వ.సం. |
ఎమ్ఒయు/ ఒప్పందం |
భారతదేశం పక్షాన |
ఫ్రెంచ్ పక్షాన |
ఉద్దేశం |
1. |
మత్తుమందులు, సైకోట్రాపిక్ సబ్ స్టన్సె స్ మరియు కెమికల్ ప్రికర్సర్స్ అక్రమ వినియోగాన్ని నిరోధించడంతో పాటు వాటికి సంబంధించిన నేరాలను తగ్గించడానికి ఇండియా, ఫ్రాన్స్ ల మధ్య కుదిరిన ఒప్పందం |
శ్రీ రాజ్ నాధ్ సింగ్, హోం శాఖ మంత్రి |
శ్రీ జీన్ యెవ్స్ లెడ్రియాన్, యూరప్ మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి |
ఈ ఒప్పందం కారణంగా మత్తుమందుల అక్రమ రవాణా పైన, వాటి వినియోగం పైన ఇరు దేశాలు పోరాటం చేస్తాయి. తద్వారా అది ఉగ్రవాదానికి ఆర్ధిక సాయం అందకుండా ప్రభావం చూపుతుంది. |
2. |
భారతదేశం-ఫ్రాన్స్ ల మధ్య వలస మరియు రాకపోకల భాగస్వామ్య ఒప్పందం |
శ్రీమతి సుష్మాస్వరాజ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి |
శ్రీ జీన్ యెవ్స్ లెడ్రియాన్, యూరప్ మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
|
ఈ ఒప్పందం కారణంగా ఇరు దేశాల మధ్య రాకపోకల ఆధారంగా తాత్కాలిక సర్క్యులర్ వలసలకు వీలవుతుంది. స్వదేశానికి నైపుణ్యాలను తిరిగి తెప్పించుకోవడం వీలవుతుంది. |
3. |
విద్యారంగ సంబంధిత అర్హతలను ఇరు దేశాలు పరస్పరం గుర్తించడానికి వీలుగా ఇండియా, ఫ్రాన్స్ ల మధ్య ఒప్పందం
|
శ్రీ ప్రకాశ్ జావడేకర్, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి |
శ్రీమతి ఫ్రెడరిక్ విడాల్, ఉన్నత విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణ రంగాల మంత్రి |
ఈ ఒప్పందం ఫలితంగా విద్యార్హతలను ఇరు దేశాలు పరస్పరం గుర్తించడానికి వీలు కల్పించం ఈ ఒప్పందం ఉద్దేశం. |
4. |
రైల్వే రంగంలో సాంకేతిక సహకారానికి సంబంధించిన అవగాహన పూర్వక ఒప్పందం. భారతదేశ రైల్వే మంత్రిత్వశాఖకు, ఫ్రాన్స్ లోని ఎస్ ఎన్ సి ఎఫ్ మోటిలిటీస్ సంస్థకు మధ్యన కుదిరింది. |
శ్రీ పీయూష్ గోయల్, రైల్వే శాఖ మంత్రి |
శ్రీ జీన్ యెవ్స్ లెడ్రియాన్, యూరప్ మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి |
అత్యధిక వేగంతోను, మధ్యతరహా వేగంతోను ప్రయాణం చేసే రైళ్ల విషయంలో పరస్పర సహకారాన్ని పెంపొందించుకొని, బలోపేతం చేసుకోవడం ఈ ఎమ్ఒయు ఉద్దేశం. స్టేషన్ ల పునరుద్దరణ, ప్రస్తుతం జరుగుతున్న పనులలో, మౌలిక సదుపాయాలల్లో ఆధునికీకరణను చేపట్టడం, నగర శివార్ల రైళ్లను అభివృద్ధి పరచడం చేస్తారు. |
5. |
భారతదేశం, ఫ్రాన్స్ శాశ్వత ఇండో- ఫ్రెంచ్ రైల్వేల వేదికను ఏర్పాటు చేసుకోవడానికి సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్. |
