Governments alone cannot bring about changes. What brings about change is participative governance: PM Modi
The biggest assets of any nation are Shram Shakti and Ichcha Shakti. Once the people decide to bring about change, everything is possible: PM
Essential to know the root of every problem and think about 'out of the box' ways to solve them, says PM Modi
What will drive innovation is IPPP- Innovate, Patent, Produce, and Prosper: PM Narendra Modi
We want to give more autonomy to our higher education sector. Work is being done to create institutions of eminence: PM
Innovation has the power to overcome the challenges our world faces: PM Modi

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, స్మార్ట్ ఇండియా హ్యాక‌థాన్ -2018 గ్రాండ్ ఫినాలేని ఉద్దేశించి , వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ముచ్చ‌టించారు. . ఈ సంద‌ర్భంగా స్మార్ట్ ఇండియా హాక‌థాన్ -2018లో పాల్గొన్న వారితో  మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి, ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యంతో కూడిన పాల‌న ప్రాధాన్య‌త గురించి ప్ర‌ముఖంగా ప్ర‌స్తావించారు.

యువ‌త‌రంపై త‌న‌కు ఎన్నో ఆశ‌లు ఉన్నాయ‌ని అంటూ  ప్ర‌ధాన‌మంత్రి, న‌వ‌భార‌త నిర్మాణ దార్శ‌నిక‌త‌ను సాధించేందుకు త‌మ వంతు చేయూత‌నందించాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు. యువ ప్రొఫష‌న‌ల్స్‌,యువ సి.ఇ.ఒలు, యువ శాస్త్ర‌వేత్త‌లు, యువ అధికారుల‌ను క‌లుసుకునేందుకు వ‌చ్చే ఏ అవ‌కాశాన్నీ తానెప్పుడూ వ‌దులుకోన‌ని ప్ర‌ధాన‌మంత్రి స్ప‌ష్టం చేశారు.“ దేశాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు యువత, వినూత్న ఆలోచ‌న‌ల‌ను చేస్తుండ‌డం చూసి నాకు సంతోషంగా ఉంది “ అని ఆయ‌న అన్నారు.

ఏ దేశానికైనా  శ్ర‌మ‌శ‌క్తి, ఇచ్చాశ‌క్తి గిప్ప ఆస్తి అని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు..  “ ప్ర‌జ‌లు ఒక్క‌సారి మార్పు తీసుకువ‌చ్చేందుకు నిర్ణ‌యించుకుంటే , ఇక ప్ర‌తి ఒక్క‌టీ సాధ్య‌మే. అయితే ప్ర‌భుత్వాలు చేసే పెద్ద త‌ప్పు , వారు మాత్ర‌మే మార్పు తీసుకురాగ‌ల‌ర‌ని ఆలోచించ‌డం” అని ఆయ‌న అన్నారు.

ఈ హ్యాక‌థాన్‌లో పాల్గొనేవారి సంఖ్య గ‌త సంవ‌త్స‌రం పాల్గొన్న వారి సంఖ్య‌తో పోల్చి చూసిన‌పుడు , పెర‌గ‌డం ప‌ట్ల‌ ప్ర‌ధాన‌మంత్రి సంతోషం వ్య‌క్తం చేశారు. “ గ‌తంలో జ‌రిగిన హ్యాక‌థాన్‌ సంద‌ర్భంగా  చేప‌ట్టిన ప్రాజెక్టులు చాలావ‌ర‌కు పూర్త‌యిన‌ట్టు నాకు తెలిసింది” అని ప్ర‌ధాన‌మంత్రి చెప్పారు.

 న‌వ‌క‌ల్ప‌న‌ల‌పై ప్ర‌ధానంగా .ప్ర‌ధాన‌మంత్రి దృష్టిపెట్టారు. అందుకు ఐ .పి .పి. పి   అంటే ఇన్నొవేట్‌, పేటెంట్‌, ప్రొడ్యూస్‌, ప్రాస్ప‌ర్ మంత్రను ఆయ‌న ప్ర‌స్తావించారు. “ ఈ నాలుగు చ‌ర్య‌లు మ‌న దేశాన్ని స‌త్వ‌ర అభివృద్ధివైపు తీసుకు వెళ‌తాయి. అందుకు మ‌నం న‌వ‌క‌ల్ప‌న‌లు ఆవిష్క‌రించాలి. . మ‌న న‌వ‌క‌ల్ప‌న‌ల‌ను పేటెంట్‌గా మార్చాలి.మ‌న ఉత్ప‌త్తిని సుల‌భ‌త‌రం చేయాలి. ఇలా స‌త్వ‌రం ప్ర‌జ‌ల వ‌ద్ద‌కు ఈ ఉత్ప‌త్తుల‌ను తీసుకువెళ్ల గ‌లిగితే అది వారి సుసంప‌న్న‌త‌కు దోహ‌ద‌ప‌డుతుంది” అని ప్ర‌ధానమంత్రి అన్నారు. “  మ‌న ప్ర‌పంచం ఎదుర్కొంటున్న స‌వాళ్ల‌ను అధిగ‌మించే శ‌క్తి నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు ఉంది.మ‌న ఆవిష్క‌ర‌ణ‌లు మ‌న సాటి పౌరుల జీవితాల‌లో ఏర‌కంగా మార్పు తీసుకురానున్నాయ‌న్న‌ది మ‌నం ఆలోచించాలి” అని ఆయ‌న అన్నారు. ప‌రిశోధ‌న‌, న‌వ‌క‌ల్ప‌న‌ల‌కు వీలు క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న వివిధ చ‌ర్య‌ల‌ను ప్ర‌ధాన‌మంత్రి వివ‌రించారు.

