ఇండియన్ ఫారిన్ సర్వీస్ అధికారులు గా శిక్షణ లో ఉన్నటువంటి ముప్ఫై తొమ్మిది మంది ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ని ఈ రోజు కలుసుకొన్నారు. వారంతా ఫారిన్ సర్వీస్ ఇన్ స్టిట్యూట్ లో ప్రస్తుతం శిక్షణ ను పొందుతున్నారు.
ఆఫీసర్ ట్రయినీలను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఉత్తమమైనటువంటి చరిత్ర, సంస్కృతి మరియు సంప్రదాయాలు కలిగివున్న భారతదేశానికి విదేశాలలో ప్రాతినిధ్యం వహించేందుకు ప్రాధాన్యం ఉంది అంటూ నొక్కి పలికారు. ఐఎఫ్ఎస్ అధికారులు ఒక్క వర్తమాన జాతీయ ప్రాధాన్యాల పట్ల మాత్రమే కాకుండా, భవిష్యత్తు లో జాతీయ అభివృద్ధి కి అవసరమైన అంశాల పట్ల కూడా జాగరూకులై ఉండాలని ప్రధాన మంత్రి చెప్పారు. సాంకేతిక విజ్ఞానార్జన పట్ల మరింత శ్రద్ధ వహించాలని, రాష్ట్ర ప్రభుత్వాలతో, అలాగే విదేశీ సంబంధాల నిర్వహణలో ప్రాముఖ్యం అంతకంతకు పెరుగుతున్నటువంటి వర్గం అయిన వలస జనాభా తో చక్కటి సంబంధాలను కలిగివుండవలసిందిగా ప్రధాన మంత్రి సూచిస్తూ, శిక్షణ పొందుతున్న అధికారులను ప్రోత్సహించారు.
ఫారిన్ సర్వీస్ ఇన్ స్టిట్యూట్ లో ప్రస్తుతం శిక్షణ ను పొందుతున్న, భూటాన్ కు చెందిన ఇద్దరు దౌత్యవేత్తలు కూడా ప్రధాన మంత్రి తో భేటీ అయిన బృందం లో సభ్యులుగా ఉన్నారు.