ఉలాన్ బటోర్ లోని చరిత్రాత్మకమైన గందన్ తేగ్ చెన్ లింగ్ మఠం లో నెలకొల్పిన భగవాన్ బుద్ధుడు మరియు ఆయన శిష్యులు ఇద్దరి విగ్రహాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, ఇంకా మంగోలియా అధ్యక్షుడు మాన్య శ్రీ ఖాల్త్ మాగిన్ బటుల్ గా లు సంయుక్తం గా ఆవిష్కరించారు.
ప్రధాన మంత్రి 2015వ సంవత్సరం లో మంగోలియా లో పర్యటించిన సందర్భం గా గందన్ తేగ్ చెన్ లింగ్ మఠం లో ప్రార్థన లలో పాలుపంచుకొన్నారు. మన రెండు దేశాల మధ్య, మన రెండు దేశాల ప్రజల మధ్య నెలకొన్న ఉమ్మడి నాగరకత, ఇంకా ఉమ్మడి బౌద్ధ వారసత్వం తాలూకు లంకెల ను చాటి చెప్పే విధం గా భగవాన్ బుద్ధుని విగ్రహాన్నొక దాని ని మఠాని కి బహుమతి గా ఇస్తున్నట్లు ప్రధాన మంత్రి ప్రకటించారు.
ఆ విగ్రహం భగవాన్ బుద్ధుడు తన ఇద్దరు శిష్యుల తో కలసి ఆసీనుడై ఉన్న భంగిమ లో ఉన్నది. శాంతి, సహ జీవనం మరియు దయ ల సందేశాన్ని ప్రబోధిస్తున్నట్లుగా ఉందది. ఆ విగ్రహాన్ని 2019వ సంవత్సరం సెప్టెంబర్ 6వ, 7వ తేదీల లో ఉలాన్ బటోర్ లో నిర్వహించిన సంవాద్ సంభాషణ ల మూడో సంచిక సందర్భం గా గందన్ మఠం లో స్థాపించారు. బౌద్ధాని కి సంబంధించిన సమకాలీన అంశాల పై చర్చోప చర్చలు చేయడం కోసం వివిధ దేశాల కు చెందిన బౌద్ధ ధార్మిక నాయకుల ను, నిపుణుల ను మరియు పండితుల ను అందరినీ సంవాద్ సంభాషణ ల యొక్క మూడో సంచిక ఒక చోటు కు చేర్చింది.
గందన్ తేగ్ చెన్ లింగ్ మఠం మంగోలియా లోని బౌద్ధుల కు చెందిన ఒక ప్రముఖ కేంద్రం గా ఉంది. అంతేకాదు, ఇది అమూల్యమైనటువంటి బౌద్ధ వారసత్వానికి ఒక కోశాగారం గా కూడా ఉంది. ఏశియన్ బుద్ధిస్ట్ కాన్ఫరెన్స్ ఫర్ పీస్ (ఎబిసిపి) యొక్క 11వ సాధారణ సభ 2019వ సంవత్సరం జూన్ 21వ తేదీ మొదలుకొని 23వ తేదీ వరకు జరిగింది ఇక్కడే. భారతదేశం, దక్షిణ కొరియా, రష్యా, శ్రీ లంక, బాంగ్లాదేశ్, భూటాన్, నేపాల్, ఉత్తర కొరియా, ఎల్‌పిడిఆర్, థాయీలాండ్, జపాన్ తదితర దేశాల అతిథుల తో సహా 14 దేశాల నుండి 150 మంది కి పైగా అతిథులు ఈ కార్యక్రమాని కి విచ్చేశారు.
ప్రధాన మంత్రి మరియు మంగోలియా అధ్యక్షుడు మాన్య శ్రీ ఖాల్త్ మాగిన్ బటుల్‌గా లు ఈ రోజు న ఆవిష్కరించిన విగ్రహం భగవాన్ బుద్ధుని యొక్క విశ్వవ్యాప్త సందేశం పట్ల మన రెండు దేశాలు వ్యక్తం చేసే ఉమ్మడి గౌరవాని కి ఒక సంకేతం గా ఉంది.