భారతదేశంపై ప్రపంచం ఆశావహ భావనకుగల కారణాలను వివరించే కథనాలు, సమాచార చిత్రాలను మనీ కంట్రోల్ వెబ్‌సైట్ సేకరించడాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన వృద్ధిని, స్థితిస్థాపక స్ఫూర్తిని ఈ కథనాలు, సమాచార చిత్రాలు చాటి చెబుతున్నాయని ఆయన పునరుద్ఘాటించారు.
ఈ మేరకు ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“ప్రస్తుత సంక్షోభ సమయంలోనూ భారత ఆర్థిక వ్యవస్థ వేగుచుక్కగా ప్రకాశిస్తోంది. ఈ మేరకు దృఢమైన వృద్ధి, స్థితిస్థాపక స్ఫూర్తితో దేశ భవిష్యత్తు ఆశావహంగా కనిపిస్తోంది. ఇదే వేగాన్ని కొనసాగిస్తూ 140 కోట్ల మంది భారతీయులకు సౌభాగ్యాన్ని అందిద్దాం!” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
India's economy shines as a beacon of hope in these challenging times. With robust growth and resilient spirit, the future looks promising. Let us keep this momentum and ensure prosperity for 140 crore Indians! https://t.co/MnR4IXZuwm
— Narendra Modi (@narendramodi) August 19, 2023