శ్రీ పీయూష్ గోయల్, రైల్వే శాఖ మంత్రి |
శ్రీ జీన్ యెవ్స్ లెడ్రియాన్, యూరప్ మరియు విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి
|
ఇండో- ఫ్రెంచ్ శాశ్వత రైల్వే వేదికను ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇదివరకే ఇరు దేశాల మధ్య ఉన్న సహకారాన్ని బలోపేతం చేసుకోవడం ఈ లెటర్ ఆప్ ఇంటెంట్ ఉద్దేశం |
6. |
సాయుధ దళాల లాజిస్టిక్స్ కు సంబంధించి భారతదేశం, ఫ్రాన్స్ పరస్పరం సహాయం చేసుకొనేందుకు వీలుగా ఒప్పందం
|
శ్రీమతి నిర్మల సీతారమణ్, రక్షణ శాఖ మంత్రి |
శ్రీమతి ఫ్లోరెన్స్ పార్లే, సాయుధ దళాల మంత్రి |
ఇరు దేశాల మధ్య అధికృత నౌకాదళ సందర్శనలు, ఉమ్మడి కవాతులు, ఉమ్మడి శిక్షణ కార్యక్రమాలు, మానవీయ సహాయం, విపత్తు సహాయ చర్యలు మొదలైన కార్యక్రమాలలో పరస్పర లాజిస్టిక్స్ సహకారం, సరఫరా లకు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది
|
7. |
పర్యావరణ రంగంలో సహకారానికి సంబంధించి భారతదేశం, ఫ్రాన్స్ మధ్య అవగాహన పూర్వక ఒప్పందం (ఎమ్ఒయు) |
డాక్టర్ మహేశ్ శర్మ, పర్యావరణం, అడవులు మరియు జల వాయు పరివర్తన శాఖ సహాయ మంత్రి |
శ్రీమతి బ్రూనే పాయిర్సన్, ఈకొలాజికల్ అండ్ ఇంక్లూసివ్ ట్రాన్షిశన్ శాఖ సహాయ మంత్రి
|
పర్యావరణ, వాతావరణ మార్పుల రంగాలలో రెండు దేశాల సాంకేతిక నిపుణల మధ్య, రెండు దేశాల మధ్య సమాచారాన్ని ఇచ్చి పుచ్చుకోవడానికి వీలు కల్పించేలా ఈ ఎమ్ఒయు ఒక ప్రాతిపదికను ఏర్పరుస్తుంది |
8. |
సుస్థిరమైన నగర అభివృద్ధి రంగంలో భారతదేశం, ఫ్రాన్స్ ల మధ్య ఒప్పందం |
శ్రీ హర్ దీప్ సింగ్ పురీ, గృహ నిర్మాణం, నగర మరియు పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత)
|
శ్రీమతి బ్రూనే పాయిర్సన్, ఈకొలాజికల్ అండ్ ఇంక్లూసివ్ ట్రాన్షిశన్ శాఖ సహాయ మంత్రి |
స్మార్ట్ సిటీ స్ అభివృద్ధి, నగర రవాణా వ్యవస్థలు, వలసదారుల నివాసాలు, సౌకర్యాలు మొదలైన వాటికి సంబంధించి సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. |
9. |
భారతదేశం, ఫ్రాన్స్ ల మధ్య భద్రపరచిన లేదా గోపనీయ సమాచారాన్ని ఇరు దేశాలు ఇచ్చిపుచ్చుకొని దానికి భద్రతను కల్పించడానికి సంబంధించి ఒప్పందం |
శ్రీ అజీత్ డోభాల్, ఎన్ఎస్ఎ |
శ్రీ ఫిలిప్ ఎతియెనె, దౌత్య వ్యవహారాలలో ఫ్రాన్స్ అధ్యక్షునికి సలహాదారు
|
ఇరు దేశాలకు సంబంధించిన భద్రపరచిన సమాచారాన్ని ఇచ్చి పుచ్చున్న సందర్బాల్లో ఆ సమాచారానికి భద్రత కల్పించే ఉమ్మడి భద్రత నియమ నిబంధనలను ఈ ఒప్పందం నిర్వచిస్తుంది.
