శ్రేష్ఠులైన ఇజ్రాయల్ ప్రధాని శ్రీ బెంజామిన్ నెతన్యాహూ,
భారతదేశం మరియు ఇజ్రాయల్ లకు చెందిన వ్యాపార ప్రముఖులు,
మహిళలు మరియు సజ్జనులారా,
ప్రధాని శ్రీ నెతన్యాహూ తో పాటు ఇజ్రాయల్ ప్రతినిధి వర్గం సభ్యులకు నా దేశ వాసులందరి తరఫున నేను స్వాగతం పలుకుతున్నాను. ఉభయ దేశాలకు చెందిన సిఇఒ లతో సమావేశం కావడం నాకు మరింత ఆనందాన్ని ఇస్తోంది. ద్వైపాక్షిక సిఇఒస్ ఫోరమ్ ద్వారా భారతీయ మరియు ఇజ్రాయల్ వ్యాపార ప్రముఖులతో ప్రధాని శ్రీ నెతన్యాహూ మరియు నేను ఒక ఫలప్రదమైన సంభాషణను కొద్దిసేపటి కిందటే ముగించాం. ఈ సంభాషణ పైన, గత సంవత్సరంలో మొదలైన సిఇఒ ల భాగస్వామ్యం పైన నాకు ఉన్నతమైన ఆశలు ఉన్నాయి.
మిత్రులారా!
ఇజ్రాయల్ అన్నా, ఆ దేశ ప్రజలన్నా నాకు ఎప్పటికీ ఎంతో గౌరవం ఉంది. 2006లో నేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఇజ్రాయల్ లో పర్యటించాను. మళ్ళీ గత సంవత్సరం జులై లో కూడా నేను ఇజ్రాయల్ లో పర్యటించాను. ఈ పర్యటన భారతదేశం నుండి జరిగినటువంటి ఈ తరహా పర్యటనలలో ఒకటో పర్యటన.
అది చాలా ప్రత్యేకమైనటువంటి పర్యటన. ఇజ్రాయల్ ను ముందుకు నడిపిస్తున్న నూతన ఆవిష్కారాలు, సాహసం, పట్టుదల ల యొక్క అసాధారణమైన స్ఫూర్తిని నేను ఆ సందర్భంలో చాలా దగ్గర నుండి పరిశీలించాను. గత కొన్ని సంవత్సరాలుగా మన సంబంధాలకు బలాన్ని ఇచ్చినటువంటి ఒక కొత్త శక్తి మరియు ఒక ఉద్దేశం అంటూ ఉన్నాయి. ఇది మన సహకారాన్ని మరింత ఎత్తులకు తీసుకుపోవడంలో తోడ్పడనుంది. మన ప్రజలు మరియు వారి జీవితాలలో ఉత్తమత్వం కోసం ఉద్దేశించిన పరస్పర అవకాశాలే చోదక శక్తిగా భారతదేశం, ఇజ్రాయల్ ల సంబంధాలలో ఒక ప్రకాశవంతమైనటువంటి నూతనాధ్యాయం ముంగిట మనం నిలబడి ఉన్నాం.
మన సంబంధాలలో పరివర్తనను తీసుకురావడంలో వ్యాపారం మరియు పరిశ్రమ రంగాల పాత్ర కీలకం. మన మధ్య సంబంధాలకు వాస్తవిక విలువను జోడించి, సిసలైన విజయాలను అందించగలిగేవి మీ యొక్క ఉమ్మడి ప్రయత్నాలే. భారతదేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం మరియు ఇజ్రాయల్ కు చెందిన ఆధునిక, సాంకేతిక విజ్ఞాన ప్రాముఖ్యం మాకు ఎంత ముఖ్యమైనవంటే- మనం కలిసి సాధించగలిగిన దానికంటూ చివరకు ఆకాశం సైతం ఓ హద్దును ఏర్పరచ జాలదు.
