ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రేపటి రోజున అనగా శుక్రవారం నాడు, నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూటే తో పాటు వర్చువల్ మాధ్యమం ద్వారా శిఖర సమ్మేళనాన్ని నిర్వహించనున్నారు.
ప్రధాని శ్రీ రూటే ఇటీవల జరిగిన పార్లమెంటు ఎన్నికల లో గెలిచిన అనంతరం జరుగుతున్న ఈ శిఖర సమ్మేళనం లో క్రమం తప్పక చోటు చేసుకొంటున్న ఉన్నత స్థాయి సమావేశాల ద్వారా ద్వైపాక్షిక సంబంధాల కు అందుతున్న గతి ని అలా కొనసాగించడం జరుగుతుంది. ఈ శిఖర సమ్మేళనం సాగే క్రమం లో, ఇరువురు నేత లు ద్వైపాక్షిక సహకారాన్ని గురించి సమగ్రం గా చర్చించి, ఇప్పుడు ఉన్న సంబంధాలను బలపరచుకొనే నూతన పద్ధతుల పై దృష్టి ని సారించనున్నారు. వారు పరస్పర హితం ముడిపడ్డ ప్రాంతీయ అంశాలపైన, ప్రపంచ అంశాల పైన తమ తమ అభిప్రాయాల ను ఒకరికి మరొకరు తెలియజేసుకోన్నారు.
భారతదేశం, నెదర్లాండ్స్ ప్రజాస్వామ్యం, చట్టాల అమలు, స్వాతంత్ర్యం వంటి ఉమ్మడి విలువల ద్వారా సౌహార్దపూర్ణమైనటువంటి, మైత్రి భరితమైనటువంటి సంబంధాల ను ముందుకు తీసుకు పోతున్నాయి.
యూరోప్ ఖండం లో ప్రవాసీ భారతీయ సముదాయం పెద్ద సంఖ్య లో నివసిస్తోంది నెదర్లాండ్స్ లోనే. ఉభయ దేశాల మధ్య నీటి నిర్వహణ, వ్యవసాయం, ఫూడ్ ప్రోసెసింగ్, ఆరోగ్య సంరక్షణ, స్మార్ట్ సిటీ స్, పట్టణ ప్రాంతాల లో ప్రజా రవాణా సౌకర్యాలు, విజ్ఞాన శాస్త్రం- సాంకేతిక విజ్ఞానం, నవీకరణ యోగ్య శక్తి, అంతరిక్షం రంగాల లో విస్తృతమైన సహకారాన్ని కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలు ఒక బలమైన ఆర్థిక భాగస్వామ్యాన్ని కూడా నెలకొల్పుకొన్నాయి. భారతదేశం లో నెదర్లాండ్స్ మూడో అతిపెద్ద ఇన్వెస్టరు గా ఉంది. 200 లకు పైగా డచ్ కంపెనీలు భారతదేశం లో పని చేస్తున్నాయి. అదే విధం గా అంతే సంఖ్య లో భారతీయ కంపెనీ లు కూడానెదర్లాండ్స్ లో వ్యాపార కార్యకలాపాల ను నిర్వహిస్తున్నాయి.