి వాటిని ఫార్వర్డ్ చేస్తూంటాం. చేస్తూనే ఉంటాం. ఈ రోజులలో యుద్ధాలు కేవలం సరిహద్దులలో మాత్రమే జరగవు. అవి దేశం లోని వివిధ రంగాల లో ఒకేసారి జరుగుతాయి. ప్రతి పౌరుడు అందులో తన పాత్ర ను నిర్ణయించుకోవాలి. దేశ సరిహద్దుల లో క్లిష్ట పరిస్థితుల లో పోరాడుతున్న సైనికుల ను గుర్తు చేసుకుంటూ మన పాత్ర ను కూడా నిర్ణయించుకోవాలి.
నా ప్రియమైన దేశవాసులారా, గత కొన్ని నెలలు గా కరోనాతో యావత్తు దేశం ఐక్యం గా పోరాడిన విధానం చాలా భయాల ను తప్పు గా నిరూపించింది. ఈ రోజు న మన దేశంలో రోగనివృత్తి సూచి ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉంది. అలాగే, మన దేశం లో కరోనా మరణాల సూచి కూడా ప్రపంచం లోని చాలా దేశాల కంటే చాలా తక్కువ గా ఉంది. ఒక్క వ్యక్తి ని అయినా కోల్పోవడమన్నది విచారకరం. అయితే లక్షలాది దేశవాసుల ప్రాణాల ను రక్షించడం లో భారతదేశం విజయం సాధించింది. కానీ మిత్రులారా, కరోనా ముప్పు తొలగిపోలేదు. ఇది చాలా చోట్ల వేగం గా వ్యాపిస్తోంది. మనం చాలా అప్రమత్తం గా ఉండాలి. కరోనా మొదట్లో ఉన్నంత ఘోరం గానే ఉందని మనం గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల మనం పూర్తి జాగ్రత్తల ను తీసుకోవాలి. ముఖానికి మాస్క్ ను ధరించడం, రెండు గజాల దూరం, తరచు గా చేతుల ను కడుక్కుంటూ ఉండడం, సర్వజనిక ప్రదేశాల లో ఉమ్మి వేయకపోవడం, శుభ్రత ను గురించి పూర్తి గా జాగ్రత్త వహించడం- ఇవి కరోనా బారి న పడకుండా మనలను మనం రక్షించుకోవడం లో మన యొక్క ఆయుధాలు గా పనిచేయగలవు. కొన్నిసర్లు మనకు మాస్క్ తో ఇబ్బంది ఉంటుంది; ముఖం నుండి మాస్కు ను తొలగించాలని అనిపిస్తుంది; అప్పుడే ముచ్చట్లు పెడుతూ ఉంటాము. మాస్క్ ను మరింత అవసరమైనప్పుడే తొలగిద్దాము. మాస్క్ కారణం గా మీకు ఇబ్బంది ఎదురైనప్పుడల్లా.. ఒక్క క్షణం.. ఆ వైద్యులను గుర్తు తెచ్చుకోండి; ఆ నర్సుల ను గుర్తు తెచ్చుకోండి; ఆ కరోనా వారియర్స్ ను గుర్తు తెచ్చుకోండి- గంటల తరబడి నిరంతరం మాస్క్ ను ధరించి, అందరి ప్రాణాల ను కాపాడడానికి వాళ్ళు చేసే కృషి ని గుర్తు తెచ్చుకోండి. వాళ్ళు ఎనిమిది నుండి పది గంటల పాటు మాస్క్ ను ధరిస్తున్నారు. వాళ్ళు ఇబ్బంది పడడం లేదా? వారిని కొంచెం గుర్తు తెచ్చుకోండి. నాగరికులు గా మనం మాస్క్ ను తీసివేయకూడదు. మరొకరి ని తీసివేయనీయ కూడదు. ఒక ప్రక్కన మనం పూర్తి అప్రమత్తత తో కరోనా తో పోరాడాలి. మరో ప్రక్కన మనం చేసే వ్యవసాయం, ఉద్యోగం, చదువు.. మనం చేసే ఏ పని లో అయినా సరే, వేగాన్ని సాధించాలి. మిత్రులారా, కరోనా కాలం లో మన గ్రామీణ ప్రాంతాలు యావత్తు దేశాని కి దిశానిర్దేశం చేశాయి. పౌరులు, గ్రామ పంచాయతీ లు చేసిన కృషి వివరాలు, వారి ప్రయత్నాల వివరాలు గ్రామాల నుండి నిరంతరం వస్తున్నాయి. జమ్ము లో త్రేవా అనే గ్రామ పంచాయతీ ఉంది. బల్ బీర్ కౌర్ గారు అక్కడి సర్పంచ్. బల్ బీర్ కౌర్ గారు తన పంచాయతీ లో 30 పడకల క్వారన్టీన్ కేంద్రాన్ని నిర్మించారని నాకు తెలిసింది. పంచాయతీ కి వచ్చే మార్గాల లో నీటి కోసం ఏర్పాట్లు చేశారు. చేతులు కడుక్కోవడం లో ప్రజల కు ఎటువంటి ఇబ్బంది ఉండకుండా ఏర్పాట్లు చేశారు. ఇది మాత్రమే కాదు, బల్ బీర్ కౌర్ గారు స్వయం గా, భుజం మీద వేలాడుతున్న స్ప్రే పంపు తో, స్వచ్ఛంద సేవకుల తో కలసి, మొత్తం పంచాయతీ లో, చుట్టుపక్కల ప్రాంతాల లో శానిటైజేషన్ కూడా చేస్తారు. అటువంటి మరో కశ్మీరీ మహిళ సర్పంచ్ విషయం కూడా చెప్తాను. గాందర్ బల్ లోని చౌంట్ లీవార్ గ్రామానికి చెందిన జైతూనా బేగమ్. తన పంచాయతీ కరోనా తో యుద్ధం చేయాలి, అలా యుద్ధం చేస్తూనే సంపాదించడానికి అవకాశాలను కూడా ఏర్పరచాలి అని జైతూనా బేగమ్ నిర్ణయించుకొన్నారు. ఆ ప్రాంతం అంతటా మాస్కుల ను, రేశన్ ను ఉచితం గా పంపిణీ చేశారు ఆవిడ. ప్రజల కు వివిధ పంటల కు సంబంధించిన విత్తనాలతో పాటు ఆపిల్ మొక్కల విత్తనాలను కూడా ఆమె ఇచ్చారు. తద్ద్వారా ప్రజలు వ్యవసాయం లో, తోటపనుల లో ఇబ్బందులు ఎదుర్కోకుండా చూశారు.
మిత్రులారా, కశ్మీర్ నుండి వచ్చిన మరో ఉత్తేజకరమైన సంఘటన ను గురించి చెప్తాను. అనంతనాగ్ లోని మ్యూనిసిపల్ ప్రెసిడెంటు శ్రీ మొహమ్మద్ ఇక్ బాల్ గారి కి సంబంధించిన సంఘటన ఇది. ఆ ప్రాంతం లో శానిటైజేశన్ కోసం ఒక స్ప్రేయర్ అవసరం. యంత్రాన్ని మరొక నగరం నుండి తీసుకురావలసి ఉంటుందని, ఖర్చు ఆరు లక్షల రూపాయలు అవుతుందని ఆయన తెలుసుకున్నారు. అప్పుడు ఇక్ బాల్ గారు స్వయం గా ప్రయత్నించి, ఒక స్ప్రేయర్ యంత్రాన్ని తయారుచేశారు. అది కూడా కేవలం యాభై వేల రూపాయల డబ్బు తో . ఇటువంటి ఉదాహరణ లు ఇంకా చాలా ఉన్నాయి. ఇటువంటి అనేక ఉత్తేజకరమైన సంఘటన లు ప్రతి రోజూ దేశం లోని ప్రతి మూల నుండీ ముందుకు వస్తున్నాయి. వారందరూ శుభాకాంక్షలు అందుకునేందుకు అర్హులు. సవాలు ఎదురైంది. కానీ ప్రజలు అంతే బలం తో దానిని ఎదుర్కొన్నారు.
నా ప్రియమైన దేశ వాసులారా, విపత్తు ను అవకాశం గా, విపత్తు ను అభివృద్ధి గా మార్చడం లో సరైన సానుకూల విధానం తో ఉండడం సహాయపడుతుంది. ప్రస్తుతం కరోనా సమయం లో మన దేశం లోని యువత, మహిళలు వారి వారి ప్రతిభ తోను, నైపుణ్య శక్తి తోను కొన్ని కొత్త ప్రయోగాల ను ఎలా ప్రారంభించారో కూడా చూస్తున్నాము. బిహార్ లోని చాలా మహిళా స్వయం సహాయక సమూహాలు మధుబనీ పెయింటింగ్ తో కూడిన మాస్కుల ను తయారు చేయడం ప్రారంభించాయి. అవి బాగా ప్రాచుర్యం పొందాయి. ఈ మధుబనీ మాస్కులు తమ సంప్రదాయాన్ని ఒక విధం గా ప్రచారం చేస్తాయి. ప్రజల కు ఆరోగ్యం తో పాటు ఉపాధి ని కూడా అందజేస్తాయి. ఈశాన్యం లో వెదురు ఎంత సమృద్ధి గా లభిస్తుందో మీకు తెలుసు. ఇప్పుడు ఈ వెదురు నుండి త్రిపుర, మణిపుర్, అసమ్ ల కళాకారులు అధిక నాణ్యత కలిగినటువంటి నీటి సీసాల ను, టిఫిన్ డబ్బాల ను తయారు చేయడం మొదలుపెట్టారు. మీరు వాటి నాణ్యత ను చూస్తే ఆశ్చర్యపోతారు. వెదురు తో అంత చక్కటి సీసా లు తయారయ్యాయంటే మీరు నమ్మరు. ఈ సీసా లు పర్యావరణ పరంగా అనుకూలమైనవి. వాటి తయారీ లో వెదురు ను మొదట వేప మొక్కల తోను, ఇతర ఔషధ మొక్కల తోను ఉడకబెట్టడం జరుగుతుంది. దీని వల్ల ఔషధ గుణాలు కూడా వాటి కి వస్తాయి.
చిన్న చిన్న స్థానిక ఉత్పత్తులు గొప్ప విజయాన్ని ఎలా ఇస్తాయో చెప్పేందుకు ఝార్ ఖండ్ కూడా ఒక ఉదాహరణ గా నిలుస్తుంది. ఝార్ ఖండ్ లోని బిషున్ పుర్ లో 30 కి పైగా సమూహాలు ఉమ్మడి గా లెమన్ గ్రాస్ ను సాగు చేస్తున్నాయి. ఈ నిమ్మకాయ గడ్డి నాలుగు నెలల్లో తయారవుతుంది. దాని నూనె ను మంచి ధరల కు బజారు లో విక్రయిస్తారు. ఈ కాలం లో దీనికి చాలా డిమాండ్ ఉంది. నేను దేశం లోని మరో రెండు ప్రాంతాల ను గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ రెండూ ఒకదానిరి మరొకటి వందల కిలోమీటర్ల దూరం లో ఉన్నాయి. భారతదేశాన్ని స్వావలంబన దిశ గా తీసుకుపోయేందుకు వివిధ మార్గాల లో కృషి చేస్తున్నాయి. వాటిలో ఒకటి లద్దాఖ్, మరొకటి కచ్ఛ్. లేహ్ మరియు లద్దాఖ్ ల పేర్లు వింటే అందమైన మైదానాలు, ఎత్తైన పర్వతాల దృశ్యాలు మన ముందు కనబడతాయి. స్వచ్ఛమైన గాలి అందించే శ్వాస ను అనుభూతి చెందుతాము. అదే సమయంలో కచ్ఛ్ పేరు చెప్తే సుదూరంగా ఉండే ఎడారి, కనుచూపు మేరలో చెట్లు, మొక్కలు కూడా కనబడని ప్రాంతం మన కళ్ల ముందు కనబడుతుంది. లద్దాఖ్ లో పండే ఎప్రికాట్ పండు ప్రత్యేకమైనది. ఈ పంట కు ఆ ప్రాంత ఆర్ధిక వ్యవస్థ ను మార్చే సామర్థ్యం ఉంది. కానీ, ఇది సరఫరా చేసే క్రమం లో అనేక సవాళ్ల తో ముడిపడి ఉంది. దాని సరఫరా లో వ్యర్థాల ను తగ్గించడానికి ఒక నూతన ఆవిష్కరణ ను ఉపయోగించడం ప్రారంభించారు. దాన్నే సోలర్ ఎప్రికాట్ డ్రయర్ ఎండ్ స్పేస్ హీటర్ అంటారు. ఇది ఎప్రికాట్ పండు తో పాటు ఇతర పండ్లను, కూరగాయల ను కూడా ఆరబెడుతుంది. ఇది చాలా పరిశుభ్రమైన పద్దతి. గతం లో పొలాల దగ్గర ఈ ఎప్రికాట్ లను ఎండబెట్టే పరిస్థితుల లో వృథా ఎక్కువ అయ్యేది. దుమ్ము, ధూళి, వర్షపు నీరు ల కారణం గా పండ్ల నాణ్యత కూడా ప్రభావితమయ్యేది. మరోవైపు, ఈ రోజుల్లో కచ్ఛ్ లోని రైతులు డ్రాగన్ ఫ్రూట్స్ ను పండించడానికి ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా మంది విన్నప్పుడు ఆశ్చర్యపోతారు – కచ్ఛ్ లో డ్రాగన్ ఫ్రూట్స్ ను గురించి చెప్తే చాలా మంది ఆశ్చర్య పోతారు. కానీ, అక్కడ నేడు చాలా మంది రైతులు ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. పండ్ల నాణ్యత ను పెంచడం, తక్కువ భూమి లో ఎక్కువ పంట ను పండించడం మొదలుకొని అనేక ఆవిష్కరణ లు జరుగుతున్నాయి. డ్రాగన్ ఫ్రూట్స్ కు ప్రజాదరణ నిరంతరం పెరుగుతోందని నాకు చెప్పారు. ముఖ్యం గా అల్పాహారం లో దీని వాడకం గణనీయం గా పెరిగింది. దేశం డ్రాగన్ ఫ్రూట్స్ ను దిగుమతి చేసుకోకూడదని కచ్ఛ్ రైతులు సంకల్పించారు. ఇది స్వయం సమృద్ధి కి సంబంధించిన విషయం.
మిత్రులారా, మనం వినూత్నం గా ఆలోచించినప్పుడు ఎవరూ ఊహించని పనులు కూడా సాధ్యమవుతాయి, ఉదాహరణ కు బిహార్ లోని కొంతమంది యువకుల కృషి ని గమనిద్దాము. వారు అంతకుముందు సాధారణ ఉద్యోగాలు చేసే వారు. ఒక రోజు వారు ముత్యాల ను పండించాలని నిర్ణయించుకున్నారు. తమ ప్రాంతం లో ప్రజల కు దీని గురించి పెద్ద గా తెలియదు. దాంతో వారు మొదట సమాచారాన్ని సేకరించారు. జయపుర్ కు, భువనేశ్వర్ కు వెళ్లి శిక్షణ తీసుకొన్నారు. తమ గ్రామంలోనే ముత్యాల సాగు ను ఆరంభించారు. నేడు వారు దీని నుండి చాలా సంపాదిస్తున్నారు. వారు ముజఫ్ఫర్ పుర్, బెగూసరాయ్, పట్ నా లో ఇతర రాష్ట్రాల నుండి తిరిగి వచ్చిన ప్రవాసీ శ్రమికుల కు శిక్షణ నివ్వడం మొదలుపెట్టారు. చాలా మందికి ఇది స్వావలంబన కు దారుల ను తెరచింది.
మిత్రులారా, కొద్ది రోజుల తరువాత రక్షాబంధన్ పర్వదినం వస్తోంది. చాలా మంది ప్రజలు, సంస్థలు ఈసారి రక్షాబంధన్ ను వైవిధ్యం గా జరుపుకోవాలని ప్రచారం చేయడాన్ని నేను గమనిస్తున్నాను. చాలా మంది దీనిని స్థానిక ఉత్పత్తుల ప్రచారానికి అనుసంధానిస్తున్నారు. ఇది నిజం. మన పండుగ, మన సమాజం. మన ఇంటికి సమీపంలో ఉన్న వ్యక్తి వ్యాపారం పెరగాలి. తద్వారా వారికి కూడా పండుగ సంతోషం గా ఉంటుంది. అప్పుడు, పండుగ ఆనందం విభిన్నం గా ఉంటుంది. దేశ రక్షా బంధన్ సందర్భం లో ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు.
మిత్రులారా, ఆగస్టు 7వ తేదీ న జాతీయ చేనేత దినోత్సవం. భారత హస్తకళ కు వందల సంవత్సరాల అద్భుతమైన చరిత్ర ఉంది. చేనేత ను, హస్తకళ ను భారతీయులు వీలైనంత ఎక్కువ గా ఉపయోగించాలని మనందరం ప్రయత్నం చేయాలి. అంతేకాకుండా భారతదేశం యొక్క చేనేత గురించి, భారతదేశం యొక్క హస్తకళల ను గురించి మనం వీలైనంత ఎక్కువ మంది కి ప్రచారం చేయాలి. ఈ కళల్లో చాలా వైవిధ్యం ఉంది. ఈ విషయాన్ని ఎంతగా ప్రచారం చేస్తే మన స్థానిక చేతివృత్తుల వారు, చేనేత కార్మికులు అంతగా ప్రయోజనాలను పొందుతారు.
మిత్రులారా, ముఖ్యంగా నా యువ స్నేహితులారా, మన దేశం మారుతోంది. ఎలా మారుతోంది? ఎంత వేగం గా మారుతోంది? ఏ రంగాల లో ఎంత వేగం గా మార్పు చోటు చేసుకొంటోంది? దానిని సానుకూల దృష్టి తో చూస్తే, మనమే ఆశ్చర్యపోతాం. గతం లో క్రీడల తో పాటు ఇతర రంగాల ను పరిశీలిస్తే ఆ రంగాల లో చాలా మంది వ్యక్తులు పెద్ద నగరాల నుండి, పెద్ద కుటుంబాల నుండి లేదా ప్రసిద్ధ పాఠశాలల నుండి లేదా కళాశాలల నుండి వచ్చే వారు. ఇప్పుడు దేశం మారుతోంది. మన యువత గ్రామాల నుండి, చిన్న పట్టణాల నుండి, సాధారణ కుటుంబాల నుండి ముందుకు వస్తున్నారు. విజయాలు సాధిస్తున్నారు. తమ కొత్త కలల ను కొనసాగిస్తూ, సంక్షోభాల మధ్య ముందుకు సాగుతున్నారు. ఇటీవల వచ్చిన బోర్డు పరీక్షల ఫలితాలలో ఇటువంటిదే మనకు కనిపిస్తుంది. ఈ రోజు ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మనం అటువంటి ప్రతిభావంతులైన పిల్లల తో మాట్లాడుతున్నాము. కృతికా నాందల్ అటువంటి ప్రతిభాశాలి పుత్రిక. కృతికా గారు హరియాణా లో పానీపత్ కు చెందిన వారు.
మోదీ గారు – హలో.. కృతికా గారు నమస్తే.
కృతికా- నమస్తే సర్.
మోదీ గారు – ఇంత మంచి ఫలితం వచ్చినందుకు మీకు చాలా అభినందనలు.
కృతికా – ధన్యవాదాలు సర్.
మోదీ గారు – ఈ రోజుల్లో టెలిఫోన్ కాల్స్ తో మీరు అలసి పోయి ఉంటారు. చాలా మంది నుండి ఫోన్లు వచ్చి ఉంటాయి.
కృతికా – అవును సర్.
మోదీ గారు – అభినందించే వారికి కూడాను, వారు సైతం గర్వపడుతూ ఉండి ఉంటారనుకుంటాను ఎందుకంటే వారు మిమ్ములను ఎరుగుదురు అని. మీకు ఎలా వుంది.
కృతికా – సర్.. చాలా బాగుంది. తల్లితండ్రులు గర్వపడేటట్టు చేయడం స్వయం గా నాకూ గర్వం గానే ఉంది.
మోదీ గారు – మంచిది, ఇది చెప్పండి మీకు ఎక్కువ ప్రేరణనిచ్చింది ఎవరంటారు
కృతికా – సర్! మా అమ్మయే క దా నాకు పెద్ద ప్రేరణ మూర్తి.
మోదీ గారు – భలే. సరే, మీరు మీ అమ్మ గారి వద్ద నుండి నేర్చుకొంటున్నదేమిటి?
కృతికా – సర్, ఆమె జీవితం లో చాలా ఇబ్బందుల ను చూశారు. అయినప్పటికీ ఆమె ఇంత ధైర్యం గాను, ఇంత బలం గాను ఉన్నారు, సర్. ఆమె ను చూసి చూసి ఎంత ప్రేరణ లభిస్తుంది అంటే నేను కూడా ఆమె లాగానే తయారు కావాలన్నంతగా.
మోదీ గారు – మీ అమ్మ గారు ఎంత వరకు చదువుకున్నారు.
కృతికా – సర్, బి.ఎ. చదివారు ఆమె.
మోదీ గారు – బిఎ చదివారా?
కృతికా – అవును సర్.
మోదీ గారు – సరే. మరి, మీ అమ్మగారు మీకు నేర్పిస్తారు కూడానా.
కృతికా – అవును సర్. నేర్పిస్తారు. లోకం పోకడ ను గురించిన ప్రతి విషయాన్ని ఆవిడ చెబుతుంటారు.
మోదీ గారు – ఆమె మందలిస్తూ ఉంటారు కూడా అనుకుంటాను.
కృతికా – అవును సర్.. ఆమె మందలిస్తారు కూడాను.
మోదీ గారు – మంచిదమ్మా.. మీరు ముందు ముందు ఏం చేయాలనుకుంటున్నారు?
కృతికా – సర్. నాకు డాక్టర్ అవ్వాలనుంది.
మోదీ గారు – ఓహ్.. !
కృతికా – ఎమ్ బిబిఎస్ చదవాలని.
మోదీ గారు – చూడండి.. డాక్టర్ అవ్వడం అంత తేలికైన పని కాదు!
కృతికా – అవును సర్.
మోదీ గారు – మీరు చాలా చురుకైన వారు కాబట్టి డిగ్రీ అయితే సంపాదించేయగలుగుతారు. కానీ తల్లీ, డాక్టర్ యొక్క జీవనం అది, సమాజం కోసం సమర్పణ కావలసివుంటుంది.
కృతికా – అవును సర్.
మోదీ గారు – ఒక డాక్టరు ఒక్కొక్క సారి రాత్రి పూట ప్రశాంతం గా నిదురించనైనే లేరు. ఒక్కొక్క సారి రోగి వద్ద నుండి ఫోన్ వచ్చేస్తుంది. మరొక్క మారు ఆసుపత్రి నుండి ఫోన్ చేస్తారు. మరి పరుగెత్తవలసివస్తుంది. అంటే ఒక విధం గా ప్రతి రోజూ 24 గంటలూ.. మూడు వందల అరవై ఐదు రోజులూ విధి నిర్వహణే నన్నమాట. ఒక డాక్టర్ యొక్క జీవనం ప్రజల సేవలోనే గడపవలసి ఉంటుంది.
కృతికా – యస్ సర్.
మోదీ గారు – మరి ప్రమాదమూ ఉంటుంది. ఎందుకంటే.. ఒక్కొక్క సారి తెలియదు, ఇవాళ రేపు ఎటువంటి వ్యాధులు వస్తున్నాయి అంటే డాక్టర్ల ముందు కూడా చాలా పెద్ద సంకటం వచ్చి నిల్చుంటుంది.
కృతికా – మరే, సర్.
మోదీ గారు – సరి కృతికా, హరియాణా అయితే ఆటపాటల్లో యావత్తు భారతదేశానికే ఎల్లప్పుడూ ఉత్తేజాన్ని, ప్రోత్సాహాన్ని ఇచ్చే రాష్ట్రం గా ఉంది కద.
కృతికా – అవును సర్.
మోదీ గారు – అయితే మరి మీరు కూడా ఏదైనా క్రీడల లో పాల్గొంటూ ఉంటారా?, ఏవైనా ఆటలంటే మీకు ఇష్టమా?
కృతికా – సర్.. బాస్కెట్‌బాల్ ఆడేదాన్ని, బడి లో.
మోదీ గారు – అలాగా.. మీ ఎత్తు ఎంత? ఎక్కువ ఎత్తు ఉంటారా మీరు?
కృతికా – లేదు సర్. ఐదు అడుగుల రెండు అంగుళాలు ఉంటాను.
మోదీ గారు – అలాగా.. ఆట మీకు బాగా ఇష్టమా?
కృతికా – సర్.. అదంటే ఉద్వేగంగా ఉంటుంది, ఆడేస్తుంటాను.
మోదీ గారు – మంచిది, మంచిది. సరే, కృతికా గారు.. మీ అమ్మగారి కి నా తరఫు న ప్రణామాలు పలకండి. వారు మిమ్ములను ఈ విధమైనటువంటి యోగ్యురాలు గా చేశారు. మీ యొక్క జీవనాన్ని తీర్చిదిద్దారు. మీ అమ్మ గారికి నమస్సులు మరియు అనేకానేక శుభాకాంక్షలూను. ఇంకా, మీకు కూడాను అభినందనలు. అనేకానేక శుభాకాంక్షలు.
కృతికా – ధన్యవాదాలు సర్.
రండి! ఇప్పుడు మనం కేరళ లోని ఎర్నాకులం కు పోదాము. కేరళ యొక్క నవ యువకుని తో మాట్లాడదాము.
మోదీ గారు – హెలో.
వినాయక్ – హెలో సర్. నమస్కారం.
మోదీ గారు – వినాయక్.. అభినందనలు.
వినాయక్ – ధన్యవాదాలు సర్,
మోదీ గారు – శభాశ్ వినాయక్.. శభాశ్
వినాయక్ – ధన్యవాదాలు సర్,
మోదీ గారు – జోశ్ ఎలా ఉంది
వినాయక్ – అధికం గా ఉంది సర్..
మోదీ గారు – మీరు ఏదైనా ఆట ఆడుతారా?
వినాయక్ – బాడ్ మింటన్ ఆట.
మోదీ గారు – బాడ్ మింటన్..
వినాయక్ – అవును సర్.
మోదీ గారు – ఒక బడి లో లేదా మరెక్కడైనా మీకు శిక్షణ తీసుకునే అవకాశం ఉందా?
వినాయక్ – లేదు సర్ .. బడి లో ఇప్పటికే మేము కొంత శిక్షణ ను పొందాము.
మోదీ గారు – ఊఁ.
వినాయక్ – మా ఉపాధ్యాయుల నుండి శిక్షణ ను స్వీకరించాము సర్.
మోదీ గారు – ఆహాఁ, అలాగా.
వినాయక్ – తద్ద్వారా మాకు బయట పాల్గొనే అవకాశం లభిస్తుంది సర్
మోదీ గారు – వావ్
వినాయక్ – పాఠశాల నుండే సర్.
మోదీ గారు – మీరు ఎన్ని రాష్ట్రాల ను సందర్శించారు?
వినాయక్ – నేను కేరళ ను, ఇంకా తమిళ నాడు ను మాత్రమే సందర్శించాను సర్.
మోదీ గారు – కేరళ, ఇంకా తమిళ నాడు మాత్రమేనా.
వినాయక్ – అవును సర్.
మోదీ గారు – మరి, మీరు దిల్లీ ని సందర్శించాలనుకుంటున్నారా?
వినాయక్ – అవును సర్. ఇప్పుడు, పై చదువుల కోసం దిల్లీ విశ్వవిద్యాలయం లో దరఖాస్తు చేస్తున్నాను.
మోదీ గారు – బలే. అంటే మీరు దిల్లీ కి వస్తున్నారన్నమాట.
వినాయక్ – మరే.. అవును సర్.
మోదీ గారు – చెప్పండి.. భవిష్యత్తు లో బోర్డ్ పరీక్షలు వ్రాసే తోటి విద్యార్థుల కోసం ఏదైనా సందేశం ఇస్తారా?
వినాయక్ – కఠోరం గా శ్రమించడం, ఇంకా కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం సర్.
మోదీ గారు – అంటే పరిపూర్ణ కాల నిర్వహణ అనేదే మీ సందేశమా
వినాయక్ – అవును సర్.
మోదీ గారు – వినాయక్.. నేను మీ అలవాటుల ను గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను.
వినాయక్ – ……… బ్యాడ్మింటన్ మరియు రోయింగ్ సర్.
మోదీ గారు – మీరు సోశల్ మీడియా లో క్రియాశీలం గా ఉన్నారా
వినాయక్ – లేదు సర్.. ఎటువంటి ఇలెక్ట్రానిక్ సాధనాలను గానీ లేదా గాడ్జెట్ లను గానీ ఉపయోగించడానికి స్కూల్ లో మాకు అనుమతి ఇవ్వరు.
మోదీ గారు – అంటే మీరు అదృష్టవంతులన్నమాట
వినాయక్ – అవును సర్.
మోదీ గారు – సరే.. వినాయక్.. మరో మారు అభినందనలు. మీ అందరికీ శుభాకాంక్షలు. ఆల్ ద బెస్ట్.
వినాయక్ – ధన్యవాదాలు సర్.
రండి! మనం ఉత్తర్ ప్రదేశ్ కు వెళ్దాము. ఉత్తర్ ప్రదేశ్ లోని అమ్ రోహా కు చెందిన ఉస్మాన్ సైఫీ తో మాట్లాడదాము..
మోదీ గారు – హెలో ఉస్మాన్. మీకు అనేకానేక అభినందనలు.
ఉస్మాన్ – ధన్యవాదాలు సర్.
మోదీ గారు – సరే ఉస్మాన్.. మాకు చెప్పండి.. మీరు కోరుకున్నన్ని మార్కులు వచ్చాయా.. తక్కువ గా వచ్చాయా?
ఉస్మాన్ – లేదు. నేను కోరుకున్నన్నే వచ్చాయి.. నా తల్లితండ్రులు కూడా చాలా సంతోషం గా ఉన్నారు.
మోదీ గారు – వాహ్, మంచి కుటుంబం. ఇంట్లో మీరు మాత్రమే ఇంత చురుకు గా ఉన్నారా?
ఉస్మాన్ – నేను మాత్రమే సర్. నా సోదరుడు కొంచెం కొంటె వాడు.
మోదీ గారు – అలాగా..
ఉస్మాన్ – మిగతా వారు నా గురించి చాలా సంతోషం గా ఉన్నారు.
మోదీ గారు – సరే.. బాగుంది. బాగా మీరు చదువుతున్నప్పుడు మీకు ఇష్టమైన సబ్జెక్ట్ ఏమిటి?
ఉస్మాన్ – గణితం.
మోదీ గారు – వాహ్.. ! గణితశాస్త్రం లో ఆసక్తి ఎలా ఉండేది ? ఏ మాస్టారు మీకు స్ఫూర్తి ని ఇచ్చారంటారు?
ఉస్మాన్ – మా సబ్జెక్ట్ టీచర్ లలో రజత్ సర్ అని ఒకరు ఉన్నారు. నాకు ప్రేరణనిచ్చింది ఆయనే. మరి వారు చాలా బాగా చదువు చెప్తారు. నాకు మొదటి నుండి నాకు గణితం అంటేనే మక్కువ గా ఉంటూ వచ్చింది. మరి అది చాలా ఆసక్తిదాయకమైన సబ్జెక్టు కూడాను.
మోదీ గారు – ఊఁ.
ఉస్మాన్ – ఎంత ఎక్కువ గా లెక్కలు చేస్తే అంత గా ఆసక్తి వస్తుంది. అందుకే గణితం నా అభిమాన పాత్రమైనటువంటి సబ్జెక్టు.
మోదీ గారు – ఊఁ. ఊఁ.. ఆన్లైన్ వేద గణితం తరగతులు జరుగుతాయి అనే సంగతి మీకు తెలుసా?
ఉస్మాన్ – అవును సర్.
మోదీ గారు – మరి మీరు ఎప్పుడైనా ప్రయత్నించారా?
ఉస్మాన్ – లేదు సర్. ఇంకా చేయలేదు.
మోదీ గారు – వాటిలో మీరు చేరితే.. మీ మిత్రులందరూ మిమ్మల్ని ఒక ఇంద్రజాలికుడిగా చూస్తారు.. ఎందుకంటే కంప్యూటర్ యొక్క స్పీడ్ తో మీరు వేద గణితం లెక్కలు చేయవచ్చు. ఎంతో సరళమైనటువంటి టెక్నిక్ లు ఉన్నాయి. ఇంకా ఈ రోజులలో అవి ఆన్లైన్ లో కూడా అందుబాటు లో ఉన్నాయి.
ఉస్మాన్ – చెప్పండి సర్.
మోదీ గారు – గణితం అంటే మీకు ఆసక్తి ఉన్నందు వల్ల, కొత్త విషయాల ను కూడా మీరు చెప్పవచ్చు.
ఉస్మాన్ – సర్.
మోదీ గారు – సరే ఉస్మాన్.. ఖాళీ సమయం లో మీరు ఏం చేస్తారు?
ఉస్మాన్ – సర్, నేను ఖాళీ సమయం లో ఏదో ఒకటి వ్రాస్తూ నే ఉంటాను సర్. వ్రాయడం అంటే నాకు చాలా ఆసక్తి ఉంది.
మోదీ గారు – బాగుంది.. ! మీరు గణితం పై కూడా ఆసక్తి చూపుతారు. సాహిత్యం అన్నా కూడా మీకు ఆసక్తి ఉంది.
ఉస్మాన్ – అవును సర్.
మోదీ గారు – మీరు ఏమి వ్రాస్తారు? కవితలు వ్రాస్తారా.. శాయరీలా..
ఉస్మాన్ – కరెంట్ అఫైర్స్ కు సంబంధించిన ఏదైనా అంశంపై నేను వ్రాస్తూ ఉంటాను.
మోదీ గారు – ఓహ్.. అలాగా.
ఉస్మాన్ – కొత్త కొత్త విషయాలు తెలుస్తూ ఉంటాయి సర్.. జిఎస్ టి, పెద్ద నోట్ల రద్దు.. ఇలా.. అన్ని విషయాలు.
మోదీ గారు – ఓహ్! మీరు కళాశాల లో పై చదువులు చదువుకోవడానికి తదుపరి ప్రణాళిక ఏం చేస్తున్నారు?
ఉస్మాన్ – కళాశాల లో చదువుకుంటున్నా సర్.. జెఇఇ మెయిన్స్ మొదటి ప్రయత్నం లో క్లియర్ చేశాను. రెండో ప్రయత్నం లో ఇప్పుడు సెప్టెంబర్ లో రాస్తాను. నా ప్రధాన లక్ష్యం ఏమిటంటే.. నేను మొదట ఐఐటి నుండి బ్యాచిలర్ డిగ్రీ ని పొందాలి. ఆ తరువాత సివిల్ సర్వీసెస్ కు వెళ్లి ఐఎఎస్ అవ్వాలి.
మోదీ గారు – ఓహ్! మీరు టెక్నాలజీ పైన కూడా ఆసక్తి ని చూపుతున్నారా?
ఉస్మాన్ – అవును సర్. అందుకే నేను ఐఐటి లో ఐ. టి. ని ఎంచుకున్నాను
మోదీ గారు – అలాగే ఉస్మాన్.. మీకు నా శుభాకాంక్షలు. మీ సోదరుడు కొంటె గా ఉంటే మీకు సమయం కూడా బాగా గడుస్తుంది. మీ అమ్మానాన్నల కు నా నమస్కారాలు చెప్పండి. వారు మీకు ఈ విధంగా ఒక అవకాశాన్ని ఇచ్చారు. ప్రోత్సహిస్తున్నారు. మీరు చదువు తో పాటు ప్రస్తుత సమస్యల ను అధ్యయనం చేయడం, వ్రాస్తూ ఉండడం నాకు నచ్చాయి. చూడండి.. వ్రాయడం వల్ల కలిగే ప్రయోజనం ఏమిటంటే మీ ఆలోచన లు పదును గా అవుతాయి. అభినందనలు..
ఉస్మాన్ – ధన్యవాదాలు సర్.
రండి! దక్షిణం వైపునకు వెళ్దాం. తమిళ నాడు లోని నామక్కల్ నుండి పుత్రిక కనిగా తో మాట్లాడదాం .. కనిగా తో సంభాషణ ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది.
మోదీ గారు- కనిగా గారూ.. వణక్కమ్.
కనిగా- వణక్కమ్ సర్..
మోదీ గారు- ఎలా ఉన్నారు మీరు
కనిగా- బావున్నాను సర్
మోదీ గారు- మొదట గొప్ప విజయం సాధించిన మిమ్మల్ని అభినందించాలనుకుంటున్నాను.
కనిగా- ధన్యవాదాలు సర్.
మోదీ గారు- నామక్కల్ ను గురించి విన్నప్పుడు, నాకు ఆంజనేయర్ దేవాలయం గుర్తుకు వస్తుంది.
కనిగా- అవును సర్.
మోదీ గారు- ఇప్పుడు నేను మీతో నా సంభాషణ ను కూడా గుర్తుంచుకొంటాను.
కనిగా- అలాగే సర్.
మోదీ గారు- కాబట్టి.. మళ్ళీ అభినందనలు.
కనిగ్గ- ధన్యవాదాలు సర్.
మోదీ గారు- మీరు పరీక్షల కోసం చాలా కష్టపడ్డారు. పరీక్షల కు సిద్ధమవుతున్నప్పుడు మీ అనుభవం ఎలా ఉంది?
కనిగా- సర్… మేము మొదటి నుండి చాలా కష్టపడుతున్నాము. ఈ ఫలితం ఊహించలేదు. కానీ పరీక్ష బాగా వ్రాసినందువల్ల , మంచి ఫలితం వచ్చింది.
మోదీ గారు- మీరు ఎన్ని మార్కులు వస్తాయని ఊహించారు?
కనిగా- 485 లేదా 486 .. అలా వస్తాయి అనుకున్నాను
మోదీ గారు- ఇప్పుడు ఎన్ని వచ్చాయి?
కనిగా- 490.
మోదీ గారు- మీ కుటుంబ సభ్యులు, మీ ఉపాధ్యాయుల స్పందన ఏమిటి ?
కనిగా- వారు చాలా సంతోషం గా ఉన్నారు. వారికి చాలా గర్వం గా ఉంది సర్.
మోదీ గారు- మీకు ఇష్టమైన విషయం ఏది?
కనిగా- గణితం.
మోదీ గారు- ఓ! మీ భవిష్యత్తు ప్రణాళిక లు ఏమిటి?
కనిగా- నేను డాక్టర్ అవుతాను సర్.. వీలయితే ఎఎఫ్ ఎమ్ సి నుండి..
మోదీ గారు- మీ కుటుంబ సభ్యులు వైద్య వృత్తి లో ఉన్నారా.. లేదా వేరే ఏదైనా వృత్తి లో ఉన్నారా?
కనిగా- లేదు సర్. నాన్న డ్రైవర్. అయితే నా సోదరి ఎమ్ బిబిఎస్ చదువుతోంది సర్.
మోదీ గారు- వావ్! కాబట్టి మొదట నేను మీ నాన్న కు నమస్కారాలు చేస్తాను. మీ సోదరి గురించి, మీ గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న తండ్రి ఆయన. ఆయన చేసేది గొప్ప సేవ.
కనిగా- అవును సర్.
మోదీ గారు- ఆయన అందరికీ ప్రేరణ.
కనిగా- అవును సర్.
మోదీ గారు- మీకు, మీ సోదరి కి, మీ నాన్న కు , మీ కుటుంబాని కి అభినందనలు.
కనిగా- ధన్యవాదాలు సర్.
మిత్రులారా, క్లిష్ట పరిస్థితుల లో కూడా ఉత్సాహం ప్రదర్శించే అలాంటి యువ స్నేహితుల విజయ గాథ లు మనకు స్ఫూర్తిని ఇస్తాయి. వీలైనంత ఎక్కువ మంది యువ మిత్రుల తో మాట్లాడే అవకాశం ఉండాలని నా మనసు లో ఉంటుంది. అయితే సమయానికి కొన్ని పరిమితులు కూడా ఉన్నాయి. దేశాని కి స్ఫూర్తి ని ఇచ్చే వారి విజయ గాథల ను, అందరితో పంచుకోవాలని నేను యువ సహచరులందరినీ కోరుతున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా, ఏడు సముద్రాలు దాటిన తరువాత.. భారతదేశం నుండి వేల మైళ్ళ దూరం లో ‘సురినామ్’ అనే చిన్న దేశం ఉంది. సురినామ్ తో భారతదేశానికి చాలా సన్నిహిత సంబధాలు ఉన్నాయి. వంద సంవత్సరాల కంటే ముందు భారతదేశం నుండి ప్రజలు అక్కడికి వెళ్లి దానిని తమ నివాసం గా చేసుకున్నారు. నేడు అక్కడ నాలుగో-ఐదో తరం భారతీయ సంతతి వారు ఉన్నారు. ఈ రోజు, సురినామ్ లో నాలుగింట ఒక వంతు కంటే ఎక్కువ మంది భారతీయ సంతతి కి చెందిన వారు. మీకు తెలుసా.. అక్కడి సాధారణ భాషల లో ఒకటైన ‘సర్ నామీ’ కూడా ‘భోజ్‌పురి’ భాష లో మాండలికం. ఈ సాంస్కృతిక సంబంధాల వల్ల భారతీయులైన మనం చాలా గర్వం గా భావిస్తున్నాం..
ఇటీవల శ్రీ చంద్రిక ప్రసాద్ సంతోఖీ సురినామ్ యొక్క నూతన అధ్యక్షుడు అయ్యారు. ఆయన భారతదేశానికి మిత్రుడు. 2018 వ సంవత్సరం లో జరిగిన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ (పిఐఒ) పార్లమెంటరీ సమావేశాని కి కూడా హాజరయ్యారు. శ్రీ చంద్రికా ప్రసాద్ సంతోఖీ గారు వేద మంత్రాల తో ప్రమాణ స్వీకారం ప్రారంభించారు. ఆయన సంస్కృతం లో మాట్లాడారు. వేదాల ను ప్రస్తావించారు. ‘‘ఓమ్ శాంతి: శాంతి: శాంతి’’ తో ప్రమాణ స్వీకారం పూర్తి చేశారు. తన చేతి లో వేదాల ను తీసుకొని ఆయన ఇలా అన్నారు.. “నేను, చంద్రికా ప్రసాద్ సంతోఖీ” అని.. మరి ఆనక ప్రమాణ స్వీకారం లో ఆయనేం చెప్పారు? ఆయన వేదాల లోని ఒక మంత్రాన్ని జపించారు. ఆయన ఇలా అన్నారు..
“ఓమ్ అగ్నే వ్రతపతే వ్రతం చరిష్యామి తచ్ఛకేయం తన్మే రాధ్యతామ్..
ఇదమహమనృతాత్ సత్యముపైమి” అని.
ఈ మాటల కు- అగ్ని సంకల్ప దేవుడు. నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను. దీని కోసం అగ్ని నాకు శక్తి ని మరియు సామర్థ్యాన్ని ప్రదానం చేయుగాక.. అసత్యానికి దూరం గా ఉండి సత్యం వైపు వెళ్ళవలసింది అని నన్ను ఆశీర్వదించు గాక.. – అని భావం.
నిజం గా, ఇది మనందరికీ గర్వించదగ్గ విషయం.
నేను శ్రీ చంద్రిక ప్రసాద్ సంతోఖీ ని అభినందిస్తున్నాను. దేశసేవ చేయడం కోసం 130 కోట్ల మంది భారతీయుల పక్షాన ఆయన కు శుభాకాంక్షలను వ్యక్తం చేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా, ఇది వర్షాల కాలం కూడా. వర్షం నుండి దుమ్ము, ధూళి, వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఇంతకుముందు సారి కూడా నేను మీకు చెప్పాను. వైద్యశాలల లో రద్దీ కూడా పెరుగుతుంది. కాబట్టి మీరు పరిశుభ్రత పట్ల చాలా శ్రద్ధ వహించాలి. వ్యాధి నిరోధక శక్తి ని పెంచే విషయాలు.. ఆయుర్వేద కషాయాల ను తీసుకోవడం మొదలైనవి పాటించాలి. కరోనా వ్యాప్తి కాలం లో మనం ఇతర వ్యాధుల నుండి దూరంగా ఉండాలి. ఆసుపత్రి ని సందర్శించాల్సిన అవసరం లేకుండా జాగ్రత్త పడాలి.
మిత్రులారా, వర్షాకాలంలో దేశం లో అధిక భూ భాగం వరదల ను ఎదుర్కొంటోంది. బిహార్, అసమ్ ల వంటి రాష్ట్రాల లో చాలా ప్రాంతాల లో వరదలు అనేక ఇబ్బందులను సృష్టించాయి. అంటే ఒక వైపు కరోనా ఉంది.. మరొక వైపు ఇది మరొక సవాలు. అన్ని ప్రభుత్వాలు, ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు, రాష్ట్ర విపత్తు నియంత్రణ బృందాలు , స్వచ్ఛంద సంస్థలు.. అన్నీ కలసి ఉపశమన చర్యలను, సహాయక చర్యల ను నిర్వహిస్తున్నాయి. ఈ విపత్తు తో బాధపడుతున్న ప్రజలందరికీ సహాయం గా యావత్తు దేశం నిలుస్తుంది.
మిత్రులారా, మరుసటి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మనం కలిసే కన్నా ముందుగానే ఆగస్టు 15 కూడా వస్తోంది. ఈసారి ఆగస్టు 15 కూడా భిన్నమైన పరిస్థితుల లో ఉంటుంది. కరోనా మహమ్మారి పరిస్థితుల లో ఈ ఉత్సవం జరుగుతుంది. మహమ్మారి నుండి స్వాతంత్రం పొందుతామని స్వాతంత్ర్య దినోత్సవం రోజు న ప్రతిజ్ఞ చేయాలని యువత ను, దేశవాసులను నేను కోరుతున్నాను. స్వావలంబన కలిగిన భారతదేశం కోసం ప్రతిజ్ఞ చేయాలని కోరుతున్నాను. కొత్త విషయాలను నేర్చుకోవాలని, నేర్పాలని సంకల్పించాలని, కర్తవ్యాలను నెరవేర్చడానికి సంకల్పించాలని యువత ను, దేశ ప్రజలందరినీ నేను అభ్యర్థిస్తున్నాను. ఈ రోజు మన దేశం ఉన్నత స్థాయి లో ఉండడానికి దేశ నిర్మాణానికి తమ జీవితాలను అంకితం చేసిన ఎంతో మంది గొప్ప వ్యక్తులే కారణం. ఆ గొప్ప వ్యక్తుల లో ఒకరు ‘లోక మాన్య తిలక్’. 2020 ఆగష్టు 1వ తేదీ న లోక మాన్య తిలక్ గారి 100 వ వర్ధంతి. లోక మాన్య తిలక్ గారి జీవితం మనందరికీ పెద్ద ప్రేరణ. మనకు చాలా విషయాలు నేర్పుతుంది.
ఈ సారి మనం కలుసుకొన్నప్పుడు మనం చాలా విషయాలను గురించి మాట్లాడుకుందాము. కొత్త విషయాల ను కలసి నేర్చుకుందాము. అందరితోనూ పంచుకుందాము. మీరందరూ మిమ్మల్ని మీరు జాగ్రత్త గా చూసుకోండి. మీ కుటుంబాన్ని జాగ్రత్త గా చూసుకోండి. ఆరోగ్యం గా ఉండండి. రాబోయే అన్ని పండుగ ల సందర్భం లో దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం.
‘‘మన్ కీ బాత్’’ (మనసు లో మాట) ఇప్పుడు 2020 వ సంవత్సరం లో తన ప్రయాణం లో సగం మార్కు ను సాధించింది. ఈ కాలం లో, మనం అనేకానేక విషయాల గురించి మాట్లాడుకున్నాము. సహజంగానే, మన సంభాషణల లో ఎక్కువ భాగం ప్రపంచ మహమ్మారి చుట్టూ తిరిగింది; ఇది మానవ జాతి ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తు. అయితే, ఈ రోజుల్లో నేను గమనిస్తున్నాను, “ఈ సంవత్సరం ఎప్పుడు గడుస్తుంది !” అనేది ప్రజలలో అంతులేని చర్చనీయాంశం గా ఉంది. ‘‘ఈ సంవత్సరం ఎందుకు ఇంత మందకొడిగా సాగుతోంది?’’ అనే ప్రశ్నతోనే మన ఫోను సంభాషణ లు ప్రారంభం అవుతున్నాయి. సంవత్సరం ఎందుకు మంచి గా లేదని ప్రజలు వ్రాస్తున్నారు, స్నేహితుల తో సంభాషిస్తున్నారు. వారిలో కొందరు 2020 వ సంవత్సరం శుభప్రదమైంది కాదని పేర్కొంటున్నారు. ఈ సంవత్సరం ఎలాగో అలాగా తొందర గా గడిస్తే చాలని ప్రజలు కోరుకుంటున్నారు.
మిత్రులారా, ఇలా ఎందుకు జరుగుతోంది అని కొన్ని సార్లు ఆలోచిస్తుంటాను. అటువంటి చర్చల కు కొన్ని కారణాలు ఉండవచ్చు. కేవలం 6-7 నెలల క్రితం, కరోనా అనే విపత్తు ను గురించి మనకు అసలు తెలియదు, లేదా పోరాటం ఇంత సుదీర్ఘ కాలం సాగుతుందని ఊహించలేదు. ఒక విపత్తు ఇళ్ల ఉండగా, ఇది సరిపోదన్నట్టు, దేశం లో రోజురోజు కు అంతులేని సవాళ్లు ఎదురుపడుతూనే ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం, మన తూర్పు తీరం లో అమ్ఫాన్ తుఫాను, పశ్చిమ తీరంలో నిసర్గ్ తుఫాను లు వచ్చాయి. ఇంకా అనేక రాష్ట్రాల లో, మన రైతు సోదరులు, మన రైతు సోదరీమణులు మిడతల దండు ల భారాన్ని భరించాల్సి వచ్చింది…. ఇవేమీ కాకపోతే, దేశం లోని అనేక ప్రాంతాల లో అడపాదడపా భూకంపాలు సంభవించాయి. వీటన్నిటి మధ్య, మన పొరుగు దేశాల తో కూడా మన దేశం కొన్ని సవాళ్ళ ను ఎదుర్కోవలసి వచ్చింది. వాస్తవానికి, ఈ రకమైన ప్రతికూలతలు అన్నిటినీ ఒకే సారి విన్న సందర్భాలు చాలా అరుదు. ఏదైనా చిన్న సంఘటన జరిగినా ప్రజలు ఆ సంఘటనల ను ఈ సవాళ్ళ తో అనుసంధానం చేసి చూస్తున్న దశ లో మనం ఉన్నాము.
మిత్రులారా, కష్టాలు మన మీదకు వస్తాయి; విపత్తు లు మనల ను ఎదుర్కొంటాయి…. కానీ ప్రశ్న ఏమిటి అంటే – 2020 వ సంవత్సరం మంచిది కాదనే విస్వాశాన్ని మనం కొనసాగించాలా? మొదటి ఆరు నెలల్లో పరిస్థితి ఆధారం గా మొత్తం సంవత్సరం అలాగే ఉంటుందని ఊహించడం ఎంతవరకు సరైంది? నా ప్రియమైన దేశవాసులారా, ఖచ్చితం గా ఇది సరి కాదు. ఏదైనా ఒక సంవత్సరం లో, సవాళ్లు ఒకటి నుండి యాభై మధ్య ఉండవచ్చు, ఆ సంఖ్య ఆధారం గా ఆ సంవత్సరం మంచిదనీ లేదా చెడ్డదనీ నిర్ణయించకూడదు. చరిత్ర ఆధారం గా చూస్తే, భారతదేశం ఎల్లప్పుడూ ప్రకాశవంతం గా మరియు బలం గా నిలబడింది, అన్ని రకాల విపత్తు లు మరియు సవాళ్ళపై విజయాన్ని సాధించింది. శతాబ్దాలు గా, అనేక మంది దౌర్జన్యం గా భారతదేశం పై దాడి చేశారు. కష్టాల అగాధం అంచు కు నెట్టి వేశారు. ఒకానొక కాలం లో భారతదేశం తుడిచిపెట్టుకుపోతుందనీ, భారతీయ సంస్కృతి సర్వనాశనమవుతుందనీ భావించారు. కానీ, భారతదేశం, ఈ సంక్షోభాల కారణం గా, మరింత మహిమాన్వితం గా మారింది.
మిత్రులారా, మన వాళ్లు ఈ మాటలు అంటాప్తారు.. ‘సృజన శాశ్వతంగా ఉంటుంది, సృజన నిరంతరాయం గా ఉంటుంది’ అని. నాకు ఒక పాట లోని కొన్ని పంక్తులు ఈ సందర్భం లో గుర్తు కు వస్తున్నాయి.
యహ్ కల్- కల్ ఛల్-ఛల్ బహ్ తీ, క్యా కహ్ తీ గంగా ధారా ?
యుగ్ యుగ్ సే బహ్ తా ఆతా, యహ్ పుణ్య్ ప్రవాహ్ హమారా.
గల గల మనే , గంగా నది అల లు ఏమంటున్నాయి ?
రాళ్లు, రప్పలు ఆపలేనిది, మన శక్తివంతమైన దైవిక ప్రవాహం.
అదే పాట లో ఆ తరువాతి పంక్తులు ఇలా ఉంటాయి ..
క్యా ఉస్ కో రోక్ సకేంగే , మిట్ నే వాలే మిట్ జాయేఁ,
కంకడ్ -పత్థర్ కీ హస్తీ, క్యా బాధా బన్ కర్ ఆయేఁ .
స్థిరమైన ప్రవాహాన్ని నిరోధించే శక్తి ఎవరి కి ఉంది….
జాడ లేకుండా చాలా మునిగిపోయాయి!
గులకరాళ్ళు అయినా, రాళ్ళు అయినా ఏమి చేయగలవు,
దైవ కృప కు ఎప్పుడైనా అడ్డు ఉందా?
భారతదేశం కూడా, ఒక వైపు, భారీ ప్రతికూలతల ను ఎదుర్కొంటూనే ఉంది, మరో వైపు, అనేక రకాల పరిష్కారాలు అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి, అడ్డంకుల ను అధిగమిస్తూనే ఉంది. సాహిత్యం పునరుజ్జీవం చూసింది, కొత్త పరిశోధనలు వెలువడ్డాయి, కొత్త అంశాలు పుట్టుకొచ్చాయి. దీని అర్థం, క్లిష్ట కాలాల లో కూడా, ప్రతి రంగం లో సృష్టి ప్రక్రియ నిరాకంటం గా సాగి, మన సంస్కృతి ని సుసంపన్నం చేసి, మన దేశం యొక్క పురోగతి కి దారితీసింది. భారతదేశం ఎప్పుడూ కష్టాలను విజయాని కి మెట్టు గా మార్చుకొంది. అదే మనోబలం తో, నేటి కష్ట కాలాల లో సైతం మనం ముందుకు సాగాలి. మీరు ముందుకు సాగితే, 130 కోట్ల మంది దేశ ప్రజలు ముందుకు సాగుతారు, అప్పుడు, ఈ సంవత్సరం, దేశాని కి కీర్తి ని సాధించే ఏడాది గా రుజువు అవుతుంది. ఈ సంవత్సరం దేశం నవీన లక్ష్యాల ను సాధిస్తుంది, అన్ని క్రొత్త రెక్కల తో నూతన శిఖరాల కు చేరుకొంటుంది. 130 కోట్ల మంది దేశవాసుల సామూహిక శక్తి ని నేను గట్టిగా నమ్ముతున్నాను… అందులో మీ అందరూ ఉన్నారు. …… అద్భుతమైన ఈ దేశ వారసత్వం పైన నాకు గట్టి నమ్మకం ఉంది.
నా ప్రియమైన దేశవాసులారా, మనకు ఎదురయ్యే విపత్తు తో సంబంధం లేకుండా, భారతదేశం యొక్క సంస్కారం … జీవన విధానం మనలో ప్రతి ఒక్కరి ని నిస్వార్థం గా సేవ చేయడానికి ప్రేరేపిస్తుంది. క్లిష్ట సమయాల లో భారతదేశం ప్రపంచాని కి సహాయం అందించిన విధానం, శాంతి మరియు అభివృద్ధి లో భారతదేశం యొక్క పాత్ర ను మరింత బలపరిచింది. భారతదేశం యొక్క విశ్వవ్యాప్త సోదర స్ఫూర్తి ని ప్రపంచం గ్రహించింది… అదే సమయంలో భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని మరియు ప్రాదేశిక సమగ్రత ను కాపాడటాని కి భారత ప్రజల నిబద్ధత మరియు శక్తి ని కూడా గమనించింది. లద్దాఖ్ లోని భారతీయ గడ్డ పైకి, కన్నెత్తి చూసే వారికి తగిన జవాబే దొరికింది. భారతదేశం, మిత్రత్వం యొక్క స్ఫూర్తి ని గౌరవిస్తుంది.. అలాగే ఏ విరోధికైనా, జంకకుండా దీటైన జవాబు ను కూడా ఇవ్వగలదు. కళ్ల లోకి కళ్లు పెట్టి చూడడం, ఇంకా తగ్గ జవాబు ఇవ్వడం కూడా భారతదేశాని కి తెలుసును. మన వీర సైనికులు భరత మాత యొక్క గౌరవానికి ఎట్టి పరిస్థితుల లోను, ఎటువంటి భంగాన్ని కూడాను కలగనివ్వబోమని రుజువు చేశారు.
మిత్రులారా, లద్దాఖ్ లో అమరులైన మన సైనికుల ధైర్యాని కి నివాళుల ను అర్పించడంలో దేశం మొత్తం కలిసి వస్తోంది. దేశం మొత్తం వారికి గౌరవంగా, కృతజ్ఞత తో నివాళులు అర్పిస్తోంది. వారి కుటుంబ సభ్యుల మాదిరి గానే, జరిగిన నష్టాని కి ప్రతి భారతీయుడు వేదన ను వ్యక్తపరుస్తున్నారు. కుటుంబాలు తమ ధైర్యవంతులైన పుత్రుల అత్యున్నత త్యాగంపై అనుభూతి చెందే అంతర్గత భావన… దేశం పట్ల వారి మనోభావం, నిజమైన శక్తి ని, దేశ శక్తి ని కలిగి ఉంది. అమరవీరుల తల్లిదండ్రులు తమ ఇతర కుమారుల ను, ఇతర యువ కుటుంబ సభ్యుల ను కూడా సైన్యం లో చేరవలసిందని సూచించడాన్ని మీరు గమనించే ఉంటారు. బిహార్ కు చెందిన శహీద్ కుందన్ కుమార్ తండ్రి గారి మాట లు అయితే ఇంకా చెవి లో ప్రతిధ్వనిస్తూనే ఉన్నాయి. దేశ రక్షణ కోసం, తన మనవళ్లను కూడా సైన్యాని కి పంపడానికి సిద్ధం గా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఇదే విధమైన భావన ప్రతి అమరవీరుని కుటుంబం లోనూ కనిపించింది. నిజంగా, ఈ కుటుంబ సభ్యులు ప్రదర్శించే త్యాగం చాలా గౌరవప్రదమైంది. మన భారత మాత భద్రత కోసం మన జవాను లు అత్యున్నత త్యాగం చేసిన సంకల్పం మన జీవిత లక్ష్యం గా ఉండాలి… ఇది మనలో ప్రతి ఒక్కరి కి వర్తిస్తుంది. మన ప్రయత్నాలు అన్నీ కూడాను ఒకే దిశ లో ఉండాలి… మన సరిహద్దుల ను పరిరక్షించడం లో దేశం యొక్క సామర్థ్యాల ను మరింత గా పెంచే దిశ గా మనం కృషి చేయాలి. ఒక స్వావలంబనయుత భారతదేశం కోసం మనందరం కృషి చేయాలి, అదే అమరవీరుల కు అర్పించే నిజమైన శ్రద్దాంజలి అవుతుంది. అసమ్ నుండి రజనీ గారు నాకు లేఖ ను వ్రాశారు. తూర్పు లద్దాఖ్ లో ఏమి జరిగిందో చూసిన తరువాత, ఆమె ప్రతిజ్ఞ ను స్వీకరించారు అని… మరి ఆ ప్రతిజ్ఞ ఏమిటి అంటే, ఆమె ‘లోకల్’ మాత్రమే కొనుగోలు చేస్తారని… అలాగే ‘లోకల్’ కోసం ‘వోకల్’.. అంటే ఆమె యొక్క గొంతు ను కలపడానికి కూడా సిద్ధం గా ఉంది అని ఆ లేఖ సారాంశం. ఈ విధమైన సందేశాలు నాకు దేశం నలుమూలల నుండి వస్తున్నాయి. చాలా మంది తమ లేఖ ల ద్వారా తాము కూడా ఈ మార్గాన్ని అవలంబించామని తెలిపారు. ఇదే విధం గా, భారతదేశం రక్షణ రంగం లో స్వయంసమృద్ధిని సాధించాలని కోరుకొంటున్నాను అంటూ మదురై కి చెందిన మోహన్ రామమూర్తి, వ్రాశారు.
మిత్రులారా, స్వాతంత్య్రాని కి ముందు, రక్షణ రంగం లో, మన దేశం ప్రపంచం లోని అనేక దేశాల కంటే ముందుంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ లు చాలా ఉన్నాయి. అప్పట్లో మన కంటే వెనుకబడి ఉన్న చాలా దేశాలు, ఇప్పుడు మన కంటే ముందున్నాయి. స్వాతంత్య్రం తరువాత, మన ముందు అనుభవాన్ని పరిగణన లోకి తీసుకొని రక్షణ రంగం లో తగిన కృషి ని జరపవలసి ఉంది…… అయితే, ఆ ప్రయత్నాల ను మనం చేయలేదు. కానీ, ఈ రోజు న, రక్షణ మరియు సాంకేతిక రంగాల లో, భారతదేశం ఆ రంగాల లో ముందుకు సాగడానికి అవిశ్రాంతం గా ప్రయత్నిస్తోంది…. భారతదేశం స్వావలంబన వైపు అడుగు లు వేస్తోంది.
మిత్రులారా, ప్రజల భాగస్వామ్యం లేకుండా ఏ లక్ష్యాన్ని విజయవంతం గా సాధించలేము. అందుకే, స్వయంసమృద్ధియుత భారతదేశాన్ని సాధించే దిశ గా, పౌరుని గా, మన సమష్టి సంకల్పం, నిబద్ధత మరియు మద్దతు లు అవసరం; నిజాని కి అత్యవసరం. మీరు ‘లోకల్’ కొన్నప్పుడు, ప్రతి ఒక్కరూ లోకల్ కొనే విధం గా నలుగురి కి ప్రచారం చేస్తే, మీరు దేశాన్ని బలోపేతం చేయడం లో పాత్ర ను పోషించినట్లు అవుతుంది. ఇది కూడా, మన స్వంత విధానం లో, మన దేశాని కి సేవ చేసినట్లే అవుతుంది. మీ వృత్తి ఏదైనా, అది ఎక్కడైనా, దేశాని కి సేవ చేసేందుకు, అవకాశాలు అనేకం గా ఉన్నాయి. దేశ అవసరాన్ని దృష్టి లో పెట్టుకొని, మీరు ఏ సహాయాన్ని చేసినా, అది, సేవా స్ఫూర్తి కి లోబడి ఉంటుంది. మీ వైపు నుండి మీరు చేసే ఈ సహాయం, దేశాని కి ఏదో ఒక రకం గా బలాన్ని చేకూరుస్తుంది. మన దేశం ఎంత బలం గా ఉంటే, ప్రపంచం లో శాంతి యొక్క అవకాశాలు అంత బలపడతాయని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి.
విద్యా వివాదాయ ధనం మదాయ, శక్తి: పరేషాం పరిపీడనాయ |
ఖలస్య సాధో: విపరీతం ఏతత్, జ్ఞానాయ దానాయ చ రక్షనాయ|| అని అన్నారు.
ఈ మాటల కు – స్వభావ రీత్యా చెడ్డవాడు, వ్యక్తుల తో వివాదం కోసం తన విద్య ను, దర్పాన్ని ప్రదర్శించుకొనేందుకు ధనాన్ని, మరియు ఇతరుల ను బాధపెట్టేందుకు తన శక్తి ని ఉపయోగిస్తాడు. కానీ సజ్జనుడు, జ్ఞానం కోసం విద్య ను, ఇతరుల కు సహాయపడేందుకు ధనాన్ని, రక్షణ కోసం శక్తి ని ఉపయోగిస్తాడు – అని భావం. భారతదేశం ఎప్పుడూ తన శక్తి ని ఉపయోగించుకొంటుంది, అదే భావన ను ప్రతిధ్వనిస్తుంది. దేశ గౌరవాన్ని మరియు సార్వభౌమత్వాన్ని పరిరక్షించుకోవడమే భారతదేశం యొక్క గంభీరమైన సంకల్పం. భారతదేశం యొక్క లక్ష్యం- స్వయంసమృద్ధియుతమైనటువంటి భారతదేశాన్ని ఆవిష్కరించడమే. భారతదేశం యొక్క నిర్మాణం- విశ్వాసం మరియు స్నేహం. భారతదేశం యొక్క భావన సోదరభావం. మనం ఈ సూత్రాల కు కట్టుబడి ముందుకు పోతున్నాము.
నా ప్రియమైన దేశవాసులారా, ప్రస్తుత కరోనా సంకట కాలం లో, దేశం లాక్ డౌన్ దశ నుండి బయటపడి అన్ లాక్ దశ కు చేరుకొంది. ఈ అన్ లాక్ కాలం లో, ఎవరైనా రెండు అంశాల మీద శ్రద్ధ వహించవలసివుంటుంది. అవి- కరోనా ను ఓడించడం మరియు దేశ ఆర్థిక వ్యవస్థ ను బలోపేతం చేసి దానికి శక్తి ని ఇవ్వడమూను. మిత్రులారా, అన్ లాక్ కాలం లో, మనం లాక్ డౌన్ కాలం తో పోలిస్తే మరింత అప్రమత్తం గా ఉండి తీరాలి. మన జాగరూకతే మనలను కరోనా బారి నుండి కాపాడగలుగుతుంది. ఎప్పటికీ, గుర్తు పెట్టుకోండి, మీరు మాస్క్ ను ధరించకపోయినట్లయితే, ఒక మనిషి కి మరొక మనిషి కి నడుమ న రెండు గజాత సామాజిక దూరం తాలూకు నియమాల ను పాటించకపోతే, లేదా ఇతర ముందుజాగ్రత్తల ను తీసుకోకపోతే, మీరు మీ తో పాటుగా ఇతరుల ను, మరీ ముఖ్యం గా ఇంటిలోని బాలల ను మరియు వయోధికుల ను అపాయం లోకి నెట్టుతున్నారన్న మాటే. అందుకని, నేను దేశ ప్రజల ను అందరి కి విజ్ఞప్తి చేసేది ఏమిటి అంటే.. మరి నేను పదే పదే ఇలాగ కోరేది ఏమిటి అంటే.. అజాగ్రత్త గా ఉండవద్దు.. స్వయంగా మీ పట్ల, అలాగే ఇతరుల పట్ల కూడా శ్రద్ధ తీసుకోండి అనే.
మిత్రులారా, ఈ అన్ లాక్ దశ లో, మరెన్నో విషయాలు కూడా- ఏవయితే ఇంత వరకు దేశాన్ని బంధించి ఉంచాయో- మరి వాటి బంధనాల యొక్క తాళాల ను కూడా తెరచుకొంటున్నాయి. సంవత్సరాల తరబడి మన గనుల త్రవ్వకం రంగం లాక్ డౌన్ దశ లో ఉంటూ వచ్చింది. వాణిజ్య సరళి వేలంపాట పద్ధతి ని అనుమతించాలన్న నిర్ణయం ఈ స్థితి ని సమూలం గా మార్చివేసింది. కేవలం కొన్ని రోజుల క్రితం, అంతరిక్ష రంగం లో చరిత్రాత్మకమైనటువంటి మార్పుల ను ప్రవేశపెట్టడమైంది. ఈ సంస్కరణ ల ద్వారా, ఏళ్ల తరబడి లాక్ డౌన్ స్థితి లో ఉంటూ వచ్చిన రంగాని కి విముక్తి ని ఇవ్వడం జరిగింది. ఇది స్వయంసమృద్ధియుతమైన భారతదేశం దిశ గా పయనాన్ని వేగవంతం చేయడమే కాకుండా , ఇది భారతదేశం లో సాంకేతిక విజ్ఞానం యొక్క పురోగతి ని ప్రోత్సహిస్తుంది కూడాను. మీరు గనక మన వ్యవసాయ రంగానికేసి ఒకసారి దృష్టి ని సారించారా అంటే, ఈ రంగం లోని అనేక విషయాలు సైతం దశాబ్దాల పాటు లాక్ డౌన్ స్థితి లో ఉండిపోయాయని మీరు గమనించగలుగుతారు. ఈ రంగాన్ని కూడా ప్రస్తుతం అన్ లాక్ చేయడమైంది. ఇది, ఒక ప్రక్క న, రైతుల కు వారి యొక్క ఫలసాయాన్ని ఎక్కడైనా సరే, వారికి నచ్చిన వారి కి విక్రయించుకొనేందుకు స్వతంత్రాన్ని ఇస్తుంది; మరో ప్రక్క న, ఇది అధిక రుణాల కు కూడాను బాట ను పరచింది. అటువంటి అనేక రంగాలు ఉన్నాయి, వేటిలోనయితే, మన దేశం ఇన్ని అన్ని సంక్షోభాల నడమ న, చరిత్రాత్మక నిర్ణయాల ను తీసుకొంటూ, అభివృద్ధి తాలూకు నూతన మార్గాల ను తెరుస్తోంది.
నా ప్రియమైన దేశవాసులారా, ప్రతి మాసం, మనం మన హృదయాల ను స్పర్శించేటటువంటి వార్తల ను చదువుతున్నాం, ఇంకా చూస్తున్నాము. అవి భారతదేశం లో ప్రతి ఒక్కరు మరొక మనిషి కి ఒకరి స్తోమత మేరకు చేతనైనంత వరకు సాయపడటానికి చిత్తశుద్ది తో సంసిద్ధంగా ఉన్నారన్న సంగతి ని మనకు గుర్తు కు తెస్తున్నాయి.
అటువంటి ఒక ప్రేరణాత్మకమైన గాథ ను ప్రసార మాధ్యమాల ద్వారా చదివే అవకాశం నాకు చిక్కింది. అది అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన గాథ. సియాంగ్ జిల్లా మిరెమ్ అనే పల్లె ఒక విశిష్ట కార్యానికి పూనుకొంది; అది భారతదేశాని కి అంతటి కి ఒక ప్రేరణ గా నిలచింది. ఆ గ్రామస్థుల లో చాలా మంది వారి యొక్క జీవనోపాధి కై బయట వేర వేరు చోటుల లో ఉంటున్నారు. కరోనా విశ్వమారి కాలం లో, వారు తిరిగి తమ ఊరి కి తిరిగి వస్తున్నారు. పల్లెవాసులు ఈ విషయాన్ని గమనించి, వారి సంఘావరోధాని కై గ్రామాని కి వెలుపల, ముందస్తు గానే ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. వారంతా కలసికట్టు గా ఊరికి కాస్తంత దూరం లో
14 తాత్కాలిక గుడిసెల ను తయారు చేశారు. ఆ వ్యక్తులు ఎవరైతే గ్రామాని కి తిరిగి చేరుకొంటారో, వారు మొదట ఈ గుడిసె ల లో కొన్ని రోజులు ఏకాంతవాసం లో ఉండాలన్నది గ్రామీణుల నిర్ణయం. ఆ గుడిసెల లో టాయిలెట్ లను, నీటి ని, ఇంకా విద్యుత్తు ను, రోజువారీ అవసరపడే వస్తువుల తో సహా సిద్ధం గా ఉంచారు. మిరెమ్ గ్రామీణుల వంతు గా వారిలో వ్యక్తం అయినటువంటి ఈ చైతన్యం మరియు వారి యొక్క ఈ సామూహిక ప్రయాస అందరి సావధానత ను మరి అలాగే ప్రశంసల ను తన వైపు నకు తిప్పుకొన్నాయి.
మిత్రులారా, ఈ శ్లోకం మన గ్రంథాల లో ఉంది –
స్వభావం న జహాతి ఏవ, సాధుః ఆపద్రతోపి సన్ l
కర్పూరః పావక్ స్పృష్టః సౌరభం లభ్తేతరామ్ ||
ఈ మాటల కు – కర్పూరం అగ్ని లో మండుతూ ఉన్నప్పుడు కూడా దాని సుగంధాన్ని వదలిపెట్టదు- అని భావం. అలాగే ధర్మవంతులు విపత్తుల్లోనూ వారి లక్షణాల ను లేదా నిజ స్వభావాన్ని వదులుకోరు. నేడు, మన దేశ కార్మిక సోదరులు ఈ మంత్రాని కి ప్రతిరూపాలు గా ఉన్నారు. ప్రస్తుతం మన ప్రవాసీ శ్రామికుల కథ లు చాలా వినిపిస్తున్నాయి. యావత్తు దేశాని కి ప్రేరణ ను అందిస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ గ్రామాని కి తిరిగి వచ్చిన ప్రవాసీ శ్రామికులు, కల్యాణి నది ని ప్రక్షాళన చేశారు. నది కి సహజ రూపాన్ని తెచ్చారు. దీని ని చూసి, సమీప ప్రాంత రైతులు, ప్రజలు స్ఫూర్తి ని పొందారు. కార్మికులు స్వగ్రామాల కు తిరిగి వచ్చిన తరువాత, క్వారన్టీన్ సెంటర్ లో గడిపినప్పుడు, చుట్టూ ఉన్న పరిస్థితుల ను మార్చడానికి వారి నైపుణ్యాల ను ఉపయోగించిన విధానం అద్భుతం. మన దేశం లోని లక్షలాది గ్రామాలలో ఇటువంటి కథ లు చాలా ఉన్నాయి. అవి ఇంకా మన దాకా రాలేదు.
మన దేశ స్వభావం లాగే, మీ ఊరిలో లేదా మీ సమీపం లో ఇటువంటి సంఘటన లు జరిగి ఉండాలని నేను గట్టి గా నమ్ముతున్నాను. అటువంటి ఉత్తేజకర సంఘటన లు మీ దృష్టి కి వస్తే, వాటి ని గురించి వ్రాసి, నాకు పంపండి. ఈ విపత్తు కాలం లో, ఈ సానుకూల ఘటనలు ఇతరుల లో స్ఫూర్తి ని నింపుతాయి.
నా ప్రియమైన దేశవాసులారా, కరోనా వైరస్ మన జీవన విధానాన్ని మార్చివేసింది. నేను, లండన్ నుండి అచ్చయిన ‘ఫైనాన్షియల్ టైమ్స్’ లో ఒక చాలా ఆసక్తిదాయకమైనటువంటి ఒక కథనాన్ని చదివాను. ప్రస్తుత కరోనా కాలం లో, అల్లం, పసుపు సహా ఇతర సుగంధ ద్రవ్యాల కు ఆసియాలోనే కాక అమెరికాలోనూ డిమాండ్ పెరిగిందని ఆ కథనం లో వ్రాశారు. వ్యాధినిరోధక శక్తి ని పెంచుకోవడంపై యావత్తు ప్రపంచం దృష్టి ని సారించింది. ఈ శక్తి ని పెంచే పదార్థాలు మన దేశం తో ముడిపడి ఉన్నాయి. వాటి ప్రత్యేకత ను గురించి ప్రపంచ ప్రజల కు తేలికైన భాష లో మనం చెప్పగలగాలి. విదేశీయులు దానిని సులభం గా అర్ధం చేసుకోగలుగుతారు. ఆరోగ్యకరమైన భూమి ని సృష్టించడానికి మనం మన సహకారాన్ని అందిద్దాము.
కరోనా సంక్షోభం ఏర్పడకపోతే.., జీవితం అంటే ఏమిటి?, జీవితం ఎందుకు ఉంది?, మన జీవనం ఎలా ఉంది? వంటి విషయాలు, బహుశా, ఇవి గుర్తు కు వచ్చేవే కాదు. చాలా మంది మానసిక ఒత్తిడి కి ఇదే కారణం. మరోవైపు, లాక్ డౌన్ కాలం లో జీవనానందంలోని చిన్న కోణాల ను ఎలా తిరిగి పొందారో ప్రజలు నాతో పంచుకున్నారు. సాంప్రదాయకమైనటువంటి ఆటలు ఆడడం, కుటుంబం తో కలిసి గడపడం వంటి అనుభవాల ను చాలామంది వ్రాసి, నాకు పంపారు.
మిత్రులారా, మన దేశం లో గొప్ప వారసత్వ సాంప్రదాయక క్రీడ లు ఉన్నాయి. ఉదాహరణ కు, “పచీసీ” అనే ఆట ను గురించి మీరు విని ఉండవచ్చు. దీని ని తమిళ నాడు లో ‘‘పల్లాన్గులీ’’ అని, కర్నాటక లో ‘‘అలి గులి మణె’’ అని, ఆంధ్ర ప్రదేశ్ లో ‘‘వామనగుంటలు’’ అనే పేరుల తో ఆడడం జరుగుతుంది. ఇది ఒక రకమైన వ్యూహాత్మాక ఆట. ఆట లో భాగం గా అనేక గుంట లు ఉంటాయి. ఆ గుంటల లో దాచిన గుళిక లేదా విత్తనాన్ని ఆటగాళ్లు కనిపెట్టాలి. ఈ ఆట దక్షిణ భారతదేశం నుండి ఆగ్నేయాసియా వరకు, తరువాత మిగిలిన ప్రపంచాని కి చేరిందని చెబుతారు.
మిత్రులారా, ఈ రోజు ప్రతి చిన్నారి కి ‘స్నేక్ అండ్ లాడర్’ ఆట ను గురించి తెలుసును. కానీ, ఇది “మోక్షపథం” లేదా “పరమపదం” అని పిలిచే మరొక సాంప్రదాయకమైన భారతీయ ఆట అని మీకు తెలుసా?. మన దేశం లో “గుట్టా” అని పిలువబడే మరొక సాంప్రదాయక క్రీడ కూడా ఉంది. ఇది చిన్నాపెద్దా, అందరి లో, సమానం గా ఆదరణ ను పొందింది. ఒకే పరిమాణం లో ఐదు చిన్న రాళ్ల ను పట్టుకోవడమే ఈ ఆట. ఒక రాయి ని గాలి లోకి విసరి, ఆ రాయి గాలి లో ఉన్నప్పుడే, నేల మీదున్న మిగిలిన రాళ్ల ను మీరు పట్టుకోవాలి. సాధారణం గా మన దేశం లో ఇంటి ఆటల కు పెద్ద హంగామా అవసరం లేదు. ఎవరో ఒకరు ఒక సుద్దముక్క ను గాని, లేదా రాయి ని గాని తీసుకు వస్తారు. దానితో కొన్ని గీతల ను నేల మీద గీస్తారు. ఇక ఆట ను ఆడడాని కి సిద్ధం గా ఉంది. పాచిక లు అవసరమయ్యే ఈ తరహా ఆటల ను కాస్త సరళీకరించి, గవ్వల తోనో లేదా చింతపిక్కల తోనో ఆడుతున్నారు.
మిత్రులారా, ఈ రోజు న నేను ఈ ఆటల ను గురించి చెబుతున్నప్పుడు, మీలో చాలా మంది వారి బాల్య స్మృతుల లోకి వెళ్లారని నాకు తెలుసు. మీరు ఆ రోజుల ను, ఆ ఆటల ను ఎందుకు మరచిపోయారు? తాత, అమ్మమ్మ ల వంటి కుటుంబ పెద్దల కు నాదొక అభ్యర్థన. అది- మీరు ఈ ఆటలను కొత్త తరానికి అప్పగించాలి- అనేదే. మీరు కాకపోతే ఎవరు దీని ని చేస్తారు?. ఇప్పుడు ఆన్ లైన్ అభ్యాస కాలం వచ్చింది. సమతౌల్యాన్ని సాధించడానికి, ఆన్ లైన్ ఆటల ను వదలించుకోవడానికి మన పిల్లల కోసం మనమే ముందుకు రావాలి. ఇక్కడ స్టార్ట్- అప్ లకు, యువతరాని కి విభిన్నమైనటువంటి, బలమైనటువంటి అవకాశాలు ఉన్నాయి.
భారతీయ సంప్రదాయం ఇంటి ఆటల ను కొత్త రూపాల లో, ఆకర్షణీయమైన రూపాలలో, ఆవిష్కరిద్దాము. ఈ ఆటల కు వనరుల ను సమీకరించే వారు, పంపిణీదారులు, స్టార్టప్ రూపకర్తలు బాగా ప్రాచుర్యం పొందారు. మన భారతీయ క్రీడ లు కూడా స్థానికమే అని గుర్తు పెట్టుకోవాలి. మనం ఇప్పటికే ‘వోకల్ ఫర్ లోకల్’ అంటూ ప్రతిజ్ఞ చేశాము. నా చిన్న, యువ స్నేహితులైన ప్రతి ఇంటి పిల్లల కు ఈ రోజు న నేను ఒక ప్రత్యేక అభ్యర్థన ను చేస్తున్నాను. మీకు వీలు చిక్కినప్పుడు మీ తల్లిదండ్రుల ను మొబైల్ అడిగి తీసుకొని, మీ తాత, అవ్వ లు లేదా ఇంట్లో పెద్దవారి ఇంటర్వ్యూ ను రికార్డ్ చేయండి. జర్నలిస్టు లు టీవీ చానల్స్ లో ఇంటర్వ్యూ లు చేసినట్లుగా, మీరు కూడా అటువంటి ఇంటర్వ్యూ చేసి, దానిని మొబైల్ లో రికార్డ్ చేయండి. పెద్దవారి ని ఎటువంటి ప్రశ్నల ను అడగాలో నేను కొన్ని సూచన లు ఇస్తాను. చిన్నపిల్లలు గా ఉన్నప్పుడు వారి జీవనశైలి ఎలా ఉండేదీ అని అడగండి. వారు ఏ ఆటల ను ఆడారు?, సినిమాల కు వెళ్ళారా?, సెలవుల్లో బంధువుల ఇంటి కి వెళ్లి ఉంటే, పొలాన్ని గాని లేదా గాదె ను గాని చూశారా?, పండుగల ను ఎలా జరుపుకొన్నారు?.. అడగడానికి ఇటువంటి ప్రశ్న లు చాలానే ఉన్నాయి. పెద్దవారు కూడా 40, 50, 60 ఏళ్ల జీవితాన్ని గుర్తు చేసుకోవడాన్ని ఇష్టపడతారు. ఆనాటి భారతదేశాన్ని గురించి తెలుసుకోవడం మీకు కూడా సంతోషాన్ని ఇస్తుంది. ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి ప్రాంతం అప్పట్లో ఎలా ఉంది?, సమీప ప్రాంతాలు ఎలా ఉన్నాయి?, అప్పటి ప్రజల ఆలోచన లు, ఆచారాలు ఏమేమిటి?.. ఈ విషయాల ను గురించి చాలా సులభం గా నేర్చుకోవచ్చును, తెలుసుకోవచ్చును. ఈ ఇంటర్వ్యూ మంచి వీడియో ఆల్బమ్ గాను, కుటుంబాని కి అమూల్యమైన నిధి గాను మిగలవచ్చు.
మిత్రులారా, చరిత్ర యొక్క ఖచ్చితత్వాన్ని దగ్గర గా తెలుసుకోవడానికి ఆత్మకథ లేదా జీవిత చరిత్ర చాలా ఉపయోగకరమైన సాధనం. మీరు మీ పెద్దల తో మాట్లాడుతున్నప్పుడు- వారి కాలం, వారి బాల్యం, మరి వారి యవ్వనంలోని పరిస్థితుల గురించి- అర్ధం చేసుకోగలుగుతారు. వారి యొక్క పసితనం గురించి, వారి యొక్క కాలం గురించి ఇంట్లో పిల్లల కు వివరించడానికి పెద్దల కు ఇది ఒక అద్భుత అవకాశం.
మిత్రులారా, రుతుపవనాలు దేశం లోని చాలా ప్రాంతాల కు విస్తరించాయి. వర్షాలు బాగా ఉంటే, మన రైతు లు అద్భుతమైన దిగుబడి ని పొందుతారు; మరి, ప్రకృతి కూడాను పచ్చ గా ఉంటుంది. వర్ష కాలం లో ప్రకృతి తనను తాను చైతన్య పరుచుకొంటుంది. మానవులు సహజ వనరుల ను దోపిడి చేస్తూవుంటే, వర్షాల సమయం లో ప్రకృతి వాటి ని తిరిగి సమకూర్చుతుంది. మన మాతృభూమి కి రుణపడి, మన బాధ్యతల ను నిర్వర్తిస్తేనే పునఃసమీకరణ సాధ్యమవుతుంది. మనం చేసే చిన్న ప్రయత్నం, ప్రకృతి కి చాలా సాయపడుతుంది. చాలా మంది భారతీయులు ఈ దిశ గా అసాధారణ ప్రయత్నాల ను చేస్తున్నారు.
కర్నాటక లోని మండావలీ లో 80-85 ఏళ్ల కామెగౌడ అనే వ్యక్తి ఉన్నారు. కామెగౌడ ఒక సాధారణ రైతు. అసాధారణ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. కామెగౌడ తన పశువుల ను మేత కోసం తీసుకుపోతారు. అవి గడ్డి ని తింటున్నప్పడు, ఆ ప్రాంతం లో కొత్త చెరువుల ను నిర్మించేందుకు ఆయన పూనుకున్నారు. తన ప్రాంతం లో నీటి కొరత ను అధిగమించాలన్నది 85 ఏళ్ల కామెగౌడ లక్ష్యం. అందుకే, నీటి నిల్వ కోసం చిన్న చెరువుల ను తవ్వే పనిలో పడ్డారు. ఇప్పటివరకు, ఆయన 16 చెరువుల ను తవ్వేశారు. ఆయన నిర్మించిన చెరువులు పెద్ద- పెద్ద వి కాకపోవచ్చు. కానీ, ఆయన ప్రయత్నాలు చాలా పెద్ద వి. ప్రస్తుతం, ఆ చెరువుల కారణం గా ఆ ప్రాంతానికి అంతటి కితా నవ జీవనం లభించింది.
మిత్రులారా, గుజరాత్ లోని వడోదరా కూడా ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఉదాహరణ. ఇక్కడ, జిల్లా యంత్రాంగం, స్థానికులు కలసి ఒక ఆసక్తికరమైన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం కారణం గా, నేడు వడోదరా లోని ఒక వేయి పాఠశాలల్లో వర్షపు నీటి సంరక్షణ జరుగుతోంది. ఏటా సగటు న 100 మిలియన్ లీటర్ ల నీటి ని సంరక్షిస్తున్నారని అంచనా.
మిత్రులారా, ఈ వర్ష కాలం లో ప్రకృతి ని పరిరక్షించడానికి మనం కూడా చొరవ తీసుకోవాలి. ఇక గణేశ్ చతుర్థి కి సన్నాహాలు మొదలవువుతాయి. పర్యావరణ అనుకూల గణపతి విగ్రహాలను తయారుచేసి, వాటిని మాత్రమే పూజించడానికి ఈసారి మనం ప్రయత్నించగలమా? నదుల లో, చెరువుల లో నిమజ్జనం అనంతరం నీటి కి, జలచరాల కు ప్రమాదకరం గా మారే విగ్రహాల ఆరాధన ను మనం వదులుకుందామా? నా పిలుపునకు మీరు స్పందిస్తారని నేను గట్టిగా నమ్ముతున్నాను. రుతుపవనాల తో వచ్చే వ్యాధుల నుండి మనం జాగ్రత్త గా ఉండాలి. కరోనా మహమ్మారి కాలం లో, ఈ వ్యాధుల బారి నుండి కూడా మనల్ని మనం రక్షించుకోవాలి. ఆరోగ్యం గా ఉండడానికి ఆయుర్వేద మందుల ను, మూలిక కషాయాలను, వేడి నీటి ని తీసుకోవాలి.
నా ప్రియమైన దేశవాసులారా, ఈ రోజు జూన్ 28 వ తేదీ న, క్లిష్ట కాలం లో దేశాన్ని గట్టెక్కించిన పూర్వ ప్రధానుల లో ఒకరికి భారతదేశం శ్రద్ధాంజలి ని ఘటించింది. ఈ రోజు మన మాజీ ప్రధాని శ్రీ పి.వి.నరసింహారావు గారి శత జయంతి సంవత్సరం ప్రారంభమైంది. శ్రీ పి.వి.నరసింహారావు గారి గురించి మనం మాట్లాడేటప్పుడు, సహజంగానే మనకు కనిపించే ఆయన చిత్రం ఒక రాజకీయ నాయకుడి ది. కానీ ఆయన బహుభాషా కోవిదుడు అన్నది కూడా నిజం. ఆయన అనేక భారతీయ భాషల ను, విదేశీ భాషల ను మాట్లాడే వారు. భారతీయ విలువల ను ఆయన జీర్ణించుకున్నారు. వారి కి పాశ్చాత్య సాహిత్యం లో, విజ్ఞాన శాస్త్రంపైనా పరిజ్ఞానం ఉంది. పి.వి. నరసింహా రావు భారతదేశం లోని అత్యంత అనుభవజ్ఞ నాయకుల లో ఒకరు. ఆయన జీవితం లో మనం తెలుసుకోవలసిన మరో గొప్ప కోణం కూడా ఉంది. మిత్రులారా, నరసింహా రావు వారి యొక్క యవ్వన దశ లోనే స్వాతంత్ర్య ఉద్యమం లో చేరిపోయారు. వందే మాతరమ్ పాడటానికి హైదరాబాద్ నిజాం నవాబు అనుమతి ని నిరాకరించినప్పుడు, నిజాంకు వ్యతిరేకం గా సాగిన ఉద్యమం లో చురుకు గా పాల్గొన్నారు. ఆ కాలం లో పి.వి. గారి వయస్సు 17 ఏళ్లే. అన్యాయాని కి వ్యతిరేకం గా గొంతెత్తడానికి చిన్నప్పటి శ్రీమాన్ నరసింహా రావు ఎప్పుడూ ముందున్నారు. నరసింహారావు గారు చరిత్ర ను కూడా బాగా అర్ధం చేసుకున్నారు. చాలా సాధారణమైన నేపథ్యం నుండి ఆయన ఎదిగారు. విద్య పై ఆయనకు ఉన్న ప్రేమ, నేర్చుకోవాలనే తాపత్రయం, నాయకత్వ సామర్థ్యం.. ఇవి అన్నీ కూడాను చిరస్మరణీయమైనవి. నరసింహా రావు గారి శత జయంతి సంవత్సరం లో మనందరం ఉన్నాము. ఆయన జీవితాన్ని గురించి మరియు ఆయన యొక్క ఆలోచన ల ను గురించి వీలయినంత ఎక్కువ గా తెలుసుకోవడానికి ప్రయత్నించండి అని నేను మిమ్ములను అభ్యర్థిస్తున్నాను. నేను, మరొక్క సారి ఆయన కు శ్రద్ధాంజలి ని అర్పిస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా, ఈ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) లో చాలా విషయాలపైన చర్చించాము. వచ్చే 'మన్ కీ బాత్' (మనసు లో మాట) లో మరిన్ని కొత్త విషయాల పై సాగుతుంది. మీరు, మీ యొక్క సందేశాలను, వినూత్న మైనటువంటి ఆలోచనల ను నాకు పంపడాన్ని కొనసాగించాలి. మనమందరం కలసి ముందుకు సాగుదాము. నేను ప్రారంభం లో చెప్పినట్లుగా, రాబోయే రోజులు మరింత సానుకూలం గా ఉంటాయి. ఈ ఒక్క సంవత్సరం లో మాత్రమే మనం మెరుగ్గా రాణించడం కాదు, అదే స్థాయి ని ఆ తరువాత కూడా కొనసాగించాలి. దీనివల్ల దేశం అత్యున్నత శిఖరాల కు చేరుకొంటుంది. ఈ దశాబ్దం లోనే, 2020 వ సంవత్సరం, భారతదేశాని కి కొత్త మార్గాన్ని చూపుతుందన్న నమ్మకం నాలో ఉంది. ఈ భరోసా తో, మీరు కూడా ముందంజ వేయండి; ఆరోగ్యం గా ఉండండి; సానుకూలం గా ఆలోచించండి. ఈ శుభకామనల తో, మీకు అందరికి అనేకానేక ధన్యవాదములు.
నమస్కారం.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం యొక్క 12 వ భాగం లో పాల్గొని ప్రసంగిస్తూ, దేశం లో సామూహిక ప్రయాస ల ద్వారా కరోనా పై భీకర పోరు కొనసాగుతోందన్నారు. కోవిడ్ విశ్వమారి తో జరుపుతున్నటువంటి ఈ యొక్క పోరాట క్రమం లో భాగం గా ఆర్థిక వ్యవస్థ లోని ఒక ప్రధాన విభాగాని కి తలుపుల ను తెరచిన నేపథ్యం లో మరింత జాగరూకులుగా, అప్రమత్తం గా ఉండాలంటూ ప్రజల కు ఆయన విజ్ఞప్తి చేశారు.
శ్రామిక్ ప్రత్యేక రైళ్ళు, ప్రత్యేక రైళ్ల తో పాటు సాధారణ రైలు సేవ లు కూడా తగిన ముందు జాగ్రత్త చర్యల తో పునఃప్రారంభం అయ్యాయని ప్రధాన మంత్రి అన్నారు. విమాన సేవ లు మళ్లీ మొదలయ్యాయి, పరిశ్రమ సైతం సాధారణ స్థితి కి చేరుకుంటోంది అని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల లో ఎటువంటి కట్టడి లేకపోవడం అనేది ఉండకూడదని ప్రధాన మంత్రి హెచ్చరిక చేశారు. ‘‘దో-గజ్-కీ-దూరీ’’ ని (ఒక మనిషి కి, మరో మనిషి కి నడుమ రెండు గజాల ఎడం ఉంచుకోవడాన్ని) పాటించాలని, ఫేస్ మాస్క్ లను ధరించాలని, సాధ్యమైనంతవరకు ఇంట్లోనే ఉండాలని ఆయన సూచించారు. ఎన్నో కష్టాల కు ఓర్చిన అనంతరం, పరిస్థితి ని చక్కదిద్ధేందుకు దేశం ఎంతో నేర్పరితనం తో తీసుకొన్న నిర్ణయాల ఫలితం వ్యర్థం కాకూడదు అని ఆయన నొక్కి వక్కాణించారు.
మన ప్రజలు చాటిన సేవా స్ఫూర్తి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. అది అతి పెద్ద బలం అని ఆయన అభివర్ణించారు. ‘‘సేవా పరమో ధర్మః’’ అనే సూక్తి మనకు తెలిసిందే; సేవ చేయడం లోనే ఆనందం ఉంది, సేవ లోనే సంతృప్తి ఉంది అని ఆయన అన్నారు. దేశ వ్యాప్తం గా ఉన్న వైద్య సేవల సిబ్బంది కి తన ప్రగాఢ శుభకామనల ను వ్యక్తం చేశారు. దేశం లోని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, పారిశుధ్య కార్మికులు, రక్షకభట బలగం మరియు ప్రసార మాధ్యమాల సిబ్బంది లోని సేవా భావాన్ని ప్రధాన మంత్రి కొనియాడారు. ఈ సంక్షోభ కాలం లో మహిళా స్వయం సహాయక సమూహాలు చేసిన విశిష్ట కృషి ని కూడా ఆయన ప్రశంసించారు.
తమిళ నాడు కు చెందిన కె.సి.మోహన్, అగర్ తలా కు చెందిన గౌతమ్ దాస్, పఠాన్ కోట్ కు చెందిన దివ్యాంగుడు రాజు ల వంటి సామాన్య పౌరులు ఈ సంకట కాలం లో ఇతరులకు సహాయం చేయడానికని తమ వద్ద పరిమితమైనటువంటి వనరులే ఉన్నప్పటికీ జంకక ముందంజ వేశారని ప్రధాన మంత్రి సోదాహరణం గా వివరించారు. మహిళల స్వయం సహాయ సమూహాల యొక్క నిరంతర శ్రమ ను గురించిన లెక్కలేనన్ని కథ లు దేశం నలుమూలల నుండి తెర మీదకు వస్తున్నాయి అని కూడా ఆయన అన్నారు.
ఈ విశ్వమారి ని ఎదుర్కోవడం లో చాలా చురుకైనటువంటి పాత్ర ను పోషించిన వ్యక్తుల ప్రయత్నాల ను కూడా ప్రధాన మంత్రి ప్రశంసించారు. నాసిక్ కు చెందిన రాజేంద్ర యాదవ్ శానిటైజేషన్ మశీన్ ను రూపొందించి ఆయన యొక్క ట్రాక్టర్ కు జత పరచారు అంటూ దీనిని ఒక ఉదాహరణ గా ప్రధాన మంత్రి పేర్కొన్నారు. ‘దో-గజ్-కి-దూరీ’ ని పాటించడానికి చాలా మంది దుకాణదారులు వారి దుకాణాల్లో పెద్ద పైపు లైన్ లను నెలకొల్పారని ఆయన తెలిపారు.
మహమ్మారి కారణం గా ప్రజలు పడ్డ యాతన లు మరియు క్లేశాల ను గురించి కార్యక్రమ శ్రోతల కు ప్రధాన మంత్రి వివరిస్తూ, కరోనా వైరస్ సమాజం లో అన్ని వర్గాల వారి ని బాధించింది, అయితే అల్ప సౌకర్యాలు మాత్రమే ప్రాప్తించిన శ్రామికులు మరియు కార్మికులు మాత్రం కరోనా వైరస్ కారనం గా అత్యంత ప్రభావితులు గా మిగిలారు అని పేర్కొన్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర నుండి ప్రతి ఒక్క విభాగం మరియు ప్రతి ఒక్క సంస్థ పూర్తి స్థాయి వేగం తో సహాయ కార్యక్రమాల లో చేతి తో చేయి వేసి మరీ పనిచేస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు. వారు పడుతున్న బాధలు ఎటువంటివి అన్నది యావత్తు దేశం అర్థం చేసుకొందని, ఆ బాధల తో మమేకం అయిందని, కేంద్రం మొదలుకొని రాష్ట్రాలు, స్థానిక పాలక సంస్థ ల వరకు ప్రతి ఒక్కరూ 24 గంటలూ పాటుపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. రైళ్ల లోను, బస్సుల లోను లక్షలాది మంది శ్రామికుల ను సురక్షితం గా వారి వారి గమ్యస్థానాల కు చేరవేయడం కోసం, మరి వారి ఆహారం పట్ల శ్రద్ధను వహిస్తూ ప్రతి ఒక్క జిల్లా లో వారికి క్వోరన్టీన్ కై తగిన ఏర్పాట్లు చేయడం లో ఉదారం గా నిమగ్నమైన ప్రజల ను ఆయన ప్రశంసించారు.
ప్రస్తుత పరిస్థితుల లో ఒక క్రొత్త పరిష్కారాన్ని రూపొందించడం తక్షణావసరం అని ప్రధాన మంత్రి నొక్కి చెప్పారు. ఈ దిశ గా ప్రభుత్వం అనేక చర్యల ను తీసుకొందని ఆయన అన్నారు. కేంద్రం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు గ్రామ ఉపాధి, స్వతంత్రోపాధి, ఇంకా చిన్న తరహా పరిశ్రమల కు విస్తారమైన అవకాశాల ను కల్పించాయని ఆయన అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం దేశాన్ని ఈ దశాబ్దం లో ఉన్నతోన్నతమైనటువంటి శిఖరాల కు తీసుకుపోతుందన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కరోనా ప్రపంచవ్యాప్త వ్యాధి ప్రబలిన ప్రస్తుత కాలం లో, ప్రతి చోట ప్రజలు యోగ ను గురించి, ఆయుర్వేదాన్ని గురించి మరింత అధికం గా తెలుసుకోదలుస్తూ, దానిని ఒక జీవన పంథా గా స్వీకరించాలనుకొంటున్నారని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. ‘‘సముదాయం, రోగనిరోధక శక్తి మరియు ఏకత్వం’’ల కోసం యోగ ను అనుసరించాలి అని ఆయన వాదించారు. కరోనా ప్రపంచవ్యాప్త వ్యాధి విజృంభిస్తున్న ప్రస్తుత కాలం లో, యోగ మరింత ముఖ్యమైంది గా మారింది, ఎందుకంటే ఈ వైరస్ శ్వాస ను పీల్చుకొనే వ్యవస్థ పై ప్రభావం చూపుతుంది అని ఆయన అన్నారు. యోగ లో, శ్వాసకోశ వ్యవస్థ ను బలోపేతం చేసే అనేక రకాలైన ప్రాణాయామాలు ఉన్నాయి. యోగ వల్ల ప్రయోజనకరమైన ప్రభావాలు ఉన్నట్లు చాలా కాలం నుండే గమనించడం జరిగింది అని ఆయన అన్నారు.
దీనికి తోడు, ఆయుష్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన అంతర్జాతీయ వీడియో బ్లాగ్ పోటీ ‘మై లైఫ్, మై యోగా కోసం ప్రజలు వారి యొక్క వీడియోల ను పంచుకోవలసిందంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ పోటీ లో ప్రతి ఒక్కరు పాల్గొనాలి, మరి రాబోయే అంతర్జాతీయ యోగ దినోత్సవం లో పాలుపంచుకోవాలి అంటూ ప్రధాన మంత్రి అభ్యర్థించారు.
ప్రపంచవ్యాప్త వ్యాధి తో పోరు సలపడం లో ప్రభుత్వ ప్రయత్నాల ను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. అలాగే ‘ఆయుష్మాన్ భారత్’ పథకం యొక్క లబ్ధిదారుల సంఖ్య ఒక కోటి కి పైబడినట్లు ఆయన వెల్లడిస్తూ అందుకు గర్వం గా ఉందన్నారు. విశ్వమారి నేపథ్యం లో రోగుల కు చికిత్స చేసిన వైద్యులు, నర్సులు మరియు వైద్య సిబ్బంది తో పాటు ‘ఆయుష్మాన్ భారత్’ యొక్క లాభితుల కు కూడా ఆయన అభినందనలు తెలిపారు.
ఒకానొక సమయం లో మనం కరోనావైరస్ తో సమరం చేస్తూనే, అమ్ఫాన్ తుఫాను వంటి విపత్తుల తో సైతం పోరాడవలసి వచ్చిందని ప్రధాన మంత్రి అన్నారు. అమ్ఫాన్ పెనుతుఫాను వేళ పశ్చిమ బెంగాల్ మరియు ఒడిశా ల ప్రజలు ఎంతటి ధైర్య సాహసాల తో పోరు లో పాలుపంచుకొన్నదీ ఆయన ప్రస్తావించి, అందుకు గాను వారి ని శ్లాఘించారు. ఆ రాష్ట్రాల లో రైతుల కు వాటిల్లిన నష్టాల కు గాను ఆయన సహానుభూతి ని వ్యక్తం చేశారు. వారు ఎదుర్కొన్న కష్టాలు, మరి వారు చూపిన దృఢత్వం, సంకల్పాన్ని చాటిన రీతి కొనియాడదగినవి అని ఆయన అన్నారు.
తుఫాను విపత్తు కు అదనం గా, దేశం లోని అనేక ప్రాంతాలు మిడతల దండు దాడుల ప్రభావాని కి లోనయ్యాయి అని శ్రీ మోదీ అన్నారు. సంకట కాలం లో దేశవ్యాప్తం గా సామాన్య మానవుడు నిత్యావసర వస్తువుల కొరత ను ఎదుర్కోనక్కరలేకుండా ప్రభుత్వం ఏ విధం గా ఉదారం గా పనిచేస్తున్నదీ ఆయన నొక్కి పలికారు. కేంద్రం మొదలుకొని రాష్ట్ర ప్రభుత్వాలు, వ్యవసాయ విభాగం లేదా పరిపాలన విభాగం వరకు ప్రయత్నాలు కొనసాగుతూ ఉన్నాయి, రైతుల కు సాయపడడానికి మరియు ఈ సంక్షోభం కారణం గా పంట నష్టాన్ని తగ్గించడానికి ప్రతి ఒక్కరు ఆధునిక సాంకేతిక మెలకువల అండదండల ను తీసుకోవడం లో నిమగ్నం అయ్యారు అంటూ ప్రధాన మంత్రి వివరించారు.
నీటి ని సైతం ఆదా చేయవలసిన బాధ్యత ను గ్రహించడం కూడా వర్తమాన తరాని కి ఆవశ్యకం అని ప్రధాన మంత్రి నొక్కి వక్కాణించారు. వాన నీటి ని కాపాడుకోవలసిన అవసరం ఎంతయినా ఉంది, మరి ప్రతి ఒక్కరు జల సంరక్షణ కోసం పాటు పడాలి అని ఆయన స్పష్టం చేశారు. వచ్చే ‘పర్యావరణ దినం’ సందర్భం లో కొన్ని మొక్కల ను నాటడం ద్వారా మరియు ప్రకృతి తో అనునిత్యం సంబంధాన్ని పెనవేసుకొనేందుకు తగిన సంకల్పాలు చేసుకోవడం ద్వారా ప్రకృతి కి సేవ చేయవలసింది గా కూడా దేశ ప్రజల ను ఆయన అభ్యర్థించారు. లాక్ డౌన్ జీవన వేగాన్ని మందగింపచేసినప్పటికీ, అది ప్రకృతి ని ఉచిత రీతి న దర్శించేందుకు ఒక అవకాశాన్ని ప్రసాదించిందని, ఈ కాలం లో వన్య మృగాలు మరింత గా బయట కు రావడం మొదలుపెట్టాయని ఆయన అన్నారు.
తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఉండటం గాని లేదా ఉదాసీనం గా ఉండటం గాని ఒక ఐచ్ఛికం కాకూడదు అని చెప్తూ, ప్రధాన మంత్రి తన ప్రసంగాన్ని ముగించారు. కరోనా తో పోరాటాన్ని ఇప్పటికీ ఇంకా అంతే తీవ్రమైందిగా ఎంచవలసి ఉంది అని ఆయన అన్నారు.
నా ప్రియమైన దేశ ప్రజలారా… నమస్కారం. మీరందరూ లాక్డౌన్లో ఈ 'మన్ కి బాత్' వింటున్నారు. ఈ 'మన్ కీ బాత్' కోసం సూచనలు, ఫోన్ కాల్స్ సాధారణ సందర్భాల్లో కంటే చాలా రెట్లు ఎక్కువగా వచ్చాయి. చాలా విషయాల్లో మీలో ఉన్న ఆలోచనలు, మీ మనసులోని భావాలు నాకు చేరాయి. వీటిలో చాలా అభిప్రాయాలను చదవడానికి, వినడానికి నేను ప్రయత్నించాను. మీ దృష్టికి రాని అనేక అంశాలను ఈ విపత్తు కాలంలో మీరు తెలుసుకున్నారు. యుద్ధం మధ్యలో జరుగుతున్న ఈ 'మన్ కి బాత్'లో మీ అందరితో ఆ అంశాలను పంచుకోవాలని నేను భావిస్తున్నాను.
మిత్రులారా! కరోనాకు వ్యతిరేకంగా భారతదేశం చేసిన పోరాటం నిజంగా ప్రజలే నడిపించిన పోరాటం. భారతదేశంలో, ప్రజలు కరోనాకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. మీరు పోరాడుతున్నారు. శాసన వ్యవస్థ, పరిపాలనా యంత్రాంగం ప్రజలతో కలిసి పోరాడుతున్నాయి. అభివృద్ధి కోసం ప్రయత్నిస్తున్న భారతదేశం వంటి పెద్ద దేశం పేదరికంతో నిర్ణయాత్మక పోరాటం చేస్తోంది. కరోనాతో పోరాడటానికి, గెలవడానికి దేశానికి ఈ ఏకైక మార్గమే ఉంది. ఈ రోజు, మొత్తం దేశం – దేశంలోని ప్రతి పౌరుడు, ప్రజలు, ఈ పోరాటంలో సైనికులుగా పాల్గొనడం, పోరాటానికి నాయకత్వం వహించడం మన అదృష్టం. మీరు ఎక్కడ పరిశీలించినా భారతదేశం చేసే యుద్ధం ప్రజలే నడిపిస్తున్న యుద్ధమని గ్రహిస్తారు. ప్రపంచం మొత్తం ఈ మహమ్మారి వల్ల సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. భవిష్యత్తులో ఎప్పుడైనా ఈ విషయంలో చర్చ జరిగితే, ఈ పోరాటంలో పద్ధతులపై చర్చ జరిగితే, ప్రజలే నడిపిస్తోన్న భారతదేశం చేస్తున్న ఈ పోరాటం ఖచ్చితంగా చర్చకు వస్తుందని నేను నమ్ముతున్నాను. దేశవ్యాప్తంగా ప్రతిచోటా ప్రజలు ఒకరికొకరు సహాయం చేయడానికి ముందుకు వచ్చారు. పేదలకు ఆహారం, రేషన్ సదుపాయం, లాక్డౌన్ వ్యవస్థలో పాటించాల్సిన విధానాలు , ఆస్పత్రులు ఏర్పాటు, వైద్య పరికరాలను దేశంలో తయారు చేసే అంశం మొదలైన అనేక విషయాల్లో ఈరోజు దేశం మొత్తం ఒక లక్ష్యం, ఒక దిశ వెంట కలిసిమెలిసి వెళ్తోంది. చప్పట్లు, గంటలు, దీపం, కొవ్వొత్తి – ఇవన్నీ నవీన ఆలోచనలకు తావిచ్చాయి. ఈ విషయాల్లో ప్రజలు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయాల్లో ఇతరులకు స్ఫూర్తినిచ్చారు. నగరమైనా, గ్రామమైనా – దేశంలో ఒక భారీ మహా యజ్ఞం జరుగుతున్నట్లు అనిపిస్తుంది. ఇందులో ప్రతి ఒక్కరూ సహకరించడానికి ఆసక్తిగా ఉన్నారు. మన రైతు సోదరులు, సోదరీమణులను చూడండి – ఒక వైపు, ఈ అంటువ్యాధి ప్రబలుతున్నా పగలు, రాత్రి తమ పొలాలలో కష్టపడి పనిచేస్తున్నారు. మరోవైపు ఆకలితో దేశంలో ఎవరూ నిద్రపోకూడదని కూడా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్కరూ తమ సామర్థ్యం మేరకు ఈ యుద్ధంలో పాల్గొంటున్నారు. కొందరు అద్దె మాఫీ చేస్తుంటే, మరికొందరు తమ పెన్షన్ లేదా ఇతరత్రా వచ్చిన డబ్బును PM CARES లో జమ చేస్తున్నారు. పొలంలోని అన్ని కూరగాయలను కొందరు దానం చేస్తున్నారు. మరికొందరు ప్రతిరోజూ వందలాది మంది పేద ప్రజలకు ఉచితంగా ఆహారం ఇస్తున్నారు. కొందరు మాస్కులు తయారు చేస్తున్నారు. కొందరు కూలీ సోదరులు, సోదరీమణులు తాము నిర్బంధంలో భాగంగా బస చేస్తున్న పాఠశాలకు రంగులు వేస్తున్నారు.
మిత్రులారా! ఇతరులకు సహాయం చేయడానికి మీలో- మీ హృదయం లోని ఏ మూలలోనైనా ఉన్న ఈ భావోద్వేగమే కరోనాకు వ్యతిరేకంగా, భారతదేశం చేసే ఈ పోరాటానికి బలాన్ని ఇస్తోంది. ఈ భావనే ఈ పోరాటాన్ని ప్రజలే నడిపించేలా చేస్తోంది. గత కొన్ని సంవత్సరాలుగా మన దేశంలో ఇది ఒక మానసిక స్థితిగా మారి బలపడుతోంది. కోట్లాది ప్రజలు గ్యాస్ సబ్సిడీని వదిలివేయడం, లక్షలాది మంది సీనియర్ సిటిజన్లు రైల్వే సబ్సిడీని వదిలివేయడం, స్వచ్ఛ భారత్ అభియాన్ నాయకత్వాన్ని తీసుకోవడం, మరుగుదొడ్లు నిర్మించడం వంటివి – ఇలాంటి లెక్కలేనన్ని విషయాలు మన మనస్సును దృఢంగా చేస్తాయి. దేశం కోసం ఏదైనా చేయటానికి ప్రేరణగా నిలుస్తాయి.
నా ప్రియమైన దేశవాసులారా! 130 కోట్ల మంది దేశవాసుల ఈ మనోభావానికి తల వంచి నమస్కరిస్తున్నాను. మీ ఆలోచన ప్రకారం, దేశం పట్ల మీకున్న ఆసక్తి మేరకు, మీ సమయానుసారం మీరు ఏదైనా చేసేందుకు వీలుగా ప్రభుత్వం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ను కూడా సిద్ధం చేసింది. ఈ వేదిక – covidwarriors.gov.in . మరోసారి చెప్తుుున్నాను – covidwarriors.gov.in | ఈ వేదిక ద్వారా ప్రభుత్వం అన్ని సామాజిక సంస్థల వాలంటీర్లను, పౌర సమాజ ప్రతినిధులను, స్థానిక పరిపాలనను అనుసంధానించింది. చాలా తక్కువ సమయంలో, 125 మిలియన్ల మంది ఈ పోర్టల్‌లో చేరారు. డాక్టర్, నర్సుల నుండి మన ASHA, ANM సోదరీమణులు, NCC, NSS భాగస్వాములు, వివిధ రంగాలకు చెందిన నిపుణులందరూ ఈ వేదికను తమ వేదికగా చేసుకున్నారు. ఈ వ్యక్తులు స్థానికంగా సంక్షోభ నివారణ ప్రణాళికలను రూపొందించడంలో, అమలు చేయడంలో చాలా సహాయం చేస్తున్నారు. మీరు కూడా covidwarriors.gov.in లో చేరి దేశానికి సేవ చేయవచ్చు. కోవిడ్ వారియర్ కావచ్చు.
మిత్రులారా! ప్రతి కష్టమైన పరిస్థితి, ప్రతి పోరాటం, కొన్ని పాఠాలు నేర్పిస్తుంది. కొన్ని అవకాశాలకు మార్గం సుగమం చేస్తుంది. కొన్ని గమ్యాలకు దిశానిర్దేశం చేస్తుంది. ఈ పరిస్థితిలో దేశవాసులందరూ చూపించిన సంకల్ప శక్తితో భారతదేశంలో కూడా కొత్త మార్పు ప్రారంభమైంది. మన వాణిజ్యం, మన కార్యాలయాలు, మన విద్యాసంస్థలు, మన వైద్య రంగం… ఇలా ప్రతి ఒక్కరూ కొత్త సాంకేతిక మార్పుల వైపు వేగంగా కదులుతున్నారు. సాంకేతిక పరిజ్ఞానం విషయంలో దేశంలోని ప్రతి ఆవిష్కర్త కొత్త పరిస్థితులకు అనుగుణంగా నవ నిర్మాణం చేస్తున్నట్టు అనిపిస్తుంది.
మిత్రులారా! దేశం ఒక జట్టుగా పనిచేసినప్పుడు లభించే ఫలితాలను ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వమైనా, రాష్ట్ర ప్రభుత్వమైనా ప్రతి విభాగం, ప్రతి సంస్థ సమన్వయంతో ఉపశమనం కోసం పూర్తి వేగంతో పనిచేస్తున్నాయి. వైమానిక సిబ్బంది, రైల్వే ఉద్యోగులు రాత్రింబగళ్లు కష్టపడుతున్నారు. తద్వారా దేశవాసుల సమస్యలను తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. 'లైఫ్‌లైన్ ఉడాన్'' అనే ప్రత్యేక పథకం ద్వారా దేశంలోని ప్రతి ప్రాంతానికి మందులను పంపిణీ చేస్తున్నట్టు మీలో చాలా మందికి తెలుసు. వైమానిక ఉద్యోగులు ఇంత తక్కువ సమయంలోనే దేశంలోని మూడు లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణించి, దేశంలోని ప్రతి మూల మూలలో
కూ 500 టన్నులకు పైగా వైద్య సామాగ్రిని మీకు రవాణా చేశారు. అదేవిధంగా, రైల్వే సహచరులు కూడా నిరంతరం లాక్డౌన్లో పనిచేస్తున్నారు. తద్వారా దేశంలోని సామాన్య ప్రజలకు నిత్యావసర వస్తువుల కొరత లేకుండా చూస్తున్నారు. ఈ పని కోసం భారతీయ రైల్వే 60 కి పైగా రైల్వే మార్గాల్లో 100 కి పైగా పార్శిల్ రైళ్లను నడుపుతోంది. అదేవిధంగా మన పోస్టల్ విభాగం వారు మందుల సరఫరాలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. మన ఈ సహచరులందరూ నిజమైన కరోనా యోధులు.
మిత్రులారా! 'ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజీ' కింద, డబ్బును నేరుగా పేదల ఖాతాకు బదిలీ చేస్తున్నారు. 'వృద్ధాప్య పెన్షన్' మంజూరైంది. పేదలకు మూడు నెలల ఉచిత గ్యాస్ సిలిండర్లు, రేషన్ వంటి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నారు. ఈ పనులన్నిటిలో ప్రభుత్వంలోని వివిధ విభాగాల సిబ్బంది, బ్యాంకింగ్ రంగానికి చెందిన ఉద్యోగులు ఒక జట్టులాగా పగలు, రాత్రి పని చేస్తున్నారు. ఈ అంటువ్యాధిని ఎదుర్కోవడంలో మన దేశంలోని రాష్ట్ర ప్రభుత్వాలు చాలా చురుకైన పాత్ర పోషిస్తున్నాయని నేను ప్రశంసిస్తున్నాను. కరోనాకు వ్యతిరేకంగా పోరాటంలో స్థానిక పరిపాలన యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర ప్రముఖమైనది. వారి కృషి ప్రశంసనీయం.
నా ప్రియమైన దేశ వాసులారా! దేశవ్యాప్తంగా ఆరోగ్య సేవలతో సంబంధం ఉన్న వారు ఇటీవల ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఆర్డినెన్స్‌లో, కరోనా యోధులపై హింస, వేధింపులు, వారికి ఏదైనా రూపంలో గాయాలకు వ్యతిరేకంగా కఠినమైన శిక్ష విధించే నిబంధన ఉంది. దేశాన్ని కరోనా రహితంగా మార్చడానికి పగలు, రాత్రి పనిచేస్తున్న మన వైద్యులు, నర్సులు, పారా మెడికల్ సిబ్బంది, సమాజ ఆరోగ్య కార్యకర్తలు మొదలైనవారిని రక్షించడానికి ఈ చర్య చాలా ముఖ్యమైనది.
నా ప్రియమైన దేశవాసులారా! మహమ్మారికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ పోరాటంలో మన జీవితాన్ని, సమాజాన్ని, మన దగ్గర జరుగుతున్న సంఘటనలను తాజా కోణం నుండి చూసే అవకాశం లభించిందని మనమందరం భావిస్తున్నాం. సమాజ వైఖరిలో పెద్ద మార్పు జరిగింది. మన జీవితంతో అనుసంధానించబడిన ప్రతి వ్యక్తి ప్రాముఖ్యత ఈరోజు మనకు తెలుసు. మన ఇళ్లలో పనిచేసే వ్యక్తులు, మన అవసరాలను తీర్చడానికి పనిచేసే సాధారణ కార్మికులు, పొరుగు దుకాణాలలో పనిచేసే వ్యక్తులు… మొదలైనవారి ప్రాముఖ్యతను అనుభవిస్తున్నాం. అదేవిధంగా అత్యవసర సేవలను అందించే వ్యక్తులు, అంగళ్లలో పనిచేసే మన సోదర సోదరీమణులు, మన పరిసరాల్లోని ఆటో డ్రైవర్లు, రిక్షా నడిపేవారు – వీరు లేకుండా మన జీవితం ఎంత కష్టమవుతుందో ఈ రోజు మనం అనుభవిస్తున్నాము.
ఈ రోజుల్లో లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియాలో ప్రజలు తమ ఈ తోటివారిని జ్ఞాపకం చేసుకోవడమే కాదు – వారి గురించి ఎంతో గౌరవంగా రాస్తున్నారు. శుభ్రపరిచే కార్మికులపై ప్రజలు పూలు కురిపించే దృశ్యాలు దేశంలోని ప్రతి మూల నుండి వస్తున్నాయి. ఇంతకుముందు, మీరు బహుశా వారి పనిని కూడా గమనించలేదు. వారు వైద్యులు, స్వీపర్లు, ఇతర సేవా వ్యక్తులు కావచ్చు. ఇది మాత్రమే కాదు, మన పోలీసు వ్యవస్థ గురించి సామాన్య ప్రజల ఆలోచనలో చాలా మార్పులు వచ్చాయి. ఇంతకుముందు, పోలీసుల గురించి ఆలోచిస్తున్నప్పుడు ప్రతికూలత తప్ప మరేమీ చూడలేకపోయేవాళ్ళం. ఈ రోజు మన పోలీసులు పేదలకు, అవసరాల్లో ఉన్న వారికి ఆహారం, మందులు ఇస్తున్నారు. సహాయం కోసం పోలీసులు వస్తున్న విధానం, POLICING లోని మానవ మరియు సున్నితమైన కోణాన్ని ఆవిష్కరించింది. మన మనస్సును కదిలించింది, మన హృదయాన్ని తాకింది. సామాన్య ప్రజలు భావోద్వేగ రీతిలో పోలీసులతో నిమగ్నమయ్యే సందర్భం ఏర్పడింది. పోలీసులు దీనిని ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నారు. ఈ సంఘటనలు రాబోయే కాలంలో చాలా సానుకూల మార్పును తీసుకురాగలవన్న నమ్మకం నాకుంది. మనం ఎప్పుడూ ఈ సకారాత్మకతకు ప్రతికూల రంగులు అద్దవద్దు
మిత్రులారా! మనం తరచూ వింటుంటాం – ప్రకృతి, వక్రీకరణ, సంస్కృతి. ఈ పదాలను కలిసి చూడండి. దాని వెనుక ఉన్న భావోద్వేగాన్ని చూడండి. అప్పుడు మీరు జీవితాన్ని అర్థం చేసుకోవడానికి కొత్త మార్గాలు చూస్తారు. మనం మానవ స్వభావం గురించి మాట్లాడితే, 'ఇది నాది', 'నేను ఉపయోగిస్తాను' అనే భావన చాలా సహజంగా పరిగణించబడుతుంది. దీనీపై ఎవరికీ అభ్యంతరం ఉండదు. మనం దానిని 'ప్రకృతి' అని పిలవవచ్చు. కానీ 'నాది కాదు', 'నాకు అర్హత లేనిది' అనే వస్తువును మరొకరి నుండి లాక్కొని వాడతాను అనుకోవడం వికృతి.. ఈ రెండింటికి మించి, ప్రకృతి మరియు వక్రబుద్ధికి పైన, ఒక సంస్కృతి ఉంటుంది. మనస్సుతో ఆలోచించినప్పుడు లేదా ప్రవర్తించినప్పుడు, మనం 'సంస్కృతి'ని చూస్తాము. ఎవరైనా తన హక్కును, కష్టపడి సంపాదించిన వస్తువును, తనకు అవసరమైనదాన్ని మరొకరితో పంచుకోవడం, ఇతరుల అవసరాన్ని నెరవేర్చడం 'సంస్కృతి'. మిత్రులారా! కష్ట కాలంలోనే ఈ లక్షణాలు పరీక్షించబడతాయి.
మన విలువలకు అనుగుణంగా, మన సంస్కృతికి అనుగుణంగా భారతదేశం కొన్ని నిర్ణయాలు తీసుకుందని మీరు ఇటీవల చూసారు. సంక్షోభం ఉన్న ఈ సమయంలో మందుల అవసరం ప్రపంచంలో వివిధ దేశాలతో పాటు ధనిక దేశాలకు చాలా ఉంది. భారతదేశం ప్రపంచానికి మందులు ఇవ్వకపోతే, భారతదేశాన్ని ఎవరూ తప్పు పట్టరు. భారత దేశం ప్రాధాన్యత దాని పౌరుల ప్రాణాలను కాపాడటం అని ప్రతి దేశం అర్థం చేసుకుంటుంది. కానీ మిత్రులారా, భారతదేశం ప్రకృతి, వికృతిల ఆలోచనాధోరణికి మించి ఉండాలని నిర్ణయించుకుంది. భారతదేశం తన సంస్కృతి ప్రకారం నిర్ణయించింది. మేము భారతదేశ అవసరాల కోసం మా ప్రయత్నాలను పెంచడమే కాక, ప్రపంచం నలుమూలల నుండి వస్తున్న మానవాళిని రక్షించాలన్న పిలుపుపై కూడా పూర్తి దృష్టి పెట్టాము. ప్రపంచంలోని పేదలందరికీ మందులు అందజేయడానికి మేము చొరవ తీసుకున్నాం. మానవత్వం ప్రదర్శించాం. ఈ రోజు, నేను చాలా దేశాల అధిపతులతో ఫోన్లో మాట్లాడినప్పుడు, వారు ఖచ్చితంగా భారత ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతారు. ఆ ప్రజలు 'థాంక్యూ ఇండియా, థాంక్స్ పీపుల్ ఆఫ్ ఇండియా' అని చెప్పినప్పుడు, దేశానికి గర్వం పెరుగుతుంది. అదేవిధంగా, భారతదేశ ప్రజలు ఆయుర్వేదం, యోగాకు ఇచ్చే ప్రాముఖ్యతను ప్రపంచవ్యాప్తంగా చాలా ప్రత్యేకమైన రీతిలో చూస్తున్నారు. సోషల్ మీడియాలో చూడండి, ప్రతిచోటా రోగనిరోధక శక్తిని ఎలా పెంచుకోవాలి, ఆయుర్వేదం, భారతదేశ యోగా ఎలా చర్చించబడుతున్నాయి. కరోనా దృష్టికోణంలో, రోగనిరోధక శక్తిని పెంచడానికి ఆయుష్ మంత్రిత్వ శాఖ ఇచ్చిన సందేశాన్ని, మీరు ఖచ్చితంగా ఉపయోగిస్తున్నారని నేను విశ్వసిస్తున్నాను. ఆయుష్ మంత్రిత్వ శాఖ జారీ చేసిన వేడి నీరు, కషాయాలను, ఇతర మార్గదర్శకాలను మీరు మీ దినచర్యలో చేర్చుకుంటే చాలా ప్రయోజనం ఉంటుంది.
మిత్రులారా, మన స్వంత శక్తులను, గొప్ప సంప్రదాయాన్ని గుర్తించడానికి మనం చాలాసార్లు నిరాకరించడం దురదృష్టం. ప్రపంచంలోని ఏ ఇతర దేశమైనా సాక్ష్యం ఆధారిత పరిశోధనల ఆధారంగా ఇదే పని చేసినప్పుడు. మన స్వంత ఫార్ములా మనకు బోధిస్తే, దాన్ని ఆచరిస్తాం. బహుశా, దీని వెనుక ఒక పెద్ద కారణం ఉంది – వందల సంవత్సరాల మన బానిసత్వం దీనికి కారణం. ఈ కారణంగా కొన్నిసార్లు మన స్వంత శక్తిని మనం నమ్మము. మన విశ్వాసం తక్కువగా కనిపిస్తుంది. అందువల్ల, మన దేశంలోని మంచి విషయాలను, మన సాంప్రదాయ సూత్రాలను పరిశోధనలు నిర్వహించే బదులు విస్మరిస్తాము, అవి హీనంగా కనిపిస్తాయి. భారతదేశ యువ తరం ఈ సవాలును స్వీకరించాలి. ప్రపంచం యోగాను సంతోషంగా అంగీకరించినట్లే, వేలాది సంవత్సరాల నాటి మన ఆయుర్వేద సూత్రాలను ప్రపంచం అంగీకరిస్తుంది. అవును! దీని కోసం, యువ తరం ప్రతిజ్ఞ చేయవలసి ఉంటుంది. ప్రపంచానికి అర్ధమయ్యే శాస్త్రీయ భాషలోనే మనం వివరించాలి. ఏదైనా చేసి చూపించాలి.
మిత్రులారా! కోవిడ్ –19 కారణంగా మన పని విధానం, మన జీవన విధానం, మన అలవాట్లలో చాలా సానుకూల మార్పులు సహజంగా జరుగుతున్నాయి. మీరు కూడా గ్రహించి ఉంటారు. ఈ సంక్షోభం మన అవగాహనను, వివిధ అంశాలపై మన చైతన్యాన్ని మేల్కొల్పింది. మన చుట్టూ మనం చూస్తున్న ప్రభావం మొదట – మాస్క్ ధరించి, ముఖాన్ని కప్పి ఉంచడం. కరోనా కారణంగా, మారుతున్న స్థితిలో మాస్క్ కూడా మన జీవితంలో భాగమవుతోంది. మన చుట్టూ ఉన్న చాలామందిని మాస్క్ లో ఎప్పుడూ చూడలేదు. కానీ, ఇప్పుడు ఇదే జరుగుతోంది. అవును! మాస్క్ ఉపయోగించే వారందరూ అనారోగ్యంతో ఉన్నారని దీని అర్థం కాదు. నేను దీని గురించి మాట్లాడేటప్పుడు పాత విషయాలు గుర్తొస్తాయి. మీరందరూ కూడా గుర్తుకు తెచ్చుకుంటారు. మన దేశంలో చాలా ప్రాంతాల్లో ఎవరైనా పండ్లు కొంటున్నట్లు కనిపిస్తే, చుట్టుపక్కల ప్రజలు ఖచ్చితంగా అడిగేవారు – ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నారా? అని. అంటే, పండును అనారోగ్యంతో ఉన్నవారు మాత్రమే తింటారనే నమ్మకం ఉండేది. అయితే, కాలం మారిపోయింది. ఈ అవగాహన కూడా మారిపోయింది. అదేవిధంగా మాస్క్ పై అవగాహన ఇప్పుడు మారబోతోంది. మీరు చూస్తారు. మాస్క్ ఇప్పుడు నాగరిక సమాజానికి చిహ్నంగా మారుతుంది. మీరు అనారోగ్యం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవలసి వస్తే, ఇతరులను కూడా కాపాడటానికి, మీరు ముసుగు ధరించాలి. ముఖాన్ని కప్పుకోవాలి.
మిత్రులారా! బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడం వల్ల కలిగే హాని ఏమిటో ఇప్పుడు అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఈ విషయంలో మన సమాజంలో మరో పెద్ద అవగాహన వచ్చింది. ఎక్కడైనా ఉమ్మివేయడం తప్పు అలవాట్లలో ఒక భాగం. ఇది పరిశుభ్రతకు, ఆరోగ్యానికి తీవ్రమైన సవాలుగా ఉంది. ఒక విధంగా, ఈ సమస్య గురించి మనకు ఎప్పటినుంచో తెలుసు, కానీ, ఈ సమస్య సమాజాన్ని అంతం చేసే స్థాయిని గతంలో చేరలేదు. ఇప్పుడు ఈ చెడు అలవాట్లను దూరం చేసేందుకు సరైన సమయం. "ఎన్నడూ చేయకపోవడం కంటే ఆలస్యం ఉత్తమం" అని కూడా అంటారు. కాబట్టి, ఆలస్యం కావచ్చు, కానీ, ఇప్పుడు, ఈ ఉమ్మివేయడమనే అలవాటును వదిలివేయాలి. ఈ విషయాలు ప్రాథమిక పరిశుభ్రత స్థాయిని పెంచుతాయి. కరోనా కూడా సంక్రమణ చెందకుండా నిరోధించడానికి సహాయపడతాయి.
నా ప్రియమైన దేశవాసులారా, ఈ రోజు నేను మీతో 'మన్ కీ బాత్' గురించి మాట్లాడుతున్నప్పుడు, అక్షయ-తృతీయ పవిత్ర పర్వదినం కూడా ఉంది. మిత్రులారా, 'క్షయం' అంటే విధ్వంసం. ఎప్పటికీ నాశనం కానిది, అంతం కానిది అక్షయం. . మనమందరం ఈ పండుగను ప్రతి సంవత్సరం మన ఇళ్లలో జరుపుకుంటాం.. కాని ఈ సంవత్సరం దీనికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. నేటి కష్ట సమయాల్లో, మన ఆత్మ, మన భావన అక్షయమని గుర్తుచేసే రోజు ఇది. ఈ రోజు మనకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని విపత్తులు వచ్చినా, ఎన్ని వ్యాధులు ఎదుర్కోవలసి వచ్చినా – వాటితో పోరాటం కొనసాగుతుందని గుర్తుచేస్తుంది. కృష్ణుడు, సూర్యదేవుడి ఆశీర్వాదాలతో పాండవులు అక్షయ పాత్ర పొందిన రోజు ఇది అని నమ్ముతారు. అక్షయ పాత్ర అంటే ఆహారం ఎప్పటికీ ముగియని పాత్ర. మన అన్నదాతలు రైతులు ఈ పరిస్థితిలో దేశం కోసం, మనందరి కోసం, ఈ స్ఫూర్తితో కృషి చేస్తారు. వారి కృషి కారణంగా ఈ రోజు మనందరికీ- దేశంలో పునరుత్పాదక ఆహార పదార్థాలు ఉన్నాయి. ఈ అక్షయ తృతీయ సందర్భంగా మన జీవితాలలో ముఖ్యమైన పాత్ర పోషిస్తున్న మన పర్యావరణం, అడవులు, నదులు, మొత్తం పర్యావరణ వ్యవస్థ పరిరక్షణ గురించి కూడా ఆలోచించాలి. మనం 'పునరుత్పాదక'ంగా ఉండాలనుకుంటే, మొదట మన భూమి పునరుత్పాదకంగా ఉండేలా చూసుకోవాలి.
అక్షయ-తృతీయ పండుగ కూడా దాతృత్వ శక్తికి ఒక సందర్భం అని మీకు తెలుసా! స్వచ్ఛ హృదయ భావనతో మనం ఏది ఇచ్చినా అది ముఖ్యమైనది. మనం ఏమి ఇస్తామో, ఎంత ఇస్తామో ముఖ్యం కాదు. ఈ సంక్షోభ పరిస్థితుల్లో, మన చిన్న ప్రయత్నాలు మన చుట్టూ ఉన్న చాలా మందికి భారీ సహాయకారిగా మారతాయి. మిత్రులారా, జైన సంప్రదాయంలో ఇది చాలా పవిత్రమైన రోజు. మొదటి తీర్థంకరుడు రిషభదేవ్ జీవితంలో ఇదో ఒక ముఖ్యమైన రోజు. ఈ విధంగా, జైన సమాజం దీనిని ఒక పండుగగా జరుపుకుంటుంది. అందువల్ల ఈ రోజున ప్రజలు ఏదైనా శుభకార్యాలను ఎందుకు ప్రారంభించాలనుకుంటున్నారో అర్థం చేసుకోవడం సులభం. ఈ రోజు క్రొత్తదాన్ని ప్రారంభించే రోజు కాబట్టి, మనమందరం కలిసి, మన ప్రయత్నాల ద్వారా, మన భూమిని పునరుత్పాదకమైనదిగా, నశించనిదిగా మార్చగలమా? మిత్రులారా, ఈ రోజు బసవేశ్వరుడి జయంతి. బసవేశ్వరుని జ్ఞాపకాలు, సందేశాలను పదేపదే తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి మరియు కనెక్ట్ అవ్వడానికి నాకు అవకాశం లభించడం నా అదృష్టం. బసవేశ్వర జన్మదినం సందర్భంగా బసవేశ్వరుడి అనుయాయులందరికీ అభినందనలు.
మిత్రులారా, పవిత్ర రంజాన్ మాసం కూడా ప్రారంభమైంది. చివరిసారి రంజాన్ జరుపుకున్నప్పుడు, ఈసారి రంజాన్ ఇంత పెద్ద ఇబ్బందులను ఎదుర్కొంటుందని ఎవరూ ఊహించలేదు. కానీ, ఇప్పుడు ఈ ఇబ్బంది ప్రపంచం మొత్తం ఏర్పడింది. ఈ రంజాన్ ని సంయమనం, సద్భావన, సున్నితత్వం మరియు సేవలకు చిహ్నంగా మార్చడానికి మనకు అవకాశం ఉంది. ఈసారి, ఈద్ రాకముందే ప్రపంచం కరోనా నుండి విముక్తి పొందాలని, మునుపటిలా ఉత్సాహంతో ఈద్ జరుపుకోవాలని గతంలో కంటే ఎక్కువగా ప్రార్థిస్తున్నాము. రంజాన్ ఈ రోజుల్లో, స్థానిక పరిపాలన మార్గదర్శకాలను అనుసరించి, కరోనాకు వ్యతిరేకంగా ఈ పోరాటాన్ని బలోపేతం చేస్తామని నాకు నమ్మకం ఉంది. రహదారుల్లో, వీధుల్లో, మార్కెట్లలో భౌతిక దూరం నియమాలను పాటించడం ఇప్పటికీ చాలా ముఖ్యం. రెండు గజాల భౌతిక దూరం విషయంలో, ఇళ్ల నుండి బయటకి రాగూడదనే విషయంలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్న మత పెద్దలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. వాస్తవానికి, ఈసారి కరోనా భారతదేశంతో సహా పండుగలను జరుపుకునే విధానాన్ని మార్చింది. ఇటీవల బిహు, బైసాకి, పుతండు, విషూ, ఒడియా నూతన సంవత్సరం మొదలైన పర్వదినాలు వచ్చాయి. . ప్రజలు ఈ పండుగలను ఇంటి లోపల ఉండి, చాలా సరళ విధానాలతో, సమాజం పట్ల శ్రేయో దృక్పథంతో ఎలా జరుపుకుంటారో చూశాము. సాధారణంగా ఈ పండుగలను స్నేహితులు కుటుంబాలతో పూర్తి ఉత్సాహంతో జరుపుకునేవారు. ఇంటి నుండి బయటకు వెళ్లి తమ ఆనందాన్ని పంచుకునేవారు. కానీ ఈసారి అందరూ సంయమనంతో ఉన్నారు. లాక్డౌన్ నియమాలను అనుసరించారు. ఈసారి మన క్రైస్తవ మిత్రులు కూడా ఇంట్లో 'ఈస్టర్' జరుపుకున్నట్లు చూశాము. మన సమాజం, మన దేశం పట్ల ఈ బాధ్యతను నెరవేర్చడం ఈ రోజు చాలా ముఖ్యం. అప్పుడే మనం కరోనా వ్యాప్తిని ఆపగలుగుతాము. కరోనా వంటి ప్రపంచ మహమ్మారిని మనం ఓడించగలుగుతాము.
నా ప్రియమైన దేశవాసులారా, ఈ ప్రపంచ మహమ్మారి సంక్షోభం కాలంలో మీ కుటుంబ సభ్యునిగా, మీరందరూ కూడా నా స్వంత కుటుంబ సభ్యులుగా భావించి కొన్ని సూచనలు చేయడం నా బాధ్యత. మితిమీరిన ఆత్మవిశ్వాసంలో చిక్కుకోవద్దు. కరోనా ఇంకా మా నగరానికి, మా గ్రామానికి, మా వీధిలోకి, మా కార్యాలయంలోకి చేరలేదు కాబట్టి ఇకపై రాదు అనే ఆలోచనను దూరం చేయండి. చూడండి, ఎప్పుడూ అలాంటి తప్పు చేయవద్దు. ప్రపంచ అనుభవం మనకు చాలా చెబుతోంది. అప్రమత్తత ప్రమాదాన్ని దూరం చేస్తుంది. గుర్తుంచుకోండి, ఈ విషయాలన్నిటిలో మన పూర్వీకులు మాకు బాగా మార్గనిర్దేశం చేశారు. మన పూర్వీకులు చెప్పారు –
‘అగ్ని: శేషం. రుణ: శేషం,
వ్యాధి: శేషం తథైవచ |
పునః ్పు్పున ప్రవర్దెత్
తస్మాత్ శేషమ్ న కారయేత్ ||
అంటే చిన్నగా మొదలై పెద్దవైన మంటలు, అప్పులు, అనారోగ్యం తేలికగా తీసుకుంటే మరింత ప్రమాదకరంగా మారుతుంది. వాటికి పూర్తి చికిత్స చాలా ముఖ్యం. అందువల్ల, అత్యుత్సాహంతో, స్థానిక స్థాయిలో, ఎక్కడా నిర్లక్ష్యం ఉండకూడదు. ఎల్లప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. నేను మరోసారి చెప్తున్నాను. – రెండు గజాలు దూరం ఉండండి, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకోండి. "రెండు గజాల దూరం- ఆరోగ్యానికి అవసరం. మీకు మంచి ఆరోగ్యం ఉండాలని కోరుకుంటూ నేను నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. తరువాతి 'మన్ కి బాత్' సందర్భంగా మనం కలిసినప్పుడు, ఈ గ్లోబల్ మహమ్మారి నుండి విముక్తి పై కొన్ని వార్తలు ప్రపంచం నలుమూలల నుండి రావాలి, మానవజాతి ఈ కష్టాల నుండి బయటపడాలి. ఈ ప్రార్థనతో మీకందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను.
నా ప్రియతమ దేశవాసులారా..
సాధారణంగా మన్ కీ బాత్ లో నేను అనేక విషయాలను మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను. అయితే ఈరోజు మన దేశమే కాదు.. ప్రపంచం మనసులో కూడా ఒకే ఒక్క విషయం కదలాడుతోంది. అదే ప్రాణాంతకమైన కరోనా వ్యాధి సృష్టించిన భయంకర కష్టం. ఇటువంటి సమయంలో వేరే విషయాల గురించి మాట్లాడటం సమంజసంగా ఉండదు. ఎన్నో ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడాలనుకున్నాను కానీ.. ఈ ప్రాణాంతక వ్యాధికి సంబంధించి కొన్ని విషయాలను తెలియజేయాలని నా మనసు కోరుకుంటోంది. అయితే ముందస్తుగా దేశప్రజలందరినీక్షమించమని కోరుకుంటున్నాను. మీరందరూ నన్ను క్షమిస్తారని నా ఆత్మ చెబుతోంది. ఎందుకంటే కొన్ని కఠినమైన నిర్ణయాలను తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది. దీనివల్ల మీరందరూ ఎన్నో కష్టనష్టాలకు గురికావల్సి వస్తోంది. ముఖ్యంగా నా నిరుపేద సోదరసోదరీమణులను చూస్తుంటే ఏమనిపిస్తోందంటే వారందరూ కూడా ఈనేం ప్రధానమంత్రి? మమ్మల్ని కష్టనష్టాల ఊబిలోకి తోసేసాడు అని వాళ్లు అనుకుంటున్నారనిపిస్తోంది. నన్ను క్షమించమని ప్రత్యేకంగా వారిని కోరుకుంటున్నాను. బహుశా, చాలామంది నా మీద కోపం పెంచుకుని ఉంటారు. మమ్మల్నందరినీ ఇట్ల ఇళ్లలో బందిస్తావా అని ఆగ్రహిస్తున్నారు. నేను మీ అందరి కష్టనష్టాలను అర్థం చేసుకోగలను. మీఅందరి ఇబ్బందులను అర్థం చేసుకోగలను అయితే.. 130 కోట్ల జనాభా గల మనలాంటి దేశంలో కరోనా పై యుద్ధానికి ఇంతకుమించిన మరోమార్గం లేనేలేదు. కరోనాతో యుద్ధమంటే జీవితానికి చావుకు మధ్య జరిగే యుద్ధం. ఈ యుద్ధంలో మనం గెలవాలి. అందుకే కఠినమైన నిర్ణయాలు తప్పనిసరి అయ్యాయి. ఎవ్వరి మనసూ ఇంత కఠినమైన నిర్ణయాలను అంగీకరించరు. అయితే ప్రపంచ దేశాల్లోనిపరిస్థితులను చూస్తుంటే మిమ్మల్ని మీ కుటుంబాల్ని క్షేమంగా ఉంచడానికి ఇదొక్కటే మార్గమని తేలుతుంది. నేను మరోసారి మీకు కలిగిన ఇబ్బందులకు, కష్టాలకు క్షమించమని కోరుకుంటున్నారు.
సహచరులారా…
మనదగ్గర ఒక సూక్తి ఉంది. “ఏవం ఏవం వికార: అపి తరుణా సాధ్యతే సుఖం” అంటే వ్యాధులు, రోగాలను అవి ప్రబలకముందే, వాటిని ప్రారంభంలోనే ఎదుర్కొవాలి. లేకపోతే అవి ముదిరిన తర్వాత నివారించడం అసాధ్యమవుతుంది. రోగాలను నయం చేయడం కూడా మరింత కష్టమవుతుంది. ఈరోజు యావత్ భారతం ఒకటే చెబుతోంది. సోదరసోదరీమణులారా.. తల్లులారా… కరోనా వైరస్ యావత్ ప్రపంచాన్నీ బందీచేసింది. జ్ఞానులను, వైజ్ఞానికులను, నిరుపేదలను, ధనవంతులను, బలహీన వర్గాలను, శక్తి మంతులను అందరినీ ఇది సవాల్ చేస్తోంది. ఇది దేశాల సరిహద్దులకు కానీ, ఒక ప్రాంత సరిహద్దులకు కానీ, ఒక వాతావరణ పరిమితులకు కాని, దేనికీ కట్టుబడటం లేదు. ఇది మానవజాతిని నాశనం చేయడానికీ, అంతం చేయడానికీ పట్టుబట్టి కూర్చుంది. అందుకే అందరూ.. కలిసికట్టుగా, యావత్ మానవజాతీ ఈ వైరస్ అంతంచూడడానికి సంకల్పం చేసుకోవాలి. లాక్ డౌన్ ను పాటిస్తూ ఇతరులను కాపాడుతున్నామన్న భావన కొంతమందిలో కలుగుతోంది. ఇది కేవలం అపోహ. ఈ భ్రమలోంచి బయటపడండి. ఈ లాక్ డౌన్ మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికీ, మీ కుటుంబాన్ని మీరు కాపాడుకోవడానికీ.ఇంకా ముందు ముందు కూడా కొన్ని రోజుల వరకు మీరు ఓర్పు వహించక తప్పదు సహనం ప్రదర్శించాలి. లక్ష్మణరేఖను దాటకూడదు. సహచరులారా.. నాకు తెలుసు ఎవ్వరూ కూడా కావాలని చట్టాన్ని ఉల్లంఘించాలని కోరుకోరు. నియమనిబంధనలను పాటించకూడదని ఎవ్వరూ అనుకోరు. కానీ కొంతమంది ఇట్లా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్లు పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోలేకపోతున్నారు. వారందరినీ కోరేది ఒక్కటే లాక్ డౌన్ నియమాలను పాటించకపోతే. కరోనా వైరస్ నుంచి కాపాడుకోవడం కష్టతరమవుతుంది. ప్రపంచంలో చాలా మంది ఈ అపోహలతోనే కాలం గడిపారు. ఇప్పుడు పశ్చాతాప పడుతున్నారు. ఆరోగ్యం పరంభాగ్యం –స్వాస్థ్యంసర్వార్థ సాధనం అంటే ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే, దేనినైనా సాధించడానికి సాధనం. ప్రపంచంలో అన్ని సుఖాలను పొందడానికి సాధనం కేవలం ఆరోగ్యమే అందుకే లాక్ డౌన్ నియమాలను ఉల్లంఘించేవారు తమ జీవితంతో ఆటలాడుకుంటున్నారని చెప్పక తప్పదు. ఈ యుద్ధంలో అనేక మంది యోధులు కేవలం ఇంట్లో కూర్చొని కాకుండా బయటకు వెళ్లి కరోనా వైరస్ తో పోరాడుతున్నారు. వీరంతా యుద్ధంలో అగ్రభాగాన నిల్చిన సైనికులు. ముఖ్యంగా నర్సులు. ఈ నర్సుల్లో మన సోదరులు, సోదరీమణులు కూడా ఉన్నారు. డాక్టర్లు, సహచర వైద్య సిబ్బంది వీరంతా కరోనాను ఓడిస్తున్నారు. మనం వీరి నుంచి స్ఫూర్తి పొందాలి.
ఈ మధ్య నేను కొంత మందితో ఫోన్ లో మాట్లాడాను. వారిలో ఉత్సాహాన్ని నింపాను. వారితో మాట్లాడటం వల్ల నాలో మరింత ఉత్సాహం పెరిగింది. వారితో మాట్లాడి ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. ఈసారి మన్ కీ బాత్ ద్వారా ఆ సహచరుల అనుభవాలు, వారితో మాట్లాడిన విషయాలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ముందుగా నాతో కలుస్తున్నవారు రామ్ గంప తేజా గారు. నిజానికి ఆయన ఐటీ ప్రొఫెషనల్. రండి ఆయన అనుభవాలను విందాం.
మోదీ : ఎస్ రాం
రామ్ గంప తేజా : నమస్కారమండీ.
మోదీ : ఎవరు? రామ్ గారేనా మాట్లాడేది.
రామ్ గంప తేజా : అవును సర్. రామ్ ను మాట్లాడుతున్నారు.
మోదీ : రామ్ నమస్తే.
రామ్ గంప తేజా :నమస్తే.. నమస్తే..
మోదీ : మీరు కరోనా వైరస్ పెను ప్రమాదం నుంచి బయటపడ్డారని విన్నాను.
రామ్ గంప తేజా : అవును సార్.
మోదీ :మీతో ఒక విషయం మాట్లాడాలనుకుంటున్నారు. చెప్పండి మీరు పెను ప్రమాదం నుంచి ఎట్లా బయటపడ్డారు. మీ అనుభవాలు వినాలనుకుంటున్నాను.
రామ్ గంప తేజా :నేను ఐటీ రంగంలో పని చేసే ఉద్యోగిని. పనిలో భాగంగా మీటింగ్స్ కోసం దూబాయ్ వెళ్లాల్సి వచ్చింది. అక్కడ అనుకోకుండానే అలా జరిగిపోయింది. తిరిగి రాగానే జ్వరంలాంటివి మొదలయ్యాయి సార్. ఆతర్వాత ఐదారు రోజులకు డాక్టర్లు కరోనా వైరస్ పరీక్షలు జరిపారు. అప్పుడు పాజిటివ్ వచ్చింది. వెంటనే హైదరాబాద్ లోని ప్రభుత్వ గాంధీ హాస్పిటల్ లో నన్ను చేర్చారు. ఆతర్వాత 14 రోజులకి నాకు నయమైంది. డిశ్చార్జి చేశారు. నిజంగా అదంతా ఎంతో భయంకరంగా సాగింది.
మోదీ :అంటే మీకు కరోనా వైరస్ సోకిందన్న విషయం తెలిసింది?.
రామ్ గంప తేజా : అవును సార్.
మోదీ :మీకు ఈ వైరస్ ఎంతో భయంకరమైనదన్న అన్న విషయం ముందే తెలుసుకదా. జ్వరంతో బాధ పడుతున్నారు కదా.
రామ్ గంప తేజా : అవును సార్.
మోదీ :అయితే వైరస్ సోకిన విషయం తెలియగానే మీకు ఏమనిపించింది.
రామ్ గంప తేజా : ఒక్కసారిగా భయంవేసింది. ముందైతే నేను నమ్మలేకపోయాను. ఇట్లా ఎట్లా జరిగిందో అర్థం కాలేదు. ఎందుకంటే భారత దేశంలో కేవలం ఇద్దరి, ముగ్గురికే ఈ వ్యాధి సోకింది. అందుకే ఏమీ అర్థం కాలేదు. ఆస్పత్రిలో చేరిన తర్వాత నన్ను క్వారంటైన్ లో ఉంచారు. రెండు, మూడు రోజులు అట్లాగే గడిచిపోయాయి. అక్కడ ఉన్న డాక్టర్లు… నర్సులు…
మోదీ : ఆ ఇంకా…
రామ్ గంప తేజా :వాళ్లు ఎంతో మంచివాళ్లు. ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్లు నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచేవాళ్లు నాకు ఏమీ కాదన్న నమ్మకాన్ని కలిగించే వాళ్లు. మీరు తొందరగా కోలుకుంటారు. అంటూ ఇట్లాంటి మాటలు మాట్లాడే వాళ్లు. పగటి పూట ఇద్దరు, ముగ్గురు డాక్టర్లు మాట్లాడేవాళ్లు. నర్సులు కూడా మాట్లాడేవాళ్లు. మొదట్లో భయం వేసింది. కాని క్రమంగా ఇంతమంది మంచివాళ్ల మధ్య ఉన్న కారణంగా నాకేమీ కాదన్న నమ్మకం కుదిరింది. ఏంచేయాలో వాళ్లకి తెలుసు. తప్పనిసరిగా నాకు మెరుగవుతుంది అన్న విశ్వాసం పెరిగింది.
మోదీ : మీకుటుంబ సభ్యుల మనస్థితి ఎట్లా ఉండేది.
రామ్ గంప తేజా :నేను ఆస్పత్రిలో చేరినప్పుడు మొదట్లో వాళ్లు ఎంతో ఆందోళనకు గురయ్యారు. ఇక్కడ మీడియా కూడా కొంత సమస్యాత్మకంగా మారింది. ఆతర్వాత మాకుటుంబ సభ్యులకు కూడా పరీక్షలు చేశారు. నెగిటివ్ వచ్చింది. నాకూ, నాకుటుంబ సభ్యులకూ, చుట్టు పక్కల వారికి కూడా ఎంతో ఊరటనిచ్చింది. ఆ తర్వాత రోజురోజుకీ నా పరిస్థితిలో మెరుగుదల కన్పించింది. డాక్టర్లు మాతో మాట్లాడేవారు. కుటుంబ సభ్యులకు కూడా విషయాలు చెప్పేవారు. వారు ఏఏ జాగ్రత్తలు తీసుకుంటున్నారో ఏవిధంగా చికిత్స చేస్తున్నారో అన్ని విషయాలు కుటుంబ సభ్యులకు తెలిపేవారు.
మోదీ :మీరు స్వయంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకునేవారు. మీ కుటుంబ సభ్యులు ఏ ఏ జాగ్రత్తలు తీసుకునేవారు?
రామ్ గంప తేజా : నేను క్వారంటైన్ లోకి వెళ్లిన తర్వాతే ఈ విషయం తెలిసింది. అయితే క్వారంటైన్ తర్వాత కూడా మరో 14 రోజులు పడుతోందని డాక్టర్లు చెప్పారు. ఆ 14 రోజులు ఇంటి దగ్గరే ఒక గదిలో ఉండాలని చెప్పారు. వారిని ఇంట్లో తమకుతాముగా క్వారంటైన్ లో ఉండాలని కోరారు. నేను ఆస్పత్రి నుంచి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోనే ఒక గదిలో ఉండేవాన్ని.. దాదాపుగా రోజంతా ఎక్కువసేపు మాస్క్ తగిలించుకొని ఉండేవాన్ని. తినడానికి గదిలోంచ బయటికి వచ్చే ముందు చేతులను శుభ్రంగా కడుక్కునేవాడిని. ఇది ఎంతో ముఖ్యం.
మోదీ : సరే రామ్.. మీరు ఆరోగ్యం పుంజుకొని బయటికి వచ్చారు. మీకు, మీకుటుంబ సభ్యులకు ఎన్నోన్నో శుభాకాంక్షలు.
రామ్ గంప తేజా : ధన్యవాదాలు సార్.
మోదీ :కానీ మీ ఈ అనుభవం…
రామ్ గంప తేజా : ఆ సార్..
మోదీ : మీరు ఐటీ ప్రొఫెషన్ లో ఉన్నారు.. కదా…
రామ్ గంప తేజా : చెప్పండి సార్..
మోదీ : అయితే ఆడియో తయారు చేసి…
రామ్ గంప తేజా : ఆ సర్…
మోదీ : ఇతరులతో పంచుకోండి… ప్రజలతో పంచుకోండి. దీనిని సామాజిక మాధ్యమంలో వైరల్ చేయండి. ఈ విధంగా చేస్తే ప్రజలు భయాందోళనలకు గురికాకుండా ఉంటారు. ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలో కాడా తెలుస్తుంది. ఈ ప్రాణాంతక వ్యాధి నుంచి దూరంగా ఉండడానికి తమనుతాము కాపాడుకోవడానికి ప్రయత్నిస్తారు.
రామ్ గంప తేజా :అవును సార్. బయటికివచ్చి చూస్తున్నాను క్వారంటైన్ అంటే తమకు తాము జైలులో ఉన్నట్లుగా భావిస్తున్నారు. ఇది నిజంగా ఇలాంటిది కాదు. అందరూ అర్థం చేసుకోవాలి. ప్రభుత్వం చెబుతున్న క్వారంటైన్ కేవలం వారికే కాదు, వారి కుటుంబ సభ్యులకు కూడా మంచిది. అందుకే.. ఎంతో మందికి ఈ విషయాలను చెప్పాలనుకుంటున్నాను. పరీక్షలు చేయించుకోండి. క్వారంటైన్ అంటే భయపడకండి. క్వారంటైన్ అంటే అదేదో మచ్చలాంటిది అనుకోకండి.
మోదీ :మంచిది రామ్. మీకు ఎన్నెన్నో శుభాకాంక్షలు.
రామ్ గంప తేజా : ధన్యవాదాలు.. ధన్యవాదాలు…
మోదీ : ధన్యవాదాలు..
రామ్ గంప తేజా : సార్ ఇంకో విషయం చెప్పాలనుకుంటున్నాను.
మోదీ : ఆ చెప్పండి… చెప్పండి.
రామ్ గంప తేజా :నాకు చాలా సంతోషంగా ఉంది సార్. మీరు తీసుకున్న చర్యలు ప్రపంచంలో ఏ దేశం కూడా తమ పౌరుల కోసం తీసుకోలేదు. అంతేకాదు మీ కారణంగా మేమందరం కూడా క్షేమంగా బయట పడగలమని ఆశిస్తున్నాను.
మోదీ :ఈ వైపరిత్యం నుంచి దేశ బయటపడాలి. ఇది ఎంతో భయానకమైన పరిస్థితి. ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి.
రామ్ గంప తేజా : ఏమీ కాదు సార్. మొదట్లో నాకు భయం వేసింది. మీరు లాక్ డౌన్ ప్రకటించినప్పుడు. మీరు తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే నాలో నమ్మకం పెరుగుతోంది. మనందరం మీ సహాయంతో బయటపడతాం సార్. ధన్యవాదాలు సార్.
మోదీ : ధన్యవాదాలు సోదరా… ఎన్నెన్నో కృతజ్ఞతలు.
రామ్ గంప తేజా : ధన్యవాదాలు సర్.
దేశవాసులారా… రామ్ గంప తేజా గారు చెప్పినట్లు ఆయనకు కరోనా సోకిన విషయం తెలిసిన తర్వాత డాక్టర్లు ఇచ్చిన ఆదేశాలను తూచాతప్పకుండా పాటించారు. ఆకారణంగానే ఆయన ఆరోగ్యవంతుడై మళ్లీ సాధారణ జీవితాన్ని గడపగలుగుతున్నారు. కరోనాను ఓడించిన మరో వ్యక్తి మనతో కలుస్తున్నారు. కేవలం ఆయనే కాదు.. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ కరోనా ఊబిలో చికుక్కుకుపోయిన వారే. నవయువకుడైన వారి కుమారుడు కూడా ఈ ఊబిలో చికుక్కున్నాడు. రండి.. ఆగ్రాకు చెందిన అశోక్ కపూర్ గారితో మాట్లాడదాం.
మోదీ : అశోక్ గారు.. నమస్తే…. నమస్తే…
అశోక్ కపూర్ : నమస్కారం సార్… మీతో మాట్లాడడం నా అదృష్టం సార్.
మోదీ :నిజమే.. ఇది మా అదృష్టం కూడా. అందుకే మీకు ఫోన్ చేశాను. ఎందుకంటే మీ కుటుంబం యావత్తు ఈ ప్రమాదంలో పడింది కదా..
అశోక్ కపూర్ : అవును… అవును… అవును.
మోదీ : నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. మీకు ఈ సమస్య గురించి, ఈవ్యాధి గురించి ఎట్లా తెలిసింది. ఏం జరిగింది. ఆస్పత్రిలో ఏం జరిగింది. ఈవిషయాలు చెప్పండి. మీరు చెప్పేవి విని వాటిలో దేశానికి పనికొచ్చే అంశాలను నేను ఉపయోగించుకుంటాను.
అశోక్ కపూర్ :తప్పనిసరిగా ఉపయోగించుకోవచ్చండీ… నాకు ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు. వారు ఇటలీ వెళ్లారు. అక్కడ చెప్పులకు సంబంధించిన ఒక ప్రదర్శన జరిగింది. మేం చెప్పులు, బూట్లు తయారు చేస్తాం. చెప్పులు, బూట్లు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది.
మోదీ : చెప్పండి.
అశోక్ కపూర్ :అక్కడ ఇటలీలో మేళా జరిగింది. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పటికీ…
మోదీ : ఆ… చెప్పండి.
అశోక్ కపూర్ :అక్కడికి మా అల్లుడు కూడా వెళ్లారు. ఆయన ఢిల్లీలో ఉంటారు. ఆయనకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది. వెంటనే ఆయన రామ్ మనోహర్ లోహియా ఆస్పత్రికి వెళ్లారు.
మోదీ :ఆ.. చెప్పండి.
అశోక్ కపూర్ :అక్కడ ఆయనకు పాజిటివ్ వచ్చింది. ఆయనను సఫ్ధర్ జంగ్ ఆస్పత్రికి తరలించారు.
మోదీ : ఆతర్వాత…
అశోక్ కపూర్ : మాకు అక్కడి నుంచి ఫోన్ వచ్చింది. మీరు కూడా ఆయనతో వెళ్లారు కదా.. మీరు కూడా పరీక్షలు చేయించుకోండి. కాంతో మా ఇద్దరు అబ్బాయిలు పరీక్షలు చేయించుకోవడానికి వెళ్లారు. ఇక్కడి ఆగ్రా జిల్లా ఆస్పత్రిలో… ఆస్పత్రి వారు, ఎందుకైనా మంచిది మీకుటుంబ సభ్యులను కూడా పిలుచుకోండి అని చెప్పారు. ఇంకేముంది? అందరం అక్కడి వెళ్లాం.
మోదీ : ఆ… తర్వాత.
అశోక్ కపూర్ : మేం మొత్తం ఆరుగురం. మా ఇద్దరు అబ్బాయిలు, నేను, భార్య నా వయస్సు డెబ్భైమూడేళ్లు, నా భార్య, నా కోడలు, నా మనవడు… నామనవడి వయస్సు పదహారేళ్లు మా ఆరుగురికి పాజిటివ్ వచ్చింది. డాక్టర్లు ఆరుగురిని ఢిల్లీకి పంపిస్తామని చెప్పారు.
మోదీ : ఓ మై గాడ్.
అశోక్ కపూర్ :సార్.. అయితే మేమెవరమూ భయపడలేదు. సరే మంచిది అన్నాం. మంచిదే కదా.. ముందే తెలిసిపోయింది. మేం ఢిల్లీ సఫ్ధర్ జంగ్ ఆస్పత్రికి వెళ్లాం. ఈ ఆగ్రా ఆస్పత్రి వాళ్లే అంబులెన్స్ ఏర్పాటు చేసి మమ్మల్ని అక్కడికి పంపించారు. ఈ ఆస్పత్రి వాళ్లు ఎటువంటి ఛార్జీలు మమ్మల్ని అడగలేదు. ఆగ్రా డాక్టర్లు, ఆస్పత్రి యాజమాన్యం దయతో మేం ఢిల్లీ వెళ్లాం.
మోదీ : మీరు అంబులెన్స్ లో వచ్చారా.
అశోక్ కపూర్ : అవును సార్. అంబులెన్స్ లోనే వచ్చాం. అంబులెన్స్ లో కూర్చుని కూర్చునే వచ్చాం. మాకు ఆస్పత్రి వాళ్లు రెండు అంబులెన్స్ లు ఇచ్చారు. మాతోపాటు డాక్టర్లు కూడా ఉన్నారు. మమ్మల్ని సప్ధర్ జంగ్ ఆస్పత్రిలో విడిచి పెట్టారు. మేము వచ్చేటప్పటికే సప్థర్ జంగ్ ఆస్పత్రి డాక్టర్లు గేటుముందే మమ్మల్ని రిసీవ్ చేసుకోవడానికి నిలబడి ఉన్నారు. డాక్టర్లు మమ్మల్ని అక్కడి వార్డులోకి తరలించారు. మా ఆరుగురిని వేరు వేరు గదుల్లో ఉంచారు. గదులు బాగున్నాయి. అన్ని సౌకర్యాలూ ఉన్నాయి. సార్ మేము 14 రోజులు అక్కడ ఆస్పత్రిలో ఒంటరిగా ఉన్నాం. అక్కడి డాక్టర్లు మాకు ఎంతో సహకరించారు. మంచి చికిత్స అందించారు. అక్కడి సిబ్బంది కూడా ఎంతో సహకరించారు. అక్కడ అందరూ ఓకేరకమైన దుస్తులు వేసుకొని ఉండడంతో ఎవరు డాక్టర్లో, ఎవరు వార్డు బాయో, ఎవరు నర్సో తెలుసుకోవడం చాలా కష్టంగా ఉండేది. వారు ఏది చెబితే దానిని మేం పాటించేవాళ్లం. మాకు ఎటువంటి కష్టం కలుగలేదు. ఒక్కశాతం సమస్యకూడా ఎదురుకాలేదు.
మోదీ : మీ ఆత్మవిశ్వాసం ఎంతో ప్రబలంగా కనిపిస్తోంది.
అశోక్ కపూర్ : అవును సార్. నేను ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్నాను. నిజానికి సార్ నాకు మోకాలి చిప్పల ఆపరేషన్ జరిగింది సార్. అయినప్పటికీ నేను ఎంతో పర్ఫెక్ట్ గా ఉన్నాను సార్.
మోదీ :అది కాదు… ఇంత పెద్ద కష్టం మీ కుటుంబ సభ్యులను ముంచెత్తినా అందులోనూ పదహారేళ్ల పిల్లాడికి కూడా వచ్చినా…
అశోక్ కపూర్ :అతనికి పరీక్షలు జరుగుతున్నాయి సార్. ఐ.సీ.ఎస్.ఈ. పరీక్ష ఉండింది సార్. అయితే పరీక్ష రాయలేదు సార్. తర్వాత చూసుకోవచ్చులే అని చెప్పాను సార్. ముందు ప్రాణం నిలబడితే ఆతర్వాత పరీక్ష. ఏం ఫర్వాలేదు.
మోదీ : నిజమే. మీ అనుభవం మీకు ఎంతగానో పనికి వచ్చింది. యావత్ కుటుంబానికీఆత్మ విశ్వాసాన్ని ఇచ్చింది. ధైర్యాన్నీ, ఓర్పునీ సమకూర్చింది.
అశోక్ కపూర్ : అవును సార్. మా కుటుంబ సభ్యులమందరం వెళ్లాం. ఒకరికి ఒకరు తోడుగా నిలిచాం. అయితే కలుస్తూ ఉండేవాళ్లం కాదు. కేవలం ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉండేవాళ్లం. మేం కలుసుకునేవాళ్లం కాదు కానీ. డాక్టర్లు శాయశక్తుల మాపట్ల అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. మేం ఎప్పటికీ వారికి కృతజ్ఞులమై ఉంటాం. వారు మాకు ఎంతో సహకరించారు. ఆస్పత్రి సిబ్బంది, నర్సులు మాకు తోడుగా నిలిచారు సార్.
మోదీ :సరే.. మీకూ మీ కుటుంబ సభ్యులకు అందరికీ ఎన్నెన్నో శుభాకాంక్షలు.
అశోక్ కపూర్ : థ్యాంక్యూ సార్.. ధన్యవాదాలు. మాకెంతో సంతోషంగా ఉంది. మీతో మాట్లాడగలిగాం.
మోదీ :మీకే కాదు. నాకు కూడా…
అశోక్ కపూర్ : సార్.. ఆతర్వాత.. ఎప్పటికీ ప్రజల్లో జాగరూకత పెంచడానికి గానీ, ఏదైన సహాయం చేయడానికి గానీ, మేమంతా సిద్ధంగా ఉంటాం సర్.
మోదీ :అంత అవసరం లేదు. మీరు మీ పద్ధతిలో ఆగ్రాలో ఆ పని చేయండి. ఎవరైనా ఆకలితో ఉంటే అన్నం పెట్టండి. నిరుపేదల గురించి ఆలోచించండి. ప్రజలు నియమనిబంధనలు పాటించేలా చూడండి. మీకుటుంబం ఈమహమ్మారిలో చిక్కిఎలా బయటపడిందో తెలియజేయండి. మీరు ఏవిధంగా అయితే.. నియమాలను పాటిస్తూ.. మీ కుటుంబాన్ని కాపాడారో, అదేవిధంగా ప్రజలందరూ కూడా నియమాలను పాటిస్తే దేశాన్ని కాపాడొచ్చు.
అశోక్ కపూర్ :మోదీ సర్ మేం ఒక మీడియో లాంటివి తయారు చేసి ఛానల్స్ కు అందజేశాం సార్.
మోదీ :చాలా మంచిది.
అశోక్ కపూర్ :ఛానల్స్ వాళ్లు. ప్రజల్లో అవగాహన పెంచడానికి ఆ వీడియోను ప్రసారం కూడా చేశారు.
మోదీ : సామాజిక మాధ్యమాల్లో మరింత పాపులర్ చేయాలి.
అశోక్ కపూర్ :అవును సార్. మేం మా కాలనీలో అందరికీ చెప్పాం. శుచీ శుభ్రత ఉన్న కాలనీ మాది. అందరికీ చెప్పాం. ఇదిగో మేం వచ్చేశాం. భయపడాల్సిన పనేలేదు. ఏదైనా ఇబ్బంది అనిపిస్తే వెళ్లి పరీక్షలు చేయించుకోండి. మాతో కలిసి మెలిసి ఉన్న వారందరూ కూడా పరీక్షలు చేయించుకోవాలి. భగవంతుడి దయతో అందరూ చల్లగా ఉండాలి. ఇంతే సార్.
మోదీ : సరే. మీ అందరికీ శుభాకాంక్షలు.
అశోక్ కపూర్ :సరే సార్. మీ దయ. మేమైతే ఎంతో సంతృప్తిగా ఉన్నాం. మీతో మాట్లాడినందుకు సంతోషంగా ఉంది. మిమ్మల్ని అహ్మదాబాద్ లో ఒకసారి చూశాను సార్. ఇప్పటికి మీతో మాట్లాడగలిగాను. మా ఇల్లు మణినగర్ లోనే ఉంది సర్.
మోదీ :ఓహో.. అలాగా…
అశోక్ కపూర్ :అక్కడ మిమ్మల్ని ఒకసారి చూశాం సార్. మా పెద్దన్నయ్యగారు అక్కడ ఉంటారు సార్.
మోదీ : ఇప్పుడు మీరు ఆగ్రాలో ఉంటున్నారు కదా.
అశోక్ కపూర్ : అవును సార్. మేము ఆగ్రాలో ఉంటున్నాం. మేం ఇద్దరు సోదరులం సర్. ఒక సోదరుడు అహ్మదాబాద్ లో మణినగర్ లో ఉంటారు.
మోదీ :సరే.. మంచిది.
అశోక్ కపూర్ :సార్.. అది మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గం కదా.
మోదీ : అవును. అక్కడ శాసన సభ్యుడిగా ఉండేవాణ్ని.
అశోక్ కపూర్ :మీ పాలన సాగుతున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను సార్. ఇప్పుడు మీతో మాట్లాడుతుంటే ఎంతో బాగుంది సార్.
మోదీ :సరే మంచిది. ధన్యవాదాలు… ఎన్నెన్నో శుభాకాంక్షలు.
అశోక్ కపూర్ : ధన్యవాదాలు… ధన్యవాదాలు.
సహచరులారా… అశోక్ గారు, వారి కుటుంబ సభ్యులు దీర్ఘాయుస్సుతో జీవించాలని కోరుకుందాం. వారు చెప్పినట్లుగా ఎటువంటి ఆందోళనకు గురికాకుండా భయపడకుండా తగిన సమయంలో.. తగిన చర్యలు తీసుకుంటూ.. అవసరమైనప్పుడు డాక్టర్లను సంప్రదిస్తూ.. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటే మనం ఈ మహమ్మారిని ఓడించగలుగుతాం. సహచరులారా.. వైద్య శాస్త్ర స్థాయిలో మహమ్మారితో పోరాడుతున్నాం. వారి అనుభవాలను తెలుసుకోవడం కోసం నేను కొంత మంది డాక్టర్లతో మాట్లాడాను కరోనా వైరస్ తో జరుగుతున్న ఈ యుద్ధంలో మొదటి వరుసలో నిలబడి ఆ డాక్టర్లు పోరాడుతున్నారు. వారి దైనందిన జీవితంలో భాగంగా ఎప్పటికీ ఇటువంటి రోగులతోనే వారు గడపాల్సి వస్తుంది. రండి మనతో కలవడానికి ఢిల్లీకి చెందిన డాక్టర్ నీతేష్ గుప్త వచ్చారు.
మోదీ : నమస్తే డాక్టర్ గారూ.
నీతేష్ గుప్త :నమస్తే సార్.
మోదీ : నమస్తే నీతేష్ గారు, మీరైతే ఏకంగా యుద్ధరంగంలో ముందు వరుసలో
ఉన్నారు. ఆస్పత్రులలో మీ సహచరుల మూడ్ ఎలా ఉంది. కొద్దిగా
తెలియచేస్తారా..
నీతేష్ గుప్త :అందరి మూడ్ బ్రహ్మాండంగా ఉంది. అంతా మీ ఆశీర్వాద బలమే.
మీరు ఇచ్చిన ఆదేశాలను అందరూ సమర్థిస్తున్నారు. మేము
అడిగనవన్నీ మీరు సమకూరుస్తున్నారు. అందుకే మేమందరం
సరిహద్దులో నిలబడ్డ సైనికులలాగా యుద్ధం చేస్తున్నాం. మా కర్తవ్యం, మా బాధ్యతా ఒక్కటే. రోగి ఆరోగ్యవంతుడై ఇంటికి వెళ్లేలా చూడడం.
మోదీ : మీరు చెప్పేది నిజమే. ఇది యుద్ధం లాంటి పరిస్థితే. మీరందరూ
అగ్రభాగాన నిలబడి యుద్ధం చేస్తున్నారు.
నీతేష్ గుప్త : ఔను సార్
మోదీ : చికిత్స తోపాటు రోగికి కౌన్సిలింగ్ కూడా చేయాల్సి వస్తుంది కదా.
నీతేష్ గుప్త : ఔను సార్. ఇది చాలా అవసరం. ఎందుకంటే.. రోగి విషయం
వినగానే ఏమైపోతుందోనని విపరీతంగా భయపడతాడు. అతనికి
అర్థమయ్యేలా చెప్పాల్సి ఉంటుంది. ఏం లేదు కేవలం 14 రోజుల్లో మీకు
నయమవుతుంది. మీరు హాయిగా ఇంటికి వెళతారు. ఇప్పటికీ మేం
16మంది రోగుల్ని ఆరోగ్యవంతుల్ని చేసి ఇంటికి పంపించాం.
మోదీ : సరే మంచిది. అయితే..ఓవరాల్ గా భయభీతులైన రోగుల విషయంలో
వారిని బాధించేది ఏమిటి. మీకేం కనిపించింది.
నీతేష్ గుప్త : వారికి ఏం జరగబోతోందోనన్న భయం ఉండేది. ఇప్పుడెట్లా..
బయట ప్రపంచంలో ఎంతోమంది చనిపోతున్నారు కదా. మాకు అలాగే
జరుగుతుందా అని వారు విపరీతంగా భయపడే వారు. మేం వారికి
అర్థమయ్యేలా చెప్పేవాళ్లం. వారికి ఉన్న ఇబ్బంది ఏమిటో ఆ సమస్య
ఎన్ని రోజుల్లో తీరుతుందో స్పష్టంగా చెప్పేవాళ్లం. మీకున్న ఇబ్బంది
చాలా చిన్నది. మామూలు జలుబు,జ్వరం లాంటిదే. అంతే..
అంతకుముంచి ఏమీ లేదని చెప్పేవాళ్లం. ఐదారు రోజుల్లో నయం
అయిపోతుందని అర్థమయ్యేలా తెలియజేసే వాళ్లం. మీకు పరీక్షలు
చేస్తాం. నెగిటివ్ వస్తే వెంటనే ఇళ్లకు పంపిస్తాం. అందుకే రోజూ రెండు
మూడు సార్లు రోగుల దగ్గరకు వెళ్లేవాళ్లం. కలిసే వాళ్లం. వారికి రోజంతా సౌకర్యంగా ఉంటే బాగుంటుంది. అందుకే.. ఎప్పటికప్పుడు వారితో మాట్లాడుతూ ఉండేవాళ్లం.
మోదీ: వారిలో ఆత్మవిశ్వాసం పెరిగేది కదా. మొదట్లో భయపడే వాళ్లు కదా. నీతేష్ గుప్తా : ఔను. మొదట్లో భయపడే వాళ్లు. కానీ.. మేము వారికి
అర్థమయ్యేలా చెప్పేవాళ్లం. రెండు మూడురోజుల్లో క్రమంగా
మెరుగవుతున్నట్లు కనిపిస్తే వారికి కూడా పూర్తిగా కోలుకుంటామన్న
నమ్మకం కలిగేది.
మోదీ: అయితే చాలామంది డాక్టర్లు వారి జీవితంలో ఎంతో సేవ చేసే బాధ్యత
ఇప్పుడు తమకు లభించిందని భావిస్తున్నారు. మీరు కూడా అలాగే
భావిస్తున్నారా..
నీతేష్ గుప్తా : నిజమే సార్. నిజంగా ఇది ఎంతో గొప్ప బాధ్యత. మేము మా
బృందంలోని సహచరులను ఎప్పటికీ ప్రోత్సహిస్తూ ఉంటాం. ముందు
జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదు. మంచి జాగ్రత్తలు
తీసుకుంటే దేనినైనా నయం చేయవచ్చని రోగులకు చెబుతూ ఉంటాం.
మోదీ: మంచిది డాక్టర్ గారు. మీ దగ్గరికి పెద్దసంఖ్యలో రోగులు వస్తూ
ఉంటారు. వారికి చికిత్స చేయడంలో మీరు ప్రాణాలు ఒడ్డడానికి కూడా
సిద్ధపడి పనిచేస్తున్నారు. మీతో మాట్లాడడం ఎంతో బాగుంది. ఈ
యుద్ధంలో నేను మీకు తోడుగా ఉన్నాను. యుద్ధం చేస్తూనే ఉందాం.
నీతేష్ గుప్తా : మీ ఆశీర్వాదముంటే చాలు. అంతే మేము కోరుకునేది.
మోదీ: ఎన్నెన్నో శుభాకాంక్షలు సోదరా.
నీతేష్ గుప్తా : ధన్యవాదాలు సార్.
మోదీ: ధన్యవాదాలు నీతేష్ గారూ. నమస్కారాలు. మీలాంటి వారి
ప్రయత్నాలతో భారతదేశం కొరోనా పై జరుగుతున్న ఈ యుద్ధంలో
విజయాన్ని సాధిస్తుంది. మీకు ఓ విన్నపం. మీరు జాగ్రత్తగా ఉండండి.
మీ సహచరులను జాగ్రత్తగా చూసుకోండి. మీ కుటుంబాన్ని జాగ్రత్తగా
చూసుకోండి. ప్రపంచ దేశాలలో కొనసాగుతున్న పరిణామాలను
చూస్తుంటే ఈ కొరోనా వైరస్ సోకిన వ్యక్తుల సంఖ్య ఒక్కసారిగా
పెరిగిపోతోంది. ఈ విధంగ పెరిగిపోతున్న మహమ్మారిని అరికట్టడానికి
ఉత్కృష్టమైన ఆరోగ్యసేవలు అందజేయడం జరుగుతోంది. భారతదేశంలో
అటువంటి పరిస్థితి రాకుండా చూడాలి. అందుకోసం అవిశ్రాంతంగా
ప్రయత్నించాలి. మరో డాక్టర్ బోర్సే గారు మనతో మాట్లాడబోతున్నారు..
మోదీ : నమస్తే డాక్టర్ గారు
బోర్సే : నమస్తే.. నమస్తే.
మోదీ : మీరు మానవసేవే మాధవసేవగా భావిస్తూ పనిచేస్తున్నారు. మీతో
ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను. దేశప్రజలకు మీ సందేశం కావాలి.
చాలామంది మనసులో ఒక ప్రశ్న ఉదయిస్తోంది. ఎప్పుడు డాక్టర్లను
సంప్రదించాలి. ఎప్పుడు కరోనా పరీక్ష చేయించుకోవాలి? ఒక డాక్టరుగా
మిమ్మల్ని మీరు పూర్తిగా ఈ కొరోనా రోగుల కోసం జీవితాన్ని అంకితం
చేసుకున్నారు. మీరు చెప్పే విషయాలు ఎంతో లోతుగా ఉంటాయి.
ఎంతో ప్రాధాన్యముంటుంది. మీరు చెప్పే విషయాలను
వినాలనుకుంటున్నాను.
బోర్సే :సార్ నేను ఇక్కడ బి.జె. మెడికల్ కాలేజ్ పూణేలో ఉంటాను.
ఇక్కడ ప్రొఫెసర్ గా చేస్తున్నాను. ఇక్కడ పూణే మున్సిపల్ కార్పోరేషన్
హాస్పటల్ ఉంది. దానిపేరు నాయుడు హాస్పటల్. ఇక్కడ జనవరి
2020 నుంచి స్క్రీనింగ్ సెంటర్ ప్రారంభమైంది. ఇక్కడ ఇప్పటివరకు
16 కోవిడ్-19 పాజిటివ్ కేసులు వచ్చాయి. ఈ 16 మంది కొరోనా
రోగులలో మేము చికిత్స చేసి, క్వారంటైన చేసి, ఐసోలేషన్ లో ఉంచి,
ఇప్పటివరకు ఏడుగురిని డిశ్చార్జి చేశాం సార్. మిగతా 9 మంది
రోగుల పరిస్థితి కూడా స్థిరంగా ఉంది. వారు కూడా క్రమంగా
కోలుకుంటున్నారు సార్. వారి శరీరాల్లో వైరస్ ఉన్నప్పటికీ.. పరిస్థితి
మెరుగుపడుతోంది సార్. ఇప్పుడు ఇక్కడ ఉన్న శాంపిల్ సైజ్ చాలా
తక్కువే కేవలం 16 కేసులే సార్. అయితే… యువకులకు
కూడా ఇది సోకుతోంది సార్. అయినా.. ఇది అంత ప్రమాదకరమైనది
కాదు సార్. ఇప్పుడు కేవలం 9మందే ఉన్నారు సార్. వారు
కూడా కోలుకుంటారు సార్. వారి పరిస్థితి ఇంకా క్షీణించదు సార్.
రోజువారీ పరిస్థితిని పరీక్షిస్తున్నాం సార్. ఒక నాలుగైదు రోజుల్లో వారికి
పూర్తిగా నయమవుతుంది. ఇక్కడికి వచ్చిన కొరోనా అనుమానితు
లందరూ అంతర్జాతీయ ప్రయాణాలు చేసే వాళ్లే. అందుకే వారు వైరస్
బారిన పడ్డారు. ఇటువంటి వారికి శ్వాబ్ చేస్తున్నాం. ఇది ప్రొఫా
రేంజియల్ శ్వాబ్. మస్కల్ శ్వాబ్ తీసుకుంటున్నారు. మస్కల్ శ్వాబ్ నివేదిక అందిన తర్వాత పాజిటివ్
వస్తే వారిని పాజిటివ్ వార్డులో చేరుస్తాం. ఒకవేళ నెగిటివ్ వస్తే వారిని
హోం క్వారంటైన్ సందేశంతో ఏ విధంగా వ్యవహరించాలో సలహాలు ఇస్తూ ఇళ్లకు పంపిస్తాం.
మోదీ :డాక్టర్ గారూ, మీరు ఏమనుకుంటున్నారో. ఇళ్లలో ఏ విధంగా
వ్యవహరించాలో వారికి ఏ ఏ సలహాలు ఇస్తారో తెలియచేస్తారా..
బోర్సే : సార్. ఒకవేళ ఇంట్లో ఉంటే.. ఇంట్లోనే క్వారంటైన్ చేసుకోవాలి.
కనీసం ఆరు అడుగుల దూరాన్ని పాటించాలి. ఇది మొదటి విషయం.
రెండోది మాస్క్ ఉపయోగించాలి. మాటిమాటికీ చేతులు శుభ్రం
చేసుకోవాలి. వారి దగ్గర శానిటైజేషన్ లేకపోతే వారి దగ్గర ఉన్న
మాములు సబ్బుతో చేతులను మాటిమాటికి శుభ్రం చేసుకోవాలి.
ఒకవేళ దగ్గు వచ్చినా, తుమ్ము వచ్చినా చేతి రుమాలు అడ్డం
పెట్టుకోవాలి. దీనివల్ల దగ్గు, తుమ్ములతో బయటకు వచ్చే
తుంపరలు దూరంగా పడకుండా చూసుకోవచ్చు. నేల మీద పడకుండా
మిగతా చోట్ల పడకుండా ఉండడం కోసం రుమాలును అడ్డం
పెట్టుకుని దగ్గాలి.. లేదా తుమ్మాలి. ఈ విధంగా చేయడం వల్ల వైరస్
విస్తరించే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఈ విషయాలను అందరికీ
అర్థమయ్యేలా చెబుతున్నాం. వారు ఇంటివద్దే క్వారంటైన్ లో ఉండాలి. వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంటి బయటకు రాకూడాదు. ఇప్పుడైతే లాక్ డౌన్ కొనసాగుతోంది. నిజానికి ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా లాక్ డౌన్
లో ఇంటివద్దే క్వారంటైన్ లో ఉండాలి. కనీసం 14 రోజులు క్వారంటైన్ లో
ఉండాలని వారికి సూచిస్తున్నాం.సలహాలు కూడా ఇస్తున్నాం.
మోదీ : మంచిది డాక్టర్ గారూ. మీరు ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. అది
కూడా అంకిత భావంతో చేస్తున్నారు. మీ సహచర బృందం కూడా
ఈ సేవలో నిమగ్నమైంది. మీ దగ్గురకు వచ్చిన రోగులందరూ కూడా
క్షేమంగా, హాయిగా ఇళ్లకు వెళతారన్న నమ్మకం నాకుంది. యావత్
దేశంలోనూ ఈ విధంగానే మీ అందరి మద్దతుతో వైరస్ తో పోరాడి గెలుస్తాం.
బోర్సే : సార్. మాకు కూడా నమ్మకముంది. మనం గెలుస్తాం. ఈ యుద్ధంలో
విజయం సాధిస్తాం.
మోదీ : డాక్టర్ గారూ మీ అందరికీ ఎన్నెన్నో శుభాకాంక్షలు. ధన్యవాదాలు
బోర్సే : ధన్యవాదాలు సార్.
సహచరులారా.. మన ఈ సహచరులందరూ.. మిమ్మల్నీ యావత్ దేశాన్నీపెను విపత్తు నుంచి కాపాడే ప్రయత్నంలో నిమ్మగ్నులై ఉన్నారు. వీరు చెప్పిన విషయాలను కేవలం వినడమే కాదు. వాటిని మన జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఈరోజు డాక్టర్ల త్యాగం, తపస్సు, అంకితభావాన్ని చూస్తుంటే నాకు ఆచార్య చరకుడు చెప్పిన విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి. ఆచార్య చరకుడు చెప్పిన విషయం డాక్టర్లకు సరిగ్గా సరిపోతుంది. డాక్టర్ల జీవనంలో ఈ విషయాలను స్పష్టంగా చూస్తున్నాం. ఆచార్య చరకుడు ఏమన్నారంటే “న ఆత్మార్థం న అపి కామార్థం అతభూతదయామ్ ప్రతి వర్తతే యత్ చికిత్సాయాం స సవర్మేతి వర్తతే”. అంటే ధనము లేదా ఏదైనా ఒక ప్రత్యేకమైన కోరికతో కాకుండా కేవలం నిరుపేదల సేవ కోసం జాలి, దయ, కరుణతో పని చేయాలి. అలా చేసిన వారే అత్యుత్తమ చికిత్సకులు అవుతారు.
సహచరులారా… మానవత్వం మూర్తీభవించిన నర్సులందరికీ ఈరోజు నేను నమస్కరిస్తున్నాను. మీరు ఏ సేవాభావంతో పని చేస్తున్నారో అది నిరుపమానం. మరో విశేషమేమిటంటే 2020 సంవత్సరాన్ని యావత్ ప్రపంచం నర్సులు, దాయీల అంతర్జాతీయ సంవత్సరంగా జరుపుకుంటోంది. 200 సంవత్సరాల క్రితం 1820 లో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ తో ముడిపడివున్న విషయమిది. సేవాభావంతో నర్సింగ్ వృత్తిని కొత్త శిఖరాలకు చేర్చిన వ్యక్తి ఆమె. ప్రపంచంలో సేవాభావానికి అంకితమైన ప్రతీ నర్సుకూ సమర్పితమైన ఈసంవత్సరం నిజంగా నర్సింగ్ వృత్తికి పెద్ద పరీక్షలాగా ఎదురు నిల్చింది. మీరందరూ ఈ పరీక్షలో ఉత్తీర్ణులు అవడమే కాకుండా, ఎంతో మంది జీవితాలను కాపాడగలరన్న నమ్మకం నాకుంది.
మీవంటి సహచరులందరీ ధైర్యసహసాల కారణంగానే ఇంతపెద్ద యుద్ధం చేయగలుగుతున్నాం. మీవంటి సహచరులు డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు, ఇతర వైద్య సహాయక సిబ్బంది కావచ్చు,ఆశా, ఏఎన్ఎం కార్యకర్తలు కావచ్చు, సఫాయీ కర్మచారులు కావచ్చు మీ అందరి ఆరోగ్యం గురించి కూడా దేశం ఆందోళన చెందుతోంది. అందుకే సుమారు 20 లక్షల సహచరుల కోసం 50 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమాను ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఈ యుద్ధంలో మీరు మరింత ఆత్మవిశ్వాసంతో దేశానికి నాయకత్వం వహించగలుగుతారు.
నా ప్రియతమ దేశవాసులారా
కరోనా వైరస్ పై జరుగుతున్న యుద్ధంలో మన చుట్టుపక్కల ఉన్నవారు ఎంతోమంది నిజమైన హీరోలుగా అగ్రభాగాన నిలిచి పోరాడుతున్నారు. నరేంద్రమోదీ యాప్ పైన, నమో యాప్ పైన బెంగుళూరుకు చెందిన నిరంజన్ సుధాకర్ హెబ్బాలే గారు ఇటువంటి వారే నిజజీవితంలో హీరోలని పేర్కొన్నారు. ఇది నిజంగా వాస్తవం. వారి కారణంగానే మన రోజూవారీ జీవితం ఎంతో హాయిగా సాగుతూ ఉంటుంది. ఒక్కసారి ఊహించండి. ఒకరోజు మీ ఇంట్లో పంపులో, నీళ్లు ఆగిపోతేనో లేదా మీ ఇంట్లో ఒక్కసారిగా కరంట్ పోతేనో ఆయా సమయాల్లో నిజంగా మన రోజువారి జీవన నాయకులే ఆకష్టాలను దూరం చేస్తారు. ఒకసారి మీరు మీఇంటి ప్రక్కన ఉన్న చిన్న పచారి కొట్టు గురించి ఆలోచించండి. ఈ క్లిష్ట సమయంలో ఆదుకాణందారు కూడా ఎంతో సాహసం చేస్తున్నాడు. ఎందుకోసం? ఎవరికోసం? ఆలోచించండి. మీకూ, మీ అవసరాలకూ తగిన సామాగ్రి అందక మీరు ఇబ్బంది పడతారేమోనని తను సాహసిస్తున్నాడు. సరిగ్గా ఇదే విధంగా మీ నిత్యావసర వస్తువులకు కొరత రాకుండా చూడడానికి సరఫరా ఆగిపోకుండా చేయడానికీ, అవిశ్రాంతంగా తమపని తాము చేసుకుపోతున్న డ్రైవర్లు, శ్రామికుల గురించి కూడా ఆలోచించండి.ప్రభుత్వం బ్యాంకింగ్ సేవలను యధాతధంగా కొనసాగిస్తోంది. బ్యాంకింగ్ రంగంలో ఉన్న వారందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ యుద్ధానికి నేతృత్వం వహిస్తూ.. బ్యాంకుల్లో సేవలు చేస్తున్నారు. మీ సేవలో నిమగ్నమయి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో వారు చేస్తున్న సేవ చిన్నదేమీ కాదు. బ్యాంకుల్లో పని చేసే వారికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పినా తక్కువేమీ కాదు. ఈ కామర్స్ రంగంలో పెద్ద సంఖ్యలో పని చేస్తున్న వారు ఆయా కంపెనీల్లో, డెలివరీ పని చూస్తున్నవారూ కూడా ఎంతో శ్రమిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి. లాక్ డౌన్ సమయంలో టి.వి. చూడగలుగుతున్నారు, ఇంట్లోనే ఉండి ఏదో ఫోన్ ద్వారా ఇంటర్నెట్ ఉపయోగించుకోగలుగుతున్నారు. వీటన్నింటినీ సక్రమంగా పని చేయించడానికి ఎవరో ఒకరు తమ జీవితాన్ని అంకితం చేస్తున్నారు. ఈసమయంలో మీలో చాలా మంది డిజిటల్ పేమెంట్ సులభంగా చేయగలుగుతున్నారు. దీని వెనక కూడా ఎంతో మంది పని చేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో, దేశంలో అన్ని కార్యకలాపాలను సక్రమంగా నిర్వహిస్తున్నది వాళ్లే. ఈరోజు దేశ ప్రజలందరీ తరఫున వీళ్లందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు అన్ని రకాల ముందు జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతున్నాను. మిమ్మల్నీ, మీ కుటుంబ సభ్యులను మీరు క్షేమంగా ఉండేలా చూడండి.
నా ప్రియతమ దేశవాసులారా…
కరోనా వైరస్ అనుమానితులపట్ల, ఇంటి దగ్గర క్వారంటైన్ లో ఉన్న వాళ్ల పట్లా కొంతమంది వ్యవహరిస్తున్నతీరు ఏమాత్రం బాగాలేదు. ఇటువంటి సంఘటనలు నా దృష్టికి వచ్చాయి. ఇది ఎంతో దురదృష్టకరమైన విషయం. ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ సామాజిక దూరం పాటించాలి అంతేకానీ, భావోద్రేకాలతో, మానవత్వానికే దూరంగా ఉండడం సరియైన పద్ధతికాదు. వైరస్ సోకిన వారు లేదా అనుమానితులు నేరస్థులు కాదు. వారు కేవలం వైరస్ బాధితులు మాత్రమే. వీరందరూ ఇతరులకు అది సోకకుండా ఉండేందుకు తమకుతాము దూరంగా ఉండాలి.క్వారంటైన్ లో ఉండాలి. కొన్ని చోట్ల ప్రజలు తమ బాధ్యతలను సీరియస్ గా తీసుకున్నారు. ఎంత తీవ్రంగా అంటే వైరస్ లక్షణాలేవీ లేకపోయినా తమకు తాము క్వారంటైన్ చేసుకున్నారు. ఎందుకంటే వారు విదేశాల నుంచి తిరిగి వచ్చినవాళ్ళు అందుకే రెండింతలుగా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇంకొకరికి సోకకుండా ఉండేందుకు ఆజాగ్రత్తలు పాటిస్తున్నారు. ఇంత బాధ్యతతో వారు వ్యవహరిస్తున్నప్పుడు వారి పట్ల మనం మరో రకంగా వ్యవహరించడం న్యాయం కాదు. వారి పట్ల సానుభూతితో, సహకార భావనతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది.
కరోనా వైరస్ తో పోరాడడానికి అన్నింటికంటే మంచి పద్ధతి. సామాజిక దూరాన్ని పాటించడం. అయితేసామాజిక దూరం అంటే సామాజిక సంప్రదింపులకు పూర్తిగా స్వస్తి పలకడం కాదు. నిజానికి మన ప్రాచీన సామాజిక సంబంధాలకు కొత్త ఊపిరులూ దాల్చిన సమయమిది. మన పాత సంబంధాలకు కొత్త మెరుగులు అద్దాలి. ఒకవిధంగా చెప్పాలంటే సామాజిక దూరం పెరగాలి. సానుభూతి పూర్వక దూరం తగ్గాలి. నేను మరొకసారి చెబుతున్నాను. సామాజిక దూరాన్ని పెంచాలి. మనోభావాలకు సంబంధించిన దూరాన్ని తగ్గించాలి. రాజస్థాన్ లోని కోటా నుంచి యశ్ వర్ధన్ గారు నరేంద్రమోదీ యాప్ పైన రాసిన విషయమేమిటంటే లాక్ డౌన్ వల్ల కుటుంబ సంబంధాలు మరింత ప్రగాఢమవుతున్నాయి. పిల్లలతో కలిసి బోర్డ్ గేమ్స్, క్రికెట్ ఆడుతున్నారు. వంటిళ్లలో కొత్త కొత్త ఆహార పదార్ధాలు తయారవుతున్నాయి. జబల్ పూర్ నుంచి నిరుపమా హర్షేయ్ నరేంద్రమోదీ యాప్ పై రాస్తూ మొట్టమొదటి సారిగా తనకు రజాయీ తయారు చేయాలన్న కోరిక నెరవేర్చుకొనే అవకాశం లభించిందని అన్నారు. అంతేకాదు, ఆమె రజాయీ పనితోపాటు మొక్కల పెంపకానికి సంబంధించిన కోరికను కూడా హాయిగా తీర్చుకుంటున్నారు. అదే విధంగా రాయ్ పూర్ కు చెందిన పరీక్షిత్, గురుగావ్ కు చెందిన ఆర్యమన్, ఉత్తరాఖండ్ కు చెందిన సూరజ్ రాసిన పోస్టు కూడా చదివే అవకాశం లభించింది.అతను తన స్కూలుదోస్తులతో ఈ-రీయూనియన్ జరిపే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అతనికి వచ్చిన ఐడియా చాలా బాగుంది. మీకు కూడా దశాబ్దాల క్రితం స్కూలు, కాలేజీల్లో ఉన్న మిత్రులతో మాట్లాడే అవకాశం ఈ మధ్యకాలంలో లభించి ఉండకపోవచ్చు. మీరు కూడా ఈ ఐడియాను అమలు చేసి చూడవచ్చు.ఇప్పటి వరకు చదవలేకపోయిన పుస్తకాలను ఇప్పుడు చదువుతున్నామని భువనేశ్వర్ కు చెందిన ప్రత్యూష్, కోల్ కతాకు చెందిన వసుధ తెలియజేశారు. సామాజిక మాధ్యమాల్లోనేను చూశాను – కొంతమంది ఏళ్ల తరబడీ వాడక మూలనపడి ఉన్న తబలా, వీణా వంటి సంగీత పరికరాలకు దుమ్ము దులిపి కొంతమంది అభ్యాసం చేయడం ప్రారంభించారు. మీరు కూడా ఇలా చేయవచ్చు. తద్వారా మీరు సంగీతమిచ్చే ఆనందాన్ని పొందడమే కాక.. మీ పాత జ్ఞాపకాలను కూడా తాజా చేసుకోవచ్చు. అంటే ఎంతో అమూల్యమైన సమయం ఇప్పుడు దొరికింది. ఈ సమయాన్ని, మిమ్మల్ని, మీరు, మీతో జోడించుకోవడమే గాక, మీరు మీ హాబీలతో కూడా జోడించుకోవచ్చు. మీరు మీ పాత స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మమేకం అయ్యే అవకాశం లభించింది. ఈలాక్ డౌన్ సమయంలో మీరు మీ ఫిట్ నెస్ కోసం ఏం చేస్తున్నారని రూర్ కీ నుంచి రాశీ ప్రశ్నించారు. ప్రస్తుత సమయంలో నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా ఏవిధంగా ఉపవాసముంటున్నారని అని కూడా ప్రశ్నించారు. నేను మరొకసారి మీఅందరికీ తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఇంటి నుంచి బయటికి రావద్దని మాత్రమే కోరాను. అంతా గానీ మీలోపలికి మీరు వెళ్లకూడదని ఆజ్ఞాపించలేదు. ఇదో మంచి అవకాశం బయటకు వెళ్లకండి. మీలోపలికి మీరు వెళ్లండి. మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఇకపోతే నవరాత్రి ఉపవాసాల విషయానికి వస్తే ఇది నా శక్తికీ, నా భక్తికీ సంబంధించిన విషయం. ఫిట్ నెస్ విషయానికి వస్తే విషయం మరీ సుదీర్ఘమైపోతుంది. అందుకే సామాజిక మాధ్యమాల్లో నేను ఏం చేస్తానో. ఏం చేస్తున్నానో, వాటికి సంబంధించిన వీడియోలను అప్ లోడ్ చేస్తాను. నరేంద్రమోదీ యాప్ పై ఈవీడియోను తప్పని సరిగా చూడండి. నేను ఆచరించే విషయాల్లో బహుశా కొన్ని మీకు పనికి రావచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. నేను ఫిట్ నెస్ ఎక్స్ పర్ట్ ని కాదు. అంతేకాదు యోగా అధ్యాపకున్ని కూడా కాదు. నేను కేవలం ఆచరించే వాడిని మాత్రమే. అయితే యోగాకు సంబంధించి కొన్ని ఆసనాల ద్వారా నాకు ప్రయోజనం చేకూరిందన్న విషయం మాత్రం వాస్తవం. లాక్ డౌన్ సమయంలో, మీకు కూడా కొన్ని విషయాలు పనికి రావచ్చు, ఉపయోగపడవచ్చు.
సహచరులారా… కరోనాపై సాగిస్తున్న ఈ యుద్ధం గతంలో ఎన్నడూ జరగనిది అంతేకాదు.. ఎంతో సవాళ్లతో కూడింది. ఈ సమయంలో తీసుకున్న నిర్ణయాలు కూడా అటువంటివే. ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ చూడని, వినని చర్యలు ఇవి. కరోనాను నివారించడానికి భారతీయులందరూ… తీసుకుంటున్న ఈచర్యలూ, చేస్తున్న ప్రయత్నాలూ ఇదే కరోనా మహమ్మారిపై భారతదేశానికి విజయాన్ని చేకూరుస్తాయి. ప్రతిఒక్క భారతీయుడి ఓర్పూ, సహనం, సంకల్పం.. ఇవే మనల్ని ఈ కష్టాల నుంచి బయట పడవేయగల్గుతాయి. అదే విధంగా నిరుపేదల పట్ల సానుభూతి, దయ, కరుణాభావాలు మరింతగా పెంపొందాలి. ఎక్కడ నిరుపేద కన్పించినా, ఎక్కడ బాధపడుతున్నవారు కన్పించినా, ఎక్కడ ఆకలితో అలమటించేవారు కన్పించినా ఈ క్లిష్ట సమయంలో మనం ముందుగా వారి గురించి ఆలోచిస్తూ, వారి కడుపు నింపడంలోనే మానవత్వం వెల్లివిరుస్తుంది. ఈపని భారతదేశమే చేయగలదు. మన సంస్కారాలు, మన సంస్కృతి అటువంటివి.
నా ప్రియతమ దేశవాసులారా…
ఈరోజు ప్రతి భారతీయుడు తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం నాలుగు గోడలమధ్య బందీ అయ్యాడు. అయితే రాబోయే సకాలంలో దేశం ప్రగతి కోసం ఈ భారతీయుడే అంతెత్తు గోడలను కూడా అధికమించి ముందుకుసాగుతాడు. దేశాన్ని మున్మందుకు తీసుకుపోతాడు. మీరు, మీ కుటుంబంతో కలిసి ఇంటి దగ్గరే ఉండండి. క్షేమంగా, జాగ్రత్తగా ఉండండి. ఈ యుద్ధాన్ని మనం గెలిచి తీరాలి, తప్పని సరిగా గెలుస్తాం. మన్ కీ బాత్ కోసం మళ్లీ వచ్చే నెల కలుద్దాం. ఈలోపల ఈకష్టాలను అధిగమించడంలో మనం సఫలమవుతామన్న నమ్మకంతో ఆశతో, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అందరికీ ఎన్నెన్నో కృతజ్ఞతలు.
నా ప్రియమైన దేశప్రజలారా, ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) మాధ్యమం ద్వారా కచ్ నుండి కోహిమా వరకూ, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకూ దేశ ప్రజలందరి కీ మరోసారి నమస్కారం తెలిపే అవకాశం రావడం నా అదృష్టం. మీ అందరి కీ నమస్కారం. మన దేశం గొప్పతనాన్నీ, వైవిధ్యాల ను తల్చుకుంటూ, వాటికి నమస్కరించడం ప్రతి భారతీయుడూ గర్విస్తూ చేసే పని. ఈ వైవిధ్యాల ను తలుచుకునే అవకాశం వచ్చినప్పుడల్లా ఎంతో ఉత్కంఠత, ఎంతో ఆనందం తో మనసు నిండిపోతుంది. ఒకరకంగా ఇది ఎంతో ప్రేరణ ను కూడా ఇస్తుంది. కొద్ది రోజుల క్రితం నేను ఢిల్లీ లోని హునర్ హాట్ లోని ఒక చిన్న ప్రదేశంలో మన దేశ గొప్పతనం, సంస్కృతి, సంప్రదాయం, ఆహారపదార్థాలు, ఇంకా భావోద్వేగాల్లోని వైవిధ్యాల ను చూసే అవకాశం లభించింది. సాంప్రదాయ వస్త్రాలు, హస్తకళలు, తివాచీలు, పాత్రలు, వెదురు, ఇత్తడి ఉత్పత్తులు, పంజాబ్ కు చెందిన ఫుల్కారి, ఆంధ్ర ప్రదేశ్ నుండి విలాసవంతమైన తోలు పని, తమిళ నాడు నుండి అందమైన వర్ణ చిత్రాలు, ఉత్తర ప్రదేశ్ నుండి ఇత్తడి ఉత్పత్తులు, భదోహి నుండి తివాచీ లు, కచ్ నుండి రాగి ఉత్పత్తులు, అనేక సంగీత వాయిద్యాలు, లెక్కలేనన్ని విషయాలు, మొత్తం భారతదేశం యొక్క కళ మరియు సంస్కృతి యొక్క సంగ్రహావలోకనాలు నిజంగా ప్రత్యేకమైనవి! వాటి వెనుక ఉన్న చేతివృత్తుల వారి కథలు, వారి నైపుణ్యాల పట్ల అభిరుచి, ప్రేమ, వారి కథలు అన్నీ కూడా ఎంతో స్ఫూర్తిదాయకం గా ఉంటాయి. హునర్ హాట్ లో ఒక దివ్యాంగ మహిళ మాటలు విని నాకెంతో సంతోషం కలిగింది. మొదట్లో ఆవిడ ఫుట్ పాత్ పై తన వర్ణ చిత్రాల ను అమ్మేవారని ఆవిడ నాకు చెప్పారు. కానీ, హునర్ హాట్ లో చేరిన తరువాత తన జీవితమే మారిపోయిందని ఆమె అన్నారు. ఇవాళ్టి రోజున ఆమె లో ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా, తనకంటూ ఓ సొంత ఇల్లు కూడా ఆమె కు సమకూరింది. హునర్ హాట్ లో మరెందరో కళాకారుల ను కలిసి వారితో మాట్లాడే అవకాశం లభించింది. హునర్ హాట్ ప్రదర్శనల్లో పాల్గొనే కాళాకారుల లో సగానికన్నా ఎక్కువ మంది మహిళలే ఉన్నారని నాకు చెప్పారు. గత మూడేళ్ళ లో హునర్ హాట్ మాధ్యమం ద్వారా దాదాపు మూడు లక్షల మంది కళాకారుల కీ, వృత్తి విద్యా కళాకారుల కీ ఎన్నో ఉపాధి అవకాశాలు లభించాయి. కళా ప్రదర్శనకు హునర్ హాట్ ఒక మంచి వేదిక మాత్రమే కాక, వారి కలల కు రెక్కల ను కూడా అందిస్తోంది ఈ వేదిక. హునర్ హాట్ లో ఈ దేశం లోని వైవిధ్యాల ను మరువడం అసాధ్యం అనిపించే స్థలం ఒకటి ఉంది. కళా నైపుణ్యం తో పాటు అక్కడ మన ఆహార వైవిధ్యాల ను కూడా చూడవచ్చు. ఒకే వరుస లో అక్కడ ఇడ్లీ-దోశ, ఛోలే-భతూరా, దాల్-బాటీ, ఖమన్-ఖాండ్వీ, ఇంకా ఎన్నో రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. నేను స్వయంగా అక్కడ బిహార్ కు చెందిన రుచికరమైన లిటీ-చోఖే తిన్నాను. సంతోషం గా, రుచి ని ఆస్వాదిస్తూ తిన్నాను. భారతదేశం లో ప్రతి ప్రాంతం లోనూ ఇటువంటి సంతలు, తిరునాళ్ళూ, ప్రదర్శనలు జరుగుతూనే ఉంటాయి. భారత దేశాన్ని గురించి తెలుసుకునేందుకు, భారతదేశాన్ని అనుభూతి చెందడానికీ, అవకాశం దొరికినప్పుడల్లా ఇటువంటి ప్రదర్శనల కు తప్పకుండా వెళ్లాలి. అప్పుడే ‘‘ఏక్ భారత్ – శ్రేష్ఠ్ భారత్’’ని, అంటే, భిన్నత్వం లో ఏకత్వాన్ని పూర్తిగా ఆస్వాదించడానికి అవకాశం లభిస్తుంది. మీకు దేశం లోని విభిన్న కళలు, సంస్కృతుల తో పరిచయమవడమే కాకుండా, మన దేశం లో కష్టించి పని చేసే కళాకారులు, ముఖ్యం గా మహిళా శ్రేయస్సు కి కూడా మీ వంతు సహకారాన్ని అందించినవారవుతారు. కాబట్టి, అటువంటి ప్రదర్శనల కు తప్పకుండా వెళ్ళండి.
నా ప్రియమైన దేశప్రజలారా, మన దేశం లో ఎన్నో గొప్ప సంప్రదాయాలు ఉన్నాయి. మన పూర్వీకులు మనకు వారసత్వం గా ఇచ్చినవి, మనకు లభించిన విద్య, ఉపదేశాలూ అన్నీనూ. వీటిలో తోటి జీవుల పట్ల కనికరం, ప్రకృతి పట్ల ఉన్న అపారమైన ప్రేమ, ఇవన్నీ మన సాంస్కృతిక వారసత్వాలు. ప్రతి ఏడాదీ భారతదేశం లోని ఈ వాతావరణం ఆతిథ్యాన్ని తీసుకోవటానికి, ప్రపంచం నలుమూలల నుండి వివిధ జాతుల భారతదేశం వస్తాయి. ఏడాది పొడుగునా ఎన్నో వలస జాతుల కు భారతదేశం ఇల్లు గా మారుతుంది. ఐదు వందల కన్నా ఎక్కువ పక్షులు, రకరకాల జాతుల పక్షులు, రకరకాల ప్రాంతాల నుండి వస్తాయని చెబుతూ ఉంటారు. ఇటీవల, గాంధీ నగర్ లో ‘సిఒపి – 13 కన్వెన్శన్’ జరిగింది. అందులో ఈ విషయంపై ఎన్నో ఆలోచనలు, ఎంతో చింతన, ఎంతో మేధోమథనం జరిగాయి. భారతదేశం చేస్తున్న ప్రయత్నాల కు కూడా ఎంతో ప్రశంస లభించింది. మిత్రులారా, రాబోయే మూడేళ్ల పాటు వలస జాతులపై జరగనున్న ‘సిఒపి కన్వెన్శన్’ కు భారతదేశం అధ్యక్షత వహించటం మనందరికీ గర్వకారణం. ఈ సందర్భాన్ని మనం ఎలా ఉపయోగకరం గా మార్చుకోవచ్చునో, మీరు మీ సలహాలను తప్పక తెలియచేయండి.
‘సిఒపి కన్వెన్శన్’ గురించి జరుగుతున్న చర్చ మధ్యన నా ధ్యాస మేఘాలయ తో ముడిపడిన మరొక విషయం పైకి మళ్ళింది. ఈ మధ్య జీవ శాస్త్రవేత్తలు ఒక కొత్త రకం చేపల ను కనుగొన్నారు. ఇవి కేవలం మేఘాలయ లోని గుహల్లో మాత్రమే ఉంటాయి. గుహల్లోని భూ భాగం క్రిందన ఉండే జలచరాలలో కెల్లా ఇవి పెద్ద రకాని కి చెందినవని తెలుసుకున్నారు. ఇవి భూమి కి బాగా అడుగున, ఏ మాత్రం వెలుతురు వెళ్ళలేని చీకటి గుహల్లోని అట్టడుగు భూ భాగం లో మాత్రమే ఈ రకం చేపలు ఉంటాయిట. అంత పెద్ద చేపలు, అంతటి లోతైన గుహల్లో ఎలా జీవిస్తున్నాయి? అని శాస్త్రవేత్తలు ఆశ్చర్యపడుతున్నారు. మన భారతదేశం, ముఖ్యం గా మేఘాలయ అరుదైన జాతుల కు ఇల్లుగా మారడం అనేది సంతోషకరమైన విషయం . ఇది మన భారతదేశం లోని జీవవైవిధ్యానికి ఒక కొత్త పరిమాణాన్ని అందిస్తుంది. మన చుట్టుపక్కల ఇటువంటిచ ఇంకా కనిపెట్టవలసిన విచిత్రాలు ఎన్నో ఉన్నాయి. ఇటువంటి విషయాల ను గురించి కనుక్కోవాలంటే పరిశోధనాత్మక అభిరుచి ఉండాలి. గొప్ప తమిళా కవయిత్రి అవ్వయార్ ఏమన్నారంటే,
“कट्टत केमांवु कल्लादरु उडगड़वु, कड्डत कयिमन अड़वा कल्लादर ओलाआडू”
“కట్టత కేమావూ కల్లాదరు ఉడగడవు, కడ్డత కయిమన అడవా కల్లాదరు ఓలాఆడు”
దీని అర్థం ఏమిటంటే “మనకి తెలుసినది కేవలం ఒక ఇసుక రేణువంత, కానీ మనకి తెలియనిది ఒక బ్రహ్మాండం తో సమానం”
ఈ దేశం లో వైవిధ్యాలు కూడా అలాంటివే. ఎంత తెలుసుకున్నా తక్కువే. మన వద్ద ఉన్న జీవ వైవిధ్యాలు కూడా అటువంటివే. అవి యావత్ మానవజాతి కి ప్రత్యేక నిధి వంటివి. వాటిని మనం కాపాడుకోవాలి. పరిరక్షించుకోవాలి. ఇంకా ఎన్నో తెలుసుకోవాలి కూడా.
నా ప్రియమైన యువమిత్రులారా, ఈ మధ్యన మన దేశ యువత లో, పిల్లల లో, విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం (Science&Technology) పట్ల బాగా ఆసక్తి పెరుగుతోంది. అంతరిక్షంలో రికార్డు స్థాయిలో శాటిలైట్ ప్రయోగాలు, కొత్త కొత్త రికార్డులు, కొత్త కొత్త లక్ష్యాలు ప్రతి భారతీయుడినీ గర్వం తో నింపుతాయి. చంద్రయాన్-2 ప్రయోగ సమయం లో బెంగుళూరు లో ఉన్నప్పుడు అక్కడి కి వచ్చిన పిల్లల ఉత్సాహాన్ని చూశాను. వాళ్ల మొహాల్లో నిద్రన్న మాటే లేదు. ఒకరకంగా రాత్రంతా వారు మేల్కొనే ఉన్నారు. వాళ్ళల్లో విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం, ఇంకా సృజనాత్మకత పట్ల కనబడిన ఉత్సాహం మర్చిపోలేనిది. పిల్లల్లో, యువత లో ఉన్న ఈ ఉత్సాహాన్ని ప్రోత్సహించడానికి, వారిలో శాస్త్రీయ దృక్పథాన్ని ప్రోత్సాహించడానికి మరొక ఏర్పాటు మొదలైంది. శ్రీహరి కోట లో జరిగే రాకెట్ ప్రయోగాన్ని ఇప్పుడు మీరు దగ్గర నుండి, నేరుగా చూడచ్చు. ఈ మధ్యనే అందరి కోసమూ ఒక విజిటర్ గేలరీ తెరవడం జరిగింది. అందులో పది వేల మంది కూర్చునే ఏర్పాటు జరిగింది. ఐఎస్ఆర్ఒ వెబ్ సైట్ లో ఉన్న లింక్ ద్వారా ఆన్ లైన్ బుకింగ్ చేసుకోవచ్చు. ఎన్నోచోట్ల నుండి పాఠశాల విద్యార్థుల ను రాకెట్ ప్రయోగాన్ని చూపించడానికి, వాళ్లని మోటివేట్ చెయడానికి టూర్ పై తీసుకు వస్తున్నారని నాకు చెప్పారు. రాబోయే కాలం లో ఈ సౌకర్యాన్ని తప్పకుండా వినియోగించుకోవాల్సింది గా అన్ని పాఠశాల ల ప్రధానోపాధ్యాయులను, అధ్యాపకులను నేను కోరుతున్నాను.
మిత్రులారా,
నేను మీకు మరొక ఉత్సాహకరమైన సమాచారాన్ని చెప్పాలనుకుంటున్నాను. నమో యాప్ లో నేను ఝార్ఖండ్ లోని ధన్ బాద్ నివాసి పారస్ కామెంట్ చదివాను. ఇస్రో కి చెందిన “యువిక” కార్యక్రమం గురించి యువమిత్రుల కు నేను చెప్పాలని పారస్ కోరాడు. యువత ని సైన్స్ తో జతపరచడానికి ఇస్రో చేసిన మెచ్చుకోదగ్గ ప్రయత్నమే ‘‘యువిక’’. 2019లో ఈ కార్యక్రమం స్కూల్ పిల్లల కోసం లాంచ్ చేశారు. ‘‘యువిక’’ అంటే యువ విజ్ఞాన కార్యక్రమం. ఈ కార్యక్రమం మన స్వప్నమైన ‘‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్, జై అనుసంధాన్’’ నినాదాని కి ప్రతిరూపం. ఈ కార్యక్రమం లో పరీక్షల తర్వాత, విద్యార్థులు తమ సెలవుల్లో ఇస్రో తాలూకూ రకరకాల సెంటర్ల కు వెళ్ళి అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం, అంతరిక్ష విజ్ఞానం, అంతరిక్షశాస్త్ర ప్రయోగం గురించి తెలుసుకుంటారు. ట్రైనింగ్ ఎలా ఉంటుంది? ఏ రకంగా ఉంటుంది? ఎంత అద్భుతం గా ఉంటుంది? మొదలైన విషయాలు తెలుసుకోవాలి అంటే క్రితం సారి ఎవరైతే హాజరైయ్యారో, వారి అనుభవాల ను చదవండి. మీరు స్వయం గా రావాలి అనుకుంటే ఇస్రో తో జతపరచబడిన ‘‘యువిక’’ వెబ్ సైట్ లో మీ వివరాల ను రిజిస్టర్ చేసుకోవచ్చు. నా యువ మిత్రులారా, మీ కోసం ఆ వెబ్ సైట్ పేరు చెప్తున్నాను, రాసుకోండి. ఇవాళే తప్పకుండా ఆ వెబ్ సైట్ ను చూడండి www.yuvika.isro.gov.in రాసుకున్నారుగా ?
నా ప్రియమైన దేశ ప్రజలారా, 2020,జనవరి 31న లడఖ్ లోని అందమైన లోయలు ఒక చారిత్రాత్మక ఘటన కు సాక్షులు గా నిలిచాయి. లేహ్ లోని కుషోక్ బకులా రింపోచీ విమానాశ్రయం నుండి భారతీయ వాయుసేన కు చెందిన ఎఎన్-32 విమానం గాల్లోకి బయలుదేరగానే ఒక కొత్త చరిత్ర సృష్టించబడింది. ఈ విమానం ఇంధనం లో పది శాతం(10%) భారతీయ బయో-జెట్ ఇంధనాన్ని కలిపి (Bio-jet fuel) నింపారు. విమానం లోని రెండు ఇంజన్ల లోనూ ఈ మిశమాన్ని నింపడం అనేది ఇదే మొదటిసారి. ఇంతేకాకుండా, లేహ్ లో ఈ విమానం బయలుదేరిన విమానాశ్రయం భారతదేశం లోనే గాక, యావత్ ప్రపంచం లోనే అత్యంత ఎత్తు లో ఉన్న విమానాశ్రయాల్లో ఒకటి. ముఖ్యమైన విషయం ఏమిటంటే బయో-జెట్ ఇంధనం (Bio-jet fuel) non-edible tree borne oil నుండి తయారు చేయబడింది. దీనిని భారతదేశం లోని విభిన్న ఆదివాసీ ప్రాంతాల నుండి కొనుగోలు చేస్తారు. ఈ ప్రయత్నాల వల్ల కార్బన్ ప్రసరణ (బయటకు పంపడం) తగ్గడమే కాక ముడి చమురు దిగుమతుల పై భారతదేశం ఆధారపడటం తగ్గించవచ్చు. ఇంత పెద్ద కార్యక్రమం లో పాలుపంచుకున్నవారందరికీ, ముఖ్యంగా సిఎస్ఐఆర్, డేహ్రాడూన్ లోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం లోని శాస్త్రవేత్తల కు నేను ఆభినందన లు తెలుపుతున్నాను. బయో ఇంధనం తో విమానం నడపడమనే టెక్నాలజీ ని చేసి చూపెట్టారు వాళ్ళు. వారి ప్రయత్నాలు ‘మేక్ ఇన్ ఇండియా’ ను కూడా శక్తివంతం చేస్తాయి.
నా ప్రియమైన దేశప్రజలారా,
మన నవభారతదేశం పాత పధ్దతుల లో నడవడానికి తయారు గా లేదు. ముఖ్యం గా, మన ‘న్యూ ఇండియా’ సోదరీమణులు, తల్లులు ధైర్యం గా ముందుకు వెళ్ళి ఎన్నో సవాళ్ళ ను తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. వారి వల్లనే సమాజం లో ఒక సానుకూల మార్పును మనం చూడగలుగుతున్నాం. బీహార్ కు చెందిన పూర్ణియా కథ యావత్ దేశాని కీ స్ఫూర్తి ని ఇవ్వదగినది. కొన్ని దశాబ్దాలు గా వరదల వల్ల విషాదం లో కూరుకుపోయిన ప్రాంతం ఇది. ఇటువంటి పరిస్థితుల్లో వ్యవసాయం, ఆదాయాన్ని ఇవ్వగల అన్ని వనరుల సమీకరణ ఎంతో కష్టం అక్కడ. ఇటువంటి పరిస్థితుల్లో పూర్ణియా కు చెందిన కొందరు మహిళలు ఒక కొత్త మార్గాన్ని కనుగొన్నారు. మిత్రులారా, ఇంతకు మునుపు ఈ ప్రాంతం లో మహిళలు మల్బరీ చెట్ల పై ఉండే పట్టు పురుగుల నుండి Cocoon(పట్టుపురుగుల గూడు) లను తయారు చేసేవారు. దానికి చాలా నామమాత్రపు ధర వారికి లభించేది. వాటిని కొనుక్కున్నవారు మాత్రం ఇవే పట్టు గూళ్ళ నుండి పట్టు దారాలు తయారు చేసి ఎక్కువ లాభాలు సంపాదించుకునేవారు. నేడు పూర్ణియా కు చెందిన మహిళలు ఒక కొత్త మార్గానికి నాంది పలికి మొత్తం చిత్రాన్నే మార్చివేశారు. ఈ మహిళలు ప్రభుత్వ సహకారం తో మల్బారీ ఉత్పత్తి సమూహాన్ని తయారు చేశారు. తర్వాత పట్టుపురుగుల గూళ్ళ నుండి పట్టుదారాల ను తయారు చేశారు. ఆ తర్వాత ఆ దారాల తో సొంతం గా పట్టుచీరల ను నేయించడం మొదలు పెట్టారు. మొదట్లో పట్టుపురుగుల గూళ్ళ ను అతి తక్కువ ధరకు అమ్మిన అదే మహిళలు, ఇప్పుడు వాటితో తయారు చేసిన చీరల ను వేల రూపాయిల కు అమ్ముతున్నారు. ‘‘ఆదర్శ్ జీవికా మహిళా మల్బారీ ఉత్పాదన సమూహ్’’ కు చెందిన సోదరీమణులు చేసిన అద్భుతం తాలూకూ ప్రభావం ఇప్పుడు ఎన్నో గ్రామాల్లో కనబడుతోంది. పూర్ణియా కు చెందిన ఎన్నో గ్రామాల కు చెందిన రైతు సోదరీమణులు ఇప్పుడు చీరలు నేయించడమే కాక పెద్ద పెద్ద ప్రదర్శనల్లో తమ సొంత స్టాల్స్ ను ఏర్పాటు చేసుకుని, వారి ఉత్పాదనల ను వారే స్వయం గా అమ్ముకుంటున్నారు. నేటి మహిళలు కొత్త శక్తి తో, కొత్త ఆలోచనల తో, ఎలా కొత్త లక్ష్యాల ను సాధిస్తున్నారో తెలుసుకోవడానికి ఇది మంచి ఉదాహరణ.
నా ప్రియమైన దేశప్రజలారా,
మన దేశ మహిళల, ఆడబిడ్డల ఉద్యమ స్ఫూర్తి, వారి సాహసం, ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయం. మన ఆడబిడ్డలు పాత పరిమితుల ను అధిగమించి, ఉన్నత శిఖరాల ను ఎలా అధిరోహిస్తున్నారో తెలుసుకోవడానికి మన చుట్టుపక్కలే మనకి ఇటువంటి ఉదాహరణలు అనేకం కనిపిస్తాయి. పన్నెండేళ్ల ఆడబిడ్డ కామ్య కార్తికేయన్ సాధించిన విజయం గురించి మీకు నేను తప్పకుండా చెప్పాలనుకున్నాను. కేవలం పన్నెండేళ్ల వయసు లో కామ్య Mount Aconcagua ని అధిరోహించి చూపెట్టింది. ఇది దక్షిణ అమెరికా లోని ANDES పర్వతాల లో ఉన్న అతి ఎత్తయిన పర్వతం. దాని ఎత్తు దాదాపు 7000 మీటర్లు. ఈ నెల మొదట్లో కామ్య ఈ పర్వతాన్ని విజయవంతం గా అధిరోహించి, ముందుగా అక్కడ మన త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిందన్న వార్త ప్రతి భారతీయుడి మనసునీ తప్పక ఆనందమయం చేస్తుంది. దేశం గర్వపడేలాంటి పని చేసిన కామ్య ఒక కొత్త లక్ష్యాన్ని చేపట్టిందని నేను విన్నాను. దాని పేరు ‘‘మిశన్ సాహస్’’. ఇందులో భాగం గా కామ్య అన్ని ఖండాల లోనూ ఉన్న ఎత్తయిన పర్వతాల ను అధిరోహించే లక్ష్యం చేపట్టింది. ఈ ప్రయత్నం లో ఉత్తర, దక్షిణ ధృవాల్లో skiing చేయాల్సి ఉంది. కామ్య ‘‘మిశన్ సాహస్’’లో విజయం సాధించాలని కోరుతూ ఆమెకు అభినందనలు తెలుపుతున్నాను. కామ్య సాధించిన విజయం అందరూ ఫిట్ గా ఉండాలనే స్ఫూర్తి ని కూడా అందిస్తుంది. ఇంత చిన్న వయసు లో కామ్య సాధించిన విజయానికి నిస్సందేహంగా ఫిట్ నెస్ కూడా ఒక కారణమే. ‘ఎ నేశన్ దట్ ఈజ్ ఫిట్, విల్ బి ఎ నేశన్ దట్ ఈజ్ హిట్’ (A Nation that is fit, will be a nation that is hit) అంటే.. ‘ఏ దేశం ఫిట్ గా ఉంటుందో, ఆ దేశానికి అన్నింటా విజయమే లభిస్తుంది.’ ఇది వచ్చే నెల లో జరగనున్న అడ్వంచర్ స్పోర్ట్స్ కి కూడా ఎంతో తగినది. భారతదేశంలో అడ్వంచర్ స్పోర్ట్స్ జరగడానికి తగిన భౌగోళిక పరిస్థితులు మన దేశం లో ఉన్నాయి. ఒక పక్క ఎత్తయిన పర్వతాలు ఉంటే, మరో పక్క సుదూరాల వరకూ వ్యాపించిన ఎడారి ఉంది. మన దేశం ఒక పక్క దట్టమైన అడవుల కు నెలవయితే, మరో పక్క విస్తరించిన సముద్రం ఉంది. అందువల్ల మీ అందరినీ నేను కోరేది ఏమిటంటే, మీకు నచ్చిన చోట, మీకు ఇష్టమైన పని ని ఎంచుకుని, మీ జీవితాన్ని తప్పకుండా (adventure) సాహసం తో జత పరచండి. జీవితం లో (adventure) సాహసం కూడా ఉండి తీరాలి కదా.
మిత్రులారా,
పన్నెండేళ్ళ ఆడబిడ్డ కామ్య సాధించిన విజయగాథ తరువాత, 105 సంవత్సరాల బాగీరథమ్మ విజయగాథ ను గురించి మీరు వింటే నిర్ఘాంతపోతారు. మిత్రులారా, మనం జీవితం లో ప్రగతి సాధించాలన్నా, అభివృధ్ధి చెందాలన్నా, ఏదన్నా సాధింఛాలన్నా కూడా మొదటి షరతు ఏమిటంటే, మన లోపల ఉండే విద్యార్థి ఎప్పుడూ బ్రతికే ఉండాలి. మన 105 సంవత్సరాల బాగీరథమ్మ ఇదే విషయం లో స్ఫూర్తిని అందిస్తుంది. ఈ బాగీరథమ్మ ఎవరా అని మీరు ఆలోచిస్తున్నారా? బాగీరథమ్మ కేరళా లోని కొల్లమ్ లో ఉంటుంది. చాలా చిన్నతనం లోనే ఆమె తన తల్లిని కోల్పోయింది. చిన్నతనం లోనే వివాహం జరిగింది కానీ భర్త ని కూడా పిన్నవయసు లోనే కోల్పోయింది. అయితే, బాగీరథమ్మ తన ధైర్యాన్ని కోల్పోలేదు. తన ఆత్మస్థైరాన్ని కోల్పోలేదు. పదేళ్ల కన్నా చిన్న వయసు లోనే ఆమె పాఠశాల చదువు ఆగిపోయింది. 105 సంవత్సరాల వయసు లో ఆవిడ మళ్ళీ పాఠశాల లో చేరి, మళ్ళీ చదువు మొదలుపెట్టారు. అంత వయసు లో కూడా ఆవిడ లెవెల్-4 పరీక్షలు రాసి, ఎంతో ఆత్రుతగా ఫలితాల కోసం ఎదురుచూడడం మొదలుపెట్టారు. పరీక్షల్లో ఆవిడ 75 శాతం మార్కులు సంపాదించుకున్నారు. అంతే కాదు, గణితం లో నూటికి నూరు శాతం మార్కులు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఆవిడ ఇంకా చదువుకోవాలని ఆశ పడుతున్నారు. తరువాతి పరీక్షలు కూడా రాయాలని అనుకుంటున్నారావిడ. బాగీరథమ్మ లాంటి వాళ్లే ఈ దేశాని కి బలం. ఇటువంటివారే స్ఫూర్తి కి అతిపెద్ద మూలం. నేనివాళ ముఖ్యం గా బాగీరథమ్మకు నమస్కరిస్తున్నాను.
మిత్రులారా,
జీవితం లో ప్రతికూల పరిస్థితుల్లో మన ధైర్యం, మన ధృఢ సంకల్పం ఎటువంటి పరిస్థితులనైనా మార్చేస్తుంది. ఈమధ్యన నేను మీడియా లో ఒక కథ చదివాను. దాని గురించి మీతో తప్పకుండా చెప్పాలనుకున్నాను. మురాదాబాద్ తాలూకా లోని హమీర్ పూర్ గ్రామం లో నివసించే సల్మాన్ కథ ఇది. సల్మాన్ జన్మత: దివ్యాంగుడు. అతడి కాళ్ళు అతడికి సహకరించవు. అయినా కూడా ఏ మాత్రం ఓటమి ని అంగీకరించకుండా సొంతం గా ఏదైనా పని చేసుకుని బ్రతకాలని నిర్ణయించుకున్నాడు. అంతేగాక, తనలాగే ఇబ్బంది పడే మరికొందరు దివ్యాంగుల కు కూడా తాను సహాయపడాలని అతడు అనుకున్నాడు. తన ఊరిలోనే చెప్పులు, డిటర్జెంట్లు తయారు చేసే పని ప్రారంభించాడు సల్మాన్. చూస్తూండగానే వారితో పాటూ మరో ముఫ్ఫై మంది దివ్యాంగులు వారికి జతయ్యారు. మీరు గమనించాల్సిన మరో విషయం ఏమిటంటే, సల్మాన్ తాను నడవలేక పోయినా ఇతరుల కు నడక తేలికవ్వడానికి ఉపయోగపడే చెప్పుల ను తయారుచే యాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే తన తోటి దివ్యాంగుల కు తానే శిక్షణ ను ఇచ్చాడు. ఇప్పుడు వారందరూ కలిసి తయారీ చేస్తారు, క్రయవిక్రయాలు కూడా వారే చేసుకుంటారు. తమ కష్టం తో కేవలం తమకు మాత్రమే ఉపాధి సంపాదించుకోవడం కాకుండా, తమ కంపెనీ ని కూడా లాభాల్లోకి తెచ్చిపెట్టారు. వీళ్ళంతా కలిసి ఇప్పుడు రోజంతా కష్టపడి రోజుకు 150 జతల చెప్పులు తయారు చేస్తారు. ఇంతేకాదు, ఈ ఏడాది ఒక వంద మంది దివ్యాంగుల కు పని ఇవ్వాలని సల్మాన్ సంకల్పించుకున్నడు. వీరందరి ధైర్యం, వారి ఉద్యమస్ఫూర్తి కి వందనాలు సమర్పిస్తున్నాను. ఇటువంటి సంకల్పశక్తి గుజరాత్ లో కచ్ ప్రాంతాని కి చెందిన అజరక్ గ్రామం లోని ప్రజలు చూపెట్టారు. 2001లో వచ్చిన భూకంప విధ్వంసాని కి అందరూ గ్రామం వదిలి వెళ్ళి పోతుంటే ఇస్మయిల్ ఖత్రీ అనే ఆయన, గ్రామం లోనే ఉంటూ ‘‘అజరక్ ప్రింట్’’ అనే తమ సంప్రదాయ కళను పరిరక్షించాలనే సంకల్పాన్ని చేసుకున్నాడు. చూస్తూండగానే ప్రకృతి లోని సహజ రంగుల తో తయారైన సంప్రదాయక కళ ‘‘అజరక్ ప్రింట్’’ అందరినీ ఆకర్షించడం మొదలు పెట్టింది. గ్రామ ప్రజలందరూ తమ సంప్రదాయక కళాప్రక్రియ తో ముడిపడిపోయారు. గ్రామ ప్రజలు ఎన్నో ఏళ్ల పూర్వం తయారైన ఈ కళను రక్షించడమే కాక, ఆధునిక ఫ్యాషన్ కు ఈ కళ ను జత చేశారు. ఇప్పుడు పెద్ద పెద్ద డిజైనర్ లు, పెద్ద పెద్ద డిజైనర్ సంస్థలు, అజరక్ ప్రింట్ ను వాడుకోవడం మొదలు పెట్టారు. గ్రామం లో కష్టపడి పని చేసేవారి కారణం గా ఇవాళ ‘‘అజరక్ ప్రింట్’’ పెద్ద బ్రాండ్ గా మారింది. ప్రపంచం లోని పెద్ద వ్యాపారస్తులు ఈ ప్రింట్ వైపుకి ఆకర్షితులవుతున్నారు.
నా ప్రియమైన దేశప్రజలారా,
ఇటీవలే దేశవ్యాప్తం గా అందరూ మహాశివరాత్రి పండుగ ను జరుపుకున్నారు. శివపార్వతుల ఆశీర్వాదమే దేశ చైతన్యాన్ని జాగృతం చేస్తోంది. మహాశివరాత్రి సందర్భం గా ఆ భోలేనాథుడి ఆశీర్వాదం మీ అందరికీ ఉండాలి. మీ అందరి కోరికలనూ భగవంతుడైన శివుడు తీర్చాలని, మీరు శక్తివంతులు గా ఉండాలని, ఆరోగ్యం గా ఉండాలని, సుఖం గా ఉండాలని, దేశం పట్ల మీ మీ కర్తవ్యాల ను నిర్వర్తిస్తూ ఉండాలని కోరుకుంటున్నాను.
మిత్రులారా,
మహాశివరాత్రి తో పాటుగా, ఇక వసంత ఋతువు తాలూకూ వెలుగు కూడా దినదినమూ పెరుగుతూ ఉంటుంది. రాబోయే రోజుల్లో హోలీ పండుగ ఉంది. దాని వెంటనే ‘ఉగాది’ (గుడీ పడ్వా) కూడా రాబోతోంది. నవరాత్రి పండుగ కూడా దీనితో పాటే కలిసి ఉంటుంది. రామనవమి కూడా ఆ వెంటనే వస్తుంది. పండుగలు, పర్వదినాలు మన దేశంలో సామాజిక జీవితాల తో విడదీయలేని భాగం గా ఉంటూ వచ్చాయి. ప్రతి పండుగ వెనకాల ఏదో ఒక సామాజిక సందేశం దాగి ఉంటుంది. అది సమాజాన్ని మాత్రమే కాక యావత్ దేశాన్నీ ఐకమత్యం తో కట్టిపడేస్తుంది. హోలీ తర్వాత వచ్చే చైత్ర శుక్ల పాడ్యమి నుండీ భారతీయ విక్రమ నామ నూతన సంవత్సరం మొదలవుతుంది. అందుకు గానూ, భారతీయ నూతన సంవత్సరాది కి కూడా నేను మీ అందరి కీ ముందస్తు శుభాకాంక్షలు తెలియ చేస్తున్నాను.
నా ప్రియమైన దేశ ప్రజలారా, తదుపరి ‘మన్ కీ బాత్’ వరకూ కూడా విద్యార్థులందరూ పరీక్షలు రాయడం లో నిమగ్నమై ఉంటారు. పరీక్షలు అయిపోయినవారు సంతోషం గా ఉంటారు. చదువుకుంటున్నవారి కీ, చదువు అయిపోయినవారి కీ కూడా నా శుభాకాంక్షలు. రండి, తదుపరి ‘మన్ కీ బాత్’ కోసం అనేకానేక కబుర్ల ను తీసుకుని వద్దాం. మళ్ళీ కలుద్దాం.
అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం!
నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! ఇవాళ జనవరి 26వ తేదీ. మన గంతంత్ర దినోత్సవం సందర్భం గా అనేకానేక శుభాకాంక్షలు. 2020లో ఇది మన మొదటి ‘మన్ కీ బాత్’. ఈ నూతన సంవత్సరం లోనే గాక ఈ దశాబ్దం లోనే మొదటి ‘మన కీ బాత్’ కార్యక్రమం ఇది. మిత్రులారా, ఈసారి గణతంత్ర దినోత్సవ వేడుకల కారణం గా మీతో జరిపే ‘మన్ కీ బాత్ ’ కార్యక్రమం సమయం లో మార్పులు చేస్తే మంచిదనిపించింది. అందుకని ఇవాళ మరొక సమయాన్ని నిర్ణయించి, మీతో ‘మన్ కీ బాత్’ మాట్లాడుతున్నాను. మిత్రులారా, రోజులు మారతాయి. వారాలు మారతాయి. నెలలు గడిచిపోతాయి. సంవత్సరాలే మారిపోయాయి. కానీ, మన భారతదేశ ప్రజల ఉత్సాహం మారదు. మనం ఏ మాత్రం తక్కువ కాదు, మనం కూడా ఏదో ఒకటి సాధిస్తాం – ’can do’ అన్న భావం అది. ఈ ’can do’ అనే భావన ఒక సంకల్పంగా మారుతోంది. దేశం కోసం, సమాజం కోసం ఏదైనా చెయ్యాలనే భావన ప్రతి రోజూ అంతకు ముందు కన్నా, మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. మిత్రులారా, కొత్త కొత్త విషయాలపై చర్చించేందుకు, దేశ ప్రజలు సాధించే కొత్త కొత్త విజయాల ను తెలుసుకుని దేశమంతటా సంబరాలు జరుపుకోవడానికీ ఈ ‘మన్ కీ బాత్ ’ వేదిక పై మనందరము మరొక్కసారి సమావేశమయ్యాము. పంచుకోవడానికీ, నేర్చుకోవడానికీ, కలిసి ఎదగడానికీ – ‘మన్ కీ బాత్’ కార్యక్రమం – ఒక చక్కని, సహజమైన వేదిక గా మారింది. ప్రతి నెలా వేల సంఖ్య లో ప్రజలు తమ సూచనల ను, తమ ప్రయత్నాలను, తమ అనుభవాలను పంచుకుంటారు. వాటిలో నుంచి సమాజానికి ప్రేరణ ను ఇచ్చే విషయాల ను, కొందరు ప్రజల అసాధారణ ప్రయత్నాల నూ ఇక్కడ చర్చించుకునే అవకాశం ‘మన్ కీ బాత్’ ద్వారా మనకు లభిస్తోంది.
ఎవరో అలా చేసి చూపించారుట – మనం కూడా చెయ్యగలమా? అలాంటి ఒక ప్రయోగాన్ని దేశవ్యాప్తం గా మరొకసారి చేసి ఒక గొప్ప మార్పుని మనమూ తీసుకు రాగలమా? ఆ మార్పుని, సమాజం లో ఒక సాధారణ అలవాటుగా మార్చి, ఆ మార్పుని శాశ్వతం చేయగలమా? ఇలాంటి కొన్ని ప్రశ్నల ను వెతుకుతూ వెతుకుతూ, ప్రతి నెలా ‘మన్ కీ బాత్’ లో కొన్ని విన్నపాలు, కొన్ని ఆహ్వానాలూ, ఏదో సాధించాలనే సంకల్పాల పరంపర మొదలైంది. గడిచిన కొన్ని సంవత్సరాలు గా మనం ఎన్నో చిన్న చిన్న సంకల్పాల ను చేసుకుని ఉంటాము. ‘‘సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకూడదు’’ , ‘‘ఖాదీనీ, దేశీ వస్తువులనూ కొనాలి’’, ‘‘పరిశుభ్రత పాటించాలి’’ , ‘‘ఆడబిడ్డలను గౌరవించాలి, వారి విజయాలకు గర్వపడాలి’’ , ‘‘less cash economy లాంటి కొత్త అంశాలు, వాటిని బలపరచడం’’ – మొదలైన అనేకమైన సంకల్పాలన్నీ మన ఈ తేలికపాటి ‘మన్ కీ బాత్’ కబుర్ల ద్వారానే జన్మించాయి.
నాకొక ముచ్చటైన ఉత్తరం వచ్చింది. బీహార్ నుంచి శ్రీ శైలేశ్ గారి నుంచి. అయితే వారు ఇప్పుడు బీహార్ లో నివసించట్లేదు. ఇప్పుడు ఆయన ఢిల్లీ లోని ఒక ఎన్.జి.ఒ లో పని చేస్తున్నారు. శ్రీ శైలేశ్ గారు ఏం రాశారంటే, ‘‘మోదీ గారూ, మీరు ప్రతి ‘మన్ కీ బాత్’ లోనూ ఏదో ఒక కొత్త విషయాన్ని ప్రస్తావిస్తారు. వాటిల్లో ఎన్నో పనుల ను నేను చేశాను. ఈ చలికాలం లో నేను ప్రజల వద్ద నుండి పాత బట్టలు సేకరించి, వాటి అవసరం ఉన్నవారికి పంచాను. ‘మన్ కీ బాత్’ నుండి ప్రేరణ పొంది ఎన్నో పనుల ను నేను చేయడం మొదలు పెట్టాను. కానీ నెమ్మది గా నేను కొన్ని విషయాల ను మర్చిపోయాను. కొన్ని నాకు సాధ్యపడలేదు. కొత్త సంవత్సరం లో నేనొక ప్రణాళిక ను తయారు చేసాను. నూతన సంవత్సరం లో ప్రజలు new year resolutions చేసుకున్నట్లు, నేను చేయాలనుకున్న పనులన్నింటి జాబితా ను నేను తయారు చేశాను. మోదీ గారూ, ఈ కొత్త సంవత్సరం లో ఇది నా social resolution! ఇవన్నీ చిన్న చిన్న విషయాలే కానీ పెద్ద పెద్ద మార్పుల ను తీసుకు రాగలవని నాకు అనిపిస్తోంది. నా ఈ ప్రణాళిక మీద మీరు ఆటోగ్రాఫ్ చేసి, నాకు తిరిగి పంపగలరా?’’
శైలేశ్ గారూ, మీకు అనేకానేక అభినందనలు, శుభాకాంక్షలు. ‘‘మన్ కీ బాత్ ప్రణాళిక’’ అనే మీ నూతన సంవత్సర resolution ఎంతో సృజనాత్మకం గా ఉంది. దీనిపై నేను తప్పకుండా అభినందనలు అని రాసి మీకు తిరిగి పంపిస్తాను. మిత్రులారా, ఈ ‘‘మన్ కీ బాత్ ప్రణాళిక’’ ను చదువుతుంటే, ఇన్ని రకాల విషయాలు ఉన్నాయా? ఇన్ని రకాల హేష్ ట్యాగ్ లా? అని ఆశ్చర్యం కలిగింది. మనందరమూ కలిసి ఎన్నో పనులు కూడా చేశాము. ఒకసారి మనము ‘‘సందేశ్ టూ సోల్జర్స్’’ పేరుతో ఒక ప్రచారాన్ని నడిపాము. తద్వారా మన భారత సైనికుల మనసుల కు మరింత చేరువ గా వెళ్ళి వారితో బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ‘మన్ కీ బాత్ ’ కార్యక్రమం ద్వారా ఒక ప్రచారాన్ని నడిపాము.
‘ఖాదీ ఫర్ నేశన్ – ఖాదీ ఫర్ ఫ్యాశన్’ నినాదం తో ఖాదీ ఉత్పత్తుల అమ్మకాల కు ఒక కొత్త స్థాయి ఏర్పడింది. ‘buy local’ అనే మంత్రాన్ని సొంతం చేసుకున్నాం. ‘हम फिट तो इंडिया फिट’ అంటూ శారీరిక ధృఢత్వం పట్ల అప్రమత్తత పెంచాము. ‘మై క్లీన్ ఇండియా’ లేదా ‘స్టాచ్యూ క్లీనింగ్’ మొదలైన ప్రయత్నాలతో పరిశుభ్రతను ఒక సామూహికోద్యమంగా తయారుచేశాము. హేష్ ట్యాగ్ No to drugs(#NoToDrugs,), హేష్ ట్యాగ్ భారతలక్ష్మి (#BharatKiLakshami), హేష్ ట్యాగ్ Self for Society (#Self4Society), హేష్ ట్యాగ్ StressFreeExam (#StressFreeExams), హేష్ ట్యాగ్ సురక్షా బంధన్ (#SurakshaBandhan), హేష్ ట్యాగ్ డిజిటల్ ఎకానమీ (#DigitalEconomy), హేష్ ట్యాగ్ రోడ్ సేఫ్టీ (#RoadSafety), చెప్పుకుంటూ పోతే ఇలాంటివి కోకొల్లలు!
శైలేశ్ గారూ, మీరు తయారు చేసిన ఈ ‘మన్ కీ బాత్ ప్రణాళిక’ ను చూస్తే అర్థమైంది, ఇది చాలా పెద్ద జాబితా అని. రండి, మనందరమూ ఈ ప్రయాణాన్ని కొనసాగిద్దాం. ఈ ‘మన్ కీ బాత్ ప్రణాళిక’ నుండి మనకు నచ్చిన ఏదో ఒక అంశాన్ని ఎన్నుకుని దానిపై పని చేద్దాం. హేష్ ట్యాగ్ ను ఉపయోగించి అందరితోనూ మన వంతు తోడ్పాటును పంచుకుందాం. స్నేహితులను, కుటుంబ సభ్యులను, అందరికీ ప్రేరణ ను అందిద్దాం. ప్రతి భారతీయుడూ ఒక్కో అడుగూ వేస్తూంటే మన భారతదేశం 130 కోట్ల అడుగులు ముందుకు వెళ్తుంది. అందుకే ‘‘చరైవేతి, చరైవేతి, చరైవేతి…’’ అంటే ‘‘పదండి ముందుకు, పదండి ముందుకు, పదండి ముందుకు’’ అనే మంత్రం తో మన ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉందాం.
నా ప్రియమైన దేశప్రజలారా, మనం ‘మన్ కీ బాత్ ప్రణాళిక’ ను గురించి మాట్లాడుకున్నాం. పరిశుభ్రత తర్వాత ప్రజల సహకార భావన, అంటే participative spirit, నేడు మరొక రంగం లో వేగవంతమవుతోంది. అదే ‘నీటి సంరక్షణ’. ‘నీటి సంరక్షణ’ కోసం ఎన్నో విస్తృతమైన, సరికొత్త ప్రయత్నాలు దేశవ్యాప్తం గా, దేశం నలుమూలల్లోనూ జరుగుతున్నాయి. క్రితం వర్షా కాలం లో మనం మొదలుపెట్టిన ‘‘జల్ శక్తి అభియాన్’’ – ప్రజల సహకారం తో అత్యంత వేగం గా విజయపథం వైపుకి అడుగులు వేస్తోంది. పెద్ద సంఖ్య లో జలాశయాల, చెరువుల నిర్మాణం జరిగింది. సమాజం లోని అన్ని వర్గాల ప్రజలూ ఈ ప్రచారం లో తమ వంతు సహకారాన్ని అందించారు. రాజస్థాన్ లోని ఝాలోర్ జిల్లా లో రెండు చారిత్రాత్మిక దిగుడు బావులు చెత్త తోనూ, మురికి నీటి తోనూ నిండిపోయాయి. భద్రాయు, థాన్వాలా పంచాయితీల నుండి వందలాది ప్రజలు ‘‘జల్ శక్తి అభియాన్" ద్వారా ఈ దిగుడు బావుల ను పునర్జీవితం చేసే ప్రయత్నాలు చేపట్టారు. వర్షాల కు ముందుగానే వారందరూ ఈ దిగుడు బావుల్లో పేరుకు పోయిన చెత్తనీ, బురదనీ, మురికి నీటినీ తొలగించే పని ప్రారంభించారు. ఈ ప్రచారం కోసం కొందరు శ్రమదానం చేస్తే, కొందరు ధన సహాయం చేశారు. అందరి శ్రమ వల్లా ఇవాళ ఆ దిగుడు బావులు వాళ్లకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని బారాబంకీ తాలూకూ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. ఇక్కడ, 43 హెక్టార్ల ప్రాంతం లో వ్యాపించి ఉన్న సరాహీ సరస్సు తన అవసాన దశ లో ఉంది. కానీ, అక్కడి గ్రామీణ ప్రజలు తమ సంకల్పశక్తి తో ఈ సరస్సు కు కొత్త ఊపిరి ని అందించారు. ఇంత పెద్ద లక్ష్యాన్ని నెరవేర్చే దారి లో వాళ్ళు ఏ ఆటంకాన్నీ రానివ్వలేదు. ఒకదాని తర్వాత మరొక గ్రామాన్ని కలుపుకుంటూ అంతా ఒకటిగా నిలిచారు. వారంతా కలిసి సరస్సు కి నలువైపులా ఒక మీటరు ఎత్తు గట్టుని కట్టారు. ఇప్పుడా సరస్సు నీటి తో నిండి ఉంది. చుట్టుపక్కల వాతావరణం పక్షుల కలరవాలతో ప్రతిధ్వనిస్తోంది.
ఉత్తరాఖండ్ లోని అల్మోరా –హల్ద్వానీ హైవే ను ఆనుకుని ఉన్న సునియాకోట్ గ్రామం నుండి కూడా ప్రజా భాగస్వామ్యం తాలూకూ ఒక ఉదాహరణ వెలుగు లోకి వచ్చింది. గ్రామం లో నీటి ఎద్దడి నుంచి బయటపడడానికి, తామే స్వయం గా నీటిని గ్రామం వరకూ తెచ్చుకోవాలనే సంకల్పాన్ని చేపట్టారు. ప్రజలు చందాలు వేసుకుని, డబ్బు పోగుచేసి, శ్రమదానం చేసి, దాదాపు ఒక కిలో మీటర్ దూరం నుంచి తమ గ్రామం వరకూ గొట్టాలు వేసుకున్నారు. పంపింగ్ స్టేషన్ ఏర్పరుచుకున్నారు. ఇంకేముంది, చూస్తూండగానే రెండు దశాబ్దాల నుంచీ ఇబ్బంది పెడుతున్న సమస్య శాశ్వతం గా సమసిపోయింది. వర్షపు నీటి సంరక్షణ కోసం బోరుబావిని వాడే సృజనాత్మక ఆలోచన ఒకటి తమిళ నాడు నుంచి వెలుగు లోకి వచ్చింది. నీటి సంరక్షణ కు సంబంధించిన ఇటువంటి కథనాలు దేశవ్యాప్తం గా ఎన్నో వినవచ్చాయి. ‘న్యూ ఇండియా’ సంకల్పాని కి ఇవి బలాన్ని ఇస్తాయి. మన జలశక్తి ఛాంపియన్స్ గురించిన కథలు వినడానికి యావత్ దేశం ఉత్సుకత చూపెడుతోంది. నీటి సేకరణ కు, ఇంకా నీటి సంరక్షణ కు సంబంధించి మీ చుట్టుపక్కల జరుగుతున్న ప్రయత్నాల ను, వాటి తాలూకూ కథనాల నూ ఫోటోల నూ, వీడియోల నూ హేష్ ట్యాగ్ (#)jalshakti4India లో షేర్ చేయండి.
నా ప్రియమైన దేశ ప్రజలారా, ముఖ్యం గా నా యువ మిత్రులారా, ‘‘ఖేలో ఇండియా’’ కు అందించిన అద్భుతమైన ఆతిథ్యాని కి గానూ అసమ్ ప్రభుత్వాని కీ, అసమ్ ప్రజల కూ, ఇవాళ ‘మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా నేను అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను. మిత్రులారా, గువాహాటీ లో జరిగిన మూడవ ‘‘ఖేలో ఇండియా క్రీడలు’’ జనవరి 22వ తేదీన పూర్తయ్యాయి. ఆ పోటీల లో రకరకాల రాష్ట్రాల కు చెందిన దాదాపు ఆరు వేల మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ ఆటల పోటీల లో ఎనభై పాత రికార్డుల ను బద్దలుకొట్టారని వింటే మీరు ఆశ్చర్యపోతారు. అందులోనూ 56 రికార్డుల ను మన ఆడబిడ్డలు తిరగరాశారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను. ఇది కేవలం ఆడబిడ్డల వల్లే సాధ్యపడింది. విజేతల తో పాటూ, ఈ ఆటలపోటీల్లో పాల్గొన్న క్రీడాకారులందరి కీ నేను అభినందనలు తెలుపుతున్నాను.
ఇంకా, ‘‘ఖేలో ఇండియా గేమ్స్’’ ను విజయవంతం గా నిర్వహించినందుకు దీనికి సంబంధించిన అందరు వ్యక్తుల కూ, శిక్షకుల కూ, సాంకేతిక అధికారుల కూ నా కృతజ్ఞతను తెలుపుతున్నాను. మనందరం సంతోషించాల్సిన విషయం ఏమిటంటే ఏడాది ఏడాది కీ కృతజ్ఞతా ఈ ‘‘ఖేలో ఇండియా క్రీడలు’’ లో పాల్గొనే క్రీడాకారుల సంఖ్య పెరుగుతోంది. దీనిని బట్టి పాఠశాల స్థాయి లో పిల్లల కు క్రీడల పట్ల ఆసక్తి ఎంతగా పెరుగుతోందో గమనించవచ్చు. 2018లో ‘ఖేలో ఇండియా క్రీడలు’ మొదలైనప్పుడు ఇందులో ముఫ్ఫై ఐదు వందల క్రీడాకారులు పాల్గొన్నారు. కానీ మూడేళ్లల్లో క్రీడాకారుల సంఖ్య ఆరు వేల కంటే ఎక్కువకు పెరిగింది. అంటే దాదాపు రెట్టింపు సంఖ్య! అంతేకాదు కేవలం మూడేళ్ళ లో ‘ఖేలో ఇండియా క్రీడలు’ మాధ్యమం ద్వారా ముఫ్ఫై రెండు వందల ప్రతిభావంతులైన పిల్లలు తయారయ్యారు. ఇందులో చాలామంది పిల్లలు లేమి లోనూ, పేదరికం లోనూ పెరిగి పెద్దయినవారూ ఉన్నారు. ‘ఖేలో ఇండియా క్రీడల’ లో పాల్గొన్న పిల్లల, వారి తల్లిదండ్రుల ధైర్యం, ధృఢ సంకల్పం తాలూకూ కథనాలు ప్రతి భారతీయుడి కీ ప్రేరణ ను అందిస్తాయి. గువాహాటీ కు చెందిన పూర్ణిమా మండల్ నే తీసుకోండి, ఆమె గువాహాటీ నగరపాలిక సంస్థలో ఒక పారిశుధ్య కార్మికురాలు (స్వీపర్). కానీ వారి అమ్మాయి మాళవిక ఫుట్ బాల్ పై పట్టుదల పెడితే, అబ్బాయి సుజీత్ ఖో ఖో పై దృష్టి పెట్టాడు. వారి ఇంకో అబ్బాయి ప్రదీప్ అసమ్ హాకీ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు.
గర్వంతో నిండిన ఇటువంటి మరొక కథనం తమిళ నాడు లోని యోగానందన్ గారిది. తమిళ నాడు లో బీడీలు తయారు చేసే పని ఆయనది. కానీ ఆయన కుమార్తె పూర్ణశ్రీ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకాన్ని సంపాదించుకుని అందరి మనసులను దోచుకుంది. నేను డేవిడ్ బెక్‌హామ్ పేరు తలవగానే మీరంతా ప్రఖ్యాత అంతర్జాతీయ ఫుట్ బాల్ ఆటగాడు అంటారు. కానీ, ఇప్పుడు మన దగ్గర కూడా ఒక డేవిడ్ బెక్‌హామ్ ఉన్నాడు. ఇప్పుడు అతడు కూడా గువాహాటీ లోని యూత్ గేమ్స్ లో స్వర్ణ పతకాన్ని సాధించాడు. అది కూడా 200 మీటర్ల సైక్లింగ్ పోటీ తాలూకూ Sprint Event లో.
కార్-నికోబార్ ద్వీపానికి చెందిన డేవిడ్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు. అతడిని పెంచిన బాబాయి అతడిని ఫుట్ బాల్ ఆటగాడిగా చూడాలనుకుని, అతడికి పేరును కూడా ప్రఖ్యాత ఫుట్ బాల్ ఆటగాడి పేరునే పెట్టాడు. కానీ డేవిడ్ మనసు సైకింగ్ పై ఉండేది. నాకు సంతోషాన్ని కలిగించిన మరొక విషయం ఏమిటంటే, ఖేలో ఇండియా పథకం లో భాగం గా ఈయన ఎన్నికయి, ఇవాళ సైక్లింగ్ లో ఒక కొత్త కీర్తికిదీటాన్ని అధిరోహించాడు. భివానీ కి చెందిన ప్రశాంత్ సింహ్ కన్హయ్యా Pole vault ఈవెంట్ లో తన సొంత రికార్డ్ ను తానే బద్దలుకొట్టాడు. 19 ఏళ్ల ప్రశాంత్ ఒక రైతు కుటుంబానికి చెందిన వాడు. ప్రశాంత్ తన Pole vault ప్రాక్టీసుని మట్టిలోనే చేసేవాడని చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇది తెలిసిన తర్వాత ఆయన కోచ్ కు, ఢిల్లీ లోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియం లో అకాడమీ నడిపించడానికి క్రీడా విభాగం సహాయం చేసింది. ఇవాళ ప్రశాంత్ అక్కడ శిక్షణ పొందుతున్నాడు.
ముంబయి కు చెందిన కరీనా శన్ తా (Kareena Shankta ) కథ, ఎట్టి పరిస్థితి లోనూ ఓటమి ని ఒప్పుకోని ఆమె పట్టుదల ప్రతి ఒక్కరికీ ప్రేరణ ను అందిస్తుంది. కరీనా 100 మీటర్ల Breaststroke పోటీలో, అండర్ 17 విభాగం లో స్వర్ణ పతకాన్ని సాధించి, ఒక సరికొత్త జాతీయ రికార్డు ని నెలకొల్పింది. పదవ తరగతి చదువుతున్న కరీనా కి ఒకసారి మోకాలికి దెబ్బ తగిలిన కారణం గా ట్రైనింగ్ ని వదులుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ కరీనా, ఆమె తల్లి ధైర్యాన్ని కోల్పోలేదు. దానికి పరిణామం ఇవాళ మీ ముందర ఉంది. క్రీడాకారులందరి ఉజ్వల భవిష్యత్తు ని నేను కోరుకుంటున్నాను. దానితో పాటుగా దేశ ప్రజలందరి తరఫునా వీరందరి తల్లిదండ్రుల కి నేను నమస్కరిస్తున్నాను. వారంతా తమ పేదరికాన్ని పిల్లల భవిష్యత్తు కి అవరోధంగా కానివ్వలేదు. జాతీయ ఆటల పోటీల మాధ్యమం ద్వారా క్రీడాకారుల కు తమ ప్రతిభను కనబరిచే అవకాశమే కాకుండా ఇతర రాష్ట్రాల సంస్కృతి ని తెలుసుకునే అవకాశం కూడా లభిస్తుంది. అందుకని "ఖేలో ఇండియా యూత్ గేమ్స్" నమూనా లోనే ప్రతి ఏడాదీ "ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్" ను నిర్వహించాలనే నిర్ణయాన్ని తీసుకున్నాము.
మిత్రులారా, రాబోయే నెల ఫిబ్రవరీ 22 నుండీ మార్చి 1 వరకూ ఒడిశా కు చెందిన కటక్, ఇంకా భువనేశ్వర్ లోనూ ‘‘ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్’’ ప్రారంభం కాబోతున్నాయి. ఇందులో పాల్గొనడానికి మూడు వేల కు పైగా క్రీడాకారులు ఎంపికయ్యారు.
నా ప్రియమైన దేశప్రజలారా, పరీక్షల సమయం వచ్చేసింది. కాబట్టి విద్యార్థులందరూ తమ తమ చదువుల సన్నహాలు పూర్తి చేసుకునే స్థితి లో ఉండి ఉంటారు. దేశం లోని కోట్ల మంది విద్యార్థి మిత్రుల తో ‘‘పరీక్షా పే చర్చ’’ జరిపిన తరువాత దేశ యువత ఆత్మవిశ్వాసం తో ఉందని, ఏ సవాలునైనా ఎదుర్కొనే స్థాయి లో ఉన్నారని నేను నమ్మకం గా చెప్పగలుగుతున్నాను.
మిత్రులారా, ఒక పక్క పరీక్షలు ఉన్నాయి. మరో పక్క చలికాలం. ఈ రెండింటి మధ్యా మిమ్మల్ని మీరు ఆరోగ్యం గా ఉంచుకోవాల్సిందని నేను కోరుతున్నాను. కాస్తంత కసరత్తు చెయ్యండి. కాస్తంత ఆడుకోండి, గెంతులు వెయ్యండి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆటపాటల్లో నిమగ్నమవ్వడం కూడా ముఖ్యం. ‘‘ఫిట్ ఇండియా’’లో భాగం గా ఎన్నో కొత్త కార్యక్రమాలు జరగడం నేను ఈ మధ్య గమనిస్తున్నాను. జనవరి 18న దేశవ్యాప్తం గా యువత cyclothon ని ప్రారంభించారు. అందులో పాల్గొన్న లక్షల కొద్దీ దేశ ప్రజలు ఫిట్ నెస్ ని గురించి సందేశాలు ఇచ్చారు. మన ‘న్యూ ఇండియా’ పూర్తి స్థాయి లో ఫిట్ గా ఉండడానికి, అన్నివైపుల నుండీ జరుగుతున్న ప్రయత్నాలు ఉత్సాహాన్నీ, ఉత్సుకతనీ నింపేవిగా ఉంటున్నాయి. గత ఏడాది నవంబర్ లో మొదలైన ‘‘ఫిట్ ఇండియా స్కూల్’’ ప్రచారం కూడా ఇప్పుడు ఊపందుకుంది. ఇప్పటిదాకా 65,000 కంటే ఎక్కువ పాఠశాలలు ఆన్ లైన్ రిజిస్ట్రేషన్ తీసుకుని ‘‘ఫిట్ ఇండియా స్కూల్’’ సర్టిఫికెట్ ని పొందాయని తెలిసింది. ఫిజికల్ ఏక్టివిటీ నీ, ఆటలనూ స్కూలు పాఠాలతో కలిపి ‘‘ఫిట్ స్కూల్’’ గా తప్పక మారాలని దేశం లోని మిగిలిన పాఠశాలల వారిని కూడా నేను కోరుతున్నాను. ఇంతేగాక, దేశ ప్రజలందరినీ నేను కోరేది ఏమిటంటే, మీరందరూ కూడా మీ దినచర్యలో ఫిజికల్ ఏక్టివిటీ కి ఎక్కువ అవకాశం ఇవ్వండి. మనం ఫిట్ గా ఉంటే ఇండియా ఫిట్ గా ఉంటుందని రోజూ మీకు మీరే గుర్తు చేసుకోండి.
నా ప్రియమైన దేశప్రజలారా, రెండు వారాల క్రితం భారతదేశ విభిన్న ప్రాంతాల లో రకరకాల పండుగలు జరిగాయి. లోరీ తాలూకూ ఉత్సాహమూ, వెచ్చదనంతో పంజాబ్ నిండిపోయింది. తమిళ నాడు లోని సోదర సోదరీమణులు పొంగల్ పండుగ ను, తిరువళ్ళువర్ జయంతి నీ జరుపుకున్నారు. అసమ్ లో బిహు తాలూకూ మనోహరమైన వర్ణం చూశాము. గుజరాత్ లో ప్రతి చోటా ఉత్తరాయణ పుణ్యకాలపు ఉత్సవం తో పాటూ ఆకాశం గాలిపటాల తో నిండిపోయింది. ఇటువంటి సమయంలో ఢిల్లీ ఒక చారిత్రాత్మక ఘటన కు సాక్షి గా నిలిచింది. ఢిల్లీ లో ఒక ముఖ్యమైన ఒప్పందం పై సంతకాలు జరిగాయి. దానితో పాటుగా దాదాపు 25 ఏళ్ల ఒక బాధాకరమైన అధ్యాయం – Bru Reang refugee crisis – అంతమయింది. ఎప్పటికీ ముగిసిపోయింది. మీ పండుగ సంబరాల మధ్యన ఈ ఒప్పందం గురించి మీరు వివరంగా తెలుసుకోలేకపోయి ఉండవచ్చు. అందుకని ‘మన్ కీ బాత్’ లో దీని గురించి తప్పకుండా చర్చించాలని నేను అనుకున్నాను. ఈ సమస్య 90లలో ఏర్పడింది. 1997లో జాతీయ ఉద్రిక్తత కారణంగా Bru Reang తెగ కు చెందిన ప్రజల కు మిజోరమ్ నుండి వేరుపడి త్రిపుర లో శరణు తీసుకోవాల్సివచ్చింది. ఈ శరణార్థుల ను ఉత్తర త్రిపుర (North Tripura)లోని కంచన్ పూర్ లో ఉన్న అస్థాయీ కెంప్స్ లో ఉంచారు. Bru Reang సముదాయపు ప్రజలు ఇలా శరణార్థులు గా జీవిస్తూ తమ జీవితం లోని ముఖ్యమైన భాగాన్ని కోల్పోవడం చాలా బాధాకరమైన విషయం. అలా కేంపుల్లో జీవించడం అంటే తమ ప్రాథమిక సౌకర్యాల ను కోల్పోవడమే! 23 ఏళ్ల పాటు ఇల్లు లేదు, భూమి లేదు, కుటుంబం లేదు, అనారోగ్యానికి పరిష్కారం లేదు, పిల్లల కు చదువు లేదు, వారికి ఏ రకమైన సౌకర్యమూ లేదు. ఒక్కసారి ఆలోచించండి 23 ఏళ్ల పాటు కేంపుల్లో కఠిన పరిస్థితుల్లో జీవనాన్ని సాగించడం వాళ్లకు ఎంత కష్టంగా ఉండి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. జీవితం లో ప్రతి క్షణం, ప్రతి రోజూ ఒక అనిశ్చిత భవిష్యత్తు తో ముందుకు నడవడం ఎంత కష్టమయమో కదా! ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళిపోయాయి. కానీ, వీళ్ళ దుఃఖానికి పరిష్కారాన్ని మాత్రం అందించలేకపోయాయి. కానీ ఇన్ని కష్టతర పరిస్థితుల్లో కూడా భారతీయ రాజ్యాంగం, సంస్కృతి పట్ల వారి విశ్వాసం ధృఢంగా ఉంది. ఇదే విశ్వాసం వల్ల వారి జీవితాల్లో ఇవాళ ఒక కొత్త వెలుగు కనబడింది.
ఒప్పందం ప్రకారం ఇప్పుడు వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి మార్గం ఏర్పడింది. ఆఖరికి ఈ 2020 కొత్త శతాబ్దపు ప్రారంభం, Bru Reang సముదాయపు ప్రజలకు ఒక కొత్త ఆశనూ, ఆశా కిరణాలనూ తీసుకు వచ్చింది. దాదాపు 34000 Bru Reang శరణార్థుల కు త్రిపుర లో నివాసాలు ఏర్పడతాయి. ఇంతేగాక, వారి పునర్నివాసానికీ, సంపూర్ణ అభివృధ్ధి కీ కేంద్ర ప్రభుత్వం దాదాపు ఆరు వందల కోట్ల రూపాయిల సహాయాన్ని కూడా ఇవ్వబోతోంది.
ప్రతి ఒక్క నిరాశ్రిత కుటుంబానికీ స్థలాలు మంజూరు చెయ్యబడతాయి. ఇళ్ళు కట్టుకోవడానికి సహాయం కూడా అందించబడుతుంది. దానితో పాటుగా వారికి అన్నసామాగ్రి కూడా ఇవ్వబడుతుంది. వారు ఇప్పుడు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల జన సంక్షేమ పథకాల లో భాగస్థులవుతారు. వాటిని ఉపయోగించుకో గలుగుతారు. ఈ ఒప్పందం ఎన్నో రకాలుగా ఎంతో ప్రత్యేకమైనది. Co-operative Federalism భావనని ఈ ఒప్పందం చూపెడుతుంది. ఈ ఒప్పందం కోసం మిజోరం, త్రిపుర, ఉభయ రాజ్యాల ముఖ్యమంత్రులూ హాజరయ్యారు. ఈ ఒప్పందం ఉభయ రాష్ట్రాల ప్రజల ఒప్పుదల, ఇంకా అభినందనల వల్లనే సాధ్యపడింది. అందువల్ల నేను ఈ రెండు రాష్ట్రాల ప్రజలకూ, అక్కడి ముఖ్యమంత్రులకూ ప్రత్యేకం గా కృతజ్ఞతల ను తెలుపుతున్నాను. ఈ ఒప్పందం భారతీయ సంస్కృతిలో నిక్షిప్తమైన కరుణా భావాన్ని, సహృదయతనీ ప్రకటితం చేస్తుంది. అందరినీ ‘మనవారు’ అనుకోవడం, ఐకమత్యం తో జీవించడం, ఈ పుణ్యభూమి సంస్కారంలోనే ఇమిడి ఉంది. మరొక్కసారి ఈ ఉభయ రాజ్యాల ప్రజలకూ, Bru Reang సముదాయాని కీ నేను ప్రత్యేకం గా అభినందనలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, ‘ఖేలో ఇండియా గేమ్స్’ లాంటి సఫలవంతమైన ఆటలపోటీలను నిర్వాహించిన అసమ్ లో మరొక పెద్ద పని జరిగింది. మీరు కూడా వార్తల్లో చూసే ఉంటారు. కొద్ది రోజుల క్రితం అసమ్ లో ఎనిమిది వేరు వేరు మిలిటెంట్ గ్రూప్ లకు సంబంధించిన 644 సభ్యులు తమ ఆయుధాల తో పాటూ లొంగిపోయారు. ఇంతకు ముందు హింసామార్గం వైపుకి వెళ్ళిపోయినవారు తమ విశ్వాసాన్ని శాంతిమార్గం వైపుకి మళ్ళించి, దేశ అభివృధ్ధి కి భాగస్వాములు అవ్వాలనే నిర్ణయాన్ని తీసుకుని, జనజీవన స్రవంతి లోకి వెనక్కు వచ్చారు. గత ఏడాది త్రిపుర లో కూడా ఎనభై కంటే ఎక్కువ మంది హింసామార్గాన్ని విడనాడి, జనజీవన స్రవంతి లోకి తిరిగి వచ్చారు. హింస తోనే సమస్యల కు పరిష్కారాన్ని వెతకవచ్చు అనుకుని ఆయుధాల ను పట్టుకున్నవారంతా; శాంతి, ఐకమత్యాల వల్లనే ఏ సమస్య అయినా పరిష్కారమవుతుంది. అదే ఏకైక మార్గం అని బలంగా నమ్మారు. దేశ ప్రజలారా, ఈశాన్య రాష్ట్రాల్లో తీవ్రవాదం చాలామటుకు తగ్గింది. దీనికి అతి పెద్ద కారణం ఏమిటంటే, ఈ ప్రాంతం తో ముడిపడి ఉన్న ప్రతి సమస్యనూ శాంతి తోనూ, నిజాయితీ తోనూ, చర్చించి పరిష్కరించడం జరిగితుంది. ఇప్పుడు కూడా దేశం లో ఏ మూలనైనా హింస, అయుధాల ద్వారా సమస్యల కు సమాధానాలు వెతుకుతున్న వారితో ఇవాళ్టి పవిత్రమైన గణతంత్ర దినోత్సవం సందర్భం గా నేను అభ్యర్థించేది ఏమిటంటే, వారంతా జనజీవన స్రవంతి లోకి వెనక్కు రావాలని.
సమస్యల ను శాంతి పూర్వకం గా పరిష్కరించడం లో తమ పైన, ఈ దేశ సామర్థ్యం పైనా నమ్మకం ఉంచాలని కోరుతున్నాను. జ్ఞాన విజ్ఞానాలు, ప్రజాస్వామ్య యుగమైన ఇరవై ఒకటవ శతాబ్దం లో మనం ఉన్నాము. హింస వల్ల జీవితాలు బాగుపడిన ప్రాంతం ఏదైనా ఉందని మీకు తెలుసా అసలు? శాంతి, సద్భావాలు జీవితానికి ఆటంకాలు గా ఉన్న ప్రాంతం గురించి మీరెప్పుడైనా విన్నారా? ఏ సమస్యకూ హింస సమాధానం కాదు. ప్రపంచం లోని ఏ సమస్యకూ మరొక వేరే సమస్య ను పుట్టించడం వల్ల పరిష్కారం లభించదు. సమస్య కు వీలయినన్ని సమాధానాలు వెతకడం వల్ల సమస్యల కు పరిష్కారాలు దొరుకుతాయి. రండి, మనందరమూ కలిసి, అన్ని ప్రశ్నల కూ శాంతిమార్గమే సమాధానం అయ్యేలాంటి నవ భారత నిర్మాణానికి నడుం కడదాం.
ఐకమత్యం ద్వారా ప్రతి సమస్యకూ సమాధానాన్ని ఇచ్చే ప్రయత్నం చేద్దాం. ప్రతి విభజననూ, విభజన ప్రయత్నాల నూ మనలోని సోదరభావం నిర్వీర్యం చేయాలి.
నా ప్రియమైన దేశప్రజలారా, పవిత్ర గణతంత్ర దినోత్సవ సందర్భం గా గగన యాన్ మిశన్ గురించి చెప్పడం నాకు చాలా ఆనందం గా ఉంది. దేశం ఆ వైపుగా ముందుకు అడుగేస్తోంది. 2022 నాటికి మన దేశాని కి స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఈ సందర్భం గా మనం గగన్ యాన్ మిషన్ ద్వారా ఒక భారతీయుడిని అంతరిక్షం లోకి తీసుకువెళ్ళే మన సంకల్పాన్ని సాధించాల్సి ఉంది. 21వ శతాబ్దపు సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో ‘‘గగన్ యాన్’’ భారతదేశాని కి ఒక చారిత్రాత్మక విజయం గా నిలుస్తుంది. ఈ ప్రయోగం భారతదేశానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది.
మిత్రులారా, మీకు తెలిసే ఉంటుంది, ఈ మిశన్ లో వ్యోమగామి అంటే అంతరిక్ష యాత్రికులు గా నలుగురు అభ్యర్థుల ను ఎన్నుకోవడం జరుగుతుంది. ఈ నలుగురు యువ భారతీయ వాయుసేన తాలూకూ పైలెట్లు. ఈ ప్రతిభావంతులైన యువకులు, భారతదేశ నైపుణ్యం, ప్రతిభ, సామర్థ్యం, సాహసం, ఇంకా భారతదేశ స్వప్నాలకూ ప్రతీకలు. మన నలుగురు మిత్రులూ, రాబోయే రోజుల్లో తమ శిక్షణ కోసం రశ్యా వెళ్లబోతున్నారు. భారత్-రశ్యా దేశాల మధ్య మైత్రీభావానికి, సహకారాని కీ ఈ శిక్షణ మరొక సువర్ణావకాశం గా నిలుస్తుందని నాకు నమ్మకం. వీరికి ఒక ఏడాది పైగా శిక్షణ ఇవ్వబడుతుంది. ఆ తర్వాత భారతదేశ ఆశలనూ, ఆకాంక్షల నూ అంతరిక్షం దాకా తీసుకువెళ్ళాల్సిన బృహత్తర బాధ్యత వీరిలో ఒకరిపై ఉంటుంది. నేటి గణతంత్ర దినోత్సవ శుభ సందర్భం లో ఈ నలుగురు యువకుల కూ, ఈ మిశన్ తో ముడిపడిన భారత, రశ్యా దేశపు శాస్త్రవేత్తలను, ఇంజనీర్లను నేను అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశ ప్రజలారా, గత మార్చ్ లో ఒక వీడియో, మీడియా లోనూ, సోషల్ మీడియా లోనూ చర్చనీయాంశం అయ్యింది. చర్చ దేనిపైనంటే, 107 సంవత్సరాల ఒక వయోవృధ్ధురాలు, రాష్ట్రపతి భవన వేడుకల లో ప్రోటోకాల్ ని దాటుకుని వచ్చి ఎలా రాష్ట్రపతి ని ఆశీర్వదించగలదు? కర్నాటక లో వృక్ష మాత పేరు తో ప్రసిధ్ధి చెందిన ఆమె పేరు సాలూమరదా తిమ్మక్క. అవి పద్మ పురస్కారాల వేడుకలు.
చాల సాధారణ నేపథ్యం నుంచి వచ్చిన తిమ్మక్క చేసిన అసాధారణ సేవ ను దేశం గుర్తించి, అర్థం చేసుకుని ఆమె కు తగిన గౌరవాన్ని ఇచ్చింది. ఆమెకు పద్మశ్రీ పురస్కారం లభించింది.
మిత్రులారా, నేడు భారతదేశం ఇటువంటి మహనీయుల ను చూసి గర్వపడుతుంది. భుమితో సంబంధం ఉన్న ఇటువంటి గొప్ప వారిని సన్మానించి దేశం గర్వపడుతుంది. ప్రతి ఏడాది లాగనే, నిన్నటి సాయంత్రం పద్మ పురస్కారాల ప్రకటన జరిగింది. మీరందరూ కూడా ఈ పురస్కార గ్రహీతలు అందరి గురించి తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. వీరందరూ చేసిన సేవా కార్యక్రమాల గురించి మీ కుటుంబం తో చర్చించాలని కోరుతున్నాను. 2020లో పద్మ పురస్కారాల కోసం 46 వేల అభ్యర్థనలు నమోదు అయ్యాయి. 2014తో పోలిస్తే ఈ సంఖ్య 20 రెట్లు కన్నా ఎక్కువే. ఈ సంఖ్య పద్మ పురస్కారాలు ఇప్పుడు people's award గా మారాయన్న ప్రజల నమ్మకాన్ని చూపెడుతుంది. పద్మ పురస్కారాల ప్రక్రియ అంతా ఇప్పుడు ఆన్ లైన్ లోనే జరుగుతోంది. ఇంతకు ముందు కొద్దిమంది ప్రజల చేతుల్లో ఉండే ఈ నిర్ణయాలు ఇప్పుడు పూర్తిగా ప్రజల చేతుల్లో ఉంటున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే, పద్మ పురస్కారాల ను గురించి ఇప్పుడు ప్రజల్లో ఒక కొత్త నమ్మకం, గౌరవం ఏర్పడ్డాయి. ఈ పురస్కారాల ను అందుకునే వ్యక్తులు అందరూ ఎలాంటివారంటే, పరిశ్రమ తోనూ, కష్టం తో పైకి వచ్చినవారు. పరిమిత అవకాశాల తో, చుట్టుపక్కల ఉన్న చీకటి ని చీల్చుకుని ముందుకు నడిచినవారు. ఒక రకం గా చెప్పాలంటే వారి బలమైన ఇఛ్చాశక్తి, సేవా భావన, నిస్వార్థ భావం, మనందరికీ ప్రేరణాదాయకం. పద్మ పురస్కార గ్రహీతలందరి కీ నేను మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. మీరంతా కూడా వీరి గురించి చదివి, వారి గురించి వీలయినంత ఎక్కువ సమాచారాన్ని తెలుసుకోవాల్సింది గా కోరుతున్నాను. వారి జీవితాల గురించిన అసాధారణ కథనాలు సమాజానికి సరైన మార్గం లో ప్రేరణను ఇవ్వగలవు.
నా ప్రియమైన దేశప్రజలారా, మరోసారి గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భం గా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ఈ దశాబ్దం అంతా మీ జీవితాల లో, భారతదేశ చరిత్ర లో కొత్త సంకల్పాలు ఏర్పడాలనీ, అవి నెరవేరాలనీ కోరుతున్నాను.
ప్రపంచం భారతదేశం నుంచి ఏదైతే ఆశిస్తోందో, అవన్నీ సంపూర్ణం చేసుకునే సామర్థ్యం భారతదేశం సంపాదించుకోవాలి. ఇదే నమ్మకం తో రండి, కొత్త దశాబ్దపు ప్రారంభాన్ని ఆహ్వానిద్దాం. కొత్త సంకల్పాల తో, భరతమాత కోసం ఐకమత్యం తో కలసి ఉందాం. అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం.
నా ప్రియదేశవాసులారా! నమస్కారం. 2019 కి వీడ్కోలు ఇచ్చే సమయం ఆసన్నమైంది. మూడు రోజుల లోపలే 2019 వీడ్కోలు పలుకుతుంది, మనము 2020 లో ప్రవేశించడం మాత్రమే కాదు, కొత్త సంవత్సరం లోకి, కొత్త దశాబ్దంలోకి ఇరవై ఒకటో శతాబ్దం లోని మూడవ దశాబ్దం లోకి ప్రవేశిస్తాము. నేను దేశవాసులందరికీ 2020 హార్ధిక శుభాకాంక్షలను అందజేస్తున్నాను. ఈ దశాబ్దానికి సంబంధించినంత వరకు ఒకటి మాత్రం నిజం. ఈ ఇరవై ఒకటో శతాబ్దం లో జన్మించి, ఈ శతాబ్ది యొక్క ముఖ్య విషయాలను అర్థం చేసుకుంటూ పెరుగుతున్న యువజనులే దేశాభివృద్ధి ని వేగవంతం చేయడం లో ముఖ్య పాత్ర వహిస్తారు. ఈ యువకుల ను నేడు రకరకాల పేర్లతో పిలుస్తారు. కొందరు వారిని millennials అంటారు. కొందరు జనరేషన్ z లేక జెన్ z అని కూడా అంటారు. ఒకమాట మాత్రం ప్రజల మనసులో స్థిరమైపోయింది, అదేమిటంటే ఇది సోషల్ మీడియా జనరేషన్ అని. ఈ యువతరం ఎంతో ప్రభావశాలురు అనేది మనకందరికీ అనుభవమైన విషయమే. కొత్తగా ఏదైనా చేయాలని, ప్రత్యేకంగా ఏదైనా చేయాలని వారి కల. వారికి స్వంత అభిప్రాయాలు ఉంటాయి. ఇంకా సంతోషకరమైన విషయం ఏమిటంటే, అదీ ముఖ్యంగా భారతదేశం గురించి నేను చెప్పాలనుకునేదేమిటంటే మనం చూస్తున్న ఈ యువత వ్యవస్థ ను అభిమానిస్తారు. సిస్టమ్ ను ఇష్టపడతారు. అంతే కాదు, వీరు సిస్టమ్ ను అనుసరించడానికి ఇష్టపడతారు. ఎప్పుడైనా సిస్టమ్ సరిగా స్పందించక పోతే అశాంతికి గురి అవడమే కాక ధైర్యంగా సిస్టమ్ ను ప్రశ్నిస్తారు. ఇదే మంచిదని నేను నమ్ముతాను. ఒకమాట నిశ్చయంగా చెప్పవచ్చు. మన దేశ యువతకు అరాచకం అంటే ద్వేషము. అవ్యవస్థ, అస్థిరత ఇవంటే అసలు నచ్చదు. వారు కుటుంబవాదము, జాతివాదము, తన-పర, స్త్రీ-పురుష భేదాలను ఇష్టపడరు. అప్పుడప్పుడూ మనం చూస్తూనే ఉంటాము. విమానాశ్రయం లో కానీ లేదా సినిమా థియేటర్ లలో కానీ వరుస లో నుంచున్న వారి మధ్యలోకి ఎవరైనా ప్రవేశించడానికి ప్రయత్నిస్తే వెంటనే అడ్డుకునేదీ, గొంతెత్తి మాట్లాడి ఆపేదీ యువతే అయి ఉంటుంది. మనము చూశాము, ఇలాంటి సంఘటన ఏదైనా జరిగితే మరొక యువకుడు వెంటనే తమ మొబైల్ ఫోన్ తీసి ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తాడు, చూస్తుండగానే ఆ వీడియో వైరల్ అయిపోతుంది. ఇక తప్పు చేసిన వాడు అయ్యో, ఎంత పని జరిగింది అని అవగాహన చేసుకుంటాడు. కాబట్టి ఒక కొత్త రకమైన వ్యవస్థ, కొత్త యుగము, కొత్త రకమైన ఆలోచన, మన యువతరం ఏర్పరుస్తున్నది. నేడు భారతదేశం ఈ తరం మీద ఆశలు పెట్టుకున్నది. ఈ యువతరం దేశాన్ని కొత్త శిఖరాల మీదకు చేర్చాలి. స్వామి వివేకానందుడు చెప్పాడు –“My faith is in the Younger Generation, the Modern Generation, out of them, will come my workers.” వారన్నారు – ‘‘నా నమ్మకం యువతరం మీద, ఆధునిక తరం మీద, మోడరన్ జెనరేషన్ మీద. వారి నుంచే నా కార్యకర్తలు వస్తారు.” అని నమ్మకంగా చెప్పారు. యువత గురించి మాట్లాడుతూ వారు అన్నారు –“యవ్వనము యొక్క విలువను కొలువజాలము, వర్ణింపజాలము.” ఇది జీవితం లోని అత్యంత అమూల్య దశ. మీ భవిష్యత్, మీ జీవితము మీరు యవ్వన దశను ఎలా ఉపయోగించుకున్నారన్న దాని మీదనే ఆధారపడి ఉంటాయి. వివేకానందుడు చెప్పిన ప్రకారము ఎవరైతే ఎనర్జీ, డైనమిజం తో నిండి ఉంటారో, ఎవరైతే మార్పు తెచ్చే శక్తిని కలిగి ఉంటారో వారే నిజమైన యువకులు. భారతదేశం లో ఈ దశాబ్దం లో యువత యొక్క అభివృద్ధి మాత్రమే కాక యువత యొక్క సామర్థ్యం వల్ల దేశం యొక్క అభివృద్ధి కూడా జరుగుతుందని నాకు పూర్తి నమ్మకముంది. భారతదేశాన్ని ఆధునికం చేయడం లో ఈ తరం పెద్ద పాత్ర ను పోషించనుందని నేను భావిస్తున్నాను. వచ్చే జనవరి 12 వ తేదీన వివేకానంద జయంతి ని దేశము, యువ జన దినోత్సవం గా జరుపుకునేటప్పుడు, ప్రతి యొక్క యువజనత ఈ దశాబ్దం లో తమ బాధ్యత ను గురించి ఆలోచించాలి. ఈ దశాబ్దం కొరకు ఏదైనా ఒక సంకల్పం చేసుకోవాలి.
నా ప్రియ దేశవాసులారా, కన్యాకుమారి లో ఏ రాతి మీద కూర్చొని వివేకానందుడు ధ్యానం చేశాడో అక్కడ వివేకానంద రాక్ మెమోరియల్ ఉందని మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది, దానికి ఇప్పుడు యాభై ఏళ్ళు పూర్తయినాయి. గత ఐదు దశాబ్దాల లో ఈ స్థానం భారత్ కు గర్వకారణం గా నిలిచింది. కన్యాకుమారి దేశాని కి, ప్రపంచాని కి ఆకర్షక కేంద్రమైంది. దేశభక్తి తో పాటు ఆధ్యాత్మిక చైతన్యము అనుభూతి చెందాలనుకొనే ప్రతి ఒక్కరి కీ ఇది ఒక పుణ్యక్షేత్రం గా, భక్తి కేంద్రం గా విలసిల్లింది. స్వామీజీ యొక్క స్మృతి చిహ్నము అన్ని ధర్మముల, అన్ని వయస్సుల, అన్ని వర్గముల ప్రజల కు దేశభక్తి పట్ల ప్రేరకం గా నిలిచింది. ‘దరిద్ర నారాయణుని సేవ’ ఈ మంత్రాన్ని జీవనమార్గం గా చేసుకునేలా చేసింది. అక్కడికి ఎవరు వెళ్ళినా వారి లో శక్తి జాగృతం కావడం, సకారాత్మక భావాలు మేల్కొనడం, దేశం కోసం ఏదైనా చేయాలనే తపన కలగడం ఎంతో సహజమైన విషయం.
గౌరవనీయులైన మన రాష్ట్రపతి గారు కూడా ఈ మధ్యనే యాభై ఏళ్ళ క్రితం నిర్మింపబడిన ఈ రాక్ మెమోరియల్ పర్యటన చేసి వచ్చారు. మరి మన ఉప రాష్ట్రపతి గారు కూడా గుజరాత్ లోని కచ్ లోని రణ్ లో ఒక ఉత్తమ రణోత్సవ్ జరిగే చోటకు ప్రారంభోత్సవాని కి వెళ్ళడం నాకు సంతోషం కలిగించింది. మన రాష్ట్రపతి గారు, ఉప రాష్ట్రపతి గారు కూడా భారత లో ఇటువంటి ముఖ్యమైన పర్యాటక స్థలాల కు వెళ్తున్నారంటే దేశవాసుల కు దీన్నుంచి తప్పకుండా ప్రేరణ లభిస్తుంది-మీరు కూడా తప్పక వెళ్ళండి.
నా ప్రియదేశవాసులారా, మనము వేర్వేరు కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో, బడుల్లో చదువుతాము. కానీ చదువు పూర్తయ్యాక alumni meet ఒక గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఈ అందరు యువకులు కలిసి పాత జ్ఞాపకాల లోకి జారిపోతారు. పది, ఇరవై , ఇరవై ఐదు ఏళ్ళ వెనక్కి వెళ్ళిపోతారు. కానీ, అప్పుడప్పుడూ ఒక alumni meet విశేషం గా ఆకర్షిస్తుంది. దేశవాసుల దృష్టి కూడా అటువైపు మళ్ళడం ఎంతో అవసరం. Alumni meet, నిజానికి పాత మిత్రులతో కలవడం, అన్ని జ్ఞాపకాలను నెమరు వేసుకోవడం, ఆ ఆనందమే వేరు. కానీ దీంతో పాటు ఒక Shared purpose ఉంటే, ఒక సంకల్పం ఉంటే, ఏదైనా అనుభూతి పరమైన సంబంధం ఉంటే అప్పుడిది ఇంకా వన్నెకెక్కుతుంది. మీరు చూసే ఉంటారు, alumni group అప్పుడప్పుడూ తమ స్కూళ్ళ కు ఎంతో కొంత విరాళమిస్తూ ఉంటుంది. కొందరు కంప్యూటరైజ్డ్ చేయడానికి ఏర్పాట్లు చేయిస్తే, కొందరు మంచి గ్రంథాలయం ఏర్పాటు చేయిస్తారు, ఇంకొందరు మంచినీటి సౌకర్యాలను ఏర్పాటు చేయిస్తారు, మరికొందరు అదనపు గదులను నిర్మించడానికి ఏర్పాటు చేయిస్తారు, ఇంకా కొందరు sports complex తయారు చేయిస్తారు. ఏదో ఒకటి చేస్తారు. తమ జీవితం మెరుగు పడిన చోటు ఇది అని ఆయా చోట్లకు కావలసినదేదో తమ జీవితం లో కొంతైనా చేయాలని వారి మనసు లో ఉంటుంది. ఉండాల్సిందే. దీనికోసం ప్రజలు ముందుకొస్తారు. అయితే, నేను ఇప్పుడు ఒక ప్రత్యేక సందర్భాన్ని మీకు చెప్తాను. ఈ మధ్యే మీడియా లో బీహార్ యొక్క పడమటి చంపారణ్ జిల్లాలో భైరవగంజ్ హెల్త్ సెంటర్ యొక్క కథ ను నేను విన్నప్పుడు నాకెంత సంతోషం కలిగిందంటే, మీతో పంచుకోకుండా ఉండలేను. ఈ భైరవ్ గంజ్ హెల్త్ సెంటర్ లో అంటే ఆరోగ్యకేంద్రం లో ఉచితంగా హెల్త్ చెకప్ చేయించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి వేల మంది ప్రజలు చేరుకున్నారు. ఈ మాటలో మీకు ఆశ్చర్యం కలిగించేదేమీ లేదు. మీరనుకోవచ్చు, ఇందులో కొత్త సంగతేముంది? వచ్చుంటారు ప్రజలు అని. కాదండీ, చాలా కొత్త సంగతుంది. ఈ కార్యక్రమము ప్రభుత్వానికి కాదు. ప్రభుత్వం యొక్క initiative కూడా కాదు. ఇది అక్కడి KR High School యొక్క పూర్వ విద్యార్థులది. వారి యొక్క alumni meet దాని ద్వారా తీసుకున్న చర్య ఇది. దీని పేరు ‘సంకల్ప్ ‘Ninety Five.’ ‘సంకల్ప్ Ninety Five’ యొక్క అర్థము – ఆ హైస్కూల్ యొక్క 1995 (నైన్ టీన్ నైన్ టీ ఫైవ్) బాచ్ యొక్క విద్యార్థుల సంకల్పము అని. నిజానికి ఈ బాచ్ విద్యార్థులు ఒక alumni meet పెట్టుకున్నారు, అందులో కొత్తగా ఏదైనా చేద్దామనుకున్నారు. ఈ విద్యార్థులు సమాజం కోసం ఏదైనా చేద్దామని నిశ్చయించారు, పబ్లిక్ హెల్త్ అవేర్ నెస్ పట్ల తమ వంతు బాధ్యత తీసుకున్నారు. ‘సంకల్ప్ Ninety Five’ ఈ ఉద్యమంలో బేతియాలోని ప్రభుత్వ వైద్య కళాశాల, అనేక ఆసుపత్రులు కూడా పాల్గొన్నాయి. ఆ తర్వాత పబ్లిక్ హెల్త్ గురించి ఒక సంపూర్ణ ఉద్యమమే నడిచింది. ఉచిత పరీక్షలు కానివ్వండి, ఉచిత మందుల పంపిణీ కానివ్వండి, అవేర్ నెస్ పెంచడం కానివ్వండి, ‘సంకల్ప్ Ninety Five’ ప్రతి ఒక్కరి కీ ఒక ఉదాహరణగా నిలిచిపోయింది. మనం తరచూ చెప్తుంటాం, దేశం లో ప్రతి పౌరుడు ఒక అడుగు ముందుకు వేస్తే దేశం నూట ముప్పై కోట్ల అడుగులు ముందుకు వేసినట్టేనని. ఇటువంటి మాటలు సమాజం లో ప్రత్యక్ష రూపం లో అమలు కావడం చూస్తున్నపుడు ప్రతి ఒక్కరికీ ఆనందం కలుగుతుంది, సంతోషం కలుగుతుంది. జీవితం లో ఏదైనా కొంత చేయడానికి స్ఫూర్తి కలుగుతుంది. ఒక వైపు బీహార్ లోని బేతియా లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆరోగ్య సేవల గురించి ఉద్యమిస్తే, ఇంకోవైపు ఉత్తర ప్రదేశ్ లోని ఫూల్ పూర్ యొక్క కొందరు మహిళలు తమ ఉత్తేజం తో పూర్తి ప్రాంతానికే స్ఫూర్తిగా నిలిచారు. ఐకమత్యంగా ఒక సంకల్పం చేసుకుంటే పరిస్థితుల ను మార్చడాన్ని ఎవరూ ఆపలేరని ఈ మహిళలు నిరూపించారు. కొంత కాలం క్రిందట ఫుల్ పూర్ లోని మహిళలు ఆర్థిక ఇబ్బందులు మరియు బీదరికం తో బాధపడేవారు. కానీ వీరిలో తమ కుటుంబం మరియు సమాజం కొరకు ఏదైనా చేసి తీరాలన్న పట్టుదల ఉండేది. ఈ మహిళలు కాదీపూర్ స్వయం సహాయ బృందం women self help group తో కలిసి చెప్పులు తయారుచేసే కళను నేర్చుకున్నారు. దీని ద్వారా వారు తమ కాళ్ళల్లో గుచ్చుకున్న బలహీనతలనే ముళ్ళను పెకలించివేయడమే గాక, స్వావలంబన ను సాధించి తమ కుటుంబానికి ఆధారమయ్యారు. గ్రామీణ ఉపాధి మిషన్ యొక్క సహాయం ద్వారా అక్కడ చెప్పులు తయారుచేసే కర్మాగారం కూడా నెలకొల్పబడింది. అక్కడ ఆధునిక యంత్రాల ద్వారా చెప్పులు తయారు చేయబడుతున్నాయి. నేను అక్కడి స్థానిక పోలీసులకు, వారి కుటుంబాలకు కూడా శుభాకాంక్షలు ప్రత్యేకం గా తెలుపుతున్నాను, వారు తమ కోసం, తమ కుటుంబం కోసం, ఈ మహిళల ద్వారా తయారుచేయబడిన చెప్పులను కొని వారిని ప్రోత్సహిస్తున్నారు. నేడు ఈ మహిళల సంకల్పం వారి కుటుంబాల ఆర్థిక స్థితిని బలోపేతం చేయడమే కాక వారి జీవన స్థాయిని కూడా పెంచింది. ఫుల్ పూర్ పోలీసు వారి , వారి కుటుంబాల వారి మాట విన్నప్పుడు మీకు నేను ఎర్రకోట నుంచి 15 ఆగస్ట్ నాడు దేశవాసులను స్థానిక వస్తువుల ను కొనమని చేసిన మనవి గుర్తు వచ్చి ఉంటుంది. నేను నేడు మళ్ళీ ఒకసారి అదే సలహా ఇస్తున్నాను, మనము స్థానిక స్థాయి లో తయారైన వస్తువుల ను ఎందుకు ప్రోత్సహించకూడదు? మన కొనుగోళ్ళలో వారికి ఎందుకు ప్రాధాన్యం ఇవ్వకూడదు? మన లోకల్ ప్రాడక్ట్స్ ను మన గౌరవంగా, ప్రతిష్ట గా ఎందుకు భావించకూడదు? ఈ భావనతో మనము మన తోటి దేశవాసుల సమృద్ధి ని పెంచడానికి మాధ్యమం కాలేమా? సహచరులారా! మహాత్మా గాంధీ ఈ స్వదేశీ భావన ను లక్షలాది ప్రజల జీవితాల ను వెలిగించే జ్యోతి గా భావించారు. అతి బీదవాడి జీవితం లో కూడా సమృద్ధి నిండుతుంది. నూరేళ్ళ మునుపే గాంధీ గారు ఒక ప్రజా ఉద్యమాన్నే ప్రారంభించారు. దీని లక్ష్యం ఒక్కటే – స్థానిక ఉత్పత్తుల ను ప్రోత్సహించడం. స్వావలంబన పొందే ఈ మార్గాన్ని గాంధీజీ చూపించారు. రెండు వేల ఇరవై రెండు (2022) లో మన స్వాతంత్ర్యం పొంది 75 ఏళ్ళు పూర్తవుతాయి. ఏ స్వతంత్ర భారతం లో మనము ఊపిరి పీలుస్తున్నామో ఆ భారతాన్ని స్వతంత్రం చేయడానికి భారత సుపుత్రులు, సుపుత్రికలు, అనేక యాతనల ను అనుభవించారు. అనేకులు తమ ప్రాణాలను ఆహుతి ఇచ్చారు. అనేక ప్రజల త్యాగము, తపస్సు, బలిదానాల వల్ల మనకు స్వాతంత్ర్యం లభించింది. ఏ స్వాతంత్ర్యాన్ని మనం పూర్తిగా ఉపయోగించుకుంటున్నామో, ఏ స్వేచ్ఛా జీవనాన్ని మనం అనుభవిస్తున్నామో, దాని కొరకు జీవితాన్ని పోగోట్టుకున్న వారున్నారు, బహుశా ఎంతో కష్టం మీద మనము చాలా కొద్ది మంది పేర్లనే తెలుసుకోగలమే కానీ, తమ కలల ను, స్వతంత్ర భారతవని కలల ను – సమృద్ధ, సుఖకర, సంపన్న, స్వతంత్ర భారతావని కోసమే ఎంతో మంది త్యాగాలు చేశారు.
నా ప్రియ దేశవాసులారా, 2022 లో స్వాతంత్ర్యానికి 75 ఏళ్ళు పూర్తవుతున్న సందర్భంలో కనీసం ఈ రెండు మూడేళ్ళు మనం స్థానిక ఉత్పత్తులను కొనాలన్న సంకల్పం చేసుకోలేమా? భారత్ లో తయారైన, మన దేశవాసుల స్వహస్తాల తో తయారైన, మన దేశవాసుల స్వేదం పరిమళించే ఈ వస్తువుల ను మనం కొనాలన్న విన్నపం చేయలేమా? నేను దీర్ఘకాలం గురించి చెప్పడం లేదు, కేవలం 2022 వరకు స్వాతంత్ర్యం యొక్క 75 ఏళ్ళు నిండే వరకు. ఈ పని కేవలం ప్రభుత్వాలు కాదు, ప్రతిచోటా యువకులు ముందుకు వచ్చి చిన్న చిన్న సంస్థలు గా ఏర్పడి, ప్రజల కు ప్రేరణ కలిగించి, నచ్చజెప్పి, నిశ్చయింఛేలా చేయండి – రండి మనమంత లోకల్ వి కొందాము, స్థానిక ఉత్పత్తుల కు, దేశవాసుల స్వేద పరిమళాల కు మద్దతు ఇద్దాము – అదే మన స్వతంత్ర భారతం యొక్క స్వర్ణిమ ఘడియగా ఈ కలల ను తోడుగా తీసుకుని మనం నడుద్దాం.
నా ప్రియ దేశవాసులారా, మనందరికీ ఒకటి చాలా ముఖ్యమైనది. దేశం లోని పౌరులు స్వావలంబన సాధించాలి. గౌరవం గా తమ జీవితాన్ని గడపాలి. నా దృష్టిని ఆకర్షించిన ఒక ప్రయత్నం గురించి చర్చించాలనుకుంటున్నాను. అదేమిటంటే, జమ్ము, కశ్మీర్ మరియు లద్దాఖ్ యొక్క హిమాయత్ ప్రోగ్రామ్. హిమాయత్ నిజానికి స్కిల్ డెవలప్ మెంట్ /కౌశల్య అభివృద్ధి మరియు ఉపాధి తో కూడినది. ఇందులో 15 నుంచి 35 వరకూ వయస్సున్న బాలలు, యువకులు పాల్గొంటారు. జమ్ము, కశ్మీర్ లోని చదువు ఏదో కారణం వల్ల పూర్తి చేయలేకపోయినా, మధ్యలో స్కూలు, కాలేజ్ వదిలివేయాల్సిన పరిస్థితి లో ఉన్న వారికోసం.
నా ప్రియదేశవాసులారా, మీకు తెలిస్తే సంతోషిస్తారు. ఈ కార్యక్రమం లో గత రెండేళ్ళలో పద్దెనిమిది వేల యువకుల కు, 77 (seventy seven) వేర్వేరు ట్రేడ్ లలో శిక్షణ ఇవ్వ బడింది. ఇందులో దాదాపు ఐదు వేల మంది ఎక్కడో ఒకచోట ఉద్యోగాలు పొందారు, చాలా మంది స్వయం ఉపాధి లో ముందుకు సాగుతున్నారు. హిమాయత్ ప్రోగ్రామ్ లో తమ జీవితాన్ని మార్చుకున్న ఈ ప్రజల కథలు వింటే నిజంగా హృదయాన్ని కదిలించేవి గా ఉంటాయి.
పర్వీన్ ఫాతిమా, తమిళనాడు లోని తిరుపూర్ లోని ఒక గార్మెంట్ యూనిట్ లో ప్రమోషన్ వచ్చాక సూపర్ వైజర్ కమ్ కోఆర్డినేటర్ అయింది. ఒక సంవత్సరం ముందరి వరకు కార్గిల్ లో ఒక చిన్న ఊళ్ళో ఉండేది. ఈ రోజు ఆమె జీవితం లో ఒక పెద్ద మార్పు వచ్చింది. ఆత్మవిశ్వాసం వచ్చిది- స్వావలంబన సాధింఛింది. తన కుటుంబానికంతా ఆర్థిక పురోగతి కి అవకాశం తీసుకొచ్చింది. పర్వీన్ ఫాతిమా లాగా హిమాయత్ ప్రోగ్రామ్ లేహ్-లద్దాఖ్ క్షేత్రం లోని నివాసులకు, ఇతర బిడ్డల కు తమ అదృష్టాన్ని మార్చివేసింది. ఈరోజు వీళ్ళంతా తమిళనాడు లోని అదే సంస్థ లో పని చేస్తున్నారు. ఇదే విధంగా హిమాయత్ డోడా లోని ఫియాజ్ అహ్మద్ కు కూడా వరమైంది. ఫియాజ్ 2012 లో 12 వ తరగతి పాసయినాడు. కానీ అనారోగ్య కారణం గా తన చదువు కొనసాగించలేకపోయాడు. ఫియాజ్ రెండేళ్ళ వరకూ గుండె జబ్బు తో బాధపడ్డాడు. ఈ లోపల అతని సోదరుడు, ఒక సోదరి మరణించారు. ఒకరకంగా తన కుటుంబం కష్టాల లో కూరుకుపోయింది. చివరికి, హిమాయత్ సహాయం దొరికింది. హిమాయత్ ద్వారా ITES అంటే ‘ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్డ్ సర్వీసెస్’ లో ట్రైనింగ్ దొరికింది. ఇప్పుడు పంజాబ్ లో పని చేస్తున్నాడు.
ఫియాజ్ అహ్మద్ యొక్క గ్రాడ్యుయేషన్ చదువు, దీనితో పాటే మొదలుపెట్టి, ఇప్పుడు దాదాపు పూర్తి చేస్తున్నాడు. ఈ మధ్యలో ఒక హిమాయత్ కార్యక్రమం లో తన అనుభవాలను పంచుకోడానికి పిలిపించారు. తన కథ చెప్తూ ఉండగా అతని కళ్ళ లో నీళ్ళు తిరిగాయి. ఈ విధంగా అనంత నాగ్ లోని రకీబ్-అల్-రహమాన్ ఆర్థిక ఇబ్బందుల తో తన చదువు పూర్తి చేయలేకపోయాడు. ఒకరోజు, రకీబ్ తన బ్లాక్ లో ఒక మొబలైజేషన్ క్యాంప్ ఏర్పాటయినపుడు హిమాయత్ కార్యక్రమం గురించి తెలుసుకున్నాడు. రకీబ్ వెంటనే రీటైల్ టీమ్ లీడర్ కోర్స్ లో చేరాడు. అక్కడ ట్రైనింగ్ పూర్తి అయిన వెంటనే ఒక కార్పొరేట్ హౌస్ లో ఉద్యోగం లో చేరాడు. ‘హిమాయత్ మిషన్’ ద్వారా లాభం పొందిన ప్రతిభావంతులైన అనేక యువకుల కథలు జమ్మూ-కాశ్మీర్ లో పరివర్తన కు ఉదాహరణలు గా నిలుస్తాయి. హిమాయత్ కార్యక్రమము, ప్రభుత్వము, ట్రైనింగ్ పార్ట్నర్, ఉద్యోగం ఇచ్చే కంపెనీలు మరియు జమ్ము, కశ్మీర్ ప్రజల మధ్య ఒక మెరుగైన మేళవింపు ఒక ఆదర్శ ఉదాహరణ.
ఈ కార్యక్రమం జమ్ము, కశ్మీర్ యువకుల లో ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్ని నింపింది మరియు ముందుకు వెళ్ళే దారిని మెరుగు పరచింది.
నా ప్రియదేశవాసులారా, 26 వ తేది ఈ దశాబ్దం లోని చివరి సూర్యగ్రహణం మనం చూశాం. బహుశా సూర్యగ్రహణం యొక్క ఈ సంఘటన వల్ల MY GOV లో రిపున్ ఒక చాలా ఆసక్తికరమైన కామెంట్ వ్రాశారు. వారు ఏమని వ్రాస్తున్నారంటే, “….. నమస్కారం సర్, నా పేరు రిపున్. …నేను నార్త్ ఈస్ట్ వాస్తవ్యుడిని. కానీ ఈ మధ్య సౌత్ లో పని చేస్తున్నాను. నేను ఒక సంగతి షేర్ చేయాలనుకుంటున్నాను. నాకు గుర్తుంది. మా ప్రాంతం లో ఆకాశం స్వచ్ఛం గా ఉండడం వల్ల మేము గంటల తరబడి ఆకాశం లోని చుక్కల ను తదేకంగా చూస్తుండేవాళ్ళము. Star gazing నాకు చాలా ఇష్టమైనది. నేను ఇప్పుడు ఒక ప్రొఫెషనల్ ను. నా దిన చర్య వలన నేను ఇప్పుడు వీటికి సమయం ఇవ్వలేకపోతున్నాను. … మీరు దీని గురించి ఏమైనా చెప్పగలరా? ముఖ్యంగా astronomy గురించి యువతలో ఎలా ప్రచారం చేయవచ్చు?”
నా ప్రియదేశవాసులారా! నాకు ఎన్నో సూచనలు వస్తూ ఉంటాయి. కానీ, ఇటువంటి సూచన బహుశా మొదటి సారి వచ్చింది. ఆ విధం గా విజ్ఞానం యొక్క అనేక కోణాల గురించి మాట్లాడే అవకాశం దొరికింది. ముఖ్యం గా యువతరం యొక్క కోరిక మీద నేను మాట్లాడే అవకాశం దొరికింది. కానీ, ఇంతవరకు ఈ విషయం అలా ఉండిపోయింది. ఇప్పుడు 26 వ తేది సూర్యగ్రహణం వచ్చింది కాబట్టి, మీకు కొద్దిగా ఆసక్తి ఏర్పడి ఉంటుంది. దేశవాసులందరిలా, ముఖ్యంగా నా యువ సహచరుల వలెనే నేను కూడా 26 వ తేది సూర్యగ్రహణం మీద ఉత్సాహంతో ఉన్నాను. నేను కూడా చూడాలనుకున్నాను. కానీ ఆ రోజు దిల్లీలో మబ్బు పట్టి ఉండడంతో ఆ ఆనందం దొరకలేదని చింతించినా, టీవిలో కోఝీకోడ్ మరియు భారత్ లోని ఇతర ప్రదేశాల లోని సూర్యగ్రహణం యొక్క అందమైన దృశ్యాలు చూశాను. సూర్యుడు వెలుగుతున్న ring ఆకారంలో కనిపించాడు. నాకు ఆరోజు ఈ విషయానికి సంబంధించిన experts తో మాట్లాడే అవకాశం కూడా లభించింది. వాళ్ళు చెప్పారు, ఇలా ఎందుకు జరుగుతుందంటే చంద్రుడు భూమికి చాలా దూరంలో ఉండడం వల్ల ఆ ఆకారం పూర్తిగా సూర్యుడిని కప్పలేకపోతుంది. అందుకే ఒక ring ఆకారంలో కనిపిస్తుంది. ఈ సూర్యగ్రహణం ఒక annular solar eclipse దీనినే వలయ గ్రహణం లేదా కుండల గ్రహణం అని కూడా అంటారు. ఈ గ్రహణం మనకు గుర్తు చేస్తుంది, మనము భూమి మీద ఉండి అంతరిక్షం లో తిరుగుతున్నాము అని. అంతరిక్షంలో సూర్యుడు, చంద్రుడు, మరియు అన్య గ్రహాలు, ఖగోళ పిండాలు తిరుగుతూ ఉంటాయి. చంద్రుని నీడ వలన మనకు గ్రహణం రకరకాలుగా కనిపిస్తుంది. సహచరులారా, భారతంలో astronomy అంటే ఖగోళ విజ్ఞానానికి చాలా ప్రాచీన గౌరవ ప్రదమైన చరిత్ర ఉంది. ఆకాశంలో మెరిసే నక్షత్రాలతో మన సంబంధం మన సంస్కృతి అంత ప్రాచీనమైనది. మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. భారతం లో వేర్వేరు స్థానాల లో ఎన్నో భవ్యమైన జంతర్-మంతర్ లు చూడదగ్గవి ఉన్నాయి. ఈ జంతర్-మంతర్ లకు astronomy తో ప్రగాఢ సంబంధం ఉంది. ఆర్యభట్టు మహాశయుని విలక్షణ ప్రతిభ గురించి తెలీని వాళ్ళెవరు? తన కాలక్రియ లో వారు సూర్యగ్రహణం గురించీ, చంద్రగ్రహణం గురించి విస్తృతం గా వ్యాఖ్యానం చేశారు. అది కూడా philosophical మరియు mathematical రెండు కోణాల నుంచీ కూడా. వారు mathematically భూమి యొక్క నీడ లేదా shadow సైజ్ ను ఎలా లెక్కిస్తారు అని చెప్పారు. వారు గ్రహణం యొక్క కాల వ్యవధి మరియు extent ను calculate చేసే పద్ధతుల ను వివరం గా చెప్పారు. భాస్కరుడు వంటి వారి శిష్యులు ఈ spirit ను, ఈ knowledge ను ముందుకు తీసుకువెళ్ళే ప్రయత్నం పూర్తిగా చేశారు. తర్వాత పధ్నాలుగు-పదిహేనవ శతాబ్దం లో కేరళ లో సంగం గ్రామాని కి చెందిన మాధవుడు ఉండేవారు. వీరు బ్రహ్మాండం లో ఉన్న గ్రహాల స్థితి ని లెక్కించడానికి calculus ను ఉపయోగించారు. రాత్రి కనిపించే ఆకాశం, కేవలం ఆసక్తి ని రేకెత్తించేదే కాదు, గణిత దృష్టి తో ఆలోచించేవారికి, వైజ్ఞానికుల కు ఒక ముఖ్యమైన source గా ఉండేది. కొన్నేళ్ళ క్రిందట నేను ‘Pre-Modern Kutchi (కచ్ఛీ) Navigation Techniques and Voyages’ అనే పుస్తకాన్ని విడుదల చేశాను. ఈ పుస్తకం ఒకరకంగా ‘మాలమ్(maalam) యొక్క డైరీ’ . మాలమ్ అనే వ్యక్తి, నావికుని రూపం లో తన అనుభవాలను తన పద్ధతి లో డైరీగా వ్రాసుకున్నాడు. ఆధునిక యుగం లో ఆ మాలమ్ యొక్క పోథీ అది కూడా గుజరాతీ పాండులిపుల సంకలనము. అందులో ప్రాచీన Navigation technology యొక్క వర్ణన ఉంటుంది. ‘మాలమ్ నీ పోథీ’ లో అనేక మార్లు ఆకాశము, నక్షత్రాలు, నక్షత్రగతుల వర్ణన ఉంటుంది. సముద్ర యాత్ర చేసే సమయం లో నక్షత్రాల ద్వారానే దిశానిర్దేశం జరుగుతుందని అందులో స్పష్టం గా చెప్పబడింది. Destination చేరే దారి నక్షత్రాలే చూపిస్తాయి.
నా ప్రియ దేశవాసులారా, Astronomy రంగం లో భారతదేశం ఎంతో ముందుంది. మన initiatives, path breaking కూడా. మన దగ్గర పూనే లో విశాలమైన Meter Wave Telescope ఉంది. అంతే కాదు, కొడైకెనాల్, ఉదగమండలం, గురుశిఖర్ మరియు హాన్లే లదాఖ్ లలో కూడా పవర్ ఫుల్ టెలిస్కోప్ లు ఉన్నాయి. 2016 లో నాటి బెల్జియమ్ ప్రధాన మంత్రి మరియు నేను నైనిటాల్ లోని 3.6 మీటర్ దేవస్థల optical telescope ను ప్రారంబించాము. ఇది ఆసియా లోనే అతి పెద్ద టెలిస్కోప్ అంటారు. ISRO దగ్గర ASTROSAT అనబడే ఒక Astronomical satellite ఉంది. సూర్యుని గురించి రీసెర్చ్ చేయడానికి ISRO ‘ఆదిత్య’ పేరుతో ఒక వేరే satellite ను కూడా లాంచ్ చేయబోతోంది. ఖగోళ విజ్ఞానాని కి సంబంధించిన మన ప్రాచీన విజ్ఞానం గానీ, నవీన ఉపకరణాలు గానీ వీటి గురించి మనం తెలుసుకోవాలి, గర్వపడాలి. మన యువ వైజ్ఞానికుల లో మన వైజ్ఞానిక చరిత్ర మీద ఆసక్తితో పాటు, astronomy యొక్క భవిష్యత్ గురించి ఒక దృఢమైన ఇచ్ఛాశక్తి కూడా కనిపిస్తుంది.
మన దేశం యొక్క Planetarium, Night sky ని అర్థం చేసుకోవడం తో పాటు Star Gazing ను ఒక అభిరుచి గా వికసింప చేయడానికి motivate చేస్తుంది. ఎంతోమంది Amateur telescope లను బాల్కనీలలో, డాబాల మీద పెట్టుకుంటారు. Star Gazing తో Rural Camps మరియు Rural Picnic లకు కూడా ప్రోత్సాహం లభిస్తుంది. ఇంకా ఎన్నో స్కూల్-కాలేజ్ లు కూడా Astronomy club లను ఏర్పాటు చేస్తారు. ఈ ప్రయోగాలను ముందుకు తీసుకెళ్ళాలి.
నా ప్రియదేశవాసులారా, మన పార్లమెంట్ ప్రజాస్వామ్యమందిరం అని మనకు తెలుసు. నేను ఈరోజు ఒక మాట ఎంతో గర్వం తో చెప్పాలనుకుంటున్నాను, మీరు ఎన్నుకొని పంపించిన ప్రతినిధులు గత 60 ఏళ్ళ రికార్డ్ ను బద్దలు కొట్టారు. గత ఆరునెల్లలో 17 వ లోక్ సభ యొక్క రెండు సమావేశాలు ఎంతో productive గా ఉన్నాయి. లోక్ సభ అయితే 114% పని చేసింది. రాజ్యసభ 94% పని చేసింది. ఇంతకు ముందు బడ్జెట్ సమావేశాల్లో 135 శాతము పని చేసింది. రాత్రులు పొద్దు పోయేవరకూ పార్లమెంట్ నడుస్తూనే ఉంది. నేనెందుకు చెప్తున్నానంటే పార్లమెంట్ సభ్యులందరూ ఈ విషయంలో అభినందనకు పాత్రులు, ప్రశంసకు యోగ్యులు. మీరు ఏ జన ప్రతినిధుల ను పంపించారో వారు అరవయ్యేళ్ళ రికార్డ్ లను బద్దలు కొట్టారు. ఇంత పని జరగడము భారత్ యొక్క ప్రజాస్వామ్యపు శక్తి ని, ప్రజాస్వామ్యం పట్ల నమ్మకాన్ని పరిచయం చేస్తుంది. నేను రెండు సభల సభాధ్యక్షుల కు, అన్ని రాజకీయ పార్టీల కు, అందరు సభ్యుల కు ఈ చురుకైన పాత్రకై ఈ సందర్భం గా అనేకానేక అభినందనల ను తెలియ చేస్తున్నను.
నా ప్రియదేశవాసులారా, సూర్యుడు, భూమి, చంద్రుని గతులు కేవలం గ్రహణాన్ని నిర్ణయించడం మాత్రమే కాదు, ఇంకా చాలా విషయాల తో ముడిపడి ఉన్నాయి. సూర్య గతి ని బట్టి జనవరి మధ్య లో భారతమంతటా భిన్న ప్రకారములైన పండుగలు చేసుకుంటారని మనకందరి కీ తెలుసు. పంజాబ్ నుంచి తమిళనాడు వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ప్రజలు అనేక పండుగల ను జరుపుకుంటారు. జనవరి లో ఎంతో గొప్పగా మకర సంక్రాంతి, ఉత్తరాయణం చేసుకుంటారు. వీటిని శక్తి ప్రతీకలు గా నమ్ముతారు. ఈ కాలం లో పంజాబ్ లో లోహడీ, తమిళనాడు లో పొంగల్, అసమ్ లో మాఘ్-బిహూ జరుపుకుంటారు. ఈ పండుగలు రైతుల సమృద్ధి మరియు పంటలతో ఎంతో దగ్గరగా ముడిపడి ఉన్నాయి. ఈ పండుగలు మనకు భారత్ యొక్క ఐక్యత మరియు వివిధతల గురించి గుర్తు చేస్తాయి. పొంగల్ యొక్క చివరి రోజు గొప్పవారైన తిరువళ్ళువర్ జయంతి ని జరుపుకునే అదృష్టం మన దేశవాసుల కు లభిస్తుంది. ఆ రోజు గొప్ప రచయిత, చింతనాపరుడు సంత్ తిరువళ్ళువర్ కు వారి జీవితాని కి అంకితం చేయబడుతుంది.