మిత్రులారా,
గత జులై లో నేను ఇజ్రాయల్ లో పర్యటించినప్పుడు ఇండియా- ఇజ్రాయల్ ఇండస్ట్రియల్ ఆర్ & డి అండ్ టెక్నలాజికల్ ఇన్నోవేశన్ ఫండ్ (i4F) లో భాగంగా సంయుక్త పరిశోధన-అభివృద్ధి (ఆర్ & డి) పథకాల కోసం తొలి పిలుపును ఇస్తున్నందుకు ఈ రోజున నేను చాలా సంతోషిస్తున్నాను. 5 సంవత్సరాల కాలంలో వినియోగించుకోవలసివున్న ఈ నిధి వ్యాపారాత్మకంగా ఉపయోగించుకోదగ్గ నవీనమైన, సాంకేతిక విజ్ఞాన సంబంధమైన పరిష్కారాలను అన్వేషించడంలో రెండు దేశాలకు చెందిన ప్రతిభావంతులైన వ్యక్తులను ఆ పనికి పురమాయించేందుకు ఎంతో మంచి అవకాశాన్ని ప్రసాదిస్తోంది.
ఈ వేదికను ఉపయోగించుకోవడానికి రెండు దేశాల సంస్థలు ముందుకు రావలసిందని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ‘‘డేటా ఎనలిటిక్స్’’ మరియు ‘‘సైబర్ స్పేస్ సెక్యూరిటీ’’ ల వంటి రంగాలలో ఆర్ & డి పథకాలను చేపట్టడానికి శాస్త్ర విజ్ఞాన నిపుణుల, సాంకేతిక విజ్ఞాన నిపుణుల బృందాల రాకపోకలు వేగాన్ని పుంజుకోవడం సైతం ఉత్తేజితం చేస్తోంది.
2018 జులై లో భారతదేశంలో ఇండియా- ఇజ్రాయల్ ఇన్నోవేశన్ అండ్ టెక్నాలజీ కాన్‌క్లేవ్ జరుగనుండటం కూడా నాకు ఆనందాన్ని కలిగిస్తోంది. నూతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిసి అభివృద్ధి పరచడానికి ఈ కాన్‌క్లేవ్ ఊతాన్ని అందిస్తుందని నేను ఆశిస్తున్నాను. నిజానికి ఈ కార్యానికి సంబంధించిన రంగం రేపటి రోజు దాటిన మరునాడు ఐక్రియేట్ ద్వారా సిద్ధం కాగలదు. ఐక్రియేట్ క్యాంపస్ ను ప్రారంభించడానికి మేం ఉభయులం గుజరాత్ కు వెళ్తున్నాం. నూతన ఆవిష్కారాలకు దోహదించే ఒక కేంద్రంగా ఐక్రియేట్ ను అభివృద్ధి పరచడం జరుగుతోంది.
మిత్రులారా!
ప్రధాని శ్రీ నెతన్యాహూ ను గుజరాత్ లోని గ్రామీణ ప్రాంతాలు చూసేందుకు నేను తీసుకు వెళ్తున్నాను. ఎందుకంటే, సామాన్యుడికి మేలు చేయడంలోనే సాంకేతిక విజ్ఞానం మరియు నూతన ఆవిష్కారాల యదార్థ శక్తి ఇమిడి ఉంది కాబట్టి. నూతన ఆవిష్కారాలకు మరియు ఇంక్యుబేషన్ కు అనువైన విశిష్టమైన పర్యావరణాన్ని కలిగినటువంటి స్టార్ట్-అప్ ల దేశం ఇజ్రాయల్ అన్న సంగతి జగమెరిగిన సంగతి.
ఈ ఖ్యాతి ఇజ్రాయల్ నవ పారిశ్రామికులకు దక్కుతుంది. మీరు ఇజ్రాయల్ ను ఒక బలమైన, స్థిరమైన మరియు నూతన ఆవిష్కారాలకు నిలయమైన ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దారు. మీరు 8 మిలియన్ ప్రజలతో కూడిన ఒక దేశాన్ని సాంకేతిక విజ్ఞాన పరంగా ప్రపంచ స్థాయి పవర్ హౌస్ వలె ప్రకాశించేటట్లు చేశారు.