|
10. |
సముద్ర ప్రాంతం పైన చైతన్యం కలిగించే మిశన్ కు సంబంధించి ముందస్తు అధ్యయనాల రూపకల్పన విషయంలో భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ (ఐఎస్ఆర్ఒ), సెంట్రల్ నేషనల్ డి’ఎట్యూడ్స్ స్పేశియల్స్ ( సిఎన్ ఇ ఎస్) మధ్య ఏర్పాటు అమలు కు సంబంధించిన ఒప్పందం |
శ్రీ కె. శివన్, కార్యదర్శి, అంతరిక్ష విభాగం మరియు చైర్మన్, ఐఎస్ఆర్ఒ |
శ్రీ జీన్ యెవెస్ లె గాల్, ప్రెసిడెంట్, సిఎన్ ఇ ఎస్ |
ఫ్రాన్స్ కు, భారతదేశానికి మధ్య ప్రాధాన్యం కలిగిన ప్రాంతాలలో నౌకల గుర్తింపునకు, పర్యవేక్షణకు సంబంధించి ఆద్యంతం పరిష్కరాలను అందించగలిగే ఒప్పందం |
11. |
భారతదేశానికి చెందిన న్యూక్లియర్ పవర్ కార్పొరేశన్, ఆఫ్ ఇండియా లిమిటెడ్ కు, ఫ్రాన్స్ కు చెందిన ఇడిఎఫ్ కు మధ్య ఇండస్ట్రియల్ వే ఫార్బర్డ్ ఒప్పందం |
శ్రీ శేఖర్ బసు, కార్యదర్శి, అణు శక్తి విభాగం |
శ్రీ జీన్ బెర్నార్డ్ లెవీ, సిఇవో, ఇడిఎఫ్ |
జైతాపూర్ పరమాణు విద్యుత్తు ప్రాజెక్టు అమలుకు ఒక బాటను ఈ ఒప్పందం సూచిస్తుంది. |
12. |
హైడ్రోగ్రఫీ, మేరిటైమ్ కార్టోగ్రఫీలకు సంబంధించి భారతదేశం, ఫ్రాన్స్ ల మధ్య ద్వైపాక్షిక ఒప్పందం |
శ్రీ వినయ్ క్వాత్రా, భారతదేశం రాయబారి |
శ్రీ అలెగ్జాండర్ జీగ్లర్, ఫ్రాన్స్ రాయబారి |
హైడ్రోగ్రఫీ, నాటికల్ డాక్యుమెంటేషన్, మేరిటైమ్ భద్రతా సమాచారం రంగాలకు సంబంధించి సహకారాన్ని ఈ ఒప్పందం ప్రోత్సహిస్తుంది |
13. |
స్మార్ట్ సిటీ ప్రాజెక్టులకు నిధులను అందించడానికి వీలుగా భారతదేశం, ఫ్రాన్స్ లకు మధ్య రుణ సౌకర్య ఒప్పందం. ఈ ప్రాజెక్టులు ఛాలెంజ్ విధానంలో చేపట్టినవై ఉండాలి. |
శ్రీ వినయ్ క్వాత్రా, భారతదేశం రాయబారి |
శ్రీ అలెగ్జాండర్ జీగ్లర్, ఫ్రాన్స్ రాయబారి |
స్మార్ట్ సిటీస్ కార్యక్రమానికి కేటాయించిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధుల మధ్య వచ్చే అంతరాన్ని భర్తీ చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుంది. |
14. |
నేశనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జి (ఎన్ఐఎస్ఇ), నూతన మరియు నవీకరణ యోగ్య శక్తి మంత్రిత్వ శాఖ ఇంకా ఫ్రాన్స్ కు చెందిన నేశనల్ సోలార్ ఎనర్జి ఇన్ స్టిట్యూట్ (ఐఎన్ఇఎస్) కు మధ్య అవగాహన పూర్వక ఒప్పందం |
శ్రీ వినయ్ క్వాత్రా, భారతదేశం రాయబారి |
శ్రీ డేనియల్ వెర్వాయెర్దె, అడ్మినిస్ట్రేటర్, ది కమిశన్ ఫర్ అటామిక్ అండ్ ఆల్టర్నేట్ ఎనర్జి (సిఇఎ) |
అంతర్జాతీయ సౌర కూటమి ( ఐఎస్‌ఎ) సభ్యత్వ దేశాలలో ఇరు దేశాలు పని చేయడానికి ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. సౌర శక్తి (సోలార్ ఫోటో వోల్టాయిక్, స్టోరేజ్ టెక్నాలజీస్ మొదలైన) రంగాలలో సాంకేతిక విజ్ఞానం బదిలీ, పరస్పర సహాయ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. |