నా ప్రియ దేశవాసులారా, 2019 లో ఇది చివరి ‘మన్ కీ బాత్’. 2020 లో మళ్ళీ కలుద్దాం. కొత్త సంవత్సరం, కొత్త దశాబ్దం, కొత్త సంకల్పం, కొత్త శక్తి, కొత్త ఉల్లాసం, కొత్త ఉత్సాహం తో రండి, ముందుకు పోదాం. సంకల్పము ను పూర్తి చేయడానికి సామర్థ్యాన్ని ప్రోది చెసుకుంటూ పోదాం. చాలా దూరం నడవాలి, చాలా చేయాలి, దేశాన్ని కొత్త శిఖరాల మీదకు చేర్చాలి. 130 కోట్ల దేశవాసుల ప్రయత్నం మీద, వారి సామర్థ్యము మీద, వారి సంకల్పము మీద, అపారమైన గౌరవం తో రండి, ముందుకు పోదాం.
అనేకానేక ధన్యవాదాలు,
అనేకానేక శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశప్రజలారా,
‘మన్ కీ బాత్’ లోకి మీ అందరికీ స్వాగతం. ఇవాళ్టి ‘మన్ కీ బాత్’ దేశ యువత కోసం. స్నేహశీలత, దేశభక్తి కల యువత కోసం. సేవాతత్పరత కలిగిన యువతరం కోసం. మీకు తెలుసు కదా, ప్రతి ఏడాదీ నవంబరు నెలలోని నాలుగవ ఆదివారాన్ని NCC Day గా మనం జరుపుకుంటాము. సాధారణంగా మన యువతకి స్నేహితుల దినోత్సవం బాగా గుర్తు ఉంటుంది. కానీ NCC Day ని గుర్తుపెట్టుకునేవారు కూదా చాలా మందే ఉన్నారు. రండి, ఇవాళ మనం NCC గురించి కబుర్లు చెప్పుకుందాం. తద్వారా నాకు కూడా కొన్ని గతరోజుల జ్ఞాపకాలు గుర్తుకుతెచ్చుకునే అవకాశం లభిస్తుంది. ముందుగా NCC లోని ప్రస్తుత, పూర్వ కేడేట్లకి నా అనేకానేక శుభాకాంక్షలు. ఎందుకంటే నేను కూడా మీలాగనే ఒకప్పుడు NCC కేడెట్ నే. ఇవాళ్టికీ మనసులో నన్ను నేను ఒక కేడెట్ లాగే భావించుకుంటాను. NCC అంటే National Cadet Corps అని అందరికీ తెలుసిన విషయమే. ప్రపంచంలో అతిపెద్ద uniformed youth organizations అన్నింటిలోనూ, మన భారతదేశం లోని NCC ఒకటి. ఇది ఒక Tri-service Organization. ఇందులో మన సాయుధదళాలు, జల, వాయు సేనలు మూడూ కలిసి ఉంటాయి. నాయకత్వం, దేశభక్తి, నిస్వార్థ సేవ, క్రమశిక్షణ, కఠోర పరిశ్రమ, మొదలైన సద్గుణాలను తమ స్వభావంలో భాగంగా మార్చుకుని, వీటిని తమ అలవాట్లుగా మార్చుకునే అద్భుత ప్రయాణం పేరే NCC ! ఈ యాత్రను గురించి మరిన్ని కబుర్లు ఇవాళ మనతో ఫోన్లో చెప్పుకుందుకు, NCC లో తమదైన స్థానాన్ని సంపాదించుకున్న కొందరు యువత తయారుగా ఉన్నారు. రండి వారితో మాట్లాడదాం.
ప్రధాన మంత్రి: మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు?
తరన్నుమ్ ఖాన్( lady): జైహింద్ ప్రధాన మంత్రి గారూ.
ప్రధాన మంత్రి: జైహింద్.
తరన్నుమ్ ఖాన్: సార్, నా పేరు junior under officer తరన్నుమ్ ఖాన్.
ప్రధాన మంత్రి: తరన్నుమ్ మీది ఏ ప్రాంతం?
తరన్నుమ్ ఖాన్: నేను ఢిల్లీ నివాసిని సర్.
ప్రధాన మంత్రి: ఓహో. NCC లో ఎప్పటి నుండి ఉన్నారు? మీ అనుభవాలు ఏమిటి?
తరన్నుమ్ ఖాన్: సర్ నేను NCC లో 2017 నుండి ఉన్నాను. ఈ మూడేళ్ళూ కూడా నా జీవితంలో అత్యంత ఉత్తమమైనవి.
ప్రధాన మంత్రి: ఇది వినడానికి చాలా సంతోషంగా ఉంది.
తరన్నుమ్ ఖాన్: సర్, నేను అనుభూతి చెందిన అత్యంత ఉత్తమమైన అనుభవాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. అది “ఏక్ భారత్- శ్రేష్ఠ భారత్” కేంప్. ఆగస్టు లో జరిగిన ఆ కేంప్ కి NER ‘North Eastern Region’ తాలూకూ పిల్లలు కూడా వచ్చారు. వారితో మేము పది రోజుల పాటు ఆ కేంప్ లో ఉన్నాము. తద్వారా మేము వారి జీవన విధానము, వారి భాష తెలుసుకున్నాము. వారి సంప్రదాయము, వారి సంస్కృతి గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాము. vaizome అంటే హలో అని, అలాంటివి. కల్చరల్ నైట్ జరిగినప్పుడు వారి నృత్య విధానాలనీ వాటినీ నేర్చుకున్నాము. వారి నృత్యాన్ని తెహ్రా అంటారు. వారు నాకు మెఖేలా వేసుకోవడం కూడా నేర్పించారు. ఆ దుస్తులలో మేమందరమూ ఎంతా బాగున్నామో. ఢీల్లీ, నాగాలాండ్ ప్రాంతాలకు చెందిన మిత్రులు, మేమందరమూ కూడా చాలా బాగున్నాము. వారికి మేము ఢిల్లీ కూడా చూపెట్టాము. ఢిల్లీలో వాళ్ళకి నేషనల్ వార్ మెమోరియల్ నూ, ఇండియా గేట్ నూ చూపెట్టాము. అక్కడ వాళ్లకి మేము ఢిల్లీ ఛాట్ , భేల్ పురీ రుచులను చూపెట్టాము కూడా. వాళ్ళు ఎక్కువగా సూప్స్, ఉడికించిన కూరలు తింటారు కాబట్టి మా రుచులు వారికి కారంగా అనిపించాయి. మన రుచులు వాళ్ళకి పెద్దగా నచ్చలేదు కానీ మేమందరమూ కలిసి బోలెడు ఫోటోలు తీసుకున్నాము. ఎన్నో అనుభవాలను పంచుకున్నాము.
ప్రధాన మంత్రి: మీరు వాళ్ళందరితో కాంటాక్ట్ లోనే ఉన్నారా?
తరన్నుమ్ ఖాన్: ఔను సర్. మేము వారితో మా స్నేహం కొనసాగుతోంది.
ప్రధాన మంత్రి: మంచి పని చేసారు.
తరన్నుమ్ ఖాన్: ఔను సర్.
ప్రధాన మంత్రి: మీ తర్వాత ఇంకా ఎవరున్నారు మాట్లాడేవారు..
జి.వి.శ్రీహరి: జై హింద్ సర్
ప్రధాన మంత్రి: జైహింద్
జి.వి.శ్రీహరి: నేను సీనియర్ అండర్ ఆఫీసర్ జి.వి. శ్రీహరి ని మాట్లాడుతున్నాను. సర్. నేను కర్నాటక లోని బెంగుళూరు నుంచి వచ్చాను.
ప్రధాన మంత్రి: మీరు ఎక్కడ చదువుకుంటున్నారు.
జి.వి.శ్రీహరి: బెంగుళూరు లోని Kristu Jayanti College లో సర్
ప్రధాన మంత్రి: ఓహో, బెంగుళూరు లోనేనా
జి.వి.శ్రీహరి: అవును సర్.
ప్రధాన మంత్రి: చెప్పండి.
జి.వి.శ్రీహరి: నేను సింగపూర్ లో జరిగిన యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ కి హాజరై, నిన్ననే వచ్చాను సర్ .
ప్రధాన మంత్రి: భలే!
జి.వి.శ్రీహరి: అవును సర్
ప్రధాన మంత్రి: అయితే మీకు సింగపూర్ వెళ్ళే అవకాశం లభించిందన్నమాట.
జి.వి.శ్రీహరి: అవును సర్.
ప్రధాన మంత్రి: అయితే సింగపూర్ అనుభవాలు చెప్పండి –
జి.వి.శ్రీహరి: అక్కడ కేంప్ కి యునైటెట్ కింగ్ డమ్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, సింగపూర్, హాంగ్ కాంగ్, ఇంకా Nepal మొదలైన ఆరు దేశాల నుండి కేడెట్స్ వచ్చారు. అక్కడ మాకు combat lessons, International Military exercises మొదలైనవాటిని exchange చేసుకునే అవకాశం లభించింది. అక్కడ మా ప్రదర్శన కొంత భిన్నంగానే జరిగింది సర్. అక్కడ మాకు water sports, ఇంకా ఎన్నో సాహస కార్యకలాపాలు నేర్చుకునే అవకాశం లభించింది. అక్కడ జరిగిన water polo tournament లో భారతీయ జట్టుకి విజయం లభించింది సర్. అక్కడ జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలన్నింటిలోనూ మేము పాల్గొన్నాము సర్. అక్కడి వారికి మా డ్రిల్, మా word of command బాగా నచ్చాయి సర్.
ప్రధా నమంత్రి: హరీ, మీరు ఎంతమంది వెళ్లారు?
జి.వి.శ్రీహరి: ఇరవై మంది సర్. పది మంది అబ్బాయిలం, పది మంది అమ్మాయిలు.
ప్రధాన మంత్రి: వీరంతా భారతదేశం లోని వివిధ ప్రాంతాలకు చెందిన వారేనా?
జి.వి.శ్రీహరి: అవును సర్.
ప్రధానమంత్రి: బావుంది. మీ అనుభవాలను వినడానికి మీ మిత్రులందరూ ఆత్రంగా ఉండి ఉంటారు.
ఇంకా ఎవరున్నారు మాట్లాడేవారు –
వినోలే కిసో : జైహింద్ సర్.
ప్రధాన మంత్రి: జైహింద్.
వినోలే కిసో : నా పేరు వినోలే కిసో సర్. నేను సీనియర్ అండర్ ఆఫీసర్ ని . నేను north eastern region కి చెందిన నాగాలాండ్ నుంచి వచ్చాను సర్.
ప్రధాన మంత్రి: వినోలే, మీ అనుభవాలేమిటో చెప్పండి.
వినోలే కిసో : సర్ , నేను St. Joseph’s college, Jakhama ( Autonomous) లో B.A. History (Honours) చదువుతున్నాను. నేను 2017లో NCC లో చేరాను. అది నా జీవితంలోకెల్లా అత్యంత మంచి నిర్ణయం సర్.
ప్రధాన మంత్రి: NCCలో చేరడం వల్ల మీకు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళే అవకాశం అభించింది?
వినోలే కిసో : నేను NCCలో చేరాకా ఎంతో నేర్చుకున్నాను. నాకు అవకాశాలు కూడా బాగానే వచ్చాయి. ఒక అనుభవాన్ని మీతో పంచుకుంటాను. నేను ఈ 2019, జూన్ నెలలో ఒక కేంప్ కి వెళ్ళాను. దాని పేరు Combined Annual Training Camp. kohima లోని Sazolie college లో అది జరిగింది. ఆ కేంప్ కి 400 మంది cadets హాజరైయ్యారు.
ప్రధాన మంత్రి: అయితే, మీ నాగాలాండ్ ప్రజలంతా మీ అనుభవాలను తెలుసుకోవాలనుకుంటారు కదా. భారతదేశం లో ఎక్కడికి వెళ్ళావో, ఏమేమి చూశావో, నీ అనుభవాలను మా అందరితో పంచుకుంటావా?
వినోలే కిసో : తప్పకుండా చెప్తాను సర్.
ప్రధాన మంత్రి: సరే! మీతో ఇంకా ఎవరున్నారు?
అఖిల్: జైహింద్ సర్. నా పేరు జూనియర్ అండర్ ఆఫీసర్ అఖిల్ సర్.
ప్రధాన మంత్రి: అఖిల్, చెప్పండి.
అఖిల్: హరియాణా కు చెందిన రోహ్తక్ నుంది వచ్చాను సర్ నేను.
ప్రధాన మంత్రి: ఓహో
అఖిల్: నేను ఢిల్లీ యూనివర్సిటీ కి చెందిన దయాల్ సింగ్ కాలేజీ నుండి వచ్చాను సర్. నేను ఫిజిక్స్ ఆనర్స్ చదువుతున్నాను సర్.
ప్రధాన మంత్రి: ఓహో.
అఖిల్: సర్, నాకు ఎన్.సి.సి లో అన్నింటికన్నా క్రమశిక్షణ బాగా నచ్చింది సర్
ప్రధాన మంత్రి: ఆహా!
అఖిల్: ఆ క్రమశిక్షణే నన్ను మరింత బాధ్యతాయుతమైన పౌరుడిగా తీర్చిదిద్దింది సర్. ఎన్.సి.సి కేడెట్ లతో చేయించే డ్రిల్, వారి యూనిఫారమ్ నాకు బాగా ఇష్టం సర్.
ప్రధాన మంత్రి: ఎన్ని కేంప్స్ లో పాల్గొన్నావు? ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళావు?
అఖిల్: నేను మూడు కేంప్ లకు హాజరయ్యాను సర్. నేను ఈమధ్యనే డేహ్రాడూన్ లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ లో పాల్గొని వచ్చాను సర్.
ప్రధాన మంత్రి: ఎన్ని రోజుల క్యాంప్ అది?
అఖిల్ : అది పదమూడు రోజుల క్యాంప్ సర్
ప్రధాన మంత్రి: ఓహో.
అఖిల్: భారతీయ సేనలో ఆఫీసర్ ఎలా అవుతారో అక్కడ నేను చూశాను సర్. ఆ తర్వాత నుండీ భారతీయ సేనలో ఆఫీసర్ అవ్వాలనే కోరిక, సంకల్పం ఇంకా దృఢంగా మారాయి సర్.
ప్రధాన మంత్రి: చాలా మంచిది.
అఖిల్: రిపబ్లిక్ డే పెరేడ్ లో కూడా నేను పాల్గొన్నాను సర్.
ప్రధాన మంత్రి: శభాష్!
అఖిల్: నాకన్నా ఎక్కువ మా అమ్మ చాలా సంతోషించింది సర్. తెల్లవారుజామున రెండింటికి లేచి మేము రాజ్ పథ్ లో పెరేడ్ చేయడానికి వెళ్ళేప్పుడు మేమంతా ఎంతో ఉత్సాహంగా ఉండేవాళ్ళం. మిగిలిన దళాలవారు మమ్మల్ని ఎంతగా ప్రోత్సహించారంటే, రాజ్ పథ్ లో మేము మార్చ్ చేస్తూంటే మా వెంట్రుకలు నిక్కబొడుచుకునేవి సర్.
ప్రధాన మంత్రి: మీ నలుగురితో మాట్లాడే అవకాశం లభించినందుకు ఆనందం గా ఉంది. అది కూడా NCC Day నాడు. ఇది నాకు ఎంతో సంతోషకరమైన విషయం. ఎందుకంటే నేను కూడా చిన్నప్పుడు మా గ్రామం లోని పాఠశాల లో NCC కేడెట్ గా ఉన్నాను. ఈ క్రమశిక్షణ, ఈ యూనిఫారమ్, వాటి వల్ల పెరిగే మానసిక స్థైర్యం, ఇవన్నీ కూడా ఒక NCC కేడెట్ గా నాకు చిన్నప్పుడు అనుభవమే.
వినోలే: ప్రధాన మంత్రి గారూ, నాదొక ప్రశ్న
ప్రధాన మంత్రి: ఆ..అడగండి
తరన్నుమ్: మీరు కూడా NCC లో భాగంగా ఉన్నానంటున్నారు కదా..
ప్రధాన మంత్రి: ఎవరు? వినోలే నేనా మాట్లాడుతున్నది?
వినోలే: అవును సర్, నేనే
ప్రధా నమంత్రి: ఆ, వినోలే చెప్పండి.
వినోలే: మీకు ఎప్పుడైనా దండన (punishment) లభించిందా?
ప్రధాన మంత్రి: (నవ్వుతూ) అంటే మీకు అప్పుడప్పుడూ దండన(punishment) లభిస్తూ ఉంటుందా?
వినోలే : అవును సర్.
ప్రధాన మంత్రి: లేదు. నాకెప్పుడూ ఆ పరిస్థితి రాలేదు. ఎందుకంటే నేను మొదటి నుండి క్రమశిక్షణ ను నమ్మే వ్యక్తి ని. కానీ ఒకసారి ఒక అపార్థం జరిగింది. మేము ఒక కేంప్ కి వెళ్లినప్పుడు నేను ఒక చెట్టు ఎక్కాను. అందరూ నేను తప్పు చేశాను, నాకు శిక్ష పడుతుందనే భావించారు. కానీ తర్వాత, గాలిపటం దారానికి చిక్కుకున్న ఒక చిన్న పక్షిని రక్షించడానికి నేను ఆ చెట్టు ఎక్కానని, ఆ పక్షిని విడిపించినప్పుడు అందరికీ అర్థమైంది. అందరూ నన్ను అభినందించారు. ఇలాంటి ఒక చిత్రమైన అనుభవం నాకు ఎదురైంది.
తరన్నుమ్ ఖాన్: మీ అనుభవాన్ని తెలుసుకోవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది సర్.
ప్రధాన మంత్రి: ధన్యవాదాలు
తరన్నుమ్ ఖాన్: నేను తరన్నుమ్ ని మాట్లాడుతున్నాను సర్.
ప్రధాన మంత్రి: ఆ..చెప్పండి చెప్పండి.
తరన్నుమ్ ఖాన్: సర్, ప్రతి భారతీయ పౌరుడినీ రాబోయే మూడేళ్ళలో దేశంలోని పదిహేను ప్రదేశాలకు వెళ్లవలసిందని మీ సందేశంలో మీరు చెప్పారు కదా. మేము ఎటువంటి ప్రదేశానికి వెళ్ళాలో మీరు కొంచెం చెప్పగలరా? అన్నింటికన్నా ఏ ప్రదేశం మీకు బాగా నచ్చిందో కూడా చెప్పగలరా?
ప్రధాన మంత్రి: నేను ఎప్పుడూ హిమాలయ ప్రాంతాన్ని బాగా ఇష్టపడతాను.
తరన్నుమ్ ఖాన్: ఓహో..
ప్రధాన మంత్రి: అయినా నా ఇష్టాన్ని పక్కనపెడితే, నేను భారతీయులను కోరేది ఏమిటంటే, మీకు ప్రకృతి పై ప్రేమ గనుక ఉంటే, దట్టమైన అడవులను, జలపాతాలను, ఇంకా భిన్నమైన ప్రదేశాలను చూడాలని ఉంటే, మీరు తప్పకుండా ఈశాన్య భారతదేశానికి(North East) వెళ్ళవలసిందని నా విన్నపం.
తరన్నుమ్: అలాగే సర్.
ప్రధాన మంత్రి: నేను ఎప్పుడూ ఇదే చెప్తూంటాను. ఇందువల్ల ఈశాన్య భారత ప్రదేశాల లో టూరిజం పెరుగుతుంది. ఆ ప్రాంతాల ఎకానమీకి చాలా లాభదాయకం. ఇందువల్ల “ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్” అనే స్వప్నం కూడా మరింత శక్తిమంతమవుతుంది.
తరన్నుమ్ ఖాన్: అవును సర్.
ప్రధాన మంత్రి: కానీ, యావత్ భారతదేశం లో ప్రతి ప్రాంతం లోనూ చాలా చూడవలసిన ప్రదేశాలు ఉన్నాయి. తెలుసుకోవలసిన విషయాలు ఉన్నాయి. ఒకరకంగా చెప్పాలంటే ఆత్మను స్పృశించే ప్రాంతాలు ఉన్నాయి.
జి.వి. శ్రీహరి: ప్రధాన మంత్రి గారూ, నేను శ్రీహరి ని మాట్లాడుతున్నాను.
ప్రధాన మంత్రి : హరీ, చెప్పండి.
జి.వి. శ్రీహరి: మీరు ఒక రాజకీయ నాయకుడు కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు? అని మిమ్మల్ని అడగాలనుకున్నాను సర్.
ప్రధాన మంత్రి : ఇది చాలా కష్టమైన ప్రశ్న. ఎందుకంటే ప్రతి పిల్లవాడి జీవితంలోనూ ఎన్నో మజిలీలు వస్తాయి.
ఒకసారి ఏదో అవ్వాలనిపిస్తుంది. మరోసారి మరొకటి అవ్వాలనిపిస్తుంది. నాకు రాజకీయాలలోకి రావాలని ఆసక్తి ఎప్పుడూ లేదు. అలా ఎప్పుడూ అనుకోనూ లేదు. కానీ ఇప్పుడిక్కడికి చేరుకున్నాను. కాబట్టి, నా శాయశక్తులా దేశానికి సేవ చెయ్యాలని, అదే విషయం గురించి ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాను. అందువల్ల, అసలు ఇక్కడ లేకపోతే మరెక్కడ? అని అసలు ఆలోచించకూడదు కూడా నేను. ఉన్నచోటనే మనసు లగ్నం చేసి జీవించాలి. శాయశక్తులా శ్రమించాలి. వీలయినంతగా దేశం కోసమే పని చెయ్యాలి. రాత్రి, పగలు చూసుకోకుండా, నేను పని చేయ్యాల్సినది దేశం కోసం మాత్రమే అనే లక్ష్యం తో నేను ముందుకు వెళ్తున్నాను.
అఖిల్: ప్రధాన మంత్రి గారూ…
ప్రధాన మంత్రి: ఆ..చెప్పండి
అఖిల్: మీరు ఇంతగా శ్రమిస్తూ ఉంటారు కదా, మీకు టీవీ చూడడానికీ, సినిమాలు చూడడానికీ, పుస్తకాలు చదువుకోవడానికీ ఎప్పుడు సమయం దొరుకుతుందా అని నాకు చాలా కుతూహలంగా ఉంది.
ప్రధాన మంత్రి: పుస్తకాలు చదివే అలవాటు నాకు ఉండేది. సినిమాలు చూడాలనే ఆసక్తి ఎప్పుడూ లేదు. అందువల్ల ఆ సమయాభావం అనిపించదు. కానీ టీవీ చూడడానికి ఎక్కువ సమయం లభించదు. చాలా తక్కువ సమయం దొరుకుతుంది. ఆసక్తి ఉండడం వల్ల ఇదివరలో అప్పుడప్పుడూ డిస్కవరీ ఛానల్ చూసేవాణ్ణి. పుస్తకాలు కూడా చదివేవాణ్ణి కానీ ఈ మధ్య అసలు సమయమే దొరకడం లేదు. అయినా గూగుల్ కారణంగా మంచి అలవాట్లు పోతున్నాయి. ఏదన్నా రిఫరెన్స్ కావాలంటే వెంటనే షార్ట్ కట్ లు వెతికేసుకుంటున్నాము. అలా అందరితో పాటే నాకు ఉన్న మంచి అలవాట్లు కూడా తప్పిపోయాయి.
ఇవాళ మీ అందరితో మాట్లాడడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మీ ద్వారా ఎన్.సి.సి కేడెట్స్ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. అనేకానేక ధన్యవాదాలు మిత్రులారా.
ఎన్.సి.సి కేడెట్స్ అందరూ: అనేకానేక ధన్యవాదాలు సర్. థాంక్ యూ.
ప్రధాన మంత్రి: ధన్యవాదాలు. ధన్యవాదాలు
ఎన్.సి.సి కేడెట్స్ అందరూ: జైహింద్ సర్.
ప్రధాన మంత్రి: జైహింద్.
ఎన్.సి.సి కేడెట్స్ అందరూ: జైహింద్ సర్
ప్రధాన మంత్రి: జైహింద్. జైహింద్.
నా ప్రియమైన దేశ ప్రజలారా, డిసెంబర్ 7 వ తేదీని, మన Armed Forces Flag Day గా జరుపుకుంటామన్న విషయాన్ని భారతీయులంతా ఎప్పుడూ మర్చిపోకూడదు. మన వీర సైనికుల పరక్రమాన్నీ, బలిదానాలను గుర్తు చేసుకునే రోజు అది. అంతేగాక, వారికి మన సహకారాన్ని, మద్దతుని తెలిపే రోజు. వారికి మనం కేవలం గౌరవాన్ని మాత్రమే ప్రకటిస్తే సరిపోదు. మన సహకారాన్ని కూడా అందించాలి. డిసెంబర్ 7 వ తేదీన ప్రతి భారతీయ పౌరుడూ ముందుకు రావాలి. ప్రతి ఒక్కరి దగ్గరా ఆ రోజున Armed Forces Flag ఉండి తీరాల్సిందే. ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించి తీరాలి. రండి, ఈ సందర్భంగా మనం మన సాయుధదళాల అద్భుతమైన సాహసాలు, శౌర్య పరాక్రమాలను, సమర్పణాభావాల పట్ల కృతజ్ఞతను వ్యక్తపరుద్దాం. అమరవీరులైన మన సైనికులను స్మరిద్దాం.
నా ప్రియమైన దేశప్రజలారా, భారతదేశం లో మొదలైన ఫిట్ ఇండియా ఉద్యమం గురించి మీకు తెలుసు కదా. సిబిఎస్ సి వారు ఒక ప్రశంసాత్మకమైన పని చేశారు. ఫిట్ ఇండియా వారోత్సవాన్ని ప్రారంభించారు. పాఠశాలల వారు ఈ ఫిట్ ఇండియా వారోత్సవాన్ని డిసెంబర్ నెలలో ఎప్పుడైనా జరుపుకోవచ్చు. ఇందులో ఫిట్ నెస్ కు సంబంధించిన ఎన్నో రకాల కార్యకలాపాలు ఉంటాయి. ఇందులో క్విజ్, వ్యాస రచన, చిత్రలేఖనం, సంప్రదాయ, ప్రాంతీయ ఆటలు, యోగాసనాలు, నృత్యం, మొదలైన ఆటపాటల్లో పోటీలు ఉంటాయి. ఫిట్ ఇండియా వారోత్సవంలో విద్యార్థులతో పాటూ వారి అధ్యాపకులు, తల్లిదండ్రులు కూడా పాల్గోవచ్చు. కానీ ఫిట్ ఇండియా అంటే కేవలం మెదడుకు పదునుపెట్టడం, కాయితాలపై కసరత్తు చేయడమో లేదా ల్యాప్ టాప్ లోనో, కంప్యూటర్ లోనో, లేదా మొబైల్ ఫోన్ లోనో ఒక ఫిట్ నెస్ యాప్ చూడడం మాత్రమే అనుకోకండి. ఫిట్ ఇండియా అంటే చెమటను చిందించడం. మన ఆహారపు అలవాట్లు మారాలి. ఎక్కువగా శ్రమించడం ఒక అలవాటుగా మార్చుకోవాలి. నేను దేశం లోని ప్రతి పాఠశాల బోర్డు వారినీ, యాజమాన్యాన్నీ కోరేదేమిటంటే, ప్రతి పాఠశాల లోనూ, డిసెంబర్ నెలలో ఫిట్ ఇండియా వారోత్సవాన్ని జరపాలని కోరుతున్నాను. ఇందువల్ల ఫిట్ నెస్ అనేది మన దిన చర్యలో ఒక భాగం గా మారుతుంది. ఫిట్ ఇండియా మూవ్ మెంట్ లో భాగం గా ఫిట్ నెస్ గురించి పాఠశాలలకు ర్యాంకింగ్ ఏర్పాటు కూడా జరిగింది. ఈ ర్యాంకింగ్ ని సంపాదించుకున్న పాఠశాలల వారు ఫిట్ ఇండియా లోగోనీ, జెండానీ వాడుకోగలుగుతారు.
ఏ పాఠశాల అయినా ఫిట్ ఇండియా పోర్టల్ కు వెళ్ళి తమను తాము ఫిట్ గా ప్రకటించుకోవచ్చు. అప్పుడు ఆ పాఠశాలలకు ఫిట్ ఇండియా త్రీ స్టార్, ఫిట్ ఇండియా ఫైవ్ స్టార్ రేటింగ్స్ ఇవ్వబడతాయి. దేశం లోని అన్ని పాఠశాలలూ ఫిట్ ఇండియా ర్యాంకింగ్ లో పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఫిట్ ఇండియా అనేది ఒక సహజ స్వభావం గా మారాలి. ఇది ఒక ప్రజా ఉద్యమం గా మారాలి. ప్రజల్లో అవగాహన పెరగాలి. ఇందుకోసం అందరూ ప్రయత్నించాలి.
నా ప్రియమైన దేశ ప్రజలారా, భారతదేశం ఎంతో విశాలమైనది. ఎన్నో భిన్నత్వాలతో నిండి ఉన్నది మన దేశం. అందువల్ల ఎన్నో విషయాలు మన దృష్టికి రావు. అది స్వాభావికమే. ఒక విషయాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం mygov app లోని కామెంట్స్ పై నా దృష్టి పడింది. అస్సామ్ లోని నౌగావ్ అనే ప్రాంతానికి చెందిన శ్రీ రమేష్ శర్మ గారు ఆ కామెంట్ రాశారు. బ్రహ్మపుత్ర నది పై ఒక ఉత్సవం జరుగుతోందని ఆయన రాశారు. దాని పేరు బ్రహ్మపుత్ర పుష్కరాలు. నవంబరు 6 నుండి నవంబరు16 వరకూ ఈ ఉత్సవాలు జరిగాయి. ఇందులో పాల్గోవడానికి దేశం నలుమూలల నుండి ఎందరో ప్రజలు అక్కడికి చేరుకున్నారు. ఇది విని మీకు ఆశ్చర్యంగా అనిపించలేదు? కానీ దురదృష్టవశాత్తు ఈ ఉత్సవానికి లభించవలసిన ప్రచారం లభించలేదు. దేశం నలుమూలలకీ ఈ ఉత్సవాన్ని గురించిన సమాచారం అందాల్సినంతగా అందలేదు. కానీ ఈ మొత్తం ఉత్సవం ఒకరకంగా చెప్పాలంటే దేశాన్ని ఏకం చేసే కార్యక్రమం. ఒకే దేశం, ఒకే సందేశం, మనందరము ఒకటే అనే సందేశాన్ని అందించే ఉత్సవం ఇది. ఐకమత్య భావాన్ని పెంచేది, ఆ భావానికీ బలాన్నిచ్చే కార్యక్రమం ఇది.
ముందుగా, ‘మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా దేశ ప్రజల కు ఈ విషయాన్ని తెలిపే ప్రయత్నం చేయాలని నిశ్చయించుకున్న రమేష్ గారికి అనేకానేక ధన్యవాదాలు. ఈ విషయమై విస్తృతమైన చర్చలు గానీ, ప్రచారం గానీ జరగలేదని మీరు బాధపడుతూ చెప్పడం చాలా ముఖ్యమైన విషయం. మీ బాధను నేను అర్థం చేసుకోగలను. దేశం లో చాలామందికి ఈ సంగతి తెలియనే తెలియదు. కానీ ఎవరైనా ఈ సంగతిని International river festival అని ప్రచారం చేసి ఉంటే, గొప్ప గొప్ప పద ప్రయోగాలతో ప్రచారం చేయగలిగి ఉంటే, బహుశా మన దేశంలో కొందరు దీనిపై చర్చలు జరిపి ఉండేవారు, అందువల్ల ప్రచారం కూడా జరిగి ఉండేది.
నా ప్రియమైన దేశ ప్రజలారా, पुष्करम, पुष्करालू, पुष्करः అనే పదాలను మీరెప్పుడైనా విన్నారా? వీటి అర్థం మీకు తెలుసా? ఇవి భారతదేశం లోని రకరకాల నదులకు జరిగే ఉత్సవాల తాలూకూ వేరు వేరు పేర్లు, ప్రతి పన్నెండేళ్ళకి ఒకసారి, మన దేశం నలుమూలల్లోనూ ప్రవహించే పన్నెండు ముఖ్యమైన నదులకు ఉత్సవాలు జరుగుతాయి. ఒకదాని తర్వాత ఒకటిగా, ప్రతి నదికీ పన్నెండేళ్ల కొకసారి, పన్నెండు రోజుల పాటు ఉత్సవాలు జరుపుతారు. కుంభ్ మేళా లాగ ఈ ఉత్సవాలన్నీ దేశ సమైక్యతను పెంచుతాయి. “ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్” అనే నినాదాన్ని దృశ్యరూపం లో ఈ ఉత్సవాలు చూపెడతాయి. పుష్కరాల వల్ల నది తాలూకు గౌరవం, ప్రాముఖ్యత, జీవితంలో నది ప్రాముఖ్యత ఒక సహజరూపంలో బహిర్గతమవుతాయి.
ప్రకృతికీ, పర్యావరణానికీ, నీటికీ, భూమికీ, అరణ్యాలకూ మన పూర్వీకులు ఎంతో ప్రాముఖ్యతను ఇచ్చారు. నదుల ప్రాముఖ్యతను అర్థం చేసుకుని సమాజానికి నదుల పట్ల సానుకూల భావం ఏర్పడేలా, అది ఒక ఆచరించదగ్గ కర్మలాగ ఏర్పరిచారు. నది తో పాటుగా సంస్కృతిని, నదితో పాటుగా ఒక కర్మనూ ప్రవహింపజేశారు మన పూర్వీకులు. అలా నదితో పాటుగా సమాజాన్ని కలిపి ఉంచే ప్రయత్నం నిరంతరం సాగుతూ వచ్చింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఇందువల్ల సమాజం నదులతోనూ ముడిపడింది, తనలో తాను ఐకమత్యంగానూ ఉంది. క్రితం సంవత్సరం తమిళనాడు లో తామీర్ బర్నీ అనే నది పుష్కరాలు జరిగాయి. ఈ ఏడాది బ్రహ్మపుత్ర నదికి పుష్కరాలు జరిగాయి. వచ్చే ఏడాది ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో తుంగభద్రా నది పుష్కరాలు జరగబోతున్నాయి. ఒకరకంగా మీరు ఈ పన్నెండు నదుల ప్రదేశాల యాత్రలనూ ఒక యాత్రా ప్రదక్షిణలాగ చేయాలనే పథకాన్ని తయారు చేసుకోవచ్చు. ఈ సందర్భంలో నేను అస్సాం ప్రజల ఆత్మీయతనూ, వారి ఆతిథ్యాన్నీ మెచ్చుకోవాలనుకుంటున్నాను. భారతదేశం నలుమూలల నుండి వచ్చిన తీర్థయాత్రికులను అస్సాం ప్రజలు ఎంతో అందమైన స్వాగతాన్ని అందించారు. పరిశుభ్రత పట్ల కూడా నిర్వాహకులు ఎంతో శ్రధ్ధను కనబరిచారు. ప్లాస్టిక్ రహితంగా ప్రదేశం ఉండేలా ఏర్పాట్లు చేసారు. ప్రతిచోటా బయో టాయిలెట్లను ఏర్పరిచారు, నదుల పట్ల ఈ రకమైన ఐక్యతా భావాన్ని జాగృతం చేసేలా వేల ఏళ్ల క్రితమే మొదలైన ఈ ఉత్సవాలు భావితరాలను కూడా ఐకమత్యంగా ఉంచుతాయని ఆశిస్తున్నాను. ప్రకృతి, పర్యావరణ, నీరు, ఇవన్నీ కూడా మన పర్యటన లో భాగం గా మారాలని, జీవితాల లో కూడా ఇవి ఒక భాగమవ్వాలని ఆశిస్తున్నాను.
నా ప్రియమైన దేశ ప్రజలారా, మధ్య ప్రదేశ్ నుండి శ్వేత అనే ఆడబిడ్డ నమో యాప్ లో ఏం రాసిందంటే, “సర్, నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను. నా బోర్డ్ పరీక్షలకు ఇంకా ఒక ఏడాది సమయం ఉంది. మీరు విద్యార్థులతోనూ, ఎగ్జామ్స్ వారియర్స్ తోనూ మీరు మాట్లాడడం నేను వింటూనే ఉంటాను. కానీ నేను మీకు ఇప్పుడు ఎందుకు రాస్తున్నానంటే, రాబోయే పరీక్షలపై చర్చ ఎప్పుడు ఉంటుందో మీరింకా చెప్పలేదు. దయచేసి మీరు త్వరలో ఈ చర్చను ఏర్పాటు చేయండి. వీలైతే జనవరి లోనే ఈ కార్యక్రమాన్ని మీరు ప్రారంభించండి.
మిత్రులారా, మన్ కీ బాత్ గురించి ఇదే సంగతి నాకు బాగా నచ్చుతుంది. నా యువ మిత్రులు నాతో అధికార పూర్వకం గానూ, స్నేహభావం తోనూ ఫిర్యాదు చేస్తారు. ఆదేశాలను జారీ చేస్తారు. సూచనల ను అందిస్తారు. ఇది నాకు ఎంతో ఆనందాన్ని అందిస్తుంది. శ్వేత గారూ, మీరెంతో సరైన సమయానికి ఈ విషయాన్ని గుర్తుకు తెచ్చారు. పరీక్షలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఏడాది లాగానే వాటిని గురించి మనం చర్చించుకోవాలి కూడా. మీరు చెప్పినది సరిగ్గానే ఉంది. ఈ కార్యక్రమాన్ని కాస్త త్వరగానే ఏర్పాటు చేయాలి.
పరీక్షల గురించి జరిగిన గత కార్యక్రమం తర్వాత, ఎంతో మంది ప్రజలు దీనిని ఇంకా ప్రభావవంతంగా తయారు చేయడానికి ఎన్నో సూచనలను పంపించారు. కార్యక్రమాన్ని చాలా ఆలస్యం గా చేశానని, కార్యక్రమం జరిగే నాటికి పరీక్షలు బాగా దగ్గరకు వచ్చేశాయని ఫిర్యాదు కూడా చేశారు. ఈ కార్యక్రమాన్ని జనవరి లో చేయాలని శ్వేత ఇచ్చిన సూచన సరైనదే. HRD Ministry , MyGov టీమ్ కలిసి దీనిపై పని చేస్తోంది. కానీ నేను జనవరి నెల మొదట్లోనో, మధ్యలోనో ఈ కార్యక్రమం ఏర్పాటయ్యే ప్రయత్నం చేస్తాను. దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థుల, మిత్రుల వద్ద రెండు అవకాశాలు ఉన్నాయి. మొదటిది, తమ స్కూల్ నుండే ఈ కార్యక్రమం లో పాలుపంచుకోవడం, రెండవది – ఇక్కడ ఢిల్లీ లో జరిగే కార్యక్రమం లో నేరుగా పాల్గొనడం. ఢిల్లీ లో ఈ కార్యక్రమం లో పాల్గొనడానికి దేశవ్యాప్తంగా విద్యార్థుల ఎంపిక, MyGov మాధ్యమం ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
మిత్రులారా, మనందరం కలిసి పరీక్షల భయాన్ని పారద్రోలాలి. నా యువ మిత్రులు పరీక్షల సమయం లో నవ్వుతూ, ఆడుతూ పాడుతూ ఉండాలి, తల్లిదండ్రులు వత్తిడి లేకుండా ఉండాలి, అధ్యాపకులు ధైర్యంగా ఉండాలి, అనే ఉద్దేశాలతో గత కొన్ని సంవత్సరాలుగా మేము ‘మన్ కీ బాత్’ ద్వారా, పరీక్షల గురించిన చర్చను టౌన్ హాల్ మాధ్యమం ద్వారా, లేదా ఎగ్జామ్ వారియర్స్ పుస్తకం మాధ్యమం ద్వారానూ నిరంతరం ప్రయత్నం చేస్తున్నాము. ఈ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులందరూ, తల్లిదండ్రులందరూ, అధ్యాపకులందరూ వేగాన్నందించారు. ఇందుమూలంగా నేను వారందరికీ ఋణపడి ఉంటాను. రాబోయే పరీక్షలపై చర్చా కార్యక్రమాన్ని కూడా మనందరము కలిసి జరుపుకుందామని మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను.
మిత్రులారా, 2010లో అయోధ్య కేసులో అలహాబాద్ హై కోర్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ గురించి గత ‘మన్ కీ బాత్’ లో మనం మాట్లాడుకున్నాం. నిర్ణయం రాబోయే ముందర, వచ్చిన తర్వాత కూడా , దేశం యావత్తు ఆ సమయంలో ఎలా ప్రశాంతంగా ఉందో, సోదరభావంతో నిలబడిందో అప్పుడు నేను చెప్పాను. ఈసారి కూడా నవంబర్ 9వ తేదీన సుప్రీం కోర్టు జడ్జిమెంట్ వచ్చినప్పుడు, 130 కోట్ల భారతీయులందరూ కలిసి, తమకు దేశ సంక్షేమం కన్నా మరేదీ ఎక్కువ కాదని మరోసారి నిరూపించారు. శాంతి, ఐకమత్యం, ఇంకా సద్భావనా విలువలు దేశవ్యాప్తంగా నిండి ఉన్నాయి. రామమందిరం పై నిర్ణయం వచ్చినప్పుడు, యావత్ దేశం ఆ తీర్పుని మనస్ఫూర్తిగా ఆమోదించింది. ఎంతో సహజంగా, శాంతి పూర్వకంగా తీర్పుని స్వీకరించింది. ఇవాళ ‘మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా నేను దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. ప్రజలందరూ తమ ధైర్యాన్నీ, నిగ్రహాన్నీ, పరిపక్వతనీ చూపెట్టిన విధానానికి నేను అందరికీ ప్రత్యేక కృతజ్ఞతలను తెలుపుతున్నాను.
ఒక వైపు నుంచి చూస్తే ఈ తీర్పు వల్ల ఎంతో కాలం తర్వాత ఒక న్యాయ పోరాటం సమాప్తమైంది. మరో వైపు నుండి చూస్తే న్యాయ వ్యవస్థ పట్ల దేశానికి గౌరవం మరింత పెరిగింది. ఒక రకంగా ఈ తీర్పు మన న్యాయ వ్యవస్థకు కూడా ఒక మైలు రాయిగా నిలుస్తుంది. సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ చారిత్రాత్మక తీర్పు తర్వాత దేశం కొత్త ఆశలతో, కొత్త ఆకాంక్షలతో, కొత్త దారులలో కొత్త ఉద్దేశాలతో నడక మొదలుపెట్టింది. నవ భారతం(న్యూ ఇండియా) ఇదే భావనను స్వీకరిస్తూ శాంతి, ఐకమత్యం , సద్భావన తో ముందుకు నడవాలని నేను కోరుకుంటున్నాను. ఇది మనందరి కోరిక కూడా.
నా ప్రియమైన దేశప్రజలారా, మన నాగరికత, మన సంస్కృతి, మన భాషలు ప్రపంచానికి భిన్నత్వం లో ఏకత్వం అనే సందేశాన్ని అందిస్తాయి. 130 కోట్ల ప్రజలున్న ఈ దేశం లో ‘कोस-कोस पर पानी बदले और चार कोस पर वाणी’ అనే నానుడి ఉండేది. అంటే, మన దేశంలో ప్రతి క్రోశు దూరానికీ నీళ్ళు మారతాయి, ప్రతి నాలుగు క్రోశుల దూరానికీ భాష మారుతుంది అని అర్థం. మన భారతదేశం లో కొన్ని వందల భాషలు శతాబ్దాలుగా పుడుతూ, అభివృధ్ధి చెందుతూ ఉన్నాయి. అయితే, ఈ రకరకాల భాషలు, మాండలీకాలన్నీ కూడా అంతరించిపోతాయేమో అని భయం వేస్తూ ఉంటుంది. కొద్ది రోజుల క్రితం నేను ఉత్తరాఖండ్ లోని ధార్చులా కు చెందిన ఒక సంఘటన గురించి చదివి నేను ఎంతో ఆనందించాను. ప్రజలు ఏ విధంగా తమ భాషను ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నారన్నది ఈ కథ వల్ల మనకు తెలుస్తుంది. ఇందుకోసం ప్రజలు కొన్ని సృజనాత్మక పధ్ధతులు కూడా పాటిస్తున్నారు. ధార్చులా సంఘటనపై నా దృష్టి ఎందుకు వెళ్లిందంటే, ఒకప్పుడు నేను ధార్చులా మీదుగా ప్రయాణిస్తూ ఉండేవాడిని. ఆ వైపున నేపాల్, అటు వైపు కాలీ గంగా ఉన్న ధార్చులా గురించి వింటూనే …
నా దృష్టి ఈ వార్త వైపు వెళ్ళింది. పిథౌరాగఢ్ లోని ధార్చులాలో రంగ్ సమూహానికి చెందిన చాలామంది నివసిస్తూ ఉంటారు. వీరి భాష రగ్లో. వీళ్ల భాషను మాట్లాడేవారి సంఖ్య చాలా తక్కువైపోతోందని వాళ్లంతా చాలా బాధపడుతూ ఉండేవారు. ఒకరోజు వారంతా కలిసి తమ భాషను రక్షించుకోవాలని తీర్మానించుకున్నారు. చూస్తూండగానే ఈ ఉద్యమంలో చేరే రంగ్ సమూహానికి చెందిన ప్రజల సంఖ్య మరింతగా పెరుగుతూ వచ్చింది. ఈ సమూహానికి చెందిన సంఖ్య ఎంత చిన్నదో వింటే మీరు ఆశ్చర్యపోయారు. మొత్తం కలిపి దాదాపు పది వేల మంది ఉంటారేమో అంతే. ఎనభై నాలుగేళ్ల ముదుసలి దీవాన్ సింగ్ నుండి ఇరవై రెండేళ్ళ వైశాలి గర్బ్యాల్ వరకు, ప్రొఫెసర్ నుండి వ్యాపారస్తుడి వరకూ ప్రతి వ్యక్తి తమకు వీలైన ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఈ ఉద్యమంలో సోషల్ మీడియా సహాయాన్ని కూడా పూర్తిగా వాడుకున్నారు. ఎన్నో వాట్సప్ గ్రూపులు తయారయ్యాయి. వందల కొద్దీ ప్రజలను అందులో చేర్చుకున్నారు. ఈ భాష కు ఏ లిపీ లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ భాష మనుగడ కేవలం వాడుకలోనే ఉంది. ఇలా ఉండగా, ప్రజలు కథలు, పాటలు, కవితలూ పోస్ట్ చేయడం మొదలు పెట్టారు. ఒకరి భాషను మరొకరు సరిచేయడం మొదలు పెట్టారు. ఒకరకంగా వాట్సప్ క్లాస్ రూమ్ గా మారిపోయింది. అక్కడ ప్రతి ఒక్కరూ అధ్యాపకులే, ప్రతి ఒక్కరూ విద్యార్థే! రంగ్లో భాషను సంరక్షించడానికి మరో ప్రయత్నం కూడా జరిగింది. రకరకాల కార్యక్రమాలు ప్రారంభించారు. పత్రికలు ప్రారంభించారు. సామాజిక సంస్థల సహాయం కూడా తీసుకున్నారు.
మిత్రులారా, మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఐక్య రాజ్య సమితి ఈ ఏడాదిని ‘International Year of Indigenous Languages’ గా ప్రకటించింది. అంటే, అంతరించిపోయే దిశలో ఉన్న భాషలను సంరక్షణ చేయాలని బలంగా సంకల్పించారు. నూట ఏభై ఏళ్ల క్రితం ఆధునిక హిందీ భాషా పితామహుడు భారతేందు హరిశ్చంద్ర గారు కూడా అన్నారు.. ““निज भाषा उन्नति अहै, सब उन्नति को मूल,
बिन निज भाषा-ज्ञान के, मिटत न हिय को सूल ||”
అంటే, మాతృభూమి గురించిన జ్ఞానాన్ని తెలుసుకోకుండా అభివృధ్ధి జరగదు. అని అర్థం.
ఇటువంటి సమయంలో రంగ్ సమూహానికి చెందిన ఈ ఉదాహరణ యావత్ ప్రపంచానికీ ఒక దారిని చూపేట్టేదిగా నిలుస్తుంది.
ఒకవేళ మీరు కూడా ఈ కథ వల్ల ప్రేరణ పొందితే గనుక మీ మాతృ భాషనూ, మీ మాండలీకాన్నీ ఉపయోగించడం మొదలు పెట్టండి. కుటుంబానికీ, సమాజానికీ ప్రేరణని ఇవ్వండి.
19వ శతాబ్ద అంతంలో మహాకవి సుబ్రహ్మణ్య భారతి గారు కూడా తమిళంలో కొన్ని మాటలు అన్నారు. అవి కూడా మనకు ఎంతో ప్రేరణను అందిస్తాయి. సుబ్రహ్మణ్య భారతి గారు తమిళంలో ఏమన్నారంటే –
मुप्पदु कोडी मुगमुडैयाळ
उयिर् मोइम्बुर ओंद्दुडैयाळ
इवळ सेप्पु मोळी पधिनेट्टूडैयाळ
एनिर् सिन्दनै ओंद्दुडैयाळ
(Muppadhu kodi mugamudayal, enil maipuram ondrudayal
Ival seppumozhi padhinetudayal, enil sindhanai ondrudayal)
19వ శతాబ్దం చివరలో ఆయన చెప్పిన మాటలివి. భారతమాతకు ముఫ్ఫై కోట్ల ముఖాలున్నాయి. కానీ, ఒకటే శరీరం ఉంది అని ఆయన అన్నారు. ఇది పద్దెనిమిది భాషలు మాట్లాడినా, ఆలోచన ఒకటే అన్నారు.
నా ప్రియమైన దేశ ప్రజలారా, అప్పుడప్పుడు జీవితం లో చిన్నచిన్న విషయాలు కూడా ఎంతో పెద్ద సందేశాన్ని అందిస్తాయి. మీరే చూడండి – మీడియాలో స్కూబా డైవర్స్ తాలూకూ కథ ఒకటి ఉంది. ప్రతి భారతీయుడికీ ప్రేరణను అందించేలాంటి కథ ఇది. విశాఖపట్నం లో ఒకరోజు మంగమరిపేట బీచ్ లో డైవింగ్ లో శిక్షణ ను అందించే స్కూబా డైవర్లు సముద్రం నుంచి తిరిగి వస్తున్నప్పుడు, సముద్రం లో తేలివస్తున్న కొన్ని ప్లాస్టిక్ బాటిల్స్, పౌచ్ లనూ చూశారు. వాటిని శుభ్రపరుస్తుంటే ఇది చిన్న విషయం కాదని వారికి అర్థమైంది. మన సముద్రం చెత్తతో నిండిపోతోందని అర్థం అయ్యింది. గత కొన్ని రోజులుగా ఈ డైవర్స్ సముద్ర తీరంలో ఒక వంద మీటర్ల దూరానికి లోపలికంటా ఈదుకుంటూ వెళ్ళి అక్కడ పేరుకున్న చెత్తని బయటకు తీస్తూ వచ్చారు. కేవలం పదమూడు రోజుల్లోనే అంటే రెండు వారాల లోపే దాదాపు నాలుగు వేల కిలోల ప్లాస్టిక్ వేస్ట్ ని వారు సముద్రం నుండి బయటకు తీసారని నాకు చెప్పారు. ఈ స్కూబా డైవర్స్ చేసిన చిన్న ఆరంభం, ఒక పెద్ద ఉద్యమ రూపాన్ని సంతరించుకుంటోంది. వీరికి ఇప్పుడు స్థానీయుల సహాయం కూడా లభ్యమౌతోంది. చుట్టుపక్కల ఉన్న మత్స్యకారులు కూడా వారికి అన్నిరకాల సహాయాలనూ అందిస్తున్నారు. ఈ స్కూబా డైవర్స్ ప్రేరణతో మనం కూడా కేవలం మన చుట్టుపక్కల ప్రాంతాలను ప్లాస్టిక్ చెత్త నుండి విముక్తి చేయాలనే సంకల్పాన్ని తీసుకుంటే గనుక భారతదేశం ప్లాస్టిక్ చెత్త నుండి విముక్తిని పొందగలదు. యావత్ దేశానికీ ఒక ఉదాహరణగా నిలవగలదు. కాస్త ఆలోచించండి..!
నా ప్రియమైన దేశప్రజలారా, రెండు రోజుల తర్వాత నవంబర్ 26. ఈ రోజు యావత్ దేశానికీ ఎంతో ముఖ్యమైనది. ముఖ్యంగా మన గణతంత్రానికి ఎంతో ముఖ్యమైన రోజు. ఈ రోజును మనం మన రాజ్యాంగ దినోత్సవంగా జరుపుకుంటాము. ఈసారి మన రాజ్యాంగ దినోత్సవంగా ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈసారి రాజ్యాంగాన్ని మనం స్వీకరించి డెభ్భై ఏళ్ళు పూర్తవుతున్నాయి. ఈ సందర్భంగా ఈసారి పార్లమెంట్ లో ప్రత్యేక సమావేశం జరిగుతుంది. ఏడాది పొడుగునా దేశవ్యాప్తంగా రకరకాల కార్యక్రమాలు జరగనున్నాయి. రండి, ఈ సందర్భంగా మన రాజ్యాంగం లోని సభ్యులందరికీ ఆదర పూర్వకంగా నమస్కరిద్దాం. వారి పట్ల మన భక్తిని సమర్పిద్దాం. భారత రాజ్యాంగం ఎటువంటిదంటే, అందులో ప్రతి పౌరుడి అధికారం, గౌరవం రక్షింపబడుతుంది. ఇది మన రాజ్యాంగ నిర్మాతల దూరదృష్టి వల్లనే సాధ్యం కాగలిగింది. ఈ రాజ్యాంగ దినోత్సవం నాడు, మన రాజ్యాంగంలోని ఆదర్శాలను కాపాడుకుంటూ, దేశ నిర్మాణానికి సహకారాన్ని అందించాలనే మన నిబధ్ధతకు మనం శక్తినివ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇదే మన రాజ్యాంగ నిర్మాతలు కన్న కల.
నా ప్రియమైన దేశప్రజలారా, చలికాలం మొదలవుతోంది. కొద్ది కొద్దిగా చలి తెలుస్తోంది. కొన్ని హిమాలయ శిఖరాలను మంచు దుప్పట్లు కప్పడం మొదలైపోయింది. కానీ ఈ కాలం ‘ఫిట్ ఇండియా’ ఉద్యమానికి. మీరు, మీ కుటుంబం, మీ మిత్రులు, మీ సహచరులు అందరూ అవకాశాన్ని వదులుకోకండి. ‘ఫిట్ ఇండియా’ ఉద్యమాన్ని ముందుకు నడిపించడానికి ఈ కాలాన్ని బాగా ఉపయోగించుకోండి.
అనేకానేక శుభాకాంక్షలు. అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియ దేశవాసులారా, నమస్కారము. ఈ రోజు దీపావళి. పావన పర్వదినం. మీ అందరికీ దీపావళి సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు. మనవాళ్ళు చెప్తారు –
శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదామ్ ।
శత్రుబుద్ధివినాశాయ దీపజ్యోతిర్నమోస్తుతే ।
ఎంత ఉత్తమ సందేశము! ఈ శ్లోకంలో ప్రకాశం జీవితం లో సుఖం, ఆరోగ్యం, సమృద్ధి తీసుకొనివస్తుంది, అది విరోధబుద్ధిని నాశనం చేసి సద్బుద్ధి దర్శనం చేయిస్తుంది అని చెప్పారు. అటువంటి దివ్యజ్యోతికి నా ప్రణామములు. మనము ప్రకాశాన్ని విస్తరింపచేయాలని, సానుకూలభావాలను ప్రసరింపజేయాలని, ఇంకా శత్రుభావనలను నశింపజేయాలని ప్రార్థించడం అనే దాని కన్నా ఈ దీపావళిని గుర్తుంచుకోవడానికి మంచి ఆలోచన ఏముంటుంది! నేటికాలంలో ప్రపంచంలో అనేక దేశాలలో దీపావళిని జరుపుకుంటారు. ఇంకా విశేషమేమంటే ఈ పండుగ జరుపుకోవడంలో కేవలం భారతీయ సమాజం మాత్రమే కాక ఇప్పుడు అనేక దేశాల ప్రభుత్వాలు, అక్కడి పౌరులు, అక్కడి సాంఘిక సంస్థలు కూడా పాల్గొని దీపావళిని సంపూర్ణమైన హర్షోల్లాసాలతో జరుపుకుంటారు. ఒకరకంగా అక్కడ ‘భారత్’ ను నెలకొల్పుతారు.
సహచరులారా, ప్రపంచంలో ఫెస్టివల్ టూరిజానికి ఒక ప్రత్యేక ఆకర్షణ ఉంది. మన భారత్ లో దేశీయ పండుగలలో ఫెస్టివల్ జానికి అపారమైన అవకాశాలున్నాయి. హోలీ కానివ్వండి, దీపావళి కానివ్వండి, ఓనమ్ కానివ్వండి, పొంగల్ కానివ్వండి, బిహూ కానివ్వండి ఈ పండుగలను ప్రచారం చేసే ప్రయత్నం మనం చేయాలి. అంతేకాక పండుగల సంబరాలలో ఇతర రాష్ట్రాల, ఇతర దేశాల ప్రజలను భాగస్వాములను చేయాలి. మనకు ప్రతి రాష్ట్రంలో, ప్రతి ప్రాంతంలో విభిన్నమైన పండుగలు ఉంటాయి. ఈ విషయం ఇతరదేశాల ప్రజలకు ఎంతో ఆసక్తి కలిగిస్తుంది. అందుకే భారత్ లో ఫెస్టివల్ టూరిజం ను ప్రోత్సహించడంలో దేశానికి వెలుపల నివసించే భారతీయుల పాత్ర ముఖ్యమైనది.
నా ప్రియ దేశవాసులారా, క్రితం సారి మన్ కీ బాత్ లో ఈ దీపావళికి కొత్తగా ఏదైనా చేద్దామని మనం నిశ్చయించాము. నేను చెప్పాను – రండి, మనమంతా ఈ దీపావళికి భారతీయ నారీశక్తి ని, వారి సాధనలను సెలబ్రేట్ చేసుకుందాము అని. అంటే భారతీయ లక్ష్మీపూజ. ఇలా చెప్పాక చూస్తూండగానే సామాజికమాధ్యమాలలో లెక్కలేనన్ని స్ఫూర్తిదాయకమైన కథలు వరుసగట్టాయి. వరంగల్ లోని కోడిపాక రమేశ్, మా అమ్మ నా శక్తి అని నమో యాప్ లో వ్రాశారు 1990 లో మా నాన్నగారు మరణించాక, మా అమ్మ తన ఐదుగురు కొడుకుల బాధ్యత తీసుకుంది. ఈనాడు మా అన్నదమ్ములం మంచి ప్రొఫెషన్ లలో ఉన్నాము. మా అమ్మ మాకు దైవం. సర్వస్వం. ఆమె నిజంగా భారతీయ లక్ష్మి.
రమేశ్ గారూ, మీ తల్లి గారికి నా ప్రణామములు. ట్విట్టర్ లో యాక్టివ్ గా ఉండే గీతికాస్వామి అంటున్నారు, ఒక బస్ కండక్టర్ కూతురు మేజర్ ఖుష్ బూ కన్వర్ వారి దృష్టిలో ‘భారతీయ లక్ష్మి’ అని. వారు అస్సాం రైఫిల్స్ యొక్క ఆల్ ఉమన్ శాఖ కు నేతృత్వం వహించారు. కవితా తివారీ గారికి వారి శక్తి వారి కూతురు భారతీయ లక్ష్మి. తన కూతురు మంచి పెయింటింగ్స్ వేస్తుందని వారికి ఎంతో గర్వంగా అనిపిస్తుంది. ఆమె CLAT పరీక్షలో మంచి రాంక్ తెచ్చుకుంది. మేఘా జైన్ రాస్తున్నారు, 92 ఏండ్ల ఒక వృద్ధమహిళ ఎన్నో ఏళ్ళనుంచి గ్వాలియర్ రైల్వేస్టేషంలో ప్రయాణీకులకు ఉచితంగా త్రాగునీరు అందిస్తోంది. మేఘాజీ ఈ భారతీయ లక్ష్మి యొక్క వినమ్రత, కరుణ వల్ల ఎంతో స్ఫూర్తి పొందారు. ఇటువంటి ఎన్నో కథలను ప్రజలు షేర్ చేస్తున్నారు. మీరు తప్పక చదవండి, స్ఫూర్తి పొందండి. మీరు కూడా మీ చుట్టుపక్కల ఇటువంటి విషయాలను షేర్ చేయండి. ఈ అందరు భారతీయ లక్ష్ములకు నా ఆదరపూర్వక ప్రణామములు.
నా ప్రియ దేశవాసులారా, 17 వశతాబ్దంలో సుప్రసిద్ధ కవయిత్రి సాంచి హొన్నమ్మ ఆకాలంలో కన్నడ భాషలో ఒక కవిత వ్రాశారు. ఆ భావాలు, ఆ పదాలు, భారతీయ లక్ష్ములందరికీ, ఇప్పుడు మనం చెప్పుకున్నవారందరికీ పునాది అక్కడే రచింపబడిందనుకుంటాను. ఎంత గొప్ప పదాలు, ఎంత గొప్ప భావాలు, ఎంత ఉత్తమమైన ఆలోచనలు, కన్నడలో కవిత ఇలా ఉంది.
ಪೆಣ್ಣಿಂದ ಪೆರ್ಮೆಗೊಂಡನು ಹಿಮವಂತನು
ಪೆಣ್ಣಿಂದ ಭೃಗು ಪೆರ್ಚಿದನು
ಪೆಣ್ಣಿಂದ ಜನಕರಾಯನು ಜಸವಡೆದನು
పెణ్ణింద పెర్మె గొండను హిమవంతను
పెణ్ణింద భృగు పెర్చిదను
పెణ్ణింద జనకరాయను జసవడెదను
అనగా హిమవంతుడు అంటే పర్వత రాజు తన కూతురు పార్వతి వల్ల, భృగు మహర్షి తన కూతురు లక్ష్మి వల్ల, జనకమహారాజు తన కూతురు సీత వల్ల ప్రసిద్ధులైనారు అని. మన పుత్రికలు మన గౌరవం. ఈ పుత్రికల మాహాత్మ్యం వల్లనే మన సమాజానికి బలమైన గుర్తింపు, ఉజ్జ్వల భవిష్యత్తు.
నా ప్రియ దేశవాసులారా, 12 నవంబర్ 2019 నాడు ప్రపంచమంతటా శ్రీ గురునానక్ దేవ్ గారి 550 వ ప్రకాశోత్సవము జరుపుకుంటారు. గురునానక్ ప్రభావం భారత్ లోనే కాదు, ప్రపంచమంతటా ఉంది. ప్రపంచంలో అనేక దేశాల్లో మన సిక్కు సోదరసోదరీమణులు నివసిస్తున్నారు. వారు గురునానక్ దేవ్ గారి ఆదర్శాలకు పూర్తిగా అంకితమైనవారు. నేను వైంకూవర్ (Vancouver), టెహరాన్ గురుద్వారాలకు నేను చేసిన యాత్రను ఎప్పుడూ మరువలేను. శ్రీ గురునానక్ దేవ్ గారి గురించి నేను మీకు ఎంతో చెప్పగలను, కానీ దానికి మన్ కీ బాత్ యొక్క అనేక ఎపిసోడ్ లు కావలసి వస్తాయి. వారు సేవను సర్వోచ్చ స్థానంలో నిలిపారు. గురునానక్ దేవ్ గారు నిస్వార్థ భావంతో చేసిన సేవ అమూల్యమైనదని నమ్మేవారు. వారు అంటరానితనం వంటి సాంఘిక దురాచారాలను తీవ్రంగా వ్యతిరేకించారు. శ్రీ గురునానక్ దేవ్ గారు తమ సందేశాన్ని ప్రపంచంలోని దూరదేశాల వరకూ ప్రసరింపచేశారు. తమ కాలంలో అధికంగా యాత్రలు చేసేవారిలో వారొకరు. అనేక ప్రాంతాలకు వెళ్ళారు, వెళ్ళినచోటల్లా తమ నిరాడంబరత, వినమ్రత, సరళత లతో అందరి మనసులను గెలుచుకున్నారు.గురునానక్ దేవ్ అనేక ముఖ్యమైన ధార్మిక యాత్రలను చేశారు. వాటిని ‘ఉదాసీ’ అంటారు. సద్భావన, సమానత సందేశాలను తీసుకొని వారు ఉత్తరం దక్షిణం తూర్పు పడమర అన్ని దిక్కులకూ వెళ్ళారు, ప్రతి చోటా ప్రజలతో, సాధువులతో, ఋషులతో కలిశారు. అస్సాం యొక్క సుప్రసిద్ధ సాధువు శంకర్ దేవ్ కూడా వారితో స్ఫూర్తి పొందారని నమ్ముతారు. వారు పవిత్ర హరిద్వార్ యాత్ర చేశారు. కాశీలో గురుబాగ్ గురుద్వారా ఒక పవిత్ర స్థలం. శ్రీ గురునానక్ దేవ్ అక్కడ బస చేశారని చెప్తారు. వారు బౌద్ధ ధర్మానికి చెందిన ‘రాజ్ గిర్’, ‘గయ’ వంటి ధార్మిక స్థలాలకు కూడా వెళ్ళారు. దక్షిణాన గురునానక్ దేవ్ శ్రీలంక వరకూ యాత్ర చేశారు.
కర్ణాటకలోని బీదర్ యాత్రాసమయంలో గురునానక్ దేవ్ అక్కడి నీటి సమస్యను పరిష్కరించారు. బీదర్ లో ‘గురునానక్ దేవ్ జీరా సాహెబ్’ పేరుతో ఒక ప్రసిద్ధ స్థలముంది. అది వారి సంస్మరణార్థం వారికే సమర్పింపబడింది. ఒక ‘ఉదాసీ’ కాలంలో గురునానక్ దేవ్ ఉత్తరాన కాశ్మీర్ ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాలను దర్శించారు. దీనివల్ల సిక్ఖు అనుచరులకు, కాశ్మీర్ కు బలమైన సంబంధాలు ఏర్పడ్డాయి. గురునానక్ దేవ్ గారు టిబెట్ కూడా వెళ్ళారు. అక్కడి ప్రజలు వారిని ‘గురువు’గా విశ్వసించారు. వారు ఉజ్బెకిస్తాన్ యాత్ర చేశారు ,అక్కడ కూడా పూజ్యులే. ఒక ‘ఉదాసీ’ లో వారు ఇస్లామిక్ దేశాలకు కూడా పెద్ద ఎత్తున యాత్రలు చేశారు. వాటిలో సౌదీ అరేబియా, ఇరాక్ మరియు ఆఫ్ఘనిస్తాన్ కూడా ఉన్నాయి. వారు లక్షలాది ప్రజల మనసుల్లో కొలువై ఉన్నారు. ఆ ప్రజలంతా పూర్తి భక్తి శ్రద్ధలతో వారి ఉపదేశాలను అనుసరించారు, నేటికీ అనుసరిస్తూనే ఉన్నారు. కొన్ని రోజుల క్రితమే దాదాపు 85 దేశాల రాయబారులు/ప్రతినిధులు దిల్లీ నుంచి అమృత్ సర్ వెళ్ళారు. అక్కడ అమృత్ సర్ స్వర్ణ దేవాలయాన్ని దర్శించారు, గురునానక్ దేవ్ గారి 550 వ ప్రకాశోత్సవానికి హాజరైనారు. అక్కడ ఈ అందరు ప్రతినిధులు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేయడమే కాదు, సిక్ఖు సంప్రదాయాలు, సంస్కృతి గురించి తెలుసుకునే అవకాశం పొందారు. ఆ తర్వాత అనేక మంది ప్రతినిధులు సామాజిక మాధ్యమాలలో అక్కడి ఫోటోలను పంచుకున్నారు. గొప్ప గౌరవపూర్వకమైన తమ అనుభవాలను గురించి కూడా రాశారు. గురునానక్ దేవ్ గారి 550 వ ప్రకాశోత్సవం వారి ఆలోచనలను, ఆదర్శాలను మన జీవనంలోకి తెచ్చుకోవడానికి ఎక్కువ స్ఫూర్తిని కలిగించాలని నా అభిలాష. మళ్ళీ ఒకసారి నేను శిరసు వంచి గురునానక్ దేవ్ గారికి ప్రణామాలు చేస్తున్నాను.
నా ప్రియ సోదరసోదరీమణులారా, అక్టోబర్ 31 మీకందరికీ తప్పక గుర్తు ఉంటుందని నా నమ్మకం. ఆరోజు ఉక్కుమనిషి సర్దార్ వల్లభభాయి పటేల్ జయంతి. వారు దేశాన్ని ఒకతాటిపైకి తీసుకొచ్చిన మహానాయకుడు. సర్దార్ పటేల్ ప్రజలను ఒక్కటి చేసే అద్భుత శక్తిని కలిగి ఉండడమే కాదు, భిన్నాభిప్రాయాలు కలిగిన వారితో కూడా సాంగత్యం కలిగి ఉండేవారు. ప్రతి చిన్న విషయాన్ని కూడా లోతుగా పరిశీలించేవారు, పరీక్షించేవారు. వారు సరైన అర్థంలో వారిని ‘మ్యాన్ ఆఫ్ డీటైల్’ అనవచ్చు. వారు సంఘటితం చేసే నేర్పు కలిగిన నిపుణులు. ప్రణాళికలు తయారుచేయడంలో, రణనీతి తయారుచేయడంలో వారు నైపుణ్యం కలిగినవారు. సర్దార్ సాహెబ్ కార్యశైలి గురించి చదివితే, వింటే వారి ప్లానింగ్ ఎంత బలంగా ఉంటుందో తెలుస్తుంది. 1921 లో అహ్మదాబాద్ లో కాంగ్రెస్ సమావేశం లో పాల్గొనడానికి దేశమంతటి నుంచి వేల సంఖ్యలో ప్రతినిధులు రావలసి ఉంది. సమావేశపు ఏర్పాట్ల బాద్యతలన్నీ సర్దార్ పటేల్ పైన ఉండేవి. ఆ సందర్భాన్ని వారు పట్టణంలో నీటి సరఫరా యొక్క నెట్ వర్క్ ని మెరుగు పరచడానికి కూడా వినియోగించుకున్నారు. ఎవరికీ నీటి కొరత రాకుండా ఉండేలా ఏర్పాటు చేశారు. ఇంతే కాదు, సమావేశ స్థలంలో ఏ యొక్క ప్రతినిధి యొక్క వస్తువులు, చెప్పులు దొంగతనం కాకుండా ఉండేలా వారేం ఏర్పాటు చేశారో తెలుసుకుంటే మీరు ఆశ్చర్య పోతారు. వారు రైతులతో సంప్రదించి, ఖాదీ సంచులను తయారు చేయించారు. రైతులు సంచులు తయారుచేసి, ప్రతినిధులకు అమ్మారు. ఈ సంచులలో చెప్పులు పెట్టుకొని తమతో పాటు ఉంచుకున్నప్పుడు ప్రతినిధులకు చెప్పులు పోతాయేమోనన్న ఆందోళణ పోయింది. అదే సమయంలో ఖాదీ విక్రయం కూడా మెరుగు పడింది. రాజ్యాంగ సభలో ఉల్లేఖనీయ పాత్ర వహించినందుకు సర్దార్ పటేల్ కు మన దేశం ఎప్పుడూ ఋణపడి ఉంటుంది. కులం, సంప్రదాయం ఆధారంగా ఏర్పడే భేదభావాలకు అవకాశం ఉండని విధంగా వారు ప్రాథమిక హక్కులను నిర్ధారించే ముఖ్యమైన పని చేశారు.
సహచరులారా, భారత ప్రథమ హోం శాఖ మంత్రిగా సర్దార్ వల్లభభాయి పటేల్ సంస్థానాలను విలీనం చేసే ఒక గొప్ప భగీరథ, చారిత్రాత్మక కార్యం నిర్వహించారని మనకందరికీ తెలుసు. ప్రతి సంఘటన మీద దృష్టి ఉంచడం వారి ప్రత్యేకత. ఒకవైపు వారి దృష్టి హైదరాబాద్, జూనాగఢ్, ఇంకా ఇతర రాష్ట్రాలమీద ఉన్నా, ఇంకోవైపు సుదూర దక్షిణంలోని లక్షద్వీప్ మీద కూడా ఉండింది. నిజానికి సర్దార్ వల్లభభాయి పటేల్ చేసిన దేశం యొక్క ఏకీకరణ గురించి ఎప్పుడు మాట్లాడినా కొన్ని ముఖ్య ప్రాంతాల లో వారి పాత్ర గురించే చర్చ జరుగుతూ ఉంటుంది. లక్షద్వీప్ వంటి చిన్న ప్రాంతం విషయంలో కూడా వారు ముఖ్య పాత్ర నిర్వహించారు. ఈ మాటను ప్రజలు గుర్తు చేసుకోవడం అరుదు. లక్షద్వీప్ అనేది కొన్ని ద్వీపాల సమూహమని మీకు బాగా తెలుసు. అది భారత్ లో అన్నిటికన్నా అందమైన ప్రాంతాల్లో ఒకటి. 1947 లో భారత్ విభజన తర్వాత మన పొరుగు దేశపు దృష్టి లక్షద్వీప్ మీద ఉంది. తన జెండా తో సహా ఒక ఓడను కూడా పంపింది. సర్దార్ పటేల్ కు ఈ వార్త తెలిసిన వెంటనే ఏమాత్రం సమయం వృథా చేయకుండా వారు కఠిన చర్యలు చేపట్టారు. మొదలియార్ సోదరులు, ఆర్కాట్ రామస్వామి మొదలియార్ మరియు ఆర్కాట్ లక్ష్మణస్వామి మొదలియార్ తో చెప్పారు – ట్రావెన్ కోర్ ప్రజలతో కలిసి ఉద్యమం చేసి జెండా ఎగరేయమని చెప్పారు. లక్షద్వీప్ లో మొదట త్రివర్ణ పతాకం ఎగరాలి. వారి ఆదేశంతో వెంటనే అక్కడ త్రివర్ణ పతాకం ఎగరవేశారు, లక్షద్వీప్ ను ఆక్రమించే పొరుగువారి కుట్రలనన్నిటినీ భగ్నం చేశారు. ఆ తర్వాత మొదలియార్ సోదరులను లక్షద్వీప్ అభివృద్ధి కొరకు సకలప్రయత్నాలను చేయమని వారు కోరారు. నేడు లక్షద్వీప్ భారతదేశ ప్రగతికి తన ముఖ్య పాత్రను నిర్వహిస్తోంది. ఇది ఒక ఆకర్షణీయమైన పర్యాటక ప్రాంతం కూడా. ఈ అందమైన ద్వీపాలను, సముద్రతీరాలను మీరంతా సందర్శిస్తారని నేను విశ్వసిస్తాను.
నా ప్రియ దేశవాసులారా, 31 అక్టోబర్ 2018 న సర్దార్ పటేల్ స్మృత్యర్థం తయారైన ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఏకతామూర్తి దేశానికీ ప్రపంచానికీ అంకితం చేయబడింది. ఇది ప్రపంచంలోనే అన్నిటికన్నా ఎత్తైన విగ్రహం. అమెరికాలోని ‘స్టాట్యూ ఆఫ్ లిబర్టీ’ కన్నా ఇది రెండింతలు ఎత్తైనది. ప్రపంచంలో అన్నిటికన్న ఎత్తైన విగ్రహం ప్రతి హిందూస్తానీకి గర్వకారణం. ప్రతి హిందూస్తానీ గర్వంతో తలెత్తుకొనే విషయం. ఒక సంవత్సరంలోగా 26 లక్షలకు పైగా పర్యాటకులు ఈ ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ దర్శనార్థం వచ్చారని తెలిస్తే మీరు చాలా సంతోషిస్తారు. ఈ లెక్కన ప్రతిరోజూ సగటున ఎనిమిదిన్నర వేల మంది ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ యొక్క వైభవాన్ని దర్శించారు. సర్దార్ వల్లభభాయి పటేల్ పట్ల వారి మనసులోని నమ్మకాన్ని, భక్తిని ప్రకటించారు, అంతేకాక అక్కడ ఇప్పుడు కాక్టస్ గార్డెన్, బటర్ ఫ్లై గార్డెన్, జంగిల్ సఫారీ, చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్ , ఏకతా నర్సరీ వంటి అనేక ఆకర్షణీయ కేంద్రాలు క్రమంగా వృద్ధి చెందుతూ స్థానిక ఆర్థిక వ్యవస్థకు చేయూతగా ఉన్నాయి. ప్రజలకు రోజురోజుకూ కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. పర్యాటకుల సౌకర్యార్థం అక్కడి అనేక గ్రామాల ప్రజలు తమ తమ ఇళ్ళల్లో హోమ్ స్టే సౌకర్యమూ కల్పిస్తున్నారు. హోమ్ స్టే సౌకర్యాలు కల్పించే ప్రజలకు ప్రొఫెషనల్ ట్రైనింగ్ కూడా ఇప్పించబడుతున్నది. అక్కడి ప్రజలు ఇప్పుడు డ్రాగన్ పండ్ల సేద్యం కూడా ప్రారంభించారు. త్వరలోనే అక్కడి ప్రజలకు ఇది ముఖ్య ఉపాధి అవుతుందని నేను నమ్ముతున్నాను.
సహచరులారా, దేశం కోసం, అన్ని రాష్ట్రాల కోసం, పర్యాటక పరిశ్రమ కోసం, ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ఒక అధ్యయనాంశం అవుతుంది. ఒక సంవత్సర కాలంలోపలే ఒక ప్రాంతం విశ్వప్రసిద్ధ పర్యాటక క్షేత్రం గా ఎలా వృద్ధి చెందుతుందో దీనికి మనమే సాక్షి. అక్కడికి దేశవిదేశాల నుంచి ప్రజలు వస్తారు. రవాణా, వసతి, గైడ్స్, ఎకోఫ్రెండ్లీ వ్యవస్థలు ఒకదాని తర్వాత ఒకటి అనేక వ్యవస్థలు వాటంతటవే వృద్ధి చెందుతున్నాయి. గొప్ప ఆర్థిక వృద్ధి జరుగుతున్నది. పర్యాటకుల అవసరాలకనుగుణంగా ప్రజలు సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రభుత్వం తన పాత్ర నిర్వహిస్తోంది. సహచరులారా! ఈమధ్య టైమ్ మాగజైన్ ప్రపంచంలోని 100 ముఖ్యమైన టూరిస్ట్ డెస్టినేషన్ లలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ కి ముఖ్యస్థానం ఇచ్చారన్న విషయం పట్ల ఏ హిందూస్తానీ గర్వ పడకుండా ఉండగలడు! మీరంతా మీ అమూల్యమైన సమయంలో కొంత సమయం వెచ్చించి ‘స్టాట్యూ ఆఫ్ యూనిటీ’ ని చూడడానికి వెళ్తారని నేను ఆశిస్తున్నాను. పర్యటన, యాత్ర చేయాలనుకున్న ప్రతి హిందూస్తానీ భారత్ లోని కనీసం 15 టూరిస్ట్ డెస్టినేషన్స్ కు కుటుంబంతో సహా వెళ్ళి అక్కడ ఒక రాత్రి ఉండాలని నా విన్నపం ఎప్పటికీ ఉంటుంది.
సహచరులారా, 2014 నుంచి ప్రతి సంవత్సరమూ అక్టోబర్ 31 న ‘జాతీయ ఐక్యతా దినోత్సవం’ గా జరుపుకుంటున్నామని మీకు తెలుసు. ఈ రోజు మనము మన దేశం యొక్క ఐక్యత, అఖండత భద్రత ఎట్టి పరిస్థితులలోనూ రక్షించాలనే సందేశాన్నిస్తుంది. 31 అక్టోబర్ ప్రతీసారిలాగే రన్ ఫర్ యూనిటీ కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇందులో సమాజంలోని ప్రతి వర్గంలోని ప్రజలు పాల్గొంటారు. రన్ ఫర్ యూనిటీ ఈ దేశం ఒక్కటి అనే మాటకు ప్రతీక. ఒకే దిశ వైపు పయనిస్తుంది. ఒకే లక్ష్యాన్ని చేరుకోవాలని ఆశిస్తుంది. ఒకే లక్ష్యం – ఒకే భారత్ శ్రేష్ఠ భారత్.
గత ఐదేళ్ళనుంచి చూస్తున్నాము – దిల్లీ నే కాకుండా హిందూస్తాన్ యొక్క వందల పట్టణాలలో, కేంద్రపాలిత ప్రాంతాలలో, రాజధానులలో, జిల్లాకేంద్రాలలో, చిన్న టైర్ 2 టైర్ 3 పట్టణాల్లో కూడా చాలా ఎక్కువ సంఖ్యలో స్త్రీ పురుషులు నగరవాసులు, గ్రామవాసులు, పిల్లలు, యువతీయువకులు, వృద్ధులు, దివ్యాంగులు, అందరూ పెద్ద సంఖ్యలో కలుస్తున్నారు. ఏదైమైనా నేటి కాలంలో ప్రజలలో మారథాన్ మీద ఒక ఆసక్తి , పట్టుదల చూస్తూనే ఉన్నాము. రన్ ఫర్ యూనిటీ కూడా ఒక ఇలాంటి విశిష్టమైన అవకాశం. పరుగు మనసు, మెదడు శరీరాలకు లాభదాయకమైనది. దీంట్లో పరుగూ ఉంది, ఫిట్ ఇండియా భావాన్ని చరితార్థం చేస్తుంది, దాంతో పాటే ఒకే భారత్ – శ్రేష్ఠ భారత్ ఈ ఉద్దేశాన్ని కూడా మనం అలవరచుకుంటాము. అందుకే కేవలం శరీరం మాత్రం కాదు, మనసు, సంస్కారం కూడా భారత్ యొక్క ఐక్యత కోసం, భారత్ ను నూతన శిఖరాలకు చేర్చడం కోసం. అందుకే మీరు ఏ పట్టణంలో ఉన్నారో అక్కడ మీ చుట్టుపక్కల రన్ ఫర్ యూనిటీ గురించి తెలుసుకోగలరు. దీనికోసం ఒక పోర్టల్ లాంచ్ చేయబడింది. runforunity.gov.in ఈ పోర్టల్ లో దేశమంతటా ఎక్కడ రన్ ఫర్ యూనిటీ ఏర్పాటు అవుతుందో ఆ వివరాలు ఉన్నాయి. మీరంతా 31 అక్టోబర్ నాడు భారత్ ఐక్యత కోసం, మీ మీ ఫిట్ నెస్ కోసం కూడా తప్పకుండా పరుగులో పాల్గొంటారని నేను నమ్ముతున్నాను.
నా ప్రియ దేశవాసులారా, సర్దార్ పటేల్ దేశాన్ని ఐక్యతా సూత్రంలో కూర్చారు. ఐక్యతా మంత్రం మన జీవన సంస్కారం వంటిది. భారత్ వంటి వైవిధ్యాలతో కూడిన దేశంలో మనం ప్రతి స్థాయిలో, ప్రతి మార్గంలో, ప్రతి మలుపులో, ప్రతి మజిలీలో ఐక్యతా మంత్రానికి బలం చేకూరుస్తూ ఉండాలి. నా ప్రియ దేశవాసులారా, దేశం యొక్క ఐక్యత పరస్పర సద్భావన ను పరిపుష్టి చేసేందుకు మన సమాజం ఎల్లప్పుడూ ఎంతో చొరవతో, జాగరూకతతో ఉంది. మనం మన చుట్టుపక్కల చూస్తే చాలు, ఇలాంటి ఉదాహరణలు ఎన్నో దొరుకుతాయి. ఆ ఉదాహరణల్లో పరస్పర సద్భావం పెంచేందుకు నిరంతరం పని చేసే వారు కనిపిస్తారు. కానీ చాలాసార్లు సమాజం యొక్క ప్రయత్నాలు, దాని పాత్ర స్మృతిపథం నుంచి కనుమరుగవుతూ ఉంటాయి
సహచరులారా, 2010 సెప్టెంబర్‌లో రామజన్మభూమి మీద అలహాబాద్ హైకోర్ట్ లో తీర్పు రావడం నాకు గుర్తు ఉంది. ఆ రోజులను కొంచెం గుర్తు చేసుకోండి. ఎలాంటి వాతావరణం ఉంది! రకరకాల మనుష్యులు మైదానంలోకి వచ్చేశారు. ఎలాంటి స్వార్ధపరులు ఆ పరిస్థితులను తమ తమ పద్ధతులలో తమ లాభానికనుగుణంగా మలచుకోడానికి ప్రయత్నించారు! వాతావరణంలో ఉద్రిక్తత పెంచడానికి ఎన్నెన్ని రకాల మాటలు మాట్లాడేవారు! భిన్న భిన్న స్వరాలలో మంటలు పెంచడానికి ప్రయత్నాలు చేశారు. కొందరు నినాదాలవాళ్ళు, గొప్పలకు పోయేవాళ్ళు కేవలం తాము ప్రసిద్ధులు కావడానికి ఏమేం మాట్లాడారో వాళ్ళకే తెలీదు. ఎలాంటి బాధ్యతారహితమైన మాటలు మాట్లాడారో మనకంతా గుర్తుంది. కానీ ఇదంతా ఐదురోజులు, ఏడు రోజులు, పది రోజులు జరుగుతూ ఉంది, కానీ తీర్పు రాగానే, ఒక ఆనందదాయకమైన, ఆశ్చర్యకరమైన మార్పు దేశం చూసింది. ఒక వైపు రెండు వారాల వరకూ ఉద్రిక్తత పెంచడం కోసం ఇదంతా జరిగింది, కానీ రామజన్మభూమి మీద తీర్పు రాగానే ప్రభుత్వము, రాజకీయపక్షాలు, సాంఘిక సంస్థలు, పౌర సమాజం అన్ని సంప్రదాయాల ప్రతినిధులు, సాధు, సంత్ లు అందరూ సమతుల్యమైన సంయమనంతో ప్రకటనలు చేశారు. వాతావరణంలో ఉద్రిక్తతను తగ్గించే ప్రయత్నం. కానీ నాకు ఆ రోజులు ఇప్పటికీ బాగా గుర్తు. ఎప్పుడు ఆరోజును గుర్తు చేసుకున్నా మనసుకు ఆనందం కలుగుతుంది. న్యాయస్థానం యొక్క గరిమ గౌరవపూర్వకంగా సమ్మానించబడింది. ఎక్కడకూడా ఉద్రిక్తతను, వేడిని పెంచే అవకాశం రానివ్వలేదు. ఈ మాటలు ఎప్పుడూ గుర్తు పెట్టుకోవాలి. ఇవి మనకు బలాన్నిస్తాయి. ఆరోజులు ఆ క్షణాలు, మనకు కర్తవ్యబోధ చేస్తాయి. ఐక్యతా స్వరం దేశానికి ఎంత శక్తి ఇస్తుంది అనేదానికి ఇది ఉదాహరణ.
నా ప్రియ దేశవాసులారా, 31 అక్టోబర్ మన దేశం యొక్క మాజీ ప్రధాని శ్రీమతి ఇందిర గారి హత్య జరిగినరోజు. దేశానికి ఒక పెద్ద దెబ్బ తగిలిన రోజు. నేను వారికి కూడా నేడు నా శ్రద్ధాంజలి సమర్పించుకుంటున్నాను.
నా ప్రియ దేశవాసులారా, నేడు ఇంటింటి కథ ఒకటి దూర తీరాలకు వినిపిస్తుందంటే, ప్రతి గ్రామం యొక్క కథ వినిపిస్తుందంటే, ఉత్తరం నుంచి దక్షిణం వరకూ, తూర్పు నుంచి పడమర వరకూ హిందూస్థాన్ లోని మూలమూలలా ఒక కథ వినిపిస్తుందంటే అది స్వచ్ఛత కథ. ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబం, ప్రతి గ్రామం స్వచ్ఛతకు సంబంధించి తన సంతోషకరమైన అనుభవాలను చెప్పాలనుకుంటారు. ఎందుకంటే స్వచ్చతా ప్రయత్నాలు నూట ముప్ఫై కోట్ల హిందూస్తానీలవి. వీటి ఫలితాలు కూడా నూటముప్ఫై కోట్ల హిందూస్థానీలవి. ఒక సంతోషకరమైన రోమాంచితం చేసే అనుభవమొకటి ఉంది. నేను విన్నాను. మీకూ వినిపించాలనుకుంటున్నాను. మీరు ఊహించండి – విశ్వంలో అన్నిటికన్నా ఎత్తైన యుద్ధ క్షేత్రం, వాతావరణం మైనస్ 50-60 డిగ్రీల లోకి వెళ్ళేచోట, గాలిలో ఆక్సిజన్ కూడా నామమాత్రంగా ఉండేచోట, ఇటువంటి ప్రతికూల పరిస్థితులలో ఇన్ని సవాళ్ళమధ్య ఉండడం పరాక్రమం కన్నా తక్కువేమీ కాదు, అటువంటి కఠిన పరిస్థితులలో మన వీర సైనికులు రొమ్ము విరుచుకొని దేశ సరిహద్దులను రక్షించడమే కాక అక్కడ స్వచ్ఛ సియాచిన్ ఉద్యమం కూడా చేస్తున్నారు. భారతీయ సైన్యం యొక్క ఈ అద్భుత నిబద్ధత కై నేను దేశవాసుల తరఫున వారికి ప్రశంసలు అందజేస్తున్నాను. కృతజ్ఞత ప్రకటిస్తున్నాను. అక్కడ ఎంత చలి ఉంటుందంటే డీకంపోజ్ కావడమే కష్టం. అందులో చెత్తాచెదారాన్ని వేరుచేయడమే కాదు, ఆ ఏర్పాటు చేయడం కూడా చాలా గొప్ప పని. అందులో, గ్లేసియర్ చుట్టుపక్కల 130టన్నులకు పైన చెత్తను తొలగించడం, అదీ అక్కడి సున్నితమైన జీవావరణ వ్యవస్థ! ఎంత పెద్ద సేవ అది! అది కూడా అరుదైన జాతి మంచు చిరుతపులులు నివసించే ఎకోసిస్టమ్ ఉన్న ప్రదేశం! అక్కడ సియాచిన్ జాతి గొర్రెలు, గోధుమ రంగు ఎలుగుబంట్లు వంటి అరుదైన జంతువులు ఉండే ప్రదేశం. ఈ సియాచిన్ నదుల స్వచ్చమైన నీటి మూలాలు, గ్లేసియర్ లు అని మనకందరికీ తెలుసు. కాబట్టి ఇక్కడ స్వచ్ఛతా ఉద్యమం చేసే పని అంటే ప్రజలకు ఇక్కడి నుంచి క్రింది ప్రాంతాలకు పారే నీటిని స్వచ్ఛంగా అందించటం ద్వారా చేయడం. దాంతో పాటు నుబ్రా, ష్యోక్ వంటి నదీజలాలను ఉపయోగిస్తారు.
నా ప్రియ దేశవాసులారా, పండుగ మనందరి జీవితాలలో ఒక కొత్త చైతన్యాన్ని మేల్కొలిపే పర్వంగా ఉంటుంది. ఇంకా దీపావళి అంటే ముఖ్యంగా ఏదో కొత్తవస్తువు కొనడం, ప్రతీ కుటుంబంలో ఎక్కువ తక్కువ జరుగుతూనే ఉంటుంది. మనము స్థానికంగా లభించే వస్తువులనే కొనుగోలు చేసే ప్రయత్నం చేయాలని నేను ఒకసారి చెప్పాను. మనకు అవసరమైన వస్తువులు మన గ్రామంలో దొరుకుతుంటే వాటికోసం మనము తాలూకాకు వెళ్ళవలసిన పని లేదు. తాలూకా పట్టణంలో దొరుకుతున్నవాటి కోసం జిల్లా కేంద్రం వరకూ వెళ్ళక్కరలేదు. ఎంత ఎక్కువగా మనం స్థానిక వస్తువులను కొంటామో, ‘గాంధీ 150’ అంతగా గొప్పగా జరిగినట్టు అనుకోవచ్చు. నా విన్నపం ఏమిటంటే మన తయారీదార్లు చేత్తో చేసినవి, మన ఖాదీ వారు నేసినవి కొంతైనా మనం కొనాలి. ఈ దీపావళికి కూడా ముందే మీరు చాలా కొనేసి ఉంటారు గానీ, కొందరు దీపావళి తర్వాతైతే కొద్దిగా తక్కువ ధరలకు దొరుకుతుంది అని ఆలోచించే వారు ఉంటారు. కాబట్టి ఇంకా దీపావళి తర్వాత కొనుగోళ్ళు చేసేవాళ్ళు చాలామందే ఉంటారు. కాబట్టి దీపావళి శుభాకాంక్షలతో పాటు నేను విన్నపం చేస్తున్నాను. రండి మనం లోకల్ వి కొనాలన్న నియమం పెట్టుకుందాం. స్థానిక వస్తువులను కొందాం. చూడండి, మహాత్మా గాంధీ కలలను నిజం చేయడంలో మనము ముఖ్య పాత్ర పోషించినట్లవుతుంది. నేను మరొక్కసారి ఈ దీపావళి పండుగ సందర్భంగా మీకు అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దీపావళి కి మనము రకరకాల టపాకాయలు వాడుతాము. కానీ అప్పుడప్పుడూ అజాగ్రత్తవలన నిప్పు అంటుకుంటుంది. ఎక్కడైనా గాయాలవుతుంటాయి. మీకందరికీ నా విన్నపం ఏమిటంటే మీరు జాగ్రత్తగానూ ఉండండి, పండుగను ఉత్సాహంగానూ జరుపుకోండి. నా అనేకానేక శుభాకాంక్షలు.
అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశ ప్రజలారా,
నమస్కారం,
మిత్రులారా, దేశంలోని ఒక ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వారి గురించి కూడా ఇవాళ్టి మన్ కీ బాత్ లో నేను మాట్లాడబోతున్నాను. మన దేశప్రజలందరి మనసుల్లోనూ వారి పట్ల ఎంతో గౌరవము, అభిమానము ఉన్నాయి. మన దేశంలో ఆమె పట్ల ఆప్యాయత, గౌరవము లేని వాళ్ళంటూ ఎవరూ ఉండరేమో. వయసులో ఆవిడ మనందరి కన్నా ఎంతో పెద్దావిడ. దేశ చరిత్రలోని ఎన్నో మైలురాళ్ళకు, రకరకాల కాలాలకు ఆవిడ సాక్షి. మనం ఆవిడని దీదీ(అక్కయ్య) అంటాము – ఆమె "లతా దీదీ"(లత అక్కయ్య). ఈ సెప్టెంబర్ 28 నాటికి ఆవిడకి తొంభై ఏళ్ళు నిండాయి. విదేశీ ప్రయాణానికి వెళ్ళే ముందర నాకు దీదీతో మాట్లాడే అవకాశం లభించింది. ఒక చిన్న తమ్ముడు తన అక్కయ్యతో గారంగా మాట్లాడినట్లే ఆ సంభాషణ నడిచింది. ఇలాంటి వ్యక్తిగత సంభాషణల గురించి నేనెప్పుడూ మాట్లాడను కానీ ఇవాళ మీరు కూడా లతా దీదీ మాటలను, మా సంభాషణనూ వినాలని నేను కోరుకుంటున్నాను. ఈ వయసులో కూడా లతా దీదీ దేశంతో ముడిపడి ఉన్న ఎన్నో విషయాల పట్ల ఎంత ఉత్సుకతతో ఉన్నారో, తయారుగా ఉన్నారో మీరూ వినండి. భారతదేశ ప్రగతిలో, మారుతున్న భారతదేశంలో, నూతన శిఖరాలను అందుకుంటున్న భారతదేశంలోనే జీవన సంతోషం దాగి ఉంది మరి!
మోదీగారు: లతాదీదీ, నమస్కారం! నేను నరేంద్ర మోదీ ని మాట్లాడుతున్నాను.
లత గారు: నమస్కారం.
మోదీగారు: నేను ఫోన్ ఎందుకు చేసానంటే, ఈసారి మీ పుట్టినరోజునాడు..
లత గారు: ఆ.. చెప్పండి..
మోదీగారు: నేను విమాన ప్రయాణంలో ఉంటాను.
లత గారు: అలానా !
మోదీగారు: అందుకని బయల్దేరే ముందరే –
లత గారు: ఆ.. చెప్పండి..
మోదీగారు: మీకు అనేకానేక ముందస్తు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాను. మీ ఆరోగ్యం బాగుండాలి. మా అందరికీ మీ ఆశీస్సులు అందాలి. ఇదే నా ప్రార్థన. మీకు ప్రణామాలు తెలపాలనే అమెరికా వెళ్ళే ముందరే నేను మీకు ఫోన్ చేశాను.
లత గారు: మీ ఫోన్ వస్తుందని తెలిసి నేనెంతో ఆశ్చర్యపోయాను. మీరు ఎప్పుడు తిరిగివస్తారు?
మోదీగారు: 28వ తేదీ అర్థరాత్రి దాటాకా 29వ తేదీ తెల్లవారుఝామున. అప్పటికి మీ పుట్టినరోజు అయిపోతుంది.
లత గారు: ఓహో, అలానా. పుట్టినరోజు జరిపుకునేదేమీ లేదు. ఏదో ఇంట్లోనే..
మోదీగారు: చూడండి దీదీ, నాకు మీ..
లత గారు: మీ ఆశీర్వాదం దొరికితే..
మోదీగారు: అయ్యో, మీరు నా కన్నా పెద్దవారు కాబట్టి మీ ఆశీర్వాదాన్నే మేము కోరుకుంటున్నాం.
లత గారు: వయసులో పెద్దవారు చాలామందే ఉంటారు. కానీ ఎవరైతే తన పనుల వల్ల పెద్దవారౌతారో, వారి ఆశీర్వాదం లభించడం ఎంతో గొప్ప విషయం.
మోదీగారు: దీదీ మీరు వయసులోనూ పెద్దవారే. మీరు చేసిన పనుల వల్లా పెద్దవారే. మీరు సాధించిన సాఫల్యాలు ఎంతో సాధన వల్ల, తపస్సు వల్ల లభిస్తాయి.
లత గారు: అవునండీ, ఇదంతా మా తల్లిదండ్రుల ఆశీర్వాదం, శ్రోతల ఆశీర్వాదం వల్ల సాధ్యమైంది. నా వల్ల జరిగినదేమీ లేదు.
మోదీగారు: జీవితంలో మీరు ఇంత సాధించిన తర్వాత కూడా మీ తల్లిదండ్రులు అందించిన సంస్కారానికీ, వినమ్రతకీ ఎల్లప్పుడూ ప్రాముఖ్యతనివ్వడం మాకెంతో స్ఫూర్తిదాయకం. మీరు చూపే ఈ వినయమే మావంటి కొత్త తరాలవారికి, అందరికీ కూడా నేర్చుకోవలసిన ముఖ్యమైన విషయం. ఇది మా అందరికీ ఎంతో ప్రేరణాత్మకమైన సంగతి.
లత గారు: ఊ..
మోదీగారు: మీ తల్లిగారు గుజరాతీ అని మీరు గర్వంగా చెప్పినప్పుడల్లా నాకు ఆనందం కలుగుతుంది.
లత గారు: ఊ..
మోదీగారు: నేను ఎప్పుడు మీ వద్దకు వచ్చినా మీరు నాకు ఏదో ఒక గుజరాతీ వంటకాన్నే తినిపించారు.
లత గారు: ఔను. మీరేమిటనేది మీకు తెలీదు. కానీ నాకు తెలుసు. మీ రాక వల్ల భారతదేశం ముఖచిత్రమే మారిపోతోంది. అదే నాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. చాలా బాగా అనిపిస్తుంది.
మోదీగారు: చాలు దీదీ. మీ ఆశీర్వాదం ఇలానే ఉండాలి. యావత్ దేశానికీ మీ ఆశీర్వాదం కావాలి. మాలాంటివారు ఏదో ఒక మంచి చేస్తూ ఉండాలి. మీరు నాకెప్పుడూ ప్రేరణని అందిస్తూనే ఉన్నారు. మీ ఉత్తరాలు నాకు అందుతూ ఉంటాయి. మీరు ఎప్పుడూ పంపించే ఏవో ఒక బహుమతులు నాకు అందుతూ ఉంటాయి. ఈ ఆత్మీయత, ఒక కుటుంబంలాంటి అనుబంధం నాకెంతో ఆనందాన్ని ఇస్తాయి.
లత గారు: నేను మిమ్మల్ని ఎక్కువ శ్రమ పెట్టకూడదనుకుంటాను. ఎందుకంటే, మీరెంత బిజీగా ఉంటున్నారో, మీకు ఎంత పని ఉంటోందో నేను గమనిస్తున్నాను. ఎంతగానో ఆలోచించాల్సి ఉంటుంది. మీరు వెళ్ళి మీ అమ్మగారి పాదాలంటి ఆశీర్వాదం తీసుకుని వచ్చాకా, నేను కూడా ఆవిడ వద్దకు ఎవరినో పంపించి, ఆవిడ ఆశీర్వాదాలను అందుకున్నాను.
మోదీగారు: అవును అమ్మకు గుర్తు ఉంది. నేను వెళ్ళినప్పుడు నాకు చెప్పింది.
లత గారు: టెలీఫోన్ లో ఆవిడ నాకు ఆశీస్సులు అందించినప్పుడూ నాకు చాలా ఆనందం కలిగింది.
మోదీగారు: మీరు చూపిన ఈ అభిమానానికి అమ్మ చాలా ఆనందించింది.
లత గారు: అవును.
మోదీగారు: నా గురించి మీరిలా ఎప్పుడూ ఆదుర్దాపడుతున్నందుకు కృతజ్ఞతలు. మరోసారి మీకు అనేకానేక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
లత గారు: అలాగే.
మోదీగారు: ఇటీవల ముంబై వచ్చినప్పుడు మిమ్మల్ని ముఖాముఖి కలవాలని చాలా అనుకున్నాను.
లత గారు: తప్పకుండా.. మరి రాలేదు..
మోదీగారు: సమయం లేక నేను రాలేకపోయాను.
కానీ త్వరలో నేను తప్పకుండా వస్తాను.
లత గారు: అలాగే.
మోదీగారు: మీ ఇంటికి వచ్చి , మీ చేతులతో చేసిన కొన్ని గుజరాతీ వంటకాలు తింటాను.
లత గారు: అలాగే తప్పకుండా. తప్పకుండా. ఇది నా అదృష్టంగా భావిస్తాను.
మోదీగారు: నమస్కారం దీదీ.
లత గారు: నమస్కారం.
మోదీగారు: మీకు అనేకానేక శుభాకాంక్షలు
లత గారు: అనేకానేక ప్రణామాలు.
మోదీగారు: నమస్కారం.
నా ప్రియమైన దేశప్రజలారా, నవరాత్రి తో పాటుగా ఇవాళ్టి నుంచీ పండుగల వాతావరణం మరోసారి కొత్త ఆశలతో, కొత్త ఉత్సాహంతో, కొత్త శక్తితో, కొత్త సంకల్పాలతో నిండిపోతుంది. పండుగల కాలం కదా! రాబోయే కొన్ని వారాల వరకూ దేశవ్యాప్తంగా పండుగల వెలుగు ఉంటుంది. మనందరమూ కూడా నవరాత్రి ఉత్సవాలు,గర్బా, దుర్గా పూజ, దసరా, దీపావళి, భగినీ హస్త భోజనం, ఛత్ పూజ, వంటి ఎన్నో పండుగలను జరుపుకుంటాము. రాబోయే పండుగలన్నింటీకీ, మీ అందరికీ నా తరఫున అనేకానేక శుభాకాంక్షలు. పండుగ సమయానికి కుటుంబసభ్యులందరూ కలుస్తారు. ఇళ్ళన్నీ ఆనందంతో, కేరింతలతో నిండిపోయి ఉంటాయి. కానీ మీరు గమనించే ఉంటారు, మన చుట్టుపక్కల కూడా, ఈ పండుగల ఆనందాన్ని అందుకోలేనివారు చాలామంది ఉంటారు. దీనినే "దీపం క్రింద చీకటి" అంటారు. ఈ సామెత కేవలం అక్షరాలకే పరిమితం కాదు. ఇది మనందరికీ ఒక ఆదేశం. ఒక సాక్షాత్కారం. ఒక ప్రేరణ. ఆలోచించండి. ఒక పక్క కొన్ని ఇళ్ళు వెలుగులతో నిండి ఉంటే, మరో పక్క వారి ఎదురుగానే కొన్ని చుట్టుపక్కల ఇళ్ళల్లో చీకటి నిండి ఉంటుంది.
కొన్ని ఇళ్ళల్లో మిఠాయిలు పాడయిపోతూ ఉంటే, కొన్ని ఇళ్ళల్లో పిల్లలు మిఠాయిల కోసం తపిస్తారు. కొన్ని చోట్ల అలామారాల్లో బట్టలు పెట్టడానికి చోటే ఉండదు. కొన్నిచోట్ల శరీరాన్ని కప్పేందుకు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. దీన్నే కదా "దీపం క్రింద చీకటి" అంటారు? ఇదే "దీపం క్రింద చీకటి" అంటే! ఇలాంటి చీకట్లు తొలగినప్పుడే ఈ పండుగల నిజమైన ఆనందాన్ని మనం ఆస్వాదించగలం. చీకటి తొలగి వెలుగు నిండాలి. ఆనందాలు లేని చోట మనం ఆనందాన్ని నింపాలి. ఇదే మన స్వభావం కావాలి. మన ఇళ్ళల్లోకి మిఠాయిలూ, బట్టలు , బహుమతులు వచ్చినప్పుడు ఒక్క క్షణం వాటిని బయటకు పంచే మార్గాన్ని కూడా ఆలోచించాలి. కనీసం మన ఇళ్ళల్లో అధికంగా ఉన్న వస్తువులు, మనకు అవసరం లేని వస్తువులు అయినా తప్పకుండా పంచిపెట్టే అలవాటు చేసుకోవాలి. ఎన్నో పట్టణాల్లో, ఎన్నో ఎన్.జీ.వోలు యువ మిత్రుల స్టార్ట్ అప్స్ ఇటువంటి పనులు చేస్తున్నాయి. వాళ్ళు ప్రజల వద్ద నుండి బట్టలు, స్వీట్లు, భోజనం లాంటివి సమీకరించి అవసరార్థులను వెతికి వెతికి, వారికి ఈ వస్తువులన్నీ చేరుస్తారు. ఈ పనులన్నీ గుప్తంగా కూడా చేస్తారు. ఈసారి ఈ పందుగ సమయంలో పూర్తి అవగాహనతో, సంకల్పంతో ఈ " దీపం క్రింద చీకటిని " తొలగించగలమా? ఎన్నో పేద కుటుంబీకుల మొహాలపై మీరు పూయించే చిరునవ్వులు పండుగల్లో మీ ఆనందాన్ని రెండింతలు చెయ్యగలదు. మీ మోము మరింతగా మెరవగలదు. మీ ప్రమిద మరింత ప్రకాశవంతంగా మారగలదు. మీ దీపావళి మరింత వెలుగులను నింపగలదు.
నా ప్రియమైన సోదర సోదరీమణులారా, దీపావళికి అదృష్టము, సమృధ్ది రూపాలలో లక్ష్మి ఇంటింటికీ వస్తుంది. సంప్రదాయపరంగా లక్ష్మిని స్వాగతిస్తారు. ఈసారి మనం కొత్త రకంగా లక్ష్మిని స్వాగతిద్దామా? మన సంస్కృతిలో ఆడపడుచులను లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. ఎందుకంటే ఆడపిల్ల అదృష్టాన్నీ, సమృధ్ధినీ తెస్తుంది. ఈసారి మనం మన సమాజంలో , పల్లెల్లో, పట్టణాల్లో ఆడబిడ్డలను గౌరవించే కార్యకమం ఏర్పాటు చేద్దామా? ఇటువంటి ఒక సార్వజనిక కార్యక్రామం ఏర్పాటు చేద్దామా? తమ కష్టంతో, పట్టుదలతో, ప్రతిభతో కుటుంబానికీ, సమాజానికీ, దేశానికీ పేరుని తీసుకువస్తున్న ఎందరో ఆడబిడ్డలు మన మధ్య ఉండే ఉంటారు. ఈ దీపావళికి అటువంటి లక్ష్ములను గౌరవించే ఈ కార్యక్రమం మనం చేయగలమా? అసాధారణమైన పనులు చేస్తున్న ఎందరో ఆడపడుచులూ, కోడళ్ళూ మన చుట్టూ ఉండే ఉంటారు. కొందరు నిరు పేద విద్యార్థులకు చదువు చెప్పే బాధ్యతను చేపడతారు. పరిశుభ్రత, ఆరోగ్యాలపై దృష్టి పెట్టి జాగురుకతని పంచే దిశలో కొందరుంటే; డాక్టర్లు, ఇంజనీర్లు గా మారి సమాజానికి సేవ చేసేవారు కొందరు, వకీలుగా మారి ఎవరికో న్యాయం చేసేందుకు పాటుపడేవారు కొందరు. మన సమాజం ఇటువంటి ఆడబిడ్డలను గుర్తించి, గౌరవించి, గర్వపడాలి. దేశవ్యాప్తంగా ఈ గౌరవ కార్యక్రమాలు జరగాలి. మనం మరో పనిని కూడా చేయగలం – ఈ ఆడబిడ్డల విజయాలను గురించి సోషల్ మీడియాలో షేర్ చేయండి, హేష్ టాగ్ #(Hashtag) ఉపయోగించిండి, #bharatkilaxmi (భారత లక్ష్మి) అని రాయండి. మనందరమూ కలిసి "సెల్ఫీ విత్ డాటర్" అనే మహా ఉద్యమాన్ని నడిపాము గుర్తుందా? అది ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఇప్పుడు కూడా అలానే మనం "భారత లక్ష్మి" ఉద్యమాన్ని చేపడదాం. భారత లక్ష్మి ని ప్రోత్సహించడం అంటే దేశమూ, దేశ ప్రజల శ్రేయస్సు మార్గాలని మరింత బలోపేతం చేయడమే.
నా ప్రియమైన దేశప్రజలారా, మన్ కీ బాత్ వల్ల ఎంతో గొప్ప ప్రయోజనం ఉందని నేనింతకు మునుపు కూడా చెప్పాను. దీని వల్లనే ఎందరో పరిచిత, అపరిచిత వ్యక్తులతో ప్రత్యక్ష్యంగానూ, పరోక్షంగానూ మాట్లాడే అదృష్టం నాకు లభిస్తోంది. కొద్ది రోజుల క్రితం నాకు ఎక్కడో అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన అలీనా తాయంగ్ అనే విద్యార్థిని నుంచి చాలా ఆసక్తికరమైన ఉత్తరం వచ్చింది. అందులో ఏం ఉందో , ఉత్తరాన్ని మీకు కూడా చదివి వినిపిస్తాను ..
"గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారూ,
నా పేరు అలీనా తాయంగ్. అరుణాచల్ ప్రదేశ్ లోని రోయింగ్ నుంచి నేను రాస్తున్నాను. ఈసారి నా పరీక్షా ఫలితాలు వచ్చినప్పుడు ఎవరో నన్ను అడిగారు, నువ్వు Exam Warriors పుస్తకాన్ని చదివావా? అని. నేనా పుస్తకం చదవలేదని చెప్పాను కానీ వెళ్లి కొనుక్కుని , రెండు మూడుసార్లు చదివాను. ఆ తర్వాత నాకు చాలా మంచి జరిగింది. పరీక్షల ముందర గనుగ ఈ పుస్తకాన్ని చదివి ఉంటే ఇంకా ప్రయోజనం కలిగేది కదా అనుకున్నాను. ఈ పుస్తకంలో ఎన్నో విషయాలు నాకు బాగా నచ్చాయి. కానీ ఇందులో విద్యార్థుల కోసం ఎన్నో చిట్కాలున్నాయి కానీ తల్లిదండ్రుల కు, ఉపాధ్యాయులకు ఎక్కువేమీ లేదు. ఈ పుస్తకాన్ని మరొకమారు ముద్రించే ఉద్దేశం ఉంటే గనుక కొత్త ఎడిషన్ లో తల్లిదండ్రుల కు, ఉపాధ్యాయులకు కూడా ఏవైనా చిట్కాలు, ఇంక వేరేమైనా విషయాలతో మొదలైనవి కలిపి ముద్రించండి" అని ఉందా ఉత్తరంలో.
చూడండి, దేశ ప్రధాన సేవకుడికి పని అప్పగిస్తే, తప్పకుండా జరుగుతుందని నా యువ మిత్రులకి కూడా నమ్మకం ఉంది. నా చిన్నారి విద్యార్థి నేస్తం, ముందుగా నాకు ఉత్తరం రాసినందుకు ధన్యవాదాలు. Exam Warriors రెండు,మూడుసార్లు చదివినందుకు ధన్యవాదాలు. చదివేటప్పుడు అందులో ఏమేమి పొరపాట్లు ఉన్నాయని అనిపించిందో చెప్పినందుకు కూడా అనేకానేక ధన్యవాదాలు. దీనితో పాటుగా నా చిన్నారి నేస్తం నాకు పని కూడా అప్పగించింది. నేను తప్పకుండా మీ ఆజ్ఞని పాటిస్తాను. కొత్త ముద్రణ జరిగే సమయానికి నాకు వీలైతే గనుక తప్పకుండా తల్లిదండ్రుల కు, ఉపాధ్యాయులకు కూడా ఏవైనా రాయడానికి ప్రయత్నిస్తాను. కానీ మీ అందరినీ నేనొకటి కోరతాను. నాకు మీరు సహాయం చేయగలరా? రోజువారీ జీవితంలో మీరు ఏమేమి భావాలను అనుభూతి చెందుతారో నాకు చెబుతారా? దేశంలోని విద్యార్థులందరినీ, తల్లిదండ్రులనీ , ఉపాధ్యాయులనూ నేను అభ్యర్థిస్తున్నాను – stress free exam తో ముడిపడి ఉన్న విషయాలను, మీ అనుభవాలనూ, మీ సూచనలను నాకు పంపించండి. నేను తప్పకుండా వాటిని చదువుతాను. చదివి, ఆలోచించి, వాటిల్లో ఏ సూచనలు నచ్చుతాయో వాటిని నా మాటల్లో, నా పధ్ధతిలో రాయడానికి ప్రయత్నిస్తాను.మీ సూచనలు ఎక్కువగా వస్తే గనుక నా కొత్త ఎడిషన్ విషయం ఖాయం అయిపోతుంది. మీ ఆలోచనల కోసం ఎదురుచూస్తాను. అరుణాచల్ కు చెందిన చిన్నారి నేస్తం, అలీనా తాయంగ్ కి కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, దేశ ప్రధాన మంత్రి తాలుకూ విస్తృత కార్యక్రమాలను గురించి వార్తా పత్రికలు, టీ.వీ మాధ్యమాల ద్వారా మీకు తెలుస్తూనే ఉంటుంది. తీరిక లేకుండా ఉండడం గురించి చర్చించుకుంటారు కూడానూ. కానీ నేనూ మీలాగనే ఒక సాధారణ వ్యక్తినని మీక్కూడా తెలుసు . ఒక సాధారణ పౌరుడిని. అందువల్ల ఒక సాధారణ జీవితంపై ఏ ప్రభావాలు ఎక్కువగా పడతాయో అలాంటి ప్రభావమే నా జీవితంలో నాపై కూడా ఉంటుంది. ఎందుకంటే నేను కూడా మీ మధ్య నుంచి వచ్చిన వ్యక్తినేగా! చూడండి, ఈసారి యూ.ఎస్ ఓపెన్ లో విజయాన్ని గురించి ఎన్ని చర్చలు జరిగాయో, అన్నే చర్చలు రన్నర్ అప్ గా నిలిచిన Daniil Medvedev ప్రసంగం పై కూడా జరిగాయి. సోషల్ మీడియాలో బాగా తిరుగుతోందని నేను కూడా ఆ ప్రసంగాన్ని విన్నాను. మేచ్ కూడా చూశాను. ఇరవై మూడేళ్ళ Daniil Medvedev నిరాడంబరత , అతడి పరిపక్వత అందరినీ ఆకట్టుకుంది. నేను మాత్రం ఎంతో ఆకర్షితుడనయ్యాను. ఈ ప్రసంగానికి కొద్ది సమయం మునుపే 19 సార్లు Grand Slam విజేత, టెన్నిస్ లెజెండ్ అయిన Rafael Nadal చేతిలో పరాజయం పాలైయ్యాడు. ఈ స్థితిలో వేరెవరైనా ఉండి ఉంటే నిరాశగా, ఉదాసీనంగా మారిపోయి ఉండేవారు. కానీ Daniil Medvedev మొహం వాడిపోలేదు. పైగా తన మాటలతో అందరి మొహాలపై చిరునవ్వులు తెప్పించాడు. అతడి వినమ్రత, సరళత, అతడిలో కనబడిన నిజమైన sportsman spirit చూసి అందరూ ముగ్ధులైపోయారు. అతడి మాటలను అక్కడి ప్రేక్షకులందరూ ఉత్తేజకరంగా స్వీకరించారు. విజేత Rafael Nadal ని కూడా Daniil ప్రశంసించాడు. లక్షల కొద్దీ యువ ఆటగాళ్ళకు Rafael Nadal ఎలా ప్రేరణగా నిలిచాడో చెప్పాడు. అతడితో ఆడడం ఎంత కష్టమో కూడా చెప్పాడు Daniil . కఠినమైన పోటిలో ఓటమిని ఎదుర్కొని కూడా తన ప్రత్యర్థి నాడాల్ ని ప్రశంసించి నిజమైన sportsman spirit కి సజీవ ఉదాహరణగా నిలిచాడు Daniil . ఇంతేకాక, ఛాంపియన్ గా నిలిచిన నాడాల్ కూడా డేనీ ఆటని ఎంతో మెచ్చుకున్నాడు. ఒకే మేచ్ లో ఓటమినెదుర్కొన్న ఆటగాడి ఉత్సాహం, గెలుపొందిన ఆటగాడి వినమ్రత, రెండు చిత్రాలూ చూడతగ్గవి. ఒకవేళ మీరు Daniil Medvedev ప్రసంగాన్ని విననివారికీ, ముఖ్యంగా యువతని తప్పకుండా ఆ వీడియో చూడాల్సిందిగా కోరుతున్నాను. ప్రతి వర్గం వారూ, ప్రతి వయసు వారూ తప్పక నేర్చుకోవాల్సినది ఉంది. గెలుపు – ఓటములకు విలువనివ్వకుండా, వాటిని అధిగమించిన క్షణాలు అవి. జీవితం గెలుస్తూనే ఉంటుంది. మన దగ్గర శాస్త్రాల్లో ఎంతో గొప్పగా ఈ విషయాన్ని చెప్పారు. మన పూర్వీకుల ఆలోచనవిధానం నిజంగా మెచ్చుకోదగినది. మన శాస్త్రాల్లో ఏమని ఉందంటే –
" విద్యయా వినయోపేతా హరతి
న చేతాంసీ కస్య మనుజస్య !
మణి కాంచన సంయోగ:
జన్యయతి లోకస్య లోచన ఆనందం "
అంటే, ఏ వ్యక్తిలో అయినా యోగ్యత, వినమ్రత ఒకేసారి ప్రవేశించినప్పుడు, అతడు ఎవరి మనసునైనా గెలవగలడు. నిజానికి, ఈ యువ ఆటగాడు ప్రపంచ ప్రజలందరి మనసులూ గెలిచేసాడు.
నా ప్రియమైన దేశప్రజలారా, ముఖ్యంగా నా యువ మిత్రులారా, నేనిప్పుడు చెప్పబోయే విషయం, మీ మంచి కోరుతూ చెప్తున్నాను. వాగ్వివాదాలూ, పక్ష-విపక్షాలూ జరుగుతూనే ఉంటాయి. కానీ కొన్ని విషయాలు ముందుకు వెళ్లకముందే ఆపేస్తే, చాలా మేలు జరుగుతుంది. బాగా చెయ్యి దాటిపోయిన విషయాలు, చాలా దూరం ప్రచారమైపోతాయి. అప్పటికి వాటిని ఆపడం కష్టమైపోతుంది. కానీ మొదట్లేనే మనం జాగ్రత్తపడి వాటిని ఆపేస్తే చాలా వరకూ కాపాడుకున్నట్లే అవుతుంది. అందువల్ల ఇవాళ ముఖ్యంగా నా యువ మిత్రులతో నేను కొన్ని విషయాలు తప్పకుండా చెప్పాలనుకుంటున్నాను. తంబాకుని సేవించడం ఆరోగ్యానికి చాలా హానికరం. ఈ దురలవాటుని మానుకోవడం కూడా చాలా కష్టం. తంబాకు సేవించేవారికి కేన్సర్, డయాబెటిస్, రక్తపోటు లాంటి అనారోగ్యాలు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంటుంది. అందరూ ఇదే మాట చెప్తారు. తంబాకులో ఉండే నికోటిన్ అనే పదార్థం మత్తుని కలిగిస్తుంది. చిన్న వయసులోనే ఈ అలవాటుకి బానిస అయితే మెదడు ఎదుగుదలపై కూడా దీని ప్రభావం పడుతుంది. కానీ ఇవాళ నేను మీతో మరో కొత్త సంగతి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఈమధ్య భారతదేశంలో ఈ-సిగరెట్టు పై నిషేధం విధించబడిన సంగతి మీకు తెలిసే ఉంటుంది. మామూలు సిగరెట్టు కంటే భిన్నంగా ఉండే ఈ-సిగరెట్టు ఒక రకమైన ఎలక్ట్రానిక్ పరికరం. ఈ-సిగరెట్టు లో నికోటిన్ తో పాటూ ఒక ద్రవపదార్ధాన్ని వేడి చేయడం వల్ల ఒక రకమైన కెమికల్ పొగ ఉత్పన్నమౌతుంది. దాని ద్వారా నికోటిన్ ని సేవిస్తారు. మామూలు సిగరెట్టు వల్ల కలిగే నష్టాల గురించి మనందరికీ తెలుసు. కానీ ఈ-సిగరెట్టు గురించి ఒక తప్పుడు అభిప్రాయాన్ని పుట్టించారు. ఈ-సిగరెట్టు వల్ల ఏమీ ప్రమాదం లేదనే భ్రాంతి ప్రచారం చెయ్యబడింది. మిగతా సిగరెట్ల లాగ ఇందులోంచి దుర్గంధం వ్యాపించకుండా ఉండేందుకు ఇందులో సుగంధ రసాయనాలు కూడా కలిపేవారు. మనం చూస్తూ ఉంటాం, ఒక ఇంట్లో తండ్రి చైన్ స్మోకర్ అయితే కూడా, ఇంట్లోని మిగతా వ్యక్తులని సిగరెట్టు కాల్చకుండా ఆపుతూ ఉంటారు. పిల్లలకి సిగరెట్టు, బీడీ మొదలైన దురలవాట్లకు గురవ్వకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కుటుంబంలోని మరే ఇతర సభ్యుడికీ ఈ ధూమపాన దురలవాటు అవ్వకూడదనే చూస్తారు. ధూమపానం వల్ల, తంబాకు వల్ల శరీరానికి భారీ నష్టం జరుగుతుందని వారికి తెలుసు. ధూమపానం వల్ల వచ్చే ప్రమాదాల గురించి ఎలాంటి అపోహలు లేవు. దాని వల్ల నష్టం జరుగుతుంది. ఇది అమ్మేవారికి కూడా తెలుసు. సిగరెట్టు తాగేవారికీ తెలుసు. చూసేవారికీ తెలుసు. కానీ ఈ-సిగరెట్టు సంగతి పూర్తిగా భిన్నమైనది. ఇ-సిగరెట్టు గురించి ప్రజల్లో సరైన అవగాహన లేదు. దానివాల జరిగే ప్రమాదాల గురించి కూడా ప్రజలకి అసలేమీ తెలియదు. అందువల్ల అప్పుడప్పుడు కుతూహలం కారణంగా ఇంట్లోకి రహస్యంగా ఈ-సిగరెట్టు వచ్చి చేరుతోంది. అప్పుడప్పుడు, మేజిక్ చేస్తున్నాను అంటూ దీనిని పిల్లలు ఒకరికి ఒకరు చూపించుకుంటున్నారు కూడా.కుటుంబంలో తల్లిదండ్రుల ఎదురుగా కూడా కొందరు పిల్లలు ఇవాళ నేనొక మేజిక్ చూపిస్తున్నాను. నా నోట్లోంచి పొగ తెప్పిస్తున్నాను, నిప్పు లేకుండా పొగ తెప్పిస్తున్నాను, దీపం వెలిగించకుండానే పొగతెప్పిస్తాను చూడండి, అంటూ ఏదో మేజిక్ షో చేస్తున్నట్లు చూపిస్తుంటే, కుటుంబసభ్యులు చప్పట్లు కూడా కొడుతున్నారు. వారికేమీ తెలియనే తెలియదు. కానీ ఒక్కసారి గనుక పిల్లలు ఈ దురలవాటులో పడితే, నెమ్మది నెమ్మదిగా వారు ఆ మత్తుకి అలవాటు పడిపోతారు. ఈ దురలవాటుకి బానిసైపోతారు. మన యువత తమకి తెలియకుండానే డబ్బుని వ్యర్థం చేసే మార్గంలో నడవడం మొదలుపెడతారు. నిజానికి ఈ-సిగరెట్టు లో ఎన్నో హానికరమైన రసాయనాలు కలుపుతారు. దాని వల్ల ఆరోగ్యంపై చాలా దుష్ప్రభావం పడుతుంది. మీకు తెలుసు , ఎవరైనా పొగ తాగుతుంటే వచ్చే వాసన వల్ల వారు సిగరెట్టు కాలుస్తున్నట్లు మనకు తెలిసిపోతుంది. వారి జేబులో సిగరెట్టు పేకెట్ లేకపోయినా వాసన వాల్ల తెలిసిపోతుంది. కానీ ఇ-సిగరెట్టు తో అలా కాదు. అందువల్ల, ఎందరో పిల్లలు, యువత, తెలిసీ తెలియక, ఫ్యాషన్ అనుకుంటూ చాలా గర్వంగా పుస్తకాల మధ్యన, ఆఫీసుల్లో, తమ జేబుల్లో, అప్పుడప్పుడూ చేతుల్లో కూడా ఈ-సిగరెట్టు తో తిరుగుతూ కనిపిస్తున్నారు. దానికి అలవాటు పడిపోతున్నారు. యువత అంటే మన దేశ భవిష్యత్తు. ఈ కొత్త రకం మత్తులో యువత చెడుదోవలో పడకుండా, దేశము, వారి జీవితాలూ నాశనమవకుండా ఉండాలని, కుటుంబాలలోని కలలు తుడిచిపెట్టుకుపోకూడదని, ఈ మత్తు రోగం, ఈ దురలవాటు సమాజంలో వేళ్లతో పాతుకుపోకూడదని ఈ-సిగరెట్టు పై నిషేధం విధించబడింది.
నేను మీ అందరినీ కోరేదేమిటంటే తంబాకు వ్యసనాన్ని వదిలిపెట్టండి, ఈ-సిగరెట్టు గురించిన ప్రలోభాలకి గురికాకండి. రండి, మనందరం కలిసి ఒక ఆరోగ్యకరమైన భారతదేశాన్ని నిర్మిద్దాం.
అవునూ, మీకు ఫిట్ ఇండియా గుర్తుందా? ఫిట్ ఇండియా అంటే పగలూ, సాయంత్రం రెండేసి గంటలు జిమ్ లోకి వెళ్ళి చేతులూ కాళ్ళూ ఆడించడం కాదు. పైన చెప్పిన దురలవాట్ల నుండి దూరంగా ఉండటమే ఫిట్ ఇండియా అంటే. నా మాటలు మీకు తప్పుగా అనిపించవు. మీరు నా మాటలని తప్పకుండా మంచిగానే తీసుకుంటారని నా నమ్మకం.
నా ప్రియమైన సోదర సోదరీమణులారా, తమ కోసం కాకుండా ఇతరుల కోసం తమ జీవితాలని త్యాగం చేసిన అసాధారణ వ్యక్తులను కన్న జన్మ భూమి, కర్మ భూమి మన భారతదేశం. ఇటువంటి దేశంలో పుట్టడం మనందరి అదృష్టం.
మన భారతదేశం, మన భారత మాత, ఎందరో రత్నాలను కన్న వసుంధర. ఎందరో రత్నాల్లాంటి అసాధారణ వ్యక్తులకు మన భారతదేశం జన్మ భూమి అయ్యింది. కర్మ భూమి అయ్యింది. వారంతా కూడా తమ తమ కోసం కాకుండా ఇతరుల కోసం జీవించారు. అలాంటి గొప్ప వ్యక్తి ఒకరిని అక్టోబర్ 13వ తేదీన వాటికన్ సిటీ లో సన్మానించబోతున్నారు. ఇది భారతీయులందరూ ఎంతో గర్వించదగ్గ విషయం. పోప్ ఫ్రాంసిస్ రాబోయే అక్టోబర్ 13వ తేదీన మరియం ట్రేసియా ని సన్యాసినిగా గౌరవంగా ప్రకటించబోతున్నారు. సిస్టర్ మరియం ట్రేసియా తన ఏభై ఏళ్ల పరిమిత జీవనకాలంలో మానవత్వం కోసం, మానవుల మేలు కోరి చేసిన మంచి పనులు యావత్ ప్రపంచానికే ఒక ఉదాహరణ. సమాజ సేవ, విద్యారంగాలలో ఆవిడకి అద్భుతమైన ఆసక్తి ఉంది. ఆవిడ ఎన్నో పాఠశాలలూ, హాస్టళ్ళూ, అనాథశరణాలయాలూ నిర్మించారు. తన జీవిత పర్యంతం ఆవిడ ఇదే ఉద్యమం మీద దృష్టి నిలిపారు. సిస్టర్ ట్రేసియా ఏ పని చేసినా శ్రధ్ధతో, పట్టుదలతో, పూర్తి సమర్పణాభావంతో పూర్తి చేశారు. ఆవిడ Congregation of the Sisters of the Holy Family ని స్థాపించారు. అది ఇవాళ కూడా ఆవిడ జీవితాదర్శాలను, మిషన్ నీ ముందుకు నడిపిస్తోంది. నేను మరొక సారి సిస్టర్ మరియం ట్రేసియాకు శ్రధ్ధాంజలిని సమర్పిస్తున్నాను. భారతదేశ ప్రజలకు, ముఖ్యంగా మన క్రైస్తవ సోదర సోదరిమణులకు, ఈ గుర్తింపు సందర్భంగా అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశ ప్రజలారా, నేడు మనం గాంధీజీ 150 వ జన్మదినం జరుపుకోవడం భారతదేశమే కాక యావత్ ప్రపంచం గర్వించదగ్గ విషయం. 130కోట్ల దేశప్రజలు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి విముక్తి పొందాలని సంకల్పించారు. పర్యావరణని సంరక్షించే మార్గంలో, యావత్ ప్రపంచంలో భారతదేశం తీసుకున్న మార్గదర్శకత్వాన్ని చూసి ఎన్నో దేశాలు భారతదేశం పై తమ దృష్టిని సారించాయి. అక్టొబర్ రెండు నుంచీ జరగబోయే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి విముక్తి పొందే ఉద్యమంలో మీరంతా పాలుపంచుకుంటారని నాకు పూర్తి నమ్మకం ఉంది. పలుచోట్ల ప్రజలు తమ తమ పధ్ధతులలో ఈ ఉద్యమానికి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. మన దేశానికి చెందిన ఒక యువకుడు ఒక చిత్రమైన పెద్ద ఉద్యమాన్ని నడిపించాడు. అతడి పని నా దృష్టికి వచ్చింది. అతడు చేసే ఈ కొత్త ప్రయోగం గురించి నేను అతనితో ఫోన్ లో మాట్లాడి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. అతడి మాటలు దేశంలోని మిగతా ప్రజలకి కూడా పనికి వస్తాయేమో!
శ్రీ రిపుదమన్ బెవ్లి గారు ఒక చిత్రమైన ప్రయత్నం చేస్తున్నారు. ఆయన Plogging చేస్తారు. Plogging అన్న పదం వినడం నాకూ మొదటిసారి. విదేశాలలో ఈ పదం ఉపయోగిస్తారేమో కానీ భారతదేశంలో రిపుదమన్ బెవ్లి గారు దీనిని ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకువచ్చారు. రండి, ఆయనతో కాసేపు మాట్లాడదాం –
మోదీ గారు: హలో రిపుదమన్ గారూ, నమస్కారం! నేను నరేంద్ర మోదీని మాట్లాడుతున్నాను.
రిపుదమన్: ధన్యవాదాలు సార్.
మోదీ గారు: రిపుదమన్ గారూ, మీరు Plogging పేరుతో అంకిత భావంతో పని చేస్తున్నారు.
రిపుదమన్: అవును సార్.
మోదీ గారు:అందువల్ల , నేను స్వయంగా ఫోన్ చేసి మిమ్మల్ని వివరాలు అడుగుదామని నా మనసులో కుతూహలం కలిగింది.
రిపుదమన్: చెప్పండి సర్
మోదీ గారు: మీ మనసులోకి ఈ ఆలోచన ఎలా వచ్చింది?
రిపుదమన్: అవును సర్
మోదీ గారు: ఈ పదం, ఈ పధ్ధతి మీ మనసులోకి ఎలా వచ్చింది?
రిపుదమన్: సర్, ఇవాళ యువతకు అంతా కూల్ గా కావాలి. వారికి ఏదైనా ఆసక్తికరంగా ఉండాలి. నేను మోటివేట్ అయ్యాను కానీ యువతని మోటివేట్ చెయ్యడానికి ఏదైనా ఆసక్తికరంగా ఉండాలి. 130కోట్ల భారతీయులని ఈ ఉద్యమంలో జోడించాలంటే ఏదైనా కూల్ గా, ఆసక్తికరంగా చెయ్యాలనుకున్నాను. నేను స్వయంగా ఒక రన్నర్ ని. పొద్దుటే మేము పరిగెడుతుంటే ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. జనం తక్కువగా ఉంటారు. రోడ్లపై చెత్తాచెదారం, ప్లాస్టిక్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అదంతా చూసి ఫిర్యాదు చెయ్యడం, తిట్టుకోవడం కాకుండా ఏదైనా చెయ్యాలని నేను అనుకున్నాను. మా రన్నింగ్ గ్రూప్ సాయంతో ఢిల్లీలో ఇది మొదలుపెట్టాను. తర్వాత యావత్ భారతాదేశానికీ దీనిని పరిచయం చేసాను. ప్రతి చోట నుంచీ ఎన్నో ప్రశంసలు లభించాయి.
మోదీ గారు: మీరు ఎగ్జాక్ట్ గా ఏం చేసేవారు? కాస్త నాకు అర్థం అయ్యేలా , మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా దేశప్రజలకు కూడా తెలిసేలా వివరించండి.
రిపుదమన్: సర్, మేము ‘Run & Clean-up Movement’ ని మొదలుపెట్టాము. మా రన్నింగ్ గ్రూప్స్ కి, వారి వర్క్ అవుట్ అయిపోయాకా, కూల్ డౌన్ ఏక్టివిటీ సమయంలో చెత్తను ఎత్తే పనిని చేపట్టాలని కోరాము. మీఅంతట మీరే ప్లాస్టిక్ ఏరడం మొదలుపెట్టండి. రన్నింగ్ తో పాటూ క్లీనింగ్ కూడా అయిపోతుంది. దీనివల్ల తెలియకుండానే ఎంతో వ్యాయామం కలిసివస్తోంది. దీని వల్ల మీరు కేవలం రన్నింగే కాకుండా, squats చేస్తున్నారు, deep squats చేస్తున్నారు, lunges చేస్తున్నారు , forward bent చేస్తున్నారు, దీనివల్ల ఇది ఒక holistic work out అయిపోయింది | గత ఏడాది ఎన్నో fitness పత్రికలలో భారతదేశంలో Top fitness trend అంటూ మా పనిని nominate చేశారు.
మోదీ గారు: ఇందుకు గానీ మీకు నా అభినందనలు
రిపుదమన్: ధన్యవాదాలు సర్
మోదీ గారు: ఇప్పుడు సెప్టెంబర్ 5 నుండీ మీరు కొచ్చిన్ నుండి ఈ ప్రచారాన్ని మొదలుపెట్టారా?
రిపుదమన్: అవును సర్. ఈ మిషన్ పేరు " ‘R|Elan Run to make India Litter Free’ . ఎలాగైతే మీరు అక్టోబర్ 2న ఒక చారిత్రాత్మక నిర్ణయాన్ని ఇవ్వాలన్నారో, అలానే చెత్త నుంచి విముక్తి లభిస్తే ప్లాస్తిక్ నుంచి కూడా విముక్తి లభిస్తుందని నాకు నమ్మకం ఉంది . ఇది ఒక వ్యక్తిగత బాధ్యతగా మారుతుందని నేను నమ్ముతున్నాను. నేను ఏభై పట్టణాలలో , వెయ్యి కిలోమీటర్ల దూరం పరిగెడుతూ క్లీనింగ్ చేస్తున్నాను. ఇది ప్రపంచంలోకెల్లా అతిపెద్ద క్లీనప్ డ్రైవ్ అవుతుందని అందరూ అంటున్నారు. దీనితో పాటుగా మేము సోషల్ మీడియాలో #(Hashtag) ని ఉపయోగించాము. #PlasticUpvaas అని పెట్టి, అక్కడ ప్రజలు తమ జీవితంలో ప్లాస్టిక్ నే కాకుండా సింగిల్ యూజ్ చేసే ఏ వస్తువునైనా తమ జీవితాలలోంచి తీసేస్తాము అని చెప్పవలసిందిగా ప్రజలని కోరుతున్నాము.
మోదీ గారు: అద్భుతం! అయితే సెప్టెంబర్ 5న మీరు ఈ ప్రచారాన్ని మొదలుపెట్టినప్పటి నుంచీ మీ అనుభవాలేమిటి?
రిపుదమన్: ఇప్పటివరకూ అయితే చక్కని అనుభవాలు ఎదురైయ్యాయి. గత రెండేళ్ళలో కూడా యావత్ భారతదేశంలో మేము 300 Plogging drives చేశాము. మేము కొచ్చిన్ లో మొదలుపెట్టాకా రన్నింగ్ గ్రూప్స్ జాయిన్ అయ్యాయి. అక్కడ ఉన్న స్థానిక క్లీనప్ గ్రూప్స్ ని నేను మాతో కలుపుకున్నాను. కొచ్చిన్ తర్వాత మధురై, కోయంబత్తూర్, సేలం లలో తిరిగాము. ఇప్పుడే మేము ఉడుపీ లో పూర్తిచేసాము. అక్కడ ఒక పాఠశాల వారు మమ్మల్ని ఆహ్వానించారు. మూడు నుంచీ ఆరవ తరగతి వరకూ చదివే చిన్న చిన్న పిల్లలకు ఒక వర్క్ షాప్ ఇవ్వమని ఒక ఆరగంట సేపు ఉండమని ఆహ్వానించారు. అరగంట వర్క్ షాప్ మూడు గంటల Plogging drive అయ్యింది. పిల్లలు ఎంత enthusiastic గా ఉన్నారంటే that they wanted to do this and they wanted to take it back . తల్లిదండ్రులకూ, చుట్టుపక్కలవారికీ, తోటివారి కి చెప్పాలని పిల్లలకి అనిపించడమే అతి పెద్ద motivation. అదే మమ్మల్ని ముందుకు నడిపిస్తుంది.
మోదీ గారు: రిపూ గారూ, ఇది పరిశ్రమ కాదు ఒక సాధన. మీరు నిజంగా ఒక సాధన్ చేస్తున్నారు.
రిపుదమన్: అవును సర్
మోదీ గారు: నా తరఫున అనేక అధన్యవాదాలు. మీరు దేశప్రజలతో మూడు మాటలు చెప్పాలి అని అడిగితే, ఏం చెప్తారు?
రిపుదమన్: చెత్త రహిత భారతదేశం కోసం నేను మూడు స్టెప్స్ చెప్పాలనుకుంటున్నాను.
1 . చెత్తను చెత్త కుండీలో మాత్రమే వెయ్యండి.
2 .ఎదైనా సరే బయట చెత్త కనిపిస్తే దానిని తీసి చెత్త కుండీలో వెయ్యండి.
3. చెత్త కుండీ కనిపించకపోతే మీ బండిలో, మీతో మీ ఇంటికి తీసుకువెళ్ళి,
తడి చెత్త, పొడి చెత్తలను విడదీసి, మీ ఇంట్లోని చెత్తడబ్బాలో వెయ్యండి. పొద్దుట మున్సిపాలిటి చెత్తబండి వచ్చినప్పుడు వారికి ఇచ్చివేయండి.
ఈ మూడు స్టెప్స్ అందరూ పాటిస్తే మనం చెత్త రహిత భారతదేశాన్ని చూడగలము.
మోదీ గారు: చూడండి రిపూ గారూ, ఎంతో సరళమైన పదాలలో, సాధారణ పౌరుడు కూడా అర్థమయ్యే భాషలో వారు పాటించే విధంగా, గాంధీ గారి కలలనే మీతో పాటుగా నడిపిస్తున్నారు. ఇంతేకాక గాంధీగారిలాగనే, విషయాన్ని సరళమైన పదాలతో చెప్పే పధ్ధతిని కూడా మీరు అలవరుచుకున్నారు.
రిపుదమన్: ధన్యవాదాలు.
మోదీ గారు: అందుకనే మీరు ప్రశంసనీయులు. మీతో మాట్లాడితే నాకు చాలా బాగుంది. మీరు ఎంతో వినూత్న పధ్ధతిలో , ముఖ్యంగా యువతకు నచ్చే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. నేను మీకు అనేక అభినందనలు తెలుపుతున్నాను.
మిత్రులారా, ఈసారి గాంధీ జయంతి సందర్భంగా క్రీడా మంత్రాలయం కూడా ‘Fit India Plogging Run’ ప్రారంభించబోతోంది.అక్టోబర్ 2న యావత్ భారతదేశంలో రెండు కిలోమీటర్ల ప్లాగింగ్ జరగబోతోంది. ఈ కార్యక్రమం ఎలా జరగాలి, ఈ కార్యక్రమంలో ఏం చేస్తాము అనేది రిపుదమన్ గారి అనుభవాల నుండి మనం తెలుసుకున్నాము.అక్టోబర్ 2 నుండి మొదలవబోయే ఈ ఉద్యమంలో మనందరం రెందు కిలోమీటర్ల జాగింగ్ తో పాటూ, దారిలో ఎదురయ్యే ప్లాస్టిక్ ని కూడా జమ చెయ్యాలి. దీనివల్ల మనం మన ఆరోగ్యంతో పాటూ, పుడమితల్లి ఆరోగ్యాన్ని కూడా రక్షించినవాళ్లం అవుతాము. ఈ ఉద్యమం వల్ల ప్రజలలో ఫిట్నెస్ తో పాటూ పరిశుభ్రత పై కూడా అవగాహన పెరుగుతోంది. 130 కోట్ల దేశప్రజలందరూ ఈ ఉద్యమం దిశగా తలో అడుగూ వేస్తే , సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నుంచి విముక్తి పొందే దిశగా మన భారతదేశం 130 కోట్ల అడుగులు ముందుకు వెళ్తుంది.
రిపుదమన్ గారూ, మరోసారి మీకు అనేకానేక ధన్యవాదాలు. మీకూ, మీ జట్టు కీ, ఈ సృజనాత్మక ప్రయోగానికీ, నా తరఫున అనేకానేక అభినందనలు. ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా, అక్టోబర్ 2 కోసం యావత్ భారతదేశంలో, ప్రపంచంలో సన్నాహాలు జరుగుతున్నాయి. కానీ మేము గాంధీ 150 ని కర్తవ్యపథం వైపు నడిపించాలని అనుకుంటున్నాము. దేశహితం కోసం మన జీవితాలలో మార్పులు చేసుకుంటూ ముందుకి నడుద్దాం. ఒకసారి ముందుగా గుర్తుచెయ్యాలనుకుంటున్నాను. రాబోయే మన్ కీ బాత్ లో దీని గురించి విస్తారంగా వివరిస్తాను కానీ ఈసారి నేను కొంచెం ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, మీరు తయారుగా ఉంటారని.
మీకు గుర్తుందా? అక్టోబర్ 31 సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి అని మీకు గుర్తుండే ఉంటుంది. "ఏక్ భారత్, స్రేష్ఠ భారత్" అనేది మనందరి కల. ఇందుకోసమే ప్రతి ఏడాదీ అక్టోబర్ 31 న మనం యావత్ దేశంలో "రన్ ఫర్ యూనిటీ" పేరుతో దేశ సమైక్యత కోసం పరుగు ని నిర్వహిస్తున్నాం. ప్రజలు అందరూ , వృధ్ధులు, స్కూల్ ,కాలేజీలలో అందరూ, భారతదేశంలోని లక్షల పల్లెల్లో ప్రజలు కూడా ఆరోజున దేశ సమైక్యత కోసం పరుగుపెట్టాలి. మీరు ఇప్పటి నుందే తయారీ మొదలుపెట్టండి. ఇంకా సమయం ఉంది. దీని గురించి వివరంగా తర్వాత చెప్తాను. కొందరు ప్రాక్టీస్ మొదలుపెట్టచ్చు, ప్రణాళికలు తయారుచేసుకోవచ్చు.
మీకు గుర్తుందే ఉంటుంది, ఆగస్టు 15న ఎర్ర కోట బురుజు నుండి నేను చెప్పాను, 2022 వరకూ మీరు భారతదేశంలోని ఏవైనా పదిహేను యాత్రా ప్రదేశాలకు వెళ్లమని చెప్పాను. వీలైతే ఒకటి, రెందు రాత్రులు ఉండేలాగ ప్రయత్నించమని చెప్పాను. భారతదేశాన్ని మీరు చూడండి. అర్థం చేసుకోండి. అనుభూతి చెందండి. మన వద్ద ఎన్ని వైవిధ్యాలు ఉన్నాయో, దీపావళి పండుగ సమయంలో సెలవులు వచ్చినప్పుడు ప్రజలు తప్పకుండా వెకేషన్ కి వెళ్తారని నేను మళ్ళీ చెప్తున్నాను. భారతదేశంలోని ఏవైనా పదిహేను యాత్రా ప్రదేశాలకు తప్పక వెళ్లమని చెప్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, మొన్ననే సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవం జరుపుకున్నాం. ప్రపంచంలోని కొన్ని సంస్థలు పర్యాటక రంగంలో రేంకింగ్ లు కూడా ఇస్తాయి. మన భారతదేశం ట్రావెల్ అండ్ టూరిజమ్ కాంపిటీటివ్ ఇండెక్స్ లో ఎంతో ప్రగతి సాధించిందని తెలుసుకుంటే మీరంతా సంతోషపడతారు. ఇదంతా మీ అందరి సహకారం వల్లనే జరిగింది. ముఖ్యంగా మీరు పర్యటన ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నందు వల్లే ఇది జరిగింది. ఇందులో పరిశుభ్రత ఉద్యమం సహకారం కూడా ఎంతో ఉంది. ఈ మార్పు ఎమ్త ఉందో చెప్పనా మీకు? మీకు తప్పకుండా సంతోషం కలుగుతుంది. ఇవాళ మన ర్యాంకు 34. ఐదేళ్లక్రితం మన ర్యాంక్ 65. అంటే మనం చాలా పెద్ద జంప్ నే చేశాము. మనం గనుక ఇంక ప్రయత్నం చేస్తే, స్వాతంత్రం వచ్చిన 75 వసంతాల లోపే మనం టూరిజంలో ప్రపంచంలోని ప్రముఖ స్థానాల్లో మనకంటూ స్థానాన్ని సంపాదించుకోగలము.
నా ప్రియమైన దేశ ప్రజలారా, మీ అందరికీ మరోసారి వైవిధ్యాలతో నిండిన భారతదేశంలోని వేరు వేరు పండుగల సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు. దీపావళి సంబరాలలో టపాసులు కాల్చేప్పుడు , అగ్ని ప్రమాదాలు జరగకుండా, ఎవరికీ నష్టం కలగకుండా, వ్యక్తులకు హాని జరగకుండా జాగ్రత్త పడండి. ఇందుకోసం మీరు వ్యక్తపరచవలసిన అభ్యంతరాలను నిశ్చితంగా వ్యక్తపరచండి. ఆనందమూ ఉండాలి. సంతోషమూ ఉండాలి. ఉత్సాహమూ ఉండాలి. మన పండుగలు సామూహిక సంస్కారాన్ని , పరిమళాలను కూడా పంచుతాయి. సామూహిక జీవితమే ఒక కొత్త సామర్థ్యాన్ని ఇస్తుంది. ఆ కొత్త శక్తే సాధనకు స్థానం. అదే పండుగ. రండి, కలసిమెలసి ఉత్సాహంతో, ఆశలతో, కొత్త కలలతో, కొత్త సంకల్పాలతో మనం పండుగలను జరుపుకుందాం.
మరోసారి అనేకానేక శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
నా ప్రియదేశవాసులారా, నమస్కారం. మనదేశం ప్రస్తుతం ఒకవైపు వర్షాన్ని ఆస్వాదిస్తూ ఉంది. రెండో వైపు హిందూస్తాన్ లోని మూలమూలలా ఏదోఒక ఉత్సవం, మేళా దీపావళి వరకూఅన్నీ జరుగుతుంటాయి. బహుశా మన పూర్వీకులు, ఏ పరిస్థితిలోనూ సమాజములో ఒక మందకొడితనం రాకుండా ఉండేలా ఋతుచక్రము, ఆర్థిక చక్రము సమాజ జీవన వ్యవస్థ ను అమర్చిపెట్టారు. ఇంతవరకు మనం అనేక పండుగలు జరుపుకున్నాము. నిన్న హిందూస్తాన్ అంతటా శ్రీ కృష్ణ జన్మ మహోత్సవం జరిగింది. ఇలాంటి వ్యక్తిత్వం ఉంటుందని, వేల ఏండ్లు గడిచినా కూడా ప్రతి పండుగ ఒక కొత్తదనాన్ని తీసుకొస్తుందని, కొత్త స్ఫూర్తిని అందిస్తుందని, కొత్త శక్తిని తీసుకొస్తుందని అసలు ఎవరైనా ఊహించగలరా? వేల ఏండ్ల నాటి జీవనం ఈనాటికీ సమస్యల పరిష్కారానికై ఉదాహరణగా చూపించదగినదని, ప్రేరణ ఇవ్వగలదని, ప్రతి వ్యక్తి శ్రీకృష్ణుని జీవితంలో నుంచి, వర్తమానకాలపు సమస్యలపరిష్కారాలు వెదుకగలడని ఊహించగలరా? ఇంత సామర్థ్యం ఉండి కూడా కృష్ణుడు ఒకసారి రాసక్రీడలో లీనమౌతూ, ఇంకోసారి గోవులమధ్య, గోపాలకుల మధ్య ఉంటూ, మరోసారి ఆటపాటల్లో, వేణుగానాల్లో ఇలా చెప్పలేనన్ని వైవిధ్యతలతో నిండిన వ్యక్తిత్వము, అసమాన సామర్థ్యం కలిగిన శ్రీమంతుడు. కానీ సమాజ శక్తికి అంకితమైన, లోకశక్తికి అంకితమైన, లోకపాలకుని రూపంలో కొత్తకీర్తిపతాకాలను స్థాపించే వ్యక్తిత్వం. స్నేహం ఎలా ఉండాలో చెప్పాలంటే సుదాముని సంఘటనను ఎవరు మరిచిపోగలరు? అంతేకాదు, యుద్ధభూమిలో ఇన్ని గొప్పతనాలున్నా కూడా సారథి పని చేపట్టడం కూడా అంతే. పర్వతాలను మోయగలడు, ఎంగిలి విస్తళ్ళను తీసేయగలడు. ఇలా ప్రతి పనిలోనూ ఒక కొత్తదనం కనిపిస్తుంది. ఈరోజు నేను మీతో మాట్లాడుతుంటే ఇద్దరు గొప్ప మోహనుల గురించి ఆలోచన వస్తోంది. ఒకరు సుదర్శనచక్రధారి మోహనుడు, ఒకరు చరఖాధారి మోహనుడు. సుదర్శనచక్రధారి మోహనుడు యమునా తీరమును వదిలేసి, గుజరాత్ లోని సముద్రతీరానికి వెళ్ళి ద్వారకానగరములో స్థిరపడితే, సముద్రతీరములో పుట్టిన మోహనుడు యమునాతీరానికి వచ్చి దిల్లీలో జీవితపు అంతిమఘడియలను గడిపాడు. సుదర్శన చక్రధారి మోహనుడు ఆనాటి స్థితిలో వేల ఏండ్ల క్రితమే, యుద్ధాన్ని ఆపడానికి, ఘర్షణను నివారించడానికి, తన బుద్ధిని, కర్తవ్యాన్ని, తన సామర్థ్యాన్ని, తన వివేక చింతనను పూర్తిగా ఉపయోగించాడు. అలాగే చరఖాధారి మోహనుడు కూడా స్వాతంత్ర్యం కొరకు, మానవీయ విలువల కొఱకు, వ్యక్తిత్వం యొక్క మూల తత్వానికి బలం చేకూర్చడానికి స్వాతంత్ర్య పోరాటానికే ఎలా ఒక కొత్తరూపాన్నిచ్చాడో, ఎలాంటి కొత్త మలుపు తిప్పాడో, చూసిన విశ్వమే అబ్బురపడింది. నేటికీ అబ్బురపడుతూనే ఉంది. నిస్వార్థ సేవ యొక్క మహత్యాన్ని గానీ, జ్ఞానం యొక్క మహత్యాన్ని గానీ లేదా జీవితపు ఎగుడుదిగుళ్ళలో చిరునవ్వుతో ముందుకు సాగే తీరు యొక్క మహత్యాన్ని గానీ మనము శ్రీకృష్ణభగవానుని సందేశం నుంచి నేర్చుకోగలము. అందుకే శ్రీ కృష్ణుడు జగద్గురువు రూపంలో ఇప్పటికీ ప్రసిద్ధుడు. – కృష్ణం వందే జగద్గురుమ్.
నేడు మనం పండుగల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇదే సమయంలో భారతదేశం ఇంకొక పెద్ద పండుగ యొక్క ఏర్పాట్లలో ఉంది. భారతదేశమే కాదు, ప్రపంచమంతటా ఇదే చర్చ జరుగుతోంది. నా ప్రియదేశవాసులారా! నేను మహాత్మాగాంధీ యొక్క 150 వ జయంతి గురించి మాట్లాడుతున్నాను. 2 అక్టోబర్ 1869, పోర్ బందర్ లో సముద్రతీరాన నేడు మనం కీర్తిమందిరం అని పిలుచుకునే చోట, ఆ చిన్న యింట్లో, మానవ చరిత్రకు కొత్త మలుపు ఇచ్చినటువంటి కొత్త కీర్తిపతాకం స్థాపించినటువంటి ఒక వ్యక్తి, కాదు ఒక యుగం పుట్టుక జరిగింది. మహాత్మా గాంధీ గారి ఒక మాట ఎప్పటికీ ఉండిపోయే మాట, ఒక రకంగా చెప్పాలంటే వారి జీవితపు ఒక భాగంగా ఉండిపోయిన సేవ, సేవాభావం, సేవ పట్ల కర్తవ్య పరాయణత. వారి మొత్తం జీవనం చూస్తే, దక్షిణాఫ్రికా లో జాతివివక్షకు గురి అవుతున్న సమూహాల సేవ. ఆ యుగంలో అది చిన్న విషయమేం కాదు సుమండీ! ఆయన చంపారణ్యంలో వివక్షకు గురి అవుతున్న రైతులకు సేవ చేశారు. తగిన కూలీ పొందని మిల్లు కార్మికులకు సేవ చేశారు. బీదలు, అసహాయులు, బలహీనులు, క్షుధార్తులకు సేవచేయడమే తన జీవిత పరమకర్తవ్యంగా భావించారు. రక్తపిత్త వ్యాధి విషయంలో ఉన్న అనేక భ్రమలను తొలగించడానికి వారు స్వయంగా రక్తపిత్త వ్యాధిగ్రస్తులకు సేవ చేశారు. సేవద్వారానే తన జీవితాన్నే ఉదాహరణగా నిలుపుకున్నారు. సేవను మాటల్లో కాకుండా జీవించి చూపించారు. సత్యంతో గాంధీకి ఎంత విడదీయరాని బంధం ఉండిందో, సేవతో కూడా అంతే అనన్యసామాన్యమైన విడదీయరాని బంధం ఉండేది. ఎవరికి, ఎప్పుడు, ఎక్కడ ఏ అవసరం పడినా, మహాత్మాగాంధీ సహాయానికి సిద్ధంగా ఉండేవారు. వారు కేవలం సేవను మాత్రమే కాక దానితో ముడిపడిన ఆత్మానందాన్ని కూడా సమర్థించేవారు. సేవాశబ్దము యొక్క సార్థకత దాన్ని ఆనందంతో చేయడం లోనే ఉంది – సేవా పరమో ధర్మః. కానీ దాంతోపాటు ఉత్కృష్టమైన ఆనందము, స్వాంతఃసుఖాయ అనే భావం యొక్క అనుభూతి కూడా సేవలో అంతర్నిహితమై ఉంటుంది. ఈ విషయాన్ని బాపూజీ జీవితం నుంచి మనం చక్కగా అర్థం చేసుకోగలము. మహాత్మాగాంధీ అసంఖ్యాక భారతీయుల స్వరమై వినిపించడమే కాదు, మానవ విలువలు, మానవ గరిమకై విశ్వపు గొంతుకగా కూడా మారిపోయారు. మహాత్మా గాంధీకి వ్యక్తి, సమాజం, మానవులు, మానవత ఇదే ముఖ్యంగా ఉండేది. ఆఫ్రికాలోని ఫీనిక్స్ ఫార్మ్ అయినా, టాల్ స్టాయ్ ఫార్మ్ అయినా, సబర్మతీ ఆశ్రమమైన, వార్ధా అయినా అన్ని చోట్లా, తన ఒక విశిష్టమైన రీతిలో సమాజ ప్రగతి, కమ్యూనిటీ మొబెలైజేషన్ పట్ల వారి సమర్థన ఉండేది. పూజ్య మహాత్మాగాంధీ కి సంబంధించిన అనేక ముఖ్యస్థలాలకు వెళ్ళి నమస్కరించే గొప్ప అదృష్టం నాకు కలిగింది. సేవాభావం ద్వారా సంఘటిత భావాన్నే వారు సమర్థించేవారు అని చెప్పగలను. సమాజసేవ, సమాజ ప్రగతి కమ్యూనిటీ సర్వీస్ కమ్యూనిటీ మొబెలైజేషన్ ఈ భావనలన్నిటినీ మనం మన వ్యావహారిక జీవనంలో తేవలసిన అవసరం ఉంది. నిజం చెప్పాలంటే ఇదే మహాత్మా గాంధీకి నిజమైన శ్రద్ధాంజలి, నిజమైన కార్యాంజలి. ఇలాంటి సందర్భాలు చాలా వస్తుంటాయి, మనమూ ఆచరిస్తుంటాము. కానీ గాంధీ యొక్క 150 వ జయంతి కూడా ఇలాగే వచ్చి వెళ్ళిపోవడం మనకు సమ్మతమేనా? కాదు దేశవాసులారా! మనమందరం మనలను ప్రశ్నించుకుందాం. చింతన చేద్దాం, మేథోమథనం చేద్దాం, సామూహికంగా సంభాషిద్దాం. మనము సమాజంలో ప్రజలతో కలిసి, అన్ని వర్గాలవారితో కలిసి, అన్ని వయసుల వారితో కలిసి, గ్రామమూ పట్టణమూ స్త్రీ పురుషుడు అని లేక అందరితో కలిసి సమాజం కొఱకు ఏం చేద్దాం, ఒక వ్యక్తిగా నేను నా ప్రయత్నంగా ఏం చేయగలను అని ఆలోచిద్దాం. నా తరఫునుంచి వాల్యూ అడిషన్ ఏముంటే బాగుంటుంది? సామూహికత మన బలం. ఈ 150 వజయంతి సంవత్సరం పొడుగునా జరిగే కార్యక్రమాల్లో సామూహికత, సేవ కూడా ఉండనిద్దాం. మన వీధిలో ఉండేవారంతా కలిసి ఎందుకు ప్రయత్నించకూడదు? మన ఫుట్ బాల్ టీం ఉందంటే ఫుట్ బాల్ కూడా ఆడదాము, ఒకటీ అరా గాంధీ ఆదర్శాలకూ అనుగుణంగా సేవాకార్యక్రమాలూ చేద్దాం. మన మహిళా మండలి లేడీస్ క్లబ్ ఉంది. ఆధునిక యుగంలో లేడీస్ క్లబ్ యొక్క కార్యకలాపాలూ చేద్దాం, కానీ లేడీస్ క్లబ్ యొక్క సఖులంతా కలసి ఏదో ఒక సేవాకార్యక్రమం అందరు కలసి చేద్దాం. చాలా చేయగలము. పుస్తకాలను సేకరించి బీదలకు పంచడం, జ్ఞానం పంచడం ఇలా 130 కోట్ల భారతీయులకు, 130 కోట్ల ఊహలు ఉన్నాయి. 130 కోట్ల ఆరంభాలు చేయవచ్చు. ఏ హద్దూ లేదు. మనసులో అనుకున్నది – మంచి అభిలాష, సత్కారణం, సద్భావం పూర్తి అంకితభావంతో సేవ చేయగలిగితే చాలు. అది కూడా స్వాంతః సుఖాయ – ఒక అనన్యమైన ఆనందానుభూతి కోసం అయి ఉంటే చాలు.
నా ప్రియ దేశవాసులారా, నేను కొన్ని నెలల క్రితం గుజరాత్ లోని దాండికి వెళ్ళాను. స్వాతంత్ర్య పోరాటంలో ‘ఉప్పు సత్యాగ్రహం’ దాండి చాలా ముఖ్యమైన ఒక మలుపు. దాండి లో మహాత్మాగాంధీకి అంకితమిచ్చిన ఒక అత్యాధునిక మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొన్నాను. మీ అందరితో కూడా నా ఒక విన్నపమేమిటంటే- మీరంతా రానున కాలంలో మహాత్మాగాంధీ కి సంబంధించిన ఏదో ఒక ప్రదేశాన్ని సందర్శించండి. పోర్ బందర్ కానీ, సబర్మతీ కానీ, చంపారణ్యం కానీ, వర్ధా ఆశ్రమం కానీ, దిల్లీ లోని మహాత్మాగాంధీకి సంబంధించిన చోటైనా గానీ, ఇటువంటి చోట్లకు మీరు వెళ్తే మీ ఫోటోలతో సహా సోషల్ మీడియాలో పంచుకోండి. దీనిద్వారా ఇతరులు కూడా స్ఫూర్తి పొందేలా, ఆ ఫోటోలతో పాటు మీ భావాలను వ్యక్తం చేస్తూ మూడు నాలుగు మాటలు వ్రాయండి. మీ మనసులోనుంచి వచ్చే మాటలు ఏ ఇతర పెద్ద సాహిత్య రచనలలో వాటికన్నా ఎక్కువ ప్రభావశీలంగా ఉంటాయి. నేటి రోజున మీ దృష్టిలో మీ కలంతో గీసిన గాంధీ చిత్రం ఇంకా ఎక్కువ రెలెవెంట్ గా కనిపించవచ్చు. రానున్న సమయంలో చాలా కార్యక్రమాలు, పోటీలు, ప్రదర్శనల ఏర్పాట్లు చేయబడ్డాయి. కానీ ఈ సందర్భంలో ఒక ఆసక్తి కరమైన మాట మీతో పంచుకోవాలనుకుంటున్నాను. Venice Biennale ఒక ప్రసిద్ధమైన కళా ప్రదర్శన. అక్కడ ప్రపంచంలోని కళాకారులంతా కలుస్తారు. ఈ సారి Venice Biennale యొక్క భారతీయ భవనంలో గాంధీ స్మృతులతో ఒక ఆసక్తికరమైన ప్రదర్శన ఏర్పాటయింది. ఇందులో హరిపురా Panels విశేషమైన ఆసక్తితో ఉంది. గుజరాత్ లోని హరిపురాలో కాంగ్రెస్ సమావేశం జరగడం, అందులో సుభాశ్ చంద్రబోస్ అధ్యక్షుడుగా ఎన్నిక కావడం అనే చరిత్రకెక్కిన సంఘటన మీకు గుర్తుండే ఉంటుంది. ఈ ఆర్ట్ పానెల్ కు ఒక అందమైన గతం ఉంది. కాంగ్రెస్ యొక్క హరిపురా సభకన్నా ముందు 1937-38 లో మహాత్మా గాంధీ శాంతినికేతన్ కళాభవన్ యొక్క తత్కాలీన ప్రిన్సిపాల్ నందలాల్ బోస్ ను ఆహ్వానించారు. భారతదేశంలో నివసించే వారి జీవనశైలిని కళామాధ్యమంద్వారా చూపించాలని, ఈ సభలో వారి ఆర్ట్ వర్క్ యొక్క ప్రదర్శన ఉండాలని గాంధీజీ అభిలషించారు. మన రాజ్యాంగానికి శోభతెచ్చే ఆర్ట్ వర్క్ ఈ నందలాల్ బోస్ దే. రాజ్యాంగానికి ఒక ప్రత్యేక గుర్తింపునిచ్చేదది. ఈ బోస్ గారి కళాసాధన రాజ్యాంగంతో పాటు తననూ అమరుడిని చేసింది. నందలాల్ బోస్ హరిపురా చుట్టుపక్కల గ్రామాలను పర్యటించి, చివరికి గ్రామీణ భారత జీవనాన్ని చూపిస్తూ ఒక art canvas తయారుచేశారు. ఈ అమూల్యమైన కళా ప్రజ్ఞ గురించి Venice లో గొప్ప చర్చ జరిగింది. గాంధీ జీ యొక్క 150 జన్మ జయంతి సందర్భంగా శుభాకాంక్షలతో పాటు ప్రతీ హిందుస్తానీ నుంచి ఏదైనా ఒక సంకల్పాన్ని నేను కోరుకుంటాను. దేశం కోసం, సమాజం కోసం, ఇతరుల కోసం ఏదో కొంత చేయాలి. అదే బాపూ యొక్క చక్కనైన, నిజమైనప్రామాణిక కార్యాంజలి అవుతుంది.
భారతమాత సుపుత్రులారా! గత కొన్నేళ్ళుగా మనము 2 అక్టోబరు కు ముందటి రోజులు దాదాపు రెండు వారాలు దేశమంతటా ‘స్వచ్ఛతయే సేవ’ ఉద్యమం చేపడుతున్నామని మీకు గుర్తుండే ఉంటుంది. ఈసారి ఇది సెప్టెంబర్ 11 నుండే మొదలవుతుంది. ఈ సమయంలో మనము మన మన ఇండ్ల నుంచి బయటికి వచ్చి శ్రమదానంతో మహాత్మాగాంధీ కి కార్యాంజలి సమర్పిద్దాము. ఇల్లు కానీ, వీధికానీ, కూడలి కానీ సందులు గానీ, బడి కానీ కళాశాల కానీ అన్ని సార్వజనిక స్థలాలలో స్వచ్ఛతా ఉద్యమం నిర్వహించాలి. ఈసారి ప్లాస్టిక్ మీద మరింత శ్రద్ధ పెట్టాలి. ఆగస్ట్15 న ఎఱ్ఱకోట నుంచి మాటలాడుతూ వందన్నర కోట్ల దేశవాసులు ఎలా ఉత్సాహం, శక్తితో స్వచ్ఛతా ఉద్యమం చేశారో నేను చెప్పాను. బహిరంగ ప్రదేశాలలో మలమూత్ర విసర్జనాల నుంచి ముక్తి లభించే పని చేశాము. అలాగే మనమందరం కలిసి Single Use Plastic యొక్క వాడుకను ఆపేయాలి. ఈ ప్రచారం విషయంలో సమాజం లోని అన్ని వర్గాలు ఉత్సాహంగా ఉన్నాయి.
నా సోదర సోదరీ వ్యాపారులెందరో తమ దుకాణాల్లో ఒక బోర్డ్ ను పెట్టారు. ఒక placard ను పెట్టారు. అందులో వినియోగదారులు తమ సంచులను తామే తెచ్చుకోవాలి అని వ్రాసి ఉంటుంది. దీని ద్వారా డబ్బులూ మిగులుతాయి, పర్యావరణ రక్షణ లో తన వంతు పాత్రనీ పోషించినట్లవుతుంది. ఈ సారి 2 అక్టోబర్ బాపూజీ 150 వ జయంతి జరుపుకునే సందర్భంలో బహిరంగ మలమూత్ర విసర్జన నుంచి విడుదల పొందిన భారతదేశాన్ని వారికి సమర్పించడమే కాక ప్లాస్టిక్ కు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి పునాది వేద్దాము. నేను సమాజంలోని అన్ని వర్గాలవారితో, ప్రతి గ్రామ, ప్రతి పట్టణ నివాసులతో ఒక అప్పీలు చేస్తున్నాను. చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. ఈ సంవత్సరం గాంధీ జయంతిని ప్లాస్టిక్ చెత్త నుంచి భారతమాతను ముక్తి చేసేలా జరుపుకుందాము. 2 అక్టోబరును ప్రత్యేకంగా జరుపుకుందాము. మహాత్మా గాంధీ జయంతి రోజు ఒక విశేష శ్రమదానోత్సవం కావాలి. దేశంలోని అన్ని మునిసిపాలిటీ, కార్పొరేషన్, జిల్లా పరిషత్, గ్రామ పంచాయత్ ప్రభుత్వ, ప్రైవేట్ అన్ని వ్యవస్థలు, అన్ని సంస్థలు, ఒక్కొక్క పౌరుడు అందరితో నా విన్నపం ఏమంటే ప్లాస్టిక్ చెత్త కుప్ప సేకరణకు, నిల్వకు తగిన ఏర్పాటు ఉండాలి. ఈ ప్లాస్టిక్ వేస్ట్ అంతా ఒక చోట సేకరింపబడితే దాన్ని తగినట్టుగా ఎలా వదిలించుకోవాలి disposal కు ఏర్పాటు ఎలా జరగాలి అనే విషయాన్ని పరిశీలించమని నేను అన్ని కార్పొరేట్ సెక్టార్లకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను. దీన్ని రీసైకిల్ చేయవచ్చు. దీన్ని ఇంధనంగా వాడవచ్చు. అదే విధంగా ఈ దీపావళి వరకు మనం ఈ ప్లాస్టిక్ చెత్త యొక్క సురక్షిత వినియోగం అనే పనిని చేయవచ్చు. సంకల్పం మాత్రం ముఖ్యం. స్ఫూర్తి కొఱకై అటూ ఇటూ చూసే పని లేదు. గాంధీ కన్నా పెద్ద స్ఫూర్తి ఇంకేముంటుంది?
నా ప్రియ దేశవాసులారా, మన సంస్కృత సుభాషితాలు ఒక రకంగా జ్ఞాన రత్నాలు. మనకు జీవితంలో ఏం కావాలో అవన్నీ వాటిలో దొరుకుతాయి. ఈ మధ్య తగ్గిపోయింది కానీ మొదట వాటితో నాకు చాలా అనుబంధం ఉండేది. ఈరోజు ఒక సంస్కృత సుభాషితంతో ఒక చాలా ముఖ్యమైన మాటను చెప్పాలనుకుంటున్నాను. ఇది శతాబ్దాల ముందర వ్రాసిన మాట. ఐనా ఇప్పటికీ దీని ప్రాధాన్యత ఉంది. ఒక ఉత్తమ మైన సుభాషితములో ఇలా చెప్తారు.
పృథివ్యాం త్రీణి రత్నాని జలమన్నం సుభాషితం।
మూఢైః పాషాణఖండేషు రత్నసంజ్ఞా ప్రదీయతే.
అంటే పృథివిలో జలము, అన్నము మరియు సుభాషితము –
అని మూడు రత్నాలున్నాయి. మూర్ఖులు రాతిని రత్నమనుకుంటారు. మన సంస్కృతిలో ఆహారానికి చాలా ఎక్కువ మహిమ ఉంది. ఎంతంటే మనము అన్నజ్ఞానాన్ని కూడా విజ్ఞానంలో కలిపేశాము. సంతులిత పౌష్టిక భోజనం మనకందరికీ అవసరమైనది. ఇంకా ముఖ్యంగా మహిళలకు, అప్పుడే పుట్టిన పిల్లలకు. ఎందుకంటే వీరే మన భవిష్యత్తుకు పునాది. ‘పోషణ్ అభియాన్’ లో దేశమంతటా ఆధునిక వైజ్ఞానిక పద్ధతులలో పోషణ ప్రజా ఉద్యమంగా తయారవుతున్నది. ప్రజలు కొత్త ఆసక్తి కరమైన పద్ధతులలో కుపోషణతో పోరాడుతున్నారు. ఒకసారి ఒక విషయం నాదృష్టిలోకి వచ్చింది. నాసిక్ లో పిడికిటి నిండా ధాన్యము అనే ఒక పెద్ద ఉద్యమం జరిగింది. అందులో పంట కోతల దినాలలో అంగన్ వాడీ సేవికలు ప్రజల నుంచి ఒక పిడికిలి ధాన్యాన్ని సేకరిస్తారు. ఈ ధాన్యాన్ని స్త్రీలు, పిల్లలకు వేడిగా ఆహారం తయారుచేయడానికి వాడతారు. ఇందులో దానం చేసే వ్యక్తి ఒక జాగరూకుడైన పౌరునిగా సమాజ సేవకునిగా అవుతున్నాడు. ఆ తర్వాత అతడు స్వయంగా ఈ లక్ష్యం కొరకు అంకితమౌతాడు. ఈ ఉద్యమంలో ఒక సైనికునిలా పనిచేస్తాడు. మనమంతా కుటుంబాల్లో హిందూస్తాన్ లో అన్ని మూలల్లో అన్నప్రాసన సంస్కారం గురించి విన్నాము. పిల్లలకు మొదటి సారి ఘనాహారం తినిపించే సమయంలో ఈ సంస్కారం జరిపించబడుతుంది. ద్రవాహారం కాదు ఘనాహారం. గుజరాత్ 2010 లో ఒక ఆలోచన చేసింది. అన్నప్రాసన సందర్భంగా పిల్లలకు కాంప్లిమెంటరీ ఫుడ్ ఇచ్చి ఈ విషయంలో అవసరమైన ఎఱుక ఎందుకు కలిగించరాదు అని. ఇది చాలా గొప్ప ముందడుగు, దీనిని ప్రతి ఒక్కరూ పాటించవచ్చు. చాలా రాష్ట్రాల్లో ప్రజలు తిథి భోజన ఉద్యమం చేస్తారు. కుటుంబంలో పుట్టినరోజు గానీ, ఏదైనా శుభదినం కానీ, ఏదైనా స్మృతిదినం కానీ, కుటుంబ సభ్యులు పౌష్టికాహారం, రుచికరమైన ఆహారం తయారుచేసి అంగన్ వాడీలకు, బడులకు వెళ్ళి కుటుంబ సభ్యులు స్వయంగా వడ్డిస్తారు, తినిపిస్తారు. తమ ఆనందాన్ని పంచుకుంటారు. ఆనందాన్ని పెంచుకుంటారు. సేవాభావము, ఆనందభావముల ఒక అద్భుతమైన సమావేశం దృశ్యగోచరమౌతుంది. సహచరులారా! ఇలా అనేకమైన చిన్న చిన్న పద్ధతులద్వారా మన దేశము కుపోషణతో పోరాడి ప్రభావం తీసుకురావచ్చు. నేడు సరైన విషయపరిజ్ఞానం లేక, బీదవారు, సంపన్నులు కూడా కుపోషణ బారిన పడుతున్నారు. దేశమంతటా సెప్టెంబరు నెల ‘పోషణ అభియాన్ ‘ రూపంలో జరుపబడుతుంది. మీరంతా ఇందులో పాలుపంచుకోండి. విషయాలు తెలుసుకోండి. కొత్తవి చేర్చండి. మీరూ పాల్గొనండి. మీరు ఒకరిద్దరు వ్యక్తులనైనా కుపోషణ నుంచి ముక్తి కలిగేలా చేశారంటే మన దేశాన్ని కుపోషణ నుంచి ముక్తి కలిగినట్టే.
“హలో సర్, నా పేరు సృష్టి విద్య. నేను 2ndఇయర్ విద్యార్థినిని. సర్ నేను 12 ఆగస్టున మీ ఎపిసోడ్ చూశాను. Bear Grylls తో మీరున్నారు. ఆ కార్యక్రమం నాకు చాలా నచ్చింది. మీకు మన ప్రకృతి, వన్యప్రాణులు, పర్యావరణం పట్ల ఎంత శ్రద్ధ ఉందో ఎంత జాగ్రత్త తీసుకుంటారో విని చాలా సంతోషం కలిగింది. ఒక సాహసి రూపంలో కొత్త రూపంలో మిమ్మల్ని చూసి సంతోషం కలిగింది. ఈ కార్యక్రమ సమయంలో మీ అనుభవం ఎలా ఉండింది అని నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. చివరగా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను సర్. మీ ఫిట్ నెస్ లెవెల్ చూసి మా యువత చాలా ప్రభావితమైంది. ఇంత ఫిట్ అండ్ ఫైన్ గా మిమ్మల్ని చూసి చాలా స్ఫూర్తి కలిగింది.”
సృష్టి గారు, మీ ఫోన్ కాల్ కు ధన్యవాదాలు. మీలాగే హరియాణా నుంచి సోహనా నుంచి కే కే పాండేయ గారు, సూరత్ నుంచి ఐశ్వర్యాశర్మ గారితో పాటు చాలా మంది డిస్కవరీ ఛానల్ లో ప్రసారమైన ‘Man Vs Wild’ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు. ఈ సారి నేను ‘మన్ కీ బాత్’ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఈ విషయం గురించి చాలా ప్రశ్నలు వస్తాయి అని ఖచ్చితంగా అనిపించింది. అలాగే జరిగింది కూడా. గత కొన్ని వారాలుగా నేను ఎక్కడికి వెళ్ళినా ప్రజలతో కలిసినా అక్కడ ‘Man Vs Wild’ గురించి ప్రస్తావన వచ్చింది. ఈ ఒక్క ఎపిసోడ్ తో నేను హిందూస్తాన్ మాత్రమే కాక ప్రపంచంలోని యువత అందరితో కలిసినట్టైంది. యువ హృదయాలలో నాకింత చోటు దొరుకుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. మన దేశంలోని, ప్రపంచంలోని యువత వైవిధ్యమైన విషయాల పైన దృష్టి పెడుతున్నదని నేనెప్పుడూ అనుకోనే లేదు. ఎప్పటికైనా ప్రపంచంలోని యువ హృదయాలను స్పృశించే అవకాశం నా జీవితంలో వస్తుందని నేనేనాడూ ఊహించలేదు. కానీ జరిగిందేమిటి? గత వారం నేను భూటాన్ వెళ్ళాను. ప్రధానమంత్రి గా నేను ఎప్పుడు ఎక్కడికి వెళ్ళే సందర్భం వచ్చినా నేనొక విషయాన్ని గమనిస్తున్నాను – అంతర్జాతీయ యోగ్ దివస్ వల్ల ప్రపంచంలో ఎవరితో మాట్లాడే సందర్భం ఏర్పడినా ఎవరో ఒకరు ఐదు పది నిమిషాలు యోగా గురించి నాతో మాట్లాడతారు. ప్రపంచంలో పెద్ద నేతల్లో నాతో యోగా గురించి చర్చించని వాళ్ళు అరుదు. ఈ విషయం నేను ప్రపంచమంతటి గురించి చెప్తున్నాను. కానీ ఈ మధ్య ఒక కొత్త అనుభవం కలిగింది. ఎవరు కలిసినా, ఎక్కడ మాట్లాడే సందర్భం వచ్చినా వాళ్ళు వన్యప్రాణుల గురించి చర్చిస్తున్నారు, పర్యావరణం గురించి మాట్లాడుతున్నారు. పులి, సింహము, జీవ సృష్టి ప్రజలకు ఎన్ని విషయాల్లో అభిరుచులున్నాయి! డిస్కవరీ చానల్ ఈ కార్యక్రమాన్ని 165 దేశాల్లో వారి భాషలో ప్రసారం చేసే ప్రణాళిక వేసింది. నేడు పర్యావరణం, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్ వీటిగురించి విశ్వ స్థాయిలో మేథోమథనం జరుగుతున్న సందర్భంలో, భారతదేశం యొక్క సందేశము, భారతదేశం యొక్క సంప్రదాయాలు, భారతదేశం యొక్క సంస్కార యాత్రలో ప్రకృతిపట్ల ఉన్న సహానుభూతి ఈ విషయాలన్నీ విశ్వానికి పరిచయం కావడంలోఈ కార్యక్రమంసహకరిస్తుందని ఆశిస్తాను. పూర్తిగా నమ్ముతున్నాను. మన భారత దేశంలో క్లైమేట్ జస్టిస్, స్వచ్చ వాతావరణం దిశగా తీసుకున్న చర్యలను ఇప్పుడు ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇంకొక ఆసక్తి కరమైన సంగతి ఏమిటంటే కొందరు సంకోచిస్తూ నన్నొక మాట అడుగుతున్నారు, మోదీగారు, ఇది చెప్పండి. మీరు హిందీలో మాట్లాడుతున్నారు, Bear Grylls కు హిందీరాదు. మరి ఇంత వేగంగా మీ మధ్య సంభాషణ ఎలా జరుగుతున్నది? దీనిని తర్వాత ఎడిట్ గాని చేసారా? మళ్ళీ మళ్ళీ షూట్ చేశారా? ఏం జరిగింది? చాలా కుతూహలంగా ప్రశ్నిస్తారు. చూడండి, ఇందులో రహస్యమేమీ లేదు. చాలా మంది మనసులో ఈ ప్రశ్న ఉంది. సరే, నేను ఈ రహస్యాన్ని ఇప్పుడు చెప్పేస్తాను. నిజానికి ఇది రహస్యమే కాదు. వాస్తవమేమంటే Bear Grylls తో జరిగిన సంభాషణలో టెక్నాలజీ ని పూర్తిగా వినియోగించడం జరిగింది. నేను ఏదైనా చెప్పగానే అది ఆంగ్లంలోకి అనువాదం సమాంతరంగా జరిగిపోయేది. సమాంతరంగా జరుగుతుండడం వల్ల Bear Grylls చెవిలో ఒక చిన్న కార్డ్ లెస్ పరికరం పెట్టి ఉంచారు. కాబట్టి నేను హిందీలో మాట్లాడుతుంటే అది అతనికి ఆంగ్లంలో వినిపిస్తూ ఉండడం వల్ల సంభాషణ సాఫీగా సాగింది. టెక్నాలజీ యొక్క చమత్కారమే అది. ఈ షో తర్వాత చాలా మంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ గురించి చర్చిస్తూ కనిపిస్తున్నారు. మీరు కూడా ప్రకృతి, వన్యప్రాణులు, ఉండే చోట్లకు తప్పక వెళ్ళండి. నేను ఇదివరకు కూడా చెప్పాను. తప్పకుండా చెప్తుంటాను. మీరు జీవితంలో ఈశాన్యభారతానికి తప్పక వెళ్ళండి. ఆహా! ఏమి ప్రకృతి ఉందక్కడ! మీరు చూస్తూనే ఉండిపోతారు. మీ అంతరంగం కూడా విశాలమౌతుంది. 15 ఆగస్టున నేను ఎఱ్ఱకోట పైనుంచి మీకు విన్నపం చేశాను. రాబోయే మూడేళ్ళలో కనీసం 15 ప్రదేశాలు, భారతదేశంలో 15 ప్రదేశాలు పూర్తిగా పర్యటనకేంద్రాలుగా అవుతాయి. మీరు వెళ్ళండి, చూడండి, అధ్యయనం చేయండి, కుటుంబాన్ని తీసుకువెళ్ళండి, కొంత సమయం అక్కడ గడపండి. వైవిధ్యాలతో నిండిన దేశం మీక్కూడా ఈ వైవిధ్యాలను ఒక ఉపాధ్యాయునిలా పరిచయం చేస్తుంది. మీలో లోపలనుంచి ఈ వైవిధ్యాన్ని నింపుతుంది. మీ జీవనపరిధి విశాలమౌతుంది. మీ ఆలోచనా పరిధి విశాలమౌతుంది. మీరు కొత్త స్ఫూర్తి, కొత్త ఆకాంక్షలు, కొత్త ప్రేరణ పొందగలిగే ప్రదేశాలుహిందూస్తాన్ లోపలే ఉన్నాయని నాకు పూర్తి నమ్మకముంది. పైగా కొన్ని ప్రదేశాలైతే మీకూ, మీ కుటుంబానికీ కూడా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపించేలా ఉండొచ్చు.
నా ప్రియ దేశవాసులారా, భారతదేశంలో పర్యావరణ రక్షణ, శ్రద్ధ అంటే సంరక్షణ గురించిన ఆలోచన సహజంగా కనిపిస్తుంది. గత నెలలో నాకు దేశంలో పులి జనాభాను విడుదల చేసే అదృష్టం కలిగింది. భారతదేశంలో ఎన్ని పులులున్నాయో మీకు తెలుసా? భారతదేశంలో పులుల సంఖ్య 2967. రెండువేల తొమ్మిది వందల అరవై ఏడు. కొన్నేళ్ళ క్రిందట ఈ సంఖ్యలో సగం ఉండడమే కష్టమై ఉండేది. 2010 లో పులుల గురించి రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఒక పులుల సదస్సు జరిగింది. అందులో పులుల సంఖ్య తగ్గుతుండడం గురించి విచారం వెలిబుచ్చి, ఒక సంకల్పం తీసుకున్నారు. 2022 కల్లా ప్రపంచంలోని పులుల సంఖ్య రెట్టింపు చేయాలన్నదే ఆ సంకల్పం. కానీ ఇది ఇప్పుడు కొత్త ఇండియా. మనము లక్ష్యాలను త్వరత్వరగా పూర్తి చేస్తాము. మనము 2019 లోనే ఇక్కడి పులుల సంఖ్యను రెట్టింపు చేశాము. భారతదేశంలో పులుల సంఖ మాత్రమే కాదు అభయారణ్యాలు, కమ్యూనిటీ రిజర్వ్ స్ సంఖ్య కూడా పెరిగింది. నేను పులుల డేటా విడుదల చేసేటప్పుడు నాకు గుజరాత్ లోని గిర్ సింహాలు కూడా గుర్తొచ్చాయి. నేను అక్కడ ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టినప్పుడుగిర్ అడవులలో సింహాల నివాసం తగ్గుతూ ఉండింది. వాటి సంఖ్య తగ్గుతూ ఉండింది. మేము గిర్ లో ఒకటొకటిగా అనేక చర్యలు చేపట్టాము. 2007 లో అక్కడి మహిళా గార్డ్లను నియమించే నిర్ణయం తీసుకున్నాము. పర్యాటకులను పెంచడానికి మౌలిక సదుపాయాల ను మెరుగు పరచాము. ఎప్పుడైనా సరే ప్రకృతి, వన్యప్రాణుల గురించి మాట్లాడితే పరిరక్షణ గురించే చర్చ జరుగుతుంది. కానీ, రక్షణతో పాటు కరుణ వైపు ఈ చర్చను తీసుకువెళ్ళడం గురించి ఆలోచించాలి. మన శాస్త్రాలలో ఈ విషయం గురించి చక్కటి మార్గదర్శనం దొరుకుతుంది. శతాబ్దాలకు పూర్వమే మన శాస్త్రాలలో మనము చెప్పుకున్నాము.
నిర్వనో బధ్యతే వ్యాఘ్రో, నిర్వ్యాఘ్రం ఛిద్యతే వనమ్।
తస్మాద్ వ్యాఘ్రో వనం రక్షేత్, వనం వ్యాఘ్రం న పాలయేత్॥
అర్థమేమంటే, అరణ్యం లేకుంటే పులులకు మానవ ప్రాంతాలకు రాక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. తత్ఫలితంగా అవి చంపబడతాయి. అడవిలో పులులు లేకుంటే మనుష్యులు అడవి చెట్లను కొట్టేసి దాన్ని నాశనం చేస్తారు. కాబట్టి వాస్తవంలో పులి అడవిని రక్షిస్తుంది. అడవి పులిని కాదు. ఎంత గొప్పగా ఈ విషయాన్ని మన పూర్వీకులు వివరించారు! కాబట్టి మనం అడవులను, చెట్లను, వన్యప్రాణులను రక్షించడం మాత్రమే ఆవశ్యకం కాదు, అవి సరైన రీతిలో వృద్ధి పొందడానికి తగిన వాతావరణాన్ని కూడా కల్పించాలి.
నా ప్రియ దేశవాసులారా, 11 సెప్టెంబర్ 1893 లో స్వామీ వివేకానందుని చారిత్రక ఉపన్యాసాన్ని ఎలా మరిచిపోగలము? విశ్వమంతటా మానవజాతిని ఊపేసిన భారత యువ సన్యాసి ప్రపంచంలో భారతదేశం యొక్క తేజోవంతమైన గుర్తింపును నిలిపాడు. బానిసగా భారతదేశాన్ని ఏ ప్రపంచం వికృతంగా చూస్తూ ఉండిందో, 11సెప్టెంబర్ 1893 న స్వామీ వివేకానందుని వంటి మహాపురుషుని మాటలు అదే ప్రపంచం భారతదేశం వైపు చూసే దృష్టినే మార్చుకునేలా చేశాయి. రండి, స్వామీ వివేనందుడు భారతదేశం యొక్క ఏ రూపాన్ని చూడాలనుకున్నాడో, భారతదేశం యొక్క ఏ సామర్థ్యాన్ని తెలుసుకున్నాడో ఆ విధంగా జీవించే ప్రయత్నం చేద్దాం. మనలోనే ఉంది, అంతా ఉంది. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుదాం.
నా ప్రియ దేశవాసులారా, 29 ఆగస్ట్ న ‘జాతీయ క్రీడాదినోత్సవం’గా జరుపుకుంటామని మీకంతా గుర్తు ఉండే ఉంటుంది. ఈ సందర్భంలో మన దేశమంతటా ‘ఫిట్ ఇండియా మూవ్ మెంట్’ ప్రారంభించబోతున్నాము. స్వయంగా ఫిట్ గా ఉండాలి. దేశాన్ని ఫిట్ గా తయారు చేయాలి. ప్రతి ఒక్కరికీ పిల్లలకు, పెద్దవాళ్ళకు, యువతకు, మహిళలకు అందరికీ ఇది చాలా ఆసక్తికరమైన ఉద్యమంగా ఉంటుంది. ఇది మీకు మీ స్వంతమైన విషయంగా ఉంటుంది. వాటి వివరాలన్నీ ఇప్పుడే చెప్పను. 29 ఆగస్ట్ వరకూ వేచిఉండండి. నేను స్వయంగా ఆరోజు వివరంగా విషయాలు చెప్తాను. మిమ్మల్ని కలుపుకొని వెళ్ళకుండా ఉండను. ఎందుకంటే మిమ్మల్ని నేను ఫిట్ గా చూడాలనుకుంటున్నాను. ఫిట్ నెస్ గురించి మిమ్మల్ని జాగరూకుల్ని చేయాలనుకుంటున్నాను. ఫిట్ ఇండియా కోసం దేశం కోసం మనమంతా కలిసి కొన్ని లక్ష్యాలను నిర్ధారిద్దాము.
నా ప్రియదేశవాసులారా, 29 ఆగస్ట్ న ఫిట్ ఇండియాలో మీకోసం ఎదురుచూస్తాను. సెప్టెంబర్ నెలలో ‘పోషణ్ అభియాన్’ లో కూడా. ఇంకా ముఖ్యంగా 11 సెప్టెంబర్ నుంచి 02 అక్టోబర్ వరకూ ‘స్వచ్ఛతా అభియాన్’ లో కూడా. ఇక 02 అక్టోబర్ పూర్తిగా ప్లాస్టిక్ కోసమే అంకితం. ప్లాస్టిక్ నుంచి ముక్తి పొందడానికి మనమంతా ఇల్లు, ఇంటిబయట అన్ని చోట్లా మనస్ఫూర్తిగా పాటుపడాలి. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో దుమ్ము రేగగొడతామని నాకు తెలుసు. రండి, ఒక కొత్త ఆకాంక్ష, కొత్త సంకల్పం, కొత్త శక్తితో ముందుకు సాగుదాం.
నా ప్రియ దేశవాసులారా, నేడు’మన్ కీ బాత్’ లో ఇంతే. మళ్ళీ కలుద్దాం. నేను మీ మాటల కోసం, మీ సూచనల కోసం వేచి ఉంటాను. రండి, మనమంతా కలిసి స్వాతంత్ర్య యోధుల కలల భారతం రూపొందేలా, గాంధీ కలలను సాకారం చేసేలా ముందుకు సాగుదాం – ‘స్వాంతః సుఖాయ.’ అంతరంగం లోని ఆనందాన్ని సేవాభావం ద్వారా ప్రకటిస్తూ ముందుకు సాగుదాం.
అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారము. ‘మన్ కీ బాత్’ ఎప్పటిలాగే నేను, మీరు కూడా ఎదురు చూసే కార్యక్రమ. ఈ సారి కూడా అనేక సంఖ్య లో ఉత్తరాలు, వ్యాఖ్యలు, ఫోన్ కాల్స్ వచ్చాయి – చాలా కథలు, సలహాలు, ప్రేరణలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఏదో చెప్పాలనుకుంటున్నారు, చేయాలనుకుంటున్నారు. వీటన్నిటి లో ఉన్న విషయాలను కూర్చాలని ఎంతో ఆవేశం కలుగుతుంది, కానీ సమయం చాలదు. అన్నీ కూర్చలేకపోతున్నాను. మీరు నన్ను పరీక్షిస్తున్నారని అనిపిస్తుంది. కానీ మీ మాటలనే, ఈ ‘మన్ కీ బాత్’ యొక్క దారం లో కూర్చి మీకు మరొకసారి పంచాలనుకుంటున్నాను.
క్రితం సారి నేను ప్రేమ్ చంద్ కథల పుస్తకాన్ని గురించి చర్చించాను. అప్పుడు ఏ పుస్తకమైనా చదివితే దాన్ని గురించి ఒక నాలుగు మాటలను NarendraModi App ద్వారా అందరితో పంచుకోవాలని మనం నిశ్చయించుకున్న విషయం మీకు గుర్తు ఉండే ఉంటుంది. పెద్ద సంఖ్య లో ప్రజలు అనేకరకాల పుస్తకాల ను గురించి వివరాల ను పంచుకున్నారు. ప్రజలు సైన్స్, టెక్నాలజీ, ఇనవేశన్, చరిత్ర, సంస్కృతి, బిజినెస్, జీవన చరిత్రలు వంటి అనేక విషయాల ను గురించి వ్రాసిన పుస్తకాల ను గురించి చర్చిస్తున్నారు. కొందరయితే నన్ను మరికొన్ని పుస్తకాలను గురించి మాట్లాడమని కూడా సలహా ఇచ్చారు. అలాగే, తప్పకుండా మరిన్ని పుస్తకాల గురించి నేను మీతో మాట్లాడుతాను. కానీ, ఎక్కువ పుస్తకాలు చదవడానికి ఇప్పుడు సమయం అంత కేటాయించలేకపోతున్నానని ఒప్పుకుంటాను. కానీ, ఒక లాభం కలిగింది, అదేమిటంటే మీరు వ్రాసి పంపుతున్న వివరాలు చూస్తుంటే చాలా పుస్తకాల వివరాలు నాకు తెలుసుకొనే అవకశాం కలుగుతోంది. ఈ నెల రోజుల అనుభవం వల్ల మనం దీన్ని ముందుకు తీసుకువెళ్ళాల్సిన అవసరం ఉందని అనిపిస్తోంది. మనం ఈ NarendraModi App లో కొత్త పుస్తకాలు చదవడం, అక్కడ వ్రాయడం, చర్చించడం చేయగలిగేలా ఒక శాశ్వతమైన బుక్స్ కార్నర్ ఎందుకు పెట్టకూడదు? మన ఈ బుక్స్ కార్నర్ కు మీరే ఒక మంచి పేరు సూచించగలరు. పాఠకుల కు, లేఖకుల కు ఇది ఒక క్రియాశీల వేదిక గా తయారు చేద్దాం. మీరు చదువుతూ, వ్రాస్తూ ఉండండి, అలాగే ‘మన్ కీ బాత్’ యొక్క అందరు సహచరులతో పంచుకుంటూ ఉండండి.
సహచరులారా, నాకేమనిపిస్తుందంటే జల సంరక్షణ – ‘మన్ కీ బాత్’ లో నేను ఈ విషయాన్ని ప్రస్తావించక ముందు నుంచే మీ అందరి మనసును తాకే మాట, సామాన్య మానవులకు నచ్చిన మాట అని నాకు అనిపిస్తూ ఉంది. నీటి విషయం ఈ మధ్య కాలం లో హిందుస్తాన్ మనసుల ను పట్టి ఊపేసిన సంగతి నా అనుభవం లోకి వస్తూంది. జల సంరక్షణ గురించి దేశమంతటా అనేకమైన ఎరుక కలిగిన, ప్రభావవంతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రజలు సాంప్రదాయక విధివిధానాల గురించిన వివరాలనయితే పంచుకున్నారు. మాధ్యమాలు కూడా జలసంరక్షణ మీద ఎన్నో నవీన ప్రచారాల ను ప్రారంభించాయి. ప్రభుత్వమైనా, ఎన్‌జిఒ లు అయినా – యుద్ధ ప్రాతిపదిక మీద ఎంతో కొంత ప్రయత్నం చేస్తున్నాయి. సంఘటిత సామర్థ్యాన్ని చూసి నా మనసు కు ఎంతో నచ్చుతోంది. సంతోషం కలుగుతోంది. ఉదాహరణ కు ఝార్ఖండ్ లో రాంచీ నుంచి కొంచెం దూరంగా ఓర్ మాంఝీ బ్లాక్ లో ఆరా కేరమ్ గ్రామం లో అక్కడి గ్రామీణులు నీటి ఏర్పాట్ల గురించి ఎంత స్ఫూర్తి చూపించారంటే, అది అందరికీ ఆదర్శం అయిపోయింది. ఆ గ్రామ వాసులు కొండ మీద నుంచి పడుతున్న జలపాతాన్ని ఒక దిశ వైపు తీసుకువెళ్ళే పని చేశారు. అది కూడా అసలైన దేశీయ పద్ధతుల లో. దీనివల్ల మట్టి కోసుకుపోవడం, పంట నష్టం ఆగి, పొలాలకు నీళ్ళు అందుతున్నాయి. గ్రామీణుల ఈ శ్రమదానం గ్రామాని కి అంతటికీ జీవనదానం కన్నా తక్కువేమీ కాదు. ఒక విషయం తెలిసి మీరంతా ఆనందపడగలరు. అదేమిటంటే నార్త్ ఈస్ట్ లోని అందమైన రాష్ట్రం మేఘాలయ తన జల విధానం, వాటర్ పాలసీ తయారు చేసుకొన్న దేశం లోనే మొట్ట మొదటి రాష్ట్రం అయింది. ఆ ప్రభుత్వాన్ని నేను అభినందిస్తున్నాను.
హరియాణా లో నీటి అవసరం తక్కువ ఉండి, రైతుకు కూడా నష్టం లేనటువంటి పంటలను ప్రోత్సహించడం జరుగుతోంది. అక్కడి ప్రభుత్వం రైతుల తో చర్చలు జరిపి, వారి సాంప్రదాయకమైన వ్యవసాయ విధానాలకు బదులుగా, తక్కువ నీటి అవసరం ఉన్న పంటల ను ప్రోత్సహించినందుకు నేను వారిని ప్రత్యేకంగా అభినందిస్తాను.
ఇప్పుడు పండుగల సమయం వచ్చేసింది. పండుగల సమయంలో అనేక ప్రదర్శనలు/మేళాలు కూడా జరుగుతాయి. అటువంటి చోట్లను జల సంరక్షణ కోసం ఎందుకు ఉపయోగించకూడదు? సమాజంలోని అన్ని వర్గాల వారు అక్కడ గుమిగూడతారు. అక్కడ నీటిని పొదుపుగా వాడడం గురించిన సందేశాలు చాలా ప్రభావవంతంగా వినిపించవచ్చు. ప్రదర్శనలు ఏర్పాటు చేయవచ్చు. వీధి నాటకాలు వేయవచ్చు. ఉత్సవాలతో పాటు, జల సంరక్షణ సందేశం కూడా సులువుగా మనం వారికి చేర్చవచ్చు.
సహచరులారా, జీవితం లో కొన్ని విషయాలు ఎంతో ఉత్సాహాన్ని నింపుతాయి. ముఖ్యంగా పిల్లల సాధనలు, విజయాలు మనకందరికీ కొత్త శక్తి ని ఇస్తాయి. కాబట్టి నాకు ఈ రోజు కొందరు పిల్లల గురించి మాట్లాడాలని అనిపిస్తోంది. ఈ పిల్లలు – నిధి బాయిపోటు, మోనీశ్ జోషి, దేవాంశీ రావత్, తనుశ్ జైన్, హర్ష్ దేవధర్ కర్, అనంత్ తివారీ, ప్రీతి నాగ్, అథర్వ్ దేశ్ ముఖ్, అరోన్యతేశ్ గంగూలీ, హృదిక్ అలామందా.
వీరి గురించి నేను చెప్పేది వింటే మీకు ఎంతో గర్వం కలుగుతుంది. ఉత్సాహం వస్తుంది. కేన్సర్ మాట వింటేనే ప్రపంచమంతా ఎంత భయపడుతుందో మనకందరికీ తెలుసు. మృత్యువు గుమ్మంలో వేచి ఉంది అని తెలిసినా, ఈ పది మంది పిల్లలు తమ జీవన పోరాటంలో కేన్సర్ ని, ఇంకా అటువంటి ఘాతుకమైన వ్యాధులని ఓడించి తమ సాధనతో ప్రపంచమంతటా భారతదేశానికి పేరు తెచ్చారు. ఆటల్లో ఒక ఆటగాడు టోర్నమెంట్ గెలిచిన తర్వాత మెడల్ తెచ్చుకున్నాకే చాంపియన్ అవడం మనం చూస్తూనే ఉంటాం. కానీ, ఈ అరుదైన ఘటనలో వీరంతా ఆటల పోటీలో పాల్గొనకముందే చాంపియన్లు. వాళ్ళు జీవిత పోరాటంలో చాంపియన్లు.
ఈ నెలలో మాస్కోలో ప్రపంచ బాల విజేతల ఆటలు ఏర్పాటు చేశారు. ఇది ఒక విశిష్టమైన ఆట. ఇందులో కేన్సర్ తో పోరాడి బయటపడినవాళ్ళే పాల్గొనే యంగ్ కేన్సర్ సర్వైవర్స్ పాల్గొనే స్పోర్ట్స్ టోర్నమెంట్. వీటిలో షూటింగ్, చదరంగం, ఈత, పరుగుపందెం, ఫుట్ బాల్ మరియు టేబిల్ టెన్నిస్ వంటి పోటీల ఏర్పాటు జరిగింది. మన దేశస్తులైన ఈ పది మంది చాంపియన్లు ఈ టోర్నమెంట్ లో మెడల్స్ గెలిచారు. కొందరికైతే ఒకటి కన్నా ఎక్కువ మెడల్స్ కూడా వచ్చాయి.
నా ప్రియ దేశవాసులారా, ఆకాశాన్ని దాటి అంతరిక్షంలో భారతదేశపు సఫలత గురించి మీరంతా గర్వపడి ఉంటారని నాకు నమ్మకం ఉంది – చంద్రయాన్-2.
రాజస్థాన్ లోని జోధ్‌పుర్ నుంచి సంజీవ్ హరీపురా, కోల్కత్తా నుంచి మహేంద్రకుమార్ డాగా, తెలంగాణ నుంచి పి. అరవిందరావు వంటి అనేకులు, దేశమంతా వివిధ భాగాల నుంచి NarendraModi App & MyGov లలో వ్రాశారు. వారెంతా ‘మన్ కీ బాత్’ లో చంద్రయాన్ -2 గురించి రిక్వెస్ట్ చేశారు.
నిజానికి అంతరిక్ష విషయం తీసుకుంటే 2019 భారతదేశానికి చాలా మంచి ఏడాదిగా చెప్పుకోవచ్చు. మన శాస్త్రవేత్తలు మార్చ్ లో A-Sat లాంచ్ చేశారు. తర్వాత చంద్రయాన్-2. కానీ ఎన్నికల హడావిడి లో అప్పుడు A-Sat గురించి గొప్పగా చెప్పుకోదగినంత చర్చ జరగలేదు. చెప్పాలంటే A-Sat మిస్సైల్ కేవలం మూడు నిమిషాల్లో మూడొందల కిలో మీటర్ల దూరం ఉన్న శాటిలైట్ ను పడగొట్టే సామర్ధ్యం కలిగి ఉంది. ప్రపంచం లోనే దీనిని సాధించిన నాలుగో దేశం గా భారత్ నిలిచింది. ఇక ఇప్పుడు జులై 22వ తేదీన దేశమంతా శ్రీహరికోట నుంచి అంతరిక్షం వైపు చంద్రయాన్-2 ఎలా అడుగులు వేసిందో దేశమంతా గర్వంగా చూసుకుంది. చంద్రయాన్-2 లాంచ్ యొక్క ఫొటోలు దేశవాసులకు గౌరవం, ఉత్సాహం, సంతోషం చేకూర్చాయి.
చంద్రయాన్-2 ఈ మిషన్ అనేక రకాలుగా విశిష్టమైనది. చంద్రయాన్-2 చంద్రుని గురించి మన అవగాహనకు మరింత స్పష్టత చేకూర్చుతుంది. దీని ద్వారా మనకు చంద్రుడి గురించి మరింత విస్తారమైన సమాచారం దొరుకుతుంది. అయితే, నన్నడిగితే చంద్రయాన్-2 వల్ల మనకు రెండు గొప్ప పాఠాలు లభించాయని నేను చెప్పగలను. అవేమిటంటే – ఫెయిత్ మరియు ఫియర్‌లెస్‌నెస్.. అంటే విశ్వాసం, నిర్భీకత, మనకు మన టాలెంట్, కెపాసిటీ ల గురించి నమ్మకం ఉండాలి. మన ప్రతిభ, సామర్ధ్యాల గురించి విశ్వాసం ఉండాలి. చంద్రయాన్-2 పూర్తిగా భారతీయ ప్రతిభ తో రూపొందించబడింది అని తెలిస్తే మీరు తప్పక సంతోషిస్తారు. ఈ heart, spirit (హృదయం, ఉత్తేజం) భారతీయమైనవి. ఇది పూర్తిగా స్వదేశీ మిషన్, కొత్త కొత్త రంగాల్లో కొత్త రకంగా ఏదన్నా సాధించడానికి గానీ, ఇనొవేటివ్ జీల్ లో గానీ మన శాస్త్రవేత్తలు సర్వ శ్రేష్ఠులని, విశ్వ-స్తరీయులనీ ఇది మరొకసారి నిరూపించింది.
మరొక ముఖ్యమైన పాఠం ఏమిటంటే ఏ ఒక ఆటంకానికి మనం బెదరిపోకూడదు. మన శాస్త్రజ్ఞులు రికార్డ్ టైమ్ లో పగలు రాత్రి ఏకం చేసి సాంకేతిక సమస్యలను పరిష్కరించి చంద్రయాన్-2 ను లాంచ్ చేయడం అపూర్వమైన విషయం. శాస్త్రజ్ఞుల ఈ మహా తపస్సును ప్రపంచం గమనిస్తోంది. ఆటంకం వచ్చినా కూడా చేరే సమయాన్ని మార్చకుండా వెళ్ళడం చాలా మందికి ఆశ్చర్యకరమైన విషయంగా కనిపిస్తుంటే అది మనకు గర్వపడాల్సిన విషయం. మన జీవితంలో temporary set backs అంటే తాత్కాలిక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ, వాటిని దాటి వెళ్ళగల సామర్ధ్యం కూడా మన లోపలే ఉంటుందని ఎప్పుడూ గుర్తుంచుకోండి. చంద్రయాన్-2 ప్రయోగం దేశంలోని యువకులకు సైన్స్ మరియు ఇనవేశన్ వైపు ప్రేరణ కలిగిస్తుంది. విజ్ఞానమే అభివృద్ధికి మార్గం. ఇక చంద్రుని ఉపరితం మీద లాండర్ విక్రమ్ మరియు రోవర్ ప్రజ్ఞాన్ లాండ్ అయ్యే సెప్టెంబర్ నెల కోసం మనం ఎదురుచూద్దాం.
ఈ రోజు ‘మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా దేశంలోని విద్యార్థి మిత్రులతో, యువ సహచరులతో ఒక ఆసక్తికరమైన పోటీ గురించి, కాంపిటీషన్ గురించి వివరాలు పంచుకుందామనుకుంటున్నాను. దేశంలో యువతీ యువకులను ఆహ్వానిస్తున్నాను – ఒక క్విజ్ కాంపిటీషన్. అంతరిక్షానికి చెందిన జిజ్ఞాస, భారత్ యొక్క స్పేస్ మిశన్, సైన్స్ & టెక్నాలజీ – ఈ క్విజ్ కాంపిటీషన్ యొక్క ముఖ్య విషయం. ఉదాహరణకు రాకెట్ లాంచ్ చేయడానికి ఏమేం చేయాల్సి ఉంటుంది? శాటిలైట్ ఎలా ఆర్బిట్ లో ప్రవేశ పెట్టబడుతుంది? ఇంకా శాటిలైట్ తో మనకు ఏఏ వివరాలు అందుబాటులోకి వస్తాయి? A-Sat ఏమిటి? చాలా విషయాలున్నాయి. MyGov Website లో ఆగస్టు 1వ తేదీన ఫలితాలు ఇవ్వబడతాయి.
యువ సహచరులకు, విద్యార్థులకు ఇందులో పాల్గొనమని, ఈ క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొని దీన్ని ఆసక్తికరంగా, అవిస్మరణీయంగా మార్చమని నేను మనవి చేస్తున్నాను. తమ తమ స్కూళ్ళకు విజయం కలగడానికి పూర్తి ప్రయత్నం చేయమని నేను పాఠశాలల కు, ఉత్సాహవంతులైన అధ్యాపకుల కు, ఉపాధ్యాయుల కు, సంరక్షకుల కు ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తున్నాను. అందరు విద్యార్థుల ను ఇందులో పాల్గొనేలా ప్రోత్సహించండి. ఇంకా ఆకర్షణీయమైన విషయం ఏమిటంటే ఇందులో ఎక్కువ స్కోర్ చేసిన విద్యార్థుల కు ప్రతి రాష్ట్రం నుంచి, భారత ప్రభుత్వమే ఖర్చు భరించి శ్రీహరికోట కు తీసుకు వెళుతుంది. సెప్టెంబర్ లో చంద్రయాన్ చంద్రుని ఉపరితలం మీద లాండ్ అయ్యే క్షణాలను స్వయం గా చూసే అవకాశం వారికి కలిగిస్తుంది. గెలిచిన విద్యార్థుల కు ఈ విజయం ఒక చారిత్రక ఘటన గా ఉండిపోతుంది. కానీ, ఇందుకు మీరు క్విజ్ కాంపిటీషన్ లో పాల్గొనాలి. అందరికన్నా ఎక్కువ మార్కులు పొందగలగాలి. విజయం సాధించగలగాలి.
సహచరులారా, నా ఈ సలహా మీకు బాగా నచ్చి ఉండాలి. మజా అయిన అవకాశం కదూ. అయితే మనం క్విజ్ లో పాల్గొనడం మరచిపోవద్దు. వీలయినంత ఎక్కువ మందిని పాల్గొనేలా ప్రేరేపిద్దాం.
నా ప్రియ దేశవాసులారా, మీరు ఒక విషయం గమనించి ఉంటారు. మన ‘మన్ కీ బాత్’ లు అన్నీ స్వచ్ఛతా ఉద్యమాన్ని అడుగడుగునా ముందుకు నడిపించాయి. అలాగే స్వచ్ఛత కోసం చేస్తున్న ప్ియత్నాలన్నీ ‘మన్ కీ బాత్’ కు ప్రేరణ గా నిలిచాయి. అయిదేళ్ళ క్రితం ప్రారంభమైన ఈ ప్రయాణం జనులందరి సహకారం వలన స్వచ్ఛత యొక్క కొత్త కొత్త మైలురాళ్ళను చేరుకుంటున్నది. స్వచ్ఛత లో మనం ఆదర్శ స్థితి కి చేరామని కాదు గానీ, ఎలాగైనా ఇది ఒడిఎఫ్ నుంచి మొదలుకొని, పబ్లిక్ స్థలాలో స్వచ్ఛత ఉద్యమం వరకు లభించిన సాఫల్యత 130 కోట్ల దేశవాసుల సంకల్ప బలం. అయితే మనం ఇక్కడే ఆగిపోము. ఈ ఉద్యమం స్వచ్ఛత నుంచి సుందరత వరకు సాగుతుంది. ఈ మధ్యే కొన్ని రోజుల ముందు మీడియా లో శ్రీమాన్ యోగేశ్ సైనీ, వారి బృందం, వారి కథ చూశాను. యోగేశ్ సైనీ ఇంజినీర్. అమెరికా లో తన ఉద్యోగం వదులుకొని, భారత మాత సేవకై తిరిగి వచ్చారు. వారు కొంత కాలం క్రిందట ఢిల్లీ ని స్వచ్ఛంగా మాత్రమే కాదు, అందంగా చేసే ప్రయత్నాన్ని మొదలు పెట్టారు. వారు తమ బృందం తో పాటు, లోథీ గార్డెన్ యొక్క చెత్తకుండీల నుంచి పని మొదలు పెట్టారు. స్ట్రీట్ ఆర్ట్ ద్వారా, ఢిల్లీ లోని చాలా ప్రాంతాల ను అందమైన పెయింటింగ్స్ ద్వారా అలంకరించే పని చేపట్టారు. ఓవర్ బ్రిడ్జ్, బడి గోడల దగ్గర నుండి స్లమ్ లోని గుడిసెల వరకు తమ కళ ద్వారా అందం గా చెక్కడం మొదలు పెట్టాక ప్రజల సహకారం కూడా లభిస్తుండగా ఈ పరంపర కొనసాగింది. కుంభమేళా లో ప్రయాగ్‌రాజ్ ని ఏ విధంగా స్ట్రీట్ పెయింటింగ్ ద్వారా అలంకరించారో మీకు గుర్తుండే ఉంటుంది. నాకు తెలిసింది. భాయి యోగేశ్ సైనీ, వారి బృందం ఇందులో పెద్ద పాత్ర వహించింది. రంగుల్లో, రేఖల్లో ఏ స్వరము ఉండకపోవచ్చు. కానీ, వీటితో తయారైన చిత్రాలతో తయారైన ఇంద్రధనుస్సు ఇచ్చే సందేశం వేల మాటల కన్నా ఎక్కువ ప్రభావం చూపుతుందని నిరూపించబడుతుంది. స్వచ్ఛతా ఉద్యమపు అందం లో కూడా మనకు ఈ మాట అనుభవం లోకి వస్తుంది. వేస్ట్ నుంచి వెల్త్ (చెత్త నుంచి విత్తం) తయారు చేసే సంస్కృతి మన సమాజం లో డెవలప్ కావాలి. ఒక ప్రకారం గా మనం వ్యర్థం నుంచి అర్థం తయారు చేసే దిశలో ముందుకు నడవాలి.
నా ప్రియ దేశవాసులారా, కొన్ని రోజుల క్రిందట MyGov లో నేను ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చదివాను. జమ్ము, కశ్మీర్ లోని శోపియా లోని మహమ్మద్ అస్లమ్ భాయి వ్రాసిన వ్యాఖ్య అది.
వారు వ్రాశారు, ‘మన్ కీ బాత్’ కార్యక్రమం వినడం బాగుంటుంది. మా జమ్ము,కశ్మీర్ రాష్ట్రం లో కమ్యూనిటీ మొబిలైజేషన్ ప్రోగ్రామ్ – బాక్ టు విలేజ్ (పల్లె వైపు పయనం) ఏర్పాటు లో నేను క్రియాశీలమైన పాత్ర పోషించానని చెప్పడానికి నాకు చాలా సంతోషం గా ఉంది. ఈ కార్యక్రమం జూన్ నెల లో ఏర్పాటయింది. ప్రతి మూడు నెలల కు ఒకసారి ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేయాలని నాకు అనిపిస్తుంది. దాంతో పాటు, ఈ కార్యక్రమం పై ఆన్లైన్ మానిటరింగ్ వ్యవస్థ కూడా ఉండాలి. నాకు తెలిసి ప్రజలు నేరుగా ప్రభుత్వం తో సంధానించే కార్యక్రమం ఇదే మొదటిది అనుకుంటున్నాను.
మహమ్మద్ అస్లమ్ భాయి వ్రాసిన ఈ సందేశం నాకు పంపారు. ఇది చదివాక ‘బాక్ టు విలేజ్’ కార్యక్రమం గురించి తెలుసుకోవాలని నాకు ఉత్సాహం పెరిగిపోయింది. దీని గురించి వివరంగా తెలుసుకున్నాక ఇది దేశమంతా తెలుసుకోవాల్సిన విషయం అని నాకు అనిపించింది. కశ్మీరు ప్రజలు అభివృద్ధి యొక్క ముఖ్య స్రవంతి లో కలవడానికి ఎంత తపిస్తున్నారో, ఎంత ఉత్సాహంగా ఉన్నారో ఈ కార్యక్రమం ద్వారా తెలుస్తుంది. ఈ కార్యక్రమం లో మొదటిసారిగా పెద్ద పెద్ద అధికారులు నేరుగా పల్లెల కు చేరారు. ఏ అధికారులనైతే ప్రజలు ఎప్పుడూ చూడలేదో, వారు స్వయం గా బయలుదేరి తమ గుమ్మం ముందుకు వచ్చి అభివృద్ధి పనుల కు గల ఆటంకాలను తెలుసుకొని దూరం చేయడానికి వచ్చారు. ఈ కార్యక్రమం వారమంతా జరిగింది. రాష్ట్రం లోని దాదాపు నాలుగున్రర వేల పంచాయతీల్లో ప్రభుత్వ అధికారులు గ్రామీణుల కు ప్రభుత్వ ప్రణాళికల ను, కార్యక్రమాల ను గురించిన వివరాలన్నీ విశదం గా తెలిపారు. ఈ ప్రభుత్వ సేవలన్నీ వారి వరకు చేరుతున్నాయా, లేదా? అని పరిశీలించారు. పంచాయతీల సామర్థ్యం ఇంకా ఎలా పెంచవచ్చు? వాటి ఆదాయాన్ని ఎలా పెంచవచ్చు? వాటి సేవలు సామాన్య మానవుల జీవితాలపై ఎటువంటి ప్రభావాన్ని చూపించగలవు? గ్రా మీణులు కూడా తమ సమస్యల ను విపులం గా తెలిపారు. సాక్షరత, సెక్స్ రేషియో, ఆరోగ్యం, స్వచ్ఛత, జల సంరక్షణ, విద్యుత్తు, నీరు, బాలికల విద్య, వృద్ధుల పెన్షన్ కు.. సంబంధించిన ప్రశ్నలు ఇటువంటి అనేక విషయాల పైన చర్చ జరిగింది.
సహచరులారా, ఇది కేవలం ప్రభుత్వం సాంప్రదాయం కోసం ఒక రోజు గ్రామం లో తిరిగి వచ్చారు అన్నట్టు కాకుండా, ఈ సారి అధికారులు రెండు రోజులు, ఒక రాత్రి పంచాయతీలోనే ఉన్నారు. దీంతో వారికి గ్రామం లో సమయం గడపడానికి తగిన అవకాశం దొరికింది. ప్రతి ఒక్కరినీ కలిసే ప్రయత్నం జరిగింది. ప్రతి సంస్థానాని కి చేరే ప్రయత్నం చేశారు. ఈ కార్యక్ మాన్ని ఆసక్తికరం గా తయారు చేయడానికి, ఇంకా చాలా విషయాలు చేర్చారు. ఖేలో ఇండియా తరఫున పిల్లల కు ఆటల పోటీలు నిర్వహించారు. అక్కడే స్పోర్ట్స్ కిట్స్, మన్ రేగా యొక్క జాబ్ కార్డ్ స్, ఎస్సి, ఎస్టి సర్టిఫికెట్స్ పంచిపెట్టారు. ఫైనాన్షియల్ లిటరసీ (ఆర్థిక అక్షరాస్యత) క్యాంపులు ఏర్పాటు చేశారు. వ్యవసాయం, తోటల పెంపకం వంటి ప్రభుత్వ విభాగాల తరఫు నుంచి స్టాల్స్ ఏర్పాటు చేసి, పలు ప్రభుత్వ ప్రణాళికల గురించి వివరాల ను అందించారు. ఒక రకం గా ఈ కార్యక్రమం ఒక అభివృద్ధి ఉత్సవం అయింది. ప్రజల భాగస్వామ్యపు ఉత్సవం అయింది. జనజాగృతి ఉత్సవం అయింది. కశ్మీర్ ప్రజలు అభివృద్ధి యొక్క ఈ ఉత్సవం లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇంకా సంతోషకరమైన విషయం ఏమిటంటే చేరుకోవడానికే ఒక రోజు, ఒకటిన్నర రోజు పట్టే దుర్గమమైన కొండ దారుల్లో వెళ్ళాల్సిన గ్రామాల కు కూడా ప్రభుత్వాధికారులు చేరుకుని ‘బాక్ టు విలేజ్’ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎప్పుడూ సరిహద్దు లో కాల్పులు జరిగే ప్రాంతం లో ఉన్న సరిహద్దు గ్రామ పంచాయతీలకు కూడా ఈ అధికారులు వెళ్ళారు. అంతేగాక, శోపియా, పుల్వామా, కుల్గామ్ మరియు అనంత్ నాగ్ జిల్లాల లోని అతి ఉద్రిక్తమైన ప్రాంతాల కు కూడా అధికారులు నిర్భయం గా చేరుకున్నారు. చాలా మంది అధికారులు గ్రామాల్లో తమకు లభించిన స్వాగత సత్కారాల కు ముగ్ధులై రెండు రోజులు అక్కడే ఉండిపోయారు. ఈ ప్రాంతాల్లో గ్రామ సభలు ఏర్పాటు కావడం, వాటి లో పెద్ద సంఖ్య లో ప్రజలు పాల్గొనడం అందులో తమ కోసం ప్రణాళికలు తయారు చేసుకోవడం ఇవన్నీ సంతోషకరమైన విషయాలు. కొత్త సంకల్పం, కొత్త ఉత్సాహం మరియు గొప్ప ఫలితాలు.. ఈ కార్యక్రమం, ఇందులో ప్రజల భాగస్వామ్యం చెప్తున్నాయి. స్పష్టం గా మన సోదర సోదరీమణులు గుడ్ గవర్నెన్స్ కోరుకుంటున్నారు అని. అభివృద్ధి యొక్క శక్తి.. బాంబులు, తుపాకుల శక్తి కన్నా బలమైనదని ఈ విషయం నిరూపిస్తుంది. ఎవరైతే అభివృద్ధి మార్గం లో ద్వేషాల ను పెంచాలనుకుంటారో, ఆటంకం తేవాలనుకుంటారో వారు తమ చెడు ఉద్దేశాల లో ఎప్పటికీ సఫలం కాలేరన్నది తేటతెల్లమవుతుంది.
నా ప్రియ దేశవాసులారా, జ్ఞానపీఠ పురస్కారం తో గౌరవించబడిన శ్రీమాన్ దత్తాత్రేయ రామచంద్ర బెంద్రే తన ఒక కవిత లో శ్రావణ మాస మహిమ ను ఇలా కీర్తిస్తారు.
కవితలో వారంటారు.
హొళిగె మళిగె ఆగ్యేద లగ్న. అదరాగ భూమి మగ్న.
అర్థమేమిటంటే – వాన తుంపర కు, నీటి ధార కు ఉన్న బంధనం విశిష్టమైనది. ఆ సౌందర్యం చూడడం లో భూమి నిమగ్నమైంది.
భారతదేశమంతటా వేర్వేరు సంస్కృతులు మరియు భాషల ప్రజలు శ్రావణ మాసాన్ని తమ తమ పద్ధతుల లో సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ రుతువు లో మన చుట్టుపక్కల చూశామంటే, భూమి పచ్చటి వస్త్రం కప్పుకున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. నాలుగు దిక్కులా ఒక కొత్త శక్తి సంచారం అవడం మొదలవుతుంది. ఈ పవిత్ర మాసం లో ఎందరో భక్తులు కాఁవడ్ (హరిద్వార్) యాత్ర, అమరనాథ్ యాత్రల కు వెళ్తారు. కొందరు నియమానుసారం ఉపవాసాలు చేస్తారు. ఉత్సాహం గా జన్మాష్టమి, నాగ పంచమి వంటి పండుగల కోసం వేచి చూస్తారు. ఈ సమయం లో సోదరీ సోదరుల ప్రేమ కు ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగ కూడా వస్తుంది. శ్రావణ మాసం మాట వచ్చినప్పుడు ఇంకో విషయం కూడా వింటే మీకు సంతోషం కలుగుతుంది. ఈసారి అమరనాథ్ యాత్ర కు క్రిందటి నాలుగు ఏళ్ళ కన్నా ఎక్కువ మంది భక్తులు వెళ్ళారు. జులై 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మూడు లక్షల కంటే ఎక్కువ మంది తీర్థ యాత్రికులు పవిత్ర అమరనాథ్ గుహ యొక్క దర్శనం చేసుకున్నారు. 2015 లో 60 రోజుల లో ఈ యాత్ర లో ఎంత మంది పాల్గొన్నారో, అంతకంటే ఎక్కువగా ఈ సారి 28 రోజుల లోనే పాల్గొన్నారు.
అమరనాథ్ యాత్ర సఫలత విషయం లో నేను ముఖ్యం గా జమ్ము, కశ్మీర్ ప్రజల ను, వారి అతిథి సత్కారాల ను ప్రశంసిస్తాను. అక్కడి కి వెళ్ళి యాత్ర నుంచి తిరిగి వచ్చిన వారంతా, ఆ రాష్ట్ర ప్రజల యొక్క ఉత్సాహం, ఆత్మీయత చూసి సంతోషిస్తారు. ఈ విషయాలన్నీ భవిష్యత్తు లో పర్యాటక రంగాని కి ఎంతో లాభదాయకం గా నిరూపించ బడనున్నాయి. ఉత్తరాఖండ్ లో కూడా ఈ సారి చార్ధామ్ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి నెలన్నర లోపలే ఎనిమిది లక్షల మంది కన్నా ఎక్కువ భక్తులు కేదార్నాథ్ ధామ్ దర్శనం చేసుకున్నారని నాకు తెలిసింది. 2013 లో వచ్చిన భయంకరమైన విపత్తు తర్వాత మొదటిసారి ఇంత రికార్డు సంఖ్య లో తీర్థ యాత్రికులు అక్కడికి చేరుకున్నారు.
మీ అందరికీ నా ఒక విన్నపం ఏమిటంటే, దేశం లో వర్షాకాలం లో ఏ ప్రదేశాలు అందం గా ఉంటాయో, ఆ ప్రాంతాల కు మీరంతా తప్పకుండా వెళ్ళండి.
మన దేశం లో ఈ అందాలను చూడడానికి మన దేశం లోని జనాల ఆత్మ ను తెలుసుకోవడానికి టూరిజం యాత్ర వీటికన్నా పెద్ద ఉపాధ్యాయులు ఎవరూ ఉండరు.
ఈ అందమైన, జీవంతమైన శ్రావణ మాసం మీ అందరిలో కొత్త శక్తి, కొత్త ఆశ, కొత్త ఆకాంక్షల ను చేర్చాలని, మీ అందరికీ నా శుభాకాంక్షలు. ఆగస్టు నెల భారత్ ఛోడో ను కూడా అలాగే గుర్తు చేస్తుంది. ఈ ఆగస్టు 15 మీరు ప్రత్యేక ప్రయత్నాలు ఏమైనా చేయండి. స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడానికి కొత్త పద్ధతుల ను ఆలోచించండి. జనులు ఎక్కువ గా పాల్గొనాలి. 15 ఆగస్టు ప్రజల పండుగ గా, అందరి పండుగ గా ఎలా చేయాలి? దీని గురించి తప్పక ఆలోచించండి. ఇంకో పక్క దేశం లోని చాలా చోట్ల భారీ వర్షాలు కురుస్తున్న సమయమిది. చాలా ప్రాంతాల్లో వరద ప్రభావం ఉంది. వరద వల్ల అనేక నష్టాల ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. వరద సంక్షోభం లో ఇరుక్కున్న ప్రజల కు నేను హామీ ఇస్తున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలసి బాధితులైన ప్రజల కు ప్రతి యొక్క సహాయం అందించేటట్లు పనులు వేగం గా జరుగుతున్నాయి. మనం టివి లో వర్షాల యొక్క ఒక పక్షమే చూస్తాం. అన్ని చోట్లా వరదలు, నీరు నిలచిపోవడం, ట్రాఫిక్ జామ్. వర్ష రుతువు యొక్క ఇంకొక చిత్రం.. దీనివల్ల ఆనందం పొందే మన రైతులు, కువకువలాడే పక్షులు, పారే సెలయేళ్ళు, పచ్చదనపు వస్త్రం అలంకరించుకున్న భూమి.. దీన్ని చూడడానికి మీరు కుటుంబం తో సహా యాత్ర కు వెళ్ళాల్సి ఉంటుంది. వర్షం – తాజాదనం, సంతోషం అంటే, ఫ్రెష్ నెస్, హాపీనెస్ రెండింటినీ తన వెంట తెస్తుంది. ఈ వర్షాకాలం మీకు నిరంతర సంతోషాల ను ఇవ్వాలని నా ఆకాంక్ష. మీరంతా ఆరోగ్యం గా ఉందురుగాక.
నా ప్రియ దేశవాసులారా, ‘మన్ కీ బాత్’ – ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ ఆపాలి. చాలా కష్టం గా అనిపిస్తుంది. కానీ, సమయానికి హద్దు ఉంటుంది. ఒక నెల ఎదురు చూశాక మళ్ళీ వస్తాను. మళ్ళీ కలుస్తాను. నెలంతా మీరు నాకు చాలా మాటలు చెప్పండి. వచ్చే ‘మన్ కీ బాత్’ లో వాటినన్నింటిని చేర్చడానికి ప్రయత్నిస్తాను. యువ సహచరులకు గుర్తు చేస్తున్నా, మీరు క్విజ్ కాంపిటీషన్ అవకాశాన్ని పోగొట్టుకోకండి. మీరు శ్రీహరికోట వెళ్ళే అవకాశం ఉంది. దీన్ని ఎట్టి పరిస్థితి లోను పోనివ్వకండి.
మీకందరికీ అనేకానేక ధన్యవాదాలు. నమస్కారాలు.
నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారము. ఒక దీర్ఘ విరామము తర్వాత, మళ్ళీ ఒకసారి , మీ అందరితో, ‘ మన్ కీ బాత్’ , మనసులో మాట, జనులలోని మాట, జనుల మనసులోని మాట ఐన ఈ పరంపర మొదలుపెడుతున్నాము. ఎన్నికల హడావిడిలో పనుల వత్తిడి ఎక్కువగా ఉండింది కానీ ‘మన్ కీ బాత్’ లోని మజా మాత్రం అందులో లేదు. ఒక లోటు కనిపిస్తూనే ఉండింది. మనవాళ్ళ మధ్య కూర్చొని, తేలికైన వాతావరణంలో, 130 కోట్ల దేశవాసుల కుటుంబంలోని వ్యక్తిగా, ఎన్నో మాటలు వినేవాళ్ళము, మళ్ళీ చెప్పుకునేవాళ్ళము. అప్పుడప్పుడూ మనమాటలే మనవాళ్ళకు ప్రేరణ కలిగించేవి. ఈ మధ్యలో నాకు కాలం ఎలా గడిచి ఉంటుందో మీరంతా ఊహించగలరు. ఆదివారం, చివరి ఆదివారం 11 గంటలకు నాకు ఏదో కోల్పోయినట్టుగా అనిపించింది-మీకూ అనిపించి ఉంటుంది కదా! ఖచ్చితంగా అనిపించి ఉంటుంది. బహుశా ఇది నిస్సారమైన కార్యక్రమం కానే కాదు. ఈ కార్యక్రమంలో జీవం ఉండేది, సొంతం అనిపించేది, మనసు లగ్నమయ్యేది, హృదయం లగ్నమయ్యేది, అందువల్లే ఈ మధ్య ఈ కార్యక్రమానికి వచ్చిన ఈ కొద్ది విరామం నాకు చాలా కఠినంగా అనిపించింది. నేను అనుక్షణమూ ఏదో పోగొట్టుకున్నట్టు భావించేవాడిని. ‘మన్ కీ బాత్’ చెప్పేటపుడు మాట్లాడింది నేనైనా, ఆ పదాలు నావైనా, గొంతు నాదైనా, కథ మీది, ప్రయోజనం మీది, గొప్పతనం మీది. నా పదాలు, నా స్వరం మాత్రమే నేను ఉపయోగించేవాడిని. కాబట్టి నేను ఈ కార్యక్రమాన్ని కాదు మిమ్మల్నే miss అయ్యాను. వెలితిగా అనిపించేది. ఎన్నికలు అయిపోగానే మీ మధ్యకు రావాలని కూడా ఒకసారి అనిపించింది. కానీ మళ్ళీ అనుకున్నాను, ఇలా కాదు, ఆ Sunday క్రమమే అలా కొనసాగాలి అని. కానీ ఈ Sunday చాలా ఎదురుచూసేలా చేసింది. ఎలాగైతేనేం, చివరికి ఈ సండే రానేవచ్చింది. ఒక కుటుంబవాతావరణంలో ఒక చిన్న ‘మన్ కీ బాత్’ ఎలాగైతే సమాజం, జీవనములలో మార్పుకు కారణం అవుతుందో, అలాగే ఈ ‘మన్ కీ బాత్’ పరంపర ఒక కొత్త spirit కి కారణమౌతూ, ఒక రకంగా New India యొక్క spirit కు బలమిచ్చేలా కొనసాగనిద్దాం.
గడచిన కొన్ని నెలలలో చాలా సందేశాలు వచ్చాయి. ప్రజలు కూడా ‘మన్ కీ బాత్’ miss అవుతున్నట్టుగా చెప్పారు. వీటిని నేను చదివినప్పుడు, విన్నప్పుడు నాకు చాలా బాగుంటుంది. ఒక ఆత్మీయభావన కలుగుతుంది. ఇది నా ‘ స్వ’ నుంచి ‘సమిష్టి’ వరకూ సాగే యాత్రగా ఇది అప్పుడప్పుడూ నాకనిపిస్తూ ఉంటుంది. ఇది నా ‘అహమ్ నుంచి వయమ్’ వరకూ సాగే యాత్ర. మీతో చేసే ఈ మౌనభాషణము ఒక రకంగా నాకు నా spiritual యాత్రానుభూతి లోని అంశం. నేను ఎన్నికల హడావిడిలో కేదారనాథ్ ప్రయాణం ఎందుకు చేశాను అనే ప్రశ్న చాలా మంది వేశారు. అలా ప్రశ్నించడం మీ హక్కు. మీ కుతూహలాన్ని నేనర్థం చేసుకోగలను. నాకు కూడా ఆ భావాలను మీతో పంచుకోవాలని అనిపిస్తుంది. కానీ అవి మాట్లాడితే ‘మన్ కీ బాత్’ రూపం మారిపోతుంది. ఎన్నికల హడావిడిలో, జయాపజయాల సందిగ్ధతలో, ఇంకా పోలింగ్ కూడా ముగియకముందే నేను బయల్దేరాను. చాలామంది దీనిలో రాజకీయ అర్థాలు వెదికారు. నా వరకూ ఇది , నేను నాతో గడిపే అవకాశం. చెప్పాలంటే నన్ను నేను కలుసుకోవడానికే వెళ్ళాను. అన్నీ ఇప్పుడు చెప్పను గానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. ‘మన్ కీ బాత్’ వరుసలో వచ్చిన చిన్న విరామం వల్ల నా మనసులో ఏర్పడిన వెలితిని కేదార్ లోయల్లో , ఆ ఏకాంత గుహలో నింపుకొనే అవకాశం ఏర్పడింది. ఇక మీ కుతూహలాన్ని కూడా ఒకరోజు తీర్చే ప్రయత్నం చేస్తాను. ఎప్పుడు చేస్తాను అని చెప్పలేను కానీ తప్పక చేస్తాను. ఎందుకంటే నామీద మీకు ఆ హక్కు ఉంది. కేదార్ విషయంలో ప్రజలు ఎలా కుతూహలం కనబరిచారో అదే కుతూహలంతో కొన్ని సకారాత్మకమైన విషయాలపట్ల మీరు చూపే శ్రద్ధను , మీ మాటల్లో చాలా సార్లు గమనించాను. ‘మన్ కీ బాత్’ కు వచ్చే ఉత్తరాలు, input అంతా routine ప్రభుత్వ కార్యక్రమాలకు భిన్నంగా ఉంటుంది. ఒక రకంగా మీ ఉత్తరాలు నాకు ఒక్కోసారి ప్రేరణనిస్తే, ఒక్కోసారి శక్తి నిస్తుంటాయి. అప్పుడప్పుడూ నా ఆలోచనలకు పదునుపెట్టే పని కూడా మీ మాటలు చేస్తుంటాయి. ప్రజలకు, దేశానికి, సమాజానికి ఎదురయ్యే సమస్యలను, సవాళ్ళను నా దృష్టిలోకి తీసుకొని రావడంతో పాటే వాటికి పరిష్కారాలు కూడా చెప్తూ ఉంటాయి. నేను గమనించాను- ప్రజలు సమస్యలను ఏకరువుపెట్టడమే కాక వాటికి సమాధానాలను, సూచనలను, కొన్ని ఆలోచనలను ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ప్రకటిస్తూ ఉంటారు. ఒకవేళ ఎవరైనా స్వచ్ఛత గురించి వ్రాస్తూ ఉంటే, కాలుష్యం పట్ల తమ ఆగ్రహాన్ని ప్రకటిస్తూనే స్వచ్ఛత కోసం చేస్తున్న ప్రయత్నాలను ప్రశంసిస్తూ ఉంటారు కూడా. ఒక్కొక్కరు పర్యావరణం గురించి మాట్లాడేటప్పుడు వారి బాధ వ్యక్తమౌతూ ఉంటుంది, దాంతోపాటే తాము స్వయంగా చేసిన ప్రయోగాలు, చూసిన ప్రయోగాలు, మనసులోని ఆలోచనలు అన్నిటి గురించీ చెప్తారు. అంటే ఒక రకంగా సమస్యల పరిష్కారాలు ఎలా సమాజవ్యాప్తం కావాలో ఆ నమూనా మీ మాటల్లో కనిపిస్తుంది. ‘మన్ కీ బాత్’ దేశము, సమాజము కోసము ఒక అద్దము లాంటిది. దేశవాసుల్లో ఉన్న అంతర్గత శక్తి, బలము, talent కి లోటు లేదనే విషయము దీనిద్వారా తెలుస్తుంది. ఆ బలాలను, talent ను సమన్వయపరిచి ఒక అవకాశం ఇచ్చి, కార్యాన్వితం చేయవలసిన ఆవశ్యకత ఉంది. ఈ ‘మన్ కీ బాత్’ ద్వారా తెలిసే ఇంకొక విషయమేమిటంటే దేశం యొక్క అభివృద్ధిలో 130 కోట్ల ప్రజలందరూ సక్రియంగా, సమర్థతతో పాలు పంచుకోవాలనుకుంటున్నారు. అంతేకాదు, నేను ఒక మాట తప్పకుండా చెప్తాను, ‘మన్ కీ బాత్’ కోసం నాకు ఎన్ని ఉత్తరాలు, టెలిఫోన్ calls వస్తాయో, ఎన్ని సందేశాలు వస్తాయో వాటన్నిటిలో ఫిర్యాదు చేసే స్వభావం చాలా తక్కువ ఉంటుంది. ఎవరైనా ఏదైనా తమ కోసం అడిగినట్టుగా ఒక్కసారి కూడా , గడచిన ఐదేళ్ళలో నా దృష్టికి రాలేదు. దేశ ప్రధానమంత్రికి ఉత్తరం వ్రాస్తూ, తమ స్వంత ప్రయోజనం కోసం ఏమీ అడగకుండా వ్రాస్తున్నారంటే ఈ దేశంలో కోట్ల ప్రజల భావాలు ఎంత ఉన్నతమైనవి అని మీరే ఊహించండి. నేను ఇటువంటి విషయాలను analysis చేసినప్పుడు, నా మనసుకెంత ఆనందం కలుగుతుందో నాకెంత శక్తి లభిస్తుందో మీరు ఊహించగలరు. మీరు ఎంతగా నన్ను నడిపిస్తారని, నన్ను పరుగెత్తిస్తారని, క్షణక్షణం ప్రాణం పోస్తారని మీరు ఊహించనేలేరు, ఇదే, ఈ బంధాన్నే నేను miss అయ్యాను. ఈరోజు నా మనసు సంతోషంతో నిండిపోయింది. నేను చివరిసారి మాట్లాడినప్పుడు మూడు-నాలుగు నెలల తర్వాత కలుసుకుందాం అని చెప్తే, కొందరు అందులో రాజకీయ అర్థాలు వెదికారు. అరె! మోదీజీ కి ఎంత confidence, ఎంత నమ్మకం అన్నారు. Confidence మోదీది కాదు – ఈ నమ్మకం, మీ నమ్మకం అనే foundation ది. ఆ మీ నమ్మకం రూపు గట్టగా నేను చాలా సహజంగా ‘ మళ్ళీ కొన్ని నెలల తర్వాత మీ వద్దకు వస్తాను ‘ అని చెప్పగలిగాను. Actually నేను రాలేదు, మీరు నన్ను తెచ్చారు, కూర్చోబెట్టారు. మీరే నాకు మళ్ళీ మాట్లాడే అవకాశం ఇచ్చారు. ఈ భావనతోటే ‘మన్ కీ బాత్’ పరంపరను ముందుకు తీసుకెళ్దాం.
దేశంలో ఎమర్జెన్సీ విధించినపుడు దానికి వ్యతిరేకత కేవలం రాజకీయపరిధికి మాత్రం పరిమితం కాలేదు, రాజకీయనాయకులకు మాత్రం పరిమితం కాలేదు, జైలు ఊచలకు మాత్రం ఆ ఉద్యమం పరిమితం కాలేదు. ప్రజలందరి మనసులో ఒక ఆక్రోశం ఉండింది. పోగొట్టుకున్న ప్రజాస్వామ్యం గురించి తపన ఉండింది. పగలూ రాత్రి చక్కగా భోజనం లభిస్తున్నప్పుడు ఆకలి ఏమిటన్నది తెలీనట్లే, సాధారణ జీవనంలో ప్రజాస్వామిక హక్కుల యొక్క మజా ఏమిటన్నది తెలీదు. వాటినెవరన్నా లాక్కున్నప్పుడు తెలుస్తుంది. ఎమర్జెన్సీ సమయంలో ప్రతి పౌరుడికీ తమ వస్తువేదో ఎవరో లాక్కుపోయినట్లు తెలిసింది. తన జీవితమంతా ఉపయోగించనివైనా సరే వాటినెవరో లాక్కుపోయినప్పుడు ఆ బాధ ఏమిటో అది మనసులో ఉండింది. ప్రజాస్వామ్యం ఏర్పడిందీ, కొన్ని ఏర్పాట్లు భారతరాజ్యాంగం చేసిందీ ఇందుకు కాదు అని మనసులో ఉండింది. సమాజవ్యవస్థను నడిపించడానికి రాజ్యాంగం, నియమనిబంధనలు, చట్టాలు వీటి ఆవశ్యకత ఉంటుంది, హక్కులు, కర్తవ్యాలు కూడా ఉంటాయి కానీ చట్టాలు, నియమాలకు అతీతమైన ప్రజాస్వామ్యం మన సంస్కారమని, ప్రజాస్వామ్య విధానం మన సంస్కృతిలోనే ఉందని భారత్ గర్వంగా చెప్పుకోగలదు. ప్రజాస్వామ్యము మనకు లభించిన వారసత్వము. ప్రజాస్వామ్యానికి వారసులమైన మనము అది లేని లోటును ఇట్టే తెలుసుకోగలము. ఎమర్జెన్సీ సమయంలో అలా తెలుసుకున్నాము. కాబట్టి దేశము తనకోసం కాకుండా , తన స్వప్రయోజనం కోసం కాకుండా ప్రజాస్వామ్య రక్షణ కోసం ఎన్నికలకు ఆహ్వానం ఇచ్చింది. బహుశా ప్రపంచంలోని ఏ దేశంలోనైనా అక్కడి ప్రజలు ప్రజాస్వామ్యం కోసం, తమ మిగిలిన హక్కులు, అధికారాలను, అవసరాలను పట్టించుకోకుండా కేవలం ప్రజాస్వామ్యము కోసం ఓటు వేశారో లేదో గానీ ఈ దేశం అటువంటి ఒక ఎన్నికలను 77 (డెబ్భై ఏడు) లో చూసింది. ప్రజాస్వామ్యపు నేటి ఎన్నికలపండుగ, అతి పెద్ద ఎన్నికల ఉద్యమం మన దేశం లో ప్రస్తుతం జరిగింది. ధనికులనుంచి మొదలుకొని బీదల వరకు అందరూ ఈ పండుగలో సంతోషంతో పాల్గొని మన దేశ భవిష్యత్తును నిర్ణయించడానికి తత్పరులై పాల్గొన్నారు.
ఏదైనా ఒక వస్తువు మన దగ్గర ఉన్నప్పుడు మనము దాన్ని underestimate చేస్తాము, దాని amazing facts ని కూడా నిర్లక్ష్యం చేస్తాము. మనకు దొరికిన అమూల్యమైన ప్రజాస్వామ్యాన్ని కూడా మనము చాలా సులువుగా granted గా తీసుకుంటాము. కానీ, ఈ ప్రజాస్వామ్యము ఎంతగొప్పదో, శతాబ్దాల సాధనతో, తరతరాల సంస్కారాలతో, ఒక విశాలమైన మానసిక స్థితితో ఈ ప్రజాస్వామ్యము మన నవనాడుల్లో నెలకొన్నది అని మనము గుర్తుచేసుకుంటూ ఉండాలి. భారతదేశములో 2019 లోక్ సభ ఎన్నికలలో 61 కోట్లకు పైగా ప్రజలు వోటు వేశారు, sixty one crore. ఈ సంఖ్య మనకు ఏదో సామాన్యంగా అనిపించవచ్చు. కానీ ప్రపంచంలో చూడబోతే ఒక చైనా ను వదిలేస్తే, మిగతా ప్రపంచంలోని ఏ దేశం యొక్క నికర జనాభా కన్నా ఎక్కువ మంది ప్రస్తుతం వోటు వేశారు అని చెప్పగలను. ఎంతమంది ఐతే 2019 లోక్ సభ ఎన్నికలలో వోటు వేశారో , ఆ సంఖ్య అమెరికా మొత్తం జనాభా కన్నా ఎక్కువ, దాదాపు రెండింతలు. భారతదేశంలోని మొత్తం ఓటర్ల సంఖ్య మొత్తం యూరప్ జనాభాకన్నా ఎక్కువ. ఇది మన ప్రజాస్వామ్యం యొక్క వైశాల్యాన్ని పరిచయం చేస్తుంది. 2019 లోక్ సభ ఎన్నికలు ఇప్పటివరకూ చరిత్రలో ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామిక ఎన్నికలు. ఈ విధంగా ఎన్నికలు జరిపించడానికి ఎంత పెద్ద స్థాయిలో మానవశక్తి, ఏర్పాట్ల అవసరం ఉంటుందో మీరు ఊహించవచ్చు. లక్షల మంది ఉపాధ్యాయులు, అధికారులు, ఉద్యోగులు పగలూ రాత్రి శ్రమిస్తేనే ఇది సంభవమైంది. ప్రజాస్వామ్యం యొక్క ఈ మహ యజ్ఞాన్ని సుసంపన్నం చేయడానికి సుమారు మూడు లక్షల పారామిలిటరీ దళాల రక్షణాధికారులు తమ బాధ్యతలను నిర్వహించారు, వివిధ రాష్ట్రాల 20 లక్షల పోలీసు ఉద్యోగులు కూడా గరిష్ఠ స్థాయిలో శ్రమించారు. వీరి కఠిన పరిశ్రమ ఫలితంగా ఈసారి క్రితంసారి కన్నా ఎక్కువగా ఓటింగ్ జరిగింది. దేశం మొత్తం మీద 10 లక్షల పోలింగ్ స్టేషన్ లు, సుమారు 40 లక్షలకు పైగా ఈవిఎమ్ (EVM) మెషిన్లు, 17 లక్షలకు పైగా వివిప్యాట్ (VVPAT)మెషిన్లు, ఎంత పెద్ద ఏర్పాట్లో మీరు ఊహించవచ్చు. ఏ ఒక్క ఓటరు కూడా తన ఓటుహక్కు వినియోగించలేని పరిస్థితి రాకూడదని ఇదంతా చేయడం జరిగింది. అరుణాచల్ ప్రదేశ్ లోని ఒక సుదూర ప్రాంతంలో కేవలం ఒక్క మహిళా ఓటరు కోసం ఒక పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడికి చేరడానికి ఎన్నికల కమిషన్ అధికారులకు రెండు రోజులు ప్రయాణించవలసి వచ్చిందని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగొచ్చు. కానీ ఇదే ప్రజాస్వామ్యానికి అసలైన గౌరవం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన స్థానంలోని పోలింగ్ కేంద్రం భారతదేశంలో ఉంది. ఇది హిమాచల్ ప్రదేశ్ లోని లాహౌల్ –స్పీతి ప్రాంతంలో 15000 అడుగుల ఎత్తులో ఉంది. అంతేకాదు, ఈ ఎన్నికలలో గర్వపడదగ్గ ఇంకో అంశం కూడా ఉంది. బహుశా చరిత్రలో మొదటిసారిగా మహిళలు కూడా పురుషుల తో సమానంగా ఉత్సాహంగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ ఎన్నికలలో మహిళల, పురుషుల పోలింగ్ శాతం దాదాపు సమానంగా ఉంది. అదేవిధంగా ఉత్సాహం కలిగించే వాస్తవం ఏమిటంటే నేడు పార్లమెంటులో 78 (seventy eight) మహిళా ఎంపీలున్నారు. నేను ఎన్నికల కమిషన్ ను, ఎన్నికల ప్రక్రియకు చెందిన ప్రతి వ్యక్తినీ అభినందిస్తున్నాను. భారతదేశంలో జాగృతి పొందిన ఓటర్లకు ప్రణామం చేస్తున్నాను.
నా ప్రియ దేశవాసులారా, ‘ బొకే కాదు బుక్’ అని నేను చెప్పడం మీరు చాలా సార్లు వినే ఉంటారు. స్వాగత-సత్కారాల్లో మనము పూల బదులు పుస్తకాలు ఇవ్వమని నా ప్రార్థన. అప్పట్నించీ చాలా చోట్ల ఇలా పుస్తకాలు ఇవ్వడం జరుగుతోంది. ఈమధ్య నాకెవరో ‘ప్రేమ్ చంద్ కీ లోక్ ప్రియ కహానియా’ అనే పుస్తకం ఇచ్చారు. అది నాకు బాగా నచ్చింది. ఎక్కువ సమయం దొరకకపోయినా, ప్రవాసంలో ఉన్నప్పుడు నాకు వారికొన్ని కథలు మళ్ళీ చదివే అవకాశం దొరికింది. ప్రేమ్ చంద్ తన కథల్లో సమాజం యొక యథార్థ చిత్రణ చేయడం వల్ల చదివేటప్పుడు వాటి యథార్థచిత్రం మనసులో ఏర్పడుతుంది. వారు వ్రాసిన ఒక్కొక్క మాట సజీవమై నిలుస్తుంది. సహజమైన, సరళమైన భాషలో మానవీయ అనుభూతులను వ్యక్తం చేసే వారి కథలు నా మనసును ఆకట్టుకున్నాయి. వారి కథల్లో మొత్తం భారతదేశం యొక్క మనోభావాలు ప్రతిఫలిస్తాయి. వారు రచించిన ‘నశా’ అనే కథ చదువుతున్నప్పుడు సమాజంలోని ఆర్థిక అసమానతలవైపు నా దృష్టి మళ్ళింది. నేను యువకునిగా ఉన్నప్పుడు ఈ విషయంమీద చర్చలలో రాత్రులెన్ని గడచిపోయేవో గుర్తు వచ్చింది. జమీందారు కొడుకు ఈశ్వరీ , పేదకుటుంబంలోని వీర్ ల ఈ కథ ద్వారా, జాగ్రత్తగా లేకపోతే చెడు సాంగత్యం యొక్క ప్రభావం ఎప్పుడు పడుతుందో తెలీదు అన్న విషయం తెలుసుకుంటాము. నా మనసును ఆకట్టుకున్న రెండోకథ ‘ఈద్ గాహ్’, ఒక పిల్లవాడి హృదయకోమలత, తన నాన్నమ్మ పట్ల అతడి నిర్మలమైన ప్రేమ, అంత చిన్న వయసులో అతని పరిపక్వత. 4-5 ఏళ్ళ హామిద్ సంత నుంచి పట్టకారు తీసుకొని నాన్నమ్మ వద్దకు వెళ్ళడం, నిజంగా మానవహృదయకోమలత్వానికి గరిమ అని చెప్పవచ్చు. ఈ కథలోని చివరి పంక్తులు ఎంతో భావుకుల్ని చేయకమానవు, “ చిన్న హామిద్ వృద్ధ హామిద్ పార్ట్ ఆడుతున్నాడు – వృద్ధ అమీనా , అమీనా చిన్న పాప అయిపోయింది.”
అదేవిధంగా ‘పూస్ కీ రాత్’ ఒక మార్మిక కథ. ఈ కథలో ఒక పేదరైతు కష్టజీవితపు వ్యంగ్యచిత్రణ కనిపిస్తుంది. తన పంట అంతా నష్టమై పోయినాక హల్దూ రైతు ఇక తనకు వణికించే చలిలో పొలానికి కాపలాగా రాత్రిళ్ళు పడుకోవాల్సిన అవసరం లేదని సంతోషిస్తాడు. వాస్తవానికి ఈ కథలు ఒక శతాబ్దకాలం పాతవే అయినా, నేటి సందర్భానికీ తగినవే అనిపిస్తుంది. వీటిని చదివిన తర్వాత నాకు ఒక ప్రత్యేకమైన అనుభూతికి లోనయ్యాను.
చదవడం మాటకొస్తే, ఏదో ఒక మీడియాలో నేను కేరళ లోని అక్షరా లైబ్రరీ గురించి చదివాను. ఈ లైబ్రరీ ఇడుక్కి (Idukki) దట్టమైన అడవుల్లోని ఒక గ్రామంలో ఉందని తెలిస్తే మీకు ఆశ్చర్యం కలగక మానదు. అక్కడి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు పి.కె.మురళీధరన్, చిన్న టీ కొట్టు నడిపే పి.వి.చిన్నతంబి వీళ్ళిద్దరూ ఈ లైబ్రరీ కోసం నిర్విరామంగా కృషి చేశారు. ఒక్కొక్కసారి పుస్తకాల కట్టలు భుజం మీద మోసుకొని కూడా తీసుకురావాల్సి వచ్చింది. నేడు ఈ లైబ్రరీ ఆదివాసీ పిల్లలతో పాటు ప్రతి ఒక్కరికీ దారిచూపుతున్నది.
గుజరాత్ లో వాంచె గుజరాత్ (చదువు గుజరాత్) ఉద్యమం ఒక సఫల ప్రయోగం. లక్షల సంఖ్యలో అన్ని వయస్సులవాళ్ళు పుస్తకపఠనం అనే ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. నేటి digital ప్రపంచంలో, Google గురు కాలంలో మీ daily routine లోంచి కొంత సమయం చదవడానికి తప్పకుండా వినియోగించండి అని మీకు నా విన్నపం. మీరు నిజంగా చాలా enjoy చేస్తారు. ఏ పుస్తకం చదివినా దాని గురించి NarendraModi App లో ఖచ్చితంగా వ్రాయండి. తద్వారా ‘మన్ కీ బాత్’ లో శ్రోతలందరూ దానిగురించి తెలుసుకోగలుగుతారు.
నా ప్రియమైన దేశవాసులారా, మన దేశంలోని ప్రజలు వర్తమానానికే కాకుండా భవిష్యత్తు కూ సవాలు గా నిలిచే విషయాల గురించి ఆలోచిస్తారని నాకు చాలా సంతోషంగా ఉంది. నేను NarendraModi App, Mygov లలో మీ వ్యాఖ్యలు చదివేటప్పుడు గమనించాను. నీటి సమస్య గురించి చాలామంది చాలా వ్రాస్తున్నారు. బెళగావి(Belagavi) లో పవన్ గౌరాయి, భువనేశ్వర్ లో సితాంశూ మోహన్ పరీదా, ఇంకా యశ్ శర్మా, శాహాబ్ అల్తాఫ్ ఇంకా చాలా మంది నాకు నీటికి సంబంధించిన సమస్యల గురించి వ్రాశారు. మన సంస్కృతిలో నీటికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఋగ్వేదంలో ఆపఃసూక్తము నీటి గురించి ఇలా చెప్పబడింది:
ఆపో హిష్ఠా మయో భువః, స్థా న ఊర్జే దధాతన, మహేరణాయ చక్షసే,
యో వః శివతమో రసః, తస్య భాజయతేహ నః, ఉషతీరివ మాతరః ।
అర్థమేమంటే జలమే జీవనదాయిని శక్తి, శక్తిమూలం. మాతృవత్ అంటే తల్లిలాగా ఆశీర్వదించు. మీ కృప మామీద వర్షించుగాక. అని. ప్రతియేడూ దేశంలోని అనేక ప్రాంతాల్లో నీటి సమస్య తలెత్తుతూనే ఉంది. సంవత్సరం పాటు పడిన వర్షపాతంలోని నీటిలో మనం కేవలం 8% నీటిని మాత్రమే మనం దాచుకోగలుగుతున్నామంటే మీరు ఆశ్చర్యపోకమానరు. కేవలం 8% మాత్రమే. ఈ సమస్యకు పరిష్కారం వెదకాల్సిన సమయం వచ్చింది. మిగిలిన అన్ని సమస్యలలాగే ప్రజల భాగస్వామ్యంతో , ప్రజాశక్తితో, నూటముప్ఫై కోట్ల దేశవాసుల సామర్థ్యంతో, సహకారంతో, సంకల్పంతో ఈ సమస్యను కూడా పరిష్కరిద్దాం. నీటి యొక్క ప్రాధాన్యతను అన్నిటికన్నా ముఖ్యంగా భావించి దేశంలో కొత్త జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిద్వారా నీటికి సంబంధించిన అన్ని విషయాల్లో వేగంగా నిర్ణయాలు తీసుకోగలము. కొన్నాళ్ళ క్రితం నేను ఒక కొత్త పని చేశాను. దేశంలోని సర్పంచ్ లందరికీ గ్రామప్రధానికి ఉత్తరాలు వ్రాశాను. గ్రామప్రధానులకు నీటిని పొదుపుచేయాలని, నీటి సేకరణ చేయడానికి వర్షపునీటియొక్క ప్రతి బిందువునూ సేకరించడానికి వారిని గ్రామసభలో ఒక సమావేశం ఏర్పాటు చేసి, గ్రామీణులతో చర్చించమని వ్రాశాను. ఈ పనిలో వారంతా పూర్తిగా ఉత్సాహంతో పాల్గొని ఈ నెల 22 వ తేదీన వేల పంచాయతీలలో కోట్ల ప్రజలు శ్రమదానం చేశారు. గ్రామాల్లో ప్రజలు నీటి యొక్క ప్రతి బిందువునూ సేకరించే సంకల్పం చేశారు.
ఈరోజు ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో నేను మీకు ఒక సర్పంచ్ మాటలు వినిపిస్తాను. ఝార్ఖండ్ లోని హజారీబాగ్ జిల్లాకు చెందిన కటకమ్ సాండీ బ్లాక్ లోని లుపుంగ్ పంచాయతీ సర్పంచ్ మనందరికీ ఒక సందేశం ఇస్తున్నాడు.
“నా పేరు దిలీప్ కుమార్ రవిదాస్. నీటిని పొదుపు చేయాలంటూ ప్రధానమంత్రి నుంచి ఉత్తరం వచ్చినప్పుడు ప్రధానమంత్రి మనకు ఉత్తరం వ్రాశాడంటే మా చెవులను మేమే నమ్మలేకపోయాము. మేము 22 వ తేదీ గ్రామంలోని ప్రజలను సమావేశపరచి, ప్రధానమంత్రి ఉత్తరాన్ని చదివి వినిపించాక, గ్రామంలోని ప్రజలు చాలా ఉత్సాహభరితులైనారు. నీటి సేకరణకు చెరువును శుభ్రం చేసి, కొత్త చెరువు నిర్మించడానికి శ్రమదానం చేసి తమ పాత్ర నిర్వహించడానికి సిద్ధమైనారు. వర్షాలు రావడానికి ముందే ఈ పని చేయడం వల్ల మనకు రాబోయే సమయంలో నీటి కరువు ఉండదు. సరైన సమయంలో మన ప్రధానమంత్రి మనలను హెచ్చరించారు.”
బిర్సా ముండా పుట్టిన ఆ నేల ప్రకృతితో సహజీవనం చేయడమే అక్కడి సంస్కృతి. అక్కడి ప్రజలు మళ్ళీ ఒకసారి జలసంరక్షణ కొరకు తమ వంతు పాత్ర నిర్వహించడానికి సిద్ధమైనారు. అందరు గ్రామ ప్రధానులకు, అందరు సర్పంచులకు వారి క్రియాశీలతకు అనేక శుభాకాంక్షలు. దేశమంతటా ఇలా జలసంరక్షణ చేపట్టిన అనేక సర్పంచులున్నారు. గ్రామమంతటికీ కూడా ఇది జలసంరక్షణ చేయవలసిన సందర్భము. గ్రామంలోని ప్రజలు, తమ ఊళ్ళో జలమందిరం కట్టడానికి పోటీ పడుతున్నట్టుగా అనిపిస్తుంది. నేను ముందే అన్నట్టుగా, సామూహిక ప్రయత్నంతో హెచ్చు సకారాత్మక పరిణామాలు కనిపిస్తాయి. దేశమంతటికీ నీటి సమస్య పరిష్కారం కోసం ఒకే ఫార్ములా ఉండదు. కాబట్టి దేశంలోని వివిధ ప్రాంతాలలో , వివిధ పద్ధతులలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ అన్నిటి లక్ష్యము ఒక్కటే. అదే నీటి వనరును కాపాడుకోవడం. జలసంరక్షణ.
పంజాబ్ లో drainage lines ను సరిచేస్తున్నారు. దీనివల్ల water logging సమస్య నివారింపబడుతుంది. తెలంగాణాలో timmaipalli (తిమ్మైపల్లి) లో టాంక్ నిర్మాణం గ్రామజనుల జీవితాన్నే మార్చివేసింది. రాజస్థాన్ లోని కబీర్ ధామ్ లో పొలాలలో ఏర్పాటుచేయబడిన చిన్న చిన్న చెరువుల వలన ఒక పెద్ద మార్పు వచ్చింది. తమిళనాడు లోని వెల్లూరు (Vellore) లో నాగ నది (Naag nadi) ని పునరుజ్జీవింపజేయడానికి 20 వేల మంది మహిళలు కలిసి సామూహికంగా ప్రయత్నం చేశారని చదివాను. గఢ్ వాల్ లో కూడా స్త్రీలందరూ కలసి rain water harvesting మీద చాలా పని చేస్తున్నారని కూడా నేను చదివాను. ఇటువంటి ప్రయత్నాలు చాలా జరుగుతున్నాయి. మనమంతా కలిసి బలంగా ప్రయత్నిస్తే అసంభవాన్ని కూడా సంభవం చేస్తామని నాకు నమ్మకం కలుగుతోంది. జనం జనం కలిస్తే జలం ప్రాప్తిస్తుంది. నేడు ‘మన్ కీ బాత్’ ద్వారా నేను దేశవాసులకు 3 విన్నపాలు చేస్తున్నాను.
నా మొదటి విన్నపం – దేశవాసులంతా స్వచ్ఛతను ఎలా ప్రజాఉద్యమం చేశారో, అలాగే, జలసంరక్షణ కొరకు కూడా ఒక ప్రజా ఉద్యమం ప్రారంభిద్దాం. మనమంతా కలిసి నీటి యొక్క ప్రతి బిందువును సేకరించేందుకు సంకల్పిద్దాం. నాకు నమ్మకం ఉంది, నీళ్ళు పరమేశ్వరుని ప్రసాదం. జలం పరుసవేది. ఈ పరుసవేదితో , నీటి స్పర్శతో నవజీవన నిర్మాణం జరుగుతుంది. నీటియొక్క ఒక్కొక్క బిందువును కాపాడడానికి ఒక అవగాహనా ఉద్యమం చేద్దాం. దీనిలో భాగంగా నీటికి చెందిన సమస్యల గురించి మాట్లాడాలి, జలసంరక్షణా పద్ధతుల గురించి మాట్లాడాలి. ముఖ్యంగా వివిధ క్షేత్రాలకు చెందిన ముఖ్యులకు, జలసంరక్షణ కొరకు innovative campaigns కు నాయకత్వం వహించాల్సిందిగా నా విజ్ఞప్తి. సినిమా రంగం కానివ్వండి, క్రీడారంగం కానివ్వండి, మీడియాలోని మన మిత్రులు కానివ్వండి, సామాజిక సంస్థలకు చెందిన వ్యక్తులు కానివ్వండి, సాంస్కృతిక సంస్థలకు చెందిన వ్యక్తులు కానివ్వండి, ప్రవచనకారులు కానివ్వండి, ప్రతిఒక్కరూ తమ తమ పద్ధతులలో ఈ ఉద్యమానికి నేతృత్వం వహించండి. సమాజాన్ని మేల్కొల్పండి, సమాజాన్ని ఒకటి చేయండి, సమాజంతో కలిసి పనిచేయండి. చూడండి, మన కళ్ళముందు మనం మార్పును తప్పక చూస్తాము.
దేశవాసులతో నా రెండవ విన్నపం. మన దేశంలో జలసంరక్షణ కొరకు అనేక సాంప్రదాయిక పద్ధతులు శతాబ్దాలనుంచి వినియోగంలో ఉన్నాయి. జలసంరక్షణ కు చెందిన ఆ సాంప్రదాయిక పద్ధతులను share చేసుకోవాల్సిందిగా నేను మీ అందరికీ విన్నవిస్తున్నాను. మీలో ఎవరైనా పోర్ బందర్, పూజ్య బాపూ జన్మస్థలం దర్శించే అవకాశం కలిగి ఉంటే, పూజ్య బాపూ ఇంటి వెనుక ఒక ఇల్లు ఉంది. అక్కడ 200 ఏళ్ళ నీటి టాంక్ (Water Storage Tank) ఉంది. ఈనాటికీ అందులో నీళ్ళు ఉంటాయి. వర్షాకాలంలో నీటిని పట్టికాపాడే వ్యవస్థ ఉంది. అందుకే నేనెప్పుడూ చెప్తూ ఉంటాను. ఎవరైనా కీర్తి మందిర్ వెళ్తే ఆ నీటి టాంక్ ను తప్పక చూడండి అని. ప్రతిచోటా ఇటువంటి అనేక ప్రయోగాలు ఉంటాయి.
మీ అందరితో నా మూడవ విన్నపం. జలసంరక్షణ దిశలో ముఖ్య పాత్ర నిర్వహించే వ్యక్తులు, స్వచ్ఛంద సంస్థలు, ఈ రంగంలో పని చేసే ప్రతి ఒక్కరూ ఈ విషయానికి సంబంధించి వారికి తెలిసింది share చేయండి. అలా చేయడం వల్ల ఒక సమృద్ధమైన, నీటికి సంబంధించిన క్రియాశీల సంస్థల, వ్యక్తుల database తయారౌతుంది. రండి, మనం జలసంరక్షణకు సంబంధించిన అత్యధిక పద్ధతుల సూచి తయారుచేసి ప్రజలకు జల సంరక్షణ పట్ల ప్రేరణ కలిగిద్దాం. మీరంతా #JanShakti4JalShakti హాష్ టాగ్ ని ఉపయోగించి మీ content share చేసుకోవచ్చు.
నా ప్రియదేశవాసులారా, ఇంకొక విషయంలో కూడా నేను మీకు కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రపంచంలోని వ్యక్తులందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. 21, జూన్ నాడు మళ్ళీ ఒకసారి ఉత్సాహోల్లాసాలతో ఒక కుటుంబానికి చెందిన మూడు-మూడు, నాలుగు-నాలుగు తరాలవాళ్ళు కలిసి యోగాడే ను జరుపుకున్నారు. Holistic Health Care కోసం అవగాహన పెరిగింది, అందులో యోగా డే ప్రాముఖ్యత పెరిగింది. ప్రపంచంలో అన్ని మూలల్లో సూర్యోదయ సమయంలో యోగాభ్యాసి స్వాగతం చెప్తే, సూర్యాస్తమయం వరకూ జరుగుతుంది. ఎక్కడెక్కడ మనుషులున్నారో అక్కడంతా యోగా ఆచరించారు. బహుశా అలా కాని ప్రదేశం లేదేమో అనిపించేంతగా యోగా బృహద్రూపం దాల్చింది. భారతదేశంలో హిమాలయాల నుంచి హిందూ మహాసాగరం వరకూ, సియాచిన్ నుంచీ సబ్ మెరైన్ వరకూ, air-fore నుంచీ air-craft carriers వరకూ, AC gyms నుంచి వేడిగాలుల ఎడారి వరకూ, గ్రామాలనుంచీ పట్టణాలవరకూ- ఎక్కడ అవకాశం ఉందో అక్కడంతా యోగా చేయడమే కాదు, సామూహికంగా ఉత్సవంగా చేసుకున్నారు.
ప్రపంచంలో అనేక దేశాల రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ప్రసిద్ధ వ్యక్తులు, సామాన్య పౌరులు వారి వారి దేశాల్లో ఎలా యోగా ఆచరించారో నాకు twitter లో చూపించారు. ఆరోజు ప్రపంచమంతా ఒక సుఖమయకుటుంబం లాగా కనిపించింది.
ఒక ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కొరకు ఒక ఆరోగ్యకరమైన, సహానుభూతి కల వ్యక్తుల అవసరం ఉంటుందని మనందరికీ తెలుసు. యోగా వల్ల ఇది సాధ్యమౌతుంది. కాబట్టి యోగా ప్రచారము-ప్రసారము ఒక గొప్ప సమాజసేవ . ఈ సేవకు గుర్తింపు నిచ్చి సన్మానించుకోవద్దా? 2019 లో యోగా promotion and development లో విశిష్టపాత్ర పోషించినవారికి Prime Minister’s Awards ప్రకటన, నాకు చాలా సంతోషాన్నిచ్చిన విషయం. ప్రపంచమంతటా ఉన్న అనేక సంస్థలకు ఈ పురస్కారం ఇవ్వబడింది. వారంతా ఎంత గొప్పగా యోగా ను ప్రచారము-ప్రసారము చేయడంలో ఎంత ముఖ్య పాత్ర పోషించారో మీరు ఊహించలేరు. ఉదాహరణకు ‘జపాన్ యోగ్ నికేతన్’ తీసుకుంటే, ఇది జపాన్ అంతటా యోగాను జనప్రియం చేసింది. ‘జపాన్ యోగ్ నికేతన్’ అక్కడ ఎన్నో institutes, training courses నడుపుతుంది. తర్వాత ఇటలీకి చెందిన Ms. Antonietta Rozzi అనే వ్యక్తి సర్వయోగ్ ఇంటర్నేషనల్ ను ఆరంభించి యూరప్ అంతటా యోగా ప్రచారం-ప్రసారం చేశారు. ఇవి అన్నీ స్ఫూర్తిదాయకమైనవి. యోగాకు సంబంధించిన విషయంలో భారతీయులు వెనుకబడే ప్రసక్తే లేదు కదా? బీహార్ యోగ్ విద్యాలయ్, ముంగేర్ కూడా ఈ పురస్కారం పొందింది. గడచిన కొన్ని దశాబ్దాలుగా ఇది యోగా కు అంకితమై ఉంది. అదే విధంగా స్వామీ రాజర్షి ముని కూడా పురస్కారం అందుకున్నారు. వారు life mission and Lakulish Yoga University ని స్థాపించారు. యోగా యొక్క విస్తృత celebration మరియు యోగా సందేశాన్ని ఇంటింటికీ చేర్చేవారికి పురస్కారం ఈ రెండూ ఈ యోగా డే ను మరింత ప్రాముఖ్యత గలదిగా చేశాయి.
నా ప్రియ దేశవాసులారా, మన యాత్ర ఈరోజు ప్రారంభమవుతున్నది. కొత్త భావాలు, కొత్త అనుభూతులు, కొత్త సంకల్పాలు, కొత్త సామర్థ్యాలు. అయినా నేను మీ సలహాల కొరకు వేచి ఉంటాను. మీ ఆలోచనలతో కలిసి నడవడం నాకు ఒక ముఖ్యమైన యాత్ర. ‘మన్ కీ బాత్’ కేవలము నిమిత్తమాత్రము. రండి మనం కలుస్తూ ఉందాం, మాట్లాడుతూ ఉందాం. మీ భావాలను వింటూ, సేకరించుకుంటూ, అర్థం చేసుకుంటూ ఉండనివ్వండి. ఆ భావాలకనుగుణంగా జీవించే ప్రయత్నమూ అప్పుడప్పుడూ చేయనివ్వండి. మీ ఆశీస్సులు నా మీద ఎప్పుడూ ఉండుగాక. మీరే నాకు ప్రేరణ, మీరే నాకు శక్తి. రండి, అందరం కలిసి కూర్చొని ‘మన్ కీ బాత్’ ని ఆస్వాదిస్తూ జీవితంలోని కర్తవ్యాలను నిర్వహించుకుంటూ సాగుదాం. మళ్ళీ ఒకసారి వచ్చే నెల ‘మన్ కీ బాత్’ లో కలుద్దాం. మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు.
నమస్కారం.
నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! ఇవాళ మన్ కీ బాత్ మొదలుపెడుతూంటే మనసు భారంగా ఉంది. పది రోజుల క్రితం భరతమాత తన వీర పుత్రులను కోల్పోయింది. పరాక్రమవంతులైన ఈ వీరులు మన 125కోట్ల దేశప్రజల రక్షణార్థం తమ జీవితాలను పోగొట్టుకున్నారు. దేశప్రజలు ప్రశాంతంగా నిద్ర పోవడం కోసం ఈ వీరపుత్రులు తమ నిద్రాహారాలు మానుకుని మనల్ని రక్షించారు. పుల్వామా ఉగ్రవాదదాడిలో వీర జవానుల మరణం తర్వాత దేశవ్యాప్తంగా ప్రజలందరిలోనూ, వారి మనసుల్లోనూ ఆవేదన, ఆక్రోశం నిండాయి. మరణించిన వీరుల కుటుంబాలకు నలుమూలల నుండీ సానుభూతి మొదలయింది. ఈ ఉగ్రవాద హింసకు వ్యతిరేకంగా మీ, నా మనసుల్లో ఉన్న ఆవేదనే ప్రతి భారతీయుడి హృదయాంతరాళంలోనూ ఉంది. ప్రపంచంలో మానవత్వాన్ని నమ్మే ప్రతి మానవతావాద సముదాయం లోనూ ఇదే భావం ఉంది. భారతమాత రక్షణకై తమ ప్రాణాలను అర్పించిన ప్రతి భారతీయ సైనికుడికీ నేను నమస్కరిస్తున్నాను. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చెయ్యడానికి ఈ బలిదానం మనకు నిరంతరం ప్రేరణను అందిస్తుంది. మన సంకల్పాన్ని మరింత బలపరుస్తుంది. జాత్యహంకారం, సాంఘిక దురభిమానం, ప్రాంతీయవాదం, మొదలైన అనేక తేడాలను మరచి, దేశం ఎదుర్కొంటున్న ఈ సవాలును మనందరమూ ఎదుర్కోవాలి. ఎందుకంటే ఉగ్రవాదానికి వ్యతిరేకంగా మనం వేసే అడుగు మునుపటి కంటే ధృఢంగా, నిర్ణయాత్మకంగానూ, బలంగానూ ఉండాలి. మన సాయుధదళాలు ఎప్పుడూ కూడా అద్వితీయమైన సాహసాన్ని, పరాక్రమాన్ని ప్రదర్సిస్తూనే ఉన్నాయి. శాంతి స్థాపన కోసం వారు అద్భుతమైన సామర్ధ్యాన్ని చూపెట్టారు. అదే సామర్ధ్యం, దాడికి పాల్పడినవారికి వారి భాషలోనే జవాబు చెప్పడానికి పనికివచ్చింది.
దాడి జరిగిన వంద గంటల లోపే ఎలాంటి చర్యలు తీసుకున్నామో మీరు గమనించే ఉంటారు. ఉగ్రవాదులను, వారికి సహాయం చేసిన వారిని సమూలంగా నాశనం చెయ్యాలని సంకల్పించారు. అమరవీరుల బలిదానాల తరువాత, మీడియా ద్వారా వారి కుటుంబ సభ్యుల నుండి ప్రేరణాత్మకమైన మాటలు వచ్చాయి. అవే మాటలు దేశ ధైర్యానికి బలాన్ని ఇచ్చాయి. బీహార్ లోని బగల్పూర్ కు చెందిన అమరవీరుడు రతన్ ఠాకూర్ తండ్రిగారైన రామ్ నిరంజన్ గారు ఇటువంటి దు:ఖపూరిత క్షణాలలో కూడా తెలియచేసిన భావనలు మనందరికీ ఎంతో ప్రేరణను ఇస్తాయి. తన రెండవ కుమారుడిని కూడా శత్రువులతో పోరాడటానికి పంపిస్తానని, అవసరమైతే తాను కూడా పోరాడతానని తెలిపారు. ఒరిస్సా లోని జగత్సింగ్ పూర్ తాలూకు అమరవీరుడు ప్రసన్నా సాహు భార్య మీనా గారి ధైర్యాన్ని చూసి యావత్ దేశం ఆమెకు నమస్కరిస్తోంది. ఆవిడ తమ ఏకైక కుమారుడిని కూడా సి.ఆర్.పి.ఎఫ్ లో చేరుస్తానని వాగ్దానం చేశారు. జాతీయ పతాకం ఉంచబడిన వీర సైనికుడు విజయ్ షోరెన్ పార్థివ శరీరం ఝార్ఖండ్ లోని గుమ్లా చేరగానే వారి పిల్లాడు, నేను కూడా సైన్యంలో చేరతాను అన్నాడు అమాయకంగా. ఈ చిన్నారి మనోగతమే ఇవాళ భారతదేశంలోని ప్రతి చిన్నపిల్లాడి మనగతాన్నీ తెలుపుతుంది. ఇలాంటి భావనలే, మన వీర, పరాక్రమ,అమరవీరుల ఇళ్ళలో మనకు కనబడుతాయి. ఏ ఒక్క అమరవీరుడికీ ఇందులో మినహాయింపు లేదు. వారి కుటుంబాలకు కూడా ఇందులో మినహాయింపు లేదు. దేవరియాకు చెందిన అమర వీరుడు విజయ్ మౌర్య కుటుంబం, కాంగ్డా కు చెందిన తిలక్ రాజ్ తల్లిదండ్రులు, కోటాకు చెందిన అమరవీరుడు హేమ్ రాజ్ ఆరేళ్ల కుమారుడు – ఎవరైనా సరే, ఈ అమరవీరుల ప్రతి కుటుంబ కథా ప్రేరణతో నిండినదే.
ఈ కుటుంబాల వారు ప్రదర్శించిన భావాలను తెలుసుకుని, అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యవలసిందిగా యువతరానికి నేను మనవి చేస్తున్నాను. దేశభక్తి అంటే ఏమిటి? త్యాగము, తపస్సు అంటే ఏమిటో తెలుసుకోవడానికి ఇక చరిత్రలోని పాత సంఘటనల వైపుకి వెళ్ళాల్సిన పని మనకు లేదు. మన కళ్ల ముందర ఉన్న సజీవ సాక్ష్యాలు ఉజ్వల భారత భవితవ్యానికి ప్రేరణాత్మక ఉదాహరణలు.
నా ప్రియమైన దేశప్రజలారా, స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయినా, మనందరమూ ఇంకా యుధ్ధ స్మారక చిహ్నం కోసం ఎదురుచూస్తున్నాం కదా. ఆ ఎదురుచూపులు ఇప్పుడు ఇక పూర్తయ్యాయి. దీని గురించి దేశప్రజలకు ఉన్న ఆసక్తి, ఉత్సుకత సర్వసాధారణం. నరేంద్ర మోదీ యాప్ లో ఉడుపీ, కర్నాటకా నుండి శ్రీ ఓంకార్ శెట్టి గారు జాతీయ యుధ్ధ స్మారకం(National War Memorial) తయారైనందుకు తన ఆనందాన్ని వ్యక్తం చేసారు. భారతదేశంలో జాతీయ యుధ్ధ స్మారకం లేదమిటని నాకు ఆశ్చర్యంగానూ, బాధ గానూ ఉండేది. దేశ రక్షణకు తమ ప్రాణాలను అర్పించే అమరవీరుల శౌర్యగాధలను భద్రపరిచే ఒక స్మారక చిహ్నం . దేశంలో ఇటువంటి స్మారక చిహ్నాన్ని ఏర్పరచాలని నేను నిశ్చయించుకున్నాను.
జాతీయ యుధ్ధ స్మారకం ఒకటి నిర్మించాలని మనం సంకల్పించిన చాలా కొద్ది సమయంలోనే ఈ నిర్మాణం పూర్తవడం చాలా సంతోషించదగ్గ విషయం. రేపు, అంటే ఫిబ్రవరి 25వ తేదీన, మన కోట్లాది దేశప్రజలంతా కలిసి ఈ జాతీయ సైనిక స్మారకాన్ని
మన సైన్యానికి అప్పగిద్దాము. వారి ఋణం తీర్చుకునేందుకు దేశం చేసే ఒక చిన్న ప్రయత్నం ఇది.
ఢిల్లీ హృదయంలో, అంటే ఢిల్లీలో ఎక్కడ ఇండియా గేట్, అమరవీరుల జ్యోతి ఉన్నాయో వాటికి దగ్గరగా ఈ స్మారకాన్ని ఏర్పాటుచెయ్యడం జరిగింది. ఈ జాతీయ సైనిక స్మారకాన్ని దర్శించడం దేశప్రజలకు ఒక తీర్థక్షేత్రాన్ని దర్శించడంతో సమానంగా ఉంటుందని నాకు పూర్తి నమ్మకం ఉంది. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం కోసం అత్యధిక బలిదానాలు ఇచ్చిన సైనికులకు దేశం చూపెట్టే కృతజ్ఞతకు ప్రతిరూపమే ఈ జాతీయ సైనిక స్మారక చిహ్నం. ఈ స్మారక చిహ్నం ఆకృతి, మన అమరవీరుల అద్వితీయ సాహసాన్ని ప్రదర్శిస్తుంది. ఈ జాతీయ సైనిక స్మారకం కల్పన నాలుగు ఏక కేంద్ర వృత్తాలపై (four Concentric circles) ఆధారపడి ఉంటుంది. మొదటి వృత్తంలో ప్రతి సైనికుడి జననం నుండి బలిదానం వరకూ నడిచిన యాత్ర మొత్తం చిత్రించడం జరిగింది. అమర చక్రంలోని జ్వాల అమరవీరుడి అమరత్వానికి ప్రతీక. రెండవ వృత్తం శౌర్య చక్రం. ఇది సైనికుల సాహసానికి,ధైర్య ప్రదర్శనకు ప్రతీక. ఈ గాలరీలోని గోడలపై సైనికుల సాహసగాధలు చెక్కబడ్డాయి. దాని తర్వాతది త్యాగ వృత్తం. ఈ చక్రంలో దేశం కోసం అత్యధిక బలిదానాలు ఇచ్చిన సైనికుల పేర్లు సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. ఆ తర్వాతది రక్షణా వృత్తం. ఇది రక్షణకు ప్రతీక.
ఈ చక్రంలో దట్టమైన చెట్ల వరుస ఉంది. ఈ చెట్లు సైనికులకు ప్రతీకలు. దేశ సరిహద్దుల్లో ప్రతి పుటా సైనికులు అప్రమత్తంగా ఉన్నందువల్ల దేశ ప్రజలు సురక్షితంగా ఉన్నారు అన్న సందేశాన్ని దేశప్రజలకు నమ్మకంగా అందిస్తుంది ఈ చక్రం. మెత్తం మీద చూస్తే, మన దేశానికి చెందిన గొప్ప గొప్ప అమరవీరులను గురించి తెలుసుకోవడానికి, వారికి కృతజ్ఞతను తెలుపడానికి, వారిని గురించి శోధన చేసే ఉద్దేశంతో వచ్చేవారు తప్పనిసరిగా ఈ జాతీయ సైనిక స్మారకాన్ని సందర్శించడానికి వచ్చే స్థలంగా ఇది మారనుంది. మనం ప్రాణాలతో ఉండడానికి, దేశం సురక్షితంగా ఉండి, అభివృధ్ధి చెందడానికి తమ ప్రాణాలను బలిదానం చేసిన వారి గాధలు ఇక్కడ ఉన్నాయి. దేశ అభివృధ్ధి కోసం మన సాయుధదళాలు, పోలీసులు, పారా మిలిటరీ దళాలు అందించే గొప్ప తోడ్పాటుని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. గత ఏడాది అక్టోబర్ లో నాకు ఈ జాతీయ సైనిక స్మారక చిహ్నం కూడా దేశానికి అంకితంచేసే అదృష్టం లభించింది. మనందరి రక్షణ కోసం నిరంతరం పాటుపడే మహిళా పోలీసులు, ఇంకా పురుష పోలీసు సిబ్బంది పట్ల మనం కృతజ్ఞత ప్రకటించాలనే ఆలోచనలకు ప్రతిబింబమే ఈ జాతీయ పోలీసు స్మారకం. మీరంతా జాతీయ సైనిక స్మారకాన్నీ, జాతీయ పోలీసు స్మారకాన్నీ చూడడానికి తప్పక వెళ్తారని నేను ఆశిస్తున్నాను. మీరు అక్కడికి ఎప్పుడు వెళ్ళినా, అక్కడ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో తప్పకుండా షేర్ చేయండి. దాని వల్ల ఇతరులకి కూడా అక్కడకు వెళ్ళలనే ప్రేరణ కలుగుతుంది. వాళ్ళు కూడా ఈ పవిత్ర స్థలాన్ని, ఈస్మారక చిహ్నాన్ని చూడాలనికి ఉత్సాహపడతారు.
నా ప్రియమైన దేశప్రజలారా, ’మన్ కీ బాత్’ కోసం మీరు రాసే వేల కొద్దీ ఉత్తరాలు, వ్యాఖ్యలు, నాకు రకరకాల మాధ్యమాల ద్వారా చదివే అవకాశం దొరుకుతూ ఉంటుంది. ఈసారి మీ వ్యాఖ్యలు చదువుతుంటే ’ఆతిష్ ముఖోపాధ్యాయ్’ గారు రాసిన ఒక ఆసక్తికరమైన సూచన నా దృష్టికి వచ్చింది. ఆయన ఏమి రాసారంటే, “1900, మార్చి 3వ తేదీన ఆంగ్లేయులు బిర్సా ముండాను అరెస్టు చేసినప్పుడు ఆయన వయసు కేవలం పాతికేళ్ళు. అదే రోజున జమ్షెడ్ జీ టాటా గారి జయంతి కూడా అవడం యాదృచ్ఛికం.” ఆయన ఇంకా ఏమని రాసారంటే, “ఈ ఇద్దరి వ్యక్తిత్వాలకీ పూర్తిగా రెండు వేరు వేరు కుటుంబాల నేపథ్యం ఉంది. ఇద్దరూ కూడా ఝార్ఖండ్ వారసత్వాన్నీ, చరిత్ర నూ సంపన్నం చేశారు. మన్ కీ బాత్ లో బిర్సా ముండా, జమ్షెడ్ జీ టాటా ఇద్దరికీ శ్రధ్ధాంజలి ని అర్పించడం ఒక రకంగా గౌరవప్రదమైన ఝార్ఖండ్ చరిత్రను, వారసత్వాన్నీ గుర్తుచేసుకోవడంలాంటిది” అని రాశారు. ఆతిష్ గారూ మీ అభిప్రాయంతో నేను ఏకీభవిస్తున్నాను. ఈ ఇద్దరు గొప్ప నాయకులూ కేవలం ఝార్ఖండ్ కే కాదు మెత్తం భారతదేశ కీర్తినే పెంచారు. వారి తోడ్పాటుకు గానూ యావత్ భారతదేశం వారి పట్ల కృతజ్ఞతతో ఉంది. ఇవాళ మాన్ యువతకు ఎవరిదైనా ప్రేరణాత్మక వ్యక్తిత్వాన్ని గురించి తెలపాల్సిన అవసరం ఉందంటే, అది మహానుభావుడు బిర్సా ముండా గురించే! ఆంగ్లేయులు దాక్కుని, ఆయన నిద్రపోతుండగా ఆయనను పట్టుకున్నారు. ఇటువంటి పిరికి చర్యను వాళ్ళు ఎందుకు చేశారో తెలుసా మీకు? ఎందుకంటే ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నిలబెట్టిన ఆంగ్లేయులకు కూడా ఆయనకు భయపడేవారు. మహానుభావుడు బిర్సా ముండా కేవలం తన వారసత్వమైన విల్లంబులతోనే తుపాకీలతో, తూటాలతో భయపెట్టిన ఆంగ్ల ప్రభుత్వాన్ని కూడా వణికించారు. అసలు ప్రజలకు ఎవరిదైనా ప్రేరణాత్మకమైన నాయకత్వం లభించినప్పుడు ఆయుధాల కన్నా, ప్రజల సామూహిక శక్తే అధికంగా ఉంటుంది. మహానుభావుడు బిర్సా ముండా ఆంగ్లేయులతో కేవలం రాజకీయ స్వాతంత్రం కోసం పోరాడలేదు. ఆదివాసుల సామజిక, ఆర్థిక అధికారాల కోసం కూడా ఆయన పోరాటం చేశారు. తన చిన్నపాటి జీవితకాలంలోనే ఇదంతా ఆయన చేసి చూపెట్టారు. వంచితులు, దోపిడీకి గురైన వారి జీవితాలలో సూర్యుడిలా వెలుగుని నింపారు. మహానుభావుడు బిర్సా ముండా పాతికేళ్ళ చిన్న వయసులోనే తన ప్రాణాలను బలిదానం చేశారు. బిర్సా ముండా లాంటి భరతమాత బిడ్డలు దేశంలోని ప్రతి ప్రాంతంలోనూ పుట్టారు. ఏళ్లపాటు సాగిన స్వాతంత్ర్య సంగ్రామాంలో పాలుపంచుకోని భాతరదేశ ప్రాంతమంటూ ఏది లేదు. కానీ దురదృష్టం ఏమిటంటే ఆ యా ప్రాంతాల ప్రజల త్యాగం, సౌర్యం, బలిదానాల కథలు నేటి తరానికి అందనేలేదు. మహానుభావుడు బిర్సా ముండా లాంటి వ్యక్తిత్వాలు మనకు మన అస్థిత్వాన్ని తెలిపితే, జెమ్‌షెడ్ జీ టాటా లాంటి వ్యక్తిత్వాలు దేశానికి పెద్ద పెద్ద సంస్థలను అందించాయి. జెమ్‌షెడ్ జీ టాటా ఒక సరైన దూరదృష్టి కలిగిన వ్యక్తి. ఆయన భారతదేశ భవిష్యత్తుని చూడడమే కాక దాని కోసం ఒక బలమైన పునాదిని కూడా వేశారు. సైన్స్, టెక్నాలజీ, ఇంకా ఇండస్ట్రీ హబ్ గా భారతదేశాన్ని తయారుచేయడం భవిష్యత్తుకి ఎంతో అవసరం అని ఆయన కు బాగా తెలుసు. ఆయన దూరదృష్టి వల్లే టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ స్థాపించబడింది. దానినే ఇప్పుడు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అంటున్నారు. ఇంతే కాక ఆయన టాటా స్టీల్ మొదలైన ఎన్నో ప్రపంచస్థాయి సంస్థలను, కంపెనీలనూ స్థాపించారు. జెమ్‌షెడ్ జీ టాటా గారికీ, సమావేసం స్వామి వివేకానంద గారికీ అమెరికా ప్రయణంలో ఒక ఓడలో జరిగింది. వారిద్దరి మధ్య జరిగిన ఒక ముఖ్యమైన చర్చలో విషయం ఏమిటంటే, భారతదేశంలో సైన్స్, టెక్నాలజీ ల ప్రచారము, వ్యాప్తి ని గురించి. ఈ చర్చే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కి పునాది అని చెప్పుకుంటారు.
నా ప్రియమైన దేశప్రజలారా, ఫిబ్రవరి29వ తేదీన భారతదేశ మాజీ ప్రధానమంత్రి మురార్జీ భాయ్ దేశాయ్ గారి జయంతి . ఈ రోజు నాలుగు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది. సహజమైన, శాంతిపూర్ణ వ్యక్తిత్వంతో నిండిన మురార్జీ భాయ్ భారతదేశంలో అందరికంటే క్రమశిక్షణ కలిగిన నాయకులలో ఒకరు. స్వతంత్ర భారత పార్లమెంట్ లో అందరి కంటే ఎక్కువ బడ్జెట్ ప్రవేశపెట్టిన వ్యక్తిగా మొరార్జీ భాయ్ దేశాయ్ గారి పేరు నమోదైంది. దేశ ప్రజాస్వామ్య నిర్మాణం ప్రమాదంలో ఉన్న కఠిన సమయంలో, దేశాన్ని తన నైపుణ్యమైన నాయకత్వంతో నడిపించారు మొరార్జీ దేశాయ్. అందువల్ల మన తరువాతి తరాల వారు కూడా ఆయనకు ఋణపడి ఉంటారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం మురార్జీ భాయ్ దేశాయ్ అత్యవసర పరిస్థితి(Emergency)కి వ్యతిరేకంగా జరిపిన పోరాటంలో తాను కూడా మునిగిపోయాడు. అందువల్ల తన వృధ్ధాప్యంలో కూడా ఆయన భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. అప్పటి ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి, జైలులో కూడా పెట్టారు. 1977 ఎన్నికలలో జనతాపార్టీ విజయాన్ని సాధించినప్పుడు ఆయన ప్రధానమంత్రి అయ్యారు. ఆయన పదవీకాలంలోనే 44వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు. ఇది ఎందుకు ముఖ్యమైనదంటే, (ఎమర్జెన్సీ) అత్యవసర పరిస్థితిలో జరిగిన 42వ రాజ్యాంగ సవరణ ప్రకారం – సుప్రీం కోర్టు అధికారాన్ని తగ్గించడం, ఇంకా ఇటువంటి మిగతా ఏర్పాట్లు – మన ప్రజాస్వామ్య విలువలకు నష్టం కలిగించేలాంటివి. వాటిని ఈ 44వ రాజ్యాంగ సవరణ తో సరిచేసారు. ఎలాగంటే 44వ రాజ్యాంగ సవరణ వల్ల పార్లమెంట్, శాసనసభ కార్యకలాపాలను వార్తాపత్రికలలో ప్రచురించడానికి ఏర్పాటు చెయ్యబడింది. ఈ సవరణ వల్లే కొన్ని సుప్రీం కోర్టు అధికారాలు పునరుధ్ధరించబడ్డాయి. ఈ సవరణ లోనే రాజ్యాంగంలోని 20, 21వ అధికరణ ప్రకారం లభించే ప్రాధమిక హక్కులకు ఎమర్జెన్సీ కాలంలో ఏ రకమైన రద్దు జరగకుండా ఏర్పాట్లు చేయబడ్డాయి. మంత్రిమండలి చేసే లిఖితపూర్వక సిఫార్సు మీదే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితిని ప్రకటించాలి. దానితో పాటుగా ఒక్కసారికి ప్రకటించిన అత్యవసర పరిస్థితి కాల పరిమితిని ఆరునెలలకన్నా ఎక్కువ పెంచడానికి వీలులేదని నిర్ణయించారు. మొదటిసారిగా ఇలాంటి ఏర్పాటు చేయబడింది. ఈ రకంగా, 1975లో ఎమర్జన్సీ కాలంలో ఎలాగైతే ప్రజాస్వామ్యం హత్య చేయబడిందో, అలా భవిష్యత్తులో ఎప్పటికీ జరగకుండా మొరార్జీ భాయ్ గారి వల్ల నిశ్చితమైన ఏర్పాట్లు చేయబడ్డాయి. భారతీయ ప్రజాస్వామ్య వైభవాన్ని నిలిపి ఉంచడానికి ఆయన అందించిన అమూల్యమైన సహకారాన్ని భవిష్యతరాలవారు ఎప్పటికీ గుర్తుంచుకుంటారు. ఇటువంటి గొప్ప నాయకుడికి మరోసారి నేను శ్రధ్ధాంజలిని సమర్పించుకుంటున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, ప్రతిసారిలాగనే ఈసారి కూడా పద్మ పురస్కారాలను గురించి ప్రజలు ఎంతో ఉత్సుకత చూపారు. ఇవాళ మనం ఒక నవ భారతం వైపుకి అడుగులు వేస్తున్నాం. అందువల్ల మనం అట్టడుగు స్థాయిలో స్వార్థరహిత భావంతో తమ పనిని తాము చేసుకువెళ్ళేవారిని గౌరవించాలి. తమ కష్టంతో రకరకాల పధ్ధతులలో ఇతరుల జీవితాలలో అనుకూలమైన మార్పులను తెస్తున్న వ్యక్తులు ఉన్నారు. ప్రజాసేవ, సమాజ సేవ, వీటన్నింటికన్నా ఎక్కువగా దేశ సేవ లో నిస్వార్థంగా మునిగిపోయిన వారే నిజమైన ఉద్యోగులు. పద్మ పురస్కారాలు ప్రకటించినప్పుడు పేర్లు విని, వీరెవరు? అని కొందరు ప్రశ్నించడం మీరు చూసే ఉంటారు. ఇది గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే వీరెవరూ టివీలు, మ్యాగజీన్లు, లేదా వార్తాపత్రికలలో మొదటి పేజీల్లో ఎప్పుడూ కనబడరు. వీరంతా వెలుగుజిలుగుల ప్రపంచానికి దూరంగా ఉంటారు. ఏ పేరు కోసమూ పాటుపడకుండా నేల మీద కాళ్ళు నిలిపి పని చెయ్యడాన్ని విశ్వాసిస్తారు. “యోగ: కర్మసు కౌశలం” అని భగవద్గీత అందించిన సందేశాన్ని ఒకరకంగా జీవించి చూపెడతారు. ఇటువంటి కొందరు వ్యక్తుల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. ఒరిస్సా లోని దౌతారీ నాయక్ గురించి మీరు తప్పకుండా వినే ఉంటారు. “Canal man of the Odisha” అని ఊరికే పిలవరు. దౌతారీ నాయక్ తన గ్రామంలో కేవలం తన చేతులతో కొండను తవ్వి మూడు కిలోమీటర్ల వరకూ కాలువ మార్గాన్ని తయారుచేశాడు. తన పరిశ్రమతో నీటిపారుదల సమస్యను, నీటి సమస్యను శాశ్వతంగా తొలగించేశాడు. గుజరాత్ కు చెందిన అబ్దుల్ గఫూర్ ఖత్రీ గారినే తీసుకోండి. ఆయన కచ్ ప్రాంతంలోని వంశపారపర్యమైన రోగన్ చిత్రకళని పునర్జీవితం చేసే అద్భుతమైన పని చేశారు. అంతరించిపోతున్న ఈ కళను కొత్తతరాలకు అందించే గొప్ప పనిని ఆయన చేస్తున్నారు. అబ్దుల్ గఫూర్ ఖత్రీ గారు చిత్రించిన ట్రీ ఆఫ్ లైఫ్ కళాకృతిని నేను అమెరికా మాజీ రాష్ట్రపతి బరాక్ ఓబామా కు బహుమతిగా ఇచ్చాను. పద్మ పురస్కారాన్ని అందుకున్న వారిలో మరాఠ్ వాడాకు చెందిన శెబ్బీర్ సయ్యద్ గోమాత సేవకుడిగా గుర్తింపబడ్డారు. ఆయన తన పూర్తి జీవితాన్ని గోమాత సేవకి అర్పించిన తీరు అద్భుతం. మధురై కు చెందిన చిన్నా పిళ్ళై తమిళనాడులో కలంజియమ్ ఉద్యమం ద్వారా పీడితులను, దోపిడీకి గురైనవారిని సశక్తులుగా తయారుచేసే పని చేసిన మొదటి వ్యక్తి. దానికి తోడుగా ప్రజలు చిన్న చిన్న సంఘాల ఆధారంగా, చిన్న ఆర్థిక వ్యవస్థలను ఏర్పాటు చేసుకునే పధ్ధతిని ప్రారంభించారు. అమెరికా కు చెందిన Tao Porchon-lynch గురించి విని మీరు సంభ్రమాశ్చర్యాలకు గురౌతారు. lynch ఇవాళ ఒక సజీవ యోగా సంస్థగా మారిపోయారు. నూరేళ్ల వయసులో కూడా ఆమె ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు యోగాలో శిక్షణను అందిస్తోంది. ఆమె ఇప్పటికి పదిహేను వందల మందిని యోగా శిక్షకులుగా తయారు చేసింది. ఝార్ఖండ్ లో లేడీ టార్జాన్ పేరుతో ప్రఖ్యాతి చెందిన జమునా టూడూ, టింబర్ మాఫియా తోనూ, నక్సలైట్ల తోనూ పోరాడే సాహసవంతమైన పని చేసారు. ఏభై హెక్టార్ల అటవీ ప్రాంతాన్ని నష్టపోకుండా కాపాడడమే కాకుండా, కలిసికట్టుగా చెట్లు, వన్యజీవాల రక్షణ కోసం పోరాడేలా పదివేల మహిళలకు ప్రేరణను ఇచ్చారు. ఇవాలా గ్రామప్రజలు ప్రతి పిల్లాడి జననానికీ పధ్ధెనిమిది చెట్లు, ప్రతి ఆడపిల్ల పెళ్ళీకి పది చెట్లు నాటడం అనేది జమున గారు పరిశ్రమకు ఫలితమే. గుజరాత్ కు చెందిన ముక్తా బేన్ పంకజ్ కుమార్ దగ్లీ ల కథ మిమ్మల్ని ఎంతో కదిలిస్తుంది. స్వయంగా దివ్యాంగురాలు కావడమే కాక దివ్యాంగ మహిళల ఉధ్ధారణ కోసం ఆవిడ చాలా పాటుపడ్డారు. అటువంటి కార్యక్రమాల ఉదాహరణ దొరకడం కష్టం. చక్షు మహిళా సేవాకుంజ్ పేరుతో ఒక సంస్థను స్థాపించి, చూపు లేని పిల్లలు మనోధైర్యంతో తమ కాళ్లపై తాము జీవించేలా ఆత్మనిర్భరంగా తయారుచేసే పనిలో నిమగ్నమయ్యారు. బిహార్ లోని ముజఫ్ఫర్ పూర్ కి చెందిన కిసాన్ చాచీ అనగా రాజ్ కుమారీ దేవీ కథ చాలా ప్రేరణాత్మకమైనది. మహిళా సశక్తీకరణ, ఇంకా వ్యవసాయాన్ని లాభధాయకంగా తయారుచేసే దిశలో ఆవిడ ఒక ఉదాహరణగా నిలిచింది. కిసాన్ చాచీ తన ప్రాంతంలోని మూడు వందల మహిళలను స్వయం సహాయక బ్రుందాలుగా జోడించి, వారిని ఆర్థికంగా తమ కాళ్లపై తాము నిలబడేలా ప్రోత్సహించారు. గ్రామంలోని మహిళలకు వ్యవసాయంతో పాటుగా స్వయంఉపాధికి అవసరమయ్యే వివిధ మార్గాలపై శిక్షణను ఇచ్చారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే అవిడ వ్యవసాయానికి టెక్నాలజీని జోడించారు. దేశ ప్రజలారా, ఇంకా ఈసారి పద్మ పురస్కారాల్లో మొదటిసారిగా పన్నెండుమంది రైతులకు కూడా పురస్కారాలు దక్కాయి. సాధారణంగా వ్యవసాయ రంగంతో ముడిపడిన చాలా కొద్ది మంది, వారిలో కూడా స్వయంగా వ్యవసాయం చేసేవారు పద్మశ్రీ జాబితాలోకి వచ్చారు. ఇది మారుతున్న భారతదేశ సజీవ చిత్రం.
నా ప్రియమైన దేశ ప్రజలారా, నేను కొద్దిరోజులుగా నేను చెందుతున్న ఒక ఒక మనసుని హత్తుకునే అనుభూతిని గురించి నేనివాళ మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఈమధ్య దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఆయుష్మాన్ భారత్ పథకం PM-JAY అంటే ప్రధానమంత్రి జన ఆరోగ్య పథకం, లబ్ధిదారులను కలవాలని అనుకుంటున్నాను. కొందరితో మాట్లాడే అవకాశం లభించింది. ఒక ఒంటరి తల్లి, ఆమె బిడ్డ, డబ్బు లేక వైద్యం చేయించుకోలేకపోతున్నారు. ఈ పథకం వల్ల వైద్యం జరిగి ఆమె ఆరోగ్యవంతురాలైంది.
శ్రమించి పని చేసి, తన కుటుంబాన్ని పోషించుకునే ఒక ఇంటి పెద్ద, ప్రమాదం జరగడం వల్ల పని చెయ్యలేకపోతున్నాడు. ఈ పథకం వల్ల లబ్ధి పొంది అతడు తిరిగి ఆరోగ్యవంతుడై, కొత్త జీవితాన్ని జీవిస్తున్నాడు.
సోదర,సోదరీ మణులారా, గత ఐదునెలలుగా దాదాపు పన్నెండు లక్షల పేద కుటుంబాలు ఈ పథకం వల్ల లభ్ధి పొందారు. పేదల జీవితాలలో ఈ పథకంవల్ల ఎటువంటి మార్పులు వస్తున్నాయో నేను గమనించాను. మీరంత కూడా, వైద్యానికి ధనం లేకపోవడం వల్ల ఇబ్బంది పడుతున్న పేదవారెవరైనా తెలిస్తే, వాళ్ళకి ఈ పథకం గురించి తక్షణం చెప్పండి. ఈ పథకం అటువంటి పేదకుటుంబాల కోసమే.
నా ప్రియమైన దేశప్రజలారా, పాఠశాలల్లో పరీక్షలు మొదలయ్యే సమయం వచ్చింది. దేశవ్యాప్తంగా వివిధ విద్యాబోర్డులు రాబోయే కొన్ని వారాల్లో పదవ, పన్నెండవ తరగతుల బోర్డు పరీక్షల ఏర్పాట్లు ప్రారంభిస్తారు. పరీక్షలు రాయబోయే విద్యార్థులందరికీ , వారి సంరక్షకులకు , ఉపాధ్యాయులందరికీ నా తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో ’పరీక్షలపై చర్చ’ అనే ఒక పెద్ద కార్యక్రమం టౌన్ హాల్ ఫార్మాట్ లో జరిగింది. ఈ టౌన్ హాల్ కార్యక్రమంలో టెక్నాలజీ మాధ్యమం ద్వారా దేశవిదేశాలలోని కోట్ల కొద్దీ విద్యార్థులతో , వారి సంరక్షకులతో, ఉపాధ్యాయులతో మాట్లాడే అవకాశం నాకు లభించింది. పరీక్షలపై చర్చ గురించిన ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో పరీక్షలతో ముడిపడిన విభిన్నమైన అంశాలపై విస్తారంగా చర్చ జరిగింది. విద్యార్థులకు ఖచ్చితంగా లాభదాయకంగా ఉండేలాంటి ఎన్నో విషయాలు చర్చలోకి వచ్చాయి. విద్యార్థులు, వారి ఉపాద్యాయులు, తల్లిదండ్రులు యూట్యూబ్ లో ఈ కార్యక్రమం పూర్తి రికార్డింగ్ ను చూడవచ్చు. రాబోయే పరీక్షలకు నా ఎక్జామ్ వారియర్స్ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశప్రజలారా, భారతదేశం గురించి మాట్లాడుతూంటే పండుగల గురించిన ప్రస్తావన లేకుండా ఉండనే ఉండదు. మన దేశంలో ఏదో ఒక ప్రాముఖ్యత లేకుండా, ఏ పండుగా లేకుండా ఏ రోజూ కూడా ఉండనే ఉండదు. ఎందుకంటే కొన్నివేల సంవత్సరాల ప్రాచీన సంస్కృతి, వారసత్వాలు మన వద్ద ఉన్నాయి. కొద్ది రోజుల్లో మహాశివరాత్రి రాబోతోంది. ఈసారి శివరాత్రి సోమవారం నాడు వచ్చింది. శివరాత్రి సోమవారం నాడు వస్తే ఒక ప్రత్యేక ప్రాముఖ్యత మన మనసుల్లో నిండిపోతుంది. పవిత్రమైన ఈ శివరాత్రి పండుగ సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశప్రజలారా, కొద్ది రోజుల క్రితం నేను కాశీ వెళ్లాను. అక్కడ నాకు కొందరు దివ్యాంగ సోదర సోదరీమణులతో గడిపే అవకాశం లభించింది. వారితో చాలా విషయాలపై చర్చ జరిగింది. వాళ్ల ఆత్మవిశ్వాసం నిజంగా నన్ను చాలా ప్రభావితం చేసింది. ప్రేరణాత్మకంగా ఉంది. మాటల మధ్య వారిలో ఉన్న ఒక ప్రతిభావంతుడైన యువకుడితో మాట్లాడుతుంటే, అతడన్నాడు “నేనొక స్టేజ్ ఆర్టిస్ట్ ని. నేను వినోదాన్ని పంచే కార్యక్రమాల్లో మిమిక్రీ చేస్తాను.” ఎవరి మిమిక్రీ చేస్తావు అని సరదాగా అడిగాను. “నేను ప్రధానమంత్రి ని మిమిక్రి చేస్తాను” అని చెప్పాడు. చేసి చూపెట్టమన్నాను. నేను చాలా సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యాను. మన్ కీ బాత్ లో నేను ఎలా మాట్లాడతానో అదంతా మిమిక్రీ చేసి చూపెట్టాడు. మన్ కీ బాత్ మిమిక్రీనే చేసాడు. అది విన్న నాకు, ప్రజలు మన్ కీ బాత్ ని వినడమే కాకుండా చాలాసార్లు గుర్తుచేసుకుంటారు కూడా అని తెలిసి చాలా ఆనందం వేసింది. నేను నిజంగా ఆ దివ్యాంగ సోదరుడి శక్తిని చూసి ప్రభావితుడినయ్యాను.
నా ప్రియమైన దేశప్రజలారా, మన్ కీ బాత్ కార్యక్రమం మాధ్యమం ద్వారా మీ అందరితో జతపడడం నాకు ఒక ప్రత్యేకమైన అనుభవం. రేడియో మాధ్యమం ద్వారా ఒక రకంగా నేను కోట్ల కుటుంబాలతో ప్రతి నెలా ముఖాముఖి జరుపుతాను. చాలాసార్లు మీ అందరితో మాట్లాడడం వల్ల, మీ ఉత్తరాలు చదవడం వల్ల, ఫోన్ లో మీరు తెలిపే అభిప్రాయాలను విని, మీ అందరూ నన్ను మీ కుటుంబాలలో వ్యక్తిగా పరిగణిస్తున్నారని అనిపిస్తుంది. ఇది నాకొక ఆహ్లాదకరమైన అనుభూతి. మిత్రులారా, ప్రజాస్వామ్యానికి ఎన్నికలు ఒక పెద్ద పండుగ లాంటివి. రాబోయే రెండు నెలలు మనందరమూ ఎన్నికల పోటాపోటీల్లో నిమగ్నమై ఉంటాము. నేను ఈ ఎన్నికలలో స్వయంగా ఒక అభ్యర్థిగా ఉంటాను. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవిస్తూ, రాబోయే మన్ కీ బాత్, మే నెల ఆఖరి ఆదివారం నాడు ఉంటుంది. అంటే మార్చి నెల, ఏప్రిల్ నెల, మే నెల మొత్తం మూడు నెలల భావనలను ఎన్నికల తరువాత ఒక కొత్త విశ్వాసంతో, మీ ఆశీర్వాద బలంతో మరోసారి మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా మన మాటల పరంపరను ప్రారంభిస్తాను. కొన్నేళ్లపాటు మీతో మనసులో మాటలు మాట్లాడుతూ ఉంటాను. మరోసారి మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! ఈ నెల 21వ తేదీన దేశానికి ఒక చాలా బాధాకరమైన విషయం తెలిసింది. ఏమిటంటే, కర్ణాటక లోని తుముకూరు జిల్లాకు చెందిన శ్రీ సిధ్ధగంగా మఠాథిపతి డా. శ్రీ శ్రీ శ్రీ శివకుమార్ స్వామి గారు ఇక లేరనే వార్త. శివ కుమార్ స్వామి గారు తన యావత్ జీవితాన్నీ సమాజ సేవకే సమర్పించేసారు. బసవేశ్వర భగవానుడు మనకు “కాయకవే కైలాస్” అని నేర్పించాడు. అంటే, కఠినమైన శ్రమ చేస్తూ నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉండడం శివుడి నివాసమైన కైలాసానికి వెళ్ళడం లాంటిది అని అర్థం. శివకుమార స్వామి గారు ఇదే బాటపై నడిచారు. ఆయన తన 111ఏళ్ళ జీవితకాలంలో ఎన్నో వేల మందికి సామజిక, విద్యా, ఆర్థిక సహాయాలను అందించే పనులను చేసారు. వారి ఖ్యాతికి కారణం ఆయన విద్వత్తు. ఆంగ్ల, కన్నడ, సంస్కృత భాషలలో ఆయనకు అద్భుతమైన ప్రావీణ్యం ఉంది. ఆయన ఒక సంఘ సంస్కర్త. ప్రజలకు భోజనము, ఆశ్రయము, విద్య, ఆథ్యాత్మిక జ్ఞానం అందించడానికి మాత్రమే ఆయన తన జీవితాంతం పాటుపడ్డారు. రైతులు నిరతరం క్షేమంగా ఉండాలన్నదే జీవితంలో ఆయనకు అత్యంత ముఖ్యమైన విషయం. సిధ్ధగంగా మఠం ద్వారా క్రమం తప్పకుండా జంతువుల, వ్యవసాయ వేడుకల నిర్వాహణ జరుగుతూ ఉంటుంది. పరమ పూజ్యులైన స్వామీజీ అశీస్సులు నాకు అనేక సార్లు లభించడం నా అదృష్టం. 2007లో శ్రీ శ్రీ శ్రీ శివ కుమార స్వామి గారి శత సంవత్సర ఉత్సవ వేడుకలకు మన మాజీ రాష్ట్రపతి డాక్టర్.ఎ.పి.జె.అబ్దుల్ కలాం గారు తుమ్కూరు వెళ్లారు. కలాం గారు పూజ్యులైన స్వామి గారికి ఒక కవితను కూడా ఆ సందర్భంగా వినిపించారు. అదేమిటంటే –
“O my fellow citizens – In giving, you receive happiness,
In Body and Soul – You have everything to give.
If you have knowledge – share it
If you have resources – share them with the needy.
You, your mind and heart
To remove the pain of the suffering,And, cheer the sad hearts.
In giving, you receive happinessAlmighty will bless, all your actions.”
“నా తోటి దేశ పౌరులారా, ఇవ్వడంలో ఆనందం ఉంది.
దేహం లోనూ, ఆత్మలోనూ – ఇవ్వడానికి ఎంతో ఉంది.
మీకు జ్ఞానం ఉంటే పంచండి.
మీ వద్ద వనరులు ఉంటే – అవసరార్థులకు పంచండి.
మీరు, మీ బుధ్ధిని, మీ మనసుని
బాధలో ఉన్నవారి కోసం ఉపయోగించండి. దు:ఖితులను ఆహ్లాదపరచండి.
ఇవ్వడం ద్వారా ఆనందం లభిస్తుంది. భగవంతుడు మీ ప్రతి చర్యను ఆశీర్వదిస్తాడు.”
అని అర్థం.
శ్రీ శ్రీ శ్రీ శివ కుమార స్వామి గారి జీవితాన్నీ, సిధ్ధగంగ మఠం లక్ష్యాన్నీ డాక్టర్ కలాం గారు ఈ కవిత ద్వారా అందంగా సమర్పించారు.మరోసారి నేను ఈ మహాత్ముడికి నా శ్రధ్ధాంజలిని అర్పిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, 1950, జనవరి26 వ తేదీన మన దేశ రాజ్యాంగం అమలులోకి వచ్చింది. ఆరోజున మన దేశం ఒక గణతంత్ర దేశంగా మారింది. నిన్ననే మనం ఆడంబరంగా, గౌరవ మర్యాదలతో మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం. కానీ ఇవాళ నేనింకో మాట చెప్పాలనుకుంటున్నాను. జనవరి25వ తేదీ మన ఎన్నికల సంఘాన్ని స్థాపించిన రోజు. ఆ రోజుని మనం జాతీయ ఓటరు దినోత్సవంగా(National Voter’s Day) జరుపుకుంటాం. భారతదేశంలో ఎన్నికల ఏర్పాట్లు ఏ స్థాయిలో జరుగుతాయో చూసి ప్రపంచం యావత్తు ఆశ్చర్య పడుతుంది. మన ఎన్నికల సంఘం ఎంత చాకచక్యంగా ఈ ఏర్పాట్లన్నీ చేస్తుందో చూసి ప్రతి భారతీయుడూ గర్వపడడమనేది సాధారణమైన విషయమే. రికార్డు లో నమోదైన ప్రతి పౌరుడికీ, ప్రతి నమోదైన ఓటరుకీ తమ ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశాన్ని మన దేశం ఏర్పాటు చేస్తుంది.
హిమాచల్ ప్రదేశ్ లోని 15,000 అడుగుల ఎత్తుపై ఉన్న ప్రాంతాల్లో కూడా ఎన్నికల కేంద్రాలు ఏర్పాటవుతాయి. అండమాన్ నికోబార్ ద్వీప సమూహాల్లోని దూర దూర ద్వీపాల్లో కూడా ఎన్నికల ఏర్పాట్లు జరుగుతాయి. గుజరాత్ లోని విషయాన్ని మీరు తప్పక వినే ఉంటారు. గిర్ అడవిలోని ఒక అందమైన ప్రాంతంలో కేవలం ఒకే ఒక ఓటరు కోసం ఒక పోలింగ్ బూత్ పెడతారు. కేవలం ఒకే ఒక్క ఓటరు కోసం! ఇటువంటి ఎన్నికల సంఘాన్ని చూసి మనం గర్వపడడం చాలా సాధారణమైన విషయం. ఆ ఒక్కొక్క ఓటరు కోసం, అతడికి తన ఓటు హక్కుని ఉపయోగించుకునే అవకాశం లభించాలనే ఉద్దేశంతో, ఎన్నికల సంఘం ఉద్యోగుల జట్టు మొత్తం దూర దూర ప్రాంతాలకు వెళ్ళి ఎన్నికలు జరిగేలా చూస్తుంది. ఇదే మన గణతంత్ర దేశంలోని అందం. మన గణతంత్రాన్ని బలంగా ఉంచడానికి నిరంతరం ప్రయాస పడే ఎన్నికల సంఘాన్ని నేను మెచ్చుకుంటున్నాను. ఎన్నికల ప్రక్రియలో పాల్గొని, స్వతంత్రంగా, నిష్పక్షంగా ఎన్నికలు జరగడానికి సహాయపడే అన్ని రాష్ట్రాల ఎన్నికల సంఘాల ఉద్యోగులను, మిగతా ఉద్యోగులనందరినీ కూడా నేను అభినందిస్తున్నాను.