అది జల సంబంధ సాంకేతిక విజ్ఞానం కానివ్వండి, లేదా వ్యవసాయ సంబంధ సాంకేతిక విజ్ఞానం కానివ్వండి, లేదా ఆహార పదార్థాల ప్రాసెసింగ్ కానివ్వండి, లేదా ఆహార పదార్థాల నిల్వ ప్రక్రియలు కానివ్వండి.. నూతన ఆవిష్కరణలు మరియు పురోగతులకు ఇజ్రాయల్ ఒక మిలమిలలాడే ఉదాహరణగా నిలచింది. అది ఫిజికల్ సెక్యూరిటీ కావచ్చు; లేదా వర్చువల్ సెక్యూరిటీ కావచ్చు; అది భూమి మీద జలం లోను లేదా రోదసి లోను కావచ్చు.. మీ సాంకేతిక విజ్ఞాన ప్రతిభ ప్రశంసలకు పాత్రమైంది. నిజానికి భారతదేశం లోని నీటి ఎద్దడితో సతమతం అవుతున్న ఒక రాష్ట్రం నుండి వచ్చిన వాడిగా నేను ప్రత్యేకించి ఇజ్రాయల్ యొక్క జల దక్షతను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను.
మిత్రులారా!
భారతదేశంలో మేం మూడు సంవత్సరాలుగా ఒక వ్యత్యాసాన్ని తీసుకురావడం కోసం, అటు స్థూల స్థాయిలో, ఇటు సూక్ష్మ స్థాయిలో నిలకడతో కూడిన చర్యలు చేపడుతూ వస్తున్నాం. మా ధ్యేయమల్లా ‘సంస్కరించు, పని చేయు మరియు పరివర్తనను సాధించు’ అనేదే.
దీని ఫలితాలు రెండు విధాలుగా ఉన్నాయి. వీటిలో ఒకటోది.. మా ప్రక్రియలు, విధానాలు మరియు వ్యవస్థలు ప్రపంచంలో ఉత్తమమైన వాటితో జత పడుతున్నాయి. రెండోది.. మేం వేగవంతమైన వృద్ధిని నిలబెట్టుకోగలుగుతున్నాం.
ప్రగాఢమైన నిర్మాణాత్మక సంస్కరణలను అమలు పరుస్తూనే మేం అత్యంత వేగంగా వర్థిల్లుతున్న ప్రధానమైన ఆర్థిక వ్యవస్థలలో స్థానాన్ని సంపాదించుకొన్నాం. ఎఫ్‌డిఐ ప్రవాహాలు 40 శాతం మేర వృద్ధి చెంది, ఇది వరకు ఎన్నడూ ఎరుగనంత ఉన్నత స్థాయికి చేరుకొన్నాయి. యువతకు నైపుణ్యాలు అందించి వారికి ఉద్యోగాలు ఇచ్చేందుకు మహత్తరమైన కృషి జరుగుతోంది. మా జనాభాలో 65 శాతం మంది 35 సంవత్సరాల లోపు వయస్సు కలిగిన వారే ఉన్నారు. వీరు సాంకేతిక విజ్ఞాన ఆధారితమైన వృద్ధి కోసం తహతహలాడుతున్నారు.
ఇది మాకు ఒక మార్పుమాత్రమే కాకుండా అత్యంత గొప్పదైనటువంటి ఒక అవకాశం కూడాను. ఇందుకోసం మేం స్టార్ట్-అప్ ఇండియా ఉద్యమాన్ని మొదలుపెట్టాం. ఈ రంగంలో భారతదేశం- ఇజ్రాయల్ భాగస్వామ్యానికి అపారమైన అవకాశాలు ఉన్నాయి. రెండు దేశాలలో స్టార్ట్-అప్ ల మధ్య ఒక లంకెగా ఇండియా- ఇజ్రాయల్ ఇన్నోవేశన్ బ్రిడ్జి పని చేస్తుంది. విజ్ఞానం నిండినటునవంటి ఈ భారీ జలాశయాన్ని అందుబాటు లోకి తెచ్చుకొనేందుకు భారతీయ పరిశ్రమలు, స్టార్ట్- అప్ లు మరియు విద్యా సంస్థలు వాటి ఇజ్రాయల్ వెంచర్ లతో సమన్వయాన్ని తప్పక ఏర్పరచుకోవాలని నేను చెబుతూ వస్తున్నాను.
భారతదేశం దగ్గర పరిమాణం మరియు త్రాసు ఉన్నాయి.
ఇజ్రాయల్ దగ్గర బుద్ధి కుశలత మరియు సాన పెట్టడం ఉన్నాయి.
భారతదేశంలో ఉపయోగించుకోదగిన లేదా వ్యాపారపరంగా పెంపొందించుకొనేందుకు తగిన అనేక ఆలోచనలు, సాంకేతిక పరిజ్ఞానం ఉండేందుకు అవకాశం ఉంది.
