‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమానికి పది సంవత్సరాలు పూర్తి అయిన సందర్భాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వాగతించారు. మన దేశాన్ని తయారీకి, నవకల్పనకు పేరెన్నికగన్న దేశంగా తీర్చిదిద్దడానికి 140 కోట్ల మంది భారతీయులు ఉమ్మడిగా సంకల్పించుకోవడాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ రుజువుచేస్తోందని శ్రీ నరేంద్ర మోదీ తెలిపారు. ‘మేక్ ఇన్ ఇండియా’ను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని ఆయన స్పష్టం చేశారు.
సామాజిక ప్రసార మాధ్యమ వేదిక ‘ఎక్స్’ లో ప్రధాన మంత్రి ఈ కింది విధంగా ఒక సందేశాన్ని రాశారు:
‘‘ఈ రోజున, ‘మేక్ ఇన్ ఇండియా’కు పది సంవత్సరాలు పూర్తి అయిన ఘట్టాన్ని మనం గుర్తుకు తెచ్చుకొంటున్నాం. ఈ ఉద్యమాన్ని ఫలప్రదం చేయడానికి గడచిన పదేళ్ళుగా అలుపెరుగక శ్రమిస్తున్న వారందరికీ నేను అభినందనలు తెలియజేస్తున్నాను. మన దేశాన్ని తయారీ రంగానికీ, నవకల్పనలకు మారుపేరుగా తీర్చిదిద్దడానికి 140 కోట్ల మంది భారతీయులు కలసి సంకల్పం చెప్పుకోవడాన్ని ‘మేక్ ఇన్ ఇండియా’ కళ్ళకు కడుతున్నది. వివిధ రంగాలలో ఎగుమతులు ఏ విధంగా పెరిగిందీ, సామర్థ్యాలను ఏ స్థాయుల్లో పెంపొందించిందీ, తత్ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పటిష్టమైన స్థితికి చేరుకున్నదీ గమనించదగ్గ అంశాలు.
సాధ్యమైనన్ని రకాలుగా ‘మేక్ ఇన్ ఇండియా’కు ప్రోత్సాహాన్ని ఇవ్వడానికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. సంస్కరణల మార్గంలో భారతదేశం పురోగతిలో సాగిపోతూనే ఉంటుంది. మనమందరం కలిసికట్టుగా స్వయంసమృద్ధి (‘ఆత్మనిర్భర్ భారత్’) దిశగా, అభివృద్ధి చెందినటువంటి భారతదేశాన్ని (‘వికసిత్ భారత్’ను) ఆవిష్కరించుదాం’’
Today, we mark #10YearsOfMakeInIndia. I compliment all those who are tirelessly working to make this movement a success over the last decade. ‘Make in India’ illustrates the collective resolve of 140 crore Indians to make our nation a powerhouse of manufacturing and innovation.…
— Narendra Modi (@narendramodi) September 25, 2024