క్రమ సంఖ్య

ఎమ్ఒయు ల పేరు; ఒప్పందం పేరు

లక్ష్యాలు

1.

రష్యా దూర ప్రాచ్య ప్రాంతం లో వాణిజ్యం, ఆర్థికం, పెట్టుబడి రంగాలలో 2024 నుంచి 2029 మధ్య కాలానికి భారత్-రష్యా సహకార కార్యక్రమం; రష్యన్ ఫెడరేషన్ లోని ఆర్కిటిక్ ప్రాంతంలో సహకారానికి సంబంధించిన సూత్రాలు.

రష్యా లోని దూర ప్రాచ్య ప్రాంతానికి , భారతదేశానికి మధ్య వాణిజ్యం, సంయుక్త పెట్టుబడి ప్రాజెక్టులు మరింతగా వృద్ధి చెందేందుకు మార్గాన్ని సుగమం చేయడం.

2.

వాతావరణ మార్పు, కర్బనం పాళ్ళను తక్కువగా ఉంచుతూ అభివృద్ధిని సాధించడం అనే అంశాలపై భారతదేశ పర్యావరణం, అడవులు, వాతావరణ మార్పు మంత్రిత్వ శాఖకు, రష్యన్ ఫెడరేషన్ కు చెందిన ఆర్థికాభివృద్ధి మంత్రిత్వ శాఖకు మధ్య అవగాహనపూర్వక ఒప్పంద పత్రతం (ఎంఒయు)

వాతావరణ మార్పు, కర్బన పాళ్ళు తక్కువ ఉండేటట్లు చూస్తూ అభివృద్ధిని సాధించడం అనే అంశాలపై ఒక సంయుక్త కార్యాచరణ సమూహాన్ని ఏర్పాటు చేయడం.

చౌకైన సాంకేతికతలను అభివృద్ధి చేయడం కోసం సమాచారాన్ని, ఉత్తమ కార్యప్రణాళికలను ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకోవడం, తత్సంబంధిత పరిశోధనలను కలసి నిర్వహించడం

3.

సర్వే ఆఫ్ ఇండియాకు, రష్యన్ ఫెడరేషన్ కు చెందిన ఫెడరల్ సర్వీస్ ఫర్ స్టేట్ రిజిస్ట్రేషన్, కేడాస్టర్, కార్టోగ్రఫీ కి మధ్య ఎంఒయు

భూగణితం (జియోడెసి), దేశ పట రచన  కళ (కార్గొగ్రఫి), భూప్రాంతాల సంబంధ సమాచార సేకరణ లో జ్ఞానాన్ని, అనుభవాన్ని ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చి పుచ్చుకోవడం; వృత్తి నైపుణ్య సంబంధమైన శిక్షణ, సామర్థ్య నిర్మాణం; విజ్ఞానశాస్త్ర సంస్థల మధ్య, విద్య సంస్థల మధ్య సహకారం

4.

ధ్రువ ప్రాంతాలలో పరిశోధన, లాజిస్టిక్స్ సంబంధ అంశాలలో సహకారానికి సంబంధించి భారత ప్రభుత్వ భూవిజ్ఞానశాస్త్రాల మంత్రిత్వ శాఖకు చెందిన నేశనల్ సెంటర్ ఫర్ పోలార్ అండ్ ఓషన్ రిసర్చ్ కు , ఆర్కిటిక్ అండ్ అంటార్కిటిక్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ కు మధ్య ఎంఒయు

వనరులను, డేటా ను పంచుకుంటూ ధ్రువ సంబంధ వాతావరణం, వాటిలో చోటుచేసుకొనే మార్పులను అధ్యయనం చేయడంలో సహకారం;  ధ్రువ ప్రాంతాలలో లాజిస్టిక్స్; సంయుక్త పరిశోధనను చేపట్టడం; సిబ్బంది మార్పిడి; ధ్రువ ప్రాంతంలో నిర్వహించే అంతర్జాతీయ కార్యక్రమాలలోను, ప్రాజెక్టులలోను పాల్గొనడం.