ఈ ఏడాది మన దేశంలో జరగబోయే లోక్ సభ ఎన్నికలలో 21వ శతాబ్దంలో పుట్టిన యువత ఎన్నికలలో తమ ఓటు హక్కుని మొదటిసారిగా వినియోగించుకోబోతున్నారు. దేశ బాధ్యతని తమ భూజాలకు ఎత్తుకునే అవకాశం వారికి లభిస్తోంది. ఇప్పుడు వాళ్ళు దేశంలో నిర్ణయప్రక్రియలో భాగస్వాములు కాబోతున్నారు. తమ సొంత కలలను దేశ స్వప్నాలతో ముడిపెట్టే తరుణం వచ్చింది. ఎన్నికలలో పాల్గోవడానికి అర్హులైన యువత తమ పేర్లను ఓటర్ల జాబితాలో తప్పక రిజిస్టరు చేయించుకోవాల్సిందిగా నేను యువతను కోరుతున్నాను. దేశంలో ఓటరుగా గుర్తింపు పొందడం, ఓటు హక్కుని పొందడం అనేది జీవితంలో ఎదురయ్యే అనేక ముఖ్యమైన ఘట్టాల్లో ఒక ముఖ్యమైన మెట్టు. దానితో పాటుగా ఓటువెయ్యడం అనేది నా బాధ్యత అన్న భావం మన లోపల పెరగాలి. జీవితంలో ఎప్పుడైనా, ఏదైనా కారణం వల్ల ఓటు వెయ్యలేకపోతే చాలా బాధ కలగాలి. అయ్యో , నేను ఓటు వెయ్యలేకపోయాను, ఆ రోజు నేను ఓటువెయ్యడానికి వెళ్లలేదు. అందువల్లనే దేశం ఇవాళ ఇంత ఒత్తిడిలో ఉంది.. అనుకునేంతటి బాధ్యత మనకి ఉండాలి. ఇది మ వృత్తి,ప్రవృత్తి కావాలి. ఇది మన సంస్కృతి కావాలి. దేశంలోని ప్రముఖ వ్యక్తులకు నేను చెప్పేదేమిటంటే, మనందరము కలిసి
ఓటరుజాబితాలో మన పేర్లను నమోదు చేయించడం, ఎన్నికలు జరిగే రోజున ఓటు వెయ్యడం, మొదలైన విషయాలను ప్రచారం చేసి, ప్రజలను అప్రమత్తులుగా తయారుచేద్దాం. పెద్ద సంఖ్యలో మన యువ ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకుంటారనీ, తమ భాగస్వామ్యంతో మన గణతంత్రానికి మరింత బలాన్ని ఇస్తారని నేను నమ్ముతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, పవిత్రమైన ఈ భరతగడ్డపై ఎందరో మహాపురుషులు జన్మించారు. వారంతా మానవత్వం కోసం కొన్ని అద్భుతమైన, మరవలేని పనులను చేశారు. మన భరతభూమి ఎందరో రత్నాలవంటి బిడ్డలను కన్న భూమి. అటువంటి మహాపురుషులలో ఒకరే నేతాజీ సుభాష్ చంద్ర బోస్. జనవరి 23వ తేదీన యావత్ భారతదేశం ఒక విభిన్నమైన రీతిలో ఆయన జయంతిని జరుపుకుంది. భారతదేశ స్వతంత్ర సంగ్రామానికి తమ భాగస్వామ్యాన్ని అందించిన మహావీరుల స్మారకార్థంగా తయారుచేసిన ఒక సంగ్రహాలయాన్ని(మ్యూజియంను) ప్రారంభం చేసే అదృష్టం నాకు నేతాజీ జయంతి నాడు లభించింది. స్వాతంత్రం వచ్చిన నాటి నుండీ ఎర్రకోటలో ఎన్నో గదులు మూసివేయబడి ఉన్నాయాని మీకు తెలిసు కదా. అలా మూసివేయబడి ఉన్న గదులన్నింటినీ ఎంతో అందమైన సంగ్రహాలయాలుగా తీర్చిదిద్దారు. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కీ, ఇండియన్ నేషనల్ ఆర్మీ కి ఒక సంగ్రహాలయం, ‘याद-ए-जलियां’, ఇంకా1857 – Eighteen Fifty Seven, India’s First War of Independenceపేర్లతో మరికొన్ని సంగ్రహాలయాలు తయారయ్యాయి. ఈ సంగ్రహాలయాలు ఉన్న గదుల్లోని ప్రతి ఇటుకలోనూ మన గౌరవపూర్వకమైన చరిత్ర తాలూకూ పరిమళాలు నిండి ఉన్నాయి. ఈ సంగ్రహాలయాల ప్రతి అంగుళంలోనూ మన స్వాతంత్ర సమరవీరుల గాధలను చెప్పే విషయాలు మనల్ని చరిత్రలోకి తీసుకువెళ్తాయి. ఇదే ప్రదేశంలో భారతమాత వీరపుత్రులైన – కర్నల్ ప్రేమ్ సెహ్గల్, కర్నల్ గురుభక్ష్ సింహ్ డిల్లో, మేజర్ జనరల్ షహన్వాజ్ ఖాన్ లపై ఆంగ్ల ప్రభుత్వం దావా నడిపింది.
ఎర్రకోటలోని క్రాంతి మందిర్ లో నేతాజీ కి సంబంధించిన జ్ఞాపకాలను సందర్శిస్తున్నప్పుడు నేతాజీ కుటుంబసభ్యులొకరు నాకు ఒక అరుదైన టోపీని బహుకరించారు. అది ఒకప్పుడు నేతాజీ పెట్టుకున్న టోపీట. అక్కడకు వచ్చిన ఆ టోపీని చూసిన ప్రజలలో దేశభక్తి కలిగేందుకు ప్రేరణ లభిస్తుందనే ఉద్దేశంతో ఆ టోపీని ఆ సంగ్రహాలయంలోనే ఒక చోట పెట్టించేసాను నేను. అసలు మన నాయకుల శౌర్యం, దేశభక్తిల గురించి నవతరానికి వేరు వేరు రూపాల్లో మళ్ళీ మళ్ళీ నిరంతరం అండింఛాల్సిన అవసరం ఉంది. క్రిందటి నెల డిసెంబర్ ముప్ఫై న నేను అండమాన్ నికోబార్ ద్వీపానికి వెళ్లాను. 75ఏళ్ల క్రితం ఎక్కడైతే నేతాజీ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారో, సరిగ్గా అదే ప్రదేశంలో మళ్ళీ త్రివర్ణపతాకాన్ని ఎగురవేశారు. 2018,అక్టోబర్ లో ఎర్రకోటలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేయడం చూసి జనాలు ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అక్కడ ఆగస్టు పదిహేను కి మాత్రమే జాతీయపతాకాన్ని ఎగురవేసే అలవాటు ఉంది. ఆజాద్ హింద్ సర్కార్ తయారై 75ఏళ్ళు పూర్తైన సందర్భంలో అలా ఎగురవేశాము.
సుభాష్ బాబుని ఎప్పటికీ ఒక వీర సైనికుడిగా, ఒక నైపుణ్యం గల నిర్వాహకుడిగా గుర్తుంచుకుంటాము. స్వతంత్ర సంగ్రామంలో ఒక ముఖ్యమైన పాత్ర వహించిన వీరుడైన సైనికుడిగా గుర్తుంచుకుంటాము. “ఢిల్లీ చలో”, “తుమ్ ముఝే ఖూన్ దో, మై తుమ్హే ఆజాదీ దూంగా”(నువ్వు నాకు రక్తం ఇవ్వు, నేను నీకు స్వాతంత్రాన్ని ఇస్తాను), లాంటి చురుకైన నినాదాలతో నేతాజీ ప్రతి భారతీయుడి గుండెల్లోనూ స్థానాన్ని సంపాదించుకున్నాడు. నేతాజీకి సంబంధించిన ఫైళ్లను సార్వజనికం చేయాలని చాలా ఏళ్ళ నుండీ కోరడం జరిగింది. ఇది మేము చెయగలిగామని నాకు ఆనందంగా ఉంది. నేతాజీ కుటుంబం మొత్తం ప్రధానమంత్రి కార్యాలయానికి వచ్చిన రోజు ఇంకా నాకు గుర్తు ఉంది. మేమంతా కలిసి నేతాజి గురించి ఎన్నో కబుర్లు చెప్పుకున్నాం. నేతాజీకి శ్రధ్ధాంజలి ఘటించాం.
భారతదేశానికి చెందిన ఎందరో మహా నాయకులతో ముడిపడి ఉన్న కొన్ని ప్రాంతాలను అభివృద్ధి పరచే ప్రయత్నం జరగడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. బాబాసాహెబ్ అంబేద్కర్ కు సంబంధించిన 26,అలీపూర్ రోడ్డు , సర్దార్ పటేల్ సంగ్రహాలయం, క్రాంతి మందిర్ మొదలైనవి. మీరు ఢిల్లీ వస్తే గనుక ఈ ప్రాంతాలను తప్పక సందర్శించండి.
నా ప్రియమైన దేశప్రజలారా, ఇవాళ మనం నేతాజీ సుభాష్ చంద్ర బోస్ గురించి, అది కూడా మన్ కీ బాత్ లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి, నేను నేతాజీ గారి జీవితానికి సంబంధించిన ఒక కథను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. నేను ఎప్పుడూ కూడా రేడియోను మనుషులను కలిపే ఒక మాధ్యమంగా భావించాను. అలానే నేతాజీ కి కూడా రేడియోతో బాగా దగ్గర సంబంధం ఉంది. ఆయన కూడా దేశప్రజలతో సంభాషించడానికి రేడియోను మాధ్యమంగా ఎన్నుకున్నారు.
1942లో,సుభాష్ బాబు ఆజాద్ హిండ్ రేడియోను మొదలుపెట్టారు. రేడియో ద్వారానే ఆయన ఆజాద్ హిండ్ ఫౌజ్ లోని సైనికులతోనూ, దేశప్రజలతోనూ మాట్లాడుతూ ఉండేవారు. రేడియోలో సుభాష్ బాబు మాట్లాడే పధ్ధతే వేరుగా ఉండేది. మాట్లాడే ముందుగా ఆయన అందరితోనూ -– This is Subhash Chandra Bose speaking to you over the Azad Hind Radio అనేవారు. ఆ మాట వింటూనే శ్రోతల్లో ఒక కొత్త ఉత్సాహం, కొత్త శక్తి ప్రవహించేవి.
ఈ రేడియో స్టేషన్ వారానికొకసారి వార్తలను కూడా ప్రసారం చేసేదని నాకు చెప్పారు. ఆంగ్లం, హిందీ, తమిళం, బాంగ్లా,మరాఠీ, పంజాబీ,పష్తో , ఇంకా ఉర్దూ భాషల్లో ఈ వార్తలు ప్రసారమయ్యేవిట. ఈ రేడియో స్టేషన్ ను నిర్వహించడంలో
గుజరాత్ లో ఉండే ఎమ్.ఆర్.వ్యాస్ గారు చాలాముఖ్య పాత్ర వహించారుట.ఆజాద్ హింద్ రేడియోలో ప్రసారమయ్యే కార్యక్రమాలను ప్రజలు బాగా ఇష్టపడేవారుట. ఆ కార్యక్రమాల వల్ల మన స్వాతంత్ర సమరయోధులకు కూడా చాలా బలం లభించేది.
ఈ క్రాంతి మందిరంలోనే ఒక దృశ్యకళా సంగ్రహాలయం కూడా తయారుచేసారు. భారతీయ కళలు,సంస్కృతిలను గురించి ఎంతో ఆకర్షణీయంగా చెప్పే ప్రయత్నం ఇక్కడ చేశారు. సంగ్రహాలయంలో నాలుగు చారిత్రాత్మక ప్రదర్శనలు ఉన్నాయి. అక్కడ మూడు శతాబ్దాల పూర్వం వేయబడిన 450 కన్నాఎక్కువ చిత్తరువులు, కళాచిత్రాలు ఉన్నాయి. సంగ్రహాలయంలో అమృతా షేర్గిల్, రాజారవివర్మ, అవనీంద్ర నాథ్ టాగూర్, గగనేంద్రనాథ్ టాగూర్, నందలాల్ బోస్, జామినీ రాయ్, సైలోజ్ ముఖర్జీ, వంటి ఎందరో గొప్ప కళాకారుల ఉత్కృష్టమైన చిత్రాలు ఇక్కడ ప్రదర్శనలో ఉంచారు. మీరు అక్కడికి వెళ్ళి గురుదేవులు రవీంద్రనాథ ఠాగూర్ చిత్రాలను కూడా తప్పక చూడవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నను. చిత్రలేఖనం గురించి మాట్లాడుతూ గురుదేవులు రవీంద్రనాథ్ ఠాగూర్ గీసిన ఉత్కృష్టమైన చిత్రాలను చూడమంటున్నారేమిటీ అనుకుంటున్నారా? మీకు ఇంతవరకు గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ ఒక రచయితగా, ఒక సంగీతకారుడిగానే తెలిసి ఉంటారు. కానీ గురుదేవులు ఒక చిత్రకారుడు కూడా. ఆయన ఎన్నో విషయలాపై చిత్రాలను గీశారు. ఆయన పశుపక్ష్యాదుల చిత్రాలను కూడా వేశారు. ఎన్నో సుందరమైన దురానుగత చిత్రాలను కూడా చిత్రించారు. ఇంతే కాక ఆయన మనుష్య గుణగణాలను కూడా తన కేన్వాస్ పై చిత్రీకరించే ప్రయత్నం చేసారు. ముఖ్యమైన విషయం ఏమిటంటే గురుదేవులు టాగూర్ తన అత్యధిక చిత్రలకు ఏ పేరూ పెట్టనేలేదు. తన చిత్రాలను చూసేవారు, స్వయంగా ఆ చిత్రాన్ని అర్థం చేసుకుని, ఆ చిత్తరువులో ఉన్న సందేశాన్ని తన దృష్టికోణంతో అర్థం చేసుకోవాలని ఆయన అనుకునేవారు. ఆయన చిత్తరువులు యూరోపియన్ దేశాల్లో, రూస్ లోనూ, అమెరికాలోనూ కూడా ప్రదర్శించబడ్డాయి. క్రాంతి మందిరంలో ఆయన చిత్తరువులను చూడడానికి మీరు తప్పక వెళ్తారని నాకు నమ్మకం ఉంది.
నా ప్రియమైన దేశప్రజలారా, భారతదేశం సాధువుల భూమి. మన సాధువులు, తమ ఆలోచనలు, తమ పనుల ద్వారా సద్భావం, సమానత, ఇంకా సామాజిక సాధికారత సందేశాలను అందించారు. అలాంటి ఒక సాధువే సంత్ రవిదాస్. ఫిబ్రవరి19 రవిదాస్ గారి జయంతి. సంత్ రవిదాస్ గారి దోహాలు చాలా ప్రసిధ్ధి పొందాయి. సంత్ రవిదాస్ గారు చిన్న చిన్న వాక్యాల్లోనే పెద్ద పెద్ద సందేశాలను అందించేవారు. ఆయన ఏమన్నారంటే –
“जाति-जाति में जाति है,
जो केतन के पात,
रैदास मनुष ना जुड़ सके
जब तक जाति न जात”
అరటిచెట్టుకాండాన్నిచీరుతూఉంటే, పొరవెనకాలపొర, మళ్ళీపొర వెనకాల పొర వస్తాయే కానీ లోపల ఏమీ ఉండదు. చెట్టు చీరడం పూర్తయిపోతుంది. అచ్చం అలానే, మనిషిని మతాల్లోకి పంచేసరికీ మనిషి మనిషిగా మిగలలేదు. అయన ఏమనేవారంటే, నిజంగా భగవంతుడు ప్రతి మనిషిలోనూ ఉన్నప్పుడు, మనుషులను కులం, మతం మొదలైన సామాజిక ఆధారాలతో విడదీయడం సరైనది కాదు అనేవారు.
గురు రవిదాస్ గారి జననం ప్రవిత్ర భూమి అయిన వారణాసిలో జరిగింది. సంత్ రవిదాస్ గారు తన జీవితకాలమంతా తన సందేశాల ద్వారా శ్రమ, ఇంకా శ్రామికుల ప్రాముఖ్యతను తెలిపే ప్రయత్నం చేశారు. ఆయన ప్రపంచానికి శ్రమ తాలూకూ ప్రాముఖ్యతను వాస్తవికంగా తెలిపే ప్రయత్నం చేశారనడం తప్పు అవదు. ఆయన అనేవారు –
“मन चंगा तो कठौती में गंगा”
అంటే “మీమనసు, హృదయంపవిత్రంగాఉంటేసాక్షాతూఈశ్వరుడేమీహృదయంలోనివసిస్తాడు” అనిఅర్థం.
సంత్రవిదాస్సందేశాలుప్రతిశాఖను, అన్నివర్గాలప్రజలనుప్రభావితంచేశాయి. చిత్తోడ్మహారాజా, రాణీలను,మీరాబాయిమొదలైనవారంతాఆయనశిష్యులే. నేనుమరోసారిసంత్రవిదాస్గారికినమస్కరిస్తున్నాను.
నాప్రియమైనదేశప్రజలారా, కిరణ్సిదర్గారుమైగౌలోఏంరాసారంటే, నేనుమన్కీబాత్లోభారతీయఅంతరిక్ష్యకార్యక్రమాలు, దానిభవిష్యత్తుతోముడిపడినవిషయాలపైదృష్టినిసారించాలనిచెప్పారు. విద్యార్థులలోఅంతరిక్ష్య కార్యక్రమాలపై ఆసక్తి పెంచేలాంటి విషయాలు మాట్లాడాలనీ, కొంచెం కొత్తగా, విద్యార్థులు ఆకాశపు పరిధిని దాటి ఆలోచించేలా ఉండాలని కోరుతూ వాళ్లతో మాట్లాడమని నన్ను కోరారు.
కిరణ్ గారూ, మీ ఆలోచనను, ప్రత్యేకంగా మన పిల్లల కోసం ఇచ్చిన సందేశాన్ని మెచ్చుకుంటున్నాను. కొన్ని రోజుల క్రితం నేను అహ్మదాబాద్ వెళ్ళాను. అక్కడ నాకు విక్రమ్ సారాభాయ్ గారి విగ్రహావిష్కరణ చేసే అదృష్టం లభించింది. భారత అంతరిక్ష్య కార్యక్రమాల్లో డాక్టర్ విక్రమ్ సారాభాయ్ గారికి ఒక ప్రత్యేకమైన తోడ్పాటు ఉంది. మన అంతరిక్ష్య కార్యక్రమాల్లో దేశంలోని అసంఖ్యాక యువ వైజ్ఞానికుల సహకారం ఉంది. మనం ఎంతో గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఇవాళ మన విధ్యార్థులు అభివృధ్ధి చేసిన సేటిలైట్, Sounding Rocketsఅంతరిక్ష్యం లోకి వెళ్తున్నాయి. ఈ జనవరి 24న మన విధ్యార్థులు తయారు చేసిన “కలామ్- సేట్” లాంచ్ చెయ్యబడింది. ఒరిస్సాలో విశ్వవిద్యాలయ విద్యార్థుల ద్వారా తయరుచెయ్యబడిన Sounding Rocketsకూడా ఎన్నో రికార్డులను సృష్టించాయి. దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండీ 2014 వరకూ తయారైన స్పేస్ మిషన్లన్నింటిలో దాదాపు Space Mission లన్నింటినీ గడచిన నాలుగేళ్ళలో మొదలుపెట్టారు. ఒకే అంతరిక్ష్యయానంతో, ఒకేసారి 104 సేటిలైట్స్ లాంచ్ చేసిన ప్రప్రంచరికార్డుని కూడా మనం సృష్టించాము. త్వరలోనే మనం చంద్రయాన్ -2 ప్రచారం ద్వారా చంద్రుడిపై భారతదేశ ఉనికిని నమోదు చెయ్యబోతున్నాం.
స్పేస్ టెక్నాలజీని మన దేశం ధన, మాన రక్షణకి కూడా బాగా ఉపయోగించుకుంటోంది. వరదలైనా, రైలు లేదా రోడ్డు రక్షణ మొదలైనవాటికి స్పేస్ టెక్నాలజీ వల్ల చాలా సహాయం అందుతోంది. మన మత్స్యకార సోదరులకు NAVICdevices పంచడం జరిగింది. ఇది వాళ్ల రక్షణతో పాటూ వాళ్ళు ఆర్థికంగా అభివృధ్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ప్రభుత్వ సేవల పంపిణీకీ ,accountability ని ఇంకా మెరుగుపరచడానికీ స్పేస్ టెక్నాలజీ ని మనం వాడుకుంటున్నాం. “Housing for all”అందరికీ ఇళ్ళు అనే పథకంలో 23 రాష్ట్రాల్లో దాదాపు 40లక్షల ఇళ్ళను జియో-ట్యాగ్ చేసారు. దానితో పాటుగా ఉపాధిరూపంలో దాదాపు 350కోట్లు సంపత్తిని జియో ట్యాగ్ చేశారు . ఇవాళ మన శాటిలైట్లు అభివృధ్ధి చెందుతున్న దేశ ప్రగతికి ప్రతీకలు. ప్రపంచంలో ఎన్నో దేశాలతో మనకు పెరుగుతున్న సత్సంబంధాలకు దీని సహకారం ఎంతో ఉంది. సౌత్ ఏషియా శాటిలైట్స్ కి ఒక ప్రత్యేకమైన చొరవ ఉంది. అవి పొరుగున ఉన్న మన మిత్రరాజ్యాలకు కూడా అభివృధ్ధి బహుమతిని ఇచ్చాయి. తన competitive launch servicesద్వారా భారతదేశం ఇవాళ కేవలం అభివృధ్ధి చెందుతున్న దేశాలవే కాకుండా అభివృధ్ధి చెందిన దేశాల శాటిలైట్స్ ని కూడా లాంచ్ చేస్తోంది. ఆకాశం, నక్షత్రాలూ ఎప్పుడూ పిలల్లకు ఆకర్షణీయమైనవే. మన స్పేస్ ప్రోగ్రామ్ పిల్లలకు గొప్పగా ఆలోచించడానికీ, తమ పరిధిని దాటి ఆలోచించడానికీ అవకాశం ఇస్తుంది. ఇది ఇప్పటిదాకా అసంభవమనుకున్న విషయాలు. ఇది మన పిల్లలు నక్షత్రాలను చూడడం తో పాటుగా, కొత్త నక్షత్రాలను వెతకడానికి, వారికి ప్రేరణను అందించడానికి ఉపయోగపడే దృష్టికోణం ఇది.
నా ప్రియమైన దేశప్రజలారా, నేను ఎప్పుడూ చెప్తాను. ఆటలు ఆడేవారు రాణించాలి. ఈసారి ఖేలో ఇండియాలో ఎందరో తరుణ్ లు ,యువ ఆటగాళ్ళూ, వికశించి ముందుకువచ్చారు. జనవరి నెలలో పూనాలో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో 18 క్రీడల్లో దాదాపు 6000మంది ఆటగాళ్ళు పాల్గొన్నారు. మన క్రీడల local ecosystem బలంగా ఉంటే, అంటే మన మూలాలు బలంగా ఉంటేనే మన యువ క్రీడాకారులు దేశంలోనూ, ప్రపంచంలోనూ తమ సామర్థ్యాన్ని అత్యుత్తమంగా ప్రదర్శించగలరు. స్థానికంగా క్రీడాకారులు అత్యుత్తమ ప్రదర్శనను కనబరచిప్పుడే వారు గ్లోబల్ స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రదర్శనను చూపగలరు. ఈసారి ఖేలో ఇండియాలో ప్రతి రాష్ట్రం నుండి క్రీడాకారులు తమతమ స్థాయిలో అత్యుత్తమ ప్రదర్శనను అందించారు. మెడల్ వచ్చిన ఎందరో క్రీడాకారుల జీవితం, ఎంతో ప్రేరణాత్మకంగా ఉంది.
బాక్సింగ్ లో యువ క్రీడాకారుడు ఆకాష్ గోర్ఖా వెండి పతకాన్ని సాధించాడు. ఆకాష్ తండి రమేష్ గారు పుణే లోని ఒక కాంప్లెక్స్ లో వాచ్‌మేన్ గా పని చేస్తారు. తన కుటుంబంతో పాటూ ఆయన ఒక పార్కింగ్ షెడ్ లో ఉంటారు. మహారాష్ట్ర లో అండర్-21 మహిళా కబడ్డి జట్టు కేప్టెన్ సోనాలీ హేల్వీ సతారా నివాసి. చిన్నవయసులోనే తన తండ్రిని కోల్పోయింది ఆమె. ఆమె తల్లి, సోదరుడు ఆమె ప్రతిభకు తమ సహకారాన్ని అందించారు. చాలాసార్లు కబడ్డి లాంటి ఆటల్లో మహిళలకు సహకారం పెద్దగా లభించదు. అయినా కూడా సోనాలీ కబడ్ది ని వరించి, అత్యుత్తమ ప్రతిభను చూపెట్టింది. ఆసన్సోల్ లోని పదేళ్ళ అభినవ్ షా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో అందరికంటే తక్కువ వయస్కుడిగా బంగారు పతకాన్ని సాధించాడు. కర్ణాటక కు చెందిన ఒక రైతు బిడ్డ అక్షతా వాస్వాని కమ్తీ వెయిట్ లిఫ్టింగ్ లో స్వర్ణ పతకాన్ని గలుచుకుంది. ఆమె తన గెలుపుకి కారణం తన తండ్రి అని చెప్పింది. ఆమె తండ్రి బెల్గామ్ లో ఒక రైతు. మనం నవభారత నిర్మాణం గురించి మాట్లాడుతుంటాం. యువశక్తి సంకల్పమే న్యూ ఇండియా కదా. ఖేలో ఇండియా తాలూకూ ఈ కథలన్నీ చెప్పేదేమిటంటే – న్యూ ఇండియా నిర్మాణం కేవలం పెద్ద పట్టణాల ప్రజలది మాత్రమే కాక; చిన్న చిన్న నగరాల, గ్రామాల, ప్రాంతాల నుండి వచ్చిన యువజనుల, పిల్లల, young sporting talents,మొదలైనవారందరి సహకారం కూడా ఉంది.
నా ప్రియమైన దేశప్రజలారా, మీరు ఎన్నో ప్రముఖ అందాల పోటీల గురించి వినే ఉంటారు. కానీ మీరు మెరిసే టాయిలెట్ ల పోటీ గురించి ఎప్పుడైనా విన్నారా?గత నెల రోజులుగా జరుగుతున్న ఈ విచిత్రమైన పోటీలో ఏభైవేల కన్నా ఎక్కువ టాయిలెట్లు పోటీ పడ్డాయి. ఈ విచిత్రమైన పోటీ పేరు “స్వచ్ఛ సుందర్ సౌచాలయ్”. ప్రజలు తమ టాయిలెట్లను శుభ్రంగా ఉంచడంతో పాటూ, దానిని రంగులతో అలంకరించి, వాటికి పెయింటింగ్స్ వేయించి అందంగా కూడా తయారుచేస్తున్నారు. మీకు కాశ్మీరు నుండి కన్యాకుమారి దాకా, కచ్ నుండి కామ్రూప్ వరకూ ఉన్న స్వచ్ఛ సుందర్ సౌచాలయాల చిత్రాలు సామాజిక మాధ్యమాలలో చూడడానికి దొరుకుతాయి. నేను సర్పంచ్ లకూ, గ్రామాధిపతులకూ తమ పంచాయితీలలో ఈ ప్రచారానికి నేతృత్వం వహించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను. మీ స్వచ్ఛ సుందర్ సౌచాలయ్ ఫోటోను #MylzzatGharతో జోడించి సామాజిక మాధ్యమంలో తప్పక షేర్ చేయండి.
మిత్రులారా, 2014, అక్టోబర్ రెండవ తేదీన మనందరము మన దేశాన్ని పరిశుభ్రంగా తయారుచెయ్యడానికీ, బహిరంగ మలమూత్రవిసర్జన రహితంగా తయారుచెయ్యడానికి కలిసికట్టుగా ఒక చిరస్మరణియ యాత్రను మొదలుపెట్టాము. భారతదేశంలో ప్రజల సహకారంతో ఇవాళ భారతదేశం 2019 కన్నా ముందరే బహిరంగ మలమూత్రవిసర్జన రహితంగా తయారయ్యింది. ఇది బాపూజీ 150 వ జయంతి కల్లా మనం ఇచ్చే గొప్ప శ్రధ్ధాంజలి.
పరిశుభ్ర భారతదేశం తాలూకూ ఈ చిరస్మరణియ యాత్రను లో మన్ కీ బాత్ శ్రోతల సహకారం కూడా ఎంతో ఉంది. అందువల్లనే, ఐదు లక్షల ఏభైవేల కన్న ఎక్కువ గ్రామాలు, ఆరువందల జిల్లాలు తమని తాము బహిరంగ మలమూత్రవిసర్జన నుండి విముక్తి పొందినట్లుగా ప్రకటించాయన్న విషయం మీ అందరితో పంచుకోవడం ఆనందాన్ని ఇస్తోంది. గ్రామీణ భారతదేశంలో పరిశుభ్రత coverage 98% ని మించింది. దాదాపు తొమ్మిది కోట్ల కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం అందించబడింది.
నా ప్రియమైన చిట్టి పొట్టి మిత్రులారా, పరీక్షలు దగ్గర పడుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో నివశించే అంశుల్ శర్మ మై గౌ లో ఏం రాసాడంటే, నాకు పరీక్షలు, ఎక్షామ్ వారియర్స్ గురించి చెప్పండి అని రాశాడు.
అంశుల్ గారూ, ఈ విషయం ఎత్తినందుకు ధన్యవాదాలు. అవును. ఎన్నో కుటుంబాలకు ఏడాదిలో మొదటిభాగం పరీక్షా సమయం. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుండి అధ్యాపకుల వరకూ, అందరూ పరీక్షల సంబంధిత పనులలో బిజీగా ఉంటారు. నేను విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు, అధ్యాపకులకూ శుభాకాంక్షలు చెప్తున్నాను. నేను ఈ విషయంపై ఇవాల్టి మన్ కీ బాత్ కార్యక్రమంలో చర్చించాలనుకుంటున్నాను. కానీ నేను రెండు రోజుల తర్వాత, అంటే జనవరి29వ తేదీన ఉదయం 11 గంటలకు పరీక్షలపై దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులతో చర్చా కార్యక్రమాన్ని జరపబోతున్నానని చెప్పడం మీకు ఆనందాన్ని కలిగింస్తుందని ఆశిస్తున్నాను. ఈసారి విద్యార్థులతో పాటుగా తల్లిదండ్రులనూ, అధ్యాపకులనూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గోబోతున్నారు. ఈసారి కొన్ని ఇతర దేశాల విద్యార్థులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గోబోతున్నారు. ఈ పరీక్షలలో చర్చలో, పరీక్షలతో ముడిపడిన అనేక విషయాలతో, ప్రత్యేకంగా ఒత్తిడి రహిత పరీక్షల గురించి యువ మిత్రులతో ఎన్నో కబుర్లు మాట్లాడబోతున్నాను.
ఇందుకోసం నేను ప్రజలను ఇన్పుట్ లనూ, ఐడియాలను పంపాలని కోరాను. మై గౌ లో పెద్ద ఎత్తున ప్రజలు తమ అభిప్రాయాలను పంచుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. ఇందులో ఎన్నో అభిప్రాయాలు, సూచనలనూ నేను తప్పకుండా టౌన్ హాల్ కార్యక్రమంలో మీ ముందర ఉంచుతాను. మీరు తప్పక ఈ కార్యక్రమంలో పాల్గొని, సామాజిక మాధ్యమం, నమో యాప్ మాధ్యమాల ద్వారా ఈ కార్యక్రమం లైవ్ టెలీకాస్ట్ ను చూడవచ్చు.
నా ప్రియమైన దేశప్రజలారా, జనవరి 30 పూజ్యులైన బాపూ వర్ధంతి. పదకొండింటికి యావత్ దేశం అమరవీరులకు శ్రధ్ధాంజలి ఘటిస్తుంది. మనం ఎక్కడ ఉన్నా ఒక కూడా రెండు నిమిషాలు అమరవీరులకి తప్పక శ్రధ్ధాంజలి ఘటిద్దాం. పూజ్యులైన బాపూ ని తప్పక స్మరిద్దాం. పూజ్యులైన బాపూ కలలను సాకారం చేయాలని, నవభారతాన్ని నిర్మించాలని, దేశపౌరులుగా మన కర్తవ్యాలను నిర్వహించాలని – ఈ సంకల్పాలతో ముందుకు నడుద్దాం రండి. ఈ 2019 యాత్రను సఫలపూర్వకంగా ముందుకు నడిపిద్దాం. మీ అందరికీ నా అనేకానేక శుభాకాంక్షలు. అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! ఈ 2018 సంవత్సరం చివరికి వచ్చేసింది. 2019వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతున్నాం. ఇలాంటి సమయంలో గడచిన ఏడాది తాలూకూ కబుర్లను తలచుకోవడంతో పాటుగా నూతన సంవత్సర తీర్మానాల గురించి కూడా చర్చించుకోవడం సర్వసాధారణం. వ్యక్తిగతంగానూ , సామాజికపరంగానూ, దేశపరంగా కూడా ప్రతి ఒక్కరూ ఒక్కసారి వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ముందుచూపుతో భవిష్యత్తు వైపుకి కూడా చూడగలిగినంత దూరం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలా చూసుకున్నప్పుడే గతంలోని అనుభవాలూ ఉపయోగపడతాయి, కొత్త పనులు చేయడానికి ఆత్మవిశ్వాసమూ పెరుగుతుంది. ఇంకా, మన జీవితంలో మార్పుని తీసుకురావడానికి మనం ఏం చెయ్యగలము? దేశం కోసం, సమాజం ముందుకు నడవడానికి మన వంతు సహాయం ఏం చెయ్యగలము? అన్న ఆలోచన కూడా కలుగుతుంది. మీ అందరికీ 2019వ సంవత్సరానికి గానూ అనేకానేక శుభాకాంక్షలు. 2018వ సంవత్సరాన్ని ఎలా గుర్తుంచుకోవాలా అని మీరందరూ ఆలోచిస్తూ ఉండిఉంటారు. 2018వ సంవత్సరాన్ని భారతదేశం ఒక గర్వించదగ్గ దేశంగా, తన 130కోట్ల ప్రజల బలాన్ని ఎలా గుర్తుంచుకుంటుందనేది కూడా ముఖ్యమైన విషయమే. ఇది మనందరికీ ఎంతో గౌరవప్రదమైన సంగతి.
2018లో ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఆరోగ్య భీమా పథకం "ఆయుష్మాన్ భారత" ప్రారంభమైంది. దేశంలోని ప్రతి గ్రామానికీ విద్యుత్తు లభించింది. దేశంలోని పేదరికాన్ని భారతదేశం రికార్డ్ స్థాయిలో నిర్మూలిస్తోందని ప్రపంచంలోని రేటింగ్ – విశిష్ట సంస్థలన్నీ ఒప్పుకున్నాయి. అభ్యంతరహితమైన దేశప్రజల సంకల్పం వల్ల పరిశుభ్రతా కార్యక్రమాలు కూడా తొంభై ఇదు శాతానికి మించి జరుగుతున్నాయి.
స్వాతంత్రం వచ్చిన తరువాత, ఎర్రకోటపై నుండి మొట్టమొదటిసారిగా స్వాతంత్ర భారత ప్రభుత్వపు 75వ వార్షికోత్సవ త్రివర్ణపతాకం ఎగురవేయబడింది. దేశాన్ని ఏకత్రాటిపై నడిపించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గౌరవార్థం ప్రపంచంలోకెల్ల పెద్ద ప్రతిమ "Statue of Unity" దేశానికి లభించింది. మన దేశం పేరు ప్రపంచంలో మారుమ్రోగింది. ఐక్యరాజ్య సమితి అత్యున్నత పర్యావరణ పురస్కారమైన "Champions of the earth" award ను మన దేశానికి బహుకరించింది. సౌర శక్తి, వాతావరణ మార్పులలో భారతదేశ ప్రయత్నాలకు ప్రపంచంలో స్థానం లభించింది. భారతదేశంలో అంతర్జాతీయ సోలార్ కూటమి తాలూకూ మొదటి మహాసభ " International Solar Alliance" ప్రారంభోత్సవం జరిగింది. మనందరి సామూహిక సహకారాల కారణంగానే మన దేశంలో ease of doing business rankingలో అపూర్వమైన మెరుగుదల కనబడింది. దేశ ఆత్మరక్షణకు కొత్త బలం లభించింది. ఈ సంవత్సరంలోనే మన దేశం Nuclear Triad (అణు త్రయం) ను సఫలవంతంగా పూర్తి చేసింది. అంటే నీరు, భూమి, ఆకాశం – ఈ మూడు అంచెల్లోనూ అణుప్రయోగ సామర్థ్యం ఉన్న దేశంగా ఇప్పుడు మన దేశం మారింది. మన దేశపు ఆడపడుచులు తమ నావికా సాగర్ ప్రదక్షిణ ద్వారా యావత్ దేశాన్నీ చుట్టి వచ్చి దేశం గర్వపడేలా చేశారు. వారణాసి లో భారతదేశ మొదటి జలమార్గం ప్రారంభమైంది. దీనితో జాతీయ జలమార్గ రంగంలో కొత్త విప్లవానికి అంకురార్పణ జరిగింది. భారదేశంలోనే అతిపెద్ద రోడ్డూ,రైల్ వంతెన బోగీబీల్ బ్రిడ్జ్ ప్రారంభోత్సవం జరిగింది. దేశంలో వందవది, సిక్కింలో మొదటిది అయిన పాక్యాంగ్ విమానాశ్రయం ప్రారంభోత్సవం జరిగింది. Under-19 ప్రపంచ క్రికెట్ కప్ , అంధుల ప్రపంచ కప్ – రెండిటినీ భారతదేశం గెలుచుకుంది. ఈసారి ఆసియా క్రీడల్లో భారతదేశం పెద్ద సంఖ్యలో పతకాలను సాధించింది. పారా ఆసియా క్రీడల్లో కూడా భారతదేశం ఎంతో చక్కని ప్రతిభను కనబరిచింది. ఇలా ప్రతి భారతీయుడి ప్రయత్నం గురించీ , మనందరి ప్రయత్నాల గురించీ నేను మన మన్ కీ బాత్ లో మాట్లాడుతూంటే 2019 వచ్చేస్తుందేమో ! ఇదంతా 130కోట్ల దేశప్రజల నిర్విరామ కృషి వల్లనే సాధ్యమైంది. భారతదేశ ప్రగతి, అభివృధ్ధిల ప్రయాణం 2019 లో కూడా ఇలానే సాగుతుందని, మన దేశం మరింత బలంగా తయారై ఉన్నత శిఖరాలకు చేరుకుంటుందని నాకు నమ్మకం ఉంది.
నా ప్రియమైన దేశప్రజలారా, ఈ డిసెంబరు లో మనం కొందరు అసాధారణ వ్యక్తులను కోల్పోయాం. డిసెంబర్ 19న చెన్నై లో డాక్టర్ జయచంద్రన్ మరణించారు. ఆయనను ప్రజలు ప్రేమతో "మక్కల్ మరుతవర్(ప్రజల వైద్యుడు)" అని పిలిచేవారు. ఎందుకంటే ఆయన ప్రజల మనసుల్లో నివసించేవారు. డాక్టర్ జయచంద్రన్ పేదవారికి అతిచవకగా వైద్యసదుపాయాలను అందించినవారిగా పేరుపొందారు. రోగులకు వైద్యాన్ని అందించడానికి ఆయన ఎప్పుడూ సిధ్ధంగా ఉండేవారని ప్రజలు చెప్తారు. తన వద్దకు వచ్చే వృధ్ధ రోగులకు రానూ పోనూ ఖర్చులను కూడా ఆయనే ఇచ్చేవారు. సమాజానికి ప్రేరణ ను అందించేలాంటి ఆయన గురించిన ఇలాంటి ఎన్నో విషయలను నేను thebetterindia.com websiteలో చదివాను.
ఇలానే డిసెంబర్ 25న కర్ణాటక కు చెందిన సులగిట్టి నరసమ్మ గారి మరణవార్త తెలిసింది. గర్భం ధరించిన తల్లులు, సోదరీమణులకు ప్రసవ సమయంలో సహాయం చేసే సహాయకురాలిగా సులగిట్టి నరసమ్మ పనిచేసేది. ముఖ్యంగా కర్ణాటకలోని దుర్లభమైన ప్రాంతాల్లో వేల సంఖ్యలో తల్లులకు, సోదరీమణులకూ తన సేవలను అందించారు ఆవిడ. ఈ సంవత్సరం మొదట్లో పద్మశ్రీ పురస్కారంతో సన్మానించబడ్డారు ఆవిడ. ప్రేరణాత్మకమైన వ్యక్తిత్వం ఉన్న డాక్టర్ జయ చంద్రన్, సులగిట్టి నరసమ్మ లాంటి ఎందరో వ్యక్తులు సమాజంలో అందరి శ్రేయస్సు కోసం తమ జీవితాలను అంకితం చేసారు. హెల్త్ కేర్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఉత్తర్ ప్రదేశ్ లోని బిజ్- నౌర్ లోని డాక్టర్ల సామాజిక ప్రయత్నాల గురించి మాట్లాడాలనుకుంటున్నాను. పట్నంలోని కొందరు డాక్టర్లు శిబిరాలను ఏర్పాటుచేసి పేదలకు ఉచితంగా వైద్యం చేస్తున్నారని కొద్ది రోజుల క్రితం మా పార్టీ కార్యకర్తలు కొందరు నాతో చెప్పారు. అక్కడి హార్ట్, లంగ్స్ క్రిటికల్ సెంటర్ తరఫున ప్రతి నెలా ఇలాంటి వైద్య శిబిరాల ఏర్పాటు చేసి, ఎన్నోరకాల రోగాలకు ఉచితంగా పరీక్షలు జరపడమే కాకుండా వారికి ఆ శిబిరాల్లో ఉచితంగా వైద్యం చేసే ఏర్పాటు కూడా జరుగుతుంది. ప్రతి నెలా వందల కొద్దీ పేద రోగులు ఈ శిబిరాల వల్ల లాభ్ధి పొందుతున్నారు. నిస్వార్థ భావంతో సేవ చేయడానికి నడుంకట్టిన ఈ డాక్టర్ మిత్రుల ఉత్సాహం నిజంగా ప్రసంశనీయం. సామూహిక ప్రయత్నాల ద్వారానే పరిశుభ్రతా ఉద్యమం విజయవంతమైందని ఇవాళ నేను గర్వంగా చెప్తున్నాను. కొద్ది రోజుల క్రితం మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ లో ఒకేసారి మూడు లక్షల పైగా ప్రజలు పరిశుభ్రతా ఉద్యమంలో పాల్గొన్నారని నాకు కొందరు చెప్పారు. పరిశుభ్రత అనే ఈ మహాయజ్ఞంలో నగరపాలికలు, స్వయం సేవా సంస్థలు, స్కూలు,కాలేజీ విద్యార్థులు, జబల్ పూర్ లోని ప్రజలు, అందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. డాక్టర్ జయచంద్రన్ గురించి నేను చదివిన thebetterindia.com గురించి ఇందాకే నేను ప్రస్తావించాను. సమయం దొరికినప్పుడల్లా నేను తప్పక ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి ఇలాంటి మరిన్ని ప్రేరణాత్మకమైన విషయాలను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాను. ఈమధ్య ఇలాంటి ఎన్నో వెబ్సైట్లు ప్రేరణాత్మకమైన ఇటువంటి విలక్షణమైన వ్యక్తుల జీవితాల నుండి స్ఫూర్తిని అందించేలాంటి ఎన్నో కథలను మనకి పరిచయం చేయడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. thepositiveindia.com అనే వెబ్సైట్ సమాజంలో సానుకూలతను, సున్నితత్వాన్నీ పెంచడానికి పనిచేస్తోంది. ఇలానే yourstory.comలో young innovator ల, ఇంకా ఉద్యమకారుల తాలూకూ విజయగాథలు చాలా చక్కగా ప్రచురిస్తారు. ఇలానే samskritabharati.in ద్వారా ఇంటి వద్ద నుండే సంస్కృత భాషను సులభంగా నేర్చుకోవచ్చు. ఇలాంటి వెబ్సైట్ల గురించి మనం ఒకరితో ఒకరం షేర్ చేసుకుందాం. సానుకూలతను మనందరం కలిసి వైరల్(ప్రచారం) చేద్దాం. ఇలా షేర్ చేయడం వల్ల సమాజంలో మార్పుని తేగలిగే ఇలాంటి నాయకుల గురించి చాలా ఎక్కువ మందికి తెలుస్తుంది. ప్రతికూల భావాలను ప్రచారం చేయడం సులభమే. కానీ మన సమాజంలో మన చుట్టూ జరుగుతున్న అనేక మంచి పనులు 130కోట్ల దేశప్రజల సాముహిక ప్రయాసల వల్లనే జరుగుతున్నాయి.
ప్రతి సమాజంలోనూ ఆటపాటల కు ఎంతో ప్రత్యేకత ఉంటుంది. ఆటలను చూస్తున్నపుడు, చూసేవారి మనసు కూడా శక్తితో నిండిపోతుంది. క్రీడాకారులకు లభించే పేరు ప్రతిష్ఠలు, గౌరవ మర్యాదలు లాంటి ఎన్నో విషయాలను మనం చూస్తూంటాం. కానీ ఒకోసారి వీటి వెనుక ఉన్న ఎన్నో విషయాలను క్రీడాప్రపంచం పరిధి ని దాటి ఉంటాయి. అంతుపట్టనివిగా ఉంటాయి. కాశ్మీర్ కు చెందిన ఒక ఆడబిడ్డ హనాయా నిసార్ గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. కొరియాలో జరిగిన కరాటే ఛాంపియన్ షిప్ లో స్వర్ణ పతకాన్ని గెలిచింది. 12 సంవత్సరాల హనాయా కాశ్మీర్ లోని అనంత్ నాగ్ ప్రాంతానికి చెందింది. హనాయా ఎంతో కష్టపడి, ఏకాగ్రతతో కరాటే నేర్చుకుంది.ఆ ఆట మెలుకువలన్నీ తెలుసుకుని తనని తాను నిరూపించుకుంది. నేను కూడా దేశప్రజల తరఫున ఆమెకు ఉజ్వలమైన భవిష్యత్తు లభించాలని కోరుకుంటున్నాను. హనాయాకు అనేకానేక శుభాకాంక్షలు, ఆశీర్వాదాలు.
అలానే పదహారేళ్ల ఆడబిడ్డ రజని గురించి మీడియాలో ఎంతో చర్చ జరిగింది. మీరు కూడా చదివే ఉంటారు. రజని జూనియర్ మహిళా బాక్సింగ్ పోటీల్లో స్వర్ణ పరకాన్ని గెలుచుకుంది. రజని పతకాన్ని గెలుచుకోగానే ఆమె దగ్గరలో ఉన్న ఒక స్టాల్ కి వెళ్ళి ఒక గ్లాసు పాలు తాగింది. ఆ తర్వాత ఆమె తన పతకాన్ని ఒక గుడ్డలో చుట్టి బ్యాగ్ లో పెట్టుకుంది. రజని ఒక గ్లాస్ పాలు ఎందుకు తాగింది అని మీరు ఆలోచిస్తూ ఉండచ్చు. ఆమె తన తండ్రి జస్మేర్ సింహ్ గారి గౌరవార్థం అలా చేసింది. ఎందుకంటే ఆయన పానీపట్ లో ఒక స్టాల్ లో లస్సీ అమ్ముతారు. తన తండ్రి తనను అంతవరకూ చేర్చడానికి ఎంతో త్యాగం చేశారనీ, ఎంతో కష్టపడ్డారని, రజని చెప్పింది. జస్మేర్ సింహ్ ప్రతి ఉదయం రజని , ఆమె తమ్ముళ్ళు లేవడానికి ఎంతో ముందుగానే పనిలోకి వెళ్ళిపోయేవారు. రజని తన తండ్రికి బాక్సింగ్ నేర్చుకుంటానన్న కోరికని తెలుపగానే, ఆయన తనకు వీలయినన్ని ప్రయత్నాల ద్వారా ఆమెకు ధైర్యాన్ని ఇచ్చారు. రజనికి తన బాక్సింగ్ సాధన పాత గ్లౌజులతో మొదలుపెట్టాల్సివచ్చింది. ఎందుకంటే ఆ రోజుల్లో వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండేది. ఇన్ని ఇబ్బందుల తర్వాత కూడా రజని నిరుత్సాహపడకుండా బాక్సింగ్ నేర్చుకుంటూనే ఉంది. సెర్బియా లో కూడా ఆమె ఒక పతకాన్ని సాధించింది. నేను రజనికి శుభాకాంక్షలు , ఆశీర్వాదాలు తెలుపుతున్నాను. రజనికి తోడ్పాటుని ఇచ్చి, ఆమెను ఉత్సాహపరచినందుకు ఆమె తల్లిదండ్రులు జస్మేర్ గారికి, ఉషారాణి గారికి కూడా అభినందనలు తెలుపుతున్నాను. ఇదేనెలలో పూనా కి చెందిన ఆడపడుచు ఇరవై ఏళ్ళ వేదాంగీ కులకర్ణీ సైకిల్ పై అత్యంత వేగంగా ప్రపంచయాత్ర చేసిన ఆసియా మహిళగా నిలిచింది. 159 రోజులవరకూ రోజూ మూడొందల కిలోమీటర్లు సైకిల్ తొక్కేవారు. ప్రతిరోజూ మూడొందల కిలోమీటర్లు సైకిల్ తొక్కడం మీరు ఊహించగలరా? సైకిల్ నడపడమంటే ఆమెకి ఉన్న అత్యంత ఆసక్తి మెచ్చుకోదగ్గది. ఇలాంటి విజయాలను గురించి విన్నప్పుడు మనకూ స్ఫూర్తి రాదూ?! నా యువస్నేహితులారా, ముఖ్యంగా ఇలాంటి సంఘటనల గురించి విన్నప్పుడు మనం కూడా కష్టాల మధ్యనుండి ఏదో సాధించాలనే ప్రేరణని పొందుతాం. సంకల్పం గట్టిదైతే, స్థిరమైన ధైర్యం ఉంటే, అడ్డంకులు వాటంతట అవే అగిపోతాయి. కష్టాలు ఎప్పుడూ అడ్డంకులు కావు. ఇటువంటి అనేక ఉదాహరణలు వింటూంటే మనకి కూడా మన జీవితంలో ప్రతి క్షణం ఒకకొత్త ప్రేరణ లభిస్తూనే ఉంటుంది.
నా ప్రియమైన దేశప్రజలారా, జనవరిలో ఆనందోత్సాహాలతో నిండిన ఎన్నో పండుగలు రాబోతున్నాయి. లోరీ, పొంగల్, మకర సంక్రాంతి, ఉత్తరాయణ్, మాఘ్ బిహూ, మాఘీ, ఇలాంటి పండుగల సందర్భంలో యావత్ భారతదేశంలో ఎన్నో సంప్రదాయక నృత్యాల చిత్రాలు కనబడతాయి. కొన్ని చోట్ల పంటలు కోతకివచ్చిన ఆనందంలో భోగిమంటలు వేసుకుంటారు. కొన్ని చోట్ల ఆకాశంలో రంగు రంగుల గాలిపటాలు ఎగురుతూ కనిపిస్తాయి. కొన్ని చోట్ల తిరనాళ్ల తాలూకూ రంగులు వెల్లివిరిస్తే, కొన్ని చోట్ల ఆటల పోటీలు జరుగుతాయి. కొన్నిచోట్ల నువ్వులు-బెల్లం కలిపి తినిపిస్తారు. ఒకరితో ఒకరు "తిల్ గుడ్ గ్యా,ఆణి గోడ్ గోడ్ బోలా" అని చెప్పుకుంటారు. ఈ పండుగల పేర్లన్నీ వేరు వేరుగా ఉన్నా అన్నింటినీ జరుపుకునే అంతర్గత భావం ఒకటే. ఈ ఉత్సవాలు ఎక్కడోఅక్కడ పంటపొలాలతో ముడిపడి ఉంటుంది. రైతుతో, గ్రామాలతో, పంటలు, ధాన్య రాశులతో ముడిపడి ఉంటుంది. ఈ సమయంలోనే సూర్యుడు ఉత్తరాయణంలో మకరరాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ తర్వాతే పగటి పొద్దు ఎక్కువగా మారుతుంది. చలికాలపు పంటల కోతలు మొదలైపోతాయి. మన అన్నదాతలైన రైతు సోదరసోదరీమణులకు అనేకానేక శుభాకాంక్షలు. భిన్నత్వంలో ఏకత్వం, ఒకే భారతదేశం శ్రేష్ఠ భారతదేశం -అనే భావన తాలూకూ పరిమళాన్ని మన పండుగలన్నీ తమలో కలుపుకుని ఉన్నాయి. మన పండుగలు ప్రకృతితో ఎంత దగ్గరగా ముడిపడి ఉన్నాయో మనం గమనించవచ్చు. భారతీయ సంస్కృతిలో సమాజాన్నీ ప్రకృతినీ వేరువేరుగా చూడము. ఇక్కడ వ్యక్తి, సమాజం రెండూ ఒకటే. పండుగల ఆధారంతో తయారైన కేలెండరు ప్రకృతితో మనకి ఉన్న దగ్గర సంబంధానికి ఒక చక్కని ఉదాహరణ. ఇందులో సంవత్సరం పొడుగునా వచ్చే పండుగలతో పాటూ, గ్రహ నక్షత్రాల లెఖ్ఖింపు కూడా ఉంటుంది. ప్రాకృతిక, భౌగోళిక ఘటనలతో మనకి ఎంతో పురాతన సంబంధం ఉందన్న సంగతి ఈ సాంప్రదాయక కేలెండర్ వల్ల మనకి తెలుస్తుంది. సూర్య చంద్రుల గమనముతో ఆధారంగా, సూర్య చంద్రుల కేలెండర్ ల ఆధారంగా పండుగల, పర్వదినాల తిధులు నిర్ధారితమై ఉంటాయి. ఎవరు ఏ కేలండర్ ని అనుసరిస్తారో ఆ కేలెండర్ ఆధారంగా పండుగలను వారు జరుపుకుంటారు. చాలా ప్రాంతాల్లో గ్రహ నక్షత్రాల స్థితులకు అనుసారంగా పండుగలు, పర్వదినాలు జరుపుకుంటారు. గుడీపడ్వా, చేటీచండ్, ఉగాది ఇలాంటి పండుగలన్నీ చంద్రమాన కేలెండర్ ఆధారంగా జరుపుకుంటారు. తమిళ పుథాండు, విషు, వైశాఖ్, పోయిలా వైశాఖ్,బిహు – ఈ పండుగలన్నీ సౌరమానం ప్రకారం జరుపుకుంటారు. మనం జరుపుకునే కొన్ని పండుగల్లో నదులను, నీటిని రక్షించుకునే భావం ప్రత్యేకంగా నిక్షిప్తమై ఉంది. ఛట్ పండుగ నదులు, చెరువులలో సూర్యోపాసనతో ముడిపడి ఉంది.
మకర సంక్రాంతి రోజున కూడా లక్షల, కోట్ల ప్రజలు ప్రవిత్ర నదుల్లో స్నానం చేస్తారు. మన పండుగలు, పర్వదినాలు మనకి సామాజిక విలువలను గురించి కూడా తెలుపుతాయి. ఒక వైపు పౌరాణిక ప్రాముఖ్యతను చాటిచెప్తూనే, ఒకరితో ఒకరు కలిసిమెలిసి సోదరభావంతో మెలగాలనే ప్రేరణాత్మక జీవిత పాఠాలను ఎంతో సహజంగా ఈ పండుగలు నేర్పుతాయి. మీ అందరికీ 2019వ సంవత్సరానికి గానూ అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. రాబోయే పండుగలను కూడా మీరు సంపూర్ణ ఆనందంతో జరుపుకోవాలని కోరుకుంటున్నాను. భారతదేశంలోని భిన్నత్వం, భారతీయ సంస్కృతి తాలూకూ అందాన్నీ అందరూ చూసేలా ఈ పండుగలలో తీసుకున్న ఫోటోలను అందరితో షేర్ చేసుకోండి.
నా ప్రియమైన దేశప్రజలారా, యావత్ ప్రపంచానికీ గర్వంగా చూపెట్టడానికి మన సంస్కృతిలో మనం గర్వించదగ్గ విషయాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాటిలో ఒకటి కుంభ మేళా. కుంభ మేళా గురించి మీరు ఎంతో విని ఉంటారు. చలనచిత్రాల్లో కూడా దాని గొప్పదనం గురించి, వైభవం గురించి చాలా చూసే ఉంటారు. అది నిజమే. కుంభ మేళా స్వరూపం విస్తృతమైనది. ఎంత దివ్యమైనదో, అంత భవ్యమైనది. దేశ, విదేశాలనుండీ ప్రజలు వచ్చి ఇందులో పాల్గొంటారు.కుంభ మేళా లో నమ్మకం, శ్రధ్ధల తో కూడిన జనసాగరం నిండి ఉంటుంది. ఒకే చోట ఒకేసారి దేశవిదేశాల నుండి లక్షల, కోట్ల మంది ప్రజలు కలుస్తారు. కుంభ్ వారసత్వం మన దేశపు గొప్ప సాంస్కృతిక సంప్రదాయం నుండి వికసించి, విరాజిల్లింది. ఈసారి జనవరి పదిహేను నుండీ ప్రయాగ లో ఏర్పాటవుతున్న ప్రపంచ ప్రసిధ్ధ కుంభ మేళా కోసం మీరందరూ కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తూ ఉండి ఉంటారు. ఇప్పటి నుండే మహాత్ములు, సాధువులు అప్పుడే కుంభ మేళా కు చేరుకోవడం మొదలుపెట్టేసారు. క్రితం ఏడాది యునెస్కో వారు కుంభ మేళా ను "Intangible cultural heritage of humanity " జాబితాలో గుర్తింపునిచ్చి చేర్చడమే దీని ప్రాపంచిక ప్రాముఖ్యతకు నిదర్శనం. కొద్ది రోజుల క్రితం ఎన్నో దేశాల దౌత్యాధికారులు కుంభ మేళా కు జరుగుతున్న ఏర్పాట్లను చూశారు. అక్కడ ఒకేచోట ఎన్నో దేశాల జాతీయ జండాలను ఎగురవేశారు. ప్రయాగలో ప్రారంభమౌతున్న ఈ కుంభ మేళాలో నూట ఏభై కంటే ఎక్కువ దేశాల నుండి ప్రజలు రావచ్చని అంచనా. కుంభ మేళా దివ్యత్వం నుండే యావత్ ప్రపంచానికీ భారతదేశం తన వైభవాన్ని చాటిచెప్తుంది. సెల్ఫ్ డిస్కవరీకి ఒక పెద్ద మాధ్యమం కుంభ మేళా. ఇక్కడకు వచ్చే ప్రతి వ్యక్తికీ వేరు వేరు అనుభవాలు ఎదురౌతాయి. సంసారిక విషయాలను ఆధ్యాత్మిక దృష్టితో చూసి, అర్థంచేసుకుంటారు. యువతకు ఇది ఒక పెద్ద లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ గా నిలుస్తుంది. కొద్ది రోజుల క్రితం నేను స్వయంగా ప్రయాగ వెళ్ళాను. కుంభ మేళాకి ఏర్పాట్లు జోరుగా సాగుతుండడం చూశాను. ఈ సందర్భంగా ప్రయాగలో ప్రజలు కూడా ఎంతో ఉత్సాహంగా ఉన్నారు. అక్కడ నేను integrated command and control centre ప్రారంభోత్సవం చేశాను. భక్తులకు దీనివల్ల ఎంతోసహాయం లభిస్తుంది. ఈసారి కుంభ మేళాలో, పరిశుభ్రత పట్ల కూడా ఎంతో దృష్టి పెడుతున్నారు. ఏర్పాట్లలో భక్తి తో పాటుగా, శుభ్రత కూడా ఉంటే, దూరదూరాల వరకూ దీని గురించి మంచి మాట అందుతుంది. ఈసారి ప్రతి యాత్రికుడికీ పవిత్ర సంగమస్నానం తర్వాత అక్షయ వృక్షం పుణ్య దర్శనం కూడా లభిస్తుంది. ప్రజల నమ్మకానికి ప్రతీకైన ఈ అక్షయ వృక్షం వందల ఏళ్ల నుండీ కోటలోపలే ఉండిపోయింది. అందువల్ల భక్తులు కావాలన్నా దీనిని దర్శించుకోలేకపోయేవారు. ఇప్పుడు అక్షయ వృక్షం ద్వారం అందరి కోసం తెరవబడింది. మీరు కుంభ మేళాకి వచ్చినప్పుడు , అక్కడి వేరు వేరు సందర్భాల్లో ఫోటోలు తీసుకుని, సామాజిక మాధ్యమాల్లో అందరితో షేర్ చేయండి. అందువల్ల ఎక్కువ మంది ప్రజలకు కుంభ్ మేళాకు వెళ్ళడానికి ప్రేరణ లభిస్తుంది.
అధ్యాత్మికత నిండిన ఈ కుంభ్, భారతీయ దర్శనానికి ఒక గొప్ప కుంభ్ అవ్వాలి.
నమ్మకానికి నిలయమైన ఈ కుంభ్ , దేశభక్తి ని నింపే గొప్ప కుంభ్ అవ్వాలి.
జాతీయ సమైక్యతను పెంచే గొప్ప కుంభ్ అవ్వాలి.
భక్తులకు చెందిన ఈ కుంభ్ ప్రపంచ పర్యాటికుల పాలిట గొప్ప కుంభ్ అవ్వాలి.
కళాత్మికత నిండిన ఈ కుంభ్ సృజనశక్తులకు ఒక గొప్ప కుంభ్ అవ్వాలి.
నా ప్రియమైన దేశప్రజలారా, జనవరి 26న గణతంత్ర దినోత్సవ వేడుకలను గురించి దేశప్రజల మనసుల్లో ఎంతో ఉత్సాహం ఉంటుంది. ఆ రోజున మనం మన రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తులను తలచుకుంటాం. ఈ సంవత్సరం మనం మన పూజ్యులైన బాపూ 150వ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నాం. దక్షిణాఫ్రికా ప్రసిడెంట్ శ్రీ సిరిల్ రామపోసా గారు ఈసారి మన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిధిగా భారతదేశం రావడం ఎంతో అదృష్టం. పూజ్యులైన బాపూకీ, దక్షిణాఫ్రికాకి ఎంతో విడదీయలేని బంధం ఉంది. ”మోహన్’ మహాత్ముడిగా మారింది దక్షిణాఫ్రికాలోనే. దక్షిణాఫ్రికాలోనే మహాత్మా గాంధీ తన మొదటి సత్యాగ్రహాన్ని మొదలుపెట్టారు. అక్కడే వర్ణవిభేదానికి వ్యతిరేకంగా ఎదురునిలిచారు ఆయన. ఫీనిక్స్, టాల్‌స్టాయ్ ఫార్మ్ లను అక్కడే స్థాపించారు. అక్కడి నుండే న్యాయం, శాంతి ల ప్రతిధ్వని ప్రపంచానికి వినబడింది. 2018ని -నెల్సన్ మండేలా శతజయంతి ఏడాదిగా కూడా జరుపుకుంటున్నాము. ఆయనను మఢీబా అనే పేరుతో కూడా ప్రసిధ్ధులు. వర్ణవివక్ష కి వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి నెల్సన్ మండేలా యావత్ ప్రపంచానికీ ఒక ఉదాహరణ. ఆయనకు స్ఫూర్తిదాయకం ఎవరో తెలుసా? అన్ని ఏళ్ల పాటు ఆయన జైలులో గడపడానికి సహన శక్తి, ప్రేరణ ఆయనకు మన పూజ్యులైన బాపూ నుండే వచ్చాయి. బాపు గురించి మండేలా ఏమన్నారంటే " మన చరిత్రలో ఒక విడదీయలేని భాగం మహాత్ములు. ఎందుకంటే ఆయన సత్యంతో తన మొదటి ప్రయోగం ఇక్కడే చేశారు. ఇక్కడే ఆయన న్యాయం కోసం తన విలక్షణతను ప్రదర్శించారు. ఇక్కడే ఆయన తన సత్యాగ్రహాన్ని ప్రారంభించి, పోరాటాన్ని జరిపే విధానాలని తెలియజేసారు" ఆయన బాపూజీని తన రోల్ మోడల్ గా స్వీకరించారు. బాపూ, మండేలా ఇద్దరూ కూడా యావత్ ప్రపంచానికీ కేవలం స్ఫూర్తికి ఆధారాలు మాత్రమే కాదు, వారి ఆదర్శాలు మనకు ప్రేమ, కరుణ తో నిండిన సమాజ నిర్మాణానికి ఎల్లప్పూడూ ప్రోత్సాహాన్ని అందిస్తాయి."
నా ప్రియమైన దేశప్రజలారా, కొద్ది రోజుల క్రితం గుజరాత్ లోని నర్మదాతీరంలోని కేవడియాలో DGP conference జరిగింది. ప్రపంచంలోకెల్లా అత్యంత ఎత్తైన విగ్రహం "statue of unity" ఉన్నచోట, మన దేశంలోని ఉన్నత పోలీసుఅధుకారులతో ఒక సమర్థవంతమైన చర్చ జరిగింది. భారత దేశ, దేశప్రజల రక్షణను మరింత భద్రతను పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలి అన్న విషయంపై విస్తారంగా చర్చ జరిగింది. ఆ సందర్భంగా నేను జాతీయ సమైక్యత కోసం "సర్దార్ పటేల్ పురస్కారాలను" మొదలుపెట్టబోతున్నట్లు ప్రకటించాను. జాతీయ సమైక్యతకు తమ వంతు కృషి చేసిన వారికి ఈ పురస్కారాన్ని అందించడం జరుగుతుంది. సర్దార్ పటేల్ గారు తన యావత్ జీవితాన్నీ దేశ సమైక్యత కోసం అంకితం చేశారు. భారతదేశ అఖండత చెక్కుచెదరకుండా ఉండేందుకు పాటుపడ్డారు. భారతదేశ శక్తి ఇక్కడి భిన్నత్వంలోనే దాగి ఉందని సర్దార్ గారి నమ్మకం. సర్దార్ పటేల్ గారి ఈ భావనను గౌరవిస్తూ ఈ సమైక్యతా పురస్కారం ద్వారా వారికి శ్రధ్ధాంజలిని అర్పిద్దాం.
నా ప్రియమైన దేశప్రజలారా, జనవరి పదమూడున గురుగోవింద్ సింగ్ గారి పవిత్ర జయంతి . గురు గోవిండ్ సింగ్ గారి జననం పాట్నా లో జరిగింది. ఆయన తన జీవితంలో ఎక్కువ సమయాన్ని ఆయన ఉత్తర భారతంలోనే గడిపారు. మహారాష్ట్ర లోని నాందేడ్ లో ఆయన తన ప్రాణాలను త్యజించారు. ఆయన జన్మభూమి పట్నా, కర్మ భూమి ఉత్తర భారతం , అంతిమ క్షణాలు నాందేడ్. ఒకరకంగా చెప్పాలంటే, యావత్ భారత దేశానికీ ఆయన ఆశీర్వాదం లభించింది. ఆయన జీవితకాలాన్ని గనుక పరిశీలిస్తే, అందులో యావత్ భారతదేశమూ కనబడుతుంది. తన తండ్రి శ్రీ గురు తేగ్ బహదూర్ (tegh bahadur) మరణించిన తరువాత గురు గోవింద్ సింగ్ గారు తొమ్మిదేళ్ల చిన్న వయసులోనే గురువు స్థానంలో కూర్చున్నారు. న్యాయం కోసం పోరాటం జరపడానికి కావలసిన ధైర్యం గురు గోవింద్ సింగ్ గారికి సిక్కు గురువుల నుండి వారసత్వంగా లభించింది. ఆయన శాంతమైన, సరళమైన వ్యక్తిత్వం కలవారు. కానీ ఎప్పుడెప్పుడైతే పేదల, బలహీనులను అణచడానికి ప్రయత్నాలు జరిగాయో, వారికి అన్యాయాలు జరిగాయో, అప్పుడప్పుడు మాత్రం గురు గోవింద్ సింగ్ తన మాటని ఎంతో గట్టిగా వినిపించారు. అందుకనే ఏమన్నారంటే
" సవా లాఖ్ సే ఎక్ లడావూ,
చిడియోం సే మై బాజ్ తుడావూ,
తబే గోవింద్ సింగ్ నామ్ సునావూ"
బలహీనవర్గాలతో పోరాడి బలాన్ని ప్రదర్శించకూడదు అని అనేవారు ఆయన. మానవ దు:ఖాన్ని నివారించడమే అన్నింటికంటే పెద్ద సేవ అని శ్రీ గోవింద్ సింగ్ నమ్మేవారు. వీరత్వం, శౌర్యం, త్యాగం, ధర్మపరాయణత తో నిండిన దివ్య పురుషులు ఆయన. శస్త్రం, శాస్త్రం రెండింటి గురించిన గొప్ప జ్ఞానం ఆయనకు ఉండేది. ఆయన ఒక గొప్ప విలుకాడు మాత్రమే కాక గురుముఖి, బ్రజ్ భాష, సంస్కృతం, ఫార్సీ, హిందీ, ఉర్దూ మొదలైన అనేక భాషలు తెలిసిన వారు. నేను మరొక సారి గురుగోవింద్ సింగ్ గారికి నమస్కరిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, దేశంలో ఎన్నో మంచి ఉదంతాలు జరుగుతూ ఉంటాయి కానీ వాటిని గురించి విస్తృతమైన చర్చలు జరగవు. ఇలాంటి ఒక ప్రత్యేకమైన ప్రయత్నం FSSAI అంటే food safety and standard authority of India వారి ద్వారా జరిగుతోంది. మహాత్మా గాంధీ గారి 150వ జయంతి సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా ఎన్నో కార్యక్రమాల ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ పరంపరలో సేఫ్ & హెల్తీ డైట్ హేబిట్స్ – మంచి ఆహారపు అలవాట్లను పెంపొందించడం కోసం పనిచేస్తోంది. Eat right India ప్రచారంలో భాగంగా దేశవ్యాప్తంగా ఆరోగ్య భారతదేశ పర్యటనలు జరుగుతున్నాయి. ఈ ప్రచారం జనవరి 27 వరకూ జరిగుతుంది. అప్పుడప్పుడు ప్రభుత్వసంస్థలు నియంత్రణ విభాగాలుగా కనబడతాయి. కానీ ఈ FSSAI దానిని దాటుకుని ప్రజలను జాగృతం చేసి, వారిని శిక్షితులను చేసే పని చేయడం మెచ్చుకోదగ్గది. భారతదేశం పరిశుభ్రంగా ఉన్నప్పుడు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంపన్నంగా తయారవుతుంది. మంచి ఆరోగ్యానికి పౌష్టిక భోజనం అవసరం. ఈ సందర్భం లో ఈ చొరవతీసుకున్నందుకు గానూ FSSAI ని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. మీరంతా ఈ ప్రయత్నంతో ముడిపడాలని నా విన్నపం. మీరందరూ ఇందులో పాలుపంచుకోవాలని, ముఖ్యంగా పిల్లలకు తప్పకుండా ఈ విషయాలను చూపెట్టాలని నేను కోరుతున్నాను. భోజనం తాలుకూ ప్రాముఖ్యతను చిన్నప్పటి నుండే పిల్లలకు తెలపాల్సిన ఆవస్యకత ఉంది.
నా ప్రియమైన దేశ ప్రజలారా, 2018లో ఇది చివరి కార్యక్రమం. 2019లో మనం తిరిగి కలుద్దాం. తిరిగి మన్ కీ బాత్ లో కబుర్లు చెప్పుకుందాం. వ్యక్తిగత జీవనమైనా, దేశ జీవనమైనా, సమాజ జీవనమైనా , ప్రగతికి స్ఫూర్తి ఆధారం. రండి, కొత్త ప్రేరణతో, కొత్త ఉత్సాహంతో, కొత్త సంకల్పాలతో, కొత్త విజయాలతో, కొత్త శిఖరాలను చేరుకుందాం. ముందుకు నడుద్దాం. ఎదుగుతూ నడుద్దాం. మనం మారదాం. దేశాన్ని మారుద్దాం. అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! 2014 అక్టోబర్ 3వ తేదీ నాడు, విజయదశమి పండుగ రోజున మన్ కీ బాత్ కార్యక్రమం మొదలైంది. ఈ "మన్ కీ బాత్” మాధ్యమం ద్వారా మనందరమూ కలిసి ఒక ప్రయాణాన్ని ప్రారంభించాము. మన – ఈ మన్ కీ బాత్ ధారావాహిక ప్రయాణం ఇవాళ్టితో ఏభై సంచికలు పూర్తి చేసుకుంటోంది. అందువల్ల ఇది మనకి గోల్డెన్ జూబ్లీ ఎపిసోడ్, అంటే ఇవాళ మన్ కీ బాత్ కి స్వర్ణోత్సవం అన్నమాట. ఈసారి మీ అందరి వద్ద నుండి వచ్చిన ఫోన్ కాల్స్, ఉత్తరాలు అన్నీ కూడా ఎక్కువగా ఈ స్వర్ణోత్సవ సందర్భాన్ని గురించే ప్రస్తావించాయి. మై గౌ లో ఢిల్లీకి చెందిన అంషు కుమార్, అమర్ కుమార్, పట్నా నుంచి వికాస్ యాదవ్; అలానే నరేంద్రమోదీ యాప్ నుండి ఢిల్లీకి చెందిన మోనికా జైన్, బద్రవాన్; పశ్చిమ బెంగాల్ నుండి ప్రసేన్ జీత్ సర్కార్, నాగ్ పూర్ నుండి సంగీతా శాస్త్రి – వీరందరూ కూడా దాదాపు ఒకేలాంటి ప్రశ్న ను అడిగారు. వారంతా ఏమని అడిగారంటే, ప్రజలు మిమ్మల్ని ఎక్కువగా లేటెస్ట్ టెక్నాలజీ(నూతన సాంకేతికత),సోషల్ మీడియా(సామాజిక మాధ్యమం), మొబైల్ యాప్ లు వాడే వ్యక్తిగా చెప్పుకుంటారు కదా. కానీ మీరు ప్రజలతో కలవడానికి రేడియోని మాధ్యమంగా ఎందుకు ఎన్నుకున్నారు? అని అడిగారు. రేడియోని దాదాపు అందరూ మర్చిపోయిన నేటి కాలంలో మోదీ గారు రేడియోని తీసుకువచ్చారేమిటీ? అనే మీ కుతూహలం చాలా సహజమైనదే. మీకొక కథ చెప్పాలి నేను. 1998లో సంగతి ఇది. నేను భారతీయ జనతా పార్టీ లో సంస్థ సభ్యుడిగా హిమాచల్ ప్రదేశ్ లో పనిచేస్తున్న సమయం అది. మేనెలలో ఒక సాయంత్రం నేను ఒక చోట నుండి మరోచోటకు ప్రయాణం చేస్తున్నాను. హిమాచల్ కొండల్లో సాయంత్రానికే చలి పెరిగిపోతుంది. అందుకని నేను దారిలో టీ తాగుదామని ఒక ధాబా దగ్గర ఆగాను. అదొక అతిచిన్న ధాబా. రోడ్డు చివరగా ఒక తోపుడుబండి మీద ఒకే వ్యక్తి నిలబడి టీ తయారుచేసి అమ్ముతున్నాడు. టీ కావాలని అడిగాను. అప్పుడతను తన దగ్గర ఉన్న ఒక గాజు పాత్ర లోంచి ఒక లడ్డూ తీసి, ’టీ తర్వాత తాగుదురు గానీ ముందీ లడ్డూ తినండి, నోరు తీపి చేసుకోండి’ అన్నాడు. నేను ఆశ్చర్యపోయి మీ ఇంట్లో ఏదన్నా పెళ్ళీ-పేరంటాలేమన్నా జరిగాయా? ఏదన్నా సభో-సమవేశమో జరిగిందా?అని అడిగాను. అప్పుడతను, ’లేదు లేదు అన్నా. మీకు తెలీదా? చాలా ఆనందించాల్సిన విషయం’ అన్నాడు ఎంతో సంబరపడిపోతూ. అతడి ఉత్సాహాన్ని చూసి నేను మళ్ళీ అడిగాను – ఏమైంది? అని. "తెల్సా, ఇవాళ భారతదేశం బాంబుని పేల్చింది" అన్నాడతను. "భారతదేశం బాంబుని పేల్చిందా? నాకేం అర్థం కావట్లేదు" అన్నాను నేను. అప్పుడతను అన్నాఇదిగో రేడియో వినండి అని రేడియో పెట్టగానే, రేడియోలో అదే విషయంపై చర్చ జరిగుతోంది. అప్పటి మన ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయ్ గారు మీడియా ముందుకు వచ్చి, పరమాణు పరీక్ష ఆరోజు జరిగిందన్న సంగతిని ప్రకటించారు. ఆ ప్రకటనను రేడియోలో విన్న ఈ టీ కొట్టతను ఎంతో సంబరపడిపోతున్నాడు. నాకెంతో ఆశ్చర్యం కలిగింది. మంచు కొండల మధ్యన, అడవిలాంటి ఇటువంటి నిర్మానుష్య ప్రదేశంలో , ఒక తోపుడు బండి మీద టీ కొట్టు పెట్టుకున్న మనిషి, రోజంతా పక్కనే పెట్టుకునే వినే రేడియోలో వచ్చిన వార్తలు విని ఇంతగా ఆనందిస్తున్నాడంటే, రేడియో ప్రభావం ఎంత గొప్పదో కదా అనిపించింది. ప్రజలందరినీ కలిపేది, గొప్ప శక్తివంతమైనది రేడియో అన్న సంగతి అప్పటి నుండీ నా మనసులో బాగా నిలిచిపోయింది. సుదూర ప్రాంతాలకు వార్తలను అందించడంలో రేడియోను మించిన సాధనం మరొకటేదీ లేదన్న సంగతి అప్పటినుండీ నా మనసులో బాగా నాటుకుపోయింది. రేడియో కున్న శక్తిని అంచనా వేస్తూ ఉండేవాడిని. నేను ప్రధానమంత్రిని అయ్యిన తరువాత అన్నిటికంటే శక్తివంతమైన మాధ్యమం వైపుకి నా దృష్టి మరలడం సహజమే. 2014 మే నెలలో ఒక ముఖ్య సేవకుడి రూపంలో నేను పని చేయడం మొదలుపెట్టగానే, దేశ సమైక్యత, మన ఉజ్వలమైన చరిత్ర, మన సాహసం, భారతదేశంలోని వైవిధ్యాలు, మన సాంస్కృతిక వైవిధ్యాలూ, మన సమాజం నరనరాల్లో నిండి ఉన్న మంచితనం, ప్రజల ప్రయత్నాలు, ఆలోచనలు, తపస్సు, భారతదేశ చరిత్ర, వీటన్నింటినీ ప్రజల వరకూ తీసుకువెళ్ళాలి అనుకున్నాను. దేశంలోని మారుమూల ఉండే పల్లెటూర్ల నుండీ మెట్రో సిటీల వరకూ, రైతుసోదరుల నుండీ వృత్తి నిపుణులైన యువత వరకూ ఈ విషయాలన్నీ తీసుకువెళ్ళాలి అనుకున్నాను. ఆ ఆలోచనలోంచే ఈ మన్ కీ బాత్ ప్రయాణం మొదలైంది. ప్రతి నెలా కొన్ని లక్షల ఉత్తరాలను చదవడం, ఫోన్ కాల్స్ ను వినడం, యాప్ లో, మై గౌ లోనూ వ్యాఖ్యలను చూడడం, వీటన్నింటినీ ఒకే దారంతో ముడివేస్తూ, మృదువైన భావోద్వేగాలు నిండిన కబుర్లు చెప్పుకుంటూ చెప్పుకుంటూ సాగించిన ఈ ఏభై ధారావాహికల ప్రయాణాన్ని, మనందరమూ కలిసే ప్రయాణించాము. ఇటీవల ఆకాశవాణి మన్ కీ బాత్ మీద ఒక సర్వే ను కూడా నిర్వహించింది. ఈ సర్వేలో వచ్చిన ఫీడ్ బ్యాక్ చాలా ఆసక్తికరంగా ఉంది. సర్వేలో పాల్గొన్నవారిలో 70% మంది క్రమం తప్పకుండా మన్ కీ బాత్ కార్యక్రమాన్ని వింటారుట. ఎక్కువశాతం ప్రజల ఉద్దేశం ప్రకారం మన్ కీ బాత్ కార్యక్రమం సమాజంలో ఎంతో అనుకూల ప్రభావాన్ని పెంచింది. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా చాలా పెద్ద ఎత్తున ప్రజా ఉద్యమాలకు ఊపు అందింది. #indiapositive గురించి ఎంతో విస్తృతమైన చర్చ కూడా జరిగింది. ఇది మన దేశప్రజలందరి మనసుల్లో ఉన్న సానుకూల దృక్పథానికీ, సకారాత్మక భావాలకీ చక్కని ఉదాహరణ. మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల ప్రజలలో volunteerism అంటే స్వచ్ఛంద సేవా భావం కూడా పెరిగిందని కొందరు తమ అనుభవాలను కూడా పంచుకున్నారు. సమాజ సేవ కోసం ప్రజలు పెద్ద ఎత్తున ముందుకు వస్తున్నారు. ఇదొక పెను మార్పు. మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల ప్రజలకు రేడియో ఇంకా ఎక్కువ ప్రియమైనదిగా మారుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కేవలం రేడియో మాధ్యమం ద్వారా మాత్రమే ప్రజలు ఈ కార్యక్రమాన్ని వినటం లేదు. వారు – టి.వి, ఎఫ్.ఎమ్. రేడియో, మొబైల్, ఇంటర్నెట్, ఫేస్ బుక్ లైవ్, పెరిస్కోప్ తో పాటూ నరేంద్రమోదీ యాప్ ద్వారా కూడా మన్ కీ బాత్ లో పాల్గొనే అవకాశం తమకు కలగాలని కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంపై మీ నమ్మకాన్ని చూపెట్టి, ఇందులో భాగస్తులైనందుకు గాను నేను మన్ కీ బాత్ కుటుంబానికి చెందిన మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
(ఫోన్ కాల్ – 1)
"గౌరవనీయులైన ప్రధానమంత్రిగారికి నమస్కారం.నా పేరు శాలిని. నేను హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను. మన్ కీ బాత్ కార్యక్రమం ఎంతో ప్రజారంజకమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం కూడా ఒక రాజకీయ వేదికగా మిగిలిపోతుందేమో అని మొదట్లో అంతా అనుకున్నారు. ఇదొక చర్చనీయాంశంగా కూడా మారింది. కానీ నెలలు గడిచేకొద్దీ ఈ కార్యక్రమం రాజకీయ విషయాలకు బదులుగా సామాజిక సమస్యలు, సవాళ్ళపై మాత్రమే దృష్టిని నిలిపింది. తద్వారా నాలాంటి ఎన్నో కోట్లమంది సామాన్య ప్రజలను తనతో కలుపుకుంది. నెమ్మది నెమ్మదిగా విమర్శ కూడా ఆగిపోయింది. నా ప్రశ్న ఏమిటంటే, మీరీ కార్యక్రమాన్ని రాజకీయాల నుండి దూరంగా ఎలా ఉంచగలిగారు? ఈ కార్యక్రమాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవాలని, లేదా ఈ వేదిక నుండి మీ ప్రభుత్వం సాధించిన విజయాలను లెఖ్ఖించాలనే ఆలోచన మీకెప్పుడూ రాలేదా? ధన్యవాదాలు."
మీ ఫోన్ కాల్ కు అనేకానేక ధన్యవాదాలు. మీ అంచనా సరైనదే. అసలు ఒక నాయకుడికి మైకు దొరకి, ఎదురుగా లక్షల ,కోట్ల మంది వినే శ్రోతలు ఉంటే ఇంకేం కావాలి? కొందరు యువమిత్రులు "మన్ కీ బాత్" లో వచ్చిన అన్ని విషయాల మీదా ఒక స్టడీ చేశారు. ఏ ఏ పదాలు ఎక్కువ సార్లు వాడారు ? ఏ పదాన్ని మళ్ళీ మళ్ళీ ఎక్కువసార్లు వాడారు? అని అన్ని మన్ కీ బాత్ కార్యక్రమాలపై ఒక lexical analysis చేశారు. వారు కనుక్కున్న ఒక విషయం ఏమిటంటే, ఈ కార్యక్రమం (apolitical) రాజకీయపరమైనది కాదు అని. ఈ కార్యక్రమంలో రాజకీయాలు, ప్రభుత్వపరమైన సంగతులు ఏమీ ఉండకూడదు, ఇందులో అసలు మోదీ కనిపించకూడదు, అని మన్ కీ బాత్ ప్రారంభం అయినప్పుడే నేను నిర్ణయించుకున్నాను. ఈ సంకల్పాన్ని నిలబెట్టుకోవడానికి అన్నింటికన్నా ఎక్కువ సహకారం, ప్రేరణ మీ నుంచే లభించాయి. ప్రతి మన్ కీ బాత్ ముందర వచ్చే ఉత్తరాలు, ఆన్ లైన్ వ్యాఖ్యలు, ఫోన్ కాల్స్, వీటన్నింటిలో శ్రోతల ఆకాంక్షలు స్పష్టంగా కనిపించేస్తాయి. మోదీ వస్తాడు, వెళ్పోతాడు కానీ ఈ దేశం స్థిరంగా ఉంటుంది. మన సంస్కృతి చిరకాలం నిలిచి ఉంటుంది. 130 కోట్ల దేశప్రజల ఈ చిన్న చిన్న కథలన్నీ ఎప్పటికీ సజీవంగానే ఉంటాయి. అవన్నీ ఈ దేశానికి కొత్త ప్రేరణను అందించి, కొత్త ఉత్సాహంతో ఉన్నత శిఖరాలను అందుకునేలా చేస్తాయి. అప్పుడప్పుడు వెనుతిరిగి చూసినప్పుడల్లా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఎప్పుడైనా, ఎవరైనా , దేశంలోని ఏదో ఒక మారుమూల ప్రాంతం నుండి " దేశం లోని చిన్న చిన్న వ్యాపారస్తులతో, ఆటో నడిపేవారితో, కూరలు అమ్ముకునే వారితో బాగా ఎక్కువగా కలిసిపోవడం మనకి మంచిది కాదు" అని ఉత్తరం వస్తే, అలాంటి భావాన్నే మరొకరు ప్రకటిస్తే, అలాంటి సమభావాలున్న ఉత్తరాలను నేను గుదిగుచ్చి ఉంచుతాను. నా అనుభవాలను కూడా వాళ్లతో పాటూ మీ అందరితో కూడా పంచుకుంటాను. ఆ తర్వాత నెమ్మదిగా ఈ విషయం ఇళ్ళకూ, సామాజిక మాధ్యమాలకూ, వాట్సప్ లోనూ చక్కర్లు కొడుతూ ఒక మార్పు వైపుకి పయనిస్తుంది. మీరందరూ పంపించిన పరిశుభ్రత కథలు, ఎందరో సామాన్య ప్రజల ఉదాహరణలు కలిసి, మనకు తెలియకుండానే ప్రతి ఇంటి నుండీ ఒక చిన్నారిని పరిశుభ్రతకు బ్రాండ్ అంబాసిడర్ గా నిలబెట్టేస్తుంది. తన ఇంటివాళ్లను కూడా నిలబెట్టేసేంతటి నేర్పు, అప్పుడప్పుడు ఫోన్ కాల్స్ లో ప్రధానమంత్రికి కూడా ఆదేశాన్ని ఇచ్చేంతటి తెగువ ఆ చిన్నారికి ఉంటాయి. హరియాణా లోని చిన్న గ్రామం నుండి మొదలైన selfiewithdaughter ప్రచారాన్ని యావత్ దేశంలోనే కాక, విదేశాలకి కూడా పాకించగలిగే శక్తి ఏ ప్రభుత్వానికి ఎప్పటికి రాగలదు? సమాజం ఆలోచనల్లో మార్పుని తేవడానికి, సమాజంలో అన్ని వర్గాలవారూ, ప్రముఖులందరూ ఏకమై, ఒక ఆధునిక భాషని జాగృతం చెయ్యాలి. అది నేటి యువతకు అర్థమయ్యే మేలుకొలుపులా ఉండాలి. కొన్నిసార్లు మన్ కీ బాత్ పరిహాసానికి కూడా గురైంది. కానీ నా మనసులో ఎప్పుడూ 130 కోట్ల దేశప్రజలందరూ ఎప్పుడూ ఉంటారు. వారందరి మనసే నా మనసు. మన్ కీ బాత్ ప్రభుత్వపు మాట కాదు, ఇది సమాజపు మాట. మన్ కీ బాత్ ఒక aspirational India, ఒక ప్రతిష్టాత్మక భారతదేశపు మాట. భారతదేశ మూలశక్తి రాజకీయం కాదు. సింహాసనమూ కాదు. భారతదేశ మూల శక్తి సామాజిక నీతి, సమాజ శక్తి. సామాజిక జీవితానికి అనేక వేల కోణాలు ఉంటాయి. వాటన్నింటిలో రాజకీయం ఒక కోణం మాత్రమే. అంతా రాజకీయం అయిపోవడం సమాజం ఆరోగ్యానికి మంచిది కాదు. అప్పుడప్పుడు రాజకీయ సంఘటనలు, రాజకీయవేత్తలూ ఎంతగా శాసిస్తారంటే, వారి వల్ల సమాజం లోని తక్కిన ప్రతిభలు, మిగిలిన ప్రయత్నాలన్నీ మరుగునపడిపోతాయి. భారతదేశం లాంటి దేశం భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలంటే సామాన్య ప్రజల ప్రతిభలకు తగిన గుర్తింపు లభించాలి. ఇది మనందరి సామూహిక బాధ్యత. ఆ దారిలో మన్ కీ బాత్ ఒక
వినయపూర్వకమైన చిన్న ప్రయత్నం.
(ఫోన్ కాల్ – 2)
నమస్కారం ప్రధాన మంత్రిగారూ. నేను ముంబాయ్ నుండి ప్రోమితా ముఖర్జీ ని మాట్లాడుతున్నాను. సార్, ప్రతి మన్ కీ బాత్ కార్యక్రమమూ గాఢమైన అంతర్-దృష్టి తో , సమాచారంతో, సానుకూలదృక్పథం ఉన్న కథలతో, ఇంకా సామాన్య మానవుడి మంచి పనులతో నిండి ఉంటోంది. ప్రతి కార్యక్రమానికీ ముందర మీరు ఎంతగా తయారవుతారు అని నేను మిమ్మల్ని అడగాలని అనుకుంటున్నాను?
ఫోన్ కాల్ చేసినందుకు మీకు అనేకానేక ధన్యవాదాలు. మీ ప్రశ్నలో ఒక రకమైన ఆత్మీయత ఉంది. ఏభైయ్యవ మన్ కీ బాత్ తాలూకూ అతిపెద్ద ఘనత ఏమిటంటే మీరు ఒక ప్రధానమంత్రిని కాకుండా ఒక దగ్గరి మనిషిని ప్రశ్నిస్తున్నట్లు అడగడం. ప్రజాస్వామ్యం అంటే ఇదే. మీ ప్రశ్నకు సులువుగా సమాధానం చెప్పాలంటే – తయారవడమంటూ ఏమీ లేదు. అసలు మన్ కీ బాత్ నాకు చాలా సులువైన పని. ప్రతిసారీ మన్ కీ బాత్ ముందర ప్రజల ఉత్తరాలు వస్తాయి. మై గౌ, నరేంద్ర మోదీ మొబైల్ యాప్ లలో ప్రజలు తమ ఆలోచనలను పంచుకుంటారు. ఒక టోల్ ఫ్రీ నంబరు కూడా ఉంది – 1800117800. ఈ నంబరు కి ఫోన్ చేసిన ప్రజలు తమ సందేశాన్ని తమ గొంతుతో రికార్డ్ చేస్తారు. మన్ కీ బాత్ మొదలయ్యే ముందర ఎక్కువ ఉత్తరాలు, ఎక్కువ వ్యాఖ్యలు స్వయంగా చదవాలని నా ప్రయత్నం. చాలా ఫోన్ కాల్స్ ని నేను స్వయంగా వింటాను.మన్ కీ బాత్ కార్యక్రమం దగ్గర పడేకొద్దీ, నేను ప్రయాణించే సమయాలలో మీరు పంపిన ఆలోచనలనీ, ఇన్పుట్స్ నీ నేను ఎంతో నిశితంగా చదువుతాను.
ప్రతి క్షణం నా దేశ ప్రజలందరూ నా మనసులోనే ఉంటారు.అందుకనేఎవరు రాసిన ఏ ఉత్తరం చదివినా, ఉత్తరం రాసినవారి పరిస్థితులు, వారి భావాలు నా ఆలోచనల్లో భాగం అయిపోతాయి. ఆ ఉత్తరం కేవలం కాయితం ముక్క మాత్రమే కాదు. ఎందుకంటే నేను దాదాపు 40-45ఏళ్ళపాటు ఒక సంచార జీవితాన్ని గడిపాను. దేశంలోని అనేక జిల్లాల్లో సంచరించాను. దేశంలోని మారుమూల జిల్లాల్లో కూడా నేను ఎక్కువ సమయాన్నే గడిపాను. అందువల్ల ఏదైనా ఉత్తరం చదివేప్పుడు ఆ ప్రాంతాన్ని, వాళ్ళా ఉత్తరం రాసిన సందర్భాన్ని సులువుగా నాకు నేను అన్వయించుకోగలను. వాస్తవమైన విషయాలను అంటే వాళ్ల గ్రామం, వ్యక్తి పేరు మొదలైన వివరాలని నోట్ చేసుకుంటాను. మన్ కీ బాత్ లో గొంతు నాదే అయినా, ఉదాహరణలు, భావోద్వేగాలు, ఉత్తేజం నా దేశప్రజలవి. మన్ కీ బాత్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి ఉత్తరాలు, వ్యాఖ్యలు చదవడం కుదరకపోయినా నిరాశ పడకుండా మళ్ళీ మళ్ళీ ఉత్తరాలు,వ్యాఖ్యలు పంపేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. మీ ఆలోచనలు, మీ భావాలు నా జీవితంలో ఎంతో ముఖ్యమైనవి. మీ అందరి కబుర్లు మునుపటి కంటే ఎక్కువగా నాకు అందుతూ ఉంటాయని, వాటి వల్ల మన కీ బాత్ మరింత ఆసక్తికరంగానూ, ప్రభావవంతంగాను, ఉపయోగకరంగానూ మారుతుందని నాకు ఎంతో నమ్మకం ఉంది. మన్ కీ బాత్ లో పాల్గొనలేని ఉత్తరాలను, సూచనలను సంబంధిత విభాగాల దృష్టికి తెచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది. నేను ఆకాశవాణి, ఎఫ్.ఎం.రేడియో, దూరదర్శన్, మిగతా టి.వి ఛానల్స్, సామాజిక మాధ్యమాలలోని నా సహచరులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. వారి శ్రమ వల్లనే మన్ కీ బాత్ ఎక్కువ మంది ప్రజల వద్దకు చేరగలుగుతోంది. ఆకాశవాణి బృందం ప్రతి మన్ కీ బాత్ కార్యక్రమాన్నీ అనేక భాషల్లో ప్రసారణ చేస్తోంది. కొందరైతే ప్రాంతీయ భాషల్లో కూడా ఎంతో చక్కగా మోదీ గొంతుతో దగ్గరగా ఉండే స్వరంతో, అదే స్వరంతో మన్ కీ బాత్ ని వినిపిస్తున్నారు. ఆ రకంగా వారు ఆ ముఫ్ఫై నిమిషాల పాటు నరేంద్ర మోదీ గా మారిపోతున్నారు. వారి ప్రతిభ, నైపుణ్యాలకు గానూ వారందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ధన్యవాదాలు తెలుపుతున్నాను. మీ అందరినీ కూడా మీ మీ భాషల్లో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తప్పకుండా వినవలసిందిగా కోరుతున్నాను. తమ తమ ఛానల్స్ లో మన్ కీ బాత్ తాలూకూ ప్రతి విషయాన్నీ క్రమం తప్పకుండా ప్రసారం చేసే మీడియాలోని నా మిత్రులందరికీ నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఏ రాజకీయవేత్తా కూడా మీడియా పట్ల ఎప్పుడూ సానుకూలంగా ఉండరు. ప్రతివారూ కూడా తమ గురించి తక్కువ కవరేజ్ (వార్తా సేకరణ) జరిగిందని భావిస్తారు, లేదా వాళ్ల గురించి జరిగిన వార్తా సేకరణ వారికి ప్రతికూలంగా ఉందని భావిస్తారు. కానీ మన్ కీ బాత్ లో ప్రాస్తావించిన ఎన్నో విషయాలను మీడియా తన సొంత విషయాలుగా మార్చుకుంది. పరిశుభ్రత, రోడ్డు రక్షణ, drugs free India, selfie with daughter మొదలైన ఎన్నో విషయాలకు నూతన పధ్ధతిలో ఒక ఉద్యమ రూపాన్ని అందించి ముందుకు నడిపే పని చేసింది మీడియా. టి.వి. ఛానల్స్ కూడా దీనిని most watched radio programme గా తయారుచేసారు. నేను మీడియా వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను. మీ సహకారం లేకపోతే నా ఈ మన్ కీ బాత్ ప్రయాణం అసంపూర్ణంగా ఉండేది.
(ఫోన్ కాల్ 3)
నమస్తే మోదీ గారూ, నేను ఉత్తరాఖండ్ లోని మసురీ నుండి నిధి బహుగుణ ని మాట్లాడుతున్నాను. నేను ఇద్దరు యుక్త వయస్కులకు తల్లిని. ఈ వయసులో పిల్లలు సాధారణంగా ఎవరైనా ఏదైనా చెప్తే వినడానికి ఇష్టపడరు. అది వారి తల్లిదండ్రులైనా, అధ్యాపకులైనా సరే. కానీ మీ మన్ కీ బాత్ కార్యక్రమం లో మాత్రం, మీరు పిల్లలతో ఏదైనా చెప్పినప్పుడు వారు దాన్ని అర్థం చేసుకుని, మీరు చెప్పింది పాటిస్తున్నారు కూడా. ఆ రహస్యమేమిటో మీరు మాతో పంచుకోగలరా? పిల్లలు చక్కగా విని, మీరు చెప్పినవి పాటించేలాగ మీరు ఎలా చెప్పగలుగుతున్నారు?వాళ్ల మనసుకి హత్తుకునేలా ఎలా మాట్లాడగలుగుతున్నారో చెప్తారా? ధన్యవాదాలు."
నిధి గారూ, మీ ఫోన్ కాల్ కి గానూ అనేకానేక ధన్యవాదాలు. నిజం చెప్పాలంటే నా దగ్గర ఏ రహస్యమూ లేదు. నేను చేస్తున్నది, చెప్తున్నది అందరి కుటుంబాల్లోనూ జరుగుతున్నదే అయి ఉంటుంది. సులువుగా చెప్పాలంటే నన్ను నేను యువత స్థానంలో ఊహించుకునే ప్రయత్నం చేస్తాను. నన్ను నేను వారి పరిస్థితుల్లో పెట్టుకుని, వాళ్ల ఆలోచనలకీ నా ఆలోచనలకి సామరస్యత తీసుకువచ్చి ఒక wave length match చేసే ప్రయత్నం చేస్తాను. మన సొంత జీవితాలలోని పాత విషయాలు మనకు అడ్డం రాకపోతే, ఎదుటివారు ఎవరైనా కూడా అర్థం చేసుకోవడం సులువైన పనే. అప్పుడప్పుడు మన పక్షపాతధోరణే సంభాషణలకి అన్నింటికన్నా పెద్ద ఆటంకాన్ని కలిగిస్తుంది. ఒప్పుకోవడం, ఒప్పుకోకపోవడం, ప్రతిచర్యలకు బదులుగా ఏదైనా విషయాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం నా మొదటి ప్రాధాన్యత. ఇలా చేస్తే ఎదుటివారు కూడా మనల్ని ఒప్పించడానికి రకరకాల ప్రయత్నాలు చేసి, ఒత్తిడులు తెచ్చే బదులుగా మన wave length లోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇది నేను చాలా అనుభవపూర్వకంగా తెలుసుకున్నది. అందువల్లనే communication gap తగ్గిపోయి ఒకరకంగా ఒకే ఆలోచనకి మేమిద్దరం సహప్రయాణికులం అవుతాము. ఇద్దరిలో ఎవరు ఎప్పుడు తమ ఆలోచనను వదిలి ఎదుటివారి ఆలోచనని ఏకీభవించారో, ఆ ఆలోచనని స్వీకరించారో తెలీదు. నేటి యువత ప్రత్యేకత ఏమిటంటే, వారు నమ్మని విషయాన్ని దేనినీ వాళ్ళు పాటించరు. కానీ వాళ్ళు కనుక ఏ విషయాన్నైనా నమ్మితే, దాని కోసం అన్నింటినీ వదులుకుని పరిగెడతారు. కుటుంబాలలో పెద్దలకూ, పిల్లలకూ మధ్యన ఉండే తరాల అంతరాల గురించి అంతా చెప్తూ ఉంటారు. కానీ చాలా కుటుంబాల్లో యువతతో సంభాషించడం చాలా పరిమితంగా ఉంటుంది. చాలా వరకూ చదువుకు సంబంధించి చర్చిస్తారు. లేదా జీవన విధానం గురించి ’అలా చెయ్యకు, ఇలా చెయ్యకు ’ అని సలహాలు ఇస్తారు. ఏ అపేక్షా లేకుండా జరిపే సంభాషణలు కుటుంబాల్లో నెమ్మది నెమ్మదిగా తక్కువైపోతున్నాయి. ఇది విచారించాల్సిన విషయమే.
ఆశించడానికి బదులు స్వీకరించడం, కొట్టివేయడానికి బదులు చర్చించడం చేస్తే సంభాషణ ప్రభావవంతం అవుతుంది. వివిధ కార్యక్రమాల్లో లేదా సామాజిక మాధ్యమాలలోయువతతో మాట్లాడే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. వాళ్ళు చేసేది, ఆలోచించేది అర్థం చేసుకునే ప్రయత్నం నేను చేస్తూ ఉంటాను. వాళ్ల దగ్గర ఎప్పుడూ కూడా ఆలోచనల రాశి ఉంటుంది. వాళ్ళూ చాలా ఉత్సాహవంతం గా, నూతనంగా, స్పష్టంగానూ ఉంటారు. మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా నేను యువత చేసే ప్రయత్నాలనూ, వాళ్ల మాటలనూ, ఎక్కువగా చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాను. యువత ఎక్కువగా ప్రశ్నిస్తారన్నది ఎప్పుడూ ఉండే ఒక ఫిర్యాదు. యువకులు ప్రశ్నించడమనేది చాలా మంచి సంగతి. ఎందుకంటే వాళ్ళు అన్ని విషయలనూ మూలాల నుండి తెలుసుకోవాలని ఆశిస్తారు. యువతలో ధైర్యం లేదని కొందరు అంటారు. కానీ నష్టపోవడానికి యువత వద్ద సమయం లేదు. చాలామంది యువత ఎక్కువ సృజనాత్మకంగా మారడానికి ఇదే కారణం. ఎందుకంటే వారు పనులను వేగంగా చెయ్యాలని కోరుకుంటారు. నేటి యువత గొప్ప లక్ష్యాలను సాధించాలని, పెద్ద పెద్ద కలలను కంటారని మనకి అనిపిస్తుంది. పెద్ద పెద్ద కలలను కని, గొప్ప గొప్ప విజయాలను సాధిస్తే మంచిదే కదా. ఇదే కదా న్యూ ఇండియా అంటే!
యువత ఒకే సమయంలో చాలా పనులు చేస్తారు అని కొందరు అంటారు. కానీ అందులో తప్పేముంది? వాళ్ళు మల్టీ టాస్కింగ్ లో నిష్ణాతులు.అందుకే అలా చేస్తున్నారు. మనం మన చుట్టుపక్కల గనుక దృష్టిని సారిస్తే, Social Entrepreneurship ఆయినా, స్టార్టప్స్ అయినా, క్రీడలైనా, లేదా మిగతా ఏ రంగం లోనైనా, సమాజంలో పెద్ద మార్పులు తెచ్చేది యువతే కదా. ప్రశ్నించే ధైర్యం చేసి, పెద్ద పెద్ద కలలను కనే సాహసం చేసేది యువతే కదా. యువత ఆలోచనలను మనం నేలపైకి తెచ్చి, వాటిని వ్యక్తీకరించడానికి స్వాతంత్రాన్ని ఇస్తే వారు దేశంలో సానుకూల మార్పులను తేగలరు. వాళ్ళు అలా చేస్తున్నారు కూడా.
నా ప్రియమైన దేశప్రజలారా, గురుగ్రామ్ నుంచి వినీత గారు మై గౌ లో ఏం రాసారంటే, మన్ కీ బాత్ లో రేపు అనగా నవంబర్ 26 న రాబోతున్న రాజ్యాంగ దినోత్సవం గురించి నేను మాట్లాడాల్సిందిగా కోరారు. ఈ రోజు చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే మనం రాజ్యాంగాన్ని ఆమోదించి, ఈ రోజుతో డెభ్భైయవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం అని ఆవిడ అన్నారు.
వినీత గారూ మీ సూచనకు అనేకానేక ధన్యవాదాలు.
అవును. రేపు రాజ్యాంగ దినోత్సవం. మన రాజ్యాంగాన్ని తయారుచేసిన గొప్పవారందరినీ తలుచుకునే రోజు రేపు. నవంబర్ 26 ,1949లో మనం రాజ్యాంగాన్ని స్వీకరించాం. రాజ్యాంగాన్ని డ్రాఫ్ట్ చెయ్యడమనే చారిత్రాత్మక కార్యక్రమాన్ని చెయ్యడానికి, రాజ్యాంగ సభకి రెండు సంవత్సరాల, పదకొండు నెలల, పదిహేడురోజులు పట్టింది. మూడేళ్ల లోపే మనకి ఈ మహామహులందరూ మనకు ఇంతటి వ్యాపకమైన,విస్తృతమైన రాజ్యాంగాన్ని అందించారు. ఒక అసాధారణ వేగంతో వీరంతా రాజ్యాంగాన్ని నిర్మించిన తీరు ఇవాళ్టికి కూడా టైమ్ మేనేజ్మెంట్ కూ, ప్రొడక్టివిటీ కీ ఒక ఉదాహరణ. ఇది మనకి కూడా మన బాధ్యతలను రికార్డు సమయంలో పూర్తి చేసేందుకు ప్రేరణను ఇస్తుంది. దేశం లోని గొప్ప గొప్ప ప్రతిభావంతుల సంగమమే ఈ రాజ్యాంగ సభ. దేశంలోని ప్రజలు సాధికారకంగా ఉండాలని, నిరుపేద వ్యక్తి కూడా సామర్థ్యాన్ని కలిగి ఉండేలాంటి ఒక రాజ్యాంగాన్ని అందించాలని వాళ్ళలో ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేసారు.
హక్కులూ, బాధ్యతల గురించి మన రాజ్యాంగంలో విస్తారంగా వర్ణించారు. అదే మన రాజ్యాంగంలోని ప్రత్యేకత. దేశపౌరుల జీవితాలలో ఈ రెండింటి సమన్వయం దేశాన్ని ముందుకు తీసుకువెళ్తుంది. ఎదుటివారి అధికారాలను మనం గౌరవిస్తే, మన హక్కులకు రక్షణ దానంతట అదే ఏర్పడుతుంది. ఇలానే రాజ్యాంగంలో ఉన్న మన బాధ్యతలను పాటిస్తే, మన హక్కులకి రక్షణ దానంతట అదే ఏర్పడుతుంది. నాకింకా గుర్తే, 2010లో భారతదేశ రాజ్యాంగానికి 60ఏళ్ళు పూర్తయినప్పుడు, గుజరాత్ లో మేము రాజ్యాంగ పుస్తకాన్ని ఏనుగుపై ఊరేగించాం. యువతలో రాజ్యాంగం పట్ల అప్రమత్తత పెంచడానికి, వారికి రాజ్యాంగంలోని అంశాలను పరిచయం చెయ్యడానికి చేసిన ఒక గుర్తుండిపోయే ప్రయత్నం అది. 2020వ సంవత్సరంలో ఒక గణతంత్ర రూపంలో మనం డెభ్భై ఏళ్ళు పూర్తి చేసుకుంటాం. 2022లో మనకి స్వాతంత్రం వచ్చి డెభ్భై ఐదేళ్ళు పూర్తిచేసుకుంటాము.
రండి , మనందరమూ మన రాజ్యాంగ విలువలను ముందుకు నడిపిద్దాం. దేశంలో Peace, Progression, Prosperity , అనగా దేశంలో శాంతి, ఉన్నతి, సమృధ్ధి లను నునిశ్చితం చేద్దాం.
నా ప్రియమైన దేశప్రజలారా, రాజ్యాంగ సభ గురించి మట్లాడుతుంటే, రాజ్యాంగ సభ కు కేంద్రంగా నిలిచిన ఆ మూలపురుషుడైన మహానుభావుడి తోడ్పాటు మరువలేనిది. ఆయనే పూజ్యులైన బాబాసాహెబ్ అంబేద్కర్. డిసెంబర్ 6న ఆయన వర్ధంతి. కోట్ల భారతీయులకు గౌరవంగా బ్రతికే అధికారాన్ని ఇచ్చిన బాబాసాహెబ్ గారికి దేశప్రజలందరి తరఫునా నమస్కరిస్తున్నాను. ప్రజాస్వామ్యం బాబాసాహెబ్ నరనరాల్లో ఉంది. భారతదేశ ప్రజాస్వామ్య విలువలు బయట నుంచి రాలేదు అనేవారు. గణతంత్రం అంటే ఏమిటి? సభావ్యవస్థ అంటే ఏమిటీ? ఇది భారతదేశానికి ఏమీ కొత్త విషయం కాదు. రాజ్యాంగ సభలో ఆయన ఒక భావపూరితమైన అభ్యర్థన ని చేసారు. ఎంతో పోరాటం చేస్తే లభించిన ఈ స్వాతంత్రాన్ని మనం మన చివరి రక్తపు బొట్టు వరకూ కాపాడాలి. మన భారతీయులు వేరు వేరు నేపధ్యాల నుండి వచ్చినవారైనా, దేశహితాన్ని అన్నింటికన్న ముందు ఉంచాలని ఆయన అనేవారు.”ఇండియా ఫస్ట్ ’ – ఇదే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మూల మంత్రం . మరోసారి పూజ్యులైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి వినమ్ర శ్రధ్ధాంజలి.
నా ప్రియమైన దేశప్రజలారా, రెండు రోజుల ముందర, నవంబర్ 23న మనందరమూ శ్రీ గురునానక్ దేవ్ గారి జయంతిని జరుపుకున్నాము. మళ్ళీ సంవత్సరం, అంటే 2019లో మనం వారి 550వ జయంతి ఉత్సవాన్ని జరుపుకోబోతున్నాం. గురునానక్ దేవ్ గారు ఎల్లప్పుడూ ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడ్డారు. సమాజానికి ఆయన ఎప్పుడూ సత్యం, కర్మ, సేవ, కరుణ, ఆత్మీయతల మార్గాన్ని చూపెట్టారు. వచ్చే సంవత్సరంలో గురునానక్ దేవ్ గారి 550వ జయంతి ఉత్సవాన్ని దేశం గొప్పగా జరుపుకుంటుంది. ఈ ఉత్సవాల ఆనందం దేశంలోనే కాక ప్రపంచం యావత్తు వ్యాపిస్తుంది. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ, కేంద్ర పాలిత ప్రభుత్వాలను ఈ ఉత్సవాన్ని ఘనంగా జరుపుకోవాల్సిందిగా కోరడం జరిగింది. ఈ రకంగా గురునానక్ గారి 550వ జయంతి ఉత్సవాలు ప్రపంచ దేశాలన్నింటిలోనూ జరుపుకుంటారు. దీనితో పాటుగా గురునానక్ గారితో సంబంధం ఉన్న అన్ని పవిత్ర ప్రదేశాల మార్గాలనూ కలుపుతూ ఒక ప్రత్యేక రైలు కూడా నడపబడుతుంది. దీనికి సంబంధించిన ఒక సమావేశం లో నేను పాల్గొన్నప్పుడు నాకు లఖ్ పత్ సాహిబ్ గురుద్వారా గుర్తుకు వచ్చింది. 2001లో వచ్చిన గుజరాత్ భూకంపం వల్ల ఆ గురుద్వారాకు కూడా భారీగా దెబ్బతింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక ప్రజలతో కలిసి ఆ గురుద్వారాను తిరిగి పునరుధ్ధరించిన తీరు ఇవాళ్టికీ ఒక ఉదాహరణగా నిలుస్తుంది. కర్తార్ పూర్ కారిడార్ ను నిర్మించాలనే ఒక పెద్ద నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తీసుకుంది. అందువల్ల పాకిస్తాన్ లోని కర్తార్ పూర్ లో ఉన్న గురునానక్ గారి పవిత్ర స్థలాన్ని మన దేశ యాత్రికులు సులువుగా దర్శించుకోవచ్చు.
నా ప్రియమైన దేశప్రజలారా, ఏభైయ్యవ మన్ కీ బాత్ తరువాత మనం మళ్ళీ మరోసారి రాబోయే మన్ కీ బాత్ లో కలుద్దాం. ఇవాళ ఈ కార్యక్రమం వెనుక ఉన్న నా భావాలను మీతో పంచుకునే అవకాశం మొదటిసారి లభించింది. మీరు ఇలానే ప్రశ్నలు అడుగుతూ ఉండండి. మన ప్రయాణం సాగుతూ ఉంటుంది. మీ సహకారం ఎంత ఎక్కువగా లభిస్తే, మన ప్రయాణం అంత గాఢంగా సాగి, ప్రతి ఒక్కరికీ సంతోషాన్ని పంచుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమం వల్ల నాకేమి లభించింది అని అప్పుడప్పుడు కొందరి మనసుల్లో ప్రశ్న వస్తుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి వచ్చే ఫీడ్ బ్యాక్ లలో ముఖ్యంగా నా మనసుని తాకే విషయమేమిటో నేనివాళ చెప్పదలుచుకున్నాను. తమ కుటుంబాలతో కూర్చుని మన్ కీ బాత్ కార్యక్రమం వింటుంటే, మా కుటుంబాలలోని పెద్దే మా మధ్యన కూర్చుని ,మా విషయాలు మాతో ముచ్చటిస్తున్నట్లు మాకు అనిపిస్తుంది అని ఎక్కువమంది ప్రజలు చెప్పారు. ఈ మాటని నేను విస్తృతంగా విన్నప్పుడు, నాకు చాలా ఆనందం కలిగింది. నేను మీ వాడిని, మీతో కలిసి ఉన్నవాడిని, మీ మధ్య ఉన్నవాడిని, మీరే నన్ను ఇంటిపెద్దను చేసారు. ఇదేవిధంగా నేను కూడా మీ కుటుంబసభ్యుడిగా మన్ కీ బాత్ మాధ్యమంగా వస్తూనే ఉంటాను. మీతో కలిసిపోతూ ఉంటాను. మీ సుఖదు:ఖాలే నా సుఖదు:ఖాలు. మీ ఆకాంక్షలే నా ఆకాంక్షలు. మీ ఆశయాలే నా ఆశయాలు.
రండి, ఈ ప్రయాణాన్ని ఇంకా ముందుకు సాగిద్దాం.
అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా, అందరికీ నమస్కారం! అక్టోబర్ 31వ తేదీన మనందరికీ ప్రియమైన సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జయంతి. ప్రతి సంవత్సరంలో లాగనే ఆ రోజున కూడా ఐక్యత కోసం నిర్వహించే పరుగు 'Run for Unity' లో పాలుపంచుకోవడానికి దేశ యువత తయారుగా ఉన్నారు. ఇప్పుడు వాతావరణం కూడా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి వాతావరణం 'Run for Unity' పరుగులో పాలుపంచుకునేవారి ఉత్సాహాన్ని కూడా పెంచుతుంది. మీ అందరూ కూడా ఐక్యత కోసం జరిగే ఈ పరుగు – 'Run for Unity' లో చాలా పెద్ద సంఖ్యలో పాల్గోవాలని అభ్యర్థిస్తున్నాను. స్వాతంత్ర్యం రావడానికి ఆరున్నర నెలల ముందు, 1947 జనవరి 27న ప్రపంచ ప్రసిధ్ధిగాంచిన అంతర్జాతీయ పత్రిక "టైమ్ మ్యాగజైన్" ఒక సంస్కరణ ను ప్రచురించింది. పత్రిక కవర్ పేజీ మీద సర్దార్ పటేల్ గారి చిత్రాన్ని వేశారు. తమ లీడ్ స్టోరీలో ఆ పత్రిక ఒక భారతదేశ పటాన్ని ఇచ్చింది. కానీ అది ఇవాళ మనం చూస్తున్న భారతదేశ పటం లాంటిది కాదు. చాలా భాగాలుగా విభజితమైపోయిన భారతదేశ పటం అది. అప్పట్లో దేశంలో దాదాపు 550 దేశీయ సంస్థానాలు ఉండేవి. భారతదేశం పట్ల ఆంగ్లేయుల ఆసక్తి తగ్గిపోయింది కానీ వాళ్ళు భారతదేశాన్ని ముక్కలు ముక్కలుగా చేసి వెళ్ళీ పోవాలనుకున్నారు. "ఆ సమయంలో భారతదేశానికి విభజన, హింస, ఆహార పదార్థాల కొరత, ధరల పెరుగుదల, అధికారం కొరకై జరిగే రాజకీయాలు.. మొదలైన ప్రమాదాలు పొంచి ఉన్నాయి " అని టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. వీటన్నింటి మధ్యా దేశాన్ని ఐక్యంగా ఉంచి, గాయాలను మాన్పే సామర్థ్యం ఎవరికైనా ఉందీ అంటే అది కేవలం వల్లభ్ భాయ్ పటేల్ కు మాత్రమే ఉంది అని ఆ పత్రిక రాసింది. టైమ్ మ్యాగజైన్ తన వ్యాసంలో ఉక్కు మనిషి జీవితంలోని ఇతర అంశాలను కూడా బహిర్గతం చేసింది. 1920లో అహ్మదాబాద్ లో వచ్చిన వరదల్లో ఆయన ఎలా సహాయ కార్యక్రమాల ఏర్పాటు చేసారు, ఎలా బార్దోలీ సత్యాగ్రహానికి మార్గదర్శకత్వం వహించారో తెలిపింది. దేశం పట్ల ఆయనకు గల నిజాయితీ, నిబధ్ధత ఎటువంటివంటే రైతులు, కూలీవారు మొదలుకొని ఉద్యోగస్తుల వరకూ అందరికీ ఆయనపై నమ్మకం ఉండేది. "రాష్ట్రాల మధ్య సమస్యలు బాగా పెరిగిపోయాయి. వీటిని కేవలం మీరు మాత్రమే పరిష్కరించగలరు" అని గాంధీగారు కూడా ఆయనతో అన్నారుట. సర్దార్ పటేల్ గారు ఒక్కొక్క సమస్యనూ పరిష్కరించి, దేశాన్ని సమైక్యంగా చేసే అసంభవమైన పనిని పూర్తిచేసి చూపెట్టారు.
విడి విడిగా ఉన్న జూనా గఢ్, హైదరాబాద్, ట్రావెన్కూర్, రాజస్థాన్ లోని సంస్థానాలు.. మొదలైన అన్ని రాజ సంస్థానాలనూ దేశంలో విలీనం చేశారు. ఇవాళ మనం భారతదేశ పటాన్ని ఇలా సమైక్యంగా చూడకలుగుతున్నాము అంటే అది సర్దార్ పటేల్ గారి తెలివి, రాజనీతిజ్ఞత వల్లనే. ఐక్యతా సూత్రంతో బంధించబడిన ఈ భారతదేశాన్నీ, మన భరతమాతను చూసుకుని మనం స్వాభావికంగానే సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారిని చక్కగా స్మరించుకుంటాం. ఈ అక్టోబర్ 31వ తేదీన మనం జరుపుకోబోతున్న సర్దార్ పటేల్ గారి జయంతి ఎంతో ప్రత్యేకమైనది. ఆ రోజున సర్దార్ పటేల్ గారికి నిజమైన శ్రధ్ధాంజలిని అందిస్తూ Statue of Unity ని దేశానికి అంకితం చెయ్యబోతున్నాం మనం .గుజరాత్ లో నర్మదా నదిపై స్థాపించిన ఈ విగ్రహం ఎత్తు అమెరికా లోని statue of liberty కి రెండింతలు ఉంటుంది. ఇది ప్రపంచంలోకెల్లా అంబరాన్నంటే అతి పెద్ద విగ్రహం. ప్రపంచంలోకెల్లా అతి పెద్ద ఎత్తైన ప్రతిమ మన దేశంలో ఉంది అని ప్రతి భారతీయుడూ ఇప్పుడు గర్వపడతాడు. ఇప్పటిదాకా భూమితో ముడిపడిఉన్న సర్దార్ పటేల్ గారు ఇప్పుడు ఆకాశపు శోభను కూడా పెంచుతారు. ప్రతి భారతీయుడూ కూడా ఈ గొప్ప విజయాన్ని చూసుకుని ప్రపంచం ముందర గర్వంగా నిలబడి, తల ఎత్తుకుని నిలబడి మన గొప్పదనాన్ని కీర్తిద్దాం. ప్రతి భారతీయుడికీ ఈ విగ్రహాన్ని చూడాలనిపించడం స్వాభావికమే. భారతదేశంలో ప్రతి మారుమూల ప్రాంతంలోని ప్రజలు ఈ ప్రతిమ ఉన్న ప్రదేశాన్ని అత్యంత ప్రియమైన సందర్శనా స్థలంగా భావిస్తారని నా నమ్మకం.
నా ప్రియమైన సోదర సోదరీమణులారా, నిన్ననే మన దేశవాసులందరమూ 'infantry day' జరుపుకున్నాం. భారతీయ సైన్యంలో భాగమైన వారందరికీ నేను నమస్కరిస్తున్నాను. నేను మన సైనికుల కుటుంబాలకు కూడా వారి సాహసానికి గానూ సెల్యూట్ చేస్తున్నాను. కానీ మన దేశవాసులందరూ ఈ 'infantry day' ని ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా? ఇదే రోజున మన భారతీయ సైనికులు కాశ్మీరు గడ్డపై అడుగుపెట్టిన చొరబాటుదారుల నుండి కాశ్మీరులోయను రక్షించారు. ఈ చారిత్రాత్మక సంఘటనకు కూడా సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ తో నేరుగా సంబంధం ఉంది. Sam manekshaw అనే ఒక గొప్ప భారతదేశ సైన్యాధికారి తాలూకూ పాత ఇంటర్వ్యూ (సంభాషణ)ని నేనొకసారి చదివాను. ఆ సంభాషణలో ఫీల్డ్ మార్షల్ Sam manekshaw , తాను కల్నల్ గా ఉన్నప్పటి రోజుల్ని జ్ఞాపకం చేసుకున్నారు. ఆ సమయంలో 1947 అక్టోబర్ లో కాశ్మీరులో సైనిక పోరాటాలు మొదలయ్యాయి. కాశ్మీరుకు సైన్యాన్ని పంపించడం ఆలస్యం అవుతోందని ఒకానొక సమావేశంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ కోపగించుకోవడాన్ని ఫీల్డ్ మార్షల్ Sam manekshaw జ్ఞాపకం చేసుకున్నారు. ఆ సమావేశంలో సర్దార్ పటేల్ తనదైన ప్రత్యేక రీతిలో తన వంక చూసి కాశ్మీరులోని సైనిక పోరాటానికి కాస్త కూడా ఆలస్యమవడానికి వీల్లేదు. వీలయినంత త్వరగా దానికి పరిష్కారం ఆలోచించాలి అన్నారు. ఆ తర్వాత మన సైన్యం జవానులు విమానయానం ద్వారా కాశ్మీరు చేరుకున్నారు. అప్పుడు ఏ విధంగా మనకు విజయం లభించిందో మనకు తెలిసిన విషయమే. అక్టోబర్ 31న మన మాజీ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారి వర్ధంతి కూడా. ఇందిరగారికి కూడా గౌరవపూర్వక శ్రధ్దాంజలి.
నా ప్రియమైన దేశప్రజలారా, ఆటలంటే ఎవరికి ఇష్టం ఉండవు? క్రీడాప్రపంచంలో స్ఫూర్తి, బలం, నైపుణ్యం, సామర్థ్యం -ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవి. ఇవి ఒక క్రీడాకారుడి సాఫల్యానికి గీటురాళ్లు. ఈ నాలుగు గుణాలూ ఏ దేశ నిర్మాణానికైనా ఎంతో ముఖ్యమైనవి. ఏ దేశపు యువతలో ఈ గుణాలన్నీ ఉంటాయో, ఆ దేశం కేవలం ఆర్ధిక, విజ్ఞాన, సాంకేతిక రంగాల్లో అభివృధ్ధిని సాధించడమే కాకుండా క్రీడారంగంలో కూడా తన విజయపతాకాన్ని ఎగురవేస్తుంది. ఇటీవలే నాకు రెండు మరపురాని సమావేశాలు జరిగాయి. మొదటిది జకార్తాలో జరిగిన Asian para Games2018లో మన para athlets ను కలిసే అవకాశం లభించింది. ఈ క్రీడల్లో భారతదేశం మొత్తం 72 పతకాలను సాధించి రికార్డు ని సృష్టించిన మన para athlets భారతదేశ గౌరవాన్ని పెంచారు. ఈ ప్రతిభావంతులైన para athlets ను స్వయంగా కలిసే అదృష్టం లభించింది. వారందరికీ నేను అభినందనలు తెలిపాను. వారందరి ధృఢమైన సంకల్పబలం, ప్రతి ఆటంకాన్ని ఎదుర్కొని, పోరాడి, ముందుకు నడవాలనే వారి పట్టుదల, మన దేశప్రజలందరికీ ప్రేరణాత్మకం. ఇలానే, అర్జెంటీనా లో జరిగిన summer youth olympics 2018 విజేతలను కలిసే అవకాశం లభించింది. youth olympics 2018 లో మన యువత ఇదివరకటి కన్నా మిన్నగా తమ ప్రతిభను ప్రదర్శించారని తెలుసుకుని మీరు సంతోషిస్తారు. ఈ పోటీల్లో మన దేశం పదమూడు పతకాలతో పాటూ మిక్స్ ఈవెంట్ లో అదనంగా మరో మూడు పతకాలను గెలుచుకుంది. ఈసారి ఆసియాక్రీడల్లో కూడా మన దేశం తన ప్రతిభను చాటుకున్న సంగతి మీ అందరికీ గుర్తుండే ఉంటుంది. కొద్ది నిమిషాల్లో నేను ఎన్నిసార్లు ఇదివరకటి కన్నాఎక్కువగా, ఇదివరకటి కంటే గొప్పగా, లాంటి పదాలను ఉపయోగించానో చూడండి. ఇది నేటి భారతీయ క్రీడారంగం కథ. ఇది రోజురోజుకీ కొత్త శిఖరాలను చేరుకుంటోంది. భారతదేశం కేవలం క్రీడారంగం లోనే కాదు, మనం ఎప్పుడూ ఊహించని రంగాల్లో కూడా భారతదేశం కొత్త రికార్డులను నెలకొల్పుతోంది. ఉదాహరణకి, నేను మీకు para athlet నారాయణ్ ఠాకూర్ గురించి చెప్తాను. Asian para Games2018లో అథ్లెటిక్స్ లో ఈయన బంగారుపతకాన్ని సాధించారు. నారాయణ్ జన్మత: దివ్యాంగుడు. ఎనిమిదేళ్ల వయసులో తండ్రిని కోల్పోయిన ఇతడు, మరో ఎనిమిదేళ్ల పాటు అనాథశరణాలయంలో గడిపాడు. అనాథశరణాలయం నుండి బయటకు వచ్చాకా జీవితాన్ని గడుపుకోవడానికి అతడు DTC బస్సులను శుభ్రపరచడం, ఢిల్లీ లోని రోడ్ల పక్కన ఉండే ధాబాల్లో వెయిటర్ లాంటి పనులను చేశాడు. అదే నారాయణ్ ఇవాళ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని, భారతదేశానికి బంగారు పతకాలు గెలుచుకొస్తున్నాడు. ఇంతే కాదు, భారతదేశ క్రీడల్లో పెరుగుతున్న సామర్ధ్యాన్ని చూడండి. భారతదేశం ఎప్పుడూ జూడో లో, సీనియర్ లెవెల్ లోనూ, జూనియర్ లెవెల్ రెండింటిలోనూ ఏ ఒలెంపిక్ పతకాలనూ సాధించలేదు. కానీ యూత్ ఒలెంపిక్స్ లో తబాబీ దేవి వెండి పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. పదహారేళ్ళ యువ క్రీడాకారిణి తబాబి దేవి మణిపూర్ లోని ఒక గ్రామంలో నివసిస్తూంటారు. తండ్రి కూలిపనికి వెళ్తే, తల్లి చేపలు అమ్మేది. చాలాసార్లు వారి ఇంట్లో భోజనానికి కూడా డబ్బులు ఉండేవి కాదు. ఇటువంటి పరిస్థితులలో కూడా తబాబి దేవి ధైర్యం ఏ మాత్రం తగ్గలేదు. దేశం కోసం మెడల్ సంపాదించి చరిత్రను సృష్టించింది.ఇటువంటివే లఖ్ఖలేనన్ని కథలు. ప్రతి జీవితమూ స్ఫూర్తిదాయకమైనదే. ప్రతి యువక్రీడాకారుడూ, అతడి స్ఫూర్తి – న్యూ ఇండియాకి గుర్తింపు.
నా ప్రియమైన దేశప్రజలారా, మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మనం 2017లో FIFA Under17 world cup ప్రారంభోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాం. అత్యంత సఫలవంతమైన టోర్నమెంట్ గా దాన్ని యావత్ ప్రపంచం మెచ్చుకుంది. FIFA Under17 world cup లో ప్రేక్షకుల సంఖ్య విషయంలో కూడా ఒక కొత్త ఒరవడిని మనం సృష్టించాం. దేశంలోని వేరు వేరు ప్రాంతాల్లోని స్టేడియంల నుండి పన్నెండు లక్షల కంటే ఎక్కువమంది ప్రేక్షకులు ఆ ఫుట్ బాల్ పోటీలను చూసి ఆనందించి, యువ క్రీడాకారులను ప్రోత్సహించారు. ఈ సంవత్సరం భారతదేశానికి పురుషుల హాకీ ప్రపంచ కప్ 2018 ని భువనేశ్వర్ లో నిర్వహించే అదృష్టం లభించింది. హాకీ ప్రపంచ కప్ నవంబర్ 28 నుండీ ప్రారంభమై డిసెంబర్ 16 వరకూ నడుస్తుంది. ఏ రకమైన ఆట ఆడే భారతీయుడికైనా లేదా ఏదో ఒక ఆటపై ఆసక్తి ఉన్న భారతీయుడికైనా హాకీ అంటే ఆసక్తి తప్పకుండా ఉంటుంది. హాకీ ఆటలో భారతదేశానికి ఒక సువర్ణచరిత్ర ఉంది. గతంలో భారతదేశం ఎన్నో హాకీ పోటీల్లో స్వర్ణ పతకాలు గెలుచుకుంది. ఒకసారైతే భారతదేశం ప్రపంచ కప్ ని కూడా సాధించింది. హాకీ ఆటకు ఎందరో గొప్ప ఆటగాళ్ళను భారతదేశం అందించింది. ప్రపంచంలో ఎక్కడ హాకీ ప్రస్తావన వచ్చినా, మన భారతదేశానికి చెందిన గొప్ప గొప్ప హాకీ క్రీడాకారులను తలవకుండా ఆ కథ పూర్తవ్వదు. హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యానచంద్ గురించి యావత్ ప్రపంచానికీ తెలుసు. ఆ తరువాత బల్వీందర్ సింగ్ సీనియర్, లెస్లీ క్లాడియస్ (Leslie Claudius), మొహమ్మద్ షాహిద్, ఉద్దమ్ సింగ్ నుండి ధన్‌రాజ్ పిళ్ళై వరకూ హాకీ ఆట చాలా పెద్ద ప్రయాణాన్నే నిర్ణయం చేసింది. ఇవాళ్టికీ మన టీమ్ ఇండియా ఆటగాళ్ళు తమ పరిశ్రమతో, పట్టుదలతో సాధిస్తున్న విజయాలతో కొత్త తరాల హాకీ ఆటగాళ్ళకు ప్రేరణను అందిస్తున్నారు. ఉద్వేగభరితమైన పోటీలను చూడటం క్రీడాప్రేమికులకు ఒక మంచి అవకాశం. మీరంతా భువనేశ్వర్ వెళ్ళి హాకీ మ్యాచ్ లను చూసి, మన క్రీడాకారులను ఉత్సాహపరచండి . ఇతర జట్టు లను కూడా ప్రోత్సహించండి. తనకంటూ ఒక గౌరవపూర్వకమైన చరిత్ర ఉన్న రాష్ట్రం ఒరిస్సా. ఒరిస్సాకు ఒక సంపన్నమైన, సాంస్కృతిక వారసత్వం ఉంది. అక్కడి మనుషులు కూడా చాలా స్నేహపూర్వకమైనవారు. క్రీడాప్రేమికులకి ఒరిస్సాని సందర్శించే ఒక మంచి అవకాశం లభిస్తుంది. ఈ రకంగా మీరు ఆటలను చూసి ఆనందించడంతో పాటుగా కోణార్క్ లోని సూర్య దేవాలయం, పూరీ లోని జగన్నాథ మందిరం, చిలకా సరస్సు మొదలైన విశ్వవిఖ్యాత ప్రదేశాలనూ, పవిత్ర స్థలాలనూ సందర్శించవచ్చు. ఈ పోటీలకు గానూ నేను మన భారతీయ పురుష హాకీ జట్టుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. 125 కోట్ల భారతదేశ ప్రజలందరూ వారి వెంట ఉన్నారని, వారిని ప్రోత్సహిస్తూ ఉంటారని జట్టుకు నేను నమ్మకంగా చెప్తున్నాను. అలానే భారతదేశం రాబోతున్న హాకీ జట్టులన్నింటికీ నేను అనేకానేక శుభాకంక్షలు తెలియచేస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, సామాజిక కార్యక్రమాలు నిర్వహించడానికి చాలామంది ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. వారందరూ కూడా దేశప్రజలందరికీ ప్రేరణాత్మకంగా నిలుస్తారు. వారు ప్రజలలో ఉత్సాహాన్ని నింపుతారు. అసలు సేవా పరమో ధర్మ: అనేది మన భారతీయ వారసత్వం. వేల శతబ్దాల నుండీ వచ్చిన మన సంప్రదాయం. సమాజంలో ప్రతి చోటా, ప్రతి రంగంలోనూ ఈ వారసత్వ పరిమళాన్ని మనం ఇవాళ్టికీ చూడగలం. కానీ ఈ నవీన యుగంలో, కొత్త తరాలవాళ్ళు ఈ వారసత్వాన్ని నూతనంగా కొత్త ఉత్సాహంతో, కొత్త ఆశలతో, కొత్త కలలతో ఈ పనులను చెయ్యడానికి ముందుకు వస్తున్నారు. ఒక పోర్టల్ ని లాంచ్ చేసే కార్యక్రమానికి కొద్దిరోజుల క్రితం నేను వెళ్లాను. దాని పేరు 'self 4 society'. Mygov, ఇంకా దేశంలోని IT , electronic industry వారు తమ ఉద్యోగస్తులను సామాజిక కార్యక్రమాలు చేపట్టేలా మోటివేట్ చెయ్యడానికీ, అందుకు సరైన అవకాశాలను వారికి అందించడానికీ ఈ portal ని launch చేశారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి వారంతా చూపెట్టిన ఉత్సాహం, శ్రధ్ధ లను చూస్తే భారతీయులందరూ గర్వపడతారు. IT నుండి సమాజం వరకూ , నేను కాదు మనం, అహం కాదు వయం, స్వ నుండి సమిష్టి దాకా నడిచే ప్రయాణం ఇందులో ఉంది. కొందరు పిల్లలను చదివిస్తుంటే, కొందరు పెద్దలను చదివిస్తున్నారు.కొందరు పరిశుభ్రతపై దృష్టి పెడితే, కొందరు రైతులకు సహాయం చేస్తున్నారు. వీటన్నింటి వెనుకా ఏ స్వలాభమూ లేదు. కేవలం సమర్పణా భావం, సంకల్పం మాత్రమే ఉన్న నిస్వార్థభావం మాత్రమే ఉంది. ఒక యువకుడు దివ్యాంగుల wheelchair basketball జట్టుకు సహాయపడడానికి స్వయంగా wheelchair basketball నేర్చుకున్నాడు. mission mode activity అంటే ఈ ఆసక్తి , ఈ సమర్పణా భావమే . ఇవన్నీ తెలిసిన ఏ భారతీయుడు గర్వపడకుండా ఉంటాడు? తప్పకుండా గర్వపడతాడు. ’నేను కాదు మనం’ అనే భావన మనందరికీ ప్రేరణను అందిస్తుంది.
నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఈసారి నేను ’మన్ కీ బాత్ ’ కోసం మీ అందరి సూచనలనూ చూస్తూంటే, పాండిచ్చెరీ నుండి శ్రీ మనీష మహాపాత్ర రాసిన ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య కనపడింది. ఆయన మై గౌ లో ఏమని రాసారంటే, "భారతీయ గిరిజన సంప్రదాయాలు, ఆచారాలూ, ప్రకృతితో పాటు సహజీవనానికి ఎంత గొప్ప ఉదాహరణలో మీరు మన్ కీ బాత్ కార్యక్రమంలో చెప్పండి" అని రాశారు. sustainable development కోసం అనేక సంప్రదాయాలను మనం అనుసరించాల్సిన అవసరం ఉంది. వాటి నుండి నేర్చుకోవాల్సినది చాలా ఉంది. మనీష్ గారూ, ఇటువంటి విషయాన్ని మన్ కీ బాత్ శ్రోతల ముందు ప్రస్తావించినందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. మన గౌరవపూర్వకమైన సంస్కృతిని, గతాన్ని తిరిగి చూసుకోవడానికి మనల్ని ప్రేరేపించే మంచి అవకాశం ఈ విషయం. ఇవాళ యావత్ ప్రపంచం, ముఖ్యంగా పశ్చిమ దేశాలు పర్యావరణను రక్షించడానికి చర్చలు జరుపుతున్నారు. సమతుల జీవన విధానం కోసం మార్గాలు అన్వేషిస్తున్నారు. మన భారతదేశం కూడా ఈ సమస్యను ఎదుర్కుంటోంది. దీని పరిష్కారం కోసం మాత్రం మనలోకి మనం ఒకసారి తొంగిచూసుకోవాలి అంతే. మన చరిత్రను, సంప్రదయాలను ఒకసారి తిరిగి చూడాలి. ముఖ్యంగా మన ఆదివాసీల జీవన శైలిని తెలుసుకోవాలి. ప్రకృతితో సామరస్యంగా ఉండటం అనేది మన ఆదివాసీల సంస్కృతిలో ఉంది. మన ఆదివాసీ సోదర సోదరీమణులు చెట్లను,మొక్కలను, పళ్లను దేవతామూర్తులుగా భావించి పూజిస్తారు. మధ్య భారత దేశంలో ముఖ్యంగా మధ్య ప్రదేశ్, చత్తీస్ గఢ్ ప్రాంతంలో నివసించే భీల్ తెగకు చెందిన ఆదివాసులు రావి, అర్జున వృక్షాలను శ్రధ్ధగా పూజిస్తారు. రాజస్థాన్ లాంటి ఎడారి ప్రాంతంలో విష్ణోయీ సమాజం వారు పర్యావరణ సంరక్షణ ఎలా చేయాలి అనే మార్గాన్ని మనకు చూపెట్టారు. ముఖ్యంగా వృక్షాలను సంరక్షించే విషయంలో వారు తమ జీవితాలను సైతం త్యాగం చెయ్యడానికి సిధ్దపడతారు కానీ ఒక్క చెట్టుకి కూడా నష్టం జరగనివ్వరు. అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన మిష్మీ తెగ వారు , పులులతో సంబంధం ఉందని నమ్ముతారు. పులులను తమ తోడపుట్టినవారిగా వాళ్ళు భావిస్తారు. నాగాలాండ్ లో కూడా పులులను అడవులను రక్షించే రక్షకులుగా పరిగణిస్తారు. మహారాష్ట్ర లో వర్లీ వర్గానికి చెందిన ప్రజలు పులిని అతిధిగా భావిస్తారు. వారికి పులుల సన్నిధి శ్రేయోదాయకం. మధ్య భారతదేశంలోని కోల్ తెగ వారు తమ అదృష్టం పులులతో ముడిపడి ఉందని నమ్ముతారు. పులికి గనుక ఆపూట ఆహారం దొరకకపోతే తాము కూడా ఆ పూట పస్తు ఉంటారు. ఇది వారి ఆచారం. మధ్య భారతదేశంలోని గోండ్ తెగవారు బ్రీడింగ్ సీజన్ లో కేథన్ నదిలోని కొన్ని ప్రాంతాల్లో చేపలు పట్టడం ఆపేస్తారు. ఆ ప్రాంతాల్లో చేపలు ఎక్కువగా ఉంటాయిట. ఇదే ఆచారాన్ని పాటిస్తూంటేనే వారికి ఆరోగ్యకరమైన, కావాల్సినన్ని మంచి చేపలు దొరుకుతాయి. ఆదివాసులు తమ ఇళ్ళను సహజపదార్థాలతో నిర్మించుకుంటారు. ఇవి ధృఢంగా ఉండడంతో పాటుగా ప్రర్యావరణకు కూడా మేలు చేస్తాయి. దక్షిణ భారతదేశంలో నీలగిరి పీఠభూమిలోని ఏకాంత ప్రాంతాల్లో నివశించే ధూమంతు అనే ఒక చిన్న తెగ తమ బస్తీలని సంప్రదాయకంగా స్థానీయంగా దొరికే చిన్న చిన్న వస్తువులతోనే తయారుచేసుకుంటారు.
నా ప్రియమైన సోదర సొదరీమణులారా, ఆదివాసీ తెగలవారు తమలో తాము కలిసిమెలసి, శాంతియుతంగా జీవించాలని నమ్ముతారన్న సంగతి నిజమే. కానీ ఎవరైనా తమ సహజ వనరులకు నష్టం కలిగిస్తుంటే ,తమ హక్కుల కోసం పోరాడటానికి వాళ్ళు భయపడరు . మన మొట్టమొదటి స్వాతంత్ర్యసమరయోధుల్లో కొందరు ఆదివాసి తెగల వారే ఉన్నారు. భగవాన్ బిర్సా ముండాను ఎవరు మర్చిపోగలరు? తన అడవిని రక్షించుకుందుకు బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంతో పెద్ద పోరాటమే చేశారయన. నేను చెప్పిన విషయాల జాబితా కాస్త పెద్దదే. ప్రకృతితో సామరస్యంగా ఎలా ఉండాలో చెప్పేందుకు ఆదివాసీ తెగల నుండి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఇవాళ మన దగ్గర ఈమాత్రం అటవీ సంపద మిగిలి ఉండడానికి కారణమైన మన ఆదివాసులకి దేశం ఋణపడి ఉండాలి. వారి పట్ల మనం ఆదరంగా ఉండాలి.
నా ప్రియమైన దేశప్రజలారా, మన్ కీ బాత్ లో మనం సమాజం కోసం అసాధారణ పనులు చేసిన వ్యక్తుల గురించీ, సంస్థల గురించీ చెప్పుకుంటాం. చూడడానికి చిన్నవిగా కనిపించినా, ఆ పనుల వల్ల చాలా లోతైన ప్రభావమే పడుతుంది. ఆ మార్పులు మనలో మానసికంగానూ, సమాజం నడిచే తీరు మార్చేలాంటివీనూ. కొద్దిరోజుల క్రితం నేను పంజాబ్ కు చెందిన సొదరుడు గురుబచన్ సింగ్ గురించి చదివాను. కష్టపడి పనిచేసే ఒక సామాన్యమైన రైతు గురుబచన్ సింగ్ కొడుకు పెళ్ళి జరిగుతోంది. ఈ వివాహానికి ముందుగానే గురుబచన్ గారు పెళ్లికుమార్తె తల్లిదండ్రులకు పెళ్ళి నిరాడంబరంగా జరిపిద్దాం, కానీ నాదొక షరతు.. అని చెప్పారట. సాధారణంగా పెళ్ళివారు షరతు అన్నారంటే అదేదో పెద్ద కోరికే అని అనుకుంటాం. వీళ్ళేవో పెద్ద పెద్ద కోరికలే కోరబోతున్నారు అనుకుంటారు వియ్యాలవారు. కానీ ఒక సాధారణ రైత్రు అయిన సోదరుడు గురుబచన్ అడిగిన షరతు విని మీరందరూ కూడా ఆశ్చర్యపోతారు. అదే మన సమాజంలో ఉన్న నిజమైన బలం. గురుబచన్ ఏమని అడిగారంటే, పెళ్ళిలో మీరు ధాన్యం కోయగా మిగిలిన వరి దుబ్బులని పొలంలో కాల్చనని వియ్యాలవారిని మాటివ్వాల్సిందిగా ఆయన అడిగారు. ఎంతో పెద్ద సామాజిక శ్రేయస్సు ఇందులో ఉంది. గురుబచన్ సింగ్ గారు అడిగిన కోరిక చిన్నగానే ఉంది కానీ ఆయన హృదయం ఎంత విశాలమైనదో ఈ కోరిక తెలుపుతుంది. ఇలా వ్యక్తిగత విషయలను సమాజ శ్రేయస్సు తో కలిపే కుటుంబాలు మన సమాజంలో చాలానే ఉన్నాయి. శ్రీ గురుబచన్ సింగ్ గారి కుటుంబం అలాంటి ఒక ఉదాహరణని మన ముందర ఉంచారు. పంజాబ్ లోని నాభా దగ్గర ఉన్న మరొక చిన్న గ్రామం కల్లర్ మాజ్రా గురించి చదివాను నేను. కల్లర్ మాజ్రా అనే ఈ గ్రామం ఎందుకు చర్చల్లోకి వచ్చిందంటే, అక్కడి ప్రజలు ధాన్యం కోయగా మిగిలిన వరి దుబ్బులని పొలంలో కాల్చే బదులు, వాటిని మట్టి తవ్వి లోపల కప్పిపెట్టేస్తారుట. దాని కోసం ఎంత సాంకేతికత అవసరం ఉంటుందో అంతటినీ సమకూర్చుకుంటారుట. సోదరుడు గురుబచన్ సింగ్ కి నా అభినందనలు. కల్లర్ మాజ్రా ప్రజలకు, వాతావరణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి తమ శాయశక్తులా ప్రయత్నించే ప్రజలందరికీ నా అభినందనలు. మీరంతా పరిశుభ్రమైన జీవనవిధానం అనే భారతీయ సంప్రదాయానికి నిజమైన ప్రతినిధులుగా ముందుకు నడుస్తున్నారు. చుక్క,చుక్కా కలిస్తేనే సాగరమైనట్లు, చిన్న చిన్న జాగ్రత్తలు, మంచి పనులు, సానుకూలమైన పనులు, ఎల్లప్పుడూ సానుకూల వాతావరణాన్ని తయారుచేయడంలో అతి పెద్ద పాత్రను వహిస్తాయి.
నా ప్రియమైన దేశప్రజలారా, మన గ్రంధాల్లో చెప్పారు –
ఓం దయౌ: శాంతి: అంతరిక్ష్యం శాంతి:
పృథ్వీ శాంతి: ఆప: శాంతి: ఔపథయ: శాంతి:
వనస్పతయ: శాంతి: విశ్వేదేవా: శాంతి: బ్రహ్మ శాంతి:
సర్వం శాంతి: శాంతరేవ శాంతి: సమా సమా శాంతిరేధి
ఓం శాంతి: శాంతి: శాంతి:
దీని అర్థం ఏమిటంటే, ముల్లోకాల్లోనూ నలుమూలలా శాంతి ఉండాలి. నీటిలో, భూమిపై, ఆకాశంలోనూ, అంతరిక్ష్యం లోనూ, అగ్ని లో, వాయువులో, ఔషధాలలో, వృక్షకోటి లో, ఉద్యానవనాలలో, అచేతనలో, సంపూర్ణ బ్రహ్మాండంలో శాంతి స్థాపన చేద్దాం. జీవంలో, హృదయంలో, నాలో, నీలో, జగత్తు లోని ప్రతి కణంలో, ప్రతి చోటా శాంతిని స్థాపిద్దాం.
ఓం శాంతి: శాంతి: శాంతి:
ప్రపంచ శాంతి అనే మాట వచ్చినప్పుడల్లా భారతదేశం పేరు, ఇందుకు భారతదేశం అందించిన సహకారం సువర్ణాక్షరాలలో కనబడుతుంది. భారతదేశానికి వచ్చే నవంబర్ 11వ తేదీ ప్రత్యేకమైనది. ఎందుకంటే, వందేళ్ల క్రితం నవంబర్11న మొదటి ప్రపంచ యుధ్ధం పూర్తయ్యింది. యుధ్ధం సమాప్తమై వందేళ్ళు పూర్తయ్యాయంటే, అప్పుడు జరిగిన భారీవినాశనానికీ, జన నష్టం పూర్తయ్యి ఒక శతాబ్దం పూర్తవుతుంది. మొదటి ప్రపంచ యుధ్ధం భారతదేశానికి ఒక ముఖ్యమైన సంఘటన. సరిగ్గా చెప్పాలంటే అసలా యుధ్ధంతో మనకి సంబంధమే లేదు. అయినా కూడా మన సైనికులు ఎంతో వీరత్వంతో పోరాడారు, ఎంతో పెద్ద పాత్రను పోషించారు, అత్యధిక బలిదానాలను ఇచ్చారు. యుధ్ధం వచ్చినప్పుడు తాము ఎవరికీ తీసిపోమని భారతీయ సైనికులు ప్రపంచానికి చూపెట్టారు. దుర్లభమైన ప్రదేశాలలో, విషమ పరిస్థితుల్లో కూడా మన సైనికులు తమ శౌర్యప్రతాపాలను చూపెట్టారు. వీటాన్నింటి వెనుకా ఉన్న ఒకే ఉద్దేశ్యం – తిరిగి శాంతి స్థాపన చెయ్యడం. మొదటి ప్రపంచ యుధ్ధం లో ప్రపంచం వినాశతాండవాన్ని చూసింది. అంచనాల ప్రకారం దాదాపు ఒక కోటిమంది సైనికులు, మరో కోటి మంది ప్రజలు తమ ప్రాణాలను కోల్పోయారు. దీనివల్ల శాంతి ఎంత ముఖ్యమైనదో ప్రపంచం తెలుసుకుంది. గత వందేళ్లలో శాంతి అనే పదానికి అర్థమే మారిపోయింది. ఇవాళ శాంతి, సద్భావం అంటే కేవలం యుధ్ధం జరగకపోవడం కాదు. తీవ్రవాదం మొదలుకొని వాతావరణంలో మార్పు, అర్థిక అభివృధ్ధి నుండీ సామాజిక న్యాయం వరకూ మార్పు జరగాల్సి ఉంది. వీటన్నింటి కోసం ప్రపంచం సహకారంతోనూ, సమన్వయంతోనూ పనిచేయాల్సి ఉంది. నిరుపేద వ్యక్తి అభివృధ్ధే శాంతికి నిజమైన సంకేతం.
నా ప్రియమైన దేశప్రజలారా, మన ఈశాన్య రాష్ట్రాల విషయమే వేరు. ఈ ప్రాంతంలో ప్రాకృతిక సౌందర్యం అనుపమానమైనది. ఇక్కడి ప్రజలు అత్యంత ప్రతిభావంతులు. మన ఈశాన్యం ఇప్పుడు ఎన్నో మంచి పనులవల్ల కూడా గుర్తించబడుతోంది. ఈశాన్య రాష్ట్రాలు ఇప్పుడు సేంద్రీయ వ్యవసాయంలో ఎంతో అభివృధ్ధిని సాధించాయి. కొద్ది రోజుల క్రితం సిక్కిం లో sustainable food system ని ప్రోత్సహించడానికి స్థాపించిన Future Policy Gold Award 2018ని సిక్కిం గెలుచుకుంది. ఈ అవార్డు ని సంయుక్త రాష్ట్రాలతో కలిసిన F.A.O అంటే Food and Agriculture Organisation తరఫున ఇస్తారు. ఈ రంగంలో best policy making కోసం ఇచ్చే ఈ అవార్డ్ ఆ రంగంలో ఆస్కార్ తో సమానం. ఇదే కాక మన సిక్కిం ఇరవై ఐదు దేశాల నుండి యాభై ఒక్క నామినేటెడ్ పాలసీలను దాటుకుని ఈ అవార్డుని గెలుచుకుంది. ఇందుకు గానూ నేను సిక్కిం ప్రజలకు అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, అక్టోబర్ అయిపోతోంది. వాతావరణంలో కూడా ఎన్నో మార్పులు వస్తున్నాయి. చలికాలం మొదలయ్యింది. దానితో పాటుగా పండుగల వాతావరణం కూడా వచ్చేసింది. ధన్ తెరస్, దీపావళి, భయ్యా దూజ్, ఛట్..ఒకరకంగా చెప్పాలంటే నవంబర్ నెలంతా పండుగల నెల. దేశప్రజలందరికీ ఈ పండుగలన్నింటి తరఫునా అనేకానేక శుభాకాంక్షలు.
మీ అందరినీ నేను కోరేది ఏమిటంటే, ఈ పండుగలలో మీ క్షేమాన్నే కాకుండా మీ అరోగ్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోండి. సమాజ శ్రేయస్సుని కూడా దృష్టిలో పెట్టుకోండి. కొత్త సంకల్పాలను చేసుకునేందుకు ఈ పండుగలు సరైన అవకాశాన్ని ఇస్తాయని నా నమ్మకం. కొత్త నిర్ణయాలను చేసుకునేందుకు కూడా ఈ పండుగలు అవకాశాన్ని ఇస్తాయి. ఒక mission mode తో మీరు జీవితంలో ముందుకు నడవడానికీ, ధృఢ సంకల్పాన్ని చేసుకోవడానికీ ఈ పండుగలు ఒక అవకాశంగా మారాలని కోరుకుంటున్నాను. దేశ అభివృధ్ధిలో మీ అభివృధ్ధే ఒక ముఖ్యమైన భాగం. మీకు ఎంత అభివృధ్ధి జరిగితే దేశం అంతగా ప్రగతిని సాధిస్తుంది. మీ అందరికీ నా అనేకానేక శుభాకాంక్షలు. అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా నమస్కారం! మన సైనిక బలగాలను, మన సాయుధ దళాలను చూసి గర్వపడని భారతీయుడు ఎవరూ ఉండరు. ఏ జాతి, ఏ ప్రాంతం, ఏ మతం, లేదా ఏ భాషకు చెందిన వారైనా కూడా ప్రతి భారతీయుడూ మన సైనికుల పట్ల, తమ సంతోషాన్నీ, మద్దతునీ తెలపడానికి ఎల్లప్పుడూ తయారుగా ఉంటాడు. నిన్న 125కోట్ల భారతీయులందరూ పరాక్రమ పర్వాన్ని జరుపుకున్నారు. 2016లో జరిగిన సర్జికల్ స్ట్రైక్ ను గుర్తుచేసుకున్నారు. టెర్రరిజం ముసుగులో మన దేశంపై పరోక్ష యుధ్ధం జరిగినప్పుడు, వారి నిర్లజ్జకర ప్రవర్తనకు దీటైన జవాబుని మన సైనికులు సర్జికల్ స్ట్రైక్ రూపంలో అందించారు. దేశంలోని పలు ప్రాంతాల్లో మన సాయుధదళాలు ప్రదర్శనలను ఏర్పాటుచేసాయి. ఈ ప్రదర్శనల ముఖ్య ఉద్దేశ్యం – మన దేశ ప్రజలకు, ఎక్కువగా మన యువతరానికి, మన దేశానికి ఉన్న శక్తిని పరిచయం చేయడమే. మనలో ఎంత సామర్ధ్యం దాగి ఉందో, మన సైనికులు ఏ విధంగా తమ ప్రాణాలకు తెగించి దేశాన్నీ,మనల్ని రక్షిస్తూ ఉంటారో తెలపడానికి. పరాక్రమ్ పర్వ్ లాంటి ముఖ్యమైన రోజులు మన దేశ యువతలో మన సైనికుల పట్ల గౌరవపూర్వకంగా ఎలా ఉండాలో తెలిపేలాంటి వారసత్వ సంప్రదాయాల్ని గుర్తు చేస్తాయి. తద్వారా మన దేశ సమైక్యత ను, నైతికతను సదా నిలిపి ఉంచడానికి ఇలాంటి దినోత్సవాలు మనల్ని ప్రోత్సహిస్తాయి. వీరుల భూమి అయిన రాజస్థాన్ లోని జోధ్‌పూర్ లో ఒక కార్యక్రమంలో నేను కూడా పాల్గొన్నాను. మన దేశ శాంతి, సామరస్యాలను నష్టపరచాలనే ప్రయత్నం ఎవరు చేసినా సరే, వారికి చెంపపెట్టు లాంటి సమాధానాన్ని మన సైనికులు ఇవ్వగలరన్న సంగతి ఇప్పుడు నిశ్చయంగా అందరికీ అర్ధమైంది. మనం శాంతికాముకులం. దేశంలో శాంతిని పెంచాలనే నిబధ్ధతతో ఉంటాం. కానీ అది దేశ గౌరవంతో రాజీ పడో, లేదా దేశ సార్వభౌమాధికారాన్ని పణంగా పెట్టో మాత్రం జరగదు. భారతదేశం నిరంతరం శాంతి పట్ల అంకితభావంతో, కట్టుబడి ఉంది. ఇరవయ్యవ శతాబ్దంలో జరిగిన రెండు ప్రపంచయుధ్ధాలలోనూ మన దేశ సైనికులు ఒక లక్ష కంటే ఎక్కువమంది శాంతి కోసం స్వచ్ఛంద బలిదానాలను ఇచ్చారు. ఆ యుధ్ధాలతో మనకు ఏ మాత్రం సంబంధం లేనప్పటికీ కూడా. మన దృష్టి ఎన్నడూ మనది కాని భూమిపై పడలేదు. ఇది శాంతి పట్ల మనకున్న నిబధ్ధత. కొన్ని రోజుల క్రితం సెప్టెంబరు ఇరవై మూడవ తేదీన ఇజ్రాయిల్ లో హైఫా యుధ్ధం జరిగి వందేళ్ళు పూర్తయిన సందర్భంలో, మైసూర్, హైదరాబాద్, జోధ్‌పూర్ లకు చెందిన ఈటెగాళ్ళైన మన వీర సైనికులను జ్ఞాపకం చేసుకున్నాం. వారిపై దండెత్తి వచ్చినవారితో మన వీర సైనికులు పోరాడి హైఫా కు ముక్తిని ప్రసాదించారు. శాంతిబాటలో పయనించాలనే ఉద్దేశంతో మన దేశ సైనికులు చేసిన ఒక సాహసం అది. ఐక్య రాజ్య సమితికి చెందిన రకరకాల శాంతి భద్రతా దళాలకు అత్యధిక సంఖ్యలో సైనికులను పంపే దేశాలలో భారతదేశం కూడా ఒకటి. దశాబ్దాలుగా మన వీర సైనికులు నీలి హెల్మెట్ ధరించి ప్రపంచంలో శాంతిని స్థాపించడంలో కీలక పాత్రను వహిస్తున్నారు.
నా ప్రియమైన దేశప్రజలారా, ఆకాశం కబుర్లు విచిత్రమైనవి. ఆకాశానికి కూడా తమ శక్తిని పరిచయం చేసిన మన వైమానిక దళం దేశప్రజలందరి దృష్టినీ తన వైపుకి ఆకర్షించుకుంది. మనకు రక్షణను అందిస్తుందనే నమ్మకాన్ని కుదిర్చింది. గణతంత్ర దినోత్సవ ఉత్సవ సమయంలో జరిగే పెరేడ్ లో ఏ భాగం కోసం ప్రజలు ఆత్రంగా ఎదురు చూస్తారో, వాటిల్లో ఒకటి ఫ్లై పాస్ట్(fly past) . అందులో మన వైమానిక దళం ఆశ్చర్యకరమైన పనులతో తన శక్తిని ప్రదర్శిస్తుంది. అక్టోబర్ 8వ తేదీన మనం వైమానిక దళ దినోత్సవం జరుపుకుంటాం. 1932లో ఆరుగురు పైలట్లు , 19 మంది సైనికులతో మొదలైన అతి చిన్న వైమానిక దళం పెరిగి పెద్దయ్యింది. ఇవాళ మన దళం ఇరవై ఒకటవ శతాబ్దంలోకెల్లా సాహసవంతమైన, శక్తివంతమైన వైమానిక దళాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఒక అద్భుతమైన ప్రయాణం. దేశం కోసం తమ సేవను అందించే ఈ వాయు యోధులకు, వారి కుటుంబాలకు నా హృదయపూర్వక అభినందనలు.
1947 లో పాకిస్తాన్ వారు ఆకస్మిక దాడి మొదలుపెట్టినప్పుడు, శ్రీనగర్ ను ఆక్రమణదారుల నుండి భారత వైమానిక దళాలవారే రక్షించారు. భారతీయ సైనికులు, వారి సాధనాలు, యుధ్ధ సమయంలో సరిగ్గా సమయానికల్లా చేరేలా ఖచ్చితమైన ప్రణాళిక చేసింది మన వైమానిక దళాలవారే. 1965లో శత్రువుల మొహం పగిలేలా జవాబునిచ్చింది కూడా మన వైమానిక దళమే. 1971లో జరిగిన బంగ్లాదేశ్ స్వతంత్ర పోరాటం గురించి ఎవరికి తెలీదు? 1999 లో కార్గిల్ ను చొరబాటుదారుల వశం నుండి విడిపించడంలో కూడా వైమానిక దళం ముఖ్య పాత్రను వహించింది. టైగర్ హిల్స్ లో శత్రువుల స్థావరాలపై రాత్రింబవళ్ళూ బాంబుదాడి చేసి వారిని మట్టి కరిపించింది కూడా మన వైమానిక దళమే. సహాయ పునరావాసాలు అయినా, విపత్తు నిర్వహణ అయినా సరే మన వాయుసేనా యోధులు చేసే మెచ్చుకోలు పనుల వల్ల దేశానికి వారి పట్ల ఎంతో కృతజ్ఞతాభావంతో ఉంది. తుఫాను, గాలివాన, వరదలు నుండి అడవిలో కార్చిచ్చుల వరకూ ప్రకృతి వైపరీత్యాలన్నింటినీ ఎదుర్కొని, దేశప్రజలకు సహాయం చెయ్యడంలో వారు చూపే తెగువ అద్భుతమైనది. దేశంలో gender equality అంటే స్త్రీ, పురుష సమానత్వాన్ని నిరూపించడంలో వైమానికదళం వారు ఒక ఉదాహరణగా నిలిచారు. ఒక ప్రత్యేక మహిళా విభాగాన్ని మన దేశ ఆడపడుచుల కోసం ఏర్పాటు చేసారు. ఇప్పుడైతే మన వైమానిక దళం స్త్రీల కోసం short service commission తో పాటూ permanent commissionను కూడా ప్రత్యామ్నాయంగా ఇస్తోంది. ఆగస్టు15 న ఎర్రకోట వేదిక నుండి నేను ఈ ప్రకటనను చేసాను. భారత సైన్యంలో సాయుధ బలగాలలో పురుష శక్తి తో పాటూ స్త్రీ శక్తి సహకారం కూడా సమానంగా ఉందని ఇప్పుడు భారతదేశం గర్వంగా చెప్పగలదు. శక్తిస్వరూపమైన స్త్రీ ఇప్పుడు సాయుధురాలు కూడా అవుతోంది.
నా ప్రియమైన దేశప్రజలారా, కొద్ది రోజుల క్రితం మన నౌకా దళానికి చెందిన అభిలాష్ టోమీ అనే అధికారి తన జీవితం కోసం మృత్యువుతో పోరాటం చేశారు. యావత్ దేశం ఆయనను ఎలా రక్షించుకోవాలా అని ఆందోళన పడింది. మీకు తెలుసు కదా అభిలాష్ టోమీ చాలా సాహసవంతుడైన అధికారి. ఏ రకమైన ఆధునిక సాంకేతికతనూ ఉపయోగించుకోకుండా, కేవలం ఒక చిన్న నావ సహాయంతో ప్రపంచాన్ని చుట్టివచ్చిన మొట్టమొదటి భారతీయుడు ఆయన. దక్షిణ హిందూ మహా సముద్రంలో Golden Globe Raceలో పాల్గోవడానికి ఆయన గత ఎనభై రోజులుగా సముద్రంలో తన వేగాన్ని అదుపుకుంటూ ముందుకు వెళ్తున్నారు. కానీ భయంకరమైన సముద్రపు తుఫాను ఆయనకు ఇబ్బందులను తెచ్చింది. కానీ భారత నౌకా దళానికి చెందిన ఈ వీరుడు సముద్రంలో అనేక రోజుల పాటు పోరాడుతూ గడిపాడు. ఆ సముద్రపు నీటిలో తిండితిప్పలు లేకుండా నిరంతరం పోరాడుతూనే ఉన్నాడు కానీ ఓటమిని ఒప్పుకోలేదు. సాహసం, సంకల్పబలం, పరాక్రమాలకు అతి పెద్ద ఉదాహరణ అతను. కొద్ది రోజుల క్రితం అతడిని సముద్రంలోంచి రక్షించి బయతకు తీసుకువచ్చిన తరువాత నేను ఆయనతో ఫోన్ లో మాట్లాడాను. ఇంతకు మునుపు కూడా నేనతన్ని కలిసాను. ఇంతటి ఆపద నుండి బయటకు వచ్చిన తరువాత కూడా అతడిలోని ధైర్యం, పోరాట పటిమ, మరోసారి ఇటువంటి సాహసం చెయ్యాలనే కోరిక ఉన్నాయి. ఇవన్నీ కూడా మన దేశ యువతకు ప్రేరణాత్మకమైనవి. అభిలాష్ టోమీ ఆరోగ్యం మెరుగవ్వాలని నేను ప్రార్థిస్తున్నాను. ఆయన సాహసం, ఆయన పరాక్రమం, ఆయన సంకల్పబలం, పోరాట పటిమ, గెలవాలనే సంకల్పం మన దేశ యువతకు తప్పకుండా ప్రేరణను అందిస్తాయి.
నా ప్రియమైన దెశప్రజలారా, అక్టోబర్ రెండవ తేదీ మన దేశానికి ఎంత ముఖ్యమైనదో ప్రతి ఒక్కరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం అక్టోబర్ రెండుకు ఒక ప్రత్యేకత ఉంది. ఇప్పటి నుండీ మొదలుకొని ఒక రెండేళ్ళ వరకూ మనందరము మహాత్మా గాంధీ 150వ జయంతి ఉత్సవాలను ప్రపంచవ్యాప్తంగా అనేక కార్యక్రమాల ద్వారా జరుపుకోబోతున్నాం. మహాత్మా గాంధీ ఆలోచనలు యావత్ ప్రపంచానికీ ప్రేరణను అందించాయి. Dr. Martin Luther King Junior , Nelson Mandela లాంటి గొప్ప నాయకులు కూడా తమ ప్రజలకు సమానత్వం, గౌరవం తాలూకూ హక్కులను అందించడానికి జరిపిన పోరాటాలకు మహాత్మా గాంధీ ఆలోచనల నుండి శక్తిని పొందినవారే. ఇవాళ్టి మన్ కీ బాత్ కార్యక్రమంలో నేను పూజ్య బాపూ జరిపిన మరొక ముఖ్యమైన పనిని గురించి మీతో చర్చించాలనుకుంటున్నాను. దీని గురించి వీలయినంత ఎక్కువమంది దేశప్రజలందరూ తెలుసుకోవలసిన అవసరం ఉంది. 1941లో గాంధీ గారు constructive programme అంటేరచనాత్మక కార్యక్రమ రూపంలో కొన్ని ఆలోచనలను రాయడం మొదలుపెట్టారు. తర్వాత 1945లో స్వతంత్ర పోరాటం ఊపందుకొన్నప్పుడు ఆయన తన ఆలోచనల సవరణా ప్రతి ని తయారుచేసారు. పూజ్య బాపూ రైతులు, పల్లెలు, శ్రామికుల అధికారాలను రక్షించడం కోసం, పరిశుభ్రత, విద్య లాంటి అనేక విషయాలపై తన ఆలోచనలను దేశప్రజల ముందర పెట్టారు. దానిని గాంధీ చార్టర్(Gandhi Charter) అని కూడా అంటారు. పూజ్య బాపు ప్రజా సంగ్రాహకుడు. ప్రజలతో కలిసిపోవడం, వారిని తనతో కలుపుకోవడం అనేది బాపూ ప్రత్యేకత. అది ఆయన స్వభావం. ఇది ఆయన వ్యక్తిత్వంలోని ప్రత్యేకతగా అందరూ గుర్తించారు. ఇది దేశానికి ఎంతో అవసరమైన, ముఖ్యమైన ఆవస్యకత అని బాపూ అందరికీ అర్థమయ్యేలా చేశారు. స్వతంత్ర పోరాటం జరిగిన సమయంలో ఆయన వహించిన ముఖ్య పాత్ర ఏమిటంటే ఆ పోరాటాన్ని ఒక ప్రజా-ఉద్యమంగా మార్చడం. మహాత్మా గాంధీ గారి ఆహ్వానంపై సమాజంలోని ప్రతి వర్గానికీ, ప్రతి ప్రాంతానికీ సంబంధించిన ప్రజలందరూ కూడా స్వతంత్ర పోరాట ఉద్యమానికి తమను తాము అంకితం చేసుకున్నారు. బాపు మనందరికీ ఒక ప్రేరణాత్మక మంత్రాన్ని ఇచ్చారు. అది గాంధీగారి తాయత్తు అనే పేరుతో పసిధ్ధి చెందింది.అందులో గాంధీ గారు ఏం చెప్పారంటే, "నేను మీ అందరికీ ఒక తాయొత్తు ని ఇస్తాను. మీకు ఎప్పుడైనా ఏదైనా సందేహం కలిగినా, లేదా మీ అహం మీపై అధికారాన్ని చూపెట్టినా సరే ఒక పరీక్షను పెట్టుకోండి. మీరు చూసిన వ్యక్తుల్లో అతి పేద, బలహీన వ్యక్తి ఎవరైతే ఉన్నారో, అతడి మొహాన్ని గుర్తుకు తెచ్చుకోండి. మీరు వేయబోయే అడుగు ఆ వ్యక్తికి ఎలాంటి సహాయాన్ని అందించగలదు? అని ఆలోచించండి . ఆ పేద వ్యక్తికి నా నిర్ణయం సహాయపడగలదా? దానివల్ల అతడికి ఏదైనా లాభం చేకూరగలదా? దీనివల్ల అతడు తన జీవితమ్లో ఏవైనా మార్పులు చేసుకోగలడా? నా నిర్ణయం వల్ల ఆకలితో అలమటిస్తున్న కోట్ల కొద్దీ ప్రజల ఆకలి తీరగలదా? వారి ఆత్మ సంతృప్తి చెందగలదా? అని ప్రశ్నించుకోండి. అప్పుడు నీ సందేహ నివృత్తి జరుగుతున్నట్లు, నీ అహం కరిగిపోతున్నట్లు నీకు అనిపిస్తుంది" అని చెప్పారు బాపూ.
నా ప్రియమైన దేశప్రజలారా, గాంధీ గారు చెప్పిన ఈ మంత్రం ఇప్పటికీ ముఖ్యమైనదే. నేడు దేశంలో మధ్యవర్గం పెరుగుతోంది, వారి ఆర్థిక శక్తి పెరుగుతోంది, కొనుగోలు శక్తి పెరుగుతోంది. మనం ఏదన్న కొనేందుకు వెళ్ళినప్పుడు ఒక్క క్షణం పూజ్య బాపూ ని గుర్తు చేసుకుని, ఆయన చెప్పిన ఈ మంత్రాన్ని ఒక్కసారి గుర్తుచేసుకుందాం. ఈ వస్తువు కొనుగోలు చెయ్యడం వల్ల నేను దేశంలో ఏ పౌరుడికి లాభం ఇస్తున్నాను?ఎవరి మొహంలో సంతోషాన్ని వెలిగిస్తున్నాను? నా కొనుగోలు వల్ల ఎవరికి నేరుగా కానీ పరోక్షంగా గానీ లాభం కలగబోతోంది? దీని వల్ల నిరుపేద వ్యక్తికి లాభం కలిగితే నా కొనుగోలు వల్ల నేను చాలా సంతోషాన్ని పొందుతాను. భవిష్యత్తులో మీ ప్రతి కొనుగోలు ముందరా, గాంధీ గారు చెప్పిన ఈ మంత్రాన్ని గనుక మీరు గుర్తు ఉంచుకోవాలి. గాంధీ గారి 150వ జయంతి సందర్భంగా ఇది గనుక గుర్తు పెట్టుకుంటే మన కొనుగొలు వల్ల ఎవరో ఒక నిరుపేదకు ఉపయోగం కలుగుతుంది, అతడు చిందించిన చమటకు, పడిన కష్టానికీ, అతడి పెట్టుబడి పెట్టిన ప్రతిభకూ అన్నింటికీ ఏదో ఒక లాభం చేకూరుతుంది అని ఆలోచించాలి. ఇదే గాంధీ గారి తాయత్తు. ఇదే ఆయన సందేశం. అందరి కంటే పేదవాడు, బలహీనుడు అయిన వ్యక్తి జీవితంలో మీరు వేసే అడుగు వల్ల గొప్ప మార్పు రాగలదు అని నాకు నమ్మకం ఉంది.
నా ప్రియమైన దేశప్రజలారా, పరిశుభ్రత పాటిస్తే స్వాతంత్ర్యం లభిస్తుంది అని గాంధీగారు చెప్పారు. ఎలాగో ఆయనకూ తెలిసి ఉండదు కానీ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అలానే ఇవాళ మీరు చేసే ఈ చిన్న పని వల్ల కూడా నా దేశ ఆర్థిక అభివృధ్ధి, ఆర్థిక సాధికారత, పేదవాడికి పేదరికంతో పోరాడే శక్తిని ఇవ్వడానికి నా సహకారం ఉంటుందా అని మీకు అనిపించవచ్చు. కానీ నేటి యుగంలో ఇదే నిజమైన దేశభక్తి, ఇదే గాంధీ గారికి మనం ఇచ్చే కార్యాంజలి. ఉదాహరణకి, ప్రత్యేక సందర్భాల్లో ఖాదీ, చేనేత ఉత్పాదక కొనుగోళ్ళ వల్ల అనేకమంది చేనేత కర్మికులకి సహాయాన్ని అందించినవాళ్ళమౌతాము. లాల్ బహదూర్ శాస్త్రి గారు పాతబడిన, చిరిగిన చేనేత వస్త్రాలను కూడా దాచిపెట్టి వాడుకునేవారట. అందులో ఎవరి కష్టం ఉందో కదా అనే ఆలోచనతో అలా చేసేవారుట. ఈ ఖాదీ వస్త్రాలన్నీ కూడా ఎంతో కష్టపడితే గాని తయారవ్వవు, వీటి ఒక్కొక్క దారం ఉపయోగపడాలి అనేవారుట. దేశం పట్ల అభిమానం, దేశప్రజల పట్ల ప్రేమ కనబడే ఇటువంటి గొప్ప భావనలు అతి చిన్న అడుగులు వేసే ఆ మహామనీషి నరనరాల్లోనూ నిండి ఉన్నాయి. రెండు రోజుల్లో పూజ్య బాపు తో పాటూ మనం శాస్త్రి గారి జయంతిని కూడా జరుపుకోబోతున్నాం. శాస్త్రి గారి పేరు వినగానే మన భారతీయుల మనసుల్లో ఒక అనంతమైన భక్తిశ్రధ్ధలు ఎగసిపడతాయి. వారి సౌమ్య వ్యక్తిత్వం ప్రతి పౌరుడినీ ఎప్పటికీ గర్వంతో నింపేస్తుంది.
బయట నుంచి అతి వినమ్రంగా కనబడి, లోపలి నుండి మాత్రం పర్వతం లాంటి ధృఢ నిశ్చయం కలిగి ఉండేవారు లాల్ బహదూర్ శాస్త్రి గారు. "జయ్ జవాన్ జయ్ కిసాన్" అన్న నినాదం శాస్త్రి గారి గొప్ప వ్యక్తిత్వానికి ఒక చక్కని నిదర్శనం. ఏదాదిన్నర కాలం పాటు సాగిన ఆయన సంక్షిప్త పదవీ కాలంలో, ఆయన దేశ సైనికులకు, రైతులకు విజయశిఖరాలను అందుకునే మంత్రం ఇచ్చారు. ఇది దేశం పట్ల ఆయనకు ఉన్న నిస్వార్థ ప్రేమకు నిదర్శనం.
నా ప్రియమైన దేశప్రజలారా, ఇవాళ మనం పూజ్యులైన బాపుని గుర్తు చేసుకుంటున్నప్పుడు పరిశుభ్రత గురించి మాట్లాడుకోవడం అనేది సాధారణమే. సెప్టెంబర్ పదిహేను నుండీ "పరిశుభ్రతే సేవ" అనే ఒక ఉద్యమం మొదలైంది. కోట్ల కొద్దీ ప్రజలు ఈ ఉద్యమంలో పాల్గొన్నారు. నాకు కూడా ఢిల్లీలోని అంబేద్కర్ పాఠశాల లో పిల్లలతో పరిశుభ్రత శ్రమదానం చేసే అవకాశం లభించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ స్వయంగా ఆ పాఠశాలకు పునాది వేశారుట. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలూ ఈ సెప్టెంబర్ పదిహేను వ తేదీన జరిగిన శ్రమదానంలో పాల్గొన్నారు. అనేక సంస్థలు ఈ కార్యక్రమంలో అత్యంత ఉత్సాహంగా పాల్గొన్నాయి. స్కూలు పిల్లలు, కాలేజీ పిల్లలు, ఎన్.సి.సి, ఎన్.ఎస్.ఎస్, యువజన సంఘాలు, మీడియా గ్రూపులు, కార్పరేట్ ప్రపంచంలోనివారందరూ కూడా పెద్ద ఎత్తున పరిశుభ్రతకై శ్రమదానం చేశారు. ఇందుమూలంగా ఈ పరిశుభ్రతా ప్రేమికులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలుయచేస్తున్నాను. రండి ఒక ఫోన్ కాల్ విందాం –
"నమస్కారం! నా పేరు షైతాన్ సింగ్. పూగల్ తాలూకా, బికనేర్ జిల్లా, రాజస్థాన్ నుండి మాట్లాడుతున్నాను. నేనొక అంధుడిని. నా రెండు కళ్ళు కనబడవు. నేను పూర్తి గుడ్డివాడిని. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ’మన్ కీ బాత్ కార్యక్రమం’ ద్వారా మోదీ గారు చేపట్టిన పరిశుభ్ర భారతదేశాన్ని తయారుచేసే పని చాలా గొప్పది. నాలాంటి అంధులు మరుగుదొడ్ల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు ఇంట్లోనే మరుగుదొడ్ల నిర్మాణం జరిగడం వల్ల మాకు చాలా ఉపయోగం జరిగింది. ఇది చాలా గొప్ప అడుగు. ఈ పని ఇలానే ముందుకు సాగాలి"
అనేకానేక ధన్యవాదాలు. మీరు చాలా మంచి మాట చెప్పారు. ప్రతివారి జీవితంలోనూ పరిశుభ్రతకు ప్రత్యేకమైన స్థానం ఉంది. స్వచ్ఛ భారత ఉద్యమం ద్వారా మీ ఇంట్లో మరుగుదొడ్డి నిర్మణం జరిగడం వల్ల అది మీకు బాగా ఉపయోగపడుతోంది. ఇంతకు మించిన ఆనందం మా అందరికీ ఇంకేముంటుంది? మీకు కనబడదు కాబట్టి చూడలేకపోతున్నారు కానీ ఈ ఉద్యమం ద్వారా కలిగిన ప్రయోజనం ఇందులో పాల్గొన్న వారికి కూడా అంచనా ఉండి ఉండదు . మరుగుదొడ్డి నిర్మాణం జరగక ముందు మీరెన్ని ఇబ్బందులతో జీవితాన్ని గడిపేవారో, మరుగుదొడ్డి నిర్మాణం జరిగిన తర్వాత అది మీ పాలిట ఎలా వరంగా మారిందో అన్న విషయం మీరు ఫోన్ చేయకపోయి ఉంటే మాకు తెలిసేది కాదు. పరిశుభ్రతా ఉద్యమంలో పాలుపంచుకున్నవారందరి దృష్టికీ ఈ సున్నితమైన అంశం వచ్చేది కాదు. మీ ఫోన్ కాల్ కి గానూ మీకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, "స్వఛ్ఛ భారత్ మిషన్" కేవలం మన దేశం లోనే కాదు యావత్ ప్రపంచంలోనే ఒక విజయవంతమైన కథ అయ్యింది. దీని గురించి ప్రతి ఒక్కరూ చెప్పుకుంటున్నారు. చరిత్రలో నిలిచిపోయేలాంటి ప్రపంచంలోకెల్లా అతి పెద్ద పరిశుభ్రతా సదస్సు ని ఈసారి భారతదేశం నిర్వహించబోతోంది. ‘Mahatma Gandhi International Sanitation Convention’ అంటే "మహాత్మా గాంధీ అంతర్జాతీయ పరిశుభ్రతా సదస్సు" ప్రపంచవ్యాప్తంగా ఉన్న పరిశుభ్రతా మంత్రులు, ఈ రంగంలోని నిపుణులు ఒకటిగా వచ్చి ఈ పరిశుభ్రతా సదస్సులో తమతమ ప్రయోగాలు, అనుభవాలు పంచుకుంటారు. 2018 అక్టోబర్ రెండవ తేదీన బాపూ 150వ జయంతి ఉత్సవాల ప్రారంభం తో పాటూ ఈ ‘Mahatma Gandhi International Sanitation Convention’ పూర్తవుతుంది.
నా ప్రియమైన దేశప్రజలారా, సంస్కృతంలో ఒక మాట ఉంది – "న్యాయమూలం స్వరాజ్యం స్యాత్". అంటే స్వరాజ్య మూలంలోనే న్యాయం ఉంటుంది. న్యాయాన్ని గురించిన చర్చ జరిగినప్పుడు మానవ అధికారాల భావంలోనే పూర్తిగా అది అంతర్గతమై ఉంటుంది. శోషిత,పీడిత, వంచిత ప్రజలకు స్వతంత్రం, శాంతి, న్యాయం అందించాలంటే, అది ప్రత్యేకంగా అనివార్యమైన సంగతి. బాబా సాహెబ్ అంబేద్కర్ ద్వారా నిర్మితమైన రాజ్యాంగంలో పేదల ప్రాధమిక హక్కుల కోసం అనేక చట్టాలు చేయబడ్డాయి. వాటి దృష్టితో ప్రేరణ పొంది, 1993 అక్టోబర్ 12, న "జాతీయ మానవ హక్కుల కమిషన్ అంటే "‘National Human Rights Commission’ (NHRC) స్థాపించబడింది. కొద్ది రోజుల్లో NHRC పాతికేళ్ళు పూర్తిచేసుకోబోతోంది. NHRC కేవలం మానవ హక్కులను మాత్రమే రక్షించలేదు. మనవత గౌరవాన్ని కూడా పెంచే పని చేసింది ఈ కమీషన్. మన మాజీ ప్రధానీ, మన ప్రాణ ప్రియ నేత శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయ్ గారు స్పష్టంగా చెప్పారు – మానవ హక్కులనేవి మనకి పరాయివేమీ కాదు. మన జాతీయ మానవ హక్కుల కమిషన్ చిహ్నాంలో వైదిక కాలం నాటి ఆదర్శ సూత్రం "సర్వే భవంతు సుఖిన:" అంకితమై ఉంది. మానవ హక్కుల కోసం NHRC విస్తృతమైన అవగాహనని కల్పించింది. దానితో పాటూ ఇందులో ఆ హక్కుల దురుపయోగాన్ని అడ్డుకునేందుకు కూడా మెచ్చుకోదగ్గ పాత్రను వహించింది. పాతికేళ్ల ఈ ప్రయాణంలో దేశప్రజల్లో NHRC ఒక ఆశనీ, ఒక నమ్మకపు వాతావరణాన్నీ ఏర్పరిచింది. ఒక ఆరోగ్యకరమైన సమాజం కోసం , ఉత్తమ ప్రజాస్వామ్య విలువల కోసం ఇదొక పెద్ద ఆశాపూర్వకమైన ఘటన అని నా నమ్మకం. ఇవాళ జాతీయ స్థాయిలో మానవ హక్కుల పనితో పాటూ ఇరవై ఆరు దేశాల మానవ హక్కుల కమిషన్ కూడా స్థాపించబడింది. ఒక సమాజ రూపంలో మానవ హక్కులను అర్థం చేసుకుని, ఆచరణలోకి తెచ్చే ప్రయత్నం చెయ్యాల్సి ఉంది. ఇదే "సబ్ కా సాథ్, సబ్ కా వికాస్" – ’అందరి సహకారంతో -అందరికీ అభివృధ్ధి ’ అనే ఆలోచనకి ఆధారం.
నా ప్రియమైన దేశప్రజలారా, అక్టోబర్ నెలలో జయ ప్రకాశ్ నారాయణ్ గారి జయంతి ఉంది. ఇదే నెలలో రాజమాత విజయరాజే సింధియా గారి శతాబ్ది జయంతి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ మహా పురుషులందరూ మనకి ప్రేరణాత్మకమైనవారు. వారికి నా నమస్సులు. అక్టోబర్ 31 వ తేదీన సర్దార్ సాహెబ్ జయంతి ఉంది. వీరి గురించి రాబోయే మన్ కీ బాత్ లో నేను వివరంగా చెప్తాను కానీ ఇవాళ మాత్రం నేను తప్పకుండా ఈ ప్రస్తావన చెయ్యలనుకున్నాను. గత కొన్నేళ్ళ నుండీ సర్దార్ సాహెబ్ జయంతి అయిన అక్టోబర్ 31 నాడు "రన్ ఫర్ యూనిటీ" అని భారతదేశంలో ప్రతి చిన్న- పెద్ద పట్టణాల్లో, ప్రాంతాల్లో, పల్లెల్లో "రన్ ఫర్ యూనిటీ" ఏర్పాటుచేయడం జరుగుతోంది. ఈసారి కూడా మనం ప్రయత్నపూర్వకంగా ప్రతి చిన్న- పెద్ద పట్టణాల్లో, ప్రాంతాల్లో, పల్లెల్లో ఈ "రన్ ఫర్ యూనిటీ"ని ఏర్పాటుచేద్దాం. "రన్ ఫర్ యూనిటీ" అనే కార్యక్రమం సర్దార్ సాహెబ్ ను గుర్తుచేసుకుందుకు ఉత్తమ మార్గం. ఎందుకంటే ఈయన జీవితమంతా భారతదేశ సమైక్యత కోసం పాటుపడ్డారు. అక్టోబర్ 31 న "రన్ ఫర్ యూనిటీ" ద్వారా సమాజంలో ప్రతి వర్గాన్నీ, దేశంలోని ప్రతి ప్రాంతాన్నీ సమైక్యతాభావంతో ముడిపెట్టేందుకు మనం చేసే ప్రయత్నాలన్నింటికీ మనం బలాన్నిద్దాం. ఇదే ఆయనకు మనం ఇచ్చే చక్కని శ్రధ్ధాంజలి.
నా ప్రియమైన దేశప్రజలారా, నవరాత్రి , దుర్గా పూజ లేదా విజయదశమి ఏ పేరైనా ఈ పవిత్ర పండుగల సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వకంగా అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! యావత్ భారతదేశం ఇవాళ పవిత్రమైన రక్షాబంధనం పండుగను జరుపుకుంటోంది. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకంక్షలు. సోదర, సోదరీమణుల మధ్యన ఉన్న ప్రేమాభిమానాలకీ, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకానికీ ప్రతీక ఈ రక్షాబంధనం పండుగ . ఈ పండుగ సామాజిక సహృదయతకి కూడా పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. రెండు వేరు వేరు రాజ్యాలకు లేదా మతాలకు చెందిన మనుషులను ఒక్క రక్షా బంధనం అనే నమ్మకపు దారంతో ముడిపెట్టి ఒకటిగా చేసిన ఎన్నో కథలు మన దేశ చరిత్రలో ఉన్నాయి. కొద్ది రోజుల్లో జన్మాష్టమి పండుగ కూడా రాబోతోంది. మొత్తం వాతావరణమంతా ఏనుగులు, గుర్రాలు, పల్లకీ.. శ్రీ కృషునికీ జై, గోవింద, గోవింద అనే జయజయధ్వానాలతో నిండిపోబోతోంది. శ్రీ కృష్ణుని రంగులో కలిసిపోయి ఆ భగవత్ ప్రేమలో జోగడమనేది ఒక సహజమైన ఆనందం. ఆ ఆనుభూతే వేరు. దేశంలోని అనేక ప్రాంతాల్లో , ప్రత్యేకంగా మహారాష్ట్ర రాష్ట్రంలో యువకులు ఉట్టికుండలు తయారు చేస్తూ ఉండి ఉంటారు. రక్షాబంధనం, ఇంకా కృష్ణాష్టమి సందర్భంగా దేశ ప్రజలందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు.
"ప్రధానమంత్రి మహోదయ్, నమస్కారః ! అహం చిన్మయి, బెంగుళూరు నగరే విజయభారతి విద్యాలయే దశమ కక్షాయాయాం పఠామి. మహోదయ్ అద్య సంస్కృత్ దినమస్తి. సంస్కృత్ భాష సరల్ ఇతి సర్వే వదంతి. సంస్కృత్ భాషా వయ్ మత్ర్ వహ: అత: సంభాషణమ్ అపి కుమ్ర: ! అత: సంస్కృతస్య మహత్వ: విషయే భవత: గహ: అభిప్రాయ: ఇతి రూపయావదతు !"
భగినీ చిన్మయీ,
భవతి సంస్కృత్ -ప్రశ్నం పృష్టవతి.
బహుత్తమమ్. బహుత్తమమ్.
అహం భవత్యా: అభినందనం కరోమి.
సంస్కృత్ -సప్తాహ్ -నిమిత్తం దేశవాసీనాం
సర్వోషామ్ కృతే మమ హార్దిక – శుభకామనా:
ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు గానూ ఆడబిడ్డ చిన్మయి కి ఎంతో కృతజ్ఞతలు. మిత్రులారా, శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం తో పాటుగా సంస్కృత భాషా దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం. ఈ గొప్ప వారసత్వాన్ని పరిరక్షించి, అలంకరించి, సామాన్య ప్రజలకు అందించడానికి పాటుపడుతున్న ప్రజలందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. ప్రతి భాషకీ తనదైన ఒక వైభవం ఉంటుంది. ప్రపంచంలోకెల్లా పురాతనమైన భాష తమిళ భాష. ఇది దేశప్రజలందరూ గర్వించదగ్గ విషయం. వేదకాలం నుండీ వర్తమాన కాలం వరకూ సంస్కృత భాష కూడా జ్ఞానాన్ని పంచడంలో ఎంతో పెద్ద పాత్రను వహించింది. మన భారతీయులందరం ఈ విషయాన్ని ఎంతో గర్వంగా చెప్పుకుంటాము.
జీవితంలోని ప్రతి అంశంతో ముడిపడి ఉన్న జ్ఞాన భాంఢారం సంస్కృత భాషలోనూ, సంస్కృత సాహిత్యంలోనూ ఉంది. అది విజ్ఞానం, తంత్రవిద్య, వ్యవసాయ విజ్ఞానం, ఆరోగ్య శాస్త్రం, శిల్పశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం, గణిత శాస్త్రం, మేనేజ్మెంట్ , ఆర్థికశాస్త్రం, పర్యావరణం.. ఇలా ఏ శాస్త్రమైనా సరే. గ్లోబల్ వార్మింగ్ సమస్యని పరిష్కరించే సమాధానాలు మన వేదాల్లో విస్తారంగా రాసిపెట్టి ఉన్నాయని అంటారు. కర్ణాటక రాష్ట్రం లోని శివమోగ జిల్లాలోని మట్టూరు గ్రామంలో నివసించే ప్రజలు ఇవాళ్టికి కూడా సంస్కృత భాషలోనే మాట్లాడుకుంటారు. తెలుసా! ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం.
ఒక సంగతి వింటే మీరు ఆశ్చర్యపోతారు – అనంతమైన ఎన్నో కొత్త పదాలని నిర్మించడానికి అనువైన భాష సంస్కృత భాష. 2000 ధాతువులు, 200 ప్రత్యయాలు అంటే సఫిక్స్ లు, 22 ఉపసర్గలు అంటే ప్రిఫిక్స్ లు, ఇంకా సమాజం నుండి లెఖ్ఖలేనన్ని పదాలని తయారుచేయడం ఈ భాషలో వీలుపడుతుంది. అందువల్లే ఎన్నో సూక్ష్మమైన చిన్న చిన్న విషయాలను కూడా ఈ భాషలో ఖచ్చితంగా వర్ణించగలము. ఇవాళ్టికి కూడా మనం ఏదైనా విషయాన్ని గట్టిగా చెప్పాలంటే దానికి ఒక ఆంగ్ల సామెతని కలిపి చెప్తూ ఉంటాము. ఒకోసారి కవితలు, కవిత్వాల సహాయం కూడా తీసుకుంటాము. కానీ సంస్కృత సుభాషితాలతో పరిచయం ఉన్నవారికి ఒక సంగతి తెలుసు. అదేమిటంటే, తాము చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా నిశ్చితంగా అతి తక్కువ పదాలతో ఈ భాషలో ఉన్న సుభాషితాల ద్వారా తెలియచేయవచ్చు. ఇది సంస్కృత భాషకి ఉన్న మరో ప్రత్యేకత. ఈ సుభాషితాలు మన మాతృభూమితో, మన సంప్రదాయంతో ముడిపడి ఉన్నవి కావడం వల్ల దీనిని అర్థం చేసుకోవడం కూడా సులభం.
దీనికి ఒక ఉదాహరణ – జీవితంలో గురువు ప్రాముఖ్యత ఎటువంటిదో తెలియచేయడానికి సంస్కృతంలో ఏమన్నారంటే –
" ఏకమపి అక్షరమస్తూ, గురు: శిష్యాం ప్రభోదయేత్
పృథివ్యాం నాస్తి తద్ – ద్రవ్యం, యద్ – దత్వా హయనృణీ భవేత్"
ఈ వాక్యాలకి అర్ధం ఏమిటంటే, గురువు తన శిష్యులకి ఒక్క అక్షరం జ్ఞానాన్ని అందించినా సరే, ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి సరిపడే వస్తువుగానీ, ధనం గానీ ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేవు – అని. రాబోయే ఉపాధ్యాయ దీనోత్సవాన్ని మనందరమూ ఇదే భావంతో జరుపుకుందాం. జ్ఞానము, గురువు రెండూ కూడా విలువకట్టలేవి, వెల కట్టలేనివి, అమూల్యమైనవి. తల్లి తరువాత పిల్లల ఆలోచనలను సరైన మార్గంలో పెట్టగల బాధ్యతను తమపై పెట్టుకునేది గురువులే. ఆ బాధ్యత తాలూకూ ప్రభావం జీవితమంతా కనబడుతూనే ఉంటుంది. ఉపాధ్యాయ దీనోత్సవం సందర్భంగా మన దేశ మాజీ రాష్ట్రపతి, గొప్ప ఆలోచనాపరుడు , భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని మనం ఎప్పుడూ గుర్తుచేసుకుంటాము. వారి జయంతినే దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటుంది. దేశంలోని ఉపాధ్యాయులందరికీ రాబోయే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దానితో పాటూగా విజ్ఞానం, విద్య, విద్యార్థుల పట్ల మీకున్న సమర్పణాభావాన్ని అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, కష్టించి పనిచేసే మన రైతులకు ఎన్నో ఆశలను తీసుకువస్తుంది ఈ వర్షాకాలం . తీవ్రమైన ఎండతో ఎండిపోయిన చెట్లకు, మొక్కలకు, ఎండిపోయిన నదులకు సేద తీరుస్తుంది. కానీ అప్పుడప్పుడు ఈ వర్షాకాలం అతివృష్టిని, వినాశనాన్ని కలిగించే వరదలను కూడా తీసుకువస్తుంది. కొన్ని చోట్ల తక్కువ వర్షాన్నీ, మరి కొన్న చోట్ల అంతకన్నా ఎక్కువ వర్షాన్నీ కురిపిస్తోంది ప్రకృతి. ఈమధ్య కేరళలో వచ్చిన భయంకరమైన వరదలను మనందరమూ చూశాం. ఈ వరదలు ప్రజల జీవితాలను పూర్తిగా దెబ్బ తీశాయి. ఇటివంటి కఠిన పరిస్థితుల్లో దేశమంతా కలిసికట్టుగా కేరళ రాష్ట్రానికి సహాయంగా నిలిచింది.
తమ కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి మనందరి సానుభూతి ఉంది. జీవితాలను కోల్పోయినవారికి తిరిగి ప్రాణాలు పొయ్యలేము కానీ శోకతప్త కుటుంబాలకు ఒక్క సంగతి మాత్రం చెప్పగలను. ఏమిటంటే, ఇటువంటీ దు:ఖమయ వాతావరణంలో నూటపాతికకోట్ల దేశప్రజలందరూ కూడా మీకు తోడుగా నిలబడి ఉన్నారని నమ్మకంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ వరదల్లో గాయపడిన ప్రజలు త్వరగా ఆరోగ్యవంతులు కావాలని ప్రార్థిస్తున్నాను. రాష్ట్రంలోని ప్రజల ఆత్మబలంతోనూ, అసాధారణ సాహసాల బలంతోనే కేరళ రాష్ట్రం తిరిగి నిలబడగలదని నేను నమ్ముతున్నాను.
ప్రమాదాలు తమ వెనుక వదిలిపెట్టి వెళ్ళే వినాశనాలు దుర్భాగ్యమైనవి. కానీ ప్రమాదాలు జరిగినప్పుడే మానవత్వం అంటే ఏమిటో మనకు అర్థం అవుతుంది. కచ్ నుండి కామ్ రూప్ వరకూ, కశ్మీరు నుండీ కన్యాకుమారీ వరకూ ప్రతిఒక్కరూ తమ తమ పరిధిలో ఏదో ఒక సహాయం చేస్తూనే ఉన్నారు. కేరళ లో అయినా దేశంలోని మరే ఇతర ప్రదేశం లో అయినా, ఏ జిల్లా అయినా, ఏ ప్రాంతం అయినా ప్రజల జీవితాలు తిరిగి మామూలుగా అవడానికి ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. అన్ని వయస్కుల వారూ, ప్రతి రంగానికీ చెందిన వారూ తమ సహకారాన్ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కేరళ రాష్ట్రంలోని కష్టాలను తగ్గించాలని, వారి దు:ఖాన్ని పంచుకోవాలని ఖచ్చితంగా ప్రయతిస్తున్నారు. కేరళలో జరుగుతున్న రక్షణా కార్యక్రమాలకు సాయుధ బలగాల సైనికులే నాయకులని మనందరికీ తెలుసు. వరదల్లో చిక్కుకుపోయినవారిని రక్షించడంలో వారు ఏ అవకాశాన్నీ వదలలేదు. air force కాని, navy కాని, army కాని, BSF,CISF, RAF, ప్రతి ఒక్కరూ కూడా సహాయక, రక్షణా ప్రయత్నాల్లో ఎంతో పెద్ద పాత్రను వహించారు. NDRF వీరుల కఠిన పరిశ్రమను గురించి నేను ప్రత్యేకంగా చెప్పలనుకుంటున్నాను. ఇటువంటి కష్టకాలంలో వారు ఎంతో ఉత్తమమైన సహాయం చేశారు. NDRF వీరుల సామర్థ్యం, వారి కమిట్మెంట్, చురుకైన నిర్ణయం తీసుకుని పరిస్థితులను అదుపులో పెట్టేందుకు చేసిన ప్రయత్నం ప్రతి భారతీయుడూ దృష్టి పెట్టవలసిన విషయంగా నిలిచింది. నిన్న ఓణమ్ పండుగ. ఈ ప్రమాదం నుండి అతి త్వరగా బయటకు రావడానికి దేశానికీ, ముఖ్యంగా కేరళ రాష్ట్రానికీ ఈ ఓణమ్ పండుగ శక్తిని ఇవ్వాలని, తద్వారా కేరళ రాష్ట్ర పునరాభివృధ్ధి వేగవంతం అవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. కేరళ ప్రజలకూ, దేశవ్యాప్తంగా విపత్తు సంభవించిన ఇతర ప్రాంతాలవారికీ, దేశమంతా వారికి తోడుగా ఉందని మరోసారి దేశవాసులందరి తరఫునా నేను నమ్మకంగా చెప్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, ఈ సారి మన్ కీ బాత్ కోసం వచ్చిన సూచనలను నేను చూస్తూంటే నాకు ఎక్కువగా వచ్చిన సందేశాలు ఒకే విషయం గురించి. అవి శ్రీ అటల్ బిహారీ వాజ్పాయ్ గురించి. ఘాజియాబాద్ నుండి కీర్తి, సోనీ పత్ నుండి స్వాతి వత్స్, కేరళ నుండి సోదరుడు ప్రవీణ్, పశ్చిమ బెంగాల్ నుండి డాక్టర్ స్వపన్ బెనర్జీ, బిహార్ లోని కటిహార్ నుండి అఖిలేశ్ పాండే మొదలైన ఎందరో అసంఖ్యాకులు నరేంద్ర మోదీ యాప్ లో, మై గౌ లోనూ అటల్ గారి జీవితంలోని విభిన్న దృష్టికోణాలను గురించి నన్ను మాట్లాడమని తమ సందేశాలలో కోరారు. ఆగస్టు పదహారవ తేదీన అటల్ గారి మరణ వార్తను విన్న ప్రపంచము, దేశమూ శోకసంద్రంలో మునిగిపోయింది. పధ్నాలుగు ఏళ్ల క్రితమే ప్రధానమంత్రి పదవిని వదిలిపెట్టేసిన ఒక గొప్ప దేశాధినేత ఆయన. ఒకరకంగా చెప్పాలంటే గత పదేళ్ళుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా వెళ్ళారు ఆయన. వార్తల్లో కూడా ఎక్కడా కనబడేవారు కాదు. బహిరంగంగా కూడా ఎక్కడా కనబడలేదు. పదేళ్ల కాలం అంటే చాలా ఎక్కువ కాలం కిందే లెఖ్ఖ. కానీ భారతదేశ సామాన్య ప్రజల మనసుల్లో ఈ పదేళ్ల కాలం ఒక్క క్షణం అంతరాయాన్ని కూడా కలిగించలేదని ఆగస్టు పదహారవ తేదీ తర్వాత తెలిసింది. అటల్ గారి మరణవార్త వినగానే దేశప్రజలందరిలో ఎటువంటి స్నేహభావమూ, ఎటువంటి శ్రధ్ధ, దు:ఖ్ఖమూ కలిగాయో చూస్తేనే చాలు, ఆయనదెంత విశాలమైన వ్యక్తిత్వమో మనకు అర్థం అవుతుంది. గత కొద్ది రోజులలో అటల్ గారి వ్యక్తిత్వంలోని ఉత్తమమైన అంశాలు మనందరికీ బాగా తెలిసాయి. ప్రజలు ఆయనను ఉత్తమ పార్లమెంట్ సభ్యుడిగా, సున్నితమైన రచయితగా, గొప్ప వక్తగా, ప్రియమైన నాయకుడిగా తలుచుకున్నారు. ఇకపై తలుచుకుంటారు కూడా. సుపరిపాలనను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చిన కారణంగా అటల్ గారికి దేశం ఋణపడి ఉంటుంది. కానీ ఇవాళ నేను అటల్ గారి వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని కేవలం గుర్తుచేసుకోవాలని అనుకుంటున్నాను. అటల్ గారు భారతదేశానికి ఒక గొప్ప రాజకీయ వ్యవస్థని అందించారు. రాజకీయ వ్యవస్థలో మర్పు తేవాలని ప్రయత్నించారు. ఆయన కోరుకున్న మార్పుని సమాజ నిర్మాణానికి ఉపయోగించాలని ప్రయత్నించారు. దానివల్ల సమాజానికి ఎంతో లాభం జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో లాభం కలగబోతోంది. ఇది ఖాయం. 2003 లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణ చట్టానికి కారణమైన అటల్ గారికి మన కృతజ్ఞతలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ సవరణ భారత రాజకీయాలలో రెండు ముఖ్యమైన మార్పులను తెచ్చింది.
మొదటి మార్పు ఏమిటంటే, రాష్ట్రాలలో మంత్రిమండలి సంఖ్య విధానసభ సీట్ల సంఖ్యలో పదిహేను శాతానికి పరిమితము. రెండవది ఏమిటంటే, పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల సంఖ్య మూడింట ఒక వంతు నుండీ ముడింట రెండువంతులు చెయ్యబడింది. దానితో పాటుగా పార్టీ ఫిరాయింపు చేసేవారిని అయోగ్యులుగా నిర్ధారించవచ్చని స్పష్టంగా మార్గనిర్దేశం చెయ్యబడింది.
భారతదేశంలో చాలా ఏళ్ల వరకూ ఎక్కువమంది మంత్రులతో మంత్రిమండలి తయారుచేసే రాజకీయ సంస్కృతి ఉండేది. ఈ కారణంగా పెద్ద పెద్ద జంబో మంత్రిమండలులు విధులను నిర్వహించడానికి కాకుండా రాజకీయ నాయకులను సంతోష పరచడానికి మాత్రమే ఏర్పడేవి. అటల్ గారు దీనిని మార్చేసారు. అందువల్ల డబ్బు ఆదా అయింది. వనరులు ఆదా అయ్యాయి. దీనివల్ల కార్యదక్షత పెరిగింది. అటల్ గారి వంటి దూరదృష్టిగలవారి వల్లే ఈ పరిస్థితులు మారాయి. మన రాజకీయ సంస్కృతిలో ఆరోగ్యకరమైన సంప్రదాయాలు పెరగడం మొదలుపెట్టాయి. అటల్ గారు ఒక నిజమైన దేశభక్తుడు. వారి పరిపాలనలోనే బజెట్ ప్రవేశపెట్టే సమయంలో మార్పు జరిగింది. మొదట్లో ఆంగ్లేయుల సంప్రదాయం ప్రకారం లండన్ లో పార్లమెంట్ జరిగే సమయం కాబట్టి , సాయంత్రం ఐదింటికి బజట్ ను ప్రవేశపెట్టేవారు. 2001 లో అటల్ గారు సాయంత్రం ఐదింటి సమయాన్ని , ఉదయం పదకొండింటికి గా మార్చారు. అటల్ గారి పాలనలోనే మరొక మార్పు కూడా జరిగింది. ఇండియన్ ఫ్లాగ్ కోడ్ తయారైంది. 2002లో దీనిని అధికారికంగా గుర్తించారు. ఈ కోడ్ కారణంగానే ఎన్నో నియమాలు తయరైయ్యాయి. వాటివల్లే బహిరంగ ప్రదేశాలలో కూడా త్రివర్ణపతాకం ఎగురగలిగింది. దీనివల్లే ఎందరో భారతీయులకు తమ దేశ పతాకాన్ని ఎగురవేసే అవకాశం లభించింది. ఈ విధంగా మన ప్రాణప్రదమైన త్రివర్ణపతాకాన్ని సాధారణ పౌరుల మధ్యకు తీసుకువచ్చారు. ఈ విధంగా అటల్ గారు దేశంలో ఎన్నికల కార్యక్రమం అయినా, ప్రజా ప్రతినిధుల సంబంధించిన విషయమైనా. వాటికీ సాహసవంతమైన అడుగులు వేసి సమూలమైన మార్పులు తీసుకువచ్చారు. అదే విధంగా దేశంలో ఒకేసారి రాష్ట్రాలకి, కేంద్రానికీ ఎన్నికలు జరపాలనే చర్చలు జరుగుతుండటం మీరు చూస్తున్నారు. ఈ విషయానికి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ ప్రజలు తమ తమ అభిప్రాయాలను తెపియచేస్తున్నారు. ఇది మంచి విషయం. ప్రజాస్వామ్యానికి ఇది ఒక మంచి శుభపరిణామం. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికీ, ఉత్తమమైన ప్రజాస్వామ్యానికీ, మంచి సంప్రదాయాలని అందించడం, ప్రజాస్వామ్యాన్ని శక్తివంతం చెయ్యడానికి నిరంతరం శ్రమించడం, నిష్పక్షపాతంగా చర్చలను జరపడం, మొదలైనవన్నీ కూడా అటల్ గారికి మనం ఇచ్చే ఉత్తమ శ్రధ్ధాంజలిగా నిలుస్తాయి. అటల్ గారు కలలు కన్న సమృధ్ధి చెందిన, అభివృధ్ధి పొందిన భారతదేశం కలను నిజం చెయ్యాలనే సంకల్పాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ మనందరి తరఫునా అటల్ గారికి శ్రధ్ధాంజలిని అర్పిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, పార్లమెంట్ గురించి ఎప్పుడు చర్చలు వచ్చినా, ఎప్పుడూ పార్లమెంట్ సాగకపోవడం, గందరగోళం, వాయిదాలు గురించే మాట్లాడుకుంటారు. ఏదైనా మంచి జరిగినప్పుడు మాత్రం దాని గురించి ఎక్కువగా మాట్లాడరు. కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్ లో వర్షాకాల సమావేశాలు పూర్తయ్యాయి. లోక్ సభలో కార్యనిర్వహణ నూట పధ్ధెనిమిది శాతం, రాజ్య సభలో కార్యనిర్వహణ డెభ్బై నాలుగు శాతం గా నిలిచింది. పార్టీ ప్రయోజనాలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులందరూ ఈ వర్షాకాల సమావేశాలను వీలయినంత ఎక్కువగా ఉపయోగకరంగా మార్చాలని ప్రయత్నించారు. దీనికి పరిణామంగా లోక్ సభలో ఇరవై ఒకటి, రాజ్య సభలో పధ్నాలుగు బిల్స్ ఆమోదించబడ్డాయి. పార్లమెంట్ లోని ఈ వర్షాకాల సమావేశాలు సామాజిక న్యాయం, ఇంకా యువజనుల అభివృధ్ధి సమావేశాల రూపంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సమావేశాలలో యువతకూ, వెనుకబడిన వర్గాలకూ ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైన బిల్లులు అమోదించబడ్డాయి. దశాబ్దాల నుండీ SC/ST కమీషన్ లాగ OBC కమీషన్ ని కూడా ఏర్పరచాలనే కోరిక ఉంది. వెనుకబడిన వర్గాలవారి అధికారాలను సునిశ్చితం చెయ్యడానికి దేశం ఈసారి OBC కమీషన్ ను నియమించాలనే సంకల్పాన్ని నెరవేర్చింది. దానికి ఒక రాజ్యాంగ అధికారాన్ని కూడా ఇచ్చింది. సామాజిక న్యాయం అనే లక్ష్యాన్ని ఇది ముందుకు తీసుకువెళుతుంది. షడ్యూల్డ్ తెగల , షడ్యూల్డ్ జాతుల అధికారాలను కాపాడడానికి రాజ్యాంగ సవరణ బిల్లు కూడా సమావేశాలలో ఆమోదించబడింది. ఈ చట్టం షడ్యూల్డ్ తెగల , షడ్యూల్డ్ జాతుల సంక్షేమాన్ని సురక్షితం చేస్తుంది. దానితో పాటు ఇది అపరాధులను అత్యాచారాలను చెయ్యకుండా ఆపుచేసి, దళిత వర్గాల్లో విశ్వాసాన్ని నింపుతుంది.
ఏ సభ్య సమాజమైనా దేశంలో స్త్రీ శక్తి కి వ్యతిరేకంగా జరిగే ఏలాంటి అన్యాయాన్నైనా సహించదు. బలాత్కార దోషులను సహించడానికి దేశం సిధ్ధంగా లేదు. అందువల్ల పార్లమెంట్ అపరాధ చట్ట సవరణ బిల్లు ని ప్రవేశపెట్టి కఠిన శిక్షని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం దుశ్చర్యలను చేసే దోషులకు కనీసం పదేళ్ల తక్కువకాకుండా శిక్ష, పన్నెండేళ్ల లోపూ బాలికపలై అత్యాచారం చేసినవారికి ఉరిశిక్షను విధిస్తారు.
కొద్ది రోజుల క్రితం మీరు వార్తాపత్రికలలో చదివే ఉంటారు, మధ్య ప్రదేశ్ లోని మందశౌర్ లో ఒక న్యాయస్థానం కేవలం రెండు నెలల విచారణ తరువాత మైనరు బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు దోషులకు ఉరిశిక్షను విధించింది. అంతకు ముందు మధ్యప్రదేశ్ లో కఠనీ లో ఒక న్యాయాస్థానంలో కేవలం ఐదు రోజుల విచారణ తరువాత దోషులకు ఉరిశిక్ష పడింది. రాజస్థాన్ లో కూడా అక్కడి న్యాయస్థానాలు కొన్ని ఇలాంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ చట్టం మహిళలపై, బాలికలపై జరిగే అన్యాయాలను ఆపడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. సమాజంలో మార్పు లేని ఆర్థిక అభివృధ్ధి అసంపూర్ణంగానే ఉంటుంది. లోక్ సభలో త్రిపుల్ తలాఖ్ బిల్లు అమోదించబడింది. కానీ రాజ్య సభలో ఈసారి సమావేశాలలో ఇది జరగలేదు. ముస్లిం మహిళలకు న్యాయాన్ని అందించడానికి యావత్ దేశం సర్వశక్తులతో వారికి తోడుగా నిలబడి ఉందని నేను నమ్మకంగా చెప్తున్నాను. దేశహితం కోసం మనం ముందుకు నడిచినప్పుడు పేదవారు, వెనుకబడినవారు, పీడితుల,వంచితుల జీవితాలలో మార్పుని తీసుకురాగలము. వర్షాకల సమావేశాలలో ఈసారి అందరూ కలిసి ఒక ఆదర్శాన్ని నిలబెట్టారు. దేశంలోని పార్లమెంట్ సభ్యులందరికీ బహిరంగంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, ఈ రోజుల్లో కోట్లాది ప్రజల దృష్టి జకార్తా లో జరుగుతున్న ఆసియాక్రీడలపై ఉంది. ప్రతిరోజూ ఉదయం ప్రజలు వార్తాపత్రికలలో, టెలివిజన్ లో, సమాచారాలలో, సోషల్ మీడియాలపై దృష్టిని సారిస్తున్నారు. ఈరోజు ఏ భారతీయ క్రీడాకారుడు మెడల్ సాధించాడా అని చూస్తున్నారు. ఆసియాక్రీడలు ఇంకా జరుగుతున్నాయి. నేను దేశం కోసం పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా పోటీలలో ఆడాల్సి ఉన్న క్రీడాకారులకు అనేకానేక శుభాకాంక్షలు.
భారత దేశ క్రీడాకారులు ముఖ్యంగా షూటింగ్ , రెస్లింగ్ లలో ఉత్తమమైన ప్రతిభను చూపెడుతున్నారు. ఇంతకు ముందు సరైన ప్రతిభను చూపెట్టని విభాగాలలో కూడా మన క్రీడాకారులు ప్రతిభను కనబరుస్తున్నారు. వూషు, రోయింగ్ మొదలైన ఆటలలో భారతీయులు సాధించినవి పతకాలు మాత్రమే కాదు. భారతీయ క్రీడాకారుల ఆకాశాన్నంటే ఆశయాలకు, ఆకాంక్షలకూ ఇవి ప్రమాణాలు. దేశానికి పతకాలు సాధించినవారిలో ఎక్కువమంది ఆడపడుచులు ఉన్నారు. ఇది చాలా శుభ సంకేతం. పతకాలు సాధించే యువ క్రీడాకారుల్లో పదిహేను, పదహారు సంవత్సరాల యువత కూడా ఉన్నారు. ఇది కూడా చాలామంచి సంకేతమే. వీరిలో చాలామంది చిన్న చిన్న ప్రాంతాలకూ, గ్రామాలకు చెందినవారు. ఈ యువకులందరూ కఠిన పరిశ్రమతో ఈ విజయాలను సాధించారు. ఆగష్టు 29 న మనం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటాము. ఈ సందర్భంగా క్రీడాప్రేమికులందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దానితో పాటుగా హాకీ మాంత్రికుడు, గొప్ప క్రీడాకారుడు శ్రీ ధ్యాన్ చంద్ గారికి నా శ్రధ్ధాంజలి అర్పిస్తున్నాను. దేశంలోని ప్రజలందరూ తప్పనిసరిగా ఆటలు ఆడాలనీ, తమ ఫిట్ నెస్ పై దృష్టిని పెట్టాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆరోగ్య భారతదేశమే, సంపన్న , సమృధ్ధ భారతదేశాన్ని నిర్మించగలదు. భారతదేశం ఫిట్ గా ఉంటేనే భారతదేశ ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మితమౌతుంది. ఆసియాక్రిడల్లో పతకాలు సాధించిన విజేతలకు మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. దానితో పాటుగా ఇతర క్రీడాకారులు కూడా అత్యుత్తమ ప్రదర్శనను చూపెట్టాలను కోరుకుంటున్నాను. అందరికీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.
ప్రధానమంత్రి గారూ, నమస్కారం! నేను కాన్పూర్ నుండి భావనా త్రిపాఠి ని మాట్లాడుతున్నాను. నేను ఒక ఇంజినీరింగ్ విద్యార్థినిని.
గతసారి మన్ కీ బాత్ లో మీరు కాలేజ్ లో చేరబోతున్న విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడారు. అంతకు ముందు కూడా మీరు డాక్టర్లతో, చార్టర్డ్ అకౌంటెంట్స్ తో మాటాడారు. నా నుంచి మీకు ఒక విన్నపం. సెప్టెంబర్ పదిహేను న మనం జరుపుకునే ఇంజనీర్స్ డే సందర్భంగా మీరు మా ఇంజనీరింగ్ విద్యార్థినీ విద్యార్థులతో కొన్ని కబుర్లు చెప్తే, మా అందరికీ మనస్థైర్యం పెరుగుతుంది. ఆనందం కలుగుతుంది. భవిష్యత్తులో మాకు దేశం కోసం ఏదైనా చెయ్యడానికి ప్రోత్సాహం లభిస్తుంది."
నమస్తే భావన గారూ! మీ ఆలోచనను నేను గౌరవిస్తున్నాను. మనందరమూ కూడా ఇటుకలు, రాళ్ళతో ఇళ్ళూ, భవనాలు తయారవడం చూశాము. దాదాపు పన్నెండు వందల ఏళ్ల క్రితం ఒక విశాలమైన కొండను, అది కూడా ఏక శిల కొండ. ఆ కొండను ఒక విశాలమైన, గొప్ప ఆలయంగా రూపొందించారు. మీరు ఊహించగలరా? కానీ అలా జరిగింది. మహారాష్ట్ర లో ఎల్లోరాలో ఉన్న కైలాశ్ నాథ్ ఆలయం అది. దాదాపు వెయ్యి ఏళ్లకు పూర్వం అరవై మీటర్ల కన్నా ఎక్కువ పొడువు ఉన్న ఒక్క స్థంభాన్ని గ్రానైట్ తో నిర్మించారని, ఆ స్థంభం పై దాదాపు ఎనభై టన్నుల గ్రెనైట్ శిలను నిలబెట్టారని మీకు ఎవరైనా చెప్తే మీరు నమ్ముతారా? తమిళ్నాడులోని తంజావూర్ లోని బృహదీశ్వర ఆలయంలో శిల్ప కళ, ఇంకా ఇంజనీరింగ్ తాలూకూ నమ్మశక్యం గాని కలయికని చూడవచ్చు. గుజరాత్ లోని పాఠన్ లో పదకొండవ శతాబ్దపు ’రాణి కీ వావ్ ’ ని చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యచకితులౌతారు. భారత భూమి ఇంజనీరింగ్ తాలూకూ ప్రయోగశాలగా ఉండేది. భారతదేశంలో ఎంతో మంది ఇంజనీర్లు నమ్మశక్యం గాని కల్పనలకి రూపాన్ని ఇచ్చారు. ఇంజనీరింగ్ ప్రపంచంలో అద్భుతాలుగా చెప్పుకునేలాంటి ఉదాహరణలు రూపొందించారు. గొప్ప గొప్ప ఇంజనీర్లు ఉన్న మన సంప్రదాయంలో, తన పనులతో ఇవాళ్టికీ ప్రజలను ఆశ్చర్యచకితులను చేస్తున్నటువంటి మనకి లభించిన ఒక రత్నం ఎవరంటే – భారతరత్న డాక్టర్ ఎం.విశ్వేశ్వరయ్య. కావేరీ నదిపై ఆయన నిర్మించిన కృష్ణరాజ సాగర్ ఆనకట్ట వల్ల ఇవాళ్టికి కూడా లక్షల సంఖ్యలో రైతులు, సామాన్య ప్రజలు లాభాన్ని పొందుతున్నారు. వారి ప్రాంతంలో ఆయన పూజనీయులే. అంతేకాక దేశం యావత్తూ కూడా ఆయనను చాలా గౌరవంతోనూ, ఆత్మీయత తోనూ గుర్తుచేసుకుంటుంది. వారి గుర్తుగానే సెప్టెంబర్ పదిహేనవ తేదీని ఇంజనీర్స్ డే గా జరుపుకుంటాము. వారి అడుగుజాడల్లో నడుస్తున్న మన దేశ ఇంజినీర్లు యావత్ ప్రపంచంలో తమ ఉనికిని చాటుకున్నారు. ఇంజనీరింగ్ ప్రపంచంలోని అద్భుతాలను గురించి నేను మాట్లాడినప్పుడు, 2001 లో గుజరాత్ లోని కచ్ లో భూకంపం వచ్చినప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. అప్పుడు నేను ఒక వాలంటీరుగా అక్కడ పనిచేసాను. అప్పుడు ఒక గ్రామానికి నేను వెళ్ళినప్పుడు, వందేళ్ళు దాటిన ఒక తల్లిని కలిసే అవకాశం నాకు లభించింది. ఆమె మావైపు చూసి మమ్మల్ని హేళన చేస్తూ ఇలా చెప్పింది.. "చూడండి ఇది నా ఇల్లు. కచ్ లో దానిని ’భూంగా” అంటారు. ఈ ఇల్లు మూడు భూకంపాలను చూసింది. నేను స్వయంగా మూడు భూకంపాలను చూశాను. ఈ ఇంట్లోనే చూశాను. కానీ మీకెక్కడైనా ఏదైనా నష్టం జరిగినట్లు కనబడుతోందా? ఈ ఇంటిని మా పూర్వీకులు ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా, ప్రకృతికి అనుకూలంగా నిర్మించారు." అని గర్వంగా చెప్పింది.
అది విని నాకు ఏమనిపించిందంటే, శతాబ్దాలకు పూర్వమే ఆ కాలపు ఇంజనీర్లు స్థానీయ పరిస్థితులకు అనుగుణంగా, సామాన్య ప్రజలు సురక్షితంగా నివసించేలా ఇటువంటి నిర్మాణాలు చేసారు. ఇప్పుడు మనం ఇంజనీర్స్ డే ని జరుపుకుంటున్నప్పుడు మన భవిష్యత్తుని గురించి కూడా మనం ఆలోచించాలి. ప్రతి చోటా వర్క్ షాప్స్ పెట్టాలి. మారుతున్న కాలంలో మనం ఏ ఏ కొత్త విషయాలను నేర్చుకోవాలో? ఏ ఏ విషయాలను తెలుసుకోవాలో? ఏ ఏ విషయాలను కలుపుకోవాలో? మనకి తెలియాలి.
డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవాళ ఒక పెద్ద సవాలుగా మరింది. ప్రకృతి వైపరీత్యాలతో ప్రపంచం పోరాడుతోంది. ఇటువంటి సమయంలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఎలా రూపాంతరం చెందాలి? దానికి ఎటువంటి కోర్సులు ఉండాలి? విద్యార్థులకు ఏమి నేర్పించాలి? కట్టడాలు, నిర్మాణాలూ పర్యావరణానుకూలంగా ఎలా ఉండాలి? స్థానిక పదార్థాల వాల్యూ ఎడిషన్ చేసి, నిర్మాణాలను ఎలా ముందుకు తీశుకువెళ్ళాలి? జీరో వేస్ట్ అనేది మన మొదటి ప్రాధాన్యతగా ఎలా మారాలి? మొదలైన అనేక విషయాలను ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నప్పుడు మనం తప్పక ఆలోచించాల్సిన విషయాలు.
నా ప్రియమైన దేశప్రజలారా, ఇది పండుగల వాతావరణం. ఇప్పుడే దీపావళికి కూడా ప్రయత్నాలు మొదలైపోతాయి. మన్ కీ బాత్ లో కలుస్తూ ఉందాం. మనసులో మాటలు చెప్పుకుందాం. మనసుతో దేశాన్ని ముందుకు నడిపించడానికి కలిసికట్టుగా ఉందాం. ఇదే ఆలోచనతో మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.
నా ప్రియమైన దేశప్రజలందరికీ నమస్కారం! ఈమధ్యన చాలా చోట్ల వర్షాలు బాగా కురుస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొన్ని చోట్ల ఎక్కువగా వర్షాలు కురుస్తున్నాయని ఆందోళన పడుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కొన్ని ప్రదేశాల్లో ఇప్పటివరకూ అసలు వర్షాలే లేనందువల్ల ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. భారతదేశ వైశాల్యం, భిన్నత్వాలే కాక అప్పుడప్పుడు వర్షాలు కూడా తమ ఇష్టాఇష్టాలను చూపెడుతూ ఉంటాయి. కానీ మనం వర్షాలను తప్పుపట్టలేము. ప్రకృతితో విరోధాన్ని కొని తెచ్చుకున్నది మనుషులే. ఆ కారణంగానే అప్పుడప్పుడు ప్రకృతి మనపై అలక వహిస్తుంది. అందుకని ప్రకృతి ప్రేమికులుగా మారి, ప్రకృతిని రక్షించాల్సిన బాధ్యత మనకి ఉంది. మనం ప్రకృతికి ప్రతినిధులుగా మారినప్పుడే, కొన్ని ప్రకృతిపరమైన విషయాల్లో ఉండే సమతుల్యం అదే విధంగా నిలిచి ఉంటుంది.
కొన్ని రోజుల క్రితం అలాంటి ఒక ప్రకృతి వైపరీత్యం ఒకటి యావత్ ప్రపంచాన్నీ తన వైపుకు తిప్పుకుంది. మానవ హృదయాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందా సంఘటన. మీరంతా టీవీలలో చూసే ఉంటారు. థాయిలాండ్ లో పన్నెండుమంది జూనియర్ ఫుట్ బాల్ ఆటగాళ్ళ జట్టు, వారి కోచ్ విహారానికి ఒక గుహ లోకి వెళ్ళారు. సాధారణంగా ఆ గుహ లోకి వెళ్ళి, బయటకు రావడానికి కొన్ని గంటల సమయం పడుతుంది. కానీ ఆ రోజు విధి నిర్ణయం మరో విధంగా ఉంది. వాళ్ళు గుహలో బాగా లోపలికి వెళ్ళిన తరువాత హటాత్తుగా వర్షం పడినందువల్ల గుహ ద్వారం వద్ద చాలా నీరు నిలిచిపోయింది. ఆ కారణంగా వాళ్ళు బయటకు వచ్చే దారి మూసుకుపోయింది. బయటకు వచ్చేందుకు ఏ మార్గం దొరకక వాళ్ళంతా గుహ లోపల ఉన్న ఒక చిన్న దిబ్బ దగ్గర ఉండిపోయారు. ఒకటో, రెండు రోజులో కాదు, ఏకంగా పధ్ధెనిమిది రోజులు వరకూ అలానే ఉండిపోయారు! యుక్తవయసులో ఉండగా మరణం ఎదురైతే, క్షణ క్షణం ఆ దుస్థితిలో గడపాల్సి వస్తే, ఆ క్షణాలు ఎలా ఉంటాయో మీరు ఊహించగలరు కదా.
ఒక వైపు వాళ్ళు ఆపదతో పోరాడుతుంటే, మరోవైపు యావత్ ప్రపంచం లోని మానవజాతంతా ఏకమై భగవంతుడు ప్రసాదించిన మానవతా విలువలను ప్రదర్శించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఈ పిల్లలు సురక్షితంగా బయట పడాలని ప్రార్థనలు చేశారు. ఆ పిల్లలు ఎక్కడ చిక్కుకుపోయారో, ఏ పరిస్థితిలో ఉన్నారో, తెలుసుకునేందుకు వీలయినన్ని ప్రయత్నాలు చేశారు. వాళ్లని బయటకు ఎలా తీసుకురావాలి? ఒకవేళ సకాలంలో వారిని రక్షించడం కుదరకపోతే వర్షాకాలం ముగిసేవరకూ వారిని బయటకు తీసుకురావడం అసంభవం. అదృష్టవశాత్తూ వారు సురక్షితంగా ఉన్నారన్న శుభవార్త రాగానే ప్రపంచవ్యాప్తంగా అందరూ శాంతించారు, ఆనందించారు. కానీ ఈ రక్షణా కార్యక్రమం మొత్తం ఎలా జరిగింది అనే విషయాన్ని నేను మరో దృష్టితో గమనించాను. ప్రతి స్థాయిలోనూ కనబడిన పరిపూర్ణమైన బాధ్యత అద్భుతంగా తోచింది. ప్రభుత్వం , పిల్లల తల్లిదండ్రులు, వారి కుటుంబసభ్యులు, మీడియా, దేశ ప్రజలు, అందరూ కూడా ప్రశాంతంగా, ధైర్యాలను అద్భుతంగా ఆచరించి చూపెట్టారు. ప్రజలంతా ఒక జట్టుగా ఏర్పడి తమ లక్ష్య సాధనలో నిమగ్నమయ్యారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ చూపెట్టిన నిదానమైన వైఖరి – నేర్చుకోవాల్సిన, అర్థంచేసుకోవాల్సిన సంగతి. ఆ తల్లిదండ్రులు బాధపడలేదనో, వారి తల్లులు కన్నీళ్ళు పెట్టలేదనో కాదు నేను చెప్పేది, వారి ధైర్యం, సహనం, యావత్ సమాజం శాంతియుతంగా ఆ వ్యవహారాన్ని నడిపిన తీరు చూసి మనందరమూ ఎంతో నేర్చుకోవాలి.
ఈ మొత్తం వ్యవహారంలో ధాయ్ లాండ్ నావికాదళానికి చెందిన ఒక జవాను తన ప్రాణాలను కోల్పోయాడు కూడా. అటువంటి కఠిన పరిస్థితుల్లో, గుహ మొత్తం వర్షపు నీటితో నిండిపోయినప్పటికీ కూడా, ఆ చీకటి గుహలో ఎంతో ధైర్యసాహసాలతో వారంతా ఆశను విడిచిపెట్టలేదు. మానవత్వమంతా ఏకమైతే అద్భుతమైన విషయాలు జరుగుతాయని ఈ సంఘటన తెలుపుతుంది. కాస్త శాంతంగా, స్థిరమైన మనసుతో మన లక్ష్యంపై మనసు పెట్టి పనిచేస్తే చాలు.
కొద్ది రోజుల క్రితమే మన దేశానికి ప్రియమైన కవి నీరజ్ గారు మనల్ని వదిలివెళ్ళ పోయారు. ఆశ, నమ్మకం, ధృఢసంకల్పం, ఆత్మవిశ్వాసం మొదలైన గుణాలు నీరజ్ గారి ప్రత్యేకతలు. మన భారతీయులకు కూడా నీరజ్ గారి ప్రతి మాటా ఎంతో బలాన్ని ఇవ్వగలదు, ప్రేరణను అందించగలదు. ఆయన ఏమని రాశారంటే –
“అంధకారం అస్తమించే తీరుతుంది,
తుఫానులు ఎన్నైనా సృష్టించు,
పిడుగులు ఎన్నైనా కురిపించు,
దీపం వెలిగిందంటే ఇక అంధకారం అస్తమించే తీరుతుంది.”
నీరజ్ గారికి ఆదరణీయ శ్రధ్ధాంజలి .
“నమస్తే ప్రధానమంత్రి గారూ. నా పేరు సత్యం. ఢిల్లీ విశ్వవిద్యాలయం లో మొదటి సంవత్సరంలో అడ్మిట్ అయ్యాను. మా పాఠశాల బోర్డ్ పరీక్షల సమయంలో పరీక్షల వత్తిడిని ఎలా ఎదుర్కోవాలో, ఎలా చదువుకోవాలో మీరు మాకు చెప్పారు కదా. మా లాంటి విద్యార్థులకు ఇప్పుడు మీరిచ్చే సందేశం ఏదైనా ఉందా?”
ఒక రకంగా చూస్తే జులై, ఆగస్టు రెండు నెలలు రైతులకు, విద్యార్థులకూ కూడా ఎంతో ముఖ్యమైన నెలలు. ఇది కళాశాలలు ఆరంభమయ్యే సమయం . సత్యం లాంటి ఎందరో విద్యార్థులు పాఠశాలను వదిలి కళాశాలల్లో చేరే సమయం ఇది. ఫిబ్రవరి, మార్చి నెలలు పరీక్షలు, ప్రశ్నా పత్రాలు, జవాబులతో గడిచిపోతాయి. సెలవులలో సరదాగా, కులాసాగా గడపడంతో పాటూ పరీక్షా ఫలితాలు, జీవనపయనాన్ని నిర్ణయించుకోవడం, భవిష్యత్ నిర్ణయాల ఆలోచనలతో ఏప్రిల్, మే నెలలు గడిచిపోతాయి. ఇక జులై వచ్చేసరికీ యువత తమ జీవితంలో అత్యంత ముఖ్యమైన భాగంలో అడుగు పెడతారు. అక్కడ వాళ్ల దృష్టి ప్రశ్నల నుండి కట్ -ఆఫ్ వైపుకి మళ్ళుతుంది. విద్యార్థుల ధ్యాస ఇంటి నుండి హాస్టల్ కి మారిపోతుంది. విద్యార్థులు తల్లిదండ్రుల నీడ నుండి ప్రొఫెసర్ల నీడలోకి వస్తారు. నా యువ మిత్రులు తమ కాలేజీ జీవితాన్ని చాలా ఆనందంగా, ఉత్సాహంగా మెదలుపెట్టబోతూ ఉండి ఉంటారని నాకు గట్టి నమ్మకం. మొదటిసారి ఇంటి నుండి బయటకు , ఊరి నుండి బయటకు వెళ్ళి, ఒక భద్రత నిండిన వాతావరణం నుండి వేరుపడి, మీకు మీరే సారధులుగా మారాల్సిన సమయం ఇది. ఎంతోమంది యువజనులు మొదటిసారిగా తమ ఇళ్ళను వదిలి, తమ జీవితాలకు ఒక కొత్త దిశను అందించడానికి బయటకు వస్తారు. ఇప్పటికే చాలామంది విద్యార్థులు తమ తమ కాలేజీలలో చేరిపోయి ఉంటారు. కాలేజీలలో చేరాల్సిన వారు ఇంకా కొందరు ఉండి ఉంటారు. మీ అందరికీ నేను చెప్పేదేమిటంటే ప్రశాంతంగా ఉండండి, జీవితాన్ని ఆనందంగా గడపండి, జీవితంలో మనస్సాక్షిని పూర్తిగా ఆస్వాదించండి. చదువుకోవాలి అంటే పుస్తకాలను తప్పకుండా చదివే తీరాలి. వేరే మార్గం లేదు. కానీ కొత్త కొత్త విషయాలను తెలుసుకునే ప్రవృత్తి ఎప్పుడూ ఉండాలి. పాత స్నేహితులకు ఎంతో గొప్ప విలువ ఉంది. చిన్ననాటి స్నేహితులు విలువైనవాళ్ళు. కానీ కొత్త స్నేహితులను ఎన్నుకోవడం, స్నేహం కలుపుకోవడం, ఆ స్నేహాలని నిలబెట్టుకోవడం ఇదంతా చాలా తెలివితేటలతో చెయ్యాల్సిన పని. కొత్త కొత్త నైపుణ్యాలు, కొత్త కొత్త భాషలు నేర్చుకోండి. తమ ఇంటిని, ప్రాంతాన్ని వదిలి చదువుకోవడానికి కొత్త ప్రదేశానికి వెళ్ళిన యువత ఆ కొత్త ప్రదేశాలను శోధించండి. ఆ ప్రాంతాల గురించి తెలుసుకోండి. అక్కడి ప్రజలను, వారి భాషను, సంస్కృతిని తెలుసుకోండి. అక్కడి పర్యాటక ప్రదేశాలకు వెళ్ళి, వాటిని గురించి వివరాలను తెలుసుకోండి. కొత్త ఇన్నింగ్స్ మొదలుపెడుతున్న యువజనులందరికీ నా అభినందనలు. కాలేజీల ప్రస్థావన వచ్చింది కాబట్టి ఇటీవలే నేను వార్తల్లో చూసిన మరో విషయం గురించి చెప్తాను. మధ్యప్రదేశ్ లోని ఒక నిరుపేద కుటుంబానికి చెందిన ఆశారామ్ చౌదరి అనే విద్యార్థి తన జీవితంలోని కష్టమైన పోటీలన్నింటినీ దాటి విజయాన్ని చేజిక్కించుకున్నాడు. జోధ్‌పూర్ AIIMS తాలూకూ MBBS పరీక్షలో మొదటి ప్రయత్నంలోనే విజయాన్ని సాధించాడు. అతని తండ్రి చెత్తను పోగుచేసే పని చేసి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ విజయానికి గానూ నేను ఆ విద్యార్థిని అభినందిస్తున్నాను. ఇటువంటి ఎందరో విద్యార్థులు నిరుపేద కుటుంబాల నుండి, ప్రతికూల పరిస్థితుల నుండీ వచ్చి కూడా తమ కష్టంతో, పట్టుదలతో మనకు ప్రేరణాత్మకంగా నిలిచే విజయాలను సాధించి చూపెట్టారు. ఢిల్లీకి చెందిన DTC బస్సు డ్రైవర్ కుమారుడైన ప్రిన్స్ కుమార్ అయినా, కలకత్తాలో ఫుట్‌పాత్ పై వీధి దీపాల కింద చదువుకున్న అభయ్ గుప్తా అయినా సరే. అహ్మదాబాద్ కు చెందిన ఆడపడుచు అఫ్రీన్ షేక్ తండ్రి ఆటో నడుపుతాడు. నాగ్ పూర్ కు చెందిన ఆడబిడ్డ ఖుషీ తండ్రి ఒక పాఠశాల బస్సు డ్రైవరు. హరియానా కు చెందిన కార్తీక్ తండ్రి కాపలాదారుడు(వాచ్‌మేన్). ఝార్ఖండ్ కు చెందిన రమేష్ సాహూ తండ్రి ఇటుకల బట్టీలో పనిచేసే కార్మికుడు. రమేష్ కూడా స్వయంగా తిరునాళ్లలో బొమ్మలు అమ్మేవాడు. పుట్టినప్పటి నుండీ spinal muscular atrophy అనే ఒక జన్యుపరమైన వ్యాధితో బాధపడుతున్న గుర్గావ్ కు చెందిన దివ్యాంగ బాలిక అనుష్క పాండా , వీరందరూ కూడా తమకు ఎదురైన ప్రతి బాధని దాటుకుని, తమ ధృఢసంకల్పం, ధైర్యాలతో ప్రపంచం తమ వైపుకి చూసేలాంటి విజయాలను తమ సొంతం చేసుకున్నారు. మనం మన చుట్టుపక్కల గనుక గమనిస్తే ఇటువంటి ఎన్నో ఉదాహరణలు కనబడతాయి.
దేశంలోని ఏ మారుమూల ప్రాంతంలో జరిగిన మంచి సంఘటన అయినా నా మనసుకు శక్తిని ఇస్తుంది. ప్రేరణని అందిస్తుంది. నేనిప్పుడు మీకు కొందరు యువకుల కథ ను చెప్తుంటే నాకు నీరజ్ గారి మాటలు కూడా గుర్తువస్తున్నాయి.
“భూమి గీతాన్ని నేను ఆకాశానికి వినిపించాలి
ప్రతి చీకటినీ నేను వెలుగులోకి పిలవాలి
పూల పరిమళంతో కరవాలాన్ని జయించాలి
పాడి పాడి నేను కొండల్ని మేలుకొలపాలి ”
జీవిత పరమార్థం అదే కదా .
నా ప్రియమైన దేశప్రజలారా, కొద్ది రోజుల క్రితం నా దృష్టిని “ఇద్దరు యువకులు కలిసి మోదీ కలలను సాకారం చేసారు” అని రాసి ఉన్న ఒక వార్త ఆకర్షించింది. లోపల చదివితే ఇవాళ మన యువత టెక్నాలజీని తెలివిగా, సృజనాత్మకంగా ఉపయోగించి ఎలా సామాన్య వ్యక్తి జీవితంలో మార్పుని తేవడానికి ప్రయత్నిస్తున్నారో తెలిసింది. అమెరికాలో టెక్నాలజీ హబ్ గా పిలవబడే సేంజోజ్ నగరంలో ఒకసారి నేను భారతీయ యువకులతో చర్చ జరుపుతున్నాను. భారతదేశం కోసం తమ ప్రతిభని ఎలా ఉపయోగించగలరో ఆలోచించి, సమయాన్ని వెచ్చించి, దేశం కోసం ఏదైనా చెయ్యమని నేను వారిని కోరాను. మేధో వలస ని మేధో వృధ్ధిగా మార్చమని కోరాను. రాయ్ బరేలీకి చెండిన ఇద్దరు ఐ.టి. ప్రొఫెషనల్స్ యోగేష్ సాహూ, రజనీశ్ భాజ్‌పేయీ గార్లు నా సవాలుని స్వీకరిస్తూ ఒక నూతన ప్రయత్నం చేసారు. తమ ప్రొఫెషనల్ నైపుణ్యాన్ని ఉపయోగిస్తూ వారిద్దరూ కలిసి, ఒక “స్మార్ట్ గావ్ యాప్” తయారు చేసారు. ఈ యాప్ ఆ గ్రామ ప్రజలను యావత్ ప్రపంచంతో కలపడమే కాకుండా వారు ఇకపై ఏదైనా సలహాను గానీ, సూచనను గానీ కావాల్సి వస్తే, తమ సొంత మొబైల్ లోనే అది లభ్యమయ్యేలా చేశారు. రాయ్ బరేలీ కు చెందిన గ్రామం తౌధక్ పూర్ నివాసులందరూ, గ్రామ పెద్ద, డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్, సి.డి.ఓ అందరూ కూడా ఈ యాప్ ను ఉపయోగించుకోవలసిందని ప్రజలను కోరారు. ఒక రకంగా ఈ యాప్ గ్రామంలో డిజిటల్ విప్లవాన్ని తేచ్చే ప్రయత్నం చేస్తోంది. గ్రామంలో జరిగే అభివృధ్ధి పనులను ఈ యాప్ ద్వారా రికార్డ్ చేయడం, ట్రాక్ చేయడం, మానిటర్ చేయడం సులువైపోయింది. ఈ యాప్ లో గ్రామం లోని ఫోన్ డైరెక్టరీ, వార్తా విభాగం, జరగబోయే కార్యక్రమాల జాబితా, ఆరోగ్య కేంద్రం, సమాచార కేంద్రం ఉన్నాయి. ఈ యాప్ రైతుల కు కూడా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ యాప్ లోని గ్రామర్ ఫీచర్ రైతుల మధ్య FACT rate తెలుసుకోవడానికి, ఒక విధంగా చెప్పాలంటే వారి ఉత్పాదనకు మార్కెట్ ప్లేస్ లా ఉపయోగపడుతుంది. ఈ విషయాన్ని మీరు నిశితంగా పరిశీలిస్తే ఒక విషయం అర్థమౌతుంది – ఆ యువకులు అమెరికాలో, అక్కడి జీవన విధానం, ఆలోచనధోరణుల మధ్య జీవితాన్ని గడుపుతున్నారు. ఎన్నో ఏళ్ల క్రితం భారతదేశాన్ని వదిలి వెళ్ళినా కూడా తమ గ్రామంలోని చిన్న చిన్న విషయాలను కూడా గుర్తుంచుకుని, సవాళ్లను అర్థం చేసుకుని, తమ గ్రామంతో ఎంతో మానసికంగా ముడిపడి ఉన్నారు. ఈ కారణంగానే వారు గ్రామానికి ఏది అవసరమో సరిగ్గా అలాంటిదే చెయ్యగలిగారు. తమ గ్రామంతోటీ, తన మూలాలతో ఉన్న ఈ అనుబంధం , దేశం కోసం ఏదైనా చెయ్యాలనే ఒక తపన, ప్రతి భారతీయుడిలోనూ స్వాభావికంగానే ఉంటాయి. కానీ అప్పుడప్పుడు కాలం వల్ల, దూరాల వల్ల, పరిస్థితుల వల్ల, దానిపై ఒక పల్చని దుమ్ము పేరుకుపోతుంది. కానీ ఎవరైనా ఒక చిన్న నిప్పు రవ్వతో అయినా వాటిని స్పృశించితే చాలు లోపలి విషయాలన్నీ మరోసారి పైకి వస్తాయి. అవి తన గడచిన రోజుల జ్ఞాపకాల వైపుకి లాక్కుని తోసుకుపోతాయి. మన విషయంలో కూడా ఇలానే జరిగిందా? అని మనల్ని మనం ఒకసారి పరిశీలించుకోవాలి. స్థితులు, పరిస్థితులు, దూరాలూ మనల్ని దేశానికి దూరం చేసెయ్యలేదు కదా.. దుమ్ము పేరుకుపోలేదు కదా.. తప్పకుండా ఆలోచించండి.
“గౌరవనీయులైన ప్రధానమంత్రి గారూ, నమస్కారం! నేను సంతోష్ కాకడే ను , మహారాష్ట్ర లోని కొల్హాపూర్ నుండి మాట్లాడుతున్నాను. పండర్ పూర్ వారీ అనే పండర్పూర్ తీర్థయాత్ర మహారాష్ట్ర కు చెందిన ఒక ప్రాచీన సంప్రదాయం. ప్రతి ఏడూ ఇది చాలా ఉత్సాహము, ఉల్లాసాలతో జరుపుకుంటారు. దాదాపు ఏడెనిమిది లక్షల భక్తులు ఇందులో పాల్గొంటారు. ఈ ప్రత్యేకమైన కార్యక్రమం గురించి దేశప్రజలందరికీ కూడా తెలుసేలా మీరు మరిన్ని వివరాలను తెలపండి”
సంతోష్ గారూ మీ ఫోన్ కాల్ కు అనేకానేక ధన్యవాదాలు. పండర్ పూర్ తీర్థయాత్ర నిజంగా ఒక అద్భుతమైన యాత్ర. మిత్రులారా, ఈసారి జులై ఇరవై మూడవ తేదీన ఆషాఢ ఏకాదశి వచ్చింది. ఆ రోజున పండర్ పూర్ తీర్థయాత్రను ఒక భవ్య పరిణితి రూపంగా కూడా జరుపుకుంటారు. పండర్ పూ మహరాష్ట్ర లోని సోలాపూర్ జిల్లా లోని ఒక పవిత్రమైన ఊరు. ఆషాఢ ఏకాదశి కి ఒక పదిహేను, ఇరవై రోజుల ముందు నుండే వార్కరీ అంటే తీర్థయాత్రికులు, పల్లకీలతో పాటుగా పండర్ పూర్ తీర్థయాత్రకై కాలి నడకన బయలుదేరుతారు. ఈ యాత్రను వారీ అంటారు. ఇందులో లక్షల సంఖ్యలో భక్తులు పాల్గొంటారు. జ్ఞానేశ్వర్, తుకారామ్ మొదలైన గొప్ప సాధువుల పాదుకలను పల్లకీలో పెట్టి, విఠ్ఠల్ ,విఠ్ఠల్ అని పాడుకుంటూ, నాట్యం చేస్తూ, వాయిద్యాలను మ్రోగిస్తూ కాలి నడకన పండర్ పూర్ బయలుదేరతారు. ఈ యాత్ర విద్య, సంస్కారం, శ్రధ్ధల త్రివేణీ సంగమం. తీర్థయాత్రికులు లేదా విఠోబా లేదా పాండురంగడు అనే పేర్లతో పిలవబడే విఠ్ఠల్ భగవానుడి దర్శనం కోసం అక్కడికి చేరుకుంటారు. విఠ్ఠల్ భగవానుడు పేదల, వంచితుల, పీడితులకు మేలు చేసి, రక్షిస్తాడు. మహారాష్ట్ర, కర్ణాటక, గోవా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రజలలో అపారమైన శ్రధ్ధ , భక్తి ఉన్నాయి. పండర్ పూర్ లో విఠ్ఠోబా ఆలయానికి వెళ్ళడం, అక్కడి మహిమ, సౌందర్యం, ఆధ్యాత్మిక ఆనందం ఒక ప్రత్యేకమైన అనుభూతి. వీలైతే ఒకసారి పండర్పూర్ వారీ అనుభవాన్ని తప్పక అనుభూతి చెందమని మన్ కీ బాత్ శ్రోతలని నేను కోరుతున్నాను.
జ్ఞానేశ్వర్, నామ్ దేవ్, ఏక్ నాథ్, రామ్ దాస్, తుకారామ్ మొదలైన అసంఖ్యాక సాధువులు మాహారాష్ట్ర లో నేటికీ కూడా సామాన్య ప్రజలను శిక్షితులను చేస్తున్నారు. మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడే శక్తిని ఇస్తున్నారు. భారతదేశంలోని ప్రతి మారుమూల ప్రాంతంలో కూడా ఈ సాధువుల సంప్రదాయం ప్రజలకు ప్రేరణను అందిస్తూ వచ్చింది. వారి ప్రముఖ జానపద సంగీత రీతులైన భారూడ్ లేదా అభంగ్ ఏదైనా సరే మనకు వాటి ద్వారా సద్భావం, ప్రేమ, సౌభ్రాతృత్వ సందేశం లభిస్తుంది. వీటి వల్ల మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా సమాజం శ్రధ్ధగా పోరాడటానికో మంత్రం లభిస్తుంది. ఈ సాధువులే ఎప్పటికప్పుడు సమాజాన్ని ఆపి, అడ్డుపడి, అద్దం కూడా చూపెట్టారు. మన సమాజంలో ప్రాచీన దురలవాట్లు అంతమయ్యేలా చూశారు. ప్రజల్లో కరుణ, సమానత, శుభ్రత మొదలైన సంస్కారాలు ఏర్పడ్డాయి. మన భరతభూమి ఎందరో రత్నాలను కన్న భూమి. ఎందరో సాధువుల గొప్ప సంప్రదాయం మన దేశంలో ఉంది. అలానే ఆ సమర్థవంతులైన మహాపురుషులైన ఈ భరతమాత బిడ్డలందరూ ఈ భూమి కోసం తమ జీవితాలను అర్పించారు, సమర్పించారు. అలాంటి ఒక మహాపురుషుడే లోకమాన్య తిలక్. ఆయన అనేక భారతీయుల మనసుల్లో చెరగని ముద్రని వేశారు. జులై ఇరవై మూడవ తేదీన మనం తిలక్ గారి జయంతినీ, ఆగష్టు ఒకటవ తేదీన వారి వర్థంతినీ జరుపుకుంటాము. లోకమాన్య తిలక్ సాహసము, ఆత్మవిశ్వాసము నిండుగా ఉన్న వ్యక్తి. బ్రిటిష్ పాలకులకు వారి తప్పులను చూపెట్టే శక్తి , చాతుర్యం ఆయనలో ఉన్నాయి. ఆంగ్లేయులు తిలక్ అంటే ఎంత భయపడేవారంటే, ఇరవై ఏళ్లలో ఆయనకు వాళ్ళు మూడు సార్లు రాజద్రోహ నేరాన్ని అంటగట్టే ప్రయత్నం చేశారు. ఇది చిన్న విషయమేమీ కాదు. లోకమాన్య తిలక్, అహ్మదాబాద్ లో ఉన్న ఒక తిలక్ విగ్రహము గురించిన ఒక ఆసక్తికరమైన సంఘటన ఇవాళ దేశప్రజలతో పంచుకుంటున్నాను. 1916, అక్టోబర్‌లో ఆహ్మదాబాద్ వచ్చినప్పుడు, ఇప్పటికి దాదాపు వందేళ్ల క్రితం నలభైవేలకు పైగా ప్రజలు ఆయనకు స్వాగతం పలికారు. ఈ యాత్రలో భాగంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ కు వారితో మాట్లాడే అవకాశం లభించింది. సర్దార్ వల్లభాయ్ పటేల్ పై లోకమాన్య తిలక్ గారి ప్రభావం అధికంగా ఉంది. 1920ఆగష్టు1,న లోకమాన్య తిలక్ గారు మృతి చెందినప్పుడు అహ్మదాబాద్ లో వారి స్మారక విగ్రహాన్ని ప్రతిష్టించాలని ఆయన అనుకున్నారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ అహ్మదాబాద్ నగరపాలక సంస్థకు మేయర్ గా ఎన్నికయ్యారు. వెంఠనే ఆయన లోకమాన్య తిలక్ గారి స్మారక విగ్రహం కోసం విక్టోరియా గార్డెన్ ని ఎన్నుకున్నారు. ఈ గార్డెన్ బ్రిటన్ మహారాణి పేరున ఉంది. ఈ నిర్ణయంపై స్వాభావికంగా బ్రిటిష్ వారు అప్రసన్నంగా ఉన్నారు. అనుమతిని ఇవ్వడానికి కలక్టర్ అనుమతించట్లేదు. కానీ సర్దార్ గారు సర్దార్ గారే! వారు స్థిరంగా ఉండి, లోకమాన్య విగ్రహం నెలకొల్పడం కోసం తన పదవిని త్యజించడానికి సిధ్ధమైయ్యారు. చివరికి విగ్రహం తయారైంది. సర్దార్ గారు ఆ విగ్రహాన్ని ఎవరితోనో కాకుండా, 1929 ఫిబ్రవరి 28న మహాత్మా గాంధీ గారితో చేయించారు. అన్నింటికన్నా గొప్ప విషయమేమిటంటే, ఆ ఉద్ఘాటన సభలో తన ప్రసంగంలో పూజ్య బాపూ ఏమన్నారంటే, సర్దార్ పటేల్ వచ్చిన తరువాత అహ్మదాబాద్ నగరపాలిక కు ఒక వ్యక్తి దొరకడామే కాకుండా అతని ధర్యం కారణంగానే తిలక్ గారి విగ్రహ నిర్మాణం కూడా సాధ్యమైంది.
ఈ విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే, అది తిలక్ గారు ఒక కుర్చీలో కూర్చుని ఉన్న అరుదైన విగ్రహమే కాకుండా, క్రింద “స్వరాజ్యం నా జన్మ హక్కు” అని రాసి ఉంటుంది. ఇదంతా ఆంగ్లేయుల సమయంలోని విషయాన్నే మీకు చెప్తున్నాను. లోకమాన్య తిలక్ గారి ప్రయత్నాల కారణంగానే సామూహిక గణేశ ఉత్సవాల సంప్రదాయం మొదలైంది. ఈ సామూహిక గణేశ ఉత్సవాలు సంప్రదాయక శ్రధ్ధ, ఉత్సవంతో పాటుగా , సమాజిక మేలుకొలుపు, సామూహికత, ప్రజల్లో సామరస్యత, సమానత భావాలను ముందుకు నడిపించడానికి ఒక ప్రభావవంతమైన మాధ్యమంగా మారాయి. ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరాడటానికి ఏకమవ్వాల్సిన సమయంలో ఈ ఉత్సవాలు జాతి, సంప్రదాయాల బంధనాలను తెంచుకుని అందరినీ ఏకం చేసే పని చేసింది. కాలంతో పాటూ ఇటువంటి వ్యవస్థల ప్రాముఖ్యత కూడా పెరిగింది. మన పురాతన వారసత్వం, చరిత్రలలో నిలిచిన వీర నాయకుల పట్ల ఇవాళ్టికి కూడా మన యువతరంలో ఎంతో ఇష్టం ఉందని ఇటువంటి వ్యవస్థల వల్లే తెలుస్తుంది. నేటికీ ఎన్నో పట్టణాల్లో దాదాపు ప్రతి వీధిలోనూ గణేశ విగ్రహాలను పెట్టి పూజలు చేయడం మనం చూశ్తూంటాం. ఒక జట్టుగా కలిసిమెలసి ఆ వీధిలో నివసించేవారంతా కలిసి పూజలను నిర్వహిస్తారు. ఇది మన యువత కు కూదా ఎంతో మెరుగైన అవకాశం. అక్కడే వారు నాయకత్వం, నిర్వాహణ మొదలైన గుణాలను నేర్చుకోవడం వీలవుతుంది.దానివల్ల వారి వ్యక్తిత్వం వికసిస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా, నేను క్రితం ఏడాది కూడా మిమ్మల్ని అభ్యర్థించాను..ఈసారి కూడా మనం గణేశ ఉత్సవాలు జరుపుకుందాం. వైభవంగా జరుపుకుందాం. ఉల్లాస, ఉత్సాహాలతో జరుపుకుందాం. కానీ పర్యావరణానుకూల(ఇకో-ఫ్రెండ్లీ) గణేశుడికి మాత్రమే ఉత్సవం చెయ్యాలని పట్టుబట్టండి. ఈసారి కూడా లోకమాన్య తిలక్ గారిని గుర్తుచేసుకుంటున్నాం కాబట్టి మరోసారి మీ అందరినీ అభ్యర్థిస్తున్నాను. వినాయకుడి విగ్రహం దగ్గర నుండీ అలంకరణ సామగ్రీ వరకూ అన్నీ పర్యావరణానుకూలంగా ఉండేలా చూడండి. ప్రతి నగరంలోనూ కూడా పర్యావరణానుకూల గణేశ ఉత్సవాల పోటీ జరగాలి. ఆ పోటీలకు బహుమతులు కూడా ఇవ్వాలి. మై గౌ యాప్ లోనూ, నరేంద్ర మోదీ యాప్ లోనూ కూడా పర్యావరణానుకూల గణేశ ఉత్సవాల తాలూకూ వస్తువులకు విస్తృతమైన ప్రచారం జరగాలని కోరుకుంటున్నాను. నేను తప్పకుండా ఈ విషయాన్ని ప్రజలకు చేరవేస్తాను. లోకమాన్య తిలక్ దేశవాసులందరిలోనూ ఆత్మవిశ్వాసాన్ని నింపారు. “స్వరాజ్యం నా జన్మహక్కు. మేము దానిని సాధించి తీరతాం” అనే నినాదాన్ని ఇచ్చారు. ఇవాళ “స్వరాజ్యం నా జన్మహక్కు. మేము దానిని సాధించి తీరతాం” అనే ఈ నినాదాన్ని చెప్పాల్సిన సమయం. మంచి పాలన, అభివృధ్ధి ఫలాలు ప్రతి భారతీయుడికీ అందాలి. ఇటువంటి విషయాలే నవ భారతాన్ని నిర్మిస్తాయి. తిలక్ జన్మించిన ఏభై ఏళ్ల తరువాత సరిగ్గా అదే రోజున అంటే జులై ఇరవై మూడవ తేదీన మరో భరతమాత బిడ్డ జన్మించాడు. దేశవాసులందరూ స్వాతంత్రంగా ఊపిరి పీల్చుకోవాలనే సంకల్పంతో ఆయన కూడా తన జీవితాన్ని బలిదానం చేశారు. నేను చంద్ర శేఖర్ ఆజాద్ గురించి మాట్లాడుతున్నాను. ఈ క్రింది వాక్యాలను చదివి ప్రేరణ పొందని భారతీయుడు ఉండడు..
“సర్ఫరోషీ కీ తమన్నా అబ్ హమారే దిల్ మే హై
దేఖ్నా హై జోర్ కిత్నా బాజు ఏ కాతిల్ మే హై”
అంటే
“బలవ్వాలనే కోరిక ఇప్పుడు మా మనసుల్లో ఉంది
ఇప్పుడిక హంతకుడి బలాన్ని పరీక్షించాలి”
ఈ వాక్యాలు అష్ఫాక్ ఉల్లా ఖాన్, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి అనేక యువకులకు ప్రేరణను అందించాయి. చంద్రశేఖర్ ఆజాద్ ధైర్యం, స్వాతంత్రం కోసం ఆయన పడ్డ తీవ్రమైన తపన ఎందరో యువకులను ప్రేరితులను చేసింది. ఆజాద్ తన జీవితాన్ని పణంగా పెట్టారు. విదేశీ పాలన ముందర ఎన్నడూ తలవంచలేదు. మధ్య ప్రదేశ్ లో చంద్రశేఖర్ ఆజాద్ స్వగ్రామం అలీరాజ్ పూర్ వెళ్ళే అదృష్టం నాకు లభించింది. అలహాబాద్ లోని చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ లో కూడా శ్రధ్ధాంజలి అర్పించే అవకాశం లభించింది. విదేశీయుల తుపాకీ గుళ్ళ వల్ల కూడా తాను చనిపోకూడదని కోరుకున్న వీర పురుషుడు చంద్రశేఖర్ ఆజాద్ గారు. స్వాతంత్రం కోసం పోరాడుతూ బ్రతికుతాం, లేకపోతే స్వాతంత్రంగా చనిపోతాం అనేవారాయన. ఇదే ఆయన ప్రత్యేకత. మరొక్కసారి భరతమాత బిడ్డలైన ఈ ఇద్దరు మహాపురుషులు – లోకమాన్యతిలక్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గార్లకు నేను శ్రధ్ధాంజలి ఘటిస్తున్నాను.
కొద్ది రోజుల క్రితమే ఫిన్ ల్యాండ్ లో జూనియర్ అండర్-20 ప్రపంచ ఆథ్లెటిక్ ఛాంపియన్షిప్ లో 400మీట్లర్ల పరుగుపందెంలో భారతదేశానికి చెందిన ధైర్యవంతురాలైన రైతుబిడ్డ హిమా దాస్ బంగారు పతకాన్ని సాధించి చరిత్రను సృష్టించింది. దేశానికి చెందిన మరొక ఆడపడుచు ఏక్తా భయాన్ ఇండోనేషియా నుండి నా ఈ-మెయిల్ కి జవాబు రాసింది. అక్కడ ఆమె ఏషియన్ గేమ్స్ కి సిధ్ధమౌతోంది. ఈ-మెయిల్ లో ఏక్తా భయాన్ ఏం రాసిందంటే – ” మువ్వన్నెల జండాను పట్టుకోవడం అనేది ప్రతి అథ్లెట్ జీవితంలోనూ అన్నింటికన్నా అపురూపమైన క్షణం. ఆ అవకాశం లభించినందుకు నాకు గర్వంగా ఉంది”. ఏక్తా మేము ఆందరమూ కూడా నిన్ను చూసి గర్వపడుతున్నాము. మీరు భారతదేశానికి వన్నె తెచ్చారు. తునిషియా లో ప్రపంచ పారా ఎథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2018లో ఏక్తా బంగారు పతకాన్నీ, కాంస్య పతకాన్నీ గెలుచుకుంది. ఆమె విజయం ప్రత్యేకమైనది ఎందుకంటే ఆమె తన ఇబ్బందినే తన విజయానికి మాధ్యమంగా మార్చుకుంది. ఏక్తా భయాన్ కు 2003లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో శరీరంలో సగ భాగం, క్రింది భాగం నిర్వీర్యం అయిపోయింది. కానీ ఈ అమ్మాయి ఓటమిని అంగీకరించలేదు. తనని తాను సమర్థురాలిగా తయారు చేసుకుంటూ ఈ స్థాయికి చేరుకుంది. మరొక దివ్యాంగుడు యోగేష్ కఠునియా గారు బెర్లిన్ లో పారా ఎథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ లో డిస్క్ థ్రో లో బంగారు పతకాన్ని గెలుచుకుని ప్రపంచ రికార్డుని నెలకొల్పారు. ఆయనతో పాటూ సుందర్ సింగ్ గుర్జర్ కూడా జావలిన్ లో బంగారు పతకాన్ని గెలుపొందారు. ఏక్తా భయాన్ గారు, యోగేష్ కఠురియా గారు, సుందర్ సింగ్ గారూ, వీరందరి ధైర్యానికీ, స్ఫూర్తికీ వందనం చేస్తున్నాను. ఆభినందింస్తున్నాను. వీరంతా ఇంకా ముందుకు వెళ్లాలి. ఆడుతూ ఉండాలి. వికసిస్తూ ఉండాలి.
నాప్రియమైన దేశప్రజలారా, ఆగష్టు నెల చారిత్రికంగా అనేక సంఘటనలు, ఉత్సవాలతో నిండి ఉంటుంది. కానీ వాతావరణం కారణంగా అప్పుడప్పుడు అనారోగ్యం ఇంట్లోకి ప్రవేశిస్తూ ఉంటుంది. మీ అందరూ చక్కని ఆరోగ్యంతో ఉండాలని కోరుకుంటూ, దేశ భక్తిని ప్రేరేపించే ఆగస్టు నెలకూ, శతాబ్దాలుగా వస్తున్న అనేకానేక ఉత్సవాలకు గానూ మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను. మరోసారి మన్ కీ బాత్ లో తప్పకుండా కలుద్దాం.
అనేకానేక ధన్యవాదాలు.
నమస్కారం! నా ప్రియమైన దేశప్రజలారా, ఇవాళ మరోసారి ’మన్ కీ బాత్ ’ కార్యక్రమం ద్వారా మీ అందరితో కబుర్లు చెప్పే అదృష్టం లభించింది. కొద్ది రోజుల క్రితమే బెంగుళూరులో ఒక చారిత్రాత్మక క్రికెట్ మేచ్ జరిగింది. నేను భారత్ - అఫ్గానిస్తాన్ జట్ల మధ్య జరిగిన టెస్ట్ మేచ్ గురించి మాట్లాడుతున్నానని మీకు అర్ధమయ్యే ఉంటుంది. ఇది అఫ్గానిస్థాన్ కు మొదటి అంతర్జాతీయ మేచ్. ఆ మేచ్ మన భారత జట్టు తో జరగడం ప్రతి ఒక్క భారతీయుడూ గర్వించదగ్గ విషయం. రెండు జట్లూ కూడా ఎంతో మెరుగైన ఆటను ఆడారు. అఫ్గానిస్తాన్ కు చెందిన బౌలర్ రషీద్ ఖాన్ ఈసారి ఐ.పి.ఎల్ లో కూదా ఎంతో చక్కని ప్రతిభను కనబరిచాడు. అఫ్గానిస్తాన్ రాష్ట్రపతి శ్రీ అషరఫ్ గనీ గారు "అఫ్గానిస్తాన్ ప్రజలు తమ హీరో రషీద్ ఖాన్ పట్ల ఎంతో గర్వంగా ఉన్నారు" అని నన్ను ట్యాగ్ చేస్తూ తన ట్విట్టర్లో రాయడం నాకు గుర్తుంది. ఈ క్రీడాకారులకు తమ ప్రతిభను చూపెట్టడానికి ఒక వేదికను అందించినందుకు గానూ మన భారతీయ మిత్రులకు నేనెంతో ఋణపడి ఉంటాను. అఫ్గానిస్తాన్ లోని ఉత్తమమైన ప్రతిభకు రషీదే ప్రతినిధి. క్రికెట్ ప్రపంచానికి అతడొక సంపద. అఫ్గానిస్తాన్ రాష్ట్రపతిగారు సరదాగా మరోమాట కూడా రాసారు "రషీద్ ని మేమెవ్వరికీ ఇవ్వబోవడం లేదు" అని. ఈ మేచ్ మనందరికీ ఎంతో గుర్తుండిపోతుంది. ఇది మొదటి మేచ్ కాబట్టి తప్పకుండా గుర్తుంటుంది కానీ నాకు మాత్రం మరో విషయం కారణంగా గుర్తుంటుంది. యావత్ ప్రపంచానికీ ఒక ఉదాహరణగా నిలిచిపోయే ఒక ప్రత్యేకమైన పని భారత జట్టు చేసింది. ట్రోఫీ తీసుకునే సమయంలో విజేతగా నిలిచిన జట్టు ఏమి చెయ్యాలో భారత జట్టు అదే పని చేసింది. ట్రోఫీ తీసుకునేప్పుడు భారతీయ జట్టు మొదటీసారిగా మేచ్ ఆడిన అఫ్గానిస్థాన్ జట్టుని కూడా వేదిక మీదకు ఆహ్వానించి ఇద్దరూ కలిపి ట్రోఫీని తీసుకున్నారు. క్రీడాస్ఫూర్తి అంటే ఏమిటో ఈ సంఘటన ద్వారా మనం తెలుసుకోవచ్చు. సమాజాన్ని ఏకం చెయ్యడానికి , మన యువతలో ఉన్న ప్రతిభాపాటవాలను వెలికి తియ్యడానికి, వాటిని వెతికి పట్టుకోవడానికి క్రీడలు ఒక మెరుగైన పధ్ధతి. భారత, అఫ్గానిస్థాన్ రెండు జట్లకు నా అభినందనలు. భవిష్యత్తులో కూడా ఇలాగే మనం ఒకరితో ఒకరు కలిసి క్రీడాస్ఫూర్తితో ఆడతామని ఆశిస్తున్నాను. ఆడతాం కూడా.
నా ప్రియమైన దేశప్రజలారా, ఈ జూన్ 21వ తేదీన నాలుగవ ”అంతర్జాతీయ యోగా దినోత్సవం’ నాడు ఒక చక్కని దృశ్యాన్ని తిలకించాను. యావత్ ప్రపంచం కలిసికట్టుగా కనపడింది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఆనంద ఉత్సాహాలతో యోగాభ్యాసం చేశారు. బ్రజిల్ లో యూరోపియన్ పార్లమెంట్ లోనూ, న్యూయార్క్ లో ఉన్న ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలోనూ , జపాన్ నౌకా దళానికి చెందిన యుధ్ధ నౌకలోనూ, అన్ని చోట్లా కూడా ప్రజలు యోగా చేస్తూ కనిపించారు. సౌదీ అరేబియా లో మొదటిసారిగా యోగాకు చెందిన చారిత్రాత్మక కార్యక్రమం జరిగింది. చాలారకాల యోగాసనాలను మహిళలే ప్రదర్శించి చూపెట్టారని నాకు చెప్పారు. లడాక్ లోని ఎత్తైన మంచు శిఖరాలల్లో కూడా భారత ,చైనా సైనికులు కలిసికట్టుగా యోగాభ్యాసం చేసారు. యోగా అన్ని సరిహద్దులనూ చెరిపి, అందరినీ జత పరుస్తుంది. వందల కొద్దీ దేశాలలో వేల కొద్దీ ఉత్సాహవంతులైన ప్రజలు జాతి, మత, ప్రాంత, లింగ భేదాలన్నింటినీ మరచి ఈ సందర్భాన్ని ఒక పెద్ద ఉత్సవంగా మార్చేసారు. యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఇంత ఉత్సాహవంతంగా జరిపుకుంటుంటే, మరి మన దేశ ప్రజలు దీనిని రెట్టింపు ఉత్సాహంతో ఎందుకు జరుపుకోరు.
మన దేశ భద్రతా దళ సైనికులు, నీటిలో,భూమిపై, ఆకాశంలో మూడు చోట్లా యోగాభ్యాసం చేయడం 125కోట్ల ప్రజలు తిలకించారు. కొందరు వీర జవానులు జలాంతర్గామి లో యోగా చేస్తే, కొందరు సియాచీన్ లోని మంచు కొండల్లో యోగాభ్యాసం చేసారు. వైమానిక దళానికి చెందిన మన వీరులు ఆకాశంలో భూమికి పదిహేను వేల అడుగుల ఎత్తులో నుండి యోగాసనాలు వేసి అందరినీ సంభ్రమానికి గురిచేసారు. విమానంలో కూర్చుని కాకుండా గాలిలో తేలుతూ యోగాసనాలు వెయ్యడం చూసి తీరాల్సిన దృశ్యం. పాఠశాలలు, కళాశాలలు,
ఆఫీసులు, పార్కులు, ఎత్తైన భవనాలు, క్రీడా మైదానాలు అన్ని చోట్లా యోగాభ్యాసం జరిగింది.
అహ్మదాబాద్ లోని ఒక దృశ్యం మాత్రం మనసుకు హత్తుకుంది. అక్కడ దాదాపు 750 దివ్యాంగ సోదర సోదరీమణులు ఒక చోట కలిసి యోగాభ్యాసం చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. కుల, మత మరియు భూగోళ పరిధిని దాటి యోగాప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలను ఏకం చేసే పని చేసింది. మన ఋషులు, మునులు, సాధువులు ఎప్పుడూ చెప్తూ వచ్చిన వసుదైక కుటుంబకం అనే భావాన్ని మనం శతాబ్దాలుగా నమ్ముతూ వస్తున్నాం. యోగా ఆ భావాన్ని సరైన విధంగా నిరూపించి చూపెట్టింది. ఇవాళ ఆరోగ్యం ఒక ఉద్యమంగా మారింది. యోగాభ్యాసం వల్ల ఆరోగ్యం పట్ల మొదలైన ఈ ప్రచారం ముందుకు సాగుతుందని నేను ఆశిస్తున్నాను. ఎక్కువ శాతం ప్రజలు దీనిని తమ జీవితాలలో భాగం చేసుకుంటారు.
నా ప్రియమైన దేశప్రజలారా, mygov, నరేంద్ర మోదీ యాప్ లలో ఈసారి మన్ కీ బాత్ లో జులై ఒకటవ తేదీన జరగబోతున్న డాక్టర్స్ డే గురించి చెప్పమని చాలా మంది నాకు రాశారు . మంచి సంగతి. ఇబ్బంది ఎదురైనప్పుడే మనం వైద్యుడి దగ్గరకు వెళ్తాము. కానీ ఆ రోజున మన దేశంలోని వైద్యుల ప్రగతిని ఉత్సవంగా జరిపుకోబోతున్నాం. సమాజానికి వారు అందిస్తున్న సేవలకు గానూ వారికి అనేకానేక ధన్యవాదాలు . తల్లిని భగవత్స్వరూపంగా పూజించేవాళ్ళము మనం. తల్లిని భగవంతుడితో సమానంగా భావిస్తాము. ఎందుకంటే తల్లి మనకి జన్మనిస్తుంది. తల్లి జన్మను అందిస్తే, వైద్యుడు మనకు పునర్జన్మను అందిస్తాడు. కేవలం రోగాలను తగ్గించడం తోనే వైద్యుని పాత్ర ముగిసిపోదు. కుటుంబానికి స్నేహితుడి లాంటి వాడు వైద్యుడు. “They not only cure but also heal” అన్నమాటలు మన జీవన విధానంలో మార్గదర్శకాలు. ఇవాళ వైద్యుల వద్ద వైద్య విద్వత్తుతో పాటుగా సాధారణ జీవన విధాన పధ్ధతులు మన ఆరోగ్యం పై ఎటువంటి ప్రభావాన్ని చూపగలవు అన్న విషయాలపై లోతైన అవగాహన, అనుభవం ఉంటున్నాయి. భారతీయ వైద్యులు తమ సామర్థ్యం, ఇంకా నైపుణ్యాలతో యావత్ ప్రపంచంలో తమ గుర్తింపుని చాటుకున్నారు. వైద్య వృత్తిలో ఉండే పట్టుదల, పరిశ్రమలతో పాటుగా క్లిష్టమైన వైద్య సమస్యలను పరిష్కరించగలరన్న పేరుపొందారు మన భారతీయ వైద్యులు . మన్ కీ బాత్ మాధ్యమం ద్వారా నేను దేశప్రజలందరి తరఫునా మన వైద్య మిత్రులందరికీ వచ్చే జులై 1 వ తేదీన జరగబోతున్న "డాక్టర్స్ డే’ సందర్భంగా అనేకానేక అభినందనలను తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, ఈ భరత భూమిపై జన్మించినందుకు మనం ఎంతో అదృష్టవంతులం. మన భారత దేశ చరిత్రలో ఏదో ఒక చారిత్రాత్మక ఘటన జరగని ఏ ఒక్క నెలా, ఏ ఒక్క రోజూ లేదు. భారతదేశంలో ప్రతి ప్రదేశానికీ తనదైన ఒక వారసత్వం ఉంది. ఆ ప్రాంతంతో ముడిపడి ఉన్న ఎవరో ఒక సాధువు, మహా పురుషుడు, ఒక ప్రసిధ్ధ వ్యక్తి ఆ యా ప్రాంతాలకి తమ వంతు సహకారాన్ని అందించారు. గొప్పతనాన్ని ఇచ్చారు.
"ప్రధాన మంత్రిగారూ నమస్కారం! నేను డా.సురేంద్ర మిశ్ర ను మాట్లాడుతున్నాను. మీరు జూన్ 28న మఘర్ వస్తున్నారని తెలిసింది. నేను మఘర్ పక్కనే గోరఖ్‌పూర్ కు చెందిన చిన్న గ్రామం టడ్వా లో నివసిస్తున్నాను. మఘర్ లో కబీర్ సమాధి ఉంది. కబీర్ ని ఇక్కడి ప్రజలు సామాజిక సామరస్యానికి పాటుపడిన వ్యక్తిగా గౌరవిస్తారు. కబీర్ భావాలపై ప్రతి చోటా చర్చలు జరుగుతాయి. మీరు చేస్తున్న కార్యక్రమాలు సమాజంలోని అన్ని వర్గాలపై ఎంతో ప్రభావం చూపుతున్నాయి. దయచేసి ప్రభుత్వం చేపట్టబోతున్న మరిన్ని కార్యక్రమాల గురించి మాకు తెలియజేయాలని మిమ్మల్ని వేడుకుంటున్నాను."
ఫోన్ చేసినందుకు మీకు అనేకానేక ధన్యవాదాలు. 28వ తేదీన నేను మఘర్ వస్తున్న సంగతి నిజమే.గుజరాత్ లోని కబీర్వడ్ మీకు తెలిసే ఉంటుంది.,గుజరాత్ లోని కబీర్ వడ్ లో నేను పనిచేసేప్పుడు సత్పురుషుడు కబీర్ సాంప్రదాయాన్ని పాటించే కొందరు వ్యక్తులతో ఒక జాతీయ సమ్మేళనాన్ని నిర్వహించాను. కబీర్ దాస్ గారు మఘర్ ఎందుకు వెళ్ళారో మీకు తెలిసా? మఘర్ లో మరణిస్తే స్వర్గాన్ని చేరరని ఒక నమ్మకం ఉండేది అప్పట్లో. కాశీలో దేహ త్యాగం చేస్తేనే స్వర్గం వెళ్తారని నమ్మేవారు. మఘర్ ని అపవిత్రంగా చూసేవారు. సత్పురుషుడు కబీర్ దాస్ దీనిని విశ్వసించేవారు కాదు. తన జీవితకాలంలో ఉన్న మూఢ విశ్వాసాలనూ, దురాచారాలనూ నిర్మూలించడానికి ఆయన ప్రయత్నించారు. అందుకనే ఆయన మఘర్ వెళ్ళి అక్కడే సమాధి చెందారు. కబీ దాస్ తన రచనలు, పద్యాల ద్వారా సామాజిక సమానత, శాంతి, సౌభ్రాతృత్వాలను సమర్థించారు. ఇవే ఆయన ఆదర్శాలు. ఆయన రచనలలో ఇదే ఆదర్శం మనకు కనబడుతుంది. ఈకాలంలో కూడా అవి మనకెంతో ప్రేరణాత్మకంగా ఉంటాయి. ఆయన రాసిన ఒక పద్యం ఇది -
"కబీర్ సోయీ పీర్ హై, జో జానే పర్ పీర్
జో పర్ పీర్ న జానహీ, సో కా పీర్ మే పీర్"
అంటే, సాటివారి బాధను అర్థంచేసుకున్నవాడే నిజమైన శ్రేష్ఠమైన సాధువు . ఎదుటివారి దు:ఖాన్ని అర్థం చేసుకోలేనివాడు నిర్దయుడు. కబీర్ దాస్ గారు సామాజిక ఐక్యత పట్ల ప్రత్యేకమైన శ్రధ్ధ చూపారు. ఆయన తన కాలంనాటి కంటే భవిష్య కాలం గురించి ఎక్కువ ఆలోచించేవారు. అసంతులత, సంఘర్షణ నిండిన ఆనాటి కాలంలో ఆయన శాంతి, సద్భావాల సందేశాన్ని అందించారు . ప్రజల మనసులని ఏకత్రం చేసి అభిప్రాయభేదాలను అంతం చేసే ప్రయత్నం చేసారు.
జగ్ మే బైర్ కోయీ నహీ, జో మన్ శీతల్ హోయ్
యహ్ ఆపా తో డాల్ దే, దయా కరే సబ్ కోయ్
మరో పద్యంలో కబీర్ ఏమన్నారంటే -
"జహా దయా తహా ధర్మ్ హై, జహా లోభ్ తహా పాప్
జహా క్రోధ్ తహా కాల్ హై, జహా క్షమా తహా ఆప్"
ఆయన మరోచోట అన్నారు ""जाति न पूछो साधू की, पूछ लीजिये ज्ञान |"
అంటే, కులమతాలకు అతీతంగా మనుషులను జ్ఞానం ఆధారంగా కొలవమని, మర్యాదనివ్వమని ఆయన ప్రజలను వేడారు. శతాబ్దాల తరువాత కూడా ఆయన మాటలు ఈనాటికీ ప్రభావవంతమైనవే. ఇవాళ మనం ఆయన కథనాలను వింటుంటే ఇవాళ్టి జ్ఞాన యుగానికి చెందిన మాటలనే ఆయన చెప్తున్నారని అనిపిస్తుంది.
“जहां दया तहं धर्म है, जहां लोभ तहं पाप |
जहां क्रोध तहं काल है, जहां क्षमा तहं आप ||”
జహా దాయ్ తహా ధర్ హై, జహా లోభ్ తహా పాప్
జహా క్రోధ్ తహా కాల్ హై, జహా క్షమా తహా ఆప్
जाति न पूछो साधू की, पूछ लीजिये ज्ञान |"
అంటే, కులమతాలకు అతీతంగా మనుషులను జ్ఞానం ఆధారంగా కొలవమని, మర్యాదనివ్వమని ఆయన ప్రజలను కోరారు. శతాబ్దాల తరువాత కూడా ఆయన మాటలు ఈనాటికీ ప్రభావవంతమైనవే. ఇవాళ మనం ఆయన కథనాలను వింటుంటే ఇవాళ్టి జ్ఞాన యుగానికి చెందిన మాటలనే ఆయన చెప్తున్నారని అనిపిస్తుంది.
సత్పురుషుడు కబీర్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి , ఆయన రాసిన మరొక పద్యం గుర్తొస్తోంది నాకు. అందులో ఆయన ఏమన్నారంటే,
“गुरु गोविन्द दोऊ खड़े, काके लागूं पांय |
बलिहारी गुरु आपने, गोविन्द दियो बताय ||”
గురు గోవింద్ దోఊ ఖడే, కాక్ లాగూ పాయ్
బలిహారీ గురు ఆప్నే, గోవింద్ దియో బతాయ్
గురువు తాలూకూ గొప్పతనం అలాంటిది.ఇలాంటి గురువే మరొకరున్నారు - జగద్గురువు -భగవంతుడు గురునానక్ .కోట్ల కొద్దీ ప్రజలకు సన్మార్గాన్ని చూపెట్టిన దేవుడు ఆయన. శతాబ్దాలుగా ప్రేరణను అందిస్తునే ఉన్నారు.గురునానక్ భగవానుడు సమాజంలో జాతిమత బేధాలను నిర్మూలించాలని, యావత్ మానవజాతినీ ఒక్కటిగా తలచి ఆలింగనం చేసుకోవాలని బోధించారు. పేదల, నిరాశ్రయుల సేవే భగవ్ంతుడికి మనం అందించే సేవ అని వారు అనేవారు. వారు ఎక్కడికి వెళ్ళినా సమాజానికి ఉపయోగపడే పనులే చేసారు. సామాజిక బేధభావాలకు అతీతంగా ఉండే వంటశాల ను ఏర్పాటు చేసారు. అక్కడ ప్రతి జాతి, కుల ,మత,సాంప్రదాయాలకు చెందిన వ్యక్తులు వచ్చి వంట చేయవచ్చు. భగవాన్ గురునానక్ గారే ఈ లంగరు వ్యవస్థను మొదలుపెట్టారు. 2019 లో భగవాన్ గురునానక్ గారి 550వ జయంతి ఉత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాము. మనందరమూ ఆనందోత్సాహలతో ఈ ఉత్సవంలో పాల్గోవాలని నేను కోరుకుంటూన్నాను. గురునానక్ గారి ఈ 550వ జయంతి ఉత్సవాన్ని యావత్ సమాజం, యావత్ ప్రపంచం ఎలా జరుపుకోవాలి అనే విషయంపై కొత్తకొత్త ఆలోచనలు, కొత్త కొత్త సూచనలూ, కొత్త కొత్త ఊహలు చేసి, మనం ఆలోచించి, సరైన ఏర్పాట్లు చేద్దాం. ఎంతో గౌరవంతో పాటుగా ఈ జయంతి ఉత్సవాన్ని మనం ప్రేరణాత్మకమైన ఉత్సవంగా మారుద్దాం.
నా ప్రియమైన దేశ ప్రజలారా, భారత దేశ స్వాతంత్రపోరాటం చాలా పెద్దది. చాలా విస్తృతమైనది. లోతైనది. లెఖ్ఖలేనన్ని బలిదానాలతో నిండిన సంగ్రామం ఇది. పంజాబ్ తో ముడిపడి ఉన్న ఒక చరిత్ర ఉంది. యావత్ మానవత్వాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేసిన జలియన్‌వాలాబాగ్ దుర్ఘటన జరిగి 2019నాటికి వందేళ్ళు పూర్తవుతుంది. 1919 , ఏప్రిల్13, నాటి ఆ చీకటి రోజుని ఎవరు మర్చిపోగలరు? అధికార దుర్వినియోగంతో కౄరత్వం హద్దులన్నీ దాటి నిర్దోషులైన, నిరాయుధులైన, అమాయక ప్రజలపై తుపాకీ గుళ్ల వర్షాన్ని కురిపించిన రోజది. ఈ సంఘటన జరిగి వందేళ్ళు పూర్తవబోతున్నాయి. ఇటువంటి రోజుని మనం ఎలా గుర్తుచేసుకోవాలి అని మనందరమూ ఆలోచిద్దాం. ఈ సంఘటన అందించిన అమర సందేశాన్ని మాత్రం మనం ఎప్పటికీ గుర్తుంచుకోవాలి. హింసతోనూ, కౄరత్వం తోనూ ఎప్పుడూ ఏ సమస్యకూ పరిష్కారం లభించదు అనే సందేశాన్ని ఈ సంఘటన అందిస్తుంది. ఎప్పుడూ కూడా శాంతి, అహింస, త్యాగం, బలిదానాలనే విజయం వరిస్తుంది.
ఢిల్లీలో రోహిణి కి చెందిన శ్రీ రమణ్ కుమార్ నరేంద్ర మోదీ యాప్ లో ఏం రాసారంటే, రాబోయే జులై 6 వ తేదీన డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్మదినం కాబట్టి, మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి గురించి దేశప్రజలకు తెలపవలసిందిగా ఆయన కోరారు. రమణ్ గారూ, ముందుగా మీకు అనేకానేక ధన్యవాదాలు. భారతదేశ చరిత్ర పై మీకున్న ఆసక్తి ని చూసి ఆనందం కలిగింది. మీకు తెలిసే ఉంటుంది. నిన్ననే జూన్23న ఆయన వర్ధంతి. డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ ఎన్నో అంశాలతో ముడిపడి ఉన్నారు. కానీ వారికి అత్యంత ప్రియమైన అంశాలు విద్య, పరిపాలన, పార్లమెంటరీ వ్యవహారాలు. కలకత్తా విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్స్ అయిన వారందరిలోకీ ఆయన అతి పిన్న వయస్కుడైన వైస్ ఛాన్సలర్ అని చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. వైస్ ఛాన్సలర్ అయినప్పుడు ఆయన వయసు కేవలం 33 ఏళ్ళు మాత్రమే. డాక్టర్.శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి ఆహ్వానం పై గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ 1937 లో కలకత్తా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్ని వంగ భాష లో సంబోధించారు అన్న సంగతి చాలా కొద్ది మందికే ఇది తెలుసు. ఆంగ్ల పరిపాలన జరుగుతున్న సమయంలో, కలకత్తా విశ్వవిద్యాలయ స్నాతకోత్సవాన్నివంగ భాషలో సంబోధించడం అదే మొదటిసారి. 1947 నుండి 1950 వరకూ డాక్టర్.శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారు భారతదేశ మొదటి పారిశ్రామిక మంత్రిగా ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే భారతదేశ పారిశ్రామిక ప్రగతికి బలమైన పునాదిని అందించింది ముఖర్జీ గారే. భారత పారిశ్రామిక అభివృధ్ధికి ఆయన ఒక బలమైన పునాదిని వేసి, ఒక బలమైన వేదికని తయారుచేసారు. 1948లో వచ్చిన స్వతంత్ర భారతదేశ మొదటి పారిశ్రామిక విధానం, ఆయన ఆలోచనలు, ఆయన దార్శనిక ముద్రతోవచ్చింది. భారతదేశం ప్రతి రంగంలోనూ పారిశ్రామికంగా స్వయం సమృద్ధిగా, సమర్థవంతంగా, సంపన్నంగా ఉండాలనేది డాక్టర్ ముఖర్జీ కల. భారతదేశం పెద్ద పెద్ద పరిశ్రమలను స్థాపించాలని, దానితో పాటుగా MSME, చేనేత, వస్త్రాలు, కుటీర పరిశ్రమల పట్ల కూడా పూర్తి శ్రధ్ధ చూపెట్టాలని ఆయన కోరుకునేవారు, కుటీర ,చిన్న పరిశ్రమలు సమంగా అభివృధ్ధి చెందాలని , వాటికి ఆర్థిక సహాయం, సంస్థల ఏర్పాటు లభించాలని , దాని కోసం 1948 నుండి 1950 ల మధ్య All India Handicrafts Board, All India Handloom Board , Khadi & Village Industries Board మొదలైనవాటిని స్థాపించారు. డాక్టర్ ముఖర్జీ గారు భారతదేశ రక్షణ ఉత్పత్తి తాలూకూ దేశీయకరణపై కూడా ప్రత్యేక శ్రధ్ధ చూపారు. ముఖర్జీ గారు స్థాపించిన కర్మాగారాలలో Chittaranjan locomotive works కర్మాగారం, Hindustan aircraft కర్మాగారం, సిందరీ లోని ఎరువుల కర్మాగారం, దామోదర్ ఘాటీ కార్పొరేషన్ - ఈ నాలుగు అన్నింటికన్నా సఫలవంతమైన పెద్ద ప్రాజక్టులు. తక్కిన రివర్ వేలీ ప్రాజక్టుల స్థాపనలలో కూడా డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారిది పెద్ద సహకారమే. పశ్చిమ బెంగాల్ అభివృధ్ధి కోసం ఆయన చాలా పాటుపడ్డారు. ఆయన ఆలోచన, విచక్షణ, క్రియాశీలతల వల్లే బెంగాల్ లో ఒక భాగం రక్షించబడింది. ఇవాళ ఆ భాగం భారతదేశంలో ఉండటానికి ఆయనే కారణం. భారతదేశ సమగ్రత, ఐక్యత - ఈ రెండూ ఆయన ఆన్నింటికన్నా ప్రాముఖ్యతనిచ్చిన అంశాలు. వీటి కోసమే 52 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన తన ప్రాణాలను సైతం కోల్పోవాల్సి వచ్చింది .
రండి, మనందరమూ ఎప్పటికీ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ గారి ఐక్యతా సందేశాన్ని గుర్తుంచుకుని, సద్భావం, సౌభ్రాతృత్వ భావాలతో భారతదేశ అభివృధ్ధి కోసం సర్వశక్తులతో ఏకమౌదాం.
నా ప్రియమైన దేశప్రజలారా, గత కొన్ని వారాలలో నాకు వీడియో కాల్ మాధ్యమం ద్వారా ప్రభుత్వం ప్రవేశపెట్టిన వివిధ ప్రణాళికల ద్వారా లబ్ధిపొందిన వారితో సంభాషణ జరిపే అవకాశం లభించింది. ఫైళ్ల పరిధిని దాటి ప్రజల జీవితాలలో ఏటువంటి మార్పులు వస్తున్నాయో, వారి ద్వారానే వినే అవకాశం లభించింది. ప్రజలు తమ సంకల్పాలు, తమ సుఖ దు:ఖాలు, తమ సదుపాయాలను గురించి చెప్పారు. నాకు ఇది కేవలం ఒక ప్రభుత్వపరమైన కార్యక్రమం కాదు. నాకు ఇది ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అనుభవం. ఈ కార్యక్రమం ద్వారా నాకు ప్రజల మొహంలో సంతోషం కనపడింది. ఇంతకన్నా ఆనందకరమైన క్షణాలు ఎవరి జీవితంలోనైనా ఏం ఉంటాయి? సామాన్య ప్రజల కథలు , అమాయకపు మాటల్లో వారి అనుభవాల కథలు , నా మనసుకి హత్తుకుపోయాయి. మారుమూల పల్లెల్లోని ఆడాపడుచులకు కామన్ సర్వీస్ సెంటర్ మాధ్యమం ద్వారా పల్లెల్లోని వయోవృధ్ధుల పెంన్షన్ నుండీ పాస్‌పోర్ట్ తయారుచేయించుకునే సేవ వరకూ అన్నీ అందుబాటులో ఉన్నాయి. చత్తీస్ గడ్ లోని ఒక సోదరి సీతాఫలాలను ఏరి వాటితో ఐస్‌క్రీమ్ తయారు చేస్తోంది. ఝార్ఖండ్ లో అంజనా ప్రకాష్ లాగనే దేశంలోని లక్షలమంది యువత జన ఔషధ కేంద్రాలను నడపడం తో పాటుగా చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి చవకగా మందులను అందిస్తున్నారు. రెండు మూడేళ్ళుగా ఉద్యోగం వెతుక్కుంటున్న ఒక పశ్చిమ బెంగాల్ లోని యువకుడు ఇప్పుడు తన వ్యాపారాన్ని విజయవంతంగా చేసుకుంటున్నాడు. అంతే కాక పది పదిహేను మందికి తానే ఉద్యోగాలను ఇస్తున్నాడు. తమిళ్నాడు, పంజాబ్ , గోవా లోని పాఠశాలల్లో విద్యార్థులు తమ చిన్న వయసులోనే పాఠశాలలోని టింకరింగ్ లేబ్ లో వ్యర్థ పదార్థాలతో మేనేజ్మెంట్ లాంటి ముఖ్యమైన అంశాలపై దృష్టి పెట్టి పని చేస్తున్నారు. ఇటువంటివి మరెన్నో కథలు ఉన్నాయి. ప్రజలు తమ విజయాల తాలూకూ కబుర్లు చెప్పని ప్రాంతం దేశంలో ఏమూలలోనూ లేనే లేదు. ఈ కార్యక్రమం మొత్తంలో నాకు సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే ప్రభుత్వం విజయాన్ని సాధించడం కన్నా ఎక్కువగా సామాన్య ప్రజలు విజయాన్ని సాధించడం. ఇదే దేశ శక్తి, నవ భారత స్వప్నాలకి ఉన్న శక్తి,నవ భారత సంకల్ప శక్తి. ఇది నాకు బాగా తెలుస్తోంది. సమాజంలో కొందరు ఉంటారు. వారు నిరాశగా మాట్లాడకపోతే, నిరుత్సాహంగా మాట్లాడపోతే, అవిశ్వాసపరమైన మాటలు మాట్లాడకుంటే, కలపడానికి బదులు విడదీసే మార్గాలు వెతకకుండా ఉంటే, వారికి నిద్ర పట్టదు. ఇలాంటి వాతావరణంలో సామాన్య ప్రజలు కొత్త ఆశలతో, కొత్త ఉత్సాహంతో తమ జీవితాలలో జరుగుతున్న సంఘటనలను గురించి మాట్లాడితే అది ప్రభుత్వం గొప్పతనం కాదు. మారుమూల ఉన్న చిన్న పల్లెలోని ఒక చిన్నపిల్ల సంఘటన కూడా నూటపాతిక కోట్ల దేశప్రజలకు ప్రేరణను అందివ్వగలదు. టెక్నాలజీ సహాయంతో, వీడియో బ్రిడ్జ్ మాధ్యమం ద్వారా ప్రభుత్వ ప్రణాళికల వల్ల లాబ్ధి పొందిన ప్రజలతో సమయాన్ని గడపిన క్షణాలన్నీ నాకు ఎంతో ప్రేరణాత్మకమైనవి.ఆనందకరమైనవి. దీని వల్ల పని చేసిన ఆనందం లభించడంతో పాటూ, ఇంకా ఎక్కువ పని చెయ్యాలన్న ఉత్సాహం కూడా కలుగుతుంది. నిరుపేద వ్యక్తి కోసం జీవితాన్ని అంకితం చెయ్యాలన్న కొత్త ఆనందం,కొత్త ఉత్సాహం, కొత్త ప్రేరణ లభిస్తాయి.
దేశప్రజలకు నేనెంతో ఋణపడిఉంటాను. 40, 50 లక్షల ప్రజలు ఈ వీడియో బ్రిడ్జ్ కార్యక్రమంలో పాల్గొని ,నాకు కొత్త శక్తిని ఇచ్చే పని చేసారు. మరోసారి మీ అందరికీ నేను ఋణపడిఉంటాను అని తెలియచేస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, నేనెప్పుడూ గమనిస్తాను, మనం మన చుట్టుపక్కల గనుక గమనిస్తే ఎక్కడో అక్కడ ఏదో ఒక మంచి జరుగుతూనే ఉంటుంది. మంచి చేసే మనుషులు ఉంటారు. ఆ మంచితనపు సుగంధాన్ని మనమూ ఆస్వాదించవచ్చు. కొద్ది రోజుల క్రితం ఒక సంగతి నా దృష్టికి వచ్చింది. ఇది ఒక గొప్ప కలయిక. ఇందులో ఒక పక్క ఇంజినీర్లు, ప్రొఫెషనల్స్ ఉన్నారు. రెండో పక్క పొలంలో పనిచేసేవారు, వ్యవసాయంతో ముడిపడి ఉన్న మన రైతు సోదర సోదరీమణులు ఉన్నారు. ఇవి రెండూ విభిన్నమైన రంగాలు కదా అని మీరు అనుకుంటూ ఉంటారు. వీటికి సంబంధమేమిటీ అంటే - బెంగుళూరులో కార్పరేట్ ప్రొఫెషనల్స్, ఐ.టి ఇంజనీర్లు ఒకటయ్యారు. వారంతా కలిసి ఒక సహజ సమృధ్ధి ట్రస్ట్ ని ఏర్పరిచారు. రైతుల ఆదాయం రెట్టింపు అయ్యేలా చెయ్యడానికి ఈ ట్రస్ట్ ని స్థాపించారు. రైతులను కలుపుకుంటూ, ప్రణాళికలను తయారు చేస్తూ, రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడానికి ప్రయత్నాలు చేసారు. వ్యవసాయానికి ఉపయోగపడే కొత్త లక్షణాలతో పాటు, కొత్త పంటలను ఎలా పండించాలి అని ఈ ట్రస్ట్ ద్వారా professional, engineer, technocrat ల ద్వారా రైతులకు శిక్షణను అందించడం మొదలుపెట్టారు. ఇదివరకూ ఏ రైతులు తమ పొలంలో ఒకే రకమైన పంటను పండించారో, ఏ రైతులు ఎక్కువ పంటను పండించలేకపోయారో, లాభాలను ఎక్కువగా పొందలేకపోయారో వారు ఇవాళ కూరగాయలు పండిస్తున్నారు. వాటికి సొంతంగా మార్కెటింగ్ కూడా ట్రస్ట్ ద్వారా చేసుకుని మంచి లాభాలను పొందుతున్నారు. ధాన్యాన్ని పండించే రైతులు కూడా ఈ ట్రస్ట్ తో కలిసారు. పంట పండించడం మొదలుకుని, మార్కెటింగ్ వరకూ మొత్తం పనిలో రైతులే ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. దీనివల్ల లాభాలన్నీ రైతులవే. రైతుల భాగస్వామ్యం, రైతుల హక్కు నిశ్చితంగా ఉంచే ప్రయత్నం ఇది. పంటలు బాగా పెరగడానికి, దానికి సరైన నాణ్యమైన విత్తనాల కోసం ప్రత్యేకంగా ఒక సీడ్ బ్యాంక్ కూడా తయారుచెయ్యబడింది. స్త్రీలు ఈ సీడ్ బ్యాంక్ పనులను చూస్తారు. మహిళలను కూడా ఈ పనుల్లో కలుపుకున్నారు. ఈ అభినవ ప్రయత్నం చేసిన యువకులందరికీ నేను అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను. professionals, technocrat, engineering ప్రపంచం నుండి వచ్చిన ఈ యువకులు తమ పరిధిని దాటి వచ్చి రైతులకు సహాయంగా నిలబడి , పల్లెలతో ముడిపడి, వ్యవసాయంతో ,ధాన్యంతో ముడిపడే మార్గాన్ని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరోసారి నేను ఈ దేశయువతను వారి ఈ అభినవ ప్రయోగాలకి గానూ, నాకు తెలిసినవాటికీ, నాకు తెలియని వాటికీ, ప్రజలకు తెలిసినా , తెలియకపోయినా, కోట్ల కొద్దీ ప్రజలకు మంచి చేస్తున్న వారి నిరంతర ప్రయత్నాలకు గానూ, వారందరికీ నా తరఫున అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, జి.ఎస్.టి అమలుపరిచి ఒక ఏడాది కావస్తోంది. ‘One Nation, One Tax’ అనేది దేశ ప్రజల కల. అది ఇవాళ సాకారమైంది. ‘One Nation, One Tax reform’ దీనికి ఎవరినైనా అభినందించాల్సి వస్తే నేను రాష్ట్రాలనే అభినందిస్తాను. GST అనేది Cooperative federalism కి ఒక గొప్ప ఉదాహరణ. అన్ని రాష్ట్రాలూ కలిసి దేశ హితం కోసం నిర్ణయాన్ని తీసుకున్నాయి కాబట్టే దేశంలో ఇంత పెద్ద టాక్స్ రిఫార్మ్ అమలుపరచడం జరిగింది. ఇప్పటి వరకూ GST Council తాలూకూ 27 మీటింగ్స్ జరిగాయి. ఈమీటింగ్స్ లో వివిధ రకాల రాష్ట్రాల ప్రజలు పాల్గొంటారు, విభిన్న రాజకీయఆలోచనలు కలిగిన వ్యక్తులు పాల్గొంటారు, వేరు వేరు స్థానాలున్న రాష్ట్రాలుఉంటాయి. కానీ ఈ GST Council ఇప్పటివరకూ తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా అందరి సమ్మతంతో తీసుకున్నవే. GST కి ముందు దేశంలో 17 రకాల వివిధ రకాలైన పన్నులు ఉండేవి. కానీ ఈ వ్యవస్థ ఏర్పాటైన తరువాత ఒకే ఒక పన్ను మొత్తం దేశంలో అమలులోకి వచ్చింది. నిజాయితీ కి లభించిన విజయం జి.ఎస్.టి . ఒక రకంగా నిజాయితీకి పండుగ కూడా. ఇంతకు ముందు దేశంలో చాలాసార్లు పన్నుల విషయంలో అజమాయిషీలపై ఫిర్యాదులు వస్తూ ఉండేవి. జి.ఎస్.టి . లో జి.ఎస్.టి . అజమాయిషీ ల స్థానాన్ని ఐ.టి రంగం తీసుకుంది. రిటర్న్ నుండి రిఫండ్ వరకూ అంతా ఆన్లైన్ లోనే ఇన్ఫర్మేషన్ టేక్నాలజీ ద్వారానే జరుగుతుంది. జి.ఎస్.టి . వల్ల తనిఖీ లు ఆగాయి. సరుకుల కదలిక వేగవంతమైంది.దీనివల్ల కేవలం సమయం ఆదా అవడమే కాక లాజిస్టిక్స్ రంగానికి కూడా ఎంతో లాభం చేకూరుతోంది. ప్రపంచంలోకెల్ల అతి పెద్ద పన్ను సంస్కరణ జి.ఎస్.టి అయి ఉంటుంది. భారత దేశంలో ఇంత పెద్ద పన్ను సంస్కరణ విజయవంతమవడానికి కారణం ప్రజలు దీనిని సొంతం చేసుకోవడమే. జన శక్తి ద్వారానే జి.ఎస్.టి విజయవంతమైంది. సాధారణంగా ఇంత పెద్ద సంస్కరణ, ఇంత పెద్ద దేశంలో
ఇంత పెద్ద జనాభా లో స్థిరంగా మారడానికి ఐదు నుండీ ఏడేళ్ళు సులువుగా పడుతుంది. కానీ దేశంలోని నిజాయితీ పరుల ఉత్సాహం, నిజాయితీపరుల ఉత్సాహవంతమైన జన శక్తి భాగస్వామ్యానికి ప్రతిఫలంగా కేవలం ఒక్క ఏడాదిలోనే చాలావరకూ ఈ కొత్త పన్ను విధానం తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంది. అంతేకాక అవసరార్థం తన inbuilt వ్యవస్థ ద్వారా మార్పులు కూడా చేసుకుంటోంది. ఇది ఎంతో పెద్ద విజయం. ఈ విజయాన్ని 125కోట్ల దేశప్రజలు సంపాదించుకున్నారు.
నా ప్రియమైన దేశప్రజలారా, మరోసారి మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ముగిస్తూ, మిమ్మల్ని కలిసి, మీతో మాట్లాడే మరో అవకాశం కోసం రాబోయే మన్ కీ బాత్ కార్యక్రమం కోసం ఎదురుచూస్తూంటాను. మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు.
అనేకానేక ధన్యవాదాలు.
నమస్కారం! ’మన్ కీ బాత్’ మాధ్యమం ద్వారా మరోసారి మీ అందరి ముందుకూ వచ్చే అవకాశం లభించింది. మీ అందరికీ బాగా గుర్తుండే ఉంటుంది నావికా దళానికి చెందిన ఆరుగురు మహిళా కమాండర్ల బృందం గత కొద్ది నెలల క్రితం సముద్రయానం చేస్తున్నారని చెప్పిన సంగతి. ’ నావికా సాగర్ పరిక్రమ ’ పేరుతో చేపట్టిన ఈ యాత్ర గురించి నేను కొన్ని విషయాలు మాట్లాడాలనుకుంటున్నాను. భారతదేశానికి చెందిన ఈ ఆరుగురు ఆడపడుచుల బృందం రెండువందల ఏభై నాలుగు రోజులు పైగా సముద్రంపై ప్రయాణించి ఐ.ఎనె.ఎస్.వి తారినీ నౌకలో ప్రంపంచాన్ని చుట్టి మే నెల 21వ తేదీన భారతదేశానికి తిరిగి వచ్చారు. దేశమంతా వారికి ఎంతో ఉత్సాహంగా స్వాగతం చెప్పింది. రకరకాల మహాసముద్రాలలో, సముద్రాలలోనూ ప్రయాణిస్తూ, దాదాపు ఇరవై రెండు వేల సముద్రపు(నాటికల్) మైళ్ళ యాత్రను సాగించాలని వారు నిర్ణయించుకున్నారు. ప్రపంచంలోనే ఒక మొట్టమొదటి సంఘటన ఇది. గత బుధవారం నాకు ఈ ఆడపడుచులను కలిసి, వారి అనుభవాలను తెలుసుకునే అవకాశం లభించింది. మరోసారి నేను ఈ ఆడబిడ్డలందరికీ వారి సాహసానికి, నావికాదళ ప్రతిష్టను పెంచినందుకు, భారతదేశ గౌరవ మర్యాదలను పెంచినందుకు, ముఖ్యంగా భారతదేశపు ఆడపిల్లలు ఎందులోనూ తక్కువ కాదు అని ప్రపంచానికి చాటినందుకు గానూ అనేకానేక అభినందనలు తెలియచేస్తున్నాను. సాహసాలను గురించి ఎవరికి తెలీదు? మానవజాతి అభివృధ్ధి ప్రయాణాన్ని గనుక మనం పరిశీలిస్తే ఏదో ఒక సాహసం నుండే అభివృధ్ధి పుట్టిందని తెలుస్తుంది. సాహసం ఒడిలోంచే కదా అభివృధ్ధి పుట్టేది! ఏదో చెయ్యాలనే తపన, మామూలు దారి నుండి విడిపడి ఏదైనా చెయ్యలనే కోరిక, ఏదైనా ప్రత్యేకంగా చెయ్యాలని, నేను కూడా ఏదైనా చెయ్యగలను అనుకునే వారు చాలా తక్కువమంది ఉన్నా కూడా, వారి తపన యుగయుగాల వరకూ కోట్లకొద్దీ ప్రజలకు ప్రేరణని ఇవ్వగలదు. ఈమధ్య మీరు గమనించే ఉంటారు – ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కినవారి గురించి ఎన్నో కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. యుగాలుగా ఎవరెస్ట్ శిఖరం మానవజాతిని సవాలు చేస్తూనే ఉంది, సాహసవంతులు ఆ సవాలుని స్వీకరిస్తూనే ఉన్నారు.
మహారాష్ట్ర లో చంద్రపూర్ లోని ఒక ఆశ్రమపాఠశాలకు చెందిన ఐదుగురు ఆదివాసి విద్యార్థులు – మనీషా ధ్రువ్, ప్రమేష్ ఆలే, ఉమాకాంత్ మడ్వీ, కవిదాస్ కాత్మోడే, వికాస్ సోయామ్ – వీరంతా ఒక బృందంగా ఏర్పడి, మే 16 వ తేదీన ప్రపంచంలోనే అతిపెద్ద శిఖరాన్ని ఎక్కారు. ఆశ్రమపాఠశాలకు చెందిన ఈ ఐదుగురు విద్యార్థులు ఆగస్టు 2017లో శిక్షణను మొదలుపెట్టారు. వర్ధా, హైదరాబాద్, డార్జలింగ్, లేహ్,లడక్ లలో వీరికి శిక్షణను ఇచ్చారు. "మిషన్ శౌర్య” ద్వారా ఎన్నుకోబడిన ఈ యువకులు, ఆ పేరుని సార్థకం చేస్తూ ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి, యావత్ దేశం గర్వపడేలా చేసారు. చంద్రపూర్ పాఠశాల సిబ్బందినీ, ఈ చిన్నారి స్నేహితులకీ హృదయపూర్వకంగా అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను. ఈమధ్యనే పదహారేళ్ళ శివాంగీ పాఠక్ , నేపాల్ నుండి ఎవరెస్ట్ ని అధిరోహించిన అతిపిన్న వయస్కురాలైన భారతీయ మహిళగా నిలిచింది. శివాంగికి అనేకానేక అభినందనలు.
అజీత్ బజాజ్, వారి అమ్మాయి దియా ఎవరెస్టుని అధిరోహించిన మొదటి భారతీయ తండ్రీ-కూతురు అయ్యారు. కేవలం యువకులు మాత్రమే ఎవరెస్టుని ఎక్కడంలేదు. మే 19న సంగీతా బెహ్ల్ ఎవరెస్టుని అధిరోహించారు. ఆమె వయసు ఏభై దాటింది. ఎవరెస్టుని ఎక్కేవారిలో కొందరికి కేవలం నైపుణ్యం మాత్రమే కాదు సున్నితత్వం కూడా ఉంది అని నిరూపించారు. కొద్ది రోజుల క్రితం "స్వచ్ఛ గంగా ప్రచారం"లో భాగంగా బి.ఎస్.ఎఫ్ కు చెందిన ఒక సమూహం ఎవరెస్టుని ఎక్కి, తిరిగి వచ్చ్చేటపుడు తమతో పాటూ బోలెడు చెత్తను కూడా తీసుకొచ్చారు. ఇది ఎంతో ప్రసంశనీయమైన పని. దానితో పాటుగా ఇది పరిశుభ్రత పట్ల, పర్యావరణం పట్ల వారికున్న నిబధ్ధతను చూపెడుతుంది. ఏళ్లతరబడి ఎందరో వ్యక్తులు ఎవరెస్టుని అధిరోహించే ప్రయత్నం చేస్తున్నారు, వారిలో ఎందరో విజయవంతంగా ఈ పనిని పూర్తిచేసారు కూడా. ఈ సాహసవీరులందరికీ, ముఖ్యంగా ఆడబిడ్డలకు హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, ముఖ్యంగా నా యువ స్నేహితులారా, రెండు నెలల క్రితం నేను ఫిట్ ఇండియా గురించి చెప్పినప్పుడు ఇంత ఎక్కువ స్పందన వస్తుందని ఆశించలేదు. ప్రతి ప్రాంతం నుండీ ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు దీనికి మద్దతునిస్తారని అనుకోలేదు. ఫిట్ ఇండియా గురించి నేను మాట్లాడుతున్నప్పుడు, నేను నమ్మేదేమిటంటే మనం ఎంత ఎక్కువగా ఆడితే, దేశమంతా కూడా అంతే ఎక్కువగా ఆడుతుంది. సామాజిక మాధ్యమాల్లో ప్రజలు ఫిట్నెస్ సవాళ్ల వీడియోలు పంచుకుంటున్నారు. వాటిల్లో ఒకరినొకరు ట్యాగ్ చేసుకుని మరీ సవాలు చేసుకుంటున్నారు. ఈ ఫిట్ ఇండియా ప్రచారంలో అందరూ భాగస్తులౌతున్నారు. సినిమా రంగానికి చెందినవారైనా, క్రీడారంగానికి చెందినవారైనా, లేదా దేశంలోని ప్రముఖులు, సైన్యంలోని జవానులు, పాఠశాల ఉపాధ్యాయులు, నలువైపుల నుండీ కూడా ఒకే పిలుపు వినిపిస్తోంది – "మనం ఫిట్ గా ఉంటే దేశం ఫిట్ గా ఉంటుంది" అని.
భారతీయ క్రికెట్ టీం కేప్టెన్ విరాట్ కోహ్లీ నన్ను కూడా సవాలు చేసాడు. ఆ సవాలుని స్వీకరించాను. ఇది చాలా మంచి విషయం అని నేను నమ్ముతున్నాను. ఇలాంటి సవాళ్ళు మనల్ని ఫిట్ గా ఉంచుతాయి, ఇతరులని కూడా ఫిట్ గా ఉండమని ప్రోత్సహిస్తాయి.
నా ప్రియమైన దేశప్రజలారా, మన్ కీ బాత్ లో చాలాసార్లు నేను ఆటల గురించి, ఆటగాళ్ల గురించీ, ఏవో ఒక కబుర్లు నా ద్వారా మీరు వింటూనే ఉన్నారు. క్రితంసారి కామన్వెల్త్ గేమ్స్ గెలుపొందిన క్రీడాకారులు తమ అభిప్రాయాలను మనతో మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా పంచుకున్నారు కూడా.
"నమస్కారం సర్! నోయిడా నుండి నేను ఛవీ యాదవ్ ను మాట్లాడుతున్నాను. నేను మీ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా వింటాను. ఈసారి వేసవి సెలవులు మొదలైపోయాయి. ఒక తల్లిగా నేను గమనించినది ఏమిటంటే, పిల్లలు ఎక్కువ సమయం ఇంటర్నెట్ లో ఆటలు ఆడుతూ గడిపేస్తున్నారు. మా చిన్నప్పుడు మాత్రం మేము ఎక్కువగా అవుట్ డోర్ గేమ్స్ అయిన కొన్ని సంప్రదాయక వీధి ఆటలు ఆడేవాళ్లము. ఏడు పెంకులాట – అంటే ఏడు పెంకులను ఒకదానిపై ఒకటి వరసగా పేర్చి, దాన్ని బంతితో కొట్టేవాళ్ళం. ఇంకా నేలా-బండ, ఖోఖో మొదలైన అప్పటి ఆటలను ఇప్పుడు దాదాపుగా అందరూ మర్చిపోతున్నారు. మీరు ఆనాటి సంప్రదాయక వీధి ఆటల పట్ల ఈ తరం పిల్లలకు ఆసక్తి పెరిగేలా వాటిని గురించి మీరు చెప్పాలని కోరుతున్నాను. ధన్యవాదాలు"
ఛవీ యాదవ్ గారూ, మీరు ఫోన్ కాల్ చేసినందుకు ధన్యవాదాలు. ఇదివరకూ ప్రతి వీధి లోనూ , ప్రతి పిల్లాడి జీవితంలోనూ భాగమయిన కొన్ని ఆటలు ఇవాళ నెమ్మదిగా మాయమైపోతున్నాయి. ఈ ఆటలకు వేసవి సెలవులలో ప్రత్యేకమైన స్థానం ఉండేది. ఒకోసారి మండుటెండలో , ఒకోసారి రాత్రి వేళల్లో భోజనం అయిన తరువాత ఏ చింతా లేకుండా, నిశ్చింతగా పిల్లలందరూ గంటలు గంటలు ఈ ఆటలన్నీ అడుకుంటూ ఉండేవారు. కొన్ని ఆటలు అయితే కుటుంబం మొత్తం కలిసి ఆడుకునేలా ఉండేవి. ఏడు పెంకులాట లేదా గోళీలాట, ఖో ఖో, బొంగరాలాట లేదా గూటీ బిళ్ల, ఇలా ఎన్నో లెఖ్ఖలేనన్ని వీధి ఆటలు కాశ్మీరు నుండీ కన్యాకుమారి వరకూ, కచ్ నుండి కామరూప్ వరకూ ప్రతి ఒక్కరి బాల్యంతోనూ జతపడి ఉండేవి. ఈ ఆటలను వేరు వేరు ప్రాంతాల్లో వేరు వేరు పేర్లు ఉండి ఉండచ్చు. ఉదాహరణకు పిట్టూ ఆనే ఆటని లాగోరీ , సాతోలియా , ఏడు పెంకులాట , సాత్ పథ్తర్ , డికోరీ , సతోదియా …ఇలాగ ఒకే ఆటని ఎన్నో పేర్లతో పిలుస్తారు. సంప్రదాయక ఆటల్లో ఇన్ డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి, అవుట్ డోర్ గేమ్స్ కూడా ఉన్నాయి. మన దేశంలో భిన్నత్వంలో దాగి ఉన్న ఏకత్వం ఈ ఆటల్లో కూడా కనబడుతుంది. ఒకే ఆటను రకరకాల ప్రాంతాల్లో రకరకాల పేర్లతో పిలుస్తారు. నేను గుజరాత్ కు చెందిన వాడిని కదా, అక్కడ ఒక ఆట ఉంది, దానిని ’చోమల్ ఇస్తీ ’(అష్టా-చెమ్మా) అంటారు. ఇది గవ్వలు, చింతపిక్కలు లేదా డైస్ తో, 8×8 square board తో ఆడేవారు. ఈ ఆటను దాదాపు ప్రతి రాష్ట్రం లోనూ ఆడేవారు. కర్నాటక లో దీనిని చౌకాబారా అంటారు, మధ్య ప్రదేశ్ లో దీనిని అత్తు, కేరళలో పకీడాకాలీ, మహారాష్ట్ర లో చంపూల్, తమిళ్నాడులో దాయామ్, ఇంకా థాయామ్ అనీ, రాజస్థాన్ లోచంగాపో – ఇలా ఎన్నో పేర్లు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల వారు ఇతర భాషలు రాకపోయినా, ఈ ఆటను ఆడిన తరువాత, అరే ఈ ఆట మేమూ ఆడేవాళ్లం అని గుర్తుపట్టేస్తారు. చిన్నప్పుడు గిల్లీ డండా(గూటీ-బిళ్ళ) ఆట ఆడనివారం ఎవ్వరం ఉండము. గ్రామాల నుండీ పట్టణాల దాకా ఈ ఆటను అందరూ ఆడతారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల పేర్లతో ఈ ఆటను పిలుస్తారు. ఆంధ్రప్రదేశ్ లో ఈ ఆటను గూటీ-బిళ్ల లేదా కర్రా-బిళ్ల అనీ పిలుస్తారు. ఒరిస్సా లో గులిబాడీ అనీ, మహారాష్ట్రలో విత్తిడాలు అనీ అంటారు. కొన్ని ఆటలు ఆడేందుకు ఒకో కాలం ఉంటుంది. గాలిపటం ఎగురవేయడానికి కూడా ఒక సమయం ఉంది. అందరూ గాలిపటాలు ఎగురవేస్తారు. ఆ సమయంలో ఆడుకునేప్పుడు మనలో ఉన్న ప్రత్యేకమైన లక్షణాలను మనం స్వేఛ్ఛగా వ్యక్తపరచగలము. మీరు గమనించే ఉంటారు, స్వతహాగా సిగ్గరి అయిన పిల్లవాడు ఆడుకునేప్పుడు మాత్రం చలాకీగా అయిపోతాడు. తన భావాలను స్వేచ్ఛగా వ్యక్తపరుస్తాడు. గంభీరంగా ఉండే కొందరు పెద్దలు ఆటలాడేటప్పుడు మాత్రం వారిలోని పిల్లాడు బయటకు వస్తాడు. సంప్రదాయకమైన ఆటలు శారీరిక సామర్థ్యాన్ని పెంచే విధంగా తయారుచెయ్యబడ్డాయి. అంతే కాక మనలో తార్కికమైన ఆలోచననూ, ఏకాగ్రతనూ, అప్రమత్తతనూ, స్ఫూర్తినీ పెంపొందిస్తాయి. ఆటలు కేవలం ఆటలు మాత్రమే కాదు, అవి జీవిత విలువలను కూడా నేర్పుతాయి. అంటే – లక్ష్యాలను ఏర్పరుచుకోవడం, ధృఢత్వాన్ని ఎలా సొంతం చేసుకోవాలి, టీమ్ స్పిరిట్ ని ఎలా నేర్చుకోవాలి, పరస్పర సహకారాన్ని ఎలా అందించుకోవాలి మొదలైనవన్నమాట. ఈమధ్యకాలంలో నేను గమనిస్తున్నదేమిటంటే, బిజినెస్ డేవలప్మెంట్ తాలూకూ శిక్షణా కార్యక్రమాలతో ముడిపడి ఉన్న సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం(overall personality development, మానవ సహ నైపుణ్యాలు(interpersonal skills ) పెంచుకోవడానికి మన సంప్రదాయక ఆటలను ఈమధ్య ఉపయోగించుకుంటున్నారు. సంపూర్ణ వ్యక్తిత్వ వికాసానికి ఆ ఆటలు ఎంతో సులువుగా ఉపయోగపడుతున్నాయి కూడా. ఈ ఆటలను ఆడడానికి వయసుతో నిమిత్తం లేనే లేదు. పిల్లల నుండీ మొదలుకుని తాతా-అమ్మమ్మలూ, తాతా-నాన్నమ్మా వరకూ అంతా కలిసి ఈ ఆటలు ఆడితే మనం ఈనాడు చెప్పుకునే తరాల అంతరాలు కూడా ఇట్టే మాయమైపోతాయి. దానితో పాటుగా మన సంస్కృతి, సంప్రదాయాలను కూడా తెలుసుకుంటాం. ఎన్నో ఆటలు సమాజం, పర్యావరణ మొదలైన అంశాలను గురించి మనల్ని అప్రమత్తం చేస్తాయి. ఈ ఆటలన్నీ మనం కోల్పోతామేమో అని అప్పుడప్పుడు బెంగగా ఉంటుంది. అలా జరిగితే గనుక ఈ ఆటలనే కాదు, బాల్యాన్ని కూడా కోల్పోతాం. అప్పుడు ఇలాంటి కవితల్నే మనం వింటూ గడపాల్సి వస్తుంది –
"ఈ సంపదను తీసుకో
ఈ కీర్తిని కూడా తీసేసుకో
నా యవ్వనాన్ని కూడా తీసేసుకో
కానీ నాకు నా చిన్ననాటి శ్రావణాన్ని తిరిగివ్వు
ఆ కాగితపు పడవ, ఆ వర్షపు చినుకులు… "
ఇలాంటి పాటలను మనం వింటూ ఉండిపోతాం. అందువల్ల మన సంప్రదాయక ఆటలను మనం కోల్పోకూడదు. పాఠశాలల్లోనూ, వీధులలోనూ, యువకులంతా కలిసికట్టుగా ముందుకు వచ్చి ఈ ఆటలను ప్రోత్సహించాలి. సమూహ సేకరణ(crowd sourcing ) ద్వారా మనం మన సంప్రదాయక ఆటల తాలూకూ అతి పెద్ద భాండాగారాన్నే(అర్కైవ్) తయారుచేయగలం. ఈ ఆటల నియమాలతో, ఆడే విధానాలతో వీడియోలు తయారు చేసి పిల్లలకు చూపెట్టచ్చు. యేనిమేషన్ చిత్రాలను కూడా తయారుచేసి కొత్త తరాలవారికి చూపెట్టవచ్చు. అలా అయితే, వీధి ఆటలు గా పిలవబడే ఈ ఆటల వారికి ప్రత్యేకంగా అనిపిస్తాయి. వాటిని చూస్తారు, ఆడతారు, వికసిస్తారు.
