ఎ. ఉభయ పక్షాలు ఇచ్చిపుచ్చుకొన్న ఒప్పందాలు/ఎంఒయు ల పట్టిక
వరుస సంఖ్య |
ఎమ్ఒయు/ఒప్పందం యొక్క శీర్షిక |
భారతదేశం పక్షాన అందుకొన్న వ్యక్తి |
బాంగ్లాదేశ్ పక్షాన అందుకొన్న వ్యక్తి |
1 |
కుశియారా నది ఉమ్మడి సరిహద్దు నుండి భారతదేశం మరియు బాంగ్లాదేశ్ లు నీటిని తీసుకోవడం అనే అంశంపై భారత ప్రభుత్వ జలశక్తి మంత్రిత్వ శాఖకు మరియు బాంగ్లాదేశ్ ప్రభుత్వ జల వనరుల మంత్రిత్వ శాఖకు మధ్య ఎంఒయు. |
శ్రీ పంకజ్ కుమార్, కార్యదర్శి, జల శక్తి మంత్రిత్వ శాఖ |
శ్రీ కబీర్ బిన్ అన్వర్, సీనియర్ సెక్రట్రి, జల వనరుల మంత్రిత్వ శాఖ |
2 |
బాంగ్లాదేశ్ రైల్ వే సిబ్బంది కి భారతదేశం లో శిక్షణ ను ఇచ్చే అంశం పై భారత ప్రభుత్వ రైల్ వే ల మంత్రిత్వ శాఖ (రైల్ వే బోర్డు) కు మరియు బాంగ్లాదేశ్ ప్రభుత్వ రైల్ వే ల మంత్రిత్వ శాఖకు మధ్య ఎంఒయు. |
శ్రీ వినయ్ కుమార్ త్రిపాఠి, చైర్ మన్, రైల్వే బోర్డు |
శ్రీ ముహమ్మద్ ఇమ్రాన్, భారతదేశాని కి బాంగ్లాదేశ్ రాయబారి |
3 |
బాంగ్లాదేశ్ రైల్ వే లో ఎఫ్ఒఐఎస్, ఇంకా ఇతర ఐటి ఏప్లికేశన్స్ వంటి ఐటి వ్యవస్థల లో సహకారం అంశం పై భారత ప్రభుత్వ రైల్ వే ల మంత్రిత్వ శాఖ (రైల్ వే బోర్డు) కు మరియు బాంగ్లాదేశ్ ప్రభుత్వ రైల్ వే ల మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒయు.
|
వినయ్ కుమార్ త్రిపాఠి, చైర్ మన్, రైల్వే బోర్డు |
శ్రీ ముహమ్మద్ ఇమ్రాన్, భారతదేశాని కి బాంగ్లాదేశ్ రాయబారి |
4 |
బాంగ్లాదేశ్ న్యాయ అధికారులకు భారతదేశంలో శిక్షణ ను ఇవ్వడం తో పాటు వారి సామర్థ్యాల ను పెంచడం అనే అంశం పై భారతదేశం యొక్క నేశనల్ జూడిశల్ అకైడమి కి మరియు బాంగ్లాదేశ్ సుప్రీమ్ కోర్టు కు మధ్య ఎంఒయు. |
శ్రీ విక్రమ్. కె. దొరైస్వామి, బాంగ్లాదేశ్ కు భారతదేశం రాయబారి
|
శ్రీ ఎండి గోలమ్ రబ్బాని, రిజిస్ట్రార్ జనరల్, బాంగ్లాదేశ్ సుప్రీం కోర్టు |
5 |
భారతదేశాని కి చెందిన కౌన్సిల్ ఫార్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) కు మరియు బాంగ్లాదేశ్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఎండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (బిసిఎస్ఐఆర్) కు మధ్య విజ్ఞానశాస్త్ర పరమైన మరియు సాంకేతిక విజ్ఞాన సంబంధమైన సహకారం అంశం పై ఎంఒయు |
డాక్టర్ ఎన్. కళైసెల్వి, డిజి, సిఎస్ఐఆర్ |
డాక్టర్ ఎమ్ డి. ఆఫ్తాబ్ అలీ శేఖ్, చైర్ మన్, బిసిఎస్ఐఆర్ |
6 |
అంతరిక్ష సాంకేతిక విజ్ఞానం సంబంధి రంగాలలో సహకారానికి ఉద్దేశించిన ఎంఒయు. |
శ్రీ డి. రాధాకృష్ణన్, ఎన్ఎస్ఐఎల్ కు చైర్ మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ |
డాక్టర్ షాహ్ జహాన్ మహమూద్, బిఎస్ సిఎల్ కు చైర్ మన్ మరియు సిఇఒ
|
7 |
ప్రసార రంగం లో సహకారం అనే అంశం పై ప్రసార భారతి కి మరియు బాంగ్లాదేశ్ టెలివిజన్ (బిటివి) కి మధ్య ఎంఒయు
|
శ్రీ మయాంక్ కుమార్ అగర్వాల్, సిఇఒ, ప్రసార భారతి, |
శ్రీ శోహ్ రబ్ హొసైన్, డైరెక్టర్ జనరల్, బిటివి
|
బి. ప్రారంభించిన/ప్రకటించిన /ఆవిష్కరించిన ప్రాజెక్టుల పట్టిక
1. ఖుల్ నా లోని రామ్ పాల్ లో 1320(660x2) ఎమ్ డబ్ల్యు సామర్థ్యం కలిగి ఉండే మైత్రీ పవర్ ప్లాంటు ఆవిష్కరణ; ఈ సూపర్ క్రిటికల్ కోల్- ఫైర్ డ్ థర్మల్ పవర్ ప్లాంటు ను దాదాపు 2 బిలియన్ యుఎస్ డాలర్ వ్యయం తో ఏర్పాటు చేయడం జరుగుతున్నది. దీనిలో 1.6 బిలియన్ యుఎస్ డాలర్ మేరకు, రాయితీ తో కూడిన ఆర్థిక సహాయ పథకం లో భాగం గా ఇండియన్ డెవలప్ మెంట్ అసిస్టన్స్ గా సమకూరుతుంది.