అట‌ల్ టింక‌రింగ్ ల్యాబ్‌లో విద్య‌,  అభ్య‌స‌న నైపుణ్యాల ప్రాతిప‌దిక‌గా ఆధునిక ప‌ద్ధ‌తుల‌ను ప్ర‌వేశ‌పెట్ట‌డం ద్వారా ఆర‌వ త‌ర‌గ‌తి నుంచి 12 వ త‌ర‌గ‌తి వ‌ర‌కు గ‌ల  విద్యార్థులు దీనివ‌ల్ల ఎంతో ప్ర‌యోజ‌నం పొంద‌గ‌లుగుతున్నారు.

ఐఐటిలు, ఐఐఎస్‌సి, ఎన్‌.ఐ.టిల‌లో బిటెక్‌,ఎంటెక్‌, ఎం.ఎస్ వంటి కోర్సులు చ‌దివే వారిలో ప్ర‌తి సంవ‌త్స‌రం సుమారు వెయ్యి మందికి ప్ర‌ధాన‌మంత్రి రిసెర్చ్ ఫెలోషిప్‌ను అందించ‌డం జ‌రుగుతోంది. ఈ విద్యార్థుల‌కు నెల‌కు సుమారు 70 వేల రూపాయ‌ల నుంచి 80 వేల రూపాయ‌ల వ‌ర‌కు ఆర్థిక స‌హాయాన్ని ఐదు సంవ‌త్స‌రాల వ‌ర‌కు ఇస్తారు.

ఉన్న‌త విద్యా సంస్థ‌ల‌కు మ‌రింత విస్తృత‌ స్వంతంత్ర ప్ర‌తిప‌త్తి క‌ల్పించ‌డం పై దృష్టిపెట్ట‌డం జ‌రుగుతోంది.

ప్ర‌పంచ స్థాయి ప్ర‌తిభ‌, ప్ర‌మాణాలు క‌లిగిన 20 సంస్థ‌ల‌ను రూప‌క‌ల్ప‌న దిశ‌గా కృషి జ‌రుగుతోంది.

ప్ర‌ధాన‌మంత్రి త‌న ప్ర‌సంగం సంద‌ర్భంగా మేక్ ఇన్ ఇండియా ఒక బ్రాండ్‌గా ఎలా మారిందీ, ప్ర‌పంచ‌వ్యాప్తంగా అది ఇప్పుడు ఎలా బ‌హుళ ప్ర‌చారం పొందిందీ ఒక ఉదాహ‌ర‌ణ ఇచ్చారు. నాలుగు సంవ‌త్స‌రాల క్రితం భార‌త దేశంలో మొబైల్ ఫోన్ల త‌యారీ యూనిట్లు కేవ‌లం రెండు మాత్ర‌మే ఉండేవ‌ని, కానీ ఇవాళ దేశంలో 120 వ‌ర‌కు ఫ్యాక్ట‌రీలు న‌డుస్తున్నాయ‌ని  ఆయ‌న చెప్పారు. 2013-2014 సంవ‌త్స‌రం గ‌ణాంకాల‌తో పోలిస్తే, పేటెంట్ రిజిస్ట్రేష‌న్లు, ట్రేడ్ మార్క్ రిజిస్ట్రేష‌న్లు మూడు రెట్లు పెరిగాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి తెలిపారు.

వివిధ రంగాల‌కు చెందిన హ్యాక‌థాన్‌లు అంటే హెల్త్ – హ్యాక‌థాన్‌, లా- హ్యాక‌థాన్‌,ఆర్కిటెక్చ‌ర్‌-హ్యాక‌థాన్‌, అగ్రిక‌ల్చ‌ర్‌- హ్యాక‌థాన్‌,రూర‌ల్ -హ్యాక‌థాన్ ఇలా ప‌లు హ్యాక‌థాన్‌ల‌కు గ‌ల అవ‌కాశాల‌ను ప‌రిశీలించాల్సిందిగా ప్ర‌ధాని ఇందులో పాల్గొన్న‌వారికి సూచించారు. “ మ‌న‌కు వినూత్నంగాఆలోచించే వ్య‌వ‌సాయరంగ నిపుణులు, ఇంజ‌నీర్లు, ఆర్కిటెక్ట్‌లు, డాక్ట‌ర్లు, లాయ‌ర్లు, మేనేజ‌ర్లు ఈ హ్యాక‌థాన్‌ల‌కు కావాలి. అలాంటి హ్యాక‌థాన్‌లు ప్ర‌తిభ మొగ్గ‌తొడిగే వారికి ఒక వేదిక‌గా ఉపయోగ‌ప‌డ‌తాయి.” అని ఆయ‌న అన్నారు.ప్ర‌గ‌తి స‌మావేశాల ద్వారా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు తాను ఎలా ప‌ర్య‌వేక్షిస్తున్న‌దీ కూడా త‌న స్వీయ అనుభ‌వాల‌ను ప్ర‌ధాన‌మంత్రి ఈ సంద‌ర్భంగా యువ‌త‌తో పంచుకున్నారు.

ఈ గ్రాండ్ ఫినాలే కార్య‌క్రమం సంద‌ర్బంగా ప్ర‌ధానమంత్రి , దేశంలోని వివిధ కేంద్రాల‌లో స్మార్ట్ ఇండియా హ్యాక‌థాన్ లో పాల్గొన్న వారితో  ముచ్చ‌టించారు.

 

Click here to read full text speech

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi