ఆర్చ్‌బిషప్ శ్రీ జార్జి కూవాకాడ్‌ను పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా చేయనుండడం భారతదేశానికి అత్యంత గర్వకారణమైన విషయం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున అన్నారు.
ప్రధానమంత్రి కార్యాలయం తన హ్యాండిల్ నుంచి సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంలో ఈ కింది విధంగా పేర్కొంది:
‘‘ఆర్చ్‌బిషప్ శ్రీ జార్జి కూవాకాడ్ ను పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్ కార్డినల్‌గా ప్రకటించనుండడం భారతదేశానికి అమిత గర్వకారణమైన విషయం.
ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడానికి కేంద్ర మంత్రి శ్రీ జార్జి కురియన్ నాయకత్వంలో ఒక ప్రతినిధి వర్గాన్ని భారత ప్రభుత్వం పంపించింది.
ఈ కార్యక్రమాని కన్నా ముందు, పరమ పవిత్రులు పోప్ ఫ్రాన్సిస్‌తో భారతీయ ప్రతినిధి వర్గం సమావేశమైంది.
@Pontifex
@GeorgekurianBjp”
It is a matter of immense pride for India that Archbishop George Koovakad will be created as a Cardinal by His Holiness Pope Francis.
— PMO India (@PMOIndia) December 7, 2024
The Government of India sent a delegation led by Union Minister Shri George Kurian to witness this Ceremony.
Prior to the Ceremony, the Indian… pic.twitter.com/LPgX4hOsAW