5.

భారతదేశానికి చెందిన ప్రసార భారతికి, రష్యా లోని ఎఎన్ఒ ‘‘టివి -నోవోస్తి’’ (రష్యా టుడే టివి చానల్) కు మధ్య ప్రసారాల విషయంలో సహకారానికి, సమన్వయానికి  సంబంధించిన ఎంఒయు

కార్యక్రమాలు, సిబ్బంది, శిక్షణ ల విషయాలలో ఇచ్చి పుచ్చుకొనే  వైఖరిని అనుసరించడంతో పాటు ప్రసార రంగంలో సహకారం

6.

భారతదేశానికి చెందిన ఆరోగ్య,కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధీనం లోని ఇండియన్ ఫార్మాకోపియా కమిషన్ కు, రష్యన్ ఫెడరేషన్ కు చెందిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఆధీనం లోని ఫెడరల్ స్టేట్ బడ్జెటరీ ఇన్‌స్టిట్యూషన్ ‘‘సైంటిఫిక్ సెంటర్ ఫర్ ఎక్స్ పర్ట్ ఇవాల్యుయేషన్ ఆఫ్ మెడిసినల్ ప్రొడక్ట్స్’’ కు మధ్య ఎంఒయు

సమాచారాన్ని ఒక పక్షానికి మరొక పక్షం ఇచ్చిపుచ్చుకోవడం, సామర్థ్య నిర్మాణం మాధ్యమం ద్వారా మానవ ఉపయోగార్థం ఉన్నతమైన నాణ్యతను కలిగివుండే మందులను అందుబాటులోకి ఉంచేందుకు తగిన చర్యలను తీసుకోవడం

7.

ఇండియన్ ఇంటర్ నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటరు కు, రష్యన్ ఫెడరేషన్ కు చెందిన వాణిజ్యం, పరిశ్రమల మండలి ఆధీనంలోని ఇంటర్ నేషనల్ కమర్షియల్ ఆర్బిట్రేషన్ కోర్టు కు మధ్య సహకారానికి సంబంధించిన ఒప్పందం

వాణిజ్య స్వభావం కలిగిన సివిల్ లా తో సంబంధం గల  వివాదాల పరిష్కారానికి మార్గాన్ని సుగమం చేయడం

8.

ఇన్వెస్ట్ ఇండియా కు, జెఎస్‌సి ‘‘మేనేజ్ మెంట్ కంపెనీ ఆఫ్ రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్ ఫండ్’’ కు మధ్య సంయుక్త పెట్టుబడులను ప్రోత్సాహించేందుకు  రూపురేఖల ను తీర్చిదిద్దడానికి సంబంధించిన ఒప్పందం

పెట్టుబడి సంబంధ సహకారాన్ని ప్రోత్సహించడం, ఆ సహకారం వర్ధిల్లేటట్లు చేయడం ద్వారా భారతదేశ మార్కెట్టు లో రష్యన్ కంపెనీలు పెట్టుబడి పెట్టేందుకు మార్గాన్ని సుగమం చేయడం

9.

ట్రేడ్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కు, ఆల్ రష్యా పబ్లిక్ ఆర్గనైజేషన్ ‘‘బిజినెస్ రష్యా’’కు మధ్య ఎంఒయు

ద్వైపాక్షిక వాణిజ్యాన్ని, పెట్టుబడులను ప్రోత్సహించడం, బిజినెస్ –టు – బిజినెస్ (బి2బి) సమావేశాలను నిర్వహించడం, వ్యాపార ప్రోత్సాహక కార్యక్రమాలను ఏర్పాటు చేయడం; వ్యాపార సంబంధ ప్రతినిధివర్గాల పర్యటనలను ఏర్పాటు చేయడం.

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
25% of India under forest & tree cover: Government report

Media Coverage

25% of India under forest & tree cover: Government report
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi