క్రమ సంఖ్య |
ఎమ్ఒయు లు/ఒప్పందాల పేరు |
వివరణ |
1. |
రక్షణ రంగ సహకారానికి ఎమ్ఒయు |
భారతదేశానికి, జోర్డాన్ కు మధ్య రక్షణ రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి ఉద్దేశించింది. ఇందుకోసం శిక్షణ, రక్షణ సంబంధ పరిశ్రమలు, ఉగ్రవాద కార్యకలాపాలను నిరోధించడం, సైనిక పరమైన అధ్యయనాలు, సైబర్ సెక్యూరిటీ, సైనిక సంబంధ వైద్య సేవలు, శాంతి పరిరక్షణ తదితర గుర్తించిన రంగాలు కొన్నింటిలో సహకారాన్ని అమలు పరచేందుకు మార్గాన్ని సుగమం చేయడంతో పాటు, ఈ తరహా సహకారానికి పరిధిని నిర్వచించడం ఈ ఎమ్ఒయు ఉద్దేశం. |
2. |
దౌత్యపరమైన మరియు ఆధికారిక పాస్ పోర్ట్ దారులకు వీజా మాఫీ |
ఈ ఒప్పందం భారతదేశం మరియు జోర్డాన్ లకు చెందిన దౌత్యవేత్తలు, ఆధికారిక పాస్ పోర్ట్ దారులు వీజా ఆవశ్యకత లేకుండానే అటు నుండి ఇటు ఇటు నుండి అటు ప్రవేశానికి, నిష్క్రమణకు మరియు ప్రయాణాలకు గాను రంగాన్ని సిద్ధం చేస్తుంది. |
3. |
కల్చరల్ ఎక్చేంజ్ ప్రోగ్రాము (సిఇపి) |
ఈ కార్యక్రమం 2018 నుండి 2022 దాకా భారతదేశానికి మరియు జోర్డాన్ కు మధ్య సంగీతం, నాట్యం; రంగస్థలం, ప్రదర్శన, చర్చా సభలు మరియు సమావేశాలు; గ్రంథాలయం, ప్రాచీన గ్రంథాలయాలు, వస్తు ప్రదర్శనశాలలు, సాహిత్యం, పరిశోధన, ప్రమాణ పత్ర రచన; విజ్ఞాన శాస్త్ర వస్తు ప్రదర్శన శాలలు, ఉత్సవాలు; సామూహిక మాధ్యమాలకు తోడు యువజన కార్యక్రమాలు.. ఈ రంగాలన్నింటిలో ఆదాన ప్రదానానికి వీలు కల్పిస్తుంది. |
4. |
మానవ వనరుల సంబంధిత సహకార ఒప్పందం |
జోర్డాన్ లో భారతదేశానికి చెందిన వ్యక్తుల కాంట్రాక్టు ఎంప్లాయ్ మెంట్ తాలూకు పాలనకు సంబంధించిన ఉత్తమ పద్ధతులను ప్రోత్సహించడం కోసం భారతదేశం, జోర్డాన్ ల మధ్య సహకారానికి ఈ ఎమ్ఒయు వీలు కల్పిస్తుంది. |
5. |
ఆరోగ్యం, ఇంకా వైద్య రంగంలో భారతదేశానికి, జోర్డాన్ కు మధ్య సహకారానికి ఉద్దేశించిన ఎమ్ఒయు |
భారతదేశం మరియు జోర్డాన్ లలో ఆయా చట్టాలు మరియు నిబంధనలకు అనుగుణంగా ఆరోగ్యం, వైద్య విజ్ఞాన శాస్త్రం వైద్య విద్య మరియు పరిశోధన రంగాలలో సమానత్వం, మరియు పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన సహకారాన్ని ఏర్పరచుకోవడంతో పాటు, ఆ విధమైన సహకారాన్ని ప్రోత్సహించడం ధ్యేయంగా ఈ ఎమ్ఒయు రూపొందింది. పరస్పర సహకారానికి గాను గుర్తించినటువంటి పలు రంగాలలో సార్వత్రిక ఆరోగ్య రక్షణ (యుహెచ్ సి), ఆరోగ్య రంగంలో సేవలు మరియు ఐటి, ఆరోగ్య సంబంధ పరిశోధన, నేషనల్ హెల్త్ స్టాటిస్టిక్స్, క్షయ వ్యాధి నిర్ణయం, చికిత్స మరియు మందుల వాడకం, ఔషధాలు మరియు వైద్య పరికరాల క్రమబద్ధీకరణ వంటివి ఉన్నాయి. |
6. |
జోర్డాన్ లో తదుపరి తరం సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (సిఒఇ)ని ఏర్పాటు చేసేందుకు ఉద్దేశించిన ఎమ్ఒయు |
జోర్దాన్ లో 5 సంవత్సరాల పాటు కనీసం 3000 మంది ఐటి వృత్తి నిపుణులకు శిక్షణను ఇవ్వడం కోసం తదుపరి తరానికి చెందిన సెంటర్ ఆఫ్ ఎక్స్ లెన్స్ (సిఒఇ)ని ఏర్పాటు చేయడం; అలాగే జోర్డాన్ కు చెందిన ఐటి రంగం మాస్టర్ ట్రైనర్స్ కు శిక్షణ ఇవ్వడం కోసం భారతదేశంలో రిసోర్స్ సెంటర్ ను ఏర్పాటు చేయడం ఈ ఎమ్ఒయు ప్రధానోద్దేశం. |
