భారతీయ వాయు సేన ఆత్మనిర్భరత కు పెద్ద పీట ను వేస్తున్నటువంటి తన ప్రయాసల లో సహకారాన్ని అందించాలని మరియు భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవాలంటూ దేశం లోని విద్య రంగ ప్రముఖుల కు, వైజ్ఞానిన సముదాయాని కి మరియు పరిశ్రమ జగతి కి చెందిన వారికి ఆహ్వానం పలికింది. ఎయరో ఇండియా 2023 కు ముందు రోజు న ఆసక్తి అభివ్యక్తీకరణ (ఎక్స్ ప్రెశన్ ఆఫ్ ఇంటరెస్ట్) కై 31 ఆహ్వానాల ను ఇవ్వడమైంది.
ఇది ఆత్మనిర్భరత దిశ లో సాగుతున్నటువంటి ఒక సాహస యాత్ర లో కీలక భాగస్వాములు గా మారేందుకు భారతదేశం లోని కుశాగ్ర బుద్ధుల కు మరియు చైతన్యశీలురైనటువంటి నవ పారిశ్రామికవేత్తల కు ఒక గొప్ప అవకాశం అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారతీయ వాయు సేన యొక్క ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ, అందులో -
‘‘మన దేశ ప్రజలు సదా గర్వించేటటువంటి రక్షణ రంగం లో స్వయం సమృద్ధి సాధన కై చేపట్టిన ఒక మిశన్ లో మహత్వపూర్ణ భాగస్వామ్యాన్ని నెలకొల్పేందుకు భారతదేశం లోని అమిత ప్రతిభావంతుల కు మరియు చైతన్యశీలురు అయినటువంటి నవ పారిశ్రామికవేత్తల కు ఇది ఒక గొప్ప అవకాశం.’’ అని పేర్కొన్నారు.
A great opportunity for India’s sharpest minds and dynamic entrepreneurs to be vital partners in the mission towards self-reliance and that too in the defence sector, which has always made our nation proud. https://t.co/NC1pmnqs30
— Narendra Modi (@narendramodi) February 13, 2023