పిల్లల కు కొత్త కొత్త ఆటబొమ్మల ను అందుబాటు లోకి తీసుకురావడం మరియు భారతదేశం ఏ విధం గా బొమ్మల ఉత్పత్తి కేంద్రం గా మారగలదనే అంశాల పై చిల్డ్రన్ యూనివర్సిటీ ఆఫ్ గాంధీ నగర్ తో, కేంద్ర మహిళా మరియు శిశు వికాసం మంత్రిత్వ శాఖ తో మరియు ఎంఎస్ఎంఇ మంత్రిత్వ శాఖ తో తాను జరిపిన చర్చోపచర్చల ను గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) తాజా ప్రసంగం లో వెల్లడించారు. ఆటవస్తువులు చురుకుదనాన్ని పెంచడం ఒక్కటే కాకుండా, మన మహత్త్వాకాంక్షల కు రెక్కల ను కూడా తొడుగుతాయని ఆయన అన్నారు. ఆటబొమ్మలు కేవలం వినోదాన్నే అందించవు, అవి వినోదం తో పాటు మన మేధో వికాసానికి తోడ్పడుతాయి, అలాగే ఆటబొమ్మలు మన సంకల్పాన్ని కూడా ప్రోత్సహిస్తాయి అని ప్రధాన మంత్రి అన్నారు.
బొమ్మల ను గురించి గురుదేవులు రబీంద్ర నాథ్ టాగోర్ చెప్పిన ఒక ఉపాఖ్యానాన్ని ప్రధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. పూర్తి కాకుండా ఉన్న బొమ్మయే మంచి బొమ్మ; పిల్లలు కలిసికట్టుగా ఆటాడుతూనే పూర్తి చేసేదే మంచి బొమ్మ అవుతుంది అని గురుదేవులు అన్నారు అని ప్రధాన మంత్రి నొక్కిపలికారు. బాలల్లో ఉండే సృజనాత్మకత ను బయటకు తెచ్చేలాగా బొమ్మలు ఉండాలి అని గురుదేవులు చెప్పే వారు అని ప్రధాన మంత్రి అన్నారు.
పిల్లల జీవితాల కు సంబంధించిన వివిధ దశలపై బొమ్మల ప్రభావం అనే అంశానికి జాతీయ విద్య విధానం లో ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం జరిగిందని ప్రధాన మంత్రి తెలిపారు. మంచి బొమ్మలు తయారుచేసే కళాకారులెందరో మన దేశంలో ఉన్నారని, కర్నాటక లో చెన్నపట్టణ , రామనగరం, ఆంధ్ర ప్రదేశ్ కృష్ణా జిల్లా లోని కొండపల్లి , తమిళ నాడు లోని తంజావూరు, అసమ్ లోని ధుబరీ, ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ కూడా బొమ్మల తయారీ కేంద్రాలు గా అభివృద్ధి చెందుతున్నాయి. ప్రపంచవ్యాప్తం గా బొమ్మల పరిశ్రమ 7 లక్షల కోట్ల రూపాయలకు పైగా విలువైన బొమ్మల ను తయారు చేస్తుండగా దానిలో భారతదేశం
వాటా చాలా తక్కువ అని ఆయన తెలిపారు.
విశాఖపట్నానికి చెందిన శ్రీ సి. వి. రాజు కృషి ని ప్రధాన మంత్రి ప్రశంసించారు. శ్రేష్ఠమైన నాణ్యత కలిగిన ఏటికొప్పాక బొమ్మల ను రూపొందించడం ద్వారా
ఆ స్థానిక ఆటబొమ్మల కు మళ్లీ మంచి గుర్తింపు ను శ్రీ సి. వి. రాజు సంపాదించిపెట్టారన్నారు. ఆటబొమ్మల తయారీ కై నవ పారిశ్రామికవేత్తలంతా ఒక్కటవ్వాలని, ఇది స్థానిక బొమ్మల కు ఖ్యాతి ని సంతరింపచేయవలసిన తరుణం అని ప్రధాన మంత్రి ఉద్బోధించారు.
కంప్యూటర్ గేమ్స్ వైపు ప్రస్తుతం మొగ్గు అధికం గా ఉంది అని ప్రధాన మంత్రి చెప్తూ, మన చరిత్ర తాలూకు భావన లపైన, అవధారణల పైన ఆధారితమై ఉండేటటువంటి గేమ్స్ ను రూపొందించవలసిందంటూ సూచన చేశారు.