7. |
రాక్ ఫాస్పేట్ మరియు ఫర్టిలైజర్ ఎన్ పికె/దీర్ఘకాలిక సరఫరా కోసం ఎమ్ఒయు |
ఈ ఎమ్ఒయు ఉద్దేశం జోర్దాన్ లో గని తవ్వకాలు మరియు రాక్ ఫాస్ఫేట్ బెనిఫీసియేషన్ తో పాటు ఫాస్పారిక్ యాసిడ్/డిఎపి/ఎన్ పికె ఉత్పత్తి సదుపాయాన్ని ఏర్పాటు చేయడం. జోర్డాన్ లోని ఈ సదుపాయంలో ఉత్పత్తి అయ్యే వస్తువలను 100 శాతం భారతదేశానికి ఇచ్చేందుకు ఒక దీర్ఘకాలిక ఒప్పందం చేసుకొంటారు; తద్వారా భారతదేశానికి రాక్ ఫాస్పేట్స్ సుదీర్ఘ కాలం పాటు నిలకడైన స్థాయిలో సరఫరా అయ్యేందుకు మార్గం సుగమం అవుతుంది. |
8. |
కస్టమ్స్ పరంగా పరస్పర సహాయక ఒప్పందం |
ఈ ఒప్పందం రెండు దేశాలలో కస్టమ్స్ సంబంధిత నేరాలను నిరోధించడంతో పాటు కస్టమ్స్ చట్టాలను సరైన రీతిలో అమలు పరచడంలో భారతదేశానికి, జోర్డాన్ కు మధ్య పరస్పర సహాయానికి ఉద్దేశించినటువంటిది. అంతే కాకుండా కస్టమ్స్ డ్యూటీలు, పన్నులు, రుసుములు ఇంకా కస్టమ్స్ పాలన యంత్రాంగం విధించే ఇతర ఛార్జీలకు సంబంధించిన ఖచ్చితమైన సమాచారాన్ని రెండు వైపులా సాఫీగా ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ ఒప్పందం తోడ్పడుతుంది. |
9. |
ఆగ్రా కు మరియు జోర్డాన్ లోని పెట్రా కు మధ్య ట్రైనింగ్ అగ్రిమెంట్ |
ఈ ఒప్పందం ద్వారా ఆగ్రా మరియు పెట్రా పురపాలక సంఘాలు పర్యాటకం, సంస్కృతి, క్రీడలు మరియు ఆర్థిక రంగాలలో ఒక దానికి మరొకటి సహకరించు కొనేందుకు కొన్ని కార్యకలాపాలను గుర్తించడంతో పాటు సామాజిక సంబంధాలను పెంపొందించు కొనేందుకు కలిసికట్టుగా పని చేస్తామని ప్రకటించాయి. |
10. |
ఇండియ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ (ఐఐఎమ్ సి) కి మరియు జోర్డాన్ మీడియా ఇన్ స్టిట్యూట్ (జెమ్ఐ)కి మధ్య సహకారం |
ఈ ఎమ్ఒయు లక్ష్యమల్లా ఈ రెండు సంస్థల మధ్య సంయుక్త ప్రాజెక్టులను అభివృద్ధి పరచాలన్నదే; అలాగే, విద్య మరియు విజ్ఞాన శాస్త్ర సంబంధిత కార్యకలాపాలను సంయుక్తంగా నిర్వహించడం కూడా. అంతేకాదు, సిబ్బందిని, విద్యార్థులను మరియు ఉమ్మడి ప్రయోజనంతో ముడిపడిన సామగ్రిని ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. |
11. |
ప్రసార భారతి కి మరియు జోర్డాన్ టివి కి మధ్య ఎమ్ఒయు |
ఈ ఎమ్ఒయు కార్యక్రమాల సహ నిర్మాణం, ఆదాన ప్రదానం, సిబ్బందికి శిక్షణ ను ఇవ్వడం మరియు మరింత సమన్వయానికి గాను ఆయా రంగాలలో సహకారం కోసం ప్రసార భారతి కి మరియు జోర్డాన్ రేడియో అండ్ టివి కార్పరేషన్ కు మధ్య సహకారానికి వీలు కల్పిస్తుంది. |
12. |
విశ్వవిద్యాలయంలో హిందీ చైర్ స్థాపనకు సంబంధించి యూనివర్సిటీ ఆఫ్ జోర్డాన్ (యుజె) కు మరియు ఐసిసిఆర్ కు మధ్య ఎమ్ఒయు |
ఈ ఎమ్ఒయు యూనివర్సిటీ ఆఫ్ జోర్డాన్ లో హిందీ భాషకు సంబంధించి ఐసిసిఆర్ చైర్ ను ఏర్పాటు చేయడంతో పాటు ఆ వ్యవస్థ నిర్వహణకు గాను ఐసిసిఆర్ మరియు యుజె ల మధ్య సహకారానికి గాను ఒక ప్రాతిపదికను ఏర్పరచడమే కాకుండా, ఇతరత్రా కూడా రంగాన్ని సిద్ధం చేస్తుంది. |