వరుససంఖ్య |
దస్తావేజు పేరు |
భారతదేశం పక్షాన సంతకం చేసిన వారు |
ఆర్ఒకెపక్షాన సంతకం చేసిన వారు |
ధ్యేయాలు |
1 |
అప్ గ్రేడెడ్ కోంప్రిహెన్సివ్ ఇకనామిక్ పార్ట్ నర్ శిప్ అగ్రిమెంట్ (సిఇపిఎ) లోని అర్లి హార్వెస్ట్ ప్యాకేజీ కి సంబంధించిన సంయుక్త ప్రకటన |
భారతదేశ వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభు |
ఆర్ఒకె వ్యాపారం, పరిశ్రమ మరియు శక్తి శాఖ మంత్రి శ్రీ కిమ్ హ్యున్-చోంగ్ |
వ్యాపార సరళీకరణ (రొయ్యలు, నత్తలు మరియు శుద్ధి చేసిన చేపలు సహా) కై కీలక రంగాలను గుర్తించడం ద్వారా భారతదేశం-ఆర్ఒకె సిఇపిఎ ను నవీనీకరించే అంశం పై ప్రస్తుతం కొనసాగుతున్న సంప్రదింపులకు మార్గాన్ని సుగమం చేయడం. |
2 |
వ్యాపార పరిష్కారాలకు సంబంధించిన ఎంఒయు |
భారతదేశ వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభు |
ఆర్ఒకె వాణిజ్యం, పరిశ్రమ మరియు శక్తి శాఖ మంత్రి శ్రీ కిమ్ హ్యున్-చోంగ్ |
డంపింగు ను నివారించడం, సబ్సిడీ, కౌంటర్ వేలింగు లు వంటి వ్యాపార పరిష్కారాలలో సహకారం మరియు ప్రభుత్వ అధికారులు, ఇంకా డమేన్ ఎక్స్ పర్ట్ స్ తో కూడిన ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయడం ద్వారాను, సంప్రదింపులు మరియు సమాచార ఆదాన, ప్రదానాల ద్వారాను రక్షణాత్మక చర్యలను తీసుకోవడం. |
3 |
ఫ్యూచర్ స్ట్రాటజీ గ్రూపు తాలూకు ఎంఒయు |
భారతదేశ వాణిజ్యం మరియు పరిశ్రమ శాఖ మంత్రి శ్రీ సురేశ్ ప్రభు మరియు విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ |
ఆర్ఒకె వాణిజ్యం, పరిశ్రమ మరియు శక్తి శాఖ మంత్రి శ్రీ కిమ్ హ్యున్-చోంగ్ మరియు ఆర్ఒకె ఐసిటి, ఇంకా విజ్ఞాన శాస్త్రం శాఖ మంత్రి శ్రీ యు యంగ్ మిన్ |
నాలుగో పారిశ్రామిక విప్లవం యొక్క ప్రయోజనాలను అందుకోవడానికి ఆధునిక సాంకేతికతలను అభివృద్ధి పరచడంలో సహకరించుకోవడం. దీనిలో భాగంగా ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), ఆర్టిఫీశల్ ఇంటెలిజెన్స్ (ఎఐ), బిగ్ డాటా, స్మార్ట్ ఫ్యాక్టరీ, 3డి ప్రింటింగ్, ఇలెక్ట్రిక్ వీకల్, అడ్వాన్స్ మెటీరియల్స్ తో పాటు వృద్ధులకు మరియు దివ్యాంగులకు తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య సంరక్షణ.. ఈ రంగాలను ప్రాధాన్య రంగాలుగా పరిగణిస్తారు. |
4 |
2018–2022సంవత్సారాల మధ్య కాలంలో సంస్కృతి బృం దాల రాకపోకలకు సంబంధించిన కార్యక్రమం |
భారతదేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ రాఘవేంద్ర సింహ్ |
భారతదేశం లో ఆర్ఒకె రాయబారి శ్రీ శిన్ బోంగ్ కిల్ |
సంగీతం, నృత్యం, రంగస్థలం, కళాప్రదర్శనలు, పురావస్తు భాండాగారాలు, మానవ పరిణామ శాస్త్రం, సాముహిక మాధ్యమాలకు సంబంధించిన కార్యక్రమాలు మరియు వస్తు ప్రదర్శన శాల లో ప్రదర్శించే సామగ్రి.. ఈ రంగాలలో సంస్థాగత సహకారాన్ని అందించుకోవడం ద్వారా సాంస్కృతిక, ప్రజా సంబంధాలను గాఢతరం చేసుకోవడం. |