నా ప్రియమైన దేశప్రజలారా, రాబోయే జూన్ ఐదవ తేదీ నాటి ప్రపంచ పర్యావరణ దినోత్సవ సంబరాలను అధికారికంగా భారతదేశం నిర్వహించనుంది. ఇది భారతదేశం సాధించిన ఒక ముఖ్యమైన విజయం. వాతావరణ మార్పుని తగ్గించే దిశలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలలో భారతదేశానికి ప్రాముఖ్యత పెరుగుతోందన్న సంగతి ఈ నిర్వహణ వల్ల అందరికీ తెలుస్తుంది. అందుకు ఈ నేతృత్వం ఒక పరిచయంగా నిలుస్తుంది. ‘Beat Plastic Pollution’ అనేది ఈసారి ఇతివృత్తం. ఈ ఇతివృత్తం తాలూకూ భావాన్ని దృష్టిలో ఉంచుకుని మనందరమూ కూడా పోలిథిన్, లో గ్రేడ్ పోలిథిన్ లను ఉపయోగించకుండా ఉంటామని గట్టిగా నిశ్చయించుకోవాలి. మన ప్రకృతిపై, వన్య ప్రాణులపై, మన ఆరోగ్యంపై పడుతున్న ప్లాస్టిక్ కాలుష్యపు ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నించాలి. ప్రపంచ పర్యావరణ దినోత్సవం తాలూకూ వెబ్సైట్ wed-india2018 కు వెళ్ళి, అక్కడ పొందుపరిచిన ఎన్నో ఆసక్తికరమైన సలహాలను చూసి, తెలుసుకుని, వాటిని మీ రోజువారీ జీవితాలలో భాగంగా చేసుకోవడానికి ప్రయత్నించండి. భయంకరమైన వేసవిలో వరదలు వస్తాయి, వర్షం విజయం ఎడతెరిపి లేకుండా కురుస్తుంది. వాతావరణం భరించలేనంత చల్లగా మారిపోతుంది. అప్పుడు ప్రతిఒక్కరూ అనుభవజ్ఞులు లాగ గ్లోబల్ వార్మింగ్, వాతావరణ మార్పులను గురించి మాట్లాడతారు. కానీ మాటల వల్ల సమస్యలు తీరతాయా? ప్రకృతి పట్ల సున్నితంగా వ్యవహరించడం, ప్రకృతిని రక్షించడమనేవి మన సహజ స్వభావంగా ఉండాలి. మన సంస్కారంలో ఉండాలి. గత కొద్ది వారాలుగా దేశం లోని వివిధ ప్రాంతాల్లో ఇసుక తుఫానులు వచ్చాయి. ఈదురుగాలులతో పాటూ భారీ వర్షాలు కూడా పడ్డాయి. ఇవన్నీ కాలానుగుణమైనవి కాదు. జన నష్టం జరిగింది. ఆస్తి నష్టాలు కూడా జరిగాయి. ఇవన్నీ కూడా నిజానికి వాతావరణ నమూనాలో జరుగుతున్న మార్పులు, వాటి పరిణామాలు. మన సంస్కృతి, మన సంప్రదాయం మనకి ప్రకృతితో విబేధించడాన్ని నేర్పలేదు. మనం ప్రకృతిపట్ల సద్భావంతో ఉండాలి. ప్రకృతితో ముడిపడి ఉండాలి. మహాత్మా గాంధీ గారు జీవితాంతం ప్రతి అడుగులోనూ ఈ విషయాన్నే సమర్ధించారు. ఇవాళ భారతదేశం వాతావరణ న్యాయం(climate justice) గురించి మాట్లాడినా, Cop21 , ఇంకా Paris ఒప్పందాలలో ప్రముఖ పాత్ర వహించినా, అంతర్జాతీయ సౌర కూటమి(international solar alliance ) మాధ్యమం ద్వారా యావత్ ప్రపంచాన్నీ ఒక్క త్రాటిపై నిలబెట్టినా, వీటన్నింటి వెనుకా మహాత్మా గాంధీ గారి కలను నిజం చెయ్యాలన్న ఒక ఆలోచన ఉంది. మన భూగ్రహాన్ని పరిశుభ్రంగా, ఆకుపచ్చగా తయారుచెయ్యాలంటే ఏం చెయ్యగం అని ఈ పర్యావరణ దినోత్సవం నాడు మనందరమూ ఆలోచిద్దాం. ఇలా ఈ దిశగా మనం ముందుకు నడవగలమా? వినూత్నంగా చెయ్యగలమా? వర్షాకాలం రాబోతోంది. ఈసారి మనం రికార్డ్ స్థాయిలో చెట్లు నాటే లక్ష్యాన్ని నిర్ణయించుకోవచ్చు. కేవలం వృక్షాలను నాటడమే కాకుండా అవి పెద్దవి అయ్యేవరకూ వాటిని సంరక్షించే ఏర్పాట్లు చెయ్యాలి.
నా ప్రియమైన దేశప్రజలారా, ప్రత్యేకించి నా యువ మిత్రులారా, మీరు జూన్ 21ని బాగా గుర్తుంచుకున్నారుగా? మీరే కాదు, ప్రపంచం మొత్తం జూన్ 21ని గుర్తుంచుకుంటుంది. యావత్ ప్రపంచం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకుంటుంది. ఇది అందరి ఆమోదాన్నీ పొందింది. ప్రజలు కొన్ని నెలల ముందు నుండే తయారవ్వడం మొదలుపెడుతున్నారు. యావత్ ప్రపంచం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకోవడానికి పూర్తిగా సన్నాహాలు చేసుకుంటోందని నాకు వార్తలు వచ్చాయి. yoga for unity – అంటే ’ ఐక్యత కోసం యోగా ’, harmonious society – అంటే ’ సామరస్య సమాజం” అనే సందేశాలను ప్రపంచం గత కొద్ది ఏళ్లలో మళ్ళీ మళ్ళీ అనుభూతి చెందింది. సంస్కృత మహా కవి భర్తృహరి ఎన్నో యుగాల క్రితమే తన శతకత్రయం లో రాశారు –
धैर्यं यस्य पिता क्षमा च जननी शान्तिश्चिरं गेहिनी
सत्यं सूनुरयं दया च भगिनी भ्राता मनः संयमः।
शय्या भूमितलं दिशोSपि वसनं ज्ञानामृतं भोजनं
एते यस्य कुटिम्बिनः वद सखे कस्माद् भयं योगिनः।।
ధైర్యం యస్య పితా క్షమా చ జననీ శాంతిశ్చిరం గేహినీ
సత్యం సూనురయం దయా చ భగినీ భ్రాతా మన: సంయమ:
శయ్యా భూమితలం దిశోపి వసనం జ్ఞానామృతం భోజనం
యతే యస్య కుటుంబిన: వద సఖే కస్మాద్ భయం యోగిన:
ఏన్నో యుగాలకు పూర్వం చెప్పబడిన ఈ మాటలకు సరళమైన అర్థం ఏమిటంటే "పరిమితంగా యోగాభ్యాసం చెయ్యడం వల్ల మంచి గుణాలు, సత్సంబంధాలు, స్నేహితులుగ మారిపోతాయి. యోగా చెయ్యడం వల్ల అది తండ్రిలా మనల్ని రక్షించే సాహసం చేస్తుంది. తల్లికి బిడ్డల పట్ల ఉండేలాంటి క్షమా భావాన్ని పుట్టిస్తుంది. మానసిక ప్రశాంతత మన స్నేహితుడిలా మారిపోతుంది. భర్తృహరి చెప్పినట్లుగా నియమంగా యోగా చెయ్యడం వల్ల సత్యం మన సంతానంగా, దయ సోదరిగా, స్వీయ నియంత్రణ మన సోదరుడిగా, భూమి మన పరుపుగా, జ్ఞానం మన ఆకలిని పోగొట్టేదిగా తయారవుతాయి. ఈ గుణాలన్నీ ఒక్కరిలో ముడిపడి ఉన్నప్పుడు యోగి అన్ని రకాలభయాలపై విజయాన్ని సంపాదించుకుంటాడు. మన వారసత్వమైన యోగాని ముందుకు నడిపించవలసిందిగా మరోసారి నేను దేశప్రజలందరినీ కోరుతున్నాను. తద్వారా ఆరోగ్యకరమైన, ఆనందభరితమైన, సద్భావపరమైన దేశాన్ని నిర్మిద్దాం.
నా ప్రియమైన దేశప్రజలారా, ఇవాళ మే 27వ తేదీ. భారతదేశ ప్రధమ ప్రధానమంత్రి పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి పుణ్యతిథి. నెహ్రూ గారికి నేను ప్రణామం చేస్తున్నాను. ఈ మే నెల మరొక విషయంతో కుడా ముడిపడి ఉంది. అది వీర సావర్కర్. 1857వ సంవత్సరంలో ఈ మే నెల లోనే మన భారతీయులు ఆంగ్లేయులకు తమ సత్తాను చూపించారు. దేశం లోని ఎన్నో ప్రాంతాల్లో మన సైనికులు, రైతులు అన్యాయానికి విరుధ్ధంగా తమ శౌర్యాన్ని చూపెడుతూ నిలబడ్డారు. దు:ఖపడాల్సిన విషయం ఏమిటంటే, మనం చాలా కాలం వరకూ 1857 సంఘటనలను కేవలం విద్రోహ చర్యలుగా, సిపాయిల తిరుగుబాటుగా చెప్పుకున్నాం. కానీ నిజానికి ఆ సంఘటనని తక్కువగా అంచనా వేయడమే కాకుండా, అది మన స్వాభిమానాన్ని దెబ్బ తీయడానికి చేసిన ఒక ప్రయత్నం కూడా. 1857లో జరిగినది కేవలం విద్రోహం మాత్రమే కాదు, అది మన మొదటి స్వాతంత్ర పోరాటం అని వీర సావర్కర్ గారు మాత్రమే ధైర్యంగా రాశారు . సావర్కర్ గారితో పాటూ లండన్ లోని ఇండియా హౌస్ లోని వీరులంతా కలిసి ఈ సంఘటన తాలూకూ 50 వ వార్షికోత్సవాన్ని ఆడంబరంగా జరుపుకున్నారు. ఏ నెలలో అయితే మొదటి స్వాతంత్ర సంగ్రామం ప్రారంభమయ్యిందో, అదే నెలలో వీర సావర్కర్ గారి జననం కూడా జరిగింది. సావర్కర్ గారిది అనేక ప్రత్యేకతలు కలిగిన వ్యక్తిత్వం. శస్త్రాలు, అస్త్రాలు రెండిటినీ ఆరాధించారు ఆయన. మామూలుగా వీర సావర్కర్ గారిని ఆయన వీరత్వానికీ, బ్రిటిష్ వారి పాలనకు వ్యతిరేకంగా ఆయన జరిపిన పోరాటానికి గానూ గుర్తు చేసుకుంటాము. కానీ ఇవన్నీ కాకుండా ఆయన ఒక తేజశ్శాలి అయిన కవి, సామాజిక సంస్కర్త కూడా. ఆయన ఎల్లప్పుడూ సద్భావన , ఐక్యత భావాలకి బలాన్నిచ్చారు. సావర్కర్ గారి గురించి ఒక అద్భుతమైన వర్ణనని మన ప్రియమైన గౌరవనీయులు అటల్ బిహారీ వాజ్పాయ్ గారు చేసారు. అటల్ బిహారీ వాజ్పాయ్ గారు ఏమన్నారంటే – సావర్కర్ గారు అంటే తేజం, సావర్కర్ గారు అంటే త్యాగం, సావర్కర్ గారు అంటే తపస్సు, సావర్కర్ అంటే తత్వం, సావర్కర్ అంటే తర్కం, సావర్కర్ అంటే యవ్వనం, సావర్కర్ అంటే బాణం, సావర్కర్ అంటే కత్తి. అటల్ బిహారీ వాజ్పాయ్ గారు సరైన చిత్రణ చేసారు. సావర్కర్ గారు కవిత, క్రాంతి రెండిటితోనూ నడిచారు. ఆయన ఒక సున్నితమైన కవి కావడమే కాక ఒక సాహసవంతుడైన విప్లవకారుడు కూడా.
నా ప్రియమైన సోదర సోదరీమణులారా, నేను టివీ లో ఒక కథని చూశాను. రాజస్థాన్ లో సీకర్ ప్రాంతంలోని నిరుపేద బస్తీలలో నివసించే ఆడపిల్లల కథ. మన ఈ ఆడబిడ్డలు చెత్త ఏరుకోవడంతో పాటూ ఇంటింటా బిక్షాటన చేసేంత నిస్సహాయులు. ఇవాళ వాళ్ళు కుట్టు పని నేర్చుకుని పేదవారు తమ శరీరాలను కప్పుకోవడానికి బట్టలు కుట్టిపెడుతున్నారు. అక్కడి ఆడబిడ్డలు, ఇవాళ తమ తమ కుటుంబాలకు సరిపడా బట్టలు కుట్టడమే కాకుండా ఇతర సామాన్యవర్గాలకూ, ఇంకా కొన్ని మంచి బట్టలు కూడా కుట్టిపెడుతున్నారు. ఇంతే కాకుండా వారు తమ నైపుణ్యాన్ని అభివృధ్ధి పరుచుకునే శిక్షణా తరగతులకు కూడా వెడుతున్నారు. మన ఈ ఆడబిడ్డలు ఇవాళ ఆత్మ విశ్వాసంతో ఉన్నారు. గౌరవంగా తమ జీవితాలను గడుపుకుంటున్నారు. తమ తమ కుటుంబాలకు బలాన్నిచ్చేలా తయారయ్యారు. ఆశ,విశ్వాసాలతో నిండిన ఈ ఆడబిడ్డల ఉజ్వలమైన భవిష్యత్తుకు గానూ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఏదైనా సాధించాలనే కోరిక ఉంటే, ధృఢసంకల్పం ఉంటే, ఎన్నో కష్టాల మధ్యన కూడా విజయాన్ని సాధించవచ్చు అని వారు నిరూపించారు. ఇది కేవలం సీకర్ ప్రాంతపు విషయం మాత్రమే కాదు, భారతదేశం లోని ప్రతి మూలా మీకు ఇలాంటి విషయాలు ఎన్నో కనబడతాయి. మీ ప్రాంతంలో, చుట్టుపక్కల గనుక మీరు దృష్టిని సారిస్తే ప్రజలు ఏ విధంగా తమ పరిస్థితులను జయించి నిలబడుతున్నారో తెలుస్తుంది. మనం ఏదైనా టీకొట్టు దగ్గర నిలబడి , టీ రుచిని ఆస్వాదిస్తున్నప్పుడు, పక్కన ఉన్న మనుషులు మాట్లాడుకునే కబుర్లు, వారి చర్చలు, అభిప్రాయాలు, విమర్శలు వినే ఉంటారు. ఈ చర్చలు రాజకీయాల గురించీ కావచ్చు, సామాజిక విషయాల గురించీ కావచ్చు, సినిమాల గురించీ కావచ్చు, ఆటలు, ఆటగాళ్ల గురించీ కావచ్చు, దేశంలోని సమస్యల గురించి కూడా కావచ్చు. ఇలాంటి చర్చలు జరపాలి కానీ చాలావారకూ ఇలాంటి చర్చలు, చర్చల వరకే పరిమితమౌతాయి. కానీ కోందరు వ్యక్తులు మాత్రం తమ పనుల నుండి కొంత సమయం కేటాయించి, తమ కష్టంతోనూ, ఇష్టం తోనూ మార్పుని తెచ్చే దిశగా ముందుకు నడుస్తారు. తమ కలలకు నిజరూపాన్ని ఇస్తారు. ఇతరుల కలల్ని కూడా తమవిగా చేసుకుని వాటిని నిజం చేయ్యడానికి తమని తాము శోషింప చేసుకునేలాంటి ఒక కథ ఒరిస్సా లోని కటక్ నగరంలో ఒక పూరి గుడిసె లో నివసించే డి.ప్రకాశ రావు ది. నిన్ననే నాకు డి.ప్రకాశ రావు ని కలిసే అవకాశం లభించింది. శ్రీ డి.ప్రకాశ రావు ఏభై ఏళ్ళుగా నగరంలో టీ అమ్ముకుంటున్నారు. ఒక మామూలు టీ కొట్టు నడిపే వ్యక్తి, డెభ్భై కంటే ఎక్కువ మంది పిల్లలకు విద్యా ప్రకాశాన్ని అందిస్తున్నాడని తెలిస్తే మీరు వింటే ఆశ్చర్యపోతారు. బస్తీలోనూ, పూరి గుడిసెల్లోనూ నివసించే పిల్లల కోసం "ఆశ ఆశ్వాసన" పేరుతో ఒక పాఠశాలను ప్రారంభించారు. జీవనం కోసం టీకొట్టును నడిపే ఈ పేద వ్యక్తి తన ఏభై శాతం ఆదాయాన్ని ఆ పాఠశాల కోసం ఖర్చు పెడతాడు. పాఠశాలకు వచ్చే పిల్లలందరికీ విద్య, ఆరోగ్య, భోజన సదుపాయాలను పూర్తిగా అందిస్తాడు. డి.ప్రకాశ రావు కఠిన పరిశ్రమకీ, ఆయన పట్టుదలకీ, ఆ పేద విద్యార్థుల జీవితాలకు కొత్త దారిని చూపినందుకు గానూ ఆయనకు అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను. ఆ పిల్లల జీవితాలలోంచి చీకటిని ఆయన తరిమివేశారు.”తమసోమా జ్యోతిర్గమయా’ అనే వేద వాక్యం ఎవరికి తెలీదు? కానీ ఆ వాక్యాన్ని జీవించి చూపెట్టారు డి.ప్రకాశరావు. వారి జీవితం మనందరికీ, సమాజానికీ, యావత్ దేశానికీ ఒక ప్రేరణ.
మీ చుట్టుపక్కల కూడా ఇలాంటి ప్రేరణాత్మక సంఘటనలు ఉంటాయి. అనేకానేకమైనవి ఉంటాయి. రండి అందరం కలిసి అనుకూలతని ముందుకు నడిపిద్దాం.
జూన్ నెలలో ఏండ తీవ్రత ఎంత ఎక్కువగా ఉంటుందంటే ప్రజలు వర్షాల కోసం ఎదురుచూస్తారు. ఆకాశంలో మబ్బులెప్పుడు కనబడతాయా అని ఎదురుచూపులు చూశ్తారు. కొద్ది రోజుల్లో ప్రజలు చంద్రుడి కోసం కూడా ఎదురుచూశ్తారు. చంద్రుడు కనబడ్డాడంటే అర్ధం ఈద్ పండుగ జరుపుకోవచ్చని. రంజాన్ సందర్భంగా ఒక నెలంతా ఉపవాసం ఉన్నాకా ఈద్ పండుగ ను పూర్తి ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ సందర్భంగా, ప్రత్యేకంగా పిల్లలకు మంచి బహుమతులు కూడా లభిస్తాయి. ఈద్ పండుగ మన సమాజంలో సామరస్య బంధాలను మరింత బలపరుస్తుందని నేను ఆశిస్తున్నాను. అందరికీ అనేకానేక అభినందనలు.
నా ప్రియమైన దేశప్రజలారా, మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు. మరోసారి మళ్ళీ వచ్చే నెలలో ’మన్ కీ బాత్’ లో కలుద్దాం.
నమస్కారం!
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. ఇటీవల ఏప్రిల్ 4వ తేదీ నుండీ ఏప్రిల్ 15వ తేదీ వరకూ ఆస్ట్రేలియా లో 21వ కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. భారతదేశంతో పాటుగా ప్రపంచంలోని మరో 71దేశాలు ఈ ఆటలలో పాల్గొన్నాయి. ఇంత పెద్ద కార్యక్రమంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న వేల కొద్దీ క్రీడాకారులు ఇందులో పాల్గొంటున్నారంటే, అక్కడ ఎటువంటి వాతావరణం అక్కడ ఉంటుందో ఊహించగలరా? ఉత్సాహం, ఆసక్తి, సరదా, ఆశలు, ఆకాంక్షలు, ఏదో సాధించాలనే సంకల్పం .. ఇటువంటివన్నీ ఉన్న వాతావరణం నుండి ఎవరు మాత్రం దూరంగా ఉండగలరు? ఇటువంటి సమయంలోనే దేశంలోని ప్రతి ఒక్కరూ కూడా రోజూ ఉదయాన్నే ఇవాళ ఎవరి ఆట ఉందీ? భారతదేశం ప్రదర్శన ఎలా ఉండబోతోంది? ఎవరెవరు మెడల్స్ గెలుచుకుంటారు? అని ఆసక్తిగా ఎదురుచూశారు. ఇలా అనుకోవడమూ సహజమే. మన భారతీయ క్రీడాకారులందరూ కూడా దేశవాసులందరి ఆశలనూ వమ్ము చెయ్యకుండా అత్యుత్తమ ఆటను ప్రదర్శిస్తూ, ఒకదాని తర్వాత మరొక పతకాన్ని గెలుస్తూనే ముందుకు సాగారు. షూటింగ్ లో, కుస్తీ పోటీలో, వెయిట్ లిఫ్టింగ్ లో, టేబుల్ టెన్నిస్ , బ్యాడ్మెంటన్ మొదలైన ఆటల్లో భారతదేశం రికార్డ్ స్థాయిలో ఆటను ప్రదర్శించింది. 26 బంగారు పతకాలు, 20 వెండి పతకాలు, 20 కాంస్య పతకాలు సాధించి, మొత్తమ్మీద దాదాపు 66 పతకాలను భారతదేశం సాధించింది. ఈ విజయం ప్రతి భారతీయుడూ గర్వించతగ్గది. క్రీడాకారులకు కూడా పతకాలు సాధించడం గర్వంగానూ, ఆనందంగానూ ఉంటుంది. యావత్ దేశానికీ, దేశవాసులందరికీ కూడా ఇది అత్యంత గౌరవపూర్వక పండుగలాంటిది. మేచ్ పూర్తయిన తరువాత భారతదేశానికి ప్రాతినిధ్యం వహిస్తూ అథ్లెట్లు అక్కడ పతకాలతో నిలబడి ఉండగా, మన మువ్వన్నెల జండాను కప్పుకుని ఉండగా, మన జాతీయ గీతం వినిపిస్తూ ఉంటే, సంతోషం, ఆనందం, గౌరవం, ఘనత కలగలిసిన ఆ భావన ఎంతో అపురూపమైనది. ప్రత్యేకమైనది. తనువునీ, మనసునీ కూడా కదిలించే భావన అది. ఉత్సాహంతోనూ, సమభావంతోనూ మనందరి హృదయాలూ నిండిపోతాయి. అసలలాంటి భావాలను వ్యక్తపరచడానికి నా దగ్గర మాటలు కూడా లేవు. కానీ నేను ఈ క్రీడాకారుల నుండి విన్నది మీకు కూడా వినిపించాలని అనుకుంటున్నాను. నాకు గర్వంగా ఉంది. మీలో కూడా ఆ భావన కలగాలని నా కోరిక.
౧) “కామన్వెల్త్ గేమ్స్ లో నాలుగు మెడల్స్ సాధించిన మనికా బాత్రా ని నేను. రెండు బంగారు పతకాలూ, ఒక వెండి పతకం, ఒక కాంస్య పతకం సాధించాను. “మన్ కీ బాత్” కార్యక్రమాన్ని వినే శ్రోతలకు నేను చెప్పాలనుకున్నదేమిటంటే, మొదటిసారిగా భారతదేశంలో టేబుల్ టెన్నిస్ ఇంత ప్రజాదరణ పొందినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ పోటీలలో నేను నా బెస్ట్ టేబుల్ టెన్నిస్ ఆటను ప్రదర్శించాననే అనుకుంటున్నాను. మొత్తం జీవితానికి సరిపడేంత బెస్ట్ టేబుల్ టెన్నిస్ ఆటను ఆడాను. కానీ అంతకు ముందు నేను ఎంతగా సాధన చేసానో మీతో చెప్తాను. నేను నా కోచ్ సందీప్ సార్ తో పాటుగా ఎంతో సాధన చేసాను. కామన్వెల్త్ గేమ్స్ కన్నా ముందర పోర్చుగల్ లో జరిగిన క్యాంప్స్ కీ, టోర్నమెంట్స్ కీ ప్రభుత్వం మమ్మల్ని పంపించినందుకు, మాకు చక్కని అంతర్జాతీయ అవగాహనను కల్పించినందుకు గానూ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. యువతరానికి నేనిచ్చే సందేశం ఒకటే – ఓటనిమి ఎప్పుడూ అంగీకరించద్దు. మిమ్మల్ని మీరు తెలుసుకోండి.
౨) నా పేరు పి.గురురాజ్. ” మన్ కీ బాత్” కార్యక్రమాన్ని వినేవారందరికీ నేను చెప్పదలుచుకున్నదేమిటంటే – 2018 కామన్వెల్త్ గేమ్స్ లో పతకాన్ని గెలవాలన్నది నా కల. మొదటిసారిగా ఈ ఆటల్లో పాల్గొని, మొదటి రోజున, భారతదేశానికి మొదటి పతకాన్ని అందించినందుకు నాకెంతో ఆనందంగా ఉంది. నా ఈ పతకాన్ని మా ఊరు కుందాపూర్ కీ, నా కర్నాటక రాష్ట్రానికీ, నా దేశానికీ అంకితం చేస్తున్నాను.
౩) నా పేరు మీరాబాయ్ చానూ
21వ కామన్వెల్త్ గేమ్స్ లో పాల్గొని భారతదేశానికి మొదటి బంగారు పతకాన్ని అందించడం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మణిపూర్ నుంచి భారతదేశం కోసం ఒక ఉత్తమ క్రీడాకారిణిని అవ్వాలన్నది నా కల. మణిపూర్ ప్రజలు, మా అక్క, మిగతా కుటుంబ సభ్యులందరూ కూడా నాకెంతో ప్రేరణను అందించిన తరువాత నేను మణిపూర్ నుండి భారతదేశం కోసం, ఎలాగైనా క్రీడాకారిణిగా నిలవాలని కోరుకున్నాను. క్రమశిక్షణ, నిజాయితీ, సమర్పణా భావం, ఇంకా నా శ్రమ నేను విజయవంతంగా నిలబడడానికి మిగిలిన కారణాలు.
కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశ ప్రదర్శన ఉత్తమమైనదిగానూ, ప్రత్యేకమైనది గానూ నిలిచింది. ప్రత్యేకమైనది ఎందుకంటే ఈసారి ఎన్నో విషయాలు మెదటిసారిగా జరిగాయి. ఈసారి కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం తరఫున పాల్గొన్న కుస్తీ పోటీదారులందరూ పతకాలు గెలుచుకుని వచ్చారని మీకు తెలుసా? మనికా బాత్రా తను పాల్గొన్న అన్ని పోటీల లోనూ పతకాలను సాధించారు. ఇండివిడ్జువల్ టేబుల్ టెన్నిస్ లో బంగారు పతకాన్ని సాధించిన మొదటి భారతీయ మహిళ ఆమె. భారతదేశానికి అన్నింటికన్నా ఎక్కువ పతకాలు షూటింగ్ లో లభించాయి. 15ఏళ్ళ భారతీయ షూటర్ అనీష్ భాన్వాలా కామన్వెల్త్ గేమ్స్ లో భారతదేశం తరఫున బంగారు పతకాన్ని సంపాదించుకున్న అతి చిన్న వయస్కుడైన క్రీడాకారుడు.
కామన్వెల్త్ గేమ్స్ లో మరో పతకాన్ని సాధించిన సచిన్ చౌదరి భారతీయ ఏకైక పారా పవర్ లిఫ్టర్. ఈసారి గేమ్స్ ప్రత్యేకమైనవి ఎందుకంటే, ఈసారి అధికంగా పతకాలు సాధించినది మహిళా అథ్లెట్ లే. స్క్వాష్ అయినా, బాక్సింగ్ అయినా, వెయిట్ లిఫ్టింగ్ అయినా , షూటింగ్ అయినా సరే మహిళా క్రీడాకారులు చిత్రాలు చేసి చూపారు. బేట్మెంటన్ లో చివరి పోటీ భారత్ కి చెందిన ఇద్దరు క్రీడాకారిణులు సైనా నెహ్వాల్, పి.వి.సింధూ ల మధ్యన జరిగింది. ఈ ఆటను దేశవాసులందరూ ఆసక్తికరంగా చూసారు. నాక్కూడా చాలా ఆనందం కలిగింది. గేమ్స్ లో పాల్గొనడానికి వచ్చిన అథ్లెట్స్ దేశం లోని వివిధ ప్రాంతాల నుండి, చిన్న చిన్న పట్టణాల్లోంచీ వచ్చారు. అనేక కష్టాలనూ, బాధలనూ ఎదుర్కొని ఇక్కడి దాకా చేరారు. వారంతా ఇవాళ అందుకున్న స్థాయి, వారు చేరుకున్న లక్ష్యాలు, అన్నీ కూడా వారి వారి జీవితంలో వారి తల్లిదండ్రులు, వారి సంరక్షకులు; కోచ్ లేదా సపోర్ట్ స్టాఫ్ ; పాఠశాల, పాఠశాలలోని ఉపాధ్యాయులు; స్కూల్లోని వాతావరణం మొదలైనవారందరి సహకారం వల్లనే సాధ్యమయ్యాయి. అన్ని పరిస్థితుల్లోనూ వారి వెంట నిలబడి వారి ధైర్యాన్ని నిలబెట్టి ఉంచిన వారి స్నేహితుల సహకారం కూడా ఉంది. నేను ఈ క్రీడాకారులందరితో పాటూ ,వారికి సహకరించినవారందరికీ కూడా అనేకానేక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
క్రితం నెల ’మన్ కీ బాత్ ’ లో నేను దేశప్రజలందరితోనూ, ముఖ్యంగా యువతతో ఫిట్ ఇండియాని నిర్మించాల్సిందిగా కోరాను. రండి, ఫిట్ ఇండియాలో పాల్గొనండి..ఫిట్ ఇండియాను నడిపించండి అని నేను ప్రతి ఒక్కరినీ నేను ఆహ్వానించాను. ప్రజలు ఈ ఉద్యమంలో ఎంతో ఉత్సాహంగా పాల్గొనడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. చాలామంది ప్రజలు దీనికి తమ సహకారాన్ని తెలుపుతూ ఉత్తరాలు రాసారు, సోషల్ మీడియా లో తమ ఫిట్నెస్ మంత్రాన్నీ, ఫిట్ ఇండియా కథలను షేర్ చేసారు. శశికాంత్ భోంస్లే గారు ఈతకొలను దగ్గర తన చిత్రంతో పాటుగా “నా శరీరమే నా ఆయుధం , నా మూలపదార్థం నీళ్ళు, ఈతే నా ప్రపంచం” అని రాసి పంపారు.
రుమా దేవనాథ్ ఏమ్ రాసారంటే, “మార్నింగ్ వాక్ వల్ల నేను చాలా ఆరోగ్యంగానూ, ఆనందంగానూ ఉన్నాను. ఆమె ఇంకా ఏమంటున్నారంటే ““For me – fitness comes with a smiles and we should smile, when we are happy.” దేవనాథ్ గారూ, ఫిట్నెస్ వల్లనే ఆనందం కలిగుతుందనడంలో ఎంత మాత్రం సందేహం లేదు.
ధవల్ ప్రజాపతి : తన ట్రెక్కింగ్ అనుభవాలను పంచుకుంటూ ఆయన ఏం రాసారంటే “నా దృష్టిలో ట్రావెలింగ్, ట్రెక్కింగ్ చెయ్యడమే ఫిట్ ఇండియా. చాలామంది పేరుప్రతిష్ఠలు ఉన్నవారు కూడా ఎంతో ఆసక్తికరమైన విధంగా మన యువతను ఫిట్ ఇండియా కోసం ఉత్తేజపరచడం చూసి నాకు చాలా ఆనందం కలిగింది. సినీ కళాకారుడు అక్షయ్ కుమార్ ట్విట్టర్ లో ఒక వీడియో ను పంచుకున్నారు. నేనూ అది చూశాను. మీఅంతా కూడా ఆ వీడియోను చూడండి. అందులో ఆయన ఉడెన్ బీడ్స్ తో ఎక్సర్సైజ్ చేస్తూ కనిపిస్తారు. ఆ వ్యాయామం వీపు, పొట్టలలోని కండరాలకి ఎంతో లాభదాయకమైనది అని ఆయన తెలిపారు. బహుళ ప్రచారం పొందిన మరో వీడియోలో ఆయన వాలీబాల్ ఆడుతూ కనిపించారు. చాలామంది యువత పిట్ ఇండియా ఎఫర్ట్స్ తో పాటుగా జతపడి, తమ అనుభవాలను పంచుకున్నారు. ఇలాంటి ఉద్యమాలు మనందరికీ, దేశమంతటికీ కూడా ఎంతో లాభదాయకమైనవి. నేను చెప్పే మరో ముఖ్యమైన మాట ఏమిటంటే, ఖర్చులేని ఫిట్ ఇండియా ఉద్యమం పేరే యోగా. ఫిట్ ఇండియా ప్రచారంలో యోగా కి ఎంతో ప్రత్యేకమైన స్థానం ఉంది. మీరు కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారని అనుకుంటున్నాను. జూన్ 21వ తేదీన జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం మహత్యాన్ని ప్రపంచం అంతా స్వీకరించింది. మీరు కూడా ఇప్పటి నుండే తయారు కండి. ఒంటరిగా కాకుండా, మీ నగరం , మీ గ్రామం, మీ ప్రాంతం, మీ పాఠశాల, మీ కళాశాల, ఏ వయసు వారైనా, పురుషులైనా, స్త్రీలైనా కూడా ప్రతి ఒక్కరూ కూడా యోగాతో జతపడడానికి ప్రయత్నం చెయ్యాలి. సంపూర్ణమైన శారీరిక ఉల్లాసం కోసం, మానసిక ఆనందం కోసం, మానసిక సంతులత కోసం యోగా ఎంత ఉపయోగకరమో ఇప్పుడిక భారతదేశానికీ, ప్రపంచానికీ చెప్పాల్సిన అవసరం లేదు. నేను యోగా చేస్తున్నట్లు తయారు చేసిన యానిమేటెడ్ వీడియో ఈమధ్యన చాలా ప్రచారం పొందింది. ఒక టీచర్ చెయ్యాల్సిన పనిని, అది యానిమేషన్ ద్వారా పూర్తయ్యేలా ఎంతో శ్రధ్ధగా ఈ యానిమేషన్ చేసినవారిని నేను అభినందిస్తున్నాను. మీకు కూడా ఇందువల్ల లాభం చేకూరుతుంది.
నా యువ మిత్రులారా, మీరంతా ఇప్పుడు పరీక్షలు,పరీక్షలు, పరీక్షలు అనే ఆందోళన నుండి బయటపడి శెలవుల ఆలోచనల్లో మునిగి ఉంటారు. శెలవులను ఎలా గడపాలి, ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచిస్తూ ఉండి ఉంటారు. నేను ఒక కొత్త పని కోసం మిమ్మల్ని ఆహ్వానించదలుచుకున్నాను. ఈమధ్యన చాలా మంది యువకులు ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్చుకోవడానికి తమ సమయాన్ని వినియోగిస్తున్నారు. Summer Internship ప్రాముఖ్యత కూడా పెరుగుతోంది. యువత కూడా దానికై వెతుకుతూ ఉంటారు. Internship అనేదే ఒక కొత్త అనుభవం. ఇందువల్ల నాలుగు గోడలకు బయట, పెన్నూ కాయితమూ , కంప్యూటర్ నుండి దూరంగా జీవితాన్ని కొత్తగా జీవించడానికి సరిపడా అనుభవాలను తెలుసుకునే అవకాశం లభిస్తుంది. నా యువ మిత్రులారా, ఒక ప్రత్యేకమైన Internship కోసం నేను మిమ్మల్ని ఇవాళ ఆహ్వానిస్తున్నాను. భారత ప్రభుత్వానికి చెందిన విభాగాలు – క్రీడా శాఖ, మానవ వనరుల శాఖ, త్రాగు నీటిశాఖ, మొదలైన మూడు నాలుగు విభాగాలు కలిసి ఒక ” స్వఛ్ఛ భారత్ Summer Internship – 2018″ ని ప్రారంభించారు. కళాశాలలకు చెందిన విద్యార్థినీ,విద్యార్థులు, ఎన్.సి.సి కి చెందిన యువత, ఎన్.ఎస్.ఎస్. కి చెందిన యువత, నెహ్రూ యువ కేంద్రానికి చెందిన యువత, సమాజం కోసం, దేశం కోసం, ఏదో నేర్చుకోవాలనుకునే వారు, సమాజంలో మార్పు తేవడానికి తమ వంతు సహాయం చెయ్యలనుకునేవారు, ఒక అనుకూలమైన శక్తితో సమాజసేవలో పాలుపంచుకోవాలనుకునే వారందరికీ కూడా ఇదెంతో గొప్ప అవకాశం. దీనివల్ల పరిశుభ్రత కు కూడా బలం లభిస్తుంది. అక్టోబర్ 2వ తేదీ నుండీ మనం జరుపుకోబోయే మహాత్మా గాంధీ గారి 150 వ జయంతి ఉత్సవాల కంటే ముందుగానే మనకు ఏదో చేశామన్న తృప్తి మిగులుతుంది. కళాశాలల్లోనూ, విశ్వవిద్యాలయాలలోనూ ఉత్తమమైన పనులు చేసిన ఉత్తమమైన interns కి రాష్ట్ర స్థాయిలో పురస్కారాలు లభిస్తాయి. ఈ Internship ని విజయవంతంగా పూర్తిచేసే ప్రత్యేకమైన Intern కి ’స్వఛ్ఛ భారత మిషన్” ద్వారా ఒక సర్టిఫికెట్ ఇవ్వబడుతుంది. ఇంతేకాక ఏ Intern అయితే ఈ పనిని బాగా చేస్తారో వారికి యు.జి.సి రెండు క్రెడిట్ పాయింట్స్ కూడా ఇస్తుంది. ఈ Internship నుండి లబ్ధిని పొందవలసిందిగా నేను విద్యార్థులనూ, యువతనూ మరొకసారి ఆహ్వానిస్తున్నాను. మీరు మై గౌ యాప్ నుండే ’Swachh Bharat Summer Internship’ కోసం నమోదులు చేసుకోవచ్చు. ఇందులో పాల్గొనడం ద్వారా మన యువత స్వఛ్ఛభారత ప్రచారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళగలదని ఆశిస్తున్నాను. మీరు మీ తాలూకూ సమాచారాన్ని తప్పక పంపించండి, కథను రాయండి, చిత్రాలను పంపండి, వీడియోలను పంపండి. రండి..ఒక కొత్త అనుభూతి కోసం, ఏదైనా నేర్చుకునేందుకు ఈ శెలవులను వినియోగిద్దాం.
నా ప్రియమైన దేశ ప్రజలారా, ఎప్పుడు అవకాశం లభించినా నేను దూరదర్శన్ లో ’ గుడ్ న్యూస్ ఇండియా ’ కార్యక్రమాన్ని తప్పకుండా చూస్తుంటాను. ఈ కార్యక్రమాన్ని చూడవలసిందిగా దేశప్రజలను నేను కోరుతున్నాను. ఇందువల్ల దేశంలో ఏ ఏ ప్రాంతంలలో, ఏటువంటి మనుషులు ఎలాంటి మంచి పనులు చేస్తున్నారో తెలుస్తుంది.
కొద్ది రోజుల క్రితం నేను ఈ కార్యక్రమంలో పేద విద్యార్థుల చదువు కోసం నిస్వార్థ సేవ చేస్తున్న ఢిల్లీ కి చెందిన కొందరు యువకుల కథను చూపిస్తుండడం చూశాను. ఈ యువ సమూహం కలిసి వీధి పిల్లలనూ, మురికివాడల్లో నివసించే పిల్లల చదువు కోసం ఒక పెద్ద ప్రచారాన్ని చేపట్టారు. మొదట్లో వీరు రోడ్లపై భిక్షాటన చేసే పిల్లలను, చిన్న చిన్న పనులు చేసుకుని బ్రతికే పిల్లల పరిస్థితులను చూసి ఎంతగా కదిలిపోయారంటే, వెంఠనే ఇటువంటి సృజనాత్మకమైన పనిలో నిమగ్నమైపోయారు. ఢిల్లీ లోని గీతా కాలనీ దగ్గర్లో ఉన్న మురికివాడల్లోని పదిహేనుమంది పిల్లలతో ప్రారంభమైన ఈ ప్రచారం ఇప్పుడు రాజధానిలో పన్నెండు స్థానాల్లో రెండువేలమంది పిల్లలను కలుపుకుంది. ఈ ప్రచారంతో ముడిపడిఉన్న యువకులు, శిక్షకులు తమ తీరుబడిలేని దినచర్య నుండే రెండు గంటల సమయాన్ని కేటాయించుకుంటూ, సామాజంలో మార్పు కోసం ఈ భగీరథ ప్రయత్నంలో నిమగ్నమై ఉన్నారు.
సోదర సోదరీమణులారా, ఇదే విధంగా ఉత్తరాఖండ్ లోని పర్వత ప్రాంతాలకు చెందిన కొందరు రైతులు దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ప్రేరణాత్మకంగా నిలిచే పని చేశారు. వారంతా తమ సంఘటిత ప్రయత్నాలతో తమదే కాకుండా తమ ప్రాంతపు విధినే మార్చేసారు. ఉత్తరాఖండ్ లోని బాగేశ్వర్ లో ముఖ్యంగా బుల్గురు గోధుమలు, తోటకూర, మొక్కజొన్న, బార్లీ మొదలైన పంటలు మాత్రమే పండుతాయి. కొండప్రాంతం కావడం చేత రైతులకు ఈ పంటల తాలూకూ సరైన ధర లభించేది కాదు. కప్కోట్ ప్రాంతానికి చెందిన రైతులు ఈ పంటలను నేరుగా బజారులో అమ్మి నష్టపడేకన్నా విలువ పెంచే (ధర పెరుగుదల) మార్గాన్ని కనుగొన్నారు. వారేం చేశారంటే, ఈ పండించిన వాటితో బిస్కెట్లు తయారు చేసి, అమ్మడం మొదలుపెట్టారు. ఈ పంటలన్నింటిలో ఇనుప ఖనిజం ఎక్కువగా ఉన్నందువల్ల ఈ ఇనుము తత్వమున్న బిస్కెట్లు గర్భవతి మహిళలకు చాలా ఉపయోగకరమైనవి. మునార్ గ్రామంలో ఈ రైతులందరూ కలిసి ఒక ప్రభుత్వ సంస్థను ఏర్పాటుచేసి, అక్కడ ఈ బిస్కెట్లు తయారు చేసే ఫ్యాక్టరీని తెరిచారు. రైతుల ధైర్యాన్ని చూసి ప్రభుత్వం కూడా ఆ సంస్థను ’ రాష్ట్రీయ ఆజీవిక మిషన్’(National Rural Livelihood Mission (NRLM))కు జతపరిచింది. ఇప్పుడీ బిస్కెట్లను కేవలం బాగేశ్వర్ జిల్లా లోని దాదాపు ఏభై అంగన్వాడి కేంద్రాలలోనే కాకుండా అల్మోడా, కౌసానీ వరకూ అందిస్తున్నారు. రైతుల శ్రమ వల్ల ఈ సంస్థ ఏడాదికి పది,పదిహేను లక్షల అమ్మకపు మొత్తాన్ని చేరుకోవడమే కాకుండా 900 కన్నా అధికంగా కుటుంబాలకు రోజువారీ పనులను కల్పిస్తోంది. ఇందువల్ల జిల్లా నుండి ఎక్కువగా ఉన్న వలసలు కూడా ఆగాయి.
నా ప్రియమైన దేశ ప్రజలారా, భవిష్యత్తులో ప్రపంచంలో నీటి కోసం యుధ్ధాలు జరుగుతాయి అని మనం వింటున్నాం. ప్రతివారు ఈ మాట అంటున్నారు కానీ ఎవరూ బాధ్యతగా ఉండటం లేదు. నీటి పరిరక్షణ అనేది ఒక సామాజిక బాధ్యతగా పరిగణించాలని మనకి అనిపించదా? ఒక్కొక్క వర్షపు చుక్కనీ మనం ఎలా భద్రపరుచుకోవాలి అనిపించదా?మనందరికీ తెలుసు భారతీయులందరికీ నీటి పరిరక్షణ అనేది కొత్త విషయం కాదు. కేవలం పుస్తకాల్లోని విషయం కాదు. భాషకు అందని విషయం కాదు. శతాబ్దాలుగా మన పూర్వీకులు దీనిని మనకు చేసి చూపెట్టారు. ఒక్కొక్క నీటి చుక్కకూ వారు ఎంతటి ప్రాముఖ్యతనిచ్చారో మనకు తెలుసు. ఒక్కొక్క నీటి చుక్కనీ ఎలా సంరక్షించాలో వారు కొత్త కొత్త ఉపాయాలు కనుక్కుని చేసి చూపెట్టారు. మీలో ఎవరికన్నా తమిళ్నాడు వెళ్ళే అవకాశం వస్తే అక్కడ కొన్ని ఆలయాలలో ఏర్పాటుచేసి ఉన్న పెద్ద పెద్ద శిలాశాసనాలలో నీటిపారుదల వ్యవస్థ, నీటి పరిరక్షణ వ్యవస్థ, పొడి నిర్వహణ ఎలా చెయ్యాలో రాయబడి ఉంటుంది. మనార్ కోవిల్, చిరాన్ మహాదేవీ, కోవిల్ పట్టీ లేదా పుదుకొట్టయి మొదలైన ఆలయాలలోకి వెళ్తే, అన్ని చోట్లా పెద్ద పెద్ద శిలాశాసనాలు మీకు కనబడతాయి. ఇవాళ్టికి కూడా రకరకాల దిగుడుబావి లు(stepwells) పర్యాటక స్థలాల్లో మనకు పరిచితమే. కానీ ఇవన్నీ కూడా నీటి సంరక్షణార్థం మన పూర్వీకులు చేసిన ప్రయత్నాలకు సజీవ నిదర్శనాలు అన్న సంగతి మనం మర్చిపోకూడదు. గుజరాత్ లోని ’అడాలజ్ దిగిడుబావి’, ఇంకా పాటన్ లోని ’పాటన్ రాణి దిగుడుబావి’ లను UNESCO World Heritage sites గా గుర్తించింది. వీటి వైభవము చూడగానే తెలుస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే దిగుడుబావులంటే నీటి ఆలయాలే కదా. మీరు రాజస్థాన్ వెళ్తే గనుక జోధ్ పూర్ లోని చాంద్ బావడీ తప్పకుండా చూడండి. ఇది భారతదేశంలోని దిగుడుబావులు అన్నింటికన్నా పెద్దది, ఇంకా అందమైన దిగుడుబావులలో ఒకటి. గమనించాల్సిన విషయం ఏమిటంటే అది నీటి కొరత ఉన్న ప్రాంతంలో నిర్మించబడి ఉంది. ఏప్రిల్, మే, జూన్ ,జూలై నెలలలో వర్షపునీటిని సేకరించడానికి గొప్ప అవకాశం ఉంటుంది. మనం ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటే గనుక మనకు లాభం కలుగుతుంది. ఉపాధి కొరకు కేటాయించిన బడ్జెట్ కూడా ఈ నీటి పరిరక్షణకు పనికివస్తుంది. గత మూడేళ్ళుగా నీటి పరిరక్షణ, నీటి నిర్వహణ దిశగా ప్రతి ఒక్కరూ కూడా తమ తమ ప్రయత్నాలు చేశారు. ప్రతి ఏడూ ఉపాధి కొరకు కేటాయించిన బడ్జెట్ నుండి నీటి పరిరక్షణ, నీటి నిర్వహణపై సగటున 32 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయబడ్డాయి. 2017-18 గురించి చెప్పాలంటే , నేను 64 వేల కోట్ల రూపాయిల మొత్తంలో 55% అంటే దాదాపు 35వేల కోట్ల రూపాయిలను నీటి పరిరక్షణ వంటి పనుల కోసం ఖర్చుపెట్టడం జరిగింది. గత మూడేళ్ల కాలంలో ఇటువంటి నీటి పరిరక్షణ, నీటి నిర్వాహణ ఉపాయాల మాధ్యమం ద్వారా 150 లక్షల హెక్టార్ల భూమికి అధికంగా లాభం చేకూరింది. నీటి పరిరక్షణ, నీటి నిర్వాహణ ల కోసం భారత ప్రభుత్వం ద్వారా ఉపాధికి లభించే ధనాన్ని కొందరు చాలా లాభదాయకంగా వాడుకోవడం జరిగింది. కేరళ లోని కుట్టెం పేరూర్ (kuttemperoor) నదిపై ఉపాధి పనులు చేసుకునే 7వేల మంది 70రోజుల వరకూ ఎంతో కష్టపడి ఆ నదిని పునరుద్ధరించారు. గంగా, యమునలు నీటితో నిండి ఉండే నదులు. కానీ ఉత్తర్ ప్రదేశ్ లోనూ, మరి కొన్ని ప్రాంతాల్లోనూ, ఫతేపూర్ జిల్లా లో ససుర్ ఖదేరీ పేరుతో ఉన్న నదీ మొదలైన రెండు చిన్న చిన్న నదులు ఎండిపోయాయి. జిల్లా యంత్రాంగం ఉపాధిలో భాగంగా పెద్ద మొత్తంలో మట్టి, నీటి పరిరక్షణ కార్యక్రమాలను చేపట్టే భారాన్ని తమపై వేసుకున్నారు. దాదాపు 40-45 గ్రామాల ప్రజల సహాయంతో ఈ ఎండిపోయిన ససుర్ ఖదేరీ నదిని పునరుద్ధరించారు. పశువులకైనా, పక్షులకైనా, రైతులకైనా, పొలాలకైనా, గ్రామాలకైనా ఉపయోగపడే ఈ పునరుధ్ధరణ ఎంతో దీవెనలతో నిండిన విజయం. మరోసారి ఏప్రిల్, మే, జూన్, జులై నెలలు మన ముందర ఉన్నాయి. నీటి పారుదల వ్యవస్థ, నీటి పరిరక్షణ కోసం మనందరమూ కూదా బాధ్యత వహించి, కొన్ని ప్రణాళికలు తయారు చేసుకుని, మనం కూడా జల సంరక్షణకు ఏదైనా సాధించి చూపెడదాం.
నా ప్రియమైన దేశ ప్రజలారా, ’మన్ కీ బాత్ ’ సమయానికల్లా నాకు ఎన్నో ప్రాంతాల నుండి సందేశాలు వస్తాయి. ఉత్తరాలు వస్తాయి. ఫోన్ కాల్స్ వస్తాయి. పశ్చిమ బెంగాల్ లో ఉత్తరం వైపున 24వ సబ్ డివిజన్ తాలూకూ దేవీతోలా గ్రామానికి చెందిన ఆయన్ కుమార్ బెనర్జీ మై గౌ యాప్ ద్వారా తన సందేశాన్ని రాశారు. ఆయన ఏమంటారంటే – “మనం ప్రతి సంవత్సరం రవీంద్ర జయంతి జరుపుకుంటాం. కానీ నోబుల్ పురస్కార గ్రహీత అయిన రవీంద్రనాథ్ టాగూర్ అనుసరించిన ప్రశాంతతతో, అందమైన, సమైక్యతతో నిండిన జీవితాన్ని గడపాలన్న జీవన వేదాంతం ఎవరికీ తెలియనే తెలియదు. మీరు దయ ఉంచి మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ విషయం గురించి చర్చించండి. అందువల్ల ప్రజలకు ఈ సంగతి తెలుస్తుంది.”
’మన్ కీ బాత్ ’ వినే మిత్రులందరి దృష్టికీ ఈ విషయాన్ని తెచ్చినందుకు నేను ఆయన గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. గురుదేవులు రవీంద్రనాథ్ టాగూర్ జ్ఞానము, వివేకము నిండిన సంపూర్ణ వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. వారి రచనల్లు ప్రతి ఒక్కరి మనసుపై తమదైన చెరిగిపోలేని ముద్రను వేస్తాయి. రవీంద్రనాథ్ ఒక ప్రతిభావంతుడైన వ్యక్తిత్వం కలిగినవారు. బహుముఖ ప్రజ్ఞాశాలి. కానీ వారిలో దాగి ఉన్న ఒక అధ్యాపకుడిని ప్రతి క్షణం మనం గుర్తించవచ్చు. వారు గీతాంజలి లో రాశారు – ’He, who has the knowledge has the responsibility to impart it to the students.’ అంటే “జ్ఞానం ఎవరివద్ద ఉంటుందో, దానిని జిజ్ఞాసులైనవారికి పంచడం అనేది వారి బాధ్యత”.
నాకు బెంగాలీ భాష రాదు కానీ చిన్నప్పుడు నాకు త్వరగా నిద్ర లేచే అలవాటు ఉండేది. తూర్పు భారతదేశంలో రేడియో ప్రసారం త్వరగా మొదలైపోయేది. పశ్చిమ భారతదేశంలో లేటుగా మొదలౌతుంది. నాకు కొద్ది కొద్దిగా గుర్తుంది..దాదాపు ఐదున్నరకి కాబోలు రేడియోలో రవీంద్ర సంగీతం ప్రారంభం అయ్యేది. అది వినే అలవాటు ఉండేది. భాష రాకపోయినా పొద్దున్నే త్వరగా లేచి రేడియోలో రవీంద్ర సంగీతం వినడం నాకు బాగా అలవాటై పోయింది. ఆనంద లోకే, ఆగునేర్, పోరోష్మణి – మొదలైన కవితలు వినే అవకాశం వచ్చినప్పుడు మనసులో ఎంతో చైతన్యం కలిగేది. మిమ్మల్ని కూడా రవీంద్ర సంగీతం , వారి కవితలు ఎంతో ప్రభావితం చేసి ఉంటాయి. నేను రవీంద్రనాథ్ టాగూర్ కి ఆదరపూర్వకమైన అంజలిని ఘటిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, కొద్దిరోజుల్లోనే పవిత్రమైన రంజాన్ నెల మొదలవబోతోంది. ప్రపంచవ్యాప్తంగా రంజాన్ మాసాన్ని పూర్తి శ్రధ్ధ, గౌరవాలతో జరుపుకుంటారు. ఉపవాసపు సమిష్టి అంశం ఏమిటంటే మనిషి స్వయంగా ఆకలిగా ఉంటేనే తప్ప ఎదుటివారి ఆకలి అర్థం కాదు అని. తాను దాహంగా ఉంటేనే ఇతరుల దాహం మనిషికి అర్థం అవుతుంది. పైగంబర్ మొహమ్మద్ సాహెబ్ గారి విద్య, సందేశాలను గుర్తు చేసుకోవాల్సిన సమయం ఇది. సమానత్వం, సహోదరత్వపు మార్గాలపై నడవడం మన బాధ్యత. ఒకసారి ఒక వ్యక్తి పైగంబర్ సాహెబ్ ను అడిగారట -“ఇస్లాం మతం లో ఏ పని అన్నింటికన్నా మంచిది? అని. దానికి పైగంబర్ సాహెబ్ గారు -“ఎవరైనా పేదవారికి, అవసరం ఉన్నవారికి తిండి పెట్టడం, పరిచయమున్నా, లేకపోయినా అందరినీ సద్భావంతో పలకరించాలి” పైగంబర్ మొహమ్మద్ సాహెబ్ జ్ఞానము, కరుణ లపై విశ్వాసం ఉంచేవారు. వారికి ఎటువంటి అహంకారమూ ఉండేది కాదు. అహంకారమే జ్ఞానాన్ని పరాజితమయ్యేలా చేస్తుంది అంటారు. పైగంబర్ మొహమ్మద్ సాహెబ్ ప్రకారం మన వద్ద ఏదైనా వస్తువు అవసరానికి మించి ఉన్నప్పుడు, దానిని ఎవరైనా అవసరం ఉన్న వ్యక్తులకు ఇవ్వాలి. అందుకే పవిత్రమైన రంజాన్ మాసంలో దానం ఇస్తు ఉంటారు. పైగంబర్ మొహమ్మద్ సాహెబ్ గారి ప్రకారం వ్యక్తి తన పవిత్ర ఆత్మ వల్ల ధనవంతుడౌతాడు. ధనం వల్ల కాదు. దేశవాసులందరికీ నేను పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. ఈ అవకాశం ప్రజలను మొహమ్మద్ సాహెబ్ గారి శాంతి, సద్భావాల సందేశాలపై నడిచేందుకు ప్రేరణను ఇవ్వాలని కోరుకుంటున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, బుద్ధపూర్ణిమ ప్రతి భారతీయుడికీ ముఖ్యమైన రోజు. కరుణ, సేవ,త్యాగం ఈ మూడింటి శక్తినీ చూపెట్టిన మహామనీషి, బుధ్ధభగవానుడు నడిచిన నేల ఈ భారతదేశం అని మనం గర్వపడాలి. విశ్వవ్యాప్తంగా ఆయన ఎన్నోలక్షల మందికి మార్గనిర్దేశం చేసారు. బుధ్ధ భగవానుడిని తలుచుకుంటూ, వారు చూపెట్టిన మార్గంలో ప్రయాణించడానికి ప్రయత్నిస్తూ, సంకల్పం చేసుకుంటూ, నడవాల్సిన మనందరి బాధ్యతనూ మరొక్కసారి గుర్తుచేస్తుంది ఈ బుధ్ధపూర్ణిమ. బుధ్ధభగవానుడు సమానత్వం, శాంతి, సద్భావం, సహోదరత్వాల ప్రేరణా శక్తి. ఇటువంటి మానవత్వపు విలువల అవసరం నేడు ప్రపంచంలో అధికంగా ఉంది. బాబాసాహెబ్ డా. అంబేద్కర్ గారు తన సోషల్ ఫిలాసఫీ లో బుధ్ధ భగవానుడి నుండే ఎక్కువ ప్రేరణ ఉందని గట్టిగా చెప్పేవారు. వారన్నారు ““My Social philosophy may be said to be enshrined in three words; liberty, equality and fraternity. My Philosophy has roots in religion and not in political science. I have derived them from the teaching of my master, The Buddha.”
బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం ద్వారా దళితులు, పీడితులు, దోపిడీకి గురైనవారు, వంచితులు, మొదలైన కొన్ని పరిమితులకు లోబడి జీవిస్తున్న కోట్ల కొద్దీ ప్రజలను ధృఢమైనవారిగా తయారు చేసారు. ఇంతకు మించి కరుణకు గొప్ప ఉదాహరణ ఉండదు. ఇటువంటి కరుణే ప్రజల బాధల పట్ల బుధ్ధ భగవానుడు చూపిన అన్ని గొప్ప గుణాలలో ఒకటి. బౌధ్ధ భిక్షువులు రకరకాల దేశాలలో సంచరిస్తూ ఉంటారని అంటారు. వారు తమతో పాటూ బుధ్ధ భగవానుని సంపన్నకరమైన ఆలోచనలను తీశుకుని తిరుగుతూ ఉంటారు. ఇది అన్ని కాలాల్లోనూ జరుగుతూనే వస్తోంది. యావత్ ఆసియా ఖండంలో వ్యాపించిన బుధ్ధ భగవానుని బోధలు మనకు వారసత్వంగా లభించాయి. అనేక ఆసియా దేశాలైన చైనా, జపాన్, కొరియా, థాయిలాండ్,కాంబోడియా,మాయన్మార్ మొదలైన అనేక దేశాల్లో ఈ బౌధ్ధ సంప్రదాయం, బౌధ్ధ బోధనలు వారి వారి మూలాల్లో కలిసిపోయి ఉన్నాయి. అందు కోసమే మనం బౌధ్ధ పర్యాటకుల కోసం ప్రాధమిక సదుపాయాలను అభివృధ్ధి పరుస్తున్నాము. ఆగ్నేయ ఆసియా లోని ముఖ్యమైన ప్రాంతాలూ, భారతదేశం లోని కొన్ని ముఖ్యమైన ప్రాంతాలూ ఈ బౌధ్ధ పర్యాటనలో భాగమైయ్యాయి. ఎన్నో బౌధ్ధ ఆలయాల పునరుధ్ధరణ కార్యక్రమాల్లో భారతదేశానికి కూడా ఇప్పుడు భాగస్వామ్యం లభించడం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. ఇందులో మయన్మార్ లోని బాగాన్ లో ఉన్న శతాబ్దాల క్రితంనాటి వైభవపూర్వమైన ఆనంద్ మందిర్ కూడా ఉంది. ఇవాళ ప్రపంచంలో ప్రతి చోటా సంఘర్షణ, అనాగరిక హింస కనబడుతోంది. ద్వేషాన్ని దయతో జయించాలన్నది బుధ్ధ భగవానుని బోధన. కరుణా సూత్రాలను నమ్ముతూ, ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న బుధ్ధ భగవానుని భక్తితో పూజించే భక్తులందరికీ బుధ్ద పూర్ణిమ సందర్భంగా శుభాకాంక్షలు అందజేస్తున్నాను. బుధ్ధుని భోధనలతో ఒక శాంతియుత, కరుణాపూరిత ప్రపంచాన్ని నిర్మించడానికి తమవంతు బాధ్యతను నిర్వర్తించేలా చేయమని, బుధ్ధ భగవానుని యావత్ ప్రపంచాన్నీ ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను. ఇవాళ మనం బుధ్ధ భగవానుని గుర్తు చేసుకుంటున్న సమయంలో మరో సంగతి – మీరు లాఫింగ్ బుధ్ధా విగ్రహాల గురించి వినే ఉంటారు. లాఫింగ్ బుధ్ధా విగ్రహాలు అదృష్టాన్ని తెస్తాయని అంటూంటారు. కానీ ఈ స్మైలింగ్ బుధ్ధా విగ్రహాలు భారతదేశ రక్షణ చరిత్రలోని ఒక ముఖ్యమైన ఘటనతో ముడిపడి ఉన్నదని చాల కొద్దిమందికే తెలుసు. స్మైలింగ్ బుధ్ధా కీ, భారతీయ సైనిక శక్తీ కీ ఏం సంబంధం ఉందీ అని మీరు అనుకుంటూ ఉండవచ్చు. ఇరవై ఏళ్ల క్రితం మే 11, 1998 సాయంత్రం అప్పటి భారత ప్రధానమంత్రి శ్రీ అటల్ బిహారీ వాజపేయి గారు దేశాన్ని సంబోధిస్తూ చెప్పిన మాటలు యావత్ దేశాన్నీ గర్వమూ, పరాక్రమమూ, అనందమయ క్షణాలతో నింపేసాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి ఉన్న భారతీయ సముదాయాల్లో కొత్త ఆత్మవిశ్వాసం వెల్లివిరిసింది. ఆ రోజు కూడా బుధ్ధ పూర్ణిమ. మే 11, 1998 లో భారత పశ్చిమ సరిహద్దుల్లో రాజస్థాన్ లోని పోఖరణ్ లో పరమాణు ప్రయోగం జరిగింది. అది జరిగి ఇరవై ఏళ్ళు అయ్యింది. ఈ ప్రయోగం బుధ్ధ భగవానుని ఆశీర్వాదంతో బుధ్ధ పూర్ణిమ నాడు జరిగింది. భారతదేశ ప్రయోగం విజయవంతమైంది. ఒకరకంగా చెప్పాలంటే విజ్ఞానం, సాంకేతికత క్షేత్రాల్లో భారతదేశం తనకున్న బలాన్ని ప్రదర్శించింది. ఆ రోజు భారతదేశ చరిత్రలో, దేశ సైనికశక్తి ప్రదర్శన రూపంలో అంకితమైంది. inner strength అంటే అంత:శక్తి శాంతికి ఎంతో అవసరం అని బుధ్ధ భగవానుడు ప్రపంచానికి చూపెట్టాడు. ఇలాగే మనం ఒక బలమైన దేశం గా నిలబడినప్పుడు మనం అందరితో శాంతిపూర్వకంగా ఉండగలరు. 1998 మే నెల కేవలం పరమాణు ప్రయోగం జరిగినందుకు మాత్రమే దేశానికి ముఖ్యమైనది కాదు. అది ఎలా జరిపారో అన్నది ముఖ్యమైనది. భరత భూమి ఎందరో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలతో నిండిన భూమి అని ప్రపంచానికి చూపెట్టింది. ఒక బలమైన నాయకత్వం ఉంటే భారతదేశం నిత్యం కొత్త మజిలీలను, ఉన్నత శిఖరాలనూ సాధించగలదు అని నిరూపించింది. అటల్ బిహారీ వాజపేయి గారు “జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్” అనే మంత్రాన్ని ఇచ్చారు. ఈసారి మే 11, 1998 నాటికి ఆ ప్రయోగం జరిగి ఇరవై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా మనం విజయోత్సవం చేసుకోబోతున్నాం. ఈ సందర్భంగా అటల్ జీ ఇచ్చిన “జై విజ్ఞాన్” మంత్రాన్ని అనుసంధానించుకుంటూ ఆధునిక భారతదేశాన్ని తయారుచేయడానికి, శక్తివంతమైన భారతదేశాన్ని తయారు చేయాడానికి, సమర్థవంతమైన భారతదేశాన్ని తయారుచేయడానికి ప్రతి యువకుడూ తోడ్పాటుని అందివ్వాలని సంకల్పించాలి. తమ సామర్ధ్యాన్ని భారతదేశ సామర్థ్యానికి భాగస్వామిని చెయ్యాలి. చూస్తూండగానే అటల్ గారు ప్రారంభించిన యాత్రను ముందుకు నడిపించడానికి కొత్త ఆనందాన్ని, కొత్త సంతోషాన్నీ మనం కూడా పొందగలం.
నా ప్రియమైన దేశ ప్రజలారా, వచ్చే మన్ కీ బాత్ లో మళ్ళీ కలుద్దాం. ఎన్నో కబుర్లు చెప్పుకుందాం. అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం!
ఇవాళ శ్రీరామనవమి పండుగ. ఈ శ్రీరామనవమి పండుగ రోజున దేశప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. రామనామానికి ఎంత శక్తి ఉందో పూజ్యులైన బాపూ జీవితంలో ప్రతి క్షణంలోనూ మనం చూశాము. కొద్ది రోజుల క్రితం జనవరి 26వ తేదీన ఆసియాలోని(ASEAN) పలుదేశాల నేతలందరూ ఇక్కడికి వచ్చినప్పుడు వారందరూ వారితో తమ సాంస్కృతిక బృందాలను తమ వెంట తీసుకువచ్చారు. వారిలో ఎక్కువ శాతం దేశాల వారు ఇక్కడ రామాయణాన్ని ప్రదర్శించడం మనమెంతో గర్వించదగ్గ విషయం. అంటే రాముడు, రామాయణం కేవలం మన భారతదేశానికే కాక ప్రపంచ భూభాగంలో ఒకటైన ఈ ఆసియా దేశాలన్నింటికీ కూడా ప్రేరణను అందించి, ప్రభావితం చేసాయన్నమాట. నేను మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, ప్రతిసారిలాగానే ఈసారి కూడా చాలా పెద్ద సంఖ్యలో మీ అందరి ఉత్తరాలు, ఈ-మెయిల్స్, ఫోన్ కాల్స్, కామెంట్లు నాకు అందాయి. కోమల్ ఠక్కర్ గారూ, మై గౌ యాప్ లో మీరు ఆన్ లైన్ ద్వారా సంస్కృత భాషా కోర్సులను నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు రాసినది చదివాను. వృత్తిరీత్యా ఐ.టి రంగంలో ఉన్నప్పటికీ కూడా, సంస్కృత భాష పట్ల మీకు ఉన్న ప్రేమను చూస్తే చాలా సంతోషం కలిగింది. దీనికి సంబంధించిన విభాగంతో సంస్కృత భాష ప్రచారంలో జరుగుతున్న ప్రయత్నాల తాలూకూ సమాచారాన్ని మీకు అందించవలసిందిగా కోరాను.
’ మనసులో మాట’ శ్రోతలలో కూడా సంస్కృత భాషా ప్రచారం తాలూకూ పనులు చేసేవారు ఉంటే, కోమల్ గారి సూచనను ఎలా ముందుకు నడిపించాలో అలోచించవలసిందిగా కోరుతున్నాను.
బీహార్ లోని నలందా జిల్లా తాలూకూ బరాకర్ గ్రామం నుండి ఘనశ్యామ్ కుమార్ గారు నరేంద్రమోదీ యాప్ లో రాసిన కామెంట్లు చదివాను. భూమిపై నానాటికీ తగ్గిపోతున్న జలరాశి గురించి ఆయన ఆందోళనను వ్యక్తం చేసారు. ఈ విషయం నిజంగా ఎంతో ముఖ్యమైనది.
కర్ణాటక నుండి శకల్ శాస్త్రి గారు పదాలను ఎంతో అందంగా జతచేస్తూ ఏం రాసారంటే, “మన దేశం ఆయుష్మంతురాలు ఎప్పుడవుతుందంటే మన ’భూమి ఆయుష్మంతురాలు’ అయినప్పుడు. మన ’భూమి ఆయుష్మంతురాలు’ ఎప్పుడవుతుందంటే, మనం ఈ భూమిపై నివసించే ప్రతి ఒక్క ప్రాణి గురించి ఆదుర్దా పడినప్పుడు. వేసవికాలంలో మనందరినీ పశుపక్ష్యాదుల కోసం మంచినీటిని ఏర్పాటు చెయ్యవలసిందని కోరారు. శకల్ గారూ, మీ ఆలోచనలను నేను శ్రోతలందరికీ చేరవేసాను.
యోగేష్ భద్రేష్ గారు ఈసారి నేను యువత తో వారి ఆరోగ్యాలను గురించి మాట్లాడాలని కోరారు. మిగతా ఆసియా దేశాల యువతతో పోలిస్తే ,మన భారతదేశంలో యువత బలహీనంగా ఉన్నారని ఆయన భావన. యోగేష్ గారూ, ఈసారి నేను కూడా అందరితోనూ ఆరోగ్యం గురించి, ముఖ్యంగా Fit India గురించి వివరంగా మాట్లాడాలని అనుకుంటున్నాను. అప్పుడు మీ యువత అంతా ఏకమై Fit India ఉద్యమాన్ని నడిపించ వచ్చు.
కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ రాష్ట్రపతి కాశీయాత్రకు వచ్చారు. ఆ యాత్రకు సంబంధించిన వారణాసి చిత్రాలన్నీ మనసుకు హత్తుకునేలా ఉన్నాయని, ప్రభావితం చేసేలా ఉన్నాయని ప్రశాంత్ కుమార్ గారు తన ఉత్తరంలో రాసారు. ఆ యాత్ర తాలూకూ చిత్రాలన్నింటినీ, వీడియోలన్నింటినీ, సామాజిక మాధ్యమం ద్వారా ప్రచారం చెయ్యాలని ఆయన కోరారు. ప్రశాంత్ గారూ, భారత ప్రభుత్వం వారు ఆ చిత్రాలను అదే రోజున సామాజిక మాధ్యమం లోనూ, నరేంద్ర మోదీ యాప్ లోనూ షేర్ చేసారు. మీరు కూడా వాటిని like చేసి, రీట్వీట్ చేసి, మీ స్నేహితులందరికీ అందించండి.
చెన్నై నుండి అనఘ, జయేష్, ఇంకా ఎంతోమంది పిల్లలు Exam Warrior పుస్తకం వెనకాల ఇవ్వబడిన gratitude cards మీద తమ మనసులో వచ్చిన ఆలోచనలన్నింటినీ రాసి, తిరిగి నాకు పంపించారు. అనఘకీ, జయేష్ కీ, ఇంకా మిగతా పిల్లలందరికీ నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, మీ అందరి ఉత్తరాల వల్లా నా రోజువారీ శ్రమ అంతా మటుమాయమైపోతుంది. ఎన్నో ఉత్తరాలు, ఎన్నో ఫోన్ కాల్స్, ఎన్నో కామెంట్లు..! వీటన్నింటిలోనూ నేను చదవగలిగినన్ని ఉత్తరాలు చదివాను. వినగలిగినన్ని ఫోన్ కాల్స్ విన్నాను. వీటన్నింటిలోనూ ఎన్నో విషయాలు మనసుని తాకాయి. కానీ కేవలం వాటన్నింటి గురించే
చెప్తూ ఉంటే, బహుశా కొన్ని నెలల పాటు నేను మాట్లాడుతూ ఉన్నా కూడా ఆ కబుర్లు తరగవు. ఇంకా చెప్తూనే ఉండాలేమో.
ఈసారి ఎక్కువ శాతం పిల్లల నుండే ఉత్తరాలు వచ్చాయి. పరీక్షలను గురించి రాసిన ఉత్తరాలు. శెలవులలో ఏమేమి చెయ్యాలనుకుంటున్నారో కూడా రాసారు పిల్లలు. వేసవికాలంలో పశుపక్ష్యాదులకు నీటిని అందించే విషయం గురించి రాశారు. రైతుల వేడుకల గురించీ, ఇంకా దేశవ్యాప్తంగా పొలాల్లో జరిగే కార్యక్రమాలను గురించి కొందరు రైతు సోదరుల నుండి, సోదరీమణుల నుండీ ఉత్తరాలు వచ్చాయి. నీటి సంరక్షణ గురించి కొందరు చైతన్యవంతులైన పౌరులు సూచనలు పంపారు. రేడియో మాధ్యమం ద్వారా మనం ’మనసులో మాటలు ’ చెప్పుకోవడం మొదలుపెట్టినప్పటి నుండీ నేనొక విషయాన్ని గమనించాను. వేసవికాలంలో ఎక్కువగా వేసవికాలం గురించిన విషయాలపైనే ఉత్తరాలు వస్తున్నాయి. పరీక్షల ముందర విద్యార్థిమిత్రుల ఆందోళన గురించిన ఉత్తరాలు వస్తాయి. పండుగ సమయాలలో మన పండుగలు, మన సంస్కృతి, మన సంప్రదాయాల గురించిన కబుర్లతో ఉత్తరాలు వస్తాయి. అంటే, మనసులో మాటలు వాతావరణంతో పాటూ మారతాయి. అంతే కాకుండా మన మనసులో మాటలు ఎక్కడో కొందరి జీవితాల వాతావరణాన్ని కూడా మార్చేస్తాయన్నది కూడా నిజం. ఎందుకు మార్చకూడదు? మీ ఈ మాటల్లో, మీ అనుభవాలలో, మీ ఉదాహరణలలో ఎంతో ప్రేరణ, ఎంతో శక్తి, ఎంతో ఆత్మీయత, దేశానికి ఎదో ఒకటి చెయ్యాలన్న తపన ఉంటాయి. వీటన్నింటికీ మొత్తం దేశ వాతావరణాన్నే మార్చేయగల శక్తి ఉంది.
అస్సాం లోని కరీమ్ గంజ్ లో ఉండే అహ్మద్ అలీ అనే ఒక ఆటోరిక్షా నడిపుకునే వ్యక్తి, తన పట్టుదలతో తొమ్మిది స్కూళ్ళు కట్టించాడు అనే విషయం నాకు మీ అందరి ఉత్తరాల ద్వారానే తెలిసింది. ఇలాంటి ఉత్తరాల వల్లనే మన దేశం యొక్క మొక్కవోనిన పట్టుదల నాకు కనబడుతుంది. కాన్పూర్ లోని డాక్టర్ అజీత్ మోహన్ చౌధరీ గారి కథ విన్నప్పుడు, ఆయన ఫుట్‌పాత్ పై నివసించే పేదవారి వద్దకు వెళ్ళి, వారికి వైద్యసేవలను అందించడమే కాక వారికి ఉచితంగా మందులు కూడా అందిస్తారని తెలిసినప్పుడు, ఈ దేశపు సౌభాతృత్వాన్ని తెలుసుకునే అవకాశం నాకు లభించింది. 13ఏళ్ల క్రితం సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల, కలకత్తా లోని కేబ్ డ్రైవర్ సైదుల్ లస్కర్ సోదరి మరణించింది. అందుకని సకాలంలో వైద్యం అందకపోవడం వల్ల మరే ఇతర పేదవ్యక్తీ చనిపోకూడదన్న సదుద్దేశంతో, ఒక ఆసుపత్రిని నిర్మించాలని ఆయన సంకల్పించాడు. తన ఈ లక్ష్యం కోసం సైదుల్ ఇంట్లోని నగలన్నింటినీ అమ్మాడు, దానాలను స్వీకరించాడు. అతడి కేబ్ లో ప్రయాణించిన ఎందరో ప్రయాణికులు మనస్ఫూర్తిగా దానాలని ఇచ్చారు. ఒక మహిళా ఇంజినీరు తన మొదటి జీతాన్ని సైతం అతడికి ఇచ్చేసింది. ఇలా సమకూర్చుకున్న సొమ్ముతో చివరికి పన్నెండేళ్ల తరువాత, సైదుల్ లస్కర్ తన బగీరథ ప్రయత్నంలో సఫలం సాధించి, తన శ్రమ ఫలితంగా, తన సంకల్పం కారణంగా, కలకత్తా దగ్గరలో పునరీ గ్రామంలో దాదాపు ముఫ్ఫై పడకలు ఉన్న ఆసుపత్రిని తయారుచేసాడు. ఇది న్యూ ఇండియా బలం.
ఉత్తర్ ప్రదేశ్ లోని ఒక మహిళ అనేక సంఘర్షణల తరువాత 125మరుగుదోడ్ల నిర్మాణం జరిపి, మహిళలందరినీ వారి హక్కుల కోసం పోరాడడానికి ప్రేరణను అందించినప్పుడు, మాతృశక్తి దర్శనం అయ్యింది. ఇలాంటి ఎన్నో ప్రేరణాత్మక సంఘటనలు నాకు నా దేశాన్ని పరిచయం చేస్తాయి. యావత్ ప్రపంచం ఇవాళ భారతదేశం వైపు చూసే దృష్టికోణం మారింది. ఇవాళ భారతదేశం పేరుని ఎంతో గౌరవంగా పలుకుతున్నారంటే, దాని వెనుక ఇలాంటి భరతమాత బిడ్డల ప్రయత్నాలెన్నో దాగి ఉన్నాయి. నేటి రోజున దేశవ్యాప్తంగా యువతలో, మహిళలలో, వెనుకబడిన వర్గాలలో, పేదవారిలో, మధ్యతరగతి వారిలో, అన్ని వర్గాలలోనూ మనం ముందుకు నడవగలము, మన దేశం ముందుకు నడవగలదు అన్న నమ్మకం ఏర్పడింది. ఆశలు, ఆశయాలతో నిండిన ఒక ఆత్మవిశ్వాసంతో కూడిన సానుకూల వాతావరణం ఏర్పడింది. ఇదే ఆత్మవిశ్వాసం, ఇదే సానుకూలత మన న్యూ ఇండియా తాలూకూ సంకల్పాన్ని సాకారం చెయ్యగలదు. కలను నిజం చెయ్యగలదు.
నా ప్రియమైన దేశప్రజలారా, రాబోయే నెలలు మన రైతు సోదర ,సోదరీమణులందరికీ ఎంతో ముఖ్యమైనవి. ఈ కారణంగా వ్యవసాయానికి సంబంధించిన ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. ఈసారి నేను దూరదర్శన్ ప్రసారం చేసే డిడి కిసాన్ ఛానల్ లో రైతులతో జరిపే చర్చల వీడియోలను కూడా నేను తెప్పించుకుని చూశాను. దూరదర్శన్ ద్వారా ప్రసారమయ్యే ఈ డిడి కిసాన్ ఛానల్ తో ప్రతి రైతూ జతపడాలి, ఆ కార్యక్రమాలను చూడాలి. ప్రతి రైతూ ఆ ప్రయత్నాలని తమ తమ పొలాల్లో కూడా ప్రవేశపెట్టాలని నేను కోరుకుంటున్నాను. మహాత్మా గాంధీ నుండీ శాస్త్రిగారి వరకూ, లోహియా గారూ, చౌధరీ చరణ్ సింహ్ గారూ, చౌధరీ దేవీలాల్ గారూ, అందరూ కూడా వ్యవసాయాన్నీ, వ్యవసాయదారుడినీ, మన దేశ ఆర్థిక వ్యవస్థనూ, సామాన్య జనజీవనంలో ఒక ముఖ్యమైన భాగంగా భావించారు.
మట్టి తోనూ, ధాన్యపు రాసులతోనూ, రైతులతోనూ మహాత్మా గాంధీ గారికి ఎంతో అనుబంధం ఉంది. ఇదే భావం ఆయన మాటల్లోనే ‘To forget how to dig the earth and to tend the soil, is to forget ourselves.’
అంటే, “భూమిని దున్నటం, మట్టిని సంరంక్షించుకోవడం మనం మర్చిపోతే మనల్ని మనమే మర్చిపోయినట్లు” అని అర్థం.
ఇలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు కూడా చెట్లు, మొక్కలు, వృక్షాల సంరక్షణ చెయ్యలనీ; మరింత మెరుగైన విధంగా వ్యవసాయ వ్యవస్థను అభివృధ్ధి పరచాల్సిన అవసరం ఉందని ఎన్నోసార్లు నిశ్చయంగా చెప్పేవారు. డాక్టర్ రామ్ మనోహర్ లోహియా గారైతే మన రైతు సోదరుల కోసం మెరుగైన ఆదాయం, మెరుగైన నీటిపారుదల సౌకర్యాలను సునిశ్చితం చెయ్యడానికీ; ధాన్యం, ఇంకా పాల ఉత్పత్తిని పెంచడానికి పెద్ద ఎత్తున జనాలను జాగృతం చెయ్యాలని చెప్పారు. 1979లో చౌధరీ చరణ సింహ్ గారు తన ఉపన్యాసంలో రైతులతో నూతన సాంకేతిక సదుపాయాలను ఉపయోగించుకునేలా చెయ్యాలనీ, కొత్త ఆవిష్కరణలు చెయ్యాలనీ కోరారు. వాటి అవసరం ఎంతో ఉందని గట్టిగా చెప్పారు. కొద్ది రోజుల క్రితం నేను ఢిల్లీ లో ఏర్పాటైన “వ్యవసాయ అభివృధ్ధి మేళా”కి వెళ్ళాను. అక్కడ రైతు సోదరులు, సోదరీమణులతోనూ, శాస్త్రజ్ఞులతోనూ నేను సంభాషించడం జరిగింది.
వ్యవసాయంతో ముడిపడిన వారి అనుభవాలను తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, వ్యవసాయంతో ముడిపడిన ఆవిష్కరణల గురించి తెలుసుకోవడం నాకొక ఆనందకరమైన విషయం. మేఘాలయ లోని రైతుల శ్రమను గురించి తెలుసుకోవడం నన్ను అన్నింటికన్నా ఎక్కువగా ప్రభావితం చేసింది. తక్కువ దిగుబడి వచ్చే ఈ ప్రాంతంవారు గొప్ప పని చేసి చూపించారు. మేఘాలయ లోని మన రైతుసొదరులు 2015-16సంవత్సరంలో గత ఐదేళ్ల రికార్డునీ అధుగమించి, రికార్డ్ ఉత్పత్తిని చేసి చూపించారు. లక్ష్యం నిర్ధారితమై ఉన్నప్పుడు, చెక్కుచెదరని ధైర్యం ఉన్నప్పుడు, మనసులో సంకల్పం ఉన్నప్పుడు, లక్ష్యాన్ని తప్పక సిధ్ధించుకోగలము అని వాళ్లు చూపెట్టారు. ఇవాళ రైతుల శ్రమకు, సాంకేతిక సహాయం కూడా తోడౌతోంది. దానివల్ల వ్యవసాయదారులకు ఎంతో బలం చేకూరింది. నా వద్దకు వచ్చిన ఉత్తరాలలో చాలా మంది రైతులు MSP(MSP అంటే, కనీస మద్దతు ధర) గురించి రాశారు. ఈ విషయంపై నేను వారితో చర్చించాలని కూడా వారు కోరారు . సోదరసోదరీమణులారా, ఈసారి బడ్జట్ లో రైతుల పంటలకు సరైన ధర అందించాలనే ఒక పెద్ద నిర్ణయం తీసుకోవడం జరిగింది.
సూచించిన పంటలకు MSPని, వారి పెట్టుబడిలో కనీసం ఒకటిన్నర రెట్లు ఉండేలాగ నిర్ణయించడం జరిగింది. వివరంగా చెప్పాలంటే, MSP ని లెఖ్ఖించడం కోసం ఏ పెట్టుబడి అయితే పెడతారో అందులో ఏవేమి కలుస్తాయంటే – పొలంలో పనిచేసేవారి కూలీ, పశువుల ఖర్చు, వాటి గ్రాసం, మషీన్ అద్దెకు తెచ్చిన వాటి ఖర్చు, ఉపయోగించిన అన్నిరకాల ఎరువుల ఖరీదు, నీటి పారుదల ఖర్చు, ప్రభుత్వానికి కట్టే భూమి శిస్తు, వర్కింగ్ క్యాపిటల్ పై కట్టవలసిన వడ్డీ, కౌలుకు తోసుకున్న భూమి తాలూకూ అద్దె, మొదలైనవన్నీ కలుస్తాయి. ఇంతేకాక, శ్రమించే రైతుతో పాటూ అతడి కుటుంబ సభ్యులెవరైనా కూడా అతడికి సహాయపడితే వారి శ్రమ విలువను కూడా ఈ ఖర్చులో కలుపుతారు. ఇంతేకాకుండా రైతుకు తన దిగుబడికి సరైన ధర లభించడం కోసం దేశంలో agriculture marketing reform పై కూడా పెద్ద ఎత్తున పని జరిగుతోంది. గ్రామాలలోని స్థానిక సంతలు, హోల్‌సేల్ మార్కెట్ల తోటీ, ఇంకా గ్లోబల్ మార్కెట్ల తోటీ కలిసేలాగ ప్రయత్నం జరుగుతోంది. రైతులకు తమ ఉత్పత్తులను అమ్మడానికి ఎంతో దూరం వెళ్ళాల్సిన అవసరం లేకుండా దేశంలోని ఇరవై రెండువేల గ్రామీణ మండీలను అవసరమైన ప్రాధమిక సదుపాయాలతో అభివృధ్ధి పరుస్తూ, APMC , ఇంకా e-NAM platform తోటి వాటిని అనుసంధానించబడుతున్నాయి. అంటే ఒక విధంగా చెప్పాలంటే, వ్యవసాయం తో దేశంలోని ఏ మార్కెట్ తో అయినా ముడిపడేలాంటి ఏర్పాటు జరుగుతోంది.
నా ప్రియమైన దేశ ప్రజలారా, ఈ సంవత్సరం మహాత్మా గాంధీ గారి 150వ జయంతి ఉత్సవాలు మొదలౌతాయి. ఇది ఒక చారిత్రాత్మిక సందర్భం. దేశం ఏ విధంగా ఈ ఉత్సవాన్ని జరుపుకోవాలి? పరిశుభ్ర భారతదేశాన్ని తయారుచెయ్యడం అనేది ఎలానూ మన సంకల్పమే. ఇది కాకుండా 125కోట్ల దేశవాసులందరూ కలిసి గాంధీ గారికి ఎటువంటి ఉత్తమమైన శ్రధ్ధాంజలి ఇవ్వగలం? మీరందరూ మై గౌ యాప్ ద్వారా ఈ విషయంపై మీ అభిప్రాయాలను అందరితో పంచుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతున్నాను.
’ గాంధీ 150 ’ లొగో ఎలా ఉండాలి? నినాదం లేదా మంత్రం లేదా ప్రకటనా వాక్యం ఏదైతే బావుంటుంది? వీటన్నింటి గురించీ మీరంతా మీ మీ సూచనలను అందించండి. మనందరమూ కలిసి బాపూ కి ఒక అపురూపమైన శ్రధ్ధాంజలిని సమర్పిద్దాం. బాపూని స్మరించుకుంటూ, వారి నుండి ప్రేరణను పొందుతూ, మన దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలి.
( మహిళా ఫోన్ కాల్)
“ఆదరణీయ ప్రధానమంత్రి గారూ ,నమస్కారం. నేను గుర్గావ్ నుండి ప్రీతీ చతుర్వేదీ ని మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రి గారూ, స్వఛ్ఛభారత ప్రచారాన్ని మీరు ఎలాగైతే ఒక విజయవంతమైన ప్రచారంగా మలిచారో, అదే విధంగా ’ఆరోగ్యకరమైన భారతదేశ ప్రచారాన్ని ’ కూడా విజయవంతం చెయ్యవలసిన సమయం వచ్చింది. ఈ ప్రచారం కోసం మీరు ప్రజలను, ప్రభుత్వాన్నీ, సంస్థలను ఏ విధంగా సంఘటితపరుస్తున్నారో మాకు తెలపండి..ధన్యవాదాలు “
ధన్యవాదాలు, మీరు సరిగ్గా చెప్పారు. పారిశుధ్య భారత దేశం, ఆరోగ్యకరమైన భారతదేశం – రెండూ కూడా ఒకదానిపై ఒకటి పరస్పరం ఆధారపడి ఉన్నాయన్న మాట నిజం . ఆరోగ్యరంగంలో ఇవాళ దేశం సంప్రదాయ విధానాల ద్వారా ముందుకు వెడుతోంది. దేశంలో ఆరోగ్యానికి సంబంధించిన ఏ పనికైనా ఇంతకు ముందు కేవలం ఆరోగ్య మంత్రిత్వ శాఖ కు మాత్రమే బాధ్యత ఉండేది. కానీ ఇప్పుడు అన్ని మంత్రిత్వ శాఖలూ, పారిశుధ్య మంత్రిత్వ శాఖ , ఆయుష్ మంత్రిత్వ శాఖ , రసాయనాల మరియు సేంద్రీయ ఎరువుల మంత్రిత్వ శాఖ , వినియోగదారుల మంత్రిత్వ శాఖ లేదా మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ , లేదా రాష్ట్ర ప్రభుత్వాలూ అన్నీ కూడా కలిసికట్టుగా ఆరోగ్యకరమైన భారతదేశం కోసం పని చేస్తున్నారు. అంతే కాకుండా వ్యాధి నిరోధక ఆరోగ్యంతో(preventive health) పాటుగా అందుబాటులో ఆరోగ్యానికి(affordable health) కూడా అధిక ప్రాముఖ్యతని ఇస్తున్నారు. వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ పట్ల ఎంత ఎక్కువ అప్రమత్తంగా ఉంటే అంత ఎక్కువగా వ్యక్తికీ, కుటుంబానికీ, సమాజానికీ కూడా లాభం చేకూరుతుంది. ఆరోగ్యకరమైన జీవితం ఉండాలంటే ముందుగా కావాల్సినది -పరిశుభ్రత. గత నాలుగేళ్లలో పారిశుధ్య సంరక్షణ దాదాపు రెట్టింపు అయి దగ్గర దగ్గరగా ఎనభై శాతానికి చేరుకుంది. మనందరమూ కూడా దేశపరంగా దృష్టిని సారించాము కాబట్టి మనకీ పరిణామం లభించింది.
ఇంతే కాకుండా దేశవ్యాప్తంగా ఆరోగ్య సంరక్షణా కేంద్రాలు(health wellness cenres) ఏర్పరచడానికి విస్తృతమైన ఏర్పాట్లు జరుగుతున్నాయి. వ్యాధి నిరోధక ఆరోగ్య సంరక్షణ(previntive health-care) రూపంలో యోగా కొత్తగా ప్రపంచవ్యాప్తంగా తనకు గుర్తింపుని తెచ్చుకుంది. ధృఢత్వానికీ, ఆరోగ్యానికీ, రెండిటికీ యోగా గ్యారెంటీని ఇస్తుంది. యోగా ఇవాళ ఇంటింటికీ చేరి, ఒక ప్రజా ఉద్యమం గా మారింది. ఇది మనందరి నిబధ్ధతకూ లభించిన పరిణామం. ఈసారి అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న అయింది. ఇంకా వంద రోజులు కూడా లేవు. గత మూడేళ్ళ లోనూ కూడా అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు దేశం లోనూ, ప్రపంచంలోనూ , ప్రతి చోటా కూడా ప్రజలందరూ ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. ఈసారి కూడా మనము ఖచ్చితంగా యోగా చేద్దామని నిశ్చయించుకుందాం. మన కుటుంబాన్నీ, స్నేహితులనూ, అందరినీ యోగా చెయ్యవలసిందిగా ప్రోత్సహించడం ఇప్పటి నుండే మొదలుపెట్టండి. ఆసక్తికరమైన కొత్త పధ్ధతుల ద్వారా పిల్లలలో, యువతలో, వయోవృధ్ధులలో , స్త్రీలైనా, పురుషులైనా, అన్ని వయస్కుల వారిలోనూ యోగా పట్ల ఇష్టాన్ని పెంచాలి. మన దేశంలో టివీ లోనూ, ఇతర ఎలెక్ట్రానిక్ మాధ్యమాల లోనూ ఏడాది పొడువునా యోగా గురించిన రకరకాల కార్యక్రమాలు వస్తూనే ఉంటాయి. కానీ ఇప్పటి నుండీ యోగా దినోత్సవం వరకూ ఒక ప్రచార రూపంలో ప్రజలలో యోగా పట్ల అప్రమత్తతను మీరు పెంచగలరా ?
నా ప్రియమైన దేశప్రజలారా, నేను యోగా గురువుని కాదు. యోగ సాధనను మాత్రం చేస్తాను. కానీ కొందరు వ్యక్తులు తమ సృజనాత్మకతతో నన్ను ఒక యోగా గురువుని కూడా చేసేసారు. నేను యోగా చేస్తున్నట్లు 3డి యానిమేషన్ వీడియోలను కూడా తయారుచేసారు. నేను మీ అందరికీ ఆ వీడియోలను షేర్ చేస్తాను. వాటి సహాయంతో మనందరం కలిసి ఆసనాలూ, ప్రాణాయామం చెయ్యగలము. ఆరోగ్య సంరక్షణ అనేది సులభంగానూ, అందుబాటులోనూ ఉండాలి. ప్రజలందరికీ చవకైన, సులభమైన ఆరోగ్య సంరక్షణను అందించడానికి విస్తృత స్థాయిలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. నేడు దేశవ్యాప్తంగా మూడువేలకంటే ఎక్కువ సార్వజనిక ఔషధ కేంద్రాలు తెరవబడ్డాయి. వాటిల్లో దాదాపు 800 కన్నా ఎక్కువ మందులు తక్కువ ధరకే లభ్యమౌతున్నాయి. ఇటువంటివే మరిన్ని కేంద్రాలు తెరిచే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అవసరం ఉన్నవారికి ఈ సార్వజనిక ఔషధ కేంద్రాల వివరాలను తెలిపి, వారి మందుల ఖర్చుని తగ్గించాల్సిందని నేను ’ మనసులో మాట ’ శ్రోతలను కోరుతున్నాను. దీనివల్ల వారికెంతో సహాయం లభిస్తుంది. హృద్రోగులకు heart stent ధర 85% వరకూ తగ్గించడం జరిగింది. knee implants ధరను కూడా బాగా నియంత్రించి 50 నుండీ 70% వరకూ తగ్గించడం జరిగింది. “ఆయుష్మాన్ భారత యోజన” లో భాగంగా దాదాపు పది కోట్ల కుటుంబాలకి, అంటే దాదాపు ఏభై కోట్ల ప్రజలకి ఒక సంవత్సరకాల వైద్యానికి గానూ ఐదు లక్షల రూపాయిల ఖర్చులను భారత ప్రభుత్వం, ఇన్సురెన్స్ కంపెనీ కలిపి ఇస్తాయి. దేశంలో ఉన్న 479 వైద్య కళాశాలల్లో MBBS సీట్ల సంఖ్యను పెంచి, దాదాపు 68 వేల సీట్లు చేసాము. దేశవ్యాప్తంగా ప్రజలకు మెరుగైన వైద్యం, ఆరోగ్య సదుపాయాలూ అందించేందుకు గానూ వివిధ రాష్ట్రాల్లో కొత్త AIIMS తెరుచుకోబోతున్నాయి. ప్రతి మూడు జిల్లాలకూ మధ్య ఒక కొత్త వైద్య కళాశాల నిర్మించబడుతుంది. దేశానికి 2025 నాటికల్లా టి.బి నుండి విముక్తి లభించాలని లక్ష్యం ఏర్పరిచాము. ఇది చాలా పెద్ద పని. ప్రజలందరినీ జాగృతం చెయ్యడానికి మీ సహాయం కావాలి. దేశం టి.బి నుండి విముక్తిని పొందడానికి మనందరమూ కలసికట్టుగా ప్రయత్నం చెయ్యాలి.
నా ప్రియమైన దేశప్రజలారా, ఏప్రిల్ 14 వ తేదీన బాబా సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు ఎన్నోఏళ్ల క్రితమే పారిశ్రామికీకరణ గురించి చెప్పారు. ఆయన దృష్టిలో పరిశ్రమ అనేది ఎంతో శక్తివంతమైన మాధ్యమం. దీని ద్వారా నిరుపేద వ్యక్తి కి కూడా ఉద్యోగావకాశాలు లభించగలవు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక గొప్ప పారిశ్రామిక శక్తిగా కల గన్నారు. ఇవాళ దేశవ్యాప్తంగా Make in India ప్రచారం విజయవంతంగా నడుస్తోంది అంటే ఆనాటి ఆయన ఆలోచనే దానికి ప్రేరణ. నేడు భారతదేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన దేశంగా నిలబడింది. యావత్ప్రపంచం లో అందరికంటే ఎక్కువ Foreign Direct Investment, FDI భారతదేశానికే వస్తోంది. ప్రపంచం మొత్తం పెట్టుబడికీ, నవీకరణకూ, అభివృధ్ధి కీ కేంద్రంగా భారతదేశాన్ని చూస్తున్నాయి. పట్టణాలలోనే పరిశ్రమల అభివృధ్ధి జరుగుతుంది అనే ఆలోచన తోనే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ భారతదేశంలో పట్టణాభివృధ్ధి, నగరీకరణ పై నమ్మకం పెట్టారు. వారి ఈ ఊహను నిజం చెయ్యడానికే నేడు దేశంలో smart cities mission, urban mission మొదలైనవి మొదలుపెట్టడం జరిగింది. దీని వల్ల దేశంలోని పెద్ద పట్టణాలలోనూ, చిన్న నగరాలలోనూ కూడా మంచి రోడ్లు, మంచినీటి వ్యవస్థ, ఆరోగ్య సదుపాయాలు, విద్య, డిజిటల్ కనెక్టివిటీ సౌకర్యాలు మొదలైన అన్ని రకాల సౌలభ్యాలూ లభించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. డాక్టర్ బాబా సాహెబ్ గారికి ఆత్మ నిర్భరత, స్వయం సమృధ్ధి లపై గట్టి నమ్మకం ఉంది. ఏ వ్యక్తీ కూడా ఏదరికంలోనే జీవితాన్ని గడపడం అనేది ఆయనకు ఇష్టం లేదు. ఇంతే కాదు, పేదలకు ఏదో పంచిపెట్టేస్తే వారి పేదరికం దూరమయిపోతుంది అన్న విషయాన్ని ఆయన ఒప్పుకునేవారు కాదు. నేడు ముద్రా పథకం, స్టార్టప్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా ల ప్రారంభాలు మన యువ ఆవిష్కారులకూ, యువ వ్యాపారస్తులకూ జన్మనిస్తున్నాయి. 1930 నుండీ 1940 వరకూ గడిచిన దశాబ్దంలో భారతదేశంలో కేవలం రోడ్ల, రైళ్ల మాటలే వినిపించేవి. ఆ సమయంలో బాబా సాహెబ్ అంబేద్కర్ గారు పోర్ట్ ల గురించీ, నీటి మార్గాల గురించీ మాట్లాడారు. డాక్టర్ బాబా సాహెబ్ గారే జల శక్తిని దేశ శక్తిగా గుర్తించారు. దేశాభివృధ్ధి కోసం నీటి వాడకం పెరగాలని సూచించారు. వివిధ river valley authorities నీ, నీటితో సంబంధం ఉన్న రకరకాల కమీషన్స్ అన్నీ కూడా డాక్టర్ బాబా సాహెబ్ గారి కలలే. ఇవాళ దేశంలో పోర్టుల కోసం, జల మార్గాల కోసం చారిత్రాత్మక ప్రయత్నాలు జరుగుతున్నాయి. భారతదేశంలోని వివిధ సముద్రతీరాల్లో కొత్త కొత్త పోర్టులు తయారవుతున్నాయి. పాత పోర్టుల్లోని ప్రాధమిక సదుపాయాలను బలోపేతం చేస్తున్నారు. నలభైల కాలంలో ఎక్కువగా రెండవ ప్రపంచయుధ్ధం, ఉద్భవిస్తున్న ప్రచ్ఛన్న యుధ్ధం , విభజన గురించిన చర్చలు ఎక్కువగా జరిగేవి. ఒక విధంగా ఆ సమయంలోనే డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశపు నూతన శక్తికి పునాదిని వేసారు. వారు సంయుక్త రాజ్యాంగ పధ్ధతి, సామూహిక వ్యవస్థ ప్రాముఖ్యత గురించి మాట్లాడారు. దేశాన్ని అభివృధ్ధిలోకి తీసుకురావడానికి కేంద్రం, రాష్ట్రం రెండూ కలిసి పనిచెయ్యాలని కోరారు. నేడు మనం పరిపాలనకు చెందిన ప్రతి అంశంలోనూ సహకార సమాఖ్యవాదం, co-operative federalism, కంటే కూడా ముందుకు నడిచి competitive co-operative federalism మంత్రాన్ని స్వీకరించాం. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, బలహీన వర్గాలతో ముడిపడి ఉన్న నాలాంటి ఎందరో వ్యక్తులకు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు గొప్ప ప్రేరణ. పైకి రావడానికి పేరున్న కుటుంబంలోనో గానీ, ధనిక కుటుంబంలోనో జన్మించాల్సిన అవసరం లేదని; భారత దేశంలో పేద కుటుంబంలో జన్మించిన వారు కూడా తమ కలలను కనచ్చు. వాటిని సాకారం చేసుకునే ప్రయత్నం చేయవచ్చు, విజయాన్ని పొందచ్చు అని ఆయన మనకు చూపెట్టారు. చాలామంది డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారిని హేళన చేసారు కూడా. ఆయనను వెనకకు నెట్టడానికి ప్రయత్నించారు. ఒక పేద, వెనుకబడిన కుటుంబానికి చెందిన వ్యక్తి ముందుకు నడవకుండా, జీవితంలో ఏమీ సాధించలేకుండా ఉండేలా చేసేందుకు సాధ్యమయినన్ని ప్రయత్నాలు చేసారు. కానీ న్యూ ఇండియా చిత్రం దీనికి భిన్నమైనది. ఆ ఇండియా అంబేద్కర్ కలలు కన్నది. పేదవారిది. వెనుకబడిన వర్గాల వారిది. డాక్టర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14వ తేదీ నుండీ మే 5వ తేదీ వరకూ “గ్రామ స్వరాజ్య ప్రచారం” ఏర్పాటు చేయబోతున్నారు. దీని ద్వారా యావత్ భారత దేశంలో గ్రామాల అభివృధ్ధి, పేదవారికి మేలు, సామాజిక న్యాయం మొదలైన విషయాలపై వివిధ కార్యక్రమాలు ఉంటాయి. మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే, ఈ ప్రచారంలో మీరంతా ఉత్సాహవంతంగా పాల్గోండి.
నా ప్రియమైన దేశప్రజలారా, రాబోయే రోజుల్లో ఎన్నో పండుగలు రాబోతున్నాయి. భగవాన్ మహావీర జయంతి, హనుమాన్ జయంతి, ఈస్టర్, బైసాఖీ మొదలైనవి. భగవాన్ మహావీర జయంతి ఆయన త్యాగాన్నీ, తపస్సునీ గుర్తు చేసుకోవాల్సిన రోజు. అహింసా సందేశ ప్రచారకర్తగా భగవాన్ మహావీర్ గారి జీవితమూ, వారి ప్రవచనా మార్గమూ మనందరికీ ప్రేరణను అందిస్తుంది. దేశవాసులందరికీ మహావీర జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. ఈస్టర్ చర్చ వస్తూనే ప్రేరణాత్మకమైన యేసు ప్రభువు ఉపదేశాలు గుర్తుకు వస్తాయి. ఆయన ఎప్పుడూ మానవతకు శాంతి, సద్భావము, న్యాయము,దయ, కరుణ సందేశాలను అందించారు. ఏప్రిల్ లో పంజాబ్ లోనూ, పశ్చిమ భారత దేశంలోనూ బైశాఖీ ఉత్సవం జరుపుకుంటారు. అదే రోజుల్లో బీహార్ లో జుడ్ శీతల్, సతువాయిన్ , అస్సాం లో బిహు, పశ్చిమ బెంగాల్ లో పోయిలా వైశాఖ్ ల హర్షోల్లాసాలు నిండి ఉంటాయి. ఈ పండుగలన్నీ ఏదో ఒక రూపంలో మన వ్యవసాయం తోనూ, ధాన్యపు రాసులతోనూ, అన్నదాతలతోనూ ముడిపడి ఉంటాయి. దిగుబడి రూపంలో లభించే అపురూపమైన కానుకలకు మనం ఈ పండుగల మాధ్యమం ద్వారా ప్రకృతికి ధన్యవాదాలు సమర్పిస్తాము. మరోసారి మళ్ళీ మీ అందరికీ రాబోయే అన్ని పండుగల సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు. అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం!
ఈసారి ’మనసులో మాట ’ని ఒక ఫోన్ కాల్ తో ప్రారంభిద్దాం –
(లేడీ వాయిస్)
“గౌరవనీయులైన ప్రధానమంత్రి గారూ, నేను మీరట్ నుండి కోమల్ త్రిపాఠీ ని మాట్లాడుతున్నాను. 28వ తేదీ నేషనల్ సైన్స్ డే. భారతదేశపు ప్రగతి, అభివృధ్ధి రెండూ కూడా విజ్ఞానం తోనే ముడిపడి ఉన్నాయి. విజ్ఞానంలో మనం ఎంత ఎక్కువగా పరిశోధనలు, ఆవిష్కరణలు చేస్తామో అంత ఎక్కువగా మనం అభివృధ్ధి చెందుతాము. ఎదుగుతాము. మన దేశ యువతకు ప్రేరణను అందించే విధంగా ఏవైనా మాటలు చెప్పగలరా? మీరిచ్చే ప్రేరణ దేశ యువతకు తమ ఆలోచనలను వైజ్ఞానికపరంగా మార్చుకుని, దేశాన్ని అభివృధ్ధి దిశగా తీశుకువెళ్ళేందుకు సహాయపడగలదు..ధన్యవాదాలు.”
మీరు ఫోన్ కాల్ చేసినందుకు అనేకానేక ధన్యవాదాలు. విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలను నా యువ స్నేహితులు నన్ను అడిగుతూ ఏవేవో ప్రశ్నలు రాస్తూనే ఉంటారు. సముద్రపు నీరు నీలంగా కనిపిస్తుంది. కానీ మన దినచర్యలో అనుభవపూర్వకంగా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, నీటికి ఏ రంగూ ఉండదని. నది అయినా, సముద్రమయినా, నీటి రంగు ఎందుకు మారుతుంది అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఈ ప్రశ్న మన ఆధునిక భారతదేశానికి ఒక గొప్ప శాస్త్రవేత్తని ఇచ్చింది. విజ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ముందుగా భారతరత్న సర్ సి.వి.రామన్ గారి పేరు గుర్తుకు వస్తుంది. ఆయనకు లైట్ స్కాటరింగ్ అంటే కాంతి యొక్క వికీర్ణంపై అద్భుతమైన పరిశోధన చేసినందుకు గానూ నోబుల్ బహుమతి లభించింది. ఆయన పరిశోధన “రామన్ ఎఫెక్ట్” పేరుతో ప్రసిధ్ధి చెందింది. మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 నాడు నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాము. ఎందుకంటే, ఇదే రోజున సి.వి. రామన్ గారు ” లైట్ స్కాటరింగ్” అనే అంశం కనుగొన్నారు. అందుకు గానూ వారికి నోబుల్ పురస్కారం లభించింది. మన దేశంలో విజ్ఞాన రంగంలో ఎందరో శాస్త్రవేత్తలు జన్మించారు. ఒకవైపున ప్రముఖ గణిత శాస్త్రవేత్త బోధాయనుడు, భాస్కరుడు, బ్రహ్మ గుప్తుడు, ఆర్యభట్టు మొదలైనవారి సంప్రదాయం ఉంది. మరోవైపు చికిత్సా రంగంలో సుష్రుతుడు, చరకుడు మనకు గౌరవనీయులు. సర్ జగదీశ్ చంద్ర బోస్, హర్ గోవింద్ ఖురానా నుండి సత్యేంద్రనాథ్ బోస్ వంటి శాస్త్రవేత్తలు భారతదేశానికి గర్వకారణM. సత్యేంద్రనాథ్ బోస్ పేరు మీద ప్రముఖ పార్టికల్ “BOSON” నామకరణం కూడా జరిగింది. ఈమధ్య నాకు ముంబయ్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. – Wadhwani Institute for Artificial Intelligence ప్రారంభోత్సవానికి అందిన ఆహ్వానం అది. విజ్ఞాన రంగంలో జరుగుతున్న అద్భుతాల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా నిలిచింది. Artificial Intelligence మాధ్యమం ద్వారా Robots, Bots , ఇంకా మరెన్నో ప్రత్యేకమైన పనులను చేసే యంత్రాలను తయారుచేయడానికి సహాయం లభిస్తుంది. ఈమధ్య యంత్రాలు కూడా స్వయంగా వాటంతట అవే తమలోని Intelligenceని మరింతగా పెంచుకొంటున్నాయి. ఈ టెక్నాలజీ ఎందరో పేదలు, baadhiతులు, అవసరం ఉన్నవారి జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఆ కార్యక్రమంలో నేను దివ్యాంగ సోదరసోదరీమణుల జీవితాలు సౌఖ్యవంతంగా మారడానికి Artificial Intelligence ద్వారా ఏదైనా సహాయం లభించే వీలేమైనా ఉందా? Artificial Intelligence ఉపయోగించి ప్రకృతి వైపరీత్యాల గురించి మరింత ఎక్కువగా అంచనాలను వెయ్యగలమా? రైతుపోదరులకు పంటల ఉత్పత్తి గురించి ఏమైనా సహాయం చెయ్యగలమా? Artificial Intelligence ఆరోగ్య సేవల అందుబాటును సులభతరం చెయ్యడానికీ, ఆధునికపధ్ధతులలో రోగాలను నయం చెయ్యడంలో ఏదైనా సహాయాన్ని అందించగలదా? అని నేను ఆ శాస్త్రవేత్తల సమూహాన్ని కోరాను.
కొద్దిరోజులక్రితం ఇజ్రాయిల్ ప్రధానమంత్రి తో పాటూ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ‘I Create’ ప్రారంభోత్సవానికి వెళ్ళే అవకాశం నాకు లభించింది. అక్కడ ఒక యువకుడు తయారుచేసిన ఒక డిజిటల్ పరికరాన్ని చూసాను. ఆ పరికరంలోని ప్రత్యేకత ఏమిటంటే, మాటలురానివారు తమ మాటలను ఆ పరికరం ద్వారా రాయగానే అవి స్వరరూపాన్ని సంతరించుకుంటాయి. దానివల్ల మనం మామూలుగా ఎదుటిమనిషితో మాట్లాడినట్లే, మాటలురానివారు కూడా ఎదుటివారితో సంభాషించవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా Artificial Intelligence ను ఉపయోగించుకోవచ్చని నేను అనుకుంటున్నాను.
సైన్స్ అండ్ టెక్నాలజీల విలువ తటస్థంగా ఉంటుంది. వాటంతట వాటికి ఏ విలువా ఉండదు. ప్రతి యంత్రమూ మనం ఏ విధంగా కోరుకుంటామో, అలా మాత్రమే పని చేస్తుంది. కానీ యంత్రం ద్వారా మనం ఎలాంటి పని చేయించుకుంటాము అన్నది మనపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మానవ లక్ష్యమే ముఖ్యమైనది. విజ్ఞానాన్ని కేవలం మానవుడి సంక్షేమం కోసం మాత్రమే కాకుండా, మానవ జీవితం ఉత్కృష్టమైన శిఖరాలను ఆధిరోహించడానికి కూడా ఉపయోగించాలి.
లైట్ బల్బ్ ను కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ తన పరిశోధనల్లో చాలాసార్లు విఫలమయ్యారు. ఒకసారి ఆయనను ఈ విషయం గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఏమన్నారంటే, “నేను లైట్ బల్బ్ ను తయారవ్వకుండా చెయ్యగలిగే లాంటి పదివేల ప్రయత్నాలు చేసాను” అన్నారు. అంటే ఎడిసన్ తన విఫలయత్నాలను కూడా తన శక్తిగా మార్చుకున్నారన్నమాట. యాదృఛ్ఛికమూ, అదృష్టకరమైన విషయం ఏమిటంటే నేను ఇవాళ మహర్షి అరవిందుల కర్మభూమి “Auroville ” లో ఉన్నాను. ఒక విప్లవకారుడిగా ఆయన బ్రిటిష్ పాలనకు సవాలుగా నిలిచారు. వారికి వ్యతిరేకంగా పోరాడారు. వారి పరిపాలనపై ప్రశ్నించారు. ఇదే విధంగా ఆయన ఒక మహర్షి రూపంలో జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రశ్నించారు. వాటికి జవాబుని కూడా వెలికితీసి, మానవత్వానికి దారి చూపెట్టారు. సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రతిసారీ ప్రశ్నించుకుంటూ ఉండడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. శాస్త్రీయ ఆవిష్కరణల వెనుక ఉన్న అసలైన ప్రేరణ కూడా అదే. ఎందుకు, ఏమిటి, ఎలా? లాంటి ప్రశ్నలకు జవాబులు దొరికేవరకూ అవిశ్రాంతంగా శ్రమించాలి. నేషనల్ సైన్స్ డే సందర్భంగా నేను మన శాస్త్రవేత్తలను, విజ్ఞానంతో ముడిపడి ఉన్న వ్యక్తులందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను. సత్యం కోసం, జ్ఞానం కోసం వెతకడానికి మన యువత ప్రేరణపొందాలని, విజ్ఞానం సహాయంతో సమాజానికి వారు సేవ చెయ్యాడానికి ప్రేరణ పొందాలని కోరుకుంటూ , నేను మన యువతరానికి అనేకానేక శుభాకాంక్షలు అందిస్తున్నాను.
మిత్రులారా, ఆపద సమయంలో సేఫ్టీ, డిజాస్టర్ మొదలైన విషయాలపై నాకు చాలా సార్లు ఎన్నో సందేశాలు వస్తూ ఉంటాయి. ప్రజలు నాకు ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. పూనా నుండి రవీంద్ర సింహ్ గారు నరేంద్రమోదీ యాప్ కు పంపిన సందేశంలో occupational safety గురించి ప్రస్తావించారు. మన దేశంలో ఫ్యాక్టరీలు, నిర్మాణం పనులు జరిగే చోట safety standards పెద్ద గొప్పగా లేవని వారు అన్నారు. రాబోయే మార్చి నాలుగవ తేదీ National Safety Day కాబట్టి, ప్రధానమంత్రిగారు తన మన్ కీ బాత్ కార్యక్రమంలో భద్రత గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పాలనీ, ప్రజలలో భద్రత పట్ల అవగాహన పెంచాలని ఆయన రాసారు. మనం బహిరంగ ప్రదేశాల్లో భద్రత గురించి మాట్లాడేప్పుడు pro-activeness , preparedness అనే రెండు ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకోవాలి. భద్రత రెండు రకాలు. ఆపద సమయంలోనూ, వైపరీత్యాల మధ్య పాటించాల్సినది ఒకటి . రెండవది దైనందిక జీవితంలో ఉపయోగపడేది. safety in everyday life .
దైనందిక జీవితంలో మనం భద్రత గురించి అప్రమత్తంగా లేకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే, ఆపదల సమయంలో భద్రతను పొందడం కష్టమైపోతుంది. మనందరమూ చాలాసార్లు దారిలో రాసి ఉన్న బోర్డులను చదువుతూ ఉంటాము. వాటిలో
-” ఏకాగ్రత లోపిస్తే – ప్రమాదం జరుగుతుంది”
-“ఒక తప్పిదం నష్టాన్ని కలిగిస్తుంది – ఆనందాన్ని ,నవ్వులను చిదిమేస్తుంది”
– “ఇంత త్వరగా భవబంధాలను తెంచుకోకు – భద్రతతో బంధుత్వాన్ని పెంచుకో”
– “భద్రతతో ఆడుకోవద్దు – జీవితాన్ని కోల్పోవద్దు”
ఇలాంటివి చదువుతూ ఉంటాము. ఆ దారిని దాటాక ఆ వాక్యాల వల్ల మన జీవితంలో అన్నిసార్లూ ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ ప్రకృతివైపరీత్యాలను వదిలేస్తే, ఎక్కువ శాతం ప్రమాదాలు మన పొరపాట్ల వల్లే జరుగుతాయి. మనం అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే, మన జీవితాలను కాపాడుకోవడమే కాకుండా, పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కూడా సమాజాన్ని రక్షించగలం. ఒకోసారి పని చేసే చోట భద్రతను గురించి ఎన్నో సూచనలు రాసి ఉంటాయి. కానీ వాటిని ఎవ్వరూ కూడా సరిగ్గా పాటించరు.
మహానగరాల్లోనూ, పట్టణాల్లోని ఉన్న పురపాలక సంఘాలవారు అగ్నిమాపకదళాలతో వారంలో ఒకసారైనా, నెలలో ఒకసారైనా వివిధపాఠశాలల్లోని పిల్లల ఎదుట మాక్ డ్రిల్ చేయించవలసిందని నేను కోరుతున్నాను. దానివల్ల రెండు ఉపయోగాలు ఉన్నయి. అగ్నిమాపకదళానికి కూడా అప్రమత్తంగా ఉండే అవకాశం లభిస్తుంది. యువతరానికి కూడా వీటికి సంబంధించిన శిక్షణ లభిస్తుంది. దీనికి విడిగా ఏ అదనపు ఖర్చూ ఉండదు. ఇది విద్యలో ఒక భాగమైపోతుంది. నేను ఎప్పుడూ ఇదే విషయాన్ని చెప్తూ ఉంటాను. ప్రమాదాల గురించి, వైపరీత్యాల గురించి చెప్పుకోవాలంటే, భారతదేశం వాతావరణ పరంగానూ ,భౌగోళికంగానూ ఎన్నో వైవిధ్యాలున్న దేశం. ఈ దేశం ఎన్నో ప్రకృతిక, మానవ నిర్మితమైన ప్రమాదాలను ante ఎన్నో రసాయనిక, పారిశ్రామిక దుర్ఘటనలను ఎదుర్కొంది. ఇవాళ National Disaster Management Authority అనగా NDMA వారు దేశంలో ప్రధాన విపత్తు నిర్వహణ చేస్తున్నారు. భూకంపాలు, వరదలు, తుఫానులు మొదలైన వివిధరకాలైన ప్రమాదాలు వచ్చినప్పుడు ,rescue operation ఉన్నప్పుడు NDMA వారు వెంtaనే అక్కడికి చేరుకుంటారు. కొన్ని మార్గదర్శక సూత్రాలను కూడా వారు విడుదల చేసారు. అంతేకాక దానితో పాటుగా capacity building కోసం కూడా వారు శిక్షణా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. వరదలు, తుఫానులు వచ్చే జిల్లాల్లో వాలంటీrla శిక్షణ కోసం “ఆపదా మిత్ర” పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. శిక్షణ, అప్రమత్తత లది ఎంతో ముఖ్యమైన పాత్ర. రెండు మూడేళ్ల క్రితం ’లూ – అంటే వేడి గాడ్పుల వల్ల ప్రతి ఏtaa veలమంది మరణించేవారు.అందువల్ల వేడి గాడ్పులను నియంత్రించడానికి NDMA వారు వర్క్ షాప్ లను నిర్వహించారు. ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి ప్రచారాన్ని నడిపారు. వాతావరణ శాఖ వారు ఖచ్చితమైన అంచనాలను వేసారు. అందరి సహకారంతో ఒక చక్కని పరిణామం ముందుకొచ్చింది. 2017లో వేడి గాడ్పుల వల్ల జరిగే మరణాల సంఖ్య ఊహించని విధంగా తగ్గి దగ్గర దగ్గర 220కి పరిమితమైంది. దీనివల్ల తెలిసినదేమిటంటే, మనం భద్రతకు ప్రాముఖ్యతను ఇస్తే, మనం సురక్షితంగా ఉంdaగలం. సమాజంలో ఈ విధంగా ఎక్కడ ఆపద ఉంటే అక్కడకు వచ్చి నిమిషాల్లో సహాయం కార్యక్రమాల్లో నిమగ్నమయిపోయే అసంఖ్యాక ప్రజలను, సామాజిక సంఘాలను, అప్రమత్త పౌరులను నేను అభినంdisస్తున్నాను. Fire and Rescue Services, National Disaster Response Forces, Paramilitary Forces, మన సైనిక బలగాలు కూడా ఆపద సమయంలో, ఎంతో ధైర్యసాహసాలతో చేరుకుని తమ ప్రాణాలను సైతం లెఖ్ఖ చేయకూండా ప్రజలకు సహాయం చేస్తారు. NCC, Scouts మొదలైనవి కూడా ఇలాంటి పనులు చేపడుతున్నాయి. శిక్షణను కూడా ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నుండి మరో ప్రయత్నం కూడా మొదలైంది. దేశాలలో జాయింట్ మిలిటరీ ఎక్స్‌సర్‌సైజ్ ఉన్నట్లే, ప్రపంచదేశాలన్నీ కలిసి Disaster Management కోసం కూడా joint exercise ఎందుకు చెయ్యకూడదు అని ఆలోచించాయి. భారతదేశం నేతృత్వంలో BIMSTEC పేరుతో, బాంగ్లాదేశ్, భారతదేశం, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ మొదలైన దేశాలన్నీ కలిసి ఒక joint disasters management exercise చేసాయి. ఇది ఒక మొట్టమొదటి, గొప్ప మానవతా ప్రయోగం. మనం ఒక pramaada chaitanya samaajamగా తయారవ్వాలి. మన సంస్కృతిలో మన విలువలను పరిరక్షించుకోవడం, అంటే safety of values గురించి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము. కానీ మనం values of safety అంటే భద్రత యొక్క విలువలను కూడా తెలుసుకుంటూ ఉండాలి. వాటిని మన జీవితంలో భాగం చేసుకోవాలి. సామాన్యంగా మనం ఎన్నోసార్లు విమానంలో ప్రయాణిస్తూ ఉంటాము. విమానప్రయాణ ప్రారంభంలో air hostess భద్రత గురించి సూచనలు ఇస్తూ ఉంటారు. ఈ సూచనలన్నీ కూడా మనందరమూ ఎన్నోసార్లు వినే ఉంటాము. కానీ ఎవరైనా మనల్ని విమానంలోకి తీసుకువెళ్ళి నిలబెట్టి, లైఫ్ జాకెట్ ఎక్కడ ఉంది, దానిని ఎలా ఉపయోగించాలి అని అడిగితే, మనలో ఎవ్వరమూ కూడా సరిగ్గా సమాధానం చెప్పలేమని నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే సమాచారం అందించే సదుపాయం ఉందా? అంటే ఉంది. వాటిని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందా? అంటే ఉంది. కానీ మనం దృష్టి పెట్టము. ఎందుకు అంటే మనం స్వభావపరంగా అప్రమత్తంగా ఉండము. అందువల్ల విమానంలో కూర్చున్నాకా, మన చెవులకి జాగ్రత్తలు వినబడతాయి కానీ ’అవి మన కోసమే చెప్తున్నారు’ అని మనలో ఎవరమూ అనుకోము. జీవితంలోని ప్రతి రంగంలోనూ మనం అలాగే అనుకుంటాం. ఈ భద్రత మన కోసం కాదు అని మనం అనుకోకూడదు. మనందరమూ మన భద్రత కోసం అప్రమత్తంగా ఉంటే సమాజ భద్రత కూడా అందులో అంతర్గతంగా ఉంటుంది.
నా ప్రియమైన దేశప్రజలారా, ఈసారి బడ్జెట్ లో స్వఛ్ఛభారత్ ప్రచారంలో భాగంగా గ్రామాల కోసం బయోగ్యాస్ మాధ్యమం ద్వారా
waste to wealth, waste to energy – అంటే వ్యర్థాల నుండి సంపద, వ్యర్థాల నుండి శక్తినీ తయారుచేసుకోవడం అనే విషయంపై దృష్టి పెట్టి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనికి గోబర్ -ధన్ అని పేరు పేటాము. ’GOBAR-Dhan’ అంటే – Galvanizing Organic Bio-Agro Resources. గ్రామాలను శుభ్రపరచడం, పశువుల పేడను, ఇంకా సేంద్రీయ వ్యర్థాలను COMPOST , BIO-GAS లుగా మార్చడమే కాక వాటి ద్వారా ధనాన్ని, శక్తినీ ఉత్పత్తి చెయ్యడమే ఈ గోబర్-ధన్ ఉద్దేశ్యం. భారతదేశంలో పశువుల సంఖ్య దాదాపు ముఫ్ఫై కోట్లు. వాటి పేడ ఉత్పత్తి ముఫ్ఫై లక్షల టన్నులు. కొన్ని యూరోపియన్ దేశాలూ, చైనా లోనూ పశువుల పేడనూ, మిగితా సేంద్రీయ వ్యర్థాలనూ శక్తిని ఉత్పత్తి చెయ్యడానికి వాడతాయి. కానీ భారతదేశంలో వీటిని పూర్తిస్థాయిలో ఉపయోగం లేదు. “స్వచ్ఛ భారత మిషన్ గ్రామీణ్” లో భాగంగా ఇప్పుడు ఈ దిశలో ముందుకు నడుస్తున్నారు. పశువుల పేడ, సేంద్రీయ వ్యర్థాలను , వంటిళ్ళలో నుండి లభ్యమయ్యే వ్యర్థాల నుండి బయో గ్యాస్ ఆధారిత శక్తిని ఉత్పత్తి చెయ్యడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించబడింది. గోబర్ ధన్ యోజనా లో భాగంగా గ్రామీణ భారతదేశంలో రైతు సోదరసోదరీమణులను పేడ, వ్యర్థాలనూ కేవలం పనికిమాలినవిగా చూడకూండా, ధనాన్ని ఆర్జించే మాధ్యమాలుగా చూడాలవలసిందిగా ప్రోత్సహించడం జరుగుతుంది. గోబర్ ధన్ పథకం ద్వారా గ్రామీణరంగాలకు ఎన్నో లాభాలు కలుగుతాయి. గ్రామాలను శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాటి ఉత్పాదన పెరుగుతుంది. బయో గ్యాస్ వల్ల వంటకూ, లైటింగ్ కోసమూ అవసరమయ్యే శక్తి విషయంలో స్వయం సమృధ్ధి పెరుగుతుంది. రైతులకూ, పశువుల కాపరులకూ ఆదాయం పెరగడానికి ఈ పథకం సహాయపడుతుంది. వేస్ట్ కలక్షన్, రవాణా, బయోగ్యాస్ అమ్మకం, మొదలైనవాటి కోసం కొత్త ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. గోబర్ ధన్ పథకం సవ్యంగా సాగడానికి ఒక ఆన్‌లైన ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్ కూడా తయారుచెయ్యడదుతుంది. ఇది రైతులను, కొనుగోలుదారులతో జతపరుస్తుంది. దీనివల్ల రైతులకు పేడ, సేంద్రీయ వ్యర్థాలకు గానూ సరైన ధర లభిస్తుంది. నేను వ్యాపారస్తులనూ, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న సోదరీమణులను ముందుకు రావలసిందిగా అబ్యర్థిస్తున్నాను. స్వయం సహాయక బృందాన్ని , సహకార సమితులను ఏర్పాటు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవలసినదిగా నేను కోరుతున్నాను. clean energy and green jobs అనే ఉద్యమంలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తద్వారా గ్రామాలలో వ్యర్థాన్ని ధనంగా మార్చడానికీ, గోబర్ – ధన్ తయారుచేసే దిశగా అడుగెయ్యాలి.
నా ప్రియమైన దేశప్రజలారా, ఇప్పటివరకు మనం music festival, food festival, film festival మొదలైన ఎన్నో రకాలైన ఫెస్టివల్స్ గురించి వింటూవచ్చాం. కానీ చత్తీస్ గడ్ లోని రాయ్ పూర్ లో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం ద్వారా మొట్టమొదటి వ్యర్థాల మహోత్సవం ఏర్పాటైంది. రాయపూర్ నగర పాలక సంస్థ ద్వారా ప్రారంభించబడిన ఈ మహోత్సవం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే, పరిశుభ్రత పట్ల అవగాహన. నగరంలోని వ్యర్థాలను సృజనాత్మకంగా ఉపయోగించడానికీ, వ్యర్థాలను తిరిగి ఉపయోగించడానికీ విభిన్నమైన పధ్ధతుల గురించి అవగాహన కల్పించడం. ఈ మహోత్సవం లో భాగంగా జరిగిన రకరకాల కార్యక్రమాల్లో విద్యార్థుల నుండీ పెద్దల వరకు అందరూ పాల్గొన్నారు. వ్యర్థాలను ఉపయోగించి చేసిన రకరకాల కళాకృతులు తయారయ్యాయి. వేస్ట్ మేనేజ్మెంట్ తాలూకూ అన్ని దృష్టికోణాలపై ప్రజలను సుశిక్షితులను చెయ్యడానికి వర్క్ షాప్ లను కూడా ఏర్పాటుచేసారు. పరిశుభ్రత ప్రధానాంశం పై సంగీట కార్యక్రమం కూడా జరిగింది. ఆర్ట్ వర్క్ కూడా చేసారు. రాయ్ పూర్ నుండి ప్రేరణ పొంది కొన్ని మిగతా జిల్లాల్లో కూడా రకరకాల పధ్ధతుల్లో వ్యర్థ మహోత్సవాలు జరిగాయి. ప్రతి ఒక్కరూ తమ వంతుగా పరిశుభ్రత గురించిన సృజనాత్మక ఆలోచనలను పంచుకున్నారు. చర్చించుకున్నారు. కవితాగానాలు చేసారు. పరిశుభ్రత గురించిన ఒక ఉత్సవ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ , పరిశుభ్రతల తాలూకూ ప్రాముఖ్యాన్ని విభిన్న రీతిలో ఈ మహోత్సవంలో ప్రదర్శించినందుకు గానూ రాయపూర్ నగరపాలక సంస్థనూ, మొత్తం చత్తిస్ గడ్ ప్రజలనూ, అక్కడి ప్రభుత్వాన్నీ, పాలనా యంత్రాంగానికి నేను అనేకానేక ఆభినందనలు తెలుపుతున్నాను.
ప్రతి ఏడూ మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. మన దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజున మన దేశంలో ’నారీశక్తి పురస్కారం ’ పేరుతో వివిధరంగాల్లో అనుసరించదగ్గ కార్యక్రమాలు చేపట్టిన మహిళలందరినీ సత్కరిస్తారు. ఇవాళ దేశం woman development – నుండి woman-lead development అంటే దిశగా ముందుకు సాగుతోంది. అంటే ఇవాళ మనం మహిళా అధివృధ్ధి నుండి ముందుకు నడిచి మహిళా -నేతృత్వ అభివృధ్ధి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంగా నాకు స్వామీ వివేకానంద గారి మాటలు గుర్తువస్తున్నాయి – ఆయన ఏమన్నారంటే “the idea of perfect womanhood is perfect independence’-
నూటపాతిక సంవత్సరాల క్రితం స్వామీ వివేకానంద గారి అభిప్రాయం భారతీయ సంస్కృతిలో నారీశక్తి తలంపుని వ్యక్తపరుస్తుంది. ఇవాళ సామాజిక, ఆర్థిక జీవితంలోని అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులను కల్పించడం మనందరి కర్తవ్యం. ఇది మనందరి బాధ్యత. పురుషుల గుర్తింపు స్త్రీల వల్ల ఏర్పడిన సంప్రదాయంలో మనం భాగస్తులం. యశోదానందనుడు, కౌసల్యా నందనుడు, గాంథారీ పుత్రులు, ఇదే ప్రతి కుమారుడికీ గుర్తింపుగా ఉండేది. ఇవాళ మన మహిళలు అత్మబలాన్నీ, ఆత్మ విశ్వాసాన్నీ తమ పనుల ద్వారా మనకు పరిచయం చేస్తున్నారు. స్వయం సమృధ్ధులుగా తయారయ్యారు. తమని తాము ముందుకు నడిపించుకుంటూ, దేశాన్నీ, సమాజాన్నీ కూడా ముందుకు నడిపించడానికీ, ఒక కొత్త మైలురాయిని చేరుకుని పనులు చేసారు. ఎక్కడ మహిళ శక్తివంతంగా ఉంటుందో, సబలగా ఉంటుందో, దేశ సమగ్ర అభివృధ్ధి లో సమాన భాగస్వామిగా ఉంటుందో అదే మన న్యూ ఇండియా స్వప్నం కూడా కదా.
కొద్ది రోజుల క్రితం ఒకాయన నాకొక గొప్ప సలహాను ఇచ్చాడు. మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ప్రతి గ్రామంలోనూ, నగరంలోనూ వంద సంవత్సరాలు జీవితాన్ని పూర్తి చేసుకున్న తల్లులకూ, సోదరీమణులకూ సన్మాన కార్యక్రమం ఏర్పాటవ్వగలదా? అని ప్రశ్నించారాయన. ఆ సన్మాన కార్యక్రమంలో వారి వారి సుదీర్ఘపు జీవితపు విషయాలను తెలుసుకునే అవకాశం కలగగలదా? అని ప్రశ్నించారు. నాకా ఆలోచన బాగా నచ్చింది. అది మీకు అందిస్తున్నాను. మహిళా శక్తి ఏమేమి పనులు చెయ్యగలదో తెలుసుకోవడానికి మీకెన్నో ఉదాహరణలు దొరుకుతాయి. మీ చుట్టుపక్కల చూస్తే గనుక మీ జీవితానికి ప్రేరణను అందించే ఏదో ఒక కథ మీకు కనబడుతుంది. ఇప్పుడే నాకు ఝార్ఖండ్ నుండి నాకొక సమాచారం అందింది. ప్రరిశుభ్రత ప్రచారంలో భాగంగా ఝార్ఖండ్ లో దాదాపు పదిహేను లక్షల మంది మహిళలు – ఇదేమీ చిన్న సంఖ్య కాదు- పదిహేను లక్షల మంది మహిళలు కలిసి ఒక నెలపాటు ప్రరిశుభ్రత ప్రచారం నడిపారు. 2018,జనవరి 26 నుండి ప్రారంభమైన ఈ ప్రచారంలో భాగంగా, కేవలం ఇరవై రోజుల్లోనే ఈ మహిళలు ఒక లక్ష డెభ్భై వేల మరుగుదొడ్లను నిర్మించి ఒక కొత్త ఉదాహరణను నిలిపారు. ఇందులో దాదాపు ఒక లక్ష సఖీ సమితులు కలిసాయి. పధ్నాలుగు లక్షలమంది మహిళలు, రెండువేలమంది పంచాయితీ ప్రతినిధులు, ఇరవై తొమ్మిదివేల నీటి సహాయకులు, పదివేల మహిళా స్వచ్ఛాగ్రహులు, ఏభై వేలమంది చేతివృత్తులతో జీవనం సాగించే మహిళలు పాల్గొన్నారు. ఇది ఎంత పెద్ద సంఘటనో మీరు ఊహించగలరు. సాధారణ జీవితంలో పరిశుభ్రతా ప్రచారాన్ని, పరిశుభ్రతా సంస్కారాన్ని సామాన్య ప్రజల స్వాభావిక ప్రవర్తనగా మార్చేందుకు స్త్రీశక్తి ప్రభావవంతంగా ప్రయత్నించగలదు అని ఝార్ఖండ్ మహిళలు నిరూపించారు.
సోదరసోదరీమణూలారా, ఎలిఫెంటా ద్వీపంలోని మూడు గ్రామాలకి స్వతంత్రం వచ్చిన డెభ్భై ఏళ్ల తరువాత విద్యుత్తు వచ్చిందని రెండు రోజుల క్రితమే నేను వార్తల్లో చూశాను. దీని వల్ల అక్కడి ప్రజల్లో ఎంతో ఆనందోత్సాహాలు కలిగాయి. మీ అందరికీ బాగా తెలుసు, ఎలిఫెంటా ద్వీపం ముంబయ్ నుండి సముద్రంలో పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక పెద్ద పర్యటనా కేంద్రం. ఎలిఫెంటా గుహలు యునెస్కో వారి ప్రపంచవారసత్వ సంపద లో భాగం. అక్కడ ప్రతిరోజూ దేశవిదేశాల నుండి చాలాపెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఒక ముఖ్యమైన యాత్రా స్థలం. ముంబయ్ కి చాలా దగ్గరగా ఉండీ, స్వతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు అయినా ఆ ప్రాంతానికి విద్యుత్తు రాలేదని తెలిసి నాకు ఆశ్చర్యం వేసింది. డెభ్భై ఏళ్ల వరకు ఎలిఫెంటా ద్వీపంలోని మూడు గ్రామాలు – రాజ్ బందర్, మోర్ బందర్, సేంత్ బందర్ లలో ప్రజల జీవితాల్లో అలుముకున్న చీకటి ఇప్పటికి తొలగింది. వారి జీవితాలు కాంతివంతమయ్యాయి. నేను అక్కడి ప్రభుత్వానికీ, ప్రజలకూ అభినందనలు తెలుపుతున్నాను. ఎలిఫెంటా గుహలు, ఎలిఫెంటా గ్రామాలు విద్యుత్తుతో కాంతివంతమయ్యాయని నాకు సంతోషం వేసింది. ఇది కేవలం విద్యుత్తు కాదు. అభివృధ్ధి పథానికి ఒక కొత్త ఉదయం. దేశవాసుల జీవితాలు కాంతివంతమవ్వడం, వారి జీవితాలలో ఆనందాలు వెల్లివిరియడం కన్నా గొప్ప ఆనందకరమైన సమయం, సంతోషకర క్షణాలు ఇంకేమి ఉంటాయి? నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇటీవలే మనం శివరాత్రి మహోత్సవాన్ని జరుపుకున్నాం. ఇప్పుడు మార్చ్ నెల కళకళలాడుతున్న పంటలతో , తలలాడిస్తున్న బంగారు రంగుల గోధుమకంకులు, మనసుని పులకరింపజేసే మామిడిపూత అందాలు, ఇవన్నీ కూడా ఈ నెలలోని విశేషాలు. ఈ నెల వచ్చే హోలీ పండుగ కూడా ఈ నెలలో మనందరికీ ఎంతో ప్రియమైనది. మార్చ్ రెండవ తేదీన దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటాము. హోలీ పండుగలో రంగుల ప్రాముఖ్యత ఎంత ఉందో, అంతే ప్రాముఖ్యత హోళికా దహనానిది కూడా. చెడుని అగ్నిలో దహనం చేసి నాశనం చేసే రోజు ఇవాళ . మనసులోని భిన్నాభిప్రాయాలన్నీ మర్చిపోయి, అందరూ కలిసి కూర్చుని, ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకునే శుభసందర్భం హోలీ అంటే. ఈ పండుగ ప్రేమ, ఐకమత్యం, సోదర భావాల తాలూకూ సందేశాలను ఇస్తుంది. దేశవాసులందరికీ హోలీ పండుగ సందర్భంగా హోలీ రంగుల ఉత్సవపు శుభాకాంక్షలు. రంగులతో నిండిన శుభాకాంక్షలు. ఈ పండుగ మన దేశవాసులందరి జీవితాలలో రంగురంగుల ఆనందాలను నింపాలని కోరుకుంటున్నాను. నా ప్రియమైన దేశవాసులారా అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం.
నా ప్రియమైన దేశప్రజలారా నమస్కారం! 2018 సంవత్సరంలో ఇది మొదటి ’మనసులో మాట’. రెండు రోజుల క్రితమే మనం మన గణతంత్ర దినోత్సవాన్ని ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నాము. పది దేశాలకు చెందిన దేశాధ్యక్ష్యులు ఈ ఉత్సావంలో పాల్గోవడం దేశ చరిత్రలో మొదటిసారి.
నా దేశ ప్రజలారా, శ్రీ ప్రకాశ్ త్రిపాఠీ గారు నరేంద్ర మోదీ యాప్ కు ఒక పెద్ద లేఖను వ్రాసారు. తన లేఖలో పేర్కొన్న విషయాలను మనసులో మాటలో ప్రస్తావించవలసిందిగా కోరారు. వారేం రాసారంటే, ఫిబ్రవరి ఒకటవ తేదీ అంతరిక్ష్యం లోకి వెళ్ళిన కల్పనా చావ్లా వర్థంతి. కొలంబియా అంతరిక్ష్య యాన దుర్ఘటనలో ఆవిడ మనల్ని వదిలి వెళ్పోయినా, ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల యువతకు ప్రేరణను అందించారు. తన పొడవాటి లేఖలో మొదట కల్పనా చావ్లా గురించి ప్రస్తావించినందుకు సోదరులు ప్రకాశ్ గారికి నేను ఋణపడిఉంటాను. ఇంత చిన్నవయసులోనే కల్పనా చావ్లాగారిని కోల్పోవడం అందరికీ ఎంతో దు:ఖం కలిగించింది. కానీ ఆవిడ తన జీవితం ద్వారా యావత్ ప్రపంచానికీ, ముఖ్యంగా మన భారతదేశంలోని వేల మంది యువతులకు నారీశక్తి కి ఎలాంటి సరిహద్దులూ ఉండవని తెలియచేసారు. కోరిక, ధృఢ సంకల్పం ఉంటే, ఏదైనా చెయ్యాలనే అభిలాష ఉంటే, అసాధ్యమైనదేది లేదు. ఇవాళ్టి రోజున భారతదేశంలో మహిళలందరూ ప్రతి రంగంలోనూ అభివృధ్ధి చెందుతూ దేశ గౌరవాన్ని పెంచుతున్నారు.
ప్రాచీన కాలం నుండీ మన దేశంలో మహిళలకు లభించిన గౌరవం, సమాజంలో వారికి లభించిన స్థానం, వారి సహకారం యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంది. భారతదేశంలో ఎందరో విదూషీమణుల సంప్రదాయం ఉంది. వేదసార సంగ్రహిణలో ఎందరో భారతీయ విదుషీమణుల తోడ్పాటు ఉంది. లోపాముద్ర, గార్గి, మైత్రేయి లాంటి స్మరణీయులెందరో! ఇవాళ మనం "ఆడపిల్లను రక్షించు, ఆడపిల్లను చదివించు" లాంటి నినాదాలు చేస్తున్నాం కానీ చాలా కాలం క్రితమే మన శాస్త్రాల్లో, స్కందపురాణంలో ఏం చెప్పారంటే,
"దశ పుత్ర, సమా కన్యా, దశ పుత్రాన్ ప్రవర్థయన్
యత్ ఫలం లభతే మర్త్య తత్ లభ్యం కన్యకైకయా"
(दशपुत्र, समाकन्या, दशपुत्रान प्रवर्धयन् | यत् फलं लभतेमर्त्य, तत् लभ्यं कन्यकैकया ||)
అనగా ఒక కుమార్తె పది కుమారులతో సమానం. పది మంది పుత్రుల వల్ల కలిగే పుణ్యం ఒక్క కుమార్తె తోనే లభిస్తుంది. ఇది మన సమాజంలో స్త్రీ ప్రాముఖ్యాన్ని చూపెడుతుంది. అందుకే మన సమాజంలో స్త్రీ ని శక్తి స్వరూపంగా భావిస్తారు. ఈ స్త్రీ శక్తి మొత్తం దేశాన్ని, సమాజాన్నీ, కుటుంబాన్నీ ఏక త్రాటిపై నిలుపుతుంది. వైదిక కాల విదుషీమణులైన లోపాముద్ర, గార్గి, మైత్రేయి ల విద్వత్తైనా; అక్కమహాదేవి, మీరాబాయిన భక్తి, జ్ఞానాలైనా; అహల్యాబాయి హోల్కర్ పరిపాలనా వ్యవస్థ అయినా; రాణి లక్ష్మీబాయి వీరత్వమైనా, స్త్రీ శక్తే ఎప్పుడూ కూడా మనకెంతో ప్రేరణను అందిస్తూ, దేశ గౌరవమర్యాదలను కాపాడుతోంది.
శ్రీ ప్రకాశ్ త్రిపాఠీ గారు ఎన్నో ఉదాహరణలను సూచించారు. మన సాహసవంతురాలైన రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన సుఖోయి 30 యుధ్ధ విమాన ప్రయాణం స్త్రీలందరికీ ఎంతో ప్రేరణను ఇస్తుందన్నారు. వర్తికా జోషీ నేతృత్వంలో భారతీయ నౌకాదళ మహిళా సభ్యులు ఐ.ఎన్.ఎస్.వి .తరిణిపై ప్రపంచ యాత్ర చేస్తున్నారు. వారి గురించి కూడా ప్రస్తావించారు. భావనా కంఠ్, మోహనా సింహ్, అవనీ చతుర్వేదీ అనే ముగ్గురు సాహస వనితలు ఫైటర్ పైలెట్స్ అయ్యి, సుఖోయి 30 యుధ్ధవిమాన శిక్షణ తీసుకుంటున్నారు. క్షమతా వాజపేయి నేతృత్వంలో ఆల్ విమెన్ క్రూ ఢిల్లీ నుండి అమెరికా లోని సెన్ఫ్రాన్సిస్కో కి, తిరిగి ఢిల్లీ వరకూ ఏర్ ఇండియా బోయింగ్ జట్ విమానాన్ని నడిపారు. వారందరూ మహిళలే. వారు సరిగ్గా చెప్పారు - ఇవాళ ప్రతి రంగంలోనూ స్త్రీలు రాణించడమే కాకుండా నేతృత్వాన్ని వహిస్తున్నారు. ఇవాళ ప్రతి రంగంలో కూడా అందరి కంటే ఎక్కువగా మన స్త్రీలే ఏదో ఒకటి సాధించి చూపెడుతున్నారు. పునాదిరాళ్లను వేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం గౌరవనీయులైన రాష్ట్రపతిగారు ఒక కొత్త పనిని ప్రారంభించారు.
వారి వారి రంగాల్లో మొట్టమొదటిగా ఏదో ఒకటి సాధించిన ఒక అసాధారణ మహిళల బృందాన్ని రాష్ట్రపతిగారు కలిసారు. దేశంలోని ఈ మహిళా సాధకుల్లో , మొదటి మహిళా మర్చెంట్ నేవీ కేప్టెన్, పాసింజరు ట్రైన్ తాలూకూ మొదటి మహిళా ట్రైన్ డ్రైవర్, మొదటి అగ్నిమాపక సిబ్బంది(ఫైర్ ఫైటర్), మొదటి మహిళా బస్ డ్రైవర్, అంటార్క్టికా చేరిన మొదటి మహిళ, ఎవరెస్ట్‌ను అధిరోహించిన మొదటి మహిళ, ఇలా ప్రతి రంగంలోని మొదటి మహిళలను కలిసారు. మన స్త్రీ శక్తి, సమాజంలోని సాంప్రదాయక కట్టుబాట్లను అధిగమిస్తూ అసాధారణ విజయాలను సాధించారు. ఒక రికార్డుని నెలకొల్పారు. కష్టపడి, ఏకాగ్రత, ధృఢసంకల్పాలతో పని చేస్తే, ఎన్నో అవాంతరాలనూ, బాధలనూ అధిగమిస్తూ ఒక నూతన మార్గాన్ని తయారు చేయవచ్చు అని వారు నిరూపించారు. ఆ మార్గం తమ సమకాలీనులనే కాక రాబోయే తరాల వారికి కూడా ప్రేరణను అందించి, వారికి ఒక కొత్త ఉత్సాహాన్ని అందించేదిగా అది నిలుస్తుంది. దేశం మొత్తం ఈ స్త్రీ శక్తి గురించి తెలుసుకోవడానికి, వారి జీవితాల నుండి, వారి పనుల నుండి ప్రేరణను పొందేందుకు వీలుగా ఈ women achievers, first ladies పై ఒక పుస్తకం కూడా తయారైంది. ఇది నరేంద్ర మోదీ వెబ్సైట్ లో ఈ-పుస్తకం రూపంలో లభ్యమౌతోంది.
ఇవాళ దేశంలోనూ, సమాజంలోనూ జరుగుతున్న సానుకూలమైన మార్పుల్లో దేశ స్త్రీ శక్తి తాలూకూ ముఖ్యంమైన పాత్ర ఉంది. ఇవాళ మనం మహిళా సాధికారత గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి, ఒక రైల్వే స్టేషన్ గురించి చెప్పాలనుకుంటున్నాను. మహిళా సాధికారత కూ, ఒక ఒక రైల్వే స్టేషన్ కూ గల సంబంధం ఏమిటా అని మీరు అనుకోవచ్చు. ముంబయ్ లోని మాటుంగా స్టేషన్ మొత్తం మహిళా సిబ్బందితో నిండిన భారత దేశంలోని మొట్టమొదటి రైల్వే స్టేషన్ . అక్కడ అన్ని విభాగాల్లోనూ మహిళా సిబ్బందే. వాణిజ్య విభాగంలోనూ, రైల్వే పోలీస్ లో, టికెట్ చెకింగ్ లో, అనౌన్స్ మెంట్ సిబ్బంది లో, పోయింట్ పర్సన్ లోనూ, నలభై కంటే అధికంగా అందరూ మహిళా సిబ్బందే. ఈసారి గణతంత్ర దినోత్సవ పెరేడ్ చూసిన తర్వాత చాలామంది ప్రజలు ట్విట్టర్, ఇతర సాంఘిక మాధ్యమాల ద్వారా పెరేడ్లో వారు గమనించిన ముఖ్యమైన అంశం గురించే రాసారు. అది అందరూ మహిళలే పాల్గొన్న సాహసవంతమైన ప్రయోగం BSF Biker Contingent గురించే! ఈ సాహసవంతమైన ప్రయోగ దృశ్యం విదేశాలనుండి వచ్చిన అతిధులందరినీ కూడా ఆశ్చర్య చకితులను చేసింది. ఇది మహిళా సాధికారతకూ, ఆత్మవిశ్వాసానికీ ఒక రూపం. ఇవాళ మన మహిళలు నాయకత్వాన్ని వహిస్తున్నారు. స్వశక్తులుగా మారుతున్నారు. ఇలాంటిదే మరొక విషయం నా దృష్టికి వచ్చింది. ఛత్తీస్ గడ్ కు చెందిన మన ఆదివాసీ మహిళలు ఒక గొప్ప పని చేసారు. ఒక గొప్ప ఉదాహరణను చూపెట్టారు. ఆదీవాసీ మహిళల విషయం అనగానే అందరి మనసుల్లో ఒక ఖచ్చితమైన చిత్రం కనబడుతుంది. ఒక అడవి, అందులో తలపాగాల చుట్టలపై కట్టేల మూటల బరువుని మోసు నడుస్తున్న మహిళల చిత్రం కనబడుతుంది. కానీ ఛత్తీస్ గడ్ కు చెందిన మన ఆదివాసీ మహిళలు దేశానికి ఒక కొత్త చిత్రాన్ని చూపించారు. ఛత్తీస్ గడ్ లో దంతేవాడ ప్రాంతంలో హింస, అత్యాచారాలతో, బాంబులు, తుపాకులతో, మావోయిస్టులు ఒక భయంకరమైన వాతావరణాన్ని అక్కడ సృష్టించి ఉంచారు. అలాంటి ప్రమాదకరమైన ప్రాంతంలో ఆదివాసీ మహిళలు ఈ-రిక్షా ను నడిపి తమ కాళ్లపై తాము నిలబడ్డారు. అతికొద్ది సమయంలోనే ఎందరో మహిళలు ఇందులో కలిసారు. దీనివల్ల మూడు లాభాలు జరుగుతున్నాయి. ఒకవైపు స్వయంఉపాధి వారిని స్వశక్తులుగా తయారుచేసింది. మరోవైపు మవోవాద ప్రభావమున్న ఆ ప్రాంతం రూపురేఖలు మారుతున్నాయి. వీటితో పాటూ పర్యావరణ పరిరక్షణకు కూడా బలం చేకూరుతోంది. ఇందుకు అక్కడి జిల్లా అధికార యంత్రాంగాన్ని కూడా అభినందిస్తున్నాను. దీనికి అవసరమైన ధన సహాయాన్ని అందించడం మొదలుకొని వారికి శిక్షణను ఇవ్వడం వరకూ, ఈ మహిళల విజయానికి జిల్లా అభికార యంత్రాంగం ఎంతో ముఖ్యమైన పాత్ర వహించింది.
"మాలో మార్పు రాదు..మేమింతే" అనే మాటలు కొందరి నుండి మనం పదే పదే వింటూంటాం. ఆ విషయం ఏమిటంటే వినమ్రత, పరివర్తన. మన చేతుల్లో లేనిదాన్ని వదిలెయ్యాలి, అవసరమైన చోట మార్పులు స్వీకరించాలి. తనను తాను సరిదిద్దుకోవడం మన సమాజంలోని ప్రత్యేకత. ఇటువంటి భారతీయ సాంప్రదాయం, ఇటువంటి సంస్కృతి మనకు వారసత్వంగా లభించాయి. తనని తాను సరిదిద్దుకునే పధ్ధతే ప్రతి చైతన్యవంతమైన సమాజపు లక్షణం. యుగాలుగా మన దేశంలో వ్యక్తిగతంగానూ, సామాజిక స్థాయిలో కూడా సామాజంలోని మూఢనమ్మకాలకు, చెడు పధ్ధతులకు వ్యతిరేకంగా నిలబడి ఎదుర్కొనే ప్రయత్నం జరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే బీహార్ ఒక ఆసక్తికరమైన కొత్త తరహా కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్రంలోని సామాజంలోని చెడు పధ్ధతులను వేళ్లతో పెకిలించివెయ్యడానికి పదమూడువేల కంటే ఎక్కువ కిలోమీటర్ల ప్రపంచంలోనే అతిపెద్ద మానవహారం(Human Chain ) చేసారు. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలను బాల్య వివాహాలకు, వరకట్న దురాచారాలకూ వ్యతిరేకంగా అప్రమత్తులను చేసారు. బాల్య వివాహాలకు, వరకట్న దురాచారాలు మొదలైన చెడు పధ్ధతులకు వ్యతిరేకంగా మొత్తం రాష్ట్రం పోరాటం చెయ్యాలని సంకల్పించింది. పిల్లలు, పెద్దలు, ఉత్సాహంతో నిండిన యువత, తల్లులు, సోదరీమణులు, ప్రతి ఒక్కరూ ఈ పోరాటంలో భాగమయ్యారు. పట్నా లోని చారిత్రక గాంధీ మైదానం నుండి మొదలైన ఈ మానవ హారం రాష్ట్ర సరిహద్దుల వరకూ అనూహ్యంగా ప్రజలను కలుపుకుంటూ సాగింది. సమాజంలో ప్రజలందరికీ సరైన విధంగా అభివృధ్ధి ఫలితాలు అందాలంటే, సమాజం ఇటివంటి చెడు పధ్ధతుల నుండి విముక్తి చెందాలి. రండి, మనందరమూ కలిసి ఇలాంటి చెడు పధ్ధతుల సమాజం నుండి నిర్మూలిస్తామని ప్రతిజ్ఞ చేద్దాం. ఒక నవ భారత దేశాన్నీ, ఒక సశక్తమైన, సమర్థవంతమైన భారతదేశాన్ని నిర్మిద్దాం. నేను బిహార్ రాష్ట్ర ప్రజలనూ, ముఖ్యమంత్రినీ, అక్కడి పరిపాలనా యంత్రాంగాన్ని, ఆ మానవహారంలో పాల్గొన్న ప్రతి వ్యక్తినీ వారి సమాజ కల్యాణం దిశగా ఇంతటి విశిష్టమైన, విస్తృతమైన ప్రయత్నం చేసినందుకుగానూ అభినందిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, కర్ణాటక లోని మైసూర్ కు చెందిన దర్శన్ గారు మై గౌ యాప్ లో ఏం రాసారంటే, వారి తండిగారి వైద్యానికి నెలకు ఆరువేలు ఖర్చు అయ్యేవిట. వారికి ముందర ప్రధానమంత్రి జన ఔషధీ పథకం గురించి తెలీదట. జన ఔషధీ కేంద్రం గురించి తెలిసిన తర్వాత అక్కడ మందులు కొనటం మొదలుపెట్టాకా, అతనికి మందుల ఖర్చు 75 శాతం వరకూ తగ్గిపోయింది. ఈ విషయాన్ని తెలుసుకుని, ఎక్కువమంది ప్రజలు లాభం పొందాలనే ఉద్దేశంతో ’మనసులో మాట ’ కార్యక్రమంలో నేనీ విషయాన్ని ప్రస్తావించాలని వారు కోరారు. కొద్ది కాలంగా ప్రజలు ఈ విషయాన్ని నాకు రాస్తున్నారు. చెప్తున్నారు. ఈ పథకం ద్వారా లాభం పొందిన వారి వీడియోలు సామాజిక మాధ్యమాలలో నేను చూశాను. ఇటువంటి సమాచారం తెలిస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఎంతో సంతోషం లభిస్తుంది. తనకు లభించినది ఇంకెందరికో కూడా లభించాలనే దర్శన్ గారి ఆలోచన నాకెంతో నచ్చింది. హెల్త్ కేర్ ను అందుబాటులోకి తేవడం, ఈజ్ ఆఫ్ లివింగ్ ను ప్రోత్సహించడం ఈ పథకం వెనుక ఉద్దేశం. జన ఔషథ కేంద్రాల్లో లభించే మందులు బజార్లో అమ్మకమయ్యే బ్రాండెడ్ మందుల కన్నా ఏభై నుండీ తొంభై శాతం వరకూ చవకగా లభిస్తాయి. ఇందువల్ల సామాన్య ప్రజలు, ముఖ్యంగా నిత్యం మందులు వాడే వయోవృధ్ధులకు ఎంతో ఆర్థిక సహాయం లభిస్తుంది. డబ్బు ఆదా కూడా అవుతుంది. ఇందులో కొనుగోలు అయ్యే జెనిరిక్ మందులు ప్రపంచ ఆరోగ్యసంస్థ నిర్ణయించిన స్థాయిలోనే ఉంటాయి. ఈ కారణంగా మంచి క్వాలిటీ మందులు తక్కువ ధరకే లభిస్తాయి. ఇవాళ దేశం మొత్తంలో మూడు వేల జన ఔషథ కేంద్రాలు స్థాపించబడ్డాయి. ఇందువల్ల మందులు చవకగా లభించడమే కాకుండా సొంతంగా వ్యాపారం చేసుకునేవారికి ఉపాధి అవకాశాలు కూడా లభిస్తాయి. చవక ధరల్లోని మందులు భారతీయ ప్రధానమంత్రి జన ఔషథ కేంద్రాల్లోనూ, ఆసుపత్రుల్లోని ’అమృత్ స్టోర్స్ ’ లోనూ అభ్యమౌతాయి. దేశంలోని ప్రతి నిరుపేద పౌరుడికీ నాణ్యమైన ఆరోగ్యసేవలను అందుబాటులో ఉండే విధంగా చెయ్యాలనేదే ఈ పథకం ఉద్దేశం. తద్వారా ఆరోగ్యకరమైన, సంపన్నమైన భారతదేశాన్ని నిర్మించడమే ముఖ్యోద్దేశం.
నా ప్రియమైన దేశప్రజలారా, మహారాష్ట్రకు చెందిన మంగేష్ గారు నరేంద్ర మోదీ యాప్ కు ఒక ఫోటోను పంపించారు. నా దృష్టిని ఆవైపుకి తిప్పుకునేలా ఆ ఫోటో ఉంది. అందులో ఒక మనవడు, తన తాతయ్యతో కలిసి క్లీన్ మోర్నా నదిని శుభ్రపరిచే కార్యక్రమంలో పలుపంచుకుంటున్నాడు. అకోలా లోని ప్రజలు స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో భాగంగా మోర్నా నదిని శుభ్రపరచడానికి పరిశుభ్రతా కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించుకున్నారు. మోర్నా నది ఇదివరకూ పన్నెండు నెలలలోనూ ప్రవహించేది. ఇప్పుడు అది కొన్ని నెలలలో మాత్రమే ప్రవహిస్తోంది. మరొక బాధాకరమైన విషయం ఏమిటంటే, నది పూర్తిగా కలుపు, గుర్రపు డెక్కతో నిండిపోయింది. నడి ఒడ్డున కూడా చాలా చెత్త పారేస్తున్నారు. అందుకని ఒక ఏక్షన్ ప్లాన్ తయారుచేసుకుని, మకర సంక్రాంతి ముందరి రోజు నుండీ, అంటే జనవరి పదమూడు నుండీ ‘Mission Clean Morna’ లో మొదటి భాగంగా నాలుగు కిలోమీటర్ల పరిధిలో పధ్నాలుగు స్థానాల్లో మోనా నదికి ఇరువైపులా శుభ్రతా కార్యక్రమాన్ని చేపట్టారు. ‘Mission Clean Morna’ పేరన జరిగిన ఈ మంచి కార్యక్రమంలో అకోలా కు చెందిన ఆరువేలకు పైగా ప్రజలు, వందకు పైగా ఎన్.జీ.ఓలు, కళాశాలలూ, విద్యార్థులు, పిల్లలు, వృధ్ధులు, తల్లులు, సోదరీమణులు, ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొన్నారు. 20 జనవరి 2018 నాడు కూడా ఈ పరిశుభ్రతా కార్యక్రమం జరిగింది. మోర్నా నది పూర్తిగా శుభ్రపడేవరకూ, ప్రతి శనివారం ఉదయం ఈ శుభ్రతా కార్యక్రమం జరుగుతుందని నాకు చెప్పారు. మనిషి ఏదైనా సాధించాలని పట్టుపడితే, సాధించలేనిదేదీ లేదని ఈ విషయం నిరూపిస్తుంది. ప్రజాఉద్యమాల ద్వారా పెద్ద పెద్ద మార్పులు తీసుకురావచ్చు. నేను అకోలా ప్రజలకూ, అక్కడి జిల్లా, నగర పురపాలక శాఖకూ, ఈ పనిని ప్రజాఉద్యమంగా మార్చిన ప్రతి పౌరుడికీ, వారి వారి ప్రయత్నాలకు గానూ ఎంతగానో అభినందిస్తున్నాను. మీ ఈ ప్రయత్నం దేశంలోని ఎందరికో ప్రేరణని ఇస్తుంది.
నా ప్రియమైన దేశప్రజలారా, ఈమధ్య పద్మ పురస్కారాలపై జరుగుతున్న చర్చలను మీరూ వినే ఉంటారు. వార్తాపత్రికలు, టివీ ఈ విషయంపై మన దృష్టిని ఆకర్షిస్తున్నాయి. కాస్త నిశితంగా గమనిస్తే మీకు గర్వంగా అనిపిస్తుంది. ఎలాంటి గొప్ప గొప్ప వ్యక్తులు మన మధ్య ఉన్నారో అని గర్వం కలుగుతుంది. మన దేశంలో సామాన్య వ్యక్తులు కూడా ఏ రకమైన సహాయం లేకుండా అంతటి స్థాయికి చేరుకుంటున్నందుకు స్వాభావికంగానే మనకి గర్వంగా అనిపిస్తుంది. ప్రతి ఏడాదీ పద్మ పురస్కారాలను ఇచ్చే సంప్రదాయం ఉంది కానీ గత మూడేళ్ళుగా పద్మ పురస్కారాల ప్రక్రియ మారింది. ఇప్పుడు ఏ పౌరుడైనా ఈ పురస్కారానికై ఎవరినైనా నామినేట్ చేయవచ్చు. ప్రక్రియ అంతా ఆన్లైన్ లోకి రావడంతో పారదర్శకత వచ్చింది. ఒకరకంగా ఈ పురస్కారాల ఎన్నిక ప్రక్రియ మొత్తం మారిపోయింది. చాలా సాధారణమైన వ్యక్తులకు కూడా పద్మ పురస్కారాలు లభించడం మీరూ గమనించే ఉంటారు. సాధారణంగా టీవీల్లోనూ, పెద్ద పెద్ద నగరాల్లో, వార్తాపత్రికలలోనూ, సభల్లోనూ కనబడని వ్యక్తులకు పద్మ పురస్కారాలు లభిస్తున్నాయి. ఇందువల్ల పురస్కారాన్ని ఇవ్వడం కోసం వ్యక్తి పరిచయానికి కాకుండా అతడు చేస్తున్న పని ప్రాముఖ్యం పెరుగుతోంది. ఐ.ఐ.టి కాన్పూర్ విద్యార్థి అయిన అరవింద్ గుప్తా గారు పిల్లలకు బొమ్మలు తయారుచెయ్యడంలోనే తన పూర్తి జీవితాన్ని గడిపేసారన్న సంగతి విని మీరు ఆనందిస్తారు. పిల్లలలో విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచడానికి ఆయన గత నలభై ఏళ్ళుగా , పనికిరాని వస్తువులతో బొమ్మలు తయారుచేస్తున్నారు. పిల్లలు పనికిరాని వస్తువులతో విజ్ఞానపరమైన ప్రయోగాలు చెయ్యడానికి ప్రేరణ ఇవ్వాలనేది ఆయన ఉద్దేశం. అందుకోసం ఆయన దేశవ్యాప్తంగా మూడు వేల పాఠశాలకు వెళ్ళి 18 భాషల్లో తయారైన చలనచిత్రాలను చూపెట్టి పిలల్లకు ప్రేరణను అందిస్తున్నారు. ఎంతటి అద్భుతమైన జీవితమో! ఎంతటి అద్భుతమైన సమర్పణా భావమో!
ఇలాంటి కధే కర్నాటక కు చెందిన సీతవ్వ జోదట్టి (SITAVAA JODATTI) ది కూడా. వీరికి ’ महिला-सशक्तीकरण की देवी ’ అనే బిరుదు ఊరికే రాలేదు. ఆవిడ గత ముఫ్ఫై ఏళ్ళుగా బెలాగవీ (BELAGAVI) లో లెఖ్ఖలేనందరు మహిళల జీవితాలు మార్పు చెందటానికి గొప్ప సహకారాన్ని అందించారు. ఏడేళ్ళ వయసులోనే దేవదాసిగా మారారు. తర్వాత దేవదాసీల అభివృధ్ధి కోసమే తన పూర్తి జీవితాన్ని అంకితం చేసారు. ఇంతేకాక వీరు దళిత మహిళల జీవితాల కోసం కూడా అపూర్వమైన కార్యక్రమాలు చేసారు.
మధ్యప్రదేశ్ కు చెందిన బజ్జూ శ్యామ్ గురించి కూడా మీరు వినే ఉంటారు. వీరు ఒక నిరుపేద ఆదివాసీ కుటుంబంలో జన్మించారు. జీవితం గడుపుకోవడానికి ఒక మామూలు ఉద్యోగం చేసేవారు. కానీ ఆయనకు సాంప్రదాయ ఆదివాసీల చిత్రాలు వేసే అలవాటు ఉండేది. ఇదే వ్యాపకం ఆయనకు భారతదేశంలోనే కాక విశ్వవ్యాప్తంగా కూడా ఎంతో కీర్తిని తెచ్చిపెట్టింది. నెదర్ల్యాండ్స్, జర్మనీ, ఇంగ్లాండ్, ఇటలీ లాంటి ఎన్నో దేశాల్లో ఈయన చిత్రాల ప్రదర్శనలు జరిగాయి. విదేశాలలో భారతదేశం కీర్తిని పెంచిన బజ్జూ శ్యామ్ గారి ప్రతిభను గుర్తించి, ఆయనకు పద్మశ్రీని ఇచ్చారు.
కేరళకు చెందిన లక్ష్మీ కుట్టి కథను విని మీరు ఆనందాశ్చర్యాలతో ఉండిపోతారు. ఆవిడ కల్లార్ లో ఉపాధ్యాయురాలు. ఇప్పటికీ ఆవిడ దట్టమైన అడవుల్లో ఆదివాసుల ప్రాంతంలో తాటాకులతో నిర్మించిన పాకలో నివసిస్తున్నారు. ఆవిడ తన స్మృతి ఆధారంగా ఐదువందల మూలికా మందులు తయారు చేసారు. మూలికలతో మందులు తయారు చేసారు. పాముకాటుకు ఉపయోగించే మందు తయారుచెయ్యడంలో ఆవిడ సిధ్ధహస్తురాలు. మూలుకా మందులలో తనకున్న పరిజ్ఞానంతో లక్ష్మి గారు నిరంతరం ప్రజల సేవ చేస్తున్నారు. ఈ అజ్ఞాత వ్యక్తిని గుర్తించి ఆవిడ చేసిన సమాజ్ సేవకు గానూ ఆమెను పద్మశ్రీతో గౌరవించారు.
ఇవాళ మరొక పేరును కూడా ప్రస్తావించాలని నాకు అనిపిస్తోంది. పశ్చిమ బెంగాలు కు చెందిన డెభ్భై ఐదు ఏళ్ల సుభాషిణీ మిస్త్రీ. వారిని కూడా పద్మ పురస్కారానికి ఎన్నుకున్నారు. ఒక ఆసుపత్రిని నిర్మించడానికి సుభాషిణీ మిస్త్రీ గారు ఇతరుల ఇళ్లల్లో అంట్లు తోమారు, కూరగాయలు అమ్మారు. ఇరవై మూడేళ్ల వయసులో వైద్యసదుపాయం అందక ఆవిడ భర్త మరణించారు. ఆ సంఘటన ఆవిడలో పేదవారి కోసం ఆసుపత్రి నిర్మించాలనే సంకల్పాన్ని కల్గించింది. ఇవాళ ఆవిడ ఎంతో కష్టంతో నిర్మించిన ఆసుపత్రిలో ఎందరో వేలమంది పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తున్నారు. మన బహురత్న భారతభూమిలో ఎవరికీ తెలియని, ఎవరూ గుర్తించని ఇలాంటి నర,నారీ రత్నాలెందరో ఉన్నారని నాకు ఎంతో నమ్మకం. ఇలాంటి వ్యక్తులకు గుర్తింపు లేకపోవడం సమాజానికే నష్టం. మన చుట్టుపక్కల సమాజం కోసం జీవిస్తున్న వారు, సమాజం కోసం జీవితాలను అంకితం చేసేవారు, ఏదో ఒక ప్రత్యేకతతో జీవితమంతా లక్ష్యంతో పనిచేసేవారు ఉన్నారు. వారిని ఎప్పటికైనా సమాజంలోకి తీసుకురావాలి. అందుకు పద్మ పురస్కారాలు ఒక మాధ్యమం. వారు గౌరవమర్యాదలను కోరుకోరు. వాటి కోసం పనిచెయ్యారు. కానీ వారి పనుల ద్వారా మనకు ప్రేరణ లభిస్తుంది. పాఠశాలకూ, కళాశాలలకూ పిలిచి వారి అనుభవాలను అందరూ వినాలి. పురస్కారాలను దాటుకుని కూడా సమాజంలో కొన్ని ప్రయత్నాలు జరగాలి.
ప్రతి సంవత్సరం జనవరి తొమ్మిదవ తేదిని మనం ప్రవాస భారతీయ దినోత్సవంగా మనం జరుపుకుంటున్నాం. గాంఢీగారు ఇదే తేదీన సౌత్ ఆఫ్రికా నుండి భారతదేశానికి తిరిగి వచ్చారు. ఈ రోజున మనం భారతదేశంలోనూ, ప్రపంచంలోని నలుమూలల్లోనూ నివసిస్తున్న భారతీయులందరి మధ్యనున్న వీడని బంధానికి ఉత్సవాన్ని జరుపుకుంటాము. ఈసారి ప్రవాస భారతీయ దినోత్సవం నాడు ప్రపంచవ్యాప్తంగా నివసిస్తున్న భారత సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యులు, మేయర్ల ను అందరికీ మనం ఒక కార్యక్రమానికి ఆహ్వానించాం. ఆ కార్యక్రమంలో Malaysia, New Zealand, Switzerland, Portugal, Mauritius, Fiji, Tanzania, Kenya, Canada, Britain, Surinam, దక్షిణ ఆఫ్రికా, ఇంకా అమెరికాల నుండి, ఇంకా ఇతర దేశాల్లో ఎక్కడెక్కడ మన భారత సంతతికి చెందిన మేయర్లున్నారో, ఇతర దేశాల్లో ఎక్కడెక్కడ మన భారత సంతతికి చెందిన పార్లమెంట్ సభ్యులు ఉన్నారో, వారంతా పాల్గొన్నారు. వివిధ దేశాల్లో నివసిస్తున్న భారత సంతతికి చెందిన వ్యక్తులు, ఆయ దేశాల సేవలు చేస్తూనే, భారత దేశంతో కూడా తమ సంబంధాలను బలంగా నిలుపుకోవడం నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. ఈసారి ఐరోపా సంఘం నాకొక కేలెండర్ ను పంపించింది. అందులో వారు యూరప్ లో వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల ద్వారా విభిన్న రంగాల్లో వారు చేస్తున్న పనులను మంచిగా చూపించారు. యూరప్ లో వివిధ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల కొందరు సైబర్ సెక్యూరిటీలో పనిచేస్తుంటే, కొందరు ఆయుర్వేదానికి అంకితమయ్యారు. కొందరు తమ సంగీతంతోనూ, మరికొందరు కవిత్వంతోనూ సమాజాన్ని రంజింపజేస్తున్నారు. కొందరు వాతావరణ మార్పులపై పరిశోధన చేస్తే, కొందరు భారతీయ గ్రంధాలపై పనిచేస్తున్నారు. ఒకరు ట్రక్ నడిపి గురుద్వారా నిర్మిస్తే, మరొకరు మసీదు నిర్మించారు. మన భారతీయులు ఎక్కడ ఉన్నా వారు అక్కడ ఉన్న భూమిని ఏదో ఒకరకంగా అలంకరించారు. ఇటువంటి చెప్పుకోదగ్గ కార్యక్రమానికి గానూ, భారతీయ మూలాలున్న ప్రజలను గుర్తించడానికీ, వారి మాధ్యమం ద్వారా ప్రపంచంలోని ప్రజలకు వారి సమాచారాన్ని తెలిపినందుకు గానూ ఐరోపా సంఘానికి నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను.
జనవరి ముఫ్ఫై వ తేదీ మనందరికీ సరైన మార్గాన్ని చూపిన పూజ్య బాపూజీ వర్థంతి. ఆరోజు మనం అమరవీరుల దినోత్సవం జరుపుకుంటాము. ఆ రోజున దేశరక్షణకు తమ ప్రాణాలను అర్పించిన గొప్ప అమరవీరులకు పదకొండు గంటలకు శ్రధ్ధాంజలి అర్పిస్తాము. శాంతి, అహింసల మార్గమే బాపూజీ మార్గం. భారతదేశమైన, ప్రపంచమైనా, ఒక వ్యక్తి అయినా, కుటుంబమయినా, సమాజం యావత్తూ పూజించే బాపూజీ ఏ ఆదర్శాల కోసమై జీవించారో, ఏ విషయాలు మనకు చెప్పారో, అవి నేటికి కూడా అవి అత్యంత ఉపయుక్తమైనవి. అవి కేవలం కాయితపు సిధ్ధాంతాలు మాత్రమే కాదు. ప్రస్తుత కాలంలో కూడా మనం అడుగడుగునా బాపూజీ మాటలు ఎంట నిజమైనవో చూశ్తున్నాం. మనం బాపూజీ బాటలో నడవాలని సంకల్పించి, ఎంత నడవగలమో అంత నడిస్తే అంతకు మించిన శ్రధ్దాంజలి బాపూజీకి ఏమి ఉంటుంది?
నా ప్రియమైన దేశప్రజలారా, మీ అందరికీ 2018 కి గానూ శుభాకాంక్షలు తెలుపుతూ, నా మాటలను ఇంతటితో ముగిస్తున్నాను. అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం!
ప్రియమైన నా దేశ వాసులారా నమస్కారం! ఈ సంవత్సరానికి ఇది ఆఖరి మనసులో మాట. ఇవాళ ఈ 2017 సంవత్సరానికి ఆఖరి రోజు అవడం అనుకోకుండా కలిసివచ్చింది. ఈ ఏడాది అంతా కూడా మీరూ, నేను ఎన్నో విషయాలను పంచుకున్నాం. మన్ కీ బాత్ (‘మనసులో మాట’) కోసం మీ అందరి అనేకమైన ఉత్తరాలు, అభిప్రాయాలు, మనం పంచుకున్న ఆలోచనలు నాకు ఎప్పుడూ కొత్త శక్తిని ఇస్తూ ఉంటాయి. మరికొన్ని గంటలలో సంవత్సరం మారిపోతుంది కానీ, మన మాటల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. రాబోయే సంవత్సరంలో మనం మరిన్ని కొత్త విషయాలను చెప్పుకుందాం, కొత్త అనుభవాలను పంచుకుందాం. మీ అందరికీ 2018 సంవత్సరానికి గానూ అనేకానేక శుభాకాంక్షలు. కొద్ది రోజుల క్రితమే డిసెంబరు 25 నాడు ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగను వైభవంగా జరుపుకున్నారు. భారతదేశంలో కూడా ప్రజలంతా ఎంతో ఉత్సాహంతో ఈ పండుగను జరుపుకున్నారు. క్రిస్మస్ సందర్భంగా మనమంతా ఏసు క్రీస్తు చేసిన గొప్ప బోధనలను గుర్తుచేసుకుందాము. ఏసు క్రీస్తు అన్నింటి కన్నా ఎక్కువగా సేవాభావాన్ని గురించి చెప్పే వారు. సేవాభావం సారాన్ని మనం బైబిల్ లో కూడా చూస్తాము.
“The Son of Man has come, not to be served,
But to serve,
And to give his life, as blessing
To all humankind.”
అంటే- ‘‘దేవుని కుమారుడు సేవింపబడటానికి రాలేదు. సేవ చేయటానికి జన్మించాడు. తన జీవితాన్ని మానవజాతికి ఒక వరంలా అందివ్వడానికి వచ్చాడు’’ అని దీని భావం.
సేవా మహత్మ్యాన్ని ఈ వాక్యాలు తెలియజేస్తాయి. ప్రపంచంలో ఏ జాతి అయినా, ఏ ధర్మం అయినా, ఏ సంప్రదాయం అయినా, వివిధ వర్ణాల వారు అయినా.. అందరికీ మానవత విలువలను తెలిపే ఒక అపురూపమైన గుర్తింపుగా సేవాభావం ఉంది. మన దేశంలో నిష్కామ కర్మను గురించి చెప్తారు. నిష్కామ కర్మ అంటే ఏమీ ఆశించకుండా సేవ చెయ్యడం. సేవా పరమో ధర్మ: అని మన పెద్దలు అన్నారు. మానవ సేవే మాధవ సేవ. శివ భావంతో మానవ సేవ చెయ్యాలి. అంటే ప్రపంచం అంతటా ఇవే మానవతా విలువలు అని రామకృష్ణ పరమహంస గారు అనే వారు. రండి, ఆ మహా పురుషులను స్మరించుకుంటూ, పవిత్రమైన తిథులను తలుచుకుంటూ, మన ఈ గొప్ప విలువల పరంపరకు కొత్త ఉత్సాహాన్ని, కొత్త శక్తిని అందిద్దాం. స్వయంగా కూడా ఆ విలువల ప్రకారం జీవించడానికి ప్రయత్నిద్దాం.
ప్రియమైన నా దేశవాసులారా, ఈ సంవత్సరంలో పదో సిక్కు గురువు గురు గోవింద్ సింగ్ గారి 350వ జయంతి వార్షికోత్సవం జరిగింది. త్యాగం మరియు సాహసాలతో నిండిన గురు గోవింద్ సింగ్ గారి జీవితం మనందరికీ ఎంతో స్ఫూర్తిని ఇచ్చే చక్కని ఉదాహరణ. గురు గోవింద్ సింగ్ గారు గొప్ప జీవిత విలువలను ఉపదేశించారు. వాటిని పాటిస్తూనే ఆయన తన జీవితాన్ని గడిపారు. ఒక గురువు, దార్శనికుడు, మహా యోధుడు అయిన గురు గోవింద్ సింగ్ గారు ఈ పాత్రలన్నింటిలో జీవిస్తూ ప్రజలకు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచారు. వేధింపులకు, అన్యాయాలకు వ్యతిరేకంగా ఆయన పోరాడారు. కులం, ధర్మాల బంధనాలను తెంచుకొనే మార్గాన్ని ఆయన బోధించారు. ఈ ప్రయత్నాలలో ఆయన వ్యక్తిగతంగా ఎంతో పొగొట్టుకోవలసి వచ్చింది. కానీ ఆయన ఎప్పుడూ ద్వేష భావాన్ని దరి చేరనివ్వలేదు. జీవితంలో ప్రతి క్షణంలో ప్రేమ, త్యాగం, శాంతి సందేశాలను నింపే ఎన్నో గొప్ప ప్రత్యేకతలతో నిండిన వ్యక్తిత్వం ఆయనది. ఈ సంవత్సరం జనవరిలో, పట్నా సాహిబ్ లో గురు గోవింద్ గారి 350వ జన్మదిన వార్షికోత్సవ ఉత్సవాలలో పాలుపంచుకొనే అవకాశం నాకు లభించడం నా అదృష్టం . రండి, మనమంతా గురు గోవింద్ సింగ్ గారి స్ఫూర్తిదాయకమైన జీవితం నుండి, వారి గొప్ప బోధనల ప్రకారం మన జీవితాలను మలచుకుందాం.
2018 జనవరి ఒకటో తేదీ, అంటే.. రేపటి రోజు నా దృష్టిలో ఒక ప్రత్యేకమైన రోజు. ప్రతి ఏడూ కొత్త సంవత్సరం వస్తుంది. జనవరి ఒకటో తేదీ వస్తుంది. ఇందులో ప్రత్యేకత ఏముందీ అని మీరు అనుకోవచ్చు. కానీ ఈ జనవరి ఒకటో తేదీ నిజంగానే ప్రత్యేకమైనటువంటిది. ఎవరైతే 2000 సంవత్సరం లేదా తరువాత పుట్టారో, అంటే 21వ శతాబ్దంలో జన్మించిన వారందరికీ 2018, జనవరి నుండీ వోటు వేసే అర్హత వస్తుంది. భారత రాజ్యాంగం 21వ శతాబ్దపు వోటరులకు, ‘‘న్యూ ఇండియా వోటర్లకు’’ స్వాగతం పలుకుతోంది. నేను మన యువతకు అభినందనలు తెలియజేస్తూ, మీ అందరూ కూడా మిమ్మల్ని మీరు వోటర్లు గా నమోదు చేసుకోవాలని మనవి చేసుకుంటున్నాను. యావత్ భారత దేశం మీ అందరికీ 21వ శతాబ్దపు వోటర్లుగా స్వాగతం చెప్పడానికి ఉవ్విళ్ళూరుతోంది. మీరంతా కూడా 21వ శతాబ్దపు వోటర్లుగా గౌరవ భావాన్ని అనుభూతి చెందుతూ ఉండి ఉండవచ్చు. మీ అందరి వోట్లూ ’న్యూ ఇండియా’ కు ఆధారం. ప్రజాస్వామ్యంలో వోటు శక్తి ఎంతో శక్తివంతమైనటువంటిది. లక్షల మంది జీవితాలలో అనుకూలమైన మార్పులను తేవడానికి ‘‘వోటు’’ అనేది ఎంతో ప్రభావశీల సాధనం. వోటు వేయడం ద్వారా మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేసేవారు మాత్రమే కాదు, 21వ శతాబ్దపు భారతదేశం ఎలా ఉంటుంది?, 21వ శతాబ్దపు భారతదేశం మీ కలల్లో ఎలా ఉందో తెలియజేస్తుంది. మీరు కూడా 21వ శతాబ్దపు భారతదేశ నిర్మాతలు కావచ్చు. దీనంతటికీ ఈ జనవరి ఒకటో తేదీ నాంది కాబోతోంది. ఇవాళ ఈ ‘మనసులో మాట’లో నేను 18 ఏళ్ల నుండీ 25 ఏళ్ళ లోపూ శక్తి, సంకల్పాలతో నిండిన మన ప్రముఖులైన యువతతో మాట్లాడాలనుకొంటున్నాను.
నేను వీరందరినీ ‘‘న్యూ ఇండియా యువత’’ గా భావిస్తున్నాను. ‘‘న్యూ ఇండియా యువత’’ అంటే ఆశ, ఉత్సాహం, శక్తి. మన ఈ శక్తివంతమైన యువత నైపుణ్యంతో, బలంతో మన ‘న్యూ ఇండియా’ కల నెరవేరుతుందని నా నమ్మకం.
‘న్యూ ఇండియా’ జాత్యహంకారం, సాంఘిక దురభిమానం, తీవ్రవాదం, అవినీతి మొదలైన విషాల నుండి విముక్త నవ భారతం, మురికి, పేదరిక రహితమైన నవ భారతం అవ్వాలి. నవ భారతం లో అందరికీ సమానమైన అవకాశాలు లభించి అందరి ఆశలు, ఆకాంక్షలు తీరాలి. శాంతి, ఏకత్వం, సద్భావనలు మనకు మార్గదర్శకాలు కావాలి. నా ఈ నవ భారత యువతరం ముందుకు వచ్చి నవ భారతాన్ని ఎలా నిర్మించాలో మేథోమధనం చెయ్యాలనేది నా కోరిక. వారు వారి కోసం మార్గాన్ని నిర్ణయించుకుంటూ, తమ మార్గంతో ముడిపడి ఉన్న వారందరినీ తమ లక్ష్యంతో కలుపుకుంటూ ముందుకు సాగాలి. మీరు నడుస్తూ, దేశాన్ని కూడా ముందుకు నడిపించండి. మీతో మాట్లాడుతూంటే నాకు ఆలోచన వచ్చింది. మనం భారతదేశం లోని ప్రతి జిల్లాలో ఒక mock parliament ను ప్రారంభిద్దామా ? అందులో 18 ఏళ్ల నుండీ 25 ఏళ్ళ లోపూ యువత కలిసి నవ భారతాన్ని గురించి మేథోమధనం చేస్తూ, మార్గాలు అన్వేషిస్తూ, ప్రణాళికలు తయారు చేసి, మన సంకల్పాలను 2022 కన్నా ముందే ఎలా పూర్తి చెయ్యాలో ఆలోచించి, మన స్వాతంత్ర్య సమర యోధులు కలలు కన్న భారతదేశ నిర్మాణాన్ని ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తే బావుంటుంది కదా. స్వాతంత్ర పోరాటాన్ని మహాత్మా గాంధీ ప్రజా ఉద్యమంగా మార్చేసారు. నా యువ మిత్రులారా, 21వ శతాబ్దంలో భవ్యమైన,దివ్యమైన భారతదేశం కోసం మనందరమూ కూడా ప్రజా ఉద్యమాన్ని చేపట్టాల్సిన సమయం వచ్చింది. అభివృధ్ధి కోసం ప్రజా ఉద్యమం. ప్రగతి కోసం ప్రజా ఉద్యమం. సమర్థవంతమైన, శక్తివంతమైన భారతదేశం కోసం ప్రజా ఉద్యమం! ఆగష్టు పదిహేనుకి దగ్గర దగ్గర ఢిల్లీ లో ఒక mock parliament ఏర్పాటు చేయాలని నేను అనుకుంటున్నాను. అందులో ప్రతీ జిలా నుండీ ఎన్నుకోబడిన యువత పాల్గొని, రాబోయే ఐదు సంవత్సరాలలో నవ భారత నిర్మాణం ఎలా చేయాలి, సంకల్పాలను సాకారం చేసుకోవడానికి ఏమేమి చెయ్యాలి అన్న అంశాలపై చర్చించాలని నా కోరిక. ఈనాటి యువతీయువకుల ఎదుట ఎన్నో అవకాశాలు ఉన్నాయి. నైపుణ్యాన్ని అభివృధ్ధి చేసుకోవడం నుండీ సృజనాత్మకత, పారిశ్రామికీకరణ లో మన యువత ముందుండి, విజయవంతమౌతోంది. ఈ అవకాశాల ప్రణాళికల గురించిన సమాచారం మన నవ భారత యువతకు ఒకే చోటులో లభ్యమయ్యేలా చేయాలి. పద్దెనిమిదేళ్ళు వస్తూనే యువతకు ప్రపంచం గురించీ, ఈ విషయాలన్నింటి గురించీ స్వాభావికంగా తెలియచేసి, వారు దానిని అవసరమైన విధంగా ఉపయోగించుకొనే విధంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తే బావుంటుంది.
ప్రియమైన నా దేశ వాసులారా, గత ‘మనసులో మాట’ లో నేను మీతో సకారాత్మక ఆలోచనల ప్రాముఖ్యాన్ని గురించి మాట్లాడాను. ఈ సందర్భంలో ఒక సంస్కృత శ్లోకం నాకు గుర్తుకువస్తోంది –
ఉత్సాహో బలవానార్య, నాస్త్యుత్సాహాత్పరమ్ బలమ్
సోత్సాహాస్య చ లోకేశు, న కించిదపి దుర్లభమ్
దీనికి.. ఉత్సాహంతో నిండిన ఒక వ్యక్తి అత్యంత శక్తివంతుడు. ఎందుకంటే ఉత్సాహాన్ని మించింది ఏదీ లేదు. సానుకూలత, ఉత్సాహాలతో నిండిన వ్యక్తికి ఏదీ అసంభవం కాదు.. అని భావం. ఆంగ్లం లో ఒక సామెత ఉంది – ‘‘ pessimism leads to weakness, optimism to power ’’ అని. గత ‘మనసులో మాట’ లో నేను దేశ ప్రజలను 2017లో వారి వారి యొక్క మంచి అనుభవాలను పంచుకోవలసిలందని, ఆ సద్భావనలు నిండిన వాతావరణంలో 2018 ని స్వాగతించవలసిందని కోరాను.
సామాజిక మాధ్యమాల ద్వారా, MyGov మరియు the Narendra Modi App ల ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు వారి సానుకూల స్పందనను అందించి, వారి వారి అనుభవాలను పంచుకోవడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. Positive India hashtag (#) తో వచ్చిన లక్షల ట్వీట్లు దాదాపు 150 కోట్ల కన్నా ఎక్కువ మందికి చేరాయి. ఒక రకంగా చెప్పాలంటే, ఈ అనుకూల ప్రచారం భారతదేశం నుండి మొదలై ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. వచ్చిన ట్వీట్లు, స్పందనలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. అది చాలా ఆనందకరమైన విషయం. కొందరు దేశ ప్రజలు ఈ సంవత్సరంలో తమ మనసులపై ప్రత్యేకమైన , అనుకూల ప్రభావాన్నీ చూపిన కొన్ని వరుస సంఘటనలను పంచుకున్నారు. కొందరు తమ వ్యక్తిగత విజయాలను కూడా పంచుకున్నారు.
(ఒకటో ఫోన్ కాల్)
‘‘నా పేరు మీనూ భాటియా. నేను మయూర్ విహార్, పాకెట్- 1, ఫేజ్-1, ఢిల్లీ లో నివసిస్తున్నాను. నా కుమార్తె ఎం.బి.ఎ. చేయాలనుకుంటే, దాని కోసం బ్యాంక్ నుండి లోన్ కావలసి వచ్చింది. అది చాలా సులువుగా లభించింది కూడా. నా కుమార్తె చదువు ముందుకు సాగింది.’’
(రెండో ఫోన్ కాల్)
‘‘నా పేరు జ్యోతి రాజేంద్ర వాడే. నేను బోడల్ నుండి మాట్లాడుతున్నాను. నెలకు ఒక్క రూపాయి బీమా పథకంలో నా భర్త చేరారు. ప్రమాదంలో ఆయన మరణించారు. ఆ సమయంలో మా పరిస్థితి మాకు మాత్రమే తెలుసు. ప్రభుత్వం ద్వారా మాకు ఎంతో సహాయం లభించింది. దాని వల్ల నేను కాస్త తట్టుకోగలిగాను.’’
(మూడో ఫోన్ కాల్)
‘‘నా పేరు సంతోష్ జాదవ్. మా భిన్నర్ గ్రామం గుండా 2017 లో జాతీయ రహదారిని వేశారు. దాని వల్ల మా రోడ్లు చాలా మెరుగై, మా వ్యాపారం కూడా పెరగనుంది.’’
(నాలుగో ఫోన్ కాల్)
‘‘నా పేరు దీపాన్శు అహూజా. ఉత్తర్ ప్రదేశ్ లోని సాదత్ గంజ్ తాలూకా, సహారన్ పుర్ జిల్లా మాది. భారతీయ సైనికుల ద్వారా జరిగిన రెండు సంఘటనలను గురించి చెప్పాలి. మొదటిది పాకిస్తాన్ లో వారు జరిపిన సర్జికల్ స్ట్రైక్. దాని వల్ల తీవ్రవాదుల స్థావరాలను నాశనం చేశారు. రెండోది డోక్ లామ్ లో మనం చూసిన భారతీయ సైనికుల పరాక్రమం సాటిలేనిది.’’
(అయిదో ఫోన్ కాల్)
‘‘నా పేరు సతీశ్ బేవానీ. మా ప్రాంతంలో నీటి సమస్య ఉండేది. గత నలభై ఏళ్ళుగా మేము భారత సైన్యాల పైప్ లైన్ పైనే ఆధారపడి ఉన్నాం. ఇప్పుడు మాకు విడిగా గొట్టపుమార్గం ఏర్పాటైంది. 2017లో మాకు జరిగిన గొప్ప సదుపాయం ఇది.’’
ఇలా ఎందరో వ్యక్తులు వారి వారి స్థాయిల నుండి చేస్తున్న పనులు ఎన్నో జీవితాలలో సానుకూల మార్పులను తెస్తున్నాయి. వాస్తవంగా చెప్పాలంటే, మనందరం కలిసి నిర్మిస్తున్న నవ భారతం ఇదే. రండి, ఇటువంటి చిన్న చిన్న ఆనందాలతో మనం కొత్త సంవత్సరంలోకి ప్రవేశిద్దాం. కొత్త సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. అనుకూల భారతదేశం నుండి పురోగమిస్తున్న భారతదేశం దిశగా బలమైన అడుగులు వేద్దాం. సానుకూల దృక్పథం గురించి చెప్పుకుంటూ ఉంటే నాకు కూడా ఒక విషయాన్ని పంచుకోవాలని ఉంది. ఈమధ్య నాకు కశ్మీర్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఎగ్జామినేషన్ లో అగ్రగామిగా నిలచిన శ్రీ అంజుమ్ బశీర్ ఖాన్ ఖట్టక్ తాలూకూ ప్రేరణాత్మక గాథ తెలిసింది. ఆయన తీవ్రవాదం, ద్వేషం సంకెళ్ల నుండి బయటపడి, కశ్మీర్ ఎడ్మినిస్ట్రేటివ్ సెర్విస్ పరీక్ష లో టాపర్ గా నిలిచాడు. 1990లో తీవ్రవాదులు వారి పూర్వీకుల ఇంటిని కాల్చివేశారు.
అక్కడ తీవ్రవాదం, హింస ఎంత ఎక్కువగా ఉందంటే వారి కుటుంబానికి తమ పూర్వీకుల భూమిని వదలిపెట్టవలసి వచ్చింది. నలువైపులా ఇంతటి హింసాత్మక వాతావరణం చాలు ఒక చిన్న పిల్లాడి మనస్సులో అంధకారమైన, క్రూరమైన ఆలోచనలను నింపడానికి. కానీ అంజుమ్ అలా జరగనివ్వలేదు. అతను ఆశను ఎప్పుడూ వీడలేదు. తన కోసం అతడు ఒక కొత్త మార్గాన్ని ఎన్నుకున్నాడు. ప్రజలకు సేవ చేసే మార్గం. వ్యతిరేక వాతావరణం నుండి అతడు బయట పడి తన విజయ గాథను తానే రాసుకున్నాడు. ఇవాళ అతడు కేవలం జమ్ము & కశ్మీర్ ప్రాంతంలోనే కాక యావత్ దేశంలోని యువతకూ ప్రేరణాత్మక ఉదాహరణగా నిలచాడు. పరిస్థితులు ఎంత బాగాలేకపోయినా కూడా అనుకూలమైన పనుల ద్వారా నిరాశా మేఘాలను ఛేదించవచ్చు అని అంజుమ్ నిరూపించాడు.
గత వారమే జమ్ము & కశ్మీర్ లోని కొందరు ఆడ బిడ్డలను కలిసే అవకాశం నాకు దక్కింది. వారి పట్టుదలను, ఉత్సాహాన్ని, కలలను గురించి నేను వింటున్నప్పుడు, వారు జీవితంలో ఏ యే రంగాలలో ప్రగతిని సాధించాలనుకుంటున్నారో విన్నప్పుడు వారు ఎంతటి ఆశావాదులో తెలిసింది. వారితో నేను మాట్లాడినప్పుడూ వారిలో ఎక్కడా నిరాశ అనేదే కనిపించలేదు. వారిలో ఉత్సాహం ఉంది, శక్తి ఉంది, కలలు ఉన్నాయి, సంకల్పం ఉంది. వారితో గడిపిన సమయంలో నాకు కూడా ప్రేరణ లభించింది. ఇదే దేశానికి శక్తి. ఇదే నా యువత. ఇదే నా దేశ భవిష్యత్తు.
ప్రియమైన నా దేశ వాసులారా, మన దేశంలోనే కాక ప్రపంచంలోని ప్రసిద్ధ ధార్మిక క్షేత్రాలను గురించిన ప్రస్తావన వచ్చినప్పుడు కేరళలోని శబరిమల లోని గుడి గురించి ప్రస్తావన సహజమే. విశ్వ ప్రసిధ్ధమైన ఈ ఆలయంలో అయ్యప్ప స్వామి ఆశీర్వాదం కోసం ప్రతి సంవత్సరం ఎందరో భక్తులు- కోట్ల సంఖ్యలో- ఇక్కడకు వస్తారు. ఎంతో మహాత్మ్యం ఉన్న ఇంతటి భక్త సందోహం వచ్చే చోటు, పరిశుభ్రతను పాటించడమనేది ఎంతో సవాలుతో కూడకున్న సంగతి. ప్రత్యేకంగా అది కొండ ప్రాంతం, అడవుల మధ్య ఉన్న ప్రాంతం కూడా కావడంతో పరిశుభ్రత పాటించడం ఇంకా కష్టం. కానీ ఈ సమస్య ను పరిష్కరించడానికీ, సమస్యను సంస్కారంగా మార్చడానికీ, సమస్య నుండి బయట పడే మార్గాన్ని ఎలా వెతకాలో తెలిపేందుకు, ఇందుకు ప్రజల సహకారం ఎంత ఉందో తెలపడానికి శబరిమల ఆలయం ఎంతో గొప్ప ఉదాహరణగా నిలుస్తుంది. శ్రీ పి.విజయన్ అనే ఒక పోలీస్ ఆఫీసర్ పుణ్యం పూంగవనమ్ అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాడు. ఆ కార్యక్రమంలో భాగంగా పరిశుభ్రత పట్ల అప్రమత్తంగా ఉండాలనే ఒక స్వయం ప్రచారాన్ని మొదలుపెట్టాడు. అక్కడికి వచ్చే యాత్రికులు పరిశుభ్రత కోసం ఎదో ఒక శారీరిక శ్రమ చస్తే గానీ వారి యాత్ర పూర్తవ్వని విధంగా ఒక సాంప్రదాయాన్ని అతను ప్రారంభించాడు. ఈ ఉద్యమంలో చిన్న, పెద్ద అంటూ తేడా లేదు. ప్రతి యాత్రికుడు భగవంతుడి పూజలో భాగంగానే ఎంతో కొంత సమయాన్ని పరిశుభ్రత కోసం కేటాయిస్తారు. చెత్తను శుభ్రపరచటానికి పనిచేస్తారు. ప్రతి ఉదయం ఇక్కడ యాత్రికులంతా పరిసరాలను శుభ్రపరచే దృశ్యం ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఎంతటి ప్రముఖులైనా, ఎంత పెద్ద అధికారి అయినా, ఎంతటి ధనికుడైనా, ప్రతి ఒక్కరూ ఒక సామాన్య యాత్రికుడిలా ఈ పుణ్యం పూంగవనమ్ అనే కార్యక్రమంలో భాగమై పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్న తరువాతే ముందుకు వెళ్తారు. ఇటువంటి ఎన్నో ఉదాహరణలు మన దేశ ప్రజల కోసం ఉన్నాయి.
శబరిమల లో ఇంత అభివృధ్ధి చెందిన ఈ పరిశుభ్రత ఉద్యమం, అందులోనూ పుణ్యం పూంగవనమ్ కార్యక్రమం ప్రతి యాత్రికుడి యాత్రలో భాగమైపోతుంది. అక్కడ కఠోరమైన నియమాలతో పాటూ, పరిశుభ్రత అనే కఠోర సంకల్పం కూడా వారితో నడుస్తుంది.
ప్రియమైన నా దేశ వాసులారా, 2014 అక్టోబర్ 2వ తేదీ నాటి పూజ్య బాపూజీ జయంతి నాడు, పూజ్య బాపూజీ అసంపూర్ణ కల అయిన ‘స్వచ్ఛ భారతదేశం’ మరియు ‘మురికి కి తావు ఉండని భారతదేశం’ గా మన దేశాన్ని మారుస్తామని మనమంతా సంకల్పం చెప్పుకొన్నాం. పూజ్య బాపూజీ ఇదే పని కోసం జీవితమంతా పాటుపడ్డారు. ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. బాపూ జీ 150వ జయంతి నాటికి మనం ఆయన కలా అయిన స్వచ్ఛ భారతదేశాన్ని ఆయనకు అందించే ప్రయత్నంలో ఏదో ఒకటి చేద్దాం. పారిశుధ్యాన్ని పాటించడానికి దేశవ్యాప్తంగా ఎన్నో ప్రయత్నాలు జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో విస్తృతమైన ప్రజా భాగస్వామ్యంతో జరుగుతున్న మార్పులు కనబడుతున్నాయి. పట్టణ ప్రాంతాలలో పరిశుభ్రత స్థాయిని సాధించిన స్థాయిని అంచనా వేయడానికి, ప్రపంచం లోని అతి పెద్ద సర్వేక్షణను జనవరి 4 నుండి మార్చి 10, 2018 వరకు ‘క్లీన్ సర్వే 2018’ నిర్వహిస్తుంది. ఈ సర్వేక్షణలు సుమారు 40 కోట్ల జనాభాలో నాలుగు వేలకు పైగా నగరాలలో జరుగుతాయి.
నగరాలను బహిరంగ మల మూత్రాదుల విసర్జన రహితంగా చెయ్యడానికి, వ్యర్థాలను సేకరించడానికి, చెత్తను సేకరించి తీసుకువెళ్ళడానికి జరిగే రవాణా ఏర్పాట్లు, శాస్త్రీయంగా చెత్తను శుద్ధి చేయడం, అలవాట్లలో మార్పుల కోసం జరుగుతున్న ప్రయత్నాలు, సామర్థ్య నిర్మాణానికి మరియు పరిశుభ్రత కోసం జరుగుతున్న నూతన ప్రయత్నాలూ, ఈ పని కోసం ప్రజల భాగస్వామ్యం మొదలైనవన్నీ కూడా ఈ సర్వేక్షణలో అంచనా వేయవలసిన సంగతులు. ఈ సర్వే సందర్భంగా, వివిధ జట్లు వెళ్లి నగరాలను తనిఖీ చేస్తాయి. పౌరులతో మాట్లాడి మరియు వారి అభిప్రాయాన్ని తీసుకుంటాయి. the Cleanliness App ఉపయోగం, ఇంకా విభిన్న రకాల సేవా స్థలాలలో మార్పును అంచనా వేస్తారు. ఈ సర్వేక్షణ ద్వారా నగరాలలో ఏర్పాటైన శుభ్రత వ్యవస్థ నగర పరిశుభ్రతలో భాగమైందా లేక ప్రజల జీవన విధానంలో భాగమైందా అన్నది అంచనా వేస్తారు. పరిశుభ్రత కేవలం ప్రభుత్వమే చెయ్యాలని లేదు. ఇది ప్రతి పౌరుడికి, ప్రతి ప్రజా సంఘానికి కూడా పెద్ద బాధ్యత. రాబోయే రోజుల్లో జరగబోయే ఈ సర్వేక్షణలో ప్రతి పౌరుడు ఉత్సాహంతో పాల్గొనాలన్నది ప్రతి పౌరుడికీ నా విన్నపం. ఈ సర్వేక్షణ లో మీ నగరం, మీ ప్రాంతం, మీ వీధులు వెనుకబడకుండా మీరు గట్టి ప్రయత్నం చెయ్యాలి. మీ ఇంట్లోని తడి చెత్తని , పొడి చెత్తని వేరు చేసి పారవేయడానికి నీలం రంగు, ఆకుపచ్చ రంగు చెత్త డబ్బాలను ఉపయోగించడం మీకందరికీ ఇప్పటికే బాగా అలవాటు అయి ఉంటుందని నా నమ్మకం.
చెత్తను తగ్గించడం, తిరిగి ఉపయోగించడం, పునరుపయోగించడం అనే సిద్ధాంతాలు చాలా ప్రయోజనకరమైనవి. ఈ సర్వేక్షణ ఆధారంగా నగరాలకు శ్రేణీకరణ (రేంకింగ్) ఇచ్చేటప్పుడు – మీ పట్టణంలో ఒక లక్ష కన్నా తక్కువ జనాభా గనుక ఉంటే ప్రాంతీయ శ్రేణీకరణ లో అత్యధిక స్థానాన్ని సంపాదించవచ్చు. అలా జారగాలనేది మీ కల కావాలి. మీ ప్రయత్నం ఆ దిశగా సాగాలి. జనవరి 4 నుండీ మార్చి 10, 2018 మధ్య జరిగే పరిశుభ్రతా సర్వేలో, స్వచ్ఛత కు సంబంధించిన ఈ ఆరోగ్యకరమైన పోటీలో మీరు వెనుకబడకుండా ప్రతి నగరంలోనూ కూడా ఇది ఒక ప్రజా చర్చా విషయం కావాలి. మా నగరం – మా ప్రయత్నం, మా అభివృధ్ధి – దేశానికి ప్రగతి అనే నినాదాలు మీ అందరి కలా కావాలి. రండి, ఇదే సంకల్పంతో మనందరమూ మరోసారి పూజ్య బాపూజీ ని స్మరించుకుంటూ స్వచ్ఛ భారతదేశం అనే సంకల్పాన్ని సంపూర్ణం చెయ్యడానికి ప్రయత్నాలు చేద్దాం.
ప్రియమైన నా దేశ వాసులారా, కొన్ని విషయాలు చూడటానికి చాలా చిన్నగా కనిపిస్తాయి కానీ సమాజపరంగా మన గుర్తింపు పై చాలావరకూ ప్రభావాన్ని చూపిస్తాయి. ఇటువంటి ఒక విషయాన్ని ఇవాళ ‘మనసులో మాట’ ద్వారా మీతో నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఎవరైనా ఒక ముస్లిమ్ మహిళ హజ్ యాత్రను చెయ్యాలనుకుంటే, ఆమె ఒక ‘మెహ్ రమ్’ లేదా ఒక సంరక్షకుడు లేకుండా ఆమె ఆ యాత్రను చెయ్యడానికి వీలు లేదు.
మొదటి సారి ఈ సంగతి విన్నప్పుడు నేను ఆశ్చర్యపోయాను. అలా కూడా ఉంటుందా ? ఇటువంటి నియమాన్ని ఎవరు రూపొందించారు ? ఎందుకీ వివక్ష ? అని నేను ఈ విషయం లోతుల్లోకి వెళ్ళినప్పుడు- స్వాతంత్రం వచ్చి డెభ్భై ఏళ్ళు అవుతున్నా ఇటువంటి నిషేధాన్ని విధించింది మనమే అని తెలిసి ఆందోళన పడ్డాను. దశాబ్దాలుగా ముస్లిమ్ మహిళలకు అన్యాయం జరిగుతోంది కానీ ఏ చర్చలూ జరగట్లేదు. ఎన్నో మహమ్మదీయ దేశాలలో ఈ నియమం లేదు కూడా. కానీ భారతదేశం లోని ముస్లిమ్ మహిళలకు ఈ అధికారం లేదు. మన ప్రభుత్వం ఈ విషయంపై దృష్టిని పెట్టడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది.
మన అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అవసరమైన చర్యలను తీసుకుంది. డెభ్భై ఏళ్ల నుండీ వస్తున్న సాంప్రదాయాన్ని మారుస్తూ ఈ నిషేధాన్ని ఎత్తివేసింది. ఇవాళ ముస్లిమ్ మహిళలు ఏ సంరక్షకుడి తోడూ లేకుండా హజ్ యాత్ర చేయవచ్చు. ఒంటరిగా హజ్ యాత్ర చేయాలనుకుని ధరఖాస్తు చేసుకున్న మహిళలందరికీ ప్రయాణించడానికి అనుమతిని ఇవ్వవలసిందిగా అల్పసంఖ్యాక వర్గాల వ్యవహారాల మంత్రిత్వ శాఖ కు నేను సూచించాను. సాధారణంగా హజ్ యాత్రికులకు లాటరీ పద్ధతి ద్వారా అనుమతిని ఇస్తారు. కానీ ఒంటరి మహిళలను ఈ లాటరీ పద్ధతి నుండి దూరంగా ఉంచాలన్నది నా అభిప్రాయం. ఒక ప్రత్యేక పర్గంగా వారికి అవకాశాన్ని ఇవ్వాలి. భారతదేశ అభివృద్ధి ప్రయాణం మన నారీ శక్తి ద్వారా, వారి ప్రతిభ కారణంగా ముందుకు నడిచిందని, వారి ప్రతిభపై ఆధారపడి ఇంకా ముందుకు నడుస్తుందని నా ధృఢ విశ్వాసం, నా నమ్మకం. మన మహిళలకూ కూడా పురుషులతో సమానంగా అధికారం లభించాలి. ప్రగతి పథంలో వారు కూడా పురుషులతో సమానంగా నడిచేందుకు వారికి సమానావకాశాలు కల్పించాలనేది మన నిరంతర ప్రయత్నం కావాలి.
ప్రియమైన నా దేశ వాసులారా, జనవరి 26 వ తేదీ మనకు ఒక చరిత్రాత్మకమైన పండుగ. కానీ ఈసారి 2018లో జనవరి 26 వ తేదీ విశేషంగా గుర్తుండిపోతుంది. ఈసారి గణతంత్ర దినోత్సవానికి మొత్తం పది ఆసియాన్ (ASEAN) సభ్యత్వ దేశాల నేతలూ ముఖ్య అతిథులుగా భారతదేశం వస్తున్నారు.
ఈసారి గణతంత్ర దినోత్సవానికి ఒక్కరు కాదు పది మంది ముఖ్య అతిథులు ఉంటారు. ఇలా భారతదేశ చరిత్రలో మునుపు ఎన్నడు జరగలేదు. భారతదేశానికి, ఆసియాన్ దేశాలకు 2017 చాలా ముఖ్యమైందిగా నిలిచింది. ఆసియాన్ దేశాలు 2017 లో తమ 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటే, 2017 లో ఆసియాన్ దేశాలతో భారతదేశం తమ పాతికేళ్ల భాగస్వామ్యాన్ని పూర్తిచేసుకొంది. జనవరి 26 కి ఈ పది ఆసియాన్ దేశాల మహా నేతలు ఒక చోటులో మన దేశంలో ఏకమవడం మన భారతీయులందరికీ గర్వించదగిన విషయం.
ప్రియమైన నా దేశ వాసులారా, ఇది పండుగల కాలం. ఒక రకంగా మనది పండుగల దేశం. ఏదో ఒక పండుగా లేకుండా ఉండే రోజులు మనకు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడే మనందరమూ క్రిస్మస్ జరుపుకొన్నాం. కొత్త సంవత్సరం రాబోతోంది. రాబోయే కొత్త సంవత్సరం మీ అందరికీ బోలెడు సుఖసంతోషాలను, ఆనందాన్ని, సమృద్ధిని తేవాలని కోరుకొంటున్నాను. మనందరం కొత్త ఉత్సాహంతో, కొత్త ఆశతో, కొత్త సంకల్పంతో ముందుకు సాగుదాం. జనవరి లో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశిస్తాడు. ఇదే నెలలో మకర సంక్రాంతి జరుపుకుంటారు. ఇది ప్రకృతితో ముడిపడిన పండుగ. మన ప్రతి పండుగ ప్రకృతితో ముడిపడిందే కానీ విభిన్నమైన మన సంస్కృతిలో ప్రకృతి తాలూకూ ఈ అద్భుత ఘటనను రకరకాలుగా విడివిడిగా జరుపుకునే ఆచారం ఉంది. పంజాబ్ లేదా ఉత్తర భారత దేశంలో ఈ పండుగను లోహ్ డీ రూపంలో ఆనందిస్తే, యు.పి., బిహార్ లో ఖిచ్డీ లేదా తిల్ సంక్రాంతి గా స్వాగతిస్తారు. రాజస్థాన్ లో సంక్రాంత్ అంటారు, అసమ్ లో మాఘ బిహు అంటే, తమిళ నాడు లో పొంగల్ అంటారు. ఈ పండుగలన్నీ వేటికవే ప్రత్యేకమైనవి. దేని ప్రాముఖ్యం దానికే ఉంది. ఈ పండుగలన్నీ 13వ తేదీ నుండి 17వ తేదీల మధ్య జరుపుకొంటాం. ఈ పండుగల పేర్లన్నీ వేరు వేరు కానీ వీటి మూల తత్త్వం ఒకటే. ప్రకృతి, వ్యవసాయాల తో ముడిపడి ఉన్నాయి.
దేశ ప్రజలందరికీ ఈ పండుగల సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు. మరో సారి మీ అందరికీ 2018 నూతన సంవత్సరానికి ఎన్నో శుభాకాంక్షలు.
ప్రియమైన దేశ వాసులారా, మీకు అనేకానేక ధన్యవాదాలు. 2018 లో మరోసారి మాట్లాడుకుందాం.
మీకు ఇవే నా ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! కొద్ది కాలం క్రితం నాకు కర్ణాటక కు చెందిన బాల మిత్రులతో పరోక్షంగా సంభాషించే అవకశం లభించింది. టైమ్స్ గ్రూప్ వారి “విజయ కర్ణాటక” అనే వార్తాపత్రిక వారు బాలల దినోత్సవం సందర్భంగా ఒక అభిప్రాయ సేకరణ జరిపారు. అందులో భాగంగా ప్రధానమంత్రికి ఉత్తరం రాయవలసిందిగా వారు బాలలను కోరారు. వాటిలో ఎన్నిక చేసిన కొన్ని ఉత్తరాలను వారు ప్రచురించారు. ఆ ఉత్తరాలు నాకు బాగా నచ్చాయి. ఈ చిన్న చిన్న పిల్లలకు కూడా మన దేశ సమస్యల పట్ల, దేశంలో జరుగుతున్న చర్చల పట్ల అవగాహన ఉంది. ఆ పిల్లలలు చాలా విషయాల గురించి ప్రస్తావించారు. ఉత్తర కర్నాటకు చెందిన కీర్తీ హెగ్డే, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీ పథకాలను మెచ్చుకుంటూ, మన శిక్షా వ్యవస్థలో మార్పులను తేవాల్సిన అవసరం మనకి ఉందని సలహా ఇచ్చింది. ఈ కాలంలో పిల్లలు క్లాస్ రూమ్ రీడింగ్ పట్ల అయిష్టత కనబరుస్తున్నారనీ, వారికి ప్రకృతి గురించి తెలుసుకోవడమే ఇష్టంగా ఉందనీ తెలిపింది ఆమె. మనం మన పిల్లలకు ప్రకృతి గురించిన పరిజ్ఞానాన్ని అందిస్తే, బహుశా ముందు ముందు కాలంలో పర్యావరణాన్ని రక్షించేందుకు వారికా సమాచారం ఉపయోగపడే అవకాశం ఉంది.
లక్ష్మేశ్వర్ నుండి రీడా నాడాఫ్ అనే బాలిక తాను ఒక సైనికుడి కూతురునైనందుకు గర్విస్తున్నానని రాసింది. మన వీర సైనికులను తల్చుకుని గర్వపడని భారతీయుడు ఉండదు కదా! అందులోనూ ఒక సైనికుడి కుమార్తెగా మీరు గర్వపడడం సర్వసాధారణం. కల్బుర్జీ నుండి ఇర్ఫాన్ బేగమ్ ఏం రాసారంటే తన పాఠశాల తమ గ్రామం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉందనీ, అందువల్ల పాఠశాలకు చాలా త్వరగా బయలుదేరాల్సి వస్తోందనీ, తిరిగి ఇంటికి రావడానికి కూడా రాత్రి బాగా ఆలస్యం అవుతోందట. దానితో తన స్నేహితురాళ్లతో ఎక్కువ సమయాన్ని గడపలేకపోతున్నానని బాధని ఆమె వ్యక్తపరిచింది. కాబట్టి తమ గ్రామానికి దగ్గరలో పాఠశాల ఉంటే బావుంటుందనే సలహాను ఆమె ఇచ్చారు.
కానీ దేశ ప్రజలారా, నా వరకూ ఈ ఉత్తరాలన్నీ చదివే అవకాశాన్ని ఆ వార్తా పత్రికవారు నాకు కలిగించినందుకు ఆనందం కలిగింది. నాకు ఇదొక మంచి అనుభవం.
నా ప్రియమైన దేశ ప్రజలారా, ఇవాళ నవంబరు 26. ఇవాళ మన రాజ్యాంగ దినోత్సవం. 1949లో ఇవాళ్టి రోజున భారత పార్లమెంట్ భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. 1950, జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చిన కారణంగా మనం ఆ రోజుని గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటాము. భారత రాజ్యాంగం మన ప్రజాస్వామ్యానికి ఆత్మ. ఇవాళ మన రాజ్యాంగ సభలోని సభ్యులను స్మరించుకోవాల్సిన రోజు . వారు మన భారత రాజ్యాంగాన్ని తయారు చెయ్యడానికి దాదాపు మూడేళ్ళ పాటు పరిశ్రమించారు. దేశానికి జీవితాలను అంకితం చేసినవారి ఆలోచనా విధానం ఎలా ఉంటుందో ఆ చర్చను చదివితే తెలుస్తుంది. గర్వంగా ఉంటుంది. ఎన్నో వైవిధ్యాలతో నిండిన మన దేశ రాజ్యాంగాన్ని నిర్మించడానికి వారెంత కఠోరమైన పరిశ్రమ చేసారో మోరు ఊహించగలరా? దేశం బానిసత్వపు సంకెళ్ల నుండి విముక్తి చెందుతున్న ఆ సమయంలో ఎంతటి వివేకం, అవగాహన, దూరదృష్టి తో వారు ఊహించి ఉంటారో కదా. ఈ రాజ్యాంగం విషయంలో రాజ్యాంగ నిర్మాతలు, వారు చేసిన ఆలోచనలకు అనుగుణంగా నవ భారతాన్ని నిర్మించాల్సిన బాధ్యత మనందరిదీ. మన రాజ్యాంగం చాలా విస్తృతమైనది. జీవితంలో ఏ రంగమూ , ప్రకృతిలో ఏ విషయమూ మన రాజ్యాంగం స్పృశించనిది లేదు. అందరికీ సమానత్వం, అందరి పట్లా సమభావనే మన రాజ్యాంగ పరిచయానికి గుర్తింపు. బీదవారైనా, దళితులైనా, వంచితులైనా, వెనుకబడినవారైనా, ఆదివాసులైనా, మహిళలైనా, ప్రతి పౌరుడి ప్రాధమిక హక్కులను కాపాడటమే కాకుండా, వారి శ్రేయస్సుని మన రాజ్యాంగం అభిలషిస్తుంది. మనం మన రాజ్యాంగాన్ని తూచా తప్పకుండా పాటించడం మన కర్తవ్యం. పౌరుడైనా, పాలకుడైనా రాజ్యాంగ భావాలకు అనుగుణంగా ముందుకి నడవాలి. ఎవరికీ ఎటువంటి నష్టమూ జరగకూడదు. ఇదే మన రాజ్యాంగ సందేశం. ఇవాళ మన రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గుర్తుకు రావడం సాధారణమే. ఈ రాజ్యాంగ సభలో ముఖ్యమైన విషయాలపై పదిహేడు సమితిలు ఏర్పడ్డాయి. వీటిలో అన్నింటికన్నా ముఖ్యమైనది ముసాయిదా సమితి. డా. బాబా సాహెబ్ అంబేద్కర్ ఆ ముసాయిదా సమితికి అధ్యక్యులు. ఒక ముఖ్యమైన అతి పెద్ద పాత్రను వారు పోషించారు. మనం ఇవాళ ఏ భారత రాజ్యాంగాన్ని చూసుకుని గర్వపడుతున్నామో , ఆ భారత రాజ్యాంగాన్ని నిర్మించడంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి సమర్థవంతమైన నేతృత్వం, చెరిగిపోని ముద్ర కనిపిస్తాయి. సమాజంలో ప్రతి వర్గానికీ మేలు జరగేలా వారు రాజ్యాంగాన్ని తయారుచేసారు. డిసెంబర్ ఆరవ తేదీన వారి నిర్యాణం సందర్భంగా మనం ఎప్పటిలాగే వారిని స్మరించుకుంటూ నమస్కరిద్దాం. దేశాన్ని సంపన్నంగా, శక్తివంతంగా తయారుచేయడంలో డా. బాబా సాహెబ్ అంబేద్కర్ గారి కృషి అవిస్మరణీయం. డిసెంబర్ 15 సర్దార్ వల్లభాయ్ పటేళ్ గారి వర్థంతి. రైతు బిడ్డ నుండీ దేశపు ఉక్కు మనిషిగా మారిన సర్దార్ పటేల్ గారు దేశాన్ని ఏకత్రాటిపై నిలపడానికి అసాధారణమైన ప్రతిభ చూపారు. సర్దార్ పటేల్ కూడా రాజ్యాంగ సభలో సభ్యులుగా ఉన్నారు. వారు ప్రాధమిక హక్కులు, మైనారిటీలు(అల్ప సంఖ్యాక వర్గాలు), ఇంకా ఆదివాసీలపై ఏర్పరిచిన సలహా సంఘానికి కూడా అధ్యకులుగా ఉన్నారు.
నవంబరు 26 మన రాజ్యాంగ దినోత్సవం. కానీ తొమ్మిదేళ్ళ క్రితం ఆదే రోజున తీవ్రవాదులు బొంబాయిపై దాడి జరిపిన సంఘటనని ఎలా మర్చిపోగలం? ఆనాడు ప్రాణాలు కోల్పోయిన వీర పౌరులను, రక్షక భటులను, భద్రతా సిబ్బందినీ స్మరించుకుని, దేశం వారందరికీ నమస్కరిస్తోంది. వారి బలిదానాన్ని దేశం ఎప్పటికీ మర్చిపోదు. తీవ్రవాదం ఇవాళ ప్రపంచంలోని ప్రతి ప్రాంతంలోనూ నిత్యం జరిగే దుర్ఘటనల కారణంగా భయంకర రూపాన్ని దాల్చింది. తీవ్రవాదం కారణంగా మనం గత నలభై ఏళ్ళుగా దేశంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాం. వేల కొద్దీ నిర్దోషులు తమ ప్రాణాలను కోల్పోయారు. కానీ కొన్నేళ్ల క్రితం భారత దేశం ప్రపంచంలో తీవ్రవాదాన్ని గురించి , తీవ్రవాదం తాలూకూ పెను ప్రమాదాలను గురించి చర్చించినప్పుడు ప్రపంచంలో చాలామంది దీనిని గంభీరంగా తీసుకోలేదు. కానీ ఇవాళ తీవ్రవాదం వారి తలుపులను తడుతున్నప్పుడు ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వమూ, మానవతావాదాన్ని నమ్ముతున్నవారూ, ప్రజాస్వామ్యంపై నమ్మకమున్న ప్రభుత్వాలన్నీ కూడా తీవ్రవాదాన్ని ఒక పెద్ద సవాలుగా భావిస్తున్నాయి. తీవ్రవాదం ప్రపంచ మానవత్వాన్ని ఎదిరించి, దానికి సవాలుగా మారింది. మానవ శక్తులను నష్టపరచడానికి తీవ్రవాదం నడుం కట్టింది. దానితో కేవలం భారతదేశమే కాకుండా ప్రపంచంలోని అన్ని మానవతావాద శక్తులూ కలిసికట్టుగా నిలబడి తీవ్రవాదాన్ని ఓడించి తీరాలి. బుధ్ధభగవానుడు, మహావీరుడు, గురునానక్, మహాత్మా గాంధీ మొదలైన వారు అహింస, ప్రేమల సందేశాలను ప్రపంచానికి అందించిన భూమి మనది. తీవ్రవాదం, ఉగ్రవాదమూ మన సామాజిక వ్యవస్థని బలహీనపరిచి, దానిని చిన్నాభిన్నం చేయాలని విఫల ప్రయత్నాలు చేస్తాయి. అందువల్ల మానవతావాద శక్తులన్నీ అప్రమత్తంగా ఉండాల్సిన సమయం ఇది.
నా ప్రియమైన దేశప్రజలారా, డిసెంబర్ 4వ తేదీన మనందరమూ నావికా దళ దినోత్సవం జరుపుకుంటాము. భారతీయ నావికా దళం మన సముద్రతీరాలను రక్షిస్తూ, మనకు భద్రతను అందిస్తుంది. నేను మన నావికా దళానికి సంభందించిన వారందరినీ అభినందిస్తున్నాను. సింధూ నదైనా, గంగ, యమునా, సరస్వతీ నదులు ఏవైనా మన నాగరికత అబివృధ్ధి చెందినది నదీతీరాలలోనే. మన నదులూ, మన సముద్రతీరాలూ మన ఆర్థిక వ్యవస్థకూ, వ్యూహాత్మకతకూ ఎంతో ముఖ్యమైనవి. యావత్ ప్రపంచానికీ మనకీ మధ్యన ప్రవేశ ద్వారాలు. ఈ దేశానికీ, ఈ భూమికీ మహా సముద్రాలతో విడదీయలేని బంధం ఉంది. చరిత్రలోకి చూస్తే ఎనిమిది,తొమ్మిది వందల సంవత్సరాల క్రితం, అప్పటి నావికా దళాలన్నింటిలోకీ చోళుల నావికా దళం అత్యంత శక్తివంతమైన నావికా దళంగా గుర్తింపు పొందింది. చోళ సామ్రాజ్యపు విస్తారణలో, చోళులను సమకాలీన రాజ్యాలలో కెల్లా అగ్ర ఆర్థిక శక్తిగా నిలబెట్టడంలో చోళనావికా దళం పెద్ద పాత్రే పోషించింది. చోళుల నావికా దళాల సాహస యాత్రల ఉదాహరణలు సంగమ సాహిత్యంలో ఇవాళ్టికీ అందుబాటులో ఉన్నాయి. ప్రపంచంలోని చాలావరకూ నావికా దళాలు, చాలా ఏళ్ల తరువాతే యుధ్ధ నౌకల పై మహిళలను అనుమతించారని చాలకొద్దిమందికే తెలిసి ఉంటుంది. కానీ చోళ నావికా దళంలో ఎనిమిది, తొమ్మిది వందల ఏళ్ల క్రితమే పెద్ద సంఖ్యలో మహిళలు ముఖ్య పాత్రలను పోషించారు. మహిళలు యుధ్ధాల్లో కూడా పాల్గొనేవారు. చోళ పాలకుల వద్ద నౌకా నిర్మాణానికి సంబంధించిన విజ్ఞానం సమృధ్ధిగా ఉండేది. నౌకా దళాన్ని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, చత్రపతి శివాజీ మహారాజునీ ,వారి నావికా దళ సామర్ధ్యాన్నీ ఎవరు మర్చిపోగలరు?! సముద్రానికి ముఖ్యమైన పాత్ర ఉన్న కొంకణ తీర ప్రాంతం మహారాజు శివాజీ గారి రాజ్యంలో భాగంగా ఉండేది. మహారాజు శివాజీ గారి ఆధీనంలోని సింధూ దుర్గ్, మురూడ్ జంజీరా, స్వర్ణ దుర్గ్ మొదలైన ఎన్నో కోటలు సముద్ర తీరాల్లోనో లేదా సముద్రంతో చుట్టుముట్టబడో ఉండేవి. ఈ కోటలన్నింటినీ భద్రతా బాధ్యతనూ మరాఠుల నౌకా దళం చేపట్టేది. మరాఠుల నౌకా దళం లో పెద్ద పెద్ద నౌకలూ, చిన్న చిన్న పడవలూ కలిసి ఉండేవి. వారి నావికా దళం ఎటువంటి శత్రువునైనా ఎదిరించడంలోనూ, వారి నుండి తప్పించుకోవడంలోనూ అత్యంత నైపుణ్యం కలిగి ఉండేవి. మరాఠుల నావికా దళ్లలను గురించి చెర్చించుకుంటున్నప్పుడు, కాన్హోజీ ఆంగ్రే ను గుర్తుచేసుకోకుండా ఉండలేము. వారు మరాఠుల నావికాదళాన్ని ఒక ఉన్నత స్థాయికి తీశుకువెళ్ళారు. ఎన్నో స్థానాల్లో ఆయన మరాఠా నావికదళాల స్థావరాలను ఏర్పరిచారు. గోవా లో విముక్తి పోరాటంలో, 1971 లోని భారత-పాకిస్థాన్ యుధ్ధం లో, స్వతంత్రం వచ్చిన తరువాత ఎన్నో సందర్భాల్లో మన నావికాదళం తన పరాక్రమాన్ని చూపెట్టింది. నావికా దళం గురించి చెప్తున్నప్పుడు మనకు యుధ్ధాలు మాత్రమే గుర్తుకు వస్తాయి. కానీ భారతదేశ నావికా దళం మానవతా కార్యక్రమాల్లో కూడా ఎంతో ముండు ఉంటుంది. ఈ ఏడాది జూన్ నెలలో బంగ్లాదేశ, మయన్మార్ లో మోరా తుఫాన్ వచ్చినప్పుడు మన నావికా దళపు నౌక ఐ.ఎన్.ఎస్.సుమిత్ర తక్షణం రక్షణను అందించింది. ఎందరో మత్స్యకారులను నీటిలో నుండి కాపాడి, వారిని బాంగ్లాదేశ్ కు అప్పగించారు. ఈ సంవత్సరం మే,జూన్ నెలలలో శ్రీలంక లో భయంకరమైన వరదలు వచ్చినప్పుడు మన నావికా దళంలోని మూడు నౌకలు తక్షణం అక్కడికి చేరుకుని, అక్కడి ప్రభుత్వానికీ, ప్రజలకూ తమ సహాయాన్ని అందించాయి. బంగ్లాదేశ్ లో సెప్టెంబర్ నెలలో రోహింగ్యాల విషయంలో మన నావ్బికా దళ నౌక ఐ.ఎన్.ఎస్ . ఘడియాల్
మానవతావాద సహాయాన్ని అందించింది. జూన్ నెలలో పపువా న్యూ గునియా ప్రభుత్వం మనకు ఎస్.ఓ.ఎస్ సందేశాన్ని అందించినప్పుడు, వారి చేపలు పట్టే పడవల మత్స్యకారులను రక్షించడంలో మన నావికా దళం వారికి సహాయాన్ని అందించింది. నవంబర్ 21న పశ్చిమ గల్ఫ్ లో ఒక వ్యాపార నౌక లో జరిగిన సముద్రపు దోపిడీ సంఘటనలో కూడా, మన నౌకాదళపు నౌక ఐ.ఎన్.ఎస్.త్రిఖండ్ వారి సహాయార్థం వెళ్ళింది. ఫిజీ వరకూ ఆరోగ్య సేవలను అందించాల్సి వచ్చినా, తక్షణ ఉపశమనం అందించాలన్నా, ఆపద సమయంలో పొరుగు దేశానికి సహాయాన్ని అందించాలన్నా కూడా మన నావికా దళం ఎప్పుడూ గౌరవప్రదమైన పనులు చేస్తూనే ఉంది. మన భారతీయులు మన భద్రతా దళాలను ఎప్పుడూ గౌరవంతోనూ, ఆదరణతోనూ చూస్తాము. నావికా దళమైనా, సైన్యమైనా, వైమానిక దళమైనా సరే మన సైనికుల సాహసానికీ, వీరత్వానికీ, శౌర్యానికీ, పరాక్రమానికీ, బలిదానాలకీ ప్రతి భారతీయుడూ వారికి వందనాలు సమస్పిస్తాడు. 125 కోట్ల దేశ ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడం కోసం, మన వీర సైనికులు తమ యౌవనాన్నీ, జీవితాలను దేశం కోసం అర్పిస్తారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ ఏడవ తేదీన సాయుధ సైనికులు “ఫ్లాగ్ డే” ను జరుపుకుంటారు. ఇది మన దేశపు సాయుధ సైనికుల పట్ల గర్వాన్నీ, గౌరవాదరణలనూ ప్రకటించే రోజు. ఈసారి రక్షా మంత్రిత్వ శాఖ డిసెంబర్ ఒకటి నుండి ఏడవ తేదీ వరకూ ఒక ప్రచారాన్ని జరపాలని నిర్ణయించుకున్నారు. దేశ పౌరుల వద్దకు వెళ్ళి సాయుధ సైనికుల గురించిన సమాచారాన్ని ఇవ్వాలనీ, ప్రజలను అప్రమత్తులను చెయ్యాలని, ఆ వారం మొత్తం పిల్లా, పెద్దా, ప్రతి ఒక్కరూ జాతీయ పతాకాన్ని ధరించాలని వారు నిర్ణయించారు. దేశంలో సైన్యం పట్ల ఒక గౌరవభావ ఉద్యమం ఏర్పడాలి. ఈ సందర్భంగా మనం సాయుధ సైనికుల పతాకాలను పంచుకోవచ్చు. మన చుట్టుపక్కల తెలిసినవారిలో సాయుధ సైనికులతో సంబంధం ఉన్నవారు వారి అనుభవాలను, వారి ధైర్యసాహసాలనూ, వాటితో ముడిపడి ఉన్న వీడియోలనూ, చిత్రాలనూ #armed forces flag day పై పోస్ట్ చేయవచ్చు. పాఠశాలలోనూ, కళాశాలలోనూ సైనికులను ఆహ్వానించి వారి వద్ద నుండి సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని అడిగి తెలుసుకోవచ్చు. సైన్యానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు మన యువతరానికిదొక మంచి అవకాశం ఇది. మన సాయుధ దళాలలోని సైనికులందరి సంక్షేమం కోసం నిధులను సమకూర్చడానికి ఇదొక సదవకాశం. ఈ మొత్తం సైనిక సంక్షేమ బోర్డ్ ద్వారా యుధ్ధంలో అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయానికీ, గాయపడిన సైనికుల సహాయానికీ వారి పునరావాసానికీ ఖర్చు చేయబడుతుంది. ఆర్థిక సహాయం చెయ్యడానికి వివిధ చెల్లింపు మార్గాల వివరాలను ksb.gov.in నుండి పొందవచ్చు. మీరు కేష్ లెస్ పేమెంట్ కూడా చేయవచ్చు. ఈ సందర్భంగా మనందరమూ కూడా మన సాయుధ దళాల మనోబలాన్ని పెంచే పని చేద్దాం. రండి..మనం కూడా వారికి మేలు జరిగే పనులు చేద్దాం.
నా ప్రియమైన దేశప్రజలారా, డిసెంబర్ ఐదవ తేదీ world soil day. ఈ సందర్భంగా నేను నా రైతు సోదర,సోదరీమణులతో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. పృధ్విలో అత్యంత ముఖ్యమైన భాగం మట్టి . మనం తినే ప్రతీ పదార్థమూ ఈ మట్టితో జతపడి ఉంటుంది. ఒకరకంగా మొత్తం food chain అంతా మట్టితో ముడిపడి ఉంది. ప్రపంచంలో ఎక్కడా కూడా సారవంతమైన మట్టి లేకపోతే ఏమై ఉండేదో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. మట్టీ ఉండదు, చెట్లూ చేమలూ పెరగవు. మానవ జీవితం ఎక్కడ సాధ్యపడుతుంది? జీవ జంతువులు జీవించడం ఎలా సాధ్యపడుతుంది? చాలా ముందుగానే మన సంస్కృతిలో ఈ విషయమై చర్చ జరిగింది. ఇదే కారణం వల్ల మనం మట్టి ప్రాముఖ్యత పట్ల ప్రాచీన కాలం నుండీ అప్రమత్తంగా ఉన్నాం. మన సంస్కృతిలో ఒక వైపు పంటల పట్ల, మట్టి పట్ల ప్రజల్లో భక్తి భావమూ, ఋణ భావమూ కూడా ఉండేలా సహజ ప్రయత్నాలు జరిగాయి. మరో వైపు ఈ మట్టికి పోషణ అందే విధంగా కొన్ని వైజ్ఞానిక పధ్ధతులు మన జీవితాలలో భాగాలుగా మారాయి.
మన మట్టి పట్ల భక్తిభావం, వైజ్ఞానికంగా మట్టిని రక్షించడం, సంరక్షించడం రెండూ కూడా ఈ దేశపు రైతుల జీవితాలలో ముఖ్యమైనవిగా ఉన్నాయి. మన దేశంలో రైతులు సాంప్రదాయంతో ముడిపడి ఉంటూనే, ఆధునిక విజ్ఞానం పట్ల ఆసక్తి చూపడం, ప్రయత్నం చెయ్యడం, సంకల్పించడం మనందరం గర్వించదగ్గ విషయం. హిమాచల్ ప్రదేశ్ లోని హమీర్ పూర్ జిల్లాలోని, టోహూ గ్రామంలో, భోరంజ్ బ్లాక్ కు చెందిన రైతుల గురించి నేను విన్నాను. ఇదివరలో అక్కడి రైతులు అసమతుల్య పధ్ధతిలో రసాయనిక ఎరువులను ఉపయోగించిన కారణంగా అక్కడి నేల పూర్తిగా పాడయిపోయింది. దిగుబడి తగ్గిపోయింది. దాని వల్ల ఆదాయమూ తగ్గిపోయింది. ఆ మట్టి ఉత్పాదక శక్తి కూడా నెమ్మది నెమ్మదిగా తగ్గిపోయింది. గ్రామంలోని కొందరు రైతుల అప్రమత్తతతో విషమిస్తున్న పరిస్థితిని గమనించి సకాలంలో తమ మట్టికి పరీక్షలు చేయించి, ఏ రకమైన ఎరువులు, సూక్ష్మ పోషకాలు, సేంద్రీయ ఎరువులు వాడమని చెప్పారో, ఆ సలహాను పాటించారు. ఆ తర్వాత పరిణామాలను విని మీరు ఆశ్చర్యపోతారు. soil health వారి ద్వారా రైతులకు లభించిన సమచారం, దిశా నిర్దేశం వల్లా 2016-17 లో రబీ పంటలో వారి ఉత్పాదనల్లో ఎకరానికి మూడు నుండీ నాలుగు రెట్ల వృధ్ధి కనబడింది. ఆదాయంలో కూడా ఎకరానికి నాలుగు నుండీ ఆరువేల రూపాయిల దాకా సంపాదన పెరిగింది. దానితో పాటుగా మట్టి నాణ్యతలో కూడా మెరుగుపడింది. ఎరువుల వాడకం తగ్గడం వల్ల ఆర్థిక లాభం కూడా చేకూరింది. మన రైతు సోదరులు soil health card పై ఇచ్చిన సలహాలను పాటించడానికి ముందుకు రావడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. అందువల్ల లభిస్తున్న శుభ పరిణామాల వల్ల వారి ఉత్సాహం కూడా రెట్టింపౌతోంది. పంట గురించి ఆలోచించాలంటే ముందర భూమాతను జాగ్రత్తగా కాపాడుకోవాలి. భూమాతను మనం కాపాడుకుంటే, భూమాత మనందరినీ కాపాడుతుంది అని ఇప్పుడు మన రైతులకు కూడా తెలిసివచ్చింది.
దేశమంతటా మన రైతుసోదరులందరూ తమ మట్టిని మరింత బాగా అర్థం చేసుకుని, దానికి అనుగుణంగా పంటలను సాగుచెయ్యడం కోసమై పదికోట్లకు పైగా soil health card లు తీసుకున్నారు. మనం భూమాతని పూజిస్తాము. కానీ ఎరువులతో భూమాత ఆరోగ్యం ఎంతగా పాడవుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? అవసరమైనదాని కంటే ఎక్కువ ఎరువుల వాడకం వల్ల భూమాతకి గంభీరమైన నష్టం వాటిల్లుతుందని అన్నిరకాల వైజ్ఞానిక పరీక్షల ద్వారా ఇది నిరూపించబడింది. రైతు భూమాత బిడ్డ. అతడు భూమాతని అనారోగ్యంగా ఎలా చూడగలడు? ఈ తల్లీ బిడ్డల సంబంధాన్ని మరోసారి పునరుజ్జీవన చెయ్యాల్సిన సమయం ఆసన్నమైంది. మన రైతులు, మన భూమిపుత్రులు, మన భూమాత సంతానం 2022 నాటికి, స్వాతంత్రం వచ్చి 75 ఏళ్ళు పూర్తయ్యేనాటికి, ఇవాళ వారంతా పొలాల్లో ఎంతెంత ఎరువులను వాడుతున్నారో, వాటిలో ఏభై శాతమే వాడకం ఆపేస్తామని సంకల్పించగలరా? ఒక్కసారి మన భూమి పుత్రులు, నా రైతు సోదరులూ ఇటువంటి సంకల్పాన్ని కనుక చేసుకుంటే భూమాత ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉత్పాదన పెరుగుతుంది. రైతు జీవితంలో మార్పు రావడం మొదలౌతుంది. గ్లోబల్ వార్మింగ్, వాతావరణంలో మార్పులు, మనందరమూ అనుభవిస్తున్నాం. ఒకప్పుడు దీపావళికి ముందరే చలికాలం వచ్చేసేది. ఇప్పుడు డిసెంబర్ వచ్చేస్తున్నా చలి నెమ్మదిగా నెమ్మదిగానే అడుగులు వేస్తోంది. కానీ చలికాలం మొదలవగానే మనందరికీ రగ్గుల్లోనుండి బయటకు రావాలనిపించదు. మనందరికీ ఇది అనుభవమే. కానీ ఇలాంటి వాతావరణంలో కూడా సదా అప్రమత్తంగా ఉండేవారు ఎలాంటి పరిణామాలను తేగలరో, అలాంటి ఉదాహరణలు మనకు ఎంతో ప్రేరణను అందిస్తాయి. మీక్కూడా వింటే ఆశ్చర్యం కలుగుతుంది – మధ్యప్రదేశ్ కు చెందిన ఎనిమిదేళ్ల తుషార్ అనే దివ్యాంగ బాలుడు, బహిరంగ మలమూత్ర విసర్జన నుండి తన గ్రామాన్ని విముక్తి చెయ్యడానికి కంకణం కట్టుకున్నాడు. అంతటి విస్తృతస్థాయిలోని పెద్ద పనిని ఇంత చిన్న పిల్లాడు చేపట్టడం ఆశ్చర్యకరం!! కానీ అతడి పట్టుదల, సంకల్పం ఆ పని కంటే ఎన్నో రెట్లు పెద్దవి, స్థూలమైనవి, శక్తివంతమైనవి. ఎనిమిదేళ్ల మాట్లాడలేని బాలుడు, ఒక వీల ని తన ఆయుధంగా చేసుకుని , పొద్దున్నే ఐదింటికి లేచి ఊళ్ళోని ఇంటింటికీ వెళ్ళి, ఈల వేసి ప్రజలని నిద్రలేపి, చేతి సైగలతో బహిరంగ మలమూత్ర విసర్జన చేయవద్దని చెప్పేవాడు. ప్రతి రోజూ 30,40 ఇళ్ళకు వెళ్ళి పరిశుభ్రత గురించి పాఠాన్ని చెప్పే ఈ పిల్లవాడి కారణంగా కుమ్హారీ గ్రామం బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి పొందింది. పరిశుభ్రతను పెంపొందించే దిశగా ఆ చిన్న పిల్లాడు ఎంతో ప్రేరణాత్మకమైన పని చేసాడు. పరిశుభ్రతను పాటించడానికి వయసుతో నిమిత్తం లేదు, హద్దులూ లేవు. పిల్లలైనా, పెద్దలైనా, మహిళలైనా, పురుషులైనా పరిశుభ్రత అందరికీ అవసరం. పరిశుభ్రత కోసం ప్రతి ఒక్కరూ ఎంతో కొంత చెయ్యడం అవసరం. మన దివ్యాంగ సోదర,సోదరీమణులు ధృఢనిశ్చయం కలిగినవారు. సమర్థవంతులు, సాహసికులు. ఏదైనా సంకల్పించగలరు. వారి నుండి ప్రతి క్షణం ఏదో ఒకటి నేర్చుకోవచ్చు. ఇవాళ వారు ప్రతి రంగంలోనూ రాణిస్తున్నారు. క్రీడారంగంలోనైనా, ఏదైనా సామాజిక సమస్యలలోనైనా మన దివ్యాంగ సోదరులు ఎవరికీ తీసిపోరు. మీకు గుర్తుండే ఉంటుంది, రియో ఒలెంపిక్స్ లో మన దివ్యాంగ క్రీడాకారులు, మెరుగైన ఆటను ప్రదర్శించి నాలుగు పతకాలను గెలిచారు. అంధుల T-20 ప్రపంచ కప్ లో చాంపియన్లుగా నిలిచారు. దేశవ్యాప్తంగా వివిధ రకాల పోటీలు జరుగుతూ ఉంటాయి. కొద్ది రోజుల క్రితం ఉదయ్ పూర్ లో 17వ జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలు జరిగాయి. దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల నుండి వచ్చిన మన యువ దివ్యాంగ సోదర ,సోదరీ మణులు ఆ పోటీలో పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. అందులో పాల్గొన్న ఒక దివ్యాంగ యువకుడు గుజరాత్ కి చెందిన 19ఏళ్ల జిగర్ టక్కర్. అతడి శరీరంలో ఎనభై శాతం కండకూడా లేదు. కానీ అతడి సాహసమూ, సంకల్పమూ, శ్రమ చూడండి.. శరీరంలో ఎనభై శాతం కండ లేకుండానే అతడు జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలలో పదకండు పతకాలు గెల్చుకున్నాడు. 70వ జాతీయ పారా స్విమ్మింగ్ పోటీలలో కూడా అతడు బంగారు పతకాన్ని గెలిచాడు. ఈ ప్రతిభ కారణంగానే అతడు భారత క్రీడా సమాఖ్య ద్వారా 20-20 పారాలింపిక్స్ కోసం ఎన్నుకోబడ్డాడు. 32 పారా ఈతగాళ్లలోంచి ఎంచబడిన ఇతడికి గుజరాత్ లో గాంధీ నగర్ లోని, సెంటర్ ఫర్ ఎక్సెలెంసెస్ లో శిక్షణ ఇవ్వబడుతుంది. జిగర్ టక్కర్ మనోబలానికి నేను ప్రణామం చేస్తూ, అతనికి నా అభినందనలు అందిస్తున్నాను. ఇవాళ దివ్యాంగులకు అవకాశాలు అందించడానికి, ప్రత్యేకమైన శ్రధ్ధ ఇవ్వబడుతోంది. దేశ లోని ప్రతి వ్యక్తీ స్వశక్తుడు కావాలన్నదే మా ప్రయత్నం. సంఘటిత సమాజం నిర్మితమవ్వాలి. సమ, మమ భావాలతో సమాజంలో సామరస్యత పెరగాలి. అందరూ కలిసికట్టుగా ముందుకి నడవాలి.
కొద్ది రోజుల తర్వాత ఈదే-మిలాదున్నబీ పండుగ జరుపుకుంటారు. ఈ రోజున పైగంబర్ హజరత్ మొహమ్మద్ సాహెబ్ జన్మించారు. దేశవాసులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటున్నాను. ఈ ఈద్ సమాజంలో శాంతి, సద్భావనలను పెంచడానికి మనందరికీ కొత్త ఉత్సాహాన్ని ఇస్తుందని, కొత్త శక్తిని ఇస్తుందని, కొత్త సంకల్పాలని చేసుకునే సామర్థ్యాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాను.
(ఫోన్ కాల్)
కాన్పూర్ నుండి నేను నీరజా సింహ్ ను మాట్లాడుతున్నాను. “నాదొక విన్నపం.. ఈ సంవత్సరం మొత్తం లో మీరు చెప్పిన మనసులో మాటలు అన్నింటిలోనూ పది ఉత్తమమైన మాటలని మీరు మా అందరితో మరోసారి పంచుకోవాల్సింది. ఆ మాటల పున:స్మరణ వల్ల, మా ఆందరికీ ఏదైనా నేర్చుకునే అవకాశం లభిస్తుంది.”
మీ మాట నిజమే. 2017 పూర్తవుతోంది. 2018 తలుపు తడుతోంది. కానీ మీరు చక్కని సూచన చేసారు. నాకు మీ మాటలకు మరింత జోడించి, మార్పు చేసే ఆలోచన కలిగింది. ’దు:ఖాన్ని మరవండి, సుఖాన్ని మర్చిపోకండి ’ అని మన గ్రామాలలో ఉండే గ్రామపెద్దలు, వయసుమళ్ళినవారు చెప్పినట్లు దు:ఖాన్ని మర్చిపోదాం. సుఖాన్ని మర్చిపోకండి. ఈ మాటలను ప్రచారం చెయ్యాలని నాకు అనిపిస్తోంది. మనం కూడా శుభాన్ని సంకల్పిస్తూ 2018 లోకి ప్రవేశిద్దాం. మన దగ్గర. బహుశా ప్రపంచమంతటా కూడా సంవత్సరానంతంలో పద్దులు రాస్తారు, ఆలోచనలు చేస్తారు, రాబోయే కొత్త సంవత్సరం కోసం ప్రణాళికలు తయారుచేస్తారని మనకు తెలుసు. మన దేశంలో కూడా మీడియాలో గడిచిన సంవత్సరం తాలూకూ ఆసక్తికరమైన సంఘటనలను మరోసారి గుర్తుకు తెచ్చే ప్రయత్నం జరుగుతుంది. దాంట్లో మంఛి-చెడులు రెండూ ఉంటాయి. కానీ 2018 లోకి మనం మంచి విషయాలను తలుచుకుంటూ ప్రవేశించాలని, మంచిని చేస్తూ ప్రవేశించాలనీ మీకు అనిపించడం లేదూ? మీ అందరికీ ఒక సూచనను చేస్తున్నాను, ఐదో, పదో మంచి విషయాలను; మీరు విన్నవైనా, చూసినవైనా, అనుభవించినవైనా, వాటి గురించి ఇంకొందరు తెలుసుకుంటే వారికి కూడా మంచి ఆలోచనలు వచ్చేలా మీరు పంచగలరా? మనం ఈ సంవత్సరం లో మన జీవితంలో గడిచిన ఐదు మంచి అనుభవాలను ప్రజలతో పంచుకోగలమా? అవి చిత్రాల ద్వారా కానీ, కథల ద్వారా కానీ, వీడియోల రూపంలో కానీ పంచుకోవలసిందని మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. 2018 ని మనం ఒక శుభ వాతావరణంలో స్వాగతించాలి. మంచి జ్ఞాపకాలతో స్వాగతిద్దాం. శుభమైన ఆలోచనతో, శుభకరమైన విషయాలను గుర్తుచేసుకుంటూ స్వాగతిద్దాం.
రండి, నరేంద్ర మోదీ యాప్ లో, మై గౌ లో లేదా సోషల్ మీడియా లో #positiveindia తో పాటుగా శుభకరమైన మాటలతో పంచుకోండి. ఇతరులకు ప్రేరణను అందించే విషయాలను పంచుకోండి. మంచి విషయాలను పంచుకుంటే, మంచి పనులు చెయ్యాలని మనసుకి తోస్తుంది. మంచి విషయాలు మంచిని చేసేందుకు శక్తిని ఇస్తాయి. శుభకరమైన ఆలోచనలు, శుభ సంకల్పానికి కారణమౌతాయి. శుభ సంకల్పం, శుభ పరిణామం కోసం ముందుకు తీసు కువెళ్తాయి.
రండి, ఈసారి #positiveindia కోసం ప్రయత్నిద్దాం. చూడండి, మనందరమూ కలిసి ఎంతో శక్తివంతమైన అనుకూల స్పందనలను ప్రేరేపిస్తూ, రాబోయే సంవత్సరానికి స్వాగతం పలికుదాం. ఈ సమిష్టి చోదక శక్తినీ, దాని ప్రభావాన్నీ మనందరమూ కలిసి చూద్దాం. రాబోయే మనసులో మాటలో నేను తప్పకుండా ఈ #positiveindia లో వచ్చిన విషయాలను దేశప్రజలందరికీ అందించే ప్రయత్నం చేస్తాను.
నా ప్రియమైన దేశప్రజలారా, వచ్చే నెల, రాబోయే మనసులో మాట తో మీ మధ్యకు వస్తాను. మరోసారి చాలా కబుర్లు చెప్పే అవకాశం లభిస్తుంది. అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! దీపావళి అయిన ఆరు రోజుల తర్వాత వచ్చే ఛాత్ పండుగ మన దేశంలో అత్యంత నియమ నిష్ఠలతో జరుపుకునే పండుగలలో ఒకటి. ఆ రోజున ఆహార వ్యవహారాలు, వేషభాషలు, మొదలైన అన్ని రకాల సాంప్రదాయపరమైన నియమాలను పాటిస్తారు. ప్రత్యేక పండుగ అయిన ఈ ఛాత్ పూజ ప్రకృతి తోనూ, ప్రకృతి ఆరాధనతోనూ పూర్తిగా జతకూడింది ఈ పండుగ. సూర్యుడినీ, నీటినీ ఈ పూజా సమయంలో పూజిస్తారు.కందమూలాలు, మట్టి పాత్రలు, వెదురు మొదలైనవి ఈ పూజా విధులతో ముడిపడిన విభిన్న సామగ్రీలు.
విశ్వాసాలతో నిండిన ఈ పండుగలో ఉదయిస్తున్న సూర్యుడినీ, అస్తమిస్తున్న సూర్యుడునీ ఆరాధించే సందేశం ఒక ప్రత్యేకమైన సంస్కారంతో నిండి ఉంది. ప్రపంచం ఎదిగే వారిని పూజిస్తే, ఈ చాత్ పూజలో అస్తమించడం అనివార్యమని తెలిసినవారిని కూడా పుజించడం ఛాత్ పూజ మనకి తెలుపుతుంది. మన జీవితంలో పారిశుధ్యానికి ఎంతటి ప్రాముఖ్యత నివ్వాలో కూడా ఈ పండుగ చెప్తుంది. ఈ పండుగ ముందర ఇంటి మొత్తాన్ని దులిపి, శుభ్రపరిచడంతో పాటూ, నది, చెరువు, పూజ చేసే నది ఒడ్డులను కూడా ప్రజలు చాలా ఉత్సాహంతో కలిసిమెలసి శుభ్రపరుస్తారు. ఈ సూర్య నమస్కారాలు లేదా ఛాత్ పూజ పర్యావరణ సంరక్షణ, రోగ నివారణ, క్రమశిక్షణల పండుగ.
సాధారణంగా ఏదైనా అడిగి తీశుకోవడాన్ని ప్రజలు హీనంగా భావిస్తారు. కాని ఈ ఛాత్ పూజలో పొద్దున్నే అర్ఘ్యం పూర్తయిన తర్వాత ప్రసాదాన్ని అడిగి తీసుకోవడం అనేది ఒక ప్రత్యేకమైన సాంప్రదాయం. ఇలా ప్రసాదాన్ని అడిగి తీసుకునే సాంప్రదాయం వెనకాల అహంకారం నశిస్తుందన్న ఉద్దేశం ఉంది. అహంకార భావన వ్యక్తి అభివృధ్ధికి అవరోధం కలిగిస్తుంది. భారతదేశంలోని ఈ గొప్ప సాంప్రదాయం పట్ల ప్రతి ఒక్కరూ గర్వంగా భావించడం స్వాభావికమే.
నా ప్రియమైన దేశ ప్రజలారా, మనసులో మాట ను అభినందించే వారూ ఉన్నారు, విమర్శించేవారూ ఉన్నారు. కానీ ’మనసులో మాట’ ప్రభావాన్ని నేను ప్రజల్లో గమనించినప్పుడు, దేశప్రజలతో ’మనసులో మాట ’ నూటికి నూరు శాతం బలమైన బంధంగా జతపడిపోయిందన్న నా నమ్మకం ధృఢపడుతుంది. ఖాదీ, చేనేతల ఉదాహరణనే తీసుకోండి.. గాంధీ జయంతి సమయంలో నేను ఖాదీ, చేనేతల వకాల్తా పుచ్చుకున్నందుకు పరిణామం ఏం జరిగిందో తెలిస్తే మీరు కూడా ఎంతో సంతోషిస్తారు. ఈ అక్టోబర్ పదిహేడవ తేదీ అంటే ధన్ తెరస్ రోజున ఢిల్లీ లోని ఖాదీ, గ్రామీణ పరిశ్రమల భవనంలోని ఖాదీ దుకాణం లో రికార్డ్ స్థాయిలో, దాదాపు ఒక కోటి ఇరవై లక్షల రూపాయిల అమ్మకాలు నమోదయ్యాయిట. ఖాదీ, చేనేత, రెండిటి అమ్మకాలూ ఇంత పెద్ద ఎత్తున జరగడమనేది మీకు కూడా ఆనందకరమైన విషయమే కదా. దీపావళి సమయంలో ఖాదీ గిఫ్ట్ కూపన్ల అమ్మకాలలో దాదాపు 680 శాతం వృధ్ధి నమోదైంది. ఖాదీ, హస్తకళల మొత్తం అమ్మకాలలో కూడా క్రిందటి ఏడాది కన్నా ఈ సంవత్సరం దాదాపు తొంభై శాతం వృధ్ధి నమోదైంది. ఈమధ్యన యువత, పెద్దలు, పిల్లలు, వయసుమళ్ళినవారు, స్త్రీలు, అన్ని వయస్కులవారూ కూడా ఖాదీ, చేనేతలను ఇష్టపడుతున్నారు. దీనివల్ల ఎన్నో నేత పనిచేసే కుటుంబాలకూ, చేనేత కుటుంబాలకూ, ఎన్నో పేద కుటుంబాలకు ఎంత లాభం చేకూరుతుందో నేను ఊహించగలను. ఇంతకు ముందు ఖాదీని “ఖాదీ ఫర్ నేషన్” అనేవారు. నేను “ఖాదీ ఫర్ ఫ్యాషన్” అన్నాను. ఇప్పుడు , “Khadi for nation”, “Khadi for fashion” రెండిటి స్థానాన్నీ Khadi for transformation తీసుకుంటోందని నేను గమనించాను. నిరుపేద కార్మికుల జీవితాలలో మార్పుని తేవడమే కాకుండా, వారిని శ్వశక్తితో పైకి తీసుకువచ్చే శక్తివంత సాధనాలుగా ఖాదీ , చేనేత రెండూ కూడా మారుతున్నాయి. గ్రామీణ పరిశ్రమలలో ఇవి అతి పెద్ద పాత్రను పోషిస్తున్నాయి.
రాజన్ భట్ గారు నరేంద్ర మోదీ యాప్ లో భద్రతా దళాలతో జరుపుకున్న నా దీపావళి సంబరాల గురించి తెలుసుకోవాలనుకుంటున్నానని రాశారు. అంతేకాక మన భద్రతా దళాలు దీపావళిని ఎలా జరుపుకుంటారో తెలుసుకోవాలనుకుంటున్నానని కూడా రాశారు. తేజస్ గైక్వాడ్ గారు కూడా న్ నరేండ్ర మోదీ యాప్ లో మన ఇంటి మిఠాయిలు భద్రతా దళాలవారికి అందించడం ఎలా? పండుగ సమయంలో మాకు కూడా మన వీర జవానులు గుర్తుకు వస్తారని రాశారు. మన ఇంటి మిఠాయిలను భద్రతా దళాలవారికి అందిస్తే బావుంటుందని నాకు కూడా అనిపించింది. మీరంతా దీపావళి పండుగను ఆనందోల్లాసాలతో జరుపుకుని ఉంటారని భావిస్తున్నాను. నాకు ఈసారి దీపావళి కూడా ప్రత్యేకమైన అనుభూతులని ఇచ్చింది. మరోశారి సరిహద్దుల్లో పరాహాకాస్తున్న మన వీర భద్రతా దళాలతో దీపావళీ పండుగ జరుపుకునే సదవకాశం లభించింది. ఈసారి దీపావళిని నేను జమ్మూ కాశ్మీర్ లోని గురేజ్ సెక్టార్ లోని భద్రతాదళాలతో జరుపుకోవడం మరచిపోలేని అనుభూతి. దేశ సరిహద్దుల్లో ఎంత కఠినమైన, విషమ మరిస్థితులను వారు ఎదుర్కొంటూ మన భద్రతా దళాలు దేశాన్ని రక్షిస్తూ ఉంటాయో, ఆ సంఘర్షణకూ, సమర్పణా భావానికీ, త్యాగానికి నేను దేశ ప్రజలందరి తరఫునా మన భద్రతా దళాలలోని ప్రతి సైనికుడినీ నేను గౌరవిస్తాను. మనకి అవకాశం దొరికినప్పుడల్లా, అవసరం లభించినప్పుడల్లా, మన సైనికుల అనుభవాలను తెలుసుకోవాలి. వారి గౌరవపూర్వకమైన కథలను వినాలి. మన భద్రతా దళాలలోని సైనికులు కేవలం సరిహద్దుల్లోనే కాక ప్రపంచమంతటా శాంతి స్థాపన చెయ్యడమనే ముఖ్యమైన పాత్రని నిర్వర్తిస్తున్నారన్న సంగతి మనలో చాలామందికి తెలీదు. UN Peacekeeper ఐక్యరాజ్యసమితిలో శాంతి పరిపక్షకులుగా వారు భారతదేశం పేరుని ప్రపంచమంతటా మారుమ్రోగిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం అక్టోబర్ 24 న ప్రపంచమంతటా UN Day, అంటే ఐక్యరాజ్యసమితి దినోత్సవం జరిగింది. ప్రపంచంలో శాంతి స్థాపన కోసం ఐక్యరాజ్యసమితి చేసే ప్రయత్నాలు, వారి సఫల పాత్రనూ ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకుంటారు. మనం “వసుదైక కుటుంబం” అనే సిధ్ధాంతాన్ని నమ్మేవారిమి. అంటే ప్రపంచమంతా మన కుటుంబమే. ఇదే విశ్వాసంతో భారతదేశం మొదటినుండీ ఐక్యరాజ్య సమితి తాలూకూ వివిధ ముఖ్యమైన ప్రయత్నాలలో క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్వర్తిస్తూ వస్తోంది. మీకు తెలిసే ఉంటుంది, భారతదేశ సంవిధానంలోని ప్రస్థావన, ఐక్యరాజ్య సమితి చార్టర్ లోని ప్రస్థావన, రెండూ కూడా ‘we the people’ అనే పదాలతోనే మొదలవుతాయి. భారతదేశం స్త్రీ సమానత్వాన్ని ఎల్లప్పుడూ సమర్థించింది. UN Declaration of Human Rights దీనికి ప్రత్యక్ష్య ఉదాహరణ . ఇందులోని మొదటి వాక్యంలో ప్రస్థావించిన ‘all men are born free and equal’ పదాలు భారతదేశ ప్రతినిధి హంసా మెహతా ప్రయత్నాల వల్ల మార్చబడ్డాయి. తర్వాత అవి ‘all humans beings are born, free and equal’ గా స్వీకరించబడ్డాయి. ఇది చాలా చిన్న మార్పులా అనిపిస్తుంది కానీ ఇందులో ఒక ధృఢమైన ఆలోచన కనబడుతుంది. UN Umbrella లో భాగంగా ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక కార్యకలాపాలలో భారతదేశం అందరి కంటే ముఖ్యమైన పాత్ర వహించింది. ఐక్యరాజ్యసమితి తాలూకూ శాంతి రక్షణ మిషన్ లో భారతదేశం ఎప్పుడూ కూడా పెద్ద క్రియాశీల పాత్రను నిర్వర్తిస్తూ వస్తోంది. 18 వేల కంటే ఎక్కువ భారతీయ భద్రతా దళాలు UN peacekeeping operations లో తమ సేవలను అందించాయన్న సంగతి మీలో చాలామందికి ఈ సమాచారం మొదటిసారిగా ఇప్పుడే తెలుస్తోంది. ప్రస్తుతం భారతదేశానికి చెందిన ఏడువేల సైనికులు UN Peacekeeping initiatives తో ముడిపడి ఉన్నారు. ఇది యావత్ ప్రపంచంలోనే మూడవ అత్యధికసంఖ్య . ఆగస్ట్ 2017 వరకూ భారతీయ సైనికులు ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన 71 శాంతి పరిరక్షక కార్యకలాపాల లో దాదాపుగా 50 operations లో మన సైనికిలు సేవలను అందించారు. ఈ operations, Korea, Cambodia, Laos, Vietnam, Congo, Cyprus, Liberia, Lebanon, Sudan, మొదలైన ప్రపంచంలోని ఎన్నో దేశాలలో జరిగాయి. Congo, దక్షిణ సుడాన్ లో భారతీయ సైన్యం ఏర్పాటు చేసిన ఆసుపత్రిలో ఇరవై వేలకు పైగా రోగుల కు వైద్యం అందించారు. ఇంకా ఎంతోమందిని కాపాడారు.
భారతదేశ భద్రతా దళాలు ఎన్నో దేశాలలో అక్కడి ప్రజలను రక్షించడమే కాకుండా, అక్కడ people friendly operations జరిపి ఎన్నో హృదయాలను గెలుచుకున్నారు. భారతీయ మహిళలు శాంతి స్థాపన కార్యక్రమాల్లో ముఖ్యమైన పాత్రను వహించారు. Liberia లో జరిపిన ఐక్యరాజ్యసమితి వారి శాంతి ఉద్యమం సేవాదళం లో భాగంగా మహిళా పోలీస్ యూనిట్ ని పంపడమ్ జరిగిందని చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. భారతదేశం వేసిన ఈ అడుగులు ప్రపంచంలోని తక్కిన దేశాలన్నింటికీ ప్రేరణాపూర్వకంగా నిలిచాయి. ఆ తర్వాత, మిగిలిన దేశాలన్నీ కూడా తమ తమ మహిళా పోలీస్ యూనిట్ లను పంపించడం మొదలుపెట్టారు. భారతదేశ పాత్ర కేవలం శాంతి పరిరక్షక కార్యకలాపాల
వరకే పరిమితం కాదు. దాదాపు ఎనభై ఐదు దేశాల Peacekeepers కి భారతదేశం శిక్షణను అందిస్తోందన్న విషయం విని మీరు గర్వ పడతారు. మహాత్మా గాంధీ, గౌతమ బుధ్ధుడు నడయాడిన ఈ భూమి నుండి వెళ్ళిన మన వీర శాంతి రక్షకులు యావత్ ప్రపంచానికీ శాంతి, సద్భావాల సందేశాలను అందించారు. శాంతి పరిరక్షక కార్యకలాపాలు అంత సులువైనవేమీ కావు. మన భద్రతాదళంలోని సైనికులకు ప్రమాదకరమైన ప్రాంతాల్లోకి కూడా వెళ్ళి పని చేయాల్సివస్తుంది.
రకరకాల మనుషుల మధ్యన ఉందాల్సి వస్తుంది. విభిన్న పరిస్థితులనూ, రకరకాల సాంప్రదాయాలను గురించీ తెలుసుకోవాల్సి వస్తుంది. వారికి ఆ యా ప్రాంతాల్లోని స్థానిక అవసరాలకూ, పరిస్థితులకు అనుగుణంగా తమను తాము మలుచుకోవాల్సి వస్తుంది. ఇవాళ మన వీర ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకులను గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి, కేప్టెన్ గుర్బచన్ సింగ్ సలారియా గారిని తలుద్దాం. ఆఫ్రికా లోని కాంగోలో శాంతి కోసం పోరాడుతూ తమ సర్వస్వాన్నీ త్యాగం చేసిన ఆయనను మర్చిపోగలమా? వారిని తల్చుకుంటేనే ప్రతి భారతీయుడి హృదయం గర్వంతో పొంగుతుంది. పరమవీర చక్ర బిరుదుతో సన్మానితులైన ఏకైన ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షకుడు, వీర పురుషుడు ఆయన. సైప్రస్ లో ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్న మరో భారతీయ శాంతి పరిరక్షకుడు లెఫ్టెనెంట్ జనరల్ ప్రేమ్ చంద్ గారు. 1989 లో, 72 ఏళ్ల వయసులో ఆయనను నమీబియా ఆపరేషన్స్ కోసం ఫోర్స్ కమాండర్ అయి, ఆ దేశ స్వాతంత్రాన్ని సునిశ్చితం చెయ్యడానికి తన సేవలను అందించారు. భారతీయ సేన లో ప్రముఖులుగా ఉన్న జనరల్ థిమయ్యా కూడా సైప్రస్ లో ఐక్యరాజ్యసమితి శాంతి పరిరక్షక దళానికి నేతృత్వం వహించారు. శాంతిస్థాపన కోసం తన సర్వస్వాన్నీ అర్పించారు. శాంతిదూత రూపంలో భారతదేశం ఎప్పుడూ కూడా ప్రపంచ శాంతి, ఏకత్వం, సద్భావనల సందేశాన్ని అందిస్తూ వచ్చింది. ప్రతి ఒక్కరూ కూడా శాంతి సద్భావనలతో జీవిస్తూ, ఒక మెరుగైన శాంతియుతమైన భవిష్య నిర్మాణం దిశగా ముందుకు నడుస్తారని నా నమ్మకం.
నా ప్రియమైన దేశప్రజలారా, మన పుణ్య భూమి నిస్వార్థంతో మానవసేవ చేసిన మహానుభావులతో నిండి ఉంది. మనం సోదరి నివేదిత అని పిలిచే సిస్టర్ నివేదిత కూడా అటువంటి అసాధారణ వ్యక్తులలో ఒకరు. ఆవిడ ఐర్ల్యాండ్ లో మార్గరెట్ ఎలిజబెత్ నోబుల్ పేరుతో జన్మించింది. స్వామి వివేకానందులు ఆవిడకు నివేదిత అనే పేరుని ఇచ్చారు. నివేదిత అంటే పూర్ణ రూపంతో సమర్పణ చేయడం అని అర్థం. తర్వాత ఆవిడ ఆ పేరుని సార్థకం చేసుకున్నారు. నిన్న సిస్టర్ నివేదిత నూట ఏభైయ్యవ జయంతి. ఆవిడ స్వామి వివేకానందుల వల్ల ఎంతగా ప్రభావితురాలైందంటే, తన సుఖవంతమైన జీవితాన్ని త్యాగం చేసి, పేదల సేవ కోసం సమర్పించేసింది. బ్రిటిష్ రాజ్యంలో జరిగుతున్న అత్యాచారాలు అమెకు బాగా తెలుసు. ఆంగ్లేయులు మన దేశాన్ని బానిసను చేసుకోవడమే కాక మనల్ని మానసిక రూపంలో కూడా బానిసలుగా చెయ్యడానికి ప్రయత్నం చేసారు. మన సంస్కృతిని తక్కువగా చూపించి, మనలో హీనభావాన్ని పుట్టించడమే వాళ్ల నిరంతర ప్రయత్నం. సోదరి నివేదిత భారతీయ సంస్కృతి గౌరవాన్ని పున:స్థాపితం చేసారు. జాతీయ స్పృహ ని జాగృతం చేసి ప్రజలను ఏకం చేయడానికి పనిచేశారు. ప్రపంచంలోని వివిధ దేశాలకు వెళ్లి సనాతన ధర్మం, తత్వశాస్త్రం గురించి జరుగుతున్న చెడు ప్రచారాలకు వ్యతిరేకంగా తన గళమెత్తారు. ప్రఖ్యాత జాతీయవాది, తమిళ కవి సుబ్రహ్మణ్య భారతి తన విప్లవ కవిత ‘పుధుమై పొన్న్’ , నవతరం మహిళ, ఇంకా మహిళా సాధికారత ద్వారా ప్రసిద్ధి గాంచారు. దానికి ప్రేరణ సోదరి నివేదిత అని అంటారు. సోదరి నివేదిత గారు గొప్ప శాస్త్రవేత్త అయిన జగదీష్ చంద్ర బోస్ కు కూడా మద్దతు ఇచ్చారు. ఆవిడ తన వ్యాసాలు మరియు సమావేశాలు ద్వారా బోస్ గారి పరిశోధన యొక్క ప్రచురణ మరియు ప్రచారం లో సహాయపడింది. మన భారతీయ ప్రత్యేక సౌందర్యం మన సంస్కృతిలో ఆధ్యాత్మికత మరియు విజ్ఞాన శాస్త్రం పరస్పరం ఒకదానికి మరొకటి పరిపూర్ణతను అందించడం లోనే ఉంది. సిస్టర్ నివేదిత , శాస్త్రవేత్త జగదిశ్ చంద్ర బోస్ దీనికి ప్రత్యక్ష్య ఉదాహరణ. 1899లో కలకత్తాలో భయంకరమైన ప్లేగు వ్యాధి వ్యాపించింది. చూస్తుండగానే ఎన్నో లక్షల మంది చనిపోయారు. సోదరి నివేదిత తన ఆరోగ్యాన్ని గురించి ఆలోచించకుండా కాలవలు, రోడ్లు శుభ్రపరిచే పని ప్రారంభించారు. విలాసవంతమైన జీవితాన్ని గడపగలిగీ కూడా పేదవారి సేవలో నిమగ్నమైంది. ఆవిడ త్యాగంతో ప్రేరణ పొందిన ప్రజలు సేవా కార్యక్రమాల్లో ఆవిడకు సహాయం అందించడం మొదలుపెట్టారు. ఆవిడ తన పనులతో ప్రజలకు పరిశుభ్రత, సేవల ప్రాముహ్యాన్ని తెలిపింది. ఆవిడ సమాధిపై “‘Here reposes Sister Nivedita who gave her all to India’ – అని రాసి ఉంటుంది .అంటే – తన సర్వస్వాన్నీ భారతదేశానికి అర్పించిన సోదరి నివేదిత ఇక్కడ విశ్రాంతిని పొందుతోంది అని అర్థం. నిస్సందేహంగా ఆవిడ అలానే చేసారు. ప్రతి ఒక భారతీయుడూ వారి జీవితం నుండి శిక్షణ పొంది, స్వయంగా సేవాపథంలో నడిచే ప్రయత్నం చెయ్యడం కన్నా మించిన శ్రధ్ధాంజలి ఆ గొప్ప వ్యక్తిత్వానికి మరొకటి ఉండదు.
(ఫోన్ ) గౌరవనీయులైన ప్రధానమంత్రిగారూ, నా పేరు డాక్టర్ పార్థ్ షా. నవంబర్ పధ్నాలుగు ను మనం బాలల దినోత్సవంగా జరుపుకుంటాం. వారు మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ గారి జన్మదినం కాబట్టి. ఆ రోజు ప్రపంచ డయాబెటిస్ దినోత్సవం. డయాబెటీస్ కేవలం పెద్దల వ్యాధి కాదు. అది ఎందరో పిల్లలలో కూడా కనిపిస్తోంది. ఈ సమస్యను మనం ఎలా ఎదుర్కోగలం?
మీ ఫోన్ కాల్ కు ధన్యవాదాలు. అన్నిటికన్నా ముందర మన మొట్టమొదటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి జయంతి సందర్భంగా బాలలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. పిల్లలే నవభారత నిర్మాణానికి నాయకులు, హీరోలు. మీ ఆందోళన సరైనది. ఇదివరకూ వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు జీవితం చివరలో వచ్చేవి – అవి ఇప్పుడు పిల్లల్లో కూడా కనబడుతున్నాయి. పిలల్లకు కూడా డయాబెటిస్ వస్తోందని వింటూంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఇదివరకూ ఇలాంటి వ్యాధులని రాచరోగాలనేవారు. అంటే గతంలో ఇలాంటి వ్యాధులు కేవలం ధనవంతులకూ, విలాసవంతమైన జీవితాలని జీవించేవారికి మాత్రమే వస్తూండేవి. యువతలో ఇలాంటి వ్యాధులు అరుదుగా ఉండేది. కానీ ఇవాళ మన జీవన విధానం మారిపోయింది. ఇలాంటి వ్యాధులను ఇవాళ జీవన విధాన పొరపాటు పేరుతో పిలవబడుతున్నాయి. మన ఆహారవ్యవహార పధ్ధతుల్లో మార్పులు, జీవితంలో తగినంత శారీరిక శ్రమ లేకపోవడమే ప్రజలు పిన్న వయసులోనే ఇలాంటి వ్యాధుల బారిన పడడానికి ముఖ్యమైన కారణం. సమాజానికీ, కుటుంబానికీ ఈ విషయం పట్ల శ్రధ్ధ వహించాల్సిన అవసరం ఉంది. దీని గురింఛి ఆలోచిస్తే చాలు. మరెలాంటి అధిక జాగ్రత్తలూ పాటించనక్కర్లేదు. చిన్న చిన్న పనులని సరైన పధ్ధతిలో నియమిత రూపంలో పాటించడం, తమ అలవాట్లను మార్చుకోవడం, వాటిని స్వభావంగా మార్చుకోవడమే చెయ్యాల్సినది.
కుటుంబసభ్యులు అప్రమత్తతతో తమ పిల్లలను మైదానాలలో ఆడుకునే అలవాటుని చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. వీలైతే పెద్దలు కూడా పిల్లలతో పాటూ మైదానంలోకి వెళ్ళి ఆడే ప్రయత్నం చెయ్యాలి. పిల్లలను లిఫ్ట్ ఉపయోగించకుండా, మెట్ల దారిలో పైకి క్రిందకీ తిరిగే అలవాటి చెయ్యాలి. డిన్నర్ తరువాత కుటుంబంలో అందరూ, పిల్లలను తీసుకుని నడకకు వెళ్ళే ప్రయత్నం చెయ్యాలి.
Yoga for Young India – ముఖ్యంగా మా యువ స్నేహితులు ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడానికి, జీవనశైలి రుగ్మత నుండి వారిని రక్షించడంలో యోగా ఉపయోగకరంగా ఉంటుంది. పాఠశాల ప్రారంభానికి ముందుగా ముఫ్ఫై నిమిషాల యోగా ఎంత లాభదాయకమో చూడండి.ఇంట్లోనూ యోగా చేయచ్చు. సహజమైనది, సులువైనది, సర్వసులభమైనది. ఇదే యోగా ప్రత్యేకత. సహజం అని ఎందుకు అంటున్నానంటే, ఏ వయసువారైనా సులువుగా యోగా చేసేసేయగలరు. సులువైనది ఎందుకంటే ఎవరైనా సులువుగా నేర్చుకోవచ్చు. సర్వసులభమైనది ఎందుకంటే యోగా ఎక్కడైనా చేయవచ్చు. ఏ ప్రత్యేకమైన పరికరాలూ, మైదానాలు అవసరం లేదు. డయాబెటిస్ కంట్రోల్ చెయ్యడానికి యోగా ఎంత ఉపయోగపడుతుందో కనుక్కోవడానికి ఎన్నో పరిశోధనలు జరుగుతున్నాయి. AIIMS లో కూడా దీనిపై ప్రయోగాలు జరుగుతున్నాయి. ఇప్పటిదాకా లభించిన పరిణామాలు చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. ఆయుర్వేదాన్నీ, యోగానీ మనం కేవలం వ్యాధినివారక మాధ్యమాలుగా మాత్రమే చూడకూడదు. వాటిని మనం మన జీవితాలలో భాగం చేసుకోవాలి.
నా ప్రియమైన దేశప్రజలారా, ముఖ్యంగా నా యువమిత్రులారా, గత కొద్దిరోజుల్లో క్రీడారంగంలో మంచి వార్తలు వచ్చాయి. వేరు వేరు ఆటల్లో మన దేశ ఆటగాళ్ళు దేశానికి పేరు తెచ్చారు. హాకీలో భారతదేశం అద్భుతమైన ఆటలు చూపెట్టి ఆసియా కప్ బిరుదుని సంపాదించారు. మన క్రీడాకారులు అత్యుత్తమైన ఆటను ప్రదర్శించడమ్ వల్ల మన హాకీజట్టు పదేళ్ల తరువాత ఆసియా కప్ చాంపియన్ అయ్యారు. ఇంతకు ముండు భారతదేశం 2003, ఇంకా 2007 లో ఆసియా కప్ ఛాంపియన్ అయ్యింది. జట్టు మొత్తానికీ , సహాకార సభ్యులందరికీ కూడా నా తరఫున , దేశప్రజల తరఫునా, అనేకానేక ధన్యవాదాలు.
హాకీ తరువాత బ్యాడ్మెంటన్ లో కూడా భారతదేశానికి మంచి కబురు వచ్చింది. బ్యాడ్మెంటన్ స్టార్ కిదాంబి శ్రీకాంత్ ఉత్తమమైన ఆటను ప్రదర్శించి డెన్మార్క్ ఓపెన్ సిరీస్ ను గెలుచుకుని ప్రతి భారతీయుడినీ గౌరవంతో నింపేసాడు. Indonesia open , ఇంకా Australia open తర్వాత ఇది అతని మూడవ super series premiere బిరుదు. నేను మన యువ మిత్రునికి, తన ఈ గెలుపుకి , భారతదేశ గౌరవాన్ని పెంచినందుకూ అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను.
మిత్రులారా, ఈ నెలలోనే FIFA Under-17 World Cup ప్రారంభం జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జట్టులన్నీ భారతదేశం వచ్చాయి. అందరూ ఫుట్ బాల్ మైదానంలో తమ ప్రతిభను చూపించారు. నాకు కూడా ఒక ఆట ను చూసే అవకాశం లభించింది. ఆటగాళ్ళలోనూ, ప్రేక్షకుల్లోనూ అమితమైన ఉత్సాహం కనబడింది. ప్రపంచ కప్ తాలూకూ ఇంత పెద్ద ఈవెంట్, ప్రపంచమంతా మిమ్మల్ని చూస్తుండగా ఇంత పెద్ద ఆట, యువ క్రీడాకారుల శక్తి, ఉత్సాహం, సాధించి చూపెట్టాలన్న తపననూ చూసి నేను నిశ్చేష్టుడనయ్యాను. ప్రపంచ కప్ నిర్వాహణ విజయవంతంగా జరిగింది. అన్ని జట్టులూ తమ ఉత్తమమైన ఆటను ప్రదర్శించాయి. భారత జట్టు ప్రపంచ కప్ ను గెలవలేకపోయినా అందరి మనసులనీ గెలుచుకున్నారు. భారతదేశం తో పాటూ ప్రపంచమంతా ఈ ఉత్సవాన్నీ, ఆటను ఆస్వాదించారు.ఈ మొత్తం టోర్నమెంట్ ఫుట్ బాల్ ప్రేమికులకు ఆసక్తికరంఘానూ, ఆనందదాయకంగానూ నిలిచింది. ఫుట్ బాల్ భవిష్యత్తు ఉజ్వలంగా ఉంది. ఆ సంకేతాలు కనిపిస్తున్నాయి. నేను మరొకసారి క్రీడాకారులనూ, వారి సహచరులనూ, క్రీడాభిమానులకూ నా అభినందనలూ, శుభాకాంక్షలూ తెలుపుకుంటున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, స్వచ్ఛ భారత్ విషయంలో నాకు ఎంతమంది రాస్తున్నారంటే, వారందరి అభిప్రాయాలకూ నేను న్యాయం చెయ్యాలనుకుంటే రోజూ మనసులో మాట కార్యక్రమం చెయ్యాల్సి ఉంటుంది. ప్రతి రోజూ పారిశుధ్యానికి మాత్రమే మనసులో మాటను కేటాయించాల్సి ఉంటుంది. ఒకరు చిన్న చిన్న పిల్లల ప్రయత్నాల ఫోటోలను పంపిస్తే, మరొక చోట యువ జట్టు ప్రయత్నాల కథలు ఉంటాయి. ఒక చోట స్వచ్ఛతకు సంబంధించి ఏదో సృజనాత్మక ఆవిష్కరణ ఉంటే, మరో చోట ఏదో ఒక అధికారి పట్టుదలతో వచ్చిన మార్పు గురించిన వార్త ఉంటుంది. కొద్ది రోజుల క్రితం నాకొక విస్తృతమైన రిపోర్ట్ అందింది. అందులో మహారాష్ట్రలో చంద్రపూర్ కోట పునరుధ్ధరణ తాలూకూ కథ ఉంది.అక్కడ Ecological Protection Organisation అనే ఒక NGO బృందం చంద్రపూర్ కోటలో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టింది. రెండువందల రోజుల వరకూ నడిచిన ఈ కార్యక్రమంలో ప్రజలు ఆగకుండా, అలసిపోకుండా, ఒక జట్టుగా నిలిచి పరిశుభ్రత కార్యక్రమాన్ని నడిపారు. వరుసగా రెండువందల రోజులు. కార్యక్రమానికి ముందూ, ఆ తర్వాత ఫోటోలు వారు నాకు పంపించారు. ఫోటో చూసి నేను నిశ్చేష్టుడనయ్యాను. తమ పరిసరాలలోని అపరిశుభ్రతను చూసి నిరాశపడినవారూ, పారిశుధ్యం అనే స్వప్నం ఎలా పూర్తవుతుంది అనుకునేవారూ ఆ ఫోటోలను చూడండి, వాటిల్లో Ecological Protection Organisation యువతనీ, వారి చెమటనూ, వారి ధైర్యాన్నీ, వారి సంకల్పాన్నీ, ఆ జీవకళ ఉట్టిపడే ఫోటోల్లో చూడవచ్చు. వాటిని చూశ్తూనే మీ నిరాశ నమ్మకంగా మారిపోతుంది. పరిశుభ్రత కోసం జరిగిన ఈ భగీరథ ప్రయత్నం సౌందర్యానికీ, సామూహికతకూ, నిరంతరతకీ ఒక అద్భుత ఉదాహరణ. కోటలు మన వారసత్వ ప్రతీకలు. చారిత్రక కట్టడాలను సురక్షితంగా, స్వచ్ఛంగా ఉంచవలసిన బాధ్యత దేశప్రజలందరిదీ. నేను Ecological Protection Organisation నీ, వారి మొత్తం బృందాన్నీ, చంద్రపూర్ ప్రజలందరికీ అనేకానేక అభినందనలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశ ప్రజలారా, రాబోయే నవంబర్ నాలుగవ తేదీన మనందరమూ గురునానక్ జయంతిని జరుపుకుంటాము. గురునానక్ గారు సిక్కుల ప్రధమ గురువే కాకుండా, జగత్ గురువులు కూడా. వారి సంపూర్ణ మానవ కల్యాణం కోసం పాటుపడ్డారు.
జాతులన్నింటినీ ఒకటిగా చూశారు. మహిళా సశక్తీకరణనూ, మహిళా గౌరవానికీ ప్రాముఖ్యతనిచ్చారు. గురునానక్ గారు కాలినడకన ఇరవై ఎనిమిది వేల కిలోమీటర్ల యాత్ర చేసారు. ఈ యాత్రలో భాగంగా వారు నిజమైన మానవత్వం గురించి సందేశాన్ని ఇచ్చారు. వారు ప్రజలతో మాట్లాడారు. సత్యం, త్యాగం, కర్మ నిష్ఠల మార్గాన్ని వారు చూపెట్టారు. సమాజంలో సమానతల గురించి సందేశానిచ్చారు. కేవలం మాటల ద్వారానే కాక తన పనుల ద్వారా ఆ సందేశాలని చేసి చూపెట్టారు. ప్రజల్లో సేవా భావం పెంపొందేలా లంగరు వేసారు. కలసికట్టుగా కూర్చుని లంగరు స్వీకరించడం వల్ల ప్రజల్లో ఏకత్వం , సమానత్వాల భావాలు జాగృతమైంది. గురునానక్ గారు జీవితాన్ని సార్థకం చేసుకోవడానికి మూడు సందేశాలు ఇచ్చారు. పరమాత్మ నామాన్ని జపించడం, కష్టపడి పని చెయ్యి, అవసరం ఉన్నవారికి సహాయపడడం. గురునానక్ గారు తన మాటలను చెప్పడానికి “గురుబాణీ”ని రచించారు కూడా. రాబోయే 2019వ సంవత్సరంలో మనం గురునానక్ గారి 550వ కాంతి సంవత్సరాన్ని జరుపుకోబోతున్నాం. రండి, మనం వారి సందేశాల బోధనా మార్గంలో ముందుకి నడవడానికి ప్రయత్నిద్దాం.
నా ప్రియమైన దేశప్రజలారా, రెండు రోజుల తరువాత మనం అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జయంతి జరుపుకోబోతున్నాం. ఆధునిక అఖండ భారతదేశానికి పునాది వీరే వేసారని మనందరికీ తెలుసు. భారత మాత అందించిన గొప్పబిడ్డ అసాధారణ యాత్రతో ఇవాళ మనం ఎంతో నేర్చుకోవచ్చు. అక్టోబర్ 31 శ్రీమతి ఇందిరా గాంధీ ఈ ప్రపంఛాన్ని వదిలి వెళ్ళిపోయిన రోజు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రత్యేకత ఏమిటంటే, వారి కేవలం పరివర్తన తాలూకూ ఆలోచనలే కాకుండా వాటిని చేసి చూపించడానికి జటిలమైన సమస్యలకు కూడా వ్యవహారిక పరిష్కారాలను వెతికే సామర్థ్యం ఉన్నవారు. ఆలోచనను సాకారం చెయ్యడంలో ఆయనకు ఆయనే సాటి. భారతదేశాన్ని ఏకతాటిపై నిలపే పగ్గాలను సర్దార్ వల్లభాయ్ పటేల్ అదుపుచేసారు. కోట్లాది భారతవాసులను ఒక దేశం , ఒక రాజ్యాంగం క్రిందకు భారతదేశాన్ని తీసుకువచ్చే ప్రయత్నాన్ని నిశ్చితపరిచారు. వారి నిర్ణయసామర్థ్యం వారికి అన్ని అడ్డంకులనూ ఎదుర్కొనే శక్తిని ఇచ్చింది. ఎక్కడ మనోబలం అవసరమో అక్కడ మనోబలంతో పనిచేసారు. ఎక్కడ బలప్రయోగం అవసరమో అక్కడ అది చేసారు. వారు ఒక ఉద్దేశాన్ని నిశ్చయించుకుని అదే నిశ్చయం వైపుకి పూర్తి కృషితో ముందుకు నడుస్తూ వెళ్ళారు. దేశాన్ని ఏకం చేసే ఈ కార్యక్రమాన్ని వారొక్కరే చెయ్యగలరు. అందరూ సమానత్వాన్ని అందుకునేలాంటి దేశాన్ని ఆయన ఊహించారు. వారి ఈ మాటలు మనందరికీ ప్రేరణాత్మకంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను –
– “కులమతాలకి మధ్య విభేదం మనల్ని ఆపకూడదు. అందరూ భారతదేశానికి పుత్రులూ, పుత్రికలే. మనమందరమూ మన దేశాన్ని ప్రేమించాలి. పరస్పర ప్రేమ, సద్భావనల సహాయంతో మన విధిని నిర్మించడానికి ప్రయత్నం చెయ్యాలి.”
సర్దార్ గారి ఈ కథనం ఇవాళ కూడా మన న్యూ ఇండియా స్వప్నం కోసం ప్రేరణాత్మకం, సంబంధితమైనదే. ఈ కారణంగా వారి జయంతి “దేశ ఐకమత్య దినోత్సవంగా” జరుపుకుంటాము. దేశానికి ఒక అఖండ స్వరూపాన్ని ఇవ్వడంలో వారి సహకారం వెలకట్టలేనిది. సర్దార్ గారి జయంతి సందర్భంగా అక్టోబర్ 31 ని దేశమంతటా “రన్ ఫర్ యూనిటీ” ఏర్పాటు చెయ్యబడింది. దేశంలోని అందరూ పిల్లలు, యువత, మహిళలు, అన్ని వయస్కుల వారూ అందులో పాల్గొంటారు. మీ అందరికీ నా విన్నపం ఏమిటంటే మీరు కూడా “రన్ ఫర్ యూనిటీ” లో పరస్పర సద్భావన ఉత్సవంలో పాల్గొనండి.
నా ప్రియమైన దేశప్రజలారా, దీపావళి శెలవుల తరువాత కొత్త సంకల్పంతో, కొత్త నిశ్చయంతో, మీరంతా మీ రోజువారీ జీవితాలలో మరోసారి ప్రారంభించి ఉంటారు. నా తరఫున దేశవాసులందరికీ వారి కలలన్నీ సాకారం కావాలని కోరుకుంటూ, శుభాకాంక్షలు. అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా, మీ అందరికీ నమస్కారం! ఆకాశవాణి ద్వారా మీ అందరితో మనసులో మాటలు చెప్తూ చెప్తూండగా మూడేళ్ళు గడిచిపోయాయి. ఇవాళ్టి మనసులో మాట 36వ అంకం. ఒక రకంగా చెప్పాలంటే, భారతదేశం నలుమూలల్లోనూ నిండి ఉన్నఆలోచనలు, ఆశలు, ఆకాంక్షల రూపం , ఒక అనుకూలమైన శక్తి ఈ ’మనసులో మాట’ . కొన్ని చోట్ల నుండి ఫిర్యాదులు కూడా ఉన్నాయి కానీ ప్రజల మనసుల్లో పొంగిపొరలే ఆలోచనలన్నింటితో నేను ముడిపడే ఒక పెద్ద అద్భుతమైన అవకాశాన్ని నాకు ఈ మనసులో మాట ఇచ్చింది. ఇవి నా మనసులో మాటలని నేనెప్పుడూ చెప్పలేదు. ఈ మనసులో మాట దేశప్రజలందరి మనసులతో ముడిపడి ఉంది. వారి భావాలతో, వారి ఆశలూ-ఆకాంక్షలతో జతపడి ఉంది. ఈ మనసులో మాటలో నేను చెప్పే కబుర్లు దేశం నలుమూలల నుండీ నాకు ప్రజలు పంపిన మాటలే. ఇంకా అవన్నీ చాలా తక్కువగానే చెప్తాను నేనింకా మీతో కొన్ని మాటలే పంచుకోగలుగుతాను కానీ నాకు మాత్రం ఒక మాటల భాండాగారమే లభిస్తోంది. ఈ -మెయిల్ ద్వారా, టెలీఫోన్ ద్వారా , mygov ద్వారా , NarendraModiApp ద్వారా ఇన్ని మాటలు నాకు చేరతాయి. వీటిలో చాలవరకూ నాకు ప్రేరణను కలిగించేవే. చాలావరకూ ప్రభుత్వంలో మార్పుల్ని తెచ్చేలాంటివే ఉంటాయి. కొన్ని వ్యక్తిగత ఫిర్యాదులు ఉమ్టే, కొన్ని సామూహిక సమస్యల పట్ల దృష్టిని నిలిపేలాంటివి ఉంటాయి. నెలలో ఒకసారి, ఒక అరగంట మీ సమయాన్నే నేను తీసుకుంటున్నాను కానీ ప్రజలు మాత్రం నెలలో ముఫ్ఫై రోజులూ ’మనసులో మాట’ కోసం తమ మాటలు చేరవేస్తూ ఉంటారు. ఇందుకు పరిణామంగా ఏమి జరిగిందంటే ప్రభుత్వంలో కూడా సున్నితత్వం ఏర్పడింది. సమాజంలో దూరప్రాంతాల్లో ఎలాంటి శక్తులు ఉన్నాయో, వారి పట్ల దృష్టి వెళ్ళే ప్రయత్నం జరిగింది. అందువల్ల మూడేళ్ళ ఈ మనసులో మాట ప్రయాణం దేశవాసులందరి మనోభావాల, అనుభూతుల తాలూకూ ప్రయాణం. ఇంత తక్కువ సమయంలో భారతదేశంలోని సామాన్యపౌరుడి భావాలను తెలుసుకుని అర్థం చేసుకునే అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు దేశప్రజలందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మనసులో మాట చెప్పే ప్రతిసారీ నేను ఆచార్య వినోభా భావే చెప్పిన మాటలను గుర్తుంచుకున్నాను. ఆచార్య వినోభా భావే ఎప్పుడూ అనేవారు ‘अ-सरकारी, असरकारी ’ అని. అంటే ప్రభుత్వేతరంగా ఉంటేనే లాభకారి అవుతారు అని. నేను కూడా మనసులో మాటలో ఎప్పుడూ ప్రజలనే ప్రధానాంశంగా ఉంచుకునే ప్రయత్నం చేసాను. రాజకీయపు రంగు దీనికి అంటకుండానే చూశాను. ఎప్పటికప్పుడు, పరిస్థితుల్లో ఎంతటి తీవ్రత ఉన్నా, ఆక్రోశాలున్నా, వాటితో పాటూ నేనూ కదిలిపోకుండా, ఒక స్థిరమైన మనసుతో, మీతో కలిసి ఉండే ప్రయత్నమే చేశాను.
ఇప్పుడు మూడేళ్ళు పూర్తయ్యాయి కాబట్టి సామాజిక శాస్త్రవేత్తలూ, విశ్వవిద్యాలయాలూ, పరిశోధనా పండితులు, మీడియా నిపుణులూ తప్పకుండా దీని విశ్లేషణ చేస్తారు. మంచి,చెడు రెంటినీ ఎత్తిచూపుతారు. కానీ ఇటువంటి విశ్లేషణాత్మక చర్చలే భవిష్యత్తులో మనసులో మాటకు ఎంతో ఎక్కువగా ఉపయోగపడతాయి. ఒక సరికొత్త స్పృహను, కొత్త ఉత్సాహాన్నీ అందిస్తాయి. భోజనం చేసేప్పుడు – మనకి ఎంత అవసరం అని ఆలోచించి, సరిపడినంతే తినాలి. పదార్థాలను వృధా చెయ్యకూడదు అని నేనిదివరకూ ’మనసులో మాట’లో ఒకసారి చెప్పాను. ఆ తర్వాత దేశం నలుమూలల నుండీ, అనేక సామాజిక సంస్థలు, అనేకమంది యువకులు ముందునుంచే ఇటువంటి పనులు చేస్తున్నారని చెప్తూ నాకు ఎన్నో ఉత్తరాలు వచ్చాయి. కంచంలో వదిలేసిన అన్నాన్ని ఒక చోట చేర్చి, దానిని ఎలా సద్వినియోగపరచాలని ఆలోచించేవాళ్ళు ఎంతో మంది ఉన్నారన్న సంగతి నా దృష్టికి వచ్చాకా, నాకు చాలా ఆనందమూ, ఎంతో సంతోషమూ కలిగాయి.
మరోసారి మనసులో మాటలో నేను మహరాష్ట్రలో పదవీ విరమణ చేసిన ఒక ఉపాధ్యాయుడు శ్రీ చంద్రకంత్ కులకర్ణీ గురించి చెప్పాను. ఆయనకు వచ్చే పదహారు వేల పెన్షన్ లోంచి ఐదు వేల రూపాయిలు తీసి, 51 పోస్ట్ డేటెడ్ చెక్ ల రూపంలో పారిశుధ్యం కోసం దానమిచ్చేసారు. ఆ తరువాత పరిశుభ్రత నిమిత్తమై ఇటువంటి పనులు చెయ్యడానికి ఎందరో ముందుకు వచ్చారు.
మరోసారి నేను హర్యానా లో ఒక సర్పంచ్ తీసుకున్న ’సెల్ఫీ విత్ డాటర్’ ఫోటో చూసి, దాని గురించి మనసులో మాటలో అందరితో చెప్పాను. చూస్తూండగానే ఒక్క భారతదేశంలోనే కాక, యావత్ ప్రపంచం లోనే ’సెల్ఫీ విత్ డాటర్’ అనే ఒక పెద్ద ఉద్యమం మొదలైంది. ఇది కేవలం సామాజిక మాధ్యమం తాలూకూ విషయం మాత్రమే కాదు. ప్రతి అమ్మాయిలోనూ ఒక కొత్త ఆత్మవిశ్వాసాన్నీ, నూతన గర్వాన్నీ ఉత్పన్నం చేసే సంఘటన ఇది. అందరు తల్లిదండ్రులకీ తమ కుమార్తెలతో సెల్ఫీ తీసుకోవాలి అని అనిపించింది. ప్రతి అమ్మాయికీ తనలో ఏదో గొప్పతనం ఉందనీ, తనకు ప్రాముఖ్యత ఉందనీ నమ్మకం కలిగింది.
కొద్ది రోజుల క్రితం నేను భారత ప్రభుత్వం వారి పర్యాటక శాఖా విభాగంలో కూర్చుని ఉన్నాను. అక్కడ ప్రయాణానికి వెళ్తున్న వారితో incredible India (అద్భుతమైన భారతదేశం) లో ఎక్కడికి వెళ్తే అక్కడ ఫోటోలు తీసి పంపించమని చెప్పాను. అప్పుడు భారతదేశం మారుమూల ప్రాంతాల నుండీ కూడా వచ్చిన లక్షల కొద్దీ చిత్రాలు, ఒక రకంగా పర్యాటక రంగంలో పనిచేసేవారందరికీ చాలా పెద్ద సంపదగా నిలిచాయి. ఒక చిన్న సంఘటన ఎంత పెద్ద ఉద్యమాన్ని లేవదీయగలదో మనసులో మాట ద్వారా నాకు అనుభవమైంది. మూడేళ్లు పూర్తయ్యాయన్న ఆలోచన రాగానే నా మనసు వాకిట్లో ఎన్నో సంఘటనలు మెదిలాయి. సరైన దిశలో నడవటానికి దేశం ఎప్పుడూ ముందే ఉంటుంది. దేశంలో ప్రతి పౌరుడూ, తోటి పౌరుడి హితం కోసం, సమాజానికి మంచి జరగడం కోసం, దేశ ప్రగతి కోసం, ఏదో ఒకటి చెయ్యాలనే అనుకుంటున్నాడు. ఇది నా మూడేళ్ళ ’మనసులో మాట ’ ప్రచారంలో భాగంగా దేశప్రజల నుండి విన్న, తెలుసుకున్న, నేర్చుకున్న సంగతి. ఏ దేశానికైనా సరే, అన్నింటికన్నా పెద్ద పెట్టుబడి, అతి పెద్ద శక్తి ఇదే. దేశప్రజలందరికీ హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను.
ఒకసారి మనసులో మాటలో నేను ఖాదీ గురించి మాట్లాడాను. ఖాది అనేది ఒక వస్త్రం కాదు, ఒక ఆలోచన అని చెప్పాను. ఈ మధ్య కాలంలో ప్రజల్లో ఖాదీ పట్ల ఆసక్తి పెరగటం గమనించాను. నేను మిమ్మల్ని స్వభావరీత్యా ఖాదీధారణ అలవరచుకోమని చెప్పలేదు కానీ మీరు వాడే రకరాకల వస్త్రాల్లో ఒక ఖాదీ వస్త్రాన్ని కూడా ఎందుకు కలుపుకోకూడదూ అని అడిగాను. కర్టెన్ గానో, దుప్పటి గానో, కనీసం రుమాలుగానైనా సరే. ఆ తర్వాత యువతలో ఖాదీ పట్ల ఆసక్తి పెరగడాన్ని నేను గమనించాను. ఖాదీ అమ్మకాలు పెరిగాయి. ఆ కారణంగా పేదల ఇళ్ళల్లో వారికి అవసరమైన ఉపాధి లభించింది. అక్టోబర్ రెండు గురించి ఖాదీ అమ్మకాల్లో డిస్కౌంట్ లు ఇవ్వబడతాయి. చాలావరకూ తగ్గింపు లభిస్తుంది. ఈ ఖాదీ ప్రచారాన్ని ఇలానే ముందుకు నడిపించి, పెంచాలని నేను మరోసారి కోరుతున్నాను. ఖాదీ వస్త్రాలని కొని పేదవారి ఇళ్లల్లో దీపావళి దీపాలను వెలిగించండి. ఈ భావనతో మనం పనిచేద్దాం. మన దేశంలోని పేదలకు ఈ పని వల్ల ఒక బలం చేకూరుతుంది. మనం అలా చెయ్యాలి కూడా. ఖాదీ పట్ల ఆసక్తి పెరిగిన కారణంగా, ఖాదీ రంగంలో పనిచేసేవారిలోనూ, భారత ప్రభుత్వం లో ఖాదీతో సంబంధం ఉన్న వారిలోనూ ఒక కొత్త కోణంలో ఆలోచించే ఉత్సాహం కూడా పెరిగింది. కొత్త సాంకేతికత ని ఎలా తేవాలి, ఉత్పాదన శక్తిని ఎలా పెంచాలి , సౌరశక్తితో పనిచేసే చేతి మగ్గాలు ఎలా తేవాలి, 20-20, 25-25, 30-30 ఏళ్ల నుండీ మూసుకుపోయి ఉన్న ప్రాచీన సాంప్రదాయాన్ని ఎలా పునరుధ్ధరించాలి – మొదలైన ఆలోచనలు పెరిగాయి.
ఉత్తర్ ప్రదేశ్ వారణాసి జిల్లాలోని సేవాపురి లో 26 ఏళ్ల నుండీ మూసుకుపోయిన ఖాదీ ఆశ్రమం పునరుధ్ధరించబడింది. అనేకమైన ప్రవృత్తులను జోడించారు. అనేకమందికి ఉపాధి అవకాశాలు ఉత్పన్నమయ్యాయి. కాశ్మీరు లోని పంపోర్ లో మూసుకుపోయిన ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల శిక్షణా కేంద్రాన్ని తిరిగి మొదలుపెట్టారు. ఈ రంగానికి ఇవ్వడానికి కాశ్మీరులో చాలా పని ఉంది. ఇప్పుడీ శిక్షణా కేంద్రం తిరిగి ప్రారంభమైన సందర్భంగా కొత్త తరాల వారికి నిర్మాణంలో, నేయడంలో, కొత్త వస్తువులు చెయ్యటంలో సహాయం లభిస్తుంది. ఈ మధ్యన పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు దీపావళి బహుమతులుగా ఇవ్వడానికి ఖాదీ వస్తువులని ఎన్నుకోవడం నాకు చాలా సంతోషాన్ని కలిగిస్తోంది. ప్రజలు కూడా ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకునేప్పుడు ఖాదీ వస్తువులను ఎన్నుకోవడం మొదలుపెట్టారు. కొన్ని వస్తువులు సహజంగా ఎలా ముందుకు వెళ్తాయో మనందరికీ అనుభవంలోకి వచ్చింది.
నా ప్రియమైన దేశ ప్రజలారా, క్రితం నెలలోని మనసులో మాటలో మనందరమూ ఒక సంకల్పాన్ని చేసుకున్నాం. గాంధీ జయంతికి పదిహేను రోజుల ముందు నుండీ దేశమంతటా పరిశుభ్రతా ఉత్సవాన్ని జరుపుకోవాలని మనం నిర్ణయించుకున్నాం. ప్రజలందరినీ పరిశుభ్రతతో కలుపుకుందామనుకున్నాం. మన గౌరవనీయులైన రాష్ట్రపతి గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. యావత్ దేశం ఏకమైంది. పిల్లలు-పెద్దలూ, పురుషులు, స్త్రీలు , నగరాల్లో, పల్లెల్లో, ప్రతిఒక్కరూ ఇవాళ పారిశుధ్య ప్రచారంలో భాగస్థులయ్యారు. “సంకల్పంతో సాధించగలం” అని నేను చెప్పినట్లుగా, ఈ పారిశుధ్య ప్రచారం ఏ రకంగా ముందుకు నడుస్తోందో మనం కళ్ల ముందరే చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ ప్రచారాన్ని స్వీకరించి, దీనికి సహకరించి, సఫల పరచడానికి తన వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఇందువల్ల ఆదరణీయులైన రాష్ట్రపతి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. వారితో పాటుగా దేశంలోని ప్రతి వర్గం వారు కూడా దీనిని సొంత పనిలా భావిస్తున్నారు. ప్రతి ఒక్కరు ఈ ప్రచారంతో జతపడ్డారు. క్రీడారంగంలో వారు, సినీ రంగంలో వారు, విద్యావేత్తలు, పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, రైతులు, కూలీలు, అధికారులు, పోలీసులు, పిల్లలు, జవానులు – ప్రతి ఒక్కరూ దీనితో కలిసిపోయారు. సార్వజనీన ప్రదేశాల్లో ఒక వత్తిడి కనబడుతోంది.. ఈ ప్రదేశాలు చెత్తగా ఉంటే ప్రజలు ఊరుకోరు అన్న అవగాహన కనబడుతోంది. అక్కడ పనిచేసేవారిలో కూడా ఈ వత్తిడి కనబడుతోంది. ఇది చాలా మంచిది. ’పరిశుభ్రతే సేవ’ అనే ప్రచారం మొదలుపెట్టిన నాలుగురోజుల్లోనే డెభ్భై ఐదు లక్షల కంటే అధికంగా ప్రజలు, నలభై వేల కన్నా అధికంగా ప్రజలు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాల్లో భాగమైపోయారు. కొందరైతే పరిణామాలు తప్పక చూపెడతామన్న లక్ష్యంతో నిరంతరం పని చేస్తున్నారు. ఈసారి మరో కొత్త సంగతి కూడా గమనించాం – ఒక పక్క పారిశుధ్య కార్యక్రమాలు చేస్తూ, మరో పక్క చెత్త పారేయకుండా జాగ్రత్త పడుతూండడం. పరిశుభ్రతను ఒక స్వభావంగా మార్చుకోవాలంటే, భావోద్వేగ ఉద్యమం కూడా అవసరమే. ఈసారి “పరిశుభ్రతే సేవ” ద్వారా ఎన్నో పోటీలు జరిగాయి. రెండున్నర వేల కంటే ఎక్కువమంది పిల్లలు ఈ పరిశుభ్రత తాలుకు వ్యాస రచన పోటీల్లో పాల్గొన్నారు. వేల మంది పిల్లలు చిత్రాలు తయారుచేశారు. తమ తమ ఊహలతోనే పరిశుభ్రత గురించిన చిత్రాలు వేసారు. చాలా మంది కవితలు రాసారు. చిన్న చిన్న పిల్లలు నాకు వేసి పంపించిన బొమ్మలను నేను సామాజిక మాధ్యమం ద్వారా పంచుకుంటున్నాను. వారిని మెచ్చుకుంటున్నాను. పారిశుధ్యం మాట వచ్చినప్పుడల్లా మీడియా వారికి ధన్యవాదాలు తెలపడం నేనెప్పుడూ మర్చిపోను. ఈ ప్రచారాన్ని వారు ఎంతో పవిత్రపూర్వకంగా ముందుకు నడిపించారు. వారి వారి పధ్ధతులలో ఈ ప్రచారంతో ముడిపడి, ఒక అనుకూలమైన వాతావరణం తయారుచెయ్యడానికి వారెంతో సహకరించారు. ఇప్పుడు కూడా వారు తమ పధ్ధతులలో పారిశుధ్య ప్రచారానికి నాయకత్వం వహిస్తున్నారు. మన దేశం లోని ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, దేశానికి ఎంత సేవ చేస్తున్నారో “పరిశుభ్రతే సేవ” ఉద్యమంలో మనం చూస్తున్నాం. ఈమధ్యన శ్రీనగర్ కు చెందిన బిలాల్ డార్ అనే పధ్ధెనిమిదేళ్ల యువకుడు గురించి ఎవరో నాకు చెప్పారు. శ్రీనగర్ పురపాలక సంఘం “పారిశుధ్యం” కోసం ఈ బిలాల్ డార్ ను తమ బ్రాండ్ అంబాసిడర్ గా నియమించిందని తెలిస్తే మీరు సంతోషపడతారు. బ్రాండ్ అంబాసిడర్ అనగానే అతడు సినీ రంగానికి చెందినవాడేమో, క్రీడా రంగానికి చెందిన హీరో ఏమో అని మీరు అనుకోవచ్చు. కానే కాదు. బిలాల్ డార్ తన పన్నెండు-పదమూడేళ్ళ వయసు నుంచీ, గత ఐదారేళ్ళుగా పరిశుభ్రతపైనే దృష్టి పెట్టాడు. ఆసియాలోనే అతిపెద్దదైన సరస్సు శ్రీనగర్ లో ఉంది కదా. అక్కడ ప్లాస్టిక్, పాలిథీన్, వాడేసిన బాటిల్స్, చెత్తా చెదారం, అన్నింటినీ శుభ్రపరుస్తూ వస్తున్నాడు ఈ కుర్రాడు. వాటితో కాస్తంత ఆదాయం కూడా అతడికి లభిస్తోంది. అతడి తండ్రి చిన్నతనంలోనే కేన్సర్ తో చనిపోతే, తన జీవనానికి సరిపడే జీవనోపాధికి పారిశుధ్యాన్ని కూడా జతపరిచాడీ యువకుడు. బిలాల్ ఏడాదికి పన్నెండు వేల కిలోల కంటే ఎక్కువ చెత్తను శుభ్రపరిచాడని ఒక అంచనా. పారిశుధ్యం పట్ల ఇంతటి శ్రధ్ధ చూపిస్తున్నందుకు, బ్రాండ్ అంబాసిడర్ ఆలోచన చేసినందుకు గానూ శ్రీనగర్ నగరపాలక సంఘాన్ని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే శ్రీనగర్ ఒక ప్రముఖ పర్యాటక ప్రాంతమే కాక భారతదేశంలో ప్రతి ఒక్కరూ వెళ్లాలని కోరుకునే నగరమైన శ్రీనగర్ లో ఇలాంటి పరిశుభ్రత కార్యక్రమాలు జరగడం చాలా పెద్ద విషయం. బిలాల్ ను బ్రాండ్ అంబాసిడర్ గా ఎన్నుకోవడమే కాక అతడికి పురపాలక సంస్థ వాహనాన్ని ఇచ్చి, యూనిఫారమ్ ని ఇచ్చింది. బిలాల్ ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రజలు పరిశుభ్రతను పాటించేందుకు తగిన శిక్షణను ఇస్తాడు. ప్రేరణను అందిస్తూ, ప్రజలు కార్యరంగంలోకి దిగే దాకా వారి వెంటనే ఉంటాడు. వయసులో చిన్నవాడైనా పరిశుభ్రత పట్ల ఆసక్తి ఉన్న వారందరికీ ఇతడు ప్రేరణకర్త. బిలాల్ దార్ కి అనేకానేక అభినందనలు అందిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, భవిష్యత్ చరిత్ర, గత చరిత్రలోంచే జన్మిస్తుందని మనం ఒప్పుకోవాలి. చరిత్ర సంగతి వస్తే, మహాపురుషులు గుర్తుకురావడం స్వాభావికమే. ఈ అక్టోబర్ నెల ఎందరో మహాపురుషులను స్మరించుకోవాల్సిన నెల. మహాత్మా గాంధీ మొదలుకొని సర్దార్ పటేల్ వరకూ ఎందరో మహాపురుషులు మన ముందర ఉన్నారు. వారంతా కూడా ఇరవైయ్యవ, ఇరవై ఒకటవ శతాబ్దాల కోసం మనందరికీ దారి చూపారు. నాయకత్వం వహించారు. మార్గదర్శకంగా నిలిచారు. దేశం కోసం వారంతా ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. అక్టోబర్ రెండవ తేదీన మహాత్మా గాంధీ, లాల బహదూర్ శాస్త్రి గార్ల జయంతి అయితే అక్టోబర్ పదకొండు జయప్రకాశ్ నారాయణ్, నానాజీ దేశ్ ముఖ్ గార్ల జయంతి. సెప్టెంబర్ 25 పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారి జయంతి. ఈసారి నానాజీ గారిదీ, పండిట్ దీన్ దయాళ్ గారిదీ శతాబ్ది సంవత్సరం కూడా. ఈ మహాపురుషులందరి కేంద్ర బిందువు ఏమిటో తెలుసా? అందరిలో ఉన్న ఒక సాధారణ విషయం ఏమిటంటే దేశం కోసం బ్రతకడం, దేశం కోసం ఏదైనా చెయ్యడం. కేవలo ఉపదేశాలివ్వడమే కాక తమ జీవితాల ద్వారా నిరూపించి చూపెట్టిన మహానుభావులు వాళ్ళు. గాంధీ గారు, జయప్రకాశ్ గారు, దీన్ దయాళ్ గారూ ఎటువంటి మహాపురుషులంటే వారు జనసందోహాల నుండి మైళ్ల దూరంలో ఉండి కూడా ప్రజాజీవితాలతో పాటుగా క్షణం క్షణం జీవించారు. ’బహుజన హితాయ-బహుజన సుఖాయ’ అన్నట్లుగా ప్రజాహితం కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. నానాజీ దేశ్ ముఖ్ గారు రాజకీయ జీవితాన్ని వదిలేసి, గ్రామోదయం పనిలో నిమగ్నమయ్యారు. ఇవాళ వారి శతజయంతి జరుపుకుంటూంటే వారి గ్రామోదయ కార్యక్రమం పట్ల గౌరవభావం కలగడం స్వాభావికమే.
భారతదేశ మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారు యువకులతో మాట్లాడిన ప్రతిసారీ నానాజీ దేశ్ ముఖ్ గారి గ్రామీణ అభివృధ్ధికి సంబంధించిన విషయాలే చెప్పేవారు. ఎంతో గౌరవంతో ఉదహరిస్తూ ఉండేవారు. వారు స్వయంగా నానాజీ చేపట్టిన కార్యక్రమాలను చూసేందుకు గ్రామాలకు వెళ్ళారు.
మహాత్మా గాంధీ గారి లాగనే దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు కూడా సమాజంలో చివరి వరుసలో కూర్చున్న వ్యక్తి గురించి మట్లాడేవారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ్ గారు కూడా సమాజంలో చివరి వరుసలో కూచున్న పేద, పీడిత,వంచిత, దోపిడీకి గురైనవారి జీవితాలలో విద్య ద్వారా, ఉపాధి ద్వారా ఎలా మార్పుని తీసుకురావచ్చో చెప్తూ ఉండేవారు.
ఈ మహాపురుషులందరినీ స్మరించుకోవడం వారికి ఉపకారం చెయ్యడానికి కాదు. ముందుకి నడవడానికి మనకి దారి దొరుకుతుందని. మనం సరైన దిశలో పయనించాలని.
రాబోయే మన్ కీ బాత్ లో నేను తప్పకుండా సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి చెప్తాను. అక్టోబర్ 31 నాడు దేశం మొత్తం రన్ ఫర్ యూనిటీ – ’ఒక శ్రేష్ఠ భారత దేశం’ కార్యక్రమాన్ని చేపట్టాలి. దేశం లోని ప్రతి నగరంలోనూ, పెద్ద ఎత్తున రన్ ఫర్ యూనిటీ కార్యక్రమం జరగాలి. వాతావరణం కూడా పరిగెత్తాలనిపిచేంత ఆహ్లాదకరంగా ఉంది. సర్దార్ గారంతటి ఉక్కు శక్తిని పొందాలంటే ఇది అవసరం. ఆయన దేశాన్ని ఏకం చేసారు. మనం కూడా ఏకత్వం కోసం పరిగెత్తి, ఏకత్వ మంత్రాన్ని ముందుకు నడిపించాలి.
భిన్నత్వంలో ఏకత్వం మన భారతదేశ ప్రత్యేకత అని సాధారణంగా చెప్తూ ఉంటాము. భిన్నత్వాన్ని మనం గౌరవిస్తాం కానీ మీరెప్పుడైనా ఈ భిన్నత్వాన్ని అనుభూతి చెందే ప్రయత్నం చేసారా? మనం ఒకానొక జాగృతావస్థలో ఉన్నాం అని నేను ప్రతిసారీ చెప్తూ వస్తున్నాను. భారతదేశంలోని వైవిధ్యాలను అనుభూతి చెందండి, వాటిని స్పృశించండి, వాటి పరిమళాన్ని అస్వాదించండి అని ప్రత్యేకంగా మన యువతతో చెప్పాలనుకున్నాను. మీరు చూడండి, మీ వ్యక్తిత్వ వికాసానికి కూడా మన దేశంలోని వైవిధ్యాలు పెద్ద పాఠశాలలుగా మారగలవు. సెలవు రోజులు గడుస్తున్నాయి. దీపావళి దగ్గర పడుతోంది. దేశంలో ఏదో ఒక చోటికి ప్రయాణించి వెళ్ళే ఆలోచనలో అంతా ఉన్నారు. అందరూ పర్యాటకులుగా వెళ్లడం సాధారణమైన విషయమే. కానీ బాధని కలిగించే విషయం ఏమిటంటె, ప్రజలు మన దేశాన్ని చూడరు, దేశం లోని వైవిధ్యాలను చూడరు. తెలుసుకోరు. కానీ తళుకుబెళుకుల మాయలో పడి విదేశీ పర్యటన చేసేందుకు మాత్రం సంసిధ్ధంగా ఉన్నారు. మీరు ప్రపంచాన్ని చూడండి. నాకే అభ్యంతరమూ లేదు. కానీ ఎప్పుడైనా మన ఇంటిని కూడా చూడండి. ఉత్తర భారతదేశంలో వ్యక్తికి దక్షిణ భారత దేశం గురించి ఏం తెలుస్తుంది? పశ్చిమ భారత వ్యక్తికి తూర్పు వైపున ఏముందో ఎలా తెలుస్తుంది? మన దేశం ఎన్నోఈ వైవిధ్యాలతో నిండి ఉంది.
