ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపిఎస్) 2016 బ్యాచ్ కు చెందిన 110 మందికి పైగా శిక్షణలో ఉన్న అధికారులు ఈ రోజు సమావేశమయ్యారు.
శిక్షణలో ఉన్న అధికారులతో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, పోలీసు విధుల నిర్వహణలో మానవీయ దృక్పథం మరియు సాంకేతిక విజ్ఞానం వంటి విషయాలకు ఉన్న ప్రాముఖ్యాన్ని ఉద్ఘాటించారు. స్వాతంత్య్రం వచ్చిన నాటి నుండి విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన 33,000 మందికి పైగా పోలీసు సిబ్బంది చేసిన త్యాగాలను ఆయన గుర్తుకు తెచ్చారు.
జాతీయ భద్రతా సలహాదారు శ్రీ అజీత్ డోభాల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.