5 |
కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ (సిఎస్ఐఆర్) మరియు నేశనల్ రిసర్చ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఎస్ టి) మధ్య విజ్ఞానశాస్త్రం, ఇంకా సాంకేతిక విజ్ఞానపరిశోధన రంగం లో సహకారానికి ఎంఒయు
|
సిఎస్ఐఆర్, డిజి, డాక్టర్ గిరీశ్ సాహ్నీ |
నేశనల్ రిసర్చ్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఎన్ఎస్ టి) ఛైర్మన్ డాక్టర్ వాన్ క్వాంగ్ యున్ |
తక్కువ ఖర్చు తో జల శుద్ధి, సాంకేతికతలు, ఇంటెలిజెంట్ ట్రాన్స్ పోర్ట్ సిస్టమ్, నూతన ప్రత్యామ్నాయ పదార్థాలు, సాంప్రదాయక వైద్యం ఇంకా ప్రాచ్య వైద్యం లతో పాటు టెక్నాలజీ ప్యాకేజి, వాణిజ్యీకరణ రంగాల లోను మరియు విజ్ఞాన శాస్త్ర సంబంధమైన పరిశోధన, ఇంకా సాంకేతిక పరిశోధన లలో సహకరించుకోవడం. |
6 |
రిసర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్ స్ ఆర్గనైజేశన్ (ఆర్ డిఎస్ఒ) కు మరియు కొరియా రైల్ రోడ్ రిసర్చ్ ఇన్ స్టిట్యూట్ (కెఆర్ఆర్ఐ) కి మధ్య సహకారానికి ఎంఒయు |
ఆర్ డిఎస్ఒ డిజి శ్రీ ఎమ్. హుస్సేన్ |
కెఆర్ఆర్ఐ, ప్రెసిడెంట్ శ్రీ న హి- సూంగ్ |
రైల్వే సంబంధిత పరిశోధన, రైల్వే లకు సంబంధించిన అనుభవం యొక్క ఆదాన ప్రదానం మరియు రైల్వే పరిశ్రమల అభివృద్ధి లో సహకరించుకోవడం. అధునాతన రైల్వేల ఆర్ & డి కేంద్రాన్ని భారతదేశం లో ఏర్పాటు చేయడం సహా సంయుక్త పరిశోధన పథకాల ప్రణాళిక రచనకు మరియు అమలుకు గల అవకాశాలను ఇరు పక్షాలు అన్వేషిస్తాయి. |
7 |
బయో-టెక్నాలజీ ఇంకా బయో ఇకనోమిక్స్ రంగంలో సహకారానికి ఎంఒయు |
భారతదేశ విజ్ఞాన శాస్త్రం మరియు సాంకేతిక విజ్ఞానం శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ |
ఆర్ఒకె, విజ్ఞాన శాస్త్రం మరియు ఐసిటి శాఖ మంత్రి శ్రీ యు యంగ్ మిన్ |
ఆరోగ్యం, ఔషధాలు, అగ్రో ఫిషరీ ప్రొడక్టులు, డిజిటల్ హెల్త్ కేర్ ప్రిసిఝన్ మెడిసిన్, బ్రెయిన్ రిసర్చ్ లో బయో బిగ్ డాటా మరియు బయో టెక్నాలజీ స్వీకారం లో సహకారం తో పాటు తదుపరి తరం వైద్య సామగ్రి.. ఈ రంగాలలో సహకరించుకోవడం. |
8 |
ఐసిటి ఇంకా టెలీకమ్యూనికేశన్స్ రంగంలో సహకారానికి ఎంఒయు |
భారతదేశ టెలీ కమ్యూనికేశన్స్ శాఖ సహాయ మంత్రి శ్రీ మనోజ్ సిన్హా |
ఆర్ఒకె, విజ్ఞాన శాస్త్రం మరియు ఐసిటి శాఖ మంత్రి శ్రీ యు యంగ్ మిన్. |
అత్యధునాతన టెలీ కమ్యూనికేషన్స్/ఐసిటి సర్వీసులు మరియు 5జి క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డాటా, ఐఒటి, ఎఐ ల వంటి తదుపరి తరం వైర్ లెస్ కమ్యూనికేశన్ నెట్ వర్క్ ల అభివృద్ధిలోను, ఆధునికీకరణలోను మరియు విస్తరణ లోను సహకరించుకోవడం. అలాగే, వాటిని సర్వీసులు, విపత్తుల నిర్వహణ, అత్యవసర పరిస్థితులలో ప్రతిస్పందించడం, మరియు సైబర్ సెక్యూరిటీ లో వినియోగించుకోవడం. |
