రాజ్యసభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ, భారతదేశం యొక్క రిజర్వు బ్యాంకు వంటి సంస్థల రాష్ట్రీయ పవిత్రతను కాపాడాలని అభిప్రాయపడ్డారు. ‘నా ప్రభుత్వంపైనా లేదా నాకు సంబంధించిన పార్టీ మీద దాడులను అర్థంచేసుకోగలను కానీ ఆర్బిఐ వంటి సంస్థలను రాజకీయాలలోకి లాగడం సరికాదు. వాటి పవిత్రతను కాపాడాలి.” ఆర్బిఐ మన దేశ ఆర్థిక వ్యవస్థలో ప్రధాన పాత్రపోషిస్తుంది మరియు దానికి మనం సానుకూలంగా దోహదపడాలి.
ఆర్బిఐ వంటి సంస్థలను మరింత బలోపేతం చేసేందకు ఎన్డిఎ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టిందని శ్రీ మోదీ తెలిపారు.” ఆర్బిఐ చట్టం సవరించిన ద్రవ్య విధానం కమిటీ ఏర్పాటు చేశాము. ఇది చాల కాలం క్రితంజరగాలి. కాని మా ప్రభుత్వం చేసింది. ఈ కమిటీలో ఒక్క సభ్యుడు కూడా కేంద్ర ప్రభుత్వానికి చెందినవారు ఉండరు.”