క్రమ సంఖ్య |
పత్రాలు |
భారత ప్రతినిధులు |
వియత్నాం ప్రతినిధులు |
1. |
శాంతి, సుసంపన్నత, ప్రజల కోసం భారత-వియత్నాం ఉమ్మడి విజన్
భారత- వియత్నాం మధ్యన నెలకొన్న చారిత్రక, సాంస్కృతిక బంధం; ఉమ్మడి విలువలు, ప్రయోజనాలు; పరస్పర వ్యూహాత్మక విశ్వాసం, అవగాహన పునాదిగా ఉభయ దేశాల భవిష్యత్ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేయాల్సి ఉంటుంది.. |
ప్రధానమంత్రులు ఆమోదించినవి |
|
2. |
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం మరింతగా అమలుపరిచేందుకు కార్యాచరణ కాలపరిమితి 2021-2023
2021-2023 సంవత్సరాల మధ్య శాంతి, సుసంపన్నత, ప్రజల కోసం రూపొందించిన జాయింట్ విజన్ అమలు కోసం నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికల ప్రతిపాదన. |
విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ ఎస్.జైశంకర్ |
ఉప ప్రధానమంత్రి, విదేశీ వ్యవహారాల మంత్రి శ్రీ ఫాం బిన్ మిన్ |
3. |
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రక్షణ ఉత్పత్తుల శాఖ, వియత్నాం జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన రక్షణ పరిశ్రమల జనరల్ డిపార్ట్ మెంట్
ఉభయ దేశాల రక్షణ పరిశ్రమల మధ్య సహకార వృద్ధికి ఒక యంత్రాంగం ఏర్పాటును ప్రోత్సహించడం. |
శ్రీ సురేంద్ర ప్రసాద్ యాదవ్, జాయింట్ సెక్రటరీ (నావల్ సిస్టమ్స్) |
మేజర్ జనరల్ లువాంగ్ తన్హ్ చువాంగ్ |
4. |
వియత్నాంలోని నహ్ ట్రాంగ్ లోని జాతీయ టెలీకమ్యూనికేషన్ విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ఆర్మీ సాఫ్ట్ వేర్ పార్క్ ఏర్పాటుకు భారత రాయబార కార్యాలయం, హానోయ్-టెలీ కమ్యూనికేషన్స్ విశ్వవిద్యాలయం, జాతీయ రక్షణ మంత్రిత్వ శాఖ, వియత్నాం మధ్య 50 లక్షల డాలర్ల ఒప్పందం
నహ్ ట్రాంగ్ టెలీ కమ్యూనికేషన్స్ విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఆర్మీ సాఫ్ట్ వేర్ పార్కులో సాఫ్ట్ వేర్ అప్లికేషన్ల విభాగంలోశిక్షణ, సేవలకు సంబంధించిన ఐటి మౌలిక వసతుల ఏర్పాటు. |
శ్రీ ప్రణయ్ వర్మ వియత్నాం రాయబారి |
కల్నల్ లీ జువాన్ హంగ్, రెక్టార్ |
5. |
భారత్ లోని ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షణ కార్యకలాపాల కేంద్రం, వియత్నాంలోని ఐక్యరాజ్య శాంతి పరిరక్షణ దళానికి చెందిన శాంతి పరిరక్షణ కార్యకలాపాల విభాగం మధ్య ఒప్పందం అమలు
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షణ దళం సహకారం అభివృద్ధిలో దృష్టి సారించవలసిన ప్రత్యేక కార్యకలాపాలు. |
మేజర్ జనరల్ అనిల్ కషిద్
అదనపు డైరెక్టర్ జనరల్ (ఐసి) |
మేజర్ జనరల్ హువాంగ్ కిమ్ ఫుంగ్
