వ. సం |
ఒప్పందాలు/ ఎంఒయు లు |
భారతదేశం పక్షాన మార్పిడి చేసుకొన్న వారు |
సౌదీ వైపు నుంచి ఇచ్చిపుచ్చుకున్నవారు |
1. |
నేశనల్ ఇన్ వెస్ట్ మెంట్ ఎండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ లో పెట్టుబడి పెట్టడం పై భారత గణతంత్ర ప్రభుత్వం మరియు కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ప్రభుత్వం ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం |
శ్రీమతి సుష్మా స్వరాజ్, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి |
హెచ్. ఇ. శ్రీ ఖాలిద్ అల్ ఫలీహ్, శక్తి, పరిశ్రమల మరియు ఖనిజ వనరుల శాఖ మంత్రి |
2. |
పర్యాటక రంగం లో సహకారం పై భారత గణతంత్ర ప్రభుత్వ పర్యాటక మంత్రిత్వ శాఖ మరియు కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా యొక్క సౌదీ కమిశన్ ఫర్ టూరిజం ఎండ్ నేశనల్ హెరిటేజ్ ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం |
శ్రీ టి.ఎస్.తిరుమూర్తి, కార్యదర్శి (ఇఆర్), |
హెచ్. ఇ. శ్రీ అదెల్ అల్-జుబేర్, విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి |
3. |
గృహ నిర్మాణ రంగంలో సహకారం పై భారత గణతంత్ర ప్రభుత్వ మరియు కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా ప్రభుత్వం ల మధ్య అవగాహనపూర్వక ఒప్పందం |
శ్రీ అహ్మద్ జావేద్ సౌదీ అరేబియా కు భారతదేశ రాయబారి |
హెచ్. ఇ. డాక్టర్ మాజిద్ బిన్ అబ్దుల్లా అల్ కసబీ, వాణిజ్యం మరియు పెట్టుబడి శాఖ మంత్రి |
4. |
ద్వైపాక్షిక పెట్టుబడి సంబంధాలను పెంచేందుకు భారత గణతంత్ర ప్రభుత్వానికి చెందిన ఇన్ వెస్ట్ ఇండియా కు, కింగ్ డమ్ ఆఫ్ సౌదీ అరేబియా యొక్క సౌదీ అరేబియన్ జనరల్ ఇన్ వెస్ట్ మెంట్ అథారిటీ కి మధ్య ఫ్రేం వర్క్ కో ఆపరేశన్ ప్రోగ్రాం |
శ్రీ అహ్మద్ జావేద్. సౌదీ అరేబియా కు భారతదేశ రాయబారి |
హెచ్. ఇ. డాక్టర్ మాజిద్ బిన్ అబ్దుల్లా అల్ కసబీ, వాణిజ్యం మరియు పెట్టుబడి శాఖ మంత్రి |
5. |
ప్రసారం పై మరియు దృశ్య శ్రవణ కార్యక్రమాల మార్పిడి పై సహకారానికి సంబంధించి న్యూ ఢిల్లీ లోని ప్రసార భారతి కి, సౌదీ అరేబియా కు చెందిన సౌదీ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేశన్ (ఎస్‌బిసి)కి మధ్య ఎంఒయు |
శ్రీ అహ్మద్ జావేద్, సౌది అరేబియా కు భారతదేశ రాయబారి |
హెచ్.ఇ. డాక్టర్ తుర్కి అబ్దుల్లా అల్-షబానా, ప్రసార మాధ్యమాల శాఖ మంత్రి |
నోట్: పై వాటి తో పాటు ఇంటర్ నేశనల్ సోలర్ అలయెన్స్ (ఐఎస్ ఎ) కు సంబంధించిన ఫ్రేం వర్క్ అగ్రిమెంటు పై న కూడా సౌదీ పక్షం సంతకాలు చేసింది.