Sl.No. | ఎంఓయు / ఒప్పందం వివరాలు | భారతదేశం తరఫున ప్రాతినిధ్యంవహించినవారు | డెన్మార్క్ తరఫున ప్రాతినిధ్యంవహించినవారు |
---|---|---|---|
1 |
భూగర్భ జలాల వనరుల మ్యాపింగ్ కు సంబంధించి భారతదేశానికి డెన్మార్క్‌కు మధ్యన ఎంఓయు. ఇండియాకు చెందిన విజ్ఞాన శాస్త్ర మరియు పారిశ్రామిక పరిశోధనా మండలి- జాతీయ భూభౌతిక పరిశోధనా కేంద్రం, హైదరాబాద్ కు డెన్మార్క్ కు చెందిన ఆర్హస్ విశ్వవిద్యాలయం, డెన్మార్క్ మరియు గ్రీన్ లాండ్ లకు చెందిన భౌగోళిక సర్వే సంస్థ లకు మధ్యన ఈ అవగాహన ఒప్పందం పత్రం కుదిరింది. |
డాక్టర్ వి.ఎం. తివారీ, డైరెక్టర్, సిఎస్ ఐఆర్- ఎన్ జిఆర్ ఐ, ఉప్పల్ రోడ్డు, హైదరాబాద్ ( తెలంగాణ) |
ఆంబ్ ఫ్రెడ్డీ స్వానే |
2 |
ఇండియాకు చెందిన విజ్ఞానశాస్త్ర మరియు పారిశ్రామిక పరిశోధనా మండలికి, డెన్మార్క్ కు చెందిన పేటెంట్ మరియు ట్రేడ్ మార్క్ కార్యాలయానికి మధ్యన సంప్రదాయ విజ్ఞాన డిజిటల్ లైబ్రరీని అందుబాటులోకి తెచ్చే ఒప్పందం. |
డాక్టర్ విశ్వజనని జె. సత్తిగెరి, హెడ్, సిఎస్ ఐఆర్- సంప్రదాయ విజ్ఞాన డిజిటల్ లైబ్రరీ విభాగం, 14, సత్సంగ్ విహార్ మార్గ్, న్యూఢిల్లీ |
ఆంబ్ ఫ్రెడ్డీ స్వానే |
3 |
ఉష్ణమండల వాతావరణంలో సహజ శీతలీకరణ పరికరాలను ఏర్పాటు చేసుకోవడానికి వీలుగా ఉన్నతస్థాయి సంస్థను ఏర్పాటు చేయడానికిగాను బెంగళూరులోని భారతీయ విజ్ఞానశాస్త్ర సంస్థకు, డెన్మార్క్ కు చెందిన డాన్ ఫాస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ కు మధ్యన ఎంఓయు. |
ఆచార్య గోవిందన్ రంగరాజన్, డైరెక్టర్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. |
శ్రీ రవిచంద్రన్ పురుషోత్తమన్, అధ్యక్షులు, డాన్ ఫాస్ ఇండియా |
4 |
భారతదేశానికి చెందిన నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామిక ప్రోత్సాహక మంత్రిత్వశాఖకు డెన్మార్క్ ప్రభుత్వానికి మధ్యన జాయింట్ లెటర్ ఆఫ్ ఇంటెంట్. |
శ్రీ రాజేష్ అగర్వాల్, కార్యదర్శి, నైపుణ్యాభివృద్ధి మరియు పారిశ్రామ ప్రోత్సాహక మంత్రిత్వశాఖ |
ఆంబ్ ఫ్రెడ్డీ స్వానే |
|
పైవాటితోపాటు కింద తెలిపిన వాణిజ్య ఒప్పందాలను కూడా ప్రకటించారు.
ఎ. |
హైడ్రోజన్ ఎలక్ట్రోలైజర్ ను అభివృద్ధి చేయడంపైనా, అనంతరం ఇండియాలో దాని తయారీ, అందుబాటును చేపట్టడంపైనా రిలయన్స్ ఇండిస్ట్రీస్ లిమిటెడ్‌కు,స్టైస్ డాల్ ఫ్యూయల్ టెక్నాలజీ సంస్థలకు మధ్యన ఎంఓయు. |
బి. |
డెన్మార్క్ లో సుస్థిరత్వ పరిష్కారాలనందించే ఉన్నతస్థాయి కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి సంబంధించి ఇన్ఫోసిస్ టెక్నాలజీస్, ఆర్హస్ విశ్వవిద్యాలయానికి మధ్యన ఎంఓయు.
|
సి. |
ఆర్ధికరంగంలో హరిత మార్పును సాధించడానికి సంబంధించి పరిశోధనలు చేయడానికిగాను అవసరమైన విజ్ఞాన మార్పిడిలో వ్యూహాత్మక సహకారంపైన అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ మరియు స్టేట్ ఆఫ్ గ్రీన్ సంస్థలకు మధ్యన ఎంఓయు. |