క్ర. సం. |
ఒప్పందాలు/ఎంఒయు ల పేరు |
భారతదేశం తరఫున సంతకం చేసిన వారు |
మాల్దీవ్స్ తరఫున సంతకం చేసిన వారు |
1. |
హైడ్రోగ్రఫీ రంగం లో పరస్పర సహకారాని కి సంబంధించి మాల్దీవ్స్ నేశనల్ డిఫెన్స్ ఫోర్స్ కు,భారత నౌకాదళాని కి మధ్య ఎంఒయు
|
శ్రీ విజయ్ గోఖలే, విదేశీ వ్యవహారాల కార్యదర్శి |
శ్రీ యుజా, మరియా అహ్మద్ దిది, రక్షణ మంత్రి |
2. |
ఆరోగ్య రంగంలో సహకారానికి భారత ప్రభుత్వాని కి మరియుమాల్దీవ్స్ ప్రభుత్వాని కి మధ్య ఎంఒయు |
శ్రీ సంజయ్ సుధీర్, భారత రాయబారి |
శ్రీ అబ్దుల్లా అమీన్, ఆరోగ్య మంత్రి |
3. |
సముద్ర మార్గం లో ప్రయాణికులు,సరకు రవాణా కు సంబంధించి భారత ప్రభుత్వ శిప్పింగ్ మంత్రిత్వ శాఖ కు మరియుమాల్దీవ్స్ రవాణా,పౌర విమానయాన మంత్రిత్వ శాఖ కు మధ్య ఎంఒయు |
శ్రీ సంజయ్ సుధీర్, భారత రాయబారి |
శ్రీ ఐషత్ నహులా, రవాణా, పౌర విమాన యాన మంత్రి |
4. |
కస్టమ్స్ రంగం లో సామర్ధ్యాల పెంపు నకు సంబంధించి కస్టమ్స్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ కు మరియు మాల్దీవ్స్ కస్టమ్స్ సర్వీసెస్ కు మధ్య ఎంఒయు |
శ్రీ సంజయ్ సుధీర్, భారత రాయబారి |
శ్రీ అహ్మద్ నుమాన్ , కమిశనర్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ |
5. |
మాల్దీవ్స్ సివిల్ సర్వెంట్ లకు శిక్షణ, సామర్ధ్యాల పెంపు నకు సంబంధించి నేశనల్ సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, డిపార్ట్ మెంట్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్, పబ్లిక్ గ్రీవెన్సెస్ కుమరియు మాల్దీవ్స్ సివిల్ సర్వీస్ కమిశన్ కు మధ్య ఎంఒయు |
శ్రీ సంజయ్ సుధీర్, భారత రాయబారి |
డాక్టర్ అలీ శమీమ్, ప్రెసిడెంట్/ ఛైర్మన్ సివిల్ సర్వీస్ కమిశన్ ఆఫ్ మాల్దీవ్స్ |
6. |
వైట్ శిప్పింగ్ సమాచారాన్ని పంచుకొనేందుకు సంబంధించి భారత నౌకా దళానికి మరియుమాల్దీవ్స్ జాతీయ రక్షణ దళానికి మధ్య సాంకేతిక ఒప్పందం |
సంజయ్ సుధీర్, భారత రాయబారి |
బ్రిగేడియర్ జనరల్ అబ్దుల్ రహీమ్ అబ్దుల్ లతీఫ్, వైస్ ఛీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్స్ |