మన మాజీ రాష్ట్రపతి శ్రీ అబ్దుల్ కలాం గారి మాటల్లో చూస్తే ఒక సంగతి తెలుస్తుంది. మహాత్మా గాంధీ, లోకమాన్య తిలక్, స్వామీ వివేకానంద, మొదలైనవారు భారతదేశ పర్యటన చేసినప్పుడు వారికి భారతదేశాన్ని తెలుసుకోవడానికి, అర్థం చేసుకోవడానికీ, దేశం కోసం పోరాడి, ప్రాణాలర్పించడానికి ఒక కొత్త ప్రేరణ లభించింది. ఈ మహానుభావులందరూ కూడా దేశంలో విస్తృతంగా పర్యటించారు. ఈ పని మొదలుపెట్టే ముందు,భారతదేశాన్ని తెలుసుకుని, అర్థం చేసుకునే ప్రయత్నం చేశారు. భారతదేశాన్ని తనలో నింపుకుని జీవించే ప్రయత్నం చేసారు. మనం మన దేశం లోని భిన్న భిన్న రాజ్యాలని, వైవిధ్యమైన సమాజాలనీ, సమూహాలనీ, వారి రీతి-రివాజులనీ, వారి సంప్రదాయాన్నీ, వారి వేషభాషలనూ, భోజన అలవాట్లను, వారి ప్రమాణాలను ఒక విద్యార్థిగా నేర్చుకుని, అర్థం చేసుకుని,జీవించే ప్రయత్నం చెయ్యగలమా?
మనం పరిచయస్థుల్లా కాకుండా, ఒక విద్యార్థిగా ఇతరులను తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తేనే పర్యాటనలో వేల్యూ ఎడిషన్ ఉంటుంది. నా స్వీయ అనుభవం ఏమిటంటే నాకు భారతదేశంలోని సుమారు ఐదువందల కన్న ఎక్కువ జిల్లాలకు వెళ్ళే అవకాశం లభించి ఉంటుంది. నాలుగువందల ఏభై కంటే ఎక్కువ జిల్లాల్లో నాకు రాత్రిపూట గడిపే అవకాశం లభించింది. ఇవాళ్టిరోజున భారతదేశంలో నేనింత పెద్ద బాధ్యత వహిస్తున్నానంటే, ఆ ప్రయాణం తాలూకూ అనుభవాలు నాకు చాలా ఉపయోగపడటం వల్లనే. విషయాలను అర్థం చేసుకోవడానికి నాకు చాలా సౌకర్యాలు లభిస్తాయి. “భిన్నత్వం లో ఏకత్వం” అనే కేవలం నినాదం చెప్పడం కాకుండా, ఈ విశాల భారత దేశాన్ని, మన అపారమైన శక్తి భాండాగారాన్నీ మీరంతా అనుభూతి చెందాలని నేను కోరుకుంటున్నాను. “ఒకే భారతం -శ్రేష్ఠ భారతం” కల ఇందులోనే దాగి ఉంది. మన భోజనాది విషయాల్లో ఎంతో వైవిధ్యం ఉంది. జీవితాంతం ప్రతి రోజూ ఒకో కొత్త రకం పదార్థం తింటూ ఉన్నా కూడా పునరావృత్తo అవ్వనన్ని వైవిధ్యాలు మన భోజనాలలో ఉన్నాయి.
ఇదే మన దేశ పర్యాటనలో ఉన్న పెద్ద శక్తి. నా విన్నపం ఏమిటంటే, మీరీ సెలవులలో ఏదో బయటకు వెళ్ళడం కోసమో , మార్పు కోసమో బయల్దేరామని కాకుండా ఏదన్నా తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాలి, నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో బయటకు వెళ్లండి. భారతదేశాన్ని మీ లోపల దర్శించుకోండి. ఈ అనుభవాలతో మీ జీవితం సమృధ్ధమవుతుంది. మీ ఆలోచనా పరిథి విశాలమవుతుంది. అనుభవాలకు మించిన పాఠాలేముంటాయి?సాధారణంగా అక్టోబర్ నుండి మార్చి దాకా ఎక్కువగా పర్యాటనకు బావుంటుంది. ప్రజలు అలానే వెళ్తూంటారు. మీరీసారి వెళ్తే గనుక నా ప్రచారాన్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తారని నాకు నమ్మకం. మీరెక్కడికి వెళ్ళినా మీ అనుభవాలను పంచుకోండి. చిత్రాలను పంచుకోండి.#incredibleindia ( హ్యాష్ టాగ్ incredibleindia) లో మీ ఫోటోని తప్పక పంపించండి. మీరు వెళ్ళిన చోట కలిసిన మనుషుల చిత్రాలను కూడా పంపించండి. కేవలం నిర్మాణాల గురించే కాకుండా, కేవలం ప్రకృతి సౌందర్యాన్నే కాకుండా అక్కడి జనజీవన విధానాల గురించి కూడా రాయండి. మీ ప్రయాణం గురించిన చక్కని వ్యాసాన్ని రాయండి. Mygov లేదాNarendraModiApp కి పంపించండి. మన పర్యాటక శాఖను ప్రోత్సహించడానికి నాకొక ఆలోచన వచ్చింది. మీ రాష్ట్రం లోని ఏడు ఉత్తమమైన పర్యాటక ప్రదేశాలను గురించి రాయండి. ప్రతి భారతీయుడూ మీ రాష్ట్రం లోని ఆ ఏడు ప్రాంతాల గురించీ తెలుసుకోవాలి. వీలైతే వెళ్లాలి. ఈ విషయంలో మీరేదైనా సమాచారాన్ని అందించగలరా? NarendraModiApp లో ఆ సమాచారాన్ని ఇవ్వగలరా? #incredibleindia లో పెట్టగలరా? మీరు చూడండి, ఒకే రాష్ట్రం నుండి అందరూ అందించిన సమాచారం నుండి పరిశీలించి, వాటిల్లో ఎక్కువగా వచ్చిన ఏడు ప్రదేశాలను గురించి ప్రచార సాహిత్యాన్ని తయారుచెయ్యవలసిందిగా ప్రభుత్వానికి నేను చెప్తాను. ఒక రకంగా చెప్పాలంటే, ప్రజల అభిప్రాయాల వల్ల పర్యాటక ప్రదేశాల ప్రచారం జరుగుతుందన్నమాట. ఇలానే దేశం మొత్తంలో మీరు చూసిన ప్రదేశాలలోకెల్లా చూసి తీరాల్సిన ఏడు ప్రదేశాల గురించి, మరెవరైనా చూస్తే చాలా బావుంటుంది, తెలుసుకోవాలి అనిపించే ప్రదేశాల గురించిన వివరాలనుMyGov కీ, NarendraModiApp కీ తప్పకుండా పంపించండి. భారత ప్రభుత్వం వాటిపై తప్పక పనిచేస్తుంది. అటువంటి ఉత్తమ ప్రదేశాలపై చిత్రాల తయారీ, వీడియోలు చేయడం, ప్రచార-సాహిత్యాన్ని తయారు చెయ్యడం, వాటిని ప్రోత్సహించడం ద్వారా మీ నుంచి అందిన, ఎన్నిక కాబడ్డ ప్రదేశాల సమాచారాన్ని ప్రభుత్వం స్వీకరిస్తుంది. రండి, నాతో కలిసి నడవండి. ఈ అక్టోబర్ నెల నుండీ మార్చి నెల వరకూ ఉన్న సమయాన్ని దేశ పర్యాటనలో ఉపయోగించుకుందుకు, ప్రోత్సహించేందుకు మీరు కూడా ఒక పెద్ద ఉత్ప్రేరక సాధకులుగా మారచ్చు. మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, ఒక మనిషిగా ఎన్నో విషయాలు నన్నూ కదుపుతాయి. నా మనసుని ఆందోళనకు గురి చేస్తాయి. నా మనసుపై గాఢమైన ప్రభావాన్ని వదిలివెళ్తాయి. ఎంతైనా నేను కూడా మీలాగే మనిషిని కదా. గత కొద్ది రోజుల్లో జరిగిన ఒక సంఘటన మీ దృష్టికి కూదా వచ్చే ఉంటుంది.. మహిళా శక్తి, దేశ భక్తి ల అనూహ్యమైన ఉదాహరణను మన దేశప్రజలందరమూ చూశాము.
భారత సైన్యానికి లెఫ్టేనెంట్ స్వాతి, నిధి ల రూపాల్లో ఇద్దరు వీర వనితలు లభించారు. వీరు అసామాన్యులు. అసామాన్యులు అని ఎందుకు అంటున్నానంటే భారతమాత కి సేవ చేస్తూ, చేస్తూ వారి భర్తలు స్వర్గస్థులయ్యరు. చిన్న వయసులో సంసారం ఛిన్నాభిన్నమయిపోతే వారి మన:స్థితి ఎలా ఉంటుందో మనం ఊహించగలం. కానీ అమరవీరుడు కర్నల్ సంతోష్ మహాదిక్ భార్య స్వాతి మహాదిక్ ఇటువంటి కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటూనే భారత సైన్యంలో చేరాలని నిశ్చయించుకుంది. భారత సైన్యంలో చేరింది. పదకొండు నెలలపాటు ఆమె కఠినమైన పరిశ్రమతో శిక్షణ పొంది, తన భర్త కలలను సాకారం చెయ్యడానికి తన జీవితాన్ని అంకితం చేసింది. అలానే నిధీ డూబే భర్త ముఖేష్ డూబే కూదా సైన్యంలో పని చేస్తూ, మృత్యుభూమికి మరలిపోయారు. ఆయన భార్య నిధి కూడా సైన్యంలోనే చేరాలని పట్టుబట్టి, చేరింది. ప్రతి భారతీయుడికీ మన ఈ మాతృ శక్తి పట్ల, మన ఈ వీర వనితల పట్ల గౌరవభావం కలగడం స్వాభావికమే. నేను ఈ ఇద్దరు సోదరీమణులకూ హృదయపూర్వకంగా అనేకానేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వారు దేశం లోని కోటాదికోట్ల ప్రజలకి కొత్త ప్రేరణనూ, కొత్త ఉత్తేజాన్నీ అందించారు. ఆ ఇద్దరు సోదరీమణులకూ అనేకానేక అభినందనలు.
నా ప్రియమైన దేశప్రజలారా, నవరాత్రి ఉత్సవాలు, దీపావళి పండుగల నడుమ మన దేశ యువతకి ఒక పెద్ద అవకాశం వేచి ఉంది. FIFA under-17 ప్రపంచ కప్ మన దేశంలో జరుగుతోంది. నలువైపులా ఫుట్ బాల్ శబ్దాలు ప్రతిధ్వనిస్తూ ఉంటాయని నా నమ్మకం. ప్రతి తరానికీ ఫుట్ బాల్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. భారతదేశం లోని ఏ పాఠశాలలోనూ, కళాశాల లోనూ ఫుట్ బాల్ ఆట ఆడుతూండే యువకులు లేని గ్రౌండ్ ఉండదు. ప్రపంచమంతా భరతభూమిపై ఆడడానికి తరలివస్తోంది. రండి, మనందరమూ ఆటని మన జీవితాలలో భాగం చేసుకుందాం.
నా ప్రియమైన దేశప్రజలారా, నవరాత్రి పండుగ జరుగుతోంది. దుర్గాదేవి పూజ జరుగుతోంది. వాతావరణమంతా పవిత్రంగా, సుగంధభరితంగా ఉంది. నలువైపులా ఆధ్యాత్మిక వాతావరణం, ఉత్సవ వాతావరణం, భక్తితో నిండిన వాతావరణం ఉంది. ఇదంతా శక్తి సాధన ఉత్సవంగా పరిగణించబడుతుంది. వీటిని శారద నవరాత్రులని కూడా అంటారు. ఇప్పటి నుండీ శరదృతువు ప్రారంభమవుతుంది. పవిత్రమైన నవరాత్రి సందర్భంగా దేశప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు. దేశంలోని సామాన్యపౌరుడి జీవితంలోని ఆశలు, ఆకాంక్షలన్నీ తీర్చేందుకు మన దేశం ఉన్నత శిఖరాలను అందుకోవాలని అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. అన్నిరకాల సవాళ్లనూ ఎదుర్కొనే సామర్థ్యం దేశానికి రావాలని కోరుకుంటున్నాను. దేశం వేగంగా ముందుకు సాగాలనీ, 2022 లో భారతదేశం స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకునేనాటికి, స్వాతంత్ర్యసమరయోధుల కలలన్నీ సాకారం చేసే ప్రయత్నం, 125కోట్ల దేశప్రజల సంకల్పం, అవిరామ కృషి, అవిరామ ప్రయత్నాలు, సంకల్ప సిధ్ధికి తయారుచేసుకున్న ఐదేళ్ల రోడ్ మ్యాప్ పై ప్రయాణానికి అమ్మవారు మనల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. ఉత్సవాలను జరుపుకోవాలి. ఉత్సాహాన్నీ పెంచుకోవాలి.
అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశవాసులారా, సాదర నమస్కారం! ఒకవైపు దేశం ఉత్సవాలలో మునిగి ఉంది. మరోవైపు భారతదేశంలో ఏదో ఒక మూల నుండి హింసాత్మక వార్తలు వచ్చినప్పుడు దేశం చింతించడం సహజమే. ఇది బుధ్ధ భగవానుడు, గాంధీ పుట్టిన దేశం. దేశ ఐక్యత కోసం ప్రాణాలను సైతం అర్పించిన సర్దార్ పటేల్ పుట్టిన దేశం ఇది. కొన్ని యుగాలుగా మన పూర్వీకులు ప్రజల జీవన విలువలను, అహింసను , సమానంగా ఆదరించారు. ఇది మన నరనరాల్లో నిండి ఉంది. "అహింసా పరమో ధర్మ: " దీనిని మనం చిన్నప్పటి నుండీ వింటూ వచ్చాం చెప్తూ వచ్చాం. నేను ఎర్ర కోట నుండి కూడా చెప్పాను - విశ్వాసాల పేరుతో హింసను సహించేది లేదు అని చెప్పాను. అది సంప్రదాయపరమైన విశ్వాసం అయినా సరే, రాజకీయ ఆలోచనా ధోరణి తాలూకూ విశ్వాసం అయినా సరే, ఒక వ్యక్తి పట్ల ఉన్న విశ్వాసం అయినా సరే, వారసత్వపరమైన విశ్వాసం అయినా సరే. విశ్వాసాల పేరుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరికీ లేదు. డాక్టర్. బాబా సాహెబ్ అంబేద్కర్ మనకు ఇచ్చిన రాజ్యాంగం ప్రకారం, ప్రతి వ్యక్తి కీ న్యాయం పొందేందుకు అన్నిరకాల ఏర్పాట్లూ ఉన్నాయి. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారు, హింసామార్గంలో పయనించేవారు ఎవరినైనా సరే, వారు వ్యక్తి అయినా, గుంపు అయినా, ఈ దేశం సహించదు. ఏ ప్రభుత్వమూ సహించదు అని నేను దేశప్రజలకు నమ్మకంగా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ చట్టానికి లోబడి ఉండాల్సిందే. చట్టం జవాబుదారీలను నిర్ణయించి, దోషులకు శిక్షను వేసి తీరుతుంది.
మన దేశం అనేక భిన్నత్వాలతో నిండి ఉంది. ఈ భిన్నత్వాలు ఆహారం, జీవనశైలి, వస్త్రధారణ వరకే పరిమితం కాదు. జీవితంలో ప్రతి విషయంలోనూ ఈ వైవిధ్యాలు మనకు కనిపిస్తాయి. మన పండుగలు కూడా అనేక భిన్నత్వాలతో నిండి ఉన్నాయి. కొన్ని వేల సంవత్సరాల నాటి పురాతాన సంస్కృతి మనకు వారసత్వంగా లభించిన కారణంగా సాంస్కృతిక సంప్రదాయాలు, సామజిక సంప్రదాయాలు, చారిత్రక ఘటనలు, అన్నీ గమనిస్తే, గనుక ఏడాదిలో ఏదో ఒక్కరోజు ఏ పండుగతోనూ ముడిపడని రోజు ఉంటుందేమో. మన పండుగలన్నీ కూడా ప్రకృతిపరంగా కాలానుగుణంగా వస్తుంటాయి. అన్నీ కూడా ప్రకృతితో నేరుగా సంబంధం కలిగి ఉంటాయి. చాలావరకూ మన పండుగలన్నీ కూడా రైతులతో ముడిపడి ఉంటాయి, జాలరులతో జతపడి ఉంటాయి.
ఈవేళ నేను పండుగల గురించి చెప్తున్నాను కాబట్టి అన్నింటికన్నా ముందర మీ అందరికీ ’మిచ్ఛామి దుక్కడం’ - నొప్పించి ఉంటే క్షమించండి అని చెప్పాలనుకుంటున్నాను. జైన సమాజం నిన్న సంవత్సరీ పండుగ జరుపుకుంది. జైన సమాజంవారు భాద్రపద మాసంలో పురుషూయ పండుగ జరుపుకుంటారు. పురుషూయ పండుగ ఆఖరిరోజున సంవత్సరీ పండుగ ఉంటుంది. నిజంగా ఇది ఒక అద్భుతమైన సంప్రదాయం. సంవత్సరీ పండుగ క్షమ, అహింస, స్నేహా భావాలకు ప్రతీక. దీనిని ఒక రకంగా క్షమాపణ పండుగ అని కూడా అంటారు. ఈ రోజున ఒకరికొకరు ’మిచ్ఛామి దుక్కడం ’ అని చెప్పుకునే సంప్రదాయం ఉంది. అలానే మన శాస్త్రాల్లో ’క్షమా వీరస్య భూషణమ్’ అంటే క్షమించడం వీరులకు ఆభరణం వంటిదని అర్ధం. క్షమించేవారే వీరులు. ’క్షమించడం బలవంతుడి ప్రత్యేకత’ అని మహాత్మా గాంధీ చెప్పిన మాటలు మనం వింటూనే వచ్చాం.
షేక్స్పియర్ తన ’ మర్చెంట్ ఆఫ్ వెనీస్ ’ నాటకంలో క్షమాభావం ఎంత గొప్పదో చెప్తూ - "“Mercy is twice blest, It blesseth him that gives and him that takes” అంటాడు. అంటే క్షమించేవాడు, క్షమించబడేవాడూ, ఇద్దరికీ భగవంతుడి ఆశీర్వాదం లభిస్తుంది" అని అర్థం.
నా ప్రియమైన దేశప్రజలారా, ప్రస్తుతం దేశం నలుమూలలా అందరూ వైభవంగా గణేశ చతుర్థి పండుగ జరుపుకుంటున్నారు. గణేశ చతుర్థి సంగతి వచ్చినప్పుడు బహిరంగ-గణేశోత్సవాల విషయం రావడం స్వాభావికమే. బాలగంగాధర తిలక్ గారు 125 ఏళ్ళ క్రితం ఈ సంప్రదాయానికి జన్మనిచ్చారు. గత 125 ఏళ్ళు స్వాతంత్రానికి పూర్వం అవి స్వాతంత్ర్యోద్యమానికి ప్రతీకగా ఉండేవి. స్వాతంత్రం తరువాత అవి సమాజ శిక్షణ, సామాజిక చైతన్యాన్ని మేల్కొలిపడానికి ప్రతీకగా నిలిచాయి. గణేశ చతుర్థి పండుగ పదిరోజుల వరకూ చేస్తారు. ఈ పండుగని ఏకత్వం, సమానత, పరిశుభ్రతలకు ప్రతీకగా చెప్తారు. దేశవాసులందరికీ గణేశ ఉత్సవాల సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు.
ఇప్పుడు కేరళలో ఓనమ్ పండుగ జరుపుకుంటున్నారు. భారతదేశంలోని రంగురంగుల పండుగలలో కేరళకు చెందిన ఓనమ్ ఒక ప్రముఖమైన పండుగ. ఈ పండుగ సామాజిక, సాంస్కృతిక ప్రాముఖ్యతను తెలుపుతుంది. ఓనమ్ పండుగ కేరళీయుల గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. ఈ ఉత్సవం సమాజంలో ప్రేమ మరియు సామరస్యం యొక్క సందేశంతో కొత్త ఉత్సాహం, కొత్త ఆశ, ప్రజల మనస్సుల్లో కొత్త విశ్వాసాన్ని జాగృతం చేస్తుంది. ఇప్పుడు మన పండుగలు కూడా పర్యాటక శాఖ వారి ఆకర్షణలుగా మారుతున్నాయి. గుజరాత్ లో నవరాత్రి ఉత్సవాలు, బెంగాలు లో దుర్గా పూజ ఉత్సవాలు ఒకరకంగా పర్యాటక శాఖ వారి ఆకర్షణలుగా మారిపోయాయి. మన ఇతర పండుగలు కూడా విదేశీయులను ఆకర్షించడానికి ఉపయోగపడతాయి. ఆ దిశగా మనం ఏం చెయ్యగలమని ఆలోచించాలి.
ఈ పండుగల పరంపరలో కొన్ని రోజుల్లో ’ఈద్-ఉల్-జుహా’ పండుగ వస్తోంది. దేశవాసులందరికీ ’ఈద్-ఉల్-జుహా’ సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు, అభినందనలు. పండుగ అంటే నమ్మకానికీ, విశ్వాసానికీ చిహ్నం. నవభారతదేశంలో పండుగలను పరిశుభ్రతకు ప్రతీకలుగా తయారుచెయ్యాలి. పండుగకు తయారవడమంటే - ఇంటిని శుభ్రపరచడం. ఇది మనకు కొత్తేమీ కాదు కానీ దీనిని ఒక సామాజిక అలవాటుగా మార్చడం ముఖ్యం. సార్వత్రికంగా శుభ్రత అంటే కేవలం ఇంట్లో అని మాత్రమే కాదు. మొత్తం గ్రామంలో, నగరంలో, పట్టణంలో, రాష్ట్రంలో, మన దేశంలో శుభ్రత, పరిశుభ్రతని పండుగలలో ఒక ముఖ్యమైన భాగంగా తయారుచెయ్యాలి.
నా ప్రియమైన దేశప్రజలారా, ఆధునికత అర్థాలు మారుతున్నాయి. ఈ రోజుల్లో మీరెంత సంస్కారవంతులైనా, ఎంత ఆధునీకులైనా మీ ఆలోచనా విధానం ఎంత నూతనంగా ఉన్నా సరే, అవన్నీ బేరీజు వెయ్యడానికి ఒక కొత్త కోణం, ఒక కొత్త కొలమానం, ఒక సంతులనం తయారయ్యాయి; అదేమిటంటే పర్యావరణం పట్ల మీరెంత జాగ్రత్తగా ఉన్నారు అన్నది. మీరు మీ చర్యల్లో పర్యావరణానికు అనుకూలమైన పనులు చేస్తున్నారా, వ్యతిరేకంగా చేస్తున్నారా, అని ప్రజలు గమనిస్తున్నారు. అందుకే ఈ పండుగ రోజుల్లో అన్నిచోట్లా పర్యావరణానికి అనుకూలమైన మట్టి గణపతి ఉద్యమం మొదలైంది. మీరు యూట్యూబ్ లో గనుక చూస్తే, ప్రతి ఇంట్లోనూ పిల్లలు మట్టిగణపతిని తయారుచేసి దానికి రంగులు అద్దుతున్నారు. కొందరు కూరగాయల రంగులు అద్దితే, కొందరు రంగురంగుల కాగితం ముక్కలు అంటిస్తున్నారు. దగ్గరదగ్గర ఈ ప్రయోగాన్ని అన్ని కుటుంబాలవారూ చేస్తున్నారు. ఒకరకంగా పర్యావరణాత్మక చేతన తాలూకూ ఇంత పెద్ద విస్తృతమైన శిక్షణ ఈ గణేశోత్సవాల సమయంలో తప్ప ఇంతకు ముందెప్పుడూ బహుశా గమనించి ఉండం. మీడియా హౌస్ వారు కూడా పెద్ద ఎత్తున పర్యావరణానికి అనుకూలమైన మట్టి గణపతి విగ్రహాలను తయారుచేసే శిక్షణను ప్రజలకు అందిస్తూ ప్రేరణని, మార్గనిర్దేశాన్నీ ఇస్తున్నారు. చూడండి ఎంత పెద్ద మార్పు వచ్చిందో! ఆనందకరమైన మార్పు.
అలానే నేను చెప్పినట్లుగా మన దేశం కోట్లాదికోట్ల అద్భుతమైన ఆలోచనాపరులతో నిండి ఉంది. ఎవరైనా కొత్త కొత్త ఆవిష్కారాలు చేస్తే చాలా ఆనందం కలుగుతుంది. ఎవరో ఇంజనీరు స్వయంగా చెప్పారు నాకు, ఆయన కొన్ని ప్రత్యేకమైన రకరకాలైన మట్టిని సంపాదించి, దానిని కలిపి, మట్టిగణేశుడిని తయారుచేసే శిక్షణ ప్రజలకి అందించారుట. పూజ తర్వాత ఒక చిన్న బకెట్ లో ఆ గణేశ నిమజ్జనం చేస్తే, విగ్రహం వెంటనే నీటిలో కరిగిపోతుంది. అక్కడితో ఆగకుండా ఆయన అందులో ఒక తులసిమొక్క వేసి, పెంచారు. మూడేళ్ళ క్రితం నేను పరిశుభ్రత ఉద్యమం మొదలుపెట్టాను. దీనికి వచ్చే అక్టోబర్ రెండు నాటికి మూడేళ్ళు పూర్తవుతాయి. ఈ ఉద్యమం తాలూకూ అనుకూల పరిణామాలు కనబడుతున్నాయి. మరుగుదొడ్ల నిర్మాణాలు 39% నుండి దాదాపు 67% కి చేరాయి. రెండు లక్షల ముఫ్ఫైవేల కన్నా అధికంగా పల్లెలు, బహిరంగ మలమూత్ర విసర్జన నుండి తాము విముక్తులమయ్యామని ప్రకటించారు.
ఆమధ్య గుజరాత్ లో భయంకరమైన వరదలు వచ్చాయి. చాలామంది ప్రజలు తమ ప్రాణాలు పోగొట్టుకున్నారు. కానీ వరద నీరు ఇంకిపోయిన తర్వాత చాలా దుర్గంధం వ్యాపించింది. ఇలాంటి సమయంలో గుజరాత్ లోని బనాస్కాంతా జిల్లా లో ధానేరా లో, జమీయత్ ఉలేమా-ఎ-హింద్ కార్యకర్తలు వరద ప్రభావిత ఇరవై రెండు గుడులను, మూడు మసీదులను దశలవారీగా శుభ్రపరిచారు. తమ చెమటను చిందించి అందరినీ రక్షించారు. పరిశుభ్రత పాటించడానికి ఐక్యత ఎంత అవసరమో జమీయత్ ఉలేమా-ఎ-హింద్ కార్యకర్తలు చూపెట్టారు. ఇలాంటి సంఘటనలు మనకు ప్రేరణను అందిస్తాయి. పారిశుధ్యం కోసం సమర్పణా భావంతో చేసే ప్రయత్నాలు శాశ్వతమైన స్వభావాలుగా మారితే మన దేశం మరెంతో ఎత్తుకు ఎదగగలదు.
నా ప్రియమైన దేశ ప్రజలారా, అక్టోబర్ రెండున గాంధీ జయంతికి పదిహేను ఇరవై రోజుల ముందు నుండే ’పారిశుధ్య సేవ’ అని ఇంతకు ముందు చెప్పినట్లే ’జన సేవే ప్రభు సేవ’ , ’పరిశుభ్రతే సేవ’ అనే ప్రచారాన్ని నడపవలసిందిగా మీ అందరినీ మరోసారి కోరుతున్నాను. దేశమంతటా పారిశుధ్య వాతావరణం తయారుచెయ్యండి. ఎక్కడ అవకాశం దొరికినా, ఎక్కడ దొరికితే అక్కడ, మనం అవకాశాలని వెతుక్కుందాం. అందరం కలిసికట్టుగా ఉందాం. ఒకరకంగా దీపావళికి, నవరాత్రికి, దుర్గా పూజకు ముందు సన్నాహాలుగా దీనిని భావిద్దాం. శ్రమదానం చేద్దాం. సెలవు రోజున, ఆదివారాల్లో ఒక దగ్గర చేరి, ఒక్కటిగా పనిచేయండి.చుట్టుపక్కల ఉన్న బస్తీల్లోకి వెళ్ళండి, దగ్గరలోని పల్లెకు వెళ్లండి. కానీ ఇదంతా ఒక ఉద్యమంగా భావిస్తూ చేయండి. అందరూ అన్ని ఎన్.జి.ఓ లను, పాఠశాలలు, కళాశాలలు, సామాజిక, సాంస్కృతిక, రాజకీయ నాయకులను, ప్రభుత్వ అధికారులనూ, కలెక్టర్లను, సర్పంచ్ లనూ, ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను - అక్టోబర్ రెండున గాంధీ జయంతికి పదిహేనురోజుల ముందర నుండి మనమందరమూ ఒక పారిశుధ్య వాతావరణాన్ని తయారుచేద్దాం. చక్కని పరిశుభ్రతతో అక్టోబర్ రెండు ని నిజంగా గాంధీగారు కలలుకన్న అక్టోబర్ రెండు గా మారుద్దాం. త్రాగునీరు మరియు స్వచ్ఛతా మంత్రిత్వశాఖ, MyGov.in లో ఒక విభాగాన్ని సృష్టించారు. అందులో మరుగుదొడ్ల నిర్మాణం తరువాత మరు మీ పేరు, మీరు సహాయం చేసిన కుటుంబం పేరు నమోదు చేయవచ్చు. నా సోషల్ మీడియా మిత్రులందరూ కూడా మీ మీ రచనాత్మక ఉద్యమాన్ని చేపట్టవచ్చు. Virtual World Forumపై కూడా పని జరుగుతోంది, ఇది మనకు ప్రేరణను ఇవ్వవచ్చు. పరిశుభ్ర సంకల్పం నుండి పరిశుభ్రతను గురించిన పోటీలలో పాల్గొనవచ్చు. ఈ ప్రచారంలో భాగంగా త్రాగునీరు మరియు స్వచ్ఛతా మంత్రిత్వశాఖ వారు వ్యాస రచన పోటీలు, కథా పోటీలు, లఘు చిత్రాల పోటీలు, పెయింటింగ్ పోటీలు నిర్వహించబోతున్నారు. ఇందులో మీరు వివిధ భాషల్లో వ్యాస రచన చేయవచ్చు. వయసుతో నిమిత్తం లేకుండా ఎవరైనా ఈ పోటీల్లో పాల్గొనవచ్చు. ఒక లఘు చిత్రాన్ని మీరు మీ మొబైల్ తో తీసేయవచ్చు. పారిశుధ్యానికి ప్రేరణను అందించేలాంటి రెండు మూడు నిమిషాల ఫిల్మ్ ను తయారు చేయవచ్చు. ఈ పోటీల్లో పాల్గొనేవారికి జిల్లా స్థాయిలో మూడు, రాష్ట్ర స్థాయిలో కూడా మూడు బహుమతులు ఉంటాయి. పారిశుధ్యానికి సహాయపడే ఇటువంటి ప్రచారానికి కూడా మీ అందరినీ కలవమని, ఈ పోటీల్లో పాల్గొనవలసిందని నేను ఆహ్వానిస్తున్నాను.
అక్టోబర్ రెండు, గాంధీ జయంతిని ’పారిశుధ్య అక్టోబర్ రెండు’ గా జరుపుకోవాలనే సంకల్పాన్ని చేసుకోమని మరోసారి మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాను. అందుకోసం సెప్టెంబర్ పదిహేను నుండీ ’పారిశుధ్య సేవ’ మంత్రాన్ని ఇంటింటికీ చేర్చండి. పరిశుభ్రత కోసం ఏదో ఒక అడుగు వెయ్యండి. స్వయంగా పరిశ్రమించి ఈ ప్రచారంలో ఒక భాగమవ్వండి. ఈ అక్టోబర్ రెండు గాంధీ జయంతి ఎలా ప్రకాశవంతమవుతుందో మీరే చూడండి. పదిహేను రోజుల ప్రచారం తరువాత, ’పారిశుధ్య సేవ’ తరువాత, అక్టోబర్ రెండున గాంధీ జయంతి జరుపుకునేప్పుడు పూజ్య బాపూజీ కి శ్రధ్ధాంజలి ఘటిస్తున్నప్పుడు మీలో ఎంత పవిత్రమైన ఆనందం ఉంటుందో మీరు ఊహించగలరు.
నా ప్రియమైన దేశప్రజలారా, నేనీవేళ విశేషంగా మీ అందరి ఋణాన్నీ స్వీకరించాలనుకుంటున్నాను. హృదయపూర్వకంగా నేను మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇంతకాలంగా మీరు నా ’మనసులో మాట’ తో కలిసిఉన్నందుకు కాదు, నేను ఋణపడి ఉన్నది, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్న నా ’మనసులో మాట’ కార్యక్రమంతో దేశం నలుమూలల నుండీ లక్షల ప్రజలు నాతో కలుస్తున్నందుకు. వినేవారి సంఖ్య కోట్లలో ఉంది. కానీ లక్షల మంది ప్రజలు ఉత్తరాలు రాస్తున్నారు, సందేశాలు పంపుతున్నారు, ఫోన్ ద్వారా సందేశాలు ఇస్తున్నారు. ఇదంతా నాకు పెద్ద కోశాగారం లాంటిది. దేశప్రజలందరి మనసులోని మాటలూ తెలుసుకోవడానికి నాకు ఇదొక పెద్ద అవకాశం గా మారింది. మీరు ఎంత ఎక్కువగా మనసులో మాట కోసం ఎదురుచూస్తారో, అంతకంటే ఎక్కువగా నేను మీ సందేశాల కోసం ఎదురుచూస్తాను. మీ ప్రతి మాటతో నాకు ఎంతో కొంత నేర్చుకునే అవకాశం లభిస్తుంది. అందుకే అంత ఆశగా ఎదురుచూస్తాను. నేను చేసే పనికి గీటురాయిగా అవి పనికి వస్తాయి. మీ చిన్న చిన్న మాటలు నాలో పెద్ద పెద్ద ఆలోచనలు రేకెత్తించడానికి పనికొస్తాయి. అందువల్ల మీ ఈ సహకారానికి ఋణపడి ఉంటాను. వీలయినంతవరకూ మీ మాటలను నేను స్వయంగా చూసి, చదివి, విని , అర్థంచేసుకోవాల్సినటువంటి మాటలు వస్తుంటాయి. మీరే చూడండి, ఈ ఫోన్ కాల్ తో మీరు ఎలా మిమ్మల్ని జతపరుచుకుంటారో.. మీక్కూడా అనిపిస్తుంది, అవును, నేను కూడా ఇలాంటి పొరపాటు చేశానని. ఒకోసారి కొన్ని విషయాలు మన అలవాట్లలో ఎంతగా కలిసిపోతాయంటే, మనం పొరపాటు చేస్తున్నామన్న సంగతి మనం గమనించం కూడా.
"ప్రధానమంత్రి గారూ, నేను పూనా నుండి అపర్ణ ని మాట్లాడుతున్నాను. నేను నా స్నేహితురాలి గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆమె ఎప్పుడు ప్రజలకి సహాయం చెయ్యాలనే ప్రయత్నంలో ఉంటుంది. కానీ తనకున్న ఒక అలవాటు నన్ను కంగారుపెడుతోంది. నేను తనతో ఒకసారి ఒక షాపింగ్ మాల్ కు వెళ్లాను. ఒక చీరపై తను రెండువేల రూపాయలు సులువుగా ఖర్చు పెట్టింది. పీజా కి 450 రూపాయలు పెట్టింది కానీ షాపింగ్ మాల్ కు వెళ్ళిన ఆటో డ్రైవర్ తో ఐదు రూపాయల కోసం బేరసారాలు చేసింది. దారిలో కూరలు కొనుక్కుంది. ఒక్కో కూరగాయపై బేరమాడి 4,5 రుపాయిలు మిగుల్చుకుంది. నాకు అది నచ్చలేదు. మనం పెద్ద పెద్ద చోట్లలో అడగకుండానే పెద్ద మొత్తాలు చెల్లిస్తాం కానీ కష్టపడే సోదర సోదరీమణులతో కొద్ది రూపాయిల కోసం గొడవ పడతాం. వారిని నమ్మం. మీరు మీ ’మనసులో మాట’ లో ఈ సంగతిని తప్పకుండా ప్రస్తావించండి"
ఈ ఫోన్ కాల్ విన్న తరువాత మీరు తప్పకుండా ఉలిక్కిపడి ఉంటారు. ఇలాంటి పొరపాటు ఇక చెయ్యకూడదు అని మీరు మనసులో నిశ్చయించుకుని ఉంటారని నా నమ్మకం. మనం మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా సామానులు అమ్మేవారు , తోపుడు బళ్ళ వారు, చిన్న దుకాణదారుడో, కూరగాయలు అమ్మేవారో మన పని కోసం వచ్చినప్పుడు, ఎప్పుడైనా ఆటో డ్రైవర్ తో పని పడినప్పుడు - మరెప్పుడైనా సరే ఎవరైనా కష్టపడి పనిచేసేవారితో పని వచ్చినప్పుడు వారికి ఇవ్వాల్సిన ధర విషయమై బేరసారాలు చేస్తాము. ఇంత కాదు, రెండు రూపాయిలు తక్కువ చేసుకో, ఐదు రూపాయిలు తక్కువ చేసుకో..అని. అదే మనం ఏదైనా రెస్టారెంట్ కు భోజనానికి వెళ్తే బిల్లు కూడా చూడకుండా డబ్బులు తీసి ఇచ్చేస్తాము. ఇంతేకాదు, షోరూమ్ లో చీర కొనడానికి వెళ్తే బేరాలాడం కానీ ఎవరైనా పేదవారితో పని వస్తే మాత్రం బేరాలాడ కుండా అస్సలు ఉండం. పేదవాడు ఏమనుకుంటాడో అని మీరెప్పుడైనా ఆలోచించారా? ప్రశ్న రెండు రూపాయిలదో, ఐదు రూపాయిలదో కాదు. పేదవాడి మనసుకు కలిగిన కష్టానిది. వాళ్ళు పేదవారు కాబట్టి మీరు వారి నిజాయితీని అనుమానించారని వాళ్లు బాధపడతారు.
మీ జీవితంలో రెండు రూపాయిలకి, ఐదు రూపాయిలకి ఏమీ ప్రాముఖ్యత ఉండదు. కానీ మీ ఈ చిన్న అలవాటు వాళ్ల మనసులను ఎంత లోతుగా గాయపరచగలదో ఎప్పుడైనా ఆలోచించారా? ఇటువంటి హృదయానికి హత్తుకునేటువంటి విషయాన్ని మీ ఫోన్ కాల్ ద్వారా నాకు తెలిపినందుకు, మేడమ్, మీకు నా కృతజ్ఞతలు. నా దేశప్రజలు కూడా, వారికి పేదవారితో ఇలా ప్రవర్తించే అలవాటు ఉంటే, వారు తప్పకుండా మారతారనే నమ్మకం నాకుంది.
నా ప్రియమైన యువమిత్రులారా, ఆగస్టు 29వ తేదీని దేశమంతా జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుంది. ఇది గొప్ప హాకీ ఆటగాడు, హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ గారి జన్మదినం. హాకీ ఆటకు ఆయన చేసిన సేవ ఎనలేనిది. ఈ సంగతిని గుర్తు చేసుకోవడానికి కారణమేమిటంటే, మన దేశ భావితరం క్రీడలతో ముడిపడాలని నా కోరిక. ఆటలు మన జీవితాలలో భాగం కావాలి. ప్రపంచంలోకెల్లా మనదే యువ దేశమైనప్పుడు ఆ యౌవ్వనదశ క్రీడామైదానంలో కూడా కనబడాలి. క్రీడలంటే శారీరిక ధృఢత్వం, మానసిక చురుకుదనం, వ్యక్తిత్వ మెరుగుదల. అంతకంటే ఏం కావాలి? ఒకరకంగా ఆటలు మనసులు కలిపేందుకు ఉపయోగపడే పెద్ద ఔషధం. మన దేశ యువత క్రీడాప్రపంచంలో ముందుకు రావాలి. ఇవాల్టి కంప్యూటర్ యుగంలో ప్లే-స్టేషన్ కన్నా ప్లేయింగ్ ఫీల్డ్ చాలా మహత్యం కలిగినదని నేను హెచ్చరించదలచుకున్నాను. కంప్యూటర్ లో FIFA ఆడండి కానీ బయట మైదానంలో కూడా ఎప్పుడైనా ఫుట్‌బాల్ తో ఫీట్లు చేసి చూపించండి. కంప్యూటర్ లో క్రికెట్ ఆడుతూ ఉండి ఉంటారు కానీ ఆరుబయట మైదానంలో ఆకాశం క్రింద క్రికెట్ ఆడే ఆనందమే వేరు. ఒక సమయంలో ఇంట్లోని పిల్లలు బయటకు వెళ్తే, ఎప్పుడొస్తారని అమ్మ అడిగేది. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇంట్లో పిల్లలు ఉన్నా కూడా ఫోనో, కార్టూన్ సినిమానో చూడడంలో మునిగిపోతున్నారు లేదా మొబైల్ గేమ్ కి అతుక్కుపోతున్నారు. ఇప్పుడు అమ్మకి ’ఎప్పుడు బయటకు పోతావురా’ అని గట్టిగా అరవాల్సి వస్తోంది. కాలాన్ని బట్టి మనుషులు మారిపోతున్నారు. ఒక సమయంలో నువ్వెప్పుడొస్తావు అని అడిగే అమ్మ, ఇవాళ నువ్వెప్పుడు బయటికి వెళ్తావు? అని అడుగుతోంది.
యువ మిత్రులారా, క్రీడామంత్రిత్వశాఖ వారు క్రీడా ప్రతిభను వెతికి, మెరుగుపెట్టడం కోసం ఒక స్పోర్ట్స్ టాలెంట్ సెర్చ్ పోర్టల్ ను తయారుచేశారు. దేశం మొత్తం లో క్రీడారంగంలో ప్రతిభ గల పిల్లలు ఎక్కడ ఉన్నా, క్రీడారంగంలో వాళ్ళు సాధించిన విజయాలు ఈ పోర్టల్ లో బయోడేటాతో సహా లేదా విడియో ను అప్లోడ్ చేయవచ్చు. ఎంచుకున్న ఔత్సాహిక క్రీడాకారులకు క్రీడా మంత్రిత్వశాఖ శిక్షణనందిస్తుంది. ఈ పోర్టల్ రేపటి నుండీ ప్రారంభమవబోతోంది. మన క్రీడాకారులకు సంతోషకరమైన వార్త ఏమిటంటే, భారతదేశంలో అక్టోబర్ 6 నుండీ 28 వరకూ, ఫీఫా అండర్ 17 ప్రపంచ కప్ మొదలవబోతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇరవై నాలుగు టీమ్ లు భారతదేశాన్ని తమ నివాసంగా మార్చుకోనున్నాయి.
రండి, ప్రపంచం నలుమూలల నుండి రాబోయే మన యువ అతిథులను, క్రీడా ఉత్సవాలతో స్వాగతిద్దాం. ఆటలను ఆస్వాదిద్దాం. దేశంలో ఒక క్రీడా వాతావరణాన్ని తయారుచేద్దాం. ఆటల విషయం మాట్లాడుతుంటే నాకు గతవారంలో జరిగిన మనసుకు హత్తుకునే సంఘటన ఒకటి గుర్తుకువచ్చింది. ఆ విషయం నేను దేశప్రజలతో పంచుకోవాలనుకుంటున్నాను. చాలా చిన్న వయసు ఉన్న ఆడపిల్లలను కలిసే అవకాశం నాకు లభించింది. వారిలో కొందరు హిమాలయ ప్రాంతాల్లో పుట్టినవారు. సముద్రంతో వారికి ఎప్పుడూ అనుబంధం లేదు. నావికాదళం లో పని చేసే అలాంటి ఆరుగురు ఆడపిల్లల ఉత్సాహం, వాళ్ల ధైర్యం మనందరికీ ప్రేరణని ఇచ్చేలాంటిది. ఈ ఆరుగురు ఆడపిల్లలూ INS తారిణి (Tarini) అనే ఒక చిన్న బోటు తీసుకుని సముద్రాన్ని దాటడానికి బయల్దేరుతున్నారు. ఈ ప్రచారం పేరు "నావికా సాగర్ పరిక్రమ’. వారు ప్రపంచాన్ని మొత్తం చుట్టి కొన్ని నెలల తరువాత, లేదా చాలా నెలల తరువాత భారతదేశం తిరిగివస్తారు. ఒకోసారి నలభై రోజుల దాకా నీటిలోనే ప్రయాణించాల్సి వస్తుంది వారికి. ఒకోసారి వారికి ముఫ్ఫైయ్యేసి రోజులు. సముద్రపు అలల మధ్యన మన ఆరుగురు ఆడపిల్లలు ప్రయాణించడం ప్రపంచంలోనే మొదటి సంఘటన అవుతోంది. ఈ ఆడపిల్లలను చూసి గర్వపడని భారతీయుడు ఉంటాడా? నేను ఈ ఆడపిల్లల ఉత్సాహానికి అభివాదం చేస్తున్నాను. దేశప్రజలతో తమ అనుభవాలను పంచుకోవాల్సిందిగా నేను వారిని కోరాను. నేను కూడా నరేంద్ర మోదీ యాప్ లో మీరంతా చదువుకునేందుకు వీలుగా, వారి అనుభవాల కోసం ఒక విభాగాన్ని ఏర్పాటుచేస్తాను. ఎందుకంటే ఒకరకంగా ఇదొక సాహసగాథ, స్వీయ అనుభవాల కథ. ఈ ఆడపిల్లల మాటలను మీదాకా చేర్చడం నాకు సంతోషకరం. ఈ ఆడపిల్లలకి నేను అనేకానేక అభినందనలు, అనేకానేక ఆశీర్వాదాలు తెలుపుతున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, సెప్టెంబర్ ఐదవ తేదీని మనమందరమూ ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటాం. ఆరోజు మన దేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్. సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినం. వారు రాష్ట్రపతి అయినా కూడా జీవితాంతం తనను తాను ఒక అధ్యాపకుడిగానే భావించేవారు. వారు ఎప్పటికీ ఒక అధ్యాపకుడిగానే జీవించడానికి ఇష్టపడేవారు. వృత్తి పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి ఆయన. ఒక విద్యావంతుడు, పండితుడు, ఒక రాజనీతిజ్ఞుడు, భారతదేశ రాష్ట్రపతి అయినా కూడా ప్రతి క్షణం ఒక అధ్యాపకుడిలానే భావించుకునేవారు. వారికి నా ప్రణామాలు.
" It is the supreme art of the teacher to awaken joy in creative expression and knowledge." అని ఆల్బర్ట్ ఐన్ స్టీన్ అనే గొప్ప శాస్త్రవేత్త అన్నారు. తన విద్యార్థుల్లో సృజనాత్మక భావాన్ని, జ్ఞానం తాలూకూ ఆనందాన్నీ జాగృతం చేయడమే ఒక అధ్యాపకుడిలో్ అన్నింటికన్నా ఎక్కువగా ఉండాల్సిన ముఖ్యమైన గుణం. ఈసారి ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటూ మనం ఒక సంకల్పాన్ని చేద్దామా? ఒక మిషన్ గా మారి ఒక ప్రచారాన్ని చేద్దామా? ’Teach to Transform, Educate to Empower, Learn to Lead” అనే సంకల్పం తో ముందుకు నడుద్దామా? ప్రతి ఒక్కరినీ ఐదేళ్ల వరకూ ఏదో ఒక సంకల్పంతో ముడిపెట్టండి. దానికి సాఫల్యం చేసుకునే మార్గాన్ని చూపెట్టండి. జీవితంలో సాఫల్యాన్ని పొందిన ఆనందాన్ని అందుకోండి. ఇలాంటి వాతావరణాన్ని మన పాఠశాలలు, మన కళాశాలలు, మన విద్యా సంస్థలు ఏర్పరచగలవు. మన దేశంలో మనం మార్పు గురించి మాట్లాడుతున్నప్పుడు, కుటుంబం గురించి మాట్లాడితే అమ్మ గుర్తుకు వచ్చినట్లు, సమాజం గురించి మాట్లాడితే ఉపాధ్యాయుడు గుర్తుకువస్తాడు. మార్పు లో ఉపాధ్యాయుడికి చాలా పెద్ద పాత్ర ఉంటుంది. ప్రతి ఉపాధ్యాయుడి జీవితంలోనూ తన సహజమైన కృషి కారణంగా మరొకరి జీవితంలో మార్పులు తెచ్చే ప్రయత్నంలో విజయం పొందిన ఘటనలు, ఎప్పుడో ఒకప్పుడు జరిగిన సంఘటనలు ఉండే ఉంటాయి. మనం గనుక కలిసికట్టుగా ప్రయత్నిస్తే, దేశాన్ని మార్చడంలో అతిపెద్ద పాత్ర వహించగలం. రండి.. ’Teach to Transform’ అనే మంత్రం తో ముందుకు నడుద్దాం.
"ప్రణామం ప్రధానమంత్రి గారూ, నా పేరు డా. అన్నయా అవస్థీ. నేను ముంబాయి నగరంలో ఉంటున్నాను. హోవార్డ్ విశ్వవిద్యాలయం వారి భారతీయ పరిశోధక కేంద్రం లో పనిచేస్తాను. ఒక పరిశోధకుడిగా financial inclusion , దానికి సంబంధించిన సామాజిక పథకాలు ఉండే ఆర్థిక సమావేశాలపై నాకు ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. మిమ్మల్ని నేను అడిగేదేమిటంటే, మీరు 2014లో ప్రవేశపెట్టిన జన ధన యోజన వల్ల మూడేళ్ల తరువాత కూడా భారతదేశాన్ని ఆర్థికంగా సురక్షితం చేసిందా? దేశం ఆర్థికంగా బలోపేతం అయ్యిందా? గణాంకాలు చూసి చెప్పగలరా? ఈ సాధికారత, సదుపాయాలు మన మహిళలకు, రైతులకు, గ్రామాల్లోని శ్రామికుల వద్దకూ చేరగలిగిందా?చెప్పండి. ధన్యవాదాలు."
నా ప్రియమైన దేశప్రజలారా, ’ప్రధానమంత్రి జన ధన యోజన’ , financial inclusion , భారతదేశం లోనే కాక ప్రపంచం మొత్తం లోని ఆర్థిక జగత్తులోని పండితులకు చర్చావిషయమైంది. 2014, ఆగష్టు 28 న నా మనసులోని ఒక కలతో ఈ ప్రచారాన్ని ప్రారంభించాను. రేపు ఆగష్టు 28 న ఈ ’ప్రధానమంత్రి జన ధన యొజన’ మొదలై మూడేళ్ళు పూర్తి అవుతాయి. ముఫ్ఫై కోట్ల కొత్త కుటుంబాలవారిని దీనితో జతపరిచాం, బ్యాంక్ ఖాతాలు తెరిచాం. ఈ సంఖ్య ప్రపంచంలో ఎన్నో దేశాల జనాభా కంటే ఎక్కువ. ఈవేళ నా వద్ద పెద్ద సమాధానమే ఉంది.. మూడేళ్ళ లోపే సమాజంలోని ఆఖరి మెట్టుపై కూచుని ఉన్న నా పేద సోదరుడు కూడా దేశ ఆర్థిక వ్యవస్థ తాలూకూ ముఖ్య ధార లో భాగస్థుడయ్యాడు. అతడి అలవాటు మారింది. అతడు బ్యాంక్ కు వెళ్ళివస్తున్నాడు. డబ్బుని ఆదా చేస్తున్నాడు. డబ్బు ఉండటం వల్ల సురక్షితంగా ఉండగలుగుతున్నాడు. డబ్బు చేతిలో ఉన్నా, జేబులో ఉన్నా, ఇంట్లో ఉన్నా వృధాఖర్చు చెయ్యడానికి మనసవుతుంది. కానీ ఇప్పుడు ఏర్పడిన సంయమన వాతావరణం వల్ల నెమ్మది నెమ్మదిగా అతడికి కూడా డబ్బు పిల్లల అవసరలకు పనికివస్తుందని అర్థమౌతోంది. రాబోయే రోజుల్లో ఏదన్నా మంచి పని చెయ్యాలంటే డబ్బులు పనికివస్తాయని అర్థమైంది. పేదవాడు ఇప్పుడు తన జేబులోని రుపే కార్డ్ ని చూసుకుని, ధనవంతులతో సమానంగా తనను తాను చూసుకుంటున్నాడు. వాళ్ల జేబుల్లో క్రెడిట్ కార్డ్ ఉంటే, నా జేబులో రుపే కార్డ్ ఉంది అని సంతృప్తి పడుతున్నాడు. అది తనకు గౌరవంగా భావిస్తున్నాడు. ప్రధానమంత్రి జన ధన యోజనలో మన పేదవారి ద్వారా దాదాపు 65 వేల కోట్ల రూపాయిలు బ్యాంకుల్లో జమ అయ్యింది. ఒకరకంగా ఇది పేదవారి ఆదా. రాబోయే రోజుల్లో ఇదే వారి శక్తి. ప్రధానమంత్రి జన ధన యోజన ద్వారా ఎవరి ఖాతాలయితే ఏర్పడ్డాయో, వారికి బీమా లాభం కూడా లభించింది.
ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా పథకం, ప్రధానమంత్రి సురక్షా బీమా పథకం - ఒక రూపాయి, ముఫ్ఫై రూపాయల అతి తక్కువ ప్రీమియం ఈవేళ పేదవారికి జీవితంలో కొత్త నమ్మకాన్ని అందిస్తోంది. చాలా కుటుంబాల్లో ఒక రూపాయి బీమా కారణంగా; పేదవాడికి ఆపద వచ్చినప్పుడు, కుటుంబంలో ముఖ్యవ్యక్తి మరణిస్తే, కొద్ది రోజుల్లోనే వారికి రెండు లక్షల రూపాయిలు లభిస్తాయి. దళితులైనా, గిరిజనులైనా, మహిళలైనా, చదువుకున్న యువకుడైనా, తన కాళ్ళపై తాను నిలబడి ఏదన్నా చెయ్యాలనుకునే యువకుడైనా ప్రధానమంత్రి ముద్రా పథకం, స్టార్టప్ పథకం, స్టాండప్ పథకం మొదలైన పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. కోటాను కోట్ల యువతకు ప్రధానమంత్రి ముద్రా పథకం ద్వారా బ్యాంకుల నుండి ఏ గ్యారెంటీ లేకుండానే ఋణాలు అందేలా, వారు స్వయంగా తమ కాళ్లపై తాము నిలబడుతున్నారు. ఇంతే కాక, ప్రతి ఒక్కరూ మరొకరికి లేదా ఇద్దరికి ఉద్యోగాన్ని ఇచ్చే సఫలయత్నం చేశారు. గత కొద్ది రోజుల క్రితం బ్యాంకుల వారు నన్ను కలిశారు. జన ధన యోజన వల్లా, ఇన్సురెన్స్ వల్లా, రుపే కార్డ్ వల్లా, ప్రధానమంత్రి ముద్రా పథకం వల్లా, సామాన్య ప్రజలకు ఎలాంటి లాభం చేకూరిందో, వారు సర్వే చేయించారు. వాటి వల్ల ప్రేరణాత్మకమైన సంఘటనలు వెలికివచ్చాయి. ఇవాళ సమయం లేదు కానీ అలాంటి విషయాలను మై గౌ.ఇన్ లో అప్లోడ్ చెయ్యమని బ్యాంకులవారికి నేను కోరుతున్నాను. ఒక ప్రణాళిక వ్యక్తి జీవితంలో ఎలాంటి మార్పును తీసుకువస్తుందో, ఎలా శక్తిని నింపుతుందో , ఎలా కొత్త విశ్వాసాన్ని నింపుతుందో, దానిని చదివి ప్రజలు ప్రేరణ పొందుతారు. అలాంటి ఎన్నో ఉదాహరణలు నా వద్దకు వచ్చాయి. వాటిని మీవరకూ చేర్చే పూర్తి ప్రయత్నాన్ని నేను చేస్తాను. ఇలాంటి ప్రేరణాత్మక ఘటనల వల్ల మీడియా వారు కూడా పూర్తి లాభాన్ని పొందవచ్చు. అలాంటివారి ముఖాముఖిని ప్రసారం చేసి కొత్త తరాలవారికి కొత్త ప్రేరణను అందించగలరు.
నా ప్రియమైన దేశప్రజలారా, మరోసారి మీ అందరికీ ’మిచ్ఛామి దుక్కడం ’ - నొప్పించి ఉంటే క్షమించండి . అనేకానేక ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశ వాసులారా,
నమస్కారం.
వర్షాకాలంలో మనిషి మనసు చాలా పారవశ్యంగా ఉంటుంది. పశువులు, పక్షులు, మెక్కలు, ప్రకృతి, ప్రతి ఒక్కరు వర్షాగమనం వల్ల ఉల్లాసంగా మారిపోతారు. కానీ ఎప్పుడైనా వర్షం వికృత రూపాన్ని ధరిస్తే మాత్రం వినాశనాన్ని సృష్టించే శక్తి నీటికి ఎంత ఉందో తెలుస్తుంది. ప్రకృతి మనకు జీవితాన్ని ప్రసాదిస్తుంది. మన భాధ్యతలను స్వీకరిస్తుంది. కానీ, అప్పుడప్పుడు భూకంపాలు, వరదల వంటి ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు తన భయంకరమైన స్వరూపంతో ఎంతో వినాశనాన్ని సృష్టిస్తుంది. మారుతున్న ఋతు చక్రంతో పర్యావరణం లో మార్పులు వస్తున్నాయి. దాని ప్రభావం కూడా చాలా తీవ్రంగా ఉంటోంది. గత కొన్ని రోజుల్లో భారతదేశంలోని అసమ్, ఈశాన్య ప్రాంతాలు, గుజరాత్, రాజస్తాన్, బెంగాల్ లోని కొన్ని ప్రాంతాలలో అతివృష్టి కారణంగా ప్రాకృతిక ఆపదల్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. వరద ప్రాంతాలలో ఎంతో పర్యవేక్షణ జరుగుతోంది. సహాయ కార్యక్రమాలు విస్తృత స్థాయిలో జరుగుతున్నాయి. మంత్రివర్గం లోని నా మిత్ర సభ్యులు కూడా ఏ ప్రాంతానికి వీలైతే ఆ ప్రాంతానికి చేరుకొంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ తమ పధ్ధతులలో వరద బాధితులకు వీలైనంత ఉత్తమ సహాయాన్ని అందిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో ప్రజల సహాయార్థం సామాజిక సంస్థలు, సాంస్కృతిక సంస్థలు, సేవాభావంతో పని చేసే పౌరులు వారికి చేతనైనంతగా సహాయం చేస్తున్నారు. భారత ప్రభుత్వం తరఫున మిలిటరీ జవానులైనా, వాయు సేన వారైనా, ఎన్ డిఆర్ఎఫ్ వారైనా, అర్ధసైనిక బలగాలైనా ఇటువంటి సమయాలలో ఆపదలో చిక్కుకొన్న వారిని తమ ప్రాణాలొడ్డి సహాయపడడానికి సంతోషంగా ఏకమౌతారు. వరదల వల్ల జన జీవితం చాలా అస్తవ్యస్తంగా తయారవుతుంది. పంటలు, పశువులు, మౌలిక సదుపాయాలు, రహదారులు, విద్యుత్తు, సమాచార మాధ్యమాలు మొదలైనవన్నీ ప్రభావితం అవుతాయి. ముఖ్యంగా మన రైతు సోదరులకు, పంటలకు నష్టం వాటిల్లినప్పుడు వారు నష్టపోకుండా ఇన్ శ్యూరెన్స్ కంపెనీలకు, ముఖ్యంగా పంటల బీమా సంస్థలు రైతులకు క్లయిమ్ సెటిల్ మెంట్ వెంటనే చేసేటట్టు, వారు ముందస్తుగా అప్రమత్తంగా ఉండేటట్టు ప్రణాళికలు తయారు చేశాము. వరద పరిస్థితులను ఎదుర్కోవడానికి 24 గంటలు కంట్రోల్ రూమ్ హెల్ప్ లైన్ నంబరు 1078 నిరంతరం పనిచేస్తోంది. ప్రజలు వారి కష్టాలు చెప్తున్నారు కూడా. వర్షాకాలానికి ముందరే అత్యధిక ప్రాంతాల్లో ముందస్తు అప్రమత్తత తో ప్రభుత్వ వ్యవస్థలన్నింటినీ సిధ్ధంగా ఉంచాము. ఎన్ డిఆర్ఎఫ్ బృందాలను పనిలో పెట్టాము. వారు, ప్రతి చోటా ఆపదమిత్రులను తయారుచెయ్యటం, వారికి ఏమేమి చెయ్యాలో ఏమేమి చెయ్యకూడదో శిక్షణనివ్వడం, వాలంటీర్లను నిర్ణయించడం, ఒక వైపు ప్రజా సంస్థల్ని నిలబెట్టడం మొదలైన పనులన్నీ చేస్తారు. ఈరోజుల్లో మనకు ముందుగానే వాతావరణ సూచనలు లభిస్తున్నాయి. సాంకేతిక విజ్ఞా నం అబివృధ్ధి చెందడం వల్ల అంతరిక్ష విజ్ఞానం కూడా వాతావరణ అంచనాలు సరిగ్గా వెయ్యడంలో పెద్ద పాత్ర వహిస్తోంది. నెమ్మది నెమ్మదిగా మనం కూడా ఈ వాతావరణ సూచనల ప్రకారంగా మన పనులను చేసుకుంటూ ఉంటే, నష్టాల నుండి మనల్ని మనం రక్షించుకోవచ్చు.
నేను ‘మనసులో మాట’ కార్యక్రమం కోసం తయారయ్యేటప్పుడు, నాకన్నా ఎక్కువగా దేశ ప్రజలు ఎక్కువ తయారవడాన్ని నేను గమనిస్తున్నాను. ఈసారి జిఎస్ టి గురించి ఎన్ని ఉత్తరాలు, ఫోన్ కాల్స్ వచ్చాయంటే ఇప్పటికీ ప్రజలు వారి ఆనందాన్ని, కుతూహలాన్నీ వ్యక్తంచేస్తున్నారన్న మాట. ఒక ఫోన్ కాల్ మీకు వినిపిస్తాను..
‘‘ నమస్కారం ప్రధాన మంత్రి గారూ, నేను.. గుడ్ గావ్ నుండి.. నీతూ గర్గ్ ను మాట్లాడుతున్నాను. నేను మీ చార్టర్డ్ అకౌంటెంట్స్ డే నాటి ప్రసంగాన్ని విని, చాలా ప్రభావితమయ్యాను. క్రిందటి నెల ఇదే తేదీన మన దేశంలో వస్తువులు మరియు సేవల పన్ను (జిఎస్ టి) అమలులోకి వచ్చింది. దానివల్ల గత నెల రోజులుగా ప్రభుత్వం ఆశించిన ఫలితాలు వస్తున్నాయో లేదో మీరు చెప్పగలరా ? ఈ విషయంలో మీ ఆలోచనలను నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ధన్యవాదాలు. ’’
జిఎస్ టి అమలు లోకి వచ్చి దాదాపు నెల రోజులు గడిచింది. లాభాలు కూడా కనిపించడం మొదలైంది. జిఎస్ టి కారణంగా వారు అవసరంగా కొనుగోలు చేస్తున్న వస్తువుల్లో ధర ఎలా తగ్గిందో, వస్తువులు ఎలా చవకగా లభిస్తున్నాయో చెప్తూ ఎవరైనా పేదల నుండి నాకు ఉత్తరాలు వచ్చినప్పుడు నాకు చాలా సంతోషం, ఆనందం కలుగుతున్నాయి. మొదట్లో ఎలా ఉంటుందో ఏమో అని భయపడ్డాను. కానీ, ఇప్పుడు నెమ్మదిగా అన్ని విషయాలూ నేర్చుకుంటూ తెలుసుకొంటున్నారు. వ్యాపారం మునుపటి కంటే సులభమైందని ఈశాన్య ప్రదేశాలు, సుదూర కొండ ప్రదేశాల్లో, అడవుల్లో నివసించే వ్యక్తులు నాకు ఉత్తరాలు రాసినప్పుడు ఆనందం కలుగుతుంది. ముఖ్యంగా వినియోగదారుకు వ్యాపారస్థుడి మీద నమ్మకం పెరుగుతోంది. రవాణా మరియు లాజిస్టిక్స్ రంగంలో జిఎస్ టి ప్రభావం ఎంతగా పడిందో, నేనూ గమనిస్తున్నాను. ట్రక్కుల రాకపోకలు పెరిగాయి. దూరాన్ని నిర్ణయించడం ఇప్పుడు సులభమైపోయింది. హైవే లు cluster- free అయిపోయాయి. ట్రక్కుల వేగం పెరగడం వల్ల కాలుష్యం కూడా తగ్గింది. సరుకులు కూడా త్వరగా చేరుతున్నాయి. ఈ సౌలభ్యం వల్ల ఆర్థిక ద్రవ్య వేగానికి కూడా బలం చేకూరుతుంది. ఇంతకు ముందు పన్నులు విడివిడిగా ఉండడం వల్ల రవాణా మరియు లాజిస్టిక్స్ రంగంలో ఎక్కువ వనరులు రాత పని చెయ్యడానికే చాలా సమయం పట్టేది. అందుకోసం ప్రతి రాష్ట్రంలోనూ కొత్త కొత్త గోదాములు కట్టాల్సి వచ్చేది. నేను ‘గుడ్ అండ్ సింపుల్ టాక్స్’ అని పిలిచే జిఎస్ టి నిజంగానే మన ఆర్థిక వ్యవస్థ మీద చాలా తక్కువ సమయంలోనే ఒక అనుకూల ప్రభావాన్ని ఉత్పన్నం చేసింది. ఎంతో వేగంగా వచ్చిన చక్కని మార్పు, వేగంగా జరిగిన మైగ్రేషన్ రిజిస్ట్రేషన్ యావత్ దేశంలో ఒక కొత్త నమ్మకాన్ని పుట్టించాయి. ఆర్థిక వ్యవస్థ లోని పండితులు, సాంకేతిక నిపుణులు భారతదేశంలో జిఎస్ టి ప్రయోగాన్ని గురించి పరిశోధన చేసి ఒక నమూనా వలె ప్రపంచం ముందర ఎప్పుడో ఒకప్పుడు తప్పక నిలబెడతారు. ఇది ప్రపంచంలోని విశ్వవిద్యాలయాలన్నింటికీ ఒక కేస్ స్టడీ అవుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున, ఇంత గొప్ప మార్పు, ఇన్ని కోట్ల ప్రజల ప్రమేయంతో ఈ విశాల దేశంలో దానిని అమలుపరచడం, విజయవంతంగా ముందుకు నడిపించడం అన్నది చాలా పెద్ద కార్యం. ప్రపంచం తప్పకుండా ఈ విషయంపై పరిశోధన చేస్తుంది. ఇప్పుడు జిఎస్ టి అమలులోకి వచ్చింది; అన్ని రాష్ట్రాలకు అందులో భాగం, బాధ్యతా ఉన్నాయి. అన్ని నిర్ణయాలను రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలిపి ఏకగ్రీవంగా తీసుకొన్నాయి. పేదవాడి కంచంలో ఏ రకమైన బరువు పడకూడదన్నదే ఆ ఏకగ్రీవ నిర్ణయాల పరిణామం. జిఎస్ టి కి ముందర ఏ వస్తువు ధర ఎంత ఉండేది, ఇప్పటి కొత్త పరిస్థితుల్లో ఆ ధర ఎంత ఉంది అన్న సంగతులన్నీ జిఎస్ టి యాప్ లో మీ మొబైల్ ఫోన్ ద్వారానే మీరు చక్కగా తెలుసుకోవచ్చు. ఒక దేశం ఒకే పన్ను అనే పెద్ద కల నిజమైంది. జిఎస్ టి విషయంలో ఏ రకంగా తాలూకా స్థాయి నుండి భారత ప్రభుత్వం వరకూ నిమగ్నమై ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరూ ఎంత కష్టపడి పనిచేశారో నేను గమనించాను. ప్రభుత్వానికి, వ్యాపారస్థులకు మధ్య ఎంతో చక్కని, స్నేహపూర్వకమైన వాతావరణం ఏర్పడింది. వినియోగదారుకు, ప్రభుత్వానికీ మధ్య విశ్వాసం పెంపొందించడానికి ఇది ఎంతో ముఖ్య పాత్ర వహించింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని మంత్రిత్వ శాఖలకు, అన్ని విభాగాలకు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులు అందరికీ నా హృదయ పూర్వక అభినందనలు తెలుపుతున్నాను. జిఎస్ టి భారత దేశ సమష్టి శక్తికి ఒక గొప్ప ఉదాహరణ. ఇది ఒక చరిత్రాత్మక ఘనకార్యం. ఇది కేవలం పన్నుల సంస్కరణ కాదు, ఇది ఒక కొత్త నిజాయితీతో కూడినటువంటి సంస్కృతికి బలాన్ని ఇచ్చే ఆర్థిక వ్యవస్థ. ఒక రకంగా చెప్పాలంటే, ఇది ఒక సామాజిక సంస్కరణ ఉద్యమం. ఇంత పెద్ద ప్రయత్నాన్ని సులువుగా విజయవంతం చేసినందుకు మరో సారి నేను కోట్లాది దేశవాసులందరికీ కోటి కోటి ప్రణామాలు చేస్తున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా, ఆగస్టు నెల అంటేనే విప్లవ నెల. 1920 ఆగస్టు 1 న సహాయనిరాకరణోద్యమం మొదలైందని సహజంగానే మనం చిన్నప్పటి నుండీ వింటూ వస్తున్నాం. 1942 ఆగస్టు 9 న ‘క్విట్ ఇండియా ఉద్యమం’ మొదలైంది. దీనిని ఆగస్టు విప్లవమని కూడా అంటారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఒక రకంగా చూస్తే, ఆగస్టు నెలలో జరిగిన ఘటనలన్నీ కూడా స్వాతంత్ర పోరాట చరిత్రతో ముఖ్యంగా ముడిపడి ఉన్నాయి. ఈ ఏడాది మనం ‘‘క్విట్ ఇండియా’’ ఉద్యమం తాలూకూ వజ్రోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. కానీ ఈ ‘‘క్విట్ ఇండియా’’ అనే నినాదాన్ని డాక్టర్. యూసుఫ్ మెహ్రర్ అలీ అనే ఆయన ఇచ్చారన్న సంగతి చాలా కొద్దిమందికే తెలుసు. ఆగస్టు 9వ తేదీ 1942లో ఏం జరిగిందో మన కొత్త తరం వారు తెలుసుకోవాలి. 1857 నుండి 1942 వరకూ స్వాతంత్రం కోసం ఏ స్వాతంత్ర ఉద్దీపనతో దేశ ప్రజలు ముడిపడి ఉన్నారో, ఏ ఉద్రేకాన్ని పంచుకున్నారో అది మన భావి భారత నిర్మాణానికి ప్రేరణ. మన స్వాతంత్ర సమర యోధులు చేసిన త్యాగం, తపస్సు, ఇచ్చిన బలిదానాలకూ మించిన ప్రేరణ ఏమి ఉంటుంది మనకు ?
భారత స్వాతంత్ర్య సంగ్రామంలో ‘క్విట్ ఇండియా’ ఉద్యమం ఒక ముఖ్యమైన నినాదం. బ్రిటిష్ ప్రభుత్వపు సంకెళ్లను విడిపించుకోవడానికి యావత్ దేశానికీ ఈ ఉద్యమమే ప్రేరణను ఇచ్చింది. ఆంగ్లేయులకు విరుధ్ధంగా భారతీయ ప్రజలు ప్రతి మూల నుండీ, పల్లెల నుండీ, పట్టణాల నుండీ, చదువుకున్న వారైనా, నిరక్ష్యరాస్యులైనా, పేదవారైనా, ధనికులైనా, ప్రతి ఒక్కరూ చేయీ చేయీ కలిపి ‘క్విట్ ఇండియా’ ఉద్యమంలో భాగమైన సమయం ఇదే! జనాక్రోశం చిట్టచివరి దశ కు చేరుకున్న తరుణం అది. మహాత్మ గాంధీ గారి ఆహ్వానంపై లక్షల మంది భారతీయులు ‘‘డూ ఆర్ డై’’ అనే మంత్రంతో తమ జీవితాన్ని ఉద్యమ ప్రవాహంలోకి నడిపించారు. లక్షల మంది యువకులు వారి చదువులను సైతం ఆపివేసి, పుస్తకాలను వదలివేశారు. స్వాతంత్ర్యమనే మంత్ర జపంతో ముందుకు నడిచారు. ‘క్విట్ ఇండియా’ ఉద్యమానికి ఆగస్టు 9న మహాత్మ గాంధీ గారు పిలుపునైతే ఇచ్చారు కానీ, పెద్ద పెద్ద నేతలందరినీ బ్రిటిష్ ప్రభుత్వం జైళ్ళలో బంధించేసింది. అదే సమయంలో రెండవ తరం నేతలైన డాక్టర్. లోహియా, జయ ప్రకాశ్ నారాయణ్ ల వంటి మహా పురుషులు ఉద్యమంలో పెద్ద పాత్రను పోషించారు.
1920 లో సహాయ నిరాకరణ ఉద్యమం, 1942 లో ‘క్విట్ ఇండియా’ ఉద్యమం,.. ఈ రెండూ కూడా మహాత్మ గాంధీ గారి రెండు స్వరూపాలను మనకు చూపెడతాయి. సహాయ నిరాకరణ ఉద్యమం స్వరూపమే వేరు. 1942 లో ఉద్యమ తీవ్రత ఎంతగా పెరిగిపోయిందంటే, మహాత్మ గాంధీ లాంటి మహా పురుషుడు కూడా ‘‘డూ ఆర్ డై’ అనే మంత్రాన్ని అందుకొన్నారు. దీనంతటికీ వెనుక ప్రజల మద్దతు ఉంది; ప్రజల తోడు ఉంది; ప్రజల సంకల్పం ఉంది; ప్రజల సంఘర్షణ ఉంది; యావత్ దేశం ఒక్కటై పోరాటం చేసింది. ఒక్కసారి గనుక భారతదేశ చరిత్రను తిరగేస్తే, అసలు భారతదేశ మొదటి స్వాతంత్ర్య సంగ్రామం 1857 లోనే మొదలైందని నేను అప్పుడప్పుడు అనుకుంటాను. అప్పుడు ప్రారంభమైన స్వాతంత్ర్య సంగ్రామం 1942 వరకూ దేశంలో ఏదో ఒక మూల జరుగుతూనే ఉంది. ఈ సుదీర్ఘ కాలం దేశప్రజల మనసుల్లో స్వాతంత్రమనే ఉద్రేకాన్ని పుట్టించింది. ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి చెయ్యాలనే నిర్ణయానికి నిబధ్ధులైపోయారు. తరాలు మారుతున్నా ప్రజల సంకల్పంలో మార్పు రాలేదు. ప్రజలు వస్తున్నారు.. ఏకం అవుతున్నారు. వెళ్తున్నారు.. కొత్త వారు వస్తున్నారు. మళ్ళీ వారంతా ఏకం అవుతున్నారు. ఆంగ్ల సామ్రాజ్యాన్ని వేళ్లతో పెకలించి పారేయడానికి దేశం ప్రతి క్షణం ప్రయత్నిస్తూనే ఉంది. 1857 నుండీ 1942 వరకూ జరిగిన ఈ పరిశ్రమ, సంగ్రామాలు కల్పించిన ఒక కొత్త పరిస్థితి, 1942 నాటికి చివరి దశ కి చేరుకుంది. క్విట్ ఇండియా ఉద్యమం ఎంతగా మారుమ్రోగిపోయిందంటే మరో ఐదేళ్ల లోపునే 1947లో ఆంగ్లేయులు దేశం వదలి వెళ్ళాల్సివచ్చింది. 1857 నుండీ 1942 వరకూ ఈ స్వాతంత్ర ఉద్దీపన ప్రజలందరి వద్దకూ చేరింది. ఇక 1942 నుండీ 1947 వరకూ ఐదేళ్ల పాటు ప్రజలందరూ ఒకే మనసుతో, సంకల్పంతో నిర్ణయాత్మకంగా ఉంటూ సఫలపూర్వకంగా దేశానికి స్వాతంత్ర్యాన్ని అందించడానికి ఈ ఐదేళ్ళ కాలం కారణమయ్యింది. ఈ ఐదేళ్ళూ ఒక మలుపు లాంటివి.
ఇప్పుడు మిమ్మల్నొక గణితంతో కలుపుతాను. 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చింది. ఇప్పుడు 2017. దాదాపు డెభ్భై ఏళ్లు గడిచిపోయాయి. ప్రభుత్వాలు వచ్చాయి.. వెళ్ళాయి. వ్యవస్థలు తయారయ్యాయి, మారాయి, పెంపొందాయి, పెరిగాయి. దేశాన్ని సమస్యల్లోంచి బయట పడెయ్యటానికి ప్రతి ఒక్కరూ తమ తమ పధ్ధతుల్లో ప్రయత్నించారు. దేశంలో ఉపాధి అవకాశాలు పెంచడానికీ, పేదరికాన్ని నిర్మూలించడానికీ, అభివృధ్ధిని పెంచడానికీ ప్రయత్నాలు జరిగాయి. వారి వారి పధ్ధతుల్లో శ్రమించారు. విజయం లభించింది కూడా. అపేక్షలు పుట్టాయి. 1942 నుండి 1947 వరకూ ఈ ఐదేళ్ళూ కూడా సంకల్పసిధ్ధి కి ఒక మలుపులాంటివి. నేను గమనించినంతవరకూ 2017 నుండీ 2022 వరకూ ఉన్న ఐదేళ్ళు కూడా అప్పటి ఐదేళ్ల లాగ సంకల్పసిధ్ధికి తోడ్పడేలాంటివే. ఈ 2017 ఆగస్టు 15ని మనం ఒక సంకల్ప పర్వంగా జరుపుకుందాం. 2022 లో స్వాతంత్ర్య వజ్రోత్సవాల సమయానికల్లా మనం ఆ సంకల్పాన్ని సాధించి తీరతాం. నూట పాతిక కోట్ల దేశ ప్రజలు గనుక ఆగస్టు 9 నాటి విప్లవ దినాన్ని గుర్తు చేసుకుని, ఈ ఆగస్టు 15న ప్రతి భారతీయుడూ వ్యక్తిగా, పౌరుడిగా దేశానికి ఈ సేవ చేస్తాను, కుటుంబపరంగా ఇది చేస్తాను, సమాజపరంగా ఇది చేస్తాను, పల్లెలు పట్నాల పరంగా ఇది చేస్తాను, ప్రభుత్వ విభాగం రూపంలో ఇది చేస్తాను, ప్రభుత్వపరంగా ఇది చేస్తాను అని సంకల్పించుకోవాలి. కోట్లాది కోట్ల సంకల్పాలు ఏర్పడాలి. అవి సంపూర్ణమవ్వడానికి ప్రయత్నించాలి. ఎలాగైతే 1942 నుండి 1947 వరకూ ఐదేళ్ళు దేశ స్వాతంత్ర్యానికి మైలురాళ్ళయ్యాయో; ఈ ఐదేళ్ళు, అంటే 2017 నుండీ 2022 వరకు.. భారత దేశ భవిష్యత్తు కోసం అలాగే మైలురాళ్లవ్వాలి, అలానే చెయ్యాలి కూడా. ఐదేళ్ల తరువాత దేశ స్వాతంత్ర్య వజ్రోత్సవాలు జరుపుకొంటాము. అందుకని మనందరం ఇవాళ ఒక ధృఢసంకల్పాన్ని చేసుకోవాలి. 2017ను మన సంకల్ప సంవత్సరంగా చేసుకోవాలి. ఈ ఆగస్టు నెలను సంకల్పంతో ముడిపెట్టి ధృఢపరుచుకోవాలి. మురికి - క్విట్ ఇండియా, పేదరికం- క్విట్ ఇండియా, లంచగొండితనం - క్విట్ ఇండియా, ఉగ్రవాదం - క్విట్ ఇండియా, కులతత్వం -క్విట్ ఇండియా, మతతత్వం -క్విట్ ఇండియా!
ఇవాళ్టి ఆవశ్యకత ‘‘డూ ఆర్ డై’’ కాదు సంకల్పంతో ముడిపడడానికి. కలవడానికి. అత్యుత్తమ ఫలితాలను సాధించడానికి సంకల్పించడం అవసరం. సంకల్పం కోసమే జీవించాలి. పోరాడాలి. రండి, ఈ ఆగస్టు నెల 9వ తేదీ నుండి సంకల్ప సిధ్ధి కోసం ఒక మహోద్యమాన్ని నడుపుదాము. ప్రతి భారతీయుడూ, సామాజిక సంస్థ, స్థానిక సంస్థల ప్రాంతీయ విభాగాలు, పాఠశాలలూ, కళాశాలలూ, వివిధ సంస్థలు, ప్రతి ఒక్కరం కూడా ‘నూతన భారత్’ కోసం సంకల్పిద్దాము. రాబోయే ఐదేళ్లలో మనం సాధ్యపరుచుకునే సంకల్పం కావాలది. యువత సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఎన్ జి వో మొదలైన వారు సామూహిక చర్చలను జరిపించవచ్చు. కొత్త కొత్త ఆలోచనలను వెలికి తీయవచ్చు. మనం దేశాన్ని ఏ స్థాయికి చేర్చగలం, ఒక వ్యక్తిగా ఆ కార్యక్రమంలో నేను ఎటువంటి సహకారాన్ని అందించగలను అని ఆలోచించాలి. రండి, ఈ సంకల్ప పర్వంలో మనమూ భాగం అవుదాము.
మనం ఎక్కడ ఉన్నా లేకపోయినా, మనం ఆన్ లైన్ లో తప్పకుండా ఉంటాము కాబట్టి, ఇవాళ నేను ముఖ్యంగా ఆన్ లైన్ ప్రపంచంతో, నా యువ మిత్రులను, నా యువ సహచరులను ‘నవ భారత’ నిర్మాణానికి వారు సృజనాత్మక పధ్ధతులతో సహకారాన్ని అందించడానికి ముందుకు రావాలని ఆహ్వానిస్తున్నాను. సాంకేతికతను ఉపయోగిస్తూ వీడియోలు, పోస్ట్ లు, బ్లాగ్ లు, వ్యాసాలు, కొత్త కొత్త ఆలోచనలు తీసుకొని రండి. ఈ ప్రచారాన్ని ఒక జనాందోళనగా మనం మలుద్దాం. NarendraModiApp లో కూడా యువ మిత్రుల కోసం ‘క్విట్ ఇండియా క్విజ్ ’ ను ఆవిష్కరించబోతున్నాం. ఈ క్విజ్ యువతను మన దేశ ఘన చరిత్రతో జోడించి, స్వాతంత్ర్యోద్యమ నాయకులను పరిచయం చెయ్యడానికి ఉపయోగపడుతుంది. మీరు ఈ ప్రయత్నానికి తప్పకుండా విస్తృతమైన ప్రచారం కల్పించి, అన్నిదిశలా వ్యాపింపజేస్తారని నేను నమ్ముతున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా, ఆగస్టు 15వ తేదీన దేశ ‘ప్రధాన సేవకుడి’గా ఎర్ర కోట నుండి దేశ ప్రజలతో మాట్లాడే అవకాశం లభిస్తుంది. నేనొక నిమిత్త మాత్రుడిని మాత్రమే. అక్కడ మాట్లాడేది ఒక వ్యక్తి కాదు. ఎర్ర కోట నుండి నూట పాతిక కోట్ల ప్రజల స్వరం ప్రతిధ్వనిస్తుంది. వాళ్ల కలలకు మాటల రూపాన్ని ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. గత మూడేళ్లుగా వరుసగా దేశం నలుమూలల నుండీ ఆగస్టు 15 నాడు నేను ఏం మాట్లాడాలి, ఏ విషయాలను గురించి చెప్పాలి అనే సూచనలు, సలహాలు అందుతూనే ఉన్నాయి.
ఈసారి కూడా MyGov లేదా NarendraModiApp లకు మీరు మీ ఆలోచనలను తప్పక పంపవలసిందిగా నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. నేను స్వయంగా వాటిని చదువుతాను. ఆగస్టు 15వ తేదీన నాకు దొరికినంత సమయంలో వాటిని ప్రస్తావించడానికి కూడా ప్రయత్నిస్తాను. గత మూడేళ్ళ ఆగస్టు 15 ప్రసంగాలలో నాకు వినబడ్డ ఫిర్యాదు ఏమిటంటే, నా ప్రసంగాలు ఎక్కువ సమయాన్ని తీసుకొంటున్నాయని. అందుకని ఈసారి నా ప్రసంగం సమయాన్ని తగ్గిద్దామని నేను నిర్ణయించుకొన్నాను. మొత్తంమీద నలభై ఐదు, ఏభై నిమిషాల్లో పూర్తి చెయ్యడానికి ప్రయత్నిస్తాను. నేను నా కోసం నియమాన్ని పెట్టుకున్నాను కానీ నిలబెట్టుకోగలనో లేదో తెలీదు. కానీ తప్పకుండా నా ప్రసంగ సమయాన్ని తగ్గించాలనే ప్రయత్నంలో ఉన్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా, నేను మరో విషయాన్ని ప్రస్తావించదలుచుకున్నాను. భారత దేశ ఆర్థిక వ్యవస్థలో ఒక సామాజిక అర్థశాస్త్రం ఇమిడి ఉంది. దానిని మనం ఎప్పుడూ తక్కువగా పరిగణించకూడదు. మన పండుగలూ, మన ఉత్సవాలూ కేవలం ఆనందదాయకాలే కాదు. మన పండుగలూ, మన ఉత్సవాలూ సామాజిక సంస్కరణోద్యమాలు కూడా. కానీ దానితో పాటుగా మన ప్రతి పండుగ నిరుపేద పౌరుడి ఆర్థిక జీవనంతో కూడా నేరుగా ముడిపడి ఉంటుంది. కొన్ని రోజుల్లో రక్షాబంధనం, జన్మాష్టమి, వినాయక చవితి, దాని తర్వాత చవితి చంద్రుడు, అనంత చతుర్దశి, దుర్గా పూజ, దీపావళి.. ఇలా వరుసగా పండుగలు వస్తాయి. ఇవన్నీ కూడా పేదవారికి ఆర్థిక సంపాదనకు తోడ్పడతాయి. పండుగలన్నింటిలో ఒక సహజమైన ఆనందం ఇమిడివుంటుంది. పండుగల అనుబంధాలలో తియ్యదనాన్ని, కుటుంబంలో స్నేహాన్ని, సమాజంలో సౌభ్రాతృత్వాన్ని తీసుకు వస్తాయి. వ్యక్తిని, సమాజాన్ని ముడి పెడతాయి. వ్యక్తి నుండి సమష్టి దాకా ఒక సహజ ప్రయాణం జరుగుతుంది. ‘అహం నుండి వయమ్’ వైపునకు వెళ్ళే ఒక అవకాశం ఏర్పడుతుంది. ఆర్థిక వ్యవస్థకు సంబంధించినంత వరకూ రాఖీ కి కొన్ని నెలల ముందు నుండీ లక్షల కుటుంబాల్లో చిన్న చిన్న కుటీర పరిశ్రమలలో రాఖీల తయారీ మొదలైపోతుంది. ఖాదీ మొదలుకొని పట్టు దారాల వారకు ఎన్నో రకాల రాఖీలు తయారు అవుతున్నాయి. ఇటీవల కాలంలో ప్రజలు ఇంటిలో తయారైన రాఖీలనే ఎక్కువ గా ఇష్టపడుతున్నారు. రాఖీలు తయారు చేసే వారు, రాఖీలు అమ్మే వారు, మిఠాయిలు తయారు చేసే వారు, వేల- లక్షల ప్రజల రోజువారీ వ్యాపారం ఒక పండుగతో ముడిపడివుంటుంది. మన పేద సోదర, సోదరీమణుల కుటుంబాలు వీటి వల్లే కదా గడిచేది. మనం దీపావళికి దీపాలను వెలిగిస్తాము. అదొక వెలుగుల పండుగ మాత్రమే కాదు. ఇంటికి శోభను తీసుకు వచ్చే పండుగ మాత్రమే కాదు. దాని సంబంధం నేరుగా చిన్న చిన్న మట్టి ప్రమిదలు తయారు చేసే పేద కుటుంబాలతో ముడిపడివుంది. కానీ ఇవాళ నేను పండుగలను గురించి, ఆ పండుగలతో ముడి పడి ఉన్న పేదవారి ఆర్థిక వ్యవస్థను గురించి మాట్లాడేటప్పుడు, వాటితో పాటూ పర్యావరణాన్ని గురించి కూడా మాట్లాడాలని అనుకొంటున్నాను.
నా కన్నా దేశ ప్రజలు ఎక్కువ అప్రమత్తులూ, చురుకైన వారు అని అప్పుడప్పుడు నాకు అనిపిస్తుంది. గత నెల రోజులుగా పర్యావరణ విషయమై అప్రమత్తమైన ప్రజలు నాకు ఉత్తరాలు రాశారు. వినాయక చవితి కి బాగా ముందుగానే పర్యావరణ హితకరమైన గణేశుడి విషయం చెప్పాలంటూ రాశారు. అందువల్ల వారు ముందుగానే మట్టి విఘ్నేశ్వరుడి విషయమై ఇప్పటి నుండీ ప్రణాళికలు చేసుకోగలుగుతారు. సమయానికి ముందుగానే నేను ఈ విషయాన్ని ప్రస్తావించాలని చెప్పిన ప్రజలకు నేను ఎంతో ఋణపడి ఉంటాను. ఈ సారి సామూహిక గణేశ్ ఉత్సవాలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ గొప్ప సంప్రదాయాన్ని లోకమాన్య తిలక్ గారు ప్రారంభించారు. సామూహిక గణేశ్ ఉత్సవాలు మొదలై ఈ సంవత్సరానికి 125 ఏళ్ళైంది. 125 ఏళ్ళూ, 125 కోట్ల దేశ ప్రజలు. లోకమాన్య తిలక్ గారు సదుద్దేశంతో సమాజంలో ఏకత్వం కోసం, అవగాహన కోసం, సామూహిక ఉత్సవాల కోసం ఈ సామూహిక గణేశ్ ఉత్సవాలను మొదలుపెట్టారు. మళ్ళీ ఈ ఏడాది గణేశోత్సవాలలో ప్రజలంతా కచ్చితంగా ఏకమై, చర్చా కార్యక్రమాలను నిర్వహించి, లోకమాన్య తిలక్ గారి కృషిని మరో సారి గుర్తు చేసుకుని, తిలక్ గారి భావన ఏదైతే ఉందో.. దానిని బలపరుద్దాం. దానితో పాటుగా పర్యావరణ పరిరక్షణ కోసం పర్యావరణ హితకరమైన గణేశ్ ని, అంటే మట్టి గణపతిని పూజిద్దామని మనం సంకల్పం చెప్పుకొందాము. ఈసారి నేను ముందుగానే చెప్పాను కాబట్టి మీరంతా నాతో ఏకీభవిస్తారన్న నమ్మకం నాకు ఉంది. దాని వల్ల విగ్రహాలు తయారు చేసే మన పేద కళాకరులకు, కార్మికులకు రోజువారీ పని దొరుకుతుంది. కడుపు నిండుతుంది. రండి, మన ఉత్సవాలను పేదవారి ఆర్థిక వ్యవస్థతో ముడి పెడదాము. మన పండుగల ఆనందాన్ని పేదవారి ఇంటి ఆర్థిక పండుగ గా మార్చడమే మన ప్రయత్నం కావాలి. దేశవాసులందరికీ రాబోయే వేరు వేరు పండుగల ఉత్సవాలకు గానూ అనేకానేక అభినందనలు తెలియజేస్తున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా, విద్యా రంగమైనా, ఆర్థిక రంగమైనా, సామాజిక క్షేత్రమైనా, ఆటపాటలైనా, మన ఆడపిల్లలు దేశం పేరును నిలబెడుతుండడం, కొత్త కొత్త లక్ష్యాలను అందుకోవడం మనం నిరంతరం గమనిస్తున్నాం. మన దేశ ప్రజలందరం కూడా మన ఆడపిల్లలను చూసి గర్వపడుతున్నాం. కొద్ది రోజుల క్రితం మన దేశ మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ పోటీలలో అద్భుతమైన ఆటను ప్రదర్శించారు. ఈ వారంలోనే ఆ క్రీడాకారిణులతో భేటీ అయ్యే అవకాశం నాకు లభించింది. వారితో మాట్లాడడం నాకు చాలా ఆనందాన్నిచ్చింది. కానీ, ప్రపంచ కప్ ను గెలవలేకపోవడం వారికి చాలా భారంగా ఉందన్న సంగతిని నేను గమనించాను. వారి మొహాల్లో కూడా ఆ నిరాశ, ఒత్తిడి తొంగిచూశాయి. ఆ ఆడపిల్లలకు నేను నాదైన లెక్క ను వినిపించాను. వారితో నేను ‘‘ ఈమధ్య ప్రసార మాధ్యమాల తీరు ఎలా ఉందంటే, ఆశలను ఎంతగానో పెంచేస్తున్నారు, అంటే సాఫల్యాన్ని పొందకపోతే అది ఆక్రోశంగా మారుతోంది కూడా. భారతదేశ క్రీడాకారులు ఓడిపోతే దేశ ప్రజలు కోపంతో వారిపై విరుచుకుపడడం మనం ఎన్నో ఆటలలో చూశాము. కొందరు కనీస మర్యాద లేకుండా, చాలా బాధ కలిగించేలా మాట్లాడుతారు, రాస్తారు. కానీ, మొదటిసారిగా జరిగిందేమిటంటే, మన క్రీడాకారిణులు ప్రపంచ కప్ లో విజయాన్ని పొందలేకపోయినా, ఆ వైఫల్యాన్ని 125 కోట్ల మంది ప్రజలు తమ భుజాలపైన వేసుకొన్నారు. కాస్త భారం కూడా మన ఆడపిల్లలపై పడనీయలేదు. ఇంతేకాక, ఈ ఆడపిల్లలను మెచ్చుకొని గౌరవించారు. దీనిని ఒక శుభకరమైన మార్పుగా నేను భావిస్తున్నాను. ’’ ఇంకా ఈ ఆడపిల్లలతో నేను "చూడండి.. ఇలాంటి అదృష్టం కేవలం మీకే లభించింది. మీరు గెలవలేకపోయారన్న భావనను మనసులో నుండి తీసివేయండి. మ్యాచ్ గెలిచినా, గెలవకపోయినా మీరు 125 కోట్ల మంది ప్రజల మనసులను గెలుచుకున్నారు " అని. ఆ క్రీడాకారిణులతో నేను చెప్పాను.. నిజంగా మన దేశంలో యువతరం, ముఖ్యంగా మన ఆడపిల్లలు.. దేశం పేరును నిలబెట్టడానికి ఎంతో చేస్తున్నారు అని. మరో సారి దేశ యువతరానికి, ప్రత్యేకంగా మన ఆడపిల్లలకు నా హృదయపూర్వక అభినందనలను, శుభాకాంక్షలను తెలియజేస్తున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా, మరో సారి మీకు గుర్తు చేస్తున్నాను. ఆగస్టు విప్లవాన్ని, ఆగస్టు 9వ తేదీని మరో మారు గుర్తు చేస్తున్నాను. ఆగస్టు 15వ తేదీని మరో సారి గుర్తు చేస్తున్నాను. 2022 నాటికి, మన స్వాతంత్రానికి 75 వసంతాలు వస్తాయని కూడా గుర్తు చేస్తున్నాను. ప్రతి దేశ పౌరుడూ సంకల్పించి, తన సంకల్ప సిధ్ధి కోసం ఐదేళ్ళ మార్గ సూచీని తయారు చేసుకోవాలి. మనందరమూ దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలి. చేర్చాలి.. చేర్చాలి. రండి, మనందరమూ కలిసి నడుద్దాం, ఏదో ఒక ప్రయత్నం చేస్తూ నడుద్దాము. దేశ సౌభాగ్యం, భవిష్యత్తు ఉత్తమంగా ఉంటాయన్న నమ్మకంతో ముందుకు సాగుదాము. మీ అందరికీ అనేకానేక శుభాభినందనలు, ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశ వాసులారా,
నమస్కారం,
వాతావరణం మారిపోతోంది.. ఈసారి ఎండలు ఎక్కువగా ఉన్నాయి. అయితే వర్ష రుతువు రావడంతో వాతావరణం పూర్తిగా మారిపోయింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసి, వాతావరణం ప్రసన్నంగా మారింది. వర్షాలు కురిశాక చల్లని గాలులు వీచడంతో గత కొన్ని రోజులుగా ప్రజలకు ఎంతో ఊరట కలిగింది. మనకంతా అనుభవంలోకి వచ్చిన విషయమే ఇది. మనం ఎంత సంఘర్షణలో ఉన్నా, ఒత్తిడితో నలిగిపోతున్నా- అది ఒకరి స్వీయ జీవితం కావచ్చు లేదా ప్రజా జీవనం కావచ్చు- వర్షాల రాకడ ఒకరిలో ఉత్సాహాన్ని నింపి తీరుతుందనేది అనుభవైకవేద్యం.
దేశంలోని అనేక ప్రాంతాలలో జగన్నాథ రథ యాత్ర ను ఎంతో పవిత్ర భావంతో జరుపుతున్నారు. ఈ పండుగను ఇప్పుడు ప్రపంచంలోని కొన్ని ప్రాంతాలలో కూడా జరుపుకొంటున్నారు. దేశంలోని అణగారిన వర్గాల వారు భగవాన్ జగన్నాథుడితో ప్రగాఢమైన అనుభూతులు పెనవేసుకొన్నారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జీవితాన్ని, ఆయన రాసిన పుస్తకాలను చదివిన వారు ఆయన భగవాన్ జగన్నాథుని దేవాలయాన్ని, ఆ ఆలయ సంప్రదాయాలను మనస్పూర్తిగా ప్రశంసించారని గ్రహించి ఉంటారు. ఎందుకంటే, సామాజిక న్యాయం, సామాజిక సమానత్వం ఈ రెంటిలోనూ స్వయంసిద్ధంగా ముడిపడివున్నాయి. జగన్నాథ భగవానుడు నిరుపేదల ఆరాధ్య దైవం. చాలా మందికి తెలియకపోవచ్చు కానీ, ఆంగ్లంలో juggernaut అనే పదం ఉంది. ఎవరూ ఆపలేని దివ్యమైన రథం అని ఈ మాటకు అర్థం. నిఘంటువులో juggernaut పదానికి వ్యుత్పత్తి జగన్నాథ రథం నుండే తీసుకోబడినట్లుగా ఉంటుంది. దేశమంతా జగన్నాథ రథ యాత్రను తమ తమ సంప్రదాయాలకు అనుగుణంగా జరుపుకోవడం దీనికి కారణం. జగన్నాథ భగవానుడి రథ యాత్రా మహోత్సవ సమయంలో దేశ ప్రజలందరికీ నేను శుభాకాంక్షలు అందిస్తున్నాను. భగవాన్ జగన్నాథుడి చరణారవిందాలకు ప్రణామాలు అర్పిస్తున్నాను.
భారతదేశం విశిష్టతల్లో భిన్నత్వంలో ఏకత్వం కూడా ఒకటి. ఇదే మన దేశపు శక్తి కూడా. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ప్రజలంతా ప్రార్థనలు జరుపుకుంటున్నారు. ఇది ‘ఈద్’ పర్వదినం. ‘ఈద్ -ఉల్- ఫిత్ర్’ సందర్భంగా నా తరపున మీకందరికీ అనేక శుభాకాంక్షలు అందిస్తున్నాను. పుణ్యాన్ని అందించే, దానాలు చేసే రంజాన్ మాసం చాలా పవిత్రం. సంతోషాలను పంచుకొనే పవిత్ర సమయం ఇది. మనం ఎంతగా సంతోషాలను పంచుకుంటామో అవి మరింతగా ద్విగుణీకృతం అవుతాయి. రండి, మనమంతా కలిసికట్టుగా ఈ పవిత్ర పర్వదిన సందర్భాలలో ప్రేరితులమై సంతోషాల నిధులను పంచుకుందాం. దేశాన్ని ప్రగతి పథంలోకి నడిపిద్దాం.
పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ఉత్తర ప్రదేశ్ లోని బిజ్ నోర్ కు చెందిన ముబారక్ పూర్ గ్రామంలో జరిగిన ఒక అద్భుత ఘటన నా స్మృతి పథంలో మెదులుతోంది. దాదాపు మూడున్నర వేల మంది ముస్లిం సోదర, సోదరీమణులతో కూడిన కుటుంబం ఆ చిన్న గ్రామంలో నివసిస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే, ఆ ఊళ్లో ఎక్కువ జనాభా కలిగిన వ్యక్తులు ముస్లిం సోదర, సోదరీమణులే. ఈ రంజాన్ సందర్భంగా గ్రామీణులంతా కలిసి మరుగుదొడ్ల నిర్మాణం చేయాలని నిర్ణయించుకున్నారు. వ్యక్తిగతమైన మరుగుదొడ్ల నిర్మాణం పథకం కింద ప్రభుత్వం కూడా వీరికి తన తరపున 17 లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించింది. మీకు ఈ విషయం తెలిసిన తరువాత ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా పెల్లుబుకుతుంది. ఈ పవిత్ర రంజాన్ మాసంలో ఇక్కడ నివసించే ముస్లిం సోదర, సోదరీమణులు 17 లక్షల ధన సహాయాన్ని తిరస్కరించారు. ప్రభుత్వానికే తిరిగి ఇచ్చేశారు. వారంతా ఏకమై “మా కోసం నిర్మించుకునే మరుగుదొడ్లను మేమే కట్టించుకుంటాం. డబ్బులు మావే శ్రమదానం కూడా మాదే” అని చెప్పారు. ఈ 17 లక్షల రూపాయలను కేంద్రం మరో గ్రామం అభివృద్ధికి వినియోగించవచ్చునని వీళ్లు సలహా ఇచ్చారు. ఈ సందర్భంగా ముబారక్ పూర్ లోని గ్రామీణులందరికీ పవిత్ర రంజాన్ సందర్భంగా అద్భుతమైన నిర్ణయాన్ని తీసుకున్నందుకు అభినందనలు అందిస్తున్నాను. వాళ్లు చేసే ప్రతి ఒక్క పని ఇతరులకు ప్రేరణ కలిగిస్తోంది. అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే, ముబారక్ పూర్ ను వీళ్లంతా కలిసి బహిరంగ మల విసర్జన రహిత ప్రదేశంగా మార్చి వేశారు. మన దేశంలో మూడు ప్రదేశాలు ఉన్నాయి. సిక్కిం, హిమాచల్ ప్రదేశ్, కేరళ రాష్ట్రాలు ఇది వరకే బహిరంగ మల విసర్జన లేని ప్రదేశాలుగా ప్రకటింపబడ్డాయి. ఈ వారంలో ఉత్తరాఖండ్, హరియాణా లు కూడా ఈ జాబితాలో చేరిపోయాయి. ఈ ఐదు రాష్ట్రాల ప్రభుత్వాలకు అక్కడ ఉన్న అధికారులకు, సామాన్య ప్రజలందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతలు అందిస్తున్నాను. వీళ్లు చేసిన కార్యం చాలా అద్భుతమైనటువంటిది.
వ్యక్తిగత జీవితంలో కానివ్వండి.. సామాజిక జీవితంలో కానివ్వండి.. ఏదైనా ఒక మంచి పని చేయాలి అంటే, దానికి చాలా ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. మన చేతి రాత సరిగా లేదనుకోండి, దానిని సరి చేయాలంటే చాలా కాలం పాటు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. అప్పుడు గాని మన అలవాటు మారిపోదు. పరిశుభ్రత విషయం కూడా ఇలాంటిదే. పరిశుభ్రతకు భంగం కలిగించే దురలవాట్లు మనకు జీవితంలో ఒక భాగంగా మారిపోయాయి. ఇలాంటి దురభ్యాసాల నుండి విముక్తిని పొందేందుకు నిరంతరం ప్రయత్నించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరి మనస్సులో ఈ విషయం పట్ల అవగాహన పెంపొందించాల్సి ఉంటుంది. ప్రేరణను కలిగించే ఆదర్శమైన సంఘటనలను మనం మాటిమాటికి నెమరు వేసుకోవడం అవసరం. నేటి పరిస్థితుల్లో పరిశుభ్రత అనే కార్యక్రమం ప్రభుత్వానికి మాత్రమే పరిమితం కాలేదు. ప్రజలందరిలో ఇది ఒక ఉద్యమంగా మారిపోయింది. ఈ విషయం నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. ప్రభుత్వాల్లో పని చేస్తున్న వ్యక్తులు కూడా ప్రజల భాగస్వామ్యంతో ముందుకు వెళ్తున్నారు. దీని వల్ల ప్రభుత్వానికి ఎంతో బలం చేకూరుతుంది.
కొన్ని రోజుల క్రితం జరిగిన ఒక అద్భుత సంఘటన నా మదిలో మెదులుతోంది. దానిని మీ ముందు ఉంచుతున్నాను. ఈ సంఘటన ఆంధ్ర ప్రదేశ్ లోని విజయనగరం జిల్లాలో జరిగింది. అక్కడి ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ఒక బృహత్ కార్యాన్ని చేపట్టింది. మార్చి 10వ తేదీ ఉదయం 6 గంటల నుండి మార్చి 14 ఉదయం 10 గంటల దాకా 100 గంటల పాటు నిరంతర ప్రచార కార్యక్రమం చేపట్టారు. దీని లక్ష్యం ఏమిటీ అంటే, నూరు గంటల సమయంలో 71 గ్రామ పంచాయతీల్లో 10 వేల మరుగుదొడ్ల నిర్మాణం చేయడం.
ప్రియమైన నా దేశ వాసులారా, నూరు గంటల సమయంలో ప్రభుత్వం, ప్రజలు కలిసి పది వేల మరుగుదొడ్ల నిర్మాణం చేయడంలో సఫలీకృతులయ్యారన్న అంశం మీకు అపారమైన సంతోషాన్ని కలిగిస్తుంది. 71 గ్రామాలు బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా మారిపోయాయి. ప్రభుత్వాల్లో పని చేస్తున్న వ్యక్తులకు, ప్రభుత్వ అధికారులకు, విజయనగరం జిల్లాకు చెందిన ఆ గ్రామంలోని పౌరులకు నేను అనేక అభినందనలు అందిస్తున్నాను. వీళ్ళంతా కలిసికట్టుగా భగీరథ ప్రయత్నం చేసి ఇతరులకు ఆదర్శ వ్యక్తులుగా మారిపోయారు.
ఇటీవలి రోజుల్లో ‘మనసులో మాట’ (మన్ కీ బాత్) ప్రసంగాలు చేస్తున్న నాకు ప్రజల నుండి ఎన్నో సలహాలు వస్తున్నాయి. కొన్ని సూచనలు NarendraModiApp కు వస్తున్నాయి. అలాగే మరికొన్ని సలహాలు MyGov.in కు వస్తున్నాయి. ఉత్తరాలు అందుతున్నాయి. ఆకాశవాణి ద్వారా కూడా సలహాలు తామరతంపరగా వచ్చిపడుతున్నాయి.
అత్యవసర పరిస్థితిని స్మరిస్తూ శ్రీ ప్రకాశ్ త్రిపాఠి ఒక లేఖ రాశారు. జూన్ 25వ తేదీ ప్రజాస్వామ్య చరిత్రలో కళంకితమైన కాలంగా పరిగణించారు. ప్రజాస్వామ్యం పట్ల శ్రీ ప్రకాశ్ త్రిపాఠీకి ఉన్న గౌరవం, జాగరూకత ప్రశంసనీయమైంది. ప్రజాస్వామ్యం అనేది కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు. ఒక సంస్కారం కూడా. ప్రజాస్వామ్యం పట్ల నిరంతరం జాగరూకత అవసరం. అందువల్ల ప్రజాస్వామ్యానికి భంగం కలిగించే విషయాల గురించి మనం పట్టించుకోవాలి. ప్రజాస్వామ్యానికి సంబంధించిన మంచి అంశాల విషయంలో ముందంజ వేయాలి. 1975 జూన్ 25వ తేదీ ఒక కాళరాత్రిగా మారింది. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ఏ వ్యక్తి ఈ కాళరాత్రిని విస్మరించలేడు. భారతీయులెవరూ దీనిని మరిచిపోలేరు. ఒక రకంగా మొత్తం దేశాన్ని అప్పటి ప్రభుత్వం జైలుగా మార్చివేసింది. ఎమర్జెన్సీ సమయంలో అప్పటి న్యాయ వ్యవస్థ కూడా భయంతో గజగజ వణికింది. పత్రికల నోళ్లు మూయించారు. పత్రికల్లో పని చేసే వ్యక్తులు, విద్యార్థులు, ప్రజాస్వామ్యంలో కార్యం నిర్వహించే వ్యక్తులు ఆ కరాళమైన కాళరాత్రిని మాటిమాటికీ స్మరించుకుంటున్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పట్ల నిరంతర జాగరూకత వహించాలని ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి ప్రయత్నాలు ఇలాగే కొనసాగాలి సుమా. ఆ సమయంలో శ్రీ అటల్ బిహారి వాజ్ పేయి కూడా కారాగారంలో బంధించబడ్డారు. ఎమర్జెన్సీ తరువాత ఒక సంవత్సరం గడిచింది. అప్పుడు శ్రీ అటల్ బిహారీ వాజ్ పేయి ఒక కవిత రాశారు. ఆ కవితలో అలనాటి పరిస్థితిని వారు చక్కగా వర్ణించారు.
జ్యేష్ఠ మాసం బాగా అలిగింది.
శరత్ కాల చంద్రిక ఉదాసీనంగా రగిలింది
రెచ్చగొట్టే జ్యేష్ఠమాసం
చచ్చుబడిన శరత్ కాల కౌముది
శ్రావణ మాసపు భారత కుంభం ఒలికిపోయింది
ఒక ఏడాది గడిచిపోయింది
దుష్టుల కబంధ హస్తాల్లో చిక్కిపోయిన విశ్వం
కకావికలైన పక్షులు
కబంధ హస్తాల్లో చిక్కిన ప్రజలు
కకావికలైన పక్షులు
నేల నుండి నింగి దాకా
నేల నుండి నింగి దాకా
స్వాతంత్య్రం గీతం ప్రతిధ్వనించింది
ఒక ఏడాది గడిచిపోయింది
దారి చూస్తున్న కన్నులు
లెక్కపెడుతున్న రోజులు
ఎదురు చూస్తున్న నయనాలు
లెక్కపెడుతున్న రోజులు
మళ్లీ వస్తుంది ఏమో
మళ్లీ వస్తుంది ఏమో
మనసుకు కలిగిన శోకం వెళ్లిపోయింది
ఒక ఏడాది గడిచిపోయింది.. ఇలాగ సాగిందా కవిత.
ప్రజాస్వామ్యాన్ని ఆరాధించే వ్యక్తులు గట్టిగా పోరాటం చేశారు. భారతదేశం చాలా విశాలమైంది. అవకాశం దొరకినప్పుడు భారత ప్రజలందరూ ప్రజాస్వామ్యం పట్ల నరనరాల్లో జీర్ణించుకుపోయిన తమ భక్తిని ప్రకటించుకున్నారు. ఎన్నికల సమయంలో తమ బలాన్ని ప్రదర్శించారు. ప్రజల నరనరాల్లో వ్యాపించిన ఈ భావన మనకు సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని మనం మరింత బలపరచాలి.
ప్రియమైన నా దేశ వాసులారా,
నేడు ప్రతి ఒక్క భారతీయుడు ప్రపంచం ముందు తల ఎత్తుకు తిరుగుతున్నాడు. మన దేశం గర్వకారణమని భావిస్తున్నాడు. 2017 జూన్ 21 వ తేదీ ప్రపంచమంతా యోగమయంగా మారిపోయింది. జలపాతాల నుండి పర్వతాల దాకా ప్రభాత కాలంలో ప్రజలందరూ సూర్య కిరణాలకు స్వాగతం పలికారు. ఈ విషయం భారతీయులందరికీ గర్వకారణం. దీని అర్థం ఇంతకు ముందు ప్రజలకు యోగా గురించి జ్ఞానం లేదని కాదు. నేటికీ ప్రజలంతా యోగ సూత్రంలో బంధించబడ్డారు. మొత్తం ప్రపంచాన్ని కలిపే సూత్రంగా యోగం పరిణమించింది. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు జూన్ 21న యోగాసనాలు వేశాయి. చైనాలో ‘గ్రేట్ వాల్ ఆఫ్ చైనా’ పైన యోగా చేశారు. పెరూలో వరల్డ్ హెరిటేజ్ సైట్ మాచూ పిచ్చూ పై సముద్రానికి 2 వేల 400 మీటర్ల ఎత్తున ప్రజలు యోగా చేశారు. ఫ్రాన్స్ లో ఐఫిల్ టవర్ వద్ద యోగా జరిగింది. యుఎఇ లో, అబూ ధాబీ లో 4 వేల కన్నా ఎక్కువ మంది ప్రజలు సామూహికంగా యోగాసనాలు వేశారు. అఫ్గానిస్తాన్ లోని హెరాత్ లో భారత్, అఫ్గాన్ స్నేహ సేతువుగా ప్రసిద్ధి చెందిన సల్మా సేతువు పై యోగా చేశారు. ఇలా చేయడం వల్ల ఉభయ దేశాల స్నేహం విషయంలో కొత్త అంశాన్ని జోడించినట్లయింది. సింగపూర్ లాంటి చిన్న ప్రదేశంలో పది ప్రదేశాల్లో కార్యక్రమాలు జరిగాయి. ఒక వారం పాటు ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఐక్య రాజ్య సమితి (యుఎన్) పది తపాలా స్టాంపులు విడుదల చేసింది. యుఎన్ ముఖ్య కేంద్రంలో యోగా గురువులతో చర్చా సమావేశం జరిగింది. యుఎన్ లోని ప్రభుత్వ సిబ్బంది, దూతల కార్యాలయంలోని వ్యక్తులందరూ ఇందులో పాల్గొన్నారు.
ఈసారి యోగా ప్రపంచవ్యాప్తంగా రికార్డులు బద్దలు చేసింది. గుజరాత్ లోని అహమదాబాద్ లో సుమారు 55 వేల మంది ప్రజలు ఒక్కసారిగా యోగా చేసి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించారు. లఖనవూలో జరిగిన యోగా కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది. అయితే, నాకు తొలిసారిగా వర్షంలో యోగా చేసే అదృష్టం కలిగింది. మైనస్ 20, 25, 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉండే సియాచిన్ లో కూడా మన సైనికులు యోగా చేశారు. మన సాయుధ దళాలు కానివ్వండి, సరిహద్దు భద్రతా దళాలు కానివ్వండి, ఐటి బి పి సైనికులు కానివ్వండి, సిఆర్ పిఎఫ్ దళాలు కానివ్వండి, సిఐఎస్ఎఫ్ సైనికులు కానివ్వండి.. అందరూ యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒక కుటుంబంలోని మూడు తరాల వారు కలిసి యోగ చేసి, దానికి సంబంధించిన ఫొటోలు పంపించండి అని నేను కోరాను. కొన్ని టీవీ ఛానళ్లలో దీనికి సంబంధించిన వార్తలు వచ్చాయి. నాకు చాలా ఫొటోలు వచ్చాయి. వాటిలో కొన్నింటిని ఎన్నుకుని NarendraModiApp లో భద్రపరచడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా యోగ చర్చలు జరిగే ఈ వేళలో మనకు ఒక విషయం స్పష్టమైంది. యోగా చేయడం వల్ల ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించే మన సమాజం ఆరోగ్య స్థితి నుండి సురక్షిత స్థితికి చేరుకుంటోంది. యోగా వల్ల మనకు ఆరోగ్యం లభిస్తుంది. దీంతో పాటు భద్రత కోసం యోగం ఒక అద్భుతమైన సాధనం అని మనం గ్రహించాలి.
(సౌండ్ బైట్)
‘‘గౌరవనీయులైన ప్రధాన మంత్రి గారు, గుజరాత్ లోని అహమదాబాద్ నుండి నేను డాక్టర్ అనీల్ సోనారాను మాట్లాడుతున్నాను. మీకు నేను ఒక ప్రశ్న వేయాలనుకున్నాను. కేరళలో మీరు ఒక విషయం చెప్పారు. మనం వివిధ కార్యక్రమాల్లో అతిథులకు పుష్పగుచ్ఛాన్ని కానుకగా అందిస్తాం. దానికి బదులుగా పుస్తకాలు ఇవ్వాలి. అది ఒక స్మృతి చిహ్నంగా నిలిచిపోతుంది. ఈ ప్రక్రియను మీరు గుజరాత్ లో మీ కార్యాలయంలోనే ప్రారంభించారు. అయితే ఇటీవల ఇలాంటి సంప్రదాయం మనకు ఎక్కడా కనిపించదు. దీని కోసం మనం ఏమైనా చేయవచ్చా. దీని కోసం మనం ఏదైనా ప్రయత్నం ఎందుకు చేయకూడదు ? ఇది దేశవ్యాప్తంగా అమలు అయ్యేటట్టు మనం చేయగలిగింది ఏమీ లేదా ?, సార్’’ అంటూ ఆయన మాట్లాడారు.
కొన్ని రోజుల క్రితం, నేను చాలా ఇష్టమైన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. కేరళలో ఎన్నో మంచి కార్యక్రమాలు జరుగుతాయి. పి.ఎన్. పనికర్ ఫౌడేషన్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ప్రజల్లో పుస్తకాలు చదివే ప్రవృత్తి పెరగాలని, పుస్తకాల పట్ల చైతన్యం పెరగాలని ఈ ఫౌండేషన్ రీడింగ్ డే, రీడింగ్ మంత్ సెలబ్రేషన్ జరిపింది. ఆ కార్యక్రమానికి వెళ్లే అదృష్టం నాకు కలిగింది. అక్కడ పుష్ప గుచ్ఛానికి బదులుగా పుస్తకాలు ఇస్తారట. నాకు ఇది ఎంతో నచ్చింది. కొన్నేళ్ల క్రితం మర్చిపోయిన అంశాన్ని మళ్లీ గుర్తుకు తెచ్చుకునే అవకాశం నాకు కలిగింది. గుజరాత్ లో నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పుష్పగుచ్ఛానికి బదులు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించాను. లేదా చేతి రుమాలుతో స్వాగతం చేయాలనుకున్నాం. ఆ చేతి రుమాలు ఖాదీతో తయారైనటువంటిది. ఖాదీ ఉద్యమానికి కూడా మనం ప్రోత్సాహం ఇవ్వాలి కదా. గుజరాత్ లో నేను ఉన్నంత కాలం ఈ సంప్రదాయం అలాగే నిలిచింది. ఇది ఒక అలవాటుగా మారిపోయింది. ఇక్కడికి వచ్చాక ఈ అలవాటు తప్పిపోయింది. కేరళకు వెళ్లి వచ్చాక మళ్లీ అలవాటు ఏర్పడింది. వెంటనే నేను ప్రభుత్వాధికారులకు ఆదేశాలు ఇవ్వడం ప్రారంభించాను. మెల్లగా ఇది మన స్వభావంలో ఒక భాగంగా మారిపోవాలి. ఒక పుష్పగుచ్ఛం కొద్దిసేపటికి వాడిపోతుంది. ఒకసారి చేతిలోకి తీసుకుంటాం, మళ్లీ వదిలి వేస్తాం. అయితే, పుస్తకం విషయంలో అలా కాదు. అది మన ఇంట్లో ఒక భాగమైపోతుంది. కుటుంబంలో ఒక భాగంగా మారిపోతుంది. ఖాదీ చేతి రుమాలుతో స్వాగతం చెప్తే ఎంతో మంది పేదలకు మనం సహాయం చేసినట్లవుతుంది. ఖర్చు కూడా తగ్గిపోతుంది. సరిగ్గా ఇచ్చిన వస్తువు ఉపయోగపడుతుంది. ఇలాంటి అంశాలు నేను వివరిస్తున్నాను. వీటికి చారిత్రాత్మకమైన విలువ ఉంది. గత ఏడాది లండన్ కు వెళ్లినప్పుడు బ్రిటిష్ రాణి ఎలిజిబెత్ నన్ను భోజనానికి పిలిచారు. అక్కడ మాతృ వాత్సల్య భరితమైన వాతావరణం నెలకొంది. ఆప్యాయంగా రాణి గారు ఆతిథ్యం అందించారు. తరువాత ఆమె నాకు ఓ చిన్న చేతి రుమాలును ఇచ్చారు. నూలుతో తయారైన రుమాలు అది. నాకు అందించే వేళలో ఆమె కళ్ళలో ఒక మెరుపు మెరిసింది. తన పెళ్లి రోజున ఈ చేతి రుమాలును మహాత్మ గాంధీ గారు తనకు కానుకగా ఇచ్చారని, వివాహ సందర్భంలో ఆయన ఇచ్చిన శుభాకాంక్షగా ఇది మిగిలిపోయిందని ఆమె వివరించారు. మహాత్మ గాంధీ అందించిన కానుకను ఎలిజిబెత్ రాణి ఇన్నేళ్లపాటు భద్రపరచడం ఆశ్చర్యకరం. నేను వెళ్ళినపుడు నాకు ఆ రుమాలును చూపించి, దానిని స్పర్శించవలసిందిగా ఆమె కోరారు. మహాత్మ గాంధీ గారు ఇచ్చిన చిన్ని కానుక ఆమె జీవితంలో ఒక చరిత్రాత్మకమైన వస్తువుగా మిగిలిపోయింది. ఇలాంటి మంచి అలవాట్లు రాత్రికి రాత్రే రావని నాకు తెలుసు. ఇలాంటి మాటలు ప్రస్తావించినప్పుడు మనల్ని విమర్శించే వాళ్లకు కొదువ ఉండదు. ఎన్ని విమర్శలు వచ్చినా ఇలాంటి మాటలు కొనసాగాలి. ప్రయత్నాలు కూడా కొనసాగాలి. ఎక్కడికైనా వెళ్లినప్పుడు నాకు ఎవరైనా పుష్పగుచ్ఛం అందించాలనుకుంటే వాళ్లను వద్దు అని మందలిస్తానని దీని అర్థం కాదు. ఈ విమర్శలు జరుగుతూనే ఉంటాయి. మనం మన ప్రయత్నం కొనసాగించాలి. మెల్లగా పరిస్థితిలో మార్పులు వస్తాయి.
ప్రియమైన నా దేశ వాసులారా, ప్రధాన మంత్రిగా నాకు ఎన్నో కర్తవ్యాలు ఉంటాయి. ఫైళ్లలో మునిగిపోతాం. అయితే, నాకు ఒక అలవాటు ఉంది. ప్రతి రోజూ నాకు వచ్చే ఉత్తరాల్లో కొన్నింటిని చదువుతాను. సామాన్య ప్రజలతో నాకు సంబంధాన్ని పెంపొందించేవి ఈ ఉత్తరాలే. రకరకాల ఉత్తరాలు వస్తాయి. నాకు ఒక ఉత్తరం వచ్చింది. ఈ ఉత్తరం గురించి మీకు తప్పక చెప్పాలనుకుంటున్నాను. సుదూర తమిళ నాడులో మదురై నగరంలో నుండి ఒక గృహిణి అరుళ్ మొళి శరవణన్ గారు నాకు ఒక ఉత్తరం రాశారు. నా పిల్లల చదువుసంధ్యలను దృష్టిలో పెట్టుకుని ఏదో ఒక ప్రయత్నంతో ఆర్థికంగా బలపడాలని ఆశించాను. నా కుటుంబానికి వేడినీళ్ళకు చన్నీళ్ళుగా ఉపయోగపడాలని అనుకున్నా. బ్యాంకులో నుండి డబ్బులు తీసి కొన్ని వస్తువులను ఖరీదు చేసి అమ్మే విషయం గురించి ఆలోచించారు. ఇంతలో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన Government e-Marketplace అనే అంశం నా మదిలో మెదిలింది. నేను దాని కోసం ఎందరినో అడిగాను. అన్వేషణ కొనసాగించాను. ఆ పథకంలో నేను నా పేరు నమోదు చేయించుకున్నాను. భారతీయులందరికీ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. మీరు కూడా ఇంటర్ నెట్ పై ఈజీఇఎమ్ అనే సైటుకు వెళ్లండి. అక్కడ ఒక కొత్త రకమైన వ్యవస్థ ఉంది. ఎవరైనా ప్రభుత్వానికి చిన్న చిన్న వస్తువులను సరఫరా చేయాలనుకుంటే ఉదాహరణకు బల్బులు, డస్ట్ బిన్ లు, చీపుర్లు, కుర్చీలు, టేబుళ్ళు పంపించాలనుకున్నా, అమ్మాలనుకున్నా ఇందులో తన పేరు రిజిస్టర్ చేసుకోవాలి. తన వద్ద ఉన్న వస్తువుల క్వాలిటీ గురించి అందులో రాయాలి. దాని ధర ఎంతో వివరించాలి. ప్రభుత్వ అధికారులు ఈ సైట్ కు తప్పనిసరిగా వెళ్లాలి. తక్కువ ధరకు చక్కటి ప్రమాణాలు కలిగిన వస్తువులను అమ్మే వ్యక్తులను మనం గుర్తించాలి. ఆ వ్యక్తికి సామాగ్రి పంపించమని ఆదేశాలు ఇవ్వాలి. ఇక లంచగొండితనానికి ఇక్కడ ఆస్కారం లేదు. సంపూర్ణమైన పారదర్శకత ఉంది. ఇక్కడ సంఘర్షణకు చోటు లేదు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంతో అన్నీ స్పష్టంగా జరుగుతాయి. ఈజీఇఎమ్ లో రిజిస్టర్ అయిన వ్యక్తుల సరకుల వివరాలను తప్పనిసరిగా ప్రభుత్వాధికారులు పరిశీలిస్తారు. మధ్యవర్తులు లేని కారణంగా కారుచౌకగా వస్తువులు లభిస్తాయి. ఈ అరుళ్ మొళి మేడమ్ కూడా ఈ వెబ్ సైట్ పై తాను అమ్మదలిచిన వస్తువుల జాబితాను నమోదు చేసుకున్నారు. ఆవిడ నాకు రాసిన ఉత్తరం చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఆమె రాశారు “ముద్రా’’ పథకం ద్వారా నాకు పెట్టుబడి లభించింది. నా వ్యాపారం ప్రారంభమైంది. ఈజీఇఎమ్ లో నా వద్ద అమ్మకానికి సరుకుల వివరాలన్నీ పొందుపరిచాను. ప్రధాన మంత్రి కార్యాలయం నుంచి నాకు ఆర్డర్ కూడా లభించింది అని. ఆమె తన ఉత్తరంలో ప్రధాన మంత్రి కార్యాలయం వారు రెండు ఫ్లాస్క్ లను కొనుక్కున్నారు. వీటి తాలుకు 1600 రూపాయల పేమెంట్ కూడా నాకు అందింది. ఇదే నిజమైన సాధికారిత. సన్నకారు పరిశ్రమలను ప్రోత్సహించాలి మనం. అరుళ్ మొళి నాకు ఉత్తరం రాయకపోయి ఉంటే ఈజీఇఎమ్ ప్రక్రియ ద్వారా సుదూర ప్రాంతానికి చెందిన ఒక మహిళ వ్యాపారం చేస్తున్న అంశం తెలిసేది కాదు. ఆమె అందించిన వస్తువులు ప్రధాన మంత్రి కార్యాలయానికి చేరుకోవడం విశేషం. ఇదే మన దేశంలోని బలం. ఇందులో పారదర్శకత ఉంది. సాధికారిత నెలకొంది. నూతన ఉద్యమం ప్రారంభించే ప్రయత్నం ఉంది. తమ వద్ద ఉన్న సరుకులను విక్రయించదలచిన వ్యక్తులు ఈజీఇఎమ్ సౌలభ్యాన్ని ఉపయోగించుకోవచ్చు. ప్రభుత్వం ఉండనే ఉంటుంది. పాలన మాత్రం పటిష్టంగా సాగుతుంది. ఇందుకు ఇదే ఉదాహరణ. చౌక ధరలో చాలా సులభంగా వస్తువులు లభిస్తాయి. సామర్థ్యం పెరుగుతుంది. పారదర్శకత పెరుగుతుంది.
ప్రియమైన నా దేశ వాసులారా,
ఒకవైపు యోగా గురించి మనం గర్వపడుతున్నాం. మరో వైపు అంతరిక్షంలోకి విజయవంతంగా ఉపగ్రహాలను పంపిస్తున్నాం. ఇది కూడా మనకు గర్వకారణం. ఒకవైపు మన పాదాలు యోగంతో ముడిపడి నేలపై నిలిచాయి. మన స్వప్నాలు మాత్రం సుదూరమైన ఆకాశంలో క్షితిజాలను దాటి ప్రయాణిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా క్రీడా రంగంలో, శాస్త్ర విజ్ఞాన రంగంలో మనం ఎన్నో చమత్కారాలు చేశాం. మన భారతదేశం నేల మీదే కాదు నింగిపై కూడా అభివృద్ధిని సాధించింది. రెండు రోజుల క్రితం ఇస్రో సంస్థ 30 నానో ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపించింది. ఈ ప్రయత్నంలో భారత్ తో పాటు ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా లాంటి 14 దేశాలు కూడా పాలుపంచుకున్నాయి. ఈ నానో ఉపగ్రహాల సహాయంతో వ్యవసాయరంగంలో ఎన్నో వింతలు చేయవచ్చు. ప్రకృతి వైపరీత్యాల గురించి ముందస్తు సమాచారం లభిస్తుంది. కొన్ని రోజుల క్రితం జరిగిన సంఘటన నా స్మృతిలో మెదులుతోంది. ఇస్రో జిశాట్ 19ను విజయవంతంగా ప్రయోగించింది. ఇంతవరకు భారత్ అంతరిక్షంలోకి పంపిన ఉపగ్రహాల్లో చాలా బరువైనది ఇదే. మన భారతదేశంలోని పత్రికలన్నీ ఈ ఉపగ్రహం బరువు ఏనుగుతో సమానమని అభివర్ణించాయి. జూన్ 19వ తేదీన మార్స్ మిషన్ జరిగి వెయ్యి రోజులు పూర్తి అయ్యాయి. మీకంతా తెలిసిన విషయమే మార్స్ మిషన్ కోసం మనం అంతరిక్షంలో విజయవంతంగా ఒక ప్రదేశాన్ని ఎన్నుకున్నాం. ఈ మిషన్ వ్యవధి 6 నెలలు. ఆ ఉపగ్రహం జీవన కాలం కూడా ఆరు నెలలు. ఆరు నెలలు గడిచిపోయినా మన మంగళయాన్ మిషన్ ఇంకా పని చేస్తూనే ఉంది. ఫొటోలు పంపిస్తోంది. సమాచారం అందిస్తోంది. విజ్ఞానానికి సంబంధించిన డేటాను అందిస్తోంది. అనుకున్న వ్యవధి కన్నా ఎక్కువ కాలం పని చేయగలుగుతోంది. వెయ్యి రోజులు పూర్తి చేసుకోవడం అంతరిక్ష యాత్రలో ఒక మహత్తరమైన అడుగు.
ఈ రోజుల్లో మనం క్రీడా రంగంలో కూడా ప్రగతిని సాధించాం. క్రీడారంగం పట్ల మన యువతీయువకుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. చదువులతో పాటు యువకులు క్రీడా కార్యక్రమాల్లో కూడా పాల్గొంటున్నారు. ఇవన్నీ వాళ్ల ఉజ్జ్వల భవిష్యత్తుకు తార్కాణాలు. మన క్రీడాకారులు విజయపరంపరలతో మన దేశం క్రీడా రంగంలో గర్వకారణమైన స్థితికి చేరుకుంది. మన కీర్తి ప్రతిష్టలు ప్రపంచమంతా వ్యాపించాయి. ఇటీవల మన దేశానికి చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు శ్రీ కిదాంబి శ్రీకాంత్ ఇండోనేశియా ఓపెన్ లో దిగ్విజయం సాధించాడు. మన కీర్తి పతాకాన్ని వినువీధిలో ఎగురవేశాడు. ఈ మహత్తర విజయానికి శ్రీకాంత్ ను, ఆయన కోచ్ ను హృదయ పూర్వకంగా అభినందిస్తున్నాను. కొన్ని రోజుల క్రితం పరుగుల రాణి పి.టి. ఉష గారు నెలకొల్పిన ఉషా స్కూల్ ఆఫ్ అథ్లెటిక్స్ లో సిన్ థెటిక్ ట్రాక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం నాకు దక్కింది. క్రీడా రంగానికి మనం అందించే ప్రాముఖ్యాన్ని బట్టి క్రీడాకారులు తమ క్రీడా స్ఫూర్తిని పెంపొందించుకోవడం జరుగుతుంది. వ్యక్తిత్వ వికాసంలో క్రీడలు అద్భుతమైన పాత్రను పోషిస్తాయి. సమగ్ర వ్యక్తి నిర్మాణంలో క్రీడలు చాలా ముఖ్యమైనవి. మన దేశంలో ప్రతిభావంతులకు ఏ మాత్రం కొరత లేదు. మన కుటుంబాల్లో పిల్లలు ఇష్టపడితే క్రీడా రంగంలో వాళ్లకు అవకాశాలు అందించాలి. ఆట మైదానం నుంచి వాళ్లను తెచ్చి, గదిలో బంధించి పుస్తకాల పురుగులుగా మార్చడం తగదు. చదువులతో పాటు క్రీడా రంగంలో కూడా వారు ముందంజ వేయాలి. విద్యార్థులకు క్రీడారంగంలో ఏ మాత్రం ఆసక్తి ఉన్నా పాఠశాలలో, కళాశాలలో, కుటుంబంలో అన్ని చోట్లా వ్యక్తులు ప్రోత్సహించాలి. రాబోయే ఒలంపిక్స్ సందర్భంగా భారతీయులందరూ కొత్తగా కలలు కనే దిశగా ముందుకు సాగాలి.
ప్రియమైన నా దేశ వాసులారా, మరొక్కసారి పండుగల వాతావరణంతో ఈ వర్ష రుతువు మనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సమయంలో మనకు కలిగిన అనుభూతి నిత్య నవీనమైంది. మరొక్కసారి మీకందరికీ నా శుభాకాంక్షలు.. రాబోయే ‘మనసులో మాట’ (మన్ కీ బాత్) కార్యక్రమంలో మరికొన్ని మాటలు ముచ్చటిస్తాను.
నమస్కారం.
***
ఈ ఏడాది వేసవిని మనం మర్చిపోలేము.. కానీ వర్షాకాలం కోసమైతే ఎదురు చూస్తున్నాం. మీతో నేను మాట్లాడుతున్న ఈ రోజు నుంచే పవిత్రమైన రంజాన్ నెల మొదలైంది. పవిత్రమైన రంజాన్ నెల మొదలైన సందర్భంగా భారత దేశంలోని, యావత్ ప్రపంచం లోని ప్రజలకూ, ప్రత్యేకంగా ముస్లిమ్ సమాజానికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రంజాన్ నెలలో ప్రార్థనకూ, ఆధ్యాత్మికతకూ, దాతృత్వానికీ చాలా ప్రత్యేకత ఇస్తారు. మన భారతీయులందరూ గర్వించదగ్గ సంప్రదాయాన్ని మన పూర్వీకులు మనకు ఏర్పరచడం నిజంగా మన అదృష్టం.
ప్రపంచంలోని అన్ని సంప్రదాయాలూ మన దేశంలో ఉన్నందుకు మన నూట పాతిక కోట్ల మంది దేశవాసులందరం గర్వపడాలి. మన దేశంలో ఆస్తికులూ ఉన్నారు, నాస్తికులూ ఉన్నారు. విగ్రహారాధనను సమర్ధించేవారూ ఉన్నారు, విగ్రహారాధనని వ్యతిరేకించేవారూ ఉన్నారు. ఇటువంటి సిధ్ధాంతాలూ, ఇటువంటి పూజాపధ్ధతులూ, ఇటువంటి సంప్రదాయమూ, మనందరికీ కలిసికట్టుగా ఉండగలిగే కళను జీర్ణించుకునేలా చేశాయి. ధర్మమైనా, సంప్రదాయమైనా, సిధ్ధాంతమైనా, ఆచారమైనా మనకు ఒకే సందేశాన్ని అందిస్తాయి - అవే శాంతి, ఏకత్వం, సద్భావన. ఈ శాంతి, ఏకత్వం, సద్భావనల మార్గం ముందుకు వెళ్ళడానికి పవిత్రమైన ఈ రంజాన్ నెల సహకరిస్తుంది. నేను మరో సారి అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. క్రితంసారి ‘‘మనసులో మాట’’ చెప్తున్నప్పుడు నేను ఒక పదాన్ని వాడాను, ముఖ్యంగా యువతతో అన్నాను.. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఏదైనా కొత్తగా చెయ్యమని; కొత్త అనుభవాలను చవిచూడమని. జీవితంలో కాస్తంత రిస్క్ తీసుకుని, కష్టాలను ఎదుర్కోవడానికి ఇదే సరైన వయసనీ చెప్పాను. దానికి చాలామంది ప్రజలు ప్రతిస్పందించడం ఇవ్వడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. వ్యక్తిగతంగా తమ తమ విషయాలు చెప్పడానికి అందరూ ఉత్సాహాన్ని కనబరిచారు. అన్నింటినీ నేను చదవలేకపోయాను, ప్రతి ఒక్కరి సందేశాన్నీ నేను కనీసం వినలేకపోయాను. అన్ని ఎక్కువ సందేశాలు వచ్చాయి. కానీ నేను సంక్షిప్తంగా చూసినంతవరకూ గమనించిందేమిటంటే, కొందరు సంగీతాన్ని నేర్చుకునే ప్రయత్నం చేశారు, కొందరు కొత్త వాయిద్యాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, కొందరు యూట్యూబ్ సహాయంతో కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, కొత్త భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు వంట నేర్చుకుంటున్నారు, కొందరు నాట్యం నేర్చుకుంటున్నారు, కొందరు నటన నేర్చుకుంటున్నారు, కొందరైతే కవితలు రాయడం మొదలుపెట్టామని కూడా రాశారు. ప్రకృతి గురించి తెలుసుకుని, జీవించి, అర్థం చేసుకొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఒక ఫోన్ కాల్ ని మీకు కూడా వినిపించాలనుకుంటున్నాను.. అదేమిటంటే,
‘‘నేను దీక్షా కాత్యాల్ ని మాట్లాడుతున్నాను. నాకున్న చదివే అలవాటు మొత్తం పోయింది. అందుకని ఈ సెలవుల్లో నేను మళ్ళీ చదవాలని నిర్ణయించుకున్నాను. సాతంత్ర్య పోరాటం గురించి నేను చదవడం మొదలుపెట్టినప్పుడు నాకు అర్ధమైంది.. భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని అందివ్వడానికి ఎంత పోరాటం చెయ్యాల్సి వచ్చిందో, ఎన్ని బలిదానాలు ఇవ్వాల్సివచ్చిందో, ఎందరు స్వాతంత్ర్య సమర యోధులు జైళ్ళలో ఏళ్లకు ఏళ్ళు గడిపారో. చిన్న వయస్సులోనే ఎంతో సాధించిన కీర్తిశేషుడు భగత్ సింగ్ వల్ల నేనెంతో ప్రభావితురాలినయ్యాను. అందువల్ల ఈ విషయం గురించి యువతరానికి మీరు సందేశాన్ని ఇవ్వవలసిందని కోరుతున్నాను’’.
మన దేశ చరిత్ర గురించి, మన స్వాతంత్ర సమర యోధుల గురించి , దేశం కోసం తమ ప్రాణాలర్పించిన వీరుల గురించి తెలుసుకోవడానికి మన యువతరం ఆసక్తి చూపడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. లెక్కకు మించిన మహా పురుషులు వారి యౌవనాన్ని జైళ్ళలో కోల్పోయారు. ఎందరో యువకులు ఉరితీయబడ్డారు. వారంతా ఎన్నో బాధలు పడ్డారు కాబట్టే ఇవాళ మనం స్వాతంత్ర్య భారతావనిలో ఊపిరి పీల్చుకోగలుగుతున్నాము. స్వాతంత్ర్య పోరాటంలో ఏయే మహాపురుషులైతే జైళ్ళలో గడిపారో వారంతా చదవడం, రాయడం మొదలైన చాలా పెద్ద పని చేశారు. వారందరి రచనలూ కూడా భారత దేశస్వాతంత్రానికి చాలా శక్తినిచ్చాయన్న సంగతి మనకు తెలుసు.
చాలా ఏళ్ళ క్రితం నేను అండమాన్- నికోబార్ కు సెల్యులార్ జైల్ చూడ్డానికి వెళ్ళాను. ఇవాళ వీర్ సావర్ కర్ గారి జయంతి. ఆయన జైల్లో ‘మాజీ జన్మఠే’ అనే పుస్తకాన్ని రాశారు. కవితలు రాసే వారు. గోడలపై రాసే వారు. ఆయనను చిన్న చీకటి గదిలో బంధించారు. స్వాతంత్ర్య ప్రేమికులు ఎలాంటి యాతనలు అనుభవించారో ! సావర్కర్ గారి ‘మాజీ జన్మఠే’ పుస్తకాన్ని నేను చదివినప్పుడు, నాకు సెల్యులర్ జైల్ చూడాలనే ఆసక్తి కలిగింది. అక్కడొక light & sound show కూడా జరుగుతుంది. అది చాలా ప్రేరణాత్మకంగా ఉంటుంది. స్వాతంత్ర్యం కోసం అండమాన్ జైల్లోని ఇదే సెల్యూలర్ జైల్ లో కాలాపానీ శిక్షను అనుభవిస్తూ వారి యౌవనాన్ని కోల్పోయిన వారు భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి చెందిన వారు, ప్రతి భాషను మాట్లాడే వారు ఉన్నారు. ప్రతి భాష మాట్లాడే వారూ , ప్రతి ప్రాంతానికి చెందిన వారూ, ప్రతి తరానికీ చెందిన ప్రజలు యాతనలను అనుభవించారు.
ఇవాళ వీర సావర్ కర్ గారి జయంతి. మనకు లభించిన స్వాతంత్ర్యం కోసం ప్రజలు ఎటువంటి యాతనలను అనుభవించారో, ఎన్నెన్ని కష్టాలు పడ్డారో, సెల్యులర్ జైల్ కు వెళ్ళి చూస్తే, కాలాపానీ అని ఎందుకంటారో, అక్కడికి వెళ్ళాకే తెలుస్తుందని నేను దేశ యువతరానికి తప్పకుండా చెప్పదలుచుకున్నాను. మీరు కూడా వీలైతే, ఒక రకంగా మన స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఈ తీర్థ క్షేత్రానికి తప్పకుండా వెళ్లండి.
ప్రియమైన నా దేశ ప్రజలారా, జూన్ 5 నెలలో ఒకటో సోమవారం. మామూలుగా అయితే ఏ ప్రత్యేకతా లేదు. కానీ, జూన్ 5 ఒక విశేషమైన రోజు. ఎందుకంటే ఆ రోజును మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ ఏడాది ఐక్య రాజ్య సమితి ఈ సంవత్సరానికి పెట్టిన ఇతివృత్తం ఏమిటంటే connecting people to nature. మరొక మాటలో చెప్పాలంటే back to basics. ప్రకృతితో అనుసంధానం అవ్వడమంటే ఏమిటి ? నా దృష్టిలో దీనికి అర్థం మనతో మనం కలవడం. మనతో మనం కనెక్ట్ అవ్వడం. ప్రకృతితో కనక్టవ్వడమంటే, బెటర్ ప్లానెట్ ని పెంపొందించడం. ఈ సంగతిని మహాత్మ గాంధీ గారి కన్నా బాగా ఎవరు చెప్పగలరు ? మహాత్మ గాంధీ గారు చాలా సార్లు చెప్పే వారు "one must care about a world one will not see" అని. అంటే, మనం చూడని ప్రపంచాన్ని గురించి కూడా ఆలోచించాలి, జాగ్రత్త తీసుకోవాలి. మీరూ గమనించే ఉంటారు, ప్రకృతి లోని శక్తి ఏమిటంటే బాగా అలసిపోయి వచ్చినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు మొహంపై చల్లుకుంటే ఎంతో తాజాదనం వచ్చేస్తుంది. బాగా అలసిపోయి వచ్చినప్పుడు గది కిటికీలు తెరిచి, తలుపులు తెరిచి, తాజా గాలిని పీల్చుకున్నప్పుడు కొత్త చైతన్యం వస్తుంది. ఏ పంచభూతాలతో ఐతే శరీరం నిర్మితమౌతుందో, ఆ పంచభూతాల స్పర్శ కలిగినప్పుడు మన శరీరంలో ఒక కొత్త ఉత్తేజం ఉత్పన్నమౌతుంది, ఒక కొత్త శక్తి కనబడుతుంది. ఇది మనకందరికీ అనుభవంలోనిదే. కానీ మనం దీనిని పట్టించుకోము. మనం దీనిని ఒక దారానికి కట్టి ఉంచము. ఒక సూత్రంతో బంధించము. మీరు ఇకపై తప్పక గమనించండి, మీకు ప్రకృతి పరమైన స్పర్శ కలిగినప్పుడు మీలో ఒక కొత్త చైతన్యం జాగృతమౌతుంది. అందువల్ల జూన్ 5న ప్రకృతితో ముడిపడాలనే ప్రపంచ ప్రయత్నం మన సొంత ప్రయత్నం కూడా అవ్వాలి. మన పూర్వీకులు పర్యావరణను కాపాడిన ఫలితం మనకు ఇప్పుడు లభిస్తోంది. మనం గనుక ఇప్పుడు కాపాడితే, రాబోయే తరాలకు లాభం చేకూరుతుంది. వేదాలు పృథ్వి, పర్యావరణాలను శక్తి మూలాలుగా కొలిచాయి. మన వేదాల్లో ఈ వర్ణన లభిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే అథర్వణ వేదం మొత్తం పర్యావరణకు చెందిన దిశానిర్దేశ గ్రంథం. ఇది వేల సంవత్సరాలకు పూర్వమే రాయబడింది. ‘‘మాతా భూమి: పుత్రో అహం పృథివ్యా:’’ అని చెప్పబడింది. మనలోని స్వచ్ఛతకు కారణం పృథ్వి అని వేదాలు చెప్పాయి. అవని మన తల్లి, మనం ఆమె బిడ్డలము. బుధ్ధ భగవానుడిని తలుచుకున్నప్పుడు వెలికివచ్చే విషయం ఏమిటంటే, బుద్ధ భగవానుడి జన్మ, ఆయన జ్ఞాన ప్రాప్తి, ఆయన మహాపరినిర్వాణము మూడూ ఒక చెట్టు కింద జరిగాయి. మన దేశంలో కూడా ఎన్నో పండుగలూ, ఎన్నో పూజా పధ్ధతులూ; చదువుకున్నవారైనా, చదువురానివారైనా, పట్టణవాసులైనా, పల్లెవాసులైనా, ఆదివాసీలైనా, అందరికీ ప్రకృతి పూజ, ప్రకృతి పట్ల ప్రేమ సహజంగానే వారి సామాజిక జీవితంలో భాగమే. కానీ మనం ఈ విషయాన్ని ఆధునిక నిర్వచనాలతో, ఆధునిక ఆలోచనలతో జోడించాల్సిన అవసరం ఉంది.
ఈమధ్య నాకు రాష్ట్రాల నుండి కబుర్లు అందుతున్నాయి. ఏమంటే, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వర్షాలు మొదలౌతూనే, పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ఆరంభమవుతుంది. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతారు. పాఠశాల పిల్లలను కూడా కలుపుకుంటారు. సమాజ సేవా సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు కలుస్తాయి. ప్రభుత్వం స్వయంగా చొరవ తీసుకుంటుంది. మనం కూడా ఈ ఏడాది వర్షాకాలంలో మొక్కలు నాటే పనిని ప్రోత్సహిద్దాం.
సహకరిద్దాం.
నా ప్రియమైన దేశప్రజలారా, జూన్ 21 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన రోజు. ప్రపంచ యోగా దినోత్సవం రూపంలో యావత్ ప్రపంచం ఈ రోజును జరుపుకుంటుంది. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం గా అచిర కాలంలోనే మూలమూలలకూ వ్యాపించి, ప్రజలను దగ్గరచేస్తోంది. ఒకవైపున ఎన్నో విచ్ఛిన్నకర శక్తులు ప్రపంచంలో తమ వికృత రూపాల్ని ప్రదర్శిస్తున్న సమయంలో, భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప వరం యోగా. యోగా ద్వారా యావత్ ప్రపంచాన్ని ఒక సూత్రంతో ముడిపెట్టగలిగాం. మనసును ,బుధ్ధిని, శరీరాన్నీ, ఆత్మనీ ఎలాగైతే కలుపుతుందో, అలాగే ఈ రోజు యోగా ప్రపంచాన్ని దగ్గరచేస్తొంది. ఇవాళ మన జీవన శైలి వల్ల, హడావుడి వల్ల, పెరుగుతున్న బాధ్యతల వల్లా ఒత్తిడి లేని జీవితాన్ని జీవించడం కష్టతరమైపోతోంది. పిన్న వయస్కుల్లో కూడా ఈ పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఏవో ఒక మందులు వేసుకుని రోజుని గడిపేస్తున్నాం. ఇలాంటి సమయంలో ఒత్తిడి రహిత జీవితం జీవించడానికి యోగా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వెల్ నెస్, ఫిట్ నెస్.. రెండిటికీ సంబంధించిన పూచీని యోగా ఇస్తుంది. యోగా వ్యాయామం మాత్రమే కాదు. మనసును ,బుధ్ధిని, శరీరాన్నీ, ఆలోచనల ద్వారా, ఆచారం ద్వారా ఆరోగ్యం కోసం ఒక అంతర్గత ప్రయాణం. ఆ అంతర్గత యాత్రను అనుభూతి చెందాలంటే, అది యోగా ద్వారానే సాధ్యం. రెండు రోజుల క్రితమే యోగా దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ప్రపంచం లోని అన్ని ప్రభుత్వాలకూ, అందరు నేతలకూ ఉత్తరాలు రాశాను.
క్రితం సంవత్సరమే నేను యోగాకు సంబంధించిన కొన్ని పోటీలను ప్రకటించాను. కొన్ని బహుమతులను ప్రకటించాను. నెమ్మది నెమ్మదిగా ఆ దిశగా పనులు ముందుకు సాగుతాయి. నాకొక సలహా వచ్చింది. ఆ మౌలికమైన సలహాను ఇచ్చిన వారిని నేనెంతో అభినందిస్తున్నాను. చాలా ఆసక్తికరమైన సలహా అది. వారేమన్నారంటే ఇది మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారు, ఒకేసారి యోగాసనాలను చేసేలాగ పిలుపునివ్వవలసిందిగా నన్ను కోరారు. అమ్మమ్మ,తాతయ్య ఆయినా సరే, నానమ్మ, తాతయ్య అయినా సరే, తల్లితండ్రులైనా సరే, కొడుకులు,కూతుళ్ళైనా సరే, ఒక మూడు తరాల వాళ్ళు కలిసి యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను అప్ లోడ్ చెయ్యండి. నిన్న, నేడు, రేపటి ఈ సుందరమైన సంయోగం యోగాకు ఒక కొత్త కొలమానాన్ని అందిస్తుంది. ఈ సలహాను ఇచ్చిన వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం ఎలాగైతే ’ సెల్ఫీ విత్ డాటర్ ’ అనే విధానం ద్వారా మంచి ఆసక్తికరమైన అనుభవాన్ని సంపాదించామో అలాగన్న మాట. యోగాసనాలు వేస్తున్న ఈ మూడు తరాల వారి ఫోటోలు తప్పకుండా దేశానికీ, ప్రపంచానికీ కూడా ప్రశంసలను అందిస్తాయి. మూడు తరాల వారు ఎక్కడ యోగా చేసినా సరే, వారు కలిసి యోగాసనాలు చేస్తున్న ఫోటోలను నాకు మీరు తప్పకుండా నరేంద్ర మోదీ యాప్ కూ, my gov కూ పంపించండి. నిన్న,నేడు, రేపటి ఈ చిత్రాలు ఒక ఆహ్లాదకరమైన రేపటి భరోసాను అందిస్తాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇంకా మన వద్ద మూడు వారాల సమయం ఉంది. నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇవాళ్టి నుండి ఆచరణను మొదలుపెట్టండి. నేను కూడా జూన్ 1 నుండీ ట్విటర్ లో రోజూ యోగా సంబంధమైన విషయాలు పోస్ట్ చేస్తూఉంటాను. వరుసగా జూన్ 21 వరకూ పోస్ట్ చేస్తూ, మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మీరు కూడా మూడు వారాల పాటు వరుసగా యోగా గురించిన విషయాలను ప్రచారం చెయ్యండి. ప్రసారం చెయ్యండి. ప్రజలను కలుపుకుంటూ వెళ్ళండి. ఒక రకంగా దీనిని preventive health care ఉద్యమమనే అనాలి. నేను మీ అందరినీ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.
మీ అందరూ నాకు ‘ప్రధాన సేవకుడి’ బాధ్యతను అప్పగించినప్పటి నుండీ, తరువాత ఎర్ర కోట నుండి నా మొదటి ప్రసంగం ఆగస్టు 15న, అక్కడి నుండి మొదటిసారి మాట్లాడే అవకాశం లభించినప్పుడూ కూడా నేను స్వచ్ఛత గురించిన విషయాలు మాట్లాడాను. అప్పటి నుండీ ఇప్పటివరకూ భారతదేశంలో రకరకాల ప్ర్రాంతాలలో నేను పర్యటించాను. అలా తిరిగినప్పుడల్లా నేను గమనించిందేమిటంటే, కొందరు చాలా సూక్ష్మంగా మోదీ ఏం చేస్తున్నారు ? మోదీ ఎక్కడికి వెళ్తున్నారు ? మోదీ ఏమేమి చేస్తున్నారు అనే దాన్ని బాగా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే నాకు చాలా ఆసక్తికరమైన ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే, నేనసలు ఆ విధంగా ఊహించలేదనే చెప్పాలి. కానీ వారు ఈ విషయాన్ని గమనించినందుకు వారికి నేను ఋణపడిఉంటాను. ఈ ఫోన్ కాల్ వింటే అదేమిటో మీక్కుడా అర్థమౌతుంది..
"మోదీ గారూ, నమస్కారం! నేను ముంబయ్ నుంచి నైనాను మాట్లాడుతున్నాను. మోదీ గారూ, నేను టీవీ లోనూ, సోషల్ మీడియా లోనూ ఈమధ్య తరచూ చూస్తున్నదేమిటంటే మీరు వెళ్ళిన ప్రతి చోటా కూడా ప్రజలు శుచి- శుభ్రతల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ముంబయ్ అయినా, సూరత్ అయినా.. మీ ఆహ్వానంపై ప్రజలు గుంపులు గుంపులుగా పరిశుభ్రతను ఒక బృహత్కార్యం గా స్వీకరిస్తున్నారు. పెద్దలలో, పిల్లలలో కూడా పరిశుభ్రత పట్ల అవగాహన వచ్చింది. చాలా సార్లు రహదారుల మీద చెత్త పారేస్తున్న పెద్దవాళ్ళని కూడా వారు ఆపడం నేను గమనించాను. కాశీ ఘాట్ నుండి మీరు మొదలుపెట్టిన పరిశుభ్రత తాలూకూ ప్రచారం, మీ ప్రేరణతో ఒక ఉద్యమంగా మారింది."
మీ మాటలు నిజమే. నేనెక్కడెక్కడికి వెళ్ళినా ప్రభుత్వ యంత్రాంగం పరిశుభ్రతా కార్యక్రమాన్ని చేపడుతుంది. కానీ ఈమధ్య సమాజంలో కూడా పరిశుభ్రత ఒక ఉత్సవంగా మారింది. నేను వెళ్ళడానికి ఐదురోజుల ముందు, ఏడు రోజుల ముందు, పది రోజుల ముందు, చాలా పెద్ద ఎత్తున పరిశుభ్రతా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రసార మాధ్యమాలు కూడా దానికి ఎంతో ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నేను గుజరాత్ లోని కచ్ఛ్ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ పరిశుభ్రత ను గురించి చాలా పెద్ద కార్యక్రమమే జరిగింది. నేనది గమనించలేదు కానీ ఇంతకు ముందు చెప్పిన ఫోన్ కాల్ వచ్చిన తరువాత ఆలోచిస్తే, ఆ సంగతి నిజమేననిపించింది. దేశం ఈ విషయాలన్నీ ఎంత శ్రధ్ధగా గమనిస్తోందో తెలుసుకున్నాక, ఈ విషయాన్ని గమనించాక, నాకెంత ఆనందం కలుగుతోందో మీరు ఊహించగలరు. నా ప్రయాణాలకు కూడా పరిశుభ్రత జోడైందన్న విషయం తెలుసుకోవడం కన్నా ఆనందం మరొకటేముంటుంది నాకు ? ప్రధాన మంత్రిని ఆహ్వానించడానికి జరిగే ఇతర సన్నాహాలు ఎలాగూ జరుగుతాయి. కానీ, వాటన్నింటికన్నా పరిశుభ్రత పాటించడమనే సంగతికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. తనకు తానుగా పరిశుభ్రతను ప్రేమించడమనేది ఎవరికైనా ఆనందదాయకమే. స్ఫూర్తిదాయకమే. ఈ పరిశుభ్రతా కార్యక్రమాన్ని ప్రోత్సహించేవారందరికీ కూడా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎవరో నాకొక సలహా ఇచ్చారు. నిజానికా సలహా చాలా తమాషాగా ఉంది. అది నేను చెయ్యగలనో లేదో కూడా నాకు తెలీదు. మోదీ గారూ, మీరు మీ పర్యటనను నిర్ణయించుకునేప్పుడు ఏ రకమైన పర్యటన కోరినా, వాళ్ళతో "బాబూ, నన్ను పిలవాలంటే మీ పరిశుభ్రత స్థాయి ఎంత ఉంటుంది ? ఎన్ని టన్నుల చెత్తా చెదారాన్ని మీరు నాకు బహుమనంగా ఇవ్వగలరు ? దాని ఆధారంగా నేను నా పర్యటనను నిర్ణయించుకుంటాను అని చెప్పండి.." అన్నారు. ఉపాయం బాగానే ఉంది కానీ నేనూ ఆలోచించుకోవాలి. కానీ ఇలాంటి ఒక ఉద్యమం తయారవ్వాలి. ఏవేవో వస్తువులు బహుమతిగా ఇచ్చే కన్నా ఇన్ని టన్నుల చెత్తచెదారాన్ని శుభ్రపరిచి బహుమానంగా ఇవ్వడమనేది చాలా మంచి విషయం. ఇలా చెయ్యడం ద్వారా ఎంతో మందిని రోగాల బారి నుండి కాపాడినవారమౌతాము. అది మానవత్వాన్ని ఎంతగానో పెంచే పని. ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలచుకున్నాను. ఈ చెత్తా చెదారం ఏదైతే ఉందో అది వృథా కాదు. అది సంపద. ఒక వనరు. దీనిని కేవలం పనికిరాని చెత్తగానే మాత్రం చూడకండి. ఒక్కసారి ఈ చెత్తచెదారాన్ని కూడా మనం సంపదలా భావించడం మొదలుపెడితే వ్యర్థాల నిర్వహణ తాలూకూ ఎన్నో కొత్త కొత్త పధ్దతులు మనకు తెలుస్తాయి. స్టార్ట్- అప్ లో చేరిన యువకులు కూడా కొత్త కొత్త పథకాలతో ముందుకు వస్తారు. కొత్త కొత్త పరికరాలను తీసుకుని రండి. రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో, పట్టణాలలోని ప్రజాపతినిధుల సహాయంతో వ్యర్థాల నిర్వహణ గురించిన ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, దేశంలోని దాదాపు 4వేల పట్టణాలలోని ఘన వ్యర్థాలు, ద్రవ రూప వ్యర్థాలను సమీకరించడానికి ఉపయోగపడే సాధనాలు లభించబోతున్నాయి. రెండు రకాల చెత్త డబ్బాలు లభ్యమౌతాయి. ఒకటి ఆకుపచ్చ రంగు డబ్బా, మరొకటి నీలం రంగు డబ్బా. తడి చెత్త, పొడి చెత్త .. ఇలా రెండు రకాల వ్యర్థాలు బయటకు వస్తాయి. మనం క్రమశిక్షణ ను పాటించి, ఈ 4వేల పట్టణాల్లో పెట్టబోయే రెండు రకాల చెత్త డబ్బాలలో పొడి చెత్తని నీలం డబ్బాలో, తడి చెత్తని ఆకుపచ్చ డబ్బాలో వేద్దాం. వంటింట్లోంచి వచ్చే కూరగాయల తొక్కలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలైనా, కోడిగుడ్డు పెంకులైనా, రాలిపోయిన మొక్కల,చెట్ల ఆకులైనా కూడా తడి చెత్త క్రిందకు వస్తాయి. అవన్నీ ఆకుపచ్చ డబ్బాలో వెయ్యండి. ఇవన్నీ పొలాల్లోకి బాగా పనికివస్తాయి. పొలాలు పచ్చగా ఉంటాయని గుర్తు పెట్టుకుంటే, ఆకుపచ్చ చెత్తడబ్బాలో ఏమేమి వెయ్యాలో గుర్తు ఉంటుంది. రెండవ రకం చెత్త డబ్బా చిత్తుకాగితాలు, అట్టపెట్టెలు, ఇనుము, గాజు, బట్టలు, ప్లాస్టిక్, పాలిథీన్, విరిగిపోయిన డబ్బాలు, రబ్బరు, మెటల్ మొదలైన ఎన్నో రకాలు పొడిచెత్త విభాగంలోకి వస్తాయి. వీటిని యంత్రాలలో వేసి రీసైకిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఒక సంస్కృతిని ప్రారంభించగలమన్న నమ్మకం నాకు ఉంది. ప్రతి సారీ పరిశుభ్రత వైపునకు కొత్త అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి మనం. అప్పుడే పరిశుభ్రత గురించి గాంధీ గారు కన్న కలలను మనం నిజం చెయ్యగలం. ఇవాళ నేను గర్వంగా ఒక విషయం గురించి చెప్పదలుచుకున్నాను. ఒక్క మనిషి అయినా సరే, గట్టిగా నిర్ణయించుకుంటే, ఎంత పెద్ద ప్రజా ఉద్యమాన్ని అయినా నడిపించగలడు. పరిశుభ్రత తాలూకూ పని అలాంటిదే. గత కొద్ది రోజుల్లో మీరు వినే ఉంటారు.. ముంబయ్ లో చెత్త ప్రదేశంగా చెప్పుకునే వర్సోవా బీచ్ ఇవాళ ఒక పరిశుభ్రమైన, సుందరమైన వర్సోవా బీచ్ గా మారిపోయింది. ఇది ఒక్కసారిగా జరగలేదు. దాదాపు వరుసగా ఎనభై- తొంభై వారాల పాటు నగరవాసులు కష్టపడి ఈ వర్సోవా బీచ్ రూపురేఖలను మార్చివేశారు. వేల టన్నుల కొద్దీ చెత్తా చెదారం ఆ ప్రాంతం నుండి తొలగించబడిన తరువాత ఇవాళ వర్సోవా బీచ్ శుభ్రంగా, అందంగా మారింది. దీని పూర్తి బాధ్యతను Versova Residence Volunteer (VRV) తీసుకుంది. శ్రీ అఫ్రోజ్ షా అనే ఒకాయన అక్టోబర్ 2015 నుండీ ఈ పనిలో నిమగ్నమయ్యారు. నెమ్మది నెమ్మదిగా ఆ కార్యక్రమం పెద్దదై, ప్రజా ఉద్యమంగా మారింది. ఈ పని చేసినందుకు గానూ అఫ్రోజ్ షా గారికి United Nations Environment Programme (UNEP) వారు పెద్ద అవార్డ్ ను ఇచ్చారు . Champions of The Earth Award అనే ఆ అవార్డ్ ను పొందిన మొదటి భారతీయుడు ఆయన అయ్యారు. అఫ్రోజ్ షా గారిని నేను అభినందిస్తూ, ఈ ఉద్యమానికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక లోక సంగ్రహుడిగా ఆయన ఎలాగైతే ఆ మొత్తం ప్రాంతంలోని ప్రజలను జత చేసుకుంటూ, దానిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చారో అదెంతో ప్రేరణాత్మకమైన ఉదాహరణ.
సోదర సోదరీమణులారా, ఇవాళ మరో ఆనందాన్ని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ‘‘స్వచ్ఛ భారత్ ఉద్యమానికి సంబంధించి జమ్ము & కశ్మీర్ లోని రియాసీ బ్లాక్ గురించి. రియాసీ బ్లాక్ ఆరుబయలు ప్రదేశాలలో మల మూత్ర విసర్జన రహితం (open defecation free .. ODF) అయ్యిందని నాతో చెప్పారు. రియాసీ బ్లాక్ లోని ప్రజలందరికీ, అక్కడి పాలకులకూ కూడా జమ్ము & కశ్మీర్ ఒక మంచి ఉదాహరణను అందించింది. అక్కడి ప్రజలకు నేను అభినందనలు తెలుపుతున్నాను. ఈ మొత్తం ఉద్యమాన్ని ఎక్కువ భాగం నడిపించింది జమ్ము & కశ్మీర్ లోని ఆ ప్రాంతానికి చెందిన మహిళలేనట. ఈ విషయంలో అవగాహనను పెంచడానికి వారు స్వయంగా దివిటీ యాత్రలు కూడా చేశారట. ఇంటింటికీ, ప్రతి సందులోకీ వెళ్ళి ప్రజలను ఉత్తేజపరిచారట. ఆ తల్లులకూ, సోదరీమణులందరికీ జమ్ము & కశ్మీర్ గడ్డపై ఒక బ్లాక్ ని open defecation free చేసి ఒక శుభారంభాన్ని చేసినందుకు గానూ నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.
ప్రియమైన నా దేశప్రజలారా, గత పదిహేను నుంచీ నెల రోజులుగా వరుసగా వార్తాపత్రికలలోనూ, టివీ చానల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ, మూడేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రజలు ప్రభుత్వపు లెక్కాపద్దులు చూస్తున్నారు. మూడేళ్ల క్రితం మీరు నాకు ‘ప్రధాన సేవకుడి’ బాధ్యతను అప్పగించారు. ఎన్నో సర్వేక్షణలూ, అభిప్రాయ సేకరణలు జరిగాయి. ఈ ప్రక్రియలన్నింటినీ నేను ఆరోగ్యకరమైన సూచనలుగా స్వీకరిస్తాను. ప్రతి పరీక్షలోనూ ఈ మూడేళ్ల కాలాన్నీ జోడించి పరీక్షించారు. సమాజంలో ప్రతి విభాగానికి చెందినవారూ దానిని విశ్లేషించారు. ప్రజాస్వామ్యంలో ఒక ఉత్తమమైన ప్రక్రియ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాలన్న విషయాన్ని నేను స్పష్టంగా నమ్ముతాను. ప్రజలకు తమ పని గురించిన లెక్కా పద్దులు ప్రభుత్వం చూపెట్టి తీరాలి. కొన్ని చోట్ల అభినందనలను అందించారు, కొన్ని చోట్ల మద్దతునిచ్చారు, కొన్ని చోట్ల లోపాలను ఎత్తి చూపారు. సమయం వెచ్చించి మా పనిని గురించి లోతుగా విశ్లేషించిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. కీలకమైన, ముఖ్యమైన ఫీడ్ బ్యాక్ అందించిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లోటుపాట్లూ, లోపాలూ వెలుగులోకి వస్తేనే వాటిని సరిచేసుకునే అవకాశం లభిస్తుంది. విషయం మంచిదైనా, కొంచెమే మంచిదైనా, చెడ్డదైనా, ఏదైనా దాని నుండే పాఠం నేర్చుకొని, నేర్చుకొన్న దాని సాయంతోనే ముందుకు నడవాలి. నిర్మాణాత్మకమైన విమర్శ ప్రజాస్వామ్యానికి బలాన్నిస్తుంది. ఒక అప్రమత్త దేశానికి , ఒక చైతన్యవంతమైన దేశానికి ఈ మథనం అవసరమే.
ప్రియమైన నా దేశ ప్రజలారా, నేను కూడా మీలాగే ఒక సాధారణ పౌరుడిని. ఒక సాధారణ పౌరుడిగా మంచి, చెడు ప్రతి విషయం ప్రభావం ఒక సాధారణ పౌరుడి మనసుపై ప్రభావం పడినట్లే నా మనసుపై కూడా పడుతుంది. ‘మనసులో మాట’ కార్యక్రమాన్ని కొందరు ఒకవైపు సంభాషణ గానే చూస్తారు. కొందరు రాజకీయదృష్టితో వ్యాఖ్యలు చేస్తారు. కానీ, ఇంత ఎక్కువ అనుభవంతో నాకేమనిపిస్తుందంటే, నేను మనసులో మాట మొదలుపెట్టినప్పుడు ఈ కార్యక్రమం నన్ను భారతదేశంలో ప్రతి కుటుంబంలోనూ ఒక సభ్యుడిగా మార్చేస్తుందని నేనే అనుకోలేదు. ఒక్కొక్క సారి నేను ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని ఇంటి విషయాలు మాట్లాడుతున్నట్లు నాకనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఎన్నో కుటుంబాల వారు నాకు రాశారు. నేను చెప్పినట్లుగానే ఒక సాధారణ పౌరుడిగా నా మనసులో ఏర్పడిన ప్రభావాన్ని రెండురోజుల క్రితమే రాష్ట్రపతి భవన్ లో గౌరవనీయులు రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారూ, స్పీకర్ గారూ కలిసి ‘మనసులో మాట’ తాలూకూ ఒక విశ్లేషణా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఒక వ్యక్తిగానూ, ఒక సాధారణ పౌరుడిగానూ ఈ సంఘటన నా ఉత్సాహాన్నెంతో పెంచింది. అంత పెద్ద స్థానంలో కూర్చుని ఉన్నా కూడా సమయం వెచ్చించి ‘మనసులో మాట’కు ఇంతటి ప్రాముఖ్యాన్నిచ్చినందుకు గానూ గౌరవనీయులు రాష్ట్రపతి గారికీ, ఉప రాష్ట్రపతి గారికీ, స్పీకర్ గారికీ నేను ఋణపడి ఉంటాను. ఒక విధంగా ‘మనసులో మాట’ కార్యక్రమానికే ఒక కొత్త కోణాన్ని అందించారు. మా మిత్రులు కొందరు ఈ ‘మనసులో మాట’ పుస్తకంపై పని చేస్తున్నప్పుడు నాతో కూడా అప్పుడప్పుడు చర్చించారు. కొంత కాలం క్రితం ఈ మాట చర్చకు వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. అబు ధాబీ లో నివసించే ఒక ఆర్టిస్ట్ అక్బర్ సాహెబ్ పేరుతో పరిచితుడు. ‘మనసులో మాట’ కార్యక్రమంలో చర్చించిన విషయాలకు ఆయన తన కళ ద్వారా బొమ్మ లు వేసిస్తానని స్వయంగా ప్రస్తావించారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అక్బర్ గారి మనసులో మాటలకు కళారూపాన్ని అందించి తన ప్రేమను తెలిపారు. నేను అక్బర్ గారికి ఋణపడి ఉంటాను.
ప్రియమైన నా దేశప్రజలారా, ఈసారి మనం కలుసుకునే సరికి దేశం నలుమూలలా వర్షాలు పడుతూ ఉంటాయి. వాతావరణం మారి ఉంటుంది. పరీక్షా ఫలితాలు వచ్చేసి ఉంటాయి. కొత్త మలుపులోంచి విద్యాజీవితం మొదలౌతూ ఉంటుంది. వర్షాలు పడుతూనే- ఒక కొత్త ఉత్సాహం, కొత్త సుగంధం, ఒక కొత్త పరిమళం మొదలౌతాయి. రండి, మనందరం ఈ వాతావరణంలో ప్రకృతి ని ప్రేమిస్తూ ముందుకు నడుద్దాం. నా తరఫున మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.
*****
ప్రియమైన నా దేశ ప్రజలారా, నమస్కారం. ప్రతి ’మనసులో మాట’ (మన్ కీ బాత్) కార్యక్రమానికీ ముందర దేశం నలుమూలల నుండీ, అన్ని వయసుల వారి నుండీ, ‘మనసులో మాట’ కోసం ఎన్నో సలహాలు వస్తూ ఉంటాయి. ఆకాశవాణి నుండీ, NarendraModiApp నుండీ, MyGov ద్వారాను, ఫోన్ ద్వారాను రికార్డయిన సందేశాలు వెల్లువెత్తుతూ ఉంటాయి. వీలు చేసుకుని వాటిని చదువుతూ ఉంటే నాకెంతో ఆనందకరంగా ఉంటుంది.
ఆ సందేశాల ద్వారా ఎంతో వైవిధ్యమైన సమాచారం నాకు లభిస్తూ ఉంటుంది. దేశం నలుమూలలా ఎందరి శక్తుల నిధో దాగి ఉంది. ఎంతో మంది అసంఖ్యాక అజ్ఞాన సాధకులు సమాజంలో గోప్యంగా ఉంటూ వారి సహాయ సహకారాలను అందిస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి రాని ఎన్నో సమస్యలు కూడా ఒక్కొక్కసారి వీరి ద్వారా బయటకు వస్తున్నాయి. బహుశా వ్యవస్థ, ప్రజలు ఈ సమస్యలకు అలవాటు పడిపోయి ఉంటారు. పిల్లల కుతూహలం, యువకుల ఆశయాలు, పెద్దల అనుభవ సారం మొదలైన విషయాలు నా దృష్టికి వస్తున్నాయి. ప్రతి సారీ ఎన్నెన్ని అభిప్రాయాలు ’మనసులో మాట’కు అందుతున్నాయో, వాటిలో ఎలాంటి సలహాలు ఉన్నాయో, ఎన్ని ఫిర్యాదులు ఉన్నాయో, ప్రజల అనుభవాలు ఎలా ఉన్నాయో వంటి వాటన్నింటినీ ప్రభుత్వం విస్తారంగా పరిశీలిస్తుంది.
ఎదుటివారికి సలహాలు ఇవ్వడమనేది మనిషి సహజ లక్షణం. బస్సు లోనో, రైలు లోనో ప్రయాణిస్తున్నప్పుడు ఎవరికైనా దగ్గు వస్తే, వెంటనే ఎవరో ఒకరు వచ్చి ఇలా చెయ్యమంటూ ఏదో ఒక సలహా ఇచ్చేస్తారు. సలహాలు, సూచనలు ఇవ్వడమనేది మన స్వభావాల్లోనే ఉన్నాయి. మొదట్లో మనసులో మాట కి సూచనలు అందినప్పుడు, సలహాలు అనే మాట వినేటప్పుడు, చదివేటప్పుడు కనబడేది. సలహాలు ఇవ్వడమనేది చాలా మందికి ఒక అలవాటేమో అని మా బృందానికి కూడా అనిపించేది. కానీ సూక్ష్మం గా గమనించే ప్రయత్నం చేసేసరికీ నేను ఎంతో ఉద్వేగానికి లోనయ్యను.
నన్ను చేరడానికి, సలహాలు అందించడానికి ప్రయత్నించే చాలా మంది వారి వారి జీవితాల్లో ఏదో ఒకటి చేస్తున్నవారే. ఏదో మంచి చెయ్యాలనే తాపత్రయంతో తమ బుధ్ధిని, శక్తిని, సామర్ధ్యాన్ని పరిస్థితులకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు. అందువల్ల నా దృష్టికి కొన్ని సలహాలు వచ్చినప్పుడు అవి సామాన్యమైనవి కావని, అనుభవపూర్వకంగా బయటకు వచ్చినవని నాకు అర్ధమైంది. కొందరు వ్యక్తులు వారి సలహాలను వారు పని చేసే చోట, మిగతా వారు వింటే వాటికి ఒక సమగ్ర రూపం ఏర్పడి ఎందరికో సహాయకరంగా మారతాయనే ఉద్దేశంతో కూడా సలహాలను తెలియచేస్తారు. అందువల్ల స్వభావపరంగా వారు వారి సలహాలు ‘మనసులో మాట’లో వినపడాలని కోరుకుంటారు.
నా దృష్టిలో ఇవన్నీ చాలా సకారాత్మకమైనవి. అన్నింటికన్నా ముందుగా నేను సమాజానికి ఎంతో కొంత సేవ చేస్తూ తమ సలహానందించే కర్మయోగులకు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇంతేకాక ఏదైనా విషయాన్ని నేను ప్రస్తావించినప్పుడు ఇలాంటి విషయాలు గుర్తుకొచ్చినప్పుడు చాలా సంతోషం కలుగుతుంది. గత నెలలో కొందరు నాకు ఆహారం వ్యర్ధమవడం గురించి తమ బాధను వెలిబుచ్చినప్పుడు, ఆ విషయాన్ని నేను ’మనసులో మాట’ లో ప్రస్తావించాను. ఆ తర్వాత NarendraModiApp లోనూ, MyGov లోనూ దేశం నలుమూలల నుండీ చాలా మంది వ్యక్తులు ఆహారం వ్యర్ధమవకుండా చూడడానికి తాము ఎలాంటి సృజనాత్మకమైన ప్రయత్నాలు చేసారో చెప్పుకొచ్చారు.
మన దేశంలోని యువత ఎంతో కాలంగా ఈ పనిని చేస్తోందని నాకు తెలియనే తెలియదు. కొన్ని సామాజిక సంస్థలు చేస్తాయన్న సంగతి చాల ఏళ్ళుగా తెలుసు, కానీ యువత కూడా ఈ విషయం పట్ల ఇంతటి శ్రధ్ధను తీసుకొంటున్నారన్న సంగతి నాకు ఇటీవలే తెలిసింది. నాకు కొందరు వీడియోలు కూడా పంపించారు. కొన్ని చోట్ల రోటీ బ్యాంకులు ఉన్నాయి. ప్రజలు వారి వద్ద ఉన్న అధిక రొట్టెలను, కూరలనూ ఆ బ్యాంకుల్లో జమ చేస్తే, వాటి అవసరం ఉన్న వ్యక్తులు వాటిని అక్కడకు వెళ్ళి తీసుకుంటారు. ఇచ్చే వారికీ సంతోషం, పుచ్చుకునే వారికీ చిన్నతనంగా ఉండదు. సమాజం సహకరిస్తే ఎలాంటి పనులు జరుగుతాయో చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
ఇవాళ్టితో ఏప్రిల్ నెల అయిపోతుంది. ఇదే ఆఖరు తేదీ. మే ఒకటి, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల స్థాపక దినం. ఈ సందర్భంగా ఈ రెండు రాష్ట్రాల ప్రజలకూ అనేకానేక శుభాకాంక్షలు. రెండు రాష్ట్రాలూ ఎన్నో కొత్త కొత్త అభివృధ్ధి శిఖరాలను దాటే నిరంతర ప్రయత్నాన్ని చేసాయి. దేశ ప్రగతికి తమ సహకారాన్ని అందించాయి. రెండు రాష్ట్రాల్లోనూ మహాపురుషుల నిరంతర ప్రయాస, సమాజంలోని ప్రతి రంగం లోనూ వారి జీవితాలు మనకు స్ఫూర్తినందిస్తూ ఉంటాయి. ఈ మహాపురుషులను జ్ఞప్తికి తెచ్చుకొంటూ, రాష్ట్ర అవతరణ జరిగిన రోజున స్వాతంత్ర్యం వచ్చిన డెభ్భై ఐదేళ్ళకు, అంటే 2022 నాటికి, మనం మన రాష్ట్రాలనూ, మన దేశాన్నీ, మన సమాజాన్నీ, మన నగరాన్నీ, మన కుటుంబాలనీ ఎక్కడికి చేర్చగలమన్న సంకల్పాన్ని చేసుకోవాలి.
ఆ సంకల్పాన్ని సిధ్ధించుకోవడానికి ప్రణాళికను తయారుచేసుకోవాలి. ప్రజలందరి సహకారంతోనూ ముందుకు నడవాలి. మరోసారి ఈ రెండు రాష్ట్రాలకూ నా అనేకానేక శుభాకాంక్షలు.
ఒక సమయంలో వాతావరణంలో మార్పు విద్యాప్రపంచం తాలూకూ విషయంగా ఉండేది. సదస్సులలో అంశంగా ఉండేది. కానీ ఇవాళ ప్రకృతి తన ఆట నియమాలన్నీ ఎలా మార్చేస్తోందో మన రోజూవారీ జీవితాల్లో అనుభవపూర్వకంగా చూస్తూ ఆశ్చర్యపోతున్నాం. మన దేశంలో మే, జూన్ నెలల్లో ఉండే వేసవి తీవ్రత ఈసారి మార్చ్, ఏప్రిల్ నెలల్లోనే అనుభూతి చెందాల్సిన పరిస్థితి వచ్చేసింది. అందువల్ల ఈ సారి మనసులో మాట కోసం నేను సలహాలను సేకరిస్తున్నప్పుడు, ఎక్కువ శాతం సలహాలు ఈ వేసవిలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో మొదలైన సలహాలను అందించారు. ఇవన్నీ కూడా ప్రచారంలో ఉన్నవే. కొత్తవేమీ కాదు, కానీ సరైన సమయానికి వాటిని గుర్తుచేసుకోవడం కూడా మంచిదే.
శ్రీ ప్రశాంత్ కుమార్ మిశ్ర, శ్రీ టి.ఎస్. కార్తీక్ మొదలైన మిత్రులందరూ పక్షుల గురించి విచారపడ్డారు. బాల్కనీ లోనూ, డాబా పైనా, పక్షుల కోసం నీళ్ళు పెట్టి ఉంచాలని అన్నారు. చాలా కుటుంబాల్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఈ పనిని చెయ్యడం నేను చూశాను. ఒక్కసారి వాళ్ళ దృష్టిలోకి ఈ పని వచ్చేస్తే, ఇంక రోజుకి పదిసార్లు పక్షులు వచ్చాయా లేదా, పెట్టిన గిన్నెలో నీళ్ళు ఉన్నాయో లేదో అని చూడ్డానికి వెళ్తూ ఉంటారు. మనకి ఇదొక ఆటలా తోస్తుంది కానీ నిజంగా పసి మనసుల్లో సానుభూతిని రేకెత్తించే అద్భుతమైన అనుభూతి ఇది. మీరు కూడా గమనించండి, పశుపక్ష్యాదులతో కాస్తంత అనుబంధం ఉన్నా, అదొక కొత్త ఆనందాన్ని మనకు అందిస్తుంది.
కొన్ని రోజుల క్రితం గుజరాత్ కు చెందిన సోదరుడు శ్రీ జగత్ ‘Save The Sparrows’ అనే ఒక పుస్తకాన్ని నాకు పంపాడు. అందులో తక్కువైపోతున్న పిచ్చుకల సంఖ్యను గురించి విచారాన్ని వ్యక్తం చేస్తూనే, mission mode లో వాటి సంరక్షణార్థం స్వయంగా చేస్తున్న ప్రయోగాలను గురించిన చాలా మంచి వర్ణన అందులో ఉంది. అయినా మన దేశంలో పశు పక్ష్యాదులతో, ప్రకృతితో సహజీవనం గురించిన విషయాలు అందరికీ బాగా తెలిసినవే కానీ సామూహికంగా ఇలాంటి ప్రయత్నాలకు బలాన్నివ్వడం అవసరం.
నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు “దావూదీ బొహ్రా సమాజ్” ధర్మ గురువు సైయదనా గారికి వంద సంవత్సరాలు వచ్చాయి. వారు నూట మూడేళ్లు జీవించారు. వారి వందవ పుట్టినరోజు ఉత్సవాల నిమిత్తం బొహ్రా సమాజం తమ బుహ్రానీ ఫౌండేషన్ ద్వారా పిచ్చుకలను పరిరక్షించడానికి చాలా పెద్ద ఉద్యమాన్నొకదాన్ని నడిపారు. దానిని ప్రారంభించే శుభావకాశం నాకు లభించింది. దాదాపు ఏభై రెండు వేల బర్డ్ ఫీడర్స్ ను ప్రపంచం నలుమూలలకీ వారు పంపారు. Guinness book of World Records లో కూడా ఈ విషయం నమోదైంది.
అప్పుడప్పుడు మనం ఎంత తీరుబడి లేకుండా అయిపోతామంటే పేపర్ వేసే వారు, పాల వారు, కూరగాయలమ్మే వారు, పోస్ట్ మన్, ఇలా ఈ వేసవి రోజుల్లో గుమ్మంలోకి ఎవరొచ్చినా కాస్తంత మంచినీళ్లు తాగుతారా అని అడుగుదామన్న ధ్యాసే లేనంత విధంగా అయిపోతాం.
యువ మిత్రులారా, మీతో కూడా కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నాను. మన యువతలో చాలా మంది కంఫర్ట్ జోన్ లోనే జీవితాన్ని గడపడానికి ఇష్టపడుతున్నారని అప్పుడప్పుడు ఆందోళనగా ఉంటుంది నాకు. తల్లితండ్రులు కూడా ఒక రక్షణాత్మక వాతావరణంలోనే వారి ఆలనా పాలనా చేస్తున్నారు. దీనికి భిన్నంగా ఉండేవారు కూడా ఉన్నారు కానీ ఎక్కువగా కంఫర్ట్ జోన్ లో ఉండేవాళ్ళే కనపడతారు. ఇప్పుడు పరీక్షలయిపోయి, శెలవులను ఆస్వాదించేందుకు పథకాలు వేసేసుకుని ఉంటారు. వేసవి శెలవులు ఎండాకాలం అయిపోయిన తరువాతే కాస్త బావుంటాయి. నేను ఒక స్నేహితుడిలా మీ వేసవి శెలవులు ఎలా గడపాలో చెప్పాలనుకుంటున్నాను. కొందరైనా తప్పకుండా ప్రయోగపూర్వకంగా చేసి, తెలియజేస్తారన్న నమ్మకం నాకు ఉంది.
వేసవిసెలవులను ఎలా గడపాలో మూడు సలహాలు ఇస్తాను. ఆ మూడింటినీ పాటిస్తే చాలా బావుంటుంది కానీ వాటిల్లో ఒక్కటైనా మీరు పాటించడానికి ప్రయత్నించండి. ఏదైనా కొత్త ప్రతిభ సహాయంతో కొత్త అనుభవాన్ని పొందడానికి ప్రయత్నించండి. ఇదివరకూ వినని, చూడని, ఆలోచించని, తెలియని చోటుకు వెళ్ళాలనిపిస్తే వెళ్ళిపోండి. కొత్త ప్రదేశాలు, కొత్త అనుభవాలు, కొత్త ప్రతిభ కోసం ప్రయత్నించండి.
అప్పుడప్పుడు దేని గురించైనా టి.విలో చూడ్డానికీ, పుస్తకంలో చదవడానికీ, పరిచయస్తుల ద్వారా వినడానికీ, దాన్ని స్వయంగా అనుభవించడానికీ, ఈ రెంటి మధ్యన నింగికి నేలకు మధ్య ఉన్నంత అంతరం ఉంటుంది. నేను కోరుకునేదేమిటంటే, ఈ వేసవి సెలవులలో మీ ఆసక్తి ఎందులో ఉంటే వాటిని తెలుసుకోవడానికి ప్రయత్నించండి. కొత్త ప్రయోగాన్నిచెయ్యండి. ప్రయోగం పాజిటివ్ గా ఉండాలి. మీ కంఫర్ట్ జోన్ నుండి మిమ్మల్ని బయటకు తెచ్చేదిగా ఉండాలి. మనం మధ్యవర్గానికి చెందినవాళ్ళం. సుఖవంతమైన కుటుంబాలకు చెందినవాళ్ళం. రిజర్వేషన్ లేకుండా రైల్లో సెకండ్ క్లాస్ బోగీలో ఎక్కాలని ఎప్పుడైనా అనిపించిందా మిత్రమా ?
కనీసం ఒక రోజంతా అలా ప్రయాణిస్తే ఎంత అనుభవం వస్తుందో. ఆ ప్రయాణీకుల సంగతులేమిటి, వారు స్టేషన్లో దిగి ఏం చేస్తారు ? ఏడాది మొత్తంలో నేర్చుకోలేని ఎన్నో విషయాలను అలాంటి రిజర్వేషన్ లేని ఇరవైనాలుగు గంటల రైలు ప్రయాణంలో, పడుకోవడానికి కూడా చోటు లేనంత జనంతో కిక్కిరిసిన రైల్లో నిలబడి ప్రయాణిస్తే నేర్చుకోగలరు. ఒక్కసారన్నా అలాంటి అనుభవాన్ని పొందండి. ఎప్పుడూ అలానే ప్రయాణించమని నేను అనడం లేదు. ఎప్పుడైనా ఒకసారి ప్రయత్నించండి. సాయంత్రాల్లో మీ ఫుట్ బాల్ తోనో, వాలీ బాల్ తోనో లేదా మరేదైనా ఆట వస్తువులతో తక్షణం నిరుపేద బస్తీల్లోకి వెళ్లండి. ఆ పేద పిల్లలతో స్వయంగా ఆడండి, అప్పుడు చూడండి ఆ ఆటలో జీవితంలో ఎప్పుడూ పొందనటువంటి ఆనందం మీకు లభిస్తుంది.
సమాజంలో ఇలాంటి జీవితాన్ని గడుపుతున్న పిల్లలకు మీతో ఆడే ఆవకాశం దొరికినప్పుడు వారి జీవితాల్లో ఎలాంటి మార్పు వస్తుందో తెలుసా? మీకు కూడా ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనిపిస్తుందని నేను విశ్వాసంతో చెప్పగలను. ఈ అనుభవం మీకు చాలా నేర్పిస్తుంది. ఎన్నో స్వచ్ఛంద సంస్థలు సేవాకార్యక్రమాలను చేపడుతూ ఉంటాయి. మీరు గూగుల్ గురువు గారితో కలిసి ఉంటారుగా, అందులో వెతకండి. అలాంటి ఏదో ఒక సంస్థతో ఒక పదిహేను ఇరవై రోజులు గడపండి.వారితో వెళ్ళండి. అడవుల్లోకైనా వెళ్లండి.
అప్పుడప్పుడు కొన్ని వేసవి శిబిరాలు ఉంటాయి, వ్యక్తిత్వ వికాసం కోసం, మరెన్నో రకాలైన అభివృధ్ధి కోసం ఏర్పాటైన వాటిల్లో చేరండి. కానీ దానితో పాటే ఇలాంటి సమ్మర్ కేంప్ లో చేరినట్లు, వ్యక్తిత్వ వికాసం కోర్సు చేసినట్లు ఎప్పుడైనా అనిపించిందా ? ఇలాంటి కేంపుల అవసరం ఉన్నా కూడా చేరలేని వారి వద్దకు వెళ్ళి మీరు నేర్చుకున్నది వారి వద్ద డబ్బు తీసుకోకుండా నేర్పించండి. ఏది ఎలా చెయ్యాలో మీరు వాళ్ళకి నేర్పించగలరు. సాంకేతికత దూరాలను తగ్గించేందుకు, సరిహద్దులను చెరిపేందుకు వచ్చింది కానీ దాని దుష్ప్రభావం ఎలా మారిందంటే- ఒకే ఇంట్లో ఉండే ఆరుగురు మనుషులు ఒకే గదిలో ఉన్నా కూడా వారి మధ్య ఉన్న దూరాలు ఊహించడానికి కూడా అందనంతగా ఉంటున్నాయన్న విషయం నన్నెంతో ఆందోళనకు గురిచేస్తూ ఉంటుంది. ఎందుకని ? ప్రతి ఒక్కరూ సాంకేతికత వల్ల మరెక్కడో తీరుబడి లేకుండా ఉన్నారు. సామూహికత కూడా ఒక సంస్కారమే. సామూహికత ఒక శక్తి. నేను చెప్పిన రెండవది నైపుణ్యం. ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలని మీకు అనిపించదా ? ఇవాళ మనది పోటీ యుగం. పరీక్షల్లోనే మునిగిపోయి ఉంటూంటాం. ఎక్కువగా మార్కులు సంపాదించాలనే తపనలో మునిగిపోయి ఉంటాం. సెలవుల్లో కూడా ఏదో ఒక కోచింగ్ క్లాసుల్లో, తరువాతి పరీక్షల గురించిన ఆలోచనలో ఉంటాం. మన యువతరం మర మనుషులలాగా మారిపోయి యంత్రాల్లాగ జీవించడం లేదు కదా అని భయం వేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు.
మిత్రులారా, జీవితంలో ఎత్తుకు ఎదగాలన్న కల మంచిదే. ఏదన్నా సాధించాలన్న ఆలోచన మంచిదే. అలా చెయ్యాలి కూడా. కానీ మీలో ఉన్న మానవత మెద్దుబారిపోతోందేమో గమనించండి! మనం మానవీయ విలువలకు దూరంగా వెళ్ళిపోవట్లేదు కదా అని గమనించుకోండి. ప్రతిభను పెంచుకోవడానికి ఈ అంశాలపై కాస్త దృష్టిసారించగలమా ? ఆలోచించండి. సాంకేతికత కు దూరంగా మీతో మీరు సమయం గడపడానికి ప్రయత్నించగలరా ? ఏదైనా సంగీత వాయిద్యం నేర్చుకోండి. ఏదైనా కొత్త భాష లో ఐదు నుండి ఏభై దాకా వాక్యాలు నేర్చుకోండి. తమిళమో, తెలుగో, అస్సామీ, మరాఠీ, పంజాబీ.. ఏదైనా. ఎన్నో వైవిధ్యాలతో నిండిన దేశం మనది. కాస్త దృష్టి పెడితే మన చుట్టుపక్కలలోనే ఏదో ఒకటి నేర్చుకోవడానికి దొరుకుతుంది. ఈత రాకపోతే, ఈత నేర్చుకోండి. డ్రాయింగ్ వెయ్యండి, ఉత్తమమైన బొమ్మ రాకపోయినా కాయితంపై ఏదో ఒకటి వెయ్యడానికి ప్రయత్నించండి.
మీలో దాగి ఉన్న మానవత బయటపడుతుంది. చిన్న చిన్న పనులే అనిపించినా మనం అప్పుడప్పుడూ అనుకునే కొన్ని పనులయినా మనసు పెడితే మనం నేర్చుకోలేమా? మీకు కారు నడపడం నేర్చుకోవాలనిపించచ్చు కానీ ఎప్పుడైనా ఆటో రిక్షా నడపడం నేర్చుకోవాలని అనిపించే ఉంటుంది కదా? మీకు సైకిల్ తొక్కడం వచ్చే ఉండవచ్చు; కానీ, ప్రజలను తీసుకువెళ్ళే త్రిచక్ర వాహనాన్ని నడపాలని ఎప్పుడైనా ప్రయత్నించారా ? మీరు చూడండి, ఈ కొత్త ప్రయత్నాలు, కొత్త నైపుణ్యం మీకు సంతోషాన్ని ఇవ్వడమే కాక, ఒకే పరిధికి కట్టిపడేసి ఉంచిన మీ జీవితాన్ని అందులోంచి బయటకు లాగగలదు కూడా.
సంప్రదాయానికి భిన్నంగా కూడా ఏదన్నా చేసి చూడండి మిత్రులారా ! జీవితాన్ని తీర్చిదిద్దుకునే అవకాశాలంటే ఇవే మరి. పరీక్షలన్నీ అయిపోయి, వృత్తిపరంగా కొత్త మజిలీకి చేరుకున్నప్పుడు ఇవన్నీ నేర్చుకుంటాంలే అని మీరనుకోవచ్చు; కానీ, అలాంటి అవకాశం రాదు. అప్పుడు వేరే ఏదో జంజాటంలో పడతారు. అందుకే మీతో చెప్తున్నాను, మీకొకవేళ ఇంద్రజాలం నేర్చుకోవాలనే సరదా ఉంటే, పేకలతో చేసే ఇంద్రజాలాన్ని నేర్చుకోండి. మీ స్నేహితులకు ఇంద్రజాలాన్ని చూపిస్తూ ఉండండి. మీకు తెలియని ఏదో ఒక విషయాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. దాని వల్ల మీకు తప్పకుండా లాభం కలుగుతుంది. మీలో దాగి ఉన్న మానవతా శక్తులకు చైతన్యం లభిస్తుంది. అభివృధ్ధికి ఇది చాలా మంచి అవకాశం. నా అనుభవంతో చెప్తున్నాను, ప్రపంచాన్ని చూడడం వల్ల ఎంతగా నేర్చుకుని, ఎంతగా తెలుసుకోవడానికి వీలవుతుందో మనం ఊహించలేరు కూడా. కొత్త కొత్త ప్రదేశాలూ, కొత్త కొత్త ఊర్లు, కొత్త కొత్త పట్టణాలు, కొత్త కొత్త పల్లెలు, కొత్త కొత్త ప్రాంతాలు చూడండి. కానీ వెళ్ళే ముందర ఎక్కడికైతే వెళ్తున్నారో ఆ అభ్యాసానికి వెళ్ళి, అక్కడ ఒక జిజ్ఞాసువు లాగ చూడడం, తెలుసుకోవడం, ప్రజలతో చర్చించడం, వాళ్లను అడగడం మొదలైన ప్రయత్నాలు చేస్తే, ఆ ప్రదేశాలను చూసిన ఆనందమే వేరుగా ఉంటుంది.
మీరు ప్రయత్నించండి. ప్రయాణాలు ఎక్కువ చేయద్దు. ఒకే ప్రదేశంలో మూడు నాలుగు రోజులు ఉండండి. అప్పుడు వేరే ప్రాంతానికి వెళ్ళండి. అక్కడ మరో మూడు నాలుగు రోజులు గడపండి. దీనివల్ల మీకు ఎంతో నేర్చుకోవడానికి అవకాశం లభిస్తుంది. మీరు వెళ్ళేటప్పుడు మీ ఫోటో కూడా నాకు షేర్ చేయడం మంచిది. ఏమేమి చూశారో, ఎక్కడెక్కడికి వెళ్లారో Incredible India అనే హేష్ ట్యాగ్ ను ఉపయోగించడం ద్వారా మీ అనుభవాలను పంచుకోండి.
మిత్రులారా, ఈసారి భారత ప్రభుత్వం కూడా మీకొక మంచి అవకాశాన్నిచ్చింది. కొత్త తరాల వారు నగదు వాడకం నుండి దగ్గర దగ్గరగా విముక్తి పొందితున్నారు. వారికి నగదుతో అవసరం లేదు. వారు డిజిటల్ కరెన్సీ ని నమ్మడం మొదలుపెట్టారు. మీరు కూడా నమ్ముతున్నారు కదా ! కానీ ఈ ప్రణాళిక ద్వారా మీరు సంపాదించుకోవచ్చని కూడా మీరెప్పుడైనా అనుకున్నారా ? భారత ప్రభుత్వం ఒక ప్రణాళిక చేసింది. మీరు BHIM App ని డౌన్ లోడ్ చేసుకుని వాడుతూ ఉండే ఉంటారు కదా. దానిని మరొకరికి పంపించండి.
మీరు జతపరిచిన మరొకరు ఆ యాప్ ద్వారా మూడు లావాదేవీలు గనుక చేస్తే, ఆర్థిక వ్యాపారం మూడు సార్లు చేస్తే, ఆ పని చేసినందుకు గానూ మీకు పది రూపాయిల సంపాదన లభిస్తుంది. మీ ఖాతాలో ప్రభుత్వం తరఫునుండి పదిరూపాయిలు జమా అవుతాయి. ఒకవేళ రోజులో మీరు ఇరవైమందితో గనుక చేయిస్తే సాయంత్రానికల్లా మీరు రెండొందల రూపాయిలు సంపాదించుకుంటారు. వ్యాపారస్థులకి కూడా సంపాదన ఉంటుంది. విద్యార్థులకు కూడా సంపాదన ఉంటుంది. ఈ ప్రణాళిక అక్టోబర్ 14వ తేదీ వరకు అమలులో ఉంటుంది. ఈ విధంగా ’డిజిటల్ ఇండియా’ను తయారుచేయడంలో మీ సహకారం ఉంటుంది. న్యూ ఇండియాకు మీరొక కాపలాదారు అయిపోతారు. సెలవులకు సెలవులూ, సంపాదనకు సంపాదనా. రిఫర్ చేయండి- ఆర్జించండి.
సాధారణంగా మన దేశంలో విఐపి కల్చర్ పట్ల దురభిప్రాయ వాతావరణం ఉంది. కానీ అదెంత లోతైనదో నాకిప్పుడిప్పుడే తెలుస్తోంది. ఇప్పుడింక భారతదేశంలో ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే, తన కారుపై ఎర్ర లైటు పెట్టుకుని తిరగకూడదని ప్రభుత్వం నిర్ణయం చేసింది. ఒక రకంగా అది వి.ఐ.పి కల్చర్ కి గుర్తుగా మారింది; కానీ, నా అనుభవంతో చెప్పేదేమిటంటే- ఎర్ర లైటు వాహనంపై ఉంటుంది, కారుపై ఉంటుంది, కానీ నెమ్మది నెమ్మదిగా అది మెదడులోకి చొచ్చుకుపోయి, మానసికంగా విఐపి కల్చర్ వృధ్ధి చెందింది. ఇప్పుడు వాహనాలపై ఎర్ర లైట్ పోయినా కూడా, మెదడులోకి చొచ్చుకుపోయిన ఎర్ర లైటు బయటకు పోయిందని గట్టిగా చెప్పలేము. నాకొక ఆసక్తికరమైన ఫోన్ కాల్ వచ్చింది – ఆ ఫోన్ లో ఆయన తన భయాన్ని కూడా వ్యక్తపరిచారు కానీ ఈ ఫోన్ కాల్ వల్ల సామాన్య మానవులకు ఇలాంటివి నచ్చవనీ, ఇలాంటి వాటి వల్ల వారు దూరాన్ని మాత్రమే అనుభూతి చెందుతున్నారన్న అంచనా మాత్రం నాకు లభించింది.
“నమస్కారం ప్రధాన మంత్రి గారూ, మధ్య ప్రదేశ్ లోని జబల్ పూర్ నుండి నేను శివ చౌబే ని మాట్లాడుతున్నాను. నేను ప్రభుత్వ నిర్ణయమైన red beacon light ban గురించి కొంత మాట్లాడాలనుకుంటున్నాను. వార్తా పత్రికలో నేనొక వాక్యం చదివాను. అందులో ““every Indian is a VIP on a road” అనే వాక్యం రాసి ఉంది. అది చదివి నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇప్పుడు నా సమయం కూడా అంతే ముఖ్యమైంది కదా అని ఆనందం కలిగింది. నాకు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కోవాలని లేదు. మరొకరి కోసం ఆగాల్సిన పనీ లేదు. ఈ నిర్ణయానికై నేను మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. ఇంకా, మీరు నడిపిస్తున్న స్వచ్ఛ భారత్ ఉద్యమం ద్వారా మన దేశం మాత్రమే శుభ్రపడడం లేదు, మన రోడ్లపై ఉన్న విఐపి దాదాగిరీ కూడా శుభ్రపడుతున్నందుకు కూడా మీకు ధన్యవాదాలు.”
ప్రభుత్వ నిర్ణయం ద్వారా ఎర్ర లైటు రద్దు అనేది వ్యవస్థలో ఒక భాగం. కానీ మనసులో నుండి కూడా దీనిని ప్రయత్నపూర్వకంగా తొలగించాల్సిన అవసరం ఉంది. మనందరం కలిసి అప్రమత్తంగా ప్రయత్నిస్తే ఇది తొలగిపోగలదు. దేశంలో విఐపి ల స్థానంలో ఇపిఐ ల ప్రాముఖ్యం పెరగాలన్నదే ’న్యూ ఇండియా భావన’. విఐపి ల స్థానంలో ఇపిఐ అంటున్నానంటే, నా భావం స్పష్టంగా ఉంది- Every person is important. ప్రతి వ్యక్తికీ ప్రాముఖ్యం ఉంది, ప్రతి వ్యక్తికీ గొప్పదనం ఉంది. 125కోట్ల దేశవాసుల ప్రాముఖ్యాన్ని మనం స్వీకరిస్తే, 125 కోట్ల దేశవాసుల గొప్పదనాన్నీ స్వీకరిస్తే, గొప్ప కలలను సాకారం చేయడానికి ఎంత పెద్ద శక్తి ఏకమౌతుందో కదా! మనందరమూ కలిసి ఈ పని చెయ్యాలి.
ప్రియమైన నా దేశప్రజలారా, మనం మన చరిత్రనీ, మన సంస్కృతినీ, మన పరంపరనీ మాటిమాటికీ గుర్తు చేసుకుంటూ ఉండాలని నేను ఎప్పుడూ చెప్తాను. అందువల్ల మనకి శక్తి , ప్రేరణ లభిస్తాయి. ఈ సంవత్సరం మన 125 కోట్ల దేశవాసులందరమూ కలిసి స్వామీ రామానుజాచార్యుల వారి వెయ్యవ జయంతి జరుపుకుంటున్నాం. ఏదో ఒక కారణంగా మనం ఎంతగా తీరుబడి లేకుండా ఉన్నామంటే, ఎంత చిన్నగా ఆలోచిస్తున్నామంటే- ఎక్కువలో ఎక్కువ ఒక శతాబ్దం వరకే ఆలోచిస్తున్నాం. ప్రపంచంలోని తక్కిన దేశాలji శతాబ్దం అంటే ఎంతో గొప్ప. కానీ భారతదేశం ఎంత ప్రాచీన దేశం అంటే, తన అదృష్టంలో వెయ్యేళ్ళు, ఇంకా ఎక్కువ సంవత్సరాల పురాతన జ్ఞాపకాలతో పండుగ చేసుకునే అవకాశం మనకు లభించింది. ఒక వెయ్యేళ్లకు పూర్వపు సమాజం ఎలా ఉండేది ? అప్పటి ఆలోచనలు ఎలా ఉన్నాయి ? కాస్త ఊహించండి. ఇవాళ కూడా సమాజిక సంకెళ్ళను తెంచుకుని బయటకు రావాలంటే ఎంత కష్టంగా ఉంటుంది. అదే వెయ్యేళ్ల ముందరైతే ఎలా ఉండి ఉండేది ? రామానుజాచార్యులు తన సమయంలో అప్పటి సమాజంలోని చెడు, వర్ణభేదాలూ, అంటరానితనం, జాతి భేదాలు మొదలైనవాటికి వ్యతిరేకంగా చాలా పెద్ద పోరాటమే చేసారన్నది చాలాకొద్ది మందికి మాత్రమే తెలిసి ఉంటుంది. వారు తన స్వీయ ఆచరణ ద్వారా సమాజం ఎవరినైతే అంటరానివాళ్ళుగా పరిగణిస్తుందో, వారందరినీ ఆలింగనం చేసుకున్నారు. వెయ్యేళ్లకు పూర్వమే వారికి గుడిలో ప్రవేశాన్ని ఇవ్వడానికి ఆయన ఉద్యమించి, వారందరికీ గుడిలోకి ప్రవేశానికి అనుమతి సంపాదించారు. ప్రతి యుగంలోనూ ఆ కాలపు సమాజంలోని చెడును అంతమొందించేందుకు మన సమాజం నుండే మహాపురుషులు పుడుతూ ఉండడం మన అదృష్టం. రామానుజాచార్య వెయ్యవ జయంతిని ప్రస్తుతం మనం జరుపుకొంటున్నాం, మనం సామాజిక ఏకత్వం వర్ధిల్ల జేసేందుకు పడుతున్న ప్రయాసలో ఆయన నుండి ప్రేరణను పొంది ఐకమత్యమే బలం అన్న లోకోక్తికి మద్దతిద్దాం.
భారత ప్రభుత్వం రేపు మే ఒకటవ తారీఖున స్వామి రామానుజాచార్యుల స్మృత్యర్థం ఒక తపాలా బిళ్లను విడుదల చెయ్యబోతోంది. స్వామి రామనుజాచార్యులకు నేను ఆదరపూర్వక ప్రణామాలు తెలుపుకుంటూ, నివాళులర్పిస్తున్నాను.
ప్రియమైన నా దేశప్రజలారా, రేపు మే ఒకటవ తారీఖున మరొక ప్రత్యేకత ఉంది. ప్రపంచంలో దీనిని చాలా చోట్ల ‘‘శ్రామికుల రోజు’’గా జరుపుకుంటారు. శ్రామికుల రోజు అనే మాట వచ్చినప్పుడు, శ్రామికుల గురించిన చర్చ జరుగినప్పుడు, నాకు బాబాసాహెబ్ అంబేడ్కర్ గారు గుర్తుకురావడం స్వాభావికమే. శ్రామికులకు లభించిన సౌకర్యాలు, వారికి దక్కిన ఆదరణలకు మనం బాబాసాహెబ్ అంబేడ్కర్ కు రుణపడి ఉన్నామన్న సంగతి చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. శ్రామికుల మేలు కోసం బాబాసాహెబ్ అంబేడ్కర్ అందించిన సహకారం చిరస్మరణీయం. ఇవాళ నేను బాబాసాహెబ్ అంబేడ్కర్ గురించి, స్వామీ రామానుజాచార్యుల గురించీ చెప్తుంటే, కర్ణాటక కు చెందిన పన్నెండవ శతాబ్దపు సాధువు, సమాజ సంస్కర్త “జగద్గురు బసవేశ్వర”గారు కూడా గుర్తుకు వస్తున్నారు. నిన్ననే నాకొక సభకు వెళ్ళే అవకాశం లభించింది. వారి వచనామృత సంగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం అది. పన్నెండవ శతాబ్దంలో వారు కన్నడ భాషలో, శ్రమ – శ్రామికుల విషయంపై లోతైన ఆలోచనలు చేశారు. కన్నడ బాషలో ఆయన “కాయ్ కవే కైలాస్” అన్నారు. దాని అర్థం ఏమిటంటే, ‘మీరు మీ పరిశ్రమతోనే శివుడి ఇల్లైన కైలాస ప్రాప్తిని పొందగలరు’ అని. అంటే కర్మ చెయ్యడం వల్లనే స్వర్గం ప్రాప్తిస్తుంది. మరో మాటలో చెప్పాలంటే, శ్రమే శివుడు. నేనెప్పుడూ ‘శ్రమయేవ జయతే’ అని చెప్తూంటాను. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ను గురించి చెప్తుంటాను. నాకు బాగా గుర్తుంది, భారతీయ మజ్దూర్ సంఘం వ్యవస్థాపకుడు, ఆలోచనాపరుడు, శ్రామికుల గురించి ఎంతో ఆలోచించిన దత్తోపంత్ ఠేంగ్డీ గాకె ఏమనే వారంటే – ఒక వైపు మావో వాదం తో ప్రేరితులైనవారి ఆలోచన ఏమిటంటే “ప్రపంచ శ్రామికులారా ఏకం కండి”. ఇంకా దత్తోపంత్ ఠేంగ్డీ గారు ఏమనేవారంటే “శ్రామికులారా రండి, ప్రపంచాన్ని ఏకం చేద్దాం”. ఒకవైపు అనేవారు- ’‘Workers of the world unite’ . భారతీయ ఆలోచన నుండి వచ్చిన ఆలోచనాసరళిని గురించి దత్తోపంత్ ఠేంగ్డీ గారు ఏమనేవారంటే ’Workers unite the world ’. ఇవాళ నేను శ్రామికుల గురించి మట్లాడుతున్నప్పుడు దత్తోపంత్ ఠేంగ్డీ గారు గుర్తుకురావడం స్వాభావికమే.
ప్రియమైన నా దేశ ప్రజలారా, కొద్ది రోజుల్లో మనం బుధ్ధపూర్ణిమ జరుపుకుంటాం. ప్రపంచవ్యాప్తంగా బుధ్ధ భగవానుడి అనుయాయులందరూ ఉత్సవాలు జరుపుకుంటారు. ఇవాళ ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలైన హింస, వినాశం, యుధ్ధం, అస్త్రాల పోటీ లాంటి వాతావరణం చూసినప్పుడు బుధ్ధ భగవానుడి ఆలోచనలు చాలా ఉపయుక్తంగా అనిపిస్తాయి. భారతదేశంలో బుధ్ధుడి జీవన యాత్రకు అశోకుడి జీవిత యుధ్ధం అద్దం పడుతుంది. బుధ్ధ పూర్ణిమ రోజున సంయుక్త రాష్ట్రాల ద్వారా “vesak day” జరుపుకోవడం నా అదృష్టం. ఈ ఏడాది శ్రీ లంకలో ఇది జరిగుతుంది. ఈ పవిత్రమైన రోజున నాకు శ్రీ లంకలో బుధ్ద భగవానుడికి నివాళి అర్పించటానికి అవకాశం లభిస్తోంది. వారి జ్ఞాపకాలను పున:స్మరణ చేసుకోవడానికి అవకాశం లబిస్తోంది.
ప్రియమైన నా దేశప్రజలారా, భారతదేశంలో ఎప్పుడూ కూడా ‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్’ మంత్రంతోనే ముందుకు నడవడానికి ప్రయత్నించాము. భారతదేశంలో ‘సబ్ కా సాథ్ – సబ్ కా వికాస్’ అన్నప్పుడు, అది కేవలం భారతదేశం వరకే కాక ప్రపంచవ్యాప్త పరిధిలోకి కూడా వస్తుంది. ముఖ్యంగా మన ఇరుగుపొరుగు దేశాలకు కూడా వర్తిస్తుంది. మన ఇరుగుపొరుగు దేశాలతో సహకారమూ ఉండాలి, అభివృధ్ధి వారికీ జరగాలి. అనేక ప్రయోగాలు జరుగుతుంటాయి. మే 5 న భారత దేశం దక్షిణ- ఆసియా ఉపగ్రహాన్ని ప్రయోగించనుంది. ఈ ఉపగ్రహం సామర్థ్యమూ, దీనితో ముడిపడిఉన్న సౌలభ్యాలు దక్షిణ-ఆసియా తాలూకూ ఆర్థిక, అభివృధ్ధిపరమైన ప్రాథమికతలను పరిపూర్ణం చేసుకునేందుకు ఎంతో ఉపయోగపడుతుంది. సహజ వనరుల రేఖాచిత్రణ చేయడమైనా, టెలి- మెడిసిన్ ఐనా, విద్యారంగం ఐనా, అధిక సాంద్రత కలిగిన సాంకేతిక పరిజ్ఞాన అనుసంధాన విషయమైనా, ప్రజల మధ్య పరస్పర సంప్రదింపుల ప్రయత్నాలకైనా ఈ ఉపగ్రహం సహకరిస్తుంది. దక్షిణ ఆసియాకు చెందిన ఈ ఉపగ్రహం దక్షిణ-ఆసియా ప్రాంతం మొత్తం అభివృధ్ధి చెందడానికి ఎంతో సహాయపడుతుంది. దక్షిణాసియా ప్రాంతం అంతటిలో సహకారం పెంపొందించుకోవడానికి ఇది భారతదేశం వేస్తున్న గొప్ప అడుగు- ఒక వెలకట్టలేని కానుక. దక్షిణ-ఆసియా ప్రాంతం పట్ల మనకున్న అంకితభావానికి ఇదొక సరైన ఉదాహరణ. దక్షిణ-ఆసియా శాటిలైట్ తో సంబంధం ఉన్న దేశాలన్నింటినీ ఈ ముఖ్యమైన ప్రయోగానికి స్వాగతిస్తున్నాను. శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
ప్రియమైన నా దేశ ప్రజలారా, ఎండలు తీవ్రంగా ఉన్నాయి. మీ వారిని కాపాడుకోండి, మిమ్మల్ని మీరు కాపాడుకోండి.
మీకందరికీ మంచి జరుగుగాక .
మీకు ఇవే నా ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశ వాసులారా, మీ అందరికీ నా నమస్కారం. దేశం నలుమూలలా ఎక్కువ శాతం కుటుంబాలు వారి పిల్లల పరీక్షలలో నిమగ్నమై ఉండి ఉంటారు. పరీక్షలు అయిపోయిన వారి కుటుంబాలలో కాస్త ఉపశమనభరిత వాతావరణం, పరీక్షలు జరిగే కుటుంబాలలో కాస్తంత ఒత్తిడితో కూడిన వాతావరణం ఉండి ఉంటాయి. ఇటువంటి సమయంలో నేనొక్కటే చెప్పగలను , క్రితం సారి ‘మనసులో మాట’ లో నేను విద్యార్థులతో ఏ ఏమాటలైతే చెప్పానో, వాటిని మళ్ళీ వినండి. పరీక్షల సమయంలో మీకవి చాలా పనికి వస్తాయి.
ఇవాళ మార్చి 26. ఈ రోజు బంగ్లాదేశ్ స్వతంత్ర దినోత్సవం. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన ఒక చరిత్రాత్మక యుధ్ధంలో బంగ-బంధు నాయకత్వంలో బంగ్లాదేశ్ మునుపెన్నడూ లేని విజయాన్ని సాధించింది. ఇలాంటి ప్రత్యేకమైన రోజున స్వతంత్ర బంగ్లాదేశ్ సోదర పౌరులకూ, సోదరీమణులకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బంగ్లాదేశ్ ఇంకా అభివృధ్ధి పథంలోకి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. బంగ్లాదేశ్ కు ఒక బలమైన తోడుగా, ఒక మంచిమిత్రదేశంగా, మీతో చేయీ చేయీ కలిపి ఈ యావత్ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడి, మీరు అభివృధ్ధి దిశగా అడుగులు వెయ్యడానికి భారతదేశం పూర్తి సహకారాన్ని అందిస్తూనే ఉంటుంది.
మన రవీంద్రనాథ్ టాగూర్ జ్ఞాపకాలు మన రెండుదేశాలకూ భాగస్వామ్య వారసత్వమవ్వడంమనకెంతో గర్వకారణం. ఎందుకంటే బంగ్లాదేశ్జాతీయగీతం మన గురుదేవులు రవీంద్రనాథ్టాగూర్ రచన. రబీంద్రనాథ్ టాగూర్ గురించి ఒక ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే, 1913లో నోబెల్ పురస్కారాన్ని అందుకున్న మెట్టమొదటి వ్యక్తి ఆయన. అంతే కాదు, ఆంగ్లేయులు ఆయనకు‘Knighthood’ బిరుదును ఇచ్చారు కూడా. 1919లో జలియన్ వాలా బాగ్ లో ఆంగ్లేయులు మారణహోమాన్ని సృష్టించినప్పుడు వారికి వ్యతిరేకంగా గళమెత్తిన మహామనుషులలో రబీంద్రనాథ్ టాగూర్ కూడా ఒకరు. ఈ సంఘటనే ఒక పన్నెండేళ్ల బాలుడి మనసుపై బలమైన ప్రభావాన్ని చూపిన సమయం. ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యంలో ఈ జలియన్ వాలా బాగ్ మారణహోమం ఆ పిల్లవాడి జీవితానికి ఒక ప్రేరణను ఇచ్చింది. 1919లో పన్నెండేళ్ళున్న ఆ చిన్న భగతే మనందరికీ ప్రియమై, ప్రేరణగా నిలచిన అమరవీరుడు భగత్ సింగ్. ఇవాళ్టికి మూడు రోజుల క్రితం మార్చి నెల 23వ తేదీన భగత్ సింగ్ నూ, అతడి మరో ఇద్దరు మిత్రులు సుఖ్ దేవ్, రాజ్ గురూ లనూ ఆంగ్లేయులు ఉరికంబానికి ఎక్కించారు. ఆ సంఘటన భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురూ ముగ్గురికీ మృత్యుభయం లేకుండా, భారత మాతకు సేవ చేసుకున్న సంతోషాన్ని మిగిల్చిందన్న సంగతి మనందరికీ తెలుసు. వారు ముగ్గురూ భారత మాతకు స్వతంత్య్రాన్ని అందివ్వడం కోసం జీవితం పట్ల తమకున్న కలలన్నీ అంకితం చేశారు. ఇవాళ్టికి కూడా ఈ ముగ్గురు వీరులూ మనకెంతో ప్రేరణను అందిస్తారు. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురూ ల ప్రాణ సమర్పణల గాథను మనం అక్షరాల్లో పెట్టలేము కూడా. యావత్ బ్రిటిష్ సామ్రాజ్యం ఈ ముగ్గురికీ భయపడేది.
ఉరి శిక్ష పడి వారు జైలులో ఉన్నప్పటికీ, వారితో ఎలా మెలగాలో అనే చింత బ్రిటిష్ వారికి ఉండేది. అందుకే ఎవ్వరూ చెయ్యని విధంగా మార్చి నెల 24వ తేదీన ఉరి శిక్షను అమలుపరచాల్సి ఉండగా, మార్చి నెల 23వ తేదీ నాడే శిక్ష అమలుపరచారు. అంతే కాక వారి మృతదేహాలను దొంగతనంగా ఇవాళ్టి పంజాబ్ ప్రాంతానికి తీసుకువచ్చి దహనం చేయించారు. చాలా ఏళ్ళ క్రితం ఆ ప్రాంతానికి నేను మొదటిసారి వెళ్ళినప్పుడు ఒకరకమైన ప్రకంపనలు నా శరీరంలో కలిగాయి. ఎప్పుడైనా అవకాశం లభిస్తే, పంజాబ్ కు వెళ్ళి భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురూ ల మాతృమూర్తులు, ఇంకా బటుకేశ్వర్ దత్ సమాధులను దర్శించవలసిందిగా దేశ యువతకు నేను సూచిస్తున్నాను.
ఆ సమయంలోనే స్వాతంత్ర్యం కోసం పిలుపు, దాని తీవ్రత, దాని పరిమాణం పెరుగుతూ ఉంది. ఒకవైపు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురూ ల వంటి వీరులు సాయుధ విప్లవానికై యువకులను ప్రేరేపించారు. ఇవాళ్టికి సరిగ్గా వందేళ్ల పూర్వం 1917 ఏప్రిల్ 10వ తేదీ నాడు మహాత్మా గాంధీ చంపారణ్ సత్యాగ్రహం చేశారు. ఇది చంపారణ్ సత్యాగ్రహ శతాబ్ది సంవత్సరం. భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధేయ వాదం, గాంధీ గారి వ్యవహార శైలి మొదటిసారి చంపారణ్ సమయంలోనే తెలిసింది. ముఖ్యంగా పోరాటం తాలూకూ విధి విధానాల పరంగా స్వాతంత్ర్యం కోసం సల్సిన పోరాటం ప్రయాణం మొత్తంలో ఈ సంఘటన ఒక మైలురాయి. ఈ సమయంలోనే జరిగిన చంపారణ్ సత్యాగ్రహం, ఖేడా సత్యాగ్రహం, అహ్మదాబాద్ లోని మిల్లు కార్మికుల సమ్మె.. వీటన్నింటిలో మహాత్మా గాంధీ గారి ఆలోచనలూ, వ్యవహార శైలి తాలూకూ బలమైన ప్రభావం కనబడుతుంది. 1915 లో గాంధీ గారు విదేశాల నుండి తిరిగివచ్చారు. 1917లో బిహార్ లోని ఒక చిన్న గ్రామానికి వెళ్ళి ఆయన దేశానికి ఒక కొత్త ప్రేరణనిచ్చారు. ఇవాళ మన మనసుల్లో ఉన్నమహాత్మా గాంధీ గారి రూపం ఆధారంగా మనం చంపారణ్ సత్యాగ్రహం యొక్క ప్రభావాన్నిఅంచనా వెయ్యలేము. ఊహించండి.. 1915 లో భారతదేశానికి తిరిగివచ్చిన ఒక మనిషి జరిపిన కేవలం రెండేళ్ళ కార్యకలాపాలు. అంతకు ముందు దేశం ఆయనను ఎరుగదు. ఆయన ప్రభావం దేశంపై లేదు. అదే ఆరంభం. ఆ సమయంలో ఆయన ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సివచ్చిందో, ఎంత కష్టపడాల్సివచ్చిందో మనం ఊహించవచ్చు. జన సమీకరణ కౌశల్యం, భారతీయ సమాజం నాడి తెలుసుకునే శక్తి, తన ప్రవర్తనతో బ్రిటిష్ సామ్రాజ్యంలోని నిరుపేద వ్యక్తులు, నిరక్షరాస్యులను, పోరాటం కోసం ఒకటి చేయడం, ప్రేరేపించడం, పోరాటం కోసం బరి లోకి దింపడం, మొదలైన మహాత్మా గాంధీ గారి అద్భుత శక్తులను చూపించింది చంపారణ్ సత్యాగ్రహమే. అందువల్లే మనం గాంధీ గారి విశ్వరూపాన్ని దర్శించగలిగాం. ఒక వందేళ్ల క్రితం జరిగిన చంపారణ్ సత్యాగ్రహ సమయంలోని గాంధీ గారి గురించి తెలుసుకుంటే, సాధారణ జీవితాన్ని మొదలుపెట్టే ఏ వ్యక్తికైనా చంపారణ్ సత్యాగ్రహం ఎంతో తెలుసుకోవలసిన అంశమే. సాధారణ జీవితాన్ని ఎలా మొదలుపెట్టాలో, స్వయంగా ఎంత పరిశ్రమించాలో, గాంధీ గారు అదెలా చేశారో ఆయన నుండి నేర్చుకోవచ్చు. రాజేంద్ర బాబు గారు, ఆచార్య కృపలానీ గారి లాంటి మనం విన్న పెద్ద పెద్ద దిగ్గజ నేతలనందరినీ అదే సమయంలో గాంధీ గారు పల్లెపల్లెకూ పంపారు. ప్రజలతో కలసి, ప్రజలు చేసే పనిలో దానికి స్వాతంత్ర్య పోరాటపు రంగునద్దటం ఎలాగో నేర్పించారు. గాంధీ గారి ఈ విధి విధానాలను ఆంగ్లేయులు అర్థం చేసుకోలేకపోయారు. పోరాటాలు , ఆలోచనలూ రెండూ ఒకేసారి నడిచాయి. గాంధీ గారు దీనిని ఒకే నాణానికి రెండు ముఖాలుగా చేశారు. ఒకటి పోరాటమూ, రెండవది ఆలోచన. ఒక వైపున జైళ్ళు నింపుతూ ఉండడం, రెండవ వైపున వ్యూహాత్మక కార్యకలాపాలలో నిమగ్నమవడం. ఒకఅద్భుతమైన సంతులత గాంధి గారి కార్యశైలిలో ఉంది.
సత్యాగ్రహం అనే పదానికి అర్థం ఏమిటో, అసమ్మతి అంటే ఏమిటో, సహాయ నిరాకరణ అంటే ఏమిటో అంత పెద్ద సామ్రాజ్యానికి చూపెట్టారు. ఒక సంపూర్ణమైన అర్థాన్ని గాంధీ గారు మాటల ద్వారా కాక ఒక సఫలపూర్వకమైన ప్రయోగం ద్వారా చూపెట్టారు.
ఇవాళ దేశం చంపారణ్ సత్యాగ్రహం తాలూకు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో భారతదేశ సామాన్య పౌరుడి శక్తి ఎంత అపారమైందో తెలిపి, ఆ అసామాన్య శక్తిని స్వాతంత్ర్య ఉద్యమం వైపునకు నడిపినట్లే స్వరాజ్యం నుండి సురాజ్య ప్రయాణం, నూట పాతిక కోట్ల మంది ప్రజల సంకల్ప శక్తి వారి పరిశ్రమకు పరాకాష్ట. సర్వజన హితాయ – సర్వ జన సుఖాయ అనే మూల మంత్రాన్ని తీసుకుని, దేశం కోసం, సమాజం కోసం ఎంతో కొంత చెయ్యాలనే అఖండ ప్రయాసే స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహా పురుషుల కలలను సాకారం చేస్తుంది.
ఇవాళ మనం ఇరవైఒకటవ శతాబ్దం వైపునకు అడుగులు వేస్తున్నప్పుడు, ఏ భారతీయుడు దేశం మారాలని అనుకోడు ? ఏ భారతీయుడు దేశంలో మార్పునకు భాగస్వామి అవ్వాలని కోరుకోడు ? మార్పును తేవాలనే నూట పాతిక కోట్ల మంది ప్రజల కోరిక, ప్రయత్నం ఇవే కొత్త భారతావనికి, ఇండియాకు బలమైన పునాది. ‘న్యూ ఇండియా’ ఏ ప్రభుత్వ కార్యక్రమమూ కాదు. ఏ రాజకీయపక్షాల ఎన్నికల వాగ్దాన పత్రం కాదు. ప్రాజెక్టూ కాదు. ‘న్యూ ఇండియా’ నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజల ఆహ్వానం. నూట పాతిక కోట్ల మంది ప్రజలు కలసి ఏ భవ్య భారతాన్ని నిర్మించాలనుకుంటున్నారో ఆ భావమే ‘న్యూ ఇండియా’. నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజల మనసుల్లో ఒక ఆశ ఉంది. ఒక కోరిక, ఒక సంకల్పం, ఒక ఉత్సాహం ఉన్నాయి.
ప్రియమైన నా దేశవాసులారా, మనం కాస్త మనసొంత జీవితాలలో నుండి బయటకు వచ్చి, కాస్త సానుభూతితో సమాజంలో జరుగుతున్న కార్యకలాపాలను చూస్తే, చుట్టుపక్కల ఏం జరుగుతోందో గమనించి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే లక్ష్యార్థులైన వ్యక్తులు నిస్వార్థ భావంతో, తమ సొంత బాధ్యతలనే కాకుండా సమాజం కోసం, దోపిడీకి గురయ్యే వార్తి కోసం, బాధితులు, వంచితుల కోసం, పేదల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండడం గమనిస్తే నిశ్చేష్టులౌతారు. అది కూడా ఒక తపస్సు లాగ, సాధన లాగ, ఒక మూగ సేవకుడి లాగ వారి పనిని వారు చేసుకుపోతున్నారు. రోజూ ఆసుపత్రికి వెళ్ళి రోగులకు సేవ చేసేవారు చాలా మంది ఉన్నారు. రక్తదానం అంటే వెనువెంటనే పరుగు పెట్టే వారెందరో ఉన్నారు. అన్నార్తులకు భోజన సదుపాయాలను అందించే వారు ఎందరో ఉన్నారు. ఎందరో రత్నాల వంటి పుత్రులు ఉన్న భూమి మనది. ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న సూత్రం మన రక్తంలో ఉంది. ఒక్కసారి దానికి సామూహికంగా, సంఘటిత రూపంగా చూస్తే ఇదెంత పెద్ద శక్తో తెలుస్తుంది. ‘న్యూ ఇండియా’ మాట వచ్చినప్పుడు, దాని గురించిన ఆలోచన , దాని గురించిన విమర్శ ఉండడం, విభిన్న దృష్టి కోణాల నుండి దానినిచూడడం స్వాభావికమే. ఇది ప్రజాస్వామ్యంలో అవసరం కూడా. కానీ నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజలు ఒకసారి సంకల్పిస్తే, వారి సంకల్పసిధ్ధి కోసం బాట ఎంచుకున్నట్లయితే, ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ నడిస్తే, నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజల కల అయిన ‘‘న్యూ ఇండియా’’ మన కళ్ల ముందర సాకారమౌతుంది. ఇవన్నీ బడ్జెట్ సాయంతోనో, ప్రభుత్వ ప్రథకాల వల్లనో, ప్రభుత్వ ధనంతోనో జరగాలని లేదు. ప్రతి పౌరుడూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని సంకల్పించాలి. తన బాధ్యతలను పూర్తి నిజాయితీతో నిర్వర్తిస్తానని సంకల్పించాలి, ప్రతి పౌరుడూ వారంలో ఒక రోజు తాను పెట్రోల్, డీజిల్ వాడనంటూ సంకల్పం చెప్పుకోవాలి. ఇవన్నీ మామూలు విషయాలే; కానీ మీరు దేశాన్నిఅప్పుడు చూడండి.. నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజల స్వప్నం ‘న్యూ ఇండియా’ మన కళ్ల ముందర సాకారమౌతున్నట్లు కనబడుతుంది. చెప్పేదేమిటంటే, ప్రతి పౌరుడూ పౌర ధర్మాన్ని పాటించాలి. బాధ్యతలను నిర్వర్తించాలి. అప్పుడు దానంతట అదే న్యూఇండియాకు ఒక శుభారంభమౌతుంది.
2022 కల్లా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతాయి. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురూ లను గుర్తు చేసుకుందాం. చంపారణ్ సత్యాగ్రహాన్నిగుర్తు చేసుకుందాం. మనం కూడా మన జీవితాలను క్రమబద్ధం చేసి, సంకల్పబద్ధులమై ‘‘స్వరాజ్యం నుండి సురాజ్యం’’ యాత్రలో భాగమవుదామా ? నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.. రండి !
ప్రియమైన నా దేశ వాసులారా, నేను మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత కొద్ది నెలలలో మన దేశంలో ఎలాంటి వాతావరణం నెలకొందంటే, చాలా పెద్ద ఎత్తున ప్రజలు డిజిటల్ చెల్లింపులు, డిజి- ధన్ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. నగదు రహిత వ్యవహారాలు ఎలా జరపాలన్న ఉత్సుకత పెరిగింది. నిరుపేదలు కూడా ఆ సంగతులు నేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా నెమ్మదినెమ్మదిగా నగదు రహితంగా వ్యాపారాలు ఎలా చెయ్యాలో తెలుసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. నోట్ల రద్దు తరువాత రకరకాల డిజిటల్ చెల్లింపుల విధానాలలో చాలా వృద్ధిని చూడగలిగాం. భీమ్ యాప్ ను ప్రారంభించి రెండు- రెండున్నర నెలలు మాత్రమే అవుతున్నా, దగ్గర దగ్గర ఒకటిన్నర కోట్ల మంది ప్రజలు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.
నా దేశ ప్రజలారా, నల్ల ధనం, అవినీతి పట్ల జరుపుతున్న పోరాటాన్ని మనం ముందుకు నడిపించాల్సి ఉంది. నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజలు ఈ ఏడాది కాలంలో రెండున్నర వేల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరపగలమని సంకల్పించగలరా ? మేము బడ్జెట్ లో ప్రకటించాం. నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజల కోసం చేసే ఈ పనిని వారు తలిస్తే ఒక సంవత్సరం వరకు ఆగాల్సిన పని లేదు. ఆరు నెలల్లో పూర్తి చేసెయ్యగలరు. రెండున్నర వేల కోట్ల డిజిటల్ లావాదేవీలకు- బడిలో కట్టే రుసుం నగదు రూపంలో కాక డిజిటల్ గా చెల్లిద్దాం. రైళ్ళలో ప్రయాణించినా, విమానాల్లో ప్రయాణించినా డిజిటల్ చెల్లింపులు జరుపుదాం. మందులు కొనుగోలు చేసినా డిజిటల్ పేమెంట్ చేద్దాం. చవక బియ్యం వ్యాపారం చేసినా డిజిటల్ వ్యవస్థ ద్వారా చేద్దాం. రోజువారీ జీవితంలో ఇవన్నీ మనం చేయచ్చు. దీని వల్ల మీరు దేశానికి ఎంత సేవ చేయగలరో మీరు ఊహించుకోలేరు. నల్ల ధనం, అవినీతి పట్ల జరిగే పోరాటంలో మీరొక వీర సైనికుడిగా మారగలరు. ప్రజలకు ఇవన్నీనేర్పించడం కోసం, ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం కోసం గత కొద్ది రోజుల్లో డిజి- ధన్ మేళా తాలూకూ ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. యావద్దేశంలో ఇటువంటి వంద కార్యక్రమాలను జరపాలని సంకల్పించాం. 80- 85 కార్యక్రమాలు అయిపోయాయి. వాటిల్లో బహుమతి పథకాలు కూడా ఉన్నాయి. దగ్గర దగ్గర పన్నెండున్నర లక్షల మంది ప్రజలు వినియోగదారుల బహుమతులు అందుకున్నారు. వ్యాపారుల కొరకు ఏర్పాటు చేసిన బహుమతులను డెభ్భై వేల మంది అందుకున్నారు. ప్రతి ఒక్కరూ ఈ పనిని ముందుకు నడిపించాలనే సంకల్పించారు. ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి. ముందే నిశ్చయమైనట్లు ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి నాడు ఈ డిజి మేళా సమాప్తమౌతుంది. వంద రోజులు పూర్తి కాగానే ఒక పెద్ద చివరి కార్యక్రమం జరగనుంది. అతి పెద్ద డ్రా ఒకటి అందులో నిర్దేశించబడి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి వరకూ ఇంకా మన వద్ద ఎంత సమయం మిగిలి ఉందో, అంతదాకా భీమ్ యాప్ ప్రచారం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. నగదు వాడకాన్ని తగ్గించానికీ, నోట్లతో వ్యవహారాలను తగ్గించడానికీ మన వంతు కృషి చేద్దాం.
ప్రియమైన నా దేశ వాసులారా, ‘మనసులో మాట’ కోసం ప్రతిసారి నేను సలహాలు అడిగినప్పుడల్లా అనేక రకాలైన సలహాలు రావడం నాకు ఆనందకరం. కానీ స్వచ్ఛత విషయంలో మాత్రం ప్రతి సారీ విన్నపాలు ఉంటూనే ఉంటున్నాయి. పదకొండవ తరగతి చదువుతున్న గాయత్రి అనే అమ్మాయి దెహ్ రా దూన్ నుండి ఫోన్ చేసి ఒక సందేశాన్ని పంపించింది. “గౌరవనీయులైన ప్రధానాధ్యాపకులు గారూ, ప్రధాన మంత్రి గారూ, మీకు నా గౌరవపూర్వక నమస్కారాలు. అన్నింటికన్నా ముందుగా ఈ ఎన్నికలలో మీరు అత్యధిక ఓట్లతో గెలిచినందుకు అనేకమైన శుభాకాంక్షలు. మీతో నా మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నాను. పరిశుభ్రత ఎంత అవసరమో ప్రజలకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. ప్రజలు చాలా చెత్తాచెదారాన్ని వేస్తూ కలుషితం చేసే ఒక నది మీదుగా నేను రోజూ ప్రయాణిస్తాను. ఆ నది రిస్పనా వంతెన మీదుగా మా ఇంటి దాకా వస్తుంది. ఈ నది కోసం మేము బస్తీలకు వెళ్ళి ఊరేగింపులు చేశాం. ప్రజలతో మాట్లాడాం. కానీ, దానివల్ల ఏమీ ప్రయోజనం కలగలేదు. నేను మీతో చెప్పాలనుకున్నదేమిటంటే, మీరు ఒక బృందాన్ని పంపి, లేదా వార్తాపత్రికల ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు” అని ఆ సందేశంలో ఉంది.
చూడండి సోదర సోదరీమణులారా, పదకొండవ తరగతి చదువుతున్న ఒక బిడ్డ ఎంత బాధపడుతోందో. ఆ నది లోని చెత్తాచెదారాన్ని చూసి ఆమెకు ఎంత కోపం వస్తోందో చూడండి. దీన్ని నేను శుభసూచకంగా గుర్తిస్తున్నాను. నూట పాతిక కోట్ల మంది ప్రజల మనసుల్లో అపరిశుభ్రత పట్ల కోపం కలగాలనే నేను కోరుకుంటున్నాను. ఒకసారి కోపం మొదలైతే, అసంతృప్తి మొదలైతే, రోషం కలిగితే మనమే అపరిశుభ్రత పట్ల ఏదో ఒకటి చెయ్యడానికి పూనుకుంటాం. గాయత్రి స్వయంగా తన కోపాన్ని తెలియచెయ్యడం మంచి విషయం. నాకు సలహాను కూడా చెప్తూ, తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పింది. శుభ్రత ఉద్యమం మొదలైనప్పటి నుండీ ప్రజలందరూ అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ అందులో వారి ప్రయత్నాలను జోడించుకుంటూ ముందుకువెళ్తున్నారు. అదొక ఉద్యమంగా రూపు దిద్దుకుంది. అపరిశుభ్రత పట్ల ద్వేషం కూడా పెరుగుతోంది. అప్రమత్తంగా ఉన్నా, సక్రియ భాగస్వామిగా ఉన్నా, ఉద్యమంగా ఉన్నా, వాటికి మహత్యం ఎంతైనా ఉంటుంది. కానీ పరిశుభ్రత ఎప్పుడూ ఉద్యమం కన్నా కూడా, ఒక అలవాటుతో ముడిపడి ఉంటుంది. ఈ ఉద్యమం అలవాట్లను మార్చే ఉద్యమం. ఈ ఉద్యమం పరిశుభ్రత అలవాట్లను పెంపొందించే ఉద్యమం. ఉద్యమం సామూహికంగా జరుగుతుంది. కష్టమైనా పనే.. కానీ, చెయ్యాల్సిందే. దేశ నవతరంలో, బాలల్లో, విద్యార్థినీ విద్యార్థులలో, యువతీయువకులలో మేల్కొన్న ఈ భావన దానంతట అదే ఒక మంచి పరిణామాన్నిసూచిస్తోందని నేను నమ్ముతున్నాను. ఈ రోజు ‘మనసులో మాట’లో గాయత్రి చెప్పిన మాటలు వింటున్న వారందరూ, గాయత్రి సందేశం మనందరికీ సందేశంగా మారాలని దేశ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను.
ప్రియమైన నా దేశవాసులారా, ‘మనసులో మాట’ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన దగ్గర నుండి చాలా మంది ఒకే విషయం పై నాకు అనేక సూచనలు అందించారు. అది ఆహారం వ్యర్థమవడం గురించి. మనకు తెలుసు మనం ఇంట్లో భోజనం చేసినా, సామూహిక విందు భోజనాల్లో కూడా అవసరానికి మించి మన కంచంలో ఆహారం వేసేసుకుంటాం. కనబడినవన్నీ కంచంలో వేసేసుకుని తరువాత తినడానికి ఇబ్బంది పడతాం. కంచంలో వేసుకున్న వాటిలో సగం కూడా కడుపులో వేసుకోలేక, అక్కడే వదిలేసి వచ్చేస్తాం. ఈ ఎంగిలి పదార్థాలను వదిలెయ్యడం వల్ల మనం ఎంత నష్టం చేస్తున్నామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? ఇలా ఎంగిలి చేసి వదలకుండా ఉంటే, ఎందరు పేదల కడుపులు నిండగలవో ఎప్పుడైనా ఆలోచించారా ? ఇది అర్థమయ్యేలా తెలపాల్సిన విషయం కాదు. మన ఇళ్ళల్లో చిన్న పిల్లలకు వడ్డించినప్పుడు “ఎంత తినగలవో అంతే తిను నాయనా” అని అమ్మ చెప్తుంది. ఏదో ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ విషయం పట్ల ఉదాసీనంగా ఉండడం సమాజ ద్రోహమే అవుతుంది. పేదల పట్ల అన్యాయమే. మరో సంగతి ఏమిటంటే, ఒకవేళ మిగిలితే కుటుంబానికి కూడా ఆర్థిక లాభమే కదా. సమాజపరంగా మంచి విషయమే. కానీ ఇదెలాంటి విషయమంటే, కుటుంబానికి కూడా మంచిదే. ఈ విషయమై ఎక్కువ చెప్పదలుచుకోలేదు కానీ అప్రమత్తత పెరగాలని మాత్రం కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఉద్యమించే కొందరు యువకులను నేను ఎరుగుదును. వారు కొన్ని మొబైల్ యాప్ లను తయారు చేశారు. ఎక్కడెక్కడైతే ఇటువంటి ఆహారం మిగిలిపోయిందని వారిని పిలుస్తారో, అక్కడికి వెళ్ళి ఆ ఆహారాన్ని ఒక చోట చేర్చి దానిని సద్వినియోగపరుస్తూ, కష్టపడతారు. ఇది మన దేశంలోని యువకులే చేస్తారు. మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి వారు మీకు కనబడతారు. వాళ్ల జీవితాలు కూడా మనకు ఎంగిలి వదలకూడదనీ, ఎంత తినగలమో అంతే తీసుకోవాలని తెలుపుతూ, స్ఫూర్తిని అందిస్తాయి.
చూడండి, మార్పునకు ఇవే దారులుంటాయి. ఎవరైతే శరీరం, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తారో వారెప్పుడూ చెప్తారు “కడుపులో కొంచెం ఖాళీ ఉంచండి, కంచంలో కొంచెం ఖాళీ ఉంచండి”. ఆరోగ్యం విషయం కాబట్టి ఏప్రిల్ 7వ తారీఖు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఐక్యరాజ్యసమితి 2030 వరకూ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే ‘‘అందరికీ ఆరోగ్యం’’ అనే లక్ష్యాన్ని నిర్ణయించారు. ఈసారి ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 7వ తారీఖు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డిప్రెషన్ మీద దృష్టి పెట్టాయి. ఈసారి వారి ప్రధానాంశం డిప్రెషన్. మనకి కూడా డిప్రెషన్ అనే పదం తెలుసు. కానీ అర్థం తెలుసుకోవాలంటే కొందరు దాన్ని కుంగుబాటు అంటారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో 35 కోట్ల పైబడి ప్రజలు మానసికంగా డిప్రెషన్ తో బాధ పడుతున్నారు. ప్రమాదం ఏమిటంటే, మన చుట్టుపక్కల ఉన్న వారిలో కూడా మనం ఈ సంగతి గమనించం. బాహాటంగా ఈ సంగతి మాట్లాడడానికి కూడా మనం ఇష్టపడం. డిప్రెషన్ కు గురైన వ్యక్తి కూడా దాని గురించి మాట్లాడడు. ఎందుకంటే, ఆ వ్యక్తి కూడా దాని గురించి చర్చించడానికి సిగ్గుపడతాడు. డిప్రెషన్ నుండి విముక్తి లభించదని భావించద్దని నేను దేశ ప్రజలతో చెప్పాలనుకుంటున్నాను. ఒక మానసిక వాతావరణాన్ని ఏర్పరచినప్పుడే విముక్తి లభించడం ప్రారంభమౌతుంది. మొదటి మంత్రం ఏమిటంటే, సప్రెషన్ బదులుగా ఎక్స్ ప్రెషన్ అవసరం. అంటే డిప్రెషన్ ను అణచివేయకుండా దానిని బయటకు తెలియపరచడం. మీ మిత్రుల వద్ద, తల్లితండ్రుల వద్ద, అన్నదమ్ముల మధ్యా, ఉపాధ్యాయులతో మీకు ఏమనిపిస్తోందో మనసు విప్పి చెప్పండి. వసతిగృహంలో నివసించే పిల్లలకు అప్పుడప్పుడు ఒంటరితనం వల్ల ఎంతో ఇబ్బంది కలుగుతుంది. మన దేశంలో సౌభాగ్యమేమిటంటే, మనం ఉమ్మడి కుటుంబాలలో పెరిగి పెద్దవాళ్లం అయ్యాం. పెద్ద పెద్ద కుటుంబాలలో కలసిమెలసి ఉంటాం కాబట్టి డిప్రెషన్ కు ఆస్కారం ఉండదు. కానీ, నేను కొందరు తల్లితండ్రులకు చెప్పాలనుకుంటున్నాను- మీరు ఎప్పుడైనా గమనిస్తే, ఒకోసారి మీ పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు, ఇంతకు ముందు మీతో కలసి భోజనం చేసే వారు ఇప్పుడు హఠాత్తుగా ‘తరువాత తింటాను’ అని టేబుల్ దగ్గరకు రారు. ఇంట్లో అందరూ బయటకు వెళ్తూంటే, నేను రానని ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతుంటే, ఎందుకలా చేస్తున్నారో గమనించారా ? అవి డిప్రెషన్ వైపు మొదటి అడుగులు అని మీరు నమ్మండి. ఒకవేళ వారు సమూహం వైపునకు కాక ఒంటరితనం వైపునకు అడుగులు వేస్తూ ఉంటే ప్రయత్నపూర్వకంగా అలా జరగకుండా చూడండి. వారితో మనసు విప్పి ఎవరైతే మాట్లాడతారో వారి మధ్యన ఉండే అవకాశాన్ని వాళ్లకు ఇవ్వండి. నవ్వుతూ, సంతోషంగా ఉండే మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళను తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ప్రేరేపించండి. వాళ్ల మనసులో ఎక్కడ ఏ నిరాశ ఉందో, దానిని బయటకు తియ్యండి. ఇదే ఉత్తమమైన ఉపాయం. ఈ డిప్రెషన్ శారీరిక, మానసిక రోగాలకు కారణమవుతుంది. ఎలాగైతే మధుమేహం అన్నిరకాల రోగాలకూ మూలమౌతుందో, అలానే డిప్రెషన్ కూడా నిలబడడానికీ, పోరాడడానికీ, సాహసించడానికీ, నిర్ణయాలు తీసుకోవడానికీ ఉన్నమన మొత్తం సామర్థ్యాలనీ ధ్వంసం చేసేస్తుంది. మీ మిత్రులు ,మీ కుటుంబం, మీ పరిసరాలు, మీ వాతావరణం.. అన్నీ కలసి డిప్రెషన్ లోకి వెళ్ళకుండా మిమ్మల్ని ఆపగలవు. ఒకవేళ అందులోకి వెళ్ళి ఉంటే బయటకు కూడా తీసుకురాగలవు. మరో విధానం కూడా ఉంది.. ఒకవేళ మీవాళ్ల మధ్యన మీరు మనసు విప్పి మీ అభిప్రాయాలు వ్యక్తం చేయలేకపోతే, ఒక పని చెయ్యండి.. మీ చుట్టుపక్కల ఎక్కడైనా సేవాభావంతో పని చేస్తున్న వారి వద్దకి వెళ్ళి, వారికి సహాయం చెయ్యండి. మనసు పెట్టి సహాయం చెయ్యండి. వారి కష్ట సుఖాలను పంచుకోండి. అప్పుడు మీరు గమనించండి.. మీలోని బాధంతా అదృశ్యమైపోతుంది. ఎదుటి వారి దు:ఖాన్నిమీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, సేవాభావంతో చేస్తే, మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఉత్పన్నమౌతుంది. ఇతరులను కలసినప్పుడు, ఎవరికైనా సేవ చేసినప్పుడు, నిస్వార్థంగా సేవ చేసినప్పుడు, మీరు మీ మనసులోని బరువును సులువుగా తేలిక పరచుకోగలరు.
అలాగే, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా కూడా ఒక చక్కని మార్గం. ఒత్తిడికి దూరంగా, మానసిక శ్రమకు దూరంగా, ప్రసన్న చిత్తంతో జీవన ప్రయాణాన్ని గడపడానికి యోగా చాలా సహాయం చేస్తుంది. జూన్ 21వ తేదీన మూడవ అంతర్జాతీయ యోగా దినం. కొన్ని లక్షల మంది సమక్షం లో సామూహిక యోగా దినాన్ని జరుపుకోవడానికి మీరు కూడా ఇప్పటి నుండే సమాయత్తమవ్వండి. మీ మనసులో ఈ మూడవ అంతర్జాతీయ యోగా దినం గురించి ఏవైనా సలహాలు ఉంటే, మీరు మీ మీ సలహాలను మీ మొబైల్ యాప్ ద్వారా నాకు పంపండి, మార్గాలను సూచించండి. యోగా కు సంబంధించి ఎన్ని గీతాలు, కావ్యాత్మక రచనలు మీరు తయారు చెయ్యగలరో చెయ్యండి. అవి ప్రజలకు సులభంగా అర్థమౌతాయి.
ఆరోగ్యం గురించి ఎలాగూ ఎక్కువ చర్చ వచ్చింది కాబట్టి తల్లులకూ, సోదరీమణులకూ నేను ఈ వేళ ముఖ్యంగా ఒక సంగతిని చెప్పదలుచుకున్నాను. గత కొద్ది రోజులలో భారత ప్రభుత్వం ఒక పెద్దముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. మన దేశంలో ఉన్న ఉద్యోగినుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. పని చేసే వర్గంలో వారి భాగస్వామ్యం పెరుగుతూండడం స్వాగతించాల్సిన విషయం. దానితో పాటే మహిళలకు ప్రత్యేకమైన బాధ్యతలు కూడా ఉన్నాయి. కుటుంబ బాధ్యతలే కాకుండా ఆర్థికపరమైన బాధ్యతలలో కూడా వారు పాలుపంచుకోవాల్సి ఉంటోంది. దానివల్ల అప్పుడప్పుడు లేదా ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలకు అన్యాయం జరుగుతోంది. అందువల్ల భారత ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ పని వర్గం మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ గర్భిణీలుగా ఉన్న సమయంలో, ప్రసవ సమయంలో, ఇంతకు ముందు ఇచ్చే 12 వారాల ప్రసూతి సెలవును ఇప్పుడు 26 వారాలకు పెంచాము. ఈ విషయంలో ప్రపంచంలో రెండు మూడు దేశాలే మనకంటే ముందున్నాయి. ఈ సోదరీమణులందరి కోసమని భారతదేశం ఎంతో ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. దాని ముఖ్యోద్దేశం నవజాత శిశువు సంరక్షణ, భారత భావి పౌరుడికి తాను జన్మనెత్తిన ప్రారంభ సమయంలో సరైన సంరక్షణ అందాలని, తల్లి ప్రేమ నిండుగా పొందాలని, అప్పుడే ఈ పిల్లలు పెరిగి పెద్దయి దేశానికి మంచి శక్తిగా మారతారు. అప్పుడు తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుందని ఇలాంటి ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఫార్మల్ సెక్టార్ లో పనిచేసే దాదాపు 18 లక్షల మంది మహిళలకు దీని వల్ల లాభం చేకూరుతుంది.
ప్రియమైన నా దేశ వాసులారా, ఏప్రిల్ 5వ తేదీన శ్రీరామ నవమి పర్వదినం. ఏప్రిల్ 9వ తేదీన మహావీర్ జయంతి. ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి. ఈ మహాపురుషుల జయంతులన్నీ మనకు ఎంతో ప్రేరణను ఇస్తూ ఉండాలి. ‘న్యూ ఇండియా’ కోసం సంకల్పించే శక్తిని ఇవ్వాలి. రెండు రోజుల తరువాత చైత్ర శుక్ల పాడ్యమి. కొత్త సంవత్సరం మొదటి పాడ్యమి. ఈ కొత్త సంవత్సర సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. వసంత ఋతువు తరువాత మన రైతులందరి శ్రమకు ఫలితం లభించి, పంటలు చేతికి వచ్చే సమయమిది. మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఈ కొత్త సంవత్సరాన్నివేరు వేరు పేర్లతో జరుపుకొంటుంటారు. కొత్త సంవత్సర ప్రవేశ వేళ మహారాష్ట్రలో ‘‘గుడీ పడ్వా’’, ఆంధ్ర, కర్ణాటకల్లో ‘ఉగాది’గా, సింధీల “చేటీ-చాంద్”, కశ్మీరీ “నవ్ రేహ్”, అవధ్ ప్రాంతంలో సంవత్సర పూజ, బిహార్ లోని మిధిల లో “జుడ్ శీతల్”, మగధ లో “సతువానీ” పండుగలు జరుగుతాయి. భారతదేశం ఇన్ని లెక్కపెట్టలేనన్ని వైవిధ్యాలతో కూడుకున్న దేశం. నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ కూడా నా తరఫున చాలా అభినందనలు. అనేకానేక ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశ వాసులారా, నమస్కారం. చలికాలం ఇక అయిపోతోంది. వసంత ఋతువు మన జీవితాల్లోకి తొంగిచూస్తోంది. శరత్కాలం తరువాత చెట్లకు కొత్త చిగుర్లు వస్తాయి. పూలు వికసిస్తాయి/పూస్తాయి. తోటలు,వనాలు పచ్చదనంతో నిండిపోతాయి.
పక్షుల కిలకిలారావాలు మనసును హత్తుకుంటాయి. పువ్వులే కాకుండా పళ్ళు కూడా చెట్ల కొమ్మల్లో నుండి ఎండలో మెరుస్తూ కనబడతాయి. ఎండాకాలంలో బాగా వచ్చే మామిడి పళ్ళ తాలూకూ మామిడి పూత వసంతంలోనే కనబడడం మొదలవుతుంది. పొలాల్లో పసుపు పచ్చని ఆవ పూలు రైతుల అంచనాలను పెంచుతాయి. ఎర్రని మోదుగ పూలు హోలీ వస్తోందన్న సందేశాన్ని అందిస్తాయి. కవి అమీర్ ఖుస్ రో ఋతువులు మారుతున్న ఈ క్షణాలపై ఎంతో ఇంపైన వర్ణన చేశారు. ఆయన ఇలా అన్నారు :
"తోటలన్నింటా పూసిన ఆవపూలు,
ఆకాశం కురిపించినట్లున్న మోదుగపూలు,
కొమ్మ కొమ్మకూ కోయిలపాట.."
ప్రకృతి ఆనందకరంగా ఉన్నప్పుడు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నప్పుడు మనిషి కూడా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తాడు. వసంత పంచమి, మహా శివరాత్రి, హోలీ మొదలైన పండుగలు మనిషి జీవితంలో ఆనందాల రంగులను నింపుతాయి. ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం నిండిన వాతావరణంలో మనం మన చివరి మాసమైన ‘ఫాల్గుణాని’కి వీడ్కోలు చెప్పబోతున్నాం. కొత్త నెల ‘చైత్రాన్ని’ స్వాగతించడానికి తయారుగా ఉన్నాం. ఈ రెండు నెలల సంయోగమే కదా వసంత ఋతువు.
‘మనసులో మాట’ కన్నా ముందు నుండే నేను అడిగినప్పుడల్లా NarendraModiApp, ట్విటర్, ఫేస్ బుక్ లలోను, ఉత్తరాల ద్వారాను నాకు బోలెడు సలహాలను అందించిన లక్షల మంది దేశ వాసులకు ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. వారందరికీ నేను ఋణపడి ఉంటాను.
శోభా జాలాన్ అనే ఆవిడ NarendraModiApp లో “చాలా మంది ప్రజలకు ఐఎస్ఆర్ఒ ఉపయోగాలను గురించిన అవగాహన లేదు కాబట్టి, మీరు 104 ఉపగ్రహాల ప్రయోగం గురించీ ఇంటర్ సెప్టర్ మిసైల్ గురించీ కొంత సమాచారాన్ని అందించవలసింది” అని కోరారు.
శోభ గారూ, భారతదేశం గర్వించే ఉదాహరణను గుర్తు చేసినందుకు మీకు బోలెడు ధన్యవాదాలు. పేదరికాన్ని పరిష్కరించాలన్నా, వ్యాధుల నుండి రక్షింపబడాలన్నా, ప్రపంచంతో ముడిపడాలన్నా, జ్ఞానాన్నీ, సమాచారాలనూ చేర్చాలన్నా, సాంకేతికత, విజ్ఞానం ద్వారానే సాధ్యపడేటటువంటి స్థానాన్ని అవి సంపాదించుకున్నాయి. 2017, ఫిబ్రవరి 15వ తేదీ భారతీయుల జీవితాలలో గౌరవప్రదమైన రోజు. మన దేశం ప్రపంచం ముందు గర్వంతో తలెత్తుకునేంత గొప్ప పనిని మన శాస్త్రవేత్తలు చేశారు. వారు గత కొద్ది కాలంగా ఐఎస్ఆర్ఒ (ఇస్రో)లో ఎన్నో అపూర్వమైన ప్రయోగాలను విజయవంతంగా పూర్తి చేశారు. అంగారక గ్రహానికి, ‘మార్స్ మిషన్ ’, ‘మంగళ్ యాన్’ మొదలైన విజయవంతమైన ప్రయోగాల తరువాత కొద్ది రోజుల క్రితమే అంతరిక్ష క్షేత్రంలో ప్రపంచ రికార్డు ను ఐఎస్ఆర్ఒ నెలకొల్పింది. ఒక పెద్ద ప్రయోగం ద్వారా ఒకేసారి భారతదేశంతో పాటు అమెరికా, ఇజ్రాయెల్, కజాక్ స్తాన్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, యుఎఇ వంటి దేశాలకు చెందిన 104 ఉపగ్రహాలను ఐఎస్ఆర్ఒ విజయవంతంగా ప్రయోగించింది. ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపి చరిత్ర సృష్టించిన మొట్టమొదటి దేశంగా భారతదేశం నిలిచింది. ఇది పిఎస్ఎల్ వికి వరుసగా 38వ విజయవంతమైన ప్రయోగం కావడం ఆనందించాల్సిన విషయం. ఇది కేవలం ‘ఇస్రో’ కే కాక భారతదేశానికి కూడా ఒక చరిత్రాత్మక విశిష్ట కార్యం. ఇస్రో అతి తక్కువ ఖర్చుతో దక్షతతో నిర్వహించిన ఈ అంతరిక్ష కార్యక్రమం యావత్ ప్రపంచంలో ఒక అద్భుతంగా మారింది; భారతదేశ శాస్త్రవేత్తలు సాధించిన ఈ విజయాన్ని మొత్తం ప్రపంచం విశాల హృదయంతో ప్రశంసించింది.
సోదర సోదరీమణులారా, ఈ 104 ఉపగ్రహాలలోనూ ముఖ్యమైంది భారతదేశ ఉపగ్రహం కార్టొశాట్ 2డి. ఈ శాటిలైట్ తీసే చిత్రాలు, వనరుల మ్యాపింగ్, మౌలిక సదుపాయాలు, అభివృధ్ధి అంచనాలు, పట్టణ అభివృధ్ధి ప్రణాళికలూ మొదలైనవాటికి ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా నా రైతు సోదర సోదరీమణులకు దేశంలో నీటి మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో, వాటిని ఎలా ఉపయోగించుకోవాలి, అలాగే దృష్టిలో పెట్టుకోవలసిన ముఖ్యమైన విషయాలు ఏమిటి, తదితర అంశాలపై కార్టొశాట్ 2డి మనకు సహకరిస్తుంది. మన శాటిలైట్ వెళ్తూనే కొన్ని చిత్రాలను పంపించింది. అది తన పనిని అప్పుడే మొదలుపెట్టేసింది. ఆనందించాల్సిన విషయం ఏమిటంటే, ఈ మొత్తం కార్యక్రమం తాలూకూ పర్యవేక్షణంతా మన యువ శాస్త్రవేత్తలు, మహిళా శాస్త్రవేత్తలూ చేశారు. యువకులు, మహిళల ఈ బలమైన భాగస్వామ్యం ఇస్రో సాధించిన విజయంలోకెల్లా ఒక గౌరవప్రదమైన విషయం. ఇస్రో శాస్త్రవేత్తలకు దేశ ప్రజలందరి పక్షాన నేను అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజల కోసం, దేశ సేవ కోసం, అంతరిక్ష విజ్ఞానం ఉపయోగపడాలనే లక్ష్యాన్ని ఎల్లప్పుడూ ఉంచేందుకు నిత్యం కొత్త కొత్త రికార్డులను కూడా వారు నెలకొల్పుతున్నారు. మన శాస్త్రవేత్తలకూ, వారి పూర్తి బృందానికీ మనం ఎన్ని అభినందనలు తెలిపినా తక్కువే.
శోభ గారు భారత దేశ భద్రతకు సంబంధించిన మరో ప్రశ్న కూడా వేశారు. ఆ విషయంలో భారతదేశం మరో గొప్ప సాఫల్యాన్ని కూడా సాధించింది. ఈ విషయాన్ని గురించి పెద్దగా చర్చలేమీ జరగలేదు కానీ ఈ ముఖ్యమైన విషయంపై ఆవిడ దృష్టి పడింది. రక్షణ రంగంలో కూడా భారతదేశం బాలిస్టిక్ ఇంటర్ సెప్టర్ మిసైల్ ని విజయవంతంగా పరీక్షించింది. ఇంటర్ సెప్షన్ టెక్నాలజీ వారి ఈ క్షిపణి తన ప్రయోగంలో భాగంగా భూమి నుండి దగ్గర దగ్గరగా 100 కిలోమీటర్ల ఎత్తు నుండి శత్రువుల క్షిపణిని గుర్తించి, కుప్పకూల్చి విజయాన్ని సాధించింది. రక్షణ రంగంలో ఇది చాలా కీలకమైన విజయం. ప్రపంచం మొత్తం మీద ఇటువంటి పట్టు సాధించిన దేశాలు అతికష్టం మీద నాలుగో, లేక ఐదో ఉంటాయన్న సంగతి మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. మన భారత శాస్త్రవేత్తలు ఇది చేసి చూపెట్టారు. ఇంకా దీని శక్తి ఎటువంటిదంటే, ఒకవేళ 2000 కిలోమీటర్ల దూరం నుండి కూడా భారతదేశాన్ని ఆక్రమించేందుకు ఏదైనా క్షిపణి వస్తే, అంతరిక్షంలోనే దాన్ని నాశనం చేసే శక్తి మన క్షిపణి కి ఉంది.
కొత్త టెక్నాలజీని చూసినప్పుడు, ఏవైనా విజ్ఞానపరమైన కొత్త విజయాలు లభించినప్పుడూ మనకు ఆనందం కలుగుతుంది. మానవజీవితం తాలూకూ అభివృధ్ధి యాత్రలో జిజ్ఞాస చాలా ముఖ్యమైన పాత్రను పోషించింది. ప్రత్యేకమైన వివేకం, ప్రతిభ గల వారు వారి జిజ్ఞాసను జిజ్ఞాస లాగా ఉండనివ్వరు. వారు దాని లోపల కూడా ప్రశ్నలు పుట్టించి, కొత్త జిజ్ఞాసలను వెతుకుతారు. కొత్త జిజ్ఞాసలను సృష్టిస్తారు. అదే జిజ్ఞాస కొత్త శోధనకు కారణమౌతుంది. వారి ప్రశ్నలకు సమాధానాలు దొరికేవరకూ వివేకవంతులు నిద్రపోరు. మానవజీవితం తాలూకూ వేల సంవత్సరాల అభివృధ్ధి యాత్రను గనుక మనం పరిశీలిస్తే, ఈ మానవజీవితం తాలూకూ అభివృధ్ధి యాత్రకు ఏ అంతమూ లేదన్న విషయాన్ని మనం చెప్పగలం. అంతం అనేది అసంభవం. బ్రహ్మాండాన్నీ, సృష్టి నియమాలనూ, మనిషి మనసునూ తెలుసుకోవడానికి నిరంతర ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. కొత్త విజ్ఞానం, కొత్త సాంకేతిక పరిజ్ఞానం అందులోనుండే పుడతాయి. అలా పుట్టే ప్రతి కొత్త సాంకేతిక పరిజ్ఞానం, కొత్త విజ్ఞానం ఒక కొత్త యుగానికి జన్మనిస్తాయి.
నా ప్రియమైన యువకులారా, విజ్ఞానం, శాస్త్రవేత్తల కఠిన పరిశ్రమల విషయం మనం మాట్లాడుకుంటున్నప్పుడల్లా నేను ‘మన్ కీ బాత్‘ (మనసులో మాట)లో చాలా సార్లు మన యువతరంలో విజ్ఞానం పట్ల ఆకర్షణను పెంచాలన్న సంగతి చెప్తూ వచ్చాను. దేశానికి చాలా మంది శాస్త్రవేత్తల అవసరం ఉంది. నేటి శాస్త్రవేత్తలు రాబోయే తరాలలోని జీవన విధానంలో ఒక శాశ్వత మార్పుకు కారణమౌతారు.
మహాత్మా గాంధీ చెప్పే వారు “No science has dropped from the skies in a perfect form. All sciences develop and are built up through experience” అని.
ఇంకా పూజ్య బాపూజీ “I have nothing but praise for the zeal, industry and sacrifice that have animated the modern scientists in the pursuit after truth” అని కూడా అన్నారు.
విజ్ఞానం ఎప్పుడూ సామాన్య ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని, తన సిధ్ధాంతాలను సహజంగా ఎలా ఉపయోగించుకోవచ్చో, వాటికి ఏ మాధ్యమం ఉపయోగకరమో, ఏ సాంకేతిక పరిజ్ఞానం అవసరమో గమనించాలి. ఎందుకంటే, సామాన్య మానవుడికి అదే అన్నింటికన్నా ఎంతో ఉపయోగకరమైన వరమౌతుంది. గత కొన్ని రోజుల్లో నీతీ ఆయోగ్, భారత విదేశీ మంత్రిత్వ శాఖ కలిసి 14వ ప్రవాస భారతీయ దినం సందర్భంగా ఒక పెద్ద అద్వితీయమైన పోటీకి ప్రణాళిక ను తయారుచేశాయి. సమాజానికి ఉపయోగపడే సృజనాత్మకతను ఆహ్వానించడమైంది. ఇటువంటి సృజనాత్మకతలను గుర్తించడం, ప్రదర్శించడం, ప్రజలకు వాటి సమాచారాన్ని అందించడం, ఇలాంటి సృజనాత్మక ఆవిష్కారాలు ప్రజలకు ఎలా ఉపయోగపడతాయి, వాటిని పెద్ద ఎత్తున ఎలా ఉత్పత్తి చెయ్యాలి, వాటిని వాణిజ్యపరంగా ఎలా ఉపయోగించాలి మొదలైనవాటిని చూసినప్పుడు, వారు ఎంత గొప్ప పని చేశారో అని నాకు అనిపించింది. ఇటీవలే నేనొక ఆవిష్కరణని చూశాను. మన పేద జాలర సోదరుల కోసం అది తయారు చెయ్యబడింది. ఒక సామాన్యమైన మొబైల్ యాప్ తయారైంది. ఆ యాప్ లోని గొప్ప సంగతి ఏమిటంటే, జాలరులు చేపలు పట్టేందుకు వెళ్ళేప్పుడు, వారు ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ చేపలు ఎక్కువ ఉంటాయో, గాలి ఎంత వేగంతో ఎటువైపు వీస్తోందో, అలలు ఎంత ఎత్తు వరకూ ఎగసిపడుతున్నాయో, అంటే ఒక్క యాప్ లోనే ఇంత సమాచారం లభిస్తోంది. దీనివల్ల మన జాలర సోదరులు చాలా తక్కువ సమయంలో ఎక్కడ ఎక్కువ చేపలు ఉన్నాయో అక్కడికి తక్కువ సమయంలో చేరి, తమ సంపాదన పెంచుకోగలుగుతారు.
అప్పుడప్పుడు సమస్య కూడా సమాధానం కోసం విజ్ఞాన మహత్వాన్ని చాటిచెప్తుంది. 2005లో ముంబయి లో ఎక్కువ వర్షాలు కురిశాయి. వరదలు వచ్చాయి. సముద్రం కూడా పొంగడం వల్ల చాలా కష్టాలు వచ్చాయి. ఏదైనా ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు అది ముందర పేదవాడికే వస్తుంది. ఇద్దరు వ్యక్తులు పెద్ద మనసుతో ఈ విషయంలో పని చేశారు. ఇటువంటి సమయాల్లో ఇంటిని రక్షించేలా, ఇంట్లోని వారిని రక్షించేలా, ఇంట్లో నీరు నిండకుండా కాపాడేలా, నీటి వల్ల కలిగే వ్యాధుల నుండి కూడా కాపాడేటటువంటి ఒక ప్రత్యేకమైన ఇంటి నమూనాని ఊహించి, అభివృధ్ధి చేశారు. ఇలాంటివి చాలా అవిష్కరణలే ఉన్నాయి. దీని అర్థం ఏమిటంటే, సమాజంలో, దేశంలో, ఈ రకమైన పాత్రను పోషించే మనుషులు చాలా మందే ఉంటారు. మన సమాజం కూడా చాలా వరకూ సాంకేతికత దిశగానే పయనిస్తోంది. వ్యవస్థలన్నీ కూడా సాంకేతికత దిశగానే నడుస్తున్నాయి. ఒక విధంగా సాంకేతికత మన జీవితాలలో ఒక విభిన్నమైన భాగంగా మారుతోంది. గత కొద్ది రోజులుగా డిజి- ధన్ యోజన చాలా బలపడుతున్నట్లు తోస్తోంది. నెమ్మది నెమ్మదిగా ప్రజలు నగదుని వదిలి డిజిటల్ కరెన్సీ వైపుగా ముందుకు సాగుతున్నారు. భారతదేశంలో కూడా డిజిటల్ లావాదేవీలు చాలా వేగంగా అభివృధ్ధి చెందుతున్నాయి. ముఖ్యంగా యువతరం తమ మొబైల్ ఫోన్స్ నుండే తమ డిజిటల్ చెల్లింపులను జరపడానికి అలవాటుపడుతున్నారు. ఇదొక శుభ సంకేతంగా నేను భావిస్తున్నాను. కొద్ది రోజుల క్రితం మన దేశంలో ‘లకీ గ్రాహక్ యోజన’, ‘డిజి- వ్యాపార్ యోజన’లకు భారీ మద్దతు లభించింది. దగ్గరదగ్గరగా రెండునెలలు గడిచిపోయాయి. ప్రతి దినం పదిహేను వేల మందికి తలో వెయ్యి రూపాయిల బహుమానం గెల్చుకున్నారు. ఈ రెండు పథకాల ద్వారా భారతదేశంలో నగదు చెల్లింపును ఒక ప్రజా ఉద్యమంగా మార్చే ఒక ప్రయత్నం జరిగింది. యావత్ దేశం దీనిని స్వాగతించింది. ఆనందించాల్సిన విషయం ఏమిటంటే, ఇప్పటిదాకా ‘డిజి- ధన్ యోజన’ ద్వారా పది లక్షల మంది ప్రజలకు బహుమతి లభించింది. ఏభై వేల మందికి పైగా వ్యాపారస్తులు బహుమతులు గెలిచారు. ఈ గొప్ప కార్యక్రమాన్ని ముందుకు నడిపించే ప్రజలకు బహుమతి రూపంలో ఇంచుమించు నూట ఏభై కోట్ల రూపాయిలకు పైగానే లభించింది. ఈ ప్రణాళికలో భాగంగానే వంద కంటే ఎక్కువ ఖాతాదారులకు ఒక్కొక్కరికీ లక్ష రూపాయల చొప్పున బహుమతి లభించింది. నాలుగువేల కంటే ఎక్కువమంది వ్యాపారస్థులకు ఏభై వేల చొప్పున బహుమతి లభించింది. రైతైనా, వ్యాపారస్థులైనా, చిన్న ఉద్యోగస్తులైనా, కుల వృత్తి చేసేవారైనా, గృహిణులైనా, విద్యార్థులైనా, అందరూ కూడా ఇందులో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. వారికి లాభం కూడా చేకూరుతోంది. చూడండి, యువకులే పాల్గొంటున్నారా? లేదా పెద్ద వయసువారు కూడా పాల్గొంటున్నారా అని నేను ఈ విశ్లేషణ వివరాలను అడిగినప్పుడు, బహుమతి పొందినవారిలో పదిహేను సంవత్సరాల యువకులే కాకుండా అరవై ఐదు, డెభ్భై సంవత్సరాల పెద్దలు కూడా ఉన్నారని తెలిసి నాకు ఆనందం కలిగింది.
మైసూర్ నుండి శ్రీ సంతోష్ గారు తన ఆనందాన్ని ప్రకటిస్తూ NarendraModiApp లో వారికి లకీ గ్రాహక్ యోజన లో వెయ్యి రూపాయిల బహుమతి లభించిందని రాశారు. కానీ వారు రాసిన అన్నింటికన్నా గొప్ప సంగతి, నాకు పంచుకోవాలనిపించిన సంగతి ఏమిటంటే, “వెయ్యి రూపాయిల బహుమతి నాకు లభించిన సమయంలో నాకో సంగతి తెలిసింది. ఒక పేద వృద్ధురాలి ఇంటికి నిప్పు అంటుకుని, సామానంతా కాలిపోయిందని తెలిసింది. నాకు లభించిన వెయ్యి రూపాయిల బహుమతికి హక్కుదారు ఆ పేద వృధ్ధురాలు అనిపించి, ఆ వెయ్యి రూపాయిలూ ఆమెకు ఇచ్చేశాను. ఇలా చెయ్యడం నాకెంతో ఆనందం కలిగించింది” అని రాశారు. సంతోష్ గారూ, మీ పేరు, మీ పని రెండూ మా అందరికీ సంతోషాన్ని ఇస్తున్నాయి. మీరెంతో ప్రోత్సాహకరమైన పని చేశారు.
ఢిల్లీ కి చెండిన ఇరవై రెండేళ్ళ కారు డ్రైవరు, సోదరుడు సబీర్ నోట్ల చట్టబద్ధత రద్దు తరువాత తన రోజువారీ కార్యకలాపాల్లో డిజిటల్ వ్యాపారంతో ముడిపడ్డారు. ప్రభుత్వం ప్రకటించిన ‘లకీ గ్రాహక్ యోజన’లో అతడికి ఒక లక్ష రూపాయిలు బహుమతి లభించింది. ఇవాళ అతడు కారు నడుపుతాడు. కానీ ఒకరకంగా ఈ ప్రణాళికకు రాయబారిగా మారాడు. ప్రయాణికులందరికీ ఎప్పుడూ డిజిటల్ సంబంధమైన విషయాలను చెప్తూ ఉంటాడు. ఎంతో ఉత్సాహంగా విషయాలను చెప్తూ, ఇతరులనూ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు.
మహారాష్ట్ర నుండీ పిజి చదువుకుంటున్న పూజా నేమాడే అనే ఒక యువ మిత్రురాలు కూడా రూపే కార్డ్, ఇ-వేలెట్ ల ఉపయోగం తన కుటుంబంలో ఎలా జరుగుతోందో, దానిని అమలుజరుపుతుంటే ఎంత ఆనందాన్ని పొందుతున్నారో, తన అనుభవాలను తన స్నేహితులతో పంచుకుంటూ ఉంటుంది. లక్షరూపాయల బహుమానం రావడం తనకు ఎంత విలువైనదో చెప్తూ, తాను దీనిని ఒక ఉద్యమంగా తీసుకుని, ఇతరులను కూడా ఇందుకోసం ప్రోత్సహిస్తోంది.
దేశ ప్రజలకు, ముఖ్యంగా దేశ యువతకూ , ఈ ‘లకీ గ్రాహక్ యోజన’ లేదా ‘డిజి- ధన్ వ్యాపార యోజన’లో బహుమతి లభించిన వారిని స్వయంగా ఈ ప్రణాళికలకు రాయబారిగా మారమని కోరుతున్నాను. మీరు దీనిని ముందుకు నడిపించండి. ఈ పని ఒక రకంగా అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో పెద్ద పాత్ర పోషిస్తుంది. నా దృష్టిలో, ఈ పనితో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ దేశంలో ఒక కొత్త అవినీతి వ్యతిరేక దళమే. ఒకరకంగా మీరు శుభ్రతా సైనికులు. మీకు తెలుసు, ‘లక్కీ గ్రాహక్ యోజన’ వంద రోజులు పూర్తయ్యే రోజైన ఏప్రిల్ 14వ తేదీ, డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి.
గుర్తు చేసుకోవాల్సిన రోజు. ఏప్రిల్ 14న కొన్ని కోట్ల రూపాయల బహుమతి ఉన్న ఒక డ్రా జరగబోతోంది. దానికి ఇంకా దగ్గర దగ్గర 40, 45 రోజులు ఉన్నాయి. బాబా సాహెబ్ అంబేడ్కర్ ను గుర్తుచేసుకుంటూ మీరొక పని చెయ్యగలరా ? కొద్ది రోజుల క్రితమే బాబా సాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతి జరిగింది. వారిని గుర్తు చేసుకుని మీరు కూడా కనీసం 125 మందికి BHIM APP డౌన్ లోడ్ చేసుకోవడం నేర్పించండి. దానితో వ్యాపార లావాదేవీలు ఎలా జరుగుతాయో నేర్పించండి, ముఖ్యంగా మీ చుట్టుపక్కల ఉండే చిన్నపాటి వ్యాపారస్తులకు నేర్పించండి. ఈసారి బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి, BHIM APP , రెండింటికీ విశేషమైన ప్రత్యేకతను ఇవ్వండి. అందుకే నేను చెప్పేదేమిటంటే, బాబా సాహెబ్ వేసిన పునాదిని మనం బలపరచాలి. ఇంటింటికీ వెళ్ళి, అందరినీ కలుపుకుని 125 కోట్ల చేతుల వరకూ BHIM APP ను చేర్చాలి. గత రెండు మూడు నెలల నుండీ జరుగుతున్న ఈ ఉద్యమం ప్రభావం ఏమిటంటే, ఎన్నో కాలనీలలో, ఎన్నో పల్లెల్లో, ఎన్నో పట్టణాల్లో ఎంతో సఫలమైంది.
ప్రియమైన నా దేశ వాసులారా, మన దేశ ఆర్థిక వ్యవస్థకు వ్యవసాయం ఒక పెద్ద మూలస్తంభం. పల్లెల్లోని ఆర్థిక బలం, దేశ ఆర్థిక పురోగతికి బలాన్నిస్తుంది. ఇవాళ నేనొక ఆనందకరమైన విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. మన రైతు సోదర, సోదరీమణులు ఎంతో శ్రమించి మన ధాన్యాగారాలను నింపేశారు. ఈ ఏడాది మన దేశంలో రైతుల శ్రమతో రికార్డు స్థాయిలో ధాన్య ఉత్పాదన జరిగింది. మన రైతులు పాత రికార్డులన్నీ బద్దలుకొట్టేశారు అని అన్ని సంకేతాలు తెలుపుతున్నాయి. ఈసారి పొలాల్లో పంటలు ఎలా పండాయంటే, ప్రతి రోజూ పొంగల్, బైశాఖీ పండుగలు జరుపుకుంటున్నట్లే అనిపిస్తోంది. ఈ సంవత్సరం దేశంలో దాదాపు రెండువేల ఏడువందల లక్షల టన్నులకు మించి ఆహార ధాన్యాలను ఉత్పత్తి చేయడం జరిగింది. మన రైతుల పేరున నమోదైన ఆఖరి రికార్డ్ కంటే ఈసారి 8% ఎక్కువ నమోదైంది. ఇది ఇంతకుమునుపెన్నడూ ఎరగని సాఫల్యం. నేను దేశ రైతులను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఎందుకంటే వారు సంప్రదాయ పంటలే కాకుండా పేద ప్రజలను దృష్టిలో పెట్టుకుని, రకరకాల పప్పు ధాన్యాలను కూగా సాగుచేశారు. ఎందుకంటే పేదవారికి పప్పు తోనే అన్నింటికన్నా ఎక్కువ ప్రోటీన్లు అందుతాయి. దేశంలో రైతులు పేదవారి అవసరాన్ని దృష్టిలో పెట్టుకుని దగ్గర దగ్గరగా రెండువందల తొంభై లక్షల హెక్టార్ల భూమిలో రకరకాల పప్పుధాన్యాల పంటలు పండించడం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. ఇది కేవలం రకరకాల పప్పుల ఉత్పాదనే కాదు, నా దేశ పేద ప్రజలకి రైతులు చేసిన గొప్ప సేవ. నా ప్రార్థనని, నా విన్నపాన్నీ , నా దేశ రైతులు ఏ ప్రకారంగా నెత్తిమీద పెట్టుకుని కష్టపడి పప్పుధాన్యాల రికార్డ్ ఉత్పాదన చేశారో.. అందుకే నా రైతు సోదర సోదరీమణులు ప్రత్యేకమైన అభినందనలకు అర్హులు.
ప్రియమైన నా దేశ వాసులారా, మన దేశంలో ప్రభుత్వం ద్వారా, సమాజం ద్వారా, సంస్థల ద్వారా, ప్రతి ఒక్కరి ద్వారా స్వచ్ఛత దిశగా ఏదో ఒక పని జరుగుతూనే ఉంది. ఒక రకంగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో స్వచ్ఛత కు సంబంధించి అప్రమత్తంగా వ్యవహరిస్తుట్లుగా కనబడుతోంది. ప్రభుత్వం కూడా నిరంతరంగా ప్రయత్నిస్తూనే ఉంది. కొద్ది రోజుల క్రితం భారత ప్రభుత్వ జల, పారిశుధ్య మంత్రిత్వ శాఖ తాలుకూ తాగు నీరు, స్వచ్ఛత మంత్రిత్వ విభాగం వారి కార్యదర్శి నేతృత్వంలో 23 రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారుల కార్యక్రమం ఒకటి తెలంగాణలో జరిగింది. ఆ సదస్సు తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ లో తలుపులు మూసి ఉన్న ఒక గదిలో కాకుండా, ప్రత్యక్షంగా స్వచ్ఛత వల్ల ఉన్న ప్రయోజనాలు ఏమిటో వాటిని ప్రయోగపూర్వకంగా ఎలా చెయ్యాలో చేసి చూపెట్టారు. ఫిబ్రవరి 17, 18 తేదీలలో హైదరాబాద్ లో toilet pit emptying excercise ను నిర్వహించారు. ఆరు ఇళ్ళ toilet pitsను ఖాళీ చేయించి, వాటిని బాగుచేశారు. ట్విన్ పిట్ టాయిలెట్ లను ఖాళీ చేశాకా, మళ్ళీ ఆ టాయిలెట్ గొయ్యిలను తిరిగి ఉపయోగించుకునే విధానాలను అధికారులే స్వయంగా చూపెట్టారు. ఈ కొత్త టెక్నిక్ గల మరుగుదొడ్లు ఎంత సౌకర్యవంతమైనవో కూడా వారు చూపెట్టారు. వీటిని ఖాళీ చేసి, తిరిగి శుభ్రపరిచే పధ్ధతిలో ఏ రకమైన ఇబ్బందీ ఉండదు. ఎటువంటి సంకోచమూ ఉండదు. టాయిలెట్లను శుభ్రపరచడానికి మానసిక అడ్డంకి ఏదైతే ఉంటుందో, అది కూడా ఉండదు. మనం ఇతర శుభ్రతలు ఎలా చేసుకుంటామో, ఈ టాయిలెట్ గొయ్యిలను కూడా అలానే శుభ్రపరుచుకోవచ్చు. దేశంలో ఈ ప్రయత్నానికి మీడియా ద్వారా చాలా ప్రచారం లభించింది. ఈ కార్యక్రమానికి స్వాభావికంగానే ప్రాముఖ్యత లభించింది. ఎందుకంటే ఒక ఐఎఎస్ అధికారి స్వయంగా టాయిలెట్ గొయ్యిలను శుభ్రపరిచినప్పుడు అది దేశప్రజల దృష్టిని ఆకర్షించడం స్వాభావికమే. ఈ టాయిలెట్ పిట్ ల శుభ్రపరిచేప్పుడు మనం ఏదైతే చెత్తా చెదారం అనుకుంటామో, దానిని ఎరువు రూపంలో చూస్తే అది నల్ల బంగారమే. వ్యర్థం సంపదగా ఎలా మారగలదో మనం తెలుసుకుంటాము. అది నిరూపించబడింది కూడా. ఆరుగురు సభ్యులున్న కుటుంబానికి ఒక స్టాండర్డ్ ట్విన్ పిట్ టాయిలెట్ ఐదేళ్ళ లో నిండుతుంది. ఆ తరువాత చెత్తను సులువుగా మరొక పిట్ లోకి మళ్ళించవచ్చు. ఆరు నుండి పన్నెండు నెలల్లో టాయిలెట్ గొయ్యి లో చేరిన చెత్త పూర్తిగా కుళ్ళిపోతుంది. ఈ కుళ్ళిపోయిన చెత్త నిర్వహణ ఎంతో సురక్షితం. ఎరువు రూపంలో చూసినా ఎంతో ముఖ్యమైన ఎన్ పికె ఎరువు. రైతులకు ఎన్ పికె ఎరువు సుపరిచితమే. ఇది నైట్రోజన్, భాస్వరం, పొటాషియం మొదలైన పోషక తత్వాలతో నిండి ఉంటుంది. వ్యవసాయ రంగంలో ఇది ఎంతో ఉత్తమమైన ఎరువుగా పరిగణించబడుతుంది.
ప్రభుత్వం ఏ రకంగా ఈ ముందడుగు తీసుకుందో, ఇతరులు కూడా ఇలాంటి ముందడుగు ప్రయోగాలు చేసే ఉంటారు. ఇప్పుడు దూరదర్శన్ లో కూడా స్వచ్ఛత వార్తల తాలూకూ ఒక విశేష కార్యక్రమం వస్తోంది. అందులో ఇటువంటి విషయాలు ఎంత వెలుగు చూస్తే అంత మంచిది. ప్రభుత్వంలో కూడా రకరకాల విభాగాలలో స్వచ్ఛత పక్షోత్సవాలు నిరంతరం జరుగుతూ ఉంటాయి. మార్చి నెల మొదటి పక్షంలో ‘మహిళా మరియు శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ’ తో పాటూ ‘గిరిజనాభివృధ్ధి మంత్రిత్వ శాఖ’ వారు కూడా ఈ స్వచ్ఛత కార్యక్రమానికి మద్దతునివ్వబోతున్నారు. మార్చి నెల రెండవ పక్షంలో మరో రెండు మంత్రిత్వ శాఖలు.. షిప్పింగ్ శాఖ- జల వనరుల శాఖ’, నదుల వికాసం మరియు గంగానది శుద్ధి శాఖ.. కూడా స్వచ్ఛత కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లనున్నాయి.
మనకు తెలుసు, మన దేశంలోని ఏ పౌరుడైనా కూడా ఏదైనా సాధించినప్పుడు దేశం యావత్తూ ఒక కొత్త శక్తిని అనుభూతి చెందుతుంది. అది ఆత్మ విశ్వాసాన్ని పెంచుతుంది. రియో పారాలింపిక్స్ లో మన దివ్యాంగ క్రీడాకారుల ప్రదర్శనను మనమెంతో స్వాగతించాం. ఈ నెలలోనే జరిగిన అంధుల జట్టు టి-20 ప్రపంచ కప్ ఫైనల్స్ లో భారత దేశం పాకిస్తాన్ ను ఓడిస్తూ వరుసగా రెండో సారి ప్రపంచ ఛాంపియన్ గా నిలిచి దేశ గౌరవాన్ని పెంచింది. మరో సారి నేను జట్టు సభ్యులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. దివ్యాంగ మిత్రుల ఈ ఘనకార్యానికి యావద్దేశం గర్విస్తోంది. దివ్యాంగ సోదర సోదరీమణులు ఎంతో సమర్థవంతులని నేనెప్పుడూ అనుకుంటాను. వారెంతో ధృఢ నిశ్చయం కలిగి ఉంటారు. సాహసవంతులు, సంకల్పబలం గల వారు. ఎల్లప్పుడూ వారి నుండి నేర్చుకోవాల్సింది ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది.
విషయం క్రీడా సంబంధితమైనదైనా, అంతరిక్ష సంబంధితమైనదైనా మన దేశ మహిళలు ఎవరికీ తీసిపోరు. అడుగులో అడుగు వేసుకుంటూ వారు ముందుకు వెళ్తున్నారు. తమ విజయాలతో దేశఖ్యాతిని పెంచుతున్నారు. ఈ మధ్య జరిగిన ‘ఏషియా రగ్బీ సెవెన్స్ ట్రోఫీ’ లో మన దేశ మహిళా క్రీడాకారులు రజత పతకం సాధించారు. వారందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
మార్చి 8వ తేదీన ప్రపంచామంతా కూడా మహిళా దినోత్సవంగా జరుపుకుంటుంది. భారతదేశంలో కూడా ఆడపిల్లలకు ప్రాముఖ్యత పెరగాలి. కుటుంబాల్లో, సమాజంలో వారి పట్ల శ్రధ్ధ పెరగాలి. వారిపట్ల కరుణ పెరగాలి. ‘బేటీ బచావో - బేటీ పఢావో’ ఉద్యమం వేగంగా ముందుకు సాగుతోంది. ఇవాళ ఇది ఒక ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదు. ఒక సామాజిక సంచలనం గా, జన విద్యాకార్యక్రమం గా మారింది. గత రెండేళ్ళుగా ఈ కార్యక్రమం సామాన్య ప్రజల మనస్సులను ఆకర్షించింది. దేశంలోని నలుమూలలా రగులుతున్న ఈ సమస్య ప్రజలను ఆలోచింపజేసింది. ఏళ్ల తరబడి వస్తున్న ఆచార వ్యవహారాల పట్ల ప్రజల ఆలోచల్లో మార్పు వచ్చింది. ఆడపిల్ల పుట్టిందని తెలియగానే సంబరాలు జరుపుకుంటున్నారన్న వార్తలు తెలిసినప్పుడు ఎంతో ఆనందం కలుగుతుంది. ఒక రకంగా ఆడపిల్లల పట్ల పెరుగుతున్న సానుకూల వైఖరి వారి సామాజిక స్వీకరణకు కారణమౌతోంది. తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో ఒక ప్రత్యేకమైన కార్యక్రమం ద్వారా బాల్య వివాహాలను ఆదుపుచేయగలిగారు. ఇప్పటిదాకా దాదాపు 175కు పైగా బాల్య వివాహాలను ఆపగలిగారు. జిల్లా పాలనా విభాగం ‘సుకన్య సమృధ్ధి యోజన’ లో భాగంగా దగ్గర దగ్గర 55-60 వేల పైనే ఆడపిల్లల బ్యాంక్ అకౌంట్లు తెరిచారు. జమ్ము కశ్మీర్ లోని కధువా జిల్లాలో కన్వర్జెన్స్ మోడల్ ద్వారా అన్ని విభాగాలనూ ’బేటీ బచావో - బేటీ పఢావో యోజన’ కార్యక్రమంలో చేర్చారు. గ్రామ సభల నిర్వహణతో పాటు జిల్లా పాలనా విభాగం ద్వారా అనాధ బాలికలను దత్తత తీసుకోవడం, వారికి విద్యా సదుపాయాలను కల్పించడం మొదలైన ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. మధ్య ప్రదేశ్ లో ఆడపిల్లలను చదివించడం కోసం పల్లె పల్లెలో, ఇంటి ఇంటికీ వెళ్ళి తలుపు తట్టే కార్యక్రమం ఒకటి ’హర్ ఘర్ దస్తక్ ’ అనే పేరుతో జరుగుతోంది. రాజస్థాన్ లో ’అప్నా బచ్చా, అప్నా విద్యాలయ ’ అనే కార్యక్రమాన్ని నడిపించి, ఏ బాలికలైతే బడి మానేశారో వారిని తిరిగి పాఠశాలలో చేర్చి, వారిని మళ్ళీ చదువుకోవడానికి ప్రోత్సహించే కార్యక్రమం జరుగుతోంది.
ఇంతకీ చెప్పేదేమిటంటే, ‘బేటీ బచావో - బేటీ పఢావో’ యోజన కూడా అనేక రూపాంతరాలను చెందుతోంది. ఈ ఉద్యమం మొత్తం ఒక ప్రజాఉద్యమం గా మారింది. కొత్త కొత్త ఆలోచనలు దానితో ముడిపడుతున్నాయి. ప్రాంతీయ అవసరాలకు అనుగుణంగా వాటిని మార్చుకుంటున్నారు. ఇదొక శుభలక్షణంగా నేను భావిస్తున్నాను. మార్చి 8న మహిళా దినోత్సవం జరుపుకోబోతున్న సందర్భంలో మనందరిదీ ఒకటే భావన-
"మహిళ ఒక స్వయం శక్తి, ఆమె భారతీయ నారి. ఏ మాత్రం ఎక్కువ తక్కువలు లేకుండా ఆమెకు అందరితో సరిసమానమైన అధికారం ఉంది."
ప్రియమైన నా దేశ వాసులారా, ‘మనసులో మాట’ కార్యక్రమం ద్వారా అప్పుడప్పుడూ మీ అందరితో ఏదో ఒకటి మాట్లాడే అవకాశం నాకు దొరుకుతోంది. మీరంతా కూడా చురుకుదనంతో తోడవుతున్నారు. మీ వద్ద నుండి నేనెంతో తెలుసుకుంటున్నాను. ఏం జరుగుతోంది, పల్లెల్లో, పేదవారు మనసుల్లో ఏమనుకుంటున్నారో నాదాకా వస్తోంది. మీ ఈ సహకారానికి మీకు నేనెంతో ఋణపడి ఉంటాను. అనేకానేక ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం! జనవరి 26 న గణతంత్ర దినోత్సవాన్ని దేశమంతటా మనమందరం ఎంతో ఉత్సాహంతో ఘనంగా జరుపుకున్నాం. భారత రాజ్యాంగం, దేశప్రజల కర్తవ్యం, దేశ ప్రజల అధికారాలు, ప్రజాస్వామ్యం పట్ల మన అంకితభావం, ఇవన్నీ ఒకరకంగా మన దేశ సంస్కారాలకు జరిగే పండుగ వంటిది. ఇది ముందు తరాలను ప్రజాస్వామ్యం తాలూకూ బాధ్యతల పట్ల జాగరూకులను చేస్తుంది, సంస్కరిస్తుంది.
కానీ ఇప్పటికీ మన దేశంలో ప్రజల బాధ్యతలు, అధికారాల పట్ల ఎంత లోతుగా, ఎంత సమగ్రంగా చర్చ జరగాల్సి ఉందో అది ఇంతవరకూ జరగటం లేదు. ప్రతి స్థాయిలోనూ, ఎల్లప్పుడూ, ఎంత బలం అధికారానికి ఇస్తామో అంతే శక్తిని కర్తవ్యాలకు కూడా ఇవ్వాలని నేను ఆశిస్తున్నాను. అధికారం, కర్తవ్యం అనే రెండు పట్టాల పైనే మన భారత రాజ్యాంగపు రైలు వేగంగా ముందుకు నడవగలదు.
రేపు జనవరి 30 మన పూజ్య బాపూజీ పుణ్య తిధి. జనవరి 30 న ఉదయం పదకొండు గంటలకు రెండూ నిమిషాల మౌనం పాటించి, దేశం కోసం ప్రాణాలర్పించిన అమరవీరులకు మనం శ్రధ్ధాంజలి అర్పిస్తాము. సమాజపరంగా, దేశపరంగా ఇది సహజ ప్రవర్తన కావాలి. రెండు నిమిషాలైనా కూడా అందులో సమైక్యత, సంకల్పం, అమరవీరుల పట్ల శ్రద్ధ ప్రకటితమౌతాయి.
మన దేశంలో సైన్యం, రక్షణ బలగాల పట్ల ఒక సహజమైన ఆదరణ ప్రకటితమౌతుంది. ఈ గణతంత్ర దినోత్సవ ఉదయాన విభిన్న పురస్కారాలతో ఎవరైతే వీరజవానులు గౌరవింపబడ్డారో వారి కుటుంబసభ్యులందరినీ నేను అభినందిస్తున్నాను. ఈ పురస్కారాలలో కీర్తి చక్ర, శౌర్య చక్ర, పరమ విశిష్ఠ సేవా పతకం, విశిష్ఠ సేవా పతకం మొదలైన అనేక రకాలున్నాయి. నేను ముఖ్యంగా యువకులకు చెప్పదలచుకున్నదేమిటంటే సామాజిక మాధ్యమంలో మీరంతా చాలా ఉత్సాహంగా ఉంటున్నారు. మీరొక పని చెయ్యగలరా? ఈసారి ఎవరెవరైతే వీరపురస్కారాలు అందుకున్నారో- మీరు అంతర్జాలంలో వెతకండి, వారికి సంబంధించిన నాలుగు మంచిమాటలు రాసి, మీ స్నేహితులందరికీ పంపించండి. వాళ్ళ వీరత్వం, సాహసపరాక్రమాలను బాగా అర్థం చేసుకున్నప్పుడు మనకు ఆశ్చర్యమే కాకుండా గర్వంతో పాటూ ప్రేరణ కూడా లభిస్తుంది.
జనవరి 26 న మనం ఒకవైపు ఘనంగా, ఉత్సాహాలతో ఉన్న సమయంలో కాశ్మీరులో మన సైన్యం జవానులు దేశ రక్షణలో నిమగ్నమై ఉన్నారు. మంచుచరియలు విరిగిపడడంతో వారంతా వీరమరణం పొందారు. ఈ వీర జవానులందరికీ ఆదరపూర్వక శ్రధ్ధాంజలి ఘటిస్తూ ప్రణమిల్లుతున్నాను.
నా యువమిత్రులారా, మీ అందరికీ బాగా తెలుసు, నేను మనసులో మాట నిరంతరం చెప్తూ ఉంటాను. జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ నెలలన్నీ ప్రతి కుటుంబంలోనూ పరిక్షా సమయాలు. ఇంట్లో ఒకరిద్దరు పిల్లలకు పరీక్షలు ఉన్నా, ఇంటిలో అందరిపై ఆ పరీక్షాభారం ఉంటుంది. విద్యార్థి మిత్రులతోనూ, వారి ఉపాధ్యాయులతోనూ, వారి గురువులతోనూ మాట్లాడటానికి ఇదే సరైన సమయం అని నాకు తోచింది. ఎందుకంటే కొన్నేళ్ళ నుంచీ నేనెక్కడికి వెళ్ళినా, ఎవరిని కలిసినా, ఈ పరీక్షలు పెద్ద సమస్యగా కనిపించాయి. కుటుంబం , విద్యార్ధులూ, అధ్యాపకులూ అందరూ కలవరపడుతూ కనబడతారు. ఒక పెద్ద విచిత్ర మానసిక వాతావరణం ప్రతి ఇంట్లోనూ కనబడుతుంది. ఇందులోంచి అందరూ బయటకు రావాలని నాకెప్పుడూ అనిపించేది. అందుకనే నేను ఇవాళ యువమిత్రులతో వివరంగా మాట్లాడాలనుకుంటున్నాను. ఈ విషయాన్ని నేను ప్రకటించినప్పుడు అనేకమంది అధ్యాపకులు, సంరక్షకులు, విద్యార్థులు నాకు సందేశాలు, ప్రశ్నలు, సలహాలు పంపించారు. బాధనూ, ఆవేదననూ వ్యక్తం చేసారు. వాటిని చూశాక నా మనసులో వచ్చిన ఆలోచనను ఇవాళ పంచుకోవాలనుకుంటున్నాను. సృష్టి నుండి నాకొక టేలీఫోన్ సందేశం వచ్చింది. మీరు వినండి, సృష్టి ఏం చెప్తోందో "సార్, మీతో నేను ఏం చెప్పాలనుకున్నానంటే, పరీక్షల సమయంలో మా ఇంట్లో, ఇరుగుపొరుగు ఇళ్ళల్లో, మన సమాజంలో ఒక భయానకమైన వాతావరణం నెలకొంటుంది. ఈ కారణంగా విద్యార్థులు ప్రేరణ కన్నా నిరుత్సాహితులౌతారు. అందుకని, ఇలాంటి వాతావరణం ఆనందకరంగా ఉండలేదా అని నేనడగదలుచుకున్నాను"
ఈ ప్రశ్న సృష్టి మాత్రమే వేసింది కానీ మీ అందరి మనసుల్లో కూడా ఇదే ప్రశ్న ఉండిఉంటుంది. పరిక్షాసమయమనేది ఆనందకర సందర్భంగా ఉండాలి. ఏడాది మొత్తం కష్టపడి చదివినది చెప్పడానికి ఇప్పుడు అవకాశం వచ్చింది, ఇలాంటి ఆశా,ఉత్సాహాల సందర్భం ఇది అవ్వాలి. పరీక్షలు ఆనందకరంగా కొందరికే ఉంటాయి. చాలామందికి అది ఒక ఒత్తిడి. దీనిని మీరు ఒత్తిడిగా మార్చుకుంటారో, లేక ఆనందకరంగా మార్చుకుంటారో అన్న నిర్ణయం మీదే. ఆనందకరంగా అనుకున్నవారు లాభపడతారు. ఒత్తిడిగా అనుకున్నవారు బాధపడతారు. అందువల్ల పరిక్షలనేవి ఒక ఉత్సవం వంటిదని నా ఉద్దేశం. పరీక్షలను పండుగలుగా భావించండి. పండుగ, ఉత్సవము ఉన్నప్పుడు మనలో ఉన్న అత్యుత్తమ సత్తా బయటకు వస్తుంది. మన సమాజశక్తి కూడా ఉత్సవ సమయంలోనే వ్యక్తమౌతుంది. ఏది అత్యుత్తమమో అదే ప్రకటితమౌతుంది. సాధారణంగా మనం ఎంతో క్రమశిక్షణారహితంగా ఉన్నామని అనుకుంటాం. కానీ, నలభై-నలభై ఐదు రోజుల పాటు జరిగే కుంభ మేళాలాంటి సందర్భాలలో జరిగే ఏర్పాట్లు చూస్తే క్రమశిక్షణ అవసరానుకూలంగా ఎలా వస్తుందో, ప్రజల్లో ఎంత క్రమశిక్షణ ఉందో తెలుస్తుంది. ఇది ఉత్సవశక్తి. పరీక్షల్లో కూడా కుటుంబమందరిలో, మిత్రులందరి మధ్యా, ఇరుగుపొరుగు వారి మధ్యా ఒక ఉత్సాహవాతావరణం ఏర్పడాలి. మీరు చూడండి ఆ వత్తిడి ఆనందంగా మారిపోతుంది. ఉత్సవభరిత వాతావణం పరీక్షాభారాన్ని తొలగిస్తుంది. అందువల్ల నేను తల్లిదండ్రులందరికీ చెప్పదలుచుకున్నదేమిటంటే, మీరు ఈ మూడు నాలుగు నెలల సమయాన్నీ ఉత్సాహభరితమైన వాతావరణంగా మార్చండి. పరివారం మొత్తం ఒక జట్టుగా ఏర్పడి ఒక ఉత్సవాన్ని సఫలం చెయ్యడం కోసం తమతమ వంతు పాత్రల్ని ఉత్సాహవంతంగా పోషించాలి. చూస్తూండగానే మార్పు వచ్చేస్తుంది. వాస్తవం ఏమిటంటే, కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకూ , కచ్ నుండి కామ్ రూప్ వరకూ , అమ్ రేలీ నుండి అరుణాచల్ ప్రదేశ్ వరకూ ఈ మూడు నాలుగు నెలలూ పరీక్షలే పరీక్షలు. ఇది మనందరి బాధ్యత. ప్రతి ఏడాదీ ఈ మూడు నాలుగు నెలలూ మన విధానాల ద్వారా, మన పధ్ధతుల ద్వారా, మన కుటుంబ పరిస్థితులకు అనుగుణంగానూ ఈ ఉత్సవంలో మార్పును తేవడం మనందరి బాధ్యత. అందుకే మీ అందరితో "స్మైల్ మోర్, స్కోర్ మోర్" అంటాను నేను. ఎంత ఎక్కువ సంతోషంగా కాలాన్ని గడుపుతారో, అంతే ఎక్కువ మార్కులు సంపాదించగలుగుతారు. చేసి చూడండి. మీరు గమనించే ఉంటారు, మీరెంత ఆనందంగా ఉంటారో, ఎంత ఎక్కువగా నవ్వుతారో, అంత ఎక్కువగా సేదతీరుతారు. మీరు ఎంత సహజంగా విశ్రాంతి పొందితే, అంత ఎక్కువగా జరిగిన విషయాలు మీకు గుర్తుకు వస్తాయి. ఏడాది క్రితం క్లాస్ రూమ్ లో ఉపాధ్యాయులు ఏం చెప్పారో మొత్తం గుర్తుకు వస్తుంది. మీరు తెలుసుకోవలసిన మరో విషయం ఏమిటంటే, రిలాక్స్ అవ్వడమే జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే మరో గొప్ప విధానం. మీరు ఉద్రిక్తతతో ఉంటే అన్ని తలుపులూ మూసుకుపోతాయి. బయట విషయం లోపలికి వెళ్లదు, లోపలి సంగతి బయటకు రాదు. ఆలోచనావిధానం మందగిస్తుంది. అది ఒక భారమైపోతుంది. మీరు గమనించే ఉంటారు, పరీక్షల్లో మీకు అంతా గుర్తుకువస్తుంది. పుస్తకం, అధ్యాయం, పేజీ నంబరు గుర్తుకువస్తాయి. పేజీలో పైన రాసి ఉందో, క్రింద రాసి ఉందో కూడా గుర్తుకువస్తుంది కానీ రాయాల్సిన పదం మాత్రం గుర్తుకురాదు. పరీక్ష రాసి హాలు బయటకు వచ్చిన తరువాత, ’అరే..ఇదే పదం కదా’ అని అప్పుడు గుర్తుకు వస్తుంది. వత్తిడి వల్ల పరీక్షహాలులో గుర్తుకు రాలేదు. బయటకు రాగానే ఎలా గుర్తుకు వచ్చింది? మీరే కదా? ఎవరూ చెప్పలేదు కూడా. మరెలా గుర్తుకు వచ్చింది? లోపల ఉన్నది వెంఠనే ఎందుకు గుర్తుకు వచ్చిందంటే మీరా వత్తిడి నుండి బయటకు వచ్చేశారు. అందుకని, జ్ఞాపకశక్తిని పెంపొందించుకునే గొప్ప ఔషధం ఏదన్నా ఉంటే అది రిలాక్స్ అవ్వడమే. నా స్వీయ అనుభవం ద్వారా నేను చెప్పేదేమిటంటే, ఒకవేళ వత్తిడి ఉంటే మన విషయాలు మనమే మర్చిపోతాము. కానీ రిలాక్స్ అయినప్పుడు మాత్రం ఊహించలేని విధంగా ఎంతో పనికొచ్చే విషయాలు మనకు గుర్తుకు వచ్చేస్తాయి. మీ దగ్గర జ్ఞానం లేక కాదు. సమాచారం లేక కాదు, పరిశ్రమ లేకా కాదు. వత్తిడి ఉన్నప్పుడు మీ జ్ఞానం, మీకు తెలిసిన విషయాలు ఆ ఒత్తిడి క్రింద నలిగిపోతాయి. అందువల్ల ‘A happy mind is the secret for a good mark-sheet’ అన్నది ముఖ్యం. అప్పుడప్పుడు ఏమనిపిస్తుందంటే మనం సరైన దృష్టితో పరీక్షని చూడలేకపోతాం. అదొక జీవనమరణ సమస్యగా అనిపిస్తుంది. మీరు రాయబోయే పరీక్ష, మీరు సంవత్సరమంతా చదివిన చదువుకి పరీక్ష. అది జీవిత పరీక్ష కాదు. మీరు ఎలా జీవించారో, ఎలా జీవిస్తున్నారో, ఎలా జీవించాలనుకుంటున్నారో అన్నదానికి పరీక్ష కాదు. క్లాస్ రూమ్ లో నోట్ బుక్ ద్వారా ఇచ్చే పరీక్షలే కాకుండా
మీ జీవితంలో ఇంకా ఎన్నో పరీక్షలు ఎదుర్కొని ఉంటారు. అందుకని, పరిక్షలనేవి జీవితంలోని గెలుపు ఓటములతో సంబంధం ఉన్నవనే అపోహలోంచి బయట పడండి. మన పూర్వ రాష్ట్రపతి ఏ.పి.జె.అబ్దుల్ కలాం గారి గొప్ప ఉదాహరణ మనందరి కళ్ళ ముందరా ఉంది. ఆయన వాయుసేనలో చేరాలనుకున్నారు. విఫలమయ్యారు. ఆ విఫలం కారణంగా ఆయన నిరుత్సాహపడిపోయి జీవితంలో ఓడిపోతే భారతదేశానికి ఇంత పెద్ద శాస్త్రవేత్త లభ్యమయ్యేవారా? ఇంత గొప్ప రాష్ట్రపతి దొరికేవారా? దొరికేవారు కాదు. ఎవరో రుచా ఆనంద్ గారు నాకొక ప్రశ్న పంపించారు-
"ఈ కాలంలో విద్యాపరంగా నే చూసే అతిపెద్ద సవాలు ఏమిటంటే, విద్యార్జన అనేది పరీక్షా కేంద్రితమైపోయింది. మార్కులే అన్నింటికన్నా ముఖ్యమైపోయాయి. ఇందుమూలంగా ప్రతిస్పర్థలు పెరిగిపోతున్నాయి. విద్యార్థులలో ఒత్తిడిభావం కూడా బాగా పెరిగిపోయింది. అందువల్ల విద్యార్జనలోని ప్రస్తుత దిశ, దాని భవిష్యత్తు విషయమై మీ ఆలోచనను తెలుసుకోవాలనుకుంటున్నాను."
వారి ప్రశ్నలోనే జవాబు ఉంది. కానీ రుచా గారూ నా అభిప్రాయం కూడా తెలుసుకోవాలనుకున్నారు. మార్కులు, మార్కుల జాబితా కి ఒక పరిమితమైన ఉపయోగాలున్నయి. జీవితంలో అదే సర్వస్వం కాదు. మీరెంత జ్ఞానం సంపాదించారో అన్నదానిపై మీ జీవితం ఆధారపడి ఉంటుంది. మీరు సంపాదించుకున్న జ్ఞానాన్ని మీ జీవితం నిలబెట్టుకోవడానికి ఎలా ఉపయోగించుకున్నారు అన్న విషయంపై మీ జీవితం గడుస్తుంది. జీవితంలో - మీరు చెయ్యాల్సింది, జీవితంలో చెయ్యాలనుకున్నది అన్న రెండు విషయాలూ ఒకదానికొకటి సహకరిస్తున్నాయా లేదా అన్న విషయం పట్ల ధ్యాస ఉంచితే, మార్కుల సమస్య తోక ముడుచుకుని మీ వెంటే ఉంటుంది. అప్పుడు మార్కుల వెనకాల పరిగెత్తాల్సిన అవసరం మీకు ఉండదు. జీవితంలో మీకు జ్ఞానం, నైపుణ్యం, ఆత్మవిశ్వాసం, సంకల్ప శక్తి పనికివస్తాయి. మీరే చెప్పండి, మీ కుటుంబం అంతా చూపించుకునే ఒక ఫ్యామిలీ డాక్టర్ మీకూ ఉండే ఉంటారు కదా.. ఆ ఫ్యామిలీ డాక్టర్ ని కూడా ఆయన ఎన్ని మార్కులతో పాసయ్యారు అని మీరెప్పుడూ అడిగి ఉండరు. ఎవ్వరూ అడిగిఉండరు. ఆయనొక మంచిడాక్టర్. మీకు ఆయన వల్ల లాభం కలుగుతోంది అని ఆయన సేవలను మీరు అందుకుంటున్నారు. మీరేదన్నా పెద్ద కేసు కోసమై ఎవరైనా పెద్ద వకీలు దగ్గరకు వెళ్ళినప్పుడు ఆయన మార్కు షీట్ మీరు చూస్తారా? మీరు ఆయన అనుభవాన్ని, జ్ఞానాన్ని, ఆయన ఎంత ప్రయోజకుడో చూస్తారు. అందుకని ఈ సంఖ్యల భారమేదైతే ఉందో అది కూడా మనల్ని కొన్నిసార్లు సరైన మార్గంలో వెళ్ళనివ్వదు. అయితే దీని అర్థం ఇంక చదవద్దు ఆపేయండని నేను అనడం లేదు. మీ పరీక్షల కోసం దాని అవసరం తప్పకుండా ఉంది. నిన్న నేనెలా ఉన్నాను, ఈరోజెక్కడ ఉన్నాను అన్నది తెలుసుకోవడానికి పరీక్షలు అవసరం. అప్పుడప్పుడు మీరు మీ జీవితాన్ని నిశితంగా పరిశీలిస్తే, మార్కుల కోసం పరిగెడితే, మీరు అడ్డదారులే వెతుకుతారు. కావాల్సినవి మాత్రమే చూస్తారు.వాటి మీదే దృష్టి పెడతారు. కానీ మీరు అనుకున్నవి కాకుండా వేరే ప్రశ్నలు వచ్చినప్పుడు, మీరు చదువుకున్న ప్రశ్నోత్తరాలు కాకుండా వేరే ప్రశ్నలు వచ్చినప్పుడు మీరు ఒక్కసారిగా నిరుత్సాహపడిపోతారు. అలా కాకుండా మీరు జ్ఞానంపై మీ దృష్టిని కేంద్రీకరిస్తే, చాలా విషయాలను అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చేస్తారు. అలా కాక మార్కులపై దృష్టి పెడితే, మార్కుల కోసం మీకు మీరే ఒక పరిధి ఏర్పరుచుకుని అందులో నెమ్మదినెమ్మదిగా సంకుచితమౌతారు. అందువల్ల ఏం జరుగుతుందంటే, పరీక్షల్లో బాగా రాణించినా, జీవితంలో అప్పుడప్పుడు విఫలమయ్యే అవకాశం ఉంది.
రుచా గారూ ’ప్రతిస్పర్థ ’ అనే పదాన్ని కూడా వాడారు. ఇది ఒక పెద్ద మానసిక యుధ్ధం. నిజం చెప్పాలంటే, జీవితాన్ని ముందుకు నడిపించడానికి ప్రతిస్పర్ధ పనికిరాదు. జీవితాన్ని ముందుకు నడిపించడానికి అనుస్పర్ధ పనికివస్తుంది. అనుస్పర్ధ అంటే నీతో నువ్వే పోటీ పడడం. గడిచిన కాలం కన్నా రాబోయే కాలం బాగుండాలంటే ఎలా? జరిగిపోయిన పరిణామాల కన్నా రాబోయే అవకాశాలు బావుండాలంటే ఏం చెయ్యాలి? క్రీడాప్రపంచంలో మీరు తరచూ చూసే ఉంటారు. మీకు వెంఠనే అర్థమౌతుందని నేను క్రీడా ప్రపంచంలోని ఉదాహరణలు ఇస్తూ ఉంటాను. చాలావరకూ మేటి క్రీడాకారుల జీవితంలోని ప్రత్యేకత ఏమిటంటే వారు తమతో తామే పోటీ పడతారు. సచిన్ టేండుల్కర్ గారి ఉదాహరణనే తీసుకుందాం.. ఇరవై ఏళ్ళుగా తన రికార్డును తానే అధిగమిస్తూ, తనను తానే ప్రతిసారీ ఓడించి ముందుకు వెళ్ళడం అనేది ఒక అద్భుత జీవన యాత్ర. ఎందుకంటే, ఆయన ప్రతిస్పర్థ కన్నా అనుస్పర్థ మార్గాన్ని ఎంఛుకున్నారు.
మిత్రులారా, జీవితం లోని ప్రతి రంగంలోనూ, మీరు పరీక్షకు వెళ్ళేప్పుడు కూడా, రెండు గంటలు ముందుగా ప్రశాంతంగా చదువుకోగలిగే సమయాన్ని మూడు గంటలు దాకా మీరు చెయ్యగలరా? ఇంతకు ముందు లేవాలనుకుని నిర్ణయించుకున్న సమయానికి లేవలేకపోయేవారు. ఇప్పుడు నిర్ణీతసమయానికి లేవగలుగుతున్నారా? ఇంతకు ముందు పరీక్షా వత్తిడికి నిద్ర పట్టేది కాదు, ఇప్పుడు పడుతోందా? అని మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరే గమనిస్తారు. పోటీతత్వం పరాజయాన్నీ,నిరాశనీ, ఈర్ష్యనీ పుట్టిస్తుంది . కానీ స్వీయపోటీ ఆత్మమధనాన్నీ, ఆత్మ చింతననీ పుట్టిస్తుంది. సంకల్ప శక్తిని బలపరుస్తుంది. మిమ్మల్ని మీరే ఓడించినప్పుడూ ఇంకా ఇంకా ముందుకు వెళ్ళాలనే ఉత్సాహాం తనకు తానే జనిస్తుంది. మరే ఇతర అధికశక్తి అవసరం రాదు. దానంతట అదే లోపల్లోపలే ఆ శక్తిని పుట్టిస్తుంది. సులువుగా చెప్పాలంటే, మీరు ఎవరితోనైనా పోటీ పడుతూంటే మూడు ముఖ్యమైన అంశాలు కనబడతాయి. అవేమిటంటే, మొదటిది- మీరు ఎదుటివారి కంటే మెరుగైనవారు. రెండు, మీరు ఎదుటివారి కంటే చాలా తక్కువవారు లేదా వారితో సమానమైన వారు. ఒకవేళ మీరు మెరుగైనవారైతే పట్టించుకోరు, అత్యంత ఆత్మవిశ్వాసంతో ఉంటారు.ఒకవేళ మీరు ఎదుటివారి కంటే తక్కువవారైతే నిరాశతోనూ, దు:ఖంతోనూ, ఈర్ష్య తోనూ నిండిపోతారు. ఆ ఈర్ష్య మీలో మిమ్మల్ని తినేస్తుంది. ఒకవేళ మీరు సమానమైన పోటీదారులైతే మెరుగుపడే అవసరం ఉందని మీరు అనుకోరు. బండి ఎలా నడుస్తొందో అలానే నడిపించేస్తారు. అందువల్ల నేను మీకు చెప్పేదేమిటంటే, స్వీయపోటీ నే చెయ్యమని. ఇప్పటివరకు ఏమి చేసాను? ఇకపై ఎలా చేస్తాను? ఇంకా బాగా ఎలా చేస్తాను? అని ఆలోచించి చూడండి. మీలో మీకు చాలా మార్పు కనబడుతుంది.
ఎస్.సుందర్ గారు సంరక్షకుల విషయంలో వారి అభిప్రాయాలను తెలియచేసారు. ఆయనేమన్నారంటే, పరీక్షల్లో సంరక్షకుల పాత్ర ఎంతో ముఖ్యమైనది. ఆయన ఏం రాశారంటే - " నా తల్లి ఎక్కువ చదుదుకోలేదు. కానీ నా వద్ద కూర్చుని నన్ను లెఖ్ఖలు చెయ్యమని అడిగేది. నా సమాధానాలు సరిచూసి నాకు సహకరించేది. తప్పులు దిద్దేది. నా తల్లి పదవ తరగతి పాసవ్వలేదు కానీ ఆవిడ సహకారం లేకుండా సి.బి.ఎస్.ఇ ఈ పరీక్షలు పాసయ్యేవాణ్ణి కాదు."