2. రూప్ శా వంతెన ను ప్రారంభించడమైంది ; 5.13 కి.మీ. రూప్ శా రైలు బ్రిడ్జి 64.7 కిమీ పొడవున ఉండే ఖుల్ నా- మోంగ్ లా పోర్టు సింగల్ ట్రేక్ బ్రాడ్ గేజి రైల్ ప్రాజెక్టు లో ఒక ముఖ్య భాగం గా ఉంది. ఇది మోంగ్ లా పోర్టు ను మొట్టమొదటిసారిగా రైలు మార్గం ద్వారా ఖుల్ నా తో కలుపుతుంది; ఆ తరువాత బాంగ్లాదేశ్ లోని మధ్య ప్రాంతాన్ని, అలాగే ఉత్తర ప్రాంతాన్ని, అంతేకాక భారతదేశం సరిహద్దు ప్రాంతమైన పశ్చిమ బంగాల్ లోని పెట్రాపోల్ ను, ఇంకా గెదె ను కూడా ఇది కలపునుంది.
3. రహదారి నిర్మాణం సంబంధి ఉపకరణాల ను, యంత్రాల ను సరఫరా చేసేందుకు సంబంధించిన ప్రాజెక్టు; రహదారి నిర్వహణ మరియు నిర్మాణ సంబంధి ఉపకరణాల ను, ఇంకా యంత్రాల ను 25 ప్యాకేజీలు గా బాంగ్లాదేశ్ రహదారులు మరియు రాజమార్గాల విభాగాని కి సరఫరా చేయడం ఈ ప్రాజెక్టు లో భాగం గా ఉంది.
4. ఖుల్ నా దర్శన రైల్ వే లైన్ లింక్ ప్రాజెక్టు; ఇది ఇప్పటికే ఉన్నటువంటి మౌలిక సదుపాయాల ఉన్నతీకరణ ప్రాజెక్టు (బ్రాడ్ గేజ్ యొక్క డబ్లింగు) ఇది ప్రస్తుతం గెదె-దర్శన వద్ద గల క్రాస్ బార్డర్ రైల్ లింకు ను ఖుల్ నా తో కలుపుతుంది. ఈ ప్రాజెక్టు తో రెండు దేశాల కు మధ్య, ప్రత్యేకించి ఢాకా కు రైలు కనెక్శన్ లు వృద్ధి చెందుతాయి. అది మాత్రమే కాకుండా భవిష్యత్తు లో ఈ మార్గం మోంగ్ లా పోర్టు కు కూడా రైల్ కనెక్శన్ ఏర్పడుతుంది. ఈ ప్రాజెక్టు వ్యయం 312.48 మిలియన్ యుఎస్ డాలర్ మేరకు ఉండవచ్చని అంచనా.
5. పర్బతిపుర్ - కౌనియా రైల్ వే లైన్ - ఇప్పటికే క్రియాశీలం గా ఉన్నటువంటి మీటర్ గేజ్ మార్గాన్ని డ్యూయల్ గేజ్ లైన్ ప్రాజెక్టుగా మార్పు చేయాలని ఉద్దేశించడమైంది. ఈ ప్రాజెక్టుకు 120.41 మిలియన్ యుఎస్ డాలర్ వ్యయం కావచ్చని ఒక అంచనా. ఈ ప్రాజెక్టు ఇప్పటికే ఉన్న క్రాస్ బార్డర్ రైల్ మార్గాన్ని (బాంగ్లాదేశ్ లోని) బిరోల్ - (పశ్చిమ బంగాల్ కు చెందిన) రాధిక పుర్ కు కలపగలదు. దీనితో ద్వైపాక్షిక రైలు సంధానం పెంపొందుతుంది.