డైరెక్టర్ |
6. |
భారత అణు ఇంధన నియంత్రణ బోర్డు (ఎఇఆర్ బి), వియత్నాంకు చెందిన రేడియేషన్, అణుభద్రత ఏజెన్సీ (వరన్స్) మధ్య అవగాహన ఒప్పందం రేడియేషన్ నుంచి రక్షణ కల్పించడం, అణుభద్రతపై ఉభయ దేశాల నియంత్రణ సంస్థల మధ్య సహకార ప్రోత్సాహం. |
శ్రీ జి.నాగేశ్వరరావు
చైర్మన్ |
ప్రొఫెసర్ న్యూగ్యెన్ తువాన్ ఖై
డైరెక్టర్ జనరల్ |
7. |
సిఎస్ఐఆర్‌కు అనుబంధ భారత పెట్రోలియం ఇన్ స్టిట్యూట్, వియత్నాం పెట్టోలియం ఇన్ స్టిట్యూల్ మధ్య ఎంఓయు
పెట్రోలియం పరిశోధన, శిక్షణలో సహకారాన్ని పెంపొందించడం |
డాక్టర్ అంజన్ రే
డైరెక్టర్ |
శ్రీ న్యూగ్యెన్ అన్హ్ దువో
డైరెక్టర్ |
8. |
భారత్ కు చెందిన టాటా మెమోరియల్ సెంటర్, వియత్నాం నేషనల్ కేన్సర్ హాస్పిటల్ మధ్య ఎంఓయు
శాస్ర్తీయ పరిశోధన, ఆరోగ్య సంరక్షణ సేవలు, కేన్సర్ రోగులకు సంబంధించిన డయాగ్నసిస్, చికిత్స విభాగాల్లో పరస్పర సహకారం. |
డాక్టర్ రాజేంద్ర ఎ బద్వే
డైరెక్టర్ |
శ్రీ లీ వాన్ క్వాంగ్
డైరెక్టర్ |
9. |
భారత్ కు చెందిన నేషనల్ సోలార్ ఫెడరేషన్, వియత్నాం స్వచ్ఛ ఇంధన అసోసియేషన్ మధ్య ఎంఓయు
భారత, వియత్నాం సోలార్ ఇంధన పరిశ్రమల మధ్య పరిజ్ఞానం, ఉత్తమ విధానాలు, సమాచార మార్పిడి; భారత, వియత్నాంలలో సోలార్ పవర్ ప్రోత్సహించడంలో కొత్త వ్యాపారావకాశాల అన్వేషణ. |
శ్రీ ప్రణవ్ ఆర్.మెహతా
చైర్మన్ |
శ్రీ దావో డూ దూంగ్
ప్రెసిడెంట్ |
వెలువరించిన ప్రకటనలు :
1. వియత్నాం సరిహద్దు గస్తీ కమాండ్ కోసం హైస్పీడ్ గార్డ్ బోట్ల (హెజ్ఎస్ జిబి) తయారీ ప్రాజెక్టు కోసం వియత్నాంకు భారత ప్రభుత్వం 10 కోట్ల డాలర్ల రక్షణ రుణం మంజూరు; ఇప్పటికే నిర్మాణం పూర్తయిన హెచ్ఎస్ జిబి వియత్నాంకు అప్పగింత; భారత్ లో మరో రెండు హెచ్ఎస్ బిజిల తయారీ; వియత్నాం కోసం మరో హెచ్ఎస్ జిబి తయారీ కోసం నీల్ వేయడం
2. వియత్నాంలోని నిన్హ్ తువాన్ ప్రావిన్స్ లో స్థానిక సమాజానికి ప్రయోజనం కలిగించేందుకు 15 లక్షల డాలర్ల భారత గ్రాంట్ ఇన్ ఎయిడ్ తో ఏడు అభివృద్ధి ప్రాజెక్టులు పూర్తి చేసి వియత్నాంకు అప్పగించడం
3. 2021-2022 నాటికి ప్రస్తుతం అమలులో ఉన్న వార్షిక క్విక్ ఇంపాక్ట్ ప్రాజెక్టుల (క్యుఐపి) సంఖ్య 5 నుంచి 10కి పెంచడం
4. వియత్నాంలో చారిత్రక ప్రాధాన్య స్థలాల రక్షణకు మూడు కొత్త డెవలప్ మెంట్ భాగస్వామ్య ప్రాజెక్టుల (మై సన్ దేవాలయం ఎఫ్ బ్లాక్; క్వాంగ్ నామ్ రాష్ట్రంలో డాంగ్ డువాంగ్ బౌద్ధారామం; ఫు యెన్ రాష్ట్రంలో నాన్ చామ్ టవర్) అభివృద్ధి
5. ఇండియా– వియత్నాం నాగరికత, సాంస్కృతిక సంబంధాల ఎన్ సైక్లోపేడియా తయారీ కోసం ద్వైపాక్షిక ప్రాజెక్టు ప్రారంభం.