క్రమ సంఖ్య |
సంతకం చేసిన ఒప్పందాలు |
అవగాహనా ఒప్పందం పరిధి |
---|---|---|
1. |
హైడ్రో కార్బన్ రంగంలో సహకారానికి ఒప్పందం |
ముడి చమురు వెలికితీయడం, సహజవాయువు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, సామర్థ్య నిర్మాణం, హైడ్రోకార్బన్ విలువ ఆధారిత వ్యవస్థలో నైపుణ్యాలను పంచుకోవడం తదితర అంశాల్లో సహకారం. |
2. |
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఒప్పందం |
ఉమ్మడి కార్యకలాపాలు, శాస్త్రీయ సామగ్రి, సమాచారం పంచుకోవడం, సిబ్బంది వినిమయం ద్వారా వ్యవసాయం, దాని అనుబంధ రంగాల్లో సహకారాన్ని పెంపొందించడం |
3. |
సాంస్కృతిక వినిమయ కార్యక్రమం (2024-27) |
రంగస్థలం, సంగీతం, లలిత కళలు, సాహిత్యం, గ్రంథాలయం, వస్తుప్రదర్శనశాల వ్యవహారాల్లో సహకారంతో పాటు సాంస్కృతిక వినిమయాన్ని ప్రోత్సహించడం ద్వారా భారత్-గయానా మధ్య సాంస్కృతిక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం.
|
4. |
భారత ఫార్మకోపియాను గుర్తించేలా భారత ఫార్మకోపియా కమిషన్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ, గయానా ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల మంత్రిత్శ శాఖ మధ్య ఒప్పందం |
ఇరు పక్షాల చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా ఔషధాల నియంత్రణలో సన్నిహిత సహకార అభివృద్ధి, సమాచార మార్పిడి ప్రాధాన్యతను గుర్తించడం
|
5. |
జన ఔషధి పథకం (పీఎంబీజేపీ) అమలుకు హెచ్ఎల్ఎల్ లైఫ్ కేర్ లిమిటెడ్ సంస్థ, గయానా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య ఒప్పందం. |
పీఎంబీజేపీ పథకం ద్వారా కరీబియన్ సమూహ దేశాలకు సరసమైన ధరలకే పబ్లిక్ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీల ద్వారా ఔషధాల సరఫరా |
6. |
వైద్య ఉత్పత్తుల రంగంలో సహకారానికి సీడీఎస్‌సీవో, గయానా ఆరోగ్య మంత్రిత్వ శాఖ మధ్య అవగాహనా ఒప్పందం. |
ఔషధాలు, జీవ ఉత్పత్తులు, వైద్య పరికరాలు, సౌందర్య సాధనాల తయారీలో ఉపయోగించే ముడిపదార్థాలతో సహా ఫార్మాసూటికల్ రంగంలో వైద్య ఉత్పత్తుల నియంత్రణ దిశగా చర్చలు, సహకార వ్యవస్థల ఏర్పాటు చేయడమే లక్ష్యం |
7. |
జనాభా ఆధారంగా డిజిటల్ పరివర్తన దిశగా విజయవంతమైన సాంకేతిక పరిష్కారాలను పంచుకునేలా ఇండియా స్టాక్ అవగాహన ఒప్పందం |
|
8. |
యూపీఐ తరహా వ్యవస్థను అభివృద్ధి చేసే దిశగా ఎన్‌పీసీఐ ఇంటర్నేషనల్ పేమెంట్ లిమిటెడ్, గయానా విదేశీ వ్యవహారాల శాఖ మధ్య అవగాహనా ఒప్పందం
|
గయానాలో యూపీఐ తరహా రియల్ టైమ్ పేమెంట్ వ్యవస్థను పరస్పరం అమలు చేయాల్సిన అవకాశాన్ని అర్థం చేసుకోవడమే ఈ ఎంఓయూ లక్ష్యం.
|
9. |
ప్రసార భారతి, నేషనల్ కమ్యూనికషన్స్ నెట్వర్క్, గయానా మధ్య ప్రసార రంగంలో సహకార భాగస్వామ్య ఒప్పందం |
సాంస్కృతిక, విద్య, సైన్స్, వినోదం, క్రీడలు, వార్తల రంగాల్లో ఉమ్మడి ఆసక్తి ఉన్న అంశాల్లో కార్యక్రమాల పరస్పర మార్పిడి |
10. |
ఎన్‌డీఐ (జాతీయ రక్షణ సంస్థ, గయానా), ఆర్ఆర్‌యూ (రాష్ట్రీయ రక్ష విశ్వవిద్యాలయం, గుజరాత్) మధ్య అవగాహనా ఒప్పందం. |
రెండు సంస్థల మధ్య జాతీయ భద్రత, రక్షణ అధ్యయనాల్లో పరిశోధన, విద్య, శిక్షణను మెరుగుపరచడానికి సహకార భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేయడమే ఈ అవగాహనా ఒప్పందం లక్ష్యం. |