మిత్రులారా!
ఈ రోజు మేం అతి పెద్ద తయారీ దేశాలలో ఒక దేశంగా ఆవిర్భవించాం. కానీ, మా వద్ద ఉన్న శక్తి ఇంకా క్షీణించిపోలేదు. మేం మా యొక్క యువత లోని శక్తిని ఆలంబనగా చేసుకొని భారతదేశాన్ని ప్రపంచ శ్రేణి తయారీ కేంద్రంగా నిలబెట్టే పనిలో నిమగ్నమై ఉన్నాం.
దీనిని సాధించడంలో సహాయపడేందుకు గాను ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది. ఈ కార్యక్రమాలకు తోడు, ఒక సాంప్రదాయక ఆర్థిక వ్యవస్థలో ఒక సరికొత్త పర్యావరణం మరియు ఏకీకృత పన్ను విధానాల అండతో ఒక ‘న్యూ ఇండియా’ ను ఆవిష్కరించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.
మేం మరీ ముఖ్యంగా ఒక విజ్ఞాన ఆధారితమైన నైపుణ్యాల తోడ్పాటు తో కూడిన సాంకేతిక విజ్ఞానం చోదకంగా ఉన్న సమాజంగా భారతదేశాన్ని మలచాలని ఆసక్తి కనబరుస్తున్నాం. స్కిల్ ఇండియా మరియు డిజిటల్ ఇండియా ల ద్వారా ఇప్పటికే ఒక భవ్యమైన నాంది జరిగింది. ఈ పరివర్తనను తీసుకొని రావడానికి వీలుగా గత నా ప్రభుత్వం కొన్నేళ్ళలో చెప్పుకోదగిన సంస్కరణలను అమలు చేసింది.
మేము వ్యాపార సంస్థలు మరియు కంపెనీలు ఎదుర్కొంటున్నటు వంటి ఎన్నో నియంత్రణ పరమైన మరియు విధాన పరమైన సమస్యలను పరిష్కరించాం. భారతదేశంలో ‘సులువుగా వ్యాపారం చేసుకొనే’ అంశంపై మేం చిత్తశుద్ధితో కృషి చేశాం.
మరి ఫలితాలు కనపడుతున్నాయి:
గత మూడు సంవత్సరాలలో, భారతదేశం ప్రపంచ బ్యాంకు యొక్క సులువుగా వ్యాపారం చేసే దేశాల సూచీ లో 42 అంచెలు ఎగబాకింది;
మేం రెండు సంవత్సరాలలో డబ్ల్యుఐపిఒ యొక్క గ్లోబల్ ఇన్నోవేశన్ ఇండెక్స్ లో 21 స్థానాలను అధిరోహించాం.
మేం వరల్డ్ ఇకనామిక్ ఫోరమ్ యొక్క గ్లోబల్ కాంపిటిటివ్ నెస్ ఇండెక్స్ లో గత రెండు సంవత్సరాలలో 32 స్థానాలు ఎగువకు వెళ్ళాము.
ఇది మరే దేశం సాధించనటువంటి ఘనత;
మేం ప్రపంచ బ్యాంకు యొక్క 2016వ సంవత్సరపు లాజిస్టిక్స్ పెర్‌ఫార్మెన్స్ ఇండెక్స్‌లో 19 స్థానాలు ఎగువకు చేరుకొన్నాము;
మేం యుఎన్‌సిటిఎడి పట్టికీకరించిన 10 అగ్రగామి ఎఫ్‌డిఐ గమ్య స్థానాల సరసన నిలచాం. కానీ మేం ఇంతటితోనే ఆగిపోం; మేం మరింత ఎక్కువగాను, మరింత ఉత్తమంగాను కృషి చేయాలని అభిలషిస్తున్నాం.
పెట్టుబడులు మరియు సాంకేతిక విజ్ఞానం ప్రవేశించేందుకు వీలుగా రక్షణ రంగంతో సహా చాలా వరకు రంగాలను ఎఫ్‌డిఐ కోసం తెరచి ఉంచడం జరిగింది. ఎఫ్‌డిఐ ఆమోదాలలో 90 శాతానికి పైగా ఆటోమేటిక్ రూట్ లోకి తీసుకురావడమైంది.