9 |
భారతదేశం, ఆర్ఒకె ల మధ్య సూక్ష‌్మ, లఘు, మరియు మధ్య తరహా సంస్థల [నోడల్ ఏజెన్సీలు:నేశనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేశన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఐసి) ఇంకా ఆర్ఒకె కు చెందిన స్మాల్ అండ్ మీడియమ్ బిజినెస్ కార్పొరేశన్ (ఎస్ బిసి)] మధ్య సహకారానికి ఎంఒయు |
నేశనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేశన్(ఎన్ఎస్ఐసి) చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ రవీంద్ర నాథ్ |
స్మాల్ అండ్ మీడియమ్ బిజినెస్ కార్పొరేశన్ ప్రెసిడెంట్ శ్రీ లీ సాంగ్ జిక్ |
ఇరు దేశాలలోని సూక్ష‌్మ, లఘు మరియు మధ్యతరహా సంస్థలను అభి వృద్ధిపరచడంలో సహకరించుకోవడంతో పాటు ప్రపంచ విపణులలో వాటి యొక్క స్పర్ధాత్మకత ను మెరుగు పరచడం. ఒక ఇండియా-ఆర్ఒకె టెక్నాలజీ ఎక్చేంజి సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలను ఇరు పక్షాలు అన్వేషిస్తాయి. |
10 |
గుజరాత్ ప్రభుత్వానికి మరియు కొరియా ట్రేడ్ కమర్షియల్ ఏజెన్సీ (కెఒటిఆర్ఎ)కు మధ్య ఎంఒయు |
గుజరాత్ ప్రభుత్వ పరిశ్రమలు మరియు గనుల ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ ఎమ్.కె. దాస్
|
కొరియన్ ట్రేడ్-ఇన్‌వెస్ట్‌మెంట్ ప్రమోశన్ ఏజెన్సీ ప్రెసిడెంట్ అండ్ సిఇఒ శ్రీ వాన్ ప్యూంగ్-ఓహ్ |
పట్టణ ప్రాంతాలలో అవస్థాపన, ఫూడ్ ప్రాసెసింగ్, వ్యవసాయ సంబంధ పరిశ్రమలు, స్టార్ట్-అప్ ఇకో సిస్టమ్, నైపుణ్యాలలో శిక్షణ మరియు నూతన శక్తి యొక్క, ఇంకా నవీకరణ యోగ్య శక్తి యొక్క అభివృద్ధి వంటి రంగాలలో సహకరించుకోవడం ద్వారా గుజరాత్ రాష్ట్రం మరియు దక్షిణ కొరియా కంపెనీల మధ్య పారిశ్రామిక సంబంధాలను, పెట్టుబడి సంబంధాలను పెంపొందించడం. అహమదాబాద్ లో కెఒటిఆర్ఎ ఒక కార్యాలయాన్ని తెరుస్తుంది. అలాగే, 2019వ సంవత్సరంలో జరిగే వైబ్రంట్ గుజరాత్ గ్లోబల్ సమిట్ లో పాలుపంచుకొనే సంస్థల లో తాను కూడా ఒకటిగా చేరుతుంది. |
11 |
మహారాణి సురిరత్న స్మారక ప్రాజెక్టు కు సంబంధించిన ఎంఒయు |
యుపి ప్రభుత్వ టూరిజమ్ డిజి మరియు అడిషనల్ చీఫ్ సెక్రటరీ శ్రీ అవనీశ్ కుమార్ అవస్థి |
ఆర్ఒకె రాయబారి శ్రీ శిన్ బోంగ్ కిల్ |
క్రీ.శ. 48 లో కొరియా కు వెళ్ళి, రాజు కిమ్ సురో ను పెళ్ళాడిన అయోధ్య రాకుమారి సురిరత్న (మహారాణి హుర్ వాంగ్-వోక్)ను స్మరించుకొనేందుకు నిర్మితమైన ప్రస్తుత కట్టడాన్ని నవీనీకరించడం మరియు ఆ కట్టడం విస్తరణ పనులను చేపట్టడం. కొరియా లో పెద్ద సంఖ్య లో పౌరులు తమ యొక్క వంశపారంపర్యం ప్రముఖ రాకుమారి నుండి వచ్చినట్టు చెప్పుకొంటూ వుంటారు. నూతనంగా చేపట్టే నిర్మాణం భారతదేశానికి, ఆర్ఒకె కు మధ్య చిరకాలంగా కొనసాగుతున్న మైత్రి కి, ఇంకా ఉమ్మడి సాంస్కృతి వారసత్వానికి ఒక ఉపహారం కాగలదు. |