ఎ. శంకుస్థాపన / ప్రాజెక్టుల సమీక్ష
1. గ్రేటర్ మాలే కనెక్టివిటి ప్రాజెక్టు కు శంకుస్థాపన చేయడం; భారతదేశం అందజేసే 500 మిలియన్ యుఎస్ డాలర్ విలువైన ప్రాజెక్టు యొక్క స్థిర కార్యాల ను మొదలుపెట్టడం
2. ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందించేటటువంటి 227 మిలియన్ యుఎస్ డాలర్ విలువ కలిగిన బైయర్స్ క్రెడిట్ పరపతి రూపేణా ఆర్థిక సహాయం ద్వారా నిర్మించ తలపెట్టిన హుల్ హుమలే లో 4,000 సాముదాయిక ఆవాస యూనిట్ ల నిర్మాణం లో చోటు చేసుకొన్న పురోగతి పై సమీక్ష.
3. భారతదేశం మాల్దీవులు సహకారం పై సమగ్ర పర్యవేక్షణ. దీని లో 34 దీవుల లో అడ్డూ హదారులు, భూమి పునరుద్ధరణ, జల సరఫరా మరియు పారిశుధ్యం మరియు శుక్రవారపు మసీదు యొక్క జీర్ణోద్ధరణ తో ముడిపడ్డ ప్రాజెక్టు లు భాగం గా ఉన్నాయి.
బి. ఒప్పందాలు / ఎమ్ఒయు ల ఆదాన- ప్రదానం
1. భారతదేశాని కి చెందిన ఎన్ఐఆర్ డిపిఆర్ కు మరియు మాల్దీవులు లోని స్థానిక ప్రభుత్వ ప్రాధికార సంస్థ కు మధ్య స్థానిక మండలుల మరియు మహిళల అభివృద్ధి సంఘం యొక్క సభ్యుల కు వారి సామర్థ్యాల ను మరింతగా పెంచడం తో పాటు గా వారికి శిక్షణ ను ఇవ్వడానికి సంబంధించినటువంటి అవగాహనపూర్వక ఒప్పంద పత్రం (ఎమ్ఒయు)
2. భారతదేశాని కి చెందిన ఐఎన్ సిఒఐఎస్ (‘ఇన్కోయిస్’)కు మరియు మాల్దీవులు కు చెందిన మత్స్య పరిశ్రమ మంత్రిత్వ శాఖ కు మధ్య సంభావిత చేపల వేట మండలాని కి సంబంధించిన ముందస్తు అంచనా సామర్థ్య నిర్మాణం తో పాటు సమాచారాన్ని వెల్లడి చేసుకోవడం మరియు సముద్ర విజ్ఞాన శాస్త్ర పరిశోధన రంగం లో సహకారానికి సంబంధించిన ఎమ్ఒయు
3. సిఇఆర్ టి-ఇండియా కు మరియు మాల్దీవులు కు చెందిన ఎన్ సిఐటి కి మధ్య సైబర్ భద్రత రంగం లో సహకారాని కి ఉద్దేశించిన ఎమ్ఒయు
4. భారతదేశాని కి చెందిన ఎన్ డిఎమ్ఎ కు మరియు మాల్దీవులు కు చెందిన ఎన్ డిఎమ్ఎ కు మధ్య విపత్తు నిర్వహణ రంగం లో సహకారాని కి ఉద్దేశించిన ఎమ్ఒయు
5. భారతదేశం లోని ఎక్జిమ్ బ్యాంకు కు మరియు మాల్దీవులు యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ కు మధ్య మాల్దీవులు లో పోలీసు మౌలిక సదుపాయాల కల్పన కు గాను 41 మిలియన్ యుఎస్ డాలర్ విలువ కలిగిన బయర్స్ క్రెడిట్ రూపేణా ఆర్థిక సహాయానికి సంబంధించినటువంటి ఒప్పందం
6. హుల్ హుమలే లో అదనం గా నిర్మించబోయే 2,000 సాముదాయిక ఆవాసాల యూనిట్ ల కోసం 119 మిలియన్ యుఎస్ డాలర్ విలువ కలిగిన బయ్యర్స్ క్రెడిట్ రూపేణా ఆర్థిక సహాయానికి అనుమోదం సంబంధిత ఎక్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు మాల్దీవులు ఆర్థిక మంత్రిత్వ శాఖ కు మధ్య లెటర్ ఆఫ్ ఇంటెంట్
సి. ప్రకటనలు
1. మాల్దీవులు లో మౌలిక సదుపాయల కల్పన సంబంధిత ప్రాజెక్టుల కు ఆర్థిక సహాయం కోసం 100 మిలియన్ యుఎస్ డాలర్ విలువ కలిగిన సరికొత్త లైన్ ఆఫ్ క్రెడిట్ ను అందజేయడం.
2. లైన్ ఆఫ్ క్రెడిట్ లో భాగం గా 128 మిలియన్ యుఎస్ డాలర్ విలువ కలిగిన హనీమాధూ విమానాశ్రయం అభివృద్ధి పథకం కోసం ఇపిసి కాంట్రాక్టు ను అమలుపరపచడానికి ఆమోదాన్ని తెలపడమైంది.
3. లైన్ ఆఫ్ క్రెడిట్ లో భాగం గా 324 మిలియన్ యుఎస్ డాలర్ విలువ కలిగిన గుల్ హిఫాహలూ నౌకాశ్రయం అభివృద్ధి ప్రాజెక్టు తాలూకు డిపిఆర్ కు ఆమోదం మరియు టెండర్ ప్రక్రియ ను మొదలు పెట్టడానికి రంగం సిద్ధం అయింది.
4. లైన్ ఆఫ్ క్రెడిట్ లో భాగం గా 30 మిలియన్ యుఎస్ డాలర్ విలువ కలిగిన కేన్సర్ ఆసుపత్రి ప్రాజెక్టు కోసం ఫీజిబులిటి రిపోర్టు మరియు ఫైనాన్శియల్ క్లోజర్ లకు ఆమోదం
5. హుల్ హుమలే లో అదనం గా 2,000 సాముదాయిక ఆవాస యూనిట్ ల కోసం ఎక్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా 119 మిలియన్ యుఎస్ డాలర్ విలువైన బయర్స్ క్రెడిట్ రూపేణా ఆర్థిక సహాయం
6. మాల్దీవులు నుంచి భారతదేశాని కి సుంకం ఉండనటువంటి ట్యూనా ఎగుమతుల కు సహకరించడం
7. మాల్దీవులు జాతీయ రక్షణ దళాని కి ఇదివరకు అందించినటువంటి నౌక-సిజిఎస్ హురవీ- స్థానం లో మరొక నౌక ను సరఫరా చేయడం
8. మాల్దీవులు జాతీయ రక్షణ దళాని కి రెండో లేండింగ్ క్రాఫ్ట్ అసాల్ట్ (ఎల్ సిఎ) ను సరఫరా చేయడం
9. మాల్దీవులు జాతీయ రక్షణ దళాని కి 24 యుటిలిటీ వెహికల్స్ ను బహుమతి గా ఇవ్వడం