మేం ప్రస్తుత అత్యంత బాహాట ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉన్నాం. కొద్ది రోజుల కిందటే మేం సింగిల్ బ్రాండ్ రిటైల్ మరియు నిర్మాణ పరమైన వికాస రంగాలలో ఎఫ్‌డిఐ కి 100 శాతం ఆటోమేటిక్ రూట్ లో ఆమోదాలకు అనుమతిని ఇచ్చాం. మేం మా జాతీయ విమానయాన సంస్థ ఏర్ ఇండియా లోనూ విదేశీ ఇన్వెస్టర్లకు అవకాశం కల్పించాం.
భారతదేశంలో వ్యాపారం చేయడాన్ని రోజు రోజుకూ సులభతరంగా మలచేందుకు మేం కృషి చేస్తున్నాం. పన్నుల విధానంలో మేం అనేక చరిత్రాత్మక సంస్కరణలను తీసుకువచ్చాం. ఒక కొత్త బాటను వేసేటటువంటి జిఎస్‌టి సంస్కరణను విజయవంతంగా, సాఫీగా పరిచయం చేయడమైంది.
ఇది భారతదేశంలో ఇంత వరకు చోటు చేసుకొన్న వ్యాపారపరమైన మరియు ఆర్థికపరమైన సంస్కరణలన్నింటిలోకి అతి పెద్ద సంస్కరణ. జిఎస్‌టి ని ప్రవేశ పెట్టడం మరియు ఫైనాన్షియల్ టెక్నాలజీలు, ఇంకా డిజిటల్ లావాదేవీలతో ఒక ఆధునికమైన మరియు పారదర్శకమైన, నిలకడైన, మార్పులను అంచనా వేయగలిగే పన్నుల విధానం దిశగా మేం నిజంగానే సాగాం.
మిత్రులారా,
మేకింగ్ ఇన్ ఇండియా లో ఇజ్రాయల్ కు చెందిన అనేక కంపెనీలు చేతులు కలిపాయి. అలాగే, జల సంబంధమైన అధునిక సాంకేతిక పరిజ్ఞానం కలిగిన కంపెనీలు, వ్యవసాయ సంబంధ మెలకువలు కలిగిన కంపెనీలు, రక్షణ మరియు భద్రత వ్యవస్థలకు సంబంధించిన కంపెనీలు, ఔషధ తయారీ సంబంధ విజ్ఞానం కలిగిన సంస్థలు సైతం భారతదేశంలో వాటి కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. అదే విధంగా ఇజ్రాయల్ లో ఐటి, సేద్యపు నీటిపారుదల మరియు ఔషధ రంగం వంటి అనేక రంగాలలో భారతీయ కంపెనీలు చెప్పుకోదగ్గ ఉనికిని కలిగివున్నాయి.
మన వ్యాపారంలో వజ్రాలకు ఒక ప్రముఖ పాత్ర ఉంది. ప్రస్తుతం ఇదివరకటితో పోలిస్తే అనేక వ్యాపార సంస్థలు సంయుక్త రంగంలో నెలకొన్నాయి. అయితే, ఇది ఆరంభం మాత్రమే. ఇజ్రాయల్ తో మా వ్యాపారం 5 బిలియన్ డాలర్ల కన్నా అధికంగా వృద్ధి చెందింది.
అయితే ఇది వాస్తవ సత్తా కన్నా ఎంతో తక్కువగానే ఉంది. మనం మన సంబంధాల యొక్క సంపూర్ణ సామర్థ్యాన్ని సాధించుకోవాలి. ఇది దౌత్యపరమైన అనివార్యత మాత్రమే కాదు, ఆర్థిక సంబంధమైన అనివార్యత కూడాను. మన ఉమ్మడి సామర్ధ్యాన్ని ఎలా వినియోగించుకోవాలనే అంశంపైన మీ సూచనలను నేను ఆహ్వానిస్తున్నాను. నూతన ఆవిష్కారాల స్ఫూర్తి స్వీకారాల స్ఫూర్తిలతో పాటు, సమస్యలకు పరిష్కారాలను కొనుగొనే స్ఫూర్తి రెండు దేశాలలోనూ నిబిడీకృతమై ఉంది.
మీకు ఒక ఉదాహరణను గురించి చెబుతాను:
వ్యర్థ పదార్థాల నియంత్రణలో మనం మన కృషిని సమన్వయపరచుకోగలిగిన పక్షంలో దక్కే పర్యావరణ సంబంధమైన మరియు ఆర్థిక సంబంధమైన ప్రయోజనాలను ఊహించండి. మన ఫలాలు, కాయగూరలు మరియు తోట పంటల ఉత్పత్తులకు విలువను జోడించగలిగితే ఎలా ఉంటుందో ఊహించండి!
నీటి విషయంలోను ఇదే ఉదాహరణను వర్తింప చేయండి.
ఇలా మనకు పలు సన్నివేశాలు ఎదురవుతాయి. అదే విధంగా నీటి ఎద్దడి కూడాను. ఆహార పదార్థాలను పారవేస్తున్న సన్నివేశాలు కూడా మనం చూస్తున్నాం.
మరో వైపున, ఎంతో మంది ఆకలి బాధతో అలమటిస్తున్న సందర్భాలు ఉన్నాయి.
మిత్రులారా!
భారతదేశ అభివృద్ధి కార్యక్రమాల పట్టిక చాలా పెద్దది. అది ఇజ్రాయల్ కు చెందిన కంపెనీలకు విస్తృతమైన ఆర్థిక అవకాశాలను ఇవ్వజూపుతోంది. భారతదేశానికి విచ్చేసి ఇక్కడ కార్యకలాపాలు జరపవలసిందిగా ఇజ్రాయల్ కు చెందిన వ్యాపార సంస్థలను, కంపెనీలను మరియు వ్యక్తులను మరింత మందిని నేను ఆహ్వానిస్తున్నాను.
ప్రభుత్వం మరియు ప్రజలతో పాటు భారతదేశం లోని వ్యాపారస్తుల సముదాయం కూడా చేతులు కలపడానికి ఆసక్తితో ఎదురు చూస్తోంది. మీ దేశానికి చెందిన కంపెనీలు, సంస్థలు విజయం సాధించాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అవసరమైన ప్రతి సందర్భంలో మీకు నా యొక్క మద్ధతు మరియు నా ప్రభుత్వ తోడ్పాటు లభిస్తాయని నేను హామీని ఇస్తున్నాను. భారతదేశం, ఇజ్రాయల్ ల వ్యాపార మరియు ఆర్థిక సమన్వయాన్ని వర్థిల్లేటట్లు చేయడంలో నిరంతరాయ మద్దతును అందిస్తున్నందుకుగాను ప్రధాని శ్రీ నెతన్యాహూ కు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మన భాగస్వామ్యం మున్ముందు ఎన్నో విజయాలు అందుకోగలదన్న నమ్మకం నాకు ఉంది.
మీకందరికీ ధన్యవాదాలు.
I have always had a deep regard for Israel and its people. I visited Israel in 2006 as CM of Gujarat. Last year in July, I visited Israel, the first such visit from India. I experienced the remarkable spirit of innovation, enterprise and perseverance that drives Israel: PM
— PMO India (@PMOIndia) January 15, 2018
There is new energy and purpose that has invigorated our ties over the last few years. It will help take our cooperation to greater heights. We stand on the cusp of a new chapter in India-Israel relations driven by our people & mutual opportunities for betterment of lives: PM
— PMO India (@PMOIndia) January 15, 2018
In India, we have been taking steady steps over three years at both macro as well as micro-level, to make a difference. Our motto is: Reform, Perform and Transform: PM @narendramodi
— PMO India (@PMOIndia) January 15, 2018
The India-Israel Innovation Bridge will act as a link between the Start-ups of the two sides. I have been saying that Indian Industries, start-ups and the academic institutions must collaborate with their Israeli counterparts to access the huge reservoir of knowledge: PM
— PMO India (@PMOIndia) January 15, 2018
We want to do more and do better. To enable entry of capital and technology, most of the sectors including defence, have been opened for FDI. More than 90 percent of the FDI approvals have been put on automatic route. We are now among the most open economies: PM
— PMO India (@PMOIndia) January 15, 2018
India’s development agenda is huge. It presents a vast economic opportunity for Israeli companies. I invite more and more Israeli people, businesses and companies to come and work in India. Along with Govt & people, the business community of India too is keen to join hands: PM
— PMO India (@PMOIndia) January 15, 2018