భారతీయ రైల్వేల యొక్క ‘మేక్ ఇన్ ఇండియా’ సంబంధమైనటువంటి కృషి భారతదేశం లో మొట్టమొదటి సెమీ హై స్పీడ్ రైలు “వందే భారత్ ఎక్స్‌ప్రెస్’’గా రూపుదిద్దుకొంది.
న్యూ ఢిల్లీ-కాన్‌పుర్-అలహాబాద్-వారాణసీ మార్గం లో పరుగులు తీసే తొలి రైలు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపు ఉదయం న్యూ ఢిల్లీ రైల్వే స్టేశన్ లో ప్రారంభ సూచకం గా జెండా ను చూపెడతారు. ఆయన రైలు లోని సదుపాయాల ను పరిశీలించి, అనంతరం జన సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ఈ రైలు ప్రారంభిక యాత్ర లో పాలుపంచుకొనే అధికారుల మరియు ప్రసార మాధ్యమాల ప్రతినిధుల బృందాని కి కేంద్ర రైల్వేలు మరియు బొగ్గు శాఖ మంత్రి శ్రీ పీయూష్ గోయల్ నాయకత్వం వహించనున్నారు. ఈ రైలు కాన్‌పుర్ లో, అలహాబాద్ లో ఆగుతుంది. అక్కడ ప్రముఖులు మరియు ప్రజలు ఈ రైలు కు స్వాగతం పలుకుతారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు గరిష్టం గా గంట కు 160 కిలో మీటర్ల వేగం తో పరుగు పెడుతుంది. ఇందులో శాతాబ్ది రైలు లో మాదిరిగానే ప్రయాణ తరగతులు ఉంటాయి. అయితే, సౌకర్యాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. ప్రయాణికుల కు ఒక సరికాత్త యాత్రానుభూతిని అందించాలనేది ఈ రైలు ధ్యేయం గా ఉంది.
ఈ రైలు న్యూ ఢిల్లీ నుండి వారాణసీ కి 8 గంట లలో చేరుకొంటుంది. సోమ వారాలు మరియు గురు వారాలు తప్ప మిగిలిన అన్ని రోజుల లో ఈ రైలు రాక పోక లు జరుపుతుంది.
రైలు పెట్టెలన్నింటి లోను వాటంతట అవే తెరచుకొనే, మూసుకొనే తలుపులు, జిపిఎస్ ఆధారితం గా పని చేస్తూ ప్రయాణికుల కు సమాచారాన్ని అందించే దృశ్య, శ్రవణ వ్యవస్థ, వినోదం అందించేందుకుగాను ఆన్- బోర్డ్ హాట్‌స్పాట్ వై-ఫై సదుపాయం తో పాటు చాలా హాయి ని ఇచ్చేటటువంటి సీటింగ్ అమర్చడమైంది. టాయిలెట్ లు అన్నీ కూడాను బయోవ్యాక్యూమ్ తరహా లో ఉన్నాయి. ప్రతి సీటు కు రెండు విధాలైన కాంతి ప్రసారం అయ్యే ఏర్పాట్లు.. ఒకటి సాధారణమైన వెలుగు ను ప్రసరిస్తే, రెండో వ్యవస్థ వ్యక్తిగత ఎంపిక తరహా లో.. ఉంటాయి. ప్రతి రైలు పెట్టె లో ఒక వంటశాల ను జత చేశారు. దీనితో ప్రయాణికులు వేడి వేడి గా పొగలు కక్కే భోజనం, వేడి పానీయాలు, ఇంకా శీతల పానియాలను అందుకొనేందుకు వీలు ఉంటుంది. ఉష్ణాన్ని మరియు ధ్వని ని చాలా తక్కువ స్థాయి లలో ఉంచేందుకు ఇన్సులేశన్ ను సైతం ఏర్పరచారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లో 16 ఎయిర్-కండిశన్ సౌకర్యం కలిగిన రైలు పెట్టెలు ఉంటాయి. వాటి లో రెండు రైలు పెట్టెలు ఎగ్జిక్యూటివ్ తరగతి కి చెందినవి కూడా ఉన్నాయి. ఈ రైలు లో మొత్తం 1,128 మంది కూర్చొని ప్రయాణించవచ్చు. ఇది ఇన్నే సీట్లతో ఉండే సాంప్రదాయక శాతాబ్ది రేక్ కన్నా ఎంతో మెరుగైందిగా ఉంది. విద్యుత్తు సామగ్రి ని రైలు పెట్టెల దిగువ భాగం లో మార్చడమైంది. డ్రైవర్ ఉండే బోగీ లో కూడా సీట్లు ఉన్నాయి.
హరిత పాదముద్ర లను జోడించుకొంటూ ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు రైలు యొక్క బోగీ లలో రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ ను కలిగివుంది. ఈ వ్యవస్థ 30 శాతం వరకు విద్యుత్తు శక్తి ని ఆదా చేయగలదు.
వేగం, భద్రత, ఇంకా సేవ.. ఇవి ఈ రైలు విశిష్టత లుగా ఉన్నాయి. రైల్వే లకు చెందిన ఉత్పత్తి విభాగం అయినటువంటి చెన్నై లోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసిఎఫ్) పూర్తి గా దేశీయం గా రూపకల్పన, తయారీ మరియు కంప్యూటర్ మోడలింగ్ లలో కీలక భూమిక ను పోషించింది. చాలా పెద్ద సంఖ్యలో ఉన్న సరఫరాదారులతో కలసి కేవలం 18 నెలల్లో ఐసిఎఫ్ తన పనిని పూర్తి చేసింది.
ప్రధాన మంత్రి యొక్క ‘మేక్ ఇన్ ఇండియా’ దార్శనికత కు అనుగుణంగా రైలు లోని ప్రధాన వ్యవస్థ లను భారతదేశం లోనే తీర్చిదిద్దడం తో పాటు నిర్మించడం జరిగింది. పనితీరు లో, భద్రత లో, ప్రయాణికుల కు సౌకర్యం అంశం లో ప్రపంచ శ్రేణి ప్రమాణాల కు తులతూగుతూనే ప్రపంచ స్థాయి ధరల లో సగాని కన్నా తక్కువ ఖర్చు లో రూపుదిద్దుకొన్న ఈ రైలు యొక్క ప్రభావం అంతర్జాతీయ రైలు వ్యాపారం లో ఆట నియమాన్ని మార్చే సత్తా ను కలిగివుంది.