సుందర్ గారూ, మీరన్నది నిజమే. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు. నన్ను ప్రశ్నించేవారు, సలహాలిచ్చేవారిలో మహిళలే అధికంగా ఉన్నారు. ఎందుకంటే, ఇంట్లో పిల్లల భవిష్యత్తు విషయంలో తల్లులలో ఉండే సహజమైన ఆసక్తి, క్రియాశీలత మొదలైనవాటితో వారు చాలా విషయాలను సులభతరం చెయ్యగలరు. సంరక్షకులకు నేను చెప్పేదల్లా ఏమిటంటే మూడు విషయాలపై దృష్టి పెట్టండి. స్వీకరించడం, నేర్పించడం, సమయాన్ని ఇవ్వడం. ఉన్నదానిని స్వీకరించండి. మీవద్ద ఎంత సామర్ధ్యం ఉందో దాన్ని ఉపయోగించండి. మీరెంత పనిలో ఉన్నా, సమయాన్ని కేటాయించండి. ఒక్కసారి మీరు స్వీకరించడం నేర్చుకుంటే, ముఖ్యమైన సమస్యలు అక్కడితో సమాప్తమైపోతాయి. సమస్య మూలాల్లోనే సంరక్షకుల, అధ్యాపకుల నమ్మకం ఉంటుంది. ప్రతి సంరక్షకుడికీ ఇది అనుభవమే. సమస్యల తాలూకూ సమాధానాల మార్గాలు స్వీకరణ ద్వారానే తెరుచుకుంటాయి. ఆకాంక్షలు దారుల్ని కష్టతరం చేస్తాయి. పరిస్థితిని స్వీకరించడమే కొత్త మార్గాలను తెరిపిస్తుంది. అందువల్ల, ఉన్నదానిని స్వీకరించండి. మీరు కూడా భారవిముక్తులౌతారు. మనం చిన్నపిల్లల స్కూలుబ్యాగ్ ల బరువు గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. కానీ నాకేమనిపిస్తుందంటే, అప్పుడప్పుడు సంరక్షకుల ఆకాంక్షలు, ఆశలు, పిల్లల స్కూలు బ్యాగుల కన్నా బరువెక్కిపోతాయి.
చాల ఏళ్ళ క్రితం మాట - మాకు బాగా తెలిసిన వ్యక్తి గుండెపోటుతో ఆసుపత్రిలో ఉన్నారు. అప్పుడు మన భారతదేశ లోక్ సభ మొదటి స్పీకర్ గణేశ్ దాదా మావలంకర్ , వారి కుమారుడు, ఒకప్పటి ఎం.పి పురుషోత్తమ్ మావలంకర్, ఆసుపత్రిలో చూడడానికి వచ్చారు. నేనప్పుడు అక్కడ ఉన్నాను. వచ్చినాయన రోగి ఆరోగ్యం గురించి ఒక్క ప్రశ్న కూడా వెయ్యలేదు. వస్తూనే ఆయన కూచుని, అక్కడి పరిస్థితులను కానీ, రోగమెలా ఉందని కానీ, రోగి ఆరోగ్యం గురించి గానీ ఏమీ మాట్లాడలేదు కానీ ఛలోక్తులు విసరడం మొదలుపెట్టారు. రెండు నిమిషాల్లో అక్కడి వాతావరణం మొత్తాన్ని తేలిక పరిచారు. ఒకవిధంగా చెప్పాలంటే, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని కలిసినప్పుడు మనం వారిని రోగం పేరుతో భయపెట్టేస్తాం. సంరక్షకులతో నేను చెప్పదలుచుకున్నదేమిటంటే, అప్పుడప్పుడు మనం కూడా పిల్లలతో ఇలాగే ప్రవర్తిస్తాం. పరీక్షరోజుల్లో పిల్లలకి నవ్వుతూ సరదాగా ఉండే పరిస్థితిని కల్పించాలని మీకెప్పుడైనా అనిపించిందా? అలా చేసి చూడండి, వాతావరణం మారిపోతుంది.
ఒక చిత్రమైన ఫోన్ కాల్ వచ్చింది నాకు. ఆయన తన పేరుని చెప్పదలుచుకోలేదు. విషయం విన్నాక ఆయన ఎందుకు పేరు చెప్పదలుచుకోలేదో మీకు అర్థమౌతుంది.
"నమస్కారం ప్రధానమంత్రి గారూ. నా పేరు నేను చెప్పదలుచుకోలేదు.నా చిన్నతనంలో నేను చేసిన పని అలాంటిది. చిన్నప్పుడు ఒకసారి నేను చూసిరాయడానికి ప్రయత్నించాను. అందుకోసం నేను చాలా ప్రయత్నాలు చెయ్యడం మొదలెట్టాను. దాని పద్ధతులు వెతకడానికి ప్రయత్నించాను. దానివల్ల నా సమయం చాలా వృధా అయిపోయింది. బుర్ర పెట్టి ఎంత సమయాన్నైతే చూసిరాయడానికి ప్రయత్నాలు చేశానో, ఎంత సమయాన్ని వృధా చేశానో అదే సమయాన్ని నేను బాగా చదువుకోవడానికి వాడుకుని ఉంటే, అవే మార్కులు సంపాదించి ఉండేవాణ్ణి. అంతేకాక చూసిరాయడానికి ప్రయత్నించినందువల్ల నేను పట్టుబడడమే కాకుండా, నావల్ల నా చుట్టూ ఉన్న మిత్రులకు కూడా చాలా ఇబ్బంది ఎదురైంది."
మీ మాట నిజమే. ఈ అడ్డదారులు ఏవైతే ఉన్నాయో, అవి చూసిరాయడానికి కారణాలయిపోతాయి. అప్పుడప్పుడు మనపై మనకి నమ్మకం లేని కారణంగా పక్కవాడి పేపర్లో చూసిరాయాలని, నేను రాసింది సరైనదా కాదా అని నిర్ధారణ చేసుకోవాలనీ అనిపిస్తుంది. ఒకోసారి మనం సరిగ్గా రాసినా, పక్కవాడు తప్పు రాయడం వలన దాన్ని నమ్మి మోసపోతూ ఉంటాము. అందువల్ల చూసి రాయడం ఎప్పుడూ కూడా ఉపయోగపడదు. ‘To cheat is to be cheap, so please, do not cheat’ I చూసిరాయడం మిమ్మల్ని చెడ్డవారిని చేస్తుంది. అందుకని చూసిరాయకండి. మీరు ఎప్పటికీ చూసిరాయకండి, చూసిరాయకండి అని వినేఉంటారు . నేనూ మళ్ళీ మీకు అదే మాట చెప్తున్నాను. చూసిరాతను మీరు ఏ విధంగా చూసినా అది జీవితాన్ని విఫలం చేసే మార్గం వైపు మిమ్మల్ని ఈడ్చుకుపోతుంది. పరీక్షహాలులో పట్టుబడిపోతే మీ జీవితం సర్వం నాశనమౌతుంది. ఒకవేళ మీరు పట్టుబడకపోతే జీవితపర్యంతం నేను ఇలా చేసాననే అపరాధభావం మీ మనసులో నిలిచిపోవడమే కాకుండా; మీ పిల్లలకు మీరు చెప్పాల్సి వచ్చినప్పుడు మీరు వారి కళ్ళల్లోకి సూటిగా చూసి మాట్లాడలేరు. ఒకసారి చూచిరాతకు అలవాటు పడిపోతే జీవితంలో ఏదైనా నేర్చుకోవాలనే తపన ఎప్పటికీ ఉండదు. అప్పుడు మీరు ఎంతవరకు వెళ్లగలరు?
ఒకవేళ మీరు కూడా మీ దారులను గోతిలోకి మళ్ళిస్తున్నట్లయితే, నేను చూసినదేమిటంటే, చూసిరాయడానికి కొత్త పధ్ధతులు వెతకడంలో కొందరు ఎంత ప్రతిభను ఉపయోగిస్తారంటే, ఎంత పెట్టుబడి పెడతారంటే, తమ పూర్తి సృజనాత్మకతను చూసిరాయడం యొక్క పధ్ధతుల కోసం ఖర్చు పెట్టేస్తారు. అదే సృజనాత్మకతను, అదే సమయాన్ని పరీక్ష విషయాలపై పెడితే, అసలు చూసిరాసే అవసరమే ఉండదు. తమ సొంత కష్టంతో ఏ పరిణామం లభిస్తుందో, దానివల్ల పెరిగే ఆత్మవిశ్వాసం అద్భుతంగా ఉంటుంది.
ఒక ఫోన్ కాల్ వచ్చింది: "నమస్కారం ప్రధానమంత్రిగారూ! నా పేరు మోనిక. నేను పన్నెండవ తరగతి విద్యార్థిని. నేను పన్నెండవ తరగతి విద్యార్థినిని కాబట్టి బోర్డ్ ఎగ్జామ్స్ విషయమై నేను మిమ్మల్ని రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నాను. నా మొదటి ప్రశ్న ఏమిటంటే, ఏం చేస్తే పరీక్షా సమయంలో పెరిగే వత్తిడి తగ్గుతుంది? రెండవ ప్రశ్న ఏమిటంటే, పరీక్షలన్నీ కూడా విషయం, పని గురించే ఉంటాయి కానీ ఆటల గురించి ఎందుకు ఉండవు? ధన్యవాదాలు"
పరీక్షా రోజుల్లో నేను మీతో ఆటపాటల విషయాలు మాట్లాడితే, పరీక్షా సమయంలో పిల్లలను ఆడుకొమ్మని చెప్తున్నాడు..ఏం ప్రధానమంత్రండీ? అని మీ గురువులు, మీ తల్లిదండ్రులు నన్ను కోప్పడతారు. ఎందుకంటే విద్యార్థులు ఆటపాటలపై దృష్టి పెడితే చదువు పట్ల ధ్యాస తగ్గిపోతుందని సాధారణంగా అనుకుంటారు. అసలీ ఆలోచనాధోరణే తప్పు. అసలు సమస్య అది కాదు. పరిపూర్ణ వికాసం జరగాలంటే పుస్తకాల బయట కూడా ఒక విశాలమైన జీవితం ఉంటుంది. దానిని కూడా జీవించి, నేర్చుకోవడానికీ ఇదే సమయం. ముందర పరీక్షలన్నీ రాసేసి తర్వాత ఆడుకుంటాను, అది చేస్తా, ఇది చేస్తా అంటే అది జరిగే పని కాదు. ఇదే జీవితాన్ని మలిచే సమయం.దీన్నే పెంపకం అంటారు. నిజానికి నా దృష్టిలో పరీక్షల్లో మూడు విషయాలు చాలా ముఖ్యమైనవి. ఒకటి - సరైన విశ్రాంతి, రెండవది - శరరానికి అవసరమైనంత నిద్ర, మూడవది మెదడుకి పనే కాకుండా శరీరానికి కూడా ముఖ్యమే. శరీరంలోని మిగిలిన భాగాలకు కూడా చురుకుదనం అవసరం. ఎప్పుడైనా ఆలోచించారా? మన ఎదురుగా ఇంత ఉన్నప్పుడు, రెండు నిమిషాలు బయటకు వచ్చి ఆకాశం వంక చూసి, చెట్లచేమల వైపు చూసి , కాస్త మనసుని తేలిక చేసుకుంటే , మీరు మళ్ళీ మీ గదిలోకి పుస్తకాల ముందుకి వచ్చినప్పుడు ఎంత ఉత్సాహపడతారో మీరు చూడండి! మీరు ఏం చేస్తున్నా సరే ఒక బ్రేక్ తీసుకోండి. లేచి వంటింట్లోకి వెళ్ళండి. మీ కిష్టమైన వస్తువునో, బిస్కెట్ నో వెతకి తినండి. కాస్త సరదా కాలక్షేపం చేయండి. కనీసం ఐదు నిమిషాలైనా బ్రేక్ ఇవ్వండి. మీ పని సులువౌతోందని మీకు తెలుస్తుంది. అందరికీ ఇది నచ్చుతుందో లేదో తెలీదు కానీ ఇది నా అనుభవం. ఇలాంటి సమయంలో గాఢంగా ఊపిరి తీసుకోవడం చాలా ఉపయోగకరం. గాఢంగా ఊపిరి తీసుకోవడానికి గదిలోనే ఉండక్కర్లేదు. కాస్త ఆకాశం కనబడేలా ముంగిట్లోకో, డాబా మీదకో వెళ్ళి ఐదు నిమిషాలు గాఢంగా ఊపిరి తీసుకుని మళ్ళీ చదువుకోవడానికి కూర్చోండి. శరీరమంతా ఒక్కసారిగా మీరు పొందిన విశ్రాంతి మెదడుని కూడా అంతే సేద తీరుస్తుంది. కొందరికి రాత్రంతా మేల్కొంటే ఎక్కువ చదువుతామని అనిపిస్తుంది కానీ శరీరానికి అవసరమైనంత నిద్రని తప్పకుండా ఇవ్వాలి. దాని వల్ల మీరు చదివే కాలం వృధా కాదు. అది మీలో చదివే శక్తిని పెంచుతుంది. మీ ఏకాగ్రత పెరుగుతుంది. మీలో తాజాదనం పెరుగుతుంది. మొత్తంగా మీలోని సామర్థ్యం బాగా పెరుగుతుంది. నేను ఎన్నికల సభల్లో పాల్గొన్నప్పుడు, అప్పుడప్పుడు నా గొంతు మొరాయిస్తుంది. ఒకసారి ఒక జానపదగాయకుడు నన్ను కలవడానికి వచ్చాడు. ఆయన నేనెన్ని గంటలు పడుకుంటానని అడిగాడు. మీరేమన్నా డాక్టరా అని అడిగాను నేను. కాదు కాదు.. ఎన్నికల సభల్లో పాల్గొన్నప్పుడు మీ గొంతు పాడవడానికీ దీనికీ సంబంధం ఉంది అన్నాడు. మీరు బాగా నిద్ర పోతేనే మీ స్వరపేటికకి బాగా విశ్రాంతి దొరుకుతుంది అన్నాడు. నేను నా నిద్ర గురించీ , నా ప్రసంగం గురింఛీ, నా గొంతు గురించీ ఎప్పుడూ ఆలోచించనే లేదు. ఆయన నాకొక గొప్ప వనమూలిక ఇచ్చాడు. నిజంగానే మనం వీటి ప్రాముఖ్యతను గుర్తించాలి. వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది. కానీ ఎప్పుడూ నిద్ర పొమ్మనే అర్థం కాదు. మెలకువగా ఉండక్కర్లేదు, నిద్రపొండని ప్రధానమంత్రి చెప్పారని కొందరు అనగలరు. అలా చెయ్యకండి. లేకపోతే మీ కుటుంబసభ్యులు నామీద కోపం తెచ్చుకోగలరు. మీ మార్కుల జాబితా వచ్చిన రోజున మీరు వారికి చూపెట్టకపోతే, అది నేనే చూపెట్టాల్సి వస్తుంది. అలా చెయ్యకండి. అందుకనే నేను అంటాను - ‘P for prepared and P for play’, ఆడుకునేవారే వికసిస్తారు, ‘the person who plays, shines’ I మనసు, బుధ్ధి, శరీరాలని చైతన్యపరచడానికి అదొక పెద్ద ఔషధం.
సరే కానీ, యువమిత్రులారా, మీరు పరీక్షా ప్రయత్నాలలో ఉన్నారు, నేనేమో మిమ్మల్ని "మనసులో మాట"లలో పెట్టాను. నా ఇవాల్టి మాటలు మీకు విశ్రాంతిని తప్పకుండా ఇస్తాయని నేను అనుకుంటున్నాను. అంతే కానీ నేను చెప్పిన మాటల్ని భారమవనీయకండి. వీలయితే చెయ్యండి. వీలుకాకపోతే లేదు. లేకపోతే ఇవి కూడా బరువైపోతాయి. అయితే, మీ కుటుంబంలోని తల్లిదండ్రులకు మీరు బరువవ్వకూడదని ఎలాగైతే చెప్తానో ,అది నాకు కూడా వర్తిస్తుంది. మీ సంకల్పాన్ని గుర్తుకు తెచ్చుకుంటూ, మీ పై నమ్మకాన్ని పెట్టుకుని పరీక్షలకు వెళ్ళండి. మీకు నా శుభాకాంక్షలు. ప్రతి పరీక్షనూ నెగ్గడానికి ప్రతి పరీక్షనూ ఉత్సవంగా మార్చేయండి. ఇక ఎప్పూడూ పరీక్ష పరీక్షలాగే ఉండదు. ఇదే మంత్రంగా ముందుకు నడవండి.
ప్రియమైన దేశ ప్రజలారా, ఫిబ్రవరి ఒకటి 2017 భారతీయ తీర రక్షక దళం 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ సందర్భంగా తీరరక్షక దళం అధికారులూ, జవానులందరికీ వారి దేశసేవలకు గానూ ధన్యవాదాలు తెలుపుతున్నాను. దేశంలో నిర్మితమైన మొత్తం 126 నౌకలు, 62 విమానాలతో ప్రపంచంలోని నాలుగు అతిపెద్ద తీరరక్షక దళాలలో తన స్థానాన్ని నిలబెట్టుకుంది. ఇది ఎంతో గర్వ కారణం. "వయం రక్షామహ:" అనేది తీరరక్షక దళం మంత్రం. తమ ఈ ఆదర్శవాక్యాన్ని చరితార్థం చేస్తూ దేశ సముద్ర తీరాలూ, సముద్ర పరిసరాలను సురక్షితం చెయ్యడానికి తీరరక్షక దళ జవానులు ప్రతికూల పరిస్థితుల్లో కూడా రాత్రీ పగలు తయారుగా ఉంటారు. క్రితం ఏడాది తీరరక్షక దళం వారి బాధ్యతలతో పాటుగా, మన దేశ సముద్రతీరాన్ని శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టాయి. వేల మంది ఇందులో పాల్గొన్నారు. తీరభద్రత తో పాటూ తీర శుభ్రత గురించి కూడా వారు ఆలోచించారు. ఇది నిజంగా అభినందించాల్సిన విషయం. తీరరక్షక దళంలో పురుషులే కాకుండా మహిళలు కూడా వారి బాధ్యతలు నిర్వహిస్తున్నారు.. విజయవంతంగా నిర్వహిస్తున్నారని మన దేశంలో చాలా కొద్ది మందికే తెలిసి ఉంటుంది. తీరరక్షక దళంలో మహిళా ఆఫీసరు పైలట్ అయినా, పర్యవేక్షణ రూపంలో పనిచేయడమే కాక Hovercraft కమాండ్ ని కూడా నిర్వహిస్తున్నారు. భారతీయ తీర రక్షణలో భాగంగా మన సముద్రజలాల రక్షణ కూడా ఇవాళ ప్రపంచంలో ఒక ముఖ్యమైన భాగం అయింది. అందువల్ల భారతీయ తీరరక్షణ దళం 40 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నందుకు వారికి అనేకానేక శుభాకాంక్షలు.
ప్రిబ్రవరి ఒకటవ తారీఖున వసంత పంచమి పండుగ. సర్వ శ్రేష్ఠ ఋతువుగా వసంత ఋతువు అందరి ద్వారా స్వీకరింపబడింది. వసంతం ఋతువులకే రాజు. మన దేశంలో వసంత పంచమి రోజున సరస్వతీ పూజ జరిపే పండుగగా జరుపుకుంటారు. విద్యారాధనకు అవకాశంగా భావిస్తారు. ఇంతే కాక, ఈ రోజు వీరులకు ప్రేరణ నిచ్చే రోజు. " మేరా రంగ్ దే బసంతీ చోలా" కి అదే ప్రేరణ. పావనమైన ఈ వసంత పంచమి పండుగ సందర్భంగా నా దేశ ప్రజలకు అనేకానేక శుభాకాంక్షలు.
నా ప్రియమైన దేశ ప్రజలారా, "మనసులో మాట" లో ఆకాశవాణి కూడా తన ప్రమేయంతో ఎల్లప్పుడూ కొత్త రంగు రూపాలను నింపుతోంది. గత నెల నుండీ వారు నా "మనసులో మాట" పూర్తి అయిన వెంఠనే ప్రాంతీయ భాషల్లో ’మనసులో మాట’ వినిపించడం మొదలుపెట్టారు. దీనికి విస్తృతమైన ఆదరం లభించింది. దూరదూరాలనుండి ప్రజలు ఉత్తరాలు రాస్తున్నారు. స్వీయ ప్రేరణతో ఆకాశవాణి వారు చేసిన ఈ పనికి వారిని ఎంతగానో అభినందిస్తున్నాను. దేశ ప్రజలారా, మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. మీతో ఏకమవడానికి మనసులో మాట నాకు గొప్ప అవకాశాన్ని ఇస్తుంది. మీకందరికీ ఎన్నెన్నో శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశ ప్రజలారా, నమస్కారం. క్రిస్ మస్ సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. సేవ, త్యాగం మరియు కరుణలకు మన జీవితంలో ప్రాముఖ్యాన్ని ఇవ్వాల్సిన రోజు నేడు. "పేదలకు మన ఉపకారం కాదు మన ఆదరణ కావాలి" అన్నారు ఏసు క్రీస్తు. "ఆయన పేదలకు సేవ చేయడం మాత్రమే కాక, పేదవారు చేసిన సేవలను కూడా మెచ్చుకున్నారు" అని సెయింట్ ల్యూక్ తన సువార్తలో రాశారు. ఇదే అసలైన సాధికారిత. దీనికి సంబంధించిన కథ ఒకటి బాగా ప్రచారంలో ఉంది. ఆ కథలో ఏం చెప్పారంటే, జీసస్ ఒక గుడి తాలూకూ కోశాగారం దగ్గర నిలబడి ఉన్నారట. ఎందరో ధనికులు వచ్చి ఎన్నో దానాలు ఇచ్చారట. ఆ తరువాత ఒక పేద వితంతువు వచ్చి రెండు రాగి నాణాలు ఇచ్చిందట. ఒక విధంగా చూస్తే రెండు రాగి నాణాలకు పెద్ద విలువేమీ లేదు. అక్కడ నిలబడ్డ భక్తులలో కుతూహలం కలగడం సహజమే. అందరి కన్నా ఎక్కువ దానం ఇచ్చింది ఆ మహిళే; ఎందుకంటే, మిగిలిన వారు చాలా ఇచ్చారు.. కానీ, ఆమె తన దగ్గర ఉన్నదంతా ఇచ్చేసింది అని జీసస్ అప్పుడు అన్నారట.
ఇవాళ డిసెంబర్ 25వ తారీఖున మహామనిషి మదన్ మోహన్ మాలవీయ గారి జయంతి కూడానూ. భారతీయుల మనసుల్లో సంకల్పాన్నీ, ఆత్వ విశ్వాసాన్నీ మేల్కొలిపిన మాలవీయ గారు ఆధునిక విద్యకు ఒక కొత్త మార్గాన్ని ఏర్పరిచారు. వారి జయంతి రోజున వారికి నా భావపూర్వకమైన శ్రద్ధాంజలి. రెండు రోజుల క్రితమే మాలవీయ గారి తపోభూమి అయిన బనారస్ లో చాలా అభివృధ్ధి కార్యక్రమాలను శుభారంభం చేసే అవకాశం నాకు లభించింది. వారణాసి లోని బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో నేను మహామనిషి మదన్ మోహన్ మాలవీయ కేన్సర్ సెంటర్ కు పునాదిరాయి వేశాను. ఆ ప్రాంతం మొత్తంలో ఒక కేన్సర్ సెంటర్ నిర్మాణం జరుగుతోంది. ఇది తూర్పు ఉత్తర ప్రదేశ్ వాసులకే కాకుండా ఝార్ఖండ్, బిహార్ ల వరకూ ఉన్న ప్రజలకు గొప్ప వరమనే చెప్పాలి.
భారత రత్న మరియు పూర్వ ప్రధాన మంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి గారి జన్మదినం కూడా ఇవాళే. అటల్ గారి సేవలను దేశం ఎప్పటికీ మరువదు. వారి నేతృత్వంలో, మనం పరమాణు శక్తి లో కూడా దేశం తల ఎత్తుకొనేటట్లు చేశాము. పార్టీ నేతగా, పార్లమెంట్ సభ్యుడిగా, మంత్రిగా, ప్రధాన మంత్రిగా, తన ప్రతి పాత్రలోనూ ఒక ఆదర్శాన్ని నింపారు అటల్ గారు. వారి జన్మదినం సందర్భంగా వారికి నమస్కరిస్తూ, వారికి చక్కని ఆరోగ్యాన్ని ప్రసాదించవలసిందిగా ఆ భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను. ఒక కార్యకర్త గా అటల్ గారితో పనిచేసే సదవకాశం నాకు లభించింది. ఎన్నో స్మృతులు కళ్ళ ముందర మెదులుతున్నాయి. ఇవాళ పొద్దున్నే నేను ట్వీట్ చేస్తూ, ఒక పాత వీడియోను కూడా పంచుకొన్నాను. ఒక చిన్న కార్యకర్త రూపంలో కూడా అటల్ గారి స్నేహ వర్షాన్ని అందుకునే అదృష్టం నాకెలా లభించిందో ఆ వీడియోను చూస్తే తెలుస్తుంది.
ఇవాళ క్రిస్ మస్ పండుగ సందర్భంగా బహుమతుల రూపంలో దేశ ప్రజలకు రెండు పథకాల ద్వారా లాభం లభించబోతోంది. ఒక రకంగా చెప్పాలంటే, రెండు కొత్త పథకాలు ప్రారంభమవుతున్నాయి. దేశమంతటా, పల్లెల్లో లేదా పట్టణాలలో, చదువుకున్న వారు లేదా నిరక్ష్యరాస్యులు, ఎవరైనా కూడా నగదురహితంగా ఉన్నప్పుడు విలువేముంది ? నగదురహిత వ్యాపారాన్ని ఎలా నడుపుతారు ? డబ్బు లేకుండా కొనుగోళ్ళు ఎలా జరుగుతాయి ? నలువైపులా ఎంతో కుతూహల వాతావరణం నెలకొని ఉంది. అందరూ, ఒకరి నుండి మరొకరు తెలుసుకొని, నేర్చుకోవాలనుకుంటున్నారు. ఇదే విషయాన్ని ప్రోత్సహించడానికి, మొబైల్ బ్యాంకింగ్ కు బలాన్ని చేకూర్చడానికీ, ఇ-పేమెంట్ అలవాటవడానికీ, భారత ప్రభుత్వం వినియోగదారుల కోసం మరియు చిన్న వ్యాపారస్తుల కోసమూ ఒక "ప్రోత్సాహక పథకా"న్ని ఇవాళ్టి నుండి ప్రారంభిస్తోంది. కొనుగోలుదారును ప్రోత్సహించడానికి "లకీ గ్రాహక్ పథకం" మరియు వ్యాపారస్తులను ప్రోత్సహించడానికి "డిజి ధన్ వ్యాపార పథకం" మొదలవుతున్నాయి.
ఇవాళ డిసెంబర్ 25న క్రిస్ మస్ కానుకగా పదిహేను వేల మందికి డ్రా పధ్ధతిలో బహుమతి లబిస్తుంది. ఆ పదిహేను వేల మందికీ, ప్రతి ఒక్కరి ఖాతా లోకీ వెయ్యి రూపాయిల బహుమతి వెళ్తుంది. ఇది కేవలం ఇవాళ్టి రోజున మాత్రమే కాక ఒక వంద రోజుల వరకూ జరుగుతుంది. ప్రతి రోజూ 15,000 మందికి వెయ్యి రూపాయిల చప్పున బహుమతి లభించబోతోంది. వంద రోజుల్లో, లక్షల కుటుంబాల వారికి, కోట్ల రూపాయిల బహుమతులు రాబోతున్నాయి. కానీ, మొబైల్ బ్యాంకింగ్, ఇ-బ్యాంకింగ్, రుపే కార్డ్, యూ.పి.ఐ, యు.ఎస్.ఎస్.డి మొదలైన డిజిటల్ చెల్లింపు విధానాల ఉపయోగం ఆధారంగా డ్రా తీయబడుతుంది. అప్పుడే ఈ బహుమతికి మీరు అర్హులవుతారు. దీనితో పాటుగా ఇటువంటి వినియోగదారుల కోసం వారంలో ఒకరోజు ఒక పెద్ద డ్రా తీయబడుతుంది. ఆ బహుమతులు కూడా లక్షల్లోనే ఉంటాయి. ఇంకా మూడు నెలల తరువాత ఏప్రిల్ 14వ తేదీన డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ గారి జయంతి రోజున ఒక బంపర్ డ్రా ఉంటుంది. అందులో కొన్ని కోట్ల బహుమతులు ఉంటాయి. "డిజి ధన్ వ్యాపార పథకం" ముఖ్యంగా వ్యాపారస్తుల కోసమే. వ్యాపారస్తులు స్వయంగా ఈ పథకంలో భాగంగా మారి, తమ వ్యాపారాన్ని నగదురహితంగా మార్చడానికి కొనుగోలుదారులను కూడా అందులో కలుపుకోవచ్చు. అలా చేసే వ్యాపారస్తులకు కూడా విడిగా బహుమతులు అందించబడతాయి. అవి కూడా వేల సంఖ్యలోనే ఉన్నాయి. వ్యాపారస్తుల సొంత వ్యాపారం కూడా నడుస్తుంది, దానితో పాటూ వారికి బహుమతి వచ్చే అవకాశమూ లభిస్తుంది. ఈ పథకం సమాజంలోని అన్ని వర్గాల వారికీ, ముఖ్యంగా పేద మరియు దిగువ మధ్య తరగతి వర్గాలవారిని దృష్టిలో పెట్టుకుని తయారుచేయడం జరిగింది. అందువల్ల ఎవరైతే రూ. 50 కన్నా ఎక్కువ - రూ. 3,000 కన్నా తక్కువ ఖరీదుతో కొనుగోళ్ళు చేస్తారో వాళ్ళు మాత్రమే ఈ పథకం వల్ల లబ్ధి పొందుతారు. రూ. 3,000 కన్నా ఎక్కువ ఖరీదుతో కొనుగోళ్ళు చేసేవారికి ఈ బహుమతి లభించదు. నిరుపేద ప్రజలు కూడా యు.ఎస్.ఎస్.డి ని ఉపయోగించి ఫీచర్ ఫోన్ లేదా సాధారణ ఫోన్ మాధ్యమంతో సరుకులు కొనుగోలు చేయవచ్చు, సామానులు అమ్మవచ్చు ,ఇంకా డబ్బు చెల్లింపులు కూడా చేయవచ్చు. వారంతా కూడా ఈ బహుమతి పథకం ద్వారా లబ్ధి పొందవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎ.ఇ.పి.ఎస్ ద్వారా కొనుగోలు-విక్రయాలు చేయవచ్చు మరియు వారు కూడా బహుమతులు గెలుచుకోవచ్చు. చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు, కానీ భారతదేశంలో ఇవాళ్టి రోజున 30 కోట్ల రుపే కార్డులు ఉన్నాయి, వారిలో 20 కోట్ల పేద కుటుంబాల వద్ద, జన్-ధన్ ఖాతాలు ఉన్నవారి దగ్గర ఈ రుపే కార్డ్ లు ఉన్నాయి. ఈ 30 కోట్ల మంది వెంటనే ఈ బహుమతుల ప్రణాళికలో భాగం కాగలరు. దేశ ప్రజలు ఈ పథకం పట్ల ఆసక్తి చూపిస్తారని నాకు నమ్మకం ఉంది. మీ చుట్టుపక్కల ఉన్న యువతకు ఈ విషయాలన్నింటి గురించి అవగాహన ఉంటుంది. వారిని అడిగితే ఈ వివరాలన్నీ మీకు చెబుతారు. మీ కుటుంబాలలో కూడా పదో తరగతో, పన్నెండో తరగతో చదివే పిల్లలు ఉంటారు కదా, వారైనా కూడా ఈ విషయాలన్నీ మీకు చక్కగా వివరించగలుగుతారు. ఇది చాలా సులువు. ఎంత సులువంటే, మీరు మొబైల్ ఫోన్ లోంచి వాట్సప్ పంపినంత సులువు.
ప్రియమైన నా దేశ ప్రజలారా, దేశంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎలా ఉపయోగించుకోవాలో, ఇ-పేమెంట్ ఎలా చెయ్యాలో, ఆన్ లైన్ పేమెంట్ ఎలా చెయ్యాలో, మొదలైన విషయాల పట్ల అవగాహన వేగంగా పెరగడం చూస్తుంటే నాకు చాలా సంతోషం కలుగుతోంది. గడచిన కొద్ది రోజుల్లో నగదురహిత వ్యాపారం, డబ్బు లేని వ్యాపారం 200 నుండి 300 శాతానికి పెరిగింది. దీనిని ప్రోత్సహించడం కోసమని భారత ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయాన్ని తీసుకుంది. ఈ నిర్ణయం ఎంత పెద్దదో వ్యాపారస్తులు చాలా చక్కగా అంచనా వెయ్యగలరు. ఏ వ్యాపారులైతే డిజిటల్ లావాదేవీలు జరుపుతారో, తమ వ్యాపారంలో డబ్బుకి బదులు ఆన్ లైన్ పే మెంట్ పధ్ధతిని అభివృధ్ధి పరుస్తారో, అటువంటి వ్యాపారులకు ఆదాయపు పన్ను నుండి రాయితీ ఇవ్వబడింది.
దేశంలోని అన్ని రాష్ట్రాలనూ నేను అభినందిస్తున్నాను. కేంద్రపాలిత ప్రాంతాలవారిని కూడా అభినందిస్తున్నాను. అందరూ తమకు తోచిన విధంగా ఈ ప్రయత్నాన్ని ముందుకు నడిపించారు. ఇందుకోసం రకరకాల పథకాల ఆలోచనలను చెయ్యడానికి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు అధ్యక్ష్యతన ఒక కమిటీ కూడా ఏర్పడింది. కానీ మిగతా ప్రభుత్వాలు కూడా తమ పధ్ధతిలో అనేక పథకాలను ప్రారంభించి, అమలుపరచడం కూడా నేను గమనించాను. ఎవరో చెప్పారు, ఆస్తి పన్ను మరియు వ్యాపార లైసెన్స్ రుసుమును డిజిటల్ గా చెల్లించినవారికి 10 శాతం రాయితీ ఇచ్చేలా అస్సాం ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. గ్రామీణ బ్యాంకుల శాఖలు తమ 75 శాతం వినియోగదారుల చేత 2017 జనవరి నుండి మార్చి వరకూ కనీసం 2 డిజిటల్ లావాదేవీలు చేయిస్తే, వారికి ప్రభుత్వం నుండి రూ. 50,000 బహుమతి లభించనుంది. 2017 మార్చి 31 వరకూ 100 శాతం డిజిటల్ లావాదేవీలు చేసే గ్రామాలకు ప్రభుత్వం నుంచి "ఉత్తమ పంచాయత్ ఫర్ డిజి ట్రాన్సాక్షన్" పథకం క్రింద రూ. 5 లక్షల బహుమతి అందించాలని వారు ప్రకటించారు. ఎవరైతే రైతులు విత్తనాలు మరియు ఎరువులు కొనడానికి పూర్తిగా డిజిటల్ చెల్లింపుల విధానాన్ని ఉపయోగించుకుంటారో, వారిలో మొదటి పది మంది రైతులకు "డిజిటల్ కృషక్ శిరోమణి" పేరుతో రూ. 5,000 బహుమతి ఇవ్వాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది. అస్సాం ప్రభుత్వాన్నీ, ఇలాంటి చొరవ తీసుకుంటున్న మిగిలిన ప్రభుత్వాలనూ కూడా నేను అభినందిస్తున్నాను. ఎన్నో ఇతర సంస్థలు కూడా గ్రామాల్లోని పేద రైతులతో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేలా చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. నాకెవరో చెప్పారు, "గుజరాత్ నర్మదా వేలీ ఫెర్టిలైజర్స్ & కెమికల్స్ లిమిటెడ్" (జిఎన్ఎఫ్ సి) అనే ఎరువుల కంపెనీ వారు రైతులకు వీలుగా ఉండేందుకు ఎరువులు అమ్మే చోట ఒక 1000 పి.ఓ.ఎస్. మెషీన్లను పెట్టించారట. తరువాత కొద్ది రోజుల్లోనే 35,000 మంది రైతులకు 5 లక్షల ఎరువుల బస్తాలు డిజిటల్ చెల్లింపుల ద్వారా ఇప్పించారు. ఇదంతా కూడా కేవలం రెండు వారాల్లో చేశారు. ఆనందకరమైన విషయమేమిటంటే, గత ఏడాది తో పోలిస్తే జిఎన్ఎఫ్ సి ఎరువుల అమ్మకం 27 శాతం పెరిగింది.
సోదర సోదరీమణులారా, మన ఆర్థిక వ్యవస్థలో, మన జీవన వ్యవస్థలో అసంఘటిత రంగం చాలా పెద్దది. మనకు తెలుసు ఈ కూలీలకు రోజు కూలీ, డబ్బు, జీతాలూ నగదు రూపంలో ఇస్తారు. దీనివల్ల ఈ కూలీల శ్రమ దోపిడీ కూడా జరుగుతోంది. రూ. 100 ఇవ్వాల్సిన చోట రూ. 80 ఇస్తారు, రూ. 80 ఇవ్వాల్సిన చోట రూ. 50 ఇస్తారు. ఇంకా బీమా లాంటి ఆరోగ్య రంగం దృష్టిలో వారికి లభ్యమయ్యే ఇతర సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వారికి దక్కడం లేదు. కానీ ఇప్పుడు నగదురహిత చెల్లింపులు జరుగుతున్నాయి. డబ్బు నేరుగా బ్యాంక్ లో జమ అవుతోంది. ఈ ప్రకారంగా అసంఘటిత రంగం సంఘటిత రంగంగా మారుతోంది. దోపిడీ అంతమవుతోంది. ఇదివరకూ మామూళ్ళు ఇవ్వాల్సి వచ్చేది. అది కూడా ఇప్పుడు ఆగిపోయింది. ఇప్పుడు కూలీలకు, పని చేసేవారికీ, పేదవారికి మొత్తం డబ్బు వచ్చే మార్గం ఏర్పడింది. దానితో పాటే వారికి లభించాల్సిన మిగిలిన లాభాలకు కూడా వారు హక్కుదారులవుతున్నారు. యువత శాతం ఎక్కువగా ఉన్న దేశం మనది. టెక్నాలజీ మనకు సులభ సాధ్యమైనది కాబట్టి మన దేశం ఇందులో అందరికంటే ఎంతో ముందు ఉండవలసింది. "స్టార్ట్-అప్'' తో మన యువత చాలా ప్రగతిని సాధించారు. మన యువత కొత్త కొత్త ఆలోచనలతో, కొత్త కొత్త టెక్నాలజీలతో, కొత్త కొత్త పధ్ధతులతో ఈ క్షేత్రానికి ఎంత బలం ఇవ్వాలో అంత బలాన్నీ అందివ్వడానికి ఈ డిజిటల్ పయనం ఒక సువర్ణావకాశం. కానీ దేశాన్ని నల్ల ధనం నుంచి, లంచగొండితనం అంతమొందించడానికి చేసే ఈ ప్రయత్నంలో మనందరం కలిసికట్టుగా ఉండాలి.
ప్రియమైన నా దేశ ప్రజలారా, నేను ప్రతి నెలా మనసులో మాట ద్వారా ప్రజలను తమ తమ సలహాలను ఇవ్వవలసిందిగా, తమ అభిప్రాయాలను చెప్పవలసిందిగా కోరుతున్నాను. దానివల్ల, MyGov ఇంకా నరేంద్ర మోదీ యాప్ నకు వేల సంఖ్యలో వచ్చిన సలహాల్లో 80, 90 శాతం సలహాలు లంచగొండితనం, నల్ల ధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి సంబంధించినవే వచ్చాయి. నోట్ల రద్దు గురించిన ప్రస్తావనలు కూడా వచ్చాయి. ఈ విషయాలన్నింటినీ చూసిన మీదట నేను వాటిని మూడు ముఖ్యమైన విభాగాలుగా విభజించాను. కొందరు ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యల గురించీ, పడుతున్న కష్టాల గురించీ చాలా వివరంగా రాశారు. రెండవ విభాగం లోనివారు ఎవరంటే, ఈ పనిని సమర్ధించే వారు. ఇంతమంచి పని వల్ల, పవిత్రమైన పని వల్ల దేశానికి ఎంత మంచి జరుగుతోందో చెప్తూనే, ఈ పని వల్ల దేశంలో ఎక్కడెక్కడ ఎలాంటి అక్రమాలు జరుగుతున్నాయో, ఎటువంటి కొత్త కొత్త అవినీతి మార్గాలు వెతుకుతున్నారో వాటి గురించిన ప్రస్తావన కూడా ప్రజలు చేశారు. ఇక మూడో విభాగం వారు ఎవరంటే, జరిగిన దానికి తమ మద్దతుని తెలపడమే గాక, దానితో పాటే ఈ పోరాటం ముందుకు సాగాలని కూడా అన్నారు. అవినీతి, నల్లధనం పూర్తిగా నిర్మూలించబడాలని, దాని కోసం ఇంకా కఠినమైన అడుగులు వెయ్యాల్సి వచ్చినా వెనుకాడకూడదంటూ, ఎంతో బలాన్ని ఇచ్చేటువంటి మాటలు రాసిన వారు ఉన్నారు.
అనేక ఉత్తరాలు రాసి నాకు మద్దతు ఇచ్చిన దేశప్రజలకు నేను ఋణపడి ఉంటాను. శ్రీ గురుమణి కేవల్ MyGovలో ఏం రాశారంటే, "నల్లధనాన్ని అరికట్టడానికి తీసుకున్న ఈ చర్యలు ప్రశంసాపాత్రమైనవి. మేమంతా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము, కానీ మనందరం అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నాము. ఈ పోరాటంలో మేమంతా సహకరిస్తున్నందుకు మాకు సంతోషంగా ఉంది. నల్లధనం, అవినీతి మొదలైనవాటికి వ్యతిరేకంగా మనమంతా సైనిక దళాల్లాగ పని చేస్తున్నాము" అన్నారు. శ్రీ గురుమణి కేవల్ రాసిన మాటల్లోని భావాలే దేశంలోని అన్ని దిశల నుండీ వ్యక్తమవుతున్నాయి. మనమంతా అదే భావనకు లోనవుతున్నాము. కానీ ఇంత కష్టం పడుతున్నప్పుడు, ఇన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పుడు బాధపడని మనిషి ఎవరూ ఉండరన్నది నిజం. మీకెంతటి బాధ కలుగుతోందో, అంతే బాధ నాకు కూడా కలుగుతోంది. కానీ ఒక ఉత్తమ ధ్యేయం కోసం, ఒక్క ఉన్నతమైన ఆలోచనను సాధించడం కోసం, స్వచ్ఛమైన నిస్వార్ధమైన పని జరుగుతున్నప్పుడు, ఈ కష్టాలు, దు:ఖం, బాధల మధ్య కూడా దేశ ప్రజలు ధైర్యంతో నిలబడ్డారు. ఈ ప్రజలే నిజమైన మార్పుకి ప్రతినిధులు. మరొక కారణంగా కూడా నేను ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను; వారు కేవలం అనేక ఇబ్బందులను ఎదుర్కోవడమే కాక ప్రజలను తప్పుదోవ పట్టించాలనే ప్రయత్నం చేసిన కొందరు వ్యక్తులకు కూడా ధీటైన జవాబు చెప్పారు. వాళ్ళు ఎన్నో పుకార్లు పుట్టించారు. అవినీతి మరియు నల్లధనం పై పోరాటానికి కూడా సాంప్రదాయకత రంగు పులిమే ప్రయత్నం జరిగింది. నోట్ల పై అచ్చువేసిన స్పెల్లింగ్ తప్పని ఎవరో పుకారు పుట్టించారు . ఉప్పు ధర పెరిగిందని మరి కొందరు వదంతులు పుట్టించారు. మరికొందరేమో ఈ రూ. 2,000 నోటు కూడా రద్దవుతుందని, రూ. 500, రూ. 100 రూపాయిల నోట్లు కూడా మళ్ళీ రద్దవుతాయనీ పుకారు పుట్టించారు. కానీ ఇలాంటి ఊహాగానాలు, వదంతుల మధ్య కూడా దేశ ప్రజల మనసుల్ని ఎవరూ కదపలేకపోయారు. ఇంతే కాదు, కొందరు నడుం కట్టి, తమ బుధ్ధి తో, సృజనాత్మకతతో ఇలాంటి వదంతులు పుట్టించే వారి ముసుగులు తొలగించి, ఆయా వదంతులు వట్టివని చెప్తూ.. నిజాల్ని నిరూపించారు కూడా. ఇటువంటి ప్రజల సహకారానికి నా శతకోటి నమస్కారాలు.
ప్రియమైన నా దేశ ప్రజలారా, 125 కోట్ల దేశ ప్రజలు నా వెంటే నిలబడి ఉన్నప్పుడు ఏదీ కూడా అసంభవం కాదని నేను ప్రతి క్షణం అనుభూతి చెందుతున్నాను. ప్రజలు దేవుడి ప్రతిరూపాలు. వారి ఆశీర్వాదం భగవంతుడి ఆశీర్వాదమే అవుతుంది. అవినీతిపై, నల్లధనంపై జరిగే ఈ మహాయజ్ఞం లో ప్రజలు పూర్తి ఉత్సాహంతో పాలుపంచుకొంటున్నందుకు నేను దేశ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అవినీతి, నల్లధనానికి వ్యతిరేకంగా పార్లమెంట్ లో జరుగుతున్న పోరాటం రాజకీయ వర్గాలకూ, రాజకీయ నిధుల కోసమూ విస్తృతమైన చర్చ జరగాలని నేను కోరుకుంటున్నాను. పార్లమెంట్ సక్రమంగా నడిచి ఉంటే తప్పకుండా మంచి చర్చ జరిగేది. రాజకీయ వర్గాల్లో అంతా వెసులుబాటే అంటూ కొందరు పుట్టించిన పుకార్లు తప్పు. చట్టం అందరికీ సమానంగానే వర్తిస్తుంది. వ్యక్తి అయినా, సంస్థ అయినా, రాజకీయ పక్షమైనా అందరూ చట్టాన్ని పాటించవల్సిందే, చట్టాన్ని గౌరవించి తీరాల్సిందే. ఎవరైతే బాహాటంగా అవినీతినీ, నల్లధనాన్నీ సమర్థిస్తున్నారో, వారు ప్రభుత్వంలోని లోటుపాట్లని వెతకడంపైనే దృష్టి పెడతారు. మాటిమాటికీ నియమాలు ఎందుకు మారతాయి? ఈ ప్రభుత్వం ఉన్నదే ప్రజల కోసం. ప్రజల నుండి నిరంతరం అభిప్రాయాలని అందుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తూనే ఉంది. ప్రజలకు ఎక్కడ కష్టం ఎదురవుతోంది? ఏ నియమాల వల్ల ఇబ్బంది వస్తోంది? వాటికి మార్గం ఎలా వెతకాలి అని ఆలోచిస్తుంది. ఒక సంవేదనశీల ప్రభుత్వం అవడం వల్ల ప్రతి క్షణం ప్రజలందరి సుఖ సంతోషాలను దృష్టిలో పెట్టుకుని, ప్రజలకు సాధ్యమైనంత ఇబ్బందిని తగ్గించే విధంగా ఎన్ని నియమాలైతే మార్చాల్సి వస్తుందో అన్ని నియమాలనూ మారుస్తాం. ఇంకో పక్క , నేను మొదటి రోజే చెప్పాను, 8వ తారీఖున చెప్పాను. ఈ పోరాటం సామాన్యమైనది కాదు. 70 ఏళ్ళుగా అవినీతి, మోసంతో కూడిన నల్ల వ్యాపారంలో ఎలాంటి శక్తులు కలిసి ఉన్నాయి ? వాటి శక్తి ఎంత ? అలాంటి శక్తులతో నేను పోరాటం చెయ్యాలని నిశ్చయించుకున్నప్పుడు, అవి కూడా ప్రభుత్వాన్ని ఓడించాలని నిరంతరం కొత్త ఉపాయాలు వెతుకుతాయి. అటువంటి కొత్త ఉపాయాలు ఎంచుకొన్నప్పుడు మేము కూడా వాటిని ఎదుర్కోడానికి దీటైన సరికొత్త ఉపాయాలు వేయాల్సి వస్తుంది. వారెంత లోతుగా వెళ్తే, నేనంత కంటే లోతుగా వెళ్తాను. ఎందుకంటే మేము అవినీతిపరులనూ, నల్ల వ్యాపారులనూ, నల్ల ధనాన్నీ కూడా నిర్మూలించదలుచుకొన్నాము. మరో పక్క, ఎందరివో ఉత్తరాలు నా వద్దకు ఈ విషయాన్ని తీసుకుని వచ్చాయి. వీటిలో ఏ విధంగా అక్రమాలు జరుగుతున్నాయో, ఏ విధంగా వారు కొత్త కొత్త మర్గాలు వెతుకుతున్నారో వాటి గురించిన చర్చలు ఉన్నాయి.
ప్రియమైన నా దేశ ప్రజలకు ఒక విషయమై హృదయపూర్వక అభినందనలు తెలపాలనుకుంటున్నాను. టీవీ లోనూ, వార్తా పత్రికలలోనూ మీరు చూస్తూనే ఉంటారు.. రోజూ కొత్త కొత్త వ్యక్తులు పట్టుబడుతున్నారు. నోట్లు దొరుకుతున్నాయి. సోదాలు జరుగుతున్నాయి. పెద్ద పెద్ద మనుషులు పట్టుబడుతున్నారు. ఇదెలా సంభవం ? ఆ రహస్యం చెప్పనా ? రహస్యమేమిటంటే, నాకా వివరాలు ప్రజల వద్ద నుండే వస్తున్నాయి. ప్రభుత్వ వ్యవస్థ ద్వారా ఎంత సమాచారం లభిస్తుందో, వాటి కంటే అనేక రెట్లు అధికంగా సామాన్య ప్రజల నుండి సమాచారం లభిస్తోంది. ఇంకా మాకు లభిస్తున్న ఈ విజయం సామాన్య ప్రజలు అప్రమత్తంగా ఉండడం వల్లనే సాధ్యమైంది. నా దేశంలో అప్రమత్తంగా ఉన్న పౌరుడు ఇలాంటి శక్తుల ముసుగు తొలగించడానికి ఎంతటి సాహసం చేస్తున్నాడో ఎవరైనా ఊహించగలరా ? అందువల్ల వస్తున్న సమాచారం ద్వారానే ఎక్కువగా విజయం లభిస్తోంది. ఇలాంటి సమాచారం ఇవ్వదలుచుకున్నవారి కోసం ప్రభుత్వం ఒక ఇ-మెయిల్ అడ్రస్ ఏర్పాటు చేసింది. సమాచారాన్ని దానికీ పంపవచ్చు, లేదా MyGov కీ పంపవచ్చు. ఇలాంటి అన్ని దురాగతాలతో పోరాడడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది. దానికి మీ సహకారం ఉంటే పోరాటం చాలా సులభమవుతుంది.
మూడవ రకపు ఉత్తరాల రచయితల వర్గం చాలా పెద్ద సంఖ్యలో ఉంది. వారేమంటారంటే, "మోదీ గారూ అలసిపోకండి, ఆగిపోకండి. ఇంకా ఎలాంటి కఠినమైన అడుగులు వేయాల్సివచ్చినా వేయండి. ఒక్కసారి ఈ దారిని ఎంచుకున్నాక, గమ్యాన్ని చేరాల్సిందే. "ఇలాంటి ఉత్తరాలు రాసే వారందరికీ నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే, వారి ఉత్తరాల్లో ఒకవైపున విశ్వాసమూ, మరో వైపున ఆశీర్వాదమూ ఉన్నాయి. ఇది ఇక్కడితో ఆగిపోదని నేను మీకు నమ్మకంగా చెప్తున్నాను. ఇది కేవలం ఆరంభమే. ఈ పోరాటాన్ని గెలిచి తీరాలి. అలసిపోవడానికీ, ఆగిపోవడానికీ అవకాశమే లేదు. ఏ విషయం పట్ల 125 కోట్ల దేశ ప్రజల ఆశీర్వాదం ఉంటుందో ,ఆ విషయంలో అడుగు వెనక్కి వేసే ప్రశ్నే తలెత్తదు. మీకు తెలిసే ఉంటుంది, భారతదేశంలో బేనామీ ఆస్తిపై 1988లోనే ఒక చట్టాన్ని తయారు చేశారు. కానీ ఎప్పుడూ దానికి నిబంధనలు తయారుకాలేదు. దాన్ని ప్రజలలోకి తీసుకువెళ్ళలేదు. ఆ చట్టాన్ని అలానే మురగబెట్టారు. మేము దాన్ని బయటకు తీసి, ఎంతో పదునుపెట్టి, "బేనామీ ఆస్తి చట్టం" తీసుకువచ్చాము. రాబోయే రోజుల్లో ఆ చట్టం కూడా తన పని చేసుకుపోతుంది. దేశ హితార్ధం, జనహితార్థం ఏం చేయాల్సివచ్చినా మేం దానికి మొదటి ప్రాధాన్యతను ఇస్తాము.
ప్రియమైన నా దేశ ప్రజలారా, క్రితం సారి మనసులో మాటలో కూడా నేను చెప్పాను. ఈ కష్టాల మధ్య కూడా మన రైతులు చాలా కష్టం చేసి, పంట దిగుబడిలో క్రిందటేడు కన్నా ఎక్కువ దిగుబడితో రికార్డ్ సాధించారు. వ్యవసాయ రంగం దృష్టిలో ఇదొక శుభ సంకేతం. ఈ దేశ కూలీ అయినా, ఈ దేశ రైతైనా, ఈ దేశ యువకుడైనా, వీరందరి శ్రమ ఇవాళ కొత్త ఒరవడి సృష్టిస్తోంది. గత కొద్ది రోజుల్లో ప్రపంచ ఆర్థిక వేదిక పై, భారత దేశం అనేక రంగాల్లో తన పేరును ఎంతో గౌరవంగా నిలబెట్టుకుంది. వివిధ సూచికల ద్వారా ప్రపంచం దేశాల మధ్య భారతదేశ స్థానం పెరుగుదల కనబడడం మన దేశ ప్రజల నిరంతర ప్రయాసల ఫలితమే. ప్రపంచ బ్యాంక్ యొక్క డూయింగ్ బిజినెస్ రిపోర్ట్ లో భారత దేశ ర్యాంకింగ్ పెరిగింది. భారతదేశంలో వ్యాపార ప్రాక్టీస్ ని ప్రపంచ ఉత్తమ ప్రాక్టీసెస్ తో సమానంగా నిలబెట్టడానికి వేగంగా ప్రయత్నాలు చేస్తున్నాము. మనకి విజయం లభిస్తోంది కూడా. UNCTAD ద్వారా వచ్చిన World Investment రిపోర్ట్ ప్రకారం ఆర్థికంగా బాగా అభివృధ్ధి చెందుతున్న దేశాల 2016-18 జాబితాలో భారత దేశం 3వ స్థానానికి చేరుకుంది. ప్రపంచ ఆర్థిక వేదిక యొక్క ప్రపంచ పోటీదారు నివేదికలో భారతదేశం స్థానం 32 ర్యాంకుల పైకి చేరుకుంది. గ్లోబల్ రూపకల్పన సూచిక 2016 లో మనం 16 స్థానాల పైకి చేరాం. ఇంకా ప్రపంచ బ్యాంక్ యొక్క Logistics performance Index లో మనం 19 స్థానాలు పైకి చేరాము. ఇంకా ఇలాంటి ఎన్నో నివేదికల అంచనాలు కూడా ఇలాంటి సూచనలే చేస్తున్నాయి. భారతదేశం వేగంగా ముందుకు దూసుకుపోతోంది.
ప్రియమైన నా దేశ ప్రజలారా, ఈసారి పార్లమెంట్ సమావేశాలు దేశ ప్రజల అసంతృప్తికి గురయ్యాయి. నలుదిశలా పార్లమెంట్ కార్యకలాపాలకు సంబంధించి ఆవేశాలు ప్రకటితమయ్యాయి. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి కూడా వారి వారి అసంతృప్తులను తెలిపారు. కానీ ఇటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని మంచి పనులు జరిగిపోతాయి. అప్పుడు మనసుకు చాలా సంతోషం కలుగుతుంది. పార్లమెంట్ లో గందరగోళం మధ్యలోనే దేశం గమనించని ఒక ఉత్తమమైన పని జరిగింది.
సోదర సోదదీమణులారా, ఇవాళ ఈ మాట తెలపడానికి నాకు చాలా ఆనందంగానూ, గర్వంగానూ ఉంది. దివ్యాంగుల కోసం మా ప్రభుత్వం ఏమి ఏర్పాటుచేయాలని తలపెట్టిందో, దానికి సంబంధించిన బిల్లు ఒకటి పార్లమెంట్ లో పాస్ అయ్యింది. దీనిపై నేను లోక్ సభ, రాజ్య సభ సభ్యులందరికీ రుణపడి ఉన్నాను. దేశంలోని కోట్లాది దివ్యాంగుల తరపున కూడా వారికి రుణపడి ఉన్నాను. దివ్యాంగుల కోసం మా ప్రభుత్వం కట్టుబడి ఉంది. నేను వ్యక్తిగతంగా కూడా ఆ ప్రయత్నాన్ని వేగవంతం చేయడానికి ప్రయత్నించాను. దివ్యాంగులకు దక్కవలసిన హక్కులు ఇంకా గౌరవం వారికి లభించాలి అని నా అభిప్రాయం. పారాలింపిక్స్ లో నాలుగు పతకాలు గెలుచుకు రావడం ద్వారా దివ్యాంగ సోదరసోదరీమణులందరూ కూడా వారి పట్ల మా ప్రయత్నాలూ, నమ్మకాలకూ శక్తిని అందించారు. అంతేకాకుండా, వారి గెలుపు ద్వారా కేవలం దేశ గౌరవాన్ని నిలపడమే కాకుండా, తమ సామర్థ్యంతో ప్రజలను ఆశ్చర్యచకితులని చేశారు. మన దివ్యాంగ సోదరసోదరీమణులందరూ కూడా దేశంలోని అందరు పౌరుల్లాగానే వెలకట్టలేని వారసత్వ సంపద, శక్తి. దివ్యాంగుల మేలు కోసం ఏర్పడిన ఈ చట్టం ద్వారా వారికి ఎన్నో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఇవాళ నేను ఎంతో ఆనందిస్తున్నాను. ప్రభుత్వ ఉద్యోగాలలో వారికి రిజర్వేషన్ 4 శాతానికి పెంచబడింది. ఈ చట్టం వల్ల దివ్యాంగుల విద్య, సౌకర్యాలు , ఫిర్యాదులకి ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేయబడ్డాయి. ప్రభుత్వం దివ్యాంగుల పట్ల ఎంత కరుణతో ఉందో తెలియచెప్పడానికి గత రెండేళ్ళలో కేంద్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం నిర్వహించిన 4350 శిబిరాలే తెలియజేస్తాయి. 352 కోట్ల రూపాయిలు ఖర్చు చేసి, 5,80,000 వేల మంది దివ్యాంగులకు వారికి అవసరమైన ఉపకరణాలను పంచాము. ప్రభుత్వం ఐక్యరాజ్యసమితి భావాలకు అనుగుణంగానే ఈ చట్టాన్ని తీసుకువచ్చింది. మొదట దివ్యాంగుల వర్గం 7 రకలుగా ఉండేది. కానీ ఇప్పుడీ చట్టంతో దానిని 21 రకాలుగా మార్చడమైంది. మరో 14 కొత్త వర్గాలని ఇందులోకి తీసుకువచ్చాము. దీనిలో పొందుపరచడం ద్వారా దివ్యాంగుల తాలూకూ ఎన్నో కొత్త వర్గాలకు మొదటిసారిగా న్యాయము, అవకాశమూ లభించాయి. Thalassemia, నరాల బలహీనత, మరుగుజ్జుతనం మొదలైన వర్గాలను కూడా ఇందులో కలపడం జరిగింది. నా యువమిత్రులారా, గత కొన్ని వారాలుగా క్రీడారంగంలో మనందరి గౌరవాన్ని పెంచే వార్తలను వింటున్నాం. భారతీయులం కాబట్టి సహజంగానే గర్వంగా ఉంటుంది. భారతీయ క్రికెట్ టీమ్ ఇంగ్లాండ్ ని ఓడించి 4-0 తేడాతో సిరీస్ ని గెలుచుకుంది. ఇందులో కొందరు యువ ఆటగాళ్ళ ప్రతిభ మెచ్చుకోదగ్గది. మన యువ ఆటగాడు కరుణ్ నాయర్ త్రిశతాన్ని చేయగా, కె.ఎల్.రాహుల్ 199 పరుగులు చేశాడు. టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ మంచి బ్యాటింగ్ తో పాటూ, మంచి నాయకత్వ లక్షణాలు కనబరిచాడు. భారతీయ క్రికెట్ టీమ్ ఆఫ్ స్పిన్ బౌలర్ ఆర్.ఆస్విన్ ను2016 సంవత్సరానికి గానూ "క్రికెటర్ ఆఫ్ ద ఇయర్'' మరియు "బెస్ట్ టెస్ట్ క్రికెటర్''గా ఐ.సి.సి. ప్రకటించింది. వీరందరికీ నా అనేకానేక అభినందనలు, అనేకమైన శుభాశీస్సులు. హాకీ ఆటలో కూడా 15 ఏళ్ళ తరువాత మంచి కబురు వచ్చింది. గొప్ప కబురు వచ్చింది. జూనియర్ హాకీ టీమ్ ప్రపంచ కప్ ని దక్కించుకుంది. 15 ఏళ్ళ తరువాత జూనియర్ హాకీ టీం కి ప్రపంచ కప్ ని దక్కించుకునే అవకాశం లభించింది. ఈ గెలుపుని సాధించిన యువ క్రీడాకారులందరికీ ఎన్నో అభినందనలు. ఈ గెలుపు భారతీయ హాకీ టీమ్ కి చక్కని శుభసంకేతం. గత నెలలో మన మహిళా క్రీడాకారులు కూడా చమత్కారం చేసి చూపెట్టారు. భారతీయ మహిళా హాకీ టీమ్ ఏషియన్ చాంఫియన్స్ ట్రోఫీ గెలిచింది. కొద్ది రోజుల క్రితమే అండర్-18 ఆసియా కప్ లో భారతీయ మహిళా హాకీ టీమ్ రజత పతకాన్ని సాధించింది. క్రికెట్, హాకీ టీమ్ క్రీడాకారులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాను.
ప్రియమైన నా దేశవాసులారా, 2017వ సంవత్సరం కొత్త ఆశల, ఉత్సాహాల సంవత్సరంగా మారాలనీ, మీ సంకల్పాలన్నీ సిధ్ధించాలనీ, అభివృధ్ధి యొక్క నూతన శిఖరాలను మనం దాటగలగాలనీ కోరుకొంటున్నాను. 2017వ సంవత్సరం లో సుఖశాంతులతో జీవించడానికి దేశంలోని నిరుపేద పౌరుడికి కూడా అవకాశం దొరకాలని ఆశిస్తూ, నూతన సంవత్సరం 2017 కు నా తరఫున దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకాంక్షలు.. ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా, నమస్కారం. గత నెలలో మనమంతా దీపావళిని ఆనందంగా జరుపుకొన్నాము. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సారి కూడా దీపావళి పండుగను సైనికులతో కలిసి జరుపుకొనేందుకు చైనా సరిహద్దులకు వెళ్లాను. ఐటిబిపి జవాన్లతో, సైన్యానికి చెందిన జవాన్లతో కలిసి హిమాలయ శిఖరాల్లో దీపావళి జరుపుకొన్నాను. నేను ప్రతిసారి వెళతాను. కానీ ఈసారి దీపావళి అనుభూతే వేరు. దేశంలోని 125 కోట్ల మంది ఈసారి దీపావళిని సైన్యానికి, భద్రతా బలగాలకు అంకితం చేశారు. అక్కడి ప్రతి జవాను ముఖంలో ప్రజలు ఇచ్చిన ఈ గౌరవం తాలూకు ఆనందం కనిపించింది. ఈ భావన సైనికుల మనసుల్లో నిండిపోయింది. అంతేకాకుండా దేశ ప్రజలంతా తమకు శుభాకాంక్షలు పంపుతూ పండుగ ఆనందంలో సైనికులను కూడా భాగస్వాములను చేయడం అద్భుతమైన స్పందన. ప్రజలు పంపింది మామూలు శుభాకాంక్షలు కావు. హృదయపూర్వక స్పందనలు. ఒకరు చక్కని కవిత రాస్తే, మరొకరు చిత్రాన్ని రూపొందించారు. ఇంకొకరు కార్టూన్ వేశారు. మరొకరు వీడియోను రూపొందించి పంపారు. ఆ విధంగా ప్రతి ఇంటా సైనికుల మాటే వినిపించింది. ఈ లేఖలను చూసినప్పుడల్లా నాకు ఆనందంతో పాటు ఆశ్చర్యం వేసింది. ఎంత ఆత్మీయమైన భావాలతో ఈ లేఖలు రాశారో అనిపించింది. అలాంటి వాటిని కొన్ని ఎంపిక చేసి ఒక కాఫీ టేబుల్ బుక్ తయారు చేయాలని మై గవ్ లో కొందరు సూచించారు. ఆ పని జరుగుతున్నది. మీ అందరి సహకారంతో దేశ సైనిక జవాన్ల పట్ల మీరు వ్యక్తీకరించిన భావాలను, భద్రతా బలగాల పట్ల మీ భావాంబర వీధుల్లో విహరించిన అంశాలను ఒక పుస్తక రూపంలో తీసుకురావడం జరుగుతున్నది.
సైన్యంలోని ఒక జవాను ఇలా రాశాడు.. ప్రధాన మంత్రి గారూ, సైనికులం హోళి, దీపావళి ప్రతి పండుగను సరిహద్దుల్లోనే జరుపుకొంటాము. ఎల్లప్పుడూ మేము దేశ రక్షణలోనే నిమగ్నమై ఉంటాము. అయినప్పటికీ పండుగ సమయాల్లో ఇల్లు గుర్తుకు వస్తుంది. నిజం చెప్పాలంటే ఈసారి అలా జరగలేదు. పండుగనాడు ఇంట్లో లేకపోయాం కదా అనిపించలేదు. 125 కోట్ల మంది దేశవాసులతో కలిసి దీపావళి జరుపుకొంటున్నా మనిపించింది.
ప్రియమైన నా దేశ వాసులారా..
సైనికుల మధ్య జరుపుకొన్న ఈ దీపావళి, ఈ వాతావరణం, ఈ అనుభూతులను కొన్ని సందర్భాలకే పరిమితం చేయాలా? మనం ఒక దేశంలో, ఒక సమాజంలో వ్యక్తులుగా ఎలాంటి పండుగ వచ్చినా, ఉత్సవం వచ్చినా సైనికులను ఏదో రూపంలో తప్పక గుర్తు చేసుకోవడం సహజమైన అలవాటుగా మార్చుకోవాలని మీ అందరినీ అభ్యర్ధిస్తున్నాను. దేశమంతా సైన్యానికి అండగా నిలిస్తే, సైనిక శక్తి 125 రెట్లు పెరుగుతుంది.
కొన్నాళ్ల క్రితం జమ్ము & కశ్మీర్ నుండి అక్కడి గ్రామ పెద్దలంతా నన్ను కలవడానికి వచ్చారు. వారంతా జమ్ము & కశ్మీర్ పంచాయత్ కాన్ఫరెన్స్ కు చెందినవారు. కశ్మీర్ లోయలోని వేర్వేరు ఊళ్ల నుంచి వచ్చారు. వారితో చాలా సేపు మాట్లాడే అవకాశం కలిగింది. గ్రామాభివృద్ధి గురించి ప్రస్తావన కూడా వచ్చింది. దేశవాసులం అందరమూ ఈ విషయాల గురించి ఎంతగా బాధపడతామో, వారు కూడా అంతగానూ విచారించారు. అక్కడ తగలబెట్టింది పాఠశాలలను కాదు, పిల్లల భవిష్యత్ ను అని వారు ఆవేదన చెందారు. మీరంతా మీమీ గ్రామాలకు వెళ్లిన తరువాత ఆ పిల్లల భవిష్యత్ పైన మనస్సును లగ్నం చేయండి అని వారికి విజ్ఞప్తి చేశాను. కశ్మీర్ లోయ నుండి వచ్చిన ఈ అధ్యక్షులంతా నాకు ఇచ్చిన మాటను పొల్లుపోకుండా నిలబెట్టారు. గ్రామాలకు వెళ్లి ఎక్కడెక్కడో ఉన్న ప్రజల్లో చైతన్యం కలిగించడం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. కొన్నాళ్ల క్రితం బోర్డు పరీక్షలు జరిగాయి. కశ్మీర్ బాలబాలికలంతా సుమారు 95 శాతం పరీక్షలకు హాజరయ్యారు. బోర్డు పరీక్షలకు విద్యార్థినీ విద్యార్థులు ఇంత పెద్ద సంఖ్యలో హాజరు కావడం చూస్తుంటే జమ్ము & కశ్మీర్ లోని మన పిల్లలు తమ ఉజ్జ్వల భవిష్యత్ కోసం, విద్య ద్వారా సమున్నతమైన అభివృద్ధిని సాధించేందుకు సంకల్పించారనేందుకు ఇది ఒక సంకేతంగా నిలుస్తుంది. ఈ ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్న విద్యార్థులను అభినందిస్తున్నాను. వారి తల్లితండ్రులను, వారి ఇతర కుటుంబ సభ్యులను, ఉపాధ్యాయులను, గ్రామ అధ్యక్షులందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.
ఈసారి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కోసం ప్రజల సలహాలు కోరగా ప్రియమైన సోదర సోదరీమణులందరూ ఒకే విధంగా స్పందించారని చెప్పగలను. 500, 1000 రూపాయల నోట్ల గురించి మరింత విస్తృతంగా చర్చించాలని వారన్నారు. నవంబర్ 8న రాత్రి 8 గంటలకు దేశ ప్రజలను ఉద్దేశించి నేను మాట్లాడుతూ దేశంలో మార్పు తీసుకురావడానికి ఒక మహోన్నత పథకాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పాను. ఈ నిర్ణయాన్ని తీసుకొన్నప్పుడు, మీ ముందు ఈ విషయాన్ని పెట్టినప్పుడు, ఈ నిర్ణయం సామాన్యమైనది కాదని, కష్టాలతో కూడుకొని ఉన్నదని నేను బాహాటంగా మీకందరికీ చెప్పాను. ఇది ఎంతో ముఖ్యమైన నిర్ణయం అయితే దీనిని అమలుచేయడం కూడా అంతే ముఖ్యమైంది కూడా. దీని వల్ల మనం మన దైనందిన జీవనంలో వేరు వేరు కొత్త కష్టాలను ఎదుర్కొనవలసి వస్తుందన్న సంగతిని కూడా నేను గ్రహించాను. ఈ నిర్ణయం ముఖ్యమైందని, దీని ప్రభావం నుండి బయటపడడానికి 50 రోజులైనా పడుతుందని కూడా నేను చెప్పాను. అప్పుడుగాని మనం సాధారణ స్థితి వైపు సాగలేము. 70 ఏళ్ళ నుండి ఏ సమస్యల్లో అయితే మనం కొట్టుమిట్టాడుతున్నామో, వాటి నుండి బయటపడే కృషి సులభం కానేరదు. మీ సమస్యలను నేను పూర్తిగా అర్థం చేసుకోగలను. అయితే నా నిర్ణయాన్ని మీరు సమర్ధించడం చూస్తుంటే, దానికి మీరందిస్తున్న సహకారాన్ని చూస్తుంటే, మిమ్మల్ని తప్పుదోవ పట్టించేందుకు ఎన్నో శక్తులు ప్రయత్నిస్తున్నా, అప్పుడప్పుడూ మనసుకు బాధ కలిగించే ఘటనలు జరుగుతున్నా, వాస్తవాన్ని పూర్తిగా అర్థం చేసుకుని దేశ హితం కోసం కొన్ని సమస్యల్ని కూడా మీరు భరించడం చూస్తుంటే- నాకు ఆనందం కలుగుతోంది.
500, 1000 రూపాయల నోట్లు, మరో వైపు ఇంత పెద్ద దేశం, ఇంత పెద్ద ఎత్తున కరెన్సీ, ఈ నిర్ణయం- వీటన్నింటినీ యావత్ ప్రపంచం సునిశితంగా గమనిస్తున్నది. ప్రతి ఆర్థిక వేత్త దీనిని లోతుగా విశ్లేషిస్తున్నారు. మదింపు చేస్తున్నారు. భారతదేశంలోని 125 కోట్ల మంది సమస్యలను ఎదుర్కొంటూ కూడా సాఫల్యం పొందుతారా లేదా అని ప్రపంచమంతా చూస్తోంది. భారతదేశంలోని 125 కోట్ల మంది పట్ల ప్రభుత్వానికి అత్యంత శ్రద్ధ ఉందని, అనంతమైన విశ్వాసం ఉందని ప్రపంచం భావిస్తోంది. 125 కోట్ల మంది దేశవాసుల సంకల్పాన్ని ప్రభుత్వం నెరవేరుస్తుందని అనుకుంటోంది. మన దేశం నిక్షేపంగా అన్ని రకాలైన ప్రయత్నాలతో ఈ సమస్యను అధిగమిస్తుంది. అందుకు కారకులు ఈ దేశంలోని ప్రజలు, ఆ కారకులు మీరే. ఈ సాఫల్య మార్గం కూడా మీ వల్లనే సిద్ధిస్తుంది.
దేశ వ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, స్థానిక సంస్థల యావత్ యంత్రాంగం, లక్షా ముప్ఫయ్ వేల బ్యాంకు శాఖలు, లక్షలాదిగా ఉద్యోగులు, లక్షన్నరకు పైగా తపాలా కార్యాలయాలు, లక్షకు పైగా ‘బ్యాంకు మిత్ర’లు రాత్రింబవళ్లూ ఈ పనిలో నిమగ్నమై ఉన్నారు. అంకితభావంతో పని చేస్తున్నారు. ఎంతటి ఇబ్బంది ఏర్పడినా వీరంతా శాంత చిత్తంతో ఈ పనిని దేశ సేవా యజ్ఞంగా భావించి, ఒక మహా పరివర్తన కృషిగా భావించి పని చేస్తున్నారు.
ఉదయం పనిలో నిమగ్నమై, ఎంత రాత్రి అవుతుందో తెలియని పరిస్థితిలో పని చేస్తున్నారు. ఈ కారణం వల్ల భారతదేశం ఈ పరిస్థితిని అధిగమిస్తుందని స్పష్టంగా కనిపిస్తోంది. ఇన్ని ఇబ్బందుల మధ్య బ్యాంకులు, తపాలా కార్యాలయాల సిబ్బంది అందరూ పని చేయడం నేను చూశాను. మానవతా దృక్పథంతో వ్యవహరించే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. ఖండ్ వాలో ఒక పెద్దాయనకు ప్రమాదం జరిగింది. అప్పటికప్పుడు డబ్బులు అవసరమయ్యాయి. అక్కడ స్థానిక బ్యాంకు ఉద్యోగి ఒకరి దృష్టికి ఈ విషయం వెళ్ళింది. అతను స్వయంగా వారి ఇంటికి వెళ్ళి ఆ పెద్దాయనకు డబ్బులు అందజేశాడని నాకు తెలిసింది. ఇలా నిత్యం టీవీలో, ఇతర మాధ్యమాలలో, పత్రికలలో ఇటువంటి సంఘటనల వార్తలు తెలుస్తున్నాయి. ఈ మహా యజ్ఞం కోసం పరిశ్రమించేవారందరికీ, ప్రయత్నం చేస్తున్న వారందరికీ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పరీక్షలో ఉత్తీర్ణులైనప్పుడే అసలైన శక్తి అంచనాకు అందుతుంది. ప్రధాన మంత్రి ద్వారా జన్ ధన్ యోజన ప్రచారం జరుగుతున్నపుడు బ్యాంకు ఉద్యోగులందరూ ఆ పనిని ఏ విధంగా తమ భుజాలపైకెత్తుకుని, 70 ఏళ్ళలో చేయలేకపోయిన పనిని చేసి చూపెట్టారో నాకు బాగా గుర్తుంది. వాళ్ళ సామర్థ్యం అప్పుడు తెలిసింది. ఇవాళ మళ్ళీ ఇంకొక సారి వారు ఆ సవాలును స్వీకరించారు. 125 కోట్ల దేశ ప్రజల సంకల్పాన్ని, అందరి సామూహిక పురుషార్థం ఈ దేశాన్ని ఒక కొత్త శక్తిగా రూపొందించి విస్తృతపరుస్తుందనే నమ్మకం నాకు ఉంది.
కానీ దుర్మార్గం ఎంతగా ప్రబలిపోయి ఉందంటే ఇవాళ్టికి కూడా కొందరి దుర్మార్గపు అలవాట్లు పోవడం లేదు. ఇవాళ కూడా కొందరు ఈ అవినీతి సొమ్మునూ, ఈ నల్లధనాన్నీ, లెక్కలు చూపని సొమ్మునీ, గుప్త ధనాన్ని ఎలాగైనా, ఏ మార్గం ద్వారానైనా వ్యవస్థలోకి తీసుకురావాలని చూస్తున్నారు. వాళ్ళు తమ అవినీతి సొమ్మును రక్షించుకొనే ప్రయత్నంలో ఎన్నో సంఘ విద్రోహక మార్గాలను వెతుకుతున్నారు. ఈ పనికి కూడా వాళ్లు పేదవారిని ఉపయోగించుకునే మార్గాన్ని ఎంచుకోవడం చింతించాల్సిన విషయం. పేదవారిని ప్రలోభపెట్టి, ఆశచూపి, ప్రలోభపరిచే మాటలు చెప్పి వాళ్ళ ఖాతాల్లో డబ్బు జమ చేసి లేదా వేరే పనులు చేయించుకొని తమ దొంగ సొమ్మును రక్షించుకొనే ప్రయత్నాలు చేస్తున్నారు. మారడం, మారకపోవడం మీ ఇష్టం, చట్టానికి అనుకూలంగా ఉండడం, అనుకూలంగా ఉండకపోవడం మీ ఇష్టం.. కానీ, దయచేసి పేదల బతుకులతో ఆడుకోవద్దని మాత్రం అటువంటి వారికి ఇవాళ చెప్పాలనుకొంటున్నాను. బేనామీ స్థిరాస్తులపై ఎంతటి కఠినమైన చట్టం చేసి అమలుపరుస్తున్నామంటే ఎంతటి ఇబ్బంది ఎదురవుతుందని చూడడం లేదు. దేశ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకూడదని ప్రభుత్వం అనుకుంటోంది. మధ్య ప్రదేశ్‌లోని శ్రీ ఆశీస్ నాకు ఫోను చేసి 500, 1000 రూపాయల నోట్ల ద్వారా అవినీతికి, నల్లధనానికి వ్యతిరేకంగా మొదలుపెట్టిన యుద్ధంపై నన్ను ఇలా మెచ్చుకున్నారు..
“సార్, నమస్తే. నా పేరు ఆశీస్ పారే. నేను మధ్య ప్రదేశ్ లోని హర్దా జిల్లా తిరాలి తెహ్ శీల్ పరిధిలోని తిరాలి గ్రామానికి చెందిన ఒక సామాన్య పౌరుడిని. మీరు 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేయడం అనేది చాలా మెచ్చుకోదగ్గ సంగతి. ప్రజలు ఎన్నో ఇబ్బందులను, కష్టనష్టాలను ఓర్చుకొని కూడా దేశ ప్రగతి కోసం ఈ కఠినమైన నిర్ణయాన్ని స్వాగతించారని మీ ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం ద్వారా ఉదాహరణ పూర్వకంగా తెలుపమని కోరుతున్నాను. అది విని ప్రజలు ఉత్సాహభరితులు అవుతారు. దేశ నిర్మాణానికి నగదు రహిత ప్రణాళిక ఎంతో అవసరం. నేను ఈ పోరాటంలో యావత్ దేశంతో పాటు ఉన్నాను. మీరు ఈ 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసినందుకు నేను నిజంగా చాలా ఆనందిస్తున్నాను.”
కర్ణాటక నుండి శ్రీ ఎల్లప్ప వెలాంకర్ కూడా ఫోన్ చేసి ఇదే విధంగా ప్రతిస్పందించారు. ఆయన ఏమన్నారంటే.. “మోదీ గారూ, నమస్తే. నేను కర్ణాటకలోని కొప్పాళ్ జిల్లాలోని ఒక పల్లెటూరు నుండి ఫోన్ చేస్తున్నాను. నా పేరు ఎల్లప్ప వెలాంకర్. మీకు నేను మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలపాలనుకుంటున్నాను. మీరు మంచి రోజులు వస్తాయని చెప్పారు. కానీ, ఇలాంటి పెద్ద అడుగు వేస్తారని ఎవరూ ఊహించలేదు. 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసి నల్లధన ఆసాములకు, అవినీతిపరులకు గుణపాఠం నేర్పించారు. ప్రతి ఒక్క భారతీయుడికి ఇంత కన్నా మంచి రోజులు ఎప్పటికి రావు. అందుకనే నేను మీకు మనఃపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను.” అని ఆయన అన్నారు.
ప్రసార మాధ్యమాల ద్వారా, ప్రజల ద్వారా, ప్రభుత్వ వర్గాల ద్వారా కొన్ని విషయాలు తెలుస్తూ ఉండడం వల్ల పని చేయడానికి ఉత్సాహం రెట్టింపు అవుతుంది.
నా దేశ సామాన్య మానవుడి యొక్క అద్భుత సామర్ధ్యాన్ని చూస్తే ఎంతో ఆనందంగా, ఎంతో గర్వంగా ఉంటుంది. మహారాష్ట్రలోని అకోలాలో 6వ నెంబర్ జాతీయ రహదారిపై ఒక రెస్టారెంట్ ఉంది. మీ జేబుల్లో పాత నోట్లు ఉంటే, మీకు భోజనం చేయాలని ఉంటే, మీరు డబ్బు గురించి చింతించకండి. ఇక్కడి నుండి ఆకలితో వెళ్ళకండి. భోజనం చేసే వెళ్ళండి. మళ్ళీ ఈ దారిలో వెళ్ళే అవకాశం వస్తే తప్పకుండా డబ్బు ఇచ్చి వెళ్ళండి అని వాళ్ళు ఒక పెద్ద బోర్డు పెట్టారు. జనం అక్కడికి వెళ్ళి భోజనం చేస్తున్నారు. మళ్ళీ రెండు మూడు రోజుల్లో అటుగా వెళ్ళినప్పుడు డబ్బులు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇదీ నా దేశ శక్తి. అందులో సేవాభావం, త్యాగ భావం, నిజాయతీ లు ఇమిడి ఉన్నాయి.
నేను ఎన్నికలప్పుడు చాయ్ తాగుతూ చర్చలు జరిపే వాడిని. ఈ సంగతి ప్రపంచమంతా వ్యాపించింది. ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలు ‘చాయ్ తాగుతూ చర్చ’ అనే మాటలు పలకడం నేర్చుకున్నారు. కానీ చాయ్ తాగుతూ చేసే చర్చల ద్వారా పెళ్ళిళ్ళు కూడా జరుగుతాయని నాకు తెలియదు. నవంబర్ 17న సూరత్ లో ఒక అమ్మాయి వారింటికి పెళ్ళికి వచ్చిన వారందరికీ చాయ్ మాత్రమే తాగించింది. వేరే విందు కార్యక్రమాలు ఏమీ చేయలేదు. ఎందుకంటే నోట్ల రద్దు వల్ల కొన్ని ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. పెళ్ళివారందరూ కూడా దానిని అంతే గౌరవపూర్వకంగా స్వీకరించారు. సూరత్ లోని భరత్ మారు, దక్షా పర్మార్ లు – అవినీతికి, నల్లధనానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి వాళ్ళు తమ పెళ్ళి ద్వారా మద్దతును తెలపడం ఒక స్వయం ప్రేరణాత్మకమైన విషయం. ఈ నూతన వధూవరులకు నేను మన:పూర్వక ఆశీర్వాదం అందజేస్తున్నాను. ఈ మహాయజ్ఞంలో తమ పెళ్ళిని కూడా ఒక భాగంగా చేసి అవకాశంగా మార్చుకున్నందుకు చాలా అభినందనలు తెలుపుతున్నాను.
నేను ఒకసారి రాత్రి ఆలస్యంగా వచ్చినపుడు టీవీలో వార్తల్లో చూశాను.. అస్సాంలోని ధేకియాజులీ అనే ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ తేయాకు తోట పనివారు ఉంటారు. వాళ్ళ పనికి వారాంతంలో డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళకి 2000 రూపాయల నోటు ఇవ్వగానే వాళ్ళు ఏం చేశారంటే, ఇరుగు పొరుగున ఉన్న నలుగురు మహిళలను కలుపుకొని కొనుగోళ్లు జరిపి 2000 రూపాయల నోటు ఇచ్చారు. అందువల్ల వాళ్ళకి చిల్లర నోట్ల అవసరమే పడలేదు. ఎందుకంటే, నలుగురు కలిసి కొనుక్కుని మళ్ళీ వారం కలుసుకున్నప్పుడు ఖర్చు తాలూకూ లెక్క చేసుకోవచ్చు అని నిర్ణయించుకొన్నారు. ఈ విధంగా ప్రజలు తామే మార్గాలు వెతుక్కుంటున్నారు. ఈ మార్పును కూడా మనం గమనించవచ్చు. ప్రభుత్వానికి ఒక సందేశం వచ్చింది. అందులో టీ తోటల్లో పనిచేసే శ్రామికులు తమకు ఎటిఎమ్ కావాలని కోరారు. గ్రామాల్లో కూడా ఎటువంటి మార్పులు వస్తున్నాయో చూడండి. ఈ ప్రచారం వల్ల కొందరు వ్యక్తులకు తాత్కాలిక లాభం కలిగింది. రాబోయే రోజుల్లో దేశానికి కూడా లాభం చేకూరుతుంది. ఈ నోట్ల రద్దు ఫలితం ఎలా ఉందని నేను అడిగినప్పుడు, చిన్న చిన్న పట్టణాల్లో నుండి కొంత సమాచారం లభించింది. దాదాపు 45, 50 పట్టణాల నుండి నాకు వచ్చిన సమాచారం ప్రకారం, ఎన్నాళ్ళుగానో వసూలు కాని పాత బాకీ డబ్బు, పన్నులు, మంచినీటి పన్ను, కరెంటు బిల్లుల బకాయిలు వసూలయ్యాయి. మీకు బాగా తెలుసు- పేద ప్రజలు ఎప్పుడూ 2-3 రోజులు ముందుగానే వారి బకాయిలను తీర్చివేసే అలవాటు ఉన్నవారు. బాగా పెద్ద చేతులు ఉన్న పెద్ద మనుషులు అనే వాళ్ళే, ఎవరూ అడిగే వారుండరన్న ధీమాతో డబ్బులు ఎగవేస్తారు. అందువల్ల వారిది చాలా బాకీ ఉండిపోయేది. ప్రతి నగరపాలక సంస్థకూ అతి కష్టం మీద 50 శాతం పన్నులు మాత్రమే వసూలయ్యేవి. కానీ, ఈసారి 8వ తేదీ నిర్ణయం తరువాత అందరూ వారి వారి తమ పాత నోట్లను జమ చేయడానికి పరుగులు పెట్టారు. 47 పట్టణాల లెక్కల్లో కిందటి ఏడాది దాదాపు మూడు వేల కోట్ల రూపాయల నుండి మూడున్నర వేల కోట్ల రూపాయల పన్ను వసూలయింది. అలాంటిది.. ఈ ఒక్క వారంలో వాళ్ళకి 13 వేల కోట్ల రూపాయల పన్ను వసూలైందని విని మీరు ఆశ్చర్యపోతారు, ఆనందిస్తారు కూడా. ఎక్కడ మూడు, మూడున్నర వేలు? ఎక్కడ 13 వేల కోట్లు? అది కూడా నేరుగా వచ్చింది. ఇప్పుడా నగరపాలక సంస్థలకు నాలుగు రెట్లు డబ్బులు రావడం వల్ల మురికివాడల్లో మురుగు కాల్వల వ్యవస్థ, మంచినీటి సదుపాయాలు, అంగన్ వాడీల వ్యవస్థ ఏర్పడుతుందనడంలో సందేహం లేదు. నగరపాలక సంస్థలకు ఎన్నో రకాలైన లాభాలు ప్రత్యక్షంగా కనబడుతూ ఉన్నాయనడానికి ఇలాంటి ఎన్నో ఉదాహరణలు లభిస్తున్నాయి.
సోదర సోదరీమణులారా..
మన గ్రామాలు, రైతులు మన దేశ ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు. ఒకవైపున ఆర్థిక వ్యవస్థలో వస్తున్న కొత్త మార్పుల కారణంగా, కష్టాల మధ్య ప్రతి పౌరుడు తమకు తాము సర్దుకుపోతున్నారు. కానీ, ఇవాళ నేను నా దేశ రైతులకు ప్రత్యేకమైన ధన్యవాదాలను తెలపాలనుకుంటున్నాను. ఇప్పుడు విత్తిన పంట గణాంకాలను సమీకరిస్తున్నాను. గోధుమలైనా, ధాన్యమైనా, నూనె గింజలైనా, నవంబరు 20వ తేదీ దాకా వీటిపై నా దగ్గర లెక్క ఉంది; కిందటి ఏడాది కన్నా ఈసారి చాలా ఎక్కుగా పంట దిగుబడి పెరిగిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. ఎన్నో కష్టాల మధ్య రైతులు మార్గాలు వెతుక్కున్నారు. ప్రభుత్వం కూడా రైతులకూ, గ్రామాలకు ప్రాధాన్యం అందించే విధంగా ఎన్నో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంది. అయినా కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. కానీ, మన ప్రతి కష్టాన్నీ, ప్రకృతి విపత్తులను కూడా అధిగమిస్తూ ఎప్పుడూ ధైర్యంగా నిలబడే మన రైతు ఇప్పుడు కూడా అలానే ధైర్యంగా నిలబడతాడని నాకు నమ్మకం ఉంది.
మన దేశంలోని చిన్న వ్యాపారులు ఉద్యోగాలు ఇస్తారు. ఆర్థిక కార్యకలాపాలను కూడా ముందుకు నడిపిస్తారు. పెద్ద పెద్ద మాల్స్ వలె గ్రామాల్లోని చిన్న చిన్న దుకాణాల వారు కూడా 24 గంటలు వాళ్ళ వ్యాపారాన్ని చేసుకోవచ్చుననీ, ఏ చట్టమూ వారిని ఆపదనే ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని కిందటి బడ్జెట్టులో మేము తీసుకున్నాము. ఎందుకంటే నా అభిప్రాయం ప్రకారం, పెద్ద పెద్ద మాల్స్ 24 గంటలు వ్యాపారం చేసుకుంటున్నప్పుడు, గ్రామాల్లోని చిన్నపాటి పేద దుకాణదారుకు అదే అవకాశం ఎందుకు లభించకూడదు? ‘ముద్ర యోజన’ ద్వారా వాళ్లకు రుణం ఇవ్వడానికి అనేక చర్యలు మొదలుపెట్టాము. లక్షల, కోట్ల రూపాయలు ‘ముద్ర యోజన’ ద్వారా అటువంటి చిన్న చిన్న వ్యాపారస్తులకు రుణాలుగా ఇచ్చాము. ఎందుకంటే ఈ చిన్న వ్యాపారమే కోట్ల రూపంలో ప్రజలు చేస్తుంటారు. వందల వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని వారు నడిపిస్తారు. కానీ ఈ నోట్ల రద్దు నిర్ణయం వల్ల వారికి కూడా కొంత ఇబ్బందులు ఎదురవడం సహజమే. కానీ, నేను గమనించిందేమిటంటే, టెక్నాలజీ ద్వారా, మొబైల్ యాప్ ద్వారా, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా, క్రెడిట్ కార్డు ద్వారా నమ్మకం ఆధారంగా కూడా ఈ చిన్న చిన్న వ్యాపారులు వారి వారి పధ్ధతులలో వినియోగదారులకు సేవలను అందిస్తున్నారు. ఇదే అవకాశంగా, మీరందరూ కూడా డిజిటల్ ప్రపంచంలోకి అడుగుపెట్టాలని మన చిన్న వ్యాపార సోదర సోదరీమణులందరినీ నేను కోరుతున్నాను. మీరు కూడా మీ మొబైల్ ఫోన్ లలో బ్యాంకుల యాప్ లు డౌన్ లోడ్ చేసుకోండి. మీరు కూడా క్రెడిట్ కార్డుల పిఒఎస్ మెషిన్ ను మీ వద్ద ఉంచుకోండి. మీరు కూడా నోటు లేకుండా వ్యాపారం ఎలా చేయవచ్చునో తెలుసుకోండి. మీరు చూడండి, పెద్ద పెద్ద మాల్స్ టెక్నాలజీ మాధ్యమం ద్వారా వాటి వ్యాపారాలను ఎలా పెంపొందించుకొంటాయో, అలాగే ఒక చిన్న వ్యాపారి కూడా ఈ సాధారణ వినియోగదారులకు అనుకూలమైన టెక్నాలజీ ద్వారా తన వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఇందువల్ల అభివృద్ధికి అవకాశమే తప్ప వ్యాపారం దెబ్బతినే ప్రశ్నే లేదు. నగదు రహిత సమాజాన్ని తయారు చేయడానికి మీరు ముఖ్యమైన పాత్ర వహించగలరనే నమ్మకంతో నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మీ వ్యాపారాన్ని పెంచుకోవడానికి మొబైల్ ఫోన్ లో మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయగలరని భావిస్తున్నాను. ఇవాళ వ్యాపారం నడపడానికి నోటు రహిత అనేక మార్గాలు ఉన్నాయి. సాంకేతికపరమైన దారులు ఉన్నాయి. అవి క్షేమకరమైనవి, సురక్షితమైనవి, వేగవంతమైనవి. ఈ ప్రయత్నాన్ని విజయవంతం చేయడానికి మీరు మద్దతు ఇవ్వాల్సి ఉందని నేను కోరుకుంటున్నాను. ఇంతే కాదు, మార్పునకు మీరు నాయకత్వం వహించాలి. ఇంతే కాదు, మార్పునకు మీరు నాయకత్వం వహించాలి. అది మీరు చేయగలరని నాకు నమ్మకం ఉంది. మీరు మొత్తం గ్రామంలో ఈ టెక్నాలజీ ఆధారంగా వ్యాపారం చేసుకోవచ్చని నేను నమ్ముతున్నాను.
మీరెంతో దోపిడీకి గురయ్యారని శ్రామిక సోదర సోదరీమణులు అందరికీ నేను చెప్పదలుచుకున్నాను. కాగితంపై ఒక జీతం కనబడుతుంది. చేతికి అందే జీతం మరొకటి ఉంటుంది. ఎప్పుడైనా జీతం పూర్తిగా దొరికితే బయట నిలబడి ఉన్న వాడికి ఎంతో కొంత ఇవ్వవలసి ఉంటుంది. శ్రామికులకు ఈ దోపిడి వారి జీవనంలో ఒక తప్పనిసరి భాగంగా అయిపోయింది. ఈ కొత్త వ్యవస్థ ద్వారా మీకు కూడా బ్యాంకులో ఖాతా ఉండాలని, మీ జీతం డబ్బు మీ ఖాతాలో జమ కావాలని, తద్వారా కనీస వేతనాలు మీకు అందాలని కోరుకుంటున్నాను. ఏ కత్తిరింపులు లేకుండా మీ పూర్తి జీతం మీకు అందాలి. మీరు దోపిడీకి గురి కాకూడదు. ఒకసారి మీ బ్యాంకు ఖాతాలోకి డబ్బు రాగానే మీరు కూడా స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండా మీ చిన్న మొబైల్ ఫోన్ లోనే లావాదేవీలు జరుపుకోవచ్చు. ఇవాళ్టి రోజున మీ మొబైల్ ఫోన్ కూడా ఇ-పర్స్ రూపంలో పని చేస్తుంది. ఇరుగు పొరుగున ఉన్న చిన్నపాటి దుకాణాల్లో కొనుగోళ్ళు జరుపుకోవచ్చు. ఫోను ద్వారానే పైకాన్ని చెల్లించవచ్చు.
అందుకనే శ్రామిక సోదర సోదరీమణులందరినీ ఈ ప్రణాళికలో భాగస్వాములను చేయాలని విశేషంగా కోరుకుంటున్నాను. ఎందుకంటే, చివరిగా ఇంత పెద్ద నిర్ణయాన్ని నేను దేశంలోని పేద ప్రజల కోసం, రైతుల కోసం, శ్రామికుల కోసం, వంచితుల కోసం, పీడితుల కోసం, వాళ్ళ హక్కు వారికి అందడం కోసమే తీసుకున్నాను. ఇవాళ నేను ముఖ్యంగా యువ మిత్రులతో మాట్లాడాలనుకుంటున్నాను. భారతదేశ జనాభాలో 65 శాతం జనాభా 35 ఏళ్ళ లోపు వయస్సు వారేనని మనం ప్రపంచానికి గొప్పగా చెప్పుకొంటాము. నా దేశ యువతీయువకులారా.. నా నిర్ణయం మీకు నచ్చిందని నాకు తెలుసు. మీరంతా ఈ నిర్ణయాన్ని సమర్ధిస్తున్నారని కూడా నేనెరుగుదును. ప్రయోజనకరమైన ఈ విషయాన్ని ముందుకు తీసుకువెళ్ళడానికి మీరంతా సహకరిస్తారని కూడా నాకు ఎరుకే. అయితే మిత్రులారా.. మీరే నా నిజమైన నేస్తాలు. తల్లి భారతికి సేవ చేసుకునే ఒక అద్భుతమైన అవకాశం మనకు అందరికీ వచ్చింది.
దేశాన్ని ఆర్థికపరంగా ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళగలిగే అవకాశం మనకు లభించింది. నా యువతీయువకులారా, మీరు నాకు సాయం చేయగలరా? ఇది ఇంతటితో పూర్తయ్యే విషయం కాదు. నాకు తోడుగా నిలుస్తారా? ఇవాళ మీకున్న ప్రపంచానుభవం పాత తరానికి లేదు. మీ కుటుంబంలో పెద్దన్నకు కూడా మీకున్న ప్రపంచ జ్ఞానం తెలిసి ఉండకపోవచ్చు. అమ్మ, నాన్న, పిన్ని, బాబాయి, అత్త, మామలకు కూడా లేకపోవచ్చు. ‘యాప్’ అంటే ఏమిటో మీకు తెలుసు. ‘ఆన్ లైన్ బ్యాంకింగ్’ ఏమిటో మీకు తెలుసు. ‘ఆన్ లైన్ టికెట్ బుకింగ్’ ఎలా చేస్తారో మీకు తెలుసు. మీకు ఇవన్నీ చాలా సాధారణ విషయాలు. మీరు ఉపయోగించగలరు కూడా. కానీ, ఇవాళ దేశం ‘నగదుకు తావులేని సమాజం’ అనే ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టింది. అదే మన స్వప్నం. నూటికి నూరు పాళ్ళు నగదు రహిత సమాజం సంభవం కాదని మనకు తెలుసు. అందుకని ‘తక్కువ నగదు సమాజం’ దిశగా భారతదేశం ఎందుకు అడుగు వేయకూడదు? ఒకసారి ఇవాళ మనం ‘తక్కువ నగదు సమాజం’ దిశగా అడుగు వేస్తే, ఇక నగదు రహిత సమాజం అనే గమ్యం ఎంతో దూరం లేదు. అందుకోసం నాకు మీ సహాయం కావాలి. మీ సమయం కావాలి. మీ సంకల్పం కావాలి. మీరు నన్ను ఎప్పుడూ నిరాశపరచరని నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే మనమందరమూ భారతదేశ పేద ప్రజల జీవితాల్లో మార్పు రావాలని కోరుకునే వాళ్ళమే. నగదు రహిత సమాజం కోసం, డిజిటల్ బ్యాంకింగ్ కోసం, లేదా మొబైల్ బ్యాంకింగ్ కోసం ఎన్ని అవకాశాలు ఉన్నాయో మీకు తెలుసు. ప్రతి బ్యాంకు ఆన్ లైన్ సదుపాయం కల్పిస్తుంది. భారతేదశంలో ప్రతి బ్యాంకుకు వారి ‘మొబైల్ యాప్’ అంటూ ఉంది. ప్రతి బ్యాంక్ కు వాళ్ళ వాలెట్ అంటూ ఉంది. వాలెట్ అంటే ఇ-పర్స్ అని సాధారణ అర్థం. రక రకాల కార్డులు కూడా లభిస్తున్నాయి. జన్ ధన్ పథకం ద్వారా భారతదేశంలోని కోట్లాది పేద కుటుంబాల దగ్గర రూపే కార్డులు ఉన్నాయి. ఇంకా 8వ తేదీకి ముందు రూపే కార్డ్ ఉపయోగం బాగా తక్కువగా ఉండేది. ఇప్పుడు పేదలు రూపే కార్డ్ వాడడం మొదలుపెట్టారు. అందులో దగ్గర దగ్గరగా 300 శాతం అభివృద్ధి జరిగింది. మొబైల్ ఫోన్ లో ప్రీపెయిడ్ కార్డు ఉన్నట్లే, బ్యాంకులో కూడా డబ్బు ఖర్చుపెట్టడానికి ప్రీపెయిడ్ కార్డు దొరుకుతుంది. వ్యాపారం చేయడానికి ఒక యుపిఐ చాలా ఉపయోగకరమైన వేదిక. దీనితో కొనుగోలు చేయవచ్చు, డబ్బు పంపవచ్చు, డబ్బు తీసుకోవచ్చు కూడా. ఈ పని మీరు వాట్సప్ (WhatsApp) మెసేజ్ లు పంపినంత తేలిక.
చదువు రాని వ్యక్తికి కూడా ఈ రోజున వాట్సప్ చేయడం, మెసేజ్ పంపడం, ఫార్వర్డ్ చేయడం వచ్చు. ఇంతేకాక టెక్నాలజీ ఇవాళ ఎంత సులభమైందంటే ఈ పనికోసం పెద్ద స్మార్ట్ ఫోను అవసరం కూడా లేదు. మామూలు చిన్నపాటి సాధారణ సౌకర్యాలు ఉన్న ఫోను ద్వారా కూడా నగదు బదిలీ అవుతుంది. బట్టలు ఉతికేవారయినా, కూరగాయల వ్యాపారి అయినా, పాల వ్యాపారి అయినా, వార్తా పత్రికలు అమ్మే వారైనా, చాయ్ అమ్మే వారైనా, శనగలు అమ్మే వారైనా, ఎవరైనా సరే దీనిని సులభంగా ఉపయోగించుకోచ్చు. ఈ వ్యవస్థను ఇంకా సులభతరం చేయడానికి నేను గట్టి ప్రయత్నం చేస్తున్నాను. అన్ని బ్యాంకులు ఈ పనిని మొదలుపెట్టాయి. ఇదే పని చేస్తున్నాయి. ఇప్పుడు ఆన్ లైన్ సర్ చార్జ్ ను కూడా రద్దు చేశాము. గత రెండు మూడు రోజులుగా వార్తా పత్రికలలో మీరు చూసే ఉంటారు; నగదు రహిత సమాజ ఉద్యమానికి బలం చేకూరాలనే ఉద్దేశంతో ఇలాంటి కార్డుపరమైన ఇతర ఖర్చులను కూడా మేము రద్దు చేశాము.
ఓ నా యువ మిత్రులారా… ఇదంతా జరుగుతున్నా కూడా, ఇవన్నీ ఏమీ తెలియకుండా ఉన్న ఒక తరం ఉంది. మీరంతా ఈ గొప్ప కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారని నాకు బాగా తెలుసు. వాట్సప్ లో మీరు ఇచ్చే సృజనాత్మక సందేశాలు – నినాదాలు, కవితలు, కథలు, కార్టూన్లు, కొత్త కొత్త ఆలోచనలు, హాస్యం- అంతా నేను చూస్తున్నాను. ఈ సవాళ్ళ మధ్య మన యువతరం సృజనాత్మక శక్తిని చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే, ఒకప్పుడు యుద్ధ మైదానంలో భగవద్గీత జన్మించింది. అలానే ఇవాళ ఇంతటి మార్పులు జరుగుతున్న కాలంలో మనం ప్రయాణిస్తున్నప్పుడు కూడా మీలోని మౌలికమైన సృజనాత్మక ప్రకటితమవుతోంది. కానీ, ప్రియమైన నా యువ మిత్రులారా.. ఈ పనిలో నాకు మీ సహాయం కావాలి. మీరంతా ముఖ్యంగా కోట్లాది యువతరం నాకు ఈ సహాయం చేస్తారని నాకు నమ్మకం ఉంది. మీరొక పని చేయండి.. స్వయంగా నగదు రహిత సమాజ నిర్మాణంలో భాగమవుతామని ఈ రోజే సంకల్పించండి.
మీ మొబైల్ ఫోన్ లో ఆన్ లైన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి సాంకేతిక పరిజ్ఞానం లభిస్తుంది. అంతే కాదు ప్రతి రోజూ గంట, రెండు గంటలు కేటాయించి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, తమ బ్యాంకు యాప్ ను ఏ విధంగా డౌన్ లోడ్ చేయాలి? మీ ఖాతాలో ఉన్న డబ్బును ఏ విధంగా ఖర్చు చేయాలి? దుకాణదారుకు ఏ విధంగా చెల్లించాలి? దుకాణదారు కూడా టెక్నాలజీ ద్వారా ఏ విధంగా వ్యాపారం చేయవచ్చుననే విషయంలో శిక్షణ ఇవ్వండి. నగదురహిత సమాజానికై, నోట్ల తిప్పలు తప్పించే కార్యక్రమం కోసమై, దేశంలో అవినీతిని అంతమొందించే కార్యక్రమం కోసం, నల్లధనం నుండి విముక్తిని కల్పించే కార్యక్రమం కోసం, ప్రజలకు కష్టనష్టాలు లేకుండా చేసే కార్యక్రమం కోసం మీరు నాయకత్వం వహించాలి. పేదలకు ఒకసారి రూపే కార్డ్ ఉపయోగించే విధానాన్ని నేర్పారంటే, వారి ఆశీర్వాదాలు మీకు లభిస్తాయి.
ఈ వ్యవస్థను గురించి సామాన్యులకు నేర్పిస్తే వారికి చింతల నుండి ముక్తి లభిస్తుంది. ఈ పనిని దేశంలోని యువతీ యువకులందరూ చేయాలి. దీనికి ఎక్కువ సమయం కూడా పట్టదు. నెల రోజుల లోపు ప్రపంచంలోని ఒక నూతన ఆధునిక భారతదేశంగా మనం నిలబడగలుగుతాము. ఈ పనిని మీరు మొబైల్ ఫోన్ ద్వారా చేయగలరు. రోజుకు పది ఇళ్ళకు వెళ్ళి ఈ పని చేయండి. ఆ పది ఇళ్ళకు అనుసంధానం ఏర్పరచండి. మిమ్మల్నందరినీ ఆహ్వానిస్తున్నాను నేను. రండి. ఊరికే సమర్ధించడం కాదు. ఈ పరివర్తనకు ఒక సేనానిగా మారితే మార్పు తీసుకొచ్చి తీరగలుగుతాము.
దేశాన్ని అవినీతి బారి నుండి, నల్లధనం బారి నుండి విముక్తం చేసే ఈ యుద్ధాన్ని మనం ముందుకు తీసుకెళదాం. ప్రజాజీవితంలో నవ యువత మార్పును తీసుకువచ్చిన దేశాలు ప్రపంచంలో అనేకం ఉన్నాయి. యువతే మార్పు తీసుకువస్తుంది. యువత వల్లే విప్లవం వస్తుంది. ఈ విషయాన్ని అంగీకరించవలసిందే. కెన్యాలో ఇటువంటి మార్పునే యువత తీసుకువచ్చింది. ఎమ్-పాస్ లో ఇలాంటి మొబైల్ వ్యవస్థను అభివృద్ధిపరిచింది. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించింది. ఈనాడు ఆఫ్రికాలోని ఈ ప్రాంతంలో కెన్యా పూర్తిగా అన్ని వ్యవహారాలకు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించే దిశగా మార్పు చెందింది. ఈ విధంగా ఈ దేశం గొప్ప విప్లవాన్ని తెచ్చింది.
నా యువతీ యువకులారా…. ఈ కృషిని మరింత ముందుకు తీసుకువెళ్లాలని మిమ్మల్ని మరీ మరీ కోరుతున్నాను. ప్రతి పాఠశాల, విశ్వవిద్యాలయం, ఎన్ సి సి, ఎన్ ఎస్ ఎస్ – వ్యష్టిగాను, సమష్ఠిగాను ఈ కృషిలో పాలుపంచుకోవాలంటూ మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. మనకు దేశ సేవ చేసే ఉత్తమ తరుణం వచ్చింది. ఈ అవకాశాన్ని జారవిడుచుకోకుండా పని చేద్దాము.
ప్రియమైన సోదర సోదరీమణులారా.. మన దేశానికంతటికీ మహాకవి అయిన శ్రీమాన్ హరివంశ్ రాయ్ బచ్చన్ గారి జయంతిని ఈనాడు జరుపుకుంటున్నాం. హరివంశరాయ్ బచ్చన్ గారి జయంతి సందర్భంగా శ్రీమాన్ అమితాబ్ బచ్చన్ “స్వచ్ఛతా అభియాన్” కోసం ఒక నినాదం ఇచ్చారు. ఈ శతాబ్దంలోనే అత్యున్నతమైన ప్రజాభిమానాన్ని చూరగొన్న అమితాబ్ గారు స్వచ్ఛత కార్యక్రమాన్ని ఎంతో మనసుపెట్టి కొనసాగిస్తున్నారని మీకు తెలుసు. వారి తండ్రి జయంతి నాడు కూడా స్వచ్ఛత కార్యక్రమానికే ప్రాధాన్యం ఇవ్వడం చూస్తుంటే.. ఈ కార్యక్రమం వారి నరనరాన ఎంతగా స్థానం సంపాదించుకుందో మనకు అర్థమవుతుంది. వారు హరివంశరాయ్ గారి ఒక కవిత లోని పంక్తిని రాశారు. “మట్టి దేహం, ఆనందమయమైన మనస్సు, క్షణభంగురమైన జీవితం – నా పరిచయం” అన్నారు. ఈ పంక్తి ద్వారా హరివంశరాయ్ గారు తమను పరిచయం చేసుకునేవారు. అయితే వారి కుమారుడు శ్రీ అమితాబ్ ఆ పంక్తిని స్వచ్ఛ భారత్ కు వర్తింపజేస్తూ.. ఈ విధంగా సవరించి పంపారు. “స్వచ్ఛమైన తనువు, స్వచ్ఛమైన మనస్సు, స్వచ్ఛమైన భారత్ – నా పరిచయం” హరివంశరాయ్ గారికి ఆదర పూర్వకమైన నమస్సులు అర్పిస్తున్నాను. స్వచ్ఛత ఉద్యమాన్ని అణువణువున నింపుకున్న అమితాబ్ – తండ్రి కవితను మలచి, స్వచ్ఛతా స్ఫూర్తిని వ్యాప్తి చేస్తున్నందుకు అమితాబ్ గారికి కూడా ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా… మై గవ్ లో, నరేంద్ర మోదీ యాప్ లో సందేశాలు, లేఖల ద్వారా పంపుతున్న మీ అభిప్రాయాలు, మీ భావాలు – మిమ్మల్నీ, నన్ను కలుపుతున్నాయి. వీటన్నింటికీ ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) వేదికగా నిలుస్తోంది. ఇప్పుడు 11 గంటలకు ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ప్రసారమవుతోంది. ఇది పూర్తయిన వెంటనే ప్రాంతీయ భాషలలో కూడా ప్రసారమవుతుంది. హిందీ భాషను విరివిగా వాడని ప్రాంతాల్లోని నా దేశవాసులను కూడా ఈ కార్యక్రమంతో అనుసంధానం చేయడానికి ఈ నూతన కార్యక్రమాన్ని చేపట్టినందుకు ఆకాశవాణికి నేను కృతజ్ఞడిని. మీ అందరికీ అనేకానేక ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశ వాసులారా,
మీకందరికీ దీపావళి పండుగ సందర్భంగా నా హార్దిక శుభాకాంక్షలు. దేశం అంతటా ఉత్సాహంగా, ఉల్లాసంగా దీపావళి పండుగను జరుపుకొంటున్నారు. భారతదేశంలో 365 రోజులు ఎక్కడో ఒక చోట.. ఏదో ఒక ఉత్సవం జరుగుతూనే ఉంటుంది. దూరం నుండి చూసే వారికి భారతీయ జీవన స్రవంతిలో పండుగలు, పర్వాలు, ఉత్సవాలు అవిభాజ్య అంశాలుగా కనిపిస్తాయి. వేద కాలం నుండి నేటి దాకా భారతదేశంలో అనాదిగా అనేక ఉత్సవాలు జరుగుతూ వస్తున్నాయి. కొన్నింటిలో సమయానుసారంగా కొన్ని మార్పులు జరిగాయి. కాలం చెల్లిన ఉత్సవాలను ఆపివేసే ధైర్యాన్ని మనవాళ్లు ప్రదర్శించారు. ఆధునిక సమాజానికి తగినట్లుగా ఉత్సవాలలో కొన్ని మార్పులు కూడా చేయడం జరిగింది.
అయితే ఈ ఉత్సవాలలో, వాటి పరిణామంలో, పండుగల వ్యాప్తిలో, జన హృదయాల్లో చోటు సంపాదించుకున్న తీరు వెనుక- వ్యక్తి నుండి సమష్ఠిలోకి పయనించడం- అనే మూల సూత్రం దాగి ఉంది. వ్యక్తి వ్యక్తిత్వ పరిధిని విస్తరించడానికి, పరిమితమైన తన ఆలోచనా వలయాన్ని సమాజం నుండి బ్రహ్మాండం దాకా విస్తృతపరిచేందుకు ఈ పండుగలు ఉపయోగపడుతున్నాయి. ఇది ఈ ఉత్సవాల ద్వారానే సాధ్యమవుతుంది. పండుగలంటే పైకి వివిధ రకాల భోజ్య పదార్థాలను ఆరగించే కార్యక్రమం అనిపిస్తుంది. ఏ రుతువులో ఏ ఆహారం ఆరోగ్యానికి మంచిదో, అటువంటి తిండి పదార్థాలనే ఆయా రుతువులలో తయారు చేస్తారు. రైతులు ఆయా రుతువుల్లో పండించే పంటలన్నింటినీ ఉత్సవాలలో ఎలా ఉపయోగించాలి అనేదే మనకు ప్రధానం.
ఆరోగ్యం దృష్ట్యా పదార్థాలు స్వీకరించడంలో ఎటువంటి మార్పులు చేయాలి.. ఈ విషయాలన్నింటినీ మన పూర్వులు చక్కగా ఆలోచించి వైజ్ఞానికమైన దృక్పథంతో పండుగలను రూపొందించారు. ప్రపంచమంతా ఇవాళ పర్యావరణాన్ని గురించే చర్చిస్తోంది. ప్రకృతి వినాశనమే చర్చనీయాంశంగా ఉంది. మన దేశంలో ఉన్న పండుగల పరంపర విధానం ప్రకృతి పట్ల మన ప్రేమను మరింత బలోపేతం చేస్తుంది. పిల్లల నుండి మొదలుకొని ప్రతి వ్యక్తిలో సంస్కారాన్ని కలిగిస్తాయి. వృక్షాలు కానివ్వండి.. మొక్కలు కానివ్వండి, నదులు కానివ్వండి.. పశువులు, పర్వతాలు, పక్షులు కానివ్వండి.. వీటన్నింటి పట్ల బాధ్యతాయుతమైన భావాన్ని కలిగించడమే పండుగల లక్ష్యం. ఇప్పట్లో మనం ప్రతి ఆదివారం సెలవు తీసుకొంటున్నాము. అయితే – మన పెద్ద తరం వారు, కూలి నాలి చేసుకునే వారు, బెస్త వారు, పాత తరానికి చెందిన వ్యక్తులంతా పున్నమికి లేదా అమావాస్యకు సముద్ర జలాల్లో ఎటువంటి మార్పులు వస్తాయో.. ఆ సమయంలో ప్రకృతి లోని ఏయే రకాలైన వాటిపై ఆ ప్రభావం ఉంటుందో విజ్ఞానం మనకు వివరించింది. ఈ ప్రభావం మనిషి మనస్సు మీద కూడా పడుతుంది. ఈ రకంగా మనం తీసుకొనే సెలవు కూడా బ్రహ్మాండంతో, విజ్ఞానంతో ముడిపడిన పరంపర మన చరిత్రకు ఉంది.
ప్రతి పండుగ మనకు ఏదో ఒక పాఠం నేర్పే విధంగా, ఆ విధమైన సందేశాన్ని అందించేదిగా ఉంది. దీపావళి కూడా అటువంటిదే. దీపావళి పండుగ ‘తమసో మ జ్యోతిర్గమయ’.. అంటే చీకటి నుండి వెలుగులోకి వెళ్లడమనే సందేశాన్ని అందిస్తుంది. చీకటి అంటే వెలుగు లేకపోవడం మాత్రమే కాదు; మూఢ విశ్వాసాలు కూడా అంధకారం. విద్య లేకపోవడం కూడా అంధకారమే. పేదరికమూ ఒక పెద్ద అంధకారమే. సామాజిక దురాచారాలు మరొక అంధకారం. దీపావళి పర్వదినం సందర్భంగా దీపాలను వెలిగించి, సమాజంలోని పాపాల అంధకారాన్ని తొలగిద్దాము. వ్యక్తిత్వాలపై అలుముకున్న దోషాలను, చీకట్లను కూడా తరిమికొడదాం. అప్పుడే నిజమైన వెలుగులు వెలిగి దివ్యమైన దివ్వెల పండుగగా మారిపోతుంది.
ఒక విషయం మనకు బాగా తెలుసు. అదేమిటంటే, భారతదేశంలో మీకు ఏ మూలకు వెళ్ళినా.. అత్యంత సంపన్నుల వద్దకు వెళ్ళినా, నిరుపేద పూరి గుడిసెలోకి వెళ్ళినా దీపావళి పండుగ నాడు ప్రతి కుటుంబంలో స్వచ్ఛతా కార్యక్రమం చక్కగా సాగడాన్ని మనం గమనిస్తాము. ఇంట్లో అడుగడుగూ పరిశుభ్రంగా ఉంటుంది. నిరుపేద ఇంట్లో మట్టి పాత్రలు ఉండవచ్చు; వాటిని కూడా చక్కగా శుభ్రపరచుకుని ఉంటారు. అవి చూస్తేనే ఇవాళ దీపావళి పండుగ అని అనిపిస్తుంది. దీపావళి పండుగ పరిశుభ్రతకు సంబంధించిన ఒక సంకేతం కూడా. అయితే పరిశుభ్రత అంటే ఒక్క మీ ఇంట్లో పరిశుభ్రత మాత్రమే కాదు, మీ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలి. వీధులన్నీ పరిశుభ్రంగా ఉండాలి. గ్రామమంతా స్వచ్ఛంగా కనిపించాలి. మనం ఈ భావన మనందరిలో జీర్ణించుకొనేటట్లు మన పిల్లలలోనూ ఈ భావన వ్యాపించేలాగా చూడాలి.
దీపావళి పండుగ నేడు మన ఒక్క దేశానికే పరిమితం కాలేదు. ప్రపంచంలో అన్ని దేశాలు దీపావళి పండుగను ఏదో రూపంలో గుర్తు చేస్తూ జరుపుకుంటున్నాయి. ప్రపంచంలోని ప్రభుత్వాలు కూడా.. పార్లమెంట్ కూడా.. అక్కడి పాలకులు కూడా.. దీపావళి పర్వదినంలో భాగస్వాములు అవుతున్నారు. తూర్పు దేశాలు కావచ్చు. పాశ్చాత్య దేశాలు కావచ్చు. అభివృద్ధి చెందిన దేశాలు కావచ్చు. అభివృద్ధి చెందుతున్న దేశాలు కావచ్చు. ఆఫ్రికా కానివ్వండి.. ఐర్లాండ్ కానివ్వండి. దూరదూరానా దీపావళి ఘనంగా కానవస్తుంది. మీకు తెలిసే ఉంటుంది. అమెరికా లోని తపాలా శాఖ ఈసారి దీపావళి సందర్భంగా ఒక తపాలా బిళ్లను జారీ చేసింది. కెనడా ప్రధాని దీపావళి సందర్భంగా దీపం వెలిగిస్తూ ఉన్న చిత్రాన్ని ట్విటర్ లో పెట్టారు. బ్రిటన్ ప్రధాని థెరెసా మే లండన్ లో దీపావళి సందర్భంగా అన్ని వర్గాల ప్రజలతో ఒక స్వాగత సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఆమె స్వయంగా పాల్గొన్నారు కూడా. బ్రిటన్ లో అన్ని చోట్లా దీపావళి వెలుగులు విరజిమ్ముతున్నాయి. దీపావళి జరుపుకోని ప్రాంతం అనేది ఆ దేశంలో ఎక్కడా కనిపించదు. సింగపూర్ ప్రధాని ఇన్ స్టాగ్రామ్ పై ఒక చిత్రాన్ని ఎంతో గౌరవంగా షేర్ చేశారు. ఇంతకూ ఆ చిత్రంలో ఏముందనుకున్నారు ? సింగపూర్ పార్లమెంట్ లోని 16 మంది మహిళా సభ్యులు భారతీయ సంప్రదాయ చీరలను ధరించి పార్లమెంట్ బయట నిలబడి ఫొటో దిగారు. ఇదంతా దీపావళి సందర్భంగానే చేయడం జరిగింది. సింగపూర్ లో ప్రతి వీధిలో ఇప్పడు దీపావళిని జరుపుకొంటున్నారు. ఆస్ట్రేలియా ప్రధాని భారత ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు పంపించారు. ఆస్ట్రేలియాలోని వివిధ నగరాలలో దీపావళి పండుగ జరుపుకోవాల్సిందిగా కోరడం జరిగింది. న్యూజీలాండ్ ప్రధాని మన దేశానికి వచ్చారు. ఆయన తాను త్వరగా తన దేశానికి వెళ్లిపోవాలని నాతో అన్నారు. దానికి కారణం ఒక్కటే.. తమ దేశంలో ఆయన దీపావళిలో పాల్గొనాల్సివుందన్నారు. మొత్తానికి నేను చెప్పిన అంశాల సారాంశం ఏమంటే – వెలుగుల పండగైన దీపావళి మొత్తం ప్రపంచాన్ని చీకటి నుండి వెలుగులోకి తీసుకువెళ్లే ఒక సందేశాన్ని ఇస్తున్నది.
దీపావళి పండుగ నాడు కొత్త బట్టలు కట్టుకోవడం, కమ్మని భోజనం చేయడమే కాకుండా టపాకాయలను కాలుస్తారు. ఈ పండుగ పిల్లలకు, యువకులకు మహదానందాన్ని కలిగిస్తుంది. అయితే ఒక్కొక్క సారి పిల్లలు దుస్సాహసాలకు పాల్పడుతుంటారు. ఒక్కొక్క సారి టపాసులన్నింటినీ ఒకే చోట పెట్టి పెద్ద శబ్దం వచ్చే ప్రయత్నం చేస్తుంటారు. దీనివల్ల అనుకోని ప్రమాదం కూడా జరిగే అవకాశం ఉంది. కొన్ని సార్లు చుట్టుపక్కల ఏ యే వస్తువులు ఉన్నాయి ? నిప్పు అంటుకుంటే అగ్ని ప్రమాదం జరుగుతుంది అనే విషయమే గుర్తుండదు. దీపావళి రోజున ఇలాంటి ఘటనలు, అగ్ని ప్రమాద వార్తలు, మరణ వార్తలు ఎంతో బాధ కలిగిస్తాయి. దీపావళి పండుగ రోజున వైద్యులంతా కూడా వారి వారి కుటుంబ సభ్యులతో పాటు దీపావళి పండుగ జరుపుకొనేందుకు తరలివెళ్తారు. దీంతో గాయపడిన వారికి వైద్యాన్ని అందించే నాథుడే లేక మనం ఆపదలో కొట్టుమిట్టాడుతాము. తల్లితండ్రులకు, సంరక్షకులకు నా మనవి ఏమంటే – టపాకాయలు కాల్చే వేళ పిల్లల పక్కన పెద్దలు నిలబడి ఉండండి. ఎటువంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోండి.
భారతదేశంలో దీపావళి ఒక సుదీర్ఘమైన పండుగ. ఇది కేవలం ఒక్కరోజులో జరుపుకోవడం అనేది ఉండదు. గోవర్థన పూజ కావచ్చు.. భాయీ దూజ్ కావచ్చు.. లాభ పంచమి కావచ్చు.. కార్తీక పౌర్ణమి కావచ్చు.. ఇవన్నీ వెలుగుల వైపు మనల్ని తీసుకువెళ్లే మహోత్సవాలు. వీటితో మనమంతా దీపావళి పండుగను జరుపుకుంటాం. ఛఠ్ పూజకు ఏర్పాట్లు కూడా చేసుకొంటాము.
భారతదేశంలో తూర్పు ప్రాంతంలో ఛఠ్ పూజ ఒక పెద్ద పండుగ. ఈ మహా పర్వదినం నాలుగు రోజుల పాటు జరుగుతుంది. ఈ పండుగలో ఒక విశేషం కూడా ఉంది.. సమాజానికి ఈ పర్వదినం ఒక మహత్తర సందేశాన్ని అందిస్తుంది. సూర్య భగవానుడు మనకు అన్నీ అందిస్తున్నాడు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకు సూర్యుడే దేవుడు. సూర్యుడిని ఉపాసన చేయడమే ఛఠ్ పర్వ లక్ష్యం. అయితే మామూలుగా మనమంతా ఉదయించే సూర్యుడిని పూజిస్తాం. కానీ, ఛఠ్ పూజలో అస్తమిస్తున్న సూర్యుడిని పూజించడం జరుగుతుంది. ఇందులో ఒక మహత్తరమైన సందేశం దాగి ఉంది.
నేను దీపావళిని గురించి చెబుతున్నప్పటికీ లేక ఛఠ్ పూజను గురించి చెబుతున్నప్పటికీ ఈ పండుగల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు అందించడం కోసమే కాదు. ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ నేను ధన్యవాదాలను సమర్పించవలసిన అవసరం కూడా ఉంది. కొన్ని నెలలుగా జరుగుతున్న కొన్ని సంఘటనలు మనకు విషాదాన్ని మిగిల్చాయి. మన సైనికులు మన సుఖ సంతోషాల కోసం వారిని వారు అర్పణం చేస్తున్నారు. మన జవానులు, భద్రత సిబ్బంది చేస్తున్న త్యాగాలు, తపస్సు, పరిశ్రమ.. ఇవన్నీ నా మనస్సంతా నిండిపోయాయి. అందుకే ఈ దీపావళి పర్వదినాన్ని రక్షణ సిబ్బందికి అంకితం చేయాలని నా మనస్సుకు అనిపించింది. నా దేశ ప్రజలకు ‘సందేశ్ టు సోల్జర్స్’ అనే ఒక కార్యక్రమాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేశాను. దేశంలోని ప్రజలందరి హృదయాలలో సైనికుల పట్ల అసమానమైన ప్రేమ ఉంది; గౌరవం ఉంది. ఈ భావనలు ప్రజలు పంపిన సందేశాల ద్వారా పెల్లుబికాయని ఈనాడు శిరస్సు వంచి మీకు వినయ పూర్వకంగా తెలియజేస్తున్నాను. ఇవన్నీ మనకందరికీ సరికొత్త బలాన్ని అందిస్తాయి. రక్షణ సిబ్బందికి, సైనికులకు మన దేశ ప్రజలు అందించిన సందేశాలు వారిలో మనోబలాన్ని బాగా పెంపొందింపజేశాయి. దీనిని మనం మాటలలో చెప్పలేము. బడి పిల్లలు, కళాశాల విద్యార్థులు, పల్లెలలో నివసించే వారు, నిరుపేదలు, వ్యాపారులు, దుకాణాలు పెట్టుకొన్న వారు, రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినీ ప్రపంచానికి చెందిన వారు.. వారు ఎవరైనా కావచ్చు; దేశ సైనికుల కోసం దీపం వెలిగించని వారు, వాళ్ల కోసం శుభ సందేశాలను పంపించని వారు.. బహుశా ఎవరూ లేరేమో అనిపిస్తుంది. ఈ దీపావళి పండుగకు ప్రసార మాధ్యమాలు కూడా జవానులకు సందేశాన్ని అందించేందుకే వాటి కర్తవ్యాన్ని నిర్వర్తించాయి. బి ఎస్ ఎఫ్ కావచ్చు, సి ఆర్ పి ఎఫ్ కావచ్చు, ఇండో- టిబెటిన్ పోలీస్ కావచ్చు, అస్సాం రైఫిల్స్, నౌకాదళం, వాయుసేన, పదాతి దళం, తీర రక్షక దళం.. వీళ్లంతా అసంఖ్యాకంగా ఉన్నారు. అందరి పేర్లు నేను చెప్పలేకపోతున్నాను. ఈ సైనికులంతా ఎన్నో కష్టాలను ఎదుర్కొంటున్నారు. మనం ఇక్కడ దీపావళి పండుగను జరుపుకొంటూ ఉంటే సైనికుడు ఎక్కడో ఎడారిలో నిలబడి ఉన్నాడు. మరొకరు హిమాలయ శిఖరాల మీద, ఇంకొకరు పారిశ్రామిక సంస్థ వద్ద కాపలాదారుగా, వేరొకరు విమానాశ్రయంలో రక్షకుడిగా.. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క బాధ్యతను నెరవేరుస్తున్నారు. పండుగ సంబరంలో ఉన్న మనం అందరమూ అదే సమయంలో వారిని గుర్తు చేసుకోవడంలో సైతం ఒక నూతన శక్తి ఉత్పన్నం అవుతుంది. ఒక్క సందేశంతో సామర్ధ్యం పెరుగుతుందన్న విషయాన్ని దేశం చేసి చూపించింది. నేను నిజంగా దేశ వాసులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. కవులు వారి కలాలతో కవితలు అల్లి, చిత్రకారులు వారి కుంచెలతో బొమ్మలు వేసి, ముగ్గులు వేసి, వ్యంగ్య చిత్రాలను గీసి- ఈ విధంగా సరస్వతీ కటాక్షం ఉన్న వారంతా తమ తమ కళలను ప్రదర్శించారు. NarendraModiApp లో, MyGov లో ఏ విధంగానైతే ప్రజలు వారి అభిప్రాయాలను ఒక ప్రవాహంలా పంపారో, అదే విధంగా కవులు, కళాకారులు వారి కవితలు, బొమ్మలు, రంగుల రూపాలలో అసంఖ్యాకంగా వారి భావాలను వ్యక్తీకరించారు. నా దేశ సైనికుల పట్ల చూపిన ఆర్ద్రమైన భావన నాలో గర్వాన్ని నింపుతోంది. ‘సందేశ్ టు సోల్జర్స్’ హ్యాష్ ట్యాగ్ కు ఎన్ని రకాల.. ఎన్ని రకాల సందేశాలు ప్రతీకాత్మకంగా వచ్చాయో ! వాటన్నింటికీ ఒక ప్రతీకగా శ్రీ మాన్ అశ్వినీకుమార్ చౌహాన్ పంపిన ఒక కవితను మీకు చదివి వినిపించాలనుకొంటున్నాను.
అశ్విని గారు ఇలా రాశారు..
‘నేను పండుగ జరుపుకొంటున్నా, సంతోషిస్తున్నా, హాయిగా నవ్వుతున్నా
నేను పండుగ జరుపుకొంటున్నా, సంతోషిస్తున్నా, హాయిగా నవ్వుతున్నా
ఇదంతా నువ్వు అక్కడ ఉన్నందువల్లే
నీకు ఈ రోజు వివరించాలనుకొంటున్నా.. అదేమిటంటే, నా స్వేచ్ఛకు సంరక్షకుడివి నువ్వే
నా స్వాతంత్ర్యానికి కారణం నువ్వు అక్కడ ఉండడమే
నేను ప్రశాంతంగా నిద్రపోతున్నా
నేను ప్రశాంతంగా నిద్రపోతున్నా, కారణం.. నువ్వు అక్కడ సరిహద్దులను కాపలా కాస్తున్నావు కదా
పర్వతాలు, గగనతలం, ఈ దేశం నీకు ప్రణమిల్లుతున్నాయి
పర్వతాలు, గగనతలం, ఈ దేశం నీకు ప్రణమిల్లుతున్నాయి
నేను కూడా కృతజ్ఞతలతో నీకు నమస్కరిస్తున్నాను ఓ సాహసవంతుడైన సైనికుడా
నేను కూడా కృతజ్ఞతలతో నీకు నమస్కరిస్తున్నాను ఓ సాహసవంతుడైన సైనికుడా
ప్రియమైన నా దేశ వాసులారా,
సోదరి శివానీ.. ఆమె పుట్టినిల్లు, మెట్టినిల్లు కూడా సైనికులతో నిండిపోయింది. ఒక సందేశాన్ని ఆమె టెలిఫోన్ ద్వారా పంపించారు. ఈ సైనిక కుటుంబ ప్రతినిధి ఏమన్నారో ఆలకిద్దాము మనము.
‘హలో ప్రధాన మంత్రి గారూ. నేనండి శివానీ మోహన్ ను మాట్లాడుతున్నాను. ఈ దీపావళి సందర్భంగా “సందేశ్ టు సోల్జర్స్” అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.. ఇది మన సోదరులలో ఒక నైతిక ఉత్తేజాన్ని ప్రసాదించినట్లుగా రుజువు అవుతోంది. నేను ఒక సైనిక కుటుంబం నుండి వచ్చాను. నా భర్త సైన్యంలో ఒక అధికారిగా పనిచేస్తున్నారు. నా తండ్రి, మామగారు.. వీరు ఇరువురు కూడా సైన్యంలో అధికారులుగా సేవలు అందించారు. అంటే, మా కుటుంబమంతా సైనికులేనన్న మాట. సరిహద్దులను కాపు కాస్తున్న జవానులు, సైనికాధికారులు ప్రేమపూర్వకమైన సందేశాలు అందుకుంటున్నారు. దీంతో వారు మహత్తరమైన స్ఫూర్తిని, ప్రోత్సాహాన్ని పొందుతున్నారు. నేను కూడా ఒక విషయాన్ని ప్రస్తావించాలనుకొంటున్నాను.. సైనికులు, సైనికాధికారులతో పాటు వారి వారి కుటుంబాలు, భార్యలు సైతం త్యాగాలు చేస్తున్నారు. అందుకని యావత్తు సైనిక సముదాయానికి అద్భుతమైన సందేశం లభిస్తోంది. మీకు కూడా నేను ఆనందదాయక దీపావళి శుభాకాంక్షలను అందజేయాలనుకొంటున్నాను. మీకు ఇవే నా ధన్యవాదాలు’.
ప్రియమైన నా దేశ వాసులారా,
సైనికోద్యోగులు కేవలం మన దేశ సరిహద్దులనే కాపలా కాస్తుంటారు నిజమే. కానీ వారు జీవితంలోని ప్రతి రంగంలోనూ వారు వారి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారు. ప్రకృతి వైపరీత్యం కావచ్చు, లేదా శాంతి భద్రత సంబంధ సంక్షోభం కావచ్చు, లేదా శత్రువులతో తలపడడం కావచ్చు, లేదా తప్పు దారి పట్టిన యువతీయువకులను తిరిగి జీవన ప్రధాన స్రవంతిలోకి తీసుకువచ్చేందుకు వారిలో ప్రేరణను రగిలించడం కావచ్చు, మన జవానులు దేశానికి సేవ చేయడంలో దేశభక్తి భావనను వారి దేహంలోని అణువణువున నింపుకొంటున్నారు.
ఒక సంఘటన నా దృష్టికి వచ్చింది. దానిని గురించి మీకు వివరిస్తాను. విజయం వెనుక కారణాలు ఏమిటి..? అనే అంశాన్ని వింటుంటే ఎంతో శక్తి వస్తుంది. ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. మీకంతా తెలిసే ఉంటుంది. హిమాచల్ ప్రదేశ్ ప్రాంతమంతా బహిరంగ మల మూత్ర విసర్జన లేని ప్రదేశంగా మారింది. ఇంతకు ముందు సిక్కిం ఆరుబయలు మల మూత్ర విసర్జన రహిత ప్రదేశంగా ప్రకటించబడింది. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ ఆ జాబితాలోకి చేరింది. నవంబర్ 1వ తేదీ నాటికి కేరళ కూడా ఈ జాబితాలో చేరనుంది. ఇన్ని విజయాలు ఎలా సాధించగలిగాం? ఈ ప్రశ్నకు నేను జవాబిస్తాను. ఐటిబిపి లో ఒక సైనికుడు ఉన్నాడు. ఆయన పేరు శ్రీ వికాస్ ఠాకూర్. హిమాచల్ ప్రదేశ్ లోని సిర్ మౌర్ జిల్లాలోని ఒక గ్రామానికి చెందిన వ్యక్తి ఈయన. ఈయన గ్రామం పేరు బధానా. ఈ సైనికుడు సెలవుల్లో తన ఊరికి వెళ్లాడు. ఈ సమయంలో గ్రామ సభ జరుగుతున్నది. అక్కడికి ఆయన చేరుకున్నాడు. గ్రామ సభలో మరుగుదొడ్ల నిర్మాణం గురించి చర్చ కొనసాగుతోంది. కొన్ని కుటుంబాలు డబ్బు కొరత వల్ల మరుగుదొడ్ల నిర్మాణాన్ని చేపట్టలేకపోయాయి. నిలువెల్లా దేశభక్తిని నింపుకున్న శ్రీ వికాస్ ఠాకూర్ తన గ్రామంలో మరుగుదొడ్ల కొరతను నివారించాల్సిందేనని భావించాడు. శత్రువులపై తుపాకీ గుళ్ల వర్షాన్ని కురిపించే ఈ సైనికుడు వెంటనే తన చెక్ బుక్ తీసి 57,000 రూపాయలను గ్రామ పంచాయతీకి విరాళంగా అందించాడు. 57 ఇళ్లలో మరుగుదొడ్ల నిర్మాణానికి ఈ ధనాన్ని వినియోగించాలని కోరాడు. దీని ద్వారా బహిరంగ విసర్జన లేని గ్రామంగా తన గ్రామాన్ని తీర్చిదిద్దాలని ఆయన సంకల్పం. శ్రీ వికాస్ ఠాకూర్ తన లక్ష్యాన్ని అందుకున్నాడు . 57 కుటుంబాలకు తలా వెయ్యి రూపాయలు ఇచ్చి స్వచ్ఛతా కార్యక్రమానికి జోరును అందించాడు. ఇటువంటి సంఘటనల వల్లనే హిమాచల్ ప్రదేశ్ బహిరంగ మల విసర్జన రహిత ప్రదేశంగా మారిపోయింది.
అలాగే.. కేరళలో కూడా జరుగుతోంది. వీటన్నింటికీ కారణమైన నవ యువకులను నేను అభినందిస్తున్నా. వాళ్లకు కృతజ్ఞతలు తెలుపుతున్నా. కేరళలో సుదూర ప్రాంతంలో, కారడవుల్లో కొన్ని గ్రామాలు ఉన్నాయి. అక్కడిదాకా నడిచి వెళ్లడమే ఒక గగనం. అలాంటి ఒక ఊరి పేరే ఇడమాలాకుడి. అందుకే ప్రజలు ఇక్కడిదాకా వెళ్లరు. ఈ గ్రామానికి సమీపంలో ఉన్న నగరంలో నివసించే ఇంజినీరింగ్ విద్యార్థులకు ఒక ఆలోచన వచ్చింది. ఇడమాలాకుడిలో మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాలి అని అనుకున్నారు. ఎన్ సి సి క్యాడెట్లు, ఎన్ ఎస్ ఎస్ వాలంటీర్లు, ఇంజినీరింగ్ విద్యార్థులంతా కలిసి మరుగుదొడ్ల నిర్మాణానికి సంకల్పించారు. మరుగుదొడ్ల నిర్మాణానికి కావలసిన ఇటుకలు, సిమెంట్ తదితర సామాగ్రిని వీళ్లంతా తమ భుజాలపై మోసుకొని రోజంతా కాలినడకన నడుస్తూ అడవి మార్గం గుండా మారుమూల గ్రామానికి చేరుకున్నారు. అందరూ కష్టపడి మరుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేశారు. మారుమూల గ్రామాన్ని బహిరంగ మల విసర్జన రహిత గ్రామంగా తీర్చిదిద్దారు. దీనివల్ల కేరళ రాష్ట్రం బహిరంగ విసర్జన రహిత రాష్ట్రంగా మారిపోయింది. గుజరాత్ లో కూడా దాదాపు 150 ప్రాంతాలు బహిరంగ విసర్జనలేని ప్రదేశాలుగా ప్రకటించబడ్డాయి. పది జిల్లాలు కూడా విసర్జన లేని ప్రాంతాలుగా మారిపోయాయి. హరియాణా కూడా నవంబర్ 1వ తేదీ నాటికి బహిరంగ విసర్జన రహిత ప్రదేశంగా మారిపోతుందన్న శుభ సందేశం మనకు అందింది. కొన్ని నెలల్లో హరియాణా రాష్ట్రమంతా స్వచ్ఛ రాష్ట్రంగా మారిపోనుంది. ప్రస్తుతానికి 7 జిల్లాలు స్వచ్ఛ జిల్లాలుగా మారాయి.
మిగతా రాష్ట్రాల్లో కూడా పనులు అత్యంత వేగవంతంగా సాగుతున్నయి. కొన్ని రాష్ట్రాల పేర్లు మాత్రమే నేను వివరించాను. అద్భుతమైన కార్యక్రమంలో పాల్గొంటున్న వివిధ రాష్ట్రాల పౌరులందరికీ నేను అభినందనలు అందిస్తున్నాను. అపరిశుభ్రత అనే అంధకారాన్ని పటాపంచలు చేయడంలో పాలుపంచుకుంటున్న నవయువకులందరికీ నా అభినందనలు.
ప్రియమైన నా దేశ వాసులారా,
ప్రభుత్వంలో ఎన్నో పథకాలు ఉన్నాయి. ఒక పథకం తరువాత అటువంటిదే మరో పథకం వస్తే మొదటి దానికి తిలోదకాలు ఇవ్వాల్సి వస్తుంది. ఈ విషయం గురించి ఎవరూ అంతగా పట్టించుకోవడం లేదు. పాత పథకంతో పాటు కొత్త పథకం కూడా అమలులో ఉంటుంది. రాబోయే పథకం కోసం వేచి ఉండటం కూడా కొనసాగుతుంది. ఇవన్నీ నడుస్తుంటాయి. గ్యాస్ ఉన్న ఇళ్లలో, విద్యుత్ శక్తి ఉన్న గృహాల్లో కిరోసిన్ అవసరం లేదు. అయితే – ప్రభుత్వాన్ని ఎవరు అడుగుతున్నారు. కిరోసిన్ కూడా వినియోగిస్తున్నారు. గ్యాస్ నూ ఉపయోగిస్తున్నారు. విద్యుత్ శక్తిని వాడుకుంటున్నారు. ఇటువంటి సందర్భంలో నిబంధనలను ఉల్లంఘించే వాళ్లకు మంచి అవకాశం లభిస్తుంది. ఈ విషయంలో హరియాణా రాష్ట్రాన్ని నేను అభినందిస్తున్నా. ఎందుకంటే కిరోసిన్ రహితమైన రాష్ట్రంగా ఇది మారిపోయింది. గ్యాస్ ఉన్నవారికి, విద్యుత్ శక్తి కనెక్షన్లు ఉన్నవారికి ఆధార్ కార్డు సంఖ్య తో అనుసంధానం చేసి అటువంటి వ్యక్తుల జాబితాను తయారుచేశారు. ఇలా దాదాపు 8 జిల్లాలు కిరోసిన్ వాడని జిల్లాలుగా మారిపోయాయి. వీళ్లు చేపట్టిన కార్యక్రమాలను గమనిస్తే త్వరలో హరియాణా రాష్ట్రం కిరోసిన్ రహిత రాష్ట్రంగా మారిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దొంగతనాలు, దోపిడీలు ఆగిపోతాయి. పర్యావరణం బాగుపడుతుంది. విదేశీ మారకద్రవ్యం బాగా మిగులుతుంది. ప్రజలకు సౌకర్యం ఏర్పడుతుంది. అయితే నిబంధనలను ఉల్లంఘించే వారికి మాత్రం కొంత ఇబ్బంది కలుగుతుంది.
ప్రియమైన నా దేశ వాసులారా,
మహాత్మ గాంధీ గారు మనకందరికీ నిరంతరం మార్గదర్శకులు. ఆయన చెప్పిన మాటలు నేటికీ మన దేశానికి మూలాధారం. ఒక కొత్త పథకాన్ని రూపొందించే వేళ మొట్టమొదటి సారిగా నిరుపేద ముఖం గుర్తు తెచ్చుకోండి. బలహీనుల ముఖాన్ని ఒకసారి అవలోకనం చేసుకోండి. మీరు అమలుచేసే పథకం ఈ నిరుపేదకు ఏమాత్రం ఉపయోగపడుతుందో ఒకసారి ఆలోచించండి. మీ పథకం వల్ల నిరుపేదకు నష్టం ఏమన్నా కలుగుతుందా అని ఆలోచించండి. దాని తరువాత మీరు నిర్ణయం తీసుకోండి. ప్రస్తుత పరిస్థితుల్లో నిరుపేదల ఆశయాలకు అనుగుణంగా నడవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆపదలు తొలగిపోవాలి. దీని కోసం మనం ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. మన పాత ఆలోచనలు ఎలా ఉన్నా ఫర్వాలేదు. ప్రస్తుతం ఆడ, మగా అనే తేడా లేకుండా అందరికీ సమానమైన సౌకర్యాలను కల్పించాలి. నేడు పాఠశాలల్లో బాలికలకు కూడా మరుగుదొడ్లు ఉన్నాయి. మగపిల్లలకు కూడా మరుగుదొడ్లు ఉన్నాయి. ఆడపిల్లల పట్ల ఉన్న భేదభావాన్ని తొలగించే దిశగా ప్రయత్నాలు జరగాలి.
ప్రభుత్వం తరపున టీకాలు వేసే కార్యక్రమం సాగుతోంది. అయినప్పటికీ లక్షలాది మంది శిశువులు టీకాలు లేకుండా బాధపడుతున్నారు. రకరకాల రోగాలకు గురవుతున్నారు. టీకా కార్యక్రమం అందరిన పిల్లలకు టీకాలు వేసే కార్యక్రమమే ‘మిషన్ ఇంద్రధనుష్’. ఈ కార్యక్రమం వల్ల శిశువుల్ని భయంకరమైన రోగాల నుండి రక్షించడం జరుగుతుంది. ఈ 21వ శతాబ్దంలో గ్రామాల్లో చీకటి అలుముకుంటే ఎంత మాత్రం సహించలేం. గ్రామాల్లో చీకటిని పారద్రోలేందుకు విద్యుత్‌్ శక్తి కార్యక్రమం కొనసాగుతోంది. ఇందులో విజయాలు సాధిస్తూ ముందడుగు వేస్తున్నాం. స్వాతంత్య్రం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత ఒక నిరుపేద తల్లి పొయ్యి మీద వంట చేయడం ద్వారా 400 సిగరెట్ల పొగను తన శరీరంలోకి పీలిస్తే ఏమవుతుంది ? ఆమె ఆరోగ్యం పాడయిపోతుంది. 5 కోట్ల కుటుంబాలకు పొగ నుండి విముక్తిని కలిగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో మనం సఫలీకృతులం అవుతున్నాము.
చిన్న వ్యాపారులు, చిన్న పరిశ్రమ పెట్టుకున్నవాళ్లు, కాయగూరలు అమ్ముకునే వారు, పాలు అమ్ముకొనే వారు, మంగలి దుకాణాల వారు… వీరంతా వడ్డీ వ్యాపారుల విష వలయంలో చిక్కుకొని సతమతం అయ్యే వారు. ముద్రా యోజన, అంకుర యోజన, జన్ ధన్ యోజన ల వంటి పథకాలతో వడ్డీ వ్యాపారుల విష వలయం నుండి వీళ్లందరికీ విముక్తి లభించింది. ఆధార్ కార్డు ద్వారా నేరుగా డబ్బు బ్యాంకు ఖాతాలోకి వెళ్లిపోతోంది. ఈ పథకం ద్వారా ఎవరికి లబ్ది కలుగుతుందో వారికి కలుగుతుంది. సామాన్యుని జీవితంలో కూడా మోసగాళ్ల బెడదను తొలగించేందుకు ప్రయత్నాలు జరగాలి. పరిస్థితుల్లో మార్పులు తేవడం మాత్రమే కాదు.. సమస్య నుండి నేరుగా విముక్తి కలిగించే కార్యక్రమాలు చేపట్టాలి.
ప్రియమైన నా దేశ వాసులారా,
రేపు అక్టోబర్ 31వ తేదీ మహాపురుషుడు, ఉక్కు మనిషి శ్రీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి జరుపుకుంటున్నాం. భారతదేశ సమైక్యతే మూల మంత్రంగా శ్రీ సర్దార్ పటేల్ జీవితాన్ని కొనసాగించారు. ఒకవైపు ఉక్కు మనిషి జయంతి పర్వదినం, మరోవైపు శ్రీమతి ఇందిరాగాంధీ వర్ధంతి కూడా. మహా పురుషుల పుణ్య స్మరణం మనం తప్పకుండా చేయాల్సిందే. అయితే – పంజాబ్ నుండి ఒక సజ్జనుడు నాకు అందించిన సందేశం నన్ను కలచివేసింది.
‘ప్రధాన మంత్రి గారికి నమస్కారం… పంజాబ్ నుండి నేను జస్ దీప్ ను మాట్లాడుతున్నాను. మీకు తెలిసిన విషయమే.. 31వ తేదీ సర్దార్ పటేల్ గారి జన్మదినం. దేశాన్ని సమైక్యతా సూత్రంలో బంధించడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహాపురుషుడు శ్రీ సర్దార్ పటేల్. అందరినీ సమానత సూత్రంలోకి తెచ్చిన మనిషి ఆయన. అలాంటి మహా పురుషుడు జన్మించిన రోజునే శ్రీమతి ఇందిరాగాంధీ హత్యకు గురయ్యారు. ఇది ఒక దురదృష్టకరమైన విషయం. ఇందిరాగాంధీ హత్యానంతరం ఎటువంటి సంఘటనలు జరిగాయో మనకంతా తెలుసు. ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా ఎలా ఆలపాలి ?’ అని అడిగారు.
ప్రియమైన నా దేశ వాసులారా,
ఈ బాధ ఒక వ్యక్తికి సంబంధించింది మాత్రమే కాదు. చాణక్యుడి తరువాత దేశాన్ని సమైక్యం చేసేందుకు భగీరథ ప్రయత్నం చేసిన వ్యక్తి శ్రీ సర్దార్ వల్లభ్ భాయి పటేల్. దీనికి చరిత్రే సాక్షి. స్వతంత్ర భారతాన్ని ఒకే గొడుగు కిందకు, ఒక జెండా కిందకు తీసుకువచ్చిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ కే దక్కుతుంది. ఈ మహాపురుషుడికి శతకోటి నమస్కారాలు. దుఃఖకరమైన విషయం ఏమంటే సర్దార్ పటేల్ సమైక్యత కోసం జీవించారు. సమైక్యత కోసమే ప్రయత్నించారు. సమైక్యత కోసమే చివరిదాకా పోరాడారు. దీని కారణంగా ఆయన ఎంతో మందికి శత్రువుగా మారిపోయారు. అయితే – ఆయన ఏకత్వ మార్గాన్ని ఎన్నటికీ వీడిపోలేదు. అలాంటి మహనీయుడు జన్మించిన రోజు శ్రీమతి గాంధీ హత్యానంతరం ఎంతోమంది సర్దార్ జీలను హత్య చేయడం జరిగింది. ఒక మహాపురుషుడు పుట్టిన రోజున సర్దార్ జీల నరమేధం జరగడం చరిత్ర పుటల్లో ఒక రక్తపు మరకగా నిలిచిపోయింది. ఇది మనకు చాలా బాధ కలిగించే అంశం.
ఈ ఆపదలన్నింటి మధ్య సమైక్య మంత్రాన్ని ఆధారంగా తీసుకుని మనం ముందుకు నడవాలి. భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశ మూల సూత్రం. భాషలు అనేకం కావచ్చు.. జాతులు అనేకం కావచ్చు.. వేష భాషలు అనేకం కావచ్చు.. తినుబండారాలు అనేకం కావచ్చు. ఈ వైవిధ్యంలోనే ఏకత్వాన్ని సాధించడం మన లక్ష్యం. అదే మనకు బలం. భారతీయుల వైశిష్ట్యమే ఈ ఏకత. దీనిని కాపాడడం అన్ని తరాల వారి బాధ్యత. ప్రభుత్వాలన్నింటి బాధ్యత. దేశంలో ప్రతి చోట సమైక్యత కోసం అన్వేషించాలి. సమైక్యతత్వాన్ని పెంపొందించాలి. కలహాలు, చీలికల ప్రవృత్తికి స్వస్తి పలకాలి. శ్రీ సర్దార్ పటేల్ మనకు సమైక్య భారతాన్ని కానుకగా ఇచ్చారు. శ్రేష్ఠమైన భారతాన్ని సృష్టించడం మనందరి బాధ్యత. ఏకత్వం అనే మూల మంత్రమే శ్రేష్ఠ భారత నిర్మాణానికి దృఢమైన పునాది.
రైతుల పోరాటంతో శ్రీ సర్దార్ పటేల్ జీవితం ప్రారంభమైంది. ఆయన ఒక రైతు బిడ్డ. స్వాతంత్య్ర సంగ్రామంలో రైతులను కూడా భాగస్వాములు చేయడంలో శ్రీ సర్దార్ పటేల్ కీలక పాత్ర వహించారు. స్వాతంత్య్ర సంగ్రామాన్ని గ్రామాల్లో ఒక మహోద్యమంగా సాగించిన ఘనత శ్రీ సర్దార్ పటేల్ దే. ఆయనలో అద్భుతమైన సమైక్య శక్తి దాగి ఉంది. ఆ నైపుణ్యంతోనే ఆయన అద్భుతాన్ని సాధించారు. కేవలం శ్రీ సర్దార్ పటేల్ సంఘర్షణలకే తన జీవితాన్ని పరిమితం చేసుకోలేదు. ఆయన నూతనమైన వస్తువుల కల్పనకు నాంది పలికారు. ఈ రోజుల్లో మనం అమూల్ పేరు వింటున్నాం. అమూల్ కు సంబంధించిన ప్రతి వస్తువు గురించి మన దేశవాసులందరికీ తెలుసు. అయితే – చాలా కొద్ది మందికే తెలిసిన విషయం ఒకటి ఉంది. శ్రీ సర్దార్ పటేల్ తన దార్శనిక దృష్టితో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాన్ని నెలకొల్పే సంకల్పం చేపట్టారు. ఆ సమయంలో ఖేడా జిల్లాకు కైరా జిల్లా అనే పేరు ఉంది. 1942లో ఆయన పాడి రైతుల సహకార సంఘానికి శ్రీకారం చుట్టారు. ఈనాడు అమూల్ సంస్థ – రైతుల సమృద్ధికి, సౌభాగ్యానికి మూల కారణంగా నిలిచిపోయింది. అలనాడు ఆయన విత్తనం నాటారు, ఇప్పడు అది మహావృక్షంగా మారింది. శ్రీ సర్దార్ పటేల్ కు మనసారా అంజలి ఘటిస్తున్నాను. అక్టోబర్ 31వ తేదీ ‘ఏకతా దివస్’ గా జరుపుకొంటున్నాము. ఈ రోజున మనం ఎక్కడ ఉన్నా శ్రీ సర్దార్ పటేల్ ను స్మరించుకోవాలి. సమైక్యతను సాధించేందుకు సంకల్పించాలి.
ప్రియమైన నా దేశ వాసులారా,
దీపావళి పర్వదినం సందర్భంలో ఇదే పరంపరలో వచ్చే మరొక ఉత్సవం కార్తీక పౌర్ణమి. ఇది కూడా వెలుగుల పండుగే. గురు నానక్ దేవ్ సందేశాలు ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితమైనవి కావు. మొత్తం మానవాళికి అనుసరణీయమైనవి. నేటికి కూడా ఆయన సందేశం మనందరికీ మార్గదర్శకం. శాంతి, సమైక్యత, సద్భావన.. ఇవే మూల సూత్రాలు. సమాజంలో బేధభావాలు, మూఢ విశ్వాసాలు, దురాచారాలు వీటిని నిర్మూలించాలని గురు నానక్ దేవ్ బోధించారు. అలనాడు అస్పృశ్యత, జాతి భేదాలు, తారతమ్యాలు పరాకాష్ఠకు చేరాయి. భాయి లాలో ను గురు నానక్ దేవ్ తన శిష్యుడిగా స్వీకరించాడు. గురు నానక్ దేవ్ బేధ భావాన్ని విడనాడాలని సందేశం ఇచ్చారు. మనం ఆయన అడుగు జాడల్లో నడుద్దాము. తారతమ్యాలను తొలగిద్దాము.
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ (అందరితో కలిసి – అందరి వికాసం) అనే గమ్యం వైపు కదిలేందుకు మనకు గురు నానక్ దేవ్ కన్నా మరింత ఉత్తమమైన మార్గదర్శకత్వం లభించదు. రానున్న ప్రకాశోత్సవ్ సందర్భంగా గురు నానక్ దేవ్ కు నేను నా గుండె లోతులలో నుండి గౌరవపూర్వక శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా,
ఈ దీపావళి ని మన జవానులకు మరొక్క సారి దేశ అంకితం చేద్దాము. దీపావళి సందర్భంగా మీకందరికీ ఇవే నా శుభాకాంక్షలు. మీ అందరి కలలు పండాలని, సంకల్పాలు అన్ని విధాలుగానూ నెరవేరాలని కోరుకొంటుస్తున్నాను. మీ జీవితంలో విజయం, ఉల్లాసం నిండు గాక. అనేకానేక ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశ వాసులారా, నమస్కారములు. కొన్ని రోజుల క్రితం జమ్ము - కశ్మీర్ లోని ఉరీ సెక్టార్ లో తీవ్రవాదుల దాడిలో మన దేశం 18 మంది వీర పుత్రులను కోల్పోయింది. ఈ వీర సైనికులందరికీ నమస్కరిస్తున్నాను. శ్రద్ధాంజలిని ఘటిస్తున్నాను. కొందరు పిరికిపందల వల్ల జరిగిన ఈ సంఘటన మొత్తం దేశాన్ని కలచివేసింది. దేశంలో విషాదం నెలకొంది. దాంతో పాటు ఆక్రోశం కూడా కలిగింది. మరణించిన సైనికుల కుటుంబాలకు మాత్రమే జరిగిన నష్టం కాదు ఇది. తీవ్రవాదులతో జరిగిన యుద్ధంలో ఒకరి పుత్రుడు మరణించి ఉండవచ్చు; ఒకరి అన్న ప్రాణాలు కోల్పోయి ఉండవచ్చు; ఒక భార్య తన భర్తను కోల్పోయి ఉండవచ్చు.. ఈ నష్టం యావత్తు దేశానిది. అందుకే, భారతీయులందరికీ ఆనాటి మాటలనే మళ్లీ చెబుతున్నాను. తప్పు చేసిన వాళ్లు తప్పకుండా శిక్షించబడతారు.
ప్రియమైన నా దేశ వాసులారా, మన సైన్యం మీద మనకు నమ్మకం ఉంది. వారు తమ పరాక్రమంతో ఇటువంటి ప్రతి కుట్రను భగ్నం చేస్తారు. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలు ప్రశాంతంగా జీవించే విధంగా మన సైనికులు అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శిస్తారు. మన సైన్యాన్ని చూసి మనం గర్వించాలి. పౌరులమైన మనకు, రాజకీయ నాయకులకు వారి అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాలు ఎన్నో సార్లు దొరుకుతాయి. మనకు కూడా మన అభిప్రాయాలను వ్యక్తం చేసే అవకాశాలు దొరుకుతాయి. మనం మన అభిప్రాయాలను వ్యక్తీకరిస్తాం. అయితే- సేన ప్రసంగాలు చేయదు; తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తుంది.
నేను ఈ రోజు కశ్మీర్ పౌరులతో కూడా ప్రత్యేకంగా మాట్లాడదలుచుకున్నాను. కశ్మీర్ ప్రజలు దేశ విరోధి శక్తులను గుర్తించగలుగుతున్నారు. వాళ్లకు నిజం ఏమిటో తెలిశాక.. ఇటువంటి విద్రోహ శక్తులకు దూరంగా, శాంతి మార్గంలో సాగిపోతున్నారు. ప్రతి కుటుంబంలో తల్లితండ్రులు పాఠశాలలు, కళాశాలలు పూర్తి స్థాయిలో పని చేయాలని భావిస్తున్నారు. రైతులు కూడా వారి పంటలు త్వరగా చేతికి రావాలని, ఆర్థిక కార్యకలాపాలు సక్రమంగా సాగాలని ఆశిస్తున్నారు. గత కొన్ని రోజులుగా అన్ని కార్యకలాపాలు చక్కగా నడుస్తున్నాయి. మనందరికీ తెలుసు. శాంతి, సమైక్యత, సద్భావన.. ఇవే అన్ని సమస్యలకు పరిష్కార మార్గాలు అని మనకు తెలుసు. ఇదే మనకు ప్రగతి మార్గం కూడా. ముందుతరాల వారి కోసం మనం అభివృద్ధిలో నూతన శిఖరాలను అధిరోహించవలసి ఉంది. అన్ని సమస్యలకు పరిష్కారాలను మనం పరస్పర చర్చలతో కనుగొంటామనే నమ్మకం నాకు ఉంది. కశ్మీర్ లో ముందుతరాల వారికి అభివృద్ధి మార్గాన్ని అన్వేషిస్తాం. అదే విధంగా భావితరాల వారి కోసం ఉత్తమ మార్గాన్ని కూడా కనుగొంటాం. కశ్మీర్ పౌరుల భద్రత ప్రభుత్వ బాధ్యత. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకోవలసి ఉంటుంది. మన సామర్ధ్యాన్ని, శక్తిని, చట్టాలను, నియమాలను శాంతి భద్రతల పరిరక్షణకు ఉపయోగించాలని భద్రతా దళాలను నేను కోరుతున్నాను. కశ్మీర్ లోని సామాన్య ప్రజలు సుఖ సంతోషాలతో జీవించడం కోసం వినియోగించాలని కోరుతున్నాను. అందుకోసం మనం నిశ్చయంగా పాటుపడదాం. మన ఆలోచనలకు భిన్నంగా ఆలోచించే వ్యక్తులు కూడా కొత్త కొత్త అభిప్రాయాలను వ్యక్తీకరిస్తారు. ఈ మధ్య సామాజిక మాధ్యమాలలో నాకు ఎన్నో విషయాలు తెలుసుకునే అవకాశం లభించింది. భారతదేశంలోని అన్ని మూలాల నుండి అన్ని వర్గాల ప్రజల భావాలను తెలుసుకుని అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది. ఇదే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుంది. కొన్ని రోజుల క్రితం 11వ తరగతి విద్యార్థి హర్షవర్థన్ అనే యువకుడు నాకు కొన్ని భిన్నమైన విషయాలు చెప్పాడు. అతను చాలా రాశాడు. “ఉరీ ఉగ్రవాద దాడి సంఘటనకు నేను చలించిపోయాను. ఏదో చేయాల్సిందేనని అనిపించింది. అయితే, ఏం చేయాలో తోచలేదు. నా వంటి మామూలు విద్యార్థి ఏం చేయగలుగుతాడు ? దేశ హితం కోసం నేను ఏ రకంగా ఉపయోగపడతాను అని ఒక ఆలోచన కలిగింది.. ఆలోచించాను. రోజూ మూడు గంటలు అదనంగా చదువుకోవాలని సంకల్పించాను. దేశానికి పనికివచ్చే యోగ్యుడైన పౌరుడిగా మారాలని భావించాను”.. ఈ విధంగా రాశాడు.
సోదరుడా హర్షవర్థన్ ! ఈ ఆక్రోశ సమయంలో ఇంత చిన్న వయసులో నీవు ఇంత ఆరోగ్యకరంగా ఆలోచించడం నాకు ఆనందాన్ని కలిగించింది. అయితే హర్షవర్థన్.. ఇంకో విషయం కూడా చెబుతాను. ఈ ఘటనతో దేశంలోని పౌరుల మనసులో కలిగిన ఆక్రోశం ఎంతో విలువైందిగా చెప్పుకోవాలి. మన దేశంలోని చైతన్యానికి ఇది సంకేతం. ఈ ఆక్రోశం ఏదో చేసేయాలనే ఆలోచనతో కూడి ఉంది. నీవు నిర్మాణాత్మకమైన దృక్పథంతో దానిని నా ముందు ప్రకటించావు. మీకు తెలిసే ఉంటుంది.. 1965లో యుద్ధం జరిగినప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి గారు మన దేశానికి నాయకత్వం వహించారు. ఆ రోజుల్లో దేశమంతా ఇలాగే ఆక్రోశం నిండి ఉంది. ఆ ఆక్రోశం దేశభక్తితో కూడినది. ఏదో ఒకటి చేసి తీరాలని ప్రతి ఒక్కరూ భావించారు. ఆ సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి దేశంలోని ప్రజల మనోభావాలకు ఉదాత్తమైన రూపాన్నిచ్చే ప్రయత్నం చేశారు. అప్పుడు ఆయన ‘జై జవాన్ - జై కిసాన్’ అనే మంత్రాన్ని అందించి, దేశం కోసం తమ కర్తవ్య నిర్వహణ చేసేందుకు పౌరులందరికీ మంచి ప్రేరణను అందించారు. బాంబులు, తుపాకులతో గాక, ఇంకో విధంగా కూడా ప్రకటించే అవకాశం ప్రతి పౌరుడికి ఉంటుంది. ఇలాంటి అవకాశాన్ని లాల్ బహదూర్ శాస్త్రి గారు వినియోగించుకున్నారు. మహాత్మ గాంధీ గారు కూడా స్వాతంత్య్ర సంగ్రామం జరిగే రోజుల్లో ఉద్యమం తీవ్ర స్వరూపం దాల్చినపుడు దానిని నిర్మాణాత్మకమైన మార్గాన నడిపే విధంగా ప్రేరణ కలిగించేందుకు సఫల ప్రయత్నం చేశారు. సైన్యమంతా తన బాధ్యతలను నిర్వర్తించాలి. ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కూడా వారి కర్తవ్యాలను నిర్వర్తించాలి. భారతీయ పౌరులమైన మనమంతా ఉద్వేగపూరితమైన దేశభక్తి భావనతో పాటు మరేదైనా నిర్మాణత్మకమైన కార్యక్రమాన్ని చేపట్టాలి. అప్పుడే ఈ దేశం నూతన శిఖరాలను అందుకోగలుగుతుంది.
ప్రియమైన నా దేశ వాసులారా,
నరేంద్ర మోదీ యాప్ కు టి.ఎస్. కార్తీక్ అనే వ్యక్తి సందేశం పంపించాడు. అందులో పారాలింపిక్స్ లో మన క్రీడాకారులు చేసిన సాహసాలు అద్భుతమని ఆయన పేర్కొన్నారు. యాప్ కు పంపించిన సందేశంలో వరుణ్ విశ్వనాథన్ అనే వ్యక్తి కూడా క్రీడాకారులు ప్రతిభావంతంగా రాణించారని ప్రశంసించాడు. ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) లో ఈ విషయంపై మీరు కూడా స్పందించాలని అడిగారు. మీకే కాదు.. దేశంలోని ప్రతి వ్యక్తికీ పారాలింపిక్స్ లో పాల్గొన్న మన క్రీడాకారుల పట్ల ఒక స్పందనతో కూడిన భావన కలిగింది. పారాలింపిక్స్ లో మన క్రీడాకారులు అద్భుత నైపుణ్య ప్రదర్శనతో మనలో మానవతా దృక్పథాన్ని తట్టిలేపారు. దివ్యాంగుల పట్ల మనకున్న అభిప్రాయాన్ని పూర్తిగా మార్చివేశారు. మన విజేత దీపా మలిక్ కు పతకం లభించినపుడు.. ‘ఈ పతకాన్ని పొందడం ద్వారా నేను వికలాంగత్వాన్ని జయించినట్లయింది’ అని ఆమె పతకం అందుకున్న తరువాత అన్న మాటను నేనెప్పటికీ మరువలేను. ఈసారి జరిగిన పారాలింపిక్స్ లో మన దేశం నుండి ముగ్గురు మహిళలతో పాటు 19 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వేరే క్రీడాకారులతో పోల్చినపుడు దివ్యాంగులు ఆటల సమయంలో ప్రదర్శించిన శారీరక సామర్థ్యం, క్రీడా నైపుణ్యం వాళ్ళ దృఢమైన ఇచ్ఛాశక్తికి, సంకల్పశక్తికి ప్రతీకగా నిలచాయి.
మీకందరికీ తెలిసిన ఈ విషయమే మీకు ఆశ్చర్యాన్ని కూడా కలిగిస్తుంది. అద్భుతమైన ప్రదర్శనతో మన క్రీడాకారులు 4 పతకాలను గెలిచారు. వీటిలో స్వర్ణ పతకాలు రెండు, ఒక రజత పతకం, ఒక కాంస్య పతకం ఉన్నాయి. బంగారు పతకాన్ని సాధించిన దేవేంద్ర ఝఝారియా మనకు గర్వకారణం. 12 సంవత్సరాల తరువాత ఆయన మళ్లీ గెలిచారు. 12 సంవత్సరాల్లో వయసు పెరిగిపోతుంది. ఒకసారి బంగారు పతకం గెలిచిన తరువాత ఉత్సాహం కూడా తగ్గిపోతుంది. అయితే వయసు పెరిగినప్పటికీ, శారీరక సామర్ధ్యం తగ్గినప్పటికీ.. సంకల్పశక్తికి ఏమాత్రం తరిగిపోలేదని దేవేంద్ర నిరూపించారు. 12 ఏళ్ళ తరువాత పతకం తీసుకువచ్చారు. ఈయన పుట్టుకతో దివ్యాంగుడు కాదు; కరెంట్ షాక్ తగలడంతో ఒక చేయి పోగొట్టుకున్నారు. ఒక వ్యక్తి 23 సంవత్సరాల వయసులో బంగారు పతకం సాధించాడు. అదే వ్యక్తి 35 సంవత్సరాల వయసులో మరో బంగారు పతకం సాధించాడు. అందుకు ఎంతగా సాధన చేశాడో మీరే ఆలోచించండి. మరియప్పన్ తంగవేలు హైజంప్ లో స్వర్ణ పతకం గెలిచారు. ఈ తంగవేలు ఐదు సంవత్సరాల వయసులో తన కుడిచేతిని పోగొట్టుకున్నారు. పేదరికం కూడా ఆయన సంకల్ప శక్తికి అడ్డు కాలేదు. ఈయన మహానగరంలో నివసించే వ్యక్తి కాడు. మధ్యతరగతికి చెందినవాడు కూడా కాదు. 21 సంవత్సరాల వయసులో ఎన్నో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూనే.. శారీరకమైన రుగ్మతలను అధిగమిస్తూ కూడా.. అద్భుతమైన సంకల్ప శక్తితో మన దేశానికి పతకం సాధించాడు. దీపా మాలిక్ కూడా అద్భతమైన సామర్ధ్యంతో క్రీడారంగంలో ఎన్నో విజయ పతాకాలను రెపరెపలాడించారు.
వరుణ్ సి. భాటియా హై జంప్ లో కాంస్య పతకాన్ని సాధించారు. పారాలింపిక్స్ లో పతకాన్ని సాధించడంలో ఆయన కృషి ఎంతో ఉంది. మన దేశంలో, మన సమాజంలో, మన ఇరుగుపొరుగుల్లో ఉన్న ఎంతో మంది దివ్యాంగ సోదర సోదరీమణులను తలుచుకుంటే, మనకు వచ్చిన ఈ పతకాలు గుర్తుకు వస్తాయి. వారి పట్ల ఆదర భావం, గౌరవం పెరిగేలా చేశాయి. పారాలింపిక్స్ లో దివ్యాంగులు ఈ సారి అద్భుతమైన సామర్ధ్యాన్ని ప్రదర్శించారనే విషయం కొందరికి మాత్రమే తెలుసు. కొన్ని రోజుల క్రితం అదే ప్రదేశంలో సాధారణ ఒలింపిక్ క్రీడలు జరిగాయి. జనరల్ ఒలింపిక్ క్రీడల రికార్డులన్నీ దివ్యాంగులు తొలి సారిగా బద్దలు కొడతారని ఎవరూ ఊహించలేకపోయారు. ఈసారి ఇది జరిగింది. బంగారు పతకాల్ని సాధించిన వాళ్ళ రికార్డులను పరిశీలిస్తే, దివ్యాంగుల పోటీలలో అల్జీరియాకు చెందిన అబ్దుల్ లతీఫ్ బాకర్ 1.7 సెకన్లలో 1500 మీటర్ల పరుగు తీసి, కొత్త రికార్డును సృష్టించారు. ఇంతే కాదు.. దివ్యాంగులలో 4వ స్థానాన్ని పొందిన ఒక క్రీడాకారుడు పరుగు పందెంలో ఏ పతకాన్ని సాధించలేదు. అయితే - సాధారణ పరుగు పందెం ఆటగాళ్ళలో బంగారు పతకం సాధించిన క్రీడాకారుని కంటే తక్కువ సమయంలో పరుగును పూర్తి చేశాడు. ఇది నన్ను ఆశ్చర్యపరిచింది. నేను మరోసారి క్రీడాకారులందరికీ అనేక అభినందనలు తెలుపుతున్నాను. రానున్న రోజుల్లో మన దేశం పారాలింపిక్స్ లో మరిన్ని అద్భుతమైన విజయాలు సాధించే దిశగా ఒక చక్కటి ప్రణాళికను అమలుచేస్తుందని ఆశిద్దాం.
ప్రియమైన నా దేశ వాసులారా, గత వారం గుజరాత్ లోని నవసారిలో నాకెన్నో అద్భుత అనుభవాలు కలిగాయి. నన్ను బాగా కదిలించిన క్షణాలవి. అక్కడ భారత ప్రభుత్వం దివ్యాంగుల కోసం ఒక పెద్ద శిబిరాన్ని ఏర్పాటు చేసింది. ఆ రోజు ఎన్నో ప్రపంచ రికార్డులను సృష్టించడం జరిగింది. అక్కడ ఈ లోకాన్ని చూడలేని ఒక చిన్నారి గౌరీ శార్దూల్ తో భేటీ అయ్యే అవకాశం నాకు లభించింది. ఈ చిన్నారి నాంగ్ జిల్లాలోని సుదూర అటవీ ప్రాంతం నుండి వచ్చింది. ఈ చిన్న పిల్లకు రామాయణం అంతా కంఠస్థం. ఆమె చక్కగా కావ్యగానం చేసి, ఎన్నో విషయాలను నాకు వివరించింది. అక్కడి వాళ్ళ ముందు ఆ అంశాలను నేను వినిపిస్తే, ఆశ్చర్యచకితులయ్యారు. అదే రోజు ఒక పుస్తకాన్ని ఆవిష్కరించే అవకాశం కూడా కలిగింది. దివ్యాంగుల విజయ గాథలను వర్ణించే పుస్తకం అది. అందులోని సంఘటనలు ఎందరికో ప్రేరణను అందించాయి. కేంద్ర ప్రభుత్వం నవసారిలో ప్రపంచ రికార్డులను సృష్టించింది. ఇవి చాలా అద్భుతమైన విషయాలు. 8 గంటల లోపల వినికిడి కోల్పోయిన 600 మంది దివ్యాంగులకు శ్రవణ యంత్రాలను అందించడం గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డులలోకి ఎక్కింది. ఒకే రోజు దివ్యాంగుల ద్వారా మూడేసి ప్రపంచ రికార్డులను సృష్టించడం మన దేశానికంతటికీ గర్వకారణం.
ప్రియమైన నా దేశ వాసులారా, రెండు సంవత్సరాల క్రితం అక్టోబర్ 2వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా మనం ‘స్వచ్ఛ భారత్ మిషన్’ ను ప్రారంభించాం. అదే రోజు నా ప్రసంగంలో పరిశుభ్రత అనేది మన స్వభావంలో ఒక అంశం కావాలని అన్నాను. ప్రతి పౌరుడి కర్తవ్యంగా మారిపోవాలి. అపరిశుభ్రతను ప్రతి ఒక్కరూ అసహ్యించుకోవాలి. అటువంటి వాతావరణాన్ని సృష్టించాలి అన్నాను. ఈ పథకం ప్రారంభించి, రెండు సంవత్సరాలు గడిచాయి. దేశంలోని 125 కోట్ల మంది ప్రజలలో పరిశుభ్రత పట్ల చైతన్యం పెరిగిందని నా నమ్మకం. ప్రజల్లో జాగృతి కూడా పెరిగింది. ‘ఒక అడుగు పరిశుభ్రత వైపు’ అని నేను ఆనాడు చెప్పాను. ఇవాళ ప్రతి ఒక్కరూ ఒక్కో అడుగు ముందుకు వేసేందుకు ప్రయత్నించారని చెప్పగలను. అంటే 125 కోట్ల మంది అడుగులు స్వచ్ఛత వైపు పడ్డాయనే అర్థం కదా. అదీ సవ్యంగా పడ్డాయి. ఈ మార్గం సరైంది. కొంతసేపు శ్రమిస్తే, ఎటువంటి ఫలితాలు లభిస్తాయో తెలిసింది. సామాన్య పౌరులు కానివ్వండి.. పాలకులు లేదా ఉద్యోగులు కానివ్వండి.. ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి.. రహదారి కానివ్వండి.. బస్ స్టాండ్, రైల్వే స్టేషన్, పాఠశాలలు, కళాశాలలు, దేవాలయం, ఆసుపత్రి- ఏదైనా కానివ్వండి.. పిల్లల నుంచి పెద్ద వరకు గ్రామీణ నిరుపేదలు, రైతు మహిళలు అందరూ పరిశుభ్రతను నెలకొల్పేందుకు వారి వంతు ప్రయత్నం చేస్తున్నారు. మీడియా మిత్రులు కూడా సకారాత్మకమైన పాత్రను నిర్వహించారు. మనం ఇంకా మున్ముందుకు సాగవలసిన అవసరం ఉందని నాకు అనిపిస్తోంది. చక్కటి ప్రారంభం జరిగింది. ప్రయత్నాలు పరిపూర్ణంగా సాగాయి. మున్ముందు మనం పరిశుభ్రతను సాధించడంలో తప్పకుండా విజయాన్ని సాధిస్తామనే నమ్మకం నాకు కూడా కలిగింది. గ్రామీణ భారతాన్ని పరిశీలిస్తే, ఇంతవరకు 2 కోట్ల 48 లక్షల లేదంటే దాదాపు రెండున్నర కోట్ల మరుగుదొడ్ల నిర్మాణం జరిగింది. రాబోయే ఒక సంవత్సరంలో ఒకటిన్నర కోటి మరుగుదొడ్లను నిర్మించే ప్రణాళికను చేపట్టాం. ఆరోగ్యం కోసం, పౌరుల గౌరవాన్ని పరిరక్షించేందుకు ముఖ్యంగా - మాతృమూర్తుల, సోదరీమణుల గౌరవాన్ని కాపాడడం కోసం ఆరుబయలు ప్రదేశాలలో మల మూత్ర విసర్జనను మానుకోవాలి. దీనికోసం ‘ఓపెన్ డెఫికేషన్ ఫ్రీ’ లేదా ఒడిఎఫ్ అనే ఒక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాం. అన్ని రాష్ట్రాలలో, అన్ని జిల్లాలలో, అన్ని గ్రామాలలో ఒక పరిశుభ్రత పోటీని ఏర్పాటు చేశాం. ఆంధ్ర ప్రదేశ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లో వీలైనంత త్వరలో బహిరంగ మల విసర్జనను నిర్మూలించే విషయంలో మనం సఫలీకృతులం కాబోతున్నాము. మహాత్మ గాంధీ గారి జన్మస్థలమైన పోర్ బందర్ కు ఇటీవల నేను వెళ్లాను. అక్కడ రాబోయే అక్టోబర్ 2వ తేదీ నాటికి పోర్ బందర్ మల విసర్జన లేని ప్రదేశంగా మారిపోతుందని నేను ఇటీవల వెళ్ళినపుడు అధికారులు నాకు వివరించారు. ఈ కార్యాన్ని నెరవేర్చిన వారికి నా ధన్యవాదాలు. ఆ దిశగా పాటుపడుతున్న వారికి నా శుభాకాంక్షలు. మన తల్లులు, చెల్లెళ్ళ గౌరవం కోసం, చిన్న చిన్న పిల్లల ఆరోగ్య పరిరక్షణ కోసం బహిరంగ మలవిసర్జన రహిత ప్రదేశంగా మార్చాల్సిన బాధ్యత మనందరిదీ. రండి, మనమంతా దీనికోసం సంకల్పబద్ధులమై ముందుకు సాగుదాం. ముఖ్యంగా నవ యువత - ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిగా వినియోగించుకుంటున్న వారి కోసం ఒక పథకాన్ని ప్రవేశపెడుతున్నాను. మీ ఊళ్లో ‘స్వచ్ఛత మిషన్’ పరిస్థితి ఏమిటి ? దీనిని గురించి తెలుసుకొనే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. దీని కోసం భారత ప్రభుత్వం ఒక టెలిఫోన్ సంఖ్యను ఏర్పాటు చేసింది. అది 1969. మనందరికీ తెలిసిన విషయమే. మహాత్మ గాంధీ గారు 1869లో పుట్టారు. 1969లో మనం మహాత్మ గాంధీ గారి శత జయంతి మహోత్సవాలను జరుపుకొన్నాం. 2019లో మహాత్మ గాంధీ గారి 150వ జయంతిని జరుపుకోబోతున్నాం. 1969 నంబరుకు ఫోన్ చేయడం ద్వారా మీ ఊరిలో మరుగుదొడ్ల పరిస్థితిని గురించిన సమాచారాన్ని మీరు అందుకోగలుగుతారు. అంతే కాకుండా మరుగుదొడ్ల నిర్మాణానికి దరఖాస్తు కూడా చేసుకోవచ్చు. మీరు తప్పకుండా ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. అంతే కాదు.. పరిశుభ్రతకు సంబంధించిన ఫిర్యాదులను తెలుసుకొనేందుకు ఒక స్వచ్ఛతా యాప్ ను కూడా ప్రారంభించాం. ఈ యాప్ ను ముఖ్యంగా యువతరం వినియోగించుకోవాలి. కార్పొరేట్ ప్రపంచం కూడా దీని కోసం ముందుకు రావాలని భారత ప్రభుత్వం ఆశిస్తోంది. పరిశుభ్రత కోసం పని చేయాలనుకున్న నవ యువకులు అందరూ ఇందులో పాల్గొనవచ్చు. విభిన్న జిల్లాలలో
స్వచ్ఛ భారత్ కార్యకర్తలుగా ఇటువంటి యువకులను పంపించవచ్చు.
స్వచ్ఛత ప్రచారం అనేది కేవలం మన విశ్వాసాలకు, అలవాట్లకు పరిమితం కాకూడదు. పరిశుభ్రత అనేది మన స్వభావం అయిపోయినంత మాత్రాన పని పూర్తి కాదు. ఈ యుగంలో పరిశుభ్రతకు, ఆరోగ్యానికి అనుసంధానం జరగాలి. పరిశుభ్రతతో పాటు ఆదాయ అంశాలు కూడా తప్పకుండా జోడించబడాలి. ‘వేస్ట్ టు వెల్త్’ కార్యక్రమం ప్రారంభం కావాలి. ఘన వ్యర్థాల పరివర్తన ప్రక్రియ కొనసాగాలి. వీటిని ఎరువులుగా మార్చాలి. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. ఎరువుల కంపెనీలకు వ్యర్థాల నుండి తయారయ్యే ఎరువులను కొనాలని ఆదేశాలు జారీ అయ్యాయి. సేంద్రియ ఎరువులతో వ్యవసాయం చేసే రైతులకు దీనిని అందించగలగాలి. రసాయనిక ఎరువుల నుండి భూమికి చాలా నష్టం వాటిల్లింది. నేల సారాన్ని పెంపొందించాలనుకుంటే వెంటనే రైతులు సేంద్రియ ఎరువులను ఉపయోగించాలి. అటువంటి రైతులకు సేంద్రియ ఎరువులను కంపెనీలు సరఫరా చేయాలి. సేంద్రియ ఎరువుల ఉపయోగానికి సంబంధించిన ప్రకటనలలో ప్రముఖ నటుడు శ్రీమాన్ అమితాబ్ బచ్చన్ పాల్గొంటున్నారు. వ్యర్థాల నుండి ధనార్జన చేసే పథకంలో పాల్గొనేందుకు ప్రజలను ఆహ్వానిస్తున్నాను. వ్యర్థ పదార్థాలను ఎరువులుగా మార్చేందుకు నూతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కనుగొనాలి. దీంతో ఎరువుల ఉత్పత్తి పెరుగుతుంది. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. దీంతో దేశ ఆర్థిక పరిస్థితి ఎంతో మెరుగుపడుతుంది. వ్యర్థాల నుండి సంపదను సృష్టించడం సాధ్యమవుతుంది. ఇదే సంవత్సరం సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 2 వరకు ‘ఇండోశాన్’ - భారత పరిశుభ్రత సమావేశం జరుగుతోంది. ఇందులో దేశవ్యాప్తంగా ముఖ్యమంత్రులు, మంత్రులు, మహానగర మేయర్లు, కమిషనర్లు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పరిశుభ్రతను గురించే చర్చలు జరుగుతాయి. దీనికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం ఎలా ఉండాలి ? ఆర్థికమైన అవసరాలు ఎలా ఉండాలి ? ప్రజల భాగస్వామ్యం ఎలా ఉండాలి ? ఉద్యోగావకాశాలు పెంపొందించడం ఎలా... ఈ అన్ని విషయాలపై చర్చలు జరుగుతాయి. పరిశుభ్రతను గురించి కొత్త కొత్త వార్తలు తెలుస్తున్నాయి. ఒక రోజు పత్రికలో చదివాను. గుజరాత్ సాంకేతిక విశ్వవిద్యాలయం విద్యార్థులంతా కలసి 107 గ్రామాలలోకి వెళ్లి మరుగుదొడ్ల నిర్మాణం విషయంలో జాగరణ్ అభియాన్ పేర ఒక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. స్వయంగా శ్రమదానం చేసి విద్యార్థులంతా దాదాపు 9,000 మరుగుదొడ్లను నిర్మించడంలో సహకరించారు. మీకందరికీ ఈ విషయం తెలిసే ఉంటుంది. వింగ్ కమాండర్ శ్రీ పరమ్ వీర్ సింగ్ నేతృత్వంలో ఒక బృందం గంగలోని దేవప్రయాగ్ నుండి గంగాసాగర్ వరకు 2,800 కిలో మీటర్లు ఈదడం పూర్తి చేసింది. ఈ యాత్ర ద్వారా పరిశుభ్రత సందేశాన్ని ప్రజలకు చాటింది. భారత ప్రభుత్వం విభిన్న శాఖల్లో ఒక సంవత్సరం కాలపు క్యాలండర్ ను తయారు చేసింది. ప్రతి శాఖ 15 రోజుల పాటు పరిశుభ్రతపై దృష్టిని కేంద్రీకరిస్తుంది. వచ్చే అక్టోబర్ నెలలో 1వ తేదీ నుండి 15 వరకు మంచినీరు, పారిశుద్ధ్యం, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి - ఈ మూడు శాఖలు కలసి వాటి వాటి కార్య క్షేత్రాలలో పరిశుభ్రతను గురించి లక్ష్యాలను ఏర్పాటు చేసుకొని కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. అక్టోబర్ నెలలో చివరి రెండు వారాలు - 16 వ తేదీ నుండి 31 వతేదీ వరకు వ్యవసాయం, రైతు సంక్షేమం, ఆహార పరివర్తన, వినియోగదారుల విభాగం.. ఈ మూడు విభాగాలు కలసి పరిశుభ్రత విషయంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించనున్నాయి. ఈ విభాగాలన్నీ నిర్వహించే కార్యక్రమాల్లో పౌరులంతా పాల్గొనాలని నా మనవి. ఈ రోజుల్లో పరిశుభ్రతను గురించిన సర్వే కూడా జరుగుతోందని మీకు తెలుసు. తొలుతగా 73 నగరాలలో సర్వేక్షణను నిర్వహించి అక్కడ పరిశుభ్రత పరిస్థితి ఏమిటి ? అనే అంశాన్ని ప్రజల ముందుంచడం జరిగింది. ఈ సారి లక్ష జనాభా ఉన్న 500 పట్టణాలలో ఈ సర్వేక్షణ జరగనుంది. ఈ కార్యక్రమాలతో ప్రతి పట్టణంలో ఒక ఆత్మవిశ్వాసం నెలకొంది. ఈసారి మనం వెనుకబడి ఉన్నాం. రాబోయే రోజుల్లో మనం పరిశుభ్రతకు పెద్ద పీట వేస్తున్నామని ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. మనమందరం ఈ స్వచ్ఛత ప్రచార కార్యక్రమానికి పూర్తి సహకారాన్ని అందించాలి. అక్టోబర్ 2వ తేదీ మహాత్మ గాంధీ గారి, లాల్ బహదూర్ శాస్త్రి గారి జయంతిని జరుపుకొనే నాటికి స్వచ్ఛ భారత్ మిషన్ ప్రారంభమై రెండు సంవత్సరాలు పూర్తి అవుతాయి. గాంధీ జయంతి నుండి దీపావళి దాకా మీరంతా ఖద్దరు బట్టలను కొనుక్కోవాలని నా మనవి. ప్రతి కుటుంబంలో కొన్ని అయినా ఖద్దరు వస్త్రాలు తప్పనిసరిగా కొనండని విజ్ఞప్తి చేస్తూనే వస్తున్నాను. ఈ సారి కూడా ఇదే కోరుతున్నాను. దీని వల్ల నిరుపేదల ఇళ్ళలో దీపావళి కాంతులు మెరిసేటట్లు చేయగలుగుతాం. అక్టోబర్ 2వ తేదీ ఆదివారం. ఒక పౌరుడిగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛత కార్యక్రమంలో ఎందుకు పాల్గొనకూడదు ? రెండు గంటలు, నాలుగు గంటల పాటు శారీరకంగా శ్రమించి, స్వచ్ఛతలో మీరు కూడా పాలుపంచుకోవచ్చు. మీరు పరిశుభ్రతకు సంబంధించిన కార్యక్రమంలో పాల్గొంటే, దానికి సంబంధించిన ఫొటోలను NarendraModiApp కు పంపించండి. వీడియోలు ఉంటే పంపించండి. దేశవ్యాప్తంగా మనందరి ప్రయత్నాల ద్వారా పరిశుభ్రత కార్యక్రమానికి ఒక బలం చేకూరుతుంది. నూతనోత్సాహం, ప్రేరణ లభిస్తాయి. మహాత్మ గాంధీ గారు, లాల్ బహదూర్ శాస్త్రి గార్లను స్మరించుకొంటూ, మనమంతా దేశానికి ఏదైనా మంచి చేయాలని సంకల్పిద్దాం.
ప్రియమైన నా దేశ వాసులారా, జీవితంలో దేనినైనా ఇవ్వడంలో ఒక ఆనందం కలుగుతుంది. వేరే వాళ్ళు దీనిని గుర్తించినా గుర్తించకపోయినా ఫర్వా లేదు. ఇవ్వడంలో ఉన్న ఆనందం అద్భుతమైంది. గతంలో గ్యాస్ సబ్సిడీని వదులుకోవలసిందిగా నేను పిలుపునిచ్చాను. దేశ ప్రజలు స్పందించారు. దేశ ప్రజల జీవనంలో ఇది ఒక ప్రేరణాత్మక ఘటనగా నిలచింది. అక్టోబర్ 2వ తేదీ నుండి 8వ తేదీ దాకా వివిధ నగరాలలో ‘జాయ్ ఆఫ్ గివింగ్ వీక్’ ను పలువురు యువకులు, చిన్న చిన్న సంస్థలు, కార్పొరేట్ ప్రపంచం, పాఠశాలలు, స్వచ్ఛంద సంస్థలు అందరూ కలసి జరుపుకోనున్నారు. అవసరమైన వ్యక్తులకు ఆహార పదార్థాలను, వస్త్రాలను ఒక చోటుకు చేర్చి అందించే కార్యక్రమం జరగనుంది. నేను గుజరాత్ లో ఉన్నపుడు కార్యకర్తలంతా గల్లీలలో తిరుగుతూ, ప్రజల నుండి పాత బొమ్మలను దానంగా స్వీకరించే వారు. అలా లభించిన బొమ్మలను నిరుపేదల బస్తీలలోని అంగన్ వాడీలకు అందించే వారు. కడు బీద బాలలకు ఆ బొమ్మలు ఎంతో ఆనందాన్ని కలిగిస్తాయి. నిజంగా ఇవ్వడంలో ఉన్న ఆనందం అద్భుతమని ఈ కార్యక్రమాలు నిరూపించాయి. యువకులు చేపట్టే ఇటువంటి కార్యక్రమాలకు మనం ప్రోత్సాహం అందించాలి. ఇటువంటి కార్యక్రమాలలో పాల్గొంటున్న నవ యువకులకు నా హృదయపూర్వక అభినందనలు అందిస్తున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా, ఈ రోజు సెప్టెంబర్ 25వ తేదీ. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జయంతి. ఈ రోజు నుండి ఆయన శత జయంతి సంవత్సరం ఆరంభమవుతుంది. నా వంటి లక్షలాది మంది కార్యకర్తలు ఆయన చూపిన రాజకీయ ఆదర్శాలతో, సిద్ధాంతాలతో పని చేస్తున్నారు. ఆయన నిర్దేశించిన ఏకాత్మ్ - మానవ్ దర్శన్ రాజకీయ మార్గంలో భారతీయ సంస్కృతికి, సంప్రదాయానికి కట్టుబడి పని చేస్తున్నారు. అలాంటి ఆదర్శాలకు మూల పురుషుడైన పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి శత జయంతి సంవత్సరం ఈ రోజు నుండే ఆరంభమవుతుంది. ‘సర్వజన హితాయ - సర్వజన సుఖాయ’ అనేదే అంత్యోదయ సిద్ధాంతం. ఇదే వారు అందించిన ఆదర్శం. మహాత్మ గాంధీ గారు కూడా అట్టడుగు వర్గాల అభివృద్ధి అవసరమని చెప్పే వారు. అభివృద్ధి ప్రయోజనాలు నిరుపేదలకు లభించాలంటే ఏం చేయాలి ? ‘ప్రతి చేతికి పని, ప్రతి పొలానికి నీళ్లు’ - ఈ రెండు శతాబ్దాలలో ఆయన దేశ ఆర్థిక ప్రణాళికను మనకు అందించారు. దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి సంవత్సరాన్ని ‘గరీబ్ కల్యాణ్ వర్ష్’ (పేదల సంక్షేమ సంవత్సరం)గా జరుపుకోవాలి. ప్రగతి ఫలాలు నిరుపేదకు ఎలా లభిస్తాయి అనే అంశం పైన సమాజం, ప్రభుత్వాలు, పౌరులు దృష్టిని కేంద్రీకరించాలి. అప్పుడే దేశం నుండి మనం దారిద్య్రాన్ని తొలగించగలుగుతాం. బ్రిటిషు పాలన సమయంలో ప్రధాన మంత్రి నివాసాన్ని రేస్ కోర్స్ రోడ్ గా పిలిచే వారు. పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి సందర్భంగా దానిని ‘లోక్ కల్యాణ్ మార్గ్’ గా మార్చడం జరిగింది. ఇలా మార్చడం పేదల సంక్షేమ సంవత్సరాన్ని జరుపుకోవడానికి కూడా సంకేతంగా నిలుస్తుంది. మనకందరికీ అద్భుతమైన మార్గదర్శకత్వం వహించిన మహా పురుషుడు దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారికి గౌరవపూర్వకంగా నమస్కరిస్తున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా, రెండేళ్ళ క్రితం విజయదశమి రోజున నేను ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమాన్ని ప్రారంభించాను. రాబోయే విజయదశమికి రెండు సంవత్సరాలు నిండుతాయి. ప్రభుత్వ కార్యకలాపాల ప్రశంసలు చేసేందుకు ఉద్దేశించిన కార్యక్రమం కాదు ఇది. రాజకీయ చర్చా వేదిక అసలే కాకూడదు. ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకునే కార్యక్రమం కారాదు. ఈ రెండేళ్ళ కాలంలో ఎన్నో ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాను. ఎన్నో సంఘర్షణలకు లోనయ్యాను. ఎన్నో సార్లు ప్రలోభాత్మక వాతావరణం కూడా ఏర్పడిన సందర్భాలు లేకపోలేదు. అయితే - మీ అందరి ఆశీర్వాద బలంతో ఇలాంటి నకారాత్మకమైన శక్తుల నుండి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ను రక్షించుకోగలిగాను. సామాన్య పౌరుడి దాకా సందేశాన్ని పంపించగలిగాను. ప్రజల అభిప్రాయాలు ఏమిటి ? ప్రజల ఆకాంక్షలు ఏమిటి ? వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమాన్ని నిర్వహించాను. ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ద్వారా ప్రజలకు ఎన్నో విషయాలు తెలుస్తాయి. మన దేశంలోని 125 కోట్ల పౌరుల శక్తి సామర్ధ్యాలు ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) ద్వారానే నాకు అవగాహనకు వచ్చాయి. 125 కోట్ల మంది ప్రజల సామర్ధ్యాన్ని ఎన్నోసార్లు స్మరించుకున్నాను. దానితోనే ప్రేరేపితుడిని అయ్యాను. ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం రెండేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా - మీరందరూ నాకందించిన ప్రోత్సాహానికి, ప్రేరణకు, ఆశీర్వాదానికి నేను ఎంతో రుణపడి ఉన్నాను. శ్రోతలందరికీ నా అభినందనలు. ఆకాశవాణి కేంద్రానికి కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా ప్రసంగాలను ప్రసారం చేయడమే కాకుండా, దీనిని విభిన్న భాషలలో ప్రజలకు అందించిన ఘనత ఆకాశవాణికే దక్కుతుంది. ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) విన్న తరువాత నాకు ఉత్తరాల ద్వారా సలహాలు ఇచ్చి సహకరించిన ప్రజలకు, ప్రభుత్వ ద్వారాలను తట్టిన పౌరులకు కృతజ్ఞతలు. ప్రజల ఉత్తరాల ద్వారా ప్రభుత్వ లోపాలు ఏమిటో తెలిశాయి. అలాంటి సమస్యలకు ఒక వేదికను ఏర్పాటు చేసి వాటిని పరిష్కరింపజేసే ప్రయత్నం జరిగింది. ‘మన్ కీ బాత్’ 15- 20 నిమిషాల ప్రసంగం మాత్రమే కాదు.. సమాజాన్ని పూర్తిగా పరివర్తింపజేసే ఒక అద్భుతమైన కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం అందరికీ సంతోషదాయకం. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అర్పిస్తున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా, వచ్చే వారం నవరాత్రి, దుర్గా పూజ, విజయ దశమి పర్వదినాలు వస్తున్నాయి. అలాగే దీపావళి కూడా రాబోతోంది. దేశవ్యాప్తంగా ఒక విచిత్రమైన ధార్మిక వాతావరణం నెలకొంటుంది. ఇది శక్తి ఉపాసన జరిగే కాలం. సమాజంలోని ఐకమత్యమే దేశానికి బలం. నవరాత్రి కావచ్చు లేదా దుర్గా పూజ కావచ్చు. శక్తి ఉపాసన సమాజంలో ఐకమత్యాన్ని చాటే పండుగ కావాలి. ప్రజలందరినీ ఒక్క తాటిపై నడిపే పర్వదినం కావాలి. దీనిని సాధించడం ఎలా ? ఈ ఆశయాన్ని అందుకుంటేనే నిజమైన విజయ దశమి పర్వదినం జరుపుకొంటున్నట్టు అవుతుంది. రండి.. మనమందరం కలసి శక్తి సాధన చేద్దాం. ఐకమత్య మంత్రాన్ని పఠిద్దాం. దేశాన్ని వినూత్న ప్రగతి శిఖరాల వైపు ముందుకు నడిపించేందుకు అవసరమైన శాంతిని, ఐకమత్యాన్ని, సద్భావనను పెంపొందించుకుందాం. వీటితో నవరాత్రి పర్వాన్ని జరుపుకుందాం. దుర్గా పూజను చేసుకుందాం. విజయ దశమి విజయోత్సవాలను జరుపుకుందాం.
మీకందరికీ అనేక ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశ ప్రజలారా నమస్కారం..
రేపు ఆగస్టు 29.. హాకీ మాంత్రికుడు ధ్యాన్ చంద్ జయంతి.. ఈ తేదీని యావత్ దేశం జాతీయ క్రీడా దినోత్సవంగా జరుపుకుంటుంది. నేను ధ్యాన్ చంద్ గారికి శ్రద్ధాంజలి అర్పిస్తూ, ఈ సందర్భంగా మీ అందరికీ ధ్యాన్ చంద్ దేశానికి చేసిన సేవలను గుర్తు చేద్దామనుకుంటున్నాను. ఆయన 1928 లోను, 1932 లోను, 1936 లోను ఒలంపిక్ క్రీడలలో హాకీలో భారత దేశం స్వర్ణ పతకం సాధించడంలో మహనీయమైన పాత్రను పోషించారు. క్రికెట్ ప్రేమికులందరికీ బ్రాడ్ మన్ గురించి తెలుసు. ఆయన ధ్యాన్ చంద్ గురించి చెప్పిన మాటలు ఏమిటంటే- ‘ధ్యాన్ చంద్ పరుగుల లాగా గోల్స్ చేసేస్తాడు’ అని. క్రీడా స్ఫూర్తికీ, దేశ భక్తికీ ధ్యాన్ చంద్ ఒక సజీవ ఉదాహరణగా నిలిచారు. ఒకసారి కోల్ కతాలో ఒక మ్యాచ్‌లో ప్రత్యర్థి ఆటగాడు ధ్యాన్ చంద్ తలపై హాకీ స్టిక్ తో గట్టిగా బాదాడు. అప్పుడు మ్యాచ్ పూర్తి కావడానికి ఇంకా పది నిమిషాలే మిగిలి ఉంది. ధ్యాన్ చంద్ ఆ పది నిమిషాల్లో వరుసగా మూడు గోల్స్ చేశారు. నాకు తగిలిన దెబ్బకు గోల్స్ రూపంలో ప్రతీకారం తీర్చుకున్నాను అని ధ్యాన్ చంద్ అన్నారు.
ప్రియమైన నా దేశ ప్రజలారా..
ఎప్పుడు ‘మన్ కీ బాత్’ సమయం ఆసన్నమైనా mygov.in లేదా Narendra Modi App ద్వారా అనేక మంది అనే సలహాలు, సూచనలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ చాలా వైవిధ్యంగా ఉంటాయి. కానీ ఈసారి చాలా మంది రియో ఒలంపిక్స్ ను గురించి తప్పనిసరిగా మాట్లాడాలని నాకు సూచనలు పంపారు. సాధారణ పౌరుడికి రియో ఒలంపిక్స్ పట్ల ఇంత ప్రేమ, అవగాహన చూసి నాకు చాలా ఆనందం వేసింది. ప్రధాన మంత్రి రియో ఒలంపిక్స్ ను గురించి మాట్లాడాలి అంటూ ప్రజల నుండి ఒత్తిడి రావడాన్ని నేను సకారాత్మకమైందిగా భావిస్తున్నాను. క్రికెట్ కాకుండా ఇతర క్రీడల పట్ల భారతీయులకు ఉన్న ప్రేమ, ఆసక్తి, అవగాహనలు చూసి నేను ముగ్ధుడినయ్యాను. నిజంగా ఈ రోజు ఈ సందేశాన్ని ఇవ్వడానికి నాకు కలిగిన ప్రేరణకు మీరు కారకులయ్యారు. Narendra Modi App పై అజిత్ సింగ్ ‘ఈసారి మన్ కీ బాత్ లో బాలికలకు విద్య, క్రీడలలో వారి భాగస్వామ్యంపైన తప్పనిసరిగా మాట్లాడవలసింది అని కోరారు. రియో ఒలంపిక్స్ లో పతకాలను సాధించిన బాలికలు దేశ గౌరవానికి వన్నె తెచ్చారని పేర్కొన్నారు’. మరొకరు సచిన్, ఆయన ఏం రాశారంటే.. ఈసారి ‘మన్ కీ బాత్’ లో సింధు, సాక్షి, దీపా కర్మాకర్ ల ప్రస్తావన తప్పనిసరిగా చేయండి అన్నారు. మన దేశానికి పతకాలు సాధించింది ఈ బాలికలే. బాలికలు ఎవరికీ తీసిపోరని మరోసారి నిరూపించారు. పతకాలు గెలుచుకున్న బాలికలలో ఒకరు ఉత్తర భారతదేశానికి చెందిన వారైతే, మరొకరు దక్షిణ భారతదేశానికి చెందిన వారు. ఇంకొకరు తూర్పు భారతదేశానికి చెందిన వారు. వేరొకరు భారత దేశంలోని ఏదో ఒక ప్రాంతానికి చెందిన వారు. దీనిని పట్టి చూస్తే బాలికలు అందరూ దేశ పరువు ప్రతిష్ఠలను మరింతగా పెంచే బాధ్యతను తలకు ఎత్తుకున్నారనిపిస్తుంది. mygov.in వెబ్ సైట్ పై ఒలంపిక్స్ లో మరింతగా రాణించగలిగే వాళ్లం అని శిఖర్ ఠాకూర్ రాశారు. ఇంకా ‘గౌరవనీయ మోదీ గారు, రియోలో పతకాలు సాధించినందుకు శుభాకాంక్షలు. కానీ.. మన ప్రదర్శన నిజంగా బాగుందా.. అంటే.. లేదు అనే చెప్పాలి. క్రీడారంగంలో ఇంకా సుదూర ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ తల్లిదండ్రులు కేవలం చదువు మీదే శ్రద్ధ పెట్టమని చెబుతూ ఉంటారు. ఆటలు ఆడడం అంటే సమయాన్ని వృథా చేయడమని భావిస్తూ ఉంటారు. ఈ ఆలోచనను మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనికి కావలసింది సరికొత్త ప్రేరణ కల్పించడం. మీకు తప్ప ఇంకొకరికి ఈ పని సాధ్యం కాదు’ అంటూ ఆయన రాశారు. Narendra Modi App పై సత్యప్రకాశ్ మెహ్రా సూచన చేస్తూ, ‘విద్యేతర కార్యకలాపాలపైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. ముఖ్యంగా పిల్లలకు, యువకులకు క్రీడల పట్ల ఆసక్తిని పెంచాలని కోరారు. దాదాపుగా వేలాది మంది ఈ విషయాలనే సూచించారు. మనం ఆశించినట్లుగా మన ప్రదర్శన లేదు.. అన్న వాస్తవాన్ని కొట్టి పారేయలేము. అంతే కాదు, కొంత మంది క్రీడాకారులు ఇంతకుముందు దేశీయంగా ప్రదర్శించిన స్థాయిని కూడా రియోలో చూపలేకపోయారు. ఇక పతకాల పట్టిక చూస్తే, మనకు రెండే వచ్చాయి. కానీ నిజంగా ఆలోచిస్తే పతకాలు రాకపోయినా.. అనేక విషయాలలో మొదటిసారి మన భారతీయ క్రీడాకారులు చాలా అద్భుతమైన ఆట తీరును ప్రదర్శించారు. షూటింగ్లో అభినవ్ బింద్రాకు నాలుగో స్థానం దక్కింది. చాలా కొద్దిపాటి తేడాతో పతకాన్ని కోల్పోయారు. జిమ్నాస్టిక్స్ లో దీపా కర్మాకర్ అద్భుతం సాధించారు, ఆమె నాలుగో స్థానంలో నిలచారు. పతకం కొద్దిపాటి తేడాతో చిక్కకుండా పోయింది. ఒలంపిక్స్ ఫైనల్స్ కు యోగ్యతను సాధించిన మొట్టమొదటి భారతీయ మహిళ ఆవిడ. అదే విధంగా టెన్నిస్ లో సానియా మీర్జా, రోహన్ బోపన్నల జోడీ కూడా అతి కొద్ది తేడాతో పతకాన్ని కోల్పోయింది. అథ్లెటిక్స్ లో ఈసారి మంచి ప్రదర్శనను ఇచ్చాము. 32 సంవత్సరాల అనంతరం పి.టి. ఉష తరువాత, లలితా బాబర్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఫైనల్స్ కు యోగ్యత సాధించారు. అంతే కాకుండా, 36 సంవత్సరాల తరువాత మహిళా హాకీ టీమ్ ఒలంపిక్స్ లో స్థానాన్ని సంపాదించడం అందరికీ ఆనందం కలిగించే అంశం. అదే విధంగా 36 సంవత్సరాల తరువాత పురుషుల హాకీ జట్టు నాకౌట్ దశ దాకా చేరడం కూడా గర్వ కారణమే. మన జట్టు చాలా పటిష్ఠమైంది. ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే, హాకీలో స్వర్ణ పతకాన్ని సాధించిన అర్జెంటీనా జట్టు ఈ ఒలంపిక్స్ లో ఒక్కసారి మాత్రమే ఓడింది. ఆ ఓటమిని చవి చూసింది మాత్రం మన చేతిలోనే. భవిష్యత్ కచ్చితంగా మనది. బాక్సింగ్ లో వికాస్ కృష్ణ యాదవ్ క్వార్టర్ ఫైనల్స్ దాకా వెళ్లారు. కానీ, కాంస్య పతకాన్ని పొందలేకపోయారు. ఇలా ఎంతో మంది; ఉదాహరణకు, అదితి అశోక్, దత్తూ బోక్నల్, అతనూ దాస్.. ఇలా మంచి ప్రదర్శన చేసిన వారి పేర్లు మరెన్నో ప్రస్తావించవచ్చు.
ప్రియమైన నా దేశ ప్రజలారా..
మనం చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పటివరకు చేసిన తీరుగానే చేస్తూ ఉంటే, మళ్లీ మనం నిరాశకే లోనవుతాము. నేను ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాను. భారతదేశ ప్రభుత్వం లోతుగా దీనిని పరిశీలించి, అధ్యయనం చేస్తుంది. మనం ఇంకా బాగా ఏం చేయగలమో దాని కోసం మార్గసూచీని తయారుచేస్తాం. 2020, 2024, 2028 వరకు దూరదృష్టితో ముందుకు వెళ్లడానికి ప్రణాళికను తయారుచేయవలసి ఉంది. నేను రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.. మీరు సైతం ఇటువంటి కమిటీలు ఏర్పాటు చేయండి. క్రీడాలోకంలో మనం ఏమేమీ చేయగలమో ఆలోచించండి. ప్రతి రాష్ట్రం చేయగలదు. ప్రతి రాష్ట్రం ఒకటో, రెండో క్రీడలను ఎంచుకొని బలాన్ని నిరూపించుకోవచ్చు. క్రీడారంగంతో సంబంధం ఉన్న అన్నిసంఘాలను కూడా నిష్పాక్షికంగా మేధోమథనం జరపాల్సిందిగా నేను కోరుతున్నాను. అభిరుచి ఉన్న ప్రజలందరినీ కూడా వారి వారి ఆలోచనలను Narendra Modi App కు సలహాలు పంపండని విజ్ఞప్తి చేస్తున్నాను. ఆయా రాష్ట్రాలకు, ఆయా క్రీడా సంఘాలకు కూడా వారి వారి అభిప్రాయాలను, సూచనలను చర్చించి పంపించవలసిందిగా కోరుతున్నాను. మనం సర్వసన్నద్ధం కావాలి. 125 కోట్ల మంది జనాభా, అందులో 65 శాతం యువతీయువకులే ఉన్న మన భారతదేశం, ప్రపంచంలో మరింత మెరుగైన స్థానాన్ని పొందుతుందన్న నమ్మకం నాకు ఉంది. ఈ సంకల్పంతో మనం ముందుకు వెళ్లాలి.
ప్రియమైన నా దేశ ప్రజలారా..
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం.. నేను చాలా ఏళ్లుగా ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఒక విద్యార్థి మాదిరిగా విద్యార్థులతో ఎక్కువ సమయాన్ని గడుపుతూ వచ్చాను. ఆ చిన్న చిన్న పిల్లల నుండి నేను ఎంతో నేర్చుకుంటూ వచ్చాను. నాకు సంబంధించినంత వరకు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవమే కాదు; నా విద్యా దినోత్సవం కూడా. కానీ, ఈసారి జి- 20 శిఖరాగ్ర సమావేశానికి వెళ్లవలసి ఉంది. అందుకే ఈ ‘మన్ కీ బాత్’ లోనే ఆ విషయాలు కూడా మాట్లాడాలనుకున్నాను.
జీవితంలో తల్లి పాత్ర ఎంతో ఉపాధ్యాయుడి పాత్రా అంతే. తమకంటే విద్యార్థుల పట్లనే ఎక్కువ ప్రేమ చూపే ఉపాధ్యాయులను మనం ఎంతో మందిని చూసి ఉంటాము. వారు వారి శిష్యుల కోసం వారి జీవితాన్నే అంకితం చేస్తుంటారు. ఇప్పుడు రియో ఒలంపిక్స్ తరువాత ఎటు చూసినా పుల్లెల గోపీచంద్ పేరు వినిపిస్తోంది. అతను క్రీడాకారుడే. కానీ, అంతకంటే మంచి ఉపాధ్యాయుడిగా ఎదిగి ఒక ఉదాహరణగా నిలిచారు. ఈ రోజు నేను గోపీచంద్ ను ఒక క్రీడాకారుడిగా గాక, ఒక ఉత్తమ ఉపాధ్యాయుడుగా చూస్తున్నాను. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పుల్లెల గోపీచంద్ కు, అతని తపస్సుకూ క్రీడల పట్ల అతని అంకిత భావానికీ, విద్యార్థుల విజయాలు చూసి ఆనందించాలనే అతని ఆకాంక్షకూ సలాం చేస్తున్నాను. మనందరికీ కూడా జీవితంలో ఉపాధ్యాయుడి పాత్ర ఎప్పటికీ గుర్తుకు వస్తూ ఉంటుంది. సెస్టెంబర్ 5 మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి. దీనినే దేశం ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకొంటోంది. ఆయన ఎన్ని పదవులను అధిరోహించినా ఎప్పటికీ తనకు తాను ఒక ఉపాధ్యాయుడిననే భావించారు; అలాగే జీవించారు. ఆయన ఎప్పుడూ చెబుతూ ఉండేవారు.. ఏ ఉపాధ్యాయుడిలో అయితే ఎప్పటికీ విద్యార్థి దాగి ఉంటాడో, అతడే మంచి ఉపాధ్యాయుడు అని. రాష్ట్రపతి అయిన తరువాత కూడా ఉపాధ్యాయుడిగా భావిస్తూ తనలోని విద్యార్థిని సజీవంగా ఉంచుకుంటూ, జీవితాన్ని గడిపిన మహామనిషి డాక్టర్ రాధాకృష్ణన్. నాకు నా ఉపాధ్యాయులు గుర్తుకువస్తూ ఉంటారు. మా ఆ చిన్న పల్లెటూర్లో వారే నా కథానాయకులు. 90 ఏళ్ల వయసులో ఈ మధ్యే మా గురువు గారు స్వర్గస్తులయ్యారు. ఆయన ప్రతి నెలా నాకు ఉత్తరం రాసే వారు; మొన్నటి మొన్నటి వరకు నాకు ఉత్తరాలు రాస్తూనే ఉన్నారు. ప్రతి ఉత్తరంలో ఆయన ఆ నెలలో చదివిన పుస్తకాల గురించి రాసే వారు. కొటేషన్ లను ప్రస్తావించే వారు. ఆ పుస్తకం.. ఆయనకు నచ్చినదీ, లేనిదీ.. ఎందుకు నచ్చిందీ, లేదా ఎందుకు నచ్చలేదనేది వివరంగా రాసే వారు. ఆ ఉత్తరం చదువుతూ ఉంటే, తరగతి గదిలో ఆయన నాకు ఎదురుగా కూర్చొని పాఠాన్ని చెబుతున్నట్లుగా తోచేది. నిజంగా ఇప్పుడు కూడా కరెస్పాండెన్స్ కోర్సు ద్వారా ఆయన నా జ్ఞానాన్ని పెంచుతున్నారని అనిపించేది. 90 ఏళ్ల వయసులో కూడా ఆయన చేతి రాతను చూసి ఆశ్చర్యం కలిగేది. అంత అందంగా ఆయన దస్తూరి ఉండేది. ఈ వయసులో కూడా చేతి రాత చెదరనేలేదు. నా చేతి రాత బాగుండదు. అందుకే ఎవరి అందమైన చేతి రాతను చూసినా, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. వారి పట్ల గౌరవభావం పెరుగుతుంది. నా అనుభవాలు ఎలాంటివో, అటువంటి అనుభవాలే మీకూ ఉండి ఉంటాయి. మీ ఉపాధ్యాయులు మీ జీవితానికి ఎంతో కొంత మంచిని చేసే ఉంటారు. ఆ విషయాన్ని నలుగురికీ చెప్పండి. దీనివల్ల సమాజంలో ఉపాధ్యాయుల పట్ల గౌరవం పెరుగుతుంది. వారిని చూసే దృష్టి కోణంలో మార్పు వస్తుంది. సమాజంలో ఉపాధ్యాయుల గౌరవాన్ని పెంచడం మనందరి బాధ్యత. మీ ఉపాధ్యాయులతో మీరు దిగిన ఫొటో గాని, ఆ ఉపాధ్యాయులకు సంబంధించిన ప్రేరణాత్మకమైన సంఘటనలను గాని Narendra Modi App తో పాలుపంచుకోండి. దేశంలో ఉపాధ్యాయుల పాత్రను విద్యార్థి వైపు నుండి చూడడం కూడా ఎంతో ముఖ్యం.
ప్రియమైన నా దేశ ప్రజలారా..
కొద్ది రోజులలో గణేశ్ ఉత్సవాలు జరగబోతున్నాయి. గణేశుడు విఘ్నాలను తొలగించే దైవం. మనం అందరమూ మన దేశానికీ, మన సమాజానికీ, మన కుటుంబానికీ, మన అందరికీ…. ప్రతి వ్యక్తి జీవితం కూడా నిర్విఘ్నంగా ఉండాలని కోరుకుంటాము. కాబట్టి ఇప్పుడు గణేశ్ ఉత్సవానికి సంబంధించిన విషయం మాట్లాడుకుందాము.. గణేశ్ ఉత్సవాలు అనగానే లోక్ మాన్య తిలక్ జ్ఞాపకం రావడం సహజం. సామూహిక గణేశ్ ఉత్సవాల సంప్రదాయం లోక్ మాన్య బాల గంగాధర్ తిలక్ ప్రారంభించిందే. సామూహిక గణేశ్ ఉత్సవాల ద్వారా ఆయన ఒక ధార్మిక అవకాశాన్ని జాతిని మేలుకొలిపే పండుగగా మార్చారు. సమాజంలో సంస్కారాల పర్వంగా దీనిని రూపుదిద్దారు. సామూహిక గణేశ్ ఉత్సవాల ద్వారా సామాజిక జీవితాన్ని స్పృశించే అన్ని అంశాలపైన విస్తృత చర్చ జరగాలి. సమాజానికి కొత్త ఊపును, ఉత్సాహాన్నీ ఇచ్చే విధంగా ఈ కార్యక్రమాలను రూపొందించాలి. ఈ ఉత్సవాలతో పాటు ‘స్వాతంత్య్రం మా జన్మ హక్కు’ అనే మంత్రాన్ని జోడించారు. కార్యక్రమాల రూపకల్పనలో ఈ వాక్యమే కేంద్రంగా ఉండాలి. తద్వారా స్వాతంత్య్రోద్యమానికి మరింత బలం చేకూరాలని ఆయన చెప్పారు. ఇప్పుడు ఒక్క మహారాష్ట్ర లో మాత్రమే కాదు, దేశంలో నలుమూలలా సామూహిక గణేశ్ ఉత్సవాలు జరుగుతున్నాయి. యువకులంతా ఉత్సాహంతో ఈ కార్యక్రమాలను నిర్వహించడానికి అనేక రకాలుగా ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. కొంత మంది లోక్ మాన్య బాల గంగాధర్ తిలక్ ఏ భావనతో ఈ ఉత్సవాలను నిర్వహించారో, అదే భావనతో ఇప్పుడు కూడా నిర్వహించడానికి శత విధాలా కృషి చేస్తున్నారు. సామాజిక విషయాలపై ఆయన చర్చలను, గోష్టులను నిర్వహించే వారు. వ్యాస రచనలో పోటీ పెట్టే వారు. రంగోలీ పోటీ ఉండేది. ఈ రంగోలీ ఆకృతులలో సామాజిక అంశాలు ప్రతిబింబించేవి. జటిలమైన సమస్యలను చాలా కళాత్మకంగా ప్రతిబింబింపచేసే వారు. ఒక విధంగా చెప్పాలంటే, సామాజిక విద్యా ఉద్యమానికి సామూహిక గణేశ్ ఉత్సవాలు ఒక మాధ్యమంగా మారాయి. ‘స్వాతంత్య్రం మా జన్మ హక్కు’ అని ఒక ప్రేరణాత్మకమైన మంత్రాన్ని తిలక్ ఇచ్చారు. ఇప్పుడు మనం స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. ఇప్పుడు సామూహిక గణేశ్ ఉత్సవాల నినాదం, మంత్రం, సుతంత్రం మా జన్మ హక్కు కావాలి. సుతంత్రం వైపు మనం ముందుకు సాగాలి. సుతంత్రమే ప్రముఖం కావాలి. ఇప్పుడు సుతంత్ర మంత్రాన్ని మనం సామూహిక గణేశ్ ఉత్సవాల సందేశంగా అందించలేమా.. రండి.. మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. సుతంత్రం వైపు ముందుకు సాగుదాం.
ఏ ఉత్సవమైనా సమాజానికి శక్తిప్రదాయకం. ఉత్సవాలు వ్యక్తిలో, సమాజంలో, జీవితంలో కొత్త ఊపిరులను ఊదుతాయి. పండుగ కాని బతుకు అసాధ్యం. కానీ, సమయానుకూలంగా మన జీవితాన్ని మలుచుకోవాలి. ఈసారి అనేక మంది గణేశ్ ఉత్సవాలు, దుర్గా పూజ వంటి విషయాలపై నాకు ఎన్నో రాసి పంపించారు. వారి మాటలలో పర్యావరణం పట్ల బాధ కనిపించింది. మోదీ గారు, ‘మన్ కీ బాత్’ లో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో చేసిన వినాయకుడి ప్రతిమలను ఉపయోగించవద్దని ప్రజలకు వివరించాలని శంకర్ నారాయణ్ ప్రశాంత్ కోరారు. చెరువు మట్టితో తయారుచేసిన విగ్రహాలను ఎందుకు ఉపయోగించకూడదు ? ఆలోచించండి.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌తో తయారుచేసిన విగ్రహాలు పర్యావరణానికి హాని చేస్తాయి అంటూ ఆయన ఎంతో వేదనను వ్యక్తం చేశారు. ఇతరులు కూడా వారి బాధను వెళ్లబోసుకొన్నారు. నేను కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.. గణేశుడి విగ్రహాలు, దుర్గా మాత ప్రతిమలు, మన పురాతన సంప్రదాయం ప్రకారమే మట్టి తోటే రూపొందించి పర్యావరణాన్ని, చెరువులను, నదులను అన్నింటినీ కాపాడుకుందాము. నీటి కాలుష్యం ద్వారా ఆ నీటిలో ఉండే చిన్న చిన్న క్రిములు, ప్రాణులు నశిస్తాయి. అన్ని ప్రాణులను కాపాడడమే కదా భగవంతుడి సేవ. వినాయకుడు అంటే, విఘ్నాలను తొలగించే శక్తి. మనం విఘ్నాలను కలిగించే వినాయకులుగా మారకూడదు. నేను చెప్పే ఈ విషయాలు మీరు ఎలా గ్రహిస్తారో నాకు తెలియదు. నేను కాదు, చాలా మంది ఈ విషయాలను చెబుతున్నారు. నేను కూడా ఎంతో మంది చెప్పిన విషయాలను విన్నాను. విగ్రహాలను తయారుచేసే పుణెకు చెందిన అభిజిత్ గోంఢే ఫలే, ధ్యాన్ ప్రబోధిని, కొల్హాపూర్ కు చెందిన నిసర్గ్ మిత్ర్, విజ్ఞాన్ ప్రబోధిని, విదర్భకు చెందిన నిసర్గ్ కట్టా, ముంబయ్ కు చెందిన గిర్గావ్ చా రాజా, తదితర అనేక సంస్థలు, సంఘాలు, వ్యక్తులు మట్టితో వినాయకుడి విగ్రహాలను తయారు చేయాలని ప్రచారం చేస్తూ ఉద్యమిస్తున్నారు. పర్యావరణానికి అనుకూలమైన గణేశ్ ఉత్సవాలు సమాజ సేవలో ఒక భాగమే. దుర్గా పూజకు ఇంకా సమయం ఉంది.. ఇప్పుడే మనం నిర్ణయించుకుందాము. మనం ప్రాచీన సంప్రదాయం ప్రకారం మట్టితో విగ్రహాలు తయారుచేద్దాము. దీనివల్ల ఆ వృత్తి మీద ఆధారపడే వారికి ఉపాధి దొరుకుతుంది. పర్యావరణం కూడా పరిరక్షించబడుతుంది. గణేశ్ చతుర్ధి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు.
ప్రియమైన నా దేశ ప్రజలారా..
సెప్టెంబర్ 4న భారత రత్న మదర్ టెరెసాను సెయింట్ బిరుదుతో సన్మానించబోతున్నారు. మదర్ టెరెసా తన యావత్తు జీవితాన్ని భారతదేశంలోని పేదల సేవ కోసం వినియోగించారు. ఆమె పుట్టిన దేశం అల్బేనియా. ఆమె మాతృ భాష ఇంగ్లీషు కాదు. అయినా ఆమె తన జీవితాన్ని ప్రజల సేవ కోసం మలుచుకున్నారు. పేదలకు సేవ చేయడం కోసం అవిరామంగా కృషి చేశారు. ఆమె జీవితాంతం నిరుపేద భారతీయుల సేవలోనే గడిపేశారు. అటువంటి మదర్ టెరెసాకు సెయింట్ బిరుదు లభిస్తోందంటే.. భారతీయులమైన మనమందరమూ ఎంతో గర్వ పడడం సహజం. సెప్టెంబర్ 4న జరిగే ఈ కార్యక్రమానికి 125 కోట్ల దేశ ప్రజల తరపున, భారత ప్రభుత్వం తరపున మన విదేశాంగ మంత్రి సుష్మ స్వరాజ్ నేతృత్వంలో ఒక అధికార ప్రతినిధి బృందం అక్కడకు వెళుతుంది. మునులు, రుషులు, సాధువుల ద్వారా ప్రతి క్షణం మనం ఎంతో కొంత నేర్చుకుంటూనే ఉంటాము. ఎంతో కొంత గ్రహిస్తూనే ఉంటాము. ఎంతో కొంత మంచి చేస్తూనే ఉంటాము.
ప్రియమైన నా దేశ ప్రజలారా..
ప్రగతి అనేది ఒక ప్రజా ఉద్యమంగా మారితే ఎంత మార్పు వస్తుందో చూడండి. ప్రజల శక్తి భగవంతుడి రూపమే. భారత ప్రభుత్వం కొద్ది కాలం క్రితం ఐదు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మలమైన గంగ కోసం, గంగానది కాలుష్యాన్ని తొలగించడం కోసం ప్రజలను కూడా భాగస్వాములను చేసే ప్రయత్నం చేసింది. ఈ నెల 20న అలహాబాద్ లో గంగానది ఒడ్డున ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టినపుడు ఆహ్వానింపబడిన వారిలో నది ఒడ్డున ఉండే పెద్దలే ప్రముఖులు. వారిలో మహిళలు, పురుషులు అందరూ ఉన్నారు. వారు అక్కడికి వచ్చి గంగా నది సాక్షిగా వారి, వారి గ్రామాల్లో దానిని అపవిత్రం చేసి కలుషితం చేసే ప్రయత్నాన్ని అడ్డుకుంటామని శపథం చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో మరుగుదొడ్ల నిర్మాణాన్ని ఉద్యమంగా చేపడతామని చెప్పారు. అలహాబాద్ కు వచ్చిన వారిలో ఒకరు ఉత్తరాఖండ్ వాసి అయితే, ఇంకొకరు ఉత్తరప్రదేశ్ వాసి. మరొకరు బీహార్ వాసి. ఇంకా ఝార్ ఖండ్, పశ్చిమ బెంగాల్ ల నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. వీరందరికీ ఇవే కృతజ్ఞతలు తెలుపుతున్నాను. శుభాకాంక్షలు అందజేస్తున్నాను. భారత ప్రభుత్వ అన్ని మంత్రిత్వ శాఖలకు, ఆయా మంత్రులకు ఇవే నా శుభాకాంక్షలు. గంగానదిని కాలుష్య రహితంగా చేయడానికి కన్న కలలు సాకారమవుతున్నందుకు సంతోషంగా ఉంది. నేను ఐదు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ధన్యవాదాలు పలుకుతున్నాను. ప్రజాశక్తిని సమీకరించి ఈ మహత్ కార్యంలో వారిని భాగస్వాములను చేసినందుకు ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశ వాసులారా…
అప్పుడప్పుడు కొన్ని విషయాలు నా మనసును స్పర్శిస్తూ ఉంటాయి. ఆ భావాలు వెల్లడించిన వారి పట్ల గౌరవం ఇనుమడిస్తుంది. జులై 15న ఛత్తీస్‌గఢ్ లో కబీర్ ధామ్ జిల్లాలో సుమారు 1700 పాఠశాలలకు చెందిన లక్షా పాతిక మంది విద్యార్థులు వారి వారి తల్లితండ్రులకు ఉత్తరాలు రాశారు. ఒకరు ఇంగ్లీషులో రాస్తే, మరొకరు హిందీలో రాశారు. ఇంకొకరు ఛత్తీస్‌గఢ్ మాండలికంలో రాశారు. ఈ పిల్లలందరూ వారి వారి తల్లితండ్రులకు రాసిన ఉత్తరాలలో వారి ఇంటిలో మరుగుదొడ్డి కావాలి అని కోరారు. మరుగుదొడ్ల నిర్మాణానికి పట్టుబట్టారు. కొందరు విద్యార్థులైతే ఈసారి తమ పుట్టిన రోజు జరపకపోయినా ఫర్వాలేదు, మరుగుదొడ్డి తప్పకుండా కట్టించాలంటూ కోరారు. 7 ఏళ్ల నుండి 17 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న ఈ విద్యార్థులు చేసిన పనికి వెలకట్టలేము. దీని ప్రభావం ఎంతగా ఉందంటే, ఉత్తరాలు అందుకున్న తరువాత మరుసటి రోజు పాఠశాలకు వెళ్లేటప్పుడు పిల్లల చేతుల్లో తల్లితండ్రులు మరో ఉత్తరాన్ని పెట్టారు. దానిని వారు ఉపాధ్యాయులకు ఇవ్వవలసిందిగా కోరారు. ఆ ఉత్తరంలో ఫలానా తేదీ కల్లా మేం మరుగుదొడ్డిని కట్టించేస్తామన్న వాగ్దానం రాసి ఉంది. ఇటువంటి ఆలోచన వచ్చిన వారినే కాదు, ఆలోచన రాని వారినీ ఆయా తల్లితండ్రులను కూడా నేను అభినందిస్తున్నాను; విద్యార్థుల ఉత్తరాలను గంభీరంగా పట్టించుకొని, మరుగుదొడ్ల నిర్మాణ నిర్ణయాన్ని తీసుకొన్న ఆ తల్లితండ్రులకు కృతజ్ఞతలు. ఇదిగో ఇటువంటివే మనకు స్ఫూర్తిని అందిస్తాయి. ప్రేరణను కలిగిస్తాయి.
కర్ణాటకలోని కొప్పాల్ జిల్లా. ఈ జిల్లాలో 17 ఏళ్ళ మల్లమ్మ. ఈమె ఆమె కుటుంబం పైనే సత్యాగ్రహానికి పూనుకొన్నది. అన్నం తినడం కూడా మానేసింది. ఆమె తన కోసం మంచి దుస్తులు కావాలనో, మిఠాయి కావాలనో కాకుండా కేవలం తన ఇంట్లో మరుగుదొడ్డి కావాలని ఉపవాసదీక్ష చేసింది. అయితే.. ఆమె కుటుంబానికి మరుగుదొడ్డి కట్టేటంత ఆర్థిక స్తోమత లేదు. కానీ, మల్లమ్మ సత్యాగ్రహాన్ని విరమించడానికి ససేమిరా అంది. దీంతో ఆ ఊరి పెద్ద మహ్మద్ షఫీ 18,000 రూపాయలను సమీకరించారు. ఒక్క వారం రోజులలో మరుగుదొడ్డిని ఏర్పాటుచేశారు. మల్లమ్మ పట్టుదల, షఫీ లాంటి గ్రామ పెద్ద సహకారంతో కల నిజమైంది. సమస్యల పరిష్కారానికి తలుపులు ఎట్లా తెరుచుకుంటాయో తెలుసుకోవడానికి ఇదొక ఉదాహరణ.
ప్రియమైన నా దేశ వాసులారా…
స్వచ్ఛ భారత్ ప్రతి భారతీయుడి కలగా, కొంతమందికి సంకల్పంగా మారింది. కొంతమంది దీనినే లక్ష్యంగా మార్చుకున్నారు. ప్రతి ఒక్కరు ఏదో ఒక విధంగా ఈ ఉద్యమంలో భాగస్వాములయ్యారు; కొత్త కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. భారత ప్రభుత్వానికి ఒక ఆలోచన వచ్చింది. మీరు స్వచ్ఛత కోసం చేస్తున్న కృషి – రెండు నిమిషాలో మూడు నిమిషాలో- దానిని చిత్రీకరించి, కేంద్ర ప్రభుత్వానికి పంపించండి. వెబ్ సైట్లో దీనికి సంబంధించిన సమాచారమంతా ఉంటుంది. దీనిని ఒక పోటీగా నిర్వహిస్తాము. ఈ పోటీలో గెలిచిన వారికి అక్టోబర్ 2.. గాంధీ జయంతి రోజు.. బహుమతులు అందజేస్తాము. నేనైతే టీవీ ఛానళ్ల వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.. మీరు కూడా స్వచ్ఛతపై లఘు చిత్రాలను తయారుచేసి పంపండి. దానితో స్వచ్ఛ భారత్ ఉద్యమానికి మరింత ప్రేరణ లభిస్తుంది. కొత్త కొత్త నినాదాలు లభిస్తాయి. ఇవన్నీ ప్రజల భాగస్వామ్యంతోను, సామాన్య కళాకారులతోను సాధ్యమయ్యేవే. వీటి కోసం పెద్ద పెద్ద స్టూడియోలు, పెద్ద పెద్ద కెమెరాలు అవసరం లేదు. రండి- ముందుకు సాగండి. మీ అందరికీ ఇదే నా ఆహ్వానం.
నా ప్రియమైన దేశ ప్రజలారా…
ఇరుగు పొరుగు దేశాలతో మన సంబంధాలు బాగుండాలని, ప్రగాఢం కావాలని మనం కృషి చేస్తూనే ఉన్నాము. కొద్ది రోజుల క్రితం ఒక ప్రధానమైన సంఘటన జరిగింది. మన గౌరవనీయులైన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారు కోల్ కతాలో ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది ఆకాశవాణి మైత్రి ఛానెల్. చాలా మందికి ఇదేమిటి.. ఒక రేడియో ఛానెల్ ను ప్రారంభించడానికి రాష్ట్రపతి కావాలా అని అనిపించవచ్చు. కానీ, ఇది మామూలు రేడియో ఛానెల్ కాదు. ఇదో పెద్ద ముందంజ. మన పొరుగునే బంగ్లాదేశ్ ఉంది. మనకు తెలుసు.. బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ ఒకే రకమైన సంస్కృతి, సంప్రదాయాలకు చెందినవి. ఇటువైపు ఆకాశవాణి మైత్రి.. అటువైపు వైర్ లెస్ బంగ్లాదేశ్. ఆ రెండు పరస్పరం సమాచారాన్ని, విషయాలను అందిపుచ్చుకుంటాయి. ఇరువైపులా ఉన్న బంగ్లా భాష మాట్లాడే వారు.. ఆకాశవాణి ఆనందాన్ని అందుకోవచ్చు. ప్రజల మధ్య సత్సంబంధాలు నెలకొల్పడానికి ఆకాశవాణి ఎంతో దోహదం చేస్తుంది. అందుకే.. రాష్ట్రపతి స్వయంగా మైత్రి ఛానెల్ ను ప్రారంభించారు. ఈ పనిలో మనకు చేదోడుగా నిలిచిన బంగ్లాదేశ్ కు ధన్యవాదాలు తెలుపుతున్నాను. విదేశీ వ్యవహారాల విధానంలో భాగస్వాములైన ఆకాశవాణి మిత్రులకు కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.
ప్రియమైన నా దేశ ప్రజలారా..
మీరు నాకు ప్రధాన మంత్రి పనిని అప్పగించారు. నిజమే, కానీ నేను కూడా ఒక మనిషినే. అప్పుడప్పుడు హృదయాన్ని స్పందింపచేసే, గుండెను బరువెక్కించే సంఘటనలు జరుగుతుంటాయి. అవి నాలో కొత్త శక్తిని, ప్రేరణను నింపుతుంటాయి. నా భారతదేశ ప్రజలకు ఏదో చేయాలనే స్ఫూర్తిని అందిస్తూ ఉంటాయి. కొద్ది రోజుల క్రితం నాకు ఒక ఉత్తరం వచ్చింది. అది నా హృదయాన్ని తాకింది. సుమారు 84 ఏళ్ళ ఒక తల్లి. విశ్రాంత ఉపాధ్యాయురాలు ఆమె. ఆమె పంపిన లేఖ సారాంశం ఇది.. తన పేరును ఎప్పుడు, ఎక్కడా ప్రస్తావించవద్దని ఆ లేఖలో ఆవిడ మరీమరీ ప్రాథేయపడ్డారు. కానీ.. నేను ఆమె పేరును చెబుతూ.. మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఆమె తన ఉత్తరంలో “గ్యాస్ సబ్సిడీని త్యాగం చేయండని మీరు కోరినప్పుడే, నేను సబ్సిడీని వదులుకున్నాను. ఆ విషయం ఆ తరువాత పూర్తిగా మరచిపోయాను. కానీ, కొద్ది రోజుల క్రితం మీ తరఫున ఒక వ్యక్తి వచ్చి, నాకు ఒక లేఖ అందించారు. గ్యాస్ సబ్సిడీని వదులుకున్నందుకు కృతజ్ఞతలు తెలుపుతూ పంపిన లేఖ అది. ప్రధాన మంత్రి పంపించిన ఉత్తరం. ఇది పద్మ శ్రీ అవార్డు కంటే తక్కువేమీ కాదు..” అని ఆ విశ్రాంత ఉపాధ్యాయురాలు తన మనోభావాలను ఉత్తరంలో పంచుకొన్నారు.
ప్రియమైన నా దేశ ప్రజలారా..
గ్యాస్ సబ్సిడీని విడచిపెట్టిన వారందరికీ కృతజ్ఞతా పూర్వకంగా లేఖ రాయాలని ప్రయత్నం చేశాను. నా తరఫున ఎవరో ఒకరు స్వయంగా ఆ త్యాగమూర్తులను కలుసుకొని, ఆ ఉత్తరాలను వారికి అందజేస్తారు. ఇదిగో అలా.. అందజేసిన ఉత్తరానికి జవాబే ఆ మాతృమూర్తి లేఖ. ‘మీరు చాలా మంచి పని చేస్తున్నారు. నిరుపేదలైన మహిళలకు కట్టెల పొయ్యి పొగ బారి నుండి విముక్తి కల్పిస్తున్నారు. “నేను ఒక విశ్రాంత ఉపాధ్యాయురాలిని. కొద్ది రోజులలో నాకు 90 ఏళ్లు నిండుతాయి. నేను 50,000 రూపాయలు విరాళంగా మీకు పంపుతున్నాను. ఇది నిరుపేదలైన మహిళలకు పొగ నుండి విముక్తిని కల్పించడంలో మీరు చేస్తున్న కృషికి తోడ్పడాలని ఆశిస్తున్నాను” అంటూ రాశారు. రిటైర్ అయి.. వచ్చే పెన్షన్ తో జీవితాన్ని సాగదీస్తున్న ఒక మాతృమూర్తి, తన తోటి నిరుపేద సోదరీమణులకు గ్యాస్ కనెక్షన్ ను ఇవ్వడం కోసం 50,000 రూపాయలను పంపించారు. దీనిలో ముఖ్యమైంది నగదు మాత్రమే కాదు, ఆమెకు వచ్చిన ఆలోచన, భావన, ఇతరుల కోసం సాయం చేయాలనే తపన.. ఇవి నన్ను కదలించాయి. ఆ రిటైర్డ్ టీచరుకు ధన్యవాదాలు. ఇటువంటి కోట్లాది సోదరీమణుల ఆశీర్వాదాలే ఈ దేశ భవిష్యత్తుకు ఊతం. మన దేశానికి బలమూ, ధైర్యమూ. ఆమె నాకు రాసిన ఆ ఉత్తరం కూడా ప్రధాన మంత్రి పేరున పంపలేదు. మామూలు ఉత్తరం. ‘మోదీ భయ్యా’ అంటూ రాశారు. ఆవిడకు నా నమస్కారాలు. దేశంలో ఇటువంటి తల్లులు అందరికీ కూడా నా వందనములు తెలుపుకొంటున్నాను. వారు స్వయంగా కష్టాలను భరిస్తూ, తమ శక్తి కొద్దీ ఇతరులకు సహాయపడుతూ ఉంటారు.
ప్రియమైన నా దేశ ప్రజలారా…
గత సంవత్సరం అనావృష్టి కారణంగా ఎన్నో ఇబ్బందులు పడ్డాము. అయితే ఈ ఆగస్టు నెల వరదల కష్టాల్లోకి మనల్ని నెట్టింది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో మళ్లీ మళ్లీ వరదలు వచ్చాయి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, స్థానిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, సామాజిక సంస్థలు, ప్రజలు వారి వారి శక్తి మేరకు వరదల నుండి ప్రజల నుంచి గట్టెక్కించడానికి కృషి చేశారు. కానీ, ఈ వరద కష్టాల వార్తల మధ్యలోనే మరికొన్ని సందేశాలను ఇచ్చే వార్తలు కూడా వచ్చాయి. వీటిపై దృష్టి సారించాలి. ఐకమత్యంతో ఉండే బలం ఎంతో.. కలసి నడిస్తే.. కలసి పని చేస్తే.. వచ్చే ఫలితాలు అద్భుతం. వీటన్నిటితో కూడిన ఆగస్టు నెల చిరస్మరణీయం. రాజకీయంగా భిన్న ధృవాలకు చెందిన పార్టీలు ఒక తాటిపైకి వచ్చి పార్లమెంట్లో వస్తువులు, సేవల పన్ను (జి ఎస్ టి) బిల్లుకు చట్ట రూపం కల్పించాయి. జి ఎస్ టి చట్టంగా మారడంలో అన్ని రాజకీయ పార్టీల పాత్ర ప్రముఖమైందే. అన్ని పార్టీలు కలసి నడిస్తే ఎంత గొప్ప కార్యమైనా ఎంత తేలికగా పూర్తవుతుందో దీనిని బట్టి తెలుస్తోంది. అదే విధంగా కశ్మీర్ లో కూడా కొంతమేర జరిగింది. కశ్మీర్ లోని పరిస్థితుల విషయంలో దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఒకే గొంతుతో, ఒకే విధంగా స్పందించాయి. అటు ప్రపంచానికీ, ఇటు వేర్పాటువాదులకు గట్టి సందేశాన్ని ఇచ్చాయి. కశ్మీర్ ప్రజల పట్ల మన సానుభూతిని స్పష్టంగా వ్యక్తం చేశాయి. కశ్మీర్ విషయంలో అన్ని పార్టీలతో నేను స్వయంగా మాట్లాడాను. ఇది ఎంతో బాగుంది. వారు వ్యక్తం చేసిన ప్రతి అభిప్రాయంలోను ఒక విషయం స్పష్టమయ్యేది. నేను తక్కువ మాటలలో చెప్పాలనుకుంటే- ఐకమత్యం, అనురాగం ఈ రెండే మూల మంత్రాలుగా ఉండాలని అనే వాడిని. మనందరి అభిప్రాయం ఒకటే. 125 కోట్ల మంది ప్రజల అభిప్రాయమే ఇది. గ్రామంలో సర్పంచ్ మొదలుకొని ప్రధాన మంత్రి వరకు.. అందరూ భావించేది ఒక్కటే. కశ్మీర్లో ఒకరి ప్రాణం పోయిందంటే.. అతను యువకుడైనా, భద్రతాదళాలకు చెందిన జవాను అయినా.. ఎవరి ప్రాణమైనా సరే.. మనలో ఒకరిని కోల్పోయినట్లే. ఇదే భావన దేశవ్యాప్తంగా ఉంది. అమాయక కశ్మీరీ పిల్లలను ముందుకు తోసి.. అక్కడ శాంతికి భంగం కలిగించే వారు ఎవరైనా సరే.. ఎప్పుడో ఒకప్పుడు.. వారు ఈ పిల్లలకు సంజాయిషీ చెప్పుకోవాల్సిన అవసరం వస్తుంది.
ప్రియమైన నా దేశ వాసులారా…
మన దేశం చాలా పెద్దది. అనేక వైవిధ్యాలతో కూడుకొన్నది. ఈ వైవిధ్యాల మధ్యే ఐకమత్యాన్ని సాధించడం పౌరులుగా, సమాజంగా, ప్రభుత్వంగా మనందరి బాధ్యత. ఐకమత్యాన్ని పెంపొందించే మాటలకు మరింత బలాన్ని చేకూర్చుదాము. ఈ విధంగానే దేశం ఉజ్జ్వల భవిష్యత్తును రూపొందించుకొని అక్కడికి చేరుకోగలుగుతుంది. 125 కోట్ల నా దేశ ప్రజల శక్తియుక్తుల మీద నాకు నమ్మకం ఉంది.
మీ అందరికీ నా ధన్యవాదములు.
ప్రియమైన నా దేశ వాసులారా.. నమస్కారం. ఈ రోజు పొద్దు పొద్దునే ఢిల్లీలోని యువకులతో కొద్ది క్షణాలు గడిపే అవకాశం దొరికింది. రాబోయే రోజుల్లో మన యావత్ భారతదేశంలో క్రీడారంగం ప్రతిఒక్క యువకుడినీ ఉప్పొంగే ఉత్సాహంతో నింపుతుందనే నమ్ముతున్నాను. కొద్ది రోజులలో ప్రపంచంలో అతిపెద్ద క్రీడా మహోత్సవం జరగబోతోంది. అన్నిదేశాలూ ఆ క్రీడలలో సునిశిత దృష్టితో చూడవచ్చు. మీరూ గమనిస్తారు. మనకు ఎన్నో ఆశలు, ఆసయాలు ఉండవచ్చు. కానీ రియోలో ఆడటానికి వెళ్లిన ఆ క్రీడాకులతో ఉత్సాహం, పట్టుదల నింపవలసిన బాధ్యత కూడా మన నూటపాతిక కోట్ల మంది దేశవాసులకు ఉంది. ఈరోజు ఢిల్లీ నగరంలో ‘రన్ ఫర్ రియో’ , ‘ఆడు- జీవించు’ ఇంకా ఆడు- వికసించు’ అనే గొప్ప కార్యక్రమాలను భారతదేశం నిర్వహించింది. రాబోయే రోజుల్లో మనం ఎక్కడున్నా సరే మన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏదో ఒకటి చెయ్యాలి. క్రీడాకారులు ఎంతో పట్టుదలతో శ్రమించి గానీ ఆ స్థాయికి చేరుకోలేరు. ఒకవిధంగా అది ఒక కఠోర తపస్సే! ఆహారం గురించి ఎంత కోరికలు ఉన్నా వాటిని అన్నింటినీ వదులుకోవలసివస్తుంది. చలి వాతావరణంలో వెచ్చగా నిద్రపోవాలని కోరికగా ఉన్నా ఆ సమయంలో కూడా పక్క మీద నుండి లేచి మైదానంలో పరిగెత్తాల్సి ఉంటుంది. ఒక్క క్రీడాకారులే కాదు. వాళ్ల తల్లిదండ్రులు కూడా అంత దీక్షగా తమ పిల్లలకు వెనుక నుండి ఉత్తేజాన్ని అందించాల్సి ఉంటుంది. రాత్రికి రాత్రే ఎవరూ క్రీడాకారులు కాలేరు. ఒక సుదీర్ఘ పరిశ్రమ, ఒక తపస్సు తర్వాతే అలా కాగలరు. గెలుపోటములు గొప్పవే, కానీ దాంతో పాటు ఆస్థాయికి చేరుకోవడం అంతకన్నా గొప్పది. అందుకని దేశవాసులం మనందరం రియో ఒలంపిక్ క్రీడలకు వెళ్లిన మన క్రీడాకారులందరికీ మన హృదయపూర్వత శుభాకాంక్షలు తెలుపుదాం! మీ తరపు నుండి ఈ పని చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. మన క్రీడాకారులకు మీ శుభాకాంక్షలు అందించడానికి మీ దేశ ప్రధాన మంత్రి పోస్టుమ్యాన్ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నరేంద్ర మోదీ యాప్ లో క్రీడాకారులకు వాళ్ల పేరుతో శుభాకాంక్షలు పంపించండి. మీ శుభాకాంక్షలు నేను పేరుపేరునా వాళ్లకి అందజేస్తాను. నూట పాతిక కోట్ల దేశవాసుల లాగా.. నేను ఒక దేశవాసిగా, ఒక పౌరుడిగా మన ఈ క్రీడాకారులలో ఉత్సాహం, పట్టుదల పెంపొందించడానికి మీలో ఒకడిగా ఉంటాను. రండి! రాబోయే రోజుల్లో ప్రతిఒక్క క్రీడాకారుడిని ఎంత గౌరవించుకోగలమో… వారు పడే శ్రమకు తగిన విధంగా పురస్కృతులను చేయగలయో అంతా చేద్దాం.. ఇవాళ నేను రియో ఒలంపిక్ గురించి మాట్లాడుతుండగా… ఒక సాహితీ ప్రేమికుడు, పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన సూరజ్ ప్రకాశ్ ఉపాధ్యాయ్ ఒక కవితను పంపించారు. అలా అన్ని భాషల్లోనూ కవితలు వ్రాసిన వాళ్లు బహుశా కవితలు వ్రాయబోతున్న వాళ్లు, వ్రాసిన వాటిని స్వరబద్ధంగా ఉండి ఉండవచ్చు. అయితే ఈ సందర్భంగాలో సూరజ్ నాకు పంపిన ఈ కవితను మీతో
పంచుకోవాలనుకుంటున్నాను.
మొదలయ్యాయి ఆటలు కేరింతలు!
మొదలయ్యాయి ఆటలు కేరింతలు-పోటీల వసంతకాలం పుంతలు!
ఆటలు ఈ కుంభమేళాలో- రియోలోని ఉత్సాహపు వెల్లువలో భారత్ చుట్టాలి పోటీకి శ్రీకారం
కురవాలి స్వర్ణ, రజత, కాంస్య పతకాల వర్షం.
ఈ సారి మన వంతు కావాలి. అలా ఉండాలి మన తయారీ.!
ఉండాలి గురి స్వర్ణం పైనే!
ఉండాలి గురి స్వర్ణం పైనే- నిరాశ చెందకు అది అందకపోతే!
నిరాశ చెందకు అది రాకపోతే!
కోట్లాది మనస్సులుప్పొంగనీ- నీ ఆటలో జీవముప్పొంగనీ!
మూటకట్టుకో ఘనకీర్తిని రియోలో మన పతాక ధ్వజమెత్తనీ!
రియోలో మన బావుటా ఎగిరేట్టుగా!
సూరజ్ గారు! మీ కవితా భావాలను మన క్రీడాకారులందరికీ అర్పిస్తున్నాను. అంతేకాదు… నా తరపున, నూటపాతిక కోట్ల మన దేశవాసుల తరపునా రియోలో మన భారతదేశ పతాకం విజయ కేతనంగా ఎగరేయాలని పదేపదే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంకిత్ అనే యువకుడు మన పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వర్ధంతిని గురించి గుర్తుచేశారు. పోయినవారం అబ్దుల్ కలాం గారి వర్ధంతి నాడు మన దేశంతో పాటు… యావత్ ప్రపంచం శ్రద్ధాంజలి ఘటించింది. అయితే అబ్దుల్ కలాం గారి పేరు మనకు ఎప్పుుడు స్మరణకు వచ్చినా- సైన్స్, టెక్నాలజీ, క్షిపణులు వీటితో సుసంపన్నం అయిన భారతదేశ ఈ చిత్రం మన కళ్ల ముందు సాకారంగా ప్రత్యక్షమవుతుంది. అందుకనే బహుశా అంకిత్ కూడా అబ్దుల్ కలాం గారి కలలను సకారం చేయడానికి మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది ..? అంటూ లేఖ రాశారు. మీ మాట నియమే అంకిత్ జీ! రాబోయే యుగం టెక్నాలజీతో నడిచే యుగమే. ఈ టెక్నాలజీ అతి త్వరగా మార్పు చెందుతుంటుంది. ప్రతి రెండో రోజు టెక్నాలజీ మారుతుంది. కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. రాబోయే రోజుల్లో కొత్త ప్రభావాన్ని చూపిస్తుంది. అది అలా అలా మారుతూ ఉంటుంది. మీరు టెక్నాలజీని ఒక స్థాయిలో పట్టుకోలేరు. పట్టకోవాలని అడుగు వేసేలోపల అది ఎక్కడో దూరంగా కొత్తరూపాన్ని సంతరించుకుని ప్రత్యక్షమవుతుంది. దాంతో కలసి అడుగు వేయాలంటే- దాన్ని దాటి ముందుకు వెళ్లాలంటే మనకు కూడా పరిశోధన, నూతన పరికల్పన చాలా అవసరం. ఇవి టెక్నాలజీ ప్రాణాలు! ఒకవేళ ఈ పరిశోధన అంటే నూతన పరికల్పన లేకపోతే ప్రవహించకుండా నిలిచి ఉన్న నీరు ఎలా కాలుష్యాన్ని పెంచి మురికి వ్యాపింపచేస్తుందో అలా పరిజ్ఞానం కూడా కూడా భారమైపోతుంది. పరిశోధన, పరికల్పన లేకుండా పాతటెక్నాలజీ సహాయంతో జీవిద్దామనుకుంటే ఈ ప్రపంచంలో మారుతున్న యుగంలో మన వెనుకబడిన వాళ్లమై పోతాం! అలా అందరికన్నా వెనుకబడిపోతుంటాం! అందుకని యువతరంలో విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తి, టెక్నాలజీ పట్ల పరిశోధనస నూతన రూపకల్పన వీటి గురించే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అందుకని నేను అనేది ఏమిటంటే ! ఎన్నోవేషనే మన లక్ష్యం కావాలి. నేను అంటున్న ఎ.ఐ.ఎం ఏమిటంటే ఎ-అటల్, ఐ-ఎన్నోవేషన్, ఎం-మిషన్! నీతి ఆయోగ్ ద్వారా ఈ మిషన్ చేపడుతున్నాం. ఈ ఎ.ఐ.ఎం ద్వారా అంటే అటల్ ఇన్నోవేషన్ ఎక్స్ పిరియెంట్ ఆంటల్ ప్రినర్ షిప్ వరుసగా పరంపరంగా జరగాలని, దీనిద్వారా కొత్త ఉపాధి అవకాశాలు రూపొందించాలని ఒక కోరిక! అదే నా ఆశయం! మనం భావితరానికి కొత్త ఇన్నోవోటర్స్ ని అందించాలంటే మన పిల్లలను వాటితో అనుసంధానించాలి, ఈ దిశగా భారత ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను రూపొందించింది. మన పాఠశాలల్లో ఎక్కడెక్కడ ఈ టింకరింగ్ ల్యాబ్స్ ను రూపొందించింది. మన పాఠశాలల్లో ఎక్కడెక్కడ ఈ టింకరింగ్ ల్యాబ్స్ ను నెలకొల్పుతారో వాటి కోసం పదేసి లక్షల రూపాయలను మంజూరు చేయడామే గాకుండా ఐదేళ్ల వరకు వాటి నిర్వహణ కోసం కూడా పదేసి లక్షల రూపాయలు ఇస్తాం. ఆ ప్రకారమే ఇన్నోవేషన్ తో పాటు ఇంక్యుబేషన్ సెంటర్ ల అవసరమూ వస్తుంది. మన దగ్గర శక్తిమంతంగా, అన్ని వనరులతో పనిచేసే ఇంక్యుబేషన్ సెంటర్లు ఉంటే వాటిని ఇన్నోవేషన్ కోసం, స్టార్ట్ అప్స్ కోసం, ప్రయోగాల కోసం ఒక స్థితిని తీసుకురావడానికి సరైన వ్యవస్థ ఏర్పడుతుంది. కొత్త ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పాల్సిన అవసరమూ ఉంది. ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్లను శక్తివంతం చేయాల్సిన అవసరమూ ఉంది. మరి నేను చెబుతున్న అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ విషయానికొస్తే వీటి గురించి పదికోట్ల రూపాయ భారీ మొత్తాన్ని అందించే దిశలో కూడా ప్రభుత్వం ఆలోచించింది. అదేవిఘంగా భారతదేశం ఇంకెన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. రోజువారీ జీవితాలతో మనకు ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం సాంకేతికంగా పరిష్కార మార్గాలను వెతకాలి. అటల్ గ్రాండ్ ఛాలెంజెస్ ద్వారా ఈ దేశపు యువతకు స్వాగతం పలుకుతున్నా సమస్యలు మీ దృష్టికి వస్తే వాటి పరిష్కారం కోసం సాంకేతికపరంగా దారులు వెతకండి పరిషోధనలు చేయండి. ఈవిష్కారాలు సాంతికేతకు భారత ప్రభుత్వం విశేష పురస్కారాన్ని అందించి ప్రోత్సహించాలనుకుంటోంది. నాకు సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే ప్రజలలో వీటిపట్ల ఆసక్తి కనిపిస్తోంది. టింకరింగ్ ల్యాబ్స్ గురించి ప్రస్తావించే సరికి దాదాపు 13 వేలకు పైగా పాఠశాలలు ఉత్సాహంతో ముందుకు వచ్చాయి. దరఖాస్తు చేసుకుంటున్నాయి. మరి ఇంక్యుబేషన్ సెంటర్ ల విషయంలో 4 వేలకు పైగా విద్య, విద్యేతర సంస్థలు ఇంక్యుబేషన్ సెంటర్లు కావాలంటూ ముందుకొచ్చాయి. అబ్దుల్ కలాం గారికి నిజమైన శ్రద్ధాంజలి అంటే పరిశోధన, ఇన్నోవేషన్, మన దైనందిన జీవిత సమస్యల నివారణ కోసం టెక్నాలజీ, మన ఇబ్బందులు అధిగమించడానికి చేపట్టే సరళీకరణలు- వీటిపట్ల మన యువతరం ఎంత ఎక్కువగా శ్రమిస్తుందో 21వ శతాబ్దంలో భారతదేశపు అభివృద్ధిలో వారికి అంత భాగస్వామ్యం ఏర్పడుతుంది. అదే అబ్దుల్ కలాం గారికి మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి అవుతుందని నా నమ్మకం.
ప్రియమైన దేశవాసులారా! కొంతకాలం క్రితం మనం కరువు కాటకాల గురించి ఆలోచించాం. ఈ మధ్య వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్న సంతోషకమైన వార్తలతో పాటు వరదల గురించి కూడా వార్తలు వస్తున్నాయి. కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి వరద బాధితులకు సహాయం అందించడానికి భుజం భుజం కలిపి శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది. వర్షాల మూలంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతిఒక్కరూ మానవత్వం ఉన్న ప్రతిఒక్కరూ ఆనందంతో పులకరిస్తున్నారు. ఎందుకంటే.. వర్షాలు, పంటలు మన ఆర్థిక విధానాలన్నింటికీ కేంద్ర బిందువు కాబట్టి.
ఒక్కొక్క సారి మనం జీవితాంతం పశ్చాత్తాపపడేట్టు రోగాలు వస్తుంటాయి. కానీ మనం అప్రమత్తంగా ఉన్నట్లయితే.. అవగాహన కలిగి ఉంటే నిరంతర ప్రయత్నంలో ఉన్నట్లయితే ఈ రోగాల నుండి తప్పించుకోవడానికి మార్గాలు చాలా సులభంగా ఉంటాయి. డెంగ్యూ జ్వరాన్నే తీసుకోండి! డెంగ్యూ నుండి తప్పించుకోవచ్చు. స్వచ్ఛత పట్ల కొంచెంగా శ్రద్ధ చూపిస్తే, సరిగ్గా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే, పిల్లల పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తే చాలు! బీదల బస్తీల్లోనే ఇటువంటి రోగులు వస్తాయి అనుకోవద్దు. డెంగ్యూ విషయం అలాకాదు. ఇది బాగా డబ్బున్న సంపన్నుల నివాసాల్లోనూ అందరికన్నా ముందుగా వస్తుంది. అందుకని ఏ రోగమైన మనం తీసుకునే జాగ్రత్తల్ని బట్టు ఉంటుంది. మీరు టీవీల్లో ప్రకటనలు చూస్తూనే ఉంటారు. కానీ అప్పడప్పుడు వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాం. ప్రభుత్వాలు, ఆస్పత్రులు, డాక్టర్లు వాళ్ల పని వాళ్లు చేస్తారు. కానీ మనం? మనం కూడా మన ఇళల్లో, మన పరిసర ప్రాంతాల్లో, మన కుటుంబ సభ్యులతో ఈ డెంగ్యూ రాకుండా ఉండేందుకు నీటి ద్వారా వ్యాపించే ఇతర వ్యాధులు రాకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి, మీ అందరినీ నేను కోరేది ఇదే! ప్రియమైన దేశవాసులారా! ఇంకొక విపత్తు వైపు మీ దృష్టిని మరల్చాలని నేను అనుకుంటున్నాను. జీవితాలు ఎంత అస్తవ్యస్తంగా తయారవుతున్నాయంతే… ఎంత ఉరుకులు, పరుగులమయమై పోతున్నాయంటే ఒక్కొక్కసారి మన గురించి మనం ఆలోచించుకోవడానికతి కూడా మనకు తీరిక లేదనిపిస్తుంది. జబ్బు పడ్డామా? వెంటనే నయమవడానికి ఏదోఒక యాంటీబయాటికి మాత్ర మింగితే సరి అనిపిస్తుంది. రోగం నుండి తాత్రాలిక ఉపశమనం దొరుకుతుంది. కానీ ప్రియమైన నా దేశవాసులారా! అలా దొరికిన యాంటీబయాటిక్ వేసుకునే అలవాటు మనల్ని ముందుముందు మరింత విషమ స్థితికి తీసుకువెళుతుంది. నవాటి ద్వారా మీకు వెంటనే ఉపశమనం కనిపించవచ్చు. కానీ- డాక్టర్లు మందుల చీటి రాసివ్వనంతవరకు, రోగం తగ్గడానికి మన ఇలా పక్కదారులలో వెళ్లవద్దు. ఎందుకంటే వీటినుండి కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.! ఎందుకంటారా? ఇలా ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్ మందులు వాడటం చేత రోగికి తాత్కాలికంగా లాభం ఉన్నా- రోగిలో ఉండే వ్యాధికణాలు ఆ మందులకు అలవాటు పడిపోయి… పోనుపోను సదరు మందులు ఆ రోగికి పనిచేయకపోవడం, రోగంతో పోరాటం, కొత్తమందులు తయారు చేయడం, వైజ్ఞానికంగా పరిశోధనలు జరపడం, అలా ఏళ్లు గడిచిపోవడం, ఆలోగా ఆ రోగాలు కొత్త సమస్యల్ని చెత్తిపెట్టడం… ఇన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకని రోగం విషయంలో జాగ్రత్తగా ఉండటమే చాలా అవసరం! ఇంకో ఇబ్బంది వస్తుంది. అదేమిటి? డాక్టర్ గారు చూడు బాబు… ఈ యాంటీబయాటిక్ గోళీలు ఐదురోజులు పదిహేను మాత్రలు వాడు అంటారు. నే చెప్పేది ఏమిటంటే ఎన్నిరోజులు ఆ మందులేసుకోవాలని చెప్పారో అన్ని రోజుల కోర్స్ పూర్తిచేయండి. అలా అని కోర్సును మించి ఎక్కువ రోజులు తీసుకున్నా అదీ వ్యాధి క్రిములకే లాభం. అందుకని కోర్సు ఎన్ని రోజుల పాటు ఎన్ని గోళీలు వేసుకోవాలని ఉంటే దాన్ని పూర్తిచేయడం కూడా అంతే అవసరం కానీ ఆరోగ్యం బాగుపడింది కాబట్టి ఇంకా వేసుకోవక్కర్లేదు, ఒకవేళ వేసుకుంటే రోగ కణాలకి లాభమవుతుంది, అవి మరింత బలం పుంజుకుంటాయి అని మాత్రం అనుకోవద్దు. క్షయ, మలేరియా రోగాలను వ్యాపింపజేసే సూక్ష్మ క్రిములు మన శరీరంలో ఎంతవేగంగా మార్పులు తీసుకొస్తాయంటే మందుల ప్రభావం ఉండనే ఉండదు. వైద్య పరిభాషలో దీన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. అందువలన యాంటీబయాటిక్ ను ఎలా వాడాలి అని చెబుతారో ఆ నియమాలను అలా పాటించడం కూడా అంతే అవసరం! ఈ యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ నిరోధించాలని మన ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మీరు చూసే ఉంటారు. ఈ రోజుల్లో అమ్ముడుపోతున్న యాంటీబయాటిక్ మందుల ప్యాకెట్ల మీద వాటి తయారీదారుని చిరునామా పై భాగంలో ఒక ఎర్రని గీత ఉంటుంది. ఆ గీత ద్వారా మీరు జాగ్రత్త పడవచ్చు. ఆ గీత ఉందో.. లేదో… జాగ్రత్తగా గమనించండి. ఆరోగ్యం విషయం వచ్చింది కాబట్టి మీకు ఇంకో విషయం కూడా చెబుదామనుకుంటున్నాను. మన దేశంలో గర్భం ధరించిన తల్లుల విషయానికి వస్తే వారి జీవితాలే ఒక్కోసారి కలవరపెడుతుంటాయి మన దేశంలో సాలీన మూడు కోట్ల మంది మహిళలు గర్భం ధరిస్తున్నారు. అయితే ప్రసవం సమయంలో కొన్ని మరణాలు సంభవిస్తున్నాయి. ఒకసారి తల్లులు చనిపోతున్నారు. ఇంకోసారి జన్మించే శిశువులు చనిపోతున్నారు. మరో సందర్భంగా తల్లి, శిశువు ఇద్దరూ చనిపోతున్నారు. అయితే గత పదేళ్లలో ప్రసవ సమయంలో అకారణంగా చనిపోతున్న తల్లుల సంఖ్య తగ్గింది. అయినా కానీ గర్భవంతులైన తల్లులలో ఎక్కుమంది జీవితాలు సురక్షితంగా లేవు అనే చెప్పాలి. గర్భం ధరించిన సమయంలో కానీ, ఆ తర్వాత గానీ రక్తం తక్కుగా ఉండటం, ప్రసవ సంబంధమైన వ్యాధులు, అధిక రక్తపోటు…. ఇలా ఏం ఇబ్బంది తలెత్తుతుందో గానీ వాళ్ల దీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని గత కొద్ది నెలల నుండి ఒక్క పథకాన్ని ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పేరుతో ప్రారంభించింది. ఈ పథకం మూలంగా ప్రతినెలా 9వ తారీఖున గర్భవతులైన మహిళలందరికీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రతినెలా 9వ తారీఖున ఈ సేవ లభ్యమవుతుంది. ప్రతిఒక్క పేద కుటుంబానికి నా విన్నపం ఏమిటంటే గర్భవతులైన తల్లులందరూ 9వ తారీఖున దొరికే ఈ సేవ ద్వారా లాభంపొందండి. అలా చేయడం వల్ల తొమ్మిది నెలలు నిండుతుండగా ఏదైనా ఇబ్బంది వస్తే ముందే మీరు జాగ్రత్త పడగలుగుతారు. తల్లి-శిశువు ఇరువురి జీవితాలు కాపాడవచ్చు. డాక్టర్లు ముఖ్యంగా పసూతి వైద్యులు మీరు నెలలో ఒక్కరోజు 9వ తారీఖు పేద తల్లులకు ఉచితంగా సేవలందించలేరా? వైద్య సోదర సోదరీమణులారా ! మీరు సంవత్సరంలో కేవలం 12 రోజులు ఈ విషయంలో పేదల కోసం కేటాయించలేరా? గతంలో నాకు ఎంతోమంది ఉత్తరాలు వ్రాశారు. నా విన్నపాన్ని మన్నించి ముందుకువచ్చిన వైద్యులు వేలకొద్దీ ఉన్నారు. కానీ మన భారతదేశం సువిశాలమైంది. ఈ పథకం ద్వారా లక్షల మంది వైద్యులు చేయూతనందివ్వాలి. మీరు ఆ చేయూతను అందిస్తారనే నా నమ్మకం.
నా ప్రియమైన దేశ వాసులారా! ఈనాడు యావత్ ప్రపంచం వాతావరణ మార్పు, భూతాపం, పర్యావరణం- వీటి గురించి బాగా ఆలోచిస్తున్నారు. దేశ విదేశాలలో ఉమ్మడిగా దీని గురించి చర్చిస్తున్నారు. భారతదేశంలో యుగయుగాలుగా ఈ విషయాన్ని నొక్కి చెబుతూనే ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధభూమిలో కూడా భగవానుడు శ్రీ కృష్ణుడు చెట్ల గురించి ప్రస్తావిస్తారు. యుద్ధక్షేత్రంలో కూడా వృక్షాలు గురించి చర్చించారంటే ఊహించండి అది ఎంత ముఖ్యమైన విషయమే. భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెబుతారు. అశ్వత్థ సర్వ వృక్షాణాం దీని అర్థం ఏమిటంటే- అన్ని వృక్షాలలో నేను రావి చెట్టును. శుక్రాచార్య నీతిలో ఇలా చెబుతారు. నాస్తిమూలం అనేషధం అంటే ఔషథం కాని మొక్కేలేదని దాని భావం. ఏ మొక్కలోనైనా ఔషధ గుణం లేకపోలేదు. మహాభారత్ అనుశాసన పర్వంలో దీని గురించి విస్తృతంగా చర్చ జరిగింది. మహాభారత అనుశాసన పర్వంలో ఇలా చెప్పారు. ఎవరైనా ఏదైనా వృక్షాన్ని నాటితే అది వారి సంతాన రూపం అవుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. తమ సంతానం ద్వారా పరలోకంలో వారందరికీ సద్గతి ప్రాప్తిస్తుందో చెట్టు ద్వారా కూడా అదే విధమైన లాభంపొందుతారు. అందుకే తమ సంకల్పం ఆకాంక్షించే తల్లిదండ్రులు మంచి చెట్లు నాటండి. తమ బిడ్డల వలే వాటిని పెంచిపోషించండి. మన శాస్త్రం- భగవద్గీత, శుక్రాచార్య నీతి, మహాభారత అనుశాసన పర్వంలో ఇవే విషయాలు చెప్పారు. ఈ కాలంలో కూడా అలాంటివారు ఉన్నారు. ఈ ఆదర్శాలను మనసా..వాచా ఆచరించి చూపిస్తారు. కొన్ని రోజుల క్రితం నాకు పుణేకు చెందిన అమ్మాయి సోనల్ ఉదాహరణ ఒకటి జ్ఞాపకం వచ్చింది. అది నా మనస్సును తాకింది. మహాభారత్ అనుశాసన పర్వంలో కూడా అదే చెప్పారు కదా. పరలోకంలో కూడా వృక్షాలు సంతానం బాధ్యతలను పూర్తిచేస్తారని సోనల్ కేవలం తన తల్లిదండ్రుల కోరికలనే కాదు. సమాజం కోర్కెలను కూడా సంపూర్ణంగా తీర్చే బాధ్యత భుజాన వేసుకున్నారు. మహారాష్ట్రలోని పుణేలో జున్నార్ తాలూకాలో నారాయణపూర్ గ్రామంలో ఖండు మారుతి మాత్రే అనే రైతు తన మనవరాలు సొనాల్ వివాహం చాలా స్ఫూర్తిదాయంకంగా జరిపించారు. మాత్రే గారు ఏం చేశారంటే- సోనల్ వివాహానికి ఎంతమందైతే బంధువులు, స్నేహితులు, అతిథులు వచ్చారో వారందరికీ కేసర మామిడి మొక్కను కానుకగా ఇచ్చారు. నేను ఆ చిత్రాన్నిసోషల్ మీడియాలో చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వివాహంలో పెళ్లి ఊరేగింపు కనిపించడం లేదు. అంతా మొక్కలే కనిపిస్తున్నాయి. మనస్సును ఆకట్టుకుంటున్న ఆ దృశ్యం ఆ చిత్రంలో ఉంది. సోనల్ వ్యవసాయ శాస్త్ర పట్టభద్రురాలు. ఈ ఆలోచన తనకే వచ్చింది. వావాహంలో మామిడి మొక్కలను కానుకగా ఇవ్వాలని చూడండి. ప్రకృతి పట్ల తన ప్రేమను ఆమె ఎంత ఉత్తమరీతిలో ప్రకటించుకుందో. ఒకవిధంగా సోనల్ వివాహం ప్రకృతి ప్రేమ గురించిన అమరగాథ అయింది. నేను సోనల్ కు, మాత్రే గారికి ఈ వినూత్న కృషి చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలాంటి ప్రయోగాలు చాలా మంది చేస్తుంటారు. నాకు జ్ఞాపకం ఉంది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి అంబాజీ దేవాలయంలో భాద్రపద మాసంలో పెద్దసంఖ్యలో యాత్రికులు వచ్చేవారు. అక్కడ ఒక సమాజ సేవా సంస్థ ఒక కొత్త ఆలోచన చేసింది. ఆలయాల దర్శనానికి వచ్చేవారికి ప్రసాదంగా ఒక మొక్కను ఇచ్చి ఈ మొక్క అమ్మవారి ప్రసాదం. మీరు జాగ్రత్తగా దీనిని తీసుకువెళ్లి మీ ఉళ్లో, మీ ఇంట్లో నాటితే దానిని పెంచి పెద్దచేస్తే మీకు సదా అమ్మవారి ఆశీర్వాదం లభిస్తూనే ఉంటుంది చూడండి అని చెప్పారు. అలా లక్షలాది మంది పాదయాత్ర చేసివచ్చిన యాత్రికులకు ఈ ఏడాది లక్షలకొద్దీ మొక్కలు పంపిణీ చేశారు. దేవాలయాలు కూడా ఈ ఏడాది వర్షాకాలంలో ప్రసాదం బదులు మొక్కలు ఇచ్చే సంప్రదాయం ప్రారంభించవచ్చు. ఈ విధంగా మన మహోత్సవం రూపంలో ఒక సహజ ప్రజాఉద్యమం ప్రారంభమవుతుంది. మన రైతులకు కూడా నాదొక సూచన. మన చేనుకు గట్లు కట్టిన చోట, కలప కోసం చెట్లు నాటవచ్చు కదా. ఈనాడు మన దేశంలో ఇళ్లు నిర్మించేందుకు, గృహపకరణాలు తయారు చేసేందుకు కోట్ల రూపాయల విలువజేసే చెక్కను విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. మన చేను గట్ల మీద చెట్లు నాటితే ఇంటికీ, ఫర్నీచర్ కు పనికివచ్చే కలప ఇచ్చే చెట్లు పెంచితే, 15-20 ఏళ్ల తర్వాత ప్రభుత్వ అనుమతితో వాటిని కొట్టి అమ్ముకోవచ్చు. దీనివల్ల మీకొక కొత్త ఆదాయమార్గం లభిస్తుంది. భారత్ కు కలప దిగుమతి చేసుకనే బాధ తప్పుతుంది. ఇటీవల అనేక రాష్ట్రాలు వర్షాకాలం అదనుచూసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్రప్రభుత్వం కూడా ఇప్పడిప్పుడే కంపా చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం కింద దాదాపు 40 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నిధులు మొక్కల పెంపకం కోసం రాష్ట్రప్రభుత్వాలకు అందనున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం జూలై 1వ తేదీన రెండు కోట్ల పాతిక లక్షల మొక్కలు నాటిందని, వచ్చే ఏడాది మూడుకోట్ల మొక్కలు నాటాలని సంకల్పించిందని నాకు తెలిసింది. ప్రభుత్వం ఒక ప్రజాఉద్యమాన్ని ప్రారంభించింది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం. ఆ రాష్ట్రంలో ఎంతో భారీ మనమహోత్సవం ప్రారంభించి పాతిక లక్షల మొక్కలు నాటారు. రాజస్థాన్ లో పాతిక లక్షల చెట్లు పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. రాజస్థఆన్ భూమి పరిస్థితి, సారం సంగతి తెలిసినవారికి అర్ధమవుతుంది. అశలు ఇది ఎంత బృహత్కార్యమో.. ఆంధ్రప్రదేశ్ లో కూడా 2019 నాటికి అడవులు విస్తీర్ణం 50 శాతానికి పెంచాలని నిర్ణయించారు. కేంద్రప్రభుత్వం నడిపిస్తున్న గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా రైల్వే శాఖ ఈ పనిని చేపట్టింది. గుజరాత్ లో కూడా నమ మహోత్సవానికి ఒక పెద్ద ఉజ్వలమైన సంప్రదాయం ఉంది. ఈ ఏడాది గుజరాత్ ఒక మామిడి ఉద్యానవనం, ఐకమత్య ఉద్యానవనం, అమరుల ఉద్యానవనం.. ఇటువంటి అనేక సంకల్పాలను వన మహోత్సవ రూపంలో చేపట్టింది. కోట్లాది చెట్లు నాటే ఉద్యమాన్ని వారు నడిపించారు. నేను అన్ని రాష్ట్రాలను పేరుపేరునా చెప్పడం లేదు గానీ అందరూ అభినందనీయులే…!
నా ప్రియమైన దేశవాసులారా! కొద్దిరోజుల కిందట నాకు దక్షిణాఫ్రికా వెళ్లే అవకాశం కలిగింది. ఇది నా మొదటి సందర్శన. విదేశీ పర్యటన అంటే దౌత్యం ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి చర్చలు ఉంటాయి. భద్రతకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. చాలా అవగాహన ఒప్పందాలు కుదురుతాయి. ఇవన్నీ ఉండాల్సిందే. కానీ దక్షిణాఫ్రికా పర్యటన నాకు ఒకరకంగా తీర్థయాత్ర వంటిది. దక్షిణాఫ్రికాను తలుచుకోగానే మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా గుర్తుకురావడం చాలా సహజం. ప్రపంచంలో అహింస, ప్రేమ, క్షమ- అనే శబ్దాలు చెవినపడగానే గాంధీ, మండేలా వారి ముఖాలు మన కళ్ల ఎదుట ప్రత్యక్షమవుతాయి. నా దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్ కు వెళ్లాను. మహాత్మాగాంధీ నివసించిన ప్రదేశం సర్వోదయ పేరుతో ప్రసిద్ధమైంది. మహాత్మాగాంధీ ఏ రైలులో అయితే ప్రయాణించారో, ఏ రైలులో జరిగిన సంఘటన ఒక మొహన్ దాస్ ను మహాత్మాగాంధీగా అవతరించేందుకు బీజాలు వేసిందో ఈ పీటర్ మార్టిన్ బర్గ్ స్టేషన్ కు రైల్లో ప్రయాణం చేసే భాగ్యం నాకు కలిగిం.ి అయితే నేను చెబుదామనుకున్న విషయం ఏమిటంటే- ఈ సారి గొప్ప వ్యక్తులను కలవగలిగాను. మనస్సులో సమానత్వం కోసం, హెచ్చుతగ్గుల్లేని సమానమైన అవకాశాల కోసం యవ్వన ప్రాయంలో ఉన్న తమ జీవితాలనే త్యాగం చేసిన మహానుభావులు వాళ్లు. నెల్సన్ మడేలాతో పాటు భుజం భుజం కలిపి పోరాటులు సాగించారు. నెల్సన్ మండేలాతో పాటుగా ఇరవై, ఇరవై రెండేళ్లు జైలు జీవితాలు గడిపారు. ఒకవిధంగా వాళ్లు తమ యవ్వనాన్నే ధారపోశారని చెప్పవచ్చు. నెల్సన్ మండేలాకి అత్యంత సన్నిహితులుగా మెలిగిన శ్రీఅహ్మద్ కథ్రాడా, శ్రీలాలూ చీబా, శ్రీజార్జ్ బిజోస్, శ్రీరోని కాస్రిల్స్ ఈ మహానుభావులందరినీ దర్శించుకునే భాగ్యాన్ని పొందాను. భారతీయ మూలాలున్నా ఎక్కడికి వెళితే అక్కడి వాళ్లయిపోయారు. ఈ ప్రజల మధ్య జీవించారు. వాళ్ల కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఎంత శక్తిసంపన్నులు గమ్మత్తేమిటంటే నేను వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల అనుభవాలు వింటుంటే వాళ్ల మాటల్లో ఎవరిపట్లా కాఠిన్యం గానీ, ద్వేషం గానీ కనిపించలేదు. సమాజం కోసం అంతగా తపస్సు చేసి వాళ్ల ముఖాలలో ఇది తీసుకోవాలి… ఇది సంపాదించాలి… ఇలా ఉండాలి.. అన్న భావాలేమీ కనిపించలేదు. నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను అన్న ఒక నిశ్చలమైన ప్రశాంతత. భగవద్గీతలో కర్తవ్యం నిర్వహించేవారి గురించే చెప్పారు. మమ్మూర్తులా ఈ రూపాలే సాక్షాత్కారించాయి, ఆ పరిచయాలు నా మనస్సులోంచి ఎప్పటికీ చెరిగిపోవు. సమానత్వ, సమాన సౌకర్యాలు, ఏ సమాజానికైనా, ఏ ప్రభుత్వానికైనా దీన్ని మించిన మూలమంత్రం ఇంకొకటి ఉంటుందనుకోను. మనల్ని ఉజ్వల భవిష్యత్ వైపు నడిపించేవి రెండే రెండు మార్గాలు. సమభావం! సహభావం! ఇవే. మనం అందరం మంచి జీవితాలను కోరుకుంటాం. మన పిల్లలకి మంచి భవిష్యత్తును కోరుకుంటాం. ప్రతిఒక్కరి అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. వాటి ప్రయారిటీస్ అంటే ప్రాధమ్యాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ మార్గం మాత్రం ఒక్కటే! అదే ప్రగతిమార్గం. సమానత్వపు మార్గం. సమాన సౌకర్యాల మార్గం. సమభావపు మార్గం. సహభావపు మార్గం. రండి… దక్షిణాఫ్రికాలో కూడా మన జీవితపు మాల మంత్రాలను తాము పఠించి, పాటించి చూపించిన ఈ భారతీయులను చూసి గర్విద్దాం.
ప్రియమైన నా దేశవాసులారా! నేను శిల్పా వర్మ గారికి ఎంతో రుణపడి ఉంటాను. ఆవిడ నాకొక సందేశం పంపించారు. ఆవిడ పడ్డ తపన నాకు చాలా స్వాభావికంగా కనిపించింది. ఒక సంఘటన గురించి ఆవిడ తెలియజేశారు.
ప్రధాన మంత్రి గారు. ! నేను శిల్పీవర్మను. బెంగళూరు నుండి మాట్లాడుతున్నాను. కొద్దిరోజుల క్రితం వార్తల్లో ఒక విషయం చదివాను. ఒక మహిళా మోసపూరితమైన ఇ-మెయిల్ అని తెలియక నమ్మి 11 లక్షల రూపాయలు పోగొట్టుకుని ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. నేనూ ఒక స్త్రీని కావడం చేత ఆమె కుటుంబం గురించి బాధపడ్డాను. ఇలాంటి మోసపూరితమైన ఇ-మెయిల్స్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి విషయాలు మీ అందరి దృష్టిలోకి కూడా వస్తుండవచ్చు మన మొబైల్ ఫోన్లలో, మన ఈ-వెయిల్స్ లో ఎంతో ప్రలోభం కలిగించే విధంగా సందేశాలు కనిపిస్తాయి. ఇదిగో మీకు ఇంత మొత్తం బహుమతి వచ్చింది. దాన్ని అందుకోవడానికి ముందుగా మీరింత కట్టాలి అంటూ ఎవరో మెస్సేజ్ పంపిస్తారు. కొంతమంది అది నిజమని నమ్మి వస్తుందనుకున్న డబ్బు మీద వ్యామోహంతో చిక్కుకుపోతారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దొంగతనం చేసే ఈ కొత్త పద్ధతి ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. ఆర్థిక వ్యవస్థను బలిష్టం చేయడంలో ఒకవైపు టెక్నాలజీ ముఖ్యపాత్ర పోషిస్తుంటే- ఇంకోవైపు దాన్ని దుర్వినియోగం చేసే ప్రబుద్ధులు కూడా రంగంలోకి దిగుతారు. మరి ! ఒక విశ్రాంత అధికారి కూతురు పెళ్లి చేయాల్సివుంది. ఇల్లు కూడా కట్టుకోవాలనుకుంటున్నాడు. ఒకరోజు ఆయనకు ఒక ఎస్.ఎం.ఎస్ వచ్చింది. మీ కోసం విలువైన విదేశీ బహుమతి వచ్చింది. దాన్ని అందుకోవడానికి చెల్లించాల్సిన కస్టమ్స్ డ్యూటీ నిమిత్తం రెండు లక్షల రూపాయలు ఫలానా బ్యాంకుల్లో, ఫలానా ఖాతాలో జమచేయండి అంటూ. ఈ పెద్దమనిషి ముందూవెనుకా ఆలోచించకుండా తన కష్టార్జితంలోంచి రెండు లక్షలు ఆ ముక్కూ మొహం తెలియని వ్యక్తికి పంపించేశాడు. అదీ ఒక మామూలు ఎస్.ఎం.ఎస్ ను నమ్మి. తర్వాత కొద్దిక్షణాల్లో తెలిసిందతనికి తాను మోసపోయానని… కానీ ఏం లాభం… జరగకూడనిది జరిగిపోయింది. మీరు కూడా అప్పుడప్పుడూ మోసపోవచ్చు. మీకు చాలా గొప్పగా ఉత్తరాలు వస్తాయి. అవి ఎలా రాస్తారంటే ఆ ఉత్తరం నిజమోనేమో అనిపిస్తుంది. ఏదో ఒక అధికారికమైన లెటర్ ప్యాడ్ తయారు చేసి మరీ పంపిస్తారు. మీ క్రెడిట్ కార్డు నంబర్, డెబిట్ కార్డు నంబర్ లు సంపాదిస్తారు. టెక్నాలజీ సాయంతో మీ బ్యాంకు అకౌంట్ లో ఉన్న మొత్తాన్ని ఖాళీ చేసేస్తారు. ఇదో కొత్తరకపు మోసం. డిజిటల్ మోసం. మన ఇలాంటి మోహాలకు, మోసాలకు దూరంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి బూటకపు సందేశాలు వస్తే మన స్నేహితులతో పంచుకుని వారిని కూడా అప్రపమత్తం చేయాలి. శిల్పీవర్మ ఎంతో మంచి విషయం నా దృష్టికి తీసుకువచ్చారు. మీకు కూడా ఇటువంటివి ఎదురైనా, మీరు మరీ ఎక్కువగా పట్టించుకోకపోవచ్చు గానీ పట్టించుకోవాలని నాకు అనిపిస్తోంది.
ప్రియమైన నా దేశవాసులారా.. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా దేశంలోని చాలామంది ప్రజలను కలుసుకునే అవకాశం నాకు లభిస్తుంది. మన పార్లమెంటు సభ్యులు కూడా తమతమ ప్రాంతాల నుండి ప్రజలను నా దగ్గరకు తీసుకువస్తారు. నాతో మాట్లాడతారు. తమ కష్టాలను కూడా చెప్పుకుంటారు. కానీ ఈ మధ్య నాకు ఒక మంచి అనుభవం కలిగింది. అలీఘర్ నుండి కొంతమంది విద్యార్థులు నా వద్దకు వచ్చారు. బాలబాలికల్లో పొంగుతున్న ఆ ఉత్సాహాన్ని చూసితీరాలి. వారు చాలా పెద్ద ఆల్బమ్ తీసుకని వచ్చారు. వారి మూఖాలపై ఎంత సంతోషమో చెప్పలేను… అలీఘర్ పార్లమెంటు సభ్యుడు వారిని నా దగ్గరకు తీసుకువచ్చారు. వారు నాకు ఫోటోలు చూపించారు. వారంతా అలీఘర్ రైల్వేస్టేషన్ ను అందంగా తయారు చేశారు. స్టేషన్ మీద కళాత్మకమైన పెయింటింగ్ లు వేశారు. ఇంతేకాదు… గ్రామంలో ప్లాస్టిక్ సంచులు గానీ, నూనెడబ్బాలు గానీ, చెత్తకుప్పల్లో పడిఉంటే వాటిని వెతికివెతికి పోగుచేశారు. వాటిలో మట్టిని నింపి మొక్కలు నాటి వర్టికల్ గాల్డెన్ తయారుచేశారు. రైల్వేస్టేషన్ వైపు ప్లాస్టిక్ సీసాల్లో ఈ వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేసి స్టేషన్ కే ఒక నూతన రూపాన్ని ఇచ్చారు. మీరు కూడా ఎప్పుడైనా అలీఘర్ వెళ్లినట్లయితే తప్పక ఈ స్టేషన్ ను చూడండి. దేశంలోని చాలా రైల్వేస్టేషన్ల నుండి ఈ మధ్య నాకు ఈ వార్తలు అందుతున్నాయి. స్థానిక ప్రజలు రైల్వే స్టేషన్ గోడల మీద తమ కళల ద్వారా తమ ప్రాంతపు గుర్తింపును ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. ఒక నూతనత్వం కనిపిస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో ఎలాంటి మార్పు తెవచ్చునో.. దానికి ఇది ఉదాహరణ. దేశంలో ఇటువంటి పనులు చేస్తున్న వారందరికీ అభినందనలు. ముఖ్యంగా అలీఘర్ లోని నామిత్రులందరికీ మరీమరీ అభినందనలు.
ప్రియమైన నా దేశవాసులారా! వర్షపు రుతువుతో పాటు మన దేశంలో పండుగల రుతువు కూడా ప్రారంభమవుతుంది. రానున్న రోజుల్లో అందరూ ఉత్సవాల్లో మునిగి ఉండవచ్చు. ఆలయాల్లో, పూజా హృహాల్లో ఉత్సవాలు జరుపుకుంటూ ఉండవచ్చు. ఆలయాల్లో, పూజా గృహాల్లో ఉత్సవాలు జరుపుకుంటూ ఉండవచ్చు. ఇంకా మీరు కూడా ఇంట్లోనూ, బయటా కూడా ఉత్సవాల్లో ఒకచోట చేరుతుంటారు. రక్షాబంధన్ పండుగ మన దగ్గర ఒక ముఖ్యమైన పండుగ. క్రితం ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రక్షాబంధన్ సందర్భంగా మీరు మన దేశంలోని అమ్మలకు, అక్కాచెల్లెళ్లకు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన లేదా జీవన్ జ్యోతి బీమా యోజన కానుకగా ఇవ్వలేరా.. ఆలోచించండి. సోదరికి ఇటువంటి కానుక ఇవ్వాలి ఎటివంటిదంటే అది ఆమెకు జీవితంలో నిజమైన రక్షణ కల్పించేదిగా ఉండాలి. ఇంతేకాదు… మన ఇంట్లో వంటచేసే మహిళ ఉంటుంది. మన ఇంట్లో శుభ్రంగా ఇంటిపని చేసే ఎవరో ఒక మహిళ ఉంటుంది. పేదతల్లి కూతురై ఉంటుంది. ఈ రక్షాబంధన్ పండుగ సందర్భంగా వారికి కూడా సురక్ష బీమా యోజన లేదా జీవనజ్యోతి బీమాయోజన కానుకగా మీరు ఇవ్వవచ్చు. ఇదే సమాజ భద్రత . ఇదే రక్షాబంధన్ కు సరైన అర్థం.
ప్రియమైన నా దేశవాసులారా! మనలో చాలా మంది దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించినవారున్నారు. అలా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదట జన్మించిన ప్రధానమంత్రిని నేను. ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమైంది. హిందుస్థాన్ వదిలివెళ్లండి.. భారత్ వదిలి వెళ్లండి. ఈ ఉద్యమం జరిగి 75 ఏళ్లు అవుతున్నాయి. ఆగస్టు 15న మనకి స్వాతంత్ర్యం వచ్చి కూడా 70 ఏళ్లు అవుతుంది. మనం స్వాతంత్ర్యంతో వచ్చిన సంతోషాన్నయితే అనుభవిస్తున్నాం. స్వతంత్ర పౌరులమనే గర్వాన్ని కూడా అనుభవిస్తున్నాం. కానీ ఈ స్వాతంత్ర్య ఇప్పించిన ఆ మహానాయకులను సంస్మరించుకోవలసిన సమయం ఇది. భారత్ ను వీడండి.. కి 75 ఏళ్లు.. భారత స్వాతంత్ర్యానికి 70 ఏళ్లు. ఇవి మనకు కొత్త స్ఫూర్తిని ఇస్తాయి. నూతనోత్సహాన్ని రేకెత్తించగలవు. దేశం కోసం ఎంతోకొంత చేయాలనే సంకల్పాన్ని కల్పించే సందర్భంగా పనిచేస్తాయి. దేశం యావత్తు ఆ నాటి స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తిని నింపుకొని ఉప్పొంగిపోవాలి. మరోసారి స్వాతంత్ర్యపు సువాసనలు నలువైపులా వెదజల్లాలి. మనమంతా కలిసి ఈ వాతావరణాన్ని సృష్టిద్దాం. స్వాతంత్ర్య దినోత్సవం ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇదే దేశ ప్రజలందరికీ కావాలి. దీపావళి మాదిరిగా మనందరి పండుగ కావాలి. మీరు కూడా దేశభక్తి స్ఫూర్తితో కూడిన ఏదో ఒక మంచిని చేయండి. దాని బొమ్మను నరేంద్ర మోదీ యాప్ మీద తప్పక పంపండి. దేశంలోని ఒక పండగ వాతావరణం సృష్టించండి.
ప్రియమైన నా దేశవాసులారా! ఆగస్టు 15వ తేదీనాడు ఎర్రకోట బురుజుల పై నుండి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే ఒక సదవకాశం నాకు లభిస్తుంది. ఇది ఒక సంప్రదాయం. మీ మనసులో కూడా ఎన్నో విషయాలు ఉంటాయి ఎన్నో ఆలోచనలు మొదలవుతుంటాయి. ఆ ఆలోచనలను అంతే ప్రముఖంగా ఎర్రకోట పై నుండి వినిపించాలని మీరు అనిపించవచ్చు. ఈ దేశ ప్రధానమంత్రిగా, ప్రధాన సేవకుడిగా, మీ ప్రతినిధిగా నేను ఏ విషయాలు ఎర్రకోట నుండి దేశానికి వినిపించాలి అని మీరు అనుకుంటారో- ఆ మాటలను, ఆ ఆలోచనలను నాకు తెలియజేయండి. మీరు ఇదే నా ఆహ్వానం. సూచనలు, సలహాలు ఇవ్వంజి. కొక్క ఆలోచనలు ఇవ్వండి. మీ మనసులో మాట దేశ ప్రజానీకానికి తెలియజేసేందుకు నేను ప్రయత్నిస్తాను. ఎర్రకోట నుండి వినిపించే ప్రసంగం నూటపాతిక కోట్ల మంది దేశ ప్రజల మాట కావాలి. మీరు తప్పకుండా నాకు ఏదో ఒకటి రాసిపంపిండి. ‘NarendraModi App’ పైన గానీ, MyGov.in పైన గానీ పంపవచ్చు. పైపెచ్చు ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో విస్తృతమైంది. మీరు ఎన్నో విషయాలు నాకు ఎంతో తేలికగా తెలియజేయవచ్చు. మీకు ఇదే నా ఆహ్వానం. రండి. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆ మహనీయులను స్మరించుకుందాం.. మన దేశం కోసం జీవితాలను అర్పించిన మహా పురుషులను గుర్తిచేసుకుందాం. దేశం కోసం ఏదో చేస్తామన్న సంకల్పంతో ముందుకు సాగుదాం.
మీ అందరికీ నా శుభాకాంక్షలు.. ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశ వాసులారా.. నమస్కారం. ఈ రోజు పొద్దు పొద్దునే ఢిల్లీలోని యువకులతో కొద్ది క్షణాలు గడిపే అవకాశం దొరికింది. రాబోయే రోజుల్లో మన యావత్ భారతదేశంలో క్రీడారంగం ప్రతిఒక్క యువకుడినీ ఉప్పొంగే ఉత్సాహంతో నింపుతుందనే నమ్ముతున్నాను. కొద్ది రోజులలో ప్రపంచంలో అతిపెద్ద క్రీడా మహోత్సవం జరగబోతోంది. అన్నిదేశాలూ ఆ క్రీడలలో సునిశిత దృష్టితో చూడవచ్చు. మీరూ గమనిస్తారు. మనకు ఎన్నో ఆశలు, ఆసయాలు ఉండవచ్చు. కానీ రియోలో ఆడటానికి వెళ్లిన ఆ క్రీడాకులతో ఉత్సాహం, పట్టుదల నింపవలసిన బాధ్యత కూడా మన నూటపాతిక కోట్ల మంది దేశవాసులకు ఉంది. ఈరోజు ఢిల్లీ నగరంలో ‘రన్ ఫర్ రియో’ , ‘ఆడు- జీవించు’ ఇంకా ఆడు- వికసించు’ అనే గొప్ప కార్యక్రమాలను భారతదేశం నిర్వహించింది. రాబోయే రోజుల్లో మనం ఎక్కడున్నా సరే మన క్రీడాకారులను ప్రోత్సహించడానికి ఏదో ఒకటి చెయ్యాలి. క్రీడాకారులు ఎంతో పట్టుదలతో శ్రమించి గానీ ఆ స్థాయికి చేరుకోలేరు. ఒకవిధంగా అది ఒక కఠోర తపస్సే! ఆహారం గురించి ఎంత కోరికలు ఉన్నా వాటిని అన్నింటినీ వదులుకోవలసివస్తుంది. చలి వాతావరణంలో వెచ్చగా నిద్రపోవాలని కోరికగా ఉన్నా ఆ సమయంలో కూడా పక్క మీద నుండి లేచి మైదానంలో పరిగెత్తాల్సి ఉంటుంది. ఒక్క క్రీడాకారులే కాదు. వాళ్ల తల్లిదండ్రులు కూడా అంత దీక్షగా తమ పిల్లలకు వెనుక నుండి ఉత్తేజాన్ని అందించాల్సి ఉంటుంది. రాత్రికి రాత్రే ఎవరూ క్రీడాకారులు కాలేరు. ఒక సుదీర్ఘ పరిశ్రమ, ఒక తపస్సు తర్వాతే అలా కాగలరు. గెలుపోటములు గొప్పవే, కానీ దాంతో పాటు ఆస్థాయికి చేరుకోవడం అంతకన్నా గొప్పది. అందుకని దేశవాసులం మనందరం రియో ఒలంపిక్ క్రీడలకు వెళ్లిన మన క్రీడాకారులందరికీ మన హృదయపూర్వత శుభాకాంక్షలు తెలుపుదాం! మీ తరపు నుండి ఈ పని చేయడానికి నేను కూడా సిద్ధంగా ఉన్నాను. మన క్రీడాకారులకు మీ శుభాకాంక్షలు అందించడానికి మీ దేశ ప్రధాన మంత్రి పోస్టుమ్యాన్ పని చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు నరేంద్ర మోదీ యాప్ లో క్రీడాకారులకు వాళ్ల పేరుతో శుభాకాంక్షలు పంపించండి. మీ శుభాకాంక్షలు నేను పేరుపేరునా వాళ్లకి అందజేస్తాను. నూట పాతిక కోట్ల దేశవాసుల లాగా.. నేను ఒక దేశవాసిగా, ఒక పౌరుడిగా మన ఈ క్రీడాకారులలో ఉత్సాహం, పట్టుదల పెంపొందించడానికి మీలో ఒకడిగా ఉంటాను. రండి! రాబోయే రోజుల్లో ప్రతిఒక్క క్రీడాకారుడిని ఎంత గౌరవించుకోగలమో… వారు పడే శ్రమకు తగిన విధంగా పురస్కృతులను చేయగలయో అంతా చేద్దాం.. ఇవాళ నేను రియో ఒలంపిక్ గురించి మాట్లాడుతుండగా… ఒక సాహితీ ప్రేమికుడు, పంజాబ్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థి అయిన సూరజ్ ప్రకాశ్ ఉపాధ్యాయ్ ఒక కవితను పంపించారు. అలా అన్ని భాషల్లోనూ కవితలు వ్రాసిన వాళ్లు బహుశా కవితలు వ్రాయబోతున్న వాళ్లు, వ్రాసిన వాటిని స్వరబద్ధంగా ఉండి ఉండవచ్చు. అయితే ఈ సందర్భంగాలో సూరజ్ నాకు పంపిన ఈ కవితను మీతో
పంచుకోవాలనుకుంటున్నాను.
మొదలయ్యాయి ఆటలు కేరింతలు!
మొదలయ్యాయి ఆటలు కేరింతలు-పోటీల వసంతకాలం పుంతలు!
ఆటలు ఈ కుంభమేళాలో- రియోలోని ఉత్సాహపు వెల్లువలో భారత్ చుట్టాలి పోటీకి శ్రీకారం
కురవాలి స్వర్ణ, రజత, కాంస్య పతకాల వర్షం.
ఈ సారి మన వంతు కావాలి. అలా ఉండాలి మన తయారీ.!
ఉండాలి గురి స్వర్ణం పైనే!
ఉండాలి గురి స్వర్ణం పైనే- నిరాశ చెందకు అది అందకపోతే!
నిరాశ చెందకు అది రాకపోతే!
కోట్లాది మనస్సులుప్పొంగనీ- నీ ఆటలో జీవముప్పొంగనీ!
మూటకట్టుకో ఘనకీర్తిని రియోలో మన పతాక ధ్వజమెత్తనీ!
రియోలో మన బావుటా ఎగిరేట్టుగా!
సూరజ్ గారు! మీ కవితా భావాలను మన క్రీడాకారులందరికీ అర్పిస్తున్నాను. అంతేకాదు… నా తరపున, నూటపాతిక కోట్ల మన దేశవాసుల తరపునా రియోలో మన భారతదేశ పతాకం విజయ కేతనంగా ఎగరేయాలని పదేపదే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అంకిత్ అనే యువకుడు మన పూర్వ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి వర్ధంతిని గురించి గుర్తుచేశారు. పోయినవారం అబ్దుల్ కలాం గారి వర్ధంతి నాడు మన దేశంతో పాటు… యావత్ ప్రపంచం శ్రద్ధాంజలి ఘటించింది. అయితే అబ్దుల్ కలాం గారి పేరు మనకు ఎప్పుుడు స్మరణకు వచ్చినా- సైన్స్, టెక్నాలజీ, క్షిపణులు వీటితో సుసంపన్నం అయిన భారతదేశ ఈ చిత్రం మన కళ్ల ముందు సాకారంగా ప్రత్యక్షమవుతుంది. అందుకనే బహుశా అంకిత్ కూడా అబ్దుల్ కలాం గారి కలలను సకారం చేయడానికి మీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుంటోంది ..? అంటూ లేఖ రాశారు. మీ మాట నియమే అంకిత్ జీ! రాబోయే యుగం టెక్నాలజీతో నడిచే యుగమే. ఈ టెక్నాలజీ అతి త్వరగా మార్పు చెందుతుంటుంది. ప్రతి రెండో రోజు టెక్నాలజీ మారుతుంది. కొత్త రూపాన్ని సంతరించుకుంటుంది. రాబోయే రోజుల్లో కొత్త ప్రభావాన్ని చూపిస్తుంది. అది అలా అలా మారుతూ ఉంటుంది. మీరు టెక్నాలజీని ఒక స్థాయిలో పట్టుకోలేరు. పట్టకోవాలని అడుగు వేసేలోపల అది ఎక్కడో దూరంగా కొత్తరూపాన్ని సంతరించుకుని ప్రత్యక్షమవుతుంది. దాంతో కలసి అడుగు వేయాలంటే- దాన్ని దాటి ముందుకు వెళ్లాలంటే మనకు కూడా పరిశోధన, నూతన పరికల్పన చాలా అవసరం. ఇవి టెక్నాలజీ ప్రాణాలు! ఒకవేళ ఈ పరిశోధన అంటే నూతన పరికల్పన లేకపోతే ప్రవహించకుండా నిలిచి ఉన్న నీరు ఎలా కాలుష్యాన్ని పెంచి మురికి వ్యాపింపచేస్తుందో అలా పరిజ్ఞానం కూడా కూడా భారమైపోతుంది. పరిశోధన, పరికల్పన లేకుండా పాతటెక్నాలజీ సహాయంతో జీవిద్దామనుకుంటే ఈ ప్రపంచంలో మారుతున్న యుగంలో మన వెనుకబడిన వాళ్లమై పోతాం! అలా అందరికన్నా వెనుకబడిపోతుంటాం! అందుకని యువతరంలో విజ్ఞానశాస్త్రం పట్ల ఆసక్తి, టెక్నాలజీ పట్ల పరిశోధనస నూతన రూపకల్పన వీటి గురించే ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. అందుకని నేను అనేది ఏమిటంటే ! ఎన్నోవేషనే మన లక్ష్యం కావాలి. నేను అంటున్న ఎ.ఐ.ఎం ఏమిటంటే ఎ-అటల్, ఐ-ఎన్నోవేషన్, ఎం-మిషన్! నీతి ఆయోగ్ ద్వారా ఈ మిషన్ చేపడుతున్నాం. ఈ ఎ.ఐ.ఎం ద్వారా అంటే అటల్ ఇన్నోవేషన్ ఎక్స్ పిరియెంట్ ఆంటల్ ప్రినర్ షిప్ వరుసగా పరంపరంగా జరగాలని, దీనిద్వారా కొత్త ఉపాధి అవకాశాలు రూపొందించాలని ఒక కోరిక! అదే నా ఆశయం! మనం భావితరానికి కొత్త ఇన్నోవోటర్స్ ని అందించాలంటే మన పిల్లలను వాటితో అనుసంధానించాలి, ఈ దిశగా భారత ప్రభుత్వం అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ను రూపొందించింది. మన పాఠశాలల్లో ఎక్కడెక్కడ ఈ టింకరింగ్ ల్యాబ్స్ ను రూపొందించింది. మన పాఠశాలల్లో ఎక్కడెక్కడ ఈ టింకరింగ్ ల్యాబ్స్ ను నెలకొల్పుతారో వాటి కోసం పదేసి లక్షల రూపాయలను మంజూరు చేయడామే గాకుండా ఐదేళ్ల వరకు వాటి నిర్వహణ కోసం కూడా పదేసి లక్షల రూపాయలు ఇస్తాం. ఆ ప్రకారమే ఇన్నోవేషన్ తో పాటు ఇంక్యుబేషన్ సెంటర్ ల అవసరమూ వస్తుంది. మన దగ్గర శక్తిమంతంగా, అన్ని వనరులతో పనిచేసే ఇంక్యుబేషన్ సెంటర్లు ఉంటే వాటిని ఇన్నోవేషన్ కోసం, స్టార్ట్ అప్స్ కోసం, ప్రయోగాల కోసం ఒక స్థితిని తీసుకురావడానికి సరైన వ్యవస్థ ఏర్పడుతుంది. కొత్త ఇంక్యుబేషన్ సెంటర్లు నెలకొల్పాల్సిన అవసరమూ ఉంది. ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్లను శక్తివంతం చేయాల్సిన అవసరమూ ఉంది. మరి నేను చెబుతున్న అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ విషయానికొస్తే వీటి గురించి పదికోట్ల రూపాయ భారీ మొత్తాన్ని అందించే దిశలో కూడా ప్రభుత్వం ఆలోచించింది. అదేవిఘంగా భారతదేశం ఇంకెన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతోంది. రోజువారీ జీవితాలతో మనకు ఎన్నో సమస్యలు కనిపిస్తాయి. ఇప్పుడు మనం సాంకేతికంగా పరిష్కార మార్గాలను వెతకాలి. అటల్ గ్రాండ్ ఛాలెంజెస్ ద్వారా ఈ దేశపు యువతకు స్వాగతం పలుకుతున్నా సమస్యలు మీ దృష్టికి వస్తే వాటి పరిష్కారం కోసం సాంకేతికపరంగా దారులు వెతకండి పరిషోధనలు చేయండి. ఈవిష్కారాలు సాంతికేతకు భారత ప్రభుత్వం విశేష పురస్కారాన్ని అందించి ప్రోత్సహించాలనుకుంటోంది. నాకు సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే ప్రజలలో వీటిపట్ల ఆసక్తి కనిపిస్తోంది. టింకరింగ్ ల్యాబ్స్ గురించి ప్రస్తావించే సరికి దాదాపు 13 వేలకు పైగా పాఠశాలలు ఉత్సాహంతో ముందుకు వచ్చాయి. దరఖాస్తు చేసుకుంటున్నాయి. మరి ఇంక్యుబేషన్ సెంటర్ ల విషయంలో 4 వేలకు పైగా విద్య, విద్యేతర సంస్థలు ఇంక్యుబేషన్ సెంటర్లు కావాలంటూ ముందుకొచ్చాయి. అబ్దుల్ కలాం గారికి నిజమైన శ్రద్ధాంజలి అంటే పరిశోధన, ఇన్నోవేషన్, మన దైనందిన జీవిత సమస్యల నివారణ కోసం టెక్నాలజీ, మన ఇబ్బందులు అధిగమించడానికి చేపట్టే సరళీకరణలు- వీటిపట్ల మన యువతరం ఎంత ఎక్కువగా శ్రమిస్తుందో 21వ శతాబ్దంలో భారతదేశపు అభివృద్ధిలో వారికి అంత భాగస్వామ్యం ఏర్పడుతుంది. అదే అబ్దుల్ కలాం గారికి మనం అర్పించే నిజమైన శ్రద్ధాంజలి అవుతుందని నా నమ్మకం.
ప్రియమైన దేశవాసులారా! కొంతకాలం క్రితం మనం కరువు కాటకాల గురించి ఆలోచించాం. ఈ మధ్య వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయన్న సంతోషకమైన వార్తలతో పాటు వరదల గురించి కూడా వార్తలు వస్తున్నాయి. కేంద్రప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి వరద బాధితులకు సహాయం అందించడానికి భుజం భుజం కలిపి శక్తివంచన లేకుండా శ్రమిస్తోంది. వర్షాల మూలంగా కొన్ని ఇబ్బందులు వచ్చినా ప్రతిఒక్కరూ మానవత్వం ఉన్న ప్రతిఒక్కరూ ఆనందంతో పులకరిస్తున్నారు. ఎందుకంటే.. వర్షాలు, పంటలు మన ఆర్థిక విధానాలన్నింటికీ కేంద్ర బిందువు కాబట్టి.
ఒక్కొక్క సారి మనం జీవితాంతం పశ్చాత్తాపపడేట్టు రోగాలు వస్తుంటాయి. కానీ మనం అప్రమత్తంగా ఉన్నట్లయితే.. అవగాహన కలిగి ఉంటే నిరంతర ప్రయత్నంలో ఉన్నట్లయితే ఈ రోగాల నుండి తప్పించుకోవడానికి మార్గాలు చాలా సులభంగా ఉంటాయి. డెంగ్యూ జ్వరాన్నే తీసుకోండి! డెంగ్యూ నుండి తప్పించుకోవచ్చు. స్వచ్ఛత పట్ల కొంచెంగా శ్రద్ధ చూపిస్తే, సరిగ్గా అప్రమత్తంగా ఉండి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తే, పిల్లల పట్ల కాస్త ఎక్కువ శ్రద్ధ చూపిస్తే చాలు! బీదల బస్తీల్లోనే ఇటువంటి రోగులు వస్తాయి అనుకోవద్దు. డెంగ్యూ విషయం అలాకాదు. ఇది బాగా డబ్బున్న సంపన్నుల నివాసాల్లోనూ అందరికన్నా ముందుగా వస్తుంది. అందుకని ఏ రోగమైన మనం తీసుకునే జాగ్రత్తల్ని బట్టు ఉంటుంది. మీరు టీవీల్లో ప్రకటనలు చూస్తూనే ఉంటారు. కానీ అప్పడప్పుడు వాటి గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయాన్ని పట్టించుకోకుండా వదిలేస్తాం. ప్రభుత్వాలు, ఆస్పత్రులు, డాక్టర్లు వాళ్ల పని వాళ్లు చేస్తారు. కానీ మనం? మనం కూడా మన ఇళల్లో, మన పరిసర ప్రాంతాల్లో, మన కుటుంబ సభ్యులతో ఈ డెంగ్యూ రాకుండా ఉండేందుకు నీటి ద్వారా వ్యాపించే ఇతర వ్యాధులు రాకుండా ఉండేందుకు తీసుకోవలసిన జాగ్రత్తలు అన్నీ తీసుకోవాలి, మీ అందరినీ నేను కోరేది ఇదే! ప్రియమైన దేశవాసులారా! ఇంకొక విపత్తు వైపు మీ దృష్టిని మరల్చాలని నేను అనుకుంటున్నాను. జీవితాలు ఎంత అస్తవ్యస్తంగా తయారవుతున్నాయంతే… ఎంత ఉరుకులు, పరుగులమయమై పోతున్నాయంటే ఒక్కొక్కసారి మన గురించి మనం ఆలోచించుకోవడానికతి కూడా మనకు తీరిక లేదనిపిస్తుంది. జబ్బు పడ్డామా? వెంటనే నయమవడానికి ఏదోఒక యాంటీబయాటికి మాత్ర మింగితే సరి అనిపిస్తుంది. రోగం నుండి తాత్రాలిక ఉపశమనం దొరుకుతుంది. కానీ ప్రియమైన నా దేశవాసులారా! అలా దొరికిన యాంటీబయాటిక్ వేసుకునే అలవాటు మనల్ని ముందుముందు మరింత విషమ స్థితికి తీసుకువెళుతుంది. నవాటి ద్వారా మీకు వెంటనే ఉపశమనం కనిపించవచ్చు. కానీ- డాక్టర్లు మందుల చీటి రాసివ్వనంతవరకు, రోగం తగ్గడానికి మన ఇలా పక్కదారులలో వెళ్లవద్దు. ఎందుకంటే వీటినుండి కొత్త సమస్యలు పుట్టుకొస్తున్నాయి.! ఎందుకంటారా? ఇలా ఇష్టం వచ్చినట్లు యాంటీబయాటిక్ మందులు వాడటం చేత రోగికి తాత్కాలికంగా లాభం ఉన్నా- రోగిలో ఉండే వ్యాధికణాలు ఆ మందులకు అలవాటు పడిపోయి… పోనుపోను సదరు మందులు ఆ రోగికి పనిచేయకపోవడం, రోగంతో పోరాటం, కొత్తమందులు తయారు చేయడం, వైజ్ఞానికంగా పరిశోధనలు జరపడం, అలా ఏళ్లు గడిచిపోవడం, ఆలోగా ఆ రోగాలు కొత్త సమస్యల్ని చెత్తిపెట్టడం… ఇన్ని ఇబ్బందులు తలెత్తుతాయి. అందుకని రోగం విషయంలో జాగ్రత్తగా ఉండటమే చాలా అవసరం! ఇంకో ఇబ్బంది వస్తుంది. అదేమిటి? డాక్టర్ గారు చూడు బాబు… ఈ యాంటీబయాటిక్ గోళీలు ఐదురోజులు పదిహేను మాత్రలు వాడు అంటారు. నే చెప్పేది ఏమిటంటే ఎన్నిరోజులు ఆ మందులేసుకోవాలని చెప్పారో అన్ని రోజుల కోర్స్ పూర్తిచేయండి. అలా అని కోర్సును మించి ఎక్కువ రోజులు తీసుకున్నా అదీ వ్యాధి క్రిములకే లాభం. అందుకని కోర్సు ఎన్ని రోజుల పాటు ఎన్ని గోళీలు వేసుకోవాలని ఉంటే దాన్ని పూర్తిచేయడం కూడా అంతే అవసరం కానీ ఆరోగ్యం బాగుపడింది కాబట్టి ఇంకా వేసుకోవక్కర్లేదు, ఒకవేళ వేసుకుంటే రోగ కణాలకి లాభమవుతుంది, అవి మరింత బలం పుంజుకుంటాయి అని మాత్రం అనుకోవద్దు. క్షయ, మలేరియా రోగాలను వ్యాపింపజేసే సూక్ష్మ క్రిములు మన శరీరంలో ఎంతవేగంగా మార్పులు తీసుకొస్తాయంటే మందుల ప్రభావం ఉండనే ఉండదు. వైద్య పరిభాషలో దీన్ని యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటారు. అందువలన యాంటీబయాటిక్ ను ఎలా వాడాలి అని చెబుతారో ఆ నియమాలను అలా పాటించడం కూడా అంతే అవసరం! ఈ యాంటీ బయాటిక్ రెసిస్టెన్స్ నిరోధించాలని మన ప్రభుత్వం కంకణం కట్టుకుంది. మీరు చూసే ఉంటారు. ఈ రోజుల్లో అమ్ముడుపోతున్న యాంటీబయాటిక్ మందుల ప్యాకెట్ల మీద వాటి తయారీదారుని చిరునామా పై భాగంలో ఒక ఎర్రని గీత ఉంటుంది. ఆ గీత ద్వారా మీరు జాగ్రత్త పడవచ్చు. ఆ గీత ఉందో.. లేదో… జాగ్రత్తగా గమనించండి. ఆరోగ్యం విషయం వచ్చింది కాబట్టి మీకు ఇంకో విషయం కూడా చెబుదామనుకుంటున్నాను. మన దేశంలో గర్భం ధరించిన తల్లుల విషయానికి వస్తే వారి జీవితాలే ఒక్కోసారి కలవరపెడుతుంటాయి మన దేశంలో సాలీన మూడు కోట్ల మంది మహిళలు గర్భం ధరిస్తున్నారు. అయితే ప్రసవం సమయంలో కొన్ని మరణాలు సంభవిస్తున్నాయి. ఒకసారి తల్లులు చనిపోతున్నారు. ఇంకోసారి జన్మించే శిశువులు చనిపోతున్నారు. మరో సందర్భంగా తల్లి, శిశువు ఇద్దరూ చనిపోతున్నారు. అయితే గత పదేళ్లలో ప్రసవ సమయంలో అకారణంగా చనిపోతున్న తల్లుల సంఖ్య తగ్గింది. అయినా కానీ గర్భవంతులైన తల్లులలో ఎక్కుమంది జీవితాలు సురక్షితంగా లేవు అనే చెప్పాలి. గర్భం ధరించిన సమయంలో కానీ, ఆ తర్వాత గానీ రక్తం తక్కుగా ఉండటం, ప్రసవ సంబంధమైన వ్యాధులు, అధిక రక్తపోటు…. ఇలా ఏం ఇబ్బంది తలెత్తుతుందో గానీ వాళ్ల దీవితాలు అర్థాంతరంగా ముగిసిపోతున్నాయి. ఈ విషయాలను దృష్టిలో ఉంచుకుని గత కొద్ది నెలల నుండి ఒక్క పథకాన్ని ప్రధానమంత్రి సురక్షిత మాతృత్వ అభియాన్ పేరుతో ప్రారంభించింది. ఈ పథకం మూలంగా ప్రతినెలా 9వ తారీఖున గర్భవతులైన మహిళలందరికీ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలలో ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఒక్క పైసా ఖర్చు కూడా లేకుండా ప్రభుత్వాసుపత్రుల్లో ప్రతినెలా 9వ తారీఖున ఈ సేవ లభ్యమవుతుంది. ప్రతిఒక్క పేద కుటుంబానికి నా విన్నపం ఏమిటంటే గర్భవతులైన తల్లులందరూ 9వ తారీఖున దొరికే ఈ సేవ ద్వారా లాభంపొందండి. అలా చేయడం వల్ల తొమ్మిది నెలలు నిండుతుండగా ఏదైనా ఇబ్బంది వస్తే ముందే మీరు జాగ్రత్త పడగలుగుతారు. తల్లి-శిశువు ఇరువురి జీవితాలు కాపాడవచ్చు. డాక్టర్లు ముఖ్యంగా పసూతి వైద్యులు మీరు నెలలో ఒక్కరోజు 9వ తారీఖు పేద తల్లులకు ఉచితంగా సేవలందించలేరా? వైద్య సోదర సోదరీమణులారా ! మీరు సంవత్సరంలో కేవలం 12 రోజులు ఈ విషయంలో పేదల కోసం కేటాయించలేరా? గతంలో నాకు ఎంతోమంది ఉత్తరాలు వ్రాశారు. నా విన్నపాన్ని మన్నించి ముందుకువచ్చిన వైద్యులు వేలకొద్దీ ఉన్నారు. కానీ మన భారతదేశం సువిశాలమైంది. ఈ పథకం ద్వారా లక్షల మంది వైద్యులు చేయూతనందివ్వాలి. మీరు ఆ చేయూతను అందిస్తారనే నా నమ్మకం.
నా ప్రియమైన దేశ వాసులారా! ఈనాడు యావత్ ప్రపంచం వాతావరణ మార్పు, భూతాపం, పర్యావరణం- వీటి గురించి బాగా ఆలోచిస్తున్నారు. దేశ విదేశాలలో ఉమ్మడిగా దీని గురించి చర్చిస్తున్నారు. భారతదేశంలో యుగయుగాలుగా ఈ విషయాన్ని నొక్కి చెబుతూనే ఉన్నారు. కురుక్షేత్ర యుద్ధభూమిలో కూడా భగవానుడు శ్రీ కృష్ణుడు చెట్ల గురించి ప్రస్తావిస్తారు. యుద్ధక్షేత్రంలో కూడా వృక్షాలు గురించి చర్చించారంటే ఊహించండి అది ఎంత ముఖ్యమైన విషయమే. భగవద్గీతలో శ్రీ కృష్ణ భగవానుడు ఇలా చెబుతారు. అశ్వత్థ సర్వ వృక్షాణాం దీని అర్థం ఏమిటంటే- అన్ని వృక్షాలలో నేను రావి చెట్టును. శుక్రాచార్య నీతిలో ఇలా చెబుతారు. నాస్తిమూలం అనేషధం అంటే ఔషథం కాని మొక్కేలేదని దాని భావం. ఏ మొక్కలోనైనా ఔషధ గుణం లేకపోలేదు. మహాభారత్ అనుశాసన పర్వంలో దీని గురించి విస్తృతంగా చర్చ జరిగింది. మహాభారత అనుశాసన పర్వంలో ఇలా చెప్పారు. ఎవరైనా ఏదైనా వృక్షాన్ని నాటితే అది వారి సంతాన రూపం అవుతుంది. అందులో ఎటువంటి అనుమానం లేదు. తమ సంతానం ద్వారా పరలోకంలో వారందరికీ సద్గతి ప్రాప్తిస్తుందో చెట్టు ద్వారా కూడా అదే విధమైన లాభంపొందుతారు. అందుకే తమ సంకల్పం ఆకాంక్షించే తల్లిదండ్రులు మంచి చెట్లు నాటండి. తమ బిడ్డల వలే వాటిని పెంచిపోషించండి. మన శాస్త్రం- భగవద్గీత, శుక్రాచార్య నీతి, మహాభారత అనుశాసన పర్వంలో ఇవే విషయాలు చెప్పారు. ఈ కాలంలో కూడా అలాంటివారు ఉన్నారు. ఈ ఆదర్శాలను మనసా..వాచా ఆచరించి చూపిస్తారు. కొన్ని రోజుల క్రితం నాకు పుణేకు చెందిన అమ్మాయి సోనల్ ఉదాహరణ ఒకటి జ్ఞాపకం వచ్చింది. అది నా మనస్సును తాకింది. మహాభారత్ అనుశాసన పర్వంలో కూడా అదే చెప్పారు కదా. పరలోకంలో కూడా వృక్షాలు సంతానం బాధ్యతలను పూర్తిచేస్తారని సోనల్ కేవలం తన తల్లిదండ్రుల కోరికలనే కాదు. సమాజం కోర్కెలను కూడా సంపూర్ణంగా తీర్చే బాధ్యత భుజాన వేసుకున్నారు. మహారాష్ట్రలోని పుణేలో జున్నార్ తాలూకాలో నారాయణపూర్ గ్రామంలో ఖండు మారుతి మాత్రే అనే రైతు తన మనవరాలు సొనాల్ వివాహం చాలా స్ఫూర్తిదాయంకంగా జరిపించారు. మాత్రే గారు ఏం చేశారంటే- సోనల్ వివాహానికి ఎంతమందైతే బంధువులు, స్నేహితులు, అతిథులు వచ్చారో వారందరికీ కేసర మామిడి మొక్కను కానుకగా ఇచ్చారు. నేను ఆ చిత్రాన్నిసోషల్ మీడియాలో చూసినప్పుడు నేను ఆశ్చర్యపోయాను. వివాహంలో పెళ్లి ఊరేగింపు కనిపించడం లేదు. అంతా మొక్కలే కనిపిస్తున్నాయి. మనస్సును ఆకట్టుకుంటున్న ఆ దృశ్యం ఆ చిత్రంలో ఉంది. సోనల్ వ్యవసాయ శాస్త్ర పట్టభద్రురాలు. ఈ ఆలోచన తనకే వచ్చింది. వావాహంలో మామిడి మొక్కలను కానుకగా ఇవ్వాలని చూడండి. ప్రకృతి పట్ల తన ప్రేమను ఆమె ఎంత ఉత్తమరీతిలో ప్రకటించుకుందో. ఒకవిధంగా సోనల్ వివాహం ప్రకృతి ప్రేమ గురించిన అమరగాథ అయింది. నేను సోనల్ కు, మాత్రే గారికి ఈ వినూత్న కృషి చేసినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఇలాంటి ప్రయోగాలు చాలా మంది చేస్తుంటారు. నాకు జ్ఞాపకం ఉంది. నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అక్కడి అంబాజీ దేవాలయంలో భాద్రపద మాసంలో పెద్దసంఖ్యలో యాత్రికులు వచ్చేవారు. అక్కడ ఒక సమాజ సేవా సంస్థ ఒక కొత్త ఆలోచన చేసింది. ఆలయాల దర్శనానికి వచ్చేవారికి ప్రసాదంగా ఒక మొక్కను ఇచ్చి ఈ మొక్క అమ్మవారి ప్రసాదం. మీరు జాగ్రత్తగా దీనిని తీసుకువెళ్లి మీ ఉళ్లో, మీ ఇంట్లో నాటితే దానిని పెంచి పెద్దచేస్తే మీకు సదా అమ్మవారి ఆశీర్వాదం లభిస్తూనే ఉంటుంది చూడండి అని చెప్పారు. అలా లక్షలాది మంది పాదయాత్ర చేసివచ్చిన యాత్రికులకు ఈ ఏడాది లక్షలకొద్దీ మొక్కలు పంపిణీ చేశారు. దేవాలయాలు కూడా ఈ ఏడాది వర్షాకాలంలో ప్రసాదం బదులు మొక్కలు ఇచ్చే సంప్రదాయం ప్రారంభించవచ్చు. ఈ విధంగా మన మహోత్సవం రూపంలో ఒక సహజ ప్రజాఉద్యమం ప్రారంభమవుతుంది. మన రైతులకు కూడా నాదొక సూచన. మన చేనుకు గట్లు కట్టిన చోట, కలప కోసం చెట్లు నాటవచ్చు కదా. ఈనాడు మన దేశంలో ఇళ్లు నిర్మించేందుకు, గృహపకరణాలు తయారు చేసేందుకు కోట్ల రూపాయల విలువజేసే చెక్కను విదేశాల నుండి దిగుమతి చేసుకోవలసి వస్తోంది. మన చేను గట్ల మీద చెట్లు నాటితే ఇంటికీ, ఫర్నీచర్ కు పనికివచ్చే కలప ఇచ్చే చెట్లు పెంచితే, 15-20 ఏళ్ల తర్వాత ప్రభుత్వ అనుమతితో వాటిని కొట్టి అమ్ముకోవచ్చు. దీనివల్ల మీకొక కొత్త ఆదాయమార్గం లభిస్తుంది. భారత్ కు కలప దిగుమతి చేసుకనే బాధ తప్పుతుంది. ఇటీవల అనేక రాష్ట్రాలు వర్షాకాలం అదనుచూసి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్రప్రభుత్వం కూడా ఇప్పడిప్పుడే కంపా చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం కింద దాదాపు 40 వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ నిధులు మొక్కల పెంపకం కోసం రాష్ట్రప్రభుత్వాలకు అందనున్నాయి. మహారాష్ట్ర ప్రభుత్వం జూలై 1వ తేదీన రెండు కోట్ల పాతిక లక్షల మొక్కలు నాటిందని, వచ్చే ఏడాది మూడుకోట్ల మొక్కలు నాటాలని సంకల్పించిందని నాకు తెలిసింది. ప్రభుత్వం ఒక ప్రజాఉద్యమాన్ని ప్రారంభించింది. రాజస్థాన్ ఎడారి ప్రాంతం. ఆ రాష్ట్రంలో ఎంతో భారీ మనమహోత్సవం ప్రారంభించి పాతిక లక్షల మొక్కలు నాటారు. రాజస్థాన్ లో పాతిక లక్షల చెట్లు పెట్టడం అంటే సామాన్యమైన విషయం కాదు. రాజస్థఆన్ భూమి పరిస్థితి, సారం సంగతి తెలిసినవారికి అర్ధమవుతుంది. అశలు ఇది ఎంత బృహత్కార్యమో.. ఆంధ్రప్రదేశ్ లో కూడా 2019 నాటికి అడవులు విస్తీర్ణం 50 శాతానికి పెంచాలని నిర్ణయించారు. కేంద్రప్రభుత్వం నడిపిస్తున్న గ్రీన్ ఇండియా మిషన్ లో భాగంగా రైల్వే శాఖ ఈ పనిని చేపట్టింది. గుజరాత్ లో కూడా నమ మహోత్సవానికి ఒక పెద్ద ఉజ్వలమైన సంప్రదాయం ఉంది. ఈ ఏడాది గుజరాత్ ఒక మామిడి ఉద్యానవనం, ఐకమత్య ఉద్యానవనం, అమరుల ఉద్యానవనం.. ఇటువంటి అనేక సంకల్పాలను వన మహోత్సవ రూపంలో చేపట్టింది. కోట్లాది చెట్లు నాటే ఉద్యమాన్ని వారు నడిపించారు. నేను అన్ని రాష్ట్రాలను పేరుపేరునా చెప్పడం లేదు గానీ అందరూ అభినందనీయులే…!
నా ప్రియమైన దేశవాసులారా! కొద్దిరోజుల కిందట నాకు దక్షిణాఫ్రికా వెళ్లే అవకాశం కలిగింది. ఇది నా మొదటి సందర్శన. విదేశీ పర్యటన అంటే దౌత్యం ఉంటుంది. వ్యాపారానికి సంబంధించి చర్చలు ఉంటాయి. భద్రతకు సంబంధించిన చర్చలు జరుగుతాయి. చాలా అవగాహన ఒప్పందాలు కుదురుతాయి. ఇవన్నీ ఉండాల్సిందే. కానీ దక్షిణాఫ్రికా పర్యటన నాకు ఒకరకంగా తీర్థయాత్ర వంటిది. దక్షిణాఫ్రికాను తలుచుకోగానే మహాత్మాగాంధీ, నెల్సన్ మండేలా గుర్తుకురావడం చాలా సహజం. ప్రపంచంలో అహింస, ప్రేమ, క్షమ- అనే శబ్దాలు చెవినపడగానే గాంధీ, మండేలా వారి ముఖాలు మన కళ్ల ఎదుట ప్రత్యక్షమవుతాయి. నా దక్షిణాఫ్రికా పర్యటన సందర్భంగా ఫీనిక్స్ సెటిల్మెంట్ కు వెళ్లాను. మహాత్మాగాంధీ నివసించిన ప్రదేశం సర్వోదయ పేరుతో ప్రసిద్ధమైంది. మహాత్మాగాంధీ ఏ రైలులో అయితే ప్రయాణించారో, ఏ రైలులో జరిగిన సంఘటన ఒక మొహన్ దాస్ ను మహాత్మాగాంధీగా అవతరించేందుకు బీజాలు వేసిందో ఈ పీటర్ మార్టిన్ బర్గ్ స్టేషన్ కు రైల్లో ప్రయాణం చేసే భాగ్యం నాకు కలిగిం.ి అయితే నేను చెబుదామనుకున్న విషయం ఏమిటంటే- ఈ సారి గొప్ప వ్యక్తులను కలవగలిగాను. మనస్సులో సమానత్వం కోసం, హెచ్చుతగ్గుల్లేని సమానమైన అవకాశాల కోసం యవ్వన ప్రాయంలో ఉన్న తమ జీవితాలనే త్యాగం చేసిన మహానుభావులు వాళ్లు. నెల్సన్ మడేలాతో పాటు భుజం భుజం కలిపి పోరాటులు సాగించారు. నెల్సన్ మండేలాతో పాటుగా ఇరవై, ఇరవై రెండేళ్లు జైలు జీవితాలు గడిపారు. ఒకవిధంగా వాళ్లు తమ యవ్వనాన్నే ధారపోశారని చెప్పవచ్చు. నెల్సన్ మండేలాకి అత్యంత సన్నిహితులుగా మెలిగిన శ్రీఅహ్మద్ కథ్రాడా, శ్రీలాలూ చీబా, శ్రీజార్జ్ బిజోస్, శ్రీరోని కాస్రిల్స్ ఈ మహానుభావులందరినీ దర్శించుకునే భాగ్యాన్ని పొందాను. భారతీయ మూలాలున్నా ఎక్కడికి వెళితే అక్కడి వాళ్లయిపోయారు. ఈ ప్రజల మధ్య జీవించారు. వాళ్ల కోసం ప్రాణాలు త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. ఎంత శక్తిసంపన్నులు గమ్మత్తేమిటంటే నేను వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ల అనుభవాలు వింటుంటే వాళ్ల మాటల్లో ఎవరిపట్లా కాఠిన్యం గానీ, ద్వేషం గానీ కనిపించలేదు. సమాజం కోసం అంతగా తపస్సు చేసి వాళ్ల ముఖాలలో ఇది తీసుకోవాలి… ఇది సంపాదించాలి… ఇలా ఉండాలి.. అన్న భావాలేమీ కనిపించలేదు. నా కర్తవ్యాన్ని నేను నిర్వహించాను అన్న ఒక నిశ్చలమైన ప్రశాంతత. భగవద్గీతలో కర్తవ్యం నిర్వహించేవారి గురించే చెప్పారు. మమ్మూర్తులా ఈ రూపాలే సాక్షాత్కారించాయి, ఆ పరిచయాలు నా మనస్సులోంచి ఎప్పటికీ చెరిగిపోవు. సమానత్వ, సమాన సౌకర్యాలు, ఏ సమాజానికైనా, ఏ ప్రభుత్వానికైనా దీన్ని మించిన మూలమంత్రం ఇంకొకటి ఉంటుందనుకోను. మనల్ని ఉజ్వల భవిష్యత్ వైపు నడిపించేవి రెండే రెండు మార్గాలు. సమభావం! సహభావం! ఇవే. మనం అందరం మంచి జీవితాలను కోరుకుంటాం. మన పిల్లలకి మంచి భవిష్యత్తును కోరుకుంటాం. ప్రతిఒక్కరి అవసరాలు వేర్వేరుగా ఉంటాయి. వాటి ప్రయారిటీస్ అంటే ప్రాధమ్యాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ మార్గం మాత్రం ఒక్కటే! అదే ప్రగతిమార్గం. సమానత్వపు మార్గం. సమాన సౌకర్యాల మార్గం. సమభావపు మార్గం. సహభావపు మార్గం. రండి… దక్షిణాఫ్రికాలో కూడా మన జీవితపు మాల మంత్రాలను తాము పఠించి, పాటించి చూపించిన ఈ భారతీయులను చూసి గర్విద్దాం.
ప్రియమైన నా దేశవాసులారా! నేను శిల్పా వర్మ గారికి ఎంతో రుణపడి ఉంటాను. ఆవిడ నాకొక సందేశం పంపించారు. ఆవిడ పడ్డ తపన నాకు చాలా స్వాభావికంగా కనిపించింది. ఒక సంఘటన గురించి ఆవిడ తెలియజేశారు.
ప్రధాన మంత్రి గారు. ! నేను శిల్పీవర్మను. బెంగళూరు నుండి మాట్లాడుతున్నాను. కొద్దిరోజుల క్రితం వార్తల్లో ఒక విషయం చదివాను. ఒక మహిళా మోసపూరితమైన ఇ-మెయిల్ అని తెలియక నమ్మి 11 లక్షల రూపాయలు పోగొట్టుకుని ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. నేనూ ఒక స్త్రీని కావడం చేత ఆమె కుటుంబం గురించి బాధపడ్డాను. ఇలాంటి మోసపూరితమైన ఇ-మెయిల్స్ గురించి మీ అభిప్రాయం చెప్పండి. ఇలాంటి విషయాలు మీ అందరి దృష్టిలోకి కూడా వస్తుండవచ్చు మన మొబైల్ ఫోన్లలో, మన ఈ-వెయిల్స్ లో ఎంతో ప్రలోభం కలిగించే విధంగా సందేశాలు కనిపిస్తాయి. ఇదిగో మీకు ఇంత మొత్తం బహుమతి వచ్చింది. దాన్ని అందుకోవడానికి ముందుగా మీరింత కట్టాలి అంటూ ఎవరో మెస్సేజ్ పంపిస్తారు. కొంతమంది అది నిజమని నమ్మి వస్తుందనుకున్న డబ్బు మీద వ్యామోహంతో చిక్కుకుపోతారు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా దొంగతనం చేసే ఈ కొత్త పద్ధతి ఇప్పుడు ప్రపంచమంతటా వ్యాపిస్తోంది. ఆర్థిక వ్యవస్థను బలిష్టం చేయడంలో ఒకవైపు టెక్నాలజీ ముఖ్యపాత్ర పోషిస్తుంటే- ఇంకోవైపు దాన్ని దుర్వినియోగం చేసే ప్రబుద్ధులు కూడా రంగంలోకి దిగుతారు. మరి ! ఒక విశ్రాంత అధికారి కూతురు పెళ్లి చేయాల్సివుంది. ఇల్లు కూడా కట్టుకోవాలనుకుంటున్నాడు. ఒకరోజు ఆయనకు ఒక ఎస్.ఎం.ఎస్ వచ్చింది. మీ కోసం విలువైన విదేశీ బహుమతి వచ్చింది. దాన్ని అందుకోవడానికి చెల్లించాల్సిన కస్టమ్స్ డ్యూటీ నిమిత్తం రెండు లక్షల రూపాయలు ఫలానా బ్యాంకుల్లో, ఫలానా ఖాతాలో జమచేయండి అంటూ. ఈ పెద్దమనిషి ముందూవెనుకా ఆలోచించకుండా తన కష్టార్జితంలోంచి రెండు లక్షలు ఆ ముక్కూ మొహం తెలియని వ్యక్తికి పంపించేశాడు. అదీ ఒక మామూలు ఎస్.ఎం.ఎస్ ను నమ్మి. తర్వాత కొద్దిక్షణాల్లో తెలిసిందతనికి తాను మోసపోయానని… కానీ ఏం లాభం… జరగకూడనిది జరిగిపోయింది. మీరు కూడా అప్పుడప్పుడూ మోసపోవచ్చు. మీకు చాలా గొప్పగా ఉత్తరాలు వస్తాయి. అవి ఎలా రాస్తారంటే ఆ ఉత్తరం నిజమోనేమో అనిపిస్తుంది. ఏదో ఒక అధికారికమైన లెటర్ ప్యాడ్ తయారు చేసి మరీ పంపిస్తారు. మీ క్రెడిట్ కార్డు నంబర్, డెబిట్ కార్డు నంబర్ లు సంపాదిస్తారు. టెక్నాలజీ సాయంతో మీ బ్యాంకు అకౌంట్ లో ఉన్న మొత్తాన్ని ఖాళీ చేసేస్తారు. ఇదో కొత్తరకపు మోసం. డిజిటల్ మోసం. మన ఇలాంటి మోహాలకు, మోసాలకు దూరంగా ఉండాలి. అప్రమత్తంగా ఉండాలి. ఇటువంటి బూటకపు సందేశాలు వస్తే మన స్నేహితులతో పంచుకుని వారిని కూడా అప్రపమత్తం చేయాలి. శిల్పీవర్మ ఎంతో మంచి విషయం నా దృష్టికి తీసుకువచ్చారు. మీకు కూడా ఇటువంటివి ఎదురైనా, మీరు మరీ ఎక్కువగా పట్టించుకోకపోవచ్చు గానీ పట్టించుకోవాలని నాకు అనిపిస్తోంది.
ప్రియమైన నా దేశవాసులారా.. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా దేశంలోని చాలామంది ప్రజలను కలుసుకునే అవకాశం నాకు లభిస్తుంది. మన పార్లమెంటు సభ్యులు కూడా తమతమ ప్రాంతాల నుండి ప్రజలను నా దగ్గరకు తీసుకువస్తారు. నాతో మాట్లాడతారు. తమ కష్టాలను కూడా చెప్పుకుంటారు. కానీ ఈ మధ్య నాకు ఒక మంచి అనుభవం కలిగింది. అలీఘర్ నుండి కొంతమంది విద్యార్థులు నా వద్దకు వచ్చారు. బాలబాలికల్లో పొంగుతున్న ఆ ఉత్సాహాన్ని చూసితీరాలి. వారు చాలా పెద్ద ఆల్బమ్ తీసుకని వచ్చారు. వారి మూఖాలపై ఎంత సంతోషమో చెప్పలేను… అలీఘర్ పార్లమెంటు సభ్యుడు వారిని నా దగ్గరకు తీసుకువచ్చారు. వారు నాకు ఫోటోలు చూపించారు. వారంతా అలీఘర్ రైల్వేస్టేషన్ ను అందంగా తయారు చేశారు. స్టేషన్ మీద కళాత్మకమైన పెయింటింగ్ లు వేశారు. ఇంతేకాదు… గ్రామంలో ప్లాస్టిక్ సంచులు గానీ, నూనెడబ్బాలు గానీ, చెత్తకుప్పల్లో పడిఉంటే వాటిని వెతికివెతికి పోగుచేశారు. వాటిలో మట్టిని నింపి మొక్కలు నాటి వర్టికల్ గాల్డెన్ తయారుచేశారు. రైల్వేస్టేషన్ వైపు ప్లాస్టిక్ సీసాల్లో ఈ వర్టికల్ గార్డెన్ ఏర్పాటు చేసి స్టేషన్ కే ఒక నూతన రూపాన్ని ఇచ్చారు. మీరు కూడా ఎప్పుడైనా అలీఘర్ వెళ్లినట్లయితే తప్పక ఈ స్టేషన్ ను చూడండి. దేశంలోని చాలా రైల్వేస్టేషన్ల నుండి ఈ మధ్య నాకు ఈ వార్తలు అందుతున్నాయి. స్థానిక ప్రజలు రైల్వే స్టేషన్ గోడల మీద తమ కళల ద్వారా తమ ప్రాంతపు గుర్తింపును ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది. ఒక నూతనత్వం కనిపిస్తోంది. ప్రజల భాగస్వామ్యంతో ఎలాంటి మార్పు తెవచ్చునో.. దానికి ఇది ఉదాహరణ. దేశంలో ఇటువంటి పనులు చేస్తున్న వారందరికీ అభినందనలు. ముఖ్యంగా అలీఘర్ లోని నామిత్రులందరికీ మరీమరీ అభినందనలు.
ప్రియమైన నా దేశవాసులారా! వర్షపు రుతువుతో పాటు మన దేశంలో పండుగల రుతువు కూడా ప్రారంభమవుతుంది. రానున్న రోజుల్లో అందరూ ఉత్సవాల్లో మునిగి ఉండవచ్చు. ఆలయాల్లో, పూజా హృహాల్లో ఉత్సవాలు జరుపుకుంటూ ఉండవచ్చు. ఆలయాల్లో, పూజా గృహాల్లో ఉత్సవాలు జరుపుకుంటూ ఉండవచ్చు. ఇంకా మీరు కూడా ఇంట్లోనూ, బయటా కూడా ఉత్సవాల్లో ఒకచోట చేరుతుంటారు. రక్షాబంధన్ పండుగ మన దగ్గర ఒక ముఖ్యమైన పండుగ. క్రితం ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా రక్షాబంధన్ సందర్భంగా మీరు మన దేశంలోని అమ్మలకు, అక్కాచెల్లెళ్లకు ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన లేదా జీవన్ జ్యోతి బీమా యోజన కానుకగా ఇవ్వలేరా.. ఆలోచించండి. సోదరికి ఇటువంటి కానుక ఇవ్వాలి ఎటివంటిదంటే అది ఆమెకు జీవితంలో నిజమైన రక్షణ కల్పించేదిగా ఉండాలి. ఇంతేకాదు… మన ఇంట్లో వంటచేసే మహిళ ఉంటుంది. మన ఇంట్లో శుభ్రంగా ఇంటిపని చేసే ఎవరో ఒక మహిళ ఉంటుంది. పేదతల్లి కూతురై ఉంటుంది. ఈ రక్షాబంధన్ పండుగ సందర్భంగా వారికి కూడా సురక్ష బీమా యోజన లేదా జీవనజ్యోతి బీమాయోజన కానుకగా మీరు ఇవ్వవచ్చు. ఇదే సమాజ భద్రత . ఇదే రక్షాబంధన్ కు సరైన అర్థం.
ప్రియమైన నా దేశవాసులారా! మనలో చాలా మంది దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత జన్మించినవారున్నారు. అలా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదట జన్మించిన ప్రధానమంత్రిని నేను. ఆగస్టు 8న క్విట్ ఇండియా ఉద్యమం ఆరంభమైంది. హిందుస్థాన్ వదిలివెళ్లండి.. భారత్ వదిలి వెళ్లండి. ఈ ఉద్యమం జరిగి 75 ఏళ్లు అవుతున్నాయి. ఆగస్టు 15న మనకి స్వాతంత్ర్యం వచ్చి కూడా 70 ఏళ్లు అవుతుంది. మనం స్వాతంత్ర్యంతో వచ్చిన సంతోషాన్నయితే అనుభవిస్తున్నాం. స్వతంత్ర పౌరులమనే గర్వాన్ని కూడా అనుభవిస్తున్నాం. కానీ ఈ స్వాతంత్ర్య ఇప్పించిన ఆ మహానాయకులను సంస్మరించుకోవలసిన సమయం ఇది. భారత్ ను వీడండి.. కి 75 ఏళ్లు.. భారత స్వాతంత్ర్యానికి 70 ఏళ్లు. ఇవి మనకు కొత్త స్ఫూర్తిని ఇస్తాయి. నూతనోత్సహాన్ని రేకెత్తించగలవు. దేశం కోసం ఎంతోకొంత చేయాలనే సంకల్పాన్ని కల్పించే సందర్భంగా పనిచేస్తాయి. దేశం యావత్తు ఆ నాటి స్వాతంత్ర్య యోధుల స్ఫూర్తిని నింపుకొని ఉప్పొంగిపోవాలి. మరోసారి స్వాతంత్ర్యపు సువాసనలు నలువైపులా వెదజల్లాలి. మనమంతా కలిసి ఈ వాతావరణాన్ని సృష్టిద్దాం. స్వాతంత్ర్య దినోత్సవం ఇది ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఇదే దేశ ప్రజలందరికీ కావాలి. దీపావళి మాదిరిగా మనందరి పండుగ కావాలి. మీరు కూడా దేశభక్తి స్ఫూర్తితో కూడిన ఏదో ఒక మంచిని చేయండి. దాని బొమ్మను నరేంద్ర మోదీ యాప్ మీద తప్పక పంపండి. దేశంలోని ఒక పండగ వాతావరణం సృష్టించండి.
ప్రియమైన నా దేశవాసులారా! ఆగస్టు 15వ తేదీనాడు ఎర్రకోట బురుజుల పై నుండి దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే ఒక సదవకాశం నాకు లభిస్తుంది. ఇది ఒక సంప్రదాయం. మీ మనసులో కూడా ఎన్నో విషయాలు ఉంటాయి ఎన్నో ఆలోచనలు మొదలవుతుంటాయి. ఆ ఆలోచనలను అంతే ప్రముఖంగా ఎర్రకోట పై నుండి వినిపించాలని మీరు అనిపించవచ్చు. ఈ దేశ ప్రధానమంత్రిగా, ప్రధాన సేవకుడిగా, మీ ప్రతినిధిగా నేను ఏ విషయాలు ఎర్రకోట నుండి దేశానికి వినిపించాలి అని మీరు అనుకుంటారో- ఆ మాటలను, ఆ ఆలోచనలను నాకు తెలియజేయండి. మీరు ఇదే నా ఆహ్వానం. సూచనలు, సలహాలు ఇవ్వంజి. కొక్క ఆలోచనలు ఇవ్వండి. మీ మనసులో మాట దేశ ప్రజానీకానికి తెలియజేసేందుకు నేను ప్రయత్నిస్తాను. ఎర్రకోట నుండి వినిపించే ప్రసంగం నూటపాతిక కోట్ల మంది దేశ ప్రజల మాట కావాలి. మీరు తప్పకుండా నాకు ఏదో ఒకటి రాసిపంపిండి. ‘NarendraModi App’ పైన గానీ, MyGov.in పైన గానీ పంపవచ్చు. పైపెచ్చు ఈ రోజుల్లో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో విస్తృతమైంది. మీరు ఎన్నో విషయాలు నాకు ఎంతో తేలికగా తెలియజేయవచ్చు. మీకు ఇదే నా ఆహ్వానం. రండి. స్వాతంత్ర్యం కోసం పోరాడిన ఆ మహనీయులను స్మరించుకుందాం.. మన దేశం కోసం జీవితాలను అర్పించిన మహా పురుషులను గుర్తిచేసుకుందాం. దేశం కోసం ఏదో చేస్తామన్న సంకల్పంతో ముందుకు సాగుదాం.
మీ అందరికీ నా శుభాకాంక్షలు.. ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశ ప్రజలారా.. నా మనసులో మాటలను మీకు వెల్లడించే అవకాశం మరొకసారి నాకు లభించింది. నా దృష్టిలో ‘మన్ కీ బాత్’ (మనసు లోని మాట) ఒక మత ఆచారం కాదు; మీతో మాట్లాడాలని నేనెంతో ఉత్సాహంగా ఉంటాను. భారతదేశంలో ప్రతి చోట మనసు లోని మాట కార్యక్రమం ద్వారా దేశం మూల మూల లోని మీ అందరితోను కలిసిపోవడం నిజంగా నాకెంతో నచ్చింది. ఈ ‘మన్ కీ బాత్’ (మనసు లోని మాట) కార్యక్రమాన్ని ఆకాశవాణి ప్రాంతీయ భాషల్లో రాత్రి 8 గంటలకు విజయవంతంగా ప్రసారం చేస్తున్నందుకు ఆకాశవాణి వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నా మాటలు వింటున్న వారు ఆ తరువాత వారి ఆలోచనలను లేఖల ద్వారా, టెలిఫోన్ కాల్స్ ద్వారా, Mygov.in వెబ్ సైట్ ద్వారా, NarendraModiApp ద్వారా నాకు తెలియజేస్తున్నారు. మీరు చెబుతున్న దాంట్లో చాలా మాటలు ప్రభుత్వాన్ని నడపడంలో నాకు ఎంతగానో సహాయపడుతున్నాయి. ప్రజలకు సేవ చేయడంలో ప్రభుత్వం ఎంత క్రియాశీలంగా ఉండాలో, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఎంత ప్రాధాన్యం ఇవ్వాలో అనే విషయాలలో ఈ సంభాషణలు, మీతో నాకు ఉన్న లంకె.. చాలా బాగా ఉపయోగపడుతోంది. మన ప్రజాస్వామ్యం ప్రజల ప్రాతినిధ్యంతో పనిచేసేటట్లు చూడటంలో మీరు మరింత చురుకుగాను, ఉత్సాహం తోను పాల్గొంటారని నేను ఆశిస్తున్నాను.
వేసవి వేడిమి రోజు రోజుకు పెరుగుతోంది. కొంతయినా ఉపశమనం లభిస్తుందని మనం భావిస్తున్నాం. కానీ అందుకు బదులుగా ఉష్ణోగ్రత పెరుగుతూనే ఉండడాన్ని మనం చూస్తున్నాం. ఇంతలోనే రుతుపవనాలు బహుశా ఒక వారం రోజులు ఆలస్యం రావచ్చని వచ్చిన కబురు కలతను పెంచివేసింది. దాదాపు యావత్తు దేశం తీవ్రమైన ఎండల ప్రభావంలో చిక్కుకుపోయింది. ఉష్ణ తీవ్రత పెచ్చవుతూనే ఉంటోంది. పశువులు, పక్షులు, లేదా మానవులు.. ప్రతి ఒక్క ప్రాణి బాధను అనుభవిస్తున్నారు. పర్యవారణం అధ:పతనం కారణంగా ఈ సమస్యలు విషమంగా మారుతున్నాయి. చెట్లను విచక్షణరహితంగా నరికివేస్తుండడంతో వన కవచం తరిగిపోతున్నది. ఒక రకంగా చెప్పాలంటే, మానవ జాతే ప్రకృతిని ధ్వంసం చేయడం ద్వారా స్వీయ విధ్వంసానికి బాట వేసింది. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకొంటాం. ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా పర్యావరణం గురించి చర్చ జరుగుతుంది.. పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ. ఈ సారి ఐక్య రాజ్య సమితి ప్రపంచ పర్యావరణ దినోత్సవానికి ‘జీరో టాలరెన్స్ ఫర్ ఇల్లీగల్ వైల్డ్ లైఫ్ ట్రేడ్’ అనే అంశాన్ని ఇతివృత్తంగా నిర్ణయించింది. ఈ ఇతివృత్తంపై చర్చ అయితే జరుగుతుంది. కానీ మనం వృక్ష జంతుజాల గురించి, నీటిని పొదుపుగా వాడుకోవడం గురించి, మన వనాల విస్తీర్ణాన్ని పెంచడం ఎలాగన్నదానిని గురించి కూడా చర్చ జరిపే తీరాలి. గత కొంత కాలంగా మీరు చూసే ఉంటారు.. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, జమ్ము & కశ్మీర్ లోని హిమాలయ శ్రేణులలోని అడవులలో అగ్గి రాజుకున్నది. వనాలలోని మంటలకు మూల కారణం ఏంటంటే – ఎండిపోయిన ఆకులకు మన నిర్లక్ష్యం తోడవడం. ఇదే పెద్ద అగ్నిశిఖకు తావు ఇచ్చింది. అందుకనే అడవులను కాపాడుకోవడం, జలాలను పరిరక్షించుకోవడం మన అందరి విధ్యుక్త ధర్మంగా మారిపోయింది. ఇటీవల నేను అత్యధిక దుర్భిక్ష పరిస్థితి నెలకొన్న 11 రాష్ట్రాల.. ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఝార్ ఖండ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా..ల ముఖ్యమంత్రులతో సంభాషించాను.
ఇదివరకటి ప్రభుత్వం పాటించిన సంప్రదాయం ప్రకారమైతే నేను అనావృష్టికి లోనైన రాష్ట్రాలన్నిటి ముఖ్యమంత్రులతోను ఒక ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించవచ్చు, కానీ నేను అలా చేయకూడదనుకున్నాను. ప్రతి రాష్ట్రంతో విడి విడిగా సమావేశమయ్యాను, ఒక్కొక్క రాష్ట్రానికి సుమారు రెండు గంటల నుండి రెండున్నర గంటలు కేటాయించాను. ప్రతి రాష్ట్రం చెప్పినదంతా నేను శ్రద్ధగా ఆలకించాను. సాధారణంగా అటువంటి చర్చలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల వారీగా ఎంత డబ్బును మంజూరు చేసింది, ప్రతి రాష్ట్రం ఎంత డబ్బును ఖర్చు పెట్టిందనే విషయానికి మించి సాగవు. ఈ విధంగా చూసినపుడు నీరు, పర్యావరణం, దుర్బిక్షాన్ని ఎదుర్కోవడంలో, బాధిత జంతువుల పట్ల, అలాగే.. బాధిత మానవుల పట్ల శ్రద్ధ తీసుకోవడంలో కొన్ని రాష్ట్రాలు ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేసినట్లు తెలుసుకొని కేంద్ర ప్రభుత్వ అధికారులకే ఆశ్చర్యమేసింది. దేశం నలుమూలల నుండి అందిన సమాచారం బట్టి చూస్తే- అక్కడ పాలక పక్షంగా ఏ పార్టీ ఉన్నప్పటికీ సరే.. శాశ్వత పరిష్కారాలను కనుగొనడం గురించి ఆలోచన చేయాల్సివున్నదని, అంతే కాకుండా ఎంతోకాలంగా ఎదురవుతున్న సమస్యను తీర్చగల ఆచరణ సాధ్యమైన పరిష్కార మార్గాలను కూడా అనుసరించవలసివున్నదని మేం గ్రహించాం. ఒకరకంగా చెప్పాలంటే, ఇది నాకు కూడా ఒక నేర్వదగిన పాఠం వంటి అనుభూతిని కలిగించింది. రాష్ట్రాలన్నింటా ఉత్తమమైన పద్ధతులను ఎలా ప్రవేశపెట్టాలో నీతి ఆయోగ్ కసరత్తు చేయాలంటూ వారికి నేను ఆదేశాలిచ్చాను.
కొన్ని రాష్ట్రాలు ప్రత్యేకించి గుజరాత్, ఆంధ్ర ప్రదేశ్ సాంకేతిక విజ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించుకొన్నాయి. ఈ రాష్ట్రాలు చేపట్టిన అమిత విజయవంతమైన ప్రయత్నాలను భవిష్యత్తులో నీతి ఆయోగ్ ద్వారా ఇతర రాష్ట్రాలకు కూడా వర్తింపచేయాలని నేను కోరుకుంటున్నాను. ఇటువంటి సమస్యలను పరిష్కరించడానికి ప్రజల భాగస్వామ్యం ఒక బలమైన పునాదిగా నిలబడుతుంది. ఆ విషయంలో సరిగ్గా ఆలోచన చేసి.. సరైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి.. నిర్ధారించిన సమయంలోగా పూర్తి చేసే కార్యాచరణను చేపట్టినట్లయితే కరవును సంబాళించడంలో సాధ్యమైనంత అధిక ఫలితాలను సాధించవచ్చు. జల సంరక్షణ కోసం ప్రతి ఒక్క నీటి చుక్కను దాచుకోవాలి. నీరు దైవం ఇచ్చిన వరం అని నా నమ్మకం. మనం ఆలయాలకు వెళ్లినప్పుడు మనకు ప్రసాదం అందిస్తారు. అందులో నుండి ఏ కొంచెం కిందపడినా మనం మన అంతరంగంలో వేదన పడిపోతాం. మనం దానిని వెంటనే ఏరుకోవడంతో పాటు దైవం క్షమను కోరుతూ అయిదు సార్లు ప్రార్థిస్తాం. జలం కూడా దైవ ప్రసాదితమే. ఒక్క చుక్క నీరు వృథా అయినా సరే మనం ఖేదం చెందాలి; పశ్చాత్తాపపడాలి. అందుకని నీటిని నిల్వ చేయడం, నీటిని పొదుపుగా వాడుకోవడం, సేద్యపు నీటిని సద్వినియోగించడం ఇవన్నీ కూడా సమ ప్రాధాన్యం ఇవ్వదగ్గవే. సూక్ష్మ సేద్యం పద్ధతిని అవలంబించడం ద్వారా, తక్కువ నీటిని మాత్రమే తీసుకొనే పంటలను సాగు చేయడం ద్వారా ‘ప్రతి చుక్క నీటితో ఎక్కువ పంట’ను అమలు చేయవలసిన అవసరం ఉంది. ఎన్నో రాష్ట్రాల్లో మన చెరకు పండించే రైతులు సైతం సూక్ష్మ సేద్యపు నీటి పారుదల పద్ధతులను అవలంబిస్తున్నారన్నా, ఇంకొంత మంది జల్లు సేద్య పద్ధతిని పాటిస్తున్నారన్నా.. ఈ విషయాలు నిజంగా శుభ వార్త వంటివే. పదకొండు రాష్ట్రాలతో నేను చర్చ జరిపినప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ధాన్యం పండించడానికి కూడా సమర్థంగా బిందు సేద్యం పద్ధతిని విజయవంతంగా అమలు చేశారన్న సంగతిని గమనించాను. దీని మూలంగా పంట దిగుబడి అధికం అయింది. నీరు వృధా అవలేదు. శ్రామికులపై పెట్టే ఖర్చు కూడా తగ్గింది. ఈ రాష్ట్రాలు చెప్పేదేమిటంటే – వారు పెద్దపెద్ద అంచనాలు వేసుకున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర, ఆంధ్ర ఇంకా గుజరాత్ ! ఈ మూడు రాష్ట్రాలు బిందు సేద్యంలో గొప్పగా శ్రమించాయి. ప్రతి ఏడాది రెండేసి, మూడేసి హెక్టార్ల భూమిని సూక్ష్మ నీటిపారుదలలోకి తీసుకురావాలన్నదే వాటి ధ్యేయం. ఈ మార్పు అన్ని రాష్ట్రాలలో తీసుకురాగలిగితే వ్యవసాయంలో ఎంతో లాభం పొందగలం. నీటిని దాచుకోగలం. మన తెలంగాణ రైతు సోదరులు ‘మిషన్ భగీరథ’ ద్వారా కృష్ణా, గోదావరి నదుల నీటిని సమర్థంగా ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘నీరు- ప్రగతి మిషన్’ ! అందులో కూడా భూగర్భ నీటి మట్టం పెంపునకు సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగం. భూగర్భ నీటిని పూర్తిగా వాడుకోవడం కోసం చేసే ప్రయత్నాలు. మహారాష్ట్ర చేపట్టిన ప్రజా ఆందోళనలో ప్రజలు చెమటోడుస్తున్నారు; ధన సహాయం చేస్తున్నారు. వాళ్లు చేపట్టిన ‘జలయుక్త శిబిర అభియాన్’ మహారాష్ట్రను భవిష్యత్‌లో కష్టాలు రాకుండా కాపాడుతుందన్నదే నా నమ్మకం. ఛత్తీస్‌గఢ్ ‘లోక సురాజ్ – జల సురాజ్’ అభియాన్ ను చేపట్టింది. మధ్య ప్రదేశ్ ‘బలరాం తాలాబ్ యోజన’ను అనుసరించింది.. దాదాపు 22 వేల చెరువులలో. ఇవేమీ మామూలు లెక్కలు కావు. వీటన్నింటి మీద పనులు జరుగుతున్నాయి. అలాగే ‘కపిల్ ధారా కూప్ యోజన’ మరి ఉత్తరప్రదేశ్‌లో ‘ముఖ్యమంత్రి జల్ బచావో యోజన’ ! కర్ణాటకలో బావులను తిరిగి బతికించుకునేందుకు ‘కల్యాణి యోజన’ పేరుతో పనులు మొదలయ్యాయి. రాజస్థాన్, గుజరాత్ లలో – ఎక్కువగా పాత బావులు ఉన్న ప్రదేశాల్లో వాటిని నీటి దేవాలయాలుగా తిరిగి బతికించుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. రాజస్థాన్‌లో ‘ముఖ్యమంత్రి జల – స్వావలంబన్ యోజన’ ను చేపట్టారు. ఝార్ ఖండ్ అటవీ ప్రాంతమే అయినా – కొన్ని కొన్ని చోట్ల నీటి ఎద్దడి ఉంది. అక్కడ చెక్ డ్యాం పేరుతో పెద్ద ఆందోళన చేపట్టారు. వృథాగా పోయే నీటిని ఆపే ప్రయత్నం ! కొన్ని రాష్ట్రాల్లో నదుల మీద చిన్నచిన్న ఆనకట్టలు కట్టి 10 కిలోమీటర్ల నుండి 20 కిలోమీటర్ల నీటిని ఆపే దిశలో పనులు చేపట్టారు.
ఇదంతా ఒక అద్బుతమైన అనుభవం. నేను ప్రజలకు ఒక విన్నపం చేస్తున్నాను.. రాబోయే జూన్, జులై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో రండి- మనమంతా ఒక్కనీటి చుక్క కూడా వృథా కానివ్వం అనే నిర్ణయాన్ని తీసుకుందాం అంటూ. ఎక్కడెక్కడ నీటిని రక్షించగలం..? ఎలా నీటిని ఆపగలం. .? వీటి గురించి ఏర్పాట్లు చేద్దాం. మన అవసరాలకు తగ్గట్లు భగవంతుడు నీటిని అనుగ్రహించాడు. ప్రకృతి మన అవసరాలను నెరవేరుస్తోంది. కానీ – మనం ఒకవేళ నీటిని వృథాగా పోనిస్తే; ఇదే పనిగా ఉంటే..? వర్షాకాలం ముగిసిన తరువాత నీరులేకపోతే అల్లాడిపోతాం? అప్పుడు ఎలా? నీటిని గురించి అంటే, ఒక్క రైతుల గురించే కాదండి. పల్లెవాసులు, పేదవారు, డబ్బున్నవారు, కూలీలు, రైతులు, పట్నవాసులు, గ్రామీణులు అందరికీ సంబంధించిన విషయం ఇది. వర్షాకాలం వస్తోంది. మనకు నీరు కావాలి. అది లేనిదే, మనకు మనుగడే లేదు. ఈసారి దీపావళి సంబరాలు జరుపుకునేటప్పుడు ఎంత నీటిని దాచుకోగలిగాం, ఎంత నీటిని వృథాకాకుండా ఆపగలిగాం అనే విషయాన్ని సంతోషంగా చెప్పుకోగలగాలి. అప్పుడు మన ఆనందానికి హద్దులంటూ ఉండవు. నీటికి ఎంత శక్తి ఉందంటే – మనం ఎంత అలసిపోయి వచ్చినా మొహం మీద ఇన్ని నీళ్లు చిలకరించుకున్నామనుకోండి. ఫ్రెష్ అయిపోతాం. అంత శక్తి ! బాగా అలిసిపోయినా, ఒక పెద్ద చెరువును చూసినప్పుడు.. లేదూ. అనంతమైన సముద్రాన్ని చూసినప్పుడు- ఆ అనుభవమే గొప్పగా ఉంటుంది. అవునా ! ఇంత అమూల్యమైన సంపదను దైవం ద్వారా మనం పొందాం. కాస్త మనసు పెట్టి ఆ సంపదను కాపాడుకుందాం. నీటి వనరుల్ని పెంచుకుందాం. నీటినీ పెంచుకుందాం. వాడిన నీటిని తిరిగి ఉపయోగంలోకి తెచ్చుకుందాం. ఈ విషయాన్ని మీకు నొక్కి చెబుతున్నాను. రాబోయే కాలాన్ని వృథాగా వదిలివేయకండి. ఆ నాలుగు నెలల్నీ చుక్కచుక్క నీటిని కాపాడుకునేందుకు ‘జల్ బచావో అభియాన్ ‘గా మార్చుకుందాం. ఇది ప్రభుత్వాలది కాదు. మంత్రులది కాదు. మనది. మన అందరి బాధ్యత ఇది. ప్రచార మాధ్యమాలు, ప్రసార మాధ్యమాలు గతంలో నీటి ఎద్దడిని గురించి విస్తృతంగా వివరించాయి. నీటిని కాపాడుకునే విషయంలో కూడా ఈ మాధ్యమాలు ప్రజలకు మార్గదర్శనం కావాలని, ఉద్యమాలు చేపట్టాలని, నీటి ఇబ్బంది నుంచి మనల్ని సంపూర్ణంగా తప్పించే విషయంలో భాగస్వాములు కావాలని కోరుకుంటూ.. ఆ మాధ్యమాలను కూడా నేను స్వాగతిస్తున్నాను.
ప్రియమైన నా దేశ ప్రజలారా.. మన దేశాన్ని మనం ఆధునిక రంగంలోకి తీసుకువెళ్లాలి. మన దేశం పారదర్శకం కావాలి .ఎన్నో వనరులు సమాన స్థాయిలో దేశంలోని అన్ని మూలలకు చేరేట్టు చూడాలి. అందుకోసం.. మన పాత అలవాట్లను కొంచెంగా మార్చుకోవాలి. ఒక్క విషయం గురించి ప్రస్తావించదల్చుకున్నాను. ఆ విషయంలో మీరు గనుక నాకు సహాయపడినట్లయితే ఆ దిశలో తప్పకుండా మనం అభివృద్ధిని సాధించగలమనే నా నమ్మకం. మనందరికీ తెలుసు; చిన్నప్పుడు చదువుకున్నాం కూడా. ఒకప్పుడు నాణేలు ఉండేవి కావు, నోట్లు ఉండేవి కావు. బార్టర్ సిస్టమ్ నడిచేది. అంటే మీకు కూరలు కావాలంటే, దానికి బదులుగా కొంత ధాన్యం ఇచ్చేవాళ్లు. ఉప్పు కావాలంటే, కూరలు ఇచ్చేవాళ్లు. ఒక వస్తువుకు బదులుగా ఇంకొక వస్తువు. బార్టర్ సిస్టమ్ అంటే ఇదే. మెల్లమెల్లగా నాణేలు, అదే ‘కాయిన్స్’ వచ్చాయి, నోట్లు వచ్చాయి. కానీ, కాలం మారింది. ప్రపంచం నగదు రహిత వ్యవస్థ వైపు పరుగులు తీస్తోంది. ఎలక్ట్రానిక్ టెక్నాలజి ద్వారా మనం డబ్బులు తీసుకోగలం, ఇవ్వగలం. దీనివల్ల జేబు నుంచి పర్స్ కాజేస్తారన్న భయమే ఉండదు. లెక్కలు రాసుకునే అవసరం ఉండదు. ఆటోమేటిక్ లెక్కలు ఉంటాయి. మొదట్లో ఇది కష్టంగా ఉంటుంది. కానీ నెమ్మది నెమ్మదిగా అలవాటు అయిపోతే.. ఈ వ్యవస్థ సులువైపోతుంది. మేము ఈ మధ్య ప్రవేశపెట్టిన ‘ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన’ వల్ల దేశంలోని దాదాపు అన్ని కుటుంబాలు బ్యాంకులో ఖాతాలు తెరిచాయి. ఇంకొక వైపు ఆధార్ నంబర్ లభించింది. ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఒక్క భారతీయుడి చేతిలో మొబైల్ ఉంది. ‘జన్ ధన్’, ‘ఆధార్’ మరియు ‘మొబైల్’ – ‘JAM’ను జోడిస్తూ క్యాష్‌లెస్ సొసైటీ వైపు ముందుకు నడవవచ్చు. జన్ ధన్ అకౌంట్‌తో పాటు.. రూపే కార్డు ఇవ్వబడింది. వచ్చేరోజుల్లో ఈ కార్డు క్రెడిట్ మరియు డెబిట్ – రెండు విధాలుగా పనికొస్తుంది. ఈ మధ్య ఒక చిన్న ఇన్స్ట్రుమెంట్ వచ్చింది. దానిపేరు ‘పాయింట్ ఆఫ్ సేల్’ – POS. మీ ఆధార్ నంబర్, రూపే కార్డు సాయంతో ఎవరికైనా డబ్బులు చెల్లించగలరు. జేబులో నుండి డబ్బులు తీసి, లెక్కపెట్టనవసరం లేదు. డబ్బును మోసుకుంటూ తిరగనక్కర లేదు. కేంద్ర ప్రభుత్వం కొన్ని చొరవలు తీసుకుంటోంది. అందులో ఒకటి POS ద్వారా చెల్లింపు ఎలా చేయాలి? డబ్బులు ఎలా తీసుకోవాలి? అన్నది. మేము మొదలుపెట్టిన రెండో పని ‘బ్యాంక్ ఆన్ మొబైల్ – యూనివర్సల్ పేమెంట్ ఇంటర్ఫేస్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్-UPI విధానాన్ని మార్చేస్తుంది. మొబైల్ ఫోన్ ద్వారా మనీ ట్రాన్సాక్షన్ చేయడం సులభమైపోతుంది. సంతోషకరమైన విషయం ఏమిటంటే, NPCI మరియు బ్యాంకులు ఈ ప్లాట్‌ఫాంను మొబైల్ యాప్ ద్వారా ప్రారంభించే దిశగా కసరత్తు చేస్తున్నాయి. ఒకవేళ ఇది కనుక జరిగితే, బహుశా మీకు రూపే కార్డును మీతో కూడా అట్టిపెట్టుకునే పని ఉండదు. దేశవ్యాప్తంగా సుమారు 1.25 లక్షల బ్యాంకింగ్ కరెస్పాండెంట్లుగా నవయువకులకు భర్తీ చేయడం జరుగుతున్నది. ఒకరకంగా బ్యాంకు మీ గుమ్మం ముందుకు వచ్చే దిశలో పనిచేస్తున్నది. పోస్టాఫీసును కూడా బ్యాంకింగ్ సేవల కోసం ప్రోత్సహించడం జరుగుతున్నది. ఒకవేళ మనం ఈ వ్యవస్థను వినియోగించుకోవడం నేర్చుకున్నామంటే, మనకు కరెన్సీ అవసరం ఉండదు; నోట్ల అవసరం ఉండదు; డబ్బుల అవసరం ఉండదు. వ్యాపారం దానంతట అదే నడుస్తుంది. తత్ఫలితంగా పారదర్శకత చోటు చేసుకొంటుంది. రెండో రకం లావాదేవీలు ఆగిపోతాయి. నల్ల ధనం ప్రభావం తగ్గిపోతుంది. అందుకే నేను దేశ ప్రజలను దీనిని మొదలుపెట్టవలసిందిగా కోరుతున్నాను. ఒక్కసారి మొదలుపెడితే నెమ్మది నెమ్మదిగా, సులభంగా ముందుకు వెళ్లగలం. 30 సంవత్సరాల క్రితం మన చేతిలో మొబైల్ ఉంటుందని మనం ఊహించామా..? మెల్లగా అది అలవాటైపోయింది. ఇప్పుడు మొబైల్ లేకుండా ఉండమంటే, ఉండలేం. ఈ నగదు రహిత సమాజం కూడా అలాంటి రూపాన్నే ధరించవచ్చు. కానీ అది ఎంత త్వరగా జరిగితే, అంత బాగుంటుంది.
ప్రియమైన నా దేశ ప్రజలారా.. ఒలింపిక్స్ మొదలైనప్పుడు మనం తల పట్టుకుని కూర్చుంటాం. మనకు బంగారు పతకం దక్కలేదు. రజతం వచ్చిందా.. లేదా కాంస్యంతో సరిపెట్టుకుందామా అనే ఆలోచనే ఉంటుంది. ఈ క్రీడలలో మన ముందు సవాళ్లు ఉన్నాయి. కానీ మనం ఒక మంచి వాతావరణాన్ని తయారు చేయాలి. రియో ఒలింపిక్స్ కు వెళ్లే క్రీడాకారులను ప్రోత్సహించడానికి, వారి పట్టుదలని రెండింతలు చేయడానికి ప్రతి ఒక్కరు తమ తమ పద్ధతులలో; కొందరు కార్టూన్స్ ను గీసి, శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఎవరు ఏ క్రీడను ప్రోత్సహించినా.. దేశ ప్రజలు ఈ క్రీడాకారుల పట్ల సానుకూల వాతావరణాన్ని తయారు చేయాలి. ఆట ఆటే. ఇందులో గెలుపూ ఉంటుంది. ఓటమీ ఉంటుంది. పతకాలు వస్తాయి. ఒక్కొక్కసారి రావు కూడా. కానీ గట్టి పట్టుదల ఉండాలి. ఈ విషయంలో మన క్రీడా మంత్రి శ్రీ సర్బానంద్ సోనోవాల్ చేసిన ఒక పని నా మనసుకు హత్తుకుపోయింది. దానిని మీకు వెల్లడించాలనుకుంటున్నాను. మేమంతా గత వారం ఎన్నికల హడావుడిలో ఉన్నాం. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో.. అసలేం జరుగుతుందో అని చూస్తున్నాం. సర్బానంద్ గారు స్వయంగా అస్సాం ఎన్నికల్లో ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నారు. కానీ వారు అప్పటికే కేంద్ర ప్రభుత్వంలో మంత్రి. నాకు ఈ విషయం తెలిసి చాలా సంతోషం అనిపించింది. వారు అస్సాం ఎన్నికల ఫలితాలకు ముందు ఎవ్వరికీ చెప్పకుండా పటియాలా చేరుకున్నారు. నేతాజీ సుభాష్ నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్ – NIS లో ఒలింపిక్స్ కు వెళ్లే ఆటగాళ్లు శిక్షణ పొందుతున్న సంగతి అందరికీ తెలిసిందే. వారు అకస్మాత్తుగా అక్కడికి చేరుకోవడం అక్కడ ఉన్న క్రీడాకారులను ఆశ్చర్యపరిచింది. ఇది క్రీడా జగత్తునే అచ్చెరువుకు గురిచేసే విషయం. ఒక మంత్రి ఈ విధంగా క్రీడాకారుల గురించి ఆలోచించడం, క్రీడాకారులకు ఎలాంటి సౌకర్యాలు ఇవ్వబడ్డాయి..?, భోజనం ఎలా ఉంది..?, వారి శరీరానికి అవసరమైన పౌష్టికాహారం అందజేయబడుతున్నదా.. లేదా..? సరైన శిక్షకులు ఉన్నారా.. లేదా..? శిక్షణకు కావలసిన పరికరాలు సరిగ్గా పనిచేస్తున్నాయా.. లేదా..? అన్న విషయాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఒక్కొక్క క్రీడాకారుడి గదిలోకి వెళ్లి చూశారు. క్రీడాకారులతో కలసి భోజనం చేశారు. ఎన్నికల ఫలితాలు వస్తున్నాయి.. ముఖ్యమంత్రిగా కొత్త బాధ్యతలు స్వీకరించాలి; కానీ, నా ఒక స్నేహితుడొకరు క్రీడా మంత్రిగా తమ కర్తవ్యం పట్ల ఇంతగా ఆలోచించడం నాకు ఆనందాన్ని కలగజేసింది. ఇదే విధంగా మనం క్రీడల యొక్క ప్రాముఖ్యతను తెలుసుకుంటామని నా పూర్తి నమ్మకం. క్రీడా జగత్తులో ఉన్నవారిని ప్రోత్సహిద్దాం, క్రీడాకారులను ప్రోత్సహిద్దాం. ఇది వారికి అతి పెద్ద బలంగా మారుతుంది. 125 కోట్ల మంది ప్రజలు తమతో ఉన్నారని క్రీడాకారుడికి తెలిసినప్పుడు ఆ ఉత్సాహం ద్విగుణీకృతం అవుతుంది.
పోయినసారి నేను ఎఫ్ఐఎఫ్ఎ అండర్-17 వరల్డ్‌కప్ గురించి మాట్లాడాను. దేశం నలుమూలల నుంచి నాకు చాలా సలహాలు అందాయి. ఈ మధ్య నేను చూసిందేమిటంటే ఫుట్‌బాల్ యొక్క వాతావరణం దేశమంతటా కనపడుతోంది. చాలా మంది చొరవ తీసుకుని తమ తమ జట్లను తయారు చేస్తున్నారు. NarendraModi Mobile App ద్వారా నాకు చాలా సలహాలు అందాయి. చాలామంది ఆటలు ఆడరు. కానీ వేల కోట్ల ప్రజలు ఈ క్రీడల పట్ల ఆసక్తి చూపుతున్నారు. ఈ విషయం నాకు చాలా ఆనందాన్ని ఇస్తున్నది. క్రికెట్‌తో మన దేశానికున్న అనుబంధం గురించి అందరికీ తెలిసిందే. కానీ ఫుట్‌బాల్ పట్ల కూడా ఈ మక్కువ మంచి భవిష్యత్తుకు శుభ సంకేతం. రియో ఒలింపిక్స్‌కు వెళ్లే మన ప్రియమైన క్రీడాకారులకు ఆహ్లాదకరమైన, ఉత్సాహకరమైన వాతావరణాన్ని ఇద్దాం. ప్రతి దానినీ గెలుపోటములతో ముడిపెట్టకండి. క్రీడా స్ఫూర్తితో భారతదేశం ప్రపంచంలో గుర్తింపు తెచ్చుకుంటోంది. క్రీడా ప్రపంచంలో ఉన్నవారిని ప్రోత్సహించి, ఉత్సాహకరమైన వాతావరణాన్ని కల్పించడంలో తమ తమ వంతు ప్రయత్నించమని దేశ ప్రజలను కోరుతున్నాను.
గత ఎనిమిది, తొమ్మిది రోజుల నుండి ఏదో ఒక చోట నుండి ఫలితాలు వస్తున్నాయి.. నేను ఎన్నికల ఫలితాల గురించి మాట్లాడటం లేదు. సంవత్సరం పొడవునా కష్టపడి పరీక్షలు రాసిన విద్యార్థుల గురించి మాట్లాడుతున్నాను. పదో తరగతి, 12వ తరగతి.. ఒకదాని తరువాత మరొకటిగా పరీక్షా ఫలితాలు వస్తూనే ఉన్నాయి. ఇందులో మన అమ్మాయిలు వారి మేథాశక్తిని చాటి చెప్పారు. సంతోషకరమైన వార్త.
ఈ పరిణామాలలో నెగ్గినవారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఉత్తీర్ణులు కాని వారికి మరోసారి నేను చెప్పేదేమిటంటే, జీవితంలో చేయడానికి చాలా ఉంది. మనం అనుకున్న పరిణామాలు రాకపోతే, జీవితం అక్కడే ఆగిపోదు. ఆత్మ విశ్వాసంతో జీవించాలి, ఆత్మ విశ్వాసంతో ముందుకు సాగాలి.
కానీ ఒక కొత్త రకం సమస్య నా ముందుకు వచ్చింది. నేను ఈ విషయం ఎప్పుడూ ఆలోచించలేదు. నా mygov.in సైట్ లో ఒక ఇ-మెయిల్ వస్తే, నా దృష్టి అటు వైపు వెళ్లింది. మధ్య ప్రదేశ్‌కు చెందిన గౌరవ్ పటేల్ అనే ఆయన తన సమస్యను నా ముందు ఉంచారు. గౌరవ్ పటేల్ చెప్పింది ఇదీ.. నేను ఎమ్. పి. బోర్డ్ పరీక్షలలో 89.33 శాతం మార్కులు సంపాదించి, ఉత్సాహంగా ఇంటికి చేరాను. నాలుగు వైపుల నుంచి నాకు అభినందనలు అందుతాయి అని ఊహించాను. కానీ అందరూ ”అయ్యో! ఇంకో నాలుగు మార్కులు వస్తే, 90 శాతం అయ్యేది కదా! అనడం నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అంటే- నా కుటుంబం, నా స్నేహితులు, నా టీచర్.. ఎవరూ కూడా నా 89.33 శాతం మార్కులతో సంతోషపడలేదు. అందరిదీ ఒకే మాట.. ”ఇంకో నాలుగు మార్కులు వస్తే, 90 శాతం అయ్యేది కదా” అనే. ఇటువం
టి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలో నాకు అర్థం కావడంలేదు. జీవితంలో ఇదే సర్వస్వమా..? నేను చేసింది కరెక్ట్ కదా…? నేను తక్కువ చదివానా..? ఏమో.. నా మనసుపై ఇది ఒక భారంగా అనిపిస్తుంది అంటూ ఆయన రాసి పంపారు.
గౌరవ్.. మీరు చెప్పింది ఎంతో జాగ్రత్తగా విన్నాను. అందులో కనిపించే ఆవేదన మీ ఒక్కరిదే కాదు. అది మీలాంటి లక్షల, కోట్ల విద్యార్థులది అయి ఉండాలి. ఎందుకంటే. వాతావరణమే అలా మారిపోయింది కాబట్టి. సాధించిన దానికి సంతోషపడకుండా సాధించని దాని గురించి వెతుకులాడటం – ఇది ఏమీ చేయలేకపోవడానికి, వెనుకడుగు వేయడానికి దారి తీస్తుంది. ప్రతి విషయంలోనూ అసంపూర్ణత్వాన్నే అంటే – వెలితినే వెతుకుతుంటే, మనం సమాజాన్ని సంతోషం వైపు నడిపించగలమా…? లేదు. మీరు సాధించిన 89.33 శాతం మార్కుల్ని మీ వాళ్లు, మీ మిత్రులు, మీ సాటి వారు మెచ్చుకుని ఉంటే బాగుండేది. ముందుముందు మరింత అభివృద్ధి సాధించాలని మీకు తోచుండేది. మీ అందరినీ నేను కోరేది ఏమిటంటే – మీ పిల్లలు పరీక్ష ఫలితాలు ఇంటికి తెచ్చినప్పుడు, వాటిని వాస్తవాలుగా ఒప్పుకోండి. సంతోషంగా, మనస్ఫూర్తిగా మెచ్చుకోండి అని. మరింత అభివృద్ధిని సాధించేందుకు వాళ్లను ప్రోత్సహించండి. లేకపోతే, వాళ్లు నూటికి నూరు తెచ్చుకున్నా – ”వందకి వంద వచ్చాయి, సరే. ఇంకా ఏదైనా చేసి ఉంటే బాగుండేది” అనే రోజు కూడా వస్తుంది! ప్రతి విషయానికి హద్దులుంటాయి. అది మరిచిపోవద్దు.
జోధ్‌పూర్ నుంచి సంతోష్ గిరిస్వామి కూడా దాదాపు ఇలాగే రాశారు. ఆయన అనడం ఏమిటంటే .. నా చుట్టుపక్కల ఉన్నవాళ్లు మన పరిస్థితుల్ని గుర్తించడం లేదు అని. ఏదో ఒకటి- ఏదో ఒకటి మంచి చెయ్యాలంటారాయన. చాలాకాలం క్రితం ఒక కవిత చదివాను. ఆ పంక్తులు సరిగా గుర్తులేవు. కానీ ఆ కవి ఏం రాశారంటే – జీవితం అనే బొమ్మలు వేసే గుడ్డ మీద నా వేదనని చిత్రించాను. ఆ చిత్రాన్ని ప్రదర్శనలో ఉంచినప్పుడు చూసిన వాళ్లు ”దీనికి మెరుగులు దిద్దాలి, నీలం రంగు బదులు పసుపు రంగు వాడుంటే బాగుండేది, ఆ గీతలు ఇటునుంచి కాకుండా అటునుంచి ఉండుంటే బాగుండేది” అని సూచనలు చేశారు ! నా చిత్రాన్ని చూసిన వాళ్లలో కనీసం ఒకరైనా కన్నీళ్లు పెట్టుకుంటారేమోనని ఆశపడ్డాను అన్నారు. ఆయన సరిగ్గా ఈ మాటలే అన్నట్లు నాకు గుర్తు లేదు. చాలా కాలం క్రితం రాసిన కవిత అది. అయితే దాని భావం మాత్రం ఇదే. ఆ చిత్రంలో కనిపించే వేదనను అర్థం చేసుకోవడం లేదు కానీ, దానికి మెరుగులు దిద్దాలని చెప్పేవాళ్లే ఎక్కువ మంది. సంతోష్గిరి గారు.. మీ ఆవేదన కూడా గౌరవ్ ఆవేదన లాగా .. కోటానుకోట్ల విద్యార్థుల వేదన మాదిరిగానే ఉంది. ప్రజల కోరికలను పూర్తి చేసే బాధ్యత మీ మీద ఉంది. మిమ్మల్ని నేను కోరేది ఒకటే. ఇటువంటి స్థితిలో మీ నిబ్బరాన్ని కోల్పోకండి. ఇతరులు చెప్పేది వింటుండండి. కానీ, మీ సంకల్పం నుండి మాత్రం దూరం కాకండి. మీరనుకున్నది మరింత బాగా చెయ్యడానికి ప్రయత్నించండి. అయితే, ఫలితాన్ని చూసి సంతోషించకపోతే, కొత్తకొత్త నిర్మాణాలను ఎప్పుడూ చేపట్టలేరు. సాధించాం అన్న సంతోషమే, మరింత సాధించడానికి తోడ్పడుతుంది. సాధించిన దాంట్లో కొద్దిపాటి నిరుత్సాహం కూడా మరింత సాధించడానికి మెట్టు కాలేదు. కానీ తప్పకుండా వెనక్కులాగుతుంది.
అందుకని నేను మిమ్మల్ని కోరేది ఒక్కటే. మీరు ఎంత సఫలీకృతులవుతారో, దాన్ని గుర్తించండి. లోతుల్లోకి వెళ్లండి. అందులో నుండే కొత్తవి సాధించడానికి అవకాశం ఉంది. అయితే ముఖ్యంగా మీ చుట్టుపక్కల వారితో, మీ తల్లితండ్రులతో, మీ మిత్రులతో చెప్పదల్చుకున్నదేమిటంటే – మీ కోరికల భారాన్ని దయచేసి మీ పిల్లలపై మాత్రం మోపకండి. ఒక్కటి మిత్రులారా..! జీవితంలో ఎప్పుడైనా సాధించలేకపోతే ఆ జీవితం అక్కడితో ఆగిపోతుందా..? పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేని పిల్లవాడు ఆటల్లో అభివృద్ధి సాధిస్తాడు, సంగీతంలో ప్రావీణ్యం సంపాదిస్తాడు. చిత్రలేఖనంలో మెరుపులు చూపిస్తాడు, వ్యాపారంలో ముందుకువెళతాడు. భగవంతుడు ప్రతి ఒక్కరికీ ఏదో ఒక అద్భుతమైన కళని అందించే ఉంటాడు. అయితే, మీలో దాగివున్న ఆ శక్తిని మీరు గుర్తించండి. దానికి మరింత బలాన్ని అందించండి. మీరు ముందడుగు వేయడం ఖాయం. జీవితంలో ఇది ఎదురుపడుతూనే ఉంటుంది. సంతూర్ అనే వాద్యపరికరం గురించి మీరు వినే ఉంటారు. ఒకప్పుడు దీన్ని కశ్మీర్ లోయలో జానపద సంగీతంలో మాత్రమే వాడేవారు దానిని. కానీ పండిట్ శివకుమార్ అనే ఆయన దీన్ని వాడారు. ఫలితం…? మొత్తం ప్రపంచంలోనే అది ఒక గొప్ప వాద్యపరికరమైంది. మరి షెహనాయి? ఒకప్పుడు కొన్ని ప్రాంతాలకే పరిమితమై, మహారాజుల కోట గోడల మీద వాయింపబడేది. కానీ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ మహోదయుడు దాని మీద చేయి వేసిన తరువాత అది ఒక ఉత్తమ వాద్యంగా గుర్తించబడి ,విశ్వవిఖ్యాతమైంది. అందుకని, మీలో ఏం ఉంది… ఎలా ఉంది.. అన్న చింత వదిలి, ఉన్నదాన్ని బలోపేతం – మరింత బలోపేతం చెయ్యండి. ఫలితం దానంతట అదే వస్తుంది.
ప్రియమైన దేశవాసులారా .. మన దేశంలో బీద కుటుంబాలలో ఆరోగ్యం కాపాడుకోవడానికి అయ్యే ఖర్చు ఒక్కొక్క సారి వాళ్ల జీవన రీతుల్ని ఛిన్నభిన్నం చేయడం అప్పుడప్పుడూ చూస్తుంటాం. రోగం రాకుండా ఉండేందుకు అయ్యే ఖర్చు నిజానికి చాలా తక్కువే. కానీ రోగం బారినపడి, దానిని నయం చేసుకోవడానికయ్యే ఖర్చు మాత్రం చాలా ఎక్కువ. మరి రోగాలే రాకుండా జాగ్రత్తపడి, మన కుటుంబ ఆర్థిక స్థితిని మెరుగుపర్చుకునేలా మనం ఎందుకని జీవించకూడదు…? రోగాల నుండి కాపాడుకోవాలంటే అన్నిటికన్నా పెద్ద ఆయుధం శుభ్రత. పేదవారికి ఎక్కువగా లాభం చేకూర్చేది కేవలం శుభ్రతే. రెండో ఆయుధం ఏమిటంటే, నేను ప్రతిసారి చెబుతుంటానే యోగం. దాన్ని యోగా అంటారు. జూన్ 21 అంతర్రాష్ట్రీయ యోగా దినం. ప్రపంచమంతటా ఈ యోగా పట్ల ఒక ఆకర్షణ, ఒక శ్రద్ధ ఉన్నాయి. ఎంతో మంది దీనిని స్వీకరించారు కూడా. సమస్యలతో నిండిపోయిన ఈ ప్రపంచంలో సుఖంగా జీవించడానికి కావలసిన శక్తిని యోగా ఇస్తుంది. చికిత్స కంటే నివారణ ముఖ్యం అన్నారు. యోగ సాధన చేసే వ్యక్తి ఆరోగ్యంగా ఉండగలడు. తృప్తితో ఉండగలడు, చలించని మనోనిబ్బరాన్ని, ఏకాగ్రతను పెంపొందించుకోగలడు, అనుకున్నది సాధించగలడు- ఇవన్నీ అతనికి సాధ్యమవుతాయి. జూన్ 21న యోగా దినం. ఇది ఒక కార్యక్రమం కాదు. ఇదేమిటనేది అందరికీ తెలియాలి. ప్రతిఒక్కరూ యోగాని వారి జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. వారి దినచర్యలో 20, 25, 30 నిమిషాలు దీని కోసం కేటాయించాలి. మన జీవితాలను ఇలా మార్చుకోవడానికి జూన్ 21 మనకు ప్రేరణ కావాలి. ఒక్కొక్క సారి సామూహిక వాతావరణం మనిషి జీవితంలో మార్పు తీసుకురావడానికి కారణమవుతుంది. నేను కోరేది ఏమిటంటే.. జూన్ 21న, మీరుండేది ఏ ప్రాంతమైనా సరే. మీకు ఇంకా ఒక నెల రోజులు సమయం ఉంది. మీరు భారత ప్రభుత్వపు వెబ్సైట్లోకి వెళ్లి ఈసారి యోగా సిలబస్ ఏమిటి..? ఏ ఏ ఆసనాలు ఏ విధంగా చేయాలి.. ఈ వివరాలన్నీ పూర్తిగా వివరణలతో ఉన్నాయి. వాటిని చూడండి. మీ గ్రామంలో వేయించండి. మీ ప్రాంతంలో వేయించండి. మీ పట్టణంలో వేయించండి. మీ బడిలో వేయించండి. మీరు ఎక్కడుంటే అక్కడ వేయించండి ఇవాళ్టి నుంచి ఒకనెల ! ప్రారంభించండి ! చూస్తుండండి, జూన్ 21న మీరూ ఒక భాగస్వామి అవుతారు. నేను చాలా చోట్ల చదివాను కార్యాలయాలలో క్రమం తప్పకుండా ఉదయాన్నే సామూహికంగా వ్యాయామం లాంటివి చేసినప్పుడు అక్కడివారు ఎంతో అభివృద్ధిని సాధించారట. ఆ ఆఫీసు వాతావరణమే పూర్తిగా మారిపోయిందంట. మరి మన జీవితాల్లో యోగాను ఒక భాగంగా చేసుకోవడానికి జూన్ 21ను మనం ఉపయోగించుకోలేమా? మన చుట్టుపక్కల పరిసరాల్లో యోగాను వ్యాప్తి చేయలేమా? చెయ్యగలం! చెయ్యాలి! ఈసారి నేను చండీగఢ్‌లో జరగబోయే కార్యక్రమానికి వెళ్లబోతున్నాను. జూన్ 21న చండీగఢ్ వాసులతో కలసి యోగాసనాలు వెయ్యబోతున్నాను. ఆరోజు మీరు కూడా అందరితో పాటు విశ్వవ్యాప్తంగా యోగసనాలు వెయ్యబోతున్నారు. ఎటువంటి స్థితిలోనైనా వెనుకబడిపోవొద్దు. ఇదే నా కోరిక. భారతదేశం ఆరోగ్యంగా ఉండాలంటే, మీరందరూ ఆరోగ్యంగా ఉండటం ఎంతో అవసరం.
ప్రియమైన నా దేశ ప్రజలారా.. ‘మన్ కీ బాత్’ (మనసు లోని మాట) కార్యక్రమం ద్వారా నిరంతరం మిమ్మల్ని కలుస్తుంటాను. చాలా కాలం క్రిందట నేను మీకు ఒక మొబైల్ నంబర్ ను ఇచ్చాను. దానికి మీరు మిస్ డ్ కాల్ ఇచ్చి ‘మన్ కీ బాత్’ (మనసు లోని మాట) కార్యక్రమాన్ని వినవచ్చు అని చెప్పాను. ఇప్పుడది మరింత సులభతరం అయింది. మీరు కేవలం నాలుగంకెల నంబర్‌కు మిస్ డ్ కాల్ ఇచ్చి, ‘మన్ కీ బాత్’ (మనసు లోని మాట) కార్యక్రమం వినవచ్చు. ఆ నంబర్ 1922. మీరు ఎక్కడుంటే అక్కడ, ఎప్పుడంటే అప్పుడు, ఏ భాషలో అంటే ఆ భాషలో ‘మన్ కీ బాత్’ (మనసు లోని మాట) కార్యక్రమాన్ని వినవచ్చు.
ప్రియమైన నా దేశ ప్రజలారా.. మీ అందరికీ మరొకసారి నమస్కారములు. దయచేసి నేను నీటిని గురించి చెప్పిన మాటలను మీరు మరిచిపోకండి. వాటిని మీరు జ్ఞాపకం పెట్టుకొనే తీరుతారు, కదూ? సరేనా ! మరి ఇక, ధన్యవాదాలు. నమస్తే!
ప్రియమైన నా దేశ వాసులారా..
నమస్కారం.
ఇప్పుడు వేసవి కాలం. ప్రతి ఒక్కరు ఎండాకాలం సెలవుల కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకొంటారు. ఇది మామిడి పండ్ల కాలం కూడా కావడంతో, ఈ ఫలాలను రుచి చూడాలని మనం తపిస్తాం. ఒక్కొక్క సారి మధ్యాహ్నం పూట కొంచెం సేపు కునుకు తీస్తే భలేగా ఉంటుందని మనకు అనిపిస్తుంది. కానీ, ఈ సంవత్సరం ఎండలు ఎక్కువై ఉక్కబోత అందరి వినోదాన్నీ నాశనం చేసింది.
ఎడతెగని వేడిమిని గురించి జాతి ఆందోళన చెందడమనేది ఎంతో సహజమైందే. అంతకు మించి, గత రెండు సంవత్సరాలుగా వరుసగా దుర్భిక్షం ఎదురవడంతో, మామూలుగా నీరు నిల్వ ఉండే ప్రదేశాలపై ప్రతికూల ప్రభావం పడింది. కొన్ని సార్లు కబ్జా కారణంగా, మరికొన్ని సార్లు ఇసుక మేట వేసిన కారణంగా, జలాశయాలలోకి, ఇంకా ఇతర జల వనరులలోకి వచ్చే నీటి ప్రవాహానికి అడ్డంకి ఏర్పడింది. ఫలితంగా, జలాశయాలు వాటి సామర్థ్యం కన్నా తక్కువగా మాత్రమే నీటిని నిల్వ ఉంచగలుగుతున్నాయి. ఇంకా అథమమైన విషయం ఏమిటంటే, ఇదే చక్రభ్రమణం ఏళ్ల తరబడి కొనసాగుతూ ఉండటం. దీనితో ఈ జలాశయాల సామర్థ్యం క్రమంగా తగ్గిపోయింది. కరవు సమస్యను పరిష్కరించడానికి, జల సంక్షోభం నుంచి ఉపశమనం కలిగించడానికి, ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. కానీ ఇదొక్కటే కాదు.. పరిస్థితిని ఎదురించడానికి పౌరులు అభినందనీయమైన కృషికి నడుంకడుతున్నారు. అనేక గ్రామాలలో ఇప్పుడు చైతన్యవ కనుపిస్తోంది. నీటి కొరతను అనుభవించిన వారే జలం సిసలైన విలువను తెలుసుకోగలుగుతారు. కాబట్టి, ఇటువంటి చోట్ల వారు నీళ్ల విషయంలో ఎంతో జాగ్రత్తలతో ఉంటారు; ఇంకా, నీటి కరవును తట్టుకోవడానికి ఏదో ఒకటి చేయడంలో జరుగుతుంది.
ఇటీవలే ఎవరో నాతో చెప్పారు.. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్ జిల్లా హివ్ రేబజార్ గ్రామ పంచాయతీలో ఆ గ్రామస్తులు నీటి కొరతను ప్రధానమైన, ఎంతో సున్నితమైన సమస్యగా ఎంచి పరిష్కరించుకున్నారని. నీటిని నిల్వ చేయాలనే ఆసక్తి వ్యక్తమయ్యే పల్లెలను ఎవరైనా అనేకంగా చూడవచ్చు. హివ్ రేబజార్ లో వ్యవసాయదారులు పంటలు విత్తే రీతిని మార్చి అ సమస్యను పరిష్కరించారు. నీరు అధికంగా అవసరమయ్యే పంటలను.. అంటే చెరకు, అరటి వంటివి సాగు చేయడాన్ని మానివేయాలని వారు నిర్ణయించుకొన్నారు. వినడానికి ఇది చాలా సులభంగా ఉన్నా, కానీ వాస్తవంలో ఇది అంత సులభం కాదు. ఇది ఎంత పెద్ద సమష్టి నిర్ణయం అయి ఉంటుందో? ఎవరైనా నీటిని ఎక్కువగా వాడే కర్మాగారాల యజమానులకు అటువంటి జల వినియోగం పర్యవసానాలను గురించి చెప్పి వారి యూనిట్లను మూసివేయవలసిందిగా అభ్యర్థిస్తే వచ్చే ప్రతిస్పందన ఎలా ఉంటుందదో ఎవరైనా ఇట్టే ఊహించవచ్చు. అయితే ఈ రైతు సోదరుల వివేకాన్ని చూడండి. చెరకు పంట సేద్యానికి బోలెడంత నీరు కావలసి వస్తుందని గ్రహించారు కాబట్టి ఆ పంటను వేయవద్దని వారు అనుకొని, అదే ఆలోచనను అమలులో పెట్టారు. చెరకు కాకుండా పండ్లు, కాయగూరల వంటి ఎంతో తక్కువ నీరు ఉపయోగించుకొనే పంటలను వేస్తున్నారు. స్ప్రింక్లర్ లు, బిందు సేద్యం మెలకువలు, వాటర్ హార్వెస్టింగ్, వాటర్ రీఛార్జింగ్.. ఇలా అనేక రకాల కార్యక్రమాలను వారు అనుసరించారు. ఇవాళ వారి గ్రామం నీటి సమస్యకు ఎదురొడ్డి నిలువగలిగే శక్తి ని సంతరించుకొంది. నేను హివ్ రేబజార్ లాంటి చిన్న ఊరిని గురించి చెప్తుండవచ్చు అయితే, ఇటువంటి గ్రామాలు ఇంకా ఎన్నో ఉండే ఉంటాయి. అటువంటి గ్రామాల నివాసులకు వారు చేస్తున్న మంచి పనికి గాను నేను వారికి నా హృదయపూర్వకమైన అభినందనలను తెలియజేస్తున్నాను.
నాకు ఎవరో చెప్పారు, మధ్య ప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో గోర్ వా గ్రామ పంచాయతీ ఉందని. ఈ పంచాయతీ ప్రయత్నం చేసి పంట చెరువును ఏర్పాటు చేయడానికి ఒక కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు 27 పంట చెరువులను తయారు చేశారు. ఇందువల్ల భూగర్భ జలాల స్థాయి ఎంతగానో పెరిగింది. నీరు పైకి వచ్చింది. పంటకు ఎప్పుడు సాగు నీరు అవసరమైనా, నీరు లభించేది. సుమారు 20 శాతం వారి వ్యవసాయ ఉత్పాదన పెరిగింది. అలా నీరైతే పొదుపు అయ్యింది. ఎప్పుడైతే నీటి స్థాయి పైకి వస్తుందో.. అప్పుడు నీటి నాణ్యతలో కూడా ఎంతో మార్పు వస్తుంది. స్వచ్ఛమైన తాగు నీరు GDP వృద్ధికి కూడా కారణం అవుతుందని అంటారు. ఆరోగ్యం అయితే తప్పకుండా మెరుగవుతుంది.
భారత ప్రభుత్వ రైల్వే ద్వారా నీరు లాతూర్కు చేరుతుందని తెలిసినప్పుడు ఇది ప్రపంచానికి ఒక వార్త అవుతుంది. ఇది నిజమే. ఎంత వేగంగా రైల్వే ఈ పని చేసింది. ఇది తప్పకుండా అభినందనీయమే. అయితే ఆ గ్రామ ప్రజలు కూడా అంతే అభినందనీయులే. ప్రజల ద్వారా అమల్లోకి వచ్చే ఇలాంటి యోచనలు మనకు కనిపించవు. ప్రభుత్వం చేసే పనుల గురించి మంచి మాటలు అప్పుడప్పుడు మన ముందుకు వస్తుంటాయి. కానీ మన చుట్టుపక్కల ఎంతో మంది అనావృష్టిని ఎదుర్కొనేందుకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారో పరిష్కారం కోసం ఎలా కొత్త కొత్త పద్ధతులను అవలంబిస్తున్నారో మనకు గోచరిస్తుంది.
మనిషి ఎంత కష్టంలో ఉన్నప్పటికీ ఎక్కడో మంచి జరిగిందన్న ఒక శుభ వార్త అందగానే తన కష్టమంతా దూరమైయిందన్నట్టు ఊరట పొందడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఈ సారి వర్షాకాలంలో 106 శాతం నుంచి 110 శాతం వరకు ఎక్కువగా వర్షపాతం నమోదుకావచ్చునని ఎప్పుడైతే సూచన వచ్చిందో వెంటనే అందరూ ఒక శాంతి సందేశం పొందినట్టుగా ఆనందించారు. వర్షాలు కురవడానికి ఇంకా సమయం ఉన్నప్పటికీ వర్షాకాలం బాగుంటుందన్న సమాచారమే ఎంతో సంతోషాన్ని, చైతన్యాన్ని కలిగించింది. కానీ ప్రియమైన నా దేశ వాసులారా.. మంచి వర్షాలు పడతాయనే ఈ సమాచారం ఎంత ఆనందాన్ని ఇస్తుందో మనందరికీ అంతే స్థాయిలో ఒక హెచ్చరికను కూడా ఇస్తుంది. మనం ప్రతి గ్రామంలో నీటిని పొదుపుచేయడానికి ఇప్పటి నుంచే ఒక కార్యక్రమాన్ని నిర్వహించగలమా..? రైతులకు మట్టి అవసరం ఉంటుంది. పొలంలో పంట పండించేందుకు ఆ మట్టి అవసరం ఉంటుంది. ఈసారి మనం చెరువులోంచి మట్టిని తవ్వి పండించేందుకు ఆ మట్టి అవసరం ఉంటుంది. ఈసారి మనం చెరువులోంచి మట్టిని తవ్వి తీసుకెళ్లి పొలంలో ఎందుకు వేయకూడదు? పొలం కూడా బాగా పండుతుంది. పొలానికి నీటిని నిల్వ చేసుకొనే శక్తి కూడా పెరుగుతుంది. అప్పుడప్పుడు సిమెంట్ సంచులలో, అప్పుడప్పుడు ఎరువుల ఖాళీ సంచులలో రాళ్లు, మట్టి నింపి- నీళ్లు వృథాగా పోయే మార్గాల్లో వాటిని అడ్డు పెట్టి ఆ నీరు పోకుండా చేయవచ్చు. ఐదు రోజులు నీరు, ఏడు రోజులు నీరు అంతా నిలచి ఉంటే.. అది భూమిలోకి ఇంకిపోతుంది. దాంతో భూమి లోని నీటిమట్టం పైకి వస్తుంది. మన బావుల్లోకి నీరు చేరుతుంది. ఎంత నీటిని ఆపగలిగితే, అంత నీటిని ఆపి ఉంచాలి. వర్షపు నీరు, గ్రామపు నీరు గ్రామంలోనే ఉంటుంది. ఇలా మనం ఒక సంకల్పం చేసి, ఏదో ఒకటి చేస్తే.. సామాజిక ప్రయత్నం ద్వారా అంతా సంభవమే. ఈనాడు నీటికి ఎంతో కష్టంగా ఉంది. అడుగంటిపోయిన పరిస్థితి. కానీ మన వద్ద నెలన్నర రోజులు సమయం ఉంది.
నేనైతే ఎప్పుడూ చెబుతుంటాను.. మనం ఎప్పుడైనా మహాత్మా గాంధీ జన్మ స్థలమైన పోరబందర్ కు వెళితే, అక్కడ మనం చూసే అనేక ప్రదేశాలలో.. వాన నీటిని దాచి ఉంచడానికి భూమి లోపలి భాగంలో తవ్విన గుంటలను.. కూడా చూడవచ్చు; రమారమి 200 ఏళ్ల క్రితం నిర్మించారు వీటిని- వాన నీటిని నిల్వ చేయడానికి. ఈ గుంటలలో సేకరించిన నీరు ఎంత పరిశుభ్రంగా ఉండేదో.
శ్రీ కుమార్ కృష్ణ అనే ఆయన MyGovలో రాశారు.. ఒక రకమైన కుతూహలాన్ని కూడా వ్యక్తం చేశారు; ఆయనంటారు.. మన జీవిత కాలంలో గంగానది ప్రక్షాళన కార్యక్రమం సంవత్సరాల నుంచి నడుస్తోంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఇంచుమించుగా 30 సంవత్సరాల నుంచి ఆ పని సాగుతోంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఎన్నో ప్రణాళికలు రూపొందించారు. ఎంతో ఖర్చు కూడా అయింది. అందువల్ల సోదరుడు కుమార్ కృష్ణ వంటి దేశంలోని కోట్ల మంది ప్రజల్లో ఈ ప్రశ్న తలెత్తడం చాలా సహజం. ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో ఉంటారో వారికి గంగా నది మోక్షదాయిని. నేను ఈ ఆధ్యాత్మిక సత్యాన్ని ఆమోదిస్తాను. కానీ దీని కంటే ముఖ్యంగా నాకనిపిస్తుంది ఏంటంటే – గంగా నది జీవనదాయిని అని. గంగానది నుంచి మనకు అనుదినం భోజనం లభిస్తుంది. గంగ నుంచి మనకు రోజువారీ పని దొరుకుతుంది. గంగానది నుంచి మనకు బతకడానికి ఒక కొత్త శక్తి లభిస్తుంది. గంగా నది ప్రవహిస్తూ ఉంటే దేశ ఆర్థిక గతిశీలతకు కూడా ఒక కొత్త దిక్సూచి లభిస్తుంది. ఒక భగీరథుడు మనకు గంగను తెచ్చిపెట్టాడు. కానీ దీనిని కాపాడుకోవడానికి కోట్లాది భగీరథుల అవసరం ఉంది. ప్రజల భాగస్వామ్యం లేకుండా ఈ పనిలో మనం ఏనాటికీ సఫలం కాలేము. అందువల్ల ప్రతి ఒక్కరికీ శుభ్రత కోసం, స్వచ్ఛత కోసం మార్పు తీసుకొచ్చే ఒక దూతగా మారవలసి ఉంటుంది. మళ్లీమళ్లీ ఇదే విషయాన్ని చెప్పాలి, చర్చించాలి. ప్రభుత్వం తరఫు నుంచి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయి. గంగా తీరం వెంబడి ఉన్న రాష్ట్రాలన్నింటి నుంచి పూర్తి సహకారం తీసుకునేందుకు కూడా ప్రయత్నం జరుగుతోంది. ఇందులో సామాజిక సంస్థలకు, స్వచ్ఛంద సంస్థలకు కూడా పాత్ర కల్పిస్తున్నాం. ఉపరితల పరిశుభ్రత, పారిశ్రామిక కాలుష్యాన్ని ఆపేందుకు అనేక చర్యలు తీసుకుంటున్నాం. ప్రతి రోజూ గంగా నదిలోకి కాల్వల ద్వారా పెద్ద మొత్తంలో చెత్తాచెదారం వచ్చి చేరుతుంది. ఇటువంటి చెత్తను శుభ్రం చేసేందుకు వారణాసి, అలహాబాద్, కాన్పూర్, పట్నా మొదలైన చోట్ల ఉపరితలం మీద తేలుతుండే చెత్తను తీసివేసే పని జరుగుతోంది. అన్ని స్థానిక సంస్థలకు ఈ విషయాన్ని వివరించి, ఎక్కడికక్కడ చెత్తను శుభ్రం చేయవలసిందిగా కోరడం జరిగింది. ఎక్కడైతే ఈ పరిశుభ్రత కార్యక్రమం జరుగుతుందో, అక్కడ రోజుకు 3 టన్నుల నుంచి 11 టన్నుల వరకు చెత్త వెలికి వస్తోందని తెలిసింది. అంటే ఆ మేరకు మురికిని వ్యాపించకుండా ఆపగలిగినట్లే కదా. రానున్న రోజులలో మరిన్నిచోట్ల ట్రాష్ స్కిమ్మర్లు పెట్టించే ఆలోచన ఉంది. ఇందువల్ల కలిగే లాభం గంగ, యమున నదుల ఒడ్డున ఉండే వారికి తక్షణమే అనుభవంలోకి వస్తుంది.
పారిశ్రామిక కాలుష్యం మీద నియంత్రణ కోసం కాగితం, చక్కెర పరిశ్రమలతో కలసి ఒక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేశాం. కొన్నిచోట్ల అది ప్రారంభం కూడా అయ్యింది. దీని ద్వారా కూడా మంచి ఫలితాలు వస్తాయని నాకు అనిపిస్తోంది. ఉత్తరాఖండ్, ఉత్తర ప్రదేశ్లలో డిస్టిల్లరీల నుంచి వచ్చే వ్యర్థ పదార్థాలను పూర్తిగా నియంత్రించగలిగామని కొందరు అధికారులు నాకు చెప్పారు. కాగితం పరిశ్రమ నుంచి వచ్చే కాలుష్యం కూడా దాదాపు ఆగిపోయినట్లు. మనందరం సరైన దిశలో ముందుకు వెళ్తున్నామని, ఒక జాగృతి కలిగిందని దీనివల్ల తెలుస్తోంది. కేవలం గంగా నది ఒడ్డున నివసించేవారే కాదు.. సుదూరంగా దక్షిణ ప్రాంతాల్లోని వారు కూడా అడుగుతుంటారు గంగానది ప్రక్షాళన జరుగుతుంది కదా ప్రధాన మంత్రి గారు అని. ఈ జన సామాన్యంలో ఉన్న విశ్వాసమే, నమ్మకమే గంగా నది ప్రక్షాళనలో మనకు సత్ఫలితాలు తెచ్చిపెడుతుందని నేను భావిస్తున్నాను. గంగా ప్రక్షాళన కార్యక్రమం కోసం ప్రజలు విరాళాలు కూడా ఇస్తున్నారు. అలాగ ఈ ప్రయత్నం ఎంతో శ్రద్ధగా నడుస్తోంది.
ప్రియమైన నా దేశ వాసులారా.. ఈరోజు ఏప్రిల్ 24. భారతదేశంలో ఈరోజును పంచాయతీ రాజ్ దినంగా జరుపుకొంటున్నాం. దేశంలో పంచాయతీ రాజ్ వ్యవస్థ ఇదే రోజు అమలులోకి వచ్చింది. పంచాయతీ రాజ్ వ్యవస్థ క్రమంగా యావత్తు దేశానికి విస్తరించింది. ఇంకా ఇది మన ప్రజాస్వామిక వ్యవస్థలో ఒక ముఖ్యమైన భాగంగా మారి, విజయవంతంగా పని చేస్తోంది కూడాను.
ఏప్రిల్ 14న బాబాసాహెబ్ అంబేడ్కర్ 125వ జయంతిని మనం జరుపుకొన్నాం. ఈ రోజు 24 ఏప్రిల్ – పంచాయతీ రాజ్ దినం జరుపుకొంటున్నాం. ఇదెంత శుభపరిణామం అంటే, భారత రాజ్యాంగం ఇచ్చిన మహాపురుషుని జన్మదినం మొదలు.. 24వ తారీఖు రాజ్యాంగంలో అత్యంత పటిష్టమైన భాగం. మన పల్లెలు.. రెంటినీ కలిపే ప్రేరణ. అందుకే రాష్ట్ర ప్రభుత్వాలతో కలసి కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 14 నుంచి 24 వరకు పది రోజుల పాటు ‘గ్రామ ఉదయ్ సే భారత్ ఉదయ్’ అవగాహనా కార్యక్రమాన్ని తీసుకొంది.
బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి నాడు బాబాసాహెబ్ జన్మస్థానం ‘మహు’ కు వెళ్లే అవకాశం నాకు దక్కడం నా అదృష్టం. ఆ పవిత్ర భూమికి నమస్కరించే అవకాశం దక్కింది. ఇంకా ఈరోజు 24వ తారీఖున ఎక్కడైతే గిరిజన సోదర సోదరీమణులు ఎక్కువగా నివసిస్తున్నారో.. ఆ జార్ఖండ్ రాష్ట్రానికి వెళ్లి పంచాయతీరాజ్ దినోత్సవాన్ని జరుపుకోబోతున్నాం. మధ్యాహ్నం 3 గంటలకు మళ్లీ ఓసారి పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దేశంలో పంచాయతీలన్నింటితో మాట్లాడబోతున్నాను. ఈ కార్యక్రమం చాలా పెద్ద అవగాహనను కల్పించే పనిచేసింది. హిందుస్థాన్ మూలమూలలా ఉన్న గ్రామస్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థను పటిష్టం చేయడం ఎలా..? గ్రామాలు తమ అభివృద్ధికి కావలసిన పథకాలు స్వయంగా తామే ఎలా రూపొందించుకోవాలి… అనే అవగాహన ఇచ్చింది. మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఉన్నట్లే సామాజిక మౌలిక సదుపాయాలకూ ప్రాధాన్యత ఉండాలి. గ్రామంలో పాఠశాల నుంచి డ్రాపవుట్లు ఉండకూడదు. ‘బేటీ బచావో – బేటీ పఢావో’ కార్యక్రమం విజయవంతంగా నడవాలి. ఆడ పిల్ల జన్మదినం గ్రామమంతటికీ మహోత్సవం కావాలి. ఇలాంటివి ఎన్నో పథకాలు. కొన్ని గ్రామాల్లో అయితే ఆహారం విరాళంగా ఇచ్చే కార్యక్రమాలు కూడా జరిగాయి. దేశంలోని ఇన్ని గ్రామాలలో ఇన్ని రకాల కార్యక్రమాలు పది రోజుల పాటు జరగడం చాలా అరుదైనది. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాలు, గ్రామ సర్పంచులందరికీ హార్దిక అభినందనలు చెబుతున్నాను. మౌలిక పద్ధతుల్లో కొత్తదనం తెచ్చారు. గ్రామ మంచి కోసం, గ్రామాభివృద్ధి కోసం, ప్రజాస్వామ్య పటిష్టత కోసం ఎన్నో పనులు ఈ ఒక సందర్భంగా మార్చేశారు. గ్రామాలలో ఏ చైతన్యమైతే వచ్చిందో.. అదే భారత ప్రగతికి హామీగా ఉంటుంది. భారత ప్రగతికి ఆధారం గ్రామాల ప్రగతే. అందుకే మనమంతా గ్రామ ప్రగతిని బలోపేతం చేస్తూ ఉంటే ఆశించిన పరిణామాన్ని పొంది తీరుతాం.
ముంబై నుంచి శర్మిలా ధార్పురే – ఆమె ఫోన్ ద్వారా తన ఆందోళన వ్యక్తం చేశారు.. (ఆమె మాటలు..)
”ప్రధాన మంత్రి గారు.. నమస్కారం. నేను ముంబై నుంచి శర్మిలా ధార్పురేను మాట్లాడుతున్నాను. మీకు పాఠశాల, కళాశాల విద్య గురించిన ప్రశ్న ఇది. విద్యారంగంలో గత చాలా ఏళ్లుగా ప్రక్షాళనకు అవసరం ఏర్పడింది. పాఠశాలలు గానీ, కళాశాలలు గానీ తగినన్ని లేకపోవడం, లేదా ఇంకా విద్య నాణ్యత లేకపోవడం.. ఎలా ఉందంటే.. పిల్లలు విద్యను పూర్తిచేస్తూనే ఉన్నారు. కానీ, చాలా సార్లు వారికి మౌలిక అంశాల గురించి కూడా తెలియడం లేదు. దీని వల్ల ప్రపంచ పోటీలో మన పిల్లలు వెనుకబడిపోతారు. దీని గురించి మీ ఆలోచన ఏమిటి.. ఈ రంగంలో ఏ రకంగా దిద్దుబాటు తీసుకురావాలనుకుంటున్నారు..?
దీని గురించి దయచేసి మాకు చెప్పండి” అని.
శర్మిలాజీ, మీ ఆందోళన ఎంతో సహజమైనది. ఇప్పుడు ప్రతి కుటుంబంలో తల్లితండ్రులకు ఒకవేళ ఏదైనా స్వప్నం ఉంటుందంటే, అది పిల్లలను బాగా చదివించడమే అవుతుంది. ఇల్లు వాకిలి, వాహనం.. ఇవన్నీ ఆ తరువాతే వస్తాయి. భారతదేశం వంటి దేశంలో అయితే ఇదే ప్రతి ఒక్కరి భావన. ఇదే చాలా పెద్ద బలం కూడా. పిల్లలను చదివించడం.. అదీ బాగా చదివించడం, మంచి విద్య లభించడం గురించిన ఆందోళన చెందడం.. ఇది ఇంకా పెరగాలి. ఇంకా దాని గురించిన మరింత అవగాహన రావాలి. ఇంకా నేనేమనుకుంటానంటే – ఈ అవగాహన ఏ కుటుంబాలలో ఉంటుందో, దాని ప్రభావం పాఠశాలల పైన పడుతుంది. ఉపాధ్యాయుల మీదా వస్తుంది. నేను దేని కోసం స్కూలుకు వెళ్తున్నాను అని పిల్లలు కూడా అప్రమత్తమవుతారు. అందుకే తల్లితండ్రులు, అలానే ఈ విషయం గురించి ఆలోచించే అందరినీ, ముందుగా నేను కోరేది ఏమిటంటే- స్కూల్లో జరిగే అన్ని అంశాల గురించి విస్తృతంగా పిల్లలతో మాట్లాడండి. ఏదైనా విషయం మీ దృష్టికి వస్తే, స్వయంగా బడికి వెళ్లి ఉపాధ్యాయులతో మాట్లాడండి. ఈ నిఘా వ్యవస్థ మన విద్యా వ్యవస్థలో చాలా లోటుపాట్లను తగ్గించగలుగుతుంది. దీనిని సాధించుకోవడంలో ప్రజల భాగస్వామ్యం పాత్ర ఎంతగానో ఉంది.
మన దేశంలో ప్రతి ప్రభుత్వం విద్యా రంగానికి ప్రాధాన్యత నిచ్చింది. కానీ ప్రతి ప్రభుత్వం – తనదైన పద్ధతుల్లో కృషి చేసింది కూడా. చాలా సమయం వరకు మన దృష్టి విద్యావ్యవస్థను నిలబెట్టడం పైనే ఉందన్నది కూడా వాస్తవం. విద్యా వ్యవస్థను విస్తరించడం, స్కూళ్లు పెట్టడం, కళాశాలలు ఏర్పాటు చేయడం, టీచర్లను భర్తీ చేయడం, ఎక్కువ మంది పిల్లలు పాఠశాలలకు వచ్చేలా చేయడం – అంటే ఒక రకంగా విద్యను నలు దిశలా వ్యాపింజేసే ప్రయత్నం జరిగింది. అదే ప్రాధాన్యతగా ఉంది. అది అవసరం కూడా. కానీ ఇప్పుడు విస్తరణకు ఎంత ప్రాధాన్యముందో, అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత విద్యా రంగంలో దిద్దుబాటుకు ఏర్పడింది. విస్తరించే పెద్ద పని మనం పూర్తిచేశాం. ఇప్పుడు మనం నాణ్యమైన విద్యపై దృష్టి పెట్టి తీరాల్సిందే. సాక్షరతా అభియాన్ నుంచి మంచి విద్యను మన మౌలిక అవసరంగా మార్చుకోవాల్సివుంది. ఇప్పటివరకు లెక్కలు ‘ఔట్లే’ గా ఉంటుండేవి. ఇప్పుడు ఔట్‌కమ్ ఫలితాల పైనే దష్టి సారించాల్సి వుంది. ఇప్పటి వరకు స్కూలుకు ఎంత మంది వచ్చారు అన్న దాని పైనే దృష్టి ఉండేది. ఇప్పుడు స్కూలింగ్ కంటే ఎక్కువగా నేర్చుకోవడం (లెర్నింగ్)పై శ్రద్ధ తీసుకోవాలి. స్కూలులో చేర్చడం.. చేర్చడం. ఈ మంత్రం నిరంతరం జపిస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు స్కూలులో చేరిన పిల్లలకు మంచి విద్య.. యోగ్యమైన విద్య.. దీనిపై మన దృష్టి కేంద్రీకృతం కావాలి. ప్రస్తుత ప్రభుత్వ బడ్జెటును మీరు చూశారు కదా. విద్యను బలోపేతం చేసే ప్రయత్నం జరుగుతోంది. మనం ఇందులో చాలా దూరం ప్రయాణించాల్సి ఉందన్నది వాస్తవమే. కానీ మనం.. 125 కోట్ల మంది దేశ ప్రజలం.. నిర్ణయించుకుంటే సుదూర ప్రయాణం కూడా చేసేయ్యగలం. కానీ శర్మిలాజీ మాట నిజమే. ఆసాంతం దిద్దుబాటు తీసుకురావడం అవసరం.
ఈసారి బడ్జెటులో మీరు చూసే ఉంటారు – మేం మూస పద్ధతికి భిన్నంగా పని చేశాం. పది ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు, పది ప్రైవేట్ విశ్వవిద్యాలయాలను ఈసారి బడ్జెట్లో ప్రభుత్వ బంధనాల నుంచి విముక్తి చేసి మరింత సవాళ్లతో కూడిన మార్గం ద్వారా రావాలని వాటికి చెప్పాం. మీరు అత్యుత్తమ విశ్వవిద్యాలయం కావడానికి మీరేం చేస్తారో చెయ్యమన్నాం. వాటికి స్వతంత్ర ప్రతిపత్తిని ఇచ్చేందుకు ఆ కార్యక్రమాన్ని తీసుకొన్నాం. భారత విశ్వవిద్యాలయాలు కూడా విశ్వ పోటీని ఎదుర్కోగలవి కాగలవు, అలా అవ్వాలి కూడా. దీనితో పాటు విద్యకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో.. అంతే ప్రాధాన్యత నైపుణ్యానికీ ఉంది. అలాగే విద్యలో సాంకేతిక పరిజ్ఞానం చాలా పెద్ద భూమికనే పోషిస్తుంది. దూర విద్య, సాంకేతిక పరిజ్ఞానం – ఇవి మన విద్యావ్యవస్థను సరళతరమూ చేస్తాయి. ఇంకా చాలా తొందరలోనే వాటి ఫలితాలు కనిపిస్తాయని నా విశ్వాసం.
చాలా రోజులుగా ఒక విషయం మీద ప్రజలు నన్ను అడుగుతూ వస్తున్నారు. కొందరు నా వెబ్‌పోర్టల్ mygov.in మీద రాస్తూ ఉంటారు. ఇంకొందరు నాకు NarendraModiApp మీద రాస్తూ ఉంటారు. అందులోనూ యువతీ యువకులు ఎక్కువగా రాస్తారు.
సౌండ్ బైట్-
”ప్రధాన మంత్రి గారు, నమస్కారం.. నేను మోనా కర్ణవాల్ ను మాట్లాడుతున్నాను బిజ్ నోర్ నుంచి. ఇప్పటి తరంలో యువజనులకు చదువుకోవడంతో పాటు.. క్రీడలకు కూడా చాలా ప్రాముఖ్యం ఉంది. వారిలో టీం స్పిరిట్ భావన కూడా ఉండాలి. అలాగే మంచి నాయకులయ్యే గుణం కూడా ఉండాలి. అప్పుడే వారి వ్యక్తిత్వ వికాసం సాధ్యం అవుతుంది. దీన్ని నా అనుభవంతో చెబుతున్నాను. ఎందుకంటే – స్వయంగా నేను భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో ఉన్నాను . నా జీవితం మీద అది ఎంతో మంచి ప్రభావాన్ని చూపించింది. యువతీయవుకులను మీరు ఎక్కువగా చైతన్యపర్చాలని కోరుకుంటున్నాను. ప్రభుత్వం కూడా ఎన్ సిసి , భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను.”
మీరు ఎన్ని సూచనలు ఇస్తున్నారంటే, మీ అందరితో మాట్లాడే ముందు.. వీళ్లతో మాట్లాడాలనిపించింది. మీ అందరి ఒత్తిడి, మీ అందరి సూచనలు, వీటన్నిటి పరిణామం ఏమైందంటే ఎన్ సిసి, ఎన్ ఎస్ ఎస్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, రెడ్ క్రాస్ ప్రముఖులు, నెహ్రూ యువ కేంద్ర ముఖ్యులు ఉండేలా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశాను. ఇంతకు ముందు ఎప్పుడు సమావేశమయ్యారని అడిగితే, వాళ్లు ఏమన్నారంటే – దేశ స్వాతంత్ర్యం వచ్చాక ఇలాంటి సమావేశం జరగడం ఇదే మొదటి సారి అని చెప్పారు. అందుకే ఈ పనులన్నింటి విషయంలో నాపై ఒత్తిడి తెచ్చిన యువ మిత్రులకు నేను ముందుగా అభినందనలు చెబుతాను. వారి కారణంగానే నేను సమావేశం పెట్టాను. అలా చేయడం మంచికే జరిగిందని అనిపించింది. ఎంతో సమన్వయం అవసరం కన్పించింది నాకు. వాళ్ల వాళ్ల పద్ధతుల్లో చాలా చేస్తున్నారు. కానీ ఒకవేళ సామూహిక రంగంలో సంఘటితంగా మన విభిన్న పద్ధతులను సంఘటితం చేసి పనిచేస్తే ఎంత పెద్ద ఫలితం చూడగలమో. దాని విస్తృతి ఎంతో ఎక్కువో. ఎన్ని కుటుంబాలను అది స్పృశించగలదో. దాని విస్తృతిని చూసిన తరువాత నాకు పెద్ద పరిష్కారమే లభించింది. దాని ఘనత కూడా ఎక్కువే. ఏదో ఒకటి చెయ్యాలి. ఇంకా నేను స్వయంగా ఎన్ సిసి కేడెట్‌గా ఉన్నానన్న మాట వాస్తవం. అందుకే ఇలాంటి సంఘటిత వ్యవస్థల వల్ల ఒక కొత్త దృష్టికోణం దొరుకుతుందని నాకు తెలుసు. ప్రేరణ లభిస్తుంది; ఒక జాతీయ దృక్పథం పెరుగుతుంది. నాకైతే ఆ లాభం చిన్నతనంలో లభించనే లభించింది. ఈ సంస్థలలో ఒక నవజీవం నింపాలని కూడా నేననుకుంటాను. కొత్త శక్తిని నింపాలి. ఈసారి వారి ముందు ఏదో విషయాన్ని ఉంచాను. నేను చెప్పాను చూడండి. ఈ సీజన్లో జల సంరక్షణ పెద్ద ఎత్తున ఎందుకు చేయకూడదు..? మనం కృషి చేసి ఎన్ని బ్లాకులు, ఎన్ని జిల్లాలలో బహిరంగ మల విసర్జనను మాన్పించగలం..? ఈ ప్రదేశాలను బహిరంగ మల విసర్జన రహిత ప్రదేశాలుగా చేయగలమా..? దేశాన్ని ఏకం చేయడానికి ఎలాంటి కార్యక్రమాన్ని రూపొందించగలం. ఈ సంస్థలన్నింటికీ ఉమ్మడి యువ గీతాన్ని పెట్టుకోగలమా.. ఇలాంటి ఎన్నో చర్చలు వారితో జరిగాయి.
ఇవాళ, నేను మీకందరికీ ఒక విన్నపం చేస్తున్నాను. దయచేసి ఈ యువజన సంస్థలకు పక్కాగా ఉండే ఉపాయాలను సూచించండి. వారి పనితీరులోను, వారి కార్యక్రమాలలోను ఏదైనా ఒక కొత్తదనాన్ని మనం జత చేయాలా? మీరు నాకు నా NarendraModiApp మీద రాస్తే, నేను వాటిని సరైన చోటుకు పంపిస్తాను. ఇంకా ఈ సమావేశం అనంతరం వారు ఒక కొత్త వేగాన్ని అందుకోగలుగుతారని నేను భావిస్తున్నాను. ఇక, మీరు కూడా వారితో కలసి పనిచేయాలని కోరుకుంటారు.
ప్రియమైన నా దేశ వాసులారా.. ఈ రోజు మనందరినీ ఆలోచింపజేసే విషయం చెప్పాలి. దీనిని మనల్నందరినీ పునరాలోచింపజేసే విషయంగా కూడా పరిగణిస్తారు. మీరు చూసే ఉంటారు; దేశ రాజకీయ స్థితిగతులు ఎలాంటివంటే – గత కొన్ని ఎన్నికల్లో ఈ విషయం గురించి చర్చ జరుగుతూ ఉండేది. ఏ పార్టీ ఎన్ని గ్యాస్ సిలిండర్లు ఇస్తోంది. 12 సిలిండర్లా.. లేక 9 సిలిండర్లా.. అనేది ఎన్నికల్లో పెద్ద చర్చనీయాంశం అయ్యేది. అలాగే మధ్య తరగతి సమాజాన్ని ఎన్నికల దృష్టితో అందుకోవాలంటే గ్యాస్ సిలిండర్ పెద్ద అంశం అని రాజకీయ పార్టీలకు అనిపిస్తూ ఉండేది. ఇంకో వైపు రాయితీలు తగ్గించాలని ఆర్థిక శాస్త్రవేత్తల ఒత్తిడి ఉండేది. ఆ కారణంగానే ఎన్నో కమిటీలు ఏర్పాటయ్యాయి. ఆ కమిటీలకు వంట గ్యాస్ రాయితీని తగ్గించడంపైన పలు ప్రతిపాదనలు అందేవి. గ్యాస్ సబ్సిడీని తగ్గించాలనే అంశంపైన సలహాలు వచ్చేవి. ఈ కమిటీల పై కోట్లాది రూపాయలు ఖర్చయ్యేది. కానీ విషయం ఎక్కడిది అక్కడే ఉండిపోయేది. ఇది ప్రతి ఒక్కరికీ అనుభవంలోనిదే. ఎవ్వరూ దీనికి మించి ఆలోచించనే లేదు.
ఈ రోజు, ప్రియమైన నా దేశ వాసులారా, ఈ విషయంలో నా సొంత విషయాన్నే మీ ముందు ఉంచడానికి నాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను మూడో మార్గాన్ని ఎంచుకొన్నాను. మూడో మార్గం ఏదంటే, ప్రజలు, సామాన్య జనం మీద విశ్వాసాన్ని ఉంచడం. కొన్ని సార్లు రాజకీయ నాయకులు తమ మీద నమ్మకం పెట్టుకోవడం కంటే తమ ప్రజల పైన నమ్మకం పెట్టుకోవాలి. మనం ప్రజలలో ప్రగాఢ నమ్మకాన్ని ఉంచాలి. నేను ఒకసారి అన్నాను కదా.. మీరు ఏడాదికి ఒక 1500- 2000 రూపాయల ఖర్చును భరించగలిగే పక్షంలో, మీ గ్యాస్ సబ్సిడీని ఎందుకు విడిచిపెట్టరు? అని. ఇది పేద కుటుంబాలకు ఉపయోగపడవచ్చు. నేను ఆ మాటలు యథాలాపంగా చెప్పినవే, అయినా.. ఈ విషయంలో నేను ఈరోజు సగర్వంగా చెప్పగలుగుతున్నాను. నా దేశ వాసులు నా నమ్మకాన్ని వమ్ము చేయలేదు. ఒక కోటి కుటుంబాలు స్వచ్ఛందంగా తమ గ్యాస్ సబ్సిడీని సరెండర్ చేశాయి. ఈ కోటి కుటుంబాలు సంపన్న కుటుంబాలు కావు. ఒక రిటైర్ అయిన టీచర్, రిటైరైన గుమాస్తా, రైతు లేదా చిన్న దుకాణం నడుపుకొనే వారు.. ఇలా మధ్య తరగతి వారు, దిగువ మధ్య తరగతి వారు, వీరు తమ సబ్సిడీని విడిచిపెట్టారు. పైగా సబ్సిడీని వదులుకోవడం ఎంతో తేలిక కూడా. మొబైల్ ఫోన్లో యాప్ ద్వారా చేయవచ్చు. ఆన్లైన్ లో చేయవచ్చు. టెలిఫోన్ నంబరుకు మిస్ డ్ కాల్ ఇచ్చి కూడా సబ్సిడీని విడిచిపెట్టవచ్చు. ఇలా బోలెడు పద్ధతులు ఉన్నాయి. కానీ పరిశీలిస్తే తెలిసిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే – సబ్సిడీని వద్దనుకున్న కోటి కుటుంబాలలోను 80 శాతం కంటే ఎక్కువ మంది పంపిణీదారు వద్దకు వెళ్లి, వరుసలో నిలబడి మరీ తాము సబ్సిడీని సరెండర్ చేయదల్చుకొన్నామంటూ రాతపూర్వకంగా సమాచారమిచ్చారని అంచనా వేయడం జరిగింది.
ప్రియమైన నా దేశ వాసులారా, ఇది చిన్న విషయం ఏమీ కాదు. ప్రభుత్వం ఎప్పుడన్నా ఒక పన్నులో రాయితీ, లేదా మినహాయింపు ఇస్తే వారం రోజుల పాటు టీవీలో, పత్రికలలో ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ వార్తల పరంపర వస్తుంది. కానీ ఇది చూడండి. ఒక కోటి కుటుంబాలు సబ్సిడీని వదులుకున్నాయి. మన దేశంలో ఒక విధంగా ఒక హక్కుగా మారిన సబ్సిడీని ఈ కుటుంబాలు విడిచిపెట్టాయి.
నేను ఆ కోటి కుటుంబాల వారికి శత సహస్ర ప్రణామాలు చేస్తున్నాను.. వారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే, వారు రాజకీయ నాయకులు కొత్తగా ఆలోచించేలా చేశారు. ఈ ఒక్క విషయం మన దేశంలో ఆర్ధిక శాస్త్రవేత్తలు కూడా భిన్నంగా ఆలోచించేలా చేసింది. ఇలా చేస్తే.. అలా జరుగుతుంది. ఇటువంటి ప్రయత్నంలో అటువంటి ఫలితం వస్తుంది అని ఆర్థిక సమీకరణాలు, లెక్కలు, గుణింతాలు వేసే ఆర్థిక నిపుణులు కూడా తమ పరిధి దాటి ఆలోచించేలా చేసింది ఈ సబ్సిడీని విడిచిపెట్టే పర్వం. ఈ విషయంలో ఎప్పుడో ఒకప్పుడు లోతుగా ఆలోచించాలి. ఒక కోటి కుటుంబాలు సబ్సిడీని వదులుకొన్నందుకు బదులుగా మరొక కోటి పేద కుటుంబాలకు గ్యాస్ సిలిండర్లు లభించడం. సబ్సిడీ వదలుకోవడం వల్ల డబ్బు మిగిలింది అన్నది బయటి నుంచి చూసే వారికి పెద్ద చెప్పుకోదగ్గ విషయం కాదు. కానీ ప్రజల పైన విశ్వాసంతో పనిచేస్తే, ఎంత పెద్ద ఫలితమైనా సాధించగలమన్నది అసాధారణమైన పాఠం.
రాజకీయ శ్రేణులన్నింటికీ ప్రత్యేకంగా నాదొక విజ్ఞప్తి. ప్రజల పైన నమ్మకం ఉంచాలన్న విషయాన్ని కచ్చితంగా ఒకసారి ప్రస్తావించండి. ఇలాంటి ఫలితాలు మనకి లభిస్తాయి అని మీరు అసలు ఊహించి ఉండరు. మనం ఈ దిశలోనే ముందుకు సాగాలి. నాకు ఇంకో విషయం పదేపదే స్ఫురణకు వస్తుంటుంది. 3వ తరగతి, 4వ తరగతి ఉద్యోగార్థులను ఎందుకు ఇంటర్వ్యూ చేయడం..? పరీక్ష రాసి, మార్కుల జాబితాను సమర్పిస్తున్న వ్యక్తిని మనం నమ్మాలి.
కొన్ని సార్లు నాకు ఇంకొకటి అనిపిస్తుంది.. రైలు ప్రయాణాలలో కొన్ని మార్గాలలో ఎవరూ టికెట్ తనిఖీ చేసే వారు ఉండరని ప్రకటిద్దాం. దేశ ప్రజల పైన భరోసా ఉంచుదాం. ఇలా ఎన్నో రకాల ప్రయోగాలు చేయవచ్చు. ఒక్కసారి అలాంటి నమ్మకం పెట్టుకుంటే, తిరుగులేని ఫలితాలు లభిస్తాయి. సరే, ఇవి నా మనసులో ఆలోచనలు, వీటిని ప్రభుత్వ నిబంధనలుగా మార్చలేం కదా. కానీ ఇటువంటి వాటికి వీలు ఉండే వాతావరణాన్ని కల్పించవచ్చు. ఈ సానుకూల వాతావరణాన్ని రాజకీయ నాయకులు కాదు.. మన దేశంలో కోటి కుటుంబాలే కల్పించాయి.
రవి అనే వ్యక్తి ఒకరు నాకు ఒక లేఖను రాశారు.. ”ప్రతి రోజు శుభవార్తే.. అంటూ ఆయన ఇంకా ఇలా రాశారు.. దయచేసి ప్రతి రోజూ ఏదన్నా ఒక మంచి సంఘటనను గురించి పోస్ట్ చేయమని మీ అధికారులను ఆదేశించండి అంటున్నారు ఆయన. ప్రతి వార్తాపత్రికలోను, టీవీ ఛానల్ లోను బ్రేకింగ్ న్యూస్ అంటే అన్నీ దుర్వార్తలే ఉంటున్నాయి. 125 కోట్ల మంది జనాభా ఉన్న ఈ దేశంలో మన చుట్టుపక్కల అసలు మంచి విషయమేదీ జరగడమే లేదా..? ఈ పరిస్థితిని మార్చండి” అని.
రవి గారు తన కోపాన్ని వ్యక్తం చేశారు. కానీ, ఆయన ఆగ్రహం నా మీద కాదు.. ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల మీద అని నేను అనుకుంటున్నాను. మీకు గుర్తుండే ఉంటుంది, మన పూర్వ రాష్ట్రపతి డాక్టర్ ఎ.పి.జె. అబ్దుల్ కలామ్ ఎప్పుడు చెప్తుండే వారు- ”దయచేసి వార్తాపత్రిక మొదటి పేజీలో కేవలం మంచి వార్తలే అచ్చు వేయాలి” అని. ఆయన ఇదే సంగతిని ప్రతి సారి మళ్లీ మళ్లీ చెప్తుండే వారు.
కొద్ది రోజుల క్రితం ఒక వార్తాపత్రిక నాకో ఉత్తరం రాసింది.. ”ప్రతి సోమవారం మేము ఎటువంటి చెడ్డ వార్తలను కాకుండా కేవలం మంచి వార్తలను మాత్రమే ఇస్తాం అని నిర్ణయించుకొన్నాం’’ అనేది అందులోని సారాంశం. ఈ రోజులలో కొన్ని టి.వి. ఛానల్స్ మంచి వార్తల కోసం కొంత సమయాన్ని కేటాయిస్తున్నాయని నేను గమనించాను.
సానుకూలమైన వార్తలకు అంతటా ఒక వాతావరణం ఏర్పడిందని చెప్పడం సరైందే. మంచి వార్తలు, సరైన వార్తలు ప్రజలకు అందడం అవసరమని ప్రతి ఒక్కరికీ అనిపిస్తోంది. ఎంత గొప్ప వ్యక్తి అయినా.. ఎంత ఉత్తమోత్తమమైన మాట మాట్లాడినా.. ఎంత అద్భుతమైన పద్ధతిలో చెప్పినా.. ఆ మాటలకు ఒక శుభ వార్త కంటే ఎక్కువ శక్తి, ప్రభావం ఉంటాయని అనలేము. ఒక మంచి వార్త మనల్ని మంచి పని చేసేలా ప్రేరేపించే శక్తిని కలిగి ఉంటుంది.
అందువల్ల మనం మంచికి బలం చేకూరుస్తామో.. అక్కడ చెడుకు సహజంగానే స్థానం లేకుండా పోతుంది. ఒక దీపం వెలిగిస్తే చీకటి తొలగిపోతుంది. తొలగి తీరుతుంది. మీకు తెలిసే ఉంటుంది. ప్రభుత్వం transforming india అనే ఒక వెబ్సైట్ ను నడిపిస్తోంది. ఈ వెబ్సైట్లో అన్ని సానుకూలమైన వార్తలే ఉంటాయి. అంటే ప్రభుత్వం వైపు నుంచే కాదు.. ప్రజల నుంచి కూడా మంచి వార్తలు, కథనాలు అందులో ఉంటాయి. అంతే కాదు.. మీకు ఏదైనా మంచి విషయాలు తెలిస్తే మీరు కూడా మీకు సంబంధించిన మంచి వార్తలు పంపవచ్చు.
రవి గారు, మీరు ఎంతో మంచి సూచన చేశారు; కానీ, దయచేసి నా మీద అంత కోపం వద్దండి. ఏదైనా సకారాత్మకమైనది చేయడానికి, సకారాత్మకమైన మాటలు మాట్లాడడానికి, సకారాత్మకమైన విషయాలను వ్యాప్తి లోకి తీసుకు రావడానికి మనం కలసి పాటు పడవలసివుంది.
మన దేశంలో చెప్పుకోదగ్గ విశేష ఉత్సవం ‘కుంభ మేళ’. కుంభ మేళ పర్యాటక పరంగా కూడా ఒక ఆకర్షణగా నిలుస్తోంది. ఇన్నిరోజుల పాటు కోట్లాది మంది ఒక నదీ తీరంలో చేరి, పవిత్ర స్నానాలు చేస్తారని ప్రపంచంలో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ప్రశాంతమైన, శాంతిపూర్వకమైన వాతావరణంలో ఈ ఉత్సవం ముగియాలి. నిర్వహణ దృష్ట్యా.. ఉత్సవ ఏర్పాట్ల దృష్ట్యా.. ప్రజల భాగస్వామ్యం దృష్ట్యా.. ఇటువంటి ఉత్సవాలు అతి భారీ స్థాయిలో కొత్త ప్రమాణాలను నిర్దేశిస్తాయి, సాధిస్తాయి. గత కొద్ది రోజులుగా చాలా మంది సింహస్థ కుంభ్ మేళా ఫొటోలను అప్లోడ్ చేయడం నేను గమనించాను. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పర్యాటక సంస్థలు ఒక ఛాయాచిత్ర పోటీని నిర్వహించాలని నేను భావిస్తున్నాను. మంచి ఫొటోలు తీసి, అప్లోడ్ చేసేటట్లు ప్రజలను ప్రోత్సహించాలి. ఇటువంటి ఫొటోలతో ఒక్కసారి ఉత్తేజకరమైన వాతావరణం, చైతన్యం ఏర్పడి.. కుంభ మేళాలో అడుగు అడుగునా ఎంత వైవిధ్యం నెలకొని ఉందో.. ఎంత అద్భుతమైన సంగతులు జరుగుతున్నాయో తెలుస్తుంది. ఇది తప్పనిసరిగా చేయాలి.
ఇటీవల మధ్య ప్రదేశ్ ముఖ్యమంత్రి నన్ను కలిశారు. మనం స్వచ్ఛత ను గురించిన సందేశాలను ఇస్తున్నాం. కానీ, అది ఉన్న చోట పాటించడమే కాదు.. మనం ఎక్కడకు వెళితే అక్కడకు ఆ సందేశాన్ని మోసుకుపోవాలని, ప్రజలకు చెప్పాలి అని అన్నారు ఆయన. కుంభ మేళ మతపరమైన, ఆధ్యాత్మికమైన ఉత్సవమే అయినప్పటికీ – మనం దానిని ఒక సామాజిక సందర్భంగా కూడా భావించాలి. కొన్ని పద్ధతులు పాటించే సందర్భంగా మార్చుకోవాలి. ఈ ఉత్సవాల్లో మనం మంచి సంకల్పాలు, మంచి అలవాట్లు సొంతం చేసుకుని వాటిని ఆ తరువాత గ్రామ గ్రామాలలో ప్రచారం చేసే బాధ్యతను వహించవచ్చు. నీరు అంటే ప్రేమ ఎలా పెరగాలి.. జలం పట్ల విశ్వాసం ఎలా పెరగాలి.. నీటి సేకరణ, నిల్వ ఎలా జరపాలి.. ఎలా వినియోగించుకోవాలనే సంగతులను మనం కుంభ మేళ ద్వారా ఈ మేళా సందర్భంగా నేర్చుకోవచ్చు. ఈ కుంభ మేళా అనే సందర్భాన్ని ఈ లక్ష్యంతో ఎలా ఉపయోగించుకోవచ్చో ఆలోచించాలి.
ప్రియమైన నా దేశ వాసులారా… పంచాయతీ రాజ్ దినం వంటి ముఖ్యమైన సందర్భంలో నేను ఈ రోజు సాయంత్రం మీ అందరితోను తప్పక సమావేశమవుతాను. మీ అందరికీ ఇవే నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎప్పటి లాగే, మీ మనసులోని ఆలోచనలకు, నా మనసులోని ఆలోచనలకు మధ్య ఏర్పడిన విడదీయరాని బంధం నాకు అంతులేని ఆనందాన్ని ఇస్తోంది.
ప్రియమైన నా దేశపు సాటి పౌరులారా,
ముందుగా మీ అందరికీ నమస్కారాలు చెప్పి.. నన్ను ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టనివ్వండి. ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు ఈస్టర్ పర్వ దినాన్ని జరుపుకొంటున్నారు. ఈస్టర్ సందర్భంగా ప్రతి ఒక్కరికీ ఇవే నా శుభాకాంక్షలు.
నా యువ మిత్రులారా… మీరంతా ఒకవైపు పరీక్షలలో తీరిక లేకుండా ఉన్నారనుకుంటున్నాను. కొంత మందికి పరీక్షలు పూర్తయి ఉంటాయి. ఇంకా కొంత మందికి ఇంకో విధమైన పరీక్ష; ఒకవైపు పరీక్షలు.. మరొక వైపు టి-20 క్రికెట్ ప్రపంచ కప్ మ్యాచ్ లు. ఇవాళ సాయంత్రం కూడా భారతదేశం- ఆస్ట్రేలియా మ్యాచ్ కోసం మీరు తప్పక ఆసక్తితో వేచి ఉన్నారన్న సంగతి నాకు తెలుసు.
కొద్ది రోజుల కిందట పాకిస్తాన్, బంగ్లాదేశ్ జట్లతో రెండు చక్కని మ్యాచ్‌లలో భారతదేశం గెలిచింది. ఈ టి20 క్రికెట్ వరల్డ్ కప్ లో మంచి జోరును మనం చూస్తున్నాం. ఈ రోజు భారతదేశం, ఆస్ట్రేలియా జట్లు ఆడటానికి సన్నద్ధం అవుతున్నాయి; ఈ రెండు జట్లకు ఇవే నా శుభాకాంక్షలు.
మన దేశ జనాభాలో 65 శాతం యువతే. క్రీడా ప్రపంచంలో పాలు పంచుకోకుండా మనం దూరంగా ఉండటానికి ఏ కారణమూ కనపడటం లేదు. ఇది జరిగే పని కాదు. క్రీడలలో మనం విప్లవాత్మకమైన మార్పులను తీసుకురావలసిన అవసరం ఉంది. భారత దేశంలో ఇది చోటు చేసుకోవడాన్ని మనం గమనించవచ్చు. క్రికెట్ లాగానే ఇప్పుడు ఇక్కడ ఫుట్‌బాల్ లోను, హాకీ లోను, టెన్నిస్ లోను, కబడ్డీ లోను ఆసక్తి పెరుగుతోంది.
ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ నకు వచ్చే సంవత్సరంలో భారతదేశం ఆతిథ్యం ఇవ్వనుందన్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. ప్రపంచం అంతటి నుంచి ఇరవై నాలుగు జట్లు ఆడటానికి మన దేశానికి రానున్నాయి. 1951లో, 1962లో ఆసియన్ గేమ్స్‌లో భారతీయ ఫుట్ బాల్ జట్టు బంగారు పతకాలు గెలుచుకుంది. ఇంకా 1956 ఒలింపిక్ గేమ్స్‌లో భారతదేశ జట్టు నాలుగో
స్థానంలో నిలచింది. దురదృష్టవశాత్తు గడచిన కొన్ని దశాబ్ధాలుగా మనం అక్కడి నుంచి అట్టడుగు స్థానాలకు జారిపోయాం. ఇవాళ ఎఫ్ ఐ ఎఫ్ ఎ లో మన ర్యాంకింగ్ ఎంత తక్కువగా ఉందంటే, దానిని గురించి చెప్పాలన్నా కూడా నాకు మనసు రావడం లేదు.
మరో పక్క, భారతదేశ యువతలో ఫుట్‌బాల్ పట్ల అభిరుచి అంతకంతకు పెరుగుతుండటాన్ని నేను గమనిస్తూ వస్తున్నాను. అది ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ కానివ్వండి, లేదా స్పానిష్ లీగ్ కానివ్వండి, లేదా ఇండియన్ సూపర్ లీగ్ మ్యాచ్ లు కానివ్వండి.. భారతీయ యువతీయువకులు ఈ మ్యాచ్ లను గురించిన తాజా సమాచారాన్ని తెలుసుకోవడానికి గాని, వాటిని టెలివిజన్ లో చూడటానికి గాని సమయాన్ని వెచ్చిస్తున్నారు. నేనేం చెప్పదలచుకొన్నానంటే, ఈ క్రీడ పట్ల ప్రజాదరణ ఇంతగా పెరుగుతున్నప్పుడు ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ నకు ఆతిథ్యం ఇచ్చే అవకాశం మనకు దక్కినప్పుడు మనం కేవలం ఆతిథ్య పాత్రను పోషిస్తూ మన బాధ్యతను పూర్తి చేసేద్దామా..? లేక, ఈ అవకాశాన్ని మన కు ప్రయోజనం కలిగేటట్లు ఉపయోగించుకొని క్రీడలను ప్రోత్సహిద్దామా?
ఫుట్ బాల్, ఫుట్ బాల్, ఫుట్ బాల్ అనే పదం ఈ సంవత్సరమంతా మారుమోగే వాతావరణాన్ని మనం సృష్టించాలి– పాఠశాలల్లోను, కళాశాలల్లోను, ఆ మాటకొస్తే భారత దేశం ప్రతి మూల మూలనా. మన యువత, బడులలో మన పిల్లలు ఫుట్ బాల్ ఆడుతూ చెమటతో తడిసి ముద్దయిపోవాలి. అలా జరిగిందంటే, ఆతిథ్యం ఇస్తున్నందుకు మనకు సిసలైన మజా దక్కుతుంది. కాబట్టి, మనం అందరం ఫుట్ బాల్‌ను గ్రామ గ్రామానికి, వీధి వీధికి తీసుకు వెళ్లడానికి ప్రయత్నించాలి. ఇప్పటి నుంచి 2017 లో ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ జరిగే దాకా, యువతలో ఒక రకమైన ఉద్వేగాన్ని నింపుదాం. ఈ కార్యక్రమానికి ఆతిథ్యం ఇవ్వడం వల్ల కలిగే మేలు ఏమిటంటే ఇక్కడ అనేక మౌలిక క్రీడా సదుపాయాలు రూపుదిద్దుకొంటాయి. కానీ, వ్యక్తిగతంగా నాకు ఎప్పుడు ఆనందం కలుగుతుందంటే.. మనం మన దేశంలోని ప్రతి యువకుడిని ఈ క్రీడతో మమేకం చేయగలిగినప్పుడే.
మిత్రులారా.. 2017 లో ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ ను మనం మన ప్రయోజనాల కోసం ఎంత ఉత్తమంగా ఉపయోగించుకోగలమనే విషయంలో మీ అభిప్రనయాలు ఏమిటో నేను మీ నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఎలా ఉండాలి? ఈ సందర్భం తగినంత వేగం పుంజుకోవడానికి ఏ విధమైన కార్యక్రమాలను మనం ఏడాది పొడవునా నిర్వహించాలి? మనం ఇంకా ఏ యే అంశాలలో మెరుగుదల సాధించవలసిన అవసరం ఉంది? 2017 ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ ద్వారా ఈ ఆట పట్ల భారతదేశం యువతలో అభిరుచిని మనం ఎలా పెంచగలం? ఈ క్రీడతో సాన్నిహిత్యం ఏర్పరచుకొనేటట్లుగా ప్రభుత్వంలో, విద్యా సంస్థలలో, సామాజిక సంస్థలలో పోటీతత్వాన్ని ఎలా చొప్పించగలం?
క్రికెట్ లో ఇదంతా చోటు చేసుకోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం; ఇవే పార్శ్వాలను ఇతర క్రీడా విభాగాలకు కూడా వర్తించేలా మనం ప్రయత్నించాలి. ఎఫ్ ఐ ఎఫ్ ఎ కార్యక్రమం ఇలా చేయడానికి ఒక విశిష్ట అవకాశాన్ని అందిస్తోంది. ఈ అవకాశాన్ని ఎంత బాగా ఉపయోగించుకోవచ్చో మీరు మీ సలహాలు, సూచనలను నాకు పంపించగలరా? ఎఫ్ ఐ ఎఫ్ ఎ కార్యక్రమం
భారతదేశాన్ని ఒక బ్రాండ్ గా నెలకొల్పే ఒక మహదవకాశంగా నేను భావిస్తున్నాను. భారత యువత శక్తి సామర్థ్యాలు ఏమిటో ప్రపంచం గుర్తించగలిగేటట్లు చేయడానికి ఇదొక అవకాశమని నేననుకొంటున్నాను– అది ఏదైనా మ్యాచ్ ను గెలిచామా లేక ఓడామా అనే అర్థంలో కాదు సుమా. 2017 ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ ఆతిథ్యానికి సిద్ధపడుతూ, మనం శక్తి సామర్థ్యాలను పోగేసుకొని వాటిని ప్రదర్శించవచ్చు.. ప్రదర్శించవచ్చు; అలా చేస్తూనే, మనం భారతదేశ ప్రతిష్టను పెంపొందించే బ్రాండింగ్ ను కూడా చేపట్టవచ్చు.
మీరు 2017 ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ నకు సంబంధించిన మీ సలహాలు, సూచనలను NarendraModiApp ద్వారా నాకు పంపించవచ్చు; వాటిని అందుకోవడం గురించి నేను ఎదురుచూస్తాను. లోగో ఎలా ఉండాలి.., స్లోగన్లు ఎలా ఉండాలి.., భారతదేశమంతటా ఈ విషయాన్ని ప్రచారం చేయడానికి ఎలాంటి పద్ధతులను పాటిద్దాం?, పాటలు ఎలా ఉండాలి?, సావనీర్ లలో ఏయే అంశాలు ఉండాలి? .. మిత్రులారా ఆలోచించండి. ఇంకా నేను ఏం కోరుకుంటున్నానంటే.. ప్రతి యువకుడు, ప్రతి యువతి 2017 ఎఫ్ ఐ ఎఫ్ ఎ అండర్-17 వరల్డ్ కప్ యొక్క దూత అవ్వాలి. మీరు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాలుపంచుకోవాలి. భారతదేశ ప్రతిష్టను నిర్మించేందుకు ఇది ఒక సువర్ణావకాశం.
ప్రియమైన నా విద్యార్థులారా, సెలవులలో ఎక్కడికన్నా ప్రయాణమై వెళ్లాలని మీరు ఆలోచించే ఉంటారు. విదేశాలకు వెళ్లే వాళ్లు చాలా తక్కువ మంది ఉంటారు. ఎక్కువ మంది వాళ్ళ వాళ్ళ రాష్ట్రాల లోపలే వారమో పది రోజులో యాత్రలు చేస్తారు. కొద్ది మంది వారి రాష్ట్రం వెలుపలి ప్రదేశాలను సందర్శిస్తారు. గతంలో కూడా నేను మీ అందరికీ ఒక విన్నపం చేశాను.. మీరు చూసిన స్థలాల ఫొటోలను అప్ లోడ్ చేయండని. నేను చూశాను ఏ పనినైతే మన పర్యాటక విభాగం గాని, సాంస్కృతిక విభాగం గాని, రాష్ట్ర ప్రభుత్వాలు గాని, లేదా భారత ప్రభుత్వం గాని చేయలేవో.. ఆ పనిని దేశపు కోట్లాది యాత్రికులు చేసి చూపెట్టారు; ఎలాంటి భవ్యమైన ప్రదేశాల ఫొటోలను వారు అప్ లోడ్ చేశారంటే.. వాటిని చూడటం నిజంగా ఎంతో ఆనందాన్నిస్తుంది.
ఈ పనిని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలి. ఈసారి కూడా ఈ పనిని చేయండి. అయితే – ఈ సారి వాటి మీద ఏదైనా రాయండి. కేవలం ఫొటోనే కాదు… మీకున్న రచనా ఆసక్తిని ప్రదర్శించండి. కొత్త ప్రదేశంలోకి వెళ్తే దానిని చూస్తే తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ఎంతో కొంత లభిస్తుంది. ఏ అంశాలను, విషయాలను మనం తరగతి గదిలో నేర్చుకోలేమో.. ఏవైతే మన కుటుంబంలో స్నేహితుల మధ్య నేర్చుకోలేమో.. అవి తిరగడం ద్వారా ఎక్కువగా నేర్చుకునేందుకు లభిస్తాయి. ఇంకా కొత్త ప్రదేశాల కొత్తదనం అనుభవం అవుతుంది. మనుషులు, వారి భాష, వారి ఆహారపు అలవాట్లు, మాటలు అక్కడి జీవన విధానం.. ఒకటేంటి. ఎన్నెన్నో చూడటానికి లభిస్తాయి. పరిశీలన లేని ప్రయాణీకుడు రెక్కలు లేని పక్షి వంటి వాడు అని అన్నారు ఎవరో. చూడటానికి మీకు నిజంగా ఆసక్తి ఉంటే, వాటిని చూసే అంతర్ దృష్టిని కూడా మీరు సిద్ధం చేసుకోవాలి. భారతదశం వైవిధ్యాల నిలయం. ఒకసారి చూడటానికి బయలుదేరితే, జీవితం అంతా చూస్తూనే ఉంటారు.. చూస్తూనే ఉంటారు; ఎప్పటికీ తనివి తీరదు. నేను చాలా అదృష్టవంతుడిని. తిరగడానికి నాకు చాలా అవకాశం లభించింది. మీ లాగా నేను ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కానప్పుడు.. వయస్సులో చాలా చోట్ల తిరిగాను. దేశంలో నేను సందర్శించని జిల్లా అంటూ బహుశా లేదేమో.
జీవితాన్ని సరిద్దుకోవడంలో ప్రయాణం ఒక శక్తిమంతమైన పాత్రను పోషిస్తుంది. ఇప్పుడు భారత దేశంలో యువతలో ప్రయాణం పట్ల మక్కువ, జిజ్ఞాస పెరుగుతూ పోతున్నాయి. ముందు రోజుల్లో లాగా అందరూ వెళ్లే మార్గంలో, తయారుగా ఉన్న మార్గంలో వీరు వెళ్లడం లేదు. వారు ఏదో కొత్తది చేయాలనుకుంటున్నారు; వారు కాస్త కొత్తవి చూడాలనుకుంటున్నారు. దీనిని నేను ఒక మంచి సంకేతంగా భావిస్తాను. మన యువతీయువకులు సాహసవంతులు కావాలి. ఎక్కడైతే ఎప్పుడూ కాలు మోప లేదో, అక్కడ కాలు మోపడానికి ఇష్టపడాలి.
ఈ సందర్భంగా కోల్ ఇండియాకు ప్రత్యేక అభినందనలు తెలపాలని అనుకుంటున్నాను. వెస్టర్న్ కోల్ ఫీల్డ్ లిమిటెడ్ (డబ్ల్యుసిఎల్) నాగ్‌పూర్ సమీపంలోని సావనేర్ గ్రామం దగ్గర- అక్కడ బొగ్గు గనులు ఉన్నాయి- అక్కడ పర్యావరణ మైత్రీపూర్వకమైన మైన్ టూరిజం సర్క్యూట్ ను తీర్చిదిద్దింది. సాధారణంగా మనం బొగ్గు గనులు అనేసరికి అవేవో చూడదగ్గవి కావు అని అనుకుంటాం. అక్కడి గని పనివారి చిత్రాలు మనం చూసినట్లయితే, అక్కడికే వెళ్తే ఇంకా ఎలా ఉంటుందో అని అబ్బురపడతాం. మనకొక సామెత కూడా ఉంది.. అదేంటంటే.. బొగ్గులో చేయిపెడితే చేతులు నల్లగా అయిపోతాయి అని. దీంతో మనుషులు దూరంగా పారిపోతారు. కానీ ఈ బొగ్గునే టూరిజానికి గమ్యంగా వెస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ చేసి చూపించింది. నేను చాలా ఆనందంగా ఉండటానికి కారణం ఏమిటంటే.. ఇప్పుడిప్పుడే ఇది ప్రారంభమైంది. నాగ్‌పూర్ సమీపంలోని సావనేర్ గ్రామ సమీపంలో ఎకో ఫ్రెండ్లీ మైన్ టూరిజం సైట్ ను ఇప్పటి వరకు 10,000 మందికి పైగా తిలకించారు. ఏదైనా ఒక కొత్తదానిని చూడాలంటే ఇదే మనకు ఒక అవకాశాన్ని ప్రసాదిస్తోంది.
ఈసారి సెలవుల్లో ఊళ్లు తిరగడానికి వెళ్లినపుడు మీరు కూడా శుభ్రత కోసం ఏదన్నా చేయగలరా… ఈ మధ్య ఒక విషయం కనిపిస్తోంది. నిజానికి విమర్శించాలంటే ఇంకా ఎన్నో సందర్భాలున్నాయి కానీ మొత్తం మీద ఒక చైతన్యం వచ్చిందనే చెప్పాలి. పర్యాటక స్థలాల్లో పరిశుభ్రత ఉండేలా ప్రజలు ప్రయత్నం చేస్తున్నారు. ఆ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు ప్రయత్నిస్తున్నారు. అక్కడ శాశ్వత నివాసం ఉండే వారు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. శాస్త్రీయమైన పద్ధతిలో ఈ ప్రయత్నం జరగడం లేదేమో కానీ పని మాత్రం జరుగుతోంది. మీరు ఒక పర్యాటకుడిగా వెళ్లినపుడు ఆ ప్రదేశంలో యువజనులు ఈ విషయంలో తోడ్పడగలరని నాకు నమ్మకం ఉంది.
పర్యాటకం ద్వారా ఉపాధికి ఎంతో అవకాశం ఉంది. ప్రపంచ దేశాలతో పోలిస్తే భారతదేశం పర్యాటక రంగంలో చాలా వెనుకబడి ఉంది. కానీ మనం 125 కోట్ల మంది దేశ ప్రజలం. పర్యాటకాన్ని బలోపేతం చేయాలనుకుంటే కనుక, ప్రపంచాన్నే మనం ఆకర్షించగలం. ప్రపంచ పర్యాటకంలో పెద్ద భాగాన్ని మనం సొంతం చేసుకోగలుగుతాం. ఇంకా మన కోట్లాది యువ జనానికి ఉపాధి అవకాశాలు చూపగలం. ప్రభుత్వం గానీ, సంస్థలు గానీ, సమాజం గానీ, వ్యక్తులు గానీ- అందరం కలసి దీన్ని సాధించే పని చేద్దాం. రండి, ఈ దిశగా మనం ఒక ప్రయత్నం చేద్దాం.
ప్రియమైన నా యువ మిత్రులారా, సెలవురోజులను అలా ఊరికే కొద్ది కొద్దిగా వ్యర్థం చేసేయడం నాకు నచ్చదు. మీరు కూడా ఇలా ఆలోచించి చూడండి. మీ సెలవులు, జీవితంలో కీలకమైన సంవత్సరాలు అంతకన్నా కీలకమైన సమయం.. అలానే కరగిపోవడం ఏమిటి? మీరు ఆలోచించడానికి ఒక విషయం చెబుతాను. సెలవుల్లో ఒక కొత్త ప్రతిభను మీ వ్యక్తిత్వానికి జోడించే సంకల్పం తీసుకోగలరా మీరు..? ఒక వేళ మీకు ఈదడం రాకపోతే, సెలవుల్లో ఈత నేర్చుకోవాలని సంకల్పించవచ్చు. సైకిల్ తొక్కడం రాకపోతే సెలవుల్లో సైకిల్ నేర్చుకుంటానని నిర్ణయం తీసుకోవచ్చు. ఇప్పటికీ కేవలం రెండు వేళ్ళతో కంప్యూటర్ మీద టైపు చేస్తున్నానే అని మీరు అనుకుంటే నేను సరైన రీతిలో టైపింగ్ నేర్చుకోకూడదా అని ఎందుకు అనుకోరు? మన వ్యక్తిత్వ వికాసానికి ఎన్నో రకాల నైపుణ్యాలున్నాయి? వాటిని ఎందుకు నేర్చుకోకూడదు..? మనలోని కొన్ని లోపాలను ఎందుకు దూరం చేసుకోకూడదు? మనలోని కొన్ని శక్తులను ఎందుకు పెంచుకోకూడదు? ఇప్పుడు ఒక ఆలోచన చేసి చూడండి.
వీటిలో మీకు చాలా క్లాసులు అవసరమనో, శిక్షకుడు కావాలనో, చాలా పెద్ద ఫీజు కట్టాలనో, పెద్ద బడ్జెట్ వెచ్చించాలనో.. ఇలా ఏమీ లేదు. మీరు మీ చుట్టుపక్కలే చూడండి. మీరు ఒకసారి నిర్ణయించుకున్నారనుకుందాం చెత్త నుంచి ఉత్తమమైంది తయారుచేస్తాను.. అని. కొన్ని పరిశీలించండి; వాటి నుంచి తయారు చేయడం మొదలుపెట్టండి. చూడండి– మీకు సంతోషం కలుగుతుంది. సాయంత్రం అయ్యే సరికి ఈ చెత్తా చెదారంలో నుంచి మీరు ఏం తయారు చేశారో.. మీకు చిత్ర లేఖనం అంటే ఇష్టం. కానీ బొమ్మలు గీయడం రాదు. అయితేనేం, మొదలయితే పెట్టండి. అదే వస్తుంది. మీరు మీ సెలవు దినాలను మీ వ్యక్తిత్వ వికాసానికి, ప్రావీణ్యం సాధించడానికి, మీ నైపుణ్యాలను మెరుగు పరచుకోవడానికి తప్పనిసరిగా వినియోగించాలి. అలాంటివి రంగాలు లెక్కలేనన్ని ఉన్నాయి. నేను చెప్పిన వాటిలోనే కృషి చేయాలని లేదు. ఆ నైపుణ్యం వల్ల మీ వ్యక్తిత్వానికి ఉనికి ఏర్పడుతుంది. మీ ఆత్మవిశ్వాసం చెప్పలేనంత పెరుగుతుంది. సెలవులు అయ్యాక స్కూలుకు తిరిగి వెళ్లినప్పడు, కాలేజికి వెళ్లినప్పుడు మీ స్నేహితులతో చెబుతారు. నేను సెలవుల్లో ఇది నేర్చుకున్నాను అని. ఒక వేళ వాళ్లు అది నేర్చుకోలేదునుకోండి.. వాళ్లనుకుంటారు అరే నేను నష్టపోయాను. నువ్వు నేర్చుకుని వచ్చావు అని ఇలా ఆలోచిస్తారు. ఇది సహజం. కాబట్టి మీరు తప్పకుండా చేస్తారని నాకు నమ్మకం ఉంది. ఇంకా మీరు ఏం నేర్చుకున్నారో నాకు చెప్పండి. చెబుతారు కదూ.
ఈసారి www.mygov.in సైట్ లో ‘మన్‌కీ బాత్’ కోసం అనేకమైన సూచనలు అందాయి. వాటిలోంచి ఒకటి ఇదీ..
“నమస్తే ప్రధాన మంత్రి గారూ. నా పేరు అభి చతుర్వేది. గత వేసవి సెలవులలో మీరు పిట్టలకి కూడా వేసవి తాపం ఉంటుందని అన్నారు. ఓ పాత్రలో నీరు పోసి బాల్కనీలోనో, డాబా పైనో పెట్టాలని, పిట్టలు వచ్చి నీళ్లు తాగుతాయని చెప్పారు. నేను అదే పనిని చేశాను. ఎంతో సంతోషం కలిగింది. ఈ సాకుతో చాలా పిట్టలతో నాకు స్నేహం కుదిరింది. ఈ విషయాన్ని ‘మన్ కీ బాత్’లో మీరు మరోసారి చెప్పాలనే మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీకు ఇవే నా కృతజ్ఞతలు.”
ప్రియమైన నా దేశపు సాటి పౌరులారా.. నేను ఈ చిన్నారి అభి చతుర్వేది కి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. నాకు ఫోన్ చేసి, నేను చెప్పిన విషయాన్ని ఈ బాలుడు నాకు గుర్తు చేశాడు. నిజం చెప్పాలంటే, నేను దాని గురించే మరచిపోయాను. ఇంకా.. నాకు బుర్రలో లేదు ఈ విషయంపై నేనేమైనా చెబుతానా అనేది. కానీ, అభి నాకు జ్ఞాపకం చేశాడు.. నిరుడు నేను పక్షులు తాగడానికి నీళ్లతో నింపిన ఒక మట్టి పాత్రను నింపి పెట్టండి.. అని చెప్పానన్న సంగతిని.
స్నేహితులారా.. నేను అభి చతుర్వేదికి ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఆ బాలుడు నాకు ఫోన్ చేసి ఒక మంచి పనిని గురించి తెలియజెప్పాడు. పోయినసారి .. ఆ.. ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. నేను అప్పట్లో మీకు సూచించాను. ఎండాకాలంలో పిట్టలకు మట్టి పాత్రలలో నీరు పెట్టండి అని. అభి తాను ఈ పనిని ఒక ఏడాది అంతా చేస్తూ వస్తున్నానంటూ నాకు తెలిపాడు. ఎన్నో పక్షులు తనకి స్నేహితులు అయిపోయాయని కూడా చెప్పాడు. హిందీ భాషలో మహా కవయిత్రి అయిన మహాదేవి వర్మకు పక్షులంటే ఎంతో ప్రేమ. ఆవిడ ఒక కవితలో ఇలా రాశారు.. ‘మేం నిన్ను దూరంగా ఎగిరిపోనివ్వం, మేం ధాన్యంతో ఆవరణంతా నింపేస్తాం.. నీటి కుంటను తియ్యని, చల్లని నీటితో నింపేస్తాం..’ రండి, మనం కూడా మహాదేవి వర్మ గారు చెప్పినట్లే చేద్దాం. నేను అభికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఒక ముఖ్యమైన విషయాన్ని నాకు గుర్తు చేసినందుకు.
మైసూర్‌కు చెందిన శిల్పా కుకే ఎంతో దయామయమైన ఒక సమస్యను మన ముందుకు తెచ్చారు. మా ఇంటి దగ్గరకు పాల వాళ్లు వస్తారు, పేపర్ అమ్మేవాళ్లు వస్తారు. పోస్ట్ మ్యాన్ వస్తారు. కొన్ని సార్లు గిన్నెలు అమ్మేవారు, బట్టలు అమ్మేవారు ఆ దారి వెంబడి వెళ్తారు. మనం ఎప్పుడన్నా వారికి మంచినీళ్లు కావాలా… అని అడిగామా? ఎప్పుడన్నా ఇచ్చామా? శిల్పా… మీరు ఎంతో సున్నితమైన విషయాన్ని ప్రస్తావించారు. మీకు ధన్యవాదాలు. ఎంతో ముఖ్యమైన అంశాన్ని మీరు ఎంతో సరళంగా, సూటిగా చెప్పారు. విషయం చాలా చిన్నది కానీ, మంచి ఎండలో పోస్ట్ మ్యాన్ మన ఇంటికి వచ్చినపుడు చల్లని నీరు తాగించామనుకోండి. అతను ఎంత సేదదీరుతాడు. నిజానికి మన దేశంలో ఇది స్వతహాగా జరిగే విషయమే. కానీ, శిల్పా… మీరు ఈ విషయం గమనించినందుకు నాకెంతో సంతోషం వేసింది.
ప్రియమైన నా రైతు సోదర సోదరీమణులారా… డిజిటల్ ఇండియా అన్న పదం మీరు చాలాసార్లు విని ఉంటారు. డిజిటల్ ఇండియా అంటే ఇది నగరాల్లో యువజనులకు సంబంధించిన సంగతి, అది వారి ప్రపంచం అనిపించవచ్చు. అది నిజం కాదు. ‘కిసాన్ సువిధా ఆప్’ అనే యాప్ మీ సౌకర్యం కోసం అందుబాటులోకి వచ్చిందని తెలిస్తే మీరు ఎంతో సంతోషపడతారు. ఈ రైతు సువిధ యాప్‌ని మీరు మీ మొబైల్ ఫోన్లో డౌన్ లోడ్ చేసుకోండి. వ్యవసాయానికి సంబంధించిన, వాతావరణానికి సంబంధించిన విస్తృత సమాచారం స్వయంగా మీ చేతుల్లోనే అందుబాటులోకి వస్తుంది. మార్కెట్లో పరిస్థితులేంటి… మండీలో ఎటువంటి స్థితి ఉంది.. పంట దిగుబడి సరళి ఎలా ఉంది. పొలానికి వేయవలసిన మందులు ఏవి అందుబాటులో ఉన్నాయి… ఇలాంటి ఎన్నో విషయాలు ఆ యాప్‌లో ఉన్నాయి. అంతే కాదు.. ఇందులో ఉన్న బటన్ మిమ్మల్ని నేరుగా వ్యవసాయ శాస్త్రవేత్తలతో, వ్యవసాయ నిపుణులతో మాట్లాడిస్తుంది. మీరేదైనా ప్రశ్నలు అడిగితే వారు జవాబు ఇస్తారు. మీకు వివరించి చెబుతారు. నా రైతు సోదరులు, సోదరీమణులు ఈ కిసాన్ సువిధ యాప్‌ను తమ మొబైల్ ఫోన్ పైన డౌన లోడ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకసారి ప్రయత్నించి చూడండి. అందులో మీకు పనికొచ్చే సంగతులు ఏమన్నా ఉన్నాయేమో. అందులో ఏదన్నా లోపం ఉంది, తక్కువ సమాచారం ఉంది అంటే మీరు నాకు ఫిర్యాదు చేయవచ్చు కూడా.
ప్రియమైన నా రైతు సోదర సోదరీమణులారా… మిగిలిన ప్రజలందరికీ వేసవి అంటే సెలవుల కాలం. కానీ రైతులకు మాత్రం ఇది మరింత చెమటోడ్చి పని చేయవలసిన కాలం. రైతు వర్షం కోసం ఎదురుచూస్తాడు. వర్షం కోసం ఎదురుచూసే ముందుగా వర్షం కోసం తన భూమిని సిద్ధం చేసే పనిలో పూర్తిగా నిమగ్నమైపోతాడు. వర్షం కురిసినప్పుడు ఒక్క నీటి చుక్క కూడా వృథా కాకుండా భూమిని సిద్ధం చేసుకుంటాడు. వ్యవసాయం ప్రారంభమయ్యే రుతువు రైతులకు ఎంతో ముఖ్యమైన సమయం. కానీ, నీరు లేకపోతే ఏం జరుగుతుందన్న విషయం మన దేశవాసులందరూ కూడా ఆలోచించవలసిన విషయం. ఈ సమయంలో మనం మన చెరువులు, మన ప్రాంతంలో నీరు ప్రవహించే ప్రదేశాలు, చెరువుల్లోకి నీళ్లు వచ్చి చేరే మార్గాలు అక్కడ చెత్త చేరడం, లేదా దురాక్రమణ జరిగి నిర్మాణం జరగడం వల్ల అక్కడికి నీరు ప్రవహించడం ఆగిపోతుంది. అందువల్ల నీటి నిల్వలు క్రమేణా తగ్గిపోతున్నాయి. గతంలో నీరు ఉన్న ప్రదేశాలు, స్థలాలను మళ్లీ మనం తవ్వి చెత్త తీసి శుభ్రం చేసి మరింత నీరు వచ్చి చేరి నిల్వ ఉండేలా సిద్ధం చేయగలమా? ఎంత నీరు పొదుపు చేయగలిగితే అంత మంచిది. తొలకరి జల్లుల్లోనైనా సరే నీరు పొదుపు చేసి… చెరువులు నిండి.. మన నదులు, కాల్వలు నిండి పారాయంటే ఆ తర్వాత వర్షం కనిపించకుండా పోయినా నీటి కొరత అనేది బాధించదు. మనకు ఎక్కువ నష్టం జరగదు. అయితే మనం ప్రతి ఒక్క వాన నీటి చినుకును ఒడిసి పట్టి నిల్వ చేసుకొంటేనే ఇది సాధ్యమవుతుంది.
ఈసారి ఐదు లక్షల నీటి కుంటలను తవ్వేందుకు సంకల్పించాం. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎమ్ ఎన్ ఆర్ జి ఎ) కింద కూడా నీటి సేకరణకు, అసెట్స్ క్రియేట్ చేయాలని భావిస్తున్నాం. ప్రతి ఊళ్లో, ప్రతి గ్రామంలో నీరు పొదుపు చేయాలి. రానున్న వర్షా కాలంలో ప్రతి వర్షపు చుక్కను పరిరక్షించాలి. గ్రామంలో నీరు గ్రామంలోనే ఉండాలి. ఈ ఉద్యమాన్ని ఎలా నడిపించాలో మీరు ప్రణాళికలు వేయండి. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో పాలుపంచుకోండి. నీటి వనరుల ప్రాముఖ్యత గురించి ప్రజా ఉద్యమాన్ని ఎలా నడిపించాలో మీరు ప్రణాళికలు వేయండి. ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాల్లో పాలుపంచుకోండి. నీటి వనరుల ప్రాముఖ్యత గురించి ప్రజా ఉద్యమం ప్రారంభిద్దాం. నీటి వనరుల ప్రాముఖ్యత అందరూ గ్రహించేలా… నీరు పొదుపు చేసేందుకు అందరూ ప్రయత్నించేలా… ఒక ఉద్యమం ప్రారంభిద్దాం. మన దేశంలో ఎన్నో గ్రామాలు, ఎంతో మంది ప్రగతిశీలురైన రైతులు, ఎంతో మంది చైతన్యవంతులైన పౌరులు ఇప్పటికే ఈ పని చేస్తుండి ఉంటారు. అయినప్పటికీ ఇప్పుడు ఈ దిశగా ఇంకా ఎంతో ప్రయత్నం జరగడం అవసరం.. అతి ముఖ్యం.
ప్రియమైన నా రైతు సోదర, సోదరీమణులారా.. ఇటీవల భారత ప్రభుత్వం ఒక భారీ రైతు సమ్మేళనం నిర్వహించింది. ఎంత అత్యాధునిక పరిజ్ఞానం ఆవిర్భవించిందో. వ్యవసాయ రంగంలో ఎన్ని మార్పులు వచ్చాయో నేను గమనించాను. అయితే ఈ పరిజ్ఞానాన్ని పొలాల వరకు తీసుకువెళ్ళాలి. ఇప్పడు రైతులు కూడా ఇంక ఎరువులు తగ్గించాలి అంటున్నారు. ఈ పరిణామాన్ని నేను హర్షిస్తున్నాను. ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల మన భూమి తల్లి అస్వస్థత పాలైంది. మనం ఈ భూమి పుత్రులం, మనం ఈ పుడమి తల్లి సంతానం. మన అమ్మ రోగాల పాలవుతుంటే ఎలా చూస్తూ ఉండగలం…? భోజనం రుచికరంగా ఉంటుంది. కానీ, ఆ మసాలా మోతాదుకు మించి వస్తే అసలు ఆ భోజనం తినగలమా… మనకి నచ్చిన ఆ ఆహారమే నోటికి చేదు అనిపించదా?
ఈ ఎరువుల మోతాదుకు మించి మీరు వాడితే అది వినాశనానికే దారి తీస్తుంది. ప్రతిదీ సమతూకంలో ఉండాలి. అప్పుడే ఖర్చులు తగ్గి డబ్బులు మిగులుతాయి. అందుకు మా నినాదం ‘ఖర్చు తక్కువ దిగుబడి ఎక్కువ – తక్కువ పెట్టబడి ఎక్కువ పంట’. ఇదే మంత్రం జపించాలి, అనుసరించాలి. మనం మన వ్యవసాయంలో శాస్త్రీయమైన పద్ధతుల్లో వృద్ధి సాధించాలి. నీటి పరిరక్షణ కోసం ఏ చర్యలు తీసుకోవాలో మనం పూర్తి చిత్తశుద్ధితో ఆ చర్యలు తీసుకోవాలి. వర్షం కురిసేందుకు ఇంకా ఒకటి రెండు నెలల సమయం మాత్రమే ఉంది. ఈ లోపుగా మనం నీటి పరిరక్షణకు సిద్ధం కావాలి. ఎంత నీరు పొదుపు చేస్తే వ్యవసాయానికి అంత లాభం.. జీవితం అంత సౌకర్యవంతం.
ప్రియమైన నా దేశపు సాటి పౌరులారా.. ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈ ఏడాది ఈ దినోత్సవం ప్రపంచమంతా ‘బీట్ డయాబెటిస్’ అనే ఇతివృత్తంతో కార్యక్రమాలు నిర్వహించనుంది. డయాబెటిస్‌ను ఓడిద్దాం… మధుమేహం ఇతర అనేక వ్యాధులకు మన శరీరంలో ఆతిథ్యమిచ్చేందుకు ఉత్సుకతతో ఉంటుంది. మన శరీరంలోకి అనేక ఇతర వ్యాధులు కురూపులైన అతిథులుగా మన శరీరం అనే ఇంట్లోకి చొరబడతాయి. 2014 నాటికి మన దేశంలో దాదాపు ఆరున్నర కోట్ల మంది మధుమేహం రోగులున్నారని అంచనా. మూడు శాతం మరణాలకు డయాబెటిస్ కారణమని తేలింది. డయాబెటిస్‌లో రెండు రకాలు టైప్-1, టైప్-2 అని. టైప్-1 వంశపారంపర్యంగా వస్తుంది. తల్లిదండ్రులకు ఉంటే పిల్లలకు వస్తుంది. టైప్-2 డయాబెటిస్ అలవాట్ల కారణంగా, వయస్సు కారణంగా, స్థూలకాయం కారణంగా వస్తుంది. అంటే మనమే దానిని స్వయంగా ఆహ్వానిస్తాం అన్నమాట. ప్రపంచమంతా డయాబెటిస్ వ్యాధి గురించి ఆందోళన చెందుతోంది. అందుకే ఏప్రిల్ 7న ప్రపంచ ఆరోగ్య దినోత్సవానికి ఈసారి డయాబెటిస్ పై పోరాటాన్ని ఇతివృత్తంగా నిర్ణయించారు.
మన జీవనశైలి డయాబెటిస్ కు అతిపెద్ద కారణమని మనందరికీ తెలుసు. శారీరక శ్రమ తగ్గిపోతోంది. చెమట అనేది పట్టదు. అటూ ఇటూ తిరగడం అనేది జరగదు. ఆటలు ఆడటం అంటే ఆన్లైన్ గేమ్స్ మాత్రమే. ఆఫ్‌లైన్‌లో మాత్రం ఎటువంటి శ్రమ ఉండదు. మనం ఏప్రిల్ 7వ తేదీ నుంచి స్ఫూర్తి పొంది డయాబెటిస్‌ను ఓడించేందుకు మన వ్యక్తిగత జీవితాల్లో ఏదన్నా చేయగలమా? మీకు యోగా అంటే ఆసక్తి ఉంటే యోగా చేయండి. లేదా కనీసం నడక లేదా పరుగు ప్రాక్టీస్ చేయండి. నా ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉంటే నా దేశం కూడా ఆరోగ్యంగానే ఉంటుంది కాదా. కొన్నిసార్లు మనం ఏదో సంకోచంతో వైద్య పరీక్షలు చేయించుకోం. పరిస్థితి బాగా క్షీణించాక అయ్యో! నాకు ఎప్పటి నుంచో డయాబెటిస్ ఉందే అనేది స్ఫురణకు వస్తుంది. పరీక్ష చేయించుకుంటే ఏం పోతుంది చెప్పండి. ఆ మాత్రం చేసుకోండి. ఇప్పుడు అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి. ఎంతో తేలికగా ఈ పరీక్ష చేయించుకోవచ్చు. మీరు తప్పనిసరిగా ఈ విషయం ఆలోచించండి.
మార్చి 24 నాడు ప్రపంచం క్షయ నివారణ దినోత్సవం జరుపుకొంటుంది. నా చిన్నప్పుడు టీబీ అనే పేరు వింటే భయపడిపోయేవారు తెలుసా. ఇంక చావు దగ్గరపడింది అనిపించేది. కానీ, ఇప్పుడు టీబీ అంటే భయం లేదు. ఎందుకంటే ఇప్పడు అందరికీ తెలుసు టీబీకి చికిత్స వీలవుతుందని. అతి తేలికగా చికిత్స జరుగుతుందని తెలుసు. టీబీ అంటే మరణం అనుకున్న రోజుల్లో భయపడేవాళ్లు ఇప్పడు చికిత్స ఉంది అనేసరికి నిర్లక్ష్యం పెరిగిపోయింది. కానీ, ప్రపంచవ్యాప్తంగా టీబీ రోగుల సంఖ్య ఇంకా ఎక్కువగానే ఉంది. క్షయ నుంచి విముక్తి కావాలి అంటే ఒకటి సరైన చికిత్స జరగాలి… రెండు సంపూర్ణ చికిత్స జరగాలి. కరెక్ట్ ట్రీట్మెంట్ – కంప్లీట్ ట్రీట్మెంట్; మధ్యలోనే విడిచిపెడితే కొత్త సమస్యలు వస్తాయి. పైగా టీబీ ఎలాంటి వ్యాధి అంటే చుట్టుపక్కల వారు, ఇరుగు పొరుగు వారు కూడా గుర్తిస్తారు. బాబూ పరీక్ష చేయించుకో టీబీ వచ్చి ఉంటుంది అంటారు. దగ్గు వస్తోంది. జ్వరం వస్తోంది. బరువు కూడా తగ్గిపోయింది. ఇవన్నీ చూసి చుట్టుపక్కల వారు ఇదిగో చూడండి. అతనికి టీబీ-వీబీ ఏవన్నా వచ్చిందేమో అంటారు. దీని అర్థం ఏంటంటే ఈ వ్యాధి ఎటువంటిది అంటే అతి త్వరగా పరీక్ష కూడా చేయించుకోవచ్చు అని.
ప్రియమైన నా దేశపు సాటి పౌరులారా… ఈ దిశలో ఎంతో కృషి జరుగుతోంది. మన దేశంలో 13 వేల 500 మందికి పైగా మైక్రోస్కోపీ కేంద్రాలున్నాయి. నాలుగు లక్షలకు పైగా డాట్ సేవలు అందించే వారు ఉన్నారు. ఎన్నో ఆధునిక లేబొరేటరీలు ఉన్నాయి. ఈ పరీక్ష ఉచితంగా జరుగుతుంది కూడా. మీరు ఒక్కసారి పరీక్ష చేయించుకోండి. ఈ రోగం మానిపోతుంది. చేయవలసిందల్లా సరైన చికిత్స పొందడం, వ్యాధి పూర్తిగా నయమయ్యే వరకు చికిత్స కొనసాగించడం. టీబీ కానివ్వండి, డయాబెటిస్ కానివ్వండి. నాది ఒకటే విజ్ఞప్తి. మనం ఈ వ్యాధులను పారద్రోలాలి. మన దేశాన్ని ఈ వ్యాధుల నుంచి విముక్తం చేయాలి. కానీ, మీరు తలచుకోనిదే ఈ పని ప్రభుత్వం, వైద్యులు, మందుల వల్ల కాదు. అందుకే దేశవాసులకు నా విజ్ఞప్తి. డయాబెటిస్‌ను ఓడిద్దాం. టీబీ నుంచి విముక్తిని పొందుదాం.
ప్రియమైన నా దేశపు సాటి పౌరులారా.. ఏప్రిల్ నెలలో కొన్ని ముఖ్యమైన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఏప్రిల్ 14న బాబా సాహెబ్ భీమ్ రావ్ అంబేడ్కర్ జయంతి. ఆయన 125వ జయంతి వేడుకలు ఏడాది మొత్తం జరిగాయి. మహావ్ లో ఆయన జన్మ స్థలం, లండన్‌లో ఆయన విద్యాభ్యాసం, నాగ్‌పూర్‌లో ఆయన దీక్ష, ఢిల్లీలో 26, అలీపూర్ రోడ్లో ఆయన కాలం చేసిన ఇల్లు, ముంబైలో ఆయన అంత్యక్రియలు జరిగిన చైత్యభూమి.. ఈ పంచతీర్థాల్లో అభివృద్ధి కోసం మనం నిరంతరం ప్రయత్నం చేస్తున్నాం. ఈ ఏడాది ఏప్రిల్ 14న ఆయన స్వస్థలమైన మహావ్ ను సందర్శించే భాగ్యం నాకు కలిగింది. ఒక ఉత్తమ పౌరుడిగా మారేందుకు బాబా సాహెబ్ మనకు ఎంతో ప్రేరణ కలిగించారు. ఎంతో స్ఫూర్తి ఇచ్చారు. ఆయన మార్గంలో ఒక మంచి పౌరుడిగా మారడం ద్వారా మనం ఆయనకు ఘనమైన రీతిలో శ్రద్ధాంజలిని ఘటించగలుగుతాం.
మరి కొద్ది రోజుల్లోనే విక్రమ సంవత్ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. దానిని వేర్వేరు రాష్ట్రాలలో వేర్వేరు రూపాలలో జరుపుకొంటారు. కొంత మంది దీనిని కొత్త సంవత్సరం అంటారు. మరి కొంత మంది గుడిపడ్వని, మరి కొందరు వర్ష్ ప్రతిపద అని పిలుస్తారు. మరి కొందరు ఉగాది అని పిలుస్తారు. అయితే, భారత దేశంలో ఇంచుమించు అన్ని ప్రాంతాల్లో దీనికి ప్రత్యేకత ఉంది. కొత్త ఏడాది మంగళప్రదమైన వేళ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు.
మీకు తెలుసు నేను గతంలో కూడా చెప్పాను. నా ‘మన్‌కీ బాత్’ వినాలనుకుంటే ఎప్పుడైనా వినవచ్చు అని. సుమారు 20 భాషలలో దీనిని వినవచ్చు. మీరు మీకు వీలున్నప్పుడే వినవచ్చు. మీరు మీ మొబైల్ ఫోన్లో వినవచ్చు. ఇందుకు కేవలం ఒక మిస్డ్ కాల్ చేయవలసి ఉంటుంది. ఈ సేవ ఇప్పుడే నెల రోజుల క్రితమే ప్రారంభమైంది. కానీ, 35 లక్షల మంది దీనిని వినియోగించుకున్నారు. మీరు కూడా నంబర్ రాసుకోండి. 81908 – 81908. ఈ నంబర్ మళ్లీ చెప్తాను. 81908 – 81908. మీరు మిస్డ్ కాల్ చేయండి. ఎప్పుడైనా మీకు వీలుంటే అప్పుడు పాత ‘మన్ కీ బాత్’లు వినవచ్చు. మీరు మీ భాషల్లోనే వినవచ్చు. మీతో ఇలా కలసి ఉండటం అంటే నాకు ఎంతో సంతోషంగా ఉంటుంది.
ప్రియమైన నా దేశపు సాటి పౌరులారా… మీకు నా హృదయ పూర్వక శుభాకాంక్షలు; అనేకానేక ధన్యవాదాలు.
ప్రియమైన నా దేశ వాసులారా..
నమస్కారములు.
మీరు రేడియోలో నా ‘మన్ కీ బాత్’ వింటున్నారనుకుంటా; కానీ, పిల్లల పరీక్షలు మొదలవుతున్నాయి అన్న ఆలోచనే మనసులో మెదులుతూ ఉండి ఉంటుంది. కొందరికి పదో తరగతి పరీక్షలు, మరికొందరికి పన్నెండో తరగతి పరీక్షలు బహుశా మార్చి 1వ తేదీ నుంచే మొదలవుతున్నాయి. కాబట్టి, మీ మనసులో కూడా అదే మెదులుతూ ఉండి ఉంటుంది. నేను కూడా మీ ఈ యాత్రలో మీతో జత కలవాలనుకుంటున్నాను. మీకు మీ పిల్లల పరీక్షల విషయంలో ఎంతైతే ఆందోళన ఉందో, నాకూ అంతే ఆందోళన ఉంది. కానీ, పరీక్షల పట్ల మనకున్న ఆలోచన విధానాన్ని మార్చుకుంటే, బహుశా మనం ఈ ఆందోళన నుంచి విముక్తులం అవుతాం.
మీ అనుభవాలు, సూచనలు NarendraModiApp ద్వారా తప్పక పంపించండని నేను ఇంత క్రితం ‘మన్ కీ బాత్’ లో చెప్పాను. దీనికి జవాబుగా అధ్యాపకులు, తమ కెరియర్ లో ఎంతో సఫలీకృతులైన విద్యార్ధులు, తల్లితండ్రులు, సమాజంలోని కొంత మంది ఆలోచనాపరులు చాలా విషయాలు రాసి పంపించారు. ఇది నాకు ఎంతో సంతోషాన్ని కలిగించింది. రెండు విషయాలు నా మనసును స్పర్శించాయి. వాటిలో ఒకటోది.. రాసిన వారందరు విషయాన్ని సరిగ్గా గ్రహించారు. ఇక రెండోది.. ఇన్ని వేల విషయాలు ప్రస్తావనకు వచ్చాయంటే, ఇది ఎంతో మహత్తు కలిగిన అంశమని నేను ఒప్పుకొంటాను. అయితే మనలో చాలా మందిమి పరీక్షలంటే అవి కేవలం ఆ పరిసరాలకో, లేదా ఆ కుటుంబానికో, లేదా విద్యార్థులకు మాత్రమే సంబంధించినవి అంటూ ఒక గిరిని గీచేశాం. నా App లో వచ్చిన సూచనల్ని బట్టి చూస్తే, ఇది ఎంతో విస్తృతమైన అంశమని అర్థమయింది. దీనిపై దేశవ్యాప్తంగా విద్యార్థి వర్గాల్లో చర్చ జరుగుతూ ఉండాలి.
నేను ఈ రోజు నా ‘మన్ కీ బాత్’ లో మరీ ముఖ్యంగా తల్లిదండ్రులతో, పరీక్షార్థులతో, వారి ఉపాధ్యాయులతో మాట్లాడాలనుకుంటున్నాను. నేను విన్నవి, చదివినవి, నాకు ఎవరో సూచించినవి.. వాటిల్లో నుంచి కూడా కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నాకు తోచిన మరికొన్ని విషయాలను కూడా జోడిస్తాను. కానీ, పరీక్షలు రాయబోతున్న విద్యార్థుల కోసం నా ఈ 25- 30 నిమిషాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనేదే నా నమ్మకం.
ప్రియమైన నా విద్యార్థి మిత్రులారా..
నేను ఏదైనా చెప్పే ముందు- ఈ నాటి ‘మన్ కీ బాత్’ ను మనం ప్రపంచ ప్రసిద్ధ ఓపెనర్ మాటలతో ఎందుకు ప్రారంభించకూడదు?. జీవితంలో ఉన్నత విజయ శిఖరాలు చేరుకోవడంలో ఎలాంటి అంశాలు వారికి ఉపకరించాయో, వారి అనుభవాలు మీకు తప్పక తోడ్పడుతాయి. భారతదేశంలోని యువతరం ఎవరిని చూసి గర్వపడతారో అటువంటి వ్యక్తి, ‘భారత రత్న’ శ్రీ సచిన్ టెండూల్కర్ ఒక సందేశాన్ని పంపారు.. దానిని మీకు వినిపించాలనుకుంటున్నాను. వినండి..
“నమస్కారం, నేను సచిన్ టెండూల్కర్ ని మాట్లాడుతున్నాను. కొద్ది రోజుల్లోనే పరీక్షలు మొదలవుతాయని నాకు తెలుసు. మీలో చాలా మంది ఒత్తిడిలో ఉండుంటారు. మీ కోసం నాదొక్కటే సందేశం, మీ మీద మీ తల్లితండ్రులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. స్నేహితులు అంచనాలు వేస్తారు. ఎక్కడికెళ్లినా, పరీక్షలకు ఎలా సిద్ధమవుతున్నారని అందరూ అడుగుతారు. ఎన్ని మార్కులు వస్తాయి, ఎంత స్కోరు చేస్తావని, నేనొకటి చెప్పదలచుకున్నాను.. మీరు స్వయంగా మీ కోసం లక్ష్యాన్ని నిర్ణయించుకోండి. మీరు ఎవరి అంచనాల ఒత్తిడికి లోను కావద్దు. మీరు తప్పక కష్టపడి చదవండి; కానీ వాస్తవికమైన, అందుకోగలిగిన లక్ష్యాన్ని స్వయంగా పెట్టుకోండి. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నం చేయండి. నేను క్రికెట్ ఆడేటప్పుడు నా మీద ఎన్నో అంచనాలు పెట్టుకొనే వారు, నా నుంచి ఎంతో ఆశించే వారు. గత 24 ఏళ్ళలో క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యాయి. చాలా సార్లు మంచి క్షణాలు కూడా వచ్చాయి. కానీ, ప్రజల అంచనాలు ఎప్పుడూ పెరుగుతూ పోయాయి. సమయం గడుస్తున్న కొద్దీ అంచనాలు మరింతగా పేరుకుపోసాగాయి. అందుకు దీనికొక పరిష్కారాన్ని కనుక్కోవడం నాకు ఎంతో అవసరం అయింది. దాంతో నేనిదే ఆలోచించాను.. నా అంచనాలను నేనే నిర్ణయించుకుంటాను; లక్ష్యాలను స్వయంగా నిర్దేశించుకుంటానని అనుకున్నాను. నా లక్ష్యాలను నేను స్వయంగా నిర్ణయించుకొని, వాటిని సాధించగలుగుతున్నానంటే దేశానికి నేను ఎంతో కొంత మంచిని చేయగలుగుతున్నాను. ఇంకా ఆ లక్ష్యాలను సాధించేందుకు నేను నిరంతరం ప్రయత్నిస్తూ ఉండే వాడినే. నా దృష్టి బంతి మీద కేంద్రీకృతమైన కొద్దీ నెమ్మది నెమ్మదిగా లక్ష్యాలు నెరవేరాయి. మన ఆలోచనలు సకారాత్మకంగా ఉండటం అత్యవసరం అని నేను మీకు చెప్పదలచుకున్నాను. సానుకూల ఆలోచనలను సానుకూల ఫలితాలు అనుసరిస్తాయి. అందుకే, మీరు తప్పనిసరిగా సానుకూలతతో ఉండండి, ఆ పై వాడు మీకు మంచి ఫలితాలు ప్రసాదిస్తాడని నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది. పరీక్షల వేళ మీకందరికీ నా శుభాకాంకాంక్షలు. ఎలాంటి ఒత్తిడికీ లోనవకుండా పరీక్షలు రాయండి. ఇంకా మంచి ఫలితాలు పొందండి. గుడ్ లక్..”
మిత్రులారా..!
చూశారా… టెండూల్కర్ గారు ఏం చెప్తున్నారో! ఈ అంచనాల భారాల కింద నలిగిపోకండి. మీ భవిష్యత్తును మీరే నిర్మించుకోవాలి. మీ లక్ష్యాన్ని మీ అంతట మీరే ఏర్పరచుకోండి. స్వచ్ఛమైన మనసుతో, స్వచ్ఛమైన ఆలోచనలతో, స్వచ్ఛమైన సామర్థ్యంతో మీ లక్ష్యానికి చేరే గమ్యాన్ని కూడా మీరే నిర్దేశించుకోండి. సచిన్ గారి ఈ మాటలు మీకు తప్పకుండా ఉపయోగపడతాయని నా నమ్మకం. వేరొకరితో మనకు పోటీ ఎందుకు?. మనతో మనమే పోటీ పడదాము. మరొకరితో పోటీ పడటంలో మన సమయం ఎందుకు వృథా చేసుకోవాలి. మనతో మనమే స్పర్ధ ఎందుకు పెట్టుకోకూడదు. మన రికార్డులను మనమే అధిగమించాలని ఎందుకు ప్రయత్నించకూడదు?. చూడండీ.. మీరు అభివృద్ధి చెందకుండా ఎవరూ ఆపలేరు. పాత రికార్డులను మీరంతట మీరే ఎప్పుడైతే ఛేదిస్తారో, అప్పుడు మీ సంతోషానికి, మీ ఆనందానికి ఎవరూ అడ్డుకట్ట వేయలేరు. ఒక రకమైన సంతోషం లోలోపలి నుంచి వ్యక్తమవుతుంది.
మిత్రులారా..!
పరీక్షలు అంటే సంఖ్యలతో ఆట అని భావించకండి. ఎక్కడికి చేరాము, ఎంత దూరం వచ్చాము.. అనేటటువంటి లెక్కా జమల్లో చిక్కుకోకండి. జీవితానికి అంత కంటే ఒక మహోన్నత ఉద్దేశాన్ని నిర్ణయించుకోవాలి. ఒక స్వప్నంతో ప్రయాణించాలి; సంకల్ప బద్ధులు అవ్వాలి. ఈ పరీక్షలు, అవి మనం సవ్యంగా వెళ్తున్నామా లేదా అనే లెక్కలు కడతాయి; మన పరిస్థితి బాగుందా లేదా అని చూస్తాయి. అందుకే ఒక విశాలమైన, ఉన్నతమైన స్వప్నాన్ని ఏర్పరచుకుంటే- పరీక్షలు అనేవి ఒక ఆనందోత్సవంగా మారిపోతుంది. ప్రతి పరీక్ష ఈ మహోన్నత ఉద్దేశం నెరవేరడానికి ఒక ముందడుగు అవుతుంది. ప్రతి విజయం ఆ మహోన్నత లక్ష్యాన్ని సాధించేందుకు తాళం చెవిగా మారుతుంది. అందుకని ఈ సంవత్సరం ఏమవుతుంది.., ఈ పరీక్ష ఏమవుతుంది.. అని అంతవరకే ఆలోచించకండి. ఒక మహోన్నతమైన లక్ష్యాన్ని ఏర్పరచుకొని ముందుకు సాగండి. అలాంటి సమయంలో ఫలితం ఆశించిన స్థాయిలో లభించక పోయినప్పటికీ నిరాశ పడకండి. మరింత బలంగా, మరింత శక్తిమంతంగా పని చేస్తే.. మరి కాస్త గట్టి ప్రయత్నం చేస్తే.. ఫలితం వస్తుంది.
నా App లో వేలాది మంది మొబైల్ ఫోన్ నుంచి చిన్న చిన్న మాటలు రాశారు. వాటిల్లో ఆరోగ్యకరమైన శరీరంలోనే ఆరోగ్యకరమైన మనసు ఉంటుంది అని శ్రేయ గుప్తా రాసిన మాట ఎన్నదగినది. విద్యార్ధులు తమ చదువుల మీదే కాకుండా ఆరోగ్యం గురించి కూడా శ్రద్ధ తీసుకోవాలి. దానివల్ల పరీక్షను కూడా ఆరోగ్యకరంగా, మంచిగా రాయగలుగుతారు. మీరు దండీలు తీయండి అని, మూడు కిలోమీటర్లు గాని లేదా ఐదు కిలోమీటర్లు గాని పరుగు తీయడానికి వెళ్లండని గాని నేను ఇప్పుడు పరీక్షలకు మరొక్క రోజు మాత్రమే మిగిలి ఉండగా మీకు చెప్పను. కానీ, ఒక్క మాట మాత్రం నిజం.. అదేమిటంటే.. మరీ ముఖ్యంగా పరీక్షల రోజులలో మీ దిన చర్య ఎలా ఉందో చూసుకోండి. ఆ మాటకొస్తే 365 రోజులూ మన దిన చర్య మన కలల, మరియు సంకల్పాల సాధనకు అనువుగా ఉండాలి. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు చెప్పిన ఒక అంశంతో నేను ఏకీభవిస్తాను. ఆయన ప్రత్యేకంగా చేసిన సూచన ఏమిటంటే.. నియమితమైన వేళకు నిద్ర పోవాలి, ఉదయం కాగానే త్వరగా నిద్ర నుంచి లేచి, మననం చేసుకోవాలి అని. పరీక్షా కేంద్రానికి ప్రవేశ పత్రాన్ని, ఇతర వస్తువుల్ని తీసుకొని నిర్ణీత సమయానికన్నా ముందుగానే చేరుకోవాలి. ఈ మాటలనూ ప్రభాకర్ రెడ్డి గారే చెప్పారు. ఈ మాటలను చెప్పడానికి నాకయితే ధైర్యం చాలదేమో!. ఎందుచేతనంటే.. నిద్ర పోయే విషయంలో నేను కాస్తంత ఉదాసీనతను వహిస్తాను. మీరు చాలా తక్కువ సేపే నిద్రపోతారని నా మిత్రులలో చాలా మంది నాతో ఫిర్యాదు చేస్తున్నట్లుగా కూడా అంటూ ఉంటారు మరి. ఇది నాలోని ఒక లోపం; దీనిని సరి చేసుకోవడానికి నేను సైతం ప్రయత్నం చేస్తాను. అయితే, ఈ వాదనతో నేను తప్పక ఏకీభవిస్తున్నాను. తగినంత సేపు నిద్రపోవడం, గాఢమైన నిద్ర.. ఇవి మీరు రోజంతా చేయవల్సిన పనుల కోసం ఎంతో అవసరమైనవే సుమా. నేను అదృష్టవంతుడిని; తక్కువ సేపే నిద్ర పోతాను.. అయితే, నాకు ఆ నిద్ర గాఢంగా పడుతుంది. అందువల్లనే ఆ నిద్ర నాకు సరిపోతున్నది. కానీ మీకు మాత్రం నా మనవి ఏమిటంటే, చాలినంత సేపే నిద్రపొమ్మని. లేదంటే, కొంత మందికి నిద్ర పోయే ముందు చాలా.. చాలా సేపటి వరకు టెలిఫోన్ లో మాట్లాడే అలవాటుంటుంది. ఇక ఆ తరువాత కూడా మెదడులో అవే ఆలోచనలు మెదులుతుంటాయి. అలాంటప్పుడు- నిద్ర ఎలా పడుతుంది?. నేను నిద్ర గురించి చెబుతూ ఉంటే – ఏదో పరీక్షల కోసమే నిద్ర పొమ్మని చెప్తున్నాననుకోకండి. అపార్థం చేసుకోవద్దు. పరీక్షలు రాసే సమయంలో ప్రశ్నలకు చక్కగా జవాబులు రాయడానికి ఎటువంటి ఆందోళన లేకుండా ఉండటానికే మిమ్మల్ని నిద్ర పొమ్మంటున్నాను. అలా నిద్ర పోతూనే ఉండాలని.. నేనేమీ చెప్పటం లేదు. తీరా బాగా నిద్ర పోయి పరీక్షలు రాసి, తక్కువ మార్కులు వచ్చాయంటే- తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయి అని అమ్మ అడిగినప్పుడు.. మోదీ గారు పడుకోమని చెప్పారు, నేను పడుకున్నాను.. అని అని చెబుతారా ఏమిటి! అలా చేయరు కద. మీరు అలా చేయరనే నేను నమ్ముతున్నాను.
అలాగే, జీవితంలో క్రమశిక్షణ అనేది విజయాల పునాదిరాయిని పటిష్టంగా ఉంచేందుకు మూల కారణంగా నిలుస్తుంది. క్రమశిక్షణతో ఒక బలమైన పునాది పడుతుంది. సువ్యవస్థితంగా ఉండని వారు, క్రమశిక్షణను అలవరచుకోని వారు ఉదయం పూట చేయాల్సిన పనిని సాయంత్రం పూట చేస్తారు; మధ్యాహ్నం పూట చేయాల్సిన పనిని రాత్రి ఎంతో పొద్దు పోయిన తరువాత చేస్తారు.. వారు తాము పనిని పూర్తి చేసేశామనుకుంటారు; కానీ, దీనిలో ఎంత శక్తి వృథా అవుతున్నదో.. ప్రతి క్షణం మానసికంగా ఎంత ఒత్తిడో- తెలుసుకోలేరు. మన శరీరంలో ఏదైనా ఒకటీ అరా అవయవాలకు ఏ కొంచెం ఇబ్బంది ఎదురైనా సరే.. మొత్తం శరీరమే బాగా లేనట్టు అనిపిస్తుందన్నది మీకు అనుభవంలోకి వచ్చే ఉంటుంది. అంతే కాదు, మన దినచర్య కూడా అస్తవ్యస్తం అవుతుంది. కాబట్టి దేన్నీ మనం చిన్న చూపు చూడకూడదు. అందుకని ప్రతిదీ అనుకున్న సమయం లోనే చేసేయాలి; ఇందులో రాజీ పడే అలవాటు చేసుకోవద్దు. నిశ్చయించుకోండి, చేసి చూడండి.
మిత్రులారా..!
అప్పడప్పుడు నేను చూశాను, పరీక్షలకు వెళ్లే విద్యార్ధుల్లో రెండు రకాల వాళ్లు కనిపిస్తారు. వారిలో ఒకటో రకం వారు.. వీరు ఏం చదివారో, ఏం నేర్చుకున్నారో, ఏయే విషయాల్లో వారికి ప్రావీణ్యం ఉందో.. అనే విషయాలపైన మనసును లగ్నం చేస్తారు. రెండో రకం వారు.. ఈ విద్యార్ధులకు పరీక్షలో ఏ ప్రశ్న వస్తుందో తెలియదు, ఏ విధమైన ప్రశ్నలు అడుగుతారో, ఆ ప్రశ్నలకు వారు సమాధానాలు రాయగలరో, లేదో ? ప్రశ్నపత్రం కఠినంగా వస్తుందా లేక తేలిగ్గా ఉంటుందా.. అని ఆలోచిస్తారు. మీరు కూడా ఈ రెండు రకాలైన విద్యార్థుల్ని చూసే ఉంటారు. ప్రశ్నపత్రం ఎలా వస్తుందో అనుకుని ఆందోళనలో ఉండే వారిపైన వారి ఫలితాల విషయంలో కూడా నకారాత్మక ప్రభావమే పడుతుంది. ఎవరైతే నా దగ్గర ఏముంది అనే నమ్మకంతో వెళ్తారో వారు ఏం వచ్చినా దానిని తట్టుకోగలుగుతారు. ఈ విషయాన్ని నా కన్నా బాగా ఎవరు చెప్పగలరు అంటే అది – ప్రపంచంలో చేయి తిరిగిన క్రీడాకారుల ఆట కట్టించిన చదరంగం చాంపియన్ విశ్వనాథన్ ఆనంద్- అంటాను. ఆయన తన అనుభవాలను మీతో పంచుకొంటారు. రండి, ఈ పరీక్షల ఆట కట్టించడం ఎలాగో ఆయన ద్వారానే నేర్చేసుకుందురు గాని..
“హలో, నేను విశ్వనాథన్ ఆనంద్ ని. ముందుగా, మీరంతా పరీక్షలు బాగా రాయాలని చెప్పి మీకు నా శుభాభినందనలను అందజేయనివ్వండి. ఇక .. నేను నా పరీక్షలకు ఎలా సిద్దమయ్యానో, ఇంకా నా అనుభవాలు ఏమిటో ఇప్పుడు వివరిస్తాను. జీవితంలో ముందుముందు ఎదురయ్యే సమస్యల వంటివే ఈ పరీక్షలు అని నాకనిపించింది. మీరు బాగా విశ్రాంతి తీసుకొని, రాత్రంతా కంటి నిండా కునుకు తీయాలి. అందుకోసం కడుపారా భోంచేయాలి. ఆకలితో మాత్రం ఉండనేకూడదు. అన్నిటి కంటే ముఖ్యమైనది – ప్రశాంతంగా ఉండటం. ఇదంతా చదరంగం క్రీడా పోటీ వంటిదే; మీరు ఆడుతున్నప్పుడు ఏ పావు ఎప్పుడు ఎటు వస్తుందో మీకు తెలియదు. తరగతి గదిలో మీకు తెలియదు కదా.. పరీక్షలో ఏ ప్రశ్న వచ్చేదీ? అలాగే నన్న మాట ఇది కూడా. అందుకని మీరు ప్రశాంతంగా ఉంటే, పౌష్టికాహారం తింటే, చక్కగా నిద్రపోతే- అదుగో అప్పుడే మీ మెదడు సరైన సమాధానాన్ని సరైన సమయంలో గుర్తు చేసుకోగలుగుతుంది. కాబట్టి ప్రశాంతంగా ఉండండి. మీ మీద ఎక్కువ ఒత్తిడి లేకుండా చూసుకోవటం అనేది ఎంతో కీలకమైన అంశం. మీ మీద అంచనాలను కూడా మరీ ఎక్కువగా పెట్టుకోకండి. కేవలం ఒక సవాలుగా దాన్ని చూడండి- సంవత్సరం అంతా నేర్పించింది గుర్తు చేసుకోగలనా? ఈ సమస్యలను పరిష్కరించగలనా? – అని. చివరి నిమిషంలో చాలా ముఖ్యమైన అంశాలను, ఇంకా మీకు ముఖ్యమైనవిగా అనిపించిన అంశాలను, మీకు బాగా గుర్తు లేని అంశాలను మరోసారి చూసుకోండి. మీ తోటి విద్యార్థుల తోనో, లేక మీ ఉపాధ్యాయుల తోనో జరిగిన కొన్ని ఘటనలను కూడా మీరు పరీక్ష రాసే సమయంలో జ్ఞాపకానికి తెచ్చుకోవచ్చు; దీనివల్ల మీకు ఆ పాఠానికి సంబంధించిన ఎంతో సమాచారం గుర్తుకొస్తుంది. మీకు కష్టంగా అనిపించిన ప్రశ్నలను, పాఠాలను పునశ్చరణ చేశారంటే- అవి మీ మెదడులో తాజా అయిపోతాయి. దీంతో పరీక్ష రాసే సమయంలో వాటిని మరింత మెరుగ్గా రాయగలుగుతారు. అందుకే ప్రశాంతంగా ఉండండి; బాగా నిద్రపోండి. మితిమీరిన ఆత్మవిశ్వాసానికి పోకండి; న్యూనత భావాన్ని కూడా దరిజేరనీయవద్దు. నా అనుభవం ఏమిటంటే – ముందు భయపడిన దాని కంటే పరీక్షలు ఎంతో మెరుగ్గా గడచిపోతాయి. ధైర్యంగా ఉండండి.. మీకు అంతా మంచే జరగాలి గాక.”
విశ్వనాథన్ ఆనంద్ నిజంగా గొప్ప మాట చెప్పారు. ఆయన ఆడే అంతర్జాతీయ చదరంగం పోటీల్లో ఎంత స్వస్థతతో కూర్చుంటారో, ఎంత ఏకాగ్రంగా ఉంటారో మీరు పరిశీలించే ఉంటారు. ఆయన కళ్లు అటూ ఇటూ తిరగవు; ఇది కూడా మీరు గమనించే ఉంటారు. అర్జునుడు దృష్టి పక్షి కంటి మీద నిలిచేదని విన్నాం కదా.. అలాగన్నమాట. సరిగ్గా విశ్వనాథన్ ఆనంద్ కూడా ఆట ఆడుతున్నప్పుడు- ఆయన దృష్టంతా పెద్ద లక్ష్యం మీద కేంద్రీకృతమై ఉంటుంది. ఆయన మనసు లోని ప్రశాంతత ఆ కళ్లలో ప్రతిఫలిస్తుంటుంది. ఎవరైనా చెప్పారని, లోపలి శాంతి బయటికి కనిపిస్తుందా అంటే చెప్పడం కష్టమే. కానీ, ప్రయత్నం చేయాలి. దీనిని నవ్వుతూ నవ్వుతూ ఎందుకు చేయలేం? మీరు నవ్వుతూ ఉండండి. పరీక్షలు రాసేటప్పుడు కూడా ఆడుతూ పాడుతూ, నవ్వుతూ ఉంటే శక్తి తనంతట తాను ప్రశాంతంగా వెలికి వస్తుంది. మీరు స్నేహితులతో మాట్లాడటం లేదు; లేదా, ఒంటరిగా నడుస్తున్నారు.. ఒక్కొక్క అడుగే వేస్తున్నారు; చివరి క్షణం వరకు అలాగే పుస్తకాలను, పేజీలను తిరగేస్తున్నారనుకోండి. అలా చేస్తే మనసు ప్రశాంతంగా ఉండజాలదు. నవ్వండి.. బాగా నవ్వూతూ సాగండి. తోటి వారితో కలసి ఛలోక్తులు విసరుతూ సాగండి. అప్పుడు చూడండి – శాంతియుతమైన వాతావరణం దానంతట అదే వెలస్తుంది.
నేను మీకు ఒక చిన్న మాటను అర్థమయ్యేలా చెప్పాలనుకుంటున్నాను. మీరు ఒక చెరువు ఒడ్డున నిలబడి ఉన్నారనుకోండి. కింద నీటిలో చాలా వస్తువులు కనపడతాయి. కానీ అకస్మాత్తుగా ఆ నీటిలో ఎవరైనా ఒక రాయిని రువ్వారనుకోండి.. నీరు కదలడం మొదలైపోతుంది. అంతకు ముందు ఏమీ లేనప్పుడు కనిపించినట్టుగా రాయి వేసిన తరువాత కనిపిస్తాయా? నీరు కుదురుగా ఉంటే, అందులో అడుగున వస్తువులు కూడా కనిపిస్తాయి. నీరు చెదరిపోతే, అందులోనివి ఏవీ కనపడవు. మీ లోపల కూడా అలా ఎంతో పడి ఉంది; ఏడాది పాటు పడిన శ్రమ తాలూకు భాండాగారం లోపల నిండిపోయి ఉంటుంది. కానీ మనస్సు అశాంతిగా ఉంటే, ఆ ఖజానాను మీరు వెతుక్కోలేరు. అదే.. మనసు ప్రశాంతంగా ఉందనుకోండి.. మీ మనసులోని ఆ ఖజానా వెలికి వచ్చి మీ ముందు నిలుస్తుంది. మీ పరీక్ష అమాంతం సరళంగా మారిపోతుంది.
నేను ఒక విషయాన్ని వెల్లడించనా.. అది నా స్వవిషయమే. నేను ఎప్పుడైనా ఏదైనా ఉపన్యాసం వినడానికి వెళ్తాను, లేదా ప్రభుత్వంలో కూడా కొన్ని విషయాలు నాకు తెలియనివి ఉండవచ్చు. అలాంటి వాటిపైన నేను ఎంతో దృష్టిని కేంద్రీకరించవలసి వస్తుంది. అప్పుడప్పుడు లోతైన పరిశీలన ద్వారా అర్థం చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటాను. అటువంటప్పుడు మనసు లోపల ఒత్తిడి బయలుదేరుతుంది. మళ్లీ నాకనిపిస్తుంది.. లేదు లేదు.. కొద్దిగా సేద తీరుదామని; అలా చేస్తే – అప్పుడు బాగుంటుందనిపిస్తుంది. ఇందుకోసం నాలో నేనే ఒక పద్ధతిని రూపొందించుకున్నాను. బాగా దీర్ఘంగా ఊపిరి పీల్చుకుంటాను. మూడు సార్లు గాని, అయిదు సార్లు గాని- గట్టిగా ఊపిరిని పీల్చుకొని వదులుతాను. దీనికి 30, 40, 50 సెకండ్లు పడుతుంది. కానీ, ఒక్కసారిగా నా మనసు ప్రశాంతమై, విషయాలను అర్థం చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇది నా అనుభవమే కావచ్చు; మీకు కూడా ఉపయోగపడేదే.
రజత్ అగర్వాల్ ఒక మంచి మాట చెప్పారు.. ఆయన నా App లో ఇలా రాశారు – మేము ప్రతి రోజు కనీసం అర గంట స్నేహితులతో, కుటుంబ సభ్యులతో ప్రశాంతంగా మాట్లాడి సేద తీరుతాం. పిచ్చాపాటి మాట్లాడతాం, గప్పాలు కొడతాం. రజత్ జీ చాలా గొప్ప మాట చెప్పారు. ఎందుకంటే చాలా వరకు మనం చూస్తాము.. పరీక్షలు రాసి ఇంటికి రాగానే, లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాం.. ఎన్ని సరిగ్గా రాశాము. ఎన్ని తప్పులు రాశాము.. అని. ఇంట్లో కూడా తల్లితండ్రులు చదువుకున్న వారైతే, వారు కూడా ఉపాధ్యాయులైతే.. నువ్వు పరీక్ష ఎలా రాశావు?, ఏమేం ప్రశ్నలు వచ్చాయి అంటూ మళ్లీ పరీక్షను పూర్తిగా రాయిస్తారు; లేదా, ఏం జవాబులు రాశావో చెప్పమంటారు. 40 మార్కులు వస్తాయా?, 80 మార్కులు వస్తాయా?, 90 మార్కులు వస్తాయా? అని అడుగుతారు. అప్పుడు మీ మెదడంతా వేడెక్కుతుంది. మీరైనా ఏం చేస్తారు.. ఫోన్లలో స్నేహితులతో ఈ విషయాలు మాట్లాడతారు. ‘అరె యార్! అందులో నువ్వు ఏమి రాశావు?. ఏయే ప్రశ్నలకు జవాబులు రాశావు, నీకేమనిపిస్తోంది’ అంటారు. మీ మిత్రులేమో – నేనంతా గందరగోళంలో పడిపోయాను. తప్పు చేశాననిపించింది; నాకు జవాబు తెలిసి కూడా, ఆ సమయానికి జ్ఞాపకం రాలేదు.. అంటారు. ఇట్లా, ఇందులోనే పడి కొట్టుకుంటాము. మిత్రులారా! మీరిలా చేయకండి. పరీక్ష సమయం ముగిసింది. అయిపోయిందేదో అయిపోయింది. కుటుంబ సభ్యులతో గప్పాలు కొట్టండి. పాత హాస్యపు ముచ్చట్లు మరో సారి చెప్పుకోండి. ఎప్పుడైనా అమ్మానాన్నలతో ఎక్కడికైనా వెళ్లి ఉంటే, అదుగో అప్పటి సంగతులను నెమరు వేసుకోండి. పూర్తిగా వాటి నుంచి బయటపడి అరగంట గడపండి. రజత్ జీ మాటలు నిజంగా అర్థం చేసుకోదగినవిగా ఉన్నాయి.
మిత్రులారా..!
నేను మీకు శాంతి గురించి ఓ మాట చెప్పనా? ఈ రోజు మీరు పరీక్ష రాయడానికి ముందు ఎటువంటి వ్యక్తి మీకొక సందేశం పంపారంటే.. ఆయన మౌలికంగా ఒక అధ్యాపకుడు; ఇప్పుడు ఒక రకమైన సంస్కార ప్రబోధకునిగా మారారు. రాంచరిత్ మానస్ ను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించి, దాని గురించి వ్యాఖ్యానం చేస్తూ దేశం లోపలా, దేశం బయటా ప్రపంచం అంతటికీ ఆ సంస్కార ప్రవాహాన్ని చేరవేసే ప్రయత్నాలలో ఉన్నారు. అటువంటి పూజ్య మురారీ బాపూ సైతం విద్యార్థుల కోసం ఒక మహత్వపూర్ణమైన చిట్కాను పంపించారు. ఆయన ఒక బోధకుడు , ఆలోచనాపరుడు కూడా, అందుచేత ఆయన మాటల్లో రెండింటి సమ్మేళనం ఉంటుంది.
“నేను.. మురారీ బాపూను.. మాట్లాడుతున్నాను. విద్యార్థి సోదర సోదరీమణులకు నేను చెప్పదలచుకుంటున్నది ఏమిటంటే.. పరీక్షల సమయంలో మనసు మీద ఎటువంటి భారాన్నీపెట్టుకోకండి. స్పష్టమైన నిర్ణయాన్నితీసుకుని, మీరు పరీక్ష రాయడానికి కూర్చోండి. ఎటువంటి పరిస్థితి వచ్చినా, దానిని స్వీకరించండి. పరిస్థితిని ఉన్నది ఉన్నట్టుగా స్వీకరించినట్లయితే, మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. సంతోషంగా ఉండగలుగుతాము అనేది నా అనుభవం. మీ పరీక్షలో మీరు ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంత చిత్తంతో ముందుకు సాగినట్లయితే తప్పక సఫలులవుతారు. ఒకవేళ ఉత్తీర్ణత లభించకపోయినా, పరీక్ష తప్పామన్న దిగులు ఉండదు; సఫలమయ్యామని గర్వంగా కూడా ఉంటుంది. ఒక కవిత చెప్పి నేను నా సందేశాన్ని, శుభాకాంక్షలనూ అందజేస్తాను – అది
“ప్రతి ఒక్కరూ కృతకృత్యులే కావాలని నియమం ఏమీ లేదు;
వైఫల్యాలతో కూడా కలసి జీవించడం నేర్చుకోండి”.
గౌరవనీయులైన మన ప్రధాన మంత్రి గారి ‘మన్ కీ బాత్’ కార్యక్రమం విలువైనదిగా భావిస్తున్నాను. అందరికీ మరీ మరీ నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను, ధన్యవాదాలు.
పూజ్య మురారీ బాపు మనందరికీ చాలా మంచి సందేశం ఇచ్చినందుకు ఆయనకు నేను కూడా కృతజ్ఞుడను.
మిత్రులారా..!
ఇవాళ నేను మరో మాట చెప్పాలనుకుంటున్నాను. నేను ఒక విషయం గమనిస్తున్నాను. ఈ సారి ప్రజలు తమ అనుభవాలను చెప్పినపుడు వాటిలో యోగా గురించిన ప్రస్తావన తప్పకుండా తీసుకువచ్చారు. ఈ రోజుల్లో ప్రపంచంలో నేను ఎవరిని కలసినా సరే, కొంచెం సమయం దొరికినా చాలు యోగా గురించి కొద్దిగా అయినా ఎవరో ఒకరు మాట్లాడుతూనే ఉంటారు; ఇది నాకు ఎంతో సంతోషం కలిగించే విషయం. ప్రపంచంలో ఏ దేశానికి చెందిన వ్యక్తి అయినా కానివ్వండి; భారత్ కి చెందిన వ్యక్తే అయినా కానివ్వండి – యోగా గురించి ఇంతటి ఆకర్షణ ఏర్పడింది; ఇంతటి జిజ్ఞాస పుట్టుకువచ్చింది. ఇది నాకు చాలా బాగా అనిపిస్తోంది. నా మొబైల్ App నకు ఎంతో మంది – శ్రీ అతను మండల్, శ్రీ కుణాల్ గుప్తా, శ్రీ సుశాంత్ కుమార్, శ్రీ కె.జి. ఆనంద్, శ్రీ అభిజీత్ కులకర్ణి – ఇలా లెక్కలేనంత మంది మెడిటేషన్ గురించి ప్రస్తావించారు. యోగా ప్రాధాన్యం గురించి మాట్లాడారు. సరే, మిత్రులారా! నేను ఇప్పుడే ఇవాళే చెప్పాను అనుకోండి, రేపు పొద్దుటి నుంచి యోగా చేయడం మొదలు పెట్టండి అని – అది మీ పట్ల అన్యాయం చేయడమే అవుతుంది. కానీ, ఇప్పటికే యోగా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు పరీక్ష ఉంది, ఇవాళ చేయవద్దులే అనుకోవద్దు; అలా చేయవద్దు. చేస్తున్నారంటే.. చేయండి. కానీ, ఈ మాట మాత్రం నిజం. విద్యార్థి జీవితంలో కానివ్వండి, లేదా ఆ తదనంతర జీవితంలో కానివ్వండి.. మనో వికాస యాత్రలో యోగా ఒక మంచి పరిష్కారం. చాలా తేలికైన పరిష్కారం. మీరు తప్పక దానిపై దృష్టి సారించండి. ఆ.. మీ దగ్గర్లో ఎవరైనా యోగా తెలిసిన వారు ఉన్నట్లయితే వారిని అడగండి. అంతకు ముందు యోగా చేయకపోయినప్పటికీ పరీక్షల రోజుల్లో – రెండు, మూడు విషయాలు చెప్తారు, మీరు వాటిని రెండు నాలుగైదు నిమిషాల్లో చేయగలుగుతారు. చూడండి, వాటిని మీరు చేయగలరేమో. అవును, దాని మీద నాకు బాగా నమ్మకం ఉంది.
నా యువజన సహచరులారా! పరీక్ష హాలులోకి వెళ్ళాలని మీకు చాలా తొందరగా ఉంటుంది. త్వరత్వరగా మీ బల్ల మీద వెళ్ళి కూర్చోవాలని అనిపిస్తూ ఉంటుంది. ఈ విషయాలన్నీ హడావుడిగా ఎందుకు చేస్తారు? మీ మొత్తం రోజులోని సమయానికి ప్రణాళిక ముందుగానే ఎందుకు సిద్ధం చేయరు..? అంటే ట్రాఫిక్ లో చిక్కుకుపోయినా సరే, సమయానికన్న ముందుగానే గమ్యాన్ని చేరగలిగేటట్లుగా ప్రణాళికను ఎందుకు వేసుకోరు. అలా వేసుకోలేదంటే గనక ఇటువంటి విషయాలు ఒక కొత్త ఒత్తిడిని సృష్టిస్తాయి. ఇంకొక మాట – మనకు ఎంత సమయం దొరికిందో ఆ సమయంలో ప్రశ్నపత్రం, సూచనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సమయం వృథా అవుతుంది కదా- మన సమయాన్ని ఇవి మింగేస్తాయి కదా- ఇలాగని అప్పుడప్పడూ అనిపిస్తుంది. కానీ, అలాంటిదేమీ లేదు. మిత్రులారా! ఆ సూచనలను మీరు జాగ్రత్తగా క్షుణ్ణంగా చదవండి. రెండు నిమిషాలు, మూడు నిమిషాలు, ఐదు నిమిషాలు పోతే పోతాయి. అంతే కదా! పెద్ద నష్టమేమీ జరగదు. కానీ దాని వల్ల పరీక్షలో ఏం చేయాలి అనేది తెలుస్తుంది. ఎటువంటి అయోమయం ఉండదు, తరువాత పశ్చాత్తాపం కలగదు. ఇంకా, నేను చాలా సార్లు చూశాను.. పరీక్ష పేపరు వచ్చిన తరువాతనే పద్ధతి కొత్తగా ఉందనిపిస్తుంది. కానీ, సూచనలు చదివిన తరువాత బహుశా అందుకు తగినట్టుగా మనకు మనం సిద్ధమవుతాం. ఆ.. ఫర్వా లేదు; నేను ఇలాగే రాయాలి అని. మీకు నేను విన్నవిస్తున్నాను.. ఒక్క అయిదు నిమిషాలు ఇందులో పోతే పోనీయండి కానీ, ఇది మాత్రం తప్పక చేయండి.
శ్రీ యశ్ నాగర్ నా మొబైల్ App నకు ఇలా రాశారు – ఆయన మొదటి సారి ప్రశ్నపత్రాన్ని చదివినప్పుడు అది చాలా కష్టంగా ఉన్నట్టు అనిపించిందిట. కానీ, అదే పేపరును రెండో సారి ఆత్మ విశ్వాసంతో చదివితే ఇప్పుడు ఈ ప్రశ్నా పత్రమే నా దగ్గర ఉంది.. కొత్త ప్రశ్నలేవీ వచ్చేది లేదు. ఇన్ని ప్రశ్నలు మాత్రమే నేను రాయాలి అని. ఆయన ఏం రాశారంటే, రెండో సారి నేను ఆలోచించడం మొదలు పెడితే – నాకు ఎంతో తేలిగ్గా పేపరు అర్థమయింది అని. మొదటి సారి చదివినప్పుడు నాకు రాదు అని అనిపించింది. కానీ, అదే పేపరును రెండో మారు చదివితే – కాదు.. కాదు; అదే ప్రశ్నను వేరే పద్ధతిలో పెట్టారు, కానీ విషయం మాత్రం అదే, నాకు తెలిసినదే.. అని అర్థమైంది అని. అంటే ఇక్కడ ప్రశ్నలను గ్రహించడం అనేది చాలా ముఖ్యావవసరం. ప్రశ్న తీరును అర్థం చేసుకోకపోతే అప్పుడప్పుడు ప్రశ్న కఠినంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీరు ప్రశ్నలను రెండు సార్లు చదవండి, మూడు సార్లు చదవండి, నాలుగు సార్లు చదవండి.. మీకు తెలిసిన దానితో దానిని సరిచూసుకునే ప్రయత్నం చేయండి – అని యశ్ నాగర్ చెప్పిన మాటలను నేను సమర్థిస్తున్నాను. మీరు చూడండి, దీనివల్ల రాయటానికి ముందే ప్రశ్న తేలికయిపోతుంది.
నాకు ఈ రోజు చాలా సంతోషం కలిగించే విషయం ఏమిటంటే – ‘భారత రత్న’ – మన ప్రముఖ శాస్త్రవేత్త సి.ఎన్.ఆర్. రావు – ధైర్యాన్ని గురించి నొక్కి చెప్పారు. అతి కొద్ది పదాలలోనే; కానీ మన విద్యార్థులందరికీ ఆయన మంచి సందేశాన్ని ఇచ్చారు. రండి – రావు గారి సందేశం విందాం…
“నేను.. బెంగళూరు నుంచి సి.ఎన్.ఆర్.రావు ను. పరీక్షలు ఉత్కంఠ కలిగిస్తాయని నేను పూర్తిగా అర్థం చేసుకుంటాను. అందునా పోటీ పరీక్షలు. ఆందోళన పడకండి, మీ శక్తి వంచన లేకుండా పని చేయండి. నా యువ మిత్రులందరికీ నేను చెప్పేది అదే. అదే సమయంలో, ఒక విషయం గుర్తు పెట్టుకోండి – ఈ దేశంలో చాలా అవకాశాలు ఉన్నాయి. జీవితంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారో నిర్ణయించుకోండి, ఎప్పటికీ పట్టు వీడకండి. మీరు గెలుస్తారు. మీరు ఈ విశ్వ మాత పిల్లలన్న సంగతి మరచిపోవద్దు. చెట్లూ – పర్వతాల మాదిరి గానే మీకు కూడా ఇక్కడ ఉండే హక్కు ఉంది. మీకు కావలసిందల్లా పట్టుదల, అంకిత భావం, సాధన. ఈ లక్షణాలతో మీరు అన్ని పరీక్షలలోనూ ఉత్తీర్ణులవుతారు. అన్ని ఇతర ప్రయత్నాలలో గెలుస్తారు. మీరు చేయాలనుకునే ప్రతి విషయంలో విజయం సాధించాలని ఆశిస్తున్నాను. దైవం మిమ్మల్ని ఆశీర్వదించుగాక.”
చూశారా, ఒక గొప్ప శాస్త్రవేత్త మాట్లాడే తీరు ఎలా ఉంటుందో! ఏ మాట చెప్పడానికి నేను అర గంట సమయం తీసుకుంటానో, ఆ మాటను వాళ్ళు మూడు నిమిషాల్లో చెప్పేస్తారు. ఇదే విజ్ఞాన శాస్త్రానికి ఉండే బలం. ఇదే శాస్త్రవేత్త మనసుకు ఉండే బలం. దేశంలోని పిల్లలకు స్ఫూర్తిని ఇచ్చినందుకు రావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దృఢత్వం, నిష్ఠ, సాధన ల గురించి ఆయన చెప్పిన మాటలు ఇవే – అంకిత భావం, దృఢ నిశ్చయం, శ్రద్ధ – దృఢంగా ఉండండి మిత్రులారా! దృఢంగా ఉండండి. మీరు దృఢంగా ఉంటే భయం కూడా భయపడుతూ ఉంటుంది. ఇంకా, మంచి చేయడానికి బంగారు భవిష్యత్తు మీ కోసం ఎదురు చూస్తోంది.
ఇప్పుడు నా App పైన రుచిక డాబస్ నుంచి ఒక సందేశం – తన పరీక్షల అనుభవాన్ని రుచిక పంచుకున్నారు. పరీక్షల సమయంలో తన కుటుంబ సభ్యులు అందరూ ఒక సానుకూల వాతావరణం ఉండేలా నిరంతర ప్రయత్నం చేస్తూ ఉంటారనీ, ఇదే విధమైన కసరత్తు తమ తోటి కుటుంబాల్లో కూడా జరుగుతుందనీ చెప్పారు. మొత్తంమీద సానుకూలమైన వాతావరణం అన్న మాట. ఈ మాట సరైనదే. సచిన్ జీ కూడా చెప్పినట్టు.. సానుకూల ధోరణి, సానుకూల మనో దృక్పథం- ఇవి సానుకూల శక్తిని తయారు చేస్తాయి.
అప్పుడప్పుడు చాలా మాటలు ఎలా ఉంటాయంటే, మనకు ప్రేరణనిచ్చే బోలెడు మాటలు – విద్యార్థులకు మాత్రమే ప్రేరణనిస్తాయని అనుకోవద్దు. జీవితంలో ఎటువంటి దశలో మీరు ఉన్నప్పటికీ, ఒక మంచి ఉదాహరణ, నిజ జీవిత ఘట్టాలు.. ఇవి అధిక ప్రేరణనిస్తాయి; చాలా బలాన్ని కూడా ఇస్తాయి. క్లిష్ట సమయంలో నూతన మార్గాలను చూపుతాయి. మనందరం విద్యుత్తు బల్బు ను ఆవిష్కరించిన థామస్ ఎల్వా ఎడిసన్ ను గురించి మన పాఠాల్లో చదువుకుంటాం. కానీ మిత్రులారా, ఎప్పుడైనా ఈ విషయం ఆలోచించారా.. ఈ పని చేయడానికి ఆయన ఎన్ని సంవత్సరాలు వెచ్చించారో. ఆయనకు ఎన్నిసార్లు వైఫల్యాలు ఎదురయ్యాయో! ఎంత సమయం పట్టిందో. ఎంత డబ్బు ఖర్చయిందో, వైఫల్యాలతో ఎంతగా నిరాశ చెంది వుండవచ్చో. కానీ, ఈ రోజు ఆ విద్యుత్తే, ఆ బల్బే.. మన జీవితాల్లో కూడా వెలుగులు నింపుతున్నాయి. అందుకే అంటారు.. వైఫల్యాల్లో కూడా విజయాలు దాగి ఉంటాయని.
శ్రీనివాస రామానుజన్ అంటే తెలియని వారు ఎవరు? ఆధునిక కాలంలో మహోన్నత గణిత శాస్త్రవేత్తలలో ఒక పేరున్న భారత గణిత శాస్త్రవేత్త ఆయన. మీకు తెలిసే ఉంటుంది, గణితంలో ఎటువంటి సంప్రదాయ విద్యను ఆయన అభ్యసించలేదు. ప్రత్యేక శిక్షణ అయినా తీసుకోలేదు. కానీ ఆయన గణిత విశ్లేషణ, సంఖ్యా సిద్ధాంతం వంటి విభిన్న రంగాలలో అమూల్యమైన సేవలు అందించారు. అత్యంత కష్టమైన జీవితాన్ని, దుఃఖ భరితమైన జీవితాన్ని గడిపినప్పటికీ ప్రపంచానికి ఆయన ఎంతో ఇచ్చి వెళ్ళారు.
విజయం అనేది ఎప్పుడైనా, ఎవరినైనా వరించవచ్చుననటానికి మంచి ఉదాహరణ జె.కె. రాలింగ్. హారీ పోటర్ సిరీస్ ఈనాడు ప్రపంచమంతటా మారుమోగుతోంది. కానీ మొదటి నుంచి ఇలా లేదు. ఆమె ఎన్నో సమస్యలకు ఎదురీదవలసి వచ్చిందని, ఎన్ని వైఫల్యాలో వచ్చాయని, ఇన్ని కష్టాల్లో కూడా తాను దైవంగా భావించే ఆ పనిలోనే తన శక్తినంతా ధారపోశానని రాలింగ్ స్వయంగా చెప్పారు.
పరీక్షలు ఈ మధ్య విద్యార్థులకు ఒక్కరికే కాదు, మొత్తం కుటుంబానికీ, పాఠశాలకూ, ఉపాధ్యాయులకూ.. అందరికీ పరీక్షలు అవుతాయి. కానీ, తల్లితండ్రులు, ఉపాధ్యాయుల మద్దతు లేకుండా ఒంటరి విద్యార్థి పరిస్థితి బావుండదు. టీచరో, తల్లిదండ్రులో, సీనియర్ విద్యార్థులో.. వీరంతా కలసి ఒక జట్టుగా ఏర్పడి, ఒకే విధంగా ఆలోచిస్తూ వ్యూహాత్మకంగా ముందడుగు వేస్తే, పరీక్ష సులువై పోతుంది.
శ్రీ కేశవ్ వైష్ణవ్ నాకు App లో రాశారు. ఆయన ఫిర్యాదు చేశారు. ఏమనంటే, ఎక్కువ మార్కుల కోసం తల్లితండ్రులు తమ పిల్లల మీద ఎప్పుడూ ఒత్తిడి తీసుకురాకూడదని. పరీక్షలకు సిద్ధం కావటానికి మాత్రం ప్రోత్సహించాలి. వాళ్ళు విశ్రాంతిగా ఉండేలా చూడాలి.
పిల్లల మీద తమ ఆశల బరువును మోపవద్దని విజయ్ జిందల్ రాశారు. ఎంత వీలైతే అంతగా వారికి ధైర్యం చెప్పాలి. విశ్వాసం నిలుపుకొనేందుకు సహాయం చేయాలి. అది నిజమే. ఈ రోజు తల్లితండ్రులకు ఎక్కువగా చెప్పాలనుకోవడం లేదు. దయచేసి పిల్లలను ఒత్తిడిలో పడేయకండి. ఒకవేళ ఎవరైనా స్నేహితునితో మాట్లాడుతుంటే – వారించకండి. ఒక తేలికపాటి వాతావరణాన్ని – సకారాత్మక వాతావరణాన్ని నెలకొల్పండి. చూడండి.. మీ అబ్బాయి లేదా మీ అమ్మాయిలో ఎంత నమ్మకం వస్తుందో. మీకు కూడా ఆ విశ్వాసం కనిపిస్తుంది.
మిత్రులారా…!
ఒకటి మాత్రం తథ్యం. ముఖ్యంగా యువ మిత్రులతో చెప్పాలనుకుంటున్నాను. మన జీవితం మన పూర్వ తరాల కంటే ఎంతో మారిపోయింది. ప్రతి క్షణం కొత్త ఆవిష్కారం, కొత్త పరిజ్ఞానం, విజ్ఞానం నిత్య నూతన రూపాన్ని సంతరించుకుంటోంది. ఇంకా.. మనం కేవలం నిష్ఫలం అయిపోతున్నామనే భావన. కానీ, అది కాదు.. దానితో జత కలవటానికి మనం ఇష్టపడతాం. మనం కూడా విజ్ఞానం వేగాన్ని మించి, ముందుకు దూసుకుపోవాలని కోరుకుంటాం.
నేనీమాట ఎందుకు చెప్తున్నానంటే, మిత్రులారా, ఈరోజు జాతీయ విజ్ఞాన దినోత్సవం. దేశ విజ్ఞాన మహోత్సవాన్ని ఏటా ఫిబ్రవరి 28న జాతీయ విజ్ఞాన దినోత్సవంగా పాటిస్తాం. 1928 ఫిబ్రవరి 28 – సర్ సి.వి.రామన్ తన పరిశోధన – ‘రామన్ ఎఫెక్ట్’ను ప్రకటించారు. అదే పరిశోధనకు ఆయనకు నోబెల్ పురస్కారం లభించింది. అందుకే దేశం ఫిబ్రవరి 28న నేషనల్ సైన్స్ డే రూపంలో జరుపుకొంటోంది. జిజ్ఞాస – విజ్ఞానానికి మాత. ప్రతి ఒక్కరి మనసులో వైజ్ఞానిక సంబంధమైన ఆలోచనలు ఉండాలి. విజ్ఞానం పట్ల ఆకర్షణ ఉండాలి. ప్రతి తరం ఆవిష్కారాల పైన దృష్టి పెట్టాలి. విజ్ఞానం, టెక్నాలజీ లేకుండా- ఆవిష్కారం సంభవం కాదు.
ఈ రోజు నేషనల్ సైన్స్ డే సందర్భంగా దేశంలో ఆవిష్కారాలకు బలం చేకూరింది. జ్ఞానం, విజ్ఞానం, సాంకేతికత, ఇవన్నీ మన వికాస యాత్రలో సహజంగా భాగం కావాలి. ఇంకా, ఈ సారి నేషనల్ సైన్స్ డే ఇతివృత్తం ‘మేక్ ఇన్ ఇండియా.. సైన్స్ – టెక్నాలజీ ఆధారిత ఆవిష్కరణలు.’
సర్ సి.వి.రామన్ కు శిరసు వంచి నమస్కరిస్తున్నాను. విజ్ఞానం పట్ల ఆసక్తిని పెంచుకోవలసిందిగా మీకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
మిత్రులారా..!
అప్పుడప్పుడూ విజయాలు చాలా ఆలస్యంగా వస్తాయి. విజయం ఎప్పుడైతే వరిస్తుందో – అప్పుడు ప్రపంచాన్ని చూసే దృష్టి కూడా మారిపోతుంది. పరీక్షల్లో మీరు బహుశా తీరిక లేకుండా ఉండవచ్చు. అందుకే చాలా వార్తలు మీ మనసులో నమోదు కాకపోవచ్చు. కానీ ఈ మాటను నేను దేశ ప్రజలందరికీ మరో సారి చెప్పాలనుకుంటున్నాను. కొద్ది రోజుల క్రితం విని ఉంటారు. విజ్ఞాన ప్రపంచంలో ఒక పెద్ద… ముఖ్యమైన పరిశోధన జరిగింది. ప్రపంచ శాస్త్రవేత్తలు ఎంతో కష్టపడ్డారు. తరాలు వచ్చిపోయాయి. ఎంతో కొంత చేస్తూ పోయాయి. ఇంకా సుమారు వందేళ్ళ తరువాత ఒక విజయం చేతికందింది. గురుత్వాకర్షణ తరంగాలను (Gravitational Waves)మన శాస్త్రవేత్తలు తీవ్ర కృషితో గుర్తించారు. విజ్ఞాన రంగంలో ఇదొక సుదూర ప్రయాణం అనంతరం లభించిన ఫలితం. గత శతాబ్దికి చెందిన ప్రముఖ శాస్త్రవేత్త ఐన్ స్టీన్ సిద్ధాంతాన్ని ఈ పరిశోధన ప్రామాణీకరించటంతో పాటు భౌతిక శాస్త్రంలో గొప్ప ఆవిష్కారంగా కూడా గుర్తింపు పొందింది. మానవ జాతి అంతటికీ, విశ్వమంతటికీ ప్రయోజనం చేకూర్చే అంశం ఇది. ఈ పరిశోధన ప్రక్రియలో మన దేశ ముద్దు బిడ్డలు, మన మేధావి శాస్త్రవేత్తలు కూడా పాల్గొనడం, వారికీ ఇందులో భాగస్వామ్యం ఉండటం భారతీయులుగా మనకందరికీ ఆనందదాయకం.
నేను ఆ శాస్త్రవేత్తలందరికీ హార్దిక శుభాకాంక్షలు తెలియ జేయాలనుకుంటున్నాను; అభినందనలు తెలియజేయాలనుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా ఈ పరిశోధనను ముందుకు తీసుకువెళ్ళడంలో మన శాస్త్రవేత్తలు కృషి ని కొనసాగిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో జరిగే కృషిలో భారతదేశం కూడా భాగస్వామి అవుతుంది. నా దేశ వాసులారా! గతంలో ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకున్నాం. ఈ పరిశోధనలో మరిన్ని సత్ఫలితాలు సాధించేందుకు లేజర్ ఇంటర్ ఫెరో మీటర్ గ్రావిటేషనల్- వేవ్ అబ్జర్వేటరీ.. సంక్షిప్తంగా చెప్పాలంటే.. ‘లిగో’ను భారతదేశంలో ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది. ప్రపంచంలో రెండు చోట్ల మాత్రమే ఇలాంటి వ్యవస్థ ఉంది. భారతదేశం మూడోది. ఈ కృషిలో భారతదేశం కూడా పాలుపంచుకోవడంతో, కొత్త శక్తి వస్తుంది; కొత్త వేగం పుంజుకొంటుంది. తనకున్న సదుపాయాలతోనే మానవ వికాసానికి దోహదం చేసే ఈ మహోన్నత వైజ్ఞానిక పరిశోధనా ప్రక్రియలో మన దేశం సక్రియాత్మక భాగస్వామి అవుతుంది. నేను మరొక్క సారి శాస్త్రవేత్తలందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
ప్రియమైన నా దేశ వాసులారా…!
నేను మీకు ఒక నంబర్ ఇస్తున్నాను. రేపటి నుంచి ఆ నంబర్ కు మిస్ డ్ కాల్ ఇచ్చి ఆ నంబర్ నుంచి నా ‘మన్ కీ బాత్’ వినగలుగుతారు. మీ మాతృ భాషలో కూడా వినవచ్చు. మిస్ డ్ కాల్ ఇవ్వడానికి నంబర్ 81908 – 81908.
మరో సారి నంబర్ చెబుతున్నాను 81908 – 81908.
మిత్రులారా…!
మీ పరీక్షలు ప్రారంభం అవుతున్నాయి. నేను కూడా రేపు పరీక్ష రాయాల్సి ఉంది. 125 కోట్ల మంది దేశ ప్రజలు నన్ను పరీక్షించనున్నారు. అదేమిటో తెలుసా.. రేపు బడ్జెట్ ఉంది. 29 ఫిబ్రవరి. ఇది లీప్ సంవత్సరం. అయితే మీరు చూశారు.. నా మాటలు వినగానే మీకు తెలుసుంటుంది నేను ఎంత ఆరోగ్యంగా ఉన్నానో, ఎంత ఆత్మ విశ్వాసంతో ఉన్నానో. సరే.. నా పరీక్ష పూర్తవుతుంది. ఎల్లుండి మీ పరీక్షలు మొదలవుతాయి. మనం అందరం ఉత్తీర్ణులమవుదాం. దాంతో, దేశం కూడా సఫలమవుతుంది.
మరి మిత్రులారా..!
మీకు కూడా ఎన్నెన్నో శుభాకాంక్షలు. బోలెడన్ని శుభాభినందనలు. సాఫల్య – వైఫల్యాల ఆందోళన నుంచి బయటపడి విముక్తమైన మనసులతో ముందుకు సాగండి; దృఢంగా సాగుతూనే ఉండండి.
ధన్యవాదములు.
ప్రియమైన నా దేశవాసులారా..
2016 లో ఇది మొదటి 'మన్ కీ బాత్'. 'మన్ కీ బాత్' కార్యక్రమం నన్ను మీతో ఎంతగా కట్టిపడేసిందంటే, నా దృష్టికి ఏ విషయం వచ్చినా.. ఏ ఆలోచన వచ్చినా దాన్ని మీతో చెప్పాలనిపిస్తుంది. నిన్న నేను పూజ్య బాపూజీకి శ్రద్ధాంజలి ఘటించడానికి రాజ్ ఘాట్ కు వెళ్ళాను. అమర వీరులను స్మరించుకోవడం ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమమే. సరిగ్గా ఉదయం 11 గంటలకు రెండు నిముషాలు మౌనం పాటించి దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన, ప్రాణత్యాగాలు చేసిన మహా పురుషులకు, వీరులకు, తేజోమూర్తులకు, తపస్సంపన్నులకు శ్రద్ధాంజలిని సమర్పించేందుకు అవకాశం కలుగుతుంది. కానీ...మనం ఆలోచిస్తే ఇలా చేయని వారు మనలో ఎవరైనా ఉన్నారా...? దీన్ని మనం స్వభావంగా మార్చుకోవాలి అనిపించడం లేదా...? మన జాతీయ బాధ్యతగా భావించాలని అనిపించదూ. నాకు తెలుసు. ఒక్క 'మన్ కీ బాత్' ద్వారా ఇవన్నీ జరిగేవి కావు. కానీ - నిన్న అనిపించింది. మీతో కూడా మాట్లాడదామనుకున్నాను. ఇలాంటి భావాలే దేశం కోసం జీవించే ప్రేరణను మనకిస్తాయి. మీరొకసారి ఆలోచించండి. ప్రతియేటా జనవరి 30 న సరిగ్గా 11 గంటలకు 125 కోట్ల మంది దేశ ప్రజలు రెండు నిముషాలు మౌనం పాటిస్తారు. ఈ చర్యలో ఎంత శక్తి ఉంటుందో మీరు మనం ఊహించవచ్చు. మన శాస్త్రాల్లో చెప్పినట్టు "సంగచ్ఛద్వం సంవదధ్వం సం వో మనాంసి జానతామ్". మనం అంతా ఏకస్వరంగా పలుకుదాం. కలసి నడుద్దాం. మన భావన ఒక్కటే.. ఇదే దేశం యొక్క అసలైన శక్తి. ఈ శక్తికి ఇలాంటి ఘటనలే ప్రాణం పోస్తాయి.
ప్రియమైన నా దేశవాసులారా..
కొన్నాళ్ళ క్రితం నేను సర్దార్ పటేల్ సిద్ధాంతాలను చదువుతుండగా... కొన్ని విషయాలపై నా దృష్టి మళ్ళింది. వాటిలో ఒక్క విషయం నాకు చాలా నచ్చింది. ఖద్దరుకు సంబంధించి సర్దార్ పటేల్ చెప్పారు- భారతదేశ స్వాతంత్ర్యం ఖద్దరులోనే ఉంది అని. భారతదేశ సభ్యత కూడా ఖద్దరులోనే ఉంది. మనం పరమ ధర్మంగా భావించే అహింస కూడా ఖద్దరు లోనే ఉంది. భారతదేశంలో రైతుల శ్రేయస్సు గురించి మనం ఎంతో అనురక్తి చూపుతాం. వారి సంక్షేమం కూడా ఖద్దరు లోనే ఉంది. సర్దార్ గారికి సరళమైన భాషలో విషయాన్ని సూటిగా చెప్పే అలవాటు ఉండేది. ఖాదీ గొప్పతనాన్ని ఆయనెంతో బాగా చెప్పారు. నిన్న జనవరి 30న పూజ్య బాపూజీ పుణ్య తిథి నాడు దేశంలోని ఖద్దరు, గ్రామీణ పరిశ్రమలతో ముడిపడిన వారందరికీ చేరేలా నేను లేఖ రాసే ప్రయత్నం చేశాను. పూజ్య బాపూజీ విజ్ఞాన పక్షపాతిగా ఉండే వారు. నేను కూడా టెక్నాలజీని ఉపయోగించి లక్షలాది మంది సోదర సోదరీమణులను చేరే ప్రయత్నం చేశాను. ఖద్దరు ఇప్పుడు ఒక ప్రతీకగా మారింది. ఒక ప్రత్యేకమైన అస్తిత్వంగా మారింది. ఇప్పుడు ఖద్దరు యువతరాన్ని కూడా ఆకర్షించేదిగా మారుతోంది. ప్రత్యేకించి సంపూర్ణ ఆరోగ్య పరిరక్షణపైనా, సేంద్రియ అంశాల పైనా ఆలోచించే వారికి ఇదొక ఉత్తమమైన మార్గంగా మారింది. ఫ్యాషన్ దృష్టితో చూసినా కూడా ఖద్దరు తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని అందుకుంటోంది. ఖద్దరులో కూడా కొత్తదనాన్ని తీసుకురావడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్న వారందరినీ అభినందిస్తున్నాను. ఆర్థిక వ్యవస్థలో అమ్మకానికి తనకంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఖద్దరు కూడా ప్రజల మనస్సు గెలుచుకోవడంతో పాటు... అమ్మకాల్లో తన స్థానాన్ని నిలబెట్టుకోవడం అనివార్యంగా మారింది. మన దగ్గర ఎన్నోరకాల వస్త్రాలు ఉంటాయి. వాటిలో ఒక జత అయినా ఖద్దరు వస్త్రాలు కూడా ఉండాలని నేను ప్రజలకు చెప్పాను. ఈ విషయం ఇప్పుడు వాళ్లకు అవగతం అవుతోంది. ఏంటంటే.. ఖద్దరుధారులం కాలేము, కనీసం పది రకాల వస్త్రాల్లో ఖద్దరు కూడా ఉంటే ఏమి అని భావిస్తున్నారు. నా మాటలకు ప్రభుత్వంలోనూ సానుకూలమైన వాతావరణం ఏర్పడుతోంది. చాలా ఏళ్ళ క్రితం ప్రభుత్వంలో ఖద్దరు వస్త్రాల వాడకం సంపూర్ణంగా ఉండేది. క్రమ క్రమంగా ఆధునికత పేరుతో అది అడుగంటుతూ వచ్చింది. ఖాదీతో ముడివడిన మన పేదలు నిరుద్యోగులవుతూ వచ్చారు. నిజానికి ఖద్దరుకు కోట్లాది మందికి ఉపాధి కల్పించే శక్తి ఉంది. ఇటీవల రైల్వే శాఖ, పోలీసు, భారతీయ నౌకాదళం, ఉత్తరాఖండ్ తపాలా శాఖ.... ఇలాంటి ఎన్నో ప్రభుత్వ సంస్థలు ఖాదీ వాడకాన్ని పెంచేందుకు కొన్ని మంచి చర్యలు తీసుకున్నాయి. ఈ ప్రయత్నాల వల్ల అవసరమైన స్థాయిలో వస్త్రాలను తయారు చేసేందుకు ఖాదీ రంగంలో పని చేసే వారికి అదనంగా 18 లక్షల పని దినాలు కల్పించవలసిన అవసరం ఏర్పడిందని నాకు చెప్పారు. 18 లక్షల పని దినాలంటే అదే పెద్ద ముందడుగు అవుతుంది. పూజ్య బాపూజీ కూడా టెక్నాలజీని ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవాలని భావిస్తుండే వారు, సూచిస్తుండే వారు. ఫలితంగానే మన రాట్నం ఎంతో అభివృద్ధి అవుతూ అవుతూ ఈ స్థాయికి చేరింది. ఈ మధ్య సౌర శక్తిని వినియోగించుకుంటూ రాట్నాన్ని తిప్పడం, రాట్నానికి సౌర శక్తిని జోడించడం ఎంతో విజయవంతమైన ప్రయోగం అయింది. దీని వల్ల శ్రమ తగ్గి, ఉత్పత్తి పెరిగింది. వస్త్రాల నాణ్యత సైతం పెరిగింది. ప్రత్యేకించి - సౌర శక్తి తో నడిచే రాట్నం పనితీరు గురించి నాకు చాలా మంది లేఖలు రాస్తున్నారు. రాజస్థాన్ లోని దౌసా నుంచి గీతా దేవి, కోమల్ దేవి.. బీహార్ లోని నవాడా జిల్లా నుంచి సాధనా దేవి నాకు రాసిన లేఖల్లో సౌర శక్తితో నడిచే రాట్నం వల్ల వాళ్ళ జీవనంలో ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. తమ ఆదాయం రెట్టింపు అయ్యిదని, నూలు వస్త్రాల ఆకర్షణ కూడా పెరిగిందని రాశారు. ఇలాంటి విషయాలన్నీ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తాయి. జనవరి 30 న పూజ్య బాపూజీని స్మరించుకుంటున్న ఈ తరుణంలో మీకు మరొకసారి గుర్తు చేస్తున్నాను. మీకున్న ఎన్నో జత దుస్తుల్లో ఒక జత ఖద్దరు కూడా తప్పకుండా ఉండేలా చూసుకోండి. దాని వినియోగదారులు కండి.
ప్రియమైన నా దేశవాసులారా..
జనవరి 26 పర్వదినాన్ని మనమంతా ఉల్లాసంగా, ఉత్సాహంగా జరుపుకున్నాం. నలువైపులా ఉగ్రవాదులు ఏం చేస్తారోనన్న ఆందోళన మధ్య కూడా దేశ ప్రజలంగా ధైర్యాన్ని, క్రమశిక్షణను ప్రదర్శిస్తూ ఘనంగా గణతంత్ర పర్వదినాన్ని జరుపుకున్నారు. కానీ కొందరు భిన్నంగా కొన్ని మాటలు చెప్పారు.. చేశారు. వాటిపై దృష్టి పెట్టదగినవి నేను అనుకుంటున్నాను. ప్రత్యేకించి హరియాణ, గుజరాత్... ఈ రెండు రాష్ట్రాల్లో ఒక అపూర్వ ప్రయోగం జరిగింది. ఈ సంవత్సరం వారు ప్రతి ఊళ్ళో ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో అక్కడ పతాకావిష్కరణ సందర్భంలో వందన సమర్పణ కోసం అందరికన్నా ఎక్కువ చదువుకున్న బాలికను ఆహ్వానించారు. ఆ విధంగా హరియాణ, గుజరాత్ రాష్ట్రాలు ఆడ బిడ్డకు ఎంతో గౌరవాన్ని ఇచ్చాయి. విద్యాబుధ్దులు నేర్చుకున్న బిడ్డను మరింత ప్రత్యేకంగా గౌరవించారు. 'బేటీ బచావో- బేటీ పఢావో' దీనికి ఒక మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాయి. వారి ఊహాశక్తికి ఆ రెండు రాష్ట్రాలను అభినందిస్తున్నాను. పతాకావిష్కరణకు, జెండా వందనానికి అవకాశం దక్కిన బాలికలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను.
హరియాణాలో మరో విశేషం కూడా చోటు చేసుకుంది. గత ఏడాదిలో ఆడ పిల్లలు జన్మించిన కుటుంబాల వారిని జనవరి 26 నాడు ప్రత్యేకంగా ఆహ్వానించి ప్రముఖులుగా ప్రథమ పంక్తిలో కూర్చొబెట్టి గౌరవించారు. ఇది ఎంతో గౌరవంతో కూడిన సందర్భం. ఈ విషయంలో నాకింకా సంతోషం. ఎందుకంటే.. 'బేటీ బచావో- బేటీ పఢావో' కార్యక్రమాన్ని హరియాణాలో ప్రారంభించాను. హరియాణాలో స్త్రీల సంఖ్య చాలా తక్కువ ఉంది. సామాజిక సంతులనం ప్రమాదంలో పడటం ఆందోళన కలిగించింది. ఈ దశలో 'బేటీ బచావో- బేటీ పఢావో' కార్యక్రమాన్ని ప్రారంభించడానికి హరియాణాను ఎంచుకున్నప్పుడు మా అధికారులు నన్ను వారించారు. అక్కడ వద్దని, అక్కడ ఎంతో వ్యతిరేక వాతావరణం ఉందని చెప్పారు. అయినా నేను అక్కడ నుంచే ప్రారంభించాను. కానీ ఈ రోజు హరియాణాకు హార్దిక అభినందనలు చెబుతున్నాను. అక్కడ బాలికల జననాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. అక్కడ సామాజిక జీవనంలో వస్తున్న మార్పుకు నిజంగా ఆ రాష్ట్రాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
ఇంతకు ముందు 'మన్ కీ బాత్' లో నేను రెండు విషయాలు ప్రస్తావించాను. ఒక పౌరునిగా మనం మహా పురుషుల విగ్రహాలను ప్రతిష్ఠించే విషయంలో మాత్రం ఎంతో భావోద్వేగాన్ని ప్రదర్శిస్తాం. కానీ తరువాత పట్టించుకోము. రెండో విషయం.. ప్రజల హక్కుల కోసం మాట్లాడే మనం కర్తవ్యాల గురించి కూడా ఎలా ప్రాధాన్యమివ్వాలి అని. వీటి పైన చర్చ ఎలా జరగాలి..? హక్కుల గురించి చర్చ చాలా జరిగింది. ఇంకా జరుగుతూనే ఉంటుంది. అయితే - మన విధుల గురించి కూడా చర్చ జరగాలి. నాకు సంతోషం ఏమిటంటే - దేశంలోని అనేక ప్రాంతాల్లో ప్రజలు ముందుకు వచ్చారు. సామాజిక సంస్థలు ముందుకొచ్చాయి. విద్యా సంస్థలు ముందుకొచ్చాయి. కొంత మంది సాధు సత్పురుషులు ముందుకొచ్చారు. వారంతా ఎక్కడో అక్కడ విగ్రహాలను, ప్రతిమలను, పరిసరాలను శుభ్రం చేశారు. ఒక మంచి ప్రారంభం జరిగింది. ఇది కేవలం పరిశుభ్రత కార్యక్రమం కాదు. ఇది గౌరవ కార్యక్రమం. నేను ప్రతి ఒక్కరినీ పేర్కొనడం లేదు. కానీ నాకు అందిన వార్తలు ఎంతో సంతోషకరమైనవిగా భావిస్తున్నాను. కొంత మంది ఇలాంటి వార్తలు బయటకు చెప్పడానికి సంకోచిస్తారు. వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను మైగవ్ పోర్టల్ ద్వారా మీరు శుభ్రపరిచిన విగ్రహం ఫోటోను గాని, లేదా ప్రాంతం ఫొటో ను గాని తీసి తప్పక పంపండి. ప్రపంచంలోని జనం వాటిని చూస్తారు, గర్వపడతారు. అదే విధంగా హక్కులు, బాధ్యతలపై జనవరి 26న నేను ప్రజల అభిప్రాయాలు కోరగా... వేలాది మంది అందులో పాల్గొనటం నాకు సంతోషం కలిగించింది.
ప్రియమైన నా దేశవాసులారా..
ఒక విషయంలో మీ సహాయం కావాలి. మీరు తప్పకుండా నాకు సహాయపడతారని విశ్వాసం ఉంది. మన దేశంలో రైతుల గురించి చాలా మాట్లాడుతూ.. చాలా చాలా చెప్తారు. నేను ఆ వివాదంలోకి వెళ్లాలనుకోవడం లేదు. రైతుకు చాలా పెద్ద కష్టం ఉంది. కానీ - ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాళ్ళ కష్టమంతా నీటి పాలవుతుంది. పంట కాలం వృథా అవుతుంది. అటువంటి వారికి భద్రత కల్పించేందుకు ఒక్కటే ఉపాయం తట్టింది. అది 'ఫసల్ బీమా యోజన'. 2016 లో రైతులకు భారత ప్రభుత్వం ఇచ్చిన ఒక పెద్ద కానుక 'ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన'. అయితే - ఈ పథకానికి ప్రశంసలు, ఆహా..ఓహో అనే పొగడ్తలు, ప్రధాన మంత్రికి అభినందనలు ఇందుకోసం కాదు. ఇన్నేళ్ళుగా పంటల బీమా పైన చర్చ జరుగుతూ ఉన్నది. కానీ 20-25 శాతం మంది రైతులయినా దీనివల్ల లబ్దిని పొందలేకపోయారు. దీనిలో చేరలేక పోయారు. వచ్చే ఒకటి రెండేళ్లలో దేశంలోని కనీసం 50 శాతం మంది రైతులకైనా పంటల బీమా ప్రయోజనాన్ని అందంచగలమని సంకల్పం చెప్పుకోగలమా.. ఈ విషయంలో నాకు మీ సహాయం కావాలి. ఎందుకంటే.. పంటల బీమా పథకంలో వారు చేరితే కష్ట కాలంలో ఎంతో సాయం అవుతుంది. ఈ సారి ప్రధాన మంత్రి పంటల బీమా పథకానికి ఇంతగా జనాదరణ లభించడానికి కారణాలు ఉన్నాయి. దీన్ని ఎంతో విస్తరించాం, సరళీకరించాం. ఈ పథకాన్ని సరళీకరించాం. దీనికి టెక్నాలజీని జోడించాం. ఇంతే కాదు.. పంట కోసిన పదిహేను రోజుల తరువాత కూడా ఏమైనా జరిగినా సహాయం అందించేలా హామీ ఇచ్చాం. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దాని అమలు వేగంగా జరిగేలా, పరిహారం అందడంలో జాప్యం నివారించేలా చేస్తున్నాము. వీటన్నింటిపై ప్రత్యేక దృష్టి పెట్టాం. అన్నింటికి మించి- పంటల భీమా పథకానికి చెల్లించలసిన ప్రీమియంను ఎంత తగ్గించామంటే, బహుశా ఇంత తక్కువగా ఉంటుందని ఎవ్వరూ ఊహించైనా ఉండరు. రైతులు చెల్లించవలసిన ప్రీమియం ఖరీఫ్ లో అయితే ఎక్కువలో ఎక్కువ రెండు శాతం, రబీలో అయితే ఒకటిన్నర శాతం ఉంటుంది. ఇప్పుడు చెప్పండి. నా రైతు సోదరులు ఎవరైనా దీన్ని తీసుకోకపోతే నష్టపోతారా, లేదా..? మీరు రైతులు కాకపోవచ్చు. కానీ నా మనసులో మాట వింటున్నారు. మా ఈ మాటల్ని మీరు రైతులకు చేర్చగలరా.. దీని గురించి ఎక్కువగా ప్రచారం చేయాలని మిమ్మల్ని కోరుతున్నాను. అందుకోసమే ఈ సారి మీ కోసం ఒక కొత్త పథకాన్ని తెచ్చాను. ప్రధాన మంత్రి పంటల బీమా పథకం గురించి ప్రజలకు చేరాలని కోరుకుంటున్నాను. ఈ మాటల్ని ఇప్పుడు టీవీలో, రేడియోలో 'మన్ కీ బాత్' ద్వారా వింటున్నారు. కానీ మీరు తరువాత వినాలనుకుంటే ఎలా..? అందుకోసమే నేను మీకు ఒక కొత్త కానుకను ఇవ్వబోతున్నాను. మీ మొబైల్ ఫోన్ లో కూడా నా 'మన్ కీ బాత్' కార్యక్రమం వినగలరు; ఎప్పుడైనా వినగలరు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మీ మొబైల్ ఫోన్ నుంచి ఒక్క మిస్ డ్ కాల్ ఇవ్వడమే. 'మన్ కీ బాత్' వినడం కోసం ఒక మొబైల్ ఫోన్ నంబర్ ఇస్తున్నాం. 81908-81908 ఎనిమిది ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది ఎనిమిది ఒకటి తొమ్మిది సున్నా ఎనిమిది కి మీరు మిస్ డ్ కాల్ ఇస్తే ఆ తరువాత ఎప్పుడైనా 'మన్ కీ బాత్' వినగలుగుతారు. ఇప్పటికైతే ఇది హిందీలో ఉంది. అతి త్వరలో మీ మాతృ భాషలో 'మన్ కీ బాత్' వినే అవకాశం వస్తుంది. అందుకోసం నేను ఏర్పాటు చేస్తున్నాను.
ప్రియమైన నా దేశవాసులారా..
మీరైతే అద్భుతం చేశారు. జనవరి 16 న స్టార్టప్ కార్యక్రమం ప్రారంభమైనప్పుడు దేశ యువతీ యువకుల్లో కొత్త శక్తి, కొత్త చైతన్యం, కొత్త ఆశ, కొత్త ఉత్సాహం కనిపించింది. లక్షల సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి పేర్లు నమోదు చేసుకున్నారు. కానీ అంత స్థలం లేకపోవడం వల్ల ఆఖరుకు విజ్ఞాన్ భవన్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం. మీరు చేరుకోలేకపోయారు. కానీ, మీరంతా ఆన్ లైన్ లో ఉన్నారు. బహుశా ఏ ఒక్క కార్యక్రమానికి ఇన్ని గంటల పాటు లక్షలాది మంది యువతీ యువకులు అతుక్కుపోయి ఉండటం చాలా అరుదుగా జరుగుతుంది. కానీ జరిగింది. స్టార్టప్ పట్ల ఆశలు ఏ విధంగా ఉంటాయో అని నేను మొదట అనుకున్నాను. కానీ ఒక్క మాట, స్టార్టప్ అంటే ఇదేదో ఐటీకి సంబంధించిన విషయమని, అధునాతనమైన కార్యమని సామాన్యులు అనుకుంటారు. ఈ స్టార్టప్ కార్యక్రమం తరువాత ఆ భ్రమలన్నీ తొలగిపోయాయి. ఐటీ లో స్టార్టప్ కూడా లెక్కలేనన్ని అవసరాల కోసమే వస్తోంది.
నేను కొద్ది రోజుల క్రితం సిక్కిం వెళ్ళాను. ఇప్పడు సిక్కిం సేంద్రియ రాష్ట్రంగా మారింది. దేశంలోని వ్యవసాయ మంత్రులు, కార్యదర్శులను అక్కడికి ఆహ్వానించాను. అక్కడ ఇద్దరు నవ యువకులను కలిసే అవకాశం నాకు లభించింది. వారు ఐఐఎమ్ లో చదువుకుని వచ్చారు. ఒకరు అనురాగ్ అగ్రవాల్, మరొకరు సిద్ధి కర్నాణీ. వాళ్లు స్టార్టప్ ను దాటి ఒక అడుగు ముందుకేశారు. వాళ్లు ఈశాన్య రాష్ట్రాల్లో, వ్యవసాయ రంగంలో అందునా... ఔషధ మొక్కల రంగంలో కృషి చేస్తున్నారు. అవి పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పెంచుతున్నారు. వాటిని విశ్వవిపణిలో అమ్ముతున్నారు. అదే కదా మరి.
స్టార్టప్ రంగంతో పనిచేస్తున్న వారికి క్రితం సారి చెప్పాను. వాళ్ల అనుభవాలను నరేంద్ర మోదీ యాప్ లో నాకు పంపమని. చాలా మంది పంపించారు. ఇంకా ఎక్కువ వస్తే నాకు ఇంకా సంతోషంగా ఉండేది. వచ్చినవి నిజంగా ఎంతో ప్రేరణ ఇచ్చేవిగా ఉన్నాయి. ఎవరో విశ్వాస్ ద్వివేదీ అని ఓ యువకుడు ఉన్నాడు. ఆయన ఆన్ లైన్ లో వంటగదినే మొదలు పెట్టాడు. మధ్య తరగతి , దినసరి వేతనాల కోసం పని చేసే వారికి ఆన్ లైన్ నెట్ వర్కింగ్ ద్వారా టిఫిన్ పంపే పని చేస్తున్నారు. ఇంకెవరో శ్రీ దిగ్నేశ్ పాఠక్ అని ఉన్నారు. ఆయన రైతుల కోసం, ముఖ్యంగా పశువుల దాణా విషయంలో పనిచేయాలని నిర్ణయించుకున్నాడు. పశువులకు మంచి ఆహారం దొరికితే మనకు మంచి పాలు దొరుకుతాయి. నాణ్యమైన పాలు అందుబాటులో ఉంటే మన యువతరం శక్తిమంతులవుతారు. మనోజ్ గిల్దా, నిఖిల్.. వీళ్లు వ్యవసాయ గిడ్డంగుల మీద స్టార్టప్ ను మొదలుపెట్టారు. శాస్త్రీయ పద్ధతుల్లో పండ్లు నిల్వచేసే వ్యవస్థ ద్వారా వ్యవసాయ ఉత్పత్తుల కోసం గిడ్డంగుల వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నారు. ఇలా ఎన్నో సూచనలు అందాయి. మీరింకా దీనిపై సూచనలు పంపండి. నాకు బాగుంటుంది. పరిశుభ్రత గురించి ఎలా అయితే చెబుతానో, అలా మాటిమాటికీ 'మన్ కీ బాత్' లో స్టార్టప్ గురించి చెప్పాల్సి వచ్చినా చెబుతాను. ఎందుకంటే మీ సమర్థతే మాకు ప్రేరణ.
ప్రియమైన నా దేశవాసులారా..
ఇప్పుడు స్వచ్ఛతకు సౌందర్యం జత కలిసింది. ఏళ్ల తరబడి మనం మురికిపై కోపాన్ని వ్యక్తం చేస్తూ వచ్చాం. అయినా, మురికి తొలగిపోలేదు. ఇప్పడు దేశ ప్రజలు మురికిపై చర్చ వదిలి పరిశుభ్రతపై మాట్లాడటం మొదలు పెట్టారు. ఎక్కడో అక్కడ, ఎంతో కొంత పరిశుభ్రతపై పని జరుగుతోంది. కానీ ఇప్పడు దానిపై పౌరులు మరో ముందంజ వేశారు. స్వచ్ఛతకు సౌందర్యాన్ని జోడించారు. ఒక రకంగా ఇది బంగారానికి తావి అద్దడం లాంటిదే. ముఖ్యంగా రైల్వే స్టేషన్లలో ఇది కనిపిస్తోంది. స్థానిక కళల ఆధారంగా గోడ చిత్రాలు, సైన్ బోర్డులు బాగా పెడుతున్నారు. అవీ కళాత్మకంగా పెడుతున్నారు. ప్రజలను అప్రమత్తం చేసే అంశాలను కూడా ఉంచుతున్నారు. ఇంకా చాలా చాలా చేస్తున్నారు. నాకెవరో చెప్పారు.. హజారీబాగ్ స్టేషన్ లో ఆదివాసీ మహిళలు స్థానిక సోహ్రాయి-కోహబర్ కళకు సంబంధించిన డిజైన్లలో రైల్వే స్టేషన్ ను పూర్తిగా అలంకరించేశారు అని. థానే జిల్లాలో 300 మందికి పైగా స్వచ్ఛంధ కార్యకర్తలు కింగ్ సర్కిల్ స్టేషన్ ను ముస్తాబు చేశారట. మాతుంగా, బోరీవలీ, ఖార్.. ఇంకా ఇక్కడ రాజస్థాన్ నుంచి కూడా ఇలాంటి ఎన్నో వార్తలు వస్తున్నాయి. సవాయి మాధోపూర్ లోనూ, కోటా లోనూ... ఇలా ఎన్నో.
నాకేమనిపిస్తుందంటే... మన రైల్వే స్టేషన్లు వాటంతట అవే మన సంప్రదాయాలకు ప్రతీకలైపోతాయని. ఎప్పడు ఎవ్వరూ కిటికీలోంచి చాయ్- పకోడీ అమ్మే వాళ్లను వెతకరు. రైలులో కూర్చునే అక్కడి గోడలు చూసి స్థానిక విశిష్టతను తెలుసుకుంటారు. ఇంకా.. ఇది రైల్వే విభాగమో, నరేంద్ర మోదీ నో తీసుకున్న చొరవ కాదు. ఇది పౌరులది. చూడండి.. పౌరులు చొరవ తీసుకుంటే ఎలా చేస్తారో. నాకు కొన్ని ఫొటోలు అందాయి, వాటిని చూస్తున్నాను. అయితే నాకింకా మరిన్ని ఫొటోలు కలయికగా ఏమైనా పని చేసి ఉంటే మీరు వాటి ఫొటోలు పంపగలరా.. తప్పకుండా పంపండి. నేను చూస్తాను. ప్రజలు కూడా చూస్తారు. అవి మరింత మందికి ప్రేరణనిస్తాయి. ఇంకా రైల్వే స్టేషన్ లో సాధ్యమైంది, బస్ స్టేషన్లో సాధ్యమవుతుంది; అది ఆస్పత్రిలో సాధ్యమవుతుంది; ఆలయాల దగ్గర, చర్చిల దగ్గర, మసీదుల దగ్గర సాధ్యమవుతుంది. పార్కులు, తోటల్లోనూ.. ఎంతో సాధ్యమవుతుంది. ఈ ఆలోచన వచ్చిన వాళ్ళు, ప్రారంభించిన వాళ్లు, దాన్ని ముందుకు తీసుకెళ్లిన వారు అందరూ అభినందనీయులే. మీరు మాత్రం ఫొటోలు తప్పకుండా పంపండి. మీరేం చేశారో నేను చూడాలనుకుంటున్నాను.
ప్రియమైన నా దేశవాసులారా..
ఫిబ్రవరి 4వ తేదీ నుంచి 8వ తేదీ వరకు భారతదేశం పెద్ద ఎత్తున ఇతర దేశాలకు ఆతిథ్యం ఇస్తుండటం మనకు అందరికీ గర్వకారణం. విశ్వ దేశాలన్నీ మన దగ్గరకు అతిథులుగా వస్తాయి. మన నావికాదళం ఈ ఆతిథ్యానికి ప్రతిష్ఠాత్మకంగా, ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తోంది. ప్రపంచంలోని చాలా దేశాల యుద్ధ నౌకలు, నావికాదళ విమానాలు ఆంధ్ర ప్రదేశ్ తీరంలోని విశాఖపట్టణం దగ్గర ఒక్క చోటుకు చేరుతున్నాయి. అంతర్జాతీయ నౌకా సమీక్ష భారతదేశ సముద్ర తీరంలో జరుగుతుంది. విశ్వ సైనిక శక్తితో భారతదేశ సైనిక శక్తిని సమన్వయం చేసేందుకు ఇదొక ప్రయత్నం. ఒక సమష్టి కవాతు. ఇది చాలా మంచి అవకాశం. ఇంత పెద్ద కార్యక్రమం అయినందున రానున్న రోజుల్లో టీవీ, మీడియా ల ద్వారా విశేషాలు మీకు ఎలాగూ తెలుస్తాయి. భారతదేశం లాంటి దేశాలకు ఇదెంతో ప్రతిష్ఠాత్మకమైంది. ఇంకా భారతదేశ సముద్ర ఇతిహాసంలో స్వర్ణయుగాన్ని చూసింది. సంస్కృతంలో సముద్రాన్ని ఉదధి, ఇంకా సాగరం అని అంటారు. అంటే అర్థం అనంతమైన సమృద్ధి అని అర్థం. సరిహద్దులు మనల్ని వేరు చేయొచ్చు. భూమి వేరు చేయొచ్చు గాక, కానీ జలం మనల్ని కలుపుతుంది. సముద్రం కలుపుతుంది.. సముద్రంతో మనంతట మనమే కలుస్తాం. దేనితోనైనా కలపవచ్చు; ఇంకా మన పూర్వికులు శతాబ్దాల క్రిందటే ప్రపంచమంతా తిరిగి వ్యాపారం చేసి ఈ శక్తి ఎలాంటిదో పరిచయం చేశారు. ఛత్రపతి శివాజీ కావచ్చు, చోళ సామ్రాజ్యం కావచ్చు.. సముద్రయాన శక్తి విషయంలో వాళ్లు తమదైన గుర్తింపును సాధించారు. ఈ నాటికి ఎన్నో రాష్ట్రాలలో సముద్రంతో పెనవేసుకున్న సజీవ సంప్రదాయాలు ఉన్నాయి. నేటికీ వాటిని ఉత్సవాలు చేసుకుని, పాటిస్తుంటారు. విశ్వమే భారతదేశానికి అతిథిగా కదిలి వస్తుంటే నావికాదళం శక్తి ఎలాంటిదో తెలుస్తుంది. ఇదొక మంచి అవకాశం. ఈ అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొనే సౌభాగ్యం నాకు కలిగింది. అలాగే దేశపు తూర్పు కొసన గౌహతి లో సార్క్ దేశాల క్రీడోత్సవం జరుగుతోంది. సార్క్ దేశాలకు చెందిన వేలాది క్రీడాకారులు గౌహతి కి వస్తున్నారు. క్రీడా వాతావరణం, ఆశలు నిండిన పరిస్థితులు. సార్క్ దేశాల యువతరానికి ఒక మహోత్సవం.. అస్సాం రాష్ట్రంలోని గౌహతి లో జరుగుతుంది. సార్క్ దేశాలతో బాంధవ్యం నిలుపుకునేందుకు ఇదొక మహదవకాశం.
ప్రియమైన నా దేశవాసులారా..
నేను ముందే చెప్పాను. మనసులోకి ఏదైతే వస్తుందో, ఏది అనిపిస్తుందో అదే నేను మీతో పంచుకుంటానని. కొద్ది రోజుల్లో 10,12 తరగతుల పరీక్షలు ఉన్నాయి. గత 'మన్ కీ బాత్' లో నేను పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు కొన్ని విషయాలు చెప్పాను. ఈసారి ఏమనిపిస్తుందంటే- పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు ఎలా రాశారో, కుటుంబంలో ఎలాంటి వాతావరణం ఏర్పడిందో, గురువులు, టీచర్లు ఎలా దోహదం చేశారో, మీ సీనియర్లు ఎలాంటి సూచనలు అందించారో, ఎలాంటి మంచి అనుభవాలు చవిచూశారో.. చెప్పండి. ఈ సారి మనం ఒక పనిచేయవచ్చు; మీరు మీ అనుభవాలను నరేంద్ర మోదీ యాప్ కు పంపండి. నేనింకా మీడియాను కూడా కోరుతున్నా. మీ మాధ్యమాలలో వెలువరించండి. దేశ వ్యాప్తంగా విద్యార్థులు వాటిని చదివి, టీవీలో చూస్తారు. ఆందోళన, ఒత్తిడి లేకుండా ఆడుతూ పాడుతూ పరీక్షలు ఎలా రాయాలో చెప్పే ఒక మహత్తర ఔషధం వారి చేతికి అందించిన వారవుతారు. ఈ విషయంలో మీడియా మిత్రులు తప్పక సహకరిస్తారని నాకు నమ్మకం ఉంది. ఆ.... వాళ్ళు తప్పక చేస్తారు. కానీ, మీరంతా అనుభవాలను పంపినప్పుడే; తప్పకుండా పంపించండి.
స్నేహితులారా..
చాలా చాలా ధన్యవాదాలు. మళ్లీ ఒకసారి ఇంకో 'మన్ కీ బాత్' కోసం వచ్చే నెల కలుద్దాం.
నా ప్రియమైన దేశవాసులారా.....
మీ అందరికీ నా నమస్కారం. 2015లో ఇది నా చివరి ‘మన్ కీ బాత్’ ప్రసంగం. మళ్లీ మన్‌కీ బాత్ ద్వారా 2016లో మాట్లాడుకుందాం. మొన్ననే మనం క్రిస్మస్ పండుగ జరుపుకున్నాం. ఇప్పుడు కొత్త సంవత్సరానికి స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు సాగుతున్నాయి. భారత్ వైవిధ్యంతో నిండిన దేశం. పండుగల పరంపర కొనసాగుతూనే ఉంటుంది. ఒక పండుగ ముగిసింది అనుకునేలోపే, మరో పండుగ వస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే, ప్రతి పండుగ కూడా ఆ తర్వాత వచ్చే పండుగ గురించి మనలో ఒక నిరీక్షణా భావాన్ని విడిచిపెడుతుంది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది. పండుగలు ఆధారంగా నడిచే ఒక ఆర్థికవ్యవస్థ ఉన్న ఏకైక దేశం భారత్ మాత్రమేనని. సమాజంలో పేదరికంతో ఉన్నవారికి ఆర్థికంగా కార్యకలాపాలు, ఆదాయ మార్గాలు చేపట్టేందుకు ఈ పండుగలు ఒక అవకాశం కల్పిస్తాయి. దేశ ప్రజలందరికీ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలూ, 2016నూతన సంవత్సర శుభాకాంక్షలూ తెలియజేస్తున్నాను. 2016 సంవత్సరం మీ అందరికీ ఎంతో సంతోషం తెచ్చిపెట్టాలనీ, కొత్త ఉత్తేజం, కొత్త ఉత్సాహం, కొత్త సంకల్పం మిమ్మల్ని కొత్త శిఖరాలు అధిరోహించేలా చేయాలనీ ఆకాంక్షిస్తున్నాను. ప్రపంచమంతా సమస్యలూ, సంకటాల నుంచి విముక్తం కావాలనీ - అది ఉగ్రవాదమైనా, భూతాపమైనా, ప్రకృతి వైపరీత్యాలైనా - మానవులే సృష్టించుకున్న సమస్యలైనా, అన్నీ తీరి - మానవజాతికి సుఖం, శాంతితో కూడుకున్న జీవితం లభించాలి. ఇంతకంటే మనకి సంతోషం కలిగించే విషయం ఏముంది? నేను సాంకేతిక పరిజ్ఞానాన్ని పూర్తిస్థాయిలో ఉపయోగిస్తానని మీకు తెలుసు. నాకు బోలెడు సమాచారం, విషయాలు కూడా తెలుస్తుంటాయి. Mygov పోర్టల్ ను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా చూస్తుంటాను.
పూణె నుంచి గణేష్ వి సావ్లేసవార్కర్ నాకు రాశారు. ఇది పర్యాటకుల సీజన్, పెద్ద సంఖ్యలో దేశ, విదేశీ పర్యాటకులు వస్తారనీ, చాలా మంది క్రిస్మస్ సెలవులు గడిపేందుకు వివిధ ప్రదేశాలకు వెడుతుంటారనీ గుర్తు చేశారు. టూరిజం రంగంలో ఇతర అన్ని సౌకర్యాల కోసం చర్యలు తీసుకుంటారు. అయితే, ఎక్కడెక్కడ పర్యాటక గమ్యాలు ఉన్నాయో, యాత్రికులు బస చేసే స్థలాలు,తీర్థ యాత్రా స్థలాలు వున్నాయో, అక్కడ స్వచ్ఛత, శుభ్రత విషయంలో ప్రత్యేకంగా ధ్యాస పెట్టాలి అని రాశారు. మన పర్యాటక స్థలాలు ఎంత పరిశుభ్రంగా ఉంటే, ప్రపంచంలో మన పరువు అంత పెరుగుతుంది. నేను గణేష్ గారి ఆలోచనలను స్వాగతిస్తున్నాను. ఆయన మాటలను నేను మీ అందరికీ వినిపిస్తున్నాను. అసలు మన దేశంలో అతిథి దేవోభవ అన్నది మన సిద్ధాంతం. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తున్నారంటే అంతా శుభ్రం చేసి, అలంకరిస్తాం. మన పర్యాటక స్థలాలు, గమ్యాల్లో,యాత్రా స్థలాల్లో కూడా ఇది బాగా పట్టించుకోవలసిన విషయమే. స్వచ్ఛతకి సంబంధించి దేశంలో వివిధ ప్రాంతాల నుంచి నిరంతరం నాకు వార్తలు అందుతుండడం కూడా నాకు ఆనందం కలిగించే విషయం. మొదటి నుంచి కూడా నేను ఇందుకు మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తూనే ఉంటాను. ఎందుకంటే వాళ్ళు ఎన్నో చిన్న, చిన్న విషయాలు, మంచి విషయాలను వెతికి పట్టుకొని, వార్తలుగా మనకి తెలియజేస్తుంటారు. ఈ మధ్య నేను పేపర్లో ఒక వార్త చదివాను. ఇది మీతో కూడా నేను పంచుకోవాలనుకుంటున్నాను.
మధ్యప్రదేశ్ లోని సిహోర్ జిల్లాలోని భోజ్‌పురా గ్రామంలో ఒక వయోవృద్ధుడైన కార్మికుడు దిలీప్ సిన్హ్ మాలవీయ గురించి ఈ వార్త. ఆయన మేస్త్రీగా పనిచేసే సామాన్య కార్మికుడు. ఆయన చేసిన ఒక విలక్షణమైన, అద్భుతమైన పని గురించి పత్రికలో ఒక వార్త వచ్చింది. ఇది నా దృష్టికి రాగానే మీతో పంచుకోవాలని అనిపించింది. గ్రామంలో ఎవరైనా భవన నిర్మాణ సామాగ్రి తనకు ఇస్తే, మరుగుదొడ్డి నిర్మించేందుకు అయ్యే కూలీ తాను తీసుకోకుండా ఉచితంగా నిర్మిస్తానని దిలీప్ సిన్హ్ మాలవీయ ప్రకటించారు. భోజ్ పురా గ్రామంలో ఆయన తన శారీరక శ్రమతో, కూలీ తీసుకోకుండా, ఈ పనిని పవిత్రమైన కార్యంగా భావించి ఇప్పటివరకు 100 మరుగుదొడ్లు నిర్మించారు. నేను దిలీప్ సిన్హ్ మాలవీయకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన దేశం గురించి ఎన్నో నిరాశాజనకమైన వార్తలు వింటాం. కానీ మన దేశంలో కోట్ల మంది దిలీప్ సిన్హ్ లు ఉన్నారు. తమదైన పద్ధతిలో మంచి పని చేస్తున్నవారు అనేకులు ఉన్నారు. ఇదే మన దేశం శక్తి, ఇదే మన జాతి ఆశ. ఇదే మనని ముందుకి నడిపించే సమర్థత. అందుచేత, ‘మన్ కీ బాత్‘ లో దిలీప్ సిన్హ్ ని సగర్వంగా తలుచుకోవడం చాలా సబబు, సహజమేనని అనిపిస్తుంది.
అనేకానేక మంది అవిశ్రాంత ప్రయత్నం వల్లనే మనదేశం శరవేగంతో ముందుకు సాగుతోంది. అడుగులో అడుగు వేసి నూట పాతిక కోట్ల మంది భారతీయులు, ఒక్కో అడుగు తాము స్వయంగా ముందుకు వేస్తున్నారు. దేశాన్ని కూడా ముందుకు నడిపిస్తున్నారు. మెరుగైన విద్య, అత్యుత్తమ నైపుణ్యాలు, ఉపాధికి అనేక కొత్త అవకాశాలు పౌరులకు బీమా సురక్ష కవచం కల్పించడం నుంచి బ్యాంకింగ్ సౌకర్యాలు అందించడం వరకు - భౌగోళిక స్థాయిలో, వ్యాపార వాణిజ్యాలు జరపడంలో వెసులుబాటు, కొత్త వ్యాపారాలు చేయడానికి అనువైన, సౌకర్యవంతమైన వ్యవస్థలు అందుబాటులోకి తీసుకురావడం - బ్యాంకుల గుమ్మం కూడా దాటే పరిస్థితిలో లేని సామాన్య కుటుంబాలవారికి ముద్రా పథకం కింద తేలికైన రుణాలు అందించడం - ఇలా ఎన్నో సాధించాం.
యోగా తరఫున ప్రపంచం యావత్తూ ఆకర్షితమైందని ప్రతి భారతీయుడికీ ఇప్పుడు తెలుస్తోంది. తాను అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నప్పుడు, ప్రపంచం మొత్తం మనతో కలిసిందని చూసినప్పుడు ' వా... ఇదీ భారత్ ' అని మనకు అనిపించింది. ఈ భావన, ఈ అనుభూతి ఎప్పుడు కలుగుతుంది? మనం విశ్వరూపాన్ని సందర్శించినప్పుడు కలుగుతుంది. బాలకృష్ణుడు నోరు తెరచి, యశోదామాతకు తన నోట్లో బ్రహ్మాండాన్ని దర్శింపజేసిన ఘట్టం మనం ఎలా మరచిపోగలం! అప్పుడు ఆ శక్తి ఏమిటో ఆమెకు అర్థమైంది. యోగా దినోత్సవం అనే ఆ సందర్భం మన దేశానికి కూడా అటువంటి ఆకళింపు కలిగించింది. స్వచ్ఛత అనే మంత్రం ప్రతి ఇంట్లో మార్మోగుతోంది. పౌరుల భాగస్వామ్యం కూడా పెరిగిపోతోంది. స్వాతంత్య్రం అనంతరం ఇన్నేళ్ళ తర్వాత ఒక విద్యుత్ స్తంభం ఒక గ్రామంలో నెలకొల్పుకోవడం అంటే ఏమిటి అనేది నిరంతరం విద్యుచ్ఛక్తి ఉపయోగించే మనవంటి పట్టణవాసులకు నిజంగా అర్థం కాదేమో. చీకటి తెరలు వీడిపోతే, ఉత్సాహం ఎలా వెలుగుతుందో, ఉత్తేజం ఎలా సీమలు దాటి ఎగసిపోతుందో మనకి ఏం తెలుస్తుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విద్యుత్ శాఖలు ఇది వరకు కూడా పని చేసేవి. కానీ, గ్రామాలకు విద్యుత్ అందించేందుకు వెయ్యి రోజుల ఒక ప్రణాళికను ఎప్పటినుంచైతే సంకల్పించామో, ప్రతి రోజూ ఒక్కో గ్రామానికి విద్యుత్ అందిన విషయం వార్తలుగా మనకు అందుతుంది. ఆ గ్రామం విద్యుత్ దీపాల వెలుగులో ఏ విధంగా మురిసిపోయిందో తెలుస్తుంటుంది. ఇంతవరకూ మీడియాలో విస్తృతంగా ఈ చర్చ జరగలేదు. కానీ, మీడియా ఇటువంటి గ్రామాలకు చేరుకుంటుందనీ, అక్కడి వెలుగుల వేడుకను దేశానికి పరిచయం చేస్తుందని నాకు నమ్మకం ఉంది. దీనివల్ల అతి పెద్ద లాభం ఏమిటంటే, ఈ విద్యుత్ పంపిణీ పనిలో ఉన్న ప్రభుత్వోద్యోగులకు ఎంతో సంతోషం,సంతృప్తి లభిస్తుంది. మనం చేస్తున్న పని ఒక గ్రామం జీవనంలో, వ్యక్తుల జీవితాల్లో మార్పు తీసుకువస్తోందని వార్తల ద్వారా తెలిసి వారికి సంతోషం కలుగుతుంది - రైతులు, పేదలు, యువకులు, మహిళలు - వారందరికీ ఈ సమాచారం అందవలసిన అవసరం ఉంది కదా! ఏ ప్రభుత్వం పని చేసిందీ, ఏ ప్రభుత్వం పని చేయలేదూ అని తెలియడం కోసం కాదు ఈ వార్తలు వారికి చెప్పడం. ఈ విషయంలో తమకు ఉన్న హక్కులను పోగొట్టుకోరాదని వారికి అర్థం కావడం కోసం ఈ వార్తలు చెప్పాలి. హక్కుల సాధన కోసం సమాచారం అవసరం కదా! మంచి విషయాలు, సరైన విషయాలు, సామాన్య మానవులు చేసే మంచి పనుల గురించిన విషయాలు వీలైనంత మందికి అందేలా మనందరం కృషి చేయాలి. ఇది కూడా ఒక సేవా కార్యక్రమమే. నేను కూడా నావైపు నుంచి ఈ పని చేసేందుకు ప్రయత్నం చేశాను. కానీ నా ఒక్కడి వల్ల ఎంతవరకు సాధ్యపడుతుంది. కానీ మీకు చెప్తున్నా అంటే, నేను కూడా చేయాలి కదా! ప్రతివారు తమ మొబైల్ ఫోను పైన నరేంద్ర మోదీ యాప్ డౌన్ లోడ్ చేసుకొని, నాతో చేతులు కలపవచ్చును. ఈ యాప్ లో నేను చిన్నచిన్న విషయాలు షేర్ చేసుకుంటుంటాను. ప్రజలు ఇదే యాప్ ద్వారా నాకు అనేక సంగతులు చెప్పడం నాకు సంతోషం కలిగించే విషయం. మీరు కూడా మీ పద్ధతిలో, మీ స్థాయిలో ఈ ప్రయత్నంలో భాగం కండి. నూట పాతిక కోట్ల మంది భారతీయులను నేను మీ సహాయం లేకుండా ఎలా చేరుకుంటాను చెప్పండి! రండి,మనందరం కలిసి సాధారణ పౌరుల విషయాలను, సామాన్య మానవుల భాషలో వారికి అందించి, తమ హక్కులను వారు సాధించుకునేలా వారికి ప్రేరణ కలిగిద్దాం రండి.
నా ప్రియమైన యువజనులారా!
నేను ఆగస్టు 15 నాడు ఎర్రకోటపై నుంచి చేసిన ప్రసంగంలో స్టార్ట్ అప్ ఇండియా - స్టాండ్ అప్ ఇండియా గురించి ప్రాథమికంగా ప్రస్తావించాను. ఆ తర్వాత ప్రభుత్వంలో అన్ని విభాగాల్లో ఇది ప్రారంభమైంది. భారత్ స్టార్ట్ అప్ రాజధానిగా ఆవిర్భవించగలదా? మన రాష్ట్రాల మధ్య, మన యువజనుల కోసం ఒక ఉత్తమమైన ఉపాథి అవకాశంగా కొత్త కొత్త స్టార్ట్ అప్ సంస్థలు, వినూత్నమైన, వివిధమైన స్టార్ట్ అప్ లు ప్రారంభించగలమా? తయారీరంగం కానివ్వండి, సేవారంగం కానివ్వండి, వ్యవసాయం - ప్రతి రంగంలో కొత్త విషయాలు, కొత్త పద్ధతులు, కొత్త ఆలోచనా విధానం ప్రవేశపెట్టాలి. ప్రపంచం కొత్త ఆవిష్కారాలు, సృజనాత్మకత లేకుండా ముందుకు సాగలేదు. స్టార్ట్ ఆప్ ఇండియా - స్టాండ్ అప్ ఇండియా యువతరానికి ఒక పెద్ద అవకాశం తీసుకువచ్చింది. యువజనులైన నా మిత్రులారా, భారత ప్రభుత్వం జనవరి 16న స్టార్ట్ అప్ ఇండియా - స్టాండ్ అప్ ఇండియాకి పూర్తిస్థాయి కార్యాచరణ ప్రణాళిక అమల్లోకి తీసుకురానున్నది. ఇది ఎలా ఉంటుంది, అసలు ఈ పథకం ఏమిటి? ఎందుకు? అనే వివరాలతో ఒక ప్రణాళికను మీ ముందుంచుతాం. దేశంలో ఐఐటి, ఐఐఎమ్, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఎన్.ఐ.టీలు - ఎక్కడెక్కడ యువజనులు వున్నారో, వారందరికీ లైవ్ కనెక్టివిటీ ద్వారా ఈ కార్యక్రమంతో అనుసంధానిస్తాం. స్టార్ట్ అప్ విషయంలో మన ఆలోచన ఒక చట్రంలో చిక్కుకుని పోయింది. డిజిటల్ ప్రపంచం, ఐటీ వృత్తికి మాత్రమే స్టార్ట్ అప్ పరిమితం అని మనకు ఒక భావన ఉండిపోయింది. కానీ, అలా కాదు - మన దేశం అవసరాలను బట్టీ మార్పు తీసుకుని రావాలి. ఒక పేదవాడు ఎక్కడో కూలి పని చేసుకుంటాడు, అతడు శారీరక శ్రమ చేస్తాడు. కానీ, ఆ శ్రామికుడి పని సులభతరం అయ్యేలా యువజనులు ఎవరైనా ఒక వ్యవస్థ, ఒక పరికరం, ఒక పరిజ్ఞానం రూపొందించగలిగితే, నేను ఆ ఆవిష్కారాన్ని కూడా స్టార్ట్ అప్ అనే అంటాను. అలాంటి యువజనులకు సహాయం అందించమని బ్యాంకులకు చెప్తాను. ధైర్యంతో ముందుకు సాగమని ఆ యువజనులకు కూడా చెప్తాను. మార్కెట్ కూడా లభిస్తుంది. మన యువజనుల మేథో సంపద, తెలివితేటలు కొన్ని నగరాలు, పట్టణాలకు మాత్రమే పరిమితం కాదు కదా! ఆ ఆలోచనే తప్పు. భారతదేశంలో మూలమూలలా యువజనుల వద్ద ప్రతిభ ఉంది. వారికి అవకాశాలు రావాలి అంటే స్టార్ట్ అప్ ఇండియా - స్టాండ్ అప్ ఇండియా కొన్ని నగరాలకే పరిమితం కాకూడదు. దేశంలో ప్రతి మూలకూ వ్యాపించాలి. నేను రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కోరుతున్నాను. ఈ ఆలోచనను ముందుకు తీసుకువెడదాం అని.
జనవరి 16వ తేదీన నేను తప్పకుండా మీ ఎదుటకు వచ్చి, విస్తారంగా ఈ విషయం గురించి మాట్లాడతాను. మీ సలహా, సూచనలు ఎప్పుడూ స్వాగతమే.
నా ప్రియమైన యువజనులారా!
జనవరి 12న స్వామీ వివేకానంద జన్మదినం కూడా. స్వామీ వివేకానంద నుంచి ప్రేరణ పొందేవారు నా వంటివారు ఈ దేశంలో కోట్లాది మంది ఉన్నారు. 1995 నుంచి జనవరి 12న స్వామీ వివేకానంద జయంతిని జాతీయ యువ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ ఏడాది జనవరి 12 నుంచి 16 వరకు ఛత్తీస్ గఢ్ లోని రాయ్‌పూర్‌లో ఈ ఉత్సవం జరుగుతుంది. ఈ కార్యక్రమం ఒక ఇతివృత్తం ప్రకారం జరుగుతుంది. ఈసారి ఇతివృత్తం ‘భారత్ యువత - అభివృద్ధి, నైపుణ్యాలు, సమైక్యత కోసం’ అని నాకు తెలిసింది. అన్ని రాష్ట్రాల్లో, దేశం నలుచెరగుల నుంచి 10 వేల మంది కంటే ఎక్కువగా యువజనులు ఈ ఉత్సవానికి హాజరవుతారని నాకు తెలిసింది. ‘సూక్ష్మ భారతదేశం’ అనగలిగే దృశ్యం ఒకటి అక్కడ గోచరించనున్నది. ‘యువ భారతం’ అనే దృశ్యం సాక్షాత్కరించనున్నది. కలల వరద అక్కడ వెల్లువెత్తేలా కనిపిస్తుందని, సంకల్పం సానుభవం కానున్నదని నాకు అనిపిస్తుంది. ఈ యువజనోత్సవం గురించి మీరు కూడా నాకు సూచనలు, సలహాలు ఇవ్వవచ్చును కదా! నేను ముఖ్యంగా యువ మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. నరేంద్ర మోదీ యాప్ పైన మీరు నేరుగా మీ సూచనలు నాకు పంపండి. నేను మీ మనోరథం తెలుసుకోవాలని భావిస్తున్నాను. మీ ఆలోచన యువజనోత్సవంలో ప్రతిఫలించేలా నేను ప్రభుత్వానికి కూడా తగు ఆదేశాలు ఇస్తాను. సూచన చేస్తాను. కాబట్టి మిత్రులారా, నేను నరేంద్ర మోదీ యాప్ పైన మీ సలహాలు, సూచనలు అందుకునేందుకు సిద్ధంగా ఉంటాను.
అహ్మదాబాద్, గుజరాత్ కు చెందిన దిలీప్ చౌహాన్ దృష్టిలోపం ఉన్న ఒక ఉపాధ్యాయుడు. ఆయన తన పాఠశాలలో యాక్సెసబుల్ ఇండియా దినోత్సవం నిర్వహించారు. ఆయన నాకు ఫోన్ చేసి, తన భావాలను నాతో పంచుకున్నారు.
సార్, మేము మా పాఠశాలలో యాక్సెసబుల్ ఇండియా ఉత్సవం జరుపుకున్నాం. నేను దృష్టి లోపం ఉన్న టీచర్ని. నేను 2వేల మంది పిల్లలను ఉద్దేశించి అంగవైకల్యం గురించి మాట్లాడాను. ఒక విధమైన వైకల్యం కలవారికి ఏ విధంగా మనం సహాయపడవచ్చు, అవగాహన పెంచవచ్చు అనే అంశంపైన నేను మాట్లాడాను. విద్యార్థుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. అంగవైకల్యం కలవారికి సహాయపడాలని పిల్లల్లో ఎంతో ప్రేరణ, ఉత్సాహం కలిగాయి. మీరు ప్రవేశపెట్టిన యాక్సెస బుల్ ఇండియా పథకం ఎంతో గొప్ప పథకం అని నేను అనుకుంటున్నాను.
దిలీప్ గారు, మీకు నా కృతజ్ఞతలు. మీరు స్వయంగా ఈ రంగంలో పని చేస్తున్నారు. ఈ విషయాలన్నీ మీకు స్పష్టంగా అర్థమవుతాయి. మీరు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉంటారు. కొన్ని కొన్నిసార్లే, సమాజంలో ఇటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం వస్తుంది. కలుసుకోవడంతోనే నా మనసులో అనేక రకాల ఆలోచనలు తలెత్తుతాయి. మన ఆలోచనను బట్టి మన దృక్పథం, మన అభివ్యక్తి ఉంటుంది. చాలా మంది ప్రమాదవశాత్తు అంగవికలురవుతారు. కొంత మంది పుట్టుకతోనే వైకల్యంతో ఉంటారు. అలాంటి వారి గురించి ఈ ప్రపంచం రకరకాల పదాలను ఉపయోగిస్తుంది. కానీ, ఈ భాష, ఈ పదాల గురించి కూడా ఎప్పుడూ ఒక మథనం జరుగుతూ ఉంటుంది. చాలాసార్లు మనకు లేదు లేదు - వారి గురించి మాట్లాడేందుకు ఈ పదం సరైనది కాదు, ఇది వారికి గుర్తింపుగా ఉపయోగించకూడదని అనిపిస్తుంది. ఇది గౌరవంగా లేదని అనిపిస్తుంది. ఎన్నో శబ్దాలు ఈ విధంగా ఆవిర్భవించాయి. ఒక్కోసారి handicapped అంటారు, లేదా disabled అంటారు – specially abled person అంటాం - ఇలా ఎన్నో పదాలు వినవస్తుంటాయి. పదాలకు కూడా ప్రాముఖ్యత ఉందన్న విషయం మనకు తెలుసు. ఈ ఏడాది భారత్ ప్రభుత్వం ‘సుగమ్య భారత్’ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు నేను ఆ కార్యక్రమానికి హాజరు కావలసింది. కానీ తమిళనాడులో కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా చెన్నైలో, భయంకరమైన వరదల వల్ల నేను ఆ కార్యక్రమానికి ఆ రోజు హాజరు కాలేకపోయాను. కానీ నేను వెళ్ళవలసిన సమయంలో నా మనసులో దాని గురించి ఆలోచన సాగుతూ ఉంది. నాకు అప్పుడు ఒక ఆలోచన వచ్చింది. దేవుడు ఎవరికైనా శరీరంలో ఏదన్నా లోపం కల్పిస్తే, ఒకటి రెండు అవయవాలు సరిగ్గా పని చేయని పరిస్థితి కల్పిస్తే - దానిని మనం అంగవైకల్యం అంటాం. వారిని వికలాంగులని పిలుస్తాం. కానీ, వారితో పరిచయం అయినప్పుడు తెలుస్తుంది - మనకు కళ్ళకి ఒక లోపం కనిపిస్తుందేమో కానీ పరమాత్ముడు వారికి అదనంగా ఏదో శక్తినిచ్చాడు అనిపిస్తుంది. ఒక భిన్నమైన శక్తిని ఆ వ్యక్తిలో పరమాత్ముడు నింపాడనీ, ఆ శక్తిని మనం కళ్ళతో చూడలేం కానీ, వారు ఒక పని చేసినప్పుడు, వారి సమర్థత చూసి మనకు అనిపిస్తుంది ‘అరే ఈ పని ఎంత బాగా చేశారో’ అనిపిస్తుంది. అవలోకిస్తే అంగవైకల్యం అనిపించవచ్చు. కానీ అనుభవం బట్టి చూస్తే ఆ వ్యక్తి వద్ద ఏదో అదనపు శక్తి ఉందని అనిపిస్తుంది. అటువంటి సందర్భంలో నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. మన దేశంలో వికలాంగులు అనే పదం స్థానంలో ‘దివ్యాంగులు’ అనే పదాన్ని ఎందుకు ఉపయోగించకూడదు. వారు ఎటువంటి వ్యక్తులంటే, వారి వద్ద దివ్యతతో నిండిన ఒకటి, లేదా ఎక్కువ అవయవాలు అదనంగా ఉన్నాయి. దివ్యశక్తి అనే ఒక ద్రవమేదో నిండి ఉంది. సామాన్యులైన మన శరీరంలోని ద్రవమేదో వారిలో ప్రవహిస్తోంది. నాకు ఈ పదం ఎంతో నచ్చింది.
నా దేశవాసులారా!
మనం వికలాంగులు అనే పదం స్థానంలో ‘దివ్యాంగులు’ అనే పదాన్ని అలవరచుకొని, వాడుకలోకి తీసుకురాగలమా? ఈ పదాన్ని చెలామణిలోకి తెస్తారని ఆశిస్తున్నాను. ఆరోజు ప్రారంభించిన సుగమ్య భారత్ ఉద్యమం కింద భౌతికమైన, వాస్తవికమైన మౌలిక సదుపాయాల్లో మార్పు తెచ్చి, మెరుగు పరచి వాటికి దివ్యాంగులైన వారికి సుగమం, సౌకర్యవంతం చేయాలని నిశ్చయించాం. పాఠశాల, ఆసుపత్రి, ప్రభుత్వ కార్యాలయం, బస్టాండు, రైల్వేస్టేషన్ లో ర్యాంప్ లు, పార్కింగ్, లిఫ్ట్ అందుబాటులో ఉండి, బ్రెయిలీ లిపిలో అన్ని పత్రాలు - ఇలా ఎన్నో - వీటన్నింటినీ సుగమం చేసేందుకు సృజనాత్మక కృషి కావాలి - సాంకేతిక పరిజ్ఞానం కావాలి, వ్యవస్థ కావాలి, ఏర్పాట్లు కావాలి - ఒక సున్నితమైన, సహానుభూతితో కూడుకున్న దృక్పథం కావాలి. ఈ కార్యక్రమాన్ని ముందుకు కదిపాం. ప్రజల నుంచి భాగస్వామ్యం కూడా లభిస్తోంది. అందరికీ ఇది నచ్చింది. మీరు కూడా మీకు చేతనైన విధంగా ఈ ఉద్యమంలో పాలుపంచుకోండి.
నా ప్రియమైన దేశవాసులారా!
ప్రభుత్వ పథకాలు నిరంతరం వస్తూనే ఉంటాయి. నడుస్తూనే ఉంటాయి. కానీ పథకాలు ఎల్లప్పుడూ సజీవంగా, ఉత్తేజంగా ఉండడం అవసరం. పథకాలు చివరి వ్యక్తి వరకూ, మన దేశంలో ప్రతి వ్యక్తికీ చేరుకునేంతవరకు సజీవంగా ఉండాలి. అవి ఫైళ్ళలో మృతప్రాయంగా, అవశేషాలుగా మిగలకూడదు. పథకాలు రచించేదే సామాన్యుల కోసం, పేదవారి కోసం. కొన్నేళ్ళ క్రితం భారత ప్రభుత్వం ఒక ప్రయత్నం చేసింది. యోజనల ప్రయోజనాలు పొందవలసిన వారికి సులభంగా, సరళంగా ఈ ఫలాలు ఎలా చేరాలి అని యోచించింది. మన దేశంలో గ్యాస్ సిలిండర్ పైన సబ్సిడీ ఇస్తాం. దాని మీద కోట్ల రూపాయలు ఖర్చు పెడతాం. కానీ దానికి లెక్కా పత్రం లేదు - లబ్ధిదారులకు అది అందుతోందా లేదా నిర్ధారించే మార్గం లేదు. సకాలంలో అందుతోందా లేదా తెలుసుకునే పద్ధతి లేదు. ప్రభుత్వం దీనిలో కొన్ని మార్పులు తీసుకువచ్చింది. జన్ ధన్ ఖాతా తెరవడం - ఆధార్ కార్డు - వీటి సహాయంతో ప్రపంచంలోనే అతి పెద్ద నగదు బదిలీ పథకం ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాలోకి సబ్సిడీ చేరేలా చేసింది. ఇటీవలే ప్రపంచంలోనే విజయవంతంగా అమలవుతున్న అతిపెద్ద ప్రత్యక్ష నగదు బదిలీ పథకం కింద గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం లభించిందని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. పెహల్ అనే పేరుతో ఈ పథకం అమలులో ఉంది. ఈ ప్రయోగం ఎంతో విజయవంతంగా జరిగింది. నవంబర్ చివరి నాటికి 15 కోట్ల మంది వంట గ్యాస్ వినియోగదారులు పెహల్ పథకం కింద ప్రయోజనం పొందారు. 15 కోట్ల మంది బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం డబ్బు నేరుగా జమ అయింది. ఎవరూ మధ్యవర్తులు లేరు, ఎటువంటి సిఫార్సులు అవసరం లేదు. అవినీతికి ఎంటువంటి తావు లేదు. ఒకవైపు ఆధార్ కార్డు పథకం, రెండోవైపు జన్ ధన్ ఖాతా తెరవడం, మూడోది రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు కలసి లబ్ధిదారుల జాబితా తయారుచేయడం - ఆధార్ తో, ఖాతాతో వాటిని ముడిపెట్టడం - ఈ పరంపర ఇలా కొనసాగుతోంది. జాతీయ గ్రామీణ ఉపాథి హామీ పథకం గ్రామాల్లో అమలవుతోంది. ఈ చెల్లింపుల విషయంలో ఎన్నో ఫిర్యాదులు వచ్చేవి. అనేకచోట్ల ఇప్పుడు ఆ డబ్బు నేరుగా, పనిచేసిన వ్యక్తి ఖాతాలో జమ ఆవుతోంది. విద్యార్థులకు ఉపకార వేతనాలు పొందడంలో ఇబ్బందులు ఉండేవి. ఫిర్యాదులు వచ్చేవి. అందులో కూడా ఈ జమ ప్రక్రియ ప్రారంభమైంది. క్రమంగా మరింత విస్తృతమవుతోంది. ఇప్పుడు దాదాపు 40 వేల కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా నేరుగా లబ్ధిదారుల అకౌంట్లలోకి బదిలీ జరుగుతోంది. స్థూలంగా 35నుంచి 40 పథకాలు ప్రత్యక్షంగా నగదు బదిలీ ద్వారా అమలవుతున్నాయని నేను అంచనా వేస్తున్నాను.
నా ప్రియమైన దేశవాసులారా!
జనవరి 26 మన గణతంత్ర దినోత్సవం ఒక మహత్తరమైన సందర్భం. మన రాజ్యాంగ రచయిత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 125వ జయంతి కావడం ఈసారి ఒక శుభ సంయోగం. పార్లమెంట్లో కూడా రాజ్యాంగం పైన రెండు రోజులపాటు ప్రత్యేక చర్చ జరిగింది. అది ఎంతో మంచి కార్రక్రమం. అన్ని పార్టీల నేతలు రాజ్యాంగం ప్రాముఖ్యత, పవిత్రత గురించీ, రాజ్యాంగాన్ని సరైన విధంగా అర్థం చేసుకోవడం గురించి ఉత్తమమైన రీతిలో చర్చించారు. దీనిని ముందుకు తీసుకుపోవాలి. గణతంత్ర దినోత్సవం ప్రతి వ్యక్తికీ, పాలనా వ్యవస్థకూ మధ్య ఒక అనుసంధానం ఏర్పరచగలదా? వయి వస్థకు వ్యక్తితో ముడిపెట్టగలమా? మన రాజ్యాంగం మనకు ఎన్నో హక్కులు కల్పించింది. హక్కుల గురించిన చర్చ జరగడం సహజమే. చర్చ జరగాలి కూడా! ఆ చర్చ కూడా అంతే ముఖ్యం. రాజ్యాంగం మన కర్తవ్యాలు, బాధ్యతల గురించి కూడా నొక్కి చెబుతుంది. కానీ, బాధ్యతల గురించి చర్చ పెద్దగా జరగదు. ఎన్నికలు జరిగేటప్పుడు, అన్నిచోట్ల ప్రకటనలు వస్తాయి. గోడల మీద రాస్తారు. హోర్డింగ్స్ ఏర్పాటుచేస్తారు. ఓటు వేయడం మన పవిత్ర కర్తవ్యమంటూ సందేశమిస్తారు. ఓటు వేసేటప్పుడు బాధ్యతల గురించి చాలా చర్చిస్తాం. కానీ, దైనందిన జీవితంలో కూడా బాధ్యతల గురించి చర్చిచమెందుకు? ఈసారి బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి జరుపుకుంటున్న సందర్భంగా మనం జనవరి 26ని లక్ష్యంగా పెట్టుకొని పాఠశాలల్లో, కాలేజీల్లో, మన గ్రామాల్లో, నగరాల్లో, వివిధ సంఘాల్లో కర్తవ్యం అనే విషయం పైన వ్యాస రచన పోటీలు, కవితల పోటీలు, వక్తృత్వం పోటీలు, నిర్వహించవచ్చు కదా! నూట పాతిక కోట్ల మంది భారతీయులు కర్తవ్య భావనతో, బాధ్యతాయుతంగా అడుగులు వేస్తూ ముందుకు సాగితే, వ్యవహరిస్తే - ఎంత ఘన చరిత్ర సృష్టించగలం? చర్చతో ఈ ప్రక్రియ ప్రారంభిద్దాం. నాది ఒక ఆలోచన - మీరు నాకు జనవరి 26 కంటే ముందుగా డ్యూటీ, కర్తవ్యం, విధి - అనే విషయం మీద మీ భాషలో, ఆ తర్వాత సాధ్యమైతే, మీకు వీలైతే హిందీలో లేదా ఇంగ్లీష్‌లో కర్తవ్యంపై వ్యాసం, కవిత రాసి నాకు పంపండి. నేను మీ అభిప్రాయాలు, ఆలోచనలు తెలుసుకోవాలనుకుంటున్నాను. mygov పోర్టల్‌కి పంపండి. నా దేశంలో యువతరం కర్తవ్యం గురించి ఏం ఆలోచిస్తోందో తెలుసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఒక చిన్న సూచన - జనవరి 26న మనం గణతంత్ర దినోత్సవం జరుపుకున్నప్పుడు,మనం పౌరులం, బడి పిల్లలు మన మన నగరాల్లో, ఊళ్ళలో ఉన్న మహాత్ముల విగ్రహాలను, ఆ చుట్టపక్కల పరిసరాలను శుభ్రం చేయగలమా! జనవరి 26 నాటికి, అత్యుత్తమమైన పరిశుభ్రత, అలంకరణ మనం చేయగలమా? ఇది నేను ప్రభుత్వాన్ని చేయమనడం లేదు. పౌరులు చేయాలి అంటున్నాను. ఏ మహానుభావుల విగ్రహాలు పెట్టాలని మనం ఎంతో భావోద్వేగంతో పని చేస్తామో, ఆ తర్వాత ఆ విగ్రహాలను శుభ్రంగా ఉంచే విషయంలో అంతే నిర్లక్ష్యంగా ఉంటాం. సమాజంగా, దేశంగా మనం ఈ వైఖరిని స్వతహాగా అలవరచుకోగలమా! ఈ జనవరి 26కి అందరం కలిసి ప్రయత్నిద్దాం - మన ఊరిలో మహనీయుల విగ్రహాలను గౌరవపూర్వకంగా, పవిత్రంగా, పరిశుభ్రంగా ఉంచేలా, అలంకరించేలా కృషి చేద్దాం. ఇది పౌరుల ద్వారా జరగాలి. జన బాహుళ్యం ద్వారా జరగాలి.
నా ప్రియమైన దేశవాసులారా!
మరొకసారి 2016 నూతన సంవత్సరానికి మీకు ఎన్నో శుభాకాంక్షలు.
ధన్యవాదాలు
దీపావళి పవిత్ర పర్వదినం సందర్భంగా మీరు సెలవులను అద్భుతంగా గడిపి ఉంటారు. కొత్త వ్యాపార కార్యకలాపాలను కూడా ఉత్సాహంగా ప్రారంభించి ఉంటారు. ఇంకోవైపు - క్రిస్మస్ పండుగ కోసం ఏర్పాట్లు కూడా ప్రారంభమై ఉంటాయి. సామాజిక జీవనంలో పండుగ మనకు ఎంతో ముఖ్యమైనది. ఒక్కోసారి పండుగ మన గాయాలను మాన్పడానికి ఉపయోగపడితే... ఒక్కోసారి కొత్త శక్తిని ఇస్తుంది. కానీ... ఒక్కొక్కసారి పండుగలప్పుడు కష్టాలు ఎదురైతే బాధాకరంగా ఉంటుంది. మరింత ఇబ్బందిగా పరిణమిస్తుంది. ప్రపంచంలోని అన్నిచోట్ల నుంచి ప్రకృతి వైపరీత్యాల వార్తలు వస్తూనే ఉంటాయి. ఎప్పుడూ కనీవినీ ఎరుగని రీతిలో కూడా ప్రకృతి వైపరీత్యాల వార్తలు వస్తుంటాయి. వాతావరణ మార్పుల ప్రభావం ఎంత వేగంగా పెరిగిపోతోందన్న విషయం మనకిప్పుడు అనుభవంలోకి వస్తోంది. మన దేశంలోనే కొద్దిరోజుల కిందట అతివృష్టి, అకాల వర్షాలు, ఎడతెరిపిలేని వర్షాలు ఎలా కురిశాయో... ప్రత్యేకించి తమిళనాడులో ఈ వర్షాల వల్ల వాటిల్లిన నష్టం ప్రభావం ఇతర రాష్ట్రాలపై కూడా పడింది. ఎంతోమంది చనిపోయారు. ఈ కష్ట సమయంలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలుపుతున్నాను. రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ, పునరావాస కార్యక్రమాల్లో పూర్తి శక్తియుక్తులతో నిమగ్నమై ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ భుజం భుజం కలిపి పని చేస్తుంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ బృందం ఒకటి తమిళనాడు వెళ్లింది. తమిళనాడు శక్తి మీద విశ్వాసం ఉంది. ఇంతటి విపత్తును ఎదుర్కొన్నా... అది తిరిగి ముందుకు సాగుతుందని, అలాగే దేశ పురోగతిలో కూడా తన వంతు పాత్రను పోషిస్తుందని నమ్మకం ఉంది. కానీ, నలువైపులా ఇలాంటి విపత్తులను చూస్తుంటే వీటిని ఎదుర్కొనే విషయంలో తగిన మార్పు తేవాల్సిన అవసరం ఏర్పడిందనిపిస్తోంది. పదిహేనేళ్ల కిందట అయితే ప్రకృతి వైపరీత్యం అంటే అదేదో వ్యవసాయ విభాగానికే పరిమితంగా ఉండేది. ఎందుకంటే... అప్పట్లో ఎక్కువ మటుకు ప్రకృతి విపత్తులు వ్యవసాయానికే పరిమితమై ఉండేవి. కానీ ఇప్పుడు విపత్తుల తీరే మారిపోయింది. ప్రతి స్థాయిలో మనం మన సామర్థ్యాన్ని పెంచుకోవడానికి కృషి చేయడం అనివార్యంగా మారింది. ప్రభుత్వం, పౌర సమాజం, ప్రజలు, చిన్న పెద్ద సంస్థలు ఎంతో లోతైన శాస్త్రీయ దృక్పథంతో సామర్ధ్యాన్ని పెంచుకునేందుకు పాటుపడవలసి ఉంది. నేపాల్‌లో వచ్చిన భూకంపం తర్వాత నేను పాకిస్తాన్ ప్రధానమంత్రి శ్రీ నవాజ్ షరీఫ్‌తో మాట్లాడాను. సార్క్ దేశాలన్నీ కలసి విపత్తులను ఎదుర్కొనే సన్నద్ధత కోసం సంయుక్త విన్యాసం చేయాలని సూచించారు. ఢిల్లీలో సార్క్ దేశాల సమావేశం ఒక సదస్సు నిర్వహించి విపత్తులను ఎదుర్కొనే విషయంపై ఉత్తమ విధానాలను చర్చించడం నాకు సంతోషంగా ఉంది.
నాకు ఈరోజు పంజాబ్ లోని జలంధర్ నుంచి లఖ్విందర్ సింగ్ నుంచి ఫోన్ వచ్చింది.
'నేను లఖ్విందర్ సింగ్‌ను. పంజాబ్ జలంధర్ జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. మేము ఇక్కడ సేంద్రీయ వ్యవసాయం చేస్తాము. ఎంతో మందికి పంటల సాగు విషయంలో సలహాలు ఇస్తాం. నాకు ఒక సందేహం ఉంది. పంటలు కోసుకున్నాక కొయ్యలకు రైతులు నిప్పంటిస్తారు. గోధుమ గడ్డి దగ్ధం చేయడంవల్ల భూమిలోని సూక్ష్మ జీవాణువులు దెబ్బతిని దానివల్ల ఎలాంటి దుష్ప్రభావం పడుతుంది అనే విషయం ఇక్కడి వారికి ఎలా చెప్పాలి అని. దిల్లీలో, హర్యాణాలో, పంజాబ్‌లో ఈ కాలుష్యానికి నివారణ ఏంటి?' అనేది ఆ ఫోన్ కాల్.
లఖ్విందర్ సింగ్ గారు... మీ మాటలు విన్నాక నాకు చాలా సంతోషం కలిగింది. మీరు సేంద్రీయ వ్యవసాయం చేసే రైతు అని తెలిసి నాకు సంతోషం కలిగింది. రెండోది... మీరు స్వయంగా సేంద్రీయ వ్యవసాయం చేస్తూనే మరోవైపు రైతుల సమస్యల గురించి ఆలోచిస్తున్నారు. మీ ఆవేదన సమంజసమే. కానీ ఈ సమస్య ఒక్క పంజాబ్‌లోనో, ఒక్క హర్యాణాలోనో కాదు. మొత్తం భారతదేశంలోనే మనకు ఈ అలవాటు ఉంది. తరతరాలుగా ఈ విధంగా మన పంటలు కోశాక గడ్డి, ఇతర అవశేషాలను కాల్చివేసే మార్గాన్ని అనుసరిస్తున్నాం. ఒకటి -దీనివల్ల మొదట ఎలాంటి నష్టం వస్తుందో మనకు తెలిసేది కాదు. అందరు చేస్తున్నారు కాబట్టి మనమూ చేస్తూ వచ్చాం. ఇదే అలవాటుగా ఉండేది. రెండోది - దీనికి ఉపాయం ఏమిటో తెలుసుకునే శిక్షణ లేదు. దీనివల్ల ఈ విధంగా కొనసాగింది. ఈ పద్ధతి అలా పెరుగుతూనే వచ్చింది. ప్రస్తుత వాతావరణ మార్పుల సమస్యకు ఈ కాల్చివేత సమస్య కూడా తోడైంది. ఈ సమస్య ప్రభావం నగరాలకు కూడా విస్తరించడంతో ఇప్పుడు దీని గురించిన చర్చ వినిపిస్తోంది. కానీ, మీరు ఇప్పడు వ్యక్తం చేసిన ఆవేదన చాలా నిజమైంది. దీనిపై మన రైతు సోదరసోదరీమణులకు అవగాహన కల్పించాలి. ఈ సమస్యకు మొట్టమొదటి పరిష్కారం పంటల కొయ్యలను కాల్చివేయడం వల్ల కొంత సమయం కలిసివస్తుంది. శ్రమ తగ్గుతుంది. తర్వాతి పంట వేసేందుకు పొలం సిద్ధం కానుంది. కానీ... ఇది వాస్తవం కాదు. పంటల అవశేషాలు కూడా చాలా విలువైనవని... వాటిలో ఎరువుగా ఉపయోగపడే గుణం ఉందనే వాస్తవాన్ని రైతులకు వివరించి చెప్పాలి. మనం వాటిని కాల్చడం వల్ల ఆ గుణాల్ని నాశనం చేస్తున్నాం. అంతేకాదు... వాటిని ముక్కలుముక్కలుగా చేసి పెడితే పశువులు ఎండిన పండ్లుగా ఇష్టంగా తింటాయి. రెండోది - వీటిని కాల్చడం వల్ల నేల పై పొర కాలిపోతుంది.
నా ప్రియమైన రైతు సోదరీ సోదరులారా.. ఒక్క క్షణం ఆలోచించండి. మన ఎముకలు గట్టిగా ఉండాలా... గుండె దృఢంగా ఉండాలా... మూత్ర పిండాలు బాగుండాలా.. అన్నీ బాగున్నా శరీరం మీద ఉండవలసిన చర్మం కాలిపోయిందనుకోండి. ఏమవుతుంది. మనం బతుకుతామా...? గుండె కొట్టుకుంటున్నా కూడా బతకలేం. మన చర్మం కాలిపోతే జీవించడం ఎలాగైతే కష్టమో అలాగే పంటల అవశేషాలను తగులబెడితే కేవలం అవే కాదు. చర్మం కూడా కాలిపోతుంది. మన భూమి పొర కాలితే సారవంతమైన భూమిని కూడా మృత్యువు వైపు మళ్లించినట్లవుతుంది. అందుకని ఈ విషయంలో సానుకూలమైన కృషి జరగాలి. ఈ అవశేషాలను మళ్లీ భూమిలో వేసి దున్నితే అవి సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడతాయి. లేదా గొయ్యి తీసి ఒకచోట పాతి నీళ్లుపోస్తే కూడా మంచి సేంద్రీయ ఎరువుగా మారుతుంది. పశువులు తినడానికి ఇది ఎలాగు పనికి వస్తుంది. దీనివల్ల మన భూమి కూడా బాగుంటుంది... ఆ నేలలో వేసే ఇలాంటి ఎరువు వల్ల రెట్టింపు ప్రయోజనం లభిస్తుంది.
ఒకసారి అరటిసాగు చేసే రైతు సోదరులతో మాట్లాడే అవకాశం వచ్చింది. వాళ్లు నాకు ఒక మంచి అనుభవం గురించి చెప్పారు. అరటి సాగు చేసేటప్పుడు ఆ పంట అయిపోయాక అరటి బోదెలు మిగిలేవి. అటువంటి భూమిని చదును చేయడానికి ఒక్కొక్క హెక్టార్‌కు ఐదు వేలు, పది వేలు, పదిహేను వేల రూపాయలు ఖర్చయ్యేవి. ఆ బోదెలను, ఆకులను తొలగించడానికి ట్రాక్టర్ల నిండా జనం వస్తే తప్ప ఆ పని జరిగేది కాదు. ఇలాంటి పరిస్థితుల్లో కొందరు రైతులు ఏం రుజువు చేశారంటే - బోదెలను ఆరారు ఎనిమిదెనిమిది అంగుళాల ముక్కలు చేసి భూమిలో పాతేశారు. అనుభవం ఏంటంటే ఈ అరటి బోదెలలో ఎన్ని నీళ్లు ఉన్నాయంటే - అవి పాతేసిన నేలలో మొక్కలైనా, చెట్లయినా, పంటలైనా మూడు నెలల వరకు నీరు పోయవలసిన పని లేదు. ఆ పాతిపెట్టిన అరటి బోదెల ముక్కల్లో ఉన్న నీరు పైరును గానీ, మొక్కలను గానీ బతికిస్తుందన్న మాట. ఇప్పుడు అక్కడ ఈ అరటి బోదెలకే ఆదాయం కూడా వస్తోంది. ఆ మొక్కలకు కూడా ప్రాణం లభిస్తుంది. మొదట్లో ఆ ముక్కల్ని తొలగించి శుభ్రపరచడానికి ఖర్చయ్యేది. ఇప్పుడు ఆ బోదెలకే ఆదాయం వస్తోంది. చిన్న ప్రయోగం కూడా ఎంతో లాభం ఇవ్వగలదు - మన రైతు సోదరులు ఏ శాస్త్రవేత్తలకు తీసిపోరు.
ప్రియమైన నా దేశవాసులారా,
వచ్చే డిసెంబర్ 3న అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ప్రపంచమంతా జరుపుకోనుంది. ఇంతకుముందు మన్ కీ బాత్ లో మీతో నేను అవయవ దానంపై మాట్లాడాను. అందులో అవయవదానం కోసం నోటో హెల్ప్ లైన్ గురించి కూడా మాట్లాడాను. ఆనాటి మన్ కీ బాత్ తర్వాత ఫోన్ కాల్స్ సంఖ్య ఏడు రెట్లు పెరిగింది. వెబ్ సైట్లో స్పందనలు రెండున్నర శాతం పెరిగాయి. నవంబర్ 27న భారతీయ అవయవ దానం దినాన్ని జరుపుకున్నాం. సమాజంలోని పలువురు ప్రముఖులు అందులో పాల్గొన్నారు. సినీనటి రవీనా టాండన్ తదితరులు ఎంతో మంది ప్రముఖులు ఇందులో పాలుపంచుకున్నారు. అవయవదానం ఎన్నో అమూల్యమైన ప్రాణాలను కాపాడుతుంది. అవయవదానం ఒకరకమైన అమరత్వాన్ని తీసుకొస్తుంది. ఒక శరీరంలో నుంచి మరో శరీరంలోకి అవయవం వెళ్లడంతో ఆ శరీరానికి కొత్త జన్మ లభిస్తుంది. ఆ వ్యక్తికి కొత్త జీవితం లభిస్తుంది.
ఇంతకంటే సర్వోత్తమమైన దానం ఇంకేముంటుంది..? అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న రోగులు ఎందరో ఉన్నారు. అవయవ దాతలు, అవయవ మార్పిడికి సంబంధించిన జాతీయస్థాయిలో ఒక రిజిస్ట్రీ వ్యవస్థ ఈ నెల 27న ప్రారంభమైంది. నోటోకు సంబంధించిన లోగో, డోనార్ కార్డు, స్లోగన్ డిజైన్ చేయడానికి మైగవ్ డాట్ ఇన్ లో ఒక జాతీయస్థాయి పోటీ పెట్టారు. దీనిలో ఎంత మంది పెద్ద ఎత్తున పాల్గొని వినూత్నమైన రీతిలో సానుభూతితో మాట్లాడారో తలుచుకుంటే నాకు ఆశ్చర్యం కలుగుతుంది. ఈ విషయంపై విస్తృతమైన చైతన్యం వస్తుందని, అవసరార్థులకు వాస్తవికంగా ఉత్తమోత్తమైన సహాయం లభిస్తుందని నాకు విశ్వాసం ఉంది. ఎవరో ఒకరు దానం చేయకపోతే... వారికి సహాయం ఎలా లభిస్తుంది? ఇంతకుముందే నేను చెప్పినట్టు డిసెంబర్ 3న వికలాంగుల దినోత్సవంగా జరుపుకోబోతున్నాం. శారీరక, మానసిక వికలాంగులు కూడా అసమాన సాహసులు, సామర్థ్య సంపన్నులై ఉంటారు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎవరైనా వారిని హేళన చేస్తే చాలా బాధ కలుగుతుంది. ఎక్కడైనా కరుణ, దయాపూర్వకమైన మాట వినిపిస్తే చాలా బాగనిపిస్తుంది. కానీ వాళ్లపట్ల మన దృష్టిని మార్చుకుంటే వారి నుంచి స్ఫూర్తి అందుతుంది. చిన్న కష్టం వస్తే చాలు మనం ఏడుస్తూ కూర్చుంటాం. నాకు వచ్చిన కష్టం చాలా చిన్నదని వాళ్లెట్లా కష్టపడుతున్నారు... వీళ్లెట్లా జీవిస్తున్నారు... ఎలా పని చేస్తున్నారు... అని గనుక ఆలోచిస్తే మన కష్టం పెద్ద కష్టం అనిపించదు. అందువల్ల వికలాంగులు మనకు స్ఫూర్తి కలిగిస్తారు. వారి సంకల్ప శక్తి, వారి జీవన విధానం కష్టాల్ని సమర్థంగా ఎదుర్కొనే వారి దృష్టి ప్రశంసనీయంగా అనిపిస్తుంది.
