1. ‘‘విశ్వాసం మరియు భాగస్వామ్యం ద్వారా సహకారం లో నూతన శిఖరాల కు చేరుకోవడం’’ శీర్షిక తో సంయుక్త ప్రకటన.
2. భారతదేశం – రష్యా యొక్క వ్యాపారం మరియు పెట్టుబడుల పెంపుదల కు ఉద్దేశించిన సంయుక్త వ్యూహం.
3. రష్యన్/ సోవియట్ సైన్య సామగ్రి కోసం విడి భాగాల ఉత్పత్తి లో సహకారం అంశం పై మరియు రష్యన్ ఫెడరేశన్ కు, రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాని కి మధ్య ఒప్పందం.
4. దృశ్య, శ్రవణ సంబంధిత సహ నిర్మాణం అంశం లో సహకారాని కి సంబంధించి రష్యన్ ఫెడరేశన్ ప్రభుత్వాని కి మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాని కి మధ్య ఒప్పందం.
5. రహదారి రవాణా లో, రహదారుల పరిశ్రమ లో ద్వైపాక్షిక సహకారం అంశం పై రష్యన్ ఫెడరేశన్ యొక్క రవాణ మంత్రిత్వ శాఖ కు మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క రహదారి రవాణా, ఇంకా హైవేస్ మంత్రిత్వ శాఖ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం.
6. రష్యన్ ఫెడరేశన్ లో గల వ్లాదివోస్తోక్ నౌకౌశ్రయాని కి మరియు గణతంత్ర భారతదేశం లో గల చెన్నై నౌకాశ్రయాని కి మధ్య సముద్ర సంబంధిత వార్తాసౌకర్యాల అభివృద్ధి అంశం పై రష్యన్ ఫెడరేశన్ యొక్క రవాణా మంత్రిత్వ శాఖ కు మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క శిప్పింగ్ మంత్రిత్వ శాఖ కు మధ్య మెమోరాండమ్ ఆఫ్ ఇంటెంట్.
7. 2019-2022 మధ్య కాలం లో కస్టమ్స్ ఉల్లంఘనల పై పోరాటాన్ని సలిపేందుకు గాను రష్యన్ ఫెడరేశన్ కు చెందిన ఫెడరల్ కస్టమ్స్ సర్వీసు కు మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని పరోక్ష పన్నులు, ఇంకా కస్టమ్స్ సంబంధిత కేంద్రీయ మండలి కి మధ్య సహకారాని కి ఉద్దేశించినటువంటి ప్రణాళిక.
8. రవాణా కోసం సహజ వాయువు వినియోగం అంశం పై రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క పెట్రోలియమ్ మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కు, రష్యన్ ఫెడరేశన్ కు చెందిన శక్తి మంత్రిత్వ శాఖ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం.
9. చమురు మరియు గ్యాస్ రంగం లో సహకారాన్ని విస్తృతపరచుకోవడం అనే అంశం పై రష్యన్ ఫెడరేశన్ యొక్క శక్తి మంత్రిత్వ శాఖ కు మరియు రిపబ్లిక్ ఆఫ్ ఇండియా యొక్క పెట్రోలియం మరియు సహజ వాయువు మంత్రిత్వ శాఖ కు మధ్య కార్యక్రమం.
10. రష్యా లోని దూర ప్రాచ్య ప్రాంతం లో కోకింగ్ కోల్ గనుల తవ్వకం పథకాల అమలు లో సహకారాని కి ఉద్దేశించినటువంటి ఫార్ ఈస్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఎండ్ ఎక్స్ పోర్ట్ ఏజెన్సీ కి మరియు కోల్ ఇండియా లిమిటెడ్ కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం.
11. పెట్టుబడి సంబంధిత సహకారాని కి గాను రష్యన్ డైరెక్ట్ ఇన్ వెస్ట్ మెంట్ ఫండ్ కు మరియు ఇన్వెస్ట్ ఇండియా కు మధ్య సహకారం కోసం ఉద్దేశించినటువంటి ఒప్పందం.
12. రోస్ కాంగ్రెస్ ఫౌండేశన్ కు మరియు భారతదేశ వాణిజ్యం, ఇంకా పరిశ్రమ మండలు ల సమాఖ్య కు మధ్య సహకారం కోసం ఉద్దేశించినటువంటి ఒప్పందం.
13. నూతన పథకాల ను ప్రోత్సహించడం కోసం అటానమస్ నాన్-ప్రాఫిట్ ఆర్గనైజేశన్ ఏజెన్సీ ఫర్ స్ట్రటీజిక్ ఇనిశియేటివ్స్ కు మరియు భారతదేశ వాణిజ్యం, ఇంకా పరిశ్రమ మండలు ల సమాఖ్య కు మధ్య అవగాహన పూర్వక ఒప్పంద పత్రం.
14. జాయింట్ స్టాక్ కంపెనీ నోవాటెక్ మరియు పెట్రోనెట్ ఎల్ఎన్‌జి లిమిటెడ్ మధ్య డౌన్ స్ట్రీమ్ ఎల్ఎన్‌జి బిజినెస్ ను, ఇంకా ఎల్ఎన్‌జి సరఫరాల ను సంయుక్తం గా అభివృద్ధి పరచే అంశం లో సహకారం కోసం ఉద్దేశించిన అవగాహన పూర్వక ఒప్పంద పత్రం.
15. శ్రేయీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫైనాన్స్ లిమిటెడ్ కు మరియు జాయింట్-స్టాక్ కంపెనీ రోస్ జియోలాజియా కు మధ్య సహకారాని కి ఉద్దేశించిన ఒప్పందం.