ఈరోజు జావెద్ అహ్మద్ గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. అతనికి 40-42 ఏళ్ల వయసు ఉంటుంది. 1996లో కశ్మీర్ లో జావెద్ అహ్మద్ పై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆయనను వారు కాల్చారు గానీ బతికి బయటపడ్డారు. కానీ, ఉగ్రవాదుల తూటాల కారణంగా మూత్ర పిండం పోగొట్టుకున్నారు. జీర్ణకోశం, పేగుల్లో కొంత భాగం పోయింది. వెన్నుకు తీవ్రమైన గాయం అయింది. సొంత కాళ్లపై నిలబడగలిగే శక్తి శాశ్వతంగా పోయింది. అయినా జావెద్ అహ్మద్ ఓటమిని ఒప్పుకోలేదు. ఉగ్రవాదపు దెబ్బ కూడా జావెద్ మనస్థైర్యాన్ని దెబ్బతీయలేదు. తన అభిరుచి... తనది అన్నింటికంటే పెద్ద విషయం ఏంటంటే - అకారణంగా ఒక నిరపరాధికి ఇంత పెద్ద కష్టం ఎదుర్కోవలసి రావడం. జీవితంలో ముఖ్య దశ ప్రమాదంలో పడింది. కానీ ఏమాత్రం బెంగలేదు. ఆక్రోశం లేదు. ఈ కష్టాన్ని కూడా జావెద్ అహ్మద్ ఒక సంచలనంగా మార్చివేసి, తన జీవితాన్ని సమాజ సేవకు అర్పించేశారు. శరీరం సహకరించదు. కానీ 20 ఏళ్ల నుంచి పిల్లలకు చదువు చెప్పడంలో మునిగిపోయాడు. అంగవికలుర కోసం మౌలిక సదుపాయాలను ఎలా మెరుగుపర్చాలి.... బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ కార్యాలయాల్లో వికలాంగుల కోసం ఏర్పాట్లను ఎలా మెరుగుపర్చాలి... అన్న అంశాలపై పని చేస్తున్నాడు. ఈ విషయాల్లోనే తన చదువును కొనసాగించాడు. సామాజిక సేవలో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాడు. ఒక సామాజిక సేవకుని రూపంలో ఒక అప్రమత్త పౌరుడిగా, వికలాంగులకు దూతగా మారి... ఒక నిశ్శబ్ధ విప్లవం రచిస్తున్నాడు. జావెద్ జీవితం హిందుస్థాన్ మూలమూలలా మనకు ప్రేరణ ఇవ్వడానికి సరిపోదా... జావెద్ అహ్మద్ జీవితాన్ని, ఆయన తపస్సును, ఇంకా ఆయన అంకితభావాన్ని డిసెంబర్ 3న ప్రత్యేకంగా గుర్తుచేస్తాను. సమయాభావం వల్ల జావెద్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాను. కానీ దేశం నలుమూలలా ఇలాంటి ప్రేరణ దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. జీవించేందుకు కొత్త వెలుగులు ఇస్తున్నాయి. దారి చూపుతున్నాయి. డిసెంబర్ 3న ఇలాంటి అందరినీ గుర్తుచేసుకుని వారి నుంచి స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. మన దేశం ఎంతో విశాలమైందంటూ ఎన్నో ప్రస్తావనలు జరుగుతూనే ఉంటాయి. వాటిలో మనం ప్రభుత్వాల మీద ఆధారపడతాం. మధ్యతరగతికి చెందిన వ్యక్తి కావచ్చు... దిగువ మధ్యతరగతి వ్యక్తి అయినా కావచ్చు... పేదవాడు కావచ్చు... దళితులు... పీడితులు... విధివంచితులు కావచ్చు. ప్రభుత్వ వ్యవస్థలతో నిరంతర సంబంధం ఉంటుంది. ఇంకా ఒక పౌరునిగా జీవితంలో ఎప్పుడో అప్పుడు ఎవరో ఒక ప్రభుత్వాధికారితో అతనికి చేదు అనుభవం ఉండి ఉండొచ్చు. ఆ ఒకటీ అరా చేదు అనుభవం వల్ల అతనికి ప్రభుత్వ వ్యవస్థ అంటే సదభిప్రాయం ఉండదు. ఇందులో కొంత వాస్తవం కూడా ఉంది. కానీ ఒక్కోసారి ఇదే ప్రభుత్వ వ్యవస్థలో లక్షలాది మంది సేవా దృష్టితో, అంకిత భావంతో ఎంతో ఉత్తమ సేవలందిస్తున్నారు. అలాంటివారు మన దృష్టికి రాకపోవచ్చు. ప్రభుత్వ వ్యవస్థలో ఎవరో ప్రభుత్వోద్యోగి ఇంత మంచి పని చేస్తున్నారని మనకసలు తెలియనే తెలియనంత సహజంగా కాలం గడుస్తుంది.
మన దేశంలో ఆశ కార్యకర్తలు ఉన్నారు. దేశవ్యాప్తంగా వారి నెట్ వర్క్ ఉంది. మన దేశ ప్రజల మధ్య ఆశ వర్కర్లకు సంబంధించిన చర్చ నేనెప్పుడూ వినలేదు. మీరు కూడా విని ఉండరు. కానీ ప్రపంచ ప్రఖ్యాత బిల్ గేట్స్ ఫౌండేషన్ సంస్థ వ్యాపార కుటుంబం విజయం ప్రపంచానికి ఒక ఉదాహరణగా నిలిచింది. గతేడాది బిల్ గేట్స్, మిలిందా గేట్స్ కు సంయుక్తంగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రదానం చేశాం. వారు దేశంలో ఎన్నో సామాజిక సేవలందిస్తున్నారు. వారు అవిశ్రాంతంగా జీవన పర్యంతం ఏదైతే సంపాదించారో దాన్నంతటినీ పేదల కోసం ఖర్చు చేస్తున్నారు. ఎప్పుడొచ్చినా... కలసినా, ఏఏ ఆశా వర్కర్లతో కలసి పనిచేసే అవకాశం కలిగినా వారిని ఎంత పొగుడుతారంటే ఆశా వర్కర్లు ఎంత అంకితభావంతో కష్టపడి పనిచేస్తారో... కొత్తకొత్త అంశాలు నేర్చుకునేందుకు ఎంత ఉత్సాహపడతారో ఇవన్నీ వారు చెబుతారు. కొద్ది రోజుల క్రితం ఒడిశా ప్రభుత్వం స్వాతంత్య్ర దినోత్సవం నాడు ఒక ఆశ కార్యకర్తను ప్రత్యేకంగా గౌరవించింది. ఒడిశా బాలాసోర్ జిల్లాలో ఒక చిన్న గ్రామం తిందాగావ్. ఈ ఆశ కార్యకర్త, ఇంకా అక్కడి జనాభా అంతా గిరిజనులే. వారంతా షెడ్యూల్డు తెగలవారే... పేదలే. అంతేగాక ఆ ప్రాంతంలో మలేరియా విపరీతంగా ఉంది. అక్కడి ఆశ కార్యకర్త జమున మణిసింహ ఎవరినీ మలేరియాతో చావనివ్వనని నిశ్చయించుకుంది. ఇల్లిల్లు తిరగడం, ఎవరికైనా కొద్దిపాటి జ్వరం వచ్చిందని తెలిసినా వెంటనే అక్కడికి చేరిపోవడం... ఆ వ్యక్తికి తను గతంలో తీసుకున్న శిక్షణ ప్రకారం ఉపచారాలు చేయడం, ప్రతి ఇంట్లో క్రిమి నాశకాలు, దోమ తెరలు వాడకంపై అవగాహన కలిగించడం, తన సొంత బిడ్డలు నిశ్చింతగా నిద్రపోవడానికి ఎలాంటి సంరక్షణ అవసరమో అదంతా ఆ గ్రామస్తులందరికీ ఆ ఆశా వర్కరు చేసింది. అలాగే జమున మణిసింహ గ్రామమంతా దోమల నివారణకు నిరంతరం పాటుపడుతూ వచ్చింది. ఆ విధంగా మలేరియా రాకుండా ఎదుర్కొంది. తన మార్గంలో ఆ గ్రామ యువత కూడా పనిచేసేట్లుగా వారిని సిద్ధం చేసింది. ఇలాంటి ఎంత మంది, జమునా మణులున్నారో. మన చుట్టుపక్కలే అలాంటివారు ఎన్ని లక్షల మంది ఉంటారో. వాళ్లను మనం కొంచెం ఆదరభావంతో చూడాలి. అలాంటివారు మన దేశానికి గొప్ప సంపదగా ఉంటారు. సమాజ సుఖదుఃఖాలను పంచుకునే భాగస్వాములవుతారు. అలాంటి జమునామణి రూపంలో ఉన్న ఆశా కార్యకర్తలను అభినందిస్తున్నాను.
ప్రియమైన నా యువ మిత్రులారా....
ఇంటర్నెట్, సోషల్ మీడియాలో చాలా క్రియాశీలంగా ఉన్న నా యువ మిత్రుల కోసం మైగవ్ సైట్ లో మూడు E- బుక్‌లను పెట్టాను. ఒకటి స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించిన స్ఫూర్తిదాయక గాథల కోసం, సంసద్ ఆదర్శ గ్రామాలకు సంబంధించి E- బుక్ ఒకటి, ఇంకా ఆరోగ్య రంగానికి సంబంధించిందొకటి. వాటిని చూడమని మిమ్మల్ని కోరుతున్నాను. చూడండి. ఇతరులకీ చూపించండి. బాగా చదవండి. ఇంకా వీలైతే కొత్త విషయాలు జోడించాలనిపించ వచ్చు. తప్పక మైగవ్ కు పంపండి. ఇలాంటి విషయాలు ఎలా ఉంటాయంటే - మన దృష్టికి చప్పున రావు. కానీ సమాజానికి అయితే అలాంటివి ఎంతో బలాన్నిస్తాయి. సానుకూల శక్తి అన్నింటికంటే పెద్ద ఇంధనమవుతుంది. మీరు కూడా మంచి సంఘటనల గురించి షేర్ చేయండి. ఈ E- పుస్తకాలను షేర్ చేయండి. E-పుస్తకాలపై చర్చించండి. ఉత్సాహవంతులైన యువజనులు ఉంటే E- పుస్తకాల గురించి దగ్గరలోని పాఠశాలకు వెళ్లి 8, 9, 10 తరగతుల విద్యార్థులకు చెప్పండి. అక్కడ అలా జరిగింది... ఇక్కడ ఇలా జరిగింది... అని చెప్పండి. అప్పుడు మీరు నిజమైన సామాజిక శిక్షకులవుతారు. దేశ నిర్మాణంలో మీరూ పాలుపంచుకోండి. అందుకు మీకు నేను ఆహ్వానం పలుకుతున్నాను.
ప్రియమైన నా దేశవాసులారా,
యావత్ ప్రపంచం వాతావరణ మార్పుల గురించి ఆందోళన చెందుతోంది. వాతావరణ మార్పు, భూతాపంపై ప్రతిచోటా దానిపై చర్చ జరుగుతోంది. చాలా ఆందోళన కూడా ఉంది. ప్రతి పని చేయడానికి ముందు ఇప్పుడు దానికి ఒక కొలమానం రూపంలో ఆమోదం లభిస్తూ పోతోంది. భూతాపం ఇక పెరగకూడదు. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. అందరి ఆలోచన కూడా ఇదే. భూతాపం పెరగకుండా రక్షించడానికి అన్నింటికీ మించిన ఒక ముఖ్యమైన మార్గం ఉంది. అదే ఇంధన పొదుపు. డిసెంబర్ 14వ తేదీ జాతీయ ఇంధన పరిరక్షణ దినోత్సవం. దీనికి సంబంధించి ప్రభుత్వం తరపున అనేక పథకాలు అమలు జరుగుతున్నాయి. అందులో ఎల్.ఇ.డి. బల్బ్ బథకం ఒకటి. నేనొకసారి చెప్పాను పౌర్ణమి నాడు వీధి దీపాలన్నీ ఆర్పివేసి చిమ్మచీకటి చేసి ఒక గంటపాటు వెన్నెలలో జలకాలాడాలని, పున్నమి వెన్నెలను తనివితీరా ఆస్వాదించాలని. ఎవరో ఒక మిత్రుడు నాకు ఒక లింక్ పంపించాడు చూడమని. అది చూసే అవకాశం నాకు లభించింది. ఇప్పుడు ఆ విషయం మీకు కూడా చెప్పాలనిపించింది. అయితే ఈ ఘనత మాత్రం జీ న్యూస్‌కు దక్కుతుంది. ఎందుకంటే ఆ లింక్ జీ న్యూస్‌కు చెందినది కాబట్టి. కాన్పూర్ కు చెందిన నూర్ జహాన్ అనే ఒక మహిళ ఉంది. టీవీలో చూస్తే ఆమె ఎక్కువగా చదువుకున్నట్లు కనిపించదు. కానీ, ఆమె చేస్తున్న పని ఎవరికీ ఆలోచనకు కూడా తట్టి ఉండదు. సౌర విద్యుత్ తో సూర్యరశ్మిని వినియోగిస్తూ పేదలకు వెలుగునిచ్చే పని చేస్తోంది. చీకటిపై యుద్ధం చేస్తోంది. ఒక మహిళా మండలి ఏర్పాటుచేసి సౌరశక్తితో వెలిగే లాంతర్లు, వాటి తయారీని ప్రారంభించింది. ఇంకా నెలలో వంద రూపాయల అద్దెపై ఒక లాంతర్ ను అద్దెకిస్తోంది. జనం సాయంత్రం పూట ఆమె దగ్గర లాంతర్ తీసుకెళ్తారు. పొద్దున్నే వచ్చి మళ్లీ ఛార్జింగ్ చేయడానికి లాంతర్ ఇచ్చివెళ్తారు. చాలా పెద్ద ఎత్తున దాదాపు 500 ఇళ్లవారు ఆమె దగ్గరకు వస్తారని, లాంతర్లు తీసుకుని వెళ్తారని విన్నాను. రోజుకు సుమారు మూడు నాలుగు రూపాయలు ఖర్చవుతుంది. కానీ ఇల్లంతా వెలుగుంటుంది. కానీ, ఈ నూర్ జహాన్ ఆ సౌర విద్యుత్‌తో లాంతర్లను రీఛార్జ్ చేసే పనిలో రోజంతా నిమగ్నమై ఉంటుంది. ఇప్పుడు చూడండి. వాతావరణ మార్పు నివారణ కోసం ప్రపంచంలోని పెద్దపెద్ద వాళ్లంతా ఏమేమి చేస్తుంటారో. కానీ ఒక్క ఈ నూర్ జహాన్ ప్రతి ఒక్కరికీ స్ఫూర్తినిస్తోంది. అలాంటి పని చేస్తోందామె. నూర్ జహాన్ అంతరార్థం ప్రపంచమంతా వెలిగించడమే. ఈ పని ద్వారా ఆమె వెలుగును విరజిమ్ముతోంది. నేను నూర్ జహాన్ ను అభినందిస్తున్నాను. జీ టీవీని కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే కాన్పూర్ లో ఒక మారుమూల జరుగుతున్న ఈ పనిని దేశానికంతటికీ, మొత్తం ప్రపంచానికి చాటి చూపింది. చాలా చాలా అభినందనలు.
నాకు ఉత్తరప్రదేశ్ నుంచి శ్రీ అభిషేక్ కుమార్ పాండే ఫోన్ చేశారు.
'అయ్యా నమస్కారం. గోరఖ్‌పూర్ నుంచి నేను అభిషేక్ కుమార్ పాండే మాట్లాడుతున్నాను. ప్రధానమంత్రికి నేను చాలా అభినందనలు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే... ఆయన ముద్రా బ్యాంకు అనే ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. మేము ప్రధానమంత్రి గారి నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. మీరు నడుపుతున్న ఈ ముద్రా బ్యాంకులో మావంటి ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎలా సహాయపడతారు. ఎటువంటి సహాయం మాకు లభిస్తోంది'? అంటూ ఫోన్ చేశారు. అభిషేక్ గారు... ధన్యవాదాలు. గోరఖ్ పూర్ నుంచి నాకు సందేశం పంపారు. ప్రధానమంత్రి ముద్రా యోజన నిధుల్లేని వారికి నిధులిస్తుంది. పెట్టుబడులు పెట్టలేనివారికి పెట్టుబడులిస్తుంది. ఉద్దేశాన్ని అర్థమయ్యేలా చెప్పాలంటే మూడు 'E' లు... ఎంటర్ ప్రైజ్, ఎర్నింగ్, ఎంపవర్ మెంట్. ముద్ర ఔత్సాహిక పరిశ్రమను ప్రోత్సహిస్తుంది. ముద్ర సంపాదనకు అవకాశం కల్పిస్తోంది. ముద్రా నిజమైన అర్థంలో సాధికారుల్ని చేస్తుంది. చిన్న చిన్న వ్యాపారులకు సాయం చేసేందుకు ఈ ముద్ర యోజన నడుస్తోంది. ఎంత వేగంగా జరగాలనుంటున్నానో ఇంకా ఆ వేగం పుంజుకోవాల్సి ఉంది. కానీ, ప్రారంభం బాగానే జరిగింది. ఇంత తక్కువ వ్యవధిలో సుమారు 66 లక్షల మందికి 42 వేల కోట్ల రూపాయలు ప్రధానమంత్రి ముద్ర యోజన నుంచి ఇవ్వడం జరిగింది. రజకుడు కానివ్వండి... క్షురకుడు కానివ్వండి... వార్తా పత్రికలు అమ్ముకునేవారు కానివ్వండి... పాలమ్ముకునేవారు కానివ్వండి... చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేవారు. నాకు ఇంకా సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే ఈ 66 లక్షల మందిలో సుమారు 24 లక్షల మంది మహిళలు కావడం. ఈ సహాయం పొందినవారిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ వర్గాల ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. స్వయంగా కష్టించి పనిచేసి తమ కాళ్లపై తాము నిలబడి గౌరవంగా కుటుంబాన్ని నడుపుకోవాలని ప్రయాసపడేవారు. అభిషేక్ అయితే తన ఉత్సాహాన్ని గురించి స్వయంగా చెప్పారు. నా దగ్గరకు కూడా చాలా వార్తలు వస్తుంటాయి. ముంబైలో శైలేశ్ భోంస్లే అనే వ్యక్తి ఉన్నారని ఇప్పుడే నాకెవరో చెప్పారు. ఆయనకు ముద్ర యోజన ద్వారా బ్యాంకు నుంచి ఎనిమిదిన్నర లక్షల రూపాయల రుణం అందింది. దాంతో ఆయన మురుగు కాల్వలు శుభ్రంచేసే వ్యాపారం ప్రారంభించారు. నేను నా స్వచ్ఛ అభియాన్ సమయంలో ఇందుకు సంబంధించి మాట్లాడుతూ... స్వచ్ఛ అభియాన్ నూతన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్ని తయారుచేస్తుందని చెప్పాను. శైలేశ్ భోంస్లే అది చేసి చూపించారు. ఆయన ఒక ట్యాంకర్ తెచ్చారు. దాంతో ఈ పని కొనసాగిస్తున్నారు. ఈ కొద్ది రోజుల్లో ఆయన రెండు లక్షల రూపాయలు తిరిగి బ్యాంకుకు చెల్లించినట్టు కూడా నాకు చెప్పారు. మా ముద్ర యోజన ఉద్దేశం కూడా అదేనని చెప్పదలుచుకున్నాను. భోపాల్‌కు చెందిన మమతా శర్మ విషయంలో ఆమెకు ప్రధానమంత్రి ముద్ర యోజన నుంచి 40 వేల రూపాయలు లభించాయని చెప్పారు. ఆమె పర్సులు తయారుచేసే పని చేస్తున్నారు. ఇందుకోసం ఆమె గతంలో ఎక్కువ వడ్డీపై డబ్బు తెచ్చుకునేవారు. చాలా కష్టంగా వ్యాపారం చేసేవారు. ఇప్పుడు ఒకేసారి పెద్ద మొత్తంలో చేతికి డబ్బు వస్తున్న కారణంగా ఆమె తన పనిని మరింత బాగా చేసుకుంటున్నారు. ఒకటి వడ్డీలేని కారణంగా, ఇతర కారణాల వల్ల ఆమెకు ఎక్కువ ఖర్చవుతుండేది. ఇప్పడు బ్యాంకు అందించిన రుణం వల్ల సౌలభ్యం కలిగి ప్రతి నెలా దాదాపు వెయ్యి రూపాయలు ఎక్కువ ఆదాయం లభిస్తోంది. వారి కుటుంబానికి ఒక మంచి వ్యాపారం మెల్లమెల్లగా వర్థిల్లుతోంది. కానీ, నేను ఈ పథకానికి మరింత ప్రచారం జరగాలని కోరుకుంటున్నాను. మన బ్యాంకులు మరింత సానుకూలంగా, సానుభూతితో ఉండాలి. సాధ్యమైనంత ఎక్కువ మంది చిన్న వ్యాపారులకు అవి సహాయం చేయాలి. నిజానికి దేశ ఆర్థిక వ్యవస్థను వీరే నడిపిస్తారు. చిన్న చిన్న పనులు చేసే జనమే దేశ ఆర్థిక రంగానికి ఆర్థిక శక్తిగా నిలుస్తారు. మేము వారికే బలం ఇవ్వాలనుకుంటున్నాం. మంచి బాగా అమలు జరిగింది. కానీ ఇంకా బాగా జరగాలి.
ప్రియమైన నా దేశవాసులారా,
అక్టోబర్ 31 సర్దార్ పటేల్ జయంతి నాడు 'ఒక్క భారతం - శ్రేష్ఠ భారతం' గురించి నేను ప్రస్తావించాను. కొన్ని విషయాల్లో సమాజ జీవనంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాల్సి ఉంటుంది. 'రాష్ట్రయాం, జాగ్రయాం, వ్యం' శాశ్వత అప్రమత్తత ద్వారానే స్వేచ్ఛ పరిఢవిల్లుతుంది. అంతర్గత నిఘా మూల్యంగా, భారతం.. శ్రేష్ఠ భారతం దీనికి ఒక పథకంగా రూపం ఇవ్వాలని భావిస్తున్నాను. మైగవ్ మీద ఇందుకు సూచనలు కోరాను. కార్యక్రమ నిర్మాణం ఎలా ఉండాలి... ప్రజలేమిటి... ప్రజల భాగస్వామ్యం ఎలా పెరగాలి... దాని రూపం ఎలా ఉండాలి... ఈ అన్నిటిపై సూచనలు ఇవ్వాలని నేను కోరాను. తగినన్ని సూచనలు వస్తున్నాయని నాకు చెప్పారు. కానీ ఇంకా ఎక్కువ సూచనలు రావాలని నేను ఆశిస్తున్నాను. స్పష్టమైన పథకాన్ని కోరుకుంటున్నాను. ఇందులో పాల్గొనేవారికి సర్టిఫికెట్ లభిస్తుందని నాకు చెప్పారు. పెద్ద పెద్ద బహుమతులు కూడా కొన్ని ప్రకటించడం జరిగింది. మీరు కూడా మీ సృజనాత్మక శక్తిని ఉపయోగించండి. ఐక్యత, అఖండత అనే ఈ మంత్రాన్నీ.... ఒక్క భారతం, శ్రేష్ఠ భారతం మంత్రాన్నీ... ఒక్కో భారతీయుడిని కలిపేదిగా ఎలా చేయగలం...? ఎలాంటి పథకం ఉండాలి... కార్యక్రమం ఎలా ఉండాలి..? అర్థవంతంగా ఉండాలి... గౌరవప్రదంగా ఉండాలి... జీవం నిండి ఉండాలి.... ప్రతి ఒక్కరినీ కలిపేందుకు అత్యంత సహజంగా, సరళంగా ఉండాలి. ప్రభుత్వం ఏం చేయాలి... ప్రజలేం చేయాలి... పౌర సమాజం ఏం చేయాలి... చాలా విషయాలు చెప్పవచ్చు. మీ సూచనలు తప్పక పనికి వస్తాయని నాకు నమ్మకం ఉంది.
ప్రియమైన నా సోదర సోదరీమణులారా,
చలికాలం మొదలవుతోంది. చలిలో తినడం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది. బట్టలు ధరించడం కూడా మజాగా ఉంటుంది. కానీ, నాదొక విన్నపం. వ్యాయామం చేయండి. శరీరం ఆరోగ్యంగా ఉండటానికి ఈ శీతాకాలంలో ఎంతో కొంత సమయం వ్యాయామం, యోగా చేద్దాం. కుటుంబంలో కూడా ఆ వాతావరణం కల్పిద్దాం. ఒక గంటసేపు అంతా కలసి ఇదే చేస్తే కుటుంబంలో పండుగే అవుతుంది. మీరు చూడండి. ఎలాంటి చైతన్యం వస్తుందో. రోజంతా శరీరం ఎంత సహకరిస్తుందో. అందుకే మంచి రుతువులో మంచి అలవాటు చేసుకుందాం.
ప్రియమైన నా దేశవాసులందరికీ మరోసారి నా శుభాకాంక్షలు.
జైహింద్.
నా ప్రియమైన దేశవాసులారా......
మీకందరికీ నా నమస్కారం...
‘మన్ కీ బాత్ - మనసులో మాట’ కార్యక్రమం ద్వారా మరోసారి మీ అందరితో కలిసే సౌభాగ్యం నాకు లభించింది. ఈరోజు భారత్ - దక్షిణాఫ్రికా క్రికెట్ జట్ల మధ్య 5వ వన్డే మ్యాచ్ ముంబయ్‌లో జరగనుంది. ఈ సిరీస్‌కు ‘గాంధీ - మండేలా సిరీస్’ అని నామకరణం చేశారు. ఇప్పటివరకు ఈ సిరీస్ ఉత్కంఠభరితంగా ఉంది. రెండు టీమ్‌లు రెండేసి మ్యాచ్‌లు గెలుపొందాయి. అందువల్ల చివరి మ్యాచ్ ప్రాధాన్యత మరింత పెరిగింది. క్రీడాకారులందరికీ నా శుభాకాంక్షలు తెలియచేసుకుంటున్నాను. నేనీరోజు ఆకాశవాణి కన్నూరు కేంద్రం మిత్రులకు అభినందనలు తెలుపుతున్నాను. వారికి అభినందనలు ఎందుకంటే ‘మన్ కీ బాత్ - మనసులో మాట’ కార్యక్రమం ప్రారంభించిన వెంటనే అనేక మంది అందులో పాల్గొనడం మొదలైంది. ఇందులో కేరళకు చెందిన 12వ తరగతి విద్యార్థిని శ్రద్ధా తంబన్ కూడా పాల్గొన్నది. అనంతరం కన్నూరు కేంద్రం వారు ఆమెను పిలిచి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో ప్రజల స్పందన - ఫీడ్‌బ్యాక్ తెలుసుకునే వాతావరణం ఏర్పడింది. ‘ఇది తమది’ అనే భావన ప్రజలలో ఏర్పడింది. 12వ తరగతి చదువుతున్న శ్రద్ధ అనే అమ్మాయి పొందిన చైతన్యాన్ని ఆకాశవాణి కన్నూరు కేంద్రం వారు ప్రశంసించారు. ఆమెకు పురస్కారాలందజేశారు. కన్నూరు ఆకాశవాణి కేంద్రం చేసిన ఈ ప్రయత్నంతో నాకు కూడా ప్రేరణ లభించింది. దేశవ్యాప్తంగా ఆకాశవాణి కేంద్రాలు తమ తమ ప్రాంతాలలో ఇదే విధంగా చైతన్యవంతులై ప్రజలపై దృష్టి పెడితే ప్రజల భాగస్వామ్యంతో దేశాన్ని నడపాలనే మా లక్ష్యానికి ఓ కొత్త శక్తి లభిస్తుంది. కన్నూరు ఆకాశవాణి కేంద్రంలోని మిత్రులందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియచేసుకుంటున్నాను. శుభాకాంక్షలు తెలుపుతున్నాను. నేను ఈరోజు కేరళ గురించి మరో విషయం చెప్పాల్సి ఉంది. కేరళ - కొచ్చి, చిత్తూర్ లోని సెయింట్ మేరీ ప్రాధమికోన్నత పాఠశాల విద్యార్థినులు నాకు ఒక లేఖ రాశారు. ఈ లేఖకు అనేక విధాలుగా ప్రాముఖ్యత ఉంది. ఒకటేమిటంటే ఈ బాలికలందరూ ఓ గుడ్డపై తమ బొటన వేలి ముద్రలతో భారత మాత చిత్రాన్ని తయారుచేశారు.
భారతదేశ ఆకృతిలో భారత మాత చిత్రాన్ని నాకు పంపారు. వాళ్ళు తమ బొటనవేలి ముద్రలతో భారతదేశ ఆకృతిలో చిత్రాన్ని ఎందుకు తయారుచేశారని నాకు తొలుత ఆశ్చర్యం కలిగింది. కానీ వాళ్ళు ఎంత గొప్ప సింబాలిక్ సందేశం ఇవ్వాలనుకున్నారో వాళ్ళు రాసిన లేఖ చదివిన తర్వాత నాకు అర్థమైంది. ఈ బాలికలు ప్రధానమంత్రిని మాత్రమే చైతన్యం చేసే పని చేశారా అంటే అది కాదు. వాళ్ళు తమ ప్రాంతంలో కూడా ప్రజలను చైతన్యవంతులను చేసే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళ మిషన్ ఏమిటంటే అవయవదానం. అవయవదానంపై వాళ్ళు ప్రజలను చైతన్యవంతులను చేసే కార్యక్రమం చేపట్టారు. అవయవదానంపై ప్రజల్లో అవగాహనను వ్యాపింపచేయడానికి వాళ్ళు అనేకచోట్లకు వెళ్ళి నాటక ప్రదర్శనలు కూడా చేశారు. అవయవదానం ఒక వృత్తి, ప్రవృత్తిగా మారాలనేదే వాళ్ళ ఉద్దేశ్యం. “మీరు మీ మన్ కీ బాత్ - మనసులో మాట’ కార్యక్రమంలో అవయవదానంపై ప్రజలకు విజ్ఞప్తి చేయండి” అని ఈ బాలికలు నాకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మహారాష్ట్రకు చెందిన 80 ఏళ్ళ వసంతరావు సుడ్కే గురూజీ - ఆయన ఎల్లప్పుడూ ఒక ఉద్యమం నడుపుతూ ఉంటారు. అవయవదానాన్ని ఓ ఉత్సవంలా చేయాలని ఆయన అంటారు. ఈ మధ్య నాకు ఫోన్ పై కూడా అనేక సందేశాలు వస్తున్నాయి. ఢిల్లీకి చెందిన దేవేష్ కూడా ఇటువంటి సందేశాన్నే నాకు పంపించారు. “అవయవదానంపై ప్రభుత్వం తీసుకున్న చర్యల పట్ల, దీనిపై ఒక విధానాన్ని రూపొందించడానికి చేస్తున్న ప్రయత్నం పట్ల, నాకు సంతోషం కలుగుతోంది. దేశానికి ఈ రంగంలో సహకారం అవసరం. ప్రజలు ఒకరికొకరు సహకరించుకోవాలి. చైనా తదితర దేశాల కంటే మనం వెనుకబడి ఉన్నాం. మిలియన్‌కి ఒక్కరు చొప్పున అవయవదానం చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం చాలా ఉత్తమమైనది.”
ఈ విషయం చాలా ప్రాముఖ్యత కలిగిందని నాకనిపిస్తోంది. దేశంలో ప్రతి సంవత్సరం రెండున్నర లక్షల కంటే ఎక్కువగా మూత్రపిండాలు, గుండె, కాలేయదానం అవసరం ఉంది. కానీ నూట ఇరవై ఐదు కోట్ల మంది ప్రజలున్న ఈ దేశంలో కేవలం 5 వేల అవయవమార్పిడులే సఫలీకృతమవుతున్నాయి. ప్రతి ఏటా ఓ లక్ష కళ్ళకు చూపు అవసరమవుతుంది. మనం కేవలం 25 వేల వరకే చేరుకోగలుగుతున్నాం. నాలుగు కళ్ళు అవసరమైన చోట మనం కేవలం ఒక్కటే ఇవ్వగలుగుతున్నాం. రోడ్డు ప్రమాదంలో మరణిస్తే దేహంలోని అవయవాలను దానం చేయవచ్చు. చట్టపరమైన ఇబ్బందులు కూడా ఎక్కువే ఉన్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు కూడా సూచనలిచ్చే ప్రయత్నం చేశాం. కొన్ని రాష్ట్రాలు కాగితాలపై పనిని తగ్గించి దీన్ని వేగవంతం చేయడానికి మంచి ప్రయత్నం చేశారు. అవయవదానంలో తమిళనాడు ముందు వరుసలో ఉంది. అనేక సామాజిక సంస్థలు, అనేక స్్చ్ఛంద సేవా సంస్థలు ఈ దిశగా దేశంలో చాలా మంచి పని చేస్తున్నాయి. అవయవమార్పిడిని ప్రోత్సహించడానికి నేషనల్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్ ప్లాంట్ ఆర్గనైజేషన్ – ‘నోటో’ ను స్థాపించాం. 24 గంటలూ పనిచేసే హెల్ప్ లైన్ 1800-114770 సేవలు అందుబాటులో ఉన్నాయి.
“తేన్ తెక్తేన్ భంజీ థా” అని చెప్పబడింది. త్యాగం చేయడంలో కలిగే ఆనందం, దాని అత్యుత్తమ వర్ణన “తేన్ తెక్తేన్ భంజీ థా” అనే మంత్రంలో ఉంది. ఇటీవల మనమంతా టీవీలలో చూశాం. దిల్లీలోని జిబి పంత్ హాస్పిటల్లో ఓ పేద తోపుడు బండి అతని భార్యకు కాలేయ మార్పిడి చేశారు. ఆ కాలేయాన్ని ప్రత్యేక ఏర్పాట్ల మధ్య లక్నో నుంచి దిల్లీకి తీసుకువచ్చారు. ఆ శస్త్ర చికిత్స సఫలీకృతమయింది. ఓ జీవితాన్ని కాపాడారు. “అంగదానం మహాదానం”, తేన్ తెక్తేన్ భంజీ థా ఈ భావంతో మనం చరిత్ర సృష్టించాలి. ఈ విషయాన్ని మనం తప్పకుండా సమర్థించాలి.
ప్రియమైన దేశవాసులారా! ఇప్పుడిప్పడే మనం శరన్నవరాత్రి, విజయదశమి పర్వాన్ని జరుపుకున్నాం. కొద్దిరోజుల తర్వాత దీపావళి పర్వాన్ని కూడా జరుపుకుంటాం. ఈద్ కూడా చేసుకున్నాం. గణేశ్ చతుర్థి కూడా జరుపుకున్నాం.
కానీ త్వరలో దేశం ఓ పెద్ద ఉత్సవాన్ని జరుపుకోబోతోంది, దేశవాసులందరికీ గౌరవ మర్యాదలు లభించేలా! అక్టోబరు 26 నుంచి 29 వరకు దేశ రాజధాని దిల్లీలో “ఇండియా - ఆఫ్రికా ఫారిన్ సమ్మిట్” ను నిర్వహించనున్నాం. భారతదేశ గడ్డపై మొదటిసారి ఇంత పెద్ద స్థాయిలో నిర్వహించనున్నాం. భారతదేశ గడ్డపై మొదటిసారి ఇంత పెద్ద స్థాయిలో నిర్వహిస్తున్నాం. 54 ఆఫ్రికా దేశాలు, సమాఖ్యలకు చెందిన నాయకులను ఆహ్వానించాం. ఆఫ్రికా వెలుపల ఆఫ్రికా దేశాల అతి పెద్ద సభ జరుగుతోంది. భారత్ - ఆఫ్రికా సంబంధాలు చాలా దృఢమైనవి. భారతదేశ జనాభా ఎంత వుందో ఆఫ్రికా దేశాల జనాభా కూడా అంతే ఉంది. ఇవి రెండూ కలిపితే మనం ప్రపంచంలోని మూడో వంతు జనాభా అవుతాం. లక్షలాది ఏళ్ళ కిందట ఇవి ఒకే భూభాగంలో ఉండేవని చెబుతుంటారు. హిందూ మహాసముద్రం వల్ల ఇవి రెండూ ముక్కలుగా విభజించబడ్డాయి. మన మధ్య చాలా సారూప్యతలున్నాయి. భారత్ లో జీవసృష్టి, ఆఫ్రికా దేశాల్లో జీవసృష్టి అనేక విధాలుగా కలుస్తుంటాయి. ప్రకృతి వనరుల్లో కూడా చాలా దగ్గర పోలికలున్నాయి. భారతదేశానికి చెందిన సుమారు 27 లక్షల మంది ఈ దేశాల్లో దీర్ఘకాలంగా స్థిరపడి ఉన్నారు. ఆఫ్రికా దేశాలతో భారత్‌కు ఆర్ధిక సంబంధాలున్నాయి. సాంస్కృతిక సంబంధాలున్నాయి. రాజకీయ సంబంధాలున్నాయి.
కానీ అన్నిటికంటే ఎక్కువగా ఆఫ్రికా దేశాల యువతకు శిక్షణ అందించడంలో భారత్ చాలా పెద్ద, ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మానవ వనరుల అభివృద్ధి, కెపాసిటీ బిల్డింగ్, 25 వేల కంటే ఎక్కువగా ఆఫ్రికా విద్యార్థులు భారత్‌లో చదువుకుంటున్నారు. ఇక్కడ చదువుకొని వెళ్ళినవాళ్ళలో అనేక మంది ఇప్పుడు ఆఫ్రికాలో అనేక దేశాల్లో నాయకులుగా ఉన్నారు. మనవెంత దృఢమైన సంబంధాలో దీంతో తెలుస్తోంది. ఆ దృష్టితో చూస్తే ఈ సదస్సు చాలా ప్రాముఖ్యత కలిగి ఉంది. సాధారణంగా మహాసభలు జరిగే సందర్భంలో వివిధ దేశాల ముఖ్య నాయకులు కలుస్తారు. అదే విధంగా ఓ సదస్సులో ముఖ్య నాయకుల సమావేశం జరుగుతుంది. ప్రజల కలయిక కూడా జరగాలని మేం ప్రయత్నిస్తున్నాం. ఈసారి భారత ప్రభుత్వం, ప్రత్యేకించి మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఓ మంచి కార్యక్రమం చేసింది. సీ.బీ.ఎస్.ఈ. తో అనుబంధం ఉన్న అన్ని స్కూళ్ళలో చదువుతున్న విద్యార్థుల మధ్య ఓ వ్యాస రచన పోటీ నిర్వహించారు. కవితల పోటీ పెట్టారు. వాటి భాగస్వామ్యం పెరిగేలా కార్యక్రమం నిర్వహించారు. సుమారు 16 వందల స్కూళ్ళు ఇందులో పాల్గొన్నాయి.
భారత్ – దాని వెలుపల ఉన్న స్కూళ్ళు కూడా ఇందులో ఉన్నాయి. వేలాది మంది విద్యార్థులు భారత్ - ఆఫ్రికా సంబంధాలను బలపరిచే విషయాలు రాశారు. మరోవైపు మహాత్మాగాంధీ పుట్టిన గడ్డ పోర్ బందర్ నుంచి మెమొరీస్ ఆఫ్ మహాత్మా అనే ప్రదర్శన, సంచార ప్రదర్శన పోర్ బందర్ నుంచి ఉత్తరాది రాష్ట్రాల్లో ప్రయాణిస్తూ అక్టోబరు 29న దిల్లీ చేరుతుంది. ఈ ప్రదర్శనను లక్షలాది మంది విద్యార్థులు తిలకించారు. గ్రామ గ్రామాన ప్రజలు చూశారు. ఆఫ్రికా - భారత్ సంబంధాల్లో మహాత్మాగాంధీ ఎటువంటి గొప్ప పాత్ర పోషించారో, మహాత్మాగాంధీ వ్యక్తిత్వ ప్రభావం ఈ రెండు భూభాగాల్లో ఎంత ఉన్నదో, దీన్ని ప్రజలు తెలుసుకున్నారు. గుర్తించారు. ఈ రచనా పోటీల్లో చాలా ఉత్తమ రచనలు వచ్చాయి. ఓ రచన వైపునా దృష్టి వెళ్తోంది. నాకు బాగా నచ్చింది. దీన్ని మీకు వినిపించాలనుకుంటున్నాను. మన చిన్న చిన్న ప్రదేశాల్లో స్కూలు పిల్లలు కూడా ఎంత వివేకవంతులో! వారి దృష్టి ఎంత విస్తారమైంది, వారు ఎంత లోతుగా ఆలోచిస్తారో! ఈ కవితలో మనకు కనిపిస్తుంది.
ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ నుంచి గరిమాగుప్తా ఈ పోటీల కోసం ఒక కవిత రాసింది. చక్కగా రాసింది. ఆమె ఏం రాసిందంటే.....
“ఆఫ్రికాలో నైలు నది, సాగరం పేరు ‘ఎరుపు’
విశాలమైనది మహా ద్వీపం, ప్రవాస భారతీయులు సుఖమయం
సింధు లోయలో సంస్కారం ఎలా భారతీయతకు చిహ్నమో
నైలు నది, కార్డేజ్ ఆఫ్రికా సంస్కృతికి గొప్పవి
గాంధీజీ ప్రారంభించారు ఆఫ్రికా నుంచి ఆందోళనను
అందరిమీదా మాయలా పని చేసింది అందరి మన్ననలు పొందారు
జోహన్నెస్ బర్గ్ కానీండి లేదా కింగ్ స్టన్, జింబాబ్వే కానీ లేదా చాడ్
అన్ని ఆఫ్రికా దేశాల్లో దొరుకుతుంది మన ఆలూ చాట్
రాయడానికైతే రాసేస్తాను వేలాది పంక్తులు ఆఫ్రికా అడవుల్ని ప్రేమిస్తాను నేను”
కవిత చాలా పొడవు గా ఉంది. నేను కొన్నింటినే మీకు వినిపించాను. ఈ సదస్సు ఇండో-ఆఫ్రికా పై ఉంది.
ప్రజలు ఒకరికొకరిని కలపాల్సిన ఆవశ్యకత ఎలా ఏర్పడుతుందో మనకు స్పష్టంగా కనిపిస్తోంది. నేను గరిమను, ఇందులో పాల్గొనే బాలబాలికలందరికీ, 16 వందల కంటే ఎక్కువగా ఉన్న పాఠశాలలకు, హెచ్.ఆర్.డి మంత్రిత్వశాఖను అభినందిస్తున్నాను. నేను ఆగస్టు 15న సంసద్ ఆదర్శ్ గ్రామ యోజనకు సంబంధించి ఒక ప్రతిపాదన చేశాను. ఆ తర్వాత అనేక మంది పార్లమెంటు మిత్రులు ఈ పని సాకారం చేశారు. ఎంతో చిత్తశుద్ధితో పని చేశారు. గత నెలలో భోపాల్‌లో ఒక కార్యగోష్ఠి జరిగింది. ఆదర్శ గ్రామాల పథకంపై అక్కడి గ్రామ పెద్ద, జిల్లా కలెక్టరూ, పార్లమెంటు సభ్యుడూ, కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలూ అందరూ కలిసి ఆదర్శ గ్రామ యోజనపై లోతుగా చర్చించారు. కొత్తకొత్త ఆలోచనలు స్ఫురించాయి. చాలా ఉత్సాహపూర్వకంగా సాగింది. కొన్ని విషయాలను నేను మీకు గుర్తుకు తేవాలనుకుంటున్నాను. జార్ఖండ్ - ఓ విధంగా, చెప్పాలంటే బాగానే పెద్ద రాష్ట్రం. గిరిజన ప్రాంతం. దురదృష్టవశాత్తూ తీవ్రవాదులూ - బాంబులూ, తుపాకులు - రక్తసిక్త నేల జార్ఖండ్ ప్రసావన వస్తే మనకి ఇవన్నీ వినిపిస్తాయి. వామపక్ష తీవ్రవాద ప్రభావంతో అక్కడ అనేక అనేక ప్రాంతాలు నాశనమయ్యాయి. కానీ, అక్కడ మన పార్లమెంటు సభ్యుడూ, సీనియర్ నాయకుడూ, లోక్ సభ డిప్యూటీ స్పీకర్ గా కూడా పని చేసిన శ్రీమాన్ కరియాముండా గారు గిరిజనుల కోసం తన జీవితాన్ని దారపోశారు. ఆయన జార్ఖండ్ లో కుంతి జిల్లాలోని పరసీ గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడానికి ఎంపిక చేశారు. తీవ్రవాదం, వామపక్షాలూ రాజ్యం ఏలే చోట ప్రభుత్వ సిబ్బంది వెళ్ళడం కూడా కష్టమయ్యేది. వైద్యులు కూడా వెళ్ళలేక పోయేవారు. ఆయన స్వయంగా వెళ్ళడం, రావడం మొదలుపెట్టారు. ప్రజల్లో విశ్వాసం నెలకొల్పారు. ప్రభుత్వ వ్యవస్థలో ప్రాణం పోసే ప్రయత్నం చేశారు. అధికారులు పర్యటించడాన్ని ప్రోత్సహించారు. చాలాకాలంగా ఉన్న ఉదాసీనతా వాతావరణంలో ఎంతో కొంత చేయాలనే కోరికను రగిల్చారు. ఆదర్శ గ్రామ యోజన కింద మౌలిక సదుపాయాల కల్పనతో పాటు వ్యవస్థలోనూ, ప్రజల్లోనూ చైతన్యం తీసుకువచ్చే ప్రయత్నం ఈ పరసీ గ్రామంలో విజయవంతమయింది. గౌరవ, పార్లమెంటు సభ్యులు శ్రీమాన్ కరియాముండా గారిని అభినందిస్తున్నాను.
అలాగే నాకో వార్త అందింది ఆంధ్ర నుంచి. ఆంధ్ర - లోక్ సభ సభ్యుడు అశోక్ గజపతిరాజు గారు - ఆదర్శ గ్రామ యోజనలో స్వయంగా నిమగ్నమయ్యారు. ఆయన ఆంధ్రప్రదేశ్ - విజయనగరం జిల్లాలోని ద్వారపూడి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామంగా ఎంపిక చేసుకున్నారు. మిగిలిన వ్యవ్యస్థ అంతా కొనసాగుతుంది. కానీ ఆయన ఒక పెద్ద సృజనాత్మకమైన పని చేపట్టారు. అక్కడి పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఆయనో పని అప్పగించారు. ఎందుకంటే గ్రామాల్లో నవతరం విద్యాధికులయ్యారు. కానీ పాత తరం నిరక్షరాస్యులుగానే ఉన్నారు. అందుకే కొంచెం పెద్ద వయసు పిల్లలకు ఇప్పుడు రోజూ వాళ్ళ అమ్మనాన్నలకు క్లాసులో బోధించమని చెప్పారు. ఇప్పుడు ఆ పాఠశాలలు ఒకరకంగా పగలు పిల్లల విద్యకోసం, రాత్రి పిల్లలనే బోధకులను చేసే విద్య అందిస్తున్నాయి. ఇంకా సుమారు 5 వందల 50 మంది నిరక్షర వయోజనులకు ఈ పిల్లలు చదువు చెబుతున్నారు. వారిని అక్షరాస్యులను చేశారు. చూడండి సమాజంలో ఎలాంటి బడ్జెట్ లేదు. సర్క్యులర్ లేదు. ప్రత్యేక వ్యవస్థ లేదు. కానీ సంకల్ప బలంతో ఎంత పెద్ద పరిణామం తీసుకురావచ్చో. ద్వారపూడి గ్రామ పంచాయతీ నుంచి చూడవచ్చు.
అలాగే మరో ప్రియతమ పార్లమెంటు సభ్యుడు సి.ఎల్.రువాలా, ఆయన ఈశాన్య రాష్ట్రమైన మిజోరాం నుండి లోక్ సభకు ఎన్నికయ్యారు. ఈశాన్యం ఆయన ఆదర్శ గ్రామానికి రవాలా హీలింగ్ గ్రామాన్ని ఎంపిక చేసుకుని ఒక మంచి పని చేశారు. ఈ గ్రామం చెరుకు పంటకు చాలా ప్రసిద్ధి. అలాగే కుర్తాయి బెల్లంకు కూడా చాలా ప్రసిద్ధి. శ్రీ రువాలా గారు ఈ గ్రామంలో మార్చి 11న కుర్తాయి బెల్లం చెరుకు ఉత్సవాన్ని ప్రారంభించారు. అన్ని వర్గాల ప్రజలు ఇందులో పాల్గొన్నారు. పాత తరానికి చెందిన ప్రజలు కూడా వచ్చారు. అక్కడ పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా వచ్చారు. దీంతో చెరుకు అమ్మలకాలు కూడా పెరిగాయి. అందుకుగాను అక్కడ ఒక ప్రదర్శన కూడా ఏర్పాటుచేశారు. గ్రామం యొక్క ఆర్థికస్థితి మెరుగుపరిచే కేంద్రాన్ని ఎలా ఏర్పాటుచేయవచ్చో, గ్రామ ఉత్పత్తులను ఎలా మార్కెటింగ్ చేయవచ్చో దీని ద్వారా మనకు అర్థమవుతుంది. ఆదర్శ గ్రామంతో పాటు స్వయం సమృద్ధి గ్రామంగా తీర్చిదిద్దేందుకు కృషి చేసిన శ్రీ రువాలాగారు అభినందనీయులు.
నా ప్రియమైన సోదర సోదరీమణులారా! ఈ మనసులో మాట కార్యక్రమంలో పరిశుభ్రత గురించి ప్రస్తావన రాకుండా ఎలా ఉంటుంది? ముంబయి నుంచి సవితారాయ్ అనే ఒక మహిళ టెలిఫోన్ ద్వారా ఈ సందేశాన్ని పంపించారు.
“దీపావళి పండుగకు సమాయత్తమయ్యే సమయంలో మనం మన ఇంటిని పరివశుభ్రం చేసుకుంటాం. ఈసారి దీపావళికి మన ఇంటితో పాటు మన పరిసరాలను కూడా శుభ్రం చేసుకుందాం. అలాగే దీపావళి తర్వాత కూడా పరిసరాలను పరిశుభ్రంగానే ఉంచుకుందాం”.
ఆమె సరైన విషయం పైనే అందరి దృష్టి పడేలా చేశారు. ఈ సందర్భంగా నేను మీకు ఒక విషయం గుర్తు చేయదలిచాను. నా ప్రియమైన దేశవాసులారా! గత ఏడాది దీపావళి తర్వాత దేశవ్యాప్తంగా కాల్చిన టపాకాయలతో అలాగే ఉండిపోయిన ప్రాంతాలను మీడియా మనకు విస్తృతంగా చూపించి ఇది సరైన పద్ధతి కాదు అని మనకు సూచించింది.
అన్ని ప్రసార సాధనాలు ఈ అంశంపై అందరిలో జాగృతి కలిగేలా ఒక ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాయి. దీని ఫలితంగా దీపావళి అయిన వెంటనే పరిశుభ్రతపై ఉద్యమం దానంతట అదే ఆరంభమైంది. పండుగ ముందు మనం ఏం ఆలోచిస్తామో అది పండుగ తర్వాత కార్యరూపంలోకి తీసుకురావాలి అని మీరు చెప్పింది చాలా సబబు. ప్రతి ప్రజా కార్యక్రమంలో మనం ఇది చేయాలి. ఈరోజు నేను దేశంలో ఉన్న అన్ని మీడియా సంస్థలకు ప్రత్యేకంగా అభినందనలు తెలియచేస్తున్నాను. గత ఏడాది అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతి స్వచ్ఛభారత్ కార్యక్రమం ఏడాది పూర్తయిన సందర్భంగా ఇండియా టుడే వార్తా పత్రిక పరిశుభ్రతపై నిర్వహించిన సదస్సులో నాకు పాల్గొనే అవకాశం లభించింది. ఆ సంస్థ ‘క్లీన్ ఇండియా’ పురస్కారాలు ప్రదానం చేశారు.
‘వన్ లైక్ వన్ మిషన్’ తరహాలో ఎట్లాంటివారు స్వచ్ఛభారత్ కోసం పనిచేశారో నేను గమనించాను. మన దేశంలో ఎట్లాంటి ప్రదేశాలను పరిశుభ్రంగా చేశారో. ఇవన్నీ వెలుగులోకి వచ్చాయి. ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమం చేసిన ఇండియా టీవీ గ్రూప్‌ను నేను హృదయపూర్వకంగా అభినందించాను. ఎప్పటినుంచి అయితే స్వచ్ఛభారత్ ప్రచారం చేపట్టామో అప్పటి నుంచి ఆంధ్ర, తెలంగాణ నుండి ఈటీవీ, ఈనాడు మీడియా సంస్థలు ఈ కార్యక్రమంపై దృష్టి సారించాయి. ముఖ్యంగా శ్రీ రామోజీరావుగారు వయసులో చాలా పెద్దవారైనా ఆయనకు ఉన్న ఉత్సాహం చూస్తే యువకులెవరికీ ఆయన తీసిపోరు. ఆయన పరిశుభ్రత కార్యక్రమాన్ని తమ వ్యక్తిగత కార్యక్రమంగా తీసుకుని దానిని ఒక మిషన్ గా చేపట్టారు. ఈటీవీ ద్వారా దాదాపు ఆయన ఒక ఏడాది నుండి పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఆయన పత్రికలలో కూడా పరిశుభ్రతపై ఎన్నో వార్తలు వస్తూ ఉంటాయి.అలాగే వారు పరిశుభ్రతపై సానుకూలమైన వార్తలు, విజయగాధలకు ఆయన ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అలాగే ఆయన ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో దాదాపు 55, 56 వేల పాఠశాలల్లో దగ్గరదగ్గరగా 51 లక్షల మంది పిల్లలను ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేశారు.
బహిరంగ ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, ఆధ్యాత్మిక ప్రదేశాలు, ఆసుప్రతులు, పార్కులు ఇలా పలు ప్రాంతాల్లో పరిశుభ్రతపై ప్రచారాన్ని చేపట్టారు. ఇప్పుడు ఈ వార్తలు స్వచ్ఛభారత్ లక్ష్యాలను మనం సాకారం చేసుకునేందుకు కావలసిన శక్తిని ఈ తరహా కార్యక్రమాల ద్వారా మనకిస్తాయి. “యే భారత్ దేశ్ మే మేరా” అనే పేరిట ఏబీసీ న్యూస్ ఛానల్ ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు.
పరిశుభ్రత పట్ల ప్రజల్లో ఎలా అవగాహన వచ్చిందో ఈ కార్యక్రమం ద్వారా తెలియచేసింది.
ఎన్డీ టీవీ ఛానల్ బనేగా ‘స్వచ్ఛ్ ఇండియా’ అనే పేరిట ప్రచారం చేపట్టింది. దైనిక్ జాగరన్ - ఈ సంస్థ కూడా నిరంతరం స్వచ్ఛ భారత్ ప్రచారాన్ని ముందుకు తీసుకువెళ్ళింది. జీ సంస్థ ఇండియా టీవీ చేపట్టిన ‘మిషన్ క్లీన్ ఇండియా’ ను ముందుకు తీసుకు వెళ్ళింది. మన దేశంలో వందలాది ఛానల్స్ ఉన్నాయి. వేలాది వార్తా పత్రికలు ఉన్నాయి. సమయం లేనందున నేను అన్ని పేర్లు చెప్పలేకపోతున్నాను. కానీ అన్ని మీడియా సంస్థలు పరిశుభ్రతపై ప్రచారాన్ని చేపట్టాయి. అందువల్ల శ్రీమతి సవితారాయ్ ఏదయితే సూచన చేశారో దానిని దేశ ప్రజలందరూ ఇప్పుడు తమ కర్తవ్యంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకువెళ్తున్నారు. మేఘాలయలో మన గవర్నర్ శ్రీ షణ్ముగనాథన్ గారూ నాకు ఉత్తరం రాశారు. ఈ ఉత్తరం ద్వారా మేఘాలయలో మావల్యన్నోంగ్ అనే గ్రమం గురించి ప్రస్తావించారు. చాలా సంసవత్సరాల నుండి ఈ గ్రామం పరిశుభరు తకు ప్రాధన్యం ఇచ్చింది. ఈ గ్రామానికి చెందిన ప్రతి తరం వారు పరిశుభ్రత విషయంలో పూర్తిగా లీనమయ్యారు. వారు ఇంకా ఏమీ చెప్పారంటే ఆసియాలోనే క్లీనెస్ట్ విలేజ్ అంటే అత్యంత పరిశుభ్రమైన గ్రామం అవార్డు ఈ గ్రామానికి లభించిందని చెప్పారు. మనదేశంలో దూరంగా ఉన్నా, ఎంతో అందమైన ఈశాన్య ప్రాంతంలోని మేఘాలయ రాష్ట్రంలో పలు గ్రామాలు పరిశుభ్రతా రంగంలో పలు అవార్డులు గెలుచుకున్నాయని తెలుసుకొని సంతోషం కలిగింది.
అక్కడి గ్రామాల్లోని ప్రజలకు పరిశుభ్రత వారి జీవితాల్లో అంతర్భాగమయింది. ఆ గ్రామాల్లో ఇది ఒక సంస్కృతిగా రూపుదిద్దుకుంది. అందువల్ల మన దేశం తప్పకుండా పరిశుభ్రమైన దేశం అవుతుందని మనం అందరిలో విశ్వాసం కల్పిస్తోంది. దేశవాసుల కృషి వల్లే ఇది సాధ్యమవుతుంది. 2019 సంవత్సరంలో మహాత్మాగాంధీ 150వ జయంతి జరుపుకునే సమయంలో 125 కోట్ల మంది భారతీయులు గర్వంగా చెప్పుకుంటాం మనం మన భారతమాతను దుర్గంధం నుండి విముక్తి చేశామని.
నా ప్రియ దేశవాసులారా
నేను ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో అవినీతి (ఇంటింటికీ పాకిన) పాతుకుపోయిన కొన్ని విషయాలు వున్నాయని చెప్పాను. పేదవాడు చిన్న చిన్న ఉద్యోగాలకు వెళ్ళినపుడు సిఫార్సుల కోసం అతడు ఎన్ని తంటాలు పడవలసి వస్తుందో, దళారుల ముఠా అతని వద్ద నుంచి ఎట్లా ఏ విధంగా డబ్బులు అడుగుతుందో, ఉద్యోగం వచ్చినా డబ్బులు పోతాయి, ఉద్యోగం రాకపోయినా డబ్బులు పోతాయి. ఈ వార్ిలన్నీ వింటూనే ఉంటాం. మరి దాని నుంచే నా మనసులో ఒక ఆలోచన పుట్టింది. చిన్నచిన్న ఉద్యోగాలకి ఇంటర్వ్యూల అవసరం ఏమిటి అనిపించింది. ఎంతటి మానసిక నిపుణుడైనా ఒకటి లేదా రెండు నిమిషాల ఇంటర్వ్యూలో ఒక వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకున్నట్లు ప్రపంచంలో నేనైతే ఎప్పుడూ వినలేదు. ఈ ఆలోచనలతోనే ఈ చిన్న తరహా ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో, అక్కడ ఇంటర్వ్యూలనే సంప్రదాయానికి స్వస్తి చెప్తానని ప్రకటించాను.
నా ప్రియమైన యువ మిత్రులారా!!
నేను ఇవాళ గర్వంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ దిశగా ప్రభుత్వం మొత్తం ప్రక్రియను పూర్తి చేసింది. ఇక ఇప్పుడు గ్రూప్-డి, గ్రూప్-సి, గ్రూప్-బి నాన్ గెజిటెడ్ ఉద్యోగాల భర్తీలో స్వయంగా వెళ్ళాల్సిన అవసరం ఉండదు, ఇంటర్వ్యూ ఉండదు.
2016 జనవరి 1 నుంచి ఇది ప్రారంభం అయిపోతుంది. ఇప్పటికే ఈ ప్రక్రియ జరుగుతున్న చోట దానిని మధ్యలో నిలిపివేయబోము కానీ 2016 జనవరి 1 నుంచి మాత్రం ఇది ప్రారంభం అవుతుంది. ఈ సందర్భంగా యువ మిత్రులందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
అలాగే కిందటి బడ్జెట్లో నేను ఒక ముఖ్ిమైన పథకాన్ని ప్రకటించాను. మన దేశంలో బంగారం సమాజ జీవితంలో భాగంగా మారిపోయింది. బంగారాన్ని ఆర్ధిక రక్షణకు మాధ్యమంగా భావిస్తారు. కష్ట సమయంలో పనికి వచ్చే తాళం చెవిగా బంగారాన్ని భావించడం జరిగింది.
ఇది సమాజ జీవితంలో శతాబ్దాలుగా, తరతరాలుగా వస్తున్న ఆచారం. బంగారం విలువను ఎవరైనా తగ్గించగలరంటే నేను ఒప్పుకోను. కానీ ఈ యుగంలో బంగారాన్ని మృత ధనంగా పడేసి ఉంచడం మంచిదికాదు. బంగారం శక్తిగా మారగలదు. బంగారం ఆర్థిక శక్తిగా మారగలదు. బంగారం దేశ ఆర్థిక సంపత్తి కాగలదు. ఇందులో ప్రతి భారతీయుడు భాగస్వాములు కావాలి. బడ్జెట్లో మేము ఏ వాగ్ధానం అయితే చేసామో ఈ దీపావళి పండుగలోనే ఇంకా ప్రజలు ముఖ్యంగా బంగారం కొనుగోలు చేసే ధన్ తేరాస్ రోజుకు ముందుగానే మేము ముఖ్యమైన ప్రణాళికలు ఆరంభించబోతున్నాం. బంగారాన్ని నగదుగా మార్చుకునే పథకాన్ని మేము తీసుకువచ్చాం. దీని కింద మీరు మీ బంగారాన్ని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకోవచ్చు. మీరు మీ డబ్బును బ్యాంకులో వేస్తే వడ్డీ ఎలా వస్తుందో అలాగే బంగారం మీద కూడా మీకు వడ్డీ లభిస్తుంది. ఇంతకు ముందు బంగారాన్ని లాకరులో పెట్టేవారు. ఆ లాకరుకి బాడుగ మనం కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు బంగారాన్ని బ్యాంకులో పెడతారు. బ్యాంకే మీకు వడ్డీ రూపంలో చెల్లిస్తుంది. దేశ ప్రజాలారా..! ఇప్పుడు చెప్పండి బంగారం సంపదగా కాగలుగుతుందా? కాలేదా? బంగారం మృత ధనం రూపం నుండి జీవితాంతం బలాన్నిచ్చే రూపంలోకి మారగలుగుతుందా? మారలేకపోతుందా? అంతే - ఈ ఒక్క పని మాత్రం మీరు చేయాలి. మీరు నాకు అండగా నిలవాలి.
ఇప్పుడు ఇంట్లో బంగారం ఉంచుకోకండి. ఇది సురక్షితంగా ఉంటుంది. దానిపై వడ్డీ వస్తుంది. రెండు లాభాలు. తప్పక ఈ లాభం పొందండి. మరో మాట సావరిన్ గోల్డు బాండ్ లో మీ చేతిలోకి బంగారం దుంగలు వచ్చి పడవు. ఒక కాగితం ముక్క మాత్రం వస్తుంది. కానీ బంగారం విలువ ఎంత ఉంటుందో ఆ కాగితం ముక్క విలువ కూడా అంతే ఉంటుంది. ఇంకా ఏ రోజునైతే మీరు ఆ కాగితాన్ని తిప్పి ఇస్తారో ఆ రోజు బంగారం ధర ఎంత ఉంటుందో అంత మేరకు డబ్బు మీకు తిరిగి చెల్లిస్తారు. ఇవాళ మీరు వెయ్యి రూపాయల విలువ గల బంగారం బాండు తీసుకున్నారనుకోండి. ఐదేళ్ళ తర్వాత మీరు ఆ బాండు తిరిగి ఇవ్వడానికి వెళ్ళినపుడు ఆ బంగారం విలువ వెయ్యిన్నర రూపాయలు ఉందంటే మీకు ఆ కాగితానికి బదులు వెయ్యిన్నర రూపాయలు లభిస్తాయి. అయితే దీనిని ఇప్పుడు మేము ప్రారంభిస్తున్నాం. ఈ కారణంగా ఇప్పుడు బంగారం కొనాల్సిన అవసరం ఉండదు. బంగారాన్ని భద్రపరచాల్సిన అవసరం ఉండదు. బంగారాన్ని ఎక్కడ ఉంచామనే దిగులు ఉండదు. కాగితాన్ని దొంగిలించడానికైతే ఎవరూ రారు. రక్షణకు హామీ ఇచ్చే ఈ పథకాన్ని వచ్చే వారంలో తప్పక దేశ ప్రజల ముందుంచుతాను. బంగారు నాణేలు కూడా తీసుకువస్తున్నామని చెప్పటానికి నాకు చాలా సంతోషంగా ఉంది. అశోకచక్రంతో కూడిన బంగారు నాణేలు. స్వతంత్రం వచ్చి దగ్గర దగ్గర 70 ఏళ్ళు అయింది. కానీ, ఇప్పటికీ మనం విదేశీ బంగారు నాణేలనే ఉపయోగిస్తున్నాం. లేదా బంగారం బులియన్ కడ్డీలు - ఇవీ విదేశాలవే - వాటిని వాడుతున్నాం. మన దేశానికి చెందిన స్వదేశీ ముద్ర ఎందుకు ఉండరాదు? అందుచేతనే వచ్చే వారంలో ధన్ తేరాస్‌కు ముందే సామాన్య ప్రజలకు అందుబాటుకు తెస్తాం. ఐదు గ్రాములూ, పది గ్రాముల అశోకచక్రంతో కూడిన భారతీయ బంగారం నాణేలను ప్రారంభించబోతున్నాం. దీంతోపాటు 20 గ్రాముల బంగారం బిళ్ళలు కూడా ప్రజలకు అందుబాటుకు వస్తాయి. ఈ కొత్త పథకం ఆర్థి కాభ్యున్నతి దిశగా నూతన మార్పు తీసుకువస్తుందనీ నాకు మీ సహాయం వుంటుందనీ నేను నమ్ముతున్నాను.
నా ప్రియమైన దేశ ప్రజలారా!
అక్టోబరు 31వ తేదీ ఉక్కు మనిషి సర్దార్ వల్ భ్ భాయ్ పటేల్ జయంతి దినం. “ఒక్క భారతం - శ్రేష్ట భారతం” సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గుర్తు చేసుకోగానే మొత్తం భారతదేశ మహోన్నత చిత్రం మన కళ్ళ ఎదుట కదలాడుతుంది.
భారత ఐక్యత కోసం ఈ మహాపురుషుడు ఎంతో పాటు పడ్డారు. ఉక్కు మనిషిగా తన సామర్థ్యం ఏమిటో చూపారు. సర్దార్ గారికి శ్రద్ధాంజలి ఎలాగూ ఘటిస్తారు. కానీ భారత్‌ను ఒక్కటిగా చేసే ఆయన కల ఏదైతే ఉన్నదో - భౌగోళికంగా దాన్ని చేసి చూపారు. కానీ ఏకతా మంత్రం - మన ఆలోచనలకు, వ్యవహరించే తీరుకు, వ్యక్తీకరించే పద్ధతికి నిరంతరం మాధ్యమం కావాలి. భారత్‌లో వైవిధ్యం ఉంది. అనేక వర్గాలు, మతాలు, సాంప్రదాయాలు, ఎన్నో భాషలు, విభిన్న జాతులు, సంస్కృతులు... ఇలా... భారతదేశం ఎన్నో వైవిధ్యాలతో నిండి ఉంది. ఇంకా వైవిధ్యతే మనకు శోభనిస్తుంది. ఈ భిన్ుత్వం ఒకవేళ లేకపోతే... దేన్ని చూసి మనం గర్వపడుతున్నామో.. బహుశా అలా గర్వపడలేం. అందుకే భిన్నత్వమే ఏకతా మంత్రం. శాంతి, సద్భావన, ఏకత - ఇవే అభివృద్ధికి దివ్యౌషధాలు. గత ఎన్నో ఏళ్ళుగా అక్టోబరు 31న దేశంలోఎన్నో చోట్ల ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమం జరుగుతోంది. ఏకతా కోసం పరుగు - ఇంతకుముందు దీనిలో నాకు భాగం పంచుకునే అవకాశం వచ్చింది. ఈసారి కూడా దేశం నాలుగు చెరుగులా ఇందుకు తయారీ జరుగుతుందని విన్నాను. ప్రజలు ఏకతా పరుగు కోసం ఉత్సాహంగా ఏర్పాట్లు చేశారు. ఏకతా పరుగు అసలైన అర్థం - అభివృద్ధి కోసం పరుగు. మరో అర్థంలో చెప్పలాంటే అభివృద్ధి పరుగు - ఏకతా పరుగే హామీ. అర్థంలో చెప్పాలంటే అభివృద్ధి పరుగుకు ఏకతా పరుగే హామీ. రండి. సర్దార్ సాహెబ్‌కు శ్రద్ధాంజలి ఇవ్వండి. ఏకతా మంత్రాన్ని ముందుకు తీసుకువెళ్ళండి.
ప్రియ సోదర - సోదరీమణులారా! ఇప్పుడైతే మీరంతా దీపావళి ఏర్పాట్లలో తలమునకలై ఉంటారు. ఇళ్ళు శుభ్రం చేస్తూ ఉండి ఉంటారు. కొత్త కొత్త వస్తువులు కొనుగోలు జరుగుతూ ఉండొచ్చు. దీపావళి పండుగను దేశంలోని ప్రతి చోటా ఒక్కో రూపంలో చేసుకుంటూ ఉంటారు. దీపావళి శుభదినం సందర్భంగా మీ అందరికీ నా శుభాకాంక్షలు.
కానీ దీపావళి రోజుల్లోనే కొన్ని ప్రమాదాలు వింటూ ఉంటాం. టపాకాయలు కాల్చే కారణం - లేక దీపాల కారణంగా అగ్ని ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. టపాకాయల వల్ల పిల్లలకు ఎంతో నష్టం జరిగిపోతుంది. ప్రతి తల్లీ - తండ్రితో నేను చెప్పేది ఏమిటంటే - దీపావళి సంబరాన్ని జరుపుకోండి. కానీ కుటుంబంలోని పిల్లలకు నష్టం వాటిల్లేలా ప్రమాదాలు ఏమీ జరగకుండా. దీని గురించి కూడా మీరు తప్పక ఆలోచించండి. ఇంకా శుభ్రం అయితే... చెయ్యనే చేయాలి.
ప్రియమైన నా దేశ ప్రజలారా! దీపావళి తర్వాత రెండో రోజు నేను బ్రిటన్ పర్యటన పై వెళ్ళాలి. ఈసారి బ్రిటన్‌కు నా యాత్ర పట్ల నేను చాలా ఆతృతగా ఉన్నాను. దానికి ఒక ప్రత్యేక కారణం ఉంది. కొన్ని వారాల క్రితం ముంబయ్ లో బాబాసాహెబ్ అంబేద్కర్ - చైతన్య భూమి దగ్గర ఒక గొప్ప స్మారకానికి శంకుస్థాపన చేయటానికి వెళ్ళాను. ఇప్పడు నేను లండన్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించిన ఇల్లు - ఇప్పుడది భారత సంపద అయింది. నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజల ప్రేరణ స్థలం అయింది. దాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నాను. దళితుడు కానీ, వంచితుడు కానీ - వెనుకబాటుతనం, కష్టనష్టాలను ఎదుర్కొంటూ జీవించే భారతీయుడెవరికైనా, బాబాసాహెబ్ అంబేదర్కర్ - ఈ భవనం - సంకల్ప శక్తి బలంగా ఉంటే - కష్టాలను అధిగమించి జీవితంలో ముందుకు వెళ్ళవచ్చు, విద్యను పొందవచ్చని ఈ భవంతి ప్రేరణ నిస్తుంది. ఇంకా ఇదే ప్దదేశంలో బాబా సాహెబ్ అంబేద్కర్ తపస్సు చేశారు. భారత ప్రభుత్వం ఇంకా రాష్ట్ర ప్రభుత్వాలు, సమాజంలోని దళితులు, వెనుకబడినవారులాంటి వర్గాల తెలివైన పిల్లలకు విదేశాలలో చదువుకునేందుకు ఉపకార వేతనాలు ఇస్తున్నాయి. ప్రతిభావంతులైన దళిత యువతీయవకులను భారత ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది.
బ్రిటన్‌కు అలా భారత్ నుంచి మన పిల్లలు చదువుకోడానికి వెళ్ళినపుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ స్థానం వాళ్ళకు పుణ్యక్షేత్రం అవుతుందని నా విశ్వాసం. ప్రేరణ భూమి అవుతుంది. జీవితంలో కొంత నేర్చుకోవాలి. కానీ తరువాత దేశం కోసమే జీవించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ సందేశమే ఇచ్చారు. మనసారా ఇచ్చారు. అందుకే - నా బ్రిటన్ యాత్ర పట్ల నేను ప్రత్యేకంగా ఉత్సుకతతో ఉన్నానని చెప్తున్నాను. చాలా ఏళ్ళుగా విషయం చిక్కుముడి పడ్డది - ఇప్పుడు ఆ భవనం నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజల సంపద అయింది. బాబా సాహెబ్ అంబేద్కర్ పేరుతో కలిపి చెప్పేది నాలాంటి ప్రజలకు ఎంత ఆనందమిస్తుందో - మీరు అంచనా వేయవచ్చు. నాకు లండన్ లో మరో అవకాశం కూడా వస్తుంది. భగవాన్ విశ్వేశ్వర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం. ఎన్నో ఏళ్ళ క్రితం భగవాన్ విశ్వేశ్వర్ ప్రజాస్వామ్యం కోసం మహిళా సాధికారత కోసం చేసిన పని ప్రపంచంలో నిజానికి అధ్యయనం చేయాల్సిన విషయం. లండన్ నేల మీద భగవాన్ విశ్వేశ్వర్ విగ్రహం ఆవిష్కరణ - శతాబ్దాల క్రితమే భారతీయ మహా పురుషులు ఎలా ఆలోచించేవారో - దూరదృష్టితో ఆలోచించేవారో చెప్పడానికి ఉత్తమ ఉదాహరణగా నిలుస్తుంది. ఇలాంటివి కలిసినపుడు మన దేశ ప్రజలందరి మనస్సు ఉత్సాహంతో గగుర్పొడుస్తుందని మీకు తెలుసు.
నా ప్రియమైన దేశవాసుల్లారా! మన్‌కీ బాత్ - మనసులో మాట తోమీరు అనుబంధం కలిగియున్నారు. టెలిఫోన్ ద్వారా, మై గవ్.ఇన్ ద్వారా మీ సూచనలు కూడా నాకు అందుతున్నాయి. మీ లేఖల గురించి ఆకాశవాణిలో చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. ప్రభుత్వ అధికారులతో ఈ చర్చా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కొందరు తమ సమస్యలు రాస్తూ ఉంటారు. సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నం జరుగుతుంది. భారత్‌లాంటి దేశంలో మనం పలు భాషలు నేర్చుకోవాలి.
కొన్ని భాషలను నేర్చుకునే సౌభాగ్యం నాకు కలిగింది. కానీ ఇన్ని భాషలున్నాయి - అన్నీ నేనెక్కడ నేర్చుకోగలిగాను? లేదు. కానీ, నేను ఆకాశవాణికి కృతజ్ఞణ్ణి. ఈ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని రాత్రి 8 గంటలకు ప్రతి రాష్ట్రంలో ప్రాంతీయ భాషలో ప్రసారం చేస్తుంది. ఆ స్వరం మరొకరిది కావచ్చు. కానీ మాటలైతే నా మనసులోవే అవుతాయి. మీ భాషలో నేను మిమ్మల్ని చేరేందుకు కూడా రాత్రి 8 గంటలకు తప్పక ప్రయత్నం చేస్తాను. అలా మన మధ్య ఒక మంచి బంధం ఏర్పడింది. గత సంచికలో సంవత్సరం పూర్తి కావచ్చింది. ఇప్పుడు కొత్త సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. నా ప్రియ దేశవాసులకు మరోసారి చాలా చాలా శుభాకాంక్షలు.
జైహింద్.....
నా ప్రియమైన దేశవాసులారా... మీ అందరికీ నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమం. ఇది 12వ ఎపిసోడ్. మరోలా చూస్తే ఏడాది గడిచిపోయింది. గత ఏడాది అక్టోబర్ 3న మొదటిసారి మన్ కీ బాత్ - మనసులో మాట చెప్పుకునే సౌభాగ్యం నాకు కలిగింది. మన్ కీ బాత్ - మనసులో మాట - ఒక ఏడాది, ఎన్నో మాటలు. దీనివల్ల మీరు ఏం పొందారో నాకైతే తెలియదు కానీ, నేనైతే ఎంతో పొందానని తప్పకుండా చెప్పగలను.
ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తికి ఎంతో గొప్పదనం ఉంది. నా జీవితంలో ఓ ప్రాథమిక ఆలోచన ఉంది, దాంతో ప్రజల శక్తి మీద నాకు అపారమైన నమ్మకం ఉంది. అయితే - మన్ కీ బాత్ - మనసులో మాట కార్యక్రమం ద్వారా నేను నేర్చుకున్నది, నాకు అర్థమైనది, తెలుసుకున్నది, పొందినది, వీటివల్ల నేను చెప్పేదేమిటంటే మనం ఆలోచిస్తాం, అంతకంటే ఎక్కువగా జనశక్తి అపారమైనది. మన పూర్వీకులు చెబుతుండేవారు ప్రజలు భగవంతుడి అంశలో భాగమేనని. మన్ కీ బాత్ - మనసులో మాట ద్వారా నాకు అనుభవమైంది ఏమిటంటే మన పూర్వీకుల ఆలోచనల్లో ఓ గొప్ప శక్తి ఉంది, గొప్ప నిజం ఉంది, ఎందుకంటే నేను వీటిని అనుభవించాను. మన్ కీ బాత్ - మనసులో మాట కార్యక్రమం ద్వారా నేను ప్రజల నుంచి సలహాలు కోరాను, అయితే ప్రతిసారి రెండు లేదా నాలుగు సలహాలనే చూడగలిగేవాడిని. కానీ లక్షల సంఖ్యలో ప్రజలు చైతన్యవంతమై నాకు సలహాలు పంపిస్తుండేవారు. ఇది దానంతటదే ఒక గొప్ప శక్తి,. లేకుంటే ప్రధానమంత్రికి సందేశం పంపించాం, మై గవ్ డాట్ ఇన్ లో రాశాం. ఉత్తరాలు పంపించాం, కానీ ఒక్కసారి కూడా మాకు అవకాశం దొరకలేదు అని ఎవరైనా నిరాశపడవచ్చు. కానీ నాకు అలా అనిపించలేదు.
అవును.... ఈ లక్షలాది ఉత్తరాలు నాకొక పెద్ద పాఠాన్ని నేర్పించాయి. ప్రభుత్వంలోని అనేక సున్నితమైన కష్టాల విషయంలో నాకు సమాచారం అందుతూ ఉండేది, నేను ఆకాశవాణికి కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే - శ్రోతల నుంచి వచ్చే సలహాలను వారు కేవలం కాగితం ముక్కలుగా అనుకోకుండా వాటిని సామాన్య ప్రజల ఆకాంక్షలుగా భావించారు. దీని తర్వాత వాళ్లు కార్యక్రమం చేశారు. ప్రభుత్వంలోని వివిధ విభాగాలను ఆకాశవాణికి ఆహ్వానించారు, ప్రజలు చెప్పిన విషయాలను వారి ముందు ఉంచారు. కొన్ని విషయాలను తోసిపుచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వంలోని మా వివిధ శాఖలు ప్రజల్లో ఈ ఉత్తరాలపై విశ్లేషణ జరిపారు, వీటిలో ప్రభుత్వ విధాన నిర్ణయం ఏముంది...? ఏ వ్యక్తిగత కారణాల వల్ల ఆందోళనలు కలుగుతున్నాయి...? ప్రభుత్వ దృష్టిలోనే లేని ఏ అంశాలున్నాయి...? చాలా విషయాలు క్షేత్రస్థాయి నుంచి ప్రభుత్వానికి చేరడం మొదలయ్యాయి, పాలనలో ఒక మూల సూత్రం ఉంది. అదేమిటంటే - సమాచారం కింది స్థాయి నుంచి పై స్థాయికి చేరుతుండాలి, ఇది వాస్తవం, ఆదేశాలు పై నుంచి కిందిస్థాయికి వెళ్తుండాలి. ఈ సమాచార స్రవంతి మన్ కీ బాత్ - మనసులో మాటగా మారుతుందని ఎవరు అనుకున్నారు. కానీ ఇది జరిగింది. అదే విధంగా మన్ కీ బాత్ - మనసులో మాట - సమాజ శక్తిని తెలియజేసే ఒక అవసరంగా మార్పు చెందింది. నేను ఒకరోజు అన్నాను - సెల్ఫీ విత్ డాటర్ అని. ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది, దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి ఎవరో ఒకరు.... లక్షలాదిగా సెల్ఫీ విత్ డాటర్, దీంతో కుమార్తెలకు ఎంత గౌరవం లభించింది. వాళ్లు సెల్ఫీ విత్ డాటర్ చేస్తున్నప్పుడు తమ కూతురు ఆత్మ విశ్వాసాన్ని పెంపొందించేది, తమ లోలోపల ఒక కమిట్ మెంట్ ను పొంపొందిస్తుండేది, ప్రజలు చూసినప్పుడు ఆడపిల్లల పట్ల నిర్లక్ష్యం విడిచిపెట్టాలని వాళ్లకు కూడా అనిపిస్తుందడేది. ఓ నిశ్శబ్ధ విప్లవం వచ్చింది.
భారత్ లో పర్యాటక రంగాన్ని దృష్టిలో పెట్టుకుని పౌరులందరికీ విజ్ఞప్తి చేశాను, ఇన్ క్రెడియబుల్ ఇండియా, సోదరులారా.... మీరు కూడా వెళుతుంటారు, ఏదైనా మంచి ఫొటో ఉంటే పంపించండి నేను చూస్తాను అని అన్నాను. ఏదో తేలికగా అనేశాను. కానీ ఎంత పెద్ద ఉపద్రవం వచ్చిపడింది. లక్షలాదిగా దేశం నలుమూలలా నుంచి ప్రజలు ఫొటోలు పంపించారు. మన దగ్గర ఎటువంటి వారసత్వ సంపద ఉన్నదో - కేంద్ర పర్యాటక శాఖ గానీ, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని పర్యాటక విభాగాలు గానీ ఎప్పుడూ ఆలోచించి కూడా ఉండవు. ప్రభుత్వ సొమ్ము ఒక్క రూపాయి కూడా ఖర్చు కాకుండానే అన్ని అంశాలు ఒకే వేదిక పైకి వచ్చి చేరాయి. ప్రజలు పనిని పెంచేశారు. గత ఏడాది అక్టోబర్ నెలలో మొదటిసారి మన్ కీ బాత్ - మనసులో మాట కార్యక్రమం సందర్భంగా నేను గాంధీ జయంతి గురించి ప్రస్తావించాను, అక్టోబర్ 2న మహాత్మాగాంధీ జయంతిని నిర్వహిస్తున్నామని విజ్ఞప్తి చేయడానికి ఎంతో సంతోషించాను.
ఒకప్పుడు ఖాదీ ఫర్ నేషన్. ఖాదీ ఫర్ నేషన్ ప్రస్తుత పరిస్థితుల్లో అవసరం లేదా, ఖాదీ దుస్తులు కొనుగోలు చేయాలని ప్రజలకు నేను విజ్ఞప్తి చేశాను. మీ వంతు సహకారం అందించండి. గత ఏడాది కాలంలో ఖాదీ విక్రయాలు దాదాపు రెట్టింపయ్యాయని తెలియజేయడానికి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇది ప్రభుత్వ ప్రకటనల వల్ల జరగలేదు. కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం వల్ల కాలేదు. ప్రజల శక్తికి ఒక నిదర్శనం. ఒక అనుభూతి.
ఒకసారి నేను మన్ కీ బాత్ - మనసులో మాట ద్వారా చెప్పాను. పేదల ఇళ్లలో పొయ్యి వెలుగుతుంది, పిల్లలు ఏడుస్తుంటారు... ఆ పేద తల్లికి గ్యాస్ సిలిండర్ అవసరం లేదా..? మీరు రాయితీని వదులుకోలేరా..? అని నేను ధనికులకు విజ్ఞప్తి చేశాను. ఆలోచించండి... ఈ దేశంలో 30 లక్షల కుటుంబాలు గ్యాస్ సిలిండర్ పై రాయితీని వదులుకున్నారని తెలియజేయడానికి నేనెంతో సంతోషిస్తున్నాను. వాళ్లంతా ధనికులు కాదు. నేనొక టీవీ ఛానల్ చూశాను, ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడు, వితంతు మహిళ, తమ రాయితీని వదులుకోవడానికి క్యూ లైన్ లో నిలబడ్డారు. సమాజంలోని సామాన్యులు, మధ్యతరగతి వర్గాలు, దిగువ మధ్యతరగతి వర్గాల వారు రాయితీ వదులుకోవడం కష్టమైన పనే. కానీ అలాంటి వాళ్లు కూడా వదులుకున్నారు. ఇదొక నిశ్శబ్ద విప్లవం కాదా...? ఇది ప్రజల శక్తికిది నిదర్శనం...? మన ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే పని... కార్యాలయాల వెలుపల సమర్ధవంతమైన, శక్తివంతమైన సంకల్పంతో కూడిన జనశక్తి సమాజం ఉందనే విషయం ప్రభుత్వానికి బోధపడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు ఎంత ఎక్కువగా సమాజంతో కలసి పనిచేస్తాయో అంత ఎక్కువగా సమాజంలో
మార్పు తీసుకురావడానికి ఒక మంచి ఉత్ప్రేరకంగా పనిచేస్తాయి. మన్ కీ బాత్ ద్వారా ఏ విషయాల్లో నాకు నమ్మకం ఉండేదో.... ఇప్పుడు వాటిపై విశ్వాసం పెరిగింది. ఆసక్తి పెరిగింది. ఇందుకోసం ఈరోజు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రజల శక్తికి శతాధిక వందనాలు తెలుపుతున్నాను, నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ప్రతి చిన్న విషయాన్ని తమదిగా చేసుకున్నారు, దేశ శ్రేయస్సులో భాగమయ్యేందుకు కృషి చేశారు. ఇంతకు మించిన సంతోషం ఏముంటుంది.
మన్ కీ బాత్ - మనసులో మాట కార్యక్రమంలో ఈసారి నేనొక కొత్త ప్రయోగం చేయాలనుకున్నాను. ఫోన్ చేసి తమ ప్రశ్నలను, తమ సూచనలు, సలహాలను నమోదు చేయాలని నేను దేశంలోని పౌరులందరికీ విజ్ఞప్తి చేశాను, వాటిపై దృష్టి పెడతానని అన్నాను. దేశం నలుమూలల నుంచి దాదాపు 55 వేలకు పైగా ఫోన్ కాల్స్ నాకు వచ్చాయని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. సియాచిన్ నుంచి కానీ, కచ్ ప్రాంతం నుంచి కానీ, కామెరూప్, కాశ్మీర్ లేదా కన్యాకుమారి నుంచి గానీ - ఫోన్ కాల్ చేయని ప్రాంతమంటూ ఏదీలేదు. అన్ని ప్రాంతాల నుంచి ఫోన్లు చేశారు. ఇదొక సంతోషకరమైన అనుభూతి. అన్ని వయస్సుల వారు తమ సందేశం పంపించారు. కొన్ని సందేశాలను నేను స్వయంగా వినడానికి ఇష్టపడ్డాను, చాలా బాగున్నాయి. మిగతా వాటిపై నా బృందం పనిచేస్తోంది. మీరు ఒకటి రెండు నిమిషాలు సమయం వెచ్చించి ఉంటారు. మీ ఫోన్లు, మీ సందేశాలు నాకు ఎంతో ముఖ్యమైనవి. మీ సలహాలు, సూచనలపై మొత్తం ప్రభుత్వం తప్పకుండా దృష్టి పెడుతుంది. అయితే నాకొక విషయం ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలగజేస్తోంది - మన చుట్టూ నెగిటివిటీ, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని అనిపిస్తూ ఉంటుంది.
కానీ, నా అనుభవం మరోలా ఉంది. ఈ 55 వేల మంది తమకు నచ్చిన విధంగా తమ తమ విషయాలను తెలియజేయాల్సింది. వారికి ఏ అడ్డంకులు లేవు. ఏదైనా చెప్పే వీలుంది. కానీ నాకు ఆశ్చర్యమేస్తోంది. వారు చెప్పిన విషయాలు ఎలా ఉన్నాయంటే వాటిపై మన్ కీ బాత్ ప్రభావం ఉందనిపిస్తోంది. వారు చెప్పిన విషయాన్నీ సానుకూల దృక్పథంతో ఉన్నాయి. మంచి సలహాలుగా ఉన్నాయి. సృజనాత్మకంగా ఉన్నాయంటే చూడండి. దేశంలో సామాన్య పౌరులు కూడా సానుకూల ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. ఇది దేశానికి ఎంత పెద్ద పెట్టుబడి అవుతుందో ఆలోచించండి. తీవ్రమైన ఫిర్యాదులు వంటివి ఒక శాతం లేదా రెండు శాతం ఫోన్లు ఉండవచ్చు. 90 శాతం కంటే ఎక్కవ మంది సంతోషాన్ని, ఆనందం కలిగించే విషయాలు తెలిపారు. నాకు మరో విషయం గుర్తుకొచ్చింది - ప్రత్యేకించి వికలాంగులు అందులోనూ అంధులు మనవాళ్లు, వారి నుంచి ఎన్నో ఫోన్లు వచ్చాయి. అయితే ఇందుకు కారణం ఏమిటంటే వాళ్లు టీవీ చూడలేరు గనుక రేడియో తప్పక వింటుంటారు. చూపులేని వారికి రేడియో ఎంత గొప్ప సాధనమో నాకు దీని ద్వారా తెలిసింది. నేను మరో కొత్త కోణం చూస్తున్నాను వాళ్లంతా ఎన్ని మంచి విషయాలు తెలియజేశారో - ప్రభుత్వాన్ని చైతన్యం చేయడానికివి చాలు.
రాజస్థాన్ లోని అల్వార్ నుంచి పవన్ ఆచార్య ఓ సందేశం పంపించారు. పవన్ ఆచార్య చెప్పన విషయాలు దేశం మొత్తానికి వినిపించాలనుకుంటున్నాను. దేశమంతా దీన్ని అంగీకరించాలని భావిస్తున్నాను. తప్పకుండా వినండి ఆయనేం చెప్పాలనుకుంటున్నాడో.
----- 'నా పేరు పవన్ ఆచార్య. నేను రాజస్థాన్ లోని అల్వార్ కు చెందినవాడిని. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి నా విజ్ఞప్తి ఏమిటంటే - ఈసారి దీపావళికి మట్టితో చేసిన ప్రమిదలు ఎక్కువగా వాడాలని మీరు మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా దయచేసి ప్రజలకు విజ్ఞప్తి చేయాలని కోరుకుంటున్నాను. దీంతో పర్యావరణ ప్రయోజనం కలగడంతో పాటు... వేలాది మంది కుమ్మరులకు ఉపాధి కలుగుతుంది. ధన్యవాదాలు'
పవన్, పవన్ లాగే మీ అభిప్రాయాలు కూడా దేశం నలుమూలలా చేరతాయని, వ్యాపిస్తాయని నేను భావిస్తున్నాను. మంచి సలహా ఇచ్చారు. మట్టి కోసం ధర చెల్లించాల్సిన అవసరం ఉండదు. మట్టి ప్రమిదలు కూడా అమూల్యమైనవి. పర్యావరణ పరిరక్షణ దృష్టితో చూసినప్పుడు వాటికి ప్రాముఖ్యత ఉంది. ప్రమిదలను పేదలు తయారుచేస్తారు. దీంతో వారికి ఉపాథి లభిస్తుంది. పవన్ ఆచార్య చెప్పినట్లు రాబోయే పండుగలకు మనం ఇళ్లలో మట్టి ప్రమిదలు వెలిగిస్తే వెలుగులు పేదల ఇళ్లలో నిండుతాయి.. నా ప్రియమైన దేశవాసులారా... వినాయక చవితి నాడు మన సైనికులతో రెండు మూడు గంటలు గడిపే అవకాశం నాకు లబించింది. దేశ భూభాగాన్ని, సముద్రాలను, ఆకాశాన్ని పరిరక్షించే మన సైన్యం, నావికాదళం, వాయుసేన - ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ. 1965లో పాకిస్తాన్ తో యుద్ధం జరిగి 50 ఏళ్లు పూర్తయ్యాయి. దానికి సంబంధించి ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద శౌర్యాంజలి ప్రదర్శన ఏర్పాటుచేశారు. దాన్ని నేనెంతో ఆసక్తిగా చూశాను. అర్థ గంట కోసం వెళ్లాను. కానీ బయటకు వచ్చేసరికి రెండున్నర గంటలు అయిపోయాయి. మరికొన్ని చూడాల్సినవి ఉండిపోయాయి. చరిత్ర మొత్తం సజీవంగా కనిపించింది. కళా సౌందర్యం దృష్టితో చూస్తే ఉత్తమంగా ఉంది, చారిత్రాత్మక దృష్టితో చూస్తే విజ్ఞానవంతంగానూ, జీవితంలో ప్రేరణ కోసమైతే మాతృభూమి సేవ కోసం ఇంతకుమించి ప్రేరణనిచ్చేది ఏదీ ఉండదు. యుద్ధంలో మన సైనికులు ప్రదర్శించిన సాహసోపేత ఘడియలు, మన సైనికుల ధైర్యసాహసాలు, వారి త్యాగాల గురించి మనం వింటూండేవాళ్లం. ఆ సమయంలో అన్ని ఫొటోలు కూడా లభించేవి కావు, వీడియోగ్రఫీ కూడా అంతగా ఉండేది కాదు. ఈ ప్రదర్శన ద్వారా ఆనాటి అనుభూతి కలుగుతుంది.
హాజీపూర్‌లో జరిగిన పోరాటం కానీయండి, ఉత్తరాదిన జరిగిన పోరాటం గానీ, చమిండాలో జరిగినది కానీయండీ, హాజీపూర్ పాస్ వద్ద సాధించిన విజయ దృశ్యాలను చూస్తే రోమాలు నిక్కపొడుచుకుంటాయి. మన సైనికుల పట్ల మనకెంతో గర్వం కలుగుతుంది. ఈ వీరుల కుటుంబాలను కలిసే అవకాశం కూడా నాకు లభించింది. ప్రాణాలను బలిదానం చేసిన వారి కుటుంబాలను కూడా కలుసుకున్నాను. యుద్ధంలో పాల్గొన్న వారిని కలిశాను, వీరంతా తమ జీవితాల చరమదశలో ఉన్నారు. వారితో కరచాలనం చేసినప్పుడు అనిపించింది, వ్వాహ్..... ఎంత శక్తి ఉంది. ఎంతో ప్రేరణనిస్తుంది. మనం చరిత్ర సృష్టించాలంటే చరిత్ర గురించిన సున్నితమైన విషయాలను తెలుసుకోవాలి, అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. చరిత్ర మన వారసత్వంతో కలుపుతుంది. చరిత్రతో మన సంబంధాలు తెగిపోతే చరిత్ర సృష్టించే అవకాశాలు కూడా నిలిచిపోతాయి. ఈ శౌర్య ప్రదర్శన ద్వారా చరిత్ర అనుభూతి కలుగుతుంది. మనకు చరిత్ర తెలుస్తుంది, కొత్త చరిత్ర సృష్టించేందుకు అవసరమైన బీజాలు మొలకెత్తుతాయి. నేను మిమ్మల్ని, మీ కుటుంబాలను - ఒకవేళ మీరు ఢిల్లీ చుట్టుపక్కల ఉంటున్నట్లయితే ఈ ప్రదర్శన మరికొన్ని రోజులు ఉంటుందనుకుంటున్నాను. మీరు తప్పకుండా చూడండి. నాలాగా త్వరత్వరగా చూసి వెళ్లిపోవద్దు. నేను రెండున్నర గంటల్లోనే తిరిగి వెళ్లిపోయాను. కానీ మీకు మూడు, నాలుగు గంటలు పడుతుంది. తప్పకుండా చూడండి.
ప్రజాస్వామ్య బలమేంటో చూడండి. ఒక చిన్న బాలుడు ప్రధానమంత్రిని ఆదేశించాడు. కానీ ఆ బాలుడు తొందరపాటుతో తన పేరు చెప్పడం మరిచిపోయాడు. అతని పేరేంటో నాకు తెలియదు. కానీ అతని మాటలు ప్రధానమంత్రి దృష్టిని ఆకర్షించేవిగా ఉన్నాయి, కానీ దేశవాసులందరు దీనిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. వినండి ఈ బాలుడు మనకేం చెబుతున్నాడో....
----- ప్రధానమంత్రి మోదీ గారు.... మీరు అమలుచేస్తున్న స్వచ్ఛత కార్యక్రమం కింద అన్నిచోట్లా, అన్ని వీధుల్లో డస్ట్ బిన్ ఏర్పాటుచేయండి.
ఈ బాలుడు చెప్పింది నిజమే. మనం పరిశుభ్రతను మన స్వభావంగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పరిశుభ్రతకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉంది. ఈ బాలుడి సందేశంతో నాకొక గొప్ప సంతోషం కలిగింది. సంతోషం ఎందుకంటే - అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ అభియాన్ ప్రవేశపెడుతూ ప్రకటన చేశాము . స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి పార్లమెంట్లో పరిశుభ్రత అంశంపై గంటల కొద్దీ చర్చ జరుగుతోంది. మా ప్రభుత్వం మీద విమర్శలు కూడా వస్తాయి. నాకు కూడా వినాల్సి వస్తూ ఉంటుంది. మోదీగారు పెద్ద పెద్ద మాటలు చెబుతారు స్వచ్ఛత గురించి, కానీ ఏం జరిగింది అని. నేను దాన్ని తప్పుగా అనుకోను. నేను దీంట్లో మంచిని చూస్తున్నాను. అది దేశ పార్లమెంట్ కూడా పరిశుభ్రత గురించి చర్చించడం ఇంకోవైపు చూడండి. ఒకవైపు పార్లమెంటేరియన్లు, మరోవైపు దేశంలోని పసివాళ్లు... ఇద్దరూ పరిశుభ్రత గురించి మాట్లాడుతున్నారు. ఇంతకుమించి దేశానికి సౌభాగ్యం ఇంకేముంటుంది. అభిప్రాయాల ఉద్యమం ఏదైతే నడుస్తోందో దానివల్ల మురికి, మాలిన్యాలను ద్వేషించే పరిస్థితి ఏర్పడుతోంది. పరిశుభ్రత దిశగా ఒక చైతన్యం వచ్చింది. ఇది
ప్రభుత్వాలు కూడా పనిచేయక తప్పని స్థితి కలిగిస్తుంది. స్థానిక స్వపరిపాలన సంస్థలు కూడా అవి పంచాయతీలైనా, నగర పంచాయతీలైనా, నగరపాలికలైనా, మహానగర సంస్థలైనా, ఇంకా రాష్ట్రాలైనా, కేంద్రమైనా.... ప్రతి ఒక్కరికీ దీనిపై పనిచేయాల్సి వస్తుంది. ఈ ఉద్యమాన్ని మనం ముందుకు తీసుకువెళ్లాలి. లోపాలున్నా ముందుకే తీసుకెళ్లాలి. ఇంకా 2019 సంవత్సరంలో గాంధీజీ 150వ జయంతి జరుపుకునే నాటికి ఆయన స్వప్నాలను సాకారం చేసే దిశగా మనం పనిచేయాలి. ఇంకా మహాత్మాగాంధీ ఏం చెప్పేవారో మీకు తెలుసు. ఒకసారి ఆయన ఏమన్నారంటే - స్వాతంత్య్రం, పరిశుభ్రత రెండింటిలో ఒకటి ఎంచుకోవాల్సి వస్తే తాను పరిశుభ్రతనే ఎంచుకుంటాననీ, స్వాతంత్య్రం ఆ తర్వాతేనని చెప్పారు. గాంధీజీకి స్వతంత్య్రం కంటే పరిశుభ్రతే ముఖ్యమైంది. రండి... మనమంతా కలిసి మహాత్మాగాంధీ చెప్పిన మాటని అనుసరిద్దాం. ఆయన కోరికను నెరవేర్చడానికి మనమూ కొన్ని అడుగులు వేద్దాం. ఢిల్లీ నుంచి గుల్షన్ అరోడా గారు - మై గవ్ మీద ఒక సందేశం పంపారు. దీన్ దయాళ్ జీ శతజయంతి గురించి తెలుసుకోవాలనుకుంటున్నట్టు ఆయన రాశారు.
నా ప్రియమైన దేశవాసులారా.... మహాపురుషుల జీవితాలు ఎప్పుడూ, ఎల్లప్పుడూ మనకి స్ఫూర్తిదాయకంగా ఉంటాయి. ఇంకా మన పనేమిటంటే మహాత్ముల వైఖరులను, ఆలోచనలను మదింపుచేయడం మన పని కాదు. దేశం కోసం జీవించి మరణించేవారిలో ప్రతి ఒక్కరూ మనకు స్ఫూర్తి ప్రదాతలే. ఇప్పుడైతే ఎందరో మహాపురుషుల్ని స్మరించుకునే అవకాశం వస్తోంది. సెప్టెంబర్ 25న పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ, అక్టోబర్ 2న మహాత్మాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, 11న జయ ప్రకాశ్ నారాయణ, అక్టోబర్ 31న సర్దార్ వల్లభాయ్ పటేల్.... ఎన్ని లెక్కలేనన్ని పేర్లున్నాయో చూడండి. నేనైతే చాలా చెబుతున్నాను. ఎందుకంటే దేశం రత్నగర్భ. మీరేదైనా తేదీ చెప్పండి. చరిత్ర పుటల్నుంచి ఎవరో ఒక మహాపురుషుని పేరు దొరకనే దొరుకుతుంది. రానున్న రోజుల్లో ఈ మహితాత్ములందరినీ మనం గుర్తు చేసుకుందాం. వారి జీవిత సందేశాలను ఇంటింటికీ చేరుద్దాం. వారి నుంచి ఎంతో కొంత నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా - అక్టోబర్ 2 విషయం నేను మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అక్టోబర్ 2 పూజ్య బాపూజీ మహాత్మాగాంధీ జయంతి. నిరుడు కూడా నేను చెప్పాను. మీ దగ్గర అన్ని
రకాల ఫ్యాషన్ దుస్తులు ఉండి ఉంటాయి. అన్ని రకాల ఫ్యాబ్రిక్ ఉంటుంది. చాలా వస్తువులు ఉంటాయి. కానీ వాటిలో ఖద్దరుకు కూడా స్థానం ఉండాలి. నేను మరోసారి చెబుతున్నాను. అక్టోబర్ 2 నుంచి నెల రోజులపాటు ఖద్దరు మీద రాయితీ ఉంటుంది. దీన్నుంచి లబ్ధి పొందండి. ఖాదీతో పాటు... చేనేతలకు అంతే ప్రాధాన్యం ఇవ్వండి. మన నేతకార సోదరులు ఎంతో శ్రమ పడుతున్నారు. నూట పాతిక కోట్ల మంది దేశవాసులాం... 5 రూపాయలో, పదో, యాభై రూపాయలతోనైనా ఏదైనా చేనేత లేదా ఖాదీ వస్తువు కొంటే అదంతా చివరికి ఆ ఖాదీ నేతకారులకు చెందుతుంది. ఖాదీ వస్త్రం తయారుచేసే పేదింటి వితంతువులకు చేరుతుంది. అందుకే ఈసారి దీపావళి పండుగకు మనం ఖాదీకి మన ఇంట్లో స్థానం కల్పిద్దాం. ఖద్దరు బట్టలు ధరిద్దాం. మీరు పూర్తిగా ఖాదీ ధరించాలని నేను చెప్పడం లేదు. కొంతవరకు అంతే నేను విజ్ఞప్తి చేసేది. ఇంకా చూడండి. క్రితం సారి అమ్మకాలు దాదాపు రెట్టింపయ్యాయి. ఎంత మంది పేదలకు లబ్ధి చేకూరిందో. ప్రభుత్వం కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ప్రకటనలతో చేయలేదని మీ ప్రజలు చిన్నపాటి మద్దతుతో సాధించారు. ఇదే జనశక్తి అంటే. అందుకే నేను
మరోసారి ఆ పనికోసం మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను.
ప్రియమైన దేశవాసులారా.... ఒక విషయంలో నా మనస్సు ఆనందంతో నిండిపోయింది. ఆ ఆనందాన్ని మీకు కూడా కొంచెం పంచాలనిపిస్తోంది. నేను మే నెలలో కోల్‌కతా వెళ్లినప్పుడు సుభాష్ చంద్ర బోస్ కుటుంబ సభ్యులు వచ్చి కలిశారు. ఆయన సోదరుని కుమారుడు చంద్ర బోస్ అంతా ఏర్పాటుచేశారు. సుభాష్ బాబు కుటుంబ సభ్యులతో సంతోషంగా, ఉల్లాసంగా ఆ సాయంత్రం గడిపే అవకాశం లభించింది. ఆ రోజు నిర్ణయం జరిగింది. సుభాష్ బోసు కుటుంబం అంతా ప్రధానమంత్రి నివాసానికి రావాలని. చంద్రబోస్ ఇంకా వారి కుటుంబ సభ్యులు ఆ ఏర్పాట్లలో ఉన్నారు. 50 మందికి పైగా సుభాష్ బోసు కుటుంబ సభ్యులు ప్రధానమంత్రి నివాసానికి వచ్చే విషయం గత వారం ఖరారైంది. అది నాకెంతో ఆనందం కలిగించే క్షణాలు అవి. మీరు ఊహించగలరు. నేతాజీ కుటుంబ సభ్యులందరూ కలసి ఒకేసారి ప్రధానమంత్రి నివాసానికి వచ్చే అవకాశం బహుశా మొదటిసారి లభించింది. కానీ దానికంటే వారు ఆనందం కలిగించే విషయం ఏమిటంటే - అలాంటి మహా మనిషి పరివారానికి ఆతిథ్యం ఇచ్చే అవకాశం ప్రధానమంత్రి నివాసానికి ఎప్పుడూ వచ్చి ఉండదు. అది నాకు అక్టోబర్‌లో దక్కబోతోంది. వేరు వేరు దేశాల్లో ఉంటున్న 50 మందికి పైగా సుభాష్ బాబు కుటుంబ సభ్యులు ఇందుకోసమే ప్రత్యేకంగా వస్తున్నారు. అది నాకెంతో ఆనందం ఇచ్చే క్షణమే కదా అది. వారిని స్వాగతించడానికి సంతోషిస్తున్నాను. ఎంతో ఆనందానుభూతి పొందుతున్నాను.
భార్గవి కానడే నుంచి నాకో సందేశం వచ్చింది. ఇంకా ఆమె చెప్పిన తీరు , కంఠస్వరం, అంతా విన్నాక నాకేమనిపించిందంటే - ఆమె ఒక నాయకురాలు అనిపించింది, నాయకురాలు అవుతుందేమోననిపిస్తోంది.
---- నా పేరు భార్గవి కానడే. నేను ప్రధానమంత్రి గారికి విజ్ఞప్తి చేయదలిచాను. యువతరం ఓటరుగా నమోదు చేసుకునే విధంగా వారిని చైతన్యపరచండి. రానున్న కాలంలో దీనివల్ల యువతరం భాగస్వామ్యం పెరుగుతుంది. భవిష్యత్ లో ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో యువతరం కీలక భాగస్వామ్యం ఉంటుంది. ధన్యవాదాలు. ఓటర్ల జాబితాలో పేరు నమోదు చేసుకోవడం, ఓటు వేయడం గురించి భార్గవి చెబుతున్నారు. మీరు చెప్పేది నిజమే. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరూ దేశ భాగ్య విధాత అవుతారు. ఈ చైతన్యం పెరుగుతోంది. ఓటింగ్ శాతం కూడా పెరుగుతోంది. ఇందుకుగాను ముఖ్యంగా - భారత ఎన్నికల సంఘానికి అభినందనలు చెప్పాలనుకుంటున్నాను. కొన్నేళ్ళ క్రితం మన ఎన్నికల సంఘం కేవలం నియంత్రణ సంస్థగా పనిచేయడం చూసేవాళ్లం. కానీ గత కొన్నేళ్లుగా ఈ స్థితిలో చాలా మార్పు వచ్చింది. ఇప్పుడు మన ఎన్నికల సంఘం నియంత్రణ సంస్థ మాత్రమే కాదు. ఒక రకంగా ఫెసిలిటేటర్‌గా మారింది. ఓటరు సానుకూల సంస్థగా మారింది. వారి ఆలోచనలు, ప్రణాళికల్లో ఇప్పుడు ఓటరే కేంద్ర బిందువుగా మారాడు. ఇదొక మంచి మార్పు. కానీ ఎన్నికల సంఘం ఒక్కటి పనిచేస్తుంటే పని నడవదు. మనం కూడా స్కూలు, కాలేజీ, వీధుల్లో ఈ చైతన్యం నింపాలి. ఎన్నికలొచ్చినప్పుడే చైతన్యం తేవాలనుకోవడం సరికాదు. ఓటరు జాబితాలు ఎప్పటికప్పుడు అప్ గ్రేడ్ అవుతూ ఉండాలి. తాజా పరిచేలా మనం కూడా చూస్తూ ఉండాలి. నాకు లభించిన అమూల్య అధికారం అది సురక్షితంగా ఉందా... లేదా... నా అధికారాన్ని నేను ఉపయోగిస్తున్నానా... లేదా... అని తరిచి చూసుకునే అలవాటు మనమందరం చేసుకోవాలి. దేశ యువజనులు ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోనట్లయితే వారు చేసుకోవాలని కోరుతున్నాను. అలాగే ఓటు కూడా తప్పకుండా వెయ్యాలి. ఎన్నికల సమయంలో అయితే బహిరంగంగానే చెబుతుంటారు. ముందు ఓటు... తర్వాతే తిండీతిప్పలు అని. ఈ పవిత్రమైన పనిని ప్రతి ఒక్కరూ విధిగా చెయ్యాలి. ఈ మధ్య నేను కాశీలో పర్యటించి వచ్చాను. చాలా మందిని కలిశాను. చాలా కార్యక్రమాలు జరిగాయి. ఎంతో మందిని కలిశాను కానీ ఇద్దరు పిల్లల గురించి మీతో చెప్పాలనుకుంటున్నాను. ఒకరు క్షితిజ్ పాండే అనే ఏడో తరగతి విద్యార్థి కలిశాడు. బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఏడో తరగతి చదువుతున్నాడు. చాలా తెలివైన, చురుకైనవాడు. ఆత్మవిశ్వాసం కూడా ఎక్కువగానే ఉంది. కానీ - ఇంత చిన్న వయసులో భౌతికశాస్త్రం సంబంధిత విషయాలపై అభిరుచి చూశాను. చాలా చదువుతాడనుకుంటా. ఇంటర్ నెట్లో సర్ఫింగ్ చేస్తూ ఉండొచ్చు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాడనుకుంటా. రైలు ప్రమాదాలు ఎలా అరికట్టాలి...? ఎలాంటి టెక్నాలజీ ఉండాలి...? ఇంధన పొదుపు ఎలా చేయాలి...? ఎలాంటి పరిశోధనలు ఉన్నాయి...? రోబోట్ లో భావనలు ఎలా వస్తాయి....? ఎలాంటెలాంటి మాటలో చెప్పాడు. చిచ్చర పిడుగు అనుకోండి. సరే, పిల్లాడు చెప్పేదేంటో లోతుగా చూడలేకపోయాడు. అతను చెప్పిన దానిలో సూక్ష్మ పరిజ్ఞానం ఉందో ఏమో కానీ అతని విశ్వాసం, అభిరుచి చూశాను. దేశంలోని పిల్లలందరిలో వైజ్ఞానిక విషయాల మీద అభిరుచి పెరగాలని అనుకుంటున్నాను. పిల్లల మనసుల్లో ప్రశ్నలు ఎల్లప్పుడూ తలెత్తాలి. ఎందుకు....? ఎలా....? ఎప్పుడు....? పిల్లలు మనస్సు పెట్టి ఈ ప్రశ్నలు అడగాలి.
అలాగే సోనం పటేల్ చాలా చిన్నపిల్ల. నన్ను కలిసింది. తొమ్మిదేళ్ల వయస్సు. వారణాసిలో సందర్ పూర్ నివాసి. సదావృత్ పేట్ కుమార్తె. చాలా పేదింటి పిల్ల. ఆమె నన్ను అబ్బురపరిచింది. భగవద్గీత అంతా ఆమెకు కంఠోపాఠం. అన్నిటికంటే చకితుల్ని చేసిన విషయం ఏంటంటే.... గీత నుంచి అడిగిన శ్లోకం చెప్పింది. ఆంగ్లంలో టీకాటిప్పణీ చెప్పింది. దాని మీద విశ్లేషణ చెప్పింది. హిందీలో కూడా టిప్పణీ చెప్పింది. ఆమె తండ్రిని అడిగితే చెప్పాడు. ఆ పిల్ల ఐదేళ్ల వయసప్పటి నుంచి ఇలా చెబుతోందని. ఎక్కడ నేర్చుకుందని అడిగాను. వాళ్లకి కూడా తెలీదని చెప్పారు. మిగతా చదువు ఎలా ఉందని అడిగాను. గీత ఒక్కటే చదువుతుందా.... ఇంకా ఏమైనా చేస్తుందా అని అడిగితే వాళ్లు చెప్పారు. గణితం ఒకసారి చేతిలోకి తీసుకుంటే సాయంత్రానికి కంఠతా వస్తాయని.
చరిత్ర పాఠం తీసుకుంటే సాయంత్రానికి తిరిగి చెప్పేస్తుంది. కుటుంబంలో ఎవరికీ లేనిది ఆమెకు ఎలా వచ్చిందా అని ఆశ్చర్యపోతామని వాళ్లు చెప్పారు. నిజంగానే నాకు ముచ్చటేసింది. ఒక్కోసారి కొంత మంది పిల్లలకు సెలబ్రిటీ అయిపోవాలని అనిపిస్తుంది. అలాగే సోనంలో అలాంటిదేమీ లేదు. భగవంతుడు తనకి ఏదో శక్తి తప్పక ఇచ్చాడు అని నాకనిపిస్తోంది. సరే.... ఈ ఇద్దరు పిల్లల్ని కలవడం నా కాశీ యాత్రలో ఒక విశేషం. అందుకే నాకు అనిపించింది మీకు కూడా చెప్పాలని. టీవీలో మీరు చూసేది, పత్రికల్లో చదివేది కాకుండా ఇంకా కూడా ఎన్నో పనులు చేస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఇలాంటి పనుల వల్ల కొంత ఆనందం కూడా వేస్తుంది. అలాగే ఈ ఇద్దరి పిల్లలతో మాట్లాడటం నాకు గుర్తుండిపోతుంది. మన్ కీ బాత్ - మనసులో మాట కార్యక్రమంలో కొందరు నాకోసం చాలా పని పెట్టడాన్ని గమనించాను. చూడండి. హర్యాణాకి చెందిన సందీప్ ఏం చెబుతున్నాడో....
---- 'సందీప్ హర్యాణా... సార్ మీరు నెలకొకసారి చేస్తున్న మన్ కీ బాత్ వారానికి ఒకసారి చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మీ మాటల్లో చాలా పేరణ లభిస్తుంది'. సందీప్ గారు.... నా చేత ఏమేం చేయిస్తారు. నెలకోసారి చేయడానికైనా నాకెంతో కష్టపడాల్సి వస్తోంది. సమయాన్ని ఎంతో సర్దుబాటు చేసుకోవలసి వస్తోంది. అప్పుడప్పుడు మన ఆకాశవాణి సహచరులు - అరగంట ... ముప్పావుగంట... నా కోసం ఎదురుచూస్తూ కూర్చోవలసి వస్తుంది. కానీ - మీ భావనను నేను ఆదరిస్తాను. మీ సూచనకు నా ధన్యవాదాలు. ఇప్పటికైతే నెలకొకసారి సరిగ్గా ఉంది.
మన్ కీ బాత్ కార్యక్రమానికి ఒక రకంగా సంవత్సరం అయింది. మీకు తెలుసు. సుభాష్ బాబు రేడియోను ఎంతగా ఉపయోగించుకునేవారో మీకు తెలుసా...? జర్మనీలో ఆయన తన సొంత రేడియో ప్రారంభించారు. హిందుస్థాన్ ప్రజల స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి ఆయన రేడియో ద్వారా చెబుతూనే ఉండేవారు. 'ఆజాద్ హింద్ రేడియో'ను వీక్లీ న్యూస్ బులెటిన్‌తో ఆయన మొదలుపెట్టారు. ఆంగ్లం, హిందీ, బెంగాలీ, మరాఠీ, పంజాబీ, పస్తో, ఉర్దూ అన్ని భాషల్లో రేడియోను ఆయన నిర్వహించేవారు. నాకు కూడా ఇప్పుడు ఆకాశవాణిలో మనసులో మాట చేస్తూ చేస్తూ సంవత్సరం అయింది. నా మన్ కీ బాత్ - నా మనసులో మాట మీ కారణంగా అర్థవంతంగా, మీ మనసులో మాటగా మారింది. మీ మాటలు వింటూ వింటాను. మీ గురించి ఆలోచిస్తూ ఉంటాను. దాంతోనే నా ఆలోచనల్లో ఒక పరుగు మొదలవుతుంది. అది ఆకాశవాణి వేదికగా మీ వద్దకు చేరుతుంది. పలికేది నేనే, కానీ ఆ పలుకులు మీవే అవుతాయి. అదే కదా నా సంతోషం. వచ్చే నెల మనసులో మాట కోసం మళ్లీ కలుద్దాం. మీ సూచనలైతే అందుతూ ఉండాలి. మీ సూచనలతో ప్రభుత్వానికి కూడా లాభం ఉంటుంది. దిద్దుబాటు మొదలవుతుంది. మీ భాగస్వామ్యం నాకు ఎంతో విలువైనది, అమూల్యమైనది. మళ్లీ ఒకసారి మీ అందరికీ శుభాకాంక్షలు - ధన్యవాదాలు.
నా ప్రియమైన దేశవాసులారా....
మీకందరికీ నమస్కారాలు.... మరోసారి నా మనసులో మాటలు తెలియజేయడానికి మీ మధ్యకు వచ్చే అవకాశం దొరికింది. సుదూర దక్షిణాదిలో ప్రజలు ఓణం సంబరాల్లో మునిగి ఉన్నారు. నిన్న దేశవ్యాప్తంగా పవిత్ర రక్షా బంధన్ పండుగను జరుపుకున్నారు. భారత ప్రభుత్వం సామాన్య ప్రజల సామాజిక భద్రత కోసం అనేక కొత్త పథకాలు ప్రవేశపెట్టింది. కొద్దిపాటి సమయంలోనే చెప్పుకోదగ్గ స్థాయిలో అందరూ పథకాలను ఆదరించడం నాకు సంతోషం కలిగిస్తోంది. రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా మనం మన అక్కాచెల్లెళ్లకు ఈ భద్రతా పథకాన్ని అందించాలని నేను మీకందరికీ ఓ చిన్నపాటి విజ్ఞప్తి చేశాను. నాకొచ్చిన స్థూల సమాచారం మేరకు ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు 11 కోట్ల కుటుంబాలు ఈ పథకంలో చేరాయి. దాదాపు సగం ప్రయోజనం తల్లులకు, అక్కచెల్లెళ్లకు లభించినట్లు నా దృష్టికి వచ్చింది. నేను దీన్ని ఒక శుభ సంకేతంగా భావిస్తున్నాను. పవిత్ర రక్షాబంధన్ పర్వదినం సందర్భంగా అందరు మాతృమూర్తులకు, అక్కాచెల్లెళ్లకు అనేకానేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను --- ప్రధానమంత్రి జన్ ధన్ యోజనను ఓ ఏడాది క్రితం పెద్ద స్థాయిలో చేపట్టాం. 60 ఏళ్లలో పూర్తి చేయలేని పని ఇంత కొద్ది సమయంలో పూర్తవుతుందా? అంటూ అనేక ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. కానీ, నాకు ఈరోజు సంతోషమేస్తోంది. - ఈ పథకాన్ని అమలుచేయడంలో అన్ని ప్రభుత్వ శాఖలూ, బ్యాంకుల అన్ని శాఖలూ మనస్ఫూర్తిగా ఏకమయ్యాయి, సఫలీకృతమయ్యాయి. ఇప్పటివరకు నాకున్న సమాచారం మేరకు సుమారు 17 కోట్ల 45 లక్షల బ్యాంకు ఖాతాలు తెరిచారు. జీరో బాలెన్స్ తో ఖాతాలు తెరవాల్సింది - కానీ, పేద ప్రజలు ఆదా చేసి, పొదుపు చేసి 22 వేల కోట్ల రూపాయల నిధి జమ చేశారు. ఆర్థిక వ్యవస్థలోని ప్రధాన స్రవంతిలో బ్యాంకింగ్ రంగం కూడా ఉంది. ఈ వ్యవస్థ పేదల ఇంటి వరకు చేరింది. దీంతో బ్యాంకు మిత్రుల పథకాలకు కూడా బలం చేకూరింది. ఈరోజు లక్షా 25 వేల కంటే ఎక్కువ మంది బ్యాంకు మిత్రులు దేశవ్యాప్తంగా పని చేస్తున్నారు. యువతకు ఉపాథి అవకాశాలు కూడా దొరికాయి. ఒక్క ఏడాదిలో బ్యాంకింగ్ రంగం, ఆర్థికవ్యవస్థ, పేదలు... వీరందరినీ అనుసంధానం చేయడం కోసం ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కలిగించడానికి లక్షా 31 వేల శిబిరాలు ఏర్పాటుచేశారని తెలిసి మీరందరూ సంతోషిస్తారని భావిస్తున్నాను. కేవలం ఖాతాలు తెరిచి ఆపేయవద్దు. ఇప్పుడిక అనేక వేల మంది జన్ ధన్ యోజన కింద ఓవర్ డ్రాఫ్ట్ అప్పు పొందడానికి హక్కుదారులయ్యారు. వాటిని పొందారు కూడా. బ్యాంకు నుంచి డబ్బులు లభిస్తాయనే నమ్మకం పేదలకు కలిగింది. ఇందుకు సంబంధించిన వారందరినీ అభినందిస్తున్నాను. బ్యాంకుతో సంబంధాలను వదులుకోవద్దని - బ్యాంకు ఖాతాలు తెరిచిన వారందరికీ, నిరుపేద సోదరసోదరీమణులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ బ్యాంకులు మీవే, మీరు వీటిని ఇప్పుడు వదులుకోవద్దు. నేను వీటిని మీ వరకు తీసుకొచ్చాను, ఇప్పుడిక వాటిని కొనసాగించడం మీ కర్తవ్యం. మనందరి బ్యాంకు ఖాతాలు సజీవంగా ఉండాలి. మీరు తప్పకుండా కొనసాగిస్తారని నాకు నమ్మకం ఉంది. ఇటీవల గుజరాత్‌లోని ఘటనలు, హింసాత్మక సంఘటనలు దేశం మొత్తాన్ని ఆందోళన కలిగించాయి. గాంధీజీ, సర్దార్‌పటేల్‌కు చెందిన ప్రాంతంలో ఏదైనా జరిగితే తొలుత దేశం మొత్తానికి బాధ కలుగుతుంది, కష్టం వేస్తుంది. కానీ, కొద్ది సమయంలోనే గుజరాత్‌లోని పెద్దలూ, నా సోదరసోదరీమణులు, పౌరులందరూ పరిస్థితిని సరిదిద్దారు. పరిస్థితి అదుపుతప్పకుండా నివారించడంలో... కీలక పాత్ర పోషించారు. గుజరాత్ మరోసారి శాంతిమార్గంలో పయనిస్తోంది. శాంతి, ఐకమత్యం, సోదరభావం ఇదే సరైన మార్గం.... అభివృద్ధి దిశలోనే మనం భుజం భుజం కలిపి నడవాలి. అభివృద్ధి ఒక్కటే మన సమస్యలకు పరిష్కారం. ఇటీవల సూఫీ సాంప్రదాయవేత్తలతో కలిసే అవకాశం నాకు లభించింది. వారి మాటలు వినే అవకాశం దొరికింది. నిజం చెప్పాలంటే వారి అనుభవాలు, వారి మాటలు వినే అవకాశం కలగడం ఓ విధంగా ఏదో సంగీతం వింటున్నానా అనిపించింది. వారి మాటల తీరు, వారు మాట్లాడే విధానం అంటే సూఫీ సాంప్రదాయంలో ఉన్న ఉదారత, అందులో ఉన్న సౌమ్యత, ఇందులో ఓ సంగీత లయ దాగి ఉంది. వారి మధ్య ఉండటం వల్ల ఇవన్నీ నాకు అనుభూతి కలిగించాయి. నాకు చాలా నచ్చాయి. ఇస్లాం మతం యొక్క నిజమైన స్వరూపాన్ని సరైన పద్ధతిలో ప్రపంచం మొత్తానికి తెలియజేయవలసిన అవసరం ఎంతో ఉందని భావిస్తున్నాను. సూఫీ సాంప్రదాయంలో ఉన్న ప్రేమతత్త్వం, అందులో ఉన్న ఉదారత ఈ సందేశాన్ని దూరదూర ప్రాంతాల వరకు చేరవేస్తారనే నమ్మకం నాకు ఉంది. జాతికి ప్రయోజనం కలిగించే మనిషి ఇస్లాం మతానికి కూడా ప్రయోజనం కలిగిస్తాడు. నేను ఇతరులకు కూడా తెలియజేస్తున్నాను. మనం ఏ మతాన్ని పాటించినప్పటికీ సూఫీ సాంప్రదాయాన్ని అర్థం చేసుకోవలసిన అవసరం ఉంది.
త్వరలో నాకు మరో అవకాశం లభిస్తుంది. ఈ ఆహ్వానాన్ని నేను అదృష్టంగా భావిస్తున్నాను. ప్రపంచంలోని అనేక దేశాల నుంచి బౌద్ధమత పండితులు భారత్‌లోని బుద్ధగయకు రానున్నారు. విశ్వవ్యాప్తంగా మానవ జాతికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నారు. అందులో పాల్గొనాల్సిందిగా నాకు ఆహ్వానం అందింది. బుద్ధగయ రావల్సిందిగా వారు నన్ను ఆహ్వానించడం నాకు ఎంతో సంతోషం కలిగిస్తోంది. మన దేశ మొదటి ప్రధాని పండిట్ నెహ్రూ బుద్ధగయ వెళ్లారు. ప్రపపంచవ్యాప్తంగా ఉన్న పండితులతో కలిసి బుద్ధగయకు వెళ్లే అవకాశం లభిస్తుంది. నాకిది ఎంతో ఆనందం కలిగించే విషయం. నా ప్రియమైన రైతు సోదరసోదరీమణులారా...
నేను ఈరోజు మరోసారి మీకు ప్రత్యేకంగా నా మనసులో మాట తెలియజేయాలనుకుంటున్నాను. ఇంతకుముందు కూడా మన్ కీ బాత్ కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రస్తావించి ఉన్నాను. మీరు వినే ఉంటారు, నేను పార్లమెంట్ లో మాట్లాడినప్పుడు విని ఉంటారు, బహిరంగ సభల్లో నేను మాట్లాడినప్పుడు కూడా ఆలకించి ఉంటారు. మన్ కీ బాత్ కార్యక్రమంలో కూడా విని ఉంటారు. నేను ఎల్లప్పుడూ ఓ విషయం చెబుతూ వస్తున్నాను. భూసేకరణ చట్టంపై నెలకొన్న వివాదం అంశంలో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. రైతుల సంక్షేమం కోసం ఎటువంటి సలహానైనా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాను. ఈ విషయం నేను పదేపదే చెబుతూనే ఉన్నాను. భూసేకరణ చట్టంలో సవరణలు చేయాలనే మాట రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చిందనే విషయం నా సోదరసోదరీమణులకు తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇదొక విజ్ఞాపనలాగా చెప్పారు. గ్రామీణ ప్రాంతాలు, పేద రైతులకు మేలు చేయాలంటే, పంట పొలాల వరకు సాగు నీరందించడానికి కాలువలు ఏర్పాటుచేయాలనీ, గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు స్తంభాలు నెలకొల్పాలనీ, పల్లెటూళ్లలో రహదారులు ఏర్పాటుచేయాలనీ, గ్రామీణ ప్రజలకు గృహ నిర్మాణం చేపట్టాలనీ, పల్లెటూళ్లలోని యువతకు ఉపాధి కోసం అవకాశాలు కల్పించాలంటే చట్టాన్ని అధికార యంత్రాంగం జోక్యం నుంచి తప్పించాలంటే సవరణలు తప్పదనీ అందరికీ అనిపించింది. అయితే, నేను చూసిందేమిటంటే ఎన్నో వదంతులు వ్యాపింపజేశారు. రైతులను భయభ్రాంతులకు గురిచేశారు.
నారైతు సోదరసోదరీమణులారా....
మీరు వదంతులు నమ్మవద్దు. ఎట్టి పరిస్థితుల్లోను భయాందోళనకు గురి కావద్దు. రైతులకు భయం, ఆందోళనలకు గురిచేసే అవకాశాన్ని ఎవ్వరికీ ఇవ్వదల్చుకోలేదు. నాకు ఈ దేశంలో ప్రతి వాణికి ప్రత్యేకత ఉంది. కానీ, రైతుల వాణికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. భూసేకరణపై మేము ఒక ఆర్డినెన్స్ జారీ చేశాము. రేపు ఆగస్టు 31న ఈ ఆర్డినెన్స్ కాలపరిమితి అయిపోతుంది. దాని కాల పరిమితి అయినా ఫర్వాలేదని నేను నిర్ణయించాను. దీని అర్థం ఏమిటంటే - నా ప్రభుత్వం ఏర్పడక ముందు ఉన్న పరిస్థితులే పునరావృతమయ్యాయి. అయితే అందులో ఒక లోటు ఉండిపోయింది. అదేమిటంటే - 13 పాయింట్లు ఎటువంటివి అంటే - వాటిని ఏడాదిలోగా పూర్తి చేయాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఇందుకోసం ఆర్డినెన్స్ తెచ్చాం. కానీ, ఈ వివాదాల వల్ల అది కూడా కుంటుపడింది. ఆర్డినెన్స్ మాత్రం సమాప్తమైపోతుంది. కానీ, దేనివల్లనైతే రైతులకు నేరుగా లాభం కలుగుతుందో, దేనితోనైతే రైతులకు ఆర్థిక ప్రయోజనం నేరుగా ముడిపడి ఉందో అటువంటి 13 పాయింట్లను మేము నిబంధనలకు అనుగుణంగా తీసుకొచ్చి, ఈరోజే వాటిని అమలుచేస్తున్నాం. ఎందుకంటే రైతులకు నష్టం కలగకూడదు, ఆర్థిక ప్రయోజనాలు దెబ్బతినకూడదనే ఉద్దేశంతో ఇంతకుముందు ఉన్న భూసేకరణ చట్టం పరిధిలో లేని 13 పాయింట్లను ఈరోజే పూర్తి చేస్తున్నాం. మాకు ‘’జై జవాన్, జై కిసాన్’’ ఒక నినాదం కాదు. ఇది మా మంత్రమని.... నా రైతు సోదరసోదరీమణులకు హామీ ఇస్తున్నాను. గ్రామాలు, పేద రైతుల సంక్షేమం.... అందుకే ఆగస్టు 15న నేను చెప్పాను - కేవలం వ్యవసాయ శాఖ కాదు, ఇకపై అది వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖగా ఏర్పాటవుతుందని - ఈ నిర్ణయాన్ని మేము చాలా వేగంగా ముందుకు తీసుకెళ్లాం. నా రైతు సోదర సోదరీమణులారా.... ఇప్పుడిక మీరు వదంతులు నమ్మాల్సిన అవసరం లేదు. మీకు భయభ్రాంతులకు గురి చేసే ప్రయత్నం ఎవరూ చేయలేదు. మీరు భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం లేదు.
నేను మీకు మరో విషయం చెప్పాల్సి ఉంది. రెండు రోజుల క్రితం 1965 యుద్ధం ముగిసి 50 ఏళ్లు పూర్తయ్యాయి. 1965 యుద్ధం ప్రస్తావన వచ్చినప్పుడల్లా - లాల్ బహదూర్ శాస్త్రిగారు జ్ఞప్తికి రావడం సాధారణమే. ‘’జై జవాన్, జై కిసాన్’’ అనే మంత్రం కూడా గుర్తుకు రావడం సర్వ సాధారణం. భారతదేశ త్రివర్ణ పతాకాన్ని, దాని గౌరవ ప్రతిష్టలను నిలబెట్టిన అమరవీరులను స్మరించుకోవడం ఎంతో సమంజసం. 65 నాటి యుద్ధ విజయానికి సంబంధించిన వారందరికీ నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. వీరులకు నమస్కరిస్తున్నాను. ఇటువంటి చారిత్రక ఘటనలు మనకు ఎల్లప్పుడూ ప్రేరణ కలిగిస్తుంటాయి. గత వారం నాకు సూఫీ సాంప్రదాయానికి సంబంధించిన వారితో కలిసే అవకాశం దొరికినట్లే - ఓ సంతోషకరమైన అవకాశం కలిగింది. దేశంలోని ప్రఖ్యాత శాస్త్రవేత్తలతో గంటలకొద్దీ మాట్లాడే అవకాశం నాకు లభించింది. వారి మాటలు వినే అవకాశం ఏర్పడింది. విజ్ఞాన శాస్త్ర రంగంలో భారత్ అనేక దేశాల్లో ఎన్నో ఉత్తమ కార్యక్రమాల్లో పాల్గొంటుందనే విషయం తెలుసుకొని ఆనందం కలిగింది. మన శాస్త్రవేత్తలు నిజంగా శ్రేష్ఠమైన పనులు చేస్తున్నారు. వారి పరిశోధనల ఫలితాలను క్షేత్రస్థాయిలో జనసామాన్యానికి అందుబాటులోకి తీసుకురావడం ఎలా అన్నదే మన ముందున్న సవాలు? విజ్ఞాన శాస్త్ర సూత్రాలను వస్తువుల రూపంలో ఎలా మార్పు చేయాలి? ప్రయోగశాలను క్షేత్రస్థాయిలో ఎలా జోడించాలి? దాన్ని ఒక అవకాశంగా ముందుకు తీసుకెళ్లాల్సివసరం ఉంది. చాలా కొత్త విషయాలు కూడా నాకు తెలిశాయి. అవి నాకు చాలా స్ఫూర్తినిచ్చేవీ.... తెలియచెప్పేవీ కూడా. ఇంకా నేను చాలా మంది యువ శాస్త్రవేత్తలను చూశాను. ఎంత ఆశాభావంతో మాట్లాడుతున్నారో... వారి కళ్లలో ఎలాంటి స్వప్నాలు కనిపిస్తున్నాయో, కిందటి మనసులో మాట కార్యక్రమంలో చెప్పాను - విజ్ఙాన శాస్త్రం వైపు విద్యార్థులు ముందడుగు వేయాలనీ, ఎంతో అవకాశం ఉందనీ, ఎన్నో అవకాశాలు ఉన్నాయనీ ఈ సమావేశం తరువాత నాకనిపిస్తోంది. మరోసారి దాన్ని చెప్పదల్చుకున్నాను. నా యువ మిత్రులారా, విజ్ఞన శాస్త్రం పట్ల ఆసక్తి చూపండి. మన విద్యా సంస్థలు కూడా విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రజల నుంచి నాకెన్నో లేఖలు అందుతుంటాయి. ఠాణే నుంచి శ్రీమాన్ పరిమళ్ షా - మై.గవ్.ఇన్ పైన విద్యా సంస్కరణలు గురించి రాశారు. నైపుణ్యాభివృద్ధి గురించి చెప్పారు. తమిళనాడులోని చిదంబరం నుంచి శ్రీమాన్ ప్రకాశ్ త్రిపాఠి ప్రాథమిక విద్యాస్థాయిలో మంచి ఉపాధ్యాయుల గురించి రాశారు. విద్యారంగంలో సంస్కరణల గురించి నొక్కి చెప్పారు. ముఖ్యంగా నా యువ మిత్రులకు ఒక మాట చెప్పాలి. ఏమిటంటే - ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చెప్పాను. కిందిస్థాయి ఉద్యోగాల భర్తీకి ఇంటర్వ్యూలు ఎందుకని? మరి ఇంటర్వ్యూ కోసం పిలుపు వస్తే ప్రతి పేద కుటుంబానికి, వితంతువైన తల్లికి సిఫార్సు ఎక్కడ దొరుకుతుంది? ఎవరి సహాయంతో ఉద్యోగం వస్తుంది? ఎవరిని పట్టుకోవాలి? ఎటువంటి పదాలు ప్రయోగిస్తున్నారో తెలియడం లేదు. అందరూ పరుగులు పెడుతున్నారు. కిందిస్థాయిలో అవినీతి ఇది కూడా కారణం కావచ్చు. నేను ఆగస్టు 15న చెప్పాను. ఈ ఇంటర్వ్యూల సంప్రదాయం నుంచి ఒక స్థాయి కింది ఉద్యోగాలకు విముక్తి ఉండాలని కోరుకుంటున్నానని.... నాకు సంతోషమేస్తుంది - ఇప్పటికి 15 రోజులైంది. ఇంత తక్కువ సమయంలో ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు వెళుతుందని చెప్పడానికి ఆనందంగా ఉంది. ఆదేశాలు వెళుతున్నాయి. ఇంటర్వ్యూల వలయం నుంచి చిన్నచిన్న ఉద్యోగాలకు విముక్తి కల్పించే నిర్ణయం ఇప్పుడు దాదాపు అమలవుతుంది. సిఫార్సుల కోసం పేదవాళ్ళు పరుగులు పెట్టాల్సిన అవసరం రాదు. వారు దోపిడీకి గురయ్యే పరిస్థితి ఉండదు. అవినీతి ఉండదు. ఈ మధ్య ప్రపంచంలోని పలు దేశాల అతిథులు భారత్‌కు వచ్చారు. ఆరోగ్యం గురించి మాట్లాడటానికి ముఖ్యంగా మాతా మరణాలు, శిశు మరణాల రేటును తగ్గించేందుకు దాని కార్యాచరణ ప్రణాళిక కోసం ‘కాల్ టు యాక్షన్’ కార్యక్రమం కింద ప్రపంచంలోని 24 దేశాలు కలిసి భారత్ వేదికగా సమాలోచనలు జరిపారు. అమెరికా వెలుపల వేరే దేశంలో ఈ సమావేశం ఇదే మొదటిసారి. ఇప్పటికీ మన దేశంలో ప్రతి ఏడాది దాదాపు 50 వేల మంది గర్భిణీలు, 13 లక్షల మంది శిశువులు ప్రసూతి సమయంలోనే లేదా ప్రసవం అయిన వెంటనే మరణిస్తున్నారు. ఇది బాధాకరం, భయానకమైన విషయం. ఈ పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది. అంతర్ రాష్ట్ర స్థాయిలో భారత్‌కు ప్రశంసలు కూడా అందాయి. అయినప్పటికీ ఈ సంఖ్య తక్కువేమీ కాదు. మనం పోలియో నుంచి విముక్తి పొందినట్లే - మాతా, శిశు మరణాల విషయంలో టెటనస్, వాటి నుంచి కూడా విముక్తి పొందాము. ప్రపంచం కూడా దీన్ని గుర్తించింది. కానీ, ఇప్పటికీ మన గర్భిణీలను రక్షించాల్సి ఉంది. మన నవజాత శిశువులను రక్షించుకోవాల్సి ఉంది. సోదరసోదరీమణులారా.... ఈ మధ్య డెంగ్యూ గురించి వార్తలు వస్తున్నాయి. డెంగ్యూ వ్యాధి ప్రమాదకరమైనదన్నది నిజమే. కానీ దాని బారి నుంచి తప్పించుకోవడం చాలా సులభం. నేను స్వచ్ఛ భారత్ గురించి ఏదైతే చెబుతున్నానో దాంతో అది నేరుగా ముడిపడి ఉంది. టీవీలో మనం ప్రకటనలు చూస్తుంటాము. కానీ, మన దృష్టి దాని మీద ఉండదు. వార్తా పత్రికల్లో ప్రకటన ఉంటుంది. కానీ, మనం వాటిని పట్టించుకోం. ఇంట్లో చిన్నచిన్న విషయాల్లో పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటిని ఉంచటానికి పద్ధతులు ఉన్నాయి. ఈ విషయాలపై విస్తృతంగా ప్రజా అవగాహన కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినా మన దృష్టి వాటిపైకి వెళ్లదు. ఇంకా అప్పుడప్పుడు అనిపిస్తుంది. మనం చాలా మంచి ఇంట్లో ఉంటున్నామనీ, ఎంతో శుభ్రంగా ఉంటున్నామనీ... కానీ మన దగ్గరే ఎక్కడో నీరు నిల్వ ఉండొచ్చనీ... దాంతో డెంగ్యూకు ఆహ్వానం పలుకుతున్నామనీ - మీ అందరినీ కోరేది ఒక్కటే. చావును మరీ ఇంత సులువైందిగా మనం చేయవద్దు. జీవితం ఎంతో విలువైంది. తాగునీటి మీద దృష్టి పెట్టకపోవడం, స్వచ్ఛతపై ఉదాసీన వైఖరి ఇవి మృత్యువుకు కారణాలైతే - అది సరైంది కాదు. దేశవ్యాప్తంగా 514 కేంద్రాల్లో ఉచితంగా డెంగ్యూ నిర్ధారణ పరీక్షలు అందుబాటులో ఉన్నాయి. సరైన సమయంలో పరీక్ష చేయించుకోవడం - ఆరోగ్య పరిరక్షణకు ఎంతో అవసరం. ఇందులో మీ అందరి సహకారం ఎంతో అవసరం. పరిశుభ్రతకు, స్వచ్ఛతకు చాలా ప్రాధాన్యతనివ్వాలి. ఇప్పుడైతే రక్షాబంధన్ నుంచి దీపావళి వరకు ఓ రకంగా మన దేశంలో పండగలే పండుగలు. మన ప్రతి పండుగను పరిశుభ్రతతో ఎందుకు ముడిపెట్టకూడదు. మీరు చూడండి - శుభ్రత మన స్వభావంగా మారిపోతుంది.
నా ప్రియమైన దేశవాసులారా...
మీకు ఈరోజు ఒక శుభవార్త వినిపించాలి. నేను ఎల్లప్పుడూ చెబుతుంటాను. ఇప్పుడు మనకు దేశం కోసం మరణించే సౌభాగ్యం దొరకదని, కానీ దేశం కోసం జీవించే భాగ్యమైతే దొరకనే దొరికింది. మన దేశానికి చెందిన ఇద్దరు యువకులు - వారిద్దరూ సోదరులు - అది కూడా మన మహారాష్ట్రలోని నాసిక్‌కు చెందినవాళ్లు... డాక్టర్ హితేంద్ర మహాజన్, డాక్టర్ మహేంద్ర మహాజన్. కానీ, వాళ్ల గుండెల్లో మన గిరిజనులకు సేవ చేయాలన్న భావన బలంగా ఉంది. ఈ ఇద్దరు సోదరులు భారతదేశ గౌరవాన్ని పెంచారు. అమెరికాలో ‘రేస్ ఎక్రాస్ అమెరికా’ పేరిట ఓ సైకిల్ రేస్ జరుగుతుంది. చాలా కష్టతరమైంది. సుమారు 4 వేల 800 కిలోమీటర్ల మేర కొనసాగే సైకిల్ రేస్ ఇది. ఈ ఏడాది జరిగిన ఈ సైకిల్ రేస్‌లో ఈ సోదరులిద్దరూ విజయం సాధించారు. భారత ప్రతిష్టను పెంచారు. ఈ సోదరిలిద్దరికీ నేను హార్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎంతో అభినందిస్తున్నాను. కానీ, అన్నింటికంటే నాకు ఎక్కువ సంతోషం కలిగించిన విషయం ఏమిటంటే - ఆదివాసుల కోసం ఏదైనా చేయాలనే సంకల్పంతో వారు పని చేస్తుంటారు. చూడండి - దేశాన్ని ముందుకు నడిపించడానికి ఒక్కొక్కరూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారో - ఇలాంటివి వినగానే గర్వపడతాం. అప్పుడప్పుడు అవగాహన లోపం కారణంగా మనం మన యువతకు అన్యాయం చేస్తుంటాం.
పాత తరానికి ఎప్పుడూ అనిపిస్తూ ఉంటుంది. కొత్త తరానికి ఏమీ తెలియదని. నేను అనుకుంటాను - ఈ ఒరవడి శతాబ్దాలుగా వస్తోంది. యువతతో నా అనుభవం వేరుగా ఉంది. అప్పుడప్పుడు యువకులతో మాట్లాడుతుంటే - వారి నుంచి ఎంతో కొంత నేర్చుకొనే అవకాశం లభిస్తుంది. నేను అలాంటి చాలా మంది యువకులను కలిశాను. వీళ్లేమంటారంటే – ‘సండే ఆన్ సైకిల్’ అనే వ్రతం చేపట్టామని చెప్తుంటారు. కొందరేమంటారంటే - వారంలో ఒకరోజు సైకిల్ డేగా పాటిస్తున్నామని చెప్తుంటారు. మా ఆరోగ్యానికి ఇది మంచిదని అంటుంటారు. పర్యావరణానికి కూడా మంచిది. మన యువతరం పట్ల నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఈ మధ్య మన దేశంలో కూడా చాలా నగరాల్లో సైకిళ్లు నడుపుతున్నారు. సైకిల్‌ను ప్రోత్సహించేవాళ్లు పెద్ద సంఖ్యలో ఉన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించడానికి, ఆరోగ్య సంరక్షణకు ఇది మంచి ప్రయత్నం. ఇప్పుడు నా దేశానికి చెందిన ఇద్దరు యువకులు అమెరికాలో జెండా ఎగరేస్తే - భారతీయ యువకులు ఏ దిశలో ఆలోచిస్తున్నారో - దాన్ని ప్రస్తావించడం నాకు ఆనందంగా ఉంది. నేను ఈరోజు ప్రత్యేకంగా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. నాకు చాలా సంతోషం కలుగుతోంది. బాబా సాహెబ్ అంబేద్కర్.... ముంబయిలో ‘హిందూ మిల్’ స్థలాన్ని ఆయన స్మారకంగా ఏర్పాటుచేయడానికి.... చాలాకాలంగా ఈ వ్యవహారం పెండింగ్‌లో ఉంది. మహారాష్ట్ర కొత్త ప్రభుత్వం ఈ పనిని పూర్తి చేసింది. మరిప్పుడు అక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరిట భవ్యమైన, దివ్యమైన, స్ఫూర్తిదాయకమైన స్మారకం నిర్మిస్తారు. దీంతో దళిత, పీడిత, తాడిత, వంచిత వర్గాల కోసం పనిచేసే ప్రేరణను మనకు కలుగుతూ ఉంటుంది. దీంతోపాటు లండన్‌లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నివసించిన చోట.... ‘10, కింగ్ హెన్రీ రోడ్’ - ఆ భవనాన్ని కూడా ఇప్పుడు కొనుగోలు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రయాణించే భారతీయులు ఎవరైనా ఇప్పుడు లండన్ వెళితే బాబాసాహెబ్ అంబేద్కర్....స్మారకం.... ఇప్పుడు మహారాష్ట్ర ప్రభుత్వం అక్కడ నిర్మించబోతోంది... మనకొక ప్రేరణనిచ్చే ప్రదేశంగా మారుతుంది. బాబాసాహెబ్ అంబేద్కర్‌ను గౌరవిస్తూ చేపట్టిన ఈ రెండు ప్రయత్నాలకుగాను మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసిస్తున్నాను, మెచ్చుకుంటున్నాను, అభినందిస్తున్నాను. నా ప్రియ సోదరసోదరీమణులారా....
మళ్లీ వచ్చే మన్ కీ బాత్ (మనసులో మాట) కంటే ముందే మీ అభిప్రాయాలను నాకు తప్పకుండా తెలియజేయండి. ఎందుకంటే - ప్రజాస్వామ్యం ప్రజల భాగస్వామ్యంతోనే మనగలుగుతుందని నా నమ్మకం. జనుల భాగస్వామ్యంతోనే నడుస్తుంది. భుజం భుజం కలిసినప్పుడే దేశం ముందుకు వెళ్లగలుగుతుంది. మీకందరికీ శుభాకాంక్షలు. ధన్యవాదాలు.
My Dear Countrymen, Namaskar!
This year the rains have started on a good note. This will definitely prove beneficial to our farmer brothers and sisters in sowing of kharif crops. I am very pleased to share an immensely good news with you all. We have always faced scarcity of pulses and oilseeds in our country. Poor people require pulses and some amount of oil to prepare vegetables for their food. The good news for me is that there has been an increase of approximately 50% in the production of pulses and an increase of around 33% in the production of oilseeds. I would especially like to congratulate and compliment all my farmer brothers and sisters for this achievement.
My dear countrymen, 26th July is marked as Kargil Vijay Diwas in the history of our country. The intensity with which the farmers are connected with their land, our soldiers too are connected with the land in the same degree. During the Kargil war, each one of our soldier proved mightier than hundreds of soldiers of our enemies. I would like to salute all our brave soldiers who thwarted the attempts by our enemies without caring for their lives. Kargil war was not limited to just our borders, but each of our cities, villages contributed in this war. This war was fought by those mothers and sisters whose sons and brothers were fighting against the enemies at the border. This war was also fought by the daughters of our country, who were newly married and their henna were still fresh on their hands. Also, by the proud fathers, who saw themselves as soldiers, seeing their sons fighting for the country, and also by that infant who had not even learnt to walk catching his father’s fingers. It is because of these unmatchable sacrifices that our country is proudly standing on its feet in front of the entire world. Hence, I would like to salute all these valiant warriors on this occasion of Kargil Vijay Diwas.
There is another reason why I consider 26th July quite important because MyGov.in was launched a few months after our government was formed. Our pledge was to promote citizen participation in democracy and connect every citizen in the development work. And today I am pleased to share this after one year that nearly two crore people have visited MyGov website. We have received comments from five and a half lac people and I am extremely glad to mention that more than fifty thousand people took out time from their precious schedule to apply their mind and provide their suggestions on PMO applications as they considered this work important. And we have received quite significant suggestions. One of the suggestions sent from Mr. Akhilesh Vajpayee from Kanpur is to provide separate quota to the disabled for booking tickets on IRCTC website. It is quite unfair that the disabled citizens have to go through the same tiring procedure and buy tickets at the railway station. Though this is a very minor issue but the government never took note of it or thought about the same previously. But on the suggestion of our brother Akhilesh Vajpayee, our government looked into this suggestion seriously and we have implemented this facility in our system for our disabled brothers and sisters. We are receiving quite positive suggestions on MyGov, it is helping in getting assistance in creating logos, tag-lines and formulating policies by yourselves. We are experiencing fresh air in the administrative system. We are experiencing a new sense of consciousness. I am even receiving suggestion on MyGov that what should be my speech on 15th of August.
We have received quite a few suggestions from Suchitra Raghavachari from Chennai in this regard. She has suggested me to speak on the topics like Save our Daughters, Educate a Girl Child, Clean Ganges, Swachh Bharat. With this I got an idea and I am requesting you all to send suggestions about what should be the topics for my 15th August speech. You can send in your suggestions through MyGov, letters to Radio or write letters to the PM’s office. Look, I believe that this will be a great initiative to include people’s suggestion in framing my speech for 15th August. I believe that you will send your good suggestions.
I would like to talk about an issue which is a matter of great concern. I neither want to sermonize nor I am trying to find an escape route towards my responsibilities pertaining to state government, central government or units of local self-government institutions.
Two days ago a visual of an accident in Delhi caught my attention, wherein the victim on scooter was fighting for his life for ten minutes post the accident. He did not receive any help from the passers-by. In general also I have noticed that I have been receiving suggestions to speak on road safety and make the people aware of this. Be it Hoshakote Akshay from Bengaluru, Ameya Joshi from Pune or Prasanna Kakunje from Mudbidri, Karnataka - all these all people have written to me… there are many other names which I am not being able to mention and have raised their concerns. I agree that whatever you have put forth is valid.
My heart shivers when I look at the statistics of accidents. We are witnessing an accident every minute in our country. Due to these road accidents we are witnessing one death every four minutes in our country. It is a matter of huge concern that out of these deaths, nearly one third of the victims comprise the youth ranging from 15 to 25 years of age group, and such death shakes the very foundation of an entire family. The government system will continue to work towards this but I would like to request all the parents to make their children aware of all the Safety Rules pertaining to driving a two-wheeler or a four-wheeler – the families should encourage discussion of road safety at home and create an atmosphere about the same to promote road safety. We have seen few lines written at the back of auto-rickshaws, “Papa, come home early” and after reading it we are so touched by it. And therefore I say that the government has taken a lot of new initiatives in this regard, be it the initiative of education on Road Safety, initiative related to road engineering or of enforcement of road safety laws and the discussion on Emergency Care to be provided post accidents. We are going to implement Road Transport and Safety Bill to adopt these safety measures in our country. In the coming days, we are also planning to take many important measures for implementing National Road Safety Policy and Road Safety Action Plan.
We have undertaken another project called Cashless Treatment in Gurgaon, Jaipur and Vadodara to Mumbai, Ranchi, Rangaon and Mundiya national highway and it will be further extended. The Cashless Treatment refers to the policy for the first fifty hours post-accident – one need worry if one has money or not, who will pay the bills, leaving all this worry – one has to give primary importance to the road accident victim who is injured so that he is treated and provided the best hospital facilities at the earliest. We have started a toll-free number 1033 for providing information about incidents across the country and ambulance service but all these are services are for post accidents. One must strive to avoid accidents first but it is also important for us to see from the perspective that each and every soul, each and every life is precious.
Sometimes I say that the government employees to be Karma Yogis or selfless workers. I recalled a few incidents in the last few days which I liked and hence would like to share with you. Sometimes people get tired of their continuous jobs. In the initial few years the attitude is “okay, I get my salary so I will work”. However, I came across an incident of a railway department a few days ago, wherein a railway TTE Vijay Biswal from Nagpur division who is gifted with painting prowess could have has chosen to showcase his skills related to any field but he continues to work with the railways and paints various scenes related to railways only. Through this he gets an inner satisfaction for his job and also enjoys his hobby at the same time. Using his example, we can learn how to bring more life to our own jobs. Vijay Biswal has shown us how we can connect our jobs with our hobbies, interests or skills. Who knows, Vijay Biswal’s work may get recognised by his paintings across the nation in the near future.
I have come to know about a very inspiring work started by the entire team of government officials in Harda district, Madhya Pradesh. These bunch of officials with their entire team have started such a work which has touched me immensely and I really liked it – and the work they have started is ‘Operation Malyuddh’, and upon hearing this you will feel that this subject will go in a certain direction. But the key focus of this operation is to give a new direction to Swachh Bharat Abhiyaan. They are working on ‘Brother Number One’ operation in which the best brother has to gift one toilet to his sister. On the occasion of Raksha Bandhan, they are influencing all the brothers to gift toilet to their sisters, so that all the mothers and sisters of the district avoid going to toilet in the open. This operation has given a new meaning to Raksha Bandhan and I would like to congratulate the entire government team of Harda district for this initiative.
I came across a news a few days back and these small news really gives me immense pleasure and I would like to share the same with you. There exists a small village called Keshla in Rajnandgaon, Chhattisgarh. The inhabitants of this village from last few months tried and lead a campaign for building toilets in the village. Now, nobody from this village has to go to toilet in the open. After the completion of this campaign, the entire village celebrated this accomplishment just like a mega festival. These finest examples coming up to me show how our society is bringing change in human values and human mind and how the citizens of this country are taking the nation forward.
Bhavesh Deka from Guwahati has written to me on the North-East related issues and problems. I must say that North-East people are quite active. I really appreciate that they write about a lot of issues. I would like to tell them with great pleasure that we have a separate ministry for North-Eastern region. During the government of Atal Bihari Vajpayee as our Prime Minister, a DONER Ministry called “Development of North-East Region” was formed. After our government was formed, the DONER Department took an important decision of not staying in Delhi and working from centre for the North-East regions? Instead it was decided to send the government officials and their team on a seven days camp to North-East states like Nagaland, Arunachal Pradesh, Tripura, Assam and Sikkim. These officials would visit the districts, villages and meet the local government officials and talk to people’s representatives and the citizens of those regions. They will listen to their problems and direct the government in taking appropriate measures in solving those problems. This initiative will bring a fruitful result in the near future. The officials who will visit these states would realize the beauty of these states and will feel very determined to work for the development of these states and to fix the problems of these states. When they return with this pledge, they can easily understand the problems of these states even when they reach Delhi. This is a great initiative to go far-off from Delhi to East, and this act is called “Act East Policy”.
My dear countrymen, we are extremely delighted and proud of the “Mars Mission” success. India’s PSLV C-28 has launched five UK satellites, which are the heaviest satellites launched by India till date. Such news remain in the flashlight for few moments and are gone. We often do not remember these achievements for a long time. I am often worried by this thought that we speak to the youth of our nation and ask about their dream job, only one out of 100 would express their interest in becoming a scientist. Youth is losing their interest in science, which is a matter of great concern.
Science and Technology is a type of DNA for development. The youth of our country should dream about becoming a scientist and imbibe interests in the field of research and innovation. Their capabilities should be monitored and must be assisted in the right direction to achieve success in this field. Ministry of Human Resource Development, Govt. of India has initiated a National Discovery Campaign. It was inaugurated by India’s ex-President Dr. A.P.J Abdul Kalam. As a part of this campaign, IIT, NIT, Central and State Universities being their mentor and guide are going to educate and motivate the aspiring students to choose the right path in their career. I always press upon the IAS officers of our government, who have reached such heights with their vast intellect and education that they should visit the nearby schools and colleges and share their knowledge for just two to four hours in a week. Your experience and intellect would certainly help the new generation to some extent.
We have raised a very big issue regarding the supply of 24 hours electricity in the villages of our country. This work is difficult but it must be done. We have auspiciously inaugurated this scheme and the villages will get a supply of 24 hours electricity in the coming years. The students of the villages should not be affected with the shortage of electricity during their exams. There should be enough electricity for starting a small industry. Today, the villagers have to go to other villagers for charging their mobile phones. The villages should be provided with all the facilities that are available in the cities. For this purpose, we have launched “Deendayal Upadhyaya Gram Jyoti Programme”. I am aware that this country is quite vast and we have to reach the villages and far off corners of the country. We have to run for the development of the Poor. We will achieve this goal and it is already in progress. We will certainly achieve this. Today, through Mann ki Baat, I felt like expressing these myriad of thoughts.
In a way, in our country the months of August and September are the months for celebration of festivals. There are lots of festivals in these months. My greetings to all of you for the same. Please do send your suggestions for 15th August. Your opinions will really help me.
Thank you very much to you all!
Namaskar, My Dear Countrymen!
Last time in Mann ki Baat I had requested you to send me memorable pictures if you go out on a vacation anywhere in India and if you happen to find them, kindly post them under the ‘Incredible India’ hashtag. When Isaid that, I had never imagined that it would get such an immense response. Lakhs of people have posted photos on Twitter, Facebook and Instagram. I can say that India is full of diversities and I was able to witness so many magnificent scenes in those pictures; be it of architecture, art, nature, waterfalls, mountains, rivers or seas. Government of India had never thought that in terms of tourism you all could contribute in such a massive way. I liked some pictures so much that I re-tweeted them. And as I understand, if some one would not have posted the picture of Belum caves in Andhra Pradesh many people would have never come to know that something like that exists in our country. Madhya Pradesh’s Orcha Fort is another example of that. We assume Rajasthan to be a state with scarcity of water, but when someone sends a photo of Menal waterfall, it is a matter of great surprise. Really, a tremendous work has been done. We will promote and also continue doing such work and the entire world will watch it, entire nation will watch it and our new generation will also watch it.
My beloved countrymen, though you have elected me as the Prime Minister of the country but at times, the human in me shuns all posts and prestige associated with it and submerges oneself within it. I can say that 21st June, the International Yoga Day affected me in the same manner. At that time, when I proposed the International Yoga Day, it was just an idea. But the scene that was witnessed on 21st June was such that wherever the sun dawned, wherever its rays reached, there was not a single landmass wherein it was not welcomed by way of Yoga. We can say with conviction that the sun never sets in the world of Yoga practitioners.
The way Yoga was received and was welcomed with open arms around the world, there would not be any Indian who would not be proud of it. I too got delighted. And when the people of France chose River Seine and Eiffel Tower in which they take pride to do Yoga, they gave an equal status to it as River Siene and Eifel Tower. In New York people did yoga at Times Square. If we think about Sydney, Australia then the picture of Opera House comes to our mind. The citizens of Australia gave equal respect to yoga and did yoga at the Opera House. Whether it is North America, Silicon Valley or Milan’s Duomo Cathedral it is a matter of great pride for us. On 21st June when I saw Mr. Ban Ki-Moon, UN Secretary General doing yoga at UN Headquarters, I was really delighted. Similarly, UN Peace Keeping Force did a spectacular display of Yoga. In India, our soldiers too were doing yoga in Siachen on white sheet of snow and on sea too, wherever our naval ships are posted, the yoga program was being carried out by Indian Navy. Delhi made it to the Guinness Book of World Records . Rajpath turned into the Yogpath that day. I am thankful to India and the rest of the world and can say that the International Yoga Day was not for namesake. It seemed as if that from every corner of the world, there was a new inquisitiveness, new joy, new hope and new connection.
Few days back, when I tweeted a photo of a Vietnamese child doing yoga, it was such a sweet photo that it got a lot of attention from the entire world. Everybody, be it men-women, old-young, village-city, developed or developing countries, everybody got connected with it. Yoga in true terms, became the core reason to connect the entire world. I do not know how the intellectual class, elites of the world would analyze this event. But I can feel and every Indian can experience that the whole world is very curious to know more about India. Curiosity towards India has increased. The world wants to know about the values, the rituals and the heritage of India. It is our responsibility that without any artificiality we share our legacy and introduce ourselves to the world. We can only do this when we ourselves are proud of our traditions.
At times, we are so familiar with our values that we don’t feel there is anything new in them but we ourselves do not know that our family values are considered to be a big thing in the entire world. Why don’t we familiarize the outside world with our family values? The world would be very surprised to know about them. I am sure, they would be intrigued. There are many things that our forefathers have given to us which are the best and the entire world also has the right on those things. The success of International Yoga day has brought in a new responsibility along with it. It is our responsibility that we gift supreme Yoga teachers to the world. It is our responsibility that we can see the entire tradition of Yoga on one platform from the Universe.
I request the youngsters, especially the IT professionals, that all of you should come together to create an Online Yoga Activity program. We all should come to know about all the Yoga organizations, Yoga teachers and all the necessary information about the Yoga from this online program. One database must be prepared and I believe you can do it. One must start from somewhere and it would surely turn out to be a great power. I have seen and learnt from the perspective of recent occurrences that a government that works and the government that is action-oriented can bring in results if the targets are set. We should not forget that the only voice that could be heard one year ago was that nothing happens, nothing happens, nothing happens.
Can you imagine that there is a department under Government named Ayush. Nobody has paid attention towards this department. The only mention Ayush in some corner of the newspaper being a small department is once in 2 to 5 years. But it led on the International Yoga Day. It was this small department that organized this event in the entire world. Therefore, this is an example that if there is an aim then even a small department can do a supreme job.
In the last few days, the world saw how we saved people from Yemen to Afghanistan. In a few hours-, we reached Nepal and helped people over there. When people wanted to open an bank account under the Government’s new scheme of Jan Dhan Yojana, how the people working in bank helped them to do so and connected millions of Indians to the bank.
On 15th August last year, when I appealed from the Red Fort for toilets in schools, I had said that by next 15th August we have to complete this task. The work which could not be completed in last 60 years was promised to be completed by the end of one year. The promise was really daring. Almost four and half lakh toilets were to be built but I can say it with satisfaction that though 15th August is still far off, the work of constructing toilets by the people is on the verge of completion.
This means that the Government, people and Government workers, all want to work for the country. If we pledge to work in an unselfish manner “Welfare for All, Happiness for All” then the Government will also work efficiently. The people who are a part of the government will also work efficiently and the people of the nation will welcome them with open arms.
I have experienced this. This is the true strength that drives a nation forward. Last month, we had launched three Insurance schemes. I had launched them from Kolkata and it has received such a commendable response in such a short span of time. There have been very few steps which have been taken from the perspective of social security but by way of these three schemes we are taking a big leap. In such a short time span more than 10 crore people have become a part of these schemes but we have to take it further. I have a thought which I want to put forth before you. Rakshabandhan comes in the month of August. Can’t we start a massive movement before this festival and make every women, be it our mother or sister, a part of this, thereby giving benefit to them under this Insurance program. Be it a sister who is a domestic help in your home or your own sister why can’t we gift them a Rs. 12 or Rs. 330 scheme on Rakshabandhan for their entire life. This can be a big gift for a sister from their brother. Why can’t we set the eve of rakshabandhan as a target and in a number of 2 crore, 5 crore, 7 crore and 10 crore … try to reach the sisters so that they can reap the benefit of this scheme. Let’s come together and try to work together towards the completion of this pledge.
Whenever I hold a Mann ki Baat session, many people send me suggestions. This time many people have suggested that I say something about the monsoons. Yogesh Dandekar from Nagpur, Harshvardhan ji from Mysore, Praveen Nadkarni ji, Divyanshu Gupta ji have all asked me to say something about the monsoon in this session of Mann ki Baat. They have sent in some really good suggestions. And this is a season of happiness. And each one of us, whatever the age is… definitely tempted to enjoy the first showers of the monsoon. I am sure, you too might be enjoying the rains with bhajiyas, pakoras, corn and a hot cup of tea. Just as the rays of the sun give us life, similarly rainfall provide us life and sustenance. Every drop of water is precious. As a responsible citizen and as a member of the society, we will have to cultivate the habit of conserving every drop of water. It should be our pledge that water from the villages stays in the villages and water for the cities remains available for them. If the rain water does not flow away, it goes into the earth , then the aquifers get recharged and the year long water woes get resolved. Rain water harvesting is not a new concept. It is being practiced over the centuries. Be it check dams, watershed development, small lakes or the small ponds in fields, we need to save the precious waters everywhere. I always tell people, that if you go to Porbander, the birth place of Mahatma Gandhi, you will be able to see a two hundred year old underground water tank which got directly recharged with the rain water. You can still see it. If you ever go there, do visit the place. And you will find that even after two hundred years it is still functional, brimming with water and the water does not even stagnate. Porbander is a coastal city, so potable water was collected through the rains for the entire year. Even in those times such a lot of care was taken. We can too do the same. This should in fact become a mass movement. Each and every village should have the facilities for rain water harvesting.
Similarly, we find greenery so pleasing to our eyes. We all like greener surroundings. Gardens and trees bring in an element of freshness in our lives. This monsoon season, there should be mass plant sowing campaigns conducted by youth and social organizations. And I can take a leaf from my personal experience and offer you a suggestion which has been very successful. This is an intensely rural technology. Whenever you sow a plant, place an earthen pot near it. You just need to fill it once or twice in a month. You will see how fast the plant grows into a lush green tree. I have even been telling the farmers to plant trees on the boundaries of their fields instead of putting barricades. These will become your biggest asset in the long run.
It is true that rains are enjoyable and bring in a lot of fun at the same time. It is also true that rains also bring in many diseases. Doctors get to see so many patients that they hardly get the time to breathe. We all know that rains cause many water borne diseases. Increased moisture in the environment leads to bacterial growth and so, keeping the environment clean becomes important. Cleanliness is very important in monsoons. It is often requested to consume safe drinking water. Most of the people boil and drink water during this season. It has its own benefits. And this is true that the more care we take, healthier we would be. We need monsoons and we need water but we also need to stay healthy.
Dear citizens, we have recently launched three schemes for the people in the cities. We have around 500 small cities. Our policy is ‘Waste to Wealth’. We can earn from waste too. Garbage can be recycled to make fertilizers, bricks and even electricity. Contaminated water can be recycled to make it clent and be used for irrigation in the fields. We have to take this movement forward.
In the Amrut scheme, we have launched a massive campaign and taken up initiatives to improve the quality of life in our cities. We should become a country which is able to match the living standards of the world. We should have smart cities, comparable to world standards. And yet at the same time, the poorest of poor person should have an accommodation of his own and that too complete with water, electricity, sanitation and access to a school. In 2022 when India celebrates its 75 years of Independence, we wish that every Indian has a house of his own. Keeping all this in mind, we have launched three major schemes. I am positive that these schemes will bring about a qualitative difference in the lives of the urban people.
I am myself connected to you via the social media. I keep getting many new suggestions and new ideas and also good and bad information about our government. And sometimes it so happens that a small comment from an individual in some remote village in India conveys something that just touches our hearts. You are aware that the government has launched “Beti Bachao Beti Padhao” programme. But you can’t imagine the force that is lent to the programme when a village or a society adopts it. A few days back a Sarpanch in a small remote village of Haryana, Sri Sunil Jaglan ji launched ‘Selfie with Daughter’ campaign. Such an environment was created that every father wished to click a selfie of himself with his daughter and post it on the social media.
I liked this idea, and that too for a special reason. In Haryana, the number of girls in comparison to boys is dismally low. Around another 100 districts in the country have a similar dismal situation of skewed sex ratio. But it is the worst in Haryana. In that very same Haryana, if a Sarpanch of a small indistinct village lends this meaning to the “Beti Bachao Beti Padhao” programme, then I certainly get overwhelmed. It makes me so happy and it gives me a new hope and I do express my happiness. I request you all to take a selfie with your daughter and post it on #selfie with daughter. And do not forget to post a tagline around the theme of “Beti Bachao Beti Padhao” with it, whatever be the language it can be in Hindi, English, your mother tongue or your native language. And I promise to re-tweet the most inspirational tagline with you and your daughter’s selfie. We can turn “Beti Bachao Beti Padhao” into a mass movement. I urge you all to take forward the programme launched by Sri Sunil in Bibipur village of Haryana. I request you all to post on #selfie with daughter. Lets us all enjoy the rising honour and prestige of our daughters and see how joyful this entire experience of “Beti Bachao Beti Padhao” becomes. Let us all rid ourselves of this bad name that we have for not respecting our daughters.
So my best wishes to you for the coming monsoon season. May all of you enjoy the rains. Make our country clean and green. And remember, the International Yoga day was not a single day initiative. Continue practicing Yoga, then see what difference it makes to you and your life. And I say this from my experience. Please take this forward. Make Yoga a part of your life. And that initiative regarding Incredible India, do keep posting a picture of whichever part of the country you go to. The country and the world will awaken to our diversity. I felt that the handicrafts did not receive due attention. Do make it a point to post the handicrafts of the local region you visit. There are so many things that people around you might be making, the poor as well as the skilled might be creating. Do keep posting their pictures regularly. We have to expand our reach to the world and make India known to the world. We have an easy medium at our disposal and so we will all do it.
My dear countrymen, that is all for today. I shall meet you again in the next edition of Mann ki Baat. Many people expect me to announce some huge schemes during this programme. But I am working day and night towards those. This is my time for some light conversation with you all. This gives me immense pleasure.
Thank You Very Much!
मेरे प्यारे देशवासियो, पिछली बार जब मैंने आपसे मन की बात की थी, तब भूकंप की भयंकर घटना ने मुझे बहुत विचलित कर दिया था। मन बात करना नहीं चाहता था फिर भी मन की बात की थी। आज जब मैं मन की बात कर रहा हूँ, तो चारों तरफ भयंकर गर्म हवा, गर्मी, परेशानियां उसकी ख़बरें आ रही हैं। मेरी आप सब से प्रार्थना है कि इस गर्मी के समय हम अपना तो ख़याल रखें... हमें हर कोई कहता होगा बहुत ज़्यादा पानी पियें,शरीर को ढक कर के रखें... लेकिन मैं आप से कहता हूँ, हम अपने अगल-बगल में पशु-पक्षी की भी दरकार करें। ये अवसर होता है परिवार में बच्चों को एक काम दिया जाये कि वो घर के बाहर किसी बर्तन में पक्षियों को पीने के लिए पानी रखें, और ये भी देखें वो गर्म ना हो जाये। आप देखना परिवार में बच्चों के अच्छे संस्कार हो जायेंगें। और इस भयंकर गर्मी में पशु-पक्षियों की भी रक्षा हो जाएगी।
ये मौसम एक तरफ़ गर्मी का भी है, तो कहीं ख़ुशी कहीं ग़म का भी है। एग्ज़ाम देने के बाद जब तक नतीजे नहीं आते तब तक मन चैन से नहीं बैठता है। अब सी.बी.एस.ई., अलग-अलग बोर्ड एग्ज़ाम और दूसरे एग्ज़ाम पास करने वाले विद्यार्थी मित्रों को अपने नतीजे मिल गये हैं। मैं उन सब को बधाई देता हूँ। बहुत बहुत बधाई। मेरे मन की बात की सार्थकता मुझे उस बात से लगी कि जब मुझे कई विद्यार्थियों ने ये जानकारी दी, नतीजे आने के बाद कि एग्ज़ाम के पहले आपके मन की बात में जो कुछ भी सुना था, एग्ज़ाम के समय मैंने उसका पूरी तरह पालन किया था और उससे मुझे लाभ मिला। ख़ैर, दोस्तो आपने मुझे ये लिखा मुझे अच्छा लगा। लेकिन आपकी सफलता का कारण कोई मेरी एक मन की बात नहीं है... आपकी सफलता का कारण आपने साल भर कड़ी मेहनत की है, पूरे परिवार ने आपके साथ जुड़ करके इस मेहनत में हिस्सेदारी की है। आपके स्कूल,आपके टीचर, हर किसी ने प्रयास किया है। लेकिन आपने अपने आप को हर किसी की अपेक्षा के अनुरूप ढाला है। मन की बात, परीक्षा में जाते-जाते समय जो टिप मिलती है न, वो प्रकार की थी। लेकिन मुझे आनंद इस बात का आया कि हाँ, आज मन की बात का कैसा उपयोग है, कितनी सार्थकता है। मुझे ख़ुशी हुई। मैं जब कह रहा हूँ कहीं ग़म, कहीं ख़ुशी... बहुत सारे मित्र हैं जो बहुत ही अच्छे मार्क्स से पास हुए होंगे। कुछ मेरे युवा मित्र पास तो हुए होंगे, लेकिन हो सकता है मार्क्स कम आये होंगे। और कुछ ऐसे भी होंगे कि जो विफल हो गये होंगे। जो उत्तीर्ण हुए हैं उनके लिए मेरा इतना ही सुझाव है कि आप उस मोड़ पर हैं जहाँ से आप अपने करियर का रास्ता चुन रहे हैं। अब आपको तय करना है आगे का रास्ता कौन सा होगा। और वो भी, किस प्रकार के आगे भी इच्छा का मार्ग आप चुनते हैं उसपर निर्भर करेगा। आम तौर पर ज़्यादातर विद्यार्थियों को पता भी नहीं होता है क्या पढ़ना है, क्यों पढ़ना है, कहाँ जाना है, लक्ष्य क्या है। ज़्यादातर अपने सराउंन्डिंग में जो बातें होती हैं, मित्रों में, परिवारों में, यार-दोस्तों में, या अपने माँ-बाप की जो कामनायें रहती हैं, उसके आस-पास निर्णय होते हैं। अब जगत बहुत बड़ा हो चुका है। विषयों की भी सीमायें नहीं हैं, अवसरों की भी सीमायें नहीं हैं। आप ज़रा साहस के साथ आपकी रूचि, प्रकृति, प्रवृत्ति के हिसाब से रास्ता चुनिए। प्रचलित मार्गों पर ही जाकर के अपने को खींचते क्यों हो? कोशिश कीजिये। और आप ख़ुद को जानिए और जानकर के आपके भीतर जो उत्तम चीज़ें हैं, उसको सँवारने का अवसर मिले, ऐसी पढ़ाई के क्षेत्र क्यों न चुनें? लेकिन कभी ये भी सोचना चाहिये, कि मैं जो कुछ भी बनूँगा, जो कुछ भी सीखूंगा, मेरे देश के लिए उसमें काम आये ऐसा क्या होगा?
बहुत सी जगहें ऐसी हैं... आपको हैरानी होगी... विश्व में जितने म्यूज़ियम बनते हैं, उसकी तुलना में भारत में म्यूज़ियम बहुत कम बनते हैं। और कभी कभी इस म्यूज़ियम के लिए योग्य व्यक्तियों को ढूंढना भी बड़ा मुश्किल हो जाता है। क्योंकि परंपरागत रूप से बहुत पॉपुलर क्षेत्र नहीं है। ख़ैर, मैं कोई, कोई एक बात पर आपको खींचना नहीं चाहता हूँ। लेकिन, कहने का तात्पर्य है कि देश को उत्तम शिक्षकों की ज़रूरत है तो उत्तम सैनिकों की भी ज़रूरत है, उत्तम वैज्ञानिकों की ज़रूरत है तो उत्तम कलाकार और संगीतकारों की भी आवश्यकता है। खेल-कूद कितना बड़ा क्षेत्र है, और खिलाडियों के सिवाय भी खेल कूद जगत के लिए कितने उत्तम ह्यूमन रिसोर्स की आवश्यकता होती है। यानि इतने सारे क्षेत्र हैं, इतनी विविधताओं से भरा हुआ विश्व है। हम ज़रूर प्रयास करें, साहस करें। आपकी शक्ति, आपका सामर्थ्य, आपके सपने देश के सपनों से भी मेलजोल वाले होने चाहिये। ये मौक़ा है आपको अपनी राह चुनने का।
जो विफल हुए हैं, उनसे मैं यही कहूँगा कि ज़िन्दगी में सफलता विफलता स्वाभाविक है। जो विफलता को एक अवसर मानता है, वो सफलता का शिलान्यास भी करता है। जो विफलता से खुद को विफल बना देता है, वो कभी जीवन में सफल नहीं होता है। हम विफलता से भी बहुत कुछ सीख सकते हैं। और कभी हम ये क्यों न मानें, कि आज की आप की विफलता आपको पहचानने का एक अवसर भी बन सकती है, आपकी शक्तियों को जानने का अवसर बन सकती है? और हो सकता है कि आप अपनी शक्तियों को जान करके, अपनी ऊर्जा को जान करके एक नया रास्ता भी चुन लें।
मुझे हमारे देश के पूर्व राष्ट्रपति श्रीमान ए.पी.जे. अब्दुल कलाम जी की याद आती है। उन्होंने अपनी किताब‘माई जर्नी – ट्रांस्फोर्मिंग ड्रीम्स इनटू एक्शन’, उसमें अपने जीवन का एक प्रसंग लिखा है। उन्होंने कहा है कि मुझे पायलट बनने की इच्छा थी, बहुत सपना था, मैं पायलट बनूँ। लेकिन जब मैं पायलट बनने गया तो मैं फ़ेल हो गया, मैं विफल हो गया, नापास हो गया। अब आप देखिये, उनका नापास होना, उनका विफल होना भी कितना बड़ा अवसर बन गया। वो देश के महान वैज्ञानिक बन गये। राष्ट्रपति बने। और देश की आण्विक शक्ति के लिए उनका बहुत बड़ा योगदान रहा। और इसलिये मैं कहता हूँ दोस्तो, कि विफलता के बोझ में दबना मत। विफलता भी एक अवसर होती है। विफलता को ऐसे मत जाने दीजिये। विफलता को भी पकड़कर रखिये। ढूंढिए। विफलता के बीच भी आशा का अवसर समाहित होता है। और मेरी ख़ास आग्रहपूर्वक विनती है मेरे इन नौजवान दोस्तों को, और ख़ास करके उनके परिवारजनों को, कि बेटा अगर विफल हो गया तो माहौल ऐसा मत बनाइये की वो ज़िन्दगी में ही सारी आशाएं खो दे। कभी-कभी संतान की विफलता माँ-बाप के सपनों के साथ जुड़ जाती है और उसमें संकट पैदा हो जाते हैं। ऐसा नहीं होना चाहिये। विफलता को पचाने की ताक़त भी तो ज़िन्दगी जीने की ताक़त देती है। मैं फिर एक बार सभी मेरे सफल युवा मित्रों को शुभकामनाएं देता हूँ। और विफल मित्रों को अवसर ढूँढने का मौक़ा मिला है, इसलिए भी मैं इसे शुभकामनाएं ही देता हूँ। आगे बढ़ने का, विश्वास जगाने का प्रयास कीजिये।
पिछली मन की बात और आज जब मैं आपके बीच बात कर रहा हूँ, इस बीच बहुत सारी बातें हो गईं। मेरी सरकार का एक साल हुआ, पूरे देश ने उसका बारीकी से विश्लेषण किया, आलोचना की और बहुत सारे लोगों ने हमें डिस्टिंक्शन मार्क्स भी दे दिए। वैसे लोकतंत्र में ये मंथन बहुत आवश्यक होता है, पक्ष-विपक्ष आवश्यक होता है। क्या कमियां रहीं, उसको भी जानना बहुत ज़रूरी होता है। क्या अच्छाइयां रहीं, उसका भी अपना एक लाभ होता है।
लेकिन मेरे लिए इससे भी ज़्यादा गत महीने की दो बातें मेरे मन को आनंद देती हैं। हमारे देश में ग़रीबों के लिए कुछ न कुछ करने की मेरे दिल में हमेशा एक तड़प रहती है। नई-नई चीज़ें सोचता हूँ, सुझाव आये तो उसको स्वीकार करता हूँ। हमने गत मास प्रधानमंत्री सुरक्षा बीमा योजना, प्रधानमंत्री जीवन ज्योति बीमा योजना, अटल पेंशन योजना - सामाजिक सुरक्षा की तीन योजनाओं को लॉन्च किया। उन योजनाओं को अभी तो बीस दिन नहीं हुए हैं, लेकिन आज मैं गर्व के साथ कहता हूँ... शायद ही हमारे देश में, सरकार पर भरोसा करके, सरकार की योजनाओं पर भरोसा करके, इतनी बड़ी मात्रा में सामान्य मानवी उससे जुड़ जाये... मुझे ये बताते हुए ख़ुशी होती है कि सिर्फ़ बीस दिन के अल्प समय में आठ करोड़, बावन लाख से अधिक लोगों ने इन योजनाओं में अपना नामांकन करवा दिया, योजनाओं में शरीक हो गये। सामाजिक सुरक्षा की दिशा में ये हमारा बहुत अहम क़दम है। और उसका बहुत लाभ आने वाले दिनों में मिलने वाला है।
जिनके पास अब तक ये बात न पहुँची हो उनसे मेरा आग्रह है कि आप फ़ायदा उठाइये। कोई सोच सकता है क्या, महीने का एक रुपया, बारह महीने के सिर्फ़ बारह रूपये, और आप को सुरक्षा बीमा योजना मिल जाये। जीवन ज्योति बीमा योजना - रोज़ का एक रूपये से भी कम, यानि साल का तीन सौ तीस रूपये। मैं इसीलिए कहता हूँ कि ग़रीबों को औरों पर आश्रित न रहना पड़े। ग़रीब स्वयं सशक्त बने। उस दिशा में हम एक के बाद एक क़दम उठा रहे हैं। और मैं तो एक ऐसी फौज बनाना चाहता हूँ, और फौज भी मैं ग़रीबों में से ही चुनना चाहता हूँ। और ग़रीबों में से बनी हुई मेरी ये फौज, ग़रीबी के खिलाफ लड़ाई लड़ेगी, ग़रीबी को परास्त करेगी। और देश में कई वर्षों का हमारे सर पर ये बोझ है, उस ग़रीबी से मुक्ति पाने का हम निरंतर प्रयास करते रहेंगे और सफलता पायेंगे।
दूसरी एक महत्वपूर्ण बात जिससे मुझे आनंद आ रहा है, वो है किसान टीवी चैनल । वैसे तो देश में टीवी चैनेलों की भरमार है, क्या नहीं है, कार्टून की भी चैनलें चलती हैं, स्पोर्ट्स की चैनल चलती हैं, न्यूज़ की चलती है, एंटरटेनमेंट की चलती हैं। बहुत सारी चलती हैं। लेकिन मेरे लिए किसान चैनल महत्वपूर्ण इसलिए है कि मैं इससे भविष्य को बहुत भली भांति देख पाता हूँ।
मेरी दृष्टि में किसान चैनल एक खेत खलियान वाली ओपन यूनिवर्सिटी है। और ऐसी चैनल है, जिसका विद्यार्थी भी किसान है, और जिसका शिक्षक भी किसान है। उत्तम अनुभवों से सीखना, परम्परागत कृषि से आधुनिक कृषि की तरफ आगे बढ़ना, छोटे-छोटे ज़मीन के टुकड़े बचे हैं। परिवार बड़े होते गए, ज़मीन का हिस्सा छोटा होता गया, और तब हमारी ज़मीन की उत्पादकता कैसे बढ़े, फसल में किस प्रकार से परिवर्तन लाया जाए - इन बातों को सीखना-समझना ज़रूरी है। अब तो मौसम को भी पहले से जाना जा सकता है। ये सारी बातें लेकर के,ये टी० वी० चैनल काम करने वाली है और मेरे किसान भाइयों-बहिनों, इसमें हर जिले में किसान मोनिटरिंग की व्यवस्था की गयी है। आप उसको संपर्क ज़रूर करें।
मेरे मछुवारे भाई-बहनों को भी मैं कहना चाहूँगा, मछली पकड़ने के काम में जुड़े हुए लोग, उनके लिए भी इस किसान चैनल में बहुत कुछ है, पशुपालन भारत के ग्रामीण जीवन का परम्परागत काम है और कृषि में एक प्रकार से सहायक होने वाला क्षेत्र है, लेकिन दुनिया का अगर हिसाब देखें, तो दुनिया में पशुओं की संख्या की तुलना में जितना दूध उत्पादन होता है, भारत उसमें बहुत पीछे है। पशुओ की संख्या की तुलना में जितना दूध उत्पादन होना चाहिए, उतना हमारे देश में नहीं होता है। प्रति पशु अधिक दूध उत्पादन कैसे हो, पशु की देखभाल कैसे हो, उसका लालन-पालन कैसे हो, उसका खान पान क्या हो - परम्परागत रूप से तो हम बहुत कुछ करते हैं,लेकिन वैज्ञानिक तौर तरीकों से आगे बढ़ना बहुत ज़रूरी है और तभी जा करके कृषि के साथ पशुपालन भी आर्थिक रूप से हमें मजबूती दे सकता है, किसान को मजबूती दे सकता है, पशु पालक को मजबूती दे सकता है। हम किस प्रकार से इस क्षेत्र में आगे बढें, किस प्रकार से हम सफल हो, उस दिशा में वैज्ञानिक मार्गदर्शन आपको मिले।
मेरे प्यारे देश वासियों! याद है 21 जून? वैसे हमारे इस भू-भाग में 21 जून को इसलिए याद रखा जाता है कि ये सबसे लंबा दिवस होता है। लेकिन 21 जून अब विश्व के लिए एक नई पहचान बन गया है। गत सितम्बर महीने में यूनाइटेड नेशन्स में संबोधन करते हुए मैंने एक विषय रखा था और एक प्रस्ताव रखा था कि 21 जून को अंतरराष्ट्रीय योग-दिवस के रूप में मनाना चाहिए। और सारे विश्व को अचरज हो गया, आप को भी अचरज होगा, सौ दिन के भीतर भीतर एक सौ सतत्तर देशो के समर्थन से ये प्रस्ताव पारित हो गया, इस प्रकार के प्रस्ताव ऐसा यूनाइटेड नेशन्स के इतिहास में, सबसे ज्यादा देशों का समर्थन मिला, सबसे कम समय में प्रस्ताव पारित हुआ, और विश्व के सभी भू-भाग, इसमें शरीक हुए, किसी भी भारतीय के लिए, ये बहुत बड़ी गौरवपूर्ण घटना है।
लेकिन अब जिम्मेवारी हमारी बनती है। क्या कभी सोचा था हमने कि योग विश्व को भी जोड़ने का एक माध्यम बन सकता है? वसुधैव कुटुम्बकम की हमारे पूर्वजों ने जो कल्पना की थी, उसमें योग एक कैटलिटिक एजेंट के रूप में विश्व को जोड़ने का माध्यम बन रहा है। कितने बड़े गर्व की, ख़ुशी की बात है। लेकिन इसकी ताक़त तो तब बनेगी जब हम सब बहुत बड़ी मात्रा में योग के सही स्वरुप को, योग की सही शक्ति को, विश्व के सामने प्रस्तुत करें। योग दिल और दिमाग को जोड़ता है, योग रोगमुक्ति का भी माध्यम है, तो योग भोगमुक्ति का भी माध्यम है और अब तो में देख रहा हूँ, योग शरीर मन बुद्धि को ही जोड़ने का काम करे, उससे आगे विश्व को भी जोड़ने का काम कर सकता है।
हम क्यों न इसके एम्बेसेडर बने! हम क्यों न इस मानव कल्याण के लिए काम आने वाली, इस महत्वपूर्ण विद्या को सहज उपलब्ध कराएं। हिन्दुस्तान के हर कोने में 21 जून को योग दिवस मनाया जाए। आपके रिश्तेदार दुनिया के किसी भी हिस्से में रहते हों, आपके मित्र परिवार जन कहीं रहते हो, आप उनको भी टेलीफ़ोन करके बताएं कि वे भी वहाँ लोगो को इकट्ठा करके योग दिवस मनायें। अगर उनको योग का कोई ज्ञान नहीं है तो कोई किताब लेकर के, लेकिन पढ़कर के भी सबको समझाए कि योग क्या होता है। एक पत्र पढ़ लें, लेकिन मैं मानता हूँ कि हमने योग दिवस को सचमुच में विश्व कल्याण के लिए एक महत्वपूर्ण क़दम के रूप में, मानव जाति के कल्याण के रूप में और तनाव से ज़िन्दगी से गुजर रहा मानव समूह, कठिनाइयों के बीच हताश निराश बैठे हुए मानव को, नई चेतना, ऊर्जा देने का सामर्थ योग में है।
मैं चाहूँगा कि विश्व ने जिसको स्वीकार किया है, विश्व ने जिसे सम्मानित किया है, विश्व को भारत ने जिसे दिया है, ये योग हम सबके लिए गर्व का विषय बनना चाहिए। अभी तीन सप्ताह बाकी है आप ज़रूर प्रयास करें,ज़रूर जुड़ें और औरों को भी जोडें, ये मैं आग्रह करूंगा।
मैं एक बात और कहना चाहूँगा खास करके मेरे सेना के जवानों को, जो आज देश की सुरक्षा में जुटे हुए उनको भी और जो आज सेना से निवृत्त हो करके अपना जीवन यापन कर रहे, देश के लिए त्याग तपस्या करने वाले जवानों को, और मैं ये बात एक प्रधानमन्त्री के तौर पर नहीं कर रहा हूँ। मेरे भीतर का इंसान, दिल की सच्चाई से, मन की गहराई से, मेरे देश के सैनिकों से मैं आज बात करना चाहता हूँ।
वन-रैंक, वन-पेंशन, क्या ये सच्चाई नहीं हैं कि चालीस साल से सवाल उलझा हुआ है? क्या ये सच्चाई नहीं हैं कि इसके पूर्व की सभी सरकारों ने इसकी बातें की, किया कुछ नहीं? मैं आपको विश्वास दिलाता हूँ। मैंने निवृत्त सेना के जवानों के बीच में वादा किया है कि मेरी सरकार वन-रैंक, वन-पेंशन लागू करेगी। हम जिम्मेवारी से हटते नहीं हैं और सरकार बनने के बाद, भिन्न-भिन्न विभाग इस पर काम भी कर रहे हैं। मैं जितना मानता था उतना सरल विषय नहीं हैं, पेचीदा है, और चालीस साल से उसमें समस्याओं को जोड़ा गया है। मैंने इसको सरल बनाने की दिशा में, सर्वस्वीकृत बनाने की दिशा में, सरकार में बैठे हुए सबको रास्ते खोज़ने पर लगाया हुआ है। पल-पल की ख़बरें मीडिया में देना ज़रूरी नहीं होता है। इसकी कोई रनिंग कमेंट्री नहीं होती है। मैं आपको विश्वास दिलाता हूँ यही सरकार, मैं फिर से कहता हूँ - यही सरकार आपका वन-रैंक, वन-पेंशन का मसला, सोल्यूशन लाकर के रहेगी - और जिस विचारधारा में पलकर हम आए हैं , जिन आदर्शो को लेकर हम आगे बढ़ें हैं, उसमें आपके जीवन का महत्व बहुत है।
मेरे लिए आपके जीवन के साथ जुड़ना आपकी चिंता करना ये सिर्फ़ न कोई सरकारी कार्यक्रम है, न ही कोई राजनितिक कार्यक्रम है, मेरे राष्ट्रभक्ति का ही प्रकटीकरण है। मैं फिर एक बार मेरे देश के सभी सेना के जवानों को आग्रह करूंगा कि राजनैतिक रोटी सेंकने वाले लोग चालीस साल तक आपके साथ खेल खेलते रहे हैं। मुझे वो मार्ग मंज़ूर नहीं है, और न ही मैं कोई ऐसे क़दम उठाना चाहता हूँ, जो समस्याओं को जटिल बना दे। आप मुझ पर भरोसा रखिये, बाक़ी जिनको बातें उछालनी होंगी, विवाद करने होंगे, अपनी राजनीति करनी होगी, उनको मुबारक। मुझे देश के लिए जीने मरने वालों के लिए जो कर सकता हूँ करना है - ये ही मेरे इरादे हैं, और मुझे विश्वास है कि मेरे मन की बात जिसमें सिवाय सच्चाई के कुछ नहीं है, आपके दिलों तक पहुंचेगी। चालीस साल तक आपने धैर्य रखा है - मुझे कुछ समय दीजिये, काम करने का अवसर दीजिये, और हम मिल बैठकर के समस्याओं का समाधान करेंगे। ये मैं फिर से एक बार देशवासियों को विश्वास देता हूँ।
छुट्टियों के दिनों में सब लोग कहीं न कहीं तो गए होंगे। भारत के अलग-अलग कोनों में गए होंगे। हो सकता है कुछ लोग अब जाने का कार्यक्रम बनाते होंगे। स्वाभाविक है ‘सीईंग इज़ बिलीविंग’ - जब हम भ्रमण करते हैं,कभी रिश्तेदारों के घर जाते हैं, कहीं पर्यटन के स्थान पर पहुंचते हैं। दुनिया को समझना, देखने का अलग अवसर मिलता है। जिसने अपने गाँव का तालाब देखा है, और पहली बार जब वह समुन्दर देखता है, तो पता नहीं वो मन के भाव कैसे होते हैं, वो वर्णन ही नहीं कर सकता है कि अपने गाँव वापस जाकर बता ही नहीं सकता है कि समुन्दर कितना बड़ा होता है। देखने से एक अलग अनुभूति होती है।
आप छुट्टियों के दिनों में अपने यार दोस्तों के साथ, परिवार के साथ कहीं न कहीं ज़रूर गए होंगे, या जाने वाले होंगे। मुझे मालूम नहीं है आप जब भ्रमण करने जाते हैं, तब डायरी लिखने की आदत है कि नहीं है। लिखनी चाहिए, अनुभवों को लिखना चाहिए, नए-नए लोगों से मिलतें हैं तो उनकी बातें सुनकर के लिखना चाहिए, जो चीज़ें देखी हैं, उसका वर्णन लिखना चाहिए, एक प्रकार से अन्दर, अपने भीतर उसको समावेश कर लेना चाहिए। ऐसी सरसरी नज़र से देखकर के आगे चले जाएं ऐसा नहीं करना चाहिए। क्योंकि ये भ्रमण अपने आप में एक शिक्षा है। हर किसी को हिमालय में जाने का अवसर नहीं मिलता है, लेकिन जिन लोगों ने हिमालय का भ्रमण किया है और किताबें लिखी हैं उनको पढ़ोगे तो पता चलेगा कि क्या आनन्ददायक यात्राओं का वर्णन उन्होंने किया है।
मैं ये तो नहीं कहता हूँ कि आप लेखक बनें! लेकिन भ्रमण की ख़ातिर भ्रमण ऐसा न होते हुए हम उसमें से कुछ सीखने का प्रयास करें, इस देश को समझने का प्रयास करें, देश को जानने का प्रयास करें, उसकी विविधताओं को समझें। वहां के खान पान कों, पहनावे, बोलचाल, रीतिरिवाज, उनके सपने, उनकी आकांक्षाएँ,उनकी कठिनाइयाँ, इतना बड़ा विशाल देश है, पूरे देश को जानना समझना है - एक जनम कम पड़ जाता है,आप ज़रूर कहीं न कहीं गए होंगे, लेकिन मेरी एक इच्छा है, इस बार आप यात्रा में गए होंगे या जाने वाले होंगे। क्या आप अपने अनुभव को मेरे साथ शेयर कर सकते हैं क्या? सचमुच में मुझे आनंद आएगा। मैं आपसे आग्रह करता हूँ कि आप इन्क्रेडिबल इंडिया हैश टैग, इसके साथ मुझे अपनी फोटो, अपने अनुभव ज़रूर भेजिए और उसमें से कुछ चीज़ें जो मुझे पसंद आएंगी मैं उसे आगे औरों के साथ शेयर करूँगा।
देखें तो सही आपके अनुभवों को, मैं भी अनुभव करूँ, आपने जो देखा है, मैं उसको मैं दूर बैठकर के देखूं। जिस प्रकार से आप समुद्रतट पर जा करके अकेले जा कर टहल सकते हैं, मैं तो नहीं कर पाता अभी, लेकिन मैं चाहूँगा आपके अनुभव जानना और आपके उत्तम अनुभवों को, मैं सबके साथ शेयर करूँगा।
अच्छा लगा आज एक बार फिर गर्मी की याद दिला देता हूँ, मैं यही चाहूँगा कि आप अपने को संभालिए, बीमार मत होना, गर्मी से अपने आपको बचाने के रास्ते होतें हैं, लेकिन उन पशु पक्षियों का भी ख़याल करना। यही मन की बात आज बहुत हो गयी, ऐसे मन में जो विचार आते गए, मैं बोलता गया। अगली बार फिर मिलूँगा, फिर बाते करूँगा, आपको बहुत बहुत शुभकामनाएं, बहुत बहुत धन्यवाद।
मेरे प्यारे देशवासियो,
नमस्कार,
मन की बात करने का मन नहीं हो रहा था आज। बोझ अनुभव कर रहा हूँ, कुछ व्यथित सा मन है। पिछले महीने जब बात कर रहा था आपसे, तो ओले गिरने की खबरें, बेमौसमी बरसात, किसानों की तबाही। अभी कुछ दिन पहले बिहार में अचानक तेज हवा चली। काफी लोग मारे गए। काफी कुछ नुकसान हुआ। और शनिवार को भयंकर भूकंप ने पूरे विश्व को हिला दिया है। ऐसा लगता है मानो प्राकृतिक आपदा का सिलसिला चल पड़ा है। नेपाल में भयंकर भूकंप की आपदा। हिंदुस्तान में भी भूकंप ने अलग-अलग राज्यों में कई लोगों की जान ली है। संपत्ति का भी नुकसान किया है। लेकिन नेपाल का नुकसान बहुत भयंकर है।
मैंने 2001, 26 जनवरी, कच्छ के भूकंप को निकट से देखा है। ये आपदा कितनी भयानक होती है, उसकी मैं कल्पना भली-भांति कर सकता हूँ। नेपाल पर क्या बीतती होगी, उन परिवारों पर क्या बीतती होगी, उसकी मैं कल्पना कर सकता हूँ।
लेकिन मेरे प्यारे नेपाल के भाइयो-बहनो, हिन्दुस्तान आपके दुःख में आपके साथ है। तत्काल मदद के लिए चाहे हिंदुस्तान के जिस कोने में मुसीबत आयी है वहां भी, और नेपाल में भी सहाय पहुंचाना प्रारंभ कर दिया है। सबसे पहला काम है रेस्क्यू ऑपरेशन, लोगों को बचाना। अभी भी मलबे में दबे हुए कुछ लोग जीवित होंगे, उनको जिन्दा निकालना हैं। एक्सपर्ट लोगों की टीम भेजी है, साथ में, इस काम के लिए जिनको विशेष रूप से ट्रेन किया गया है ऐसे स्निफ़र डॉग्स को भी भेजा गया है। स्निफर डॉग्स ढूंढ पाते हैं कि कहीं मलबे के नीचे कोई इंसान जिन्दा हो। कोशिश हमारी पूरी रहेगी अधिकतम लोगों को जिन्दा बचाएं। रेस्क्यू ऑपरेशन के बाद रिलीफ का काम भी चलाना है। रिहैबिलिटेशन का काम भी तो बहुत लम्बा चलेगा।
लेकिन मानवता की अपनी एक ताकत होती है। सवा-सौ करोड़ देश वासियों के लिए नेपाल अपना है। उन लोगों का दुःख भी हमारा दुःख है। भारत पूरी कोशिश करेगा इस आपदा के समय हर नेपाली के आंसू भी पोंछेंगे, उनका हाथ भी पकड़ेंगे, उनको साथ भी देंगे। पिछले दिनों यमन में, हमारे हजारों भारतीय भाई बहन फंसे हुए थे। युद्ध की भयंकर विभीषिका के बीच, बम बन्दूक के तनाव के बीच, गोलाबारी के बीच भारतीयों को निकालना, जीवित निकालना, एक बहुत बड़ा कठिन काम था। लेकिन हम कर पाए। इतना ही नहीं, एक सप्ताह की उम्र की एक बच्ची को जब बचा करके लाये तो ऐसा लग रहा था कि आखिर मानवता की भी कितनी बड़ी ताकत होती है। बम-बन्दूक की वर्षा चलती हो, मौत का साया हो, और एक सप्ताह की बच्ची अपनी जिन्दगी बचा सके तब एक मन को संतोष होता है।
मैं पिछले दिनों विदेश में जहाँ भी गया, एक बात के लिए बहुत बधाइयाँ मिली, और वो था यमन में हमने दुनिया के करीब 48 देशों के नागरिकों को बचाया था। चाहे अमेरिका हो, यू.के. हो, फ्रांस हो, रशिया हो, जर्मनी हो, जापान हो, हर देश के नागरिक को हमने मदद की थी। और उसके कारण दुनिया में भारत का ये “सेवा परमो धर्मः”, इसकी अनुभूति विश्व ने की है। हमारा विदेश मंत्रालय, हमारी वायु सेना, हमारी नौसेना इतने धैर्य के साथ, इतनी जिम्मेवारी के साथ, इस काम को किया है, दुनिया में इसकी अमिट छाप रहेगी आने वाले दिनों में, ऐसा मैं विश्वास करता हूँ। और मुझे खुशी है कि कोई भी नुकसान के बिना, सब लोग बचकर के बाहर आये। वैसे भी भारत का एक गुण, भारत के संस्कार बहुत पुराने हैं।
अभी मैं जब फ्रांस गया था तो फ्रांस में, मैं प्रथम विश्व युद्ध के एक स्मारक पर गया था। उसका एक कारण भी था, कि प्रथम विश्व युद्ध की शताब्दी तो है, लेकिन साथ-साथ भारत की पराक्रम का भी वो शताब्दी वर्ष हैI भारत के वीरों की बलिदानी की शताब्दी का वर्ष है और “सेवा परमो-धर्मः” इस आदर्श को कैसे चरितार्थ करता रहा हमारा देश , उसकी भी शताब्दी का यह वर्ष है, मैं यह इसलिए कह रहा हूँ कि 1914 में और 1918 तक प्रथम विश्व युद्ध चला और बहुत कम लोगों को मालूम होगा करीब-करीब 15 लाख भारतीय सैनिकों ने इस युद्ध में अपनी जान की बाजी लगा दी थी और भारत के जवान अपने लिए नहीं मर रहे थेI हिंदुस्तान को, किसी देश को कब्जा नहीं करना था, न हिन्दुस्तान को किसी की जमीन लेनी थी लेकिन भारतीयों ने एक अदभुत पराक्रम करके दिखाया थाI बहुत कम लोगों को मालूम होगा इस प्रथम विश्व युद्ध में हमारे करीब-करीब 74 हजार जवानों ने शहादत की थी, ये भी गर्व की बात है कि इस पर करीब 9 हजार 2 सौ हमारे सैनिकों को गैलेंट्री अवार्ड से डेकोरेट किया गया थाI इतना ही नहीं, 11 ऐसे पराक्रमी लोग थे जिनको सर्वश्रेष्ठ सम्मान विक्टोरिया क्रॉस मिला थाI खासकर कि फ्रांस में विश्व युद्ध के दरमियान मार्च 1915 में करीब 4 हजार 7 सौ हमारे हिनदुस्तानियों ने बलिदान दिया था। उनके सम्मान में फ्रांस ने वहां एक स्मारक बनाया है। मैं वहाँ नमन करने गया था, हमारे पूर्वजों के पराक्रम के प्रति श्रध्दा व्यक्त करने गया था।
ये सारी घटनायें हम देखें तो हम दुनिया को कह सकते हैं कि ये देश ऐसा है जो दुनिया की शांति के लिए, दुनिया के सुख के लिए, विश्व के कल्याण के लिए सोचता है। कुछ न कुछ करता है और ज़रूरत पड़े तो जान की बाज़ी भी लगा देता है। यूनाइटेड नेशन्स में भी पीसकीपिंग फ़ोर्स में सर्वाधिक योगदान देने वालों में भारत का भी नाम प्रथम पंक्ति में है। यही तो हम लोगों के लिए गर्व की बात है।
पिछले दिनों दो महत्वपूर्ण काम करने का मुझे अवसर मिला। हम पूज्य बाबा साहेब अम्बेडकर की 125 वीं जयन्ती का वर्ष मना रहे हैं। कई वर्षों से मुंबई में उनके स्मारक बनाने का जमीन का विवाद चल रहा था। मुझे आज इस बात का संतोष है कि भारत सरकार ने वो जमीन बाबा साहेब अम्बेडकर के स्मारक बनाने के लिए देने का निर्णय कर लिया। उसी प्रकार से दिल्ली में बाबा साहेब अम्बेडकर के नाम से एक इंटरनेशनल सेंटर बने, पूरा विश्व इस मनीषी को जाने, उनके विचारों को जाने, उनके काम को जाने। ये भी वर्षों से लटका पड़ा विषय था, इसको भी पूरा किया, शिलान्यास किया, और 20 साल से जो काम नहीं हुआ था वो 20 महीनों में पूरा करने का संकल्प किया। और साथ-साथ मेरे मन में एक विचार भी आया है और हम लगे हैं, आज भी हमारे देश में कुछ परिवार हैं जिनको सर पे मैला ढ़ोने के लिए मजबूर होना पड़ता है।
क्या हमें शोभा देता है कि आज भी हमारे देश में कुछ परिवारों को सर पर मैला ढोना पड़े? मैंने सरकार में बड़े आग्रह से कहा है कि बाबा साहेब अम्बेडकर जी के पुण्य स्मरण करते हुए 125 वीं जयन्ती के वर्ष में, हम इस कलंक से मुक्ति पाएं। अब हमारे देश में किसी गरीब को सर पर मैला ढोना पड़े, ये परिस्थति हम सहन नहीं करेंगे। समाज का भी साथ चाहिये। सरकार ने भी अपना दायित्व निभाना चाहिये। मुझे जनता का भी सहयोग चाहिये, इस काम को हमें करना है।
बाबा साहेब अम्बेडकर जीवन भर शिक्षित बनो ये कहते रहते थे। आज भी हमारे कई दलित, पीड़ित, शोषित, वंचित समाज में, ख़ास करके बेटियों में, शिक्षा अभी पहुँची नहीं है। बाबा साहेब अम्बेडकर के 125 वीं जयन्ती के पर्व पर, हम भी संकल्प करें। हमारे गाँव में, नगर में, मोहल्ले में गरीब से गरीब की बेटी या बेटा, अनपढ़ न रहे। सरकार अपना कर्त्तव्य करे, समाज का उसमें साथ मिले तो हम जरुर संतोष की अनुभूति करते हैं। मुझे एक आनंद की बात शेयर करने का मन करता है और एक पीड़ा भी बताने का मन करता है।
मुझे इस बात का गर्व होता है कि भारत की दो बेटियों ने देश के नाम को रौशन किया। एक बेटी साईना नेहवाल बैडमिंटन में दुनिया में नंबर एक बनी, और दूसरी बेटी सानिया मिर्जा टेनिस डबल्स में दुनिया में नंबर एक बनी। दोनों को बधाई, और देश की सारी बेटियों को भी बधाई। गर्व होता है अपनों के पुरुषार्थ और पराक्रम को लेकर के। लेकिन कभी-कभी हम भी आपा खो बैठते हैं। जब क्रिकेट का वर्ल्ड कप चल रहा था और सेमी-फाइनल में हम ऑस्ट्रेलिया से हार गए, कुछ लोगों ने हमारे खिलाड़ियों के लिए जिस प्रकार के शब्दों का प्रयोग किया, जो व्यवहार किया, मेरे देशवासियो, ये अच्छा नहीं है। ऐसा कैसा खेल हो जिसमें कभी पराजय ही न हो अरे जय और पराजय तो जिन्दगी के हिस्से होते हैं। अगर हमारे देश के खिलाड़ी कभी हार गए हैं तो संकट की घड़ी में उनका हौसला बुलंद करना चाहिये। उनका नया विश्वास पैदा करने का माहौल बनाना चाहिये। मुझे विश्वास है आगे से हम पराजय से भी सीखेंगे और देश के सम्मान के साथ जो बातें जुड़ी हुई हैं, उसमें पल भर में ही संतुलन खो करके, क्रिया-प्रतिक्रिया में नहीं उलझ जायेंगे। और मुझे कभी-कभी चिंता हो रही है। मैं जब कभी देखता हूँ कि कहीं अकस्मात् हो गया, तो भीड़ इकट्ठी होती है और गाड़ी को जला देती है। और हम टीवी पर इन चीजों को देखते भी हैं। एक्सीडेंट नहीं होना चाहिये। सरकार ने भी हर प्रकार की कोशिश करनी चाहिये। लेकिन मेरे देशवासियो बताइये कि इस प्रकार से गुस्सा प्रकट करके हम ट्रक को जला दें, गाड़ी को जला दें.... मरा हुआ तो वापस आता नहीं है। क्या हम अपने मन के भावों को संतुलित रखके कानून को कानून का काम नहीं करने दे सकते हैं? सोचना चाहिये।
खैर, आज मेरा मन इन घटनाओं के कारण बड़ा व्यथित है, ख़ास करके प्राकृतिक आपदाओं के कारण, लेकिन इसके बीच भी धैर्य के साथ, आत्मविश्वास के साथ देश को भी आगे ले जायेंगे, इस देश का कोई भी व्यक्ति...दलित हो, पीड़ित हो, शोषित हो, वंचित हो, आदिवासी हो, गाँव का हो, गरीब हो, किसान हो, छोटा व्यापारी हो, कोई भी हो, हर एक के कल्याण के मार्ग पर, हम संकल्प के साथ आगे बढ़ते रहेंगे।
विद्यार्थियों की परीक्षायें पूर्ण हुई हैं, ख़ास कर के 10 वीं और 12 वीं के विद्यार्थियों ने छुट्टी मनाने के कार्यक्रम बनाए होंगे, मेरी आप सबको शुभकामनाएं हैं। आपका वेकेशन बहुत ही अच्छा रहे, जीवन में कुछ नया सीखने का, नया जानने का अवसर मिले, और साल भर आपने मेहनत की है तो कुछ पल परिवार के साथ उमंग और उत्साह के साथ बीते यही मेरी शुभकामना है।
आप सबको मेरा नमस्कार।
धन्यवाद।
मेरे प्यारे किसान भाइयो और बहनो, आप सबको नमस्कार!
ये मेरा सौभाग्य है कि आज मुझे देश के दूर सुदूर गाँव में रहने वाले मेरे किसान भाइयों और बहनों से बात करने का अवसर मिला है। और जब मैं किसान से बात करता हूँ तो एक प्रकार से मैं गाँव से बात करता हूँ, गाँव वालों से बात करता हूँ, खेत मजदूर से भी बात कर रहा हूँ। उन खेत में काम करने वाली माताओं बहनों से भी बात कर रहा हूँ। और इस अर्थ में मैं कहूं तो अब तक की मेरी सभी मन की बातें जो हुई हैं, उससे शायद एक कुछ एक अलग प्रकार का अनुभव है।
जब मैंने किसानों के साथ मन की बात करने के लिए सोचा, तो मुझे कल्पना नहीं थी कि दूर दूर गावों में बसने वाले लोग मुझे इतने सारे सवाल पूछेंगे, इतनी सारी जानकारियां देंगे, आपके ढेर सारे पत्र, ढेर सारे सवाल, ये देखकर के मैं हैरान हो गया। आप कितने जागरूक हैं, आप कितने सक्रिय हैं, और शायद आप तड़पते हैं कि कोई आपको सुने। मैं सबसे पहले आपको प्रणाम करता हूँ कि आपकी चिट्ठियाँ पढ़कर के उसमें दर्द जो मैंने देखा है, जो मुसीबतें देखी हैं, इतना सहन करने के बावजूद भी, पता नहीं क्या-क्या आपने झेला होगा।
आपने मुझे तो चौंका दिया है, लेकिन मैं इस मन की बात का, मेरे लिए एक प्रशिक्षण का, एक एजुकेशन का अवसर मानता हूँ। और मेरे किसान भाइयो और बहनो, मैं आपको विश्वास दिलाता हूँ, कि आपने जितनी बातें उठाई हैं, जितने सवाल पूछे हैं, जितने भिन्न-भिन्न पहलुओं पर आपने बातें की हैं, मैं उन सबके विषय में, पूरी सरकार में जागरूकता लाऊँगा, संवेदना लाऊँगा, मेरा गाँव, मेरा गरीब, मेरा किसान भाई, ऐसी स्थिति में उसको रहने के लिए मजबूर नहीं किया जा सकता। मैं तो हैरान हूँ, किसानों ने खेती से संबधित तो बातें लिखीं हैं। लेकिन, और भी कई विषय उन्होंने कहे हैं, गाँव के दबंगों से कितनी परेशानियाँ हैं, माफियाओं से कितनी परेशानियाँ हैं, उसकी भी चर्चा की है, प्राकृतिक आपदा से आने वाली मुसीबतें तो ठीक हैं, लेकिन आस-पास के छोटे मोटे व्यापारियों से भी मुसीबतें झेलनी पड़ रही हैं।
किसी ने गाँव में गन्दा पानी पीना पड़ रहा है उसकी चर्चा की है, किसी ने गाँव में अपने पशुओं को रखने के लिए व्यवस्था की चिंता की है, किसी ने यहाँ तक कहा है कि पशु मर जाता है तो उसको हटाने का ही कोई प्रबंध नहीं होता, बीमारी फैल जाती है। यानि कितनी उपेक्षा हुई है, और आज मन की बात से शासन में बैठे हुए लोगों को एक कड़ा सन्देश इससे मिल रहा है। हमें राज करने का अधिकार तब है जब हम इन छोटी छोटी बातों को भी ध्यान दें। ये सब पढ़ कर के तो मुझे कभी कभी शर्मिन्दगी महसूस होती थी, कि हम लोगों ने क्या किया है! मेरे पास जवाब नहीं है, क्या किया है? हाँ, मेरे दिल को आपकी बातें छू गयी हैं। मैं जरूर बदलाव के लिए, प्रामाणिकता से प्रयास करूंगा, और उसके सभी पहलुओं पर सरकार को, जगाऊँगा, चेताऊंगा, दौडाऊंगा, मेरी कोशिश रहेगी, ये मैं विश्वास दिलाता हूँ।
मैं ये भी जानता हूँ कि पिछले वर्ष बारिश कम हुई तो परेशानी तो थी ही थी। इस बार बेमौसमी बरसात हो गयी, ओले गिरे, एक प्रकार से महाराष्ट्र से ऊपर, सभी राज्यों में, ये मुसीबत आयी। और हर कोने में किसान परेशान हो गया। छोटा किसान जो बेचारा, इतनी कड़ी मेहनत करके साल भर अपनी जिन्दगी गुजारा करता है, उसका तो सब कुछ तबाह हो गया है। मैं इस संकट की घड़ी में आपके साथ हूँ। सरकार के मेरे सभी विभाग राज्यों के संपर्क में रह करके स्थिति का बारीकी से अध्ययन कर रहे हैं, मेरे मंत्री भी निकले हैं, हर राज्य की स्थिति का जायजा लेंगे, राज्य सरकारों को भी मैंने कहा है कि केंद्र और राज्य मिल करके, इन मुसीबत में फंसे हुए सभी किसान भाइयों-बहनों को जितनी ज्यादा मदद कर सकते हैं, करें। में आपको विश्वास दिलाता हूँ कि सरकार पूरी संवेदना के साथ, आपकी इस संकट की घड़ी में, आपको पूरी तत्परता से मदद करेगी। जितना हो सकता है, उसको पूरा करने का प्रयास किया जायेगा।
गाँव के लोगों ने, किसानों ने कई मुददे उठाये हैं। सिंचाई की चिंता व्यापक नजर आती है। गाँव में सड़क नहीं है उसका भी आक्रोश है। खाद की कीमतें बढ़ रही हैं, उस पर भी किसान की नाराजगी है। बिजली नहीं मिल रही है। किसानों को यह भी चिंता है कि बच्चों को पढ़ाना है, अच्छी नौकरी मिले ये भी उनकी इच्छा है, उसकी भी शिकायतें हैं। माताओं बहनों की भी, गाँव में कहीं नशा-खोरी हो रही है उस पर अपना आक्रोश जताया है। कुछ ने तो अपने पति को तम्बाकू खाने की आदत है उस पर भी अपना रोष मुझे व्यक्त करके भेजा है। आपके दर्द को मैं समझ सकता हूँ। किसान का ये भी कहना है की सरकार की योजनायें तो बहुत सुनने को मिलती हैं, लेकिन हम तक पहुँचती नहीं हैं। किसान ये भी कहता है कि हम इतनी मेहनत करते हैं, लोगों का तो पेट भरते हैं लेकिन हमारा जेब नहीं भरता है, हमें पूरा पैसा नहीं मिलता है। जब माल बेचने जाते हैं, तो लेने वाला नहीं होता है। कम दाम में बेच देना पड़ता है। ज्यादा पैदावार करें तो भी मरते हैं, कम पैदावार करें तो भी मरते हैं। यानि किसानों ने अपने मन की बात मेरे सामने रखी है। मैं मेरे किसान भाइयों-बहनों को विश्वास दिलाता हूँ, कि मैं राज्य सरकारों को भी, और भारत सरकार के भी हमारे सभी विभागों को भी और अधिक सक्रिय करूंगा। तेज गति से इन समस्याओं के समाधान के रास्ते खोजने के लिए प्रेरित करूँगा। मुझे लग रहा है कि आपका धैर्य कम हो रहा है। बहुत स्वाभाविक है, साठ साल आपने इन्तजार किया है, मैं प्रामाणिकता से प्रयास करूँगा।
किसान भाइयो, ये आपके ढेर सारे सवालों के बीच में, मैंने देखा है कि करीब–करीब सभी राज्यों से वर्तमान जो भूमि अधिग्रहण बिल की चर्चा है, उसका प्रभाव ज्यादा दिखता है, और मैं हैरान हूँ कि कैसे-कैसे भ्रम फैलाए गए हैं। अच्छा हुआ, आपने छोटे–छोटे सवाल मुझे पूछे हैं। मैं कोशिश करूंगा कि सत्य आप तक पहुचाऊं। आप जानते हैं भूमि-अधिग्रहण का कानून 120 साल पहले आया था। देश आज़ाद होने के बाद भी 60-65 साल वही कानून चला और जो लोग आज किसानों के हमदर्द बन कर के आंदोलन चला रहे हैं, उन्होंने भी इसी कानून के तहत देश को चलाया, राज किया और किसानों का जो होना था हुआ। सब लोग मानते थे कि कानून में परिवर्तन होना चाहिए, हम भी मानते थे। हम विपक्ष में थे, हम भी मानते थे।
2013 में बहुत आनन-फानन के साथ एक नया कानून लाया गया। हमने भी उस समय कंधे से कन्धा मिलाकर के साथ दिया। किसान का भला होता है, तो साथ कौन नहीं देगा, हमने भी दिया। लेकिन कानून लागू होने के बाद, कुछ बातें हमारे ज़हन में आयीं। हमें लगा शायद इसके साथ तो हम किसान के साथ धोखा कर रहे हैं। हमें किसान के साथ धोखा करने का अधिकार नहीं है। दूसरी तरफ जब हमारी सरकार बनी, तब राज्यों की तरफ से बहुत बड़ी आवाज़ उठी। इस कानून को बदलना चाहिए, कानून में सुधार करना चाहिए, कानून में कुछ कमियां हैं, उसको पूरा करना चाहिए। दूसरी तरफ हमने देखा कि एक साल हो गया, कोई कानून लागू करने को तैयार ही नहीं कोई राज्य और लागू किया तो उन्होंने क्या किया? महाराष्ट्र सरकार ने लागू किया था, हरियाणा ने किया था जहां पर कांग्रेस की सरकारें थीं और जो किसान हितैषी होने का दावा करते हैं उन्होंने इस अध्यादेश में जो मुआवजा देने का तय किया था उसे आधा कर दिया। अब ये है किसानों के साथ न्याय? तो ये सारी बातें देख कर के हमें भी लगा कि भई इसका थोडा पुनर्विचार होना ज़रूरी है। आनन–फानन में कुछ कमियां रह जाती हैं। शायद इरादा ग़लत न हो, लेकिन कमियाँ हैं, तो उसको तो ठीक करनी चाहिए।…और हमारा कोई आरोप नहीं है कि पुरानी सरकार क्या चाहती थी, क्या नहीं चाहती थी? हमारा इरादा यही है कि किसानों का भला हो, किसानों की संतानों का भी भला हो, गाँव का भी भला हो और इसीलिए कानून में अगर कोई कमियां हैं, तो दूर करनी चाहिए। तो हमारा एक प्रामाणिक प्रयास कमियों को दूर करना है।
अब एक सबसे बड़ी कमी मैं बताऊँ, आपको भी जानकर के हैरानी होगी कि जितने लोग किसान हितैषी बन कर के इतनी बड़ी भाषणबाज़ी कर रहें हैं, एक जवाब नहीं दे रहे हैं। आपको मालूम है, अलग-अलग प्रकार के हिंदुस्तान में 13 कानून ऐसे हैं जिसमें सबसे ज्यादा जमीन संपादित की जाती है, जैसे रेलवे, नेशनल हाईवे, खदान के काम। आपको मालूम है, पिछली सरकार के कानून में इन 13 चीज़ों को बाहर रखा गया है। बाहर रखने का मतलब ये है कि इन 13 प्रकार के कामों के लिए जो कि सबसे ज्यादा जमीन ली जाती है, उसमें किसानों को वही मुआवजा मिलेगा जो पहले वाले कानून से मिलता था। मुझे बताइए, ये कमी थी कि नहीं? ग़लती थी कि नहीं? हमने इसको ठीक किया और हमने कहा कि भई इन 13 में भी भले सरकार को जमीन लेने कि हो, भले रेलवे के लिए हो, भले हाईवे बनाने के लिए हो, लेकिन उसका मुआवजा भी किसान को चार गुना तक मिलना चाहिए। हमने सुधार किया। कोई मुझे कहे, क्या ये सुधार किसान विरोधी है क्या? हमें इसीलिए तो अध्यादेश लाना पड़ा। अगर हम अध्यादेश न लाते तो किसान की तो जमीन वो पुराने वाले कानून से जाती रहती, उसको कोई पैसा नहीं मिलता। जब ये कानून बना तब भी सरकार में बैठे लोगों में कईयों ने इसका विरोधी स्वर निकला था। स्वयं जो कानून बनाने वाले लोग थे, जब कानून का रूप बना, तो उन्होंने तो बड़े नाराज हो कर के कह दिया, कि ये कानून न किसानों की भलाई के लिए है, न गाँव की भलाई के लिए है, न देश की भलाई के लिए है। ये कानून तो सिर्फ अफसरों कि तिजोरी भरने के लिए है, अफसरों को मौज करने के लिए, अफ़सरशाही को बढ़ावा देने के लिए है। यहाँ तक कहा गया था। अगर ये सब सच्चाई थी तो क्या सुधार होना चाहिए कि नहीं होना चाहिए? ..और इसलिए हमने कमियों को दूर कर के किसानों का भला करने कि दिशा में प्रयास किये हैं। सबसे पहले हमने काम किया, 13 कानून जो कि भूमि अधिग्रहण कानून के बाहर थे और जिसके कारण किसान को सबसे ज्यादा नुकसान होने वाला था, उसको हम इस नए कानून के दायरे में ले आये ताकि किसान को पूरा मुआवजा मिले और उसको सारे हक़ प्राप्त हों। अब एक हवा ऐसी फैलाई गई कि मोदी ऐसा कानून ला रहें हैं कि किसानों को अब मुआवजा पूरा नहीं मिलेगा, कम मिलेगा।
मेरे किसान भाइयो-बहनो, मैं ऐसा पाप सोच भी नहीं सकता हूँ। 2013 के पिछली सरकार के समय बने कानून में जो मुआवजा तय हुआ है, उस में रत्ती भर भी फर्क नहीं किया गया है। चार गुना मुआवजा तक की बात को हमने स्वीकारा हुआ है। इतना ही नहीं, जो तेरह योजनाओं में नहीं था, उसको भी हमने जोड़ दिया है। इतना ही नहीं, शहरीकरण के लिए जो भूमि का अधिग्रहण होगा, उसमें विकसित भूमि, बीस प्रतिशत उस भूमि मालिक को मिलेगी ताकि उसको आर्थिक रूप से हमेशा लाभ मिले, ये भी हमने जारी रखा है। परिवार के युवक को नौकरी मिले। खेत मजदूर की संतान को भी नौकरी मिलनी चाहिए, ये भी हमने जारी रखा है। इतना ही नहीं, हमने तो एक नयी चीज़ जोड़ी है। नयी चीज़ ये जोड़ी है, जिला के जो अधिकारी हैं, उसको इसने घोषित करना पड़ेगा कि उसमें नौकरी किसको मिलेगी, किसमें नौकरी मिलेगी, कहाँ पर काम मिलेगा, ये सरकार को लिखित रूप से घोषित करना पड़ेगा। ये नयी चीज़ हमने जोड़ करके सरकार कि जिम्मेवारी को Fix किया है।
मेरे किसान भाइयो-बहनो, हम इस बात पर agree हैं, कि सबसे पहले सरकारी जमीन का उपयोग हो। उसके बाद बंजर भूमि का उपयोग हो, फिर आखिर में अनिवार्य हो तब जाकर के उपजाऊ जमीन को हाथ लगाया जाये, और इसीलिए बंजर भूमि का तुरंत सर्वे करने के लिए भी कहा गया है, जिसके कारण वो पहली priority वो बने।
एक हमारे किसानों की शिकायत सही है कि आवश्यकता से अधिक जमीन हड़प ली जाती है। इस नए कानून के माध्यम से मैं आपको विश्वास दिलाना चाहता हूँ कि अब जमीन कितनी लेनी, उसकी पहले जांच पड़ताल होगी, उसके बाद तय होगा कि आवश्यकता से अधिक जमीन हड़प न की जाए। कभी-कभी तो कुछ होने वाला है, कुछ होने वाला है, इसकी चिंता में बहुत नुकसान होता है। ये Social Impact Assessment (SIA) के नाम पर अगर प्रक्रिया सालों तक चलती रहे, सुनवाई चलती रहे, मुझे बताइए, ऐसी स्थिति में कोई किसान अपने फैसले कर पायेगा? फसल बोनी है तो वो सोचेगा नहीं-नहीं यार, पता नहीं, वो निर्णय आ जाएगा तो, क्या करूँगा? और उसके 2-2, 4-4, साल खराब हो जाएगा और अफसरशाही में चीजें फसी रहेंगी। प्रक्रियाएं लम्बी, जटिल और एक प्रकार से किसान बेचारा अफसरों के पैर पकड़ने जाने के लिए मजबूर हो जाएगा कि साहब ये लिखो, ये मत लिखों, वो लिखो, वो मत लिखो, ये सब होने वाला है। क्या मैं मेरे अपने किसानों को इस अफसरसाही के चुंगल में फिर एक बार फ़सा दूं? मुझे लगता है वो ठीक नहीं होगा। प्रक्रिया लम्बी थी, जटिल थी। उसको सरल करने का मैंने प्रयास किया है।
मेरे किसान भाइयो-बहनो 2014 में कानून बना है, लेकिन राज्यों ने उसको स्वीकार नहीं किया है। किसान तो वहीं का वहीं रह गया। राज्यों ने विरोध किया। मुझे बताइए क्या मैं राज्यों की बात सुनूं या न सुनूं? क्या मैं राज्यों पर भरोसा करूँ या न करूँ? इतना बड़ा देश, राज्यों पर अविश्वास करके चल सकता है क्या? और इसलिए मेरा मत है कि हमें राज्यों पर भरोसा करना चाहिये, भारत सरकार में विशेष करना चाहिये तो, एक तो मैं भरोसा करना चाहता हूँ, दूसरी बात है, ये जो कानून में सुधार हम कर रहे हैं, कमियाँ दूर कर रहे हैं, किसान की भलाई के लिए जो हम कदम उठा रहे हैं, उसके बावजूद भी अगर किसी राज्य को ये नहीं मानना है, तो वे स्वतंत्र हैं और इसलिए मैं आपसे कहना चाहता हूँ कि ये जो सारे भ्रम फैलाए जा रहे हैं, वो सरासर किसान विरोधी के भ्रम हैं। किसान को गरीब रखने के षड्यन्त्र का ही हिस्सा हैं। देश को आगे न ले जाने के जो षडयंत्र चले हैं उसी का हिस्सा है। उससे बचना है, देश को भी बचाना है, किसान को भी बचाना है।
अब गाँव में भी किसान को पूछो कि भाई तीन बेटे हैं बताओ क्या सोच रहे हो? तो वो कहता है कि भाई एक बेटा तो खेती करेगा, लेकिन दो को कहीं-कहीं नौकरी में लगाना है। अब गाँव के किसान के बेटों को भी नौकरी चाहिये। उसको भी तो कहीं जाकर रोजगार कमाना है। तो उसके लिए क्या व्यवस्था करनी पड़ेगी। तो हमने सोचा कि जो गाँव की भलाई के लिए आवश्यक है, किसान की भलाई के लिये आवश्यक है, किसान के बच्चों के रोजगार के लिए आवश्यक है, ऐसी कई चीजों को जोड़ दिया जाए। उसी प्रकार से हम तो जय-जवान, जय-किसान वाले हैं। जय-जवान का मतलब है देश की रक्षा। देश की रक्षा के विषय में हिंदुस्तान का किसान कभी पीछे हटता नहीं है। अगर सुरक्षा के क्षेत्र में कोई आवश्कता हो तो वह जमीन किसानों से मांगनी पड़ेगी।..और मुझे विश्वास है, वो किसान देगा। तो हमने इन कामों के लिए जमीन लेने की बात को इसमें जोड़ा है। कोई भी मुझे गाँव का आदमी बताए कि गाँव में सड़क चाहिये कि नहीं चाहिये। अगर खेत में पानी चाहिये तो नहर करनी पड़ेगी कि नहीं करनी पड़ेगी। गाँव में आज भी गरीब हैं, जिसके पास रहने को घर नहीं है। घर बनाने के लिए जमीन चाहिये की नहीं चाहिये? कोई मुझे बताये कि यह उद्योगपतियों के लिए है क्या? यह धन्ना सेठों के लिए है क्या? सत्य को समझने की कोशिश कीजिये।
हाँ, मैं एक डंके की चोट पर आपको कहना चाहता हूँ, नए अध्यादेश में भी, कोई भी निजी उद्योगकार को, निजी कारखाने वाले को, निजी व्यवसाय करने वाले को, जमीन अधिग्रहण करने के समय 2013 में जो कानून बना था, जितने नियम हैं, वो सारे नियम उनको लागू होंगे। यह कॉर्पोरेट के लिए कानून 2013 के वैसे के वैसे लागू रहने वाले हैं। तो फिर यह झूठ क्यों फैलाया जाता है। मेरे किसान भाइयो-बहनो, एक भ्रम फैलाया जाता है कि आपको कानूनी हक नहीं मिलेगा, आप कोर्ट में नहीं जा सकते, ये सरासर झूठ है। हिंदुस्तान में कोई भी सरकार आपके कानूनी हक़ को छीन नहीं सकती है। बाबा साहेब अम्बेडकर ने हमें जो संविधान दिया है, इस संविधान के तहत आप हिंदुस्तान के किसी भी कोर्ट में जा करके दरवाजे खटखटा सकते हैं। तो ये झूठ फैलाया गया है। हाँ, हमने एक व्यवस्था को आपके दरवाजे तक लाने का प्रयास किया है।
एक Authority बनायी है, अब वो Authority जिले तक काम करेगी और आपके जिले के किसानों की समस्याओं का समाधान उसी Authority में जिले में ही हो जायेगा।..और वहां अगर आपको संतोष नहीं होता तो आप ऊपर के कोर्ट में जा सकते हैं। तो ये व्यवस्था हमने की है।
एक यह भी बताया जाता है कि भूमि अधिग्रहित की गयी तो वो पांच साल में वापिस करने वाले कानून को हटा दिया गया है। जी नहीं, मेरे किसान भाइयो-बहनो हमने कहा है कि जब भी Project बनाओगे, तो यह पक्का करो कि कितने सालों में आप इसको पूरा करोगे। और उस सालों में अगर पूरा नहीं करते हैं तो वही होगा जो किसान चाहेगा। और उसको तो समय-सीमा हमने बाँध दी है। आज क्या होता है, 40-40 साल पहले जमीने ली गयी, लेकिन अभी तक सरकार ने कुछ किया नहीं। तो यह तो नहीं चल सकता। तो हमने सरकार को सीमा में बांधना तय किया है। हाँ, कुछ Projects ऐसे होते हैं जो 20 साल में पूरे होते हैं, अगर मान लीजिये 500 किलोमीटर लम्बी रेलवे लाइन डालनी है, तो समय जाएगा। तो पहले से कागज़ पर लिखो कि भाई कितने समय में पूरा करोगे। तो हमने सरकार को बाँधा है। सरकार की जिम्मेवारी को Fix किया है।
मैं और एक बात बताऊं किसान-भाइयो, कभी-कभी ये एयरकंडीशन कमरे में बैठ करके जो कानून बनाते हैं न, उनको गाँव के लोगों की सच्ची स्थिति का पता तक नहीं होता है। अब आप देखिये जब डैम बनता है, जलाशय बनता है, तो उसका नियम यह है कि 100 साल में सबसे ज्यादा पानी की सम्भावना हो उस हिसाब से जमीन प्राप्त करने का नियम है। अब 100 साल में एक बार पानी भरता है। 99 साल तक पानी नहीं भरता है। फिर भी जमीन सरकार के पास चली जाती है, तो आज सभी राज्यों में क्या हो रहा है की भले जमीन कागज़ पर ले ली हो, पैसे भी दे दिए हों। लेकिन फिर भी वो जमीन पर किसान खेती करता है। क्योंकि 100 साल में एक बार जब पानी भर जाएगा तो एक साल के लिए वो हट जाएगा। ये नया कानून 2013 का ऐसा था कि आप खेती नहीं कर सकते थे। हम चाहते हैं कि अगर जमीन डूब में नहीं जाती है तो फिर किसान को खेती करने का अवसर मिलना चाहिये।..और इसीलिये वो जमीन किसान से कब्ज़ा नहीं करनी चाहिये। ये लचीलापन आवश्यक था। ताकि किसान को जमीन देने के बावजूद भी जमीन का लाभ मिलता रहे और जमीन देने के बदले में रुपया भी मिलता रहे। तो किसान को डबल फायदा हो। ये व्यवस्था करना भी जरूरी है, और व्यावहारिक व्यवस्था है, और उस व्यावहारिक व्यवस्था को हमने सोचा है।
एक भ्रम ऐसा फैलाया जाता है कि ‘सहमति’ की जरुरत नहीं हैं। मेरे किसान भाइयो-बहनो ये राजनीतिक कारणों से जो बाते की जाती हैं, मेहरबानी करके उससे बचिये! 2013 में जो कानून बना उसमे भी सरकार नें जिन योजनाओं के लिए जमीन माँगी है, उसमें सहमती का क़ानून नहीं है।...और इसीलिए सहमति के नाम पर लोगों को भ्रमित किया जाता है। सरकार के लिए सहमति की बात पहले भी नही थी, आज भी नहीं है।..और इसीलिये मेरे किसान भाइयों-बहनो पहले बहुत अच्छा था और हमने बुरा कर दिया, ये बिलकुल सरासर आपको गुमराह करने का दुर्भाग्यपूर्ण प्रयास है। मैं आज भी कहता हूँ कि निजी उद्योग के लिए, कॉर्पोरेट के लिए, प्राइवेट कारखानों के लिए ये ‘सहमति’ का कानून चालू है, है...है।
...और एक बात मैं कहना चाहता हूँ, कुछ लोग कहतें है, PPP मॉडल! मेरे किसान भाइयो-बहनो, मान लीजिये 100 करोड रुपए का एक रोड बनाना है। क्या रोड किसी उद्योगकार उठा कर ले जाने वाला है क्या? रोड तो सरकार के मालिकी का ही रहता है। जमीन सरकार की मालिकी की ही रहती है। बनाने वाला दूसरा होता है। बनाने वाला इसीलिए दूसरा होता है, क्योंकि सरकार के पास आज पैसे नहीं होते हैं। क्योंकि सरकार चाहती है कि गाँव में स्कूल बने, गाँव में हॉस्पिटल बने, गरीब का बच्चा पढ़े, इसके लिए पैसा लगे। रोड बनाने का काम प्राइवेट करे, लेकिन वो प्राइवेट वाला भी रोड अपना नहीं बनाता है। न अपने घर ले जाता है, रोड सरकार का बनाता है। एक प्रकार से अपनी पूंजी लगता है। इसका मतलब ये हुआ कि सरकार का जो प्रोजेक्ट होगा जिसमें पूंजी किसी की भी लगे, जिसको लोग PPP मॉडल कहतें हैं। लेकिन अगर उसका मालिकाना हक़ सरकार का रहता है, उसका स्वामित्व सरकार का रहता है, सरकार का मतलब आप सबका रहता है, देश की सवा सौ करोड़ जनता का रहता है तो उसमें ही हमने ये कहा है कि सहमति की आवश्यकता नहीं है और इसीलिये ये PPP मॉडल को लेकर के जो भ्रम फैलाये जातें हैं उसकी मुझे आपको स्पष्टता करना बहुत ही जरुरी है।
कभी-कभार हम जिन बातों के लिए कह रहे हैं कि भई उसमें ‘सहमति’ की प्रक्रिया एक प्रकार से अफसरशाही और तानाशाही को बल देगी। आप मुझे बताईये, एक गावं है, उस गॉव तक रोड बन गया है, अब दूसरे गॉव के लिए रोड बनाना है, आगे वाले गॉव के लिए, 5 किलोमीटर की दूरी पर वह गॉव है। इस गॉव तक रोड बन गया है, लेकिन इन गॉव वालों की ज़मीन उस गॉव की तरफ है। मुझे बताईये उस गॉव के लोगों के लिए, रोड बनाने के लिए, ये गॉव वाले ज़मीन देंगे क्या? क्या ‘सहमति’ देंगे क्या? तो क्या पीछे जो गॉव है उसका क्या गुनाह है भई? उसको रोड मिलना चाहिए कि नहीं, मिलना चाहिये? उसी प्रकार से मैं नहर बना रहा हूँ। इस गॉव वालो को पानी मिल गया, नहर बन गयी। लेकिन आगे वाले गॉव को पानी पहुंचाना है तो ज़मीन तो इसी गावंवालों के बीच में पड़ती है। तो वो तो कह देंगे कि भई नहीं, हम तो ज़मीन नहीं देंगे। हमें तो पानी मिल गया है। तो आगे वाले गावं को नहर मिलनी चाहिए कि नहीं मिलनी चाहिए?
मेरे भाइयो-बहनो, ये व्यावहारिक विषय है। और इसलिए जिस काम के लिए इतनी लम्बी प्रक्रिया न हो, हक और किसान के लिए, ये उद्योग के लिए नहीं है, व्यापार के लिए नहीं है, गावं की भलाई के लिए है, किसान की भलाई के लिए है, उसके बच्चों की भलाई के लिए है।
एक और बात आ रही है। ये बात मैंने पहले भी कही है। हर घर में किसान चाहता है कि एक बेटा भले खेती में रहे, लेकिन बाकी सब संतान रोज़ी–रोटी कमाने के लिए बाहर जाये क्योंकि उसे मालूम है, कि आज समय की मांग है कि घर में घर चलाने के लिए अलग-अलग प्रयास करने पड़ते हैं। अगर हम कोई रोड बनाते है और रोड के बगल में सरकार Industrial Corridor बनाती है, प्राइवेट नहीं। मैं एक बार फिर कहता हूँ प्राइवेट नहीं, पूंजीपति नहीं, धन्ना सेठ नहीं, सरकार बनाती है ताकि जब Corridor बनता है पचास किलोमीटर लम्बा, 100 किलोमीटर लम्बा तो जो रोड बनेगा, रोड के एक किलोमीटर बाएं, एक किलोमीटर दायें वहां पर अगर सरकार Corridor बनाती है ताकि नजदीक में जितने गाँव आयेंगे 50 गाँव, 100 गाँव, 200 गाँव उनको वहां कोई न कोई, वहां रोजी रोटी का अवसर मिल जाए, उनके बच्चों को रोजगार मिल जाए।
मुझे बताइये, भाइयों-बहनो क्या हम चाहतें हैं, कि हमारे गाँव के किसानों के बच्चे दिल्ली और मुंबई की झुग्गी झोपड़ियों में जिन्दगी बसर करने के लिए मजबूर हो जाएँ? क्या उनके घर और गाँव के 20-25 किलोमीटर की दूरी पर एक छोटा सा भी कारखाना लग जाता है और उसको रोजगार मिल जाता है, तो मिलना चाहिये की नहीं मिलना चाहिये? और ये Corridor प्राइवेट नही है, ये सरकार बनाएगी। सरकार बनाकर के उस इलाके के लोगों को रोजगार देने का प्रबंध करेगी। ..और इसीलिए जिसकी मालिकी सरकार की है, और जो गाँव की भलाई के लिए है, गाँव के किसानो की भलाई के लिए है, जो किसानों की भावी पीड़ी की भलाई के लिए हैं, जो गाँव के गरीबों की भलाई के लिए हैं, जो गाँव के किसान को बिजली पानी मोहैया कराने के लिए उनके लिए हैं, उनके लिए इस भूमि अधिग्रहण बिल में कमियाँ थी, उस कमियों को दूर करने का हमारे प्रामाणिक प्रयास हैं।...और फिर भी मैंने Parliament में कहा था की अभी भी किसी को लगता है कोई कमी हैं, तो हम उसको सुधार करने के लिए तैयार हैं।
जब हमने लोकसभा में रखा, कुछ किसान नेताओं ने आ करके दो चार बातें बताईं, हमने जोड़ दी। हम तो अभी भी कहतें कि भाई भूमि अधिग्रहण किसानों की भलाई के लिए ही होना चाहिये। ..और ये हमारी प्रतिबद्धता है, जितने झूठ फैलाये जाते हैं, कृपा करके मैं मेरे किसान भाइयों से आग्रह करता हूँ कि आप इन झूठ के सहारे निर्णय मत करें, भ्रमित होने की जरुरत नहीं है। आवश्यकता यह है की हमारा किसान ताकतवर कैसे बने, हमारा गाँव ताकतवर कैसे बने, हमारा किसान जो मेहनत करता है, उसको सही पैसे कैसे मिले, उसको अच्छा बाज़ार कैसे मिले, जो पैदा करता है उसके रखरखाव के लिए अच्छा स्टोरेज कैसे मिले, हमारी कोशिश है कि गाँव की भलाई, किसान की भलाई के लिए सही दिशा में काम उठाएं।
मेरे किसान भाइयो-बहनो, हमारी कोशिश है कि देश ऐसे आगे बढ़े कि आपकी जमीन पर पैदावार बढ़े, और इसीलिए हमने कोशिश की है, Soil Health Card. जैसे मनुष्य बीमार हो जाता है तो उसकी तबीयत के लिए लेबोरेटरी में टेस्ट होता हैं। जैसा इंसान का होता है न, वैसा अपनी भारत-माता का भी होता हैं, अपनी धरती- माता का भी होता है। और इसीलिए हम आपकी धरती बचे इतना ही नहीं, आपकी धरती तन्दुरूस्त हो उसकी भी चिंता कर रहे हैं।
....और इसलिये भूमि अधिग्रहण नहीं, आपकी भूमि अधिक ताकतवर बने ये भी हमारा काम है। और इसीलिए “Soil Health Card” की बात लेकर के आये हैं। हर किसान को इसका लाभ मिलने वाला है, आपके उर्वरक का जो फालतू खर्चा होता है उससे बच जाएगा। आपकी फसल बढ़ेगी। आपको फसल का पूरा पैसा मिले, उसके लिए भी तो अच्छी मंडियां हों, अच्छी कानून व्यवस्था हो, किसान का शोषण न हो, उस पर हम काम कर रहे हैं और आप देखना मेरे किसान भाइयो, मुझे याद है, मैं जब गुजरात में मुख्यमंत्री था इस दिशा में मैंने बहुत काम किया था। हमारे गुजरात में तो किसान की हालत बहुत ख़राब थी, लेकिन पानी पर काम किया, बहुत बड़ा परिवर्तन आया। गुजरात के विकास में किसान का बहुत बड़ा योगदान बन गया जो कभी सोच नही सकता था। गाँव के गाँव खाली हो जाते थे। बदलाव आया, हम पूरे देश में ये बदलाव चाहते हैं जिसके कारण हमारा किसान सुखी हो।
...और इसलिए मेरे किसान भाइयो और बहनो, आज मुझे आपके साथ बात करने का मौका मिला। लेकिन इन दिनों अध्यादेश की चर्चा ज्यादा होने के कारण मैंने ज़रा ज्यादा समय उसके लिए ले लिया। लेकिन मेरे किसान भाइयो बहनो मैं प्रयास करूंगा, फिर एक बार कभी न कभी आपके साथ दुबारा बात करूंगा, और विषयों की चर्चा करूँगा, लेकिन मैं इतना विश्वास दिलाता हूँ कि आपने जो मुझे लिख करके भेजा है, पूरी सरकार को मैं हिलाऊँगा, सरकार को लगाऊंगा कि क्या हो रहा है। अच्छा हुआ आपने जी भरके बहुत सी चीजें बतायी हैं और मैं मानता हूँ आपका मुझ पर भरोसा है, तभी तो बताई है न! मैं ये भरोसे को टूटने नहीं दूंगा, ये मैं आपको विश्वास दिलाता हूँ।
आपका प्यार बना रहे, आपके आशीर्वाद बने रहे। और आप तो जगत के तात हैं, वो कभी किसी का बुरा सोचता, वो तो खुद का नुकसान करके भी देश का भला करता है। ये उसकी परंपरा रही है। उस किसान का नुकसान न हो, इसकी चिंता ये सरकार करेगी। ये मैं आपको विश्वास दिलाता हूँ लेकिन आज मेरी मन की बातें सुनने के बाद आपके मन में बहुत से विचार और आ सकते हैं। आप जरुर मुझे आकाशवाणी के पते पर लिखिये। मैं आगे फिर कभी बातें करूँगा। या आपके पत्रों के आधार पर सरकार में जो गलतियाँ जो ठीक करनी होंगी तो गलतियाँ ठीक करूँगा। काम में तेजी लाने की जरुरत है, तो तेजी लाऊंगा और और किसी को अन्याय हो रहा है तो न्याय दिलाने के लिए पूरा प्रयास करूँगा।
नवरात्रि का पावन पर्व चल रहा है। मेरी आपको बहुत-बहुत शुभकामनाएं।
नमस्ते, युवा दोस्तो। आज तो पूरा दिन भर शायद आपका मन क्रिकेट मैच में लगा होगा, एक तरफ परीक्षा की चिंता और दूसरी तरफ वर्ल्ड कप हो सकता है आप छोटी बहन को कहते होंगे कि बीच - बीच में आकर स्कोर बता दे। कभी आपको ये भी लगता होगा, चलो यार छोड़ो, कुछ दिन के बाद होली आ रही है और फिर सर पर हाथ पटककर बैठे होंगे कि देखिये होली भी बेकार गयी, क्यों? एग्जाम आ गयी। होता है न! बिलकुल होता होगा, मैं जानता हूँ। खैर दोस्तो, आपकी मुसीबत के समय मैं आपके साथ आया हूँ। आपके लिए एक महत्वपूर्ण अवसर है। उस समय मैं आया हूँ। और मैं आपको कोई उपदेश देने नहीं आया हूँ। ऐसे ही हलकी - फुलकी बातें करने आया हूँ।
बहुत पढ़ लिया न, बहुत थक गए न! और माँ डांटती है, पापा डांटते है, टीचर डांटते हैं, पता नहीं क्या क्या सुनना पड़ता है। टेलीफोन रख दो, टीवी बंद कर दो, कंप्यूटर पर बैठे रहते हो, छोड़ो सबकुछ, चलो पढ़ो यही चलता है न घर में? साल भर यही सुना होगा, दसवीं में हो या बारहवीं में। और आप भी सोचते होंगे कि जल्द एग्जाम खत्म हो जाए तो अच्छा होगा, यही सोचते हो न? मैं जानता हूँ आपके मन की स्थिति को और इसीलिये मैं आपसे आज ‘मन की बात’ करने आया हूँ। वैसे ये विषय थोड़ा कठिन है।
आज के विषय पर माँ बाप चाहते होंगे कि मैं उन बातों को करूं, जो अपने बेटे को या बेटी को कह नहीं पाते हैं। आपके टीचर चाहते होंगे कि मैं वो बातें करूँ, ताकि उनके विद्यार्थी को वो सही बात पहुँच जाए और विद्यार्थी चाहता होगा कि मैं कुछ ऐसी बातें करूँ कि मेरे घर में जो प्रेशर है, वो प्रेशर कम हो जाए। मैं नहीं जानता हूँ, मेरी बातें किसको कितनी काम आयेंगी, लेकिन मुझे संतोष होगा कि चलिये मेरे युवा दोस्तों के जीवन के महत्वपूर्ण पल पर मैं उनके बीच था. अपने मन की बातें उनके साथ गुनगुना रहा था। बस इतना सा ही मेरा इरादा है और वैसे भी मुझे ये तो अधिकार नहीं है कि मैं आपको अच्छे एग्जाम कैसे जाएँ, पेपर कैसे लिखें, पेपर लिखने का तरीका क्या हो? ज्यादा से ज्यादा मार्क्स पाने की लिए कौन - कौन सी तरकीबें होती हैं? क्योंकि मैं इसमें एक प्रकार से बहुत ही सामान्य स्तर का विद्यार्थी हूँ। क्योंकि मैंने मेरे जीवन में किसी भी एग्जाम में अच्छे परिणाम प्राप्त नहीं किये थे। ऐसे ही मामूली जैसे लोग पढ़ते हैं वैसे ही मैं था और ऊपर से मेरी तो हैण्डराइटिंग भी बहुत ख़राब थी। तो शायद कभी - कभी तो मैं इसलिए भी पास हो जाता था, क्योंकि मेरे टीचर मेरा पेपर पढ़ ही नहीं पाते होंगे। खैर वो तो अलग बातें हो गयी, हलकी - फुलकी बातें हैं।
लेकिन मैं आज एक बात जरुर आपसे कहना चाहूँगा कि आप परीक्षा को कैसे लेते हैं, इस पर आपकी परीक्षा कैसी जायेगी, ये निर्भर करती है। अधिकतम लोगों को मैंने देखा है कि वो इसे अपने जीवन की एक बहुत बड़ी महत्वपूर्ण घटना मानते हैं और उनको लगता है कि नहीं, ये गया तो सारी दुनिया डूब जायेगी। दोस्तो, दुनिया ऐसी नहीं है। और इसलिए कभी भी इतना तनाव मत पालिये। हाँ, अच्छा परिणाम लाने का इरादा होना चाहिये। पक्का इरादा होना चाहिये, हौसला भी बुलंद होना चाहिये। लेकिन परीक्षा बोझ नहीं होनी चाहिये, और न ही परीक्षा कोई आपके जीवन की कसौटी कर रही है। ऐसा सोचने की जरुरत नहीं है।
कभी-कभार ऐसा नहीं लगता कि हम ही परीक्षा को एक बोझ बना देते हैं घर में और बोझ बनाने का एक कारण जो होता है, ये होता है कि हमारे जो रिश्तेदार हैं, हमारे जो यार - दोस्त हैं, उनका बेटा या बेटी हमारे बेटे की बराबरी में पढ़ते हैं, अगर आपका बेटा दसवीं में है, और आपके रिश्तेदारों का बेटा दसवीं में है तो आपका मन हमेशा इस बात को कम्पेयर करता रहता है कि मेरा बेटा उनसे आगे जाना चाहिये, आपके दोस्त के बेटे से आगे होना चाहिये। बस यही आपके मन में जो कीड़ा है न, वो आपके बेटे पर प्रेशर पैदा करवा देता है। आपको लगता है कि मेरे अपनों के बीच में मेरे बेटे का नाम रोशन हो जाये और बेटे का नाम तो ठीक है, आप खुद का नाम रोशन करना चाहते हैं। क्या आपको नहीं लगता है कि आपके बेटे को इस सामान्य स्पर्धा में लाकर के आपने खड़ा कर दिया है? जिंदगी की एक बहुत बड़ी ऊँचाई, जीवन की बहुत बड़ी व्यापकता, क्या उसके साथ नहीं जोड़ सकते हैं? अड़ोस - पड़ोस के यार दोस्तों के बच्चों की बराबरी वो कैसी करता है! और यही क्या आपका संतोष होगा क्या? आप सोचिये? एक बार दिमाग में से ये बराबरी के लोगों के साथ मुकाबला और उसी के कारण अपने ही बेटे की जिंदगी को छोटी बना देना, ये कितना उचित है? बच्चों से बातें करें तो भव्य सपनों की बातें करें। ऊंची उड़ान की बातें करें। आप देखिये, बदलाव शुरू हो जाएगा।
दोस्तों एक बात है जो हमें बहुत परेशान करती है। हम हमेशा अपनी प्रगति किसी और की तुलना में ही नापने के आदी होते हैं। हमारी पूरी शक्ति प्रतिस्पर्धा में खप जाती है। जीवन के बहुत क्षेत्र होंगे, जिनमें शायद प्रतिस्पर्धा जरूरी होगी, लेकिन स्वयं के विकास के लिए तो प्रतिस्पर्धा उतनी प्रेरणा नहीं देती है, जितनी कि खुद के साथ हर दिन स्पर्धा करते रहना। खुद के साथ ही स्पर्धा कीजिये, अच्छा करने की स्पर्धा, तेज गति से करने की स्पर्धा, और ज्यादा करने की स्पर्धा, और नयी ऊंचाईयों पर पहुँचने की स्पर्धा आप खुद से कीजिये, बीते हुए कल से आज ज्यादा अच्छा हो इस पर मन लगाइए। और आप देखिये ये स्पर्धा की ताकत आपको इतना संतोष देगी, इतना आनंद देगी जिसकी आप कल्पना नहीं कर सकते। हम लोग बड़े गर्व के साथ एथलीट सेरगेई बूबका का स्मरण करते हैं। इस एथलीट ने पैंतीस बार खुद का ही रिकॉर्ड तोड़ा था। वह खुद ही अपने एग्जाम लेता था। खुद ही अपने आप को कसौटी पर कसता था और नए संकल्पों को सिद्ध करता था। आप भी उसी लिहाज से आगे बढें तो आप देखिये आपको प्रगति के रास्ते पर कोई नहीं रोक सकता है।
युवा दोस्तो, विद्यार्थियों में भी कई प्रकार होते हैं। कुछ लोग कितनी ही परीक्षाएं क्यों न भाए बड़े ही बिंदास होते हैं। उनको कोई परवाह ही नहीं होती और कुछ होते हैं जो परीक्षा के बोझ में दब जाते हैं। और कुछ लोग मुह छुपा करके घर के कोने में किताबों में फंसे रहते हैं। इन सबके बावजूद भी परीक्षा परीक्षा है और परीक्षा में सफल होना भी बहुत आवश्यक है और में भी चाहता हूँ कि आप भी सफल हों लेकिन कभी- कभी आपने देखा होगा कि हम बाहरी कारण बहुत ढूँढ़ते हैं। ये बाहरी कारण हम तब ढूँढ़ते हैं, जब खुद ही कन्फ्यूज्ड हों। खुद पर भरोसा न हो, जैसे जीवन में पहली बार परीक्षा दे रहे हों। घर में कोई टीवी जोर से चालू कर देगा, आवाज आएगी, तो भी हम चिड़चिड़ापन करते होंगे, माँ खाने पर बुलाती होगी तो भी चिड़चिड़ापन करते होंगे। दूसरी तरफ अपने किसी यार-दोस्त का फ़ोन आ गया तो घंटे भर बातें भी करते होंगें । आप को नहीं लगता है आप स्वयं ही अपने विषय में ही कन्फ्यूज्ड हैं।
दोस्तो खुद को पहचानना ही बहुत जरुरी होता है। आप एक काम किजीये बहुत दूर का देखने की जरुरत नहीं है। आपकी अगर कोई बहन हो, या आपके मित्र की बहन हो जिसने दसवीं या बारहवी के एग्जाम दे रही हो, या देने वाली हो। आपने देखा होगा, दसवीं के एग्जाम हों बारहवीं के एग्जाम हों तो भी घर में लड़कियां माँ को मदद करती ही हैं। कभी सोचा है, उनके अंदर ये कौन सी ऐसी ताकत है कि वे माँ के साथ घर काम में मदद भी करती हैं और परीक्षा में लड़कों से लड़कियां आजकल बहुत आगे निकल जाती हैं। थोड़ा आप ओबजर्व कीजिये अपने अगल-बगल में। आपको ध्यान में आ जाएगा कि बाहरी कारणों से परेशान होने की जरुरत नहीं है। कभी-कभी कारण भीतर का होता है. खुद पर अविश्वास होता है न तो फिर आत्मविश्वास क्या काम करेगा? और इसलिए मैं हमेशा कहता हूँ जैसे-जैसे आत्मविश्वास का अभाव होता है, वैसे वैसे अंधविश्वास का प्रभाव बढ़ जाता है। और फिर हम अन्धविश्वास में बाहरी कारण ढूंढते रहते हैं। बाहरी कारणों के रास्ते खोजते रहते हैं. कुछ तो विद्यार्थी ऐसे होते हैं जिनके लिए हम कहते हैं आरम्म्भीशुरा। हर दिन एक नया विचार, हर दिन एक नई इच्छा, हर दिन एक नया संकल्प और फिर उस संकल्प की बाल मृत्यु हो जाता है, और हम वहीं के वहीं रह जाते हैं। मेरा तो साफ़ मानना है दोस्तो बदलती हुई इच्छाओं को लोग तरंग कहते हैं। हमारे साथी यार- दोस्त, अड़ोसी-पड़ोसी, माता-पिता मजाक उड़ाते हैं और इसलिए मैं कहूँगा, इच्छाएं स्थिर होनी चाहिये और जब इच्छाएं स्थिर होती हैं, तभी तो संकल्प बनती हैं और संकल्प बाँझ नहीं हो सकते। संकल्प के साथ पुरुषार्थ जुड़ता है. और जब पुरुषार्थ जुड़ता है तब संकल्प सिद्दी बन जाता है. और इसीलिए तो मैं कहता हूँ कि इच्छा प्लस स्थिरता इज-इक्वल टू संकल्प। संकल्प प्लस पुरुषार्थ इज-इक्वल टू सिद्धि। मुझे विश्वास है कि आपके जीवन यात्रा में भी सिद्दी आपके चरण चूमने आ जायेगी। अपने आप को खपा दीजिये। अपने संकल्प के लिए खपा दीजिये और संकल्प सकारात्मक रखिये। किसी से आगे जाने की मत सोचिये। खुद जहां थे वहां से आगे जाने के लिए सोचिये। और इसलिए रोज अपनी जिंदगी को कसौटी पर कसता रहता है उसके लिए कितनी ही बड़ी कसौटी क्यों न आ जाए कभी कोई संकट नहीं आता है और दोस्तों कोई अपनी कसौटी क्यों करे? कोई हमारे एग्जाम क्यों ले? आदत डालो न। हम खुद ही हमारे एग्जाम लेंगें। हर दिन हमारी परीक्षा लेंगे। देखेंगे मैं कल था वहां से आज आगे गया कि नहीं गया। मैं कल था वहां से आज ऊपर गया कि नहीं। मैंने कल जो पाया था उससे ज्यादा आज पाया कि नहीं पाया। हर दिन हर पल अपने आपको कसौटी पर कसते रहिये। फिर कभी जिन्दगी में कसौटी, कसौटी लगेगी ही नहीं। हर कसौटी आपको खुद को कसने का अवसर बन जायेगी और जो खुद को कसना जानता वो कसौटियों को भी पार कर जाता है और इसलिए जो जिन्दगी की परीक्षा से जुड़ता है उसके लिए क्लासरूम की परीक्षा बहुत मामूली होती है।
कभी आपने भी कल्पना नहीं की होगी की इतने अच्छे अच्छे काम कर दिए होंगें। जरा उसको याद करो, अपने आप विश्वास पैदा हो जाएगा। अरे वाह! आपने वो भी किया था, ये भी किया था? पिछले साल बीमार थी तब भी इतने अच्छे मार्क्स लाये थे। पिछली बार मामा के घर में शादी थी, वहां सप्ताह भर ख़राब हो गया था, तब भी इतने अच्छे मार्क्स लाये थे। अरे पहले तो आप छः घंटे सोते थे और पिछली साल आपने तय किया था कि नहीं नहीं अब की बार पांच घंटे सोऊंगा और आपने कर के दिखाया था। अरे यही तो है मोदी आपको क्या उपदेश देगा। आप अपने मार्गदर्शक बन जाइए। और भगवान् बुद्ध तो कहते थे अंतःदीपो भव:।
मैं मानता हूँ, आपके भीतर जो प्रकाश है न उसको पहचानिए आपके भीतर जो सामर्थ्य है, उसको पहचानिए और जो खुद को बार-बार कसौटी पर कसता है वो नई-नई ऊंचाइयों को पार करता ही जाता है। दूसरा कभी- कभी हम बहुत दूर का सोचते रहते हैं। कभी-कभी भूतकाल में सोये रहते हैं। दोस्तो परीक्षा के समय ऐसा मत कीजिये। परीक्षा समय तो आप वर्तमान में ही जीना अच्छा रहेगा। क्या कोई बैट्समैन पिछली बार कितनी बार जीरो में आऊट हो गया, इसके गीत गुनगुनाता है क्या? या ये पूरी सीरीज जीतूँगा या नहीं जीतूँगा, यही सोचता है क्या? मैच में उतरने के बाद बैटिंग करते समय सेंचुरी करके ही बाहर आऊँगा कि नहीं आऊँगा, ये सोचता है क्या? जी नहीं, मेरा मत है, अच्छा बैट्समैन उस बॉल पर ही ध्यान केन्द्रित करता है, जो बॉल उसके सामने आ रहा है। वो न अगले बॉल की सोचता है, न पूरे मैच की सोचता है, न पूरी सीरीज की सोचता है। आप भी अपना मन वर्तमान से लगा दीजिये। जीतना है तो उसकी एक ही जड़ी-बूटी है। वर्तमान में जियें, वर्तमान से जुड़ें, वर्तमान से जूझें। जीत आपके साथ साथ चलेगी।
मेरे युवा दोस्तो, क्या आप ये सोचते हैं कि परीक्षा आपकी क्षमता का प्रदर्शन करने के लिए होती हैं। अगर ये आपकी सोच है तो गलत है। आपको किसको अपनी क्षमता दिखानी है? ये प्रदर्शन किसके सामने करना है? अगर आप ये सोचें कि परीक्षा क्षमता प्रदर्शन के लिए नहीं, खुद की क्षमता पहचानने के लिए है। जिस पल आप अपने मन्त्र मानने लग जायेंगे आप पकड़ लेंगें न, आपके भीतर का विश्वास बढ़ता चला जाएगा और एक बार आपने खुद को जाना, अपनी ताकत को जाना तो आप हमेशा अपनी ताकत को ही खाद पानी डालते रहेंगे और वो ताकत एक नए सामर्थ्य में परिवर्तित हो जायेगी और इसलिए परीक्षा को आप दुनिया को दिखाने के लिए एक चुनौती के रूप में मत लीजिये, उसे एक अवसर के रूप में लीजिये। खुद को जानने का, खुद को पह्चानने का, खुद के साथ जीने का यह एक अवसर है। जी लीजिये न दोस्तो।
दोस्तो मैंने देखा है कि बहुत विद्यार्थी ऐसे होते हैं जो परीक्षाओं के दिनों में नर्वस हो जाते हैं। कुछ लोगों का तो कथन इस बात का होता है कि देखो मेरी आज एग्जाम थी और मामा ने मुझे विश नहीं किया. चाचा ने विश नहीं किया, बड़े भाई ने विश नहीं किया। और पता नहीं उसका घंटा दो घंटा परिवार में यही डिबेट होता है, देखो उसने विश किया, उसका फ़ोन आया क्या, उसने बताया क्या, उसने गुलदस्ता भेजा क्या? दोस्तो इससे परे हो जाइए, इन सारी चीजों में मत उलझिए। ये सारा परीक्षा के बाद सोचना किसने विश किये किसने नहीं किया। अपने आप पर विश्वास होगा न तो ये सारी चीजें आयेंगी ही नहीं। दोस्तों मैंने देखा है की ज्यादातर विद्यार्थी नर्वस हो जाते हैं। मैं मानता हूँ की नर्वस होना कुछ लोगों के स्वभाव में होता है। कुछ परिवार का वातावरण ही ऐसा है। नर्वस होने का मूल कारण होता है अपने आप पर भरोसा नहीं है। ये अपने आप पर भरोसा कब होगा, एक अगर विषय पर आपकी अच्छी पकड़ होगी, हर प्रकार से मेहनत की होगी, बार-बार रिवीजन किया होगा। आपको पूरा विश्वास है हाँ हाँ इस विषय में तो मेरी मास्टरी है और आपने भी देखा होगा, पांच और सात सब्जेक्ट्स में दो तीन तो एजेंडा तो ऐसे होंगे जिसमें आपको कभी चिंता नहीं रहती होगी। नर्वसनेस कभी एक आध दो में आती होगी। अगर विषय में आपकी मास्टरी है तो नर्वसनेस कभी नहीं आयेगी।
आपने साल भर जो मेहनत की है न, उन किताबों को वो रात-रात आपने पढाई की है आप विश्वाश कीजिये वो बेकार नहीं जायेगी। वो आपके दिल-दिमाग में कहीं न कहीं बैठी है, परीक्षा की टेबल पर पहुँचते ही वो आयेगी। आप अपने ज्ञान पर भरोसा करो, अपनी जानकारियों पर भरोसा करो, आप विश्वास रखो कि आपने जो मेहनत की है वो रंग लायेगी और दूसरी बात है आप अपनी क्षमताओं के बारे में बड़े कॉंफिडेंट होने चाहिये। आपको पूरी क्षमता होनी चाहिये कि वो पेपर कितना ही कठिन क्यों न हो मैं तो अच्छा कर लूँगा। आपको कॉन्फिडेंस होना चाहिये कि पेपर कितना ही लम्बा क्यों न होगा में तो सफल रहूँगा या रहूँगी। कॉन्फिडेंस रहना चाहिये कि में तीन घंटे का समय है तो तीन घंटे में, दो घंटे का समय है तो दो घंटे में, समय से पहले मैं अपना काम कर लूँगा और हमें तो याद है शायद आपको भी बताते होंगे हम तो छोटे थे तो हमारी टीचर बताते थे जो सरल क्वेश्चन है उसको सबसे पहले ले लीजिये, कठिन को आखिर में लीजिये। आपको भी किसी न किसी ने बताया होगा और मैं मानता हूँ इसको तो आप जरुर पालन करते होंगे।
दोस्तो माई गोव पर मुझे कई सुझाव, कई अनुभव आए हैं । वो सारे तो मैं शिक्षा विभाग को दे दूंगा, लेकिन कुछ बातों का मैं उल्लेख करना चाहता हूँ!
मुंबई महाराष्ट्र के अर्णव मोहता ने लिखा है कि कुछ लोग परीक्षा को जीवन मरण का इशू बना देते हैं अगर परीक्षा में फेल हो गए तो जैसे दुनिया डूब गयी हैं। तो वाराणसी से विनीता तिवारी जी, उन्होंने लिखा है कि जब परिणाम आते है और कुछ बच्चे आत्महत्या कर देते हैं, तो मुझे बहुत पीड़ा होती है, ये बातें तो सब दूर आपके कान में आती होंगी, लेकिन इसका एक अच्छा जवाब मुझे किसी और एक सज्जन ने लिखा है। तमिलनाडु से मिस्टर आर. कामत, उन्होंने बहुत अच्छे दो शब्द दिए है, उन्होंने कहा है कि स्टूडेंट्स worrier मत बनिए, warrior बनिए, चिंता में डूबने वाले नहीं, समरांगन में जूझने वाले होने चाहिए, मैं समझता हूँ कि सचमुच मैं हम चिंता में न डूबे, विजय का संकल्प ले करके आगे बढ़ना और ये बात सही है, जिंदगी बहुत लम्बी होती है, उतार चढाव आते रहते है, इससे कोई डूब नहीं जाता है, कभी कभी अनेच्छिक परिणाम भी आगे बढ़ने का संकेत भी देते हैं, नयी ताकत जगाने का अवसर भी देते है!
एक चीज़ मैंने देखी हैं कि कुछ विद्यार्थी परीक्षा खंड से बाहर निकलते ही हिसाब लगाना शुरू कर देते है कि पेपर कैसा गया, यार, दोस्त, माँ बाप जो भी मिलते है वो भी पूछते है भई आज का पेपर कैसा गया? मैं समझता हूँ कि आज का पेपर कैसा गया! बीत गयी सो बात गई, प्लीज उसे भूल जाइए, मैं उन माँ बाप को भी प्रार्थना करता हूँ प्लीज अपने बच्चे को पेपर कैसा गया ऐसा मत पूछिए, बाहर आते ही उसको कह दे वाह! तेरे चेहरे पर चमक दिख रही है, लगता है बहुत अच्छा पेपर गया? वाह शाबाश, चलो चलो कल के लिए तैयारी करते है! ये मूड बनाइये और दोस्तों मैं आपको भी कहता हूँ, मान लीजिये आपने हिसाब किताब लगाया, और फिर आपको लगा यार ये दो चीज़े तो मैंने गलत कर दी, छः मार्क कम आ जायेंगे, मुझे बताइए इसका विपरीत प्रभाव, आपके दूसरे दिन के पेपर पर पड़ेगा कि नहीं पड़ेगा? तो क्यों इसमें समय बर्बाद करते हो? क्यों दिमाग खपाते हो? सारी एग्जाम समाप्त होने के बाद, जो भी हिसाब लगाना है, लगा लीजिये! कितने मार्क्स आएंगे, कितने नहीं आएंगे, सब बाद में कीजिये, परीक्षा के समय, पेपर समाप्त होने के बाद, अगले दिन पर ही मन केन्द्रित कीजिए, उस बात को भूल जाइए, आप देखिये आपका बीस पच्चीस प्रतिशत बर्डन यूं ही कम हो जाएगा
मेरे मन मे कुछ और भी विचार आते चले जाते हैं खैर मै नहीं जानता कि अब तो परीक्षा का समय आ गया तो अभी वो काम आएगा। लेकिन मै शिक्षक मित्रों से कहना चाहता हूँ, स्कूल मित्रों से कहना चाहता हूँ कि क्या हम साल में दो बार हर टर्म में एक वीक का परीक्षा उत्सव नहीं मना सकते हैं, जिसमें परीक्षा पर व्यंग्य काव्यों का कवि सम्मलेन हो. कभी एसा नहीं हो सकता परीक्षा पर कार्टून स्पर्धा हो परीक्षा के ऊपर निबंध स्पर्धा हो परीक्षा पर वक्तोतव प्रतिस्पर्धा हो, परीक्षा के मनोवैज्ञानिक परिणामों पर कोई आकरके हमें लेक्चर दे, डिबेट हो, ये परीक्षा का हव्वा अपने आप ख़तम हो जाएगा। एक उत्सव का रूप बन जाएगा और फिर जब परीक्षा देने जाएगा विद्यार्थी तो उसको आखिरी मोमेंट से जैसे मुझे आज आपका समय लेना पड़ रहा है वो लेना नहीं पड़ता, वो अपने आप आ जाता और आप भी अपने आप में परीक्षा के विषय में बहुत ही और कभी कभी तो मुझे लगता है कि सिलेबस में ही परीक्षा विषय क्या होता हैं समझाने का क्लास होना चाहिये। क्योंकि ये तनावपूर्ण अवस्था ठीक नहीं है
दोस्तो मैं जो कह रहा हूँ, इससे भी ज्यादा आपको कईयों ने कहा होगा! माँ बाप ने बहुत सुनाया होगा, मास्टर जी ने सुनाया होगा, अगर टयूशन क्लासेज में जाते होंगे तो उन्होंने सुनाया होगा, मैं भी अपनी बाते ज्यादा कह करके आपको फिर इसमें उलझने के लिए मजबूर नहीं करना चाहता, मैं इतना विश्वास दिलाता हूँ, कि इस देश का हर बेटा, हर बेटी, जो परीक्षा के लिए जा रहे हैं, वे प्रसन्न रहे, आनंदमय रहे, हसंते खेलते परीक्षा के लिए जाए!
आपकी ख़ुशी के लिए मैंने आपसे बातें की हैं, आप अच्छा परिणाम लाने ही वाले है, आप सफल होने ही वाले है, परीक्षा को उत्सव बना दीजिए, ऐसा मौज मस्ती से परीक्षा दीजिए, और हर दिन अचीवमेंट का आनंद लीजिए, पूरा माहौल बदल दीजिये। माँ बाप, शिक्षक, स्कूल, क्लासरूम सब मिल करके करिए, देखिये, कसौटी को भी कसने का कैसा आनंद आता है, चुनौती को चुनौती देने का कैसा आनंद आता है, हर पल को अवसर में पलटने का क्या मजा होता है, और देखिये दुनिया में हर कोई हर किसी को खुश नहीं कर सकता है!
मुझे पहले कविताएं लिखने का शौक था, गुजराती में मैंने एक कविता लिखी थी, पूरी कविता तो याद नहीं, लेकिन मैंने उसमे लिखा था, सफल हुए तो ईर्ष्या पात्र, विफल हुए तो टिका पात्र, तो ये तो दुनिया का चक्र है, चलता रहता है, सफल हो, किसी को पराजित करने के लिए नहीं, सफल हो, अपने संकल्पों को पार करने के लिए, सफल हो अपने खुद के आनंद के लिए, सफल हो अपने लिए जो लोग जी रहे है, उनके जीवन में खुशियाँ भरने के लिए, ये ख़ुशी को ही केंद्र में रख करके आप आगे बढ़ेंगे, मुझे विश्वास है दोस्तो! बहुत अच्छी सफलता मिलेगी, और फिर कभी, होली का त्यौहार मनाया कि नहीं मनाया, मामा के घर शादी में जा पाया कि नहीं जा पाया, दोस्तों कि बर्थडे पार्टी में इस बार रह पाया कि नहीं रह पाया, क्रिकेट वर्ल्ड कप देख पाया कि नहीं देख पाया, सारी बाते बेकार हो जाएँगी , आप और एक नए आनंद को नयी खुशियों में जुड़ जायेंगे, मेरी आपको बहुत शुभकामना हैं, और आपका भविष्य जितना उज्जवल होगा, देश का भविष्य भी उतना ही उज्जवल होगा, भारत का भाग्य, भारत की युवा पीढ़ी बनाने वाली है, आप बनाने वाले हैं, बेटा हो या बेटी दोनों कंधे से कन्धा मिला करके आगे बढ़ने वाले हैं!
आइये, परीक्षा के उत्सव को आनंद उत्सव में परिवर्तित कीजिए, बहुत बहुत शुभकामनाएं!
(Hon’ble Shri Narendra Modi):
Today, Shri Barack Obama, President of the United States, joins us in a special programme of Mann Ki Baat. For the last few months, I have been sharing my "Mann Ki Baat" with you. But today, people from various parts of the country have asked questions.
But most of the questions are connected to politics, foreign policy, economic policy. However, some questions touch the heart. And I believe if we touch those questions today, we shall be able to reach out to the common man in different parts of the country. And therefore, the questions asked in press conferences, or discussed in meetings – instead of those – if we discuss what comes from the heart, and repeat it, hum it, we get a new energy. And therefore, in my opinion, those questions are more important. Some people wonder, what does "Barack" mean? I was searching for the meaning of Barack. In Swahili language, which is spoken in parts of Africa, Barack means, one who is blessed. I believe, along with a name, his family gave him a big gift.
African countries have lived by the ancient idea of ‘Ubuntu’, which alludes to the ‘oneness in humanity’. They say – “I am, because we are”. Despite the gap in centuries and borders, there is the same spirit of Vasudhaiva Kutumbakam, which speak of in India. This is the great shared heritage of humanity. This unites us. When we discuss Mahatma Gandhi, we remember Henry Thoreau, from whom Mahatma Gandhi learnt disobedience. When we talk about Martin Luther King or Obama, we hear from their lips, respect for Mahatma Gandhi. These are the things that unite the world.
Today, Barack Obama is with us. I will first request him to share his thoughts. Then, I and Barack will both answer the questions that have been addressed to us.
I request President Barack Obama to say a few words.
(Hon’ble Shri Barack Obama):
Namaste! Thank you Prime Minister Modi for your kind words and for the incredible hospitality you have shown me and my wife Michelle on this visit and let me say to the people of India how honoured I am to be the first American President to join you for Republic Day; and I’m told that this is also the first ever Radio address by an Indian Prime Minister and an American President together, so we’re making a lot of history in a short time. Now to the people of India listening all across this great nation. It’s wonderful to be able to speak you directly. We just come from discussions in which we affirmed that India and the United States are natural partners, because we have so much in common. We are two great democracies, two innovative economies, two diverse societies dedicated to empowering individuals. We are linked together by millions of proud Indian Americans who still have family and carry on traditions from India. And I want to say to the Prime Minister how much I appreciate your strong personal commitment to strengthening the relationship between these two countries.
People are very excited in the United States about the energy that Prime Minister Modi is bringing to efforts in this country to reduce extreme poverty and lift people up, to empower women, to provide access to electricity, and clean energy and invest in infrastructure, and the education system. And on all these issues, we want to be partners. Because many of the efforts that I am promoting inside the United States to make sure that the young people get the best education possible, to make sure that the ordinary people are properly compensated for their labour, and paid fair wages, and have job security and health care. These are the same kinds of issues that Prime Minister Modi, I know cares so deeply about here. And I think there’s a common theme in these issues. It gives us a chance to reaffirm what Gandhi ji reminded us, should be a central aim of our lives. And that is, we should endeavour to seek God through service of humanity because God is in everyone. So these shared values, these convictions, are a large part of why I am so committed to this relationship. I believe that if the United States and India join together on the world stage around these values, then not only will our peoples be better off, but I think the world will be more prosperous and more peaceful and more secure for the future. So thank you so much Mr. Prime Minister, for giving me this opportunity to be with you here today.
(Hon’ble Shri Narendra Modi):
Barack the first question comes from Raj from Mumbai
His question is, the whole world knows about your love for your daughters. How will you tell your daughters about youre experience of India? Do you plan to do some shopping for them?
(Hon’ble Shri Barack Obama):
Well first of all they very much wanted to come. They are fascinated by India, Unfortunately each time that I have taken a trip here, they had school and they couldn’t leave school. And in fact, Malia, my older daughter, had exams just recently. They are fascinated by the culture, and the history of India, in part because of my influence I think, they are deeply moved by India’s movement to Independence, and the role that Gandhi played, in not only the non-violent strategies here in India, but how those ended up influencing the non-violent Civil Rights Movement in the United States. So when I go back I am going to tell them that India is as magnificent as they imagined. And I am quite sure that they are going to insist that I bring them back the next time I visit. It may not be during my Presidency, but afterwards they will definitely want to come and visit.
And I will definitely do some shopping for them. Although I can’t go to the stores myself, so I have to have my team do the shopping for me. And I’ll get some advice from Michelle, because she probably has a better sense of what they would like.
(Hon’ble Shri Narendra Modi):
Barack said he will come with his daughters. I extend an invitation to you. Whether you come as President, or thereafter, India looks forward to welcoming you and your daughters.
Sanika Diwan from Pune, Maharashtra has asked me a question. She asks me, whether I have sought assistance from President Obama for the Beti Bachao, Beti Padhao Mission
Sanika you have asked a good question. There is a lot of worry because of the sex ratio in India. For every 1000 boys, the number of girls is less. And the main reason for this is that, there is a defect in our attitudes towards boys and girls.
Whether or not I seek help from President Obama, his life is in itself an inspiration. The way he has brought up his two daughters, the way he is proud of his two daughters.
In our country too, I meet many families who have only daughters. And they bring up their daughters with such pride, give them such respect, that is the biggest inspiration. I believe that inspiration is our strength. And in response to your question, I would like to say, to save the girl child, to educate the girl child, this is our social duty, cultural duty, and humanitarian responsibility. We should honour it.
Barack, there is a question for you. The second question for President Obama comes through e-mail: Dr. Kamlesh Upadhyay, a Doctor based in Ahmedabad, Gujarat - Your wife is doing extensive work on tackling modern health challenges like obesity and diabetes. These are increasingly being faced in India as well. Would you and the First Lady like to return to India to work on these issues after your Presidency, just like Bill and Melinda Gates?
(Hon’ble Barack Obama):
Well, we very much look forward to partnering with organizations, and the government and non-governmental organizations here in India, around broader Public Health issues including the issue of obesity. I am very proud of the work that Michelle has done on this issue. We’re seeing a world-wide epidemic of obesity, in many cases starting at a very young age. And a part of it has to do with increase in processed foods, not naturally prepared. Part of it is a lack of activity for too many children. And once they are on this path, it can lead to a life time of health challenges. This is an issue that we would like to work on internationally, including here in India. And it is a part of a broader set of issues around global health that we need to address. The Prime Minister and I have discussed, for example, how we can do a better job in dealing with issues like pandemic. And making sure that we have good alert systems so that if a disease like Ebola, or a deadly flu virus, or Polio appears, it is detected quickly and then treated quickly so that it doesn’t spread. The public health infrastructure around the world needs to be improved. I think the Prime Minister is doing a great job in focusing on these issues here in India. And India has a lot to teach many other countries who may not be advancing as rapidly in improving this public health sector. But it has an impact on everything, because if children are sick they can’t concentrate in school and they fall behind. It has a huge economic impact on the countries involved and so we think that there is a lot of progress to be made here and I am very excited about the possibilities of considering this work even after I leave office.
(Hon’ble Shri Narendra Modi):
Mr. Arjun asks me a question. An interesting question. He says he has seen an old photo of me as a tourist outside the White House. He asks me what touched me when I went there last September.
It is true that when I first went to America, I was not lucky enough to visit the White House. There is an iron fence far from the White House. We stood outside the fence and took a photograph. White House is visible in the background. Now that I have become Prime Minister, that photo too has become popular. But at that time, I had never thought that sometime in my life, I would get a chance to visit the White House. But when I visited the White House, one thing touched my heart. I can never forget that. Barack gave me a book, a book that he had located after considerable effort. That book had become famous in 1894. Swami Vivekananda, the inspiration of my life, had gone to Chicago to participate in the World Religions Conference. And this book was a compilation of the speeches delivered at the World Religions Conference. That touched my heart. And not just this. He turned the pages of the book, and showed me what was written there. He had gone through the entire book! And he told me with pride, I come from the Chicago where Swami Vivekananda had come. These words touched my heart a lot. And I will treasure this throughout my life. So once, standing far from the White House and taking a photo, and then, to visit the White House, and to receive a book on someone whom I respect. You can imagine, how it would have touched my heart.
Barack there is a question for you. Himani from Ludhiana, Punjab. Question is for you ……:
(Hon’ble Shri Barack Obama):
Well the question is “Did you both imagine you would reach the positions that you’ve reached today?”
And it is interesting, Mr. Prime Minister, your talking about the first time you visited White House and being outside that iron fence. The same is true for me. When I first went to the White House, I stood outside that same fence, and looked in, and I certainly did not imagine that I would ever be visiting there, much less living there. You know, I think both of us have been blessed with an extraordinary opportunity, coming from relatively humble beginnings. And when I think about what’s best in America and what’s best in India, the notion that a tea seller or somebody who’s born to a single mother like me, could end up leading our countries, is an extraordinary example of the opportunities that exist within our countries. Now I think, a part of what motivates both you and I, is the belief that there are millions of children out there who have the same potential but may not have the same education, may not be getting exposed to opportunities in the same way, and so a part of our job, a part of government’s job is that young people who have talent, and who have drive and are willing to work for, are able to succeed. And that’s why we are emphasizing school, higher education. Making sure that children are healthy and making sure those opportunities are available to children of all backgrounds, girls and boys, people of all religious faiths and of all races in the United States is so important. Because you never know who might be the next Prime Minister of India, or who might be the next President of United States. They might not always look the part right off the bat. And they might just surprise you if you give them the chance.
(Hon’ble Shri Narendra Modi):
Thank you Barack.
Himani from Ludhiana has also asked me this question – did I ever imagine I would reach this high office?
No. I never imagined it. Because, as Barack said, I come from a very ordinary family. But for a long time, I have been telling everyone, never dream of becoming something. If you wish to dream, dream of doing something. When we do something, we get satisfaction, and also get inspiration to do something new. If we only dream of becoming something, and cannot fulfil the dream, then we only get disappointed. And therefore, I never dreamt of becoming something. Even today, I have no dream of becoming something. But I do dream of doing something. Serving Mother India, serving 125 crore Indians, there can be no greater dream than this. That is what I have to do. I am thankful to Himani.
There is a question for Barack from Omprakash. Omprakash is studying Sanskrit at JNU. He belongs to Jhunjunu, Rajasthan. Om Prakash is convener of special centre for Sanskrit Studies in JNU.
(Hon’ble Shri Barack Obama):
Well this is a very interesting question. His question is, the youth of the new generation is a global citizen. He is not limited by time or boundaries. In such a situation what should be the approach by our leadership, governments as well as societies at large.
I think this is a very important question. When I look at this generation that is coming up, they are exposed to the world in ways that you and I could hardly imagine. They have the world at their fingertips, literally. They can, using their mobile phone, get information and images from all around the world and that’s extraordinarily powerful. And what that means, I think is that, governments and leaders cannot simply try to govern, or rule, by a top-down strategy. But rather have to reach out to people in an inclusive way, and an open way, and a transparent way. And engage in a dialogue with citizens, about the direction of their country. And one of the great things about India and the United States is that we are both open societies. And we have confidence and faith that when citizens have information, and there is a vigorous debate, that over time even though sometimes democracy is frustrating, the best decisions and the most stable societies emerge and the most prosperous societies emerge. And new ideas are constantly being exchanged. And technology today I think facilitates that, not just within countries, but across countries. And so, I have much greater faith in India and the United States, countries that are open information societies, in being able to succeed and thrive in this New Information Age; than closed societies that try to control the information that citizens receive. Because ultimately that’s no longer possible. Information will flow inevitably, one way or the other, and we want to make sure we are fostering a healthy debate and a good conversation between all peoples.
(Hon’ble Shri Narendra Modi):
Omprakash wants me too, to answer the question that has been asked to Barack.
Barack has given a very good answer. It is inspiring. I will only say, that once upon a time, there were people inspired primarily by the Communist ideology. They gave a call: Workers of the world, Unite. This slogan lasted for several decades. I believe, looking at the strength and reach of today's youth, I would say, Youth, Unite the world. I believe they have the strength and they can do it.
The next question is from CA Pikashoo Mutha from Mumbai, and he asks me, which American leader has inspired you
When I was young, I used to see Kennedy's pictures in Indian newspapers. His personality was very impressive. But your question is, who has inspired me. I liked reading as a child. And I got an opportunity to read the biography of Benjamin Franklin. He lived in the eighteenth century. And he was not an American President. But his biography is so inspiring – how a person can intelligently try to change his life.
If we feel excessively sleepy, how can we reduce that?
If we feel like eating too much, how can we work towards eating less?
If people get upset with you that cannot meet them, because of the pressure of work, then how to solve this problem?
He has addressed such issues in his biography. And I tell everyone, we should read Benjamin Franklin's biography. Even today, it inspires me. And Benjamin Franklin had a multi-dimensional personality. He was a politician, he was a political scientist, he was a social worker, he was a diplomat. And he came from an ordinary family. He could not even complete his education. But till today, his thoughts have an impact on American life. I find his life truly inspiring. And I tell you too, if you read his biography, you will find ways to transform your life too. And he has talked about simple things. So I feel you will be inspired as much as I have been.
There is a question for Barack, from Monika Bhatia.
(Hon’ble Shri Barack Obama):
Well the question is “As leaders of two major economies, what inspires you and makes you smile at the end of a bad day at work?”
And that is a very good question. I say sometimes, that the only problems that come to my desk are the ones that nobody else solves. If they were easy questions, then somebody else would have solved them before they reached me. So there are days when it’s tough and frustrating. And that’s true in Foreign Affairs. That is true in Domestic Affairs. But I tell you what inspires me, and I don’t know Mr. Prime Minister if you share this view - almost every day I meet somebody who tells me, “You made a difference in my life.”
So they’ll say, “The Health-Care law that you passed, saved my child who didn’t have health insurance.” And they were able to get an examination from a Physician, and they caught an early tumour, and now he is doing fine.
Or they will say “You helped me save my home during the economic crisis.”
Or they’ll say, “I couldn’t afford college, and the program you set up has allowed me to go to the university.”
And sometimes they are thanking you for things that you did four or five years ago. Sometimes they are thanking you for things you don’t even remember, or you’re not thinking about that day. But it is a reminder of what you said earlier, which is, if you focus on getting things done as opposed to just occupying an office or maintaining power, then the satisfaction that you get is unmatched. And the good thing about service is that anybody can do it. If you are helping somebody else, the satisfaction that you can get from that, I think, exceeds anything else that you can do. And that’s usually what makes me inspired to do more, and helps get through the challenges and difficulties that we all have. Because obviously we are not the only people with bad days at work. I think everybody knows what it is like to have a bad day at work. You just have to keep on working through it. Eventually you make a difference.
(Hon’ble Shri Narendra Modi):
Indeed Barack has spoken words from the heart (Mann Ki Baat). Whatever position we may hold, we are human too. Simple things can inspire us. I also wish to narrate an experience. For many years, I was like an ascetic. I got food at other people's homes. Whoever invited me, used to feed me as well. Once a family invited me over for a meal, repeatedly. I would not go, because I felt they are too poor, and if I go to eat at their place, I will become a burden on them. But eventually, I had to bow to their request and love. And I went to eat a meal at their home. It was a small hut, where we sat down to eat. They offered me roti made of bajra (millet), and mik. Their young child was looking at the milk. I felt, the child has never even seen milk. So I gave that small bowl of milk to the child. And he drank it within seconds. His family members were angry with him. And I felt that perhaps that child has never had any milk, apart from his mother's milk. And maybe, they had bought milk so that I could have a good meal. This incident inspired me a lot. A poor person living in a hut could think so much about my well-being. So I should devote my life to their service. So these are the things that serve as inspiration. And Barack has also spoken about what can touch the heart.
I am thankful to Barack, he has given so much time. And I am thankful to my countrymen for listening to Mann Ki Baat. I know radio reaches every home and every lane of India. And this Mann Ki Baat, this special Mann Ki Baat will echo forever.
I have an idea. I share it with you. There should be an e-book made of the talk between Barack and me today. I hope the organizers of Mann Ki Baat will release this e-book. And to you all, who have listened to Mann Ki Baat, I also say, do participate in this. And the best hundred thoughts that emerge out of this, will also be added to this e-book. And I want you to write to us on Twitter, on Facebook, or online, using the hashtag #YesWeCan.
• Eliminate Poverty - #YesWeCan • Quality Healthcare to All - #YesWeCan • Youth empowered with Education - #YesWeCan • Jobs for All - #YesWeCan • End to Terrorism - #YesWeCan • Global Peace and Progress - #YesWeCan
I want you to send your thoughts, experiences and feelings after listening to Mann Ki Baat. From them, we will select the best hundred, and we will add them to the book containing the talk that Barack and I have had. And I believe, this will truly become, the Mann Ki Baat of us all.
Once again, a big thank you to Barack. And to all of you. Barack's visit to India on this pious occasion of 26th January, is a matter of pride for me and for the country.
Thank you very much.
My Dear Fellow Countrymen,
Today I have this great opportunity of interacting with you again. You must be wondering why a Prime Minister should be interacting the way I am doing it. Well, first and foremost, I am a less of your Prime Minister and more of a Pradhan Sewak (serving the people). Since childhood I have been hearing that by sharing, our intensity of pain become less while the intensity of our joys grow manifold. Well I think, this is the guiding thought behind Mann ki Baat. It is an opportunity for me to sometimes share my concern and sometimes my joy. Sharing my deepest concerns with you makes me feel light hearted and sharing my joy just doubles my happiness.
Last time, I mentioned my concern about the youth of the country. It is not because you chose me as the Prime Minister but because I feel concerned as an individual. Sons and daughters of many families are caught in the trap of drugs. It just does not destroy the person involved, but his entire family, the society and the Nation at large. Drug is such a grave menace which destroys the most powerful individuals.
While serving as the Chief Minister of Gujarat, my officers with good records would often come to ask for leave. Initially they would hesitate to spell out the reasons, however on insisting they revealed that their child had fallen into the drug trap and they now need to spend time with their kids and rehabilitate them. I could see the bravest of my officers struggling to control their tears. I met suffering mothers too. In Punjab I had the chance to meet some mothers who were very angry and yet concerned about their children who had fallen into the trap of drugs.
We have to work together as a society to tackle this menace. I understand that the youth who fall into this drug trap are often blamed. We blame these youth as being careless and irresponsible. We perceive that the victims are bad but the fact is that the drugs are bad. The youth are not wrong; it is this addiction which is wrong. Let us not blame and wrong our kids. Let us get rid of this habit of addiction and not victimize our kids. Blaming the kids would push them further into addiction. This is in fact a psycho-socio-medical issue and let us treat it as such a problem. This menace needs to be handled carefully as its solution is not limited to medical intervention only. The individual concerned, his family, friends, the society, the government and the legal system all have to work in tandem to tackle this menace. Each one of us have to contribute to get rid of this menace.
A few days ago, I had organized a DGP level conference in Assam. I expressed my concern over this issue and my displeasure at the non-serious attitude of the people concerned. I have asked the police department to seriously discuss this issue and come out with relevant solutions. I have suggested the department to launch a toll free helpline. The families often feel ashamed to come out in open about the addiction problem of their children. They have no one to confide in. Parents from any part, any corner of the country can freely approach the police if their children have fallen a victim to addiction. The department has taken this suggestion seriously and working towards its fulfillment.
The drug menace brings about the Three D’s. These Three D’s are not the ones related to entertainment but I am talking about the Three D’s related to the three vices.
First D is Darkness, the second D is Destruction and the third D is Devastation.
Drugs lead a person to a blind path of destruction. There is nothing left in its trail but devastation. This is a topic of great concern and demands total attention.
I had mentioned this topic in my last address in Mann ki Baat. We received more than 7000 letters on our Akashvani address. Some letters were received in the government offices. We received responses on government portal, Mygov.in, online and through e-mails. Lakhs of comments were received on twitter and facebook. Hence, a deep rooted concern in the society’s psyche has found a voice.
I am especially thankful to the media of our country for carrying this concern forward. Many channels conducted hour long programs. These programs were not just meant to criticize the government. They were forums for open discussion, a concern and an effort to come out with workable solutions. These initiatives created background for healthy discussions. The government was also sensitized to its responsibilities in this direction. The government can no longer remain neutral to these concerns.
There is a question I want to ask these youth caught in the drug trap. I want to ask these youth that when for three or four hours they are in a state of intoxication, they might be feeling free of all concerns, free of all tensions and in a different world altogether. But have you ever lent a thought to the fact that when you buy drugs where does this money go to? Have you ever thought about it? Just make a guess. What if this drug money goes to the terrorists? What if this money is spent by the terrorists to procure weapons? And with this weapon the very same terrorist might be pumping bullets in the heart of my soldiers. The soldier of my country gets martyred. Have you ever thought about our soldiers- a soldier who is so dear to his mother, the treasured son of Mother India, the brave son of the soil is hit by a bullet probably funded by the money spent on purchasing drugs. I know and firmly believe that you too love your motherland and have tremendous respect for our soldiers. Then how can you support a habit which funds drug mafia and the terrorists.
Some people feel that when a person is in despair, faces failures and when he is directionless, he is an easy prey to drugs. But I feel that people who lack ambition, do not have any set goals and targets, who have a deep vacuum in their lives, are the ones where drugs will have an easy access. If you want to avoid drugs and save your children from this menace then foster ambition in them, give them dreams to pursue and make them individuals with a desire to achieve something in life. Then you will see that they will not be easily distracted. Their aim then will be to achieve something in life.
Have you ever followed a sportsman’s life? A sportsman is motivated forever. In the bleak winters everyone feels like sleeping in the warmth of a quilt but a sportsman will still rise at 4 or 5 and go for his workouts. Why? because the goal is set. Similarly, if your child would be aimless, there are chances of him/her to fall prey to menace like drugs.
I remember the words of Vivekananda. These words are very apt for all the young people. Just keep repeating this thought over and over again. “Take a thought, make it your life. Ponder on it and dream about it. Make it an integral part of your dreams. Make it a part of your mind, brain, veins and each and every part of your body and forget everything else”.
This thought of Vivekananda is apt for every young person and that is why I say that each person should have an ambition in life. Having an ambition does not allow your focus on unnecessary things.
Some take it under peer pressure because it looks “cool”, some consider it as a style statement. So sometimes the youth inadvertently fall into this serious trap, due to the wrong mental perception. Addiction is neither cool nor a style statement. In reality, it is a precursor to destruction. So whenever your friends boast about their drug habits, do not applaud and enjoy such conversation. Do not be a mute spectator to such absurdities. Have the courage to stand against such conversations and say NO. Have the guts to despise such a conversation, reject such a conversation and have the guts to tell the person that he is wrong.
I would like to share some views with the parents too. These days none of us have time. All of us are running against time to earn our livelihood. We are racing against time to improve the quality of our lives. But in this blind race, do we have the time to spare for our kids. Do we ever work for our kid’s spiritual progress and discuss it with them, rather we discuss only material progress. How are they doing in their studies, what has been their progress in exam, what to eat and what not to eat, where to go and where not to go – majorly these topics form the core of the entire interactions. Do we share such a relationship that our children can bare their hearts to us? I request all of you to do this. If your children share a frank relationship then you can very well know what is going on in their life. Children do not take to bad habits suddenly. It happens gradually and it also impacts the home. Observe the changes that are happening in your home. If you observe closely then I believe that you may be successful in detecting the problem at the very beginning. Be aware of your child’s friend circle and don’t keep your conversations focused just about progress. Your concern should extend to their inner depths, their thoughts, their logic, their books, their friends and their mobiles - how and where are they spending their time. These need to be taken care of. I believe that no one else can do what a parent can for their kids. Our ancestors have left us certain pearls of wisdom and that is why they are known as statesmen. A saying goes like this:
Paanch Varsh Laaw Lijiye
Dass Laaw Tadan dei
Paanch Varsh Laaw Lijiye
Dass Laaw Tadan dei
Sut Hi Solah Varsh Mein
Mitra Sarij Gani Dei
This means that till 5 years of age a child should grow in the loving and tender care of his parents, by the time he is 10 the values of discipline should be inculcated in him. Sometimes we see that an intelligent mother gets angry and does not speak with her child throughout the day. This is a big punishment for the child. The mother punishes herself but the child too gets punished in turn. The mother just has to say that I will not talk and the 10 year old will remain worried the whole day long. He changes his habit and by the time he is of 16 years then the relationship should turn like a friend towards him. There should be an open conversation with him. This is a brilliant advice which has been passed on by our ancestors. I would like to see this inculcated in our family life.
Another thing brought to our notice is the role of the pharmacists. Some of the medicines lead to addiction. So such medicines should not be distributed without a doctor’s prescription. Sometimes a simple thing like a cough syrup can trigger addiction. It becomes the starting point for addiction. There are quite a few things that I would not like to raise from this platform. But we will have to follow and accept this discipline.
These days many children from villages go to city for higher education and start living in a hostel or a boarding school. I have heard that sometimes these avenues become the entry point of such addiction. For this the education system, the society and the security force will have to act as a vigilante. Each one will have to fulfill their roles and responsibilities. The government will fulfill the responsibilities on its end. We should constantly strive to fulfill our obligations.
I would also like to mention about the letters we have received. Some of them are interesting, some are filled with grief and some are inspiring. I cannot mention all, but I would like to mention one. There was a certain Mr. Dutt. He was deep into addiction .He was also jailed where he had several restrictions. Then later his life changed. He studied in jail and then his life was transformed. His story is very famous. He was in Yerawada Jail. There might be many such inspiring stories. Many people have been victorious in their fight against addiction. We too can come out of such habits and so we should definitely try. We should make efforts for de-addiction and rehabilitation. I would ask celebrities to be a part of this initiative - be it from the field of cinema, sports or someone concerned with public life. Be it the cultural or spiritual world, we should use every possible platform to create awareness. There should be constant messages in public interest. They will certainly have an effect. Those active on the social media, I would request them to create a continuous online movement by joining #DrugsFreeIndia hash-tag. This is more relevant because most of the addicted youth are a part of the social media. If we take this #DrugsFreeIndia hash-tag movement forward then we will do a great service for public awareness and education.
I want to take this concern forward. I would request all those who have successfully come out of this addiction to share their stories. I touched this topic because like I said in the beginning grief becomes less on sharing. This is a topic of national concern and I am not here to sermonize. And neither am I entitled to preach. I am just sharing my grief with you. Those families who are suffering from this menace, I want to share their pain as well. I want to create a responsible environment. There can be difference of opinions but let us make a beginning somewhere.
Like I mentioned before, I want to share happiness. Last week I had the opportunity to meet the Blind Cricket Team. They had won the world cup. What joy and excitement, they were exuding great self confidence. God has given us everything, eyes, hands, legs i.e. we are totally capable yet we lack this kind of determination and passion which I could see in the blind cricketers. What zeal and enthusiasm, really it was contagious. I felt super charged after meeting them. Such incidents bring great pleasure in life.
In the past few days there was yet another important news. The cricket team from Kashmir defeated Mumbai on their home ground. I do not view it as a matter of someone’s victory and other’s loss. I view it differently. All the stadiums in Kashmir have been inundated after the floods. Kashmir is passing through a tough phase. The circumstances have been extremely grim with these boys not standing any chance to practice. But the Team Spirit shown by these boys, their conviction and determination is awe inspiring. These boys have shown us that one can overcome the most trying and testing circumstances if one remains focused on our goals. This news gave me immense pleasure and I take this opportunity to congratulate all these players on their victory.
Two days back, the United Nations has decided to celebrate June 21st as International Yoga Day. It is a matter of great pride and honour for India. Our ancestors developed a beautiful tradition and today the entire world is associated with it. It does not merely benefit one personally but it has the potential to bring all the people together globally. The entire world came together on the issue of Yoga in the UN and a unanimous resolution was passed just two days back. 177 countries became the co-sponsors. In the past when it was decided to celebrate the birthday Mr. Nelson Mandela, 165 countries became co-sponsors. Before that efforts were on for International Toilet Day and 122 nations became co-sponsors to that initiative too. For celebrating Oct 2nd as Non Violence Day 140 Countries became co-sponsors, before that. But 177 countries co- sponsoring Yoga is a world record of sorts. I am thankful to all the countries that have come out in support and have honored the sentiments of the Indians and decided to observe World Yoga Day. It is now our duty that Yoga reaches out to the masses in its true essence.
Last week I had the chance to have a meeting with the Chief Ministers of all the states. This tradition has been going on for the past 50-60 years. This time it was organized at the Prime Minister’s residence. We started it as a retreat program with no papers, no files and no officers. It was a simple interaction where the Prime Minister and Chief Minister were all the same, seated together like friends. For an hour or two, matters of national concern were seriously discussed in a friendly atmosphere. Everyone just poured their hearts out. There was no political agenda involved. This too was a memorable experience that I wanted to share with you.
Last week I had the chance to travel to the North East. I had been there for three days. Many a times youth express their desire to see the Taj, Singapore or Dubai. But I would urge all the nature lovers, all who want to experience the divinity in nature, to take a tour of the North East. I had gone earlier too. This time when I went as the Prime Minister, I tried to explore its potential. Our North east has tremendous potential and possibilities. It’s a land of beautiful people and beautiful surroundings. I was filled with immense joy visiting that place. Sometimes people ask Modi ji don’t you get tired? I want to say that whatever little fatigue I had, well the North East took it away completely, I am thoroughly rejuvenated. Such is the pleasure that I derived from that visit. The love and respect accorded by the people there is something that will stay with me forever. The kinship and affinity showed by the people of the North East touched me deeply. I will also tell you, it is not a joy for only Modi to enjoy, it is there for you to enjoy too. So do travel to the North East and enjoy.
The next edition of Mann Ki Baat will happen in 2015. This is probably my last program in 2014. I wish you all a Merry Christmas. I would like to wish all the very best of New Year hes in advance. It gives me immense pleasure to know that this program Mann Ki Baat is broadcast in regional languages by the Local Radio stations that same night at 8 pm. And it is surprising to know some of the regional voice-over artists also speak in the voice very similar to me. I am surprised at the brilliant work being done by the artists associated at Akashvani and I would like to congratulate them. I consider this as an effective medium to connect to the masses. We have had tremendous response. Seeing the response Akashvani has devised a new method. They have taken a new Post Box number. So now if you wish to write into me you can write on this Post Box number.
Mann Ki Baat
Post Box no 111, Akashvani
New Delhi.
I will be awaiting your letters. You do not realize that your letters become my inspiration. Some suggestions penned down can do good to the entire nation. I am thankful to you all. We will meet next in 2015 and on some Sunday morning we will again have our own Mann Ki Baat.
Thank you very much.
My dear fellow countrymen,
I am with you again almost after a month. A month is quite a long time. Lots of things keep happening in the world. You all have recently celebrated the festival of Diwali with great fervour and joy. It is these festivals which bring happiness in our daily lives from time to time. Be it poor or rich, people from village or from urban areas, festivals hold a different significance in everyone’s lives. This is my first meeting after Diwali, so I convey my very warm wishes to you all.
Last time we had some general conversation. But then I came to some new realizations after that conversation. Sometimes we think leave it… nothing is going to change, people are indifferent, they will not do anything, our country is like this. From my last conversation in Mann Ki Baat to this one, I would urge you all to change this mindset. Neither is our country is like this nor our people indifferent. Sometimes I feel the Nation is way ahead and the government is lacking behind. And from my personal experience I will say that the governments too needs to change their mindsets. And I say that because I can see tremendous sense of commitment in the Indian youth. They are very eager to do their bit and are just seeking an opportunity where they can do their bit. And they are making efforts at their own end. Last time I had asked them to buy at least one khadi outfit. I had not asked anyone to be Khadidhari, But the feedback I got from Khadi stores was that in a week’s time the sales had jumped up by 125%. In this way, as compared to last year the sales this year is more than double in the week following 2nd Oct. This means, the people of our country is many times more than we think of. I salute all my fellow Indians.
Cleanliness……….. Can anyone imagine that cleanliness will become a such a huge public movement. The expectations are high and they should be so. I can see some good results, cleanliness can now be witnessed in two parts. One is those huge garbage piles which keep lying in the city; well the people in the government will work to remove those. It is a big challenge but you cannot run away from your responsibilities. All state governments and all municipalities will now have to take concrete actions due to the rising public pressure. Media is playing a very positive role in this. But there is the second aspect which gives me immense pleasure, happiness and a sense of satisfaction that the general public has started feeling that leave what happened in the past, now they will not dirty their surroundings. We will not add to the existing dirt. A gentleman Mr Bharat Gupta has sent me a mail on mygov.in from Satna, Madhya Pradesh. He has related his personal experience during his tour of the railways. He said that people eat on trains and usually litter around. He continues to say that he has been touring from the past many years but it is this time around no one was littering, rather they were looking for dustbins to throw their trash. When they could not see any arrangements they collected all their litter in a corner. He says that it was a very gratifying experience for me. I thank Bharat ji for sharing this experience with me.
What I am seeing is that this campaign has had a great influence on kids. Many families mention that now whenever kids eat a chocolate they themselves pick the wrapper and disposes it. I was seeing a message on the social media. Someone had posted a picture with the Title “My hero of the Day”. This picture was that of a little kid who, picks up trash, wherever he goes, even when going to school. He is himself motivated to do this. Just see…people now feel it is their country and they will not make it dirty. We will not add to the existing dirt pile. And those do litter feel ashamed for someone is around to point it out to them. I consider all these to be good omens.
Another thing is that many people come to meet me who are from all the sections of the society. They can be government officers, from film world, sports world, industrialists, scientists ……. All of them, whenever they interact with me, in ten minutes discussion, about four to five minutes the discussion is on social issues. Someone talks about cleanliness, while some others talk about education, while someone talks about social reforms. Some people discuss the ruining of family life. I initially thought if a businessman comes, he will definitely talk of things of his personal interest. But I am seeing a major change.
They talk less about their interest and more about taking on some or the other social responsibility. When I add up all these small incidents I see a larger picture and I realize that we are moving in the right direction. It is true that unhealthy environment leads to diseases and sickness, but where does sickness strike first. It first strikes the poor household. When we work towards cleanliness, we make a major effort in the direction of helping the poor. If the poor families are saved from diseases, then they will be saved from a lot of financial problems. If a person is healthy, then he will work hard, earn for the family and help in running the family smoothly. And so this cleanliness drive is directly related to the health and welfare of my poor brethren. We may not be able to do something to help the poor, but even keeping the environs clean helps the poor in a big way. Let us view it from this perspective; it will be very beneficial.
I receive different kinds of letters. Last time I had mentioned about our specially abled children. Whom God has given some kind of deficiencies; I had expressed my feelings regarding those people. I see that people who work in this field are sending me their success stories. But I came to know about two things from my people in the government. The people from the HRD ministry after hearing my talk, felt the need to do something. And the officers came together to work out an action plan. This is an example of how changes are coming about in governance. One they have decided that those specially abled who want to pursue technical education, a thousand of them who are good will be selected for Special Scholarships, and a plan has been made. I congratulate the officials who could think in those lines. Another important decision is that all the Kendriya Vidyalaya’s and all Central Universities will have a special infrastructure for the specially abled, for example if they can’t climb stairs then there will be provision for ramps to facilitate movement by wheel chair. They need different kinds of toilets. The HRD ministry has decided to allocate an additional Lakh rupees to the Kendriya Vidyalays and Central universities. This fund will be used by these institutions to create infrastructure for the specially abled. This is an auspicious beginning……………these things will lead us to change.
I had the chance to visit Siachin a few days back. I spent Diwali with the Jawans who are ready to lay down their lives for the nation. When the nation was celebrating Diwali I was at Siachin. It is because of them that we were able to celebrate Diwali, so I wanted to be with them. I experienced the difficulties in which they spent their time there. I salute all my Jawans. But I want to share another matter of great pride with you. Our Jawans work in the field of security. In calamities, they risk their lives to save our life. They also fetch medals for us in sporting events. You will be glad to know that these Jawans have won a gold medal in a very prestigious event in Britain called Cambrian Patrol, defeating contestants from 140 nations. I offer these Jawans my heartiest congratulations.
I also got an opportunity to meet, the young and dynamic students, boys and girls over tea who had won medals in Sports. They give me renewed energy. I was seeing their zeal and enthusiasm. The facilities in our country are quite less as compared to other nations, but instead of complaining they were just sharing their joy and excitement. For me, this tea programme for these players was very inspiring, and I felt really good.
I would like to tell you something more and that too from my heart. I truly believe that people of my country trust my words and my intentions. But, today one more time, I want to reiterate my commitment. As far as black money is concerned, my people, please trust your Prime Servant, for me this is the Article of Faith. This is my commitment that the hard-earned money of the poor people stashed abroad, every penny of that should be brought back. The ways and means to be followed can be different. And this is very obvious in a democratic country, but on the basis of as much I understand and as much I know, I assure you that we are on the right track. Today, nobody, neither me, nor the government, nor you, nor even the previous government knew how much money is stashed abroad. Everyone gives estimate calculated in his/her own way. I don’t want to get lost in some such figures and estimates, Its my commitment that, be it 2 rupees, or 5 rupees, or millions or even billions, this is the hard-earned money of the poor people of my country and it has to come back. And I assure you that I will keep trying till the end. No efforts will be spared. I want your blessings to be always with me. I assure you that I will do whatever and whenever something is required to be done for you. I give my commitment to you.
I have received a letter. It has been sent by Sri Abhishek Pareekh. The same sentiments were expressed to me by many mothers and sisters when I was not even the Prime Minister. Some doctor friends had also expressed their concern and I too have expressed my views on this issue a number of times in the past. Mr. Parikh has drawn my attention towards the increase of drug addiction that is fast catching up with our young generation. He has asked me to discuss this topic in “Mann ki Baat.” I agree with his concern and I will definitely include this topic, in my next edition of Mann Ki Baat. I will discuss the topic of drugs, drug addiction and drug mafia and how they are a threat to our country’s youth. If you have some experience, any information in this regard, if you have ever rescued any child from this drug addiction, if you know of any ways and means to help, if any government official has played a good role, if you give me any such information, I will convey such efforts to the public and together we will try to create an environment in each family that no child ever thinks of choosing this vice out of sheer frustration. I will definitely discuss this in detail in the next edition.
I know I am choosing those topics which put the government in the dock. But how long will we keep these things hiding? How long will we brush these important concerns under the carpet? Some day or the other we need to take a call, follow our instincts and for grand intentions tough calls are equally important. I am mustering the courage to do so because your love inspires me to do so. And I will continue to do such things because of your love.
Some people told me “ Modi ji you asked us to send you suggestions on Facebook, twitter or email. But a large section of the social class does not have access to these facilities, so what can they do. Your point is very valid. Everyone does not have this facility. Well then, if you have something to say related to Mann Ki Baat, that you hear on the radio even in the villages then do write into me on the following address
Mann Ki Baat
Akashvani
Sansad Marg
New Delhi.
Even if you send some suggestions through letters they will definitely reach me. And I will take them seriously as active citizens are the biggest asset for development. You write one letter, it indicates that you are very active. When you give your opinion, it means that you are concerned with national issues and this is strength of the nation. I welcome you.
For my Mann Ki Baat, your mann ki baat sould also reach me. Maybe you will definitely write a letter. I will try and interact with you again next month. I will try, that whenever I talk, it is Sunday, around 11 am. So I am getting closer to you.
The weather is changing. Winters are slowly setting in. This is a good month for health. Some find it a good season for eating. Some find it good for wearing nice clothes. Besides food and clothes it is a good season for health. Don’t let it go waste. Make the most of it.
Thank You.
My Dear Countrymen,
Today is the holy festival of Vijay Dashami. My heartiest greetings on this occasion of Vijay Dashami to one and all.
Through the medium of radio, I would like to share few heartfelt thoughts with you today. And, I hope that not only today, this series of conversation may be carried out regularly in future. I will try my best, if possible, to take out time twice a month or even once to speak with you. In future, I have also decided that whenever I will speak to you, it would be on Sunday morning at 11am. It would be convenient for you too and I will be content to have shared my thoughts with you.
We are celebrating the festival of Vijaya Dashami today, which is a symbol of victory of Good over Evil. A gentleman named Ganesh Venkatadari, a native of Mumbai, has sent me a mail writing that we must take a vow to eliminate ten bad habits from within ourselves on the occasion of Vijaya Dashami. I express my gratitude to him for this suggestion. As individuals, all of us must be thinking to put an end to our bad habits and win over them. For the sake of our nation, I believe all of us should come together and take a vow in getting rid of the dirt and filth from our country. On the occasion of Vijaya Dashami, we must take a vow to eliminate dirt and filth and we can do so.
Yesterday, on 2nd October on the eve of Mahatma Gandhi’s birth anniversary, more than 1.25 crore countrymen have started the ‘Swachh Bharat’ movement. I had shared one thought yesterday that I will nominate nine people and they need to upload their videos of cleaning the nation on social media websites, and nominating nine more people to do the same. I want you all to join me, clean up the nation, and nominate nine more people in this drive. Eventually, the entire nation will be filled with this atmosphere. I strongly believe that all of you will join hands with me to carry this movement forward.
Whenever we think of Mahatma Gandhi, we are reminded of Khaadi. You may be wearing variety of clothes with different fabrics and company brands in your family. But is it not possible to include Khaadi too? I am not telling you to use only Khaadi products. I am just insisting to use, at least one Khaadi product, like handkerchief, or a bath towel, a bed sheet, a pillow cover, a curtain or anything of that kind. If you have an inclination for all kinds of fabrics and clothes in your family, you can also buy Khaadi products on a regular basis. I am saying this as when you buy Khaadi products, it helps poor people to light lamps on Diwali. Also, you can avail a special discount on Khaadi products from 2nd October for a month. It is a very small thing, but has a very big impact which binds you with the poor. How you see this as a success. When I speak of 1.25 crore countrymen and assess the outcome, we might assume that government will take care of everything and as individuals we stand nowhere. We have seen that if we intend to move ahead, we need to identify our potential, understand our strengths and I can swear that we form the incomparable souls of this world. You all know that our own scientists have been successful in reaching Mars, with least expenditure. We do not lack in our strengths, but have forgotten our fortes. We have forgotten ourselves. We have become hopeless. My dear Brothers and Sisters I cannot let this happen. I always remember one of the sayings by Swami Vivekananda Ji as he always used to emphasize on one thought and possibly, he might have shared this thought with many others.
Vivekananda ii used to say, once a lioness was carrying her two cubs on the way and came upon a flock of sheep from a distance. She got a desire to prey upon them and started running towards the flock. Seeing her running, one of the cub too, joined her. The other cub was left behind and the lioness moved on, post preying upon the flock. One of the cub went with the lioness but the other cub was left behind, and was brought up by a mother sheep. He grew among the sheep, started speaking their language and adapted their ways of life. He used to sit, laugh and enjoy with them. The cub who went with the lioness, was a grown-up now. Once, he happened to meet his brother and was shocked to see him. He thought in his mind,” He is a lion and is playing with sheep, talking like sheep. What is wrong with him? “He felt that his ego was at stake and went to talk to his brother. He said,” What are you doing, brother? You are a lion.” He gets a reply from his brother, “No, I am a sheep. I grew up with them. They have brought me up. Listen to my voice and the way I talk.” He said, “Come, I will show you, who you really are.” He took his brother to a well and told him to look in the water his own reflection, and asked him, if both of them had similar faces. “I am a lion, you, too, are a lion.” His brother’s self-esteem got awakened; he attained self-realization through this and even a lion brought up among sheep started roaring like a lion. His inner soul was awakened. Swami Vivekananda Ji used to say the same. My countrymen, 1.25 crore Indians have infinite strength and capabilities. We need to understand ourselves. We need to identify our inner strengths and like Swami Ji always used to say, we need to carry our self-respect, identify ourselves and move forward in life and be successful, which in turn, make our nation a winning and successful country. I believe, all our countrymen with a population of 1.25 crores are efficient, strong and can stand against any odds with confidence.
These days, I have been getting many letters through social media websites, like Facebook, from my friends. One of them, Mr. Gautam Pal, has addressed an issue regarding the specially-abled children. He has floated the idea of a separate Municipality, Municipal Corporation or councils for them. We need to plan something for them and extend moral support. I liked his suggestion and I have experienced this during my tenure as the Chief Minister of Gujarat. A Special Olympics was held in Athens in 2011. After the Olympics, I invited all the participants and winners of specially abled category from Gujarat to my home. I spent two hours with them, and it was the most emotional and inspiring incident in my life. As I believe, a specially-abled child in not only the responsibility of the parents in a family, it is the responsibility of the entire society. God has chosen this family to support a specially abled child, but a child is a responsibility of the entire nation. After this incident, I got so emotionally attached with them, that I started organizing separate Olympics for them in Gujarat. Thousands of children with their parents used to come and attend, I, too, used to attend the Olympics. There was an atmosphere of trust and, this is the reason, I liked the suggestion given by Mr. Gautam Pal and felt like sharing it with you.
It reminds me of another story. Once, a traveller was sitting at the corner of a road, and was asking everyone the way to a specific place. He continued asking the route from many people. A man, sitting beside him was observing. The traveller stood up and started asking passers-by again. He stood up and said,” The way to your destination is here.” The traveller, then, said,” Brother, you were sitting next to me for so long, saw me asking the route from everyone. If you knew the route, why didn’t you tell me before?” The man answered,” I was waiting to verify if you really intend to reach your destination or you are asking people just for your knowledge. But, when you stood up, I was assured that you truly wish to reach your destination, and decided to give confirm the address”.
My countrymen, till the time we do not decide to walk, stand on our own, we will also not get the guidance from others in our journey. We will not get the people to hold our fingers and help us in walking. We need to take the initiative in walking and I trust all my 1.25 crore Indians, who are capable of walking on their own and will keep moving.
For the past few days, I have been getting very interesting suggestions from people. I am aware, when to adapt to these suggestions. But, I want everyone to actively participate in these suggestions as we all belong to our nation, the nation does not only belong to any Government. We are the citizens of our Nation and we all need to unite without any exceptions. Some of you have suggested simplifying the registration process for Small Scale Industries. I will definitely put this under government’s notice. Some of you have written to me to incorporate skills development courses in the school curriculum from 5th standard. This will help the students to learn various skills and crafts. I loved this idea. They have also suggested that even the adults should learn skills development courses along with their studies. One of the suggestions given was to keep a dustbin at every 100 meters and a putting in place a cleaning system.
Some of you have written to me, to abolish the use of plastic bags. I am receiving numerous suggestions from people. I have always been telling you, to write to me and narrate a true incident, which is positive and inspiring to me and our Countrymen, along with the evidence. If you do this, I can promise this to you, that I will share all those heartfelt thoughts or suggestions with all our Countrymen, through Mann ki Baat.
I have only one intention in speaking with you all,” Come, let us serve our Mother India. Let us all take our nation to the new heights. Let us all take a step forward. If you take one step, our nation takes 1.25 crore steps to move forward, and for this purpose, on this auspicious occasion of Vijaya Dashami, we all need to defeat all of our inner evils and pledge to do something good for the nation. A beginning has been made today. I will be sharing my heartfelt thoughts with one and all. Today, I have shared all the thoughts coming directly from my heart. I will meet you all next at 11 am on Sundays, but I trust our journey shall never end and will continue receiving love and suggestions from you.
After listening to my thoughts, please do not hesitate in sharing your thoughts or advice to me, I will appreciate that your suggestions keep flowing coming. I am glad to talk with you through this simple medium of Radio, which serves each and every corner of the nation. I can reach the poorest homes, as mine, my nation’s strength lies within the hut of Poor, within the villages; my nation’s strength lies with the Mothers, Sisters and Youths; my nation’s strength lies with the Farmers. Nation will only progress, if you believe in it. I am expressing my trust towards the nation. I believe in your strength, hence, I believe in our nation’s future.
I would once again, like to thank one and all for taking out time and listening to me. Thank you all!